manchu Vishnu
-
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కన్నప్ప: నెమలితో తిన్నడి ప్రేమగీతం.. ముచ్చటగొలిపిస్తున్న జంట (ఫోటోలు)
-
'కన్నప్ప' నుంచి లవ్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్‌తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
మంచు విష్ణు 'ఢీ' కొట్టగలడా..?
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ థియేటర్స్‌లలో సందడి చేసింది. ఇప్పుడు ఢీ సినిమాను మార్చి 28 రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో వాటిని ఢీ కొట్టగలదా అనే సందేహాలు ఉన్నాయి.మార్చి 28 రెండు కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్ వేసి ఉంది. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే సమయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ రంగంలోకి దిగుతుంది. సితార బ్యానర్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మార్చి 27న విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ విడుదల కానుంది. అదే తేదీన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో 'ఢీ' కొట్టడం చాలా కష్టం అని నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు. మరో తేదీ చూసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ తప్పకుండా రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే?
మంచు ఫ్యామిలీలో కొన్నిరోజుల ముందు వరకు గొడవలు జరిగాయి. ఈ మధ్య కాస్త శాంతించినట్లు ఉన్నారు. మరోవైపు తన కొత్త సినిమా 'కన్నప్ప' కోసం విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. తమ్ముడు మనోజ్ తో గొడవ గురించి స్వయంగా విష్ణునే అడిగాడు. దీనికి విష్ణు కూడా చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు.కొన్నిరోజుల క్రితం మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగా.. విష్ణు, అతడి మనుషులు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగా అక్కడేం జరిగిందనేది పక్కనబెడితే అసలు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావ్ అన్నా? అని స్వయంగా విష్ణుని ఓ నెటిజన్ అడిగేశాడు.(ఇదీ చదవండి: ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ)ఆస్క్ విష్ణు పేరుతో ట్విటర్ లో జరిగిన చాటింగ్ సందర్బంగా ఇదంతా జరిగింది. అయితే ఏం చెప్పినా సరే మళ్లీ వివాదం అయ్యే అవకాశముంది కాబట్టి.. 'ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా' అని విష్ణు చాలా సెటైరికల్ గా సమాధానమిచ్చాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.భక్త కన్నప్ప స్టోరీతో తీసిన 'కన్నప్ప' మూవీలో విష్ణు ప్రధాన పాత్రధారి కాగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఏప్రిల్ 25న ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!)Ra anna kooda intha manchiga reply ichina manasu needi , mari aaroju generator lo sugar enduk vesav bhaaii pic.twitter.com/nPj5cZRB5R— 🄳🄴🅅🄰 (@deva_cutzz) February 28, 2025 -
నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్)మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్)Rebel Star #Prabhas okka kshanam kooda aalochinchakunda idhi chayyadam anukunnaru ❤️🔥 #Kannappa #ManchuVishnu pic.twitter.com/ewtDFYkoZG— prabhas_garu_taluka (@varmadatla2) February 27, 2025 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)
-
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలు ఆగిపోతే బాగుండు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ఎన్ని జన్మలెత్తినా..శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి. నాకేం తెలీదుమాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయికన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు, శరత్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
తెలుగువారికి గొప్ప బహుమతిని అందించారు: మంచు విష్ణు
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్‌కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.కృష్ణవేణి నిర్మించిన సినిమాలుమన దేశం (1949)లక్ష్మమ్మ (1950)దాంపత్యం (1957)గొల్లభామ (1947)భక్త ప్రహ్లాద (1042) Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025 -
స్పిరిట్‌లో విష్ణు
‘స్పిరిట్’(spirit) సినిమా కోసం స్పెషల్ అప్లికేషన్ పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు(Manchu Vishnu). ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్(Prabhas). ఈ వేసవిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించనుంది యూనిట్. దీంతో నటీనటుల కోసం ‘ఎక్స్’లో ఓ నోట్‌ను షేర్ చేసింది.‘‘ఫిల్మ్ అండ్ థియేటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనుభవం ఉన్న నటీనటులు మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కొన్ని షరతులతో ‘స్పిరిట్’ టీమ్ ఓ నోట్‌ను షేర్ చేసింది. ఈ నోట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసి, తాను ‘స్పిరిట్’ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, ఏం జరుగుతుందో చూడాలన్నట్లుగా విష్ణు మంచు పేర్కొన్నారు.మరోవైపు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’ లో నటించే చాన్స్ విష్ణు మంచుకు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్‌బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్‌బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్‌బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్‌బాబు, శరత్‌కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్‌కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్‌కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్‌బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్‌బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్‌బాబు (Mohanbabu).. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు)మనోజ్‌తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్‌తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్‌లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్‌బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు
మోహన్‌బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్‌బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్‌బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్‌బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్‌బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఫామ్‌హౌస్‌ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్‌బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్‌బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్‌బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్‌ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్‌బాబు మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ వివాదాలు
-
'నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావ్'.. మంచు ఫ్యామిలీలో ట్విటర్ వార్!
మంచు వారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది.మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లకుండా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకి ఎక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గతనెలలో తలెత్తిన వివాదం మరవకముందే మరోసారి గొడవ మొదలైంది.తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్‌ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు.అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇన్‌డైరెక్ట్‌గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 ఇరువురిపై కేసులు..ఇప్పటికే మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు.#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys) Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025 -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు.మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. నా ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూసేద్దాం.'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్‌ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు..ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 -
సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్‌బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్ స్టేషన్ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.ఏం జరిగిందంటే? మనోజ్, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్ స్కూల్‌కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్‌బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో -
ఏడాదిన్నర క్రితమే తీసుకున్నా.. మీలో స్ఫూర్తి కోసమే చెబుతున్నా: మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న మాతృశ్య ఫౌండేషన్‌కు చెందిన 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే వారిని దత్తత తీసుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..' ఏడాదిన్నర క్రితం తిరుపతిలోని(Tirupati) శ్రీమతి శ్రీదేవి గారు నిర్వహిస్తున్న మాతృశ్య ఫౌండేషన్‌కు వచ్చా. ఇక్కడ ఉన్న 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నా. వారి విద్యతో పాటు కొత్త బట్టలు అందిస్తున్నా. మనలాగే వారికి కూడా పండుగలు ఆనందకరమైన క్షణాలుగా ఉండేలా చూసుకుంటున్నా. ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రపంచానికి కూడా ఇలాంటి స్టోరీస్ తెలియజేయాలని భావిస్తున్నా. ఇది నేను చేసిన గొప్ప పనేం కాదు.. సమాజానికి ఓ చిన్నసేవ మాత్రమే. ఇది మీకు స్ఫూర్తినిస్తే.. మీ శక్తితో అవసరంలో ఉన్న ఎవరికైనా మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా' అని పోస్ట్ చేశారు.సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజు పిల్లలను అల్పాహారానికి ఆహ్వానించినట్లు మంచువిష్ణు తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తిని నింపుతూ వారితో ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. పిల్లల చిరునవ్వు ఆశీర్వాదం..ఈ చిన్నపిల్లలే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగి.. అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారనే నమ్మకముందని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కన్నప్పలో మంచు విష్ణు..మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలో కిరాట పాత్రలో మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నదిఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నామని మోహన్‌బాబు వెల్లడించారు.టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కన్నప్ప టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. A year and a half ago, I adopted 120 children from Matrusya Foundation, Tirupati, run by Ms. Sridevi garu. I take care of their education, provide them with new clothes, and ensure festivals are moments of joy for them.I wasn’t keen to share this with the world, but I feel the… pic.twitter.com/A80PwnRhR9— Vishnu Manchu (@iVishnuManchu) January 14, 2025 -
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప మనసు చాటుకున్నాడు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. ఒక కుటుంబసభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానన్నాడు. సంక్రాంతి పండగ సైతం చిన్నారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పిల్లలకు నచ్చిన బొమ్మలు కూడా కొనిపెడతానన్నాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ కుటుంబసభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా..సాధారణంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పక్కన ఉన్నవాళ్లకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను. ఓ రోజు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మాతృశ్య అనాథాశ్రమం నిర్వహిస్తున్న శ్రీదేవి పరిచయమయ్యారు. (చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?)120 మంది చిన్నారుల బాధ్యత నాదేఒకసారి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. ఏ స్వలాభం లేకుండా సహృదయంతో 120 మందికి పైగా చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ఆ అనాథాశ్రమానికి వెళ్లాను, పిల్లలందర్నీ దత్తత తీసుకుంటానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పండగలకు వారితో కలిసుందామని సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను.బర్త్‌డే రోజు అనవసర ఖర్చులు పక్కన పెట్టండివీళ్లంతా నా కుటుంబసభ్యులే.. ఒక అన్నగా, ఇంటిపెద్దగా పిల్లలతో పండగ జరుపుకున్నాను. ఇది మీకూ నచ్చితే ఎవరినైనా దత్తత తీసుకోండి. పుట్టినరోజు అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారికి సాయపడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.. కాబట్టి నేను ఇప్పుడు సాయపడగలుగుతున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యాక.. వారు మిగతావారికి సాయపడాలి. అది ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే! -
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.విజువల్ వండర్‌గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్‌డే (ఫోటోలు)
-
మంచు ఫ్యామిలీలో అడవి పంది వివాదం
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్‌లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. అన్నపై మనోజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్.. తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్‌బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తిపైనా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు.ఏం జరిగిందంటే?కాగా డిసెంబర్ 8న మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరలవగా.. అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఓ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్‌బాబు, మనోజ్ (Manchu Manoj) ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు.. తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశాడు. మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.చదవండి: శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్ -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. 🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.Episode 1 is streaming now on YouTube! 🎥✨🔗Telugu: https://t.co/iolkS7zeS3🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024 -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
కేక్ వంకతో విష్ణు ఇంట్లోకి వచ్చారు: మనోజ్
-
మంచు ఫ్యామిలీలో ‘పంచదార’ గొడవ
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్‌బాబు నివాసంలో మనోజ్, విష్ణుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తన తల్లి పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చి ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జర్నలిస్ట్‌పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్ రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ (ఫొటోలు)
-
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు
-
హాలీవుడ్ నటుడితో మంచు విష్ణు భాగస్వామ్యం
ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్)విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్‌బాబు, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?) -
మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్
మద్యం మత్తులో హీరో మంచు మనోజ్ ఓ పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మనోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన బిడ్డను ఇంట్లో బంధించి, తన దగ్గరకు వెళ్లనివ్వకపోతే ఇంకెలా ప్రవర్తిస్తానని ప్రశ్నించాడు. అలాగే తాను మద్యం సేవించలేదని స్పష్టం చేశాడు.నేనే మీడియాను పిలిచా'తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత జరిగిన ఓ బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాం. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు.నా ఛాతీపై కొట్టడంతో..దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్, విజయ్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. మీరైతే ఏం చేస్తారు?అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తున్నానన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక్కు తగ్గను.ఆయుధాలతో భయపెట్టాలని చూసిన విష్ణుఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్‌గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు.నేను పారిపోవడం లేదువినయ్ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.Press NoteI wish to address the deeply distressing incident that occurred following my visit to the Telangana DGP office. My wife and I were subjected to immense trauma when we were locked out of our own home, with our 9-month-old daughter left inside.After forcing our way… https://t.co/dlwU6wLcgS— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 13, 2024చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ -
అలా చేయాల్సిన అవసరం నాకు లేదు: మోహన్ బాబు సంచలన కామెంట్స్
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు ఆడియో సందేశమిచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. మీడియాపై దాడి ఘటనపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు.నా కన్నుకు మైక్ తగలబోయిందని.. తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా?అని ప్రశ్నించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు.(ఇది చదవండి: ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్)నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు వెల్లడించారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని.. నా పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనను ప్రజలంతా గమనించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి గొడవలు సహజమేనని ఆడియో సందేశంలో మాట్లాడారు. -
మోహన్ బాబు కొత్త ఆడియో విడుదల
-
రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ
మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.బైండోవర్ అంటే ఏంటో తెలుసా?ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు. -
ఉదయం మనోజ్.. రాత్రి విష్ణు
సాక్షి, హైదరాబాద్/పహాడీషరీఫ్: మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు, పరస్పర ఫిర్యా దులు, జల్పల్లిలోని మంచు టౌన్ షిప్లో మూడు రోజు లుగా చోటు చేసుకున్న ఘటనలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుదీర్‌బాబు బుధవారం మోహన్‌బాబు కుమారులు, సినీనటులు మనోజ్, విష్ణులను విచారించారు. ఉదయం మనోజ్, రాత్రి విష్ణు నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పోలీసు కమిషనర్ సు«దీర్‌బాబు అదనపు జిల్లా మేజి్రస్టేట్ హోదాలో వారిని విచారించారు. దాదాపు గంటన్నర చొప్పున వారిని ప్రశ్నించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలతో జల్పల్లిలో ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరి స్థితి మరోసారి నెలకొనకుండా ఉండాలంటే.. చట్టానికి లోబడి వ్యవహరించాలని వారికి స్పష్టం చేశా రు. మంచు టౌన్íÙప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించా రు. ఈ మేరకు మనోజ్, విష్ణు ఇద్దరూ ఏడాది పాటు అదనపు జిల్లా మేజి్రస్టేట్, సీపీ సు«దీర్‌బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని విడివిడిగా బాండ్ రాసి ఇచ్చారు. రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించారు. ఈ మేరకు మనోజ్, విష్ణులను పోలీసులు బైండోవ ర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధన లను పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్లు, బయటి వ్యక్తులను పంపేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మంచు టౌన్‌షిప్‌లోని బౌన్సర్లు, బయటి వ్యక్తులను పహాడీషరీఫ్ పోలీసులు బయటికి పంపించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డిల పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపట్టారు. ఆ నివాసంలో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉండాలన్నారు. బయటివారు ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. మోహన్‌బాబు సహాయకుడు వెంకట కిరణ్ అరెస్ట్ మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు బుధవారం పహాడీషరీఫ్ పోలీసులు వెంకట కిరణ్‌ను అరెస్ట్ చేశారు. ఆదివారం తనపై జరిగిన దాడికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీల హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారంటూ వెంకట కిరణ్‌పై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మోహన్‌బాబుకు వెంకట కిరణ్ సహాయకుడని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి మోహన్‌బాబు ఇంటి వద్ద పలువురు జర్నలిస్ట్‌లపై దాడి ఘటనకు సంబంధించి.. బుధవారం ఉదయం మంచు టౌన్షిప్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. ఇంట్లోనే ఉన్న మనోజ్ బయటికి వచ్చి జర్నలిస్ట్‌ల ఆందోళనకు మద్దతు తెలిపారు. అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు: మనోజ్ ‘‘మా నాన్న దేవుడు.. కానీ ఈ రోజు చూస్తున్న నాన్న కాడు. నాపై మా అన్న విష్ణు, అతడి అనుచరుడు విజయ్ లేనిపోనివి మా నాన్నకు నేర్పుతూ నన్ను విలన్‌గా చిత్రీకరించారు. నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది. నాన్న చెప్పిన అన్ని పనుల కోసం గొడ్డులా కష్టపడ్డాను. ఒక్క రూపాయి కూడా అడగట్లేదు..’’అని మంచు మనోజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఒంటరిగా ఉన్నామని, తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అన్న దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యారని.. తన భార్య మౌనికకు తన తల్లి అండ ఉండాలని తండ్రి స్నేహితులు కొందరు చెప్పడంతోనే ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెడతానని పేర్కొన్నారు. ‘‘నా భార్య వచ్చాక నేను చెడ్డవాడినయ్యానని ఆరోపిస్తున్నారు. తల్లితండ్రి లేని నా భార్యకు అన్నీ నేనై చూసుకోవాలి. తాను సొంతంగా టాయ్ కంపెనీ పెట్టుకుంది. స్నేహితుల సహకారంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నాం..’’అని తెలిపారు. తనపై దాడి జరిగిన రోజు ఇంట్లో పది కార్లు ఉన్నప్పటికీ.. తాను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మోహన్‌బాబు ముఖంపై గాయాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఆయన ఛాతీపైనా గాయాలు.. కంటి కింద వాపు హైబీపీ, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారని.. ఆ సమయంలో ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. మోహన్‌బాబు ముఖం, ఛాతీపై కొన్ని గాయాలు ఉన్నాయని.. కంటి కింద వాపు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఈసీజీ, ఈకో నివేదికలు సాధారణంగానే ఉన్నాయని, సీటీ స్కాన్ చేశాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అంచనాకు వస్తామని తెలిపారు. చిరునవ్వులతో మంచు లక్ష్మి కుమార్తె వీడియో: మంచు కుటుంబంలో మంటలు రేగుతున్న వేళ.. మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సామాజిక మాధ్యమంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో తన కుమార్తె విద్యా నిర్వాణ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్ (ప్రశాంతత)’అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
మంచు విష్ణు VS మంచు మనోజ్ మాటల యుద్ధం
-
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్, విష్ణు రెడీ?
క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబంలో.. వివాదం రాజుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా మీడియా మీద మోహన్‌బాబు దాడి తర్వాత వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. -
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. -
మోహన్ బాబు సంచలన ఆడియో లీక్..!
-
LIVE: మా ఫ్యామిలీ సమస్యల గురించి నేను మాట్లాడను: Manchu Vishnu
-
'మంచు' ఫ్యామిలీలో గొడవ.. తొలిసారి స్పందించిన విష్ణు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. చిన్నకొడుకు మనోజ్.. తండ్రిపై కేసు పెట్టడం, మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం.. ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం. కాసేపటికే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు. తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచే మీడియాతో మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.(చదవండి: ఆ విషయంలో సీపీకి హామీ ఇచ్చా: మంచు మనోజ్)'ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే. అవి పరిష్కారమవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్‌ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు''మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి. లాస్ ఏంజెల్స్‌లో 'కన్నప్ప' మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది. దీంతో అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా వ్యకికి గాయాలు తగలటం బాధాకరం. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. మోహం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. పోలీసులు మా కంటే ముందు మీడియాకు లీక్ ఇస్తున్నారు. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను'(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)'మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిని గౌరవించి కలుస్తాను. ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి''మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్‌పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. కాలమే అన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు' అని విష్ణు తన ఆవేదనని బయటపెట్టారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
మా నాన్న దేవుడు: మంచు మనోజ్
సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్‌బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్‌బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)కాగా, సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్‌ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. -
రాచకొండ సీపీ నోటీసులు
-
హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆస్తుల విషయమై చిన్న కొడుకు మంచు మనోజ్ రచ్చ చేస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి చూస్తే తొలుత మోహన్ బాబు-మనోజ్ ఒకరిని ఒకరు కొట్టుకున్నారని.. హైదరాబాద్‌లోని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని న్యూస్ వచ్చింది. ఇదంతా పక్కనబెడితే మంగళవారం రాత్రి మాత్రం పెద్ద గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్ల మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: 'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన)మరోవైపు ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం, ఇది జరిగిన కాసేపటికి మనోజ్‌ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆడియోలో చెప్పినట్లు ఈ గొడవల వల్ల మోహన్ బాబు భార్య ఆస్పత్రిలో చేరింది. ఇప్పుడు ఈయన కూడా పలు అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో మోహన్ బాబు బాధపడుతున్నారు.ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మరి ఈ వివాదంలో బుధవారం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ఇద్దరి దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్స్ తమకు సరెండర్ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు మోహన్ బాబుతో పాటు అతడి కొడుకుల్ని ఆదేశించారు.బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబుకు అస్వస్థత.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ బాబు pic.twitter.com/V0GHBVpSUJ— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024(ఇదీ చదవండి: ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!) -
మంచు ఫ్యామిలీలో మంటలు!
సాక్షి, హైదరాబాద్/పహాడీ షరీఫ్: సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం ‘మంచు టౌన్’వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలు.. దూషణలు.. మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విష్ణు ఇన్... మనోజ్ ఔట్... దుబాయ్ నుంచి ‘మంచు టౌన్’కు తిరిగి వచి్చన మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్‌తో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని అ«దీనంలోకి తీసుకొని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది, బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్‌బాబు పేరిట ఉండటంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మనోజ్..తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పహాడీషరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయట్లేదని.. ఆత్మగౌరవం, భార్యాపిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్‌తోపాటు ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్‌రెడ్డిని సతీసమేతంగా వెళ్లి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని.. రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్‌బాబు ఇచి్చన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం ‘మంచు టౌన్’కు వెళ్లారు. మోహన్‌బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రానికి హీటెక్కిన వాతావరణం... మోహన్‌బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామగ్రిని బయటకు తరలించడానికి రెండు వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి ‘మంచు టౌన్’కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన ఏడు నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపారు. ఈలోగా మోహన్‌బాబు తన చిన్నకుమారుడి తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం గేటు బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. దాడిని ఖండించిన జర్నలిస్టులు.. మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలంటూ అక్కడే ధర్నా చేశారు. మరోవైపు మోహన్‌బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయన్ను గచి్చ»ౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంలో గాయపడ్డ జర్నలిస్టును పోలీసులు శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, టీవీ9 విలేకరి రంజిత్ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు పోలీసుల ఎదుటకు.. మోహన్‌బాబు, ఆయన కుమారులను బుధవారం ఉదయం 10:30 గంటలకు స్వయంగా తన ఎదుటహాజరుకావాలని రాచకొండ సీపీ సు«దీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే ముగ్గురి తుపాకులతోపాటు రూ. లక్ష చొప్పున పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు.గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావుమనోజ్ను ఉద్దేశించి ఆడియో సందేశంలో మోహన్ బాబు సాక్షి, హైదరాబాద్: కుటుంబ తగాదాను రచ్చకీడ్చావంటూ చిన్న కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు మండిపడ్డారు. మనోజ్ ప్రవర్తన మొదలు, ఆస్తుల పంపకం వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆడియో సందేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావు. ఆస్తులు ముగ్గురికీ సమపాళ్లు ఇస్తానా.. గంగపాలు చేస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా వ్యక్తిగతం. అది నా కష్టార్జితం. ఇంట్లో పనిచేసే వాళ్లను ఎందుకు కొడుతున్నావ్? పొట్టకూటి కోసం వచ్చిన వారిని కొట్టడం మహాపాపం. సినీ పరిశ్రమలో మోహన్‌బాబు పరుషంగా ఉంటాడేమో కానీ ఇంట్లో అలా కాదు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. బయటకు వెళ్లావు.. మళ్లీ చేయనని వచ్చావు. నీ భార్య, నువ్వు, మీ అమ్మ... ఇలాంటి పొరపాట్లు చేయమని చెబితే ఇంట్లోకి ఆహ్వానించా. కానీ ఈ విషయం ప్రజలు నమ్ముతారో లేదో. విద్యాసంస్థల బ్యాంకు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగితే అందుకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది లేదా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. మన విద్యాసంస్థలను ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్లడానికి విష్ణు తీవ్రంగా కృషి చేశాడు. విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికి వినయ్ అనే వ్యక్తి వస్తే నువ్వు అతనిపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబు? మీ నాన్నకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్లను అడ్డుకుంటున్నావ్. ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా? వినయ్, నీకు మధ్య జరిగిన గొడవలో మీ అన్న విష్ణు అడ్డుపడితే అతన్ని కూడా కొట్టడానికి సిద్ధపడ్డావ్’అని మోహన్‌బాబు ఆరోపించారు. -
ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!
మంచు ఫ్యామిలీ గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు లైసెన్స్ గన్స్ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. దీంతో ఒకరిపై ఒకరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని వారిని అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మనోజ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా గేటు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ గొడవ మరింత తీవ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన పోలీసులు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఆదేశించారు. రేపు ఉదయం తమ ముందు హాజరు కావాలని రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం గం. 10.30ని.లకు గన్ సరెండర్ చేయాలని ఆదేశించారు. -
‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి
మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. (చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)‘మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ వ్యవహార శైలీ మోహన్ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు. కొనసాగుతున్న సస్పెన్స్మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్ బాబుపై ఇటు మనోజ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. -
Breaking News: మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ
-
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
Manchu Manoj: ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా
-
మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత
మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు ఆదేశించాడు. అయినా కూడా వాళ్లు అక్కడే ఉండడంతో.. తన బౌన్సర్లలో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగి మనోజ్ బౌన్సర్లను బయటకు తోసేశాడు. ప్రస్తుతం మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు ఫాంహౌస్ బయట ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గొడవ విషయం తెలియగానే పహడి షరీఫ్ పోలీసులు హుటాహుటిన మోహన్ బాబు ఫాం హౌస్‌కి వెళ్లి.. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: ఆస్తుల కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్)మంచు ఫ్యామిలీలో జరుగున్నతున్న వివాదం ఆదివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ.. తనకు, తన భార్యకు ప్రాణహానీ ఉందని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్‌తో తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు.. నేడు తిరిగి హైదరాబాద్‌కు రావడంతో ఈ గొడవ మరింత ముదిరింది. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి మోహన్ బాబు నేరుగా తన ఫాంహౌస్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మనోజ్, విష్ణుల బౌన్సర్లు ఉన్నారు. విష్ణు రావడంతోనే మనోజ్ భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాను ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడంలేదని..ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్ మీడియాతో తెలిపారు. న్యాయం కోసం ఎంతమందినైనా కలుస్తానని చెప్పారు. (చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) -
ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్‌హౌస్ ‘మంచు టౌన్’కి మనోజ్‌తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్‌బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. -
మనోజ్, కోడలు మౌనికతో ప్రాణహాని ఉందన్న మోహన్ బాబు
-
చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు కొడుకు మనోజ్‌పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్‌తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్‌తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.తండ్రి ఫిర్యాదుపై మనోజ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టారు. -
విదేశాల నుంచి తిరిగొచ్చిన విష్ణు.. మనోజ్,మౌనికలపై కేసు నమోదు
టాలీవుడ్ సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు రావడంతో మనోజ్, మౌనికల నుంచి తనకు ప్రాణహాణి ఉందని మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మనోజ్‌పై క్రైం నెంబర్ 644/2024 కింద 329,351,115 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విజయ్‌రెడ్డి, కిరణ్‌లపై కేసు నమోదైంది.విదేశాల నుంచి తిరిగొచ్చిన విష్ణుకుటుంబంలో వివాదాలు జరుగుతుండటంతో మంచు విష్ణు కొంత సమయం క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి చేరకున్న మోహన్‌బాబు.. విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో కూడా వారు పూర్తి భద్రత సిబ్బంది మధ్య వెళ్లడం గమనార్హం. ఆపై కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కుటుంబ వ్యవహారాన్ని పెద్దగా చిత్రీకరించడం సరికాదని విష్ణు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. -
మంచు ఫ్యామిలీలో ముదిరిన వివాదం
-
మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్ ఇదే..
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్‌బాబు కోరారు. దీంతో పోలీసులు మనోజ్‌పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆపై క్రైం నెంబర్ 644/2024 పహడి షరీఫ్ పోలీసులు కేటాయించారు. తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా మంచు మనోజ్ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను.నా సోదరుడు దుబాయ్‌కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. ఫిర్యాదులో నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ధృవీకరించాల్సిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను.ఈ గొడవలోకి నా 7నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి..?కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం.ఇంట్లో పనిచేసే మహిళాలపై మా నాన్న చాలా ఎక్కువగానే తిడుతూ ఉంటారు. దీంతో వారు భయపడిపోవడమే కాకుండా తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు కూడా.. ఇంట్లో మా నాన్న అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో జీవిస్తారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాం.విష్ణుకు సహచరులు విజయ్‌రెడ్డి, కిరణ్‌లు సీసీటీవీ డ్రైవ్‌లను ఎందుకు తొలగించారు..? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు..? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు… ఇప్పటికీ నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. నా జీవితం, నా స్వంత యోగ్యతతో కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటుంన్నందుకు నేను గర్వపడుతున్నాను.విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటంతోనే ఈ ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను.నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. నేను పైన చెప్పిన వాటి విషయంలో అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024 -
మంచువారి అమ్మాయిలు..అరీ & వివీ హ్యాపీ బర్త్‌డే: తాతను మించిపోతారా!(పోటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటన
మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా 'కన్నప్ప'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రావొచ్చనే రూమర్స్ వచ్చాయి. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)దీంతో 'కన్నప్ప' ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 25న వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే శివరాత్రి కానుకగా వచ్చుంటే కంటెంట్‌కి కలిసి వచ్చేదేమో అనిపించింది.ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర చేయగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్
అరడజనుకి పైగా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటితో పాటే మంచు విష్ణు 'కన్నప్ప' మూవీలోనూ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించారు. తాజాగా ప్రభాస్ ఫుల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. ఇది తెగ వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)ఇప్పుడు ఈ విషయం 'కన్నప్ప' మూవీ టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ కేసు పెట్టారు. అలానే నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం 2000 మందికి పైగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారని.. ఈ లీకైన ఫొటో వల్ల వాళ్ల పనిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఫొటో లీక్ విషయమై కేసు పెట్టామని, అయితే ఈ పని ఎవరో చేశారో కనుగొని ఆ వివరాలు మాకు చెబితే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని 'కన్నప్ప' టీమ్ చెప్పింది. లీకైన ఫొటోని షేర్ చేసినా చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందనని ప్రభాస్ అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులకు 'కన్నప్ప' టీమ్ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు
‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్ యాక్షన్ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్‌బాబు, విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్‌బాబు (ఫొటోలు)
-
'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!
రెబల్ స్టార్ ప్రభాస్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్‌హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్లో రాసుకొచ్చారు.కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Wishing the powerhouse of Indian cinema, my brother #Prabhas, a very happy birthday! #Prabhas continues to conquer hearts and screens worldwide with his unmatched talent and dedication. Here’s to many more years of greatness! 🏆 #HappyBirthdayPrabhas pic.twitter.com/xX3Z26pApw— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2024 -
దర్శకుడిగా ది డీల్.. నటనే తన జీల్..
నాంపల్లి: సినిమాలకు మూలం నాటకం.. తొలితరం నటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎన్వి రంగారావు, సావిత్రి వంటివారెందరో ఈ రంగంలోకి వచ్చినవారే. ఇతర భాషల్లోనూ అనేక మంది నటులు నాటక రంగం నుంచి వెండితెరకు పరిచయమైనవారే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బిఏ.యాక్టింగ్, ఎంఏ దర్శకత్వం పూర్తి చేసి ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న డాక్టర్ హనుకోట్ల మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంఏ పూర్తి చేసిన వెంటనే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మూగ పాత్రలో అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత అదే వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రొఫెసర్‌గా, రంగస్థల కళల శాఖాధిపతిగా, లలిత కళాపీఠం పీఠాధిపతిగా(డీన్) ఎందరో నటులను తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడిగా, రచయితగా... తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి స్వీయ రచన, దర్శకత్వంలో కె2 నాటకాన్ని ప్రదర్శించి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి నాటకానికి తన బృందంతో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు వెండి నందిని అందుకున్నారు. నాటక రంగ ఆచార్యుడిగా తెలుగులో నాయకురాలు, గంగిరెద్దు, జయ జయహే తెలంగాణ, రామప్ప వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాటకాలను నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి నాటకత్రయం ‘ప్రతాపరుద్రమ’ దర్శకత్వం వహించి మెప్పించారు. రచయితగా గంగిరెద్దు, కాశీ్మర్ టు కన్యాకుమారి, గబ్బర్‌సింగ్, ధనత్రయోదశి, నాటకాలలో నూతన థోరణులను ప్రవేశపెట్టాడు. మరోసారి వెండితెరకు.. కేవలం రంగస్థలానికే పరిమితం కాకుండా రేడియో జాకీగా, టెలివిజన్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఈటీవీ– 2లో ప్రసారమైన ‘మాయాబజార్’ రాజకీయ వ్యంగ్య రూపకంతో పాటు దూరదర్శన్‌లో అనేక ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. ఈశ్వర్ సినిమా తర్వాత ఆగిపోయిన తన సినీ ప్రస్థానాన్ని తిరిగి కొనసాగిస్తూ తన స్వీయ దర్శకత్వంలో హెచ్.పద్మారమాకాంతరావు, రామకృష్ణ నిర్మాతలుగా ‘ద డీల్’ అనే సినిమాతో అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పోస్టర్ లాంచ్ చేయగా, ప్రముఖ హీరో మంచు విష్ణు ఈ సినిమా పాటను విడుదల చేశారు. దసరా సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ద డీల్ టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. -
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన మా అధ్యక్షుడు విష్ణు
-
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
‘ది డీల్’ హిట్ కావాలి: మంచు విష్ణు
‘ఈశ్వర్’ఫేం హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమయ్యిందో" పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగామంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, "ది డీల్ " చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
Manchu Vishnu: మంచు విష్ణుకు సైబర్ వేధింపులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్‌మీడియా ద్వారా ఈ పని చేస్తున్న విజయ్ చంద్రహాసన్ దేవరకొండను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి పంపారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలు సేకరించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. విజయ్ చంద్రహాసన్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వివిధ సోషల్‌మీడియా ఖాతాల్లో అనేక వీడియోలు అప్లోడ్ చేశారు. వీటిలో మంచు విష్ణు, ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ, ‘మా’లతో పాటు సినీ రంగాన్నీ కించపరిచే, అవమానించే, అభ్యంతరకరంగా చిత్రీకరించే అంశాలను పొందుపరిచాడు. ఇతను పదేపదే ఇదే పంథా అనుసరిస్తుండటాన్ని ‘మా’ సీరియస్‌గా తీసుకుంది. సంస్థ ట్రెజరర్ శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.మధులత సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే అవసరమైన ఆధారాలను సేకరించి, న్యాయస్థానంలో చార్జ్ïÙట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
మంచు విష్ణు కుమారుడి సినీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని సెట్ చేశాడు విష్ణు. సౌత్ నుంచి నార్త్ దాకా పేరుమోసిన యాక్టర్స్ అందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు. తన కుమారుడు సైతం సినిమాలో ఉన్నట్లు వెల్లడించాడు. నేడు (ఆగస్టు 26) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి అవ్రమ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో అవ్రమ్.. తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు.మాటలు రావట్లేదుఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు.. కన్నప్పలో అవ్రమ్ లుక్ లాంచ్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు అని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సినిమా..ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తున్నాడు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల, దేవరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ప్రభాస్ కు అండగా మంచు విష్ణు..
-
MAA అసోసియేషన్ సీరియస్... మరి ప్రభాస్ ని అంటే కన్నప్ప ఊరుకుంటాడా...
-
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కామెంట్స్..
-
ప్రభాస్‌పై చిన్నచూపు.. మనోభావాలు దెబ్బతిన్నాయన్న మంచు విష్ణు
ఒక్కసారి మాట అనేస్తే వెనక్కు తిరిగి తీసుకోలేం. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి. ఏమాత్రం నోరుజారినా విమర్శలపాలవడం ఖాయం. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కల్కి సినిమా తనకు నచ్చలేదన్నాడు. అక్కడితో ఆగకుండా అందులో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని కామెంట్ చేయడంతో విమర్శలపాలయ్యాడు. తాజాగా ఈ వివాదంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు.మంచు విష్ణు లేఖప్రభాస్పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని మేము గౌరవిస్తాము. కానీ, అర్షద్.. ప్రభాస్ గురించి చులకనగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది.బాధేసిందినేటి సోషల్ మీడియా యుగంలో, చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాబట్టి.. పబ్లిక్ ఫిగర్స్‌గా మన భావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. వార్సి వ్యాఖ్యలు సినీ ప్రేమికులలో, సినీ సోదరులలో అనవసరమైన ఆందోళనను సృష్టించింది. తన మాటలు మాకెంతో బాధ కలిగించాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని అర్షద్ వార్సీని కోరుతున్నాము.అందరిదీ ఒకే కుటుంబంగౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సినీ ఇండస్ట్రీ అనే ఒక కుటుంబం కింద అందరం ఉన్నాం.. సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతలో ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత. ఇండస్ట్రీలో ప్రశాంత వాతావరణం ఉండేట్లు చూస్తారని ఆశిస్తున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నాడు. -
కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్లో వారి లుక్ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప" అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్‌డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. దేవరాజ్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో నటుడు దేవరాజ్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన గిరిజనుల నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. అతని కుమారుడిగా బాలీవుడ్ నటుడు లావి పజ్నీ నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజైన ఈ పోస్టర్లపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. Introducing #Devaraj in the #Kannappa🏹 hailing from the Nilipala Hills, Mundadu and @iamlavipajni as his son #Bebbuli is ready to unleash a new wave of strength and fierce spirit 🔥#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar… pic.twitter.com/viVdUCKEny— Kannappa The Movie (@kannappamovie) August 5, 2024 -
భవిష్యత్తులోనూ 'మా' పోరాటం కొనసాగిస్తాం: మంచు విష్ణు
టాలీవుడ్ నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసింది. ఇచ్చిన గడువులోగా అలాంటి వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దాదాపు 20కి పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు.తాజాగా ఈ అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య సమాచారాన్ని నియంత్రించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సూచనలు తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సోషల్ మీడియాలో నటీనటులపై అసత్యాలు, అగౌరవ పరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాడేందుకు సభ్యుల నిబద్ధత చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. On behalf of the MAA, we are honored to support our actors. #MAA President @iVishnuManchu has addressed key issues, particularly addressing disinformation & disrespect from some content creators. We are proud of our dedicated team and their innovative ideas for the future. pic.twitter.com/xohPmWT5WD— MAA Telugu (@itsmaatelugu) July 30, 2024 -
మంచు విష్ణును అభినందించిన మీనా
చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోహీరోయిన్లను విమర్శిస్తూ కొందరు చేసిన, చేస్తున్న వీడియోలతో పాటు కామెంట్లను తొలగించాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ యూట్యూబ్ ఛానల్స్‌లలో ట్రోలింగ్ వీడియోలను తొలగించమని హెచ్చరించారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించమని ఫైర్ అయ్యారు. దీంతో ఆయనకు నెటిజన్ల నుంచి కూడా మద్ధతు లభించింది.అభ్యంతరకరమైన కంటెంట్‌తో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టేలా మంచు విష్ణు చేశారు. మహిళలపై అసభ్యకర కంటెంట్‌తో రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌ల గుర్తింపును శాశ్వితంగా రద్దు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఆయన చూపిన దూకుడుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సినీ నటి మీనా రియాక్ట్ అయ్యారు.అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో మహిళలను అవమానించేలా కంటెంట్‌తో నిండిపోయాయి. తప్పుడు కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయంగా ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లను తిప్పకొట్టడంలో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇండస్ట్రీని కాపాడుకునేందుకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. చలనచిత్ర పరిశ్రమ గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. విష్ణు, మీ చర్యలు నిజంగా అభినందనీయం. అంటూ మీనా రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
మంచు విష్ణు 'డ్రీమ్ ప్రాజెక్ట్'.. మరో క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రీలీజ్ చేయగా అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కనిపంచనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా మధుబాల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పోస్టర్‌పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపేలా ఉన్నాయి. దీంతో కన్నప్పపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. Presenting #Madhubala as #Pannaga; The chief of clan with her fierce & dare-devil spirit she is a force to be reckoned with 🔥#Madhoo #Kannappa🏹 #HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/1qnbiXwQEq— Kannappa The Movie (@kannappamovie) July 29, 2024 -
'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?
హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్‌తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్‌పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) View this post on Instagram A post shared by 24 Frames Factory (@24framesfactory) -
'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది. తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించినట్లు మా అసోసియేషన్ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, డాక్టర్ ట్రోల్స్, ట్రోలింగ్ పోరడు, అప్డేట్ ట్రోల్స్, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను బ్లాక్ చేయించారు.ఈ సందర్భంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్ నుంచి అలాంటి కంటెంట్ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. On behalf of #MAA, we urge all YouTubers and social media trollers to take a note. We are preparing to report defamatory troll videos to Cyber Crime office. Kindly remove such content from your channels and profiles to avoid complications.#RespectOurArtists— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.We have blocked an additional 18 channels that spread harmful content.Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024 -
మంచు విష్ణుకు గోల్డెన్ వీసా
టాలీవుడ్ హీరో మంచు విష్ణు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా అందకున్నారు. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది.ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ యూఏఈ గోల్డెన్ విసా అందుకున్నారు. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మంచు విష్ణు చేరారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, సునీల్ దత్, సంజయ్ దత్,మోనీ రాయ్,బోనీ కపూర్, మమ్ముట్టి, టొవినో థామస్ వంటి స్టార్స్‌కు ఈ వీసా లభించింది.2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు యూఏఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. -
బన్నీ పుష్ప-2 కు పోటీగా మంచు విష్ణు కన్నప్ప..
-
పుష్ప-2తో కన్నప్ప పోటీ.. మంచు విష్ణు పోస్ట్ అందుకేనా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సైతం అతిథిపాత్రలో కనిపించనున్నారు. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ లాంటి అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇందులో విష్ణు.. తిన్నడు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 2024 అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాదిలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.అయితే డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకే నెలలో కన్నప్ప, పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఐకాన్ స్టార్ వెకేషన్‌కు వెళ్లడం.. పుష్ప-2 షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మరోసారి వాయిదా తప్పదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పుష్ప-2 మూవీ విడుదల వాయిదా పడే ప్రసక్తే లేదని బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. December 2024 #Kannappa 🙏 #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) July 18, 2024 -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
నాదనాథుడి ఉగ్రరూపం
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆదివారం (జూలై 14) శరత్ కుమార్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఈ మూవీలో ఆయన నటిస్తున్న నాదనాథుడి పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యోధుడిలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Kannappa: నాథనాధుడుగా శరత్ కుమార్..లుక్ అదిరింది!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు(జులై 14) ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. On the special occasion of @realsarathkumar Garu's birthday, Team #Kannappa🏹 is thrilled to introduce him as Nathanadhudu! Wishing you a legendary year ahead 🏹@24FramesFactory @avaentofficial @KannappaMovie#HBDSarathkumar #KannappaMovie #ATrueIndianEpicTale #HarHarMahadevॐ pic.twitter.com/MMyUMTo8ge— Kannappa The Movie (@kannappamovie) July 14, 2024 -
సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. జులై 27న విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ.. పిల్లల వీడియోలు షేర్ చేయ్యొదంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో నటి నటులపై ట్రోలింగ్ వీడియోలు డార్క్ కామెడీ పేరుతో వీడియోలు వేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించాడు. చెప్పినట్లుగానే నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)భారతీయుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాని అవమానించినట్లుగా ఉన్నాయంటూ సిద్ధార్థ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో సిద్దూ వెంటనే స్పందించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.(పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరితో పాటు మొత్తం 8 అవార్డులను సోంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. శంకర్ మేకింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా తగ్గిపోయాయి. (‘భారతీయుడు 2’ సినిమా రివ్యూలో కోసం క్లిక్ చేయండి)రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా చిత్రం ఈ నెల 12న విడుదలైంది. రీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ట్రైలర్ జులై 10న విడుదల అయింది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. (ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార సాంగ్ జూలై 10నరిలీజ్ అయింది. (సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్. అయ్యింది ఈ సినిమా జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. (ట్రైలర్ కోసం క్లిక్ చేయండి)కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాకు ‘క’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలవుడ్ నటులు సందడి చేశారు. మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు టాలీవుడ్ తారలు ఈ వివాహానికి హాజరయ్యారు. -
‘మా’ కొరడా.. ఐదు యూట్యూబ్ ఛానెల్స్ తొలగింపు
రీసెంట్గా తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వల్ల ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లీ కూతుళ్ల బంధంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఇది ఇలా ఉండగా రెండు మూడు రోజుల క్రితం 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు. సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్లు చేసిన వీడియోలని 48 గంటల్లో డిలీట్ చేయాలని హెచ్చరించాడు. ఇప్పుడు దీనిపై మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంది.(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై 'జబర్దస్త్' రోహిణి ఫైర్) The crackdown has begun. Five YouTube channels have been terminated for posting derogatory comments about actors, their families, and personal attacks. This is just the start. We will continue to update the list as we take further action...— MAA Telugu (@itsmaatelugu) July 13, 2024 నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరడా ఝళిపించింది. ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించిందింది. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. ముందు ముందు మరిన్ని ఛానెల్స్ డిలీట్ అయ్యేలా చేస్తామని చెప్పుకొచ్చింది. ఇకపోతే తొలగించిన ఛానెల్స్‌లో 'జస్ట్ వాచ్ బీబీబీ', 'ట్రోల్స్ రాజా', 'బచిన లలిత్', 'హైదరాబాద్ కుర్రాడు', 'ఎక్స్‌వైజెడ్ ఎడిట్జ్ 007' ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వకేట్‌తో లావణ్య చాటింగ్) -
ట్రోలర్స్‌కు మంచు విష్ణు హెచ్చరిక
సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది. ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తున్న వ్యక్తుల గురించి తాజాగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో నటీనటులపై ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు తెలిపారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు మంచి పేరు ఉంది. కానీ ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో డార్క్ కామెడీ, ఫన్నీ ట్రోలింగ్ వీడియోలతో చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని విష్ణు సూచించారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు మంచు విష్ణు అప్పీల్ చేశారు. -
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ విల్లు వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నప్ప టీజర్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు. ‘కన్నప్ప’లో తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు. ఆ ధనుస్సు ధైర్యానికి సూచిక. తండ్రీ, కొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. కన్నప్ప తండ్రి నాధనాథుడు తన చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారింది. ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. కేవలం ఐదేళ్ల వయసున్న కన్నప్ప అనే యువకుడు ఓసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారు.విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ప్రత్యేకమైన విల్లుని తయారు చేశారు. కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా, విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించాడు. ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరించారు.విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది. ఇది విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నది అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.కాగా.. మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప చిత్రంతో తెరపై మన పౌరాణిక గాథను ఆవిష్కరించబోతోన్నారు. ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి ప్రముఖలు కూడా భాగమయ్యారు. శివుని భక్తుడైన 'భక్త కన్నప్ప' ఆకర్షణీయమైన కథను అద్భుతంగా చెప్పబోతోన్నారు. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. -
మంచు ఫ్యామిలీలో ఆగని గొడవలు?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనిక దంపతులు గారాలపట్టి బారసాల ఎంతో ఘనంగా జరిగింది. తమ పాపాయికి దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. శివభక్తుడైన మనోజ్.. ముక్కంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరును కూతురి కోసం ఎంచుకున్నాడు. అలాగే మౌనిక తల్లి శోభ పేరును కూడా సెలక్ట్ చేశారు. MM పులి ఆమె ముద్దు పేరన్న విషయం తెలిసిందే! మూడూ కలిసొచ్చేలా..ఈ మూడూ కలిసి తన చిన్నారికి దేవసేన శోభా MM అని నామకరణం చేశారు. ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. అయితే అందులో మనోజ్ సోదరుడు, హీరో మంచు విష్ణు కనిపించనేలేదు. అలాగే చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్లోనూ విష్ణు పేరు ఎక్కడా లేదు. పేరెంట్స్ మోహన్‌బాబు- నిర్మలాదేవి, సోదరి మంచు లక్ష్మి పేర్లతో పాటు మౌనిక సోదరులు అఖిల, విక్యంత్ పేర్లను సైతం ప్రస్తావిస్తూ కృతజ్ఞత చెప్పిన మనోజ్.. తన అన్న పేరును మాత్రం వదిలేశాడు.ఆగని గొడవలు?దీంతో మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు ఆగిపోలేదని, విష్ణు - మనోజ్ మధ్య మనస్పర్థలు అలాగే కొనసాగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మనోజ్ పెళ్లికి సైతం విష్ణు అతిథిలాగే వచ్చి వెళ్లాడు. మనోజ్‌తో సన్నిహితంగా ఉండే సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడటం, అందుకు సంబంధించిన వీడియో వైరలవడంతో ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరికీ తెలిసిపోయింది. తర్వాత మోహన్‌బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశాడు. With all Your’s & Lord Shiva’s blessings, we named our Daughter 🙏🏼❤️ #DevasenaShobhaMM pic.twitter.com/n6dvJeDoVR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 8, 2024 చదవండి: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. సిద్దార్థ్ -
మంచు విష్ణుకు హేమ బహిరంగ లేఖ
-
ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్ ఫాంహౌస్‌లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి పంపారు.'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
టీమిండియా విక్టరీ.. పూనకంతో ఊగిపోయిన టాలీవుడ్ హీరో!
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ప్రపంచకప్ విన్నింగ్ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.అయితే సినీతారలు సైతం విన్నింగ్ మూమెంట్ తనదైన స్టెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. Yahooooo! India! India! ❤️❤️❤️❤️ @ImRo45 🙏@imVkohli 🙏 What a memorable night @PDdancing anna ❤️❤️❤️ pic.twitter.com/k8q7WlmroL— Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2024 -
'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి ఈ మధ్యే టీజర్ రిలీజైంది. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?)'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!) -
ప్రభాస్ చేయాల్సిన సినిమా కానీ.. చిన్న క్యారెక్టర్ తో !
-
'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ తాజాగా విడుదలైంది. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఫాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా అలరించనున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుండగా విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే, ప్రభాస్‌తో తనకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవని మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చారు. వీరిద్దరి మధ్య సీన్స్ ఉంటాయని ఇద్దరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదని ఇదే విషయాన్ని మంచు విష్ణు స్వయంగా బయటపెట్టారు. కానీ, మిగిలిన అందరి స్టార్స్ కాంబినేషన్లో ప్రభాస్ కనిపిస్తారని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో 'కన్నప్ప' చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. టీజర్లోనే ఆయన ప్రతిభ కనిపిస్తుంది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటే.. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చేసిన సాహసాలు సినిమా అభిమానులను మెప్పిస్తున్నాయి. -
'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ 'కన్నప్ప'. గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప'లానే ఇది కూడా డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా. కాకపోతే విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలందరూ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కొన్నిరోజుల క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టీజర్ స్క్రీనింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఇకపోతే టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో నింపేశారు. అలానే శివుడిగా అక్షయ్ కుమార్ దర్శనమిచ్చాడు. నుదుట అడ్డ నామాలతో ప్రభాస్ కేవలం ఒకే ఒక్కే సెకను కనిపించాడు. ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరో మంచు విష్ణు.. 'కన్నప్ప' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా తీయమని తనకు శివుడు చెప్పాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.'2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్నగారు పిలిచి.. డైరెక్టర్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏంటి? అని అడిగారు. నాన్న.. పరమేశ్వరుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలనే నేను మొత్తం హోమ్ వర్క్ అంతా చేస్తున్నానని అన్నాను. గతేడాది జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఇది మీ ముందుకు తీసుకురావడానికి శివుడు ఆశీస్సులే కారణం' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్)కన్నప్ప సినిమా తియ్యమని శివుడు చెప్పాడు - @iVishnuManchu #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/fBKY3yRSC8— Telugu FilmNagar (@telugufilmnagar) June 14, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. టీజర్ వచ్చేసింది!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను జూన్ 14న కన్నప్ప రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంచు విష్ణు కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో గుర్రం మీద విష్ణు కూర్చుని కనిపించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.After an overwhelming reception at Cannes, I am thrilled to share the teaser for this epic tale, 'Kannappa', with you on 14th June. This film holds a special place in my heart, and I can’t wait to welcome you all to the captivating world of #Kannappa🏹. #kannappateaser… pic.twitter.com/bhmCEi6K4s— Vishnu Manchu (@iVishnuManchu) June 7, 2024 -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
కన్నప్ప మూవీలో ఛాన్స్? మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!
మంచు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మోహన్‌బాబు నిర్మాతగా విష్ణు 'కన్నప్ప' చిత్రం చేస్తుండగా, మనోజ్ 'మిరాయ్' మూవీ చేస్తున్నాడు. మంచు లక్ష్మీ 'యక్షిణి' అనే హారర్ సిరీస్‌లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లక్ష్మికి కొన్ని ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.నాతో నటించాలంటే భయంమీ సోదరుడు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో దాదాపు అన్ని భాషల స్టార్స్ నటిస్తున్నారు. మరి మీరు అందులో ఉన్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు మంచు లక్ష్మి స్పందిస్తూ.. 'మా ఇంట్లో ఉన్న అబ్బాయిలు నాతో కలిసి నటించాలంటే భయపడుతున్నారు. అందుకే నేను వారి సినిమాలు చేయడం లేదు. అందువల్లే ఇవ్వలేదేమోనేను నటిస్తే వాళ్లెక్కడ కనిపించరోనని వారి సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. ఇది సరదాగా అంటున్నానులే కానీ.. నాకు సరిపోయే క్యారెక్టర్ అందులో లేకపోవడం వల్లే విష్ణు నాకు సినిమా ఇవ్వలేదేమో! కన్నప్ప చాలా పెద్ద సినిమా.. నాతో పాటు మనోజ్‌కు కూడా ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. అయినా అందరం కలిసి చేస్తే అది ఫ్యామిలీ సినిమా అయిపోతుంది' అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తానన్న జాన్వీ కపూర్ -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం కన్నప్పలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, శరత్ కుమార్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, నయనతారతో పాటు భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో కన్నప్ప టీం సందడి చేసింది. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. 'హారిజన్: యాన్ అమెరికన్ సాగా' స్క్రీనింగ్‌లో వీరంతా పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Walked the Red Carpet yesterday for the screening of 'Horizon: An American Saga'@themohanbabu @pddancing @vinimanchu#cannes2024 pic.twitter.com/UcC8OPvFh1— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2024 -
మంచు విష్ణు ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం నటిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సైతం కన్నప్ప సెట్స్‌లో సందడి చేశారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించనుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.కన్నప్ప చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, శరత్ కుమార్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. ఇటీవలే అక్షయ్‌కుమార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్ చేయనున్న సంగతి తెలిసిందే. We are thrilled to announce another star attraction in @iVishnuManchu's #Kannappa🏹: The talented @MsKajalAggarwal is all set to shine in an important role! Stay tuned for an unforgettable cinematic experience!@24FramesFactory @avaentofficial @KannappaMovie#KannappaMovie… pic.twitter.com/aGZKUa2wzJ— Kannappa The Movie (@kannappamovie) May 17, 2024 -
కన్నప్ప: మంచు విష్ణు చెప్పింది కాకుండా ప్రభాస్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు. ఈ మధ్యే కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే! ప్రభాస్ తన పాత్ర తానే సెలక్ట్ చేసుకున్నాడంటున్నాడు విష్ణు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘కన్నప్ప నుంచి ఏ న్యూస్ వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. గత ఐదారు అప్డేట్లు టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. నా మిత్రుడు ప్రభాస్ షూట్లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. ప్రభాస్‌ను కలిసినప్పుడు..కన్నప్ప కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు, డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికర విషయం చెప్పాలి. ప్రభాస్‌ను కలిసినప్పుడు.. నేను కన్నప్ప సినిమా చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పాను. అందుకాయన ‘కథ బాగా నచ్చింది నాకు ఫలానా పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఆ క్యారెక్టర్ నేను చేయొచ్చా?’ అని అడిగారు. ఏ కారెక్టర్ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను పోషించారు. అద్భుతమైన అప్డేట్త్వరలోనే ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రల గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’ అన్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ పని చేస్తున్నారు.చదవండి: నా కన్నా మా అక్కే అందంగా ఉండేది.. టార్చర్ పెట్టా: నటి -
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్‌లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్‌తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. -
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
'కన్నప్ప' కోసం స్టార్ హీరోను దింపిన మంచు విష్ణు.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' కోసం భారత దిగ్గజ నటలను దింపుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో ఆయన పంచుకున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం రూపొందుతోంది. 'కన్నప్ప' పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది. కన్నప్ప సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. 1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్ ఆ తర్వాత 2018లో రజినీకాంత్ రోబో2.0 సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్‌ని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఓ మై గాడ్ 2లో ఇలాంటి పాత్రలో కనిపించిన అక్షయ్ భేష్ అనిపించుకున్నాడు. దీంతో కన్నప్పకు బాలీవుడ్లో మంచి మార్కెట్ వస్తుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కల్కి సినిమాలో శ్రీవిష్ణువు అంశతో కూడిన భైరవగా ప్రభాస్ కనిపించనున్నాడు.. ఇలాంటి సమయంలో కన్నప్పలో మహాశివుడిగా కనిపిస్తే ఇబ్బందవుతుందని భావించిన ప్రభాస్.. మంచు విష్ణును రిక్వెస్ట్ చేసి మార్పులు చేయాలని కోరాడట. దీంతో శివుడి పాత్ర కోసం వేట కొనసాగించిన మంచు విష్ణుకు అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని ప్లాన్ చేశాడట. అలా టాలీవుడ్లోకి తాజాగా అక్షయ్ ఎంట్రీ ఇచ్చేశాడు. త్వరలో షూటింగ్ జరుగుతుందని విష్ణు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
Manchu Vishnu: ఉగాది సందడంతా వీరి ఇంట్లోనే! (ఫోటోలు)
-
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు మలేషియాలో: మంచు విష్ణు
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే వేడుకల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉంది.జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తాం. తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్ ఛాంబర్‌తో మాట్లాడాం. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాం.అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్ లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నాం. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తోంది’ అని అన్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ఇటీవలే న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కన్నప్ప రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇవాళ తన 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య విరానికా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్‌లో ఆమెను తీసుకెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూట్లో ఉన్న మంచు విష్ణు భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విరానికా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. కాగా.. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరానికా రెడ్డిని మార్చి 1, 2009న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరో వైపు.. విష్ణు భార్య విరానికా ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ షురూ అయింది. తాజాగా న్యూజిలాండ్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్తా గ్యాప్ తర్వాత కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు తాజాగా షూటింగ్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన తండ్రి మోహన్ బాబు, విష్ణు మంచు వీడియోలో కనిపించారు. ఈ షెడ్యూల్లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. The second schedule of #Kannappa in #NewZealand is in full swing !!@iVishnuManchu #Prabhas #Vishnu pic.twitter.com/UQ67xfJVCS — Aryan (@chinchat09) February 28, 2024 -
ఎన్టీఆర్, రామ్ చరణ్ కి పోటీగా రంగంలోకి మంచి విష్ణు..!
-
'కన్నప్ప' విడుదల ఫిక్స్.. ఆ తేదీలో బిగ్‌ఫైట్
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్‌లో కీలకమైన ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్ భావిస్తోందట. ఇందులో కీ రోల్లో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కన్నప్ప చిత్రం షూటింగ్ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్ కార్యక్రామాలను కూడా సెట్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్. ఒకేరోజులో రామ్ చరణ్, తారక్ సినిమాలు ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు కూడా విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, నయనతార పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. -
చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్ బాబు ఏం అన్నారంటే
టాలీవుడ్ మెగాస్టార్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. మెగాస్టార్‌కు అవార్డు ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు రియాక్ట్ అయ్యారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నానని మోహన్ బాబు తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. భారీ వేడుకకు ప్లాన్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిరు ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ఇంతటి శుభ సందర్భంగా మెగాస్టార్ కోసం చిత్ర పరిశ్రమ నుంచి ఒక వేడుకను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ వివరాలు త్వరలో చెబుతామని దిల్ రాజు చెప్పారు. Congratulations to my dear friend @KChiruTweets on this well-deserved honor! We are all very proud of you for receiving the award. — Mohan Babu M (@themohanbabu) January 26, 2024 Woke up to the fantastic news on Sri. @KChiruTweets garu winning the prestigious #PadmaVibhushan! What a proud moment for Telugu Film Industry! Congratulations @KChiruTweets Garu 💪🏽👌❤️ — Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2024 -
Avram Manchu: ఐదేళ్లకే సినిమాలో ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు తనయుడు (ఫోటోలు)
-
మంచు వారసుడొస్తున్నాడు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ!
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ద్వారా మంచు వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు మంచు వారసుడిగా అవ్రామ్ కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మోహన్ బాబు మూడో తరం కూడా సినిమాల్లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. విష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. అవ్రామ్తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు.కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. -
మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. చిత్రీకరణ సంగతలా పక్కనబెడితే వరస అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హీరో గాయపడగా.. ఇప్పుడు సాంగ్ తీస్తున్న సమయంలో టైంలో స్టార్ కొరియోగ్రాఫర్ గాయపడింది. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) గతంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో 'కన్నప్ప' మూవీ వచ్చింది. ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు కన్నప్ప మూవీ తీస్తామని మంచు విష్ణు చాలారోజుల నుంచి చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సీన్స్ తీస్తున్నారు. అయితే నవంబరు మొదట్లో హీరో విష్ణు గాయపడ్డాడు. డ్రోన్ తగలడంతో విష్ణు మోచేతికి గాయమైంది. ఇది అయిపోయిందనుకునేలోపు ఇప్పుడు సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ కాలికి ఫ్రాక్టర్ అయింది. ఓ పాట కోసం స్టెప్స్ కంపోజ్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ మధ్యలో నిలిపేశారు. అలానే ఆమెని కూడా కొన్నిరోజులు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ సూచించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు,శరత్‌కుమార్‌లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్‌లో 'మహాభారతం' సిరీస్‌ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!
-
మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఇండస్ట్రీలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కొన్ని నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పని తీరుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగింది. ఈ బిగ్‌ఫైట్‌లో మంచు విష్ణు భారీ విజయంతో మా అధ్యక్షుడి పీఠాన్ని అదరోహించారు. ఆ తర్వాత ఆయన సినీ కార్మికులతో పాటు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న వారికి మా సభ్యత్వంతో పాటు పలు సహాయసహకారాలు అందించారు. కానీ ఆ ఎన్నికల్లో అందరి ఎజెండాలో మా బిల్డింగ్ నిర్మాణం ప్రధానంగా ఉంది. త్వరలో దానిని నిర్మాస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి కూడా మా బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు గురించి ప్రకాశ్ రాజ్ ఇలా చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు) 'మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే మా కి సొంత భవనం కూడా లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా.' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా అధ్యుక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పారు. అతను ఈ రెండేళ్లలో ఏమి చేశాడో చెప్పాలని కోరాడు. బోగస్ ఓట్లతో పాటు బయట నుంచి విమానాల్లో పిలిపించుకోవడం, వంటి కార్యక్రమాలు చేయడంతో విష్ణు గెలిచాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో..? చెయ్యనో..? తెలియదని చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఇక నుంచి తన దృష్టి జాతీయ అంశాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను మా అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
రష్మిక ఫేక్ వీడియో ఘటన.. 'మా' అధ్యక్షుడి రియాక్షన్
స్టార్ హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ తరఫున మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే?) 'డీప్ ఫేక్ కాంట్రవర్సీకి గురైన రష్మికకు నా మద్దతు తెలియజేస్తున్నాను. టెక్నాలజీని దుర్వినియోగం చేసే ఇలాంటి డేంజరస్ కంటెంట్ క్రియేట్ చేయడంపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తీవ్రంగా ఆందోళన పడుతోంది. ఇలాంటి సంఘటనలపై పోరాడేందుకు అవసరమైన గైడ్‌లైన్స్ రూపొందించే దిశగా ఏఐ, న్యాయ నిపుణులతో 'మా' సంప్రదింపులు జరుపుతోంది.ఫేక్ వీడియోలపై తక్షణమై స్పందించాల్సిన అవసరం ఉందని రష్మికకు ఎదురైన ఘటన తెలియజేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను ‘మా’ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదు.' అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. అసలేంటి గొడవ? ఓ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ వీడియోకి డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించిన రష్మిక ఫేస్ చేర్చారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫస్ట్ ఫస్ట్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆ తర్వాత హీరో నాగచైతన్య, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత కూడా స్పందించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. (ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత) I strongly support Rashmika, who is one of the many victims of the deep fake controversy video. We at , Movie Artiste Association (MAA) , are deeply concerned about the misuse of technology to create such harmful content. MAA is actively collaborating with legal and AI experts to… — Vishnu Manchu (@iVishnuManchu) November 8, 2023 -
మంచు విష్ణుకు గాయాలు.. అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డట్లు ప్రచారం జరిగింది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ క్యాన్సిల్ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్ బాబు.. మంచు విష్ణు హెల్త్ అప్డేట్ గురించి ట్వీట్ చేశాడు. 'కన్నప్ప షూటింగ్లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటాడు' అని ట్వీట్ చేశాడు. ఇకపోతే బుల్లితెరపై మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు. Grateful for all the love, wishes, and concern during @iVishnuManchu accident on the set of #Kannappa in New Zealand. By God's grace, he's on the road to recovery and will be back to shooting soon. Thank you for your support. 🙏 Har Har Mahadev! — Mohan Babu M (@themohanbabu) November 1, 2023 చదవండి: ఎనిమిది నెలల గర్భిణి.. బిడ్డను చూడకుండానే కన్నుమూసిన నటి