Movie review
-
1000 వాలా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: 1000 వాలానటీనటులు: అమిత్, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ తదితరులుదర్శకుడు: అఫ్జల్ నిర్మాత: షారూఖ్నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ మూవీ మేకర్స్ విడుదల తేదీ: మార్చి 14, 2025యువ నటుడు అమిత్ హీరోగా నటించిన తాజా చిత్రం '1000 వాలా'. ప్రముఖ సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఈ చిత్రం ఈ మార్చ్ 14 న థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అర్జున్(అమిత్ డ్రీం స్టార్) తన తాతయ్య వద్ద పెరుగుతూ ఉంటాడు. నటుడు కావాలనేది అతని కల. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కోరిక తీరదు. అయితే తన స్నేహితుడు బుజ్జి తండ్రి(పిల్ల ప్రసాద్) తన స్నేహితుడు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చాడని తెలుసుకుని అర్జున్ను అక్కడికి రమ్మంటాడు. ఎలాగైనా అతన్ని మంచి నటుడిని చేయమని బుజ్జి తండ్రి అతని స్నేహితుడికి చెబుతాడు. అయితే అతను అర్జున్ను చూడగానే షాక్ అవుతాడు. వెంటనే అతన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని హైదరాబాద్‌కు తీసుకెళ్తాడు. అక్కడ భవాని ప్రసాద్(ముక్తార్ ఖాన్)ను కలుస్తాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు(సుమన్) అర్జున్‌తో సినిమా నిర్మిస్తానని చెబుతాడు. ఈ క్రమంలోనే అర్జున్.. తన హీరోయిన్ శైలుతో ప్రేమలో పడతాడు. ఆమె అర్జున్‌కి లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న టైంలో ... అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. చనిపోయిన అమిత్ ప్లేస్‌లో తనని తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నారని అర్జున్‌కు అర్థమవుతుంది. మరోపక్క డేవిడ్(షారుఖ్ భైగ్) కావ్య అనే అమ్మాయిని చంపడానికి మనుషుల్ని పంపుతాడు. ఈ క్రమంలో అర్జున్ ఆమెను కాపాడతాడు. అయితే అమిత్‌ను తానే చంపేశానని అర్జున్‌కి చెప్పి ఇంకో షాక్ ఇస్తుంది కావ్య. అయితే అమిత్‌ను ఆమె ఎందుకు చంపింది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? తర్వాత అర్జున్ జీవితం ఎలా మారింది అనేదే మిగిలిన కథ.ఎలా ఉందంటే..కమర్షియల్ కథలకి ఫ్యామిలీ సెంటిమెంట్ కలిస్తే ఎక్కువగా సక్సెస్ అవుతాయి. ఈ విషయాన్ని '1000 వాలా తో మరోసారి ప్రూవ్ చేశాడు దర్శకుడు అఫ్జల్. అతనిలో ఉన్న మాస్ ఈ సినిమాతో బయటపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే తాత మనవళ్ల సెంటిమెంట్, ఇంటర్వెల్ ఫైట్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంది. సినిమాలో వచ్చే లాస్ట్ పాట మాస్ ఆడియన్స్‌లో ఊపేసింది. ఓవరాల్‌గా మాస్ ఆడియన్స్‌కు 1000 వాలా ఫీలింగ్ తీసుకొచ్చాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే...అమిత్ డ్రీమ్ స్టార్ అటు అర్జున్‌గా.. ఇటు అమిత్‌గా రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో ఒదిగిపోయాడు. షారుఖ్ భైగ్ రూపంలో ఓ స్టైలిష్ విలన్‌గా మెప్పించారు.సీనియర్లు సుమన్, ముక్తార్ ఖాన్, పిల్లా ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర మెప్పించారు. వంశీ కాంత్ రేఖాన అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. చందు ఏజే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ(మలయాళ డబ్బింగ్ సినిమా)నటీనటులు: ప్రియమణి, కుంచకో బోబన్ తదితరులుడైరెక్టర్: జీతూ అష్రఫ్నిర్మాతలు: మార్టిన్ ప్రక్కత్, సిబి చవారా, రంజిత్ నాయర్సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్తెలుగులో విడుదల: 14 మార్చి 2025ఇటీవల తెలుగులో మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు తెలుగులోనూ సత్తాచాటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో పాటు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా మరో సరికొత్త క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. జీతూ అష్రఫ్ తన డెబ్యూ కథగా అలాంటి జోనర్‌నే ఎంచుకున్నారు. పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకునే సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బస్సులో చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అమ్మాయి సూసైడ్‌కు హరిశంకరే కారణమా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఇదేక్రమంలో హరిశంకర్‌కు భార్య ప్రియమణి(గీత)తో తీవ్రమైన గొడవ జరుగుతుంది. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాలనుకున్నారు? వీరి ముద్దుల కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపుగా ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీని ఛేదించడం లాంటివీ కథలు రోటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జోనర్లో పోలీసులు, నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయడం చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో పోలీసు అధికారులే బాధితులు కావడమనేది కొత్త పాయింట్‌ను డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వరుస కేసులు, దర్యాప్తు సమయంలో వచ్చే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు ఒక కేసు దర్యాప్తు చేయడానికి వెళ్తే.. ఆ కేసు మరో కేసుకు లింక్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిందితుల కోసం హరిశంకర్ వేసే స్కెచ్, అతనికి పోలీసు డిపార్ట్మెంట్లో ఎదురయ్యే సమస్యలు కాస్తా రోటీన్‌గానే అనిపిస్తాయి. ఈ కేసు కీలకదశలో ఉండగానే ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో మరింత ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను సీట్‌కు అతుక్కునేలా చేశాడు డైరెక్టర్ అష్రఫ్. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిందితులను పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్, ఫైట్స్‌తో ఆడియన్స్‌కు వయొలెన్స్‌ను పరిచయం చేశాడు మన దర్శకుడు. సెకండాఫ్ మొత్తం వన్ మ్యాన్ షోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఓ సిన్సియర్ పోలీసు అధికారి కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కోణం కూడా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. పోలీసులు నిందితుల కోసం వేసే స్కెచ్, దర్యాప్తు సీన్స్ రోటీన్‌గా ఉన్నప్పటికీ.. ఈ జోనర్లో కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కథను సస్పెన్స్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల రోటీన్‌గా అనిపించినా.. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌లతో కథను ఆసక్తిగా తీసుకెళ్లాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఎండింగ్లో కూడా అంతే ట్విస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్‌తో ఆడియన్స్‌కు కాసేపు ఉత్కంఠకు గురిచేశాడు. ఓవరాల్‌గా కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరిచండంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరెలా చేశారంటే..మలయాళ స్టార్ కుంచన్ బోబన్ పోలీసు అధికారిగా తన అగ్రెసివ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా తనదైన భావోద్వేగాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రియమణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తన రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. విజువల్స్ పరంగా ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జీవీ ప్రకాశ్ కుమార్ 'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్‌గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తమిళంలో తెరకెక్కిన కింగ్స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్‌తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్‌కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్‌లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఫ్యాన్స్‌ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'వైరల్ ప్రపంచం' మూవీ రివ్యూ
టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా! టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే అవి జీవితాలనే తలకిందులు చేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. తాజాగా అలాంటి జానర్లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రిజేష్ టాంగి దర్శకత్వం వహించగా అకిల తంగి నిర్మించారు. మార్చి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ‘వైరల్ ప్రపంచం’ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథఅమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ).. రవి (సాయి రోనక్)తో ప్రేమలో ఉంటుంది. తన 4 సంవత్సరాల సంబంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్యశెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాను కలిసే ప్రవీణ్ (సన్నీ నవీన్)తో ఎమోషనల్ బాండింగ్‌ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను తర్వాత ఇంటర్నెట్ను మాత్రమే నమ్ముతారు. మరి వారి నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఎవరు? ప్రాణాలను బలిగొన్న ఘటన ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా చూస్తాం. నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుంచి దూకడంతో కథ ఆసక్తిగా మారుతుంది. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జరుగుతుంది. వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయన్నది చూపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది కథలో చక్కగా చూపించారు. ఇంటర్నెట్లో మహిళల గోప్యతను మంటగలుపుతున్న సైబర్ నేరాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు.ఎవరెలా చేశారంటే?రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్.. ఈ తరం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతారు. సహజంగా నటించారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర యాక్ట్ చేశారు.సాంకేతిక విభాగంమ్యూజిక్ ఎంతో ఎమోషనల్ ఫీల్ కలిగిస్తుంది. కానీ కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోదు. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది. కెమెరా పనితనం పర్వాలేదు.విశ్లేషణ‘ఇంటర్నెట్లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాలనుకున్న సబ్జెక్టును తెరకెక్కించడంలో దర్శకుడు బ్రిజేష్ టాంగి దాదాపు సఫలమైనట్లే! కానీ కొన్నిసీన్లు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల యువతీయువకుల జీవితాలు ఎలా మారిపోయాయనేది నేటి యువతకు అర్థమయ్యేలా చూపించారు. ఆన్లైన్ మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. యువతకు విలువైన సందేశం ఇస్తుంది.చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
'గార్డ్' తెలుగు మూవీ రివ్యూ
టైటిల్: గార్డ్విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి నిర్మించగా, జగ పెద్ది దర్శకత్వం వహించారు. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన గార్డ్ మూవీ నేడు (ఫిబ్రవరి 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గార్డ్ ప్రజల్ని ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూసేద్దాం..కథఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనను కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని గదిలోకి సామ్ వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని కథేంటి? సుశాంత్‌కు, ఆ ఆత్మకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.విశ్లేషణ.. చనిపోయిన అమ్మాయి ఆత్మ తిరిగొచ్చి పగ తీర్చుకోవడం చాలా సినిమాల్లో చూశాం. అదే పాయింట్‌తో గ్రప్పింగ్ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథనంలో కొత్తదనం చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ఇదంతా రొటీన్‌లా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది.సెకండ్ హాఫ్‌లో ఆత్మ ఏం చేసింది? తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేశాడు? అన్నది ఇంట్రెస్టింగ్గా చూపించారు. కానీ సినిమా మరీ అంతగా భయపెట్టేదిగా ఉండదు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. కథ అంతా ఆస్ట్రేలియాలో జరగడం వల్ల అక్కడ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి.ఎవరెలా చేశారంటే?విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేశాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దెయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది. శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో భయపెట్టారు. కొన్ని సీన్లు చూసినప్పుడు దర్శకుడు కాస్త తడబడినట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు. చదవండి: Aghathiyaa Review: జీవా ‘అగత్యా’ రివ్యూ -
Sabdham Movie: 'శబ్దం' మూవీ రివ్యూ
-
'తల' సినిమా రివ్యూ
టైటిల్: తలనటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్దర్శకుడు: అమ్మ రాజశేఖర్బ్యానర్: దీపా ఆర్ట్స్నిర్మాత : శ్రీనివాస గౌడ్డీఓపీ: శ్యామ్ కె నాయుడుమ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణడ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్ఎడిటర్ : శివ సామిప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తల సినిమా (Thala Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!ఎవరెలా నటించారంటే?అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా చూపించాడు. అయితే తన వయసుకు మించిన యాక్షన్ సీన్స్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అంకిత బాగా నటించింది. చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్.. హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్‌తో ఎమోషన్ పండించింది. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక విశ్లేషణఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్లో చెప్పినట్లుగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ జనరేషన్లో అమ్మకోసం కష్టపడే కొడుకు కథగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉంది.చదవండి: క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్ -
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్‌గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్‌ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్‌లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్‌తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్‌గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్‌గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
కిడ్స్ లెట్స్ క్రూజ్ టు ఆఫ్రికా...
కిడ్స్... మీరెప్పుడైనా ఆఫ్రికా ఫారెస్ట్ చూశారా! మీరు ఇప్పటిదాకా చూసినా చూడక΄ోయినా ఈ మూవీతో మీరు ఆఫ్రికా ఫారెస్ట్ చూడవచ్చు. మీరే కాదు మీతో పాటు ఓ సూపర్ కో పాసింజర్ కూడా ఉంది. అదే మనందరికీ ఇష్టమైన పాండా. అదేలాగంటారా ప్రైమ్ వీడియో ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీని అర్జెంట్ గా చూసేయండి. ఈ మూవీ మొత్తం ఆఫ్రికా ఫారెస్ట్ లోని సూపర్ విజువల్స్ తో మంచి కామెడీతో ఉంటుంది. పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీ స్టోరీ ఏంటంటే...ఇథలిక్ విలేజ్ లో పాంగ్ అనే ఓ యంగ్ పాండా ఉంటుంది. దానికి జీలాంగ్ అనే ఓ చిన్న డ్రాగన్ మంచి ఫ్రెండ్. లయన్ కింగ్ డమ్ వాళ్ళు తమ యంగ్ లయన్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి జీలాంగ్ డ్రాగన్ ను ఆఫ్రికాకి కిడ్నాప్ చేస్తారు. అప్పుడు పాంగ్ తన ఇంకో మంకీ ఫ్రెండ్ జోజోతో కలిసి జీలాంగ్ డ్రాగన్ ను సేవ్ చేయడానికి ఆఫ్రికా బయలుదేరుతుంది. పాంగ్ లాంటి చిన్న పాండా జీలాంగ్ లాంటి పెద్ద డ్రాగన్ ను ఆఫ్రికా వెళ్ళి సేవ్ చేస్తుందా లేదా అన్నది మాత్రం మీరు పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీ లోనే చూడాలి. ఈ మూవీ మొత్తం పాండా చేసే స్టంట్స్, పాండా మంకీ ఫ్రెండ్ జోజో చేసే అల్లరి అలాగే వాళ్ళతో కలిసే మరో హైనా చేసే కామెడీ చాలా బాగుంటుంది. సో కిడ్స్ బకల్ అప్ విత్ రిమోట్ అండ్ క్రూస్ టు ప్రైమ్ వీడియో టు విట్నెస్ ఆఫ్రికా విత్ పాండా బేర్. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వయస్సు 93... మనస్సు మాత్రం 23
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ్రపాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం థెల్మా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనకు వయస్సు మీద పడే కొద్దీ మనస్సు కూడా నీరసించిపోతుందనుకుంటాం. వయస్సు ఎంతైనా సంకల్ప బలం బాగా ఉంటే మనమేదైనా సాధించవచ్చు అని నిరూపించిన సినిమా ‘థెల్మా’. అలా అని ఇదేదో ఫ్యాంటసీ మ్యాజిక్ సినిమా అనుకుంటే పొరబడినట్లే. ఓ సాధారణ ముసలావిడ తన నుండి దోచుకున్న డబ్బు కోసం ఎటువంటి సాహసం చేసింది అనేదే ఈ సినిమా. జోష్ మార్గోలిన్ ఈ సినిమా దర్శకుడు. జూన్ స్క్విబ్ ‘థెల్మా’ సినిమాలోని ప్రధాన పాత్రలో నటించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆమె నటించిన పాత్ర వయస్సు 93... కానీ మనస్సు 23. ఇక జూన్ స్క్విబ్ నిజమైన వయస్సు 95... ఆమె ఈ సినిమాలో ఎంతో హుందాగా, సరదాగా నటించారు. ఈ సినిమా చూసిన తరువాత మన పెద్దవారు చాలా వరకు స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. అంతలా ఏముందీ సినిమాలో... ఓ సారి లుక్కేద్దాం. కథా పరంగా 93 ఏళ్ల థెల్మా పోస్ట్ లాస్ ఏంజెల్స్ నగరంలో ఓంటరిగా నివసిస్తుంటుంది. అప్పుడప్పుడూ తన మనవడైన డెన్నీ చూడడానికి వస్తుంటాడు. ఓ రోజు థెల్మాకు ఓ అనామకుడు డెన్నీ గొంతుతో ఫోన్ చేస్తాడు. తాను ఓ యాక్సిడెంట్ చేశానని, తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారని, తాను దీని నుండి బయటపడాలి అంటే అర్జెంటుగా పదివేల డాలర్లు పంపాలని చెప్తాడు పాపం థెల్మా ఇది మోసమని తెలియక ఆ అగంతకుడు చెప్పినట్టే డబ్బు పంపుతుంది. తరువాత తన తప్పు తెలుసుకుని చాలా బాధ పడుతుంది. కుటుంబ సభ్యులందరూ విషయం తెలుసుకుని ఇక చేసేదేమీ లేక థెల్మాని ఓదారుస్తారు. కానీ థెల్మా మాత్రం తన స్నేహితుడు బెన్‌తో కలిసి ఆ పోయిన డబ్బు కోసం పెద్ద సాహసమే చేస్తుంది. మరి... ఆ సాహసం ఏమిటి? ఆ సందర్భంలో థెల్మా ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నది మాత్రం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న ‘థెల్మా’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా చాలా వినూత్నంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను మీ పిల్లలతో పాటు పెద్దవాళ్లకు చూపించడం మరచిపోకండి. ఎందుకంటే సినిమా చూసిన తరువాత ‘థెల్మా’ స్ఫూర్తితో మీ పెద్దవాళ్లందరూ మరింత ఉత్సాహంగా ఉంటారు. – ఇంటూరు హరికృష్ణ -
కదలకుండా కట్టిపడేసే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘క్యారీ ఆన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్లో వెళుతున్నపుడు దాని జోనర్‌ని కమర్షియల్ యాంగిల్లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘క్యారీ ఆన్’ ఆ కోవకు చెందిన సినిమానే. ఇదో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పాచ్చు.ఈ సినిమాకి జేమ్ కలెక్ట్ సేరా దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... భార్యాభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్‌పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టీఎస్ఎలో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్‌పోర్టు పండగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్లు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్‌గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.ఓ అనామకుడు కొపెక్ను బ్లూటూత్ ద్వారా తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న అతని భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ ఆగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్కు సూచనలిస్తుంటాడు. అసలే పండగ కాలం... ఎయిర్‌పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగ రానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ పక్క ఆ లగేజ్‌ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్. ముందుగా తనకు కనపడకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న అతడ్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ ఆగంతకుడితో పాటు బాంబుని కనుక్కున్నాడా? అలాగే తన భార్యని కాపాడుకున్నాడా... ఈ ప్రశ్నలకు సమాధానం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘క్యారీ ఆన్’ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటి నుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యమవుతోంది. ఈ ‘క్యారీ ఆన్’ వర్త్ టు వాచ్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్. – ఇంటూరు హరికృష్ణ -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ
గత కొన్నాళ్లుగా రూట్ మార్చిన అల్లరి నరేశ్.. సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. ఈ వారం థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదొక్కటే. సుబ్బ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. దీంతో మూవీ టాక్ బయటకొచ్చింది. ట్విటర్లో సినిమా రివ్యూ పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్.. 'ఇక మీరెందుకు పాకులాడటం?')బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. అల్లరి నరేశ్ పక్కన 'హనుమాన్' ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా చేసింది. టాక్ విషయానికొస్తే.. మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'బచ్చలమల్లి' సినిమా అని అంటున్నారు. అలాన ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడని కూడా చెబుతున్నారు.డైలాగ్స్, జాతర ఫైట్ సీన్, చివరి 20 నిమిషాలతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ బాగుందని అంటున్నారు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కేర్ తీసుకోవాల్సిందని చెబుతున్నారు. ఓవరాల్‌గా చూసేటప్పుడు డెప్త్ తగ్గినట్లు అనిపించిందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అల్లరి నరేశ్ బాగానే కష్టపడ్డాడని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది)Super #BachhalaMalliAsl start to interval varaku asl bore ledu songs @allarinaresh Anna Main ga @Actor_Amritha chala beautiful ga undi Love track chala Baga ochindi Interval block adirindi Fights too good 1st half highlight camera work and music champesaru@subbucinema 🔥👌 pic.twitter.com/1yZNKrHCwz— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024#BachhalaMalli is a rustic drama that has a very honest point at its core, but the routine/bland screenplay dilutes the soul of the film and makes it less effective. The film follows many tropes and scenes that are seen in typical rural dramas. While there are a few promising…— Venky Reviews (@venkyreviews) December 19, 2024#BachhalaMalli Although the movie has a very truthful premise, the absence of excitement in the screenplay lessens its depth and affects its overall impact. #AllariNaresh tried his best, but his efforts went in vain. #AmritaAiyer was fine. Plus:👉Allari Naresh's Performance… pic.twitter.com/ZDVBM5JUtL— Review Rowdies (@review_rowdies) December 19, 2024మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది.Watchable Film @allarinaresh Characterization Was Good Dialogue 's & Jathara Fight, Last 20 MinsHero Realisation Scene 👌👌Congratulations @subbucinema & Team.#Bachhalamalli pic.twitter.com/o9u9qXBryp— Praveen (@AlwaysPraveen7) December 19, 2024#AllariNaresh #BachhalaMalli#MaheshBabu #PrabhasBachhalaMalli Review=-Mass Parts💥OverAll=2.75/5Story=2.65/5🎶/BGM=3/5♥️Emotion=3.25/5🥹Love=2.75/5Action=2.9/5🥵1stHalf=2.8/5Interval=3/5🔥2ndHlf=2.75/5Acting=4/5-Naresh🔥Climax=2.9/5-Last 15M pic.twitter.com/iZPKEFZ0ga— Reviewer_Boss^ (@ReviewerBossu) December 19, 2024ST : #BachhalaMalli pic.twitter.com/tUPtHZvdOB— sunny 𝕏🗿 (@itssunny4545) December 19, 2024#Review మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ #Bachhalamalli సినిమా @allarinaresh Acting Peaks 💥💥Director @subbucinema 👏👏👏Heroine @Actor_Amritha Settled Performance 👌👌@Composer_Vishal Good Music Good Movie... pic.twitter.com/T4JdTR72UR— Nine Tv Entertainment (@ChitramReviews) December 19, 2024Just finished movie #BachhalaMalli 🔥@allarinaresh ee malli gadu gurtundi pothad anna ❤️@Actor_Amritha I need a girl like #Kaveri you are so good I like you so much 💞 Spcl @_amAryan so good ❤️@subbucinema you made me emotional 🥺 What a writing so depth 🔥👌Songs 👌3.5/5 pic.twitter.com/1qZvfKv4aq— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024 -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
వాస్తవ ఘటనతో ఆఫ్టర్ మాత్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఆఫ్టర్ మాత్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని మాత్రం మనల్ని అనునిత్యం వెంటాడుతుంటాయి. ఆ సంఘటనకు, మనకు సంబంధం లేకపోయినా వాటి బాధితుల బాధను మనమూ అనుభవిస్తాం. కొంతమంది ఆ బాధను అలా భరిస్తూనే ఉంటారు, మరికొంతమంది ఇంకోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటనకు సినిమా రూపమిచ్చారు హాలీవుడ్ దర్శకుడు ఎలియట్ లెస్టర్. 2004లో ఓ రష్యా ఆర్కిటెక్ తన కుటుంబాన్ని ఘోర విమాన ప్రమాదంలో ΄పోగొట్టుకున్నాడు.దానికి ప్రతిగా ఎయిర్ లైన్ ట్రాఫిక్ సిబ్బందిని హత్య చేశాడు. ఈ ఘటన ఆధారంగా ‘ఆఫ్టర్ మాత్’ సినిమా తీశారు. ఈ సినిమా కథపరంగా రోమన్ ఓ కన్స్ట్రక్షన్ వర్కర్. ఫ్లైట్‌లో వస్తున్న తన కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ ΄కోర్టుకి బయలుదేరడంతో ప్రారంభం అవుతుంది సినిమా. ఎయిర్ ΄కోర్టులో అడుగుపెట్టగానే తన భార్య, కూతురు విమాన ప్రమాదంలో మరణించారని రోమన్‌కి తెలుస్తుంది. దాంతో అతను కుంగిపోతాడు. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం తెలుసుకునే క్రమంలో ఆ ప్రమాదం వెనక ఉన్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జేక్ బనోస్ అనే విషయం రోమన్‌కి తెలుస్తుంది.ఎలాగైనా సరే రోమన్ జేక్ బనోస్ని కలవాలని ప్రయత్నిస్తాడు. జేక్‌ని కలిశాక రోమన్ ఏం చేశాడన్నదే ‘ఆఫ్టర్ మాత్’ సినిమా. ఈ సినిమా ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. తన కుటుంబం మొత్తాన్ని ΄పోగొట్టుకుని దానికి కారణమైన వారి మీద పోరాటమన్నది అంత చిన్న విషయం కాదు. ఎన్నో భావావేశాలతో కూడుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా రోమన్ ΄పాత్రలో ఓ విశిష్ట నటుడు మనకు కనిపిస్తాడు. దాదాపు రెండు తరాల నుండి హాలీవుడ్ యాక్షన్ రారాజుగా పిలవబడే ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ రోమన్ పాత్రను చేశారు. ఆర్నాల్డ్ ఆ పాత్రను చేశారనే కన్నా జీవించారని చెప్పవచ్చు. సినిమా మొత్తం కాస్త స్లోగా ఉన్నా సినిమా అయిపోయాక కొన్ని గంటలు మనం రోమన్ పాత్రతోనే ప్రయాణం చేస్తాం. ‘లయన్స్ గేట్’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎమోష నల్ రోలర్ కోస్టర్‌ని చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
'ఈసారైనా?!' సినిమా రివ్యూ
విప్లవ్ అనే కుర్రాడు.. హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయితగా చేసిన సినిమా 'ఈసారైనా!?'. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా (నవంబర్ 8న) థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?డిగ్రీ చేసిన రాజు (విప్లవ్).. నాలుగేళ్లుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే ఊరిలో ఉండే శిరీష(అశ్విని) గవర్నమెంట్ టీచర్‌గా చేస్తుంటుంది. విప్లవ్, శిరీషని ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేస్తానని కండీషన్ పెడతాడు. మరి రాజు.. గవర్నమెంట్ జాబ్ కొట్టాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)ఎలా ఉందంటే?అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా తీశారు. రాజు-శిరీష పాత్రల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్‌కి కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే పాట బాగుంది. హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా క్యూట్ అండ్ స్వీట్‌గా తెరకెక్కించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయి. అలానే తెలిసిన ముఖాలు కూడా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.ఎవరు ఎలా చేశారంటే?హీరో విప్లవ్ కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అశ్విని చూడటానికి బాగుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి పర్లేదనిపించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే చాలా విభాగాలని దగ్గరుండి చూసుకున్న విప్లవ్ ఆకట్టుకున్నాడు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫీ ఓకే. పచ్చని పల్లెటూరిలో ప్రశాంతంగా అనిపించే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
'రహస్యం ఇదం జగత్' మూవీ రివ్యూ
టైటిల్: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతులవిడుదల తేదీ : 8 నవంబర్ 2024సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. అలా ఈ జానర్లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించామంటున్నాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలించిందో రివ్యూలో చూసేద్దాం..కథకథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం స్వదేశానికి తిరిగి వద్దామనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా తనతోపాటు ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటాడు. అలా అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ క్లోజ్ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు. ఆ స్నేహితులలో సైంటిస్ట్ అయిన అరు మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకునే క్రమంలో అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్‌కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!విశ్లేషణతక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమానే రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించారు. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రెండ్స్ ట్రిప్.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ కాస్త సాగదీసినట్లుగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు.ఎవరెలా చేశారంటే?షార్ట్ ఫిలింస్‌లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.టెక్నికల్ టీమ్సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ చూపించినట్లుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. డబ్బింగ్‌పై కాస్త ఫోకస్ చేయాల్సింది. డబ్బింగ్‌ను పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు మైనస్. కొన్నిచోట్ల బీజీఎమ్ డైలాగులను డామినేట్ చేసింది. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ఎం. శ్రీలేఖవిడుదల తేదీ: 08 నవంబర్ 2024సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్‌తో దిగితే ప్రేక్షకులే సూపర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వచ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు. ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు? ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హత్య కేసు నుంచి బయటపడతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గానే వచ్చినప్పటికీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు.అయితే సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామర్, ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ కథకు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'జాతర' సినిమా రివ్యూ
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. దీయా రాజ్ హీరోయిన్. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. రగ్డ్, ఇంటెన్స్ డ్రామాతో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో సినిమాని తీశారు. తాజాగా నవంబర్ 8న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఆలయ పూజారి పాలేటి. అతని కొడుకు చలపతి (సతీష్ బాబు రాటకొండ) ఓ నాస్తికుడు. అదే ఊరికి చెందిన వెంకట లక్ష్మి (దీయ రాజ్)తో చలపతి ప్రేమలో ఉంటాడు. ఓరోజు పాలేటి కలలోకి గంగావతి గ్రామదేవతలు వచ్చి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. ఆ తర్వాత గ్రామం నుండి అదృశ్యమవుతుంది. గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టడం చెడు సంకేతం అని ప్రజలు నమ్ముతారు. మరోవైపు గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) గ్రామ కార్యకలాపాలను చేపట్టడం, గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి ఆహ్వానించడం లాంటివి చేస్తాడు. ఇంతకీ గంగిరెడ్డి, పాలేటి కుటుంబానికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)ఎలా ఉందంటే?పల్లెటూరి సంస్కృతి, ఊర్లో జాతరను తలపించేలా ఈ సినిమా ఉంటుంది. అందరినీ కట్టిపడేసేలా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథను చెప్పడంలో పర్లేదనిపించాడు. సంగీతంతో పాటు సినిమాలో పల్లెటూరి అందాలని, దేవత సన్నివేశాలను బాగా చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలైనప్పటికీ తక్కువ సమయంలో స్టోరీకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా దేవత సన్నివేశాలు, బీజీఎం.. సినిమా మొత్తం ఆడియెన్స్‌ని వెంటాడతాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్‌లు ఉన్నాయి. ప్రారంభంలో, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.ఎవరెలా చేశారు?సతీష్ బాబు.. నటుడు, రచయిత, దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు. హీరోయిన్గా చేసిన దీయా రాజ్ పర్లేదనిపించింది. గంగిరెడ్డి పాత్రలో ఆర్కే నాయుడు సూట్ అయిపోయాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ
'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది. అలానే మనకు ఎంత డబ్బున్నా సరే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు.ఎవరెలా చేశాడు?బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ
విచిత్రమైన సినిమాల లిస్ట్ తీస్తే దాదాపుగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఎందుకంటే భయపెట్టలన్నా, కవ్వించాలన్నా, గ్రాఫిక్స్‌తో మాయ చేయాలన్నా సరే వాళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే భూమిపై ఏం జరగొచ్చే అనే కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ సినిమానే 'ద సైలెన్స్'. 2019లో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? నిజంగా ఇది అంత బాగుందా అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)కథేంటి?ఓ పరిశోధనా బృందం.. 800 అడుగుల లోతున్న ఓ గుహని పగలగొట్టినపుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలిచే కొన్ని వింత జీవులు.. సదరు సైంటిస్ట్లని క్రూరంగా చంపి బయటి ప్రపంచంలోకి వస్తాయి. వీటికి శబ్దం వస్తే నచ్చదు. అలాంటిది బయట ప్రపంచంలో మనుషులు చేసే శబ్దాలకు అల్లకల్లోలం అయిపోతాయి. మనుషుల్ని పీక్కుతింటుంటాయి. మరోవైపు అల్లీ ఆండ్రూస్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది. వెస్ప్ అనే జీవులు అందరినీ చంపేస్తున్నాయని వీళ్ల కుటుంబానికి తెలుస్తుంది. దీంతో సౌండ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అనుకుంటారు. మరి వింత జీవుల నుంచి వీళ్ల తప్పించుకున్నారా? లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తీసింది కల్పిత కథే అయినప్పటికీ 'ద సైలెన్స్' చూస్తున్నంతసేపు మనకు వణుకు పుడుతుంది. ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటా అని భయమేస్తుంది. జస్ట్ గంటన్నర నిడివి ఉండే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు. అలానే ఓ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఒకరికరు ఎలా అండగా నిలబడాలో చూపించారు. ప్రధాన పాత్రధారి ఫ్రెండ్ క్యారెక్టర్‌తో ఫ్రెండ్షిప్ విలువ కూడా చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ప్రస్తుతం మనలో చాలామంది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అడవుల్ని నరికేసి ఎన్నో జీవరాశులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. అవి ఏం చేయలేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అవే గనకు వికృత రూపాల్ని సంతరించుకుని మనుషులపై తిరగబడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఎక్కడో 800 అడుగుల లోతులో వాటి మానాన అవి ఉంటే, పరిశోధనల పేరుతో వాటిని ఇబ్బంది కలిగించడంతోనే వింత జీవులు భూమ్మీదకి వస్తాయి. మనిషికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయి.ఇందులో ప్రధాన పాత్ర కుటుంబంపై ఎప్పటికప్పుడు వింత జీవులు ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ప్రతిసారి వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్, కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా స్టోరీ ఉన్న 'ద సైలెన్స్' మూవీ.. ఈ వీకెండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు. ఇంకెందుకు లేటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి.- చందు డొంకాన -
దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?
దేశవ్యాప్తంగా దీపావళిని అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాణా సంచా వెలుగులతో కళకళాలాడిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల కూడా ప్రేక్షకుల కేరింతలతో సందడి చేశాయి. ఈ పండగ సందర్భంగా ఏకంగా నాలుగు మూవీస్ రిలీజయ్యాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్'తో పాటు కన్నడ డబ్బింగ్ మూవీ 'బఘీర' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. ఇంతకీ వీటిలో దీపావళి విన్నర్ ఎవరు? ఏది ఎలా ఉందంటే?'లక్కీ భాస్కర్' చాలా లక్కీమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి యునిక్ కాన్సెప్ట్ కావడం బాగా కలిసొచ్చింది. దీంతో ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ బయటకు వచ్చింది. ఆద్యంతం థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేసేయండి) డిఫరెంట్ అటెంప్ట్ 'క'బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతంలో ఏడాదికి రెండు మూడు మూవీస్‌తో వచ్చాడు. కాకపోతే అవి రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో ఏడాదిన్నర టైమ్ తీసుకుని, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'క'తో వచ్చాడు. దీనికి కూడా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?)ఏడిపించేసిన 'అమరన్'కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేశారు. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). బ్యాట్‌మ్యాన్ తరహా కథతో 'బఘీర'ప్రశాంత్ నీల్ అందించిన కథతో తీసిన కన్నడ సినిమా 'బఘీర'. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళికి తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే పైన మూడింటికి వచ్చినంత స్పందన అయితే రాలేదు. హీరో పోలీస్. కానీ వ్యవస్థ పనితీరు వల్ల రాత్రి వేళలో ముసుగు వేసుకుని మరీ విలన్లని చెండాడుతుంటాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) -
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ
ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు. చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక. అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు. ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు. -
'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ
వచ్చే వారం దీపావళికి బోలెడన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిన్న చిత్రాలు రిలీజయ్యాయి. వాటిలో ఓ మూవీనే 'నరుడి బ్రతుకు నటన'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)కథేంటి?సత్య (శివకుమార్) నటుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. యాక్టింగ్ నీకు చేతకాదని తండ్రి (దయానంద్ రెడ్డి) కాస్త పద్ధతిగా తిడతాడు. ఒక్కగానొక్క ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వరస్ట్ యాక్టర్ అని సత్య ముఖంపైనే చెబుతారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో కేరళ వెళ్లిపోతాడు. పరిచయమే లేని డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి ఇంట్లో ఇతడు ఉండాల్సి వస్తుంది. కేరళలో ఇతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు.. అసలు మన దగ్గర కూడా ఇలాంటివి తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మహా అయితే ఓసారి చూడొచ్చు. హీరో కోసం ఇంకోసారి చూడొచ్చేమో గానీ ఫీల్ గుడ్ చిత్రాలు మళ్లీ మళ్లీ చూడొచ్చు. అలాంటి ఓ సినిమానే 'నరుడు బ్రతుకు నటన'. ఏంటి అంత బాగుందా అని మీరనుకోవచ్చు. నిజంగా చాలా బాగా తీశారు.నువ్వో వరస్ట్ యాక్టర్.. జీవితంలో కష్టాలు తెలిస్తేనే నువ్వో మంచి నటుడివి అవుతావ్ అని హీరో సత్యని ఫ్రెండ్ తిడతాడు. అంతకుముందు ఊరు పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు. తండ్రి కూడా కాస్త పద్ధతిగా తిడతాడు. దీంతో కోపమొచ్చి కేరళ వెళ్లిపోతాడు. కాస్త డబ్బులు ఉండటం వల్ల కొన్నిరోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే అహం. దీంతో చేతిలో ఉన్న ఫోన్ అమ్మాలనుకుంటాడు. అదేమో ఓ పిల్లాడు తీసుకుని పారిపోతాడు. అలా అన్ని కోల్పోయిన సత్యకి సల్మాన్ పరిచయమవుతాడు. అతడితో అన్ని షేర్ చేసుకుంటాడు. వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏమో గానీ చూసే ప్రేక్షకుడికి చాలా విషయాలు నేర్పిస్తారు.డబ్బు ఉంటే చాలు.. జీవితం ఆనందంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని ఈ సినిమాలో చూపించిన విధానం సూపర్. ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీ టచ్ చేస్తూ చివరకు ఓ మంచి అనుభూతి ఇచ్చేలా మూవీని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని అందరితో తిట్టించుకున్న సత్య.. తనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ పలికిస్తాడు. చూస్తున్న మనం కూడా అతడితో పాటు ఫీల్ అవుతాం!చిన్న పాప ఎపిసోడ్, ప్రెగ్నెంట్ అమ్మాయి ఎపిసోడ్ మనల్ని భావోద్వేగాన్ని గురిచేస్తాయి. ఇక సల్మాన్ లవ్ స్టోరీ, మందు పార్టీ, వేశ్య దగ్గరకు వెళ్లిన సీన్స్‌లో సత్య-సల్మాన్ చేసిన సందడి నవ్విస్తుంది. చూస్తున్నంతసేపు ఓ మలయాళ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లే అక్కడక్కడ మలయాళ పాటలు కూడా వినిపించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇవి వస్తున్నప్పుడు మనకు భాషతో ఇబ్బంది కూడా అనిపించదు. అంతలా లీనమైపోతాం. రెండు గంటల సినిమా అప్పుడే అయిపోందా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన శివకుమార్.. ఇందులో సత్యగా నటించాడు. హీరో అనడం కంటే మనలో ఒకడిలానే అనిపిస్తాడు. నితిన్ ప్రసన్న చేసిన డి.సల్మాన్ పాత్ర అయితే హైలైట్. సరదా సరదాగా సాగిపోతూనే చాలా విషయాలు నేర్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే దాదాపు కేరళలో షూటింగ్ అంతా చేశారు. సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. దర్శకుడు రిషికేశ్వర్ మంచి పాయింట్ తీసుకున్నాడు. అంతే నిజాయతీగా ప్రెజెంట్ చేశాడు. కాకపోతే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని, మూవీని కాస్త ప్రమోట్ చేసుంటే బాగుండనిపించింది. ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అస్సలు మిస్సవొద్దు!రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ) -
'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)
సినిమా అంటేనే ఇలానే ఉండాలి అనేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయి. ఇవి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'లెవల్ క్రాస్'. ఒరిజినల్‌గా దీన్ని మలయాళంలో తీశారు. కానీ రీసెంట్గా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?రఘు (అసిఫ్ అలీ) ఎడారి ప్రాంతంలో ఒక చోట రైల్వే గేట్ కీపర్. నిర్మానుస్య ప్రాంతంలో ఒక్కడే చెక్క ఇంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి కింద పడినట్లు రఘు గమనిస్తాడు. దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన ఆమెని తన ఇంటికి తీసుకొస్తాడు. కోలుకున్న తర్వాత ఆమెకు తన గురించి చెబుతాడు. ఆమె కూడా తన గురించి చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ సినిమా తీయాలంటే హీరోహీరోయిన్ ఉండాలి. ఆరు పాటలు, మూడు ఫైట్స్, అవసరం లేకపోయినా సరే కామెడీ.. ఇలా పాన్ ఇండియా పేరుతో వందలకోట్ల బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి అక్కర్లేదని 'లెవల్ క్రాస్' సినిమా నిరూపించింది. మూడే పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర సినిమా అంతా రెండు-మూడు డ్రస్సులో మాత్రమే కనిపిస్తారు. అలాంటి విచిత్రమైన మూవీ ఇది.ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియని యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మరో వ్యక్తికి తెలిస్తే.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఎంతకు తెగిస్తారు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే ఇది. సినిమా కథ గురించి చెబితే మళ్లీ స్పాయిలర్ అవుద్దేమో! కాస్త ఓపికతో చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే వస్తుంది.సినిమాలో మూడు పాత్రలు ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతాయి. కానీ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకు అర్ధం కాదు. ఒకటి జరుగుతుందని అనుకుంటాం. కానీ తర్వాతి సీన్లో ఊహించనది జరుగుతుంది. ఒక్కొక్కరి గతం గురించి బయటపడే ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు? హీరో అనేది ప్రారంభంలో చాలామంది గెస్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలా కనిపెట్టలేరు.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏదో ఆర్ట్ మూవీ తీసినట్లు చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 45 నిమిషాల వరకు అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తాయి. మధ్యలో ఓ పాట ఉంటుంది కానీ అది అనవసరం అనిపించింది.యాక్టింగ్ పరంగా అసిఫ్ అలీ, అమలాపాల్, షరాఫుద్దీన్ ఆకట్టుకున్నారు. 'దృశ్యం' డైరెక్టర్ జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్భాజ్ ఆయూబ్ దర్శకుడు. ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్. దాన్ని తీసిన విధానం అంతకంటే డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్, యాక్షన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.-చందు డొంకాన -
'వీక్షణం' సినిమా రివ్యూ
సినిమాల్లో ఎవర్ గ్రీన్ జానర్ ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేమాట థ్రిల్లర్. ఈ జానర్ మూవీస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైన మూవీ 'వీక్షణం', రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే)కథేంటి?ఆర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు ఏం చేస్తుంటారా అని బైనాక్యులర్‌తో చూస్తుంటాడు. అలా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండే నేహా(కశ్వి)ని చూసి ఇష్టపడతాడు. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెతో ప్రేమలో పడతారు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 'వీక్షణం' కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.ఎవరెలా చేశారు?ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.టెక్నికల్ విషయానికొస్తే థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సమర్థ గొల్లపూడి సరిగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా
ఓటీటీలో అన్ని జానర్స్‌లో కొన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వయలెన్స్ అంటే ఇష్టపడేవాళ్లు బోలెడుమంది. అలాంటి ఆడియెన్స్ కోసమా అన్నట్లు గ్యాంగ్‌స్టర్, యాక్షన్ చిత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో టాప్ ప్లేసులో ఉండే మూవీ 'సిటీ ఆఫ్ గాడ్'. అయితే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు. పోర్చుగీస్ భాషలో తీసిన బ్రెజిల్ మూవీ. కానీ ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో అంతలా ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో శివారులో ఉండే సిడాడె డె డెవుస్ మురికివాడ. కనీస అవసరాలైన విద్యుత్తు, రవాణా సదుపాయాలు అస్సలు ఉండవ్. చాలామంది కటిక పేదరికంలో ఉంటారు. ఇక్కడే 'టెండర్ ట్రయో' పేరుతో ముగ్గురు కుర్రాళ్లు.. దొంగతనం, దోపీడీలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటారు. పెద్ద హోటల్లో దోపీడీ చేస్తే ఇంకా ఎక్కువగా దోచుకోవచ్చని లిటిల్ డైస్ అనే పిల్లాడు సలహా ఇస్తాడు. రాత్రి అక్కడికే దొంగతనానికి వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పోలీసులు వస్తే సిగ్నల్ ఇవ్వమని లిటిల్ డైస్‌ని బయట కాపలా ఉంచుతారు.దోపీడి మాత్రమే చేయాలని ఎవరినీ చంపకూడదని కుర్రాళ్లు అనుకుంటారు. కానీ లిటిల్ డైస్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్లు పారిపోతారు. తీరా మరుసటి రోజు పత్రికల్లో మాత్రం హోటల్లో చాలామంది చనిపోయినట్లు వార్తలు వస్తాయి. ఇంతకీ వాళ్లని ఎవరు చంపారు? చివరకు సిటీ ఆఫ్ గాడ్ అయిందెవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తీసిన ఈ సినిమా.. ఫొటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే బుస్కేప్ అనే కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ముఠా, పోలీసులకు మధ్య ఇతడు ఇరుక్కునే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 1960లోకి వెళ్లి సిడాడె డె డెవుస్ అనే ఊరు. అక్కడి వాతావరణం, మనషులు ఎలా ఉంటారనేది చూపిస్తారు.అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కుర్రాళ్లంతా డ్రగ్స్ వ్యాపారంలోకి రావడం, ఇబ్బడిముబ్బడిగా డబ్బు పోగేసుకోవడం, వీటితో తుపాకులు కొని హత్యలతో చెలరేగడం ఇలా చాలా వయలెంట్‌గా ఉంటుంది. ఆధిపత్యం కోసం మొదటి రెండు తరాలు ఇలానే ఒకరిని ఒకరు కాల్చుకుని చనిపోతారు. మూడో తరం కూడా అలానే తయారవబోతుందని చూపించడంతో సినిమా ముగుస్తుంది.ప్రాంతం గానీ, మనుషులు గానీ మనకు అస్సలు పరిచయం లేనివాళ్లు. కానీ చూస్తున్నంతసేపు బ్రెజిల్ శివారులోని మురికివాడల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరి సలపనంత స్పీడుగా ఉండే స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్లే ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంది. ఇప్పుడంటే 'సలార్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్నారు. కానీ 2002లో గ్యాంగ్‌స్టర్ జానర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు.ఇక సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే స్థానికులనే లీడ్ యాక్టర్స్‌గా పెట్టారు. 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరీ నటింపజేశారు. దాని ఫలితం మీకు సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఫ్యామిలీతో కలిసి చూడకండి. ఎందుకంటే బూతులు, న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. మీకు వయలెన్స్ ఎక్కువగా ఉండే గ్యాంగ్‌స్టర్ మూవీ చూడాలనుకుంటే దీన్ని అసలు మిస్సవొద్దు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన -
'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తన మేనరిజం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కుర్రాడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ 'రామ్‌నగర్ బన్నీ'. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎలా ఉంది? యాటిట్యూడ్ స్టార్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)కథేంటి?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సోషల్ మీడియా పుణ్యాన ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారనేది చెప్పలేం. అలా ఫేమస్ అయిన కుర్రాడు చంద్రహాస్. ఇతడి పేరే మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. కానీ దీన్ని ట్యాగ్ లైన్ వాడేసి మనోడి కొత్త సినిమాని తీసుకొచ్చేశారు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటినుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీశారు.ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు. అతడికో ఫ్యామిలీ. పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, కొన్నాళ్ల లవ్ చేసిన తర్వాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెని వదిలేస్తాడు. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్లిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉందని తెలుసుకుంటాడు. తర్వాత ఏమైంది? ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తార అనే ఆంటీ ఎవరు అనేది చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్.. మధ్యలో ఓ నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీస్ ఇష్టముంటే 'రామ్‌నగర్ బన్నీ' మీకు నచ్చేయొచ్చు. రెండున్నర గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి తప్పితే ఓవరాల్‌గా చల్తా చల్తా ఎంటర్టైనర్.ఎవరెలా చేశారు?యాట్యిట్యూడ్ అని ట్రోల్ చేస్తే, దాన్నే తన పేరుగా మార్చుకున్న చంద్రహాస్.. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్నింట్లో బాగానే కష్టపడ్డాడు. శైలుగా చేసిన విస్మయ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన అమ్మాయిలు మిగతా ముగ్గురు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే రెండు మూడు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ తీసుకున్న లైన్ పాతదే. కానీ కాస్త మెరిపించే ప్రయత్నం చేశాడు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం గానీ పాస్ అయిపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చూస్తే యాటిట్యూడ్ స్టార్ ఎంట్రీ టెస్టులో పాస్ అయిపోయినట్లే!-చందు డొంకాన.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) -
టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ
టైటిల్: టిన్ & టీనాకథలోలా - అడాల్ఫొ దంపతులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. కానీ వారి కలలను నీరుగారుస్తూ పెళ్లిరోజే లోలాకు గర్భస్రావం అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తను తల్లి కాలేదని వైద్యులు నిర్ధారిస్తారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. తననలా చూడలేకపోయిన భర్త దగ్గర్లో ఓ కాన్వెంట్ ఉందని, అందులో ఎవర్నైనా దత్తత తీసుకుందామని చెప్తాడు. మొదట లోలా అందుకు అంగీకరించదు. కానీ తర్వాత ఒప్పుకుని ఏడేళ్ల వయసున్న కవలలు టిన్ అండ్ టీనాను దత్తత తీసుకుంటారు.అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిల్లలు అందరిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. భగవంతుడిపై ఎక్కువ విశ్వాసంతో తానేం చేసినా దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. లోలా మల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లల వింత ప్రవర్తనతో భయపడిపోయిన ఆమె కడుపులో బిడ్డను వారి నుంచి కాపాడుకోవాలని చూస్తుంది. డెలివరీ తర్వాత కూడా క్షణక్షణం భయంగానే గడుపుతుంది. ఆమె భయానికి కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం చేశారు? వారిని తిరిగి ఎందుకు కాన్వెంట్లో వదిలేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!విశ్లేషణలోలాకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తను పెంచుకుంటున్న కవలలకు అపారమైన భక్తి. బైబిల్లో ఉన్నవన్నీ యదాతథంగా అమలు చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్కను చంపేస్తారు. స్కూలులో తమను ఆటపట్టిస్తున్న కుర్రాడిని సైతం దారుణంగా టార్చర్ పెట్టి చంపుతారు. వీటిని సహించని లోలా చివరకు వారిని అమాయకులుగా భావించడం వింతగా అనిపిస్తుంది. పిల్లల రాక్షస ప్రవర్తనకు ఇంకేమైనా కారణాలున్నాయా? అని అనిపించకమానదు. క్లైమాక్స్‌లో లోలా భర్తను కోల్పోవడం... ఎవరివల్లయితే తన కొడుక్కి హాని అనుకుందో ఆ కవలల్ని ఇంటికి తీసుకురావడం అందరికీ మింగుడుపడకపోవచ్చు.లోలాగా మెలీనా స్మిత్, టిన్ అండ్ టీనాగా కార్లోస్ జి మోరోలాన్, అనటాసియా రుస్సో నటించారు. వీరి పర్ఫామెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మనకే కంగారు వచ్చేస్తుంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి పడే ఆరాటం మనల్ని కదిలించివేస్తుంది. వీకెండ్లో ఓసారి చూసేయొచ్చు! టిన్ అండ్ టీనా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్ కుమార్ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)తీసుకున్న పాయింట్ సీరియస్ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్విళి పాండియన్ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్. భాస్కర్ ఇమిడియారు. (చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)ఇక కథాంశానికొస్తే... కయల్విళి పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే. అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్ ప్రమోషన్ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి, చూసే విధానం చాలా మారిపోయింది. కొత్తతరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి. అలాంటి ఓ తమిళ మూవీనే 'కొట్టుక్కాళి'. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మీనా (అన్నా బెన్) ఓ సాధారణ అమ్మాయి. ఈమె బావ పేరు పాండి (సూరి). వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది. దీంతో కాలేజీలో చేర్పిస్తారు. అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్లు కోప్పడతారు. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ప్రేమించిన అబ్బాయి.. తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు. ఈమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని కుటుంబమంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'కొట్టుక్కాళి' అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం. మలయాళ నటి అన్నా బెన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కథ చాలా సింపుల్. దెయ్యం పట్టిందనుకున్న ఓ అమ్మాయిని తీసుకుని, ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక్కక్కరు ఎలా ప్రవర్తించారు. అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేదే తెలియాలంటే మూవీ చూడాలి.సాధారణంగా సినిమా అంటే పాటలు, ఫైట్స్, హోరెత్తిపోయే బీజీఎం.. ఇలా బోలెడంత హంగామా. కానీ 'కొట్టుక్కాళి'లో ఇవేం ఉండవు. ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్‌కి ఒక్కటే డైలాగ్. అది కూడా జస్ట్ ఐదే సెకన్లు మాట్లాడుతుంది. అంతే. కోడిపుంజుని తాడుతో బంధించినట్లే.. ఫ్యామిలీ అనే ఎమోషన్స్‌కి తలొగ్గి హీరోయిన్ బంధి అయిపోయి ఉంటుంది. సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.అలానే పురుషాధిక్యం, దెయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్‌తో వదిలేశారు. అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట.ఎవరెలా చేశారు?ప్రధాన పాత్రలు చేసిన సూరి, అన్నా బెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ చాలా నేచురల్‌గా ఉంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాండి, మీనా క్యారెక్టర్స్‌తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం. దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.ఇకపోతే 'కొట్టుక్కాళి' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త ఓపిక ఉండి, డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన -
'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ
బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..కథబ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణటెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. -
ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!
మనుషులు జాంబీలుగా మారితే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ 'జాంబీరెడ్డి' అనే మూవీ ఉంది. అయితే ప్రపంచంలో ఈ జానర్లో వచ్చిన బెస్ట్ సినిమా అంటే చాలామంది చెప్పే పేరు 'ట్రైన్ టూ బుసన్'. ఒరిజినల్‌గా ఇది కొరియన్ చిత్రం. కానీ ఓటీటీలోనూ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే రివ్యూ చదివేయండి.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ))కథేంటి?ఫైనాన్సియల్ కంపెనీ నడిపే హీరో. అతడికి ఓ కూతురు. ఓ రోజు తన తల్లి ఉంటున్న బుసన్ ఊరికి వెళ్దామని వేకువజామున ట్రైన్ ఎక్కుతాడు. అయితే అప్పటికే ఓ ప్రాణాంతక వైరస్ వల్ల ఈ ఊరిలోని మనుషులందరూ జాంబీలుగా మారిపోయింటారు. కనిపించిన మనుషుల్ని పీక్కుతింటూ వాళ్లని కూడా జాంబీలుగా మార్చేస్తుంటారు. ఓ లేడీ జాంబీ.. హీరో ఎక్కిన ట్రైన్‌లోకి ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని కొరికేస్తూ ట్రైన్‌లోని చాలామందిని జాంబీలుగా మార్చేస్తుంది. మరి చివరకు ఏమైంది? హీరో, తన కూతురు బతికి బయటపడ్డారా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ట్రైన్ టూ బుసన్' సినిమాని ఈపాటికే మీలో చాలామంది చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే వాళ్ల కోసమే ఈ రివ్యూ. ఇప్పటివరకు హారర్, థ్రిల్లర్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ సినిమాలు. కానీ ఇది మాత్రం సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోనే బెస్ట్ మూవీ. జాంబీలు ఉంటాయి కాబట్టి కావాల్సినంత భయం కూడా ఉంటుంది.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)కేవలం రెండే గంటలున్న ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. ఒక్కో సీన్ చూస్తుంటే ఓ పక్క వణుకు, మరోపక్క భయంతో ప్యాంట్ తడిచిపోద్ది. చెప్పుకొంటే చిన్న కథనే గానీ చాలా గ్రిప్పింగ్‌గా తీశారు. డ్రామా, హారర్, యాక్షన్, థ్రిల్లర్.. ఒకటేమిటి బోలెడన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఇలాంటి జాంబీ మూవీలోనూ ఓ తండ్రి-కూతురి మధ్య బాండింగ్‌ని చాలా చక్కగా మనుసుని హత్తుకునేలా ఎష్టాబ్లిష్ చేశారు. తొలుత దీన్ని కొరియన్ బాషలో రిలీజ్ చేశారు. కానీ తర్వాత బోలెడంత పాపులారిటీ రావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.మనం చేసిన కొన్ని పనులు వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది అనే పాయింట్ ఆధారంగా దీన్ని తీశారు. కొరియన్ స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తాడనే రూమర్స్ వచ్చిన డాంగ్ ఇందులో ఉంటాడు. ఒక్క గుద్దుతో జాంబీలని చంపేవాడిగా కనిపిస్తాడు. ఈ వీకెండ్ ఏం చేయాలో తెలీక ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ట్రైన్ టూ బుసన్' చూడండి. చూసిన తర్వాత 'వర్త్ వర్మ వర్త్' అని కచ్చితంగా అంటారు!-చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'కళింగ' సినిమా రివ్యూ
ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ టచ్ ఉండే మూవీస్ హిట్స్ కొడుతున్నాయి. మరోవైపు హారర్ జానర్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమా 'కళింగ'. ధృవ వాయు హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ప్రగ్యా నయన్ హీరోయిన్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కళింగ అనే సంస్థానం గురించి చెబుతూ సినిమాని మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు వింతగా ప్రవరిస్తూ తమని తాము చంపుకొంటూ ఉంటారని, అడవిలోకి వెళ్లినోళ్లు తిరిగి రారని చెప్పి క్యూరియాసిటీ పెంచారు. ఆ తర్వాత లింగ-పద్దు లవ్ స్టోరీ.. ఊరిపెద్దతో లింగ తమ్ముడు గొడవ ఇలా స్టోరీ అంతా సెట్ చేసి ఫస్టాప్ నడిపించేశారు. తన పెళ్లి కోసం అడవిలోకి లింగ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. అడవిలో ఏముంది? లోపలికి వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలని సెకండాఫ్‌లో చెప్పారు. చివర్లో అసురభక్షి పాంయిట్ కొత్తగా అనిపిచింది. అయితే సినిమా పరంగా చూసుకుంటే పాయింట్ బాగున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కళింగ కథని వాయిస్ ఓవర్‌తో చెప్పించేశారు. విజువల్‌గా చూపించి ఉంటే బాగుండేది. లవ్ స్టోరీ రొటీన్. కథ అక్కడక్కడ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. హారర్ డోస్ కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?హీరో కమ్ దర్శకుడిగా ధృవవాయు ఆకట్టుకున్నాడు. లింగ పాత్రలో పర్వాలేదనిపించాడు. డైరెక్టర్‌గా కొన్నిచోట్ల మాత్రం ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్గా చేసిన ప్రగ్యా నయన్ గ్లామర్ పరంగా న్యాయం చేసింది. లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. -
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్ సీరియల్ కిల్లర్‌కు దొరికితే!
ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్లాక్డ్.కథతింటున్నా, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నామీ. ఒకరోజు బస్‌లో తన ఫోన్ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్ కిల్లర్‌కు దొరుకుతుంది. నిజానికి పాస్వర్డ్ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్‌ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్వర్డ్ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.తన నిశ్శబ్ధమే..ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్వర్డ్ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్ కిల్లర్ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.పాస్వర్డ్ అడగడమే విడ్డూరంసినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్ స్క్రీన్ మార్చడానికి పాస్వర్డ్ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్ కిల్లర్)కి పాస్వర్డ్ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్ పాస్వర్డ్ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయొచ్చు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. -
టాలీవుడ్ మూవీ 'రేవు' రివ్యూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?
టైటిల్: రేవునటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులుదర్శకుడు: హరినాథ్ పులినిర్మాతలు : మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లిసంగీత దర్శకుడు: జాన్ కె జోసెఫ్సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్ఎడిటర్: శివ శర్వానీవిడుదల తేదీ : ఆగస్టు 23, 2024ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే...సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ?ఎలా ఉందంటే..రేవు అనగానే సముద్రతీరం, మత్స్యకారులు అని అందరికీ గుర్తొస్తాయి. టైటిల్ చూస్తేనే కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఊహించుకోవచ్చు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.సముద్ర నేపథ్యం అనగానే కథ మొత్తం తీరప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో మత్స్యకారుల జీవనవిధానం, వారు పడే ఇబ్బందుల ఎలా ఉంటాయనేది డైరెక్టర్ తెరపై చూపించిన విధానం బాగుంది. కొత్త నటీనటులైనప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా తీశారు. కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచాడు హరినాథ్ పులి. కథలో సహజత్వం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. రోటీన్ స్టోరీ కావడంతో కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ అయితే మరింత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ విషయానికొస్తే డైరెక్టర్ ఆడియన్స్‌ను మెచ్చుకునేలా కథను ముగించాడు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడి పాత్రలో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా రాణించాడు. హేమంత, అజయ్ నిడదవోలు తమ పాత్రల పరిధిలో జీవించారు. హీరోయిన్ గా నటించిన స్వాతి ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర రాణించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్ మూవీనే ‘టారో’. కథఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కొహెన్–అన్నాహెల్ బర్గ్. కథాంశానికొస్తే... కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్... అందులో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.ఎలా ఉందంటే?ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గో వాచ్ ఇట్. – ఇంటూరు హరికృష్ణ -
ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ
స్టార్ హీరో డాన్ లీ.. హాలీవుడ్ సినిమా లవర్స్‌కు అభిమాన నటుడు. సౌత్ కొరియన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్‌ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. హియో మ్యుంగ్-హేంగ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.సౌత్ కొరియాలో ఒక భారీ భూకంపంతో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అతికష్టం మీద కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారికి సరైన ఆహారం దొరకదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. ఆకలితో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారు జీవిస్తుంటారు. సరిగ్గా అదే ప్రాంతంలో నామ్‌సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. అతనితో పాటుగా నామ్‌సామ్, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్) ఉంటారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. భూకంపం వల్ల నామ్‌సామ్ కూతురు చనిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తన కూతురిగా భావిస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.అలా వారి జీవితాల్లోకి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు ఎంట్రీ ఇస్తారు. దీంతో వారి లైఫ్ ప్రమాదంలో పడుతుంది. వారి నమ్మించి హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తమ వెంట తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆమె అమ్మమ్మను క్రూరంగా చంపేస్తారు. యాంగ్ జీ సు (లీ హీ జూన్) అనే డాక్టర్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపై ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా ఉండేందుకు సైన్స్‌కు పదునుపెడుతాడు. ఈ క్రమంలో అనేకమంది యువతులపై ప్రయోగాలు చేస్తూ ఉండలం వల్ల వారందరూ కూడా భయంకరమైన జాంబీలుగా మారిపోతుంటారు.కూతురుగా భావించిన హన్సునా ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకున్న నామ్‌సామ్ కాపాడేందుకు ప్లాన్ వేస్తాడు. తన మిత్రుడు అయిన చోయ్ జీ వాన్‌ను కూడా సాయంగా తీసుకెళ్తాడు. ఆమెను ఆ సైకో డాక్టర్ నుంచి వారిద్దరూ ఎలా కాపాడారు? డాక్టర్‌తో పాటు పనిచేస్తున్న లీ యూన్ హో ఎలా సాయపడింది? ఆమె వారికి ఎందుకు సాయం చేసింది..? డాక్టర్‌గా మంచి పేరున్న యాంగ్ జీ సు ఇదంతా ఎవరిని కాపాడేందుకు చేస్తున్నాడు..? ఆ డాక్టర్ బారి నుంచి హన్ సునా ప్రాణాలతో బయటపడిందా..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్‌లాండ్ హంటర్ మూవీ చూడాల్సిందే.బ్యాడ్‌లాండ్ హంటర్స్ సినిమా అంతా కూడా భూకంపంతో శిథిలమైన నగరం చూట్టే సాగుతుంది. వాస్తంగా దానిని సెట్ వేసి ప్రేక్షకులకు చూపించారు. అయినా చాలా రియలిస్టిక్‌గా సినిమాను డైరెక్టర్ మలిచాడు. ఎక్కువగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను భారీగా మెప్పిస్తాయి.డైరెక్టర్ హియో మయాంగ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి పీక్స్‌లో ఉంటుంది. నామ్ సామ్ పాత్రలో డాన్ లీ అదరగొట్టాడు. కేవలం ఆయన చేస్తున్న స్టంట్స్ కోసం సినిమా చూడొచ్చు. ఇదే సమయంలో లీహీజూన్ విలనిజం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఎవరినీ నిరుత్సాహపరచవని చెప్పవచ్చు. ఒక సైకో డాక్టర్ నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ
కొన్ని సినిమాలు క్లాసిక్స్. వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటుంచితే.. ఇలాంటివి మళ్లీ తీయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడంటే మన ప్రేక్షకులు 'బాహుబలి', 'కేజీఎఫ్' అని మురిసిపోతున్నారు. కానీ వీటికి బాబులాంటి మూవీ హాలీవుడ్లో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చింది. అదే 'అపోకలిప్టో' (2006). శతాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కో సీన్ దెబ్బకు మన మైండ్ బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!కథేంటి?ఉత్తర అమెరికాలోని మెసో అమెరికన్ అడవులు. మాయన్ తెగకు చెందిన జాగ్వర్ పా.. ఓ రోజు వేటకు వెళ్తాడు. దొరికిన మాంసంతో రాత్రి విందు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వీళ్లపై వేరే తెగకు చెందిన కొందరు దాడి చేస్తారు. ముందే పసిగట్టిన జాగ్వర్ పా.. తన భార్య, కొడుకుల్ని ఓ బావిలో సురక్షితంగా దాచేస్తాడు. దాడి చేసిన వాళ్లు కొందరిని అతి కృూరంగా చంపేసి జాగ్వర్ పాతో పాటు మిగిలిన ఆడవాళ్లు-మగవాళ్లని బానిసలుగా చేసుకుని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకీ జాగ్వర్ పా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌పై దాడి చేసిందెవరు? చివరకు పా తన భార్య-కొడుకుని కలుసుకున్నాడా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఉత్తర అమెరికాలో శతాబ్దాల క్రితం అంతరించిపోయిన మాయన్ నాగరికత ఆధారంగా 'అపోకలిప్టో' సినిమా తీశారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ మూవీస్‌లో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయిన మాయన్ తెగ, నాగరికతని స్టోరీగా ఎంచుకోవడమే పెద్ద సాహసం అనుకుంటే.. అసాధారణ రీతిలో తెరపై చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. పేరుకే హాలీవుడ్ సినిమా గానీ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వినిపించదు. పాత్రలన్నీ మాయన్ భాషలోనే మాట్లాడుతుంటాయి.ప్రధాన పాత్రల భాష, గెటప్, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస్కృతి.. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్‌గా పరిశీలించి ఈ సినిమాలో చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే ప్రధాన కథానాయకుడు జాగ్వర్ పా ఉంటున్న చోటపై మరో తెగ దాడి చేయడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక్కో సీన్ అద్భుతం అనేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో.. విలన్ చోటు నుంచి తప్పించుకుని పరుగెడతాడు. అతడు ఎంత స్పీడుగా రన్నింగ్ చేస్తాడో.. సినిమా కూడా అంతకంటే స్పీడుగా వెళ్తుంది. చూస్తున్న మనకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనేలా సీన్లు ఉంటాయి.దర్శకుడు మెల్ గిబ్సన్ తన మాయాజాలంతో తీసిన 'అపోకలిప్టో'.. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లకు ఓ టెక్స్ట్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. మన దగ్గర వస్తున్న 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలు.. దీని దరిదాపుల్లోకి కూడా రావు. ఇంతలా హైప్ ఇస్తున్నానంటే మూవీ ఎలా ఉంటుందే మీకే అర్థమైపోతుంది. అప్పటి కథ కాబట్టి మహిళా పాత్రల శరీరం కాస్త కనిపిస్తుంటుంది. కాబట్టి కుదిరితే ఒంటరిగానే చూడండి. ఓటీటీలోనే ఏదైనా మంచి యాక్షన్ మూవీ చూద్దామనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
టాలీవుడ్ మూవీ 'సంఘర్షణ'.. ఎలా ఉందంటే?
టైటిల్: సంఘర్షణనటీనటులు: శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను, ఎక్స్‌ప్రెస్ హరి, స్వాతిశ్రీ చెల్లబోయిన, సుధాకర్ తదితరులునిర్మాత: వల్లూరి శ్రీనివాస్ రావ్దర్శకత్వం: చిన్నా వెంకటేష్సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్, సుధాకర్ బార్ట్లేఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డిసంగీతం: ఆదిత్య శ్రీరామ్శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం సంఘర్షణ. మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వల్లూరి శ్రీనివాస్ రావ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) లైఫ్‌లో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. అసలు వాళ్ల జీవితంలో ఎలాంటి సంఘటన జరిగింది? దాన్ని ఎలా ఫేస్ చేశారు. ఈక్రమంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలకు, చైతన్యకు ఉన్న సంబంధం ఏంటన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న క్రైం కాన్సెప్ట్‌తో ఈ కథను రాసుకున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ హాఫ్‌లో చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) చుట్టే కథ తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే హత్యలు, ఇన్వెస్టిగేషన్ . దర్శకుడు చిన్న వెంకటేష్ మర్డర్ మిస్టరీని తెరపై చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు.సెకండాఫ్‌లో కథలో కాస్తా వేగం పెరుగుతుంది. హత్యలు, ఇన్‌స్టిగేషన్ సీన్స్ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోవు. అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ కథను ఆసక్తిగా చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్‌గా అనిపిస్తాయి. కథలో ఎక్స్‌ప్రెస్ హరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇందులో కథ, కథనం ఆడియన్స్‌ను అంతగా మెప్పించకపోయినా.. క్లైమాక్స్ ఫర్వాలేదనిపించింది. డైరెక్టర్ చిన్న వెంకటేష్ ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే..చైతన్య, రసీదా బాను తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. శివ రామచంద్రవరుపు, కరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే కేవీప్రసాద్, సుధాకర్ బాట్లే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి కత్తెరకు మరింత పని చెప్పాల్సిది. ఆదిత్య శ్రీరామ్ నేపధ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ
టైటిల్: యావరేజ్ స్టూడెంట్ నానినటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLPనిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరిసంగీతం: కార్తీక్ బి కొడకండ్లసినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024‘యావరేజ్ స్టూడెంట్ నాని’ కథేంటంటే..నాని(పవన్ కుమార్) ఓ యావరేజ్ స్టూడెంట్. అమ్మనాన్నలు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా.. అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అక్క(వివియా సంపత్) సహాయంతో మంచి ర్యాంక్ రాకపోయినా బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల సారా అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. నాని ఈ బాధలో ఉండగానే..కోమాలో ఉన్న తన అక్క తనకోసం చేసిన త్యాగం గురించి తెలుస్తుంది. తనవల్ల ఎవరికి ఉపయోగం లేదని భావించిన నాని.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? నానిని ప్రాణంగా ప్రేమించిన సారా..మరో వ్యక్తితో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది? నాని-సారాల లవ్‌స్టోరీ గురించి తెలిసిన తర్వాత కూడా అను నానితో ఎలా ప్రేమలో పడింది? యావరేజ్ స్టూడెంట్ అయినా నాని.. చివరకు అందరితో శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఎలా సంపాదించగలిగాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. హీరో యావరేజ్ స్టూడెంట్. అల్లరి చిల్లరగా తిరుగుతూ..చివరకు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటాడు.. ఇలాంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యావరేజ్ స్టూడెంట్ నాని కథ కూడా ఇదే. అయితే యూత్‌కి ఆకట్టుకునే విధంగా బోల్డ్, గ్లామర్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కొత్తూరి. దర్శకుడు రాసుకున్న పాయింట్ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం రొమాంటిక్ సీన్లతో కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫాదర్-సన్ రిలేషన్, సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా.. బోల్డ్ సీన్ల కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. అయితే యూత్ మాత్రం కొన్ని సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ అంతా నాని కాలేజీ లైఫ్.. సారాతో ప్రేమాయణంతో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సెకండాఫ్‌లో కాలేజీ సీన్లు బోర్ కొటించినా.. పాదర్-సన్ సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరిలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే పాట ఈళలు వేయిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథనం బోల్డ్‌గా సాగినా.. అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపించినా..యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ-నిర్మాణ బాధ్యతలు కూడా పవన్ కుమారే తీసుకున్నాడు. తను రాసుకున్నదే కాబట్టి నాని పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగా పండించాడు. ఎమోషన్ సీన్లలో చక్కగా నటించాడు. హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియల నటనకు పెద్దగా స్కోప్ లేదు కానీ..తెరపై అందంగా కనిపించ్ ఎంటర్టైన్ చేశారు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. చివర్లో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే మాస్ సాంగ్‌తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ
మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. 'కల్కి' రిలీజైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చిన హిందీ సినిమా 'కిల్'.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటిది థియేటర్లలో ఉండగానే ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం యూఎస్, యూకేలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ 'కిల్' ఎలా ఉందో తెలియాలంటే రివ్వ్యూ చదివేయండి.కథేంటి?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?నరకడం, పొడవడం, చంపడం.. కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకుని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే 'కిల్'. హాలీవుడ్లో 'జాన్ విక్' అని ఓ మూవీ సిరీస్.. హీరో, విలన్ గ్యాంగ్ ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీశారు. కథ చూస్తే కొత్తదేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ.. విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే 'కిల్'లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్.ఈ సినిమా అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరివరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజులో యాక్షన్, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్.. ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోలు.. 40 మంది బందిపోట్లు.. వీళ్ల మధ్య జరిగే భీకర ఫైటింగ్. మొత్తం అంతా ఇదే. పస్టాఫ్‌లో హీరో.. విలన్ గ్యాంగ్‌ని చంపకుండా కేవలం కొట్టి కిందపడేస్తుంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి కృూరంగా మారిపోతాడు. పొడవడం, నరకడంలో విలన్ గ్యాంగ్‌కే చుక్కలు చూపిస్తాడు.ఒంటి నిండా కత్తిపోట్లతో తోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్‌ని నామరూపాల్లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీ ఇదే ఫస్ట్ టైమ్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా గానీ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్‌లో ఫణి అనే పాత్ర చేసిన రాఘవ జూయల్ కూడా ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కనబెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ ఉంటాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. సినిమాటోగ్రాఫీ అయితే ఇంకా కేక. ట్రైన్ సెట్లో మూవీ తీసుండొచ్చు. కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచనే రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్లో చిక్కుకుపోయాం అనే రేంజులో భయపడతాం. ఫైనల్‌గా చెప్పాలంటే మీకు గుండె ధైర్యం ఎక్కువుంటే 'కిల్' చూడండి!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
కాకుడా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ మూవీ ‘కాకుడా’ కూడా ఒకటి. ఈ సినిమా గురించి తెలుసుకుందాం.మానవుని జీవితంలో అత్యంత సున్నితమైన మరియు భయోత్పాతమైన ఉదంతం ఏదైనా ఉంది అంటే అది మరణమే. ఆ మరణ ఇతివృత్తాంతాన్ని వినోదాత్మకంగా మలిచిన చిత్రమే ‘కాకుడా’. ఈ సినిమా జోనర్ హారర్ కామెడీ. దీనికి దర్శకులు ఆదిత్య సరపోతదార్. మామూలుగా హారర్ కామెడీ చిత్రాల్లో దెయ్యం మనుషులను భయపెట్టడం లేదా మనిషే దెయ్యాలను భయపెట్టడం చూశాం. వాటన్నిటికీ విరుద్ధంగా ‘కాకుడా’ సినిమా కాన్సెప్ట్ ఉండడం విశేషం. ఉత్తరాది రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి సంబంధించిన కథ ఇది. ఆ గ్రామం పేరే కాకుడా. ప్రతి మంగళవారం సరిగ్గా రాత్రి 7.15 నిమిషాలకు గ్రామంలోని ప్రతి ఇంటి చిన్న ద్వారం తలుపులు తీసి ఉంచాలి. ఇదే కథాంశం. ఎవరికైనా ఫలానా రోజున తాము మరణించే రోజు అని తెలిస్తే... ఇంకేముంది... క్షణక్షణం బాధతో నరకం అనుభవిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రకి తాను మరణించే రోజు తెలిసినా పైకి కొంత బాధపడుతూనే అందరితో మామూలుగా ఉంటూ కథను నడిపిస్తాడు.రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షీ సిన్హా వంటి పెద్ద తారలు నటించిన ఈ చిన్న సినిమా ఆద్యంతం కాలక్షేపదాయకం. కొన్ని కొన్ని సన్నివేశాల్లో దెయ్యం రూపం కాస్త పిల్లలను భయపెట్టినా సినిమా మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా సరదా సరదాగా చూడొచ్చు. ఈ వారానికి ‘కాకుడా’ సినిమా వినోదం కోసం గొప్ప ఛాయిస్ అని చె΄÷్పచ్చు. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ కథలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో తమిళంలో రిలీజైన 'హాట్ స్పాట్' మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి!కథేంటి?రివేంజ్, యాక్షన్, ప్రేమ కథలు విని విని ఓ నిర్మాతకు చిరాకొస్తుంది. అలాంటి టైంలో స్టోరీలు పట్టుకుని డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న మహమ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) వస్తాడు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వనని అనడంతో ఓ నాలుగు కథల్ని ఎదురుగా కూర్చున్న నిర్మాతకు చెప్తాడు. ఇంతకీ ఆ నాలుగు స్టోరీలు ఏంటి? ఇవన్నీ విన్న తర్వాత నిర్మాత ఏమన్నాడు? అసలు షఫీ.. సదరు నిర్మాతకే ఎందుకు చెప్పాడు అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?దీన్ని సినిమా అనడం కంటే 'ఆంథాలజీ' అనొచ్చు. 'హ్యాపీ మ్యారీడ్', 'గోల్డెన్ రూల్', 'టమాటో చట్నీ', 'ఫేమ్ గేమ్' అనే నాలుగు వేర్వేరు కథల్ని ఓ సినిమాగా తీశారు. చూస్తున్నంతసేపు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఎందుకంటే అంతలా ఆశ్చర్యపరుస్తాయి. అవాక్కయ్యేలా చేస్తాయి. ఏడిపిస్తాయి. భయపెడతాయ్!పెళ్లి తర్వాత ఆడపిల్లలు.. తమ ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి? అనేదే మొదటి స్టోరీ. ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? అనేది రెండో స్టోరీ. తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి.. మూడో స్టోరీ. టీవీ షోల వల్ల పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది నాలుగో స్టోరీ.ఈ సినిమాలో ఒక్కో స్టోరీ ఒక్కో ఆణిముత్యం. ఎందుకంటే ఏ మూవీలో అయినా ఒకటో రెండో సీన్లు వేరే వాటితో పోలిక రావొచ్చు. కానీ ఇందులో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చూస్తున్న మీకే నమ్మశక్యం కాని విధంగా సన్నివేశాలు ఉంటాయి. మొదటి కథ కాస్త కొత్తగా ఉంటుంది. చివరికొచ్చేసరికి ఆలోచింపజేస్తుంది. రెండో కథలో ఓ ట్విస్ట్ ఉంటుంది. అది ఇబ్బందిగా అనిపిస్తూనే మైండ్ బ్లాంక్ చేస్తుంది. మూడో కథ అయితే రెండో దానికంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మూడు స్టోరీలు.. యూత్‌ని టార్గెట్ చేసి తీసినవే.నాలుగో కథలో మాత్రం పిల్లలు.. ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోల కల్చర్ వల్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది చూపిస్తారు. చిన్న పిల్లలున్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన స్టోరీ ఇది. అయితే ఈ నాలుగింటిలోనూ దేనికది బాగానే ఉంటాయి కానీ మొదటి, చివరి స్టోరీలో మాత్రమే సరైన ముగింపు ఉంటుంది. మిగతా రెండింటిని మధ్యలో ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ విఘ్నేశ్ కార్తీక్ రాసుకున్న స్క్రిప్ట్ మేజర్ హైలైట్. చూపించేది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ ఫన్నీ వేలో చెప్పడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రాఫీ ఫెర్ఫెక్ట్. డైలాగ్స్ బాగున్నాయి. చూస్తున్నంతసేపు తెలుగు సినిమాలా ఉందేంటి అనిపిస్తుంది. యాక్టర్స్ తమిళవాళ్లే. కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమాని పొరపాటున కూడా ఫ్యామిలీతో చూడకండి. ఆహా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులో ఉంది.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘పేకమేడలు’ మూవీ రివ్యూ
టైటిల్: పేక మేడలునటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ నిర్మాణ సంస్థలు: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్నిర్మాత: రాకేశ్ వర్రేదర్శకత్వం: నీలగిరి మామిళ్లసంగీతం: స్మరణ్ సాయిసినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.విడుదల తేది: జులై 19, 2024కథేంటి?లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు మూసీ నదికి ఒడ్డున బస్తీలో నివసిస్తుంటారు. అబ్బాయికి మెరుగైన జీవితం కోసం మంచి కాలనీకి మారాలని వరలక్ష్మి ఆశ పడుతుంది. ఆమె సంపాదన మీద పడి బతకడం తప్ప ఉద్యోగం సద్యోగం చెయ్యడు లక్ష్మణ్. ఇంజనీరింగ్ చదివినా..జాబ్ చేయకుండా. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడతాడు. రియల్ ఎస్టేట్ కోసం భర్త, పిల్లల్ని అమెరికాలో వదిలేసి వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్)ను ట్రాప్ చేస్తాడు. శ్వేత దృష్టిలో తాను రిచ్ అని చూపించుకునేందుకు భార్య పేరు వాడుకుని అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మి ఏం చేసింది? లక్ష్మణ్ ఏం చేశాడు? అతడిని కొట్టినది ఎవరు? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే?భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే..భార్య కష్టపడి ఫ్యామిలీని పోషించడం అనే పాయింట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. పేక మేడలు కథ కూడా అదే. అయితే ఇందులో క్లైమాక్స్ మాత్రం కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినా.. మూవీ చూస్తుంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారన్నట్టు ఉంది. బస్తీలో లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందనేది ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభ అయినా 30 నిమిషాల వరకు నెమ్మదిగా సాగుతుంది. ఎన్నారై లేడీ ఎంటరైన తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథ చాలా సరద సరదగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో మాత్రం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. మహిళా సాధికారికతను గొప్పగా చూపించారు. ప్రీ క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే గొడవ సీన్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సినిమాటిక్‌గా కాకుండా.. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.ఎవరెలా చేశారు?వినోద్ కిషన్ ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అయితే, అతడు ఆల్రెడీ తమిళంలో ఫిల్మ్స్ చేశాడు. లక్ష్మణ్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ యాప్ట్. అతడి లీన్ పర్సనాలిటీ కూడా సూట్ అయ్యింది. మిడిల్ క్లాస్ వైఫ్ అంటే అనూష క్రిష్ణ అనుకోవాలి. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్, ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు సైతం చక్కగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా.. చాలా రిచ్‌గా నిర్మించారు. - రేటింగ్: 2.5/5 -
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
చిన్న సినిమాలపై పెద్దగా అంచనాలు ఉండవు. కొన్ని మూవీస్ అలా థియేటర్లలోకి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి చిత్రమే 'ద బర్త్ డే బాయ్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో ఒకరిద్దరు మినహా దాదాపు కొత్త వాళ్లే నటించారు. దర్శకుడి ఫేస్ అయితే ఇప్పటివరకు బయటపెట్టలేదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్లు. అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్లలో బాలు పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్స్‌లో బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు. నొప్పి తట్టుకోలేక బాలు చనిపోతాడు. ఉన్నది అమెరికా కావడంతో కుర్రోళ్లు భయపడతారు. వీళ్లందరూ అర్జున్ సోదరుడు భరత్ (రవికృష్ణ)ని పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా చంపేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'డార్లింగ్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?)ఎలా ఉందంటే?రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా 'ద బర్త్ డే బాయ్' మూవీ తీశారు. సూటిగా సుత్తి లేకుండా మొదలైన పావుగంటకే స్టోరీలోకి తీసుకెళ్లిపోయిన దర్శకుడు.. శవంతో సినిమా అంతా నడిపించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ థ్రిల్ అందించాడు. బర్త్ డే బంప్స్ పేరుతో కుర్రాళ్లు చేసే హడావుడి చాలా సహజంగా ఉంది. ఓవైపు డెడ్ బాడీనే స్టోరీలో మెయిన్ అయినప్పటికీ మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా క్యారీ చేసిన విధానం బాగుంది.ఫస్టాప్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. రెండు గంటల సినిమానే అయినప్పటికీ.. కొన్ని సీన్ల వల్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు భలేగా ఉంటుంది. తీసింది కొత్త డైరెక్టరేనా అని సందేహం వస్తుంది. స్టోరీ అంతా అమెరికాలో జరుగుతున్నట్లు రాసుకున్నారు. కానీ తీసింది ఇండియాలోనే అని చూస్తుంటే తెలిసిపోతుంది. బడ్జెట్ పరిమితుల వల్లనో ఏమో అమెరికా సెటప్ ఇండియాలోనే వేసుకున్నారు!ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన వాళ్లంతా కొత్త వాళ్లే. అయినా సరే చాలా నేచురల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్.. ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు. వీళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. విజువల్స్ బాగున్నాయి. ఓ సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంది. సింక్ సౌండ్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. పేరుకే చిన్న మూవీ గానీ బాగానే ఖర్చు చేసినట్లు అర్థమైంది. బర్త్ డే పార్టీల పేరిట బంప్స్ అని చెప్పి ఎలాపడితే అలా కొడుతూ ఎంజాయ్ చేసేవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.(ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ) -
'డార్లింగ్' సినిమా రివ్యూ
కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్‌కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్‌లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి పర్వాలేదనిపించే ట్విస్ట్.సెకండాఫ్‌లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్‌గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్‌కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్‌కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్‌పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఎవరెలా చేశారు?'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు. కానీ నభా నటేష్‌ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్‌ని ఇంకాస్త బెటర్‌గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్‌గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్‌కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి!
ఆఫర్.. ఆఫర్.. ఈ పేరు వినిపిస్తే చాలు జనాలు చేతిలో డబ్బులున్నాయా? లేవా? అని కూడా చూసుకోరు. ఆఫర్లో వస్తున్నాయంటూ ఎగబడి మరీ కొనేస్తారు. అలాగే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం ఓ షాపింగ్ స్టోర్ సిద్ధమైంది. మొదట వచ్చిన 100 మంది కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. ఇంకేముంది.. జనాలు షాపు చుట్టూ గుమిగూడారు. వారిని ఆపడం అక్కడి సెక్యూరిటీ వల్ల కూడా కావడం లేదు.కథఇంతలో ఆ షాపు యజమాని కూతురు జెస్సికా (నెల్ వర్లఖ్) తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అక్కడికి వస్తుంది. ఆమె ప్రియుడు కొత్త ఫోన్ తీసుకోవాలంటూ దర్జాగా షాపులోకి వెళ్తాడు. ఇది చూసిన జనాలు ఆగ్రహానికి లోనవుతారు. వారిని ఎందుకు లోనికి వెళ్లనిచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ఇంతలో జనం సునామీలా ముందుకు వచ్చారు. స్టోర్ తలుపు తెరిచేవరకు ఆగకుండా దూసుకొచ్చేయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో బ్లాక్ ఫ్రైడే విషాదంగా మారిపోయింది. సరిగ్గా ఏడాదికి..అయితే దీన్ని హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ లైవ్‌లో వీడియో తీడయంతో అది వైరల్‌గా మారుతుంది. ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ పెట్టాలని షాపు యజమాని డిసైడ్ అవుతాడు. అంతలోనే గతేడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చనిపోతారు. ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అందరూ చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బతికి బట్టకట్టారా? మళ్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరిగాయా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఆ సీన్ హైలైట్సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే బ్లాక్ ఫ్రైడే సేల్స్.. ఎంత విధ్వంసంగా మారిందో చూపించారు. ఆ దారుణాన్ని చూస్తున్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్‌గా ఉంటుంది. తర్వాత విలన్ చేసే హత్యలు కొన్ని కామెడీగా ఉంటే, మరికొన్ని సీరియస్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌లో అదుర్స్ అని చెప్పుకునేలా ఏ సన్నివేశమూ ఉండదు. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ఉత్సుకత మాత్రం మనలో కలగక మానదు.ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ఎలి రోత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాట్రిక్ డింప్సే, జీనా జెర్షన్, టై ఒల్సన్, నెల్ వెర్లాక్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎలి రోత్‌తో పాటు జెఫ్ రెండల్ డైలాగ్స్ రాశాడు. జనాలకు షాపింగ్, ఆఫర్స్ మీద ఉన్న పిచ్చిని.. అలాగే సోషల్ మీడియాలో వైరలవ్వాలన్న తాపత్రయాన్ని సినిమాలో సెటైరికల్‌గా చూపించారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు. మిస్టరీ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు -
సారంగదరియా సినిమా రివ్యూ
టైటిల్: ‘సారంగదరియా’నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులునిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లిదర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభువిడుదల తేది: జూలై 11, 2024కథమిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది. అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు. ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.విశ్లేషణకృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.నటీనటులుకృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి. -
సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని సినీప్రేక్షకులు ఉండరు. అలాంటివారి కోసం ఏ యేటికాయేడు కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో చాలా చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడతాయి. మరికొన్ని మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా అవార్డులు అందుకుంటాయి. అలాంటి చిత్రమే లూ. 2022లో వచ్చిన ఈ సినిమా గతేడాది రీఫ్రేమ్ స్టాంప్ అవార్డు అందుకుంది. మరి లూ మూవీ ఎలా ఉందో చూసేద్దాం..లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు తన బ్యాంక్‌లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. అలాగే పెంపుడు కుక్కకు కొన్ని వారాలపాటు అవసరమయ్యే మాంసాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? తనను కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!లూ మహిళ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. భీకరమైన వర్షం రాబోతోంది.. అప్రమత్తంగా ఉండండి అన్న ప్రకటనతో ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే హింటిచ్చాడు డైరెక్టర్ అన్నా ఫోరెస్టర్. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జుర్నీ స్మోలెట్, వీగా రైడ్లీ ఆషా నటన పర్వాలేదు. ప్రీక్లైమాక్స్ బాగుంది. కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే లూ అద్భుతాలు సృష్టించేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారైతే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూసేయొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. -
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా రివ్యూ
కాలేజీ ప్రేమకథా సినిమాలకు ఉండే డిమాండే వేరు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'కలర్ ఫోటో' వరకు చెప్పుకొంటే ఎన్నో మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. అందరూ కొత్తోళ్లే నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? ఏంటనేదే ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)కథేంటి?అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్, జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది. సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ కాదు. 90ల్లో పుట్టి, ఫోన్లు లేని కాలంలో ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలకు అయితే బాగా నచ్చుతుంది. ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లకు అబ్బే అని చెప్పి విసుగు వచ్చేస్తుంది.ఎవరెలా చేశారు?లీడ్ రోల్స్ చేసిన ప్రణవ్, శాగ్నశ్రీ.. ఇద్దరూ భలే క్యూట్‌గా చేశారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. రైటర్, ఎడిటర్, దర్శకుడు.. ఇలా అన్ని బాధ్యతలు భుజానికెత్తుకున్న శ్రీనాథ్ పులకరం.. ఫీల్ గుడ్ మూవీని అందించాడు. కానీ 'కల్కి' మేనియాలో దీన్ని పట్టించుకుంటారా అనేది సస్పెన్స్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?) -
'నీ దారే నీ కథ' సినిమా రివ్యూ
టైటిల్: నీ దారే నీ కథనటీనటులు : ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్ తదితరులుదర్శకుడు : వంశీ జొన్నలగడ్డరచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డసంగీతం : ఆల్బర్ట్టో గురియోలిబ్యానర్ : జె వి ప్రొడక్షన్స్నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డసినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావుకాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోటఎడిటర్ : విపిన్ సామ్యూల్విడుదల తేదీ: 14 జూన్ 2024ప్రియతమ్ మంతిని, సురేష్, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నీ దారే నీ కథ. అజయ్, పోసాని కృష్ణ మురళి అతిథి పాత్రల్లో నటించగా వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథఅర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి మ్యూజిషియన్‌గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం చేయాలనేది అతని కోరిక. తండ్రి (సురేష్) కూడా సపోర్ట్ చేస్తాడు. హీరో అనుకున్నది సాధించే క్రమంలో అతడి ఫ్రెండ్ తన టీమ్ నుంచి తప్పుకుంటాడు. అప్పుడు తనకు సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. కుమారుడిని మంచి మ్యూజిషియన్ గా చూడాలనుకున్న తండ్రి మధ్యలోనే మరణిస్తాడు. తండ్రి కోరికను అర్జున్ నెరవేర్చాడా? లేదా? అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే!విశ్లేషణవంశీ జొన్నలగడ్డ ఎంచుకున్న కథ కొత్తదేం కాదు. కెరీర్లో తనకు నచ్చిన పని ఎంచుకుని ఆ రంగంలో నిలబడాలనుకునే యువకుడి కథే ఈ సినిమా. తండ్రి కోటీశ్వరుడైనా కుమారుడి ప్యాషన్‌ను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తుంటాడు. అతడు ఎంత పెద్ద ధనవంతుడైనా బంధువుల సూటిపోటి మాటల్ని మాత్రం తప్పించుకోలేని పరిస్థితుల్ని తెర మీద ఆసక్తికరంగా చూపించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కొన్నిసార్లు వాసు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకమానదు. ఈ సినిమాకు ప్రధాన బలమైన బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుతూ ప్రయోగం చేశారు. బీజీఎమ్ కథకు అనుగుణంగా సెట్టయిపోయింది. కొందరు ఆర్టిస్టుల డబ్బింగ్ ఎబ్బెట్టుగా ఉంది. క్లైమాక్స్ ఊహించేట్లుగా ఉంది.ఎవరెలా చేశారంటే?ఈ సినిమాకి నటుడు సురేశ్ పెద్ద ప్లస్ పాయింట్. కుమారుడి కలల్ని సపోర్ట్ చేసే తండ్రి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ప్రియతమ్ కొత్తవాడైనా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. విజయ విక్రాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నవ్విస్తూనే ఎమోషన్ పండించాడు. అజయ్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అంజనా బాలాజీ పర్వాలేదనిపించింది.చదవండి: నన్ను పట్టించుకోలేదు.. అవమానంతో కుంగిపోయా.. రోజూ ఏడ్చేదాన్ని! -
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూసి తీరాల్సిందే. లేదంటే చాలా అంటే చాలా మిస్సవుతారు. పోస్టర్ చూడగానే ఇదేదో పిల్లల మూవీ అనుకుంటారేమో. మొత్తం చూసిన తర్వాత మీ చిన్నారుల్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అంతలా మిమ్మల్ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు! జస్ట్ రూ.45 లక్షల బడ్జెట్‌తో తీశారు. 2018లో రిలీజైన ఈ మూవీలో అంతలా ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది? ఓవరాల్ రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 2 వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'పిహు' సినిమా విషయానికొస్తే.. పిహు (పిహు మైరా విశ్వకర్మ) రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని పడి ఉంటుంది. ఆమె నిద్రపోతోందేమో అని పిహు అనుకుంటుంది. చాలాసార్లు లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పాప వల్ల కాదు. అలానే పిహు చిన్నపిల్ల కావడంతో బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. ఫ్రిడ్జ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఇస్తీ పెట్టె లాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల అన్నింటిని ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సిట్చ్యూయేషన్ నుంచి పిహు ప్రాణాలతో బయటపడిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.సాధారణంగా చిన్నపిల్లల సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయి. 'పిహు' మాత్రం మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు వణికిపోయేలా చేస్తుంది. ఇందులో కొత్తగా ఏం ఉండదు. ఓ పాప, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ లాంటివి ఆన్ చేసేసి ఇవేంటి ఇంత డేంజర్ అనుకునేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలని ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)ఈ మూవీ అంతా అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లోనే షూట్ చేశారు. కానీ చూస్తున్నంతసేపు ఏ మాత్రం బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? పిహుకి ఏం కాదుగా అని మనం టెన్షన్ పడేలా చేస్తుంది. కేవలం గంటన్నరే ఉంటుంది. కానీ మూవీ పూర్తయిన తర్వాత మనల్ని పిహు పాత్ర వెంటాడుతుంది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసి పడేసింది. ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేశారో గానీ మూవీ చూసిన తర్వాత మాత్రం పాప క్యూట్‌నెస్, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతాం.చాలామంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా.. వస్తువులతో ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారు. కానీ అవి ఎంత ప్రమాదం అనేది పిల్లలకు కచ్చితంగా చెప్పాలి బాబోయ్ అని 'పిహు' చూసిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది. ఇప్పటికే మీకు పిల్లలున్నా, త్వరలో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అర్జెంట్‌గా ఈ మూవీ చూడండి. హిందీలో అందుబాటులో ఉంది. వేరే భాష అని కంగారు పడాల్సిందేం లేదు. ఈ మువీలో డైలాగ్స్ కంటే సీన్స్ ఎక్కువ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
'మనమే' సినిమా రివ్యూ
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చాలామందికి ఇష్టమైనవి ఫీల్ గుడ్ మూవీసే. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తుంటాయి. అలాంటి ఓ సినిమా 'మనమే'. శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో? టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విక్రమ్(శర్వానంద్) లండన్‌లో ఉంటాడు. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఇతడికి అనురాగ్ (అదిత్) అనే ఓ ఫ్రెండ్. ఇండియా వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరగడంతో అనురాగ్, అతడి భార్య చనిపోతారు. వీళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని కొన్ని నెలల పాటు చూసుకోవాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)పై పడుతుంది. లండన్‌లో అనురాగ్ ఇంట్లోనే ఉంటూ పిల్లాడిని చూసుకుంటారు. మరి ఖుషిని చూసుకునే క్రమంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ సుభద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి ప్రేమ-బాండింగ్ ఉండాలి? అనేదే 'మనమే' కాన్సెప్ట్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ స్టోరీ అని చెప్పుకొచ్చారు కానీ సినిమాలో ఎమోషన్ అక్కడక్కడే వర్కౌట్ అయింది. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ జాలీగా ఉండే హీరో.. ఫ్రెండ్ చనిపోవడంతో అతడి కొడుకు బాధ్యత చూసుకోవాల్సి రావడం, ఇతడు ఒక్కడే కాకుండా అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన ఓ అమ్మాయి కూడా పిల్లాడ్ని చూసుకోవాల్సి రావడం.. ఇలా సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి వాటితో ఫస్టాప్ ఓ మాదిరిగా ఉంటుంది.సెకండాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎటేటో పోయింది. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏం జరుగుతుందిరా అని చూస్తున్న ప్రేక్షకుడు కాస్త కన్ఫూజ్ అవుతాడు. కానీ చివరకొచ్చేసరికి హీరో-అతడి తల్లిదండ్రుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్, పెద్దగా ట్విస్టులేం లేకుండా క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఏం జరుగుతుందో మనం ఊహించేయొచ్చు. సినిమాలో ఖుషి అనే పిల్లాడిది కీలక పాత్ర. కానీ అతడి క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి తప్పితే చాలావరకు మనం పూర్తిగా ఆ పిల్లాడికి కనెక్ట్ కాలేకపోతాం. సినిమా అంతా రిచ్‌గా చూడటానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషన్ కాస్త మిస్ అయింది. నిడివి రెండున్నర గంటలు.. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ ట్రిమ్ చేసినా పర్లేదు! ఇదే స్టోరీని లండన్‌లో కాకుండా ఇండియాలో ఉన్నట్లు రాసుకున్నా సరే పెద్దగా మార్పులుండవేమో? విలన్ ట్రాక్ అయితే అసలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వదిలేశారో అర్థం కాదు.ఎవరెలా చేశారు?విక్రమ్‌గా చేసిన శర్వానంద్.. తన పాత్రకు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్‌గా కనిపించాడు. సుభద్రగా చేసిన కృతిశెట్టికి ఫెర్ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే.. ఇందులో ఖుషి అనే పిల్లాడిగా చేశాడు. డైలాగ్స్ లాంటివి లేకుండా హావభావాలతోనే దాదాపు సీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లాడితో ఇంకాస్త ప్రాక్టీస్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల మేనేజ్ చేసినట్లు తెలిసిపోతుంది. మిగిలిన యాక్టర్స్ తమకు ఇచ్చిన పనికి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సినిమాని చాలా సాగదీశాడు.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
టైటిల్: ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్నటీనటులు: బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్సన్, డామియన్ మాఫీ, లీ ఎన్స్లిన్ తదితరులుడైరెక్టర్: జోహన్నెస్ రాబర్ట్స్జోనర్: హారర్‌ఓటీటీ: అమెజాన్ ప్రైమ్రన్టైమ్: 1 గంట 25 నిమిషాలుసినీ ప్రేక్షకులు హారర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ జోనర్ చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్లో హారర్ చిత్రాలకే కొదువే లేదు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక నచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌కు ఒళ్లు గగుర్పొడ్చేలా లాంటి సినిమాలు సైతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ది స్ట్రేంజర్స్ ముందువరుసలో ఉంటుంది. అలా 2008లో వచ్చిన చిత్రం ది స్ట్రేంజర్స్. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2018లో ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.కథంటేంటే..బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్సన్ నలుగురు సభ్యులు ఓకే కుటుంబం. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు చంపడాయనికి వచ్చారు? వీరి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా? నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? తెలియాలంటే 'ది స్ట్రేంజర్స్ :ప్రే ఎట్ నైట్' చూడాల్సిందే.కథ విశ్లేషణ..హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యం, భూతం లాంటివే. ఆ జోనర్లో చిత్రాలన్నీ దాదాపు అలాగే ఉంటాయని భావిస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్‌ను అందించాడు. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్‌కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది.ఆ కుటుంబం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వచ్చే వయొలెంట్ సీన్స్ వెన్నులో వణుకు పట్టిస్తాయి. క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఆడియన్స్‌కు కలిగించాడు. ఒకవైపు ప్రాణభయం.. మరోవైపు అంతా చీకటి.. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా చూసేటప్పుడు ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా? అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు రావడం ఖాయం. ఒక రాత్రిని ఓ యుగంలా మార్చిన డైరెక్టర్.. సరికొత్త హారర్ థ్రిల్‌ను అందించాడు. ఇది సీక్వెల్ కావడంతో.. ప్రీక్వెల్ చూసిన వారికి మరింత ఆసక్తిగా ఉంటుంది. చివరగా.. హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలో హారర్ ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ చిత్రాల్లో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కాబట్టి.. సబ్‌టైటిల్స్‌తోనే చూసేయొచ్చు. -
సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శర్మ నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. టికెట్ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది. ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు. అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది. ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు. సినిమాలో వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు.' అని అన్నారు. కాగా.. ఇటీవలే మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కృష్ణచైతన్య స్పష్టం చేశారు. కథ సిద్దమయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పవర్ పేట గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు. -
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్‌తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్‌గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్‌నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్‌ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్‌నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్‌కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్‌ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. -
In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
చాలామందికి టైమ్ అంటే అస్సలు విలువ ఉండదు. ఈ రోజు పని చేయ్ అంటే రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేస్తుంటారు. మరికొందరు మాత్రం రోజుకి 24 గంటలు ఉన్నా సరిపోవట్లేదని బాధపడుతుంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్లకు ఎంత కావాలంటే అంత టైమ్ కొనుక్కునే ఛాన్స్ వస్తే.. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఇదేదో విడ్డూరంగా ఉంది కదా! అవును ఓటీటీలో 'ఇన్ టైమ్' (2011) అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చూశారంటే ఇలాంటి వింతలు బోలెడు కనిపిస్తాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంత బాగుంటుందా?అది 2169 సంవత్సరం. ప్రతి ఒక్కరూ చేతికి డిజిటల్ క్లాక్‌తో పుడతుంటారు. ముసలితనం అనేది రాకుండా జెనెటిక్స్‌లో శాస్త్రవేత్తలు మార్పులు చేసుంటారు. దీంతో ప్రతి ఒక్కరి వయసు 25 ఏళ్ల దగ్గరకొచ్చి ఆగిపోతుంది. బతకాలంటే మాత్రం కష్టపడి టైమ్ సంపాదించుకోవాలి. ఆ టైమ్‌తోనే వస్తువులు కొనుక్కోవాలి, అదే టైమ్‌ని ఎక్కడా పోగొట్టుగోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ చేతికున్న టైమ్ జీరో అయిపోతే మాత్రం నొప్పి లేకుండా చచ్చిపోతారు. అలా మురికివాడలో ఉండే హీరో విల్.. ఇదే టైమ్ కారణంగా ఒక్క సెకనులో తల్లిని కోల్పోతాడు. దీంతో పగ పెంచుకుంటాడు. తనకు ఇలాంటి పరిస్థితి కల్పించిన డబ్బునోళ్లపై పగ తీర్చుకుంటాడు? ఇంతకీ ఏం చేశాడు? వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది.. ఓటీటీలో ఈ మలయాళ థ్రిల్లర్ చూశారా?)2011లో రిలీజైన హాలీవుడ్ మూవీ 'ఇన్ టైమ్'. బతకాలంటే టైమ్ కొనుక్కోవాలి, ఆ టైమ్‌తోనే ప్రతిదీ చేసుకోవాలి అనే డిఫరెంట్ కాన్సెప్టుతో తీసిన మూవీ ఇది. విల్ అనే కుర్రాడు తల్లితో కలిసి జీవిస్తుంటాడు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని టైమ్ సంపాదిస్తుంటాడు. అలాంటిది ఓ రోజు ఇతడికి ఓ వ్యక్తి 100 సంవత్సరాల్ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంకేముంది తల్లితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చని అనుకుంటాడు. కానీ ఒక్క సెకను లేట్ కావడంతో తన చేతుల్లోనే తల్లి చనిపోతుంది. దీంతో వేల సంవత్సరాలు దగ్గర పెట్టుకుని దర్జాగా బతికేస్తున్న డబ్బున్నోళ్లపై హీరో పగ పెంచుకుంటాడు.వాళ్ల చోటుకే వెళ్లి వీస్ అనే ధనవంతుడు కూతురిని కిడ్నాప్ చేస్తాడు. ఇతడి ఆలోచనలకు ఫిదా అయిన ఆ అమ్మాయి.. హీరో విల్‌తో కలిసి టైమ్ దొంగిలించడం మొదలుపెడుతుంది. అలా సొంతం చేసుకున్న టైమ్‌ని వీళ్లిద్దరూ కలిసి పేదలకు పంచుతారు. ఇలా కథ సింపుల్‌గా చెప్పాను గానీ సినిమా చూస్తుంటే మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం బోర్ కొట్టకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఎంటర్టైన్ చేస్తుంది. మనుషులకు టైమ్ విలువ తెలిస్తే అది వృథా కాకుండా కాపాడుకోవడానికి ఎంత విలువ ఇస్తారో తెలియజేసే 'ఇన్ టైమ్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 'టైమ్' ఉంటే దీనిపై ఓ లుక్కేయండి. మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'దర్శిని' సినిమా రివ్యూ
వికాస్, శాంతిప్రియ జంటగా నటించిన సినిమా 'దర్శిని'. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించగా, ఎల్వీ సూర్యం నిర్మాత వ్యవహరించారు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి ఔటింగ్ కోసం సైంటిస్ట్ డాక్టర్ దర్శిని ఫామ్ హౌస్‌కి వెళ్తారు. అనుకోకుండా ఓ గదిలో సెన్సార్ ఉన్న పెన్ దొరుకుతుంది. దాని బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్‌పై భవిష్యత్ చూపిస్తుంది. మరోవైపు అదే ఫామ్ హౌస్‌లో దర్శిని శవంలా కనిపిస్తుంది. ఇకపోతే ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని ఇక్కడికి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? అనేదే సినిమా స్టోరీ.(ఇదీ చదవండి: స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)ఎలా ఉందంటే?టైమ్ ట్రావెల్ కథలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. అలా భవిష్యత్ చూపించే మెషీన్ అనే కాన్సెప్ట్‌తో స్టోరీ బాగానే అనుకున్నారు. కానీ కథనం మాత్రం కాస్త సాగదీశారు. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముగ్గురు ఫ్రెండ్స్‌ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే తక్కువ పాత్రలతో దాదాపు ఒకే ఇంట్లో సినిమా అంతా తీశారు. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు!ఎవరెలా చేశారు?'దర్శిని'లో చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ప్రధాన పాత్రల్లో చేసిన వికాస్, శాంతి ప్రియ పర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్ పాత్ర చేసిన సత్య నవ్వించగా, మిగిలిన వాళ్లు ఫరిది మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. పాటలు ఓకే. దర్శకత్వం కూడా చాలా మెరుగుపరుచుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఈ వారం థియేటర్లలోకి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం' చిత్రాలు ఉన్నంతలో కాస్త అంచనాలతో రిలీజయ్యాయి. వీటితోపాటు వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ'. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్. రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి తీశారు. ఇంతకీ మూవీ ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మత విద్వేషాలు రగిలే రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వస్తాడు. ఇతడి దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్ని రెహమాన్ కాపాడతాడు. అనంతరం కబీర్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు. కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల రెహమాన్‌పై కబీర్ దాడి చేస్తాు. అసలు దీనికి కారణమేంటి? శ్రీరామ్, కబీర్ గతమేంటి? మతం పేరుతో ఈ ఇద్దరు.. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? చివరకి ఏమైందనేదే సినిమా.(ఇదీ చదవండి: ‘శబరి’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేసే మూవీ ఇది. హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు. ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన సందేహాలకు సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.హీరోగా రాజ్ భీమ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్లు బాగానే తీశారు. హీరోయిన్ జరా ఖాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్ ఖాన్‌గా ముక్తార్ ఖాన్ ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం ఇలా అందరూ తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.(ఇదీ చదవండి: సుహాస్ 'ప్రసన్న వదనం' రివ్యూ.. మరో హిట్ పడినట్టేనా?) -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్‌లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్‌లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసేయొచ్చు. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం.(ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ.కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది!(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది.లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి.(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ
టైటిల్: కలియుగం పట్టణంలో నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్, దేవీ ప్రసాద్, రూప లక్ష్మీ నిర్మాణ సంస్థ:నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ రచన-దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి సంగీతం: అజయ్ సినిమాటోగ్రఫీ: చరణ్ విడుదల తేది: మార్చి 29, 2024 కథేంటంటే.. నంద్యాలకు చెందిన మోహన్(దేవీ ప్రసాద్), కల్పన(రూప లక్ష్మీ) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. పేర్లు విజయ్(విశ్వ కార్తికేయ), సాగర్(విశ్వ కార్తికేయ). వీరిద్దరిలో సాగర్‌కి చిన్నప్పటి నుంచే ఓ సైకాలజీకల్ ప్రాబ్లం ఉంటుంది. రక్త చూసి ఆనందపడుతుంటాడు. తన సైకో ప్రవర్తన చూసి భయపడిపోయిన మోహన్..అతన్ని మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తాడు. విజయ్ మాత్రం చక్కగా చదువుకుంటుంటాడు. కాలేజీలో శ్రావణి(ఆయుషి పటేల్) అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయాన్ని మూడేళ్ల పాటుగా విజయ్‌తో చెప్పలేకపోతుంది. మరోవైపు నంద్యాలలో వరుస హత్యలతో పాటు ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేని ఘోరాలు జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్నదెవరో కనిపెట్టేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) నంద్యాలకు వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను చంపుతున్నదెవరు? హత్యలతో పాటు అక్కడ జరుగుతున్న మరో ఘోరం ఏంటి? సాగర్, విజయ్‌లలో ఎవరు మంచి వారు? నంద్యాలలో జరిగే ఘోరాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు నంద్యాల క్రైంకి ఎలా చెక్ పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు.ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది. ఇదే విషయాన్ని ‘కలియుగం పట్టణంలో’ చూపించాడు దర్శకుడు రమాకాంత్ రెడ్డి. దర్శకుడు ఓ మంచి పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు ఆసక్తికరమైన కథను అల్లుకున్నాడు. ప్రతీ ఒక్క పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ తెరపై తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సంబంధం సీన్లను చూపిస్తూ.. ఫస్టాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతోనే సాగించాడు. నిజంగా నంద్యాలలో ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకుడికి కూడా ఫస్టాఫ్‌లో తెలియదు. ప్రతి పాత్రపై అనుమానం కలిగిస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తికలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లోని ప్రశ్నలన్నింటికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ప్లేను ఇంకాస్త బలంగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ చక్కగా నటించాడు. రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఆయుషి పటేల్ కి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారిణిగా చిత్రా శుక్లా తొలిసారి డిఫరెంట్ రోల్ ప్లే చేసి ఆకట్టుకుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది. -
Tantra Review: 'తంత్ర' సినిమా రివ్యూ
ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే? హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది. 'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్‌తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్‌గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు. ఎవరెలా చేశారు? రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్‌లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్‌పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది. -
ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన సినిమా 'ప్రేమలు'. గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత) Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!! — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024 -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్‌పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్‌గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్‌లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్‌కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్‌గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'వీ లవ్ బ్యాడ్ బాయ్స్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: వీ లవ్ బ్యాడ్ బాయ్స్ నటీనటులు: బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ తదితరులు నిర్మాణసంస్థ: బీఎం క్రియేషన్స్ నిర్మాత: పప్పుల కనకదుర్గా రావు దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్ మంచి ఎమోషన్స్‌తో అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన చిత్రం 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్'. ఈ చిత్రం నేటి యువత, ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాను ఎమోషనల్‌గా మలిచినా కూడా మన మూలాల్ని చూపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు, యువత తప్పకుండా చూడదగ్గ చిత్రంగా థియేటర్లోకి వచ్చింది. బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీ రోల్స్ పోషించారు. బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ చిత్రానికి రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అసలు కథేంటంటే.. ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్మేట్స్ పైగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. దీంతో వారి తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారు ఇష్టపడ్డ వారితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రశాంత్, వినయ్ వారిని వివాహం చేసుకోవడానికి విస్మరిస్తారు. ప్రశాంత్, వినయ్ పెళ్లిని ఎందుకు నిరాకరించారు? అసలు ఈ జంటల మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. నేటి యువతకు సరిపోయేలా ఈ సినిమాను దర్శకుడు ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా.. ఎంతో వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఇటు యూత్‌కి.. అటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్స్,వేశ్య సన్నివేశం, అలీ ఎపిసోడ్లు, క్లైమాక్స్ ఎపిసోడ్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు రాజు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించారు. ఇది రొటీన్ సినిమా కాబట్టి ఓవరాల్‌గా బాగుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే.. అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుత యువత ఈ పాత్రలలో బాగా కనెక్ట్ అవుతారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపించారు. పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి, శివారెడ్డి తమ పరిధిలో ఆకట్టుకున్నారు. సాంకేతికత విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజ్ చేస్తుంది. లొకేషన్స్, విజువల్స్ అందంగా కనిపిస్తాయి. అయితే ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు జంటగా నటించిన సినిమా 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్'. లక్ష్మణ్ వర్మ దర్శకుడు. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చిన ఓ డబ్బున్న కుర్రాడు. కరోనా టైంలో స్వదేశానికి వస్తాడు. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న తమ విల్లాలో కొడుకుని ఉండమని తండ్రి (రవి వర్మ) చెబుతాడు. దీంతో కార్తీక్... తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి విల్లాలో ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆర్నెళ్లకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఇంతలో ప్లంబర్ సోంబాబు(డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి, విల్లాలో బంధించి అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంతకీ సోంబాబు ఎందుకలా చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'బాబు నం.1 బుల్ షిట్ గాయ్' మూవీ యాక్షన్ కామెడీ డ్రామా స్టోరీతో తీశారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి... అదే బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు కథే ఈ సినిమా. కిడ్నాపర్‌కి కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) కోట్ల విలువ చేసేవి ఎదురుగానే ఉన్నా తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్‌గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం బాగుంది. ఫస్టాప్‌లో కామెడీ ట్రాక్‌తో మొదలై, సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేశారు. సెకెండాఫ్‌లో కొంత ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ తదితర అంశాలతో ఆకట్టుకున్నారు. ఎవరెలా చేశారు? అర్జున్ కల్యాణ్, కుషిత జంట బాగుంది. అర్జున్ ఉన్నంతలో బాగానే చేశాడు. హీరోయిన్ కుషిత క్యూట్ ఫెర్ఫార్మెన్తో అలరించింది. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరోకి సమంగా ఉండే పాత్రలో కనిపించారు. ఇతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి చేసింది. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సంగీతం ఓకే. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
'గామి' సినిమా రివ్యూ
టైటిల్: గామి నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు నిర్మాతలు: కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని రచన-దర్శకత్వం: విద్యాధర్ కాగితాల సంగీతం: నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం విడుదల తేదీ: 2024 మార్చి 8 నిడివి: 2h 26m ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న తెలుగు సినిమాగా 'గామి' వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాకయ్యారు. అంచనాలు పెరిగపోయాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు శివరాత్రి కానుకగా 'గామి' థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలకు మించి హిట్ కొట్టిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 'గామి' కథేంటి? శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? తెలియాలంటే 'గామి' చూడాల్సిందే. ఎలా ఉందంటే? 'గామి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు 'గామి'.. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్‌కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓ వైపు క్యూరియాసిటీ.. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఓవైపు నుంచి ఉంటుంది. అయితే ఏదో కావాలని పెట్టినట్లు ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్‌తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్‌లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటు ఉంటుంది. చూస్తుంటే టెన్షన్‌తో సచ్చిపోతాం. చివర్లో సింహాం ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా తీసుండాల్సింది. ఇకపోతే శంకర్‌కి అతడి ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రిఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి శివభక్తులని ఆకట్టుకుంటాయి. అయితే శంకర్ ఫ్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా.. దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో అఘోరా శంకర్‌గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్‌లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడి హీరో కాదు కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్‌కి ఫెర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా తీశాడా అంటే నమ్మలేం. ఇతడి తర్వాత సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్, ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో.. సంగీతం అంతకు మించి ప్లస్ అయింది. స్వీకర్ అగస్తీ పాటలు.. నరేశ్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'గామి' ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లండి. మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'ప్రేమలు' సినిమా రివ్యూ
సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. వచ్చిన వాటిలో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి గానీ మరీ అంత హిట్ కాలేదు. మరోవైపు మలయాళంలో రీసెంట్గా వరసపెట్టి మూవీస్ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందులో ఒకటే 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మలయాళ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. కథేంటి? సచిన్(నస్లేన్) ఇంజనీరింగ్ పూర్తిచేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది ప్లాన్. వీసా రిజెక్ట్ అవ్వడంతో, ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్(GATE) కోచింగ్ కోసం హైదరాబాద్‌కి వస్తారు. ఓ పెళ్ళిలో రీను(మమిత బైజు)ని చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమకథ కంచికి చేరిందా? చివరకు ఏమైందనేదే 'ప్రేమలు' స్టోరీ. ఎలా ఉంది? ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును ఈ మూవీలో కథ గిదా ఏం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాప్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి.. అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ లవ్‌లో పడితే ఏమైందనేదే 'ప్రేమలు'. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్టు వుంటది గానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. తెలిసిన కథల్ని, అదీ ప్రేమ కథల్ని చెప్పడం కత్తి మీద సాము. కానీ 'ప్రేమలు' డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్‌తో ఆడియెన్స్‌ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్, రీనూ పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత లేత ప్రేమ.. వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలకు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, ఖజాగుడా లేక్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్‌లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు. తెలుగు డబ్బింగ్‌కి వచ్చేసరికి.. ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్‌బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతీ డైలాగ్‌ని వాడేశారు. వన్ లైనర్స్, పంచ్‌లు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్టు వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథ కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చదు. అలానే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వచ్చే చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. 'ప్రేమలు' మైనస్సుల విషయానికొస్తే.. ఇది యూత్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి స్పేస్ లేదు. తెలుగు వెర్షన్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో ఒకటి రెండు సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్‌తో అయినా సింగిల్‌గా అయినా రెండున్నర గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ 'ప్రేమలు'. ఎవరెలా చేశారు? సచిన్ పాత్రలో నస్లేన్.. చాలా బాగా చేశాడు. అమాయకత్వం, ప్రేమ, బిడియం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ని పండించాడు. రీనుగా చేసిన మమిత అయితే చాలా క్యూట్‌నెస్‌తో తనతో ప్రేమలో పడిపోయేలా చేసింది. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్‌గా చేసిన సంగీత్ ప్రతాప్‌ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరోయిన్ ని ప్రేమిస్తూ, ఆమెతో పాటు కలిసి పనిచేసే ఆది పాత్రలో చేసిన శ్యామ్ మోహన్.. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కామెడీతో కేక పుట్టించాడు. మిగతా వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే ఫస్ట్ డైరెక్టర్ గిరీష్‌ని మెచ్చుకోవాలి. క్యూట్ క్యూట్ ప్రేమకథను అంతే క్యూట్‌గా తీశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే అక్కడే ఉంటాయి. కానీ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ అజ్మల్ సభు.. హైదరాబాద్‌ని రోజూ చూసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత అందంగా చూపించాడు. విష్ణు విజయ్ పాటలు కథలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్లే ఉంది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'ప్రేమలు'.. మీ మనసు దోచే పెర్ఫెక్ట్ సినిమా. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్‌గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్‌లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్‌గా గజానంద్ (ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్‌రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
'రాధా మాధవం' సినిమా రివ్యూ
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా తాజాగా థియేటర్లలో రిలీజైన మూవీ 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మాత. దాసరి ఇస్సాకు దర్శకుడు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో కావాలనే నన్నుఇరికించారు: డైరెక్టర్ క్రిష్) కథేంటి? రాధ (అపర్ణా దేవీ).. మాధవ (వినాయక్ దేశాయ్) పేరు మీద మాధవ కేర్ సెంటర్ పెట్టి, ఈ సంస్థ ద్వారా తాగుడుకి బానిసైన వాళ్లని, అనాథ పిల్లల్ని, వృద్దుల్ని అందరినీ చేరదీస్తుంది. ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) కూడా అక్కడికి దిక్కుదోచని స్థితిలో వచ్చి పడతాడు. చివరకు తన కూతురి దగ్గరకే చేరుకున్నానని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్లాడు? ఈ తండ్రీ కూతుళ్ల మధ్య దూరం ఎందుకొచ్చింది? రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్ ఎందుకు నడుపుతోంది? అనేది మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ప్రేమకు కులాల అడ్డు ఆ తర్వాత పరువు హత్య అనే పాయింట్‌తో పలు సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీకి పీరియడిక్ బ్యాక్‌డ్రాప్ జోడించి తీసిన సినిమా 'రాధా మాధవం'. చిన్నపిల్లల ఎపిసోడ్, మాధవ కేర్ సెంటర్, అక్కడి ఫన్నీ సీన్లతో ఫస్టాప్ అంతా సరదా సరదాగా సాగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రేమకథ పర్వాలేదనిపిస్తుంది. అలా ఇంటర్వెల్ పడుతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ప్రేమ జంట, పగతో రగిలిపోయే పెద్ద మనుషులు సీన్లు బాగానే రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా తీశారు. కులాలపై వేసిన డైలాగ్స్, రాసిన సీన్స్ బాగున్నాయి. పాటలు ఉన్నంతలో పర్వాలేదు. విజువల్స్ ఓకే. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఎవరెలా చేశారు? మాధవ పాత్రలో వినాయక్ దేశాయ్ చక్కగా నటించాడు. గ్రామీణ యువకుడిగా ఉన్నంతలో బాగానే చేశాడు. యాక్షన్, డ్యాన్సుల్లో పర్వాలేదనిపించాడు. రాధగా అపర్ణా దేవీ చక్కగా కుదిరింది. మేక రామకృష్ణ కూడా నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఫరిది మేరకు నటించారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా) -
'ముఖ్య గమనిక' సినిమా రివ్యూ
అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ హీరోగా నటించిన సినిమా 'ముఖ్య గమనిక'. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఓ మాదిరి అంచనాలు పెంచిన ఈ చిత్రం..తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. తండ్రిని ఎవరో హత్య చేయడంతో ఆ ఉద్యోగం విరాన్‌కి వస్తుంది. అయితే విరాన్ తండ్రితో పాటు చాలామంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది స్టోరీ. ఎలా ఉందంటే? దర్శకుడు వేణు మురళీధర్ తీసుకున్న కథ, కథనం బాగానే ఉంది. కానీ అనుకున్న స్టోరీని తెరపైకి తీసుకురావడంలో కాస్త తడబడ్డారు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. రెండు డిఫరెంట్ క్రైమ్ ఎలిమెంట్స్‌ని ఒకే స్టోరీలో చెప్పి మెప్పించారు. కాకపోతే సగటు ప్రేక్షకుడు ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తాడనేది చూడాలి. ఎవరెలా చేశారంటే? హీరో విరాన్ ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. నటుడిగా ఇంప్రూవ్ కావాలి. హీరోయిన్ లావణ్య తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు, అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి బాగా నటించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా వుండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. -
'హ్యాపీ ఎండింగ్' సినిమా రివ్యూ
టైటిల్: హ్యాపీ ఎండింగ్ నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, ఝాన్సీ తదితరులు నిర్మాత: సంజయ్ రెడ్డి, యోగేశ్ కుమార్ పూరి, అనిల్ పల్లల దర్శకుడు: కౌశిక్ భీమిడి సంగీతం: రవి నిడమర్తి సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి విడుదల తేదీ: 2024 ఫిబ్రవరి 2 కథేంటి? స్కూల్ చదువుకునే టైంలో హర్ష్(యష్ పూరి).. ఫ్రెండ్ చెప్పడంతో ఓ రోజు శృంగారభరిత సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్తాడు. అదే మూవీ చూడటానికి రధేశ్వర్ స్వామిజీ(అజయ్ ఘోష్) రహస్యంగా వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హర్ష్ వల్ల స్వామిజీని థియేటర్లలో అందరూ గుర్తుపట్టేస్తారు. ఆయన పరువు పోతుంది. కోపోద్రిక్తుడైన స్వామిజీ, హర్ష్‌ని శపిస్తాడు. దీని వల్ల హర్ష్ ఏ అమ్మాయిని తలుచుకుంటే వాళ్లందరూ చనిపోతుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత హర్ష్.. అవని(అపూర్వ రావు)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి హర్ష్‌కి శాప విమోచం కలిగిందా? భార్యతో ఒక్కటయ్యాడా? అనేదే 'హ్యాపీ ఎండింగ్' స్టోరీ. ఎలా ఉందంటే? 'హ్యాపీ ఎండింగ్' సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే.. చిన్నప్పుడే హీరోకి శాపం, నిగ్రహం కోల్పోయి ఎవరినైతే ఊహించుకుంటాడో వాళ్లు చనిపోవడం, చివరకు దీన్ని జయించాడా? లేదా అనేది క్లైమాక్స్. వినడానికి స్టోరీ లైన్ కాస్త డిఫరెంట్‌గా ఉంది కదా! కానీ సినిమా మాత్రం ఓకే ఓకే అనేలా సాగుతుంది. హీరో చిన్నప్పటి పాత్రని పరిచయం చేస్తూ నేరుగా సినిమాని మొదలుపెట్టేశారు. మనోడికి ఉన్న ఆత్రం, ఫ్రెండ్ చెప్పడంతో స్కూల్ ఎగ్గొట్టి మరీ ఓ సెమీ పోర్న్ మూవీకి వెళ్లడం.. ఈ పిల్లాడి వల్ల అక్కడికి వచ్చిన ఓ స్వామిజీని హాల్లోని అందరూ గుర్తుపట్టేయడం.. కోపమొచ్చిన స్వామిజీ, హీరోని శపించేయడం.. ఇలా సినిమా ప్లాట్ ఏంటనేది మూవీ ప్రారంభమైన కాసేపట్లోనే చెప్పేశారు. అయితే స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ తీయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. హీరోకి ఉన్న శాపాన్ని బట్టి ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు. కానీ అలా కాకుండా చాలా సీరియస్ టోన్‌లో సాగుతూ ఉంటుంది. అలానే సీన్లు కూడా ఓ ఫ్లోలో కాకుండా సడన్‌గా వస్తుంటాయి. మళ్లీ కట్ అయిపోతుంటాయి. ఫస్టాప్, సెకండాఫ్.. రెండు కూడా సాగదీసి వదిలేశారు. ఇదే సినిమాని సింపుల్‌గా కూడా చెప్పొచ్చు. కానీ రెండున్నర గంటల పాటు తీసి విసుగు తెప్పించారు. అలానే ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా ఏ సీన్ కూడా ఎగ్జైట్ చేయదు. ఎవరెలా చేశారు? హీరోగా చేసిన యష్ పూరికి రెండు మూడు సినిమాల అనుభవముంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఉన్నంతలో సెటిల్డ్‌గా చేశాడు. డైలాగ్స్ కూడా చాలా నెమ్మదిగా చెబుతుంటాడు. ఆయన పాత్ర తీరు అంతేనా? లేదంటే అలా యాక్ట్ చేశాడా అనేది అర్థం కాదు. హీరోయిన్గా చేసిన కొత్తమ్మాయి అపూర్వ రావు కూడా ఓకే ఓకే అనిపించింది. అజయ్ ఘోష్, ఝాన్సీ లాంటి అనుభవజ్ఞులైన యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లని సరిగా వినియోగించుకోలేకపోయారు అనిపించింది. మిగతా వాళ్లు పర్వాలేదనిపింంచారు. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ కౌశిక్ భీమిడి.. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. వాటిని క్రిస్ప్ చేసుంటే సినిమా నిడివి తగ్గి, కాస్త ఆసక్తిగా ఉండేది. ఓవరాల్‌గా చూసుకుంటే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. ఎంటర్టైన్ చేసే విషయంలో చాలా తడబడ్డారు. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ
టైటిల్: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్ నిర్మాత: ధీరజ్మొగిలినేని దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్ విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది. అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు. మల్లీకి ఆ ఊరిపెద్ద, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకట బాబు(నితిన్ ప్రసన్న) చెల్లెలు లక్ష్మీ(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. లక్ష్మీకి కూడా మల్లీని ఇష్టపడుతుంది. వీరిద్దరు సెలూన్ షాప్‌నే అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటారు. మరోవైపు వెంకట బాబు, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది. పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తుంది. ఓ సారి వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్), మధ్య మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ శ్రీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మల్లీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్‌కి తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్. ఈ విషయం మల్లీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు? పోలీసు స్టేషన్‌కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం కోసం పద్మ ఏం చేసింది? మల్లీకి వెంకట్ ఎందుకు గుండు గీశాడు? అక్క కోసం మల్లీ చేసిన పోరాటం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా..కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి.. ఎమోషనల్‌గా ముగించాడు. తక్కువ కులానికి చెందిన హీరో..పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే లవ్‌స్టోరీ కొత్తగా అనిపించదు కానీ.. వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరూ ప్రతి మంగళవారం సెలూన్ షాపులో కలుసుకోవడం.. ఫోన్లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్(జగదీష్) వేసే పంచులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవికానికి దూరంగా అనిపిస్తాయి. ‘ఆధారం లేని ఆక్రమణ సంబంధం ..అవమాన పడ్డ ఆత్మాభిమానం’ అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీసు స్టేషన్ సీన్ అయితే అదిరిపోతుంది. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లోనూ అదే చేశాడు. మల్లీగాడు పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. లవర్‌గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నీవేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇన్నాళ్లు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో డిఫరెంట్ పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్లు పద్మ పాత్రను మరిచిపోలేరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్స్‌లో విజిల్స్ పడడం గ్యారెంటీ. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లక్ష్మీగా శివానీ నాగారం తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్‌గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు. పుష్ప ఫేమ్ జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్టయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ
చిత్రం: బిఫోర్ మ్యారేజ్ విడుదల: జనవరి 26 నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ... గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి, మ్యూజిక్: పీఆర్ డీవోపీ: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి ఎడిటింగ్: అలోష్యాస్ క్సవెర్ పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్ పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల యువతను ఆకర్షించే కథ, దానికి తోడు ఓ మెసెజ్ ఇస్తే సినిమాను బ్రహ్మండంగా హిట్ చేస్తారు ప్రేక్షకులు. సరిగ్గా అలాంటి సబ్జెక్టుతో వచ్చిన మూవీ 'బీఫోర్ మ్యారేజ్'. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథేంటి ధరణి (నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. పెళ్ళి కాకుండానే తల్లి అవుతుందటంతో ఆమె జీవితం తలక్రిందులు అవుతుంది. దీంతో సామాజిక ఒత్తిడికి లోనవుతుంది. జీవితం తలక్రిందులైనట్టు మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా? అలాంటి పరిస్థితిని ఎలా ఈ యువతి అధిగమిస్తుందనేదే ఈ సినిమా కథ. నటీనటులు ప్రధాన పాత్రలో నటించిన నవీన రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ తరం అమ్మాయిల ఆలోచన దోరణి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే చేసి చూపించింది. మెయిన్ లీడ్ పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పవచ్చు. అలాగే హీరో భారత్ ఆకాష్ పాత్రలో తన యాక్టింగ్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్కగా, చలాకీగా కనిపించాడు. ఇక అపూర్వ తన పాత్ర తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇతర పాత్రలు తమ పరిది మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ చేసిన పాటలు బాగున్నాయి. సింగర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 'ఇదేమి జిందగీ. రొటీన్‌గా ఉన్నది.." పాట బాగుంది. ఇక నాచురల్‌గా విజువల్స్ కనిపించేలా షూట్ చేసిన డీవోపీ రాజశేఖర్ రెడ్డి పనితీరు బాగుంది. అలోష్యాస్ క్సవెర్ ఎడిటింగ్ సరిగ్గా కుదిరిందని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. స్క్రీన్ అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. విశ్లేషణ చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్రయూనిట్ ముందే ప్రకటించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలే ఈ సినిమాలో సన్నివేశాలుగా కనిపిస్తాయి. దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న కథకు తగినట్టే తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పెళ్లికి ముందు తప్పు అనిపించని ఓ పొరపాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుందని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువతకు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. యువత థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని తప్పకుండా చెప్పొచ్చు. -
Premalo Movie Review: 'ప్రేమలో' సినిమా రివ్యూ
చిత్రం: ప్రేమలో నిర్మాణ సంస్థ: డ్రీమ్ జోన్ పిక్చర్స్ నటీనటులు: చందు కోడూరి, చరిష్మా శ్రీకర్, శివాజీ రాజా తదితరులు దర్శకుడు: చందు కోడూరి నిర్మాత: రాజేష్ కోడూరి సంగీతం: సందీప్ కనుగుల ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్ చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో ఇప్పుడు చూద్దాం. 'ప్రేమలో' కథేంటి? రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి (చందూ కోడూరి) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి(శివాజీ రాజా) ఉన్నాసరే రవిని పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయింటాడు. మెడికల్ షాప్‌లో పనిచేసే రవి.. ఎప్పటికైనా ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలనేది మనోడి డ్రీమ్. అనుకోకుండా ప్రశాంతి(చరిష్మా)ని చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. మూగదైన ప్రశాంతి.. ఇష్టపడుతున్నానని రవి చెప్పేసరికి ఇతడిని ప్రేమిస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రశాంతి.. ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రవి తనని రేప్ చేస్తున్న వీడియోనే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ప్రాణంగా ప్రేమించిన రవి.. ఎందుకు ఆమెపై బలత్కారం చేశాడు? అసలేం జరిగింది? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?) ఎలా ఉందంటే? తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. మొదలుపెట్టడమే ఓ వ్యక్తి మీద ఎటాక్ చేయడం చూపించి సినిమాని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని హీరో ఎందుకు ఛేజ్ చేస్తున్నాడనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకువెళ్లారు. ఫస్టాప్‌లో హీరో క్యారెక్టర్, స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.సెకండాఫ్‌లో అసలు కథేంటనేది రివీల్ చేశారు. నిజానికి ఇది కొత్త కథేం కాదు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతాం అని డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో.. ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు. రొటీన్ కథ, ఊహకు అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) ఎవరెలా చేశారు? హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి.. అయితే ఈయనలోని దర్శకుడిని నటుడు కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడి పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి.. డైలాగ్స్ లేని పాత్రలో కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిథి పాత్ర లాంటిదే. కానీ ఉన్నంతవరకు ఎమోషన్స్ పండించాడు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ సరిగా సరిపోయింది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ) -
'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'నెరు' కథేంటి? సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్.. ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్‌గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మల్ని విజిల్ వేసేలా చేస్తాయి. ఎవరెవరు ఎలా చేశారు? ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్‌గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్‌గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
గుంటూరు కారం మూవీ పబ్లిక్ టాక్
-
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్‌తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్‌ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Hanuman Movie: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. గూస్బంప్స్ ఖాయం!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్) ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. #OneWordReview...#HanuMan: FASCINATING. Rating: ⭐️⭐️⭐️½ Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd — taran adarsh (@taran_adarsh) January 11, 2024 -
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
1134 మూవీ రివ్యూ .. ఎలా ఉందంటే?
టైటిల్: 1134 నటీనటులు: కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ తదితరులు దర్శకత్వం: శరత్ చంద్ర తడిమేటి నిర్మాణ సంస్థ: శాన్వీ మీడియా నిర్మాత: : శరత్ చంద్ర తడిమేటి సహ నిర్మాత: భరత్ కుమార్ పాలకుర్తి సంగీతం: శ్రీ మురళీ కార్తికేయ సినిమాటోగ్రఫీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి విడుదల తేదీ: జనవరి 5,2024 న్యూ ఏజ్ మేకర్లు తెరపై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. చిన్న చిన్న కాన్సెప్ట్‌లు తీసుకుని సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నారు. ఇలాంటి ఓ క్రమంలోనే నో బడ్జెట్ అంటూ అందరూ తలా ఓ చేయి వేసుకుని చేసిన చిత్రమే 1134. టీజర్, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడంతో సినిమా మీద బజ్ ఏర్పడింది. జనవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. 1134 అనే కథ ఓ ముగ్గురి మధ్య జరుగుతుంది. లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే మూడు పాత్రల మధ్య సాగుతుంది. ఈ ముగ్గుర్ని కిడ్పాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఏటీఎం వద్ద ఉండే కెమెరాలు హ్యాక్ చేయడం, బస్ స్టాప్‌లో వద్ద కనిపించే బ్యాగులను దొంగతనం చేయడం, ఏటీఎంలో ఇల్లీగల్‌గా డబ్బులు తీయడం ఇలాంటి చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ఉండే ఆ ముగ్గురికి ఉన్న లింక్ ఏంటి? ఈ ముగ్గురు అసలు ఆ పనులు ఎందుకు చేస్తుంటారు? ఈ ముగ్గురిని కలిపి ఆ క్రైమ్ స్టోరీ ఏంటి? ఈ కథలో 1134 అంటే ఏంటి? చివరకు ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, రాబరి, మిస్టరీ, సస్పెన్స్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ ప్రయోగమే చేశాడు నూతన దర్శకుడు శరత్. తాను ఎంచుకున్న పాయింట్ నుంచి ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా తీశాడు. అనుకున్నది అనుకున్నట్టుగా తీసినట్టు కనిపిస్తుంది. మూడు పాత్రల పరిచయం, వాటి తాలుకూ ఫ్లాష్ బ్యాక్, వారి వారి నేపథ్యాలు చూపిస్తూ ఫస్ట్ హాఫ్‌ను అలా తీసుకెళ్లాడు. ఇంటర్వెల్‌కు ముందు అదిరిపోయేలా ట్విస్ట్ ఇచ్చి ఫస్ట్ హాఫ్‌ను ముగించాడు. సెకండాఫ్‌కు వచ్చే సరికి చిక్కుముడులన్నీ విప్పినట్టుగా ఉంటాయి. ఆ ముగ్గురి వెనుకున్నది ఎవరు? ఆ క్రైమ్స్‌ను చేయిస్తున్నది ఎవరు? దీని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా సెకండాఫ్ కొనసాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే సరికి కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా ప్రేక్షకుడ్ని థ్రిల్ చేయడంలో మాత్రం 1134 డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. కొత్త వాళ్లతో సినిమాను చేయడం పెద్ద సాహసమే. కొత్త వాళ్లందరూ కలిసి సినిమా చేయడం మరింత సాహసం. కొత్త వాళ్లైనా కూడా అందరూ చక్కగా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. కృష్ణగా (కృష్ణ మదుపు), ఎరిక్‌గా (గంగాధర్ రెడ్డి), హర్షగా (ఫణి భార్గవ్), లక్ష్మణ్‌గా (ఫణి శర్మ) ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. టెక్నికల్‌గా కెమెరా వర్క్, ఆర్ఆర్ బాగున్నాయి. ఎడిటింగ్ ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. శాన్వీ మీడియా, నిర్మాత భరత్ కుమార్ పాలకుర్తి ప్యాషన్ తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. -
Umapathi Movie Review: అవికా గోర్ నటించిన 'ఉమాపతి' సినిమా రివ్యూ
విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రేమ కథలకు ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ అందిస్తుంటారు. అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే 'ఉమాపతి'. ఇందులో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? ఉమాపతి కథ దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్య జరుగుతుంది. వర (అనురాగ్) కొత్తపల్లికి చెందిన వాడు. ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. దుబాయ్‌లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే.. ఇక్కడ ఆ వర జల్సాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వర.. పక్క ఊరైన దోసకాయపల్లిలో ఉమా (అవికా గోర్)ను ఇష్టపడుతుంటాడు. కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. పైగా ఉమా సోదరుడికి, వరకు పాత గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి ఈ తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెబుతాడు? అసలు వీరిద్దరూ ప్రేమలో పడతారా? పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు? ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలు ఏంటి? చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఎలా ఉంది? ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్, అవికా గోర్ మధ్యే సాగుతుంది. అనురాగ్ తెరపై తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే.. తన అల్లరితో, తన నటనతో అందరినీ కట్టి పడేసింది. వీరిద్దరి జోడికి ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇక మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు సింపుల్ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. ఇలాంటి స్టోరీలు ఇది వరకు ఎన్నో సార్లు మనం చూసినా కూడా ఉమాపతి కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలు, ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురించే సన్నివేశాలు.. ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్‌ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇంట్రవెల్‌కు చిన్న పాటి జర్క్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు పాయింట్ బయటకు వస్తుంది. రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ గొడవకు ఈ ప్రేమ కథకు ఎలా ముడి పెట్టారు.. ఆ సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. చివరకు తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపులానే సినిమా కూడా ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే.. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు, ఆర్ఆర్ ప్లస్ అవుతాయి. ఆహ్లాదకరమైన సంగీతం ఉంటుంది. సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. -
Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ
టైటిల్: బబుల్ గమ్ నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: రవికాంత్ పేరేపు మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29 నిడివి: 2h 27m సుమ పేరు చెప్పగానే గలగలా మాట్లాడే యంకర్ గుర్తొస్తుంది. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి హోస్టింగ్ చేసింది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసింది. 'బబుల్ గమ్' పేరుతో తీసిన సినిమా సుమ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. తాజాగా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? హిట్టు కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? ఆది(రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలనేది గోల్. ఓరోజు పబ్‌లో అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూస్తాడు. నచ్చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అయిపోతుంటాడు. మరోవైపు జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్-రిలేషన్స్ అంటే పెద్దగా పడవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే 'బబుల్ గమ్' స్టోరీ. ఎలా ఉంది? ఓ అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. ముద్దులు, హగ్గులు.. కొన్నాళ్లకు గొడవలు.. ఇలా లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. అయితే సినిమా ఎలా తీసినా సరే ఫైనల్‌గా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో 'బబుల్ గమ్' పాసైపోయింది. యాంకర్ సుమ కొడుకు.. ఈ సినిమాలో హీరో కావడంతో చాలామంది దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ వచ్చినప్పుడే ఇది యూత్‌కి నచ్చే, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ సినిమా అని అర్థమైపోయింది. ఫస్టాప్ విషయానికొస్తే.. కేవలం చెడ్డీతో బైక్‌పై హీరో అరుస్తూ, ఏడుస్తూ హైదరాబాద్ రోడ్‌పై వెళ్లే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి కథ ఆరు నెలల వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆదిత్య(రోషన్ కనకాల) ఎంట్రీ.. ఓ డీజే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనడం. ఎప్పుడూ తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి.. ఓ ఇద్దరు ఫ్రెండ్స్.. అనుకోకుండా ఓసారి జాన్వీ(మానస చౌదరి)ని చూడటం, ఆమెతో అనుకోని విధంగా ప్రేమలో పడటం.. ఇలా పెద్దగా మెరుపుల్లేకుండానే ఫస్టాప్ అలా అలా వెళ్లిపోతుంది. ఓ డిఫరెంట్ సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే అసలు కథంతా సెకండాఫ్‌లోనే చూపిస్తారు. అప్పటివరకు ప్రేమకథగా ఉన్నది కాస్త రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్టాప్ అంతా సరదసరదాగా ఉన్న హీరోహీరోయిన్.. సెకండాఫ్‌లో సీరియస్ డ్రామా పండిస్తారు. ఇక క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. 'బబుల్ గమ్' అని టైటిల్ కి తగ్గట్లే ఫస్టాప్ అంతా సాగదీసి వదిలిన డైరెక్టర్.. సెకండాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఓ ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే కొత్త యాక్టర్స్‌తో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కమ్ డ్రామా తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువే. అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలానే లస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్.. అక్కడక్కడ బూతు డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారు? హీరోగా చేసిన రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ మూవీకే ఈ మాత్రం ఔట్పుట్ ఇచ్చాడంటే.. మంచి ఫ్యూచర్ ఉన్నట్లే. హీరోయిన్ మానస చౌదరి కూడా బాగుంది. రొమాంటిక్స్ సీన్స్‌లో రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. ఇక హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ.. మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్థన్, అనుహాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడలేదు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన రవికాంత్ పేరేపు.. 'బబుల్ గమ్' సినిమా విషయంలో కాస్త క్లారిటీ మిస్సయ్యాడు. కానీ కొత్తోళ్లు అయిన రోషన్, మానస దగ్గర నుంచి యాక్టింగ్ బాగానే రాబట్టుకున్నాడు. ఇందులో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 'జిలేబీ' పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు అయితే టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే యూత్‌ఫుల్ ప్రేమకథని చూడాలనుకుంటే 'బబుల్ గమ్' ట్రై చేయొచ్చు. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
'జోరుగా హుషారుగా' సినిమా రివ్యూ
టైటిల్: జోరుగా హుషారుగా నటీనటులు: విరాజ్ అశ్విని, పూజిత పొన్నాడ, సాయికుమార్, సిరి హనుమంతు తదితరులు సంగీతం: ప్రణీత్ సినిమాటోగ్రఫీ: పి.మహిరెడ్డి నిర్మాత: నిరీష్ తిరువీధుల దర్శకుడు: అనుప్రసాద్ విడుదల: 2023 డిసెంబరు 15 (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) కథేంటి? సంతోష్ (విరాజ్ అశ్విన్).. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తండ్రి (సాయికుమార్).. రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు సంతోష్ తెగ కష్టపడుతుంటాడు. ఇకపోతే సంతోష్ బాస్ ఆనంద్(మధు నందన్)కి 35 ఏళ్లొచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. దీంతో ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. సంతోష్ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. ఏం చెప్పకుండా ఇతడి ఆఫీస్‌లోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్ ఆనంద్.. సంతోష్ లవర్‌తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైంది? సంతోష్.. తన ప్రేయసి గురించి అసలు నిజం బయటపెట్టాడా? తండ్రి అప్పు తీర్చాడా అనేది 'జోరుగా హుషారుగా' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? 'బేబి' మూవీలో ఓ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విని.. 'జోరుగా హుషారుగా' అనే ఎంటర్టైనింగ్ మూవీతో సోలోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ స్టఫ్‌తోనే తీశారు. చెప్పాలంటే ఇదో రెగ్యులర్ లవ్ స్టోరీ. కాకపోతే తండ్రి అనే ఎమోషన్ జోడించి తీశారు. అయితే అటు ప్రేమకథ గానీ, ఇటు ఫాదర్ ఎమోషన్ గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) ఫస్టాప్ విషయానికొస్తే.. సంతోష్‌గా విరాజ్ అశ్విన్ ప్రపంచం, అతడి ప్రేమకథ, ఆఫీస్ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత నిత్య, ఇతడి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి కాస్త వినోదం కనిపిస్తుంది. అయితే సంతోష్, నిత్యతో తన ప్రేమకథని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి కానీ పెద్దగా మెప్పించవు. ఇక సంతోష్ బాస్ ఆనంద్-నిత్య మధ్య చిన్న ట్విస్టుతో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ అంతా సంతోష్ తన లవ్‌స్టోరీ బయటపెట్టడం, తండ్రి అప్పు తీర్చడం లాంటి సన్నివేశాలతో సాగుతోంది. చివరకు ఏమైందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారు? 'బేబి' మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్.. మధ్య తరగతి కుర్రాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెట్ అయిపోయాడు. ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పూజిత పొన్నాడ.. గ్లామర్, యాక్టింగ్‌తో పర్వాలేదనిపించింది. ఆఫీస్‌లో బాస్‌గా చేసిన మధునందన్, రాజేశ్ ఖన్నా, బ్రహ్మాజీ, సిరి హనుమంతు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేది! (ఇదీ చదవండి: యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్) -
నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార 75వ సినిమా 'అన్నపూరణి'. జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. కథేంటి? తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తే చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి కల కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) ఎలా ఉందంటే? చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఇష్టమున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి.. నాన్ వెజ్ ముట్టుకోవడమే పాపం అని భావించే, తల్లిదండ్రులని ఎదురించి కార్పొరేట్ చెఫ్ ఎలా అయింది? ఇండియన్ నంబర్ వన్ చెఫ్‌గా ఎలా మారింది? అనే కథతో 'అన్నపూరణి' సినిమా తీశారు. కాన్సెప్ట్ పరంగా మంచి లైన్ అయినప్పటికీ.. దర్శకుడు కొన్ని విషయాల్లో తడబడ్డాడు. చాలా సీరియస్‌గా చెప్పాల్సిన కొన్ని సీన్స్‌ని కామెడీ చేసేశాడని అంటున్నారు. దీంతో ఫీల్ మిస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే యావరేజ్ సినిమా అని తీర్పు ఇచ్చారు. ఎవరెలా చేశారు? ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంలో నయన్ ఇప్పటికే స్పెషలిస్ట్ అయిపోయింది. అన్నపూరణి అనే అమ్మాయిగా అదరగొట్టేసింది. జై, సత్యరాజ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ పరంగా తమన్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే ఈ మూవీ తమిళంలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో విడుదల చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తారనిపిస్తోంది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
'మాధవే మధుసూదన' సినిమా రివ్యూ
టైటిల్: మాధవే మధుసూదన నటీనటులు: తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే ,జోష్ రవి, శివ తదితరులు నిర్మాణం: సాయి రత్న క్రియేషన్స్ నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు దర్శకత్వం: బొమ్మదేవర రామచంద్ర రావు సంగీతం: వికాస్ బాడిన విడుదల తేదీ: నవంబర్ 24, 2023 కథేంటంటే? మాధవ్ (తేజ్ బొమ్మదేవర) ఓ ఆవారా. స్నేహితులు రవి(జోష్ రవి), శివ(శివ)లతో కలిసి జాలీగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ లక్ష్యమంటూ లేకుండా తిరుగుతున్న కొడుకును దారిలో పెట్టాలని..బెంగళూరులోని ఆఫీస్ బాధ్యతలు అప్పజెబుతారు అతడి తల్లిదండ్రులు(ప్రియ, జయప్రకాశ్). కానీ మాధవ్ మాత్రం వైజాగ్ ట్రైన్ ఎక్కి అరకు వెళ్లిపోతాడు. మార్గ మధ్యలో ఓ రైల్వే స్టేషన్లో మాధవ్‌కి ఓ అమ్మాయి(రిషికి లొక్రే) కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే.. ఆ అమ్మాయి మాధవ్‌కి తప్ప మిగతావారెవరికి కనిపించదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు మాధవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? ప్రేమ కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. లవ్‌స్టోరీని కాస్త వైవిధ్యంగా చెబితే చాలు.. ఆ చిత్రాన్ని హిట్ చేసేస్తారు. మాధవే మధుసూదన కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఈ ప్రేమ కథలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. విధే విలన్. ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం భగ్నప్రేమికుడు ఏం చేశాడు? ఏం చేయగలడు? అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు రామచంద్రరావు. తెలుగు ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాస్త జాలీగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండడం కాస్త మైనస్. ఎవరెలా చేశారంటే? తేజ్ బొమ్మదేవరకు ఇది మొదటి సినిమా. ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. హీరోయిన్గా చేసిన రిషికి ఆకట్టుకుంటుంది. అందంగా కనిపించింది. ఫ్రెండ్స్ పాత్రలు నవ్విస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం పర్వాలేదు. పాటలు ఓకే ఓకే. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
'ద ట్రయల్' సినిమా రివ్యూ
టైటిల్: ద ట్రయల్ నటీనటులు: స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు తదితరులు స్టోరీ-దర్శకత్వం: రామ్ గన్ని నిర్మాతలు: స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు సంగీతం: శరవణ వాసుదేవన్ విడుదల తేదీ: 2023 నవంబరు 24 జైళ్ల శాఖలో డిప్యూటి జైలర్‌గా గతంలో పనిచేసిన రామ్ గన్ని అనే వ్యక్తి, దర్శకుడిగా తీసిన తొలి సినిమా 'ద ట్రయల్'. తెలుగులో ఫస్ట్ ఇంటరాగేటివ్ మూవీగా దీన్ని తీశారు. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? అజయ్(యుగ్ రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. రూప(స్పందన పల్లి) పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్.ఐగా పనిచేస్తుంటుంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన మ్యారేజ్. చాలా అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య ఓ డైరీ విషయంలో మనస్పర్థలు వస్తాయి. కొన్నాళ్లకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ చోటుకి వెళ్తారు. అక్కడ అజయ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తాడు. అసలు అజయ్ చావుకి కారణమేంటి? ఇంటరాగేషన్ అధికారిగా వ్యవహరించిన రాజీవ్(వంశీ), రూపకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ కథలకు స్టోరీలైన్ చాలా సింపుల్‌గా ఉన్నా.. స్క్రీన్‌ప్లే బోర్ కొట్టకూడదు. అప్పుడే ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ అలానే రాసుకున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు, దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో డైరీ ఆధారంగా, సైకియాట్రిస్ట్, అజయ్ కుటుంబ సభ్యులు ఇచ్చే ఆధారాలను బేస్ చేసుకుని విచారణ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాపై అంచనాలను పెంచేలా ఉంటాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే దీన్ని చూసేయొచ్చు. నిడివి కూడా 100 నిమిషాలే. ఎవరెలా చేశారు? పోలీసు అధికారిగా స్పందన సరిపోయింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో వంశీ కోటు సీరియస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అమాయకమైన సాప్ట్వేర్ ఇంజినీర్‌గా యుగ్ రామ్ మెప్పించాడు. మిగతా యాక్టర్స్ పర్వాలేదనిపించారు. దర్శకుడు రామ్ గన్ని ఫస్ట్ మూవీతో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. -
'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ
టైటిల్: కోటబొమ్మాళి పీఎస్ నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు దర్శకుడు: తేజ మార్ని సంగీతం : మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్ నిర్మాత : బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్ విడుదల తేదీ: 2023 నవంబరు 24 రీమేక్ అనేది సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్టయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజై ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం 'నాయట్టు'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లలో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) కథేంటి? శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి. ఈ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ(శ్రీకాంత్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్లో రవికుమార్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్. కోటబొమ్మాళిలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్.. ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంటపడతారు? మరి హత్య చేసిన ముగ్గురిను.. పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. సినిమా ఎలా ఉందంటే? రీమేక్ సినిమా తీయడం అనేది ఎంత సేఫో? అంత డేంజర్ కూడా! ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వులపాలైపోవడం గ్యారంటీ. ఈ విషయంలో 'కోటబొమ్మాళి పీఎస్' ఫస్ట్ క్లాస్‌లో పాసైపోయింది! రెండున్నర గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే.. మైనర్ బాలికని రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాళ్లని పోలీసులు ఎన్కౌంటర్ చేసే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్ కోసం రామకృష్ణ(శ్రీకాంత్), ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎష్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉపఎన్నికకు సంబంధించిన స్టోరీ నడుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అదికాస్త రాజకీయం అవుతుంది. రెండు స్టోరీలకు లింక్ ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్స్.. ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్లు పోలీసులకు దొరికారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. 'నాయట్టు' చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌కి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా ఓ నాలుగైదు పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్, పోలీసులు మధ్య ఛేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మెయిన్ లీడ్స్‌లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే మంచి థ్రిల్ ఇస్తాయి. ఆల్రెడీ పోలీసోడు కాబట్టి తనని ఛేజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్స్ ఇస్తుంటాడు. సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందా? పోలీసులు.. హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్స్‌ని పట్టుకుంటారా? లేదా అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్‌లో జరుగుతాయి. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కథే హీరో. మిగిలిన వాళ్లంత పాత్రధారులు మాత్రమే. అలానే స్టార్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్‌కి పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్‌కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని.. స్టోరీ అంతా ఉంటుంది కానీ యాక్టింగ్‌కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఎస్పీ రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్.. పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళీ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఫరిది మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'లింగి లింగి లింగిడి' పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజిక్ హిట్. పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది. పాటలేం లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథకు తగ్గట్లు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. చివరగా డైరెక్టర్ తేజ మార్ని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాసైపోయారు. ఓవరాల్‌గా 'కోటబొమ్మాళి పీఎస్'.. ఓ మంచి మూవీ చూసిన ఫీల్ ఇస్తుంది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ) -
ఫర్ఫ్యూమ్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్ : ఫర్ఫ్యూమ్ నటీనటులు: చేనాగ్, ప్రాచీ థాకర్, అభినయ ఆనంద్, భూషణ్ బాబా మీర్, కేశవ్ దీపక్, తదితరులు దర్శకత్వం: జేడీ స్వామి నిర్మాతలు: సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మాణ సంస్థలు: శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంగీతం: అజయ్ అరసద సినిమాటోగ్రఫీ: రామ్ కే మహేశ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: నవంబర్ 24,2023 చిన్న చిత్రాలు, కొత్త కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ చిత్రమే ఇప్పుడు వచ్చింది. స్మెల్లింగ్ అబ్సెషన్ అనే కాన్సెప్ట్ మీద తీసిన చిత్రం పర్ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అసలు కథేంటంటే.. హైద్రాబాద్‌లో ఓ విచిత్ర వ్యక్తి వ్యాస్ (చేనాగ్) అమ్మాయిల వాసన వస్తే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. అమ్మాయిల వాసనతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించే వ్యాస్‌ను పట్టుకునేందుకు ఏసీపీ దీప్తి (అభినయ) ప్రయత్నాలు చేస్తుంటుంది. అదే సమయంలో వ్యాస్‌ను లీలా (ప్రాచీ థాకర్) చూస్తుంది. చూడగానే అతడిని ఘాడమైన ముద్దు ఇస్తుంది. దీంతో వ్యాస్ ఆమె ధ్యాసలోనే ఉంటాడు. కానీ ఆమె మాత్రం వ్యాస్‌ను అవమానిస్తుంది. ఆ అవమానానికి పగ తీర్చుకోవాలని ఆమెను కిడ్నాప్ చేస్తాడు వ్యాస్? ఆ తరువాత వ్యాస్ ఏం చేస్తాడు? అసలు వ్యాస్‌కు లీలా ఎందుకు ముద్దు పెట్టింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు పోలీసులు వ్యాస్‌ని ఏం చేశారు? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త అరుదుగా జరుగుతుంటాయి. ప్రయోగాత్మక చిత్రాలకు ఓ సెక్షన్ నుంచి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే నచ్చే అవకాశం ఉంది. పాయింట్ కొత్తదే అయినా.. తెరకెక్కించడంలో, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఎమోషనల్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్, హీరోకి గల సమస్యను చక్కగా వివరించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే కథ, కథనాలు మాత్రం ఊహకందవు. ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సీన్లు ముందుకు సాగవు. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. మొదటి సినిమానే అయినా.. కొత్త వాడే అయినా కూడా చేనాగ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎక్కడా బెరుకు లేకుండా నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఇది వరకు దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం కూడా తోడవ్వడంతో తెరపై అవలీలగా నటించేసినట్టు అనిపిస్తుంది. లీల కారెక్టర్లో ప్రాచీ ఓకే అనిపిస్తుంది. ఏసీపీ దీప్తిగా అభినయ కనిపించినంతలో మెప్పించింది. బాబా, తాజ్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికపరమైన విషయానికొస్తే.. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటల ద్వారా నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరా వర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్‌గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్: సౌండ్ పార్టీ నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్,రేఖ పర్వతాల తదితురులు నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సమర్పణ : ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ రచన - దర్శకత్వం : సంజయ్ శేరి సంగీతం: మోహిత్ రెహమానిక్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్: జి.అవినాష్ విడుదల తేది: నవంబర్ 24, 2023 బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ, యంగ్ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ. పేపర్ బాయ్‌తో హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ తన చిరకాల మిత్రుడు సంజయ్ శేరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అలా వీరి కాంబినేషన్లో సౌండ్ పార్టీ తెరకెక్కింది. అమాయకులైన తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథాచిత్రమిది. మరి ఈ కథ జనాలకు కనెక్ట్ అయిందా? ప్రేక్షకులను మేరకు మెప్పించింది? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సౌండ్ చేయనుంది? అనేది రివ్యూలో చూసేద్దాం.. కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్ కుమార్(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్ కుమార్(శివన్నారాయణ)..కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు కుబేర్ కుమార్‌కు పరిచయం ఉన్న సేటు నాగ భూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’అనే హోటల్ని ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా..డాలర్ కుమార్ ప్రియురాలు సిరి(హృతిక శ్రినివాస్) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకిని వెళ్తే...రూ. 2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఆ రెండు కోట్ల రూపాయలు ఏం అయ్యాయి? కోటీశ్వరులు కావాలనే వారి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులొ చాలా సినిమాలే వచ్చాయి. సౌండ్ పార్టీలో కొత్తదనం ఏంటంటే..బిట్‌కాయిన్ అనే పాయింట్‌తో కామెడీ పండించడం. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు సంజయ్ శేరి. అయితే పేపర్‌పై రాసుకున్న కామెడీ సీన్‌ని తెరపై అదే స్థాయిలో చూపించి, రక్తికట్టించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్ నవ్వించే విధంగానే ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు కావాలనే కథకు అతికినట్లుగా అనిపిస్తుంది. కుబేర్ కుమార్ ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్ సీన్‌తోనే కథనం ఎలా సాగబోతుందో తెలియజేశాడు. డబ్బు కోసం తండ్రి కొడుకులు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్ మాత్రం కథకు అతికినట్లుగానే అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో..ఆమె పేరెంట్స్ దొరికిపోయినప్పుడు చేసే కవరింగ్.. అలాగే తండ్రీకొడుకులు అప్పు తీసుకున్న తీరు.. రొటీన్‌గా అనిపిస్తాయి. సీన్ల పరంగా చూస్తే ఫస్టాఫ్ నవ్వుకోవచ్చు. కానీ కథనం మాత్రం రొటీన్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపించినా.. నవ్వులు పూయిస్తాయి. పత్తి సతీష్‌గా చలాకీ చంటి ఒకటిరెండు సీన్లలో కనిపించినా..బాగానే నవ్వించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ సన్నివేశానికి చేసిన స్ఫూప్ సినిమాకు ప్లస్ అయింది. బిట్ కాయిన్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పుతుంది. లాజిక్కులను పక్కకి పెట్టి.. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ‘సౌండ్ పార్టీ’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శివన్నారాయణ, సన్నీ పాత్రలే. కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ అదరగొట్టేశారు. వీరిద్దరి ఫాదర్-సన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సిరి పాత్రకు హృతిక న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే. ఫాదర్-సన్ కెమిస్ట్రీ ముందు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నవ్వించాడు. ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించాడు. హీరో చెల్లెలుగా రేఖ పర్వతాల తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మోహిత్ రెహమానిక్ నేపథ్య సంగీతంతో పాటు పాటలు బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ
టైటిల్: స్పార్క్ నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు నిర్మాత: విక్రాంత్ రచన-దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: విక్రాంత్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేది: 2023 నవంబర్ 17 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) స్కార్క్ కథేంటంటే? లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు. పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్‌స్టోరీని జోడించారు. ఫస్టాఫ్‌లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్‌ట్రాక్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే? విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్‌గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది. నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమా రివ్యూ
టైటిల్: అనుకున్నవన్నీ జరగవు కొన్ని నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ దర్శకత్వం: జి.సందీప్ నిర్మాత: జి.సందీప్ సంగీతం: గిడియన్ కట్ట ఎడిటర్: కేసీబీ హరి విడుదల తేది: 3 నవంబర్, 2023 కరోనా తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ఓటీటీలలో అన్ని రకాల సినిమాలను చూసేస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే తప్ప థియేటర్స్‌కి రావడం లేదు. అందుకే నూతన దర్శకులు కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. జి.సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథేంటంటే.. కార్తీక్(శ్రీరామ్ నిమ్మల)కి రూ.30 లక్షలు అవసరం ఉంటుంది. మనీకోసం కాల్ బాయ్‌గా మారాతాడు. మరోవైపు మధు(కలపాల మౌనిక) కూడా ఓ కారణంగా కాల్ గర్ల్ అవతారమెత్తుతుంది. అయితే ఈ ఇద్దరు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? ఫ్లాట్‌లో హత్య చేయబడిందెవరు? ఎవరు చేశారు? ఈ కథలో పొసాని కృష్ణ మురళీ, బబ్లూల పాత్రేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. హీరోహీరోయిన్లు ఇద్దర్ని డిఫరెంట్ పాత్రలో చూపిస్తూ..ఆసక్తికరంగా కథనాన్ని కొనసాగించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగినా.. అపార్ట్మెంట్లో జరిగిన హత్య తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ.. మంచి ట్విస్టుల కథ ముందుకు సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ నవ్వించకపోవడమే కాకుండా..కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో పోసాని, బబ్లూల కామెడీ అదిరిపోతుంది. అపార్ట్మెంట్లో జరిగిన రెండు హత్యలకు పొసాని, బబ్లూలతో సంబంధం ఉండడం.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే.. క్రైమ్ కామెడీ చిత్రమైనా..ఒక్క ఫైటూ ఉండదు, పాట ఉండదు. కేవలం కామెడీ సీన్స్‌తో అలా సాగిపోతుంది. ఫస్టాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఆసక్తిరంగా కథను రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. క్రైమ్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్, మధు పాత్రకు శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక న్యాయం చేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మౌనికకు ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించింది. చాలా కాలం తర్వాత పోసాని కృష్ణమురళి మంచి పాత్ర లభించింది. కాంట్రాక్టు కిల్లర్‌గా ఆయన నటన నవ్వులు పూయిస్తుంది.బబ్లు పాత్ర సినిమాకు ప్లస్ అయింది. కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాకొస్తే.. గిడియన్ కట్ట అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఎడిటర్ కె సి బి హరి పనితీరు పర్వాలేదు.ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చదవండి: ఓ పక్క ట్రోలింగ్.. మరోపక్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా -
Drohi The Criminal: ద్రోహి సినిమా రివ్యూ
టైటిల్: ద్రోహి నటీనటులు: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి. దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి సంగీతం : అనంత నారాయణ ఏ. జి నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా. నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి విడుదల తేదీ: 3 నవంబర్, 2023 కథేంటంటే.. హీరో సందీప్ (అజయ్) ఒక బిజినెస్మెన్. తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. కానీ తనకు వ్యాపారం అస్సలు కలిసి రాదు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. వ్యాపారంలో నష్టపోతున్నప్పటికీ తన భార్య హీరోయిన్ దీప్తి వర్మ (చంద్రిక) అతడికి సపోర్టుగా ఉంటుంది. రెండేళ్లుగా సక్సెస్ లేకపోవడం వల్ల అజయ్ ఫుల్ ప్రెషర్లో ఉంటాడు. అలా సాగిపోతున్న తన జీవితంలో అనుకోని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. దీప్తి హత్య కేసులో తనని సస్పెక్ట్ గా అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో ఎలా బయట పడ్డాడు? అనేది ఈ సినిమా కథ. విశ్లేషణ దర్శకుడు కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. షకలక శంకర్‌లో ఒక కొత్త నటుడిని చూపించారు. ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేసిన హీరోయిన్ డెబ్బి ఇంతకుముందు చేసిన పాత్రకు భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్లో కనిపించారు. సంగీతం పర్వాలేదు. హీరో సందీప్ యాక్టింగ్ బాగుంది. హీరో ఫ్రెండ్స్‌గా మహేశ్ విట్టా, నీరోజ్ పుచ్చ పాత్రలు ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తీశారు. షకలక శంకర్ పాత్ర, నటన అద్భుతంగా ఉన్నాయి. హీరో సందీప్‌కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్నట్లుగా నటించాడు. మహేష్ విట్ట నటన చాలా బావుంది. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. చదవండి: తెలుగింటి కోడలు కాబోతున్న సీతారామం హీరోయిన్.. ఇదిగో క్లారిటీ! -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్‌కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్‌గా, రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్‌ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్‌కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్‌లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో హెరాల్డ్ దాస్‌తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్‌డమ్‌ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్‌గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్. ఈ రెండింటికి భిన్నంగా ‘భగవంత్ కేసరి’ ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అందుకే ‘భగవంత్ కేసరి’పై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. నటన పరంగా బాలయ్య పర్వాలేదనిపించినా.. అనిల్ రావిపూడి కథనం సరిగా లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. శ్రీలీల అయితే తెరపై కొత్తగా కనిపించించిందని చెబుతున్నారు. Just Now Completed My show 🤩 Movie Mathram Excellent Ra ayya 💥💥 Thaman anna BGM ayithey Next Level🥵💥💥 Anil Anna New Version 🔥🔥 My Rating 3/5 #BhagavanthKesari #Balakrishna pic.twitter.com/5TxGl3Z7dY — Rebel Star (@Pranay___Varma) October 19, 2023 #BhagavanthKesari 🔥 I don’t care 👉#NBK #kcpd acting 👉#thaman BGM 👉#srileela pure innocent acting 👉different zoner script 👉 #AnilRavipudi direction👌Hittu bomma😍Kcpd babu🦁 @NBKTrends @MusicThaman @sreleelaa @AnilRavipudi @Nandamurifans pic.twitter.com/b2qNevmZgw — Shanmukh Koyyalamudi (@shanmukh_k_95) October 18, 2023 Anil Ravipudi gave a decent commercial film that’s not of typical Balayya style & not a typical Anil film either. Though a couple of ideas & emotions didn’t work👎 , majority action blocks were pure blast💥 so, Absolutely kakapoyina, to an extent KCPD🔥(2.75/5) #BhagavanthKesari pic.twitter.com/N4b1HZcVKC — Kittu (@Kalyanchowdaryy) October 18, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 #BlockBusterBhagavanthKesari 🔥💥 @AnilRavipudi Unanimous B L O C K B U S T E R 💥🔥 Hatrick for #Balayya 🥁🥁#JaiBalayya 🔥🤙🤙 Happy ga velli movie chudandi.. Balayya Never Before, Archakam🥁#Balayya iche High peaks 💥🦁#BhagavanthKesari 🤙🤙🥁🥁 BhagavanthKesariOnOct19th pic.twitter.com/5TVQXt2kUu — ROHIT CHOWDARY K 🇮🇳 (@ROHITCHOWDARYK2) October 18, 2023 #BhagavanthKesari Review: Subtle yet MASS!#Balayya telangana dialect🔥#BalaKrishna & #SreeLeela bonding👌🏻#AnilRavipudi Dialogues💥 Story is routine but #NBK subtle acting, emotions & underlying msg itself is a worth Good Family Watch! Rating:3.25/5#BhagavanthKesariReview pic.twitter.com/nYN3Ac637l — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 19, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 -
'మధురపూడి గ్రామం అనే నేను' సినిమా రివ్యూ
టైటిల్: మధురపూడి గ్రామం అనే నేను రచన-దర్శకత్వం: మల్లి, నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్ విడుదల తేదీ: అక్టోబరు 13 శివ కంఠమనేని హీరోగా మల్లి దర్శకత్వంలో తీసిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. మణిశర్మ సంగీతమందించారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటి? మధురపూడి అనే ఊరు తన ఆత్మకథ చెబుతుంది. ఈ ఊరిలో సూరి (శివ కంఠమనేని) అనే మొండోడు. తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వరకైనా నిలబడతాడు. అలాంటి సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథలిన్ గౌడ) ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చాక సూరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఊర్లోని రాజకీయాలకు సూరికి సంబంధమేంటి? అసలు ఈ కథకు 700 కోట్ల రూపాయల డిజిటల్ స్కామ్‌కు సంబంధం ఏంటి అనేది స్టోరీ. ఎలా ఉందంటే? ఓ కథలో రివేంజ్, పొలిటిక్స్, లవ్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఉండటం విశేషం. 'మధురపూడి గ్రామం అనే నేను' ఇలాంటి అంశాలతో తీసిన చిత్రం. పాత్రలు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేసరికి కాస్త టైమ్ పట్టింది. దీంతో ఫస్టాప్ అంతా నిదానంగా సాగింది. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు ఆకట్టకున్నాయి. క్లైమాక్స్‌లో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి పనితీరు కనిపించింది. ఎవరెలా చేశారు? సూరి పాత్రలో శివ కంఠమనేని చక్కగా నటించాడు. అన్నిరకాల ఎమోషన్స్‌ని బాగా చేశాడు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ ఓకే అనిపించింది. కథలో కీలకమైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు బాగుంది. భరణి శంకర్ ఫరిది మేర నటించాడు. వనితా రెడ్డి, జబర్దస్త్ నూకరాజు, మహేంద్రన్ తదితరులు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే మణిశర్మ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సురేశ్ భార్గవ్ విజువల్స్ చక్కగా ఉన్నాయి నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లు ఉన్నాయి. -
'ఏందిరా ఈ పంచాయితీ' సినిమా రివ్యూ
టైటిల్: ఏందిరా ఈ పంచాయితీ నటీనటులు: భరత్, విషిక లక్ష్మణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు నిర్మాత: ఎమ్. ప్రదీప్ కుమార్ దర్శకుడు: గంగాధర.టి సంగీతం: పెద్దపల్లి రోహిత్ విడుదల తేదీ: అక్టోబరు 06 (ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ) కథేంటి? రామాపురం అనే ఊరు. అభి (భరత్) అండ్ గ్యాంగ్.. అల్లరితోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గడిపేస్తుంటారు. అభికి పోలీస్ అవ్వాలనేది కోరిక. ఓ సందర్భంలో అభి ఉంటున్న ఊరికి కాపలాదారుడు అవుతాడు. ఊరి పెద్ద (కాశీ విశ్వనాథ్) కూతురు యమున (విషిక)తో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఓ కేసులో అభిని పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఆ ఊర్లో జరిగిన హత్యలకు అభికి ఉన్న సంబంధం ఏంటి? యమున తండ్రినే అభి ఎందుకు చంపాలని అనుకున్నాడు? చివరకు అభి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది స్టోరీ. ఎలా ఉందంటే? సినిమాల్లో లవ్‌స్టోరీ అనేది సక్సెస్ ఫార్ములా. కొత్త దర్శకుడు గంగాధర అదే పాయింట్ పట్టుకున్నాడు. ప్రేమకథకి క్రైమ్, డ్రామా, సస్పెన్ లాంటి అంశాల్ని జోడించాడు. ప్రయోగాల జోలికి పోకుండా.. సింపుల్‌గా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు.. హీరోయిన్ దొంగతనం చేయడం.. దాన్ని రికవరి చేసినట్టుగా హీరో పోజులుకొట్టే సీన్లు బాగుంటాయి. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) సెకండాఫ్ కాస్త నిదానంగా ప్రారంభైనప్పటికీ.. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్‌లో ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అనిపిస్తుంది. చివరకు హీరో పంచాయితీ క్లియర్ అవుతుంది. ఈ మూవీలోని పాటలు వినసొంపుగా ఉంటాయి. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ఎడిటర్ బాగా చేశాడు. నిర్మాణ విలువులు మంచిగా ఉన్నాయి. ఎవరెలా చేశారు? అభి పాత్రలో భరత్ చక్కగా నటించాడు. తొలి సినిమానే అయినా డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లలో పాస్ అయిపోయాడు. విషిక అయితే యమున పాత్రలో బాగుంది. పల్లెటూరు అమ్మాయిలా అందంగా కనిపించింది. కాశీ విశ్వనాథ్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. ఊర్లోని పెద్దగా సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. హీరో స్నేహితుల పాత్రలు అలరించాయి. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. (ఇదీ చదవండి: ‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ) -
'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ
టైటిల్: మామా మశ్చీంద్ర నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ డైరెక్టర్: హర్షవర్ధన్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: అక్టోబర్ 06 నిడివి: 2h 29m కథేంటి? పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్‌కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ. ఎలా ఉంది? సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి! ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి.. స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే. ఎవరెలా చేశారు? మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు. టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్‌గా లేదు. ఓవరాల్‌గా థియేటర్స్‌లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'మంత్ ఆఫ్ మధు' రివ్యూ
టైటిల్: మంత్ ఆఫ్ మధు నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు మ్యూజిక్: అచ్చు రాజమణి సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్ డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల నిడివి: 2h 20m కథేంటి? అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ. ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు. 2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు! ఎవరెలా చేశారు? మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే! - చందు, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Good First Half Sound effects could have been less in fights Boya Senseless Mass Logics pekkana petti chudandi #Skanda https://t.co/6XUAzzuu2i — ʜᴜɴɢʀʏ ᴄʜᴇᴇᴛᴀʜ (@SiddarthRoi) September 28, 2023 సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్ మాత్రం ఓవర్సీస్లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొన్ని చోట్ల షో పడిపోయింది. ట్విటర్లో పలువురు షేర్ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్‌తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయిందని సమాచారం. ఫస్టాఫ్ కొంతమేరకు యావరేజ్‌గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. #Skanda 🎬 First Half Report 📝 :#RAmPOthineni introduction & Mass Swag🔥💥#Sreeleela Scenes 💥 Action Scenes ⚡️⚡️#Thaman Songs & Bgm Music 💥🥁💥 Interval 💥 Overall a Good First Half...!!👍 Stay tuned to @Mee_Cinema for Second Half Report & Full Review ✍️ pic.twitter.com/y1sOAXYh0j — Mee Cinema (@Mee_Cinema) September 28, 2023 Just finished watching #Skanda movie #BoyapatiSreenu Thandavaam started the main asset to movie is direction The main piller to entire movie @ramsayz acting and swag never before seen This time @MusicThaman ur music and bgm will speaks in peeks 🔥@sreeleela14 dance ultimate pic.twitter.com/sa8nDUIJRO — Jaikarthiksv (@jaikarthiksv1) September 28, 2023 First half #Blockbuster #Skanda #RAPO #RAPOMass https://t.co/o3fjjWCV8u — BABA #DEVARA 🥵 (@lovelybaba9999) September 28, 2023 Pakka Mass Hittt Bomma 🤙🤙💥 Mass Euphoria In Theatres 🔥🔥🔥 Ustaad Ram in never before looks Boyapati mark massss💥💥💥💥 Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda #RAmPOthineni #BoyapatiSreenu — S.Harsha (@SHarsha19085417) September 28, 2023 #Skanda Average 1st Half! Starts off interesting and has a rocking introduction for Ram but dips after that and loses track apart from a few good action sequences. — Venky Reviews (@venkyreviews) September 28, 2023 Take care sir! Don't sit near the speakers and wear helmet, if possible! Feeling sorry for you that you are going through this torture.....@ramsayz #skandareview — SATYA (@ssatyatweets) September 28, 2023 #Skanda 1st half: Best Introduction ever for @ramsayz 🔥, Narration👍, some mass scenes Worked well, Interval Massive🔥🔥 Very Good 1st half works In most parts 2nd half: Dialogues and some scenes Are Excellent, Climax is Different and Okay Good 2nd half Overall: HIT💥 — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) September 28, 2023 All set for Boya-Thaman Sambavam 👂👂 #Skanda pic.twitter.com/jRm5uvyQpJ — Ragadi (@RagadiYT) September 28, 2023 It's official It's two parts Skanda 2 was confirmed in post credits scene#Skanda #SkandaOnSep28 — 𝙍𝙤𝙨𝙝𝙖𝙣™ (@NTR_Roshan_) September 28, 2023 Just mental mass no logic ..just mass First half #Skanda @Prabhas83932022 pic.twitter.com/Z0xPYZvm6X — Raghu (@436game) September 28, 2023 -
ఇక మా ప్రయాణం మారుతుంది
‘‘తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. మా ‘పెదకాపు 1’ కూడా అరుదైన చిత్రంగా నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత మా ద్వారక క్రియేషన్స్ ప్రయాణం మారుతుంది’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరులతో పంచుకున్న విశేషాలు. ‘పెదకాపు 1’ చిత్రకథకి కొత్త హీరో అయితేనే సహజత్వం వస్తుంది. అందుకే విరాట్ కర్ణని తీసుకున్నాం. సినిమా మొత్తం చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కూడా సెట్స్ వేయలేదు. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబించేలా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఒక చరిత్రని కళ్ల ముందు ఎలా చూపించాలో అలానే సహజంగా చూపించారు శ్రీకాంత్ అడ్డాల. మా సినిమాని చూస్తున్నప్పుడు నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక సామాన్యుడు తన పరిస్థితులను తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం లేదు.. అదే ఈ సినిమా కథ. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారి కోసం కాపు కాసేవారికి పెదకాపు అనే పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేం ‘పెదకాపు’ టైటిల్ పెట్టాం. విరాట్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతి కలిగింది. విరాట్‌ని వైజాగ్ సత్యానంద్‌గారు హీరో ప్రభాస్‌తో పోల్చడం హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ అడ్డాలగారు విలన్‌గా చక్కగా సరిపోయారు. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు. ‘పెదకాపు 1’ రిలీజ్ తర్వాత ‘పెదకాపు 2’ ఉంటుంది. ఆ తర్వాత అడివి శేష్‌తో ఓ చిత్రం చేస్తాను. అలాగే ‘అఖండ 2’తో పాటు మరో రెండు మూడు కథలు చర్చల్లో ఉన్నాయి. – నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి -
నవంబర్‌లో థ్రిల్ చేయనున్న మంగళవారం
΄పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మంగళవారం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి. -
'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు నిర్మాత: రక్షిత్ శెట్టి దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023 మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్‌మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్‌గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్‌తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే. 'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్‌కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్‌లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్‌స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా! ఎవరెలా చేశారు? మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్‌పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ
టైటిల్: ఛాంగురే బంగారు రాజా నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: ఆర్టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాత: రవితేజ దర్శకత్వం: సతీశ్ వర్మ సంగీతం: కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: సుందర్ NC విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటి? అనకాపల్లి దగ్గర్లోని ఓ పల్లెటూరిలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) బైక్ మెకానిక్. అదే ఊరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మంగ(గోల్డీ నిస్సీ)ని ప్రేమిస్తుంటాడు. ఓ సందర్భంలో రంగు రాళ్ల విషయమై సోము నాయుడు (రాజ్ తిరందాసు)-బంగార్రాజుకి గొడవ జరుగుతుంది. తర్వాత రోజే సోము నాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో ఆ నేరం బంగార్రాజుపై పడుతుంది. ఇంతకీ సోము నాయుడిని చంపిందెవరు? ఈ స్టోరీలో తాతారావు (సత్య), గాటీ (రవిబాబు) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే 'ఛాంగురే బంగారు రాజా' స్టోరీ. (ఇదీ చదవండి: Ramanna Youth Review: ‘రామన్న యూత్’ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? సింపుల్‌గా చెప్పుకుంటే ఈ సినిమా లైన్.. ఓ హత్య, దాని వెనక మిస్టరీ. తనపై మోపిన నేరం వెనుక దాగి ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చాలనుకున్న ఓ యువకుడి స్టోరీ ఇది. ఈ తరహా కథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు.. ఆడియెన్స్ ని ఎంతవరకు థ్రిల్ చేశారు? లేదా ఎంత నవ్వించారు? అనే పాయింట్స్ మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 'ఛాంగురే బంగారు రాజా' విషయంలో డైరెక్టర్ కి పాస్ మార్కులే వేయొచ్చు. ఎందుకంటే సినిమాలో కామెడీ తప్పితే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. క్లైమాక్స్ ముందు ఓ ఛేజింగ్ సీన్ చూస్తున్నప్పుడు.. అప్పటికీ మూవీ ల్యాగ్ అయిన అనుభూతి వస్తుంది. అయితే కొత్త దర్శకుడు కావడం వల్ల దీన్ని పూర్తిస్థాయి సినిమాగా తీయడంలో దర్శకుడు తడబడ్డాడు. సినిమాని ఓ సంఘటన, మూడు చాప్టర్లు అని ముందే చెప్పేసిన దర్శకుడు.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ కూడా పెద్దగా కొత్తగా ఏం ఉండవు. మళ్లీ మళ్లీ అవే సీన్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది. మంచి కామెడీ, సెంటిమెంట్, థ్రిల్ కలిగించడానికి సినిమాలో స్కోప్ ఉన్నా సరే రైటింగ్ లో బలం లేకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ డల్ గా అలా వెళ్తుంటాయి. సత్య, రవిబాబు కామెడీతో పాటు సునీల్ గొంతుతో వినిపించే కుక్క సీన్స్ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో సత్య లవ్ స్టోరీ కూడా నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్‌లో రవిబాబు ఎంట్రీ తర్వాత సినిమా ఫన్వేలో ముందుకు సాగుతుంది. మతిమరుపుతో రవిబాబు పండించిన కామెడీ వర్కౌట్ అయింది. హీరోని చంపేందుకు ఓ వ్యక్తి ఎందుకు ప్రయత్నిస్తున్నాడనేది చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు. దర్శకుడు కొత్త నేపథ్యంతో కథను చెప్పాడు కానీ.. దాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. మిగతా విషయాల గురించి పక్కనబెడితే రంగురాళ్ల కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించింది. ఎవరెలా చేశారు? కేరాఫ్ కంచరపాలెం, నారప్ప తదితర సినిమాల్లో కార్తీక్ రత్నం.. నటుడిగా తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏ యాక్టర్ కి అయినా సరైన పాత్రలు పడితే అతడిలో సత్తా బయటకొస్తుంది. ఈ మూవీలో కార్తీక్ ఓకే అనిపించాడు. లవ్ సీన్స్ లో ఎమోషన్, నేరం మోపిన సీన్స్ లో సింపతీ వర్కౌట్ కాలేదు. సత్య, రవిబాబు.. తమ కామెడీ టైమింగ్ చూపించి ఫలితం లేకుండా పోయింది. అయితే టెక్నికల్ విషయాలకొస్తే... సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కి ఇంకా పనిచెప్పాల్సింది. ఆర్టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75 (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) -
Ramanna Youth Review: ‘రామన్న యూత్’ మూవీ రివ్యూ
టైటిల్: రామన్న యూత్ నటీనటుటు: అభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అమూల్య రెడ్డి, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, తదితరులు నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ రచన-దర్శకత్వం: అభయ్ నవీన్ సంగీతం:కమ్రాన్ సినిమాటోగ్రఫీ: పహాద్ అబ్దుల్ మజీద్ విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. సిద్దిపేట జిల్లా ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన నలుగురు యువకుల కథే రామన్న యూత్. గ్రామానికి చెందిన రాజు(అభయ్ నవీన్)కి ఎమ్మెల్యే రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) అంటే పిచ్చి. ఆయన వెంట తిరిగి ఎలాగైనా లీడర్‌గా ఎదగాలని ఆశపడతాడు. అతని స్నేహితులు చందు(జగన్ యోగిబాబు), రమేశ్(బన్నీ అభిరామ్), బాలు(అనిల్ గీలా)లతో కలిసి ఊర్లో యువనాయకుడు అనిల్(తాగోబోతు రమేశ్)తో తిరుగుతుంటారు. రామన్న యూత్ అసోసియేషన్ పెట్టి తనకు తాను లీడర్‌గా ప్రకటించుకుంటాడు. దసరా పండగ రోజు ఎమ్మెల్యే రామన్న, అనిల్‌లతో కలిసి ఉన్న ఓ ఫ్లెక్సీ కట్టిస్తాడు. అందులో అనిల్ తమ్ముడు మహిపాల్(విష్ణు) ఫోటో ఉండదు. దీంతో పగ పెంచుకున్న మహిపాల్ రాజు గ్యాంగ్‌ని అనిల్‌తో కలవకుండా అబద్దాలు చెప్పి చిచ్చు పెడతాడు. ఓ దశలో లేబర్ గాళ్లు మా అన్న పేరు చెడగొడుతున్నారని రెచ్చగొడతారు. దీంతో మహిపాల్‌కు, రాజు గ్యాంగ్‌కి గొడవ అవుతుంది. అప్పుడు దమ్ముంటే తన అన్న సాయం లేకుండా ఎమ్మెల్యేను కలవాలని రాజు గ్యాంగ్‌కి ఛాలేంజ్ విసురుతాడు. ఆ ఛాలేంజ్ని సీరియస్ తీసుకున్న రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలవాలని సిద్ధిపేటకు వెళ్తారు. మరి అనుకున్నట్లే రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలిశారా? వీళ్లంతా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లారు? అక్కడ వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? జైలు పాలు ఎందుకయ్యారు? తన ప్రియురాలు (అమూల్యారెడ్డి)తో రాజు ప్రేమ ఫలించిందా? చివరకు రాజు లీడర్ అయ్యాడా లేదా? రాజు గ్యాంగ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి అనేది తెలియాలంటే రామన్న యూత్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజకీయాల్లో కిందిస్థాయిలో తిరిగే ఓ యువకుడి కథ ఇది. సరైన నాయకుడిని ఎంచుకోకుండా.. ఆ పార్టీ జెండాలు మోస్తూ తిరిగితే చివరకు ఏం అవుతుందనేది కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. ఒక రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం యువతను ఎలా వాడుకుంటుంది? నాయకుడిని నమ్ముకొని సొంతవాళ్లను పట్టించుకోకుండా, ఏం పని చేయకుండా అవారాగా తిగిరితే చివరకు మధ్యతరగతి యువకుడి గతేమవుతుందనే మంచి సందేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. దర్శక హీరో నవీన్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథంతా పల్లెటూరి నేపథ్యంలో ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. తెలంగాణ నేటివిటితో వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది కానీ ఎమోషనల్‌గా మాత్రం పెద్దగా కనెక్ట్ కాదు. సీన్ల పరంగా, క్యారెక్టర్ డిజైన్ల పరంగా బాగానే ఉంది కానీ బలమైన కథ లేకపోవడం మైనస్. అయితే దర్శకుడిగా నవీన్‌కి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించింది. నటీనటులంతా కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సాంకేతిక అంశాలపై తనకు ఉన్న పట్టును చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సినిమాను చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు. హీరో గ్యాంగ్ చేసే దావత్, ముచ్చట్లు, వారి ఆలోచనలు..ఇవన్నీ వాస్తవికంగా ఉంటాయి. గ్రామాల్లో ఉండే యువత బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాల్లో బలమైన కథ లేదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అసభ్యతకు పాల్పడకుండా కుటుంబసమేతంగా సినిమా చూసేలా తెరకెక్కించాడు. తెలంగాణ యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. అభయ్ నవీన్, అనిల్ గీలా, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, విష్ణు పాత్రల చుట్టే ఈ కథ తిరుగుతుంది. లీడర్ అవ్వాలని కలలు కనే మధ్యతరగతి యువకుడు రాజుగా అభయ్ చక్కగా నటించాడు. అనిల్ గీలా, జగన్ యోగిబాబు కామెడీ బాగా పండించాడు. తండ్రికి భయపడినట్లు నటిస్తూనే.. బయట దోస్తానాతో తిరుగుతూ గప్పాలు కొట్టే క్యారెక్టర్ అనిల్‌ది. ఇక ఆన్లైన్ పేకాట ఆడుతూ వయసు కంటే చిన్న వాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే పాత్ర జగన్ యోగిబాబుది. ఇక విష్ణు పాత్ర ఈ సినిమాకు చాలా కీలకమైంది. జెలసీతో రగిలిపోయే మహిపాల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.ఎప్పుడూ తాగుబోతుగా కనిపించే రమేష్..ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఎమ్మెల్యే రామన్నగా శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్రమేర చక్కగా నటించాడు. యాదమ్మ రాజు, జబర్దస్త్ రోహిణి, ఆనంద చక్రపాణి, వేణ/ పొలసానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కమ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ, రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్‌ల ఎడిటింగ్ పర్వాతేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతంగా ఉన్నాయి. -
ప్రేమదేశపు యువరాణి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశపు యువరాణి నటీనటులు: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి, మెహబూబ్ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్, పవన్ ముత్యాల, రాజారెడ్డి, సందీప్, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు నిర్మాణ సంస్థలు: ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల సంగీతం: అజయ్ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ ఎడిటర్: ఎం.ఆర్. వర్మ విడుదల తేదీ: 02-09-2023. ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు చక్కటి రెస్పాన్స్ వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ.. ఎదురు తిరిగిన వారిని చంపుతూ.. నచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతుంటాడు. అయితే అదే ఊర్లో బీటెక్ ఫెయిలై తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్ రాజ్)కి, శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెనే తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అయిపోతాడు.ఆమె గురించి ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తాడు. అయితే రావులపాలెం నుంచి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురంకు వచ్చిందని శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో పరిచయం కావడం.. దీంతో చెర్రీ బీటెక్ పాసయ్యేందుకు హెల్ప్ చేస్తానని ఆమె అంటుంది. ఆలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. చివరకు పెళ్లి చేసుకుందామని చెర్రీ చెప్పగానే.. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా నాకు చాలా గోల్స్ ఉన్నాయని నో అంటుంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణిని చెర్రీ నిలదీయడంతో రవి (విరాట్ కార్తిక్)ను ఇష్టపడ్డానని చెబుతుంది. దీంతో షాక్ తిన్న చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించు కోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు శ్రావణి చెర్రీని పెళ్లి చేసుకుందా? అనేదే అసలు కథ. అంతే కాకుండా మరో వైపు అదే ఊరిలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. వీటి వల్ల రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు ఈ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే విషయాలు తెలిసేలోపే రౌడీ షీటర్ వీరయ్యతో పాటు తన కొడుకు భైరవ్ హత్యకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ రవి ఎవరు? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా? చివరకు శ్రావణి చెర్రీ కు దగ్గరైందా? లేక రవికి దగ్గరైందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్ ఉన్న సబ్జెక్ ను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించారు సాయి సునీల్ నిమ్మల. ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను మలిచారు. డబుల్ మీనింగ్ జోకులు.. కుల్లి కామెడీ లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అజయ్ పట్నాయక్ అద్భుతమైన సంగీతం సినిమాకు ప్లస్. ఆర్పీ, పట్నాయక్, సునీత పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు. ఎవరెలా చేశారంటే? చెర్రీ పాత్రలో నటించిన (యామిన్ రాజ్) తన నటనతో అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. శ్రావణి పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక రేవ్రి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. రవి పాత్రలో లెక్చరర్‌గా నటించిన విరాట్ కార్తిక్ తన పాత్రకు న్యాయ చేశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా నటించిన మెహబూబ్ బాషా, బండ సాయి, బక్క సాయి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, క్రైమ్‌ను సాల్వ్ చేసే విషయంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్, వారి ఆలోచన తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత, యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, , ప్రత్యూష, గోపీనాయుడు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. సాంకేతికత విషయాకొనికొస్తే శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ బాగుంది.. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ
టైటిల్: పిజ్జా-3 ద మమ్మీ నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ వెంకట్ తదితరులు నిర్మాణ సంస్థ: తిరుకుమరన్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత: సీవీ కుమార్ దర్శకుడు: మోహన్ గోవింద్ సంగీతం: అరుణ్ రాజ్ ఎడిటర్: అశ్విన్ సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్ విడుదల తేది: 2023 ఆగస్టు 18 'పిజ్జా 3' కథేంటి? నలన్(అశ్విన్ కాకుమాను) ఓ రెస్టారెంట్‌కి యజమాని. కాయల్(పవిత్రా మారిముత్తు) అనే యాప్ డెవలపర్‌తో ప్రేమలో ఉంటాడు. తమ పెళ్లి గురించి మాట్లాడాదమని ఆమె అన్నయ్యని కలిస్తే నలన్ని అవమానిస్తాడు. నలన్ రెస్టారెంట్లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అతడికి తెలిసిన కొందరు వ్యక్తులు వరసగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. అయితే ఈ మరణాలకు ఓ దెయ్యంతో సంబంధం ఉంటుంది. మరి ఆ ఆత్మ ఇంతమందిని చంపడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే 'పిజ్జా 3' స్టోరీ. (ఇదీ చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? 2012లో ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజైన 'పిజ్జా' సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏడాదే(2013) 'పిజ్జా 2' వచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్‌లా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో పార్ట్ 'పిజ్జా 3- ద మమ్మీ'. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా తెలుగులో తాజాగా ఈ మూవీ రిలీజైంది. ఫస్టాప్ విషయానికొస్తే.. చిన్న సైజ్ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ చూపించే సీన్‌తో సినిమాని మొదలుపెట్టారు. ఓ ఫ్యామిలీలోని తండ్రి దగ్గరున్న ఆ బొమ్మ.. అనుకోకుండా రెస్టారెంట్ నడుపుతున్న నలన్ దగ్గరకు చేరుకోవడం, పనివాళ్లు దాన్ని తీసి ఓ చోట పెట్టడం, దీంతో రాత్రుళ్లు ఆ రెస్టారెంట్లో వింత వింత శబ్దాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మధ్యమధ్యలో హారర్ సీన్స్ వస్తుంటాయి. మరోవైపు నలన్‌కి తెలిసిన వ్యక్తులు చనిపోవడం లాంటి సీన్స్‌తో నడిపించారు. ఇంటర్వెల్ టైంకి దెయ్యాన్ని చూపించి కాస్త ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో అసలు ఆ దెయ్యం ఎందుకు హత్యలు చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంతో హీరో నలన్‌కి లింక్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంటర్వెల్ వరకు పెద్దగా రివీల్ చేయకుండా స్టోరీని సాగదీసిన దర్శకుడు.. సెకండాఫ్ కోసం మొత్తం కంటెంట్‌ని దాచిపెట్టుకున్నాడు. పోనీ అది కొత్తగా ఏమైనా ఉందంటే లేదు. ఇప్పటికే చాలా హారర్ సినిమాల్లో వాడేసిన స్టోరీ లైన్‌తోనే సినిమా తీశారు. అక్కడక్కడా భయపెట్టినా, పెద్దగా ఎంటర్ టైన్ చేయలేకపోయారు. సినీ ప్రేమికులు ఇప్పటికే వందల కొద్దీ హారర్ సినిమాలు చూసి రాటుదేలిపోయారు. ఇలాంటి వాళ్లని భయపెట్టాలంటే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. అలా కాదు రెగ్యులర్ రొటీన్ స్టైల్లో తీస్తాం అంటే కుదరరు. ఈ మూవీ విషయంలో రొటీన్ ఫార్మాట్‌నే డైరెక్టర్ ఫాలో అయిపోయాడు. క్రికెట్ బంతి తగలడం వల్ల అమ్మాయి మెమొరీ లాస్, 250 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనిషి చనిపోయినా సరే అతడి శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవడం లాంటి సీన్స్‌లో ఎందుకో లాజిక్ మిస్ అయ్యారని అనిపించింది. 'పిజ్జా' అనే పేరు కూడా హైప్ కోసమే పెట్టారు తప్పితే దీనికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఎవరెలా చేశారు? ఇందులో నలన్ అనే పాత్రలో నటించిన అశ్విన్ కాకుమాను ఫరిది మేరకు యాక్ట్ చేశాడు. అతడి లవర్ కాయల్గా చేసిన పవిత్రా మారిముత్తుకు పెద్దగా స్కోప్ దొరకలేదు. కథకు కీలకమైన రోల్స్‌లో నటించిన అభి నక్షత్ర, అనుపమ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే ఓకే. హీరోహీరోయిన్ దగ్గర నుంచి ఎవరి యాక్టింగ్ కూడా ఏమంత గొప్పగా అయితే లేదు. టెక్నికల్ విషయాలకొస్తే హారర్ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. 'పిజ్జా 3' చిత్రంలో సంగీతం పరంగా పాస్ మార్కులే పడ్డాయి. సినిమాటోగ్రఫీ మరింత బెటర్‌గా ఉండాల్సింది. ఫస్టాప్ నిడివి విషయంలో ఎడిటర్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఫైనల్‌గా దర్శకుడు మోహన్ గోవింద్ గురించి చెప్పుకోవాలి. హారర్ సినిమా అంటే రొటీన్‌గా దెయ్యం, దానికి ఓ ప్లాష్ బ్యాక్ అన్నట్లు కొత్తగా ట్రై చేసి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'పిజ్జా 3' చూడటానికి బాగానే ఉన్నా.. దెయ్యం మాత్రం పెద్దగా భయపెట్టలేదు. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
టైటిల్: పోర్ తొళిల్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా దర్శకుడు: విఘ్నేశ్ రాజా సంగీతం: జేక్స్ బెజోయ్ ఎడిటర్: శ్రీజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ విడుదల తేది: 2023 ఆగస్టు 11 (సోనీ లివ్) థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అలా కొన్నాళ్ల ముందు తమిళంలో విడుదలైన 'పోర్ తొళిల్' సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ స్టోరీకి తోడు సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్(అశోక్ సెల్వన్) వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా ఉంటుంది. తిరుచ్చిలో జరిగిన ఓ మర్డర్ కేసు విచారణ బాధ్యత ఈ ముగ్గురికి అప్పగిస్తారు. దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చివరకు లోకనాథన్, ప్రకాశ్, వీణ... హంతకుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే 'పోర్ తొళిల్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా ఏదైనా సరే దాదాపుగా రెండే అంశాలు ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటిలో ఏదో ఓ పాయింట్ ఆధారంగానే దాదాపు అన్ని మూవీస్ తీస్తుంటారు. 'పోర్ తొళిల్'కి కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. అయితే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే థ్రిల్. మూవీ చూస్తున్నంతసేపు మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ ఏదో ఓ కొత్త ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మ్యాజిక్ అదే. ఫస్టాప్ విషయానికొస్తే.. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ చోట యువతి శవం కనిపిస్తుంది. అలా ఫస్ట్ సీన్‌తోనే దర్శకుడు నేరుగా పాయింట్లోకి తీసుకెళ్లిపోయాడు. అనంతరం ఎస్పీ లోకనాథన్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్ పాత్రల పరిచయం. మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉండే ఈ ఇద్దరు కలిసి, ఓ మర్డర్ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలోనే వీళ్లకు ఆధారాలు ఒక్కొక్కటిగా దొరకడం.. ఇలా స్టోరీ చకచకా పరుగెడుతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓ టెంపోలో సాగిన సినిమా.. సెకండాఫ్‌లో మాత్రం మంచి ట్విస్టులతో మరో రేంజుకి వెళ్లింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మంచి థ్రిల్ ఇచ్చే సీన్స్‌తో ఎండ్ చేయడం బాగుంది. ఓవైపు లోకనాథన్, ప్రకాశ్... మర్డర్ కేసు దర్యాప్తు చేస్తుండగానే వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా సాధారణ ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్ అమాయకత్వంతో సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది. సీన్స్ అన్నింటికీ క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం బాగుంది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని కాకుండా చివర్లో ఓ సందేశం ఇచ్చారు. అయితే అది చూసిన తర్వాత నిజంగానే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో కిల్లర్స్‌లా మారతారా అనే డౌట్ వస్తుంది. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కనిపించే పాత్రలు చాలా తక్కువ. కాకపోతే ప్రతి ఒక్కరినీ దర్శకుడు బాగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌గా అశోక్ సెల్వన్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రకాశ్ పాత్ర మొదట భయస్తుడిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మారిపోతుంది. వీణగా నిఖిల్ విమల్ బాగానే చేసింది. ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనుకుంటాం. కానీ మూవీ చివరకొచ్చేసరికి ఈమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. కెన్నడీగా శరత్‌బాబు రోల్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. 'పోర్ తొళిల్' సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, దర్శకుడు విఘ్నేశ్ రాజాతో కలిసి మంచి థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు అందించారు. హీరోహీరోయిన్లు ఉన్నారు కదా అని లవ్ ట్రాక్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు మంచి పనిచేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే 'పోర్ తొళిల్' బెస్ట్ ఆప్షన్. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
'జైలర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తలైవా మేనియాతో అంతా సందడి సందడిగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఓ మాదిరిగా సక్సెస్ అయింది. దీంతో ఈ వీకెండ్ బాగానే వసూళ్లు రాబట్టే అవకాశముంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీ పార్ట్నర్ని ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం ఆ విషయాలు బయటకొచ్చేశాయి. ఇంతకీ 'జైలర్' ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) 'జైలర్' కథేంటి? టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీ అధికారి. విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. దీంతో కొడుకు ఆచూకీ కోసం ముత్తు చాలా తిరుగుతాడు. మరి ముత్తు, కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? అనేదే 'జైలర్' స్టోరీ. ఆ ఓటీటీలేనే? రజినీకాంత్ 'జైలర్' సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతమందించగా, నెల్సన్ దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడినప్పటికీ.. సన్ పిక్చర్స్ సొంత సంస్థ సన్ నెక్స్ట్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెలన్నర తర్వాత అంటే సెప్టెంబరు చివర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!) -
Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ
టైటిల్: జైలర్ నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఎడిటర్: ఆర్.నిర్మల్ సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ విడుదల తేది: 2023 ఆగస్టు 10 'జైలర్' కథేంటి? ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే. ఎలా ఉందంటే? ముత్తు అదేనండి రజినీకాంత్.. విలన్ డెన్లోకి వెళ్లి, అతడికి వార్నింగ్ ఇస్తాడు. స్టైల్‌గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు. ఇంటర్కట్లో మరో రెండు చోట్ల శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కూడా అదే టైంకి సిగరెట్స్ స్టైల్‌గా వెలిగిస్తారు. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇదంతా చెప్పడానికి చాలా నార్మల్‌గా ఉన్నాసరే.. స్క్రీన్‌పై ఈ సీన్ చూస్తున్నప్పుడు మీరు రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి. ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), అతడి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఏడిపిస్తుంటాడు. కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం.. పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే మంచి హై ఇస్తుంది. ఇంటర్వెల్ వరకు రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం గందరగోళానికి గురిచేశాడు. అప్పటివరకు ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో ఎటెటో పోతుంది. అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. ఫైనల్లీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్, ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప ఇంకేం లేదు! డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అయిన నెల్సన్.. 'జైలర్' విషయంలోనూ అదే ఫార్ములా పాటించాడు. ఫస్టాప్‌లో రజినీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ పై కనిపించే యాక్టర్స్ అందరూ సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. మనకు మాత్రం నవ్వొస్తుంటుంది. అదే 'జైలర్'లో మ్యాజిక్. ఎవరెలా చేశారంటే? 'జైలర్'లో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఆయనకు ఇలాంటివన్నీ కొత్తేం కాదుగా! తన మార్క్ మేనరిజమ్స్‌తో.. విజిల్స్ వేయించే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో రజినీ యాక్టింగ్ మీకు కచ్చితంగా హై ఇస్తుంది. రజినీకి భార్యగా రమ్యకృష్ణ హుందాగా నటించింది. కొడుకు అర్జున్‌గా వసంత్ రవి డిఫరెంట్ పాత్రలో ఓకే అనిపించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ నిడివి చాలా తక్కువ. కానీ ఉన్నంతలో వీళ్లకు ఎలివేషన్స్ బాగా పడ్డాయి. విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్ బాగానే చేశాడు. కానీ అతడు పాత్రలో తమిళ నేటివిటి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. సునీల్ ఇందులో బ్లాస్ మోహన్ అనే సినిమా హీరో పాత్రలో నటించాడు. కానీ ఇతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. తమన్నా.. ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. యోగిబాబు, వీటీవీ గణేశ్ ఉన్నంతసేపు నవ్వించారు. మిగిలిన వాళ్లు తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరో అని చెప్పొచ్చు. పాటల సంగతి పక్కనబెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజినీకాంత్‌ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటే నార్మల్ ఆడియెన్స్‌కి 'జైలర్' నచ్చుతుంది. రజినీకాంత్ అభిమానులకు అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది! -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. -
Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నాళ్లుగా హిట్స్ లేక అల్లాడిపోతున్న తలైవా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేస్తారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతిదీ ఆకట్టుకునేసరికి అంచనాలు పెంచేసుకున్నారు. దీంతో 'జైలర్' ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోయారు. మరి ఆ అంచనాల్ని అందుకుందా? (ఇదీ చదవండి: జైలర్ రిలీజ్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న తలైవా!) ఓవర్సీస్లో 'జైలర్' షోలు ఆల్రెడీ మొదలైపోయాయి. దీంతో సినిమా చూస్తున్న పలువురు ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందనేది హింట్ ఇచ్చేస్తున్నారు. అయితే యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఫస్ట్ షోలు కాస్త ఆలస్యంగా పడ్డాయి. అయితేనేం రజినీ ఫ్యాన్స్ ఇప్పటికే ట్విట్టర్లో పోస్టులు, వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్, డార్క్ కామెడీ గట్టిగా ఉన్నాయట. పక్కా మాస్ స్టైల్ ఎంటర్ టైన్మెంట్ మూవీ అని చెబుతున్నారు. రూ.1000 కోట్ల బొమ్మ అని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'సాక్షి' బాధ్యత వహించదు. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) #Jailer Inside reports ✅ - Worst Screenplay - Story lagging - Dark comedy also not worked - 1st Half : OK - 2nd Half : 👎🏻 Overall #JailerDisaster 💯 pic.twitter.com/0lHUw8tgDH — Ajith Offline Mafia (@Offline_Mafia) August 9, 2023 #jailer Blockbuster Report 💥💥🤩pic.twitter.com/UfeQJVnnLQ — 🇧🇷DILLIᴬᵏ𝕏⚜️ (@itsdilli0700) August 10, 2023 #Jailer Review Blockbuster🔥#SuperstarRajinikanth get terrific writing & performs well✌️ Other Casts like Vinayakan, Ramya, Yogi were too good💥 Anirudh's BGMs👌 Past Scenes😃 Mathew & Narasimha Scenes👏#Nelson 👍 Rating: ⭐⭐⭐💫/5#JailerFDFS #JailerReview #Tamannaah pic.twitter.com/FkYK6AaUGK — Kumar Swayam (@KumarSwayam3) August 10, 2023 #JailerDisaster #Jailer honest review 💯💯💯#Leo pic.twitter.com/2AcMaRa9Pq — TN 72💥 (@mentalans) August 9, 2023 600 Days 😂💪🔥 #JailerReview #Jailer #JailerFDFS @actorvijay #Leo pic.twitter.com/XrVWojk6BL — 𝙊𝙏𝙁𝘾 𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧 (@OTFC_Team) August 10, 2023 #JailerBlockbuster#JailerReview - 1st Half👇 💥 Dark Comedy Working So Well🔥 💥Yogi Babu Timing 🔥🔥 💥#Thalaivar Character Intro & Reveal 🔥🔥🔥 💥 #Hukkum Placement 😱 💥 #Ani BGM Ultimate 🙌 💥 #JailerFDFS Ultimate Interval 💯 Ini Pechee Ila VECHUU Tan!#Jailer pic.twitter.com/Lg1FddVfF5 — Ms Dhoni (@msdhonicsk777) August 10, 2023 #Jailer: ⭐️⭐️⭐️⭐️ SAILER Well Paced Plot Driven Wholesome Entertainer. ||#JailerFDFS |#JailerReview || Superstar #Rajinikanth as Tiger Muthuvel Pandian is Charismatic, Valiant and Indomitable throughout the movie. Huge comeback from Nelson with a gripping story line and… pic.twitter.com/DFBN8034b2 — Manobala Vijayabalan (@ManobalaV) August 10, 2023 #JailerFDFS #Jailer #NelsonDilipkumar however, is the music by Anirudh, which transports you to a different world entirely - truly out of this https://t.co/hKLh7VIe7M the end, "Jailer" is a cinematic triumph that seamlessly blends star power, music, suspense. Don't miss out ! — Aneesh Krishna (@Aneeshmurugan) August 9, 2023 The 1000 c movie releasing Today#JailerFDFS just a hour#Rajinikanth𓃵 #JailerFromToday — Sathish (@sathishvjwsrk) August 9, 2023 #Jailer Inside reports from France 🇫🇷FDFS ✅ - 1st half lag - Story Screenplay boring, to much violence - Rajini okayish - 2nd Half waste - Anirudh vera level Overall #JailerDisaster pic.twitter.com/FDh5OP0jIt — 𝕾𝖊𝖓𝖙𝖍𝖆𝖓 ѴJ𝕏ᴸᴱᴼ🦁 (@Senthan_leo) August 9, 2023 #Jailer #JailerFDFS #JailerReview Second Half Totally Disappointment 😞#JailerDisaster pic.twitter.com/sbOFk5TfL7 — ✰VᎥjสy✰ᴸᵉᵒツ (@iTz_Vijay_45) August 10, 2023 #Jailer Pakka Mass styles entertainment movie #Review from #USA #Rajinikanth @Nelsondilpkumar @rajinikanth @Anirudh_FP #jail fight funny & Mass #jaichuta @Nelsondilpkumar — purusothamanT (@TrPurush) August 9, 2023 An #USA Theatre Manager says about #SuperstarRajinikanth and about the Craze of #Jailer 🔥🔥🔥🔥🔥🔥🔥#Rajinikanth | #JailerUSA | #superstar @rajinikanth pic.twitter.com/PIqFcj1cYx — Suresh Balaji (@surbalu) August 9, 2023 #Jailer celebrations started in Canada 💥💥💥💥#Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS #Rajinikanth pic.twitter.com/FyKu2BBMg5 — Rajini Fans Germany 🇩🇪 (@RajiniFCGermany) August 10, 2023 #JailerFDFS begun 🔥 Titla Card 🙌😍#Thalaivar #Jailer #Superstar #Rajinikanth𓃵 #JailerFDFS#Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS pic.twitter.com/zEJziFQUaQ — rebel Star Prabhas (@PrabhasAana) August 10, 2023 #Jailer Andhra/TS celebration started already 🤗💥💥💥 #Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFSpic.twitter.com/KeyEEQnjL3 — Achilles (@Searching4ligh1) August 9, 2023 #Thalaivar festival started #Jailer #Superstar #Rajinikanth𓃵 Entry 💥#JailerFDFS #Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS pic.twitter.com/cawqXtXWM5 — rebel Star Prabhas (@PrabhasAana) August 10, 2023 THE BLOCKBUSTER BEGINS 🔥🤘#WeLoveYouThalaiva #JAILER 💥😎#Rajinikanth #Superstar #Thalaivar #SuperstarSupremacy @rajinikanth pic.twitter.com/ACR86Mrak5 — Rajini✰Followers (@RajiniFollowers) August 10, 2023 -
అలా ఇలా ఎలా సినిమా రివ్యూ
టైటిల్: అలా ఇలా ఎలా నటీనటులు: పూర్ణ, శక్తి వాసుదేవన్, రాజా చెంబోలు, నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ దర్శకుడు: రాఘవ ద్వారకి నిర్మాత: జి.నాగరాజు విడుదల తేది: 22 జూలై 2023 కథ అను (పూర్ణ) అబద్దం అంటే సహించదు. అబద్దాలు ఆడదు, ఎవరైనా అబద్ధాలు ఆడి మోసం చేసినా అస్సలు ఊరుకోదు.. అలాంటి అను.. సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. మరో వైపు కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్.. మిత్రను చంపాలని అనుకుంటాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్తాడు? మిత్ర ఎవరు? సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆమెను మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ. నటీనటులు అను పాత్రలో పూర్ణ చాలా బాగా నటించింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమెకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. శక్తి వాసుదేవన్ భిన్న పార్శ్వాలను చూపించాడు. కార్తీక్ కారెక్టర్లో రాజా బాగానే మెప్పించాడు. నాగబాబు, బ్రహ్మానందం, అలీ సితార, సీత, షాయాజీ షిండే, రేఖ ఇలా అందరూ చక్కగా నటించారు. ప్రేమ కథల మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా కూడా కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తే దాన్ని జనాలు స్వీకరిస్తారు. ప్రేమ, మోసం అనే కాన్సెప్టుల మీద గతంలో బోలెడన్ని సినిమాలు వచ్చినా, ఇందులో దాన్ని కాస్త కొత్తగా చూపించినట్లనిపించింది. విశ్లేషణ ఇంటర్వెల్ వరకు ఒక సినిమాను చూపిస్తే.. తరువాత ఇంకో రకమైన సినిమాను చూపించినట్టు అయింది. ప్రథమార్దం ఫన్నీగా సాగుతుంది. బ్రహ్మానందం, అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో కామెడీకి పెద్ద పీట వేస్తే రెండో భాగంలో మాత్రం కథ మీద దృష్టి సారించారు. సెకండాఫ్‌లో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. క్లైమాక్స్ అయితే ఎవరూ గెస్ చేయలేరు. చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. సినిమాలో అక్కడక్కడా సాగదీసి బోర్ కొట్టించినా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ పాటలు, సంగీతం మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇంకొన్ని సీన్లకు కత్తెర పడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
Natho Nenu Review: 'నాతో నేను' సినిమా రివ్యూ
టైటిల్: నాతో నేను నటీనటులు: సాయికుమార్, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి, ఐశ్వర్య తదితరులు బ్యానర్: శ్రీ భవ్నేష్ ప్రొడక్షన్స్ సమర్పణ: ఎల్లలుబాబు టంగుటూరి నిర్మాత: ప్రశాంత్ టంగుటూరి సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్‌రెడ్డి సంగీతం: సత్య కశ్యప్ ఎడిటింగ్: నందమూరి హరి దర్శకత్వం: శాంతి కుమార్ తూర్లపాటి డైలాగ్ కింగ్ సాయి కుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నాతో నేను'. జబర్దస్త్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాంతి కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుల్లితెరపై కామెడీతో అలరించిన ఈయన.. డైరెక్టర్‌గా వెండితెరపై సత్తా చాటాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? ఓ గ్రామంలో కోటీశ్వరరావు(సాయికుమార్) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కష్టాన్ని తెలుసుకుని వరమిస్తాడు. మరోవైపు కోటిగాడు(సాయి శ్రీనివాస్), దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై లవ్ చేసుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపోయేసరికి సాయికి ఐశ్వర్య హ్యాండ్ ఇస్తుంది. మరో స్టోరీలో ఓ మిల్లులో పనిచేసే కోటిగాడు (ఆదిత్య ఓం).. నాగలక్షీ(దీపాలి) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. 60 ఏళ్ల కోటీశ్వరరావు, 40 ఏళ్ల కోటిగాడు, 20 ఏళ్ల కోటీగాడు జీవితంలో ఏం జరిగింది? స్వామిజీ కోటీశ్వరరావుకి ఇచ్చిన వరం ఏంటనేది 'నాతో నేను' స్టోరీ. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? మనిషి అనే దానికంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అనే స్టోరీతో తీసిన సినిమా ఇది. 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు ఆర్టిస్ట్‌లు నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి, దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఈ సినిమాతో ఇచ్చారు. సాయికుమార్ డైలాగ్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. వాళ్ల పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్తవాళ్లే అయినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్‌గా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం కోసం ఓసారి చూడొచ్చు. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఎవరెలా చేశారు? కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పనిచేస్తూ, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన బాగుంది. బ్రేకప్ అయిన కుర్రాడి పాత్రలో సాయి శ్రీనివాస్ బాగా నటించాడు. మొదటిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్ మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు. కానీ దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డారు. మాటలు బావున్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకటుకున్నాయి. రెట్రో సాంగ్, ఐటెమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. 'మనిషి ఎంత డబ్బు సంపాదించిన మన అని తోడు లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు అని నిదర్శనమే నాతో నేను సినిమా సినిమాతో నిదర్శనం ఇలాంటి సినిమాలు సొసైటీ చాలా అవసరం' (ఇదీ చదవండి: ‘డిటెక్టివ్ కార్తీక్’ మూవీ రివ్యూ) -
'భారతీయన్స్' సినిమా రివ్యూ
టైటిల్: భారతీయన్స్ నటీనటులు: నీరోజ్ పుచ్చా, సుభా రంజన్, సోనమ్ టెండప్ తదితరులు నిర్మాత: డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి దర్శకుడు: దీనరాజ్ సంగీతం: సత్య కశ్యప్, కపిల్ కుమార్ సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల విడుదల తేదీ: జూలై 14 దేశభక్తిని చాటే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మన సైనికుల ప్రాణ త్యాగాలు, శత్రు దేశాల కుట్రలను చూపిస్తూ ఇప్పటికే చాలానే మూవీస్ వచ్చాయి. ఇప్పుడు 'భారతీయన్స్' పేరుతో ఓ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రవాస భారతీయుడు శంకర్ నాయుడు నిర్మించగా.. దీనరాజ్ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) కథేంటి? ఈ కథలో పాత్రలకు పేర్లుండవు. ప్రాంతాల పేర్లతో పిలుస్తుంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలీ, బెంగాలీ, త్రిపుర, పంజాబీలు ఇలా ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ కొందరు ట్రైనింగ్ ఇస్తారు. చివరకు వారిని ఇండియన్ బోర్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్స్ ఏంటో తెలుసుకు రావాలని చెబుతారు. అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వాడు వేసిన ఎత్తు ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? దేశభక్తి సినిమాలు, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద కుట్రలు, చైనా, పాకిస్థాన్, ఇండియా అనే అంశాల మీద సినిమా తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని నిర్మాత శంకర్, దర్శకుడు దీనరాజ్ చేశారు. అయితే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. నటీనటుల ప్రభావం ఆడియెన్స్ మీద మరి కొంత పడుంటే బాగుండేది. ప్రథమార్థం అంతా పాత్రల పరిచయం, వారి వారి నేపథ్యాలు చూపించడంతో గడిచింది. ద్వితీయార్థంలోనే అసలు కథ, ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. క్లైమాక్స్ కోసం బాగానే కష్టపడినట్లుగా కనిపించింది. సినిమా ముగింపు అందరినీ కదిలిస్తుంది. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమిది. ఎవరెలా చేశారు? 'భారతీయన్స్' సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి. దేశభక్తిని చాటే సన్నివేశాలుంటాయి. వాటిలో నటీనటులు చక్కగా నటించారు. భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి ఇలా అందరూ చక్కగా నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా కెమెరామెన్ చూపించారు. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే దేశభక్తి నేపథ్యంలో సినిమా తీయడం నిజంగా అభినందనీయం. (ఇదీ చదవండి: ‘మహావీరుడు’ మూవీ రివ్యూ) -
‘భాగ్ సాలే’మూవీ రివ్యూ
టైటిల్: భాగ్ సాలే నటీనటులు: శ్రీ సింహా ,నేహా సోలం, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష, సుదర్శన్ తదితరులు నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి సంగీతం: కాళ భైరవ విడుదల తేది: జులై 7, 2023 ‘భాగ్ సాలే’ కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన (శ్రీసింహా) ఓ చెఫ్. ఎప్పటికైనా ఓ స్టార్ హోటల్ని స్థాపించాలని అతని ఆశయం. కానీ హోటల్ని స్థాపించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. తాను రాయల్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలం)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యాముల్ (జాన్ విజయ్) అనే రౌడీ ఓ డైమండ్ రింగ్ కోసం మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. రూ.25 కోట్లు విలువ చేసే ఆ రింగ్‌ని తీసుకొచ్చి ఇస్తేనే అతన్ని వదిలేస్తానని కండీషన్ పెడతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లికి ఓకే చెబుతానని నళిని(నందిని రాయ్) శ్యాముల్కి కండీషన్ పెడుతుంది. అసలు ఆ రింగ్ నేపథ్యం ఏంటి? నళినికి ఆ రింగే ఎందుకు కావాలి? ఆ రింగుకు మాయ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? మాయ కోరిక మేరకు ఆ రింగ్‌ని తీసుకురావడానికి అర్జున్ పడిన కష్టాలేంటి? అర్జున్ రిచ్ పర్సన్ కాదని తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? ఈ కథలో రమ్య(వర్షిణి), ఎస్సై ప్రామిస్రెడ్డి(సత్య) దంపతుల పాత్ర ఏంటి? చివరకు ఆ రింగ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి చిత్రాల్లో క్రైమ్ బలంగా ఉండాలి. అది లేకపోతే సినిమాపై అంత ఆసక్తి ఉండదు. బాగ్సాలే విషయంలో బలమైన క్రైమ్ లేదు. కానీ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టి, క్రైమ్, స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు. రింగ్ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి రెండు యాంగిల్స్‌లో నడుతుంది. ఒకపైపు హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి గోల, మరోవైపు రింగ్ కోసం విలన్ చేసే ప్రయత్నాలను చూపిస్తూ కథనం సాగుతుంది. విలన్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఆమె తండ్రిని విడిపించడానికి హీరో పడే పాట్లు, చెప్పే అబద్దాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో ఆ రింగ్‌ని దొంగిలించి ఒక చోట పెట్టడం..అది వేరు వేరు వ్యక్తుల చేతికి వెళ్లడం .. దాని కోసం విలన్ గ్యాంగ్, హీరో పడే తిప్పలు అన్నీ కామెడీగా సాగుతాయి. ప్రామిస్ రెడ్డి గా సత్య చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా సన్నివేశాలను ఇంతకు ముందెప్పుడో చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే వెళ్తే ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రకి శ్రీసింహా న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే ఇందులో కూడా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మాయ పాత్ర పోషించిన నేహా సోలంకి రెగ్యులర్ హీరోయిన్లలా కేవలం పాటలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. విలన్ బామ్మర్థి జాక్సన్‌గా వైవా హర్ష చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, సత్య, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, సుదర్శన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ సంగీతం. పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ
టైటిల్: రంగబలి నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: పవన్ బాసంశెట్టి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: 07-07-2023 హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ! ఎవరెలా చేశారు? హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. -చందు, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నారాయణ & కో’ మూవీ రివ్యూ
టైటిల్: ‘నారాయణ & కో’ నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణ అనుకోకుండా వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అంతా కలిసి చేసే తింగరి పనులే ‘నారాయణ అండ్ కో మూవీ కథ. అందుకే ఈ చిత్రానికి ‘ది తిక్కల్ ఫ్యామిలీ ’ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి తగ్గట్టే కథనం సాగుతుంది. కానీ ప్రతి సన్నివేశం గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథ-కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి. నారాయణ ఫ్యామిలీ పాత్రల పరిచయాలతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు పబ్‌లో కలసుకోవడం.. ప్రెగ్నెంట్ అయ్యానంటూ పెళ్లి చేసుకోవడం.. చకచకా జరిగిపోతుంది. అయితే హీరోపై హీరోయిన్‌కి లవ్ పుట్టే రీజన్ కన్విసింగ్‌గా అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథ-కథనమే బోరింగ్ అనుకుంటే.. సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఓవరాల్‌గా ‘నారాయణ అండ్ కో’ ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయింది. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. హీరో తమ్ముడు సుభాష్‌గా జైకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్తదనం ఎంటంటే.. దేవీ ప్రసాద్, ఆమని పూర్తిగా కామెడీ రోల్ ప్లే చేయడం. నారాయణగా దేవీ ప్రసాద్, జానకిగా ఆమని చేసే కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. సినిమాలో వీరిద్దరికే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఎస్సై అర్జున్‌గా అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే వీరి పాత్రల నిడివి చాలా తక్కువ. సప్తగిరి కామెడీ వర్కౌట్ కాలేదు. పూజ కిరణ్, తోటపల్లి మధుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సంగీతం పర్వాలేదు. ‘దండక డన్ డన్’ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేవు. బీజీఎం ఓకే. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ప్రసాద్ ఐమాక్స్ కీలక నిర్ణయం.. వారికి నో ఎంట్రీ!
హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా రివ్యూల కోసం వచ్చే ఛానెళ్లు, యూట్యూబర్లకు షాకిచ్చింది. ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో వారికి ప్రవేశం లేదని ప్రకటిచింది. వాటిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రసాద్ ఐమాక్స్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. \ (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) ఏ కొత్త సినిమా రిలీజైన ప్రసాద్ ఐమాక్స్ వద్దే ఆడియన్స్ నుంచి రివ్యూలు తీసుకోవడం జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఐమ్యాక్స్ ఆవరణలో రివ్యూలకు ఇకపై అనుమతి ఉండదు. దీంతో రివ్యూల కోసం న్యూస్ ఛానెల్స్, యూట్యూబర్స్ రోడ్లపైనే ఉండి రివ్యూలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి) -
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
‘భారీ తారాగణం’ మూవీ రివ్యూ
టైటిల్: భారీ తారాగణం నటీ నటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు దర్శకత్వం: శేఖర్ ముత్యాల నిర్మాత: బి.వి.రెడ్డి కెమెరా: ఎం.వి గోపి ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేశ్ సంగీతం: సుక్కు నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్ కో-ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ గౌడ్.వి కొరియోగ్రాఫర్: శ్రీవీర్ దేవులపల్లి పాటలు: సుక్కూ, సాహిత్య, కమల్ విహాస్, శేఖర్ బ్యానర్: బివిఆర్ పిక్చర్స్ బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ ఒక కూతురు , ఒక వైఫ్, ఒక లవర్, ఒక పి.ఎ, ఒక ఫ్రెండ్.. ఇలా ఐదుగురు అమ్మాయిలు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ ప్రాబ్లం నుంచి వారు ఎలా బయట పడ్డారు? ఒకరికి హెల్ప్ చేస్తే అది ఎలాగైనా తిరిగి మనదగ్గరకు వస్తుందనేదే కథ. విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు) మంచి స్నేహితులు. అయితే విశ్వనాధ్ కొడుకు సదన్(హీరో), రఘు కూతురు ధనలక్ష్మి,(రేఖ నిరోషా)లు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ ఎంతో ఆప్యాయంగా ఉన్న వీరిద్దరినీ చూసి పెద్దయిన తరువాత వీరిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం పట్నం వచ్చి బి.టెక్ లో జాయిన్ అవుతాడు సదన్. అదే కాలేజీలో చదువుతూ ఎదుటివారికి సహాయం చేయడంలో ముందున్న తార (దీపిక రెడ్డి) ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. సదన్ చేసే పనులతో ఆ తార కూడా సదన్‌ను ఇష్టపడుతుంది. అయితే తారకు అనుకొని సంఘటనలు ఎదురుకావడంతో సదన్‌కు దూరంగా ఉంటుంది. తన ప్రేమను రిజెక్ట్ చేసిందనే భావనతో అమ్మాయిలు అందరూ అంతే అని తిరిగి తన విలేజ్‌కు వస్తాడు. అయితే రఘు తన కూతురు ధనలక్ష్మి కి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. చివరికి చిన్నప్పటి ఫ్రెండ్ సదన్‌ను కూడా పెళ్లి చేసుకోను అంటుంది. మరో వైపు చిట్టెమ్మ దాబా నడుపుతున్న చిట్టెమ్మ (సరయు) కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటుంది. ఇలా శాంతి (సాహితీ దాసరి), ధనలక్ష్మి,(రేఖ నిరోషా) పరిమళ (స్మైళీ ) అనే ఐదుగురు అమ్మాయిల వారి వారి జీవితాలలో వేరే వేరే సందర్భాల్లో వారు పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి తెలివిగా ఎలా బయట పడ్డారు? అనుకోని విధంగా హీరో వీరందరికీ ఎలాంటి సహాయం చేశాడు? సదన్ కు ఈ ఐదుగురు అమ్మాయిలతో ఉన్న లింకేమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా "భారీ తారాగణం" సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు సదన్ పాత్రలో నటించిన అలీ అన్న కొడుకు సదన్ కు ఇది మెదటి చిత్రమైనా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ పాత్రల్లో నటించిన తార (దీపిక రెడ్డి) తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సెకెండ్ హీరోయిన్గా నటించిన ధనలక్ష్మి(రేఖ నిరోషా) కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. చిట్టెమ్మ పాత్రలో సరయు, డాక్టర్‌కు పీఏ పాత్రలో నటించిన పరిమళ (స్మైళీ )లు తమ పాత్రల మేర మెప్పించారు. సైకాలజీ డాక్టర్ గా శశిధర్ పాత్రలో సమీర్, చిట్టెమ్మ దాబా ఓనర్‌గా శ్రీను పాత్రలో (ఛత్రపతి శేఖర్), హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు), ఇలా అందరూ తమ నటనతో మెప్పించారు. హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన సన్నీ, సత్యలు చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందులో ఆలీ ఒక పాటలో నటించడం విశేషం. పొలిటీషియన్‌గా పోసాని పాత్ర చిన్నదే అయినా కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సాంకేతిక నిపుణుల పనితీరు ఆడవారు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు? వాటి నుంచి ఎలా బయట పడాలి? అనే కాన్సెప్ట్‌ను సెలెక్ట్ చేసుకొని దీనికి లవ్,కామెడీ థ్రిల్లర్ ను జోడించాడు డైరెక్టర్ శేఖర్ ముత్యాల. సినిమాకు కావాల్సిన డైలాగ్స్ కొత్త రకంగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్లుగా అనిపించక మానవు. సాహిత్య సాగర్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఎం.వి గోపి తన కెమెరాతో మంచి విజువల్స్ అందించాడు. దేవరాజ్ స్టంట్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. మార్తండ్ కె. వెంకటేశ్. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. బి.వి.రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
-
IQ Movie Review: ఐక్యూ సినిమా రివ్యూ
సినిమా : ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్) నటీ నటులు: సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్, లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు, శీలం శ్రీనివాసరావు, సీఎం రెడ్డి, వాసు వర్మ, తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ GLB కథ, మాటలు, సంగీతం : పోలూరు ఘటికాచలం బ్యానర్ : కె. యల్. పి మూవీస్ సమర్పణ :కాయగూరల రాజేశ్వరి నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి కెమెరా : టి. సురేందర్ రెడ్డి సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్). జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ ఇది ఒక బ్రెయిన్‌కు సంబంధించిన సినిమా. మిడిల్ క్లాస్ అమ్మాయి భూమిక (పల్లవి) చాలా తెలివి గల అమ్మాయి. చిన్నతనం నుంచే యాక్టివ్‌గా ఉంటూ తనకున్న ఐక్యూతో కౌన్ బనేగా కరోడ్ పతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొంటుంది. ఆలా గెలుచుకున్న డబ్బును మిడిల్ క్లాస్ విద్యార్థుల చదువులకు ఖర్చు పెడుతుంది. తన పీ.హెచ్.డి అయిన తరువాత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తుంది. మంచి తెలివి ఉన్నప్పటికీ అదే కాలేజీలో తన ఫ్రెండ్స్‌తో కలసి అల్లరి చిల్లరగా తిరుగుతున్న వివేక్ గ్యాంగ్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంది. అలా వచ్చిన భూమికను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే భూమికను కిడ్నాప్ చేసి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. మరో వైపు తనలో ఉన్న ఐక్యూను చూసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ అమ్మాయి మెదడును అమ్మడానికి ఒక డీల్ కుదుర్చుకొని కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తాడు. ఇంతకీ భూమికను వివేక్ కిడ్నాప్ చేశాడా? లేక ప్రొఫెసర్ చేశాడా? ఆమెతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్ చేసే అజయ్ చేశాడా? దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కేసును పోలీసులు ఎలా చేధించారు? అనేది తెలుసుకోవాలంటే "ఐక్యూ" సినిమా చూడాల్సిందే! నటీ నటుల పనితీరు వివేక్ పాత్రలో నటించిన సాయి చరణ్‌కు ఇది మొదటి చిత్రమైనా బాగానే యాక్ట్ చేశాడు. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయి భూమికగా పల్లవి తన పాత్రలో ఒదిగి పోయింది. భూమిక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ కమిషనర్ పాత్ర పోషించిన సుమన్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు. మిగతా వారందరూ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు "ఐక్యూ" అంటే మేధస్సుకు సంబంధించిన చిత్రం. అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది. విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అనే కొత్త పాయింట్ సెలెక్ట్ చేసుకొని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ GLB. ఎంటర్టైన్ చేసే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. జీవితంలో అప్పుడప్పుడూ అల్లరి చేయచ్చు. కానీ జీవితమే అల్లరిపాలు కాకూడదు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివషర్వాణి ఎడిటింగ్‌కు ఇంకాస్త కత్తెర వేయాల్సింది. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ -
'నేను స్టూడెంట్ సార్' మూవీ ట్విటర్ రివ్యూ
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓవరీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పూర్తయింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నేను స్టూడెంట్ సార్ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని కొందరు ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమా సరికొత్త థ్రిల్ అందించిందని పేర్కొంటున్నారు. కొందరేమో ఫుల్ ఎమోషనల్ డ్రామా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. Dialogues bagunnay, comedy ga start ayyindhi cinema#NenuStudentSir! pic.twitter.com/QBBHJYIeSe — D kalyan (@emptypockettss) June 2, 2023 Picha comedy ra aiyya 😂#NenuStudentSir pic.twitter.com/iV3tEL1Gpb — The Sanjay Siva (@SanjaySiva01) June 2, 2023 This is an really an good concept movie with good action thriller movie and with good drama entertainment in theatre's book your tickets now and watch it today. All the best team#NenuStudentSir 🎟️ https://t.co/Nlv9ZFR0vM#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Bharani (@PrabhasSeenu1) June 1, 2023 Edi cinema ante elanti good and interesting concept tho movie vasthe 💥 blockbuster talk easy ga vastadi Releasing today on theatre book your tickets now 😁#NenuStudentSir! 🎟️ https://t.co/LFP5XOyaUu#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Natrajan (@Siddharthroy031) June 1, 2023