rachamallu siva prasad reddy
-
YSRCPలో చేరిన టీడీపీ కౌన్సిలర్లు
-
కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
-
50 % కమీషన్.. ఎమ్మెల్యే చెప్పిన వారికే లోన్లు..
-
‘టీడీపీ, షర్మిల’.. కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైఎస్సార్సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఆదినారాయణ రెడ్డి లాంటి వారు వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చింది. ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుంది. విజయసాయి రెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా?. సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైఎస్సార్సీపీ పని అయిపోయిందని కూటమి నాయకులు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ద్వారా అత్యున్నత పదవులు అనుభవించి.. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉండగా కొంతమంది వదిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్తున్నారు. వైఎస్ జగన్ కి ద్రోహం చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది పార్టీకి, వైఎస్ జగన్‌కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.టీడీపీ, షర్మిలకు కౌంటర్..టీడీపీ నాయకులు, షర్మిలకు, ఆదినారాయణరెడ్డికి అందరికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీ పని అయిపోతుందా?. వైఎస్ జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకే కాదు.. మళ్లీ ఇంకో జన్మ ఎత్తయినా సరే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకునే కార్యకర్తలు నాతోపాటు ఊరూరా లక్షల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బలం. వైఎస్ జగన్‌ని విమర్శించే వారంతా ఆయన పేరు వింటేనే పక్క తడుపుకునే వాళ్లు. వాళ్లకు జగన్ మీద మనసు నిండా కుట్ర, ఒళ్లంతా అసూయ ఉంది. జగన్ చనిపోలేదు.. కేవలం ఓడిపోయాడని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా కూటమి నాయకులు శత్రువు గురించి భయపడుతున్నారు.ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే..వైఎస్ జగన్‌కి మేమెప్పుడూ బలం కాదు.. ఆయనే మా అందరికీ బలం. పోరాటం, ధైర్యం, విశ్వసనీయత ఆయన బలం. ఆయన వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరే ఆయనకు శ్రీరామరక్ష. కార్యకర్తలే జగన్ బలం. కార్యకర్తలు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, వంటి వారు పార్టీ మారలేదా?. విశ్వసనీయత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని అలాంటి చంద్రబాబే 2024 మళ్లీ సీఎం కాలేదా? అలాంటిది జగన్ సీఎం కాలేరా?. ఆయన మళ్లీ సీఎం కావడం తథ్యమని తెలుసు కాబట్టే శత్రువులంతా భయంతో వణికిపోతున్నారు.ఇద్దరు ముగ్గురు వదిలేసి వెళ్లినంత మాత్రాన జగన్ భయపడేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినప్పుడే మా పార్టీ కనుమరుగయ్యేది. ఆరోజే ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. వైఎస్ జగన్‌ను కాదని వెళ్లిపోయిన ఈ ఆదినారాయణ రెడ్డి మళ్లీ గెలవలేదు. ఇప్పటికే 2019-24 మధ్య ఒకసారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయణరెడ్డి.. మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి. వైఎస్సార్సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రొద్దుటూరులో వరదరాజుల అరాచకాలు రాచమల్లు ఫైర్..
-
పవన్ ను ఏకిపారేసిన రాచమల్లు
-
మీ సంపద సృష్టి మంత్రి సవితకు రాచమల్లు కౌంటర్
-
కూటమి పాలనలో ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదు: రాచమల్లు
-
అదానీతో గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
-
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. -
YSRCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు
-
చంద్రబాబుకు రాచమల్లు శివప్రసాద రెడ్డి కౌంటర్
-
బాబు దగా.. ఇది ముంచిన బడ్జెట్: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ప్రజలను చంద్రబాబు సర్కార్ దగా చేసిందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి రాగానే వెంటనే వాటిని అమలు చేస్తామని ఓటు అడిగారు. మహిళకు 15 వేలు, ఉచిత బస్సు, నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామన్నారు. 20 వేలు రైతుకు, 25 లక్షల ఉద్యోగాలు ఇలా అనేకం సూపర్ సిక్స్, మేనిఫెస్టో ఉన్నాయి. గెలిచిన వెంటనే అమలు చేస్తామని వాగ్దానం చేశారు. 6 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో కాలయాపన చేశారు. నిన్న పూర్తి బడ్జెట్ పెట్టారు.. దాంట్లో మీరిచ్చిన ఈ ఒక్క హామీ కనిపించలేదు’’ అంటూ రామమల్లు నిలదీశారు.నువ్వు మోసగాడివని తెలిసినా నీకు ఓటేయడానికి కారణం ప్రజల్లో చిన్న ఆశ. పేదరికం చెడ్డది.. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ పడతాడు. ప్రజలు కూడా ఆశ పడ్డారు.. కానీ హామీలన్నీ తుంగలో తొక్కారు. పేదరికం వల్ల జగన్‌ను ఓడించడం ఇష్టం లేకున్నా నీకు ఓటేశారు. 58.5 లక్షల మంది రైతులు ఉన్నారు.. మీ లెక్క ప్రకారం 20 వేలా చొప్పున 14వేల కొట్లు బడ్జెట్ లో పెట్టారు. వీళ్లలో 30 లక్షల మందికి మాత్రమే నువ్వు బడ్జెట్ పెట్టావ్. తల్లికి వందనం రేపటి ఏడాది ఇంటర్ వాళ్లకి తీసేస్తారు. ఈ ఏడాదికి 14 వేల కోట్లు పింఛన కోత విధించావు. 30 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసావు.. ఇంకా ఎంత కాలం మోసం చేస్తావు’’ అని చంద్రబాబును రాచమల్లు దుయ్యబట్టారు.ఆశతో నీకు పేదవాడు ఓటు వేస్తే నట్టేట ముంచావు. ఇది ముంచిన బడ్జెట్ మాత్రమే. ఈయన సంపద సృష్టించే వాడు కాదు.. సంపద లాక్కునే వాడు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచావ్. రేపటి నెల నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నారు. 4 కోట్ల మందిని మోసం చేయగల ఘనాపాటి చంద్రబాబు. రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం. సోషల్ మీడియా వారిని నువ్వు హింసిస్తున్నట్లు నీపై ప్రజాస్వామ్య యుతంగా దాడి చేస్తాం. రూ. 15 వేలు ప్రతి ఆడబిడ్డకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. రైతుకు 20 వేలు, నిరుద్యోగ భృతి 3 వేలు ఎప్పుడిస్తావో చెప్పండి. కక్ష సాధింపు చర్యలు మాని. ప్రజలకు సాయపడే పనులు చేయండి’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘ఇసుక ఉచితం అన్నారు.. ఉచితం మాత్రం అటకెక్కింది. ఈ రోజు ఎన్నికలు పెడితే.. మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే విధానం రావాలి. అలాంటి మోసపు పార్టీలను పోటీ చేయకుండా చేయాలి.. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీకి మైకు ఇవ్వనప్పుడు వెళ్లి ఏం చేయాలి?. ప్రజలు సమస్యల గురించి కాదు.. అవమానం చేయడానికి పిలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు..?. వర్రాను అవినాష్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేసి కొట్టారు. ఆయన జడ్జి ముందు వాస్తవాలు చెప్పడంతో కంగు తిన్నారు’’ అని రాచమల్లు పేర్కొన్నారు. -
వర్రా రవీంద్రారెడ్డికి టీడీపీ నుండే ప్రాణహాని...?
-
పక్కా ప్లానేనా?.. అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది...91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్ చేశారు...ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్లా..?. సోషల్ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్ అంటూ ఏబీఎన్ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు...కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది...ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. -
చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైఎస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.బాబు కుటిల రాజకీయాలు.. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైఎస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కథనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు.చంద్రబాబుకు వార్నింగ్..ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్న అసత్య కథనాలపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.. వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని ఆయనకు సూచించారు. అందుకే వ్యక్తిగత, కుటుంబ వివాదాల విషయాలను రాజకీయాల్లోకి లాగకుండా సంయమనం పాటించాలని హితవు చెప్పారు. వైఎస్ కుటుంబ ఆస్తులకు సంబంధించి వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ.. తన బిడ్డలిద్దరూ పరిష్కరించుకుంటారని, కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవద్దని విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో తాము కూడా పార్టీ ఆదేశాలతో మౌనంగా ఉన్నామని రాచమల్లు వివరించారు. షర్మిలకు మీ రక్షణ అవసరమా?షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్‌కళ్యాణ్ హామీ ఇవ్వడంపై రాచమల్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? అన్న ఆయన, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా? అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. అత్యంత కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని ఆరోపించారు. పిఠాపురంలో 16 ఏళ్ల యువతికి మత్తుమందిచి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే ఎందుకు కాపాడలేదని ప్రశ్నించిన రాచమల్లు, తిరుపతి సమీపంలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?:వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్‌లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రాష్ట్రావతరణ వేడుకలకు బాబు మంగళం -
చంద్రబాబుతో చేతులు కలిపి..
-
వైఎస్ జగన్ పట్ల షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు
-
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు. ‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్‌కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి వెళ్లారు.నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్‌ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్‌ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో భూములపైనే ఎటాచ్మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.2019లో సరస్వతి ఇండస్ట్రీస్‌లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్లో ఆ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్‌ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్‌తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్మోహన్రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్‌ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీపై రాచమల్లు ఫైర్
-
తుల గుండెల్లో రైతు బిడ్డగా YSR..
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
మోసం చేయడం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. రాచమల్లు ఫైర్
-
ఓటమిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్
-
నీ శకం ముగిసింది బాబు..
-
రాత్రి మారేలోపు జెండా మార్చేసావ్ ఆ మాట అనడానికి నోరెలావచ్చింది నీకు..?
-
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హాట్ కామెంట్స్
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీ ఏర్పాట్లు
-
చంద్రబాబు బీజేపీ పొత్తుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సెటైర్లు
-
పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కౌంటర్
-
టీడీపీ డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది: రాచమల్లు
-
షర్మిల వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
బాబు శేషజీవితం ఇక సెంట్రల్ జైల్లోనే..!
-
6 రోజుల పాటు కాలినడకన తిరుమలకు పాదయాత్ర
-
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
చంద్రబాబు బెయిల్ పై ఎమ్మెల్యే రాచమల్లు సంచలన విషయాలు..
-
చంద్రబాబు ఐటీ నోటీసుల పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రచ్చ
-
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
-
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే
-
కూతురికి ప్రేమ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే రాచమల్లు విమర్శలు
-
లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఈవినింగ్ వాకింగ్ లా ఉంది: రాచమల్లు
-
ఘటన నాటి నుంచీ టీడీపీ డైరెక్షన్ లోనే విచారణ
-
వివేకా లేఖను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు దాచిపెట్టారు ?
-
వైఎస్ వివేకా కేసు దర్యాప్తుపై అనుమానాలు !
-
‘సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వివేకా హత్య కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ‘ సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. భాస్కర్‌రెడ్డి అరెస్ట్ అక్రమం. ఏ కేసులోనైనా నిష్పక్షపాత విచారణ జరగాలి.వివేకా హత్యకు జగన్‌కూ ఏం సంబంధం. హత్య ఎందుకు జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు జరగాలి’ అని పేర్కొన్నారు. చదవండి: విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానికుల ర్యాలీ -
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
గడప గడపకు మన ప్రభుత్వం: ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): విద్యావంతురాలైన దివ్యాంగురాలు ముత్యాల లక్ష్మికి కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం రూ.2.5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం 33వ వార్డు పరిధిలోని ఆర్ట్స్‌కాలేజి రోడ్డులో తిరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేకు దివ్యాంగురాలి సమస్య ఎదురైంది. ఎంఎస్సీ (మ్యాథ్స్) చదివిన ముత్యాల లక్ష్మి ప్రస్తుతం 35వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసి కాలిని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె ఆత్మ స్థైర్యాన్ని గమనించిన ఎమ్మెల్యే రాచమల్లు కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తే లక్ష్మి జీవన పరిస్థితి పూర్తి మెరుగ్గా ఉంటుందని భావించి ఈ సహాయం అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలు లక్ష్మి మాట్లాడుతూ పెద్ద మనసుతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తనకు సహాయం అందించారన్నారు. తాను ఎమ్మెల్యే ఇచ్చిన రూ.2.5 లక్షలతోపాటు మరో లక్ష కలిపి కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుంటానని తెలిపారు. నాలుగో వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి రూ.20 వేలు, పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి రూ.15 వేలు దివ్యాంగురాలికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పద్మశాలీయ సేవా సంఘం పట్టణాధ్యక్షుడు అగ్గారపు శ్రీనివాసులు, మున్సిప ల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చౌడం రవీంద్ర, నాయకులు మల్లికార్జున ప్రసాద్, గజ్జల కళావతి, గుమ్మళ్ల పద్మావతి, జాకీర్ పాల్గొన్నారు. -
వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు
ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. ఈ హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే తనతోపాటు జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి చేసిన ప్రసారాల్లో వాస్తవాలు లేవన్నారు. ఆయన మంగళవారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడారు. తామంతా వైఎస్‌తోపాటు వివేకానందరెడ్డితో కలిసి పనిచేశామన్నారు. శాంతి కపోతానికి మారుపేరుగా నిలిచిన వివేకానందరెడ్డిని అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని జిల్లా ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. బాధితులైన వైఎస్ కుటుంబ సభ్యులనే హత్యకు బాధ్యులను చేయడం మనసును కలచివేస్తోందన్నారు. 164 స్టేట్మెంట్ను చూపుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆదివారం తెల్లవార్లూ బ్రేకింగ్ న్యూస్ పెట్టిందని, డీపీ నేతలతో డిబేట్ నిర్వహించిందని చెప్పారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమామహేశ్వరరెడ్డి.. వివేకానందరెడ్డితో కుటుంబ సభ్యులుగా వ్యవహరించేవారని తెలిపారు. సునీల్‌యాదవ్ ఆక్రోశంతో బండబూతులు తిట్టి దస్తగిరి చేతిలోని గొడ్డలిని తీసుకుని నరికాడన్నారు. ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయని ఎర్రగంగిరెడ్డి చెప్పారని, అది వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డేనని ఏబీఎన్‌లో నిర్ధారించారని పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి సిట్, సీబీఐ దర్యాప్తులో ఎక్కడా వారిపేర్లు ప్రస్తావించలేదన్నారు. దస్తగిరి సైతం సిట్ దర్యాప్తులో వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించలేదని, రెండున్నరేళ్ల తర్వాత వారి పేర్లు చెబుతున్నారన్నారు. దస్తగిరిని మేనేజ్‌చేసి కేసు మలుపు తిప్పుతున్నారు సాధారణ ఎన్నికలకంటే ముందే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, సిట్ అధికారిగా అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం నియమించిన అభిషేక్ మహంతి విచారణ చేశారని చెప్పారు. ఏడాదిపాటు ఆయన చేసిన విచారణలో ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు రాలేదన్నారు. కొంతమంది వెనుక ఉండి దస్తగిరిని మేనేజ్‌చేసి కేసును మలుపుతిప్పుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, అప్పటికే వివేకానందరెడ్డి ఆయన కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని గుర్తుచేశారు. వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత పీఏ కృష్ణారెడ్డి సెల్‌ఫోన్, లెటర్ పోలీసులకు అప్పగించలేదన్నారు. మొదట 174 సెక్షన్ కింద అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి రాత్రికి 302 కింద హత్యకేసుగా మార్చారని చెప్పారు. వైఎస్ కుటుంబ సభ్యులు ఈ హత్య చేసి ఉంటే గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఇంతకంటే మించిన గొప్ప బ్రహ్మాస్త్రం ఉంటుందా అన్నారు. గొర్రెతోక పట్టుకుని సముద్రాన్ని ఈదాలంటే కుదరదని చెప్పారు. దస్తగిరిలాగే ఎర్రగంగిరెడ్డిని కూడా అప్రూవర్‌గా మార్చి కేసు మలుపు తిప్పే అవకాశం ఉందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో డబ్బు ఎర్రగంగిరెడ్డిదని, దస్తగిరిని ప్రలోభపెట్టాడని చెప్పారు. -
నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా
ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్కాంలో తన ప్రమేయం ఉందని పరోక్షంగా తనను ఉద్దేశించి ఆంధ్రజ్యోతిలో అబద్ధపు రాతలు రాశారని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అలా నిరూపించలేని పక్షంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను మూసివేస్తారా అని ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రూ.117 కోట్లు చెక్కేశారని అబద్దపు కథనాన్ని ప్రచురించారన్నారు. తనపేరు ప్రస్తావించకపోయినా జిల్లాలో పది మంది ఎమ్మెల్యేల తరఫున తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కాగా, తమ పార్టీ కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారని తేలడంతో వెంటనే విధుల నుంచి తొలగించానని చెప్పారు. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషించాడని వివరించారు. అలాగే ట్రస్టు పేరుతో డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నకిలీ బాగోతాన్ని గుర్తించిందన్నారు.ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరినా తనకు అభ్యంతరం లేదని రాచమల్లు తెలిపారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్టకు ఎమ్మెల్యే సవాల్..
సాక్షి, ప్రొద్దుటూరు: సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కుల స్కాం కేసులో తన పాత్ర ఉందని పోలీసులు, సీఐడీ అధికారులు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ స్కాంలో తన పాత్ర లేదని తేలితే ఆంధ్రజ్యోతి పత్రికను మూసివేస్తావా అంటూ ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణకు ఆయన సవాల్ విసిరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి పత్రిక సీబీఐ దర్యాప్తు కోరితే తాను మొదటి సంతకం చేస్తానని కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారు’) -
‘విపత్తులో సాయం అందించని వ్యక్తి ఆయనే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా వైరస్ ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని.. ఇలాంటి సమయంలో ఎటువంటి సాయం అందించని వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబేనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తులో దేశవ్యాప్తంగా దిగువ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు తమ వంతు సాయం అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని దుయ్యబట్టారు. (‘ఆ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసింది’) కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని అడిగే నైతికత టీడీపీకి లేదన్నారు. రాష్ట్రంపై చంద్రబాబు 2 లక్షల 50 వేల కోట్లు అప్పుల కుంపటి పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో మృతి చెందాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. -
వైద్య సేవలపై ఎమ్మెల్యే రాచమల్లు ఆరా..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి.. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. ఆసుప్రతిలో వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను కోరారు. రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ.. రిమ్స్ సర్వజన వైద్యశాలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి చెందిన డెంటల్ కళాశాలను కూడా అధికారులు పరిశీలించారు. -
లోకేశ్ సీఎం కాకూడదని..
సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ తమను పెట్టిన ఇబ్బందులను మరిచిపోలేమని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, తమ నాయకుడు వైఎస్ జగన్ కోసమే పని చేస్తున్నామన్నారు. గతంలో పోరాట వీరులం, ఇప్పుడు పరిపాలన దక్షులమంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదని ఓ 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని వెల్లడించారు. ‘మా తల తీసి పక్కన పెడితే చంద్రబాబు సీఎం కాడని చెబితే పక్కన పెట్టేస్తామ’ని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. చంద్రబాబుకు కోటంరెడ్డి సవాల్ గత సభలో తమకు చంద్రబాబు నేర్పిన విద్యనే ఇప్పుడు ప్రదర్శిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ‘గతంలో వైఎస్ జగన్‌ను అప్పటి మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పటి మంత్రుల కామెంట్లకు నాటి సభలో చంద్రబాబు చప్పట్లు కొట్టారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. నేనూ నా కామెంట్లపై క్షమాపణ చెబుతా. నావి కానీ ఆడియో టేపులను నావే అని టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. చంద్రబాబు ఆడియో టేపులు, నావి అని చెబుతున్న ఆడియో టేపులను ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి టీడీపీ సిద్దమా? ఎవరిది తప్పని తేలితే వారు శిక్ష అనుభవించాలి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరాలు
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆయన నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. స్థానిక కేహెచ్‌ఎం స్ట్రీట్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, తమ నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లలో 150 మందికి పైగా ముస్లింలు ఉన్నారని, జీతాలు ఇవ్వకుంటే మరో రెండు రోజుల్లో రానున్న రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. వీరంతా ఆనందంగా రంజాన్ జరుపుకోవడానికి తన సొంత నిధులతో వారికి ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే ప్రతి ఏడాది అంగన్వాడీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న కొత్త బట్టలు పంపిణీ చేస్తానని, ఈ సంవత్సరం జగన్ సీఎం అయ్యారు కనుక డిసెంబర్ వరకు ఆగకుండా మరో 15 రోజుల్లో బట్టల పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. అంగన్వాడీ సిబ్బంది కుటుంబ ఆర్థిక భద్రత కోసం నియోజకవర్గంలోని 800 మంది వర్కర్లకు సొంత డబ్బుతో రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీని కడతానని చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు వరాలు ప్రకటించడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తోంది : రాచమల్ల
-
టీడీపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ప్రజల డేటా చోరీ విషయంలో సీఎం చంద్రబాబు, కొడుకు లోకేష్‌లను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, లోకేష్‌లను ఎన్నికల్లో పోటి చేయకుండా అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వారు ఈ దారుణానకి పాల్పడుతున్నారని ఆరోపించారు. డేటా చోరీ స్కాంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తమ ఆధార్ కార్డులను మార్చుకోవాలని పిలుపు ఆయన పిలుపునిచ్చారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు
-
రెండో రోజుకు చేరిన రాచమల్లు దీక్ష
-
ఇసుక క్వారీ కోసం దీక్ష
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు నిరాహార దీక్షచేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుందే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు రూ.2500 నుంచి రూ.4వేల వరకు వెచ్చించి ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇదే అదనుగా భావించి టీడీపీ నేతలు ఇసుకను బంగారంగా మార్చుకుని పేద, మధ్యతరగతి ప్రజలను సైతం దోచుకుంటున్నారన్నారు. వారికి కలెక్టర్‌తోపాటు కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరులో ఇసుక క్వారీ చూపాలని చాలా రోజులుగా తాను జెడ్పీ సమావేశం, స్వయంగా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదన్నారు. దేవగుడి ఇసుక క్వారీకి ప్రొద్దుటూరు వాసులు వెళితే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించే పరిస్థితి లేదన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక ద్వారా రూ.కోట్లు సంపాదిస్తుండగా మరో వైపు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మనుషులు పోట్లదుర్తి క్వారీ నుంచి ఇసుకను తరలించి లాభపడుతున్నారన్నారు. ఎవరైనా అత్యవసరానికి ఇతర చోట్ల ఇసుకను తెస్తే అధికారులు మాత్రం ఆ ట్రాక్టర్లకు రూ.2లక్షలు జరిమానా విధించి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 18న తాను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా నిద్ర నటిస్తున్న కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ఉచిత ఇసుకను ప్రజలకు భారంగా మార్చారని అన్నారు. ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోరు కలెక్టర్ టీడీపీ నేతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పాత బస్టాండ్‌ను కూల్చివేశారని చెప్పినా, మున్సిపల్ పార్కులో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించిన మట్టిని అమ్ముకున్నారని ఫిర్యాదు చేసినా, నిబంధనలకు విరుద్దంగా ట్యాంకును నిర్మించారని చెప్పినా, ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ల యజమానులపై దేవగుడిలో మంత్రి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పినా కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాను శాంతియుతంగా దీక్ష చేపట్టాలనని నిర్ణయించానన్నారు. అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, తర్వాత రాష్ట్రస్థాయిలో వైఎస్సార్సీపీ నాయకులను పిలిచి ఉద్యమం చేపడుతామన్నారు. అంతకూ స్పందించని పక్షంలో తాను ఆమరణ దీక్షకు పూనుకుంటానని తెలిపారు. అప్పటికైనా అధికారులు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. స్థానిక తహసీల్దార్ సైతం తన ఆవేదనను పట్టించుకోకుండా ఊయలలో ఊగినట్లు వీల్ చైర్లో ఊగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మంత్రి అనుచరుల సహకారంతో తహసీల్దార్ రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వ్యాపారం చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. ఓ ఎమ్మెల్యే ఇసుకతో రూ.100 కోట్లు సంపాదించగా, మరో ఎమ్మెల్యే కోటీశ్వరుడు అయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, నారాయణరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, కల్లూరు నాగేంద్రారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
‘మంత్రి ఆదికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సవాల్’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలో ఏర్పాటు చేసిన జడ్పీ సర్వసభ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యపై జరిగిన చర్చలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాచమల్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంతో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఒక వేళ చంద్రబాబు ఓడిపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అని మంత్రికి రాచమల్లు సవాల్ చేశారు. సవాల్‌ను స్వీకరించని మంత్రి ఆదినారాయణ ఎమ్మెల్యే రాచమల్లుపై బెదిరింపులకు దిగారు. ‘మీ ఊరికే వస్తున్నా, మీ కథ చూస్తా. వేచి ఉండండి’ అంటూ రాచమల్లుపై మడ్డిపడ్డారు. అయితే బెరింపులకు భయపడేది లేదని, ప్రజలు తోడుగా ఉన్నంత వరకూ ఎంత మంది వచ్చినా తనను ఏమి చేయలేరని రాచమల్లు పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. -
జగన్ ప్రభుత్వంలో సొంత ఇంటి కల నెరవేరుస్తాం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గురువారం రావాలి జగన్– కావాలి జగన్ అనే నినాదంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నపుబట్టీల వీధిలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి పేదలను రుణగ్రస్తులను చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి షరతులు లేకుండా ఇళ్లు నిర్మించి ఇచ్చి తాళాలు చేతికి ఇస్తామన్నారు. సొంతింటి కల నెరవేర్చని పక్షంలో మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఇంటిలో పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికి పింఛన్ వస్తుందన్నారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. 13వ వార్డు పరిధిలోని సున్నపుబట్టీ వీధి వెనుక ఉన్న డ్రైనేజి కాలువలను చూస్తే మున్సిపాలిటీ నిర్లక్ష్యం ఇట్లే తెలిసిపోతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యానికి ఇది నిలువుటెత్తు సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, టప్పా గైబుసాహెబ్, గోనా ప్రభాకర్‌రెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, టౌన్‌బ్యాంకు డైరెక్టర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్ఆర్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య యాదవ్, వెల్లాల శేఖర్, వెలవలి నాయకుడు రాజశేఖరరెడ్డి, వాసుదేవరెడ్డి, జాకీర్, బంకచిన్నాయపల్లె లక్ష్మిరెడ్డి, మల్లికార్జున, అజీం, ఎంపీటీసీ సభ్యుడు చంద్ర ఓబుళరెడ్డి, పాములేటి, తీట్ల మనోహర్, తిరుపాల్, వెంకటేశ్, జిల్లా పార్లమెంట్ కమిటీ సహాయ కార్యదర్శి షాపీర్, ఎస్ఎండీ ఇలియాస్ పాల్గొన్నారు. -
‘బాబు అవకాశవాద రాజకీయ నాయకుడు’
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ నాయకుడని వైఎస్సార్ సీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలై ఆ పార్టీతో ముగింపు కానుందని అన్నారు. తెలుగువారి ఆత్మగోషను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. సోనియాగాంధీని ఇటలి దయ్యం.. రాహూల్ గాంధీని పప్పు అని సంభోదించి వారితో కలిసిపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఆరు జిల్లాల నుంచి ప్రజలను తరలించారు’
సాక్షి, వైఎస్సార్: జిల్లాలోని ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాటం సభకు ఆరు జిల్లాల నుంచి ప్రజలను తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ధర్మపోరాట సభకు భారీగా జన సమీకరణ చేయడానికి.. టీడీపీ నాయకులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. నాలుగున్నర ఏళ్లలో సాధించలేని ఉక్కు పరిశ్రమ నెలలో సాధిస్తామని అనడం హాస్యాస్పందంగా ఉందన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ఒక బుడబుడకలోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఒక రాజకీయ వేశ్య అని వ్యాఖ్యానించారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఒక్కరోజు దీక్ష
-
మంత్రి ఆదిది నీచ మనస్తత్వం
వైఎస్సార్, ప్రొద్దుటూరు : స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన మంత్రి ఆదినారాయణరెడ్డికి వ్యక్తిత్వం లేదు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారు. వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారు. నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డితోపాటు ఆయన కుటుంబం గురించి మంత్రి వ్యక్తిగతంగా దూషించే విధానం చేపల మార్కెట్లో కన్నా అధ్వానంగా ఉందన్నారు. అసలు ఆయన మంత్రేనా..ఆ భాష వింటే తనకే సిగ్గేస్తోందన్నారు. స్వార్థంతో వ్యవహరించే మంత్రి జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. ఆయన భాగవతం చెబుతున్నా వినండి అని అన్నారు. మూడు మార్లు మంత్రి సోదరుడు నారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, ఆయనను పక్కకు నెట్టినాలుగోమారు గెలిచే సమయంలో ఆది పోటీ చేశారన్నారు. మంత్రి ఆది అంతటి స్వార్థపరుడు లేడని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బీఫాంతో గెలిచి ఆయన వెంట నడవడం తన దరిద్రమా అని నిలదీశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి రూ.30కోట్లకో, రూ.40కోట్లకో అమ్ముడు పోకుండా ఆయన వెంట నడవడం దరిద్రమా అని చెప్పారు. తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన బీఫాంపై 12వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వారిని వంచించి పార్టీ మారడం దారుణమన్నారు. పదవీ వ్యామోహంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని వదలి చంద్రబాబు మోచేతి గంజినీళ్లు తాగడం ఉన్నతమా అని అన్నారు. అధికార దాహంతో కృతజ్ఞతాహీనుడిగా మిగలావన్నారు. మంత్రి వియ్యంకుడు కేశవరెడ్డి దేశమంతా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగరగొడితే కుటుంబ స్వార్థం కోసం ప్రజలను గాలికొదిలేసి జగన్‌ను విమర్శించడం సరికాదని అన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తనను విమర్శించడం ఏమిటన్నారు. రాచమల్లు చేసిన దానికి పోటీగా కార్యక్రమం చేపట్టడాన్ని బట్టి చూస్తే తన దెబ్బకు టీడీపీ నేతలు భయపడుతున్నట్లేనని అన్నారు. తన ప్రవర్తనను, తన మనస్తత్వాన్ని ఎరిగిన ప్రొద్దుటూరు ప్రజలు తిరిగి తననే ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ తన రాజకీయ వారసుడని వేలాది మంది కార్యకర్తల మధ్యన ప్రకటించిన మంత్రి ఆయనను పక్కన పెట్టి స్వార్థంతో తన కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయ వారసునిగా పరిచయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మంత్రి కుమారుడిని చేసుకోవడంలో వ్యూహం పన్నారని అన్నారు. ఆయనకు ఎప్పటి నుంచో అండగా నిలిచిన చిన్న సోదరుడు శివనాథరెడ్డిని సైతం పక్కనపెట్టి ప్రస్తుతం మంత్రి తన తోడల్లుడు రాజగోపాల్‌రెడ్డిని ముందుకు పెట్టి రాజకీయాలను నడిపిస్తున్నారన్నారు. మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడిన మాటలపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్యే అన్నారు. తన వద్ద కిరాయి హంతక ముఠా ఉందని, సీమ టపాకాయలను ఉపయోగిస్తే జగన్ పాదయాత్ర చేస్తాడా అని మంత్రి ఆది అనడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి దృష్టిలో సీమ టకాయలంటే బాంబులని అర్థం వస్తుందన్నారు. ఎండను, వానను సైతం లెక్క చేయకుండా ప్రజాభిమానంతో పాదయాత్ర సాగిస్తున్న యోధుడు జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు జగన్ భయపడే ప్రసక్తే ఉండదన్నారు. జిల్లాలో అత్యంత పిరికివాడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఇలాంటి వాళ్లు జగన్మోహన్రెడ్డి పాదయాత్రను ఆపగలరా అని విమర్శించారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరు నాగేంద్రారెడ్డి, శేఖర్, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ముస్లిం యువకులపై కేసులు పెట్టి కొట్టిస్తారా? వైస్సార్, ప్రొద్దుటూరు : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ముస్లిం యువకులపై కేసులు పెట్టించి బూటుకాలుతో తన్నించడం తగునా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో జరిగిన నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించినందుకు నిరసనగా ఎమ్మెల్యే సోమవారం ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నారా హమారా కార్యక్రమంలో వరాల జల్లులు ప్రభుత్వం కురిపించాల్సింది పోయి ప్రశ్నించిన యువకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసి సబ్ జైలుకు తరలించారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించినట్లు ముస్లింలకు ఇస్లాం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారా, వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించారా, 15 అసెంబ్లీ సీట్లు కేటాయించారా, రూ.5లక్షల రుణాలు మంజూరు చేశారా, వడ్డీ లేకుండా డ్వాక్రా రుణాలు రూ.5వేలు చొప్పున ఇచ్చారా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన వీరిని అక్రమంగా నిర్బంధించడం తగదన్నారు. ఈ ప్రభుత్వ తీరు ఎమర్జన్సీని తలపిస్తోందన్నారు. ఇదేనా ముస్లింలపై ప్రభుత్వానికి ఉండే ప్రేమ అని అన్నారు. హిందూ–ముస్లిం భాయి భాయి అని జీవిస్తున్నామని, అదే నినాదంతో వారికి అండగా నిలిచామన్నారు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం యువకులు దేశ్‌కీ నేతలా అని మంత్రి ఆదినారాయణరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాడిన గాంధీ ఆనాడు దేశ్‌కీ నేతే అని అన్నారు. మంత్రి మాట్లాడే భాషను చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఎంఎస్‌డీపీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, కేంద్ర ప్రభుత్వం పథకం అయిన దీని ద్వారా ఇక్కడి ముస్లింలకు ఏమి చేశారో చెప్పాలని మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం కింద రాయచోటి, ప్రొద్దుటూరులో కేవలం హాస్టళ్లను మాత్రమే నిర్మించారన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసుకు సంబంధించి తాను మానవ హక్కుల కమిషన్‌ను, కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వీరి తరపున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం నంద్యాలకు వెళ్లి ముస్లిం యువకులను పరామర్శిస్తామని, మరుసటి రోజు వెయ్యి మంది యువకులతో ప్రొద్దుటూరులో దీక్ష చేపడుతానన్నారు. ముస్లిం యువకులపై అన్యాయంగా కేసులు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా వారికి అండగా నిలవాల్సింది పోయి టీడీపీ నేతలతో ముక్తియార్ జత కట్టడం పద్ధతిగా లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జాఫర్ హుసేన్, దాదాపీర్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, మైనారిటీ నాయకులు మహ్మద్రఫిక్, అబ్దుల్లా, యూసఫ్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నారాయణమ్మ, కౌన్సిలర్లు పోసా వరలిక్ష్మి భాస్కర్, రాగుల శాంతి, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, గుమ్మటమయ్య, మల్లికార్జున ప్రసాద్, పార్టీ నాయకులు ఆర్సీ సుబ్రహ్మణ్యం, జాకీర్, లక్ష్మీనారాయణమ్మ, బాబుచాన్, మేరి, నాగాయపల్లె షరీఫ్, సాధక్, ఇలియాస్, నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య, వెల్లాల భాస్కర్, మైనారిటీ సెల్ మండల కన్వీనర్ ఖాదర్‌బాషా, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డి, కాకిరేనిపల్లె రామ్మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, మురళీనాథరెడ్డి, నల్లం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నారా హఠావో.. ముస్లిం బచావో’
సాక్షి, అమరావతి : ముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.హామిలను నెరవేర్చమని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం కనీసం నిరసన తెలిపే స్వాతంత్య్రం కూడా లేదా అని ప్రశ్నించారు. వారి హక్కులను అడిగే బాధ్యత మస్లిం యువకులపై ఉందన్నారు. శాంతియుతంగా ప్లకార్టులు ప్రదర్శించడం నేరమా అని ప్రశ్నించారు. 2014లో ముస్లీంలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. నారా హమారా, టీడీపీ హమారా పేరుతో ముస్లింలను మరొసారి మభ్యపెట్టేందుకు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.నారా హమారా నహీ అని.. నారా హఠావో.. ముస్లిం బచావో అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. -
ముస్లింలను మభ్యపెట్టేందుకే కపట నాటకాలు
-
నారా హమారా బూటకం
ప్రొద్దుటూరు (వైఎస్సార్ కడప): సీఎం చంద్రబాబు నాయుడు మరో మారు ముస్లిం మైనారిటీలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుంటూరులో నారా హమారా – టీడీపీ హమారా కార్యక్రమాన్ని నిర్వహించి మైనారిటీల ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2004 ఎన్నికల కంటే ముందు ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం చంద్రబాబు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముస్లింల ఆర్థిక అభివృద్ధి కోసం ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రూ.2,500 కోట్లతో ముస్లిం మైనారిటీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో మైనారిటీలకు 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారన్నారు. వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. చరిత్రలో మంత్రి పదవి ఇవ్వని క్యాబినెట్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి క్యాబినెట్లో ముస్లిం మైనారిటీలకు చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చే ఆనవాయితీ కొనసాగిందని తెలిపారు. దేశమంతా ఈ ఆనవాయితీ పాటిస్తున్నారని చంద్రబాబు మాత్రం తిరస్కరించారన్నారు. చరిత్రలో వారికి మంత్రి పదవి ఇవ్వని ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు దొడ్డిదారిన (ఎమ్మెల్సీగా ఎన్నుకుని) మంత్రి పదవి ఇచ్చారన్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన నారాయణకు, యనమల రామకృష్ణుడుకు మంత్రి పదవులు ఇచ్చారని తెలిపా రు. ఈ తరహాలో ముస్లిం సోదరులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యాభివృద్ధి కోసం 1200 ఉర్దూ టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని చెప్పి ఉన్న పోస్టులను కూడా తొలగించారన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో హజ్ యాత్ర కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతోపాటు హజ్హౌస్లను నిర్మిస్తామని చెప్పి నిర్మించలేదన్నారు. నిధులు పక్కదారి దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయిం పులు చేస్తానని చెప్పి నిధులను పక్కదారి మళ్లించారని విమర్శించారు. 2015–16లో బడ్జెట్లో ముస్లిం మైనారిటీలకు రూ.724 కోట్లు కేటాయించి రూ.217, 2016–17లో రూ.827 కోట్లకు రూ.248, 2017–18లో రూ.1102 కోట్లకు రూ. 280 కోట్లు ఈ ప్రకారం మొత్తం మూడేళ్లలో రూ.2,653 కోట్లకు గాను రూ.745 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నా రు. ఈ విషయంలో తాను ఏ ఛాలెంజ్ చేయడానికైనా సిద్ధమేనన్నారు. పేద, మధ్య తరగతి వారు వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పి శిక్షణతోపాటు వారికి పనిముట్లు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ విప్ మాటలు వెనక్కి తీసుకోవాలి ముస్లిం మైనారిటీ డ్వాక్రా మహిళలకు రూ.5 వేలు ఇస్తామని చెప్పారన్నారు. ముస్లిం పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించా రన్నారు. వారి విద్యాభివృద్ధి కోసం ఇంగ్లిషు మీడియం పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామని, మదరసాలలో చదివే వారికి బస్ పాస్ ఇవ్వడంతోపాటు స్కాలర్షిప్లు ఇస్తామని తెలిపారన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించి కబరస్థాన్లకు స్థలాలను కేటాయిస్తామని చెప్పారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ విప్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ చంద్రబాబును అల్లాతో సమానంగా భావించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నా రు. ఇప్పటికైనా షరీఫ్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పవిత్రమైన ఖురాన్‌కు సంబంధించిన అల్లాకు ఎవరూ ప్రతిరూపం కాదన్నారు. ముస్లింల కష్టాలకు కారకుడైన చంద్రబాబు సైతాన్‌తో సమానమని అన్నారు. -
సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీదా!
ప్రొద్దుటూరు టౌన్ : ‘సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీది అన్నట్లుగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కార్యక్రమం ఉంది’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరి ధిలోని గోపవరం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహాలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కేవలం రూ.80 వేలు మంజూరు చేయడంతో.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి, 2015–16లో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండటంతో.. ఇళ్లు అసంపూర్తిగా ఉన్నా హడావిడిగా గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. ఒక ఇంటి నిర్మాణానికి ఎంత కనీసమన్నా రూ.7 లక్షల నుంచి 8 లక్షల వ్యయం అవుతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.లక్షేనని, మిగిలిన రూ.50 వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఎక్కువ మొత్తం లబ్ధిదారుడు పెట్టి నిర్మించుకునే ఇంటికి.. అంతా ప్రభుత్వమే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కొంత సహాయం చేశానని చెప్పుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది రూ.70 వేల నుంచి రూ.80 వేలేనన్నారు. వెంటనే కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఉన్న ఇంటిని కూల్చేసి, అదే స్థలంలో నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఆ మధ్య సమయం దాదాపు 20 నెలల పాటు బాడుగ ఇళ్లలో ఉన్నారని, నెలకు రూ.2 వేలు చొప్పున అద్దె మొత్తం రూ.40 వేలు అయిందని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.50 లక్షలో రూ.30 వేలు టీడీపీ నాయకులకు, అధికారులకు లంచం రూపంలో ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. బాడుగ, లంచం కలిపితే.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు సరిపోతోందన్నారు. ఇంటి మొత్తానికి లబ్ధిదారుడే ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. పేదోడు తెచ్చుకున్న అప్పునకు వడ్డీ ఎవరు కడతారన్నారు. అధికార పార్టీ నేతలు పత్రికల్లో ఫోజులు ఇస్తూ అట్టహాసం, ఆర్భాటం చేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గృహ ప్రవేశాల పేరిట ఆనంద లోగిళ్లు చూద్దాం రారండి అని అన్నారని.. అయితే అవి అప్పుల గూళ్లు అని విమర్శించారు. అరకొరగా బిల్లుల చెల్లింపు జిల్లాలో 45,723 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నిర్మాణానికి నోచుకున్నవి 15 వేలేనని తెలిపారు. ఈ 15 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసింది 2,725లోనేనని, వీటికి చెల్లించిన బిల్లులు కేవలం రూ.1,97,45,000 అని చెప్పారు. ఈ 15 వేల ఇళ్లకు రూ.1.50 లక్షల ప్రకారం చూస్తే రూ.22 కోట్లు అవుతుందన్నారు. ఇది ఏ శాతమో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రొద్దుటూరులో మంజూరైన ఇళ్లు 1050 అన్నారు. ఇందులో 201 ప్రారంభించారని, బిల్లులు పూర్తిగా చెల్లించింది 28కేనని చెప్పారు. 1022 ఇళ్లను పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, ఓబయ్య యాదవ్, లింగారెడ్డి, దాదాపీర్, రఫీ, వార్డు మెంబర్లు మేరి, ఆదినారాయణరెడ్డి, ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
సీఎం రమేశ్‌ది ఉక్కు దీక్ష కాదు..డొక్కు దీక్ష
-
‘నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయారా’
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించరని రాచమల్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు. ముగిసిన మహాధర్నా ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. -
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్ష విరమణ
-
సీఎం రమేష్‌కు రాచమల్లు సవాల్
సాక్షి, వైఎస్సార్ కడప : కడప ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యతను అఖిలపక్షం తీసుకోవాలన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీక్షలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేవలం ఓట్లు కోసమే టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. -
టీడీపీవన్ని ఓటు దీక్షలే : రాచమల్లు
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 48 గంటల దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగుతున్న రాచమల్లు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా రాచమల్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఉక్కురాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారని, టీడీపీవన్ని ఓట్ల కోసం చేసే దీక్షలేనని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగితే ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే మొదట్నుంచి వైఎస్సార్సీపీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ నేతలకు వైఎస్సార్ జిల్లా ప్రజలపై ప్రేమ లేదు. అందుకే వారు జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో దీక్ష చేస్తున్నఎమ్మేల్యే రాచమల్లుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు, రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. -
చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరూ లేరు
ప్రొద్దుటూరు కల్చరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరూ లేరని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 27వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె రచించిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఆయన వ్యక్తిత్వం గొప్పదని చెప్పారు. 1949లో మన దేశం సినిమాతో సినీ రంగానికి ఆయన పరిచయమై తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారన్నారు. 35 ఏళ్లు సినీ ఫీల్డ్‌లో ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గొప్ప రాజకీయ వేత్త అని, ఆయన పేరు రెండు సార్లు గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నాక ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చిందన్నారు. స్వార్థ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో అభూత కల్పనలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించారన్నారు. వాస్తవాలను తెలుసుకోవాలంటే తాను రచించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదవాలన్నారు. ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూలో తన గురించి, చంద్రబాబు గురించి ఏమి మాట్లాడారో తెలుసుకుంటే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని, వైఎస్ జగన్మోహన్రెడ్డికి జరిగిన అన్యాయాన్ని అందరికి చెప్పాలనే ఉద్దేశంతో తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, భూ, ఇసుక దందాలు పెరిగి అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. ఐదేళ్ల క్రితం తాను ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొన్నానని తెలిపారు. కళలను, కళాకారులను ఆదరిస్తున్న ప్రొద్దుటూరు నాటకకళాపరిషత్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆవిష్కరణలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, సిండికేట్ బ్యాంకు మేనేజర్ రా«ధశ్రీలను సత్కరించారు. ఏకపాత్రాభినయ పద్మనాటక, నృత్య పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అవధాని నరాల రామారెడ్డి, సంస్థ గౌరవాధ్యక్షులు సదాశివశర్మ, చిప్పగిరిప్రసాద్, ఉపాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, సలహా సంఘం అధ్యక్షుడు జింకా మునిస్వామి, సభ్యులు వెంకటరామిరెడ్డి, డాక్టర్ వైవీ రామమునిరెడ్డి, స్పందన అధ్యక్షుడు రాంప్రసాద్‌రెడ్డి, న్యాయవాది జింకా విజయలక్ష్మి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అన్నవరం రామ్మోహన్‌రెడ్డి, కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
‘జేసీ దివాకర్‌రెడ్డిని ప్రజలే తరిమికొడతారు’
సాక్షి, కడప : టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ నేత, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోకర్ లాంటి దివాకర్ రెడ్డితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ ఇప్పుడు ఆ మహానేత కుటుంబాన్నే విమర్శిస్తుంటే ప్రజలు సహించరని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆకేపాటి హెచ్చరించారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు ఒక పెద్ద మాయలాంటిదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. టీడపీ, బీజేపీలు మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. -
కొట్టింది మేమే.. ఏం చేస్తారు
ప్రొద్దుటూరు క్రైం : ‘కొట్టింది మేమే.. ఏం చేస్తారు.. వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు ఏం చేస్తారు’ ఈ మాటలు అన్నది ఒక అధికార పార్టీ కౌన్సిలర్. ఎక్కడో కాదు.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో. పోలీసుల సాక్షిగా స్టేషన్లో అందరూ చూస్తుండగా ప్రొద్దుటూరులోని అధికార పార్టీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య అన్న మాటలివి. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. అయితే స్టేషన్‌కు వెళ్లిన బాధితుడి ముందే కౌన్సిలర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించి పోతున్నాయి. ఓర్వలేనితనంతో సామాన్యులపై కూడా వారు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడని.. నాలుగు రోజుల క్రితం ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన ఇంటర్ చదివే బాలుడు టీడీపీ నాయకుల పోస్టింగ్‌పై ఫేస్బుక్లో లైక్ కొట్టాడు. పోస్టు పెట్టిన వారిని కాకుండా లైక్ కొట్టిన ఆ బాలుడిని అధికార పార్టీ నాయకులు కొందరు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. కార్యాలయంలోనే బాలుడిని నిర్బంధించి రామేశ్వరం రోడ్డుకు చెందిన ఒక కౌన్సిలర్‌తో పాటు టీడీపీ నాయకులు కలిసి చితక్కొట్టారు. నేను లైక్ చేశానని, నాకేం తెలియదని చెప్పినా వారు కనికరించలేదు. తర్వాత బ్లూకోల్ట్ పోలీసులకు ఫోన్ చేసి బాలుడిని వారికి అప్పగించారు. ఇందులో బాలుడి తప్పు ఉంటే కేసు నమోదు చేయాల్సిందే. పోస్టింగ్‌తో అతనికి సంబంధం లేకున్నా అధికార పార్టీ నాయకులు విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. బాలుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కూడా బాలుడినే మందలించడం గమనార్హం. గతంలో కూడా తమకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టారని టీడీపీ నాయకులు రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారం రోజుల పాటు వారిని లాకప్‌లో వేసి నరకం చూపించారు. ఇదంతా సీనియర్ నాయకుడి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేశాడని.. ఇటీవల రామేశ్వరంలోని చర్చి వీధిలోకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెళ్లారు. అదే వీధిలో నివాసం ఉంటున్న బెనర్జీ అనే యువకుడు అభిమానంతో ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేసి ఆయనతో పాటు వీధిలో తిరిగాడు. అయితే దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు మూకుమ్మడిగా యువకుడిపై దాడి చేశారు. మంగళవారం ఉదయం బెనర్జీ రామేశ్వరం రోడ్డులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద పేపర్ చదువుతుండగా కౌన్సిలర్ తలారిపుల్లయ్య, మార్కాపురం గణేష్బాబుతో పాటు మరి కొందరు అతనిపై దాడి చేశారు. దాడిలో యువకుడికి రక్తగాయాలు అయ్యాయి. మా వీధిలో ఉంటూ మాకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ వారు కులం పేరుతో దూషించారు. దీనిపై అతను వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. తనపై జరిగిన దాడిని పోలీసులకు వివరిస్తుండగా అక్కడికి వెళ్లిన కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘ కొట్టింది నేనే.. ఏం చేస్తారు..? అంటూ పోలీసులతో అన్నాడు. ఒకరిపై దాడిన చేసిన వారే స్టేషన్‌కు వెళ్లి నేనే కొట్టాను.. ఏం చేసుకుంటారని చెప్పడం చూస్తుంటే ప్రొద్దుటూరు టీడీపీ నేతల దౌర్జన్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. జరిగిన సంఘటనపై బాధితుడు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ, ఎస్ఐలు ఆ సమయంలో స్టేషన్లో ఉన్న కానిస్టేబుళ్లను విచారించగా కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘కొట్టింది నేనే.. ఏం చేసుకుంటారని’ చెప్పిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ విషయంపై పోలీసు అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కౌన్సిలర్లు తలారి పుల్లయ్య, మార్కాపురం గణేష్‌బాబు సహా మరో ముగ్గురిపై వన్‌టౌన్ పోలీసులు ఎస్టీ ఎస్సీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ నాయకుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
వెయ్యి పింఛన్లు ఆపేశారు
ప్రొద్దుటూరు :జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్ నెలకు పింఛన్లు మంజూరు అవుతాయా కావా అన్న అనుమానాలు ఓవై పు ఉంటే, మరో వైపు మళ్లీ జాబితా తయారు చేస్తే తమ పేర్లు ఉంటాయో ఉండవోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరు చేయడంతోపాటు ఈనెల 1 నుంచి పింఛన్‌దారులకు డబ్బుపంపిణీ చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాకు 20వేల వృద్ధాప్య, దివ్యాంగుల, వితంతు, చేనేత పింఛన్లు మంజూరు కాగా ఇందులో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు 1000 పింఛన్లు, మిగతా 1000 పింఛన్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కేటాయించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఇచ్చిన లేఖల ఆధారంగా మున్సిపల్ అధికారులు సంతకం చేసిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. మున్సిపల్ అధికారులు పంపిన జాబితా లో తాము సూచించిన పేర్లు లేవని, పింఛ న్ల జాబితాను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలు స్వయంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. దీంతో ప్రొద్దుటూరులో పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. 1000 మందికి కలిపి రూ.11లక్షలు మంజూరైంది. గతంలోనూ ఇలాగే జరిగింది గత ఏడాది ఆఖరులో మున్సిపాలిటీ పరిధిలోని 77 మంది చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ఈ జాబితాకు సంబంధించిన డబ్బు కూడా మంజూరైంది. అయితే తమకు తెలియకుండా పింఛన్లు మంజూరు చేశారని అధికార పార్టీ నేతలు పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారం రోజుల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చివరికి జిల్లా అ«ధికారులు జో క్యం చేసుకుని చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో అప్రతిష్టను మూటకట్టుకున్న అధికార పార్టీ నేతలు మరో మారు ఈ విధంగా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జరిగింది మున్సిపాలిటీకి 1000 పింఛన్లు మంజూరు కావడంతో అధికార పార్టీ నేతలు తమ ఇష్టానుసారం పింఛన్లను వార్డులకు కేటా యించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా పింఛన్లు మంజూరు చేశారు. ఓ వార్డుకు వంద వరకు పింఛన్లు మంజూరు కాగా మరికొన్ని వార్డులకు 20 కూడా లేవు. ఇక్కడ అధికార పార్టీ నేతలు వివక్ష ప్రదర్శించారు. త్వరలో వస్తాయి మున్సిపాలిటీ పరిధిలో 1000 పింఛన్లకు సంబంధించిన జాబితా తయారు చేసి మున్సిపల్ అధికారులకు ఇచ్చాం. అయితే ఇక్కడి నుంచి రెండు జాబితాలు వెళ్లాయి. ఈ కారణంగా తమ జాబితా ప్రకారం పింఛన్లు మంజూరు చేయాలని చెప్పాం. పింఛన్లు ఆగిపోయాయని హంగామా చేస్తున్నారు. కలెక్టర్ రెండు మూడు రోజుల్లో మంజూరు చేస్తారు. – ఆసం రఘురామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, ప్రొద్దుటూరు -
ప్రొద్దుటూరులో చంద్రబాబు పోటీ చేస్తారా?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు ఏమైనా పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఇటీవల ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి ఒకే గొడుగు కింద ఉంటూ భిన్నమైన విమర్శలు చేశారన్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ‘నీకు బలమైన అభ్యర్థి పోటీలో ఉంటాడు’ అని తనను ఉద్దేశించి అన్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి వరద బలమైన అభ్యర్థి కాదని చెప్పకనే చెబుతున్నారని తెలిపారు. లింగారెడ్డి మరో సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ‘నీపై బలమైన అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల, అదృష్టం కలిసి వచ్చి నెగ్గావు’ అని అన్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వరదరాజులరెడ్డి పోటీ చేశారని తెలిపారు. వరద బలహీనమైన అభ్యర్థి అని లింగారెడ్డి చెప్పకనే చెప్పారని తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో చురుకైన అభ్యర్థిని పోటీ చేయిస్తాం, ఆ పేరు వింటేనే నీవు షాక్‌కు గురవుతావని లింగారెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆయన చురుకైన అభ్యర్థి కాదని తెలుస్తోందని చెప్పారు. దీన్నిబట్టి వరద, లింగారెడ్డి డల్ స్టూడెంట్స్ అని తెలుస్తోందని వ్యంగ్యంగా అన్నారు. ఎవరితోనైనా పోటీకి సిద్ధం టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని, వీరోచితంగా పోరాడి గెలవడంలో తనకు సంతోషం ఉంటుందని అన్నారు. తాము ధనాన్ని నమ్మిన వాళ్లం కాదని, ప్రజా సేవను నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు అయినా మరో బాబు అయినా ప్రజా దీవెనతో బరిలోకి దిగుతానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, బలిమిడి చిన్నరాజు, లక్ష్మీనారాయణమ్మ, జింకా విజయలక్ష్మి, ఓబుళరెడ్డి, మల్లికార్జున ప్రసాద్, అజీం, బూసం రవి పాల్గొన్నారు. -
పంది ఎంత బలిసినా నంది కాలేదు
సాక్షి, హైదరాబాద్: అనైతికతకు పాల్పడినట్లు స్వయంగా తానే అంగీకరించిన రాష్ట్ర మంత్రి సి. ఆదినారాయణరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎంత మాత్రం లేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఫ్యాక్షనిస్టునని ఆయన ఘనంగా చెప్పుకోవడం దారుణమని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ మంత్రి ఆది జగన్‌పై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు నిస్తుందని జగన్ ఒక ఇంటర్యూలో చెబితే దానిని మంత్రి యాగీ చేయడం విడ్డూరమన్నారు. హోదా వస్తే మొత్తం రాష్ట్ర ప్రజలు బాగు పడతారని, తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కనుక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. ఇంతకూ మంత్రి ప్రత్యేక హోదాకు, అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఐదేళ్లు హోదా ఇస్తామంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ప్రత్యేక హోదాను అటకెక్కించినా కూడా వైఎస్సార్సీపీ గట్టిగా పోరాడుతోందని గుర్తుచేశారు. ఆ పదాలకు అర్థం ఏమిటో... జగన్ క్రిస్టియన్ కాదని, క్రిటియన్ కూడా కాదని, ఆయన కస్టోడియన్ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అర్థం లేని విమర్శలు చేశారన్నారు. కస్టోడియన్ అంటే కస్టడీకి (జైలుకు) వెళ్లేవాడేనే అర్థంతో ఆదినారాయణరెడ్డి చెప్పారని, అయితే మంత్రి అబద్ధాలు చెప్పబోయి సత్యాన్ని పలికారని రాచమల్లు అన్నారు. కస్టోడియనే... అంటే సంరక్షకుడు అని అర్థమని, ఈ రాష్ట్ర ప్రజలను సంరక్షించడానికి ఉధ్బవించినవాడు...’ అని మంత్రి గుర్తించాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ఒక్క అబద్ధం ఆడితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడని, కాని జగన్ అబద్ధాలకు దూరమన్నారు. జగన్ ఎలాంటి వాడు అనేది భవిష్యత్తే తేల్చుతుందన్నారు. 2009లో వైఎస్ వల్లనే 30 సీట్లు తగ్గాయని ఆది మాట్లాడారంటే ఆయన కడుపులో వైఎస్ కుటుంబంపై ఎంత విషయం ఉందో అర్థం అవుతోందన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నది చంద్రబాబేనని ఆయన అన్నారు. కేççసుల భయం వల్లనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. తాను సీనియర్‌నని, చంద్రబాబు అనుభవజ్ఞుడని చెప్పుకోవడాన్ని రాచమల్లు తప్పు పడుతూ... ‘పంది పెంత బలిసినా...ఎప్పటికీ నంది కాలేదు... పంది పందే...’ అని వ్యాఖ్యానించారు. -
ఇళ్ల నిర్మాణంపై వినూత్న ఆందోళన
ప్రొద్దుటూరు టౌన్ : ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు తెలియజేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వినూత్న రీతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో తొగటవీరక్షత్రీయ కల్యాణ మండపం పక్కన డెమో ఇల్లు ఏర్పాటు చేశారు. అందులో బుధవారం నుంచి ఎమ్మెల్యేతోపాటు కుటుంబ సభ్యులు నివాసం ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం పేరుతో జీ ప్లస్ త్రీ ఇంటి నిర్మాణాన్ని చేపడుతోంది. మొదటి రకం ఇంటిని 300 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల సబ్సిడీ, మరో రూ.3.40 లక్షలను బ్యాంకు ద్వారా రుణం ఇప్పించనున్నారు. ముక్కాలు సెంటు లోపు నిర్మించే ఇంటిలో వంట గది, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూంతోపాటు హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ కొలతలతో వీటిని నిర్మిస్తోందో.. అదే విధంగా ఎమ్మెల్యే డెమో ఇంటిని ఏర్పాటు చేశారు. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. ఆ ఇంటిలో ఏ విధంగా ఉండేందుకు సౌకర్యాలు ఉన్నాయో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించనున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఇల్లు నిర్మించి.. 30 ఏళ్ల పాటు బ్యాంకుకు తనఖా పెట్టి ప్రతి నెలా రుణానికి అసలు, వడ్డీతో కలిపి 30 ఏళ్లకు రూ.18 లక్షలు ఎలా వసూలు చేస్తుందో.. ప్రజలకు వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెమో ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాచమల్లు మంగళవారం రాత్రి డెమో ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణం పేరుతో పేదలను ఏ విధంగా మోసం చేస్తోంది, ప్రజలు ఆ ఇంటిలో నివాసం ఉండేందుకు ఏ మేరకు అనుకూలమనే విషయాన్ని అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రశ్నించే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నాయకులు పోసా భాస్కర్, వరికూటి ఓబుళరెడ్డి, చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు. -
పేదల శ్రమను దోచుకుంటారా?
ప్రొద్దుటూరు టౌన్ : నాడు పేదల ఓట్ల కోసం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజలను అప్పుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే 36గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ పద్ధతిలో నాసికరంగా ఇళ్లు నిర్మిస్తున్నారని వివరించారు. లబ్ధి దారులను నుంచి తక్షణమే ఒకరకం ఇంటికి రూ.50 వేలు, మరో రకం ఇంటికి రూ.లక్ష డిపాజిట్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.3 లక్షలకు లబ్ధిదారుని వాటా కలిపితే రూ.4లక్షలు అవుతుందన్నారు. చదరపు అడుగుకు రూ.1,000 నుంచి రూ.1,200 ఖర్చుచేస్తే రూ.3.50 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. కానీ ప్రభుత్వం తన బినామీ కాంట్రాక్టర్‌కు చదరపు అడుగుకు రూ.2,140 ఇస్తోందని, ఈ విధంగా ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు దండుకుంటున్నారన్నారు. ఈ విధంగా ఒక్క ప్రొద్దుటూరులోని 4 వేల ఇళ్ల నిర్మాణంలో రూ.120 కోట్ల పేదల సొమ్ము లోకేశ్‌బాబు చెంతకు చేరుతోందన్నారు. పేదలను అప్పులపాలు చేసేందుకే.. ఒక్కో లబ్ధిదారునికి బ్యాంకుల నుంచి రూ.లక్షలు అప్పు ఇప్పించి 70 పైసల వడ్డీతో ప్రతినెల రూ.4వేల నుంచి రూ.5వేలు బ్యాంకుకు చెల్లించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈవిధంగా చివరకు రూ.17లక్షల నుంచి రూ.18 లక్షలు పేదోడిపై భారం పడుతోందని తెలిపారు. ఇదేనా పేదల సొంతింటి కల నిజం చేసే విధానం అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ అక్క చెల్లెమ్మలకు చెప్పకుండా అబద్ధాలు చెప్పి అప్పులఊబిలో నెడుతున్నారని తెలిపా రు. బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే నోటీసులు జారీ చేసి ఇంటిని జప్తు చేసి వారిని కోర్టుల చుట్టూ తిప్పుతారని పేర్కొన్నారు. తాను చేసిన ఈ ప్రకటనలో ఒక్క అక్షరం తప్పని చెప్పి టీడీపీకి వలస వచ్చిన మంత్రులు నిరూపిస్తే దీక్షను విరమిస్తానని అన్నారు. లేదంటే ఇదే అక్క చెల్లెమ్మలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల బలంతో ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు 2019లో వైఎస్సార్సీపీకి అధికారం కల్పించిన పిమ్మట జగన్ ప్రభుత్వంలో 2సెంట్ల స్థలంలో స్వతంత్ర ఇంటిని నిర్మించి ఆడబిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పేదల పట్ల పెద్ద హృదయంతో మెలగాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతాం ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ప్రజలు అండగా నిలవాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్ని నియోజకవర్గాల్లో దూసుకెళుతుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చే విధంగా పోరాడతామన్నారు. -
పశువుల్లా కొంటున్నారు
సాక్షి, కడప: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఉద్యమిస్తున్న వైఎస్సార్ సీపీని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు సంతలో పశువుల మాదిరిగా కొనుగోళ్లకు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలనే డిమాండ్‌తో మంగళవారం ఉదయం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట 36 గంటల నిరాహారదీక్షను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ పక్కా గృహాల పేరుతో ప్రభుత్వం పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. ప్రొద్దుటూరులో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించారు. ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తే దాదాపు 4 వేల మందికి పంపిణీ చేసేందుకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. పేదల కోసం సగం ఖర్చు భరించేందుకు ముందుకు రావాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత వరదరాజులురెడ్డికి సూచించారు. నీచ రాజకీయాలకు తెరలేపుతున్న చంద్రబాబు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పేదలకు సేవ చేస్తానని రాచమల్లు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు ప్రజల నీళ్ల కోసం ధర్నా చేస్తే తనపై మూడు కేసులు పెట్టారని చెప్పారు. తనపై కేసులు పెట్టిన పోలీసులు, వాదిస్తున్న న్యాయవాదులకు కూడా నీళ్లు అవసరమేనన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా తదితరులు మంగళవారం సాయంత్రం దీక్ష చేస్తున్న రాచమల్లును కలిసి సంఘీభావం తెలిపారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష
సాక్షి, ప్రొద్దుటూరు: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం ప్రారంభమైన దీక్ష 36 గంటల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు రాచమల్లు పోరుబాట పట్టారు. తాజాగా ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబంధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500-4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష
-
పేదల కోసం పోరుబాట
సాక్షి, కడప : ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పోరుబాట పడుతున్నారు. చిన్నదైనా, పెద్దదైనా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. జెడ్పీ సమావేశ మందిరం సాక్షిగా అనేకమార్లు సమస్యలపై అధికారులను నిలదీశారు....ప్రజా వేదికలపై సమస్యలు పరిష్కరించాలని శంఖారావం పూరించారు. చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు పోరుబాట పట్టారు.ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూనే ఉన్నారు.ఒకవైపు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొంటూ....మరోవైపు అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటూ ప్రజల వైపు నిలుస్తున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా పోరుబాట ప్రొద్దుటూరు కేంద్రంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోరుబాట పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకు పోతూనే ప్రజా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలతో కలిసి జల దీక్ష చేపట్టారు. ఆగస్టులో జనవాసాల మధ్య మద్యం షాపులు ఎత్తి వేయని నేప«ధ్యంలో ప్రజా సంఘాలతో కలిసి దీక్షకు కూర్చొన్నారు. ఇటీవల చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లు మంజూరు చేసినా టీడీపీ ప్రొద్దుటూరు నాయకుడు అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ వెంటనే అర్హులకు పింఛన్లు అందించాలని మూడు రోజులపాటు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు.ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఇలా ప్రతినిత్యం ప్రజల బాటలోనే నడుస్తున్నారు. నేటి నుంచి 36 గంటల దీక్షకు శ్రీకారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం నుంచి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 36 గంటల నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబం«ధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500– 4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగుతున్నారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఉదయం 10 గంటలకు దీక్షకు కూర్చొని బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విరమించనున్నారు. ఎమ్మెల్యే దీక్ష చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ధర్నా చేపట్టిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
సాక్షి, ప్రొద్దుటూరు: చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేదు. దీంతో చేనేత కార్మికులు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వారికి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు మద్దతు పలికారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే వారికి మద్ధతుగా ధర్నాకు దిగారు. చేనేత కార్మికులకు పింఛన్ పంపిణీ చేసే వరకు తాను ధర్నా కొనసాగిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రేమ ఫలించిన వేళ
ప్రొద్దుటూరు టౌన్ : వారు ఇరువురు చదువుకున్నారు. గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే అబ్బాయి తరపున తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. పట్టణానికి చెందిన యువతి దీపిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వద్దకు వెళ్లి తాను ప్రేమించిన చక్రవర్తితో వివాహం చేయించాలని అభ్యర్థించారు. స్పందించిన ఎమ్మెల్యే దీపికను, ఆమె తల్లిదండ్రులను పిలుచుకుని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడలో నివాసం ఉంటున్న సిద్ధవటం చక్రవర్తి ఇంటికి బుధవారం వెళ్లారు. చక్రవర్తి దీపికను ప్రేమించిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పారు. ఇరువురి కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం వారిద్దరికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని దొరసానిపల్లె రామాలయంలో వీరికి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్యే వివాహం చేయించారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. దీపిక, చక్రవర్తిలను ఆశీర్వదించి ఎలాంటి కలహాలు లేకుండా వైవాహిక జీవితాన్ని కొనసాగించి పది మందికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే చెప్పారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించిన ఎమ్మెల్యేకు దీపిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, షమీమ్, వైఎస్సార్సీపీ నాయకులు ఓబయ్య యాదవ్, వరికూటి ఓబుళరెడ్డి, గోపవరం ఒకటో వార్డు ఎంపీటీసీ దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర విజయవంతం
ప్రొద్దుటూరు టౌన్ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విజయవంతమైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతటి జనాదరణ ఎన్టీఆర్, వైఎస్ఆర్ తర్వాత జగన్‌కే సాధ్యమైందన్నారు. యాత్రకు పకడ్బందీ బందోబస్తు కల్పించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, సోములవారిపల్లె నాయకుడు శేఖర్, ఎంపీటీసీ సభ్యులు బోస్, ఓబుళరెడ్డి, నాయకులు పోసా భాస్కర్, స్నూకర్ భాస్కర్ పాల్గొన్నారు. పత్రికలు వక్రీకరించాయి: ప్రజా సంకల్ప యాత్రలో రాచమల్లు అలక.. అంటూ కొన్ని చానళ్లు, పత్రికలు, వక్రీకరించి ప్రచారం, ప్రచురితం చేశాయని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తాను జగన్‌కు నమ్మిన బంటునని పేర్కొన్నారు. చివరి వరకు ఆయనతోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. -
నేను లేకున్నా... నా ఫొటో ఉండాలి
ప్రొద్దుటూరు : తాను లేకున్నా తన ఫొటోను అందరూ ఇంట్లో పెట్టుకునేంత గొప్పగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపిస్తున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్లో శనివారం రాత్రి ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన పథకాలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, అయితే కొన్ని పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పట్టించుకోలేదన్నారు. కనీసం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదని, చుక్కనీరు కూడా ఇవ్వలేని దద్దమ్మలు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దోమల ప్రభావంతో తరచూ విషజ్వరాలు, డెంగీ ప్రబలి పసిబిడ్డలు మృత్యువాత పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ ప్రతిష్ఠాత్మకమైన పశువైద్య కళాశాలను మంజూరు చేస్తే అందులో తాగడానికి కూడా నీరు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. యోగివేమన ఇంజినీరింగ్ కళాశాల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందన్నారు. తరగతి గదులు లేక ఓ వైపు, అధ్యాపకులు లేక మరోవైపు ఇబ్బందులు పడుతున్నారని, పేరుకేమో అది యూనివర్సిటీ కళాశాలగా ఉందని అన్నారు. అపెరల్ పార్కు గురించి పట్టించుకునేవారే లేరన్నారు. వైఎస్ హయాంలోనే 350 పడకల ఆస్పత్రి, రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు ఏర్పాటయ్యాయన్నారు. భూగర్భ డ్రైనేజి కోసం రూ.30 కోట్లు మంజూరైనా పాలకులు పట్టించుకోకపోవడంతో పథకం ఆగిపోయిందన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి తనకు గొప్ప ఆశలు, కోరికలు లేవని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. తాను లేకున్నా ప్రజలు గుర్తుంచుకునేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులరెడ్డి ఏమాత్రం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బంధువులు కూడా ఇక్కడికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. భగవంతుని దయ, మీ ఆశీస్సులు ఉంటే 2019లో అధికారంలోకి వస్తామని, అప్పుడు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తానని, స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం మార్గం ఆలోచిస్తామన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శులు పోరెడ్డి నరసింహారెడ్డి, జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు కసిరెడ్డి మహేష్‌రెడ్డి, లక్కిరెడ్డి పవన్‌రెడ్డి, కొవ్వూరు కృష్ణ చైతన్యరెడ్డి, మార్తల వంశీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
24 గంటల నిరాహార దీక్ష
♦ వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలి ♦ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో గుడి, బడితోపాటు పేదలు నివసించే ప్రాంతంలో వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలని కోరుతూ శనివారం ఉదయం నుంచి 24 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని పలు మార్లు ప్రభుత్వాధికారులకు విన్నవించడం, వినతి పత్రాలు సమర్పించడం, ధర్నాలు చేశామని తెలిపారు. అయినా స్పందించలేదని తెలిపారు. ప్రజల ఇబ్బందిని, ముఖ్యంగా మహిళలు పడుతున్న అవస్థలను గమనించామని పేర్కొన్నారు. మద్యం ప్రియుల వల్ల ఆ ప్రాంత మహిళలు, హైస్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని ఐదు మద్యం షాపులను ఎత్తివేయాలని బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తున్నానన్నారు. మద్యం షాపులు ఎత్తేసే వరకు పోరాటం సాగిస్తాం వైఎస్సార్ కాంగ్రెస్సార్పార్టీ నాయకత్వంలో టీడీపీ మద్యం పాలసీకి వ్యతిరేకంగా రామేశ్వరం రోడ్డులోని ఐదు మద్యం షాపులను ఎత్తివేసేంత వరకు పోరాటం సాగిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం జన నివాసాల మధ్య షాపులు ఉండరాదని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితమైన సీఎం చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ప్రకటించడం ఇదేనా అని విమర్శించారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశీస్తున్నానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, పోసా భాస్కర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి లక్కిరెడ్డి పవన్‌కుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
వాడ వాడకు నవరత్నాలు
►బూత్ కమిటీలను శక్తివంతంగా తయారు చేయడమే లక్ష్యం ►జగనన్న అధికారంలోకి వస్తే పనిచేసిన కార్యకర్తలందరికీ గుర్తింపు ►కంటికి రెప్పలా కార్యకర్తలను కాపాడుకుంటా ►ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ప్రకటించిన నవరత్నాలను వాడ వాడకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక దొరసానిపల్లెలోని శేగిరెడ్డికాటిరెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బూత్ కమిటీలకు సంబంధించి నవరత్నాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులకంటే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా నిలిచే కార్యకర్తలంటేనే తనకు ఇష్టమని తెలిపారు. ఒక తల్లి గర్భాన జన్మించిన పిల్లల్లా ఐక్యమత్యంగా ఉంటూ జగన్మోహన్రెడ్డి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 258 పోలింగ్ బూత్‌లకు సంబంధించి వాడవాడలా జగనన్న నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. నవరత్నాలు అద్భుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మె ల్యే తెలిపారు. ప్రతి కార్యకర్త వీటిని ఘంటాపథంగా చెప్పేలా నేర్చుకోవాలని కోరారు. వైఎస్సార్ రైతు భరోసా వల్ల ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతుకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని, రూ.12,500 చొప్పు న నాలుగు విడుతలుగా చెల్లిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు సంబం ధించి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచుతామని, అ మ్మఒడి పథకం ద్వారా చిన్నారుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలా కాకుండా ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లను నిర్మించి ఇంటి తాళాలను పేదలకు అందిస్తామన్నారు. చతికలబడిన ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వస్తుందని, ప్రస్తుతంలా కాకుం డా సీటు పొందిన ప్రతి విద్యార్థికి పూర్తి రీయింబ ర్స్మెంట్తోపాటు భోజన వసతి ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. జలయజ్ఞం ప్రా జెక్టులను పూర్తి చేసి నీరందిస్తామన్నారు. దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ప్రతి బూత్‌లో సుమారు 300 ఇళ్లు ఉంటాయని, పది మంది బూత్ కమిటీ సభ్యులు మళ్లీ ఈ పథకాలను ప్రజల చెవిలో వేయవచ్చన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం, తాను ఎమ్మెల్యే అయితే రాచమల్లు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని తెలిపారు. 2014లో కూడా అసెంబ్లీకి పం పిన మీ కృషి, పట్టుదల మరువలేనిదని పేర్కొన్నారు. వైఎస్సార్‌కు గుర్తుగా, జగనన్నకు తోడుగా అన్న పదం వింటుంటే తన ఒళ్లు పులకరిస్తుందన్నారు. జగన్‌ది సాహసోపేత నిర్ణయం నవరత్నాలు సభ తర్వాత వైఎస్సార్ కుటుంబం పథకం అమలవుతుందని, తర్వాత అక్టోబర్‌లో 13 జిల్లాలకు సంబంధించి 7 నెలలపాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. భార్యాబిడ్డలను వదలి ఏడు నెలలపాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించడం జగన్ సాహసోపేత నిర్ణయమని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలా తక్కువ కాలం జీవించినా పాలకులు ప్రజల మన్ననలను పొందాలని తెలిపారు. సభకు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ అధ్యక్షత వహించారు. -
పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.?
► వరుస హత్యలు, దొంగతనాలతో భయబ్రాంతులవుతున్న జనం ► పంచాయితీలు, సెటిల్మెంట్లకు అడ్డాగా తాలూకా పోలీసు స్టేషన్ ► టీడీపీ రాజకీయాల వల్లే డీఎస్పీ నియామకంలో ఆలస్యం ► శాంతియుత వాతావరణం నెలకొల్పడమే వైఎస్సార్సీపీ ఎజెండా ► ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కడప కార్పొరేషన్: ప్రొద్దుటూరులో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొద్దుటూరులో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస హత్యలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలతో ప్రజలు, వ్యాపార వర్గాల వారు భయాందోళనకు గురవుతున్నారన్నారు. మడూరు రోడ్లో ఆయిల్ మిల్ దగ్గర చంద్రశేఖర్‌రెడ్డి హత్య మొదలుకొని నిన్న హైందవి హత్య వరకూ 9 హత్యలు, 5 దొంగతనాలు జరిగాయన్నారు. ఈ మ«ధ్య జరిగిన ఓ హత్యను వాట్సాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారని గుర్తు చేశారు. తమకు శాంతి ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను అని, శాంతి లేని చోట అభివృద్ధి జరగదని తెలిపారు. సభలు, సమావేశాల ద్వారా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యేగా తాను శాంతి సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క పోలీసు అధికారి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.? డీఎస్పీని నియమించకపోవడం వల్లే శాంతిభద్రతలు అదుపులో లేవని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడటం వాస్తవమేనన్నారు. అయితే డీఎస్పీని నియమించకపోవడానికి కారణం ఆయనేనని విమర్శించారు. సీఎం రమేష్, వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు ఎవరికి వారు తమకు అనుకూలమైన అధికారిని నియమించుకోవాలనే ధోరణితో డీఎస్పీ నియామకాన్ని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేవారు అయి తే చాలునన్న ఏకాభిప్రాయం టీడీపీ నేతల్లో కొరవడిందన్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐగా శ్రీనివాసులును నియమిస్తే అరగంటకే ఆయన్ను పంపించేశారని, మళ్లీ ఆ పోస్టు భర్తీ కావడానికి కొన్ని నెలలు పట్టిందన్నారు. ఇటీవల సుధాకర్‌రెడ్డిని నియమిస్తే ఆయన నెలరోజులకే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారన్నారు. పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో తాలూకా పోలీస్‌స్టేషన్ పంచాయితీలు, సెటిల్మెంట్లు, కమీషన్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు. సీఐ, ఎస్ ఐలు పూర్తి పక్షపాతంతో టీడీపీ వారికి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. డీఎస్పీగా నిజాయితీ పరుడైన డైనమిక్ ఆఫీసర్‌ను నియమించేందుకు టీడీపీ నేతలు సహకరించాలని అప్పుడే ప్రొద్దుటూరులో పరిస్థితులు చక్కబడుతాయన్నారు. వాస్తవ పరిస్థితులను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుపోయామని, ఆయన అన్నీ శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, 34వ వార్డు కౌన్సిలర్ భర్త పోసా భాస్కర్, పార్టీ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ మంత్రి ఓవరాక్షన్!
వైఎస్ఆర్ జిల్లా: జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్ చేశారు. జెడ్పీ సమావేశంలో భాగంగా ఆర్డీవో వినాయక్‌పై కలెక్టర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు ఇప్పుడు కాదు తర్వాత చేయలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి హుకుం జారీచేశారు. మంత్రి తీరును ఎమ్మెల్యే రాచమల్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు, మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. -
ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
-
ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు: తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాపోయారు. తాను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ అంటే కృతజ్ఞత కూడా ఉందని చెప్పారు. ఇకనైనా తనపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అక్రమాలపై రాచమల్లు తన గళాన్ని గట్టిగా విన్పిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికార టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. తన చెప్పుతో తానే కొట్టుకుని ప్రభుత్వ దౌర్జన్యాలను ఎండగట్టారు. -
‘మా ఎమ్మెల్యేలకు భద్రత పెంచండి’
ప్రొద్దుటూరు: చంద్రబాబు పాలనలో విపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో భయాందోళన సృష్టింస్తోందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమ పార్టీ ఎమ్మెల్యేలకు 1+1 నుంచి 2+2 గన్మెన్ల భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. హింసా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని పేర్కొన్నారు. -
రాచమల్లుకు తప్పిన ప్రమాదం
- ఎమ్మెల్యే కారును ఢీ కొన్న లారీ - ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మరో నలుగురు ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి రెప్పపాటులో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, మరో నలుగురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే తన ఇన్నోవా కారు ఏపీ 04 బీపీ 1089లో శనివారం ఉదయాన్నే ప్రొద్దుటూరులో ఇంటి నుంచి బెంగళూరుకు బయల్దేరారు. కారు పులివెందుల దాటి కదిరి మార్గంలో ఘాట్‌లో వెళుతుండగా ఉదయం 6.30 ప్రాంతంలో ఎదురుగా 100 కిలోమీటర్ల వేగంతో లారీ వచ్చింది. ఈ విషయాన్ని కారు డ్రైవర్ హరి గమనించి అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో ముందు వైపున ట్రక్కు ఉండటంతో కారు పక్కకు తప్పుకోవడానికి వీలు లేకుండాపోయింది. ఆ లోగా ఎదురుగా వస్తున్న లారీ ఎమ్మెల్యే కారును రాసుకుంటూ వెళ్లింది. డ్రైవర్ కారును మరింత పక్కకు తిప్పడంతో వెనుకభాగంలో లారీ గట్టిగా డీకొట్టింది. దీంతో కారు వెనుకభాగం దెబ్బతింది. ఎమ్మెల్యేతోపాటు కారులో ఉన్న ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యక్తిగత పీఏ పెంచలయ్య, ఎమ్మెల్యే అనుచరుడు ఈశ్వర్‌రెడ్డి, గన్‌మన్, కారు డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలో ఓ మారు రాచమల్లుపై హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు అక్కడే ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు గైర్హాజరవుతాం
► బరి నుంచి తప్పుకున్న ముక్తియార్ ► ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు: సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తనతోపాటు తన వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం దొరసానిపల్లెలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నిక బరిలో తాము ఉండటం లేదు అని చెప్పడానికి ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అలాగే బాధ్యాతాయుతంగా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బి.ఫారంపై కౌన్సిలర్‌గా ఎన్నికైన వీఎస్ ముక్తియార్‌తోపాటు కొంత కాలం తర్వాత 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారని తెలిపారు. టీడీపీ నాయకులు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి మధ్య ఉండే వ్యక్తిగత విభేదాలతో మరో ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లను కూడగట్టుకుని మొత్తం 15 మందితో ముక్తియార్ తన వద్దకు వచ్చారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బి.ఫారంతో గెలిచిన ముక్తియార్ ఒక కారణం కాగా, తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా ముక్తియార్‌కు సహకరించామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన తన వెంట ఉన్న 9 మంది (తనతో కలిపి 10 మంది) ముక్తియార్ వెంట నడిచామన్నారు. ఆయన విజయానికి, నమ్మకానికి స్థిరంగా నిలువగలిగామని చెప్పారు. రూ.50లక్షలు ఆఫర్ చేశారు : పోటీ తీవ్రతరం కావడంతో తన వద్దనున్న ఒక్కో కౌన్సిలర్ ఓటుకు రూ.50లక్షల వరకు వరదరాజులరెడ్డి ఇవ్వజూపారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. అయితే ఆ డబ్బును గడ్డిపోచతో సమానంగా భావించిన తమ కౌన్సిలర్లు నిజంగా అభినందనీయులన్నా రు. వరదరాజులరెడ్డి ఎన్ని ప్రలోభాలు పెట్టినా చి వరి వరకు ముక్తియార్‌కు మద్దతు ఇచ్చామన్నారు. అయితే ప్రేమో, భయమో, ఆశో, ప్రలోభమో తెలియదు కానీ... ఏ కారణం చేతనో ముక్తియార్ పోటీ నుంచి విరమించుకున్నారని పేర్కొన్నారు. ఆ ముగ్గురే సమాధానం చెప్పాలి : మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బరి నుంచి ముక్తియార్ ఎందుకు విరమించుకున్నది ముక్తియార్‌తోపాటు ఇవి సుధాకర్‌రెడ్డి, మల్లేల లింగారెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. పోటీలో లేకపోతే కౌన్సిల్లో వైఎస్సార్సీపీకి తగిన బలం లేని కారణంగా గైర్హాజరు కావాలని నిర్ణయించామన్నారు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నిక జరగడమే ముఖ్యమని తెలిపారు. వరదరాజులరెడ్డిలా అల్లరిమూకలను వెంట వేసుకుని దౌర్జన్యకర, హింసాత్మక సంఘటనలకు పాల్పడబోమన్నారు. -
వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారు
అమరావతి: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ రాజకీయ వ్యభిచారులని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారం, మంత్రి పదవి, డబ్బుల కోసమే వారు వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారని అన్నారు. ఈ ముగ్గురికి ఏమాత్రం నైతికత లేదని, నైతికత ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ దయాదాక్షిణ్యాలపై గెలిచి, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రూపాయల చిల్లర కోసం ఆయనపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ వ్యభిచారులను అసెంబ్లీలో మాట్లాడించి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. -
మాట తప్పిన ‘ఆది’ సవాల్ విసరడమా !
ప్రొద్దుటూరు: మాట మీద నిలబడని ఆదినారాయణరెడ్డి సవాల్ విసరడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆది మాట మీద నిలబడే మనిషి కాదని అన్నారు. అధికార అంచుల మీద నిలబడ్డ ఆయన ఏనాటికైనా జారిపోక తప్పదని పేర్కొన్నారు. నాటి సవాళ్లు ఏమయ్యాయి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నప్పటికీ రెండు మాత్రం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 3 కౌన్సిల్ సీట్లు వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది సవాల్ విసిరారన్నారు. అయితే టీడీపీ 3 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన తర్వాత రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లేటప్పుడు కూడా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని అన్నారు. ఇంత వరకూ పార్టీకి, పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. డబ్బుతో రాజ్యసభ పదవిని కొన్న రమేష్‌నాయుడు రాజకీయ నాయకుడే కాదన్నారు. ఆయన ఏనాడూ ప్రజా విశ్వాసం పొందలేదని, రూ. 10కి కొని రూ.15కు విక్రయించే వ్యాపరస్తుడని ఎమ్మెల్యే తెలిపారు. వక్రీకరణలు వద్దు.. తాను మాట్లాడిన మాటలను టీడీపీ నాయక త్రయం వక్రీకరిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ‘మీరు గెలిస్తే ఊడిగం చేస్తాననే’ మాట చెప్పలేదన్నారు. 60 ఓట్లు మా వద్ద ఎక్కువగా ఉన్నాయి..మరో 40 ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాం.. వెరసి 100 ఓట్లతో గెలవబోతున్నాం అని టీడీపీ నాయకులు అన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దానికి సమాధానంగానే 60 ఓట్ల సంఖ్యాబలం చూపిస్తే ఊడిగం చేస్తానని చెప్పానన్నారు. ఆ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. తాను జమ్మలమడుగులో చేయడం వల్లనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 6 వేల ఓట్లతో బయట పడగలిగారని ఆది చెప్పడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ బొమ్మతో గెలిచిన వ్యక్తి ఇలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. వైఎస్‌ను విపరీతంగా అభిమానించే ప్రజాప్రతినిధులారా ఆయన పట్ల మరోసారి ప్రేమను వ్యక్త పరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్, గజ్జల కళావతి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జింకా విజయలక్ష్మి, దేవిప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అరెస్టు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ దాహార్తి తీర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు జలదీక్ష ప్రారంభించిన ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి పోలీసు బలగంతో దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించిన విషయం విదితమే. అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట జలదీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్ష మంగళవారం ఉదయం 10 గంటలకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే దీక్ష ప్రారంభించిన కాసేపటికే పెద్దఎత్తున పోలీసులు వచ్చి ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాచమల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద జల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు వేలాది మంది మద్దతుతో దీక్ష చేయనున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా మైలవరం డ్యాం నుంచి టీఎంసీ నీటిని పెన్నానదిలోకి విడుదల చేసేందుకు శాశ్వత జీఓను విడుదల చేయాలని, కుందూ పెన్నా వరద కాలువ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని, చెన్నమరాజుపల్లె సమీపం నుంచి రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ వరకు పైపులైన్ ద్వారా వరద నీటిని తరలించాలని, తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం పట్టణంలోని 40 వార్డులకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీక్షకు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి మద్దతు పలికారు. అర్థరాత్రి పోలీసులు, అధికారుల హడావుడి ప్రొద్దుటూరు నీటి సమస్యలపై ఆదివారం అర్థరాత్రి నుంచి జలదీక్ష చేయాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి, పోలీసులు జలదీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించేందుకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేపట్టనున్న 24 గంటల జలదీక్షా శిబిరాన్ని తొలగించే యత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. నీళ్లు ఇవ్వలేని అధికారులు సిగ్గు లేకుండా శిబిరాన్ని ఎలా తొలగిస్తారంటూ కమిషనర్‌ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మా ఇళ్ల వద్దకు వచ్చి ప్రజలు బూతులు తిడుతున్నారని, మీ ఇళ్లల్లో మినరల్ వాటర్‌తో నీళ్లు పోసుకుంటూ ప్రజల గురించి ఆలోచించరా అని నాయకుడు బంగారురెడ్డి అన్నారు. వంద కోట్లు మున్సిపాలిటీలో పెట్టుకొని ప్రజలకు పది రోజులకు ఒక సారి కూడా నీళ్లు ఇవ్వలేరా అని శాసనసభ్యుడు రాచమల్లు అన్నారు. వన్‌టౌన్ సీఐ బాలస్వామిరెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఎమ్మెల్యే వద్దకు వచ్చి బోర్లు వేస్తున్నామని నీళ్లు రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు. ఎక్కడ బోర్లు వేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన డిమాండ్లు మైలవరం జలాశయం నుంచి 1 టీఎమ్సీ నీటిని పెన్నాకు వదలించడం, కుందూపెన్నా కాలువను పూర్తి చేయడం, కుందూ నుంచి పైప్‌లైన్ పనులు ప్రారంభించడం అని తెలిపారు. తనకు మీరు చెప్పే విషయాలపై నమ్మకం లేదని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే 24 గంటల దీక్ష కూడా విరమిస్తానని చెప్పారు. -
వరద కాలువ టెండర్లలో మంత్రి వాటా రూ.7 కోట్లు
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపణ కడప కార్పొరేషన్: కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుకు భాగస్వామ్యం ఉందని, రూ.7కోట్లు చెల్లించేలా ఒప్పందం కూడా కుదిరిందని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో రూ.72 కోట్లతో చేపట్టిన వరద కాలువ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా గత ఎన్నికల్లో తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి, వచ్చే ఎన్నికలకు మళ్లీ సన్నద్ధం కావడానికి ఈ కాలువ పనులను వినియోగించుకుంటున్నారని విమర్శించారు. వరద కాలువ మొత్తం 23 కి.మీలు ఉండగా, కోర్టులో కేసులతో 6 కి.మీలు భూసేకరణ జరగలేదన్నారు. అయినా సరే ఇరిగేషన్ అధికారులు ఈ పనికి టెండర్లు పిలిచారన్నారు. మాజీ ఎమ్మెల్యే కోసమే ఇష్టానుసారంగా నిబంధనలు రూపొందించారన్నారు. చివరకు ఆ నిబంధనలతో తాము కూడా క్వాలిఫై కాలేమని లె లుసుకొని చివరి నిమిషంలో వాటిని రద్దు చేయించారని ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని అప్పనంగా దోచుకోవడానికే రూ.72కోట్ల పనిని రివైజ్ ఎస్టిమేషన్స్ పేరుతో రూ.112.63 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఇందులో మంత్రి దేవినేని సంపూర్ణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ టెండర్లు ఖరారు కాగానే రూ.7 కోట్లు మంత్రికి చెల్లించేలా రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. ప్రొద్దుటూరుకు నీళ్లు తేకుండా ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకొనే ఈ అడ్డగోలు పనులకు పుల్‌స్టాప్ పెట్టకపోతే తమ ఎమ్మెల్యేలందరితో కలిసి మంత్రి దేవినేని ఛాంబర్ ఎదుటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. తద్వారా రాష్ట్రమంతా వీరి అవినీతి భాగోతాన్ని ఎలుగెత్తి చాటుతామని స్పష్టం చేశారు. -
'టీడీపీ సర్కారుకు నూకలు చెల్లాయి'
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ సహా దేనిపైనా నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశానికి ముందు ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేలపై కుట్ర చేస్తోందని విమర్శించారు. కోర్టు ఆదేశించినా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం దారుణమని వాపోయారు. టీడీపీ సర్కారుకు నూకలు చెల్లాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. -
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆరోపణలుచేయలేదా?
చంద్రబాబుపై రాచమల్లు ధ్వజం సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారం పక్షంపై ఆరోపణలు, విమర్శలు చేయలేదా? అపుడో నీతి, ఇపుడో నీతి ఎందుకు? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం రాత్రి ఆయన మీడియాపాయింట్ వద్ద మాట్లాడారు. ప్రతిపక్షం అధికారపక్షంపై ఆరోపణలు చేయొద్దనడం సరికాదన్నారు. ‘పరిటాల రవి హత్యతో జగన్‌కు సంబంధం ఉందని ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్న టీడీపీ వద్ద సాక్ష్యాలున్నాయా? జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెబుతున్న టీడీపీ వారేమైనా ఆ డబ్బును లెక్కించి చూశారా? సాక్ష్యాలుండే మీరు మాట్లాడుతున్నారా?’ అని ప్రశ్నించారు. గత బుధవారం శాసనసభలో తాను లేకున్నా సస్పెం డ్ చేశారని, నిర్ధరించుకోకుండా సస్పెండ్ చేసిన ఈ గుడ్డి ప్రభుత్వానికి సాక్ష్యాలు కావాలా? అని నిలదీశారు. సభ జరిగిన తీరు చూస్తే అధికారపక్షమే ప్రతిపక్షంపై అవిశ్వాసం పెట్టినట్లుగా ఉందన్నారు. -
'ఆస్తుల కోసమే హత్యలు'
ప్రొద్దుటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తి కోసమే హత్యలకు పాల్పడ్డారని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ఆయన విలేకరులకు ఆయా ఘటనల గురించి వివరించారు. ‘విజయవాడలో ఆంధ్రపత్రిక స్థలాన్ని యజమాని శంభుప్రసాద్.. ఆడిటర్ చక్రపాణికి విక్రయించి, అదే స్థలాన్ని మస్తాన్‌రెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు. వరద రాజుల రెడ్డి కుటుంబీకులు తక్కువ ధరకు మస్తాన్‌రెడ్డి నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన ఈ ఎకరా స్థలానికి సంబంధించి టీడీపీ నేత వరదరాజులరెడ్డి మేనల్లుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డికి 35 శాతం, కుమారుడు నంద్యాల కొండారెడ్డికి 30 శాతం, మిగిలినదాంట్లో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శంకాపురం ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు బచ్చల ప్రతాప్, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస ప్రసాద్‌కు వాటాలు ఉన్నాయి. అనంతరం వీరు 22 ఫిబ్రవరి, 2012లో హైదరాబాద్‌లో ఆడిటర్ చక్రపాణిని హత్య చేశారు. ఈ కేసులో వీరిపై అదే నెల 29న హైదరాబాద్‌లో కేసు నమోదైందని’ తెలిపారు. తర్వాత డబ్బు విషయంలో తేడా రావడంతో కటిక శివకుమార్‌ను గత నెల 7న హత్య చేశారని ఆరోపించారు. గతంలో వీరు తన హత్యకు కుట్ర పన్నారని, న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారని, చెన్నమరాజుపల్లెకు చెందిన నడిపెన్న అనే వ్యక్తిని కూడా హత్య చేయించారని ఆరోపించారు. కేసు నుంచి బయట పడేందుకు రామచంద్రాపురం పోలీసులకు కోటి రూపాయల వరకు ముట్టజెప్పాలని ప్రయత్నించినట్లు రాచమల్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరుకు చెందిన ఓ సీఐ నుంచి రూ.40 లక్షలు అప్పుతీసుకున్నారన్నారు. -
ప్రజల పక్షాన మాట్లాడినా తప్పేనా?
దంతలూరు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు : ప్రజల పక్షాన మాట్లాడిన వారిపై కూడా ప్రభుత్వం ఒత్తిడి చేసి కేసులు పెట్టడం తగదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక దొరసానిపల్లెలోని ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి వద్ద ఉన్న పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుడు దంతలూరు కృష్ణను మంగళవారం రాత్రి పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలోని మురారిచిం తల గ్రామంలో రేషన్ పంపిణీపై ప్రజల తరఫున మాట్లాడినందుకు అరెస్ట్ చేస్తామనడం తగదన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీఓ మురళీమోహన్ను ఇప్పటికే సస్పెండ్ చేశారన్నారు. వాస్తవానికి గ్రామ ప్రజలు టీడీపీ నేత ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేయొద్దని చెప్పారన్నారు. ఈ విషయంలో ప్రజలకు మద్దతు ఇస్తే ఏదో పెద్ద నేరం చేసినట్లు.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన కోసం వచ్చిన దంతలూరు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలుగుదేశం పార్టీ కక్షసాధింపు చర్య అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపి అణచివేసే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న దంతలూరు కృష్ణను అరెస్టు చూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణను లింగాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చంద్రబాబు కోటి మంది మహిళలను మోసం చేశారు
డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకు ఉద్యమం మహిళల ధర్నాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళల రుణాలపై సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను మోసం చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. మూలధనం కాకుండా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన జరిగిన తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుతగా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారని అన్నారు. మళ్లీ లక్ష రూపాయలు మాత్రమేననడం, ఆ తర్వాత ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు అని చెప్పి, చివరకు రూ.3 వేలు మూలధనం పేరిట ఇస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. అది కూడా వాడకూడదనే నిబంధనలు విధించడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఒక్కో మారు ఒక్కో విధంగా మహిళల మైండ్ సెట్‌ను మార్చి చివరికి మోసపుచ్చారన్నారు. దీనిపై దశల వారీగా ఆందోళన చేస్తామన్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, ప్రొద్దుటూరు పట్టణ బంద్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఆందోళన సాగిస్తామని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 2 వేల మంది మహిళలు ధర్నాకు హాజరు కావడం గమనార్హం. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, ఎంపీపీ మల్లేల ఝాన్సీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు గోర్ల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించకుంటే.. ఆమరణ దీక్ష: ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేయడానికైనా వెనుకాడేది లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆస్పత్రి పరిరక్షణ కమిటీ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉందని, ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారన్నారు. ల్యాబ్ సౌకర్యం ఉన్నప్పటి కీ టెక్నీషియన్లు లేరని, ఈసీజీ, అల్ట్రా సౌండ్ మిషన్లు ఉన్నా రేడియాలజిస్టు లేరన్నారు. ఇంతటి పెద్ద భవనాలకు ఫ్యాన్లు, విద్యుత్ ఉంది కానీ కొంచం రిపేరు వచ్చినా సరి చేసే ఎలక్ట్రిషియన్ లేడన్నారు. ఆస్పత్రితోపాటు మంచినీటి సౌకర్యం కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అయినా వీటి అభివృద్ధి కోసం నడుస్తామన్నారు. ఒక వేళ ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడానికి ఆటంకమైతే.. నియోజకవర్గ ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వాన్ని అయినా వదులుకోవడానికి సిద్ధమని అన్నారు. ఉన్నతాధికారులకు నివేదించాలి డీసీహెచ్ఎస్ రామేశ్వరుడు ధర్నా ప్రాంతానికి వచ్చారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే రాచమల్లు డీసీహెచ్ఎస్ను ప్రశ్నిం చారు. ఉన్న ఫళంగా ఉద్యోగులందరిని తొలగిస్తే అత్యవసర పనులు ఎలా జరుగుతాయని అడిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిని తొలగించామని డీసీహెచ్ఎస్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇంకా కింది స్థాయి సిబ్బంది అవసరం ఉందని, అలాగే డాక్టర్లు కూడా కావాలని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాల నాయకులు డీసీహెచ్ఎస్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్, జిల్లా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ కన్వీనర్ అన్వేష్, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, కృష్ణ, తవ్వా సురేష్‌రెడ్డి, కరుమూరి వెంకటరమణ, యల్లయ్య, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అనసూయ, మురళీధర్‌రెడ్డి, టప్పా గైబుసాహెబ్, శంకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, నాయకులు పోసా భాస్కర్, పాలగిరి ఖాజా, చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్ట స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో రాష్ర్టస్థాయి బాలబాలికల అండర్ 14, 17 రైఫిల్ షూటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమేనని, గెలుపొందిన వారు ఎక్కువ, ఓడిన వారు తక్కువ కాదని చెప్పారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యం సంపాదించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని సూచించారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలో ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ముందంజలో ఉందన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని హాజీబీ జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చడం అభినందనీయమని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాఘవను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉప క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్లో రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయి రైఫిల్ పోటీలలో అండర్-14లో గోల్డ్‌మెడల్ సాధించిన టీ అతిథిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ క్రీడాకారిణికి కమలాపురం ఏపీసోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమ్మ రూ.50వేలు నగదు బహుమతి అందించారు. ఎంపీపీ రాజారాంరెడ్డి, నిర్వాహక కమిటీ అధ్యక్షులు, డీబీసీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వైఎస్ జబివుల్లా, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్‌కుమార్‌రెడ్డి, నిర్వాహక కార్యదర్శి రాఘవ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నడిగడ్డ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గరం.. గరం.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. అధికారపక్ష సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్‌రెడ్డికి ఛెర్మైన్ పక్కన సీటు కేటాయించకుండా అవమానించారంటూ సభలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఉండేల గురివిరెడ్డి అధ్యక్షతన సోమవారం మున్సిపల్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛెర్మైన్ పక్కన ఎమ్మెల్యేకు సీటు కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్‌ను ప్రశ్నించారు. ప్రజలచేత శాసనసభ్యునిగా ఎన్నికైన నన్ను అవమానించడం తగదు. నా హక్కును కాపా డుకోవాలనుకుంటున్నా తప్ప అభివృద్ధికి నేను, మా కౌన్సిలర్లు అడ్డుపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి ఛైర్మన్ గురివిరెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేత వీఎస్ ముక్తియార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకి గత 30 ఏళ్లుగా ఛైర్మన్ పక్కనే సీటు వేస్తున్నారని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాలని సూ చించారు. ఇందుకు చైర్మన్ స్పందిస్తూ నిబంధనలు అలా లేవని ఏదైనా రూల్ పొజిషన్ ఉంటే దాని ప్రకారమే చేస్తామన్నారు. దీనిపై ఎమ్మెల్యే మెమో నెంబర్ 30995-ఈఎల్‌ఈసీ.ఐ-95 ఎం.ఏ తేదీ 25-10-1995లో జారీ చేసిన ప్రభుత్వ ఆర్డర్‌ను చూపించారు. దీంతో వెంటనే చైర్మన్ మాట మా ర్చారు. వచ్చే కౌన్సిల్ సమావేశానికి దీన్ని పరిశీలిం చి అప్పుడు తానే కుర్చీ వేసి ఎమ్మెల్యేని ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రతిపక్ష నేత ముక్తియార్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఒప్పుకోలేదు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడంతో కమిషనర్ జోక్యం చేసుకుని 1995లో ఇచ్చిన ఆర్డర్లో చైర్మన్ పక్కన ఎమ్మెల్యే, ఎంపీలు కూర్చోవచ్చని ఉందని, దీని తర్వాత ఏ ఆర్డర్ వచ్చిందో తనకు తెలియదన్నారు. దాని తర్వాత ఏ ఆర్డర్ రాలేదని, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఎంత చెప్పినా కమిషనర్ స్పందించలేదు. దీంతో ప్రతిపక్ష నేత ముక్తియార్‌తోపాటు ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్ పది నిమిషాలపాటు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ అదే సీన్ తిరిగి సమావేశం ప్రారంభం కాగానే అజెండాను చదవాలని సీసీని ఛైర్మన్ ఆదేశించడంతో చైర్మన్ పక్కన ఎమ్మెల్యే కూర్చొనే ప్రభుత్వ ఆర్డర్‌పై స్పష్టత ఇవ్వకుండా ఎలా అజెండా చదివిస్తారని ముక్తియార్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రామదాసు, మురళీధర్‌రెడ్డి, మరికొందరు చైర్మన్ పక్కన ఎమ్మెల్యేకు కుర్చీ వేసేందుకు ప్రయత్నించడంతో కౌన్సిల్ హాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అందరికి సర్దిచెప్పారు. కమిషనర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే తాను ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్‌పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కమిషనర్‌ను ప్రశ్నించినా కమిషనర్ మౌనం వీడలేదు. తన హక్కులకు భంగం కలిగిస్తే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే చెప్పినా కూడా స్పందన లేదు. ఒకానొక దశలో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష నేతతోపాటు కౌన్సిలర్లను బయటికి పంపాలని చైర్మన్ డీఎస్పీకి సూచించారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు లోపలికి వచ్చే హక్కే లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. కౌన్సిల్ సమావేశంలో అజెండా పై చర్చ జరగకపోయినా చైర్మన్ ఈ అజెండాను ఆమోదించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోవడంతో ైవైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కౌన్సిల్ హాల్లో అలాగే కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత చైర్మన్ సీసీ సమావేశ భవనానికి వచ్చి 7, 28, 29, 30, 31 అంశాలను రద్దు చేస్తూ మిగిలిన అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారని చెప్పడంతో అజెండానే చదవకుండా ప్రతిపక్ష సభ్యులతో చర్చించకుండా ఎలా ఆమోదం తెలుపుతారని ఎమ్మెలే, ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.