Petrol pump
-
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్‌కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్‌లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్‌ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్‌కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్‌లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్‌కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్‌లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్‌లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్‌సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్‌కు 22,000ల పైచిలుకు, హెచ్‌పీసీఎల్‌కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్‌కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్‌పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్‌కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
రూల్స్ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!
మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.India Not For Beginers అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్‌ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌తో ఓ బంక్‌లోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్‌కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్‌లో కరెంట్ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్‌కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్‌కు పవర్ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్‌కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్ ఓనర్ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్.యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్ వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్‌లోకి వచ్చే టైంలో పైలాన్ రైడర్లూ ఉన్నా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.#Hapurपिलखुवा क्षेत्र के परतापुर रोड स्थित श्री जी फ्यूल पर एक अजीबो गरीब मामला सामने आया हैबिना हेलमेट बिजली विभाग के कर्मचारियों को पेट्रोल ना देना पेट्रोल पंप संचालक को पड़ा भारी लाइनमैन ने काट दी पेट्रोल पंप की बिजलीघटना सीसीटीवी में हुई कैद @DmHapur pic.twitter.com/My77ptruK3— Asian News UP (@AsianNewsUP) January 15, 2025 -
‘దివ్య’మైన ఉపాధి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగజన్ పెట్రోల్ బంక్ స్థానిక దివ్యాంగుల జీవితాలకు కొత్త వెలుగునిస్తోంది. మొన్నటివరకు ఎన్నో కష్టాలు పడినవారు.. ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పట్టణ శివారులోని పెద్దూరు వద్ద మెడికల్ కాలేజీ ముందు దివ్యాంగజన్ పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.2.50 కోట్లతో బంక్ ఏర్పాటు చేసింది. కలెక్టర్ మరో రూ.30 లక్షలు గ్రాంట్‌గా మంజూరు చేయడంతో ప్రస్తుతం బంక్ నడుస్తోంది. వాస్తవానికి దీనిని ట్రాన్స్‌జెండర్స్ కోసం ఏర్పాటు చేశారు. వారు ఇక్కడ ఇచ్చే రూ.12 వేల వేతనానికి పని చేసేందుకు ముందుకు రాకపోవటంతో దివ్యాంగులకు పని కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. బంక్‌ను గత నెలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 23 మందికి శాశ్వతంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి.ఈమె పేరు ఆకుల సంధ్య (42). సిరిసిల్ల శివ నగర్‌కు చెందిన ఈమెకు చిన్నప్పుడే పోలియో మూలంగా కాలు వంకరగా ఉంది. ఈమె భర్త రమేశ్ సిరిసిల్లలో కిరాణ షాపు నడిపేవాడు. ఇప్పుడు పెద్దూరులో ఉండడంతో పెద్దగా పని లేదు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ ముందు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంతో అక్కడ పని చేస్తూ సంధ్య నెలకు రూ.12 వేలు సంపాదిస్తుంది.ఇతని పేరు బాలమల్లేశ్ (40). సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన ఈయన నిరుపేద. ఇల్లు లేదు. భార్య మాధురి బీడీలు చేస్తుంది. వీరికి ఒక్క పాప. 8వ తరగతి చదువుతుంది. పోలియోతో మల్లేశ్ కాలు వంకరగా ఉంది. అతనిప్పుడు పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ నెలకు రూ.13 వేలు సంపాదిస్తున్నాడు. భార్యాభర్తల ఆదాయం రూ.20 వేల వరకు వస్తుండటంతో పెద్దగా కష్టాలు లేకుండా బతుకుతున్నారు.ఉపాధి రెట్టింపైంది మాది సిరిసిల్ల శివారులోని రగుడు. నేను స్కూల్లో పని చేసేదాన్ని. అప్పుడు రూ.6 వేలు జీతం వచ్చేది. నాకు బాబు, కూతురు. నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. ఒంటరి మహిళను కావడంతో పెట్రోల్ బంక్‌లో పని కల్పించారు. ప్రస్తుతం రూ.12 వేల వేతనం వస్తుంది. జీతం రెట్టింపు అయింది. ఇక్కడ పని చేయడం సంతోషంగా ఉంది. – గోనెపల్లి మంజుల, రగుడు దివ్యాంగులను ప్రోత్సహించాలి ప్రభుత్వ సహకారం, జిల్లా కలెక్టర్ చొరవతోనే ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. వాహనదారులు ఇక్కడ పెట్రోల్,డీజిల్ పోయించుకుని దివ్యాంగులను ప్రోత్సహించాలి. లాభాపేక్ష లేకుండా దివ్యాంగులకు పని కల్పించడమే బంక్ లక్ష్యం. –లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి, రాజన్న సిరిసిల్ల -
ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి. రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కాగా ముంబైలోని ఘాట్కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్‌పుర్‌కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్‌పుర్‌కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్‌లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్‌కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్‌లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది. -
పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్‌యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్‌ను మాత్రమే పీఎస్‌యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్‌యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
వచ్చారు, పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు.. కొంచెమైతే!
-
వచ్చారు, బైక్‌లో పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు..
భోపాల్: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్ వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్ యాజమాన్యం పేర్కొంది. (చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి సరైన సమయం ఏదంటే..) సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స్థానికులు వెల్లడించారు. అయితే, నిందితులు కావాలనే లైటర్ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు
పెట్రోల్ బంక్‌లో ప్రవేశిస్తుండగా ట్రక్ అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్ పంపు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్ 22న ఉదయం 9.3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ట్యాంక్ ఫిల్ చేసుకునేందుకు మహారాష్ట్రలోని పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సరిగ్గా పెట్రోల్ బంక్ ఎంట్రెన్స్‌లోకి వస్తుండగా ట్రక్కు అదుపుతప్పడంతో.. బంక్ వద్ద ఆగి ఉన్న కారుని ఢీకొట్టి పెంట్రోల్ బంక్ పంపు వైపుకి దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Video: Truck Hits Car At Pune Highway Petrol Pump, Uproots Fuel Dispenser Read here: https://t.co/w643tyKGZS pic.twitter.com/sVSq4qcZEU — NDTV Videos (@ndtvvideos) April 25, 2023 (చదవండి: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో) -
పెట్రో డీలర్ల ఆందోళన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కమీషన్ పెంచాలని కోరుతూ ‘పెట్రో’డీలర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘నో పర్చేజ్ డే’పాటించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంధన కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని డీలర్లంతా సంఘీభావాన్ని ప్రకటించారు. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ, డీలర్ల కమీషన్ మాత్రం పెంచలేదని, ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో తాము చెల్లించిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పెట్రోల్, డీజీల్ డీలర్ల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్, సూర్యాపేట, రామగుండం, వరంగల్‌లలో ఉన్న మూడు చమురు కంపెనీలకు చెందిన 7 పెట్రోల్, డీజిల్ డిపోల నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో ఎనిమిది మంది డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలి వేశారు. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఆర్నెల్లకోసారి డీలర్ల కమీషన్‌ను సవరించాల్సి ఉండగా, 2017 నుంచి దాని గురించి పట్టించుకోలేదని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని తప్పుపట్టడం లేదని, తాము చెల్లించిన మొత్తాన్ని రీయంబర్స్మెంట్ చేయాలని చమురు కంపెనీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి
సాక్షి, వైఎస్సార్ కడప : మండల పరిధిలోని అంకాలమ్మగూడూరులో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరిపై దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి మూడు వాహనాలలో శనివారం రాత్రి బయలుదేరారు. అంకాలమ్మ గూడూరులో ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి 11 గంటల సమయంలో వాహనాలకు డీజిల్ నింపాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు డీజిల్ పట్టేలోపే ఆలస్యమైందని వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. పెట్రోల్ బంకు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘పెట్రోల్ లేకపోయినా.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు’
న్యూఢిల్లీ:సడలించిన నూతన పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనల కింద.. పెట్రోల్, డీజిల్ విక్రయాల కంటే ముందే సీఎన్జీ, ఈవీ చార్జింగ్ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నవంబర్ 8 నాటి నిబంధనల విషయమై ఈ మేరకు తాజాగా వివరణ ఇచ్చింది. ఈ నూతన నిబంధనల కింద.. పెట్రోల్, డీజీల్ విక్రయాలతో పాటు ఏదైనా ఒక నూతన తరం ప్రత్యామ్నాయ ఇంధన విక్రయాలను (సీఎన్జీ లేదా ఎల్ఎన్జీ లేదా ఎలక్ట్రిక్ లేదా బయో ఇంధనం) కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, దీన్ని తప్పనిసరి ఆదేశంగా చూడొద్దని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పెట్రోలు బంకుకి అనుమతి పొందిన సంస్థలు. పెట్రోలు, డీజిల్ విక్రయాని కంటే ముందే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి : వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు
తిరువనంతపురం: రైతు బిడ్డ రైతే అవుతాడు.. రాజు బిడ్డ రాజు అవుతాడు.. ఇది జమానా మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా డైలాగ్ ప్రకారం విజయం ఎవడబ్బ సొత్తు కాదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. విజయం మన సొంతం అవుతుంది. ఈ మాటలు నిజం చేసి చూపారు ఆర్య రాజగోపాల్ అనే యువతి. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్ సాధించారు. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. ఏంటంటే ఆర్య తండ్రి పెట్రోల్ బంక్‌లో సాధారణ ఉద్యోగి అని చెప్పుకున్నాం కాదా. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్ పొందిన కోర్సు పెట్రోలియమ్ ఇంజనీరింగ్ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ స్ఫూర్తిదాయక కథనం వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి: Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’) కేరళ పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్. కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్. కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని, కలలను అర్థం చేసుకున్న ఆర్య చదువులో ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని పేరున్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకుంది. దానిలో భాగంగానే ఆర్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి తన బ్యాచిలర్ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పుర్‌లో సీటు సాధించి.. తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది. (చదవండి: వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే) ఆర్య కుటుంబ నేపథ్యం... ఆమె ప్రయాణం.. ఇప్పుడు సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య రాజగోపాల్, ఆమె తండ్రి రాజగోపాల్ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి.. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ Heartwarming indeed. Arya Rajagopal has done her father Sh Rajagopal Ji & indeed all of us associated with the country’s energy sector immensely proud. This exemplary father-daughter duo are an inspiration & role models for Aspirational New India. My best wishes.@IndianOilcl https://t.co/eiU3U5q5Mj pic.twitter.com/eDTGFhFTcS — Hardeep Singh Puri (@HardeepSPuri) October 6, 2021 చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు -
సాక్షి పరిశోధన: పెట్రోల్ బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే సైదాబాద్ కాలనీకి చెందిన నీల రవిచంద్ర ఎప్పుడూ తన ద్విచక్ర వాహనంలో మార్గంమధ్యలో గల జైళ్ల శాఖ నిర్వహించే చంచల్‌గూడ ఆయిల్ బంకులోనే పెట్రోల్ పోయించుకుంటాడు. కొలత సరిగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది వాహనదారులు ఇక్కడ క్యూ కడుతుంటారు. రెండురోజుల క్రితం ఆ బంకును దాటేశాక బండిలో పెట్రోల్ దాదాపు అడుక్కి వచ్చిందన్న సంగతి రవిచంద్రకు గుర్తొచ్చింది. దీంతో దారిలో ఒక ప్రైవేటు బంక్‌లో పెట్రోల్ కొట్టిద్దామనుకుని, సరిగా కొడతారో లేదో అన్న అనుమానంతో ఒక లీటర్ మాత్రమే కొట్టించాడు. అతని పాత మోటార్‌సైకిల్ లీటర్‌కు 40 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది. దీంతో ఒక లీటరు ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేందుకు, మరునాడు చంచల్‌గూడ వెళ్లే వరకు సరిపోతుందని భావించాడు. కానీ సాయంత్రం ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణంలో, ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా వాహనం ఆగిపోయింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే.. అతను అనుమానించినట్టే జరిగింది. ట్యాంక్ ఖాళీగా కన్పించడంతో బంకులో మోసం జరిగిందని గ్రహించాడు. 50 నుంచి 100 ఎంఎల్ వరకు పెట్రోల్ తక్కువ పోసి ఉంటారని అంచనా వేశాడు. రోజుకెంతో తెలుసా..! ఇలా ఒక వినియోగదారుడు ఒక లీటర్‌పై నష్టపోయేది కేవలం 50 నుంచి 100 మిల్లీలీటర్లే కావొచ్చు. కానీ ఈ తరహా మోసంతో కొన్ని బంకుల యజమానులు ఒక్క రోజులోనే కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, 60 లక్షల లీటర్లకు పైగా డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. ఈ లెక్కన చూస్తే రోజుకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్ల వరకు పెట్రోల్, మూడు లక్షల నుంచి ఆరు లక్షల లీటర్ల వరకు డీజిల్‌ను నొక్కేస్తున్నారన్నమాట. ప్రస్తుత ధరలతో లెక్కిస్తే పెట్రోల్‌పై రోజుకు దాదాపు రూ.2 కోట్ల నుంచి 4 కోట్లు, డీజిల్‌పై కూడా అటు ఇటుగా రూ. 3 కోట్ల నుంచి 6 కోట్లు వినియోగదారులు నష్టపోతున్నారన్నమాట. క్రమం తప్పకుండా పెరుగుతున్న ఇంధనం ధరలతో ఇప్పటికే అల్లాడిపోతున్న వాహనదారులను కొందరు పెట్రోల్ బంకుల యజమానులు నిలువునా మోసం చేస్తున్నారు. చాలా పెట్రోల్ బంకుల్లో డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్ల టెక్నాలజీ హైటెక్ ట్యాంపరింగ్ (సాంకేతికతలో మార్పులు, చేర్పులు) అధికారులు సైతం కనిపెట్టలేని విధంగా కొనసాగుతోంది. పలు రకాల ట్యాంపరింగ్‌తో డిస్ప్లేలో మీటర్ రీడింగ్ కరెక్ట్‌గానే చూపిస్తున్నా.. వాస్తవంగా డెలివరీ అయ్యే ఆయిల్ మాత్రం తక్కువగా ఉంటోంది. ప్రధానంగా ముంబయి, కోయంబత్తూర్లలోని డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో పనిచేసి మానేసిన సిబ్బంది, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు టెక్నీషియన్లు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు. వీరు చేసే ట్యాంపరింగ్‌ను మళ్లీ టెక్నీషియన్లు వచ్చి బహిర్గతం చేసి చూపిస్తే తప్ప గుర్తించడం కష్టమేనని చెబుతున్నారు. అయితే బంకుల డీలర్లు అత్యంత కట్టుదిట్టంగా చేస్తున్న డిజిటల్ టెక్నాలజీ ట్యాంపరింగ్ ట్రిక్కులు అనేకం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధనలో బహిర్గతమయ్యాయి. తనిఖీ చేస్తే సరిగానే.. ఎప్పుడైనా అధికారులు కానీ, అనుమానంతో వినియోగదారులు కానీ కొలత వేయించినప్పుడు ఆయిల్ సరిగానే వచ్చే ప్రత్యేక ఏర్పాట్లు ఉండటంతో ఈ ట్యాంపరింగ్‌ను వెలుగులోకి తేవడం వినియోగదారుల మాట అలా ఉంచితే సంబంధిత అధికారులకే దాదాపు అసాధ్యంగా మారుతోంది. ట్యాంపరింగ్ ఇలా.. సాఫ్ట్వేర్ మార్చేస్తున్నారు.. పెట్రోల్ బంకు డిస్పెన్సెంగ్ యూనిట్లో గల కంట్రోల్ బోర్డులోని కేబుల్ ఇన్పుట్ వైర్ ద్వారా, మెయిన్ చిప్‌కు అదనంగా మైక్రో చిప్ ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మార్పిడికి పాల్పడుతున్నారు. యూనిట్ బయట ఉండే కీ ప్యాడ్‌తో ఆపరేట్ చేస్తున్నారు. దీంతో ముందే ఏర్పాటు చేసుకున్న కోడ్ మేరకు సర్దుబాటు చేసిన కొలతల ప్రకారం (లీటర్‌కు 50 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ కోత పడేలా) ఆయిల్æ డెలివరీ అవుతోంది. డిస్ప్లే బోర్డులో కొలత సక్రమంగానే చూపించినా డెలివరీ మాత్రం సర్దుబాటు చేసిన ప్రకారమే అవుతోంది. ప్రస్తుతం చాలా బంకుల్లో ఈ టెక్నాలజీ ట్యాంపరింగ్ ద్వారానే మోసం జరుగుతోంది. మరి కొందరు యాజమానులు యూనిట్లో మెజరింగ్ సిస్టమ్ (పల్సర్ విభాగం)కు సర్క్యూట్‌తో కూడిన అదనపు కేబుల్‌ను అనుసంధానించి, కీ ప్యాడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా పంప్‌ను ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. అదనపు సర్క్యూట్.. డిస్పెన్సింగ్ యూనిట్లో ఆయిల్ పరిమాణాన్ని, విలువను సూచించే డిస్ప్లే బోర్డులో అదనపు సర్క్యూట్ ఏర్పాటు ద్వారా మెజర్మెంట్ కౌంట్ కమాండ్ (కొలత)లో మార్పు చేయడం, రీడింగ్ తెలియచేసే డిజిటల్ అనలాగ్ వద్ద సిమ్ కార్డును పోలి ఉండే చిప్ అమర్చడం ద్వారా డిస్ప్లే బోర్డులో కొలత కరెక్టుగానే చూపించేలా చేస్తూ ఆయిల్ మాత్రం తక్కువ పోస్తున్నారు. ఇన్స్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ మదర్ బోర్డులో అప్లికేషన్ ఇన్స్టాలేషన్ ట్యాంపరింగ్ గతేడాదే బయటపడినా.. ఇంకా పలు బంకుల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది. ఫిక్స్డ్ పల్సర్ వచ్చినా.. ట్యాంపరింగ్ నివారణకు ఆప్టికల్ పల్సర్ స్థానంలో ఫిక్స్డ్ పల్సర్ తెచ్చారు. అయితే దీనికి కూడా కేబుల్ అనుసంధానం, ఇతరత్రా ఏర్పాట్లతో అక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయిల్ కొలతకు ఈ పల్సర్ అనే పరికరం కీలకం. ఈ పల్సర్‌లో ట్యాంపరింగ్ ద్వారా కొలతల్లో హెచ్చుతగ్గులు చేస్తుంటారు. పల్సర్‌లో చిన్న చక్రం లాంటి పరికరం తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు చిన్న లైటు వెలుగుతుంటుంది. (బ్లింక్) ఒకసారి బ్లింక్ అయితే 2.5 ఎంఎల్ ఆయిల్ డెలివరీ అవుతుంది. అయితే పల్సర్‌లో అదనపు చిప్ ఏర్పాటు ద్వారా బ్లింకింగ్ సమయాన్ని తగ్గిస్తారు. దీనితో తక్కువ ఆయిల్ డెలివరీ అవుతుంది. డిస్పెన్సింగ్ యూనిట్లో కీలకమైన ప్రాసెసింగ్ యూనిట్‌గా మదర్‌బోర్డు పనిచేస్తుంది. ఇందులోని కన్ఫిగరేషన్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, మైక్రో కంట్రోల్, బైపాస్ కేబుల్, రిమోట్ సిస్టమ్, కీ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఇలా మదర్ బోర్డులోని ప్రతి టెక్నాలజీని ట్యాంపర్ చేస్తున్నారు. మదర్ బోర్డులోని ఐసీ సర్క్యూట్ ద్వారా ‘ఇన్స్టెంట్ (తాత్కాలిక) అప్లికేషన్’ ఇన్స్టాలేషన్ చేయడంతో అడ్జెస్ట్ చేసిన మెజర్మెంట్ ప్రకారం ఆయిల్ డెలివరీ అవుతోంది. తనిఖీల సమయంలో లేదా వినియోగదారులు డిమాండ్ చేసిన సమయంలో డిస్పెన్సింగ్ యూనిట్ ఒకసారి ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే ఇన్స్టెంట్ అప్లికేషన్ ఎగిరిపోయి సరైన మెజర్మెంట్ ప్రకారం ఆయిల్ డెలివరీ అవుతోంది. తనిఖీలు ముగిసిన తర్వాత మళ్లీ నిపుణులను పిలిపించి ఇన్స్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు. కరెంటు వోల్టేజీ నియంత్రణతో డిస్పెన్సరీ యూనిట్లు విద్యుత్ సరఫరా పైనే ఆధారపడి పనిచేస్తాయి. డిపార్ట్మెంట్ సీలు వేయని కరెంట్ వైర్ల ద్వారా వోల్టేజీ లో మార్పు చేసి మెజర్మెంట్ సర్దుబాటుతో మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా కూడా..సీల్‌కు సోల్డరింగ్ యూనిట్లో ఉండే మదర్ బోర్డు, కీ ప్యాడ్, కంట్రోల్ కార్డు, పల్సర్, కంట్రోల్ కార్డు ఇలా ప్రతి దానికీ సీల్ వేస్తారు. అయితే సోల్డరింగ్ చేయడం ద్వారా సీల్ వైర్ బ్రేక్ చేస్తున్నారు. చేయాల్సిన ట్యాంపరింగ్ చేసి తిరిగి సోల్డరింగ్ ద్వారా అవసరమైతే అదే రకమైన కొత్త వైర్ కనెక్ట్ చేస్తున్నారు. టెక్నీషియన్లకు లక్షలు.. ఇంతకుముందు డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్ల తయారీ కంపెనీల్లో పనిచేసి వివిధ కారణాలతో బయటకొచ్చిన టెక్నీషియన్లు ట్యాంపరింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా, అదనంగా చిన్న పరికరం అమర్చినా.. టెక్నికల్ ఎర్రర్‌గా చూపిస్తూ యూనిట్ పని చేయడం మానివేస్తుంది. యూనిట్ హిస్టరీ (లావాదేవీల వివరాలు) సైతం పాడవుతుంది. ఎప్పటికప్పుడు ఇంధన ధరల హెచ్చు తగ్గులు కూడా కంపెనీ ఆన్లైన్ ఆటోమేషన్ ద్వారానే జరిగిపోతుంటాయి. అందువల్ల సాధారణంగా ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. కానీ, ఈ మాజీ టెక్నీషియన్లు తమ నైపుణ్యంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనీసం హిస్టరీలో ఎలాంటి తేడాలు రాకుండా, పంప్లో ఎలాంటి ఎర్రర్ తలెత్తకుండా పని కానిచ్చేస్తున్నారు. గతంలో కొందరు ముంబయి, బెంగళూరు కేంద్రాలుగా పనిచేసే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నిపుణులు విదేశాల నుంచి చిప్స్, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి మాజీ మెకానిక్‌ల సహకారంతో అక్రమ తంతు నడిపిస్తూ పట్టుబడ్డారు. అయితే లక్షల్లో ముడుతుండటంతో.. తాజాగా మాజీ టెక్నీషియన్లే ట్యాంపరింగ్ దందాకు పాల్పడుతున్నారు. 5 లీటర్లకు 25 ఎంఎల్‌కు మించి తక్కువ రాకూడదు తూనికలు కొలతల శాఖ నిబంధన ప్రకారం.. ఏదైనా బంకులో 5 లీటర్ల ఆయిల్ పోశారనుకుంటే 25 ఎంఎల్‌కు మించి తక్కువ రాకూడదు. ఒక వేళ అలా వస్తే తక్షణమే సంబంధిత డిస్పెన్సింగ్ నాజిల్‌ను సీజ్ చేసి నోటీసు జారీ చేస్తారు. బంకు యాజమాని సంజాయిషీ ఆధారంగా కనీసం రూ.2,500 నుంచి రూ.25 వేల వరకు కాంపౌండింగ్ జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. సిబ్బంది.. సాంకేతిక పరిజ్ఞానం కొరత చిప్‌లు, రిమోట్లతో మోసం ఎప్పుడో బయటపడినా ఇప్పటికీ అనేకచోట్ల కొనసాగుతూనే ఉంది. మదర్‌బోర్డులోని వేర్వేరు ప్రదేశాల్లో చిప్‌లు, ఇతరత్రా ఏర్పాట్లతో అక్రమ దందా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా తూనికలు, కొలతల విభాగం పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గత నాలుగేళ్ల నుంచి తనిఖీలు మొక్కుబడిగా మారాయి. ఈ విభాగానికి పూర్తిస్థాయి రాష్ట్ర కంట్రోలర్ లేకుండా పోయాడు. మరోవైపు సిబ్బంది కొరత కూడా వెంటాడుతోంది. మొత్తం 254 పోస్టుల్లో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే 39 ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 23 ఖాళీగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తనిఖీల కోసం ఏర్పడిన రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సారథ్యం వహించిన అప్పటి అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ బంకులపై పెద్దయెత్తున దాడులకు దిగడంతో.. డీలర్లకు సమ్మెకు సైతం సిద్ధం కావడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మొక్కుబడిగా దాడులు జరుగుతున్నా స్వల్ప సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తనిఖీ చేసి స్టాంపింగ్, సీలింగ్ వేసే తూనికల కొలతల శాఖ అధికారులకు కనీస సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం పెట్రోల్ బంకు అక్రమార్కుల పాలిట వరంగా తయారైంది. పదేళ్ల క్రితమే డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ డిపార్ట్మెంట్లో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్, రీజినల్ కంట్రోలర్లను వేళ్లపై లెక్కించవచ్చు. మరోవైపు తూనికలు కొలతల శాఖకు మీటర్ యూనిట్‌లోని సాఫ్ట్వేర్ ఆడిటింగ్‌కు అధికారం లేకపోవడంతో, ఆధునిక టెక్నికల్ ట్యాంపరింగ్‌ను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంలో హైదరాబాద్ టాప్.. రాష్ట్ర పెట్రోల్, డీజిల్ వినియోగంలో హైదరాబాద్ వాటా సగానికి పైనే. రాష్ట్రం మొత్తం మీద మూడు ప్రధాన కంపెనీలకు చెందిన 4,710 బంకులు ఉండగా, అందులో నగరంలోనే 580కి పైగా బంకులున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్, నాచారం, చర్లపల్లిలోని ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల టెర్మినల్ డిపోల నుంచి ప్రతినిత్యం పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ నగరంలో సగటున 27 నుంచి 30 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. దాడుల్లో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు (ఫైల్) ఒక్క చిప్ ఏర్పాటుకు రూ. లక్ష పైనే.. వినియోగదారుల్లో నిలదీసే తత్వం పెరగాలి టెక్నాలజీ ట్యాంపరింగ్‌ను గుర్తించడం అంత సులువు కాదు. వినియోగదారులే అప్రమత్తంగా ఉండాలి. ఆయిల్ తక్కువగా పంపింగ్ అవుతున్నట్లు ఆనుమానం వస్తే వెంటనే నిలదీయాలి. అధికారులకు ఫిర్యాదు చేయాలి. బంకులు.. ఆయిల్ కంపెనీ, తూనికలు కొలతలు, స్థానిక అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించని పక్షంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. –విమల్ బాబు, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ ఎనిమిది ఏళ్ల క్రితమే వెలుగులోకి.. మాన్యువల్ యూనిట్ల ద్వారా జరుగుతున్న చేతివాటానికి అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ పంపులు ప్రవేశపెడితే అధికారుల ఊహకు సైతం అందని సాంకేతిక మోసం దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బయటపడింది. అప్పట్లో యూనిట్లలో ఆప్టికల్ పల్సర్ ఉండటంతో అక్రమార్కులు సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా డిజై¯Œ చేసిన అదనపు చిప్‌లను అమర్చేవారు. రిమోట్ సెన్సర్‌తో పల్సర్‌కు అనుసంధానం చేసి దానిని కంట్రోల్ రూమ్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఆయిల్ డెలివరీని నియంత్రిస్తుండేవారు. రెండు స్విచ్‌లతో కూడిన రిమోట్లో ఒక స్విచ్ నొక్కగానే నకిలీ చిప్ పనిచేసి తక్కువ ఆయిల్ డెలివరీ అయ్యేది. వినియోగదారులు క్యాన్లు, సీసాలతో వచ్చినప్పుడు, అధికారులు తనిఖీలకు ఐదు లీటర్ల క్యాన్‌తో వచ్చినప్పుడు రిమోట్లోని మరో స్విచ్ నొక్కితే ఇంధనం కరెక్టుగా డెలివరీ అయ్యేది. మొత్తం మీద వంద లీటర్లు పెట్రోల్, డీజిల్ పోస్తే దాదాపు పది లీటర్లు మిగులుబాటు అయ్యే విధంగా మైక్రో చిప్స్‌లో సాఫ్ట్వేర్ డిజై¯Œ చేసినట్లు బహిర్గతం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎలా బయటపడింది హైదరాబాద్ శివారులో 2013 జనవరి 26న సైబరాబాద్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (ఎస్వోటీ) వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బ్యాగుల్లో వందల సంఖ్యలో రిమోట్స్ చిప్స్ బయటపడ్డాయి. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయిల్ బంకుల డిస్పెన్సింగ్ యూనిట్ల తయారీ కంపెనీలకు చెందిన మాజీ టెక్నికల్ సిబ్బందిగా తేలింది. డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా ఆయిల్ డెలివరీ సమయంలో సరఫరాను నియంత్రించేందుకు చిప్‌లు, రిమోట్లు ఉపయోగిస్తున్నట్లు వారు వెల్లడించారు. నగరంలోని పలు పెట్రోల్ బంకులకు ఆర్డర్‌పై చిప్‌లు, రిమోట్లు తెస్తున్నామని చెప్పారు. అప్పటికే పలు బంకుల్లో చిప్‌లు అమర్చినట్లు కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పలు బంకులపై అధికారులు దాడులు చేసినప్పుడు మోసం బట్టబయలైంది. ఒక్క చిప్ ఏర్పాటుకు రూ. లక్ష పైనే.. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా డిస్పెన్సరీ యూనిట్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లు అమర్చి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు కొన్ని నెలల క్రితం బయటపడింది. అప్పట్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో పోలీసులు, ఎస్ఓటీ టీమ్స్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తూనికలు కొలతల శాఖ అధికారుల సహకారంతో అకస్మిక వరుస దాడులకు దిగాయి . రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్నగర్, మిర్యాలగూడ, ఆర్సీపురం తదితర బంకుల్లో ఆధునిక చిప్‌ల వ్యవహారం బయటపడింది. మీటరింగ్ యూనిట్ డిస్ప్లే వెనుక భాగం ఇంటిగ్రేటెడ్ చిప్ అమర్చి 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌కు 970 ఎమ్ఎల్ మాత్రమే డెలివరీ అయ్యే విధంగా సర్ధుబాటు చేశారు. తనిఖీలో గుర్తించని విధంగా మదర్ బోర్డును తయారు చేసి అమర్చినట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు బహిర్గతమైంది. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఆప్డేట్ టెక్నాలజీకి అనుగుణంగా సాఫ్ట్వేర్, ప్రోగ్రాం డిజైన్ చేసి ముఠా ద్వారాఒక్కో చిప్ అమర్చేందుకు రూ. 80 వేల నుంచి రూ.లక్షా 20 వేల వరకు వసూలు చేసినట్లు విచారణలో తెలింది. దీంతో అప్పట్లో రాష్ట్రంలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసి బంకుల్లో చిప్‌లు అమర్చే మెకానిజం చేసిన ముఠా సభ్యులతో పాటు తొమ్మిది పెట్రోల్ బంకుల యజమానులను సైతం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపడం సంచలనం సృష్టించింది. ఇది కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతోంది. -
మద్యం మత్తులో యువకుల వీరంగం
సాక్షి, నల్గొండ: మద్యం మత్తులో గురువారం రాత్రి పెట్రోల్‌బంక్ వద్ద యువకులు వీరంగం సృష్టించారు. ఈ సంఘటన నేరేడుచర్ల మండల కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల రామకోటేశ్వరరావు హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లలోని శివాజీనగర్ చెందిన ఇంజమూరి సాయి వర్మ, ఇంజమూరి సాయి కిశోర్ అలియాస్ చింటూ, ఇంజమూరి రాకేష్, విద్యానగర్‌కు చెందిన కొమ్ము తిలక్, వైకుంఠాపురానికి చెందిన కేశారపు నితిన్ అలియాస్ బన్నీ మొత్తం ఐదుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలపై మద్యం మత్తులో గురువారం రాత్రి నేరేడుచర్ల కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల రామకోటేశ్వర్రావు హెచ్‌పీ పెట్రోల్‌బంక్ వద్దకు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న యువకులు రూ.50ల పెట్రోల్ కొట్టమని రూ.500లను బంక్‌లో పనిచేస్తున్న దాసారం గ్రామానికి చెందిన బెజ్జం నాగార్జునకు ఇచ్చారు. మిగిలిన రూ.450లను తిరిగి ఆ యువకులకు ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఇచ్చిన డబ్బులను కిందపడేసి నాగర్జునను అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి దిగారు. దీంతో నాగార్జున పక్కనే ఉన్న ఆఫీసు రూంలోకి పరుగెత్తడంతో, అక్కడకు వెళ్లి అందులో ఉన్న ఫైర్ సిలిండర్ తీసుకొని అద్దాలు, కూర్చీలు పగులకొట్టారు. బంక్ రీడింగ్ మీటర్లను కూడా ధ్వంసం చేశారు. బంక్ యజమాని రాచకొంట రామకోటేశ్వర్రావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెట్రోల్ పైపులో నాగరాజు బుస్‌బుస్ .. వైరల్
భువనేశ్వర్: పెట్రోల్ పైపులో దూరి ఓ నాగుపాము హల్చల్ చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు దాన్ని అడవిలోకి వదిలిపెట్టడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం..ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ పైపులో నాగుపాము దూరింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. ఏంటా అని చూస్తే ఏకంగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చి పామును అడవుల్లో వదిలిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పిదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (భయానకం: గోడ దూకి హోటల్లోకి వచ్చిన సింహం..) -
‘చిప్స్’తో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో ఇంధనం పోసే యంత్రాల్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ అమర్చి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు, తూనికలు కొలతల శాఖ అధికారులు రట్టు చేశారు. 1,000 ఎంఎల్ ఇంధనానికి 970 ఎంఎల్ మాత్రమే పోసేలా చేసి లక్షల్లో డబ్బులు దండుకుంటున్న యజమానులతో పాటు ఈ వ్యవస్థీకృత నేరానికి ఆద్యులైన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 14 ఇంటిగ్రేటెడ్ చిప్స్, 8 డిస్ప్లేలు, 3 జీబీఆర్ కేబుళ్లు, మదర్ బోర్డు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మోసాల క్రమంలో తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 22 పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్‌తో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎస్కే సుభాని బాషా అలియాస్ బాషా పదేళ్లకుపైగా పెట్రోల్ బంక్ మెకానిక్‌గా పనిచేశాడు. తనకున్న అనుభవంతో.. కస్టమర్ అడిగిన దానికన్నా తక్కువగా పోసినా.. డిస్ప్లేలో మాత్రం సరిగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్ చిప్స్ అమర్చి సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన జోసెఫ్, శిబు థామస్ సాఫ్ట్వేర్ సాయంతో తయారుచేసిన చిప్స్‌ను రూ.80 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు కొన్నాడు. వాటిని ఏలూరుకు చెందిన బాజీ బాబా, శంకర్, మల్లేశ్వరరావుల సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులను ఒప్పించి వారి బంకుల్లో అమర్చాడు. మోసం చేసేదిలా.. ఒక్కో పెట్రోల్ బంక్‌లో రెండు ఇంధన పంప్‌లు ఉంటే ఒక్కదాంట్లో ఈ చిప్‌ను అమర్చేవారు. పంప్ లోపల ఒకటి, బయట కస్టమర్లకు కనిపించే డిస్ప్లే బోర్డుకు మరో చిప్ అమర్చేవారు. ఇంధనం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి లీటర్ పోయమంటే 970 ఎంఎల్ మాత్రమే పోసేవారు. డిస్ప్లేలో మాత్రం లీటర్ పోసినట్టే కనిపించేది. ఆయిల్ కార్పొరేషన్ బృందాలు తనిఖీకి వచ్చినపుడు ఆయా ఇంధన యంత్రాలను చెక్‌చేసి సీల్ వేసేవి. ఆపై ఈ ముఠా రంగంలోకి దిగి సీల్ కట్‌చేసి చిప్ అమర్చి అదే కేబుల్ వైర్ వాడేది. ఎవరైనా తనిఖీకి వస్తే.. మెయిన్ స్విచ్ ఆఫ్‌చేసి ఆన్‌చేస్తే మళ్లీ 1,000 ఎంఎల్ చూపేలా మదర్‌బోర్డును డిజైన్ చేశారు. ఇలా సుభాని గ్యాంగ్ ఏడాదిగా తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోంది. దీనిపై ఉప్పందుకున్న నందిగామ పోలీసు ఇన్స్పెక్టర్ రామయ్య, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి పెట్రోల్ బంక్‌లపై దాడి చేసి సుభాని గ్యాంగ్‌ను పట్టుకొని తెలంగాణలో 11 పెట్రోల్ బంక్‌లు సీజ్ చేశారు. 9మంది పెట్రోల్ బంక్ యజమానులను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో ఏపీలో 22 పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. మోసగాళ్లను పట్టుకోవడంలో చురుగ్గా పనిచేసిన సిబ్బందిని సజ్జనార్ రివార్డులతో సన్మానించారు. -
పెట్రోల్ బంక్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
-
పెట్రోల్ బంక్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన బైక్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బైకు మంటల్లో దగ్ధం అయ్యింది. అప్రమత్తమైన బంకు సిబ్బంది నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పెట్రోల్ బంకులో ఫైర్ సేప్టీ ప్రమాణాలు సరిగా లేవని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. (క్వారంటైన్ హోటల్స్‌లో భద్రత ఎంత..?) -
పెట్రోల్ పోయలేదని పామును వదిలాడు
-
పెట్రోల్ పోయలేదని పామును వదిలాడు
ముంబై: మనం అడిగినవాటికి ఎవరైనా 'నో' చెప్తే కోప్పడతాం. కానీ కొందరు ఆగ్రహంతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకుంటామంటూ బసులు కొడుతుంటారు. మహారాష్ట్రలోని ఓ వ్యక్తికి కూడా కోపమొచ్చింది. అంతే.. పెట్రోల్ పంపులో పామును వదిలి తన కసి తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే బుల్దానాకు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి పెట్రోల్ పోయమన్నాడు. అక్కడున్న సిబ్బంది తల అడ్డంగా ఊపుతూ కుదరదని వెళ్లగొట్టారు. కారణం.. అతను పెట్రోల్ కొట్టించేందుకు బండికి బదులు బాటిల్ పట్టుకొచ్చాడు. అయితే తనకు పెట్రోల్ ఇవ్వనందుకు అక్కడి సిబ్బందిపై కక్ష కట్టాడా సదరు వ్యక్తి. (అంధుడి కోసం మహిళ చేసిన మంచిపని) కాసేపటికి మరింత పెద్ద బాటిల్ పట్టుకొచ్చి అందులో నుంచి పెద్ద పామును పెట్రోల్ బంకులోని గదిలో వదిలాడు. ఆ పాము వెంటనే వెంటనే అక్కడి బల్ల కిందకు దూరిపోయింది. ఆ సమయంలో గదిలో ఒకే ఒక మహిళ ఉంది. దీంతో ఆమె బిక్కుబిక్కుమంటూనే నెమ్మదిగా అక్కడి నుంచి ఎలాగోలా బయటకు వచ్చేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ పుటేజీ ప్రకారం ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. అతను ఒక్క పాముతో వదల్లేదని, మరో పామును కూడా తీసుకొచ్చి గదిలో వదిలేశాడని పెట్రోల్ బంకు సిబ్బంది పేర్కొన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గదిలో ఉన్న మహిళను ధైర్యవంతురాలని కొనియాడుతుండగా, పామును పట్టుకొచ్చి ప్రతీకారానికి పూనుకున్న వ్యక్తికి సిగ్గులేదని తీవ్రంగానే విమర్శిస్తున్నారు. (129 ఏళ్ల తర్వాత కనిపించింది..) -
మాస్క్ లేకుంటే నో పెట్రోల్...
భువనేశ్వర్ : కరోనా మహమ్మారి కట్టడికి ఇంటి నుంచి బయటకు వస్తే విధిగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఒడిశాలోని పెట్రోల్ బంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మాస్క్ ధరించని వారికి వారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ నింపబోమని స్పష్టం చేశాయి. మాస్క్ ధరించిన వారికే ఇంధనం నింపుతామని ఉత్కళ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ లత్ వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 1600 పెట్రోల్ అవుట్లెట్లు ఉన్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ అనుసరించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెట్రోల్ పంపుల వద్ద పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇన్ఫెక్షన్ భయం వెంటాడుతున్నా జీవనాధారం కోసం విధులకు హాజరవుతున్నారని అన్నారు. మాస్క్ వేసుకోవడం ద్వారా కస్టమర్లు, తమ ఉద్యోగులు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందుతారని ఆయన సూచించారు. కాగా, మాస్క్‌లు ధరించని వారికి కిరాణా, కూరగాయల విక్రేతలు సైతం ఎలాంటి వస్తువులను అమ్మడం లేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి : కరోనా మృతులు లక్షలోపే.. -
ఎక్కడచూసినా అవే బారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో 24 గంటల జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతు బజార్లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్లు, మాల్స్‌కు పరుగులు తీశారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా వివిధ రాష్ట్రా ల సరిహద్దులు మూసేస్తుండటం, ఈ ప్రభా వం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కూరగాయలతోపాటు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు ప్రభుత్వం అత్యవసర సేవలను దృష్టిలో పెట్టు కొని పెట్రోల్‌బంక్‌లకు మినహాయింపు ఇచ్చింది. అంబులెన్స్‌లు, పోలీసు, రెవెన్యూ వాహ నాలతో క్వారంటైన్ సేవలను దృష్టిలో పెట్టుకొ ని పెట్రోల్ బంకులను తెరిచే ఉంచనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషన ర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోసే యూనిట్లు 3–4 ఉంటే సిబ్బంది సంఖ్యను తగ్గించి ఒక్కో యూనిట్ మాత్రమే అందుబాటులో ఉం టుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 వేల పెట్రోల్ బంకుల్లో ఇదే విధానం ఉంటుందని పెట్రోల్ బంకు డీలర్ల సంఘం నేత దినేశ్‌రెడ్డి తెలిపారు. అయితే పెట్రోల్ ట్యాంకర్లు మా త్రం ఆదివారం ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో రోజూ 10 లక్షల లీటర్ల మేర పెట్రోల్, డీజిల్ అవసరాలు ఉంటాయని, ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన 3 వేల ట్యాంకర్లు, 12 వేల ఇతర రాష్ట్రాల ట్యాంకర్లు సరఫరా చేస్తుంటాయని, ఆదివారం వాటిని ఎక్కడికక్కడే నిలిపివేస్తామని ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్ వెల్లడించారు. ఇతరత్రా ఇబ్బందు లెదురైనా.. రాష్ట్రంలో వారానికి సరిపడా నిల్వలున్నాయని తెలిపారు. -
11 కేవీ విద్యుత్ లైన్‌కు స్టాండ్ తగలడంతో..
సాక్షి, గుంటూరు : చిలకలూరిపేట మండలం తాతపూడికొండలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌లోని విద్యుత్ దీపాలు రిపేర్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మౌలాలీ, శేఖర్, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు మరణించారు. విద్యుత్ దీపాలను బాగు చేసేందుకు ఐరన్ స్టాండ్‌ను తీసుకెళ్తుండగా.. అది 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. -
షేక్‌పేట్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ కారులో పెట్రోల్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెట్రోలు బంక్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెను ముప్పు తప్పినట్టయింది. కాగా, ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. అయితే కారులో ఉన్న వ్యక్తి బయటకు దిగడంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వైరల్ : అమ్మో! పెద్ద ప్రమాదం తప్పింది
లూసీయానాలోని ఒక పెట్రోల్ బంకులోకి యస్‌యూవీ కారు ఒకటి వచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టిద్దామని తన పెంపుడు కుక్క చువావాను కారులోనే ఉంచి యజమాని బయటకు దిగి సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఈలోగా కారు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి బ్యాక్వర్డ్ డైరక్షన్లో పక్కనే ఉన్న 4- లేన్ల మెయిన్ రోడ్డుమీదకు వెళ్లింది. దీంతో అవాక్కయిన కారు యజమాని కారు వెనకాలే పరిగెత్తారు. కారు డోరు తెరిచే ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. దేవుడి దయ వల్ల ఆ సమయంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు ఎదురుగా ఉన్న మరో గ్యాస్ స్టేషన్ బారీకేడ్లను ఆనుకొని కారు నిలిచిపోయింది. కాగా కారులో ఉన్న చుహాహా క్షేమంగానే ఉంది. ఈ ఘటన లూసీయానాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ లూసియానా పోలీసులు ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీకామెంట్లు పెట్టారు. ' ఈ కుక్క మహా తెలివైనదని, కారును స్టార్ట్ చేసి నడిపిందని' పేర్కొన్నారు. మరికొందరు మాత్రం చువావా క్షేమంగా బయటపడినందుకు సంతోషిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు. నెటిజన్ల కామెంట్లపై స్పందించిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా బ్రేక్ వేయకుండానే ఆటోమెటిక్ గేర్లను మార్చుకోగలదని, అందుకే కారు ఒక్కసారిగా బ్యాక్వర్డ్ డైరక్షన్లో మూవ్ అయిందని తెలిపారు. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడం, అలాగే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడం నిజంగా అద్బుతమని పేర్కొన్నారు. ' కార్లలో తమ పెంపుడు జంతువులను వదిలి వెళ్లేవారికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ అని' పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే గత గురువారం ఫ్లోరిడాలో జరిగింది. తన పెంపుడు కుక్క బ్లాక్ లాబ్రాడర్‌ను కారులోనే ఉంచి పార్క్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత ఆటోమెటిక్ మోడ్ ఆన్ అయి కారు ఒక గంట పాటు వృత్తాకారంలో తిరగడం వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనల్లో పెంపుడు కుక్కలు ఉండడం గమనార్హం. -
బాటిళ్లలో పెట్రోల్ బంద్!
సాక్షి, కామారెడ్డి: సాధారణంగా బైక్‌పై తిరిగే వారికి ఎప్పుడో ఒకసారి పెట్రోల్ సమస్య తలెత్తుతుంది. వాహనంపై తిరిగినపుడు పెట్రోల్ పోసుకోవడం మరిచిపోయిన సందర్భంలో వాహనం ఆగిపోవడం, వెంటనే ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను సంపాదించి దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుంది. కొందరు తమ వాహనం పెట్రోల్ లేక ఆగిపోయిందని స్నేహితులకో, బంధువులకో ఫోన్ చేస్తే.. వారు బాటిళ్లలో పెట్రోల్ తీసుకువచ్చి ఇస్తుంటారు. ఇకపై ఇలా బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కుదరదు.. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ అమ్మడంపై సర్కారు ఆంక్షలు విధించింది. ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకులలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్‌ను వాడుతున్న సంఘటనలు పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై సురేశ్ అనే వ్యక్తి తన వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి సజీవదహనం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలొదిలింది. కిరోసిన్, డీజిల్ కన్నా పెట్రోల్ వేగంగా దహనం అవుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకునే విషయంలో, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పెట్రోల్ సీసాలతో హల్చల్ చేసిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెట్రోల్ అమ్మకాలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. బాటిళ్లలో ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయొద్దని ఆదేశించింది. దీంతో బంకుల యజమానులు ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట, ప్రధాన చౌరస్తాల వద్ద 40 కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దన్న ఆదేశాల నేపథ్యంలో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలో సులువుగా పెట్రోల్ తీసుకెళ్లి వ్యక్తులపై పోసి నిప్పంటించడం గాని, తమకు తాము పోసుకుని కాల్చుకోవడం గాని జరగకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో పెట్రోల్ అయిపోయినా వాహనం తీసుకొస్తేనే పెట్రోల్ పోస్తామని పెట్రోల్‌బంక్ యజమాని ఒకరు ‘సాక్షి’తో తెలిపారు. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దని ప్రభుత్వంనుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. -
గుంటూరు.. పెట్రోల్ బంక్‌లో మంటలు
సాక్షి, సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి శ్యాంసుందర్ పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగాయి. ఇద్దరు వ్యక్తులు బైకులో పెట్రోలు నింపుకోవడానికి గుంటూరు రోడ్డులోని ఈ బంక్ వద్దకు వచ్చారు. బంక్ సిబ్బంది పెట్రోలు పోస్తున్నసమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేసింది. -
గుంటూరు.. పెట్రోల్ బంక్‌లో మంటలు
-
పెట్రోల్‌ట్యాంక్‌లలో వర్షపు నీరు..
మూడు రోజుల క్రితం హయత్‌నగర్ లోని హయత్ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ లో నీళ్లు కలిసిన డీజిల్ పోయడంతో దాదాపుఇరవై వాహనాలు ముందుకు వెళ్లకుండా మొరాయించడంతో వాహనదారులు బంకు వద్ద ఆందోళనకు దిగారు. సరిగ్గా నెల రోజుల క్రితం కూడా ఇదే బంకు వద్ద నీళ్లతో కూడిన పెట్రోలు వచ్చిందని వాహనదారులు ఆందోళనకు చేపట్టడంతో పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు. సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పెట్రోల్ బంకుల తీరు మారడం లేదన్నదనేందుకు ఇదీ నిదర్శనం. కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ వాహనదారులకు అందించాలన్న ప్రయత్నం మాత్రం కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం, చేతివాటం వాహనదారులను నిలువు దోపిడీకి గురిచేస్తోంది. ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ సరఫరా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్ మిలితమైన పెట్రోల్ నిల్వల్లో పొరపాటున కూడా నీళ్లు కలిస్తే క్రమంగా పెట్రోల్ నీరు మారుతోంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్లు స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. అయితే చమురుసంస్ధలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. వర్షకాలం నేపథ్యంలో ట్యాంకుల్లో కొద్ది పాటి నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారుతున్నాయి. బంకుల నిర్వాహకులు అడుగు నిల్వల సైతం పంపింగ్ చేస్తుండటంతో వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి.దీంతో వాహనదారుల ఆందోళనకు దిగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి మ..మ అనిపిస్తున్నారు. మెకానిక్ షెడ్డుకే.... మహానగరంలో నిత్యం వాహనాలు మెకానిక్ షెడ్లవైపు పరుగులు తీస్తున్నాయి. నీళ్లతో కూడిన పెట్రోల్, డీజిల్ వినియోగంతో వాహానాలు కుప్పగా మారుతున్నాయి. స్టార్ట్ కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది. వాహనంలోని బోరు పిస్టన్ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నాలుగుచక్రాల వాహానాలకు మరింత ట్రబుల్స్ తప్పడం లేదు. శాంపిల్స్‌కే పరిమితం పౌరసరఫరాల అధికారులు పెట్రోల్ బంక్‌లలో శాంపిల్స్ సేకరించేందుకు పరిమితమవుతున్నారనే ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌పై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే అవీ అందుబాటులో ఉన్నా ఉపయోగించిన దాఖలాలు లేవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ వేళ్లపై లెక్కపెట్టవచ్చు. నీళ్ల ఇంధనంపై విచారణ నీటితో కూడిన పెట్రోల్, డీజిల్ పంపింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. వర్షపు నీళ్లు ట్యాంకులో చేరి అడుగున నిల్వ ఉంటుంది. దానిని గుర్తించకుండా వాహనాల్లో పంపింగ్ చేయడం తగదు. ఇథనాల్ కారణంగా పెట్రోల్ నీటిగా మారుతుందని డీలర్లు పేర్కొంటున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రాథోడ్, డీఎస్వో, రంగారెడ్డి -
పెట్రోల్ బంకుల్లో కల్తీ దందా
సాక్షి, వరంగల్ : పెట్రోల్ బంకుల యజమానులు చాలాచోట్ల వాహనదారులను నిలువునా దోచేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా పలు బంకుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. కుదిరితే కొలతల్లో కోత పెట్టి ఇంధనాన్ని కాజేయడం.. లేదంటే కల్తీకి పాల్పడుతూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల భారంతో నలిగిపోతున్న వినియోగదారులను పెట్రోల్ బంకుల నిర్వాకం మరింత కుంగదీస్తోంది. వాహనదారుడి కళ్లముందే ఏళ్లుగా మాయాజాలం జరుగుతుండగా కళ్లు మూసుకున్న యంత్రాంగం... ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉరుకుల పరుగుల మీద ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాయి. పెట్రోల్ బంకులపై ఇవే ఫిర్యాదులు చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొలత పూర్తి కాకుండానే పంపు ఆపేయడం, వేగంగా ట్యాంకు నింపడం.. అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ మెషిన్‌పై చేయి అడ్డుపెట్టడం వంటి మోసాలకు సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేమిటనీ ప్రశ్నిస్తే బంకు సిబ్బంది ఎలక్ట్రానిక్ యంత్రాలతో మోసాలకు తావులేదంటూ సర్దిపుచ్చడమే గాక వాహనదారులతో ఎదురు గొడవకు దిగుతున్నారు. చిల్లర డబ్బులతో పాటు ఇంధనాన్ని కాజేస్తూ, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారన్న ఫిర్యాదులు కూడాన్నాయి.. లీటర్ పెట్రోల్, డీజిల్‌లో 30 నుంచి 50 మి.లీ. మేర కోత పెట్టడంతో పాటు కిరోసిన్, నీళ్లు కలుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు బంకులపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు తమ వాహనాలకు మరమ్మతులు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, పెట్రోల్‌బంకుల్లో వసతుల విషయానికోస్తే అన్నీ గాలికొదిలేశారు. ఆయిల్ కంపెనీల అధికారులు పట్టించుకోకపోవడం.. తూనికలు కొలతల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందునే సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. బంకుల్లో ఉచిత గాలియంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాగునీరు ఇలాంటివేమీ కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నామమాత్రంగా ప్రతేక్య బృందాల తనిఖీలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో హెచ్పీసీ, బీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర కంపెనీలకు చెందిన 267 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఫిర్యాదులు ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న ఫిర్యాదులు సంబం«ధిత శాఖల అధికారులపై ఉన్నాయి. నామమాత్రంగా తనిఖీ ముగించి రికార్డులు సృష్టించుకోవడం.. శాంపిళ్లు సేకరించడం తప్ప కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలే కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బంకుల్లో జరుగుతున్న కల్తీ, తూకంలో మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అయితే, ఈ సమయంలో రాజకీయ పలుకుబడి, నేపథ్యం ఉన్న వారి బంకుల జోలికి వెళ్లకుండా కొన్ని పెట్రోల్బంకుల్లోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా మొత్తం 267 బంకులకు 55 బంకుల్లో తనిఖీ చేసిన అధికారులు 23 బంకుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిర్ధారించి చర్యలకు ప్రతిపాదించారు. కాగా, ఈ విషయమై పౌరసరఫరాల శాఖ వరంగల్ అర్బన్ జిల్లా ఇన్చార్జ్ అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తనిఖీలు నిర్వహించాం.. కల్తీ జరిగితే కఠిన చర్యలు వరంగల్ అర్బన్ జిల్లాలోని పెట్రోల్‌బంకుల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నేతృత్వాన ప్రత్యేక తనిఖీలు నిర్వహించాం. తూనికలు – కొలతల శాఖతో పాటు పౌరసరఫరాల శాఖ, ఆయా బంకులకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతీ విషయాన్ని పరిశీలించి తేడాలు ఉన్న చోట ఆయా శాఖల అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పెట్రోల్ బంక్‌ల్లో అసౌకర్యాలు, కల్తీలను ఉపేక్షించేది లేదు. – అనిల్‌కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా -
ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉన్న పెట్రోల్‌బంక్‌లో మంటలు
-
ఇక రిలయన్స్, బీపీ బంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్ ప్రకారం కొత్త వెంచర్లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్ నెట్వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్ కార్యకలాపాల వెంచర్‌పై దృష్టి పెట్టింది. మూడో జేవీ.. 2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్ సోర్సింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ (ఐజీఎస్‌పీఎల్) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్‌పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్ షెల్‌కు ప్రస్తుతం 151 అవుట్‌లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. -
రిలయన్స్, బీపీ కీలక ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బ్రిటిష్ భాగస్వామి బీపీ పీఎల్సీతో కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్ పంప్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను భారత్‌లోని విమానయాన సంస్థలకు విక్రయించాలని ప్రణాళికలు రచించాయి. ఈ మేరకు ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ ఒప్పంద పత్రాలపై మంగళవారం ముంబైలో సంతకాలు చేశారు. తుది ఒప్పందం 2019, రెగ్యులేటరీ, ఇతన అనుమతులకు నిబంధనలకు లోబడి, లావాదేవీ 2020 మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నామిన ఆర్ఐఎల్ వెల్లడించింది. రీటైల్ వ్యాపారాన్ని ఇప్పటికే ఉన్న రిలయన్స్ బంకుల ఆధారంగా నిర్మించనున్నారు. సరికొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నామనీ, రీటైల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌ద్వారా , వైమానిక ఇంధన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో ఆర్ఐఎల్ 51శాతం వాటాను, బిపి 49శాతం వాటాను వాటాను కలిగి ఉంటాయి. ఈ ఉమ్మడి సంస్థ ఆధర్యంలో 5,500 ఇంధన రిటైల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ ఏవియేషన్ ఇంధనాల వ్యాపారం కూడా ఉంటుంది, ఈ జాయింట్ వెంచర్ ద్వారా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. దేశంలో గ్యాస్ వనరులను అభివృద్ధి చేయడంలో తమ బలమైన భాగస్వామ్యం ఇప్పుడు ఇంధన రిటైలింగ్, విమాన ఇంధనాలకు కూడా విస్తరిస్తామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వినియోగదారులకు దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సేవలను మరింత పెంచడంలో తమ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందన్నారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా అవతరించనుందని బాబ్ డాడ్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న తాము ఈ వృద్ధికి తోడ్పడేందుకు మరింత ఆకర్షణీయమైన, వ్యూహాత్మక అవకాశాలవైపు చూస్తున్నామన్నారు. కాగా ఆర్ఐఎల్ ఇప్పటికే దేశంలో 1300 ఇంధన రిటైల్ పంపులను స్వతంత్రంగా నడుపుతుండగా, బీపీకి అక్టోబర్ 2016 లో భారతదేశంలో 3,500 ఇంధన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ లభించింది. భారతదేశంలో 5 వేల పెట్రోల్ పంపులను తెరవడానికి ఆర్ఐఎల్కు లైసెన్సులు ఉన్నాయి. -
బంకుల్లో నిలువు దోపిడీ.!
నిలువ నీడలేక మాడిపోవాలి. గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోవాలి. భద్రత లేక బంకుల్లో బిక్కుబిక్కుమనాలి. ఇంధనం తక్కువ పోసినా.. చిల్లర దోపిడీ సాగుతున్నా భరించాలి. పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలు సాగిపోతున్నాయి. అధికారుల దాడులు అరుదై పోతున్నాయి. ఫలితంగా వినియోగదారుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. సాక్షి, విజయనగరం : పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలకు అంతులేకపోవటంతో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, నీడ లేకపోయినా అధికారులు పట్టించుకోవటంలేదు. నిర్ణీత మొత్తానికి డిజిటల్ మీటర్లు ఫిక్స్ చేసినా.. ఇంధనం పోసే సమయంలో చేతివాటం చూపుతున్నారు. లీటరుకు కనీసం 25 మిల్లీలీటర్లు నుంచి 100 మిల్లీలీటర్లు వరకు తరుగు వస్తుందని వినియోగదారుల ఆరోపణ. ఇలా ప్రతీ బంకులో రోజూ పదుల లీటర్లలోనే దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. మరికొన్ని చోట్ల చిల్లర దోపిడీ జరుగుతోంది. వాహన టైర్లలో గాలి ఒత్తిడి సరిగా లేకపొతే ఇంధనం అధికంగా వినయోగమవుతోంది. ఇంధన వృథాను అరికట్టేందుకు గాలి నింపే యంత్రాలను కచ్చితంగా నెలకొల్పాలి. ఎక్కడా వీటి జాడే లేదు. చాలా చోట్ల స్పీడ్, పవర్ పెట్రోలు అంటూ... లీటరుకు రూ.5 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కానరాని భద్రత జిల్లా వ్యాప్తంగా 98 పెట్రోలు బంకులున్నాయి. వీటిలో కనీస భద్రత చర్యలు తీసుకోవటం లేదు. బంకుల్లో అలంకార ప్రాయంగా ఇసుక బకెట్లు, అగ్ని నివారణ పరికరాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు నిర్వహణ ఘోరంగా ఉండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల్లో సెల్ఫోన్లను నిషేధించినా అమలు కావటంలేదు. సాక్షాత్తు సిబ్బంది ఫోన్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పెట్రోలు కొట్టే సమయంలో మొబైల్ వాడితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. చెత్త డబ్బాలు సైతం కానరావు. తూకాల్లో తేడాలపై జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మందలించారని ఏకంగా ఇంటికే నిప్పంటిచాడు
సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఓ ప్రేమోన్మాది అరాచకానికి పాల్పడ్డాడు. మందలించారన్న కోపంతో యువతి స్నేహితురాలి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి... ప్రేమోన్మాదిని అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థి వంశీ తన సహచర విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన స్నేహితురాలికి చెప్పింది. వంశీ కుటుంబంతో యువతి స్నేహితురాలి కుటుంబానికి పరిచయం ఉండటంతో ఆమె అమ్మమ్మ కమలకుమారి.. వంశీని మందలించారు. దీంతో ఆగ్రహించిన వంశీ.. వారం క్రితం కమలకుమారి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మేడ మీద వున్న కమలకుమారి కుటుంబసభ్యులు.. దీన్ని షార్ట్ సర్క్యూట్‌గా భావించారు. కానీ నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో వంశీ పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేశారు. -
చుక్క..చుక్క నొక్కేస్తున్నారు..
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో పెట్రోల్ బంకుల యజమానులు రూట్ మార్చి మోసాలకు పాల్పడుతున్నారా, పెద్ద ఎత్తున ఒకేసారి కాకుండా ఒక లీటర్‌కు 5 నుంచి 10 మిల్లీ లీటర్లు తక్కువగా పోస్తూ రూపాయి రూపాయి వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడుల్లో బయట పడుతున్న విషయాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మూడు రోజులుగా గ్రేటర్ పరిదిలోని పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొలతలలో తేడాలు వస్తున్న బంకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో ఒక్కో నాజిల్ నుంచి 5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ను పరిశీలించగా 35 నుంచి 30 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వరుసగా తనిఖీలు హైదరాబాద్ జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లా రీజియన్‌లో 375 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని రోజులుగా తూనికలు, కొలతల శాఖ అధికారులు స్థబ్ధుగా ఉండటంతో పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని పెట్రోల్ బంకులపై ఫిర్యాదులు వస్తున్నందున తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న బంకుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 25న హస్తినాపురంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో లీటరుకు 6 మిల్లిలీటర్ల చొప్పున తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. బీఎన్ రెడ్డి నగర్, ఇంజాపూర్‌లోని మరో రెండు బంకుల్లోనూ తక్కువగా వస్తుండటంతో వాటిని సీజ్ చేశారు. ఈ నెల 26న అత్తాపూర్, కూకట్పల్లి, ఆరాంఘర్, కర్మాన్ ఘట్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి మూడు బంకుల్లో తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. చిల్లర మోసం పెట్రోల్ బంకుల యజమానులు ఒక లీటర్‌కు 6 మిల్లీలీటర్ల చొప్పున తక్కువగా వచ్చేలా నాజిల్లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ ధర రూ. 74.45 కాగా ఒక లీటరు కొనుగోలుపై 50 పైసల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బంకులో ఒక రోజు సుమారు 5వేల లీటర్ల అమ్మకాలు జరిగితే అదనంగా రూ. 2500 వరకు ఆదాయం వస్తుంది. ఈ తరహా మోసాల వల్ల లీటరు, రెండు లీటర్లు పోయించుకునే వారికి పెద్దగా నష్టం ఉండకపోయినా పెద్ద వాహనాలైన లారీలు, బస్సులు, కార్లలో ఒక్కోసారి 100 లీటర్ల వరకు డీజిల్ పోయిస్తుంటారు. ఇలాంటి వినియోగదారులు బంకుల యజమానులు చేసే చిల్లర మోసాలకు అధికంగా నష్టపోతున్నారు. దాడులతో అప్రమత్తం గ్రేటర్‌లోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే మైలేజీ రావడం లేదని తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొదటి రోజు, రెండో రోజు మూడు కేసులు నమోదు చేశారు. అధికారుల దాడులతో అప్రమత్తమైన బంకుల యజమానులు కొలతల్లో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మూడవ రోజు మేడ్చల్, ఆదిభట్ల, కర్మాన్ ఘట్, శామీర్‌పేట. షాద్‌నగర్ ప్రాంతాల్లోని 17 బంకుల్లో తనిఖీలు చేసిన పెద్దగా తేడాలు రాలేదని తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. రిమోట్ సహాయంతో సరిచేస్తూ పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతం మోసాలు అధునాతన చిప్‌లను వినియోగించి చేస్తుంటారనే విషయం తెలిసిందే. కారు రిమోట్ తరహాలో ఉండే ఈ రిమోట్ల సహయంతో దూరం నుంచి కూడ వీటిని ఆపరేట్ చేసి నాజిల్లోని రీడింగ్‌ను సెట్ చేయవచ్చు. అధికారులు దాడులకు వస్తే వెంటనే అప్రమత్తమయ్యే బంకుల యజమానులు రీడింగ్‌లో తేడాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. పలు బంకుల్లో లీటరుకు30 నుంచి 50 మిల్లీలీటర్ల వరకు తక్కువ వస్తున్నా అధికారుల దాడులతో జాగ్రత్త పడినట్లు సమాచారం. అర్ధరాత్రి తరువాత దాడులు మూడు రోజులుగా దాడులు చేస్తుండటంతో బంకుల నిర్వాహకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మేము కూడ తెలివిగా వ్యవహరించి తనిఖీలు చేపడుతాం. అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేయాలని భావిస్తున్నాం. అక్రమాలకు పాల్పడే వారికి జరిమానాలు విధించడంతో పాటు, నాజిల్లను సీజ్ చేస్తున్నాం. వరుసగా పట్టుబడిన బంకుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – జగన్ మోహన్ రెడ్డి తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ -
అప్రమత్తంగా లేకపోతే అంతే..
విజయనగరం పూల్‌బాగ్: నేటి సమకాలీన సమాజంలో పెట్రో ఉత్పత్తులు నిత్యావసర వస్తువులుగా మారాయి. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలకు కూడా పాల్పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు తప్పకుండా రీడింగ్ చూసుకోవాలి. అయితే ఎక్కడైనా కొలతల్లో తేడాలొస్తే వినియోగదారులు పౌరసరఫరాల అధికారులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ కొనుగోలులో నాణ్యత, కొలతల్లో తేడాలను పరిశీలించేందుకు బంకుల వద్ద నాణ్యతా పరికరాలను తప్పనిసరిగా ఉంచాలి. అలాగే బంకుల వద్ద మినరల్ వాటర్ అందుబాటులో ఉంచాలి. నాణ్యతా పరీక్షలిలా... పెట్రోల్ పంపు నాజిల్ నుంచి ఒక చుక్క పెట్రోల్‌ను ఫిల్టర్ కాగితంపై వేయాలి. రెండు నిమిషాల తర్వాత పెట్రోల్ పూర్తిగా ఆవిరైపోతుంది. అయితే కాగితంపై ఎలాంటి మరక లేకపోతే ఆ పెట్రోల్ నాణ్యమైనదిగా.. ఒకవేళ మరక ఏర్పడితే కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి. పెట్రోల్ బంకుల వద్ద ఇంధన సాంద్రత ఎంత ఉందో వినియోగదారుడికి తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ అయితే నాలుగు, డీజిల్ అయితే రెండు ప్రకారం నమూనా బాక్సులలో సాంద్రత నమోదు చేయాలి. కంపెనీ నుంచి వచ్చిన ఇంధనం, బంకుల్లో నమోదైన ఇందన సాంద్రతకు మధ్య మూడు పాయింట్ల మించితే కల్తీ జరినట్లే. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. పాటించాల్సిన నిబంధనలు... పెట్రో బంకుల్లో మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. ప్రాథమిక చికిత్స కిట్లు ఏర్పాటు చేయాలి. బంకుల వద్ద అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్ర పరికరాలతో పాటు మూడు బకెట్ల ఇసుక, మూడు బకెట్ల నీరు ఏర్పాటు చేయాలి. లారీ ఇసుక, ఐదువేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. విద్యుత్ వైర్లు బయటకు కనిపించకుండా వైరింగ్ ఉండాలి. ట్యాంకు పరిసరాల్లో హైటెన్షన్ విద్యుత్ తీగలు, టెలిఫోన్ తీగలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్రోల్ వేయించుకున్న వాహనాలకు ఉచితంగా గాలి కొట్టాలి. 2003 నిబంధనల ప్రకారం బంకుల్లో సౌకర్యాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్హెచ్ఏఐ శాఖ ధ్రువీకరణ పత్రం పొందాలి. బంకుల్లో నాణ్య తను పరిశీలించడానికి హైడ్రో థర్మామీటర్ అందుబాటులో ఉండాలి. వాహనదారులు ఆ పరికరాలను అడిగితే తప్పనిసరిగా ఇవ్వాలి. వాహనదారులకు ఎండ, వాన నుంచి రక్షణ ఇచ్చేందుకు ప్రతి బంకు వద్ద ఎత్తైన షెడ్డు నిర్మించాలి. రీడింగ్ ఎంత ఉందో... పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేటప్పుడు పెట్రో మీటర్ రీడింగ్ జీరో ఉంటేనే పెట్రోల్ పోయించుకోవాలి. రూపీ మీటరులో లీటరు, మీటర్‌కు వ్యత్యాసం తెలుసుకోవాలి. లేకపోతే లీటరు మీటర్‌ను.. రూపీ మీటర్‌గా పొరబడే అవకాశముంది. ఇలా జరిగితే వాహనదారు డు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. -
ఓయూలో పెట్రోల్ బంక్
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా క్యాంపస్‌లో సౌకర్యాలు కల్పించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో క్యాంపస్ విద్యార్థులకు సైకిల్ కూడా ఉండేది కాదన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకరికి బైక్, అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయన్నారు. క్యాంపస్‌లోని 25 హాస్టళ్లలో సుమారు 2,500 బైక్‌లు, 8వేల స్మార్ట్ ఫోన్లు, 5వేల వరకు కంప్యూటర్లు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు 300 వరకు కార్లు కూడా ఉన్నాయన్నారు. ఈ వాహనాలకు పెట్రోలు, సెల్ఫోన్లకు సిగ్నల్ సమస్య ఉందన్నారు. పెట్రోల్ కోసం విద్యార్థులు తార్నాక, విద్యానగర్ వైపు వెళ్లాల్సి వస్తోందన్నారు. యూటర్న్ కారణంగా ఎటు వెళ్లినా అర లీటర్ పెట్రోల్ అవుతుందన్నారు. అందుకే విద్యార్థులు, అధ్యాపకుల అవసరాలను గుర్తించి క్యాంపస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. గతంలో కబ్జాకు గురై ఇటీవల ఓయూకు దక్కిన మెకాస్టార్ ఆడిటోరియం పక్కనున్న సుమారు ఎకరం స్థలంలో బంక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సెల్ టవర్స్, హాస్టల్ విద్యార్థుల వంటల కోసం గ్యాస్ పైప్‌లైన్, ఉచిత వైఫై, సౌర విద్యుత్తు తదితర వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే వసతులతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. పదేళ్ల లీజు.. ఓయూలో పెట్రోల్ బంక్ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని హెచ్‌పీసీఎల్ సంస్థకు పదేళ్లకు లీజుకు ఇచ్చిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రతి ఐదేళ్లకు రెన్యూవల్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏడాదికి రూ.50 లక్షల వరకు అద్దె లభిస్తుందన్నారు. గతంలో లీజుకిచ్చిన ఓయూ భూములను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకునేలా గత ఒప్పందాలను సవరించామన్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ఇటు ఓయూ, అటు ఇఫ్లూ విద్యార్థులకు, ఉద్యోగులకు, మాణికేశ్వర్‌నగర్ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. ఓయూ భూముల లీజు వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగ పర్చాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీశైలంగౌడ్ డిమాండ్ చేశారు. గతంలో లీజుకు ఇచ్చిన భూముల అద్దె చెల్లింపులు, విధివిధానాలు పారదర్శకంగా ఉండాలన్నారు. -
ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో తమ సంస్థ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా, అలాగే ప్రైవేటు వ్యక్తుల భూముల్లోనూ బంకులు ఏర్పాటు చేసుకునేలా ఆగ్రోస్ నిర్ణయించింది. ఇప్పటికే ఆగ్రోస్‌కు చెందిన భూముల్లో బంకుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వారికి బంకులను కూడా కేటాయించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలో గుర్తించిన ఏడు ప్రాంతాల్లో బంకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. వీటిలో ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ (చింతల్), జగిత్యాల, వరంగల్, భూపాలపల్లిల్లో ఉన్న ఆగ్రోస్ భూముల్లో ఏర్పాటు చేయగా, మరో బంక్ సూర్యాపేటలోని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ బంక్‌లకు హిందుస్తాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థ పెట్రోల్ సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల డిపాజిట్.. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఉన్న భూములను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపై ఆ సంస్థ దృష్టి సారించింది. సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతోపాటు, వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సంస్థకు ఆదాయ వనరులను సమకూర్చాలని నిర్ణయించింది. ఆగ్రోస్ భూముల్లో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు హక్కులు పొందిన యజమానులు స్థల వినియోగానికి ముందుగా రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ సొమ్ముతో పెట్రోల్ బంకు నిర్మాణం చేసి ఇస్తారు. అనంతరం 30 ఏళ్లపాటు సదరు వ్యక్తికి బంకు లీజుకు ఇస్తారు. దీంతోపాటు యజమాని పెట్టిన పెట్టుబడి, ఖర్చులు, నిర్వహణ ఖర్చులు మినహా వచ్చిన లాభంలో 40 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించాలి. 60 శాతం యజమాని తీసుకోవడానికి వీలు కల్పించారు. పెట్రోల్ బంక్ ఆగ్రోస్ పేరుతోనే ఉంటుంది. అదేవిధంగా ఆగ్రోస్ భూముల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్‌ల విషయంలో 20 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. బంక్ నిర్వహించే యజమానులు పెట్రోల్ సరఫరాకు హెచ్‌పీసీఎల్ సంస్థకు రూ.5 లక్షల డిపాజిట్ చేస్తే సరిపోతుంది. పెట్రోల్ బంక్‌లకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని ఆగ్రోస్ సంస్థ ఎండీ సురేందర్ తెలిపారు. -
అంతా వారిష్టం..
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజూ దాదాపు 40 లక్షల వాహనాలు ఇంధనం పోయించుకుంటుంటాయి. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాహనాల్లో పొస్తున్న ప్రతి చుక్కకు సొమ్ము చేసుకుంటుంటారే తప్ప వినియోగదారులకు కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.ఏకంగా బంకుల యాజమాన్యాలు చమురు సంస్థల నిబంధనలను సైతం తుంగలో తొకేస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్ బంకులకు వస్తున్న వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని దాక్ష్రగా మారాయి. పౌరసరఫరాల శాఖ, జైళ్ల శాఖ ఆధ్వరంలో నడిచే పెట్రోల్ బంకుల్లో మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి తప్ప మిగిలిన ఆయిల్ కంపెనీల ఔట్ లేట్, ప్రయివేటు బంకుల్లో వాటి ఊసే కనిపించడం లేదు. పెట్రోల్ బంకులకు వచ్చే వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వేసి పంపడమే కాదు... వాహనాల్లో ఉచితంగా గాలి, వాహనదారులకు తాగు నీరు, మరుగు దొడ్లు సౌకర్యం ఖచ్చితంగా కల్పించాల్సి బాధ్యత యాజమాన్యాలపై ఉంది. మరోవైపు పెట్రోబంకుల్లో ఇంధనం నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే పెట్రోల్ బం కుల నిర్వాహకులు వీటిని పట్టించుకోవడం లేదు. నగరంలో 60.34 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 60.34 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్ర వాహనాలు 20.30 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మహానగర పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. జాగ్రత్తలేవీ.... పెట్రోల్ బంకుల ఏర్పాటు సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తక్షణమే చర్యలు తీసుకునేందుకు అనువుగా పరిసరాలు ఉండాలి. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, బకెట్లలో ఇసు క. సమీపంలో నీరు అందుబాటులో ఉంచాలి. మరోవైపు ఫస్టె్టయిడ్ కిట్లు అత్యవసరం. సిబ్బం దికి అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధృవప త్రం యాజమాన్యం వద్ద ఉండాల్సి ఉంటుంది. బంకుల వద్ద విద్యుత్ తీగలు బయటకు కనిపించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సమీపం లో హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పొగతాగరాదు బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితేఇవేమి బంకుల్లో కనిపించవనేది జగమేరిగిన సత్యం. ఉచితంగా గాలి... పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకున్న వాహనాల్లో ఉచితంగా గాలి నింపాలి. ఎండ కాలం కారణంగా చల్లని మంచి నీరు అందుబాటులో ఉంచాలి. మరుగు దొడ్లు ఏర్పాటు చేసి వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించాలి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అంబులెన్స్, పోలీసు, వికలాంగులకు ఇంధనం లేదనుకుండా పోయాల్సి ఉంటుంది. నాణ్యత పరీక్షలు ఇలా.. వినియోగదారులు ఇంధనం కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించవచ్చు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలనేది ఖచ్చితంగా ఉండాలి. పెట్రో బంకుల్లో ఇంధనం నాణ్యతను పరిరక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు అడిగితే వాటిని ఇచ్చి ఇంధనం నాణ్యత పరీ రక్షించడానికి సహకరించాలి..పెట్రోల్ బంకుల్లో హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉంచడమేగాక వినియోగదారులు అడిగిన వెంటనే అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. ఇంధనం నాణ్యతను పరిరక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బందికి అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్‌పై మరక కనిపించకూడదు మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. -
ముసుగు తీస్తే.. ముట్టడే
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): ఒళ్లంతా రగ్గుకప్పుకుని పెట్రోల్ పోస్తున్నది చలికి వణికిపోతూ కాదు..ముఖానికి గుడ్డలు కట్టుకుని వచ్చి బంకులో పెట్రోల్ పోయించుకుంటున్నదీ చెవులకు చలిగాలి సోకుతుందనీ కాదు.. పరిసరాల్లోని చెట్లకు ఉన్న తుట్టెల నుంచి తేనెటీగలు దాడి చేస్తాయన్న భయంతోనే..పెదబయలులోని జీసీసీ పెట్రోల్ బంక్ వద్ద ఈ దుస్థితి నెలకొంది. రోజుల తరబడి ఇదే దుస్థితి కొనసాగుతోంది. జీసీసీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. వాహనాల్లోకి పెట్రలో పోస్తున్నప్పుడల్లా ఆ వాసనకు తేనెటీగలు చెలరేగిపోతున్నాయి. వడగాడ్పులకు దూసుకొస్తున్నాయి. బంకు సిబ్బంది, వినియోగదారులపై దాడి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇదే దుస్థితి అని, ఇప్పటికి పది పదిహేనుసార్లు వాటి దాడికి గురయ్యామని సిబ్బంది చెబుతున్నారు. ప్రారంభంలో అటవీశాఖ, జీసీసీ అధికారులకు వివరించామని, నెలన్నరగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఎవ్వరూ పట్టించుకోలేదని అంటున్నారు. చెట్లకు ఉన్న తేనె తుట్టెలను తీయించే ప్రయత్నం చేయలేదంటున్నారు. రోజూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. తేనెటీగల దాడికి గురికాకుండా ప్రత్యేకంగా దుస్తులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విధులు బహిష్కరిస్తామని పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్యేనా మజాకా..!
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందర శివాజీ ప్రజల అవసరాల కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తారనడానికి పెట్రోల్ బంకులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలాసలో ప్రభుత్వ పెట్రోల్ బంకు మంజూరైనా తన బంకులకు ఎక్కడ పోటీగా వస్తుందోనని భయపడి అధికారాన్ని అడ్డంపెట్టుకుని బంకు ఏర్పాటుకాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైన ఎమ్మెల్యే.. తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడానికి మాత్రం ముందుంటారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల ప్రభుత్వ పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒకటి, పలాసలో మరొకటి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు, ఏర్పాట్లు తదితర పనులు చకచకా సాగిపోయాయి. శ్రీకాకుళంలో ఇప్పటికే సేవలందుతుండగా పలాసలో మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. ఇందుకు ఎమ్మెల్యే శివాజీయే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అందులో కీలకమైనది పెట్రోల్ బంకుల వ్యాపారం. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలు, పలాస, మందస, శ్రీకాకుళం, సోంపేట తదితర ప్రాంతాల్లో సుమారు 14 పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రభుత్వ బంకు ఏర్పాటు చేస్తే తన వ్యాపారానికి అడ్డుగా ఉంటుందని గ్రహించిన పలాస ఎమ్మెల్యే తనదైన శైలిలో బంకుకు మోకాలడ్డారు. శంకుస్థాపన జరిగినా.. పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు. 2018 మే 31న శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే శివాజీ తన వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించి బంకు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే 11 నెలలు పూర్తయినా నేటికీ బంకుకు మోక్షం కలగలేదని చెబుతున్నారు. ట్యాంకర్లు, ఇతర వస్తువులు నిర్మాణ స్థలం వద్దకు తీసుకువచ్చినా పనులు మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ప్రభుత్వం తరఫున బంకు ఏర్పాటైతే స్వచ్ఛమైన పెట్రోల్ వస్తుందని ఎదురుచూశామని, ఎమ్మెల్యే కారణంగా నిరాశే ఎదురైందని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమోన్మాది చేతిలో గాయపడిన రవళి మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆరు రోజుల నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి (22) సోమవారం సాయంత్రం మృతి చెందింది. పెట్రోల్ దాడిలో గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఫిబ్రవరి 27న ఆస్పత్రిలో చేర్చారు. పెట్రోల్ మంటలకు శరీరంలో 70 శాతం కాలిపోయింది. కంటిచూపు దెబ్బతింది. రక్తనాళాలు సహా పలు అంతర్గత అవయవాలు పాడయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగబారి ఉబ్బిపోయాయి. శ్వాస తీసు కోవడం కష్టంగా మారడంతో ఆమెను గత ఆరు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం అప్పగిస్తామని అధికారులు చెప్పినట్లు రవళి బంధువులు తెలిపారు. ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి.. వరంగల్జిల్లా రూరల్ సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావుల కుమార్తె రవళి. హన్మకొండ రాంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఫిబ్రవరి 27న హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుండగా, అదే కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్ (24) ఆమెను అడ్డగించి, తనను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో అప్పటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రవళిపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం రవళిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్వేష్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అతడ్ని కూడా అదే విధంగా చంపాలి : రవళి తండ్రి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందిడంతో ఆమె తండ్రి సుధాకర్ కన్నీరు మున్నీరయ్యారు. కూతురుని ఎంతో గారాభంగా పెంచుకున్నానని.. అలాంటి తన కూతురుని అన్వేష్ పొట్టన బెట్టుకున్నాడని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఒక్కగానొక్క కూతురుని అకారణంగా చంపేశాడని.. అన్వేష్‌ను కూడా పెట్రోల్ పోసి చంపేయాలని డిమాండ్ చేశారు. అన్వేష్ తన కూతురుని చాలా రోజుల నుంచి వేధించాడని, పోలీసులు అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచిందని వాపోయారు. రేపు రవళి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. చదవండి : ప్రేమోన్మాది దాడి: రవళి మృతి -
తల్లిదండ్రులపై హత్యాయత్నం
అనంతపురం, కణేకల్లు: ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో క్షణికావేశానికి లోనైన తనయుడు తల్లిదండ్రులపై పెట్రోల్ చల్లాడు. పూజగదిలో ఉన్న దీపం నుంచి మంటలు క్షణాల్లో వ్యాపించడంతో తల్లిదండ్రులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం రూరల్ సీఐ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. రామనగర్‌లో నివాసముంటున్న పి.నారాయణరెడ్డి (79), నరసమ్మ (73) దంపతులకు శేషారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, హనుమంతరెడ్డిలు సంతానం. వీరికి 2.5 ఎకరాల మాగాణి, రెండు ఇళ్లున్నాయి. ఓ ఇంట్లో తల్లిదండ్రులు, మరో ఇంట్లో మధుసూదన్‌రెడ్డి నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఉరవకొండలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు భార్యాపిల్లలతో బళ్లారిలో ఉంటున్నాడు. రెండో కుమారుడు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులుంటన్న ఇంటిపక్కనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఎవరికీ ఆస్తి పంపకాలు చేయలేదు. ఈ నేపథ్యంలో రెండో కుమారుడు మధుసూదన్‌రెడ్డి గత కొన్ని నెలల నుంచి ఆస్తి పంచాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆస్తి కోసం గొడవ.. ఆస్తి పంపకాల విషయమై ఆదివారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులుంటున్న ఇంటికెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆస్తి పంచకపోయినా పర్వాలేదని, కనీసం తానుంటున్న ఇంటినైనా రాసివ్వాలని మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశాడు. పంపకాలు చేసేదీ లేదని తక్షణమే ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తల్లిదండ్రులు ఖరాకండిగా చెప్పారు. ఆగ్రహించిన మధుసూదన్‌రెడ్డి పెట్రోలు బాటిల్ తీసుకుని ఇంట్లోకి విసిరాడు. అది కాస్తా తల్లిదండ్రులపైకి కూడా పడింది. ఇంతలో దేవునిపటాల ముందు వెలిగించిన దీపాల ద్వారా మంటలు క్షణాల్లో వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బళ్లారివవిమ్స్‌కు పంపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో అన్న మధుసూదనే ఆస్తి కోసం హత్యాయత్నం చేశాడని హనుమంతరెడ్డి ఫిర్యాదు చేసినట్లు సీఐ సాయినాథ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఆస్తి కోసం కొడుకు అఘాయిత్యం..!
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కణేకల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో కసాయి కొడుకు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వరంగల్‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
-
డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ దాడి
-
వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్ దాడి
సాక్షి, వరంగల్ : వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు... రవళి అనే యువతి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. ఈరోజు(బుధవారం) కాలేజీకి వెళ్తున్న సమయంలో.. సాయి అన్వేష్ అనే యువకుడు ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా దాడికి పాల్పడ్డ అన్వేష్ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన అతడికి దేహశుద్ధి చేసిన తోటి విద్యార్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ బంక్‌లో నిలువు దోపిడీ
శ్రీకాకుళం, ఆమదాలవలస: పట్టణంలోని లక్ష్మణరాజు ఫిల్లింగ్ స్టేషన్ పెంట్రోల్ బంక్‌లో వినియోగదారులను దోపిడీ చేసుకుంటున్న వైనం శుక్రవారం బట్టబయలైంది. మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన వినియోగదారుడు తన వాహనానికి రూ. 300 పెట్రోల్ పోయించగా, రూ. 290కు రాగానే మీటర్ రీడింగ్ ఆగిపోయింది. సదరు వినియోగదారుడు ఈ మోసాన్ని గుర్తించి నిలదీశా డు. లీటర్ బాటిల్లో ఆయిల్ కొట్టి పాయింట్లు లెక్క చూపించాలని మొండికేశాడు. ఇంతలో బంకు యజమాని వచ్చి అతడ్ని బుజ్జగించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. అయితే బిల్లు తీసి ఇవ్వాలని పట్టుబట్టగా, అందులోనూ తేడా కనిపించింది. ఈ లోగా వినియోగదారుల సంఖ్య పెరగడంతో కలవరం చెందిన బంకు యజమాని సదరు వినియోగదారుడిపై విరుచుకు పడ్డాడు. ‘నీలాంటి వారందరికీ సమాధానం చెప్పాలంటే మేం వ్యాపారం చేయలేం. మాకు ఉండాల్సిన అండదండలు ఉన్నాయి. నీవు ఎక్కడి కెళ్తావో, ఏమి చేసుకుంటావో.. నీ ఇష్టం’ అని దురుసుగా ప్రవర్తించాడు. అయితే పంపింగ్ యంత్రం మరమ్మతు ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా, వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు. ఏదేమైనా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విని యోగదారులు నిలువునా మోసపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. -
పెట్రోల్ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
-
ఒంటరి మహిళపై పెట్రోల్ దాడి..
నెల్లూరు, వాకాడు: వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం రాత్రి వాకాడు పంచాయతీ గొల్లపాళెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పుటించిన ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ 28 ఏళ్ల మహిళకు వివాహమై భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో గొల్లపాళెం గ్రామానికి చెందిన కావలి కృష్ణయ్య అనే వ్యక్తి ఆమెతో కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ఆదివారం కొంత వివాదం చోటుచేసుకోవడంతో తట్టుకోలేని కృష్ణయ్య వాకాడు గురకుల పాఠశాలకు వెళ్లే రహదారి వద్దకు రమ్మని ముఖం, చాతీపై పెట్రోలుపోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ కేకలు వేయడంతో స్థానికులు వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించారు. బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రఘునాథ్ తెలిపారు. -
పెట్రోల్ బంకులపై విజి‘లెన్స్’
కర్నూలు: పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ, కొలతల్లో తేడాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. పెట్రోల్, డీజిల్‌లో కిరోసిన్ కలిపి విక్రయాలు జరుపుతున్నారని, కొలతల్లో కూడా తేడాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలసి నారాయణస్వామి పెట్రోల్ బంకు, ఆల్ఫా పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెట్రోల్, డీజిల్‌లో ప్యూరిటీ, డెన్సిటీ మెజర్ మెంట్స్ పరిశీలించారు. సీఐ లక్ష్మయ్య నేతృత్వంలో మైనింగ్ శాఖ అధికారులతో కలిసి మరో బృందం అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. లైమ్ స్టోన్, నాపరాళ్లు, గ్రానైట్, ఇటుకలు, ఐరన్, వరిధాన్యం తదితర వాటిని అనుమతి పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో తరలిస్తుండగా తనిఖీ చేసి 18 వాహనాలను సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. 17 వాహనాల నుంచి రూ.2,96,000 అపరాధ రుసుం వసూలు చేయాలని వ్యవసాయ, మైనింగ్ శాఖ అధికారులకు నివేదించారు. -
పెట్రో బంకుల్లో ఆగని మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల మోసాలు ఆగడం లేదు. పంపింగ్‌లో చేతివాటం, డిస్ ప్లేలో దగా, స్టాంపింగ్ లేకుండా బంకుల నిర్వహణ బాహాటంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్ వినియోగంలో గ్రేటర్హైదరాబాద్ వాటా సగానికి పైనే ఉంటుంది. అవకతవకలను అరికట్టాల్సిన తూనికల కొలుతల శాఖ మాత్రం మామూళ్ల మత్రులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పుడప్పుడు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో పలు అక్రమాలు బహిర్గతమవుతున్నా మొక్కుబడి కేసులు, జరిమానాలతో చేతులు దులుపుకుంటోంది. ప్రతి లీటర్‌కు 10 నుంచి 20 ఎంఎల్... గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో డీలర్ల చేతివాటంతో ప్రతి లీటర్‌కు సగటున 10 నుంచి 20 ఎంఎల్ వరకు తక్కువగా పంపింగ్ జరగడం సాధారణమైంది. తూనికల,కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఐదు లీటర్లలో 25 ఎంఎల్ వరకు తక్కువగా ఉండవచ్చు. కానీ ప్రతి లీటర్లో తక్కువగా పంపింగ్ జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనా కట్టడి చర్యలు మాత్రం కానరావడం లేదు. సీల్ బ్రేక్ .. పెట్రోల్ బంకుల సీల్ బ్రేకింగ్ బాహాటంగా సాగుతున్నట్లు వెల్లడైంది తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి ఫిల్లింగ్ మిషన్‌ను పరిశీలించి సీల్‌వేసి స్టాపింగ్ చేస్తారు. ప్రతియేట రెన్యూవల్ కోసం సదరు డీలరు గడువు కంటే పక్షం రోజుల ముందు తూనికల కొలత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తూనికల, ఆయిల్ కంపెనీల అధికారులతోపాటు ఇద్దరు టెక్నీషియన్ల సమక్షంలో పంపింగ్ మీషన్‌లో మెజర్మెంట్ను పరిశీలించి స్టాంపింగ్ చేస్తారు. ఆయితే గతంలో అధికారుల దాడుల్లో డీలర్లు సీల్ బ్రేక్ చేసినట్లు బహిర్గతమైంది. సీల్ బ్రేక్ చేసి చిప్స్‌ను అమర్చడం,రిమోట్స్‌తో పంపింగ్ కంట్రోల్ చేయడం లాంటి సంఘటనలు బట్టబయలయ్యాయి. ప్రభుత్వ బంకులపైనే.. ప్రభుత్వం పక్షాన నిర్వహించే పెట్రో బంకుల పట్లనే వాహనదారులు ఆసక్తి కనబర్చుతున్నారు. నిత్యం రద్దీ ఉన్నప్పటికి సమయం వెచ్చించి క్యూలో నిలబడి కాస్త పెట్రోల్ పోయించుకుంటున్నారు. జైళ్ల శాఖ నిర్వాహణ లోని చంచలగూడ పెట్రో బంక్‌లలో మాత్రం రోజుకు 20 వేల నుంచి 30 వేల లీటర్ల పెట్రోల్, 15వేల నుంచి నుంచి 20వేల లీటర్లు వరకు డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. సచివాలయం వద్దగల సివిల్ సపై్ల పెట్రోల్ బంకుకు కూడా వాహనదారులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రై వేటు బంకులపై వాహనదారులకు నమ్మకం సన్నగిల్లడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. వినియోగంలో టాప్... రాష్ట్రంలోనే పెట్రో,డీజిల్ వినియోగంలో హైదరాబాద్ వాటా సగానికి పైనే ఉంది. జంట జిల్లాల్లో ప్రధాన మూడు కంపెనీలకు సుమారు 447 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. పతిరోజు ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. ‘నాజిల్’కు డబుల్ వసూల్ పెట్రో బంకుల్లో ఫిల్లింగ్ మెషిన్ల పనితీరుపై పర్యవేక్షణ పేరుతో తూనికలు, కొలుతల శాఖ అధికారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఫిల్లింగ్ మెషిన్ల స్టాంపింగ్ సమయంలో బిల్లు రసీదు కంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తుండటంతో పెట్రోల్ బంకులో జరిగే అక్రమాలపై నిఘా కరువైంది. పెట్రోల్ బంకుల యాజమానులు, స్థానిక తూనికల కొలుతల అధికారుల పరస్పర సహకారంతో పెట్రో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో పెట్రోల్ బంకుల స్టాంపింగ్ సీల్‌ను సైతం బహిరంగంగా పగులగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికోసారి తనిఖీల పేరుతో హడావుడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 447 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక్కో పెట్రోల్ బంకులో ఆరు నుంచి 10 వరకు ఫిల్లింగ్ మెషిన్లు ఉన్నాయి. ఈ లెక్కన సుమారు మూడు వేల వరకు ఫిల్లింగ్ యంత్రాలు ఉన్నట్లు అంచనా. తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి ఫిల్లింగ్ మెషిన్లను పరిశీలించి స్టాంపింగ్ చేస్తారు. ఏటా రెన్యూవల్ కోసం సదరు డీలరు గడువు కంటే పక్షం రోజుల మందే తూనికల కొలత శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తూనికల, ఆయిల్ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నిషియన్ల సమక్షంలో పంపింగ్ మెషిన్లో మెజర్మెంట్ను పరిశీలించి స్టాంపింగ్ చేస్తారు.. మెజర్మెంట్లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సరి చూసి స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను నిర్ణీత ఫీజు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమా చేయాల్సి ఉంటుంది. అయితే స్టాంపింగ్ అనంతరం సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రసీదు పెట్రోల్ బంకు యాజమానులకు అందిస్తారు. అయితే యాజమానులు మాత్రం రసీదులో పేర్కొన్న మొత్తానికి రెండింతలు నగదును అందజేయడం అనవాయితీ. డబుల్ ఫీజు చెల్లించకుండా ఉండేందుకు బంకుల యాజమానులు ఎవరూ సహసించరు. దీంతో తూనికల, కొలుతల అధికారులు బంకులు యాజమానులకు అనుకూలంగానే మెజర్మెంట్ విషయంలో సహకారం అందిస్తారు. దీనికితోడు బంకుల యాజమానులు సీల్‌ను బ్రేక్ చేసినా వారు పట్టించుకోవడం లేదు. -
వివాహితపై పెట్రోలుతో దాడి
చిత్తూరు, కలికిరి: వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి హత మార్చేందుకు యత్నించిన ఘటన బుధవారం కలికిరిలో కలకలం సృష్టిం చింది. పోలీసుల కథనం.. స్థానిక కోటవీధిలో నివా సం ఉంటున్న కదీరున్నీ సా(35) తన తల్లితో కలిసి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. బుధవారం తెల్లవారుజామున టిఫిన్ సెంటర్ వద్ద పొయ్యి వెలిగిస్తుండగా ఆమెపై అగంతకులు పెట్రోలు చల్లారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె తల్లి, చుట్టుపక్కల వారు వచ్చి మంట లను ఆర్పారు. అప్పటికే బాధితురాలి ముఖం, చేతులు, కాళ్లు కాలాయి. 108లో ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కలికిరి, మదనపల్లెలో చికిత్స చేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరిగి మదనపల్లె నుంచి తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి తల్లి షాకీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, 20 ఏళ్లక్రితం అబ్దుల్ రెహమాన్‌తో వివాహమైన కదీరున్నీసా పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటూ, కుమార్తెను చదివించుకుంటోంది. తనకు ఎవరితోనూ గొడవలు లేవని, అయితే అగంతకులు మోటార్ సైకిల్‌పై నాలుగు రోజులుగా బజారులో చక్కర్లు కొట్టారని బాధితురాలు చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో అగంతకులెవరో తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ బంక్‌లో దారుణం.. వైరల్ వీడియో
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. బైక్ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని దారుణంగా నరికి.. డబ్బు సంచిని లాక్కెళ్లారు. కడలూరు-చిదంబరం రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన బంక్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బైక్ మీద పెట్రోల్ బంక్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. పెట్రోల్ పోసే బాయ్‌తో మాట్లాడినట్టు నటించారు. ఇంతలో చివర కూర్చున్నవాడు.. అతని వద్ద నుంచి డబ్బు సంచి లాక్కునే ప్రయత్నం చేశాడు. దీనిని అతను అడ్డుకోవడంతో కత్తి తీసుకొని దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనితోపాటు ఉన్న మరో సిబ్బంది అక్కడి నుంచి పారిపోయాడు. కత్తి తీసుకొని బెదిరించినా.. డబ్బు ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో.. విచక్షణారహితంగా కత్తితో నరికి.. ఆ కిరాతకులు డబ్బుసంచితో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పెట్రోల్ బంక్‌లో దారుణం
-
నాణ్యతకు పట్టాభిషేకం !
పాలమూరు : ద్విచక్ర వాహనం లేదా కారు.. లేదంటే మరొకటి.. మనకు దగ్గర్లోని బంకుకు వెళ్లి పెట్రోల్ కాదంటే డీజిల్ పోయించుకుంటాం.. మధ్యలో వాహనం ఎక్కడ మొరాయించినా మొదట బంక్‌లో ఇంధనం నాణ్యతపై అనుమానమొస్తుంది.. ఎందుకంటే పరిస్థితులు అలా తయారయ్యాయి.. ప్రతీ వస్తువులో జరుగుతున్నట్లుగానే పెట్రోల్, డీజిల్ కల్తీకి అనర్హం కాదన్నట్లుగా మారిపోయింది. నాణ్యత విషయం పక్కన పెడితే మనం చెల్లించిన డబ్బుకు సరిపడా ఇంధనం పోశారా, లేదా అన్నది కూడా అనుమానమే! అందుకే బాగా తెలిసిన, పేరున్న బంక్‌లకు వెళ్లడాన్ని వాహనదారులు అలవాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న బంక్‌లకు ఆధరణ లభిస్తోంది. ఈ బంక్‌ల ఏర్పాటుద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం లభించడమే కాకుండా అటు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా జైలును ఆనుకుని ఏర్పాటుచేసిన బంక్ లాభాల బాటలో నడుస్తోంది. ఇదే మాదిరిగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరికొన్ని బంక్‌ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా.. కల్వకుర్తిలో ఒప్పందం జరిగింది. ఇంకా మరో పది చోట్ల కూడా బంక్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2016లో ప్రారంభం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును ఆనుకుని 2016లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి బంక్ ఇదే. ఈ బంక్‌లో పనిచేసే వారందరూ ఖైదీలే కాగా.. నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా నాణ్యత, పరిమాణంలో తేడా రావడం లేదు. ఫలితంగా రోజురోజుకు వినియోగదారుల ఆదరణ పెరుగుతుండగా.. కాసుల వర్షం కురుస్తోంది. శిక్షను అనుభవిస్తున్న, విడుదలైన ఖైదీలు 20మంది మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బంకు ఏర్పాటుతో కారాగారం ఆదాయం కూడా పెరగగా... ఉమ్మడి జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది. నాగర్‌కర్నూల్‌లో పనులు పూర్తి మహబూబ్‌నగర్ జిల్లా జైళ్ల శాఖ ఆద్వర్యంలో నాగర్‌కర్నూల్ సబ్ జైల్ దగ్గర పెట్రోల్ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ బంకును ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు కల్వకుర్తి సబ్ జైలు దగ్గర కూడా నూతనంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తికాగా.. సంబంధిత కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 2019 చివరి నాటికి ఇక్కడ కూడా పెట్రోల్ బంకును ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 26దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖతో కలిసి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 26మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించేలా బంకుల ఏర్పాటుకు జిల్లా జైళ్ల శాఖ నవంబర్ 6 నుంచి 10వరకు దరఖాస్తులు స్వీకరించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధాన రహదారికి 5 కిలోమీటర్ల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రోడ్డుకిరు వైపులా 1000 నుంచి 1500 గజాల భూమి ఇవ్వడానికి ఆసక్తి ఉన్న 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఉన్నతాధికారులకు పంపగా.. అక్కడి నుంచి నిర్ణయం వెలువడితే ఆయా ప్రాంతాల్లో బంకుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కాగా, అధికారుల కు అందిన 26 దరఖాస్తుల్లో నాగర్‌కర్నూల్, కొత్తకోట, తాండూర్ రోడ్డువైపు, అచ్చంపేట, భూత్పూర్ ప్రాంతాల నుంచే ఎక్కువ ఉన్నాయి. ఒప్పందం ఇలా... జైళ్ల శాఖతో కలిపి పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సొంత స్థలం కలిగి ఉండి జైళ్ల శాఖకు లీజ్‌కు ఇస్తే వారే బంక్ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా స్థలం ఇచ్చిన వారికి నెలకు కొంత అద్దె చెల్లిస్తారు. లేదంటే భాగస్వామ్యం ఉండడానికి కూడా అనుమతిస్తున్నారు. అయితే, ఏ విధానంలో బంక్ ఏర్పాటుచేసినా నిర్వహణ బాధ్యతలు జైళ్ల శాఖే చూసుకోనుండగా.. శిక్ష అనుభవిస్తున్న, శిక్ష పూర్తి చేసుకున్న వారికే ఉపాధి కల్పిస్తారు. తద్వారా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందడంతో పాటు ఖైదీలకు ఉపాధి లభించినట్లవుతుంది. 12 బంకుల ఏర్పాటుకు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన 12 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 26మంది దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. థర్డ్ పార్టీతో సర్వే చేసిన తర్వాత బంక్‌లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని బంక్ విజయవంతంగా నడుస్తోంది. అదేవిధంగా రెండు నెలల్లో నాగర్‌కర్నూల్‌లో బంక్ ప్రారంభం కానుంది. పెట్రోల్ బంకు ఏర్పాటు తర్వాత జైలు ఆదాయం ఆదాయం బాగా పెరగడమే కాకుండా ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. – సంతోష్‌రాయ్, సూపరింటెండెంట్, జిల్లా జైళ్ల శాఖ -
పెట్రోల్ నింపేందుకు మహిళ తిప్పలు
కొన్ని సార్లు కొందరు వ్యక్తులు చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే అమెరికాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలక్ట్రిక్ కారులో పెట్రోల్ నింపడానికి చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను గమనిస్తే.. యూఎస్‌లోని ఓ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఎలక్ట్రిక్ కారులో వచ్చిన మహిళ అందులో పెట్రోల్ నింపేందుకు చాలా విధాలుగా ప్రయత్నించారు. అది ఎలక్ట్రిక్ కారు అనే విషయం మార్చిపోయారో/తెలియకనో గాని అందులో పెట్రోల్ కొట్టడానికి శత విధాల ట్రై చేశారు. పెట్రోల్ ట్యాంక్ ద్వారం కోసం కారు చుట్టూరా వెతికారు. చివరకు కారు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూశారు. దీనిని చూస్తున్న అక్కడివారు తెగ నవ్వుకున్నారు. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఆమె కారులో పెట్రోల్ నింపేందుకు ప్రయత్నించారు. చివరకు ఓ వ్యక్తి ఆమె వద్దకి వచ్చి అది పెట్రోల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ కారు అని చెప్పారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన ఆమె నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా ఆమె వెనుకల కారులో కూర్చుని ఉన్నవారు వీడియో తీశారు. తర్వాత దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. -
అది పెట్రోల్ కారు కాదు.. ఎలక్ట్రిక్ కారు
-
చెంచులక్ష్మికి పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం
చంచల్‌గూడ: 18 చోరీ కేసుల్లో మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఘరనా దొంగ చెంచు లక్ష్మీ శుక్రవారం చంచల్‌గూడ మహిళా జైలు నుంచి విడుదలైంది.తరువాత ఆమెకు చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉద్యోగమించ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోరి కేసుల్లో చెంచు లక్ష్మీ (34) నిందితురాలుగా ఉంది. కాగా పలు కేసుల్లో ఆమె దోషిగా తేలడంతో కోర్టు ఆమె శిక్షలు విధించింది. ఎట్టకేలకు ఆమె జైలు శిక్ష పూర్తి కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలైంది. కాగా పోలీసులే తనను దొంగగా మార్చారని పలు సందర్భాల్లో ఆమె పోలీసు శాఖపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై జైలు అధికారులతో ఆమె మొరపెట్టుకోగా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోఅధికారులు చెంచు లక్ష్మీకి చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించడంతో ఇల్లు ఏర్పాటు చేసి కొంత డబ్బు కూడా చెల్లించినట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. -
ఇక మరిన్ని కంపెనీల పెట్రోల్ బంక్‌లు!
న్యూఢిల్లీ: ఇంధనాల రిటైలింగ్ వ్యాపారంలో పోటీని ప్రోత్సహించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం లైసెన్సింగ్ నిబంధనలను సరళీకరించాలనే ఉద్దేశంతో... నిపుణుల కమిటీని నియమించింది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు తోడ్పడే అంశాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే.. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్లైన్ల లేదా ద్రవీకృత సహజ వాయువు టర్మినల్స్ ఏర్పాటు మొదలైన వాటిపై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రిటైలింగ్ లైసెన్స్ నిబంధనలను సడలించడానికి తగ్గ చర్యలను ఈ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుందని కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. మరిన్ని సంస్థలు, పంప్‌ల రాకతో ధరలపరంగా, సర్వీసులపరంగా రిటైల్ కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారులకు ప్రయోజనం చేకూరగలదని చమురు శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు .. రిటైల్ రేటును నిర్ణయించేందుకు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రేట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. కిరీట్ పారిఖ్ సారథ్యంలో.. ప్రముఖ ఆర్థిక వేత్త కిరీట్ పారిఖ్, చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఐఓసీ మాజీ చీఫ్ ఎంఏ పఠాన్ ఈ కమిటీలో ఉంటారు. సంబంధిత వర్గాలతో చర్చించి కమిటీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఇంధనాల మార్కెటింగ్‌కి సంబంధించి లైసెన్సింగ్ విధానం, ప్రైవేట్ సంస్థల వాటా తదితర అంశాలను కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలు మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా ఉన్న అంశాలను గుర్తించి తగు సిఫార్సులు చేస్తుంది. సింహభాగం పీఎస్యూలదే .. ప్రస్తుతం దేశీయంగా 63,498 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి. వీటిలో సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలవే (పీఎస్‌యూ) ఉన్నాయి. ఐవోసీ అత్యధికంగా 27,325, భారత్ పెట్రోలియంకి 15,255, హెచ్‌పీసీఎల్‌కి 14,565 పంప్‌లున్నాయి. మరోవైపు, ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్‌కి 1,400, నయారా ఎనర్జీకి (గతంలో ఎస్సార్ ఆయిల్) 4,833, రాయల్ డచ్ షెల్కి 114 పంప్‌లున్నాయి. బ్రిటన్‌కి చెందిన బీపీ భారత్‌లో 3,500 పంప్‌లు ఏర్పాటుకు లైసెన్సులు పొందినప్పటికీ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అటు ఫ్రెంచ్‌కి చెందిన టోటల్ సంస్థ అదానీ గ్రూప్‌తో కలిసి 10 ఏళ్లలో 1,500 పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యం లో లైసెన్సింగ్ నిబంధనల సడలింపునకు కమిటీని ఏర్పాటు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బైక్‌పై వెంబడించి.. భార్యపై పెట్రోల్ పోసి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బంధువులతో కలిసి భార్య, మామపై పెట్రోలుపోసి నిప్పంటించాడు. పెద్దలు జరిపిన పంచాయితీ విఫలం కావడంతో తన భార్య ఆమె తండ్రితో కలిసి పుట్టింటికి జీపులో వెళ్తుండగా బైకులపై బెంబడించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. గుంటూరు, ముప్పాళ్ల (సత్తెనపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, మామపై.. అల్లుడు, అతని సమీప బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన మస్తాన్‌బీకి నరసరావుపేటకు చెందిన మహమ్మద్ ఇలియాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండగా భార్యాభర్తలకు బెల్లంకొండ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరలా కుటుంబ కలహాలు నెలకొనడంతో మస్తాన్‌బీ తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఇరు కుటుంబ సభ్యులూ ఆదివారం వారితో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మస్తాన్‌బీని తీసుకుని ఆమె తండ్రి గఫార్ నరసరావుపేట నుంచి జీపులో బెల్లంకొండకు బయలు దేరాడు. దీంతో అల్లుడు ఇలియాస్ తన బంధువులైన మరో ఐదుగురితో కలసి ద్విచక్ర వాహనాలపై వెంబడించి మాదల చప్టా వద్ద జీపును నిలిపివేసి మాట్లాడుకుందామంటూ వారిని కిందికి దింపారు. తర్వాత మస్తాన్‌బీపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. -
జంకు‘బంకు’లేదే!
పశ్చిమగోదావరి యలమంచిలి: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. వాహనచోదకులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి పట్టిం చుకోవడం లేదు. పైపెచ్చు పెట్రోల్ రీడింగ్‌లోనూ అవకతవకలకు పాల్పడుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఇవీ.. నిబంధనల ప్రకారం.. బంకుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. వాహనాలకు ఉచితంగా గాలి పట్టడానికి యంత్రాలు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు పుస్తకం ఏర్పాటు చేయాలి. పెట్రోల్ మీటర్ రీడింగ్‌లో పారదర్శకంగా వ్యవహరించాలి. పెట్రోల్ ధరలు, బంకు వేళలు, నిర్వాహకుడి ఫోన్‌నంబర్, అక్కడ లభించే సేవలు వివరిస్తూ.. బోర్డు ప్రదర్శించాలి. ఆన్లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు అందుబాటులో ఉంచాలి. ఎక్కడా కానరావే..! అయితే వీటిని బంకుల్లో ఎక్కడా అమలు చేయడం లేదు. కొన్నిచోట్ల ఆన్లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు ఉండడం లేదు. గాలిపట్టే యంత్రాలు ఉన్నా.. పనిచేయట్లేదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. తాగునీటి వసతి కూడా ఎక్కడా కానరాదు. ప్రథమ చికిత్స కిట్లు కూడా కనబడడం లేదు. ఒకవేళ ఉన్నా వాటిలో కాలంచెల్లిన మందులు, దూది ఉంటున్నాయి. కొన్ని బంకుల్లో పెట్రోల్ మీటర్ రీడింగులోనూ అవతవకలు జరుగుతున్నాయి. ధరల బోర్డులు కానరావడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. కనీస వసతులు ఉండడం లేదు పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో 15 బంకుల వరకు ఉన్నాయి. చాలా బంకుల్లో కనీస వసతులు ఉండడం లేదు. గాలి పట్టే యంత్రాలు దాదాపు లేవనే చెప్పాలి. తాగునీరు కూడా కనిపించదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. కనీసం మూత్ర విసర్జన కూడా చేయలేనంతా అధ్వానంగా ఉంటున్నాయి. – చేగొండి సీతారామస్వామినాయుడు (చిన్ని), దొడ్డిపట్ల అవగాహన ఉండట్లేదు బంకుల్లో ఉచిత సేవలు ఉంటాయని వినియోగదారులు చాలా మందికి తెలియదు. దాని వల్లే బంకు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి బంకుల్లో అందించాల్సిన సేవల వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో బోర్డు రూపంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.– వినుకొండ రవి, ఏనుగువానిలంక -
భలే ఆఫర్ : పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు వాత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ధరలు పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ మొబిక్విక్, పెట్రోల్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొబిక్విక్ ఈ ఫ్లాష్ ఆఫర్ కేవలం రాత్రి 9 గంటల వరకు వర్తించనుంది. పెట్రోల్ ధరలపై వన్-డే ఆఫర్ కింద, మొబిక్విక్ యూజర్లు, 200 రూపాయలు లేదా ఆపై ఎక్కువ మొత్తాలతో లావాదేవీలు జరిపితే 100 రూపాయల సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. 100 రూపాయల లావాదేవీకి కూడా ఈ సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం మొబిక్విక్‌తో భాగస్వామ్యమైన పెట్రోల్ పంపులకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు, ఫ్యూయల్ స్టేషన్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఈ ఆఫర్ వర్తించేందుకు కనీస లావాదేవీ రూ.100గా ఉండాలి. కాగా, ఆగస్టు 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. అత్యధిక క్రూడాయిల్ ధరలు, రూపాయి పతనం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ పతనంతో, క్రూడాయిల్ ఖరీదైనదిగా ఉంది. నేడు ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేపట్టలేదు. దీంతో నేడు లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.82.16గా, ముంబైలో రూ.89.54గా, చెన్నైలో రూ.85.41గా, కోల్‌కతాలో రూ.84.01గా ఉన్నాయి. పేటీఎం కూడా ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రూ.7500 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు కనీస లావాదేవి రూ.50గా ఉండాలి. 2019 ఆగస్టు 1 వరకు పేటీఎం ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. -
పెట్రోల్ ధర రూ.100 : బంకులు మూత పడతాయ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడా తగ్గేది లేకుండా.. పెరుగుతూనే ఉంది. కొత్త ఏడాది కానుకగా ప్రభుత్వం పెట్రోల్‌ను 100 రూపాయలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదికి దగ్గర దగ్గర 100 రోజుల సమయం ఉంది. ఈ వంద రోజుల్లో పెట్రోల్ కూడా 100 రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో లీటరు పెట్రోల్ 100 రూపాయలను దాటిన రికార్డును 2019 సొంతం చేసుకోబోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అలా పెరుగుకుంటూ వెళ్తూ.. 100 రూపాయలను క్రాస్ చేస్తే, పరిస్థితేంటి? అనే భయాందోళనలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాధారణంగా పెట్రోల్ 100 రూపాయలు దాటితే, అవి పాత మిషన్లలో చూపించడం కష్టం. ఎందుకంటే, భారత్‌లో ఇంధనం సరఫరా చేసే మిషన్లు మూడు అంకెల ధరల విధానాన్ని సపోర్టు చేయడం లేదు. ఆక్టేన్ పెట్రోల్ ప్రస్తుతం లీటరు రూ.100.33గా నమోదవుతోంది. కానీ పెట్రోల్ బంకుల మిషన్లలో ఇది కేవలం 0.33గా మాత్రమే చూపిస్తోంది. దీంతో పెట్రోల్ పంపు ఆపరేటర్లు మాన్యువల్‌గా పెట్రోల్ ధరలను అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ నార్ముల్ పెట్రోల్ విషయంలోనూ అదే జరిగితే, మాన్యువల్ ధరలను నిర్వహించడం కుదరదు. అది సాధ్యం కాని పని కూడా. పెట్రోల్ 100 రూపాయలు దాటిన తర్వాత మిషన్లను అప్డేట్ చేయడం ప్రారంభిస్తే, సరఫరా కష్టంగా మారుతుంది. అన్ని పెట్రోల్ పంపులు ఆటోమేటెడ్‌గా రన్ అవుతున్నాయి. సెట్రల్ సర్వర్‌లో మారిన తర్వాత నుంచే అన్ని సర్వర్లలో మారుతూ ఉంటాయి. ఇలా ధర పెరుగుకుంటూ పోతే మాత్రం, పెట్రోల్ పంపులు మూత పడి, అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాతనే ప్రారంభమవుతాయి. మరి అప్పటి వరకు వాహనదారులు ఎక్కడికి పోవాలి. ఏ వాహనం కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడుతోంది. అలా అయితే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 80 శాతం పెట్రోల్ బంకులు పాత మిషన్లనే వాడుతున్నాయి. ఇప్పటికే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.90లను దాటేసింది. ప్రస్తుతం రూ.91.96 వద్ద నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరో కొత్త సవాల్‌ను సృష్టించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజిల్ ధరలను ఎక్కడా తగ్గనీయ కుండా పరుగులు పెట్టిస్తున్నాయి. అంతేకాకుండా... అమెరికా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు భారత్‌కు చుక్కలు చూపిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇరాన్ ఉంది. అయితే తాజాగా ట్రంప్ సర్కార్ ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు, భారత్, ఇరాన్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా.. ఇరాన్ నుంచి చమురు దిగుమతి అయ్యే ట్యాంకర్లను అమెరికా ఆపివేస్తోంది. దీంతో భారత చమురు ఉత్పత్తుల మార్గాల్లో ఒకటైన ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులు మూతపడనున్నాయి. ఇరాన్‌పై రెండో దశ ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత చుక్కలు చూపిస్తుంటే, అదే రెండో దశ అమల్లోకి వచ్చాక పరిస్థితి మరింత దిగజారనుంది. ఇరాన్ విషయంలో అమెరికా అసలు మెత్తబడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రస్తుతం నడుస్తుందని ట్రయల్ మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను మరింత చుక్కలు చూపించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ను దేశీయంగా జీఎస్టీలోకి తేవాలనే ప్రతిపాదనను పాలకులు చాకచక్యంగా పక్కన పెట్టడం కూడా ప్రతికూలంగా నిలుస్తోంది. -
పెట్రోల్ బంకులో ప్రమాదకరమైన సంఘటన
-
పెట్రోల్ బంకులో షాకింగ్ సంఘటన
తిరునెల్వేలి : బైకులో ట్యాంక్ ఫుల్ చేయించుకున్న ఓ వాహనదారునికి, ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంకులో ట్యాంక్ నింపుకుని బయలుదేరబోతున్న సమయంలో అగ్నిప్రమాదానికి గురయ్యాడు ఆ వాహనదారుడు. ఈ షాకింగ్ సంఘటన తిరునెల్వేలి పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. సీసీటీవీలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బైకుపై కూర్చున్న వాహనదారుడు, తన ట్యాంక్ ఫుల్ చేయించున్నాడు. ఆ అనంతరం నగదు చెల్లించి, బైక్ స్టార్డ్ చేశాడు. ఇక అంతే భగ్గుమని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు వాహనదారుడు గాయాల పాలయ్యాడు. బైకుకు మంటలు అంటుకోవడంతో, వాహనదారుడిని రక్షించడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది అంతా అతని వద్దకు పరిగెత్తారు. గాయాల పాలైన ఆ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనదారుడు తన ట్యాంక్ ఫుల్ చేయించుకున్న అనంతరం ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై ఉండొచ్చని రిపోర్టులు తెలిపాయి. ఇదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిసింది. ఈ ప్రమాదాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. పెట్రోల్ బంకులో ప్రమాదం: సీసీటీవీ దృశ్యాలు -
పెట్రోల్ బంక్ వద్ద పేలుడు.. 35మంది మృతి
అబుజా: ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ట్యాంకర్లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పెట్రోలు బంకులో మీటరు మాయాజాలం!
గుణదల (విజయవాడ తూర్పు): నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే ఒక పెట్రోలు బంకులో మీటర్ మాయాజాలం బట్టబయలైంది. లక్షలాది రూపాయాలు అక్రమంగా దండుకుంటున్న వ్యవహారం శనివారం రాత్రీ గుణదలలోని పడవలరేవు పెట్రోలు బంకులో వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. పడవలరేవు కూడలివద్ద దాదాపు మూడు దశాబ్దాలుగా విజయలక్ష్మీ ఎంట్రర్‌ప్రైజెస్ పేరుతో పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న ఏలూరురోడ్డుపై ఈ పెట్రోలు బంకు ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వందలాదిగా వినియోగదారులు ఇక్కడ పెట్రోలు కొట్టిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ వినియోగదారుడు పెట్రోలు తీసుకుంటుండగా పంపు తీయగానే మీటర్ రీడింగ్ రూ. 14గా నమోదైంది. దీంతో తనకు పెట్రోలు ఇవ్వకుండానే మీటర్ రీడింగ్‌పై నగదు నమోదవ్వడాన్ని సదరు వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఇంతలో మరో వాహనచోదకుడికి ఇలాగే జరిగింది. పెట్రోలు బండిలో కొట్టకుండానే రూ.5 బిల్లు మానిటర్‌పై వచ్చేసింది. దీంతో వినియోగదారులకు బంకు సిబ్బందికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో మాచవరం ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు సేకరించారు. గతంలో మూసివేత.... కల్తీ పెట్రోలు అమ్మకం, రీడింగ్‌లో అవకతవకల కారణంగా గతంలో రెండుసార్లు ఈ బంకుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అవకతవకలు బట్టబయలు కావటంతో రెండు సార్లు ఈ బంకు మూతపడింది. ఇటీవలే మరలా బంకును పునఃప్రారంభించారు. అదే తరహాలో మోసం బయటపడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆందోళన చేసినా బంకు యాజమాన్యం రాకపోగా, పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు. -
‘డిజిటల్’ డిస్కౌంట్‌పై కోత!
సాక్షి, సిటీబ్యూరో: పెట్రో ‘డిజిటల్’ డిస్కౌంట్‌పై కోత పడింది. డిజిటల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ 0.75 నుంచి 0.25 శాతానికి కుదింపునకు గురైంది. అయినా పెట్రోల్, డీజిల్ నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పెట్రోల్ బంకుల్లో సర్వీస్ చార్జీలు లేని కారణంగా వినియోగదారులు నగదు రహిత లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016 నవంబర్‌లో డీమానిటైజేషన్ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఈ– వ్యాలెట్, మొబైల్ ఇతరత్రా నగదు రహిత సదుపాయాల ద్వారా చెల్లింపులపై చమురు సంస్థలు రాయితీ ప్రకటించిన విషయం విదితమే. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 0.75 శాతం డిస్కౌంట్ వర్తింపజేసి నగదు రహిత లావాదేవీలు జరిపిన వినియోగదారులు బ్యాంక్ ఖాతాలో మూడు రోజుల్లో రాయితీ జమయ్యేలా చర్యలు చేపట్టింది. ఏటీఎంలలో నగదు ఇబ్బందుల కారణంగా ప్రధాన ఆయిల్ కంపెనీలైన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేపట్టారు. పెట్రోల్ బంకులో డిజిటల్ చెల్లింపులపై సేవా పన్ను మినహాయించడంతో వినియోగదారులు దానికి అలవాటుపడ్డారు. తాజాగా చమురు సంస్థలు నగదు రహిత లావాదేవీలపై రాయితీ 0.25 శాతానికి కుదించి వేసింది. ఈ నిర్ణయం ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది. లీటర్ పెట్రోల్‌పై 20 పైసలు జమ.. పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపు ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేస్తే లీటర్‌పై బ్యాంక్ ఖాతాలో జమయ్యేది అక్షరాల ఇరవై పైసలే. గ్రేట ర్ పరిధిలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 81.75 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్‌పై లభించే రాయితీ అక్షరాలా ఇరవై పైసలు. డీజిల్ ధర రూ.74.55 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 18 పైసలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రో ల్, 30 నుంచి 40 లక్షల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. నగరంలో 55 లక్షల వివిధ రకాల వాహనాలకు తోడు ఇతర ప్రాంతాల నుం చి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే సుమా రు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై రాయితీ తగ్గించినా స్వైపింగ్ ద్వారా కొనుగోలు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు. -
పెట్రోల్ బంకులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. పెట్రోల్ బంకుల మోసాలపై కొద్దీకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 బంకుల్లో తనిఖీలు చేయగా..నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 బంకుల్లో డీజిల్ తక్కువగా పోస్తుండటం తోనూ , లైసెన్స్ రెన్యువల్ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ దగ్గర ఉన్న ఐడీపీఎల్ ఫార్చ్యూన్ ఫ్యుయల్ హెచ్పీసీ పెట్రోల్ బంకులో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇందులో 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
పెట్రోల్ బంకులో దాష్టీకం.. వైరల్
పెట్రోల్ బంకులో పని చేసే వ్యక్తిపై బంకు యాజమాని దాష్టీకానికి పాల్పడ్డాడు. కట్టేసి మరీ అతన్ని దారుణంగా హింసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అధికారులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా పనులోకి రావట్లేదన్న కోపంతో సదరు వ్యక్తిని బంక్‌లోని పిల్లర్‌కు కట్టేసి ఆ యాజమాని కొరడాతో చితకబాదాడు. అంతేకాదు అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, వైరల్ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ‘నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదు. ఆ కోపంతోనే బంక్ ఓనర్, అతని స్నేహితుడు నాపై దాడి చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు. -
పెట్రోల్ బంకు యాజమాని దాష్టీకం..
-
పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం
సిద్దిపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి తన కారులో రూ. 1000 డిజిల్ పోయించుం కోగా సిబ్బంది అలసత్వంతో రూ. 100ది మాత్రమే పోసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భాదితుడు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..విద్యుత్ శాఖలో డీఈగా పని చేసే అధికారికి బాధితుడు కారును అద్దెకు తిప్పుతున్నాడు. శుక్రవారం ఎన్సాన్పల్లి రోడ్డులో కోమటిచెరువు దగ్గర ఉన్న బంకులో రూ. వేయి విలువ గల డీజిల్ కారులో పోయించుకున్నాడు. డీజిల్ తక్కువ రావడంతో అనుమానంతో మెకానిక్‌తో చెక్ చేయించాడు. డిజిల్ తక్కువగా వచ్చిందని గుర్తించి సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. డిజిల్ పోయించుకున్న సమయంలో జరిగిన లావాదేవిలను పరిశీలించగా అందులో రూ. వెయికి బదులు కేవలం రూ. 100 డీజిల్‌ను మాత్రమే పోసినట్లుగా వెల్లడైంది. ఈ విషయంపై నిర్వాహకులను నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం ఇచ్చినట్లు బాధితుడు వాపోయాడు. తరువాత విషయం పట్టణంలో కలకలం రేగడంతో దిగివచ్చిన నిర్వాహకులు తక్కువ వచ్చిన డిజిల్‌తో పాటు అదనంగా మరో రూ. 500ల డిజిల్ పోస్తామని బేరమాడినట్లుగా బాధితుడు తెలిపాడు. -
మోత..వాత
జోగిపేట(అందోల్): డీజిల్, పెట్రోల్ ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రభుత్వాలు మాత్రం వివిధ రకాల పన్నులు వేస్తూ దండుకుంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు వాహనదారులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తున్నా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు. జిల్లాలోని జోగిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో సుమారు 60 వరకు పెట్రోల్ పంపులు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ద్విచక్రవాహనదారులు, ఇతర వాహనాల యజమానులు పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటారు. డీజిల్‌ను ట్రాక్టర్లతో పాటు లారీలు, జీపులు, ఇతర వాహనదారులు వినియోగిస్తారు. 2017 జూన్ నుంచి 2018 ఏప్రిల్ వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ.10.82, డీజిల్‌పై రూ.11.89 ధర పెరిగింది. కాంగ్రెస్ హయాంలో క్రూడాయిల్ ధర బ్యారెల్ రూ.100 ఉంటే ప్రస్తుతం ఒక్కసారిగా రూ.40కి పడిపోయింది. అయినప్పటికీ పెట్రో ల్, డీజిల్ ధరలు దించడం ఎందుకని భావించిన ప్రభుత్వాలు అనేక రకాల పన్నులను పెంచాయి. దీంతో క్రూడాయిల్ రూ.68కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడంతో 25 నుంచి 33 శాతం మేర పన్నులు వినియోగదారులు భరించాల్సి వస్తోంది. ఇదే జీఎస్టీలోకి చేర్చితే కేవలం 12శాతం పన్నులు వేసే అవకాశం ఉంటుందని, తద్వారా ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. పన్నులతోనే భారం క్రూడాయిల్ ధరలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చితే ధరలు దిగి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి వేస్తున్న పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.– శ్రీనివాస్, జోగిపేట,పంపు యజమాని -
దర్జాగా దోచుకున్నాడు..!
అతడు దర్జాగా వచ్చాడు. ఆ ట్రాక్టర్ యజమానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. 28వేల రూపాయలు తీసుకుని, దర్జాగా వెళ్లిపోయాడు. అసలేం జరిగిందో ఆ ట్రాక్టర్ యజమానికి అర్థమవలేదు. ‘నువ్వు మోసపోయావ్’ అని ఇతరులు చెప్పేంతవరకు కూడా అతడికి తెలియలేదు. అసలేం జరిగిందంటే... కారేపల్లి: మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన ఆంగోతు కృష్ణకు ట్రాక్టర్ ఉంది. దానికి చిన్న రిపేర్ వచ్చింది. కారేపల్లిలోని మెకానిక్ షెడ్‌కు మంగళవారం తీసుకెళ్లాడు. అంతలోనే ఆ షెడ్ వద్దకు, టిప్‌టాప్‌గా తయారైన ఓ యువకుడు వచ్చాడు. ‘‘మాది ఆంధ్రా. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నాను. మాకు మూడు డోజర్లు ఉన్నాయి. కారేపల్లి పెట్రోల్ బంక్‌లో మాకు ఖాతా ఉంది’’ అని పరిచయం చేసుకున్నాడు. ‘‘మా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. నేను అర్జంటుగా మా ఊరికి వెళ్లాలి. నాకు రూ.28వేలు కావాలి. లీటర్ డిజిల్ రూ.70 ఉంది కదా! బంక్‌లో రూ.65కే కొట్టిస్తాను. 400 లీటర్ల డీజిల్‌ను ఖాతాలో కొట్టిస్తాను’’ అని, ఆ ట్రాక్టర్ డ్రైవర్‌తో చెప్పాడు. చూడ్డానికి దర్జాగా ఉండి, మొహం దీనంగా పెట్టిన అతడిని చూసిన ఆ ట్రాక్టర్ యజమాని ఆంగోతు కృష్ణకు ఎటువంటి అనుమానం రాలేదు. పూర్తిగా నమ్మేశాడు. మనసులోనే లెక్కలేసుకున్నాడు. లీటర్‌కు రూ.65 చొప్పున 400 లీటర్లకు రెండువేల రూపాయలు మిగులుతాయని అనుకున్నాడు. ‘‘సరే.. ఆ డబ్బు నేనిస్తాను. నాకు డీజిల్ కొట్టించు’’ అని చెప్పాడు. ఆ దర్జా బాబు సరేనన్నాడు. కానీ, కృష్ణ వద్ద అంత మొత్తం లేదు. దీంతో, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోగల దుబ్బతండా గ్రామంలోగల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంట్లో నుంచి రూ.28వేలు తీసుకుని తిరిగొచ్చాడు. దర్జా బాబు, రెండువేల రూపాయలతో (డీజిల్ పట్టేందుకని) రెండు డ్రమ్ములను కొనిపెట్టాడు. వాటిని తన ట్రాక్టర్‌పై కృష్ణ చేర్చాడు. తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు ఆ యువకుడు వెళ్లాడు. వాహనాన్ని బంక్ బయట రోడ్డుపై ఉంచాడు. నమోదు కాకుండా ఉండేందుకు తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై నిలిపి బంక్ వద్దకు వెళ్లాడు. ‘‘మా ట్రాక్టర్ వెనుకాల రెండు డ్రమ్ములతో వస్తోంది. 200 లీటర్ల చొప్పున 400 లీటర్ల డీజిల్ నింపాలి. కంప్యూటర్ బిల్లు కాకుండా, చేతితో రాసిన రశీదులు కావాలి’’ అని, బంక్ ఆపరేటర్లతో చెప్పాడు. ఇంతలో ఆ ట్రాక్టర్ రానే వచ్చింది. డీజిల్ కొట్టే గన్ను ఆంగోతు కృష్ణకు ఆపరేటర్ ఇచ్చాడు. బిల్లులు రాసి, ఆ దర్జా బాబుకు ఇచ్చాడు. అతడు ఆ బిల్లులను ట్రాక్టర్ పైకి ఎక్కి కృష్ణకు ఇచ్చాడు. అతని నుంచి రూ.28వేలు తీసుకుని బంక్ బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన ఆపిన తన ద్విచక్ర వాహనంపై దర్జాగా వెళ్లిపోయాడు. డీజిల్ పోయించడం పూర్తయింది. ట్రాక్టర్‌తో వెళుతున్న కృష్ణను బంక్ ఆపరేటర్లు ఆపి, ‘‘డబ్బులు ఇవ్వకుండా వెళుతున్నావేం..?’’ అని గట్టిగా అడిగారు. కృష్ణకు నోట మాట రాలేదు. ‘‘అదేమిటి..? ఆయనేగా కొట్టించింది..? బిల్లు కూడా ఇచ్చాడు’’ అన్నాడు. ఈసారి బంక్ ఆపరేటర్లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు. మా ట్రాక్టర్ వస్తుంది, డీజిల్ కొట్టాలన్నాడు. చేతితో రాసిన రశీదు బిల్లు కావాలంటే ఇచ్చాం’’ అని చెప్పారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిల్లు చెల్లించాల్సిందేనన్నారు. ‘‘నువ్వు మోసపోయావ్’’ అని వాళ్లు చెప్పేదాకా, అసలు జరిగిందేమిటో కృష్ణకు అర్థమవలేదు. అతడు లబోదిబోమంటూ కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో బండి నెంబర్ కనిపించకుండా ఉండేందుకు, తప్పించుకునేందుకు వీలుగా ఆ ‘దర్జా’ మోసగాడు.. ముందుగానే ప్లాన్ ప్రకారంగా తన ద్విచక్ర వాహనాన్ని బంక్ బయట నిలిపాడన్న విషయం.. అప్పుడుగానీ అందరికీ అర్థమైంది. -
పెట్రోల్ బంకులో మోసం
కామారెడ్డి క్రైం: పెట్రోల్ పోయడంలో మొసం జరుగుతున్నదని ఆరోపిస్తూ కామారెడ్డిలోని ని జాంసాగర్ రోడ్లో ఉన్న శివ హెచ్‌చ్‌పీ పెట్రోల్‌బంక్‌లో మంగళవారం వాహనదారులు ఆందో ళనకు దిగారు. వివరాలు.. నిజాంసాగర్‌లో రో డ్డులోని జీవదాన్ స్కూల్ పక్కనే ఉన్న పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం తాడ్వాయి మండలం మో తే గ్రామానికి చెందిన రాజేశ్వర్‌రావు, లింగారెడ్డి వచ్చారు. చెరో రూ.200 పెట్రోల్‌ను తమ బైక్‌ల లో పోయించుకున్నారు. సందేహం రావడంతో మరో 2 బాటిళ్లలో పెట్రోల్ పోయించారు. బాటిళ్లలో రావాల్సిన దానికంటే తక్కువ రావడంతో బంక్ సిబ్బందిని నిలదీశారు. రాజేశ్వర్‌రావుకు బాటిల్లలో అరలీటర్, లింగారెడ్డికి 250 ఎంఎల్ తక్కువ వచ్చిందంటూ ఆందోళ న కు దిగారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎ స్సై యాదగిరిగౌడ్, సివిల్‌సప్లయ్ జిల్లా అధికారి రమేశ్, ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్ నర్సింలు, తూనికలు, కొలతల శాఖ అధికారిని భూలక్ష్మి విచారణ జరిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు ఐదు లీటర్ల షాంపిళ్లను సేకరించారు. దీంతో పెట్రోలు పోయడంలో అక్రమా లు జరుగుతున్నట్లుగా నిర్ధారణ అయిందని, పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
నిబంధనలు గాలికి..
బీర్కూర్: పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలను గాలికొదిలేశారు. బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. పెట్రోల్ బంకుల్లో వసతులు మాత్రం మెరుగవ్వడం లేదు. వివిధ రకాల పన్నుల పేరిట 35 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు.. బంకుల్లో వినియోగదారుల సౌకర్యాలపై దృష్టి సారించడం లేదు. భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కొన్ని బంకుల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండటం లేదు. గాలికొట్టే యంత్రాలేవి? నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 180 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకుల్లో గాలి నింపే యంత్రాలు ఉండాలి. కోరిన ప్రతి వినియోగదారునికి ఉచితంగా గాలి నింపాలి. కానీ కొందరు బంకు నిర్వాహకులు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి వాటిని ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదు. ఇక, ఉచితంగా గాలి నింపాల్సి ఉండగా, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. డిజిటల్ లావాదేవిలపై అనాసక్తి పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా అన్ని పెట్రోల్ బంకుల్లో స్వైప్ (పీవోఎస్) మిషన్లను ఉపయోగించాలని స్పష్టం చేశాయి. అయితే, చాలా బ్యాంకుల్లో పీవోఎస్ యంత్రాలను మూలన పడేశారు. ఎవరైనా ఏటీఎం కార్డు లావాదేవీలను అసలే అంగీకరించట్లేదు. ఏమైనా అంటే పీవోఎస్ మిషన్ చెడిపోయిందని సమాధానమిస్తున్నారు. బంకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నా సంబంధిత శాఖలు స్పందించడం లేదు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ టాస్క్ఫోర్సు బృందం బంకుల్లో తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం వినియోగదారులకు మెరుగైన వసుతులతో పాటు డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు అంతే.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ నాణ్యతపై అనుమానం వస్తే, తక్షణమే నివృత్తి చేసే ఉపకరణాలు అందుబాటులో ఉండాలి. నాణ్యత నిర్ధారణకు ఫిల్టర్ పేపర్, డెన్సిటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. కానీ వాహనదారులకు ఆయా నిబంధనలపై అవగాహన లేకపోవడంతో బంకుల యాజమాన్యాల ఇష్టారాజ్యం నడుస్తోంది. అవగాహన ఉన్న వారు అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. భద్రతా చర్యలు అంతంత మాత్రమే పెట్రోల్ బంకుల్లో భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తున్నాయి. బంకుల్లో ఇసుక బకెట్లు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అలంకార ప్రా యంగానే ఉంటున్నాయి. వాహనదారు లు అటుంచి, బంకు నిర్వాహకులే సె ల్ఫోన్లో మాట్లాడుతూ పెట్రోల్ పోస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. కానరాని శౌచాలయాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బంకులో మరుగుదొడ్లతో పాటు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా షెడ్డు ఉండాలి. కానీ చాలా చోట్ల టాయిలెట్ సౌకర్యమే లేకపోవడంతో వినియోగదారులు ముఖంగా మహిళలు ఇబ్బం ది పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభు త్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న స్వచ్ఛభారత్ కల సాకారం కాకుండా పోతోంది. -
రూ.50 నకిలీ నోట్ల చలామణి
చేబ్రోలు: మండలంలో రూ.50ల నకిలీ నోట్ల చెలామణీ యథేచ్ఛగా కొనసాగుతుంది. రూ.500, రూ. వెయ్యి నోట్ల నకిలీ నోట్లు విచ్చలవిడిగా వస్తున్నాయనే కారణంతో 2016 నవంబర్‌లో వాటిని రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలో తీసుకువచ్చారు. రూ.2వేలు, రూ.500ల నోట్ల మీద ప్రతి ఒక్కరికి నిఘా ఉండటం బ్యాంకుల్లోను యంత్రాల్లో పరిశీలిస్తుండటంతో పెద్ద నోట్లను వదిలిపెట్టి అక్రమార్కులు చిన్నపాటి నోట్లపై దృష్టి సారించారు. పెట్రోలు బంకులు, కిళ్లీ బంకులు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, బట్టల షాపులు ఇలా ప్రతి షాపుల్లోనూ నకిలీ నోట్ల చలామణి సాఫీగా సాగిపోతుంది. చేబ్రోలులో ఒక షాపులో నకిలీ రూ.50ల నోట్లను షాపు యజమాని గుర్తించి తీసుకోకపోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది.నకిలీ నోట్లు అసలు నోటు మాదిరిగానే ఉండటంతో అధికారులు, ఉద్యోగులు కూడా గుర్తించలేని విధంగా అక్రమార్కులకు తయారు చేస్తున్నారు. బ్యాంకుల్లో, షాపుల్లో కూడా నకిలీ నోట్లు మారుతుండటం విశేషం. నకిలీ నోట్లు గుర్తించడం ఇలా... రూ.50 నోటు గాంధీ బొమ్మ వైపు ఆర్బీఐ పేరుతో వెండిగీత కనిపిస్తుండగా నకిలీ నోటుపై ఇవి కనిపించటం లేదు. అసలు నోటుపై భాగంలో చుక్కలు కనిపిస్తుండగా నకిలీ నోటులో ఉండటం లేదు. రూ.50ల అసలు నోటుకు పక్కన చుక్కలు, పద్మం లాగా ఉంది. కింద తయారీ సంవత్సరం ఉంది. నకిలీ నోటుకు అంచున పువ్వు గుర్తు మాత్రమే ఉండి చుక్కలు లేకుండా ఉన్నాయి. పార్లమెంటు బొమ్మ కింద ఉండాల్సిన ప్రింట్ అయిన సంవత్సరం ఉండటం లేదు. ఇలా తీక్షణంగా పరిశీలిస్తే అసలు నోటు నకిలీ నోటును గుర్తించవచ్చు. -
పెట్రోల్ బంకుల్లో చేతివాటం!
పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణలో ‘పాయింట్ల’ గోల్‌మాల్‌తో వాహనదారులు దోపిడీకి గురవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పుల వెసులుబాటు డీలర్లకు కాసులు కురిపిస్తోంది. ఇంధనం పాయింట్ల రూపంలో తక్కువగా పంపింగ్ జరుగుతుండటంతో వినియోగదారులు రూ.100కు సగటున రూ.2 నష్టపోతున్నారు. జూన్ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి పెట్రో ధరలు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ధరల పెంపు కొనసాగుతోంది. కేవలం ఎప్పు డో ఒకసారి ధరలు తగ్గినా అది నామమాత్రమే. గతంలో 15 రోజులకు ఒకసారి ధరలు పెరిగినప్పుడు వాటి ప్రభావం స్పష్టంగా కనిపించేది. ప్రస్తుతం రోజువారీ సవరణలతో పైసాపైసా పెరిగి వినియోగదారులపై కనిపించని భారం పడుతోంది. అంతా సాఫ్ట్వేర్ మహిమ.. పెట్రోల్ పంపింగ్ మెషిన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులచేర్పుల వెసులుబాటే డీలర్లు అక్రమాలు చేసేందుకు ఊతమిస్తోంది. రోజువారీ ధరల పెంపు విధానం అమలు చేసినప్పటి నుంచి పెట్రోల్ బంకుల ఆధునీకరణ జరగలేదు. అత్యధిక బంకులు మాన్యువల్‌గానే ధరలు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలోని చాలా బంకుల్లో ఉన్న మెషిన్లు పాతవే. రోజువారీ ధరల సవరణ ప్రకారం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రో ధరల సవరణ జరుగుతుంది. చమురు సంస్థలు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ముంబైలో ధరలు మార్చగానే, ఇక్కడ ఆధునీకరించిన బంకుల్లో యథాతథంగా ధరలు మారుతాయి. సాధారణ (మాన్యువల్) బంకుల్లో మాత్రం డీలర్లకు సవరణ ధర మొబైల్ సంక్షిప్త సమాచారం, ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేరుతోంది. వీరు ధరలు మార్చాల్సి ఉంటుంది. ధరలు పెరిగినప్పుడు వెంటనే మార్చుతున్న డీలర్లు... తగ్గినప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దోపిడీ ఇలా.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ సాధారణంగా రూపాయల్లో పోయించుకుంటారు. కానీ చమురు సంస్థలు లీటర్లలో లెక్క కట్టే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. దీంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో లీటర్ల చొప్పున కాకుండా రూ.100–రూ.500 వరకు పోయించుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకు తగ్గట్టు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉంది. సాఫ్ట్వేర్ రూపొందించే క్రమంలో రూపాయికి సమీపం(నియరెస్ట్ టు రుపీ)గా తీర్చిదిద్దారు. ఇదే డీలర్లకు కలిసి వస్తోంది. పంపింగ్‌లో పాయింట్లు తగ్గి వాహనదారులకు నష్టం తప్పడం లేదు. దీంతో రూ.100కు కనీసం రూ.2 నష్టపోతున్నారు. -
నిబంధనలపై పెట్రోల్
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చమురు సంస్థల నిబంధనలను పాతరేస్తున్నాయి. బంకుల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నాయి. వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని ద్రాక్షగానే మారాయి. బంకులకు వచ్చిన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయడమే కాదు.. వాటికి ఉచితంగా గాలి, వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ వసతి కల్పించాలి. కానీ.. ఇవేవీ పెట్రోల్ బంకుల్లో కనిపించడంలేదు. వీటి పట్టింపేలేదు.. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడానికి అనువుగా ఉండాలి. బకెట్లలో ఇసుక. సమీపంలో నీరు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రథమ చికిత్స పెట్టెలు అత్యవసరం. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో వాటిని ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ యాజమాన్యం వద్ద తప్పకుండా ఉండాలి. బంకుల వద్ద విద్యుత్ తీగలు, హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాలి. పొగ తాగరాదు అనే బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. కనిపించని నాణ్యత పరిశీలన.. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలన కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో లేకుండాపోయాయి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసులకు, వికలాంగులకు ఇంధనం లేదనకుండా పోయాలి. హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉండాలి. వినియోగదారులు అడిగిన సమయంలో వెంటనే వీటిని అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ దానిని పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. వినియోగదారులుఇలా తెలుసుకోవచ్చు.. ఇంధనం నాణ్యతను పరీక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బంది అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్ప మరక కనిపించకూడదు. మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. నగరంలో 49 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 49 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 460 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. -
పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. జరజాగ్రత్త!
నిడమర్రు: పెట్రోల్ పంప్ దగ్గర ఆపరేటర్లు చేసే మోసాలు అనేకం ఉంటాయి. కన్ను తిప్పేలోపే మాయచేస్తారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు అరకొర చర్యలు తీసుకుని సరిపెట్టేస్తుంటారు. ఆ బంక్‌ల్లో మళ్లీ మోసాలు షరామామూలే. అంతిమంగా వినియోగదారులే నష్టపోవడం గమనిస్తుంటాం. అందుకే ఈ మోసాలను ఎలా ఎదుర్కోవాలి? నష్టపోకుండా మనం ఏమి చెయ్యాలో తెలుసుకుందాం. దృష్టి మరల్చడం.. పెట్రోల్, డీజిల్ కొట్టించే ముందు రీడింగ్ సున్నా చేసి ప్యూయల్ నింపుతారు. అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా చేస్తారు. కానీ కొంత ఆయిల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం, లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో రావాల్సిన ప్యూయల్ రాదు. ఇంధనం నింపే సమయంలో రీడింగ్‌ను చూడాలి. మీటర్ రీడింగ్ ‘000’ నుంచి కొడుతున్నారా లేదా అనే విషయాన్ని నిశితంగా గమనించాలి. నాజిల్‌ను పదే పదే ప్రెస్ చెయ్యడం బంక్‌లో ఇంధనం నింపే సమయంలో కొందరు వర్కర్లు పదేపదే ప్యూయల్ నాజిల్ ప్రెస్ చేస్తుంటారు. ఇది మనకు అంతగా కనిపించదు. ఎందుకంటే మనం రీడింగ్‌పై దృష్టిపెడతాం. పంప్ పట్టుకునే చోట ఆన్ఆఫ్ బటన్(నాజిల్) ఉంటుంది. దీన్ని మారుస్తుండడం ద్వారా కొంత మిగుల్చుకుంటారు. బటన్ పూర్తిగా నొక్కి పట్టుకోవాలని కోరండి, లేదంటే పూర్తిస్థాయిలో పెట్రోలు రాదు. ఆటో, నాలుగు చక్రాలు వాహనాల వారు ఒక్కోసారి వాహనం దిగకుండా ప్యూయల్ పోయించుకుంటుంటారు. దీనివల్ల పెట్రోల్ బంక్ వర్కర్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. కల్తీపై ఓ కన్నెయ్యండిలా.. నాఫ్తాతో పెట్రోల్‌ను కల్తీ చేయడం ద్వారా లాభాలను మిగుల్చుకుంటారు. అలాగే పెట్రోల్‌లో కిరోసిన్ ఇతరత్రా వాటిని కూడా కలుపుతుంటారు. బండి మధ్య మధ్యలో తరచూ ఆగిపోతుంటే అది పెట్రోల్ కల్తీ ప్రభావం అని గుర్తించాలి. అలానే సైలెన్సర్ కండిషన్లో ఉండి దాని నుంచి ఎక్కువగా పొగ వస్తుంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు గమనించాలి. మరిన్ని జాగ్రత్తలు ఇలా... ♦ చమురు కంపెనీ ఆధ్వర్యంలో నడపబడుతున్న పెట్రోల్ బంకులపై ఉద్యోగుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మోసాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక వేళ మోసం చేసినా కంప్లైంట్ ఇస్తే చర్యలు వేగంగా ఉంటాయి. ఇలా ఆన్లైన్ చేసిన బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది. ♦ ఆధునిక పంపింగ్ మెషిన్లు ఉన్న బంకుల్లో పోయించుకోవడం మంచిది. మల్టీ ప్రొడక్ట్ డిస్పెన్సర్ (ఎంపీడీ) పంపుల్లో మోసాలకు అవకాశం తక్కువ. ముఖ్యంగా పాత తరహా మెషిన్లను తేలిగ్గా ట్యాంపర్ చేయవచ్చు. ♦ పెట్రోల్‌ను నిదానంగా పోయమని కోరండి, వేగంగా పోస్తే తక్కువ పెట్రోల్ వచ్చేలా లోపల సెట్‌చేసి ఉంటారు. అందుకే వేగంగా పోస్తుంటారు. నిదానంగా పోయమని కోరడం మంచిది. ♦ మీకు అందుబాటులో ఉన్న బంకుల్లో ఒక్కోదానిలో ఒక్కోసారి నిర్ణీత పరిమాణంలోనే కొట్టిస్తూ మైలేజీ చెక్ చేసుకోవాలి. నిర్దిష్టమైన మైలేజ్ కంటే తక్కువ వస్తే అందులో మోసం జరిగినట్టే, ఇంజిన్ పనితీరులో మార్పు కనిపిస్తే కల్తీ జరిగినట్టే. ♦ పెట్రోల్ ట్యాంకు మూతను ముందుగా తీయవద్దు. మీటర్ 000 చేసిన తర్వాతే ట్యాంకు మూత ఓపెన్ చేయండి. ♦ రూ.50, రూ.100, రూ.150, రూ.200 ఈ డినామినేషన్లో పోయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది చిల్లర సమస్య లేకుండా ఇంత మొత్తాల్లోనే పోయించుకుంటారు. కనుక తక్కువ వచ్చేలా సెట్ చేసి ఉండవచ్చు. అందుకే లీటర్లలో కొట్టించుకోండి. లేదా రూ.111, రూ.222, రూ.333, ఈ తరహా మొత్తాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం. ఆ నగదుకు సరిపడా చిల్లర దగ్గర ఉంచుకోండి. ♦ సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. దీనివల్ల లిక్విడ్ రూపంలోని పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉండదు. -
పెట్రోల్ బంకులు భారీగా పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గత ఆరేళ్లలో (2011–2017) వీటి సంఖ్యలో 45 శాతంమేర వృద్ధి నమోదయ్యింది. దీన్ని ప్రపంచంలోనే గరిష్ట వృద్ధిగా భావించొచ్చు. భారత్‌లో అక్టోబర్ చివరి నాటికి పెట్రోల్ బంకుల సంఖ్య 60,799గా ఉంది. 2011లో వీటి సంఖ్య 41,947. 2011–2017 మధ్యకాలంలో పెట్రోల్ బంకుల సంఖ్య 18,852 మేర పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే పెట్రోల్ బంకులు ఎక్కువ. చమురు శాఖ గణాంకాల ప్రకారం.. రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ వంటి ప్రైవేట్ సం స్థలకు 5,474(9%) పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిల్లో ఎస్సార్‌కు అధిక వాటా ఉంది. ఈ సంస్థకు 3,980 బంకులున్నాయి. ఇక ప్రభుత్వ రంగ చమురు రిటైలర్ల పెట్రోల్ బంకుల సంఖ్య 55,325. ఐఓసీకి అత్యధికంగా 26,489 పెట్రోల్ బంకులున్నాయి. అమెరికా, చైనాలలో లక్ష చొప్పున పెట్రోల్ బంకులు ఉండటం గమనార్హం. -
ప్రేమోన్మాదం
ప్రేమ పేరుతో రాష్ట్రంలో వేధింపులు, కిరాతకాలు నానాటికీ పెరుగుతున్నాయి. వన్‌సైడ్ ప్రేమ అంటూ కొందరు.. తనను విస్మరించిందంటూ మరికొందరు.. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదంటూ ఇంకొందరు యువకులు ప్రేమోన్మాదులుగా మారుతున్నారు. ఈ పరిణామాలు వెరసి యువతులకు రాష్ట్రంలో భద్రత కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు యువత ఒడిగడుతున్న ఘాతుకాలు మరింత కిరాతకంగా ఉంటున్నాయి. గత ఏడాది కాలంలో పదిమంది యువతులు ఒన్‌సైడ్ ప్రేమకు ఉన్మాదుల చేతిలో బలయ్యారు. అలాగే, తనను విస్మరించారనే నెపంతో ఉన్మాదుల ఆగ్రహానికి మరో ఆరుగురు యువతులు బలికాక తప్పలేదు. ఇందులో కారైక్కాల్ వినోదిని, చెన్నైలో విద్య, సోనియా, కరూర్‌లో సోనాలి, తూత్తుకుడిలో టీచర్ ప్రాన్సీన, కోవైలో ధన్య, చెన్నై నుంగంబాక్కంలో స్వాతి, అంబత్తూరులో మైథిలి వంటి వారు ఎందరో ఉన్నారు. తాజాగా, తనకు దక్కనిది మరొరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఇందుజాను కిరాతక ప్రియుడు సజీవ దహనంచేశాడు. ఈ తరహా ఉన్మాద ఘటనలు తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి. సాక్షి, చెన్నై : ఆ ఇద్దరు పాఠశాల స్థాయిలో మిత్రులు. కళాశాల స్థాయికి ఎదగడంతో మిత్రులు ప్రేమికులయ్యారు. చెన్నై నగరంలో చెట్టాపట్టలేసుకుని తిరిగారు. ప్రియురాలి ఇంటికి వెళ్లడమే కాదు, ఆ ఇంట్లో తానూ ఒకడే అనుకుని సపర్యలు చేశాడు. పీకల్లోతు ప్రేమలో మునిగి చదువును అటకెక్కించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ‘చదువు, ఉద్యోగం సద్యోగం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి..?’ అని ప్రియురాలు, ఆమె తల్లి ప్రశ్నించారు. ఆ ప్రియుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆరేళ్లు అమితంగా తాను ప్రేమించిన యువతిని సజీవ దహనం చేసి కిరాతకుడయ్యాడు. తనకు దక్కని ప్రియురాలు ఇంకెవరికీ దక్కకూడదనే ఉన్మాదంతో ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఎదుటే పెట్రోలు పోసి తగులబెడుతుంటే అడ్డొచ్చిన ఆ యువతి తల్లి, చెల్లిపైనా పోసి నిప్పంటించాడు. చెన్నైలోని ఆదంబాక్కంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సేలంకు చెందిన షణ్ముగం(50), రేణుక(42) దంపతుల కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి కుమార్తెలు ఇందుజా(22), నివేద(20), కుమారుడు మనోజ్(15) ఉన్నారు. పెద్దకుమార్తె ఇందుజా గిండిలోని ఓ ప్రముఖ స్కూల్లో పాఠశాల చదువును ముగించింది. ఈ సమయంలో వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్ కుమారుడు ఆకాష్(24)తో స్నేహం ఏర్పడింది. తామే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మెలిగారు. ప్లస్ ఒన్లోనే ఈ ఇద్దరు ఒకర్ని మరొకరు ఇష్టపడే రీతిలో వ్యవహరించారు. ప్లస్‌టూ ముగియగానే ఇందుజా బీటెక్ , ఆకాష్ డిప్లొమో కోర్సులపై దృష్టి పెట్టారు. వీరిద్దరి కళాశాలలు వేరైనా స్నేహం మాత్రం కొనసాగింది. కాల క్రమేణా మిత్రులు ప్రేమికులయ్యారు. ప్రేమికులుగా.. ఆకాష్, ఇందుజా కళాశాల జీవితంలోకి అడుగు పెట్టిన నంతరం ప్రేమ పక్షుల్లా ఇద్దరూ పెద్దల కళ్లు గప్పి చెన్నైలో చెట్టాపట్టలేసుకుని తిరగని ప్రదేశం అంటూ లేదని చెప్పవచ్చు. పీకల్లోతు ప్రేమలో మునిగినా, ఇందుజా మాత్రం తన దృష్టిని చదువుల మీదే పెట్టింది. అయితే, ఆకాష్ చదువును అటకెక్కించాడు. తన ఇంటికి ఆకాష్ వచ్చి వెళ్లేంతగా చనువును ఇందుజా పెంచుకుంది. ఇందుజా తండ్రి బెంగళూరుకు బదిలీ కావడంతో వీరికి అడ్డు అన్న వారే లేరు. ఆ ఇద్దరు స్కూల్మెట్సే కదా.. అనుకుని తల్లి రేణుక ఎన్నడూ ఖండించలేదు. దీనిని అదనుగా తీసుకున్న ఆకాష్ ఆ కుటుంబానికి దగ్గరై తలలో నాలుకలా మారాడు. ఆ ఇంటికి కావాల్సినవన్నీ తానే స్వయంగా వెళ్లి తీసుకొచ్చే వాడు. కథ అడ్డం తిరిగింది ఓ దశలో రేణుకతో ఇందుజాను తనకు ఇచ్చి వివాహం జరిపించాలన్నట్టు ఆకాష్ చమత్కారంతో ప్రతిపాదన తీసుకొచ్చినా, ఆమె చిన్న పిల్లల చేష్టలుగా పరిగణించి పెద్దగా పట్టించుకోకుండా మరో తప్పుచేసింది. ఆరు నెలల క్రితం బీటెక్ ముగించిన ఇందుజా తరమణిలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగాన్ని దక్కించుకుంది. తనకు ఉద్యోగం వచ్చిన రెండు నెలలకు ఆకాష్‌తో ప్రేమ విషయాన్ని తల్లి రేణుక దృష్టికి తీసుకెళ్లింది. ఇందుకు ఆమె నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. అప్పటివరకు ఆ ఇంటికి స్వేచ్ఛగా వచ్చే ఆకాష్‌కు తదుపరి తలుపులు తెరచుకోలేదు. మానసికంగా కుంగిన అతను ఇందుజా కోసం పరితపించడం మొదలెట్టాడు. ప్రేమోన్మాదిగా.. ఆరేళ్ల ప్రేమ పరిచయంలో నాలుగేళ్లుగా తనతో ప్రతి గంటకు ఓసారి ఫోన్లో మాట్లాడటం లేదా, వాట్సాప్‌లో చాటింగ్ వచ్చే ఇందుజా తనను దూరం పెట్టడంతో కుంగిపోయాడు. ఆమెను కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం అతి కష్టం మీద సంప్రదించగా, చదువును అటకెక్కించి, ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగేవాడిని పెళ్లి చేసుకోవాలా..? అని తన తల్లి రేణుక ప్రశ్నిస్తోందని, ఇక తనకు దూరంగా ఉండమని ఇందుజా హెచ్చరించింది. ఆ తర్వాత అను పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి తల్లి రేణుకను ప్రాధేయపడ్డా ఫలితం శూన్యం. ప్రేమోన్మాదిగా మారిన ఆకాష్ రెండు రోజుల క్రితం సహచర ఉద్యోగి ఒకరితో ఇందుజా సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. దీంతో తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్నంతగా ఉన్మాది అయ్యాడు. పెట్రోల్ పోసి నిప్పంటించి.. చివరి ప్రయత్నం లేదా, హతమార్చడం లక్ష్యంగా పథకంతో సోమవారం రాత్రి ఆకాష్ ఆదంబాక్కంకు చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తలుపు తట్టగా, రేణుక వచ్చింది. ఆమెను చివరి ప్రయత్నంగా ప్రాధేయపడ్డాడు. ఫలితం శూన్యం. కులం అడ్డుగా ఉందని, ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలన్నట్టుగా ఆమె ప్రశ్నించడం, అదే సమయంలో ఇందుజా సైతం అక్కడికి వచ్చిన హెచ్చరించడంతో తనలోని ఉన్మాదిని ఆకాష్ బయటకుతీశాడు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ముందుగా అక్కడ దాచిన పెట్టిన క్యాన్‌ను తీసుకుని క్షణాల్లో ఇంట్లోకి మళ్లీ దూరాడు. ఇందుజా మీద ఆ క్యాన్‌లో ఉన్న ద్రవాన్ని పోశాడు. అడ్డు వచ్చిన రేణుక, నివేదల మీద పోసి లైటర్‌తో నిప్పు పెట్టాడు. పెట్రోల్ కలిపిన టర్బన్ టైల్ ఆయిల్‌ను పోసిన దృష్ట్యా, క్షణాల్లో ఆ ముగ్గుర్ని మంటలు ఆవహించాయి. బెడ్రూమ్లో ఉన్న ఇందుజా సోదరుడు మనోజ్ బయటకు వచ్చేలోపు ఆకాష్ ఉడాయించాడు. సంఘటన స్థలంలోనే సజీవదహనం రేణుక ఇంటి నుంచి కేకల్ని విన్న కింది ఫ్లోర్‌లోని రామ్‌కుమార్ పైకి పరుగులు తీశాడు. మంటల్లో కాలుతున్న వారిని రక్షించే యత్నంచేశాడు. ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. రేణుక, నివేదల్ని చుట్టుముట్టిన మంటల్ని ఆర్పారు. అయితే, ఇందుజ అక్కడే సజీవదహనమైంది. సమాచారం అందుకున్న ఆదంబాక్కం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదలను కీల్పాకం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేదని, అయితే, ఆ కుటుంబంలో చోటుచేసుకున్న తాజా ఘటనతో ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆకాష్ కోసం పోలీసులు రాత్రంతా గాలించారు. చివరకు మంగళవారం ఉదయాన్నే అతను ఆదంబాక్కం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదని, తనను మోసం చేశారంటూ అందుకే సజీవదహనం చేశానంటూ చేసిన తప్పును కిరాతక ప్రేమికుడు సమర్థించుకునే యత్నం చేయడం గమనార్హం. -
ఆయిల్ బంకుల ఆకస్మిక సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధించిన అదనపు వ్యాట్ తగ్గింపుపై జరుగుతున్న జాప్యం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, పెట్రో డీలర్లకు మధ్య గొడవకు దారితీసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కొనుగోళ్లకు సంబంధించి అధిక టార్గెట్లను విధిస్తోందంటూ ఐవోసీ పెట్రోల్ బంకు డీలర్లు బుధవారం రాత్రి నుంచి ఆకస్మిక సమ్మెకు దిగారు. లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయనందుకు ఐవోసీ ఒకటో తేదీన డీలర్లకు ఆయిల్ సరఫరా నిలిపివేసిందని, దీనికి నిరసనగా తాము ఐవోసీ పెట్రోల్ బంకులను మూసివేసి సమ్మెకు దిగినట్లు నారాయణ ప్రసాద్ తెలిపారు. రంగంలోకి దిగిన ఐవోసీ అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు డీలర్లు చెప్పారు. ఆయిల్ కంపెనీల సవరణలపై న్యాయపోరాటం సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల చెల్లింపు, సౌకర్యాలు లేకుంటే జరిమానాల విధింపుపై ఆయిల్ కంపెనీలు తెచ్చిన సవరణలను సవాల్ చేస్తూ ఉభయ రాష్ట్రాల పెట్రోల్ డీలర్ల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రం, ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులిచ్చింది. -
పెట్రోల్ బంక్‌లో మరుగుదొడ్లు తప్పనిసరి
బీచ్‌రోడ్డు(విశాఖతూర్పు): జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పనిసరి అని ఇన్చార్జి కలెక్టర్ జి.సృజన అన్నారు. కలెక్టరేట్లో సోమవారం పెట్రోల్ బంక్‌ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పని సరిగా ఉండాలన్నారు. జీవీఎంసీ పరిధిలో 72 పెట్రోల్ బంక్‌లు ఉండగా, వాటిలో 10 బంక్‌ల్లో మరుగుదొడ్లు లేనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. నిరంతరం నీటి సౌకర్యం కల్పించడంతో పాటు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, డీఎస్వో నిర్మలాబయ్ తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ కొడితే అన్నీ నీళ్లే
మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఫిల్లింగ్ స్టేషన్(పెట్రోలుబంక్)లో డీజిల్ కొట్టించుకుంటే నీళ్లు వచ్చాయని పేర్కొంటూ పలువురు వినియోగదారులు మంగళవారం బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం పలు మినీ వాహనాల్లో డ్రైవర్లు డీజిల్ కొట్టించుకోగా కొద్ది దూరం వెళ్లి వాహనాలు ఆగిపోయాయి. దీంతో వారు తిరిగి బంక్ వద్దకు వచ్చి, సీసాల్లో డీజిల్ కొట్టించగా, అందులో నీరు కనిపించింది. దీంతో సిబ్బందిని నిలదీశారు. బాధితులకు వైఎస్సార్ సీపీ నాయకులు అండగా నిలవడంతో ఆందోళన బాటపట్టారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. డీజిల్‌లో నిరు కలవడం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, బంక్‌ను మూసివేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన విషయం ఆర్డీఓ దృష్టికి వెళ్లడంతో స్థానిక తహసీల్దార్ విమలకుమారి ఘటనాస్థలానికి చేరుకుని తూనికలు, కొలతల జిల్లా అధికారి భానుప్రసాద్‌తో కలిసి డీజిల్, పెట్రోలును పరిశీలించారు. అనంతరం భానుప్రసాద్ మాట్లాడుతూ 4 మిల్లీలీటర్లు ఉండాల్సిన వాటర్డెన్సీటీ 11 మిల్లీలీటర్లు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. మధ్యాహ్నానికి ఇక్కడకు చేరుకున్న హెచ్‌పీ సేల్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ ట్యాంక్‌లోకి నీరు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు తర్జనభర్జనలు పడిన అనంతరం బంక్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బంక్‌ను సీజ్‌చేసి రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
పెట్రోల్ బంక్ మేనేజర్‌పై చీటింగ్ కేసు
కవిటి: మండలంలోని జాడుపుడి ఆర్ఎస్ సమీపంలోని భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన శాంతి ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ కోళ్ల దూర్వాసులు అలియాస్ దేవరాజు రూ.25.43 లక్షల నిధులు అక్రమంగా దారిమళ్లించాడని కవిటి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 8న పెట్రోల్ బంక్ యాజమాన్య ప్రతినిధి శేషగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.పారినాయుడు కేసు దర్యాప్తు చేసి నిందితున్ని శనివారం ఇచ్ఛాపురం కోర్టుకు తరలించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. దేవరాజు మేనేజర్ హోదాలో పెట్రోల్‌బంక్‌లో ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, బ్యాంక్ లావాదేవీలు చూస్తుండేవాడు. కొన్నాళ్లుగా బంక్ యజమానుల కళ్లుగప్పి భారీ మొత్తంలో నిధులు అవకతవకలకు పాల్పడినట్టు యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగుచూసింది. బ్యాంక్ లావాదేవీలు, పెట్రోల్‌బంక్ రికార్డులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవకతవకలు గుర్తించి దేవరాజును కోర్టులో హాజరుపర్చినట్టు ఎస్ఐ పారినాయుడు విలేకరులకు తెలిపారు. -
13న పెట్రోల్ బంకులు బంద్
బెంగళూరు: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 12 అర్ధరాత్రి నుంచి 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పెట్రోలియం డీలర్లు పిలుపునిచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే.. అక్టోబర్ 27 నుంచి నిరవధికంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్ని నిలిపివేస్తామని యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్(యూపీఎఫ్) సోమవారం ప్రకటించింది. కర్ణాటక పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘పెట్టుబడులపై రాబడులతో పాటు ప్రతీ ఆరు నెలలకు డీలర్ల మార్జిన్ల సమీక్ష, మానవ వనరుల పెంపు, పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ నష్టాలపై అధ్యయనం తదితర అంశాల పరిష్కారానికి ఓఎంసీలు అంగీకరించాయి. అయితే వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించలేదు’ అని చెప్పారు. -
13న దేశవ్యాప్తంగా పెట్రో డీలర్ల సమ్మె
-
13న పెట్రో డీలర్ల దేశవ్యాప్త సమ్మె
ముంబై: మార్జిన్లు పెంచడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్ని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు పెట్రో డీలర్ల సంఘం యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్(యూపీఎఫ్) తెలిపింది. గడువులోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే అక్టోబర్ 27 నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. డీలర్ల మార్జిన్లను ఏడాదికి రెండుసార్లు సవరించటంతో పాటు రవాణా చార్జీలు, ఇథనాల్ కలపడం వంటి డిమాండ్లపై గతేడాది నవంబర్‌లో కుదిరిన ఒప్పందాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) అమలు చేయనందునే ఈ సమ్మె చేపడుతున్నట్లు యూపీఎఫ్ స్పష్టం చేసింది. ఈ విషయమై ఓఎంసీలు, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. డీలర్లపై ఓఎంసీలు గరిష్టంగా రూ.2లక్షల వరకు జరిమానా విధించటాన్ని, రోజువారీగా పెట్రో ధరల్ని సవరించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యూపీఎఫ్ పేర్కొంది. రోజువారీ ధరల సవరణ వల్ల డీలర్లు , వినియోగదారుల్లో ఎవ్వరూ లాభపడలేదని విమర్శించింది. ప్రస్తుతం యూపీఎఫ్ కింద 54,000 మంది డీలర్లు ఉన్నారు. -
మాయా.. మర్మం..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ బ్యారెల్ ధరలు పెరుగుతున్నందున దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం తరచూ చెప్పేమాట. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నపుడు మన దగ్గర పెట్రోల్ ధర గరిష్టంగా 80 రూపాయలు ఉండేది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయింది. ఆ మేరకు మన దగ్గర పెట్రోల్ ధర కూడా సగానికి పైగా తగ్గాలి. అంటే లీటరు ధర 40 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. కానీ మార్కెట్లో లీటరు రూ.75 వరకు ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇందులో మాయామర్మం ఏమిటో పాలకులకే తెలియాలి. జంగారెడ్డిగూడెం: పెట్రోల్, డీజిల్ సమీక్షా విధానం గందరగోళంతో అమలవుతోంది. ఏరోజుకారోజు ధరలు నిర్ణయించడం అనే అంశం వినియోగదారుడికి కొంత తలనొప్పిగా మారింది. గతంలో 15 రోజులకోసారి పెట్రోల్ డీజిల్ ధరలు మారేవి. జూన్ 16 నుంచి ఏరోజు ధర ఆ రోజు మారుతోంది. ఈ మార్పు ఎలా జరుగుతుందో అర్థం కాక వినియోగదారుడు తికమకపడుతున్నాడు. ఈ విధానం ప్రకటించిన నాటి నుంచి ధరలు పైసల్లో పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 16న ప్రారంభమైన ఈ విధానంలో అప్పటికి పెట్రోల్ ధర రూ. 73.08, డీజిల్ రూ. 62.80 గా ఉంది. ఇది ఈ నెల 3వ తేదీ నాటికి పెట్రోల్ ధర రూ. 76.78, డీజిల్ రూ. 66.16కు చేరుకుంది. సమీక్షా విధానంలో పైసల చొప్పున పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా సవరణలు జరుగుతున్నాయని ప్రకటిస్తున్నా ఇది వినియోగదారుడికి అందడంలో ప్రభుత్వాల మ్యాజిక్కులు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ బాదుడు భారీగానే ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వీటిపై సుమారుగా రూ. 10 వరకు తేడా వస్తోంది. ఈ భారాన్ని వినియోగదారుడే భరించాల్సి వస్తోంది. బంక్‌ల మాయాజాలం ఇదిలా ఉంటే బంక్‌లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొలతల్లో తేడా ఉండటంతో వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. నాణ్యత విషయంలో, రీడింగ్‌లో తేడా ఉండటం వంటివి జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కల్తీ కూడా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల వాహనాలు చెడిపోయి మరమ్మతులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో 279 పెట్రోల్ బంక్‌లు జిల్లాలో ప్రభుత్వరంగ పెట్రోల్ బంకులు 279 ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 130, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ 79, హిందూస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ బంకులు 70 ఉన్నాయి. నెలలో జిల్లా మొత్తం మీద 1,05,80,000 కిలో లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. అలాగే 2,40,00,000 కిలో లీటర్ల డీజిల్‌ను వినియోగదారులు ఒక నెలలో వినియోగిస్తున్నారు. అంటే రోజు వారీ పెట్రోల్ వినియోగం 3,53,000 కిలో లీటర్లు, డీజిల్ 7,99,000 కిలో లీటర్లు వినియోగిస్తున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నెల 3న∙పెట్రోల్‌పై రూ.2, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ డీజిల్ ధరలు కొంతమేర తగ్గాయి. పన్నులతో కలిపి పెట్రోల్ రూ. 2.50, డీజిల్ రూ. 2.25 తగ్గింది. ఈ నెల 3న పెట్రోల్ ధర రూ. 76.78 ఉండగా, ప్రస్తుతం రూ. 74.24గా ఉంది. అలాగే డీజిల్ రూ. 66.16 నుంచి రూ. 63.84కు తగ్గింది. వ్యాట్ తగ్గించండి పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచిం చింది. ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న వ్యాట్‌ను 5శాతం తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ రాయనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రకటించారు. -
పెట్రోల్ బంక్‌లో ఫుడ్ ఫ్రీ
సాక్షి, బెంగళూరు: సాధారణంగా ఏ పెట్రోల్ బంకుకైనా వెళితే మీ వాహనానికి మాత్రమే ఇంధనాన్ని నింపుకోవచ్చు. కానీ, బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంకులోనికి వెళితే మాత్రం వాహనానికి మాత్రమే కాదు మీ బొజ్జకు కూడా ఇంధనం లభించినట్లే. ‘మీరు మీ ట్యాంకును నింపుకోండి...మేము మీ పొట్టను నింపుతాము (యు ఫిల్ యువర్ ట్యాంక్! వి ఫిల్ యువర్ టమ్మీ)’ పేరిట ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బెంగళూరు వాసులు వృత్తి ఉద్యోగాల కోసం ఇళ్లలో కంటే నగర రోడ్ల పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. దీంతో చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌ని, భోజనాన్ని కూడా వదిలేస్తుంటారు. పెట్రోల్ బంకు దగ్గర మాత్రం ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు తప్పక వేచి ఉండాల్సిన సందర్భం ఉంటుంది. ఆ సమయంలోనే వారికి కాస్తంత భోజనం కూడా అందజేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ కార్యక్రమం. గత వారం ఆరంభమైన ఈ కార్యక్రమంలో నెలపాటు వాహనదారులకు ఉచిత ఆహారం లభిస్తుంది. పైలెట్ ప్రాజెక్టుగా... ఇందిరానగరలోని వెంకటేశ్వర సర్వీస్ సెంటర్ యజమాని ప్రకాష్‌రావు ఆలోచన నుంచి పుట్టినదే ఈ కార్యక్రమం. ‘పెట్రోల్ బంకుల వద్ద ఉంటే ఖాళీ స్థలంలో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఐఓసీ అధికారులు అంగీకరించారు. పైలెట్ ప్రాజెక్టుగా మా పెట్రోల్ బంకులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మా వినియోగదారులకు ఉచితంగా భోజనాన్ని అందించనున్నాం. ఆ తరువాత కొంత మొత్తాన్ని వసూలు చేస్తాం. మా వద్ద శాకాహార, మాంసాహార భోజనాలతో పాటు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అల్పాహారం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు ఏ పదార్థాం కావాలో చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ప్యాక్ చేసి అందిస్తాం. మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే 100 ఐఓసీ పెట్రోలు బంకులకు ఈ కార్యక్రమానికి విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని ప్రకాష్‌రావు తెలిపారు. ప్రత్యేక వంటశాల నుంచి ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన చెఫ్‌లు అన్ని రకాల వంటలను తయారుచేసి పెట్రోల్ బంకులో అందుబాటులో ఉంచుతారు. బేకరీ ప్రాడక్ట్స్ తయారీ కోసం ఇస్కాన్‌తో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులు కాని వారు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి, ఇక్కడ ఆహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -
ప్రమాదాలకు పెట్రోల్ బంక్‌లదే బాధ్యత
బరంపురం(ఒడిశా): హెల్మెట్ లేని వాహనాలకు ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయరాదని కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ నేపథ్యంలో వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి వస్తేనే బంకుల్లో పెట్రోల్ పోసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు ప్రజలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలను చైతన్య పరిచేందుకు జిల్లావ్యాప్తంగా శిబిరాలు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్, పోలీసు, రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. హెల్మెట్ లేని వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. దీనిపై ఎస్పీ ఆశిష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ రహదారిలో గల పెట్రోల్ పంపుల్లో ఇంధనం పోసి బయలు దేరిన వాహనాలు ప్రమాదాలకు గురైతే పెట్రోల్ బంకు యాజమాన్యాలదే బాధ్యతగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. విద్యా సంస్థల బస్సులు, మినీ బస్సుల రవాణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి తగు ఏర్పాట్లు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, యాజమాన్య కమిటీలను ఆదేశించారు. -
ఫిర్యాదు చేసిన బాధితుడిపై ఎస్సై దాష్టీకం
-
పెట్రోల్ బంకుల్లో బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఖాతాను ప్రారంభించొచ్చు. అలాగే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఉపయోగకరమైన సేవలను అందించడం సహా దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ‘‘దాదాపు 14,000కు పైగా ఉన్న హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులన్నీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు బ్యాంకింగ్ పాయింట్లుగా వ్యవహరిస్తాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు వీటి వద్ద ఖాతాను ప్రారంభించటం, నగదు డిపాజిట్, విత్‌డ్రాయెల్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు’’ అని అలాగే బ్యాంక్ కస్టమర్లు వారి హ్యాండ్సెట్స్ సాయంతో డిజిటల్ పేమెంట్స్ ద్వారా హెచ్‌పీసీఎల్ స్టేషన్లలో ఫ్యూయెల్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. -
పెట్రోల్ డీలర్ల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: రోజూవారీ పెట్రో ధరల సమీక్షను నిరసిస్తూ డీలర్లు బుధవారం చేపట్టదలచిన సమ్మెను ఆగస్టు 1కి వాయిదా వేశారు. రోజూ ధరలు మారుతుండటం వల్ల పెట్రో ఉత్పత్తులను అప్పుడప్పుడు ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకు అమ్మల్సి వస్తోందనీ, తత్ఫలితంగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ పెట్రో డీలర్లు గతంలో బంద్‌కు పిలుపునిచ్చారు. జూలై 12న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా నిరసన తెలపాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే డీలర్లకు కమీషన్లను పెంచడంపై జూలై 31లోపు నిర్ణయం తీసుకోవాలని పెట్రోలియం శాఖ ఆదేశించడంతో సమ్మె వాయిదా పడింది. -
ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు
- తొలుత వరంగల్ జిల్లాలో ఏర్పాటుకు సన్నాహాలు - నష్టాల నుంచి బయటపడేందుకు వివిధ రకాల వ్యాపారాలు సాక్షి, హైదరాబాద్: నష్టాల నుంచి బయట పడేందుకు ఆగ్రోస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో వివిధ రకాల వ్యాపారాలు చేయడం ద్వారా ఉనికిని కాపాడుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా పలుచోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందుగా వరంగల్ జిల్లాలో ఒక పెట్రోల్ బంకు ఏర్పాటుకోసం దరఖాస్తు చేసుకుంది. దానికి అవసరమైన భూమిని కేటాయించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిసింది. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే నెలకు దాదాపు రూ. 5 లక్షలు ఆదాయం సమకూరనుంది. అలాగే పలు ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫ్యాన్లు, ఏసీలు, వాహనాలకు స్పేర్‌పార్టులు తదితరాలు సరఫరా చేయాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల పద్ధతుల ద్వారా ఏడాదిలోగా నష్టాల నుంచి బయటపడతామని ఆగ్రోస్ ౖచైర్మన్ కిషన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. రావాల్సిన బకాయిలు 17 కోట్లు వ్యవసాయశాఖకు అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఆగ్రోస్)ను ఏర్పాటు చేశారు. యంత్రాలను రైతులకు సరఫరా చేసిన సందర్భంలో సేవా పన్ను కింద 4 శాతం ఆగ్రోస్‌కు వ్యవసాయశాఖ కమీషన్‌గా చెల్లించాలి. కానీ ఆగ్రోస్‌కు వ్యవసా య శాఖ కమీషన్లు ఇవ్వకపోవడంతో 10 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయి. అలాగే ఆగ్రోస్‌కు విభజన వాటాగా చెల్లించాల్సిన రూ. 12 కోట్లల్లో ఏపీ రూ. 5 కోట్లు మాత్రమే చెల్లిం చింది. ఇంకా రూ.7 కోట్ల వరకు రావాల్సి ఉం దని కిషన్‌రావు చెబుతున్నారు. అలాగే వ్యవసా య యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని జిల్లాల్లో అద్దె కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాలు ఏర్పాటుచేస్తే వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు తదితరమైనవి రైతులకు అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నారు. -
లాలూ కుమారుడికి మరో ఝలక్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన పెట్రోల్ పంపు లైసెన్సును బీపీసీఎల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న కంపెనీ పంపించిన నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోల్ పంపు లైసెన్సును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రద్దు చేసింది. దీనికి సంబంధించి ఆయనకు కేటాయించిన పెట్రోల్ పంప్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 15 రోజులలోపు సమాధానం ఇవ్వాల్సింది కోరింది. బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ (రిటైల్), పాట్నా, మనీష్ కుమార్ పేరుతో ఈ నోటీసులు అందాయి. దీని ప్రకారం, అసిసాబాడ్ బైపాస్ రహదారిలో ఉన్న పెట్రోల్ పంప్‌ను యాదవ్ అక్రమంగా లీజుకు తీసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. 2012 లో పెట్రోల్ పంప్ కోసం యాదవ్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న మంత్రి పేరుతో రిజిస్టర్ అయింది. M / S లారా ఆటోమొబైల్స్‌కు రిటైల్ అవుట్ లెటకు దీన్ని అప్పగించారు. అయితే ఇది M / S చెల్లదని ఇన్ఫోసిస్టెమ్స్ ఫిర్యాదు చేసిందని బీపీసీఎల్ ఆ నోటీసులో పేర్కొంది. బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఏక పక్షంగా వ్యవహిరిస్తున్నారనీ, త్వరలోనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా యూపీఏ పాలనలో తేజ్ ప్రతాప్‌కు పెట్రోల్ పంప్ ను అక్రమంటా కేటాయించారనీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే -
16 నుంచి పెట్రోల్, డీజిల్ బంద్!
పెట్రోల్ బంకుల యజమానుల హెచ్చరిక న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూన్ 16 నుంచి ప్రభుత్వ చమురు సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోల్ బంకుల యజమాన్య సంఘాలు తెలిపాయి. అదే జరిగితే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయి వినియోగదారులకు తిప్పలు తప్పవు. అయితే ఇది సమ్మె కాదని.. 16 నుంచి పెట్రోల్, డీజిల్ మాత్రం కొనబోమని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సాల్ తెలిపారు. జూన్ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న ఐదు నగరాల్లో యజమానులు చేతులు కాల్చుకున్నారని.. దేశవ్యాప్తంగా అమలుపై పునరాలోచించాలని కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 57 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో 53 వేల బంకులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. రోజువారీ ధరల సవరణను ప్రయోగాత్మకంగా మే 1 నుంచి పుదుచ్చేరి, చండీగఢ్, జంషెడ్పూర్, ఉదయ్‌పూర్, విశాఖపట్నంలో అమలు చేస్తున్నారు. ఎస్సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. స్టాక్ విలువ పడిపోతుందున్న భయంతో రోజువారీ ధరల సవరణకు డీలర్లు జంకుతున్నారు. తమకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతుందని, చిల్లర అమ్మకాల్లో ఒడిదుడుకులు చాలా వరకు తగ్గుతాయని చమురు కంపెనీలు అంటున్నాయి. -
చంచల్‌గూడలో మహిళా పెట్రోల్ బంక్
ప్రారంభించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలతో నిర్వహించే పెట్రోల్ బంక్‌ను చంచల్‌గూడలో ప్రారంభించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీల సంస్కరణల్లో భాగంగా చంచల్‌గూడ మహిళా జైలులో శిక్ష అనుభవించి విడుదలైన 30 మంది మహిళలకు ఈ బంక్‌లో జీవనోపాధి కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వనున్నారు. మరో 20 రోజుల్లో ఈ బంక్ వినియోగంలోకి రానుంది. ఖైదీలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్రోల్ బంక్ నెలకొల్పుతున్నామని మహిళా జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం పేర్కొన్నారు. -
బంకుల్లో గప్ చిప్..!
-
బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా చెలరేగిన మంటలు
-
పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీలు, సీలింగ్ ఫ్యాన్లు
న్యూఢిల్లీ: దేశంలోని పెట్రోల్ బంకుల్లో త్వరలో విద్యుత్‌ను అదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఎల్ఈడీ బల్బును రూ.65కు, ట్యూబ్‌లైట్‌ను రూ.230, సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,150కు ప్రజలకు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఆ తర్వాత నెలరోజుల్లో అమ్మకాలు మొదలైతాయి. ఓఎంసీకి దేశవ్యాప్తంగా 53 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయిస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు. -
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
-
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో ఉన్న పెట్రోలు బంకులు పనిచేస్తాయని కర్నూలు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఇస్తున్న కమీషన్ మార్జిన్ తమకు పెంచాలనే డిమాండ్‌తో ఆదివారం బంకుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీన అన్ని బంకులు రోజులాగే పనిచేస్తాయని అసోసియేషన్ ప్రకటించింది. -
పెట్రోలు బంకు మాయమైపోయింది!
పెట్రోలు బంకులు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని వాళ్ల మీద దాడులు చేస్తుంటే.. దాడి విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగా తెలుసుకున్న ఓ యజమాని.. ఏకంగా పెట్రోలు పోసే మిషన్నే తీసి దాచేశారు! అలా తన బంకునే ఆయన మాయం చేశారు. బంకు పునర్నిర్మాణంలో ఉందంటూ బోర్డు పెట్టి.. దాడి నుంచి తప్పించుకోవాలని చూశారు. అయితే తలదన్నేవాడుంటే తాడి తన్నేవాడు ఉంటాడన్నట్లు.. అతగాడి పప్పులు అధికారుల దగ్గర ఉడకలేదు. ఇలాంటి 'పునర్నిర్మాణంలో ఉన్న' పలు బంకులమీద కూడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లు దాచిపెట్టిన మిషన్లను బయటకు తీయించి మరీ వాటిని తనిఖీ చేశారు. ఆయా మిషన్లలో చిప్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించి, వాటిని వెంటనే తీసి పారేయించారు. వినియోగదారులను మోసం చేయడానికి వీలుగా పెట్రోలు బంకుల్లో ఇలాంటి చిప్‌లు పెట్టి, పైకి తగినంత పోసినట్లు చూపిస్తూనే అందులో కోత పెడుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా యూపీ పోలీసులు చేస్తున్న దాడుల్లో ఇలాంటివి దాదాపు వెయ్యి వరకు చిప్‌లు బయటపడ్డాయి. వీటి ద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6వేల పెట్రోలు బంకులుంటే అన్నింటిమీదా దాడులు జరగబోతున్నాయి. ఇప్పటివరకు 9 పెట్రోలు బంకులను సీల్ చేసి, 23 మందిని అరెస్టు చేశామని, వారిలో నలుగురు యజమానులు కూడా ఉన్నారని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ప్రతి లీటరుకు 100 మిల్లీలీటర్లు తక్కువగా పోస్తున్నారు. -
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో, దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని 11 పెట్రోల్ బంకుల్లో మెషీన్లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేసినట్లు ప్రధాన్ సోమవారం మీడియాకు తెలిపారు. మెషీన్లను ట్యాంపరింగ్ చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. పెట్రోల్ ఔట్లెట్లను తనీఖీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందన్న ప్రధాన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇందుకు బాధ్యులేనని తేల్చిచెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో 11 పెట్రోల్ బంకుల్లో మెషీన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా లీటర్‌కు 50 మిల్లీలీటర్ల మేర పెట్రోల్ తక్కువగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
సాయంత్రం 6 దాటితే నో పెట్రోల్
-
సాయంత్రం 6 దాటితే నో పెట్రోల్
ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకే పెట్రోలు బంకులు నిర్వహణ వ్యయం భరించలేకే ఈ నిర్ణయం ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ వెల్లడి కొత్త బంకుల మంజూరుపై నియంత్రణకు పట్టు ప్రభుత్వం, మార్కెటింగ్ కంపెనీలు దిగివస్తే.. నిర్ణయంపై పునఃసమీక్ష సాక్షి, అమరావతి: పొద్దున్నే ఇంటి నుంచి బయద్దేరే ముందే వాహనంలో పెట్రోల్, డీజిల్ ఉందో లేదో సరి చూసుకోండి.. సాయంత్రం ఆఫీసు, వ్యాపార కార్యకలాపాలు ముగించుకున్నాక తీరిగ్గా పెట్రోల్ కొట్టించుకుందాంలే అనుకుంటే ఇంతే సంగతులు.. ఎందుకంటే ఇకమీదట సాయంత్రం ఆరు దాటితే పెట్రోలు బంకులు పనిచేయవు మరి.. మే మూడో వారం నుంచి రాష్ట్రంలో పరిమిత గంటల్లో మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేయనున్నాయి. మే 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇవి పనిచేస్తాయి. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటంతో 24 గంటలూ బంకులు నడపడం కష్టంగా మారిందని, దీంతో రోజుకు కేవలం 12 గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ ప్రకటించారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్ల కమీషన్లు పెంచకపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం డీలర్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో మే 10న అన్ని చమురు కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఇంధన పొదుపులో భాగంగా మే 14న ఆదివారం బంకులను పూర్తిగా మూసివేయనున్నట్టు తెలిపారు. నిర్వహించలేకపోతున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌కు లీటరుకు రూ.3.33, డీజిల్‌కు రూ.2.30 చొప్పున కమీషన్ ఉంటే కానీ బంకులు నిర్వహించడం సాధ్యం కాదని గోపాలకృష్ణ స్పష్టం చేశారు. గత మార్చినెలలో సమ్మె చేసినప్పుడు కమీషన్లు పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన కంపెనీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం డీలర్లకు లీటరు పెట్రోల్‌పై రూ.2.59, డీజిల్‌పై రూ.1.63 చొప్పున కమీషన్‌ను మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్నాయన్నారు. 2011లో అపూర్వచంద్ర కమిటీ ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోకుండా విచ్చలవిడిగా కొత్త బంకులకు అనుమతులు మంజూరు చేస్తున్నారని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు కమీషన్లు కూడా పెంచట్లేదని వాపోయారు. అపూర్వచంద్ర కమిటీ నివేదిక ప్రకారం.. నెలకు 1.70 లక్షల కిలోలీటర్లు విక్రయిస్తే కానీ బంకుల నిర్వహణ సాధ్యం కాదని, కానీ ప్రస్తుతం సగటున 1.40 లక్షల కిలోలీటర్లకు మించి అమ్మకాలు జరగట్లేదని గోపాలకృష్ణ చెప్పారు. అమ్మకాలతో సంబంధం లేకుండా పక్కపక్కనే బంకులు మంజూరు చేస్తుండటంతోపాటు ప్రైవేటు బంకుల పోటీని తట్టుకోలేకపోతున్నామన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లోనే పరిమిత వేళల్లోనే బంకులు నడపాలని నిర్ణయించామని తెలిపారు. ఈలోగా ప్రభుత్వం, మార్కెటింగ్ కంపెనీలు దిగివస్తే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. -
కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరిటెండెంట్ దౌర్జన్యం
-
ఆదివారాలు పెట్రోల్ బంద్
-
ఆదివారాలు పెట్రోల్ బంద్
మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో అమలు చెన్నై: మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు మూతపడనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హరియాణాల్లోని సుమారు 20 వేల పెట్రోల్ పంపుల్లో ఆ ఒక్కరోజు ఇంధన అమ్మకాలు నిలిచిపోతాయని ఇండియన్ పెట్రోలియం కన్సార్షియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ‘ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలని చాలా ఏళ్ల నుంచే అనుకుంటున్నాం. అయితే మా నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరడంతో ఆగిపోయాం. ఇప్పుడిక దానినే అమలుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకుని పర్యావరణాన్ని కాపాడాలని ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ చేసిన సూచన మేరకే అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘తమిళనాడులో ఆదివారం ఒక్కరోజు పెట్రోల్ పంపులు మూసివేస్తే సుమారు రూ.150 కోట్ల నష్టం కలుగుతుందని అంచనావేస్తున్నాం’ అని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయలేదన్నారు. 15 మంది సిబ్బంది పనిచేస్తున్న బంకుల్లో మాత్రం సెలవు రోజులోనూ ఒకరిని విధుల్లో ఉంచుతామన్నారు. బీజేపీలోకి అర్వీందర్ లవ్లీ న్యూఢిల్లీ: ఢిల్లీ శాఖ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో అర్వీందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారత రాజకీయాలకు ప్రధాని మోదీ, అమిత్‌షాలు కొత్త అర్థంచెప్పారని అర్వీందర్ అన్నారు. ఈయన గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ సర్కారులో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ముడుపులు ముట్టజెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తోందన్నారు. -
ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకులు మూత
చెన్నై: ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తాజాగా తమిళనాడు కూడా చేరింది. మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్ ప్రకటించింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల ఔట్ లెట్స్ ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్ బంకుల యాజమనుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలు కు వాయిదా వేసినట్టుతెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు. మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి కమ్యూనికేట్ చేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల మార్జిన్ లపెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్ చర్చిస్తోందన్నారు. దీనిపై అసోసియేషన్ త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. -
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
-
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే సెలవు కాదు. ఇక పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలు సెలవును తీసుకోనున్నాయి. మే 14 నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017 మే 14 నుంచి ప్రతి డీలర్ సెలవు తీసుకోవాలని సీఐపీడీ ఆదేశించినట్టు డీలర్స్ కన్సోర్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ చెప్పారు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటరు డీజిల్ పై రూపాయి 65పైసలు, లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల 56 పైసల కమిషన్ ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. ఈ కమిషన్ ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి నిరసనగా వారు ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూస్తామని ప్రకటించారు. అంతేకాక మే 10ని 'నో పర్చేస్ డే' గా చేపట్టబోతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడదని, సీఐపీడీ యాక్టివేట్ లో ఉండే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారాలు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడతాయని తెలిపారు. అసోసియన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సపోర్టు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కూడా ప్రభుత్వం ఎక్కువ డీలర్ కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ మూత పెట్టడం లేదన్నారు. -
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో
భువనేశ్వర్: కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకులతో బెదిరించి, మేనేజర్ పై కాల్పులు జరిపి రూ.2 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒడిషాలోని అంగల్ జిల్లా పరాంగ్లో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు పరాంగ్ లోని ఓ పెట్రోల్ బంకుకి తుపాకులతో దోపిడీకి వచ్చారు. ఓ వ్యక్తి మేనేజర్ రూమ్ బయట ఉండగా మరో ఇద్దరు లోపలికి వెళ్లారు. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ ఉంది. డబ్బు ఎక్కడ ఉందని దుండగులు మేనేజర్ జితేంద్ర బెహరాను ప్రశ్నించారు. డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఆయనపై ఓ దుండగుడు ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. మేనేజర్ చెప్పగానే మరో ఉద్యోగి మొదట కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత మనేజర్ కూడా డెస్క్ లో దాచిన మరికొంత నగదును దుండగులకు ఇచ్చేశాడు. తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించడంతో డబ్బు ఇవ్వక తప్పలేదని గాయపడ్డ మేనేజర్ జితేంద్ర పోలీసులకు తెలిపారు. రూ.2 లక్షలకు పైగా నగదును దోపిడీదారులు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ కుడికాలిలో బుల్లెట్ గాయం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ రూములో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో
-
పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం
పత్తికొండ: పత్తికొండలోని ఆదోని రహదారిలో సవారమ్మ దేవాలయం సమీపంలోని పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వేస్తుండగా ఓ పంప్‌లోని మోటారు వద్ద షార్ట్సరూ్క్యట్తో మంటలు చెలరేగాయి. బంక్ యాజమాన్యం వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గురువారం డీజిల్ ట్యాంకర్ అన్ లోడ్ చేశారు, ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే ప్రమాద నష్టం తీవ్రంగా ఉండేది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. -
చేతి చమురు వదులుతోంది !
► పెట్రోల్ బంకుల్లో భారీ మోసం ► లీటరుకు 100 మిల్లీలీటర్ల కోత ► ప్రశ్నించినవారిపై సిబ్బంది దాడులు ► మామూళ్ల మత్తులో అధికారులు మచిలీపట్నం సబర్బన్ : పెట్రోల్, డీజిల్ బంకుల యజమానులు, సిబ్బంది భారీ మోసానికి తెరతీశారు. ఏడాది కాలంగా తనిఖీలు లేకపోవటంతో చేతివాటం యథేచ్ఛగా సాగుతోంది. చేతివాటంను ప్రశ్నిస్తున్న వాహన చోదకులపై బంకుల్లోని సిబ్బంది ఎదురుదాడికి దిగుతున్న సంఘటనలు పట్టణంలో తరుచూ చోటు చేసుకుంటున్నాయి. మచిలీపట్నం పట్టణం పరిధిలో ప్రస్తుతం ఏడు బంకులు ఉండగా, మండలంలో నాలుగు బంకులున్నాయి. చమురు సంస్థల నుంచి ఈ బంకులకు రోజుకు సగటున 8 ట్యాంకర్లు( ఒక్కో ట్యాంకర్ కెపాసిటీ 12 వేల లీటర్లు) ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోంది. నియోజకవర్గంలోని వాహన చోదకులు ప్రతి రోజూ 96 వేల లీటర్ల డీజిల్, పెట్రోల్‌ను బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మోసం ఇలా..: సాధారణంగా నెలకోమారు ఆయా కంపెనీలకు చెందిన సేల్స్ ఆఫీసర్లు, ఫిట్టర్లు వచ్చిన యంత్రంలో రహస్యంగా ఉన్న కొన్ని స్క్రూలను సరిగ్గా అమర్చి వెళుతుంటారు. అనంతరం ఆ బాక్స్‌కు ఒక సీల్ వేసి వెళ్లిపోతారు. తదుపరి తూనికలు, కొలతలు అధికారులు ఆ సీల్ ఎలా ఉంది, స్క్రూ సెట్టింగ్, సీల్ ఎలా ఉందని పర్యవేక్షిస్తుండాలి. కానీ అధికారులు యాజమాన్యం చేతిలోనే ఉండటంతో కంపెనీ సిబ్బంది వేసిన సీల్‌ను తొలగించి యాజమాన్యం కొన్ని స్క్రూలను వారికి నచ్చినట్లుగా అమర్చుకుని దోపిడికి తెగబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా యజమానికి లీటరుకు 50 మిల్లీగ్రాములు మిగులుబాటు లభిస్తోంది. ఇదిలా ఉంటే అరకొర జీతాలతో పని చేస్తున్న సిబ్బంది సైతం పొట్ట నింపుకొనేందుకు భారీ మోసానికి తెగబడుతున్నారు. రీడింగ్ మీటర్ నుంచి గన్ లివర్‌కు ఉన్న కనెక్షన్‌ను ముందుగానే వారికి నచ్చినట్లు సెట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. గన్‌కు ఉన్న లివర్‌కు మూడు స్టెప్లు ఉంటాయి. మూడు స్టెప్లు గట్టిగా నొక్కితేనే పెట్రోల్ డీజిల్ సరిగ్గా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కానీ సిబ్బంది ముందుగా కొంత ఆయిల్‌ను వదిలిన తరువాత కొన్ని స్టెప్లను తగ్గించుకుంటూ వస్తుండటంతో వినియోగదారుడు చెల్లించిన నగదుకు సరిపరా ఆయిల్ రావటం లేదని పలువురి ఆరోపణ. ఈ విధంగా చేయటం వల్ల లీటర్‌కు మరో 50 మిల్లీలీటర్ల ఆయిల్ తగ్గుతోంది. అంతే లీటరుకు వినియోగదారులు 100 మిల్లీలీటర్ల పెట్రోల్ డీజిల్‌ను కోల్పోతున్నాడు. ఇదిలా ఉంటే మండలంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనం ఆయిల్ ట్యాంక్‌లో ఆయిల్ పడకుండానే మీటర్ రీడింగ్ చూపించే సాంకేతికతను సిబ్బంది కనుగోని నయా మోసానికి పాల్పతున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనితో పాటు ఆకువీడు నుంచి కల్తీ ఆయిల్ సరఫరా నియోజకవర్గంలోని బంకులకు జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సిబ్బంది దూకుడు...: కళ్లముందే జరుగుతున్న కనికట్టను ప్రశ్నించిన వినియోగదారులపై బంకుల్లోని సిబ్బంది ఎదురుదాడికి దిగుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని పెదయాదర గ్రామానికి చెందిన ఓ రైతు మండల ఆయిల్ తక్కువగా వచ్చిందని ప్రశ్నించినందుకు బంకులోని సిబ్బంది అతనిపై దాడికి దిగారు. సదరు రైతు ఈ విషయం గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటంతో గ్రామస్తులు ట్రాక్టర్‌పై వచ్చి బంకు సిబ్బందిని నిలదీశారు. ఇదే తరహాలో నెలకుర్రు, భోగిరెడ్డిపల్లి గ్రామస్తులు బంకు సిబ్బందిని ఇటీవల ప్రశ్నించారు. తాజాగా రుద్రవరం గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామంలోని బంకులో జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించినందుకు సిబ్బంది ఆమెను దుర్భాషలాడారు. మద్యం తాగి దుర్భాషలాడారు: మా గ్రామంలోని బంకుల్లో నిత్యం మోసం జరుగుతూనే ఉంది. లీటరుకు 100 మిల్లీలీటర్ల పెట్రోల్ తగ్గిపోతుంది. మీటర్ రీడింగ్‌లోనూ మోసం ఉంది. ఈ విషయాన్ని అడిగితే అక్కడ పని చేసే సిబ్బంది నన్ను దుర్భాషలాడారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు. ప్రతి రోజూ అక్కడి సిబ్బంది ఏవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. -- ఉచ్చుల భార్గవి, రుద్రవరం తనిఖీలు నిర్వహిస్తాం గడిచిన ఏడాది కాలంలో బంకులపై తనిఖీ చేయలేదు. 2015వ సంవత్సరంలో మచిలీపట్నంలోని బంకులపై 11 కేసులు నమోదు చేశాం. సిబ్బంది తక్కువగా ఉండటంతో పని ఒత్తిడితో తనిఖీలు చేయలేదు. ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదు. త్వరలోనే మచిలీపట్నంలోని బంకులపై దాడులను నిర్వహిస్తాం. --- భానుప్రసాద్, తూనికలు, కొలతల శాఖ, జిల్లా అధికారి -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్
హైదరాబాద్: పెట్రోల్ బంక్ సిబ్బంది తెలివి మీరిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్దకు వచ్చే కస్టమర్లు పేమెంట్ కోసం కార్డులు ఇస్తే డాటా తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైదాబాద్ లోని పెట్రోల్ బంక్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ హేమంత్ నాగ్ పెట్రోల్ పోయించుకున్నారు. మనీ పేమెంట్ కోసం ఐసీఐసీసీ క్రెడిట్ కార్డు ఇచ్చారు. బంక్‌లో పనిచేసే కైసర్ ఖాన్ ఇంజినీర్ ఇచ్చిన కార్డు డాటాను తస్కరించాడు. కార్డు డాటాతో మోసాలకు పాల్పడుతున్నారని హేమంత్ నాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బంక్ లో పనిచేసే కైసర్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
బంకుల్లో 0.75 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కార్డుల ద్వారా లావాదేవిలు జరిపే వారికి అదనంగా ఎటువంటి చార్జీలు పడకుండా చూస్తున్నామని లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. బంకుల్లో కార్డు వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ డిస్కౌంట్ సొమ్ము క్యాష్ బ్యాక్ రూపంలో సంబంధిత అకౌంట్లో జమ అవుతుంది. వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, సీఎన్జీ ఔట్లెట్లలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కిందిస్థాయి నుంచి డీలర్లతో సమావేశాలు నిర్వహించామని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పెద్దమొత్తంలో రీటైల్ ఔట్లెట్లు పోస్ మిషన్లు, ఈ-వ్యాలెట్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. నగదురహిత లావాదేవీలపై స్థానిక భాషల్లో రాసి ఉన్న బ్యానర్లు, కరపత్రాల సహాయంతో వినియోగదారుల్లో అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. -
పెట్రోలే కాదు.. పాలనూ అమ్ముతారు
పెట్రోల్ పంపుల్లో పెట్రోలు, డీజిల్‌తో పాటు పాలు, పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నారు. ఈ నెల 26 నుంచి పూర్వపు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని బంకుల్లో ముల్కనూర్ స్వకృషి డెయిరీ పాల అమ్మకాలను ప్రారంభించనుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమ దేవరపల్లి మండలంలోని ముల్కనూర్ స్వకృషి డెయిరీలో బుధవారం హిందు స్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు, డెయిరీ అధికారులతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. – భీమదేవరపల్లి -
బ్యాంకులు, ఓఎంసీలదే భారం
పెట్రోల్ బంకుల్లో కార్డు చార్జీలపై కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలు నిర్వహించేవారికి శుభవార్త. బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేవారిపై చార్జీల భారం ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి స్పష్టం చేశారు. కార్డుల లావాదేవీలపై పడే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలను బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే(ఓఎంసీలు) భరించాలని చెప్పారు. ధర్మేంద్ర గురువారం కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎండీఆర్ భారం వినియోగదారులపై పడే ప్రసక్తే లేదు. ఇది సుస్పష్టం. పెట్రోలు బంకులు ఈ చార్జీలు చెల్లించనవసరం లేదు. ఇక వీటిని చెల్లించాల్సింది బ్యాంకులు, ఓఎంసీలేనని తర్వాత మీడియాతో అన్నారు. ఇది వాణిజ్య పర నిర్ణయం కాబట్టి లావాదేవీల చార్జీలను ఏవి ఏ మేరకు భరించాలన్నది ఈ రెండూ కలసి కూర్చొని, పరస్పరం చర్చించుకుని నిర్ణయించుకోవాలి’ అని వివరించారు. ఎండీఆర్ చార్జీలు కిందటేడాది డిసెంబర్ 16న రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉంటాయని చెప్పారు. ఆ చార్జీలు బ్యాంకులు, ఓఎంసీలు ఏ నిష్పత్తిలో చెల్లించాలన్నది నిర్ణయించలేదన్నారు. రెండు మూడు రోజుల్లో సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని.. అనంతరం 16 నుంచి ఎండీఆర్ చార్జీలు వసూలు చేస్తారని అన్నారు. ఎండీఆర్ చార్జీలు అన్ని క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఒక శాతం, డెబిట్ కార్డుల లావాదేవీలపై 0.25 శాతం నుంచి ఒక శాతం వరకు విధిస్తారన్నారు. క్యాష్‌లెస్ లావాదేవీలు చేసే వారికి ఇంధన ధరలపై 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కొనసాగుతుందన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలను అంగీకరించినందుకు వారి నుంచి బ్యాంకులు వసూలు చేసే చార్జీలను ఎండీఆర్ అంటారు. దీనిని వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ చార్జీలను డిసెంబర్ 30 వరకు రద్దు చేసింది. తర్వాత ఈ చార్జీలను బంకు యజమానులే చెల్లించాలని బ్యాంకులు కోరాయి. ప్రభుత్వం వినియోగదారులపై చార్జీల భారం పడనివ్వరాదని చెప్పడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోలు బంకుల యజమానులు కార్డు లావాదేవీలను అంగీకరించమని ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. -
పెట్రోల్ బంకుల్లో కార్డులకు ఓకే
• డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులకు ప్రత్యేక చార్జీలుండవ్ • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక చార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13 తర్వాత కూడా అదనపు చార్జీలు లేకుండా వినియోగదారులు కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుక్కోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి మేం కట్టుబడి ఉన్నాం. కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేవారికి ఎటువంటి అదనపు చార్జీలు పడకుండా చూస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలు వేశారు. అయితే వాటిని ఎవరు చెల్లించాలి? బ్యాంకులా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలా అనే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ తేల్చుకోవాలి. ప్రభుత్వం మాత్రం ఈ చార్జీలు చెల్లించదు. దీనిపై త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడు తుంది. పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లు, బంకుల యజమానులు కమీషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నందున వారిపై ఆ చార్జీలు విధించమని ఆదివారమే హామీ ఇచ్చాం’ అని వివరణ ఇచ్చారు. కార్డు లావాదేవీలపై పడుతున్న ఎండీఆర్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోల్ డీలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు సోమవారం నుంచి కార్డులను అంగీకరించమని ప్రకటించిన ఆలిండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్.. తన నిర్ణయాన్ని ఈ నెల 13 వరకు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై వివరణ ఇచ్చారు. బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై వినియోగదారులకు 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేశారు. ఎండీఆర్ చార్జీల్లో పేమెంట్ గేట్వేలు, పీవోఎస్ మెషీన్ ప్రొవైడర్లు, బ్యాంకులకు వాటా ఉంటుందని.. ఆ చార్జీలను కూడా ఎంతవరకు తగ్గించవచ్చనే విషయమై చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. -
కార్డు వినియోగదారులకు ఊరట!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవిల ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కార్డుల ద్వారా లావాదేవిలు జరిపే వారికి అదనంగా ఎటువంటి చార్జీలు పడకుండా చూస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా గతేడాది ఫిబ్రవరిలో రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడ్డామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు డీలర్ల నుంచి వసూలు చేయడం గురించి ప్రశ్నించగా... బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీనిపై తేల్చుకోవాలని సూచించారు. ఎండీఆర్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోలియం డీలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు కనబడుతోంది. వినియోగదారులకు, డీలర్లకు ఊరట ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయిల్ కంపెనీలే ఎండీఆర్ చార్జీలు భరించేలా చేయాలని చూస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని సమాచారం. -
క్యాష్‌లెస్‌పై ‘పెట్రో’వార్
బంకులు, బ్యాంకుల ఎండీఆర్ చార్జీల లొల్లి ♦ తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీలర్లు ♦ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులు బంద్ చేస్తున్నట్టు ప్రకటన ♦ తర్వాత 13వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడి ♦ జనరల్, మెడికల్ షాపుల్లోనూ వినియోగదారులు, వ్యాపారులపై సర్‌చార్జి మోత ♦ మళ్లీ నగదు వైపే చూస్తున్న జనం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై ‘పెట్రో’వార్ మొదలైంది! పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీల వసూలు బ్యాంకులు, బంకుల మధ్య చిచ్చు రేపింది. ఈ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమంటూ ఆదివారం ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బాంబు పేల్చింది. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై వినియోగదారుల నుంచి ఎండీఆర్ చార్జీలు వసూలు చేయడాన్ని కేంద్రం ఎత్తివేసింది. అయితే 50 రోజుల గడువు ముగియడంతో ఆ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల యాజమాన్యాల నుంచి వసూలు చేయాలంటూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ‘‘పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం పన్ను, డెబిట్ కార్డులపై 0.25 శాతం నుంచి 1 శాతం పన్నును జనవరి 9 నుంచి వసూలు చేస్తాం’’అంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి తమకు లేఖ వచ్చిందని అజయ్ బన్సాల్ తెలిపారు. డిసెంబర్ 16న రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సరŠుక్యలర్ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో హెచ్డీఎఫ్సీ పేర్కొందని వివరించారు. ఈ చార్జీల వసూలును నిరసిస్తూ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను అంగీకరించవద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఆ చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చమురు కంపెనీల నుంచి సమాచారం అందడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. జనరల్, కిరాణా షాపుల్లో సర్‘చార్జ్’ క్యాష్‌లెస్ చెల్లింపుల ప్రక్రియతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులపై సర్‌చార్జీ భారం పడుతోంది. డెబిట్/క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారుడి ప్రతి లావాదేవీపై సగటున 2.8 శాతం సర్‌చార్జీ పడుతోంది. స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించిన మొత్తానికి మాత్రమే మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తోంది. సర్‌చార్జీ పేరిట కోత పడుతున్న డబ్బులకు సంబంధించి ఎలాంటి మెసేజ్ రావడం లేదు. జనవరి 1 నుంచే ఈ వాత అమల్లోకి వచ్చింది. మరోవైపు పీఓఎస్ మెషీన్లతో లావాదేవీలు సాగిస్తున్న వ్యాపారులపైన 2 శాతం భారం పడుతోంది. దీంతో జనరల్, కిరాణా సోర్లు, మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మొత్తంపై 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్కు చెందిన రవికుమార్ ఆదివారం ఓ మెడికల్షాపులో రూ.165 మెడిసిన్ కొనుగోలు చేయగా.. షాప్కీపర్ మాత్రం స్వైపింగ్ మిషన్‌లో రూ.169 ఎంట్రీ చేసి బిల్లు తీసుకున్నాడు. అదేంటని అడిగితే.. తమకు ప్రతి కొనుగోలుపై సర్‌చార్జీ పడుతోందని, అందుకే రూ.4 అదనంగా తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇది వినియోగదారులకు, వ్యాపారులకు భారంగా మారుతుండడంతో మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గుతున్నారు. కారులో రూ.1,200 పెట్రోలు కొట్టించా. నగదుకు బదులుగా డెబిట్‌కార్డుతో డబ్బులు చెల్లించా. బ్యాంకు ఖాతా నుంచి రూ.1,200తో పాటు సర్వీసు చార్జీ పేరిట అదనంగా రూ.34 కోత పడింది. మినీ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ విషయం తెలిసింది. ఇట్లా సర్‌చార్జీ పడితే మళ్లీ కార్డు ఉపయోగించ. – కొట్ర బలరాం, నాగర్‌కర్నూల్ క్యాష్‌లెస్ పద్ధతిలో రోజుకు సగటున రూ.2 లక్షల రాబడి వస్తుండగా.. బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.1.95 లక్షలు మాత్రమే జమవుతున్నట్లు స్టేట్మెంట్లో కనిపిస్తోంది. వారం రోజుల్లో దాదాపు రూ.40 వేలు కోత పడింది. కార్డుల ద్వారా చెల్లింపులతో ఇలా కోత పడితే వాటిని వినియోగించడం కష్టం కదా.. – హనుమంతు, పెట్రోల్ క్ క్యాషియర్, ఇబ్రహీంపట్నం -
పెట్రోలు బంకుల సంచలన నిర్ణయం
-
పెట్రోలు బంకుల సంచలన నిర్ణయం
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పెట్రోలు బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై ఒక శాతం లావాదేవీ పన్ను విధించాలన్న నిర్ణయంతో బంకుల యాజమాన్యాలు మండిపడ్డాయి. ఇక మీదట డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. సోమవారం నుంచే దీన్ని అమలుచేస్తామని చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇస్తున్న పీఓఎస్ మిషన్లను వాడే బంకుల నుంచి ఈ ఒక్కశాతం లావాదేవీ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం బంకుల తాజా నిర్ణయానికి కారణమైంది. అయితే, అన్ని బ్యాంకులు ఇలాగే చేస్తున్నాయో.. లేదా కేవలం కొన్ని మాత్రమే చేస్తున్నాయో తమకు తెలియదని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాలను సంప్రదించి తీసుకుంటారు. కానీ, ఇప్పుడు బ్యాంకులు తీసుకున్న నిర్ణయం వల్ల మళ్లీ పెట్రోలు బంకులకు వెళ్లేటప్పుడు కచ్చితంగా డబ్బులు తీసుకెళ్లాల్సి రావడం, దాంతో మరోసారి డబ్బుల సమస్య ఎదురవ్వడం తప్పవని అంటున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఇప్పటికే అమలుచేస్తోంది. అయితే... ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు శనివారం రాత్రి నుంచి తమ పీఓఎస్ మిషన్ల వాడకంపై 1 శాతం సర్చార్జిని వసూలు చేస్తామని డీలర్లకు నోటీసులు పంపాయి. దేశంలోని మొత్తం 52వేల పెట్రోలు బంకులలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల స్వైపింగ్ మిషన్లనే వాడుతున్నారు. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా పెట్రోలు బంకుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. -
పెట్రోల్ బంకుల్లో ఈ–చెల్లింపులతో జాగ్రత్త!
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన తీవ్ర నగదు కొరత కారణంగా ఆన్లైన్ లావాదేవీలు తప్పని సరయ్యాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) సూచిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ వ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ–పాస్) యంత్రాలు వినియోగించే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ పెట్రోల్ బంకుల్లో మొబైల్ వినియోగం నిషిద్ధమన్న విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత కారణంగా పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ఈ– పాస్ యంత్రాలు, మొబైల్ వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మొబైల్ ఎక్కువగా వాడాల్సి రావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమయ్యాయని పీఈఎస్వో హెచ్చరించింది. పీఈఎస్వో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ పీటీ సాహూ స్వయంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని ఇటీవల వివరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తరం పెట్రోలు బంకులు నిర్వహించే పలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం.. పెట్రోల్ బంకుల్లోని జోన్–1, జోన్–2 ప్రాంతాలలో ఈ– పాస్ మెషీన్లు, మొబైల్ వ్యాలెట్లు అనుమతించరాదని పెట్రోలియం మంత్రిత్వశాఖకు పీఈఎస్వో సూచించింది. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఈఎస్వో సిఫార్సు మేరకు నిర్దిష్ట కాల వ్యవధిలో తగిన చర్యలు చేపట్టేలా అన్ని రాష్ట్రాల పెట్రోలియం మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఇది అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. బంకుల్లో ఇవి చేయకూడదు.. 1. మొబైల్ బ్యాటరీలు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది పెట్రోలియం వేపర్ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ నింపేటప్పుడు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. 2.పెట్రోల్ నింపేటప్పుడు వాహన ఇంజిన్ని ఆఫ్ చేయాలి. 3.బంక్ పరిసరాల్లో ధూమపానం చేయరాదు. 4.పెట్రోల్ నింపిన తరువాత ఫిల్లింగ్ నాజిల్ బయటకు తీసేవరకు ఇంజిన్ స్టాట్ చేయకూడదు. 5.పెట్రోల్ బంకుల్లో మంటలను ఆర్పే కిట్లు తప్పనిసరిగా ఉండాలి. 6.పెట్రోల్ పంప్‌కు చిన్నారులను దూరంగా ఉంచాలి. -
జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు!
ఒక హిందీ పత్రికలో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులపై పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేసి, వారిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరిగింది. వాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన జర్నలిస్టులు.. అక్కడకు దగ్గర్లోనే ఉన్న తమ కార్యాలయంలో దాక్కున్నారు. అయినా, దాడి చేసిన వాళ్లు మళ్లీ అక్కడకు కూడా వచ్చి వారిని, మిగిలిన సిబ్బందిని కూడా తీవ్రంగా కొట్టారు. తర్వాత ఎవరో పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి అందరినీ కాపాడారు. తాము సివిల్ లైన్స్ ఏరియాలోని పెట్రోలు బంకుకు వెళ్లి రూ. 200కు పెట్రోలు పోయించుకున్నామని, వాళ్లకు పది రూపాయల నాణేలు 20 ఇచ్చామని బాధిత జర్నలిస్టులలో ఒకరైన కృష్ణకాంత్ గుప్తా తెలిపారు. అయితే బంకు సిబ్బంది మాత్రం తమకు నాణేలు వద్దని, నోట్లు ఇవ్వాలని అడిగారు. పది రూపాయల నాణేలు చెల్లుతున్నప్పుడు వాటిని ఎందుకు తీసుకోరని జర్నలిస్టులు వాళ్లను ప్రశ్నించగా.. పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన చూసి దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు అక్కడకు రాగా, మొత్తం నలుగురిపై బంకు సిబ్బంది పెట్రోలు పోసి, తమను సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కృష్ణకాంత్ చెప్పారు. -
రివాల్వర్ చూపి.. కత్తులతో దాడి చేసి..
పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం - బంకు సిబ్బందిపై కత్తులతో దాడికి పాల్పడిన దుండగులు - రివాల్వర్‌తో బెదిరించి రూ. 22 లక్షలతో పరారీ - ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాల ధ్వంసం మేడ్చల్/మేడ్చల్‌రూరల్: ఓ పెట్రోల్ బంకుపై అర్ధరాత్రి సమయంలో ఆరుగురు దుండగులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. బంకు సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి రూ. 22 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి మేడ్చల్ మండలంలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం లోని అత్వెల్లి, ఎల్లంపేట్ గ్రామాల మధ్యలో 44వ జాతీయ రహదారి పక్కన భారత్ పెట్రోలియం కంపెనీ ఔట్లెట్ ఉంది. పెట్రోల్ బంక్‌లో ఆదివారం రాత్రి నైట్ డ్యూటీలో అసిస్టెంట్ మేనేజర్ సంజీవరెడ్డి, క్యాషియర్ శ్రవణ్‌కుమార్, సెక్యూరిటీగార్డ్ ధన్‌రాజ్, సిబ్బంది రవికుమార్, బాలసాయి, లింగారెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి దాటాక ముగ్గురు సిబ్బంది మేనేజర్ గదిలో నిద్రించారు. అదే గదిలో సంజీవరెడ్డి, ధన్‌రాజ్ కూర్చొని ఉండగా క్యాషి యర్ శ్రవణ్ బయట ఉన్నాడు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆరుగురు దుండగులు కారులో పెట్రోల్ బంక్‌కు చేరుకున్నారు. క్యాషి యర్‌ను ఇద్దరు దుండగులు బెదిరించగా.. మరో నలుగురు మేనేజర్ గదిలోకి ప్రవేశించి సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి బంధిం చారు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పాలని కత్తులతో బెదిరించగా.. సిబ్బంది డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన దుండగులు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం కార్యాలయంలోని లాకర్లను పగులగొట్టి రూ.22 లక్షల నగదును దోచు కున్నారు. పెట్రోల్ బంక్ కంపెనీ ఔట్‌లెట్‌కు చెందినది కావడం.. 3 రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో.. 3 రోజులుగా బంక్‌లో అమ్మకం ద్వారా వచ్చిన నగదును లాకర్లలో ఉంచారు. ఈ మొత్తాన్ని దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయం లో రేకులబావి, పెట్రోల్‌బంక్, ఎల్లంపేట్ వద్దే పికెటింగ్ నిర్వహించారు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే దోపిడీకి పాల్పడటం గమనార్హం. సీసీ కెమెరాల ధ్వంసం.. పక్కా పథకం ప్రకారం వచ్చిన దుండ గులు బంక్‌లో ప్రవేశించి సిబ్బందిపై దాడి చేసి నగదును దోచుకున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కూడదని కార్యాలయంలో ని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గదిలో ఉన్న సీసీ కెమెరాల సిస్టమ్‌లను పగులగొట్ట డమే కాక.. సీసీ కెమెరా దృశ్యాలు నిక్షిప్తమైన డీవీఆర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. దుండ గులు కత్తులతో దాడి చేయడంతో ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. అసిస్టెంట్ మేనేజర్ సంజీవరెడ్డి, రవికుమార్ స్వల్ప గాయాలతో బయటపడగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నగర శివారు బాలాజీ ఆస్పత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా, బాలానగర్ డీసీపీ సాయి శేఖర్, ్రౖకైం డీసీపీ ఉషారాణి ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. -
పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం
-
పెరిగిన నగదు రహిత లావాదేవీలు
ముంబై : పాత పెద్ద నోట్ల రద్దు వల్ల నగరంలోని 250 పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో 16 నుంచి 18 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు వీటి సంఖ్య 60 శాతానికి చేరుకుంది. పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సగటు విక్రయ చార్ట్ లో పొందుపర్చిన వివరాల మేరకు.. పాత పెద్ద నోట్లు రద్దుకు ముందు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 652 నుంచి 700 మంది వినియోగదారులు నగదు రహిత పేమెంట్‌ను చెల్లించేవారు. సదరు వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం రోజుకు ప్రతి పెట్రోల్ బంక్‌లో 2,400కు పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు ఒక్కసారిగా పెరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అసోసియేషన్ అధ్యక్షులు రవి శిండే చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం నగర వాసులను క్రెడిట్, డెబిడ్ కార్డులను ఎక్కువగా ఉపయోగించే విధంగా ప్రేరేపించిందని తెలిపారు. అంతేకాకుండా పాత పెద్ద నోట్లను రద్దు చేసిన మొదటి వారంలో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందని శిండే తెలిపారు. ఈ సమయంలో తమ విక్రయాలు కూడా 70 శాతం పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీ, ఇతర వాహనాలు తమ వద్దకు రూ.500, రూ.1,000 నోట్లతో వచ్చేవారని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్‌లకు మొదటి రెండు మూడురోజుల్లోనే రూ.63 కోట్లు అదనంగా విక్రయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓ పెట్రోల్ బంక్ యజమాని ఒకరు మాట్లాడుతూ.. ఈ-వాలెట్ కంపెనీలతో కూడా సంబంధాలు ఏర్పర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నామన్నారు. -
డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వ నజరానాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తరువాత 27వ రోజుకూడా ప్రజల కష్టాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల కేంద్రాల వద్ద జనం క్యూలు కొనసాగనున్నాయి. పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ముఖ్యంగా ఆదివారం సెలవు తర్వాత సోమవారం తిరిగి బ్యాంకుల బయట, ఏటీఎం కేంద్రాల వద్ద దీర్ఘమైన క్యూలు కొనసాగుతున్నాయి. అయితే నోట్ల రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం, ఆర్థిక శాఖ చేస్తున్న కసరత్తు కూడా ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియపై పంచాయతీలు, జిల్లాలను పురస్కారాలతో సత్కరించనుంది. దేశవ్యాప్తంగా 90 వేల ఏటీయంలు అప్డేట్ అయ్యాయి. ఏటీఎం కేంద్రాలు, బిగ్ బజార్, పెట్రోల్ బంకుల కౌంటర్ల వద్ద కార్డుల స్వైపింగ్ ద్వారా రూ.2500 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ లో ఒక చిన్న కరెన్సీ సరఫరా పెంచడానికి రిజర్వ్ బ్యాంకు నిర్ణయాలు తీసుకుంది. చిల్లర కష్టాలను తొలగించేందుకు గాను కొత్త రూ.20, రూ.50నోట్లను సిద్ధం చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతోపాటు పాతనోట్లు కూడా చెల్లుబాటవుతాయనిస్పష్టం చేసింది నీతి అయోగ్ ప్రతి జిల్లాలో రూ .5 లక్షల నిధులను విడుదల చేయనుంది. జిల్లా మేజిస్ట్రేట్ మరియు పంచాయతీల లావాదేవీల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కువ డిజిటల్ సేవలను ప్రోత్సహించిన సంస్థలను సత్కరించనుంది. డిజిటల్ లావాదేవీల్లో మంచి పనితనం చూపించిన 10 జిల్లాలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. -
పెట్రోల్ బంకుల్లో ‘డిజిటల్’ జోరు!
న్యూఢిల్లీ: నగదురహిత చెల్లింపులకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు సన్నద్ధమయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డులే కాకుండా ఈ వాలెట్లు, మొబైల్ వాలెట్లలతో కార్యకలాపాలు జరిపేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాయి. సుమారు 4,800 పెట్రోలు బంక్‌లు పీఓఎస్ యంత్రాల ద్వారా రోజూ కార్డుకు రూ.2 వేల చొప్పన నగదును ప్రజలకు అందిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఇలా రూ.65 కోట్లు సరఫరా చేశాయి. నెల రోజుల పాటు సుమారు 53 వేల పెట్రోలు బంక్‌ల వద్ద డిజిటల్ చెల్లింపులపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలను శనివారం ప్రారంభించినట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంక్‌ల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కియోస్కోలు ఇంధనం కొనుగోలుకే కాకుండా ఎలక్ట్రానిక్ చెల్లింపులకూ పనిచేస్తాయి. త్వరలో ఇది ఎల్పీజీ పంపిణీ సంస్థలు, సీఎన్జీ బంకుల్లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లోని మూడింట రెండొంతుల ఔట్లెట్లలో డిజిటల్ చెల్లింపుల వసతులు అందుబాటులోకి వచ్చాయ మంత్రి చెప్పారు. క్యూలో నిలబడి ప్రభుత్వ ఉద్యోగి మృతి హూగ్లి: పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో నగదు కోసం ఏటీఎం వద్ద లైన్లో నిల్చొన్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం ఉదయం చనిపోయాడు. కల్లోల్ రాయ్‌చౌధరి(56) అనే ప్రభుత్వ ఉద్యోగి కూచ్ బెహార్‌లోని తన కార్యాలయం నుంచి కోల్‌కతాలో ఉన్న ఇంటికి వెళ్తుండగా నగదు కోసం హూగ్లిలో ఆగాడు. స్టేషన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నిల్చున్న 20 నిమిషాల తరువాత కుప్పకూలిపోయాడు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో సుమారు 30 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తరువాత అక్కడి సెక్యూరిటీ గార్డు పిలిపించిన డాక్టర్... అతడు అప్పటికే చనిపోయాడాని నిర్ధరించాడు. ముంబై టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ముంబై, శివారు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూ లైన్లు శనివారం ఏ మాత్రం తగ్గలేదు. వారాంతం కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బ్యాంకులు ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ప్రజలకు అందజేయగా, పెద్ద సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే, సియోన్-పాన్వెల్ హైవేపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయారుు. ప్లాజాల వద్ద డిజిటల్ ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
బంకులో ‘చిల్లర’ గొడవ
- ఖైదీ, జైలు సిబ్బందిపై వినియోగదారులు దాడికి యత్నం - చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో ఘటన హైదరాబాద్: చిల్లర లేదన్నందుకు కొందరు వినియోగదారులు ఖైదీ, సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన శుక్రవారం చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. సిబ్బంది, ఖైదీల వివరాల ప్రకారం పెట్రోల్ పోరుుంచుకున్న కొందరు వినియోగదారులు రూ. 2 వేలు నోటు ఇవ్వగా చిల్లర లేదన్న ఖైదీని దూషించడమే కాకుండా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయబోయారు. కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వీరిపై వినియోగదారులు ఒక్కసారిగా దాడి చేయబోయారు. దీంతో సిబ్బంది డబీర్‌పురా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఖైదీలు, సిబ్బందితో గొడవకు దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య తెలిపారు. -
పెట్రోల్ బంకులు కిటకిట
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ బంకులు వినియోగదారులతో పోటెత్తాయి. పెట్రోల్, డీజిల్ పోయించుకునేందుకు ప్రజలు బంకుల ముందు బారులు తీరారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకులన్నీ జనంతో కిటకిటటలాడాయి. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో జనం పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టారు. పాత రూ. 500 నోటుతో నా బైకులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చానని ముంబై శివారు ప్రాంతం మలాద్ లో ఓ పెట్రోల్ బంకు ముందు నిలుచున్న అక్షయ్ ముగ్దల్ అఏ వ్యక్తి తెలిపాడు. మరోవైపు సామాన్యుల నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతున్నారు. బ్యాంకుల్లో పడిన జీతం డబ్బులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దక్షిణ ముంబైలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన మంగళదాస్ వస్త్రాల మార్కెట్ మూడు వారాలుగా డీలా పడింది. పాత పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ ఖాళీ అయిపోయిందని, పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారని వస్త్ర దుకాణదారు ఒకరు చెప్పారు. మిగతా వ్యాపారాలు కూడా దారుణంగా పడిపోయాయి. -
డిసెంబర్ 2 లాస్ట్ డేట్
-
చిల్లర ఇవ్వనందుకు క్యాషియర్‌పై దాడి
ఇద్దరు వ్యక్తుల రిమాండ్ నాగోలు: పెట్రోల్ బంకులో చిల్లర ఇవ్వనందుకు క్యాషియర్‌పై దాడి చేసిన ఇద్దరిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. . శాతవాహననగర్‌కు చెందిన నవీన్ సాగర్‌రింగ్‌రోడ్డులోని భారత్ పెట్రోల్ పంపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి మైత్రినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డి, వెంకటేష్ పెట్రోల్ పోరుుంచుకునేందుకు అక్కడికి వచ్చిరు. రూ500 నోటు ఇచ్చి పెట్రోల్ పోయమని కోరగా, క్యాషియర్ చిల్లర లేదని చెప్పడంతో అతనిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం
-
కర్నాటకలోని పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం
-
పాతనోట్లు నిరాకరిస్తున్న పెట్రోల్ బంకులు
-
పెట్రోల్ బంకుల్లోనూ నగదు విత్‌డ్రా
-
పెట్రోల్ బంకుల్లోనూ నగదు విత్‌డ్రా
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల సమస్యను అధిగమించేందుకు పెట్రోల్ బంకుల్లో కూడా నగదు విత్‌డ్రాకు కేంద్రం అనుమతిం చింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం ద్వారా రోజుకు రూ.2 వేలు విత్‌డ్రా చేయవచ్చు. ఎస్బీఐకి చెందిన పీఓఎస్(పారుుంట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఇప్పటికే ఆయా పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచామని, ఒక వ్యక్తి రూ. 2 వేల వరకూ నగదు పొందవచ్చని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది. మూడ్రోజుల అనంతరం మరో 20 వేల పెట్రోల్ బంకులకు ఈ అవకాశం విస్తరించనున్నారు. -
‘చిల్లర’ గొడవ
చాంద్రాయణగుట్ట: కొత్తగా మార్కెట్లోకి విడుదలైన రూ.2000 నోటుకు కూడా సరి పడా చిల్లర దొరకకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జీఎం చావునీ లోని పెట్రోల్ బంక్ సిబ్బంది, వినియోగదారుల నడుమ చిల్లర విషయంలో వివా దం నెలకొంది. ఒకనొక దశలో ఘర్షణకు దిగారు. అంతలో అక్కడే ఉన్న ఛత్రినాక పోలీసులు సముదారుుంచడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాధారణంగా పెట్రోల్ బంక్‌లో పాత రూ.500, రూ.1000 నోట్లను కూడా తీసుకోవాలని కేంద్రం ఆదేశించినప్పటికీ పెట్రోల్ బంక్ సిబ్బంది మాత్రం రూ.500-1000కి ఎంత వస్తుందో అంత కావాలంటేనే పెట్రోల్ పోస్తున్నారు తప్ప రూ.100-200లకు పెట్రోల్ పోయలేని పరిస్థితి నెలకొంది. చిల్లర సమస్య కారణంగా సోమవారం ఉదయం పెట్రోల్ పోరుుంచుకొని రూ.2000 నోటు ఇచ్చిన వినియోగదారుల కు చిల్లర లేవని చెప్పడంతో వివాదం నెలకొంది. పాతబస్తీలోని పలు వ్యాపార సముదాయాల వద్ద ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నారుు. -
పెట్రోల్ బంక్‌లో ఘర్షణ, గాయాలు
ముజఫర్‌నగర్: పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. పెట్రోల్ బంక్‌లు, ఇతర అత్యవసర సేవల కోసం పాత నోట్లు వాడుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో పలుచోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో ఇదే అంశంలో తలెత్తిన వివాదం తన్నుకునేదాకా వెళ్లింది. ఢిల్లీ, సహరాన్పూర్ జాతీయ రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనదారులు పాత 500, 1000 నోట్లు ఇవ్వడంతో.. అవి చెల్లవంటూ బంకు సిబ్బంది వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెద్ద నోట్లు.. జనం పాట్లు
జిల్లాలో స్తంభించిన వ్యాపార లావాదేవీలు రూ.500, 1000 నోట్లు తీసుకోని వ్యాపారులు {పయాణికులు, రోగులకు నానా ఇబ్బందులు రంగంలోకి దిగిన దళారులు తిరుపతి: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజానీకాన్ని పరుగులు తీరుుస్తోంది. జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనిక, వ్యాపార, ఉద్యోగ వర్గాల జనమంతా బుధవారం వివిధ రకాల ఇక్కట్లను ఎదుర్కొన్నారు. జిల్లా అంతటా ముఖ్యమైన వ్యాపార లా వాదేవీలు 50 శాతం పైగా స్తంభిం చారుు. సినిమా హాళ్లు, హోటళ్లు, చికెన్, మటన్ సెంటర్లు, చిల్లర దుకాణాలు, సూపర్ మార్కెట్లు వెలవెలబోయారుు. వైన్‌షాపులు, పెట్రోలు బంకులు కిటకిటలాడినా చిల్లర సమస్య జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది. చాలా పట్టణా ల్లో దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారానికి తెరలేపారు. రూ.500కి రూ.400, రూ.1000కి రూ.800 చొప్పున చెల్లింపులు జరి పారు. పెద్ద నోట్లను ఏదో విధంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకుంటామనే భరోసా ఉన్న వ్యాపారు లు, కమీషన్ ఏజెంట్లు, కుదువ వ్యాపారులు నోట్లు తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, నారాయణవనం, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురంలో బుధవారం భక్తుల తాకిడి తగ్గింది. నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నో రద్దరుున నోట్లను తీసుకునేందుకు వ్యాపారాలు ససేమిరా అన్నారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాలతో పాటు పుణ్యక్షేత్రాలైన తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిల్లోని పూజా సామగ్రి విక్రేతలు కొనుగోలుదారుల నుంచి రూ.500, 1000 నోట్లను తీసుకోలేదు. చిల్లర లేదని కొందరు, చెల్లని నోట్లు వద్దని మరికొందరు నిరాకరించారు. నోట్లు తీసుకోవాలని తిరుపతి, చిత్తూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టినా వ్యాపారులు సానుకూలంగా స్పందించలేదు. పాలు, కూరగాయలు, చికెన్ సెంటర్ల నుంచి అన్ని రకాల దుకాణాలు, సూపర్ మార్కెట్లు నోట్లు తీసుకునేందుకు విముఖత చూపారుు. దీంతో జిల్లా అంతటా వ్యాపారాలు 50 శాతం తగ్గారుు. రోజుకి రూ. 250 కోట్ల వ్యాపార లావాదేవీలు నమోదయ్యే జిల్లాలో బుధవారం రూ.100 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగడం గగనమైందని వ్యాపార వర్గాలు వెల్లడించారుు. కిటకిటలాడిన పెట్రోలు బంకులు.. రద్దరుున నోట్లు మారింది ఇక్కడొకచోటే. జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులందరూ నోట్లు స్వీకరించారు. అరుుతే రూ.100, 200లకు కొట్టకుండా రూ.500 మొత్తానికీ పెట్రోలు కొడతామని షరతు పెట్టారు, చేసేది లేక వాహనచోదకులు మొత్తానికీ పెట్రోలు పట్టుకున్నారు. ఇదే అదునుగా బంకుల యజమానులు స్పీడ్, సూపర్ మైలేజ్ పెట్రోలు లక్ష్యాలను కూడా అధిగమించారు. ఒక్కో పెట్రోలు బంకు గతంలో 3000 నుంచి 4000 లీటర్ల పెట్రోలు విక్రరుుంచేది. అరుుతే బుధవారం మాత్రం రెట్టింపు అమ్మకాలు జరిగారుు. జిల్లాలోని వైన్, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ అమ్మకాలు బాగున్నారుు. పెద్ద నోట్ల మార్పిడికి మందుబాబులు వైన్‌షాపులను ఎంచుకున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు అమ్మకాలు జరిపారు. ఇష్లారాజ్యంగా దళారులు... చిల్లర సమస్యను ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారం చేయడం ప్రారంభించారు. తిరుపతి తుడా సర్కిల్, టీటీడీ ఏడీ బిల్డింగ్, అలిపిరి, బస్టాండ్, రైల్వే సెంటర్లను అడ్డాగా చేసుకుని వ్యాపారం చేశారు. రూ.500 నోటుకు బదులుగా రూ.400 మాత్రమే ఇచ్చి కమీషన్ కింద రూ.100 మినహారుుంచుకున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన యాత్రికులు చిల్లర కోసం వీరిని ఆశ్రరుుంచి నష్టపోయారు. -
పెద్ద నోట్లతో పరేషాన్!
కేంద్రం నిర్ణయంతో నిరాకరణ పాత నోట్లు చెల్లవంటూ ప్రచారం అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చిల్లర కోసం పలుచోట్ల వాగ్వాదాలు హన్మకొండ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం అన్ని రకాల లావాదేవీల విషయంలో గందరగోళం నెలకొంది. రూ.500, రూ.1000 నోట్లను తీసుకునేందుకు నిరాకరించారు. పాత నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో డిసెంబర్ 30లోగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇకపై ఈ నోట్లు పనికిరావనే అపోహ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారమైంది. బంకులు, హోటళ్లలో... వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు వివిధ మండలకేంద్రాల్లో హోటళ్లలో భోజనం తినేందుకు వచ్చిన వారిని యజమానులు ముందే చిల్లర అడిగారు. రూ.500, రూ.1000నోట్లను నిరాకరించారు. చిన్న, పెద్ద వ్యాపారాలు రోజూ జరిగే సాధారణ స్థితితో పోల్చితే చాలావరకు తగ్గారుు. పెట్రోల్ బంకుల్లోనూ రూ.100 నోట్ల కొరతతో రూ.500 ఇస్తే పూర్తి మొత్తానికి మాత్రమే డీజిల్, పెట్రోలు పోస్తున్నారు. బంకుల్లో చిల్లర కోసం ప్రతి ఒక్కరూ రూ.500 ఇస్తుండటంతో బంకు సిబ్బంది, వాహనదారులకు వివాదాలు చోటుచేసుకున్నారుు. మార్కెట్లలో రైతుల నిరాకరణ పెద్ద నోట్ల విషయం రైతులను మరింత గందరగోళానికి గురిచేసింది. జిల్లాలోని పరకాల, నర్సంపేట, గూడెప్పాడ్, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు విక్రరుుంచిన రైతులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో వ్యాపారులకు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. చేసేది లేక రైతుల చెల్లింపులకు సంబంధించి వ్యాపారులు వారుుదా వేశారు. కొత్తనోట్లు వచ్చిన తర్వాత చెల్లించేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే నగదు ఇవ్వకున్నా నోట్ల విషయంలో ఇబ్బందులు పడొద్దని రైతులు ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరికోతల సీజన్ కావడంతో వరికోత యంత్రాలు సైతం నిలిచిపోయారుు. రైతు కూలీలు సైతం రూ.500, రూ.1000నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిన్న నోట్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒక్క నర్సంపేట పట్టణంలో మాత్రమే లెసైన్సు ఉన్న ఫైనాన్స సంస్థలు 4 ఉన్నారుు. వీటిల్లో ఒక్కో దాంట్లో రోజూ రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు రుణాలు ఇస్తుంటారు. కేంద్రం నిర్ణయంతో ఈ సంస్థల నుంచి రైతులు ఒక్క రూపారుు కూడా తీసుకోలేదు. రైతులు, ఇతర ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.