Ram gopal Varma
-
వుమెన్స్ డే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )..ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఓ అంశంపై అందరూ ఒకలా అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తుంటాడు. దానికి లాజికైన సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆర్జీవీ ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నేను(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day 2025 ). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీకి కూడా వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. అయితే అందరిలా శుభాకాంక్షలు తెలిపితే ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆయన విషెస్ కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్జీవీ కూడా ఇలాంటి పోస్టులు పెడతారా’ అని కొంతమంది షాకవుతుంటే.. ‘సూపర్ సార్.. మీకు మీరే లెజెండ్’, ‘భళే చెప్పావ్ సర్’ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ‘శారీ’అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సత్య యాదు, ఆరాధ్య జంటగా నటించారు. మార్చి 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025 -
ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ. ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్, అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఏపీ హైకోర్టులో RGVకి బిగ్ రిలీఫ్
-
హైకోర్టులో ఆర్జీవీకి భారీ ఊరట!
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదేళ్ల క్రితం(2019)లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఏం జరిగింది?2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'(kamma rajyam lo kadapa reddlu) పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పిటిషన్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆ సినిమాలో మోహన్‌లాల్ నటన నాకు నచ్చలేదు.. కానీ: రాం గోపాల్ వర్మ
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడని అన్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్‌ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్లో ఎక్కువ టేక్‌లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్‌ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్‌లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్‌లాల్.. వీర్పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. -
రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ HD స్టిల్స్
-
'శారీ' ట్రైలర్.. చీరలో కనిపిస్తే టార్గెట్ చేసే మృగం
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం శారీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. కేవలం ఆమె ఫోటోతోనే సినిమాపై అంచనాలు పెంచేసిన వర్మ.. తాజాగా ట్రైలర్‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. పాన్ ఇండియా రేంజ్లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది. -
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ
-
ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్‌పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.ముగుసిన అర్జీవి విచారణమధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు రాం గోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు.మద్దిపాడు పీఎస్ 0 గంటల పాటు అర్జీవి విచారించారు. విచారణ ముగిసిన అనంతరం రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌కు బయల్దేరారు. -
సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్‌ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్మనోజ్ బాజ్‌పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే? -
మారిపోయిన ఆర్జీవీ.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసే సినిమాలు.. (ఫోటోలు)
-
రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష
ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరి మెజిస్ట్రేట్.. ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితంనాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దర్శకుడు విచారణకు గైర్హాజరవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు ఇప్పటిది కాదు! 2018లో రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మశ్చీంద్ర మిశ్రా తరపున శ్రీ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్‌లో వర్మ ఈ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.వర్మ రియాక్షన్దీనిపై వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఏడేళ్లనాటి కేసు. నా దగ్గర పని చేసిన మాజీ ఉద్యోగితో రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. ప్రస్తుతం మా లాయర్లు ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అన్నాడు. With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025 చదవండి: ‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ..ఒకప్పుడు మాత్రం ఆర్జీవీ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. శివ, సత్య, సర్కార్, రంగీలా లాంటి సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి కల్ట్,క్లాసిక్స్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఇటీవల మాత్రం ఆ స్థాయి సినిమాలను తీయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమా మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను ఎందుకు బెంచ్ మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆయన పశ్చాత్తాప పడ్డాడు. ఇకపై మంచి సినిమాలే చేస్తానని ప్రామిస్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే కొంతమంది ఆయన ట్వీట్‌ని నమ్మితే..మరికొంత మంది ఆర్జీవీ ఇలాంటి ట్వీట్స్ చేయడం కొత్తేమి కాదు.. మాట మార్చడం ఆయనకు అలవాటే అనుకున్నారు.కానీ వర్మ ఈ సారి సీరియస్‌గానే చెప్పారు. గత కొంతకాలంగా నాసిరకం సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ సారి ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. పెద్ద కాస్టింగ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఆర్జీవీ తెరకెక్కించబోతున్న ఈ కొత్త సినిమా పేరు ‘సిండికేట్’(Syndicate).అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చెప్పుకొచ్చాడు. 70వ దశకంలో భారత్ స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించబోతున్నానని వర్మ ట్వీట్ చేశాడు. ‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా జోడించాడు వర్మ. తాను గత కొన్నేళ్లుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసే ఒకే ఒక్క చిత్రంగా ‘సిండికేట్’ను వర్మ అభివర్ణించాడు. ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో పంచుకుంటానని వర్మ వెల్లడించాడు.“ONLY MAN CAN BE THE MOST TERRIFYING ANIMAL “In CONTINUATION to my CONFESSION note on SATYA film , I DECIDED to make the BIGGEST film ever The film is called SYNDICATE It’s about a terrifying organisation which threatens the very EXISTENCE of INDIA The CONCEPT STREET…— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2025 -
ఆర్జీవీతో విభేదాలు.. స్పందించిన హీరోయిన్
చిత్ర పరిశ్రమలో రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్‌గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్‌పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నాఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్‌గోపాల్ వర్మ, మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.‘రంగీలా’తో ఫేమస్ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది. -
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. అందరికంటే భిన్నంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఏ విషయమైనా సరే తన మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తారు. అందువల్లే ఆర్జీవీకి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు. తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాజాగా ఓ టాలీవుడ్ మూవీ గేమ్ ఛేంజర్‌పై తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ లెక్కన రాజమౌళి ఆర్ఆర్ఆర్కు రూ.4500 కోట్లు అయి ఉంటుందని రాసుకొచ్చారు. అలా గేమ్ ఛేంజర్‌కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ పుష్ప-2 రూ.1860 కోట్లు రావాల్సిందని ట్విటర్లో రాశారు. ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి.. అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి అంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.తొలి రోజు రూ.186 కోట్లు..రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వసూళ్లను ఉద్దేశించి రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. If G C costed some 450 cr then RRR in its extraordinary never before seen visual appeal should have costed 4500 cr and if G C film’s first day collections are 186 cr on day 1 , then PUSHPA 2 collections should have been 1,860 cr ..The point is that the fundamental requirement of…— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025 -
ఆ హీరోయిన్‌తో సినిమా చేయను : ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ..సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతుంటాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకున్న అలవాటు. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. సినిమా విషయాల్లోనే కాదు పర్సనల్ విషయాల్లోనూ అలానే వ్యవహరిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదన్నాడు. దానికి గల కారణం ఏంటో కూడా వివరించాడు.శ్రీదేవి అంటేనే ఎక్కువ ఇష్టంరామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆమె మరణించినా.. తనపై ఆర్జీవీకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్న సందర్భం దొరికినా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితోనూ పోల్చలేం. ఆమె అందం, అభినయం ఎవరికి రాలేదన్నారు. ‘పదహారేళ్ళ వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్ననే విషయం మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి’ అని ఆర్జీవీ అన్నారు.జాన్వీతో సినిమా చేయనుశ్రీదేవి(sridevi) కూతురు జాన్వీ కపూర్‌తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకుల ఆర్జీవీ సమాధానం ఇస్తూ ఇప్పట్లో ఆ ఉద్దేశమే లేదన్నారు. శ్రీదేవిని జాన్వీతో పోల్చడం సరికాదన్నారు. శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఏ విషయంలోనైనా ఆమెతో పోల్చలేమని అన్నారు. ‘నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే జాన్వీతో కూడా కనెక్ట్ కాలేదు. ఈ జనరేషన్ వాళ్లకి జాన్వీనే గొప్పగా కనిపిస్తుందేమో. నాకు మాత్రం శ్రీదేవినే గొప్ప. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇప్పుడైతే జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు’ అని ఆర్జీవీ అన్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వీశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ధడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. గతేడాది విడుదలైన ‘దేవర’లో జాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటించబోతుంది. -
అప్పటి వరకు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్: రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.శారీ మూవీ..తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024 -
కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేసిన ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ ఫోటోలు వైరల్!
-
రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్ లీగల్ నోటీసులు
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. -
వైఎస్ జగన్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విటర్ వేదికగా పుట్టినరోజు విషెస్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసిన తన శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: #HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం)'వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వైఎస్ జగన్ గారు, రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. (ఇదీ చదవండి: వైఎస్ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు) -
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అల్లు అర్జున్, సీఎం రేవంత్ అరెస్ట్‌లో కామన్ పాయింట్ గమనించారా?: ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. వరుసగా ట్వీట్స్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రశ్నలు సంధించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో అరెస్టైన వీడియోను పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో కామన్ పాయింట్ ఏంటి? అని ఆర్జీవీ ప్రశ్నించారు. వాళ్లిద్దరినీ బెడ్రూమ్లోకి వెళ్లి మరి అరెస్ట్ చేశారని ఆయనే సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)కాగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. What’s common between the HONOURABLE CHIEF MINISTER OF TELANGANA @revanth_anumula and INDIA’S BIGGEST STAR @alluarjun is , they both got ARRESTED FROM THEIR BEDROOMS 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/bg7YJH1Qdl— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2024 -
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
అల్లు అర్జున్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు: స్టార్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ మరోసారి కామెంట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వర్మ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. 'అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అధికారులకు నా 4 ప్రశ్నలు' అంటూ అందరినీ ఆలోచింపచేసిన ఆయన మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కేంద్రమంత్రుల నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. ఇప్పటికే బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడిన ఆర్జీవి మరోసారి ఇలా ట్వీట్ చేశారు. ' తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని అందించి, రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.' అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు.నేషనల్ అవార్డ్‌తో తెలుగు సినిమా కీర్తిని పాన్ ఇండియా రేంజ్‌కు అల్లు అర్జున్ తీసుకెళ్లాడని తెలిసిందే. ఇన్నేళ్ల తెలుగు ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు మన సత్తా ఏంటో చూపించాడు. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయింది.. @alluarjun the BIGGEST STAR of INDIA, a resident of TELANGANA STATE has given the GREATEST GIFT to the TELANGANA STATE by giving the BIGGEST HIT in the ENTIRE HISTORY of iNDIAN CINEMA and the TELANGANA STATE in turn gave him the BIGGEST RETURN GIFT by sending him to JAIL…— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2024 -
ఎవరిది వైఫల్యం.. ఎవరికి శిక్ష?
అధికారులకు నాలుగు ప్రశ్నలు..1. పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ల ను అరెస్ట్ చేస్తారా?2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? 3. సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చని పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?4. భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహ కులు తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?– ఎక్స్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మఅల్లు అర్జున్ హార్డ్‌వర్క్‌తో ఎదిగిన స్టార్పబ్లిక్ ర్యాలీల్లో, పలు ఘట నల్లో తొక్కిసలాటలు జరిగి ఎందరో అమాయ కులు చనిపోయారు. వారి జాబి తా కోసం వెతుకుతున్నా. ఈ మధ్యకాలంలో ఓ యంగ్ యాక్టర్ తొక్కి సలాటలో అసౌకర్యానికి గురై, కార్డియాక్ అరె స్ట్‌తో చనిపోయారు. అల్లు అర్జున్ హార్డ్‌వర్క్ తో ఎదిగిన స్టార్.. వారస త్వంతో కాదు. – పూనమ్ కౌర్, నటి నమ్మలేకపోతున్నానుఇప్పుడు నేను చూస్తున్న పరిణామాలను నమ్మలేక పోతున్నాను (అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఉద్దేశించి). జరి గిన ఘటన చాలా బాధాకరం.. దురదష్టకరం. అయితే అందుకు ఒక వ్యక్తిని నిందించడం మాత్రం చాలా బాధగా ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరం.. – రష్మిక మందన్నా, నటి ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదుప్రభుత్వ అధికారులు, మీ డియా వారు సినిమా పరి శ్రమకు సంబంధించిన వా ళ్లపై చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ చూపించాలని కోరుకుంటున్నాను. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చు కోవాలి. మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్య త్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసు కోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించటం సరికాదు. – నాని, సినీ నటుడుఒక్కరినే నిందించటం సరికాదుజరిగిన ఘటన హృదయ విదారకం. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఒక నటుడు భద్రతాపరమైన చర్యలకు పూర్తి బాధ్యత వహించలేడు. ఈ ఘటనకు ఒక వ్యక్తినే బాధ్యుణ్ణి చేసి, నిందించడం సరికాదు. – వరుణ్ ధావన్, సినీ నటుడు అందరూ బాధ్యులేనేను అల్లు అర్జున్‌కు గొప్ప మద్దతుదారును. జరిగిన ఘటన దురదృష్టకరం. మనం హైప్రొఫైల్ వ్యక్తు లం. ఇలాంటి పరిణామాలకు బాధ్యులుగా మారకూడదు. ప్రజల ప్రాణాలు ఎంతో విలు వైనవి. ఇలాంటి ఘటనలకు అందరూ బాధ్యత వహించాలి. – కంగనా రనౌత్, సినీనటి, ఎంపీ -
అలా జరిగితే దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆర్జీవీ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులకు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. నాలుగు రకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేశారు.సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన అధికారులకు ఆర్జీవీ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి. పుష్కరాలు ,బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? అని ట్విటర్ వేదిక నిలదీశారు.ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు ఇవే..1.పుష్కరాలు , బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? . @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు . 1.పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3.ప్రీ రిలీజ్…— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024 -
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తనపై కావాలనే కేసులు పెడుతున్నారని పలు ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.వర్మపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా కోర్టులో విచారణ జరిగింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది.సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఏపీలో సుమారు 9 జిల్లాలలో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్‌కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్‌కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్ప-2 సినిమాపై సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు లేని రికార్డులు సృష్టిస్తోందని పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ క్రియేట్ చేస్తోన్న రికార్డులపై ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రావడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ.. 'హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అత్యధిక వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది.. అలాగే బాలీవుడ్ యాక్టర్ కాకుండా మన అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు.. పుష్ప-2 పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మీరు స్టైలే వేరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సత్తా అంటే ఇది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలిరోజే రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టిన పుష్పరాజ్.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు సాధించింది. దీంతో హిందీలో బన్నీ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. The BIGGEST HINDI FILM ever in HISTORY of BOLLYWOOD is a DUBBED TELUGU FILM #Pushpa2 The BIGGEST HINDI FILM ACTOR in HISTORY of BOLLYWOOD is a TELUGU ACTOR @alluarjun who CAN’T SPEAK HINDI So it’s not PAN INDIA anymore , but it is TELUGU INDIA 💪💪💪— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2024 -
తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, మహాటీవీ సహా మరికొన్ని చానళ్లపై పరువు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తనపై, తన భాగస్వామి రవివర్మపై దుష్ఫ్రచారాన్ని సహించేది లేదని అన్నారు. వ్యూహం సినిమాకు దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా, శ్రీకాంత్ ఫైనాన్స్ సహకారం అందించారని, భాగస్వామి రవివర్మ సొంతంగా శ్రీకాంత్ నుంచి ఏపీ ఫైబర్‌నెట్ ప్రసార హక్కులను కొనుగోలు చేశారని, రవి వర్మ నుంచి ఏపీ ఫైబర్‌నెట్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసి, కోటి రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఆర్జీవీ తెలిపారు. 60 రోజులపాటు ఏపీ ఫైబర్‌నెట్‌కు హక్కులు ఇస్తే, లక్షన్నర వరకు వ్యూస్ వచ్చాయని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసారాలు నిలిపేశారని, కానీ తనకు రావాల్సిన మిగిలిన మొత్తం కోసం రవివర్మ సివిల్ కోర్టులో దావా వేశారని ఆర్జీవీ చెప్పారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనతో పాటు రవి వర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లను చట్టప్రకారం ఎదుర్కొంటానని ఆర్జీవీ తన ప్రకటనలో హెచ్చరించారు. -
అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోనన్న రామ్ గోపాల్ వర్మ
-
Pushpa 2 : ‘పుష్ప’ పాత్రపై ఆర్జీవీ రివ్యూ
అంతా అనుకున్నట్లే పుష్ప 2 మూవీ రికార్డులను బద్దలు కొడుతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా .. పుష్ప 2 మూవీ గురించే చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ముందు నుంచి కూడా పుష్ప 2 చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. ‘పుష్ప 2 చిత్రంలోని పుష్ప పాత్రపై నా రివ్యూ’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఎక్స్(ట్విటర్) షేర్ చేస్తూ.. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్రను చూడడం చాలా అరుదని అన్నారు. ఓ స్టార్ హీరో ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్ర కోసం సినిమా చూడడం పుష్ప 2 చిత్రానికి సాధ్యమైందని ప్రశంసించాడు.‘పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదు. ఒక వీక్షకుడిగా నేను సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప లాంటి పాత్ర బయట ఉందని నమ్మాను. ఇలా ఓ కమర్షియల్ ఫార్మాట్లో క్రియేట్ చేసిన పాత్రను వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చూపించడం అంత సులభతరమైన పని కాదు.పుష్పరాజు పాత్రలో గమనిస్తే..అమాయకత్వం, చాకచక్యంతో మిళితమై ఉంటాయి. అలాగే దుర్బలత్వంతో కూడిన సూపర్ అహం వంటి అత్యంత విరుద్ధమైన లక్షణాలన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరో అనేవాడు ఫర్ఫెక్ట్గా ఉంటాడని మాత్రమే మనం చూశాం. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని శక్తిగా మార్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్,హావభావాలు ఆ పాత్రకు మరింత బలమైన బలాన్ని అందించాయి. ఈ పాత్రని దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకుల గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా మందికి రిఫరెన్స్ పాయింట్‌గా పుష్ప పాత్ర ఉంటుంది. ఏ నటుడైనా తనకు సంబంధించిన సన్నివేశాల్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమైనవిగా అనిపించేంత పరిపూర్ణతను ప్రదర్శించారు. కేవడం బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కాకుండా ఎమోషన్స్ సీన్లని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించాడు. సీఎం సెల్ఫీకి నిరాకరించినప్పుడుకానీ, బాగా తాగి తన అహంకారాని పక్కన పెట్టి సారీ చెప్పే సీన్ కానీ.. అన్నింట్లిలోనూ అద్భుతంగా నటించాడు.ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాకా.. ఆ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చిన్నగా కనిపిస్తాడు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2—Ram Gopal Varma It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character Seeing…— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024 -
అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పటికే మెగా vs అల్లు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. అటు మెగా హీరోల అభిమానులు బన్నీపై ట్రోలింగ్ చేస్తుంటే.. ఇతడి ఫ్యాన్స్ వాళ్ల హీరోలని ట్రోల్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త చల్లారుతుందేమో అనుకుంటున్న టైంలో దర్శకుడు ఆర్జీవీ మంటపెట్టేలా ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా బన్నీని రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేసినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)'అల్లు మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ.. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు..పుష్ప 2 భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని క్రేజ్‌తో రిలీజ్ కాబోతుంది. మొదటి రోజు దాని కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ స్ట్రాటోస్పియర్ను విచ్ఛిన్నం చేస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా..ప్రపంచవ్యాప్తంగా ప్లానెట్ స్టార్ అని పిలిచే ఏకైక స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.అలానే బన్నీ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదు, అందుకే ఇతడు నిజమైన టవర్ స్టార్' అని వర్మ ట్విటర్లో(ఎక్స్) రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం)Here are 3 REASONS why ALLU is many times more MEGA than MEGA , and why he is not just a global star , but a PLANET STAR REASON 1.His film #Pushpa2 is the BIGGEST release in the ENTIRE HISTORY of INDIAN CINEMA and its COLLECTIONS on the 1st day are bound to BREAK the… https://t.co/WJClSl8VcZ— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2024 -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
నా పోస్ట్‌పై ఏడాది తర్వాత కేసులు పెట్టడమేంటి? : రాం గోపాల్ వర్మ
ఏపీలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో తనపై నమోదైన కేసులపై స్పందించారు.గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని.. నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.(ఇది చదవండి: రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట)గవర్నమెంట్ మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అర్జీవీ అన్నారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నాపై కూడా ఎన్నో మీమ్స్ వస్తుంటాయి.. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. తాను చేసిన ఒక్క పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించింది.కేసులకు భయపడటం లేదు: ఆర్జీవీఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
సోషల్ మీడియా డెవిల్స్.. RGV స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!
సాక్షి, అమరావతి: ‘నేను ఏడాది కిందట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు. పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాదిరిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు. ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయనూ లేదు. ఆ పోస్టుల్లో నేను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదు.కానీ హఠాత్తుగా ఏడాది తరువాత.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్టడం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది..’ అని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆయన ఆదివారం వివిధ టీవీ చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
RGV: తొమ్మిది చోట్ల కేసులు పెట్టారు..
-
RGV: రామ్ గోపాల్ వర్మను ఈడ్చుకుని వెళ్లారు... వినడానికి నాకు బాగుంటుంది
-
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్‌లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్‌నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 -
'సారీ' చెప్తారా అనే ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన వర్మ
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్‌కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్‌కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.నేను ఎప్పుడో చేసిన పోస్ట్‌లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. -
RGV Interview: డైరెక్టర్ RGVతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
-
కేసులకు భయపడటంలేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరఫ్, ఇక్కడా అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్లో ఉన్నాను. మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నా’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణసోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యాల గురించి వర్మ తరఫు న్యాయవాది మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి బుధవారం విచారణ జరుపుతామని చెప్పారు. -
కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్‌కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్‌కు తరలించడం, తద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అర్థమవుతుంది.మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్‌బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్‌ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన దారుణమైన పోస్టింగ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్‌లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్‌ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. గత టరమ్‌లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలపై కేసులు పెడుతున్నారట.మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేశారన్న ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో ఆరు కేసులు నమోదు చేశారట.వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించాలన్న దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు
-
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
అనకాపల్లిలో రాంగోపాల్ వర్మపై మరో కేసు
-
RGV పోలీస్ కేసుపై జగన్ రియాక్షన్
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం
-
పోలీస్ విచారణకు హాజరుకాని రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. లెక్క ప్రకారం ఈరోజు (నవంబర్ 19) విచారణకు హాజరు కావాలి. అయితే తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, కాకపోతే నాలుగైదు రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. అయితే వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని సీఐ అన్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఇకపోతే సోమవారం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. (ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో పిటిషన్ పై విచారణ
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 'వ్యూహం' ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)ఇప్పుడు ఈ కేసు విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు
-
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మపైనా కేసు
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదలలేదు. వ్యూహం సినిమా నిర్మించే క్రమంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలను కించపరిచేలా పోస్టింగ్ పెట్టారన్న ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.వివేకానందరెడ్డి సినిమాను దారుణంగా తీసి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై డైరెక్టుగా ఎన్నో అభాండాలు వేస్తూ యూట్యూబ్‌లోనూ, ఇతర ప్రసార మాధ్యమాలలోనూ చేసిన ప్రచారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకుని సినిమా తీసిన ఆర్జీవీపై వ్యక్తిగతంగా కేసు పెట్టడంపై సినిమా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఉన్నది దేనికి అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని సినిమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీసులు 336/4, 356/4, 196/356, ఐటీ/67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
సంచలన డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. -
గ్రాండ్‌గా ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్, కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
'అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెంట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.Her GUN was aimed at @KTRBRS and she SHOT @iamnagarjuna and @chay_akkineni and APOLOGIED to @Samanthaprabhu2 ..I DOUBT even ALBERT EINSTEIN can decipher this EQUATION 😳😳😳— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2024 -
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రాంగోపాల్ వర్మ
-
నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్
అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి హోదాలో ఉండి అలాంటి ఆరోపణలు చేయడంపై టాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగర్జున, అమల, నాగచైతన్య, సమంత, ప్రకాశ్ రాజ్, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మంత్రి చేసిన వాఖ్యలను తప్పుపట్టారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పై మండిపడుతూ వరుస ట్వీట్స్ చేశాడు.(చదవండి: మంత్రి మాటలు విని చాలా బాధపడ్డా: మెగాస్టార్ చిరంజీవి)నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం.4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణంఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024 (చదవండి: ఇలాంటి ప్రవర్తన మన తెలుగు సంస్కృతికి విరుద్ధం: అల్లు అర్జున్, వెంకటేశ్) ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే కలుగజేసుకొని ఇకపై ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము’ అని ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా, కొండా సురేఖ ఫ్యామిలీతో ఆర్జీవీకి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో కొండా సురేఖ దంపతులపై ‘కొండా’ అనే సినిమాను తెరకెక్కించాడు. -
రామ్‌నగర్ బన్నీ ఇద్దరికీ హిట్ ఇవ్వాలి: రామ్‌గోపాల్ వర్మ
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా నటించాడు కూడా. ఈ చిత్రం చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. చంద్రహాస్ హీరోగా శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ ΄÷డకండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ– ‘‘రామ్‌నగర్ బన్నీ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘మా అన్నయ్య చంద్రహాస్‌కు ‘రామ్‌నగర్ బన్నీ’ పెద్ద సక్సెస్ ఇవ్వాలి’’ అని దివిజ ప్రభాకర్ చెప్పారు. ‘‘మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్’’ అని మలయజ ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్లు మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రభాకర్ ΄÷డకండ. ‘‘మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా నచ్చని ప్రేక్షకులు మీ టికెట్‌ని ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పంపితే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను’’ అని చంద్రహాస్ తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, హీరోయిన్లు రిచా జోషి, రీతు మంత్ర, అంబికా వాణి, విస్మయ శ్రీ, సంగీత దర్శకుడు అశ్విన్ హేమంత్, నటులు సమీర్, సలీమ్ ఫేకు, ఫైట్ మాస్టర్ రాము, లిరిక్ రైటర్స్ అవినాష్, సాగర్ తదితరులు మాట్లాడారు. -
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
‘శారీ’ హీరోయిన్ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు)
-
ఏఐతో పాటలు
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్ లవ్... ఐ వాంట్ లవ్...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ) యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. -
ఆర్జీవీ 'శారీ' సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ విడుదల
కాంట్రవర్సీ టాపిక్స్‌తో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ విడుదల కానుంది. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది. -
ప్రేమలో పడ్డాక...
నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. -
ప్రేమ మరీ ఎక్కువైపోతే? ఆసక్తికరంగా ఆర్జీవీ 'శారీ' టీజర్
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ'. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అంటే ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో నవంబరులో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించగా.. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన ఎంతో మంది మహిళలని 'శారీ కిల్లర్' అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యలు చేశాడు. ఆ మృగాడికి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో అనే పాయింట్‌తో శారీ మూవీ తీశారు. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్‌గా ఓ అబ్బాయి ఎలా మారిపోయాడనేది టీజర్లో చూపించారు.ఇందులో అబ్బాయిగా సత్య యాదు, అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి స్వస్థలం కేరళ. నిజానికి ఆరాధ్యని వర్మ ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్లో తొలుత చూశారు. అలా ఆమెని ప్రధాన పాత్ర కోసం తీసుకుని ఏకంగా శారీ సినిమా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
ఆర్జీవీ 'శారీ' సినిమా.. క్రేజీ అప్డేట్
కాంట్రవర్సీ టాపిక్స్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'శారీ' మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో శ్రీలక్ష్మీ సతీశ్ అనే అమ్మాయిని చూసి ఇందులో హీరోయిన్గా ఎంచుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు టీజర్ గురించి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)ఈ సినిమా టీజర్‌ని సెప్టెంబరు 15న అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలానే ఇది ఉత్తరప్రదేశ్‌లోని శారీ కిల్లర్‌కి సంబంధించిన కథ కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.ఇకపోతే గిరి కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్జీవీ డెన్ పతాకంపై వర్మ సమర్పిస్తుండగా రవి వర్మ నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)Unlike some people are speculating , SAAREE film, is not based on the SAAREE killer of U P , but it’s based on several true life incidents #RGVsSAAREE pic.twitter.com/tDjmovrPNs— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2024 -
బిగ్‌బాస్ షోలో మరో ఆర్జీవీ బ్యూటీ.. ఈమె కరాటే ఫైటర్ (ఫొటోలు)
-
ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే ట్రెండ్ నడుస్తోంది: ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్
అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2. ఈ సినిమాకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ కోలీవుడ్ మూవీని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమా చేశా. అది అంతా అపార్ట్ మెంట్లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ తర్వాత ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ అయిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే. నేను ఈ మూవీ ప్రీమియర్ చూడలేదు. కానీ ఇక్కడ ప్రీమియర్ చూసిన వాళ్ల నుంచి మంచి టాక్ వచ్చింది. ఇవాళ కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు చూసే ట్రెండ్ నడుస్తోంది. అలాగే తెలుగులోనూ డీమాంటీ కాలనీ 2 ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. కాగా.. డీమాంటీ కాలనీ 2 చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘డెమోంటే కాలనీ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'విజయవాడలో ఇంజినీరింగ్ డేస్'.. నెటిజన్స్‌కు డైరెక్టర్ ఆర్జీవీ సవాల్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆర్జీవీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.తాను విజయవాడలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఫోటోను రాంగోపాల్ వర్మ ట్విటర్లో షేర్ చేశారు. అందులో తాను ఎక్కడున్నానో కనిపెట్టాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. అయితే ఆ ఫోటోలో అందరి మొహాలు కాస్తా బ్లర్‌గా ఉన్నాయి. అందువల్లనే ఆడియన్స్‌కు ఆర్జీవీ చిన్న పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది.కాగా.. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. Me with my friends sitting on a wall in my engineering days in Vijaywada..SPOT ME pic.twitter.com/gq7SFTb4UA— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
రాజ్‌తరుణ్-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. రాజ్ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు వేరే హీరోయిన్ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్ చేయించాడని పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా రెండు-మూడు రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. అటు లావణ్య..ఇటు శేఖర్ బాషా నిత్యం ఏదో ఒక యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడం..అవి కాస్త వైరల్ కావడం..దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా రాజ్‌తరుణ్-లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజ్-లావణ్య వివాదం మీడియా సర్కస్‌గా మారిందని, సోషల్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్‌గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ.. రాజ్ తరుణ్‌కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవీ.‘రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని.. అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే..అది చాక్లెట్ కాదు కదా? పెళ్లి చేసుకొని,20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింట్ కాదు’ అని ఆర్జీవీ అన్నారు.ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డు చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్ మైండ్ సెట్ వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతుంది..కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనే నాకు అనిపిస్తుంది’ అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
ఒకప్పుడు కేవలం అలాంటి సినిమాలే: మలయాళ ఇండస్ట్రీపై ఆర్జీవీ కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కల్కి చిత్రంలో అతిథిపాత్రలో మెరిశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆర్జీవీ మలయాళ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మలయాళ చిత్రాలు కేవలం అడల్ట్, రొమాంటిక్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవని అన్నారు.రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..'ఒకప్పుడు మలయాళం సినిమా అంటే కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమేనని మనందరికీ తెలుసు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో మలయాళ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ అడల్ట్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మలయాళం నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు లేవని కాదు. బహుశా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కారణాలతో అలాంటి సినిమాలు తీసుకొచ్చి ఉంటారేమో. వారిని ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉండొచ్చు.' అని అన్నారు,ది కేరళ స్టోరీపై ప్రశంసలు..ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి వివాదాస్పద చిత్రాలపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ది కేరళ స్టోరీ ఒకటని ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ వర్మ చిత్రం హను-మాన్, నాగ్ అశ్విన్ తాజా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సినిమాలు అధ్బుతమని కొనియాడారు. శివ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆర్జీవీ టాలీవుడ్‌కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించారు. -
ఆ సినిమాలు డేంజర్, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ
ఇతిహాసాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాగని అన్నీ ఆదరణకు నోచుకోలేదు. అందుకు ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే పురాణాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన మైథాలజీ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీని సినీప్రియులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో కల్కికి సీక్వెల్ కూడా రానుంది.డేంజర్ఇదిలా ఉంటే బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రామాయణ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. పురాణాల మీద సినిమాలు తీయడం డేంజర్.. ఎందుకంటే వాటి గురించి జనాలకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాన్ని మీరు మరోలా చూపిస్తే అది బెడిసికొడుతుంది. పైగా పురాణాల్లో పేర్కొన్న వ్యక్తులను మన దేశంలో దేవుళ్లుగా పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటి సాహసాలు చేయలేము.ట్రోలింగ్ ఎక్కువ..ఒకప్పుడు బాబూభాయ్ మిస్త్రీ.. సంపూర్ణ రామాయణ వంటి పౌరాణిక సినిమాలు తీశాడు. ఎన్టీ రామారావు కూడా అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. వాటిని ఇప్పటికీ అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. వాళ్ల వేషధారణను చూసి చేతులెత్తి మొక్కుతారు కూడా! అదే ఆదిపురుష్‌ను తీసుకోండి. అందులో లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ లుక్, హనుమాన్ లుక్ మీద ఎంత రచ్చ జరిగిందో.. ఇలా పదేపదే విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్.చూసే విధానమే మారిపోయిందినేనేమంటానంటే.. కొత్త కథను తీసుకుని దానికి రామయణ అనే పేరు పెట్టకుండా తీయండి. ఇప్పుడు ఆదిపురుష్.. ప్రభాస్ సినిమా అంటే జనాలు ఒకలా ఆలోచిస్తారు. అది రామాయణం అంటే జనాల ఆలోచన మరోలా ఉంటుంది. ఇలాంటి సున్నిత అంశాల జోలికి వెళ్లడం అవసరమా? ఏదేమైనా ధైర్యం చేసి మరీ ఇలాంటి మూవీస్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నవారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అన్నాడు.చదవండి: తన సినిమా చూసి షాకైన డైరెక్టర్.. తనకు తెలియకుండానే మార్చేశారు! -
ఆర్జీవీకి బాగా క్లోజ్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
యువర్ ఫిలిం కాంటెస్ట్: ఫైనలిస్టులు వీళ్లే!
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దర్శకనిర్మాత రామ్‌గోపాల్ వర్మ.. ఆర్జీవీ యువర్ ఫిలిం కాంటెస్ట్‌ను ప్రవేశపెట్టాడు. ఈ పోటీకి వివిధ రాష్ట్రాల నుంచి వందలకొద్దీ ఎంట్రీలు వచ్చాయి. డైరెక్టర్ ఛాన్స్ కోసం 419 మంది అప్లై చేసుకోగా వాటిని జల్లెడ పట్టి 11 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారు తీసిన సన్నివేశాలను యూట్యూబ్‌లో షేర్ చేసిన వర్మ.. ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ గత నెలలో యూట్యూబ్‌లో పోల్ పెట్టాడు. సోమవారం నాడు ఈ పోల్ ఫలితాలను వెల్లడించాడు. నిరంజన్ నాగరాజ, గురుప్రసాద్ మనారి, అభిజీత్ సాయి రెడ్డిలను ఫైనలిస్టులుగా ప్రకటించాడు. ఇప్పుడీ ముగ్గురిలో ఒకర్ని విజేతలుగా ప్రకటించాల్సిన బాధ్యత మీదేనంటూ మళ్లీ ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశాడు.వారు తెరకెక్కించిన వీడియోలు చూసి ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ యూట్యూబ్‌లో మరో పోల్ పెట్టాడు. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వారితో వర్మ ఓ సినిమా తీస్తాడు. ఆరు నెలల్లోనే మూవీ తీసి రిలీజ్ చేస్తారు. మరి వీరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్‌గా గెలిచి సినిమా ఛాన్స్ అందుకుంటారో చూడాలి! The 3 finalists chosen by the AUDIENCE POLLING for BEST DIRECTOR in the YOUR FILM competition are NIRANJAN NAGARAJA , GURU PRASAD MANARI and ABHIJEET SAI REDDY ..The POLLING for who is the BEST among these 3 is live now and will end on 10 th JULY https://t.co/qAfyyjRBMx…— Ram Gopal Varma (@RGVzoomin) July 1, 2024 చదవండి: ఈఎమ్ఐ కట్టకపోవడంతో షారూఖ్ కారు తీసుకెళ్లారు: హీరోయిన్ -
‘రేవు’ పార్టీలో హేమాహేమీలు..ఆర్జీవి మురళీమోహన్ (ఫొటోలు)
-
యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం అదే : రామ్‌గోపాల్ వర్మ
‘‘చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ‘ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్’ లక్ష్యం’’ అన్నారు దర్శక–నిర్మాత రామ్గో΄ాల్ వర్మ. శుక్రవారం విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘శివ’ అప్పుడు నా గురించి ఎవరికీ తెలియదు. ఆ చిత్రం హిట్టవ్వడం వల్లే నేనెవరో అందరికీ తెలిసింది. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నాకు వీలు దొరికింది. కానీ ప్రతిభ ఉండి నాలాగా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎందరో బయట ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్‌కి వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్‌ని ఎంపిక చేశాం. వీటిని సోషల్ మీడియాల పోల్‌కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువ మంది బెస్ట్ డైరెక్టర్‌గా ఓటు వేసిన వారికి మా సంస్థలో చాన్స్ ఇస్తాం. డైరెక్టర్స్ అనే కాదు కెమెరా, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా.. ప్రతి క్రాఫ్టులో ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేస్తున్నాం. సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నా, నిర్మాత రవి స్వార్థం’’ అన్నారు. నిర్మాత రవి కూడా పాల్గొన్నారు. -
కొత్త డైరెక్టర్స్‌కు వర్మ పరీక్ష.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా వర్మ తన డెన్లోకి అడుగుబెట్టబోయే వారి లిస్ట్‌ను ప్రకటించారు.డైరెక్టర్స్‌గా వర్మ డెన్‌లో అడుగుబెట్టాలని 419 మంది తన వెబ్సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకుంటే అందులో 11 మందిని సెలక్ట్ చేసి వారి పేర్లను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరందరూ జూన్ 14న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌కు రావాలని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్‌గా 9మంది ఎంపికయ్యారని చెప్పారు. అయితే, వీరిలో ఒక్కరు మాత్రమే ఫైనల్ అవుతారని, వారిని కూడా ఎలా ఎంపిక చేస్తారు అనేది వెబ్సైట్లో తెలిపారు. వర్మ డెన్‌కు ఎంపిక అయిన వారందరీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా వారి పేరు పక్కన చేర్చడం విశేషం. వివరాల కోసం ఈ వెబ్సైట్లో https://rgvden.com/ చూడగలరు -
ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి వర్మ ఆహ్వానం.. జూన్ 9న లిస్ట్ విడుదల
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా గతంలోనే తెలిపారు. అందుకు భారీగా రెస్పాన్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ ఔట్ డేటెడ్‌గా మారాయని వర్మ అన్నారు. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్స్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుందన్నారు వర్మ. అందుకు కావాల్సిన కొన్ని ప్రశ్నలను కూడా తన వెబ్సైట్లో ఉంచాడు. అయితే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది వర్మ తాజాగా తెలిపాడు.ఇప్పటి వరకు 319 మంది డైరెక్టర్స్‌గా తన వెబ్సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. మ్యూజిక్ కంపోజర్స్‌గా 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, వీరందరిలో ఒక్కో విభాగం నుంచి 10 మందిని సెలక్ట్ చేస్తామని, ఆ లిస్ట్‌ను జూన్ 9న ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు.నటీనటులకు సంబంధించి గమనికనటీనటులకు సంబంధించి, ఔత్సాహిక నటులు/నటీమణులను కేవలం వారి ఫోటోలు మాత్రమే పంపమని చెప్పడంలో పొరపాటు చేశామని ఆ వెబ్సైట్లో తెలిపారు. వెయ్యికి పైగా తమకు ధరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. దీంతో ఫోటో లుక్స్ వల్ల సెలక్ట్ చేయడం కాస్త కష్టంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి అక్కడ ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక వీడియో ద్వారా చెప్పాల్సిన డైలాగ్‌ను కూడా అక్కడే వర్మ టీమ్ పొందుపరిచింది. దానిని వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20లోపు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వారు కోరారు.కెమెరామెన్స్ కూడా ఛాన్స్కొత్తగా కెమెరామెన్స్‌గా రాణించాలనుకునే వారికి అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో ఆర్జీవీ తమ వెబ్సైట్లో తెలిపారు. దాని ప్రకారం జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. గతంలో ఇచ్చిన నిబంధనల విషయంలో కొన్ని మార్పులు చేసి మరోసారి జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైటర్స్ అప్లై చేసుకున్న విషయంలో కూడా పలు మార్పులు చేశారని గమనించగలరు. డైరెక్టర్,రైటర్,మ్యూజిక్ కంపోజర్, యాక్టింగ్,కెమెరామెన్ వంటి రంగాల్లో రాణించాలనుకునే వారందరికి వర్మ డెన్ ఆహ్వానం పలుకుతుంది.YOUR FILM is SUPER SUCCESS ..Out of 319 submissions and 50’submissions from directors and music directors , 10 Shortlisted directors and 10 music directors list will be put out on 9th June…Also see the revised tests regarding Actors/Actresses ,Cinematographers and writers Check…— Ram Gopal Varma (@RGVzoomin) June 6, 2024 -
'జాము రాతిరి జాబిలమ్మా' అంటూ అభిమాన హీరోయిన్‌తో వర్మ సాంగ్
'జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా' సాంగ్ వినిపించగానే ఎవరికైన టక్కున గుర్తుకొచ్చేది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. క్షణ క్షణం సినిమాలో ఈ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ తరాలు మారినా ఆదరణ మాత్రం తగ్గలేదు. 1990లో విడుదలైన క్షణ క్షణం సినిమాను స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.క్షణ క్షణం సినిమాలో జాము రాతిరి జాబిలమ్మా అంటూ.. వెండితెరపై వెంకటేశ్, శ్రీదేవి కనిపించిన విషయం తెలిసిందే. అయితే, వెంకటేశ్ స్థానంలో శ్రీదేవి పక్కన రామ్ గోపాల్ వర్మ ఉంటే.. అదేలా సాధ్యం అంటారా..? ఏఐ టెక్నాలజీ సాయంతో వర్మ అభిమానులు దీనిని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ సాంగ్‌ను రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేశాడు. శ్రీదేవి పక్కన కనిపించే భాగ్యం తనకు కల్పించిన ఏఐ టెక్నాలజీకి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు.Thanks to AI , Me in Venkatesh pic.twitter.com/VhnhUv8ddM— Ram Gopal Varma (@RGVzoomin) May 31, 2024 అతిలోక సుందరి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానంతో పాటు గౌరవం కూడా ఉంది. ఆ ఇష్టంతోనే క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్గా ఉండాలని ఎంపిక చేశారు. -
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024 -
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్‌డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్‌పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Happy Birthday Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్ ఫొటోలు చూశారా?
-
హీరో, హీరోయిన్, డైరెక్టర్.. మీరు సెలక్ట్చేసినవారితో సినిమా!
రామ్‌గోపాల్ వర్మ ఐడియాలే వేరు! సినిమా కథను ఆన్లైన్లో పెట్టి.. అందులో ఎవరు నటిస్తే బాగుంటుందనేది ప్రేక్షకులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? మెజారిటీ ఓటింగ్‌ను ప్రాతిపదికలోకి తీసుకుని అదే తారాగణంతో సినిమా వస్తే.. ఐడియా అదుర్స్ కదూ! దీన్ని రియాలిటీలో చేసి చూపిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవీ డెన్ వేదికగా శనివారం నాడు ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా తీస్తారు. ఆర్జీవీ నిర్మాతగా దాన్ని ఆరు నెలల్లో తీసి రిలీజ్ చేస్తారు. సినిమా కథనీ RGV వెబ్సైట్లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని.. ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుంచి 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్కులను బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరినీ ప్రేక్షకులే ఎన్నుకుంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం.. అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా. To know how to involve the audience in the making of a film , Click https://t.co/4u0rJD7Jn3 YOUR FILM concept #RgvYourFilm pic.twitter.com/MVSoiUFtXU — Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2024 -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న వర్మ హీరోయిన్
సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది.వర్మ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. ఫైనల్‌గా ఆ అమ్మాయిది కేరళ అని ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని వర్మ తెలిపారు. ఆమెతో 'శారీ' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. సినిమా కోసం ఆమె పేరును ఆరాధ్య దేవిగా మార్చడం జరిగింది. ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందించారు. ప్రస్తుతం ఆరాధ్య దేవితో తీస్తున్న ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి దాకా చీరలో పద్దతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్‌తో కేకపుట్టించింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చీరలో యూత్‌ను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్‌తో అదిరిపోయే ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలను వర్మ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఆరాధ్య ఫోటోలు చూసిన వారందరూ కూడా నోరెళ్లబెడుతున్నారు. అంతలా అవి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వర్త్ వర్మ.. వర్త్ అంటూ షాక్ అవుతున్నారు. పద్ధతిగా చీరకట్టులో ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావ్ వర్మ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) Hey @yeshclicks I am shocked with the transformation u made of the SAAREE girl Aaradhya Devi through ur photography .. See the pics of https://t.co/tANxbmOjAD to believe in this link https://t.co/qILXQadtVW pic.twitter.com/fuXBE5U7lA — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 -
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తిర ట్వీట్ చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్’ హ్యాండిల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా. ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్ థ్రిల్లర్లుగా వ్యూహం, శపథం రూపొందించి సక్సెస్ సాధించారు ఆర్జీవీ. SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐 — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 -
లోకేష్ గ్రాఫిక్స్ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వర్మ
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. దీంతో టీడీపీ నాయకులకు నిద్ర పట్టని పరిస్థితి. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలి రావడంతో నారా లోకేష్ తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్ అని తనలో దాగి ఉన్న మూర్ఖత్వాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. ఈ అంశంపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన స్టైల్లో సోషల్ మీడియా ద్వారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. ఇలా సమాధానం చెప్పారు. 'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి, ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్లో గ్రాఫిక్స్ ఎలా చేయగలరని మీరు వారిని అడగలేదా..? ముందు ఆ విషయం తెలుసుకోండి.' అని సలహా ఇచ్చారు వర్మ.. అనంతరం ఆయన లోకేష్‌ను ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు.. 'నువ్వు మూర్ఖుడివి అని నాకు తెలుసు.. కానీ నువ్వు మూగవాడివని నిరూపించుకున్నావు.' అని తెలిపారు. లోకేష్ గ్రాఫిక్స్ వ్యాఖ్యలపై నెట్టింట కూడా పెద్ద దుమారమే రేగింది. విదేశాల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివానని గొప్పలు చెప్పుకునే లోకేష్‌కు లైవ్ వీడియోను ఎలా గ్రాఫిక్స్ చేయగలరు, సాధ్యం కాదనే విషయం తెలియదా..? అని సెటైర్స్ వేస్తున్నారు. ఇంకా రాతియుగంలో లోకేష్ జీవిస్తున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నారా లోకేష్, కొందరు టీడీపీ నాయకులు "సిద్ధం" మీటింగ్ కి అసలు జనమే లేరని, కానీ గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించారని చెబుతున్నారు. కానీ బుర్రన్న ఎవ్వడికైనా ప్రత్యక్ష ప్రసారంలో గ్రాఫిక్స్ సాధ్యమవ్వవు కదా అని తెలుసు. అపర మేధావి లోకేష్ మాటలను కాసేపు నమ్మేద్దాం. మరైతే ఫోటోలు విడుదల చేయడం ఎందుకు..? టెలికాస్ట్ అయిన వీడియోను తీసుకుని మార్ఫింగులెక్కడ జరిగాయో చూపంచరేం..? అలా చేస్తే లోకేష్ బండారం బయటపడుతుందని ఇలా కాపీ పేస్ట్ ఫోటోలతో సరిపెట్టి తన సోషల్ మీడియా ద్వారా టీడపీ కార్యకర్తలను సంతృప్తి పరిచాడు. సీఎం జగన్ సభలకు వస్తున్న జనాలను చూసి నీరసించిపోతున్న టీడీపీ క్యాడెర్లో ఇలా అయిన ఉత్తేజం నింపుదామనే ప్రయత్నంలో లోకేష్ ఉన్నాడు. Ur ignorance has no limits .. Since u have lot of friends in the film industry , couldn’t u have asked them how anyone can do graphics in a live streaming event? https://t.co/elzkHDKtB9 — Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2024 -
‘శపథం’ మూవీ రివ్యూ
టైటిల్: శపథం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ గతవారం(మార్చి 2) థియేటర్స్‌లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక దానికి కొనసాగింపుగా ‘శపథం’అనే మూవీని తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ఏపీ ఫైబర్ నెట్‌తో పాటు పలు ఓటీటీల్లో వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేస్తున్నారు. అసలు శపథం కథ ఏంటి? ఈ చిత్రం ద్వారా ఆర్జీవి బయటపెట్టిన నిజాలు ఏంటి? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే..? ‘వ్యూహం’ ముగింపు నుంచి శపథం మూవీ ప్రారంభం అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి((అజ్మల్ అమీర్)) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ఆపడానికి చంద్రబాబు(ధనంజయ్ ప్రభునే) చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ కల్యాణ్(చింటూ) పరిస్థితి ఎలా ఉంది? 2014 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్.. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో ఎందుకు జత కట్టాడు? సొంత ప్రయోజనాల కోసం మీడియాని, వ్యవస్థలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా నిలిచిన వాలంటరీ వ్యవస్థను అభాసు పాలు చేసేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన కుట్రలేంటి? విగ్రహాలు, దేవాలయాలపై దాడులు చేయిందెవరు? దాని వెనుక ఉన్న వారి వ్యూహం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే శపథం చూడాల్సిందే. (చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే.. ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ప్రారంభానికి ముందే.. ‘ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి’ అని ఆర్జీవీ చెప్పారు. చెప్పినట్లే పచ్చి నిజాలను తెరపై చూపించాడు వర్మ. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల కుట్రలను తిప్పి కొడుతూ సీఎం జగన్ ఎలా ప్రజా పాలన కొనసాగిస్తున్నాడు అనేది ఇందులో చూపించాడు దర్శకుడు. 2019 నుంచి 2023 వరకు ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను.. దాని వెనుక ఉన్న కారణాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజల మనసులో ఏముందో, వాళ్లు ఏం చర్చింకుంటున్నారో దాన్నే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం.. వాలంటరీ వ్యవస్థ కారణంగా పేద ప్రజలను జరుగుతున్న ప్రయోజనాలను.. వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు, పవన్ చేసిన కుట్రలను ధైర్యంగా తెరపై చూపిస్తూ వారితో ఓ ఆట ఆడుకున్నాడు. వర్మ మాత్రమే ఇలా తీయగలడు అనేంతలా చిత్రాన్ని తీర్చి దిద్డాడు. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అప్పుడు ఇలానే జరిగింది కదా? దాని వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు పన్నిన కుట్రని కూడా ఉన్నది ఉన్నట్లుగా, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చూపించాడు వర్మ. స్వప్రయోజనం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడనేది అందరు అనుకునే మాట. అదే విషయాన్ని వర్మ కూడా తన సినిమా ద్వారా చెప్పాడు. అవసరానికి పవన్ ఎలా వాడుకున్నాడు? ఇప్పుడు మళ్లీ జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు చేతిలో పవన్ పావులా ఎలా మారాడు ? అనే నిజాన్ని కామెడీ వేలో చూపించి నవ్వించాడు. సినిమాల్లో పవన్ హీరో అయినా.. రాజకీయాల్లో మాత్రం పెద్ద జోకర్ అని తనదైన శైలీలో చూపించాడు వర్మ. పవన్‌కి సంబంధించిన సీన్లు వచ్చిన ప్రతిసారి పగలబడి నవ్వడం గ్యారెంటీ? ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి పీకే..పీకే.. అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత నవ్విస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొన్ని సీరియస్ అంశాలను కూడా కామెడీగా చూపించాడు వర్మ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని వ్యతిరేకించినప్పుడు.. ‘మరి మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నారు కదా?’ అని మీడియా పవన్ ప్రశ్నించడం..దానికి ఆయన ఇచ్చిన సమాధానం..తెరపై చూస్తే నవ్వొస్తుంది. బయటకు వచ్చి ఆలోచిస్తే.. నిజమే కదా? అనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని చూపిస్తూ.. సీఎం జగన్‌పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. బాబుని అరెస్ట్ చేయించడం కక్ష సాధింపు కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం నాకిచ్చిన స్థానానికి న్యాయం చేయడానికే. నేను అధికారం కోరుకున్నది ప్రజలకు మంచి చేయడానికే. అదే చేస్తున్నా. ఇది నాకు నేను చేసుకున్న శపథం’ అంటూ సీఎం జగన్ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. అలాగే చివరల్లో చంద్రబాబు గురించి ‘వెయ్యి తప్పులు చేశావ్..’అంటూ ఆర్జీవీ పాడిన పాట అయితే సినిమాకే హైలెట్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల చుట్టే తిరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ ఒదిగిపోయాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు.వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ ఒదిగిపోయారు. వ్యూహంతో పోలిస్తే ఇందులో ఆమెకు ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. ఇక చంద్రబాబు పాత్రలో ధనంజయ్ ప్రభునే పరకాయ ప్రవేశం చేశాడు. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. పవన్ కల్యాణ్ పాత్రకి చింటు న్యాయం చేశాడు. ఇక లోకేష్ పాత్రకి ఎక్కువగా డైలాగ్స్ లేకున్నా.. ఉన్న ఒకటి రెండు సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా లోకేష్‌ని ఉద్దేశిస్తూ ‘పులి కడుపున పులే పుడుతుంది’ అని చంద్రబాబు అనగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా పిల్లి సౌండ్ రావడం.. డైట్ అంటూ చిప్స్..గ్లాసుల కొద్ది పాలు తాగడం.. ఇవన్నీ నవ్విస్తాయి. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. ఆనంద్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ఆర్జీవీ పాడిన ‘వెయ్యి తప్పులు చేశావ్’ పాట సినిమాకే హైలెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా ‘శపథం’ సినిమా వైఎస్సార్సీపీ అభిమానులలో జోష్ని నింపుతూ.. సామాన్యులను ఆలోచింపజేస్తుంది. -
అందరికీ అందుబాటులో 'శపథం'.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం: వర్మ
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదలైంది. దానికి సీక్వెల్ అయిన శపథం విడుదల కావాల్సి ఉంది. వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన వర్మ.. ఆ సినిమాకు సంబంధించి శపథంను వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో వర్మ ప్రెస్‌మీట్ నిర్వహించారు. 'శపథం సినిమాను ఇప్పటికే ఏపీలో ఫైబర్ నెట్లో విడుదల చేశాం. మరో రెండు మూడు రోజుల్లో అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నప్పుడే వాటికి వెబ్ సిరీస్ కూడా తీశాం. అందరికీ సినిమా రిచ్ అవ్వాలని మా ప్రయత్నం. ఏపీ రాజకీయాల్లో నాలుగు గోడల మధ్య జరిగిన కొన్ని సంఘటనలరు ప్రజలకు చూపించాను. నాకు పబ్లిక్ ఫిగర్స్ మీద ఉన్న అభిప్రాయాన్ని సినిమాగా తీశాను.' అని ఆయన చెప్పారు. వెబ్ సిరీస్‌కు శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 అనే టైటిల్స్ పెట్టారు వర్. ఎలాంటి కట్స్ లేకుండా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. కొన్ని నిబంధనలు, కోర్టు కేసులు, అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి, వాటికి తగ్గట్టు వ్యూహంను థియేటర్లలో రిలీజ్ చేశామని చెప్పిన వర్మ శపథం మాత్రం ఇలా ఓటీటీలో విడుదల చేయడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఫైబర్ నెట్లో శపథం చిత్రాన్ని చూడవచ్చు. శపథం సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వాళ్లు సినిమాని ఎవ్వరు చూడకుండా పలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్న కేబుల్స్‌ను వారు కట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు విచారణ చేపట్టారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్లో విడుదల కావాల్సిన శపథం సినిమా ఇంకా సెన్సార్ కాలేదని ఆయన తెలిపారు. కానీ అందరూ సినిమా చూడాలని ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అందుకే సెన్సార్ కాకపోయిన ఫైబర్ నెట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
పిచ్చోడిలా అరవడం కాదు .. పవన్ కామెంట్స్ కు ఆర్జీవీ కౌంటర్
-
ఏపీ ఫైబర్ నెట్లో ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. గత శనివారం(మార్చి 2) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను తనదైన శైలీలో తెరపై చూపించాడు ఆర్జీవీ. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కాకుండా చేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ చేసిన కుట్రలను.. వాటన్నింటిని ఎదుర్కొని వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రం ద్వారా చూపించాడు. (చదవండి: వ్యూహం' సినిమా రివ్యూ) దీనికి సీక్వెల్‌గా ‘శపథం’అనే చిత్రం ఈ నెల 8న విడుదల కావాల్సింది. రిలీజ్ డేట్‌ని కూడా గత వారమే ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కావడం లేదు. వెబ్ సిరీస్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శపథం ఆరంభం, శపథం అంతం అంటు రెండు భాగాలుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు ఆర్జీవీ. ‘వ్యూహం , శపథం ల వెనుక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తియ్యటం. కానీ కొన్ని కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1 ని ఈ రోజు(మార్చి 7) సాయంత్రం 8 గంటలకు, శపథం అంతం చాప్టర్ 2ని రేపు(మార్చి 8) సాయంత్రం 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్ అవుతాయి. శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన ఉద్దేశ్యం ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపిస్తాం’ అని ఆర్జీవీ అన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్‌ని విడుదల చేస్తున్నామని అన్నారు. -
థియేటర్లో సినిమా చూసిన ఆర్జీవీ.. లోకేష్‌ను అలా చూపించానంటూ..
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వ్యూహం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమాను రామధూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన పరిణామాల సమూహమే వ్యూహం. ఈ చిత్రం మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ ఎలా ఉంటాడో.. ఆదివారం నాడు ఆర్జీవీ, వ్యూహంలో సీఎం జగన్ పాత్రను పోషించిన అజ్మల్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ జైరామ్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా ఫస్ట్ పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు. ఎన్నికలపై వ్యూహం ప్రభావం.. హీరో అజ్మల్.. సినిమాకు మంచి స్పందన వస్తోందని సంతోషించాడు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారు. గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా మార్చి 8న శపథం రిలీజ్ చేయనున్నారు. Me and VYOOHAM’s JAGAN MOHAN REDDY on our way to Vijaywada to watch the film in Jairam theatre matinee show pic.twitter.com/jRE9BjD1fU — Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2024 చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్‌ను నింపడం ఖాయం. -
ప్రపంచవ్యాప్తంగా 'వ్యూహం' విడుదల!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా నేడు (మార్చి 2) ప్రపంవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. వ్యూహం చిత్రాన్ని వర్మ తన టీమ్‌తో చూస్తున్నట్లు కొంత సమయం క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా అమెరికాలో విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్ కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవంగా వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ నారా లోకేష్ కోర్టుకు వెళ్లి పలు అభ్యంతరాలను తెలపడంతో విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. అన్నీ అడ్డంకులను ఎదుర్కొని నేడు విడుదలైన వ్యూహం సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. లోకేష్ అడ్డుకునేంత ఇబ్బంది ఈ చిత్రంలో ఏముంది అని ఆ పార్టీకి చెందిన వారు కూడా వ్యూహం చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద సందడి వాతవారణం నెలకొని ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. పార్ట్ -2 'శపథం' మార్చి 8న విడుదల కానుంది. -
RGV Den: హైదరాబాద్‌కు అమితాబ్ బచ్చన్.. ఆర్జీవీ డెన్‌లో సందడి (ఫొటోలు)
-
ఆర్జీవీ డెన్‌లో అమితాబ్ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్‌ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్‌ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. (చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్) అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్(2005) సినిమా తెరకెక్కించి బిగ్ హిట్ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్కార్ రాజ్’ అనే సినిమా చేశారు. అదీ సూపర్ హిట్ అయింది. 2017లో సర్కార్ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్‌లో సందడి చేశారు. డెన్ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 తన కార్యాలయానికి వచ్చిన సర్కార్(అమితాబ్‌ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్‌లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. సర్కార్ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ సైతం ఆర్జీవీ డెన్‌లో ఆమితాబ్ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్‌లో షేర్ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్‌తో ‘వ్యూహం’ రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్ కోసమే అమితాబ్ హైదరాబాద్ వచ్చారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం కల్కీ 2898 సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది. SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్) తాజాగా 'వ్యూహం' సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే 'వ్యూహం' రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో 'వ్యూహం' సినిమా థియేటర్లలోకి రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. దీనికి 'శపథం' అని సీక్వెల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd 💪 pic.twitter.com/DoGK95a4PB — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
25 ఇస్తే పావలాకి పావలా సీట్లు అంటారు.. ఆర్జీవీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు వెల్లడించాడు. పవన్‌పై విమర్శలు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన లేకుంటే టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించినట్లేనని విమర్శింస్తున్నారు. పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ..గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ..ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితం అయిందంటే.. చంద్రబాబు ట్రాప్‌లో పవన్ పడ్డాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ నేతలు సైతం జనసేన అధినేతపై సైటైర్లు వేస్తున్నారు. ‘24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా?’, కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నాడు. అతన్ని చూస్తే జాలేస్తోందంటూ’ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ఎద్దేశా చేశాడు. అందుకే 24 సీట్లు.. ఆర్జీవీ సెటైర్లు జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. ట్రోల్ చేస్తారనే భయంతోనే 24 సీట్లు కేటాయించారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ‘23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 స్థానాలు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశాడు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 😳 — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2024 -
వ్యూహం, శపథం చిత్రాలు వాయిదా.. కారణం ఇదే
'వ్యూహం, శపథం' చిత్రాలు వాయిదా పడినట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే 'వ్యూహం' సినిమా ఫిబ్రవరి 23న విడుదల అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1న వ్యూహం.. మార్చి 8న శపథం విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి కారణం లోకేష్ కాదని వర్మ తెలిపారు. ఫిబ్రవరి 23న సుమారు 9 సినిమాలు విడుదల కానున్నడంతో 'వ్యూహం' సినిమాకు అనుకున్నన్ని థియేటర్లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన 'వ్యూహం' సినిమా లోకేష్ కారణంగా ఎన్నికల ముందు విడుదల అవుతుందని ఇప్పటికే వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. 'వ్యూహం' సినిమా విషయంలో కోర్టు, సెన్సార్ చిక్కులతో అందరిలోనూ ఆసక్తి పెంచిన వర్మ.. తాజాగా సినిమా విడుదలను మరో వారం వాయిదా వేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో వ్యూహం, శపథం చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలపై మరింత ఆసక్తిని వర్మ పెంచారని చెప్పవచ్చు. మార్చి 1న 'వ్యూహం'.. మార్చి 8న 'శపథం' విడుదల కానున్నాయి. VYOOHAM film and SHAPADHAM film are being postponed to March 1st and March 8th but this time it is NOT BECAUSE OF LOKESH ..It is due to certain technicalities , wanting to do more promotion and also because we are getting better preferred theatres on those dates 💐💐💐 వ్యూహం… — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2024 -
వాళ్లు 'వ్యూహం' తప్పకుండా చూస్తారు: ఆర్జీవీ
పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు హిట్ కావడం సహజం. అందుకు యాత్ర, యాత్ర 2 చిత్రాలే నిదర్శనం. వైఎస్సార్, వైఎస్ జగన్‌ల పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక త్వరలోనే వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం, శపథం చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వ్యూహం ఫిబ్రవరి 23న విడుదల అవుతుండగా, దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'శపథం' మార్చి 1న విడుదల కానుంది. ‘వ్యూహం’, ‘శపథం’ ల కథేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా ఎవరు వ్యూహం రచించారు..? సీఎం అయ్యే క్రమంలో వైఎస్ జగన్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు..? ఈ పొలిటికల్ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారు..? చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? ఇలా అనేక సందేహాలకు ఈ చిత్రాలలో చూపించనున్నారు. పార్ట్ -2 'శపథం'లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కుట్రలు మొదలయ్యాయి.. పవన్‌తో కలిసి చంద్రబాబు ప్లే చేసిన గేమ్స్ వంటి అంశాలతో పాటు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం వరకు శపథం ఉంటుంది. లోకేష్ ఎంత తెలివైనోడంటే: ఆర్జీవీ వ్యూహం చిత్రం ట్రైలర్‌తో టీడీపీ బ్యాచ్‌ను ఆర్జీవీ షేక్ చేశారు. దీంతో వ్యూహం సినిమాను ఆపాలని నారా లోకేష్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు సెన్సార్ బోర్డుతో పాటు కోర్డు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల తనకు మరింత కలిసొచ్చిందని లోకేష్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు వర్మ. ఆ సమయంలా వర్మ ఇలా ఆన్నాడు 'డిసెంబర్లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ లోకేష్ తన బుర్ర వాడి ఈ సినిమాను సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చేశాడు. లోకేష్ ఎంత తెలివైనోడంటే, డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజై ఉంటే ఈపాటికి కొందరు మరిచిపోయేవారు. కానీ లోకేష్ సరైన వ్యూహం పన్ని ఎలక్షన్ల టైమ్‌లో వ్యూహం రిలీజ్ అయ్యేలా చేశాడు. అది లోకేష్ తెలివి. అందుకే లోకేష్‌కు ముద్దు ఇచ్చాను.' అని ఆయన చెప్పాడు. చంద్రబాబు సెంటిమెంట్ నంబర్ 23తో వ్యూహాం లింక్ చంద్రబాబుకు, 23 నంబర్‌తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నంబర్ లింక్ గురించి తెలుసు. ఇప్పుడీ సెంటిమెంట్‌తో వ్యూహం విడుదలకు లింక్ ఉంది. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాను నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అది కాస్తా మార్చి 23వ తేదీన విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా, మరోసారి చంద్రబాబు చుట్టూ అల్లుకున్న '23 సెంటిమెంట్'ను నెటిజన్లు బయటకు తీశారు.. ఈ విషయంలో ఆర్జీవీ కూడా ఒక ట్వీటేశారు. గతంలో వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న 23 ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి, ఎన్నికల్లో బాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చిన అంశం వరకు, చివరికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయిన తేదీని కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ర్యాగింగ్‌కు దిగాడు ఆర్జీవీ. వాళ్లు వ్యూహం తప్పకుండా వ్యూహం చూస్తారు వ్యూహం సినిమాను టీడీపీ-జనసేన జనాలు ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల బాత్రూమ్స్లలో చూసుకుంటారనేది తన ఉద్దేశం అంటూ చెప్పాడు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు మాత్రం ఆ అవసరం ఉండదన్నాడు. వాళ్లు హ్యాపీగా థియేటర్లకు వచ్చి చూడడం లేదా తమ ఇంట్లో లివింగ్ రూమ్‌లో అందరితో కలిసి చూస్తారని తెలిపాడు. -
వాళ్ల బాత్రూమ్ల్లో చూస్కుంటారు!: RGV
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్ థ్రిల్లర్లుగా వ్యూహం, శపథం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు రెడీ అయ్యారు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో రాజకీయ పరమైన ప్రశ్నలు.. అలాగే సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు.. విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తాజాగా వాటికి ఓ వీడియోతో ఆయన సమాధానం ఇచ్చారు. బాక్సింగ్ రింగ్‌లో ఎంటర్ అయితే గట్టిగా గుద్దాలి. అంతేగానీ జుట్టు పీకుతా.. చెంప గిల్లుతా అనే ఆటిట్యూడ్‌తో ఉండకూడదు. అది నా ఫిలాసఫీ. వ్యూహం, శపథం సినిమాలతో నిజాన్ని బట్టలిప్పి చూపించడం అనేదే నా ఉద్దేశం కూడా. ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా.. టీడీపీ, జనసేవాళ్లు చూస్తారా? అని కొందరు అడుగుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెబుతా.. సికింద్రాబాద్‌లో లంబా థియేటర్ అనేది ఉండేది. అందులో సెక్స్ సినిమాలు ఆడేవి. సెక్స్ అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది భయం భయంతో ఆ థియేటర్‌కు వెళ్లేవాళ్లు కాదు. కానీ, నా దృష్టిలో లంబా థియేటర్ చేసింది ప్రజాసేవ. నేను పోర్న్ చూసినట్లే.. ఎవ్వరికీ తెలియకుండా టీడీపీ, జనసేన వాళ్లు బాత్రూమ్లలో కూర్చుని వ్యూహం, శపథం సినిమాలు చూస్తారు. న్యూట్రల్ వాళ్లు మాత్రం లివింగ్ రూంలో హాయిగా సినిమాలు చూసేయండి. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది.. చూస్తే చూడండి లేకుంటే లేదు అంటూ తనదైన స్టైల్లో ముగింపును ఇచ్చారాయన. My personal philosophy on @ncbn , @naralokesh @ysjagan and VYOOHAM pic.twitter.com/2NAm6f6TPr — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 అంతకు ముందు.. సీఎం జగన్ రాప్తాడు సిద్దం సభ వీడియోను పోస్ట్ చేసిన వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎండిపోయిన రాయలసీమలో.. సీఎం జగన్ సమావేశం కోసం జన సముద్రం కదిలి వచ్చిందని.. దేశంలోనే ఇప్పటివరకు ఇలాంటి జనసమీకరణ జరిగి ఉండకపోవచ్చంటూ ట్వీట్ చేశారాయన. అదే సమయంలో.. సీఎం జగన్ పంచులను.. డైలాగ్ అంటే ఇది రా అంటూ వర్మ పోస్ట్ చేశారు. ఇక ఈ ఉదయం నుంచి టీడీపీకి.. మరోవైపు జనసేనకు ట్వీట్ల రూపంలో కౌంటర్లు వేస్తూ వస్తున్నారాయన. pic.twitter.com/o3EMhMJ57S — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 🤣🤣🤣🤣 pic.twitter.com/KoKIW1DA5c — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 ఈ లెక్కన CBN సభలకి పది మందే వచ్చినట్టా?????????😳😳😳 pic.twitter.com/LrGahAZMj3 — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 Dialogue ante idhi ra ! 👏👏👏🙌🙌🙌😘😘😘😘💐💐💐💃💃💃😍😍😍🔥🔥🔥🙏🙏🙏💪💪💪 ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్‌ను బయట పడేయండి తాగేసిన టీ గ్లాస్ సింక్‌లో పడేయండి - సీఎం వైఎస్ జగన్ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 -
వ్యూహంలో పవన్ రోల్ ఎలా ఉంటుంది..ఆ సీన్ లో బత్తాయి పండు ఎందుకు పెట్టారు ?
-
లోకేష్ కి ముద్దిచ్చిన అర్జీవి
-
షర్మిలపై RGV ఆసక్తికర వ్యాఖ్యలు
-
'మా సినిమాలకు బలం అతనే.. థ్యాంక్స్'.. ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తోన్న తాజా చిత్రం వ్యూహం. ఇప్పటికే ఈ మూవీ విడుదల ఆలస్యం కాగా.. ఈనెల 23న ప్రేక్షకులను ముందుకొస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్ట్-2 వస్తోన్న శపథం సినిమా కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని "వ్యూహం", "శపథం" చిత్రాలను తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పటికే వ్యూహం టీజర్ రిలీజ్ కాగా.. మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. డబుల్ డోస్ ట్రైలర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే రెండు సినిమాలకు సంబంధించి ఓకే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. శపథం(పార్ట్-2) మూవీ మార్చి 1న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ లోకేష్ కోర్టుకు మా సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందు మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేసింది నారా లోకేషే. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. డిసెంబర్లో రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి జనం మర్చిపోయేవారు. నేను ముందు నుంచీ చెబుతున్నా.. ఎవరైనా ఏ సినిమానైనా శాశ్వతంగా సినిమా రిలీజ్ కాకుండా ఆపలేరని. వారం రోజుల తేడాతో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందేం ఉండదు. నచ్చితే జనాలు చూస్తారు. లేదంటే రెండూ చూడరు.' సెన్సార్ బోర్డ్ గురించి మాట్లాడుతూ..'సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకున్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం. ఈ సినిమాలు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను చెప్పలేను. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఫిలిం మేకర్‌కు వాస్తవ ఘటనలను తన కోణంలో తెరకెక్కించే స్వేచ్ఛ ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్స్‌లో పేర్కొంది. వైఎస్ మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను. అన్నారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడని అనుకుంటున్నాం. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. రెండు సినిమాలు గ్యారెంటీగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలు మొదలుపెట్టినప్పుడే రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయని తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్నా..లోకేష్ పార్టీ కార్యక్రమాలు అన్నీ వదిలి మా సినిమాలు రిలీజ్ కాకుండా కోర్టులకు, సెన్సార్ ఆఫీసులకు తిరిగారు. రోడ్లపై ధర్నాలు చేయించాడు. ఆయన అంత పోరాటం చేశాడంటేనే మా సినిమాల్లో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాకు రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ధర్మం గెలిచిందని మేము భావిస్తున్నాం'. అన్నారు. Hey @LokeshNara , @ncbn and @pawankalyan .. Here is DOUBLE DOSE trailer of VYOOHAM / SHAPADHAMhttps://t.co/ocK7GD0Df3 — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2024 -
'వ్యూహం' సినిమాపై తీర్పు రేపటికి వాయిదా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం మరోసారి జరిగింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది. ఈ చిత్ర విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్) వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. విడుదల విషయంలో జాప్యం జరిగితే భారీ నష్టం వస్తుందని 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే విచారణ జరుగుతోంది. 'వ్యూహం' సినిమాని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. (ఇదీ చదవండి: 'యాత్ర-2' నుంచి మరో సాంగ్ విడుదల) -
ఆర్జీవీ ఫేవరేట్ భామ.. మరో క్రేజీ వీడియో షేర్ చేసిన డైరెక్టర్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వ్యూహం. ఈ చిత్రంలో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించగా.. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల మరింత ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఆర్జీవీ ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు. ఆ అమ్మాయి చేతుల్లో కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత తన గురించి వివరాలు తెలిస్తే చెప్పండంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆ అమ్మాయితో ఏకంగా సినిమాను కూడా ప్రకటించి షాకిచ్చారు ఆర్జీవీ. తాజాగా ఆ అమ్మాయి చేసిన మరో వీడియోను ట్విటర్లో పంచుకున్నారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోతో అభిమానులకు ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు ఆర్జీవీ. ఆమె సంగీతం వింటోందా? లేదా సంగీతమే ఆమె నుంచి వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) Can somebody tell me if she’s listening to the music ???? , or is the music coming out of her ???? pic.twitter.com/zNxR7HaBMh — Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2024 -
'వ్యూహం' చిత్రం విడుదలపై రేపు విచారణ
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు చేపడతామని కోర్టు తెలిపింది. వ్యూహం చిత్రం విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపిన విషయం తెలిసిందే. విడుదల విషయంలో జాప్యం జరిగితే భారీ నష్టం వస్తుందని వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలువరించింది. -
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలోని పాటను లాంచ్ చేసారు RGV
-
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ కాలేదు. ఈ మూవీపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు(జనవరి 22న) సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు పంపించింది. మూడు వారాల్లో సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 8న సెన్సార్ బోర్డ్.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. అన్నింటిపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. -
వ్యూహం: కోర్టు చేతికి సెన్సార్ సర్టిఫికెట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! తాజాగా వ్యూహం చిత్రంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ వివరాలు పరిశీలించిన అనంతరం మరోసారి విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
ఆడిషన్‌కు వెళ్తే ఆర్జీవీ బెంచ్ మీద కూర్చోబెట్టి..: పంకజ్
కొన్నిసార్లు నిరాశ, ఓటములు కూడా మంచే చేస్తాయంటున్నాడు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి. ఓసారి రామ్‌గోపాల్ వర్మ సినిమా ఆడిషన్‌కు వెళ్తే తనను సెలక్ట్ చేయలేదని, కానీ తర్వాత మాత్రం వేరే చోట్ల ఆఫర్స్ రావడంతో కెరీర్లో ముందుకు వెళ్లానని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. 'ముంబైలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అవకాశాల కోసం తిరిగాను. అలా ఓసారి రామ్‌గోపాల్ వర్మ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికే చాలామంది ఉన్నారు. వాళ్లంతా గూండాల్లా కనిపించారు. నా ముఖమేమో చూడటానికి కాస్త అమాయకంగా కనిపిస్తుంది. అందరూ భయంకరంగా.. మరి గూండా పాత్రకు నేను సూటవుతానా? లేదా? అన్న అనుమానంతోనే లోపలకు వెళ్లాను. కొందరికైతే ముక్కు, ముఖం మీద దెబ్బ తాకినట్లుగా గాయాలు కనిపించాయి. మీరు నటులేనా? అని అడిగితే అవునన్నారు. మరి ఎందుకింత భయంకరంగా రెడీ అయి వచ్చారని ప్రశ్నిస్తే.. ఆర్జీవీ ఖతర్నాక్‌గా కనిపించేవాళ్లనే సెలక్ట్ చేసుకుంటాడని చెప్పారు. తర్వాత వర్మ నన్ను పిలిచి బెంచీ మీద కూర్చోమన్నాడు. నా ఎదురుగా కూర్చుని 10-15 నిమిషాలపాటు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. ఎవరైనా మనల్ని అదేపనిగా చూస్తే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతా మన మంచికే! కాసేపటికే అతడు నన్ను వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత మళ్లీ ఎప్పుడూ పిలవలేదు. కానీ అతడు అద్భుతమైన దర్శకుడు. మేము కలుసుకున్న ప్రతిసారి నా పనిని, నన్ను పొగుడుతూ ఉంటాడు. కాకపోతే ఆ సమయానికి మాకు సెట్ అవ్వలేదంతే! ఒకవేళ ఆరోజు ఆయన నన్ను సెలక్ట్ చేసి ఉంటే తను, నేను ఈ క్రేజ్ కోల్పోయేవాళ్లమేమో! ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. దేనికీ బాధపడకూడదు. ఏదో మంచి జరగబోతుందన్న ఆశతో బతికేయాలి' అని చెప్పుకొచ్చాడు. నాటకాల నుంచి సినిమాలకు.. కాగా పంకజ్ త్రిపాఠి.. స్కూల్లో నాటకాలు వేసేవాడు. అది కూడా అమ్మాయిల వేషాలు ఎక్కువగా వేసేవాడు. ఐటం సాంగ్స్‌కు డ్యాన్స్ చేసేవాడు. సరాదా కోసం వేసిన నటనే తర్వాత ఆయనకు జీవితంగా మారిపోయింది. బరేలీ కీ బర్ఫీ, న్యూటన్, స్త్రీ, గుంజన్ సక్సేనా వంటి పలు సినిమాల్లో నటించిన ఆయన మంచు విష్ణు 'దూసుకెళ్తా' మూవీలో విలన్‌గా నటించి తెలుగువారికీ దగ్గరయ్యాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్‌లతో మరింత క్రేజ్ తెచ్చుకుని బిజీ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అతడు 'మై అటల్ హూన్' సినిమా చేస్తున్నాడు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 19న విడుదల కానుంది. చదవండి: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్ -
వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం రిలీజ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సినిమాపై సింగిల్బెంచ్లోనే తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8వ తేదీనే పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా.. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని.. ఏపీ రాజకీయాలను ప్రభావం చేసేలా సినిమా ఉందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈ నెల 11వ తేదీ సినిమా రిలీజ్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్, నాయకుడు పి.రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మూవీని ఆపేందుకు ఎంతోమంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెచ్చినవారికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఆర్జీవీ- పరాన్నజీవి పేరుతో ఓ ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించాడు. 'కొలికపూడి నన్ను చంపించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. యాంకర్ సాంబశివరావు అతడికి తెలివిగా సాయం చేశాడు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడు' అని ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్లో కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు యాంకర్ సాంబశివరావు, సదరు ఛానెల్ యజమాని బిఆర్ నాయుడు పై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. చివరకు అన్నంత పని చేశాడు వర్మ. నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం విజయవాడలోని డీజీపీ ఆఫీసుకు వెళ్లాడు. కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. Am reaching the office of DIRECTOR GENERAL of POLICE in VIJAYWADA by 3.30 pm TODAY to file a complaint against Kolikapudi Sreenivas Rao, Tv 5 anchor Sambashiva Rao and the channel owner B R Naidu ..Will disclose the contents of my complaint to all media immediately after that pic.twitter.com/GjfyX5Uz7h — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023 Hey @ncbn ,@naralokesh and @PawanKalyan ..Can the fact that you are not condemning this guy be taken as you endorsing him ? https://t.co/ai581FJ9Em — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023 TDP party and its head @ncbn ‘s representatives are publically on supportive tv channels like TV 5 offering monetary contracts to CUT PEOPLE’S HEADS OFF PMO … If he is not condemned and kicked out publically by them CONTRACT KILLINGS will be recognised as official policy of TDP pic.twitter.com/3HoNizU2Yh — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2023 Dear @APPOLICE100 ,this kolikapudi Sreenivasrao gave contract of Rs 1crore to kill me and he was cleverly aided by anchor called Samba of TV 5 channel who together facilitated him to repeat the contract killing on me 3 times ..Please treat this as my official complaint pic.twitter.com/Aixp5n5vpd — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2023 చదవండి: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్‌పై క్లారిటీ! -
HYD: ఆర్జీవీ ఆఫీస్ వద్ద టీడీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్‌లోని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వ్యూహం సినిమాపై పచ్చ నేతలు కడుపు మంట చూపించారు. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టారు. చివరికి పోలీసులు కల్పించుకొని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. టీడీపీ కార్యకర్తల వీరంగంపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని తెలిపారు. సినిమాను సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం భావ్యం కాదని తెలిపారు. వ్యూహం సినిమా రిలీజ్ చేయకుండా ఉండటానికి టీడీపీ పన్నాగాలు చేస్తుందన్నారు. టీడీపీ కార్యకర్తలు రౌడీయిజం చేయడం, దాడులు చేయడం సరికాదని అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబు కుర్చీలాట.. పావుగా పవన్ కల్యాణ్! -
రామ్ గోపాల్ వర్మ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఉమా..గిమా..వాడెవడు...దేవినేని ఉమాపై RGV సెటైర్లు
-
హరిరామ జోగయ్య లేఖపై RGV సంచలన కామెంట్స్
-
వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు (ఫొటోలు)
-
ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం.. ఆర్జీవీ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ కాగా.. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈనెల 23న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. ఇదే హృదయపూర్వక ఆహ్వానం అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. VYOOHAM pre release event is tmrw the 23rd at 5 pm in Vijaywada at Indira Gandhi muncipal stadium My heartfelt invitation to sri @ncbn , @naralokesh and @PawanKalyan to grace the occasion 🙏🙏🙏 pic.twitter.com/jabNUkU4HE — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!
సంచలన డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె కేరళకు చెందిన అమ్మాయిగా తెలిసింది. ఆర్జీవీ ఆ యువతి రీల్ షేర్ చేయడంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని తెలిసింది. ఆ తర్వాత ఆర్జీవీ తనను పొగిడారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది కూడా. అయితే తాజాగా ఆర్జీవీ ఏకంగా ఆ యువతితో సినిమా తీసేందుకు రెడీ అయిపోయారు. ఆమెతో శారీ అనే సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులంతా మొత్తానికి మన ఆర్జీవీ అనుకున్నంత పని చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో వైరల్ అయిన యువతిని.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారానే శ్రీలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫిక్సయినట్లే. ఆర్జీవీ డెన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అఘోశ్ వైష్ణవం దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. కాగా.. ప్రస్తుతం రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Aghosh D Prasad (@aghoshvyshnavam_avm) -
వ్యూహం... నేను నమ్మిన రియాలిటీ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్‌గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది. వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్‌లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్. ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్‌గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్‌గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం. అసలు.. జనసేనలో పవన్‌కల్యాణ్ టీడీపీ కోవర్ట్‌గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్‌గోపాల్ వర్మ -
'వ్యూహం' రెండో ట్రైలర్ పీక్స్.. రసగుల్లా కంటే చంద్రబాబే ఇష్టం: వర్మ
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో ఉన్నది ఉన్నట్లు చూపించేదే వ్యూహం సినిమా అని ఆర్జీవీ తెలిపారు. నవంబరు 10న విడుదల కావాల్సిన ఈ సినిమాపై నారా లోకేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఆ సమయంలో బ్రేక్ పడింది. తర్వాత సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి మళ్లీ సినిమాను పంపించడం ఆపై రామ్ గోపాల్ వర్మకు అనుకూలంగా సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం వంటివి జరగడంతో.. డిసెంబర్ 29న వ్యూహం సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో వ్యూహం సినిమా నుంచి మరో ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. మొదటి ట్రైలర్ మాదిరే రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈ క్రమంలో ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా వ్యాఖ్యానించారు. 'అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ వ్యూహం సినిమాను ఆపలేరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎలాంటి మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారని నన్ను అడగొద్దు. మళ్లీ చెబుతున్న ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది..? అనేది ఈ వ్యూహం చిత్రంలో చూపించాము. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము. గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో.. అది మాత్రమే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల ఇంట్లో పర్సనల్‌గా చర్చించే విషయాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ మాత్రమే.. నేను ఏమీ చూపించానో అనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారు. వ్యూహం సినిమా ఒక పొలికల్ డ్రామా... వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. రసగుల్లా కంటే కూడా చంద్రబాబు అంటేనే నాకు ఇష్టం.' అని ఆర్జీవీ అన్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు
రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్‌లో సందేశం ఉంచారాయన. BAD NEWS for BAD GUYS 💪 VYUHAM censor CERTIFICATE 🙌 DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s — Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023 వర్మ డైరెక్షన్లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్‌ను స్వీకరించారాయన. ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ -
మనలో ఎలాంటి జంతువులు ఉన్నాయో కనిపిస్తోంది: ఆర్జీవీ ట్వీట్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో డైరెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో చేరిన యానిమల్ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం సందీప్‌ను కొనియాడారు. యానిమల్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ ప్రశంసించారు. అయితే మరోసారి ఆర్జీవీ యానిమల్ చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. సినీ ప్రేక్షకులు, ప్రజలు, సినీ విమర్శకులను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. యానిమల్ చిత్రం నుంచి గ్రహించాల్సిన ఐదు ప్రధాన విషయాలివే అంటూ వరుస ట్వీట్లు చేశారు. సినీ ప్రేక్షకుల కోసం.. 1. ఈ రోజు నుంచి ఇంతకు ముందు అనుకున్న విధంగా భారతీయ చలనచిత్రాలు ఒకేలా ఉండవు. 2. సినిమాలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఎవరికీ తెలియదు. 3. మంచి, చెడు, నైతికత, విశ్వసనీయత, ఇతర కుటుంబ, సామాజిక విలువలను యానిమల్ అనే ఫిల్ స్కూల్లో నేర్చుకోవాలి. 4. అన్ని ఫిల్మ్ స్కూల్స్ సిలబస్‌లను తక్షణమే రద్దు చేయాలి. భవిష్యత్ విద్యార్థులందరికీ యానిమల్‌లా సినిమా చేయడం ఎలా? అనేది నేర్పించాలి. ఎవరైనా సినిమా చెత్తగా ఉందని చెప్పినా సినీ నిర్మాతలందరూ ఎవరి మాట వినకూడదు. మీలోని యానిమల్(టాలెంట్)ను బయటకు తీసుకురావాలి. 5. యానిమల్ చూశాక ప్రేక్షకులు ఇకపై చిన్నపిల్లల చిత్రాలను చూడరని ఫిల్మ్ మేకర్స్ గ్రహించాలి. సినీ విమర్శల కోసం.. 1. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన సినిమాకు అత్యంత అధ్వాన్నంగా రివ్యూలు ఇవ్వడం.. సినీ విమర్శకులకు, సినిమా బాక్సాఫీస్‌కు తేడా లేదని రుజువైంది. 2. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారో నిజంగా సినీ క్రిటిక్స్‌కు తెలియదు 3. అత్యధిక ప్రేక్షకులు వీక్షించడంతో మొదటిసారి ఫిల్మ్ మేకర్ కంటే విమర్శకులు అప్సెట్ అయ్యారు. 4. విమర్శకులు తమ ప్రమాణాలను మెరుగు పరచుకోవడానికి పదే పదే యానిమల్ చూడాల్సిందే. 5. ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సులు నిర్వహించాలని సినీ విమర్శకులందరూ చేతులెత్తి సందీప్‌ను అభ్యర్థించాలి భారత ప్రజల కోసం.. 1. భారతీయులంత ఓకేలా ఉండరు. మరీ మునుపటి భారతీయులు ఏమనుకుంటున్నారో? 2. సినిమాలు ఒక కళారూపమని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని విశ్వసిస్తే.. అంతకుముందు కళగా పిలవబడే దాన్నే యానిమల్ చిత్రం నాశనం చేసింది. 3. మనలో ఎలాంటి జంతువులు దాగి ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఇండియన్‌కు మరొకరిలో కనిపిస్తోంది. 4. ఇప్పుడు ఇండియన్స్ దర్శకుడిని గౌరవిస్తారని మెగా బాక్సాఫీస్ నిరూపించింది. 5. ప్రస్తుతం భారతీయులందరూ ఎదిగారని అందరూ గ్రహించారు. అంతే కాకుండా ఇప్పటి నుంచి ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా(ఎరా) విభజించాలని ట్వీట్లో ప్రస్తావించారు. డిసెంబర్ 1, 2023 కంటే ముందు.. డిసెంబర్ 1 తర్వాత అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 5 TAKE AWAYS for the CINEMA CRITICIS of INDIA from ANIMAL film 1. The WORST reviewed film becoming thd MOST watched film of INDIA proves that CRITICS make zero difference to a film’s BOX OFFICE 2. CRITICS don’t know Jack shit about why the audience will like in a film 3.… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 Now after the advent of ANIMAL, like B C and A D , the Entire Indian film industry can now be divided into 2 eras namely pre 1.12.2023 and post 1.12.2023 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 5 TAKE AWAYS for the CINEMA PEOPLE of INDIA from ANIMAL film 1. Indian Films can no longer be the same since Dec 10th 2023 , the way what one used to think earlier 2. Nobody knows a Jack shit about what the audience will like in a film 3. Good , bad , morality ,fidelity and… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 5 TAKE AWAYS for the PEOPLE of INDIA from ANIMAL film 1. Indians are not the same Indians , what the earlier Indians used to think 2. If films are believed to be an art form and reflect culture , ANIMAL has redefined culture and destroyed what was earlier called art 3. Every… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 -
'నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే'.. సందీప్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!
టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చూసిన సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. యానిమల్ మూవీతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడంటూ ఏకంగా తన రివ్యూను వెల్లడించారు. అయితే తాజాగా తన మూవీ యానిమల్కు రాం గోపాల్ వర్మ రివ్యూ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి తన ట్వీట్లో రాస్తూ... 'రామ్ గోపాల్ వర్మ చేసినంతలా మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి సేవలు అందించలేదని నేను నమ్ముతున్నా. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే. మీ నుంచి నా ఫిల్మ్ యానిమల్ రివ్యూ రావడం సంతోషంగా ఉంది. తనదైన శైలిలో వ్రాసిన రెండు విషయాలు మినహాయించి ఆర్జీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు' తెలిపారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. I believe no other director had contibuted to Indian cinema more than Mr Ram Gopal Varma did.... Film Animal review from my all time favorite director. Excluding couple of things written in his own style really grateful for all the ❤️ @RGVzoomin🙏🙏 🙏 https://t.co/wgRPEkxxMJ — Sandeep Reddy Vanga (@imvangasandeep) December 5, 2023 -
'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. 'యానిమల్' సినిమా నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే చిత్రాన్ని, డైరెక్టర్ సందీప్‌ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి క్రేజీ కామెంట్స్ చేశాడు. అయితే ఈసారి దర్శకుడిని మెచ్చుకుంటూనే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులపై కౌంటర్ వేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్'గా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఈ డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం వందల కోట్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆర్జీవీ.. సందీప్ గురించి క్రేజీ ట్వీట్ చేశాడు. 'సందీప్ రెడ్డి వంగా.. నిజ జీవితంలో ఫిజియోథెరపీ డాక్టర్. అయితే 'యానిమల్' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి మెంటల్ థెరపీ చేశాడు. ప్రేక్షకులకు హిప్నోథెరపీ చేశాడు' అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అయితే వర్మ.. ఈ ట్వీట్లో సందీప్‌ని మెచ్చుకుంటూనే ఇండస్ట్రీ, ప్రేక్షకులపై సెటైర్స్ వేయడం విశేషం. (ఇదీ చదవండి: నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!) . @imvangasandeep a qualified doctor in PHYSIOTHERAPY is now using ANIMAL to do MENTAL THERAPY to film industry and HYPNOTHERAPY to the audience — Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2023 -
వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు.. ఆర్జీవీ రివ్యూ వైరల్
ఇటీవల థియేటర్లలో రిలీజైన చిత్రం యానిమల్. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 1న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ సంచలన డైరెక్టర్ తన రివ్యూను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్లా. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా ఏ సినిమానీ చూడలేను. కానీ ఈ సినిమాని వేరు వేరు కోణాల్లో చూడాలని డిసైడ్ అయ్యా. నైన్ అండ్ హాఫ్ వీక్స్ , ఫ్యాటల్ అట్రాక్షన్ లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా? నచ్చలేదా। అన్నంత సింపుల్‌గా ఉండకూడదు. సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గుమెంట్ చేసుకునేలా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి. అదే సందేశాన్ని సందీప్ వంగ , యానిమల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు అంతే కాకుండా ఈ సినిమా హిపోక్రసీ.. పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపంతో చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుందని నా ప్రగఢ నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంట్. నాకు ఆ సినిమా కథ కానీ ,తండ్రి కొడుకుల బంధం కానీ ఏమంతా ఎక్కలేదు కానీ.. పాత కథా వస్తువుల్ని బేస్‌గా చేసుకుంటూ సందీప్ మునుపెన్నడూ చూడని విధంగా సీన్లని అద్భుతంగా చూపించారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా కరెంట్ షాకిచ్చాడు సందీప్. వాళ్లు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేశాడు. 'అని అన్నారు. సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ చాలా సార్లు షాక్ అవుతాం. నా ఉద్దేశ్యం ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే. హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని వస్తాడేమోనని.. ప్రేక్షకులందరూ ఊహించే టైంలో మెషీన్గన్తో రావటం థియేటర్లో మా అందరినీ కుర్చీలోనుంచి కింద పడినంత పనైంది. “హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్" అని రణ్‌బీర్ సింపుల్‌గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. "ఇక మీ మీద ఈగ వాలినా సరే వాళ్లని తగలబెట్టేస్తాను" అనే డైలాగ్ చెప్పినప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శైలి ఆ పాత్రను ఎలివేట్ చేయడానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చూపించి ఐసింగ్ పెట్టినట్టనిపించింది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్‌లో వాడిన అర్జున్ వెల్లి పాట , మైకేల్ జాక్సన్ "బీట్ ఇట్" మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది. ట్రెడిషనల్ సినిమా రూల్స్‌ని కడుపులో గుద్దుతూ, తన కాళ్లతో తన్నినందుకు సందీప్‌ను జీర్ణించుకోలేక , కడుపు నొప్పితో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు. ఇక్కడ ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ , ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలి. ఇందులో విలన్ బాబీ పరిచయం సినిమా చరిత్రలోనే అత్యంత ఒరిజినల్‌గా ఉంది .. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్‌లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పటానికి హీరో తన ఫామిలీ, స్టాఫ్ ముందు నగ్నంగా నడిచే సీన్ నెవర్ బిఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్ అనేలా ఉంది. విజయ్ పాత్రకి సంభందించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం.. అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం .. అది కూడా ఎందుకంటే ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్లో అది పెరుగుతూ రావడమే. నిరోధ్ వాడావా? అని హీరోని రష్మిక అడిగే సీన్. అది రాసిన తీరు అద్భుతం. రష్మీక నటనకి నేను క్లీన్ బౌల్డ్ అయ్యా అని అన్నారు. ట్రైలర్ చూసినప్పటి నుంచి రణ్‌బీర్ ఏమైనా కొంచెం ఓవర్‌గా వెళ్తున్నాడా అన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్‌గా, ప్రేక్షకుడి గా, మొదటిసారి హీరో నటన.. సందీప్ రాసిన క్యారెక్టర్‌ను మోస్తోందా? లేదా సందీప్ క్రియేట్ చేసినా క్యారెక్టర్ రణ్‌బీర్ నటనని మోస్తోందా? అన్న కన్ఫ్యూజన్లో పడేసింది. రణ్‌బీర్ నటన 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకు ఏ యాక్టర్ చూపించలేకపోయాడు. ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రణ్‌బీర్ లియోనార్డో డి కాప్రియోని కూడా మించిపోయాడు. హేయ్ సందీప్ దయచేసి నీ కాళ్ల ఫోటో నాకు వాట్సాప్‌లో పంపిస్తే మొక్కుకుంటా.' అంటూ పోస్ట్ చేశారు. “యానిమల్ " సినిమా గురించి నా రివ్యూ - రామ్ గోపాల్ వర్మ https://t.co/QlP7onjEQY — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 -
కాబోయే సీఎంకు అభినందనలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్
తెలంగాణ ఎన్నికలపై సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ గెలవడంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అభినందనలు తెలిపారు. రేవంత్ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ పోస్ట్ చేశారు. నవంబర్ 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. Hi @RahulGandhi ji , and #SoniaGandhi ji , For 1st time in many years I regained a tremendous respect for CONGRESS party 🙏🙏🙏because @revanth_anumula is going to be the Honourable C M of telangana 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 Since Congress lost in all other states , TELANGANA is a REVANTH REDDY win and not at all a congress win .. @RahulGandhi and #SoniaGandhi should thank their stars that they luckily got a BAHUBALI in @revanth_anumula — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 SUPER DUPER proud to know the present HONOURABLE CHIEF MINISTER of TELANGANA the WARRIOR KING REVANTH REDDY ..Hey @revanth_anumula Take 10000000000000000000000 BOWS🙏 pic.twitter.com/bQDVFdUjSP — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 -
RGV: ఆర్జీవీ వ్యూహం.. రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను తన ట్విటర్లో పంచుకున్నారు. ఈ సినిమాపై గతంలోనే ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్రముఖ నాయకుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవే వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటామని వెల్లడించారు. pic.twitter.com/WTUeAA7Fmk — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2023 -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్.