notices
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం లాంటి పరిణామాలతో కార్మికులు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంతో.. నిరవధిక సమ్మెలో పాల్గొంటామని కాంట్రాక్ట్ కార్మికులు చెబుతున్నాయి. -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘ముడా’ స్కాంలో ‘ఈడీ’ దూకుడు.. సీఎం భార్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు. -
యాపిల్.. ఓలా.. ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు
సాఫ్ట్వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.యాపిల్‌పై ఆరోపణలు..యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు..యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు. -
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్.. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు ఆయన న్యాయపోరాటం చేస్తున్నవేళ.. మరోవైపు విచారణకు రావాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్‌గా సంజయ్(Sanjay) వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి స్కిల్ స్కాం కేసు దర్యాప్తు ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా.. 30 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని.. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్(Subramanyam Sriram)వాదనలు వినిపిస్తూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే తనను దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. అగ్ని యాప్ తయారీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ చెబుతోందని, వాస్తవానికి ఆ యాప్ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు సైతం ప్రదానం చేసిందన్నారు. యాప్ తయారీకి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామని, అందులో లోయస్ట్ బిడ్డర్ అయిన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు అగ్నిమాపక శాఖ పనులు అప్పగించిందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించిన సౌత్రికా, యాప్ తయారీని సకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. అగ్ని యాప్ తయారీ పూర్తయి, దాని పనితీరు సంతృప్తికరంగా ఉన్న తరువాతే నగదు విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా.. మార్కెట్ ధరకంటే 5 శాతం తక్కువకే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఏసీబీ మాత్రం హడావుడిగా డబ్బు చెల్లించామంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ లబ్ధి పొందారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, అందువల్ల సంజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ముందస్తు బెయిల్(Anticipatory Bail)ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫార్ములా ఈ - కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు
-
ఏసీబీ దూకుడు.. ఫార్మూలా-ఈ కేసులో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మూలా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ(ACB Notices) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఈ-రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకావడంతో.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్‌కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు బృహత్ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్8 కమ్యూన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేశ్ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్ మీద గత జూలైలో కబ్బన్ పార్కు పోలీసులు కేసు పెట్టారు. -
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో మరో విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడువిద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం సీరియస్ అయ్యింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. -
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ టెర్రర్
అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారనే కారణంతో విజయవాడ నగరంలోని 178 వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థ అధికారులు మూడు మునిసిపల్ సర్కిళ్ల పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులకు వీటిని జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని నోటీసులలో పేర్కొన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఒక రోజు ముందే ప్రారంభించారు. విజయవాడలో 294 సచివాలయాల పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా 1వ తేదీనే వార్డు సచివాలయ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, వీఆర్వోలు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. ప్రతినెలా పెన్షన్ పంపిణీ చేసే బాధ్యతను ఏఎన్ఎం, వీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. సచివాలయ ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఒక రోజు ముందు అంటే.. నవంబర్ 30వ తేదీనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వీఎంసీ అధికారులు నవంబర్ 29న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 5.30 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. వివిధ కారణాలలో కొందరు ఉదయం 7 గంటల తర్వాత పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. గంటన్నర ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నానికే పంపిణీ 95 శాతానికి పైగా పూర్తి చేశారు. విజయవాడ నగర పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉండగా.. 64,099 మందికి అంటే 95.14 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు. అయినప్పటికీ పెన్షన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నగరపాలక సంస్థ అధికారులు 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో సగానికిపైగా నూరు శాతం పంపిణీని పూర్తి చేశారు. ఆస్పత్రులకు వెళ్లి పెన్షన్ అందజేసిన వారికి సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఓ వైపు పెన్షన్ల పంపిణీ జరుగుతుండగానే.. సాయంత్రం 6గంటలకల్లా వీఎంసీ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితివలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వేధిస్తోంది. అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారి పల్లెలో ఓ సచివాలయ ఉద్యోగి ఉదయం 7.40 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. గ్రామంలో లేని ఇద్దరు వ్యక్తులకు మినహా అందరికీ ఉదయం 10 గంటలకల్లా పంపిణీ పూర్తి చేశారు. అయినా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా 12 సచివాలయాల పరిధిలో 87.25 శాతం నుంచి 93.89 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. కానీ.. 94 శాతం పంపిణీ ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆ సచివాలయాల సిబ్బంది మొత్తానికి ఎంపీడీవో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 11 మంది సిబ్బంది పింఛన్ల పంపిణీని ఆలస్యంగా ప్రారంభించారంటూ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాపట్ల జిల్లా అనంతవరంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగి సాంబానాయక్ తన స్వగ్రామం నుంచి తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరి వస్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు సైతం షోకాజ్ నోటీసు జారీ అయింది.నోటీసులు ఉద్దేశపూర్వకమేవీఎంసీ అధికారుల తీరుపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారులు తమతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న తమపూ అధికారులు ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్లు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు ఇబ్బందులకు గురిచేయడాన్ని గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఖండిస్తున్నారు.మళ్లీ తగ్గిన పింఛన్లురాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య నెలనెలా తగ్గిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,57,162 మందికి పింఛన్ ఆగిపోయింది. కూటమి అధికారంలోకి రాకముందు ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా.. తాజాగా శనివారం 63,92,702 మందికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. ఈ నెలలోనే రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 21,472 మేర తగ్గిపోయింది. అంతకు ముందు నెలలో 24,710 మంది, దానికి ముందు నెలలో 22,601 మంది.. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లబ్ధిదారుల సంఖ్య పడిపోతూ వస్తోంది.కొత్తగా ఒక్కరికైనా పింఛన్ ఇవ్వలేదుకొత్తగా పింఛన్ల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. వైఎస్ జగన్ పాలనలో అర్హులు పింఛన్ కోసం ఏడాదిలో ఏ రోజైనా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేశారు. గత ఐదేళ్లలో పింఛన్ల పంపిణీకి సంబంధించి అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలో అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి నుంచి.. ఎన్నికల కోడ్ ముందు వరకు దాదాపు 2 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో ఆర్భాటం లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయగా.. ఇప్పుడు సీఎం మొదలు టీడీపీ నేతలంతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోలకు ఫోజులిస్తూ దండిగా ప్రచారం చేసుకుంటున్నారు.సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు» వచ్చిన సమయం, వెళ్లే సమయం నమోదు చేస్తేనే పనిదినంగా గుర్తింపు» లేకపోతే ఆ రోజుకు సెలవుగానే పరిగణన» స్పష్టంచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ» నేటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడిసాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు సచివాలయంలో విధులకు వచ్చినప్పుడు గానీ, సాయంత్రం వెళ్లే సమయంలో గానీ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేవారు. ఒకసారి హాజరు నమోదైతే ఉద్యోగి ఆ రోజు విధులకు వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించేవారు. ఇక నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం తెలియజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన ఎస్ఎంఎస్లలో స్పష్టంచేశారు. -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్‌కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 'వ్యూహం' ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)ఇప్పుడు ఈ కేసు విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. కాగా, నిన్న (సోమవారం) నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుడమేరు వరదలపై చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదలపై ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయాలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ బుడమేరు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయలేదనే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీ చేసే విషయాన్ని తరువాత చూస్తామని హైకోర్టు పేర్కొంది.చదవండి: ‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే -
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
చంద్రబాబు మరో అబద్ధం.. వైఎస్ జగన్ కౌంటర్
సాక్షి, అమరావతి: గోబెల్స్ ప్రచారాల్లో చంద్రబాబును మించిన వాళ్లు మరెవరూ లేరనే విషయం.. మరోసారి రుజువైంది. అబద్ధాల్ని సృష్టించడం.. వాటిని అంతే అందంగా అమ్ముకోవడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిలాంటి ఉన్నతస్థానంలో ఉండి.. అదీ మీడియా ముందుకు వచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది కూడా. తాజాగా.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంతో నిన్నంతా నడిచిన నాటకీయ పరిణామాలు తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్‌గా చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.‘‘జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు. ఆయన్నేదో(జగన్‌ను ఉద్దేశిస్తూ..) ఆపేశారని.. నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. సూటిగా అడుగుతున్నా.. నిన్ను వెళ్లవద్దని ఎవరైనా ఆపారా?. నోటీసులు ఉంటే మీడియాకు చూపించండి. ప్రజా జీవితంలో ఉండే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది’’ అని చంద్రబాబు మాట్లాడారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తాను అంటే.. పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమంలో ఎవరూ పాలు పంచుకున్నా.. అందరినీ అరెస్ట్ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నారు. ఆలయానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటో? అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నోటీసుల్లోని విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. దీంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం.. బయటపడింది. ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే! -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా..? లేదా..? ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి చెబుతూ, దీనికయ్యే ఖర్చంతా ఆ సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని.. దీనికి వ్యయం ఎంతవుతుందో మార్గదర్శికి చెప్పాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఖర్చు వివరాలు చెప్పిన వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఫైనాన్సియర్స్‌కు తేల్చి చెప్పింది. డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేస్తూ పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను ఆ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వాస్తవాలను నిగ్గు తేల్చాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 (హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు)న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్ జగన్ హయాంలో), మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించడం కోసం నోటీసులు జారీ చేయాలని గత విచారణ సందర్భంగా రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికయ్యే ఖర్చు ఎవరు భరించాలన్నది సందిగ్ధంగా మారడంతో రిజిస్ట్రీ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి పైన పేర్కొన్న ఆదేశాలు ఇచ్చింది. -
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని.. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ కాంట్రవర్శి కామెంట్స్ చేశారు. -
పన్ను నోటీసుల్లో సరళ పదాలు వాడండి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు పంపే నోటీసులు లేదా లేఖలలో సరళమైన పదాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఉన్న అధికారాన్ని వినియోగించడంలో న్యాయబద్దంగా వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, వ్యక్తిగత హాజరు అవసరం లేని ప్రస్తుత డిజిటల్ యుగంలో అధికారులు పన్ను చెల్లింపుదారులతో మరింత ‘న్యాయంగా, స్నేహపూర్వకంగా‘ ఉండాలని అన్నారు. పన్ను నోటీసులు పన్ను చెల్లింపుదారులలో ‘భయ భావనను‘ సృష్టించకూడదని అన్నారు. ఇందుకు బదులుగా నోటీసులు సరళంగా, సూటిగా ఉండాలన్నారు. నోటీసు పంపిన కారణాన్ని మదింపుదారునికి ‘స్పష్టంగా’ తెలియజేయాలని మంత్రి సూచించారు. ‘‘మనం సరళమైన, సులభంగా అర్థమయ్యేలా నోటీసులు జారీ చేసే మార్గాలను అన్వేíÙంచలేమా? ఎందుకు చర్య తీసుకున్నారో, నోటీసు ఎందుకు పంపడం జరుగుతోందో స్పష్టంగా వివరించలేమా?’ అని ఆమె ఈ సందర్భంగా ప్రశి్నస్తూ, ఆయా అంశాలను పన్ను చెల్లింపుదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. వేగవంతంగా రిఫండ్స్... రిఫండ్లను వేగంగా జారీ చేయడంలో మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థికమంత్రి సూచించారు. సమస్యకు తగిన చర్యలను మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులకు తగిన న్యాయపరమైన చర్యలను చివరి ప్రయత్నంగా మాత్రమే అమలు చేయాలని ఆమె కోరారు. పన్ను డిమాండ్‌కు స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం డిపార్ట్మెంట్ లక్ష్యంగా ఉండాలన్నారు. పన్నుల శాఖ మరింత స్నేహపూర్వకంగా, పారదర్శకంగా ఉండాలని తాను తరచూ పేర్కొంటున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, పన్ను అధికారులు ఇన్నాళ్లూ అన్యాయంగా వ్యవహరించారని తాను పేర్కొంటున్నట్లు అర్థం చేసుకోరాదని స్పష్టం చేశారు. -
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
త్వరలో మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణ చివరి అంకానికి చేరడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులకు త్వరలో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారుల నుంచి వాంగ్మూలంతో పాటు అఫిడవిట్లను స్వీకరించి పరిశీలించింది. ఈ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. గడువులోగా అఫిడవిట్ దాఖలు చేయకుండా కమిషన్ ఆదేశాలను ధిక్కరించిన ఓ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి విచారణకు తాజాగా సమన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. కాగా మాజీ ముఖ్యనేత ఒకరు అనారోగ్యంతో ఉన్నారని, విచారణకు హాజరుకాలేరని బీఆర్ఎస్ నేత ఒకరు కమిషన్‌కు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. అయితే ఒకవేళ సమన్లు జారీ చేసినా, విచారణకు రానిపక్షంలో కమిషన్ స్వయంగా ఆ నేత నివాసానికి వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇలావుండగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను వచ్చే వారం నుంచి కమిషన్ ప్రారంభించనుంది. 57 మంది సాక్షులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో కమిషన్‌కు సహకరించేందుకు తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని నియమించాలని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్థిక అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. -
ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంబేడ్కర్ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ.. ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.చంద్రబాబు సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు -
విడాకుల పిటిషన్: మాజీ సీఎం భార్యకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసు ఆర్టికల్ 142ను ఉపయోగించి తన క్లైంట్ ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.2016తో తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్‌ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.ఒమర్ అబ్దుల్లా, పాయల్ ఢిల్లీలోని ఒబేరాయ్‌లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి విడిగానే ఉంటున్నారు. -
కాళేశ్వరం స్కాం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై విచారణ.. తీర్పు రిజర్వ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది.ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం లంచ్ మోషన్ వేయడంతో.. అధికారులకు కోర్టు బ్రేకులు వేసింది. ఇవాళ్టి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. -
వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని తొలగిస్తాం
కాకినాడ రూరల్: కాకినాడ నగరం 49వ డివిజన్లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 452(1) అండ్ 461(1) ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్ 89 (1అండ్2), రెడ్ విత్ సెక్షన్ 82, 90(1) ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడీఏ యాక్ట్–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు. తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొన్నారు. కన్నబాబు లేదా ఆయన అనుమతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కడియాల శ్రీరమ్య డిజిటల్ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్ అవ్వలేదన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. -
విత్తన కంపెనీల టార్గెట్‌పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
నీట్ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల అంశంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. 30న ఫలితాలు వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సెలింగ్ చేపడతామని(జులై 6లోపు పూర్తి చేస్తామని) ఎన్టీఏ కోర్టుకు నివేదించింది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.Supreme Court reiterates that it will not stay the counselling of NEET-UG, 2024.“Counselling will go on and we will not stop it. If the exam goes then everything goes in totality so nothing to fear,” says Supreme Court. pic.twitter.com/ACAB1dmyt5— ANI (@ANI) June 13, 2024ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందురోజు హడావిడిగా ఫలితాలు విడుదల చేయడంపైనా రాజకీయపరమైన విమర్శలు సైతం చెలరేగాయి. దీంతో నీట్లో అవినీతి, అక్రమాలు చోటు ఉండబోదని చెబుతూ ఎన్టీఏ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు విద్యాశాఖ నీట్ గ్రేస్ మార్కుల పునఃసమీక్ష కోసం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేస్ మార్క్‌ల నిర్ణయాన్ని వెక్కి తీసుకోవడం, ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో ఆ కమిటీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.#WATCH | On the Supreme Court's hearing on the NEET-UG 2024 exam, Education Minister Dharmendra Pradhan says "There is no corruption. In connection with the NEET examination, 24 lakh students appear in the examination. A hearing in the Supreme Court is underway today and this… pic.twitter.com/xpS9v55ptY— ANI (@ANI) June 13, 2024 -
కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో తన పాత్రను తెలియజేయాలని ఆయన్ని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. పవర్ కమిషన్ నోటీసుల ప్రకారం.. జూన్ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే.. జూలై 30 వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్ కమిషన్ సంకేతాలిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి.. వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం. -
‘ఫోన్ ట్యాపింగ్’పై మీ వివరణేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీ వివరణేంటో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని.. ఇది టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి సాధారణ సమస్య కాదని, వ్యక్తుల గోప్యతలోకి చొరబడిన అంశమని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సుమోటాగా విచారణ చేపట్టిన హైకోర్టు ‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకుని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమయంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు’అంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం మధ్యాహ్న విరామం తరువాత విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్‌ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. -
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్‌నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబుపై చర్యలకు ఎన్నికల సంఘం సిఫార్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా బాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్‌పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేసింది. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పులను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. తాజాగా మరో ఫిర్యాదు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈవోకు ఫిర్యాదు అందించారు. ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గంపేట సభతోపాటు నర్సంపేట, ఎస్.కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. -
పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు
విజయవాడ,సాక్షి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్(ఈసీ) బుధవారం(ఏప్రిల్10) నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులిచ్చింది. పవన్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్‌కు ఏప్రిల్ 8న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ, వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ఇదీ చదవండి.. చంద్రబాబు నెంబర్‌వన్ కిలాడీ -
అసైన్డ్ అని తెలిసే ఆ భూమిని కొన్నారు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని తెలిసే తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత శుక్రవారం తెలిపారు. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌తో పాటు మరో నిందితుడిని విచారించిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయని వివరించారు. దీంతో సీసీఎస్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ శివానందరెడ్డితో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికి ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కేసు దర్యాçప్తు చేస్తున్నామని శ్వేత వివరించారు. ఈ మేరకు ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. పలుకుబడితో పరిష్కరిస్తానని చెప్పి.. తొలుత అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని చూసిన రియల్టర్లు టీజే ప్రకాష్, గాంధీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ ద్వారా మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన పరిచయాలు, పలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చివరికి ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున (మార్కెట్ కంటే తక్కువ ధర) ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా వీళ్లు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములను లాక్కోవడానికి కుట్ర పన్నారు. పోలీసులను నెట్టేసి పరారు ఈ కేసుల విచారణ కోసం సీసీఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వీళ్లను తోసేసి పారిపోయిన ఉదంతంపై బ్రాహ్మణ కొట్కూరు ఠాణాలో కేసు నమోదైంది. మాండ్ర కనిష్క, మాండ్ర ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డికి సీసీఎస్ పోలీసులు గత మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వీళ్లు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని బయటపెట్టారు. బుద్వేల్లోని భూమి స్వభావంపై తమకు అవగాహన ఉందని కూడా అంగీకరించారు. ఈ భూములపై అప్పటికే ఎంవోయూలు ఉన్నాయని తెలిసినా, భారీ ప్రయోజనాలను పొందే ప్రణాళికతో భూములను కొనుగోలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు వారికి నగదు, చెక్కులు అందించారని బయటపెట్టారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే వారి నుంచి తమ పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. -
కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ‘ ఐటీ’.. రూ.3 వేల కోట్లకు చేరిన నోటీసులు
న్యూఢిల్లీ: తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి ఆదాయపన్ను శాఖకు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన రికవరీ సొమ్ము మొత్తం రూ.3567 కోట్లకు చేరింది. 2014-15,2015-16, 2016-2017,2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.3567 కోట్ల ట్యాక్స్ రికవరీ నోటీసులను రెండు విడతల్లో ఐటీ శాఖ కాంగ్రెస్‌కు పంపింది. రాజకీయ పార్టీలకు ట్యాక్స్ రాయితీలు తొలగించడం కారణాంగానే కాంగ్రెస్ సేకరించిన మొత్తం విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించడంతోనే నోటీసుల్లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం డిమాండ్ నోటీసులను ఐటీ శాఖ తమ పార్టీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, మళ్లీ ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు మరో 2 ఐటీ నోటీసులు -
కాంగ్రెస్‌కు మరో రెండు ‘ఐటీ’ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖ(ఐటీ) వెంటాడుతోంది. శుక్రవారమే(మార్చ్ 29)రూ.1800 కోట్ల మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రెండు నోటీసులను ఐటీ శాఖ పంపిందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఈ నోటీసులు శనివారం రాత్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ట్యాక్స్ టెర్రరిజానికి కాంగ్రెస్ టార్గెట్‌గా మారిందని జైరామ్ ఫైర్ అయ్యారు. కాగా, 2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీని కలిపి రూ.1800 కోట్ల పన్ను కట్టాలని శుక్రవారం ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. నాలుగేళ్ల రిటర్న్స్‌పై రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఐటీ రికవరీ నోటీసులు పంపింది. 2014-15, 2015-16,2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్మెంట్ చేసే చర్యలు ఐటీ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 135 కోట్ల మేర నగదును ఫ్రీజ్ చేసింది. ఇదీ చదవండి.. రూ.1823 కోట్లు చెల్లించండి -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
Income Tax Department: రూ.1,823 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాహుల్ గ్యారంటీ ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు. -
కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. ఈసారి భారీ ఐటీ నోటీసులు
ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ.. కాంగ్రెస్ పార్టీకి పన్ను నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటిరోజే.. ఆదాయ పన్ను శాఖ రూ.1700 కోట్ల బకాయి పన్ను రికవరీ చేయాలని నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వెల్లడించారు. 2017-18 నుంచి 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాలని నోటీసులో పేర్కొంది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్న శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టేందుకు తగిన అధికారాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయని.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక.. 2014-15, 2015-16, 20216-17 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి..రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 22న కోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. ఈ రీఅసెస్మెంట్కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది. చదవండి: ముఖ్తార్ అన్సారీపై విష ప్రయోగం?, జైల్లో ఆహారంలో 40 రోజులుగా.. -
‘అఫిడవిట్’పై మళ్లీ చర్చ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడివిట్లో సరైన వివరాలు అందించలేదనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేసి సాంబశివరావుకు రాష్ట్ర హై కోర్టు నోటీసులు పంపింది. దీంతో మరోసారి అఫిడవిట్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జలగం వర్సెస్ వనమా.. తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున జలగం వెంకటరావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకటరావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2023 జూన్‌లో వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసన సభ కార్యదర్శిని జలగం వెంకటరావు కోరారు. ఇంతలో హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచే రగడ.. జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అంశంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అయితే రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాలు నింపేందుకు, సరి చూసుకునేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే నామినేషన్ దరఖాస్తుల పరిశీలన గరం గరంగా జరిగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్థి వై. కామేశ్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు అఫిడవిట్లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్థి జలగం వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో మరోసారి అఫిడవిట్ అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేస్తోందని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కించపరిచేలా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈవో స్పష్టం చేశారు. సీఈవోకు ఫిర్యాదు చేసిన వారిలో లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మద్దాళి గిరి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎ.నారాయణమూర్తి, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఉన్నారు. -
24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్ కుమార్‌మీనా స్పష్టం చేశారు. -
ఎన్నికల బాండ్ల కేసు.. SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ వివరాల వెల్లడి వ్యవహారం స్టేట్ బాండ్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని చీఫ్‌జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీకి ఎస్బీఐ ఇచ్చిన వివరాల్లో ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు వెల్లడించకపోవడం వల్ల ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే నిర్ధిష్ట సమాచారం లేదు. బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ ( ఈసీ) గురువారం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల పూర్తిస్థాయి సమాచారం లేదని ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ 2018 స్కీమ్‌ను రద్దు చేస్తూ బాండ్ల వివరాలు ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. వివరాలందించేందుకు తమకు సమయం కావాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును కోరగా సమయం ఎందుకని కోర్టు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చ్ 15లోగా బాండ్ల వివరాలందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈసీకి ఎస్బీఐ బాండ్ల వివరాలందజేసింది. ఇదీ చదవండి.. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ -
ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత
దుండిగల్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు. కళాశాలకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐఏఆర్ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 20 రోజుల్లోపే చర్యలు.. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్టీఎల్ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్ కోసం రూ.90 లక్షలు చెల్లించాం. కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్ ఛాన్స్
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్!
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొనడం గమనార్హం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలకు ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో 19వ తేదీన మధ్యాహ్నాం విచారణ ఉంటుందని.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
ఏసీబీ దూకుడు.. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో వేగం మరింత పెంచింది అవినీతి నిరోధక శాఖ(ACB). ఈ క్రమంలో విచారణకు రావాల్సిందేనంటూ బినామీలందరికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్, సత్యానారాయణ, భరణిలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో దొరికిన పత్రాల ఆధారంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. -
వివాదంలో అయోధ్యలోని రెస్టారెంట్ : నోటీసులు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య అనే నగరం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ రామ జన్మభూమి దేవాలయం నిర్మాణ ప్రతిపాదన మొదలు, ఇటీవల ఘనంగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక దాకా ప్రతీదీ విశేషంగా నిలుస్తోంది. తాజాగా అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్నాటైన రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో రెండు కప్పుల టీ , రెండు బ్రెడ్ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది, లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ హెచ్చరించారు. अयोध्या | शबरी रसोई 55 रुपए की एक चाय 65 रुपए का एक टोस्ट राम नाम की लूट है, लूट सके तो लूट pic.twitter.com/rRrl6eRBaB — Govind Pratap Singh | GPS (@govindprataps12) January 24, 2024 ఒప్పందం ప్రకారం బడ్జెట్ కేటగిరీ కింద జాబితా చేయబడిన ఈ రెస్టారెంట్ భక్తులకు , యాత్రికులకు రూ. 10కి ఒక కప్పు టీ, రెండు టోస్ట్లను అందించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు సదరు రెస్టారెంట్ ఖండించింది. ఇది ఫ్రీ గా తినాలనుకుని భావించిన కస్టమర్ల పన్నాగమని, బిల్లును సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక కుట్ర ఉందని శబరి రసోయి రెస్టారెంట్ ప్రాజెక్ట్ హెడ్ సత్యేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. తమ వద్ద పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అథారిటీ నోటీసులకు సమాధానమిచ్చినట్టు తెలిపారు.. అరుంధతీ భవన్ పేరుతో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో శబరి రసోయి ఉంది. ఇది రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్లో అహ్మదాబాద్‌కు చెందిన కవాచ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేసింది. -
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
మహువా మొయిత్రాకు మరో షాక్
ఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీకాగా.. సంబంధిత అధికారులు నేడో, రేపో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా పై డిసెంబర్ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. ఆ వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ మహువాకు కిందటి నెలలోనే నోటీసు వెళ్లింది. జనవరి 7వ తేదీ లోపు బంగ్లా ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈలోపు గడువు ముగియడంతో డీవోఈ జనవరి 8వ తేదీన.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ ఆమెకు నోటీసులు పంపింది. మూడు రోజులు గడిచినా ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో.. 12వ తేదీన మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డీవోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. మంగళవారం నాడు తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపింది డీవోఈ. అంతేకాదు.. ఆలస్యం చేయకుండా ఆమెతో బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కొలికపూడి శ్రీనివాసరావు, యాంకర్ సాంబశివరావుకు సీఐడీ నోటీసులు
-
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
విషం చిమ్మడమే పని.. వ్యక్తిగత వైరంతోనే రఘురామ పిల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాలవల్ల పలువురికి లబ్దిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా, ఈ–మెయిల్ ద్వారా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ పిల్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌కు తదుపరి విచారణ నాటికి బదులివ్వాలని రఘురామకృష్ణరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురువారం మరోసారి విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ ఈ పిల్‌పై అభ్యంతరం తెలుపుతూ సీఎస్ ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం.. ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న 41 మందిలో ఎంతమందికి నోటీసులు అందాయి? ఎంతమందికి నోటీసులు అందలేదన్న విషయం గురించి ఆరాతీసి నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఎం, ప్రభుత్వంపై రోజూ విషం.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎస్ తన ప్రాథమిక కౌంటర్లో హైకోర్టుకు నివేదించారు. ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నప్పటికీ ఆయన ప్రతీరోజూ వ్యక్తిగత వైరంతోనే మీడియా ముందు సీఎంతో పాటు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ఛానెళ్లలో మాట్లాడిన మాటలను జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో పొందుపరిచారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను కూడా తప్పుపట్టారన్నారు. వీటిని పరిశీలించి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపట్ల పిటిషనర్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో కోర్టును కోరారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రచారం కోసమే ఆయన ఈ పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపదజాలం వాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శరీరాకృతి గురించి.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు, అదనపు అడ్వొకేట్ జనరల్ గురించి ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయన్నారు. నిజానికి.. బ్యాంకును మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీఎస్ అందులో గుర్తుచేశారు. ఇక పిటిషనర్ దాఖలు చేసిన పిల్ అసలు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగాలేదని, అందువల్ల ఇది పిల్ నిర్వచన పరిధిలోకి రాదన్నారు. వ్యక్తిగత వైరంతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక రఘురామకృష్ణరాజు ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. -
చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్లో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపింది. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిలు రద్దుచేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఏపీ సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిలు సమయంలో హైకోర్టు విధించిన షరతులు పొడిగించాలని కోరారు. దీంతోపాటు కేసు గురించి పబ్లిక్ డొమైన్లో ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలన్నారు. ఈ సమయంలో.. కోర్టులో ఉన్న అంశాలపై శాఖ అధికారులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ ఆరోపించారు. ఇరుపక్షాలకు ఈ షరతు వర్తించేలా చూడాలని అభ్యర్థించారు. అగర్వాల్ వాదనకు ఏపీ సీఐడీ తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం తెలిపారు. షరతులనేవి నిందితులకే వర్తిస్తాయని.. ప్రభుత్వానికి వర్తించవని చెప్పారు. అయితే, మీరు వాయిదా కోరుతున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రతివాదికి నోటీసులు జారీచేయాలని రోహత్గి బదులిచ్చారు. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్లో మెరిట్స్‌పై నిర్ధారణలు ఉన్నాయని, ఇది రూ.300 కోట్ల ప్రజాధనం మళ్లించిన కేసు అని వివరించారు. ఏపీ సీఐడీ విజ్ఞప్తిని ధర్మాసనం అనుమతించింది. చంద్రబాబుకు నోటీసులు జారీచేస్తున్నామని, నవంబరు 3వ తేదీన ఏపీ హైకోర్టు విధించిన షరతుల్లో బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం లేదా పాల్గొనడం మినహా అన్నీ వర్తిస్తాయని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం. పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. -
ఐఏఎంసీకి ఆ భూమి ఉచితంగా ఎందుకిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ.300 కోట్ల విలువ చేసే 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఎందు కు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్య దర్శి, ఐఏఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదు పరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదే శిస్తూ..విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ‘రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ దుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 27 లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ 2021, నవంబర్ 26న జీవో నంబర్ 126ను విడు దల చేసింది. నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ మరో జీవోను విడుదల చేసింది. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది. సహజన్యాయ సూత్రాలకు ప్రభుత్వ నిర్ణ యం విరుద్ధం. ఈ జీవోలను కొట్టివేసి, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునేలా, రూ.3 కోట్లలో ఇక ముందు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఆపడంతో పాటు ఇప్పటివరకు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ఐఏఎంసీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసు కోవాలి’అని పేర్కొంటూ న్యాయవాది కె.రఘునాథ్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే... ఈ పిల్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాస నం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఓ ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూ మిని ఉచితంగా ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఈ సంస్థతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకు న్నా.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉ ల్లంఘించి భూమిని కేటాయించారన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూమిని ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. -
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్‌ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్‌ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు జీఎస్టీ నోటీసులు
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ– రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీ) రూ. 922.58 కోట్ల పన్ను డిమాండ్‌తో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నుండి నాలుగు షోకాజ్ నోటీసులను అందుకుంది. ఈ నోటీసులు రూ.478.84 కోట్లు, రూ.359.70 కోట్లు, రూ.78.66 కోట్లు, రూ.5.38 కోట్ల చొప్పున డిమాండ్‌తో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులు రీ–ఇన్సూరెన్స్, కో–ఇన్సూరెన్స్ వంటి వివిధ సేవల నుంచి వచ్చిన ఆదాయాలకు సంబంధించనవి కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. పన్ను నిపుణుల సమాచారం ప్రకారం, ఆర్జీఐసీ ఆడిటర్లు సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ పన్ను డిమాండ్‌కు సంబంధించిన అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
సినీ నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు
-
టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. (ఇదీ చదవండి: నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ) అసలేం ఏం జరిగింది? ఈ ఏడాది సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. ఇటీవలే అతడిని విచారించారు. (ఇది చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు
దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. భారత్‌కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్‌కు డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. -
పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు
సాక్షి, కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్చేశారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. ‘‘దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని నోటీసుల్లో కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో పవన్ వ్యాఖ్యలు చేశారు.పైగా.. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. పవన్ అందుకే నోటీసులు ఇచ్చాం. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు.బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు ఎస్పీ జాషువా. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆరోపించారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో గుండాలు, క్రిమినల్స్‌తో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: వారాహిని అడ్డుకునే అవసరం ఏంటి? -
నారావారి అవినీతి బ్యాండు
-
లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు
-
న్యాయమూర్తులపై పోస్టులు.. 26 మందికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పలువురు టీడీపీ నేతలు సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబుకు రిమాండు విధించడంతోపాటు, కేసు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చినందుకు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలువురు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. వీరిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణతో పాటు మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, ఆనంద్, కిషోర్ కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. గూగుల్ ఇండియా, ట్విటర్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించింది. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులు పెట్టిన ప్రతివాదుల ఫేస్బుక్ అకౌంట్ల అసలు యజమానులను గుర్తించాలని, వారికి నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. తమ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కి వాయిదా వేసింది. ఏజీ దృష్టికి దుష్ప్రచారం.. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆ క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, ఇతరులు సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెద్ద ఎత్తున పెట్టారు. వారిని కులం పేరుతో దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది డాక్టర్ వసంత్ కుమార్ లిఖితపూర్వకంగా ఏజీ ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు న్యాయవాది ఎం,సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను కూడా ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు, కామెంట్లు పెట్టిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఈ లేఖలను పరిశీలించిన ఏజీ శ్రీరామ్ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారినీ ప్రతివాదులుగా చేర్చారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేలా.. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయాధికారి ప్రతిష్టను దిగజార్చేలా పలువురు పోస్టింగ్‌లు, కామెంట్లు పెట్టారని తెలిపారు. టీవీ చర్చల్లో కూడా అడ్డగోలుగా మాట్లాడారని వివరించారు. కోర్టు ప్రతిష్టను దిగజార్చాలన్న దురుద్దేశంతోనే వారంతా అలా చేశారన్నారు. ఆ పోస్టులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా న్యాయమూర్తులపై ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు రిజిస్ట్రార్ పంపిన లేఖ మేరకు క్రిమినల్ ధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతినిచ్చారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు సైతం సుమోటోగా విచారణ జరిపిందన్నారు. ఆ తరువాత ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీఐడీకి సైతం అప్పగించిందని తెలిపారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
సుప్రీంలో కల్వకుంట్ల కవితకు ఊరట
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లిక్కర్ స్కామ్ ఈడీ సమన్ల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కవిత పిటిషన్‌పై విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో.. ఈలోపు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్EDని ఆదేశించింది. మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే.. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు తాత్కాలిక ఊరట ఇచ్చింది. దీంతో సుప్రీం చెప్పేంత వరకు కవితకు నోటీసులు జారీ చేయమని ఈడీ, బెంచ్‌కు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారామె. లిక్కర్ కేసులో గతంలోనూ ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హారజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారామె. అంతేకాదు తాను విచారణకు రాలేనని కరాకండిగా చెబుతూ వచ్చారు. కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల సమయం పొడగిస్తామని గత విచారణలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో నేటితో పదిరోజుల గడువు ముగిసింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా.. కవిత పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణలోపు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని సుప్రీం కోర్టు, ఈడీకి స్పష్టం చేసింది. -
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్‌నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్‌చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్‌చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్‌ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్‌కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్‌చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ల చాటింగ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్‌ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్‌తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్‌తోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు మరోసారి అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల సానుభూతి ప్రకటించారు విజయశాంతి. ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దు. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను అంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకత కూడా లేదు అంటూ వివరణ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు అని పేర్కొన్నారామె. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే...… pic.twitter.com/osR7evW3M5 — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 14, 2023 గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు.. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారడం.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడం.. ఆ వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏడాది కాలంగా.. ఏదో టీవీ సీరియల్లాగా సాగుతోందని.. ఇవి ఈడీ నోటీసులు కావు మోదీ నోటీసులు అని, కేవలం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంతోనే మరోసారి రాజకీయం కోసం నోటీసులు పంపారంటూ కవిత స్పందించారు. తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటీసుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేస్తానని ఆమె అన్నారు. వాస్తవం కాదు: పిళ్లై లాయర్లు ఇదిలా ఉంటే.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించడం గమనార్హం. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం న్యాయమూర్తి ఎదుట ఇవ్వలేదని, తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పిళ్లై తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. -
ఈడీ నోటీసులపై కవిత సెటైర్లు
సాక్షి, నిజామాబాద్: రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసుల పరిణామంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. నోటీసులు అందించిన విషయాన్ని ఇవాళ నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి ధృవీకరించారామె. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై సెటైర్లు సంధించారు. నోటీసులు అందాయి. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ముందు నుంచి చెబుతున్నాం. మళ్లీ రాజకీయం కోసమే పంపారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు. తెలంగాణలో నెలకొన్ని రాజకీయ వాతావరణం, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా.. ఈ విషయాన్ని మా లీగల్ టీంకు చెప్పాం. వాళ్లు ఇచ్చే సలహాను బట్టి ముందుకు సాగుతాం. ఏడాది నుంచి కంటిన్యూగా నోటీసు లు వస్తున్నాయి.. ఇదంతా టీవీ సీరియల్ లాగా సాగుతోంది అని తెలిపారామె. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని.. తాము బీజేపీకో, కాంగ్రెస్‌కో B టీమ్ కాదని.. దేశవ్యాప్తంగా కేసీఆర్ పార్టీకి దక్కుతున్న స్పందనకు ఆ రెండు జాతీయ పార్టీలు భయపడుతున్నాయని, అందుకే అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. తాము దేశ ప్రజల తరపున ఏ టీం అని తెలిపారామె. -
రామోజీ, శైలజతో పాటు మరో 13 మందికి నోటీసులు
-
నోటీసులిచ్చాకే చంద్రబాబు అరెస్టు
కొవ్వూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేశారని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. అంతా చట్టప్రకారమే జరిగిందని.. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారని పేర్కొన్నారు. అవినీతి చేయడం వల్లే.. చంద్రబాబు ఇటీవల అరెస్ట్ పేరుతో సానుభూతి డ్రామా మొదలుపెట్టారని చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేత పురందేశ్వరి ఖండించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాళ్లు వేయించి, ప్రధాని మోదీని తిట్టిన వ్యక్తులను సమర్థిస్తున్నారా? అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆమె బీజేపీకి నిబద్ధతగా ఉంటున్నారో? లేదంటే తన మరిది చంద్రబాబుతో కలిసిపోయారో చెప్పాలని హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసులో ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేశాయని బీజేపీ నేతగా పురందేశ్వరి చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌పై ఇన్నాళ్లూ నోరు మెదపని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఈరోజు చంద్రబాబుకు అండగా ముందుకు రావడాన్ని వనిత తప్పుబట్టారు. ఈ కుంభకోణంలో మీకు అందుతున్న ప్యాకేజీ ఎంతని పవన్‌ను ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను రేపో, మాపో అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ.. ప్రజలే తనను రక్షించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆయన పాలన సాగినప్పుడు జరిగిన కొన్ని స్కాములలో కాని, తాజాగా ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులోని అంశాల ఆధారంగా వచ్చే అవినీతి కేసులలో కాని, లేదా పుంగనూరు, అంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసానికి కారణమైన కేసులో కాని అరెస్టు కావచ్చన్న భయం ఆయనకు ఉండవచ్చు. దానినంతటిని డైవర్ట్ చేయడం కోసం ఆయన సహజంగానే యత్నిస్తారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎలాగైతేనేమి ఒక కధనాన్ని వండి చంద్రబాబు కు సర్టిఫికెట్ ఇచ్చేసింది. అందులోనే వారి ఆందోళన అర్ధం అవుతుంది. 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలాగే తనపై కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టు చేస్తుందేమోనని ఆయా సభలలో వాపోతుండేవారు. అప్పుడు కూడా జనం తనచుట్టూ నిలబడి రక్షించాలని అంటుండేవారు. ఆ వెంటనే సీబీఐ ఏపీకి రావటానికి వీలు లేదని ఒక ఆర్డర్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు నిజంగా అవినీతికి పాల్పడి ఉండకపోతే చర్య తీసుకోవాలని చెప్పజాలం. కానీ, ఆయన కుంభకోణాలు చేయలేదని ఎవరు చెప్పాలి? అయితే దర్యాప్తు సంస్థలు తెలపాలి. లేదంటే కోర్టులు అయినా తీర్పు ఇవ్వాలి. ఇప్పటికే ఆయనపై రాజధాని అమరావతిలో భూముల కేసు, స్కిల్ డెవలప్మెంట్ నిధుల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్ మొదలైన ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఏపీ సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. తాజాగా ఆదాయపన్ను శాఖ సాక్ష్యాలు చూపుతూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగం మోపింది. చంద్రబాబు మాత్రం ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే చేయిస్తున్నారని చిత్రమైన వాదన చేస్తున్నారు. ✍️ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తే దానిని జగన్‌కు చుట్టి మాట్లాడుతున్నారు. అంతేగానీ బీజేపీ అగ్రనేతలను ఒక్క మాట అనడానికి సాహసించలేకపోతున్నారు. కేంద్రం నోటీసులు ఇస్తే జగన్ ప్రభుత్వంపై పోరాడుతానని అంటున్నారు. దీనికి కూడా జగన్ పాలననే తప్పు పడుతున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుల ఆధారంగా సీబీఐ, ఈడీ.. అలాగే ఏపీ సీఐడీ రంగంలో దిగితే చంద్రబాబుకు చిక్కులు తప్పవన్నవి నిపుణుల అభిప్రాయంగా ఉంది. చంద్రబాబుకు శిక్షలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది వారి అంచనా. అయినా చంద్రబాబు తనను అరెస్టు చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్కాములు చేస్తే ప్రజలు రక్షించాలట. అది ప్రజాస్వామ్యామట. చంద్రబాబు మాదిరి ఎవరూ కూడా తమపై వచ్చిన కేసులలో ఇలా రక్షణ పొందలేకపోయారన్నది చాలా మంది భావన. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడం లో కూడా దిట్ట అని పేరొందారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు ఈ సమస్య గడ్డుగా మారినట్లు ఉంది. గతంలో మాదిరి ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయలేమేమోనని భయపడుతున్నారేమో తెలియదు కాని , ఆయన మాటల తీరు చూస్తే తాను అన్నిటికి అతీతుడను అన్న ఫీలింగ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోకాని, దేశంలో కాని ప్రభుత్వాలు నడిపినవారు అవినీతి ఆరోపణలకు, ఇతరత్రా అభియోగాలకు గురై అరెస్టు కాలేదా అంటే చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలే తీసుకోండి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో పలు కేసులలో చిక్కుకుని అరెస్టు అయి బెయిల్ పై విడుదల అయ్యారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న అభియోగాలపై అరెస్టు అయి జైలులో ఉండవలసి వచ్చింది. ఇలా వీరేమిటి! ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉన్నత స్థానాలలో ఉన్నవారు జైలుకు వెళ్లిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. కొందరికి అయితే ఏకంగా ఉరి శిక్షే పడింది. ✍️ మన దేశంలో కూడా బీహారు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డిదాణా కుంభకోణంలో జైలు పాలయ్యారు. కేంద్ర మంత్రిగా ఆయన ఉద్యోగాల స్కామ్ లో ఇరుక్కుని విచారణను ఎదుర్కుంటున్నారు. ఆయన పిల్లలు సైతం సీబీఐ, ఈడీల విచారణకు హాజరవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా టీచర్ల నియామకాలలో అక్రమాలపై జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సి.ఎమ్. హోదాలోనే కేసులు ఎదుర్కుని రెండుసార్లు జైలు కు వెళ్లవలసి వచ్చింది. తమిళనాడులోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరు ఈడీ కేసులో జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ కు చెందిన ఇద్దరు మంత్రులు జైలుపాలయ్యారు. ఎవరిపైన అయినా అక్రమంగా కేసులు పెట్టరాదు. అందులో సందేహం లేదు. అదే సమయంలో నిజంగానే స్కాములకు పాల్పడి ఉంటే వారిని వదలివేయాలా? అన్నది కూడా ఆలోచించాలి. తనపై కేసులు వస్తే అవన్ని కక్ష సాధింపు అని, తాను ఎవరిపైన అయినా కేసులు పెడితే అవన్ని కరెక్టు అని ప్రచారం చేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది. సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం ఎంపీగా.. ఉన్నప్పుడు కేసులు వేయించి విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. ఒక సీబీఐ అధికారిని అడ్డం పెట్టుకుని విచారణ పేరుతో పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చేశారు. అప్పట్లో జగన్ పై చేసిన ఆరోపణలు ఏమిటి?ఆయన తన కంపెనీలలో తండ్రి పలుకుబడి ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని. అందుకు గాను ఆయా పరిశ్రమలకు నీటి సదుపాయం, భూ వసతి తదితర సదుపాయాలు ఇచ్చారన్నది ఆరోపణ.ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభుత్వాలు పరిశ్రమలకు నీరివ్వడం అవినీతి ఎలా అవుతుందో ఎప్పటికీ అంతుపట్టదు. ఆమాటకొస్తే.. కియా కార్ల పరిశ్రమ కు చంద్రబాబు టైమ్ లో ఎన్నివేల కోట్ల రాయితీలు ఇచ్చారు?. మరి అది కూడా తప్పే అవుతుంది కదా!. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ షేర్ విలువ పెరుగుతుందన్న వాదన ఉంది. ముందస్తు సమాచారంతో ఆయన రిటైల్ విభాగాన్ని అమ్మివేశారు.దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో క్విడ్ ప్రోకో ఉన్నట్లా?లేనట్లా? ఆ రోజుల్లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ పై కేసులు పెట్టారు. జగన్ సంస్థలు స్థాపించినప్పుడు ఆయన ఎంపీ కూడా కాదు. ఆయన తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లకు కేసులు పెట్టారు. కాని చంద్రబాబు విషయంలో అలాకాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కాములు. వాటిలో మాత్రం ఎవరూ ఏమి చేయకూడదని ఆయన వాదిస్తున్నారు. ✍️ ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి చంద్రబాబుపై కేసులు పెడతారా? అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యవహరిస్తున్నాయి. అవినీతిని అంకుశంతో పొడవాలని చెప్పిన రామోజీరావు ఇప్పుడు చంద్రబాబు అవినీతి జోలికి ఎవరూ వెళ్లరాదని అంటున్నారు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చి 118 కోట్ల ముడుపుల ఆరోపణ చేస్తే కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాయలేకపోయారు. ఆంధ్రజ్యోతి ఆదాయపన్ను శాఖ నోటీసులు చెల్లవన్న చంద్రబాబు వాదనను భుజాన వేసుకుని కథలు ఇస్తున్నారు. టీవీ5ది మరీ విడ్డూరం. నెలకు ఏభై రూపాయల వ్యాపారం చేసే వారికి కూడా ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తుందని, అందువల్ల చంద్రబాబు కు వచ్చిన ఐటి నోటీసులను పట్టించుకోనవసరం లేదని నిస్సిగ్గుగా ప్రచారం చేసింది. ✍️ ఈ మీడియా సంగతి పక్కనబెడితే.. చంద్రబాబు ఎందుకు ఐటీ నోటీసులలోని వివిధ అంశాలపై నిర్దిష్ట సమాధానం ఇవ్వలేకపోతున్నారు?ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ కేసు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. గతంలో వైఎస్ విజయమ్మ హైకోర్టులో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, కోర్టు అంగీకరించింది. కాని అప్పట్లో సీబీఐ తనవద్ద సిబ్బంది లేదని చర్యలు తీసుకోలేదు. దీనిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ అర్ధం చేసుకోవచ్చని చాలా మంది చెబుతారు. ఈలోగా చంద్రబాబు సుప్రింకోర్టుకు వెళ్లడం, మళ్లీ హైకోర్టులో విచారణ జరిగి కేసు లేకుండా చేసుకోగలడం జరిగాయి. నిజంగానే చంద్రబాబు ఆస్తులలో ఎలాంటి తేడా లేకపోతే విచారణకు ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్న వస్తుంది. తాను ఏ విచారణకు అయినా సిద్దం అని ఆయా సందర్భాలలో చెప్పే ఈయన తీరా విచారణ దశకు ఏదైనా కేసు వస్తే దానిని ఎలాగోలా మేనేజ్ చేసుకుని బయటపడుతుంటారని చాలా మంది నమ్ముతారు. చాలా కేసులలో అలాగే జరిగింది. పైగా తనపై ఈ నలభై ఐదేళ్లలో అసలు కేసులే లేవని బుకాయించడం ఆయన స్పెషాలిటీ. ✍️ అంతదాకా ఎందుకు నిజంగానే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులోని అంశాలు అన్నీ తప్పు అయితే ఏకంగా ఆ శాఖ పైన ఎందుకు పరువు నష్టం దావా వేయరు? అని అడిగితే దానికి జవాబు ఇవ్వరు. గతంలో CBIని పంపుతారని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటి నోటీసులు వచ్చినా, మోడీపైకాని,కేంద్రంపై కాని పన్నెత్తు మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు. ఐటి శాఖ ఇచ్చిన నోటీసును మొదటగా ప్రచురించింది హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల పత్రిక అయితే.. సాక్షి ప్రచారం చేస్తోందని ఆయన అంటారు. ప్రజలకు ఆయన ఈ కేసులపై వివరణ ఇవ్వాలి. కనీసం టీడీపీ కార్యకర్తలకైనా అనుమానాలు నివృత్తి చేయాలి కదా?అలాకాకుండా డబాయించుకుంటూ మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు మాత్రం నమ్ముతారా?పైకి మాట్లాడలేకపోయినా, లోపల వారి మనసులకు తెలియదా చంద్రబాబు స్కాములకు పాల్పడింది ,లేనిది?. చంద్రబాబును వారు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకున్నా అడగలేకపోతుండవచ్చు. ఐటీ ఇచ్చిన నోటీసులలోని వ్యక్తులు మనోజ్, కిలారి రాజేష్ తదితరులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయా?లేదా?.. మనోజ్ ను పిలిచి మాట్లాడిన విషయం నిజమా?కాదా?.. పీఏ శ్రీనివాస్ కు వసూళ్ల బాధ్యతను అప్పగించింది నిజమా?కాదా?.. ఐటి శాఖ వారు మొత్తం చిట్టా అంతటిని విప్పిన దాని ప్రకారం దుబాయిలో కూడా డబ్బులు తీసుకున్నారా?లేదా?.. వీటన్నిటికి చంద్రబాబు పూర్తిగా వివరణ ఇస్తే అప్పుడు దానిపైన ఆలోచించవచ్చు. అలాకాకుండా ఎలాగూ స్కామ్ బయటపడింది. కనుక.. దాని నుంచి తప్పించుకునే యత్నాలు చేస్తూనే ,మరోవైపు ప్రజలలో సానుభూతి సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే అధికారిక హోదాలో ఆయన చేసిన అవినీతిపై వస్తున్న ఆరోపణలు కనుక. కాపురం చేసే కళ కాలు తొక్కినపుడే తెలుస్తుంది ఒక సామెత. అలాగే చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయింది ఎలాగో అందరికి తెలుసు. వైస్రాయి హోటల్ లో ఎమ్మెల్యేలను పెట్టి వారిని మేనేజ్ చేయడానికి ఎంతెంత ఖర్చు చేసింది కథలు, కథలుగా చెబుతుంటారు. తన మామ ఎన్.టి.రామారావును పదవి నుంచి దించివేసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఏ వ్యవస్థలను ఎలా ఆకట్టుకున్నది ఈ తరంవారికి తెలియకపోయినా, ఆనాటి తరానికి తెలుసు. కనుక చంద్రబాబుకు ఇలాంటి స్కామ్ లు అసలు తెలియవని ఎవరైనా అనుకుంటే వారు ఉత్త అమాయకులని అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆదాయపన్ను శాఖ గట్టిగా వ్యవహరించింది. ఇంకో విషయం చెప్పాలి. జగన్ తనను సీబీఐ పిలిస్తే ఎన్నడూ విచారణకు రానని చెప్పలేదు. వాళ్లు అరెస్టు చేస్తారని తెలిసినా, సోనియాగాంధీ కక్ష కడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విచారణకు సిద్దపడ్డారు. పదహారు నెలలు బెయిల్ రాకుండా అడ్డుకున్నా సహనంతో ఎదుర్కున్నారు. ఈ విషయాలలో ప్రజలంతా తన చుట్టూ ఉండాలని ఎన్నడూ కోరలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా ఒకవైపు కేసులకు వణికి పోతూ,మరో వైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఈ కేసులలో అరెస్టు అవుతారో లేదో చెప్పలేం కాని, అరెస్టు కాక తప్పదని భయపడుతున్నట్లుగా ఆయన ముఖ కవళికలను బట్టి తెలిసిపోతోంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
దొంగతనం చేసి దబాయింపా?
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగతనం చేసి దబాయిస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి బండారం బయటపడటంతో ఆయనకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందని, అడ్డంగా దొరికిపోయినట్లు ఆయనకే అర్థమవుతోందని చెప్పారు. అందుకే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను రేపో ఎల్లుండో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిప్పు కాదని.. తప్పులకు మానవ రూపమని, తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి అని మండిపడ్డారు. బాబు చట్టానికి అతీతుడు కాదన్నారు. నోటీసులకు స్పందించకుండా, విచారణకు సహకరించకుంటే ఐటీ శాఖ అరెస్టు కూడా చేయవచ్చన్నారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్ హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, ఈ వ్యవహారంపై ఇన్నాళ్లూ ఈడీ జోక్యం చేసుకోకపోవడంపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. అప్పట్లోనే కుంభకోణాన్ని ఎండగట్టాం.. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.పది వేల చొప్పున షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో అత్యాధునిక సదుపాయాలు, ఫర్నిచర్‌తో సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలు మాత్రమే బిల్డర్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలకు మించి వ్యయం కాదు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అప్పట్లోనే మేం అభ్యంతరం తెలిపాం. కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు అదనంగా రూ.7–8 వేలు దోచిపెట్టిన చంద్రబాబు అందులో 60 నుంచి 70 శాతం వరకూ కమీషన్ తీసుకున్నారు. పేదల నోళ్లు కొట్టి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.వెయ్యికి మించి వ్యయం కాదు. కానీ ఆ పనులను రూ.2,200 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పేదల కష్టార్జితాన్ని చదరపు అడుగుకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, ఇది పాపమని అప్పట్లోనే మేం చెప్పాం. ఐటీ నోటీసులతో అది రుజువైంది. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, విక్కీజైన్, కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబు, ఆయన పీఎస్ శ్రీనివాస్, లోకేష్ వసూలు చేసిన విధానాన్ని ఆధారాలతోసహా ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతిలో అడ్డంగా దొరికిపోయిన సమయంలోనూ తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా నిలబడి రక్షించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐటీ శాఖ నోటీసులతో ఇప్పుడూ అలాగే కోరడం విడ్డూరం. కుంభకోణాల దారులన్నీ బాబు వైపే.. అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ల్లో సీఐడీ దర్యాప్తుతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైంది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులనే ఆ కుంభకోణాల్లో నిందితులుగా సీఐడీ గతంలోనే తేల్చింది. 1995–2004 మధ్య ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు. రాజకీయంగా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టించేవారు. చంద్రబాబు కుంభకోణాలన్నీ ఆధారాలతోసహా ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదు. ఖజానాను లూటీ చేయడం సాధారణమా? చంద్రబాబుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు సాధారణమైనవని, వాటిపై తాను స్పందించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొనడం విడ్డూరం. ప్రభుత్వ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆమెకు తెలియదా? లేదంటే మరిదిని రక్షించుకోవడానికి అలా మాట్లాడారా? చీటికిమాటికీ ట్వీట్లతో రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? ఎల్లో మీడియా ఐటీ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శతవిధాలా ప్రయతి్నస్తోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర.. చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పారు. అదే కుట్రను లోకేశ్ భీమవరంలో అమలు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్ని స్తే చూస్తూ ఊరుకోం. -
‘అసైన్డ్’ సవరణపై వివరాలు అందజేయండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్‌దారులకు హక్కులు కల్పించే తెలంగాణ అసైన్డ్ భూముల చట్ట సవరణపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం–1977కు 2018లో సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం నిర్దేశించిన విధంగా 2007, జనవరి 29 నుంచి థర్డ్ పార్టీలకు అనుకూలంగా అసైన్డ్ భూముల రీఅసైన్మెంట్ కోసం కటాఫ్ తేదీని 2017, డిసెంబర్ 31 వరకు పొడిగించిందని.. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నంబర్ 12ను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అర్హులైన వారికి 1969లో సాగు భూమిని అందజేసిందని చెప్పారు. అయితే వారి నిరక్ష్యరాస్యత, అజ్ఞానం, సామాజిక, ఆర్థిక వెనుకబాటును అలుసుగా తీసుకున్న కొందరు వారి భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేశారన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువైన భూములను రూ.5 లక్షలు చెల్లించి పలుకుబడి ఉన్న వారు సొంతం చేసుకున్నారని వెల్లడించారు. అసలు లబ్ధిదారులు ఆ భూముల ద్వారా లబ్ధిపొందలేకపోయారని పేర్కొన్నారు. లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి భూములను స్వాదీనం చేసుకుని, అంతకు ముందు కేటాయించిన వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1977, తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూములను థర్డ్ పార్టీల (ఇప్పుడు అ«దీనంలో ఉన్న వారు)కు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉండగా, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
ఈడీ నోటీసులు.. సంబంధం లేదన్న గంగుల
సాక్షి, కరీంనగర్: తన కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు అందించిందన్న పరిణామంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు నోటీసులేవీ రాలేదని.. నోటీసులు అందుకున్నట్లుగా చెబుతున్న శ్వేతా గ్రానైట్స్‌తో తనకేలాంటి సంబంధం లేదని అంటున్నారాయన. గంగుల కుటుంబ సభ్యుల కు చెందిన శ్వేతా గ్రానైట్స్ విదేశాలకు ఎగుమతుల విష యంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై ఈడీ వివరణ కోరినట్లు తెలియవచ్చింది. గతేడాది నవంబర్‌లో శ్వేతా గ్రానైట్స్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. చైనాకు గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 3 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ అంశంపై మంత్రి గంగుల మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఈడీకి సంబంధించి తనకు నోటీసులేవీ రాలేదని, శ్వేతా గ్రానైట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే శ్వేతా గ్రానైట్స్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. శ్వేతా గ్రానైట్స్‌కు ఈడీ నోటీసులనేవి 2008 నుంచి కొనసాగుతున్నవేనన్నారు. ఈ విషయంలో ఆ సంస్థ వ్యాపారం గురించి లేదా తన గురించి ఈడీకి ఎలాంటి సమాచారమైనా ఇస్తానని, పూర్తిగా సహకరిస్తానని మంత్రి సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: ప్రసవాల్లో రికార్డు -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్‌పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్‌కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
దర్యాప్తు చేపడితే..బాబు, చినబాబు జైలుకే!
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై దర్యాప్తు సంస్థలు విచారణకు స్వీకరించి నేరం రుజువైతే బాబుతో పాటు ఆయన తనయుడు చిన్నబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది, కార్పొరేట్ న్యాయ నిపుణుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐటీ నోటీసులపై ఈడీ సుమోటోగా దర్యాప్తు చేపట్టవచ్చన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయొచ్చని వెల్లడించారు. పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని.. ఇవి నిజమేనని తేలితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌ను, అందులోని అవినీతిని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసినట్లు, బాబుకు ఎవరి ద్వారా, ఏ కంపెనీ ద్వారా ఎంతెంత అందింది.. తదితర వివరాలను ఆధారాలతో సహా ఐటీ శాఖ వెల్లడించింది. దీనిపై వెంకటరామిరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. తప్పించుకునే యత్నమెందుకు? ఓ రాజకీయ పారీ్టకి అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులకు బాధ్యతగా వివరణ ఇవ్వాలి. నేరమేమీ చేయనప్పుడు ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే యత్నం ఎందుకో చెప్పాలి. వారడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా.. అసలు తనకు నోటీసులిచ్చే అధికారమే లేదని బాబు పలుమార్లు లేఖ రాయడం చూస్తుంటే నేరం చేసినట్లు భావించాల్సి వస్తోంది. సెక్షన్–127 ప్రకారం నోటీసులిచ్చే అధికారం ఉందని ఐటీ అధికారులు స్పష్టంచేశారు. నేరుగానైనా కావొచ్చు.. తన అనుచరుల ద్వారానైనా కావొచ్చు.. రూ.118.98 కోట్లు బాబుకే అందాయని ఐటీ వివరాలతో సహా కుండబద్దలు కొట్టింది. 2023, ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులో అదే నెల 11న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. దీనిని నేరుగా బాబు నివాసమైన ప్లాట్ నంబర్ 1310, రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్ ఇంటికి పంపారు. ఆయన వద్ద సరైన వివరణ ఉండి ఆ రోజున హాజరై చెప్పి ఉంటే.. ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఎప్పుడు హాజరై వివరణ ఇస్తారో కూడా చెప్పడంలేదని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొనడం చూస్తుంటే అందులోని అంశాలు పూర్తి వాస్తవమేనని స్పష్టమవుతోంది. బోగస్ కంపెనీలు సృష్టించి.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఐదు కంపెనీల వాళ్లు ఇచ్చిన మెటీరియల్ పేపర్లు, బాబు పీఏ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఆ ముగ్గురు భారత్, దుబాయ్, ఇతర చోట్ల నుంచి నగదు తెచ్చి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఉంది. తాము కాంట్రాక్టులు తీసుకుని.. ఎన్నికల నిధుల కోసం ఖర్చుపెట్టేందుకు టీడీపీకి ఇచ్చినట్లు స్టేట్మెంట్లో వెల్లడించారు. నోటీసుల్లో కూడా నగదంతా షాపూర్జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకే అందినట్లు ఉంది. షలక, అన్నై (ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలియా) నుంచి రూ.33,76,18,207, ఎవరెట్ అండ్ నయోలిన్ (షీట్ ఫ్రమ్ విక్కీ మొబైల్) నుంచి రూ.50,43,00,000, పోర్ ట్రేడింగ్ నుంచి రూ.9,42,00,000, హార్డ్రిటన్ షీట్ (లక్స్టోన్ అండ్ కో) నుంచి రూ.10,23,00,000, దుబాయ్ నుంచి రూ.15,13,95,000లు చంద్రబాబుకు అందాయని.. ఇందులో రూ.118.98 కోట్లను మాత్రం ఆదాయంలో చూపలేదని కంపెనీల వారీగా వివరాలు వెల్లడించింది. షాపూర్జీ పల్లోంజీ నుంచి నగదును తీసుకునేందుకు ప్రైవేట్ డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు సృష్టించారు. బోగస్ కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, బోగస్ నామినేషన్లు అంటూ.. ‘బోగస్’ అనే పదాన్ని ఐటీ శాఖ తన నోటీసుల్లో స్పష్టంగా పలుమార్లు పేర్కొంది. సెక్షన్ 132(4), 5(బీ) కింద మనోజ్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆయన కూడా అదంతా వాస్తవమేనని సంతకం పెట్టారు. స్టేట్మెంట్లు ఇచ్చిన వారు చంద్రబాబు, అతని పీఎస్ పేరుతో పాటు లోకేశ్ పేరును వెల్లడించారు. విక్కీ అనే వ్యక్తి ద్వారా లావాదేవీలన్నీ జరిగినట్లు, నేరుగా చంద్రబాబు కూడా కొన్ని చెప్పినట్లు ఐటీ తన నోటీసుల్లో పేర్కొంది. అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు.. ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందని పక్షంలో పెద్దఎత్తున జరిమానాలు విధించవచ్చు. 25 శాతం అదనపు పన్నుతో పాటు వడ్డీ కూడా విధించవచ్చు. నేరం జరిగినట్లు తేలితే.. రూ.118.98 కోట్లకు 300 శాతం అంటే రూ.356.94 కోట్లు వసూలుచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. అరెస్టుచేసే అధికారం కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా నగదు అందడం.. పలు కంపెనీల నుంచి డబ్బు స్వీకరించడం.. క్విడ్ ప్రో కోతో పాటు మనీలాండరింగ్ కిందికి వస్తుంది. దీంతో ఈడీ కూడా సుమోటోగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈడీనే కాదు.. పీఎంఎల్ఏ, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయవచ్చు. అంతేకాక.. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. 2019 తర్వాతవే ఆ రూ.118.98 కోట్లు.. ఇక 2019 తర్వాత వచ్చినవే ఆ రూ.118.98 కోట్లు అయితే.. మరి 2014 నుంచి ఎన్ని డొల్ల కంపెనీలు నెలకొల్పారు.. ఎన్ని వేల కోట్లు ప్రజా ధనం కొల్లగొట్టారు.. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ కుంభకోణం వివరాలన్నీ బహిర్గతం కావు. ఇదంతా ప్రజల డబ్బు. దీనిపై ప్రజలెవరైనా కోర్టు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు కోరవచ్చు. -
గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది కూడా. ఇక.. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు నిర్ధారించింది. అంతేకాదు.. గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
చంద్రబాబు స్కామ్‌పై వార్తలేవి?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చంద్రబాబుకు ఆగస్టు నెలలో ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తుంటే రాష్ట్రంలో ఉన్న రామోజీకి, రాధాకృష్ణ, టీవీ–5 నాయుడులకు కనిపించడం లేదా, వినిపించడం లేదా? అని రాష్ట్ర పశుసంవర్ధశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. సుమారు రూ.118 కోట్లు తేడా వచ్చాయని వాటికి సంబంధించి పూర్తి లెక్కలు, వివరాలు ఇవ్వకపోతే చంద్రబాబుపై పూర్తి చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఎల్లోమీడియా మాత్రం నాలుగులైన్ల వార్త కూడా రాయకపోవడం దారుణమని చెప్పారు. ఎల్లోమీడియా ఉన్నంతకాలం రాష్ట్రానికి మంచి రోజులు రావన్నారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. మీ కులం వ్యక్తి అయిన చంద్రబాబు తప్పులు ప్రజలకు తెలియజేయకుండా మౌనం వహించడమే మీకు తెలుసన్న విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో మీ కులానికి చెందిన వ్యక్తి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి తప్పుచేసి ఉంటే రోజుల తరబడి పతాక శీర్షికల్లో వార్తలు చూపించేవారని చెప్పారు. ఇదేనా మీ నైతిక విలువలు, సిద్ధాంతాలు అని మండిపడ్డారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో వినయ్, విక్కి అనే వ్యక్తుల ద్వారా బోగస్ కంపెనీలు రిజిస్టర్ చేసి వాటికి సబ్ కాంట్రాక్టులు పనులు ఇప్పించుకుని సబ్‌కాంట్రాక్టుల ఖాతాల్లో డబ్బులు వేసి తిరిగి వాటిని బాబుకు చేర్చేవారని, ఇదేనా సంపద సృష్టించడమంటే అని ప్రశ్నించారు. పోలవరం ఒరిజినల్ బిడ్డర్ని పక్కన పెట్టి రామోజీరావు బంధువు నవయుగ వారికి ఇచ్చేసిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. ఇన్నాళ్లు తొడలు గొట్టిన చంద్రబాబు మూడురోజుల నుంచి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు ధరలు పెరిగినప్పుడు సీఎం జగన్ వల్లే పెంచారని ప్రచారం చేసే పచ్చమీడియా, చంద్రబాబు.. ధరలు తగ్గినప్పుడు జగన్ వల్ల తగ్గాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ నోరు ఏమైంది? ‘ప్యాకేజీ స్టార్.. ఇప్పుడు ఎందుకు నీ ప్రశ్నించేతత్వం మౌనంగా ఉంది? నీ యజమాని చంద్రబాబు అక్రమాలు బయటపడితే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు. అంటే నువ్వు నిజంగా ప్యాకేజీకి అమ్ముడుపోయావని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే పవన్‌కు ముఖ్యం’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఇదేంది సారు!.. ఇలాంటివి రాకుండా ఎన్నెన్నో స్టేలు తెచ్చుకున్న చరిత్ర మనది!
ఇదేంది సారు!.. ఇలాంటివి రాకుండా ఎన్నెన్నో స్టేలు తెచ్చుకున్న చరిత్ర మనది! -
ఐటీ నోటీసులతో చంద్రబాబుకు హైటెన్షన్
సాక్షి, అమరావతి: ఐటీ షోకాజ్ నోటీసులపై విచారణను తప్పించుకోవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఐటీ నోటీసులపై నాలుగు సార్లు సెంట్రల్ హైదరాబాద్ ఆఫీస్‌కు లేఖలు రాసిన చంద్రబాబు.. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విధానాన్ని తప్పుబడుతున్నారు. జ్యూరిడిక్షనల్ అధికారి కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి.. ఐటీ నోటీస్ రావడంపై చంద్రబాబు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలను తెలుపుతూ ఐటీ ఆఫీస్‌కు రాసి లేఖలను.. ఐటీ అధికారులు తోసిపుచ్చారు. మరోసారి ఇటీవల తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా, టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే! చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
ఒక ఐటీ నోటీస్.. 10 ప్రశ్నలు.. ఇవి నిజం కాదా చంద్రాలు..?
చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు అని మరోసారి తేలిపోయింది. ఆయన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. అక్రమ మార్గంలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్న చంద్రబాబు అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.. అడ్డంగా దొరికిపోయినా సమాధానం లేకుండా చంద్రబాబు ఎందుకు బుకాయిస్తున్నారు?. ఆ దమ్ము ఉంటే పరువు నష్టం కేసు ఎందుకు వేస్తాననడం లేదు?. అసలు ఈ పది పశ్నలకు చందబాబు వద్ద సమాధానాలు ఉన్నాయా? ►పెండ్యాల శ్రీనివాస్.. నీ సెక్రెటరీగా పని చేసింది నిజం కాదా? ఆయనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసింది నిజం కాదా? ఆయన వద్ద 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల క్లూస్ దొరికింది నిజం కాదా ?. ఎంవీపీ అనే అతను ఆదాయపు పన్ను అధికారులకి ఇచ్చిన వాంగ్మూలంలో మీ పేరు చెప్పింది నిజం కాదా ?. దాని మీద మీకు నోటీసులు ఇస్తే మీరు నాలుగు సార్లు సమాధానం చెప్పింది నిజం కాదా ? ఆ సమాధానాలను అధికారులు రిజెక్ట్ చేయడం నిజం కాదా ? ►నిన్న హిందుస్తాన్ టైమ్స్.. ఈ రోజున డెక్కన్ క్రానికల్ మీ బండారం బయట పెట్టింది నిజం కాదా?.. దుష్ప్రచారం చేస్తున్నారని కూసే అయ్యా, కొడుకులు ఎందుకు వాటిపై మాట్లాడటం లేదు? పరువు నష్టం దావా అంటూ గోల ఎందుకు చేయడం లేదు? ►అమిత్ షాని జూన్‌లో కలిసినప్పటి మీ చర్చల సారాంశం ఏమిటి? ఎందుకు బయటకి చెప్పలేదు ? ►మీ ఆత్మకూరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాంట్రాక్టర్ ఎవరు? డబ్బు ఎలా చెల్లించారు? ఈ వివరాలు బయట పెట్టగలరా ? ►ఎంవీపీ చెప్పినట్లు ఆ కిలారు రాజేష్ ఎవరు? 2016కి ముందు అతని ఆర్ధిక పరిస్థితి ఏమిటి? 2019 నాటికి ఏమిటి? తన కొడుకు మొదటి పుట్టిన రోజున వేడుకలకు విదేశీ మద్యం ఎన్ని కేసులు ఎవరు పంపించారు? అతనికి లోకేష్‌కి ఉన్న సంబంధం ఏంటి? ►పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, బీజేపీలో ఉండి తెలుగుదేశం కోసం పని చేసే పురంధరేశ్వరితో సహ ఎవరూ ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇందులో వెళ్లాయి? ►2019 వరకు ప్రతి ఏడాది మీరు విదేశీ పర్యటనలు చేసేవారు. ఎవరికీ చెప్పకుండా ఒక వారం వెళ్లే వారు. ఎక్కడికి వెళ్లారు ? ►23 మంది ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బు ఎవరు సమకూర్చారు? ►ప్రతిపాటి పుల్లారావుకు చెందిన గోల్డ్ స్టోన్, ఎల్లో స్టోన్ ఇన్ఫ్రా కంపెనీలకు ఎవరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ పనులు పుల్లారావు చేశారు? ఎన్నికల ముందు ఆ కంపెనీలో లావాదేవీలు ఎంత జరిగాయి? ►నవయుగ వాళ్లకి పవర్ ప్రాజెక్ట్ అప్పజెప్పడం వెనుక ఒప్పందం ఏంటి? రాష్ట్ర ఖజానా నుండి ఎంత మొబైలేషన్ అడ్వాన్స్ ఇచ్చారు ? ఆ పనులు ఎక్కడైనా చేశారా ? ప్రధాని పోలవరాన్ని ఏటిఎంగా వాడుకున్నారన్నారు. ఆ విషయం తప్పు అయితే ఎందుకు ప్రధానిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిలదీయలేదు? చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే! -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
ఎల్లో మీడియాకు మింగుడుపడని నిజం
మామూలుగా అయితే ఇలాంటి స్కామ్ బయటపడితే మీడియాలో అల్లరల్లరిగా వార్తలు ఇస్తారు. ఒకవేళ ఆ స్కామ్ లు నిజం కాకపోతే దాని గురించి అయినా వాదనలు వినిపిస్తూ టివీలు హోరెత్తేవి. కానీ, చిత్రంగా తెలుగుదేశం పార్టీని భుజాన మోసుకుంటూ ఊరేగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి సంస్థలు తేలుకుట్టిన దొంగల మాదిరి సైలెంట్ అయిపోయాయి. అదేమిటో తెలుసుకదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇవ్వడం.. ఎంత పెద్ద సంచలనం!. అందులోనూ ఆయన రూ. 118 కోట్ల మేర ప్రకటించని- వెల్లడించని ఆదాయంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంటే ఆ మేర చంద్రబాబుకు బ్లాక్ మనీ రూపంలో డబ్బు అందిందని అర్దం అని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఈనాడు అసలు వార్త ఇవ్వకుండా.. లోపలి పేజీలో ఎక్కడో మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యను చిన్నగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే పాత కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులు వచ్చాయని, ఎప్పుడో చంద్రబాబు సమాధానం ఇచ్చేశారని, ఇంతకాలం ఏమీ జరగకుండా ఇప్పుడు మళ్లీ నోటీసు రావడం వెనుక వైఎస్సార్సీపీ ఒత్తిడి ఉందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయంటూ వార్తను ఇచ్చింది. ఒక ఆంగ్ల పత్రిక మాత్రం ఈ కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు విశ్వయత్నాలు చేస్తున్నారని ఐటీ శాఖ చెబుతున్నట్లు పేర్కొంది. ఏ సాంకేతిక కారణాలతో దీనిని అడ్డుకోవాలా అన్న ఆలోచనలో ఆయన ఉన్నారట. నోటీసు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి.. తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పాలని చూస్తున్నారట. ✍️ ఈ తాజా నోటీసుకు నేపథ్యం చూద్దాం. అమరావతి రాజధాని పేరుతో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేసే యత్నం చేశారు. అదైనా శాశ్వతపనులకు ఖర్చు చేశారా అంటే లేదు. కేవలం తాత్కాలిక భవనాలకు భారీ ఎత్తున ధన వ్యయం చేయడంపై అప్పట్లోనే అంతా ముక్కున వేలేసుకున్నారు. చదరపు అడుగుకు పదివేల రూపాయల చొప్పున వెచ్చించినా ప్రమాణికమైన భవనాలు రాలేదు.. అవి కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. వర్షం కురిస్తే అవికారుతూ బక్కెట్లతో నీళ్లను తోడి బయట పోయవల్సిన పరిస్థితి ఉంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాల నిర్మాణాలలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు దబాయిస్తూ కథ నడిపారు. పైగా అమరావతి రాజధాని ఉద్యమం అంటూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి అవినీతి అభియోగాలను దారిమళ్లించే ప్రయత్నం చేశారు. అయినా ఏదో ఒకరోజు అవినీతి వాసన బయటకు రాకుండా ఉంటుందా?.. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ✍️ ఎంత తాను లీగల్ గా , టెక్నికల్ గా దొరకనని ఇంతకాలం చెబుతూ వచ్చినా ఎప్పుడో అప్పుడు దొరకకపోరా? చంద్రబాబు విషయంలోనూ అదే జరిగినట్లు అనిపిస్తుంది. ఇంతకాలం ఆయా వ్యవస్థలలో తన మనుషులను పెట్టుకుని ఎక్కడా ఇబ్బంది రాకుండా చేసుకుంటూ , న్యాయ వ్యవస్థ ద్వారా స్టేలు పొందుతూ , కేసులు లేకుండా చేసుకుంటూ తనకు ఉన్న మానిప్యులేషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి నెట్టుకువస్తున్నారు. ఆయా వ్యవస్థల నుంచి తన మనుషులు నిష్క్రమిస్తున్నట్లుగా ఉంది. అందువల్లే ఎలాంటి ప్రభావానికి లోనుకాని అధికారులు ఎవరో రాజీపడకుండా కేసును క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు పేర్కొన్న అభ్యంతరాలను తోసిపుచ్చి తాజా నోటీసు ఇచ్చారనుకోవాలి. గతంలోనే ఐటీ శాఖ నోటీసు ఇచ్చినా, ఏదో రకంగా ఇంతకాలం అది ముందుకు కదలకుండా జాగ్రత్తలు పడ్డారని అనుకోవాలి. కాని ఇప్పుడు మొహమాటం లేకుండా రూ. 118 కోట్ల రూపాయల డబ్బు పొందారన్న అభిప్రాయం తెలుపుతూ మరో నోటీసును అధికారులు ఇచ్చారు. నిజానికి మూడున్నర ఏళ్ల క్రితమే చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటీ, ఈడీ వంటి సంస్థలు సోదాలు జరిపి రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు అధికారికంగానే ప్రకటించాయి. కాని ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ కేసులు ఏమయ్యాయో ఎవరికి తెలియలేదు. కేంద్ర ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రచారం అయ్యింది. కాని మేనేజ్ మెంట్ ప్రభావం తగ్గుతూ వచ్చిందేమో తెలియదుకాని, ఆదాయపన్ను శాఖ మళ్లీ ఆ కేసు విచారణ కొనసాగించి అమరావతి రాజధాని లో వివిధ భవన నిర్మాణాల కాంట్రాక్టు పొందిన షాపూర్జీ ఎల్లొంజి సంస్థ వారిపైన, అలాగే సబ్ కాంట్రాక్టర్ మనోజ్ తదితరులపై కూడా సోదాలు నిర్వహించారు. అప్పుడు వారు ఆశ్చర్యపోయేలా బ్లాక్ మనీ బాగోతం బయటకు వచ్చింది. దానిని నిర్ధారించుకున్న తర్వాత రూ. 118 కోట్లకు సంబంధించిన నోటీసును ఐటి శాఖ జారీ చేసింది. ఈ నోటీసు గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఆంగ్ల పత్రిక హిందూస్తాన్ టైమ్స్ దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో అసలు విషయం బయటపడింది. ✍️ ఇది నిజం కాకపోతే చంద్రబాబుగారు ఒంటికాలుపై ఇంతెత్తున లేచేవారు. టీడీపీ నేతలంతా ఆ పత్రికపైన, ఆ వార్తను ప్రచారం చేసిన సాక్షి, వైఎస్సార్సీపీ నేతలపై ఎగెరిగి పడేవారు.కాని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. 1995 సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భాన్ని గతంలో పలుమార్లు ఒక పెద్ద కార్యక్రమంగా జరుపుకున్నారు. కాని ఈ ఐటీ నోటీసు బహిర్గతం కావడంతో ఎక్కడా కిక్కురుమన్నట్లు కనిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోగలుగుతారన్నది ఆసక్తికర విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దలతో స్నేహం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఒకసారి కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపించారు. అవేవి సత్పలితాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. అందుకు తన మామ ఎన్.టి.ఆర్. పేరుతో నాణేల విడుదల కార్యక్రమానికి హాజరైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తో చంద్రబాబు మంతనాలు జరిపారు. అదంతా కేవలం బిజెపితో ఎన్నికల పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు అంతా అనుకున్నారు. కాని దాని వెనుక అసలు కారణం ఈ కేసు అన్న సంగతి ఇప్పుడు అర్దం అవుతోంది. తన జోలికి ఐటి అధికారులు రాకుండా చూడాలని కోరి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆ క్రమంలో ఎపిలో ఒకశాతం ఓట్ల బలం కూడా లేని బిజెపికి ఏకంగా 25 అసెంబ్లీ సీట్లు, ఐదు లోక్ సభ సీట్లు ఇవ్వబానికి చంద్రబాబు ముందుకు రావడంలో ఉన్న లోగుట్టు కూడా ఇదే అయి ఉండవచ్చన్న అనుమానం బలపడుతోంది. ✍️ చంద్రబాబుకు దత్తపుత్రుడు అనే విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని, చీటికి మాటికి టిడిపిని వెనుకేసుకు వచ్చే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కాని దీనిపై మౌనం దాల్చారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో సుమారురూ. 370 కోట్ల, ఫైబర్ గ్రిడ్ కేసులో రూ. 300 కోట్లు ఇలా పలు అభియోగాలు చంద్రబాబు టీమ్ పై వచ్చాయి. వాటిని విచారించాలని ఏపీ ప్రభుత్వం ఈడి వంటి సంస్థలను కోరింది. అవి ఎంతవరకు ముందుకు వెళ్లింది తెలియదు. కాని ప్రస్తుతం ముందుగా రూ. 118 కోట్ల కేసు నోటీసు రావడంతో ఈ స్కామ్ లపై కదలిక మొదలైందని అర్ధం అవుతుంది. ✍️ దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చంద్రబాబు, రామోజీ,రాధాకృష్ణ,టివి 5 నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు.హిందుస్తాన్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేయాలని చాలెంజ్ చేశారు. లేదా ఇదంతా కుట్ర అని భావిస్తే గతంలో విమర్శించినట్లు ప్రధానమంత్రి మోదీపై మరోసారి విరుచుకుని పడి ఉండవచ్చు. కాని అవేవి చేయలేదు.అంటే ఏమిటి దాని అర్ధం?.. ఈ నోటీసులో ఉన్నదాని ప్రకారం రూ. 118 కోట్ల బ్లాక్ మనీ అనండి...ముడుపులు అనండి ..మరే పేరైనా పెట్టండి.. అంత మొత్తం ముట్టినట్లు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా!. కనీసం టీడీపీ అధికార ప్రతినిది ఎవరితోనూ దీనిపై మాట్లాడించలేదు. ✍️ స్కిల్ కేసు, పైబర్ గ్రిడ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కక్షతో పెట్టిందని ఆరోపించిన తెలుగుదేశం ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు గురించి నోరు విప్పడం లేదు. గతంలో ఓటుకు నోటు కేసులో ఏభై లక్షల రూపాయలతో చంద్రబాబు అనుచరుడుగా అప్పట్లో ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుబడినా, ఆ చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ముప్పైసార్లుకు పైగా ప్రస్తావించినా, తనపై కేసు రాకుండా చూసుకోగలిగారు.చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో అన్నాకూడా.. కేంద్ర స్థాయిలో ముఖ్యస్థానాలలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ కేసునుంచి చంద్రబాబును రక్షించడానికి నడుం కట్టారు. దాంతో కేసీఆర్ కూడా అంగీకరించి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబుకు షరతు పెట్టారు. ఆ రకంగా ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కూడా తన పద్దతి మార్చుకోకుండా అమరావతి రాజధాని పేరుతో మళ్లీ స్కామ్ కు శ్రీకారం చుట్టారు. దాని ఫలితమే అమరావతిలో ఆర్ధిక అరాచకం. వందల కోట్ల కుంభకోణాలు. ఇవి జరిగిన తీరును ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో పూసగుచ్చినట్లు వివరించారు. మరో ఎనిమిది,తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు పరిణామాలు ముందుకు వెళితే టీడీపీకి, చంద్రబాబుకు పెద్ద షాక్ అని చెప్పాలి. కేవలం భూమి కొన్నారని ఆరోపణ చేసినందుకే చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. ఇప్పుడు ఇంత పెద్ద అభియోగం వచ్చినందున ఆయన తండ్రి ఇంకెంత పెద్ద పరువు నష్టం దావా వేయాలి?.. అలా దావా వేయకపోతే అవినీతికి పాల్పడినట్లు, ముడుపులు తీసుకున్నట్లు , తాను నిప్పు కాదని ఒప్పుకున్నట్లేనా!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక రాజధాని అమరావతి పేరుతో బడా కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున అయాచిత లబ్ధి పొందారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. ఆ అక్రమార్జనకుగానూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం అందుకున్నారు కూడా. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు పొందారని ఐటీ శాఖ సాక్ష్యాధారాల్ని చూపుతోంది. కానీ, ఐటీ శాఖ సరిగా పరిశీలన చేయలేదని బుకాయిస్తున్నారు చంద్రబాబు. పైగా మనుగడలో లేని ఐటీ నిబంధనలను సాకుగా చూపి దర్యాప్తు ఆలస్యం చేసే ప్రయత్నం చేశారాయన. అయితే.. చంద్రబాబు లేవనెత్తిన టెక్నికల్ అభ్యంతరాలను ఇప్పటికే ఐటీ శాఖ తిరస్కరించింది. దీంతో కేసు మెరిట్స్ లోపలికి వెళ్లకుండా.. మరిన్ని టెక్నికల్పాయింట్స్ తెరపైకి తెచ్చి దర్యాప్తు ఆలస్యం చేయడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని సాకుల కోసం వెతుకుతోంది చంద్రబాబు అండ్ కో. లోకేష్ సన్నిహితుడికి కూడా.. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. -
అడ్డంగా బుక్కైనా.. నోరు విప్పని CBN
సాక్షి, గుంటూరు: అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఫలితంపై పొలిటికల్ రియాక్షన్లు వస్తున్నాయి. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం అంటూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2023 ► చంద్రబాబు ముడుపుల వ్యవహారం పై అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. అమరావతి నిర్మించాలంటూ ఎల్&టీ,షాపూర్ జీ పల్లోంజి ,ఇతర ఇన్ ఫ్రా సంస్థల నుంచి లంచాలు వసూలు చేశారు. వివిధ వ్యక్తుల ద్వారా,వివిధ రూపాల్లో రూ. 118 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదంతా మేం పనిగట్టుకుని చేసే ఆరోపణలు కాదు. ఎన్నికల ముందే ఇన్ కంటాక్స్ అధికారులకు అందిన ఫిర్యాదు. దీని పై మాట్లాడమంటే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడు. చంద్రబాబు చేసే పనులన్నీ అవినీతి అరాచకంతో కూడిన కుట్రలే. తాజాగా ఐటీ నోటీసులు ఇవ్వడమే దీనికి ఉదాహరణ. :::విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ► పశ్చిమగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ మొత్తం.వేల కోట్లు అతను దోచేసాడు. స్కిల్ డెవలప్మెంట్ సీమన్స్ కంపెనీ ద్వారా 300 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, ఇసుక మీద కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు మేనేజ్మెంట్ లో ఎక్సపర్ట్ కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన దోపిడీకి ఇది శాంపిల్ మాత్రమే. టిడ్కో ఇళ్ల ద్వారా పేదవాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు చొప్పున దోచుకున్నారు. డబ్బులు రాని ఆరోగ్య శ్రీ, 108 లాంటి వ్యవస్థ లను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలిసి గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్ళబేరానికి చూస్తున్నారు. :::ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ► సాక్షి, తాడేపల్లి: హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు. లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు. తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. :: మాజీ మంత్రి పేర్ని నాని. -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు. నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’పిల్లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. -
నారా లోకేష్‌కు బిగ్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు. -
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రామోజీ, శైలజాకిరణ్ మళ్లీ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్‌కు నోటీసులు జారీ చేశారు. వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మళ్లీ కూడా అదే వైఖరి రామోజీరావు, శైలజాకిరణ్‌కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్‌ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
నటుడు, దర్శకుడు ఉపేంద్ర ఉక్కిరిబిక్కిరి
నటుడు ఉపేంద్ర సినిమాలలో కొత్త కొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటూ, నిజ జీవితంలోనూ విలక్షణంగా ప్రవర్తిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నా నాలుకకు– మెదడుకు మధ్య ఫిల్టర్ లేదు, ఏది అనుకుంటే అది మాట్లాడడం నా నైజం అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు. అదే మాదిరిగా ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి ఇబ్బందుల పాలయ్యారు. కర్ణాటక : వివాదాస్పద వ్యాఖ్యలపై తనపై రెండు చోట్ల నమోదైన కేసులను రద్దు చేయాలని ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టు మెట్లెక్కారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ చోట్లలో ఆయనపై పలు సంఘాలవారు ఫిర్యాదులు చేస్తున్నారు. బెంగళూరులో రెండుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు కాగా మండ్య, కోలారులో కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఉప్పికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగాయి. శనివారం రాత్రి ఫేస్బుక్/ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఉపేంద్ర ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. దీనిపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉపేంద్ర క్షమాపణలు కోరారు. సోమవారం ట్విటర్ ఖాతాను లాక్ చేసుకొన్నారు. ఆయన ప్రస్తుతం యూఐ అనే సినిమాలో నటిస్తున్నారు. ఉపేంద్ర ఇళ్లు, వాట్సాప్‌లకు నోటీసులు మొదట చెన్నమ్మ అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు రాగా, వారు విచారణ కోసం ఉపేంద్రకు నోటీస్ ఇవ్వగానే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని తెలిసింది. వేరేవారి ద్వారా ఉపేంద్రను పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఉపేంద్రకు చెందిన రెండు ఇళ్లు, మొబైల్ వాట్సాప్‌లకు నోటీస్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణకు రావాలని బెంగళూరులోని ఉపేంద్ర ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన లేరని తెలిసింది. హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా ఏసీపీ వీవీ పురానికి బదిలీ చేశారు. ఉపేంద్రకు ఇది తగదు: మంత్రి యశవంతపుర: పేదరికం వేరు, కుల అసమానతలు వేరు, ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా నటుడు ఉపేంద్ర మాట్లాడటం మంచిది కాదని సామాజిక సంక్షేమ మంత్రి మహదేవప్ప అన్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలపై మొదట ఈ శాఖ అధికారులు బెంగళూరులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. మంత్రి స్పందిస్తూ రాజకీయ జీవనం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఉన్నవారు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా జాతి పేరుతో అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపేంద్ర హొలగేరి అనే పదాన్ని ఉపయోగించడమే తప్పు అన్నారు. హైకోర్టులో ఉపశమనం చిక్కుముడి బిగుసుకుంటోందని తెలిసి ఉపేంద్ర హైకోర్టులో పిటిషన్ వేసి తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఉపేంద్ర అన్ని వర్గాలను గౌరవించే మంచి మనిషి. హొలగేరి అనే నానుడిని మామూలుగా వాడారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదు అని ఉప్పి న్యాయవాది పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌడర్.. ఎఫ్ఐఆర్పై స్టే విధించారు. సర్కారుకు, ఇతర పక్షాలకు వైఖరి తెలపాలని నోటీసులు జారీ చేశారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
-
ఆకాశ్‌కు బైజూస్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్ఎల్)కు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్‌పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్ఎల్ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్‌ఎల్‌లో టీఎల్పీఎల్కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 27 శాతం, ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 12 శాతం వాటాలు దక్కాయి. ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్‌పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. -
గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం!
ఢిల్లీ: ‘మోదీ ఇంటిపేరు’ Modi surname కేసులో రెండేళ్ల జైలుశిక్షపై స్టే కోరుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్ ఆధారంగా.. పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ ఈశ్వర్‌బాయ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి, మరికొందరు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అలాగే.. జులై 7వ తేదీన గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు 100 పేజీలు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు నోటీసులకు స్పందన నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఆగష్టు 4వ తేదీన వాదనలు వింటామని తెలిపింది బెంచ్. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావా కేసులో గుజరాత్ సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు ఇంతకు ముందు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో జులై 15వ తేదీన రాహుల్ గాంధీ రివిజన్ పిటిషన్ వేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించింది. అంతకు ముందు జస్టిస్ గవాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువైపుల నుంచి తనకు కాస్త ఇబ్బందికరపరిస్థితులు ఉన్నాయని, తన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినా.. ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే తన సోదరుడు కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం గుర్తు చేయగా.. అందుకు రాహుల్ తరపు న్యాయవాది సింఘ్వీ నుంచి, మరో తరపు న్యాయవాది మహేష్ జెఠల్మానీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. దీంతో ఆగష్టు 4వ తేదీన గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం బెంచ్ వాదనలు విననుంది. Supreme Court issues notice to Gujarat Government and others on the plea of Congress leader Rahul Gandhi challenging the Gujarat High Court order which declined to stay his conviction in the criminal defamation case in which he was sentenced to two years in jail by Surat court… — ANI (@ANI) July 21, 2023 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు. తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. అయితే బెయిల్ దక్కించుకున్న రాహుల్ గాంధీ తన శిక్షపై స్టే తెచ్చుకోవడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ క్రమంలో గుజరాత్ సెషన్స్ కోర్టు ఆయనకు శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్ హైకోర్టుకు వెళ్లారాయన. జులై 7వ తేదీన గుజరాత్ హైకోర్టు ఆయన రివ్యూ పిటిషన్‌పై స్పందిస్తూ.. దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి(స్టే విధించడానికి) రాహుల్ గాంధీ చూపించిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. అందరుదైన సందర్భాల్లో మినహా శిక్షపై స్టేవ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ఆయనపై ఇప్పటికే 10 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైందే.. అలాగే న్యాయబద్ధమైందే. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం అని వంద పేజీలతో కూడిన తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఒకవేళ శిక్ష గనుక రద్దు అయితే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే ఛాన్స్ ఉంది. లేకుంటే ఆరేళ్ల దాకా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇదీ చదవండి: లైంగిక దాడి కేసు.. జైల్లో తక్కువ, బయటే ఎక్కువ! -
ఓఆర్ఆర్ను ఏ ప్రాతిపదికన అప్పగించారు?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్లపాటు ఏ ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) డైరెక్టర్‌తోపాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 30 ఏళ్లపాటు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ ఎంత అనేది వెల్లడించకుండా హెచ్ఎండీఏ, పురపాలక పరిపాలన–పట్టణాభివృద్ధి శాఖ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పిటిషన్లో పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ను టోల్– ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ఆదేశాలివ్వలేం.. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా టోల్ ఫీజు రూ.88 లక్షల వరకు వసూలవుతోందని, ఈ లెక్కన 30 ఏళ్ల కాలానికి లెక్కిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కంపెనీ పాలవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని, దురుద్దేశంతోనే దాఖలు చేశారని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పిటిషనర్ తరఫు న్యాయవాదికి చెప్పింది. -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్‌ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు
లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం -
ఎయిరిండియా-విస్తారా విలీనం: సీసీఐ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం. ఒప్పందం తీరిది... విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది. విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. సీసీఐ సంతృప్తి చెందకపోతే.. తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు. పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే
వికారాబాద్ అర్బన్: మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆలస్య రుసుం పేరుతో 2శాతం వడ్డీ వేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30లోపు సగం ఆస్తి పన్ను చెల్లించని వారికి ఈ వడ్డీ భారం తప్పదు. నిబంధనల ప్రకారం మున్సిపాల్టీలో భవన యజమానులు ప్రతి ఏటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒక సారి) ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరానికి చెందిన ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే యజమానులు ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఫిబ్రవరి, మార్చిలోనే ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఏటా వడ్డీ చెల్లించక తప్పడంలేదు. ఈ ఏడాది తప్పకుండా అర్ధవార్షిక పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. యజమానులకు నోటీసులు ఆస్తి పన్నును ముందస్తుగా వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు సంబంధిత యజమానులకు డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఇంటింటికి ఒకటి రెండు సార్లు పంపి అర్ధ సంవత్సరం పన్ను చెల్లించాలని లేకుంటే అస్సలు పన్నుపై 2శాతం వడ్డీ పడుతుందని చెప్పిస్తున్నారు. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు చెల్లించకుంటే వచ్చేనెల నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. యజమానులు వెంటనే మున్సిపల్ బిల్ కలెక్టర్లకు లేక ఆన్లైన్లో పన్ను చెల్లించుకోవడం మంచిదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఐదుశాతం మినహాయింపు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభం కాగా ఆస్తపన్ను చెల్లింపుపై పురపాలక శాఖ ఐదు శాతం రాయితీ అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ ఏడాదికి సంబంధించిన పన్నును ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నులో ఈ ఐదు శాతం రాయితీ వర్థిస్తుంది. దీంతో కొంత మంది యజమానులు ఆసక్తి చూపి పన్ను చెల్లించడంతో మున్సిపాల్టీలకు కొంత నిధులు సమకూరాయి. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించినవారిని మినహాయిస్తే మిగిలిన వారంతా గడువులోగా పన్ను చెల్లింపకపోతే వడ్డీ భారం భరించాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించడం కూడా భారమే. అందుకే అర్ధవార్షిక సంవత్సరంలో చెల్లిస్తే ఇంటి యజమానులకు భారం తగ్గుతుంది. – శరత్ చంద్ర, వికారాబాద్, మున్సిపల్ కమిషనర్ -
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి).. పలువురు సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. కేపీ చౌదరి దందా, డ్రగ్స్ కొన్నవారి జాబితా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోగా.. వాటిని పోలీసులు వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈనెల 14న కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించానని పోలీసులకు చెప్పారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ అవాస్తవాలు: అషురెడ్డి కేపీ చౌదరి వ్యవహారంపై అషురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘‘కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు అవాస్తవం. నాపై అలా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా ఫోన్ నంబర్‌ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదు’’అని పేర్కొన్నారు. ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా.. కొద్దిరోజులు అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడిగాడని, అంతేతప్ప ఆ ఇంట్లో వారేం చేశారనేది తనకు తెలియదని చెప్పారు. -
వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వేధింపుల ఎపిసోడ్ కొత్తమలుపు తిరిగింది. సర్పంచ్ నవ్య ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్ లు సుమోటోగా స్వీకరించి.. విచారణ నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా నవ్యకు రెండు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రెండు రోజుల్లో సమర్పించాలని సర్పంచ్ నవ్యను నోటీసుల్లో కోరారు ధర్మసాగర్ ఇన్స్పెక్టర్. అలాగే.. కాజీపేట ఏసీపీ కార్యాలయం నుంచి కూడా మరో నోటీసు నవ్యకు వెళ్లింది. మూడు రోజుల్లోగా సాక్ష్యాలతో తమను సంప్రదించాలని, విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం కోరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య ఫిర్యాదు టైంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నవ్య చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమాచారం. కాకపోతే విచారణ చేపట్టి.. తదుపరి చర్యలుచేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే.. నవ్య మాత్రం ఆ ఫిర్యాదుపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలుస్తోంది. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఐటీ నోటీసులను లైట్ తీసుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి..
పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు పాల్పడకుండా ఆదాయపు పన్ను శాఖ నూతన మార్గదర్శకాలతో పట్టు బిగించింది. ఐటీ శాఖ పంపించే నోటీసులను లైట్ తీసుకునేవారి పట్ల కఠిన వైఖరి అవలంభించనుంది. నోటీసులకు స్పందించనివారు పూర్తి స్క్రూటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను ఎగవేత చర్యలను కట్టడి చేయడంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త చర్యలను చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ నోటీసులకు స్పందించని పక్షంలో ఐటీ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు కూడా లోతుగా పరిశీలించనున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయంలో వ్యత్యాసాలను గుర్తించిన ఐటీ అధికారులు జూన్ 30లోగా ఐటీ చట్టం సెక్షన్ 143(2) కింద రెండో నోటీసు పంపుతారు. అలాగే సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు అందుకున్న వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఐటీ శాఖ పరిశీలిస్తుంది. స్క్రూటినీకి మార్గదర్శకాలు ఐటీ శాఖ పరిశీలనకు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ సీబీడీటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏవైనా చట్టబద్ధమైన సంస్థల నుంచి పన్ను ఎగవేతను సూచించే నిర్దిష్ట సమాచారం అందిన సందర్భంలో ఆ కేసులను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది. ఆ పన్ను చెల్లింపుదారు సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌కు ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నోటీసుకు స్పందనగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, సెక్షన్ 148 కింద నోటీసులు అందుకున్న సందర్భంలోనూ ఐటీ శాఖ పరిశీలన చేపడుతుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 142 (1) కింద నోటీసుపై రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తుంది. రిటర్న్ దాఖలుకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ ఈ సెక్షన్ 142(1) కింద నోటీసు జారీ చేస్తుంది. 2021 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత ఐటీ శాఖ సోదాలు చేసి సీజ్ చేసి ఉంటే అటువంటి వారు కూడా స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 1023(C) మొదలైన వాటి కింద ఐటీ శాఖ ఆమోదించకపోయినా పన్ను మినహాయింపు లేదా తగ్గింపును క్లెయిమ్ చేసిన వారిపై కూడా విచారణ ఉంటుంది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! -
ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. మరో వైపు ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. చదవండి: అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం -
అఖిలప్రియకు టీడీపీ షాక్!
సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఖిలప్రియకు టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి విషయంలో వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అఖిలప్రియకు పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఇదిలా ఉండగా.. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పని చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. అఖిల ప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని జశ్వంతిరెడ్డి అన్నారు. రోడ్డు మీద, బరి తెగించి.. ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిల ప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. (చదవండి, జశ్వంతి వీడియో చూడండి : అఖిలప్రియ గురించి ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి ఏమి చెప్పిందంటే.?) ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి! -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
ది కేరళ స్టోరీ.. బెంగాల్, తమిళనాడుకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ది కేరళ స్టోరీ.. ఈ సినిమాపై వివాదం కొనసాగుతున్నది. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ ఎందుకు చేశారని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బెంగాల్, తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది కదా? బెంగాల్ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి? అని ప్రశ్నించింది. బ్యాన్‌కు గల కారణాలను చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు ది కేరళ స్టోరీ బ్యాన్‌లో ఉన్న బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో, తమిళనాడులో ఈ సినిమా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. 'ది కేరళ స్టోరీ'ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ సినిమాను బ్యాన్ చేసిన సందర్బంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని మేకర్స్ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది.. వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరారని ట్రైలర్లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది. "Why Should Bengal Ban 'The Kerala Story'?" Supreme Court Issues Notice https://t.co/AQBKL21gWE pic.twitter.com/RHBjP5neX4 — NDTV News feed (@ndtvfeed) May 12, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. కౌన్‌బనేగా కన్నడ సీఎం -
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
టెన్త్ స్పాట్‌కు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ వేసినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు. ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆన్లైన్ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్ వాల్యూయేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? ♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ♦ మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. ♦ ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ♦ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు టీచర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులిచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతున్న ‘చైతన్య రథం’ పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ నోటీసులిచ్చారు. ‘చైతన్య రథం’ పత్రికలో గత ఏడాది నవంబరు 23వ తేదీ ఎడిషన్‌లో ‘అపరిచితుడు’, ‘బుగ్గనగారి బాగోతం’ శీర్షికలతో అవాస్తవ కథనాలు ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి బుగ్గన... సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను సమర్పిం చిన నామినేషన్ పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలను ఫోర్జరీ చేశారని బుగ్గన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా తన భూముల విస్తీర్ణం, వాటి విలువను అమాంతంగా పెంచేసి దుష్ప్రచారం చేశారన్నారు. సీఐడీ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారించి ఈ నోటీసులిచ్చారు. సెక్షన్ 92 సీఆర్పీసీ కింద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు ఇచ్చారు. 2022, నవంబరు 23 నాటి చైతన్య రథం పత్రిక కాపీ, ఆ పత్రిక ఎడిటర్, ఆ వార్తలు రాసిన విలేకరి వివరాలు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. -
టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ మంగళవారం నోటీసులు కూడా అందించారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న.. వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరంటూ సీఐడీ ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి లాయర్ చేతికి నోటీసులు అందించారు సీఐడీ అధికారులు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై చైతన్య రథం ప్రతిక తప్పుడు కథనాలు ప్రచురించింది. ఎన్నికల కమిషన్‌కి బుగ్గన సమర్పించిన అఫిడవిట్లో స్థిర, చర ఆస్తులపైనా తప్పుడు రాతలు రాసింది. దీంతో ఆయన పత్రికపై ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సీఐడీ. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వెలుగులోకి అక్రమాలు
-
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ నెల 29 లేదా 31వ తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది. -
‘స్థానిక’ ఖాళీలపై ఎన్నికల కమిషన్ కదలిక
సాక్షి, హైదరాబాద్: వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన పలు ప్రజాప్రతినిధుల స్థానాల ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) వర్గాలు వెల్లడించాయి. పలు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, ఇతర పోస్టులకు ఎన్నికలెందుకు నిర్వహించడం లేదంటూ తాజాగా ఎస్ఈసీకి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఎన్ని రోజుల్లోగా నిర్వహిస్తారో వెల్లడించాలని, అందుకు నెల రోజుల సమయం కూడా కోర్టు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వానికి ఎస్ఈసీ విజ్ఞప్తి చేయను న్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టు నోటీస్ జారీకి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎస్ఈసీకి, పీఆర్ శాఖకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. పీఆర్ శాఖ కమిషనర్‌కు కూడా కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా అంశాల ప్రాతిపదికన సమా« దానం పంపేందుకు సిద్ధమ వుతున్నట్టు తెలుస్తోంది. నూతన పీఆర్ చట్టం ప్రకారం... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వ సమ్మతి, ఆమోదంపొందాకే ఎస్ఈసీ వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. వివిధ గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది. ఖాళీలు ఏర్పడిన స్థానాలకు ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏదైనా కారణంతో స్థానిక సంస్థల పోస్టులు ఖాళీ అయితే ఆరునెలల్లో భర్తీ చేయాల్సి ఉండగా, వీటి ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మినీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వివిధ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల పోస్టులు ఆరువేలకుపైగా ఖాళీలు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఈ ‘మినీ పంచాయతీ’ఎన్నికలు జరుగుతాయో, లేదోననే చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాక ఎన్నికల వ్యయం వెల్లడించకపోవడం, విధుల నిర్వహణలో అలస త్వం ప్రదర్శించడం, అక్రమాలు, పీఆర్ చట్ట ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యా యి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎస్ఈసీకి, పీఆర్ కమిషనర్లకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పేపర్ లీక్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం).. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ఇవాళ(మంగళవారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరింది. పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ తమ ఎదుట హాజరు కావాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఆధారాలు తమకు ఇవ్వాలని సిట్ తన నోటీసుల్లో పేర్కొంది. ఇక మంగళవారం సాయంత్రం నోటీసులతో సిట్ అధికారులు.. బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని కోరింది. ఇదీ చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు -
తెలంగాణ గవర్నర్ వ్యవహారం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో ఉంచారు. అయితే.. వాటిని ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ తరుణంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ముద్ర పడాల్సి ఉంటుంది. అలా జరిగితేనే.. వాటి అమలుకు వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే పది బిల్లులను పంపితే.. తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడం లాంటివేం చేయకుండా ఆమె పెండింగ్ ఉంచారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్లో గవర్నర్‌తో పాటు గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది టీ సర్కార్. అయితే.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే.. ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతూ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో.. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కలుగుజేసుకుని తెలంగాణ గవర్నర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తానంటూ ధర్మాసనాన్ని కోరారు. అయినప్పటికీ సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మార్చి 27వ తేదీ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. -
మరోసారి సుప్రీంకు కల్వకుంట్ల కవిత!
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇవాళ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె.. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరుతూ సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపు (శుక్రవారం) తమ పిటిషన్ అత్యవసర విచారణ జరపాలని ఆమె కోరనున్నట్లు తెలుస్తోంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ అత్యవసర విచారణ చేపట్టాలని, ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ మేరకు తనకు జారీ చేసిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన లాయర్ ద్వారా కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవాళ ఈడీ విచారణకు ఆమె హాజరు కాకపోవడం, ఈ వెంటనే 20వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందేనని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు తిరుగుపయనం కావాల్సిన ఆమె.. అక్కడే ఢిల్లీలో ఉండే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అనంతరం ఆమె సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. -
మహిళా కమిషన్ నోటీసులకు బండి సంజయ్ స్పందన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కి బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆయన.. ఇవాళ లేఖ ద్వారా స్పందించారు. మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందాయని తెలిపిన బండి సంజయ్.. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే.. బదులుగా ఈ నెల 18వ తేదీన కమిషన్ ఛైర్మన్ సూచించిన టైంకి హాజరుకాగలనని చెప్పారు. అలాగే తాను కమిషన్ ఎదుట హాజరయ్యే అంశంపై పూర్తి సమాచారం అందించగలిగితే.. తాను విచారణ సమయానికి పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంటానని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఈడీ సమన్లు కావు.. మోదీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ‘అయితే జుమ్లా... లేదంటే హమ్లా’అనే రీతిలో మోదీ ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. అవి ‘ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు’అని పేర్కొన్నారు. మోదీ సర్కార్ చేతిలో ‘ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలు»ొమ్మ’గా మారాయని విమర్శించారు. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని, కవిత ఈడీ ముందు హాజరై పూర్తిస్థాయిలో సహకరిస్తారని తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.... ఒక్క బీజేపీ నేతపై అయినా దాడులు జరిగాయా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలపైకి ఉసిగొల్పుతోంది. కవితే మొదటి వ్యక్తి కాదు. చివరి వ్యక్తీ కాదు. ఇంకా చాలామంది ఉంటారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ, జగదీశ్‌రెడ్డి పీఏల మీద ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మీద ఐటీ దాడులు జరిగాయి. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర,, పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మొదలైన 12 మంది మీద ఈడీ, సీబీఐ, ఐటీలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపింది. మోదీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయి. ఒక్క బీజేపీ నేత మీద అయినా ఈ తరహా దర్యాప్తు సంస్థల దాడులు జరిగిన చరిత్ర లేదు. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 5,422. అందులో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. అదానీ కంపెనీ మోదీ సొంత కంపెనీ... ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి.. ఇవి తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ సాధించిందేమీ లేదు. గౌతమ్ అదానీ అనే వ్యక్తి మోదీ బినామీ అని చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడు. ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టులు కట్టబెట్టొద్దని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానికి ఆరు ఎయిర్‌పోర్టులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? సాక్షాత్తూ నీతి ఆయోగ్ దీన్ని తప్పుబట్టింది. దేశాన్ని కుదుపు కుదిపేసిన హిండెన్‌బర్గ్ నివేదిక మీద మోదీకి మాట రాదు. రూ.13 లక్షల కోట్ల ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రజా సంస్థల డబ్బులు ఆవిరైనా.. ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు. గౌతం అదానీకి చెందిన ముంద్రా పోర్టులో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాదు. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో పాల్గొనడానికి వచ్చి న శ్రీలంక ఆర్థిక మంత్రి.. అదానీకి, శ్రీలంకకు మధ్య జరిగిన ఆరువేల కోట్ల ఒప్పందాన్ని జీ టు జీ ఒప్పందంగా పేర్కొన్నాడు. జీ టూ జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు గౌతమ్ అదాని టు గొటబయ అని అర్థం. అదాని కంపెనీ మోదీ సొంత కంపెనీ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అదానీ కోసం ప్రధాని హోదాలో మార్కెటింగ్ చేస్తున్నారు. బీజేపీ వ్యవహారం ‘వాషింగ్ పౌడర్ నిర్మాయే..’ సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాషింగ్ పౌడర్ నిర్మా.. అన్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం. అంటే బీజేపీలో చేరగానే వారి పాపాలు, వారి మీద ఉన్న కేసులు వెంటనే పోతాయి. సుజనాచౌదరికి చెందిన షెల్ కంపెనీల ద్వారా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని, వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. కానీ సుజనాచౌదరి బీజేపీలో చేరడంతో ఆ కేసులు నీరుగారాయి. ఏపీలో బ్యాంకులకు వందల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు మీ పార్టీలో చేరగానే పునీతులు అయ్యారా ? ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయినా ఎలాంటి దాడులు ఉండవు. మహారాష్ట్రకు చెందిన ఎంపీ పాటిల్ అనే వ్యక్తి.. ‘బీజేపీలో చేరినందున నా మీదకు ఈడీ రాదు’అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఈడీ నుంచి ఉపశమనం పొందానని హర్షవర్ధన్ అనే ఎంపీ చెప్పాడు. పశ్చిమబెంగాల్లో వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న తృణమూల్ నేత సువేందు అధికారిని విచారణల పేరుతో భయపెట్టి బీజేపీలో చేర్చుకున్న తర్వాత ఆ కేసు ముందుకు సాగకపోవడం నిజం కాదా? శారదా కుంభకోణం ప్రధాన నిందితుడు హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరిన తరువాత ఈడీ, సీబీఐ అతనిపై దర్యాప్తును ఎందుకు నిలిపివేశాయి? బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థలపై సైతం ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ అంటే..ఒకటి మోదీ, మరొకటి అదాని డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటున్న బీజేపీ ప్రభుత్వం అసలు రూపం దేశ ప్రజలకు ఇప్పుడు అర్థం అయింది. ఒక ఇంజిన్ మోదీ అయితే మరో ఇంజిన్ అదానీ. ఆ డబుల్ ఇంజన్ పేరు ‘మాదాని.. అంటే మోదీ, అదానీ అన్నమాట. మోదీ– అదానీ చీకటి స్నేహం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ప్రజలందరికీ తెలుసు. తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దొడ్డిదారిన తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కాంట్రాక్టులు, పదవుల పేరుతో లొంగదీసుకున్నది అబద్ధమని చెప్పగలరా? మన తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీలోకి లాక్కున్నది వాస్తవం కాదా? మద్యమే లేని గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే ఏ విచారణ చేశారు? అది స్కాం కాదా? ఢిల్లీ లిక్కర్ పాలసీని తప్పుబడుతున్న వారు.. గుజరాత్లో జరిగిన ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారు? ఈడీ, బోడీలకు భయపడేదే లేదు.. టార్గెట్ కేసీఆర్‌లో భాగంగానే.. ఉద్యమనేత బిడ్డగా పుట్టుకనుండే చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారిణి ఎమ్మెల్సీ కవితను ఈడీ పేరుతో వేధిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీకి కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ మీద కుట్రలో భాగంగానే మనీశ్ సిసోడియాను కూడా అరెస్టు చేశారన్నది దేశ ప్రజలకు తెలుసు. బ్యాంకుల్ని ముంచినవారిని, కమీషన్లు దండుకుంటున్న వారిని పట్టించుకోకుండా కవిత మీద , ఇతర నేతల మీద ఈడీలను, బోడీలను ప్రయోగిస్తే భయపడే ప్రసక్తే లేదు. -
ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్లో ప్రకంపలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా, కవిత.. జంతర్ మంతర్‌లో ధర్నా కారణంగా ఈనెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కానుంది. అయితే, ధర్నాలో భాగంగా కవిత.. బుధవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోంది. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తాం. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్దతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఉద్యమం చేసి వచ్చాం.. భయపడే వాళ్లం కాదు. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటాం. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. 200 మంది ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. బీఆర్ఎస్కు సంబంధించిన నేతల ఇళ్లలో కూడా దాడులు జరిగాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. మేము భయపడే వాళ్లం కాదు. దేశంలో మోదీ-అదానీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. మోదీకి అదానీ బినామీ అని పిల్లోడిని అడిగినా చెబుతాడు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాలటైపోయింది. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే కేంద్రం ఈడీ దాడులు చేస్తోంది. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోంది. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ బయటే కాదు పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారు. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం. జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు. ఈడీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాను. మేము బీజేపీ బీ టీమ్ అయితే.. ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నాము. నాతో పాటు ఎవరిని విచారించినా నాకేం ఇబ్బంది లేదు. మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లుపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేకపోయాయి. అందుకే రేపు ఢిల్లీలో ధర్నా చేపడుతున్నాం. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో మొత్తం 18 పొలిటికల్ పార్టీలు పాల్గొంటాయి అని స్పష్టం చేశారు.