Moon
-
అథెనా కథ ముగిసింది
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్‌ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది. వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్‌కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది. -
చందమామపై బ్లూ ఘోస్ట్
కేవ్ కెనావెరల్ (యూఎస్): చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. చంద్రుని ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో ఇది దిగిందని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ ప్రకటించారు. ‘‘దశాబ్దకాలం క్రితం పురుడుపోసుకున్న మా అంకుర సంస్థ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ పలు గండాలను తప్పించుకుంది. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. గతంలో పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయతి్నంచి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్, కూలిపోవడం, ఒరిగిపోవడం వంటి అపశ్రుతులకు తావులేకుండా ఒక ప్రైవేట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా చంద్రునిపై ల్యాండర్‌ను దించడం ఇదే తొలిసారి. దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి. బ్లూఘోస్ట్ ల్యాండయిన అరగంటకే చంద్రుని పరిసరాల ఫొటోలు తీసి అమెరికాలో ఆస్టిన్ నగరంలోని సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. అమెరికాలో అరుదైన పేడపురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు. వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్సూట్పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది. గురువారం మరో ల్యాండర్ హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్ల ఎత్తయిన ల్యాండర్‌ను గురువారం చంద్రునిపై దింపేందుకు కూడా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో కిందివైపు దాన్ని ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్‌ను విజయవంతంగా దించినా దాని కాలు విరిగి పక్కకు ఒరిగి నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్‌ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రునిపై కాలుమోపనుంది. దీన్ని కూడా బ్లూఘోస్ట్తో పాటే ప్రయోగించారు. -
వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం
టెక్సాస్: చంద్రగ్రహణాన్ని భూమి నుంచి చూశారు. అయితే అత్యంత దగ్గరగా, అది కూడా ఆకాశం నుంచి చూశారా? లేదు కదా. అయితే వచ్చే నెలలో చంద్రునిపై దిగనున్న బ్లూ ఘోస్ట్ ల్యాండర్ చంద్రగ్రహణాన్ని అత్యంత సమీపం నుంచి చూపించి అబ్బురపరిచింది. అది తాజాగా తీసిన చంద్రగ్రహణం ఫొటోలను జతకూర్చి వీడియోగా కూర్చి ల్యాండర్ తయారీదారు ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో తెగ వైరలవుతోంది. ల్యాండర్ ప్రస్తుతం అంతరిక్షంలో భూ సమీప కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగ్రహణం ఫొటోలను తన 6.6 అడుగుల ఎత్తయిన డెక్ నుంచి కెమెరాలో బంధించింది. సూర్యకిరణాల వల్ల ఏర్పడిన తన నీడతో భూమి చంద్రుడిని కప్పేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనువిందు చేస్తున్నాయి. చంద్రునిపై నాసా పరిశోధనలకు పరికరాలను మోసుకెళ్లేందుకు ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సరీ్వసెస్’ ప్రాజెక్టులో భాగంగా జనవరి 15న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌ను ప్రయోగించారు. -
చంద్రునిపైకి ‘ఘోస్ట్’ ప్రయోగం
హాథ్రోన్: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్2లను ల్యాండర్లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్ఎక్స్ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే.. Today’s mission is our third launch to a lunar surface and just the first of several our Falcon fleet will launch for @NASA’s Commercial Lunar Payload Services (CLPS) program this year. These missions help humanity explore the Moon, Mars, and beyond, bringing us one step closer… pic.twitter.com/Go2yUccFb3— SpaceX (@SpaceX) January 15, 2025ఘోస్ట్ ఏం చేస్తుందంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్ లూనార్ ప్లేలోడ్ సర్వీసెస్(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. హకుటో చేసే పని ఇదే.. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ హకుటో ఆర్2 అనే రీసైలెన్స్ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్ ఫ్రిగోరిస్లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్లు పనిచేయకపోవడంతో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. టెనాషియస్ అనే మైక్రోరోవర్ను హకుటో-ఆర్2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో కనువిందైన దృశ్యం కనిపించింది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, భారీ వలయంతో కూడిన గ్రహం శని మన చందమామకు చాలా చేరువలో కనిపించాయి. శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ అద్భుతాన్ని జనం వీక్షించారు. ఇండియాతోపాటు యూకే, అమెరికా, చైనా, తుర్కియే తదితర దేశాల్లో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే ఇది కంటికి కనిపించడం విశేషం. బైనాక్యులర్స్ లేదా టెలి స్కోప్ ఉన్నవారు మరింత స్పష్టంగా చూడగలిగారు. ముఖ్యంగా శని గ్రహం చుట్టూ ఉన్న వలయాన్ని ఆసక్తిగా గమనించారు. అంతరిక్షంలో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని సైంటిస్టులు చెప్పారు. ఈ నెల 18వ తేదీన మళ్లీ ఇలాంటి దృశ్యం వీక్షించవచ్చని సూచించారు. -
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
ఈ చిత్రం అద్భుతం కదూ..!
సూర్యచంద్రులను ఏకకాలంలో మోస్తూ.. తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతం కదూ.. అమెరికాలోని యూటా రాష్ట్రంలో సూర్యగ్రహణం సమయంలో బెల్వా హేడెన్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం నేచర్స్ బెస్ట్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో అవుట్డోర్ అడ్వెంచర్ కేటగిరీలో మొదటి బహుమతిని గెలుచుకుంది. -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!
భూమి మినహా ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా? కోట్లాది నక్షత్ర మండలాలు, తారాతీరాలు, గ్రహాలు... సుదూరాన ఇలా ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి పరిఢవిల్లుతోందా? భూమి కాకుండా ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై జీవరాశి జాడ తెలుసుకోవడమెలా? జీవులకు ఆవాసయోగ్యమైన భౌమ్యేతర ప్రదేశాలను కనిపెట్టడమెలా? జీవం ఉనికి, జీవుల మనుగడకు సంబంధించి సానుకూల పరిస్థితులతో ఆశలు రేకెత్తిస్తున్న ప్రదేశాలు మన సౌరకుటుంబంలో ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ సాగాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? ఈ అన్వేషణకు ఒక సరైన, అత్యుత్తమ ప్రదేశమేదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఈ నెల 10న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. జలం మూలం ఇదం జీవం! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. యూరోపాపై ఏకంగా ఓ భారీ సముద్రమే ఉంది! దాని అడుగుభాగం శిలానిర్మితమని, ప్రాణుల మనుగడకు అవసరమైన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. ఈ ‘బిల్డింగ్ బ్లాక్స్’ యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉంటాయని; తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ మూలకాలను దానిపై విడిచిపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీది సమస్త శక్తికీ సూర్యుడే ఆధారం. కిరణజన్యసంయోగ క్రియతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం ద్వారా మానవులు, జంతువులకు శక్తి బదలాయింపు జరుగుతుంది. కానీ యూరోపాలోని మహాసముద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని భావిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగానే రసాయన చర్యల వల్ల యూరోపాలోని సముద్రంలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని ఊహిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలా కాలం గడిచి ఇక జీవం పుట్టే సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా అక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న ప్రదేశం యూరోపానే!యూరోపా.. ఆశల లోకం!జీవాన్వేషణలో ‘నాసా’ యూరోపాను ఎంచుకోవడానికి కారణాలు బోలెడు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో తన టెలిస్కోపుతో కనుగొన్నారు. ఆ గెలీలియన్ మూన్స్ పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో యూరోపా మన చంద్రుడి సైజులో ఉంటుంది. యూరోపా ఓ ‘ఐసీ మూన్’. దాని ఉపరితలం మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 5-40 కిలోమీటర్లు. మంచు పొర కింద 50-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. మన భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని ఆ మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపా ఉపరితలంపై పెద్ద సంఖ్యలో పగుళ్లు, కొద్దిపాటి బిలాలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా దాని ఉపరితలం భౌగోళికంగా క్రియాశీలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి కానే కాదు! అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వబోవటం (డ్రిల్ చేయడం) లేదు. అలాగే అక్కడి మహా సముద్రం లోపలికి చొచ్చుకెళ్లి పరిశీలించబోవడం లేదు కూడా. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవుల ఆవాసానికి అవసరమైన నివాసయోగ్యతా సామర్థ్యం యూరోపాకు ఉందా? ఆసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును నాసా చేపడుతోంది. భవిష్యత్ మిషన్లకు అవసరమయ్యే ముఖ్య సమాచారాన్ని యూరోపా క్లిప్పర్ నౌక సంపాదించబోతోంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిరులు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి నిటారుగా పైకి లేస్తున్న నీటి ఆవిరులు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్.. అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్! గ్రహాంతర అన్వేషణ కోసం ‘నాసా’ ఇప్పటివరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక బరువు 6 టన్నులు. ఇందులో ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో 9 శాస్త్రీయ పరికరాలు అమర్చారు. యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ వాటిలో ఉన్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ నౌక ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే! బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువగా (77 కోట్ల కిలోమీటర్లు) ఉంటుంది. సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక సూర్యకిరణాలు కూడా బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, ఆ డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. తక్కువ ఇంధనం వినియోగం నిమిత్తం తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని ‘యూరోపా క్లిప్పర్’ ఉపయోగించుకుంటుంది. ఐదున్నరేళ్లు సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2030 ఏప్రిల్‌లో ‘యూరోపా క్లిప్పర్’ గురుగ్రహం కక్ష్యను చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోమారు గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ ప్రమాదం మెండు. అందుకే క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటు చేశారు. యూరోపాలో మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, దాని లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టాలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్ కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. అయితే, హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను తాకే అవకాశమున్నందున యూరోపా క్లిప్పర్ ప్రయోగం వాయిదా పడొచ్చు. కానీ, నాసా మాత్రం ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. -జమ్ముల శ్రీకాంత్.(Courtesy: NASA, The New York Times, Space.com, Astrobiology News, TIME, CNN, Business Standard, DNA, Mint, The Economic Times, Hindustan Times). -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
జాబిల్లిపై రోబో గోడలు!
ఇప్పటి వరకు భూమి మీద రోబోలు గోడలు కట్టడం చూసి ఉంటారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఏకంగా చంద్రుని మీద గోడ కట్టడానికి కావాల్సిన ఓ రోబోట్ తయారీకి సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.చంద్రుని ఉపరితలం మీదకు ఇప్పుడు రాకపోకలు ఎక్కువయ్యాయి. నాసాకు సంబంధించిన ఆర్టెమిస్ మిషన్ చంద్రునిపై కాలనీని స్థాపించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. కక్ష్యలో ఉన్న గేట్‌వే & చంద్ర ఉపరితలం మధ్య వలసవాదులను రవాణా చేయడానికి స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ (HLS) ఉపయోగిస్తుంది. దీని వల్ల రాబోయే రోజుల్లో ఇక్కడ ధూళి ఏర్పడుతుంది.చంద్రుని మీద ధూళి ఏర్పడితే కొన్ని పరిశోధనలకు పంపించే సున్నితమైన పరికరాలలో ఏదైనా సమస్య ఏర్పడవచ్చు. కాబట్టి చంద్రుని మీద లాంచ్, ల్యాండింగ్ సైట్ల చుట్టూ గోడలను నిర్మించాలనే ఆలోచనతో 3D ప్రింటింగ్‌ను ఉపయోగించడం వంటి సాధ్యమైన పరిష్కారాలతో ముందే అన్వేషిస్తున్నారు.చంద్రుని మీద గోడలను నిర్మించడానికి.. జోనాస్ వాల్తేర్ ఓ మెరుగైన మార్గం అన్వేషిస్తున్నారు. దీనికోసం హెచ్ఈఏపీ ఎక్స్కవేటర్ల వంటి ఆటోమాటిక్ రోవర్లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోవర్లు చంద్రునిమీద గోడ నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ బెర్న్లోని సెంటర్ ఫర్ స్పేస్ అండ్ హాబిటబిలిటీలో పనిచేసిన జోనాస్ వాల్తేర్ ఆటోమాటిక్ రోబోట్స్ చంద్రునిమీద గోడలు నిర్మించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. కాగా ఇప్పటికే కొంతమంది పరిశోధకులు బౌల్డర్ బ్లాస్ట్ షీల్డ్‌లను చంద్రునిపై అరిస్టార్కస్ పీఠభూమి & షాకెల్టన్ హెన్సన్ కనెక్టింగ్ రిడ్జ్ వంటి రెండు ప్రాంతాలలో గోడలు నిర్మించడానికి అనుకూలంగా ఉందా అని పరిశీలించారు.ఇదీ చదవండి: 50వేల ఉద్యోగులకు 10 రోజుల సెలవు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయంపరిశోధకుల లెక్కల ప్రకారం.. 164 అడుగులు, 1030 అడుగులు చుట్టుకొలత & 10.8 అడుగుల వ్యాసార్థం కలిగిన షీల్డ్ రింగ్‌లను నిర్మించడంపై దృష్టి సారించాయి. అయితే బండరాళ్ల కోసం రోవర్లు 1000 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. చంద్రునిపై రోవర్లు ఛార్జ్ చేసుకోవడానికి.. నిద్రాణస్థితిలో ఉండటానికి సమయాన్ని లెక్కించి గోడను కనీసం 126 రోజులలో నిర్మించవచ్చని బృందం అంచనా వేసింది. అయితే చంద్రుని మీద ఇవన్నీ సాధ్యమవుతాయా? లేదా? అనేది ప్రస్తుతం సమాధానం లభించాల్సిన ప్రశ్నగానే ఉంది. -
చందమామపై నీటి జాడలు!
బీజింగ్: చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా? అంటే నిజమేనని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా, జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) వెల్లడించింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగే–5 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. -
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన చాంగ్యీ–6
బీజింగ్: చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(సీఎన్ఎస్ఏ) సరికొత్త చరిత్ర సృష్టించింది. చందమామపై మనకు కనిపించని అవతలివైపు భాగం నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచి్చంది. చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ మాడ్యూల్ చాంగ్యీ–6 జాబిల్లి నుంచి మట్టిని మోసుకొని స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో క్షేమంగా దిగింది. చంద్రుడి అవతలి వైపు భాగంలోని మట్టిని భూమిపైకి సురక్షితంగా చేర్చిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డుకెక్కింది.చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. చాంగ్యీ–6 మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని సీఎన్ఎస్ఏ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైనా అధినేత షీ జిన్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలిపారు. చాంగ్యీ–6 వ్యోమనౌక ఈ ఏడాది మార్చి 3న జాబిల్లి దిశగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఇందులో అర్బిటార్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే భాగాలు ఉన్నాయి.53 రోజులపాటు అవిశ్రాంతంగా ప్రయాణం సాగించి, జూన్ 2న చందమామ దక్షిణ ధ్రువంలోని సౌత్‌పోల్–అయిట్కెన్(ఎస్పీఏ) ప్రాంతంలో సురక్షితంగా దిగింది. రోబోటిక్ హస్తం సాయంతో రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన అసెండర్ జూన్ 4న తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. జూన్ 6న భూకక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్బిటార్–రిటర్నర్కు మట్టి నమూనాలను బదిలీ చేసింది.భూమిపై అడుగుపెట్టడానికి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఆర్బిటార్–రిటర్నర్ 13 రోజలపాటు కక్ష్యలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు మంగళవారం భూమిపైకి క్షేమంగా చేరుకుంది. అరుదైన మట్టి నమూనాలను తీసుకొచి్చంది. వీటిలో వేల ఏళ్ల నాటి అగి్నపర్వత శిలలు కూడా ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు దీటుగా చైనా దూసుకెళ్తోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపించబోతున్నామని గతంలోనే ప్రకటించింది. -
చంద్రుని ఆవలి వైపుకు చాంగే6
బీజింగ్: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్కెన్(ఎస్పీఏ) బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్–రిటర్నర్, ల్యాండర్–అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటార్–రిటర్నర్ జత నుంచి ల్యాండర్–అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్–రిటర్నర్ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్ ల్యాండర్–అసెండర్ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్–అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్–రిటర్నర్ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. -
‘భారత్ చంద్రుడిపై అడుగు పెడితే.. మనం మాత్రం’
ఇస్లామాబాద్: భారత దేశం చంద్రుడి మీద అడుతుపెడుతుంటే.. కరాచీలో తెరిచి ఉన్న ముగురు కాలువలో పడి చిన్నారులు మృతి చెందిన వార్తలను పాక్ చూస్తోందని ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా ప్రసంగించారు.‘‘కరాచీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక పక్క ప్రపం దేశాలు చంద్రుడిపైకి వెళ్తుంటే.. కరాచీ మాత్రం తెరిచిన ఉన్న మురుగు కాలువల్లో చిన్నారులు పడిపోయి మృతి చెందిన వార్తలతో నిలుస్తోంది. భారత్ చంద్రుడి అడుగుపెట్టిందన్న రెండు సెకండ్లకు కరాచీలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక.. కరాచీ స్వచ్ఛమైన నీరు దొరకటం లేదు.سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024మరోవైపు.. మొత్తం 2.6 కోట్ల మంది చిన్నారుల్లో 70 లక్షల మంది పిల్లలు అసలు పాఠశాలకు వెళ్లటం లేదు. కరాచీ పాకిస్తాన్‌కి ఆదాయం ఇచ్చే ఇంజన్ లాంటి నగరం. ఇక్కడ రెండు సముద్రపు పోర్టులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం పాకిస్తాన్‌కి కరాచీ గేట్‌వే వంటిది. అటువంటి కరాచీ నగరంలోనే స్వచ్ఛమైన నీరు లభించటం లేదు. నీటి కోసం ట్యాంకర్ మాఫియా నడుస్తోంది’’ అని సయ్యద్ విమర్శలు చేశారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇక..పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్.. విస్తరించిన రుణ సౌకర్యంలో భాగంగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద రుణం కోరుతోంది. -
దేశ రాజధానిలో ఘనంగా ఈద్ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్ మసీదు ఇమామ్‌లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. #WATCH | Delhi: Devotees gather at Jama Masjid to offer prayers, on the occasion of Eid-ul-Fitr. pic.twitter.com/Id3OsJDGxv — ANI (@ANI) April 11, 2024 -
చంద్రుడికి టైం వచ్చింది..!
-
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర!
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర! -
చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం!
చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనా తలపోస్తున్నాయి. అందుకవసరమైన విద్యుత్ అవసరాలను సోలార్ ప్యానళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో జాబిలిపై ఏకంగా అణు విద్యుత్కేంద్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి! అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణకు తెర తీశాయి కూడా... అంతరిక్ష పోటీలో కీలక ముందడుగు వేసే దిశగా రష్యా, చైనా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా కదులుతున్నాయి. 2035 లోపు అక్కడ అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని నిశ్చయానికి వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఇదంతా సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే, ‘‘న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుంది. మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మున్ముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు చాలవు. అణు విద్యుతే ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కనుకనే బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించాం’’ అని ఆయన వివరించారు. పర్యవేక్షణకు అంతరిక్ష ‘అణు’నౌక... అయితే చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం వ్యవస్థాపన మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు యూరీ వెల్లడించారు.... ► తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిన సాగుతాయి. ► ఇందుకోసం ప్రధానంగా రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని నడిపిస్తారు. ► స్పేస్ టగ్బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసే యోచనలో రష్యా ఉంది. ► ఇందులో భారీ అణు రియాక్టర్‌తో పాటు హై పవర్ టర్బైన్లు కూడా ఉంటాయి. ► విద్యుత్కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాన్నుంచే చంద్రునిపైకి పంపుతారు. ► దాని నిర్మాణ క్రమంలో వెలువడే అంతరిక్ష వ్యర్థాలు తదితరాలను క్లియర్ చేసే పని కూడా ఈ నౌకదే. చల్లబరచేదెలా...? చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం నిర్మాణంలో ఇమిడి ఉన్న అనేకానేక సాంకేతిక సమస్యలను అధిగమించడంలో రష్యా, చైనా తలమునకలుగా ఉన్నాయి. అయితే అణు ప్లాంటును ఎప్పటికప్పుడు చల్లబరచడం వాటికి అత్యంత కీలకమైన సవాలుగా మారనుంది. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా–25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఆ ఎదురుదెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అణు కేంద్రం విషయంలో వెనక్కు తగ్గొద్దని పట్టుదలగా ఉంది. ఆలోపే చైనాతో కలిసి మానవసహిత చంద్ర యాత్ర, ఆ వెంటనే చంద్రునిపై శాశ్వత బేస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా కూడా 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ అమెరికా ఓ కంట కనిపెడుతూనే ఉంది. వీలైనంత త్వరగా అంతరిక్షంలో అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకోవడమే రష్యా లక్ష్యమని ఇప్పటికే ఆరోపించడం తెలిసిందే. ఇదంతా పెద్ద దేశాల నడుమ అంతరిక్షంపై ఆధిపత్య పోరుకు దారి తీసే ఆస్కారం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా విని్పస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆచితూచి అడుగేద్దాం!
శాస్త్రవిజ్ఞాన విజయాలతో మానవాళి ఎప్పటికప్పుడు ముందడుగేయడం చరిత్రలో సంతోష సందర్భమే. గతవారం అలాంటి మరో సందర్భం ఎదురైంది. పుడమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన చంద్రునిపై మరోసారి మానవ మేధ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇప్పటి దాకా వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారిక అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు సాధించడం చూశాం. ఈసారి ఓ ప్రైవేట్ సంస్థ చందమామపై జయకేతనం ఎగరేసింది. అమెరికాకు చెందిన ‘ఇన్ట్యూటివ్ మెషిన్స్’ (ఐఎం) సంస్థ ఫిబ్రవరి 22న ఓ రోబోటిక్ వ్యోమనౌకను చందమామపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అయిదే దేశాలు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలా చూస్తే, ఒక ప్రైవేట్ సంస్థ ఆ అపురూప విన్యాసం చేయడం చెప్పుకోదగ్గ మైలురాయి. అయితే, చరిత్రలో రెండో పర్యాయం ఇప్పుడు మళ్ళీ జాబిల్లిపై వ్యోమయానం ఊపందుకున్న వేళ రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిర్దిష్టమైన అంతరిక్ష విధానం, ప్రత్యేక అంతరిక్ష చట్టం అవసరం ఉందని అర్థమవుతోంది. అమెరికా అంతరిక్ష నౌక ఒకటి చంద్రమండల ఉపరితలంపై దిగడం గత 50 ఏళ్ళ పైచిలుకులో ఇదే ప్రథమం! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ 1972లో అపోలో ప్రోగ్రామ్‌కు తెర దించిన తర్వాత మళ్ళీ ఆ దేశం చంద్ర మండల పునఃప్రవేశం మళ్ళీ ఇప్పుడే! చంద్రునిపై వ్యోమనౌక దిగడమనే సవాలులో మానవజాతి ఎన్నో ఏళ్ళుగా విజయాలు, వైఫల్యాలు – రెండూ చవిచూసింది. చంద్రునిపై దిగడంలో విఫలమైన ప్రతిసారీ వ్యోమనౌకల శకలాలు చంద్రోపరితలంపై చెల్లాచెదరై పడివుండడమూ చూశాం. అంతెందుకు... గత నెలలో మరో అమెరికన్ సంస్థ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ’ సైతం ఓ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపాలని చూసింది. ఇంధనం లీకేజీతో ఆ యత్నాన్ని అర్ధంతరంగా ముగించింది. సదరు ల్యాండర్ భూవాతావరణంలోకి పునఃప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంపై దగ్ధమైంది. విఫలమైన ఆ ‘ఆస్ట్రోబోటిక్’, విజయవంతమైన ‘ఐఎం’ సంస్థ... రెండూ ‘నాసా’ అండతో వాణిజ్యపంథాలో చంద్రునిపైకి వ్యోమనౌకల్ని పంపే కృషిలో భాగమే. గగనాంతర సీమల గవేషణలో ప్రైవేట్ రంగ ప్రమేయం పెరుగుతున్న తీరుకు ఇది ఉదాహరణ. చరిత్ర గమనిస్తే – 1966లోనే సోవియట్ యూనియన్ ‘లూనా9’ తొలిసారిగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. నాలుగు నెలల తర్వాత ‘సర్వేయర్1’తో అమెరికా విజయం సాధించింది. అది క్రమంగా చంద్రునిపైకి మానవయాత్రకు దారి తీసింది. 1969లో నాసా ‘అపోలో11’తో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్ద్రిన్లు చంద్రునిపై అడుగిడిన తొలి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినప్పటి నుంచి ఇప్ప టికి అరడజనుకు పైగా యాత్రల్లో డజను మంది చంద్రునిపై కాలుమోపారు. 2026 చివరి కల్లా మరోసారి చంద్రునిపైకి మానవ యానానికి అమెరికా సిద్ధమవుతోంది. మూడో దేశంగా చైనా, గత ఏడాది ‘చంద్రయాన్3’ ద్వారా రెండో ప్రయత్నంలో విజయం సాధించి నాలుగో దేశంగా భారత్ చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి. ఈ జనవరిలో జపాన్ తప్పుదిశలో ల్యాండింగ్ జరిపినప్పటికీ, అసలంటూ చేసిన అయిదో దేశంగా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఐఎం విజయంతో చంద్రమండల యాత్రల్లో ప్రైవేట్ రంగ శక్తియుక్తులు హెచ్చనున్నాయి. మరిన్ని యాత్రలకు సన్నాహాలు సాగుతు న్నందున లోతైన అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు కలువలరేడు కేంద్రబిందువు కానున్నాడు. నిజానికి, చంద్రునిపై దిగేందుకు ప్రైవేట్ సంస్థలు గతంలోనూ అనేక యత్నాలు చేశాయి. 2019లో ఇజ్రాయెల్ బెరేషీట్ చంద్రునిపై కుప్పకూలింది. 2023లో ఓ జపనీస్ సంస్థ తాలూకు ల్యాండర్ పడిపోయింది. తాజా ప్రైవేట్ ప్రయోగ విజయంలోనూ లోటుపాట్లు లేకపోలేదు. గ్రీకు పురాణా ల్లోని తెలివైన వీరుడు ‘ఒడిస్సియస్’ పేరు పెట్టుకున్న ఐఎం వారి వ్యోమనౌక ఆఖరుఘట్టంలో జాబిల్లి దక్షిణ ధ్రువానికి దగ్గరలో నేరుగా కాక అనుకున్నదాని కన్నా వేగంగా, పక్కవాటుగా దిగింది. దాంతో, ముందనుకున్నట్టు వారం కాకుండా, 2–3 రోజుల ముందే తట్టాబుట్టా సర్దుకుంటోంది. అయితే, అసలంటూ ఐఎం విజయవంతం కావడంతో నాసా ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద మరిన్ని ప్రైవేట్ ప్రయత్నాలు సాగుతాయి. 2020 నాటికి పూర్తయ్యేలా మరో 14 ప్రైవేట్ సంస్థలతో నాసా పెట్టుకున్న 260 కోట్ల డాలర్ల కాంట్రాక్టులే అందుకు తార్కాణం. ఇటీవలే భారత్ సైతం జాతీయ అంతరిక్ష రంగంలో నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టు బడులకు ద్వారాలు తెరిచింది. అంటే రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై భారం తగ్గి, ప్రైవేట్ రంగంలో భారతీయ అంకుర సంస్థల మధ్య పోటాపోటీ పెరగనుంది. ప్రపంచమంతటా ఇలాంటి ప్రైవేట్ ప్రయత్నాలతో కష్టాలూ తప్పవు. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ మినహా ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలేవీ లేవు. ఆ ఒడంబడిక సైతం అనుసరించాల్సిన విధుల జాబితాయే తప్ప, పాటించి తీరాల్సిన ఆదేశాలు కావు. తాజా ఒడిస్సియస్ దెబ్బతో వివిధ సంస్థలు చంద్రునిపైకి ఏవైనా పంపి, దాన్ని ఎలాగైనా నింపే వీలుంది. అందుకే, ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష, చంద్రమండల చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఇప్పటికే ఉప గ్రహాలతో క్రిక్కిరిసిన దిగువ భూకక్ష్య లానే చంద్రమండలమూ నిండవచ్చని శాస్త్రవేత్తల జోస్యం. చంద్రునిపై నిర్ణీత ప్రాంతాలు శాస్త్రీయ పరిశోధనా శాలలకు కీలకం గనక అవాంఛనీయ పోటీ తప్పదు. విలువైన హీలియమ్3 కోసం చంద్రునిపై గనుల తవ్వకాలు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాబట్టి, ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమిది. నైతికతకు కట్టుబడి పరిశోధనలు సాగిస్తూనే, వెన్నెలరేడు వాతావరణాన్ని విధ్వంసం చేయనిరీతిలో చట్టాలు చేసుకోవాల్సిన సమయమిది. -
మృత్యుంజయ ‘మూన్ స్నైపర్’!
ఓ వైజ్ఞానిక విశేషం... కాదు... అంతకంటే అబ్బురమే. జపాన్ శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన సంభ్రమాశ్చర్యాలు, ఆనందోత్సాహాలు... గత నెలలో చంద్రుడిపై దిగిన జపాన్ ల్యాండర్ ‘మూన్ స్నైపర్’ అనూహ్యంగా నిద్ర లేచింది. జాబిలిపై సుదీర్ఘంగా 14 రోజులపాటు కొనసాగిన రాత్రివేళలో గడ్డకట్టించే మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని దీటుగా తట్టుకుని మరీ బతికింది! నిజానికి అంతటి కఠోర శీతల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా జపాన్ దానిని తయారుచేయలేదు. కానీ అది మృత్యువును జయించి పునర్జన్మ పొందింది. ఈ ల్యాండర్ అసలు పేరు ‘స్లిమ్’ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్). ఆదివారం రాత్రి ‘మూన్ స్నైపర్’తో సమాచార సంబంధాల్ని పునరుద్ధరించి ఓ ఆదేశం పంపామని, ల్యాండర్ నుంచి ప్రతిస్పందన వచ్చిందని ‘ఎక్స్’ వేదికగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) వెల్లడించింది. చంద్రుడిపై మధ్యాహ్నం కావడంతో కమ్యూనికేషన్స్ సాధనాలు బాగా వేడెక్కినందున కొద్ది సేపటి తర్వాత ల్యాండరుతో సమాచార సంబంధాలు నిలిపివేశామని తెలిపింది. పరికరాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక కమ్యూనికేషన్స్ పునరుద్ధరిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. ‘మూన్ స్నైపర్’ గత నెల 19న చంద్రమధ్యరేఖకు దక్షిణంగా షియోలీ బిలం వాలులో దిగడమే తలకిందులుగా దిగింది. శీర్షాసనం భంగిమలో నిలిచిన దానిపై తొలుత జాక్సా ఆశలు వదిలేసుకుంది. సూర్యుడికి వ్యతిరేక దిశలో సౌరఫలకాలు ఉండిపోవటంతో ముందుజాగ్రత్తగా ల్యాండరును కొద్దిరోజులు నిద్రాణస్థితిలోకి పంపారు. అనంతరం సూర్యుడి దిశ మారి ఎండ అందుబాటులోకి రావటంతో సౌరశక్తిని సమకూర్చుకున్న ల్యాండర్ తిరిగి పని చేయడం ప్రారంభించింది. అనంతరం చంద్రుడిపై రాత్రి సమయం సమీపించడంతో దాన్ని మరోసారి నిద్రావస్థలోకి పంపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 మిషన్‌లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే... చంద్రుడిపై 14 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే రాత్రి వేళ అతి శీతల ఉష్ణోగ్రతలను భరించగలిగేలా ‘మూన్ స్నైపర్’ ల్యాండరును ‘జాక్సా’ డిజైన్ చేయలేదు. భూమ్మీద రెండు వారాల కాలానికి సమానమయ్యే అతి శీతల చంద్ర రాత్రిలో మనుగడ సాగించలేక ‘విక్రమ్’ ల్యాండర్ మూగబోయింది. కానీ ‘మూన్ స్నైపర్’ మాత్రం అదృష్టవశాత్తు జీవించగలిగింది. :::జమ్ముల శ్రీకాంత్ -
ఒడిస్సియస్ ఒరిగింది
వాషింగ్టన్: చంద్రునిపై కుదురుగా దిగని లాండర్ల జాబితాలోకి ఒడిస్సియస్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్ మెషీన్స్ ప్రయోగించిన ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇంట్యూటివ్ మెషీన్స్ (ఏఎం) సీఈవో స్టీవ్ ఆల్టెమస్ ధ్రువీకరించారు. అది నిర్దేశిత ప్రదేశంలోనో, ఆ దగ్గర్లోనో దిగి ఉంటుందన్నారు. ఒడిస్సియస్ నుంచి డేటా స్వీకరిస్తున్నట్టు ఏఎం, నాసా వెల్లడించాయి. అది మోసుకెళ్లిన పరికరాల్లో చాలా పేలోడ్స్ పని చేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాయి. జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ తాజాగా పంపిన ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలుమోపిన ‘మాలాపెర్ట్ ఎ’ బిలం వాస్తవానికి ల్యాండింగ్‌కు ప్రమాదభరితమైన ప్రదేశం. కానీ చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చోటునే ఎన్నుకున్నారు. లాండింగ్‌కు 30 సెకండ్ల ముందు ఒడిస్సియస్‌లోని ‘ఈగిల్ కామ్’ ల్యాండర్ నుంచి దూరంగా వెళ్లి ల్యాండింగ్ ఘట్టాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నేవిగేషన్ అవసరాల దృష్ట్యా ల్యాండింగ్ సమయంలో కామ్‌ను స్విచాఫ్ చేశారు. ‘‘ఒడిస్సియస్ పొజిషనింగ్‌కు సంబంధించిన ఫొటో చాలా ముఖ్యం. అందుకోసం ఈగిల్ కామ్‌ను విడుదల చేసేందుకు ప్రయతి్నస్తున్నాం. అది సుమారు 8 మీటర్ల దూరం నుంచి ఒడిస్సియస్‌ను ఫొటో తీస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఏఎం తెలిపింది. అయితే లాండింగ్‌కు కాస్త ముందు చంద్రునిపై షోంబర్గర్ క్రేటర్ ప్రాంతాన్ని దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒడిస్సియస్ ఫొటో తీసి పంపింది. సౌరఫలకాలు లాండర్ పై భాగంలో, యాంటెన్నా కింది భాగంలో ఉండిపోవటంతో దాన్నుంచి డేటా సేకరణ కూడా కష్టసాధ్యమవుతోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) త్వరలో ఒడిస్సియస్ ఆనుపానులు కనిపెట్టనుంది. ల్యాండర్ కచి్చతంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి ఫొటోలు తీయనుంది. -
పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్’.. ఆసక్తికర విషయం వెల్లడించిన ‘నాసా’
కాలిఫోర్నియా: జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్ ఒడిస్సియస్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఒడిస్సియస్ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్(గోయి) మలాపెర్ట్ సమీపంలో ఒడిస్సియస్ గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్(ఐఎమ్) అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్ పంపేందుకు ఒడిస్సియస్ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్ మెషిన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ తెలిపారు. ఒడిస్సియస్ ల్యాండ్ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులుండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది. ఇదీ చదవండి.. ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది -
చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!
జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది. ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి. వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం. వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ::: జమ్ముల శ్రీకాంత్ -
NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్ వన్
కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్ మెషిన్(ఐఎమ్ వన్) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్ వన్ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్కెనరావల్లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఐఎమ్ వన్ నోవా సి ల్యాండర్‌ను నింగిలోకి పంపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్(సీఎల్పీఎస్) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది. ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్ వన్ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయితే 1972 తర్వాత అమెరికా వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్ తర్వాత రెండో మిషన్‌గా చరిత్రకెక్కనుంది. ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది -
Nasa: చంద్రుని అరుదైన ఫొటో ! నాసా ఏం చెప్పిందంటే..
కాలిఫోర్నియా: చంద్రుడంటే భూమి మీదున్న ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇటీవల భారత్ చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయినప్పటి నుంచి చంద్రుని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ మరింత పెరిగింది. దీంతో చంద్రునికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఎలాంటి ప్రకటన చేసినా ఇటీవలి కాలంలో అది సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఈ నెల 4న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అమావాస్యకు దగ్గరగా ఉన్న అర్ధ చంద్రుని(వేనింగ్ క్రిసెంట్ మూన్) అరుదైన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అమావాస్యకు దగ్గరగా ఉన్నపుడు చంద్రుడు భూమి మీద నుంచి చూసేవాళ్లకు కొద్ది కొద్దిగా అదృశ్యమవుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి మీద ఉన్నవాళ్లకు కనిపించని పక్క చంద్రునిపై సూర్య కాంతి పడిన చిత్రాన్ని నాసా ఒడిసిపట్టింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీచదవండి.. భారత్, అమెరికా సంబంధాలు.. చపాతీ, పూరీలతో పోలిక -
శాశ్వత నిద్రలోకి ‘మూన్ స్నైపర్’
చివరి ఫొటో పంపిన జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్. చంద్రుడిపై షియోలి బిలంలో రాత్రి కమ్ముకోబోతుండగా సాయం సంధ్యకు కాస్త ముందుగా ల్యాండర్ తన కెమెరాలో బంధించిన ఆఖరి ఛాయాచిత్రాన్ని విడుదల చేసిన ‘జాక్సా’. జాబిలిపై రాత్రి అంటే... రెండు వారాలపాటు చీకటి. కనీస ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల ఫారన్‌హీట్ అంటే మైనస్ 123 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోతాయి. ప్రస్తుతం నిద్రాణ స్థితిలోకి వెళ్లిన ‘మూన్ స్నైపర్’. జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకుని మనుగడ సాగించేలా ల్యాండరును పొందించలేదు. చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడంతో చావు తప్పి కన్ను లొట్టపోయి, ఆఖరి క్షణంలో సుడి కుదిరి ఇప్పటికే ల్యాండర్ ఒకసారి చచ్చి బతికినంత పని అయిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై 14-15 రోజుల అతి తీవ్ర చలి రాత్రిని ల్యాండర్ ఎలాగోలా తట్టుకుని లక్కీ ఛాన్సుతో మరోసారి బతికితే సూర్యుడు పుణ్యమాని సోలార్ ప్యానెళ్ల సౌరశక్తి సాయంతో ఈ నెల మధ్యం నాటికి ల్యాండరును మళ్లీ పని చేయిస్తామని ‘జాక్సా’ అంటోంది. కానీ... ఇది ‘పగటి కల’. చంద్రుడిపై రాత్రి వేళల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల ధాటికి మన ‘ఇస్రో’ చంద్రయాన్-3‘ విక్రమ్’ ల్యాండర్ మూగబోయినట్టే జపాన్ ‘మూన్ స్నైపర్’ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే భావించాలి. -
బతికించిన సూరీడు.. ‘మూన్ స్నైపర్’ ఈజ్ బ్యాక్!
నిద్ర లేస్తూనే చకచకా పని ఆరంభించిన జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ ‘స్లిమ్’ ల్యాండరుతో ఆదివారం సాయంత్రం సమాచార సంబంధాలను పునరుద్ధరించినట్టు సోమవారం ‘ఎక్స్’ (పాత పేరు ట్విట్టర్) వేదికగా ప్రకటించిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’. ల్యాండరులోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరా (ఎంబీసీ)తో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మ (టాయ్ పూడిల్)ను పోలివున్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోవర్-2 (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఫొటో తీసింది. ల్యాండర్, దాని సమీపంలోని ఆ శిల ఛాయాచిత్రాన్ని ఎక్స్ వేదికగా ‘జాక్సా’ పోస్ట్ చేసింది. ‘మూన్ స్నైపర్’ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ‘మూన్ స్నైపర్’ సౌరఫలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవటంతో ల్యాండరులోని ఆన్‌బోర్డ్ బ్యాటరీని రెండున్నర గంటలు మాత్రమే వినియోగించి, 12% పవర్ ను ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచి దాన్ని ‘జాక్సా’ స్విచ్ ఆఫ్ చేసింది. ల్యాండరులోని సాంకేతిక సమస్యను అధిగమించామని, సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌరఘటాలు పనిచేస్తున్నాయని ‘జాక్సా’ వివరించింది. చంద్రుడి బిలంలో ల్యాండర్ డొల్లిపోయి తలకిందులుగా దిగినా, దాని సోలార్ ప్యానెళ్లు పై భాగంలో కాకుండా కిందివైపు... అదీ వెనుకవైపున సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నా... తాజాగా సూర్యరశ్మిని గ్రహించి అవి పనిచేయడం మొదలుపెట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ల్యాండర్ తలకిందులైనా దాని జాతకం తిరగబడి అది తుది ఘట్టంలో కుదురుకోవడం ఆశ్చర్యకర పరిణామం. ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటివరకు పనిచేస్తుందో ‘జాక్సా’ వెల్లడించలేదు. అయితే... జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే మైనస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు. చంద్రుడిపై 15 రోజులపాటు పగలు, 15 రోజులపాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే... గరిష్ఠంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేయవచ్చు. :::: జమ్ముల శ్రీకాంత్ -
అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం
జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగకముందు, దిగిన తర్వాత ‘క్లిక్’మనిపించిన ‘నాసా’ ఉపగ్రహం. ‘నాసా’ ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (LRO) ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం ఐదు రోజులకు అంటే ఈ నెల 24న ‘నాసా’ ఆర్బిటర్... ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆ సందర్భంగా జాబిలి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ ఛాయాచిత్రాలను LRO తన కెమెరాలో బంధించింది. ‘నాసా’ శుక్రవారం వాటిని విడుదల చేసింది. ఓ చిన్న చుక్కగా ల్యాండర్ ఈ ఫొటోల్లో దర్శనమిస్తోంది. చంద్రుడిపై 13.3160 డిగ్రీల దక్షిణ అక్షాంశ, 25.2510 తూర్పు రేఖాంశ ప్రదేశంలో, మైనస్ 912 మీటర్ల (మైనస్ 2,992 అడుగుల) ఎలివేషన్‌లో ‘మూన్ స్నైపర్’ దిగింది. ఈ మైనస్ ఎలివేషన్ అనేది జాబిలిపై నిమ్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఎందుకంటే.. చంద్రుడి ఉపరితలం కంటే దిగువన షియోలీ బిలం (భారీ గుంత) వాలులో ‘మూన్ స్నైపర్’ దిగింది. -
Japan: ‘మూన్ స్నైపర్’ శీర్షాసనం!.. ఇదిగో అసలు ఫొటో
చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగి శోధించడానికి ‘స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్’ (స్లిమ్)ను జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండర్ ముద్దు పేరు ‘మూన్ స్నైపర్’. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి 8:50 గంటలకు జాబిలి నేలపై ‘మూన్ స్నైపర్’ దిగడానికైతే మృదువుగా, సాఫీగానే దిగింది. కానీ.. పక్కకు డొల్లిపోయి ‘వెల్లకిలా పడిన తాబేలు’ మాదిరి తలకిందులు అయింది. ల్యాండింగ్‌లో సంభవించిన ఈ లోపం కారణంగా ‘జాక్సా’ ప్రస్తుతం భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. చంద్రుడిపై తాను దిగడానికి కొన్ని క్షణాల ముందుగా ల్యాండర్ జారవిడిచిన రెండో రోవర్ (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఈ ఫొటో తీసింది. సూర్యకాంతిని గ్రహించి, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి ల్యాండర్ బ్యాటరీని ఛార్జ్ చేయాల్సిన సౌరఫలకాలు(సోలార్ ప్యానెల్స్)ప్రస్తుతం సూర్యుడికి అభిముఖంగా లేవు. చదవండి: ‘మూన్ స్నైపర్’ బతికేనా?.. అవి ల్యాండర్ తల భాగంలో (కింది వైపు) సూర్యుడికి వ్యతిరేక దిశలో (ఆవలి వైపు) ఉన్నాయి. చంద్రుడిపై 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటాయి. చంద్రుడి ఈక్వెటర్ (చంద్రమధ్యరేఖ)కు దక్షిణంగా షియోలీ బిలం వాలులో సూర్యోదయ వేళలో ల్యాండర్ జాబిలిపై కాలుమోపాల్సింది పోయి ‘తలమోపింది’. ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో ఇప్పుడు మధ్యాహ్న సమయం. అంటే.. ల్యాండర్ పై భాగంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి కోణం మారి ఎండ కాస్త ఆవలి వైపునకు వెళితే సౌరఫలకాలకు సోకుతుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ‘స్లిమ్’ వ్యోమనౌకలోని ఆన్‌బోర్డ్ బ్యాటరీలో 12% పవర్ మిగిలివుంది. వ్యోమనౌక సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి అందుబాటులోకొస్తే బ్యాటరీని పునఃప్రారంభించాలని (రీ-స్టార్ట్ చేయాలని) ‘జాక్సా’ తలపోస్తోంది. అప్పుడు ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయత్నంలో జపాన్ సఫలం కావాలని కోరుకుందాం. ఆ 100 మీటర్ల స్పాట్లోనే దిగాం అసాధారణ రీతిలో కచ్చితత్వంతో కూడిన (ప్రెసిషన్) ల్యాండింగులో సఫలమైనట్టు ప్రకటించిన జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’. ఈ నెల 19న చంద్రుడిపై కాలుమోపే ఆఖరి అంకంలో ‘మూన్ స్నైపర్’లోని రెండు ప్రధాన ఇంజిన్లలో ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందట. ఫలితంగా వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై షియోలి బిలం వాలులో సమతాస్థితి తప్పి, దొర్లి, శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్ష్యిత ప్రదేశం నుంచి నెమ్మదిగా 55 మీటర్ల ఆవలకు కొట్టుకెళ్లి అవాంఛిత స్థితి (భంగిమ)లో నిలిచిపోయిందని వెల్లడించిన ‘జాక్సా’. ఇంజిన్ సమస్యే కనుక లేకపోతే నిర్దేశిత ప్రాంతానికి 3-4 మీటర్ల సమీపంలోనే ల్యాండర్ బహుశా దిగి ఉండేదని సంస్థ తెలిపింది. మన ‘చంద్రయాన్-3’లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కూడా చంద్రుడి ఉపరితలంపై మైనస్ డిగ్రీల్లో ఉండే రాత్రి వేళల అతి చలి ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. మరో వారం రోజుల లోపు సౌరవిద్యుత్ తయారై, దాని సాయంతో మేలుకుంటే ‘మూన్ స్నైపర్’ బతికినట్టు. లేదంటే ఆశలు వదిలివేసుకోవడమే! మరోవైపు... జాబిలి ఉపరితలంపై ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే (లక్ష్యంగా నిర్దేశించిన 100 మీటర్ల స్థలి) దిగామో, లేదో నిర్ధారించేందుకు ల్యాండర్ పంపిన డేటాను ‘జాక్సా సవివరంగా విశ్లేషిస్తున్నట్టు మరికొన్ని కథనాలు వెల్లడించాయి. - జమ్ముల శ్రీకాంత్ -
‘మూన్ స్నైపర్’ బతికేనా?.. జపాన్ ‘దింపుడు కళ్ళం’ ఆశ!
జపాన్ ప్రయోగించిన ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ మూడు రోజుల క్రితం చంద్రుడిపైనున్న షియోలీ బిలం వాలులో దిగింది. ఆ ప్రదేశంలో ప్రస్తుతం భానోదయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి ఆగమిస్తున్నాడు. ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) మాత్రం పడమటి దిక్కు వైపు మోహరించి ఉన్నాయి. ఫలితంగా వ్యోమనౌకలో సౌర విద్యుత్ తయారీకి ఇప్పుడు అవకాశం లేదు. అందుకే... భవిష్యత్తులో ల్యాండర్ పునఃప్రారంభ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా తమ ‘మూన్ స్నైపర్’ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేసినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సోమవారం ప్రకటించింది. వ్యోమనౌక ఆన్‌బోర్డ్ బ్యాటరీలో 12% (కనీస) పవర్ ఉందని, చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ దిగిన మూడు గంటలకు దాని బ్యాటరీని స్విచాఫ్ చేశామని ‘జాక్సా’ తెలిపింది. అవసరమైనప్పుడు ల్యాండరును రీ-స్టార్ట్ చేయడానికి అందులో ఉన్న 12% పవర్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు పడమటి దిక్కుకు వాలినప్పుడు ల్యాండర్ సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. అప్పుడు ల్యాండరును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం ‘జాక్సా’ వివరించింది. ప్రస్తుతం ల్యాండర్ నిద్రాణ స్థితిలో ఉంది. సౌరవిద్యుత్ తయారీ దృష్ట్యా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు వంటి వ్యోమనౌకల్ని సాధారణంగా జాబిలిపై సూర్యుడు సరిగ్గా ఉదయించే వేళల్లోనే/ప్రదేశాల్లోనే దిగేలా చూస్తుంటారు. చంద్రుడిపై పగటి సమయం (పగలు) 15 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి సమయం కూడా 15 రోజుల పాటు ఉంటుంది. చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో భానుడు ప్రస్తుతం తూర్పు దిక్కు నుంచి పడమటి వైపుగా ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ సూర్యుడు నడి నెత్తి నుంచి అంటే... మధ్యాహ్నం తర్వాత కాస్త ఆవలకు దిగి పొద్దు వాలితే గానీ ‘మూన్ స్నైపర్’ సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి సోకదు. సూర్యకాంతి తగిలితేనే, దాని నుంచి సౌరవిద్యుత్ తయారుచేసి వినియోగించుకోగలిగితేనే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకున్నట్టు. జపాన్ మూన్ మిషన్ విజయవంతమైనట్టు. తమ ‘స్లిమ్’ ల్యాండర్ నుంచి చాలా డేటా సేకరించామని, త్వరలో దాన్ని వెల్లడిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది. ‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్‌బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం. జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. -జమ్ముల శ్రీకాంత్ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు! -
చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. అయితే చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)లోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ అరే (ఎల్ఆర్ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. -
గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!
టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్? చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే! మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట. కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది. -జమ్ముల శ్రీకాంత్ -
జపాన్ గురి కుదిరేనా? చంద్రుడిపై ‘షార్ప్ షూటర్’!
జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ఇంకో దేశం సన్నద్దమైంది. అన్నీ సవ్యంగా సాగితే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:50 గంటలకు చందమామ ఉపరితలంపై జపాన్ ప్రయోగించిన ల్యాండర్ దిగనుంది. దీని అసలు నామధేయం ‘స్లిమ్’ విశదీకరిస్తే... స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది 730 కిలోల వ్యోమనౌక. చంద్రుడిపై ‘స్లిమ్’ సజావుగా దిగితే ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్ అవతరిస్తుంది. ఆ పనిలో ఈసరికే సఫలమైన నాలుగు దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారత్. ‘స్లిమ్’ మిషన్ కోసం జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) నిర్దేశించిన లక్ష్యం... ‘స్నైపర్’ పేరులోనే ఉంది. సూక్ష్మ/బహుదూరపు లక్ష్యాలను గురి తప్పకుండా గన్ సాయంతో ఛేదించే మిలిటరీ స్నైపర్ లాంటిదే ఈ మూన్ స్నైపర్ కూడా! చెప్పాలంటే... పిన్ పాయింట్ ల్యాండింగ్. జాబిలిపై ముందుగా నిర్ణయించిన లక్ష్యిత ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 100 మీటర్ల లోపే అంటే... కచ్చితంగా గీసిన గిరిలోపే (100 మీటర్ల వ్యాసం లోపే) ల్యాండరు దిగాల్సివుంటుంది! పటలంపైనే ప్రావారం! చంద్రమధ్యరేఖ (ఈక్వేటర్)కు దక్షిణంగా ‘సీ ఆఫ్ నెక్టార్’ సమీపంలోని షియోలి బిలం వాలుపై జపాన్ ల్యాండర్ కాలుమోపనుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత ప్రస్తావనార్హం. మన భూమికి బాహ్య పొర ‘భూపటలం’ (క్రస్ట్), లోపలి పొర ‘ప్రావారం’ (మాంటిల్), మధ్యలో ‘కేంద్రకం’ (కోర్) ఉన్నట్టే చంద్రుడిలోనూ ఆ తరహా పొరలు ఉంటాయి. ‘మూన్ స్నైపర్’ దిగే ప్రదేశంలో చంద్రుడి ఉపరితలంపైనే చంద్రుడి ‘ప్రావారం’ దర్శనమిస్తుంది. (బహుశా ఉల్కలు, గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లనో, చంద్రుడి అంతర్గత మార్పుల వల్లనో ప్రావారం కాస్తా వెలుపలికి చొచ్చుకొచ్చి పటలంలోనే... అది కూడా ఉపరితలంపైనే అందుబాటులో ఉన్న విశేష ప్రదేశం అది). ‘సీ ఆఫ్ నెక్టార్’ అనేది చంద్రుడిపై గతంలో సంభవించిన అగ్నిపర్వత చర్య వల్ల ఏర్పడిన సమతల ప్రదేశమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహశకలాల వంటివి ఢీకొని ఏర్పడిన బిలం ‘షియోలి క్రేటర్’ ఈ ‘సీ ఆఫ్ నెక్టార్’ మైదానంలోనే ఉంది. భూచంద్రుల మూలాన్వేషణలో ఈ ప్రదేశంలోని శిలలు కీలకమని టోక్యో విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ టొమోకత్సు మొరోట (స్పెషలైజింగ్ ఇన్ లూనార్ అండ్ ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్) వ్యాఖ్యానించారు. మూడో యత్నం ఫలించేనా! జపాన్ నిరుడు సెప్టెంబరు 7న H-11A రాకెట్ సాయంతో తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ‘స్లిమ్’ను ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.830 కోట్లు. ఇది ఒన్ వే మిషన్. అంటే... వ్యోమనౌక గానీ, చంద్రుడి నమూనాలు గానీ భూమికి తిరిగిరావు. నౌక జాబిలిపై దిగడంతోనే ఖేల్ ఖతం. దానికి అప్పగించిన పని అక్కడితో సమాప్తం. జాబిలి నేలపై ల్యాండరును క్షేమంగా దించేందుకు జపాన్ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. 2022లో ‘ఒమతెనాషి’ ల్యాండరును చంద్రుడిపై దించే తొలి ప్రయత్నంలో ‘జాక్సా’ దానితో సమాచార సంబంధాలు కోల్పోవడంతో మిషన్ విఫలమైంది. నిరుడు రెండో యత్నంలో జపాన్ ప్రైవేటు అంకుర (స్టార్టప్) సంస్థ ‘ఐ స్పేస్ ఇంక్’ కూడా హకుతో-ఆర్-1ను జాబిలిపై దింపబోయి విఫలమైంది. ఆ ల్యాండర్ దిగే క్రమంలో చంద్రుడిపై కూలిపోయింది. ఇక మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు ముందు రష్యాకు చెందిన ‘లూనా-25’ ల్యాండర్ సైతం చంద్రుడిపై దిగబోతూ కుప్పకూలి ధ్వంసమైన సంగతి తెలిసిందే. అమెరికన్ స్టార్టప్ ‘ఆస్ట్రోబోటిక్’ గత వారం ఓ ల్యాండర్ ప్రయోగించింది. కానీ ఇంధనం లీక్ సమస్యతో ఆ మిషన్ మీద ఆశలు వదిలేసుకున్నారు. జపాన్ గతంలో రెండు చిన్న గ్రహశకలాలపై (ఆస్టరాయిడ్లపై) వ్యోమనౌకల్ని పిన్ పాయింట్ ల్యాండింగ్ చేయడంలో సఫలీకృతమైంది. కానీ గ్రహశకలాలతో పోలిస్తే గురుత్వాకర్షణ అధికంగా ఉండే చంద్రుడిపై దిగడం మాత్రం సంక్లిష్ట కార్యం. ‘స్లిమ్’లో బేస్ బాల్ సైజున్న గుండ్రటి రోవర్ (రోలింగ్ రోబో)ను పంపారు. ‘జాక్సా’, జపాన్ బొమ్మల తయారీ కంపెనీ ‘టకారా టోమీ’ ఈ రోవరును రూపొందించాయి. జాబిలిపై దిగిన వ్యోమనౌకను అది ఫొటోలు తీస్తుంది. ‘స్లిమ్’ మిషన్ విజయవంతమైతే అంతరిక్ష రంగంలో జపాన్ దశ తిరిగినట్టే. ఒకవేళ శుక్రవారం (జనవరి 19) నాటి ప్రయత్నం కుదరకపోతే ‘స్లిమ్’ను జపాన్ వచ్చే నెల 16న చంద్రుడిపై దింపే ప్రయత్నం చేస్తుంది. - జమ్ముల శ్రీకాంత్ -
America: ‘ఆస్ట్రోబోటిక్స్’ మూన్ మిషన్ ఫెయిల్.. కారణమిదే
పిట్స్బర్గ్: అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ పంపిన పెరిగ్రైన్ వ్యోమనౌక చంద్రునిపై సాధారణ ల్యాండింగ్(సాఫ్ట్ ల్యాండ్) అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. నింగిలోకి ఎగిరిన కొద్ది గంటలకే వ్యోమనౌకకు చెందిన ప్రొపెల్లెంట్లోని ఇంధనం లీక్ అవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం పెరిగ్రైన్ను నింగిలోకి పంపారు. నింగిలోకి పంపినపుడు తొలుత వ్యోమనౌక ప్రయాణం బాగానే జరిగినప్పటికీ తర్వాత దాని సోలార్ ప్యానెళ్లు సూర్యునికి సరైన కోణంలోకి రాకపోవడం వల్ల బ్యాటరీల్లోని ఇంధనం ఒక్కసారిగా ఖాళీ అయింది.దీంతో అది నియంత్రణను కోల్పోయింది.అయితే అందులో మరో 40 గంటల ఇంధనం మిగిలి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అన్నీ సజావుగా జరిగితే ఫిబ్రవరిలో పెరిగ్రైన్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ప్రఖ్యాత ఏవియేషన్ కంపెనీలు బోయింగ్, లాక్హిడ్ మార్టిన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రైన్ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపారు. మరోవైపు చంద్రునిపైకి నాసా తలబెట్టిన ఆర్టెమిస్ మిషన్ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిషన్‌కు అవసరమైన కొన్ని పరికరాల సరఫరా ఆలస్యమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. మాల్దీవుల వివాదం..భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు -
నిండు పున్నమిలోనూ బాలరాముని దర్శనం
అయోధ్యలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులు.. ఇకపై చంద్రుని చల్లని వెన్నెలలోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగనుంది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. అలాగే మంగళ, శయన హారతులను కూడా ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉంటోంది. రాత్రివేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్టు యోచిస్తోంది. దీంతో భక్తులు చల్లని వెన్నెలలోనూ బాలరాముడిని దర్శించుకోగలుగుతారు. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఏకాదశితో పాటు పండుగ రోజులలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజుకు లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి. -
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
‘దుమ్ము’ రేపిన విక్రమ్!
బెంగళూరు: చంద్రయాన్–3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్‌కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్‌లోని హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు. -
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్‌యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్‌లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్‌యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్‌యాన్ మిషన్‌లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్‌డౌన్‌తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
చంద్రుడిపై మానవ నివాసం.. ఇళ్లు కట్టేది ఎవరంటే?
ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చంద్రుడిపై ఇళ్లను నిర్మించే యోచనలో నాసా ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో 17 మిషన్‌లో భాగంగా ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లో సుమారు 72 గంటల పాటు గడిపారు. భవిష్యత్‌లో అంతకంటే ఎక్కువ సేపు గడిపేలా ఆ దిశగా నాసా ప్రయోగాల్ని ముమ్మరం చేసింది. అమెరికాలోని డజన్ల మంది ఆస్ట్రోనాట్స్ చెప్పిన వివరాల ఆధారంగా 2040 నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నాసా భావిస్తోంది. ఇందుకోసం ముందుగా చంద్రుడిపై 3డి ప్రింటర్‌ను పంపి, ఆపై నిర్మాణాలను నిర్మించాలనేది నాసా ప్రణాళిక. ఈ 3డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణ చేపట్టనుంది. NASA is now plotting a return to the moon. This time, the stay will be long-term. To make it happen, NASA is going to build houses on the moon that can be used not just by astronauts, but by ordinary civilians as well. Here’s how they plan to do it. https://t.co/SbG282kIpZ pic.twitter.com/3O6y5YMUPb — The New York Times (@nytimes) October 2, 2023 ఇందుకోసం నాసా అత్యాధునిక సాంకేతికత కోసం యూనివర్సిటీలు, ప్రైవేట్ కంపెనీలతో చేతులు కలపనుంది. ఈ సందర్భంగా మేం ఉమ్మడి లక్ష్యంతో సరైన సమయంలో సరైన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చాం. అందుకే మేము అక్కడికి చేరుకుంటామని నేను భావిస్తున్నాను’ అని నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్ నిక్కీ వర్కీసర్ తెలిపారు. -
చంద్రయాన్–3 ప్రస్థానం ముగిసినట్లేనా!
న్యూఢిల్లీ: Chandrayaan-3 చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్‌ను మళ్లీ మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలు అందడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసిపోయినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ల్యాండర్, రోవర్‌తో అనుసంధానం కోసం ఇస్రో సైంటిస్టులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువంపై క్షేమంగా అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన, చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంది. అవి రెండూ 14 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశాయి. జాబిల్లిపై పరిశోధనలు జరిపి, విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేశాయి. అనంతరం సెప్టెంబర్ 2న దక్షిణ ధ్రువంపై సూర్యాస్తమయం కావడంతో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. మళ్లీ సూర్యోదయం కావడంతో ఈ నెల 22న తిరిగి మేల్కోవాల్సి ఉంది. -
ఆ కాలమానం కొలతలెలా?
చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడిన ట్లయింది. 2025 సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవు తున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు. ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుందన్నమాట! అందుకే చంద్రుని మీద కాలాన్ని లెక్కిండడం ఎలా అనేది ఇప్పుడు మానవాళి ముందున్న ముఖ్య మైన ప్రశ్నగా నిలిచింది. అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేశారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా అనుసరించవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగానే ఉన్నా... అటు సాంకేతిక పరంగానూ, ఇటు రాజకీయపరంగానూ ఇది గొప్ప సమస్యగా ఉంది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి? భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంతో తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరైన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాలు కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి. భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది. చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం. మనకు భూమి మీద సూర్యో దయం, అస్తమయం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత సుల భంగా కుదరవు అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంతకాలం పాటు ఉన్నాము అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మరో మరో పద్ధతీ వస్తున్నదని అంటున్నారు పరిశోధకులు. కె.బి. గోపాలం వ్యాసకర్త ప్రముఖ సైన్స్ రచయిత ‘ 98490 62055 -
చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్ 3 మిషన్ గురించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవన్‌ను మేల్కొలిపే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా గత 14 రోజుల నుంచి చంద్రుడిపై చీకటి ఉండటంతో ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జాబిల్లిపై సూర్మరశ్మి వెలుతురు పడటంతో నేడు(శుక్రవారం) వీటిని పునరుద్దరించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ల్యాండర్ నుంచి తమకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో పేర్కొంది. తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని చెప్పింది. చదవండి: చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. అయితే చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. ఇక నేడు సూర్యోదయం కావడంతో రోవర్‌పై సూర్యర్శ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్‌సభ స్పీకర్ వార్నింగ్.. -
'భారత్ చంద్రున్ని చేరితే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది'
ఇస్లామాబాద్: భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు. ' పాకిస్థాన్ ప్రధాని నిధులు సమకూర్చండని పక్క దేశాలను అడుక్కుంటున్నారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్‌పేయీ కాలంలో భారత్ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.' అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. పేద ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్‌కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్‌కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్‌కు రాకముందే ఆయనకి రక్షిత బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!
Chandrayaan-3Technician selling idli ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడన్న వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఇస్రోకు చెందిన HEC (హెవీఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వైరల్‌గా మారింది. బీబీసీ కథనం ఆధారంగా ఎన్డీటీవీ అందించిన రిపోర్ట్ ప్రకారం చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ స్లైడింగ్ డోర్‌ను తయారు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో అతను రోడ్‌సైడ్ స్టాల్‌ను తెరిచాడు. హెచ్ఈసీలో పనిచేస్తున్న ఉప్రారియా ఏమన్నారంటే.. జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్ కార్డ్‌తో నెట్టుకొచ్చా. ఆ తరువాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు నాలుగు లక్షల అప్పు చేశాను.. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రోజులు ఇంటిని నడిపించా.. ఇపుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చేశారు ఆకలితో చచ్చిపోవడం కన్నా అందుకే ఇక వేరే గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా ఇడ్లీ దుకాణం బెటర్ అనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని తెరవాల్సి వచ్చిందని చెప్పారు. భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి 300-400 రూపాయలొస్తాయి. తద్వారా 50-100 రూపాయల లాభం వస్తుంది ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నా రన్నారు. క్లాస్ రూంలో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారనీ, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 8,000 జీతంతో HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది. కాగా ఇస్రో చంద్రయాన్-3 జూలై 14న విజయ వంతంగా ప్రయోగించింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై కాలిడిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. Meet Deepak Kumar Uprariya who sells Tea & Idli in Ranchi. He is a Technician, who worked for building ISRO's Chandrayaan-3 launchpad. For the last 18 months, he has not received any salary. "When I thought I would die of hunger, I opened an Idli shop" (BBC Reports) pic.twitter.com/cHqytJvtfj — Cow Momma (@Cow__Momma) September 17, 2023 -
మూన్ మిల్క్ గురించి విన్నారా! ఐదువేల ఏళ్ల నాటి..
మూన్‌మిల్క్ గురించి విన్నారా! ఇది పురాతన ఆయుర్వేద పానీయం. ఆయుర్వేద మూలికల నుంచి తయారుచేసిన దివ్వ ఔషధం. పూర్వం ఈ పానీయంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేవారట. అందువల్లే వాళ్లు ఎలాంటి అనారోగ్యం బారిన పడిన తట్టకుని బతికిబట్టగట్టగలిగేవారట. దీన్ని అత్యంత శక్తివంతమైన ఔషధంగా వారంతం ప్రగాఢంగా విశ్వసించేవారని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. ఈ మూన్‌మిల్క్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తయారు చేయాలి తదితరాల గురించే ఈ కథనం. అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇది దాదాపు 5వేల ఏళ్ల నాటి పురాతన సహజసిద్ధ ఔషదం. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడం కోసం మూన్మిల్క్ని ఉపయోగించేవారట. మీకు పుష్టిని కలిగించడమేగాక రోగనిరోధక శక్తిని పెంచేలా ఈ మూన్మిల్క్కి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా దీని తయారీలో ఉపయోగించే మూలిక ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయని అంటున్నారు. దీన్ని ఆవు పాలతో తయారు చేస్తారు కాబట్టి. ముఖ్యంగా కొలస్ట్రాల్ లేకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉపయోగించే బాదం, సోయా, వోట్, దాల్చిన చెక్క, ఏలకులు, పసుపు అశ్వగంధం తదితర సుగంధ ద్రవ్వయాలు వినియోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి తోపాలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను వృద్ధి చేస్తుంది. ఇక ఇందులో వినయోగించే అశ్వగంధం వంటి అడాప్టోజెనిక్ మూలికలు శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖవంతమైన నిద్ర ఈ మూన్ మిల్క్‌ని సేవిస్తే..కలవరపాటుకు గురి కాని మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక ఇందులో ఉపయోగించే పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను వృద్ధి చేసి రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. శీతాకాలంలో దీన్ని సేవిస్తే మరింత ప్రయోజనం ఉండటమే గాక ఎన్నో రుగ్మతల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక యాలకులు, దాల్చిన చెక్క వంటి సున్నితమైన సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడం మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ మసాలాలు అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌ల వంటి సమస్యలకు చెక్‌పెడతాయి. భారీ మొత్తంలో భోజనం సమయంలో ఇది సేవిస్తే చాలా చక్కగా జీర్ణం అవ్వడమే గాక ఎలాంటి ఆపసోపాలు పడాల్సిన పని ఉండదు. తయారీ విధానం చంద్రుని పాలు తయారీకి ఆవు పాలు లేదా గేదె పాలు(వాల్నట్ మిల్స్, బాదం మిల్క్ లేదా జీడిపప్పు మిల్స్ అయినా ఉపయోగించొచ్చు) ఓ కప్పు తీసుకుని వేడి చేయండి. అందులో అర టీ స్పూన్ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క, యాలకులు కలపండి. అశ్వగంధం వంటి అడాప్లోజెనిక్ మూలికలు ఒక టీస్పూన్ వేయండి. బాగా మరిగిన తర్వాత దించి చల్లారక తాగండి. ఇది ఆరోగ్యానికి బహుముఖ ప్రయోజనాలను అందించడమే గాక ఒత్తిడిని దూరం చేసే మంచి సుఖవంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది. (చదవండి: స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?) -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్‌పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
ఆదిత్య L1 సెల్ఫీ...ఒకే ఫ్రేమ్ లో భూమి-చంద్రుడు..
-
వాహ్ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్1. అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ.. ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. Aditya-L1 Mission: 👀Onlooker! Aditya-L1, destined for the Sun-Earth L1 point, takes a selfie and images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy — ISRO (@isro) September 7, 2023 ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో. -
చంద్రునిపై వీరవల్లి వాసికి 2 ఎకరాల భూమి
హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు చంద్రుడిపై రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన ఆయన 2005లో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌ను ఈ సంస్ధ నిర్వహిస్తోంది. చంద్రునిపై ప్రయోగాలు, చంద్ర మండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టేందుకు లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఏర్పడింది. దీంతో న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేశారు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో సవివరంగా లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఇచ్చిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌పై స్పష్టంగా పేర్కొన్నారు. ల్యాండ్ పార్శిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను కూ డా ఇందులో ముద్రించారు. దీంతోపాటు చంద్రునిపై ఉపరితలం వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను జగన్నాథరావుకు ఇచ్చారు. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావటం, పలు అంతర్జాతీయ సంస్ధలు కూడా చంద్ర మండలంపైకి మానవుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం సంతోషకరమని జగన్నాథరావు అంటున్నారు. -
చివరి దశకు చేరిన చంద్రయాన్-3.. ఇస్రో కీలక ప్రకటన!
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరో ఘనత సాధించింది. మిషన్‌లో భాగమైన ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్లు విజయవంతంగా ప్రయాణించించినట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ చివరి దశకు చేరింది. చంద్రునిపై సూర్యకాంతి క్షీణిస్తుండటం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ తరుణంలో చంద్రయాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం కాగా ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.. ల్యాండర్, రోవర్లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయన్నారు. రోవర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్, ల్యాండర్లను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు సోమనాథ్ చెప్పారు. చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 చంద్రయాన్ మిషన్ గురించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రగ్యాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. -
జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ తన పనిలో బిజిబిజీగా గడుపుతోంది. జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇదీ చదవండి: Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.? -
రాఖీ కట్టేందుకే విక్రమ్‌ని పంపించాం! ఏం గిప్ట్ ఇస్తున్నావ్ మామా!
చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు. అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా! ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం. సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు. ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు. (చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!) -
విజయవంతంగా రోవర్ ఏడు రోజుల ప్రయాణం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత్ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది. ల్యాండర్ దిగిన మరికొన్ని గంటలకే దాని నుంచి రోవర్ కూడా బయటకొచ్చి తన పనిని మొదలుపెట్టేసింది. మొత్తం 14 రోజులపాటు రోవర్ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరువాత చంద్రుడిపై 14 రోజులపాటు చిమ్మ చీకట్లు ఆవరించడంతోపాటు భారీగా మంచు కురుస్తుందని పేర్కొంటున్నారు. దీంతో ల్యాండర్, రోవర్లు పనిచేస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి 14 రోజులు తర్వాత ల్యాండర్, రోవర్లు ఉన్న చోట మళ్లీ సూర్యకిరణాలు పడతాయి. వీటికి సోలార్ ప్యానెల్స్ రీస్టార్ట్ అయితే ల్యాండర్, రోవర్లు తిరిగి పనిచేస్తాయి. లేదంటే వాటి కాలపరిమితి తీరిపోయినట్టేనని చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు తన ఏడు రోజుల ప్రయాణంలో రోవర్ సుమారు 250 మీటర్ల దూరం ప్రయాణం చేసినట్టు ఇస్రో వెల్లడించింది. విజయవంతంగా లిబ్స్.. కాగా రోవర్లో అమర్చిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్) అనే పేలోడ్ విజయవంతంగా పనిచేయడం వల్ల చంద్రుడిలో దాగిన రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని తొలిసారి కనుగొన్నారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ తో పాటు ఆక్సిజన్ కూడా ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం హైడ్రోజన్ కోసం మరింతగా రోవర్ పరిశోధనలు చేస్తోంది. అయితే లిబ్స్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై శక్తివంతమైన లేజర్‌ను షూట్ చేసినప్పుడు.. అందులో నుంచి వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి ఆ డేటాను ఇస్రో భూ నియంత్రిత కేంద్రానికి పంపుతోంది. ఈ సైంటిఫిక్ పేలోడ్‌ను బెంగళూరులోని లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టం (లియోస్) అభివృద్ధి చేసింది. భారత్, చైనాకు చెందిన రెండు రోవర్లు మరోవైపు 2019 జనవరి 3న చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంలో ఐట్కిన్ బేసిన్లో చైనాకు చెందిన వాంగ్–4 మిషన్ యూటూ 2 రోవర్ సైతం పరిశోధనలు చేస్తోంది. భారత్, చైనా రోవర్ల మధ్య దూరం 1,948 కిలోమీటర్లు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒకేసారి రెండు రోవర్లు పనిచేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. నీలి రంగు నిండు జాబిలి! ఆకాశంలో నిండు జాబిలి నీలి రంగులో కనువిందు చేసింది. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడలో ఇలా అరుదైన బ్లూ మూన్ సాక్షాత్కరించింది. ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఆగస్టు ఒకటో తేదీన ఒకసారి, 30వ తేదీన రెండోసారి కనిపించింది. ఇలా ఒకే నెలలో రెండవసారి రోజూ కంటే పెద్దదిగా కనిపించడం విశేషం. ఈ సూపర్ బ్లూ మూన్ 2037 వరకు మళ్లీ కనిపించదని నిపుణులు చెబుతున్నారు. – విశాల్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో
ఇస్రో చేపట్టిన చంద్రయాన్- మిషన్‌లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టి పరిశోధనలు సాగిస్తున్న ప్రగ్యాన్ రోవర్.. తొలిసారి విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది. బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలు క్లిక్‌మనించిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ కెమెరాలను బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లో తయారు చేసినట్లు వెల్లడించింది. Chandrayaan-3 Mission: Smile, please📸! Pragyan Rover clicked an image of Vikram Lander this morning. The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam). NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE — ISRO (@isro) August 30, 2023 కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. ఇక విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు! -
ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం
నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు. అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూవుంటాయి. స్పేస్.కామ్ ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు. చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. అరుదుగా బ్లూ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3
బెంగుళూరు: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇది కూడా చదవండి: అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్ -
జపాన్ చందమామ ల్యాండర్ ప్రయోగం వాయిదా
టోక్యో: చందమామపై తొలిసారిగా అడుగుపెట్టాలన్న జపాన్ లక్ష్యం చివరి నిమిషంలో సాకారం కాలేదు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించి, పరిశోధనలు చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. జాక్సా టానేగíÙమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2–ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. ప్రతికూల వాతావరణం కారణంగా లాంచింగ్‌కు 27 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘జాక్సా’ తెలియజేసింది. ప్రయోగ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో బలమైన గాలులు వీచడం, ఉపరితల వాతావరణంలో అనిశి్చత పరిస్థితులు నెలకొనడం వల్లే వాయిదా పడినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సెపె్టంబర్ 15వ తేదీ తర్వాత తదుపరి ప్రయోగం ఉండొచ్చని సమాచారం. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాఫ్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) అనే లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన ఐదో దేశంగా జపాన్ రికార్డు సృష్టిస్తుంది. అయితే ప్రయోగించిన 4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇదిలా ఉండగా, హెచ్–2ఏ రాకెట్ ద్వారా ఇప్పటిదాకా 46 ప్రయోగాలు చేయగా, అందులో 45 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. -
Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్‌కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో
సాక్షి, బెంగళూరు: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా, చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో దిగిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పని తాను చేసుకెళ్తోంది. ఈ క్రమంలో రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గుంత కనిపించడంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. దీంతో, వెంటనే రోవర్ రూట్ మార్చారు. ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..‘ఆగస్టు 27న రోవర్ ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో ఒక గుంత కన్పించింది. నాలుగు మీటర్ల వ్యాసంతో భారీ గుంత ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్‌కు కమాండ్ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది’ అని పేర్కొంది. ఈ మేరకు చంద్రుడిపై ఉన్న గుంతకు సంబంధించిన ఫొటోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే రోవర్‌లోని నావిగేషన్ కెమెరా ద్వారా ఈ గుంతను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త మార్గంలో రోవర్ ప్రయాణించిన గుర్తులను కూడా షేర్ చేసింది. Chandrayaan-3 Mission: On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location. The Rover was commanded to retrace the path. It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF — ISRO (@isro) August 28, 2023 చంద్రుడిపై ఓవర్ హీట్.. ఇదిలా ఉండగా.. చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్‌లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. 🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission: The launch of Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for 🗓️September 2, 2023, at 🕛11:50 Hrs. IST from Sriharikota. Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx — ISRO (@isro) August 28, 2023 ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన -
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్‌గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్‌ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
ఇకపై ఆ ప్రాంతాన్ని ‘శివశక్తి’గా పిలుచుకుందాం
శివాజీనగర: చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై ‘శివశక్తి’ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్ జరిగిన రోజు(ఆగస్ట్ 23వ తేదీ)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏథెన్స్ నుంచి తిరుగు పయనమైన మోదీ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్–3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ సెంటర్లో ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు. ‘ భారత అంతరిక్ష ప్రయోగాల పథాన్ని ఈ విజయం నిజంగా అసాధారణమైన ఆనందంతో నింపేసింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా, 2019లో చంద్రయాన్–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలుచుకుందాం. శివశక్తిలోని శివ.. మానవత్వం శ్రేయస్సుకు ప్రతీక. శక్తి.. మానవాళి సంక్షేమ ఆకాంక్షలకు తగిన ధైర్యం, స్థైర్యాన్ని అందిస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేశా’ అని అన్నారు. ‘భారతీయ గ్రంథాల్లోని ఖగోళ సూత్రాలను శాస్త్రీయంగా రుజువుచేసేందుకు నవతరం ముందుకు రావాలి. వాటిని అధ్యయనం చేయాలి. ఇది మన వారసత్వానికి, శాస్త్రానికి ఎంతో ముఖ్యం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై ఇందుకు సంబంధించి రెట్టింపు బాధ్యత ఉంది. వందల ఏళ్ల బానిసత్వం కారణంగా భారత ఉజ్వల శాస్త్రీయ విజ్ఞానం మరుగునపడింది. ‘ఆజాదీ కా అమృత్’ కాలంలో ఆ విజ్ఞాన నిధిని మళ్లీ వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పాలి’ అని మోదీ అభిలషించారు. ఇబ్బంది పడొద్దనే సీఎం, గవర్నర్లను వద్దన్నా మొదట బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి కాన్వాయ్‌లో ప్రజలకు చేతులు ఊపుతూ మినీ రోడ్‌షో నిర్వహించారు. అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి రాలేదు. ఇందుకు కారణాన్ని మోదీనే వివరించారు. ‘ గ్రీస్ నుంచి సుదూర ప్రయాణం కారణంగా సరిగ్గా ఎన్ని గంటలకు విమానం ల్యాండ్ అవుతుందో తెలీదు. గవర్నర్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డెప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాకోసం అనవసరంగా చాలా సేపు వేచిఉండాల్సి రావొచ్చు. అందుకే స్వాగతం పలికేందుకు రావద్ద ని ముందే తెలియజేశా’ అని మోదీ స్పష్టత నిచ్చారు. కాగా, మోదీ వివరణపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘మోదీ కంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం, డెప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు. అది మోదీకి సుతరాము నచ్చలే దు. అందుకే ఈసారి ఆయన వచ్చినపుడు సీఎంను రావొద్దని చెప్పారు’ అని ఆరోపించారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్న మోదీ పాలెం ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలికిన బీజేపీ చీఫ్ నడ్డా, పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ‘చంద్రయాన్ విజయంతో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని.. యువతరంలో శాస్త్రాయ విజ్ఞానంపై మక్కువ పెంచేందుకు ఉపయోగించాలి. అప్పుడే 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్ అనే కల నెరవేరుతుంది’ అని అన్నారు. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ ‘చంద్రయాన్–3 విజయం తర్వాత ఇక్కడికొచ్చేందుకు, మిమ్మల్ని అభినందించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. పని పట్ల మీ అంకితభావం, నిబద్ధత, ధైర్యసాహసాలు, తెగువకు నా సెల్యూట్’ అని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘చందమామను భారత్ చేరుకుంది. ల్యాండర్, రోవర్ రూపంలో మన జాతి గౌరవం చంద్రుడిపై సగర్వంగా అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న మహిళా శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నా. దేశ నారీశక్తి ఈ ప్రాజెక్టులో పెద్దపాత్ర పోషించింది. మనోధైర్యం ఉంటే విజయం గ్యారెంటీ. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల నుంచి స్ఫూర్తి పొందేందుకు ఆగస్ట్ 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకుందాం’ అని మోదీ అన్నారు. ‘జై విజ్ఞాన్...జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చారు. ‘విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాను. అయినా నా మనస్సు, ఆలోచన మొత్తం ఇక్కడే ఉన్నాయి. అందుకే గ్రీస్ దేశం నుంచి మిమ్మల్ని కలవడానికే నేరుగా ఇక్కడికొచ్చా. ఇప్పటి వరకు భారత్‌లోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేది. ఇకపై చంద్రునిపైనా త్రివర్ణ పతాకం వెలుగులీనుతుంది. ప్రస్తుతం సాధించిన అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. ఆ ఫలితాలు కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఉపయోగపడాలి’ అని మోదీ అన్నారు. -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్‌వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్‌టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్‌కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్‌కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్‌రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్‌బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్‌రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా?
Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌లను అందిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO. తాజాగా చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను విడుదల చేఏసింది. జాబిల్లిపై రోవర్ తిరుగుతుండగా.. ఆ చక్రాల గుర్తులు పడడం.. ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడొచ్చు. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి అన్వేషణ.. గడ్డ కట్టిన నీటి అణువులను ప్రగ్యాన్(ప్రజ్ఞాన్) రోవర్ పరిశోధించనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి రెండువారాల పాటు ఇదే పనిలో ఉంది రోవర్. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్‌ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్‌స్టార్‌కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
Chandrayaan-3: ల్యాండర్ నుంచి చంద్రుడిపైకి ప్రజ్ఞాన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్ నుంచి ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తున్న వీడియోను, ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిని ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియో, ఫొటోలను విక్రమ్‌లోని ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీటిని చిత్రీకరించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి ఇప్పటిదాకా 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
నవభారత జయధ్వానం
చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావిస్తున్న అంతర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారత శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చుకున్నవిగా వాటిని కొట్టిపారేసింది. చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. ఉత్కంఠ వీడిపోయింది. నిర్దేశించిన రోజు, సమయం, ప్రదేశంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన చంద్రయాన్–3 సాధించిన మహాద్భుతమైన విజయం పట్ల భారతదేశం సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ నాయకత్వ చిహ్నాలలో సాంకే తిక పురోగతి ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్–3 ల్యాండ్ అయింది. అన్వేషణ కోసం ప్రత్యేకంగా సవాలు విసిరేటటువంటి, పెద్దగా అర్థం చేసుకోని స్థలాన్ని ఎంచు కున్న ఏకైక అంతరిక్ష దేశం భారత్. చంద్రుని అసలైన తత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది దాని ధ్రువ ప్రాంతాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఉపరితలం చాలా వరకు పెద్ద, చిన్న గ్రహ శకలాల శిథిలాలతో కప్పబడి ఉంది. ఈ శకలాలు వెయ్యేళ్లపాటు చంద్రునిపై పెనుదాడి చేసి, దానిపై పొరలు పొరలుగా పేరుకు పోయాయి. చంద్రుడి లోపలి నీటి కోసం వెతకడంతో సహా ‘ప్రజ్ఞాన్ రోవర్’ చేయబోయే ప్రయోగాలు, మనకు సమీపంలోని ఖగోళ పొరుగు గురించిన కొత్త జ్ఞానాన్ని వెల్లడిస్తాయి. సున్నితంగా ఉన్న మన సొంత భూగ్రహం చరిత్ర, తయారీలపై మన అవగాహనకు కూడా ఇది సాయపడుతుంది. ఎదుగుతున్న శక్తి ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహ న్నెస్బర్గ్లో ఉన్నప్పుడు, యాదృచ్ఛికంగా అంతరిక్ష పరిశోధనలో ఈ గొప్ప విజయం లభించింది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న దేశాల సమూహంగా మొత్తం బ్రిక్స్ ప్రభావాన్ని కూడా ఇది ఇతోధికంగా పెంచుతుంది. చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయో గాల్లో అనుభవజ్ఞ దేశంగా ఉన్న రష్యా తన మూన్ ల్యాండింగ్ ప్రాజెక్ట్‌ను భారతదేశం ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రారంభించడం యాదృచ్ఛికమే కావొచ్చు. అయినా రష్యా వైఫల్యం, భారత్ విజయాలను పక్కపక్కనే అంచనా వేయడం జరుగుతుంది. వనరుల పరంగా, అధునాతన అంతరిక్ష శక్తిగా దాని హోదాను కొనసాగించడంలో రష్యా వైఫల్యాన్ని దాని క్షీణత, అసమర్థతా లక్షణాలుగా చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అనేది అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అన్వేషణ. 2019 సెప్టెంబరులో చంద్రయాన్–2 చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు భారతదేశం కూడా నిరాశకు గురైంది. ఇప్పుడు రష్యా తన ఎదురుదెబ్బను అధిగమించి అంతరిక్ష రంగంలో మళ్లీ తన శక్తి పుంజుకోదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. అయినా దృక్కోణాలు ముఖ్యమవుతాయి. భారతదేశాన్ని అభి వృద్ధి చెందుతున్న శక్తిగా, రష్యాను క్షీణిస్తున్న శక్తిగా భావిస్తున్న అంత ర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన సమానమైన ర్యాంక్‌లో తాను లేనందున, ఉక్రెయిన్ యుద్ధం ఆ స్థానాన్ని ఏ విధంగానూ దెబ్బతీయలేదనే భావ నను ఎదుర్కోవడానికి రష్యా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. రష్యన్ మీడియాలో కూడా, విఫలమైన మూన్ మిషన్ అందుకున్న పరిమితమైన కవరేజీని చూసినట్లయితే, దాని రాజకీయ, మానసిక తిరోగమనం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చైనా వైఖరి మారేనా? ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా చైనా ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శ నలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చు కున్నవిగా వాటిని చైనా కొట్టిపారేసింది. అయితే చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా చైనా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. బహుశా భారత్ సాధించిన ఈ విజయంతో చైనా తన అహంకారాన్ని తొలగించుకుని, నమ్రతతో కాకపోయినా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిన దేశంగా భారత్‌ను పరిగణించవచ్చు. ఒకరినొకరు సమానంగా చూసుకుంటేనే ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవు. చంద్రయాన్–3 విజయా నికి చైనా ఎలా స్పందిస్తుందనేది, తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణల తర్వాత భారతదేశం పట్ల దాని వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేది సూచిక అవుతుంది. చంద్రయాన్–3 ప్రాజెక్టులో విజయం రాబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారత్ హోదాను పెంచుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే లభిస్తున్న విస్తృత ప్రచారం నేపథ్యంలో, చంద్రయాన్–3 భారత్ కీర్తి ప్రతిష్ఠలకు మరో పార్శా్వన్ని జోడిస్తుందనడంలో సందేహం లేదు. శిఖరాగ్ర సదస్సు చర్చల సమ యంలో, భారతదేశ స్వరం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని వివిధ కార్యక్రమాలు గౌరవప్రదంగా పరిగణించబడతాయి. అయితే ఇవన్నీ తదనంతర చర్యలలో ప్రతిఫలిస్తాయో, లేదో చూడాలి. దూరదృష్టి ఫలితం భారతదేశం కోసం, దాని అభివృద్ధి వ్యూహం కోసం తగిన పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్–3 సాధించినదంతా కూడా దేశం పేదగా ఉండి, అభివృద్ధి చెందుతున్నదైనప్పటికీ... అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శ్రేష్ఠమైన సంస్థలను స్థాపించాలనే తొలితరం నాయకుల దూరదృష్టి ఫలితమే. భారతదేశ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను 1948లోనే తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఛైర్మన్‌గా ఏర్పాటైంది. అప్పటి రాజకీయ నాయకత్వం ఈ అధునాతన శాస్త్రీయ సాధనకు ఇచ్చిన అధిక ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి, అంతరిక్ష పరిశోధనను సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి నేతృత్వంలో 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ నేష నల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పిలిచే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి అప్పగించారు. దీని తర్వాత 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటైంది. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నమూనాలో ఇండియన్ స్పేస్ కమిషన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్లు భారతదేశ అధునాతన శాస్త్ర, సాంకేతికతకు మూలస్థంభాలుగా నిలిచి, గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి బాగా నిధులు సమకూరుస్తున్నారు కూడా. ఈ ముందస్తు, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ కార్మికుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం చేపట్టిన తాజా అంత రిక్ష యాత్ర విజయవంతమైంది. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
చంద్రయాన్-3: మరో వీడియో వదిలిన ఇస్రో
చంద్రయాన్-3లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వీడియో విడుదల చేసింది. వీడియోలో చంద్రుడి ఉపరితలంపై ర్యాంప్‌ను ల్యాండర్ వదులుతున్న దృశ్యాల్ని, అలాగే.. సోలార్ ప్యానెల్పని ప్రారంభించిన వీడియోను ఇస్రో షేర్ చేసింది. రెండు-విభాగ ర్యాంప్ రోవర్ రోల్-డౌన్‌ను సులభతరం చేసింది. సోలార్ ప్యానెల్ రోవర్‌కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించింది. రోవర్ రోల్డౌన్కు ముందు ర్యాంప్-సోలార్ ప్యానెల్ వేగవంతమైన విస్తరణ ఎలా జరిగిందో ఇక్కడ ఉంది. Ch-3 మిషన్‌లో మొత్తం 26 విస్తరణ యంత్రాంగాలు U R రావు శాటిలైట్ సెంటర్ (URSC)/ISRO, బెంగళూరులో అభివృద్ధి చేయబడ్డాయి అని తెలిపింది. A two-segment ramp facilitated the roll-down of the rover. A solar panel enabled the rover to generate power. Here is how the rapid deployment of the ramp and solar panel took place, prior to the rolldown of the rover. The deployment mechanisms, totalling 26 in the Ch-3… pic.twitter.com/kB6dOXO9F8 — ISRO (@isro) August 25, 2023 -
అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు. మరోవైపు చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. -
చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ఫొటోలు రిలీజ్
న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో తదుపరి దశ ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. ఈ దృశ్యాలను ఇస్రో తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. బుధవారం నిర్ణీత సమయంలోనే చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మలిదశకు చేరుకుంది. కోట్లాది భారతీయుల కలల్ని సాకారం చేస్తూ జాబిల్లిని ముద్డడాడిన చంద్రయాన్-3 ల్యాండర్ ఆరోజే చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీయాగా వాటిని ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో పొందుపరచింది. ఇక ఈ రోజు ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై అడుగు పెట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. "చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఎలా అడుగుపెట్టిందో చూడండి.." అని రాసింది ఇస్రో సంస్థ. ... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W — ISRO (@isro) August 25, 2023 ఇప్పటివరకు మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై అడుగు మోపగా నాలుగో దేశంగా భారత దేశం అక్కడికి చేరుకొని చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు ILSA, RAMBHA,ChaSTE సక్రమంగానే పనిచేస్తున్నాయని అది చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనల ప్రారంభించిందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు ప్రధానంగా చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను నిశితంగా పరిశీలిస్తాయని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు.. -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్‌తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్‌పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్‌ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్‌కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్‌ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్‌లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘చంద్రయాన్-3లో ప్రయాణించిన వారికి సెల్యూట్’.. మంత్రిపై ట్రోల్స్
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం బుధవారం విజయవంతం అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ల్యాండర్‌తోపాటు రోవర్ కూడా క్షేమంగా దిగడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చివరి దశలో వ్యోమనౌక జాబిల్లిపై కాలు మోపే క్షణాలను టీవీలు, ఫోన్లలో ప్రత్యక్షంగా చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రయాన్-కు సంబంధించి రాజస్థాన్ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్ రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చందన్.. చంద్రుడి మీదకు వెళ్లిన ప్రయాణికులకు సెల్యూట్ అంటూ నోరూజారారు.. ‘చంద్రుడిపై సురక్షితంగా కాలుమోపాం.. అందులో ప్రయణించిన వారికి సెల్యూట్. సైన్స్ స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా’ అని మీడియాతో ముందు తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా చంద్రయాన్-3 మానవ రహిత మిషన్. ఇస్రో ఇందులో కేవలం విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ మాత్రమే పంపిన విషయం తెలిసిందే. వ్యోమగాములను రోదసిలోకి పంపలేదు. అయితే మంత్రి స్థానం ఉన్న అశోక్ చందన్. ప్రయోగం గురించి తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్స్‌కు గురవుతున్నారు.దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తూ.. మంత్రికి చురకలంటిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రజ్ఞాన్’.. అక్కడ తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రుడిపై వాతావరణ, నీటి వనరులు, భూగర్భ శాస్త్రం, భవిష్యత్తులో మానవ మనుగడకు సామర్థ్యాలను అధ్యయనం చేయనుంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. -
"చంద్రుడు" ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసా!
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని సురక్షితంగా దించిన నాల్గో దేశంగా ఘనత సాధించింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ముగించింది. ఈ విజయం దేశ ప్రజలను ఆనందోత్సాహల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా ఓ పండుగను తీసుకొచ్చింది ఈ విజయం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. అందులోనూ మనం చిన్నప్పటి నుంచి మామ అని ఇష్టంగా పిలుచుకును చంద్రుడు గురించి ఐతే ఆ జిజ్ఞాస మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడిపై మచ్చ ఉందని ఏవేవో చందమమా కథలను చెప్పుకునేవాళ్లం. అలాంటి చంద్రుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందామా!. చంద్రుని గురించి పౌరాణికంగా చాలా విషయాలను కథలు కథలుగా తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడుని మనః కారకుడని అంటారు. చంద్రుడు మనిషి మససుపై అధిక ప్రభావం చూపుతాడని, చంద్రుని ఆధారంగానే మనిషి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. మనిషి నిద్రపై కూడా చంద్రుని ప్రభావం ఉంటుందని అంటారు. మానసిక ఆరోగ్య దగ్గర నుంచి శారీరకంగా.. గుండె ఆరోగ్యం వరకు ఆయన ప్రభావం ఉంటుందని అంటారు. పౌర్ణమి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. పౌర్ణమి మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పర్యావరణ కారకాలు వ్యక్తుల మానసిక కల్లోలానికి కారణమవుతాయని అందువల్ల వారు నిరాశకు లేదా ఉన్మాదానికి లోనై అకృత్యాలకు పాల్పడతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భావోద్వేగాలకు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి అయిన "బైపోలార్ డిజార్డర్" వ్యక్తులపై పరిశోధనలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యక్తులు నిద్రలోని మార్పులకు, తరుచుగా కనిపించే మాంద్య లక్షణాల నుంచి ఉన్నాద లక్షణాలకు మారడంపై చంద్రుని ప్రభావం ఉన్నట్లు తేలింది. అలాగే బైపోలార్ డిజార్డర్ ఉన్న ఓ స్త్రీపై మూన్ మూడ్ కనెక్షన్ కోసం లైట్ థెరఫీని ఉపయోగించి కొన్ని మందుల మార్చడం ద్వారా చంద్రుని ప్రభావాల ఆధారంగా చికిత్స చేయవచ్చని వెల్లడైందని మాలిక్యులర్ సెక్రియాట్రిక్ జర్నల్‌లో తెలిపారు శాస్త్రవేత్తలు. నిద్రను ఎలా ప్రభావితం చేస్తాడు? పౌర్ణమి రోజుల్లో చాలామంది వ్యక్తులు సాధారణ సమయం కంటే ఆలస్యంగా నిద్రపోతారని అంటున్నారు నిపుణులు. పౌర్ణమికి ముందు రోజుల నుంచే ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది పౌర్ణమితో ముడిపడి ఉందని పరిశోధనల్లో తేలింది కూడా. ఐతే స్లీప్ లేటెన్సీ..నిద్రలోకి జారుకోవడం లేదా మొదటి నిద్రలోనే గాఢ నిద్రలోకి వెళ్లడం అనేది కూడా ఆల్కహాల్ లేదా కొన్ని రకాల మందుల ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది. . పౌర్ణమి, అమావాస్య సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గదలను గమనించినట్లు పరిశోధన పేర్కొంది. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో తొందరగా రక్తపోటు సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. బహుశా అందువల్లే కాబోలు పెద్దలు ఈ రోజు పౌర్ణమి ఇవే చేయాలి. అమావాస్యని అలాంటివి చేయకూడదు వంటి నియమాలు పెట్టారు. ముందు జాగ్రత్తతోనే నియమాలు పెడితే మనం చాదస్తంగా కొట్టిపారేస్తున్నాం. సైన్సుపరంగా వారు పెట్టినవి నిజమని తేలేంత వరకు అంగీకరించం మనం. గమనిక: ఈ కథనం చంద్రుని శక్తి గురించి కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. సైన్సుపరంగా రుజువైందని తెలియడం కోసం. దీన్ని ఆధారంగా మీరు ఔషధాలను ఉపయోగించడం లేదా ప్రయోగాలు చేయడం వంటి పనులు చేయొద్దు. ఏదైనా వైద్యులు, నిపుణులు సలహాల మేరకే పాటించాలి. ఇది కేవలం అవగాహన కల్పించాలనే ఉద్దేశం మాత్రమే. (చదవండి: మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్‌లు ఏంటో తెలుసా!) -
Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ ఘన విజయం సాధించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రగ్యాన్’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత్ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్ చేసింది ‘చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్ చంద్రుడిపై నడిచింది. మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తర్వలోనే షేర్ చేస్తాం’ అంటూ పేర్కొంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. Chandrayaan-3 Mission: Chandrayaan-3 ROVER: Made in India 🇮🇳 Made for the MOON🌖! The Ch-3 Rover ramped down from the Lander and India took a walk on the moon ! More updates soon.#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 24, 2023 ఆ సంతోషం మాటల్లో చెప్పలేం: ఇస్రో చైర్మన్ చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుక్నుఆమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చేప్పలేమన్నారు. ఫెయిల్యూర్ ఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతాయని తెలిపారు. మేము రోబోటిక్ పాత్ ప్లానింగ్ ప్రయోగం కూడా చేస్తామని చెప్పారు. కాగా మైక్రోవేవ్ సైజ్ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్లో కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్‌తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది. Photo Courtesy: IndiaToday ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్లు ఉన్నాయి. రోవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇక 40 రోజుల రోజుల ఉత్కంఠకు బుధవారం శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయి. అగ్రరాజ్యాలను తోసిరాజంటూ.. భారత్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. చందమామపై ల్యాండర్‌ను భద్రంగా దించిన నాలుగో దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్–3 విజయంపై దేశ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లు విరిశాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక భారత్‌కు వివిధ దేశాల అధినేతల నుంచి అభినందనలు అందాయి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా..
చంద్రయాన్ ల్యాండర్.. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. పైగా.. ఏదో గిఫ్ట్‌ప్యాక్ చుట్టిపెట్టి నట్లు గోల్డ్ ఫాయిల్లాగా ఉంటుంది. ఇంతకీ మెరిసేదంతా బంగారమేనా? అస్సలు కాదు.. ఇది మల్టీ లేయర్ ఇన్సులేషన్.. అనేక పొరలుగా ఉంటుంది. ఉష్ణ నిరోధకంగా దీన్ని ఉపయోగి స్తారు. అంతరిక్షంలోకి ఉపగ్రహం వెళ్లినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు వాటిల్లోని పరికరాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అవి సరిగా పనిచేయలేక పోవచ్చు. దాన్ని నివారించడానికి ఇలా కప్పి ఉంచుతారు. మూన్ గురించి.. మీకు తెలుసా? మనం అనుకు న్నట్లు.. చంద మామ గుండ్రంగా ఉండడు.. గుడ్డు ఆకారంలో ఉంటాడు.. అలాగే చల్లనయ్య.. తెల్లనయ్య కాదు.. దగ్గర్నుంచి చూస్తే.. ముదురు బూడిద రంగులో ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా.. చంద్రునిలోని 59 శాతం మాత్రమే మనకు కనిపిస్తుందట. అంతేకాదు.. చంద్రుడిని దగ్గర నుంచి చూస్తే.. భారీ గుంతలులాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ.. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఖగోళ వస్తువులు దాన్ని ఢీకొన్నప్పుడు ఏర్పడినవే.. చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర..
న్యూఢిల్లీ: చంద్రుని దక్షిణ ధ్రువం మీద సగర్వంగా జెండా పాతి చంద్రయాన్ –3 విజయనాదం చేసింది. దేశ దక్షిణ కొసన తమిళనాడులో మారుమూల విసిరేసినట్టుగా ఉండే నమ్మక్కల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగాల్లో అక్కడి మట్టిదే ప్రధాన పాత్ర మరి! ఎందుకు, ఎలా అన్నది ఓ ఆసక్తికరమైన కథ...! అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. 2008లో చంద్రయాన్–1 అనంతరం తర్వాతి ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్న రోజులవి. చంద్రునిపై సఫ్ట్ లాండింగే లక్ష్యంగా చంద్రయాన్ –2 ను తయారు చేశారు. అది చంద్రునిపై దిగితే అందులోని రోవర్ బయటికి వచ్చి చంద్రుని నేలపై నడిచేలా ప్లాన్ చేశారు. అందుకోసం లాండర్‌ను ఎక్కడ దించాలి? రోవర్ ఎలా నడవాలి? ఇవన్నీ ప్రశ్నలే. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. వాటికి సమాధానం వెదికేందుకు ఇస్రో సిద్ధమైంది. అందుకు చంద్రునిపై ఉండే మట్టి మాదిరి మట్టి కావాలి. అందుకోసం వెదుకులాట మొదలైంది. వారికి సరిపోయే మట్టి చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో నమ్మక్కల్ లో దొరికింది. 2021లో అక్కడి నుంచి 50 టన్నుల మట్టి సేకరించారు. 2019లో చంద్రయాన్ –2 మిషన్‌లో ఆ మట్టితోనే ల్యాండర్, రోవర్ అడుగులను పరీక్షించారు. తాజాగా చంద్రయాన్ –3 ప్రయోగాలకు నమ్మక్కల్ మట్టినే వాడారు. అది అనర్‌తో సైట్ మృత్తిక ‘చంద్రుని ఉపరితలం మీద ఉన్నది అనర్‌తో సైట్ రకం మృత్తిక. తమిళనాడులోని కొన్ని చోట్ల అదే రకం మట్టి ఉన్నట్టు మేం యాదృచ్ఛికంగా చేసిన భూగర్భ పరిశోధనల్లో తేలింది. కున్నమలై, సీతంపూంది వంటి నమ్మక్కల్ పరిసర ప్రాంతాల్లో అది పుష్కలంగా దొరికింది’అని పెరియార్ విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ అయిన ఎస్.అన్బళగన్ వెల్లడించారు. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. -
చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను అధ్యయనం చేయడం కోసం ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్–3 ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్‌లో 5 ఇస్రో పేలోడ్స్, నాసాకు చెందిన ఒక పేలోడ్‌ను పంపించారు. ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలంపై దించి పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి సోకదని, చీకటిగా ఉంటుందని చెబుతున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్) నుంచి అటు భూమిని, ఇటు చంద్రుడిని అధ్యయనం చేయడానికి ‘ఆర్బిటార్ స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్’అనే ఒక సైంటిఫిక్ పరికరం అమర్చి పంపారు. ఈ సైంటిఫిక్ పేలోడ్‌తో ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం నివాసయోగ్యంగా ఉందా? అనేది అధ్యయనం చేస్తారు. అలాగే చంద్రుడిపై జరుగుతున్న మార్పులను తెలుసుకోవచ్చు. జాబిల్లిని అధ్యయనం చేయడానికి ఇది ప్రయోగాత్మక పేలోడ్ కావడం విశేషం. ల్యాండర్లో పేలోడ్స్ ఇవీ... ► ల్యాండర్లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ (రంభ–ఎల్పీ) అనే సైంటిఫిక్ పేలోడ్‌తో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎల్రక్టాన్లు, చంద్రుడి అంతర్భాగం దాగి ఉన్న ఖనిజాలపై పరిశోధన చేస్తారు. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్»ౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ అనే పేలోడ్స్‌తో చంద్రుడిపై లాండింగ్ సైట్ చుట్టూ ప్రకంపనలను గుర్తిస్తారు. రోవర్‌లోని పేలోడ్స్ ► చంద్రుడి ఉపరితలం మూలక కూర్పును అధ్యయనం చేయడానికి రోవర్లో రెండు సైంటిఫిక్ పరికరాలను అమర్చి పంపారు. ఇందులో అల్ఫా పారి్టకల్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధిస్తారు. చంద్రుడిపై రసాయనాలుంటే వాటిని కూర్పు చేయడానికి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై రాళ్లను అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా చంద్రుడిపై నేల స్వభావం ఎలా ఉందో గుర్తిస్తారు. ► గ్యాస్, ప్లాస్మా పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి, చంద్రశ్రేణి అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ శ్రేణి అనే ఒక సైంటిఫిక్ పరికరాన్ని కూడా రోవర్లో అమర్చారు. ఇది కూడా చంద్రుడిపై మరింత అధ్యయనం కోసమే. -
చంద్రయాన్ –3 తరువాత?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది. కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే. కలిసొచ్చే జుగాడ్... చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం. భవిష్యత్తు అవసరాల కోసం? 1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మువ్వన్నెల చంద్రహాసం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా–25 విఫలమైన చోటే భారత్ విజయపతాక ఎగురవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. అత్యంత అరుదైన ఘనత ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాలు తీవ్ర ఉత్కంఠ చంద్రయాన్–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ తన నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్ హొరిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే? చంద్రయాన్–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్ ల్యాండింగ్. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్ క్రాష్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు. బయటకు వచి్చన రోవర్ సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాబిల్లిపై గర్జించిన సింహాలు..! చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్ రైజర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. -
ల్యాండర్ కాలుమోపగానే.. చంద్రయాన్ 3 ఫస్ట్ మెసేజ్..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 'ఇండియా అంటే నేను లక్ష్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ.. -
సరికొత్త చరిత్రను లిఖించాం.: పీఎం మోదీ..
జోహెన్నస్‌బర్గ్: చంద్రుని దక్షిణ ధృవంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ సమిష్టిగా చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలుమోపిన క్షణాన్ని వీక్షించారు. భారత్ గౌరవించదగిన విషయమని ప్రధాని మోదీ అన్నారు. "ఈ విజయంపై ఇస్రోను, శాస్త్రవేత్తలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చు కానీ నా హృదయం ఎల్లప్పుడూ చంద్రయాన్ మిషన్‌తో ఉంటుంది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపాం. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ ఘనత సాధించలేదు. సరికొత్త చరిత్రకు అధ్యాయం ప్రారంభమైంది." అని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. చంద్రునిపై ల్యాండింగ్ చేసిన ఘటన ఇప్పటివరకు ఈ మూడు దేశాలకే ఉండేది. తాజాగా చంద్రయాన్ 3తో భారత్ కూడా చేరింది. Congratulations @isro #Chandrayaan3 #IndiaOnTheMoon #PMModi #NarendraModi #PMOIndia #Congratulations #isrochandrayaan3mission @narendramodi pic.twitter.com/mVfQZAIF1V — Aryan S Prince (@aryansprince49) August 23, 2023 చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. 2019లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ మిషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకోవడం, అటు.. రష్యా లూనా 25 ఇటీవల ఫెయిలవడంతో యావత్ ప్రపంచం చంద్రయాన్ 3వైపు ఆసక్తిగా చూసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే -
ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి. చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్. జై హింద్! అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్‌చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) ఈ మిషన్ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్ చంద్రయాన్3 సక్సెస్‌తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్ చేశారు. ఐఆర్సీటీసీ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. From the dawn of humankind we have gazed at the moon and let it work its magic on our minds. The moon turned us into dreamers. Today, magic & science merge and having the moon in our grasp will spark new dreams in the minds of 1.4 billion Indians. Jai Hind. 🇮🇳… pic.twitter.com/I4I9vJD4WE — anand mahindra (@anandmahindra) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Congratulations to the entire @ISRO team for making history by successfully reaching the moon, and to continuously aiming higher and farther! 🚀🌕 #ISRO #Chandrayaan3Mission #IndiaOnTheMoon #VikramLander pic.twitter.com/bQZX02sGDz — IRCTC (@IRCTCofficial) August 23, 2023 -
చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్
బెంగళూరు: జయహో భారత్. ఇస్రో అంచనాలు తప్పలేదు. యావత్ భారతం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరూ చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. ఓటమి గెలుపునకు నాంది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-2 వైఫల్యంతో మంచి పాఠాలే నేర్చింది. అందుకే చంద్రయాన్-3లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీర్చిదిద్దింది. జులై 15వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఏపీలోని శ్రీహారి కోట నుంచి చేపట్టింది. ఎల్వీఎం3-ఎం4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఆపై 18 రోజుల వ్యవధిలో ఐదుసార్లు కక్ష్యను పెంచుకుంటూ పోసాగారు. ఆగస్టు 1వ తేదీన ట్రాన్స్ లునార్ కక్ష్య.. 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఆగస్టు 17వ తేదీన వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవత్‌లో కూడిన ల్యాండర్ మాడ్యూల్.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించడం ప్రారంభించింది. ఆ తర్వాత రెంసార్లు డీ ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి జాబిల్లి ఉపరితలానికి చేరువ చేశారు. శెభాష్ విక్రమ్ 41 రోజుల ప్రయాణంలో అలిసిపోని విక్రమ్ ల్యాండర్.. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలను వమ్ము చేయలేదు. ఊహించినట్లుగా సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా ప్రయాణించి చంద్రుడిపై అడుగు మోపింది. సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో సైంటిస్టులు పంపించిన ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్‌ను అనుసరించి.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. నాలుగు థ్రాటబుల్‌ఇంజిన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుని.. రఫ్ బ్రేకింగ్ దశను ముగించుకుని చంద్రుడి ఉపరితం చేరుకుంది. చంద్రుడికి ఏడున్నర కిలోమీట్ల ఎత్తు నుంచి ల్యాండర్ తన దిశను మార్చుకుంది. దశల వారీగా ఎత్తు దగ్గించుకుని.. ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశంలో కాలుమోపింది. తద్వారా అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. నెక్ట్స్ ఏంటంటే.. దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగగా.. చంద్రుడిపై ఆ ప్రాంతంలో మట్టిని రోవర్ పరిశోధిస్తుంది. అలాగే.. రెండువారాలపాటు మట్టిలో గడ్డ కట్టిన మంచు అణువులైనా అన్వేషణ కొనసాగనుంది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 The moment when India reached on the Moon.#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan_3 pic.twitter.com/Pq4oI1OGTw — MyGovIndia (@mygovindia) August 23, 2023 ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ సక్సెస్ కావడంపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రక క్షణాల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్ ప్రపంచంగా ఉత్కంఠగా ఎదురు చూసింది. భారత్ ప్రయత్నాన్ని, కృషిని కొనియాడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. నీటిని కనుగొనే అవకాశం ఉన్నందున దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా జెఫ్ బెజోస్, ట్విటర్ అధినేత ఎలాన్‌మస్క్ తోపాటు, నటుడు, ఆర్ మాధవన్ సహా ప్రముఖులు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ముందే సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. "రూట్ ఫర్ ఇండియా! గుడ్ లక్, చంద్రయాన్-3," బెజోస్ ఇస్రోపోస్ట్ను రీషేర్ చేస్తూ థ్రెడ్స్ యాప్‌లో పేర్కొన్నారు. అలాగే ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ బయోపిక్ 'రాకెట్రీ: దినంబి ఎఫెక్ట్' లో కీలక పాత్ర పోషించిన మాధవన్ "చంద్రయాన్-3 సంపూర్ణ విజయం సాధిస్తుంది.. మార్క్ మై వర్డ్స్ అంటూ ట్విటర్ ద్వారా ముందుగానే అభినందలు తెలిపారు. Chandrayaan-3 WILL BE ABSOLUTE SUCCESS —- MARK MY WORDS . Congratulations @isro .. IN ADVANCE .. on this spectacular success .. I AM SO SO HAPPY AND PROUD … congratulations to @NambiNOfficial too .. Vikas engine delivers yet once again during the launch.… — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, "చంద్రయాన్ ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది" అని పేర్కొన్నారు. టెస్లా , స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్-3 మూన్ మిషన్‌పై స్పందించారు. 'ఇంటర్స్టెల్లార్' సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ఖర్చు తక్కువగా ఉందని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌పై మస్క్ స్పందిస్తూ, మిషన్ "భారతదేశానికి మంచిది" అని వ్యాఖ్యానించారు. #WATCH | On Chandrayaan 3 landing, actor Kareena Kapoor Khan says, "It's a great moment for India and a proud moment for every Indian. All of us are waiting to watch it. I'm going to do that with my boys." pic.twitter.com/MLJKJjoPsS — ANI (@ANI) August 21, 2023 ఇంకా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఈ మిషన్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.కాగా ఇస్రో వెబ్‌సైట్‌తోపాటు, పలు చానెళ్లు ఈ ల్యాండింగ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ అద్భుత విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
చంద్రయాన్ ప్రయోగంపై శాస్త్రవేత్తలకు అబ్దుల్ కలాం ప్రశ్న..?
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని యావత్ దేశం ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ నేడు సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ంగ్ కానుంది. దాదాపు నాలుగేళ్లుగా 1000 మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి ఫలితం దక్కనుందని ఇస్రో ఛైర్మని సోమనాథ్ తెలిపారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ఈ మిషన్ విఫలమైంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు ముందు భారత్ చంద్రయాన్ 1 ప్రాజెక్టు కూడా చేపట్టింది. ఈ మిషన్ జాబిల్లి కక్ష్యలో దాదాపు 3400 ఆర్బిట్లు తిరిగింది. 2009 ఆగష్టు 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత ఈ మిషన్ కూడా పూర్తయింది. అయితే.. చంద్రయాన్ 1 ప్రయోగం లాంచింగ్‌కి అప్పట్లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంని పిలిచారు. అక్కడకు హాజరైన ఆయన చంద్రయాన్ 1 మిషన్ శాస్త్రవేత్తల బృందానికి ఓ ప్రశ్న వేశారు. ప్రయోగం విజయవంతం అయిందనడానికి రుజువులు ఏం ఉంటాయని అడిగారు. అందుకు ఫొటోలు మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలపగా.. అవి సరిపోవని అయన చెప్పారు. చంద్రునిపై ఏదైనా వస్తువు వేయాలని సూచించారు. కలాం సూచనలు విన్న శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగంలో మార్పులు చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ 1 నుంచి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా భూమి ఫొటోలను పంపించినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ విషయమని విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
Chandrayaan 3: చంద్రయాన్ -3 ల్యాండింగ్.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ (ఫొటోలు)
-
చంద్రయాన్-3 ల్యాండింగ్: ఏపీ ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు
సాక్షి, విజయవాడ: నేడు చంద్రయాన్-3 ల్యాండింగ్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు పాఠశాలల్లో వీక్షించే ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈవోలకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాటు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ నేడు(బుధవారం) చంద్రుడిపై అడుగుపెట్టనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ పాదమోపనుంది. 11 నిమిషాల పాటు రఫ్ బ్రేకింగ్ దశ కొనసాగనుంది. ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్వయంగా అన్వేషించనుంది. అన్నీ అనుకూలిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5.20 గంటల నుంచి ఇస్రో లైవ్ ఇవ్వనుంది. ల్యాండర్ సేఫ్‌గా దిగితే.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని గడించనుంది. ఈ కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే ఉండటంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చదవండి: చంద్రయాన్–3 ల్యాండింగ్ లైవ్ అప్డేట్స్ -
చంద్రునిపైకి ఒక వాటర్ బాటిల్ పంపాలంటే.. అదానీ, అంబానీలే ఆలోచించాలి!
చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది. చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
చంద్రయాన్–3: షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
LIVE UPDATES: ►చంద్రయాన్-2 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ►సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ►సాయంత్రం 6.04 గంటలకే ల్యాండర్ చంద్రుడిని తాకనుంది. ►విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం: ఇస్రో చైర్మన్ సోమనాథ్ ► ఆ 19 నిమిషాలు మాకు టెర్రరే. ►సాయంత్రం 5.47 గంటల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుంది. ►అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్ అయ్యేలా ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించాం: ఇస్రో చీఫ్ సోమనాథ్ ►ఆ దశలో ల్యాండర్ ఎవరి మాట వినదు. ►2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్ అయ్యేలా ప్లాన్. ►అల్గోరిథమ్స్ బాగా పనిచేస్తే చాలు ►వర్టికల్ ల్యాండింగ్ అత్యంత కీలకం ►గంటకు 7.2 కిమీ. మీ-10.8 కి,మీ స్పీడుతో నేడు ల్యాండిగ్ ►ల్యాండర్ 12 డిగ్రీల ఒరిగినా సేఫ్ ల్యాండింగ్‌కు ప్లాన్ ►నేటి ల్యాండింగ్‌లో పూర్తిగా కంప్యూర్లదే పాత్ర ►చంద్రయాన్- నేటి ల్యాండింగ్‌లో ఇస్రో శాస్త్రవేత్తలది కేవలం పరిశీలక పాత్రే ►నేడు చివరి 15న నిమిషాలు పూర్తిగా కంప్యూటర్ గైడెడ్ ►2019లో చంద్రయాన్-2 ల్యాండర్ నిలువుగా దిగకపోవడం వల్లే కూలింది ►నేడు అది జరగకూడదని సర్వ జాగ్రత్తలు ►చంద్రుడిపై ఐస్ ఉన్నట్లుందని 2009లో చెప్పిన చంద్రయాన్1 నాసా పరికరం ►చంద్రుడిపై సముద్రాలు ఉన్నట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వీలు ►చంద్రుడిపై ఇప్పటి దాకా ల్యాండ్ అయిన రోవర్లు: అమెరికా, చైనా, రష్యా ►చంద్రయాన్-3 పరిశోధనల వైపు ప్రపంచం మొత్తం చూపు ►చంద్రయాన్-3 ల్యాండింగ్ సౌతాఫ్రికా నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వీక్షించనున్నారు. ►మరొకన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ►ఇవాళ జిబిల్లాపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ►సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగుపెట్టనున్న విక్రమ్ ల్యాండర్ ►సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రోశాస్త్రవేత్తల ధీమా ►ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలు ►విజయవంతం కావాలని పూజలు, హోమాలు ►చంద్రయాన్ 3 రూపకల్పనలో గద్వాల జిల్లా యువకుడు కృష్ణా ►చంద్రయాన్-3 మిషన్‌లో 2 పేలోడ్స్(AHVC). (ILSA)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాసిన ఉండవల్లికి చెందిన కృష్ణ ►ప్రపంచ దేశాల చూపు చంద్రయాన్వైపే ►రష్యా లూనా-25 విఫలం కావడంతో చంద్రయాన్‌పై ఇతర దేశాల ఆసక్తి ►ప్రయోగం సక్సెస్ అయితే దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ►గత నెల 14న చంద్రయాన్ 3 ప్రయోగం ►41 రోజుల పాటు ప్రయాణం చేసిన చంద్రయాన్ ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని బుధవారం సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ల్యాండర్ మాడ్యూల్ చందమామను చేరుకొనే అద్భుత దృశ్యాల కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘జయహో భారత్.. జయహో ఇస్రో’ అంటూ సోషల్ మీడియాలో యువత నినాదాల హోరు ఇప్పటికే మొదలయ్యింది. ప్రపంచ దేశాలు చంద్రయాన్–3 ప్రయోగంపై ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. –సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) ►70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోల చిత్రీకరణ ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ) కేవలం 70 కిలోమీటర్ల ఎత్తునుంచి చంద్రుడి ఉపరితలాన్ని ఈ నెల 19న చిత్రీకరించింది.ఈ ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. ►ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. ►చంద్రయాన్–3లో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పటిదాకా ప్రతి ఆపరేషన్ విజయవంతం ►భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించింది. ►41 రోజుల ప్రయాణంలో ఐదుసార్లు భూమధ్యంతర కక్ష్యలో, మరో ఐదుసార్లు లూనార్ ఆర్బిట్(చంద్రుడి కక్ష్య)లో చంద్రయాన్–3 మిషన్ కక్ష్య దూరాన్ని పెంచుతూ వచ్చారు. ...ఇక మిగిలింది ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడమే. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ ఇలా.. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 25గీ134 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ మాడ్యూల్‌ను సెకన్‌కు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా దించనున్నారు. ఇందులో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. దీన్ని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని అభివర్ణిస్తున్నారంతే ఇదెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ 17 నిమిషాల్లోనే ల్యాండర్ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది. సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైన పరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకం. ల్యాండర్ మాడ్యూల్లో నాలుగు థ్రస్టర్ ఇంజిన్లు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీటిని మండించడం ప్రారంభమవుతుంది. దాంతో ల్యాండర్ వేగం క్రమంగా తగ్గిపోతుంది. తనలోని సైంటిఫిక్ పరికరాలతో ల్యాండింగ్ సైట్‌ను ల్యాండర్ మాడ్యూల్ గుర్తిస్తుంది. అడ్డంకులు ఏవైనా ఉంటే గుర్తిస్తుంది. ల్యాండింగ్ సైట్ చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్ అవుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం లేకపోలేదు. వాయిదా పడితే ఈ నెల 27న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ చెప్పారు. పరిస్థితులన్నీ అనూకూలించి, సాంకేతికపరంగా సహకారం అందితే సురక్షితంగా ల్యాండింగ్ అవుతుంది. ల్యాండర్ మాడ్యూల్‌ను నిరంతరం క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని ఇస్రో మంగళవారం వెల్లడించింది. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు అవసరమైన కమాండ్లను ల్యాండర్లో ఇస్రో అప్లోడ్ చేస్తుంది. -
చంద్రుడిపై అడుగు.. నమ్మరేంట్రా బాబూ!
అదొక అత్యంత అద్భుతమైన ఘట్టం. 1969 జులై 20వ తేదీన.. ‘ఈగిల్’ లునార్ మాడ్యుల్ నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా.. ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్రకెక్కారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. అయితే ఆ ఘనత నిజమేనా అనుమానాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి.. అందుకు కారణాలు లేకపోలేదు. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లునార్ మాడ్యుల్ ‘ఈగిల్’ కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ ‘కొలంబియా’ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. అంతరిక్షంలో సుమారు రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. జులై 19వ తేదీ.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా! ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. చుక్కలు కనపడాలి కదా! బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్ష్యాలు.. అన్నింటికి మించి సుమారు 24 బిలియన్ల డాలర్ల ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. చంద్రయాన్-3 నేపథ్యంలో సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
చంద్రయాన్ 3.. 'టెర్రర్ టైం' గురించి తెలుసా?
చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ఇస్రో ల్యాండర్ అడుగుపెట్టే క్షణం కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూప ఘట్టం ఆవిషృతమౌతుందని ఇస్రో వర్గాలు ఇప్పటికే తెలిపారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్‌లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో దిగడానికి సూర్యదయం కాగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.45 తర్వాత అసలైన ప్రక్రియ ప్రారంభమైతుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి '20 మినెట్ టెర్రర్'గా అభివర్ణించారు. Chandrayaan-3 Mission: The mission is on schedule. Systems are undergoing regular checks. Smooth sailing is continuing. The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement! The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY — ISRO (@isro) August 22, 2023 చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నిమిషాలు కీలకం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత 11 నిమిషాల పాటు రన్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా ఉంటుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. అక్కడ ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఈ దశలోనే గతంలో చంద్రయాన్ 2 కూలిపోయింది. ఈ దశల అనంతరం చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం సున్నాకు చేరుతుంది. చివరకు 150 మీటర్లకు చేరుకోగానే సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. సరైన స్థలంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల టెర్రర్ టైంకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ..
మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ బటన్‌ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్‌ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్‌తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లర్కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్‌కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు. కొందరు యూజర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్ ప్రయోగం ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. Kinda crazy when you realize India's budget for Chandrayaan-3 ($75M) is less than the film Interstellar ($165M)😯🚀 #Chandrayaan3 #moonlanding pic.twitter.com/r2ejJWbKwJ — Newsthink (@Newsthink) August 21, 2023 -
రేపే చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ల్యాండర్ కీలక ఘట్టానికి సమయం సమీపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ ‘విక్రమ్’ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. సాయంత్రం 5.20 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై దిగితే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా అదొక చిరస్మరణీయ ఘట్టమే అవుతుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అంతేకాదు చంద్రుడిపై భద్రంగా దిగిన నాలుగో దేశంగా రికార్డు సృష్టిస్తుంది. చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే అక్కడ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్–2 ఆర్బిటార్‌తో కమ్యూనికేషన్ ఏర్పర్చుకుందని ఇస్రో సైంటిస్టులు సోమవారం వెల్లడించారు. రెండూ పరస్పరం సంభాíÙంచుకుంటున్నాయని తెలిపారు. ‘వెల్కమ్, బడ్డీ!’ అంటూ ల్యాండర్ మాడ్యూల్‌కు ఆర్బిటార్ స్వాగతం పలకిందని చెప్పారు. ఆర్బిటార్‌తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని, ఇప్పటికైతే ఎలాంటి అవరోధాలు కనిపించడంలేదని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌తో సమావేశమయ్యారు. ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులను ఆయనకు వివరించారు. ఈ మొత్తం ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని తెలిపారు. లేదంటే 27వ తేదీన ల్యాండింగ్? సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ల్యాండింగ్ విషయంలో ఇస్రో కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చందమామకు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగే తరువాయి. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మరోమారు క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో ప్రకటించింది. పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటేనే ల్యాండ్ చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. చంద్రయాన్–2, రష్యా లూనా–25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్–3 విషయంలో సైంటిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దక్షిణ ధ్రువం చిత్రాలు విడుదల ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా(ఎల్‌హెచ్‌డీఏసీ) చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా కాలు మోపడానికి ఈ కెమెరా తోడ్పడనుంది. రాళ్లు, గుంతలను ఫొటో తీసి, అవి లేని చోట ల్యాండర్ దిగడానికి అనువైన ప్రదేశాన్ని ఈ కెమెరా గుర్తిస్తుంది. ప్రకాశ్‌రాజ్ పోస్టుపై రగడ ముంబై: చంద్రయాన్–3 ప్రయోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ‘ఎక్స్’లో ఆదివారం చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. చొక్కా లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ వడబోస్తున్న కార్టూన్ చిత్రాన్ని ప్రకాశ్‌రాజ్ పోస్టు చేశారు. కన్నడ భాషలో దీనికి వ్యాఖ్యను కూడా జతచేశారు. ‘‘ఇప్పుడే అందినవార్త. చంద్రయాన్ నుంచి మొదటి చిత్రం ఇప్పుడే వచి్చంది’’ అని పేర్కొన్నారు. అయితే, అందులో టీ వడబోస్తున్న చాయ్‌వాలా ఎవరన్నది ప్రకాశ్‌రాజ్ బయటపెట్టలేదు. ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్‌ను ఎద్దేవా చేస్తూ ఈ పోస్టు పెట్టారని ప్రకాశ్‌రాజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని పోస్టు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రుడికి అవతల.. అరుదైన ఫొటోలు
బెంగళూరు: చంద్రుడిపైకి ఇస్రోవారి విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టే క్షణాల కోసం యావత్ భారత్ మాత్రమే కాదు.. రష్యా 47 ఏళ్ల తర్వాతి ప్రయోగం విఫలం కావడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చంద్రయాన్-3 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సున్నితంగా ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రదేశం కోసం ల్యాండర్ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతం.. అదీ భూమికి మునుపెన్నడూ కనిపించని ప్రాంతాలను తన కెమెరాతో బంధిస్తోంది. సాధారణంగా.. చంద్రుడు మనకు ఒకవైపే కనిపిస్తాడు. అయితే.. అవతలివైపు విక్రమ్ ల్యాండర్ తీస్తున్న ఫొటోల్లో.. ఉపరితంపై అనేక బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 19వ తేదీనే ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం.. 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంది. ఒకవేళ చంద్రయాన్-3 గనుక సక్సెస్ అయితే.. సోవియట్ యూనియన్(పూర్వపు రష్యా), అమెరికా, చైనా సరసన భారత్ నిలవనుంది. Chandrayaan-3 Mission: Here are the images of Lunar far side area captured by the Lander Hazard Detection and Avoidance Camera (LHDAC). This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB — ISRO (@isro) August 21, 2023 -
ప్రకాశ్‌రాజ్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: సినీ నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్(ఒకప్పుడు ట్విటర్) వేదికగా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుండి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను తీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార బీజేపీ పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో అప్డేటెడ్ గా ఉండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం తాను చేసిన విమర్శకు ప్రతిగా తాను విమర్శల పాలయ్యాడు. జూలై 14న భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురుచూస్తోంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశాడు. ఒక వ్యక్తి టీ వడపోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రయాన్ నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో.. వావ్.. అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు కురిపించారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ.. ఏది పెడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G — Prakash Raj (@prakashraaj) August 20, 2023 ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
చంద్రుడిపై అడుగు పెట్టకుండానే కుప్పకూలిన రష్యా ల్యాండర్
మాస్కో: రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. లూనా-25 సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా -25లో శనివారం సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడిపై కుప్పకూలింది. చంద్రుడికి సమీపంగా వెళ్లిన తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ నెల 21న ఇది చంద్రుడిపై కాలు మోపాల్సి ఉండగా అంతలోనే ఇలా జరగడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రష్యా శాస్త్రవేత్తలు. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు చేసిన ఈ ప్రయోగంపై రష్యా మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ చివరి నిముషంలో క్రాష్ ల్యాడింగ్ జరగడం దురదృష్టకరమంటోంది రోస్ కాస్మోస్. మరోపక్క భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రయాన్-3 అన్ని దశలను పూర్తి చేసుకుని చంద్రుడికి అత్యంత సమీపంలో పరిభ్రమిస్తుంది. నిర్దేశిత సమయంలోనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపుతుందని శనివారం ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇది కూడా చదవండి: దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ! -
చంద్రయాన్-3.. అడుగు దూరంలో విక్రమ్
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో కీలకఘట్టాలు దాదాపు పూర్తయ్యాయి. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిచేరువ కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అంటే.. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో అనుకున్న తేదీనే చంద్రుడి దక్షిణధ్రువంపై ల్యాండ్ కానుంది. ‘‘ రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. Chandrayaan-3 Mission: The second and final deboosting operation has successfully reduced the LM orbit to 25 km x 134 km. The module would undergo internal checks and await the sun-rise at the designated landing site. The powered descent is expected to commence on August… pic.twitter.com/7ygrlW8GQ5 — ISRO (@isro) August 19, 2023 ఇదీ చదవండి: జాబిల్లిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. -
చంద్రునిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము? , అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు. అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం. చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో 14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం). ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ చంద్ర గ్రహస్య దక్షిణతః అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥ చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥ ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత. గ్రహం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే (మీరే మా బలంగా మారండి ) చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి చెప్పారంటే • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ ) ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని, పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. తరువాత చంద్రుని ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్ (ఆకాశం, అంతరిక్షం ) ఈ శ్లోకం గౌరీ దేవత వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం, పై అర్థ భాగంలోనే ఉన్నాయి. చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు. చంద్రునిపై నీటి ఆనవాళ్లు: చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది. ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి. ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని. అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది . ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం. -Dr. Y. Hanumantha Rao, email: hanuyr@gmail.com ఇదీ చదవండి: Chandrayaan 3 Mission Details: చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్ -
జాబిల్లికి చేరువగా ల్యాండర్ మాడ్యూల్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ మాడ్యూల్ చందమామకు మరింత చేరువగా వచ్చింది. మాడ్యూల్‌లోని ఇంధనాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్వల్పంగా మండించి లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 113గీ157 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది. ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ నెల 20న తెల్లవారుజామున 2 గంటలకు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నారు. ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్లనున్నారు. రెండో విడత కక్ష్య దూరం తగ్గింపు అనంతరం ఈ నెల 23న ల్యాండర్ మాడ్యూల్‌ను కక్ష్య దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియ నిర్వహిస్తారు. చంద్రుడి ఫొటోలు పంపించిన చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ చందమామకు 113 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా చిత్రీకరించిన ఛాయాచిత్రాలు, వీడియోలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చంద్రయాన్–3 వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ) ఆగస్టు 15న, ల్యాండర్ ఇమేజర్(ఎల్ఐ) కెమెరా–1 ఆగస్టు 17న ఈ చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాయి. భూ నియంత్రిత కేంద్రానికి పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై మట్టి దిబ్బలు, అఖాతాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్ చేసిన ఇస్రో..
బెంగళూరు: చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3.. ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఈ మేరకు ల్యాండర్ విక్రమ్ మొదటిసారి చంద్రుని ఫొటోలను పంపించింది. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి గురువారమే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ఆ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు. Chandrayaan-3 Mission: View from the Lander Imager (LI) Camera-1 on August 17, 2023 just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad — ISRO (@isro) August 18, 2023 ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది. ఇదీ చదవండి: India First 3D Printed Post Office: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్
చంద్రయాన్-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. ఈ మేరకు గురువారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రయాన్-3 వ్యోమననౌక చంద్రుడికి మరింత చేరువైంది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండ్ కానుంది. Chandrayaan-3 Mission: ‘Thanks for the ride, mate! 👋’ said the Lander Module (LM). LM is successfully separated from the Propulsion Module (PM) LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST. Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct — ISRO (@isro) August 17, 2023 బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంప్లెక్స్(ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు నేటి నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోగా.. ల్యాండర్లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. చంద్రయాన్–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. కాగా చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న చంద్రయాన్–3ప్రయోగించిన విషయం తెలిసిందే. మిషన్ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించిందిదే. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. -
Chandrayaan 3: జాబిల్లి వైపు వడివడిగా..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. చంద్రుడి ఉపరితలంపై దిగే కీలక ఘట్టానికి చంద్రయాన్–3 మరింత చేరువైంది. ఇక ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ వేరుకావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మిషన్ చంద్రుడి సమీప కక్ష్యలోకి(లూనార్ ఆర్బిట్) ఎలాంటి అవరోధాలు లేకుండా చేరుకుంది. చంద్రయాన్–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. అలాగే చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను వేరుచేసే విన్యాసాన్ని ఈ నెల 17న చేపట్టనున్నట్లు ఇస్రో తెలియజేసింది. నేటి నుంచే ముఖ్యమైన ఆపరేషన్ బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంప్లెక్స్(ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్! -
జాబిలికి మరింత చేరువైన చంద్రయాన్-3
-
జాబిల్లిపై యాక్సిడెంట్...మీరేం తీసుకెళ్తారు ?
-
చంద్రయాన్–3కి నాలుగోసారి కక్ష్య తగ్గింపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్–3 మిషన్‌కు నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కక్ష్య దూరాన్ని వంద కిలోమీటర్లకు తగ్గించే ప్రక్రియను ఈనెల 17న చేపట్టనున్నారు. అయితే రష్యా ప్రయోగించిన లూనా–25 అనే మిషన్ చంద్రుడిపైన దిగింది. చంద్రుని ఉపరితలంపై ఈ నెల 23న దక్షిణ ధృవంలో దిగబోయే మొట్టమొదటి మిషన్ చంద్రయాన్–3దే పై చేయి అవుతుంది. -
చందమామపై యాక్సిడెంట్.. మీరేం తీసుకెళ్తారు?
మన ఇస్రో మొన్న చందమామపైకి రోవర్‌ను పంపింది. నిన్న రష్యా కూడా పంపింది. ఇంకొన్నేళ్లు ఆగితే మనుషులూ వెళతారు. అక్కడక్కడా కాలనీలు కట్టుకుంటారు. అప్పుడప్పుడూ జనం భూమ్మీదికి, చంద్రుడిపైకి వచ్చిపోతూ ఉంటారు. ఇంతవరకు సరేగానీ.. ఒకవేళ మీరు చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష నౌకలో సమస్య వచ్చి, మనుషుల కాలనీకి దూరంగా పడిపోతే ఎలా? అంతరిక్ష నౌకలో దెబ్బతినగా మిగిలిన వస్తువులను ఎలా వాడుతారు? అన్న ఓ కొత్త సవాల్ తెరపైకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆలోచనకు పరీక్ష.. మెదడుకు మేత.. అంతరిక్షంలో విహరించాలన్నది చాలా మంది కల. ఇప్పటికే చంద్రుడిపై అడుగుపెట్టాం. ఇటీవల మరిన్ని ప్రయోగాలు చేపట్టాం. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలనూ కట్టేసుకోనున్నాం. 2025లో మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా ఆర్టిమిస్ మిషన్‌ను కూడా చేపట్టింది. ఈ క్రమంలో చంద్రుడిపైకి రాకపోకలు మొదలై, ఏదైనా సమస్య వస్తే ఎలాగన్న ప్రశ్న ఓ వైపు.. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మేధోశక్తికి పరీక్ష పెట్టడం, కొత్త ఆలోచనలు కల్పించే లక్ష్యం మరోవైపు.. అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ ‘ది నాసా మూన్ సరై్వవల్ టెస్ట్’ను రూపొందించింది. ఏ వస్తువుకు.. ఎంత ప్రాధాన్యత అంటూ.. మీరు చంద్రుడిపైకి కొంత మందితో కలిసి వెళ్లిన స్పేస్‌షిప్.. మనుషులు ఉండే కాలనీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. కమ్యూనికేషన్ పరికరాలు పాడయ్యాయి. స్పేస్‌షిప్‌లో పాడైనవి పోగా మిగిలిన 15 వస్తువుల సాయంతో.. అక్కడి నుంచి నడుస్తూ కాలనీకి వెళ్లాలి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగురుతూ, నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాల లిస్టు ఇది.. వీటిలో దేనికి మొదటి ప్రాధాన్యత, తర్వాత దేనికి.. ఇలా అన్నింటికి నంబర్లు వేయాలి. ఉన్నవి ఇవీ.. ప్రాధాన్యతలు ఏవి? ♦ అగ్గిపెట్టె ♦ పోషకాలన్నీ దట్టించిన ప్రత్యేక ఆహారం ♦ 50 అడుగుల నైలాన్ తాడు ♦ పారాచూట్ సిల్క్ (వస్త్రం) ♦ పోర్టబుల్ హీటింగ్ యూనిట్ (వేడిని ఇచ్చే పరికరం) ♦ రెండు కాలిబర్ పిస్టళ్లు ♦ ఒక బాక్స్ నిండా పాల సీసాలు ♦ ఒక్కోటీ 45కిలోల బరువున్న రెండు ఆక్సిజన్ సిలిండర్లు ♦ అంతరిక్షంలో చుక్కల స్థానాన్ని బట్టి మన స్థానం తెలుసుకునే మ్యాప్ ♦ లైఫ్ రాఫ్ట్ (అత్యవసర సమయాల్లో ఒక్కసారిగా గాలి నిండి పడవలా మారే బెలూన్) ♦ దిక్కులను చూపించే మాగ్నెటిక్ కంపాస్ ♦ 20 లీటర్ల నీళ్ల క్యాన్ ♦ సిగ్నల్ ఫ్లేర్స్ (బాణాసంచా రాకెట్లా గాల్లోకి పంపి మన స్థానం తెలిపే పరికరం) ♦ వివిధ రకాల విటమిన్లు, అత్యవసర మందుల సిరంజీలు ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ♦ సోలార్ పవర్‌తో పనిచేస్తూ.. ఎఫ్ఎం రేడియో సిగ్నళ్లు పంపే, అందుకునే పరికరం (చందమామపై కాలనీకి దూరంగా చిక్కుకుపోయిన మీరు వీటిలో ఏయే పరికరాలకు ఎంత ప్రాధాన్యత క్రమం ఇస్తారో ఇవ్వండి. తర్వాత కింద నాసా నిపుణులు ఇచ్చిన ఫలితాలు చూడండి) ఇదీ ప్రాధాన్యత.. దేనికి? ఎందుకు? 1. ఆక్సిజన్ ట్యాంకులు: అంతరిక్షంలో మనం జీవించడానికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొచ్చు. స్పేస్‌సూట్ శరీరంలోని నీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఇంకొన్ని రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుంటే నిమిషం కూడా బతకలేం. అందుకే దీనికి ఫస్ట్ ప్రయారిటీ. చంద్రుడిపై గ్రావిటీ తక్కువ కాబట్టి ఆక్సిజన్ ట్యాంకుల బరువు కూడా పెద్ద విషయమేం కాదు. భూమ్మీదితో పోలిస్తే.. ఒక్కో ట్యాంకు ఏడెనిమిది కిలోలే ఉంటుందట. 2. మంచి నీళ్లు: ఆక్సిజన్ తర్వాత అత్యంత ముఖ్యమైనవి మంచి నీళ్లే. తగిన స్థాయిలో నీళ్లు ఉంటే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చు. కాలనీకి చేరుకోవచ్చు. 3. అంతరిక్ష మ్యాప్: చంద్రుడిపై కూడా దాదాపు భూమి నుంచి చూసినట్టే.. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తాయి. అందువల్ల ముందే కాలనీలు మార్క్ చేసి ఉన్న మ్యాప్ ఉంటే.. ఆ వైపుగా ప్రయాణం చేయవచ్చు. 4. ప్రత్యేక ఆహారం: చిక్కుకున్న చోటి నుంచి కాలనీకి వెళ్లాలన్నా, రెస్క్యూ బృందం వచ్చేదాకా బతకాలన్నా ఆహారం కావాల్సిందే. 5. ఎఫ్ఎం పరికరం: ఎఫ్ఎం ట్రాన్స్మిటర్/రిసీవర్ పరికరాలు కొన్ని కిలోమీటర్ల వరకే సిగ్నళ్లను పంపడం, అందుకోవడం చేయగలుగుతాయి. అయినా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూకు, సమీపంలోని ఇతర బృందాలకు సమాచారం ఇవ్వడానికి పనికివస్తాయి. 6. నైలాన్ తాడు: చంద్రుడిపై నైలాన్ తాడు ఎందుకు అనిపించొచ్చు. అక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తాడుతో పట్టుకుని ఉండొచ్చు. చిన్నపాటి కొండల్లాంటివి ఉంటే ఎక్కడానికి వినియోగించుకోవచ్చు. మన సామగ్రిని ఒక్కదగ్గర కట్టి ఉంచుకోవచ్చు. 7. ఫస్ట్ ఎయిడ్ కిట్: స్పేస్ షిప్ కూలిపోయినప్పుడు గాయపడినా, ప్రయాణంలో సమస్య తలెత్తినా, ఏదైనా అకస్మాత్తు అనారోగ్యానికి గురైనా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో లాభం ఉంటుంది. అందులోని విటమిన్ ఇంజెక్షన్లు.. మన శరీరం సంతులనంగా ఉండటానికి తోడ్పడుతాయి. 8. పారాచూట్ వస్త్రం: చంద్రుడిపై వాతావరణం ఉండదు. కాబట్టి సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా పడతాయి. దీనితో స్పేస్ సూట్, సామగ్రితోపాటు మన కళ్లకూ నష్టం. అలా జరగకుండా పారాచూట్ వస్త్రం కప్పుకోవచ్చు. 9. లైఫ్ రాఫ్ట్: అత్యవసర పరిస్థితుల్లో వాడే లైఫ్రాఫ్ట్లో వేగంగా వాయువు నిండటానికి కార్బన్ డయాక్సైడ్ను బాగా ఒత్తిడితో నింపిన బాటిళ్లు ఉంటాయి. చంద్రుడిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. బాటిళ్లను స్పేస్సూట్కు కట్టుకుని, కార్బన్ డయాక్సైడ్ను మెల్లగా వదులుతూ ఉంటే.. రాకెట్లా ముందుకెళ్లిపోవచ్చు. 10. సిగ్నల్ ఫ్లేర్స్: కాలనీలకు దూరంగా ఎక్కడో స్పేస్‌షిప్ కూలిపోతే.. సిగ్నల్ ఫ్లేర్స్‌తో ప్రయోజనం లేనట్టే. అయితే రెస్క్యూ బృందాలు వచ్చినప్పుడు మాత్రం వాటితో మనమున్న స్థానాన్ని గుర్తించేలా చేయవచ్చు. 11. కాలిబర్ పిస్టళ్లు: చందమామపై పిస్టళ్లు దేనికి అనే అనుమానం రావొచ్చు. అయితే లైఫ్ రాఫ్ట్లలోని కార్బన్ డయాక్సైడ్ క్యాన్ల తరహాలో.. మనం వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు రాకెట్లలాగా పిస్టల్ కాల్పులు ఉపయోగపడతాయట. 12. పాల క్యాన్లు: పోషకాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఎలాగూ ఉంది. ఇంకా ఈ పాలక్యాన్లు అదనపు బరువు. ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మాత్రం వీటితో ప్రయోజనం 13. హీటింగ్ యూనిట్: చంద్రుడిపై వెలుతురు భాగంలో వేడికి కొదవ లేదు. ఒకవేళ చీకటి భాగంలోకి వెళితే మాత్రం హీటింగ్ యూనిట్ అవసరం. లేకుంటే ఉత్తదే. 14. మ్యాగ్నెటిక్ కంపాస్: చంద్రుడిపై అయస్కాంత క్షేత్రం సరిగా లేదు. అందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్‌కు పనిలేదు. 15. అగ్గిపెట్టె: దీన్ని ఎంచుకోవడం అన్నింటికన్నా వృథా. ఎందుకంటే చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు కాబటి అగ్గిపుల్ల వెలగదు, మంట అంటుకోదు. మనం సరై్వవ్ కావడానికి ఏమాత్రం పనికిరాదు. -
చంద్రయాన్–3 మిషన్ వీడియో విడుదల చేసిన ఇస్రో
-
చంద్రయాన్-3లో కీలక అడుగు.. చంద్రుని కక్ష్య వైపు ప్రయాణం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): గత నెల 14వ తేదీన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్–3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఇలా చంద్రయాన్–3 కక్ష్య దూరం మరోమారు పెంచారు. అక్కడ నుంచి ఐదు రోజులపాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఆ కక్ష్యలోకి వచ్చాక ఆగస్టు 23వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ విచ్చుకుని లోపలి నుంచి రోవర్ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని అందిస్తుంది. అంటే చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకోవడానికి ఇంకా 17 రోజులు, చంద్రుడిపై దిగడానికి 23 రోజులు పడుతుందన్న మాట. -
చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు..
చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్-3 నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ నౌకకు ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు చంద్రయాన్-3 ప్రయాణం సాగిస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య కాగా, అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆపరేషన్‌ను ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటివరకు దశలవారీగా ఐదుసార్లు పెంచారు. భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనుంది. కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది. చదవండి: చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం! ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. -
చందమామకు ఎవరు దగ్గర?
గోరుముద్దలు తింటున్నప్పుడే ఆకాశంలో చందమామను అందుకోవాలన్న ఆరాటం మనిషిది. అలా అందుకోవాలంటే దగ్గరవ్వాలి. అందుకే అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్ షిప్పులతో ప్రయాణాలు. అలాగాకుండా భూమ్మీద నుంచే చూస్తే.. చందమామ ఎవరికి దగ్గరో తెలుసా? ఏయే దేశాల వారికి దగ్గరగా ఉంటాడో తెలుసా? అసలు అంతరిక్షానికి భూమ్మీద దగ్గరి ప్రాంతమేంటో ఐడియా ఉందా? చందమామపైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో ఈ వింతైన విశేషాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఎవరెస్ట్ ఎత్తయినదే.. అయినా.. భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదేకదా అంటారు. కానీ ఇది కొంత వరకే నిజం.. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన ప్రాంతాలూ ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయి. భూమి ఆకృతి ఎఫెక్ట్ మన భూమి అచ్చంగా గోళాకారంలో ఉండదు. ధ్రువ ప్రాంతాల వద్ద కాస్త నొక్కినట్టుగా, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బెత్తుగా.. కాస్త దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి భ్రమణ వేగం, సూర్యుడి గురుత్వాకర్షణ వంటివే దీనికి కారణం. ఈ కారణం వల్లే భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ధ్రువ ప్రాంతాలు దగ్గరగా, భూమధ్యరేఖ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. దీనికితోడు భూమిపైపొరల్లోని హెచ్చుతగ్గులు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ. చంద్రుడికి దగ్గరున్నది ‘మౌంట్ చింబోరాజో’ స్పేస్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్‌లోని హెడెన్ ప్లానెటోరియం డైరెక్టర్ నీల్ డెగ్రాస్ టైసన్ కలసి అధ్యయనం చేశారు. లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్ దేశం పరిధిలోకి వచ్చే ‘మౌంట్ చింబోరాజో’శిఖరం చంద్రుడికి దగ్గర అని తేల్చారు. దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్ పరిధిలో ‘మౌంట్ చింబోరాజో’శిఖరం ఉంది. ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్‌తో పోలిస్తే.. చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు లెక్క తేల్చారు. ఈ దేశాలు కూడా ‘స్పేస్’కు దగ్గర చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే.. ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే.. భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు (13 మైళ్లు) దగ్గరగా ఉన్నట్టేనని పేర్కొంటున్నారు. ♦ భూమిపై సముద్ర మట్టం కంటే పైన భాగాల్లో అత్యంత ఎత్తయినది ‘ఎవరెస్ట్’శిఖరమే అన్నది సుస్పష్టం. కానీ సముద్రాలు, భూభాగాలు అన్నింటినీ కలిపి చూస్తే.. భూమ్మీద అతి ఎత్తయిన శిఖరం అమెరికాలోని హవాయ్ దీవుల్లో భాగమైన ‘మౌనాకీ’అగ్నిపర్వత శిఖరమే. ♦ సముద్ర మట్టంపైన మౌనాకీ ఎత్తు 4,205 మీటర్లే. కానీ సముద్రం లోపల మరో 6,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే సముద్ర గర్భం నుంచీ చూస్తే.. మౌనాకీ మొత్తం ఎత్తు 10,205 మీటర్లపైనే. అంటే ఎవరెస్ట్ కన్నా సుమారు 1,350 మీటర్లు ఎత్తు ఎక్కువ. -
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పెంపు విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3 రాకెట్‌ను శుక్రవారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది. జాబిల్లిపై ఉన్న రహస్యాలు ఛేదించేందుకు పంపిన చంద్రయాన్-3 ప్రస్తుతం కీలక దశ దిశగా సాగుతోంది. ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా ప్రయాణిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఒకసారి మిషన్ కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు.. నేడు(సోమవారం) రెండోసారి మూన్ మిషన్ కక్ష్యను పెంచే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. భారత్ పంపిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి 41,603 కిలోమీటర్లు X 226 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలో ఉందని బెంగుళూరులో జాతీయ అంతరిక్ష సంస్థ సోమవారం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మరోసారి స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్లను మండించి కక్ష్యను మరింత పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, చంద్రయాన్-3 ప్రయోగం మొత్తంలో రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించడమే తమ ముందున్న అసలైన సవాలని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదవండి: ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ని దించడమే ముందున్న లక్ష్యం -
అందీ అందని చందమామ
చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అని వ్యాఖ్యానించాడు. చంద్రుడిని చేరుకోవాలనేది మనిషి చిరకాల స్వప్నం. వీలుంటే చంద్రలోకంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. చంద్రుడిపై కాలుమోపిన మనిషి ఇంతవరకు అక్కడ కాళ్లూనుకోలేదు.అందీ అందకుండా ఊరిస్తున్న చందమామపై దేశదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలను మానుకోలేదు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి రెండో అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా చందమామ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈసారి అంతర్జాతీయ చంద్ర దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న అంశం ‘చంద్రునిపై అన్వేషణలో సమన్వయం, సుస్థిరత’. చంద్రునిపై అన్వేషణలోను, పరిశోధనల్లోను వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సమన్వయం, పరిశోధనల్లో సుస్థిరత కోసం ఐక్యరాజ్య సమితి ఈ అంశాన్ని ఎంపిక చేసుకుంది. మనిషి చంద్రుడిపై కాలుమోపడం నిజంగానే మానవాళికి ముందడుగు. చంద్రుడి ఆనుపానులు పూర్తిగా తెలుసుకోవాలంటే మరిన్ని అడుగులు మునుముందుకు వేయాలి. శాస్త్రవేత్తలు ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఒక్కో అడుగు ముందుకు వేసినప్పుడల్లా చంద్రుడి గురించి కొత్త కొత్త విశేషాలను తెలుసుకుని, మానవాళికి వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి ముందు చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. మానవాళికి ముందడుగు చంద్రుణ్ణి అందుకోవాలనే తపన మనుషుల్లో చాన్నాళ్లుగానే ఉంది. తొలి రోజుల్లో అమెరికా, సోవియట్ రష్యా చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాల్లో పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టాయి. తప్పటడుగుల దశలో జరిపిన దాదాపు అరడజను ప్రయోగాలు విఫలమైన తర్వాత తొలిసారిగా సోవియట్ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్ 12న సోవియట్ రష్యా ప్రయోగించిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడి విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలను సాగిస్తూనే ఉన్నాయి. తొలి దశాబ్దకాలంలో ఈ ప్రయోగాల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాతి నుంచి ప్రయోగాలలో వైఫల్యాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969 జూలై 16న ‘అపోలో–11’ ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా ఇద్దరు వ్యోమగాములు– నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి చేరుకున్నారు. జూలై 20న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు మోపి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ‘నాసా’ 1968 డిసెంబర్ 20న ముగ్గురు వ్యోమగాములతో ‘అపోలో–8’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి మీదకు మనుషులతో చేరుకున్న తొలి వ్యోమనౌక ఇదే. ఇందులో ఫ్రాంక్ ఎఫ్ బోర్మన్–ఐఐ, జేమ్స్ ఏ లవల్ జూనియర్, విలియమ్ ఏ ఆండ్రెస్ చంద్రుడి మీదకు వెళ్లారు. అయితే వారెవరూ చంద్రుడిపై అడుగు మోపకుండానే తిరిగి వచ్చేశారు. తొలి ప్రయోగాలు విఫలం చంద్రుడి కక్ష్యలోకి చేరుకునే తొలి ప్రయత్నాన్ని అమెరికా చేసింది. ‘నాసా’ ఏర్పాటుకు కొద్దికాలం ముందే అమెరికన్ వైమానికదళంలోని బాలిస్టిక్ మిసైల్స్ విభాగం 1958 ఆగస్టు 17న ‘పయోనీర్–0’ ప్రయోగాన్ని చేపట్టింది. భూ కక్ష్యను దాటి ఒక వస్తువును అంతరిక్షంలోకి పంపేందుకు చేసిన తొలి ప్రయోగం ఇది. థోర్ మిసైల్ ద్వారా ‘పయోనీర్–0’ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగం జరిపారు. అయితే, టర్బోపంప్, గేర్‌బాక్స్‌లలో తలెత్తిన లోపాల వల్ల ఇది భూమి నుంచి 16 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. ఈ వైఫల్యానికి కొద్దిరోజుల ముందే 1958 జూలై 29న ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి గల అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను నెలకొల్పింది. ‘పయోనీర్–0’ వైఫల్యం తర్వాత అమెరికా చేపట్టిన ప్రయోగాలన్నీ ‘నాసా’ ద్వారానే జరిగాయి. అమెరికాతో పాటే అప్పటి సోవియట్ రష్యా కూడా 1958 సెప్టెంబర్ 23న ‘లూనా ఈ–1 నం:1’ ప్రయోగాన్ని చేపట్టింది. అప్పటి సోవియట్ రాకెట్ తయారీ సంస్థ దీనిని రూపొందించింది. సోవియట్ రష్యా చేపట్టిన ఈ తొలి ప్రయోగం కూడా విఫలమైంది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయని శాస్త్రవేత్తలు అక్కడితో ఆగిపోలేదు. పట్టువదలకుండా ప్రయోగాలను సాగిస్తూ, మొత్తానికి చంద్రుణ్ణి చేరుకున్నారు. సాహిత్యంలో చంద్రయానం పలు ప్రాచీన నాగరికతల్లో చంద్రుడి ఆరాధన కనిపిస్తుంది. కొన్ని పురాణాల్లో చంద్రలోక వర్ణన కూడా కనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలో గాని మనిషి చంద్రుణ్ణి చేరుకోవడం సాధ్యం కాలేదు. అయితే, చంద్రుణ్ణి చేరుకోవాలనే ఆశ మాత్రం మనిషిలో శతాబ్దాలుగా ఉంది. ప్రాచీన సాహిత్యం ఈ ఆశకు అద్దం పడుతోంది. ప్రాచీన గ్రీకు రచయితలు ఆంటోనియస్ డయోజనీజ్, లూసియన్ ఆఫ్ సమాసతా వంటి వారి రచనల్లో చంద్రయానానికి సంబంధించిన కల్పనలు ఉండేవని చెబుతారు. ఆ రచనలు కాలగతిలో అంతరించడంతో వాటిని సాధికారికమైన ఆధారాలుగా పరిగణించలేం. జర్మన్ ఖగోళవేత్త, రచయిత జోహాన్నెస్ కెప్లర్‘సోమ్నియమ్’ అనే నవలలో మనిషి చంద్రుడిపైకి ఎగిరి వెళ్లడం గురించి రాశాడు. కెప్లర్ మరణానంతరం ఈ నవల 1634లో వెలుగులోకి వచ్చింది. దాదాపు అదేకాలంలో ఇంగ్లిష్ చరిత్రకారుడు, రచయిత ఫ్రాన్సిస్ గాడ్విన్ ‘ది మ్యాన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. గాడ్విన్ మరణానంతరం ఇది 1638లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ భాషల్లో చంద్రయానం గురించి చాలా కాల్పనిక రచనలు వెలువడ్డాయి. కాలం గడిచే కొద్దీ ఈ రచనల్లోని కల్పనలు వాస్తవానికి దగ్గరవుతూ రావడం విశేషం. రిచర్డ్ ఆడమ్స్ లాక్ ‘గ్రేట్ మూన్ హోక్స్’ను 1835లో న్యూయార్క్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ఆరు భాగాలుగా ప్రచురించింది. లాక్ ఈ వ్యంగ్యరచనలో చంద్రునిపై జీవజాలాన్ని, నాగరికతను సర్ జాన్ హెర్షల్ కనుగొన్నట్లు ఎద్దేవా చేస్తూ రాశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ 1865లో ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’ నవల రాశాడు. ఇందులో భూమి నుంచి చంద్రునిపైకి చేరుకోగల సాధనాన్ని తయారుచేసే ప్రక్రియను కొంత శాస్త్రీయంగా వివరించాడు. ఫిరంగి ద్వారా చంద్రునిపైకి ఒక వస్తువును పంపే యత్నాన్ని ఇందులో ప్రస్తావించాడు. దీనిని బట్టి తీవ్రమైన పేలుడుతోనే చంద్రుని వరకు చేరుకోవడం సాధ్యం కాగలదనే విషయంపై అప్పటికే జనాలకు అర్థమైందని అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంగ్లిష్ రచయిత హెచ్.జి.వెల్స్ 1901లో ‘ది ఫస్ట్ మెన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. ఇందులో గురుత్వాకర్షణ పరిధిని అధిగమించగల పదార్థాన్ని తయారు చేసేందుకు ఒక శాస్త్రవేత్త పాత్ర సాగించే ప్రయత్నాలను వివరించాడు. అదే ఏడాది మరో ఇంగ్లిష్ రచయిత జార్జ్ గ్రిఫిత్ ‘ఎ హనీమూన్ ఇన్ స్పేస్’ నవల రాశాడు. భూమి నుంచి చంద్రుని వరకు సాగిన ప్రణయయాత్రకు చెందిన కాల్పనిక నవల ఇది. గ్రిఫిత్ ఇందులో స్పేస్‌సూట్ గురించి వర్ణించాడు. శాస్త్రవేత్తలెవరూ అప్పటికి స్పేస్‌సూట్‌ను ఇంకా తయారు చేయలేదు. వెండితెరపై చంద్రయానం ఇంకా టాకీలు రాక మునుపే చంద్రయానం అంశంగా ఒక సినిమా వచ్చింది. ఫ్రెంచి ఇంద్రజాలికుడు, దర్శకుడు జార్జెస్ మెలీస్ 1902లో ‘లె వోయేజ్ దాన్స్ లా లూన్’ పేరిట మూకీ చిత్రం తీశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘అరౌండ్ ది మూన్’ ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ ప్రాచుర్యం ఉన్న ప్రాంతాల్లో ‘ఎ ట్రిప్ టు ది మూన్’ పేరుతో విడుదల చేశారు. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించిన ఈ చిత్రానికి అప్పట్లోనే కలరైజేషన్ కూడా చేశారు. మెలీస్ చిత్రరంగం నుంచి తప్పుకున్నాక ఈ చిత్రం ప్రింట్ కనిపించకుండా పోయింది. దీనిని 1930 ప్రాంతంలో కొందరు గుర్తించారు. కలరైజ్ చేసిన దీని ఒరిజినల్ ప్రింట్‌ను 1993లో గుర్తించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దానిని 2011లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే పదివేల ఫ్రాంకులు ఖర్చయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం ఇది భారీ బడ్జెట్ చిత్రం కిందే లెక్క. దీని తర్వాత టాకీల కాలం వచ్చాక 1950లో అమెరికన్ దర్శకుడు, నటుడు ఇర్వింగ్ పిషెల్ ‘డెస్టినేషన్ మూన్’ చిత్రాన్ని తీశాడు. ఇందులో మనుషులు చంద్రునిపైకి చేరుకున్న దృశ్యాలను దాదాపు వాస్తవ దృశ్యాలను తలపించేలా చిత్రించడం విశేషం. ఇలాంటి సినిమాలు భారత్‌లో ఆలస్యంగా వచ్చాయి. చంద్రుని మీదకు యాత్రకు సంబంధించి భారత్‌లో విడుదలైన తొలిచిత్రం ‘చాంద్ పర్ చఢాయీ’. టి.పి.సుందరం దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం 1967లో విడుదలైంది. చందమామ నానాటికీ దూరం మన భూమి నుంచి చంద్రుడు నానాటికీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు ఇలా దూరం జరగడాన్ని వారు ‘లూనార్ రెసిషన్’గా పేర్కొంటున్నారు. భూమి నుంచి చంద్రుడు ఎంత వేగంగా దూరం జరుగుతున్నాడో తేల్చేందుకు ఇటీవల శాస్త్రవేత్తలు కచ్చితమైన లెక్క కట్టారు. వారి లెక్క ప్రకారం చంద్రుడు ఏడాదికి 1.5 అంగుళాలు (3.8 సెం.మీ.) చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. చంద్రుడు భూమి నుంచి దూరం జరగడం వల్ల భూమిపై రోజు స్వల్పంగా పెరుగుతుంది. కోట్లాది సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే కాలంలో భూమిపై రోజు పదమూడు గంటలే ఉండేది. భూమిపై జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులకు చంద్రుడే కారణమనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రెండు ప్రయోగాలు.. రెండు విజయాలు చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాలను అమెరికా, రష్యాలు పోటాపోటీగా గడచిన శతాబ్దిలోనే చేపడితే, భారత్ ఈ ప్రయోగాలను ఆలస్యంగా మొదలుపెట్టింది. తొలిసారిగా 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా పంపిన ‘చంద్రయాన్–1’ వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపై నీటి జాడను గుర్తించింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, చంద్రునిపై వాతావరణ వివరాల సేకరణ వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీని తర్వాత ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని 2019 జూలై 22న చేపట్టింది. మొదట ఈ ప్రయోగాన్ని 2013లోనే చేపట్టాలని భావించినా, ల్యాండర్ తయారీని రష్యా సకాలంలో పూర్తి చేయకపోవడంతో జాప్యం జరిగింది. రెండేళ్లు గడిచినా తాత్సారం చేస్తూ వచ్చిన రష్యా చివరకు చేతులెత్తేయడంతో భారత్ ఈ ప్రయోగాన్ని పూర్తిగా స్వయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతతోనే చేపట్టాలని నిశ్చయించుకుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగంలో పంపిన ఎల్వీఎం–3 రాకెట్ విజయవంతంగా ‘చంద్రయాన్–2’ వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, దీని ద్వారా పంపిన ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి చేరుకోకుండానే గల్లంతైంది. ల్యాండర్ విఫలమైనా, చంద్రుని కక్ష్యలోకి చేరుకున్న ఆర్బిటర్ చంద్రునికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తోంది. ఇది ఏడున్నరేళ్లు పనిచేస్తుందని అంచనా. చంద్రునిపైకి చేరుకునే ప్రయోగాలను భారత్ ఆలస్యంగా చేపట్టినా, తొలి రెండు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. చంద్రునిపై ఆవాసాలు! చంద్రుడి వాతావరణం, ఉపరితలంలోని విశేషాలు తెలుసుకోవడానికి దేశ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తుంటే, ఇంకొందరు చంద్రునిపై ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంపై కలలు కంటున్నారు. చంద్రలోక నివాసం ఆలోచన మనుషుల్లో శతాబ్దాలుగా ఉంది. ఇంగ్లిష్ తత్త్వవేత్త, మతబోధకుడు జాన్ విల్కిన్స్ పదిహేడో శతాబ్దిలోనే చంద్రునిపై మానవుల నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆలోచనను వెలిబుచ్చాడు. సోవియట్ రష్యా చంద్రునిపై జరిపిన ప్రయోగం 1959లో విజయవంతం కావడంతో చంద్రునిపై నివాసాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలపై ఆశలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో చంద్రునిపై మనిషి అడుగు మోపడం మాత్రమే సాధ్యమైంది గాని, నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడిక ప్రకారం గ్రహాంతరాలలోని ప్రదేశాలపై గుత్తాధిపత్యం చలాయించడం కుదరదు. దేశాలు గాని, వ్యక్తులు గాని, సంస్థలు గాని చంద్రుడు లేదా ఇతర గ్రహాలపైనున్న స్థలాలతో వ్యాపార లావాదేవీలు సాగించడం చట్టవిరుద్ధం. అయినా, కొన్నేళ్లుగా చంద్రుడిపై ఉన్న స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. తొలిసారిగా 1936 జూన్ 15న డీన్ లిండ్సే అనే అమెరికన్ ఆసామి అంతరిక్షంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తనకే చెందుతాయని ప్రకటించుకున్నాడు. వెర్రిమాలోకాలైన కొందరు జనాలు వాటిని అతడి వద్ద నుంచి కొనుక్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. జనాల్లోని ఈ వేలంవెర్రిని గమనించే అమెరికన్ రచయిత రాబర్ట్ హీన్లీన్ 1949లో ‘ది మ్యాన్ హూ సోల్డ్ ది మూన్’ కథను రాశాడు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడికను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే సంస్థ ఎడాపెడా చంద్రుడిపై స్థలాలను కారుచౌకగా అమ్మిపారేస్తోంది. కొందరు ఔత్సాహికులు చంద్రుడిపై స్థలాలను ఈ సంస్థ వద్ద కొంటున్నారు. ఈ సంస్థ ఇచ్చే స్థలాల పట్టాలను సన్నిహితులకు కానుకలుగా కూడా బహూకరిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–1’, ‘చంద్రయాన్–2’ ప్రయోగాలు రెండూ విజయవంతమైన నేపథ్యంలో భారత్ ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’తో కలసి చేపడుతోంది. ఈ ప్రయోగం చేపట్టడానికి జూలై 14వ తేదీ అనుకూలంగా ఉన్నట్లు ‘ఇస్రో’ అధినేత సోమనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్–3 వ్యోమనౌకను ఎల్ఎంవీ–3 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని సన్నాహాలనూ పూర్తి చేశారు. ‘చంద్రయాన్–3’ ద్వారా చంద్రుని దక్షిణధ్రువంలో ల్యాండర్‌ను సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. ల్యాండర్ చంద్రుని ఉపరితలం మీదకు చేరుకున్నాక, దీనికి అనుసంధానమైన రోవర్ ల్యాండర్ నుంచి విడవడి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దీని ద్వారా చంద్రుని ప్రకంపనలను గుర్తించే సెస్మోమీటర్ వంటి పరికరాలను పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, వాతావరణం, రసాయనాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై ఇప్పటివరకు ఎవరూ చేరుకోని ప్రదేశానికి ల్యాండర్‌ను పంపుతున్నందున ఈ ప్రయోగం భారత్‌కు మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే కీలకంగా నిలుస్తుంది. ఏ మీరిది చదివేసరికి ఈ ప్రయోగం పూర్తయివుంటుంది. చదవండి : భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
మామా.. మేమొస్తున్నాం...!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ (షార్) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది. చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ ఉది్వగ్న క్షణాలు... తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగం సూపర్ సక్సెసైంది. 640 టన్నుల ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు. చంద్రయాన్–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్ స్వయంగా షార్ కేంద్రం నుంచి వీక్షించారు. ప్రయోగం జరిగిందిలా... ► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. ► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ► ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది. ► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. ► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. ► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. ► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది... ► చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ► 16 రోజుల్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు. ► తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు. ► అలా ఆగస్టు 17న చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్ మాడ్యూల్ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది. ► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్ లాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ► ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. ► చంద్రయాన్–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ వాడారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని కూడా చంద్రయాన్–2 తరహాలోనే నిర్వహించారు. ► చంద్రయాన్–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే వుంది. ► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే ప్రయతి్నస్తున్నారు. మనకిక ఆకాశమే హద్దు మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం. ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
Chandrayaan 3 Launch Visuals Video: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ - 3
-
విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 రాకెట్
ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు ►మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అవ్వాలని శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. శ్రీహారికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక రోజని ఇస్రో పేర్కొంది. యావత్ దేశ ప్రజలందరి ఆకాంక్షలు నిజమవ్వాలని ఆకాంక్షించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ అభినందనలు తెలిపారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3 ►చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఎల్వీఎం 3ఎం 4రా కెట్ నుంచి శాటిలైట్ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్-3 ప్రదక్షిణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ► ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. బాహుబలి రాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... ►ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయతి్నస్తూ వస్తోంది. ►అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు ► ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి. ► చంద్రయాన్–2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. ► ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
చంద్రయాన్-3 దేశ అంతరిక్ష చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది: ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: చందమామను ఇక్కడి నుంచి చూస్తూ మనకు తెలిసిన ఎన్నో కథలను చెప్పుకున్నాం. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని తపన మానవవాళిలో మొదలైంది. ఈ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. చంద్రుని పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్ కాస్త ఆలస్యంగా ప్రారంభించినా అద్భతాలను చేయాలని ప్రయత్నిస్తోంది. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు. 14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES — Narendra Modi (@narendramodi) July 14, 2023 చదవండి: Himachal Pradesh Floods: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్–3
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ► ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. ► చంద్రయాన్–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది. ► చంద్రయాన్–3లో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది. ► చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్–2 రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు. ► చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు. చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్.. జూలై 13న చంద్రయాన్–3 ప్రయోగం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్–1 ప్రయోగం 2008 అక్టోబర్22న, చంద్రయాన్–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2030కల్లా చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనలో పశ్చిమదేశాలతో పోటీపడుతున్న చైనా మరో ముందడుగు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ డెప్యూటీ డైరెక్టర్ లిన్ జిక్వియాంగ్ ప్రకటించారు. భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. చందమామ దక్షిణ ధృవం వైపు గడ్డకట్టిన నీటి నిల్వల అన్వేషణ కోసం 2025కల్లా మరోమారు వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించిన నేపథ్యంలో చైనా చంద్రుడిపై శోధనకు సిద్ధమైందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
భూమి మీద సరే.. చంద్రుడిపై టైం, తేదీలను ఎలా లెక్కిస్తారు?
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్ ప్రకారం జరగాల్సిందే. వాచీలోనో, ఫోన్లోనో టైమ్ చూసుకుంటూ జీవితాన్ని పరుగెత్తించాల్సిందే. మనం అనుకున్నదేదైనా జరగకుంటే ‘టైం’ బాగోలేదని వాపోవడమే. ఇది సరేగానీ.. భూమిపై ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. ఇండియాకు పగలు అయితే.. అమెరికాకు రాత్రి అవుతుంది. మరి అంతరిక్షంలో ఏ టైమ్, తేదీ పాటించాలి? చంద్రుడిపై సమయం, తేదీలను లెక్కించేదెలా? ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా.. వీటికి సమాధానాలేమిటో తెలుసుకుందామా.. అప్పట్లో చుక్కలను చూస్తూ.. మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. తర్వాతి కాలంలో గడియారాలతో సమ యాన్ని లెక్కించడం మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో తేడాకు అనుగుణంగా.. భూమిని వివిధ టైమ్ జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు సమయాలను వినియోగిస్తున్నారు. మనుషులు భూమికే పరిమితమైనంత కాలం ఇది బాగానే ఉంది. కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్య త్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.. ఏ ‘టైమ్’ను అనుసరించాలనే తిప్పలు మొదలయ్యాయి.\ ఇప్పుడు స్పేస్‌లో వాడుతున్నది ఏ ‘టైమ్’? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్) భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ఈ సమయంలో పదహారు సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశంపై ఉంటుంది. మరి టైమ్ ఎలా!?.. దీని కోసం ‘యూనివర్సల్ టైమ్ (యూటీ)’ను పాటిస్తున్నారు. - భూమ్మీద టైమ్ జోన్లను ఏర్పాటు చేసు కున్నప్పుడు బ్రిటన్‌లోని గ్రీన్ విచ్ ప్రాంతాన్ని మూలంగా తీసుకున్నారు. అక్కడ మొదలయ్యే మొదటి టైమ్ జోన్‌ను ‘గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి దీనినే ‘యూనివర్సల్ టైమ్’గా పాటిస్తున్నారు. - అయితే ఈ ‘యూటీ’ కేవలం భూమి చుట్టూ ఉన్న స్పేస్ వరకే.. చంద్రుడిపై, అంగారకుడిపై టైమ్‌ను లెక్కించేందుకు ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలూ లేవు. స్పేస్ ప్రయోగాలకు.. ‘ఎంఈటీ’.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వాటిని లాంచ్ చేసిన క్షణం నుంచి.. ఎంతెంత సమయం గడిచిన కొద్దీ ఏమేం జరిగిందనేది కీలకమైన అంశం. ఈ క్రమంలోనే స్పేస్ ప్రయోగాల్లో ప్రత్యేకంగా ‘మిషన్ ఎలాప్స్‌డ్ టైమ్ (ఎంఈటీ)’ని వాడుతారు. అంటే ఒక రాకెట్ లాంచ్ అయినప్పటి నుంచీ టైమ్ లెక్కించడం మొదలుపెడతారు. దీనినే ‘టీ ప్లస్ టైమ్’గా చూపిస్తారు. - ఉదాహరణకు ఒక చంద్రుడి వద్దకు కృత్రిమ ఉపగ్రహాన్ని పంపి, 2రోజుల 5 గంటల పది నిమి షాలు అయితే.. ఆ శాటిలైట్‌కు సంబంధించిన టైమ్‌ను ‘టీ+ 2డేస్ 5 హవర్స్ 10 మినట్స్’గా లెక్కిస్తారు. ఈ విధానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టినప్పటి నుంచీ వాడుతున్నారు. అప్పట్లో దీనిని ‘గ్రౌండ్ ఎలాప్స్‌డ్ టైమ్ (జీఈటీ)’గా పిలిచారు. తర్వాత ఎంఈటీగా మార్చారు. చంద్రుడిపై ఇలా లెక్కిస్తే సరి అంటూ.. - స్పేస్ ప్రయోగాల వరకు సరేగానీ.. చంద్రుడిపై నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ ‘టైమ్’ ఎలాగనే సందేహాలు మొదలయ్యాయి. భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే కష్టం. - సాధారణంగా సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పగలు.. అప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం వరకు రాత్రి. ఈ లెక్కన చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి (భూమ్మీది సమయం ప్రకారం). అంటే చంద్రుడిపై ఒక రోజు (మూన్ డే) అంటే.. మనకు నెల రోజులు అన్నమాట. - ఈ సమస్యను అధిగమించడానికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఉంది. చంద్రుడిపై సెకన్లు, నిమిషాలు, గంటలను యథాతథంగా లెక్కిస్తూనే.. రోజు (24 గంటల సమయం)ను మాత్రం ఒక సైకిల్‌గా పిలవాలని, 30 సైకిల్స్ కలిస్తే ఒక పూర్తి మూన్డేగా పరిగణించాలని ఆలోచన. అంటే మనకు ఒక నెల ఒక మూన్డే.. మనకు ఒక రోజు ఒక మూన్ సైకిల్‌గా లెక్కించొచ్చు. దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
చంద్రుడిపై ఆధిపత్యం.. ప్రపంచ దేశాల మూన్ రేస్!
అకస్మాత్తుగా అనేక దేశాల దృష్టి జాబిల్లిపైకి మారింది. చందమామపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ మొదలైంది. 50 ఏళ్ల క్రితమే జాబిల్లిపై తొలి అడుగు వేసిన అమెరికా మొదలు ఇప్పటివరకు ఒక్క రాకెట్ కూడా ప్రయోగించని సౌదీ అరేబియా వరకు ఎన్నో దేశాలు మూన్ రేస్‌కు సిద్ధమయ్యాయి. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలను సొంతం చేసుకోవడంతోపాటు భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో పర్యాటక అభివృద్ధి నుంచి ఆవాసాల ఏర్పాటు వరకు అక్కడి ఉపరితలంపై ముందుగా పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. ఈ దిశగా ఏయే దేశాలు ఎలాంటి ప్రయత్నాలు సాగిస్తున్నాయో ఓ లుక్కేద్దాం. దొడ్డ శ్రీనివాసరెడ్డి: చందమామపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీలో అందరికన్నా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (కన్సా) ముందుంది. చాంగ్–3, 4, 5 మిషన్లతో చంద్రుని ఉపరితలంపై కబ్జా పెడుతోంది! ఈ దశాబ్దం చివరికల్లా చంద్రునిపై అడుగుమోపాలని చైనీయులు తహతహలాడుతున్నారు. 2030 నాటికి చైనా వ్యోమగాములు జాబిల్లిపై అడుగుపెట్టడం తథ్యమని చైనా చంద్రయాన్ కార్యక్రమ అధిపతి వువీరెన్ ఢంకా భజాయించి చెబుతున్నారు. వ్యోమగాములు చంద్రునిపై దిగడానికి ఉపయోగించే పరికరాల తయారీలో ఎంతో ముందంజ సాధించామని ఆయన చెప్పారు. వ్యోమగాములను తీసుకెళ్లే అత్యాధునిక రాకెట్‌ను, అంతరిక్షనౌకను చైనా సిద్ధం చేసుకుంటోంది. కొత్త తరం రాకెట్ తొలి ప్రయోగం 2027లో నిర్వహించాలని, 2030 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అంతేకాదు వ్యోమగాములు కొంతకాలంపాటు చంద్రునిపై గడిపేందుకు వీలుగా చిన్నపాటి స్పేస్‌స్టేషన్ నిర్మాణానికి కూడా సిద్ధమవుతోంది. చంద్రునిపై ఉన్న మట్టి సాయంతో ఇటుకల తయారీకి అవసరమైన త్రీడీ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. మొత్తం ప్రాజెక్టులో అమెరికా వంటి దేశాలు భాగస్వామ్యాన్ని కూడా చైనా ఆహ్వానిస్తోంది. అమెరికా తహతహ.. చైనాకన్నా ముందే చంద్రునిపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. డొనాల్డ్ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడే చంద్రుడిపై దృష్టి పెట్టమని నాసాను కోరారు. దీంతో యాభై ఏళ్ల తరువాత మళ్లీ చంద్రునిపై అడుగు పెట్టేందుకు నాసా కృతకృత్యమైంది. ఆర్టీమిస్ పేరిట ఓ సుదీర్ఘ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాసాకి చెందిన ఓరియాన్ అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరిగి భూమిమీదకు చేరింది. రెండో మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షనౌక చంద్రుడిని ప్రదక్షిణ చేసేందుకు నాసా సన్నద్ధం అవుతోంది. 2025 నాటికి చంద్రునిపై వ్యోమగాములు అడుగు మోపేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించింది. ఇద్దరు వ్యోమగాములు అందులో ఒకరు మహిళ, మరొకరు రంగు జాతికి చెందిన వ్యక్తి చంద్రునిపై కాలుమోపేలా నాసా వ్యూహరచన చేసింది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం స్పేస్ఎక్స్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టీన్లతో నాసా జతకట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఐఎస్ఎ) ఏకంగా చంద్రుడిపై రోబోల సాయంతో ఓ గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పంతో ప్రణాళికలు రచిస్తోంది. స్పేస్ఎక్స్ ఓ వైపు నాసా కోసం పనిచేస్తూనే మరోవైపు ప్రయాణికుల్ని చంద్రునిపైకి తీసుకువెళ్లే వాణిజ్యపరమైన యాత్రలకు శ్రీకారం చుట్టే వ్యూహాన్ని రూపొందిస్తోంది. మరోవైపు అమెజాన్ అధిపతి జెఫ్‌బెజోస్ చంద్రునిపైకి సరుకులు రవాణా చేసే కార్గో రాకెట్ల రూపకల్పన కోసం బ్లూమూన్ పేరిట మిషన్‌కు రూపకల్పన చేస్తున్నారు. స్పేస్ జామ్! వచ్చే పదేళ్లలో అన్ని దేశాలు, సంస్థలు కలిసి కనీసం 100 వరకు చంద్రయాన్‌లు నిర్వహించనున్నాయి. దీంతో భూమికి చంద్రునికి మధ్య విపరీతమైన రద్దీ ఏర్పడనుంది.! భూమి–చంద్రుడి మధ్యభాగాన్ని సిస్లూనార్ అని పిలుస్తారు. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై స్పేస్ స్టేషన్ నిర్మించడం, రోబోలతో కాలనీ నిర్మించడం వంటి అనేక కార్యక్రమాల కారణంగా సిస్లూనార్ మొత్తం రాకెట్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల ప్రయోగాలతో బిజీగా మారనుంది! సిస్లూనార్ స్పేస్‌లోని కొన్ని కక్ష్యలకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఆక్రమించడానికి కూడా విపరీతమైన పోటీ ఏర్పడనుంది. సాంకేతిక అభివృద్ధి కారణంగా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా వివిధ దేశాలు, సంస్థల మధ్య పోటీ పెరిగిపోయి త్వరలో స్పేస్జామ్కు కారణం కాబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఇటీవల సిస్లూనర్ స్పేస్‌ని అందరూ శాంతియుతంగా బాధ్యతాయుత, సుస్థిర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉపయోగించుకోవాలని కోరింది. రేసులో ఇతర దేశాలు భారత్: చంద్రయాన్–2 మిషన్ విఫలమైనా చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. యూఏఈ: రషీద్ రోవర్‌ను చంద్రునిపై దింపడానికి సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. జపాన్: ప్రైవేటు సంస్థ ఐస్పేస్ చిన్నసైజు అంతరిక్షనౌక హకుతోఆర్ను జాబిల్లిపై దించే ప్రయత్నాల్లో ఉంది. అది గనుక విజయవంతమైతే చంద్రునిపైకి అంతరిక్షనౌకను దింపిన తొలి ప్రైవేటు కంపెనీ కాగలదు. ఇజ్రాయెల్: ప్రైవేటు సంస్థ చంద్రునిపై అడుగుపెట్టడానికి ప్రయోగించిన తొలి బెరిసీట్ మూన్ మిషన్ విఫలమైంది. రష్యా, యూరప్, దక్షిణ కొరియా సైతం వివిధ స్థాయిల్లో చంద్రుడిని చేరేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్: మూన్రేస్లో ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఎలాన్మస్్కకు చెందిన స్పేస్ఎక్స్, జెఫ్బ్రెజోస్కు చెందిన బ్లూ ఓరియన్ లాంటి పెద్ద ప్రైవేటు స్పేస్ సంస్థలతోపాటు వివిధ దేశాలకు చెందిన అనేక చిన్న, పెద్ద ప్రైవేటు సంస్థలు కూడా పోటీలోకి దిగాయి. చంద్రుడు ఎవరివాడు? అంతరిక్షాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వాడుకోకుండా, మానవాళి మనుగడకు ఉపయోగించుకోవాలనే ఒప్పందంపై 1967లో 110 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే అంతరిక్షాన్ని శాంతియుతంగా, పారదర్శకంగా ఉపయోగించుకోవడం కోసం అమెరికా, మరికొన్ని దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు చంద్రుడి విషయంలో మాత్రం అనేక దేశాలు తమ భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అందుకే మేము మరోసారి చంద్రుడుపైకి వెళ్లడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఈసారి అంతర్జాతీయ, వాణిజ్య భాగస్వాములతో కలసి జాబిల్లిపైకి అడుగుపెడతాం. – నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ ఒకప్పుడు చంద్రయానాన్ని దేశ గౌరవంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ప్రయోజనాల కోసం దేశాల మధ్య పోటీ ఏర్పడింది. – ఏరోస్పేస్ సెక్యూరిటీ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ కెతెలిస్ జాన్సన్ -
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్‌ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
చంద్రుడిపై మహిళా వ్యోమగామి
చంద్రుడిపై మహిళా వ్యోమగామి -
చంద్రుడి దాకా తొలి మహిళ
నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు ‘మానవాళి ముందంజ’ అని అభివర్ణించారు. కాని మానవాళి నిజమైన ముందంజ ఇకపై పడనుంది. వచ్చే సంవత్సరం చంద్రుణ్ణి చుట్టి రావడానికి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామిని ఎంపిక చేసింది నాసా. ఆ విధంగా చంద్రుని దాకా వెళ్లనున్న తొలి మహిళగా వ్యోమగామి క్రిస్టినా కోచ్ చరిత్ర సృష్టించనుంది. 50 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు మోపినప్పుడు సమస్త మానవాళి అబ్బురపడింది. పులకించింది. మానవ చరిత్రలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన అపూర్వ ఘటనగా లిఖించుకుంది. భూమ్మీద నుంచి నిత్యం కనపడే, వెన్నెల కురిపించే, వేల ఏళ్లుగా ఎన్నో కథలకూ గాథలకూ ఆలవాలమైన చంద్రుడిపై అడుగుపెట్టడం అంటే సామాన్యమా మరి. ఈ చంద్రుణ్ణి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య ‘అపోలో’ ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగగలిగారు. అయితే వారంతా పురుషులు. ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా చంద్రుడిని తాకలేదు. కాని త్వరలో తాకబోతోంది. ‘అర్టిమిస్–2’ పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళ ఎంపికైంది. ఆమే క్రిస్టినా కోచ్. ఆ విధంగా చంద్రుడి వరకూ వెళ్లగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది. చంద్రుడికి వీలైనంత దగ్గరగా వెళ్లి దాని చుట్టూ తిరిగి వచ్చే ఈ యాత్ర విజయవంతమైతే 2025లో జరిగే చంద్రయానంలో ఒక స్త్రీని పంపాలని నాసా నిర్ణయం. ఆ అసలు యాత్రకు కావలసిన ధైర్యం క్రిస్టినా ఇవ్వనుంది. ఆర్టిమిస్–2 అంటే? ఆర్టిమిస్–2 ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టరు. చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనూ తిరుగాడరు. చంద్రుడికి కొంత దూరం నుంచి ప్రయాణిస్తారు. దీన్నే ఫ్లై బై అని పిలుస్తారు. చంద్రునిపై రోబోలు, మనుషులతో పరిశోధనలు చేపట్టేందుకు నాసా చేపట్టిన కార్యక్రమమే ఆర్టిమిస్. గత ఏడాది ఆర్టిమిస్–1 పేరుతో వ్యోమగాములు లేకుండా ఒరాయెన్ అనే స్పేస్క్యాప్సూల్ను చంద్రుని చుట్టూ తిప్పా రు. వచ్చే ఏడాది ఆర్టిమిస్–2 పేరుతో ఒరాయెన్ స్పేస్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఈ నలుగురిలోనే క్రిస్టినా ఉంది. దాదాపు 10 రోజుల కాలంలో వీరంతా చంద్రుణ్ణి చుట్టి నేరుగా భూమిపైకి వస్తారు. ఒరాయెన్ క్యాప్సూల్‌లో వ్యోమగాముల కోసం చేసిన ఏర్పాట్లు, లైఫ్ సపోర్ట్ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఇది విజయవంతమైతే 2025లో ఆర్టిమిస్–3 ద్వారా వ్యోమగాములు, రోబోలు చంద్రుడిపైకి చేరి ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్టిమిస్–3లో పాల్గొనబోయే స్త్రీ వ్యోమగామి మళ్లీ క్రిస్టినాయే కావచ్చు. ఎవరీ క్రిస్టినా కోచ్? చంద్రుణ్ణి చుట్టి రావడానికి నలుగురు వ్యోమగాముల బృందంలో ఎంపికైన క్రిస్టినా కోచ్ ఆర్టిమిస్–2 యాత్రలో మిషన్ స్పెషలిస్ట్‌గా పని చేయనుంది. ఈమెతోపాటు మరో ముగ్గురు– జెరెమి హాన్సన్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్మెన్ ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిలో విక్టర్ గ్లోవర్ చంద్రుడి దాకా వెళ్లనున్న తొలి నల్ల జాతీయుడిగా చరిత్ర నమోదు చేయనున్నాడు. నార్త్ కరోలినాలో పుట్టి పెరిగిన క్రిస్టినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది. 2013లో నాసాలో చేరి స్పేస్ సైన్స్ ఇన్స్ట్రుమెంట్ల తయారీలో నైపుణ్యం సంపాదించింది. అంతే కాదు అంతరిక్షంలో ఒక్కరుగా గడిపే సమయంలో ఏర్పడే వొత్తిడి, రేడియేషన్ ప్రభావం, మెక్కల పెంపకం లాంటి అంశాల మీద పరిశోధనలు చేసింది. అందుకే 2019 మార్చి 14 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకూ ఐ.ఎస్.ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో గడిపి సుదీర్ఘకాలం అంటే 328 రోజులు అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా రికార్డు స్థాపించింది. ఇంకా విశేషం ఏమిటంటే 2019 అక్టోబర్ 18న మరో మహిళా వ్యోమగామి జెస్సికా మెయర్‌తో కలిసి ఐ.ఎస్.ఎస్ నుంచి బయటకు వచ్చి దాని వెలుపల ఉండే ఒక భాగాన్ని రీప్లేస్ చేసింది. ఫలితంగా ఆల్ విమెన్ స్పేస్‌వాక్ చేసిన రికార్డు వీరిరువురూ నమోదు చేశారు. సొంత నేలపై ప్రేమ క్రిస్టినా కోచ్‌కు ఫొటోలు తీయడం ఇష్టం. తరచూ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. కాని అంతరిక్షం నుంచి ఆమె తీసిన ఒక ఫోటో మాత్రం ఆమె మరువలేదు. అది తను పుట్టి పెరిగిన నార్త్ కరోలినాప్రాంంతం ఫొటో. అంతరిక్షం నుంచి నార్త్ కరోలినాను మొదటిసారి చూసినప్పుడు ఆమె ఉద్వేగంతో ఊగిపోయింది. ఈ గడ్డలోనే కదా నేను ఇంతదాన్నయ్యాను అనుకుందామె. ఇటువంటి అనుభూతే ఆమెకు చంద్రుణ్ణి సమీపించినప్పుడు కలగవచ్చు. ఎందుకంటే చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లిన తొలి మహిళ కదా. -
నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్వర్క్ త్వరలో
న్యూఢిల్లీ: ఎంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. రాబోయే అంతరిక్ష యాత్రలో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ చెయ్యని సాహసంతో చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ రాబోయే నెలల్లో స్పేస్ఎక్స్ రాకెట్లో నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని నోకియా ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో ఈ నెల ప్రారంభంలో బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో విలేకరులకు వెల్లడించారు. దీని ప్రకారం నోకియా ఈ ఏడాది చివర్లో చంద్రునిపై 4జీ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. దీన్ని నాసా ఆర్టెమిస్-1 మిషన్‌లో ఉపయోగించబడుతుందనీ, తద్వారా చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యమని తెలిపారు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం ప్రస్తుతం SpaceX ఫాల్కన్ 9 రాకెట్లో నవంబర్‌లో ప్రారంభించనుందని, Intuitive Machines యొక్క Nova-C లూనార్ ల్యాండర్ మన సహజ ఉపగ్రహానికి సిస్టమ్ ఇతర పేలోడ్లను తీసుకువెళుతుంది, నోకియా 4జీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను చంద్రుని దక్షిణ ప్రాంతంలోని షాకిల్టన్ క్రేటర్‌పై దాని చివరి గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. భూసంబంధమైన నెట్‌వర్క్‌లు భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని చూపడం దీని లక్ష్యం.సంబంధించి 2020 అక్టోబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో నోకియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుందని సమాచారం. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) ఈ పరిశోధనలు హెచ్డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, టెలిమెట్రీ లేదా బయోమెట్రిక్స్ అవసరమయ్యే భవిష్యత్ మిషన్లకు సెల్యులార్ నెట్‌వర్క్‌లు ప్రారంభించే అధునాతన సామర్థ్యాలు అవసరం" అని నోకియా తన వెబ్ పేజీలో నాసా భాగస్వామ్యం గురించి వెల్లడించింది. మరోవైపు ఈ టెక్నాలజీలు చంద్రునిపై మంచును గుర్తించడంలో పరిశోధకులకు సహాయ పడతాయి. అలాగే భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటి వాటిని గుర్తిస్తే గ్రహం మీద మానవ జీవితాన్ని నిలబెట్టడంలో సహాయ పడుతుందని నాసా అంచనా. -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
ఆకాశంలో అరుదైన దృశ్యం
భువనేశ్వర్: శుక్రవారం రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించింది. చంద్రునికి అతి సమీపంలో ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. ఇలాంటి అందమైన దృశ్యాన్ని స్థానికులు కొందరు ఇళ్లపై నుంచి తిలకించగా.. మరికొందరు తమ సెల్ఫోన్లలో బంధించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే పూరీ జగన్నాథుని శ్రీమందిరం ఆలయ శిఖరాన పతిత పావన పతాకం పరిసరాల్లో మరింత స్పష్టంగా ఆకర్షణీయంగా తారసపడడం విశేషం. దీనిపై భువనేశ్వర్ లోని పఠాణి సామంత్ ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ శుభేందు పట్నాయక్ మాట్లాడుతూ.. 2015లో ఒకసారి, మళ్లీ ఇన్నాళ్లకు ఈ దృశ్యం తారస పడిందని తెలపారు. భూమి, చంద్రుడు, శుక్రుడు ఒకే సరళ రేఖలో ఉండటంతో ఈ విధంగా కనిపిస్తుందన్నారు. తాజా దృశ్యంలో శుక్రుడు కొంత సమయం చంద్రుడి వెనుక ఉండిపోవడంతో ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభం కాగా, వెలుగు ఉండటంతో భారతదేశంలో కనిపించ లేదన్నారు. సాయంత్రం 6 గంటలకు శుక్రుడు చంద్రునికి చాలా సమీపానికి రాగా.. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో దీనిని పూర్తిగా చూడగలిగారని వెల్లడించారు. శుక్రుడు, చంద్రుని వెనుక దాక్కుని ఒక చివరలో ప్రవేశించి, మరొకవైపు నుంచి నిష్క్రమించినట్లు వివరించారు. ఈ దృశ్యం రాత్రి 8.30 గంటల వరకు ఆకాశంలో కనిపించింది. మరోవైపు ఈనెల 25నుంచి 30వరకు ఒకే వరుసలో 5 గ్రహాలు కనిపించనున్నాయని సమాచారం. ఈ వ్యవధిలో బుధుడు, శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు, యురేనస్, చంద్రుడు సరళ రేఖలో కనిపిస్తారు. ఈనెల 25న సూర్యాస్తమయానికి 45 నిమిషాల తర్వాత ఒకే సరళ రేఖలో 5 గ్రహాలను చూడవచ్చని శుభేందు పట్నాయక్ సూచించారు. -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమికి దూరమవుతున్న చంద్రుడు
భూమికి దూరమవుతున్న చంద్రుడు -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అద్భుతమైన బైక్.. దీనికి ముందువైపు చక్రం బదులుగా..
మనదేశంలో వీథుల్లోను, రహదారుల్లోను మంచు పేరుకుపోయే సమస్య దాదాపు లేదు గాని, ప్రతిఏటా శీతకాలంలో పాశ్చాత్యదేశాల్లో ఇదొక పెద్ద సమస్య. మంచులో చక్రాలు చిక్కుకుపోయి వాహనాలు ముందుకు సాగవు. మంచుదారిలో కాలినడక మరీ ప్రమాదకరం. రహదారులపై మంచు పేరుకుపోయినా సరే, ఏమాత్రం ఇబ్బందిలేకుండా ప్రయాణించడానికి వీలుగా అమెరికన్ కంపెనీ ‘మూన్‌బైక్స్’ ఇటీవల ఒక అద్భుతమైన బైక్‌ను రూపొందించింది. దీనికి ముందువైపు చక్రం బదులు, మంచును చీల్చుకుపోయే పదునైన పరికరాన్ని అమర్చారు. వెనుకవైపు యుద్ధట్యాంకుల మాదిరిగా చైన్లతో కూడిన రెండు చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడు మంచుదారిలో కూడా ఈ బైక్ మహాజోరుగా సాగిపోగలదు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీని ధర 8500 డాలర్లు (రూ.6.94 లక్షలు) మాత్రమే! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
పుట్టినరోజునాడే నాలుగో పెళ్లి
వాషింగ్టన్: ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి.. విడాకులు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?.. ఈయనే ఆయన. పేరు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్ ఆర్మ్‌స్టాంగ్ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా.. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ ‘లునార్ మాడ్యుల్ పైలట్’గా వ్యవహరించారు. ఇక మైకేల్ కోలిన్స్ కమాండ్ మాడ్యుల్ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్ 1969 జులై 16వ తేదీన లాంఛ్ కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు. ఇక.. మూడుసార్లు అంతరిక్షంలో సంచరించిన వ్యోమగామిగానూ అల్డ్రిన్ పేరిట ఓ రికార్డు ఉంది. 1971లో నాసా నుంచి రిటైర్ అయిన ఈ పెద్దాయన.. 1998లో షేర్స్పేస్ ఫౌండేషన్‌ను స్థాపించి అంతరిక్ష అన్వేషణ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. గతంలో ఆయనకు మూడు సార్లు వివాహం అయ్యింది. 1954-1974, 1975-78, 1988-2012.. ఇలా మూడుసార్లు ఆయన వివాహాలు విడాకులు అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన డాక్టర్ అంకా ఫౌర్తో డేటింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన 93వ పుట్టినరోజున.. 63 ఏళ్ల అంకాను వివాహం చేసుకున్నాడాయన. లాస్ ఏంజెల్స్ కలిఫ్లో దగ్గరి వాళ్ల మధ్య సింపుల్‌గా ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన ఆ పెద్దాయ.. ఇంట్లోనుంచి పారిపోయే కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. On my 93rd birthday & the day I will also be honored by Living Legends of Aviation I am pleased to announce that my longtime love Dr. Anca Faur & I have tied the knot.We were joined in holy matrimony in a small private ceremony in Los Angeles & are as excited as eloping teenagers pic.twitter.com/VwMP4W30Tn — Dr. Buzz Aldrin (@TheRealBuzz) January 21, 2023 -
చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈరోజు(నవంబరు8వ తేదీ) చంద్ర గ్రహణం ఏర్పడటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణం కాబట్టి దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు. ఏది ఏమైనా ఈ గ్రహణం ఏ సమయంలో సంభవించనుంది, ఏయే దేశాల్లో కనిపించనుందో చూద్దాం. ఈ రోజు ఏర్పడే చంద్ర గ్రహణం ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, ఫసిఫిక్, అట్లాంటిక్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా, అందులో సంపూర్ణ చంద్ర గ్రహణం 3.46 నుంచి సాయంత్రం 5.12 గంటల వరకు ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పట్టనుంది. భారత్‌లో చంద్ర గ్రహణం ఏర్పడే సమయం పగటి పూట కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. కాగా, భారత్‌లో ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉండగా, కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. సాధారణంగా పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా సూర్యుడు, భూమి, చంద్రుడు కచ్చితంగా ఒకే సరళ రేఖపైకి రావని నిపుణులు చెబుతున్నారు. భూమి కక్ష్య, చంద్రుని కక్ష్య పరస్పరం 5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే అందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. -
అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు
అందరికి వివిధ రకాల టాలెంట్లు ఉంటాయి. ఐతే ఆ టాలెంట్‌కి పదును పెట్టి విభిన్నంగా చేసి ఔరా! అనిపించుకునేవారు కొంతమందే. ఆ కోవకు చెందిన వ్యక్తే జయదీప్ గోహిల్. మూన్‌వాక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, జయదీప్ చేసిన మూన్‌వాక్ మరింత స్పెషల్. ఎందుకంటే అతను చేసింది నీటిలో తలకిందులుగా! వివరాల్లోకెళ్తే.. మూన్ వాక్‌తో జనాలను ఆకర్శిస్తున్న జయదీప్ గోహిల్.. ఈసారి విభిన్నంగా ట్రై చేశాడు. నీటి అడుగు భాగంలో మూక్వాక్తో ఆకట్టుకున్న ఈ యువకుడు.. తలకిందులుగా ఆ స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. అతను ఆ వీడియోలో తొలుత స్విమ్మింగ్ పూల్‌లోని అడుగున ఉన్న టేబుల్ పై మేఖేల్ జాక్సన్‌కి సంబంధించిన ప్రసిద్ధ పాట స్మూత్ క్రిమినల్లో ఆయన ఎలా వాకింగ్ స్టైల్ డ్యాన్స్ తరహాలో నడిచాడో అలా నడుస్తాడు. ఆ తర్వాత సడన్‌గా తలకిందులుగా నడుస్తాడు. చూస్తే ఏం చేశాడ్రా అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోకి తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు కూడా అతని టాలెంట్ చూసి తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hydroman (@hydroman_333) (చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు: వీడియో వైరల్) -
చందమామే దిగి వచ్చిందా!
దుబాయ్: డబ్బుంటే ఆ అంతరిక్షాన్నే ఎంచక్కా కిందకి దింపేసుకోవచ్చేమో కదా! లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరైన దుబాయ్‌లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి చంద్రుడి ఆకృతిలో రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందట. అచ్చు చంద్రుడి ఉపరితలం మాదిరిగా డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. 735 అడుగుల ఎత్తైన ఈ మూన్ రిసార్ట్ దుబాయ్‌కి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇందులో స్పా, వెల్నెస్ సెక్షన్, నైట్‌క్లబ్, ఈవెంట్ సెంటర్ ఉంటాయి. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే సాధారణ పర్యాటకులకి శిక్షణ కూడా ఇస్తారట. దీనికి నిర్మాణానికి 500 కోట్ల డాలర్లు అవుతుందట. దీనిపై ఏటా 180 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని నిర్మాణ కంపెనీ అంచనా. ఈ రిసార్ట్స్‌లో ఏడాదికి కోటి మంది పర్యాటకులు ఎంజాయ్ చేసే వీలుంటుంది. (క్లిక్ చేయండి: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త)