RBI
-
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.సిబిల్ స్కోర్ అప్డేషన్లో మార్పులుఆర్బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.తనిఖీ చేస్తే సమాచారంబ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.ఉచిత క్రెడిట్ రిపోర్టులునిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా లింక్‌ను డిస్ప్లే చేయాలి.నోడల్ అధికారి నియామకంఏదైనా బ్యాంక్ కస్టమర్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
మార్గదర్శి, రామోజీది 45 ఏళ్ల నయవంచన
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.రామోజీ అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.ఇష్టారాజ్యంగా వసూళ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్‌ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్‌పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు. ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు.. ‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్‌యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్‌యూఎఫ్‌ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది. ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్‌యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు. లూథ్రాను మందలించిన ధర్మాసనం ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. నాకు డబ్బులు చెల్లించలేదు... అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.బాధ్యత నుంచి పారిపోలేరు రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్‌యూఎఫ్‌లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా? తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్‌లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ -
గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
గోల్డ్ లోన్లు (Gold Loans) పొందడం రానున్న రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతవకలను అరికట్టడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేయనుంది.బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల కాలంలో అసాధరణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుండి బంగారు రుణాలు 50% పెరుగుదలను చూశాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనైతిక పద్ధతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు ఆర్బీఐ ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.కీలక ఆందోళనలు.. ప్రతిపాదిత మార్పులుగత 12 నుంచి 16 నెలలుగా ఆర్బీఐ నిర్వహించిన ఆడిట్లలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. వాటిలో కొన్ని..సరిపోని నేపథ్య తనిఖీలు: తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో, రుణగ్రహీతలపై క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల లోపాలు కనిపించాయి.వాల్యుయేషన్ సమస్యలు: రుణగ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన సంఘటనలు, వాల్యుయేషన్ పద్ధతుల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.అనైతిక పద్ధతులు: కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణగ్రహీతలకు తెలియజేయకుండా, పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశాయి.ఔట్ సోర్సింగ్ ప్రమాదాలు: ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, రుణదాతలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం.పరిశీలన ఎందుకు?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారత్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడం, అన్ సెక్యూర్డ్ లెండింగ్ పై నిబంధనలను కఠినతరం చేయడంతో బంగారం రుణాలు పెరిగాయి. కుటుంబాలు సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇది రుణాలను పొందడానికి విలువైన ఆస్తిగా మారుతుంది. ఏదేమైనా, ఈ విభాగం వేగవంతమైన వృద్ధి మొత్తం రుణ వృద్ధిని అధిగమించింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని రుణ పద్ధతులు నైతికంగా, పారదర్శకంగా ఉండేలా చూడటానికి ప్రేరేపించింది.రుణగ్రహీతలు, సంస్థలపై ప్రభావంప్రతిపాదిత మార్పులు రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుస్తాయని భావిస్తున్నారు. అయితే కఠినమైన నిబంధనలు రుణాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయం, శ్రమను కూడా పెంచుతాయి. దీంతో రుణగ్రహీతలకు త్వరగా నిధులను పొందడం కష్టతరం అవుతుంది. ఇక రుణ సంస్థల విషయానికి వస్తే.. బంగారు రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ, సాంకేతికత, సమ్మతి చర్యలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తాయి. -
Latest Appointments: తాజా నియామకాలు
న్యూఢిల్లీ: వాణిజ్యయ శాఖ అదనపు సెక్రటరీగా ఉన్న అజయ్ భదూని ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్‌ఫామ్ (గవర్నమెంట్ ఈ–మార్కెట్/జెమ్) సీఈవోగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా కొత్త బాధ్యతలు చేపడతారని తెలిపింది. జెమ్ పోర్టల్‌ను ప్రభుత్వం 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం గమనార్హం. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోళ్లకు వీలుగా దీన్ని అభివృద్ధి చేసింది. 1999 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన భదూ విభిన్న రంగాల్లో విధానాల రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..ఆర్బీఐ ఈడీగా అజిత్ రత్నాకర్ముంబై: గణాంకాలు, సమాచార నిర్వహణ, ఆరి్థక సుస్థితర శాఖలో ప్రధాన సలహాదారుగా సేవలందిస్తున్న అజిత్ రత్నాకర్ జోషి ఇకపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ శాఖతోపాటు సైబర్ రిస్క్ మేనేజ్మెంట్లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన జోషీకి ఆర్బీఐ తాజాగా పదవోన్నతి కలి్పంచింది. జోషీ హైదరాబాద్‌లోని బ్యాంకింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ సభ్యులుగా సైతం పనిచేశారు.అంతేకాకుండా స్థూల ఆరి్థక గణాంకాలు, విధాన సవాళ్లకు సంబంధించిన సంకలనాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్‌లు, కమిటీలలోనూ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఐఐటీ మద్రాస్ నుంచి మానిటరీ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశారు. -
జనంలో రూ.2000 నోట్లు.. ఇంకా అన్ని ఉన్నాయా?
ముంబై: ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 98.18 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయి. ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం తెలిపింది.2023 మే 19న ఆర్బీఐ రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆనాడు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. 2025 ఫిబ్రవరి 28 నాటికి ఈ విలువ రూ.6,471 కోట్లకు వచ్చి చేరిందని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ లేదా మార్చుకునే సదుపాయం ఉంది. మొత్తం మీద దేశంలో ఇప్పటికీ కొందమంది దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇవన్నీ పూర్తిగా ఆర్బీఐకు ఎప్పుడు చేరుతాయనేది తెలియాల్సిన విషయం. -
ఆర్బీఐని సంప్రదించండి: అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్లో అనిల్ పేర్కొన్నారు.విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?ఆర్బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది. -
సన్యాసిగా మారిన వ్యక్తి ఆర్బీఐ బాండ్ల బదిలీకి బాంబే హైకోర్టు నో
ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను తమకు బదిలీ చేయాలంటూ అతడి భార్య, తల్లి వేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించడమంటే మరణంతో సమానమని, అతడి ఆస్తులకు తామే వారసులమవుతామన్న వారి వాదనలను తోసిపుచ్చింది. మనోజ్ జవెర్‌చంద్ దెధియా అతడి కుమార్తె, కుమారుడు జైన సన్యాసం స్వీకరించి, సాధువులుగా మారారు. పేర్లను సైతం మార్చుకున్నారు. అయితే, 2022 నవంబర్‌లో మనోజ్ సన్యాసం తీసుకోకమునుపు, తన పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హెచ్డీఎఫ్సీ అధికారులను సంప్రదించారని పిటిషనర్ల లాయర్ హితేశ్ సోలంకి కోర్టుకు తెలిపారు. తమ నిబంధనల ప్రకారం సన్యాసమంటే మరణంతో సమానం కాదని వారు ఆయన వినతిని తిరస్కరించారన్నారు. స్పందించిన ధర్మాసనం.. కేవలం సన్యాసం స్వీకరించిన ఫొటోలు, ఆహ్వాన పత్రికలుంటే చాలదని, అందుకు అనుగుణమైన క్రతువులు జరిపినట్లు ఆధారాలు చూపాల్సి ఉందంది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే.. మార్గదర్శి కేసులో ఆర్బీఐ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్బీఐ వాదనలు వినిపించాయి. విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.అదే సమయంలో మార్గదర్శి సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
ఆ కంపెనీల ఆదాయం పెరిగింది: ఆర్బీఐ
ముంబై: ప్రైవేట్ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్ ప్రైవేట్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో లిస్టెడ్ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ వరుసగా 50 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. -
ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!
బ్యాంక్‌లు మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ తగ్గించింది. కన్జ్యూమర్ మైక్రోఫైనాన్స్ రుణా లు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాలపై 25 శాతం తగ్గించడంతో రిస్క్ వెయిట్ 100కు దిగొచ్చింది. దీంతో ఆయా రుణాల కోసం బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సిన నిధుల పరిమాణం తగ్గుతుంది. తద్వారా బ్యాంక్‌ల లిక్విడిటీ మెరుగవుతుంది. ఆయా విభాగాలకు రుణ వితరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.2023 నవంబర్‌లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలకు రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ పెంచడం గమనార్హం. అప్పటి నుంచి వాటి రుణ వితరణ కుంటుపడింది. ఎన్‌బీఎఫ్‌సీలకు వాణిజ్య బ్యాంక్‌ల రుణాలపై రిస్క్ వెయిట్‌ను 25 శాతం పాయింట్లను పెంచింది. అదే ఏడాది వ్యక్తిగత రుణాలకు సైతం 25 శాతం మేర వెయిట్‌ను పెంచి 125 చేసింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం రుణాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కఠిన నిబంధనలతో ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంక్‌ల నుంచి రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాలకు గతంలో పెంచిన మేర వెయిటేజీని తాజా తగ్గించగా, దీన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం తక్కువేఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) ఇతర దేశాలతో పోలిస్తే ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఆధారపడటం తక్కువగానే ఉంటోంది కాబట్టి, కొన్ని రంగాలు మినహా చాలా రంగాలపై ప్రతిపాదిత టారిఫ్‌ల ప్రభావం మరీ అంతగా ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తులు, జౌళి, ఫార్మా మొదలైన ఉత్పత్తులకు టారిఫ్ రిసు్కలు ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులుతాము రేటింగ్ ఇచ్చే భారతీయ కంపెనీలు చాలా మటుకు దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని, అవి అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తక్కువేనని పేర్కొంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో అత్యధిక వ్యత్యాసాలున్న ఏపీఏసీ దేశాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. ఎల్రక్టానిక్స్, మోటర్ సైకిల్స్, ఫుడ్, టెక్స్టైల్స్ విభాగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వివాదానికి తావివ్వకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారా బేరసారాలాడుకోవడం ద్వారా ప్రభుత్వాలు టారిఫ్‌ల విషయంలో వివేకవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. -
ఉపాధిలో వ్యవసాయమే మేటి
సాక్షి, అమరావతి: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే అగ్రగామిగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక వెల్లడించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తరువాత దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడే వారి శాతం తగ్గినప్పటికీ నేటికీ అత్యధిక శాతం మందికి ఇవే ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. దేశంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ఆర్బీఐ ‘పీరియడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్)’ సర్వే నివేదిక వెల్లడించింది. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా ఐటీ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.పీఎల్ఎఫ్ నివేదికలోని ప్రధానాంశాలు..1993–94లో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 64 శాతం మంది ఆధారపడగా 2018–19 నాటికి అది 42.5 శాతానికి తగ్గింది. 2023–24 నాటికి మాత్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్న వారి సంఖ్య కొంత పెరిగి 46.2 శాతంగా నమోదైంది.అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయినప్పటికీ రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1991–92లో రైల్వే శాఖలో 16.52 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2023–24లో 11.90 లక్షలకు తగ్గింది.బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1991–92లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8.47 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ బ్యాంకుల్లో 63 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2023–24 నాటికిప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2023–24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.46 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.74 లక్షల మంది పని చేస్తున్నారు.ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలో 2020 నాటికి 11.49 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2024 డిసెంబర్లో వీరి సంఖ్య 15.34 లక్షలకు చేరుకుంది. -
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్పిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. శక్తికాంత్ దాస్.. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ2గా నియమించడానికి క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది., ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DoPT) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాతా ఉత్తర్వులు ప్రకారం ప్రధాని మోదీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ శక్తికాంత్ దాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే పికె మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుండి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు.2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు. 1980 తమిళనాడు క్యాడర్ కు ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్.. ఢిల్లీ సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం బర్మింగమ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పూర్తి చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం ‘ పెద్ద నోట్ల రద్దు’ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన ఎకానామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత..?
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో వ్యూహాత్మక మార్పులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే రోజుల్లో మరింత వడ్డీరేట్ల కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దాంతో రాబోయే రోజుల్లో మరిన్ని వడ్డీరేట్ల కోతలుండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.2025 ఫిబ్రవరి 7న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ 6.25 శాతానికి తగ్గించింది. దాదాపు ఐదేళ్లలో ఎంపీసీ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వినియోగం, పెట్టుబడుల మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణ వ్యయాన్ని తగ్గించడం ద్వారా, ఖర్చులు, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతుందని, ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఎంపీసీ భావిస్తోంది.ఇదీ చదవండి: ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు..అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కూడా ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు పలు కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్బీఐ కూడా అదేబాటలో నడవాలని భావిస్తోంది. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు చౌకగా లభిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
రుణాల ప్రీక్లోజర్ ఛార్జీలపై ఆర్బీఐ స్పందన
బ్యాంక్‌లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఈలు తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోపరేటివ్ బ్యాంక్‌లు, బేస్ లేయర్ ఎన్బీఎఫ్సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్‌లు, ఇతర ఎన్బీఎఫ్సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.రిస్క్ ఇన్వెస్టింగ్‌పై అవగాహన కల్పించాలిఅన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్క్‌ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్‌లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐ
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.ట్రెజరీ బిల్లులుట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్ వాల్యూ)కు డిస్కౌంట్‌ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారులకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. -
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్‌ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్‌తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
ఫిన్‌టెక్ కొత్త మంత్రం రూపే కార్డ్
ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులూ యూపీఐ ద్వారానే. లేదంటే పెద్ద లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటారు. మరి క్యూఆర్ కోడ్ చెల్లింపులకు బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో అయినా బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ లేకుండా రూపే క్రెడిట్ కార్డుతో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు గతేడాదే ఆర్బీఐ వీలు కల్పించింది. ఇప్పటి వరకు ఇదేమంత ప్రచారానికి నోచుకోలేదు. కానీ, ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డుల మార్కెటింగ్‌ను భుజానికెత్తుకున్నాయి. రియో, కివి, క్రెడిట్పే తదితర ఫిన్‌టెక్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయి రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తూ, వాటిపై కమీషన్ పొందుతున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థలు, వర్తకులతోనూ చేతులు కలిపి రూపే కార్డు వినియోగంపై చక్కని ఆఫర్లు ఇస్తున్నాయి. యూపీఐకి అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో రూపే క్రెడిట్‌కార్డుతో కొత్త యూజర్లకు ఫిన్‌టెక్‌లు సులభంగా చేరువ అవుతున్నాయి. చిన్న వర్తకుల వద్ద పీవోఎస్ యంత్రాలు లేకపోవడంతో క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. పీవోఎస్ లేకపోయినా రూపే కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ‘‘పీవోఎస్ మెషిన్ లేని వర్తకుల వద్ద చెల్లింపులకు వీలు కలి్పంచే ఏకైక కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్’’అని సూపర్.మనీ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాశ్ సికారియా తెలిపారు. పీవోఎస్ లేని వర్తకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో రూపే కార్డుల రూపంలో ఫిన్టెక్లకు పెద్ద మార్కెట్టే అందుబాటులోకి వచి్చనట్టయింది. కివి సంస్థ వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తోంది. నెలవారీ రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ‘‘కస్టమర్లు యూపీఐ లావాదేవీలను క్రెడిట్ కార్డ్‌తో చేయడం మొదలు పెడితే, సేవింగ్స్ ఖాతా అనుసంధానిత యూపీఐ నుంచి మారిపోతారన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇందులో సౌలభ్యంతోపాటు మెరుగైన అనుభవం లభిస్తుంది’’అని కివి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహిత్ బేడి అభిప్రాయపడ్డారు.ఆఫర్లతో గాలం.. ‘‘యూపీఐ చెల్లింపుల పరంగా సౌకర్యవంతమైన సాధనం. క్రెడిట్ కార్డులన్నవి రివార్డులు, ప్రయోజనాలకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులు అందించే ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’అని సికారియా వివరించారు. కివి జారీ చేసే వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్‌పై 40–50 రోజుల వడ్డీ రహిత (క్రెడిట్ ఫ్రీ) కాలం అమలవుతుంది. దీనికి అదనంగా వ్యయంపై రివార్డులను అందిస్తోంది. ఎయిర్‌పోర్టుల్లో యూపీఐ ఆధారిత లాంజ్ ప్రవేశాలకూ వీలు కలి్పస్తోంది. పెద్ద వర్తకులతో టైఅప్ పెట్టుకుని క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను సైతం ఫిన్‌టెక్‌లు ఆఫర్ చేస్తుండడంతో కస్టమర్లు సైతం రూపే క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మధ్యవర్తిత్వ పాత్రతో ఆదాయం.. చాలా వరకు ఫిన్‌టెక్‌లు కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితమవుతున్నాయి. ఇవి నేరుగా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని పంపిణీ, ఇతర సేవలను అందించడానికి పరిమితమవుతున్నాయి. కార్డు యాక్టివేషన్‌పై కొంత మొత్తం చార్జీ కింద, కార్డు వినియోగంపైనా ప్రయోజనాలను అందుకుంటున్నాయి. సంప్రదాయ క్రెడిట్ కార్డులపై యూజర్లు నెలవారీ 8–9 లావాదేవీలు చేస్తుంటే.. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డుపై దీనికి రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. కివి ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ అవుతున్న రూపే క్రెడిట్ కార్డుపై నెలవారీగా ఒక్కో యూజర్ సగటున 22 నుంచి 24 లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, అధిక లావాదేవీల రూపంలో ఫిన్టెక్లకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలిసారి క్రెడిట్ యూజర్లకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ రూపే క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. యూపీఐపై క్రెడిట్ లైన్ సేవలను అందిస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో సవాళ్లతో కూడిన లిక్విడిటీ పరిస్థితులను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్బీఐ రూ.43.21 లక్షల కోట్లను చొప్పించింది.2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 14 మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.30,000 కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను ప్రవాహాలు, పరిమిత ప్రభుత్వ వ్యయం, రూపాయికి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ భారీగా జోక్యం చేసుకోవడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.ఆర్బీఐ తీసుకున్న చర్యలుపెరుగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా రూ.16.38 లక్షల కోట్లను అందుబాటులో తీసుకొచ్చింది. రోజువారీ వీఆర్ఆర్ వేలం ద్వారా రూ.25.79 లక్షల కోట్లను అందించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ.60,020 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. విదేశీ కరెన్సీ కొనుగోలు-అమ్మకం ద్వారా సుమారు రూ.45,000 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది.ఇదీ చదవండి: ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!మనీ మార్కెట్ రేట్లపై ప్రభావంలిక్విడిటీ లోటు సమస్యలున్నప్పటికీ ఓవర్‌నైట్ మనీ మార్కెట్ రేట్లు ఆర్బీఐ రెపోరేటు కంటే కొంచెం అధికంగానే ఉన్నాయి. 6.6 శాతం నుంచి 6.74 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్లు, బ్యాంకుల రుణ వ్యయాలపై ఇది నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. దీన్ని పరిష్కరించాలని బ్యాంకర్లు ఆర్బీఐను కోరుతున్నారు. ఆర్థిక సవాళ్లను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ విస్తృత వ్యూహంలో భాగంగా ఇటీవలి పాలసీ రేటు కోతకు మద్దతు ఇచ్చింది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పిస్తోంది. -
గృహ రుణం.. దిగొస్తుంది భారం!
కొండెక్కి కూర్చున్న రుణ రేటును కిందికి దింపే దిశగా ఆర్బీఐ తొలి అడుగు వేసింది. రెపో రేటును పావు శాతం తగ్గించి రుణ గ్రహీతలకు తీపి కబురందించింది. చూడ్డానికి స్వల్ప మొత్తమే అయినా.. గృహ రుణ గ్రహీతలకు లక్షల్లో మిగలనున్నాయి. తమ వంతు కృషిని కొంచెం జోడిస్తే మరింత ఆదా చేసుకోవచ్చు. రుణానికి త్వరగా గుడ్‌బై చెప్పొచ్చు. తాజా రేటు తగ్గింపుతో మిగిలేదెంత? దీనికి అదనంగా మిగుల్చుకునేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏవి? ఈ వివరాలను అందించే కథనమే ఇది. వడ్డీ భారం తగ్గేది ఇలా.. ఏడాది క్రితం 50 లక్షల గృహ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాల వ్యవధి కోసం తీసుకున్నారని అనుకుందాం. ఈఎంఐని ఇంతకుముందు మాదిరే కొనసాగించేట్టు అయితే.. పావు శాతం తగ్గింపు, అర శాతం రేటు తగ్గింపుతో ఎంత ప్రయోజనం లభిస్తుందో చూద్దాం. (టేబుల్ 2) ప్రభావం ఏ మేరకు? 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గింపు చిన్న మొత్తమే అయినా దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ మొత్తం ఆదా కానుంది. నెలవారీ చెల్లించే ఈఎంఐ ఇంతకుముందు మాదిరే కొనసాగించుకుంటూ వెళితే, పావు శాతం రేటు తగ్గింపు వల్ల రుణం త్వరగా తీరిపోతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గింపును ఈఎంఐలో సర్దుబాటు చేసుకుంటే.. అప్పుడు నెలవారీ చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. రుణ కాల వ్యవధి ఇంతకుముందే మాదిరే కొనసాగుతుంది. ఈఎంఐ తగ్గించడం లేదంటే అదే ఈఎంఐ కొనసాగించి, రుణ కాల వ్యవధి త్వరగా ముగించడం.. ఈ రెండు ఆప్షన్లను బ్యాంక్‌లు కల్పిస్తాయి. రుణ గ్రహీత తనకు అనుకూలమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల గృహ రుణాన్ని 9 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. సవరణ తర్వాత 8.75 శాతం తగ్గుతుంది. దీంతో రూ.26,992 ఈఎంఐ కాస్తా రూ.26,551కు దిగొస్తుంది. ఈఎంఐలో రూ.480 (1.8 శాతం) మిగులుతుంది. (టేబుల్ 1)అమలుకు ఎంత సమయం?బ్యాంక్‌లు 2019 అక్టోబర్ నుంచి అన్ని ఫ్లోటింగ్ రేటు రిటైల్ రుణాలను (గృహ రుణాలు సహా) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాయి. చాలా బ్యాంక్‌లు రెపో రేటునే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా అనుసరిస్తున్నాయి. కనుక రెపో రేటులో మార్పులు రుణాలపై వేగంగా ప్రతిఫలించనున్నాయి. బ్యాంక్‌లు వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షించాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణా లు, దీనికంటే ముందున్న బేస్ రేటు ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు అమల్లోకి రావడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకోవచ్చు. ‘‘రె పో లింక్డ్ రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ఈ మేరకు తక్కువ రేటుపై రు ణాలు లభిస్తాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలపై రే టు తగ్గింపు అన్నది సమీక్షించే తేదీపైనే ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ప్రస్తుతం మాదిరే రుణాలకు చెల్లింపులు కొనసాగించాలి’’ అని పైసాబజార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నవీన్ కుక్రెజా తెలిపారు.కొత్తగా రుణం తీసుకునే వారికీ ఊరట ఈ ఏడాది ఆర్బీఐ మరో 25–50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అర శాతం రేటు తగ్గడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంతన్నది పైనున్న టేబుల్–2లో గమనించొచ్చు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం డేటాపైనే భవిష్యత్తు రేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘మరో 50–75 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది ద్రవ్యోల్బణం స్థిరత్వం, అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్) ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ ఎకనామిస్ట్ అర్హ మోగ్రా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును అంచనా వేస్తున్నట్టు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు. తక్కువ రేటు రుణానికి మారిపోవడమే ఆర్బీఐ భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. ఎంసీఎల్ఆర్ విధానంలో ఉన్నవారికి ఈ రేటు తగ్గింపు ప్రయోజనం బదిలీ ఆలస్యంగా లభిస్తుంది. కనుక ఇప్పటికే ఎంసీఎల్ఆర్ ఆధారిత లేదా దీనికంటే ముందున్న బేస్ రేటు విధానంలో గృహ రుణాలు తీసుకున్నవారు రీఫైనాన్సింగ్ (వేరొక సంస్థకు మారిపోవడం) ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు రెపో నుంచి ఆఫర్ చేస్తున్నాయి. గృహ రుణ కాల వ్యవధి ఇంకా దీర్ఘకాలం పాటు ఉంటే గనుక తక్కువ రేటుపై ఆఫర్ చేసే బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తమే ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పటికే తీసుకున్న రుణాన్ని అదే బ్యాంక్ పరిధిలో రెపో రేటు విధానంలోకి మార్చి, రేటు తగ్గించాలని కూడా కోరొచ్చు. అన్ని బ్యాంక్‌లు కాకపోయినా కొన్ని బ్యాంక్‌లు ఇందుకు అనుమతించొచ్చు. రెపో ఆధారిత గృహ రుణ గ్రహీతలు సైతం మరింత తక్కువ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్/ఎన్బీఎఫ్సీకి మారిపోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. 0.35–0.50 శాతం రేటు తక్కువ ఉన్నా కానీ, బదిలీని పరిశీలించొచ్చన్నారు. పన్ను ఆదాతో కలిపితే ఆదా ఎక్కువే ‘‘రూ.25 లక్షల స్థూల ఆదాయం కలిగిన వ్యక్తి రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని (20 ఏళ్ల కాలం, 9 శాతం రేటు) 2025 మార్చి నాటికి 12 ఈఎంఐలు చెల్లించినట్టయితే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 లక్షలను ఆదా చేసుకోవచ్చు. అంటే నెలవారీగా రూ.11,461. గృహ రుణం రేటును పావు శాతం తగ్గించడం, అధిక శ్లాబుల్లోని వారికి బడ్జెట్లో ప్రకటించిన పన్ను రాయితీలతో ఈ మొత్తం మిగలనుంది’’అని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి వివరించారు. ఎప్పుడు తీసుకున్నారు..? గృహ రుణాన్ని ఐదేళ్ల క్రితం తీసుకున్న వారితో పోల్చితే ఏడాది క్రితం తీసుకున్న వారికి .. తాజా రేటు తగ్గింపుతో మిగులు ఎక్కువగా లభిస్తుంది. ఉదాహరణ: రూ.75 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు (240 నెలలు) 9 శాతం రేటుపై తీసుకున్నారు. దీనికి చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ రూ.67,479. ఇలా 20 ఏళ్ల కాలలో మొత్తం చెల్లించాల్సింది రూ.1.62 కోట్లు. ఇందులో వడ్డీ రూ.87 లక్షలు. ఇప్పుడు రుణంపై వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి దిగొచ్చింది. దీంతో గృహ రుణం తీసుకుని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తయిన వారు.. ఇంతకుముందు మాదిరిగా అదే ఈఎంఐని చెల్లిస్తూ వెళితే మిగిలిన కాలంలో ఎంత మిగులుతుంది, ఎంత తొందరగా రుణం ముగుస్తుందో టేబుల్లో చూడొచ్చు. పాక్షిక చెల్లింపుతో ఇంకా ఆదాగృహ రుణ చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు అందుబాటులోని మార్గాల్లో పాక్షిక చెల్లింపులు ఒకటి. ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక గృహ రుణ ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లిస్తూ వెళ్లాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. రూ.75 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 25 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. దీనిపై నెలవారీ రూ.62,940 ఈఎంఐగా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించినట్టయితే కాల వ్యవధి పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం రూ.1.89 కోట్లు. ఇందులో వడ్డీయే రూ.1.14 కోట్లు. ఇప్పుడు ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లించడం వల్ల 25 ఏళ్లకు బదులు 13 ఏళ్లకే రుణం తీరిపోతుంది. అసలు, వడ్డీ కలిపి చెల్లించే మొత్తం కూడా రూ.1.37 కోట్లకు తగ్గుతుంది. తద్వారా రూ.52 లక్షలు ఆదా అవుతాయి. ఇలా చేస్తే అధిక ప్రయోజనం.. → క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు ప్రయతి్నంచాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు గృహ రుణాలను 0.25 శాతం తక్కువకే ఇస్తుంటాయి. → గృహ రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి ఎంపిక చేసుకోవాలి. 20 ఏళ్ల కాలం మించకుండా చూసుకోవాలి. కొత్త పన్ను విధానంలో గృహ రుణంపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. → భవిష్యత్తులో రేట్లు తగ్గే అవకాశాలే ఎక్కువ. కనుక రెపో ఆధారిత రుణం తీసుకోవడమే మంచిది. → వీలైనంత అధిక డౌన్ పేమెంట్ ముందే సమకూర్చుకుని, రుణం మొత్తాన్ని తగ్గించుకోవాలి. → రుణ కాలవ్యవధి మరో 15 ఏళ్లు మిగిలి ఉంటే, ప్రస్తుత రుణ రేటు కంటే తక్కువ రేటుపై ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తం ఆదా అవుతుంది. → ఏటా వీలైనంత మేర ఈఎంఐ పెంచి చెల్లించడం వల్ల రుణాన్ని వేగంగా ముగించేయొచ్చు. బేరమాడడమే.. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు కొంత తక్కువ రేటును ఆఫర్ చేస్తుంటాయి. కనుక 760కు పైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారు బ్యాంక్ అధికారితో సంప్రదించి రేటు తగ్గించుకోవడంలో సఫలం కావొచ్చు. ఇప్పటికే తీసుకున్న రుణంపై రేటు తగ్గించే విషయంలోనూ రుణ గ్రహీతల డిమాండ్‌ను అధికారులు అంగీకరించొచ్చు. లేదంటే మరొక బ్యాంక్‌కు రుణాన్ని బదిలీ చేసుకుంటామంటే దానికి బదులు రేటు తగ్గింపునకు వారు మొగ్గు చూపించొచ్చు. ముఖ్యంగా బ్యాంక్‌లకు బదులు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ రేటుపై రుణ బదిలీ చేసుకునే వారిని ప్రోత్సహిస్తుంటాయి. ఇందుకు కొంత ప్రాసెసింగ్ చార్జీలను భరించాల్సి రావచ్చు. ఆటో రుణాలపై తక్కువే రూ.10 లక్షల ఆటో రుణాన్ని ఐదేళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకుని రూ.21,247 ఈఎంఐ కింద చెల్లిస్తున్నారని అనుకుందాం. తగ్గింపు తర్వాత వడ్డీ రేటు 9.75 శాతానికి దిగొచ్చింది. ఇంతకుముందు మాదిరే రూ.21,247 ఈఎంఐ చెల్లిస్తూ వెళితే.. రుణం మూడు నెలల ముందుగా తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.15,000 ఆదా అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లైసెన్స్‌లు వెనక్కి ఇచ్చేసిన ఎన్బీఎఫ్సీలు
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ లిమిటెడ్ తమ ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్)లను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్బీఐ తనంతటగా 17 ఎన్‌బీఎఫ్‌సీల సీవోఆర్లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్ కార్యాలయం పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.ఎన్బీఎఫ్సీ అంటే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ. ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్‌లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులకు తేడాఎన్బీఎఫ్సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు. ఎన్బీఎఫ్సీలు చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు. -
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండాలని హైకోర్టుకు తెలిపిన ఆర్బీఐ
-
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే... రామోజీరావు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆర్బీఐ
-
రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా?
సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలుగా న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వల్లెవేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్‌యూఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని (ప్రస్తుత కర్త) బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో పాటు రామోజీ స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని బాధ్యుడిగా చేయరాదంటూ ‘వైకేరియస్ లయబిలిటీ’ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలకు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక కొత్త కర్త (కిరణ్) నియామకంతో మార్గదర్శి హెచ్‌యూఎఫ్ పునరుద్ధరించినట్లయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా..! (సివిల్ లయబిలిటీ) అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెబుతూ వస్తున్నవన్నీ అసత్యాలు, అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది.విచారణ 28కి వాయిదా...సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి.శ్యామ్‌కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని నివేదించారు. ఆర్బీఐ చట్ట నిబంధనలను రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్‌ను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం సమంజసం కాదని పదేపదే ధర్మాసనానికి నివేదించారు. చట్టప్రకారం కిరణ్, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనల్లో ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అది చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడంతో తదుపరి విచారణ తొలుత 21కి వాయిదా పడింది. తర్వాత మార్గదర్శి తరఫు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో 21న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని, మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. -
క్యాష్ విత్‌డ్రాకూ వీల్లేదు.. బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై (New India Co operative Bank) కఠిన ఆంక్షలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త రుణాలు మంజూరు చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించింది. అలాగే క్యాష్ విత్‌డ్రాకు కూడా వీలు లేకుండా చేసింది.బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం, ద్రవ్యత స్థితి గురించి ఆందోళనల కారణంగా ఈ పరిమితులు అవసరమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డిపాజిటర్ల ఆర్థిక భద్రత దృష్ట్యా ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దాని వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.22.78 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం రూ.30.75 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్బీఐ ఆదేశాల్లో ఏముందంటే.. 2025 ఫిబ్రవరి 13న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, నిధులను తీసుకోవడం లేదా కొత్త డిపాజిట్లను అంగీకరించడం, అప్పుల కోసం చెల్లింపులు చేయడం, ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం వంటివి చేయకూడదని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది.ఖాతాదారులలో ఆందోళనఆంక్షల్లో భాగంగా బ్యాంకు ద్రవ్యత సమస్యల కారణంగా డిపాజిటర్లు తమ పొదుపు, కరెంట్ లేదా ఇతర ఖాతాల నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి వేలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బిఐ నిర్ణయం కస్టమర్లలో ఆందోళనను సృష్టించింది. దీంతో ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖల వద్దకు కస్టమర్లు పెద్ద ఎత్తున వచ్చారు. ఈఎంఐలు, అద్దెల చెల్లింపులు, రోజువారీ ఖర్చుల నిర్వహణ కోసం క్యాష్ విత్‌డ్రా లేకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కస్టమర్ల డబ్బులు వెనక్కి వస్తాయా?న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని అర్థం బ్యాంకు ఇప్పటికీ పరిమితుల కింద పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అంత వరకూ పరిస్థితిని కేంద్ర బ్యాంకు పర్యవేక్షిస్తుంది. అవసరమైన విధంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది.ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుండి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే రూ. 5 లక్షల వరకు పొందవచ్చు. ఇది బ్యాంకులో డిపాజిట్లు కలిగి ఉన్న కస్టమర్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. -
పండగైనా బ్యాంకులు పనిచేయాల్సిందే: ఆర్బీఐ
మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. -
రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పు
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించారు. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉన్న నోట్లు చట్టబద్ధంగా యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లు మహాత్మా గాంధీ ఇమేజ్‌తో కొత్త సిరీస్‌లోని రూ.50 నోట్లనే పోలి ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కేవలం శక్తికాంత దాస్ సంతకం స్థానంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేతగవర్నర్గా బాధ్యతలు స్వీకరించేకంటే ముందు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై విధించిన పర్యవేక్షక ఆంక్షలను ఎత్తివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగించింది. బ్యాంక్ తన ఆన్లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది.ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీతో సహా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ మౌలిక వసతుల్లో లోపాలను గతంలో ఆర్బీఐ గమనించింది. దాంతో నిబంధనలు పాటించకపోవడం వల్ల బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఫలితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) కార్యకలాపాలు, ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లు కొంతకాలంగా అంతరాయాలు ఎందుర్కొంటున్నాయి.నివారణ చర్యలుఆర్బీఐ ఆందోళనలకు ప్రతిస్పందనగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నివారణ చర్యలను ప్రారంభించింది. లోపాలు సవరించుకునేందుకు బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను నిత్యం ఆర్బీఐకు నివేదికల రూపంలో సమర్పించింది. ఈ కాంప్లయన్స్ను ధ్రువీకరించడానికి ఆర్బీఐ ఆమోదించిన ఎక్స్టర్నల్ ఆడిట్‌ను బ్యాంక్ పూర్తి చేసింది. బ్యాంకు తీసుకున్న పరిష్కార చర్యలతో సంతృప్తి చెందిన ఆర్బీఐ గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్ఆంక్షలు ఎత్తివేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం లభించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు లైన్‌క్లియర్ అయింది. ఈ చర్య వల్ల సమర్థవంతమైన కస్టమర్ సేవలను అందించడానికి వీలవుతుంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఆంక్షలు ఎత్తివేయడం కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు
ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలుఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యంఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: టార్గెట్ ఎఫ్‌డీఐ.. విధానాల సవరణకు యోచన!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
మార్గదర్శి అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదన్న హైకోర్టు
-
'ఏఏ' వ్యాపారానికి ఫోన్‌పే గుడ్‌బై.. లైసెన్స్ వెనక్కి..
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం. ‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది. -
ఈఎంఐలు ఇక దిగొస్తాయ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్‌లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.రెపో రేటు అంటే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత కార్పొరేట్ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.ఇతర ముఖ్యాంశాలు... → సైబర్ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్ డొమైన్‌ను డాట్ ఇన్ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్ మార్పు 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.→ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. → తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 7–9 తేదీల్లో జరుగుతుంది.గృహ రుణంపై ఊరట ఎంతంటే..? ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.5ఏళ్లలో తొలిసారి.. 2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్‌టైమ్ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.సానుకూల పరిస్థితులతోనే... గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్బీఐ టార్గెట్ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్సమయానుకూల నిర్ణయం.. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. – సి.ఎస్. శెట్టి, ఎస్బీఐ చైర్మన్ ఇది సరిపోదు... ఆర్బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్‌ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడుహౌసింగ్కు బూస్ట్... ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. – జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు -
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్‌లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్‌గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్‌కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
చివరకు ఆ రోజు వచ్చింది.. రేపో రేటు తగ్గింపుపై మీమ్స్
ఊహించినట్టుగానే 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న.. మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేపో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుంచి.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది. కాగా ఇప్పుడు తగ్గిన రేపో రేటు హోమ్ లోన్ చెల్లించే కస్టమర్లకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.#rbipolicy RBI cuts #RepoRate to 6.25 Basis point.Le #HomeLoan seeker be like:-#RBIMonetaryPolicy #PranaliRathod #ExitPolls #StocksToWatch #arrestwarrant #DelhiAssemblyElection2025 #Zomato#ExitPolls pic.twitter.com/IUS9VpCJh2— Sanjana Mohan (@SanjanaMohan10) February 7, 2025ఈ రోజు రేపో రేటును తగ్గించడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన మీమ్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒకరు "ఆఖిర్ వో దిన్ ఆ హి గయా" (చివరకు, ఆ రోజు వచ్చింది) అనే పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.after RBI Repo Rate cut by 25 bps to 6.25% 😎Meanwhile Indian, and Bank Sector be like 😂😂#RateCut #RepoRate #NagaChaitanya #Zomato #DelhiAssemblyElection2025 #ExitPolls #GIFTNIFTY #intraday pic.twitter.com/ehAyRn7bdN— Daphi (@Dafi_syiemz) February 7, 2025 -
హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ప్రకటించారు. దీని వలన వడ్డీ రేట్లు, ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం కలిగింది.2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ రుణాలు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమై ఉంటాయి. చాలా సందర్భాలలో ఇదే రెపో రేటుగా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గింపు గృహ రుణగ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని గృహ రుణాలలో ఎక్కువ భాగం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఫలితంగా, వడ్డీ భారం, వాటి ఈఎంఐలు తగ్గుతాయి. దీంతో ఇంటి యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుండి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది.హోమ్ లోన్ కస్టమర్లకు భారీ ప్రయోజనాలుప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ కస్టమర్లకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం.. ఒక సంవత్సరం క్రితం 9 శాతం వడ్డీ రేటు, 20 సంవత్సరాల కాలపరిమితి (240 నెలలు) తో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే.. నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది. రుణ కాలంలో చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 58 లక్షలు అవుతుంది.ఇప్పుడు 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం నుండి 8.75 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా అసలు, వడ్డీ మొత్తం చెల్లింపు సుమారు రూ. 53.6 లక్షలకు తగ్గుతుంది. దీని వలన రూ. 4.4 లక్షలు ఆదా అవుతుంది. అలాగే రుణ కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది. దీని వలన రుణాన్ని 10 నెలల ముందుగానే తిరిగి చెల్లించవచ్చు. -
రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ
-
RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. జీడీపీ 6.7% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.రెపో రేటు అంటే.. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. -
గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆర్బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలుతనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్బీఎప్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్బీఎఫ్సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్బీఎఫ్సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయా?.. శుభవార్త సిద్ధం!
రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. -
నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులుండవ్
న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్‌ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనను గుర్తు చేశారు. వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు. -
మరో ఆరువేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : సూపర్ 6లో ఒక్క పథకం అమలు చెయ్యకుండానే అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తుంది. తాజాగా, మంగళవారాన్ని అప్పువారంగా మార్చేస్తూ..అర్బీఐ వద్ద అర్రులు చాచింది. మరో ఆరువేల కోట్లు అప్పు చేసింది.చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం..రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తోంది. ఈ ఆరువేల కోట్లతో బడ్జెట్ అప్పులు మొత్తం రూ.80,827 కోట్లకు చేరాయి. తద్వారా ఎనిమిది నెలల్లోనే రికార్డ్ స్థాయిలో కార్పొరేషన్లు,బ్యాంక్‌ల ద్వారా మరో రూ.52 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. -
టాటా కంపెనీ కొనుగోలుకు ఆర్బీఐ ఆమోదం
టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీసీపీఎస్ఎల్)ను భారత్‌లోని ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీకి విక్రయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫైండీ ఆధ్వర్యంలోని భారతీయ అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (టీఎస్ఐ)కు టీసీపీఎస్ఎల్ను విక్రయించే ప్రణాళికలను ఆర్బీఐ ముందుంచారు. దాంతో తాజాగా వాటిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.330 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.నవంబర్ 2024లో ప్రకటించిన ఈ కొనుగోలు టీసీపీఎస్ఎల్ వైట్ లేబుల్ ఏటీఎం(నాన్ బ్యాంకింగ్ నిర్వహకులు ద్వారా నడిచే ఏటీఎం) ప్లాట్‌ఫామ్, ఇండికాష్ ఏటీఎంల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి ఫైండీకి వీలు కల్పిస్తుంది. టీఎస్ఐ ప్రస్తుతం 7,500కు పైగా బ్రౌన్ లేబుల్ ఏటీఎం(స్పాన్సర్ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు)లను నిర్వహిస్తుంది. 10,000 కంటే ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫైండీ 4,600 ఆపరేషనల్ ఇండికాష్ ఏటీఎంలను తీసుకుంటుంది. మరో 3,000 ఏటీఎం పొందేందుకు ఫైండీకి అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: జోరందుకున్న తయారీ రంగంఫైండీ సీఈఓ దీపక్ వర్మ మాట్లాడుతూ భారత్‌లో ఆర్థిక సేవలను విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏటీఎంలను కంపెనీ ప్రస్తుత నెట్‌వర్క్‌తో అనుసంధానించడంతో బ్యాంకింగ్ సేవలులేని మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
ముంబై: కీలక వడ్డీ రేట్ల కోతను ఆర్బీఐ(RBI) ఈ వారంలో జరిగే సమీక్షతో షురూ చేయొచ్చని ప్రముఖ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య భేటీ కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించొచ్చని భావిస్తున్నారు.రెండేళ్లుగా కీలక రెపో, రివర్స్ రెపో (ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోంది. కేంద్ర బడ్జెట్లో వినియోగానికి మద్దతుగా ఆదాయపన్ను విషయంలో పెద్ద ఎత్తున ఊరట కల్పించినందున, దీనికి కొనసాగింపుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రణ పరిధి 6 శాతం లోపే ఉన్నందున రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉందని నిపుణులు అంటున్నారు. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు కనిష్టాల త్రైమాసిక స్థాయిలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి: షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల జోరుఇవీ సానుకూలతలు..‘రేట్ల తగ్గింపునకు రెండు బలమైన కారణాలున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే లిక్విడిటీ పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది రేట్ల కోత ముందస్తు సూచికగా ఉంది’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో చర్యలకు మద్దతుగా రెపో రేటును తగ్గించొచ్చన్నారు. ‘కేంద్ర బడ్జెట్లో ద్రవ్యపరమైన ఉద్దీపనలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని భావించడం లేదు. కనుక 2025 ఫిబ్రవరి సమీక్షలో రేట్ల కోతకు సానుకూలతలు ఉన్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ వారంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకుంటే రేట్ల కోత వాయిదా పడొచ్చన్నారు. -
ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు. -
ఇక ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: లోక్‌సభలో వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్పందించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రంగాలవారీగా పెట్టుబడుల కేటాయింపులు, పథకాలు తదితర ప్రతిపాదనల ఆధారంగా స్టాక్స్ కదలికలు నమోదుకానున్నట్లు తెలియజేశారు. రూ. 12 లక్షలవరకూ ఆదాయంపై పన్ను చెల్లింపులు లేకపోవడంతో శనివారం ట్రేడింగ్‌లో వినియోగ రంగ కౌంటర్లు జోరు చూపాయి. బీమా రంగానికి బూస్ట్‌నిస్తూ ఇప్పటివరకూ 75 శాతంగా అమలవుతున్న ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. బడ్జెట్లో యువత, మహిళలు, రైతులకు సైతం మద్దతుగా పలు చర్యలు ప్రతిపాదించారు. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరిన్ని రంగాలవైపు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వినియోగ రంగం మరింత జోరు చూపవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ప్రణవ్ హరిదాసన్ అంచనా వేశారు. 7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దిగ్గజాలు రెడీ ఈ ఏడాది(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే వేడెక్కింది. మరిన్ని దిగ్గజాలు ఈ వారం క్యూ3((అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, టైటన్, ఎన్‌హెచ్‌పీసీ, టాటా పవర్, పీసీ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు వివిధ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకునే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోనున్నట్లు ఏంజెల్ వన్ డెరివేటివ్స్ సీనియర్ విశ్లేషకులు ఓషో కృష్ణన్ పేర్కొన్నారు.ఇతర అంశాలు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ మార్కెట్లో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఇటీవల బలహీనపడుతుంటే చమురు ధరలు పటిష్టంగా కదులుతున్నాయి. మరోపక్క యూఎస్ డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ మరింత పుంజుకుంటే సెంటిమెంటుపై ప్రభావంపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఎఫ్‌పీఐలు 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లు అంచనా. గత వారమిలాగత వారం(జనవరి 27–ఫిబ్రవరి1) దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ నికరంగా 1,316 పాయింట్లు(1.7 శాతం) బలపడి 77,506 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 390 పాయింట్లు(1.7 శాతం) పుంజుకుని 23,482 వద్ద స్థిరపడింది. కాగా.. ఎఫ్‌పీఐల అమ్మకాల కారణంగా జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం క్షీణించగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ 9 శాతం చొప్పున పతనమయ్యాయి. -
డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లు
కేంద్ర బ్యాంకు ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్‌గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024–25)లో డివిడెండ్, మిగులు ద్వారా రూ. 2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాలకంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2.89 లక్షల కోట్లను దాటనున్నాయి.ఎల్రక్టానిక్స్ ప్రాజెక్టులకు రూ.18,000కోట్లువచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ. 18,000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్, సెమీకండక్టర్లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,566 కోట్ల నుంచి రూ.26,026 కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎల్రక్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్ఐకి రూ. 8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి. మరోవైపు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటా యింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ. 2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టులకు కేటాయింపులను రూ. 9,766 కోట్లకు సవరించారు. -
బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు
పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ట, క్రియాశీలక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) కోరారు. అలాగే నష్టాలను తగ్గించడానికి థర్డ్–పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై పర్యవేక్షణను మెరుగుపరచాలని సూచించారు.ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.రాజేశ్వర్ రావు, టి.రబి శంకర్, జె.స్వామినాథన్‌తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ మోసాల పెరుగుదలపై మల్హోత్రా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.డిసెంబరులో శక్తికాంత దాస్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా బ్యాంకులతో నిర్వహించిన మొదటి సమావేశం ఇది. ఆర్బీఐ తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటుంది.సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్‌గా గత డిసెంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. గత గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం ముగియడం ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. -
మొబిక్విక్, క్రెడ్లో ఈ–రూపీ వాలెట్లు
డిజిటల్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలు మొబిక్విక్, క్రెడ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ–రూపీ వాలెట్లను ప్రవేశపెట్టాయి. దీనికి యస్‌బ్యాంక్‌తో జతకట్టాయి. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదును బదలాయించేందుకు, అలాగే వ్యక్తులు.. వ్యాపారవర్గాలకు చెల్లింపులు జరిపేందుకు సర్వీసులు ఉపయోగపడనున్నాయి. 2024లో రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా డిజిటల్ కరెన్సీ ఈ–రూపీని ప్రవేశపెట్టినప్పుడు కేవలం బ్యాంకులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీ) కూడా సీబీడీసీ సేవలను అందించేందుకు వెసులుబాటు లభించింది. ఇప్పుడు ఈ–రూపీ వాలెట్ల రోజువారీ లావాదేవీల పరిమితి రూ. 50,000గా ఉండగా, ఒక్కో లావాదేవీ విలువ పరిమితి రూ. 10,000గా ఉంది. అర్థ రూపాయి, 1 రూపాయి నుంచి రూ. 500 వరకు కరెన్సీ డినామినేషన్లలో ఈ–రూపీ అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్ భాగస్వామ్యంజెప్టో ‘రివర్స్ ఫ్లిప్’ పూర్తి..దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా క్విక్ కామర్స్ సంస్థ జెప్టో మరో అడుగు ముందుకు వేసింది. తమ హోల్డింగ్ కంపెనీ కిరాణాకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. రివర్స్ ఫ్లిప్గా వ్యవహరించే ఈ ప్రక్రియకు సంబంధించి సింగపూర్ కోర్టులు, భారత్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి లాంఛనంగా అనుమతులు లభించినట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు. తక్కువ సమయంలోనే దీన్ని సాకారం చేశారని తమ బృందానికి కితాబిచ్చారు. -
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
రూ.350 నోటు వస్తోందా?: ఆర్బీఐ ఏం చెప్పించిందంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.350, రూ.5 నోట్లను విడుదల చేస్తున్నట్లు.. కొన్ని వార్తలు, నోట్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తలు నిజమేనా? లేక కేవలం పుకార్లు మాత్రమేనా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూ. 5 నోట్లు, రూ. 350 నోట్లు కేవలం పుకారు మాత్రమే అని ఆర్బీఐ వెల్లడించింది. మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ఫొటోలే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవే ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చినట్లు చెబుతున్నారు.2016 డిమోనిటైజేషన్ తరువాత పాత రూ. 500, రూ. 1000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఆ తరువాత కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని రోజులలోనే రూ. 200 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు.2023లో ఆర్బీఐ పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ప్రజలవద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులలో ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో రెండు వేలరూపాయల నోట్లన్నీ కూడా ఆర్బీఐకు చేరుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నోటు రూ. 500 మాత్రమే.భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటుభారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. -
లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు
భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికమవడం, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.ఆర్బీఐ స్పందన..లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్టర్మ్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యంనగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది. -
వచ్చే నెలలో బ్యాంక్ పని ఉందా? ఫిబ్రవరి సెలవులు ఇవే..
సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మొత్తం 14 రోజులుఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవుఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై , నాగ్‌పూర్‌లోని బ్యాంకుల మూతఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లో హాలిడేఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 26: బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకుల మూత. -
లోన్ల మంజూరులో జాగ్రత్త.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు. -
రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదుఅమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఆర్బీఐ జోక్యం తగదురూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటాఅమెరికా కరెన్సీ యుద్ధంప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు. -
ఆర్బీఐ కొత్త రూల్: ఎంతో మేలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్బీఐ చెప్పింది.అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.నామినీ ఎవరు?ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
బ్యాంక్ చెక్కుపై బ్లాక్ ఇంక్ నిషేధమా?: ఇదిగో క్లారిటీ..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ''బ్యాంక్ చెక్కులను బ్లాక్ ఇంక్ (Black Ink)తో రాయకూడదు'' అని. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత? 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) నిజంగా ఈ ఆదేశాలను జారీ చేసిందా అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.బ్యాంక్ చెక్కులపై బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని వస్తున్న వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలను జారీచేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. అంతే కాకుండా.. ఎలాంటి ఇంక్ వాడాలి అనేదానికి సంబంధించి తాజాగా ఎలాంటి ఆదేశాలు వెల్లడికాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే. కాబట్టి బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా బ్లాక్ ఇంక్ ఉపయోగించవచ్చని పీఐబీ వివరించింది.సాధారణంగా బ్లూ లేదా బ్లాక్ వాడొచ్చని చెబుతారు. ఎందుకంటే ఇవి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. చదవడానికి కూడా బాగుంటుంది. చెక్కులపై, బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లను రాయడానికి బ్లాక్ లేదా బ్లూ వాడొచ్చు. అయితే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు ఇంక్ వాడకం నిషేధం. ఎందుకంటే దీనిని అనధికారికంగా గుర్తిస్తారు. అంతే కాకుండా పెన్సిల్ లేదా తుడిచిపెట్టగలిగే వాటిని కూడా ఉపయోగించడం నిషేధం. ఎందుకంటే వీటిని చెరిపేసి.. మార్చేసే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?బ్యాంక్ చెక్ రాయడానికి బ్లాక్ ఇంక్ నిషేధం అనే వార్తను ఎవరూ నమ్మకండి. ఎందుకంటే ఆ వార్తలో నిజం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పీఐబీ వెల్లడించింది. ఏదైనా ఒక వార్తకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా మంచి పద్దతి కాదని పేర్కొంది.It is being claimed in social media posts that @RBI has issued new rules prohibiting the use of black ink on cheques.#PIBFactCheck▶️This claim is #FAKE▶️Reserve Bank of India has not prescribed specific ink colors to be used for writing cheques🔗https://t.co/KTZIk0dawz pic.twitter.com/vbL3LbBtFs— PIB Fact Check (@PIBFactCheck) January 17, 2025 -
రూపాయి స్థిరీకరణకు ఆర్బీఐ చర్యలు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టం 86.70ని చూసిన నేపథ్యంలో, దేశీయ కరెన్సీ ఒడిదుడుకుల నివారణ, స్థిరీకరణ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చొరవలకు శ్రీకారం చుట్టింది. విదేశీ లావాదేవీల్లో రూపాయి (rupee) వినియోగం ప్రోత్సాహం లక్ష్యంగా కీలక చర్యలను ప్రకటించింది.సరిహద్దు వాణిజ్య లావాదేవీల్లో భారత రూపాయి అలాగే స్థానిక, జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సంబంధిత నిబంధనలను సరళీకృతం చేసింది. రూపాయిలో పలు దేశాలతో వాణిజ్య లావాదేవీలను నిర్వహించడం, తద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించడం, రూపాయి విలువ స్థిరీకరణ ఆర్బీఐ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలు. సెంట్రల్ బ్యాంకులతో ఎంఓయూలు..భారతీయ రూపాయితో సహా స్థానిక కరెన్సీలలో సరిహద్దు లావాదేవీలను ప్రోత్సహించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, మాల్దీవుల సెంట్రల్ బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లపై సంతకం చేసింది. వాణిజ్య లావాదేవీల కోసం భారత రూపాయిని ప్రోత్సహించడానికి 2022 జూలైలో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతా (ఎస్‌ఆర్‌వీఏ) సౌలభ్యాన్ని ఆర్బీఐ ఏర్పాటు చేసింది.అనేక విదేశీ బ్యాంకులు భారతదేశంలోని బ్యాంకులతో ఎస్ఆర్వీఏలను ప్రారంభించాయి. ఎన్ఆర్ఐ ఖాతాల లావాదేవీల విషయంలో తాజాగా మరింత సరళతర నిబంధనలను ఆర్బీఐ తీసుకువచ్చింది. సరళీకృత ఫెమా నిబంధనల ప్రకారం, భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు ప్రత్యేక నాన్–రెసిడెంట్ రూపాయి ఖాతా, ఎస్ఆర్వీఏల్లోని బ్యాలెన్స్‌లను ఉపయోగించి ఇతర నాన్–రెసిడెంట్లతో విశ్వసనీయ లావాదేవీలను నిర్వహించడానికి వీలవుతుంది.భారతీయ ఎగుమతిదారులు వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్ కోసం విదేశాలలో ఏదైనా విదేశీ కరెన్సీలో ఖాతాలను తెరవగలరని కూడా ఆర్బీఐ తెలిపింది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వీకరించడం, ఈ ఆదాయాన్ని దిగుమతుల కోసం చెల్లించడం వంటి కార్యకలాపాలను నిర్వహించవచ్చు. -
మార్కెట్లో రూ.20 నాణెం.. తికమక పడుతున్న జనం
సిరిసిల్లటౌన్: మార్కెట్లో రూ.20 నాణేలు చలామణి అవుతున్నాయి. కొత్తగా ఈ కాయిన్స్ వచ్చినట్లు చాలా మందికి తెలియక అయోమయానికి గురవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వీటిని మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసంది. కాస్త చిన్న సైజులోనే రూ.5 కాయిన్స్ కూడా చలామణి అవుతున్నాయి. రెండు చిన్నపాటి మార్పులతో ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారని చర్చించుకుంటున్నారు. -
ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానం
ద్రవ్యోల్బణం, వృద్ధిని అంచనా వేసే సాధనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమగ్ర సమీక్షను ప్రారంభించారు. గత నెలలో బాధ్యతలు స్వీకరించిన మల్హోత్రా కొత్త డేటా పాయింట్లు, విశ్లేషణలు, అంచనా ప్రక్రియలను చేర్చడం ద్వారా ఆర్బీఐ నివేదికలను మరింత స్పష్టతతో ముందుంచాలని నిర్దేశించారు. సమీక్షలో భాగంగా మల్హోత్రా(Sanjay Malhotra) అనుసరిస్తున్న కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.డేటాసెట్లను చేర్చడం..ఆర్బీఐ నివేదికలను మరింత లోతుగా అంచనా వేయడానికి ఉపయోగించే డేటాసెట్లను విస్తరించడంపై మల్హోత్రా దృష్టి సారించారు. ఇందులో స్మాల్ టికెట్ డిజిటల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ యాప్‌ల డేటా, ఆన్లైన్ ట్యాక్సీ అగ్రిగేటర్ల నుంచి డేటా సేకరించడం వంటి అంశాలున్నాయి. ఈ కొత్త డేటా పాయింట్లు ఆదాయం, వ్యయ ధోరణుల స్పష్టమైన వైఖరిని తెలియజేస్తాయని నమ్ముతున్నారు.మెషిన్ లెర్నింగ్ టూల్స్ద్రవ్యోల్బణ అంచనాలను మెరుగుపరచడానికి, ఆహారం వంటి అస్థిర వస్తువులలో ధరల హెచ్చుతగ్గులను ముందుగానే అంచనా వేయడానికి ఆర్బీఐ మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ విధానం ద్రవ్యోల్బణ(inflation) అంచనాలను మరింత ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది.మరింత సమాచార సేకరణభారతదేశ అనధికారిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత సమగ్ర డేటాను సేకరించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. అసంఘటిత రంగాల నుంచి సమకూరే ఆదాయంపై ఖచ్చితమైన డేటా పాయింట్లు లేవు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారిక డేటా వనరుల నుంచి సంగ్రహించబడని ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలి.ఇదీ చదవండి: కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులుసవాళ్లు.. అంచనాలుప్రస్తుత అంచనా లోపాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు దేశ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనా(growth forecasting)లపై ఆర్బీఐ అంచనాలు విడుదల చేసింది. ఉదాహరణకు, ఆర్బీఐ దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 2024-25 సంవత్సరానికి 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించాల్సి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. రెండు డేటా పాయింట్లు విభిన్నంగా ఉండడం కొంత చర్చకు దారి తీసింది.కొత్త మార్పుల ప్రభావం: కొత్తగా తీసుకురాబోయే మార్పులు, డేటాసెట్ల చేర్పులు ఆర్థిక వృద్ధికి సంబంధించి ఖచ్చితమైన అంచనాలకు హామీ ఇవ్వనప్పటికీ, గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుసుకునేందుకు దోహదం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం ఫిబ్రవరి పాలసీ అంచనాల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు. -
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి. -
వడ్డీరేట్ల కోత పక్కా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.భారత వృద్ధికి ఊతమిచ్చేందుకు వచ్చే ఆర్బీఐ మానిటరీ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. కార్మికుల అవసరం అధికంగా ఉండే రంగాల్లో ఉద్యోగ కల్పన ఉండవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఆర్బీఐ ఎంపీసీ(MPC) సమావేశం జరగనుంది. చైనా వంటి దేశాల నుంచి భారీగా వస్తువులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో యాండీ డంపింగ్ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్కు, పేపర్‌బోర్డు, రసాయనాలు, పాలిమర్స్ వంటి ప్రత్యేక రంగాలకు దీనిని అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరికరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు
ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మూడో హ్యాకథాన్ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ’ థీమ్‌లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్‌ను ఆర్బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్‌థాన్‌కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. వాటిని ఫైనల్ లిస్ట్ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్క్సాల్స్ టెక్నాలజీస్ఎపిఫై టెక్నాలజీస్న్యాప్ఐటీ సైబర్సెక్హెచ్విజన్ ఇండియారూప్య దర్శినివిస్ఆస్ట్ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. -
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్‌గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్‌లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్‌లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్‌లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్‌లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్‌లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్‌లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
రూపాయి రక్షణలో కరుగుతున్న ‘ఫారెక్స్’!
రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫారెక్స్ నిల్వలను (Forex reserves) వినియోగిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ చివరిలో 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 27వ తేదీతో ముగిసిన వారానికి 640.279 బిలియన్ డాలర్లకు తగ్గాయి.అంతక్రితం వారం (డిసెంబర్ 21) వారంతో పోల్చితే ఏకంగా 4.11 బిలియన్ డాలర్లు తగ్గాయి. డాలర్లకు డిమాండ్ తగ్గించడానికి తద్వారా రూపాయి విలువ స్థిరత్వానికి బ్యాంకులు, ఫారెక్స్ ట్రేడర్లకు ఆర్బీఐ తగిన స్థాయిలో అమెరికన్ కరెన్సీని అందుబాటులో ఉంచుతున్నట్లు నిపుణుల విశ్లేషణ. ఫారెక్స్‌లో ప్రధాన విభాగాలను పరిశీలిస్తే..డాలర్లలో పేర్కొనే ఫారెన్స్ కరెన్సీ అసెట్స్ విలువ 4.641 బిలియన్ డాలర్లు తగ్గి 551.921 బిలియన్ డాలర్లకు చేరింది.పసిడి నిల్వలు 541 మిలియన్ డాలర్లు తగ్గి, 66.268 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్)కు సంబంధించి పరిమాణం 12 మిలియన్ డాలర్లు తగ్గి 17.873 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిస్థితి యథాతథంగా 4.217 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
పర్సనల్ లోన్లు ఇక కష్టమే.. అమల్లోకి ఆర్బీఐ కొత్త రూల్
ఎడాపెడా పర్సనల్ లోన్లు (personal loans) పొందడం ఇకపై కష్టతరం కానుంది. బ్యాంకులు (Banks), రుణ వితరణ సంస్థలు ప్రతి 15 రోజులకూ క్రెడిట్ బ్యూరో రికార్డ్లను అప్డేట్ చేయాలనే కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది. ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్డేట్ చేయనుండటంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది.రిపోర్టింగ్ విరామాన్ని 15 రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు గత ఆగస్టులోనే ఆర్బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవస్థలను రూపొందించుకునేందుకు జనవరి 1 వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్‌ను అంచనా వేయవచ్చని ఆర్బీఐ పేర్కొంది."ఈఎంఐలు (EMI) నెల అంతటా వివిధ తేదీలలో షెడ్యూల్ అయిఉంటాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్‌లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు. ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు ముగిసిన డేటా వస్తుంది. 15-రోజుకోసారి రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది" అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఆర్ఐఎఫ్ హై మార్క్ ఛైర్మన్ సచిన్ సేథ్ అన్నారు.తరచుగా చేసే డేటా అప్డేట్లు "ఎవర్‌గ్రీనింగ్"(పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేయడం) వంటి పద్ధతులను కూడా నిరోధిస్తాయని రుణదాతలు చెబుతున్నారు. రిపోర్టింగ్ సైకిల్‌ను సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరింత విశ్వసనీయమైన డేటాను పొందుతారు. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. -
రూ.5000 నోటు వస్తోందా?: ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500. అయితే రూ.5,000 నోటు కూడా త్వరలో రాబోతుందని, కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది.ఆర్బీఐ రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకున్న తరువాత.. వాటి స్థానంలో 5,000 రూపాయల నోట్లు (Rs.5000 Note) వస్తాయని కొందరు సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమే అని, దీనిని ఎవరూ నమ్మొద్దని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.దేశంలో అతిపెద్ద కరెన్సీభారతదేశంలో చాలా మందికి తెలిసిన అతిపెద్ద కరెన్సీ 2,000 రూపాయల నోటే. కానీ ఇండియాకు స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10,000, రూ.5,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం బహుశా తెలియకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది. ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి.1978లో మొరార్జీ దేశాయ్ (Morarji Desai) నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10,000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5,000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10,000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి.ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లుభారతదేశంలో ప్రస్తుతం రూ. 500 నోట్లు మాత్రమే కాకుండా.. రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 నోట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా 2023 మే 19న ఆర్బీఐ రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఇప్పటివరకు వెనక్కి వచ్చిన రెండువేల రూపాయల నోట్లు 98.12 శాతం. అంటే ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. -
అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రాకెట్ వేగంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. బడ్జెట్ లోపల, బడ్జెట్బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఈ ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే మార్కెట్ రుణాల కింద చేసిన అప్పులు బడ్జెట్లో పేర్కొన్న దానికంటే మించి పోయాయి. బడ్జెట్లో రూ.71 వేల కోట్లు మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తామని పేర్కొంటే.. మంగళవారం చేసిన రూ.5,000 కోట్లతో మార్కెట్ రుణాల అప్పు రూ.74,827 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక ఏడాదిలోనే తాజాగా జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాల ద్వారా మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బడ్జెట్ లోపల ఒక్క మార్కెట్ రుణాల ద్వారానే అప్పులు రూ.85,827 కోట్లకు చేరనున్నాయి. వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేస్తుండగా.. మరో పక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ ద్వారా ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అంటే ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1,30,827 కోట్లకు చేరుతున్నాయి. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పులు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేయడం లేదు. ఇలాంటి చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుండటం గమనార్హం. మూడు నెలల మార్కెట్ రుణాలకు ఆర్బీఐ క్యాలెండర్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో మరో రూ.11 వేల కోట్ల మార్కెట్ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్ రుణాల ద్వారా డిసెంబర్ 31 నాటికి రూ.74,827 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాలు ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుందనే అంశంపై ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి చంద్రబాబు సర్కారుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నుంచి మార్చి వరకు ఈ తేదీల్లో ఎంత మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తారో సూచిస్తూ క్యాలెండర్ ప్రకటించింది. -
రూ.2000 నోట్లు.. ఇంకా రూ.6,691 కోట్లు
ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకూ 98.12 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని, ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. 2023 మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా 2024 డిసెంబర్ 31న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తాజాగా తెలిపింది. 98.12 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే లేదా మార్చుకునే సదుపాయాన్ని 2023 అక్టోబర్ 7 వరకు ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. 2023 అక్టోబరు 9 నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి.అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు. -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ లావాదేవీలు అధికమవుతున్నాయి. చాలామంది యూపీఐ, ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్(IMPS), ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సదుపాయాలు వినియోగిస్తుంటారు. అందులో యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా చేసిన లావాదేవీల్లో దాదాపు ఎలాంటి అవాంతరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసే చివరి దశలో ఒకసారి లుక్ అప్ ఫెసిలిటీ(ఖాతా దారుడి పేరుతో వివరాలు సరి చేసుకునే సదుపాయం) ఉంటుంది. కానీ రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా చేసే లావాదేవీల్లో ఈ సదుపాయం ఉండదు. దాంతో కొన్నిసార్లు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)ను ఆర్బీఐ కోరింది.ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీల్లో ఏదైనా పొరపాటు జరిగి వేరే అకౌంట్లోకి డబ్బు జమైతే తిరిగి వాటిని రాబట్టడం పెద్దపని. కాబట్టి పేమెంట్ చేసేముందే అన్ని వివరాలు సరిచూసుకుంటే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో జరిగే మోసాలు అరికట్టడానికి, పొరబాట్లు జరగకుండా నగదు బదిలీ చేసేందుకు ఏ ఖాతాకైతే నగదు వెళుతుందో ఆ ఖాతాదారుడి పేరును తనిఖీ చేయడానికి వినియోగదార్లకు వీలు కల్పించేలా ఒక సదుపాయాన్ని (లుక్ అప్ ఫెసిలిటీ) అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)ను ఆర్బీఐ కోరింది. ఏప్రిల్ 1, 2025 వరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసు అందిస్తున్న అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ(RBI) సూచించింది.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!యూపీఐ, ఐఎంపీఎస్లకు ఇలా..ఫోన్‌పే, జీపే.. వంటి థర్డ్‌పార్టీ యూపీఐ పేమెంట్ యాప్‌లు, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సమయంలో ఎవరికైతే డబ్బు పంపించాలో ఆ ఖాతాదారుడి పేరు వివరాలు ధ్రువీకరించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే లావాదేవీలకు ఆ సదుపాయం లేదు. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్..
దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌ను అరికట్టడం, బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.రిస్క్‌లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.డార్మాంట్ అకౌంట్లుడార్మాంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.ఇనాక్టివ్ అకౌంట్లునిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. -
పట్టిందల్లా బంగారమే!
మురిపించిన బంగారం.. రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించిన స్టాక్ మార్కెట్లు. డాలర్ విలువతో బక్కచిక్కిన రూపాయి.. 2024లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందని విధంగా వీటి ప్రయాణం సాగిపోయింది. రష్యా–ఉక్రెయిన్; ఇజ్రాయెల్–హమాస్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఘర్షణలు; కొండెక్కిన ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో టారిఫ్‌ల భయాలు.. ఇలాంటి ఎన్నో పరిణామాలు, అనిశ్చితులు బంగారానికి డిమాండ్ పెంచాయి. దీంతో ఈ ఏడాది ఈక్విటీ, డెట్‌కు మించి బంగారం సూపర్ ర్యాలీ చేసింది. డాలర్ బలోపేతం, అమెరికా డెట్‌లో మెరుగైన రాబడులతో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యం చూపించారు. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది 3 శాతం వరకు క్షీణించింది. స్థానిక రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు ఒకింత ఈక్విటీ మార్కెట్లను ఆదుకున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మీద ఈక్విటీలు నికర రాబడులను అందించాయి. బంగారం తర్వాత ఇన్వెస్టర్లు వెండికి ప్రాధాన్యం ఇచ్చారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వెండి కూడా ర్యాలీ చేసింది. స్టాక్ మార్కెట్లు రికార్డులే రికార్డులుఅంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, (ఎఫ్ఐఐలు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు చేపట్టినప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. దీనికి దేశీ పెట్టుబడులే అండగా నిలిచాయని చెప్పుకోవాలి. ఏడాది చివర్లో స్టాక్స్ మరోసారి దిద్దుబాటులోకి వెళ్లినప్పటికీ.. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 9 శాతం (6,459 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.58 శాతం (2,082 పాయింట్లు) మేర లాభాలను (డిసెంబర్ 27 నాటికి) ఇచ్చాయి. ‘‘దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అసాధారణ అమ్మకాలకు దిగడంతో గత రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి దిద్దుబాటుకు గురైంది. 2020 కరోనా విపత్తు తర్వాత ఇది మూడో గరిష్ట దిద్దుబాటు’’అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్లడించింది. రెండు అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలను ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్–ఇరాన్ నేరుగా దాడులకు దిగాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా సమసిపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కార్పొరేట్ ఫలితాలు బలంగా ఉండడం, దేశీ పెట్టుబడుల ప్రవాహం, జీడీపీ పటిష్ట వృద్ధితో.. బీఎస్ఈ సెన్సెక్స్ 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట రికార్డును సెపె్టంబర్ 27న నమోదు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అదే రోజున 26,277 గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయిల నుంచి చూస్తే సెన్సెక్స్ డిసెంబర్ 27 నాటికి 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం చొప్పున నష్టపోయాయి. → నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు: 26,277 (సెప్టెంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 2,082 పాయింట్లు (9.58%) → సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు: 85,978 (సెపె్టంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 6,459 పాయింట్లు (9%) → విదేశీ ఇన్వెస్టర్ల నికర ఈక్విటీ పెట్టుబడులు: రూ.1,655 కోట్లు (ప్రైమరీ, సెకండరీ) → విదేశీ ఇన్వెస్టర్ల నికర డెట్ పెట్టుబడులు: రూ.1,12,409 కోట్లుడిసెంబర్ 27 చివరికి సెన్సెక్స్ ముగింపు 78,699 కాగా, నిఫ్టీ ముగింపు 23,813 పాయింట్లు. ‘‘2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచింది అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయి. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్‌ను గరిష్టాలకు చేర్చింది. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహా్వనించినట్టయింది’’అని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే వివరించారు. జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో క్షీణించడం, ఇదే త్రైమాసికానికి సంబంధించి బలహీన కార్పొరేట్ ఫలితాలు, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం చివరికి మార్కెట్లో దిద్దుబాటుకు దారితీశాయి. ద్రవ్యోల్బణం 6 శాతం దాటిపోవడంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత కట్టడి దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా వినియోగం క్షీణించి, వృద్ధిపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాదిలో అధిక భాగం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైనే చలించింది. వరుసగా 9వ ఏట భారత ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచగా, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ అయితే మరింత రాబడులతో మురిపించాయి.పసిడి మెరుపులు ఈ ఏడాది ఇన్వెస్టర్లు ఊహించినదానికి మించి బంగారం రాబడులు పంచింది. వెండి కూడా మెరిసింది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.63,000 స్థాయిలో ఉండగా, రూ.78,000–79000కు వృద్ధి చెందింది. రూపాయి మారకంలో 24 శాతం ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో అయితే 29 శాతం పెరిగింది. ఇక వెండి కిలో ధర రూ.78,600 స్థాయి నుంచి 16 శాతానికి పైగా పెరిగి రూ.91,000కు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు, అంతకంతకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఈ ఏడాది పసిడికి బలాన్నిచ్చాయి. బంగారం అంతర్జాతీయంగా చూస్తే అక్టోబర్‌లో నమోదైన 2,670 డాలర్ల (ఔన్స్‌కు) నుంచి 4 శాతం నష్టపోయింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ ర్యాలీ, ద్రవ్యోల్బణం ఆందోళనలు కొంత శాంతించడం పసిడి చల్లబడడానికి కారణాలుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో ప్రస్తావించింది. అయినప్పటికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగడం, ఆర్బీఐ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి నిల్వలను పెంచుకుంటూ పోవడం ధరలకు మద్దతునిచ్చాయి. పండుగల సీజన్లో తప్పించి ఈ ఏడాది బంగారం ఆభరణాల కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అనుసరించారు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనుగోళ్లు మాత్రం వృద్ధి చెందాయి. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (సిల్వర్ ఈటీఎఫ్‌లు) ఈ ఏడాది 20 శాతం వరకు నికర రాబడిని అందించాయి. బంగారం ఈటీఎఫ్‌లు సగటున 20 శాతం పెరగ్గా, సిల్వర్ ఈటీఎఫ్‌ల ధర 19.66 శాతంగా పెరిగింది. ఈ రెండు విభాగాల్లోనూ మొత్తం 31 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. 2023లో గోల్డ్ ఈటీఎఫ్‌లు 13 శాతం రాబడిని, సిల్వర్ ఈటీఎఫ్‌లు సగటున 4 శాతం రాబడిని అందించాయి. భారత గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం భౌతిక బంగారం గడిచిన నాలుగేళ్లలో రెట్టింపై 2024 అక్టోబర్ చివరికి 54.5 టన్నులకు చేరినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు గతేడాదితో పోలి్చతే రెట్టింపై రూ.7367 కోట్లకు చేరాయి. 2023లో 2,919 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. ఆర్బీఐ కొనుగోళ్లు.. ఈ ఏడాది బంగారం ధరల ర్యాలీకి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు సైతం ప్రేరణగా నిలిచాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 11 నెలల్లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 9 శాతం పెరిగి 876 టన్నులకు చేరాయి. 2023లో 16 టన్నులు, 2022లో 33 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకున్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో భారత్ దిగుమతి చేసుకున్న బంగారం 800 టన్నులను మించి ఉంటుందని అంచనా వేసింది. 2023 ఏడాది మొత్తం దిగుమతులు 689 టన్నులుగా ఉన్నట్టు.. విలువ పరంగా చూస్తే దిగుమతులు 48 శాతం పెరిగినట్టు (ధరల పెరుగుదలతో) డబ్ల్యూజీసీ తెలిపింది. సావరీన్ గోల్డ్ బాండ్లు కనుమరుగు! బంగారంపై పెట్టుబడులను ఎల్రక్టానిక్ రూపంలోకి మళ్లించే ఉద్దేశ్యంతో 2015లో మోదీ సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఏటా నాలుగు విడతలుగా వీటిని జారీ చేయడం ద్వారా నిధులు సమకరిస్తూ వచ్చింది. ఇన్వెస్టర్లకు ఇవి మెరుగైన రాబడులు ఇచ్చాయి. ‘‘2024లో కేవలం ఒక్క విడతే ఎస్జీబీని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసింది. 2023లో నాలుగు ఇష్యూలు చేపట్టింది. 2.5 శాతం వడ్డీ హామీకితోడు పన్ను మినహాయింపు ప్రయోజనాలతో బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్య సాధనంగా ఇది మారిపోయింది. దీంతో డిమాండ్–సరఫరా మధ్య తీవ్ర అంతరానికి దారితీసింది. ఫలితంగా ఇన్వెస్టర్ల ఆసక్తి గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లింది’’ అని ఫిన్‌ఎడ్జ్ కో ఫౌండర్ మయాంక్ భటా్నగర్ తెలిపారు. పసిడి బలమైన ర్యాలీ, దీనికితోడు వడ్డీ చెల్లింపులు భారంగా మారడంతో ఎస్‌బీజీలను కేంద్రం నిలిపివేసినట్టు తెలుస్తోంది. → గోల్డ్ ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: 82,000 (అక్టోబర్ 30న హైదరాబాద్) → వెండి ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: రూ.1,01,900 (అక్టోబర్ 30) → ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు: 73 టన్నులు (నవంబర్ నాటికి) → బంగారం దిగుమతులు: 800 టన్నులు (నవంబర్ నాటికి) → గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు: 7,367 కోట్లు (అక్టోబర్ నాటికి) ఎఫ్ఐఐలు నికర పెట్టుబడిదారులేఅక్టోబర్, నవంబర్ నెలల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.1.4 లక్షల కోట్ల అమ్మకాలకు పాల్పడడం గమనార్హం. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 16 శాతానికి దిగొచ్చింది. 12 ఏళ్ల కనిష్ట స్థాయి ఇది. రిటైల్, దేశీ ఇనిస్టిట్యూషన్లు, హెచ్ఎన్ఐల వాటా 32 శాతానికి చేరింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నాటికి ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,19,277 కోట్ల మేర స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా (సెకండరీ మార్కెట్) అమ్మకాలు నిర్వహించారు. అదే సమయంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా (ఐపీవోలు) వీరు రూ.1,20,932 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా స్పష్టం చేస్తోంది. అంటే ఈక్విటీల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,655 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఈ ప్రకారం ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇంత వరకు నికర పెట్టుబడిదారులుగానే ఉన్నారు. ఎక్సే్ఛంజ్‌ల ద్వారా అమ్మకాలన్నవి అధిక వ్యాల్యూషన్ల వల్లే. అదే సమయంలో సహేతుక విలువలు ఉండడంతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డీకే విజయ్‌కుమార్ తెలిపారు. డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఈ ఏడాది మొత్తం మీద రూ.1,12,409 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా ఆధారంగా తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెరుగుపడిన కరెంట్ అకౌంట్ లోటు
దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పరిస్థితి కొంత మెరుగుపడింది. 2024–25 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 11.2 బిలియన్ (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ 1.2 శాతం) డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 11.3 బిలియన్ (జీడీపీ 1.3 శాతం) డాలర్లు. దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు ఇవీ... 2024–25 క్యూ2లో: 11.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 క్యూ2లో: 11.3 బిలియన్ (జీడీపీలో 1.3 శాతం) డాలర్లు. 2024–25 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్ ): 21.4 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్): 20.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.వాణిజ్య లోటు ఇలా... 2024–25 రెండో త్రైమాసికంలో ఎగుమతి–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 75.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023–24 ఇదే కాలంలో ఈ లోటు 64.5 బిలియన్ డాలర్లుగా ఉంది.నికర సేవల ఆదాయం 2024–25 రెండో త్రైమాసికంలో నికర సేవల ఆదాయం 44.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 39.9 బిలియన్ డాలర్లుగా ఉంది. సమీక్షా కాలంలో కంప్యూటర్, వ్యాపార, ప్రయాణ, రవాణా సేవల వంటి రంగాలలో సేవల ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. -
మళ్లీ రూ.5వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ అప్పు చేస్తోంది. ఈసారి ఏకంగా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.2,000 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ వరకు రూ.65,590 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,237 కోట్లు అప్పు చేసింది. ఈ నెల 31వ తేదీన మరో రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులే రూ.74,827 కోట్లకు చేరనున్నాయి. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసింది. దీనికి తోడు చంద్రబాబుతోపాటు కూటమి నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలోను, బడ్జెట్‌కు బయట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అప్పులు చేస్తే ఒప్పు... అదే గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తే తప్పు... అన్నట్లుగా చిత్రీకరించడమే ఎల్లో మీడియా నైజంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.పీపీఐ అంటే..పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్ బ్యాంక్ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి. -
జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.అమెజాన్ ప్రైమ్జనవరి 1 నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.కార్ల ధరల పెంపు2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.థాయిలాండ్ ఈ-వీసా1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులుచదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.LPG సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.RBI ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు & హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.యూపీఐ 123 పేరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్
భారత్ ఎకానమీ సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత క్రమంగా రికవరీ బాటన పయనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బులెటిన్ పేర్కొంది. పండుగల సీజన్, గ్రామీణ డిమాండ్ పెరుగుదల దీనికి దోహదపడుతున్న అంశాలుగా వివరించింది. ద్రవ్యోల్బణం(Inflation) అదుపులో ఉండడం– వృద్ధి సమతౌల్యతతో ప్రపంచ ఎకానమీ కూడా సవాళ్లను తట్టుకుంటూ పురోగమిస్తున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరుతో రూపొందించిన డిసెంబర్ బులెటిన్ విశ్లేషించింది.ఆర్బీఐ బులెటిన్‌లో వ్యక్తమైన అభిప్రాయాలు రచయితలవి తప్ప, సంస్థకు చెందినవిగా పరిగణించరాదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ పాలసీ సమీక్ష, క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని విశ్లేషించింది. తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండో క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మందిఆర్థిక వ్యవస్థ(economy) వృద్ధి రేటు క్షీణతకు ప్రధానంగా రెండు అంశాలు కారణమని రచయితులు తెలిపారు. స్థిరంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం, సరైన రీతిలో ఉత్పత్తి చేయడం.. ఈ రెండు అంశాల్లో వస్తున్న మార్పుల వల్ల ద్రవ్యోల్బణం ప్రతికూలంగా మారుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ధరల ఒత్తిళ్ల కారణంగా ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోతున్నారని తెలిపారు. -
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్‌లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. -
దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆర్బీఐ సమీక్ష
గువహటి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గువహటిలో జరిగిన 612వ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించింది. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన మొదటి బోర్డ్ సమావేశమిది. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ ఆరేళ్లు అందించిన విశేష సేవలను బోర్డ్ ప్రశంసించింది.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?‘ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితిని, అవుట్‌లుక్‌ను బోర్డ్ సమీక్షించింది. ఎంపిక చేసిన సెంట్రల్ బ్యాంక్ శాఖల కార్యకలాపాలతో పాటు దేశంలో ‘బ్యాంకింగ్ ధోరణి, పురోగతి–2023–24’పై ముసాయిదా నివేదికపై చర్చించింది’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఇతర డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్, రవీంద్ర హెచ్ ధోలాకియాలు సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్ జే కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
కొత్త సార్ ముందున్న సవాళ్లు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తోంది. ఏ దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌కైనా ఆర్థిక సవాళ్లు తప్పవు. ఇటీవల ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికమవుతున్న ఆహార ద్రవ్యోల్బణం, తగ్గుతున్న పారిశ్రామిక ఉత్పత్తి..వంటి చాలా సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. సంజయ్ మల్హోత్రా ముందున్న కొన్ని సవాళ్లను నిపుణులు విశ్లేష్తిస్తున్నారు.ద్రవ్యోల్బణంవార్షిక ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబరులో గరిష్టంగా 6.21శాతానికి చేరింది. సెప్టెంబరులో ఇది 5.49శాతంగా నమోదైంది. మార్కెట్ అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 2-4 ఉండాలి. కానీ దాన్ని మించిపోతుంది.ఆహార ద్రవ్యోల్బణంఈ ఏడాది సెప్టెంబరులో 9.2 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరులో 10.8 శాతానికి ఎగబాకింది. కూరగాయలు, వంట నూనెలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి.పెట్టుబడులు ఆకర్షించేలా..ఇటీవల కాలంలో మార్కెట్లు భారీగా పడిపోయాయి. క్రమంగా రెండు నెలల కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయాలకు పైగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించారు. ఈరోజు (డిసెంబర్ 17) మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కెట్ల నుంచి దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇలా మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఎఫ్‌పీఐలు గణనీయంగానే తమ పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. వారికి మరింత ధీమా కలిగేలా ఆర్బీఐ వ్యవహరించాల్సి ఉంటుంది. అగ్రరాజ్య విధానాల ప్రభావం ఈ పెట్టుబడులపై అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.డిజిటల్ మోసాలుపెరుగుతున్న సాంకేతికతకు తోడుగా ఆర్థిక వ్యవస్థను పటిష్ట భద్రత కల్పించాలి. లేదంటే సైబర్ఫ్రాడ్ల రూపంలో ఆర్థిక మోసాలు అధికమవుతాయి. ప్రస్తుతం కాలంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుల సమాచారానికి భంగం వాటిల్లకుండా, లావాదేవీలు సజావుగా సాగేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!డిపాజిట్లు.. ఎన్పీఏలుబ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారులకు నమ్మకం సన్నగిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంది. సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే బ్యాంకింగేతర రంగంలో డిపాజిట్లపై మరింత రాబడి వచ్చే ప్రత్నామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. దాంతో చాలా మంది కస్టమర్లు డిపాజిట్లపై మొగ్గు చూపడంలేదు. దాంతో బ్యాంకులు క్రిడిట్ ఇవ్వాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇచ్చిన అప్పులు వసూలుకాక నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేలా ఆర్బీఐ మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపుల కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈ-మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే, సదరు మెయిల్లో బెదిరింపులు రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.దీంతో, వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో బెదిరింపు కాల్స్, మెయిల్స్ సంఖ్యలో పెరిగింది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి. మరోవైపు.. పలు విమాన సర్వీసులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది బాంబు బెదిరింపుల సంఖ్య ఏకంగా 900పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Mumbai | A threatening email was received on the official website of Reserve Bank of India. The email was in Russian language, warned to blow up the bank. A case has been registered against unknown accused in Mata Ramabai Marg (MRA Marg) police station. Investigation into the…— ANI (@ANI) December 13, 2024 -
ఆర్బీఐ కొత్త గవర్నర్.. ఎవరీ 'సంజయ్ మల్హోత్రా'?
-
సారొచ్చారు.. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్ మల్హోత్రా చెప్పారు.అపార అనుభవం..56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
పదేళ్లూ పెరుగుదలే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రంలో కీలకాంశంగా పరిగణించే ద్రవ్యలోటు గత పదేళ్లలో భారీగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వె ల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రూ.9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.56,063 కోట్లకు చేరిందని పేర్కొంది. పలు సూచీల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశంలోని రాష్ట్రాల సంబంధిత గణాంకాలతో (హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024) ఆర్బీఐ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవ్యలోటు భారీగా నమోదవుతోంది. బడ్జెట్ పరిమాణం, రాష్ట్రాల స్థూల ఉత్పత్తితో పాటు ద్రవ్యలోటు కూడా అదే స్థాయిలో పెరుగుతోందని తెలిపింది. గత పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకాంశాలు ఇలా ఉన్నాయి. రూ.9,410 కోట్ల నుంచి రూ.56,063 కోట్లకు పెరిగిన ద్రవ్యలోటు» తెలంగాణ రాష్ట్ర నికర అప్పులు (గ్యారంటీలు కాకుండా) 2024 మార్చి నాటికి రూ.3,89,673 కోట్లుగా ఉన్నాయి. అదే 2015 మార్చి నాటికి ఇవి రూ.72,658 కోట్లు మాత్రమే. » గత పదేళ్లలో సామాజిక రంగాలపై ఖర్చు భారీగా పెరిగింది. సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల కల్పన, పారిశుధ్యం తదితర అవసరాల కోసం చేసే ఖర్చు 2014–15లో రూ.24,434 కోట్లు ఉండగా, 2023–24లో రూ.1,27,123 కోట్లకు పెరిగింది. ఇక మూలధన వ్యయం 2014–15లో రూ.11,583 కోట్లుగా, 2023–24లో రూ.78,611 కోట్లుగా నమోదైంది. » అప్పులకు వడ్డీల కింద 2014–15లో రూ.5,227 కోట్లు మాత్రమే చెల్లించగా, 2023–24లో రూ.22,408 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దేశంలోని మరో 10 రాష్ట్రాలు కూడా అప్పులకు వడ్డీల కింద మనకంటే ఎక్కువే చెల్లిస్తుండడం గమనార్హం. » గత పదేళ్ల కాలంలో పన్నేతర ఆదాయంలో పెరుగుదల ఆశించినంతగా కనిపించలేదు. 2014–15లో రూ.6,447 కోట్లు ఉన్న పన్నేతర ఆదాయం స్వల్ప పెరుగుదలతో 2023–24లో రూ.22,808 కోట్లకు చేరింది. » రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పన్ను ఆదాయం (సొంత రాబడులు) పదేళ్ల కాలంలో బాగానే పెరిగింది. ఇది 2014–15లో రూ.29,288 కోట్లు మాత్రమే ఉండగా, 2023–24 నాటికి రూ.1,31,029 కోట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో రూ.10 వేల కోట్లు పెరిగిన సొంత ఆదాయం, వరుసగా మరో రెండేళ్లు అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో మాత్రం స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేసింది. 2018–19లో రూ.65,040 కోట్లు ఉన్న పన్ను ఆదాయం, 2019–20లో 67,597 కోట్లకు పెరగగా, 2020–21లో రూ.66,650 కోట్లకు తగ్గింది. మహమ్మారి నుంచి బయటపడిన తర్వాతి ఏడాది 2021–22లో ఏకంగా రూ.25 వేల కోట్లు పెరిగింది. ఆ తర్వాతి ఏడాది రూ.10 వేల కోట్లు, గత ఏడాదిలో రూ.21 వేల కోట్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరింది.పరిమిత స్థాయిలో ఓకే.. కానీ..రెవెన్యూ వసూళ్లు, రుణ వసూళ్లతో పాటు రుణసమీకరణ ద్వారా వచ్చిన రాబడి కంటే ఆ ఏడాదిలో జరిగిన మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. వ్యక్తులైనా, వ్యవస్థలైనా, రాష్ట్రాలైనా, దేశాలైనా పొదుపు చేసి పెట్టుబడి పెట్ట డం సాధ్యం కాదు. ఆలస్యం కూడా అవు తుంది. ఈ నేపథ్యంలో పరిమిత స్థాయిలో ఉండే ద్రవ్య లోటును ప్రతికూల కోణంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్థాయికి మించి.. అంటే కొత్తగా తెచ్చే అప్పులు, చెల్లించాల్సిన అప్పులు, వడ్డీల కంటే మించితే అది భారంగా పరిణమిస్తుంది. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2023–24లో ద్రవ్యలోటు రూ.56 వేల కోట్లకు పెరిగింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3 శాతానికి మించకూడదు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉంది. రాష్ట్ర జీఎస్డీపీ రూ.13.5 లక్షల కోట్లు ఉంటుందనే అంచనా మేరకు, రాష్ట్ర ద్రవ్యలోటు కూడా 4 శాతం మించుతోంది. – డాక్టర్ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు -
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేస్తారు.అపార అనుభవం... 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు.సమన్వయానికి మారుపేరు... ఉర్జిత్ పటేల్ ఆకస్మిక ని్రష్కమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద మిగులు నిధుల బదిలీ సమస్యపై ఆర్బీఐ– ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ నేపథ్యంలోనే పటేల్ ఆకస్మిక రాజీనామా చోటుచేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఉర్జిత్ రాజీనామా నేపథ్యంలో అనిశి్చతిని ఎదుర్కొన్న మార్కెట్‌కు తిరిగి విశ్వాసాన్ని అందించిన వ్యక్తిగా శక్తికాంతదాస్ నిలిచారు. పలు క్లిష్ట సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య చక్కటి సమన్వయం సాధించడంలో ఆయన విజయం సాధించారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేశారు. -
పూచీకత్తు లేకుండా రైతులకు రూ.2 లక్షలు రుణం
చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.రైతుల మేలు కోసం..చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. -
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం
-
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం ముగిసింది. కీలకమైన రెపోరేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకుకున్న కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐదో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించారు.రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెపోరేటును యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది పదకొండోసారి. ఇక నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించారు. దీంతో ఇది 4 శాతానికి తగ్గింది. -
భారత్ బంగారం.. 882 టన్నులు
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అక్టోబర్‌లో 27 టన్నుల పసిడిని జోడించింది. దీనితో దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరింది. ఇందులో భారత్‌లో 510 టన్నుల బంగారం నిల్వ ఉండగా, మిగిలిన పరిమాణాన్ని న్యూయార్క్, లండన్‌సహా మరికొన్ని చోట్ల ఉన్న గోల్డ్ వాల్ట్‌లలో రిజర్వ్ చేసింది.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ తాజా వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో 60 టన్నులు జోడించడం విశేషం. కాగా, జనవరి నుంచి అక్టోబర్ వరకూ భారత్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని సమకూర్చుకుంది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఆర్బీఐ బంగారం జోడింపు ఐదు రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!భారత్ తర్వాత టర్కీ, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో వరుసగా 17, 8 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఈ రెండు దేశాలూ వరుసగా 72, 69 టన్నులను తమ బంగారు నిల్వలకు జోడించి మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
యూపీఐ లైట్ వాలెట్ పరిమితి పెంపు
యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాలెట్ పరిమితిని రూ. 5,000కు, ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 1,000కి పెంచింది. ఇందుకు సంబంధించి 2022 జనవరిలో జారీ చేసిన ’ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్’ను సవరించింది. ప్రస్తుతం ఈ విధానంలో ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 500గా, మొత్తం వాలెట్ లిమిట్ రూ. 2,000గా ఉంది. గత అక్టోబర్‌లో ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా ఈ పరిమితులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా అందుబాటులో లేని పరిస్థితుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేయగలిగే సాంకేతికతలను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.యూపీఐ పిన్ని ఉపయోగించకుండా తక్కువ-విలువ లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను యూపీఐ లైట్ అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లపై ఆధారపడకుండా కస్టమర్-ఫ్రెండ్లీ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి, వ్యాపారులకు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు. -
ఆ బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష కోట్లు.. ఆర్బీఐ ఆదేశాలు
ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాల సంఖ్యను సత్వరమే తగ్గించుకోవాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇనాపరేటివ్ ఖాతాలకు సంబంధించి గణాంకాలను ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ఆర్బీఐకి నివేదించాలని కోరింది.ఈ తరహా ఇనాపరేటివ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండిపోవడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సమస్యల కారణంగా ఖాతాలు నిరుపయోగంగా లేదా స్తంభించిపోయినట్టు తమ తనిఖీల్లో తెలిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల సంఖ్య అధికంగా ఉండడం, వాటిల్లో నిధులు ఉండిపోవడాన్ని ఆర్బీఐ గుర్తించింది.దీంతో వాటిని తగ్గించుకోవాలని, సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని సైతం పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 చివరి నాటికి ఇనాపరేటివ్ ఖాతాలలో రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్లు స్తంభించాయి. వీటిలో రూ. 42,270 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?ప్రభుత్వరంగ ఎస్బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇక కస్టమర్లకు సంబంధించి ఆధార్ అప్డేటెషన్ సేవలను సైతం అందించాలని, ఆధార్ ఆధారిత సేవలకు వీలు కల్పించాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇనాపరేటివ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదించినప్పటికీ, పేరు ఇతర వివరాలు సరిపోకపోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. -
ప్రారంభమైన ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తలు అంచనా. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెపె్టంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. -
కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 24,467 వద్దకు చేరింది. సెన్సెక్స్ 110 పాయింట్లు ఎగబాకి 80,956 వద్దకు చేరింది.ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) క్రమంగా అమ్మకాలను తగ్గిస్తున్నారు. అయితే ఈ నెల 6న జరగబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై మార్కెట్ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఆదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బాబు అప్పులు.. 6 నెలల్లో రూ.67,237 కోట్లు
సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి.. సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా.. నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారు. తాజాగా మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 7.11 శాతం వడ్డీకి రూ.4,237 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 10 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దీంతో బాబు సర్కార్ ఆరు నెలల్లో ఇప్పటి వరకు చేసిన అప్పు రూ.67,237 కోట్లకు చేరింది. ఇందులో బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు అప్పు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద రూ.8,000 కోట్లు అప్పు చేసింది. కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు అప్పు చేసేందుకు గ్యారంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుపట్టాయి. కానీ ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు, మార్కెఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు, ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు.. కలిపి మొత్తం రూ.8,000 కోట్ల అప్పునకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి0ది. చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అది ఒప్పులా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్పులా ఎల్లో మీడియాకు కనిపించడం గమనార్హం.ఈ వారం అప్పు రూ.4,237 కోట్లు ఇప్పటి వరకు చేసిన మొత్తం అప్పు రూ. 67,237 కోట్లు బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు బడ్జెట్ బయట రూ.8,000 కోట్లుప్రభుత్వ గ్యారంటీలతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు (రూ.కోట్లలో..) పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు -
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
జీడీపీ మందగమనం
దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అంచనాలను మించలేకపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశార్థికం భారతీయ రిజర్వు బ్యాంకు ఆశించిన ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తే ఈసారి కనిష్ఠంగా 5.4 శాతం వృద్ధి కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో అదే తంతు కొనసాగింది. ఏప్రిల్-జూన్ కాలంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని చేరుకోలేక 6.7 శాతంతో సరిపెట్టుకుంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆశించినంత పెరగదని రిజర్వు బ్యాంకు ముందుగానే అంచనా వేసింది. అందుకు విభిన్న అంశాలు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఎన్నికల వల్ల వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గడం, వ్యవసాయ, సేవా రంగాల్లో క్షీణత జీడీపీ వృద్ధికి నిరోధంగా నిలిచాయి. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధిని వెనక్కు లాగిన కొన్ని అంశాలను ఆర్బీఐ వెల్లడించింది.వేతనాల్లో మార్పు లేకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో వాస్తవ వేతన వృద్ధిలో ఎలాంటి మార్పులు లేవు. దాంతో వృద్ధికి ప్రతికూలంగా మారింది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.అధిక ఆహార ద్రవ్యోల్బణం: రిటైల్ ఆహార ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది పట్టణ వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.బలహీనమైన తయారీ రంగం: తయారీ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది.తగ్గిన ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గుతోంది. దానివల్ల ఉపాధి సృష్టి జరగక వినియోగం మందగిస్తోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతోంది.ప్రతికూల వాతావరణ పరిస్థితులు: మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా విభాగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది.కార్పొరేట్ ఆదాయాలు: చాలా కంపెనీలు రెండో త్రైమాసికంలో ఆశించినమేర ఆదాయాలు పోస్ట్ చేయలేదు. ఇది వస్తు వినియోగం తగ్గుదలను సూచిస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లకు చేరుకుంది. అది రెండో త్రైమాసికంలో రూ.44.1 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని ‘వాస్తవ జీడీపీ’ అంటారు. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకుని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది. -
ఆర్థిక సంస్థల స్థాయి పెరిగితేనే ‘అభివృద్ధి చెందిన దేశం’
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే ఆకాంక్షను సాధించాలంటే ఆర్థిక సంస్థల స్థాయి, పరిమాణం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర రావు అన్నారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 90వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఇక్కడ నిర్వహించిన ‘గ్లోబల్ సౌత్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ల ఉన్నత–స్థాయి విధాన సదస్సు’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు...గతంలో ప్రారంభించిన నియంత్రణా విధానాలు, తీసుకున్న విధానపరమైన చర్యలు భారత్‌లో పటిష్టమైన. సవాళ్లను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధికి దారితీశాయి. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న భారత్ ఎకానమీని స్థిరపరచాయి. అయితే ఎకానమీ మరింత పురోభివృద్ధికి ఫైనాన్షియల్ సంస్థల పరిమాణం మరింత పెరగాలి. దృఢమైన పాలన వ్యవస్థ, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ ఈ దిశలో పురోగతికి దారితీసే అంశాలు. బ్యాంకులతో పాటు సంస్థలుసైతం తమ పెరుగుతున్న నిధులు అవసరాలను నెరవేర్చుకోడానికి క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐకి ఉన్నంత విస్తృత ఆధారిత ప్రపంచంలో చాలా సెంట్రల్ బ్యాంకులు లేవు. ఎకానమీ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తోంది. ఆర్బీఐ 75 సంవత్సరాల అనుభవం.. దేశ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు, ఎకానమీకి మద్దతు ఇవ్వగల బలమైన ఆర్థిక రంగానికి పునాదిని నిర్మించింది. -
ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతినొప్పి కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజానికి ఛాతినొప్పి అనగానే గుండె సంబంధిత అనారోగ్య సమస్యగానే భావిస్తాం. కానీ ఆయనకు ఎసిడిటీ కారణంగా ఛాతినొప్పి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా ? దీన్ని గుర్తించగలమా..?ఒడిశాలో జన్మించిన శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్. ప్రస్తుతం ఆయన చైన్నైలోని అపోల ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ శక్తిదాస్కి ఎసిడిటి కారణంగా ఛాతి నొప్పి వచ్చిందని అందువల్లే ఆస్పత్రిలో చేరినట్లు నివేదకలు చెబుతున్నాయి. అంటే ఎసిడిటీ వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుందా అనే సందేహం ఒక్కసారిగా అందరిలోనూ మెదలయ్యింది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అన్నవాహికలోకి ఆమ్లం తిరిగి ప్రవహిస్తున్నప్పు ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా గుండెల్లో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమువుతాయని అన్నారు. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో బయటపడవచ్చు లేదా మందులతో కూడా నివారించొచ్చని వెల్లడించారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన సందర్భాల్లోనే ఇలా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. గుర్తించగలమా? అంటే..ఆమ్లత్వంతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పిని యాసిడ్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఇది ఛాతీలో మంటలా వస్తుంది. అయితే అందరూ గుండెల్లో మంటగా అపోహ పడుతుంటారు. ఈ విధంగా ఏదైనా తిన్న తర్వాత జరగుతుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు తీవ్రమై కొన్ని సార్లు పుల్లని రుచి లేదా కడుపు ఆమ్లం గొంతులోకి తన్నుకురావడంతో వాంతి రూపంలో బయటకొస్తుంది. అయితే గుండె సంబంధిత ఛాతీ నొప్పిలా కాకుండా ఎసిడిటీ సంబంధిత అసౌకర్యం చేతులు, మేడ లేదా దవడలకు వ్యాపించదు. చెప్పాలంటే ఈ సమస్యను ప్రథమ చికిత్సలో భాగంగా బాధితుడిని నిటారుగా కూర్చోబెడితే ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం పొందుతారు. పైగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఛాతి నొప్పిని గుండె సంబంధితమా లేదా ఎసిడిటీ వల్ల అనేది గుర్తించడం మాత్రమే కష్టమే అంటున్నారు నిపుణులు. అందువల్ల వాళ్లని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే అక్కడ వైద్యులే ఇది దేని వల్ల వచ్చిందనేది అంచనా వేయగలరు అని చెబుతున్నారు నిపుణులు.ఎప్పుడు క్రిటికల్ అంటే..అన్నవాహిక అల్సర్లు లేదా స్ట్రిక్చర్స్ వంటి అంతర్లీన సమస్యలు ఉంటే..నిర్జలీకరణానికి దారితీసేలా నిరంతర వాంతులు లేదా తీవ్రమైన ఛాతి నొప్పికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఈరోజు ఉదయం దాస్‌కు ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి విషమించి ఆసుప్రతిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీ ద్వారా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దాస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 2-3 గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.The Reserve Bank Governor, Shaktikanta Das IAS, has been admitted to #Chennai Apollo Hospital due to chest pain. He is currently under the close supervision of medical professionals: sources #RBI pic.twitter.com/P0Z26uq8Dl— Mahalingam Ponnusamy (@mahajournalist) November 26, 2024ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా 2018లో నియమితులయ్యారు. ఆయన అంతకుముందు పదిహేనో ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఎన్డీబీ, ఏఐఐబీలలో ప్రత్యామ్నాయ గవర్నర్‌గా కూడా పనిచేశారు. భారత్ తరఫున ఐఎంఎప్, జీ20, బ్రిక్స్, సార్క్ మొదలైన అనేక అంతర్జాతీయ ఫోరమ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. -
బీమా రంగంలోకి సెంట్రల్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్బీఐ నుంచి అనుమతిని పొందింది. జనరాలి గ్రూప్‌తో భాగస్వామ్య ప్రాతిపదికన బీమాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం భాగస్వామ్య సంస్థ(జేవీ)కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఐసీఎల్), ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఎల్ఐసీఎల్)లలో వాటాల కొనుగోలుకి సెంట్రల్ బ్యాంక్‌ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అక్టోబర్‌లోనే అనుమతించింది.రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్)కు చెందిన జీవిత, సాధారణ బీమా వెంచర్లో వాటా కొనుగోలుకి ఈ ఏడాది ఆగస్ట్‌లో విజయవంత బిడ్డర్‌గా ఎంపికైనట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్న సంగతి తెలిసిందే.. -
ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు. -
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
ఆర్బీఐ హెచ్చరిక: అలాంటివి నమ్మకండి
డీప్‌ఫేక్ వీడియోలు తెరమీదకు వచ్చిన సంఘటనలో గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ వీడియోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెట్టుబడి పథకాలను ఆర్బీఐ తీసుకొస్తున్నట్లు, అలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని, దీనిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వదు, కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను నిజమని నమ్మితే తప్పకుండా మోసపోతారు. డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు.. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu— ReserveBankOfIndia (@RBI) November 19, 2024 -
2019–24 ఐదేళ్ల సమర్థపాలనలోమున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి
సాక్షి, అమరావతి: సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్లో రెవెన్యూ మిగులు సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019–2024 వరకు దేశంలోని రాష్ట్రాల్లో 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆరి్థక స్థితిగతులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50 శాతానికిపైగా ఆస్తుల కల్పన (మూలధన)కు వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ల మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన వ్యయం 50 శాతం కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది. కేపిటల్ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల మూలధన రాబడులు, వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2019–20 నుంచి 2023–24 మధ్య రెవెన్యూ వసూళ్లలో ఆస్తి పన్నుల వసూళ్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ల్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా సేవలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. -
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
చదువుల 'రుణ' రంగం!
సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. 2023 నాటికి విద్యా రుణాలు రూ.90 వేల కోట్లకు చేరుకున్నాయి. 2023–24లో దేశీయ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ.36,448 కోట్ల మేర విద్యా రుణాలను పంపిణీ చేశాయి. 5,50,993 మంది విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. » గత దశాబ్ద కాలంగా విదేశీ విద్య కోసం రుణాలపై ఆధారపడుతున్న విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. 2012–13లో వీరి సంఖ్య 22,200 కాగా 2020లో ఏకంగా 69,898కి చేరుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ 2022 నివేదిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాలుగు శాతం మాత్రమే రుణాల ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్రలో విద్యా రుణాలకు అధిక డిమాండ్ నెలకొంది. »రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. 2022లో దాదాపు 7.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ విద్యను ఎంచుకున్నారు. వరంలా ‘పీఎం విద్యాలక్ష్మీ’నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు రహిత, హామీ రహిత రుణాన్ని అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్ ప్రకారం 860 విద్యా సంస్థల్లోని సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. » పీఎం విద్యాలక్ష్మీ పథకం కింద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కలిగిన ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రూ.7.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కాలర్‌షిలు, వడ్డీ రాయితీలు పొందకపోతే వారికి రూ.10 లక్షల వరకు రుణం అందుతుంది. మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. పీఎం విద్యాలక్ష్మీ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో విద్యా రుణం మంజూరవుతుంది. -
సాఫీగానే ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగిపోతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉండడం, నియంత్రణలో కరెంటు ఖాతా లోటు, వస్తు, సేవల ఎగుమతుల వృద్ధిని ప్రస్తావించారు. 682 బిలియన్ డాలర్ల విదేశీ మారకంతో (అక్టోబర్ 31 నాటికి) ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రేట్ల కోతకు ఇచ్చిన పిలుపుపై స్పందించలేదు. డిసెంబర్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కోసం తన వ్యాఖ్యలను రిజర్వ్ చేస్తున్నట్టు దాస్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా అక్టోబర్ పాలసీ సమీక్షలో తటస్థ విధానానికి మారినట్టు దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం మధ్యమధ్యలో పెరిగినప్పటికీ మోస్తరు స్థాయికి దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 4 శాతానికి ప్లస్ 2 లేదా మైనస్ 2 శాతం మించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యం కావడం గమనార్హం. దీర్ఘకాలం పాటు అంతర్జాతీయంగా ఎన్నో సంక్షోభ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపించినట్టు దాస్ చెప్పారు. కాకపోతే అంతర్జాతీయంగా ప్రస్తుతం కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ.. బాండ్ ఈల్డ్స్, కమోడిటీ ధరల పెరుగుదలను ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు చెప్పారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని.. ఇందుకు ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్న స్వీయ అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదే సభలో వ్యక్తం చేశారు. రూపాయికి లక్ష్యం లేదు.. రూపాయి మారకం విషయంలో ఆర్బీఐకి ఎలాంటి లక్ష్యం లేదని, అస్థిరతలను నియంత్రించేందుకు అవసరమైనప్పుడే జోక్యం చేసుకుంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ 2022, 2023లో ద్రవ్య కఠిన విధానాలను చేపట్టిన తరుణంలోనూ రూపాయి స్థిరంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) కార్యాచరణకు సంబంధించి ముసాయిదాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. -
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!భగ్గుమంటున్న కూరగాయలువంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. -
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
రూ.2,000 నోట్లు 98 శాతం వెనక్కి
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు 98 శాతం బ్యాంకుల్లోకి తిరిగొచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ రూ.6,970 కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్టు తెలిపింది. రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించడం గమనార్హం. ‘‘అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా, 2024 అక్టోబర్ 31 నాటికి రూ.6,970 కోట్లకు తగ్గాయి. అంటే 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లతో 98.04% వెనక్కి వచ్చాయి’’అని ఆర్బీఐ తెలిపింది. అన్ని బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్‌కు, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించడం తెలిసిందే. 2023 అక్టోబర్ 7 వరకు ఇందుకు అనుమతించింది. ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుకు ఇండియా పోస్ట్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. హైదరాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులోనూ ఈ సదుపాయం ఉంది. -
భారీగా తగ్గనున్న ఏటీఎంలు: కారణం ఇదే..
నగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి.సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. 2022 ఆర్ధిక సంవత్సరంలో 89 శాతం లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది జీడీపీలో 12 శాతం. ఉచిత ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ నిబంధనలు, ఇంటర్ ఆపరేబిలిటీ, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు వంటి అంశాలు ఏటీఎం పెట్టుబడులను నిరుత్సాహపరిచాయి. దీనితో పాటు ఏటీఎంలను వినియోగించేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నందున.. భారతదేశం ఒక్కో శాఖకు రెండు ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఆన్-సైట్, మరొకటి ఆఫ్-సైట్ మోడల్ ఉంటుందని సమాచారం. -
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్షరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ స్థానంలో పనిచేయడానికి అర్హులైన వారి నుంచి కేంద్ర ఆర్థికశాఖ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ స్థానంలో ఉన్న మైకేల్ పాత్రా పదవీకాలం జనవరి 14, 2025న ముగుస్తుంది. దాంతో తన స్థానంలో మరో వ్యక్తిని నియమించేలా ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది. ఈ స్థానంలో పనిచేయబోయే ఆర్థికవేత్తలు విభిన్న విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఈ పదవికి ఎంపికైన వ్యక్తి, ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పర్యవేక్షించాలి. కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా ఉండాలి. ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా 25 ఏళ్ల పాటు భారత్ లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పని చేసి ఉండాలి. కొత్తగా పదవి చేపట్టే వారు 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించకూడదు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!ఆర్థికశాఖ వేతన నిబంధనల ప్రకారం డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల వేతనం, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేవారి 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. -
171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్‌లో వాటి రిజర్వ్‌లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద నిల్వలు 854 టన్నులుఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఇక ముందూ బలమైన డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్‌తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు. -
102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీగా బంగారం నిల్వలు ఉన్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా బంగారాన్ని దాచింది ఆర్బీఐ. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల నుండి స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది.‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. లండన్‌లోని భూగర్భ వాల్ట్‌ల నుండి బంగారాన్ని భారత్‌కు తీసుకురావడం గత మే నెల తర్వాత ఇది రెండవసారి. ఆర్బీఐ మొత్తం 855 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇందులో దాదాపు 510.5 టన్నుల బంగారం దేశంలోనే ఉంది. 2022 నుండి దాదాపు 214 టన్నుల పసిడిని స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ.పెరుగుతున్న ప్రపంచ ఆందోళనలు ఆర్బీఐ, భారత ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. దీంతో మన బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవడం సురక్షితమని భావించిన అధికారులు ఈ తరలింపు చేపట్టారు. 1990లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం కారణంగా చేపట్టిన తరలింపు తర్వాత ఇదే మొదటి భారీ తరలింపు.ప్రత్యేక విమానం.. హై సెక్యూరిటీప్రత్యేక విమానం, అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల సహాయంతో ఆర్బీఐ, భారత ప్రభుత్వం సంయుక్తంగా బంగారం తరలింపు మిషన్‌ను అమలు చేశాయని వార్తా నివేదిక తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని తరలింపులు ఉండవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లో 324 టన్నుల బంగారం కలిగి ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం యూకేలోనే ఉంది. అందులోనూ 20 టన్నుల పసిడి డిపాజిట్ల రూపంలో అక్కడ ఉంచింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన తొమ్మిది భూగర్భ వాల్ట్‌లలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 400,000 బార్లు (సుమారు 5,350 టన్నులు) బంగారం ఉంది. -
3వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
క్రిప్టో కరెన్సీ ప్రమాదం!.. ఆర్బీఐ గవర్నర్
క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. -
బ్యాంకు పనులు ఈరోజుల్లో మానుకోండి..!
బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఎంత ఆన్లైన్ సేవలు ఉన్నప్పటికీ కొన్ని పనులను బ్యాంకులకు వెళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.బ్యాంకు సెలవుల సమాచారం ముందుగా తెలిస్తే దాని ఆధారంగా ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది. మరి వచ్చే నవంబర్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!సెలవుల జాబితా ఇదే..» నవంబర్ 1 శుక్రవారం దీపావళి » నవంబర్ 2 శనివారం దీపావళి (కొన్ని ప్రాంతాల్లో)» నవంబర్ 3 ఆదివారం భాయ్ దూజ్» నవంబర్ 9 రెండవ శనివారం» నవంబర్ 10 ఆదివారం» నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి» నవంబర్ 17 ఆదివారం» నవంబర్ 23 నాల్గవ శనివారం» నవంబర్ 24 ఆదివారంఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా -
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు. -
ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్
నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎంకి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు. -
ఏఐపై అతిగా ఆధారపడొద్దు: శక్తికాంత దాస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్‌దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!డిజిటలీకరణతో మనీ ట్రాన్స్ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దివ్యాంగుల కోసం ఆర్బీఐ..
దివ్యాంగులకు (పీడబ్ల్యుడీ) డిజిటల్ చెల్లింపు విధాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులు అన్ని వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు.. చెల్లింపులను సమీక్షించి, సవరించాలని ఆర్బీఐ ఆదేశించింది.పీడబ్ల్యుడీల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్‌లు, పరికరాలు.. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్ల వంటి చెల్లింపు మౌలిక సదుపాయాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.చెల్లింపు వ్యవస్థలకు అవసరమైన మార్పులను చేపడుతున్నప్పుడు, భద్రతా అంశాలలో రాజీ పడకుండా చూసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. అంతే కాకుండా.. ఆర్బీఐ ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన ఒక నెలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని పీఎస్పీలను ఆదేశించింది. నివేదికలో ఈ మార్పులను అమలు చేయడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా చేర్చాలి. -
డిజిటల్ పేమెంట్స్‌లో మార్పులు.. ఆర్బీఐ ఆదేశం
ముంబై: వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్‌లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ కోరింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.‘‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్పీలు/బ్యాంక్‌లు/నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్‌లు, నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’’అని ఆర్బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
-
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు. -
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పొడిగింపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. -
భారత్ సరికొత్త రికార్డ్: ఆర్బీఐ
భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని ఆర్బీఐ పేర్కొంది.విదేశీ మార్కద్యవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు దాటడంతో.. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. రీవాల్యుయేషన్ లాభాలు, స్పాట్ మార్కెట్ డాలర్ కొనుగోళ్ల కారణంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 10.46 బిలియన్లు పెరిగాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్గత వారం (సెప్టెంబర్ 20) విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 20న బంగారం నిల్వలు కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 'అవిరల్ జైన్'ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా నియమించింది. ఈడీగా పదోన్నతి పొందక ముందు, జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేశారు.అవిరల్ జైన్‌కు కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, జైన్ జైన్ లీగల్ డిపార్ట్మెంట్, ప్రాంగణాల విభాగాన్ని చూసుకుంటారు. అంతే కాకుండా సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన జైన్.. యాంటీ మనీ లాండరింగ్ (AML), నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన సర్టిఫికేట్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) సర్టిఫైడ్ అసోసియేట్ కూడా.RBI appoints Shri Aviral Jain as new Executive Directorhttps://t.co/Oy4ADeR5Qy— ReserveBankOfIndia (@RBI) October 4, 2024 -
పెరిగిన కరెంట్ అకౌంట్ లోటు.. కారణాలు..
దేశానికి వచ్చి-పోయే విదేశీమారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 9.7 బిలియన్ డాలర్ల(రూ.81 వేలకోట్లు) కరెంట్ అకౌంట్ లోటు నమోదైంది. అదే త్రైమాసికానికి చెందిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ 1.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2023 ఏప్రిల్–జూన్) దీని విలువ 8.9 బిలియన్ డాలర్లు(రూ.74 వేలకోట్లు)గా నమోదైంది. అయితే 2024 జనవరి–మార్చి మధ్య కరెంట్ అకౌంట్ 4.6 బిలియన్ డాలర్ల(రూ.38 వేలకోట్లు) మిగులును నమోదుచేసుకుంది. ఈమేరకు ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.సీఏడీ పెరుగుదలకు కారణాలు..క్యూ1లో కరెంట్ అకౌంట్ లోటు పెరగడానికి వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం) కారణమని ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023 క్యూ1లో వస్తు వాణిజ్యలోటు 56.7 బిలియన్ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు)కాగా, 2024 ఇదే కాలంలో ఈ విలువ 65.1 బిలియన్ డాలర్ల(రూ.5.4 లక్షల కోట్లు)కు ఎగసింది.ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్‌పీఐ) 2024–25 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కేవలం 0.9 బిలియన్ డాలర్లు(రూ.7.5 వేలకోట్లు)గా నమోదయ్యాయి.ఏప్రిల్– జూన్ మధ్య విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) 5.6 బిలియన్ డాలర్ల(రూ.47 వేలకోట్లు) నుంచి 1.8 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు)కు పడిపోయాయి.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..రెమిటెన్సులు (ఎన్ఆర్ఐలు దేశానికి పంపిన మొత్తం) మాత్రం 27.1 బిలియన్ డాలర్ల(రూ.2.2 లక్షల కోట్లు) నుంచి 29.5 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)కు పెరిగాయి. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం 4.7 బిలియన్ డాలర్ల(రూ.39 వేలకోట్లు) నుంచి 6.3 బిలియన్ డాలర్ల(రూ.52 వేలకోట్లు)కు ఎగిసాయి.ఎన్ఆర్ఐ డిపాజిట్లు 2.2 బిలియన్ డాలర్ల(రూ.18 వేలకోట్లు) నుంచి 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు చేరాయి. -
గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్‌లైన్
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్, మదింపు, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్-యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) మానిటరింగ్, రిస్క్-వెయిట్ అప్లికేషన్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.ఆర్బీఐ గుర్తించిన ప్రధాన లోపాలు⇒ రుణాల సోర్సింగ్, మదింపు కోసం థర్డ్ పార్టీలను ఉపయోగించడంలో లోపాలు⇒ కస్టమర్ లేకుండానే బంగారం మదింపు⇒ తగిన శ్రద్ధ, బంగారు రుణాల తుది వినియోగ పర్యవేక్షణ లేకపోవడం⇒ డిఫాల్ట్ అయిన రుణాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం⇒ ఎల్టీవీ పర్యవేక్షణలో లోపాలు⇒ రిస్క్-వెయిట్ల అమలులో తప్పులుఅంతేకాకుండా అవుట్సోర్స్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందు కోసం నెలల నెలల గడువును విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్‌షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్రోల్మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..వియత్నాం, బంగ్లాదేశ్‌లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు. -
భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?
భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రెండు వేలరూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ10000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు భారదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే రూ. 500 నోటు అనే చెప్పాలి. -
రాకెట్ స్పీడ్‌లో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మంగళవారం వచ్చిందంటే చంద్రబాబు సర్కారు అప్పు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరుకు చంద్రబాబు సర్కార్ అప్పులు రూ. 31,000 కోట్ల చేరుతున్నాయి. ఇప్పటికే 80 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సర్కారు రూ. 19,000 కోట్లు అప్పు చేసింది. మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరో రూ.12,000 కోట్లు అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలిపింది. దీంతో ఆర్బీఐ నెలవారీ మంగళవారాల్లో బాబు సర్కారు చేసే అప్పుల క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భాగంగానే వచ్చే నెల 1వ తేదీన మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయనుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ అప్పును ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 14 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధిలో రూ.1,000 కోట్లు అప్పు పొందనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలు, అనుమతి మేరకు అప్పులు చేస్తే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అయితే ఇప్పుడు ప్రతీ మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ ఎల్లో మీడియా ఒక ముక్క కూడా ప్రజలకు చెప్పడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదాకా చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో తెలియడంలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీలేమీ అమలు చేయకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల్లోనే రూ. 19 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పు చేసి తెచ్చిన నిధులు ఏ అభివృద్ధి పనులకు వెచ్చి0చారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై ఉందంటున్నారు. అలాగే వచ్చే మూడు నెలల్లో చేసే రూ. 12 వేల కోట్లను ఏ అభివృద్ధికి వ్యయం చేస్తారో చెప్పాల్సి కూడా ఉందంటున్నారు. -
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు
సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..సెలవుల జాబితా ఇదే.. » అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చమ బెంగాల్లో బ్యాంకుల మూత» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో సెలవు» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్టక్లో సెలవు» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుఅక్టోబర్లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. -
తయారీకి బంగారు భవిష్యత్
న్యూఢిల్లీ/సిడ్నీ: భారత్‌లో తయారీ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు 2014 సెపె్టంబర్ 25న ప్రారంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతోపాటు. తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. వ్యాపార సులభతర నిర్వహణ, అవినీతిని ఉపేక్షించకపోవడం, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాలపై దృష్టి సారించడం ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) విజయవంతం అయ్యేలా చేసినట్టు ప్రకటించారు. ఇది దేశంలో స్థానిక, విదేశీ పెట్టుబడులు ఇతోధికం కావడానికి సాయపడినట్టు చెప్పారు. భారీ పెట్టుబడుల ప్రణాళికలను చూస్తున్నామంటూ.. వీటి రాకతో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ పాత్ర మరింత పెరుగుతుందని సిడ్నీ పర్యటనలో ఉన్న గోయల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితం.. స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల సెంటిమెంట్ బలహీనంగా ఉన్న తరుణంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు చేపట్టినట్టు మంత్రి గోయల్ గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట కొంత క్షీణించింది. బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొనేవారు. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పొందేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. ఒకటే దేశం ఒకటే పన్ను – జీఎస్టీ, ఐబీసీ, పారదర్శకంగా గనుల వేలం తదితర ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసేపేత నిర్ణయాలతో అది సాధ్యపడింది’’అని మంత్రి గోయల్ వివరించారు. స్థిరమైన, స్పష్టమైన విధానాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడేలా చేసినట్టు చెప్పారు. ఈ చర్యలతో వ్యాపార సులభతర నిర్వహణలో భారత్ స్థానం 14 స్థానాలు మెరుగుపడి 190 దేశాల్లో 63కు చేరినట్టు తెలిపారు. 2020లో పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించి, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత నాటి చర్యల ఫలితాలను చూస్తున్నాం. భవిష్యత్‌పై ఉత్సాహంతో ఉన్నాం. మొబైల్స్ తయారీలో ఎంతో పురోగతి సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్స్ తయారీ కేంద్రంగా ఉన్నాం’’అని వివరించారు. టెక్స్టైల్స్, సిరామిక్స్, ఆట»ొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో దేశీ సామర్థ్యాలు నుమడించాయన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా సాయపడినట్టు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్సీ సంక్షోభాల్లోనూ దేశ జీడీపీలో తయారీ రంగం వాటా యాథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్పారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ అంతరిక్షం, బొగ్గు తవ్వకం, ఈ–కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీ ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇందులో 90 శాతం ఆటోమేటిక్ మార్గంలోనే వచి్చందన్నారు.ఆర్బీఐ దృష్టికి రియల్టర్ల నిధుల సమస్యలురియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను ఆర్బీఐ దృష్టికి తీసుకెళతానని మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో (మున్సిపాలిటీలు) మాట్లాడతానని భరోసా ఇచ్చారు. రెరా చట్టం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచి్చనట్టు చెప్పారు. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల పరంగా వాటా.. ఇలా రియల్ ఎస్టేట్ రంగం గొప్ప పాత్ర పోషిస్తోందని మంత్రి మెచ్చుకున్నారు. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయంరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఈ ఏడాది రేట్ల కోత ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతను చేపట్టకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడ్ నాలుగేళ్లలో మొదటిసారి వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆర్థిక సెంట్రల్ బ్యాంక్‌లు సైతం ఇదే బాట పట్టొచ్చన్న అంచనాలు నెలకొండడం తెలిసిందే. ‘‘రేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంక్‌లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయి. ఫెడ్ రేట్ల కోత ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కానీ, ఆర్బీఐ మాత్రం ఈ విషయంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకునే ఓ నిర్ణయానికొస్తుంది. మా అభిప్రాయం ఇదే. ఈ కేలండర్ సంవత్సరంలో ఆర్బీఐ రేట్లను తగ్గించకపోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం పరంగా మంచి పురోగతి ఉంటే తప్ప ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025 జనవరి–మార్చి) వరకు వేచి చూడాల్సి రావచ్చు’’ అని శెట్టి పేర్కొన్నారు. ఆహార ద్రవ్వోల్బణం కీలకం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన గల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి వడ్డీ రేట్ల సమీక్షను అక్టోబర్ 7–9 మధ్య చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 3.65 శాతానికి పెరగడం తెలిసిందే. జూలై నెలకు ఇది 3.54 శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 5.66 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ఆర్బీఐ దీర్ఘకాల కట్టడి లక్ష్యం 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. ఆగస్ట్ నాటి ఎంపీసీ సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం తెలిసిందే. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించింది. అంతేకాదు ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. చివరి ఎంపీసీ భేటీలో నలుగురు సభ్యులు యథాతథ స్థితికి మొగ్గు చూపితే, ఇద్దరు సభ్యులు రేట్ల తగ్గింపునకు మద్దతు పలికారు.ఎస్బీఐ నిధుల సమీకరణ రూ. 7,500 కోట్ల బాండ్ల జారీ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించింది. బాసెల్–3 నిబంధనలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీని చేపట్టినట్లు ఎస్బీఐ పేర్కొంది. అర్హతగల సంస్థాగత బిడ్డర్లకు బాండ్లను ఆఫర్ చేయగా.. భారీ స్పందన లభించినట్లు వెల్లడించింది. ప్రాథమికం(బేస్)గా రూ. 4,000 కోట్ల సమీకరణకు బాండ్ల జారీని చేపట్టగా మూడు రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. దీంతో రూ. 7,500 కోట్లవరకూ బాండ్ల జారీకి నిర్ణయించినట్లు వివరించింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు తదితరాలు దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. విభిన్న సంస్థలు బిడ్డింగ్ చేయడం ద్వారా దేశీ దిగ్గజ బ్యాంక్‌పై నమ్మకముంచినట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వ్యాఖ్యానించారు. కాగా.. 7.33% కూపన్ రేటుతో 15ఏళ్ల కాలపరిమితిగల బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలియజేసింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీకి తెరతీసినట్లు పేర్కొంది. 10ఏళ్ల తదుపరి ప్రతీ ఏడాది కాల్ ఆప్షన్‌కు వీలుంటుందని వెల్లడించింది. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థకు నిలకడను తీసుకువచ్చే బాటలో రూపొందించినవే అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలు(బాసెల్–3). బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.2% బలపడి రూ. 792 వద్ద ముగిసింది. -
అవసరాలకు తగ్గ ప్రణాళిక.. ఆర్బీఐ
న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్నిర్మించాలని ఆర్బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సర్వైలెన్స్ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది.కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహ్వానించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది.గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్ పీసుల నుంచి 132.35 బిలియన్ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్బీఐ టెండర్ డాక్యుమెంట్ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్బీఐ ఈవోఐలకు ఆహ్వానం పలికింది.