Pulivendula
-
పులివెందులలో రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ప్రారంభించిన వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పులివెందుల ముంగిట్లో అత్యున్నత వైద్యం
సాక్షి కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో అత్యాధునిక వసతులు, అత్యున్నత పరికరాలు, అత్యుత్తమ నిపుణుల ఆధ్వర్యంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలను మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించి పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ముందుగా ఆస్పత్రి ఆవరణలోకి వైఎస్ జగన్ చేరుకోగానే వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధులతోపాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఆయన సతీమణి ప్రతిభారావులతో కలసి రిబ్బన్ కట్ చేసి వైఎస్ జగన్ ఆస్పత్రిని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైఎస్సార్ ఔట్ పేషెంట్స్ విభాగాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రతిభారావు ప్రారంభించారు. పులివెందులలో రాజారెడ్డి ఆస్పత్రి దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే ఆస్పత్రిలో పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్థలాన్ని సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చిoచి నూతన భవనం, అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలా సిద్ధం చేశారు. ఆస్పత్రిలో కలియతిరిగి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డిలతో కలసి వైఎస్ జగన్ ఆస్పత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కంటి యంత్ర పరికరాలను ఆసక్తిగా తిలకించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కె.రెడ్డి, డైరెక్టర్ రాజశేఖర్ వాటి పనితీరును వివరించారు. ఆసుపత్రి సిబ్బందితోపాటు అక్కడ ఉన్న అందరినీ పలుకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. కార్యకర్తలతో మమేకం..రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తొలిరోజు మంగళవారం కార్యకర్తలు, నాయకులతో క్యాంపు కార్యాలయంలో మమేకమయ్యారు. బుధవారం వైఎస్ రాజారెడ్డి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం బయట వేలాదిగా వేచి ఉన్న మహిళలు, అభిమానులకు అభివాదం చేశారు. తెలిసినవారు కావడంతో పలువురిని పేరు పేరునా ఆప్యాయంగా పలుకరించారు.కంటి పరీక్షలు చేయించుకున్న వైఎస్ జగన్ వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వారిని వైఎస్ జగన్ కోరారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే తీర్చాలని వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధి జనార్థన్‌రెడ్డికి సూచించారు.‘‘రాజారెడ్డి ఐ సెంటర్..’’ నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోందివైఎస్ జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: పులివెందులలో ‘‘ఎల్వీపీఈఐ’’ సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ప్రారంభించడం గర్వంగా ఉందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఈ క్షణం.. అదే ఆస్పత్రికి చెందిన ప్రఖ్యాత వైద్యుడు, మా నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆస్పత్రిలోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
పులివెందుల: రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
-
అభిమానం అంటే ఇదే కదా..
-
పులివెందులలో వైఎస్ జగన్ చేతుల మీదుగా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
పులివెందుల పర్యటన: రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఆస్పత్రిని అధునీకరించడం విశేషం. రాజారెడ్డి ఐ సెంటర్‌గా ఇవాళ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. -
ప్రజలకు అండగా నిలుద్దాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజల మదిలో మనం చెరగని ముద్ర వేశాం... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనందించాం. విపక్ష పార్టీ నాయకులుగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పని చేద్దాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుందాం..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిచయం చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ పదవులు పొందిన నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రజêవ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని.. స్థానిక సమస్యలపై ప్రజల గొంతుకగా పని చేయాలని సూచించారు.వైఎస్సార్ సీపీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పాలన అందించామన్నారు. అబద్ధాల హామీలతో టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నయవంచకుడని తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారని, అతి తక్కువ సమయంలోనే మోసపోయామని గ్రహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. పులివెందులలో కోలాహలం..రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయంతాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీకరించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని నోట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నూతన జంటలకు ఆశీర్వాదం...పులివెందులలో ఇటీవల వివాహం జరిగిన నాలుగు నూతన జంటలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. నారాయణ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న వై.మహేశ్వరరెడ్డి కుమార్తె అనిలాదేవి, అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. అలాగే చెన్నారెడ్డి కాలనీలో నివసించే రవీంద్రనాథరెడ్డి కుమార్తె సాయిలహరి, అల్లుడు లిఖిత్‌లతోపాటు జి.మహేశ్వరరెడ్డి కుమార్తె సాహిత్య, అల్లుడు రామమనోహర్‌రెడ్డికి.. సుదర్శన్ కుమారుడు అనుదీప్‌కుమార్, కోడలు లాస్యశ్రీలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జంటల కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఘనస్వాగతం...తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహరరెడ్డి, బీసీ సెల్ నేత బంగారు నాగయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలశాఖ అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ...సింహాద్రిపురం మండలశాఖ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులలో నివాసం ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను కలుసుకున్నారు.మామను చూడాలని పాదయాత్ర!సాక్షి ప్రతినిధి, కడప: అభిమానానికి హద్దుండదు...! ఆత్మీయతకు వయసుతో నిమిత్తం లేదు!! వైఎస్ జగన్ పట్ల చిన్నారుల మక్కువ మరోమారు నిరూపితమైంది. పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివసించే బాలుడు మాబు షరీఫ్‌కు వైఎస్ జగన్ అంటే ఎనలేని ఇష్టం. వైఎస్ జగన్ పులివెందుల వస్తున్నట్లు తెలియడంతో ఎలాగైనా ఆయన్ను కలిసి ఫొటో దిగాలనే ఆరాటంతో తెల్లవారుజామున 5.30 గంటలకు చెప్పులు లేకుండా కాలినడకన ఇంటి నుంచి బయలుదేరాడు. హెలిప్యాడ్ వద్దకు చేరుకుని నిరీక్షించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్ తన వద్దకు వచ్చిన బాలుడిని గమనించి ఆప్యాయంగా పలుకరించారు. కరచాలనం చేయడంతో ఆనంద బాష్పాలు రాల్చిన చిన్నారి కళ్ల నీళ్లు తుడిచి వివరాలు కనుక్కున్నారు. మామయ్య తనను దగ్గరకు తీసుకున్నారని బాలుడు ఎంతో సంబరంగా వైఎస్ జగన్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ చిన్నారి అభిమానాన్ని చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అనంతరం ఆ బాలుడికి జాగ్రత్తలు చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. -
పులివెందుల ‘కంటికి రెప్పలా’..
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాల రూపురేఖలు మారాయి. ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికే నేత్ర వైద్య సేవలందిస్తున్న ఈ వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలో ఏ విధంగా కంటి ఆపరేషన్లు చేసేవారో.. నూతనంగా ప్రారంభించే ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలోనూ అదేవిధంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయనున్నారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆస్పత్రిలో అందుబాటులో ఉంచారు. భవిష్యత్‌లో ఐ కేర్ సెంటర్లు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తరహాలో పులివెందులలో కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థలో 25 వార్డులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌తో కంటి పరీక్షలు, డయోగ్నస్టిక్ సేవలు అందించనున్నారు. పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలతోపాటు ఆపరేషన్లు చేస్తారు. మొదటివిడతగా పులివెందులలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులచే వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని ఏర్పాటు చేయగా.. రానున్న రోజుల్లో 50 వేల జనాభా గల ప్రతి గ్రామంలో ఐ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.నేడు ప్రజలకు అంకితంవైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పులివెందుల ప్రజలకు అంకితం చేయనున్నారు. -
వైఎస్ జగన్ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల టూర్ ..షెడ్యూల్ ఇదే
-
ప్రజాదర్బార్‌లో వైఎస్ జగన్.. పులివెందులలో కోలాహలం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాళ్ల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగనన్నతో కరచలనం, సెల్ఫీలు..ఫొటోల కోసం ఎగబడ్డారు. మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు. తన రెండ్రోజుల పులివెందుల పర్యటన(Pulivendula Visit)లో భాగంగా.. ఇవాళ, రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు కానున్న ఆయన.. రేపు(ఫిబ్రవరి 26) ఎల్వీ ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునికీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. -
పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు, రేపు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్థానికంగా అందుబాటులో ఉంటారు.బుధవారం ఉదయం 10 గంటలకు పులివెందులలోని గుంత బజార్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన ‘వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్’ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. -
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి(మంగళ, బుధ వారాలు) పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన చేపట్టనున్నారు. రేపు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉండి వారి సమస్యలను వింటారు. అనంతరం ఎల్లుండి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. వైఎస్ జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఇదే.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభిస్తారు. -
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
వేంపల్లికి చెందిన ప్రకాష్ పై బీటెక్ రవి అనుచరుల దాడి
-
పులివెందుల టీడీపీలో బయటపడ్డ వర్గపోరు
-
పులివెందులలో బైరెటిస్ కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
-
పులివెందులలో వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
-
పులివెందులలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
-
విద్యుత్ అధికారికి YS అవినాష్ రెడ్డి వినతి పత్రం.. దీనిపై చర్యలు తీసుకోండి
-
కొత్త జంటను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పులివెందుల : కొత్త జంటకు వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం (ఫొటోలు)
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో జనం సమస్యలు విన్న వైఎస్ జగన్
-
ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. జగనన్న ఎప్పుడూ ప్రజా నాయకుడే
-
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం
సాక్షి ప్రతినిధి, కడప : ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు.. ఆరు నెలల్లోనే ఇదివరకెన్నడూ లేనంతంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. అందువల్ల ప్రజల గొంతుకగా మనం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశి్నద్దాం.. నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమవ్వండి. ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను..’ అని భరోసా ఇచ్చారు. కష్టాలు కొద్ది కాలమేనని.. ఆ తర్వాత మన టైమ్ వస్తుందని ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అధికార అండ చూసుకుని ఆ పార్టీ నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్య పడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదని భరోసా కల్పించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథా ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.పులివెందులలోని క్యాంపు కార్యాలయం గురువారం పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ సూచించారు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పలువురు జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచి్చన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ చార్జీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిoదని చెప్పారు. కాగా కుప్పం అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ ప్రాంత సర్పంచ్‌లు, యూత్ వింగ్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఓ అభిమాని గీసిన జననేత చిత్రం ఫొటో ఫ్రేమ్‌పై జగన్‌తో సంతకం చేయించుకున్నాడు. జగన్‌ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బి అంజాద్‌భాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురావిురెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్ టీచర్స్ అసోషియేషన్ క్యాలెండర్, డైరీని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకటనాథరెడ్డి, సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్తంతో జగనన్న ఫోటో వేసిన అభిమాని..
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో కొనసాగుతోన్న ప్రజాదర్బార్ కార్యక్రమం
-
నాతో సన్నిహితంగా ఉన్న టీడీపీ నాయకులు నాకు చెప్పిన మాట
-
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్‌కు హాజరైన ప్రజలు, కార్యకర్తలు (ఫొటోలు)
-
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. వినతులు స్వీకరణ
సాక్షి, వైఎస్సార్: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు. -
పులివెందులలో జననేతకు ఘన స్వాగతం
-
జననేతకు నీరా‘జనం’
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందుల–తాతిరెడ్డిపల్లె మార్గంలోని పల్లెల జనమంతా బుధవారం రోడ్డుపైకి వచ్చేశారు.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. తమ అభిమాన నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు.. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వారి అభిమానానికి ముగ్దుడైన వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు 11 గంటలకు బయలుదేరారు. అడుగడుగునా అభిమాన జనం పోటెత్తడంతో 30 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు ఏకంగా ఆరు గంటలు పట్టింది. ప్రతి గ్రామం వద్ద రోడ్డుపైకి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయం వద్దకు వచ్చే సరికి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసింది. వైఎస్ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోదండరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ మూర్తులకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. కాగా, ఈ ఆలయానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.34 లక్షలు మంజూరు చేశారు. పేరు పేరునా ఆత్మీయ పలకరింపు తాతిరెడ్డిపల్లెకు బయలు దేరిన మాజీ సీఎం వైఎస్ జగన్.. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కర్నపాపాయపల్లెలో నాగశేషులరెడ్డి కన్పించలేదు. ఆయన గురించి వాకబు చేయడంతో అనారోగ్యంతో ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. అప్పటికప్పుడు నాగశేషులరెడ్డి ఇంటికి వాహనాన్ని మళ్లించారు. ఆయన్ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లింగాలలో సీనియర్ నాయకుడు కొండారెడ్డి కన్పించక పోవడంతో వాహనం దిగి, ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. ఇలా ప్రతి గ్రామంలో నేతలను పేరు పేరునా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సినీ నటుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. పెద్దనాన్న వైఎస్ శివప్రకాష్‌రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, పెద్దమ్మ వైఎస్ భారతమ్మతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహార్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ 2025 కేలండర్‌ను ఆవిష్కరించారు. -
కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా బుధవారం లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో రామాలయానికి రూ.34లక్షలు మంజూరు చేశారు. ఇక, వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత రావడంతో ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ,వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. -
క్రిస్మస్ వేడుకల్లో YS భారతీ
-
పిల్లలతో సరదాగా వైఎస్ జగన్
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
-
4 రోజుల పాటు పులివెందులలో జగన్ పర్యటన
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సొంత నియోజవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.వైఎస్ జగన్.. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులతో ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిశాక సాయంత్ర సమయంలో పులివెందుల బయల్దేరుతారు. 25న సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన స్థానికంగా ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అదే మధ్యాహ్నాం పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు -
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించకుండా అడ్డుకున్న హీన చరిత్ర బీటెక్ రవిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా గెలిచిన వీటిని ఎన్నికలు అంటారా..? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీటెక్ రవిని పులివెందుల ప్రజలు ఓడించిన చరిత్ర మరిచిపోయావా? వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకోకపోతే బీటెక్ రవికి ఆ పార్టీలో మనుగడ కూడా లేదు. మీ సొంత గ్రామంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్లోనూ గెలవని చరిత్ర నీది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
అధైర్యపడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ శ్రేణులు, అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం 9.15 గంటల నుంచి ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరుల వెంట వెళ్లిన కేడర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఇప్పట్ల గ్రామానికి చెందిన శ్రుతిలయ తన దీననగాథను కుటుంబ సభ్యుల ద్వారా వివరించారు.ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని వారు జగన్ వద్ద వాపోయారు. అదేవిధంగా కడపకు చెందిన ముస్లిం మైనార్టీ దంపతులు వారి కుమార్తె అనారోగ్యాన్ని వివరించి, వైద్య సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన జగన్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించారు.పెద్దనాన్నతో కాసేపు..వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డితో పాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.నూతన జంటలకు ఆశీర్వాదంఇటీవల వివాహాలైన నూతన జంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. దొండ్లవాగు వైఎస్సార్సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం ఇటీవల జరిగింది. విద్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ నూతన జంట మాధురి, నరేంద్రరెడ్డిని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
పులివెందులలో రెండో రోజు జనంతో జగన్
-
పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్ జగన్‌తో ప్రజలు, అభిమానులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఉల్లి రైతులు.. అన్నదాతల ఆవేదన
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు. -
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
-
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్.. కష్టాలు వింటూ.. నేనున్నానంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
-
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
వైఎస్ఆర్ జిల్లాలో డిటోనేటర్ల పేలుడు కలకలం
-
AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్ టీడీపీ నేత బైరెటీస్ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. అండర్‌టేకింగ్ ఇవ్వకపోయినప్పటికీ ఎన్ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. -
ధైర్యంగా కష్టాలు ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప : ‘కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులొస్తాయి. ఎవరూ అధైర్యపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రెండోరోజు పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉంద’ని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలి.. పులివెందుల వెంకటప్ప మెమోరియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్–18 గ్రూపు కింద రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సంతోషాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకునేందుకు పులివెందుల క్యాంపు కార్యాలయంలో వారంతా జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ఆయన.. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని, అందుకు ప్రత్యేకంగా తరీ్ఫదు పొందాలని సూచించారు. కష్టపడితే సాధించలేనిది లేదన్న విషయాన్ని జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఉద్భోదించారు. దీంతో.. ‘మీ ఆకాంక్షను నెరవేరుస్తాం సార్’ అంటూ విద్యార్థులు ధీమాగా చెప్పారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. -
జగన్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
-
జగన్‌కు జన నీరాజనం
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పర్యటనకు వచ్చి న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రాక కోసం రహదారి వెంబడి గంటల తరబడి వేచి ఉండి అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ, వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఎక్కడ కూడా ఇసుమంతైనా విసుగు లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందులకు వచ్చారు. వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల చేరుకునేందుకు ఆయనకు 9 గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్ రాత్రి 8.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. తొలుత తోళ్లగంగనపల్లె వద్దకు పెద్దఎత్తున చేరుకున్న ప్రజానీకం పలకరింపుతో మొదలైన పర్యటన పులివెందుల వరకూ కొనసాగింది. అండగా ఉంటా.. అధైర్యపడొద్దుకడప నుంచి మాచునూరుకు వెళ్లిన వైఎస్ జగన్.. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీకి ఆ కుటుంబం అందించిన సేవలు గుర్తున్నాయని, దివంగత మాచునూరు చంద్రారెడ్డి తనకు అండగా నిలిచారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటాను, అధైర్యపడొద్దని మాచునూరు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌ను చూడగానే చంద్రారెడ్డి సతీమణీ లక్ష్మీనారాయణమ్మ బోరున విలపించారు. ఆమెను ఓదార్చిన జగన్.. ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చేరదీసి చంద్రారెడ్డి సేవలు గుర్తుచేసుకున్నారు. చంద్రారెడ్డి కుమారులు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి, కోడలు, పెండ్లిమర్రి ఎంపీపీ వరలక్ష్మిలను పలకరించి.. అధైర్యపడొద్దు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. నూతన జంటకు ఆశీస్సులు ఇటీవల వివాహమైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రహాసరెడ్డి కుమార్తె, అల్లుడికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. చంద్రహాసరెడ్డి స్వగ్రామం గొందిపల్లెలో నూతన జంట ఆశా, శివారెడ్డిలకు వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న వివిధ గ్రామాలకు చెందిన నాయకులను పేరుపేరునా పలుకరించి, ఫోటోలు దిగారు.ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతంకడప ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ దాసరి సు«ధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు జగన్‌కు స్వాగతం పలికారు. -
నేడు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.శనివారం (ఆగస్ట్31)ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్‌కి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవనున్నారు. పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.అక్కడి నుంచి అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.పోర్చుగల్‌కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్‌్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్‌ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు..
-
ఆగని అరాచకం.. పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వైఎస్సార్ కాలనీలో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అబ్ధుల్ ఇంట్లో వస్తువులు, బైక్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న అబ్దుల్ మామను తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే దాడి చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలుచిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త విఘ్నేష్ కనిపించకుండా పోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విఘ్నేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్రేగిపోతున్న టీడీపీ నేతలుఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలను అరికట్టాల్సిన పోలీసులు.. ప్రేక్షక పాత్ర పోషించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో హింసా రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల దాకా ప్రశాంతంగా ఉన్న అనంతలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమారుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు లో ఎరికలయ్య (50), హిందూపురం నియోజకవర్గంలో సతీష్ (40) లపై టీడీపీ దాడులు చేసింది. ఈ ఇద్దరు నేతలు బెంగళూరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మల్లికార్జున పల్లిలో టీడీపీ వేధింపులకు ఇద్దరు బలయ్యారు. మల్లికార్జునపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శాంతకుమార్‌పై టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారు. పోలీసులు కూడా విచారణ పేరుతో శాంతకుమార్‌ను వేధించారు. ఈ మనస్తాపంతో శాంతకుమార్ భార్య మమత (30) ఆరుమాసాల కూతురిని చంపి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేతల దాష్టీకానికి ఇదే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ కదిరి, తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. -
వైఎస్ జగన్ మానవత్వం
-
పులివెందులలో వైఎస్ జగన్.. తరలివచ్చిన జనం (ఫోటోలు)
-
పులివెందులలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగన్ రాకతో పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో పోటెత్తిన జనం
-
కాసేపట్లో క్యాంపు కార్యాలయానికి వైఎస్ జగన్
-
పులివెందులలో జననేత.. ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగుతూ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫొటోలు)
-
పులివెందుల బయలుదేరిన వైఎస్ జగన్
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
నేనున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తకు జగన్ పరామర్శ
వైఎస్సార్, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. కడప రిమ్స్‌కు వెళ్లి బాధితుడు అజయ్‌ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు. వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలంఅంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. -
YSRCP నేత తల పగలగొట్టిన టీడీపీ గూండాలు
-
బెంగళూరు కు వైఎస్ జగన్
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లా డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలను స్వీకరించారు.సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పులివెందులలో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అందరితోనూ ఓపికగా మాట్లాడారు. పలువురు నేతలను పేరుపేరునా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు. ‘వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో ఉండిపోయింది. తప్పకుండా ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రెండు కుటుంబాలకు పరామర్శ పులివెందుల నారాయణ పాఠశాల సమీపంలోని పురుషోత్తం నగర్లో నివాసముంటున్న దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు మైఖెల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది. అప్పట్లో రాలేక పోయిన వైఎస్ జగన్.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైఖెల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైఖెల్ సతీమణి అమూల్యారాణి, కుమారుడు వినీత్‌లను ఓదార్చారు. సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి.. సంగిరెడ్డి భార్య సత్యవతి, కుమారులు సుధాకర్‌రెడ్డి, సునీల్రెడ్డిలను జగన్ దంపతులు ఓదార్చారు. ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో పాటు చవ్వా సుదర్శన్‌రెడ్డి, మిట్టా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మరోసారి విషం కక్కిన ఎల్లో మీడియాసాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. వైఎస్ జగన్‌పై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని ఒక మార్ఫింగ్ వీడియోను వదిలారు. వైఎస్ జగన్ సోమవారం పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసం వద్దకు వందలాదిగా చేరుకున్నారు. జగన్‌తో మాట్లాడాలని, ఫొటో దిగాలని పెద్ద సంఖ్యలో యువకులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంటి వద్దకు ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది గిట్టని ఎల్లో మీడియా కొద్ది గంటల్లోనే ఈ వీడియోలోని వాయిస్‌ను మార్చి ‘జగన్ డౌన్ డౌన్..’ అన్నారని నిస్సిగ్గుగా విషం కక్కింది. పులివెందులలో సైతం ఇదే రీతిలో దుష్ప్రచారం చేసి ఖంగుతింది. అయినా పద్ధతి మార్చుకోక బెంగళూరులోనూ అదే వైఖరి ప్రదర్శించి అభాసుపాలైంది. -
పులివెందుల: అభిమాన నేత.. ఉప్పొంగిన ఉత్సాహం (ఫోటోలు)
-
రాబోయే రోజులు మనవే
-
వైఎస్సార్సీపీ నేత సంకిరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించారు. క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు.పులివెందుల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు.పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. -
YSRCP నాయకుడు సంకిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ మూడవరోజు పర్యటన
-
నేడు మూడో రోజు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ మీరే మా కింగ్..
-
చేసేది చెప్పాం.. చెప్పింది చేశాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘చెప్పింది చెప్పినట్లు చేసి చూపెట్టాం. చెప్పనవి కూడా ఆచరణలో చూపెట్టాం. మనం చేయగలిగిందే ఎన్నికల్లో చెప్పాం. 40 శాతం మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచిచూద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు రానే వస్తుంది. వైఎస్సార్సీపీ కేడర్ లక్ష్యంగా వ్యక్తిగత దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అండగా నిలుస్తాం. బాధితులందర్నీ కలుస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అందుకోసం వైఎస్సార్సీపీ ప్రజాపక్షంగా నినదిస్తోందన్నారు. ‘మన హామీలను నమ్మి 40 శాతం మంది ఓటు వేశారు. 50 శాతం కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరు. ఆరు నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. కూటమికి ఓటేసిన ప్రజలు మరోమారు మోసపోయామని గ్రహిస్తారు’ అన్నారు.పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పోటెత్తిన యువత మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు, ఫొటో దిగేందుకు యువత పెద్ద సంఖ్యలో పులివెందులకు వచ్చారు. సుపరిపాలన అందించిన జగన్ యోగ క్షేమాలు తెలుసుకోవాలని మరికొందరు తరలి వచ్చారు. పదవులు ముఖ్యం కాదు.. మీ వెంటే మేమంతా నడుస్తాం.. మీతోనే మాబాట.. అని భరోసా నింపేందుకు ఇంకొందరు విచ్చేయడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహిస్తూనే, మరోవైపు వచ్చిన వారికి ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ రోజంతా బిజీబిజీగా గడిపారు. పులివెందుల క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏకధాటిగా నిల్చొని వేలాది మంది ప్రజానీకాన్ని కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను చూడాలని, కలవాలని యువత ఆత్రుత ప్రదర్శించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. కిటీకి అద్దాలు పగలి ఓ యువకుడికి చిన్నపాటి గాయమైంది. జనం భారీగా తరలి రావడంతో కేవలం అర గంటలో మధ్యాహ్న భోజనం ముగించి, మళ్లీ సాయంత్రం వరకు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, కడప మేయర్ కె సురేష్‌బాబు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహార్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు.మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. మనం చేసిన మంచి, మేలు ప్రజల గుండెల్లో ఉండిపోయిందని చెప్పారు. శిశుపాలుడు లాగా తప్పులు మొదలయ్యాయని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ‘మనకు ఓటు వేశారని, వారికి ఓటు వేయలేదనే కారణంగా ప్రజలు, వైఎస్సార్సీపీ కేడర్, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. శిశుపాలుని లాగా పాపాలు చేస్తున్నారు. ఆ పాపం పండే రోజు వస్తుంది. 2029లో ప్రజలు మన వైపే చూస్తారు. మంచి చేసిన మీ జగన్ వైపే ప్రజలు నిలవనున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తా. చంద్రబాబు సర్కార్ బాధితులందర్నీ కలుస్తా’ అని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు తన భర్తను టార్గెట్ చేసి దాడి చేశారని ముదిగుబ్బ సర్పంచ్ సతీమణీ వాపోయారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ ఆమెను ఊరడించారు. మనకు మంచిరోజులు రానున్నాయని, అంత వరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు. -
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్‌కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. -
పులివెందులలో జననేత.. ప్రజలతో మమేకం.. (ఫోటోలు)
-
మా కట్టే కాలేంతవరకు జగనన్నతోనే ఉంటాం
-
పులివెందుల క్యాంపు ఆఫీస్ కు తరలొచ్చిన జనసంద్రం..
-
ఇవాళ రెండోరోజు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్పీకరిస్తున్నారు.ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో క్యాంప్ కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ కు అపూర్వస్వాగతం
-
పులివెందులలో జగన్‌కు అఖండ స్వాగతం
సాక్షి కడప/రాయచోటి/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారు. పుట్టినగడ్డలో ఆయన అడుగుపెట్టగానే జనం ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా మాజీ సీఎంకు హారతులు పడుతూ మహిళలు దిష్టితీయగా, మరికొందరు పుష్పగుచ్ఛాలు అందించారు. ఆ తర్వాత పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. జగన్‌ను చూడగానే జనమంతా ఒక్కసారిగా ‘సీఎం సీఎం’.. అంటూ ఈలలు, కేకలతో ఉత్సాహం ప్రదర్శించారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ కలుస్తూ అడిగిన వారికి ఫొటో తీసుకునే అవకాశమిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తొలిరోజంతా కార్యకర్తలతోనే గడిపారు. జగన్‌ను కలిసిన పలువురు నేతలు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జగన్ వెన్నంటే ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు. ఎంపీతో పాటు రాజంపేట, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, చంద్రశేఖర్.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ‘మండలి’ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అనేక విషయాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడారు. టీడీపీ దాడులపై జగన్ ఆరా మరోవైపు.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్లపై టీడీపీ రౌడీమూకలు చేసిన దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. రాయచోటి 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ బాషా, స్థానిక మైనార్టీ నేతలు దాడి సంఘటనను ఆయనకు వివరించారు. ఈ దాడిలో 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ బాషా కత్తిపోట్లకు గురికాగా, హరూన్ బాషా ఇంటి ముంగిట ఉన్న బైకును బండరాళ్లతో బాది ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్ దాడిలో గాయపడిన వారికి ధైర్యాన్నిచ్చారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలుస్తామన్నారు. కాన్వాయ్‌లో వాహనాల ఢీ అవాస్తవం.. ఇదిలా ఉంటే.. కడప విమానాశ్రయంలో దిగిన జగన్ తన కాన్వాయ్‌లో పులివెందులకు బయల్దేరారు. రామరాజుపల్లె వద్ద వేచి ఉన్న అభిమానులను కలిసేందుకు ఆయన వాహనాన్ని ఆపమన్నారు. అదే సమయంలో కాన్వాయ్‌తో సంబంధంలేని వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో వేరే కారులో పులివెందుల వైపు వెళ్తున్నారు. ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో కాన్వాయ్‌లో చివరగా ఉన్న అగ్నిమాపక వాహనాన్ని వెనుకవైపు ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిందని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ తెలిపారు. కానీ, మాజీ సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయని వెలువడిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారన్నారు. పచ్చ మీడియాలో దుష్ప్రచారంమాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన్ను పలకరించేందుకు పెద్దఎత్తున ప్రజానీకం పులివెందుల చేరుకున్నారు. మ.2 గంటలకు పులివెందులకు వస్తారనుకున్న ఆయన ఐదు గంటలకు చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున అభిమానులు అక్కడకు తరలివచ్చారు. బారులు తీరిన జనాన్ని కలుస్తూ, వారిని ఊరడిస్తూ అధినేత వైఎస్ జగన్ ఉండిపోయారు. అంతేకాక.. తమ అభిమాన నేతను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో నగిరిగుట్టకు చెందిన ఓ యువకుడు క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలపై పడ్డాడు. అద్దాలు పగిలి చేతికి గాయం కూడా అయ్యింది. వాస్తవం ఇలా ఉంటే, జగన్‌కు పులివెందులలోనే ప్రతిఘటన.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలంటూ పచ్చమీడియాలో తెగ దుష్ప్రచారం చేశారు. దీనిపై పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌రెడ్డి వివరణ ఇస్తూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సమయంలో కార్యకర్తల తోపులాట జరిగి కిటికీ అద్దాలు పగిలాయి కానీ, ఎలాంటి రాళ్లదాడి జరగలేదని, ఎవరూ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. కేవలం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపడంతో ఒకరిపై ఒకరు పడి తోపులాట మాత్రమే జరిగిందన్నారు. -
నేడు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 22న వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళతారు. 3 రోజుల పాటు పులివెందులలో జగన్ అందుబాటులో ఉంటారు. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.వాస్తవానికి రేపు ఉదయం జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే జగన్ పులివెందుల పర్యటన నేపథ్యంలోనే 22వ తేదీకి ఆ సమావేశాన్ని వాయిదా వేసింది.ఇదీ చదవండి: ఈవీఎంలు వద్దు.. జగన్ సంచలన ట్వీట్ -
పులివెందులలో జగన్ ముందంజ
-
ప్రాంతీయ, రాజకీయ స్వభావాలు ఒకటి కాదు!
పులివెందుల ప్రజల గురించీ, ఇక్కడి సంస్కృతి గురించీ అభ్యంతరకరంగా మాట్లాడ్డం ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రాంత ప్రజల పట్ల విషం కక్కడం పెరిగిపోయింది. ఇక్కడ జరిగే రాజకీయ సంఘటనలన్నింటికీ మొత్తం పులివెందుల ప్రజలనూ, ఆ ప్రాంతాన్నీ, సంస్కృతినీ తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే పులివెందుల ప్రజల పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించడంలో మీడియా, సినిమా వాళ్లూ, రాజకీయనాయకులూ సఫలీకృతమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా తోడవడంతో చివరికి ఈ ధోరణి ఎక్కడికెళ్లి ఆగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ముద్ర మొత్తం రాయలసీమకు ఉంది. ఇక్కడ లేని జీవితాన్ని ఇక్కడిదిగా చూపించి డబ్బు చేసుకోవడంలో సినిమా వాళ్లు ముందున్నారు. ఇవ్వాళ ఏ సినిమా రంగమైతే రాయలసీమనూ... అందులోనూ పులివెందుల వంటి ప్రాంతాలనూ నేరపూరితంగా చూపిస్తూ ఉందో, ఆ రంగానికి ఇక్కడి ప్రజలు చేసిన సేవ అంతా ఇంతా కాదు. సినిమారంగంలో మొత్తం దక్షిణ భారతదేశంలోనే తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన బీఎన్ రెడ్డి పులివెందుల ప్రాంతం వాడే. ఈయన తీసిన ‘స్వర్గ సీమ’, ‘బంగారు పాప’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు కళాఖండాలు. ‘వాహిని’ సంస్థను స్థాపించి ఈయన సృష్టించిన చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే వచ్చిన బి. నాగిరెడ్డి కూడా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. విజయా సంస్థను ప్రారంభించి ఈయన నిర్మించిన ‘పాతాళ భైరవి’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘షావుకారు’ వంటి సినిమాలు అజరామరమైనవి. పత్రికా రంగంలోనూ బి. నాగిరెడ్డి అపార కృషి చేశారు. చక్రపాణితో కలసి ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. అప్పటి తరం పిల్లలు చందమామ చదవకుండా పెరగలేదంటే అతిశయోక్తి కాదు. మోరార్జీ దేశాయ్ వంటి మాజీ ప్రధాని కూడా బి. నాగిరెడ్డిని చందమామతోనే గుర్తు పెట్టుకుని ‘చందమామ రెడ్డిగారు’ అని పిలిచేవారట. తర్వాత ఆయన మహిళల కోసం ‘వనిత’, సినిమా పాఠకుల కోసం ‘విజయ చిత్ర’ వంటి పత్రికలను నడిపారు. అలనాటి హాస్య నటుడు పద్మనాభం, ‘షో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు పొందిన నీలకంఠ వంటి వారు కూడా ఈ ప్రాంతం వారే. ఇక్కడ పుట్టిన రచయితలు మొదటి నుంచి అభ్యుదయ వాదులు. తమ రచనల్లో మానవత్వం, స్త్రీ హక్కులు, రైతు జీవితం, సామరస్య భావాల గురించి రాశారు. ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది – డ్రైనేజి స్కీము లేక... డేంజరుగా మారుతోంది’ అన్న ప్రముఖ హేతువాద జర్నలిస్టు గజ్జల మల్లారెడ్డి ఇక్కడి వాడే. తెలుగు సాహిత్య విమర్శ దిగ్గజం రాచమల్లు రామచంద్రారెడ్డి, కథకులు వైసీవీ రెడ్డి, నాద మునిరాజు, అరవేటి శ్రీనివాసులు, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్ వంటి వాళ్లు ఇక్కడివాళ్లే. ఎక్కువమంది వ్యవసాయం చేసి బతుకుతారు. ఒకప్పుడు చిరుధాన్యాలతోపాటు వేరుశనగ విపరీతంగా పండేది. ఇప్పుడు రైతులు చీని, నిమ్మ తోటలను పెంచుతున్నారు. వందల అడుగుల లోతులో బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని స్థితి. తమతోపాటు పొలాల్లో పనిచేసి తమకింత తిండి పెట్టే మూగజీవాలను ఇక్కడివాళ్లు ఇంటి మనుషుల కిందే చూసుకుంటారు. అవి చనిపోతే మనుషులతో సమానంగా అంత్యక్రియలు చేస్తారు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపరు. ఆడపిల్లలందరినీ వాళ్ల వయసుతో నిమిత్తం లేకుండా గౌరవంగా ‘అమ్మా’ అని పిలుస్తారు. అత్యంత గౌరవ మర్యాదలకూ, సున్నితత్వానికీ, సహ జీవన సంస్కృతికీ నెలవు ఇక్కడి నేల. అందుకే ఇక్కడి నుంచి అంతమంది కళాకారులు రాగలిగారు. పెద్దన లాంటి వాళ్లు ‘ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మయినా చేవే’ అన్నారంటే ఇదే కారణం. అదంతా వదిలేసి కేవలం కళ్లముందు జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇక్కడి వాళ్లంతా దుర్మార్గులు అన్నట్టు, ఇక్కడి సంస్కృతి అంతా ఆటవిక సంస్కృతి అన్నట్టు రాజకీయనాయకులు మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి రాజకీయ స్వభావమూ, ప్రాంతీయ స్వభావమూ ఒకటి కాదు. ఏ ప్రాంతంలో అయినా రాజకీయం అన్నింటికీ అతీతమైంది. దానికి ఎల్లలు లేవు. అది పెట్టుబడి దారులతో కలసి దేశవ్యాప్తంగానే అన్ని రకాల వ్యవస్థలనూ, మానవీయ విలువలనూ ధ్వంసం చేస్తోంది. ఒక దశలో ప్రజాస్వామ్యానికి మూల సూత్రమైన ప్రజలను సైతం నిర్లక్ష్యం చేసి కేవలం డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో అధికారం చేపట్టే దశకు వచ్చింది. ఇలాంటి రాజకీయాల్లో ఎవరూ ప్రశ్నలు, విమర్శలకు అతీతులు కాదు. అయితే ఆ ముసుగులో తమకు గిట్టని లేదా ఓటేయని ప్రాంతాలను ఆ యా స్థానిక రాజకీయ నాయకుల చర్యలతో కలిపి నిందించడం కరెక్టు కాదు. ముఖ్యంగా పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు కడప ఎంపీగా, రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, తరువాత వచ్చిన ఆయన తనయడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.జగన్‌పై రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఒక వర్గం మీడియా, నేతలు మొత్తం పులివెందుల ప్రాంతాన్నీ, అక్కడి ప్రజలనూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. విచక్షణతో రాజకీయ విమర్శలను రాజకీయాలకు లేదా రాజకీయ వ్యక్తుల వరకే పరిమితం చేస్తే బావుంటుంది. అలా కాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే పులివెందుల ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు తగిన కార్యాచరణతో సదరు మీడియా, రాజకీయ నేతల ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుంది. – డా‘‘ వేంపల్లె షరీఫ్జర్నలిస్టు, రచయిత ‘ 96034 29366 -
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.పులివెందుల గ్రామ సర్పంచ్గారాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానంపులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.విద్యా ప్రదాతగాదివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులునేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్‌లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ భారతి
-
మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
-
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
-
Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
-
పులివెందులకు చేరుకున్న సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. తన సతీమణి వైఎస్ భారతమ్మతో కలిసి సాయంత్రం 6.15 గంటలకు భాకరాపురంలోని స్వగృహానికి ఆయన చేరుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య భాకరాపురంలోని 138 పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరుతారు. -
పులివెందులలో హింసకు టీడీపీ పన్నాగం
సాక్షి ప్రతినిధి కడప: హింసకు తావు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పోలింగ్‌లో హింసకు టీడీపీ కుట్ర చేస్తోందని తెలిపారు. పోలింగ్ ప్రారంభంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందులలో మొదటగా హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గలాటాలు చేయాలని ప్రణాళిక రూపొందించుకుందన్నారు.ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చారని, వారి అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు యత్నిస్తోందని తెలిపారు. అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తత ప్రచారం కల్పించి, వైఎస్సార్సీపీనే చేయించినట్లుగా తప్పుడు ప్రచారానికి కుట్ర జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ఈ వ్యూహం రచించారన్నారు. స్వేఛ్చగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమని, అందుకే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారన్నారు. -
AP Elections 2024 Polling: పులివెందులకు సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి స్వస్థలం పులివెందులకు చేరుకుంటారు. రేపు.. సోమవారం ఉదయం పులివెందుల భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్ 90,543ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.క్లిక్ చేయండి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 -
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
-
ప్రచారంలో భారతమ్మ..!
-
పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
సాక్షి ప్రతినిధి, కడప: వారంతా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనే క్రియాశీలక కార్యకర్తలు. ఎన్నికల సంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు, గుర్తింపు పొందిన పార్టీ అభ్యరి్థగా మరి కొందరు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కంటే మించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తతంగం పులివెందుల నియోజకవర్గంలో తెరపైకి వచ్చింది. కలిసికట్టుగా ఒకే వాహనంలో, ఒకే గ్రామంలో టీడీపీ కోసం ప్రచారం కొనసాగిస్తున్న ఉదంతమిది. 👉పులివెందుల టౌన్‌కు చెందిన అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తుగా పార మరియు స్టోకర్ రిటర్నింగ్ అధికారి కేటాయించారు. అయితే ఎక్కడా తన గుర్తు తెలియజేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించడం లేదు. పైగా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం కోసం పనిచేస్తున్నారు. ఈనెల 3న అంబకపల్లి, మురారిచింతల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే బీటెక్ రవి కారుపై ఎస్కార్ట్ తరహాలో నిల్చొని గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న బీటెక్ రవి సోదరుడు భరత్‌కుమార్‌రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈయనతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిరెడ్డి సంజీవరెడ్డి, గోకనపల్లె వరప్రసాదరెడ్డిలు కూడా టీడీపీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. సంజీవరెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో కలిసి స్వయంగా టీడీపీలో చేరికల్లో పాల్గొన్నారు. మురారిచింతల గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం సైతం కలిసికట్టుగా చేపట్టారు. గోకనపల్లె వరప్రసాదరెడ్డి ఏకంగా టీడీపీ టోపి పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేపట్టడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
-
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
-
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
-
పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
-
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ భారతి స్పందన
వైఎస్సార్, సాక్షి: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత వ్యాఖ్యలపై పులివెందుల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారామె.సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతోషగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవు అనుకోవాలి. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగింది.చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఒక వ్యక్తిని చంపాలనుకోవడం తప్పు ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి. ఇది ఆయన విక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలను మెప్పించుకోవాలి కానీ, అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అని భారతి అన్నారు.ఇదిలా ఉంటే.. వైఎస్ భారతి ప్రచారానికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు వెళ్లి అయిదేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. -
ప్రతి ఇంటి దగ్గర మా బిడ్డ..మా బిడ్డ అంటున్నారు.. భార్యగా నాకు ఇంకేం కావాలి
-
ఇంటింటి ప్రచారంలో వైఎస్ భారతి
-
అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ..!
-
పులివెందులలో వైఎస్ భారతి.. ప్రతి ఇంటా ఆప్యాయ పలకరింపు (ఫొటోలు)
-
‘ఎంతమంది కలిసొచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’
సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు.‘‘ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం....మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్‌లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నా...ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు రూ.278 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా...ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ఒక్కసారి చూడండి. రైతులకు ప్రయోజనకరంగా మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది. మరోవైపు చక్రాయపేట మండలం చూడండి. గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్లు వస్తే మనం అక్కడ పంప్ హౌస్‌ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్ ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నా....మరి ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, మనల్ని తప్పుబట్టలేక చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకు వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లోమీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్‌లో ఎవరూ పడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసొచ్చినా, ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు, ఎల్లోమీడియా కావొచ్చు మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేయలేరని తెలియజేస్తున్నా చంద్రబాబు అండ్ కోకు....మీకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడు ఆయనకు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు జగన్ మోహన్ రెడ్డి గార్కి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గార్కి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే జగన్మోహన్రెడ్డి గారి విజయాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు....2019 లో మీరు ఎలా ఆదరించారో, ఆశీర్వదించారో మరి 2024 ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్నపైనా, అదేవిధంగా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాపైనా మెండుగా ఉంచాలని, 2019కి మించిన ఘన విజయాన్ని అందించాలని మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరుపేరున ప్రతి అన్న, తమ్ముడ్ని, ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నా’’ అని అవినాష్‌రెడ్డి తెలిపారు. -
పులివెందుల అంటే నమ్మకం, ప్రేమ
-
నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు...అవినాష్ పై సీఎం జగన్ ప్రశంసలు
-
పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్
-
వైఎస్ వివేకా హత్యపై జగన్ సంచలన కామెంట్స్..!
-
సీఎం జగన్ సింహ గర్జన..దద్దరిల్లిన పులివెందుల..
-
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
-
జగనన్నకు లక్ష ఓట్ల మెజారిటీ గ్యారంటీ..
-
పులివెందుల పబ్లిక్ మీటింగ్...సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ..
-
Watch Live: పులివెందులలో సీఎం జగన్ బహిరంగ సభ
-
మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్': సీఎం జగన్
పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్.. అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతోంది. యస్.. మన కల్చర్ మంచి చేయటం.. మన కల్చర్ మంచి మనసు..మన కల్చర్ మాట తప్పకపోవటం.. మన కల్చర్ బెదిరింపులకు లొంగకపోవడం.. అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. నమ్మకం.. ధైర్యం.. అభివృద్ధి.. సక్సెస్ స్టోరీపులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెత్తుతోందంటే ఈ అభివృద్ధి, ఆ మార్పులకు మూలం నా తండ్రి, మనందరి ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సవినయంగా తెలియజేస్తున్నా. పులివెందులలో ఏముంది? అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందులలో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయికి మన పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో కూడా వేస్తాం.నమ్మకాన్ని నింపింది పులివెందుల బిడ్డలేఒక్కటి గమనించండి. మనందరి పులివెందుల మనకే కాదు... రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అణువణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా.కాబట్టే ఆ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తుంటారు. పులివెందులను తెలుగుసీమ అభిమానించింది. నమ్మింది, కలిసి నడిచింది. పులివెందుల, కడప, రాయలసీమ మంచితనం, మాటపై నిలబడే గుండెధైర్యం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికీ అర్థమైంది కాబట్టే ఓ వైఎస్సార్, ఓ జగన్‌ను మారుమూల ప్రాంతాల్లో కూడా అభిమానించే కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు.కొత్తగా వైఎస్సార్ వారసులం అంటూ..వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, ఓ వదినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు. వీరికి తోడు, వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులం.. అంటూ మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలు, వైఎస్సార్‌ను ప్రేమించేవారు కాదా? ఒక్క విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.ఆ దివంగత మహానేత, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా, ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జిషీట్లో పెట్టింది ఎవరు? ఒక వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వైఎస్సార్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ పులివెందుల ప్రజలకు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్సార్ పోరాడిన వారితో కుమ్మక్కు!రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే కలిసిపోయి.. కాంగ్రెస్, టీడీపీతో చేయి కలిపి, వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి, ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా... వైఎస్సార్ వారసులు? వైఎస్సార్‌గారు బతికున్నంతకాలం ఎవరితో పోరాటం చేశారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ను అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ఎవరితో యుద్ధం చేశారు? అని ఆలోచన చేయమని కోరుతున్నా. కుట్రలో భాగస్వాములు వారసులా?వైఎస్సార్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి, వారికి మోకరిల్లి, వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఏకంగా ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని, ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు? ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్ లెగసీకి ఓటు వేసినట్లా? లేక వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టా? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా.వారి వెనుక ఎవరున్నారో కనిపిస్తూనే ఉందిఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా మీ అందరికి కనిపిస్తూనే ఉంది.ఆశ్చర్యం ఏమిటంటే.. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. ఔను నేనే చంపానని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరే చూస్తున్నారు కదా! నాడు చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలు, అధికార బలంతో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి? చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లాడు? అవినాష్ పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో అడిగిన ప్రశ్నలు సహేతుకమే కదా! ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలతో కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబు, బీజేపీకి లాభంఅసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయి? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత కూడా చార్జ్ షీట్లో చేర్చిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్సార్ పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అసలు ఎవరికి వైఎస్సార్ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. పులివెందుల, కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. వైఎస్సార్, పులివెందుల, వైఎస్సార్ జిల్లా పేర్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ఆలోచన చేయండి. మరోపక్క ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారో గమనించమని కోరుతున్నా. పేదలకు మంచి చేసేందుకే అధికారంపులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నామీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. మరొక్క విషయం కూడా నిండుమనసుతో చెబుతున్నా.వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చా. అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా అవినాశ్‌ను దూషించడం, అతడిని తెరమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మా అందరికన్నా అవినాష్ చాలా చిన్నోడు. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా? మన పాలనలో మనసు, మానవత్వం..ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం, ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ.. వీటన్నింటితోపాటు మీ జగన్ తెచ్చిన అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, చేయూత, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు, డీబీటీతో బటన్ నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయడం.. ఇవన్నీ మన మనసు, మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? నాన్న మరణం తర్వాత పట్టించుకున్నారా?నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా, ఎవరైనా మన పులివెందులను పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడంటే? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఈ 58 నెలల్లోనే కాదా? పులివెందులను, వైఎస్సార్ జిల్లాను ఇంకా అభివృద్ధి చేయాలి. వచ్చే ఐదేళ్లలో మీ అందరి అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా మన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్సార్, వైఎస్ జగన్.. ఇవన్నీ మనసున్న పేర్లు కాదా? ఈ పేర్లను చెరిపివేయాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులేనని గమనించాలని కోరుతున్నా. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్లు మన పులివెందుల అభివృద్ధి ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. మీ బిడ్డకు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అవినాశ్‌ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో దీవించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. ► ఈ కార్యక్రమంలోఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి చేయడంలో మీ జగన్‌ను కొట్టలేరు!జగన్‌ను పథకాలలో కొట్టలేరు. పాలనలో, పనితీరులో జగన్‌ను కొట్టలేరు. పల్లెకు మంచి చేయడంలో జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు. జగన్‌ను రైతులకు అందించిన రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్‌ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్‌ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు.వారి ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో జగన్ కంటే మంచి చేశాం అని వాళ్లు చెప్పలేరు. అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నా. మన బ్రాండ్ జగన్, మన బ్రాండ్ వైఎస్సార్, మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సీఎం జగన్ నామినేషన్ దాఖలుపులివెందుల: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సీఎస్ఐ చర్చి మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 11.10 గంటలకు అంబకపల్లె రోడ్డు మినీ సెక్రటేరియట్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి సీఎం రోడ్డు మార్గాన చేరుకున్నారు. 11.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో వెంకటేశులుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప ఉన్నారు.అనంతరం సీఎం జగన్ భాకరాపురంలోని స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కాసేపు గడిపారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కడప బయలుదేరి వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రుక్మిణి, కౌన్సిలర్ శైలజ, పలువురు మహిళలు గుమ్మడికాయతో ముఖ్యమంత్రికి దిష్టి తీశారు. కాగా, సీఎం జగన్ తరఫున పులివెందులలో వైఎస్ మనోహర్‌రెడ్డి గత సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. నా ప్రాణానికి ప్రాణం.. నా పులివెందుల పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమిస్తూ ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే పులివెందుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పులివెందుల అభివృద్ధికి మూలం వైఎస్సార్.పులివెందులను ఆదర్శంగా తీర్చిదిద్దాంపులివెందుల అభివృద్ధికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక.. ఆ కనిపిస్తున్న మెడికల్ కాలేజీ. నాన్న కలలుగన్న ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఈమధ్యనే పులివెందుల ప్రజలకు అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానంలో భాగంగా రూ.900 కోట్లతో కాలేటివాగు సామర్థ్యాన్ని 1.02 టీఎంసీలకు పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో మూడు, నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితిని మారుస్తూ ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించాం. 2020 నుంచి క్రమంతప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని ఏటా నింపుతూ వస్తున్నాం. పైడిపాలెం రిజర్వాయర్‌ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకున్నాం.యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1,000 కోట్లతో ఎరబ్రల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా జరగడం మన కళ్లెదుటే కనిపిస్తోంది. వాటర్ గ్రిడ్ ద్వారా రూ.480 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటి సరఫరా దాదాపుగా పూర్తయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ క్యాంపస్‌ను ప్రారంభించాం. ఏపీ కార్ల్‌లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతోపాటు వైఎస్సార్ వ్యవసాయ కళాశాల, ఉద్యాన కళాశాలలను నెలకొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమను పులివెందులకు తెచ్చాం. కేంద్రంతో పలుదఫాలు చర్చించి హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు సాధించాం. ఇవన్నీ మీ బిడ్డ సీఎం కాబట్టే కదా..పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్ స్టేడియం, పార్కులు లాంటివి మీరంతా చూస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్లెదుటే కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము మరో రూ.2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పులివెందులలో నవరత్నాలు పథకాల ద్వారా 94.4 శాతం గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందులలోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. – సాక్షి ప్రతినిధి, కడప -
నేడు పురిటిగడ్డ పులివెందులకు సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
షర్మిల చీప్ పాలిటిక్స్..మహిళా నేతలు ఆగ్రహం
-
‘మా కుటుంబంలో చీలిక తెచ్చారు’: ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్: తనేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలుసని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో వైఎస్ఆర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మా కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి. వైఎస్ అవినాష్‌రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఉన్నాం. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. అయినా నేను ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసం పని చేస్తా. బలిజలకు 31 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ. బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మనది. గడచిన 16 నెలలుగా వర్షాలు పడకపోయినా గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులను నింపడం వల్లే ప్రస్తుతం రైతులకు సాగునీటికి, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేదు. గతంలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీని విస్మరించింది. చంద్రబాబు నాయుడికి ధైర్యం సరిపోక మళ్లీ కూటమిగా వచ్చి 2014 లో ఇచ్చిన అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారు’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి.. కర్నూలు జిల్లాలో కూటమికి భారీ షాక్ -
సీఎం జగన్ నామినేషన్ కు.. డేట్ ఫిక్స్
-
వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం
-
పులివెందులలో భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు
-
సొంతగడ్డ పులివెందులపై మమకారం తీరేది కాదన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..ఇంకా ఇతర అప్డేట్స్