Malaysia
-
కేరాఫ్ కాంటినెంటల్ : ఇంటర్నేషనల్ చెఫ్‌లతో స్పెషల్ చిట్‌చాట్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే.. దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి. వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్ దక్షిణాది ప్రేరణతో.. మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్ -
Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్ల క్రితం ఫ్యాషన్ ఔత్సాహికులు అత్యాధునిక డిజైన్ల వైపు మొగ్గు చూపేవారని, కానీ ప్రస్తుతం మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నారని, ఆనాటి డిజైన్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోందని ప్రముఖ జువెల్లరీ డిజైనర్, విభ జ్యూవెలరీ వ్యవస్థాపకురాలు అనీషారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా సాధారణ స్థాయి మొదలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహిళల వరకు ఆభరణాల ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. దీనికి అనుగుణంగా రూపొందిస్తున్న కలెక్షన్లకు మాత్రమే మార్కెట్లో ఆదరణ పెరుగుతోందని అన్నారు. మణికొండ వేదికగా నూతనంగా రూపొందించిన వింటెరా కలెక్షన్‌ను బుధవారం ఆవిష్కరించారు. అంతరంగమే.. ప్రేరణ అందించేలా..మన ఆలోచనల్లోని మార్పులు, చేర్పులు, ఆచరణాత్మక దృక్పథాలే మన విజయాలు, గమ్యాన్ని నిర్ణయిస్తాయని విద్యావేత్తలు, ప్రముఖులు స్పష్టం చేశారు. నగరంలోని వోక్స్సెన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన టెడ్ ఎక్స్ టాక్స్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని యువతకు విజయాల సాధనలో దిశానిర్ధేశం చేశారు. ఇంటర్నేషనల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత, ఆరి్టస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ మయూర్ కల్బాగ్ స్వీయ–ఆవిష్కరణ పరివర్తనపై తన దృక్పథాలతో ఆకట్టుకున్నారు. అఘోరి – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ, స్మైల్ ఎట్ స్ట్రెస్, రైజింగ్ వాటర్‌ఫాల్ అడ్వెంచర్స్ ఆఫ్ పూర్ణ వంటి విజయవంతమైన పుస్తకాలకు ప్రసిద్ధి చెందిన కల్బాగ్ తన ప్రసంగంలో వృద్ధికి ఉ్రత్పేరకంగా ఆంతరంగిక భావనను చూపారు. ఎర్టెన్ ట్యూన్స్ సహవ్యవస్థాపకుడు అసోసియేట్ డీన్ సంతోష్ కొచెర్లకోట, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చింతకింది మల్లేశం, చుర్రోల్టో హైదరాబాద్ – జాసా మీడియా వ్యవస్థాపకుడు నీహర్ బిసాబతిని పాల్గొన్నారు. మలేషియా రెగట్టాలోలో సిటీ సెయిలర్స్ మలేషియాలోని పెర్దానాలో జరగనున్న 21వ లంకావై అంతర్జాతీయ రెగట్టాకు మన రాష్ట్రానికి చెందిన 11 మంది సెయిలర్స్ ఎంపికయ్యారు. ముంబైలో ఇటీవల జరిగిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం గెలుచుకున్న ప్రీతి కొంగర, జోగులాంబ గద్వాల్‌కు చెందిన చాకలి కార్తీక్‌తో కలిసి 470 మిక్స్డ్ క్లాస్ సీనియర్స్ విభాగంలో పోటీపడనున్నారు. పలు జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన నగరానికి చెందిన వైష్ణవి వీరవంశం, నల్గొండ జిల్లాకు చెందిన యువ గిరిజన బాలుడు శ్రావణ్ కాత్రవత్తో 420 మిక్స్డ్ క్లాస్ జూనియర్స్‌లో పోటీ పడుతున్నారు. వీరు ప్రస్తుతం భారత్‌లో నంబర్–1 ర్యాంక్‌లో ఉన్నారు. రిజ్వాన్ మొహమ్మద్, రసూల్‌పురాకు చెందిన లాహిరి కొమరవెల్లి, వినోద్ దండు, చంద్రలేఖ, భానుచంద్ర, రవికుమార్, బద్రీనాథ్ కూడా పోటీ పడుతున్నారని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుహీమ్ షేక్ తెలిపారు. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
నృత్య పోటీల్లో..శ్రీరాధాకృష్ణ ‘హై’లైట్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది. ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు. ఆన్లైన్లో పోటీలు మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్‌కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి. ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్‌కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.చదువుతో పాటు డ్యాన్స్ కూడా... నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన నాట్యం అంటే ప్రాణం నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య అనేక బహుమతులు వచ్చాయి నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్‌లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య -
T20 World CUP 2025: భారత జట్టు ప్రకటన
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. మలేషియా వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు నికీ ప్రసాద్(Niki Prasad) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సనికా చాల్కే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. వికెట్ కీపర్ల కోటాలో జి. కమలిని, భవికా అహిరే చోటు దక్కించుకున్నారు.ఇక నిక్కీ సారథ్యంలోని భారత జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు గొంగడి త్రిష(G Trisha), కేసరి ధృతి, ఎండీ షబ్నమ్ కూడా స్థానం సంపాదించారు. మరోవైపు.. స్టాండ్ బై ప్లేయర్లుగా నంధాన ఎస్, ఐరా జె, టి అనధి ఎంపికయ్యారు.పదహారు జట్ల మధ్య పోటీకాగా మలేషియాలో జరిగే అండర్-19 మహిళల ప్రపంచకప్ టోర్నీ(U19 Women’s T20 World Cup)లో మొత్తం పదహారు జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘ఎ’లో భారత్‌తో పాటు మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జనవరి 19న వెస్టిండీస్‌తో తలపడుతుంది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి భారత్అనంతరం.. జనవరి 21న మలేషియా, 23న శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక నాలుగు గ్రూపులలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ స్టేజ్‌లో అడుగుపెడతాయి. ఈ దశలో రెండు గ్రూపులలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. కాగా 2023లో తొలిసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని డిఫెండింగ్ చాంపియన్ పట్టుదలగా ఉంది.అండర్ -19 మహిళల ప్రపంచకప్ 2025కి భారత జట్టునికీ ప్రసాద్(కెప్టెన్), సనికా చాల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, జి. కమలిని(వికెట్ కీపర్), భవికా ఆహిరే(వికెట్ కీపర్), ఈశ్వరి అవసారే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుశి శుక్లా, ఆనందితా కిషోర్, ఎండీ షబ్నమ్, వైష్లవి ఎస్.స్టాండ్ బై ప్లేయర్లు: నంధాన ఎస్, ఐరా జె, టి అనధి.చదవండి: IND W Vs BAN W: ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
Ind vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్(ACC Women's U-19 Asia Cup)లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కౌలాలాంపూర్ వేదికగా భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది. అద్భుత ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థిని ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.అదరగొట్టిన సోనమ్ యాదవ్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ (24; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... యువ భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.PC: ACCకమలిని మెరుపు ఇన్నింగ్స్‌అనంతరం భారత జట్టు 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కమలిని మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.మరో 73 బంతులు మిగిలుండగానేమరో ఎండ్ నుంచి సనికా చాల్కే (19 నాటౌట్; 3 ఫోర్లు) కమలినికి సహకారం అందించింది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కమలిని భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో 73 బంతులు మిగిలుండగానే గెలిచింది. పాక్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కమలినికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు మంగళవారం నేపాల్‌తో తలపడనుంది. కాగా జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇస్తోంది.చదవండి: WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్‌పై కనక వర్షం.. ఎవరీ కమలిని? -
యునెస్కో సాంస్కృతిక ఫుడ్స్ 2024
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...అరబిక్ కాఫీఅరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.జపాన్ వారి సాకె రైస్వైన్గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.మలేషియన్ బ్రేక్ఫాస్ట్వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.కొరియా జంగ్కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.అజెర్బైజాని బ్రెడ్మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు. -
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. -
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయం లేకుండానే...
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు 2024ను ఒక్క విజయం లేకుండా ముగించింది. ఏడాదిలో చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనే కనబర్చినా చివరకు గెలుపు మాత్రం దక్కలేదు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం భారత్, మలేసియా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక అంతర్జాతీయ మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా తరఫున పావ్లో జోస్ 19వ నిమిషంలో గోల్ సాధించగా... భారత్ తరఫున రాహుల్ భేకే 39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ కొట్టాడు. రెండో అర్ధభాగంలో గోల్ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన మన జట్టు 6 పరాజయాలు, 5 ‘డ్రా’లు సాధించింది. భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పెయిన్‌కు చెందిన మనోలో మార్కెజ్‌కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. భారత్ తమ తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో ఆడుతుంది. జోరుగా ఆరంభం... ఆరంభంలో భారత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. తొలి 15 నిమిషాల పాటు బంతిని తమ ఆ«దీనంలోనే ఉంచుకున్న జట్టు కొన్ని సార్లు గోల్‌పోస్ట్‌కు చేరువగా వెళ్లగలిగినా... ఆశించిన ఫలితం దక్కలేదు. ఆరో నిమిషంలో రోషన్, చంగ్లే అందించిన పాస్‌తో ముందుకు దూసుకెళ్లిన లాలెంగ్మవియా కొట్టిన షాట్ క్రాస్ బార్ మీదుగా దూసుకెళ్లింది. అయితే భారత కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సంధూ చేసిన తప్పు ప్రత్యరి్థకి ఆధిక్యాన్ని అందించింది. భారత బ్యాక్‌లైన్ వద్ద మలేసియాను అడ్డుకునే ప్రయత్నంలో సంధూ తన పోస్ట్ వదిలి ముందుకొచ్చాడు. వెంటనే చక్కగా బంతిని అందుకున్న పావ్లో జోస్ ఖాళీ నెట్‌పైకి కొట్టడంతో మలేసియా ఖాతాలో తొలి గోల్ చేరింది. తర్వాత కొద్ది సేపటికే ఫౌల్ చేయడంతో రాహుల్ భేకే ఎల్లో కార్డ్‌కు గురయ్యాడు. 28వ నిమిషంలో రోషన్ ఇచ్చిన కార్నర్ క్రాస్‌ను అందుకోవడానికి ఎవరూ లేకపోవడంతో భారత్‌కు మంచి అవకాశం చేజారింది. ఈ దశలో కొద్దిసేపు ఇరు జట్లూ హోరాహోరీ గా పోరాడాయి. చివరకు భారత్ ఫలితం సాధిం చింది. బ్రండన్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను బాక్స్ వద్ద ఉన్న భేకే నెట్లోకి పంపడంతో స్కోరు సమమైంది. హోరాహోరీ పోరాడినా... రెండో అర్ధభాగంలో ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే తమకు లభించిన అవకాశాలను సది్వనియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈసారి భారత డిఫెన్స్ మెరుగ్గా కనిపించింది. 47వ నిమిషంలో బాక్స్ వద్ద అగ్వెరో కిక్‌ను సందేశ్ జింగాన్ సమర్థంగా అడ్డుకోగా... 53వ నిమిషంలో కార్నర్ ద్వారా భారత ప్లేయర్ బ్రండన్ చేసిన గోల్ ప్రయత్నం వృథా అయింది. మరో ఏడు నిమిషాల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఫరూఖ్ వృథా చేశాడు. చివరి ఐదు నిమిషాల ఇంజ్యూరీ టైమ్‌లో కొన్ని ఉత్కంఠ క్షణాలు సాగాయి. సుమారు 15 వేల మంది ప్రేక్షకులు మద్దతు ఇస్తుండగా భారత్ పదే పదే మలేసియా పోస్ట్‌పైకి దూసుకెళ్లినా గోల్ మాత్రం దక్కలేదు. మరోవైపు భారత కీపర్ సంధూ కూడా ప్రత్యర్థి ఆటగాళ్ళను సమర్థంగా నిలువరించగలిగాడు. -
భారత్ X మలేసియా
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేదిక కానుంది. గచ్చిబౌలి వేదికగా నేడు మలేసియాతో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఏఎఫ్సీ ఆసియా కప్ సందర్భంగా గాయపడి తిరిగి కోలుకున్న సీనియర్ డిఫెండర్ సందేశ్ జింగాన్ 10 నెలల తర్వాత పునరాగమనం చేయనుండటంతో భారత జట్టు డిఫెన్స్ బలం మరింత పెరగనుంది. చివరగా భారత జట్టు హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మారిషస్, వియత్నాంతో ‘డ్రా’ చేసుకొని సిరియా చేతిలో 0–3తో పరాజయం పాలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరగగా... చెరో 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. మరో ఎనిమిది మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పటి వరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఫిఫా ప్రపంచ ర్యాకింగ్స్లో ప్రస్తుతం భారత జట్టు 125వ స్థానంలో ఉండగా... మలేసియా 133వ ప్లేస్‌లో ఉంది. అయితే విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా జట్టు... టీమిండియా కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. భారత జట్టు తరఫున గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, సందేశ్ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్ సింగ్, అమరిందర్ సింగ్, సురేశ్ సింగ్ కీలకం కానున్నారు. భారత ఆటగాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అనుభవం ఈ మ్యాచ్‌లో కలిసిరానుంది. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి, మరో నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. ఆసక్తి గల అభిమానులు ్టజీఛిజ్ఛ్టుజ్ఛnజ్ఛీ.జీn లో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. -
భారత్ శుభారంభం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
సొంతగడ్డపై భారత్‌కు పరీక్ష
రాజ్‌గిర్ (బిహార్): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందకపోవడం... ఆ తర్వాత ప్రొ హాకీ లీగ్‌లోనూ ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించడం... వెరసి ఈ ఏడాది భారత మహిళల హాకీ జట్టుకు ఏదీ కలసి రాలేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరుసగా రెండోసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో సలీమా టెటె సారథ్యంలో భారత బృందం ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. గత ఏడాది రాంచీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి. తొలి రోజు జరిగే ఇతర మ్యాచ్‌ల్లో జపాన్‌తో దక్షిణ కొరియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), చైనాతో థాయ్‌లాండ్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. సోమవారం మలేసియాతో మ్యాచ్ తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా (12న)తో, థాయ్‌లాండ్ (14న)తో, చైనా (16న)తో, జపాన్ (17న)తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ 19న, ఫైనల్ 20న జరుగుతాయి. -
న్యూస్ రీడర్ నుంచి హీరోయిన్గా రాణిస్తున్న విశాఖ బ్యూటీ (ఫోటోలు)
-
యువ భారత్ ‘హ్యాట్రిక్’
కౌలాలంపూర్: సుల్తాన్ జొహర్ కప్ అండర్–21 పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆతిథ్య మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున శారదానంద్ తివారీ (11వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (13వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (39వ నిమిషంలో), రోహిత్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా జట్టుకు మొహమ్మద్ డానిష్ (8వ నిమిషంలో), హారిస్ ఉస్మాన్ (9వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు, మలేసియా జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐదు పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. -
వెకేషన్లో గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద, ఐకానిక్ స్టేడియం రెప్పపాటులో నేలమట్టం
మలేషియా నగరంలోని ఐకానిక్ షా ఆలం స్టేడియం చరిత్రలో కలిసి పోయింది. 80వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఈకూల్చివేతకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఒకప్పుడు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న ఈ స్టేడియం 30 ఏళ్ల నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు. దీని స్థానంలో 45వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త, ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తోంది.Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE— Manytops Stadiums (@Manytops) September 19, 2024 ఈ స్టేడియం నిర్మాణం 1990 జనవరి 1న ప్రారంభం కాగా అధికారికంగా 1994, జూలై 16, ప్రారంభించారు. ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియంగా ఉండేది. -
రాజ్ కుమార్ హ్యాట్రిక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్
చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.రాజ్ కుమార్ హ్యాట్రిక్మలేసియాతో మ్యాచ్‌లో రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్ కుమార్ గోల్స్ చేశాడు. భారత్ తరఫున రాజ్ కుమార్‌తో పాటు అరైజీత్ సింగ్ హుండల్ 6, 39 నిమిషంలో, జుగ్రాజ్ సింగ్ 7వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 40వ నిమిషంలో గోల్స్ సాధించారు. మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్ 34వ నిమిషంలో సాధించాడు.ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్ సెప్టెంబర్ 12న.. పాక్‌తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. చదవండి: స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ -
మలేషియా కౌలాలంపూర్ లో తెలుగు మహిళ గల్లంతు
-
అలనాటి సూపర్ హిట్ సాంగ్ పాడి అలరించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత సినిమాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపే వేరు. అది ఈ మధ్యకాలంలోనే దక్కుతుందని అనుకుంటే పొరపాటే. దశాబ్దాల క్రితమే మన సినిమా ఖండాంతరాలు దాటిపోయింది. ముఖ్యంగా.. పొరుగు దేశాల్లో మన చిత్రాల దక్కే ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఆ అభిమానమే ప్రదర్శించారు. మలేషియా ప్రధాని హోదాలో ఇబ్రహీం తొలిసారి భారత్‌కు వచ్చారు. మూడు రోజుల పర్యటన ముగియడంతో.. ఢిల్లీ తాజ్ మహల్ హోటల్లో ఆయనకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో 60వ దశకం నాటి పాపులర్ పాటను ఆలపించారాయన. రాజ్ కపూర్ ‘సంగమ్’(1964) కోసం గాయకుడు ముకేష్ ఆలపించిన ‘దోస్త్ దోస్త్ నా రహా’.. ఈనాటికీ గుర్తుండిపోయింది. ఆ పాటనే మలేషియా ప్రధాని ఇబ్రహీం పాడి వినిపించారు. మ్యూజిక్ సిబ్బంది భుజాలపై చేతులు వేసి మరీ సరదాగా పాడి అక్కడున్నవాళ్లను అలరించారాయన.Watch: Malaysian PM #AnwarIbrahim sings the famous song 'Dost Dost Na Raha' from the movie Sangam during his first visit to India as Prime Minister.#ViralVideo #Viral #Malaysia pic.twitter.com/NMrafjHBKG— TIMES NOW (@TimesNow) August 22, 2024 Video Credits: TIMES NOW -
మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!
మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్వర్బిన్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ భారతీయ మలయ్ వంటకాల తోపాటు మిల్లెట్లను హైలెట్ చేసేలా గ్రాండ్ లంచ్‌ను ఏర్పాటు చేశారు. మెనూలో ఏం ఉన్నాయంటే..మెనూలో భారతీయ, ఆగ్నేయాసియా రుచులను అందంగా మిళితం చేసేలా విభిన్న వంటకాలను అందించింది. ఇందులో నూడుల్స్, కూరగాయలు, స్పైసి వంటకాలు, కొబ్బరితో చేసినవి ఉన్నాయి. ఇక తీపి, కారంతో మిళితం చేసే పెర్ల్ మఖానీ వొంటన్, పెర్ల్ మిల్లెట్, కాటేజ్ చీజ్ తదితరాలు ఉన్నాయి. అలాగే మిక్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో తయారు చేసినన సలాడ్, రుచికరమైన కబాబ్‌లకు రిఫ్రెష్ బ్యాలెన్స్‌లో ఉల్లిపాయలు, బెంగాలీ పంచ్ ఫోరాన్ మసాలాలు, జీలకర్రతో వండిన బ్రెజ్డ్, బటన్ మష్రూమ్‌లు ఉన్నాయి. ఇవికాక మిల్లెట్కి సంబంధించి రాగి, బచ్చలి, జీడిపప్పతో చేసిన కుడుములు, బంగాళదుంప జీడిపప్పుతో చేసిన మిల్లెట్ కుడుము విత్ బచ్చలి కూర గ్రేవీ, గుజరాతీ ఖట్టి మీథీ దాల్, పులిహోర తదితరాలతో మలేషియా ప్రధానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు మోదీ. కాగా, 2023 అధికారికంగా మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినప్పటి నుంచి అంతర్జాతీయ ఆదరణ లభించేలా మెల్లెట్స్తో ఎలాంటి వైవిధ్యమైన వంటకాలు చేయొచ్చు తెలిపేలా భారతీయ వంటకాలతో చాటి చెబుతోంది. (చదవండి: బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!) -
భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
న్యూఢిల్లీ: భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మంగళవారం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ టెక్నాలజీతో సహకారంతోపాటు స్టార్టప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. మలేషియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ టుంకూ అబ్దుల్ రెహ్మాన్’లో ఆయుర్వేద విభాగాన్ని, యూనివర్సిటీ ఆఫ్ మలయాలో తిరువళ్లువర్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం.త్వరలో యూపీఐ, పేనెట్ అనుసంధానం: భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, రక్షణ పరిశ్రమ, ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. -
భారత్‌కు మలేషియా ప్రధాని.. పీఎం మోదీతో భేటీ
భారత్- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్‌లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు. #WATCH | Prime Minister of Malaysia Dato’ Seri Anwar bin Ibrahim arrives in New Delhi on a three-day state visit to India He was received by MoS V Somanna pic.twitter.com/rfXPn48Zph— ANI (@ANI) August 19, 2024 -
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్‌కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్‌లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
చమరి అటపట్టు సూపర్ సెంచరీ
ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టి20 కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. -
40 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్.. 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2024లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్(10) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. -
సైనిక హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని 10 మంది చనిపోయారు. ఉత్తర పెరాక్ రాష్ట్రంలోని నేవీ కేంద్రం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వచ్చే నెలలో జరిగే నేవీ వార్షికోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా పదుల సంఖ్యలో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్నాయి. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ పక్కకు జరగడంతో దాని రెక్క పక్కనే వస్తున్న మరో హెలికాప్టర్ రోటార్‌ను తాకింది. దీంతో, రెండు హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలాయి. వాటిలో ఉన్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం పది మంది వైమానిక దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. -
గాల్లో నేవీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం
మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. రాయల్ మలేషియన్ నేవీ పరేడ్ కోసం మంగళవారం ఉదయం లుముత్ నేవల్ బేస్‌లో రిహాల్సల్ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది. ⚡Ten people are reported killed as two military #helicopters had a mid-air collision in #Malaysia during preparations for a naval military parade. The incident occurred in the town of Lumut at around 9:30 am during a training to mark the 90th anniversary of the Royal… pic.twitter.com/OEF3SDNG6a — Shafek Koreshe (@shafeKoreshe) April 23, 2024 -
పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే.. ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్ నగరంలో ఉందిది. కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి. ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్ తున్ అబ్దుల్ రజాక్ ‘పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్ సిటీ హాల్ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. (చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి
రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్‌తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె మోడల్‌గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్‌కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. -
వీసాతో పనిలేకుండానే విదేశాలకు రయ్.. రయ్!
సాక్షి, విశాఖపట్నం: ‘భారతీయులూ.. వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి’ అంటూ ఇటీవల వివిధ దేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురుచూస్తున్న వారంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్–2 సిటీస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందువరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయ్‌లాండ్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ.. తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుంటోంది. ఈ సర్వీసు ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం. వీసాలతో పని లేకుండా.. వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఎంట్రీ లేదా టూరిస్ట్ వీసాలు దొరక్క.. తమకు నచ్చిన దేశంలో విహరించే ఆలోచనలను మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గోల్డెన్ చాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. టికెట్ బుక్ చేసుకుని కొన్ని దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. భారతీయ పాస్‌పోర్టు బలమైందిగా మారడమే దీనికి కారణం. ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన వీసా ఫ్రీ దేశాల జాబితాలో ప్రపంచ దేశాల్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా కొన్ని దేశాలు భారతీయుల్ని విహారానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాల్ని విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్, మలేషియాకు.. ఎయిర్ ఏషియా సంస్థ జైపూర్, గోవా, వారణాసితో పాటు విశాఖ నుంచి వీసా ఫ్రీ దేశాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపై ఎయిర్ ఏషియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు లిమిటెడ్ పీరియడ్‌తో ప్రత్యేక ప్రమోషన్ చార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సౌత్ ఇండియా నుంచి ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో మొత్తంగా 69 వీక్లీ సర్వీసులు నడుపుతూ ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మరో వీసా ఫ్రీ ప్రకటించిన థాయ్‌లాండ్‌కు కూడా విశాఖ నుంచి ఏప్రిల్‌లో సర్వీసులు మొదలు పెడుతున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది. మరోవైపు.. విశాఖ నుంచి సింగపూర్‌కు స్కూట్ సర్వీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి రోజూ కనీసం 300 నుంచి 350 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న థాయ్, కౌలాలంపూర్ సర్వీసులతో విశాఖ నుంచి ఏకంగా మూడు విదేశీ సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరిలో ఇండిగో సంస్థ కూడా మరో విదేశీ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల రాకతో విదేశీ ప్రయాణాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు గేర్ మార్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న ఎయిర్ ఏషియా ఇప్పటివరకూ దాదాపు 60 దేశాలు వీసా ఫ్రీ ప్రకటించాయి. 30 నుంచి 90 రోజుల వరకూ వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి వచ్చి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చని ప్రకటించాయి. తాజాగా తమ దేశ పర్యాటకానికి ఊతమిచ్చేందుకు వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక మాదిరిగానే మలేషియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి మలేషియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇలా వీసా ఫ్రీ టూర్‌కు వివిధ దేశాలు అవకాశమిస్తున్న తరుణంలో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో ఎయిర్ ఏషియా సంస్థ అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థ టైర్–2 నగరాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది. -
భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’
కౌలాలంపూర్: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్బంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ఈ క్రమంలో చైనా, భారత పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని వెల్లడించారు. ఇక, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక, భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది. #Malaysia will grant 30-day visa-free travel for #Chinese citizens starting Dec. 1 this year, Prime Minister Anwar Ibrahim announced on Sunday. pic.twitter.com/YvmGPe1rY6 — iChongqing (@iChongqing_CIMC) November 27, 2023 -
భారత్‌కు మరో విజయం
రాంచీ: భారత అమ్మాయిల హాకీ జట్టు ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. వందన కటారియా (7, 21వ నిమిషాల్లో) చక్కని ఆటతీరుతో రెండు గోల్స్ చేసింది. సంగీత కుమారి (28వ ని.), లాల్రెమ్సియామి (28వ ని.) క్షణాల వ్యవధిలోనే చెరో గోల్ సాధించిపెట్టారు. మూడో క్వార్టర్లో జ్యోతి (38వ ని.) కూడా గోల్ చేయడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి లీగ్‌లో భారత్ 7–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. -
బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించిన మలేషియా.. సెమీస్‌లో టీమిండియాతో "ఢీ"
ఏషియన్ గేమ్స్-2023 మెన్స్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌లో మలేషియా.. బంగ్లాదేశ్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. అఫీఫ్ హొస్సేన్ ఆల్‌రౌండ్ షోతో (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు, 4-0-11-3) ఆదుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. అఫీఫ్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో గట్టెక్కిన బంగ్లాదేశ్, అక్టోబర్ 6న జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన టీమిండియాను ఎదుర్కొంటుంది. బంగ్లా బ్యాటర్లకు కట్టడి చేసిన మలేషియా బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. మలేషియా బౌలర్లు పవన్‌దీప్ సింగ్ (4-1-12-2), విరన్‌దీప్ సింగ్ (4-0-13-0) బంగ్లా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. విజయ్ ఉన్ని, అన్వర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సైఫ్ హస్సన్ (50 నాటౌట్), అఫీఫ్ హొస్సేన్ (23), షాదత్ హొస్సేన్ (21) మాత్రమే రాణించారు. మలేషియాను గెలిపించినంత పని చేసిన విరణదీప్ సింగ్.. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేషియా 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరన్‌దీప్ సింగ్ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి ఓవర్ వరకు క్రీజ్‌లో నిలబడి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్ హొస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. అఫీఫ్ చివరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ (విరన్‌దీప సింగ్) పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ 3లో ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకు షాకిచ్చి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్.. పాక్‌ను ఢీకొంటుంది. -
ఏషియన్ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్‌లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్‌తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్‌పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్‌లాండ్‌ను దెబ్బకొట్టారు. థాయ్‌లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్‌తో తలపడనుంది. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్‌బోర్డ్‌పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
వాలీబాల్‌లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో జోరు... రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
వివాదాస్పద చైనా నూతన మ్యాప్.. భారత్‌తో గొంతు కలిపిన పలు దేశాలు
భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా ఇటీవల తన జాతీయ పటం కొత్త వెర్షన్‌ను ప్రచురించింది. దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ దేశంలోని భాగంగా చూపింది. భారత్ తీవ్ర నిరసన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా తన మ్యాప్‌లో చూపించడంపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సరిహద్దు వివాద పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని భారత్ పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనా వాదనలను తిరస్కరించింది. అవి నిరాధారమైనవిగా పేర్కొంది. చైనా చర్యపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ‘అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగం మీది అయిపోదు’ అని అన్నారు. మండిపడిన ఫిలిప్పీన్స్ చైనా మ్యాప్- 2023 వెర్షన్‌పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మండిపడింది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా సరిహద్దులు కలిగివుండటాన్ని చూపిస్తోంది. సముద్ర ప్రాంతాలపై చైనా తన సార్వభౌమాధికారంతో పాటు అధికార పరిధిని చట్టబద్ధం చేయడానికి ఈ కొత్త ప్రయత్నాలు చేస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా తెరెసిటా దాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ గతంలోనూ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసింది. ఫిలిప్పీన్స్ 2013లో చైనా జాతీయ పటాన్ని ప్రచురించడాన్ని నిరసించింది. దీనిలో కలయాన్ దీవులు,స్ప్రాట్లీస్‌లోని కొన్ని భాగాలను చైనా తన జాతీయ సరిహద్దులుగా చూపింది. చైనా వాదనలు ఖండించిన మలేషియా చైనా స్టాండర్డ్ మ్యాప్ ఎడిషన్ 2023లో దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న వాదనలకు వ్యతిరేకంగా రాతపూర్వక నోట్‌ను పంపనున్నట్లు మలేషియా ప్రభుత్వం తెలిపింది. మలేషియా ప్రాదేశిక జలాలను కూడా కలిగి ఉన్నట్టు చైనా తన మ్యాప్‌లో చూపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను మలేషియా గుర్తించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మ్యాప్‌పై వియత్నాం నిరసన చైనా దుశ్చర్యలపై వియత్నాం కూడా మండిపడింది. వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ మాట్లాడుతూ, హోంగ్ సా (పారాసెల్), ట్రూంగ్ సా (స్ప్రాట్లీ) దీవులపై వియత్నాం తన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటిస్తోందని, చైనా చేస్తున్న సముద్ర వాదనలను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘తైవాన్ను చైనా పాలించనేలేదు’ తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చైనా నూతన ప్రామాణిక మ్యాప్‌పై మండిపడింది. తైవాన్ను ఎప్పుడూ చైనా పాలించలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నూతన మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు! -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
కూలిన చిన్న విమానం..10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్‌లో గురువారం చిన్న విమానం కూలిన ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. లంగ్క్వావి నుంచి సుబంగ్ విమానాశ్రయం వైపు వస్తున్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా విమానం పల్టీలు కొడుతూ రహదారిపై కుప్పకూలింది. రహదారిపై వెళ్తున్న బైక్, కారుపై పడటంతో విమానంలోని 8 మందితోపాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్‌బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది. -
Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో
కౌలాలంపూర్: మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు క్షణాల వ్యవధిలో వైరల్ గా మారాయి. మలేషియాలోని ఒక నాలుగు లైన్ల రహదారిపై వెళ్తోన్న కారు డాష్ కెమెరాలో ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఊడిపడినట్టుగా ఓ విమానం రెప్పపాటులో నేలకొరిగింది. అంతే వేగంగా కూలిన విమానం నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు. విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. Dashcam footage shows final moments of the private jet crash in Malaysia. https://t.co/1rsoP7ALGx Viewer discretion advised. pic.twitter.com/fo4Fqxu319 — Breaking Aviation News & Videos (@aviationbrk) August 17, 2023 మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు. ఇది కూడా చదవండి: సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం -
ప్రియుడి కోసం రూ.2 వేల కోట్లు కాదనుకున్న గొప్ప ప్రేమికురాలు
ప్రేమ.. దీన్ని వర్ణించాలంటే కవులకు సైతం కలంలో సిరా సరిపోదు. ఇది చెప్పడం కంటే అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే. అయితే ఇటీవల యువతీయువకులు కొందరు ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇదే ట్రెండ్‌గా పాటిస్తున్నారు చాలామంది. అయితే ఓ యువతి మాత్రం మనీ కంటే తన మనసుకు నచ్చిన వాడే కావాలనుకుంది. కోట్ల ఆస్తి కంటే బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉండడమే బెటర్ అనుకుంది. ఆస్తి కాదు.. అతనే ముఖ్యం వవరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఆమె పైచదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటిగా మారాలనుకున్నారు. ఇక్కడ వరకు సాఫీగా సాగిన వాళ్ల లవ్‌స్టోరీ ఇక్కడే బ్రేక్ పడింది. తన ప్రేమ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ధనవంతుడు కాదన్న కారణంగా ఆమె తండ్రి వాళ్ల పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్.. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుంది. ప్రియుడే కావాలని అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా జీవిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. -
‘ఆసియా’ చాంపియన్ భారత్
చెన్నై: ఫైనల్ వరకు ఎదురు లేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా! అంచనాలకు తగినట్లుగా తొలి గోల్‌తో ఆధిపత్యం కూడా దక్కింది. కానీ ఆపై మూడుసార్లు ఆసియా చాంపియన్‌కు అసలు పోటీ అర్థమైంది. ఆట అర్ధ భాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికి భారత్ 1–3తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇక మిగిలింది అర గంట. గెలవాలంటే మిగిలిన 30 నిమిషాల్లో 3 గోల్స్ కావాలి. సర్వశక్తులు ఒడ్డాల్సిన స్థితి. ప్రత్యర్థి జోరు మీదుంది. భారత్ ఆటగాళ్లపైనే ఒత్తిడి. ఈ దశలో మూడో క్వార్టర్ ముగిసే నిమిషం భారత్‌కు వరంగా మారింది. మ్యాచ్‌ను మన పరం చేసింది. 45వ నిమిషంలో భారత ఆటగాళ్లు చేసి రెండు గోల్స్‌తో స్కోరు 3–3తో సమమైంది. మిగిలింది ఆఖరి క్వార్టర్ ఒక గోల్ చేస్తే భారత్ టైటిల్ దక్కుతుంది. ఆకాశ్‌దీప్ సింగ్ (56వ ని.లో) అదే మ్యాజిక్ చేశాడు. ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లాడు. అనుకున్న ఫలితాన్ని అజేయమైన భారత్ సాధించింది. 9వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్రాజ్ గోల్‌గా మలిచాడు. కానీ మలేసియా శిబిరం నుంచి నిమిషాల వ్యవధిలో అబు కమల్ (14వ ని.లో), రహీమ్ రజీ (18వ ని.లో), అమినుద్దీన్ (28వ ని.లో) చెరో గోల్ చేశారు. జట్టు ఆత్మరక్షణలో పడిన ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (45వ ని.), గుర్జాంత్ (45వ ని.) గోల్ చేసి అడుగంటిన ఆశలకు జీవం పోశారు. మిగిలిన ఆఖరి గోల్‌ను ఆకాశ్‌దీప్ (56వ ని.) సాధించడంతో భారత్ జయకేతనం ఎగరేసింది. జపాన్‌కు కాంస్యం సెమీస్‌లో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా కనీసం కాంస్య పతకమైనా గెలుద్దామనుకుంటే జపాన్ ముందు వారి ఆటలు సాగలేదు. ఫైనల్‌కు ముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్ 5–3తో కొరియాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన జపాన్ ఆటగాళ్లే కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో కొరియా నాలు గో స్థానంతో తృప్తిపడింది. జపాన్ తరఫున ర్యోమా ఓకా (3వ ని.లో), రియోసే కటో (9వ ని.లో)కెంటరో ఫుకుదా (28వ ని.లో) షోట యమాద (53వ ని.లో), కెన్ నగయొషి (58వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా జట్టులో జంగ్హ్యున్ జంగ్ (15వ, 33వ ని.లో) రెండు గోల్స్ సాధించిపెట్టగా, చెవొలియోన్ పార్క్ (26వ ని.) ఒక గోల్ చేశాడు. -
అజేయంగా టైటిల్ పోరుకు భారత్
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన భారత్ శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో జపాన్‌పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియా తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో మలేసియా 6–2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరింది. 2018 ఆసియా క్రీడల సెమీఫైనల్లో చివరిసారి మలేసియా చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడలేదు. 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 6–1తో చైనాపై గెలిచి ఐదో స్థానాన్ని దక్కించుకోగా... చైనా చివరిదైన ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌పై గెలుపుతో హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో లీగ్ దశలో 1–1తో తమని నిలువరించిన జపాన్‌పై టీమిండియా ఎదురు లేని విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన గత టోర్నీ (2021)లో సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. భారత శిబిరం అటాకింగ్‌కు జపాన్ వద్ద బదులే లేకపోయింది. తొలి క్వార్టర్ 0–0తో ముగిసింది. ఆ తర్వాత మూడు క్వార్టర్లు భారత ఆటగాళ్లదే జోరు. ఆకాశ్‌దీప్ సింగ్ (19వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తీ సెల్వం (51వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. -
భారత్ ఘనవిజయం
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. మలేసియాతో ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (15వ ని.లో), హార్దిక్ సింగ్ (32వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), గుర్జంత్ సింగ్ (53వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్లు రాగా అందులో మూడింటిని సది్వనియోగం చేసుకుంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆదివారం జరిగిన మిగతా రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. చైనా–కొరియా 1–1తో, పాకిస్తాన్–జపాన్ 3–3తో ‘డ్రా’ చేసుకున్నాయి. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?
సత్యాన్వేషణలో రాజ్యాన్ని భార్యా బిడ్డల్నీ త్యజించిన సిద్ధార్థుడి గురించి చదువుకున్నాం. ప్రజలకోసం వేల ఎకరాల సొంత ఆస్తిని వదులుకున్న కమ్యూనిస్టు నేతల గురించి విన్నాం. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకుందాం. ఆయనే బుద్ధిస్ట్ మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో. బిలియనీర్ ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు. సిరిపన్యో గురించి తెలుసుకునేముందు అతని తండ్రి ఆనంద కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. రూ. 40,000 కోట్ల సంపద మలేషియా-తమిళ వ్యాపారవేత్త బిజినెస్టైకూన్. తత్పరానందం ఆనంద కృష్ణన్‌ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాల్లో వ్యాపారం, అయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వాప్యారాల్లో ఆరితేరిన దిగ్గజం. దీంతోపాటు కృష్ణన్‌కి కలిపి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో మూడోవాడిగా ఆనంద్ కృష్ణన్‌ను నిలిపింది. అంతేకాదు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీఎయిర్సెల్ యజమాని. సిరిపన్యోతోపాటు, కృష్ణన్‌కి ఇద్దరు కుమార్తెలున్నారు. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) 18 ఏళ్లకే సన్యాసం మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలిచ్చిన గొప్ప పరోపకారి. ఆనంద కృష్ణన్ కూడా బౌద్ధుడే కావడం గమనార్హం. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యో కేవలం 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారి తీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రినుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది. సిరిపన్యో తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందిన వారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యో ఇంగ్లీష్, తమిళం, థాయ్ పాటు దాదాపు 8 భాషలు మాట్లాడ గలడని ప్రతీతి. అతని కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్‌ను కలవడానికి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు. "నా సంపదతో నా స్వంత కొడుకును పోషించే స్తోమత కూడా లేదు" అని తన కుమారుడు సన్యాసిగా మారిపోయిన వైనాన్ని గుర్తించిన కృష్ణన్ వ్యాఖ్యానిచారట. -
Mahati Kaumari: నాతో నేనే పోటీ పడ్డాను..!
ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది. ‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను. కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. సొంతంగా డిజైనింగ్ స్టూడియో పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను. బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు ‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్లైన్లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ. మనసును సేదతీర్చేలా... కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు. – నిర్మలారెడ్డి -
మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు
తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపడుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మలేషియా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షులు చిరుత చిట్టిబాబు గారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరించి నేడు సాధించిన అభివృద్ధిని నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి, కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఉపాధ్యక్షులు మారుతి కుర్మ. ఈ కార్యక్రమంలో అతిథులు మైటా డిప్యూటీ ప్రసిడెంట్ సత్య, మైటా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మరియు భారాస ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సంపత్ రెడ్డి ,రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, నవీన్ గౌడ్ పంజాల, కిషోర్, క్రాంతి , గౌతమ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. (చదవండి: సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్) -
మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )కు చెందిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్‌లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు మలేషియా అధికారులు. బాకీ తీర్చమంటే... ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA ) సుమారుగా 4 మిలియన్ల డాలర్లు(రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఈ సంస్థ అనేకమార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. ఇదే విమానం రెండోసారి... ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేయగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది. మొత్తం చెల్లించేసాం... మళ్ళీ అదే కథ పునరావృతం కావడంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాం, అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. గతకొంత కాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యింది. -
విషాదం: ప్రాణం తీసిన చేపల కూర.. భార్య మృతి.. కోమాలో భర్త!
విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మార్చి 25న మలేషియాలో వెలుగుచూసింది. జపాన్‌లో ఎక్కువగా తినే పఫర్ ఫిష్ రుచికరంగా ఉండటంతోపాటు అత్యంత విషపూరితమైనది. ఇది తెలియక జోహోర్కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మార్కెట్ నుంచి పఫర్ ఫిష్‌ను కొనుగోలు చేశాడు. వాటిరి ఇంటికి తీసుకురాగా అతని భార్య లిమ్ సీవ్ గ్వాన్ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది. ఇద్దరు కలిసి తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్వాన్‌కు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఇవే లక్షణాలు కొంత సమయానికి అతనిలో కూడా ప్రారంభమయ్యాయి. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్ సీవ్ గ్వాన్ మరణించింది. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు. కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. చదవండి: హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్ -
విమానంలో తరలించిన అరుదైన జాతి కోతులు
తిరువొత్తియూరు: మలేషియా నుంచి చైన్నెకి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన అరుదైన జాతికి చెందిన నాలుగు కోతులను అధికారులు తిరిగి బుధవారం అదే విమానంలో మలేషియాకు పంపించారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. వారి దుస్తులను తనిఖీ చేశారు. గంపలో మధ్య ఆఫ్రికాలోని పొడి అడవుల్లో ఉండే టీ ప్రిస్పా జాతి కోతులు, నైజీరియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో నివసించే మాంటా క్రోసా జాతి కోతులను గుర్తించారు. అరుదైన జాతులకు చెందిన నాలుగు కోతులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. వాటిని పెంచుకోవడానికి తీసుకువచ్చామని ప్రయాణికులు చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, వైద్యపరీక్షలు లేకుండా తీసుకుని వెళుతున్నట్టు గుర్తించి వాటిని తిరిగి అదే విమానంలో మలేషియాకు పంపించారు. కోతులను తీసుకువచ్చిన ఇద్దరిని విచారిస్తున్నారు. -
భారతీయ పర్యాటకులు: ఈసారి 6 లక్షలు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
ఈసారి 6 లక్షల టూరిస్టులు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. -
విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్‌లాండ్‌పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్‌లాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్ పార్క్‌తో పాటు క్లస్టర్ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే.. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు. కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి. చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
మలేసియాలో ఘనంగా భారత గణతంత్ర వేడుకలు
కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన) -
మలేషియాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్వర్యములో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, ఖీఔఓ కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఇండియన్ హై కమీషనర్ అఫ్ మలేషియా హెచ్.ఈ.బీ.ఎన్ రెడ్డి, మలేషియా తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీతా రావు మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి , మలేషియా తెలుగు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఇతర తెలుగు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది. అలాగే జబర్దస్త్ ఫేమ్ అశోక్, బాబీ పాల్గొని వారి హాస్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రుచికరమైన తెలుగు వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే ముగ్గులపోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్ , లక్కీ డ్రా నిర్వహించి బంగారు బహుమతులను అందజేశారు. హెచ్.ఈ.బీ.ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశీ గడ్డపై ఇలాంటి పండుగలు నిర్వహిస్తూ తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుతూ నవతరాలకు చాటిచెబుతేన్న మా అసోసియేషన్ ను అయన అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలలో ప్రతి ఇంట ఆనందాలు వెళ్లి విరియాలని అయన ఆకాంక్షించారు. మా ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా వాటిని కాపాడుతు రేపటి తరం పిల్లలకు తెలియచేయటం మన బాధ్యత అన్నారు. అలాగే సంక్రాతి పండుగా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన శ్రీ బిర్యానీ , టెక్ తీరా , ఎస్‌వీఐ టెక్నాలజీస్ , ఆక్సీ డేటా , రెడ్ వేవ్ , జాస్ ట్రేట్జ్ ,క్లబ్ మహీంద్రా ,మినీ మార్ట్ , మై టెక్ ,కానోపుస్ , లు లు మనీ , ఈగల్ టెక్ ,నిమ్మల, మై 81,ఫామిలీ గార్డెన్,దేశి తడ్కా,బిగ్ సి హైదరాబాద్,మై బిర్యానీ హౌస్,ప్రబలీస్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, నల్ల స్వామి నాయుడు ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల ,రవి వంశి ,శారద ,దీప్తి ,హరీష్ నడపన ,రామ్ గొల్లపల్లి ,గణేష్ ,కిషోర్ ,నాయుడు రావూరి ,రవి జాస్ ,సందీప్ తన్నీరు ,సతీష్ నంగేడా ,కల్పనా తదితరులు పాల్గొన్నారు. -
విహార యాత్ర అంటే ఆ దేశానికి వెళ్లాలంటున్న భారతీయలు!
కోవిడ్ తర్వాత సింగపూర్ తన పూర్వ వైభవాన్ని పొందింది. 2019 నుంచి కరోనాతో టూరిజం పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందర్శకుల తాకిడి పెరగడంతో 2022లో తిరిగి పుంజుకుంది. దీంతో నవంబర్ వరకు 5.37 మిలియన్లు టూరిస్టులు సింగపూర్‌ను సందర్శించారు. నవంబర్ వరకు సింగపూర్ టూరిజం బోర్డు (STB) నుంచి వచ్చిన డేటా ఆధారంగా.. 48 శాతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, భారత్ నుంచే ఉన్నారు. డిసెంబర్ సాంప్రదాయకంగా సింగపూర్ సందర్శకులకు రద్దీగా ఉండే ప్రయాణ కాలం కావడంతో, ఈ సంఖ్యను కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఇండోనేషియా నుంచి 9.86 లక్షలు ఉండగా, భారత్ నుంచి 6.12 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ టూరిజం అభివృద్ధిలో ఇండియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మలేషియా 495,470తో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (476,480), ఫిలిప్పీన్స్ (325,480) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చివరగా 2019 ప్రీ-కోవిడ్ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా 19.1 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు. ఆ సంవత్సరంలో, సింగపూర్‌కు చైనా నుంచి 3.6 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. చివరకు తమ పౌరులను మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని చైనా గత వారం ప్రకటించడంతో, 2023లో సింగపూర్ టూరిజం మహమ్మారి అనంతరం పున్వరైభవానికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి
బటంగ్ కలి: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులున్న క్యాంప్ సైట్‌ను 100 అడుగుల ఎత్తైన రోడ్డు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి ఒక్కసారిగా ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి కాగా, 12 మంది జాడ తెలియకుండా పోయారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతిచ్చిన బద్ధ శత్రువు
కౌలాలంపూర్: మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్ మలయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు. చదవండి: కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు! -
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్‌లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్‌లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. లంక బ్యాటర్లలో రణసింగే(23), ఆతపత్తు(21) పరుగులతో రాణించారు. మలేషియా బౌలర్లలో ఆజ్మీ, హమీజ్ హాసం రెండు వికెట్లు సాధించారు. ఇక 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక స్పిన్నర్లు చెలరేగడంతో మలేషియా కేవలం 33 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో మల్షా షెహానీ నాలుగు వికెట్లతో మలేషియాను దెబ్బతీయగా.. కుమారి, రణవీరా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మలేషియా బ్యాటర్లలో హంటర్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: John Campbell: వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం.. -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ’
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతకమ్మ పండగ. అలాంటి బతుకమ్మ పండుగను సభ్యులు ఘనంగా నిర్వహించారంటూ ఈ సందర్భంగా గాదరి కిషోర్ కుమార్ వారిని అభినందించారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల విషయంలో టీఆర్ఎస్ మలేషియా చూపిన చొరవపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి, శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొన్నారు. -
మలేషియాను చిత్తు చేసిన పాక్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఆసియాకప్-2022ను పాకిస్తాన్ మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మలేషియా.. పాకిస్తాన్ స్పిన్నర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 57 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో ఒమైమా సోహైల్ మూడు వికెట్లు పడగొట్టగా.. టుబా హసన్ రెండు, ఇక్భాల్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు (సదీరా అమీన్ 31), మునీబా అలీ(21) పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ
తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అన్ని పన్నులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు. -
మలేసియాలో వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
సాక్షి హైదరాబాద్: మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 23నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరిగాయి. మలేసియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5000 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలేసియా తెలుగు సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్యసుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మలేసియాలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..!
పరిచయంలేని ప్రదేశంలో మన ప్రాంతం వాళ్లు కనిపిస్తే ఆనందం! పరాయిగడ్డ మీద మన భాష వినిపిస్తే నైతిక బలం..!! సంఘాలు, సంస్థలను ఏర్పాటుచేసుకునేది ఇలాంటి మద్దతు కోసమే! మన మాట, సంస్కృతి, సంప్రదాయాలను పట్టి ఉంచుకోవడానికే!! నివసిస్తున్న దేశమేదైనా మన ఉనికి చాటుకోవడానికే!! ఇదంతా ఓ పోరాటం.. స్వస్థలాలను వదిలి దేశాంతరం వెళ్లిన వాళ్లంతా చేసే కనిపించని పోరాటం!! బ్రిటిష్ రాజ్యంలో మన తెలుగు వాళ్లు కూడా తెల్లవారి కూలీలుగా వాళ్ల కాలనీలకు వలస వెళ్లారు! అందులో మలేసియా ఒకటి! అక్కడి కొబ్బరి, రబ్బరు తోటలు సహా చాలా చోట్ల పనులకు కుదిరారు. అక్కడే స్థిరపడ్డారు. మాతృభాషను పరిరక్షించుకుంటే అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లేనని భావించారు. తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగును కాపాడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ద్వైవార్షిక సభలు ఇటీవల రవాంగ్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ స్టోరీ! అది రవాంగ్ పట్టణం.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆకాశపుటంచుల్లోకి కొమ్మలు చాచుకొని పెరిగిన.. ప్రపంచంలోకెల్లా ఎతైన మహావృక్షాలు, వాటితో పోటీపడే కొండలు, కోనలతో పచ్చగా.. ఆహ్లాదభరింతంగా ఉంటుంది. బహుశా ఆ వాతావరణం వల్లనే రవాంగ్ సామాజిక జీవితం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించే నదిలో సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణంలా జనజీవితం కనిపిస్తుంది. ఆ రవాంగ్‌లో జూన్ 26వ తేదీ.. ఆదివారం పండగలాంటి సందడి నెలకొంది. మలేసియాకు నలుదిక్కులా ఉన్న రహదారులు రవాంగ్‌కు ప్రయాణమయ్యాయి. ఉదయం ఏడింటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. రవాంగ్‌కు వందల మైళ్ల దూరంలోని జోహూర్, క్లింగ్, బాగాన్ డత్తో తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి ఉదయం తొమ్మిదింటికల్లా వచ్చేశారు. ఇటు సింగపూర్, అటు థాయ్‌లాండ్ సరిహద్దు జిల్లాల నుంచి కూడా వందలాది మంది వచ్చారు. వాళ్లంతా ఆ దేశంలో పుట్టిపెరిగిన మలేసియన్ తెలుగువాళ్లు. ఎనభై ఏళ్లు దాటిన రెండో తరం పెద్దల నుంచి ఐదారేళ్ల నేటి తరం చిన్నారుల వరకూ ఉన్నారు. అది వాళ్లు ప్రాణప్రదంగా భావించే తెలుగుతల్లి ఆలయం. మలేసియా తెలుగు అకాడమీ భవన ప్రాంగణం. గత 50 ఏళ్లుగా ఆ ప్రాంగణంతో మలేసియా తెలుగువాళ్లకు అనుబంధం ఉంది. ఒకప్పుడు రవాంగ్ తెలుగు సంఘం కార్యాలయంగా, తెలుగు సాంస్కృతిక నిలయంగా వెలుగొందిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఐదంతస్తుల తెలుగు అకాడమీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని తెలుగువాళ్లంతా కలసి ఒక్కో రింగిట్ (అక్కడి కరెన్సీ) పోగు చేసుకొని ఆ భవానాన్ని కట్టుకున్నారు. అది అక్కడి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 150 ఏళ్లకు పైగా కాపాడుకుంటున్న తల్లిభాష తెలుగును భవిష్యత్ తరాలకు వారసత్వ కానుకగా అందజేసేందుకు మలేసియా తెలుగు సంఘం సకల సదుపాయా లతో ఆ భవనాన్ని నిర్మించింది. విశాలమైన తరగతి గదులు, వసతి కేంద్రాలు, గ్రం«థాలయం, ఆటస్థలం వంటి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి, బోధన, సాహిత్య అధ్యయనం, మలేసియా తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన తెలుగు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్లు ఆ ఆదివారం అక్కడ సమావేశామయ్యారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మలేసియా తెలుగు సంఘం 44వ ద్వైవార్షిక ప్రతినిధుల మహాసభ కూడా అదే రోజు కావడం మరో విశేషం. కుటుంబ వేడుకలా... నిజానికి రెండేళ్ల క్రితమే తెలుగు అకాడమీ భవనం ప్రారంభం కావలసి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలో ఏడాదికి రెండు, మూడు సార్లయినా ఎక్కడో ఒకచోట కలుసుకొనే తెలుగువాళ్లు గత రెండేళ్లుగా కలవలేకపోయారు. దాంతో జూన్ 26వ తేదీ నాటి కార్యక్రమం వారికి ఒక భావోద్వేగభరితమైన వేదికైంది. అందుకే ఇంటిల్లిపాదీ ఆ తెలుగు వేడుకల కోసం తరలివచ్చారు దూరభారాలు లెక్కచేయకుండా! దేశంలోని తెలుగు వాళ్లంతా ఆ రోజు అక్కడ ఒక కుటుంబంలా కలసిపోయారు. ఆత్మీయ పలకరింపులతో తెలుగు భాష తేనెలూరింది. సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. మలేసియా మాజీ ప్రధానమంత్రి దత్తో శ్రీ నజీబ్‌తోపాటు అక్కడి తెలుగు ప్రముఖులు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు. మొదటగా మలేసియా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులూ’ అంటూ తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అక్కడ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు, ప్రసంగాలు, ఆటలు, పాటలతో ఆ ఉదయం.. సాయంకాలంగా ఎప్పుడు కరిగిపోయిందో తెలియలేదు. మలేసియాలోని తెలుగువాళ్లు మొదట్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాళ్లు పనిచేసే తోటల్లో తెలుగు బడులు, గుడులు ఉండేవి. పిల్లలు తెలుగు నేర్చుకొనేవారు. పెద్దవాళ్లు సాయంత్రం పూట రాముడి సన్నిధిలో చేరి కష్టసుఖాలను పంచుకొనేవారు. కాలక్రమంలో తెలుగు బడులు శిథిలమయ్యాయి. ఆ తదనంతర తరాలకు చెందినవారు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థానాల్లో స్థిరపడ్డప్పటికీ తల్లి భాష తెలుగుకు దూరమయ్యారు. మలేసియా తెలుగు సంఘానికి ఇది మనస్తాపంగా మారింది. ఈ క్రమంలోనే 2006లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు నేతృత్వంలో తెలుగు భాషాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. పలు చోట్ల నీతిశిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తిరిగి సంఘటితం చేశారు. మలేసియా అంతటా 30కి పైగా తెలుగు శాఖల్లో ఇది ఒక ఉద్యమంలా సాగింది. ప్రస్తుతం 6 వేల మంది పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటున్నారు. ‘మలేసియా భూమిపైన తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగు వర్ధిల్లుతుంది. ఆ లక్ష్యంతోనే అకాడమీ నిర్మించుకున్నాం. భవిష్యత్ తరాలకు ఇది బాటలు వేస్తుంది. తెలుగుకు దూరమైన వాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు’అని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు. ఆయన నేతృత్వంలో మొదలైన తెలుగు భాషోద్యమం ఇప్పుడు చక్కటి ఫలితాలనిస్తోంది. తెలుగు వారి ముఖద్వారం బాగాన్ డత్తో... మలేసియా తెలుగువాళ్లకు గొప్ప చరిత్ర ఉంది. 150 ఏళ్లకు పూర్వమే వలస వెళ్లిన తెలుగువాళ్లు ఆ దేశ చరిత్రలో భాగమయ్యారు. ఒకప్పటి మలయా దేశం (ఇప్పుడు మలేసియా)లో కొబ్బరి, కాఫీ, తేయాకు, రబ్బరు, పామాయిల్ తోటల్లో పని చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి కార్మికులను తరలించింది. 1850 నుంచే ఈ వలసలు మొదలైనప్పటికి 1890 నాటికి వేలాది మంది తమిళ, తెలుగు ప్రజలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో పొట్టచేతపట్టుకొని అక్కడికి చేరుకున్నారు. విశాఖ, చెన్నపట్టణం, తదితర రేవు పట్టణాల నుంచి బయలుదేరి ఓడలు ఏడు రోజుల తరువాత మలేసియాలోని పినాంగ్ రేవుకు చేర్చాయి. అలా వెళ్లిన తెలుగువాళ్లు పినాంగ్ నుంచి జంగ్ అనే చైనా వారి తెరచాప ఓడల్లో మలక్కా జలసంధి గుండా పేరాక్ నది ముఖద్వారమైన బాగాన్ డత్తోకు చేరుకున్నారు. ఆ రోజుల్లో అది ఒక చేపల రేవు. బ్రిటన్‌కు చెందిన స్ట్రెయిట్స్ ప్లాంటేషన్ కంపెనీకి చెందిన వేల ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటల్లో మొట్టమొదటి తెలుగు తరం పనిలో చేరారు. ఆ తరువాత తెలుగు కుటుంబాలు విస్తరిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి, రబ్బరు, పామాయిల్ తోటలకు స్థానికంగా వలసబాట పట్టారు. రబ్బరు తోటలతో నిండి ఉన్న రవాంగ్లోనూ బాగాన్ డత్తోకు సమాంతరంగా తెలుగు కుటుంబాలు విస్తరించాయి. ఒకప్పుడు గుప్పెడు మంది కూడా లేని తెలుగు జనాభా ఇప్పుడు ఇంచుమించు 5 లక్షలకు చేరుకుంది. ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు బ్రిటిష్ కంపెనీల లాభాల కోసం నెత్తురు ధారపోశారు. ఆ తదనంతరం మలేసియా అభివృద్ధిలో భాగమయ్యారు. రెండు ప్రపంచయుద్ధాల కాలంలో మలేసియా స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రజల త్యాగాలు ఉన్నాయి. తెలుగు ఒక్కటే అస్తిత్వం... బ్రిటిష్ వారు పంపిన వలస కూలీలుగా మలేసియాకు చేరుకున్న తెలుగువాళ్లు బతుకుతెరువు కోసం తమిళ, మలయ్, చీనా తదితర భాషలను నేర్చుకున్నారు. అయినా మృతృభాష తెలుగును మాత్రం విస్మరించలేదు. ఎక్కడెక్కడో స్థిరడిన తెలుగు వాళ్లను ఆ భాషే ఒక్క గూటి పక్షులను చేసింది. అదొక్కటే వారి అస్తిత్వం. మెజారిటీ భాషల ఆధిపత్యం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలుగు బడులు మూసివేసిన తరువాత ఆ కష్టం మరింత ఎక్కువైంది. ‘ఒకదశలో తెలుగును బతికించుకోవడమే సవాలుగా మారింది. తెలుగు నీతి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తెలుగు బోధించాం. క్రమంగా ఫలితాలు కనిపించాయి’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చెగు అక్కయ్య అప్పల్నాయుడు. 74 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు మలేసియాలోని అన్ని తెలుగు శాఖల్లో తెలుగు భాషా బోధన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంచుమించు 1990 నుంచి 2005 వరకు తెలుగు భాష సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం విధిగా అలవరచుకోవాలనే లక్ష్యంతో 2006లో మలేసియా తెలుగు సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి. ప్రతి ఇల్లు, ప్రతి తెలుగుశాఖ ఒక తెలుగు బడి అయింది. ఆరువేల మంది పిల్లలు ఇప్పుడు తెలుగుభాష పైన పట్టు సాధించారు. మలేసియా తెలుగువారి మహత్తరమైన తెలుగు వెలుగుల ప్రస్థానానికి ప్రతీకగానే తెలుగు అకాడమీ భవనం ప్రారంభమైంది. తెలుగుభాషోద్యమ రథసారథి 2006 నుంచి 2020 వరకు మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు తెలుగు నీతి శిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు దశల్లో తెలుగు బోధనకు అవసరమైన పాఠ్యప్రణాళికలను రూపొందించడం వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు అకాడమీ భవన నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకొని పూర్తి చేశారు. అలుపెరుగని అధ్యాపకుడు తెలుగు, తమిళ, మలయ్, ఇంగ్లిష్ భాషలపైన గట్టి పట్టు ఉన్న చెగు అక్కయ్య చెగు అప్పల్నాయుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి తెలుగు భాషా బోధన కోసం కృషి చేశారు. ఇప్పటికీ కాలికి బలపం కట్టుకొని మలేసియా అంతటా పర్యటిస్తూ తెలుగుశాఖలను ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యప్రణాళికలను రూపొందించడంలోనూ, భాషాబోధనలోనూ ఆయన నిపుణులు. తెలుగు సాంస్కృతిక వారధి రెండో తరానికి చెందిన పెద్దలు, ఎనభై ఏళ్లు దాటినా తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ విద్యావేత్త డీవీ శ్రీరాములు. మలేసియాకు, తెలుగు రాష్ట్రాలకు నడుమ సాంస్కృతిక వారధిగా నిలిచారు. 1970ల నుంచే అక్కడి తెలుగు వాళ్లకు హైదరాబాద్, విశాఖ, సహా అన్ని ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు తెలుగు ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటారు. ∙పగిడిపాల ఆంజనేయులు -
Malaysia Open Badminton: తాడో పేడో తేల్చుకోనున్న సాయిప్రణీత్
కౌలాలంపూర్: కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టోర్నీకి సిద్ధమయ్యాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ హైదరాబాద్ ప్లేయర్‌కు ఈ ఏడాదీ కలసి రావడంలేదు. ఈ సంవత్సరం ఆరు టోర్నీలలో బరిలోకి దిగిన సాయిప్రణీత్ ఐదు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. నేడు మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో 30 ఏళ్ల సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ తలపడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ మలేసియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు. చదవండి: Wimbledon: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. జకోవిచ్ శుభారంభం.. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
జూన్ 1 నుంచి కోళ్ల ఎగుమతులు బంద్.. చికెన్ కోసం జనం క్యూ!
సింగపూర్: మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భగ్గుమనేలా ఉన్నాయి. ఈనేపథ్యంలో జనం చికెన్ కోసం సూపర్మార్కెట్లు, మాంసం దుకాణాలకు పోటెత్తారు. రేపటి నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఇదే అదనుగా మాంస ప్రియులు పెద్ద మొత్తాల్లో కోడి మాంసాన్ని కొనుగోలు చేశారు. దీంతో చాలా మాంసం కొట్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. జూన్ 1 నుంచి మలేసియా చికెన్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిత్తింది. స్వదేశంలో కోడి మాంసం డిమాండ్, సరఫరా చైన్‌ను స్థిరీకరించేందుకు మలేసియా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు 3.6 మిలియన్ కోళ్ల ఎగుమతిని నిలుపుదల చేస్తున్నామని గతవారం ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ తెలిపారు. దేశంలో చికెన్ సరఫరా పెంచి ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి👉 కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే.. ఒక్కసారిగా మలేసియా పౌల్ట్రీపైనే సింగపూర్ చికెన్ వ్యాపారం మూడోవంతు ఆధారపడి ఉంది. ఇక మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 శాతం వరకు రేట్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జనం మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మరోవైపు కోడి మాంసం సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని సింగపూర్ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. చికెన్ ప్రత్యామ్నాయ మాంసంవైపునకు కూడా మళ్లాలని ప్రజలకు సూచించింది. చదవండి👉ఒక్క అడుగు అటువైపు వేసిఉంటే నుజ్జునుజ్జు అయ్యేవాడే.. భయంగొలిపే వీడియో! -
ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్...
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 3–3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది. మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. -
మలేసియాకు చిరంజీవి పయనం.. 20 రోజుల పాటు
Chiranjeevi Going To Malaysia For Valteru Veeraiah Movie Shoot: మలేసియా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు 'వాల్తేరు వీరయ్య'. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు ? అనే అంశాలు తెలియడానికి కాస్త సమయం ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి, బాబీ అండ్ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్ కీలకమని సమాచారం. జీకే మోహన్, ఎమ్ ప్రవీణ్ సహనిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. చదవండి: 👇 నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ అందుకు క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్.. -
ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్
క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం గొప్ప.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు అరుదైన ఫీట్.. మరి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే అద్భుతం అనాల్సిందే. అందుకే అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు.. మరి ఆ అద్బుతాన్ని సాధించింది ఎవరంటే మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్. నిజానికి వీరన్‌దీప్ సింగ్ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల క్లబ్లో జాయిన్ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం. నేపాల్ ప్రొ కప్ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవెన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగింది. వీరన్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రాకముందు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్ తొలి బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్ సింగ్ హ్యట్రిక్ నమోదు చేయడం విశేషం. హ్యాట్రిక్ సాధించిన తర్వాత వీరన్ షాహిద్ అఫ్రిది సెలబ్రేషన్‌ను గుర్తు చేశాడు. మొత్తానికి వీరన్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్ స్లిప్ క్యాచ్, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్ రూపంలో సాధించాడు. 2⃣0⃣th Over 6⃣ Balls 6⃣ Wickets 4⃣ in 4⃣ from the final 4 for the bowler 1⃣ Run Out Unbelievable stuff from @Viran23 for the @MalaysiaCricket XI here in Bhairahawa, Nepal! Surely the first time in Cricket History there's been 6 Wickets in 6 Balls!?? pic.twitter.com/pVIsdlyEwt — Andrew Leonard (@CricketBadge) April 12, 2022 -
క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్ చేశాడు
క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మన్ బంతి ఎదుర్కొవడానికి ముందు గార్డ్ ఇవ్వడం ఆనవాయితీ. రైట్ హ్యాండ్ అయితే రైట్గార్డ్.. లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ గార్డ్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్ చేశాడు. ఎంసీఏ టి20 క్లబ్స్ ఇన్విటేషన్ 2020లో భాగంగా కేఎల్ స్టార్స్, రాయల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ వారియర్స్ వికెట్ కీపర్ హరీందర్‌జిత్ సింగ్ కొత్త బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు. వాస్తవానికి హరీందర్‌జిత్ రైట్ హ్యాండ్ బ్యాటర్. కానీ బ్యాటింగ్ గార్డ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గార్డ్ చూపించాడు. ఇది చూసిన అంపైర్ కూడా ఆల్రైట్ అన్నాడు. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా హరీందర్‌జిత్ బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేశాడు. బౌలర్ బంతి విసరడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటివరకు లెఫ్ట్‌హ్యాండ్ ఆర్డర్లో ఉన్న హరీందర్ జిత్.. ఒక్కసారిగా రైట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది చూసిన మనకు షాక్.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నవ్వులు విరపూశాయి. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా ఫీల్డింగ్ ఆర్డర్ మార్చాడు. అలా అంపైర్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను వస్తూనే ఫూల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను హరీందర్ జిత్ షెకాన్ ట్విటర్లో షేర్ చేశాడు. '' నేను క్రికెట్ ఆడుతున్న ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఇంతకముందు ఎప్పుడు జరగలేదు.. నాతోనే ఇది సాధ్యమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయల్ వారియర్స్ 51 పరుగుల తేడాతో కేఎల్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఆటగాళ్లను ఫూల్ చేసిన హరీందర్‌జిత్ షెకాన్ 48 బంతుల్లో 56 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతని స్కోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ వారియర్స్ 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. 125 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్ వారియర్స్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: World Cup 2022: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో! IPL 2022: ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే! Never seen anything like this before in all my years of cricket 🤣🤣 Just wait for it..🤣 pic.twitter.com/HOO82voD5y — Harinder Sekhon (@harinsekhon9) March 21, 2022 -
పామాయిల్ ‘పంట’ పండుతోంది!
-
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కి షాక్.. FIR మూవీ బ్యాన్
Vishnu Vishal FIR Movie Banned: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కి షాక్ తగిలింది. తాజాగా ఆయన నటించిన చిత్రం FIR(ఎఫ్ఐఆర్ )నేడు(ఫిబ్రవరి11)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్, మలేషియా, ఖతార్‌లతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా అక్కడ సెన్సార్‌ని క్లియర్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మలేషియా, కువైట్, ఖతార్ ఫ్యాన్స్‌కు హీరో విష్ణు విశాల్ క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ సినిమాలో విష్ణు ముస్లిం యువకుడిగా నటించగా, గౌతమ్ మీనన్ పోలీసు అధికారిగా నటించాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 😔🤫🤫 Sorry #MALAYSIA and #KUWAIT audience... https://t.co/mUDZA3mJK4 — IRFAN AHMED (ABA) (@TheVishnuVishal) February 10, 2022 -
జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
సాధారణంగా వర్షా కాలంలో రోడ్లన్నీ తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు ఎదురైన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయాల్లో రోడ్లపై బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పి పడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనదారునికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. జస్ట్ మిస్ లేదంటే.. ఆ వీడియోలో.. వర్షం పడతుండడంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉంది. అంతలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. అంతకు ముందే వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనదారుడు జారిపడ్డాడు. అయితే వెనకనుంచి అదే లేన్‌లో ఓ ట్రక్ వస్తోంది. ఇది గమనించిన ఆ బైకర్ తేరుకుని వెంటనే ఆ ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఖాళీగా ఉన్న పక్క లేన్ వైపు లేచి పరిగెత్తాడు. కేవలం సెకన్ల వ్యవధిలో ఆ బైకర్ ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 24న జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు చాలా లక్కీ’, ‘జస్ట్ మిస్ లేదంటే’.. అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ -
‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'
More than 30,000 people were evacuated from their homes in Malaysia మలేషియా: దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు. డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చదవండి: మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో.. -
టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..
కాన్బెర్రా: కొన్ని అనుకోని సంఘటనల్లో తప్పుడు ఆరోపణలతో జైలు పాలైనప్పుడు అత్యంత బాధ అనిపిస్తుంది. అంతేకాదు మన న్యాయశాస్త్రం కూడా ఒక అపరాధికి శిక్ష పడకపోయినా పర్వాలేదు గానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్షపడకూడదనే నొక్కి చెబుతుంటాయి. కానీ చాలా కేసుల్లో మాత్రం దీన్ని ఉల్లంఘిస్తున్నారనడంలో సందేహం లేదు. అంతేకాదు తప్పుడు అభియోగాలతో నిస్సహాయులు, అభాగ్యులు జైలు పాలవుతున్న సందర్భాలు అనేకం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఆస్ట్రేలియాలోని తల్లి కూతుళ్లు ఎదుర్కొన్నారు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) అసలు విషయంలోకెళ్లితే....టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షితమైన సాంప్రదాయ పానీయాలలో ఒకటి టీ. అంతేందుకు ప్రయాణంలో చాలామంది టీ తాగేందుకే ఆసక్తి కనబరుస్తారని చెప్పక తప్పదేమో!. పాపం ఆ ఉద్దేశంతోనే కాబోలు వున్ పుయ్ కానీ చోంగ్, ఆమె కుమార్తె శాన్ యాన్ మెలానీ తమ స్వదేశం అయిన మలేషియా నుంచి సుమారు 25 కిలోల బ్రౌన్ జింజర్ టీ పొడిని దిగుమతి చేసుకుని మంచి ధరకు ఆస్టేలియాలో అమ్ముకుని లాభాలు గడించాలని ఆశిస్తారు. అయితే ఈ టీ పోడి మహిళలు ఎదర్కొనే పిరియడ్ పెయిన్‌ని పోగట్టడంలో మంచి జౌషధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ టీ పొడికి మంచి మార్కెట్ ఉంటుందన్న ఆశతో అంత ఎక్కువ మొత్తంలో ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ఏబీఎఫ్) అధికారులు టీ ప్యాకేజీలను విమానాశ్రయంలో స్వాధీనం చేసుకోవడంతో వారి వ్యాపార ప్రణాళికకు బ్రేక్ పడుతుంది. ఈ అనుహ్య ఘటనకు ఆ తల్లి, కూతుళ్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. పైగా ఆ విమానాశ్రయ అధికారులు ఆ టీ పొడిని యాంఫెటమైన్ డ్రగ్ ఫెన్మెట్రాజైన్గా తప్పుగా భావించి ఆ తల్లి కూతుళ్లను అరెస్ట్ చేయడమే కాక నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయడంతో నాలుగు నెలలు పాటు జైల్లోనే గడుపుతారు. ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్ పోలీసులు రంగంలోకి దిగి స్వయంగా ఫోరెన్సిక్ పరీక్షలు చేయడంతో ఆ తల్లి కూతుళ్లు తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయినట్లు స్థానిక కోర్టు గుర్తించి వారిని విడుదల చేస్తుంది. అంతేకాదు ఏబీఎఫ్ అధికారులు పొరబడినట్లు ఆస్ట్రేలియ ఫెడరల్ పోలీసలు కోర్టుకు తెలియజేయడమే కాక ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు లేవని నిర్ధారించిన రిపోర్ట్‌లను కోర్టుకి సమర్పించడంతోనే ఆ తల్లికూతుళ్లు విడుదల అవుతారు. ఏదిఏమైన ఈ విధంగా అన్యాయంగా అరెస్టు కావడం వల్ల వాళ్లు మానసికంగానూ, శారిరకంగానూ ఎంతో ఆవేదన అనుభవించి ఉంటారు కదా!. (చదవండి: అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) -
కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా
సూర్యాపేట క్రైం: మలేసియా సముద్రతీరంలో సూర్యాపేట యువకుడు రిషివర్ధన్‌రెడ్డి(21) గల్లంతయ్యారు. మోటకట్ట వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారుడు రిషివర్ధన్ మలే సియాలో సరుకుల రవాణా నౌకలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లభించలేదని, బుధవారం సాయంత్రంలోగా తెలుస్తుందని అధికారులు ఫోన్లో తెలిపారు. దీంతో బిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. ఎలారా బతికేది? మూడ్రోజుల క్రితం ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మురిపించావు. ఆ మాటల్ని ఇంకా మరువనే లేదు. అంతలోనే సముద్రంలో కొట్టుకుపోయావని చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది? కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా. – రిషివర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు -
మలేషియాలో సూర్యాపేట యువకుడు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశి వర్ధన్ రెడ్డి(20) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం మృత్యువాత పడ్డాడు. ఉదయం షిప్‌పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఉందని అన్నాడు. త్వరలోనే మరో కంపెనీకి మారాలనుకుంటున్నట్లు చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, కుమారుడి మృతిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి) -
‘స్వర్ణ పతకం’ అందుకునేవాడే... కానీ ఆలస్యంగా వచ్చాడని..
టోక్యో: పాపం జియాద్... పారాలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండో స్వర్ణం సాధించాడన్న అతని ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. దురదృష్టం వెంట రావడంతో బంగారు పతకం కూడా ముఖం చాటేసింది! మలేసియా చెందిన ముహమ్మద్ జియాద్ జుల్‌కెఫ్లీ షాట్‌పుట్ ఎఫ్20 క్లాస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. రియో పారాలింపిక్స్‌లో కూడా స్వర్ణం గెలిచిన అతను దానిని నిలబెట్టుకున్నట్లు కనిపించాడు. అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్ జట్టు ఫిర్యాదు చేసింది. నిజానికి ‘అధికారిక ప్రకటన’ తర్వాత జియాద్ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా... ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా... ‘అనౌన్స్మెంట్ సరిగా వినిపించలేదని, భాష అర్థం కాలేదని’ అతను చెప్పాడు. దాంతో ఇది సరైన కారణం కాదంటూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ కమిటీ జియాద్ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్ నాట్ స్టార్ట్ (డీఎన్ఎస్) అని పెట్టేసింది. ఈ ఈవెంట్లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్‌కు దక్కగా, గ్రీస్ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: పతకాల వేటకు విరామం -
స్టేజీమీదే.. 60 సెకన్లలో.. 65 డ్రెస్సులు మార్చింది
కౌలాలంపూర్: సాధారణంగా మనం డ్రెస్ వేసుకోవడానికి ఎంత లేదన్న ఐదు నిమిషాల సమయం అయినా పడుతుంది. అదే ఇక ఆడవారు చీర కట్టుకోవాలంటే 15-30 నిమిషాల సమయం తీసుకుంటారు. కొత్తగా చీర కట్టడం నేర్చుకునేవారు అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. కానీ నిమిషం వ్వవధిలో అనగా.. 60 సెకన్ల కాలంలో 65 డ్రెస్సులు మార్చి ప్రపంచ రికార్డు సృష్టించి వారిని ఎక్కడైనా చూశారా.. లేదా అయితే ఇది చదవండి మలేషియాకు చెందిన ఓ మహిళ నిమిషం వ్యవధిలో 65 డ్రెస్సులు మార్చి.. ఔరా అనిపించింది. అది కూడా స్టేజీ మీద. అదేలా సాధ్యం అంటే.. మ్యాజిక్. ఎవరీ చిన్, సిల్వియా లిమ్ అనే ఈ జంట చేసిన ప్రదర్శన ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళ స్టేజీ మీద నిల్చుని ఉంటుంది. ఆమె భర్త మ్యాజిక్ చేసే వాళ్లు ఉపయోగించే పెద్ద వస్త్రాన్ని ఆమె మీద కప్పుతాడు. దాన్ని కిందకు తీయగానే ఆమె ఒంటి మీద డ్రెస్ మారుతూ ఉంటుంది. ఇలా నిమిషం వ్యవధిలో ఈ జంట 65 డ్రెస్సులు మార్చినట్లు ఇల్యూషన్ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
మలేసియా ప్రధాని రాజీనామా
కౌలాలంపూర్: మలేసియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన 18 నెలలకే వైదొలగాల్సి వచ్చింది. మలేసియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన యాసిన్ సోమవారం రాజు సుల్తాన్ అబ్దుల్లాకు రాజీనామా సమర్పించారు. సంకీర్ణంలోని విభేదాల కారణంగా మద్దతు కోల్పోయి వైదొలిగిన యాసిన్... మరో ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉపప్రధాని ఇస్మాయిల్, మాజీ మంత్రి, యువరాజు రజాలీ హమ్జా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయిన మహతిర్ వైదొలగడంతో యాసిన్ 2020లో అధికార పగ్గాలు చేపట్టారు. -
కరోనా సోకిందని తల్లి, కుమార్తె బలవన్మరణం
తిరువొత్తియూర్: మలేషియాలో నివాసం ఉంటున్న తమిళ కుటుంబానికి కరోనా సోకడంతో విరక్తి చెంది తల్లి, కుమార్తె మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కడలూరు జిల్లా దిట్టకుడి కి చెందిన రవిరాజా (40) కంప్యూటర్ ఇంజినీర్. 12ఏళ్లకు పైగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి (5)తో నివాసముంటున్నారు. గత వారం రవిరాజా సహా భార్య, కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రవిరాజా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. సత్య, గుహదమణి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విరక్తి చెందిన సత్య, గుహదమణి నాలుగు రోజుల ముందు ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి రవిరాజా ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం సాయంత్రం మృతిచెందాడు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మృతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరం..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి… డెల్టా, లాంబ్డా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరో రూపం లాంబ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. -
మలేషియా: ఘోర రైలు ప్రమాదం.. 213 మందికి గాయాలు
కౌలాలంపూర్: మలేషియాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని కౌలాలంపూర్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.45గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెస్ట్ రన్లో భాగంగా వెళ్తున్న ట్రైన్లో ఒక డ్రైవర్ మాత్రమే ఉండగా.. మరో రైలు ప్రయాణికులతో వస్తుంది. ఈ క్రమంలో పెట్రోనాస్ టవర్స్‌కు సమీపంలో కంపంగ్ బారు – కేఎల్‌సీసీ స్టేషన్ల మధ్య సొరంగంలో రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 166 మందికి స్వల్పంగా, 47 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయని రవాణా శాఖ మంత్రి వీ కాసియాంగ్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు గాజు ముక్కలు తగలడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. సమాచార లోపం వల్లే ఘటన జరిగిందని, గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. డాంగ్ వాంగి జిల్లా పోలీస్ చీఫ్ ఏసీపీ మొహమ్ జైనాల్ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రయాణికులతో వెళ్తున్న రైలు కేఎల్‌సీసీ స్టేషన్ నుంచి పెట్రోనాస్ ట్విన్ టవర్స్‌కు దగ్గరలో ఉన్న భూగర్భ సొరంగం లైన్లో గోంబాక్ స్టేషన్‌కు వెళ్తుందని చెప్పారు. ఘటనపై మలేషియా ప్రధాని మొహిద్దీన్ యాసిన్ తీవ్ర విచారం వ్యక్త చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని రవాణా మంత్రిత్వశాఖకు సూచించారు. ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా మెట్రోరైలు చరిత్రలో మొదటిది. చదవండి: రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం! -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
టీనేజ్ సంచలనం.. టిక్ టాక్ ఎటాక్
పదిహేడేళ్ల మలేసియా విద్యార్థిని హస్నీజా టిక్ టాక్ చేసిన వీడియో ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపివేస్తోంది! స్కూల్ తరగతి గదిలో లైంగిక విజ్ఞానాన్ని బోధించే పురుష ఉపాధ్యాయుడొకరు ‘రేప్’ను ఒక జోక్‌లా చెప్పడం నచ్చని హస్నీజా ఆ విషయాన్ని టిక్‌టాక్ చేసి అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయి, విద్యాశాఖ ఆ ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించింది. రేప్‌ను హాస్యం చేయడంపై అక్కడి ‘ఆల్ ఉమెన్స్ యాక్షన్ సొసైటీ’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ‘కుదుపు’ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పట్లో ఆగిపోయేలానూ లేదు. ‘‘స్కూల్లో నిన్న నాకు ఎదురైన అనుభవం ఇది! ప్లీజ్, తరగతి గదుల్ని మాకు సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు సహాయం చేయండి’’.. అని టిక్ టాక్‌లో వీడియోలో విజ్ఞప్తి చేస్తున్నప్పుడు హస్నీజా ఆవేదన చూడాల్సిందే. ఏమిటి ఆమెకు ఎదురైన అనుభవం? రేప్ మీద వాళ్ల క్లాస్ టీచర్ జోక్ చేశాడు! ఆరోజు ఆయన బోధిస్తున్నది లైంగిక విజ్ఞాన శాస్త్రంలోని శారీరక ధర్మాల అధ్యాయం. ఇక అది మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి కూర్చొనే తరగతి గది. పాఠం చెబుతూ మధ్యలో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు ఆయన. ఆ నవ్వించడంలో రేప్‌ను కూడా జోక్ చేసేశాడు. మగపిల్లలు నవ్వారు. ఆడపిల్లలు నవ్వలేదు. వయసొస్తోంది కదా, జోక్ లోని అంతరార్థం గ్రహించి తలలు వంచుకున్నారు. ఒక సామాజిక సమస్యపై ఆయన అలా హాస్యం ఆడటం హస్నీజాకు నచ్చలేదు. ఆయన అలా ఎందుకు అనకూడదో, అంటే ఆడపిల్లలకు ఎంత హాని జరుగుతుందో చెబుతూ టిక్ టాక్ని అప్లోడ్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆ వీడియోను పదిలక్షల 40 వేల మంది చూశారు. ఆ స్పందన చూసి హస్నీజా వెంటనే ‘మేక్ స్కూల్ ఎ సేఫర్ ప్లేస్’ అనే హ్యాష్ ట్యాగ్‌ని క్రియేట్ చేసింది. మరుక్షణమే అది ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీవీల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌పై డిబేట్లు మొదలయ్యాయి. స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులు, ౖలñ ంగిక హింస.. ఆలోచనాపరుల హాట్ టాపిక్ అయ్యాయి. టాపిక్ హాట్ అని కాదు. ఆగ్రహావేశాల చర్చలు, ప్రసంగాలు మొదలయ్యాయి. మహిళా సంఘాల్లో కదలిక రావడంతో ప్రభుత్వం ఆ టీచర్‌పై విచారణకు ఆదేశించింది. అయితే హస్నీజా పరిస్థితి ఎలా అయిందో చూడండి. ∙∙ స్కూల్లో హస్నీజా సీనియర్ విద్యార్థి ఆమెను దగ్గరికి పిలిచి, ‘‘రేప్ చేస్తాను జాగ్రత్త’’ అని బెదిరించాడు. టీచర్ మీద టిక్ టాక్ చేసినందుకే అతడికి అంత కోపం! ‘‘లేదు, అమ్మాయిలే కాదు, అబ్బాయిలకూ స్కూల్లో రక్షణ ఉండాలి. రేప్ కల్చర్‌ని జోక్ చేయడం వల్ల ఇద్దరికీ ప్రమాదమేనని నేను చెప్పదలచుకున్నాను’’ అని హస్నీజా వివరణ ఇస్తుంటే టీచర్లు, స్టూడెంట్స్ వినిపించుకోవడం లేదు. ‘‘స్కూల్‌కి నువ్వు వేసుకొచ్చే బట్టలు ఎలా ఉంటాయో తెలుసా!’’ అని కొందరు ఆమె వస్త్రధారణ మీద పడ్డారు. హెడ్మాస్టర్ ఆమెను పిలిపించి, ‘‘ఏంటమ్మా... ఇది! నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు. మన స్కూల్‌కి ఎంత చెడ్డ పేరో!’’ అని మందలించారు. హస్నీజా ఇవేవీ ఊహించలేదు. అలాగని తను చేసిన పని తొందరపాటేమోనన్న భావనా లేదు. తను సరైన పనే చేశానని ఆమె బలంగా నమ్ముతోంది. అలా చెయ్యకపోతేనే తప్పు అయి ఉండేదని కూడా అంటోంది. హస్నీజాను ఎవరు ఏమన్నా, ఆమె తల్లిదండ్రులు మాత్రం మద్దతుగా ఉన్నారు. ‘‘తన జీవితం, తన అభిప్రాయాలు’’ అని అండగా నిలబడ్డారు. ‘‘ఈరోజు నా కూతురు ప్రశ్నించింది కనుక రేపు నా మిగతా కూతుళ్లకు ఇలాంటి అనుభవం ఎదురవదు’’ అని హస్నీజా తల్లి నోర్షానిజా అంటున్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. హస్నీజా పెద్దమ్మాయి. హస్నీజా టిక్ టాక్ ను ఆధారంగా చేసుకుని మలేషియా మహిళా సంక్షేమ శాఖ.. రేప్ జోకులు, ఆడవాళ్లపై కామెంట్లు, బాడీ–షేమింగ్‌ల మీద గట్టి చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖకు సిఫారసు చేసింది. హస్నీజా మలేషియాలోని కౌలా సెలంగార్ స్కూల్లో చదువుతోంది. సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తుంటుంది. సమాజంలో మార్పును కోరుకుంటూ టిక్‌టాక్‌లు చేస్తుంటుంది. అమ్మానాన్నతో హస్నీజా -
కరోనా పేరిట సంక్షోభం.. ఎమర్జెన్సీ
కౌలాలంపూర్: రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో మహమ్మారి కరోనా వైరస్ పేరు చెప్పి మలేషియాలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రధానమంత్రి విధించారు. ఆ వైరస్ పంజా విసురుతున్నా వాస్తవంగా మలేషియాలో పది నెలలుగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం ఉప ఎన్నికలు.. మరికొన్నిచోట్ల సాధారణ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వస్తుందనే భావనతో కరోనా పేరు చెప్పి దేశంలో అత్యవసర పరిస్థితిని మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసీన్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ దేశ రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వ్యతిరేకించారు. దీంతో ఇప్పుడు మలేషియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీన్ని కారణంగా చూపి అత్యవసర పరిస్థితి విధించడం సరికాదని కొట్టి పారేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల ఫలితంతో ఏర్పడిన పరిస్థితుల వలన ప్రస్తుతం అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని ఆ దేశంలోని మీడియా ఆరోపిస్తోంది. అత్యవసర పరిస్థితి విధింపుతో ఆ దేశంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదు. అయితే అత్యవసర పరిస్థితి విధించడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు ‘చీకటి రోజు’గా అభివర్ణించాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1 లక్ష 38 వేల కరోనా కేసులు నమోదవగా, 555 మరణాలు సంభవించాయి. -
10 వేల మంది హాజరు.. కారు దిగితే ఒట్టు
కౌలలాంపూర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా పెళ్లిల్లపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. 500-1000 మంది హాజరయ్యే పెళ్లి వేడుకలు ప్రస్తుతం 50-100 మంది అతిథిలతో ముగించేస్తున్నారు. అది కుదరకపోతే జూమ్‌లో వివాహ తంతు కానిచ్చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ నిబంధనలను పాటిస్తూ.. కేవలం సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తుండగా.. ఓ బడా బాబు మాత్రం ఏకంగా తన కుమారుడి వివాహానికి 10 వేల మంది అతిథిలను ఆహ్వానించాడు. 100-200 మందినే కంట్రోల్ చేయడం కష్టం అంటే ఈ పెళ్లికి వచ్చిన 10 వేల మంది కోవిడ్ నియమాలు పాటిస్తూ.. ఎంతో జాగ్రత్తగా వేడుకలో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ వివాహ వేడకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదేలా సాధ్యం అనుకుంటే సదరు దంపతులు డ్రైవ్ థ్రూ వివాహం చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. (చదవండి: అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’ ) ప్రస్తుతం ఈ పెళ్లి తంతు మలేషియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం మలేషియాలో పెళ్లి వేడుకలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ తన కుమారుడి వివాహానికి 10 వేల మందికిపైగా ఆహ్వానం పంపించారు. వారంతా కార్లలో వచ్చి అందులోనే కూర్చొని పెళ్లి వేడుకను వీక్షించారు. కార్లలోంచి చేతులు ఊపుతూ వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. వారు కార్లనుంచి దిగకపోవడంతో భౌతిక దూరం నిబంధనల ఉల్లంఘన జరగలేదు. అలానే కార్ల వద్దకే వెళ్లి అతిథులకు భోజనాలు వడ్డించారు. (చదవండి: ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను! ) దీనిపై టెంగ్కూ అద్నాన్ స్పందిస్తూ తమ ఇంట్లోని పెళ్లికి 10 వేలమంది హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చిన వారంతా కార్లలోనే కూర్చొని పెళ్లిని చూశారని.. ఎక్కడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. వారందరికీ డిన్నర్ ప్యాకెట్లు అందజేశామని చెప్పారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వివాహం అయిన మరుసటి రోజే సదరు మంత్రి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఇక మలేషియాలో ఇప్పటి వరకు 95,300 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. -
మన్‌ప్రీత్ పెళ్లిపై వివాదం
కొటాబహరు (మలేసియా): భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించి అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. తన చిరకాల స్నేహితురాలు, మలేసియా దేశానికి చెందిన ఇలి నజ్వా సిద్దీఖీని గత బుధవారం జలంధర్‌లో మన్‌ప్రీత్ పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయితే దీనిపైనే మలేసియా దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం మహిళ అయిన నజ్వా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమిటని, ఆమె మతం మార్చుకుందా అంటూ ప్రశ్నలు వచ్చాయి. చివరకు ఇందులో మలేసియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పెళ్లి కోసమంటూ నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే మలేసియా ఉప ప్రధాని (మత వ్యవహారాలు) అహ్మద్ మర్జుక్ మాత్రం తమకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని...నజ్వా స్వదేశానికి తిరిగొచ్చి అన్ని అంశాలపై స్పష్టతనివ్వాల్సి ఉందని చెప్పారు. ‘ఇలి నజ్వా సొంత రాష్ట్రం జొహర్ ప్రభుత్వ అధికారుల నుంచి మరిన్ని వివరాలు కోరాం. ప్రస్తుతానికి మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆమె ముస్లిం. ఇంకా మతం మారలేదు. విదేశంలో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఆమె ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు పంపించలేదు. ఆమె ముస్లింగానే ఉంటూ పంజాబీ తరహా పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పు చేసినట్లుగానే భావిస్తాం’ అని మర్జుక్ అన్నారు. తాజా వివాదంపై అధికారికంగా నజ్వా కానీ మన్‌ప్రీత్ సింగ్ కానీ ఇంకా స్పందించలేదు. -
దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు
కౌలలాంపూర్: మలేషియాకు చెందిన జాక్రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం లేచే సరికి పక్కన ఫోన్ కనిపించలేదు. ఎక్కడ పెట్టానా? అని ఇల్లంతా వెతికాడు. కానీ దొరకలేదు. పోనీ ఎవరైనా ఎత్తుకెళ్లారా? అంటే ఆ ఆనవాళ్లు కూడా కన్పించలేదు. ఏదో మంత్రమేసినట్టుగా ఇలా మాయమైంటేందబ్బా అని తల గోక్కున్నాడు. ఎలాగైనా ఫోన్‌ను కనిపెట్టాల్సిందేనని అనుకున్నాడు. ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ ఇంటికి దగ్గర్లోని చిట్టడవికి దారి తీశాడు. అతని తండ్రి అదే పనిగా కాల్ చేస్తుండగా, దాని ద్వారా వచ్చే రింగ్ ఆధారంగా అతను చెవులు రిక్కిరించి మరీ ముందుకెళ్లాడు. అలా ఓ తాటి చెట్టు కింద ఫోన్‌ను గుర్తించాడు. (పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!) మొబైల్లో దొంగల ఫొటోలు ఉండొచ్చేమో చెక్ చేయమని అతడి అంకుల్ సలహా ఇచ్చాడు. దీంతో జాక్రిడ్జ్ ఫోన్ ఆన్ చేసి ఫొటోలు చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే అందులో ఉన్న దొంగ.. మనిషి కాదు, కోతి. అవును, ఆ దొంగ కోతి ఎన్నో సెల్ఫీలు తీసుకుంది. కొన్నిసార్లు ఫోన్‌ను తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు క్యాప్చర్ అవగా, మరికొన్ని వీడియోలుగా రికార్డయ్యాయి. వీటన్నంటికి అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా తెరిచిన కిటికీ ద్వారా ఆ కోతి ఇంట్లోకి వచ్చి, తన ఫోన్ ఎత్తికెళ్లి ఉంటుందని జాక్రిడ్జ్ చెప్పుకొస్తున్నాడు. (కునుకు తీసిన కోతి.. నవ్వులు పూయిస్తున్న వీడియో) Something yang korang takkan jumpa setiap abad. Semalam pagi tido bangun bangun tengahari phone hilang. Cari cari satu rumah geledah sana sini semua takde then last last jumpa casing phone je tinggal bawah katil tapi phonenya takde. Sambung bawah. pic.twitter.com/0x54giujnY — z (@Zackrydz) September 13, 2020 -
మలేషియాలో ప్రవేశానికి నో ఎంట్రీ
మోర్తాడ్ (బాల్కొండ) : పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో భారత్‌తో పాటు మరో 22 దేశాల పౌరుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది. ఈ నిషేధం ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి రాగా డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. కోవిడ్ 19 రహిత దేశంగా మలేషియాను నిలపాలనే ఉద్దేశ్యంతో ఈ ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక మలేషియాలో పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు ఏజెంట్లు పలువురిని విజిట్ వీసాలపై తరలించారు. వీరిలో తెలంగాణకు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో కొంతమంది అప్పులు చేసి స్వదేశానికి చేరుకోగా, మరికొంత మంది మలేషియాలోనే చిక్కుకుపోయారు. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశానికి వెళ్లాలనుకున్నా, అక్కడి నుంచి తిరిగి భారత్‌కు రాలేని పరిస్థితి. (కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్) -
భర్త లేడు: కొడుకును పెళ్లాడిన తల్లి?
కౌలలాంపూర్: రష్యాలో ఓ మహా తల్లి ఆమె దత్తత తీసుకుని పెంచుకుంటున్న కొడుకునే పెళ్లి చేసుకున్న ఘటన మనం ఇదివరకే చూశాం. తాజాగా మలేషియాలోనూ ఓ తల్లి కొడుకుని పెళ్లి చేసుకుందంటూ ఓ వార్త ఫొటోలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజశ్రీ సెల్వకుమార్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి.. "నా కొడుకు పన్నెండేళ్ల వయసున్నప్పుడు మొదటి భర్త చనిపోయాడు. అప్పుడు నా వయసు 30. కొడుకుతో కలిసి నివసిస్తూ ఉండగా ఓ రోజు వాడు నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అతడి కాలేజీ ఐపోయిన కొద్ది నెలల తర్వాత పెళ్లికి అంగీకరించాను. అలా 2016లో ఇద్దరం వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మాకు మూడేళ్ల కొడుకున్నాడు" అని పోస్ట్ పెట్టారు. దీనికి కొన్ని ఫొటోలను కూడా జత చేశారు. (కొడుకును పెళ్లాడిన సోషల్ మీడియా స్టార్) అయితే ఇది అబద్ధమని తేలింది. సదరు ఫొటోలు మలేషియాకు చెందిన జంట ప్రతిలాస్మి సెల్వరాజ్, సేల రాజేంద్ర వని నిర్ధారణ అయింది. పైగా వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల రిలేషన్షిప్ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇక తమ ఫొటోలు తప్పుడుగా ప్రచారమవుతున్నాయని తెలిసిన ఈ జంట షాక్‌కు గురయ్యారు. దీనిపై సేల రాజేంద్ర మాట్లాడుతూ.. 'ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు. మాకు ఎవరూ శత్రువు లేరు కానీ ఇలా మమ్మల్ని బజారులో నిలబెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం' అని పేర్కొన్నారు. మరోవైపు ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించిన సెల్వ కుమార్ అనే ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. (పెళ్లికి ముందు వీటిని అడుగుతున్నారా?) వాస్తవం: మలేషియాలో తల్లి, కొడుకును పెళ్లి చేసుకోలేదు. వైరల్ అవుతున్న ఫొటోల్లో ఉన్నది నిజమైన భార్యాభర్తలు. -
10 రెట్లు ఎక్కువ ముప్పు
కౌలాలంపూర్: కరోనా వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రూపాంతరం చెందుతూ మరింత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. మలేసియాలోని వైరస్‌లో మరో కొత్త రకమైన జన్యు మార్పుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డీ614జీ అని పిలిచే ఈ కొత్త రకం మార్పులతో వైరస్ 10 రెట్లు వేగంగా ఇతరులకి సోకుతుందని మలేసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. దీనినే సూపర్ స్ప్రెడర్గా పిలుస్తారు. (జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!) భారత్ నుంచి వచ్చిన వ్యక్తితో సంక్రమణ భారత్ నుంచి వచ్చిన ఒక రెస్టారెంట్ ఓనర్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడంతో 45 మందికి వైరస్ సోకింది. అలా వైరస్ బారిన పడిన మూడు కేసుల్లో జన్యుపరమైన మార్పుల్ని గుర్తించినట్టుగా మలేసియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ నూర్ హిషమ్ అబ్దుల్లా ఫేస్బుక్ పోస్టింగ్‌లో వెల్లడించారు. ఆ వ్యక్తికి అయిదు నెలల జైలు శిక్ష విధించారు. అదే విధంగా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి వైరస్ సోకిన వారిలో కూడా జన్యుపరమైన మార్పులున్నట్టు వెల్లడైంది. ఈ జన్యు మార్పులతో వైరస్ ఇతరులపైకి సులభంగా దాడి చేస్తూ , 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌లో ఈ కొత్త తరహా మార్పులతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అబ్దుల్లా తన పోస్టింగ్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. వైరస్ 10 రెట్లు వేగంగా విజృంభిస్తుంది. ఆ చెయిన్‌ని బద్దలు కొట్టాలంటే ప్రజలు సహకరించాలి’’అని అబ్దుల్లా హితవు పలికారు. వ్యాక్సిన్ తయారీ కష్టమా ? గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్లో తొలిసారిగా వైరస్ బయటకొచ్చి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందే క్రమంలో జన్యుపరమైన మార్పుల్ని ఇప్పటికే గుర్తించారు. గతంలో ఈ తరహా జన్యు మార్పులు అమెరికా, యూరప్‌లలో గుర్తించారు. తాజాగా మలేసియాలోనూ బయటపడడం ఆందోళన పుట్టిస్తోంది. ఇలా వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ఉంటే కరోనాకి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలోనూ, ఔషధ తయారీలోనూ సవాళ్లు ఎదురవుతాయని కొందరు శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం వైరస్లలో జన్యుపరమైన మార్పులు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయని, అవేమంత ప్రమాదకరం కాదని ఇప్పటికే వెల్లడించింది. కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటున్న జన్యుమార్పులు టీకా తయారీకి ఎలాంటి అవరో«ధం కాదని చెబుతోంది. -
10 రెట్లు ప్రమాదకరంగా మారిన వైరస్!
కౌలాలంపూర్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లో 26 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకు పైగా మరణించారు. మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో నూతన సవాలు విసురుతున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. (కరోనా పడగ నీడలో 200 రోజులు) ఇలా పరివర్తనం(మార్పు) చెందిన కరోనా వైరస్‌కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్ యజమాని నుంచి ప్రారంభైన క్లస్టర్లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్‌ను గుర్తించారు. సదరు రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియా వచ్చి.. 14 రోజుల క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించాడు. అతడి రెస్టారెంట్ కేంద్రంగా 45 కేసులు వెలుగు చూడటంతో మలేషియా ప్రభుత్వం అతడికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. ఇక బ్లూమ్‌బర్గ్ నివేదికలో హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా ‘కరోనా వైరస్ పరివర్తనానికి(మ్యూటేషన్) గురవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఎందుకంటే పరివర్తనానికి గురైన కరోనా వైరస్ ప్రస్తుతం మలేషియాలోనే వెలుగు చూసింది. ఈ సంక్రమణ గొలుసును విచ్ఛిన్న చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం’ అని హిషామ్ ఆదివారం ఫేస్బుక్ వేదికగా జనాలను కోరారు. అంతేకకా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్లో కూడా ఈ జాతి కనుగొనబడిందన్నారు. (వైరస్ గుట్టు తెలిసింది!) గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్‌కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదేవిదంగా సెల్ ప్రెస్‌లో ప్రచురితమైన ఒక పత్రిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదించింది. (సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు) -
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష
కౌలాలంపూర్ : మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. కాగా.. మలేషియాలో ఎన్ఆర్సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్‌పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. (దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) -
ఆలుమగల గొడవ: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్
కౌలాలంపూర్: భార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు సర్దుకుపోవాల్సిందే. అయితే మలేషియాలో మాత్రం ఓ జంట గొడవ యూట్యూబ్ అభిమానులకు కోపం తెప్పించింది. అది ఎలాగో చదివేయండి.. మలేషియాకు చెందిన ఎం.సుగు, ఎస్.పవిత్ర భార్యాభర్తలు. వీరిద్దరూ కలిసి ఇద్దరి పేరు వచ్చేలా "సుగు పవిత్ర" అనే యూట్యూబ్ చానల్ పెట్టారు. అందులో రుచికరమైన వంటకాల వీడియోలను అప్లోడ్ చేసేవారు. వీరు చేసే వంటలు నచ్చి, తయారీ విధానం మెచ్చి 7.8 లక్షల మంది ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 98 వీడియోలను చేశారు. అయితే జూలై 20న ఈ ఆలుమగల మధ్య గొడవ జరిగింది. (అనుకోని అతిధి రాకతో అద్భుతం..) ఈ క్రమంలో తర్వాతి రోజు పూటుగా తాగిన సుగు తన భార్యపై కొడవలితో దాడి చేశాడు. ఆమె గృహ హింస కింద భర్తపై కేసు పెట్టింది. దీంతో సుగు భార్యపై కోపంతో యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలను డిలీట్ చేశాడు. దీంతో వారికి ఉన్న ఏకైక ఆదాయం పోయినట్లైంది. మరోవైపు మీరు మీరూ తగవులాడుకుని మధ్యలో వీడియోలు ఎందుకు డిలీట్ చేశారని ఆ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం అక్కడ సుగు పవిత్ర ఛానల్ పేరు మార్మోగిపోతోంది. అయితే పవిత్ర తన భర్తను క్షమించివేసినట్లు, తన కేసు ఉపసంహరించుకున్నట్లు మలేషియా మీడియా పేర్కొంది. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి మళ్లీ కొత్త వీడియో కూడా చేయనున్నారట. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!) -
కౌలలాంపూర్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు
కౌలలాంపూర్: తెరాస మలేషియా, తెలంగాణ మలేషియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెరాస కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన మంత్రి కేటీఆర్ సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మలేషియా తెలంగాణ అసోసియేషన్, తెరాస మలేషియా ఆధ్వర్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ కోర్ కమిటీ సభ్యులతో కలిసి పీవీ జయంతి ఉత్సవాలను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిపారు. (నెహ్రూను మించిన ప్రధాని పీవీ) ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ కలిసి ఈ వేడుకలను నిర్వహిచండి అని పిలుపునివ్వడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ పీవీ చేసిన కృషిని గుర్తించిన కేసీఆర్.. వారికి తగిన గుర్తింపునివ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కేసీఆర్‌కు తెరాస మలేషియా తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. పీవీ శతాబ్ది జయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా నియమితులైన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు తెరాస మలేషియా తరపున హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు చిరుత, కమిటీ సభ్యులు కుర్మ మారుతి, గుండా వెంకటేశ్వర్లు, రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, దిలీప్ కపిడి, రాజేష్ తోడేటి పాల్గొన్నారు. (అచ్చమైన భారత రత్నం) -
టీఆర్ఎస్ మలేషియా: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ వర్చ్యువల్ ఈవెంట్ ద్వారా ఆన్లైన్లో వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లైవ్‌లోనే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అలాగే లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ వారికి కావలసిన సరుకులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ, జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్- అశ్విత, యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్- కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్- కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్- రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియాలో మనోళ్ల ఆకలి కేకలు
మోర్తాడ్(బాల్కొండ): పర్యాటకులకు స్వర్గధామమైన మలేషియాలో తెలంగాణ వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం మలేషియాలో రెండు నెలల నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడటంతో వలస కార్మికులకు ఉపాధి కరువైంది. మలేషియాకు విజిట్ వీసాలపై వెళ్లి ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకోవచ్చని ఏజెంట్లు నమ్మించడంతో ఎంతో మంది తెలంగాణ కార్మికులు అక్కడకు వలస వెళ్లారు. గల్ఫ్ దేశాల కంటే కొంత మెరుగైన వేతనం అందుతుండటంతో తెలంగాణ జిల్లాల నుంచి వలస కార్మికులు మలేషియాకు క్యూ కట్టారు. మలేషియాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు అవుతుండటంతో పోలీసులు అడుగడుగునా గస్తీ నిర్వహిస్తున్నారు. దీంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు తమ నివాస స్థలాల నుంచి బయటకు రాలేక పోతున్నారు. మొదట్లో తమ వద్ద నిలువ ఉన్న వంట సామగ్రితో వారం, పది రోజుల పాటు వెళ్లదీసామాని కార్మికులు తెలిపారు. రెండు నెలల నుంచి ఉపాధి లేక పోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని కార్మికులు వాపోతున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత కొందరు దాతలు ఇచ్చిన సరుకులతో కొన్ని రోజులు రెండు పూటలా భోజనం చేశామని కార్మికులు వివరించారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు నిండుకోవడంతో ఒక్క పూట కూడా భోజనం చేయలేని దుస్థితిలో ఉన్నామని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన రాజయ్య ‘సాక్షి’కి వివరించారు. మలేషియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు దాదాపు 1,500 మంది ఉన్నారు. మలేషియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కార్మికులు తమ ఆవేదనను విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ ఆకలి బాధను తీర్చడానికి మలేషియా ప్రభుత్వంతో చర్చించాలని వలస కార్మికులు కోరుతున్నారు. ఇంటికి చేర్చండి ఏజెంట్ల మాయమాటలు నమ్మి మలేషియాకు వచ్చిన మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత మమ్మల్ని ఎలాగైనా ఇంటికి చేర్చండి. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల వల్ల వలస కార్మికులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రోజు ఒక పూట భోజనం కూడా దొరకడం లేదు.– రాజయ్య, కార్మికుడు, రామారెడ్డి, కామారెడ్డి -
భారత్ అంగీకరించింది: మలేషియా
కౌలలంపూర్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)ను కట్టడి చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు విక్రయించేందుకు భారత్ అంగీకరించిందని మలేషియా మంత్రి కౌముర్దీన్ జాఫర్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 14న మలేషియాకు 89,100 టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతినిచ్చింది. మరిన్ని టాబ్లెట్లు తెప్పించునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. హైడ్రాక్సీక్లోరోక్విన్ లభ్యతపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’అని రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా) కాగా మలేషియాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ ఇప్పటికే 82 మంది ఈ మహమ్మారికి బలికాగా.. 5 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో సత్పలితాలు ఇస్తున్నట్లు భావిస్త్ను యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాల్సిందిగా మలేషియా భారత్‌ను అభ్యర్థించింది. ఇక ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్, మాల్దీవులు తదితర దేశాలకు భారత్ ఈ టాబ్లెట్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే.(6.2 టన్నులు.. భారత్‌కు ధన్యవాదాలు) కాగా గడిచిన కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా మాజీ ప్రధాని మహతీర్ విమర్శించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నడం సహా.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పామాయిల్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. అయితే వాణిజ్యపరంగా ఇరు దేశాల మధ్య విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో మందులు సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించడం గమనార్హం.(త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోతాయి: మలేషియా మంత్రి) -
థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై వేటు
బుడాపెస్ట్: నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) వేటు వేసింది. దాంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. గత బుధవారం నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
మేకప్ వేసుకోండి: భార్యలకు ప్రభుత్వ సలహా
కౌలాలంపూర్: కోవిడ్-19(కరోనా వైరస్) ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎక్కడివాళ్లక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబంలోని భార్యాభర్తలు ఒకరి ముఖం మరొకరు చూడలేక, గొడ్డు చాకిరీ చేయలేక గొడవలకు దిగుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి భార్యలను తిట్టడమే పనిగా కొందరు భర్తలు వ్యవహరిస్తుంటుంటే, దొరికిందే సందని కొంతమంది భార్యలు.. భర్తలకు ఎదురు తిరుగుతూ వారితో ఇంటిపని, వంట పనీ చేయిస్తున్నారు. పైగా అందులో తప్పేముందని బుకాయిస్తున్నారు. దీంతో తమ బాధలు వర్ణనాతీతమంటూ కొందరు మగరాయుళ్లు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకుంటున్నారు. మలేసియాలో వీరి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటినుంచి అక్కడ గృహహింస కేసులు 50 శాతానికి పైగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతోపాటు ఓ అడుగు ముందుకేసి మహిళామణులకు కొన్ని ఉచిత సలహాలిచ్చింది. (చదవండి: లాక్డౌన్ ఎంత పనిచేసింది?) ఇంట్లో ఉంటున్న భార్యలు ఎలా నడుచుకోవాలో చెప్పుకొచ్చింది. అందులో భాగంగా భార్యాభర్తలిద్దరూ బట్టలుతుకున్న ఫొటోను షేర్ చేసి దయచేసి మీ మొగుళ్లను విసిగించడం మానండని కోరింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తతడంతో ఆ పోస్టును డిలీట్ చేసింది. ఆపై మరో పోస్టులో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మహిళామణులు కాస్త మేకప్ వేసుకుని, మంచి బట్టలు ధరించాలని సూచించింది. దీంతో ‘మేం ఎలాంటి బట్టలు ధరించాలో, ఎలా అలంకరించాలో అది కూడా మీరే చెప్పండి’ అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ సూచనలు పురుషాధిక్యత, గృహహింసను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకన్న మలేసియా ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పింది. అయితే ఇంటి నుంచి పని చేస్తున్న మహిళలు, వారి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల సంబంధాలను బలపరిచే లక్ష్యంతోనే ఈ సూచనలు తెలిపినట్లు పేర్కొంది. (కోవిడ్: అయ్యో.. ఐరోపా) -
హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు
సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తెలుగు విద్యార్థులు విశాఖపట్నంకు చేరుకున్నారు. కౌలాలంపూర్ నుంచి 186 మంది విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో మలేషియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. దీంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు) ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తెలుగు విద్యార్థులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను పరిక్షీంచేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేశారు. 50మంది వైద్యులను నియమించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులకి తరలించేందుకు ఐదు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఏ లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచనున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. -
మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్ యాసిన్
కౌలాలంపూర్: మలేసియాలో రాజకీయం రంజుగా సాగుతోంది. తొంభై నాలుగేళ్ల ముదిమిలోనూ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాలని సర్వశక్తులు ఒడ్డిన మహాతీర్ మహమ్మద్‌కు చుక్కెదురు కాగా.... పెద్దగా గుర్తింపు లేని మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి మొహియుద్దీన్ యాసిన్‌ను శనివారం ప్రధాని పదవి వరించింది. ఈ ఆకస్మిక పరిణామంతో మలేసియాలో స్కామ్‌లలో మునిగిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లైంది. మొహియుద్దీన్ యాసిన్ ప్రధానిగా ఎంపిక కావడంతో అటు మహాతీర్ ప్రభ కొడిగట్టడమే కాకుండా... అతడి వారసుడిగా తనకు పదవి దక్కుతుందనుకున్న అన్వర్ ఇబ్రహీమ్ ఆశలకు గండిపడింది. -
ఆ మూడు దేశాలకు ‘బాబోయ్ మేం రాబోమంటూ’ ..
సాక్షి, సిటీబ్యూరో: రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి తిరిగి సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు వెళ్లాలంటే ఇప్పుడు రూ.లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు కొద్దిపాటు చార్జీలతోనే వెళ్లిరావచ్చు. అంతేకాదు, కొన్ని ఎయిర్‌లెన్స్ ప్రయాణికులు చెల్లించిన చార్జీలపైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు, విదేశీటూర్లకు తీసుకెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీలు పడిగాపులు కాస్తున్నాయి. కానీ హైదరాబాద్ నగర పర్యాటకులు మాత్రం ముందుకు రావడం లేదు. ఆ మూడు దేశాలకు వెళ్లేందుకు ‘బాబోయ్ మేం రాబోమంటూ’ వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ టూరిస్టు సంస్థలు సైతం ప్యాకేజీలను విరమించుకుంటున్నాయి. గత రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ నుంచి విదేశీ ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్‌లకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోగా పర్యాటకులు ఎక్కువగా వెళ్లే మలేసియా, సింగపూర్, బ్యాంకాక్‌లకు మాత్రం చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా వెళ్లవలసిన ప్రయాణికులు మినహా సాధారణ సందర్శకులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణంగా ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 6000 నుంచి 7000 వరకు పడిపోయినట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చార్జీలు తగ్గుముఖం హైదరాబాద్ నుంచి పర్యాటకులు ఎక్కువగా వెళ్లే బ్యాంకాక్‌కు రాను, పోను చార్జీలు కలిపి గతంలో రూ.26000 నుంచి రూ.30,000 వరకు ఉంటే ఇప్పుడు సుమారు రూ.20 వేలయింది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు బ్యాంకాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. పర్యాటక ప్రదేశాలు, అందమైన గార్డెన్లతో పాటు వినోదానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే బ్యాంకాక్‌కు ఎక్కువ సంఖ్యలో వెళ్తారు. కానీ రెండు నెలల క్రితం చైనాలో మొదలైన కరోనా క్రమంగా పలు దేశాలకు విస్తరించడం, ప్రత్యేకించి ఎక్కువ దేశాల నుంచి పర్యాటకులు వచ్చే బ్యాంకాక్‌కు ప్రమాదం పొంచి ఉండడంతో నగరవాసులు బ్యాంకాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నారు. ఉన్నపళంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో థాయ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏసియా వంటి విమాన సంస్థలు చార్జీలను బాగా తగ్గించాయి. అంతేకాకుండా క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బ్యాంకాక్‌తో పాటు ఎక్కువ మంది సింగపూర్, మలేసియాకు సైతం వెళ్తారు. అందమైన సింగపూర్‌ను తిలకించడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. ఇప్పుడు ఈ రెండు దేశాలకు కూడా ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎయిర్‌లైన్స్ చార్జీలను తగ్గించాయి. సింగపూర్‌కు సైతం హైదరాబాద్ నుంచి వెళ్లి, తిరిగి చేరుకొనేందుకు ప్రస్తుత చార్జీ రూ.20 వేలే కావడం గమనార్హం. ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ భారీగా ఉండే రోజుల్లో మలేషియా ట్రిప్పు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.23 వేలకు తగ్గిపోయింది. అయినప్పటికీ నగరవాసులు అటు వైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. వేచిచూస్తున్నారు.. ‘విదేశాలకు వెళ్లేందుకు ఎవరైనా ఆ సక్తి చూపుతారు. కానీ ఇప్పుడు చా లా మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. దీంతో ప్యాకేజీలను ఏర్పాటు చేయలేకపోతున్నాం.’ అని ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తున్నప్పటికీ టూరిస్టుల విముఖత కారణంగా ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఏడాదికి ఒకసారి బ్యాంకాక్‌కు వెళ్లడం అలవాటు.కానీ ఇప్పుడు ఆ దేశానికి వెళ్లాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఒకవైపు చైనాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఆ దేశానికి చెందిన టూరిస్టులపైన థాయ్‌లాండ్æ ఎలాంటి నిషేధం విధించలేదు. దీంతో ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు వెళ్లేందుకు సాహసించడం లేదు.’’ అని రమేష్ అనే పర్యాటకుడు తెలిపారు. ప్యాకేజీలు విరమించుకున్న ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌లకు క్రమం తప్పకుండా ప్యాకేజీలను ప్రకటించే ఐఆర్సీటీసీ ఈ సారి ఎలాంటి ప్యాకేజీలను విడుదల చేయలేదు. సమ్మర్ టూర్లను వాయిదా వేసుకుంది. ఈ మూడు దేశాలకు బదులు త్వరలో యురోప్ టూర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఐఆర్సీటీసీ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. -
మలేషియాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
మలేషియా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్బంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు మలేషియాలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఫ్రీ ట్రీ సొసైటీ ఆధ్వర్యంలో నాటింగమ్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం అసోసియేషన్ ని సందర్శించి అక్కడి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుర్మ మారుతి, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి, ముల్కల శ్రీనివాస్ , శ్యామ్ రాజారామ్, హేమంత్ సాయి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మలేసియా చేతిలో...
మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 1–4తో మలేసియా చేతిలో పరాజయం చవిచూసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే ఈ పోరులో గెలిచాడు. రెండు డబుల్స్ జోడీలు, ఇతర రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఈ పరాజయంతో భారత్ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్‌తో గెలుపొందడంతో క్వార్టర్స్ చేరిన భారత్... శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 11వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ 18–21, 15–21తో లీ జి జియా చేతిలో కంగుతిన్నాడు. మొదటి డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–చిరాగ్ షెట్టి ద్వయం 18–21, 15–21తో అరొన్ చియా–సో వుయి ఇక్ జంట చేతిలో ఓడింది. దీంతో భారత్ 0–2తో ఓటమికి దగ్గరవగా... రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్ 14–21, 21–16, 21–19తో చిమ్ జున్ వీపై నెగ్గడంతో జట్టు ఆశలు నిలిచాయి. కానీ రెండో డబుల్స్‌లో ధ్రువ్ కపిల–లక్ష్యసేన్ జోడీ 14–21, 14–21తో ఒంగ్ యివ్ సిన్– తే ఈ యి జంట చేతిలో, ఆఖరి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 10–21, 15–21తో లియాంగ్ జున్ హవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత్‌తో విభేదాలు తాత్కాలికమే: మలేషియా
కౌలాలంపూర్: వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్ పేర్కొన్నారు. మలేషియా పామాయిల్ ఉత్పత్తులపై భారత్ విధించిన నిషేధం తాత్కాలికమైందని భావిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న ఆయన.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే పామాయిల్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని సంబంధిత వ్యాపార సంస్థలకు సూచించింది. దీంతో వాణిజ్యపరంగా మలేషియాకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మలేషియా మంత్రి థెరిసా కోక్ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నాం. పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. పామాయిల్ కొనుగోలుపై భారత్ నిర్ణయం తాత్కాలికమే అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. బీ20 బయోడీజిల్ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని... తద్వారా పామాయిల్ ధరలు నిలకడగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.(చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!) -
చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!
కౌలాలంపూర్: భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్(94) వ్యాఖ్యానించారు. వాణిజ్యపరంగా భారత్‌తో ఏర్పడ్డ విభేదాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ తాజా నిర్ణయంతో మలేషియా తీవ్రంగా నష్టపోతోంది. దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. ఇప్పటికిప్పుడు నూతన దిగుమతిదారు దొరక్కపోవడంతో మలేషియా వాణిజ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లంగ్వావీలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మహతీర్... తమ పామాయిల్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేసినంత మాత్రాన తాము ప్రతీకార చర్యలకు దిగబోమన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేం. అయితే దీనిని అధిగమించడం లేదా ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే మార్గాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. (ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని) అదే విధంగా సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. ఇక పరారీలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ అప్పగింత విషయంలోనూ భారత్- మలేషియాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకీర్ నాయక్.. ప్రస్తుతం మలేషియాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత్ ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ మలేషియా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జాకీర్‌ను విచారిస్తామని భారత్ చెప్పినప్పటికీ... అతడికి చెడు తలపెట్టే అవకాశాలు ఉన్నాయన్న మహతీర్.. జాకీర్‌ను భద్రంగా చూసుకుంటూ.. అతడికి ఎటువంటి హాని తలపెట్టని దేశం (భారత్ కాకుండా)ఉందని భావించినపుడు మాత్రమే అతడిని తమ దేశం నుంచి బయటకు పంపించగలమని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మొమోటాకు గాయాలు
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో మొమోటా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. మంగళవారం ఆరంభమయ్యే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ నుంచి అతను వైదొలిగాడు. దాంతో స్వదేశానికి బయలుదేరేందుకు సోమవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న వ్యాన్ హైవేపై లారీని బలంగా ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ 24 ఏళ్ల బావన్ సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మొమోటాతోపాటు ఆ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఫిజియోథెరపిస్ట్ మొరిమోటో అకిఫుమి (జపాన్), అసిస్టెంట్ కోచ్ హిరయామ (జపాన్), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సాంకేతిక అధికారి థామస్ (బ్రిటన్) కూడా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీళ్లందరిని స్థానిక పుత్రజయ ఆసుపత్రికి తరలించారు. మొమోటా ముక్కుకు, ముఖానికి గాయాలయ్యాయని... పెదవులకు కుట్లు వేశారని ... ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని మొమోటాను పరామర్శించిన అనంతరం మలేసియా క్రీడల మంత్రి సయ్యద్ సాదిక్ తెలిపారు. మలేసియా ప్రధానమంత్రి మహాథిర్ మొహమ్మద్ భార్య సితి హాస్మా అలీ, మలేసియా దిగ్గజ షట్లర్ లీ చోంగ్ వీ కూడా మొమోటాను పరామర్శించి వెళ్లారు. గత ఏడాది మొమోటా ఏకంగా 11 టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మొమోటాను పరామర్శిస్తున్న మలేసియా ప్రధాని భార్య సితి హాస్మా అలీ -
మలేషియా: దర్బార్ సినిమాకు హైకోర్టు షాక్
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల థియేటర్లలో ఈ నెల 9న దర్బార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మలేసియాలో ఈ సినిమా విడుదల విషయమై మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మలేసియాలో తమిళులు అధికం. అక్కడ రజనీకాంత్ సినిమాలు బాగా ఆడుతాయి. ఈ నేపథ్యంలో మలేసియాలో దర్బార్ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే, రజనీకాంత్ గత సినిమా 2.0కు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్.. ఒక మలేషియా సంస్థకు రూ. 23 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి చెల్లించకుండానే లైకా సంస్థ తాజాగా తన సినిమా ‘దర్బార్’ను మలేసియాలో విడుదల చేస్తుండటంతో సదరు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మలేసియాలో దర్బార్ విడుదలపై స్టే విధించాలని కోరింది. దీనికి స్పందించిన హైకోర్టు మలేసియాలో దర్బార్ విడుదలకు రూ. 4.90 కోట్ల డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బు డిపాజిట్ చేయనిపక్షంలో మలేసియాలో దర్బార్ సినిమా విడుదల ఉండబోదని తెలుస్తోంది. -
నరకం నుంచి నవశకంవైపు
తూర్పుగోదావరి, మామిడికుదురు: కుటుంబ సభ్యులను వదలి పెట్టి, అయినవాళ్లకు దూరంగా ఎన్నో ఆశలతో మలేషియా వెళ్లారు వారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన చాలామంది కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోయి అష్టకష్టాలు పడ్డారు. పరాయి దేశం.. తెలియని భాష.. తెలిసిన వాళ్లు ఎవరూ లేని ప్రాంతం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా వాటిని దిగమింగుకుని కాలం వెళ్లదీశారు. పాస్‌పోర్టులు ఏజెంట్ల చేతిలో చిక్కుకు పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడే ఏళ్ల తరబడి మగ్గిపోయారు. కూలీలా పని చేస్తూ తినడానికి కూడా సరైన తిండి కూడా లేక జీవచ్ఛవాలుగా బతుకు వెళ్లదీశారు. స్వగ్రామాలకు ప్రాణాలతో వస్తారో! లేదో తెలియని నిస్సహాయ స్థితిలో కొట్టామిట్టాడారు. తమ కుటుంబ సభ్యులతో కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లేక తల్లడిల్లిపోయారు. ఉపాధి కోసం మలేషియా వెళ్లిన తమవారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియక మన రాష్ట్రంలో బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన అనుభవించారు. సినిమా కష్టాలను తలపించే ఈ కన్నీటి వ్యధలకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. ఈ తరహా బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎస్‌ఆర్‌టీఎస్) ద్వారా మలేషియాలో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన బాధితులను స్వగ్రామాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆమ్నెస్టీ సంస్థ మలేషియా విభాగం ద్వారా అక్కడ చిక్కుకున్న మన రాష్ట్రవాసులను స్వగ్రామాలకు తీసుకువచ్చింది. మన రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 150 మంది ఇంత వరకు విడతల వారీగా స్వగ్రామాలకు చేరుకున్నారు. మలేషియాలో ఉన్న వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ బొలిశెట్టి శ్రీరామ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వగ్రామాలకు చేరుకున్న బాధితులు తమ గోడును మలేషియాలో పడ్డ కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో వెళ్లాను మాది చాలా నిరుపేద కుటుంబం. మా ఇంట్లో వారంతా కూలీలే. ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను ఐటీఐ వరకూ చదువుకున్నాను. గ్యాస్ కంపెనీలో ఉద్యోగం అని చెప్పి ఏజెంట్ మలేషియా పంపించాడు. నా కోసం రూ.1.6 లక్షల వరకు అప్పు చేశారు. మూడున్నరేళ్ల క్రితం అక్కడకు వెళ్లాను. మలేషియాలో నాకు వచ్చే ఆదాయంతో స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో వెళ్లాను. కానీ నాకు అక్కడ కూలీ పని ఇచ్చారు. నాతో పాటు మరో ముగ్గురు తెలుగు వారి పాస్‌పోర్టులు తీసుకుని మమ్మల్ని ఏజెంట్ మోసం చేశాడు. వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్నాను.- బత్తిన సాయిభగవాన్, బావాయిపాలెం, నిడమర్రు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రెండున్నరేళ్లు వెట్టి చాకిరీ చేయించుకున్నారు రెస్టారెంట్లో క్యాషియర్ పని ఉందని చెప్పి మలేషియా తీసుకువెళ్లారు. 2017 ఆగస్టులో నేను అక్కడికి వెళ్లాను. అప్పటి నుంచీ నా చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. చేసిన పనికి జీతం ఇవ్వలేదు. 24 గంటలూ పని చేయించుకున్నారు. విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. సరైన తిండి కూడా పెట్టలేదు. పోలీసు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామంటూ బెదిరించారు. నాకు అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారు. అమ్మ, చెల్లికి ఇక్కడ ఆపరేషన్ జరిగింది. అక్కడ వచ్చే జీతంతో వారిద్దరినీ పోషించాలనుకున్నాను. కానీ నా ఆశ నెరవేరలేదు. రాత్రి సమయంలో పారిపోయి వచ్చి ఏపీఎన్ఆర్టీఎస్ని ఆశ్రయించాను. వారి సహకారంతో కుటుంబ సభ్యులను కలుసుకున్నాను. అయినవిల్లి సతీష్‌చంద్ర, కడియం మోసపోయిన వారిని మన రాష్ట్రానికి పంపిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మలేషియాలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను మన రాష్ట్రానికి పంపిస్తున్నాం. మలేషియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్మెస్టీ (క్షమాభిక్ష) ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత వరకు 150 మందిని స్వగ్రామాలకు పంపించాం. బాధితులకు విమాన ప్రయాణ టిక్కెట్లు, ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారికి నచ్చిన రంగంలో ఉచిత శిక్షణ కల్పించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. బొలిశెట్టి శ్రీరామ్, వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్, మగటపల్లి పాస్‌పోర్టు తీసేసుకుని ఇబ్బంది పెట్టారు మాది చాలా పేద కుంటుంబం. విశాఖపట్నంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాం. ఎన్నో ఆశలతో రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లాను. డ్రైవర్ ఉద్యోగం ఉందని చెప్పి ఏజెంట్ మలేషియా పంపించాడు. తీరా అక్కడకు వెళ్లాక కూలీ పని ఇచ్చాడు. పాస్‌పోర్టు తీసేసుకుని నా చేత పనులు చేయించుకున్నారు. ఇంటికి వెళ్లి పోతాననని ప్రాధేయపడినా కనికరించలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అష్టకష్టాలు పడి ఏపీఎన్ఆర్టీ సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కలిగింది.ఎస్కే బషీర్, విశాఖపట్నం హీనమైన పని చేయించారు నేను డిప్లొమా వరకు చదువుకున్నాను. ఎనిమిది నెలల క్రితం మలేషియా వెళ్లాను. నా దగ్గర ఏజెంట్ లక్ష రూపాయలు తీసుకున్నాడు. మూడు నెలలు ఏ విధమైన పని లేకుండా ఖాళీగా ఉన్నాను. రెండు నెలలు పని చేశాను. చేసిన దానికి ఏ విధమైన జీతం ఇవ్వలేదు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం అని చెప్పారు. నా చేత చాలా హీనమైన పని చేయించుకున్నారు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను చదివించాడు. అక్కడ నాకు వచ్చే ఆదాయంతో స్వగ్రామం వచ్చి వ్యాపారం చేసుకోవాలన్న ఆశతో వెళ్లాను. ఎట్టకేలకు సీఎం జగన్ సహకారంతో స్వగ్రామం చేరుకున్నాను. మహ్మద్ సాజిద్, ఎర్రగుంట్ల, కడప జిల్లా అడవులు నరికించారు మాది పెద్ద కుటుంబం. నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మ, నా భార్య కూలీ పని చేస్తారు. కంపెనీ పని అని ఏజెంట్ చెప్పాడు. మా నుంచి ఏజెంట్ రూ.1.52 లక్షలు తీసుకున్నాడు. అప్పు చేసి మా కుటుంబ సభ్యులు నన్ను మలేషియా పంపించారు. ఏడాదిన్నర క్రితం నేను మలేషియా వెళ్లాను. అక్కడకు వెళ్లిన తరువాత కూలీ పని చేయించారు. మాకు ఏవిధమైన ఆస్తిపాస్తులు లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాపై ఎంతో ఆదరణ చూపించింది. ప్రాణాలతో వస్తామన్న ఆశ లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భుక్త శ్యామ్, కేదారపురం, శ్రీకాకుళం జిల్లా -
‘ఆసియా మాస్టర్స్’లో దివ్యారెడ్డికి మరో స్వర్ణం
కుచింగ్: మలేసియాలో జరుగుతోన్న ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 40 ఏళ్ల మహిళల వయో విభాగం 1500మీ. పరుగులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ బొల్లారెడ్డి దివ్యారెడ్డి స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
తెరాస మలేషియా ఆధ్వర్యంలో 'కేసీఆర్ దీక్షా దివస్'
కౌలాలంపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్. ఆ మహత్తర సందర్భాన్ని తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నారు. దీక్షా దివస్ చేపట్టి నవంబర్ 29తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. మలేషియా ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు 'లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం' అసోసియేషన్‌ని సందర్శించి అక్కడి చిన్నారులకు కావాల్సిన స్టేషనరీ, పండ్లు అందజేశారు. వెల్ఫేర్ హోంలోని పిల్లల ఆర్థిక అవసరాల నిమిత్తం రూ. 20,000 నగదు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగం ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణ రావు నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవిందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, సంతోష్ రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు రాయితీలు
సిరిసిల్ల: పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన మలేషియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో మలేసియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఏర్పాటు చేసిన సదస్సులో బుధవారం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ పార్కు., మల్టీ పర్పస్ పార్కులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే.. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘మైట’అధ్యక్షుడు సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి, ఉపాధ్యక్షురాలు అశ్విత, ముఖ్య కార్యవర్గ సభ్యులు కిరణ్‌గౌడ్, ప్రతీక్, సత్య, సందీప్, సంతోష్, మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు కాంతారావు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని
కౌలాలంపూర్ : జమ్మూ కశ్మీర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సూచించిన పరిష్కారాలను అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, పాకిస్తాన్ వంటి ప్రతీ దేశం స్వాగతించి తీరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐరాస 74వ సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో ప్రసంగించిన మహతీర్.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. శాంతియుత చర్చలతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అయితే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మహతీర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... మలేషియా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. భారత్- మలేషియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. అయితే ఆ దేశ ప్రధాని మాత్రం అసత్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం బాగాలేదని విమర్శించారు. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన మహతీర్.. కశ్మీర్‌పై తన మనసులో ఉన్న కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించానని.. దానిని ఎవరికోసమో మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. ‘ఇతర దేశాలతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను కాపాడుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో కూడా స్నేహంగా ఉండాలని మేము భావిస్తున్నాం. మాది వాణిజ్య అనుకూల దేశం. అందుకే అతిపెద్ద మార్కెట్ల కోసం అన్వేషిస్తాం. అంతమాత్రాన ప్రజల పక్షాన మాట్లాడేందుకు మేము వెనకడుగువేయం. అయినా నిజాలు మాట్లాడినపుడు కొంత మంది స్వాగతిస్తారు. మరికొంత మంది వ్యతిరేకిస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌పై తన వ్యాఖ్యల నేపథ్యంలో మలేషియా పామ్ ఆయిల్‌ను కొనుగోలు చేయకూడదని ముంబైకి చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని భావించడం లేదని తెలిపారు. -
ఎంటీఎఫ్ ఆధ్వర్యంలో వయో వృద్దులకు దీపావళి కానుకలు
కౌలాలంపూర్ : దీపావళి పండుగ సందర్బంగా మలేషియా తెలుగు ఫౌండేషన్(ఎంటీఎఫ్) ఆధ్వర్యంలో వయో వృద్దులకు దీపావళి కానుకలు అందించారు. పహంగ్ లోని అమ్మవారి ఆలయములో వయో వృద్దులకి పంచలు, చీరలు అందించారు. గత ఐదు సంవత్సరాలుగా ఎంటీఎఫ్ పలు స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మలేషియాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఏడాది ఎంటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మలేషియాలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మలేషియాలోని భారత రాయభార కార్యాలయం, వారి బంధువులతో సంప్రదింపులు జరిపారు. మలేషియా నుంచి మృతదేహాన్ని మంగళవారం ఎంహెచ్198 విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత అంబులెన్స్ సహకారంతో మృతదేహాన్ని వారి గ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. -
అక్రమ నివాసులకు వరం
(వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల) :ఉపాధి కోసం మలేషియా వెళ్లి.. వివిధ కారణాలతో అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఆ దేశం గత నెలలో క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించింది. మలేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ జిల్లాలకు చెందినవలస జీవులకు ఊరట లభించింది. ఇబ్బందులు పడుతున్న వారంతా చట్టబద్ధంగా స్వస్థలాలకు చేరుకోవచ్చు. ఆమ్నెస్టీ గడువు డిసెంబరు 31 వరకు ఉంది. ఆమ్నెస్టీద్వారా స్వదేశాలకు వెళ్లే వారు మలేషియా రింగిట్స్ 700 (ఇండియన్ కరెన్సీలో రూ.12వేలు) చెల్లించాల్సి ఉంటుంది. విమాన టిక్కెట్లు స్వతహాగానే సమకూర్చుకోవాలి. మలేషియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 20వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అక్కడి ఫామాయిల్ తోటల్లో అనేక మంది పనిచేస్తున్నారు.నైపుణ్యం కలిగిన వారికి మెరుగైన జీతాలు ఉండగా.. అన్‌స్కిల్డ్ లేబర్‌కు 800 నుంచి 1200 రింగిట్స్ చెల్లిస్తారు. అయితే, ఎక్కువ జీతాల ఆశతో కంపెనీని వీడి బయటపనిచేస్తూ సుమారు 2వేల మంది అక్రమ నివాసులుగా మారినట్లు అంచనా. ఇందులో కొందరు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. వారంతా మలేషియా ప్రభుత్వంప్రకటించిన ఆమ్నెస్టీతో స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. వలస జీవులను ఆదుకుంటాం.. మలేషియాలోని జైళ్లలో మగ్గుతున్న వారిని, బయట చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) ద్వారా ఆదుకుంటాం. డిసెంబరు 31 వరకు ఆమ్నెస్టీ అమల్లో ఉంటుంది. దీనిని వినియోగించుకుంటే ఇబ్బందులు ఉండవు. మా సంస్థ ద్వారా తెలంగాణ ప్రాంత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. – తిరుపతి సైదం, మైటా అధ్యక్షుడు -
జకీర్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ : ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్‌పై మనీల్యాండరింగ్ కేసులో పీఎంఎల్ఏ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ పిటిషన్‌పై వారెంట్‌ను జారీ చేశారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న తాను కోర్టు ఎదుట హాజరయ్యేందుకు రెండు నెలల గడువు కోరుతూ గత వారం నాయక్ దాఖలు చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. తన విద్వేష ప్రసంగాలతో జకీర్‌నాయక్ భారత్‌లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఆయనపై అభియోగాలున్నాయి. జులై 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీపై జరిగిన ఉగ్రదాడి కేసులో జకీర్ నాయక్ అప్పగింత కోసం భారత్, బంగ్లాదేశ్‌లు వేచిచూస్తున్నాయి. భారత్ ఇప్పటికే నాయక్ పాస్‌పోర్టును రద్దు చేసి ఆయనను నేరస్తుడిగా ప్రకటించింది. తనకు శాశ్వత నివాసి హోదాను ఇచ్చిన మలేషియాలోనే ఆయన మూడు సంవత్సరాలుగా ఉంటున్నారు. నాయక్‌ను అప్పగించాలని మలేషియాతో భారత్ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. కాగా ఈస్ర్టన్ ఎకనమిక్ ఫోరం సమావేశాల నేపథ్యంలో తమ మధ్య జరిగిన సమావేశంలో జకీర్ నాయక్ అప్పగింత వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించలేదని మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్ పేర్కొన్న అనంతరం కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
మలేషియా ప్రధానితో మోదీ భేటీ
మాస్కో : ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్‌తో గురువారం భేటీ అయ్యారు. రష్యాలో తూర్పు ప్రాంత ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్) సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. వ్లాదివొటోక్లో వరుస సమావేశాలు సాగుతున్నాయని, మలేషియా ప్రధానితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్, మలేషియా ప్రజలు పరస్పరం లబ్ధి పొందేలా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత్-రష్యా వార్షిక సదస్సు, ఈఈఎఫ్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా చేరుకున్న సంగతి తెలసిందే. వ్లాదివొస్టోక్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. -
మలేషియా పీఎం కంటే మోదీనే ఎక్కువ ఇష్టం!
కౌలాలంపూర్: ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆ దేశంలోని హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మలేషియా హిందువులను కించపరిచిన జకీర్‌ను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నప్పటికీ.. మలేషియా ప్రధాని మాత్రం దానిని తోసిపుచ్చారు. జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగిస్తే.. ఆయనకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మలేషియా హిందువులు తమ దేశ ప్రధాని కంటే భారత ప్రధాని నరేంద్రమోదీకే ఎక్కువ విధేయంగా ఉంటున్నారని జకీర్ నాయక్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మలేషియా మానవ వనరులశాఖ మంత్రి ఎం కులశేఖరన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. మలేషియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని.. స్థానిక కమ్యూనిటీలపై అనుమానాలు లేవనెత్తేలా మాట్లాడే హక్కు జకీర్‌కు లేదని కులశేఖరన్ తేల్చిచెప్పారు. అయితే, ఆయనను భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన మలేషియా ప్రధాని మహాథిర్ బిన్ మహమ్మద్.. వేరే ఇతర దేశాలు కోరుకుంటే.. ఆయనను పంపిస్తామని చెప్పారు. ఉగ్రసంస్థలకు నిధులు అందించడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ప్రస్తుతం మలేషియాలో పర్మనెంట్ రెసిడెంట్‌గా తలదాచుకుంటున్నాడు. అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
పాపం.. ఆ అమ్మాయి చనిపోయింది
కౌలాలంపూర్: మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్ బాలిక నోరా కొయిరిన్(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్ మజ్లాన్ మన్సూర్ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. నోరా కొయిరిన్ మృతదేహాన్ని హెలికాప్టర్లో తరలిస్తున్న సహాయక సిబ్బంది(రాయిటర్స్ ఫొటో) నోరా కొయిరిన్ కిడ్నాప్ అయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, నోరా కొయిరిన్ ఆచూకీ కోసం పోలీసులతో పాటు చాలా మంది వలంటీర్లు గాలించారు. తమ కుమార్తె ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రింగిట్స్(సుమారు 8.5 లక్షలు) నజరానా ఇస్తామని నోరా కొయిరిన్ తల్లిదండ్రులు ప్రకటించారు. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది. (చదవండి: ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు) -
ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు
న్యూఢిల్లీ : ఆ అమ్మాయి కోసం అడవంతా అణువణువు గాలిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది సాయుధలు. పోలీసు జాగిలాలతో పరుగులుతీస్తూ హెలికాప్టర్లతో చక్కెర్లు కొడుతున్నారు. మైకుల ద్వారా రారమ్మని పిలుస్తున్నారు. ఘాట్ రోడ్డులో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి ఫొటో చూపించి ఆమె గురించి వాకబు చేస్తున్నారు. తారస పడుతున్నా తండాల ప్రజల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఆమె జాడ కోసం మలేసియా ‘స్టేట్ ఫైర్ అండ్ రిస్క్యూ డిపార్ట్మెంట్’కు చెందిన 80 మంది సిబ్బంది, 200 మంది ఎలైట్ కమాండోలు, ‘వ్యాట్ 69 కమాండో’ యూనిట్‌కు చెందిన 30 మంది గాలిస్తుండగా, పోలీసులు వారి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ జాడ దొరక్కపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆమె క్షేమాన్ని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇంత మంది ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నారంటే ఆ అమ్మాయి దేశ ప్రధానియో, ప్రధాని కూతురో కాదు. అసలు దేశానికి చెందిన అమ్మాయే కాదు. లండన్ పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. ఆమె పేరు నోరా కొయిరిన్. ఆమె స్కూల్ విద్యార్థులతో పాటు ఇటీవల మలేసియా వచ్చారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’లో బస చేశారు. అటవిలో సంచరించి ఆదివారం రాత్రి తన గదికి వచ్చిన ఆ అమ్మాయి మరుసటి రోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. రూము కిటికీ తలుపులు తెరచి ఉండడంతో ఎవరైనా ఆమెను ఎత్తుకపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ముందుగా రిసార్ట్ ఏరియాలో వెతికిన సాయుధ సిబ్బంది, ఓ చోట ఫెన్షింగ్ దెబ్బతిని ఉండడంతో ఆవలనున్న దట్టమైన అటవి ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. ఆ అమ్మాయి ‘హోలోప్రొసెన్సెఫలి’ అనే మెదడు జబ్బుతో బాధ పడుతోందని, సొంతంగా మొబైల్ ఫోన్‌కు కూడా సమాధానం ఇవ్వలేదని ఆమె తల్లి మెబ్ కొయిరిన్ తెలిపారు. ఎక్కడున్న రావాల్సిందిగా ఆమె చేత కూతురిని పిలిపించి, ఆ వాయిస్‌ను రికార్డు చేసి మరి అడవంతా వినిపిస్తున్నా నేటికి ఆమె జాడ దొరకలేదు. ఈ గాలింపు చర్యల్లో భద్రతాపరమైన కారణాల వల్ల అమ్మాయి తల్లిదండ్రులనుగానీ, తోటి విద్యార్థులనుగానీ అనుమతించడం లేదని పోలీసు చీఫ్ దాటక్ మొహమ్మద్ మట్ యూసుఫ్ తెలిపారు. -
మలేషియాలో క్షమాభిక్ష
పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులు జరిమానా, శిక్ష లేకుండా వారి దేశాలకు వెళ్లిపోవడానికి క్షమాభిక్ష అమలు చేస్తుంటాయి. ఇదే విధానాన్ని మలేషియా దేశం అమలు చేస్తోంది. ఈనెల ఒకటో తేదిన క్షమాభిక్ష అమలులోకి వచ్చింది. డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నారని అంచనా. గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, గతంలో మాదిరిగా జీతాలు లేకపోవడంతో అనేక మంది మలేషియా బాట పట్టారు. ఎక్కువ మంది వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలతో మలేషియాకు పంపించారు. వారికి సరైన అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. మలేషియా ప్రభు త్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను వినియోగించుకుని వారంతా స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంది. -
జానపాడుకు చేరిన నరసింహారావు
సాక్షి, పిడుగురాళ్ల/గురజాల: తండ్రి కష్టాలు చూసి తట్టుకోలేక కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించాలనే తపనతో మలేషియా వెళ్లి చిన్నతనంలోనే నరకం చూసిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన బత్తుల నరసింహారావు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. మలేషియా నుంచి తెలుగు అసోసియేషన్ సభ్యులు టిక్కెట్ బుక్ చేయడంతో నరసింహారావు గురువారం జానపాడులోని తన స్వగృహానికి క్షేమంగా చేరుకున్నాడు. ఐదు నెలల కిందట నరసింహారావు తన స్నేహితుడు సైదారావు, భీమవరానికి చెందిన ఏజెంట్ అయ్యప్పకు మలేషియా వెళ్లేందుకు రూ.లక్ష అప్పు చేసి ఇచ్చాడు. ఆ ఏజెంటు వర్కింగ్ వీసా బదులు విజిటింగ్ వీసాపై నరసింహారావును మలేషియాకు పంపించాడు. మలేషియాలో ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్న అతన్ని పోలీసులు విజిటింగ్ వీసాపై వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మలేషియాలో తను పడుతున్న బాధలను నరసింహారావు తండ్రికి ఉత్తరం ద్వారా తెలిపాడు. కొడుకును జైల్లో వేశారని, చిత్ర హింసలు పెడుతున్నారని నరసింహరావు తండ్రి బత్తుల గురూజీకి తెలిసి తల్లడిల్లాడు. ‘నేను చచ్చి పోతున్నా. ఇక బతకను’ అంటూ కొడుకు రాసిన లేఖను మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి తెలిపాడు. స్పందించిన ఎమ్మెల్యే మలేషియాలో తెలుగు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించి నరసింహరావు ఇండియా వచ్చేందుకు కృషి చేశారు. వారందరి కృషితో గురువారానికి స్వగ్రామమైన జానపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులు గురూజీ, పద్మ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులు తనను అరెస్టు చేశాక నరకం చూపించారని, జ్వరంతో బాధపడుతున్నా కనీసం ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదని నరసింహారావు వాపోయాడు. తన తండ్రి ,అధికారుల చేసిన ప్రయత్నాల వల్లే స్వదేశం చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేశాడు. మొదలైన మరో మలేషియా బాధితుడి కథ బత్తుల నరసింహారావు మలేషియా పోలీసుల నుంచి విడుదలై ఇండియాకు వస్తుండటంతో.. పోలీసులకు చిక్కిన మరో మలేషియా బాధితుడు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన లావేటి రమేష్ తనకు టిక్కెట్ వేయమని తల్లిదండ్రులకు లెటర్ ఇచ్చి పంపించాడు. రమేష్ గత ఏడు నెలల నుంచి మలేషియా జైల్లో మగ్గుతున్నాడు. ఒక బాధితుడి కథ సుఖాంతమయ్యే సరికి మరో బాధితుడి కథ వెలుగు చూసింది. -
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..
-
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..
సాక్షి, గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశంగాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. టూరిస్టు వీసా కావడంతో.. సైదారావు గతంలో టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. రూ.లక్ష అప్పు చేసి.. కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు. -
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి
గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశం గాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. రూ.లక్ష అప్పు చేసి.. కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు. గురూజీ సెల్ ఫోన్‌కు కుమారుడి దగ్గర నుంచి వచ్చిన లేఖ టూరిస్టు వీసా కావడంతో.. సైదారావు గతంలో టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!
కౌలాలంపూర్ : ట్రిపుల్ తలాక్ ద్వారా మలేషియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ తన భార్య , రష్యా బ్యూటీక్వీన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారని రాజు తరుపు న్యాయవాది తెలియజేశారు. ‘2019, జూన్ 22న షరియా చట్టాల ద్వారా మూడు సార్లు తలాక్ చెప్పి సుల్తాన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారు’ అని సింగపూర్‌కు చెందిన సదరు అడ్వకేట్ ప్రకటించారు. కాగా రాజు భార్య, మాజీ మిస్ మాస్కో ఆక్సానా మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. తామిద్దరు కలిసి దిగిన ఫొటోలు, తమ బంధానికి గుర్తుగా జన్మించిన కుమారుడి ఫొటోలను షేర్ చేస్తూ, తాము విడాకులు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో అనారోగ్య కారణాల దృష్ట్యా సుల్తాన్ సెలవులో ఉండటంతో విడాకుల విషయమై ఆయన స్పందించలేదు. కాగా సుల్తాన్ కారణంగా ఆక్సానాకు కుమారుడు కలగలేదని అతడి న్యాయవాది పేర్కొనడం పట్ల ఆక్సానా ఫైర్ అయ్యారు. ఇక బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలో మొహమ్మద్ తన స్థానం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో క్రీడాకారుడిగా పేరొందిన సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఆ దేశ కొత్త రాజుగా ఎన్నికయ్యారు. కాగా బ్యూటీక్వీన్తో రహస్య వివాహంతో వార్తల్లోకెక్కిన మొహమ్మద్ ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా మరోసారి చర్చనీయాంశమయ్యారు. -
విక్రమ్ సినిమాపై బ్యాన్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మిస్టర్ కెకె. కోలీవుడ్ లో కదరం కొండన్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో మిస్టర్ కెకెగా రిలీజ్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావటంతో మరోసారి విక్రమ్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా మిస్టర్ కెకె టీంకు మరో షాక్ తగిలింది. ఎక్కువ భాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను మలేషియా ప్రభుత్వం నిషేదించింది. మలేషియా పోలీసులను తప్పుగా చూపించినందకు గానూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర్స్ లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించారు. కమల్ చిన్న కూతురు అక్షరా హాసన్‌తో పాటు అభి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మలేషియా జైల్లో మనోళ్లు బందీ
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. వారు మంచి ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్దనుంచి రూ.1.90 లక్షలు వసూలు చేశారు. మంచి ఉద్యోగం ఉందని చెప్పి ముందుగా సదరు కన్సల్టెన్సీ జార్జియా దేశానికి పంపించింది. అక్కడ దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నకిలీదంటూ ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి పంపించేశారు. తిరిగి వచ్చిన ఇద్దరు యువకులు ఇదేమిటని కన్సల్టెన్సీని నిలదీయగా.. ఎక్కడో పొరపాటు జరిగిందని, మంచి ఉద్యోగాలు మలేషియాలో ఇప్పిస్తామని మరోసారి నమ్మించారు. మలేషియాకు విజిట్ వీసా ఇప్పించి, అక్కడికి చేరిన తర్వాత ఎంప్లాయిమెంట్ వీసా ఇప్పిస్తామని చెప్పి పంపించారు. వారు మలేషియా చేరగానే సదరు కన్సల్టెన్సీ చేతులు దులుపుకుంది. దీంతో మలేషియాలో ఎక్కడుండాలి, ఏం చేయాలో తెలియని ఆ యువకులు.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరూ పని ఇవ్వకపోవడంతో సాధ్యపడలేదు. ఈలోగా వీసా గడువు పూర్తయిపోయింది. గడువు ముగిసిన తర్వాత అక్కడి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మలేషియా జైల్లో ఉన్న తుమ్మల దర్శన్‌రెడ్డి అనే యువకుడి తండ్రి రాజిరెడ్డి సౌదీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి సుగుణ కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో నివసిస్తున్నారు. కుమారుడు జైలు పాలయ్యాడని తెలియడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నారు. నకిలీ వీసాలను అంటకట్టి లక్షల్లో దండుకున్న కన్సల్టెన్సీపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం కన్సల్టెన్సీ మోసాలకు గురై మలేషియా జైల్లో మగ్గుతున్న యువకులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మలేషియాలో ఏవైనా చిన్న కారణాల చేత జైల్లో చిక్కుకున్న వారికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేస్తోంది. దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లను స్వదేశానికి తిరిగి పంపించడానికి అధికారులతో సంప్రదిస్తున్నాం. – ఏళ్ల రాంరెడ్డి, ప్రవాసీమిత్ర అవార్డు గ్రహీత, సింగపూర్ -
మలేషియా నుంచి విడుదలైన జిల్లా వాసులు
సాక్షి, సిరిసిల్ల : బతుకుదెరువు కోసం పొరుగుదేశం వెళ్లిన వలస జీవులకు దుర్భర జీవితం నుంచి విముక్తి లభించింది. మలేషియా జైల్లో చిక్కుకుని నరకయాతన అనుభవించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన యువకులు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. పండుగపూట ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను కలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ ఏజెంట్ మాటలు నమ్మి పనికోసం మలేషియా వెళ్లిన ఆవునూర్వాసులు బోయిని నరేశ్, బోయిని సురేశ్ నకిలీ వీసాతో అక్కడ నానా ఇబ్బందులు పడ్డారు. మలేషియా ప్రభుత్వం వీరిని జైల్లో ఉంచింది. ఐదు నెలలుగా స్వగ్రామంలో ఉంటున్న తల్లితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేని నిర్బంధ స్థితిలో ఉండిపోయారు. వీళ్ల తండ్రి కూడా ఎడారి దేశంలో కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబసభ్యుల యోగాక్షేమాలను తెలుసుకోలేనంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నలిగిపోయారు. అదృష్టవశాత్తు వీళ్లు ఉంటున్న జైళ్ల నుంచి మరో వ్యక్తి ద్వారా ఆవునూర్‌లో ఉన్న తల్లికి సమాచారం అందింది. టీఆర్ఎస్ నాయకుడు కుంబాల మల్లారెడ్డికి విషయం తెలిసి సింగపూర్‌లో ఉంటున్న తనస్నేహితుడు ఏళ్ల రాంరెడ్డికి ఫోన్లో విషయం వివరించాడు. ఆయన వెంటనే స్పందించి మలేషియాలోని ఎమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించారు. సదరు యువకుల విడుదలకు అవసరమైన అన్ని అధికారిక ఏర్పాట్లను చేయించారు. ఎట్టకేలకు సదరు యువకుల పాసుపోర్టు జారీఅయ్యాక ఈనెల 10న చెన్నైలో దిగారు. అక్కడి నుంచి రైలులో వరంగల్‌కు చేరుకుని శుక్రవారం ఆవునూర్ గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన రాంరెడ్డి కేవలం పదిరోజుల్లో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకులను తిరిగి ఇంటికి రప్పించడంలో కృషి చేసినందుకు ప్రజాప్రతినిధులు అభినందించారు. వీసాల విషయంలో మోసపోకుండా ఉండాలని ఈ సందర్భంగా రాంరెడ్డి సూచించారు. -
కలలు చెదిరి..కన్నీళ్లు మిగిలి..
సాక్షి, గాజువాక: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం పాలవడంతో గాజువాకలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఇంటికి తిరిగొస్తానని చెప్పిన ఆ వ్యక్తి మృతి చెందినట్టు కబురు రావడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. వివరాలిలా ఉన్నాయి. పాతగాజువాక దరి టీవీఎన్ కాలనీకి చెందిన కె.సూర్యనారాయణ(45) ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రాకుండా అక్కడే మరో కంపెనీలో ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించాడు. పని దొరక్కపోవడంతో తాను తిరిగి వచ్చేస్తానని భార్య జయకు ఫోన్ చేసి చెప్పాడు. తనవద్ద డబ్బులు లేవని, డబ్బులు పంపిస్తే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె తనకు తెలిసివారి వద్ద రూ.30వేలు అప్పు చేసి భర్త అకౌంట్లో జమ చేసింది. డబ్బులు అందుకున్న సూర్యనారాయణ ఇక బయల్దేరడమే తరువాయి అని భార్యకు చెప్పాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న జయకు అతడు బాత్ రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో మృతి చెందినట్టు సమాచారం అందింది. సూర్యనారాయణతో పాటు అదే రూమ్‌లో ఉంటున్నవారు ఈ విషయాన్ని ఆమెకు ఫోన్లో చెప్పారు. వీసా గడువు ముగియడంతో మృతదేహం పంపేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏడాదిన్నర క్రితం అతడు ఉపాధి కోసం విజిటింగ్ వీసాపై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీసా గడువు ముగియడంతో మృతదేహం విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కాలేదు. దీంతో తన భర్త మృతదేహాన్ని రప్పించాలని మృతుని భార్య జయ వేడుకుంటోంది. మృతునికి భార్యతో పాటు లోకేష్, ఉదయ్‌కుమార్ అనే ఇద్ద కుమారులున్నారు. తండ్రి మరణంతో వారు పెద్ద దిక్కును కోల్పోయారు. జీవితంపై ఎన్నో కలలు కన్న ఆ కుటుంబానికి చివరికి కన్నీళ్లు మిగిలాయి. వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ సూర్యనారాయణ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి.. టీవీఎన్ కాలనీలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు తెలియజేసి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులతో కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. మృతదేహాన్ని పంపించడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా దేవన్‌రెడ్డి తెలిపారు. మృతుని కుటుంబాన్ని మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు, వైఎస్సార్సీపీ నాయకులు ఉరుకూటి చందు, దొడ్డి రమణ తదితరులు పరామర్శించారు. -
బ్యాడ్మింటన్‌కు లీ చాంగ్ గుడ్‌బై
కౌలాలంపూర్: మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వీ ఆటకు వీడ్కోలు పలికాడు. గురువారం మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన లీ చాంగ్ వీ.. 19 ఏళ్లుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న తనకు గతేడాది క్యాన్సర్ సోకిందని, వైద్యుల సూచన మేరకు ఇక ఆటను కొనసాగించబోనని స్పష్టంచేశాడు. ‘ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టంగా ఉంది. అయినా నాకు వేరే అవకాశం లేదు. ఇటీవల జపాన్‌లో వైద్యుల్ని సంప్రదిస్తే.. బ్యాడ్మింటన్ ఆడేందుకు నా శరీరం సిద్ధంగా లేదని తెలిపారు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనని ఎంతగానో అభిమానించే కుటుంబ సభ్యులకు, ప్రోత్సహించిన కోచ్‌లకు, అభిమానులకు లీ ధన్యవాదాలు తెలిపాడు. లీ.. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో డి జెనీరో ఒలింపిక్స్‌లో మూడు రజత పతకాలు సాధించాడు. అలాగే 2011 లండన్, 2013 గ్వాంగ్జౌ, 2015 జకార్తాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఆరింటిలో లీ చాంగ్ నాలుగుసార్లు చైనా క్రీడాకారుడు లిన్‌డాన్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిగతా రెండింట్లో మరో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో పరాజయం చెందాడు. -
మలేషియాలో బుల్లితెర నటీనటుల స్టార్‌నైట్
మలేషియాలో బుల్లితెర నటీనటుల సంఘం బ్రహ్మాండంగా స్టార్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆ సంఘం అధ్యక్షుడు రవివర్మ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ బుల్లితెర దివంగత నటుడు ఎస్ఎన్.వసంత్ ప్రయత్నంతో 2003లో బుల్లితెర నటీనటుల సంఘం ఏర్పడిందని తెలిపారు. కాగా ఇన్నేళ్లుగా సంఘాన్ని నడుపుతున్నా, సంఘానికి పెద్దగా నిధిగానీ, భవనాన్ని గానీ ఏర్పరచుకోలేకపోయామన్నారు. ఆ కొరతను తీర్చడానికే బుల్లితెర నటీనటుల సంఘం తరఫున మలేషియాలో స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించి నిధిని సేకరించతలపెట్టామని తెలిపారు. సంఘసభ్యుల సంక్షేమం కోసం ఆగస్ట్ 17న ఈ స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. మలేషియాలోని షా అలామ్ సిలాంగర్ మెలావాటి గ్రౌండ్లో ఈ స్టార్‌నైట్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో బుల్లితెర నటీనటులతో పాటు వెండితెర నటీనటులు పలువురు పాల్గొననున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, ఐసరిగణేశ్ పాల్గొన్నారు. -
కౌలాలంపూర్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
కౌలాలంపూర్ : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలతో విజయదుందుబి మోగించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ అభిమానులుగా ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ మలేషియా సభ్యులు తెలిపారు. కౌలాలంపూర్‌లోని సెరిండా జలపాతం దగ్గర వైఎస్సార్సీపీ విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. గుంటూరుకు చెందిన శ్యాం అనిల్ కుమార్, పెదకూరపాడుకు చెందిన వెంకటరెడ్డి, రాంబాబుల ఆధ్వర్యములో ఈ కార్యక్రమం జరిగింది. కట్టెపోగు కిషోర్, రోహిత్ క్రుపాల్, సంజీవ్ దాసి, చంద్రపాల్ బాబు పుల్లగూర, నెల్సన్, హరీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కుటుంబాలతో కలిసి రోహిత్ ప్రార్ధన చేయగా శ్యాం అనిల్ కుమార్, చంద్రపాల్ బాబు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం అనిల్ కుమార్, రోహిత్, రంబాబు, రాజేష్, రవికాంత్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ జగన్ దేవుని దీవెనలతో ప్రజారంజకమైన పరిపాలన అందించాలని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా అద్భుతమైన పరిపాలన అందిచాలని కోరారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్ జగన్‌కిశుభాకాంక్షలు తెలిపారు.