Pushpa 2: The Rule
-
'పుష్ప'రాజ్‌గా జడేజా.. వీడియో రిలీజ్ చేసిన 'చెన్నై సూపర్ కింగ్స్'
అంతర్జాతీయ క్రికెట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, పుష్ప సినిమా విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్‌తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం పుష్ప మార్క్ స్టైల్లో 'తగ్గేదేలే' అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప2 విడుదలైంది. మార్చి 22నుంచి ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక వీడియోను పంచుకుంది. అందులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' గాడి రూల్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌ను వారు రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది.కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్‌లో చాలామంది కనిపిస్తారు. క్రికెటర్స్ వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా 'తగ్గేదేలే' అంటూ ఫోజులు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్‌ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎమ్‌తో ఒక సీన్ రీక్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంది. వైల్డ్‌ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ ఐపీఎల్ 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది.క్రికెట్లో పుష్ప మార్క్క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్‌కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమాని అయిపోయాడు. పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ అభిమానులను మెప్పించాడు. రీసెంట్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై శతకంతో అలరించిన ఆయన అర్ధశతకం నమోదు చేయగానే ‘పుష్ప’ స్టైల్లో నితీశ్ స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో, పాండ్యా,నజ్ముల్ ఇస్లాం,శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
బద్దలు అవుతున్న పుష్ప2 రికార్డ్స్
-
గ్లోబల్ స్టేజీపై 'పీలింగ్స్'.. వైబ్ అదిరింది!
తెలుగు సినిమా ఇప్పుడు ఎల్లలు దాటిపోయింది. బాహుబలికి వచ్చిన గుర్తింపు కావొచ్చు, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటుకు వచ్చిన ఆస్కార్ కావొచ్చు. మన సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక పాటల గురించైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలానే 'పుష్ప 2'లోని(Pushpa 2 Movie) పీలింగ్స్ పాట గ్లోబల్ స్టేజీ దద్దరిల్లిపోయేలా చేసింది.మన దగ్గర బాస్కెట్ బాల్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ అమెరికాలో ఈ ఆటకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్బీఏ అయితే ఎప్పటికప్పుడు మ్యాచులు నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా అలానే అమెరికాలోని టెక్సాస్ లో హ్యూస్టర్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. విరామ సమయంలో స్టేడియంలో కూర్చున్న వీక్షకుల్ని అలరించేందుకు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేశారు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)ఇందులో భాగంగా 45 మంది డ్యాన్సర్స్.. పుష్ప 2చిత్రంలోని పీలింగ్స్ పాటకు (Peelings Song) స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫీవర్ గ్లోబల్ స్టేజీ వరకు వెళ్లిందని బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.గతేడాది డిసెంబర్ 5న 'పుష్ప 2' (Allu Arjun) థియేటర్లలో రిలీజైంది. రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)A grand tribute to Icon Star @alluarjun & #Pushpa2 at the Houston Rockets vs Milwaukee Bucks game during the halftime show at @NBA!A proud and historic moment, celebrating Indian cinema and culture on a global stage! 🌍🇮🇳#Pushpa2TheRule #AlluArjunpic.twitter.com/hEjhB9K2Pf— Milagro Movies (@MilagroMovies) February 27, 2025 -
పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్‌ను ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్‌ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్‌తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్‌తో పాక్ టీమ్‌ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్‌కు ఫేస్‌కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్
ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఇదే మ్యాచ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ ని కూడా గట్టిగానే కాక పట్టేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి.. కాసేపటి వరకు అస్సలు వదల్లేదు. ఆ వీడియోనే తన ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.సుకుమార్ ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి.. ఈయన్ని తెగ పొగిడేసింది. 'సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో స్పూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం' అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ మధ్యే సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్పులేసిన ఊర్వశి.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలైపోయే ప్లాన్ ఏమైనా వేస్తుందా అనిపిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
చీర కట్టుకోవాలంటే భయమేసింది, నటుడిగా 5.5 మార్కులే..: అల్లు అర్జున్
తగ్గేదేలె అన్న డైలాగ్‌ను సినిమాలోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప 2 చిత్రంతో ఏకంగా రూ.1871 కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ తొలి సంచికపై కనిపించిన మొట్టమొదటి భారతీయ హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఈ కవర్ పేజీ షోటషూట్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.భయపడ్డా..అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గంగమ్మ జాతర సన్నివేశంలో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను మొదట భయపడ్డాను. ఇది వర్కవుట్ కాదేమో అన్నాను. కానీ సుకుమార్ (Sukumar) మాత్రం ఆ సన్నివేశంలో నువ్వు చీర కట్టుకుని అమ్మాయిగా కనిపించాలంతే అన్నాడు. అందుకోసం మొదట డ్రాయింగ్స్ వేశారు. నాకు ఏ లుక్ సూటవుతుందని పరీక్షించారు. తర్వాత నెమ్మదిగా నాలోనూ నమ్మకం మొదలైంది. కచ్చితంగా ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనిపించింది. నటుడిగా ఐదున్నర మార్కులుఅదే సమయంలో ఇది నాకెంతో ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. ఎందుకంటే చీర కట్టినా కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాలి. ఫైనల్‌గా ఆ సీన్ అనుకున్నట్లుగానే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిందని నేను గర్వాన్ని తలకెక్కించుకోలేదు. నటుడిగా నాకు 10కి 5.5 మార్కులు వేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 (Pushpa 2 The Rule) విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.చదవండి: దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు -
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్‌కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్‌కు స్పెషల్‌గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
‘హాలీవుడ్ రిపోర్టర్’పై అల్లు అర్జున్.. అరుదైన ఘనత
పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇటీవల విడుదలైన పుష్ప2 చిత్రం హాలీవుడ్‌ని సైతం మెప్పించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1871 కోట్లు వసూళ్లను సాధించింది రికార్డులు సృష్టించింది. ఇలా పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ఎన్నో అవార్డులను, రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) పేరుతో భారత్‌లోనూ ప్రచురితం కానుంది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్‌ను నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు.‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను వంద శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వివరించారు. -
'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప 2'.. కలెక్షన్స్ ఎంతంటే?
-
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' (రూ.2024 కోట్లు) టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో 'పుష్ప2' (రూ. 1871 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.1810 కోట్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కేజీయఫ్- 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్‌లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డ్లను నమోదు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
వివాహా బంధంలోకి అడుగుపెట్టిన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ (ఫోటోలు)
-
పుష్ప ఓ కథ కాదు.. విజయానికి కారణం ఇదే: నాగార్జున
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్లో నెగెటివ్ టాకే వినిపించింది. కానీ బాలీవుడ్లో మాత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత పుష్ప 2(pushpa 2: The Rule) కూడా మన దగ్గర కంటే బాలీవుడ్లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 చిత్రాన్ని ఆదరించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. పుష్ప సీక్వెల్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక గల కారణాలను సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) వెల్లడించాడు. పుష్ప చిత్రం ఇంత సూపర్ హిట్‌గా నిలవడానికి కారణం కథ కాదని.. పుష్పరాజ్ పాత్రకు దక్కిన ఆదరణనే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పుష్ప రిలీజ్ తర్వాత పుష్పరాజ్ పాత్ర ఒక సూపర్ హీరో పాత్రగా మారాడు. సోషల్ మీడియాలో ఆ పాత్రకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. మీమ్స్, స్పూఫ్లోనూ పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. అందుకే పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక్కడ కథ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది’అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. -
వాలెంటైన్ రోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ‘పుష్ప 2’ నటి పావని (ఫోటోలు)
-
‘పుష్ప 2’ అల్లుఅర్జున్‌కి శాపమా?
గంగోత్రి నుంచి స్టైలిస్ట్ స్టార్ దాకా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రయాణం దినదిన ప్రవర్ధమానమవుతూ సాగింది. ఆ తర్వాత ఆయన ఐకాన్‌స్టార్ గా మారే క్రమంలో పుష్పతో జరిగిన ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం ఒక విస్ఫోటనం అని చెప్పాలి. అప్పటి దాకా అగ్రగామి టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 లో సైతం లేని బన్నీని ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ పోటీకి హై జంప్ చేయించిన చిత్రం అది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్(Pushpa 2: The Rule) అల్లు అర్జున్ క్రేజ్‌ని పూర్తిగా ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఇలా అకస్మాత్తుగా నెంబర్ వన్ పొజిషన్లో ఎగిరి కూర్చున్నది లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది సినీ పండితుల అంచనాలకు సైతం అందడం లేదు. రెండో పార్ట్ రిలీజ్‌కి ముందే బీహార్ రాష్ట్రంలో బన్నీ కార్యక్రమంలో లాఠీచార్జి జరగడమే ఆశ్చర్యం అనుకుంటే పుష్ప 2 విడుదలయ్యాక హిందీ సినిమాల రికార్డులన్నీ చెరిపేయడం మరింత ఆశ్చర్యం....ధియేటర్ల రికార్డుల పరంపర అలా ఉంచితే... ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట కూడా సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక మొత్తం చెల్లించి నెట్‌ఫ్లిక్స్ స్వంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వీక్షకులు చూసిన 2వ ఆంగ్లేతర చిత్రంగా నిలవడం విశేషం. ఏదేమైనా.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడనేది నిజం. ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ విషయంలో వరుసపెట్టి పుష్ప 2 సృష్టించిన ఆశ్చర్యాల నుంచి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటున్నాం.ఈ నేపధ్యంలో కొత్తగా ఓ ప్రశ్న ఉదయిస్తోంది....నెక్ట్స్ ఏమిటి? అని. నెక్ట్స్ ఏముంది? అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది అంటూ ఎవరైనా ఠక్కున చెప్పేయవచ్చు. పుష్ప కి ముందు అయితే ఇలా అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అంటే మామూలుగా విని ఊరుకునే వార్త మాత్రమే. అయితే ఇప్పుడు అలా కాదు. ఆకాశమంత ఎదిగిన పుష్పరాజ్ ఇమేజ్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతీ అడుగునూ పట్టి కుదిపేస్తోంది. ఆ ఇమేజే ఇప్పుడు బన్నీకి సవాల్‌గా మారనుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ సహా టాప్ హీరోలు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునే ఉంటారు. అయితే వీరందరి కన్నా కాస్త భిన్నమైనదిగానే ఐకాన్ స్టార్ పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే... పుష్పరాజ్ అనే క్యారెక్టర్ విపరీతంగా ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకుపోయింది. దాంతో బన్నీ నెక్ట్స్ మూవీ పైన ప్రేక్షకుల్లో ఆశలు ఏ స్థాయిలో ఉంటాయో, అవి బన్నీ తర్వాతి సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనాలకు అందడం లేదు.ముందుగానే కధ, పాత్రల తీరుతెన్నులపై చర్చలు ముగిసినా, పుష్ప 2 తర్వాత... రానున్న అల్లు అర్జున్ సినిమాల్లోని ఐకాన్ స్టార్ పాత్ర ల్లో ఆయన పెరిగిన ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్నయినా మార్పు చేర్పులు చేయక తప్పదు. అన్నీ చేసినా... పుష్పరాజ్ స్థాయిలో మరో పాత్రను అల్లు అర్జున్‌కి తీసుకురాగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా ఒక హీరోకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అదే స్థాయిలో అసూయలు, ప్రొఫెషనల్ శతృత్వాలూ తప్పవు. సహజంగానే అవి బన్నీ ఫెయిల్యూర్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని తలకెత్తుకున్న కిరీట భారాన్ని తడబడకుండా మోయడంలో నేర్పరితనాన్ని చూపడంపైనే ఐకాన్ స్టార్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తడబడితే మాత్రం... అల్లు అర్జున్ అనే హీరోకి పుష్పరాజ్ పాత్ర వరమూ, శాపమూ రెండూ తానే అవడం తధ్యం. -
నా హృదయంలో ప్రత్యేక స్థానం: రష్మికా మందన్నా
‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ (‘Pushpa 2: The Rule) సినిమాల్లో శ్రీవల్లి పాత్రతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రష్మికా మందన్నా(Rashmika Mandanna). అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’(2021), ‘పుష్ప 2: ది రూల్’(2024) సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించి, వసూళ్లతో పాటు రికార్డులు సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే జిమ్‌లో కాలికి తగిలిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక ఈ థ్యాంక్స్ మీట్‌కు హాజరుకాలేకపోయారు. దీంతో చిత్రయూనిట్‌కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రష్మిక. ‘‘శనివారం జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్లో నేను పాల్గొనలేకపోయాను. కానీ, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా.సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కృతజ్ఞతలు. మీరు ఎంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్‌పీస్‌ను ఇచ్చినందుకు ఒక ప్రేక్షకురాలిగా థ్యాంక్స్. అదేవిధంగా శ్రీవల్లిగా చె΄్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రం కోసం అన్ని విభాగాలు బాగా పని చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రష్మిక. -
అతను లేకుండా ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయలేదు: సుకుమార్
పుష్ప-2 ది రూల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్లో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ లేకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదని సుకుమార్ అన్నారు. భవిష్యత్తులో కూడా చేయనేమో అని వెల్లడించారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. దీంతో రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రానికి డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.సుకుమార్ మాట్లాడుతూ.. 'నా పేరుతో పాటు ఉండే మరొక పేరు దేవీశ్రీ ప్రసాద్. నాపేరు సుకుమార్ కాదు.. దేవీశ్రీ ప్రసాద్ సుకుమార్. తను లేకుండా ఎప్పుడు సినిమా చేయలేదు. భవిష్యత్తులో కూడా తీయనేమో. అందుకే ముఖ్యంగా తను నా ఫస్ట్ ఆడియన్. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పగానే దేవీశ్రీ కథ అయిపోయింది అన్నాడు. సినిమా ఇంతే అనేశాడు. అలా పుష్ప-2 కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే రిలీజ్ చేశాను.. అది దేవీశ్రీకి మాత్రమే తెలుసు' అని అన్నారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని హింట్ ఇచ్చేశారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే చెర్రీ సైతం సెట్లో తన కూతురితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో జతకట్టనున్నారు. తాజాగా పుష్ప డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లో దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పారని వెల్లడించారు. ఓపెనింగ్ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. కాగా..రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
పుష్ప-2 పావని.. ఆ విషయం గుర్తు చేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు!
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు కొనసాగింపుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు లేని విధంగా రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి-1, బాహుబలి-1, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ వైడ్‌గా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.పుష్ప-2లో ఆకట్టుకున్న పావని..పుష్ప-2లో అజయ్ కూతురిగా నటించిన పావని కరణం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుష్పరాజ్‌ను చిన్నాయన అంటూ కావేరి పాత్రలో అభిమానులను మెప్పించింది పావని. అయితే పుష్ప-2 చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచింది. బన్నీ గాల్లోకి ఎగురుతూ చేసిన ఫైట్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పావని ఎమోషనలైంంది. తనను గుర్తించి అవకాశమిచ్చిన డైరెక్టర్ సుకుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.ఈవెంట్లో పావని మాట్లాడుతూ..' ఈవెంట్‌కు పెద్దలందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా క్యారెక్టర్‌తో పాటు టీమ్ మొత్తానికి ఊహించని దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఎప్పుడైనా నిద్రలోంచి లేస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. సుకుమార్ గారికి, బన్నీగారికి థ్యాంక్స్ చెప్పలేదనే బాధ ఉండేది. సినిమా రిలీజ్ అయ్యాక సుక్కు సార్, బన్నీ సార్‌ను కలవలేదంటూ ఎమోషనలైంది. అల్లు అర్జున్ సార్‌కు నేను వీరాభిమానిని. సెట్లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటా సార్. అంతేకాదు మీరు నాకు ఆదర్శం కూడా. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తా. సుక్కు సార్ మీరు నన్ను గుర్తించి అవకాశమిచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. సినిమా చూసిన తర్వాత నన్ను బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన చిత్ర బృందానికి థ్యాంక్స్.' ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ సార్‌కు థ్యాంక్స్ అంటూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది పావని కరణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
'పుష్ప రెండో పార్ట్ రావడానికి ఆయనే కారణం'.. సుకుమార్ ఆసక్తికర కామెంట్స్
పుష్ప సినిమా గురించి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని అసలు రెండు పార్టులు కాదని అన్నారు. ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయ్యేసరికి 3 గంటలు రావడంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపారు. పుష్ప సినిమాకు జరిగిన మిరాకిల్ ఇదే అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి రూ.1800 కోట్లు తీసుకు వచ్చింది చెర్రీగానే అని నవ్వుతూ మాట్లాడారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి.. ఫస్ట్ హాఫ్‌ను పుష్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని సుకుమార్ వివరించారు. దీనికంతా చెర్రీనే కారణం.. ఒక్క సినిమాతో పోయేదానికి పుష్ప సిరీస్‌గా మార్చేశారు అని సరదాగా అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ..' నా ఫస్ట్ ప్రేక్షకుడు చెర్రీగారే. ప్రతి సీన్‌ను గమనిస్తూ ఉంటారు. మైత్రి మూవీ మేకర్స్‌కి డబ్బులు వచ్చాయంటే కారణం ఆయనే. నిజానికి అందరూ అనుకున్నట్లు రెండు పార్టులు కాదు. మొదట పుష్ప అనుకున్నది ఒక్క సినిమానే. ఫస్ట్ హాఫ్ 3 గంటలు వచ్చిందని చెర్రీ అన్నారు. ముందు రిలీజ్ చేసేయండి చెప్పాడు. ఇదే పుష్ప సినిమాలో జరిగిన అద్భుతం. ఒక్క సినిమాతో పోయేదానికి మూడు పార్టులు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చెర్రీ గారిదే' అని నవ్వుతూ అన్నారు. -
పుష్ప వల్లే విదేశాల్లో కూడా గుర్తు పడుతున్నారు: సునీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.పుష్ప-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు పుష్ప-2 టీమ్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన టాలీవుడ్ నటుడు సునీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్లే తనను ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నారని తెలిపారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతుండగా కొందరు పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తు పట్టారని వెల్లడించారు. అంతేకాదు తమకు భోజనాలు వండి పెట్టారని సునీల్ వివరించారు.సునీల్ మాట్లాడుతూ.. 'మూవీ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లా. రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు. నేను 9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్‌కు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్‌కి వెళ్లి అడిగా. కానీ అది అప్పటికే క్లోజ్ చేశారని అక్కడే ఉన్న ఓ మహిళ చెప్పింది. ఆ తర్వాత దగ్గర్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికా. కబాబ్ పాయింట్ అనే ఓ చిన్న హోటల్ కనిపించింది. ఇండియన్ ఫుడ్‌కు సంబంధించిన హోటల్ అయి ఉండొచ్చని అక్కడి వెళ్లా. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది. మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు. వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్ అని. నాతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడా' అని పంచుకున్నారు. పుష్ప తర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను చూస్తే అందరికీ పుష్ప సినిమానే గుర్తుకు వస్తోందని అన్నారు. True global sensation @alluarjun 🙏🔥#Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/B7phDjPLBh— Mad Max (@madmaxtweetz) February 8, 2025 -
Pushpa 2 Thanks Meet: ‘పుష్ప2’ థ్యాంక్స్ మీట్ (ఫోటోలు)
-
సుకుమార్ ఏది చెపితే అది 5 ఏళ్ల పాటు పిచ్చోళ్లా చేశాం : అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1895 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘థ్యాంక్స్ మీట్’ ఏర్పాటు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ తొలిసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.పుష్ప సమయంలోనే కోవిడ్ ప్రారంభమైంది. ఈ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా జాతర షూటింగ్ లాస్ట్ వరకు చూస్తానా అనిపించేది . మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. ‘పుష్ప’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెపితే అది పిచ్చొల్లులాగా వింటూనే పనిచేశాం. సినిమాలో ఏది బాగుందని ప్రశంసలు దక్కినా అది డైరెక్టర్ గొప్పతనమే. విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా సుకుమార్ అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ, ఈ విజయంలోని పూర్తి క్రెడిట్ తనకే సొంతం దేవిశ్రీ లేకుండా ‘పుష్ప’ను ఊహించడం చాలా కష్టం. తను ఈ సినిమాకు ఓ గొప్ప శక్తిని అందించాడు. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ, అదొక అద్భుతంలా అయితే ఉంటుంది (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు. -
పుష్ప ఐదేళ్ల జర్నీలో ప్రతి క్షణం నాకు ముఖ్యమే: హీరో అల్లు అర్జున్
‘‘చాలాసార్లు ‘పుష్ప’ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో ఎంతో కష్టపడ్డాం. జాతర ఎపిసోడ్ టైమ్‌లో... ఈ ఎపిసోడ్ ఎండ్‌ని చూడగలనా అనిపించింది. ‘పుష్ప 2’(Pushpa 2)ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. అయితే చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. ‘పుష్ప’ సినిమాకు చెందిన ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ అదొక అద్భుతంలా అయితే ఉంది (నవ్వుతూ)’’ అన్నారు అల్లు అర్జున్(Allu Arjun) .హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ‘థ్యాంక్స్ మీట్’(Thank You Meet)ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.ఇండియన్ సినిమాలోని అన్ని ఇండస్ట్రీలకు, ఆడియన్స్ కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘పుష్ప’ ఫ్యాన్స్ కు థ్యాంక్స్. ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే... థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఒక యాక్టర్ ఎంత బాగా అయినా చేయవచ్చు. నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు... కానీ అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టర్ మాత్రమే. ఒకరు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే... సరైన మార్గ దర్శకులు లేకపోతే ఏ యాక్టర్ అయినా బ్యాడ్ యాక్టరే.నన్ను, మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు థ్యాంక్స్ (సుకుమార్‌ను ఉద్దేశించి). తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా చేసినందుకు థ్యాంక్స్. డార్లింగ్... నిన్ను అందరూ నమ్ముతారు. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు నమ్మవు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ , వై. రవిశంకర్గార్ల వల్లే ‘పుష్ప’ సాధ్యమైంది. అలాగే ప్రతి రోజూ కష్టపడే చెర్రీగారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ, నా వ్యక్తిగత ఏఏ టీమ్ అందరికీ ధన్యవాదాలు. సాంగ్స్ మిలియన్స్ ఎలా అవుతాయి అనుకున్న నాకు బిలియన్స్ లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్. శ్రీవల్లి (రష్మిక), కెమేరామేన్ క్యూబా, డ్యాన్స్మాస్టర్స్ గణేశ్, విజయ్, ప్రేమ్ రక్షిత్, శేఖర్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నర్ పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా అని ప్రతి సీన్ ముందు అల్లు అర్జున్‌కి చెప్పేవాడిని. ఈ మాటను మరోలా తీసుకోవద్దు... ట్రోల్స్ చేయవద్దు. మా కాలనీలో ఓ పెద్దాయన నాతో ‘ఎస్వీ రంగారావుగారిలా నటించాడు’ అన్నారు. ఆ పక్కనే ఉన్న మరో పెద్దాయన ‘ఎస్వీఆర్ డ్యాన్సులు, ఫైట్లు చేయడు కదా’ అన్నారు. అల్లు అర్జున్ పరిపూర్ణమైన హీరో. డ్యాన్స్ చేయగలడు... ఫైట్స్ చేయగలడు... ఏడవగలడు... నవ్వగలడు... ‘రంగస్థలం’ నుంచి నాకు సూపర్‌డూపర్ హిట్స్ వచ్చాయంటే కారణం మైత్రీ మూవీ మేకర్సే. మంచి సీన్స్ కోసం రీ షూట్స్ చేసేంత ఫ్రీడమ్ ఇచ్చారు.‘పుష్ప’ సక్సెస్ మైత్రీ మూవీ మేకర్స్‌కే చెందుతుంది. దేవీశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమా తీయలేనేమో! మొదట్లో ‘పుష్ప’ రెండు పార్ట్స్ కాదు. తొలి భాగానికే మూడు గంటల ఫుటేజ్ వచ్చిందని ‘పుష్ప 1’గా రిలీజ్ చేశాం. ఇది ‘పుష్ప’కు జరిగిన అద్భుతం. ఇది చెర్రీగారి వల్ల జరిగింది. ‘పుష్ప 2’నూ ఇలానే రిలీజ్ చేశాం. ఇలా మా లైఫ్‌లో ఆయన ‘పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3’ పెట్టారు. ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ‘పుష్ప 2’తో అసోసియేట్ అయిన అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు.‘‘పుష్ప 1, పుష్ప 2’ అనే మ్యాజిక్‌ను క్రియేట్ చేసిన అందరికీ... ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ‘‘పుష్ప 3’ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు ‘పుష్ప 2’ను హిందీలో పంపిణీ చేసిన హిందీ నిర్మాత అనిల్ తడానీ. ‘‘సుకుమార్‌గారి విజన్‌ని అల్లు అర్జున్‌గారు సరిగ్గా తీసుకెళ్లగలిగారు. ‘పుష్ప’ కోసం చాలా కాల్షీట్స్ ఇచ్చారు రష్మిక. మా సినిమాకు దేవీగారు బ్యాక్‌బోన్. ‘పుష్ప’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘పుష్ప 2’ అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘స్పెయిన్‌లో షూటింగ్ చేస్తూ, అర్ధరాత్రి వేళ అక్కడ ఓ రెస్టారెంట్‌కి వెళితే, ఆ రెస్టారెంట్ నడిపే పాకిస్తాన్ వ్యక్తి నన్ను ‘పుష్ప’ సినిమాలోని మంగళం శీనుగా గుర్తుపట్టి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీలయ్యాను. తమిళ, కన్నడ, మలయాళం... ఇలా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవంతో పాటు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది ‘పుష్ప’తోనే సాధ్యమైంది’’ అన్నారు సునీల్. ‘‘పుష్ప’ సినిమా అయ్యేలోపే రెండు ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్‌ను తట్టుకుని, అందరికీ కరెక్ట్‌గా పేమెంట్ చేసిన మా అకౌంట్స్ టీమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు మైత్రీ సీఈవో చెర్రీ. ‘నైజాంలో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘పుష్ప 2’ కూడా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున మాట్లాడారు. అజయ్, ఆదిత్యా మీనన్, జగదీశ్, గణేశ్ ఆచార్య మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి, ఎడిటర్ నవీన్ నూలి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అల్లు అర్జున్, సుకుమార్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కలిసి ‘పుష్ప’ టీమ్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. -
టైట్ సెక్యూరిటీ మధ్య స్టార్ హోటల్లో 'పుష్ప' ఫైనల్ టచ్
అల్లు అర్జున్ - సుకుమార్‌ల యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే, సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటతో సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు జరపలేదు. అయితే, పుష్ప2 థియేటర్ రన్ కూడా పూర్తి అయింది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. దీంతో సినిమా చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విజయంలో కీలకంగా పనిచేసిన పుష్ప2 నటీనటులతో పాటు టెక్నీషయన్లతో ఫైనల్ టచ్‌గా ఒక థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటెల్లో ఈ రోజు (ఫిబ్రవరి 8) సాయింత్రం పుష్ప2 థ్యాంక్స్ మీట్ జరగనుంది. టైట్ సెక్యూరిటీ మధ్య చాలా లిమిటెడ్‌గా ఆహ్వానాలు పంపారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ షీల్డ్‌లు అందించి వారిని సత్కరించనున్నారు. పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నాడోనని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సంధ్య థియేటర్ ఘటన గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చని తెలుస్తోంది. కేవలం తన తర్వాతి సినిమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని సమాచారం ఉంది.పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. -
ప్రయాగ్ రాజ్‌లో పుష్పరాజ్.. పోలీసులు ఫిదా!
అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఇటీవల పుష్ప-2 ఓటీటీలో విడుదలవగా.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌పై తెగ చర్చింకుంటున్నారు. హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్‌పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఇండియావ్యాప్తంగా బన్నీ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప-2 నార్త్‌లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దీంతో సౌత్ కంటే నార్లోనే పుష్పరాజ్ హవా ఎక్కువగా కొనసాగింది. దీంతో ఉత్తరాది ఫ్యాన్స్ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు. పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తాజాగా ఓ అభిమాని అచ్చం పుష్పరాజ్ స్టైల్లో కనిపించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళాకు వచ్చాడు. పవిత్ర స్నానం చేసిన అల్లు అర్జున్ అభిమాని అచ్చం పుష్ప సినిమాలో దుస్తులు ధరించి డైలాగ్స్‌తో అదరగొట్టాడు. ఇది చూసిన పోలీసులు అతని స్టైల్‌కు ఫిదా అయ్యారు. అతన్ని చెప్పే డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.(ఇది చదవండి: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!)కాగా.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.Prayagraj: A fan of Allu Arjun, who came from Maharashtra to take the Maha Kumbh bath.During this, the fan also recited many dialogues from the movie Pushpa while acting, which became a topic of discussion among the devotees present there.#Prayagraj #AlluArjunFan #Mahakumbh pic.twitter.com/mK0s1wtasA— Our North East (@1OurNortheast) February 6, 2025महाकुम्भ स्नान करने के लिए महाराष्ट्र से आए अल्लू अर्जुन के एक फैन ने संगम में आस्था की डुबकी लगाई। इस दौरान फैन ने पुष्पा फिल्म की एक्टिंग करते हुए कई डायलॉग भी सुनाए, जो वहां मौजूद श्रद्धालुओं के बीच चर्चा का विषय बने। #Prayagraj #AlluArjunFan #Mahakumbh @MahaaKumbh pic.twitter.com/wxetmRuQoH— Dinesh Tiwari 🇮🇳 (@TiwariDineshTi1) February 5, 2025 -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్‌క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్‌తో సీక్వెల్‌పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అలాగే నార్త్‌లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్‌పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్‌బ్లాక్‌గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్‌ను కొనసాగించగలిగితే, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్‌పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
'పుష్ప-2కు ఇంటర్నేషనల్ క్రేజ్'.. తమ్ముడి ట్వీట్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్‌పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw— Allu Sirish (@AlluSirish) February 4, 2025 -
పుష్ప2 'అల్లు అర్జున్' యాక్షన్ సీన్‌పై హాలీవుడ్ కామెంట్స్
అల్లు అర్జున్- సుకుమార్‌ల పుష్ప2(Pushpa 2 Movie) సినిమా ఓటీటీలో కూడా సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. గ్లోబల్ రేంజ్లో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన పుష్పరాజ్.. ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ పేరుతో జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix ) స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా పలు రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తూ.. ప్రపంచ సినీ అభిమానుల చేత అల్లు అర్జున్ ప్రశంసలు అందుకుంటున్నారు.పుష్ప2 ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యూస్ పరంగా ట్రెండింగ్‌లో ఉంది. ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 21 దేశాల్లో టాప్-10లో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా,జపాన్, అమెరికా,దుబాయ్ వంటి దేశాల్లో ఈ చిత్రాన్ని ఎక్కువగా చూస్తున్నారు. 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే సినిమా డైలాగ్ నిజం అయ్యేలా బన్నీ చేశాడని అభిమానులు చెబుతున్నారు. గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రం దుమ్మురేపుతుండటంతో టాలీవుడ్ పేరు వైరల్ అవుతుంది. ఓటీటీ వెర్షన్లో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు ఉంది.హాలీవుడ్ నుంచి ప్రశంసలుపుష్ప2 ఓటీటీలో చాలా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో విస్తృతంగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. దీంతో మన సినిమా గురించి హాలీవుడ్(Hollywood ) సినీ అభిమానులను మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సీన్.. అల్లు అర్జున్(Allu Arjun) చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న 'జాతర' సీక్వెన్స్‌కు వారు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా బన్నీ అలాగే కనిపిస్తాడు. దీన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.. చూస్తున్నంత సేపు గూస్బంప్స్ వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. అవెంజర్స్ వంటి సినిమాలకు మించి యాక్షన్ సీన్స్‌లో అల్లు అర్జున్ దుమ్మురేపాడని వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇలాంటి సీన్స్ తీయడం హాలీవుడ్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని వారు అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న అమెరికన్ సినిమాలకంటే పుష్ప2 చాలా బెటర్ అంటూ వారు చెప్పడంతో పుష్ప2 రేంజ్ ఏంటో తెలుపుతుంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న మార్వెల్ వంటి సినిమాల్లో కూడా ఇంతటి సృజనాత్మకత లేదని అక్కడి రివ్యూవర్లు చెబుతున్నారు. జాతర ఎపిసోడ్లో బన్నీ చేసిన సీన్‌తో పాటు ఫైనల్లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూసిన వారు.. అదంతా గ్రాఫిక్స్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా ఎంట్రీలో జపాన్‌కు వెళ్లిన బన్నీ చేతులకు రెక్కలు లేకుండా అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నాడు..? అంటూ కొందరు విమర్శలు చేశారు. కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్లో ఎప్పుడో ఆపేసిని కుంగ్‌ఫూ సినిమాలు గుర్తుకొచ్చాయిని కొందరు చెప్పారు. ఇలా పుష్ప2 గ్లోబల్ స్థాయిలో ఎక్కువగా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల పుష్ప-2 ది రూల్ ఓటీటీకి కూడా వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సీన్స్‌తో పాటు ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం అడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అల్లు అర్జున్ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.బన్నీ ఫైట్ సీక్వెన్స్ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ సైతం స్పందించారు. అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదు.. కానీ వాళ్లు చేసి చూపించారు అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరికొందరైతే పుష్ప-2 గ్లోబల్, ఇంటర్నేషనల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా పుష్పరాజ్ మూవీలోని డైలాగ్‌ను నిజం చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
మహాకుంభ్ మేళా ఫేమ్ మోనాలిసా.. ఏకంగా ఐకాన్ స్టార్‌తో!
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. తన జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. కుంభమేళాలో పూసలు విక్రయిస్తున్న ఆమెను ఓ నెటిజన్ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. ఇంకేముంది కొద్ది గంటల్లోనే ఆమె వీడియోలు వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాదు దెబ్బకు బాలీవుడ్ సినిమా ఆఫర్ ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేసింది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో అవకాశమిచ్చాడు. అంతేకాదు ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు.సినిమా ఆఫర్ రావడంతో మోనాలిసా భోంస్లే ఆనందం వ్యక్తం చేసింది. సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.ఐకాన్ స్టార్‌తో మోనాలిసా..తాజాగా మోనాలిసా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోటోకు పోజులిచ్చింది. పుష్ప-2 మూవీ పోస్టర్‌తో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు పోస్టర్‌తో బయట ఉన్నా.. రేపటి రోజున థియేటర్లో కనిపిస్తా.. త్వరలోనే ముంబయిలో కలుద్దాం.. అల్లు అర్జున్ పుష్ప-2 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఊహించని విధంగా ఫేమ్..మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు. आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है जल्दी ही मुंबई में मिलेंगेअल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025 -
అక్కడ పుష్ప 2 గ్రాండ్ రిలీజ్! మరో 1000 కోట్లు గ్యారెంటీ..
-
'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్‌లో మొదటిస్థానంలో ఉంది.అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.అయితే క్లైమాక్స్ సీన్‌పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్‌ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్ సీన్‌తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్‌ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.కాటేరమ్మ > రప్పా రప్పాపుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్ సీన్ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్‌గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్‌కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.In my opinion,Pushpa 2 climax was more over the top.Salaar kaateramma scene was worth it.It has a greater number of repeats than rappa sequence of pushpa.It's what I really felt.Nonetheless, AA did a great job.But for me,Kaateramma > Rappa#Salaar #Pushpa2 https://t.co/9DnePiuTtA— Sandeep (@02Sandeepdyh) January 31, 2025 How to Watch Pushpa 2 Without Regretting It:1. Intro Scene: Skip it entirely and jump straight to his wake-up scene.2. Songs: Whenever a song pops up, just fast-forward to the next scene.3. Climax Fight (Rappa Rappa): Do yourself a favour. Skip it completely (highly…— 𝓚𝓻𝓲𝓼𝓱𝓪𝓿 (@haage_summane) January 31, 2025 -
కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్న 'శ్రీతేజ్'
పుష్ప2(Pushpa 2: The Rule) సినిమా రేవతి(32) కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఎప్పటికీ మరిచిపోలేము. ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్(9) తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన జరిగి 56 రోజులు పూర్తి అయినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ సికింద్రాబాద్ కిమ్స్ (Kims) ఆసుపత్రిలోనే బాలుడు చికిత్స పొందుతున్నాడు.శ్రీతేజ్‌కు వెంటిలేటర్ తొలగించి ప్రత్యేక గదికి వైద్యులు షిఫ్ట్ చేశారు. తానే సొంతంగా ఆక్సీజన్ తీసుకుంటున్నాడు. అయితే, కుటుంబ సభ్యులు పిలిచినా కళ్లు తెరిచి చూడలేకున్నాడు. వారిని గుర్తుపట్టలేనంతగా బాలుడు ఉన్నాడు. కనీసం నోరు విప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేకున్నాడు. తనకు ఆహారం కూడా ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన రానా)కానీ, అతని శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ తెలిపారు. అయితే బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. శ్రీతేజ త్వరగా కోలుకొని మళ్లీ గతంలో మాదిరి తన కళ్లముందు తిరుగుతే చూడాలని ఉందని తన తండ్రి కోరుకుంటున్నాడు.రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ రూ. కోటి సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు ప్రకటించగా.. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు గతంలోనే అందించారు. అల్లు అర్జున్ కూడా శ్రీతేజను పరామర్శించారు. రేవతి కుటుంబానికి జరగరాని నష్టం జరిగిందని ఆ సమయంలో అన్నారు. ఆపై వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన వాపోయారు. బాబు పూర్తిగా కోలుకునే దాకా పూర్తి బాధ్యత తనదేనని బన్నీ ప్రకటించారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కూడా శ్రీతేజ తండ్రి భాస్కర్‌తో అల్లు అర్జున్ గతంలో అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్.. ఫ్యాన్స్‌కు బోనస్
పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్ మొదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.మరో నాలుగు నిమిషాలు అదనంగతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్‌టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు పుష్ప రన్ టైమ్ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్‌కు బోనస్‌గా ఇప్పుడు ఓటీటీ వర్షన్లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్ టైమ్ 3:44 గంటలు ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీకి పుష్ప-2.. అఫీషియల్‌గా డేట్ ప్రకటించిన నెట్‌ప్లిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'పుష్ప 2 ది రూల్'( (Pushpa 2: The Rule)) మూవీ ఓటీటీ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు నెట్‌ఫ్లిక్స్ ఫుల్స్టాప్ పెట్టింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ట్రైలర్ వీడియోను పోస్ట్ చేసింది.రీ లోడెడ్ వర్షన్ కూడా..పుష్ప- 2 రీలోడెడ్ వర్షన్‌తో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అదనంగా 23 నిమిషాల రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. పుష్పరాజ్ దెబ్బకు పలు సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాల తర్వాత పుష్పరాజ్ ఓటీటీలో సందడి చేయనున్నాడు. Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/smPXn4IMD9— Netflix India (@NetflixIndia) January 29, 2025 -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్‌కు మరో షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజైంది. పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్‌పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే రానుందని ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు పుష్ప-2 జనవరి 30న రానుందని నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్సయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు.. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్‌కు షాకిచ్చింది.పుష్ప-2 ఫ్రీ కాదట..అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ పుష్ప అభిమానులకు మరో షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలని ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.Dabbante lekka ledhu… power ante bayam ledhu… adhey Pushpa 🔥 https://t.co/4qs7VtaTfQ— Netflix India South (@Netflix_INSouth) January 29, 2025 -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్‌పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలో పుష్ప-2 ఓటీటీకి సంబంధించి ఈ రోజు పెద్దఎత్తున వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప-2 రీ లోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్డే అనే పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప-2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్‌ను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం.ఉదయం నుంచి పుష్ప-2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. పుష్ప-2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం అని ఇచ్చారు కానీ.. ఈ వారంలోనా.. లేదంటే వచ్చేవారంలోనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు తెరదించేందుకు నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మరీ ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా? ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఫిబ్రవరి 6 నుంచే ఛాన్స్..పుష్ప-2 చిత్రం రిలీజైన ఫిబ్రవరి 6వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా? లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊 Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp— Netflix India (@NetflixIndia) January 27, 2025 -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్‌హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్‌మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
పుష్ప 2 ఓటీటీ ప్రకటన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పుష్ప 2' మూవీ (Pushpa 2: The Rule)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరాచకం సృష్టించాడు. రికార్డులన్నీ రప్పారప్పా కొట్టుకుంటూ పోయాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాలకు పైనే అవుతుండటంతో అభిమానులు ఓటీటీలో పుష్పరాజ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.ఈ వారమే ఓటీటీలో రిలీజ్ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప 2 ఈ గురువారం (జనవరి 30న) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు యాప్‌లో చూపిస్తోంది. అందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు రాసుంది. రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.సినిమాపుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.చదవండి: ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం -
పుష్ప 2 రికార్డు.. సంధ్య థియేటర్లో ఎంత రాబట్టిందంటే?
పుష్ప అంటే బ్రాండ్ అని మరోసారి రుజువైంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్పరాజ్ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఒక సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక కలెక్షన్స్ (గ్రాస్) రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందని ట్వీట్ చేసింది. పుష్ప 2 రికార్డుహైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌లో 'పుష్ప రూల్' ఆల్‌టైం రికార్డ్ అందుకుందని తెలిపింది. 51 రోజుల్లో ఒక కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయలు వసూలు చేసిందని పేర్కొంది. సంధ్య థియేటర్లో 206 షోలకు గానూ 1,04,580 మంది చూశారని తెలిపింది. ఇకపోతే నైజాంలో పుష్ప 2 సినిమాను మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.సినిమాపుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే చైనాలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.Records Breaking Rapa Rapa 🔥 #Pushpa2TheRule creates history with the highest ever gross in a single screen across Telugu states 💥🎥 Sandhya 70MM💪 206 Shows | 👥 1,04,580 Audience💰 Gross: ₹1,89,75,880 in just 51 days#HistoricIndustryHitPUSHPA2Nizam Release by… pic.twitter.com/wFTDzraAdp— Mythri Movie Distributors LLP (@MythriRelease) January 25, 2025 చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్‌ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. -
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
హీరోయిన్ శ్రీలీల క్యూట్ ఫోటోలు
-
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్
చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలుదిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. -
ఓటీటీలో 'పుష్ప2' స్ట్రీమింగ్ తేదీ ఇదేనా.. నెట్టింట వైరల్..?
'పుష్ప 2'(Pushpa 2) సినిమా థియేటర్లలో భారీ రికార్డ్స్ అందుకుంది. ప్రస్తుతం రీలోడెడ్ వర్షన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. పుష్ప2 విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దీంతో పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకుందని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అయింది. కానీ, ఇప్పుడు ఏడు వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. అంటే జనవరి 29న లేదా 31న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పుష్ప2 రీలోడెడ్ వర్షన్ 3:40 నిమిషాల నిడివి ఉంది. ఓటీటీలో ఈ కొత్త వర్షన్‌ను విడుదల చేయనున్నారు.పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. -
'పుష్ప2, గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటనపై ఐటీ అధికారుల ఫోకస్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్ ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. (ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.సాధారణంగా జరిగే సోదాలే: దిల్‌రాజు భార్య వైగారెడ్డి తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్‌రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు. -
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్‌పై హృతిక్ తండ్రి విసుర్లు!
పుష్ప2 అనూహ్య విజయం తర్వత బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్, దక్షిణాది సినిమాలపై ఒక్కసారిగా ఒకరొకరుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణం... గత కొంత కాలంగా అనూహ్య స్థాయిలో టాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమ ఊపిరి సలపనివ్వని రీతిలో భారతీయ బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టడం అత్యధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారడం..కొన్నేళ్లకు ముందు.. ఉత్తరాది చిత్ర పరిశ్రమ... సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కనీస స్థాయిలో కూడా గుర్తింపు లేదు.... సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యంగానైనా బాహుబలితో మొదలైన ఊచకోత...సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి(Kalki 2898AD) ... ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలు అస్త్రశస్త్రాలతో కొనసాగిస్తూ వచ్చాయి. అయినా సరే, జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంది. కానీ పుష్ప2(Pushpa 2) తో ఆ మిణుకు మిణుకు మంటున్న వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీం... బాలీవుడ్ లోని అన్ని రికార్డుల్నీ ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాదించిన హిందీ చిత్రం అనే రికార్డ్‌తో పాటు రేపో మాపో బాలీవుడ్‌కి తనకంటూ మిగిలిన ఏకైక దంగల్ రికార్డ్‌ను కూడా మట్టికరిపించే దిశగా దూసుకుపోతున్నారు.దీంతోప్రస్తుతం టాలీవుడ్ విజయాల ముట్టడిలో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మిగిలిన తెలుగు సినిమాల విజయాల సంగతెలా ఉన్నా... పుష్ప 2 విజయం హిందీ చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసి బాలీవుడ్ హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదుపు కుదిపింది అనేది నిజం. ‘‘మా హీరోలకు సిక్స్‌ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేతకాదు. పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు’’ అంటూ బాలీవుడ్ నటి కంగన రనౌత్ వ్యాఖ్యానించడం, అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడు అంటూ సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ కితాబివ్వడం... వంటివి బాలీవుడ్‌కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ..ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ మూలిగే నక్కమీద తాటిపండు అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమక్షంలోనే వేసేశారు.ఈ నేపధ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ చిత్ర ప్రముఖులు టాలీవుడ్‌పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు, నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి... రాకేష్ రోషన్(Rakesh Roshan) పుష్ప2 సహా దక్షిణ భారత చిత్రాల విజయం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణాది సినిమాలు చాలా గ్రౌన్దేడ్ (మూలాలకు కట్టుబడిన సాదాసీదా)గా ఉన్నాయి, అవి పాతదైన పంధాలో వెళుతూ.. పాట యాక్షన్డైలాగ్భావోద్వేగాలు... ఇలా ఏళ్లనాటి ఫార్ములా సంబంధితంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి పురోగమించడం లేదు. ఏ పాత మార్గాన్ని విచ్ఛిన్నం చేయనందున వారు విజయవంతమవుతున్నారు’’ అంటూ తీసిపారేశారు. సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణాది వాళ్లు రొడ్డకొట్టుడు కధలతోనే విజయాలు సాధిస్తున్నామని, బాలీవుడ్ మాత్రం కొత్త పంధాలో వెళుతున్నామనేది ఆయన హేళన. దీనికి ఉదాహరణ గా ... తాను కహో నా...ప్యార్ హై సినిమా చేసిన తర్వాత రొమాంటిక్ సినిమాలు తీయాలని అనుకోలేదనీ.ఆ తర్వాత తాను కోయి... మిల్ గయా చేశాననీ ఆయన గుర్తు చేశారు. ఇలా తాము సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు కొత్త పంధాలో వెళుతున్నామన్నారు.అయితే టాలీవుడ్ తదితర సౌత్ ఇండియా వాళ్లు ఇలాంటి సవాళ్లు తీసుకోరని వారు సేఫ్ గేమ్ ఆడతారని అంటున్న ఆయన... బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప2, కల్కి, సాహో... వంటి ఒకదానికొకటి సంబందం లేని వైవిధ్యభరిత కధా నేపధ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్రయాత్రను చూడట్టేదనుకోవాలా? ఇది గమనిస్తున్న వాళ్లు హృతిక్ రోషన్ తండ్రి మాట్లాడుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేయగలరు అనే ఇంగితం కూడా రాకేష్‌కు లేకపోవడం దురదృష్టకరం. -
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్‌గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్‌కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్‌ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్‌కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్‌పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025 -
పుష్ప భామకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయాలైనట్లు సన్నిహితులు వెల్లడించారు. రష్మికను గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీవల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరోవైపు సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 (Pushpa 2 The Rule) మూవీతో హిట్ కొట్టి శ్రీవల్లి.. బాలీవుడ్లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు.తెలుగులో మరో మూడు చిత్రాలు..టాలీవుడ్లో ప్రస్తుతం కుబేర మూవీలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాన్–ఇండియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేర పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బరిలో ఉంటుందని ఆడియన్స్ అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేర విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి..ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్నా ఈ మూవీతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కనిపించనుంది. -
పుష్ప-2 టార్గెట్ రూ. 2వేల కోట్లు కాదు..
-
కలెక్షన్స్ సునామీ.. పుష్పరాజ్ తగ్గేదేలే !
-
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్ వర్షన్ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. (ఇదీ చదవండి: నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్ వర్షన్ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.బెంగాల్లో పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్బెంగాల్లో పుష్ప ఓ రికార్డ్ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. -
పుష్ప 2 చైనాలో రిలీజ్ అయితే దంగల్ రికార్డ్స్ అవుట్..
-
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 11 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ప్రకటించిన డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. అందుకోసమేనా?..అయితే పుష్ప-2 రీ లోడింగ్ తేదీని మార్చడంపై నెట్టింట చర్చ మొదలైంది. ఈనెల 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోంది. బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో గేమ్ ఛేంజర్ కూడా బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 రీ లోడింగ్ వర్షన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించి సంక్రాంతి సినిమాలకు షాకిచ్చారు మైత్రి మూవీ మేకర్స్.దీంతో పొంగల్‌కు రిలీజ్ అవుతోన్న సినిమాలకు పుష్ప-2 వల్ల పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి-2ను వెనక్కి నెట్టిన పుష్పరాజ్.. సంక్రాంతి చిత్రాలతో పోటీ పడితే వాటి పరిస్థితి ఏంటన్నది గమనార్హం. అందువల్లే మైత్రి మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు పోటీ ఉండకూడదనే రీ లోడింగ్ వర్షన్ తేదీని జనవరి 17 వరకు పొడిగించారు. దీంతో ఈ ఏడాది పొంగల్ బరిలో నిలిచిన నిర్మాతలకు ఊరట లభించింది. ఏదేమైనా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయడం రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ ..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. #Pushpa2Reloaded in cinemas from January 17th. 🔥#Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/zBHbNJpZKD pic.twitter.com/ItZRonNWJt— Pushpa (@PushpaMovie) January 8, 2025 -
ఇదే జరిగితే దంగల్ రికార్డ్ క్రాస్.. 'పుష్ప' గాడి అసలైన టార్గెట్ ఇదే
'పుష్ప 2' చిత్రం వరుస రికార్డ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. రూ. 1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో పుష్ప ఉన్నాడు. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే, తాజాగా పుష్ప2 ( Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ దంగల్.. కేవలం మరో రూ. 200 కోట్ల మార్క్ అందుకుంటే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియన్ టాప్ వన్ సినిమాగా పుష్ప2 చేరిపోతుంది. అయితే, ఈ మార్క్‌ను అల్లు అర్జున్ (Allu Arjun) చాలా సులువుగా అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇండియాలో కలెక్షన్ల పరంగా టాప్ వన్ సినిమాగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో బాహుబలి-2 ఉండగా రీసెంట్గా పుష్ప దాటేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయ సినిమాల లిస్ట్‌లో బాలీవుడ్ హిట్ మూవీ దంగల్ టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ కూడా ఆ చిత్రంపైనే పడింది. దంగల్ సినిమా టాప్ వన్‌లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ (China Cinema Market ) అని చెప్పవచ్చు. ఈ మూవీ అక్కడ ఏకంగా రూ. 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టాప్ వన్‌లోకి దంగల్ చేరిపోయింది. దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. అక్కడ పుష్పగాడు నచ్చితే సులువుగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. దీంతో పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ రూ. 3వేల కోట్లకు చేరవచ్చు అని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా వాళ్లకు పుష్ప నచ్చుతాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.పుష్ప-2 టార్గెట్ చైనాపుష్ప2 చిత్రం చైనాలో కూడా విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చైనా బాక్సాఫీస్‌లో పుష్ప2 ఎంట్రీ ఇస్తే తప్పనిసరిగా దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో పుష్ప2 చిత్రానికి భారీ అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, జపాన్‌లో ఎర్రచందనాన్ని (Redwood) అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజలు నిత్యం చందనంతో తయారు అయిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఎర్రచందనంతో వాళ్లకు ఎక్కువ కనెక్షన్ ఉంది. ఈ అంశాలు పుష్ప2 విజయంలో కీలకంగా మారుతాయి. ఎర్రచందనం సరఫరా విషయంలో ఇంత డ్రామా ఉంటుందా అని వాళ్లు ఆశ్చర్యపడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో అక్కడ విడుదలైన భారతీయ సినిమాలు భారీగానే కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం మహారాజ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి వారు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నీ సానుకూలతలు పుష్ప2 చిత్రానికి ఉన్నాయి. పుష్ప-2 చైనాలో విడుదలైతే దంగల్ రికార్డ్ బద్దలు కావడం చాలా సులువు అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చైనాలో వరకట్నంగా ఎర్రచందనంఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు.మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. -
సంధ్య థియేటర్ ఘటన.. తొలిసారి స్పందించిన మెగా డాటర్
సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తొలిసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడం తనను ఎంతో బాధించిందని అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడారు. రేవతి విషయం తెలియగానే తన మనసు ముక్కలైందని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరని, బన్నీ కూడా షాక్‌కి గురైయ్యారని చెప్పారు. అందరి ప్రేమాభిమానంతో అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. (చదవండి: ఆ ట్రోల్స్ తట్టుకోలేక వారం రోజులు డ్రిపెషన్లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి)ఇక తన ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని, ప్రతి సినిమాకు తన స్టైల్‌ని మార్చుకుంటాడని.. ఆ విషయంలో బన్నీ నుంచి స్ఫూర్తి పొందుతానని చెప్పింది. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలనే విషయం రామ్ చరణ్‌ను చూసి నేర్చుకుంటానని అన్నారు. ఇక కథల ఎంపిక విషయంలో గందరగోళానికి గురైతే వరుణ్ తేజ్ సలహా తీసుకుంటానని చెప్పారు.సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంఅల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2: The Rule) చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసింది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకి బన్నీ వెళ్లారు. బన్నీ వస్తున్నాడని విషయం తెలిసి అతని అభిమానులు పెద్ద ఎత్తున ఆ థియేటర్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే యువతి మరణించగా..ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బన్నీ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కాగా.. ఇప్పుడు నిహారిక స్పందించింది.హీరోయిన్గా రీఎంట్రీబుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ని ఆరంభించింది మెగా డాటర్ నిహారిక. ఆ తర్వాత కొన్నాళ్ల ‘ఒక మనసు’సినిమాతో హీరోయిన్గా మారింది. ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. పలు వెబ్ సిరీస్‌లు నిర్మించింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ మంచి విజయం సాధించింది. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నా నిహారిక.. ‘మద్రాస్ కారన్’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. షాన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యదత్తా కీలకపాత్ర పోషించారు.ఈ చిత్రం పొంగల్ కానుకగా.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.మద్రాస్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. -
పుష్ప ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించే న్యూస్.. సంక్రాంతికి రీ లోడ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.పుష్ప టీమ్ తన ట్వీట్లో రాస్తూ..' "పుష్ప2: ది రూల్’ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్స్‌లో చూడవచ్చు. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా" అని పోస్ట్ చేశారు.ఆ రికార్డ్ కోసమేనా..అయితే ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న పుష్ప-2 చిత్రానికి 20 నిమిషాల సీన్స్ అదనంగా జోడించడం చూస్తే ఆ క్రేజీ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమైంది.ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది.తాజాగా మరో 20 నిమిషాల నిడివి గల సీన్స్ యాడ్స్ చేయడం దంగల్ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకే మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ రావడం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్పరాజ్.. దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పెరగనున్న రన్‌టైమ్..ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్గా పుష్ప-2 రన్ టైమ్ మరింత పెరగనుంది. ఈ నిడివికి అదనంగా మరో 20 నిమిషాలతో కలిపి 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండనుంది. #Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/ek3gRsOaVi— Pushpa (@PushpaMovie) January 7, 2025 -
Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా
పుష్పరాజ్ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్ నటించిన హిందీ సినిమా ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ మొదటి స్థానంలో నిలిచింది. -
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్ చేంజర్‌కి పాటించరా?
అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ దాడి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా రిలీజై నెల రోజులు దాటినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోని మునుపెన్నడు లేని రికార్డులు సృష్టించింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ది రూల్(pushpa 2 the rule) నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన 32 రోజుల్లోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2(bahubali-2) రికార్డ్‌ను అధిగమించింది. ప్రస్తుతం రూ.1831 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బాహుబలి-2 (రూ.1810) కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రికార్డ్‌ను పుష్ప-2 బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లతో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి బాహుబలి-2ను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఇండియాలో టాప్-8 చిత్రాలివే..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. ఇక రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి పరిమితమైంది. తర్వాత వరుసగా ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కన్నడ మూవీ కేజీయఫ్ -2 (రూ.1250 కోట్లు), ప్రభాస్ కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. వీటిలో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలు ఉండడం మరో విశేషం.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు)హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డ్..అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కించిన పుష్ప- 2 హిందీలో తిరుగులేని వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసిన మూవీగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. వందేళ్ల ఏళ్ల హిందీ సినీ పరిశ్రమ చరిత్రలో కేవలం 15 రోజుల్లోనే రూ. 632 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 ఓటీటీకి ఎప్పుడంటే..బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2 ఓటీటీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలొచ్చాయి. గతంలోనే ఓటీటీ విడుదల తేదీపై పుష్ప టీమ్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప-2 రిలీజైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీకి రానుందని పుష్ప మేకర్స్ ప్రకటించారు.కాగా..2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్)#Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE— Pushpa (@PushpaMovie) January 6, 2025 -
అల్లు అర్జున్ను చూసి నేర్చుకోమని చెప్తా..: బాలీవుడ్ నటుడి భార్య
పుష్ప 2లో నటవిశ్వరూపం చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా చూశాక అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయిపోయానంటోంది బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద భార్య సునీత అహూజ.థియేటర్స్‌కు వెళ్లను, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. నేను పెద్దగా థియేటర్స్‌కు వెళ్లను. కానీ పుష్ప 2 సినిమా (Pushpa: The Rule) ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని నా కుమారుడితో అన్నాను. అదే చేశాను కూడా! హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా అల్లు అర్జున్ను కలుస్తాను. అతడు పడ్డ కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ ఉందా? లేదా హ్యాండ్సమ్ లుక్స్‌తో ఉన్నాడా? అనేది ఇక్కడ విషయం కాదు. నా కుమారుడికీ అదే చెప్తాతన పనితనం తెలుస్తోంది. అతడిలా కష్టపడాలని నా కొడుక్కి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అని పేర్కొంది. పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప: ద రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. అనసూయ భరద్వాజ్, సునీల్, జగపతిబాబు, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తియినప్పటికీ వసూళ్ల రాబట్టడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. తొలి రోజు నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తోన్న పుష్పరాజ్.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.బాలీవుడ్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో పుష్ప-2 హిందీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 31 రోజుల్లోనే పుష్ప-2 సాధించింది. ఈ కలెక్షన్లతో రూ.800 కోట్ల అరుదైన క్లబ్లో చేరింది. ఇప్పటికే హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.వివాదంలో పుష్పరాజ్..అయితే ఈ మూవీ విడుదలకు ముందు రోజు విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల నాంపల్లి కోర్టు సైతం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఆస్పత్రిలో మహిళ కుమారుడు..సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ కుమారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు, అల్లు అరవింద్ ఆ బాలుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇప్పటికే వారి ఫ్యామిలీకి చెక్కులు కూడా అందజేశారు. Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025 -
బెంగాల్లో తగ్గేదే లే!
‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్. సుకుమార్ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్‌కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్లో ఈ చిత్రం ఓ రికార్డ్ సాధించింది.మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్ ఫైర్.... లోకల్ కాదు... ఇంటర్నేషనల్. -
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2' జోరు.. 900 కోట్ల క్లబ్ లో పుష్ప రాజ్..
-
నాంపల్లి కోర్టుకు 'అల్లు అర్జున్'
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అల్లు అర్జున్ వ్యక్తిగతంగా సమర్పించనున్నారు.సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం వల్లే తోపులాట జరిగిందని ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో పాటు రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఆపై సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. -
తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.ఏం జరిగింది?డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్, అతడి టీమ్‌తో పాటు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్‌పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.చదవండి: అల్లు అర్జున్‌కు నేడు బెయిల్ లభించనుందా.. ? -
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్‌లో విడుదల చేశారు.పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్లో వచ్చే సాంగ్‌లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. -
అల్లు అర్జున్‌కు నేడు బెయిల్ లభించనుందా.. ?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఇదే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో భాగంగా వారిని విచారించవచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే వారిని అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.రేవతి మృతికి బన్నీ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు బీఎన్ఎస్ 105 సెక్షన్ చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ అల్లు అర్జున్‌కు బెయిలు ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలివ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. బన్నీ రెగ్యూలర్ బెయిల్ విషయంలో పోలీసులు, అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనలను కోర్టు ఇప్పటికే పరిశీలించింది. అయితే, తీర్పును నేటికి వాయిదా వేసింది. దాదాపు ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. ఆ ఒక్కటి వచ్చుంటే?
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.హిందీలో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.770 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగానూ ఘనతను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.#Pushpa2TheRule is RULING THE INDIAN BOX OFFICE with its record breaking run 💥💥The WILDFIRE BLOCKBUSTER GROSSES 1799 CRORES WORLDWIDE in 4 weeks ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/n5k1aSWQ0N— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2025 -
హైకోర్టులో ‘పుష్ప 2’ నిర్మాతలకు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసులో మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్ పేరుతో సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను నిర్మించాం. అలాగే ‘పుష్ప 2’తో సహా 30 ఇతర సినిమాలను పంపిణీ చేశాం. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా ఊపిరాడక తన భార్య, కుమారుడు కుప్పకూలారని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహిళ మృతిచెందగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మాపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల పాత్ర సినిమా నిర్మాణానికి మాత్రమే పరిమితమని వారి తరఫు న్యాయ వాది వాదించారు. ఒక్కసారి బయ్యర్లకు విక్రయించిన తర్వాత వారి పాత్ర ఏమీ ఉండదని చెప్పారు. ఎటువంటి సంబంధంలేని నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
పుష్ఫ-2 సక్సెస్ పై అమీర్ ఖాన్ ప్రశంసలు
-
సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ ఎవర్గ్రీన్ రికార్డ్‌ను కొట్టేసిన 'పుష్ప'
తెలుగు సినిమా చరిత్రలో సంధ్య థియేటర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న స్క్రీన్‌లో తమ అభిమాని హీరో సినిమా చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటారు. సుమారు 1000 సీట్లతో 70MM స్క్రీన్ ఉంటుంది. ఒకప్పడు ఈ థియేటర్లో తమ సినిమా ప్రదర్శిస్తే చాలు అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటిది మెగా హీరోలకు అడ్డాగా సంధ్య థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.సంధ్య థియేటర్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' ఉంది. 2001లో విడుదలైన ఈ చిత్రానికి ఎస్.జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంధ్య థియేటర్లో రూ. 1 కోటి 56 లక్షలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సుమారు 23 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్‌ను పుష్ప2తో అల్లు అర్జున్ కొల్లగొట్టాడు. 24 రోజులకు గాను రూ. 1 కోటి 59 లక్షలతో పుష్పరాజ్ దాటేశాడు. అయితే, ప్రభాస్ కల్కి సినిమా కూడా ఇక్కడ రూ. 1 కోటి 43 లక్షలు కలెక్ట్ చేసింది. పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం 220 రోజులకు గాను రూ. కోటి 10 లక్షలు వసూళు చేసింది. అలా ఇప్పటి వరకు ఈ థియేటర్‌కు సంబంధించి ఉన్న రికార్డ్స్‌ను పుష్ప2తో బన్నీ అందుకున్నాడు. -
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి మూడో తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఇక, ఈరోజు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతిచెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్బంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈరోజు ఇరు వర్గాల వాదనల అనంతరం, తీర్పును వచ్చే నెల మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు..సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు..రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు..బీఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు.ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చింది.రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి.పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు..రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం..అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది..ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు..బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు..అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి. ఇక, సంధ్యా థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్‌తో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయినా అల్లు అర్జున్. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మద్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. -
రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్’, కిరణ్ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్లోకి వెళదాం...ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్ ‘వేట్టయాన్: ది హంటర్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ కార్తీ–అరవింద్ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, తమన్నా–సుందర్ .సి ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్ ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’, టొవినో థామస్ ‘ఏఆర్ఎమ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’లకు అలరించాయి.తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ ఫిల్మ్ ‘హను–మాన్’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్’ సినిమా ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఈ మాస్ ఫిల్మ్‌కి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్ కిషన్ హారర్ ఫిల్మ్ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’కి ఆశించిన ఫలితం దక్కలేదు.శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘రజాకార్’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్ల ‘డీజే టిల్లు స్క్వేర్’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందగా, ‘ఓం భీమ్ బుష్’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్ భగత్ ‘ఆరంభం’ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్ నాగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్ల ‘డార్లింగ్‘, రక్షిత్ శెట్టి ‘ఆపరేషన్ రావణ్‘, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్ ‘బడ్డీ’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్ ‘ఆయ్’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేశ్ లీడ్ రోల్లో నటించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్ డ్రామా ‘పొట్టేల్’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్–సందీప్ పరిచయం అయిన ‘క’ సూపర్ హిట్ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘మెకానిక్ రాఖీ’, సత్యదేవ్–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలు అలరించాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’, నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’, ధర్మ ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్ రేట్ పెరగాలని కోరుకుందాం.మిస్సింగ్: ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. -
45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు: సంధ్య థియేటర్ యాజమాన్యం
పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమని పోలీసులు ఇరువురిపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో థియేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఆదివారం స్పందించింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు 80 మంది విధుల్లో పాల్గొన్నారంది. డిసెంబర్ 4, 5వ తేదీల్లో మైత్రీ మూవీస్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌కు వచ్చారంది. తమ దగ్గర ద్విచక్రవాహనం, ఫోర్ వీలర్‌కు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించారు.చదవండి: చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి -
Tollywood: ‘డిసెంబర్’ రివ్యూ.. హిట్ రాలేదు ‘పుష్పా’ !
నవంబర్ మాదిరే డిసెంబర్ కూడా టాలీవుడ్‌ని నష్టాల్లో ముంచేసింది. పుష్పరాజ్ ఒక్కడే బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. మిగతావాళ్లంతా చడీచప్పుడు లేకుండా ఇయర్ ఎండ్‌ని ముగించారు.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టే పుష్ప 2 మూవీ భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టిస్తోంది. సౌత్ కంటే నార్త్‌లో ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి చూస్తే.. ఈజీగా 2000 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.పుష్పరాజ్ దెబ్బకి రెండు వారాల పాటు కొత్త సినిమాలేవి రిలీజ్ కాలేదు. డిసెంబర్ 15న ఫియర్ అనే మూవీ వచ్చింది. వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్..ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫియర్ రిలీజ్‌కు ఒక రోజు ముందు అంటే మిస్ యూ అంటూ సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చాయి. అయితే సినిమాలో ఏదో మిస్ అయిందని ఆడియన్స్ తిరస్కరించారు. ఇక డిసెంబర్ 20న బచ్చాల మల్లితో అల్లరి నరేశ్(Allari Naresh) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విలేజ్ బ్యాగ్రౌండ్, రా అండ్ రస్టిక్ వాతావరణం.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌తో వచ్చినా..ఆడియన్స్ తిరస్కరించారు.అదే రోజు(డిసెంబర్ 20) తమిళ మూవీ విడుదల పార్ట్ 2, హాలీవుడ్ ఫిల్మ్ ముఫాసా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదల 2కు టాలీవుడ్లో సక్సెస్ టాక్ రాలేదు కానీ.. ముఫాసా మాత్రం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లస్ అయింది. మరో కన్నడ చిత్రం యూఐ కూడా డిసెంబర్ 20వ తేదినే విడుదలైంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ని మూటగట్టుకుంది.ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ మిస్ చేసుకుంది. ఈ పండక్కీ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్ప 2 కోసమే పెద్ద సినిమాలు క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాయి. ఈ గ్యాప్‌ని ఓ చిన్న సినిమా యూజ్ చేసుకుంది. డిసెంబర్ 25న శ్రికాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఓ చిన్న చిత్రం విడుదైంది. వెన్నెల కిశోర్ టైటిల్ రోల్లో, అనన్య నాగళ్ల, రవితేజ మహద్యం ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ డిటెక్టివ్ కథ.. తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ ఏడాది చివరి వారం (డిసెంబర్ 27) డ్రింకర్ సాయి, లీగల్లీ వీర్, వారధి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో డ్రింకర్ సాయిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని అంటున్నారు. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అయిన విషయం కూడా అంతగా తెలియదు. మొత్తంగా డిసెంబర్ కూడా టాలీవుడ్‌కు నష్టాలనే మిగిల్చాయి. ఇక ఇప్పుడు ఆశలన్నీ సంక్రాంతి సినిమాలపైనే ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలు ఉన్నాయి. వీటిల్లో ఏది సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
ఈ ఏడాదిలో 'జాతర' చూపించిన స్టార్స్
తెలుగు సినిమాల్లో జాతర ఎపిసోడ్స్ ప్రేక్షకులను థియేటర్స్‌కు వచ్చేలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జాతర జోరు బాగా కనిపించింది. కొన్ని చిత్రాల్లో జాతర ఎపిసోడ్స్ కీలకంగా నిలవగా, కొన్ని చిత్రాలు జాతర నేపథ్యంలోనే సాగాయి. సినిమా హిట్‌కి జాతర ఓ కారణంగా నిలిచింది. ఇక 2024లో వెండితెరపై జాతర హైలైట్‌గా నిలిచిన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం.అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను మించిందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. దీంతో ‘పుష్ప: ది రూల్’ వసూళ్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమా విజయానికి ఓ ముఖ్య కారణం జాతర ఎపిసోడ్ అన్నది కొందరి అభిప్రాయం.ఈ ఎపిసోడ్లో కొత్త గెటప్‌లో అల్లు అర్జున్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, కొరియోగ్రాఫర్ విజయ్ నృత్యరీతులకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జాతర ఎపిసోడ్ లుక్‌తోనే ఈ సినిమా క్లైమాక్స్‌లోనూ అల్లు అర్జున్ ఫైట్ ఉండటం విశేషం. ఈ ఎపిసోడ్‌ని దాదాపు మూడు నెలలు డిజైన్ చేసుకుని, నెల రోజుల పాటు, భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. మరో సంగీత దర్శకుడు సామ్‌సీఎస్ ఈ జాతర ఎపిసోడ్‌కు ఆర్ఆర్ అందించారని తెలిసింది. ఇక ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన ‘దేవర’లోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అయింది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ తండ్రీ కొడుకుగా (తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు) నటించిన ఈ సినిమా తొలి భాగం ‘దేవర పార్టు 1’ సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ సినిమాలో జాతర నేపథ్యంలో వచ్చే రెండు సన్నివేశాలు (ఒక సన్నివేశం దేవరతో, మరొక సీన్ వరతో) కథను మలుపు తిప్పుతాయి. ఇలా జాతర ఎపిసోడ్స్ ‘దేవర పార్టు 1’లో కీలకంగా కనిపిస్తాయి. అలాగే జాతర సమయంలో ‘వీరాధి వీరుల తిరునాళ్ల జరుపుకోవాల... రారా వీర’ అంటూ లిరిక్స్‌తో సాగే ‘ఆయుధ పూజ’ పాట కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.‘దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే ఈ ఏడాది వచ్చిన హిట్ మూవీస్‌లో ‘క’ చిత్రం ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రంతో సుజీత్ – సందీప్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. అలాగే ‘ఆడు ఆడు ఆడు... అమ్మోరే మురిసేలా ఆడు’ అంటూ వచ్చే జాతర పాట ప్రేక్షకులను అలరించింది. ‘పుష్ప: ది రూల్’ సినిమా జాతర ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు సామ్ సీఎస్యే ‘క’ సినిమాకు స్వరకర్త. ఇలా జాతర ఎపిపోడ్స్‌తో కథ మలుపు తిరిగిన సినిమాలు కొన్నైతే, జాతర నేపథ్యంలోనే మరికొన్ని సినిమాలు తెలుగు తెరపైకి వచ్చాయి.యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘పొట్టేల్’ ఈ కోవలోకే వస్తుంది. తెలంగాణలోని ఓ ఊర్లో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. జాతర నేపథ్యమే కాకుండా చదువు ప్రాముఖ్యతను కూడా తెలిపేలా దర్శకుడు సాహిత్ మోత్ఖురి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నూతన నటీనటులు సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, పెండ్యాల యశ్వంత్ తదితరులు నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది.నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్ పురుషోత్తంపల్లి అనే గ్రామంలో జరిగే సంఘటనలు, రాజకీయాలు, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. పన్నెండేళ్లకొకసారి పురుషోత్తంపల్లిలో జరిగే భరింకాళమ్మ తల్లి జాతర ఈ సినిమాకు కీలకంగా ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్ అలరించింది. ఇంకా ధ్రువ వాయు నటించి, దర్శకత్వం వహించిన ‘కళింగ’ సినిమాలో కూడా జాతర ప్రస్తావన, జాతర సాంగ్ ఉంటాయి. ఇలా జాతర టచ్‌తో ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలూ ఆడియన్స్ మెప్పు పొందడం విశేషం. 2024తో ఈ జాతర ఆగడంలేదు... 2025లో రానున్న చిత్రాల్లో కొన్నింటిలో ‘జాతర’ సందడి కనిపించనుంది. – ముసిమి శివాంజనేయులు -
'పుష్ప2' కపుల్స్ సాంగ్ వీడియో వర్షన్ విడుదల
పుష్ప2 విడుదలై ఇప్పటకి మూడు వారాలు దాటిన సోషల్‌మీడియాలో ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కపుల్స్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు రూ. 1730 కోట్లకుపైగా (గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది.పుష్ప2 సినిమా విజయంలో దేవీశ్రీప్రసాద్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మూవీలోని ప్రతి సాంగ్ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన రీల్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కపుల్స్ సాంగ్ 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' విడుదలైంది. శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ సాంగ్ ఆడియో వర్షన్ అన్ని భాషలలో ఇప్పటి వరకు 500 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో రిలీజ్ కావడంతే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. -
Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్
పుష్ప 2 .. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దెబ్బలు పడ్తయ్రో.., పీలింగ్స్.., పుష్ప పుష్ప పాటలు విడుదల చేయగా నాలుగు రోజుల క్రితం 'దమ్ముంటే పట్టుకోరా..' సాంగ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.అయితే అదేరోజు పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పోలీసులను ఉద్దేశించే ఈ పాట విడుదల చేశారని పలువురూ భావించారు. ఈ క్రమంలో ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ పాట అలాగే ఉంది. ఇప్పుడేకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మొదట షెకావత్‌కు సారీ చెప్పిన పుష్పరాజ్.. తర్వాత మాత్రం తనకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ పోలీస్ ముందే తొడ కొట్టాడు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా? -
తగ్గిన పుష్పరాజ్ కలెక్షన్స్.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పుష్పమానియా కొనసాగుతోంది.తాజాగా పుష్పరాజ్ మరో రికార్డ్ సృష్టించాడు. ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే రూ.1719 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినప్పటికీ.. తాజా వసూళ్లు చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం కాస్తా కష్టంగానే అనిపిస్తోంది.కాగా.. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.There is no stopping #Pushpa2TheRule at the box office 💥💥Becomes the fastest Indian film to cross 1719.5 CRORES WORLDWIDE in 22 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/CztMIusNBW— Mythri Movie Makers (@MythriOfficial) December 27, 2024 -
ఆ దేశాన్నీ వదిలిపెట్టని పుష్పగాడు!.. ఏకంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?
-
సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2
-
అల్లు అర్జున్‌తో నన్ను పోల్చకండి.. అభిమానితో అమితాబ్ బచ్చన్
అల్లు అర్జున్.. పుష్ప2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్ప రాజ్‌గా తను నటించిన తీరుపై చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానిని అంటూ బిగ్ బీ పేర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఓ కంటెస్టెంట్‌తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో కోల్‌కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహణి కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీనికి అమితాబ్ నవ్వుతూ ఇలా స్పందించారు. 'అల్లు అర్జున్‌కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతనికి వచ్చిన గుర్తింపునకు పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగుంది. అతనితో నన్ను పోల్చొద్దు' అంటూ నవ్వుతూ చెప్పారు.అయినప్పటికీ ఆ మహిళ మాత్రం బన్నీ టాపిక్ వదల్లేదు.. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరూ కాలర్‌ను కొరుకుతూ, కళ్లు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బీ అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. 'ఇక ఇద్దరి వాయిస్‌లోనూ ఓ రిచ్‌నెస్ ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్ను చూస్తే నా కల నెరవేరుతుంది' అని ఆమె చెప్పారు. -
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
పుష్ప-2 వసూళ్ల సునామీ.. తొలి విదేశీ చిత్రంగా రికార్డ్!
బన్నీ- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.నేపాల్‌లో విడుదలైన 20 రోజుల్లోనే రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఘనతను సొంతం చేసుకుంది. నేపాల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.కాగా.. ఈనెల 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 రిలీజైంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే రూ.294 కోట్లతో మొదలైన ప్రభంజనం కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును చేరుకుంది. తాజాగా విడుదలైన కలెక్షన్స్ చూస్తే 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇదో జోరు కొనసాగితే త్వరలోనే రూ.2000 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2TheRule is now the HIGHEST GROSSING FOREIGN FILM EVER IN NEPAL with a gross of 24.75 CRORES in 20 days 💥💥It is one of the biggest blockbusters at the Nepal Box Office and is among the TOP 3 GROSSERS OF ALL TIME ❤️🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/c6DD3mlPSm— Pushpa (@PushpaMovie) December 26, 2024 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.తాజాగా పుష్ప-2 వసూళ్లపై నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా 2024లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన మూవీగా ఘనత సాధించింది. తొలి రోజే రూ.294 కోట్లతో ప్రభంజనం సృష్టించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాసింది.THE HIGHEST GROSSER OF INDIAN CINEMA IN 2024 continues to topple records 💥💥#Pushpa2TheRule is the FASTEST INDIAN FILM EVER to collect 1700 CRORES with a gross of 1705 CRORES WORLDWIDE in 21 days ❤️🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vrL2RHqcSq— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న టాలీవుడ్
-
షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమా విడుదలై 20 రోజులు దాటినా ఇప్పటికీ భారీ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక హిందీలో అయితే రూ. 700 కోట్లకు పైగా వసూళ్ల సాధించి.. అత్యధిక వేగంగా 700 కోట్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే 2 వేల కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా మంగళవారం ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించగా.. సుకుమార్ లిరిక్స్ అందించాడు. టీ సీరిస్ తన యూట్యూబ్ చానల్లో ఈ పాటను రిలీజ్ చేయగా..అది కాస్త వైరల్ అయింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.కాగా, అల్లు అర్జున్ను పోలీసులు విచారించిన రోజు డిసెంబర్ 24 సాయంత్రం ఈ సాంగ్‌ను టీ సిరీస్ విడుదల చేసింది. అయితే ఈ పాట పోలీసులను ఉద్దేశించే రిలీజ్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ కారణంతోనే పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది.కాగా, అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదలై తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫహద్ ఫాజిల్ ఇందులో పోలీసు అధికారి షెకావత్ గా నటించాడు. పుష్ప రాజ్‌కు షెకావత్‌కి మధ్య జరిగే ఓ సన్నివేశంలో భాగంగానే ఆ పాట వస్తుంది. సినిమాలో సంభాషణలుగా చూపించిన మేకర్స్. . ఇప్పుడు అది పాట రూపంలో రిలీజ్ చేసి.. మళ్లీ డిలీట్ చేశారు. -
పుష్ప-2 చూద్దామని థియేటర్‌కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్‌లో పుష్ప-2 ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్ ముందుగానే బుక్ అవుతున్నాయి.పుష్ప-2కు బదులు బేబీ జాన్..తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. షో టైమ్‌కు థియేటర్‌కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రదర్శించారు. దీంతో థియేటర్ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్‌గా తెరకెక్కించారు.Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k— KRK (@kamaalrkhan) December 25, 2024 -
పుష్ప 2 వసూళ్లే స్పిరిట్ టార్గెట్..!
-
Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్/ చిక్కడపల్లి: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం అల్లు అర్జున్ను విచారించారు. మూడున్నరగంటలపాటు 20కిపైగా ప్రశ్నలు అడిగారు. ప్రీమియర్‌షోకు వచ్చేందుకు పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా తెలియదా అనే అంశం నుంచి ర్యాలీగా రావడం, వెళ్లడం దాకా ఎప్పుడేం జరిగిందనేది గుర్తు చేస్తూ విచారించారు. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు రావాలని సూచించారు. ఈ నెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసుల ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్‌రెడ్డి, సినీ నిర్మాత బన్నీ వాసు, న్యాయవాది అశోక్‌రెడ్డిలతో కలిసి అల్లు అర్జున్ ఉదయం 11:03 గంటలకు చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అరవింద్, చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీవాసులను పోలీస్‌స్టేషన్ కింద రూమ్ వరకే అనుమతించారు. మొదటి అంతస్తులో అడ్వొకేట్ అశోక్‌రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ విచారించారు. సంధ్య థియేటర్ ఘటన, తదినంతర పరిణామాలపై మధ్యాహ్నం 2:47 గంటల వరకు ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల విడుదల పోలీసులు చేసిన పది నిమిషాల వీడియోను ఆధారంగా చూపిస్తూ వివరాలను తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ప్రెస్మీట్లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీశారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. 10 నిమిషాలకోసారి విరామమిస్తూ.. పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ప్రతి పది నిమిషాలకోసారి విరామం తీసుకున్నట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో అల్లు అర్జున్ కేవలం ఒక్కసారి మాత్రమే టీ తీసుకున్నట్టు సమాచారం. చివరిగా అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్‌కు సూచించినట్టు తెలిసింది. ఏ–18గా మైత్రి మూవీస్.. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటివరకు మైత్రి మూవీస్ సంస్థపై ఎటువంటి కేసులు నమోదు చేయని పోలీసులు.. మంగళవారం అల్లు అర్జున్ విచారణ సమయంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలను ఏ–18 నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో చేర్చారు. బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీ ఆరెస్టు.. సంధ్య థియేటర్లో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలవడానికి కారణం ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు 10వేలకుపైగా వీడియోలను విశ్లేషించారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనీ అని గుర్తించారు. పోలీసులను సైతం అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం, గేట్లను మూసివేయడం వంటివాటిని అతడే దగ్గరుండి పర్యవేక్షించినట్టు సీసీ కెమెరా ఫుటేజీలలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తొక్కిసలాట కాదు... ఊపిరాడకనే.. సంధ్య థియేటర్లో తొక్కిసలాటతోనే రేవతి మరణించిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఇప్పటివరకు భావిస్తున్నారు. తొక్కిసలాట అయితే వారి శరీరంలో ఎముకలు విరగడం గానీ, ఇతర అవయవాలు దెబ్బతినడం గానీ జరిగి ఉండేది. అయితే రేవతికి గానీ, శ్రీతేజ్‌కి గానీ ఎక్కడ కూడా గాయాలైన ఆనవాళ్లు లేవని వైద్యుల నివేదికలో వెల్లడైంది. థియేటర్ లోయర్ బాల్కనీలో పరిమితికి మించి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడం వల్లే వారికి ఊపిరి ఆడలేదని.. ఈ క్రమంలోనే రేవతి కన్నుమూసిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అల్లు అర్జున్ను పోలీసులు అడిగిన పలు ప్రశ్నలివే.. సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు నాటి ఘటనకు సంబంధించి ప్రశ్నల వర్షం గుప్పించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు అడిగిన ప్రశ్నలివే.. ⇒ పుష్ప–2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్టు సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు అంగీకరించారు. ఈ విషయాన్ని నాగరాజు మీకు చెప్పారా? లేదా? ⇒ థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా, లేదా? అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా? ⇒ పోలీసుల అనుమతి లేకున్నా థియేటర్‌కు ఎందుకు వచ్చారు? ⇒ మీతో పాటు సినిమా చూసేందుకు ఎంత మంది వచ్చారు? ⇒ మీతోపాటు ఎంత మంది బౌన్సర్లు వచ్చారు? ఆ బౌన్సర్ల ఏజెన్సీకి అనుమతులు ఉన్నాయా? ⇒ మీరు థియేటర్‌కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందనే దానిని అంగీకరిస్తారా? ⇒ చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి వచ్చారు? ⇒ పోలీసుల విధులను మీరు ఎందుకు అడ్డుకున్నారు? ⇒ రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల మేనేజర్ నాగరాజు చెప్పారా? లేదా? ⇒ రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియదని మీడియాతో ఎందుకు చెప్పారు? ⇒ చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? ⇒ తొక్కిసలాట జరిగినా, ఒక వ్యక్తి మరణించినా కూడా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటికి రాలేదు? సంధ్య థియేటర్ కేసులో నిందితుల వివరాలివీ... ఏ–1: ఆగమాటి పెదరామిరెడ్డి, థియేటర్ యజమాని ఏ–2: ఆగమాటి చిన్నరామిరెడ్డి, థియేటర్ యజమాని ఏ–3: ఎం.సందీప్, భాగస్వామి ఏ–4: సుమిత్, భాగస్వామి ఏ–5: ఆగమాటి వినయ్, భాగస్వామి ఏ–6: అశుతోష్రెడ్డి, భాగస్వామి ఏ–7: రేణుకాదేవి, భాగస్వామి ఏ–8: అరుణారెడ్డి, భాగస్వామి ఏ–9: నాగరాజు, థియేటర్ మేనేజర్ ఏ–10: విజయ్ చందర్, లోయర్ బాల్కనీ ఇన్చార్జి ఏ–11: అల్లు అర్జున్, పుష్ప సినిమా హీరో ఏ–12: సంతోష్, అల్లు అర్జున్ పీఏ ఏ–13: శరత్ బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్ ఏ–14: రమేష్, సెక్యూరిటీ ఏ–15: రాజు, సెక్యూరిటీ ఏ–16: వినయ్‌కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఏ–17: పర్వేజ్, బాడీగార్డ్ ఏ–18: మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు -
కావాలని ఎవరూ చేయరు
రాంగోపాల్‌పేట్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతిచెందడం దురదృష్టకరమని ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు అన్నారు. అయితే ఇలాంటి ఘటనలను ఎవరూ కావాలని చేయరని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం దిల్‌రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల్లేకుండా చూసుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని ఆయన చెప్పారు.రెండు, మూడు రోజుల్లో పరిశ్రమ పెద్దలతో సహా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని.. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. మరోసారి సీఎం కలవడంతోపాటు హీరో అల్లు అర్జున్ను కూ డా కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం.. శ్రీతేజ్‌కు వెంటిలేటర్ తొలగించి రెండు రోజులైందని.. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు దిల్‌రాజు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉండటం వల్ల తాను ఇక్కడికి రాలేకపోయానని.. సీఎంను మంగళవారమే కలిశానన్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యతను ప్రభుత్వం, సినీ పరిశ్రమ తీసుకుంటుందన్నారు. బాలుడి తండ్రి భాస్కర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని.. అవసరమైతే సినీ పరిశ్రమలో ఉద్యోగం కల్పిస్తామని దిల్‌రాజు తెలిపారు.కళ్లు తెరిచిన శ్రీతేజ్కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకుంటున్నట్లు వైద్యుల వెల్లడిరాంగోపాల్పేట్: సంధ్య థియేటర్లో జరిగిన తొక్కి సలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కోమాలో ఉన్న బాలుడిని వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. దీంతో అతను కాస్త కోలుకోవడంతో రెండు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం అతను సొంతంగానే శ్వాస తీసుకుంటుండటంతోపాటు కళ్లు తెరిచి చూస్తున్నాడని.. కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకోగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. అయితే ఇంకా కుటుంబ సభ్యులను గుర్తించట్లేదని.. మాటలకు ప్రతిస్పందించట్లేదని చెప్పారు. గత మూడు రోజులుగా నాసోగ్యా్రస్టిక్ ట్యూబ్ ద్వారా అందించే ఆహారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. థియేటర్ లోపల ఏమి జరిగిందో తెలియదు: భాస్కర్ సంధ్య థియేటర్ లోపల ఏమి జరిగిందో తనకు తెలియదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మీడియాకు చెప్పారు. తాను కుమార్తెతో కలిసి థియేటర్ బయట నుంచి భార్యకు ఫోన్ చేయగా లోపల ఉన్నట్లు చెప్పిందని.. ఆ కొద్దిసేపటికే తొక్కిసలాటలో మరణించినట్లు తెలిసిందన్నారు. ఇంతవరకు తాను ఆస్పత్రికి బిల్లులేవీ చెల్లించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మైత్రీ మూవీస్ రూ. 50 లక్షలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయనకు చెందిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు, హీరో అల్లు అర్జున్ నుంచి రూ. 10 లక్షలు తనకు అందాయన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ తదితరులు నిత్యం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. అలాగే దర్శకుడు సుకుమార్ రెండుసార్లు వచ్చి కలిశారని తెలిపారు. ఘటన జరిగిన రెండవ రోజు అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడని సానుభూతితోనే నేను కేసు వాపసు తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. -
పుష్ప 2: అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన బ్యూటీ.. ఎవరంటే? (ఫోటోలు)
-
సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఆ రోజు ఏం జరిగిందంటే..ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా..
ఓ పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వివాదంలో చిక్కుకోగా మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా రాబట్టింది. అందులో ఒక్క హిందీలోనే రూ.704 కోట్లు వసూలు చేయడం విశేషం.అల్లు అర్జున్ పాడిన సాంగ్ఇకపోతే మంగళవారం నాడు పుష్ప టీమ్ దమ్ముంటే పట్టుకోరా పాట (Dammunte Pattukora Song) రిలీజ్ చేసింది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ సాగుతుంది. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించాడు. రెండు మూడు లైన్లు మాత్రమే ఉన్న లిరిక్స్‌ను సుకుమార్ అందించాడు. లక్షల వ్యూస్యూట్యూబ్లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. డిసెంర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వివాదంలో అల్లు అర్జున్ఇదిలా ఉంటే డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లగా అక్కడ తొక్కిసలాట (Sandhya Theatre Stampede) జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా మరోసారి పోలీసులు బన్నీని విచారించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: అమ్మాయిలు మిమ్మల్ని బకరాలను చేసి వాడుకుంటారు!: నటుడు -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు వేల కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. తాజా వసూళ్లు చూస్తే మరికొద్ది రోజుల్లోనే ఈ అరుదైన మైలురాయిని పుష్ప-2 మూవీ చేరుకునేలా కనిపిస్తోంది.అయితే నార్త్‌లో పుష్పరాజ్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. తాజాగా హిందీ పుష్ప-2 మరో రికార్డ్ సాధించింది. రిలీజైన 19 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త సృష్టించింది. దీంతో అత్యంత వేగంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. హిందీ సినీ చరిత్రలోనే పుష్ప-2 అరుదైన ఘనత సాధించింది. Pushpa Raj introduces the 700 CRORE CLUB to HINDI CINEMA 💥💥 The FIRST EVER FILM to collect 700 CRORES in HINDI ✨#Pushpa2TheRule collects massive 704.25 CRORES NETT in Hindi ❤🔥❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/9Mg6plgJyE— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2024 -
స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్
సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్‌కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్‌ను సంపాదించింది.కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్‌ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్‌తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు. ఏ పాటకో తెలుసా?పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ హెచ్ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by @ottta_mynd -
పీఎస్‌లో పుష్ప: అల్లు అర్జున్ ఇంటి గేటు పరదాలతో మూసివేత
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Tragedy)లో మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్‌పై ఇదివరకే కేసు నమోదైంది. గతంలోనే బన్నీని అరెస్టు చేయడం, కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తాజాగా చిక్కడపల్లి పోలీసులు విచారణకు రావాలంటూ హీరోకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun) తన లాయర్లతో కలిసి మంగళవారం (డిసెంబర్ 24న) పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.ప్రస్తుతం బన్నీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి ముందు పరదాలు కట్టారు. ఇంటి గేటును పరదాలతో మూసివేశారు. ఇంటి లోపలి మనుషులు ఎవరూ బయట మీడియాకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రెండు గంటల్లోనే గేటుకు కట్టిన పరదాలను తొలగించారు. కాగా డిసెంబర్ 22న అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఇలా పరదా కట్టినట్లు తెలుస్తోంది.ఏం జరిగింది?హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రాగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు అటు థియేటర్ యాజమాన్యంతోపాటు ఇటు హీరో అల్లుఅర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఇటీవల జైలుకు వెళ్లిన ఆయన బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా విచారణ నిమిత్తం మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్? -
అల్లు అర్జున్ ఫోటోలు
-
సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్
'పుష్ప 2' (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరడం హీరో అల్లు అర్జున్‌ని(Allu Arjun) ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు కూడా పిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)ఈ వివాదం అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపిందో తెలీదు గానీ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) మాత్రం మానసికంగా చాలా కుంగిపోయినట్లు అనిపిస్తున్నాడు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్లో మహిళ మృతి విషయాన్ని గుర్తుతెచ్చుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఏకంగా సినిమానే వదిలేస్తానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూఎస్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఈవెంట్ సందర్భంగా సుక్కు ఈ కామెంట్స్ చేశాడు.యూఎస్ ఈవెంట్లో 'గేమ్ ఛేంజర్' నుంచి 'ధోప్' లిరిక్స్‌తో సాగే పాట రిలీజ్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ఒకవేళ మీరు 'ధోప్' అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు? అని యాంకర్ సుమ అడగ్గా, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అలా చేయరులే అని సైగ చేసి చూపించాడు. బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయినట్లు ఉంది. బహుశా అందుకే అలా అన్నాడేమో?(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)Papam ra SUKKU 😢Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024 -
పుష్ప–2 దర్శకుడు,హీరో, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలి
మేడిపల్లి: పోలీసులను కించపరిచేలా పుష్ప–2 చలన చిత్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని అందుకు బాధ్యులైన సినిమా దర్శకుడు, హీరో, నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 చిత్రంలో పోలీసులను అవమానించేలా కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం దారుణమని ఇందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. -
ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పుష్ప2 సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జునే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. తాజాగా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయని అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు.ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. సినిమాల బెనిఫిట్ షోలు, హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసమో, డబ్బులున్న వాళ్ల కోసమో వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాలని ఆక్షేపించారు.సినిమాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజా శ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులివ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతోందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు.బాబు కుట్రే.. నిదర్శనమిదే..హీరో అల్లు అర్జున్‌పై చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్టు చేసినా, ఆయన ఇంటిపైన దాడి జరిగినా ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా, ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పుష్ప2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్‌బాబు ‘నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వొక కమెడియన్.చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ‘ఎక్స్’లో అర్జున్‌పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. నంద్యాలలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరోక్షంగా అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
KA Paul: రేవతి కుటుంబానికి 300 కోట్లు ఇస్తా
-
సంధ్య ధియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం
-
సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం
పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డిఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. -
పుష్ప-2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అసలేం జరిగిందంటే.. (చిత్రాలు)
-
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు. -
'పుష్ప' అభిమాని అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా అనేక రికార్డ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు భారీగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమా ప్రీమియర్స్ సమయంలో రేవతి చనిపోవడంతో చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. పుష్ప సినిమా బన్నీకి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అంతే స్థాయిలో తనని ఇబ్బంది పెట్టే సంఘటనలు జరిగాయి. అయితే, ఈ చిత్రం వల్ల ఒక గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి అర్ధరాత్రి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో 'పుష్ప-2' సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా వారి ఎంట్రీ జరగడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి కొంత సమయం పాటు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో పాటు సాధారణ వ్యక్తిలా కూర్చొని ఉన్న డ్రగ్స్ స్మగ్లర్, పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్న విశాల్ మిశ్రాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనను చూసిని వారందరూ కూడా షాక్ అయ్యారు. అతని అరెస్ట్ తర్వాత సినిమా ప్రదర్శన కొనసాగింది. సుమారు ఏడాది పాటు పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే, పుష్ప2 సినిమాపై విశాల్ మిశ్రాకు ఉన్న ఆసక్తిని పోలీసులు గుర్తించారు. ఎలాగైన అతను సినిమా చూసేందుకు వస్తాడని పోలీసులు ముందుగానే అంచనా వేసి నిఘా ఉంచారు. అయితే, అతను పుష్ప2 విడుదల సమయంలో కాకుండా తాజాగా థియేటర్‌కు వెళ్తున్నట్లు పాంచ్పావలీ పోలీస్‌స్టేషను అధికారికి సమాచారం అందింది. అతను ఏ థియేటర్లో సినిమా చూడనున్నాడు, సీటు నంబర్‌తో సహా వారికి సమాచారం రావడంతో పక్కా ప్లాన్‌తో పోలీసలు ఎంట్రీ ఇచ్చారు. విశాల్ మిశ్రాపై ఇప్పటికే రెండు హత్యలు, డ్రగ్స్ రవాణా వంటి వాటితో పాటు మొత్తం 30కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.బౌన్సర్లకు వార్నింగ్పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)వారిదే పూర్తి బాధ్యతపోలీసులపై, పబ్లిక్పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ -
అల్లు అర్జున్ మేనేజర్‌కు ముందే చెప్పాం: ఏసీపీ
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల సీసీటీవి ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గురించి సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. వాటికి కౌంటర్‌గా అల్లు అర్జున్ కూడా సంఘటన జరిగిన రోజు సంధ్య థియేటర్ వద్ద ఏమైంది అనేది తన వర్షన్‌ను పంచుకున్నారు. అయితే, తాజాగా పోలీసులు కూడా ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ క్రమంలో చిక్కడపల్లి ఏసిపీ రమేష్ కుమార్ ఘటనరోజు జరిగిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.థియేటర వద్దకు భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని, అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా బాబు పరిస్థితి కూడా సివియర్‌గా ఉందని అల్లు అర్జున్ మేనేజర్‌కు చెప్పాం. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు చెప్పాలని మేము ప్రయిత్నం చేశాం. కానీ సంతోష్ మమ్మల్ని కలవనివ్వలేదు. నాకు చెప్పండి నేను అల్లు అర్జున్‌కు చెబుతా అని సంతోష్ చెప్పారు. ఆ సమయంలో నేను ఇదే విషయాన్ని మా డీసీపీకి తెలియజేశాను. ఆ సమయంలో డీసీపీ ఆదేశాలు మేరకు నేను క్రౌడ్‌ను నెట్టుకుంటూ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి విషయం చెప్పాను. మీరు థియేటర్ నుండి వెళ్లి పోవాలి అని ఆయనకు సూచన చేశాను. కానీ, సినిమా చూసి వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. డీసీపీ, నేను వెళ్లి గట్టిగా చెప్పడంతో సుమారు 15 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారు.' అని ఏసిపీ పేర్కొన్నారు. -
అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంతో మరోసారి అల్లు అర్జున్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశాడని, అరెస్ట్ కోసం వెళితే దరుసుగా ప్రవర్తించారంటూ బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ..అవన్నీ నూటికి నూరు శాతం అబద్దాలేనని స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ.. మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించండం బాధించిందన్నారు. (చదవండి: అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డీజీపీ)ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ వివాదం గురించే చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ పుష్ప 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. (చదవండి: పీలింగ్స్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..)ఇక పుష 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Just completed watching #pushparaj , loved the Gangamma Jatra episode,refelects the #samakkasarakka like culture from #telangana , can’t imagine a talent other than #alluarjun adorning the character,thank you to the makers for reflecting our authentic Indian self so beautifully.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 21, 2024 -
'పుష్ప 2' పీలింగ్స్ సాంగ్.. ఇబ్బందిగా ఫీలయ్యా.. కానీ.. : రష్మిక మందన్నా
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ పుష్ప 2 మూవీ ఇప్పటివరకు రూ.1600 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీలోని పాటలన్నీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే పీలింగ్స్ పాట మాత్రం కాస్త సంచలనానికి తెర తీసింది.పీలింగ్స్ పాటపై రష్మిక రియాక్షన్సాంగ్లోని కొన్ని స్టెప్పులపై సోషల్ మీడియా వేదికగా పలువురూ అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో కొత్తగా ట్రై చేశారు, బాగుందంటూ మెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా పీలింగ్స పాటపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'పీలింగ్స్ రిహార్సల్ వీడియో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. అల్లు అర్జున్ సర్‌తో కలిసి డ్యాన్స్ చేశాను అని మురిసిపోయాను. నాకు ఆ ఫోబియా ఉందికానీ మొదట చాలా భయమేసింది. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే భయమేస్తుంది. ఈ పాటలో బన్నీ సర్ నన్ను ఎత్తుకుని స్టెప్పేస్తాడు. మొదట అసౌకర్యంగా ఫీలయ్యాను. కానీ సుకుమార్, బన్నీ సర్ నన్ను ఆ ఇబ్బంది నుంచి బయటపడేశారు. ఒక్కసారి ఆయన్ను నమ్మాక అదేమంత ఇబ్బందిగా అనిపించలేదు. అంతా ఫన్‌గా జరిగిపోయింది.కొందరికి నచ్చకపోవచ్చునాపై నేనే డౌట్ పడితే నటిగా రాణించడం కష్టం. నేనున్నది జనాలను ఎంటర్టైన్ చేయడానికే! మరీ ఎక్కువ ఆలోచిస్తే నా కొమ్మను నేనే నరుకున్నట్లు అవుతుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈ పాట కొందరికి నచ్చకపోవచ్చు. ప్రతీది అందరికీ నచ్చాలనేం లేదు' అని రష్మిక చెప్పుకొచ్చింది. చదవండి: 'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్ -
2000 కోట్లు టార్గెట్ 20 నిమిషాలు కొత్త సీన్లతో రీ లోడింగ్
-
2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?
2024 చివరకొచ్చేసింది. ఈ ఏడాది తెలుగు సినిమా రేంజ్ చాలా ఎత్తుకు ఎదిగింది. జనవరిలో 'హనుమాన్' దగ్గర నుంచి డిసెంబర్లో రిలీజైన 'పుష్ప 2' వరకు తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోయింది. మధ్యలో 'కల్కి', 'దేవర' లాంటి మూవీస్ పాన్ ఇండియా లెవల్లో తమదైన వసూళ్లు సాధించాయి. మిగతా భాషలతో పోలిస్తే తెలుగు చిత్రాలకు ఈసారి లాభాలు బాగానే వచ్చాయని చెప్పొచ్చు. మరి ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన మూవీ ఏంటి? ఎంతొచ్చాయి?తెలుగులో ఈ ఏడాది థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు సాధించిన సినిమాల అంటే.. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, గుంటూరు కారం ఉంటాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'పుష్ప 2' దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలోనూ రూ.645 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుని.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)లాభాల పరంగా చూసుకుంటే 'పుష్ప 2' సినిమా అగ్రస్థానంలో ఉంటుందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 'పుష్ప 2'కి అటుఇటుగా రూ.500 కోట్లకు పైనే బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 150-200 శాతం మధ్యలోనే ఉంది. కల్కి, దేవర చిత్రాల్ని తీసుకున్నా సరే పెట్టిన బడ్జెట్‌కి కొంతమేర లాభాలు వచ్చాయి తప్పితే మరీ ఎక్కువ అయితే రాలేదు.కానీ జనవరిలో రిలీజైన 'హనుమాన్' మూవీకి మాత్రం రూ.40 కోట్లు బడ్జెట్ పెడితే.. రూ.300-350 కోట్ల వరకు వచ్చాయి. దాదాపు 600 శాతానికి పైగా వసూళ్లు వచ్చినట్లే. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల్లో షేర్ ఇచ్చినా సరే నిర్మాత ఈ సినిమాతో బాగానే లాభపడినట్లే! దీనిబట్టి చూస్తే 2024లో 'హనుమాన్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'పుష్ప 2' మూవీ ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి.. రన్ పూర్తయ్యేసరికి లాభాల్లో పర్సంటేజ్ ఏమైనా మారుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్) -
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
-
నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్
బంజారాహిల్స్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు. పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శల నేపథ్యంలో శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. తాజా పరిణామాలపై వివరణ ఇచ్చారు. థియేటర్ నాకు గుడిలాంటిది.. ‘సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా’అని అల్లు అర్జున్ తెలిపారు. నా అభిమాని చనిపోతే వెళ్లాలని నాకు ఉండదా? తొక్కిసలాట ఘటనలో ఒకరి మృతితో 15 రోజులుగా బాధలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా విజయోత్సవాలను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘గతంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు హీరోల అభిమానులు చనిపోతే విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి పరామర్శించా. అలాంటిది నా అభిమాని చనిపోతే వెళ్లనా? పరామర్శించాలని నాకు ఉండదా?’అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఘటన జరిగిన మర్నాడే బాధిత కుటుంబాన్ని కలవాలనుకున్నప్పటికీ తన లీగల్ టీం సూచనల వల్ల వెళ్లలేకపోయానన్నారు. అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా.. థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని... దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. రోడ్ షో అనడం దారుణం థియేటర్‌కు రోడ్ షో, ర్యాలీ చేసుకుంటూ వెళ్లాననే మాట పూర్తిగా అవాస్తవం, దారుణమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. థియేటర్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉండగా భారీ సంఖ్యలో అభిమానులు తన వాహనాన్ని చుట్టుముట్టారని చెప్పారు. తాను కారులో నుంచి పైకి వచ్చి అభివాదం చేస్తే అభిమానులు పక్కకు జరుగుతారని అక్కడి వారు చెబితే తాను బయటకు వచ్చానని వివరించారు. తనను ఒక్కసారైనా చూసేందుకు అంత మంది అభిమానులు వచ్చినప్పుడు తాను కారులోనే కూర్చుంటే తనకు తల పొగరు అనుకుంటారని భావించే వారికి నమస్కరిస్తూ దారివ్వాలని కోరానన్నారు. మహిళ మృతి గురించి పోలీసులు చెప్పలేదు.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని పోలిసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పారు. కేవలం థియేటర్ యాజమాన్యం తన వద్దకు వచ్చి బయట గొడవగా ఉన్నందున వెళ్లిపోవాలని సూచించారన్నారు. దీంతో వెంటనే తాను భార్యతో కలిసి బయటకు వెళ్లిపోయానని వివరించారు. తన పిల్లల్ని లోపలే వదిలి వెళ్లానని.. ఒకవేళ జరిగిన దుర్ఘటన గురించి తెలిస్తే వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఈ విషయం మరుసటి రోజు ఉదయం తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి అండగా ఉన్నాననే విషయాన్ని తెలియజేసేందుకే వీడియో విడుదల చేశానన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలియడం ఒక్కటే ప్రస్తుతం తనకు ఊరట కలిగించే అంశమన్నారు. తాను వెళ్లడం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతోనే తన తండ్రి అల్లు అరవింద్‌ను ప్రత్యేక అనుమతి ద్వారా ఆస్పత్రికి పంపి బాలుడి చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ వివరించారు. తాను, దర్శకుడు సుకుమార్ కలిసి పిల్లల భవిష్యత్తు కోసం కచ్చితంగా ఏదైనా మంచి పని చేయాలని అవసరమైతే వారి పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు. ఎవరినీ నిందించట్లేదు.. తాను ఎవరినీ నిందించాలని మాట్లాడటం లేదని.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభుత్వం తమ సినిమాకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించిందని.. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో తనను మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించే పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని అల్లు అర్జున్ పేర్కొన్నారు. మా కుటుంబం గురించి అందరికీ తెలుసు: అల్లు అరవింద్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసుకుందామనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లాడని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. థియేటర్ వద్ద ఘటన తర్వాత మనస్తాపానికి గురై అదే ఆలోచనలతో ఉండిపోయాడన్నారు. మూడు తరాల చరిత్రగల తమ కుటుంబం గురించి అందరికీ తెలుసన్నారు. అసత్య ప్రచారాల వల్ల బాధలో ఉన్నందున మనసులోని ఆవేదనను చెప్పుకుంటున్నామన్నారు. ప్రజలు ఆదరిస్తేనే ఈ స్థాయికి వచ్చామని.. అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. -
జాతర పాటను బాధ్యతగా భావించాను: నృత్యదర్శకుడు విజయ్ పోలాకి
‘‘అల్లు అర్జున్‌గారి ‘పుష్ప 2’ సినిమాలోని జాతర సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీలవ్వలేదు. బాధ్యతగా ఫీలయ్యాను. ఈ సినిమాలోని ‘జాతర’ పాటకు, పుష్ప 2 టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. ‘అమ్మాడి...’ (నాని ‘హాయ్ నాన్న’), ‘మార్ ముంత చోడ్ చింత...’ (రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’), ‘లింగిడి లింగిడి...’ (శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి’), ‘నక్కిలిసు గొలుసు...’ (‘పలాస’), ‘కళ్ల జోడు కాలేజ్ పాప...’ (‘మ్యాడ్’) పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి ‘పుష్ప 2’ చిత్రంలోని జాతర పాట, టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’లకు నృత్యరీతులు సమకూర్చారు.ఈ నేపథ్యంలో విజయ్ పోలాకి మాట్లాడుతూ– ‘‘నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ...’. ఆ తర్వాత చాలా హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాను. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాట కోసం గణేష్ ఆచార్య మాస్టర్‌గారితో కలిసి వర్క్ చేశాను. అయితే ‘పుష్ప 2’లో నాకు కొరియోగ్రాఫర్‌గా చాన్స్ వస్తుందని అప్పుడు ఊహించలేదు. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి...’ జాతర పాట, ‘పుష్ప... పుష్ప...’ పాటకు వర్క్ చేశాను. జాతర పాట రొటీన్‌గా ఉండకూడదని సుకుమార్‌గారు చె΄్పారు. ఇలా ఉండాలి అంటూ... కొన్ని మూమెంట్స్ ఆయన చూపించారు. పుష్పరాజ్ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈ పాట చేయాలనుకున్నాను. అందుకని ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ని చాలాసార్లు చూశాను. జాతర సాంగ్‌కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి, 20 రోజులు షూట్ చేశాం. అల్లు అర్జున్‌గారు చాలా కష్టపడి చేశారు. ప్రస్తుతం సాయితేజ్‌గారి ‘సంబరాల ఏటిగట్టు’, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌గారి ‘భైరవం’, ‘మ్యాడ్ 2’ (సింగిల్ కార్డు), హిందీలో ‘బేబీ’ సినిమాలకు వర్క్ చేస్తున్నాను’’ అన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సినీ హీరో అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బన్నీ మీడియాతో మాట్లాడారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇచ్చారు. 'సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తుగా మాత్రమే జరిగింది. కానీ, నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్ లోపలికి నేను వెళ్లిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చిన జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం ఆ క్షణంలో నాకు తెలియదు. మరుసటి రోజు రేవతి విషయం తెలిసింది. నా సినిమా కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను..? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు నా టీమ్ వారికి ఫోన్ చేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. సినిమాకు వచ్చేవారిని ఆనందపరచాలనేది మా ఉద్దేశం.నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నేను ఎవరినీ ఒకమాట అనలేదు. అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాను అనడంలో ఎలాంటి నిజం లేదు. రేవతి కుటుంబం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానని చెప్పడం చాలా దారుణం. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను రోడ్ షో, ఊరేగింపు చేయలేదు. మూడేళ్లుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అభిమానులతో సినిమా చూడాలని ఆశతో వెళ్లాను. గతంలో ఇతర హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది నా అభిమానులు చనిపోతే.. ఆ కుటుంబాన్ని వెళ్లి కలవకుండా ఎలా ఉంటాను. లాయర్ల సూచనలతో నేను శ్రీతేజను చూసేందుకు వెళ్లలేదు. అయితే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. కానీ, అదీ కుదరదన్నారు. అయితే, సుకుమార్‌ను అయినా వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడం చాలా దారుణం. నా క్యారెక్టర్‌ను చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుంటే మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. అంతటి ఘోరం జరిగిందని నాకు తెలిస్తే.. నా బిడ్డలను థియేటర్ వద్దే వదిలి ఎలా వెళ్తాను. పూర్తి విషయాలు తెలుసుకోకుండా నాపైన నిందలు వేస్తున్నారు. నేను కూడా ఒక తండ్రినే.. నాకు శ్రీతేజ వయసు ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా కూడా సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు తెలిసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు ఎదోరకంగా అల్లు అర్జున్ను అక్కడి నుంచి పంపిస్తే.. అయినప్పటికీ, మరోసారి రూఫ్‌టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని కామెంట్ చేశారు. ఒక మహిళ చనిపోయిందని తెలిసి ఆపై ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా కూడా అల్లు అర్జున్ అదే పద్ధతి కొనసాగించారనే సంచలన ఆరోపణ రేవంత్‌రెడ్డి చేశారు. ఒక మహిళ చనిపోయాన కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని అనడం ఏంటి అంటూ బన్నీ తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. -
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్
-
అల్లు అర్జున్ ప్రచార యావే ప్రాణం తీసింది: ‘రాచాల’
సాక్షి, న్యూఢిల్లీ: పుష్ప–2 చిత్రం ప్రచార మోజులో మహిళ ప్రాణాలు తీసిన అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రేక్షకులను నియంత్రించలేమని పోలీసులు హెచ్చరించినా.. లెక్కలేనితనంతో నటుడు అల్లు అర్జున్ వచ్చారని ఆరోపించారు. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైందని, ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడని పేర్కొన్నారు. -
శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)
-
'పుష్ప 2' సక్సెస్‌తో 2024కి రష్మిక సెండాఫ్
రష్మిక కెరీర్లోనే 2024 గుర్తుండిపోయే ఏడాది. ఇప్పుడు దీనికి సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. శ్రీవల్లిగా రష్మిక పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక)ప్రస్తుతం రష్మిక.. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో బిజీగా ఉంది. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ 'సికందర్' మూవీలో ఈమెనే హీరోయిన్. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక ఫుల్ హ్యాపీ. వచ్చే ఏడాదిలోనూ గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికందర్ తదితర చిత్రాలతో అలరించేందుకు రష్మిక రెడీ అయిపోయిందనే చెప్పాలి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్) -
'పుష్ప 2'తో రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ రష్మిక (ఫొటోలు)
-
కోలుకున్న శ్రీతేజ్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
'పుష్ప 2' బెన్ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్.. కోలుకుంటున్నాడు. మొన్నటివరకు సీరియస్ కండీషన్లో ఉన్న ఇతడు.. ప్రస్తుతం కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. ఈ మేరకు వైద్యులు.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో)సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది, ఫీటింగ్ తీసుకోగలుగుతున్నాడని.. కాళ్లు-చేతులు కదిలిస్తున్నాడని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు.ఇదే సంఘటనలో శ్రీతేజ్ తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు కేసు పెట్టి.. తొలుత సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్ని అరెస్ట్ చేశారు. తర్వాత హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. వీళ్లకు బెయిల్ వచ్చింది. దీంతో కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్) -
ఓటీటీకి పుష్ప-2.. కీలక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మొదటి రోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.అయితే ఇటీవల పుష్ప-2 ఓటీటీకి త్వరగానే వచ్చేస్తోందంటూ పలువురు కథనాలు రాసుకొచ్చారు. దీంతో పుష్ప టీమ్ అప్రమత్తమైంది. ఓటీటీకి వస్తుందన్న వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. పుష్పరాజ్ ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో బిగ్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పుష్ప-2 ముందుగానే ఓటీటీకి వస్తోందన్న రూమర్స్‌కు చెక్ పెట్టింది మూవీ టీమ్.హిందీలో అరుదైన రికార్డ్బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది.There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️It won't be on any OTT before 56 days!It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. వందేళ్ల చరిత్రను తిరగరాశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ— Pushpa (@PushpaMovie) December 20, 2024 The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024 -
ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమా ఇదే..!
మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ జాబితాలో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ వీక్షించినట్లు వెల్లడించింది.కాగా.. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. -
థియేటర్ల నుంచి పుష్ప 2 అవుట్? ఏం జరిగిందంటే?
పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు. బాలీవుడ్లో బడా స్టార్ల రికార్డులను బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు (గ్రాస్) వసూలు చేయగా ఒక్క హిందీలోనే రూ.618 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఆ కారణం వల్లే?ఈ క్రమంలో నార్త్‌లో పుష్ప 2ను థియేటర్లలో నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. సినీ విశ్లేషకులు మనోబాలా విజయబాలన్.. పుష్ప 2 చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ నుంచి తీసేస్తున్నారని ట్వీట్ చేశాడు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధనకు నిర్మాతలు ఒప్పుకోలేదని, అందుకే ఉన్నపళంగా పుష్ప 2 ప్రదర్శనలను నిలిపిపేయాలని మల్టీప్లెక్స్‌లు భావించినట్లు తెలుస్తోంది. సమస్య సద్దుమణిగినట్లే!తర్వాత ఇరు వర్గాలు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మనోబాల మరో ట్వీట్లో వెల్లడించాడు. సమస్య సద్దుమణిగిందని తెలిపాడు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో పుష్ప 2 ఆడుతుందని పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పుష్ప 2 సినిమాను జనవరి రెండో వారంలో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. మరి ఇప్పుడు కొత్త అగ్రిమెంట్స్ ప్రకారం ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి! BREAKING: Pushpa 2⃣ REMOVED✖️ from all PVR INOX chains in North India from Tomorrow.— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024 BREAKING: Pushpa 2️⃣ PVR INOX agreement issue now resolved✅Shows opening slowly one by one⏳— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024చదవండి: లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ -
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?
'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజై మూడు వారాలవుతున్నా సరే జోరు చూపిస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తున్నాయి. ప్లాన్ మారిందని, అనుకున్న టైం కంటే ముందే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.2021 డిసెంబరులో 'పుష్ప' సినిమా రిలీజైంది. థియేటర్లలో ఉండగానే.. నెలరోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు కూడా అలానే చేయబోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఓటీటీ రిలీజ్ దగ్గర్లో ఉందంటేనే వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. గత నాలుగైదు రోజుల్లో పుష్ప 2 టైటిల్ సాంగ్, కిస్సిక్, ఫీలింగ్స్ వీడియోలని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. సంక్రాంతి ముందే అంటే జనవరి 9 లేదా 10వ తేదీల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుందేమో?ప్రస్తుతం రూ.1500 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసిన 'పుష్ప 2' సినిమాకు.. క్రిస్మస్, న్యూఇయర్ వీకెండ్ బాగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం 'బాహుబలి 2' రికార్డ్ గల్లంతవడం గ్యారంటీ. చూడాలి మరి ఏం జరుగుద్దో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకున్న పుష్ప-2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు పుష్పరాజ్.ఇప్పటికీ పుష్ప-2 రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప-2 వసూళ్లను రివీల్ చేశారు. ఈ మూవీ విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్ల సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. COMMERCIAL CINEMA REDEFINED 🔥HISTORY MADE AT THE BOX OFFICE 💥💥#Pushpa2TheRule collects 1508 CRORES GROSS WORLDWIDE - the fastest Indian Film to reach the mark ❤🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vk0qnXLOt0— Pushpa (@PushpaMovie) December 19, 2024 The HISTORIC RULE at the box office continues 💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to Gross 1500+ CRORES WORLDWIDE in 14 Days ❤🔥1508CR & counting 🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon… pic.twitter.com/AQueWAv9Gp— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2024 -
'కిస్ కిస్ కిస్ కిస్సిక్'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది. -
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్‌పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
కాంచన4 పై పుష్పరాజ్ ఎఫెక్ట్..?
-
'పుష్ప' రాజ్ యూనిక్ సాంగ్ విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హిట్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి బన్నీ యూనిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో సాంగ్‌ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.'పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ పలు భాషల్లో 250+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే సాంగ్ వీడియో రూపంలో తాజాగా విడుదలైంది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు. -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్..!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా పుష్ప-2 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోన్న పుష్పరాజ్.. ఏకంగా ఆస్ట్రేలియాలో కలెక్షన్ల వర్షం కురిపించాడు. దాదాపు 4 మిలియన్ డాలర్ల వసూళ్ల రాబట్టినట్లు పుష్ప టీమ్ పోస్టర్‌ను షేర్ చేసింది.ఈ వసూళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ఘనత సాధించింది. గతంలో ఏ సినిమా సాధించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ఇండియాలో మాత్రమే కాదు.. పుష్పరాజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని అర్థమవుతోంది. ఈ వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అనే డైలాగ్‌ను మరిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా పుష్ప-2 వసూళ్లు రాబట్టింది. ఇదే ఊపు కొనసాగితే మరో కొద్ది రోజుల్లోనే రెండు వేల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.పుష్పకు వీరాభిమాని డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ అంటే వార్నర్‌కు పిచ్చి అభిమానం. ఆయన సినిమాలో మేనరిజం, డైలాగ్స్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు వార్నర్. చాలాసార్లు బన్నీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు కూడా చేశారు. THE HIGHEST GROSSING INDIAN FILM IN AUSTRALIA in 2024 ❤🔥#Pushpa2TheRule hits A$ 4 MILLION gross and going strong at the Australian Box Office 💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/gYxgLbrzrv— Pushpa (@PushpaMovie) December 18, 2024 -
రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త
రిలీజై రెండు వారాలవుతున్నా సరే ఇంకా 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు.. ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ షాకింగ్ అనుభవం.. యువ నటికి ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.(ఇదీ చదవండి: మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్)తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.. రీసెంట్గా 'పుష్ప 2' సినిమా చూడటానికి వెళ్లింది. జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ.. సామీ అని గట్టిగా అరిచిందట. దీంతో సంయుక్త తెగ భయపడిపోయింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడు. భయమేసి.. పది రూపాయుల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మాల్లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదలా ఉంచితే 12 రోజుల్లో రూ.1450 కోట్లపైనే వసూళ్లని 'పుష్ప 2' సాధించింది. ఈ వీకెండ్, వచ్చే వారం క్రిస్మస్ పండగ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు
'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)తాజాగా చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు.షోకాజ్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్న కొన్ని అంశాలుసంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలుసంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం.ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారుఅల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు.అల్లు అర్జున్‌తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.టిక్కెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
ఇదెక్కడి క్రేజ్ రా అయ్యా.. పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్!
అల్లు అర్జున్ పుష్ప-2 థియేటర్లను షేక్ చేస్తోంది. ఈ నెల 5న మొదలైన పుష్పరాజ్ బాక్సాఫీస్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంది. అంతేకాకుండా హిందీలో ఎప్పుడు లేనివిధంగా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ.582 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సెకండ్ వీకెండ్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.ఈ వసూళ్లు చూస్తే చాలు హిందీలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. రెండోవారంలో ఆదివారం థియేటర్ల వద్ద ఏకంగా ఆడియన్స్‌ను చూస్తే ఏకంగా జాతరను తలపించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పుష్ప-2 థియేటర్ వద్ద ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. టికెట్స్ కౌంటర్ వద్ద మాస్ జాతర కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా థియేటర్ ముందు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్కు అందుకున్న ఘనతను ఇప్పటికే సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ సినిమాల అల్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ఇప్పటికే రూ.1409 కోట్లకు వసూళ్లతో రెండు వేల కోట్ల మార్క్ దిశగా పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్లోనే రూ.2000 వేల కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2 నిన్న ఆదివారం Raipur లో థియేటర్ లో టికెట్ల కోసం క్యూ... తెలుగు సినిమా 💪❤️ pic.twitter.com/amyUAvmoGf— Rajesh Manne (@rajeshmanne1) December 16, 2024 -
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు: టాలీవుడ్ నటుడు సుమన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ నటుడు సుమన్ స్పందించారు. పాన్ ఇండియా హీరో అయిన బన్నీకి అంత క్రేజ్ ఉన్నప్పుడు భద్రత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందన్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం చాలా తప్పు అని సుమన్ అన్నారు. కొత్త సినిమా రిలీజైనప్పుడు థియేటర్ యాజమాన్యం హీరోలను పిలుస్తారని వెల్లడించారు. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ప్రైవేట్ బౌన్సర్లతో కంట్రోల్ చేయాలని సూచించారు.సుమన్ మాట్లాడుతూ..' అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్ వాళ్లే హీరోను పిలుస్తారు. నన్ను కూడా గతంలో చాలాసార్లు థియేటర్ వాళ్లు పిలిచారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం తప్పుకాదు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పోలీసులు, థియేటర్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోవాలి. అభిమానుల రద్దీని, ఆ క్రౌడ్‌ని థియేటర్ వాళ్లు మేనేజ్ చేయాల్సింది. ' అని అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. -
అల్లు అర్జున్ ఆ మాట అనడం సంతోషాన్నిచ్చింది: యానిమల్ నటుడు
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది పుష్ప-2. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం వసూళ్లపరంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2021లో పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అయితే చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవా. యానిమల్ మూవీలో బాబీ డియోల్ సోదరుడిగా మెప్పించిన సౌరభ్ సచ్‌దేవా పుష్ప-2లో నటించడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యుకు హాజరైన సౌరభ్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సౌరభ్ సచ్‌దేవా మాట్లాడుతూ..' యానిమల్‌లో నా నటన చూసిన పుష్ప 2 మేకర్స్ నన్ను సంప్రదించారు. నాతో సుకుమార్ సార్ వీడియో సమావేశంలో మాట్లాడారు. పుష్ప-2లో నా పాత్ర గురించి దాదాపు 20 నిమిషాలు చర్చించాం. నా కంటే ముందు చాలా మందిని సంప్రదించినా.. చివరికీ నన్ను ఖరారు చేశారు' అని తెలిపాడు.అల్లు అర్జున్ గురించి సౌరభ్ మాట్లాడుతూ..'నేను అతన్ని మొదటిసారి సెట్స్‌లోనే కలిశా. అతను చాలా స్వీట్ పర్సన్. నా అభ్యర్థనపై తన వానిటీ వ్యాన్ మొత్తం నాకు చూపించాడు. అతను ఒక సూపర్స్టార్లా కాకుండా చాలా బాగా మాట్లాడారు. యానిమల్ నా రోల్ పవర్ఫుల్ అని అల్లు అర్జున్ అన్నారు. నా పాత్రను బన్నీ ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. యానిమల్, పుష్ప-2 చిత్రాలతో నాకు మరింత ఫేమ్ వచ్చిందని సౌరభ్ తెలిపారు. -
పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'పుష్ప2'. ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్, కలెక్షన్స్ ఇలా అన్నింటిలోనూ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పీలింగ్స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోషల్‌మీడియాలో ఈ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ కూడా ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.పుష్ప2 విజయంలో పాటలు కూడా ప్రధాన బలమని చెప్పవచ్చు. అల్లు అర్జున్, రష్మిక మందన్న స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుష్ప2లో భారీ క్రేజ్‌ను అందుకున్న పీలింగ్స్ సాంగ్ వీడియో అన్ని భాషలలో రిలీజ్ కావడంతో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది.విడుదలైన రోజు నుంచే 'పీలింగ్స్' సాంగ్ దూసుకుపోతోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా తెలుగులో (శంకర్ బాబు, లక్ష్మీ దాసా), హిందీలో (జావేద్ అలీ, మధుబంతీ) , తమిళంలో (సెంథిల్ గణేశ్, రాజలక్ష్మి) మలయాళంలో (ప్రణవమ్ శశి, సితార కృష్ణకుమార్) కన్నడలో (సంతోశ్ వెంకీ, అమల) ఆలపించారు. -
పుష్ప-2 మరో రికార్డ్.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)అయితే పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన పది రోజుల్లోనే నార్త్‌లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది. ఇప్పటికే హిందీలో తొలిరోజు రూ.74 కోట్లతో మొదలైన పుష్పరాజ్ ఊచకోత ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెన్ డేస్‌లో రూ.507 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.#Pushpa2TheRule breaches another record-breaking milestone ❤️🔥Crosses 500 CRORES NETT in Hindi in just 10 days - THE FASTEST FILM IN HINDI to do so 💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/CwpYUbf2o7— Pushpa (@PushpaMovie) December 15, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. ఆడియన్స్‌కు గుడ్ న్యూస్!
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.అయితే తాజాగా బన్నీ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది పుష్ప టీమ్. పుష్ప-2 3డీ వర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయం కేవలం హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని థియేటర్లలో 3డీ వర్షన్ తీసుకొస్తామని ప్రకటించింది. ఇంకేందుక ఆలస్యం.. 3డీ వర్షన్లో పుష్ప-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. Add another dimension to the WILDFIRE on the big screens 🤩Watch #Pushpa2TheRule (Telugu) in 3D at select screens in Hyderabad. It is going be an epic experience 😎Many more 3D shows being added all across the country.Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/UHK4TLknCk— Pushpa (@PushpaMovie) December 15, 2024 -
అల్లు అర్జున్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు: స్టార్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ మరోసారి కామెంట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వర్మ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. 'అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అధికారులకు నా 4 ప్రశ్నలు' అంటూ అందరినీ ఆలోచింపచేసిన ఆయన మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కేంద్రమంత్రుల నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. ఇప్పటికే బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడిన ఆర్జీవి మరోసారి ఇలా ట్వీట్ చేశారు. ' తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని అందించి, రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.' అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు.నేషనల్ అవార్డ్‌తో తెలుగు సినిమా కీర్తిని పాన్ ఇండియా రేంజ్‌కు అల్లు అర్జున్ తీసుకెళ్లాడని తెలిసిందే. ఇన్నేళ్ల తెలుగు ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు మన సత్తా ఏంటో చూపించాడు. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయింది.. @alluarjun the BIGGEST STAR of INDIA, a resident of TELANGANA STATE has given the GREATEST GIFT to the TELANGANA STATE by giving the BIGGEST HIT in the ENTIRE HISTORY of iNDIAN CINEMA and the TELANGANA STATE in turn gave him the BIGGEST RETURN GIFT by sending him to JAIL…— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2024 -
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత 'పుష్ప2' కలెక్షన్స్‌పై ప్రభావం పడిందా..?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మూవీకి వారం రోజుల్లోనే రూ. 1067 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. అయితే, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప2 సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని నెటిజన్లు ఆరా తీశారు. సంధ్య థియేటర్ ఘటనతో బన్నీ అరెస్ట్ తర్వాత కలెక్షన్స్‌పై ఏమైనా ప్రభావం చూపుతాయా అని అంచనా వేశారు. దీంతో శుక్రవారం నాడు పుష్ప2 కలెక్షన్స్ ఎంత వచ్చాయని అందరిలో ఆసక్తిగా మారింది.పుష్ప 2 మొదటి వారం నాటికి రూ. 1067 కోట్ల గ్రాస్ వచ్చిందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా రూ. 38 కోట్ల నెట్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన శుక్రవారం నాడు మాత్రం రూ. 36.25 కోట్ల నెట్ వచ్చింది. బన్నీ అరెస్ట్ ఘటన పుష్ప కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. శుక్రవారం తెలుగులో రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, బాలీవుడ్లో రూ. 27 కోట్లు, తమిళంలో రూ.1.3 కోట్లు, కర్ణాటక , కేరళ రూ.2 లక్షల వరకు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో అల్లు అర్జున్ కలెక్షన్స్ పరంగా ర్యాంప్ ఆడించేస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్లో రూ. 450 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 కేవలం తొమ్మిదిరోజుల్లోనే రూ. 1120 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. బన్నీ అరెస్ట్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ బాక్సాఫీస్ లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పుష్ప 2 ది రూల్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సుమారు 90 శాతం కలెక్షన్స్ రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాదాపు అందుకుంది. -
అరెస్ట్ పై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
-
Allu Arjun Arrest: గవర్నమెంట్ పర్మిషన్ ఇదిగో!