Mohammed Siraj
-
సిరాజ్‌తో 'బిగ్‌బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్‌తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్‌మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్‌తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్‌బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్‌బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
‘మరో సిరాజ్’ వేటలో...
సాక్షి, హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్‌గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అలాంటి సిరాజ్‌లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్కేఎస్ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు. అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకునే యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతిభ గలవారిని తీర్చిదిద్దుతున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, కోచ్ రహ్మతుల్లా బేగ్ గౌరవార్ధమే ప్రత్యేకంగా పాతబస్తీ క్రికెటర్ల కోసం ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెస్కే చెప్పారు. సుమారు 400 మంది యువ పేస్ బౌలర్లు ఈ ట్రయల్స్‌కు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాజీ క్రికెటర్లు షహాబుద్దీన్, ఫసీర్ రహమాన్, సత్యప్రసాద్, మనోజ్‌సాయి, ప్రకాశ్‌బాబు, అమానుల్లా ఖాన్‌లతో పాటు టీఎన్జీఏ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్‌గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్ దళంలో ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షిత్ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షిత్.. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకిఇంగ్లండ్తో ఆడిన టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.ఈ నేపథ్యంలో కామెంటేటర్, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ హర్షిత్ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్‌దీప్ సింగ్‌కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడుతన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్ బిగ్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్‌దీప్‌నకు కష్టాలు తప్పవు. సెకండ్ సీమర్‌గా అతడికి హర్షిత్ నుంచి పోటీ ఎదురవుతుంది.సిరాజ్ రీ ఎంట్రీ కష్టమే!కచ్చితంగా హర్షిత్ రాణా అర్ష్‌కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు హర్షిత్ రాణా.గత ఎడిషన్‌లో మొత్తంగా పదమూడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్.. కోల్‌కతాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్‌కతా జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ కావడంతో హర్షిత్‌కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
అసిస్టెంట్ కమాండెంట్ గా ఛార్జ్ తీసుకున్న క్రికెటర్ మహ్మద్ సిరాజ్
-
CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్‌తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేనకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.అందుకే చోటివ్వలేదుఅయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారుఇక ఇంగ్లండ్‌తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్‌లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అలా అయితే సిరాజ్‌కు చోటుకానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్‌కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్‌లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
టీమిండియాలో చోటు గల్లంతు.. అయినా ఆకట్టుకోలేకపోయిన సిరాజ్
ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ (Ranji Trophy) ఆకట్టుకోలేకపోయాడు. చాలాకాలం తర్వాత హైదరాబాద్ (Hyderabad) తరఫున రంజీ బరిలోకి దిగిన సిరాజ్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు. భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్‌లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేమీ లేదు. సిరాజ్ సహచర పేసర్లు చింట్ల రక్షన్ రెడ్డి, చామ మిలింద్ కలిపి ఐదు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. చామ మిలింద్ రెండు, తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్ దూబే (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మెరుపు అర్ద సెంచరీ చేసి జోష్ మీదున్న హర్ష్ దూబేను ఔట్ చేయడమే సిరాజ్‌కు ఊరట కలిగించే అంశం. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్‌తో పాటు అక్షయ్ వాద్కర్ (29), దనిష్ మలేవార్ (13), పార్థ్ రేఖడే (23), యశ్ రాథోడ్ (16), యశ్ ఠాకూర్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ (3) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 1.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి 5 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తన్మయ్ అగర్వాల్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.బీజీటీలోనూ అంతంతమాత్రమే..!ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా చలామణి అయిన సిరాజ్.. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసినప్పటికీ.. జట్టు విజయానికి అతని ప్రదర్శనలు ఏమాత్రం అక్కరకు రాలేదు. బీజీటీలో సిరాజ్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయినా అతని నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. 2023 ఆరంభంలో మంచి ఫామ్‌లో ఉండిన సిరాజ్ ఆతర్వాత కొంత కాలం పాటు తన ఫామ్‌ను కొనసాగించగలిగాడు. 2023 నుంచి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.89 సగటున 104 వికెట్లు తీశాడు. ఈ మధ్యకాలంలో అతను మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. 2023 నుంచి ఇప్పటివరకు 683.5 ఓవర్లు వేసిన సిరాజ్.. ఈ మధ్యకాలంలో అత్యధిక ఓవర్లు వేసిన భారత పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ‘డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendent Of Police-డీఎస్పీగా)’గా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దీప్తి కృతజ్ఞతలు తెలియజేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team)లో దీప్తి శర్మ గత కొంతకాలంగా కీలక సభ్యురాలిగా ఉంది. రెండేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రజత పతకం గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.గతేడాది అత్యుత్తమంగానిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.ఇక రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటుఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. క్రీడా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజాగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా మొరదాబాద్‌లో సోమవారం అధికారికంగా ఉద్యోగంలో చేరిన దీప్తి శర్మ.. డీఎస్పీ యూనిఫామ్‌లో మెరిసింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్ శర్మ, ప్రశాంత్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగ్రా ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.ప్రతిజ్ఞ చేస్తున్నా‘‘ఈ మైలురాయిని చేరినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు మద్దతుగా నిలిచి.. ఈస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా.అలాగే.. ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా నా కొత్త పాత్రలో ఒదిగిపోవడంతో పాటుగా.. విధి నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అని దీప్తి శర్మ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన క్రికెటర్లలో మరో డీఎస్పీఈ క్రమంలో దీప్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తొలుత సిరాజ్.. ఇప్పుడు మన క్రికెటర్లలో మరో డీఎస్పీ’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం హైలైట్‌గా నిలిచింది. కాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే అధికారికంగా అతడికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.చదవండి: 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట.. -
జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కలిసి కన్పించలేదు.అయినప్పటికి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్‌లు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. కాగా సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఇదేమి తొలిసారి కాదు.ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో ఈ స్టార్ పేసర్ ప్రేమలో ఉన్నాడని వార్తలు విన్పించాయి. కానీ వాటిని వారిద్దరూ కొట్టిపారేశారు. తమది అన్నాచెల్లెళ్ల బంధమంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.ఎవరీ మహిరా శర్మ?మహిరా శర్మ.. వర్ధమాన భారతీయ నటీమణులలో ఒకరు. నాగిన్-2, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె కన్పించింది. అయినప్పటికి బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. అక్కడ తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె ప్రేమయాణం నడిపింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.స్పందించిన మహిరా తల్లి..అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ తాజాగా స్పందించింది. అసలేమి మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ప్రజలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి వార్తలు రావడం సహజం. వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వార్త పూర్తిగా అబద్ధమని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా శర్మ పేర్కొంది.రంజీల్లో ఆడనున్న సిరాజ్..కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సిరాజ్ రంజీ బాట పట్టాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.చదవండి: అందరి చూపు కోహ్లి వైపు -
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్‌కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్‌రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్‌లేనా? రసవత్తర మ్యాచ్‌లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్‌లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్‌కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్‌కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్‌పూర్ ట్రాక్ పేస్‌కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్‌తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్ పూర్తి ఫిట్‌గా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు కాబట్టి.. సిరాజ్ మియా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. హైదరాబాదీ పేసర్‌కు దక్కని చోటుఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌కు తమ జట్టును ప్రకటించగా.. ఇందులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం చోటు దక్కలేదు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసిన సెలక్టర్లు.. యువ తరంగం, పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా స్థానం ఇచ్చారు. అందుకే పక్కన పెట్టామన్న కెప్టెన్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. ఇక షమీతో పాటు అర్ష్‌దీప్ కొత్త బంతితో రాణించగలడు. అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేయగలడు. అయితే, సిరాజ్ మాత్రం ఆరంభంలో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడు. అందుకే అతడిని పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చాడు.వైల్డ్ కార్డ్ ఎంట్రీఅయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్‌కు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. టోర్నీ నాటికి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధించే సూచనలు కనిపించడం లేదు. అదే విధంగా.. షమీ కూడా ఇంత వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు అతడు దూరమైనా.. నెట్స్‌లో కుంటుతూ బౌలింగ్ చేసిన దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.సిరాజ్‌కు చోటు పక్కాఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘షమీ గురించి కాసేపు పక్కనపెడతాం. బుమ్రా గురించి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం రావడం లేదు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఒక్క పేసర్ మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు.మిగతా ఇద్దరు(బుమ్రా, షమీ) సంగతి తెలియదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టుకు దూరమైతే.. ఆటోమేటిక్‌గా సిరాజ్ జట్టులోకి వచ్చేస్తాడు. కాబట్టి సిరాజ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి.చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నానని భావించి పూర్తి ఫిట్‌గా.. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇక బుమ్రా ఒక్క వన్డేలోనూ భాగం కాలేదు. కాబట్టి సిరాజ్‌కు గనుక చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే నాకైతే సంతోషమే’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే (Zanai Bhosle)తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్‌గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.సోషల్‌మీడియా వేదికగా మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఇలా పేర్కొన్నాడు. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒకరు' అని సిరాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయింది. సిరాజ్ అంటూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
ప్రముఖ సింగర్‌తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్..!
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్‌తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్‌పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్‌గా ఉంటే.. -
CT 2025: అతడి కంటే బెటర్!.. నాకు చోటు దక్కాలి కదా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సిరాజ్‌ను పక్కన పెట్టడం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశమైంది.అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. కనీసం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా ఈ హైదరాబాదీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్‌తో వన్డేలకు సిరాజ్ బదులుగా మరో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాను ఎంపిక చేశారు.సెలక్టర్ల తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్‌ను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని కార్తీక సమర్ధించాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే జట్టులో లేకపోవడం కొంతవరకు బాధకారమనే చెప్పాలి. ఈ నిర్ణయం సిరాజ్‌ను నిరాశపరిచుండొచ్చు. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా, షమీ, అర్ష్‌దీప్‌లకు ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఛాన్స్ ఇచ్చారు.వీరు ముగ్గురు వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తనను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం సిరాజ్‌ను మరింత బాధ కలిగించుంటుంది. ఈ సమయంలో సిరాజ్.. రాణా కంటే తన ఎంతో బెటర్ అని భావిస్తుండవచ్చు. ఇది అతడిని తనను తాను మరింత నిరూపించుకోవడానికి ప్రేరేపిస్తుంది.కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 71 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్-2023ను భారత్ కైవసం చేసుకోవడంలో సిరాజ్‌ది కీలక పాత్ర. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #Shardul Thakur: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్‌చేస్తే! సూపర్ సెంచరీ -
జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చానీయంశమైంది. అతడి స్ధానంలో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.దీంతో సెలక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. జడేజా స్ధానంలో సిరాజ్‌కు ఛాన్స్ ఇచ్చి ఉంటే జట్టు బౌలింగ్ యూనిట్ బలంగా ఉండేది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన బలమైన పేస్ బౌలింగ్ ఎటాక్‌ను కలిగింది. అయినప్పటికి గత రెండేళ్ల నుంచి వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత 43 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.04 యావరేజ్‌తో 71 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. 5.18 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు వన్డే నెం1 బౌలర్‌గా కూడా సిరాజ్ కొనసాగాడు."చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టులో మహ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ఒకరిని పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రవీంద్ర జడేజా స్ధానంలో సిరాజ్‌ను ఎంపిక చేయాల్సింది. సిరాజ్ జట్టులో ఉండి ఉంటే కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్ చేసేవాడు. నిజం చెప్పాలంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటి అతడిని ఎంపిక చేయడం ఎటువంటి లాభం ఉండదు. అదే సిరాజ్‌ను తీసుకుని ఉంటే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారేవాడు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!? -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్‌కు చోటు ఇచ్చారు. గత రెండేళ్లగా వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడాన్ని పలువురు మాజీలు తప్పుబడుతున్నారు.ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా సిరాజ్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే సిరాజ్ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో సిరాజ్ మరో ఐదు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ మోస్తారు ప్రదర్శన కనబరిచాడు. ఐదు టెస్టుల్లో మొత్తంగా 20 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.అందుకే పక్కన పెట్టాము: రోహిత్ శర్మకాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కొత్త బంతి, పాత బంతితో ప్రభావం చూపే బౌలర్ తమకు కావాలని, అందుకే సిరాజ్ స్ధానంలో అర్ష్‌దీప్‌కు ఛాన్స్ ఇచ్చామని రోహిత్ చెప్పుకొచ్చాడు.బంతి పాతబడినప్పుడు మహమ్మద్ సిరాజ్ ప్రభావం తగ్గుతుందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక పాక్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.బుమ్రా గాయంపై రాని స్పష్టతఅంతేకాదు.. ఈ ఓపెనింగ్ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే, చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.వన్డే వరల్డ్‌కప్-2023లో లీడింగ్ వికెట్(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సిరాజ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్ లేకపోతే సిరాజ్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.సీమ్ ఆల్‌రౌండర్లు లేరుఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.కాగా స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటిచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
టీమిండియా యువ బౌలర్‌కు వెన్నునొప్పి.. మరో పేసర్ అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ గతేడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు.అరేంగేట్ర మ్యాచ్లోనేలక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్‌స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిఅనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్‌లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్‌కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.వెన్నునొప్పి వేధిస్తోందిఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్టీ20లుతొలి టీ20- జనవరి 22- కోల్కతారెండో టీ20- జనవరి 25- చెన్నైమూడో టీ20- జనవరి 28- రాజ్కోట్నాలుగో టీ20- జనవరి 31- పుణెఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబైవన్డేలుతొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్పూర్రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
సిరాజ్ టెన్షన్ పెట్టాడు.. కానీ అతడి వల్లే.: నితీశ్ రెడ్డి తండ్రి కామెంట్స్ వైరల్
నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) మెల్బోర్న్లో సాధించిన ఘనత తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అతడి తండ్రి ముత్యాలరెడ్డి అన్నారు. ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అని.. తన కుమారుడి కష్టానికి ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా టీమిండియా తరఫున టీ20ల ద్వారా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు నితీశ్ రెడ్డి.పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికయ్యాడు. కంగారూ దేశంలోని పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసిన తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. తొలి టెస్టు నుంచే బ్యాట్‌తో చెలరేగిన నితీశ్ రెడ్డి.. తాజాగా మెల్బోర్న్ వేదికగా శతకంతో మెరిశాడు.97 పరుగుల వద్ద ఉండగా ఎనిమిదో వికెట్బాక్సింగ్ డే టెస్టులో భాగంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... భారత్ తరఫున తొలి సెంచరీ సాధించాడు. అయితే, నితీశ్ రెడ్డి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. వాషింగ్టన్ సుందర్(50) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు.99.. తొమ్మిదో వికెట్ డౌన్ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అయితే, అతడు పరుగుల ఖాతా తెరవకముందే కమిన్స్ బుమ్రాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అప్పటికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో బుమ్రా స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ సిరాజ్ వికెట్ కాపాడుకుంటాడా?.. నితీశ్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకోగలడా? అనే ఉత్కంఠ పెరిగింది.ఫోర్ బాది వంద పరుగుల మార్కుకుఅయితే, సిరాజ్ కమిన్స్ బౌలింగ్‌లో మూడు బంతులను చక్కగా డిఫెన్స్ చేసుకోవడంతో.. నితీశ్ రెడ్డికి లైన్‌క్లియర్ అయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అతడు ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.Nitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 ఇక నితీశ్ రెడ్డి శతకం బాదినపుడు అతడి కుటుంబం కూడా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ ఆడం గిల్‌క్రిస్ట్ ముత్యాలరెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.సిరాజ్ వల్లే సాధ్యమైందిఈ సందర్భంగా ముత్యాలరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబానికి ఇదెంతో ప్రత్యేకమైన రోజు. జీవితాంతం ఈ క్షణాలు గుర్తుండిపోతాయి. 14- 15 ఏళ్ల వయసు నుంచే నితీశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటుతుండటం సంతోషం. ఈ భావనను మాటల్లో వర్ణించలేను. నిజానికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నపుడు నాకు టెన్షన్‌గా అనిపించింది. అప్పటికి ఒకే వికెట్ చేతిలో ఉన్నా.. సిరాజ్ అద్భుతం చేశాడు. అతడు వికెట్ కాపాడుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు😭😭pic.twitter.com/IFTEjVw0uS https://t.co/4p2BAImzGW— Kraken (@krak3nnnnnn) December 28, 2024Adam Gilchrist asked Nitish Reddy's fathe,Nitish Reddy at 99 and Md Siraj was facing 3 balls. HIS FATHER SAID TENSION #nitishkumarreddy #fatherson #MOMENT pic.twitter.com/DVeyQOy7Io— The Comrade (@Yogeshp89973385) December 28, 2024 -
చెప్పి మరీ.. అతడిపై వేటు వేయండి: టీమిండియా దిగ్గజం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్? అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండిఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్దేకాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్ -
IND Vs AUS: ఆస్ట్రేలియా- భారత్ నాలుగో టెస్టు టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
అలా శాసించే అలవాటు మాకు లేదు: బుమ్రా
బ్రిస్బేన్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన స్థాయిని ప్రదర్శిస్తూ 6 వికెట్లతో చెలరేగాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో ఇప్పటికే 18 వికెట్లు తీసిన అతను... ఆస్ట్రేలియా గడ్డపై 50 వికెట్లు తీసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే మూడో టెస్టులో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో ఇతర బౌలర్లపై వచ్చిన విమర్శలను బుమ్రా తిప్పికొట్టాడు. వారిలో చాలా మంది కొత్తవారేనని, ఇంకా నేర్చుకుంటున్నారని మద్దతు పలికాడు. ‘జట్టులో ఇతర సభ్యుల వైపు వేలెత్తి చూపించే పని మేం చేయం. నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి అంటూ శాసించే దృక్పథం కాదు మాది. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. ఆస్ట్రేలియాలాంటి చోట రాణించడం అంత సులువు కాదు. ముఖ్యంగా మా బౌలింగ్‌లో సంధి కాలం నడుస్తోంది. కొన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో వారికి నేను అండగా నిలవాలి. వారంతా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రయాణంలో మున్ముందు మరింత మెరుగవుతారు’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యంపై కూడా అతను స్పందించాడు. ‘బ్యాటర్లు విఫలమయ్యారని, వారి వల్ల మాపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పడం సరైంది కాదు. జట్టులో 11 మంది ఉన్నాం. కొందరికి అనుభవం చాలా తక్కువ. వారు నేర్చుకునేందుకు తగినంత అవకాశం ఇవ్వాలి. ఎవరూ పుట్టుకతోనే గొప్ప ఆటగాళ్లు కాలేరు. నేర్చుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. సవాళ్లు ఎదురైనప్పుడు కొత్త తరహాలో వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో మూడు భిన్నమైన పిచ్‌లు ఎదురయ్యాయి. నేను వాటి కోసం సిద్ధమయ్యాను. గతంలో అంచనాల భారంతో కాస్త ఒత్తిడి ఉండేది. ఇప్పుడు వాటిని పట్టించుకోవడంలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. నేను బాగా ఆడని రోజు మిగతా బౌలర్లు వికెట్లు తీయవచ్చు’ అని బుమ్రా వివరించాడు. సిరాజ్‌కు గాయం! ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న మరో పేసర్ సిరాజ్‌కు బుమ్రా అండగా నిలిచాడు. అతను స్వల్ప గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడని, సిరాజ్‌లో పోరాట స్ఫూర్తి చాలా ఉందని మెచ్చుకున్నాడు. ‘మైదానంలోకి దిగిన తాను బాగా బౌలింగ్ చేయకపోతే జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని సిరాజ్‌కు తెలుసు. అందుకే స్వల్ప గాయంతో ఉన్నా బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కవని, పోరాడటం ఆపవద్దని అతనికి చెప్పా. ఎందరికో రాని అవకాశం నీకు వచ్చిందంటూ ప్రోత్సహించా. అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతకైనా పట్టుదలగా పోరాడే అతని స్ఫూర్తి నాకు నచ్చుతుంది. అది జట్టుకూ సానుకూలాశం’ అని బుమ్రా అభిప్రాయపడ్డాడు. -
సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బ్రిస్బేన్‌లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్‌ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ట్రవిస్ హెడ్‌కు సిరాజ్ సెండాఫ్ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్‌ను కించపరిచేలా ఆసీస్ ఫ్యాన్స్ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్‌స్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆసీస్.. 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.బుమ్రాకు ఐదుఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్ హెడ్ భారీ శతకం(152), స్టీవ్ స్మిత్(101) సెంచరీ కారణంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జడ్డూ కోపానికి కారణం అదేఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్ తర్వాత తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ సిరాజ్ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.జడేజా బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా బంతిని తరలించి.. సింగిల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్‌ను అందుకున్న సిరాజ్ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.దీంతో జడేజా కోపంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్.. సారీ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నా వేలును విరగ్గొట్టేశావు పో..ఈ నేపథ్యంలో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ స్పందిస్తూ.. సిరాజ్ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్ ఇచ్చాడని నికోలస్ పేర్కొన్నాడు.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రpic.twitter.com/iJC2zadOh7— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024pic.twitter.com/oCw1kXmsYl— The Game Changer (@TheGame_26) December 15, 2024 -
'సిరాజ్‌కు కొంచెం కూడా తెలివి లేదు.. ఇది అస్సలు ఊహించలేదు'
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేస్‌ర్ మహ్మద్ సిరాజ్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి సెషన్లో సిరాజ్ కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. రెండో సెషన్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్మిత్‌లు సిరాజ్‌ను ఓ ఆట ఆడేసికుంటున్నారు. ఇప్పటివరకు 18.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 69 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన బౌలింగ్ రిథమ్‌ను కోల్పోయినట్లు కన్పిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ విమర్శలు గుప్పించాడు. సిరాజ్ తన బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాడని కటిచ్ మండిపడ్డాడు. కాగా ఆసీస్ ఇన్నింగ్స్ 60 ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతిని షార్ట్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని హెడ్ ర్యాంప్ షాట్ ఆడి థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీగా మలిచాడు. అయితే ఆ ఓవర్ ముందువరకు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్ ఉండేవాడు. కానీ సిరాజ్ సూచన మెరకు తన ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ థర్డ్‌మ్యాన్ ఫీల్డర్‌ను తొలిగించాడు. ఈ క్రమంలో సిరాజ్ నిర్ణయాన్ని కటిచ్ తప్పు బట్టాడు."మహ్మద్ సిరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆ ఓవర్‌కు ముందు థర్డ్-మ్యాన్ స్ధానంలో ఓ ఫీల్డర్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్‌ను తొలిగించమని సూచించాడు. ఇది నిజంగా తెలివితక్కువ నిర్ణయం. థర్డ్ మ్యాన్‌లో ఫీల్డర్ లేనిప్పుడు షార్డ్ డెలివరీని ఎందుకు వేయాలి. సిరాజ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయలేదు. హెడ్‌కు వ్యతిరేకంగా లెగ్ సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లను, డీప్ పాయింట్లో ఓ ఫీల్డర్‌ను ఉంచారు. కానీ థర్డ్‌మ్యాన్‌లో మాత్రం ఫీల్డర్‌ను తీసేశారు. హెడ్ ఆ షాట్ ఆడాక మళ్లీ తిరిగి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్‌ను తీసుకొచ్చారు" అని గబ్బా టెస్టు కామెంటరీలో భాగంగా కటిచ్ పేర్కొన్నాడు.రెండో రోజు ఆసీస్‌దే..ఇక ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(45), మిచెల్ స్టార్క్(7) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(152), స్మిత్(101) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు. -
ఆసీస్‌తో మూడో టెస్టు.. సిరాజ్‌కు చేదు అనుభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా జట్టు అభిమానులు ఈ హైదరాబాదీ బౌలర్‌పై అక్కసు వెళ్లగక్కారు. సిరాజ్‌ను ఉద్దేశించి పరుష పదజాలం వాడుతూ, గట్టిగా అరుస్తూ అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఘటన జరిగింది. బ్రిస్బేన్ వేదికగాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో విజయం సాధించిన భారత్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది.సిరాజ్‌ను టీజ్ చేసిన ఆసీస్ఫ్యాన్స్.. కారణం ఇదేగబ్బా మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఆసీస్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అయితే, అతడు బంతి పట్టుకుని రంగంలోకి దిగగానే.. ఆస్ట్రేలియా అభిమానులు గట్టిగా అరుస్తూ అతడిని విమర్శించారు. గత మ్యాచ్‌లో సిరాజ్.. ఆసీస్ స్టార్ ట్రవిస్ హెడ్‌తో వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.ఇద్దరికీ షాకిచ్చిన ఐసీసీఅడిలైడ్ టెస్టులో హెడ్ భారీ శతకం(141 బంతుల్లో 140)తో ఆకట్టుకున్నాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి రాగా.. ఎట్టకేలకు సిరాజ్ అద్భుత యార్కర్‌తో అతడికి చెక్ పెట్టాడు. అయితే, తన బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ బౌల్డ్ కాగానే.. ‘ఇక వెళ్లిపో’ అన్నట్లుగా రియాక్షన్స్ ఇస్తూ సిరాజ్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హెడ్ సైతం గట్టిగానే అతడికి బదులిచ్చాడు.ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వీళ్లిద్దరికీ గట్టి షాక్ ఇచ్చింది. పరస్పరం దూషించుకున్న ఈ ఇద్దరు స్టార్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. చెరో డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. గత రెండేళ్లలో ఇద్దరిదీ తొలి తప్పిదం కాబట్టి ఈమాత్రం శిక్షతో సరిపెట్టింది. లేదంటే ఇద్దరూ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చేది.వర్షం వల్ల అంతరాయంఇక సిరాజ్- హెడ్ గొడవపై క్రికెట్ పండితులు విమర్శలు గుప్పించగా.. ఆసీస్ ఫ్యాన్స్ మాత్రం మూడో టెస్టు సందర్భంగా సిరాజ్‌ను హేళన చేస్తున్నట్లుగా కామెంట్లు చేశారు. కాగా బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వరణుడి వల్ల తొలుత టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత మ్యాచ్ మొదలైనా.. 13.2 ఓవర్ల ఆట ముగిసే సరికి మళ్లీ వాన కురిసింది. ఈ నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా ఒక్క వికెట్ నష్టపోకుండా 28 పరుగులు సాధించింది.చదవండి: అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్Big boo for siraj from the crowd#AUSvIND #TheGabba pic.twitter.com/rQp5ekoIak— ٭𝙉𝙄𝙏𝙄𝙎𝙃٭ (@nitiszhhhh) December 14, 2024 -
సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ సమయంలో చేసుకునే అనుచిత సంబరాలపై సీనియర్లు నచ్చజెబితే బాగుంటుందని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో సిరాజ్ చేస్తున్న పదేపదే అప్పీళ్లపై, ముందస్తు సంబరాలపై పలువురు ఆస్ట్రేలియన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.మాజీ కెప్టెన్ టేలర్ మాట్లాడుతూ భారత సీనియర్లే తమ పేసర్‌ను నియంత్రించాలన్నాడు. కొన్ని సందర్భాల్లో సిరాజ్ అప్పీల్ చేసి అంతటితో ఆగట్లేదు! అంపైర్ నిర్ణయం వెలువరించకపోయినా... తను మాత్రం వికెట్ తీసినట్లుగా సంబరాలు చేసుకోవడం కంగారూ క్రికెటర్లను అసహనానికి గురి చేస్తోంది. ‘సిరాజ్‌కు తోటి సీనియర్లే సర్దిచెప్పాలి. ఒక్క ట్రవిస్ హెడ్ అవుట్ విషయంలోనే కాదు... పదేపదే అతను అప్పీల్ చేయడం. అవుటయ్యాడా... నాటౌట్‌గా ఉన్నాడా అనే కనీస విచక్షణ కూడా మరిచి... అంపైర్ వేలు ఎత్తకపోయినా (నిర్ణయం) తను చేసుకునే పరిపక్వత లేని సంబరాలు చూసేందుకు ఏమాత్రం బాగోలేవు. ఇది ఆటకు కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం’ అని టేలర్ అన్నాడు. సిరాజ్ మంచి బౌలరని చెప్పుకొచ్చిన మాజీ కెపె్టన్ అతని ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘బౌలింగ్‌లో అతని ఉత్సాహం నన్ను ఆకట్టుకుంటుంది. తన పోటీతత్వాన్ని ఇష్టపడతాను. ఇరు జట్ల మధ్య మంచి సిరీస్ జరుగుతుంటే సిరాజ్ ఆటను కూడా గౌరవించాలి కదా. ఇదే విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా సహచరులు చెప్పాలి’ అని టేలర్ చెప్పాడు. మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ హెడ్ అవుటైనపుడు చేసిన సంజ్ఞల కంటే కూడా మితిమీరిన అప్పీళ్లకే రిఫరీ శిక్ష వేయాలని అన్నాడు.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసంమాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ మాట్లాడుతూ సిరాజ్‌కు ఆ క్షణంలో (హెడ్ అవుటైనపుడు) బుర్ర దొబ్బిందో ఏమో! లేకపోతే ఆ సమయంలో శ్రుతిమించిన సంబరాలెందుకు చేసుకుంటాడని అన్నాడు. సిరాజ్ చికాకు తెప్పించాడని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. -
సిరాజ్.. నీకు అసలు బుద్ది ఉందా..?
అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.సిరాజ్-హెడ్ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.హెడ్ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం. నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు" -
సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: జోష్ హాజిల్‌వుడ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టుతో ఆస్ట్రేలియా అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ విలన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ వాగ్వాదమే ఇందుకు కారణం.ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ చూపించిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురిచేసింది. హెడ్ కంటే ముందు మార్నస్ లబుషేన్ పట్ల కూడా ఈ హైదరాబాదీ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ సైతం సిరాజ్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగానే అడిలైడ్ ప్రేక్షకులు సిరాజ్‌ను స్లెడ్జ్ చేశారు. సిరాజ్ తీరును సునీల్ గవాస్కర్ వంటి భారత దిగ్గజాలు కూడా తప్పుబట్టారు. ఆఖరికి ఐసీసీ కూడా అతడికి షాక్ ఇచ్చింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోషల్ హాజిల్‌వుడ్ ప్రశంసించడం గమనార్హం. అతడు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. కాగా సిరాజ్-హాజిల్‌వుడ్ ఇద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడిన సంగతి తెలిసిందే."సిరాజ్ చాలా మంచివాడు. కానీ కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్యవహరిస్తాడు. సిరాజ్‌తో కలిసి ఆర్సీబీలో గడిపిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. విరాట్ కోహ్లిలా కూడా అతడిది దూకుడైన స్వభావం. చాలా ఉద్వేగభరితమైనవాడు.అతడు మైదానంలో ఉన్నంత సేపు తన స్వభావంతో అభిమానులను అలరిస్తాడు. సిరాజ్ గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అద్భతమైన బౌలింగ్ స్పెల్‌లు వేశాడు అని హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా హాజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. -
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
సిరాజ్, హెడ్లకు షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్లకు ఐసీసీ షాకిచ్చింది. భారత్-ఆసీస్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్‌లో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఐసీసీ వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. గత 24 నెలల్లో చేసిన మొదటి తప్పిదం కావడంతో సిరాజ్, హెడ్ నిషేధం బారి నుంచి తప్పించుకున్నారు. వీరిద్దరు తాము చేసిన తప్పిదాలను ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ విధించిన పెనాల్టీని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.కాగా, అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్న హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హెడ్.. సిరాజ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు ప్రతిగా సిరాజ్ కూడా నోటికి పని చెప్పాడు. సిరాజ్ ఒక అడుగు ముందుకేసి హెడ్‌ను పెవిలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. సిరాజ్, హెడ్ మ్యాచ్ ఫీజ్‌ల్లో 20 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ సాంక్షన్ చేసింది.ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో సిరాజ్, బుమ్రా పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో పేక మేడలా కూలింది. నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు మినహా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. అంతకుముందు తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. -
ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హెడ్‌ను అద్బుతమైన యార్కర్‌తో ఔట్ చేసిన అనంతరం సిరాజ్.. కాస్త దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.అందుకు హెడ్ సైతం ఏదో అంటూ కౌంటరిచ్చాడు. దీంతో సిరాజ్ మరింత సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తీరును చాలా మంది తప్పుబట్టారు. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ స్పందించాడు.హెడ్ మాట్లాడుతూ.. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అంతకుమించి ఏమి అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ సిరాజ్ మాత్రం తన మాటలను తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని, అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. అయితే తాజాగా హెడ్ వ్యాఖ్యలకు సిరాజ్ కౌంటరిచ్చాడు. హెడ్ అబద్దం చెబుతున్నాడని, నిజంగానే హెడ్ దుర్భాషలాడాడని సిరాజ్"ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత నేను నా స్టైల్లో సంబరాలు చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను అతడు దుర్భాషలాడాడు. ఇది లైవ్‌లో కూడా కన్పించింది. కావాలంటే ఇప్పుడు టీవీ రిప్లేలో కూడా చూడవచ్చు.నా సెలబ్రేషన్స్‌ను నేను చేసుకున్నా అంతే. అతడిని నేను ఏమి అనలేదు. విలేకరుల సమావేశంలో అతడు అబద్దం చెప్పాడు. అతడు నన్ను బాగా బౌలింగ్ చేశావని అనలేదు. మేము ప్రతీ ఒక్క ప్లేయర్‌ను గౌరవిస్తాము.ఎందుకంటే క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్‌గా భావిస్తాము కాబట్టి. ట్రావిస్ హెడ్ తీరు నాకు నచ్చలేదు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. -
సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.అద్భుతమైన యార్కర్‌తో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ను చేస్తున్న సిరాజ్‌ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు."సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్ -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్‌ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్‌తో హెడ్‌కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్‌కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్‌తో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్‌ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్‌కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్‌కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్
అడిలైడ్ వేదికగా భారత్‌తో మొదలైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 88 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరాడు.అసలేం జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్దమయ్యాడు. స్ట్రైక్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్ స్నేక్(ఖాళీ బీర్ ప్లాస్టిక్ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన లబుషేన్ ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వచ్చిన సిరాజ్ కూడా మధ్యలో ఆగిపోయాడు. అయితే సిరాజ్ తన బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపినప్పటికి.. ప్రత్యర్ధి బ్యాటర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సహానం కోల్పోయిన సిరాజ్ బంతిని లబుషేన్ వైపు త్రో చేశాడు. లబుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిని ఆసీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అతడి చర్యలను తప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g— cricket.com.au (@cricketcomau) December 6, 2024 -
అతడి వల్లే తొలి టెస్టులో రాణించా.. వాళ్లిద్దరు కూడా అండగా ఉన్నారు: సిరాజ్
పేలవ ఫామ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. పెర్త్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, తాను మునుపటి లయ అందుకోవడానికి కారణం పేస్ దళ నాయకుడు, ఆసీస్‌తో మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రానే అంటున్నాడు సిరాజ్. అప్పటికీ వికెట్లు లభించకపోతే‘నేను తరచుగా నా బౌలింగ్ గురించి బుమ్రాతో చర్చిస్తూనే ఉంటా. తొలి టెస్టుకు ముందు కూడా నా పరిస్థితి గురించి అతడికి వివరించా. బుమ్రా నాకు ఒకటే విషయం చెప్పాడు. ఎలాగైనా వికెట్ సాధించాలనే లక్ష్యంతో దాని గురించే అతిగా ప్రయత్నించవద్దు. నిలకడగా ఒకే చోట బంతులు వేస్తూ బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు లభించకపోతే నన్ను అడుగు అని బుమ్రా చెప్పాడు. అతడు చెప్పిన మాటలను పాటించా. వికెట్లు కూడా దక్కాయి’ అని సిరాజ్ తన సీనియర్ పేసర్ పాత్ర గురించి చెప్పాడు.మోర్నీ మోర్కెల్ కూడాఇక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా తనతో దాదాపు ఇవే మాటలు చెప్పి ప్రోత్సహించాడని కూడా సిరాజ్ పేర్కొన్నాడు. ఆరంభంలో సిరాజ్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అరుణ్‌ను సంప్రదించడం సిరాజ్‌కు అలవాటు.అరుణ్ సర్‌ను అడిగాఈ విషయం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలంగా నా బౌలింగ్ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అరుణ్ సర్‌ను అడిగా. ఆయన కూడా వికెట్లు తీయడంకంటే ఒక బౌలర్ తన బౌలింగ్‌ను ఆస్వాదించడం ఎంతో కీలకమో, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పారు’ అని వెల్లడించాడు.ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కే చెందిన దిలీప్‌తో కలిసి సాధన చేసిన విషయాన్ని కూడా సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు కోసం ‘పింక్ బాల్’తో సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు‘గులాబీ బంతి సింథటిక్ బంతి తరహాలో అనిపిస్తోంది. ఎరుపు బంతితో పోలిస్తే భిన్నంగా, గట్టి సీమ్‌తో ఉంది. నా దృష్టిలో ఈ బాల్‌తో షార్ట్ ఆఫ్ లెంగ్త్ తరహాలో బంతులు వేస్తే బాగుంటుంది.దీంతో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత పట్టు చిక్కుతుంది. అయితే లైట్లు ఉన్నప్పుడు ఎక్కువగా స్వింగ్ అవుతుందని విన్నా. నేను అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్‌లో అలాంటి వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తా’ అని సిరాజ్ వివరించాడు. కాగా స్వదేశంలో భారత జట్టు ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ బరిలోకి దిగాడు. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం కేవలం ఆరు వికెట్లే పడగొట్టగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాలో అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఇక భారత్- ఆసీస్ మధ్య డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
టీమిండియా స్టార్ సిరాజ్‌పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
సిరాజ్‌కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ సన్‌రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్‌కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. -
బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటకి బౌలర్లు మాత్రం అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు విల్లవిల్లాడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అత్యధికంగా జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్-లబుషేన్ డిష్యూం.. డిష్యూంఇక మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన సిరాజ్ మూడో బంతిని మార్నస్కు షార్ట్ బాల్‌గా సంధించాడు. అయితే ఆ బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడటానికి సదరు బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు కాకుండా తొడ ప్యాడ్ తాకి స్టంప్స్ దగ్గరలో పడింది. అయితే లబుషేన్ మాత్రం బంతిని చూడకుండా పరుగుకోసం ప్రయత్నించాడు. వెంటనే బంతి క్రీజు వద్దే ఉందని గమనించిన లబుషేన్ పరుగును ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఫాల్ త్రూలో వేగంగా క్రీజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేయాలనకున్నాడు. కానీ లబుషేన్ మాత్రం సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని తన బ్యాట్‌తో పక్కకు నెట్టాడు. అయితే లబుషేన్ బంతిని పక్కకు నెట్టేటప్పుడు క్రీజులో లేడు. దీంతో సదరు ఆసీస్ బ్యాటర్ అలా చేయడం సిరాజ్‌కు కోపం తెప్పించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి సిరాజ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతలోనే విరాట్ కోహ్లి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టాడు.కానీ లబుషేన్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కానీ కోహ్లి మాత్రం అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కావాలనే అలా చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది డీఎస్పీ బ్రో.. జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024 -
చెలరేగిన బుమ్రా.. రాణించిన రాణా, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతోటాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.పంత్, నితీశ్ రాణించగా..అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హర్షిత్ రాణాకు తొలి వికెట్మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు -
Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి. బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు. -
కాన్వే జాగ్రత్తగా ఉండు.. అతడు ఇప్పుడు డీఎస్పీ: గవాస్కర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజు(గురువారం) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 92 ఏళ్ల తమ టెస్టు క్రికెట్ హిస్టరీల భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా కివీస్ అదరగొడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.అతడొక డీఎస్పీ..కాగా రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు ఓపెనర్లు లాథమ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లాథమ్గా స్లోగా ఆడినప్పటకి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. కాన్వేను స్లెడ్జ్ చేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కాన్వే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని డెవాన్ డిఫెండ్ చేశాడు. వెంటనే సిరాజ్ కాన్వే వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అన్నాడు. కాన్వే మాత్రం సిరాజ్ మాటలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇప్పుడు డీఎస్పీ అన్న విషయం మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా? ఒక వేళ చేస్తే కచ్చితంగా నేను షాక్ అవుతాను" అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్ట్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY— John_Snow (@MrSnow1981) October 17, 2024 -
IND Vs NZ: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం
క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఉపయోగపడే పనులేవీ చేతకావా అంటూ మండిపడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు.. ఫీల్డింగ్‌లోనూ విఫలం కావడాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా రోహిత్ సేన న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.వర్షం కారణంగాఇందులో భాగంగా బెంగళూరు వేదికగా బుధవారం మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా గురువారం మొదలైంది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ కారణంగా 46 పరుగులకే ఆలౌట్ అయింది.పరుగుల ఖాతా తెరవకుండానేభారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ యువ పేసర్ విలియం రూర్కీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కేఎల్ రాహుల్.. అజాజ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈజీ క్యాచ్ మిస్ చేసిన రాహుల్ఇక ఇలా బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్ క్యాప్ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్ చేతిని తాకి మిస్ అయిన బాల్.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. రోహిత్ శర్మ ఆగ్రహంఈ క్రమంలో బౌలర్ సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనుకాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ‘‘అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: NZ vs IND 1st Test: రోహిత్ శర్మ తప్పు చేశాడా?You can't convince me that kl Rahul didn't drop this catch intentionally.Rohit Sharma is surrounded by snakes. 💔pic.twitter.com/ASh7qzHbBO— Vishu (@Ro_45stan) October 17, 2024 -
డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్
తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నియమితులైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు భారత జట్టుకు అందించిన సేవలకుగానూ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1(డీఎస్పీ) ఉద్యోగంతో పాటు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్ తాజాగా సిరాజ్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న మహ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సిరాజ్..డీజీపీని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఈ భారత స్టార్ బౌలర్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపున్నారు.Siraj is finally coming to arrest everyone who made his fake account. pic.twitter.com/zRCIWNc1A4— Silly Point (@FarziCricketer) October 12, 2024 ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మియా మళ్లీ బీజీ కానున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో సిరాజ్.. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్తో వంటి పేసర్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు.న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్ట్రావెలింగ్ రిజర్వ్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ Congratulations Mohammad Siraj for the post of DSP in Telangana State#MohammadSiraj #MohammedSiraj #Telangana pic.twitter.com/kfKtmebEkG— Rahul (@Rahul64590994) October 12, 2024 -
డీఎస్పీగా క్రికెటర్ సిరాజ్ బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందంలో సభ్యునిగా టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌కు గ్రూప్–1 ఆఫీసర్ పోస్టును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యమంత్రి ఇచి్చన హామీ మేరకు ఆయనను పోలీసు శాఖలో డీఎస్పీగా నియమించారు.శుక్రవారం ఆయన డీజీపీ జితేందర్‌కు రిపోర్ట్ చేసి, డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ పాల్గొన్నారు. తనను డీఎస్పీగా నియమించినందుకు ఈ సందర్భంగా సిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, ఐజీ ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్
టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ సిరాజ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రూప్-1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.30 ఏళ్ల సిరాజ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సిరాజ్ టీ20 వరల్డ్‌కప్-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో విశేషంగా రాణించాడు. సిరాజ్ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.సిరాజ్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్‌లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్ ఫార్మాట్ బౌలర్‌గా రాటుదేలాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్లో అతను 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి అభిమానులకు కనువిందు చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది.. 1-0తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ప్రస్తుతం కాన్పూర్‌లో రెండో మ్యాచ్ ఆడుతోంది.233 పరుగులకు బంగ్లా ఆలౌట్శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో గ్రీన్ పార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యపడగా.. రెండు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దై పోయింది. ఈ క్రమంలో సోమవారం వరణుడు కరుణించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ 74.2 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ సహచరులతో పాటు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లనూ ఆశ్చర్యపరిచింది. 50వ ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ బౌండరీకి తరలించాలనే యోచనతో షాట్ బాదినట్లు కనిపించింది. ఒక్క ఉదుటున పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ఈ క్రమంలో 30 యార్డ్ సర్కిల్ లోపలి ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న రోహిత్.. తన తల మీదుగా వెళ్తున్న బంతిని ఒక్క ఉదుటన పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో సిరాజ్‌తో పాటు లిటన్ దాస్, భారత ఫీల్డర్లు నమ్మలేమన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అలా లిటన్‌దాస్(13) రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు.చదవండి: పూరన్ సుడిగాలి శతకంHits blinks Out! ☝🏻🥳 #IndvBan #WhistlePodupic.twitter.com/A32vPxSlyP— Chennai Super Kings (@ChennaiIPL) September 30, 2024 -
IND vs BAN: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్‌దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.నిప్పులు చెరిగిన బుమ్రానాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024రోహిత్ సూపర్ క్యాచ్నాలుగో రోజు తొలి సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq— V. (@was_fairytale) September 30, 2024కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్‌ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్‌లుగా మలిచారు. షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్‌లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..? -
పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వికెట్ దక్కకపోవడానికి పరోక్ష కారణమైనందుకు ఫైర్ అయ్యాడు. అయితే, పొరపాటును తెలుసుకున్న పంత్ తనకు సారీ చెప్పడంతో సిరాజ్ శాంతించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.టీమిండియా 376 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ఇరు జట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 376 పరుగుల వద్ద ఆలౌట్ అయిన భారత్... తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) పాపం సిరాజ్నిజానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు మూడో వికెట్ కూడా దక్కేది. కానీ పంత్ కారణంగా మిస్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న జకీర్ హసన్.. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయినట్లు సిరాజ్ భావించాడు. దీంతో వికెట్ కోసం బిగ్గరగా అప్పీలు చేశాడు.రివ్యూ వద్దని చెప్పాడుఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను సంప్రదించగా... ‘‘బాల్ మరీ అంత హైట్‌కి రాలేదు. కానీ లెగ్ స్టంప్ మాత్రం మిస్సవుతోంది’’ అని బదులిచ్చాడు. దీంతో రివ్యూ తీసుకోవాలన్న సిరాజ్ అభ్యర్థనను రోహిత్ తిరస్కరించాడు. కానీ.. రీప్లేలో జకీర్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పంత్ చేయి పైకెత్తుతూ సారీ అన్నట్లుగా సైగ చేశాడు. అలా పంత్ చెప్పింది రోహిత్ విన్న కారణంగా సిరాజ్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.చదవండి: హెడ్ ఊచకోత.. పరుగుల విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు pic.twitter.com/bcyWefmJ7H— Nihari Korma (@NihariVsKorma) September 20, 2024 -
ఆ టీమిండియా బౌలర్‌తో పోటీ అంటే ఇష్టం: ఆసీస్ స్టార్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలర్లలో ఓ స్టార్ పేసర్‌తో తనకు అనుబంధం ఉందని.. అయితే, అదే సమయంలో ప్రత్యర్థిగా అతడితో పోటీ తనకు పూనకాలు తెప్పిస్తుందని తెలిపాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది నవంబరులో ఇరు జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి.టీమిండియాదే పైచేయిఇందులో భాగంగా ఆసీస్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లనుంది. ఇక ఈ టోర్నీలో గత నాలుగు దఫాలుగా భారత జట్టునే విజయం వరిస్తోంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ ఈవెంట్లో చివరగా రెండుసార్లు ఆసీస్‌లో, రెండుసార్లు సొంతగడ్డపై టీమిండియానే గెలిచింది.ఇప్పటి నుంచే హైప్ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ ఓవరాల్‌గా పదిసార్లు గెలవగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ప్రణాళికల గురించి వెల్లడిస్తున్నారు. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్.. టీమిండియాతో పోటీ గురించి చెబుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లతో తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు.మరోవైపు.. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కామెరాన్‌గ్రీన్ తదితరులు టీమిండియా భవిష్యత్తు సూపర్స్టార్ల గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు రానున్న కాలంలో టీమిండియాకు కీలకం కానున్నారని.. వారిని కట్టడి చేసేందుకు తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సిరాజ్‌తో పోటీ అంటే ఇష్టంతాజాగా ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు. సిరాజ్ కెరీర్ తొలినాళ్ల నుంచి అతడిని చూస్తున్నానని.. ఈ హైదరాబాదీ సరైన దిశలో తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రశంసించాడు. అక్కడే అరంగేట్రంఏదేమైనా టీమిండియా బౌలర్లలో సిరాజ్‌తో పోటీ అంటేనే తనకు మజా వస్తుందని లబుషేన్ తెలిపాడు. కాగా 2020 నాటి బోర్డర్- గావస్కర్ సందర్భంగానే సిరాజ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడిన సిరాజ్ ఖాతాలో వరుసగా 74, 71, 14 వికెట్లు ఉన్నాయి. మరోవైపు.. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లబుషేన్ 50 టెస్టుల్లో 4114 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. 52 వన్డేలు ఆడి 1656 రన్స్ సాధించడంతో పాటు 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ఇంగ్లండ్ కూడా అలాగే అనుకుంది: బంగ్లాకు రోహిత్ శర్మ వార్నింగ్ -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్‌మెంట్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
ఇప్పటికీ తప్పంతా ఆమెదేనా?: సిరాజ్ పోస్ట్ వైరల్
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పురుషాధిక్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి దురాగతాల్లోనూ మహిళలదే తప్పంటారేమో అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఈసారి ఏ సాకు తప్పించుకుంటారో చెప్పాలంటూ నిందితులకు వంతపాడేవాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘జార్ఖండ్: జంషెడ్‌పూర్‌లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డైవర్ లైంగిక దాడి. ‘బహుశా తనే ఇలా చేయమని అడిగిందేమో!’... రెండేళ్లుగా మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిని రాక్షసుడిగా అభివర్ణిస్తూ దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు.. అయినా, అపరిచితులతో ఫ్రెండ్లీగా ఉండవద్దని అమ్మాయిలకు చెబుతూనే ఉంటారు కదా!మద్యం మత్తులో పట్టపగలే వైజాగ్‌లో మహిళపై అత్యాచారం... ‘రాత్రుళ్లు బయటకు వెళ్లవద్దని.. అమ్మాయిలకు చెప్పినా వినరే!.. యాత్రకు వెళ్తున్న టీనేజర్‌పై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్... ‘అమ్మాయిలను బార్లు, క్లబ్బులకు వెళ్లవద్దని చెప్తూనే ఉన్నారు కదా! అయినా ఇదేంటో?!’..నన్‌పై లైంగికదాడి కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చారు.. ‘అసలు ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది?’.. యూపీలో అత్యాచారానికి గురై 85 ఏళ్ల వృద్ధురాలి మృతి.. ‘తాగి ఉన్నదా ఏంటి?’... కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య... పశ్చిమ బెంగాల్లో మిన్నంటిన నిరసనలు... ‘అసలు తను అలాంటి వృత్తి ఎందుకు ఎంచుకున్నట్లు?’...ఈసారి ఎలా తప్పించుకోబోతున్నారు? ఏం సాకులు వెదకబోతున్నారు? లేదంటే ఎప్పటిలాగే ఈసారీ ఆమెదే తప్పు.. మగాడు ఎల్లప్పుడూ మగాడే అంటారు కదా!?’’ అంటూ వివిధ ఘటనలకు సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆ ఘటనల నేపథ్యంలో నిందితులకు మద్దతునిచ్చే వారి మాటలు ఎలా ఉంటాయో చెబుతూ చెంప చెళ్లుమనేలా వేసిన సెటైర్లను సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.అత్యంత హేయమైన ఘటనకాగా కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. అత్యంత హేయమైన రీతిలో డాక్టర్‌పై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. దీంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా అట్టుడుకుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ విస్మయకర ఘటనపై సిరాజ్ శుక్రవారం ఈ మేర పోస్ట్ పెట్టాడు.ఇక శ్రీలంక పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఈ హైదరాబాదీ పేసర్..తదుపరి దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీతో బిజీ కానున్నాడు. టీమ్-బిలో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చదవండి: అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం -
ల్యాండ్ రోవర్ కారు కొన్న సిరాజ్
టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తనకెంతో ఇష్టమైన ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సిరాజ్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. కొత్త కారుతో సిరాజ్ ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ కారును తన కుటుంబం కోసం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దేవుడి ఆశీర్వాదంతో తన కలల కారును సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial)మీ కలలపై ఎలాంటి పరిమితులు ఉండవు. అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా కష్టపడి పని చేసేలా చేస్తాయి. నిలకడతో చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా కలల కారును కొనుగోలు చేసేలా చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడికి కృతజ్ఞతలు. నిన్ను నువ్వు నమ్ముకుంటే అనుకున్నది సాధించగలవు అంటూ సిరాజ్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా, సిరాజ్ అత్యంత పేద కుటుంబం నుంచి దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, సిరాజ్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన పరిమిత ఓవర్లలో సిరీస్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20, వన్డే సిరీస్‌లలో సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లలోనైనా సిరాజ్ ఫామ్‌ను అందుకోవాలని ఆశిద్దాం. -
క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయింపు
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్‌తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. సిరాజ్, నిఖత్ జరీన్, ఈషా సింగ్ వేర్వేరు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు. -
IND VS SL 2nd ODI: మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్‌పై (రిడ్లే జాకబ్స్)జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్‌పై (మాథ్యూ సింక్లెయిర్)జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!
కొలొంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆడనున్నప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల కళ్లు మాత్రం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్‌కు శ్రీలంకపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి పిచ్‌లపై సిరాజ్ చెలరేగిపోతాడు. ముఖ్యంగా కొలంబోలో సిరాజ్‌కు పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ చివరిగా ఆడిన మ్యాచ్‌లో (ఆసియా కప్ 2023 ఫైనల్లో) మియా నిప్పులు చెరిగాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరాజ్ శ్రీలంకతో ఇప్పటిదాకా ఆడిన 6 వన్డేల్లో 7.7 సగటున, 3.5 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారత అభిమానులు సిరాజ్ నుంచి మెరుపు ప్రదర్శనను ఆశిస్తున్నారు. సిరాజ్ కొలొంబోలో మరోసారి చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు.ఇదిలా ఉంటే, లంకతో ఇవాల్టి మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టీమిండియా.. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మాంచి జోష్‌లో ఉండగా.. లంకేయులు.. భారత్‌కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారగా.. శ్రీలంకను గాయాల బెడద వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికే దూరమయ్యారు.తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మొహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఆఫర్ చేసింది. సిరాజ్‌తో పాటు రెండు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 కేడర్‌లోని డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.కాగా, సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జరీన్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. జరీన్ ఇవాళ జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ బరి నుంచి నిష్క్రమించింది. ఓటమి అనంతరం జరీన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైంది -
సిరాజ్ కు బంపర్ ఆఫర్.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
శ్రీలంకతో రెండో టీ20.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరికి రెస్ట్?
శ్రీలంకతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. 24 గంటలు తిరగకముందే మరో మ్యాచ్‌కు భారత్ సిద్దమైంది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. లంక మాత్రం ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.అయితే సెకెండ్ టీ20లో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో గాయపడిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రెండో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిటర్న్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బిష్ణోయ్ ముఖానికి గాయమైంది. రక్తం రావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.ఆ తర్వాత తన బౌలింగ్‌ను బిష్ణోయ్ కంటిన్యూ చేశాడు. కానీ ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు మహ్మద్ సిరాజ్‌ను కూడా ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో పేసర్ ఖాలీల్ ఆహ్మద్ జట్టులో రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ మధుషంక స్ధానంలో ఆల్‌రౌండర్ చమిందు విక్రమసింఘేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు లంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.తుది జట్లు(అంచనా)భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఖాలీల్ ఆహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే -
Ind vs SL: సిరాజ్‌కు గాయం?.. యువ పేసర్‌కు ఛాన్స్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు శ్రీలంకతో మొదటి టీ20కి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే యువ పేసర్లతోనే భారత జట్టు బరిలో దిగాల్సి వస్తుంది.మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడే నిమిత్తం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య జూలై 27న తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా చెమడోస్తున్నాయి.ఈ క్రమంలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి కుడికాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. నొప్పితో సిరాజ్ విలవిల్లాడగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో తొలి టీ20కి అతడు అందుబాటులో ఉండే అంశంపై సందిగ్దం నెలకొంది. కాగా శ్రీలంక టూర్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండగా.. టీమిండియా పేస్ దళాన్ని ముందుకు నడిపించే బాధ్యత సిరాజ్‌పై పడింది. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగంలో టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.ఒకవేళ సిరాజ్ గనుక గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైతే అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ గాయం మానక టీ20, వన్డే సిరీస్‌ల నుంచి సిరాజ్ తప్పుకొంటే ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి రావచ్చు. లేదంటే.. వన్డే జట్టులో ఉన్న హర్షిత్ రాణాను సిరాజ్ స్థానంలో ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది యువ భారత్.అనంతరం పూర్తిస్థాయి జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంంది. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. మరోవైపు.. శ్రీలంక కొత్త కెప్టెన్‌గా చరిత్ అసలంక నియమితుడు కాగా.. సనత్ జయసూర్య ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. -
సిరాజ్‌కు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
రేవంత్ రెడ్డికి మహ్మద్ సిరాజ్ గిఫ్ట్
-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
టీమిండియా స్టార్ బౌలర్, టీ20 ప్రపంచకప్-2024 విజేత మహ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సిరాజ్‌ను అభినందించారు. వరల్డ్‌కప్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా.. శాలువా కప్పి, పుష్ఫ గుచ్ఛం అందించి.. నందిని సిరాజ్‌కు బహూకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచకప్ పతకాన్ని సిరాజ్ మియాన్ మెడలో వేసి ప్రశంసించారు.అనంతరం సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డికి తన టీమిండియా జెర్సీని బహూకరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది రోహిత్ సేన.ఇక టోర్నీలో సిరాజ్ ఒకే ఒక్క వికెట్ తీసినప్పటికీ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. అయితే, ఫైనల్లో తుదిజట్టులో మాత్రం ఈ హైదరాబాదీ పేసర్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇదిలా ఉంటే.. ఐసీసీ టైటిల్ గెలిచిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లతో కలిసి సిరాజ్ ప్రధాన మంత్రి ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రాగా నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. -
Mohammed Siraj: నాన్నను మిస్ అవుతున్నా..
ప్రధానితో భేటీ మర్చిపోలేని అనుభూతి సూర్యకుమార్ క్యాచ్ అద్భుతం.. ఇండియా గెలుస్తుందని అప్పుడే అనుకున్నాం నీలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం.. ఫస్ట్‌లాన్సర్ ఈద్గా గ్రౌండ్‌లోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నా ‘సాక్షి’తో ప్రపంచకప్ విజేత టీం సభ్యుడు మహ్మద్ సిరాజ్క్రికెట్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ గెలిచిన సంతోషం అంతా ఇంతా కాదు. 17 ఏండ్ల తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేసిన గెలుపు అది. విశ్వవిజేతగా నిలిచి గెలిచిన భారతీయ జట్టు ముంబై వీధుల్లోకి రాగానే జయజయ ధ్వానాలతో.. ఇసుకేస్తే రాలనంత జనం వారికి నీరాజనం పట్టారు. పక్కనే ఉన్న సముద్రం కూడా చిన్నబోయేలా జనసంద్రం వారికి అడుగడుగునా ఘన స్వాగతం పలికింది. అదే జట్టులో భాగస్వామ్యమైన మన హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్.. ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు. ‘ఇండియా.. ఇండియా.. లవ్ యూ సిరాజ్ భాయ్’అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. అభిమానులు పాట పాడుతుంటే వారితో సిరాజ్ గొంతు కలిపాడు. 140 కోట్ల మంది ఆశల పల్లకి మోస్తూ.. కదనరంగం లాంటి క్రికెట్లో నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రారాజు.. మియాన్ భాయ్.. మన సిరాజ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.ప్రపంచ కప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ప్రపంచకప్ జట్టులో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాకపోతే ఇంత సంతోషంలో నాన్న లేకపోవడం చాలా బాధగా ఉంది. నాన్నను చాలా మిస్ అవుతున్నా. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది కదా..? గెలుస్తామని అనుకున్నారా? ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. సూర్యకుమార్ క్యాచ్ పట్టి డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేయడం ఓ మరపురాని జ్ఞాపకం. భారత జట్టు కప్ గెలుస్తుందని అప్పుడే అనుకున్నాం. చివరకు ప్రపంచకప్ విజేతలుగా నిలిచాం. హైదరాబాద్ గురించి.. హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. మాసబ్‌ట్యాంకులోని ఫస్ట్ లాన్సర్లోనే పెరిగాను. నీలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం. ర్యాలీని ఈద్గా వరకు ఎందుకు కొనసాగించారు? ఫస్ట్ లాన్సర్‌లోని ఈద్గా మైదానం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నా. అందుకే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీని ఈద్గా మైదానం వరకు కొనసాగించాం. జట్టులో ఇష్టమైన ఆటగాళ్లు ఎవరు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరూ నన్ను వెన్నంటి ప్రోత్సహించారు. వాళ్లు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన.. మా ఇంటికి వస్తారు. ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటి ప్రవేశానికి బెంగళూరు టీమ్ మా ఇంటికి వచ్చింది . అప్పుడు చాలా సంతోషం అనిపించింది. కోహ్లీ మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు.మోదీతో విందు గురించి..ప్రపంచకప్ గెలిచి ఇండియా వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయనతో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్.. అభిమానుల ఘన స్వాగతం
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సొంత గడ్డపై అడుగు పెట్టాడు. ఢిల్లీలో టీమిండియా విక్టరీ బస్ పరేడ్ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌కు అభిమానలు ఘనస్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ అతడికి జేజేలు పలికారు. సిరాజ్ మియాతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అనంతరం మహ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహిదీపట్నం నుంచి ఈద్గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీగా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా సిరాజ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా ఆపూర్వ స్వాగతం పలికింది. హైదరాబాద్.. వరల్డ్‌కప్ హీరో మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలకుతుందని ఎస్ఆర్హెచ్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్ నిలవడంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు. అమెరికా వేదికగా జరిగిన లీగ్ స్టేజి మ్యాచ్‌ల్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రాకతో మిగిలిన మ్యాచ్‌లకు సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. #WATCH | Cricket fans welcome Mohammed Siraj on his return to Hyderabad after winning the T20I Cricket World Cup pic.twitter.com/aEzskY51vG— ANI (@ANI) July 5, 2024 -
నేడు (జులై 5) హైదరాబాద్‌కు మొహమ్మద్ సిరాజ్.. భారీ రోడ్ షోతో ఘన స్వాగతం
టీ20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న లోకల్ బాయ్ మొహ్మమద్ సిరాజ్‌కు ఘన స్వాగతం లభించనుంది. సిరాజ్‌ను భారీ ఊరేగింపుతో ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్ పెరేడ్ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ విజయోత్సవ ర్యాలీలో భాగ్యనగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విక్టరీ ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని సిరాజ్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. సిరాజ్ విక్టరీ ర్యాలీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగనుంది.కాగా, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.17 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌తో తిరిగి రావడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్‌మెంట్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్‌లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.అఫ్గాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
T20 World Cup 2024: ఇరగదీస్తున్న సిరాజ్ మియా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా పేసర్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అతను రెండుసార్లు బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (ఆన్ ఫీల్డ్ అద్భుతమైన ప్రదర్శనతో పాటు క్లిష్టమైన క్యాచ్‌లు అందుకున్నందుకు ఇచ్చే అవార్డు) గెలుచుకున్నాడు. తొలుత ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అవార్డు గెలుచుకున్న సిరాజ్ మియా.. తాజాగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో మరో మారు బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆన్ ఫీల్డ్‌లో అద్బుతమైన ప్రదర్శనలకు గుర్తుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ అవార్డు బహుకరిస్తుంది.సిరాజ్ మొదటి సారి అవార్డు గెలుచుకున్నప్పుడు ఓ కుర్రాడు మెడల్‌ను బహుకరించగా.. రెండో సారి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మెడల్‌ను ప్రధానం చేశాడు. స్పెషలిస్ట్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిరాజ్ మెగా టోర్నీలో రెండు సార్లు బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Siraj won the best fielder of the match medal vs IRE. Siraj won the best fielder of the match medal vs USA. TAKE A BOW, MOHAMMED SIRAJ. 🫡 pic.twitter.com/SmoxRJRG57— Johns. (@CricCrazyJohns) June 13, 2024పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సిరాజ్ బ్యాటింగ్‌లోనూ చాలా ఉపయోగకరమైన పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ ఆఖర్లో సిరాజ్ చేసిన 7 పరుగులు టీమిండియా గెలుపుకు దోహదపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్-ఏలో టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది. భారత్.. గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌ను జూన్ 15న కెనడాతో ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు గ్రూప్-ఏలో మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్ టై కావడంతో పాకిస్తాన్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూప్‌లో పాక్ యూఎస్ఏ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. యూఎస్ఏ తదుపరి ఐర్లాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో గెలిచినా.. లేక ఆ మ్యాచ్ రద్దైనా ఆ జట్టే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. -
సిరాజ్ కంటే అతడే నయం: అనిల్ కుంబ్లే
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. అమెరికా వేదికగా గ్రూప్ దశలో మూడింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. సూపర్-8కు అర్హత సాధించింది.ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. బుధవారం నాటి పోరులో అమెరికాను ఓడించి తమ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక ఈ మూడు విజయాలలో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను కాదని.. తనతో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలుత ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రాణించిన రెండు వికెట్లతో రాణించిన అర్ష్‌దీప్ (2/35).. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు.నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, తాజాగా అమెరికాతో మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అర్ష్‌దీప్. నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా అమెరికాను 110 పరుగులకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇక గ్రూప్ దశ తర్వాత సూపర్-8 కోసం భారత జట్టు వెస్టిండీస్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే విండీస్ పిచ్‌లపై మ్యాచ్‌ల కోసం టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడని అభిప్రాయపడ్డాడు. తన బౌలింగ్‌లోని వైవిధ్యం కారణంగా మహ్మద్ సిరాజ్ కంటే అర్ష్‌దీప్ ఓ అడుగు ముందే ఉంటాడని కుంబ్లే పేర్కొన్నాడు.‘‘టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో తన సత్తా చూపించాడు. ఒకవేళ వెస్టిండీస్‌లో టీమిండియా కేవలం ఇద్దరు సీమర్లతో పాటు హార్దిక్ పాండ్యా(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)ను మాత్రమే తీసుకుంటే గనుక సిరాజ్ కంటే అర్ష్‌దీప్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుంది.ఈ లెఫ్టార్మ్ పేసర్ జట్టులో ఉంటే బౌలింగ్ విభాగంలో వైవిధ్యం ఉంటుంది. జట్టుకు అతడు అదనపు బలంగా మారతాడు’’ అని అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా భారత్ గ్రూప్ దశలో తదుపరి శనివారం కెనడాతో తలపడనుంది. -
సిరాజ్ మియా మ్యాజిక్.. కళ్లు చెదిరే క్యాచ్! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. గ్రూపు-ఎ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేన అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో 110 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటింది. 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకుముందు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.సిరాజ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో అమెరికా బ్యాటర్ నితీష్ కుమార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతిని నితీష్ కుమార్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫుల్ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు.కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో సిరాజ్ బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. అయినప్పటకి బంతిని మాత్రం జారవిడచలేదు. సిరాజ్ క్యాచ్ చూసిన ప్రతీఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Siraj took a stunner pic.twitter.com/kJYMmupOS5— mohsinali (@mohsinaliisb) June 12, 2024 -
Ind vs Pak: నేను చేసిన ఆ ఏడు పరుగులే కీలకం: సిరాజ్
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తాను చేసిన పరుగులు ఎంతో విలువైనవి అంటున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. లో స్కోరింగ్ మ్యాచ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసి తానూ జట్టు విజయంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నాడు.న్యూయార్క్ వేదికగా టీమిండియా ఆదివారం పాకిస్తాన్‌తో తలపడిన విషయం తెలిసిందే. బౌన్స్‌కు అనుకూలించిన నసావూ కౌంటీ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లంతా తిప్పలుపడ్డారు.ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ 42 పరుగులతో రాణించాడు.అతడి తర్వాతి స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ 20 రన్స్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 7, శివం దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0, అర్ష్‌దీప్ సింగ్ 9, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులు చేశారు.ఇక పదకొండో స్థానంలో వచ్చిన మహ్మద్ సిరాజ్ ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రన్స్ కూడా డబుల్స్((రెండుసార్లు పాక్ బౌలర్ల ఓవర్ త్రో))ద్వారా లభించినవే.అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి తడబాటుకు గురై 113 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో టీమిండియాను విజయం వరించింది.అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా(3/14)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరాజ్ దాయాదితో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 19 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహ్మద్ సిరాజ్.. కీలక సమయంలో బ్యాట్‌తో రాణించేందుకు కూడా తను నెట్స్‌లో తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి టెయిలెండర్ల పాత్రనే కీలకంగా మారుతుందని.. పాక్‌తో మ్యాచ్‌లో తాను సాధించిన ఏడు పరుగులు ఎంత ముఖ్యమైనవో తెలిసి వచ్చిందని పేర్కొన్నాడు.జట్టును గెలిపించే క్రమంలో కీలక సమయంలో రాణించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని హైదరాబాదీ స్టార్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలుసునని.. అయితే, ఒత్తిడి దరిచేయనీయకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.pic.twitter.com/MIWgJ4WWbZ— Saksham Nagar (@SAKSHAMNAGAR90) April 28, 2024 -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.<blockquote class="twitter-tweet"><p lang="zxx" dir="ltr"><a href="https://t.co/MIWgJ4WWbZ">pic.twitter.com/MIWgJ4WWbZ</a></p>&mdash; Saksham Nagar (@SAKSHAMNAGAR90) <a href="https://twitter.com/SAKSHAMNAGAR90/status/1784551354158969025?ref_src=twsrc%5Etfw">April 28, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
అతడు బాగా అలిసిపోయాడు.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇవ్వండి: భజ్జీ
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్‌ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. ముంబైతో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను భజ్జీ సూచించాడు. "మహ్మద్ సిరాజ్ మానసికంగా, ఫిజికల్‌గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సిరాజ్ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్మెంట్లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తాను. ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని మనకు తెలుసు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్. కచ్చితంగా ముంబైతో మ్యాచ్ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు.. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్‌కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు.. హైదరాబాద్‌కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్‌కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సిరాజ్‌ను ఉతికారేసిన ఇంగ్లండ్ ఓపెనర్.. రోహిత్ రియాక్షన్ వైరల్!
రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఓ వైపు అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతుంటే.. సిరాజ్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్ మియా ఏకంగా 43 పరుగులిచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే సిరాజ్‌కు చుక్కలు చూపించాడు. 7 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో క్రాలే వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటి సిరాజ్ భయ్యా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లండ్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. Crawley just Shaming Siraj like in T20 Mode.. Bazball Mode is on... 4️⃣4️⃣4️⃣6️⃣ To siraj...#BobbiAlthoff #bobbiAlthoffleak #INDvENG pic.twitter.com/wEtPPgpg3a — Muhammad Asim (@MrAsim_31) February 23, 2024 -
సిరాజ్ కళ్లు చెదిరే యార్కర్.. దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. పోప్, బెన్ ఫోక్స్, రెహన్ అహ్మద్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా రెహాన్ అహ్మద్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అహ్మద్‌ను అద్బుతమైన యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 70వ ఓవర్లో ఐదో బంతిని యార్కర్‌గా సంధించాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన యార్కర్‌కు అహ్మద్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అహ్మద్ బ్యాట్‌తో అడ్డుకునే లోపే బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటు వేసింది. ఇది చూసిన అహ్మద్‌కు దెబ్బకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 319 పరుగుల వద్ద ముగించింది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
లంచ్ తర్వాత పూనకం... 29 పరుగుల వ్యవధిలోనే ఖేల్ ఖతం!
India vs England, 3rd Test Day 3: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు మూడో రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయం తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-1తో సమంగా ఉన్న టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి.. టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. #TeamIndia snag wickets for dessert 🍰 right after Lunch! 👌#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/AsabZXcy6S — JioCinema (@JioCinema) February 17, 2024 ఈ క్రమంలో శనివారం ఆట ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విజయవంతమయ్యారు. దెబ్బకు తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ లంచ్‌కు ముందు 290/5 స్కోరు వద్ద నిలిచింది. అయితే, భోజనం చేసి మళ్లీ మైదానంలో దిగిన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుస విరామాల్లో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు, జడేజా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో రోజు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అశ్విన్ లేకుండానే పది మంది యాక్టివ్ (బౌలింగ్, బ్యాటింగ్) ప్లేయర్లతో టీమిండియా బరిలోకి దిగింది. మూడో రోజు ఇంగ్లండ్ వికెట్ల పతనం ఇలా.. ►39.5వ ఓవర్: బుమ్రా బౌలింగ్‌లో- యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి జో రూట్(18) అవుట్ ►40.4వ ఓవర్: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో- జానీ బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ(0). ►50.1వ ఓవర్: కుల్దీప్ బౌలింగ్‌లో సెంచరీ వీరుడు బెన్ డకెట్(151) ఇన్నింగ్స్‌కు తెర లంచ్ తర్వాత.. ►65: జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ అవుట్(41) ►65.1: సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బెన్ ఫోక్స్(13) ►69.5: సిరాజ్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6) ►70.2: జడేజా బౌలింగ్‌లో టామ్ హార్లే స్టంపౌట్(9) ►71.1: సిరాజ్ బౌలింగ్‌లో ఆండర్సన్ క్లీన్‌బౌల్డ్(1). తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
IND vs ENG: రెండో టెస్టులో సిరాజ్‌కు నో ఛాన్స్! కారణమిదే
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. వర్క్‌లోడ్ కారణంగా రెండో టెస్టుకు సిరాజ్‌కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడి స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చాడు. "వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టు నుంచి సిరాజ్‌ను జట్టు మేనెజ్మెంట్ రిలీజ్ చేసింది. ఇటీవలి కాలంలో అతడు నిర్విరామంగా క్రికెట్ ఆడుతుండడంతో విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్మెంట్ భావించింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టుకు సిరాజ్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడు. అదే విధంగా అవేష్ ఖాన్ తిరిగి జట్టుతో కలిశాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సిరాజ్ విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఇక వైజాగ్ టెస్టుతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే విధంగా కుల్దీప్ యాదవ్ ఛానాళ్ల తర్వాత టెస్టు క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ చదవండి: IND vs ENG: ఏంటి రోహిత్ ఇది..? యువ స్పిన్నర్ ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్! వీడియో వైరల్ -
Ind vs Eng: ‘సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో..’
India vs England, 2nd Test - Visakhapatnam: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశాఖపట్నం మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ ముగ్గురూ రాణించారు ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆకట్టుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ నైపుణ్యాలతో సత్తా చాటాడు. వీరితో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం రాణించాడు. మొత్తంగా అశూ ఆరు వికెట్లు తీయగా.. జడేజా 89 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ 61 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లోకల్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు మొదటి టెస్టులో కేవలం పదకొండు ఓవర్లు బౌల్ చేసిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. రెండో టెస్టులో సిరాజ్ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు.. ‘‘జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే సరిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండో టెస్టుకు టీమిండియా సన్నద్ధం కావడంలో నేను మరో కోణంలో ఆలోచిస్తున్నా. జట్టులో అవసరమా? టెస్టు మొత్తంలో సిరాజ్‌ను కేవలం ఏడెనిమిది ఓవర్ల పాటే బౌలింగ్ చేయించాలనుకుంటే జట్టులో ఉంచడం ఎందుకు? తుదిజట్టులో కుల్దీప్ యాదవ్ కంటే అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం అతడి బ్యాటింగ్ స్కిల్స్ అని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు. మరి సిరాజ్ సేవలను ఉపయోగించుకోనపుడు అతడి స్థానంలో ప్యూర్ బ్యాటర్‌ను తీసుకోవాలి. అదనపు బ్యాటర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అనవసరంగా ఎవరూ జట్టులో ఉన్నారన్న భావన కలగదు’’ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. నిజానికి వాళ్లు(బుమ్రా, సిరాజ్) మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువస్తారని భావించాం’’ అంటూ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే! తాడోపేడో తేల్చుకో.. -
కోహ్లి నామస్మరణతో మార్మోగుతున్న ఉప్పల్ స్టేడియం
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు రెండో సెషన్ (32.5 ఓవర్లు) సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 121/4గా ఉంది. జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35), ఓలీ పోప్ (1), జానీ బెయిర్‌స్టో (37) ఔట్ కాగా.. జో రూట్ (26), బెన్ స్టోక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, రవి జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Hyderabad crowd cheering "Kohli, Kohli, Kohli". 🐐 - Fans are missing Kohli in the first Test. pic.twitter.com/WFcdR6OxOQ — Johns. (@CricCrazyJohns) January 25, 2024 కాగా, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోయినా అతని నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోతుంది. తమ ఆరాధ్య క్రికెటర్‌ను స్మరించుకుంటూ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా యువత అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. కోహ్లి ఫోటోలను పట్టుకుని ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో స్టేడియంలో జనాలు పలచగా కనిపించినా.. అక్కడున్న వారు మాత్రం కోహ్లి పేరును జపిస్తూ మ్యాచ్‌ను చూస్తున్నారు. ఓ పక్క భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. లోకల్ బాయ్ సిరాజ్ అద్బుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. కోహ్లికి అచ్చొచ్చిన ఉప్పల్.. డబుల్‌తో చెలరేగిన రన్ మెషీన్ 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్‌లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
బజ్‌బాల్ ఆడితే మాకే మంచిది.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఖతం చేస్తాం: సిరాజ్
భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ అయితే మ్యాచ్‌కు ఒక రోజే ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్ జట్టు కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు తుది జట్టులో ఇంగ్లండ్ మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్‌బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్‌బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్‌గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. -
హిందీలో మాట్లాడిన సిరాజ్.. ట్రాన్స్‌లేటర్‌గా మారిన బుమ్రా! వీడియో వైరల్
మహ్మద్ సిరాజ్.. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో అదరగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్ కీలకమైన మార్క్రమ్ వికెట్ పడగొట్టాడు. ఓవరాల్‌గా 7 వికెట్లు సాధించిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సిరాజ్‌కు ట్రాన్స్‌లేటర్‌గా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే బుమ్రా ఆంగ్లంలోకి అనువాదించాడు. సిరాజ్ మాట్లడుతూ.. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సలహాల వల్లే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని చెప్పుకొచ్చాడు. 'బుమ్రా బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత పిచ్ ఎలా ఉందో నాకు తెలియజేశాడు. ఇటువంటి వికెట్‌పై ఏ లెంగ్త్‌తో బౌలింగ్ వేయాలన్నది నాకు సలహా ఇచ్చాడు. అందుకు తగ్గట్టు నా లెంగ్త్‌ను సెట్ చేసుకున్నాను. నేను మరి ఎక్కువగా ఆలోచించలేదు. ఒకే లెంగ్త్‌లో స్ధిరంగా బౌలింగ్ చేస్తే చాలు వికెట్లు పొందవచ్చు అని భావించాను. మరో ఎండ్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తుంటే.. అతడితో కలిసి స్పెల్‌ను పంచుకోవడం చాలా బాగుంటుందని" సిరాజ్ పేర్కొన్నాడు. దీన్ని బుమ్రా ఇంగ్లీష్‌లోకి ట్రాన్సెలెట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: 'టైమ్ వేస్ట్'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు Siraj praised Bumrah during the presentation in his answer in Hindi and gave him credit. Bumrah of course edited that part out in the English translation. Of course. — Vishal Misra (@vishalmisra) January 4, 2024 -
T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!?
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త! ఈ మేటి బ్యాటర్లు ఇద్దరూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ‘విరాహిత్’ ద్వయం అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పలు సందర్భాల్లో సారథులుగా జట్టును ముందుండి నడిపించారు. అదే విధంగా.. రోహిత్- కోహ్లి ఏడాదికి పైగా టీ20ల సెలక్షన్‌కు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. పలు మ్యాచ్‌లలో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి లేకుండా పాండ్యా కెప్టెన్సీలోని యువ జట్టుతోనే టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ఆడనుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల కారణంగా ఆటకు దూరం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వరల్డ్‌కప్‌నకు ముందు కేవలం అఫ్గనిస్తాన్‌తో సిరీస్ మాత్రమే మిగిలి ఉండటం.. సదరు సిరీస్‌కు పాండ్యా, సూర్య అందుబాటులోకి రాకుంటే కెప్టెన్ ఎవరన్న ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీ20 రీఎంట్రీ గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరు అఫ్గన్‌తో సిరీస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజే ముగిసిపోవడంతో ‘విరాహిత్’ ద్వయానికి కాస్త విశ్రాంతి కూడా లభించడం సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును శుక్రవారమే ఫైనల్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ఆడటం దాదాపుగా ఖాయమైపోగా.. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు మాత్రం మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. అయితే, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. ఏడాది కాలంగా టీమిండియా తరఫున టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ద్వారా రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్లో టచ్‌లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్-2024 కంటే ముందు వాళ్లిద్దరు ఐపీఎల్-2024లో భాగం కానున్నారు. చదవండి: Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు.. భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు -
Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు: భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు
Ind Vs SA 2nd Test- Records List: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సంచలన విజయంతో కొత్త ఏడాదిని ప్రారంభించింది టీమిండియా. అంతేకాదు కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన ఆసియా తొలి జట్టుగానూ చరిత్ర సృష్టించింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు మూడు రోజుల్లో ముగిస్తే.. పర్యాటక భారత జట్టు రెండో టెస్టును ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరకపోయినా.. 1-1తో డ్రాగా ముగించి సౌతాఫ్రికాతో ట్రోఫీని పంచుకుంది. తొలి భారతీయ క్రికెటర్‌గా బుమ్రా ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సౌతాఫ్రికా స్టార్ డీన్ ఎల్గర్‌తో కలిసి జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తద్వారా.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. సఫారీ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు. సఫారీ గడ్డపై బుమ్రా- సిరాజ్ జోడీ చరిత్ర.. ఇక పేసర్ల అద్భుత బౌలింగ్ కారణంగానే టీమిండియా కేప్‌టౌన్‌లో విజయఢంకా మోగించిందన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగి 55 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్, బుమ్రా సౌతాఫ్రికాలో అరుదైన రికార్డు సృష్టించారు. సఫారీ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు (సిరాజ్, బుమ్రా) రెండు ఇన్నింగ్స్‌లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో ఓవరాల్‌గా రెండోసారి మాత్రమే. 2014లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భువనేశ్వర్ కుమార్ (తొలి ఇన్నింగ్స్‌లో 6/82), ఇషాంత్ శర్మ (రెండో ఇన్నింగ్స్‌లో 7/74) తొలిసారి ఈ ఘనత సాధించారు. సౌతాఫ్రికాపై టీమిండియా విజయం నేపథ్యంలో నమోదైన మరిన్ని రికార్డులు ఇవే ►642: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో ఫలితం రావడానికి వచ్చిన బంతులు (107 ఓవర్లు). తక్కువ బంతుల పరంగా, ఓవర్ల పరంగా టెస్టు క్రికెట్లో ఫలితం వచ్చిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డు పుస్తకాల్లో ఎక్కింది. 1932లో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్‌లో 656 బంతుల్లో ఫలితం వచ్చింది. ఇది మూడోసారి మాత్రమే ►3: రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత జట్టు నెగ్గడం ఇది మూడోసారి. గతంలో భారత జట్టు అఫ్గానిస్తాన్‌పై (బెంగళూరులో–2018), ఇంగ్లండ్‌పై (అహ్మదాబాద్‌లో–2021) ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 25 టెస్టుల్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. ►1: కేప్‌టౌన్‌లో భారత జట్టు టెస్టులో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఈ వేదికపై భారత్ ఆరు టెస్టులు ఆడి రెండింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగింటిలో ఓడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసి టెస్టులో గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ భారత్ నెగ్గిన నాలుగు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ►5: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య (జోహనెస్‌బర్గ్‌లో–2, డర్బన్‌లో–1, సెంచూరియన్‌లో–1, కేప్‌టౌన్‌లో–1). దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మొత్తం 25 టెస్టుల ఆడగా ... ఐదు టెస్టుల్లో విజయం సాధించింది. 13 టెస్టుల్లో ఓడిపోయింది. ఏడింటిని ‘డ్రా’ చేసుకుంది. నాలుగో కెప్టెన్‌గా రోహిత్ శర్మ ►4: రాహుల్ ద్రవిడ్ (2006), ధోని (2010), కోహ్లి (2018, 2021) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టుకు టెస్టులో విజయాన్ని అందించిన నాలుగో కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ►2: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ‘డ్రా’గా ముగించడం భారత జట్టుకిది రెండోసారి. ధోని సారథ్యంలో 2010–2011లో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1–1తో సమంగా ముగించింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1–1తో ‘డ్రా’గా ముగించింది. ►4: కేప్‌టౌన్‌లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చిన టెస్టులు. 1889, 1896లో దక్షిణాఫ్రికా–ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్టులు... 2005లో దక్షిణాఫ్రికా–జింబాబ్వే జట్ల మధ్య ఒక టెస్టు రెండు రోజుల్లోనే ముగిశాయి. చదవండి: కంగ్రాట్స్ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా -
చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు
తగ్గేదేలే... సినిమా డైలాగ్‌లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ ‘భారత్ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్‌టౌన్‌లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కేప్‌టౌన్: క్రికెట్‌నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్ ఇచ్చే గిఫ్ట్‌ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టి20 సిరీస్‌తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్‌లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది. అలా మొదలై... ఇలా కుదేలైంది! తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్... రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్రమ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ హైలైట్ కాగా... తొలి ఇన్నింగ్స్‌ను సిరాజ్ కూల్చితే... రెండో ఇన్నింగ్స్‌లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత్ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. ఒకడి పోరాటం... మరొకడి పేస్ ప్రతాపం టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్‌లు... 15 సెషన్లు... 450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్) డబుల్ యాక్షన్ చేయాల్సిందే! అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్‌టౌన్‌లో మాత్రం పేస్ పదునుకు, భారత్ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్ జయభేరి మోగించింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ బ్యాటర్ మార్క్రమ్ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్హమ్ (11), కైల్ వెరిన్ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్ సంగతి, బుమ్రా పేస్ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్రమ్ ధనాధన్ బౌండరీలతో సెంచరీ సాధించాడు. కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్ (11), కేశవ్ మహరాజ్ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్రమ్ పోరాటానికి సిరాజ్ బౌలింగ్‌లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్‌లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్లో లక్ష్యఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్‌కాగా, కెపె్టన్ రోహిత్ (16 నాటౌట్; 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా ముగించారు. సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించగా... ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 106; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 11; వెరిన్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 9; జాన్సెన్ (సి అండ్ బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్ శర్మ (బి) ప్రసిధ్ కృష్ణ 2; బర్గర్ (నాటౌట్) 6; ఎన్గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్ 9–3–31–1, ముకేశ్ కుమార్ 10–2–56–2, ప్రసిధ్ కృష్ణ 4–1–27–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్టబ్స్ (బి) బర్గర్ 28; రోహిత్ శర్మ (నాటౌట్) 16; శుబ్‌మన్ గిల్ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్ (బి) జాన్సెన్ 12; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్: రబడ 6–0–33–1, బర్గర్ 4–0–29–1, జాన్సెన్ 2–0–15–1. -
Ind vs SA: రెండ్రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర
South Africa vs India, 2nd Test- India won by 7 wkts: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయఢంకా మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ గెలవాలనే సంకల్పంతో రోహిత్ సేన సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. బాక్సింగ్ డే టెస్టులో ఘోర పరాజయం ఈ క్రమంలో సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అనూహ్య రీతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ గెలవాలన్న ఆశలు అడియాసలు కాగా.. కనీసం డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చింది టీమిండియా. ఇలాంటి దశలో బుధవారం కేప్‌టౌన్‌లో రెండో టెస్టు ఆరంభించింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. సీమర్లకు స్వర్గధామంగా భావించే న్యూలాండ్స్ పిచ్ మీద తొలి రోజే సఫారీల ఆట కట్టించింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు కూల్చారు. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 తొలి రోజే ఆధిక్యంలోకి టీమిండియా ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(39), శుబ్‌మన్ గిల్(36), విరాట్ కోహ్లి(46) మెరుగైన ఇన్నింగ్స్ కారణంగా 153 పరుగులు చేయగలిగింది. తద్వారా 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓ చెత్త రికార్డు కూడా.. బుమ్రా ‘ఆరే’యడంతో అయితే, 153 పరుగుల వద్దే వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓ చెత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 63/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను బుమ్రా కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో ఐదు వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. సెంచరీ హీరో మార్క్రమ్ రూపంలో సిరాజ్ కీలక వికెట్ దక్కించుకోగా.. ముకేశ్ కుమార్‌కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. దీంతో 176 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి ఆసియా జట్టుగా చరిత్ర ఈ నేపథ్యంలో 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసుకోవడమే గాక.. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 28, శుబ్‌మన్ గిల్ 10, విరాట్ కోహ్లి 12 పరుగులు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 17, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: కేఎల్ రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్‌గా.. -
రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్‌గా..
Ind vs SA 2nd Test- Fastest Test hundreds for South Africa: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు.. కేప్‌టౌన్‌లో తొలి రోజే ఏకంగా 23 వికెట్లు.. భారత పేసర్ల ధాటికి తొలుత 55 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... ఆ తర్వాత టీమిండియా 153 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా బుధవారం నాటి మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 51 బంతులు ఎదుర్కొని 36 పరుగులు, ఐదో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ ఆరు బంతులు ఆడి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు దక్కించుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మళ్లీ బౌలింగ్‌కు దిగిన టీమిండియా పేసర్లలో ముకేశ్ కుమార్ రెండు, బుమ్రా ఒక వికెట్ తీశారు. తద్వారా పేసర్లకు న్యూలాండ్స్ పిచ్ స్వర్గధామం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. తొలి రోజే బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 23 వికెట్ల ప్రదర్శనకు వేదికైన ఇలాంటి అత్యంత కఠినమైన పిచ్‌పై సెంచరీని ఊహించగలమా!? అది కూడా అత్యంత వేగవంతమైన శతకం!! ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 రెండో రోజు ఆట సందర్భంగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్. గురువారం 63/3 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు.. బుమ్రా ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మార్క్రమ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. రాహుల్ జారవిడిచిన క్యాచ్ వల్ల సెంచరీ భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన అతడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో.. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేయడంతో లైఫ్ పొందాడు. ఈ క్రమంలో 99 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని మార్క్రమ్ చరిత్రకెక్కాడు. కేప్‌టౌన్ గడ్డపై తొలి సఫారీ బ్యాటర్‌గా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆరో బ్యాటర్‌గా మార్క్రమ్ నిలిచాడు. అదే విధంగా కేప్‌టౌన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్రొటిస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు చేసింది వీరే ►ఏబీ డివిలియర్స్(75 బంతుల్లో)- ఇండియా మీద- 2010 సెంచూరియన్ మ్యాచ్‌లో.. ►హషీం ఆమ్లా(87 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 2012 పెర్త్ మ్యాచ్‌లో.. ►డెనిస్ లిండ్సే(95 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 1966 జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో ►జాంటీ రోడ్స్(95 బంతుల్లో)- వెస్టిండీస్ మీద- 1999 సెంచూరియన్ మ్యాచ్‌లో ►షాన్ పొలాక్(95 బంతుల్లో)- శ్రీలంక మీద- 2001 సెంచూరియన్ మ్యాచ్‌లో ►ఐడెన్ మార్క్రమ్(99 బంతుల్లో)- ఇండియా మీద- 2024 కేప్‌టౌన్ మ్యాచ్‌లో.. ఇక మార్క్రమ్ 106 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత కగిసో రబడ(2), లుంగి ఎంగిడి(8) అవుట్ కావడంతో సౌతాఫ్రికా 176 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించి 78 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 79 పరుగులు చేయాలి. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం. KL Rahul dropped a regulation catch of Aiden Markram (73) #KLRahul #INDvsSA #SAvsIND pic.twitter.com/V0ACuF5puD — Outofaukaat (@outofaukaat) January 4, 2024 -
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే ఇలా: సిరాజ్
Ind vs SA 2nd Test- Siraj Comments: కేప్‌టౌన్ టెస్టులో తొలి రోజే ‘సిక్సర్’తో సంచలనం సృష్టించాడు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ముకేశ్ కుమార్‌తో కలిసి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. టెస్టుల్లో తొలిసారి తన అత్యుత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశాడు. కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తంగా తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(2), కెప్టెన్ డీన్ ఎల్గర్(4), టోనీ డీ జోర్జీ(2) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్న సిరాజ్ మియా.. డేవిడ్ బెడింగ్హాం(12), కైలీ వెరెనె(15), మార్కో జాన్సెన్(0)ల వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్(3), నండ్రీ బర్గర్(4)లను పెవిలియన్‌కు పంపగా.. ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3), కగిసో రబడ(5) వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ల దెబ్బకు 55 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య సౌతాఫ్రికా. ఆధిక్యంలో రోహిత్ సేన ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 153 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మళ్లీ బ్యాటింగ్‌కు దిగగా.. ఆట ముగిసే సరికి 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. అస్సలు ఊహించలేదు ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఆట ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మహ్మద్ సిరాజ్‌కు.. ‘‘ఒకేరోజు రెండుసార్లు బౌలింగ్ చేయాల్సి వస్తుందని ఊహించారా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలా జరగుతుందని మీరైనా ఊహించారా? లేదు కదా.. మేము కూడా అంతే. క్రికెట్లో ఇవన్నీ సహజమే. ఒకేరోజు మంచి, చెత్త ఇన్నింగ్స్ చూశారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన అత్యుత్తమ ప్రదర్శనలో సీనియర్ బుమ్రా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు కూడా భాగం ఉందని సిరాజ్ తెలిపాడు. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది ‘‘ఓవైపు సీనియర్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటే.. మరోవైపు వికెట్ కీపర్ సరైన లెంగ్త్ గురించి సలహాలు ఇస్తూ ఉంటే.. బౌలర్ పని మరింత సులువు అవుతుంది. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. మన బౌలింగ్‌లో బ్యాటర్ 4-5 బౌండరీలు బాదినపుడు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలన్న విషయంపై సీనియర్ల సలహాలు కచ్చితంగా పనిచేస్తాయి’’ అని బుమ్రా, రాహుల్‌లపై 29 ఏళ్ల సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఇక రెండో రోజు ఏం జరుగుతుందో ఊహించలేమన్న ఈ రైటార్మ్ పేసర్.. వీలైనంత తక్కువ స్కోరుకు సౌతాఫ్రికాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఆధిక్యంలోనే ఉంది కాబట్టి రెండో రోజు సానుకూల ఫలితం రాబట్టగలమనే నమ్మకం ఉందని సిరాజ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తొలిరోజే న్యూల్యాండ్స్ పిచ్ నుంచి ఇంత సహకారం లభిస్తుందని అనుకోలేదని, 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదన్నాడు. చదవండి: IND vs SA: బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా W W W W W W 🙌🏻 Wreaking 🔥 ft. Mohammed Siuuuraajjj! Watch all his 6️⃣ scalps 👆🏻 Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/t7bT3pCRLl — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
Ind Vs SA 2nd Test: సిరాజ్ 6తో మొదలై 23తో ముగిసె...
ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్ టాస్ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ మన బౌలింగ్ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్ ఖాతాలో చేరినట్లే! కేప్‌టౌన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్ మజాను పంచింది. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్ (39), శుబ్‌మన్ గిల్ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. టపటపా... మ్యాచ్‌కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్ తన రెండో ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ (0)ను అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. గత మ్యాచ్ స్టార్, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ (2) కూడా సిరాజ్ బంతికే బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్ (12), జాన్సెన్ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అదే వరుస... యశస్వి జైస్వాల్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించిన బర్గర్...శ్రేయస్ (0)ను కూడా అవుట్ చేశాడు. అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్‌ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్ ఆలౌట్ అయింది. స్కోరు వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2; ఎల్గర్ (బి) సిరాజ్ 4; జోర్జి (సి) రాహుల్ (బి) సిరాజ్ 2; స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3; బెడింగామ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12; వెరీన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15; జాన్సెన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3; రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5; బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్: బుమ్రా 8–1–25–2, సిరాజ్ 9–3–15–6, ప్రసిధ్ 4–1–10–0, ముకేశ్ 2.2–2–0–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బి) రబడ 0; రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39; గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) రబడ 46; శ్రేయస్ (సి) వెరీన్ (బి) బర్గర్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 8; జడేజా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; సిరాజ్ (రనౌట్) 0; ప్రసిధ్ (సి) మార్క్రమ్ (బి) రబడ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్: రబడ 11.5–2–38–3, ఎన్గిడి 6–1–30–3, బర్గర్ 8–2–42–3, జాన్సెన్ 9–2–29–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (నాటౌట్) 36; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగ్హామ్ (నాటౌట్) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45. బౌలింగ్: బుమ్రా 6–0–25–1, సిరాజ్ 5–2–11–0, ముకేశ్ 6–2–25–2. -
అప్పుడు సెంచరీ మిస్: టెస్టుల్లో కీలక మైలురాయి అందుకున్న గిల్
South Africa vs India, 2nd Test - Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత పేసర్లు కేప్‌టౌన్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పేసర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్ మీద నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలిసారిగా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే జైస్వాల్ అవుట్ అయితే, ప్రొటిస్ పేసర్ కగిసో రబడ.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరగగా.. అతడి స్థానంలో వచ్చిన శుబ్‌మన్ గిల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన హిట్‌మ్యాన్ కేప్‌టౌన్‌లో మాత్రం బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి 37 బంతుల్లో 38 పరుగులతో జోరుమీదున్నాడు. #RohitSharma is up & about! Three 4️⃣s to get going in this #TeamIndia innings. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/kuZAOIHJJH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 1000 పరుగులు పూర్తి చేసుకున్న గిల్ మరోవైపు.. అతడి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న వన్‌డౌన్ బ్యాటర్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నండ్రే బర్గర్ వేసిన నాలుగో బంతికి రెండు పరుగులు తీసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా తన టెస్టు కెరీర్లో 36వ ఇన్నింగ్స్‌లో ఘనత ఈ మైలురాయిని అందుకున్నాడు. మెల్బోర్న్లో 2020 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 45, 35 (నాటౌట్) పరుగులు చేశాడు గిల్. అప్పుడు సెంచరీ మిస్ అదే విధంగా మరో మ్యాచ్‌లో గాబా స్టేడియంలో 91 పరుగులు సాధించి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. అయితే, విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంద పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగిసే సరికి ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం! -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్‌కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్‌కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్‌ల్లో భారత్‌పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్‌లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్‌లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్‌టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్‌టౌన్‌లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్‌టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అన్‌స్టాపబుల్ సిరాజ్: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి
South Africa vs India, 2nd Test: కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్ మార్క్రమ్(2)ను అవుట్ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్.. అనంతరం కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో బిగ్ వికెట్ పడగొట్టాడు. కీలక వికెట్ కూల్చి.. పతనానికి నాంది పలికి గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్‌ను బౌల్డ్ చేశాడు. అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా సిరాజ్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్(4) షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు. Knocked ‘em overrrr! _ ‘ | | /#MohammedSiraj has every reason to celebrate, as he cleverly sets up #DeanElgar and gets the big fish! 💥 Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/EGX6XxZsSu — Star Sports (@StarSportsIndia) January 3, 2024 సిరాజ్ దెబ్బకు టాపార్డర్ కకావికలం దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు. ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. 15.2 ఓవర్ వద్ద డేవిడ్ బెడింగ్హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్‌టౌన్ టెస్టులో ఐదు వికెట్ హాల్ నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి 6 వికెట్ హాల్ అంతటితో సిరాజ్ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఇక సిరాజ్ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3)ను అవుట్ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్(4)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 23.2 ఓవర్ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్‌కు పంపి ముకేశ్ కుమార్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! Pacy wickets with bounce on offer! Pitches in #SouthAfrica pose a different challenge, but former #TeamIndia batting coach #SanjayBangar delivers a masterclass on how best to deal with this test. Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/FYPOC19Kfn — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
హృదయం ముక్కలైంది.. సిరాజ్ పోస్ట్ వైరల్! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్‌స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్‌పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హార్ట్‌బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్‌కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్ ఈ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్‌లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్‌గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ క్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్‌ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే: వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ అల్జారీ జోసెఫ్‌ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్‌ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. Did Siraj wake up and see his co-bowlers who ll be bowling at Chinnaswamy? pic.twitter.com/ZIDVVUvUD6 — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) December 21, 2023 Is there any secret message behind this? — King Kohli's Fan (@ViratFan100) December 21, 2023 Mohammed Siraj's Instagram story. pic.twitter.com/TSCqSCbshv — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 -
వరల్డ్‌కప్‌లో కుదరలేదు.. ఈసారి సిరాజ్‌దే! ట్విస్ట్ ఏంటంటే..
బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రదానం చేసే సంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టింది టీమిండియా శిక్షణా సిబ్బంది. అయితే, ఈసారి కాస్త పేరు మార్చి అమల్లోకి తెచ్చింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ వినూత్న సంప్రదాయానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లలో అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్‌రూంలో మెడల్ ఇవ్వడం ఆనవాయితీ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలుచుకోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఏకంగా రెండుసార్లు పతకం అందుకున్నాడు. ఇక వరల్డ్‌కప్ సందర్భంగా ఇలా పతకాలు ప్రదానం చేయడం ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని.. అందుకే ద్వైపాక్షిక సిరీస్‌ల సందర్భంగా కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు టి.దిలీప్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇకపై ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ పేరిట మెడల్ అందించనున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచే దీనిని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. టీ20 సిరీస్‌లో ఫీల్డింగ్ మెడల్ కోసం రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్, మహ్మద్ సిరాజ్ నామినేషన్లలో నిలవగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌నే పతకం వరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ తొలి మెడల్ అందుకున్న సిరాజ్.. ఒలింపియన్స్ మాదిరి దానిని పంటితో కొరుకుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. వరల్డ్‌కప్ ఈవెంట్ నుంచి ఈ పతకం సాధించాలని తాపత్రయపడ్డానని.. ఇప్పటికీ తన కోరిక తీరిందని హర్షం వ్యక్తం చేశాడు. పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పక ఫలితం లభిస్తుందనే మాట మరోసారి నిరూపితమైందని సిరాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు సిరాజ్. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో అద్భుతరీతిలో ప్రొటిస్ ఓపెనర్, రెండో టీ20 హీరో రీజా హెన్రిక్స్‌ను రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
సిరాజ్ బుల్లెట్ త్రో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సమమైంది. తొలి వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 దక్షిణాఫ్రికా, మూడో టీ20లో భారత్ గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఏమి జరిగిందంటే? ప్రోటీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రెండో బంతిని హెండ్రిక్స్ మిడ్-ఆన్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం హెండ్రిక్స్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్ పరిగెత్తాడు. అయితే మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెంటనే బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్స్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు. హెండ్రిక్స్ క్రీజుకు చేరిటప్పటికే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన ప్రోటీస్ బ్యాటర్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ వికెట్ సాధించికపోయినప్పటికీ తన బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండడం విశేషం. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు With outswingers and direct hits, @mdsirajofficial has not missed his target today 🎯 Tune-in to the 3rd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/6UTxXnN7Fs — Star Sports (@StarSportsIndia) December 14, 2023 -
Ind vs SA: అభిమానులకు బ్యాడ్ న్యూస్! రెండో టీ20 కూడా...
South Africa vs India, 2nd T20I: సౌతాఫ్రికా గడ్డపై పొట్టి ఫార్మాట్లో ఆధిపత్యం చాటేందుకు సిద్ధమైన టీమిండియాకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వర్షం కారణంగా తొలి టీ20 రద్దైన విషయం తెలిసిందే. డర్బన్‌లో టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీ వర్షం కురిసే అవకాశం ఈ క్రమంలో సెయింట్ జార్జ్ పార్కులో మంగళవారం జరగాల్సిన రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉన్నట్లు సమాచారం. రెండో టీ20కి వేదికైన పోర్ట్ ఎలిజబెత్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిటీ మొత్తం మేఘావృతమై ఉందని.. ఒక్కసారి వాన మొదలైతే తెరిపినిచ్చే అవకాశం కూడా లేదని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పోర్ట్ ఎలిజబెత్‌లో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు సమాచారం. జడ్డూ, గిల్, సిరాజ్ ఎంట్రీ ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా జట్టుతో చేరారు. వీరి రాకతో యువ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ గిల్ కారణంగా తుదిజట్టులో చోటు కోల్పోనున్నాడు. టీమిండియాదే పైచేయి ఇక టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు సఫారీల టీమిండియాదే పైచేయి. టీ20లలో భారత్- సౌతాఫ్రికా ఇరవై ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 13 సార్లు టీమిండియా గెలవగా... ప్రొటిస్ జట్టుకు పదిసార్లు విజయం దక్కింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. కాగా పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం రాత్రి గం.8:30 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది. టీవీలో ‘స్టార్ స్పోర్ట్స్–1’ చానెల్లో.. డిజిటల్ ప్లాట్ఫామ్లో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే, ఇదంతా వరణుడు కరుణిస్తేనేనండోయ్!! సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా రెండో టీ20 తుది జట్ల అంచనా: టీమిండియా: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. చదవండి: IPL 2024 Auction: కళ్లన్నీ అతడిపైనే.. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! భరత్‌తో పాటు.. Durban 🛫 Gqeberha 🛬#TeamIndia have arrived ahead of the 2nd T20I.#SAvIND pic.twitter.com/wjsP2vAq6U — BCCI (@BCCI) December 11, 2023 -
టాప్‌లోనే గిల్.. దూసుకొచ్చిన కోహ్లి, రోహిత్! సిరాజ్ వెనక్కి..
Top 5 of the ICC ODI Rankings for batters And Bowlers: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టాప్-3లోకి దూసుకొచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ టాప్ ర్యాంకును నిలుపుకొన్నాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్-5లో టీమిండియా బ్యాటర్ల సంఖ్య మూడుకు చేరింది. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 3 శతకాలు, 6 అర్ధ శతకాల సాయంతో 765 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గతంలో 1258 రోజుల పాటు నంబర్ 1లో కొనసాగిన ఈ పరుగుల యంత్రం సుదీర్ఘకాలం తర్వాత మరోసారి టాప్ ర్యాంకుకు చేరువకావడం విశేషం. భారీ జంప్ కొట్టిన హెడ్ ఇక రోహిత్ శర్మ సైతం.. 11 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి 597 పరుగులు చేశాడు. దీంతో మరిన్ని పాయింట్లు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ట్రవిస్ హెడ్ ఏకంగా 28 పాయింట్లు మెరుగుపరచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్‌ను వెనక్కి నెట్టిన హాజిల్‌వుడ్.. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కినెట్టి రెండో ర్యాంకు సాధించాడు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ ఎనిమిది స్థానాలు మెరుగుపరచుకుని 12, ప్యాట్ కమిన్స్ ఏడు స్థానాలు మెరుగుపరచుకుని 27వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇక మరో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 బ్యాటర్లు 1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 826 పాయింట్లు 2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 824 పాయింట్లు 3. విరాట్ కోహ్లి(ఇండియా)- 791 పాయింట్లు 4. రోహిత్ శర్మ(ఇండియా)- 769 పాయింట్లు 5. క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- 760 పాయింట్లు టాప్-5 బౌలర్లు 1. కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా)- 741 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 703 పాయింట్లు 3. మహ్మద్ సిరాజ్(ఇండియా)- 699 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 685 పాయింట్లు 5. ఆడం జంపా(ఆస్ట్రేలియా)- 675 పాయింట్లు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
మహ్మద్ సిరాజ్‌ను కలిసిన నిర్మలా సీతారామన్..
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సిరాజ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఈ సందర్భంగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టును సీతారామన్ అభినందించారు. అదే విధంగా ఆటలో గెలుపు ఓటములు సహజమని సిరాజ్‌ను ఓదార్చారు. కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో గత 12 ఏళ్ల నుంచి ఊరిస్తున్న వరల్డ్‌కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చదవండి: CWC Final: వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
నేను అప్పుడు కూడా నంబర్ వన్.. ప్రధాన లక్ష్యం మాత్రం అదే: సిరాజ్
Mohammed Siraj opens up on being No. 1 ranked ODI bowler: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాంకుల గురించి తను పట్టించుకోనని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. గతంలో రెండుసార్లు ‘టాప్’నకు చేరి ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయిన సిరాజ్ ఈ ప్రపంచకప్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో మళ్లీ నంబర్ వన్‌గా అవతరించాడు. మొత్తంగా 709 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిదిని వెనక్కి నెట్టి.. అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఐసీసీతో మాట్లాడుతూ.. తన ప్రధాన లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే.. గతంలో కూడా నేను నంబర్ 1గా ఉన్నాను.. ఆ తర్వాత ర్యాంకింగ్స్ విషయంలో ఎత్తుపళ్లాలు. కాబట్టి నంబర్లను నేను ఏమాత్రం పట్టించుకోను. నా ఏకైక లక్ష్యం టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంలో నా వంతు సహకారం అందించడమే. బౌలర్‌గా నా ప్రదర్శన వల్ల జట్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. తాజా ఎడిషన్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్ సేన లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. బెంగళూరు వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ప్రథమ స్థానంలో ఉండగా.. కుల్దీప్ యాదవ్ (4వ స్థానం), .జస్ప్రీత్ బుమ్రా (8వ స్థానం), మహ్మద్ షమీ (10వ స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. చదవండి: CWC 2023: టీమిండియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ జట్టులో కీలక మార్పు! కారణమిదే View this post on Instagram A post shared by ICC (@icc) -
మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపుతున్న సిరాజ్.. పాక్ స్పీడ్ స్టార్ షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టి నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సిరాజ్ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో మూడు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా ఓ కీలక వికెట్ సాధించాడు. కాగా హైదరాబాద్ స్టార్ సిరాజ్ నెం1 ర్యాంక్‌కు చేరుకోవడం ఇది మూడో సారి. ప్రస్తుతం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. అయితే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నెం1 స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: Ben Stokes: సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్.. వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిది -
బాబర్ ఆజమ్ ‘శకం’ ముగిసింది.. నయా నంబర్ వన్ శుభ్‌మన్ గిల్
రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్‌మన్ గిల్ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను ఎట్టకేలకు కిందికి దించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్.. బాబర్ కంటే ఆరు రేటింగ్ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సచిన్, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరిన భారత బ్యాటర్ గిలే కావడం విశేషం. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరల్డ్‌కప్‌లో ప్రదర్శనల కారణంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారీగా స్థానచలనాలు జరిగాయి. డికాక్ (మూడో స్థానం), శ్రేయస్ (18), ఫకర్ జమాన్ (11), ఇబ్రహీం జద్రాన్ (12) తమతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఏకంగా నలుగురు భారత బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో గిల్, కోహ్లితో పాటు రోహిత్ శర్మ (ఆరో స్థానం) కూడా ఉన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిది విజయాలు సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
‘డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ
ICC WC 2023- Ind Vs SL- KL Rahul- Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై అత్యద్భుత విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టింది టీమిండియా. సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ ఆరంభం నుంచే సమిష్టి కృషితో ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. ఇప్పటి వరకు ఏడింట ఏడు గెలిచింది. లీగ్ దశలో ఇప్పటి వరకు అజేయంగా నిలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ముంబైలోని వాంఖడేలో టీమిండియా పేసర్ల సంచలన ఆట తీరు అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ల విజృంభణ భారత జట్టు విధించిన 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఆదిలోనే షాకిచ్చాడు జస్ప్రీత్ బుమ్రా. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ పాతుమ్ నిసాంకను అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో మహ్మద్ సిరాజ్ కరుణరత్నెను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవరల్లో సమరవిక్రమను కూడా అవుట్ చేశాడు. బుమ్రా, సిరాజ్ ధాటికి మొదటి రెండు ఓవరల్లో 2 పరుగులు మాత్రమే చేసిన లంక మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్ మరొకటి, మహ్మద్ షమీ ఏకంగా ఐదు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీయడంతో 55 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో కాసేపు నిలవకపోడంతో 302 పరుగుల తేడాతో భారీ మూల్యమే చెల్లించింది. రాహుల్ ఆత్మవిశ్వాసంతో అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ల ప్రదర్శనతో పాటు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సైతం తన అద్భుతమైన నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో మూడో బంతికి దుష్మంత చమీర ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ ఒడిసిపట్టాడు. అయితే, అంపైర్ క్రిస్ బ్రౌన్ ఈ బంతిని తొలుత వైడ్‌గా ప్రకటించి నాటౌట్ ఇచ్చాడు. కానీ.. రాహుల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా అప్పీలు చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో బంతి చమీర బ్యాట్‌ను తాకడంతో పాటు రాహుల్ గ్లోవ్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని చమీరను అవుట్‌గా ప్రకటించాడు. ఇలా రాహుల్ తన డేగ కళ్లతో సునిశిత దృష్టితో అప్పీలు చేసిన విధానం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. అది మాత్రం తప్పని తేలింది అయితే, ఇదే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో రెండో ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమ విషయంలో రాహుల్ అప్పీలుకు వెళ్లగా ప్రతికూల ఫలితం వచ్చింది. బాల్ అవుట్‌సైడ్ ఎడ్జ్‌ను మిస్ అయినట్లు తేలడంతో సమరవిక్రమ బతికిపోయాడు. వాళ్లపై నమ్మకం ఉంది.. వాళ్లదే బాధ్యత ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ రివ్యూ సిస్టం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని నేను పూర్తిగా మా బౌలర్లు, కీపర్‌కే వదిలేశా. వాళ్లు డిసైడ్ అయిన తర్వాతే నాకు చెప్పమని చెప్పాను. వాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే, ఒక్కోసారి అంచనాలు నిజం కావొచ్చు.. మరొకసారి ప్రతికూల ఫలితం రావొచ్చు. ఈరోజు రివ్యూ విషయంలో మా నిర్ణయం ఒకటి కరెక్ట్ అయింది. మరొకటి తప్పని తేలింది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. అంత కోపమెందుకో? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: సంతోషంగా ఉంది.. మా విజయాలకు ప్రధాన కారణం అదే: షమీ
వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ రైట్ఆర్మ్ ఫాస్ట్‌బౌలర్ ఐదు వికెట్లతో మెరిశాడు. శ్రీలంక టాపార్డర్‌ను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కుదేలు చేస్తే.. మిడిలార్డర్ బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోకుండా వరుసగా వికెట్లు పడగొట్టాడు షమీ. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ వెటరన్ పేసర్ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్న షమీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మా(పేసర్లు) ప్రదర్శన ఈరోజు అత్యద్భుతంగా ఉంది. పరస్పర సహకారంతో.. ఒకరి ఆటను మరొకరం ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాం. అందుకే మా బౌలింగ్ విభాగం ఇలాంటి ఫలితాలు రాబట్టగలుగుతోంది. నేను ఎల్లప్పుడూ సరైన లెంగ్త్‌తో రిథమ్ మిస్ కాకుండా బంతిని విసిరేందుకు ప్రయత్నిస్తా. వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో బంతిని ఏ ఏరియాలో విసురుతున్నామన్నదే కీలకాంశంగా ఉంటుంది. అయితే, కొత్త బంతితో బరిలోకి దిగినపుడు పిచ్ నుంచి మనకు సహకారం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి’’ అని షమీ తన ఆట తీరును విశ్లేషించాడు. ఇక ముంబైలో మ్యాచ్ ఆడటం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు ఇక్కడి ప్రేక్షకులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. విదేశాల్లోనూ మాకు ఫ్యాన్స్ ఎల్లప్పుడూ మద్దతుగానే ఉంటారు’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. అదే విధంగా.. డ్రెస్సింగ్‌రూం వాతావరణం అద్భుతంగా ఉందనే విషయాన్ని నేను మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ మహ్మద్ షమీ సహచర ఆటగాళ్ల నుంచి తనకు సహకారం ఉందని పేర్కొన్నాడు. కాగా పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీ సంచలన ప్రదర్శనతో శ్రీలంకను టీమిండియా 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. తద్వారా వరుసగా ఏడో విజయం అందుకుని.. ఈ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ప్రపంచకప్ టోర్నీ లో భారత్ సెమీఫైనల్ దశకు అర్హత సాధించడం ఇది ఎనిమిదోసారి. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎనిమిదిసార్లు చొప్పున సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 : శ్రీలంకపై 302 పరుగులతో టీమిండియా ఘనవిజయం (ఫొటోలు)
-
చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! వారు మాత్రం: శ్రీలంక కెప్టెన్
WC 2023- Ind Vs SL- Kushal Mendis Comments: వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ ఆరంభంలోనే 3వికెట్లు పడగొట్టి లంకను చావు దెబ్బతీశాడు. వీరిద్దరితో పాటు బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. అంతర్జాతీయ వన్డేల్లో శ్రీలంకకు ఇది మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక ఓటమితో సెమీస్ రేసు నుంచి లంక దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక దారుణ ఓటమిపై మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ స్పందించాడు. ఈ ఓటమి తనను ఎంతో బాధించిందని మెండిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. నేను కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి అంత స్వింగ్ అవుతుందని అస్సలు నేను ఊహించలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని బౌలింగ్ ఎంచుకున్నాను. అదే విధంగా ఫస్ట్‌హాఫ్‌లో వికెట్ స్లోగా ఉండి బౌలర్లకు మంచిగా ఉంటుందని తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాను. అందుకు తగ్గట్టే మధుశంక మంచి ఆరంభం అందించాడు. అతడు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఫీల్డింగ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆరంభంలో కోహ్లి, గిల్‌కు అవకాశాలు ఇచ్చేశాం. అదే మా కొంపముంచింది. వారిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మా బౌలర్ల కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎదైమనప్పటికీ క్రెడిట్ మాత్రం టీమిండియాకే ఇవ్వాలనకుంటున్నారు. వారు మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించారు. మాకు ఇంకా ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మెండిస్ పేర్కొన్నాడు. కాగా లంకపై విజయంతో భారత్‌కు సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్‌కప్‌లోనే తొలి బౌలర్‌గా View this post on Instagram A post shared by ICC (@icc) -
అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్ శర్మ
ICC WC 2023- India Qualifies For Semis- Rohit Sharma Comments: వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ముంబై వేదికగా లీగ్ దశలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. తద్వారా ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఏడూ గెలిచి అజేయంగా నిలిచి ఈ ఘనత సాధించింది. సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తూ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో లంకపై భారీ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) జట్టు సమిష్టి కృషితోనే సాధ్యమైంది మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము ఇప్పుడు అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టాం. చెన్నై నుంచి మొదలుపెడితే ఇప్పటి దాకా.. మా జట్టు సమిష్టి కృషితో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోంది. మా లక్ష్యం అదే సెమీస్‌లో మేమే తొలుత అడుగుపెట్టాలన్న లక్ష్యం నెరవేరింది. ఫైనల్ విషయంలోనూ మా టార్గెట్ అదే. ఈ ఏడు మ్యాచ్‌లలో మా ప్రదర్శన అత్యద్భుతం. జట్టులోని ప్రతి ఆటగాడు తమ వంతు పాత్ర పోషించాడు. అంతా కలిసికట్టుగా ఇక్కడిదాకా చేరుకున్నాం. వాంఖడేలో ఇలాంటి పిచ్‌పై 350 పరుగులంటే మామూలు విషయం కాదు. అయ్యర్ అద్భుతం మా బ్యాటర్లు అద్భుతం చేశారు. మా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అయితే, ఈ రోజు శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తన నుంచి మేము ఎలాంటి ఇన్నింగ్స్ కోరుకున్నామో అదే చేసి చూపించాడు. ఈరోజు తను కొత్తగా కనిపించాడు. కొత్త బంతిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా సీమర్లు మొన్న ఇంగ్లండ్‌పై ఇప్పుడు శ్రీలంకపై.. ఎదురులేని విజయం సాధించారు’’ అంటూ బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సిరాజ్ సూపర్.. చెలరేగిన షమీ కాగా వాంఖడేలో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్‌మన్ గిల్(92), విరాట్ కోహ్లి (88), శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82 రన్స్) అద్భుతం గా రాణించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో రోహిత్ సేన 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంకను భారత పేసర్లు చిత్తు చిత్తు చేశారు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ అందించగా.. సిరాజ్ మూడు, మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో భారత బౌలర్ల దెబ్బకు 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయిన శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్‌కప్‌లోనే తొలి బౌలర్‌గా View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన సిరాజ్, షమీ.. సెమీస్‌లో టీమిండియా
ICC Cricket World Cup 2023 - India vs Sri Lanka: ఆసియా కప్-2023 ఫైనల్.. కొలంబోలో.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సృష్టించిన వికెట్ల విధ్వంసం గుర్తుండే ఉంటుంది. తన బౌలింగ్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి వారెవ్వా అనిపించాడు. అంతటితో మనోడి వికెట్ల దాహం తీరలేదు.. ఆ మరుసటి రెండో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అక్కడితో ఆగక.. తన పదునైన ఫాస్ట్ ఇన్‌స్వింగర్‌తో మరో వికెట్ కూడా కూల్చాడు. నాడు బుమ్రా లంక వికెట్ల పతనాన్ని ఆరంభిస్తే.. మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోకుండా చేశాడు సిరాజ్. తద్వారా టీమిండియాకు సంచలన విజయం అందించి.. ఆసియా వన్డే కప్ విజేతగా నిలిపాడు. ఇప్పుడు.. వన్డే వరల్డ్‌కప్-2023.. ఈసారి వేదిక ముంబై.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియం.. 2011 ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవం, 2023 ఆసియా కప్‌లో ఘోర అవమానానికి బదులు తీర్చుకోవాలని ఆరాటంతో శ్రీలంక.. అయ్యే పనేనా?! View this post on Instagram A post shared by ICC (@icc) అసలే సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీ.. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన.. అయినా లంకను తక్కువగా అంచనా వేయలేం... ఇదే టోర్నీలో ఢిల్లీలో సౌతాఫ్రికా విధించిన 429 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్బుత పోరాట పటిమ కనబరిచింది.. అయితే, కుశాల్ మెండిస్(76), చరిత్ అసలంక(79), దసున్ షనక(68) మిగతా వాళ్లు రాణించకపోవడంతో 102 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.. ఇక టీమిండియాతో మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు పేసర్ మధుషాంక అద్భుత ఆరంభం అందించాడు. భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను 4 పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. అయితే, లంక ఆనందం ఎంతో సేపు నిలవలేదు. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(92), విరాట్ కోహ్లి(88) శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇక, శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 82) వచ్చిన తర్వాత స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు తీసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలా గిల్, కోహ్లి, అయ్యర్ల విజృంభణతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి బంతికే షాకిచ్చాడు. లంక ఓపెనర్ పాతుమ్ నిసాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో ఓవర్ మొదటి బంతి నుంచి సిరాజ్ తన ఆట మొదలుపెట్టాడు. లంక ఓపెనర్ కరుణరత్నెను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి సమరవిక్రమను అవుట్ చేశాడు. దీంతో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా.. సిరాజ్ ఏమాత్రం కనికరం చూపలేదు. నాలుగో ఓవర్ తొలి బంతికి మెండిస్‌ను బౌల్డ్ చేశాడు. ఇలా ఐదు ఓవర్లలోపే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పదో ఓవర్ మూడో బంతికి మరో పేసర్ మహ్మద్ షమీ.. చరిత్ అసలంకను, నాలుగో బంతికి హేమంతను.. 12 వ ఓవర్ మూడో బంతికి దుష్మంత చమీరను పెవిలియన్‌కు పంపాడు. ఇక.. 14వ ఓవర్ తొలి బంతికి ఏంజెలో మాథ్యూస్‌ను షమీ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. దీంతో 14 ఓవర్లలో కేవలం 36 పరుగులు చేసిన శ్రీలంక ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 18వ ఓవర్లో లంక టెయిలెండర్ కసున్ రజిత రూపంలో ఐదో వికెట్ దక్కించుకున్న షమీ.. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక 19.4వ ఓవర్లో రవీంద్ర జడేజా మధుషాంక(5)ను అవుట్ చేసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో 50 పరుగులకు అవుటైన లంక ఈరోజు 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 302 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇప్పటి వరకు ఆడిన ఏడింట ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంది. -
అశ్విన్‌ను ఆడించి తప్పు చేయకండి! సిరాజ్ కూడా వద్దు.. ఎందుకంటే?
ICC WC 2023- Ind Vs Eng: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించి తప్పుచేయొద్దని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. లక్నో పిచ్‌ను పొరపాటుగా అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి తెచ్చుకోకూడదని విజ్జప్తి చేశాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌తో ఆదివారం పోటీపడనుంది. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు.. ముఖ్యంగా అదనపు స్పిన్నర్‌ను ఆడించాలా లేదా అన్న అంశంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలన్న నిర్ణయం సరైందే.. కానీ ‘‘ఇంగ్లండ్ వంటి జట్టుతో ఆడుతున్నపుడు.. ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలనుకోవడం సరైన నిర్ణయమే. లక్నో వంటి పెద్ద మైదానం.. కాబట్టి ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలనే అభిప్రాయాలు ఉండటమూ సహజమే. ఐపీఎల్లో ఇక్కడ బంతి టర్న్ అయింది కాబట్టి ఆఫ్ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందనుకోవడం మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మాదిరి వికెట్ ఉండబోదు. అపుడు నల్లరేగడి మట్టితో పిచ్ రూపొందించారు. ఇది ఎర్రమట్టి పిచ్.. కాబట్టి కానీ ఇప్పుడు ఇది ఎర్రమట్టితో చేసిన పిచ్. దీని మీద బంతి బౌన్స్ అవుతుంది. పేస్ రాబట్టవచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత మారిపోతుంది. ఒకవేళ మనం ముగ్గురు స్పిన్నర్ల సెకండ్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. మనకు తెలియకుండానే ప్రత్యర్థికి మంచి చేసిన వాళ్లం అవుతాం. లేదు కచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తే.. అశ్విన్ జట్టులోకి వస్తాడు. అలాంటపుడు పేసర్లు సిరాజ్.. షమీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నా ఓటు మాత్రం షమీకే. గత మ్యాచ్‌లో సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. సిరాజ్ వద్దు.. ఎందుకంటే అయితే, షమీ ఐదు వికెట్ల హాల్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ దృష్ట్యా సిరాజ్ కంటే ముందున్న షమీని తుదిజట్టులోకి తీసుకోవాలి’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా తలపడిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్మశాలలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రపంచకప్-2023లో షమీకి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తుది జట్ల అంచనా టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), బెయిర్‌స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్. చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము.. WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్..
WC 2023- India vs England: సొంతగడ్డపై అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తూ వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల కంటే ఓ విజయం ఎక్కువే సాధించి పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తదుపరి ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది రోహిత్ సేన. లక్నోలో అక్టోబరు 29న ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తుదిజట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు స్పిన్ ఆడలేరు.. కాబట్టి ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందనుకుంటున్నా. కుల్దీప్, రవీంద్ర జడేజాతో పాటు అశ్విన్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇంగ్లండ్ బ్యాటర్లు స్పిన్ సరిగ్గా ఆడలేరు. ఇప్పటికే ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్ టోర్నీలో బాగా వెనుకబడిపోయింది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌లో గనుక బంతి స్పిన్ అవడం మొదలుపెడితే వారికి కష్టాలు తప్పవు. షమీ సత్తా చాటాడు.. ఒకవేళ.. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుంది. సిరాజ్ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కాబట్టి అతడికి రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఇక షమీ జట్టులోకి వచ్చీ రాగానే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఏదేమైనా లక్నోలో బంతి టర్న్ అయితే తప్ప టీమిండియా తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పిచ్ నార్మల్‌గా ఉంటే.. న్యూజిలాండ్‌తో బరిలోకి దిగిన జట్టే ఇక్కడా కొనసాగుతుంది. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ కాబట్టి వికెట్ స్లోగా ఉండాలని టీమిండియా అభిమానులు కోరుకుంటారు’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగింట కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హర్భజన్ ఎంచుకున్న టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
Ind Vs Pak: ‘మరీ ఇంత పిరికితనమా? బాబర్ ఇకనైనా కెప్టెన్సీ వదిలేసి..’
ICC WC 2023- Ind Vs Pak- Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు బాబర్ కెప్టెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాల్సింది పోయి.. పిరికివాడిలా వెనుకడుగు వేశాడని విమర్శిస్తున్నారు. భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడేటపుడు ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని బాబర్‌కు సూచనలు ఇస్తున్నారు. భారత బౌలర్ల విజృంభణ.. బాబర్ బృందం బెంబేలు కాగా భారత గడ్డపై తొలిసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన వన్డే నంబర్ 1 బ్యాటర్ బాబర్ ఆజం.. అక్టోబరు 14 నాటి అహ్మదాబాద్ మ్యాచ్‌లో 50 పరుగులు సాధించాడు. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పరిమితమైన వేళ ఈ వన్‌డౌన్ బ్యాటర్.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(49)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, భారత బౌలర్ల దాటికి ఈ జోడీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. ఇక వీరిద్దరి తర్వాత హసన్ అలీ తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో 191 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 30.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడంతో పాకిస్తాన్‌కు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో మరోసారి దాయాది చేతిలో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్ బాబర్ ఆజం తీరును తప్పుబట్టారు. ఇకనైనా కెప్టెన్సీ వదిలెయ్యాలి ‘‘బాబర్ ఆజం ఏదో అలా జట్టును నడిపిస్తున్నాన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ.. నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. భారత్ వంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ ఉన్నపుడు బాబర్ ఆజం ప్లాన్ ‘బి’, ప్లాన్ ‘సి’తో బరిలోకి దిగాలి. కానీ.. మ్యాచ్ చూస్తున్నంత సేపు.. బాబర్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టంగా తేలిపోయింది. ఇప్పటికైనా బాబర్ కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పైనే పూర్తిగా దృష్టి సారించాలి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని షోయబ్ మాలిక్ ఏ- స్పోర్ట్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మరీ ఇంత పిరికితనమా? నాయకుడే ఇలా ఉంటే ఇక మొయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆరంభం నుంచే పూర్తి ఒత్తిడిలో కూరుకుపోయినట్లుగా అనిపించింది. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు బాబర్ భయం భయంగా కనిపించాడు. ఏ షాట్ ఆడితే ఏమవుతుందోనన్న ఆందోళన అతడిలో కనిపించింది. కెప్టెన్ పరిస్థితే అలా ఉంటే ఆటగాళ్లు ఎలా ఆడతారు? వాళ్లు కూడా బాబర్ లాగే భయపడిపోయారు. బాబర్ ఆజం 50 పరుగులు చేయడానికి 58 బంతులు తీసుకున్నాడు. తన సహజమైన శైలిలో అతడు బ్యాటింగ్ చేయలేకపోవడం మనమంతా చూశాం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే డిఫెన్సివ్‌గా ఆడాడు. వికెట్లు పడుతున్నపుడు జాగ్రత్త అవసరమే.. కానీ మరీ పిరికివాడిలా మారిపోయి బౌలర్లపై ఎదురుదాడి చేయకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని బాబర్ ఆజం ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. కాగా అహ్మదాబాద్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ అయిన విషయం తెలిసిందే. చదవండి: WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC: సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టం.. ఒత్తిడికి లోనుకాను: టీమిండియా స్టార్ పేసర్
ICC ODI WC 2023: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంలో అదరగొడుతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో అభిమానుల మనసు గెలుచుకుంటూ భారత జట్టు విజయాల్లో భాగమవుతున్నాడు. కాగా వెన్నునొప్పి కారణంగా సుమారు పదకొండు నెలల పాటు బుమ్రా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. రీఎంట్రీలో అదరగొడుతూ.. మెగా టోర్నీలో ఈ క్రమంలో ఐర్లాండ్‌తో ఆగష్టులో టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇచ్చాడు. తొలిసారి టీ20 జట్టు పగ్గాలు చేపట్టి సఫలమయ్యాడు. సిరీస్ గెలిచిన తర్వాత.. ఆసియా కప్-2023 వంటి ప్రతిష్టాత్మక మెగా వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఆసియా విజేత టీమిండియా ప్రధాన పేసర్‌గా వన్డే వరల్డ్‌కప్-2023లో అడుగుపెట్టిన బుమ్రా ఇప్పటికే జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో తన విలువేమిటో చాటుకున్నాడు. ఎనిమిది వికెట్లు కూల్చి రోహిత్ సేన వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ ముఖ్యంగా దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా.. ఆరంభం నుంచే పొదుపుగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చిరకాల ప్రత్యర్థిపై విజయం భారత్ జయభేరి మోగించడంలో ప్రధాన పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఒత్తిడికి లోను కాను.. సవాళ్లంటే నాకిష్టం ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేనెప్పుడూ ఒత్తిడికి లోనుకాను.. ఎందుకంటే.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అవరోధాలు దాటి ఇక్కడి దాకా వచ్చాను. దేశానికి ఆడాలన్నదే నా లక్ష్యం. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను నేను సంతోసంగా స్వీకరిస్తాను. నా జట్టును గెలిపించాలనే తపనతోనే ఆడతాను’’ అంటూ ఐసీసీ మెగా టోర్నీలోనూ తాను ఎలాంటి ఒత్తిడికి గురవడం లేదని బుమ్రా వెల్లడించాడు. అలా అయితే సరిగ్గా ఆడలేం ఇక భారత్‌లో పిచ్ పరిస్థితుల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాను. నా అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు ఉపయోగపడే విధంగా.. వీలైనంత ఎక్కువ శ్రమిస్తాను. ఒత్తిళ్లు, అంచనాలు, బాధ్యతలు.. ఇలా వీటిలో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించను. ఒకవేళ అవన్నీ మనసులో పెట్టుకుంటే మనం అనుకున్న రీతిలో ప్రదర్శన చేయలేం’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తన పని తాను చేసుకుంటూ పోతే ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. కాగా బుమ్రాకు మరో పేసర్, హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ సైతం తన ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకంగా మారుతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం -
వార్ వన్‌సైడ్.. టీమిండియా చేతిలో పాక్ చిత్తు! కానీ.. రెండే లోటు అంటున్న ఫ్యాన్స్
ICC ODI World Cup 2023- India Beat Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023 మెగా మ్యాచ్‌లో వార్ వన్‌సైడ్ అయింది. చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాకిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది. సమిష్టి కృషితో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించిది. సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఖుషీ చేసింది. క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజీ మ్యాచ్‌గా భారత్- పాక్ పోరు ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా అలెర్ట్ అయిపోతారు. మ్యాచ్ ఆసాంతం ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆటగాళ్ల మధుర జ్ఞాపకాలను తమ మనసులో బందించేసుకుంటూ ఉంటారు. పాక్ బ్యాటర్ల ఆట కట్టించిన టీమిండియా బౌలర్లు అలాంటిది.. ఈసారి భారత గడ్డపై పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. పటిష్ట పేస్ దళమే తమ బలమన్న పాక్ కనీసం ఈసారైనా ఏదైనా అద్భుతం చేస్తుందా అని ఆ జట్టు అభిమానుల ఆశపడుతున్న వేళ.. టీమిండియా పేసర్లు పాక్ బ్యాటర్ల ఆట కట్టించారు. పాక్ బ్యాటర్లు వర్సెస్ టీమిండియా బౌలర్ల పోరులో వార్ వన్‌సైడ్ చేశారు. మొదటి దెబ్బ సిరాజ్‌దే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపైన బౌలింగ్‌తో ఆరంభం నుంచే ఆకట్టుకుంటే.. మహ్మద్ సిరాజ్ తొలి వికెట్ తీసి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి పునాది వేశాడు. ఇక 50 పరుగులు సాధించి క్రీజులో పాతుకుపోవాలని చూసిన పాక్ సారథి, వన్డే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ బాబర్ ఆజంను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో అసలు కథ మొదలైంది. View this post on Instagram A post shared by ICC (@icc) సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా ఆపై.. వరుసగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా సైతం సంచలన స్పెల్‌తో ప్రమాదకారిగా మారుతున్న మహ్మద్ రిజ్వాన్(49)ను బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో షాదాబ్ ఖాన్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) కుల్దీప్, జడ్డూ తక్కువేం కాదు మరో స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా హసన్ అలీ(12), హ్యారిస్ రవూఫ్(2)లను అవుట్ చేయడంతో 42.5 ఓవర్లకే పాక్ చాపచుట్టేసింది. 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఫోర్‌తో ఆరంభించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) గిల్ ఇన్నింగ్స్ ముచ్చటేసినా.. ఆనందం కాసేపే అయితే, పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో షాదాద్కు క్యాచ్ ఇచ్చి గిల్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరడం ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ పిచ్‌పై గిల్ పరుగుల వరద పారిస్తాడనుకుంటే.. ఇలా జరిగిందేంటని ఉసూరుమన్నారు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సైతం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాక్ టూ బ్యాక్ బౌండరీలు బాదిన కోహ్లి కాసేపటికే నిష్క్రమించాడు. నేనున్నాంటూ బౌండరీలు, సిక్సర్లతో మురిపించిన రోహిత్ ఈ క్రమంలో.. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్‌ను మురిపించాడు. 63 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. సెంచరీతో మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని అభిమానులు కోరుకుంటున్న వేళ షాహిన్ మరోసారి సీన్లోకి వచ్చి రోహిత్‌ను అవుట్ చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వార్ వన్‌సైడ్.. కానీ అభిమానులకు ఆ రెండే లోటు ఇక నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(53), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(19) కలిసి స్వల్ప లక్ష్య ఛేదనలో చివరి వరకు అజేయంగా నిలిచి భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి మెరుపులు చూడలేకపోవడం, రోహిత్ సెంచరీ మిస్ కావడం ఆయా ఆటగాళ్ల అభిమానులకు తీరని లోటుగా మిగిలి పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఆ రెండూ తప్పితే.. మిగతావన్నీ తీపి జ్ఞాపకాలుగానే మిగిలి పోతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా టీమిండియా తమ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు, రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా దాయాది పాకిస్తాన్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందిన ఈ మ్యాచ్‌లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Ind Vs Pak: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు.. -
పాక్‌కు చుక్కలు.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే..
ICC ODI World Cup 2023- India vs Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు. మొతేరాలో వికెట్ల మోత మోగించారు. ఐసీసీ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లో దాయాదులు భారత్-పాక్ తలపడుతున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాయకుడి నమ్మకాన్ని నిలబెడుతూ.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తూ శుభారంభం అందించాడు. తొలి వికెట్ అందించిన సిరాజ్ వరుస ఓవర్లలో మహ్మద్ సిరాజ్‌తో కలిసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) 12.3వ ఓవర్లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(36)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 24.3వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు అంపైర్ కాల్‌తో లైఫ్ లభించగా.. అతడు 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత మూడో బంతికి సిరాజ్.. బాబర్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి టీమిండియాకు మూడో వికెట్ అందించాడు. అనంతరం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో అద్భుతం చేశాడు. రెండో బంతికి సౌద్ షకీల్(6)ను ఎల్బీడబ్ల్యూ చేసిన కుల్దీప్.. ఆఖరి బాల్‌కు ఇఫ్తికర్ అహ్మద్(4)ను బౌల్డ్ చేశాడు. బుమ్రా వరుస ఓవర్లలో ఆ ఇద్దరినీ బౌల్డ్ చేసి ఇక 34 ఓవరల్లో పాక్ స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 49వ పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. బుమ్రా సంచలన రీతిలో అతడిని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి ఓవర్లో షాదాబ్ ఖాన్‌ను కూడా బౌల్డ్ చేసి పారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) మనబౌలర్ల దెబ్బ మామూలుగా లేదు ఇలా వరుస వికెట్ల క్రమంలో హార్దిక్ పాండ్యా మహ్మద్ నవాజ్(4)ను.. రవీంద్ర జడేజా హసన్ అలీ(12), హ్యారిస్ రవూఫ్(ఎల్బీడబ్ల్యూ- 2)లను పెవిలియన్‌కు పంపడంతో పాకిస్తాన్ కథ 42.5 ఓవర్లకే ముగిసిపోయింది. ఐదుగురూ సరిసమానంగా.. అతడొక్కడే పాపం టీమిండియా బౌలర్లలో పేసర్లు సిరాజ్, బుమ్రా, పాండ్యా.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తలా రెండు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనంలో ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు. 2 ఓవర్ల బౌలింగ్ వేసిన పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఒట్టిచేతులతో మిగిలిపోయాడు. 36 పరుగుల తేడాలో పాక్ 8 వికెట్లు కోల్పోయిందంటే మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ సంచలన స్పెల్స్‌తో పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా బౌలర్లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 192 పరుగుల విజయ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని టీమిండియా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో పాక్‌పై ఎనిమిదో విజయం నమోదు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: న్యూజిలాండ్‌కు బిగ్.. కేన్ మామ వరల్డ్‌కప్ నుంచి ఔట్! View this post on Instagram A post shared by ICC (@icc) -
సిరాజ్ సూపర్ డెలివరీ.. బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. రెండో వికెట్ కోల్పోయిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు రిజ్వాన్, బాబర్ పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భారత స్పిన్నర్లపై వీరిద్దరూ అధిపత్యం చెలాయిస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సిరాజ్ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అందించాడు. రోహిత్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ముచేయలేదు. పాక్ ఇన్నింగ్స్ 30 ఓవర్లో సిరాజ్ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బాబర్ థర్డ్‌మ్యాన్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బాబర్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ను కూడా సిరాజే సాధించాడు. అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీగా సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌కు బిగ్.. కేన్ మామ వరల్డ్‌కప్ నుంచి ఔట్! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 IND Vs PAK Highlights Pics: వరల్డ్ కప్‌లో పాక్-భారత్ మ్యాచ్ హైలైట్స్ (ఫొటోలు)
-
Ind vs Pak: పాక్ సున్నా.. రోహిత్ ఒక్కడే 27! ఇదీ మీ లెవల్ అంటూ..
ICC ODI World Cup 2023- India vs Pakistan: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మ్యాచ్ ఆరంభమైంది. అహ్మదాబాద్ వేదికగా దాయాదులు పోటీకి దిగగా.. లక్ష్య సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం నీలి వర్ణంతో నిండిపోయింది. రోహిత్ సేనకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టీమిండియాను చీర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్,ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి ఓవర్లో పాక్ కేవలం 4 పరుగులు మాత్రమే రాబట్టలిగింది. బుమ్రా పొదుపుగా అయితే, రెండో ఓవర్లో మరో పేసర్ మహ్మద్ సిరాజ్ 16 పరుగులిచ్చాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఇమామ్ మూడు ఫోర్లు బాదాడు. తదుపరి ఓవర్లో బుమ్రా మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన సిరాజ్.. 6 పరుగులివ్వగా.. అనంతరం బుమ్రా 5వ ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కేవలం ఒక్క పరుగుకే పాక్‌ను పరిమితం చేశాడు. తొలి వికెట్ తీసిన సిరాజ్ ఇక ఆ తర్వాత వరుస ఓవర్లలో సిరాజ్ 5, బుమ్రా 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్.. అబ్దుల్లా షఫీక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. పాక్ తొలి వికెట్ కోల్పోయింది. అప్పటికి పాక్ స్కోరు 41. తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్లో 7 పరుగులు రాబట్టిన పాకిస్తాన్.. 10వ ఓవరల్లో సిరాజ్ బౌలింగ్‌లో ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇలా పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేదు. పాక్ గుండు సున్నా.. రోహిత్ ఒక్కడే కాగా 2023 ఏడాదిలో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆడిన 18 వన్డేల్లో పవర్ ప్లేలో ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కడే 16 ఇన్నింగ్స్‌లో కలిపి పవర్ ప్లేలో ఏకంగా 27 సిక్సర్లు బాదడం విశేషం. నెట్టింట హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ సందడి ఇందుకు సంబంధించిన గణాంకాలను నెట్టింట షేర్ చేస్తూ హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ పాక్ జట్టును టీజ్ చేస్తున్నారు. ‘‘మీరు 0, రోహిత్ ఒక్కడే 27.. ఇదీ మీ లెవల్ వారెవ్వా సిక్సర్ల కింగ్’’ అంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీమిండియా సారథి వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా సిక్సర్ల రారాజుగా రికార్డు సాధించాడు. గేల్ రికార్డు బద్దలు కొట్టిన రో‘హిట్’ మూడు ఫార్మాట్లలో కలిపి 556 సిక్సర్లు పూర్తి చేసుకుని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు(553) బద్దలు కొట్టాడు. కాగా అహ్మదాబాద్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో పాకిస్తాన్ 125 పరుగులు స్కోరు చేసింది. సిరాజ్, పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కాయి. చదవండి: WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్ View this post on Instagram A post shared by ICC (@icc) -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్‌ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్‌ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్‌పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్‌కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్‌తో వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా స్టార్లు
2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు. గత నెలలో సూపర్ ఫామ్‌లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం..
ICC ODI WC 2023: ‘‘ఒక గొప్ప ఉత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో దానికి పూర్తిగా ముగింపు పలకాలనే వార్తలు కూడా వినిపిస్తుండటం దురదృష్టకరం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తూ గొప్ప ఘనతల గురించి చెప్పి భావోద్వేగాలకు గురి చేసి ఇక మీ సమయం ముగిసిందని చెప్పడం ఎలాగో ఇదీ అలాగే ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇదే చివరి ప్రపంచకప్ అంటూ కొందరు చేతకాని, దూరదృష్టి లేని, బద్ధకస్తులైన క్రికెట్ పరిపాలకులు అంటున్నారు. నాకు తెలిసి అన్ని మార్పుల్లాగే ఈతరం వారి కోసం వన్డేలకు కూడా కొన్ని మార్పులతో హంగులు అద్దడం అవసరం. టి20ల్లో ఒక్కసారి దెబ్బ పడితే కోలుకునే అవకాశం ఉండదు. మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు కానీ వన్డేల్లో అలా కాదు. ఒక బౌలర్ ఆరంభంలో భారీగా పరుగులిచ్చినా చివర్లో మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వన్డేల్లో కెప్టెన్లు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఈ వరల్డ్‌కప్‌లో మనం చూడబోతున్నాం’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. వన్డే ఫార్మాట్లో ప్రపంచ టోర్నీకి ముగింపు అంటూ అభిప్రాయపడటం మూర్ఖత్వమే అని విమర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ వన్డే వరల్డ్‌కప్ ప్రాముఖ్యత, టీమిండియా గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిరాజ్, బుమ్రా సూపర్ ఈ మేరకు.. ‘‘గిల్, సిరాజ్, శ్రేయస్లాంటి వారిని అభిమానులకు మరింత చేరువ చేయాల్సి ఉంది. బౌలర్లు బాగా ప్రభావం చూపించడాన్ని మనం గుర్తించాలి. ఇటీవల ఆసియా కప్‌లో సిరాజ్, బుమ్రా కలిసి శ్రీలంకను 50 పరుగులకు కుప్పకూల్చడం చూసి చాలా సంతోషం వేసింది. అలాంటి అద్భుత బౌలింగ్‌నూ చూడాలని అభిమానులు అనుకుంటారు. ఈ తరహాలో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచేందుకు వరల్డ్ కప్ నిర్వాహకులకు ఇదే సరైన అవకాశం. భారత జట్టు బాగా ఆడటం కూడా దీనికి మేలు చేస్తుంది. నా దృష్టిలో టైటిల్ గెలిచేందుకు భారత్, ఇంగ్లండ్‌లకు మంచి అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉన్నప్పుడు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఆసక్తికరం’’ అని గంభీర్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వరల్డ్ కప్ జరిగే ఇతర నగరాల్లోనూ ఇలాగే ఉండటం మంచి విషయం. ఆటను ఆస్వాదిస్తూ.. పర్యావరణ హితంగా ప్రపంచకప్ జరిగే సమయంలోనే దసరా, దీపావళి వస్తున్నాయి. ఆ సమయంలో బాణసంచా కాల్చకుండా వన్డే క్రికెట్లో బంతి, బ్యాట్ శబ్దాలు వినగలిగితే చాలు’’ అంటూ ఆటను ఆస్వాదిస్తూనే పర్యావరణ హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభిమానులకు సూచించాడు. కాగా గంభీర్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో గౌతం గంభీర్ కీలక సభ్యుడన్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్- న్యూజిలాండ్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? -
వరల్డ్‌కప్‌కు ముందు మొహమ్మద్ సిరాజ్‌కు భంగపాటు
భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ 2023కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు భంగపాటు ఎదురైంది. కొద్ది రోజుల కిందట ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ధారాళంగా పరుగులు (9 ఓవర్లలో 68 పరుగులు) సమర్పించుకున్నందుకు గాను సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 11 పాయింట్లు (680 నుంచి 669) కోల్పోయాడు. తద్వారా అతను ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌తో అగ్రస్థానాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన హాజిల్‌వుడ్ అప్పటివరకు తన ఖాతాలో ఉన్న 669 పాయింట్లను నిలబెట్టుకుని సిరాజ్‌తో పాటు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌లో వీరిరువురిలో టాప్ ర్యాంకర్ ఎవరో తేలిపోతుంది. తాజాగా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాలు నిలబెట్టుకోగా.. పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది 2 స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండిన మిచెల్ స్టార్క్ 2 స్థానాలు కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. 11వ ర్యాంక్‌లో ఉండిన మొహమ్మద్ నబీ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకగా.. 10వ ప్లేస్‌లో ఉండిన కుల్దీప్ యాదవ్ 11వ స్థానానికి పడిపోయాడు. ఈ మార్పులు మినహాయించి టాప్-10 వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐర్లాండ్ హ్యారీ టెక్టార్‌తో సమానంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. 5వ స్థానంలో ఉండిన ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఆరుకు పడిపోగా.. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉండిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. 10వ స్థానంలో ఉండిన ఫకర్ జమాన్ 11వ ప్లేస్‌కు పడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, శుభ్‌మన్ గిల్, డస్సెన్‌లు టాప్-3 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతుండగా.. విరాట్ 9వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10 స్థానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. షకీబ్, నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతున్నారు. -
World Cup 2023: భారత తుది జట్టులో ఇద్దరు పేసర్లకే చోటు.. ఎవరిని తప్పిస్తారు..?
వరల్డ్‌కప్ లాంటి పెద్ద ఈవెంట్లో తుది జట్టు కూర్పు అనేది అన్ని జట్లకు ప్రధాన సమస్యగా పరిగణించబడుతుంది. మెగా టోర్నీ కావడంతో అన్ని జట్లు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. మిగతా జట్ల మాట అటుంచితే.. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో ఈ సమస్య టీమిండియానే అధికంగా వేధిస్తుందని అనిపిస్తుంది. భారత వరల్డ్‌కప్ జట్టులో హేమాహేమీ ఆటగాళ్లు ఉండటంతో ఎవరిని తప్పించాలో, ఎవరిని ఆడించాలో తెలియక మేనేజ్మెంట్ ఇప్పటినుంచే తలలుపట్టుకుంది. పిచ్, వాతావరణం, ఆయా ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఆఖరి నిమిషంలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. ఎక్కడో తెలియని భయం కెప్టెన్‌ను, కోచ్‌ను ఇప్పటినుంచే కలవరపెడుతుంది. తుది జట్టుకు సంబంధించి బ్యాటింగ్ విభాగం, వికెట్‌కీపర్ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉన్నప్పటికీ.. పేస్ బౌలింగ్ విభాగంతో సమస్య వస్తుంది. భారత జట్టుకు ఎంపిక చేసిన ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లలో ముగ్గురూ భీకర ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులో ఎవరిని ఆడించాలో అర్ధం కావడం లేదు. బుమ్రా రీఎంట్రీలో ఇరగదీస్తుండగా.. నంబర్ వన్ వన్డే బౌలర్‌గా సిరాజ్, ఆసీస్‌తో తొలి వన్డేలో అదిరిపోయే 5 వికెట్ల ప్రదర్శనతో షమీ.. ఇలా ముగ్గురూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుని ఇటీవలికాలంలో చెలరేగిపోయారు. దీంతో వరల్డ్‌కప్ తుది జట్టులో ఎవరిని ఆడించాలో కెప్టెన్‌కు, కోచ్‌కు అర్ధం కావడం లేదు. భారత పిచ్‌లు పేసర్లకు అంతగా సహకరించవు కాబట్టి, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగుదామనుకుంటే, ఏ టైమ్ ఏ పేసర్‌తో అవసరం పడుతుందోనన్న భయం టీమ్ మేనేజ్మెంట్ను ఇప్పటినుంచే వెంటాడుతుంది. అనుభవం దృష్ట్యా బుమ్రా, షమీలకు అవకాశం ఇస్దామనుకుంటే సిరాజ్ వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా ఉండటంతో పాటు భీకర ఫామ్‌లో ఉన్నాడు. లేదు షమీని తప్పిస్దామనుకుంటే, అతను కూడా అదిరిపోయే ప్రదర్శనలతో అబ్బురపరిచాడు. బుమ్రాను తప్పించే సాహసం మేనేజ్మెంట్ ఎలాగూ చేయలేదు. లేదు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లకు అవకాశం ఇద్దామా అనుకుంటే, అది జట్టు కూర్పు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ఏం చేయాలో మేనేజ్మెంట్కు పాలుపోవడం లేదు. పిచ్ పరిస్థితిని చూసి ఆఖరి నిమిషంలో డెసిషన్ తీసుకోవడం తప్పించి వారు ఏమీ చేయలేరు. అప్పుడు అవసరం దృష్ట్యా ముగ్గురిలో ఇద్దరిని మాత్రం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగతా జట్టు విషయానికొస్తే.. ఓపెనర్లుగా రోహిత్, గిల్ సెట్ అయిపోయారు. వన్‌డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్, ఐదో ప్లేస్‌లో రాహుల్ (వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్), ఆరో స్థానంలో హార్దిక్, ఏడో ప్లేస్‌లో జడేజా, ఎనిమిదో స్థానంలో అశ్విన్, తొమ్మిదో ప్లేస్‌లో కుల్దీప్, 10, 11 స్థానాల్లో బుమ్రా, షమీ, సిరాజ్‌ల్లో ఎవరో ఇద్దరు తుది జట్టులో ఉంటారు. ఇలా కాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండాలనుకుంటే సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరు తుది జట్టులోకి వస్తారు. వరల్డ్‌కప్‌లో భారత తుది జట్టు ఎలా ఉండాలని అనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. -
వన్డే వరల్డ్‌కప్‌లో మన వాడు ఒకే ఒక్కడు.. టీమిండియాలో కాదు..!
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన ఆటగాడు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన క్రికటర్. తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ సిరాజ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. 29 ఏళ్ల తేజ విజయవాడ నుంచి ఆమ్స్టర్డామ్కు వలస వెళ్లి, అక్కడే స్థిరపడి డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తేజ నెదర్లాండ్స్ జట్టుకు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. డచ్ టీమ్ తరఫున 20 వన్డేలు, 6 టీ20లు ఆడిన తేజ.. మొత్తంగా 531 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తేజ ఓ అద్భుతమైన సెంచరీ చేసి, డచ్ టీమ్ ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన 29 ఏళ్ల మొహమ్మద్ సిరాజ్ టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవలే అతను నంబర్ వన్ వన్డే బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, 29 వన్డేలు8 టీ20లు ఆడిన సిరాజ్ మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. బంగ్లాదేశ్ మినహా.. వన్డే ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28గా ఐసీసీ నిర్ణయించింది. జట్ల వివరాల.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్‌జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్, కొలిన్ అకెర్‌మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక -
ఆ విషయంలో నాకేం బాధ లేదు.. కానీ మీరిలా: షమీ కౌంటర్
India vs Australia, 1st ODI- Mohammed Shami: నైపుణ్యం, అనుభవం ఉన్నా సరే గత కొంతకాలంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వస్తోంది. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ వెటరన్ ఫాస్ట్‌బౌలర్‌కు చాలాసార్లు నిరాశే ఎదురవుతోంది. ఆసియా కప్-2023 టోర్నీలో బుమ్రా లేదంటే సిరాజ్ గైర్హాజరీలో మాత్రమే షమీకి తుదిజట్టులో చోటు దక్కింది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఈ సీనియర్ పేసర్‌కు ఛాన్స్ వస్తుందా లేదా అన్న సందేహాలు నెలకొన్న వేళ.. తొలి మ్యాచ్‌లో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో మొహాలీలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాను 276కు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన షమీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం మీడియాతో మాట్లాడిన షమీకి తరచూ జట్టు నుంచి తప్పించడం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘నేను రెగ్యులర్‌గా జట్టులో ఉన్నపుడు ఎవరో ఒకరు బెంచ్ మీద కూర్చుంటారు కదా! కౌంటర్ అదుర్స్ నేను కూడా అంతే! ఇందులో బాధపడాల్సింది, గిల్టీగా ఫీల్ కావాల్సింది ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. నేను లేకుంటే ఏంటి.. జట్టు గెలుస్తూనే ఉంది కదా! టీమ్ప్లాన్కు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రతిసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. జట్టు కూర్పుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనకి అవకాశం వస్తే మంచిదే! లేదంటే మ్యాచ్ ఆడుతున్న వాళ్లకి మద్దతుగా ఉండాలంతే! మేనేజ్మెంట్ నాకు ఎప్పుడు ఎలాంటి పని అప్పగించినా దానిని పూర్తిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని షమీ అదిరిపోయే జవాబు ఇచ్చాడు. రొటేషన్ పాలసీ ఉండటం సహజమని.. ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో నాకెంత అవగాహన ఉందో తెలుసుకోవడానికే ఈ ప్రశ్న అడిగారు కదా అంటూ కౌంటర్ వేశాడు. ఆధిక్యంలో టీమిండియా ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 71, శుబ్‌మన్ గిల్ 74 పరుగులతో అదరగొట్టడం సహా కెప్టెన్ కేఎల్ రాహుల్(58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(50) అర్ధ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.దీంతో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! We played "𝗙𝗶𝗲𝗿𝘆 𝗳𝗶𝗳𝗲𝗿" with 5⃣ members of #TeamIndia! 👌 Did they live-up to the challenge? 🤔 Let's find out 😉🔽 - By @28anand | #INDvAUS pic.twitter.com/kkaqruSdZF — BCCI (@BCCI) September 23, 2023 -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అన్ని విభాగాల్లో టాప్‌లో మనమే..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యువ కెరటం శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు అతి చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కు (857) గిల్‌కు (814) మధ్య తేడా కేవలం 43 పాయింట్లు మాత్రమే. ఎల్లుండి నుంచి ఆసీస్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ ఒక్క కీలక ఇన్నింగ్స్ ఆడినా బాబర్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టీమిండియా హవా కొనసాగుతుంది. ఆసియా కప్-2023 గెలిచి జోష్‌మీదున్న భారత్.. పాకిస్తాన్‌తో సరిసమానమైన రేటింగ్ పాయింట్లు (115) కలిగి రెండో స్థానంలో ఉంది. ఈనెల 22న ఆసీస్‌తో జరిగే తొలి వన్డేలో గెలిస్తే భారత్ అగ్రస్థానానికి ఎగబాకుతుంది. తద్వారా టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుంది. ఇప్పటికే భారత్ టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో భారత్ నంబర్ వన్ జట్టుగా ఉండనే ఉంది. టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ తన హవాను కొనసాగిస్తుండగా.. టీ20 నంబర్ 2 ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ సత్తా చాటాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమ్ భారత్ గతకొంతకాలంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. టెస్ట్‌ల్లో చాలాకాలంగా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత్.. వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ సత్తా చాటుతూ అన్ని విభాగాల్లో అగ్రస్థానాల్లో కొనసాగుతుంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్, నంబర్ 3 బౌలర్‌గా జడేజా.. ఆల్‌రౌండర్ల విభాగంలో తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌లు కొనసాగుతున్నారు. ఇలా టీమిండియా, టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ల్లో కొనసాగుతున్నారు. అతి త్వరలో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా, గిల్ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్‌లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్‌కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్‌కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..!
ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..! 2023 ఆసియా కప్‌లో టాప్ పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్ సగటు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు. అత్యధిక పరుగులు: శుభ్‌మన్ గిల్ (6 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు) అత్యధిక అర్ధసెంచరీలు: రోహిత్ శర్మ, కుశాల్ మెండిస్ (3) అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (11) అత్యధిక బౌండరీలు: శుభ్‌మన్ గిల్ (35) అత్యధిక స్కోర్: బాబర్ ఆజమ్ (151) అత్యధిక సగటు: మహ్మద్ రిజ్వాన్ (4 ఇన్నింగ్స్‌ల్లో 97.5) అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్: మహ్మద్ నబీ (178.95) అత్యధిక వికెట్లు: మతీష పతిరణ (11) అత్యుత్తమ బౌలింగ్ సగటు: హార్ధిక్ పాండ్యా (11.33) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: మహ్మద్ సిరాజ్ (6/21) టోర్నీ మొత్తంలో 7 సెంచరీలు నమోదు కాగా.. ఇందులో మూడు సెంచరీలు (కోహ్లి, రాహుల్, గిల్) భారత ఆటగాళ్లు చేసినవే కావడం విశేషం. -
సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్‌లో ఉంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఆసియాకప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంకను తమ సొంతగడ్డపై చావు దెబ్బతీశాడు. ఓవరాల్‌గా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. 6 వికెట్లు పడగొట్టి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్ మియా మ్యాజిక్ దాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అయితే సిరాజ్ 7 వికెట్ల ఘనత సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. సిరాజ్ చేత 7 ఓవర్లు బౌలింగ్ చేయించి హిట్‌మ్యాన్ ఆపేశాడు. రోహిత్ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సిరాజ్‌తో మరో ఓవర్ అదనంగా వేయించి వుంటే 7 వికెట్ల హాల్ సాధించి చరిత్రపుటలకెక్కేవాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. సపోర్ట్ స్టాప్ సూచన మేరకు సిరాజ్‌తో మరో ఓవర్ వేయించలేదని రోహిత్ తెలిపాడు. "స్లిప్స్‌లో అంతమంది ఫీల్డర్లను చూడటం చాలా ఆనందంగా అన్పించింది. మా ముగ్గురు పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ మిగిలిన వారికంటే చాలా కష్టపడ్డాడు. అయితే అందరూ ప్రతీరోజు రాణించాలంటే సాధ్యం కాదు. ఒక్కో రోజు ఒక్కొక్కరు హీరో అవుతారు. ఈ రోజు సిరాజ్‌ది. అప్పటికే సిరాజ్ తొలి స్పెల్‌తో కలుపుకుని వరుసుగా 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లు అంటే చాలా ఎక్కువ. అయితే అతడితో మరో ఒకట్రెండు ఓవర్లు వేయించాలని నేను అనుకున్నాను. కానీ అతడికి ఓవర్లను ఆపాలని మా మా ట్రైనర్ నుంచి నాకు సందేశం వచ్చింది. సిరాజ్ మాత్రం బౌలింగ్ కొనసాగించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఒక రిథమ్‌లో ఉన్నప్పుడు అది ఒక బ్యాటర్‌కు అయినా, బౌలర్‌కైనా సహజం. కానీ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఎందుకంటే అతడి దూకుడు ఇక్కడితో ఆగకూడదు కదా" అని పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 చదవండి: Afghan Mystery Girl: వారెవ్వా టీమ్ భారత్.. మోదీ జీకి బర్త్‌డే గిఫ్ట్! ఎవరీ అందాల సుందరి? వ్యాపారవేత్త మాత్రమే కాదు.. Asia Cup 2023: ఆసియా ఛాంపియన్స్‌గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే? -
వారెవ్వా టీమ్ భారత్.. మోదీ జీకి బర్త్‌డే గిఫ్ట్! ఎవరీ అందాల సుందరి?
Afghan Mystery Girl- Who Is Wazhma Ayoubi: వజ్మా అయూబీ.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు అఫ్గనిస్తాన్ ‘మిస్టరీ గర్ల్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆసియా కప్-2023 టోర్నీలో టీమిండియాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోందీమె. కోహ్లికి వీరాభిమాని విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన వజ్మా.. ఇప్పటికే కింగ్ సంతకంతో కూడిన జెర్సీని కూడా దక్కించుకుంది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోగానే ఆ జెర్సీ ధరించి కింగ్ రికార్డును సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు.. పాకిస్తాన్ సహా ఇతర జట్లపై టీమిండియా గెలిచినపుడు శుభాకాంక్షలు తెలుపుతూ వజ్మా అభిమానం చాటుకుంది. ఇక ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అంతేకాదు టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిపోయింది. మ్యాచ్ చూస్తున్నపుడు.. ‘‘11.2 ఓవర్లలో స్కోరు 33-7. కనీవిని ఎరుగని రీతిలో ఇలా ఏడు వికెట్లు పడటం చూశాం. అందులో 6 వికెట్లు మహ్మద్ సిరాజ్‌వే! ఈరోజు ఈ మ్యాచ్ చరిత్ర సృష్టిస్తుందనడంలో సందేహం లేదు’’ అని వజ్మా అయూబ్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇక రోహిత్ సేన ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటంతో అద్భుతమైన పోస్ట్‌తో టీమిండియా సహా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులను ఆకట్టుకుంది. ‘‘టీమ్ భారత్‌కు శుభాభినందనలు. శ్రీ మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే(సెప్టెంబరు 17) గిఫ్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కంగ్రాట్స్’’ అని వజ్మా విష్ చేసింది. ఆమె పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి. థాంక్యూ.. ‘నిజంగా మా లక్కీ ఫ్యాన్’ అంటూ ఆమెకు కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరీ వజ్మా ఆయుబ్? అఫ్గనిస్తాన్‌లో జన్మించిన వజ్మా ఆయుబి వృత్తిరిత్యా మోడల్. దుబాయ్‌లో నివాసం ఉంటున్న ఆమె వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అంతేకాదు సాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు విరాళం అందిస్తూ ఫిలాంత్రపిస్ట్గానూ పేరొందింది. వజ్మాకు ‘LAMAN’ అనే ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. బాలీవుడ్లో అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందాలనేది ఆమె చిరకాల కోరిక. అయితే, ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించిన తర్వాతే వజ్మా తన సెకండ్ హోం టీమ్ అదేనండి రోహిత్ సేనకు ఈ అందాల సుందరి మద్దతు ఇవ్వడం విశేషం. చదవండి: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Congratulations team Bharat, what a birthday gift for Sri Modi Ji @PMOIndia Congratulations to all Fans all around the world 🇮🇳👏🏻👏🏻👏🏻 #SLvsIND #AsiaCup2023final #AsiaCup pic.twitter.com/A6sIgXlifv — Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆ ఆరు వికెట్లు... సిరాజ్ రెండో ఓవర్... తొలి బంతి: పాయింట్ దిశగా నిసాంక డ్రైవ్... జడేజా అద్భుత క్యాచ్. మూడో బంతి: అవుట్ స్వింగర్‌కు సమరవిక్రమ ఎల్బీడబ్ల్యూ. నాలుగో బంతి: కవర్ పాయింట్ దిశగా ఆడిన అసలంక... కిషన్ క్యాచ్. ఆరో బంతి: అవుట్ స్వింగర్‌ను ఆడలేక కీపర్ రాహుల్‌కు ధనంజయ క్యాచ్. సిరాజ్ మూడో ఓవర్... నాలుగో బంతి: అవుట్ స్వింగర్...షనక క్లీన్‌బౌల్డ్. సిరాజ్ ఆరో ఓవర్... రెండో బంతి: అవుట్ స్వింగర్... డ్రైవ్ చేయబోయి మెండిస్ క్లీన్‌బౌల్డ్. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 నాకు రాసిపెట్టి ఉందన్న సిరాజ్ అంతా ఒక కలలా అనిపిస్తోంది. గత కొంతకాలంగా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాను. కానీ వికెట్లు మాత్రం దక్కడంలేదు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశా. చివరకు ఇవాళ నేను అనుకున్న ఫలితం వచ్చింది. వన్డేల్లో బంతిని స్వింగ్ చేసేందుకు సాధారణంగా ప్రయత్నిస్తుంటా. టోర్నీ గత మ్యాచ్‌లలో అలాంటిది సాధ్యం కాలేదు. కానీ ఇవాళ మంచి స్వింగ్ లభించింది. అవుట్ స్వింగర్‌ను సమర్థంగా వాడుకోవడం ఆనందంగా అనిపించింది. బ్యాటర్లు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తే అవుటయ్యేలా బంతులు వేశా. గతంలో శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనకు చేరువగా వచ్చినా చివరకు దక్కలేదు. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది మనకు ఎంత రాసి పెట్టి ఉంటే అంతే దక్కుతుందని నమ్ముతా. ఇవాళ అదృష్టం నా వైపు ఉంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంకంటే గర్వించే విషయం మరొకటి ఉండదు. ఇలాంటి ప్రదర్శనలు మరింత ప్రేరణను అందిస్తాయి. కఠోర శ్రమ, సాధన ఫలితమిస్తున్నాయి. నేను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బౌండరీ ఆపేందుకు సిరాజ్ పరుగులు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు సిరాజ్ విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన శ్రమ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక శ్రీలంక ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో అప్పటికే మూడు వికెట్లు తీసిన తర్వాత సిరాజ్ హ్యాట్రిక్ కోసం యత్నించగా.. బంతి బౌండరీ దిశగా వెళ్లింది. బాల్‌ను ఆపేందుకు సిరాజ్ కూడా దాని వెంట పరుగులు తీశాడు. ఇది చూసి విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ సహా హార్దిక్‌పాండ్యా నవ్వులు చిందించారు. మ్యాచ్ చూస్తున్న వాళ్లకు ఇదంతా కాస్త అసాధారణంగా అనిపించింది. కాస్త ఓవర్ అయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అత్యుత్సాహం కాదు.. అంకితభావం నిజానికి అది అత్యుత్సాహం అనడం కంటే ఆట పట్ల సిరాజ్ నిబద్ధత, అంకితభావానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ విషయం గురించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సమయంలో రవిశాస్త్రి సిరాజ్‌ను ప్రశ్నించగా.. ‘‘బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపితే గొప్పగా ఉంటుందని భావించాను అంతే’’ అని సిరాజ్ సమాధానం ఇచ్చాడు. గ్రౌండ్స్‌మెన్‌కు సిరాజ్ గిఫ్ట్ ఫైనల్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. టోర్నీలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో శ్రమకోర్చి పిచ్‌లు సిద్ధం చేసిన ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్‌మెన్‌ను తన తరఫున కానుకను ప్రకటించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా తనకు వచ్చిన 5 వేల డాలర్ల చెక్‌ను వారికి అందించాడు. మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా కాండీ, కొలంబో గ్రౌండ్స్‌మెన్‌కు ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. 50 వేల డాలర్లు వారికి ఇస్తున్నట్లు ఏసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Reality ! They are Laughing on Siraj As he only Bowl and he only Running to safe Boundary#INDvsSL https://t.co/3EvGgSu4Rp pic.twitter.com/qbdY3NcuTK — Jaisi Jiski Soch (@Jaisi_JiskiSoch) September 17, 2023 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
ఇంతింతై... వటుడింతై! బుమ్రా తర్వాత ఇప్పుడు అతడే.. అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్ సీమ్’!
Asia Cup 2023 Winner Team India- Mohammed Siraj: శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్.... సిరాజ్ వేసిన ఐదో బంతిని ధనంజయ మిడాన్ వైపు ఆడాడు. జోరు మీదున్న సిరాజ్ బంతిని ఆపేందుకు తానే స్వయంగా బౌండరీ వరకు పరుగెత్తాడు. అప్పటికే ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్‌కు అంత అవసరం లేదు. కోహ్లికి కూడా అలాగే అనిపించి గిల్‌తో పాటు అతనూ చిరునవ్వులు చిందించాడు. కానీ సిరాజ్ అంకితభావం ఎలాంటిదో అది చూపించింది. ఒక్కసారిగా మైదానంలోకి దిగితే చాలు వంద శాతం అతను జోష్‌లో కనిపిస్తాడు. ఒక్క క్షణం కూడా ఉదాసీనత కనిపించదు. సిరాజ్ వన్డేల్లో ఇప్పుడు కీలక బౌలర్‌గా ఎదగడమే అనూహ్యం. టెస్టుల్లో తనను తాను నిరూపించుకొని రెగ్యులర్‌గా మారినా ఎంతో మంది పేసర్లు అందుబాటులో ఉన్న వన్డేల్లో అతనికి సులువుగా చోటు దక్కలేదు. 2019లో తొలి వన్డే ఆడి అతను జట్టులో స్థానం కోల్పోయాడు. టెస్టు ప్రదర్శనలు, ఐపీఎల్లో చక్కటి బౌలింగ్ కూడా అతనికి వన్డేల్లో చోటు కల్పించలేకపోయాయి. అయిదే దాదాపు ఏడాదిన్నర క్రితం సిరాజ్ కెరీర్లో కీలక మలుపు. వేర్వేరు సిరీస్‌లకు బుమ్రా, షమీలాంటి సీనియర్లు తరచుగా విశ్రాంతి తీసుకుంటుండటంతో అతనికి మళ్లీ అవకాశం దక్కింది. దీనిని అతను అన్ని విధాలా అందిపుచ్చుకున్నాడు. మూడేళ్ల విరామం తర్వాత సిరాజ్ మళ్లీ వన్డే ఆడాడు. అంతే... అప్పటి నుంచి అతని ప్రదర్శన ప్రతీ మ్యాచ్‌కు మెరుగవుతూ వచ్చింది. ఏదో ద్వితీయ శ్రేణి జట్టులోకి ఎంపిక చేశాం... సీనియర్లు వస్తే మళ్లీ వెనక్కే అన్నట్లుగా కాకుండా తనను మరోసారి పక్కన పెట్టలేని విధంగా రాణించాడు. ఫిబ్రవరి 2022 నుంచి ఆడిన 28 వన్డేల్లో 4 మ్యాచ్‌లు మినహా ప్రతీసారి వికెట్లు పడగొట్టాడు. అలాగనీ పరుగులు ధారాళంగా ఇవ్వలేదు. ఎకానమీ 5 పరుగులు కూడా దాటలేదు. వికెట్లు దక్కకపోయినా ఎన్నోసార్లు బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి, మెయిడిన్లతో ఒత్తిడి పెంచి మ్యాచ్‌పై సిరాజ్ చూపించిన ప్రభావం అమూల్యం. ఇప్పుడు షమీని దాటి బుమ్రా తర్వాత రెండో ప్రధాన పేసర్‌గా మారాడు. ‘సిరాజ్ అరుదైన ప్రతిభావంతుడు’ అంటూ పదే పదే రోహిత్ ప్రశంసించడం టీమ్‌లో అతనేమిటో చూపించింది. సిరాజ్ పునరాగమనానికి ముందు ఏడాది కాలంలో కొత్త బంతితో భారత బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు. తొలి పది ఓవర్లలో అత్యంత చెత్త ప్రదర్శన (23 వన్డేల్లో 132.10 సగటు) నమోదు చేసిన టీమ్‌గా ఇండియా నిలిచింది. సిరాజ్ వచ్చాక అంతా మారిపోయింది. ఆరంభ ఓవర్లలోనే వికెట్లు తీసి అతను ఇస్తున్న శుభారంభాలు జట్టు విజయానికి బాటలు వేశాయి. కెరీర్ ఆరంభంలో సహజమైన ఇన్‌స్వింగ్ బౌలర్‌గా అడుగు పెట్టిన అతను ఆ తర్వాత అవుట్స్వింగర్లు వేయడంలో రాటుదేలాడు. ఇప్పుడు అతని అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్ సీమ్’ అనే ఆయుధం కూడా ఉంది. జనవరి 25న తొలిసారి ఐసీసీ వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన సిరాజ్ అప్పటి నుంచి చెలరేగుతూనే ఉన్నాడు. 29 వన్డేలు పెద్ద సంఖ్య కాకపోవచ్చు గానీ ఎలా చూసినా వన్డేల్లో 19.11 సగటు అసాధారణం. సరిగ్గా వరల్డ్ కప్‌కు ముందు సిరాజ్ సూపర్ ఫామ్ జట్టుకు ఆనందాన్నిచ్చే విషయం. ఇదే జోరు కొనసాగిస్తే ఈ హైదరాబాదీ పేసర్ మెగా టోర్నీలోనూ స్టార్‌గా నిలవడం ఖాయం. –సాక్షి క్రీడా విభాగం 4 వన్డేల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ సిరాజ్. గతంలో చమిందా వాస్ (శ్రీలంక; 2003లో బంగ్లాదేశ్‌పై), మొహమ్మద్ సమీ (పాకిస్తాన్; 2003లో న్యూజిలాండ్‌పై), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్; 2019లో వెస్టిండీస్‌పై) ఈ ఫీట్ నమోదు చేశారు. 6/21 వన్డేల్లో భారత్ తరఫున ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. స్టువర్ట్ బిన్నీ (6/4), కుంబ్లే (6/12), బుమ్రా (6/19) సిరాజ్కంటే ముందున్నారు. 263 మిగిలి ఉన్న బంతులపరంగా (43.5 ఓవర్లు) భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 16 మ్యాచ్‌లో తొలి 5 వికెట్లు తీసేందుకు సిరాజ్‌కు పట్టిన బంతులు. గతంలో చమిందా వాస్, అలీఖాన్ (అమెరికా) కూడా ఇదే తరహాలో 16 బంతులు తీసుకున్నారు. 129 రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్ 129 బంతుల్లోనే (21.3 ఓవర్లు) ముగిసింది. తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌ల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. చదవండి: Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్ సూపర్! కానీ.. క్రెడిట్ మొత్తం తనకే: రోహిత్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్ సూపర్! కానీ.. క్రెడిట్ మొత్తం తనకే: రోహిత్
Asia Cup 2023 Final- Rohit Sharma Comments: ‘‘అవును.. అత్యద్భుత ప్రదర్శన.. ఫైనల్లో ఇలా ఆడటం మానసికంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామో తెలియజేస్తుంది. గెలవాలన్న పట్టుదల.. బంతితో శుభారంభం.. బ్యాట్‌తో అద్భుతమైన ముగింపు.. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. మన సీమర్లను చూసి నాకు గర్వంగా అనిపించింది. గొప్పగా అనిపించింది ఎంతో కఠిన శ్రమకోర్చి ప్రణాళికలను పక్కాగా అమలు చేసిన తీరు అమోఘం. ఇలాంటి ప్రదర్శనలు చూసినపుడు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇలా జరగుతుందని నేను కూడా ఊహించలేదు. ప్రతి ఒక్క ఆటగాడు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అయితే, క్రెడిట్ మాత్రం సిరాజ్కే దక్కుతుంది. ఇలాంటి పిచ్ మీద సీమర్లు ఇంత గొప్పగా రాణించడం అత్యంత అరుదు. నిజంగా సిరాజ్ అద్భుతం చేశాడు’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఆది నుంచే చుక్కలు కొలంబోలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు ఆది నుంచే చుక్కలు చూపించారు భారత పేసర్లు. ముందుగా జస్ప్రీత్ బుమ్రా వికెట్ పడగొట్టి శుభారంభం అందించగా.. సిరాజ్ సంచలన స్పెల్(6/21)తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 50 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య జట్టు. ఇక స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసింది. ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులు రాబట్టగా 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. రోహిత్ ఖాతాలో రెండో ఆసియా కప్ తద్వారా చాంపియన్‌గా నిలిచి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలోనూ రెండో ఆసియా కప్ ట్రోఫీ చేరింది. అదే విధంగా.. అంతర్జాతీయ టైటిల్ కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న అభిమానుల కల నెరవేరింది. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన రోహిత్.. సిరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లను కొనియాడాడు. కాగా సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందగా.. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఇక సిరాజ్ మియా సంచలన ప్రదర్శన నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 A sensational bowling performance, a comprehensive win and the #AsiaCup2023 title triumph 🏆 Recap #TeamIndia's memorable Sunday in Colombo 📽️🔽#INDvSL pic.twitter.com/Eym1a66jiX — BCCI (@BCCI) September 17, 2023 -
టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻 And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗 — rajamouli ss (@ssrajamouli) September 17, 2023 -
అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది. నమ్మలేకపోయాను నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఎల్లప్పుడూ స్వింగ్ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్‌లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్ ఫుల్‌గా స్వింగ్ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను. అవుట్ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 సిరాజ్ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(2) సహా కుశాల్ మెండిస్(17), సమరవిక్రమ(0), చరిత్ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేయగా.. హార్దిక్ పాండ్యా దునిత్ వెల్లలగే(8), ప్రమోద్ మదుషాన్(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ ఇక విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే -
ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే
Asia Cup 2023 Winner Team India: ఆసియా వన్డే కప్-2023 ఫైనల్.. టీమిండియా వర్సెస్ శ్రీలంక.. ఆదివారం.. అంతర్జాతీయ టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల ఐదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు.. సమిష్టితత్వాన్ని నమ్ముకుని రోహిత్ సేనను ఢీకొట్టేందుకు దసున్ షనక బృందం సిద్ధమయ్యాయి.. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సాగే కొద్దీ బంతి టర్న్ అయ్యే సూచనలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక కెప్టెన్ దసున్ టాస్ సందర్భంగా తెలిపాడు. రోహిత్ శర్మ కూడా తాము కూడా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపేవాళ్లమని పేర్కొన్నాడు. పైగా ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలుపొందింది. దీంతో.. అభిమానుల్లో ఆందోళన.. రోహిత్ టాస్ గెలిస్తే బాగుండు.. ప్చ్.. ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం.. కాసేపటికి కవర్లు తీయగానే కాస్త ఉత్సాహం.. ఏం జరుగబోతుందో చూద్దాం అనుకుంటుండగా.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అటాకింగ్ మొదలుపెట్టాడు.. మూడో బంతికే ఓపెనర్ కుశాల్ పెరీరా అవుట్. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా ఇలా శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికి పాతుమ్ నిసాంకను.. మూడో బంతికి సదీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా.. ఆ మరుసటి బాల్కే చరిత్ అసలంకను అవుట్ చేశాడు. అంతటితో సిరాజ్ వికెట్ల దాహం తీరలేదు.. ఆఖరి బంతికి ధనుంజయ డిసిల్వను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్లో ఏకంగా.. నాలుగు వికెట్లు.. వన్డే ఫార్మాట్లో అరుదుగా కనిపించే దృశ్యం.. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక్కడితో మన స్పీడ్‌స్టర్ సిరాజ్ జోరు ఆగిపోలేదు.. ఆ తర్వాత ఆరో ఓవర్ నాలుగో బంతికి లంక కెప్టెన్ దసున్ షనకను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు కూల్చిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆ తర్వాత మళ్లీ పన్నెండో ఓవర్లో రోహిత్ శర్మ మరోసారి సిరాజ్‌కు బంతినివ్వగా.. రెండో బాల్కే శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్‌ను బౌల్డ్ చేశాడు. ఫాస్ట్ ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత భారత పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగాడు. 13 ఓవర్ మూడో బంతికి లంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగేను అవుట్ చేశాడు. అనంతరం.. పదహారో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో ప్రమోద్ ఇచ్చిన క్యాచ్ విరాట్ కోహ్లి ఒడిసిపట్టడంతో లంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే పతిరణ కూడా అవుట్! ఇంకేముంది 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. There was absolutely no respite for Sri Lanka as @hardikpandya7 joined the action to complete a 3-wicket haul with back-to-back wickets 🔥 P.S. This is the lowest score in Asia Cup history 🤯 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/15vGk0qTmZ — Star Sports (@StarSportsIndia) September 17, 2023 అసలు ఇది వన్డే మ్యాచా లేదంటే.. టీ20నా.. ఓసారి గిల్లి చూసుకోవాల్సిందే అనేంతలా టీమిండియా ఫాస్ట్‌బౌలర్ల విజృంభణతో పాపం దసున్ షనక బృందం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 15.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. సొంతగడ్డపై అవమానకర రీతిలో భారీ పరాభవం మూటగట్టుకుంది. టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిరాజ్ సహా బుమ్రా, పాండ్యా అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు భారత సారథి రోహిత్ శర్మ. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు జోడీగా ఈ వికెట్ కీపర్‌ను పంపాడు. కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు కుర్రబ్యాటర్లు ఏమాత్రం వమ్ము చేయలేదు. ఇషాన్ 18 బంతుల్లో 23, గిల్ 19 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టి.. 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేలా చేశారు. ఇంకేముంది ఎనిమిదోసారి భారత్ ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. Sublime 4️⃣ Timed to perfection by @ShubmanGill, bisecting the field & sending the ball to the fence.#TeamIndia's chase to the 🏆 is underway! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/vepXPaLvmZ — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Kishan on a roll! Back-to-back 4️⃣s for @ishankishan51 opening the batting, getting #TeamIndia racing towards victory! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NchlAeTbpU — Star Sports (@StarSportsIndia) September 17, 2023 చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
సిరాజ్ సంచలనం.. తమ వరల్డ్ రికార్డును తామే బ్రేక్ చేసిన శ్రీలంక! చెత్తగా..
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ హైదరాబాదీ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంకతో మొదలుపెట్టిన సిరాజ్ వరుసగా వన్‌డౌన్ బ్యాటర్ సదీర సమరవిక్రమ, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వ, కెప్టెన్ దసున్ షనకలను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ విశ్వరూపం.. బెంబేలెత్తిన లంక బ్యాటర్లు 12వ ఓవర్ ముగిసే సరికి ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి లంకను దెబ్బకొట్టగా.. సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో సింహళీయుల జట్టు వన్డే చరిత్రలో తన పేరిట ఉన్న చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది. 2012లో పర్ల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 13 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. తాజాగా టీమిండియాతో ఆసియా కప్ ఫైనల్లో 12 పరుగుల వద్దే ఆరో వికెట్ పారేసుకుంది. అసోసియేట్ దేశాలు మినహా టెస్టు ఆడే జట్లలో శ్రీలంక రెండుసార్లు ఈ మేరకు ఘోర పరాభవం మూటగట్టుకోవడం గమనార్హం. కెనడా లంక చేతిలో.. లంక ఇలా కాగా 2003లో శ్రీలంకతో పర్ల్‌లో 12 పరుగులకు.. అదే విధంగా 2013లో నెట్ కింగ్ సిటీతో మ్యాచ్‌లో 10 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సహా ప్రత్యర్థి చేతిలో ఇలా భంగపడటం రెండూ శ్రీలంక జట్టుకే చెల్లిందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
సిరాజ్ పెర్ఫార్మెన్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. కార్ ఇచ్చేయండి సార్..
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 (Asia Cup) ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ భారత్ వశమైంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్ బ్యాంటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 6 వికెట్లు సాధించాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సిరాజ్ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్ సిరాజ్‌కు ఎస్యూవీ గిఫ్ట్ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
Asia Cup 2023 Final IND VS SL: చరిత్ర సృష్టించిన సిరాజ్
భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 4 వికెట్లతో పాటు 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున సింగిల్ స్పెల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. The historical over of Mohammad Siraj.....!!! 4 wickets in a single over. pic.twitter.com/aMd3cihLso — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 చమిందా వాస్ రికార్డు సమం.. ఓవరాల్‌గా చూస్తే.. సిరాజ్ లంక పేస్ దిగ్గజం చమిందా వాస్ రికార్డును సమం చేశాడు. వాస్ కూడా సిరాజ్ లాగే ఓ స్పెల్‌లో 16 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తన స్పెల్‌లో తొలి 16 బంతుల్లో (2.4 ఓవర్లలో) ఓ మెయిడిన్ ఓవర్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj registers the fastest ever 5 wicket haul in a spell for India in international cricket - 16 balls. pic.twitter.com/ilfFa1pZ4u — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్.. ఓ మెయిడిన్ ఓవర్ వేసి 13 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj - the hero! A superb delivery to get his 6th wicket. pic.twitter.com/U3mDt9u9WG — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 నిస్సంక (2, జడేజా క్యాచ్), కుశాల్ మెండిస్ (17, బౌల్డ్), సమరవిక్రమ (0, బౌల్డ్), అసలంక (0, ఇషాన్ కిషన్ క్యాచ్), ధనంజయ డిసిల్వ (4, రాహుల్ క్యాచ్), షనక (0, బౌల్డ్) వికెట్లు సిరాజ్ ఖాతాలో పడ్డాయి. కుశాల్ పెరీరాను (0) బుమ్రా.. వెల్లలగేను (8) హార్దిక్ ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 40/8గా ఉంది. ప్రమోద్ మధుషన్ (0), దుషన్ హేమంత (6) క్రీజ్‌లో ఉన్నారు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023