Republican Party
-
ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు వారాల్లోనే వందకు పైగా సంతకాలు చేసినట్టు ట్రంప్ తెలిపారు.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో వివరించారు. ఈ క్రమంలో ట్రంట్ మాట్లాడుతూ..‘ఆరు వారాల్లో వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశాను. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు అనిపిస్తోంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ పని చేయడానికి అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.. చేసుకుంటూ పోతున్నాను. త్వరలోనే అమెరికన్ల కల నిజం కాబోతుంది. గతంలో కంటే మెరుగైన జీవితం వారికి లభిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. #WATCH | While addressing a joint session, US President Donald Trump says, " America is back. 6 weeks ago, I stood beneath the dome of this capitol and proclaimed the dawn of the golden age of America. From that moment on, there has been nothing but swift and unrelenting action… pic.twitter.com/5es6k7Idpg— ANI (@ANI) March 5, 2025ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలపై వాటిని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, ఇతర దేశాలు మనం వసూలు చేసే దాని కంటే చాలా ఎక్కువ సుంకాలను మన నుండి వసూలు చేస్తాయి. ఇది చాలా అన్యాయం. భారత్ మన నుండి ఆటో సుంకాలను 100% వసూలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయి. వారు మనపై ఎలాంటి సుంకాలు వేస్తారో.. మనం వాటిపై అంతే సుంకాలు విధిస్తాం అని చెప్పారు.#WATCH | While addressing a joint session of US Congress, US President Donald Trump says, " Other countries have used tariffs against us for decades and now it is our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil,… pic.twitter.com/7lRu4udKEN— ANI (@ANI) March 5, 2025అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను. అలాగే, సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | US President Donald Trump says, "Within hours of taking the oath of office, I declared a national emergency on our southern border. I deployed US military and border patrol to repel the invasion of our country and what a job they have done! As a result, illegal border… pic.twitter.com/Nn4xc97rj7— ANI (@ANI) March 5, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. #WATCH LIVE via ANI Multimedia | Republicans in Congress stand up and chant 'USA, USA' to a Democrat heckler during US President Donald Trump's Address. (Video Source: US Network Pool Via Reuters) pic.twitter.com/IV8hygCPpp— ANI (@ANI) March 5, 2025 -
తెరపైకి ట్రంప్ అభిశంసన.. అంత ఈజీనా?
అధికారం చేపట్టి పట్టుమని రెండు వారాలు కూడా కాలేదు. ఈలోపే ఆయన్ని వైట్‌హౌజ్ పీఠం నుంచి దించేయాలనే డిమాండ్ మొదలైంది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ.. ఆయన తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలు అమెరికాకు శత్రువులను పెంచడంతో పాటు ఆయన పదవీకి ముప్పుగా మారవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. 2.0లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నవన్నీ సంచలన నిర్ణయాలే. బయటి దేశాల నుంచే కాదు.. అమెరికాలోనూ ఆ నిర్ణయాలపై వ్యతిరేకత మేధోవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ని అభిశంసించాలంటూ చేపట్టిన పిటిషన్ లక్ష సంతకాలను దాటేసింది. అదీ కేవలం 11 రోజుల్లోనే!అధికారంలోకి రాకముందే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్నది ఈ పిటిషన్ వెనకాల ఉన్న ప్రధాన అభియోగం. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే తీసుకున్న.. తీసుకుంటున్న నిర్ణయాలను ఈ పిటిషన్ తప్పుబడుతోంది. ముఖ్యంగా కాపిటల్ హిల్స్ నిందితులకు క్షమాభిక్ష పెట్టడం, అమెరికా పౌరసత్వంపై రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయలు ఇతరత్రాలు ఉన్నాయి.వాషింగ్టన్కు చెందిన ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ అనే సంస్థ తన వెబ్సైట్ ద్వారా ఈ క్యాంపెయిన్ నడిపిస్తోంది. అయితే ఈ సంతకాలు లక్ష దాటిన నేపథ్యంతో.. ట్రంప్‌పై ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్(పార్లమెంట్)పరిగణనలోకి తీసుకోవాలని, అభిశంసన ద్వారా ఆయన్ని పదవీచ్యుతుడ్ని చేయాలని కోరుతోంది. అయితే.. ఇలా ఓ సంతకాల పిటిషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడ్ని తొలగించడం సాధ్యమేనా?..సంతకాల సేకరణ ద్వారా ఏ దేశ అధినేతను తొలగించిన దాఖలాలు లేవు. రాజకీయపరమైన కారణాలతోనే.. ఒక దేశ అధినేతను అభిశంసించేందుకు వీలు ఉంటుంది.అయితే ఈ తరహా సంతకాల సేకరణ చర్యతో.. సదరు అంశానికి ప్రజల మద్ధతు ఏమేర ఉందో చూపించొచ్చు. తద్వారా మీడియా, సోషల్ మీడియాను ఆకర్షించొచ్చు. అలా.. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చట్టసభ్యులపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఒత్తిడి మాత్రం చేయొచ్చు. అందుకే వీలైనన్ని ఎక్కువ సంతకాల్ని సేకరించే పనిలో ఉంది ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ గ్రూప్. అలాగే ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ 2017లోనూ ట్రంప్‌పై ఇలాంటి క్యాంపెయిన్ నడిపించినా.. ఆ టైంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన దక్కలేదు.గత హయాంలో ట్రంప్ రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. 2019లో ఓసారి, 2021 కాపిటల్ దాడికి సంబంధించి రెండోసారి ఎదుర్కొన్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన తొలగింపును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమర్థించగా.. సెనేట్ మాత్రం వదిలేసింది. ప్రస్తుతం హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్తో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్ పార్టీ బలంగా ఉంది. సో.. ట్రంప్‌పై ఈ టర్మ్‌లో అభిశంసన పెట్టడం అంత వీజీకాదిప్పుడు. -
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
దిగువసభపై పట్టుసాధించిన రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు తాజా గణాంకాల ప్రకారం దిగువసభపై ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ పట్టుసాధించింది. బుధవారం తెల్లవారు జామున కాలిఫోర్నియా లోని మరోచోట గెలవగా తాజాగా అరిజోనాలో మరో స్థానంలో గెలవడంతో రిపబ్లికన్లు ఇప్పటిదాకా గెల్చిన సీట్ల సంఖ్య 218కి పెరిగింది. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ కేవలం 208 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దిగువసభలో మొత్తం 435 స్థానాలు ఉండగా ఇంకా 9 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లోనూ ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధించింది. ఎగువ, దిగువ సభల్లో ఆధిక్యత కారణంగా త్వరలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన చట్టాలకు ఎలాంటి అవాంతరాలులేకుండా సులభంగా ఆమోదముద్ర పడనుంది. -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
Donald Trump: ట్రంప్ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్‌లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్‌ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చరిత్ర సృష్టించేందుకు సర్వశక్తులొడ్డుతుండగా.. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్!! కారణం ఏంటంటే..
ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్‌హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్తో పోటీ పడుతున్నారు. -
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్‌ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్)కు తాను తండ్రి లాంటివాడినని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఉచితం చేస్తానని ప్రకటించారు. తాజాగా జార్జియాలో ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భధారణకు తమ పార్టీ పూర్తి అనుకూలమని స్పష్టంచేశారు. ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు తమపై మాటల దాడి చేస్తారని తెలిసినప్పటికీ ఐవీఎఫ్‌కు మద్దతు ఇస్తూనే ఉంటామని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గర్భవిచ్చిత్తి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబార్షన్ హక్కులను రాష్ట్రాలకే వదిలేయాలన్నది తన విధానమని స్పష్టంచేశారు. అత్యాచారం వల్ల గర్భం దాలిస్తే, గర్భం దాలి్చన తల్లి ప్రాణానికి ముప్పు ఉంటే గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత ఐవీఎఫ్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారో ట్రంప్ వెల్లడించలేదు. అలాగే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారని తెలియజేయలేదు. ఐవీఎఫ్ తండ్రిని అంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తప్పుపట్టారు. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
భారత్‌లో దిగుమతి సుంకాలు అత్యధికం
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్‌లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు. అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్‌తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటర్‌సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు. -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్‌పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్‌పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్‌పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్‌కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్‌ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
ట్రంప్‌కు భారీ షాక్, సొంత పార్టీలోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా.. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్‌తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారుఅంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్‌తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. -
ట్రంప్‌కు కెన్నెడీ జూనియర్ మద్దతు
ఫీనిక్స్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరిచాక డెమొక్రటిక్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్ ప్రచారంలో వెనుకబడ్డారు. పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌నకు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు. రాబర్ట్ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్‌కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్‌ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్. -
ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ!.. తెరపైకి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. పిల్లలు లేనివారు పాలించేందుకు తగదు అంటూ గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కించపరిచినట్లు మాట్లాడారు. తాజాగా దీనిపై తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కాగా, జేడీ వ్యాన్స్ 2021లో అమెరికాలో పిల్లలులేని తల్లుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లలందరికీ ఓట్లు వేసే అవకాశం ఇద్దాం. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులకు ఆ ఓట్లపై నియంత్రణ ఉండేలా చూసుకుందాం. మీరు అమెరికాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఒక పేరెంట్‌గా మరింత శక్తిని కలిగి ఉండాలి. పిల్లలు లేని వారి కంటే పిల్లులు ఉన్న పేరెంట్స్‌కి ప్రజాస్వామ్యంపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే తమ వాయిస్ వినిపించగలరు. ఇదే సమయంలో పిల్లలు లేని వారు వాయిస్‌ను ఎక్కువ వినిపించలేరు(చైల్డ్ లెస్ క్యాట్ లేడీస్). పిల్లలు లేని వారు పాలించేందుకు పనికిరారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాన్స్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల వేళ జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నేతలు వ్యాన్స్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.JD Vance calls for taking away voting power from “people who don’t have kids”: “Doesn't this mean that non-parents don't have as much of a voice as parents? Yes. Absolutely” pic.twitter.com/rXhzMoat47— Kamala HQ (@KamalaHQ) July 25, 2024ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తినే ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత, ఓహియో సెనేటర్ జేమ్స్ వ్యాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యాక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వ్యాన్స్.. ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవడం గమనార్హం. -
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
Kai Madison Trump: మా మంచి తాతయ్య!
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది. ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు. నేనూ ట్రంప్‌నే... తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు. మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది. ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్‌నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.మా నాన్నసింహసదృశుడు హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు. -
అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు! ప్రకటించిన ట్రంప్
మిల్వాకీ: రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జె.డి.వేన్స్ (39)ని ఎంపిక చేసుకున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు. ఈ విషయాన్ని తన ‘ట్రూత్’ సోషల్ నెట్వర్క్ ద్వారా తెలిపారు. జేడీ వేన్స్ సతీమణి ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్‌డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వేన్స్, ఉషల వివాహం జరిగింది. యేల్ లా స్కూల్లో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తన ఎదుగుదలలో ఉషా పాత్ర ఎనలేనిదని వేన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. -
మారకుంటే... ముప్పు
రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్లు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. -
ట్రంప్ భద్రత పెంపు.. దాడిపై రిపబ్లికన్ పార్టీ నేతల రియాక్షన్
-
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్‌కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
Donald Trump: పాత కేసులో కొత్త చిక్కులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పాత కేసులో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హష్ మనీ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ఆయన మోసానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఇది కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు ట్రంప్.అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారా..?అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్ వాదన.స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి అఫైర్‌ను కప్పిపుచ్చిన ట్రంప్!2016 ఎన్నికల ప్రచార సమయంలో.. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఈ నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది స్టార్మీ. దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసింది.2016 ఎన్నికల సమయంలో ట్రంప్ మోసానికి పాల్పడ్డారు : ప్రాసిక్యూషన్తాజాగా ఈ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రాసిక్యూటర్ తరపున వాదించిన మాథ్యూ కోలాంగెలో.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని.. ఇందుకోసం సెక్స్ స్కాండల్‌ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ట్రంప్ డబ్బు ఖర్చు చేశారన్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని.. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని బలంగా వాదించారు మాథ్యూ కోలాంగెలో.డొనాల్డ్ అమాయకుడు, ఎలాంటి నేరం చేయలేదు: ట్రంప్ తరపు న్యాయవాదులుప్రాసిక్యూషన్ అభియోగాలను ట్రంప్ తరఫు న్యాయవాదులు ఖండించారు. డొనాల్డ్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్‌హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసేందుకు ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్.అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్. యూఎస్ కేపిటల్ మీద దాడి ఘటన, వైట్‌హౌస్ నుంచి కీలకమైన పత్రాల మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు శృంగార కుంభకోణంలో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు ట్రంప్. -
బైడెన్, ట్రంప్ మధ్యేనా పోరు?
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బైడెన్, ట్రంప్ మధ్యే పోరు ఉండబోతున్నట్టు కనబడుతోంది. ఆ ఇద్దరిలోనూ ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సర్వేలు ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. నవంబర్ నాటికి ఇది తలకిందులవుతుందని బైడెన్ వర్గం నమ్ముతోంది. ఎవరు గెలిచినా, అమెరికాకు ప్రధాన పోటీదారుగా చైనాను నిలపడంలో, అమెరికాకు ప్రయోజనం చేకూర్చని వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇరువురిదీ ఒకే బాట. కాకపోతే వాతావరణ విధానం, వలసలు, సుంకాలు, ప్రజాస్వామ్యం వంటి అంశాల్లో ముఖ్యమైన తేడాలు ఉంటాయి. వాణిజ్యం, వలసల విషయంలో భారత్ నాటకీయ మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది; అదే సమయంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది. భారతదేశం ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో, అమెరికాలో కూడా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికైతే అధ్యక్ష అభ్యర్థులుగా ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ అయిన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అయిన డోనాల్డ్ ట్రంప్ ఉండేట్టే కనబడుతోంది. బైడెన్ వృద్ధాప్యం సహా, ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా విధానంపై ఆయన తీరు మీద ఓటర్లు అసంతృప్తిగా ఉండటంతో, ప్రజాభిప్రాయ సర్వేలు ప్రస్తుతానికి ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ ఉన్నట్టు చూపుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, తక్కువ నిరుద్యోగం, రుణ విముక్తి, చట్టపరంగా ట్రంప్ ఎదుర్కొంటున్న కష్టాలు వంటివి... నవంబర్ నాటికి ప్రజలు ఎన్నికలకు వెళ్లే సమయా నికి ఆటుపోట్లను తిప్పికొట్టగలవని బైడెన్ వర్గం నమ్ముతోంది. ఈ ప్రారంభ దశలోనే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం నిష్ఫలమే అవుతుంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రా లలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఫలితం ఇప్పటికే తేలినట్టయింది. ఇక మొత్తం ఫలితం దాదాపు ఆరు కీలకమైన ‘స్వింగ్ స్టేట్స్’(ఊగే రాష్ట్రాలు) ద్వారా, పది లక్షల కంటే తక్కువ ఓట్ల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. పరిశీలకులు విధానపరమైన చిక్కు లను అంచనా వేయడం ప్రారంభించడం వివేకం. అయితే విధాన పరమైన నిర్ణయాలు అలాగే కొనసాగవచ్చు, కాకపోతే వాణిజ్యం, వలస విధానంలో కొన్ని నాటకీయ మార్పులు ఉండవచ్చు. అనేక అంశాల విషయంలో– ట్రంప్, బైడెన్ హయాంలు రెండింటిలోనూ గత ఎనిమిది సంవత్సరాలుగా గణనీయమైన కొనసాగింపు ఉంది. ఒకటి: అమెరికా అగ్రగామి వ్యూహాత్మక పోటీదారుగా చైనా ఉంటుందని చాలావరకు అర్థమైపోయింది. దీనివల్ల ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దేశీయ, ఆర్థిక, భద్రతా విధానాలలో మార్పు లకు దారితీసింది. రెండు: నయా ఉదారవాదం లేదా ప్రపంచీకరణ స్ఫూర్తితో ఇకపై పరస్పర సంబంధం లేని మార్కెట్ ప్రాప్యతను అందించకూడదని అమెరికా విశ్వసిస్తోంది. అమెరికాకు అనుకూలంగా క్రీడా మైదానాన్ని మార్చని వాణిజ్య ఒప్పందాలు ఇకపై కుదిరే ప్రశ్నే లేదు. మూడు: అమెరికా పాలకవర్గం ప్రత్యక్ష, బహిరంగ సైనిక యాత్రలకు వ్యతిరేకంగా ఉంది. దీనిని విమర్శకులు ‘ఎప్పటికీ సాగే యుద్ధాలు’గా అభివర్ణిస్తున్నారు. నాలుగు: సమస్యలు ఉన్నప్పటికీ, చాలావరకు ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలకు అమెరికా మద్దతుగా స్థిరంగా ఉంది. కీలకమైన తేడాలు అయితే పొత్తులు, వాతావరణ విధానం, వలసలు(ఇమ్మిగ్రేషన్), టారిఫ్‌లు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై బైడెన్, ట్రంప్ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ట్రంప్, అమెరికా మిత్రదేశాలను ఫ్రీలోడర్లుగా (ఇతరుల ఔదార్యాన్ని అవకాశంగా తీసుకునేవారు) విమర్శిస్తున్నప్పటికీ, బైడెన్ మాత్రం యూరప్, ఇండో–పసిఫిక్‌లో మిత్రులే ఫస్ట్ అనే విధానాన్ని అవలంబించారు. ట్రంప్ విజయం ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో), ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు విషయంలో ప్రత్యేక చిక్కులను కొనితెస్తుంది. డెమొక్రాటిక్ పునాదికి ముఖ్యమైన వాతావరణం, పర్యావరణ విధానాలపై బైడెన్ దేశీయ పరిశ్రమకు, క్రియాశీల వాతావరణ దౌత్యం కోసం భారీ రాయితీలకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ ఆ సబ్సిడీలను రద్దు చేయక పోవచ్చు (ఇది రిపబ్లికన్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరు స్తుంది) కానీ ఆయన కచ్చితంగా అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటారు. వ్యత్యాసం ఉన్న మరొక అంశం వలసలు. వీటిని రిపబ్లికన్లు అడ్డుకోవాలని కోరుకుంటారు. కానీ డెమొక్రాట్లు సులభతరం చేయా లని ఆశిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దులో అక్రమ వలసలను అరికట్ట డానికి రిపబ్లికన్ పాలనాయంత్రాంగం ఉద్దేశపూర్వకంగా క్రూరమైన విధానాన్ని అవలంబిస్తుంది. వాణిజ్య అసమతుల్యతలను ఎదుర్కోవ డానికీ సుంకాలు, ఇతర చర్యలను అమలు చేయడానికి ట్రంప్ సుము ఖత వ్యక్తం చేశారు. చివరగా, బైడెన్ తన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వాలను చూపుతుండగా, ట్రంప్ పాలనాయంత్రాంగం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి తక్కువ శ్రద్ధ చూపుతుంది. ఆసియాతో సహా కొన్ని అమెరికన్ మిత్రదేశాలు, భాగస్వాములు ఇప్పటికే రెండవసారి ట్రంప్ అధ్యక్ష పదవికి సంబంధించిన చిక్కు లను అంచనా వేస్తున్నారు. తన ఎజెండా విషయంలో ట్రంప్, ముఖ్యంగా సైనిక సహాయం, వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్‌పై ఎక్కువ నిబ ద్ధతతో ఉంటారు; వాటి అమలులో గొప్ప వృత్తిపరతత్వం కూడా కన బరుస్తారు. 2016లో, ట్రంప్ ఏమాత్రం సన్నద్ధత లేకుండా ఎన్ని కలలో విజయం సాధించడం పట్ల తనకు తానే ఆశ్చర్యపోయినట్లు కాకుండా, మళ్లీ అధికారంలోకి తిరిగి వచ్చినప్పుడు తన విజన్‌ని అమలు చేయడంలో మరింత నైపుణ్యం కలిగిన కార్వ నిర్వహణ ఉండ నుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా శ్రేణులు ఆయన వెనుకే ఉంటారు. మాజీ వాణిజ్య సంధానకర్త రాబర్ట్ లైట్ థైజర్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ’బ్రియన్, దేశీయ విధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్... వాణిజ్యం, విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్రలు పోషిస్తున్న వారిలో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కేటా యించాల్సిన చాలా ప్రభుత్వ కీలక పదవులకు సన్నాహాలు జరుగు తున్నాయి. సొంత పార్టీలోని ట్రంప్ విమర్శకులు సైతం పాలనా యంత్రాంగంలో చేరే అవకాశం గురించి ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఇండియాపై ప్రభావం ఉంటుందా? ఎన్నికల ఫలితాల వల్ల భారతదేశానికి ఎలాంటి చిక్కులు ఎదుర వుతాయి? రక్షణ లేదా సైనిక సహాయం కోసం వాషింVýæ్టన్పై ఆధారపడే అమెరికా మిత్రదేశాలు లేదా అమెరికన్ మార్కెట్ ప్రాప్యతపై ఆధార పడే ప్రధాన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే, ఎన్నికల ఫలితం న్యూఢిల్లీపై కాస్త తక్కువగానే ఉంటుంది. అనేక అంశాలలో, భారత దేశం తనను తాను భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్న భాగ స్వామిగా చూపించుకుంటూ, 2017–2021ల మధ్యలానే ట్రంప్ లావాదేవీలకు తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ, న్యూఢిల్లీ కనీసం రెండు అంశాలలో– వాణిజ్యం, వలసల విషయంలో నాటకీయ మార్పులను ఎదుర్కో వాల్సి ఉంటుంది. అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు దృష్ట్యా, సుంకాలను అంచనా వేయవలసి ఉంటుంది. పైగా కొన్ని కఠినమైన చర్చలు అనివార్యం అవుతాయి. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూనే, చైనా నుండి రిస్క్ లేకుండా చూసుకోవడం గురించిన భాగస్వామ్య అవగాహన, ఇప్పటికే ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, జపాన్, బ్రిటన్, యూరప్‌ల మధ్య చర్చలను రేకెత్తిస్తోంది. భారత్ విషయంలో వలస సమస్య మరింత నాటకీయంగా ఉంటుంది. చట్టపరమైన వలసదారులు– శాశ్వత నివాసితులు, అధిక నైపుణ్యం కలిగిన నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపార వేత్తల ప్రాసెసింగ్‌లో మందగమనం కొనసాగవచ్చు. ఎక్కువ తనిఖీ లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కఠినమైన నిర్బంధాలను ఎదుర్కొనే పత్రాలు లేని వలసదారుల సంఖ్య పెరగవచ్చు. ట్రంప్ విధానాల రూపురేఖలను ఇప్పటికే ఊహించవచ్చు. అయినప్పటికీ, ఆయన విజయం సాధించిన పక్షంలోనూ భారతదేశం చాలా ఇతర దేశాల కంటే ప్రత్యక్షంగా తక్కువ ప్రభావితం కావచ్చు. ధ్రువ జయ్శంకర్ వ్యాసకర్త ‘ఓఆర్ఎఫ్ అమెరికా’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్‌లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు. మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్‌లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు. జూలైలో మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి. ఎవరికి ఓటేస్తారు?: బైడెన్ మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్‌ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు జో బైడెన్ 2,099 ఇతరులు 20 జేసన్ పామర్ 3 రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు ట్రంప్ 1,228 నిక్కీ హేలీ 91 రాన్ డీశాంటిస్ 9 వివేక్ రామస్వామి 3 -
దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్!
సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఆసక్తికర ఘట్టానికి అగ్రరాజ్యపు అధ్యక్ష ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. వరుసగా రెండోసారి కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో అదే ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్.. నవంబర్ 5వ తేదీన జరగబోయే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది!. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థితత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నిలబడబోతున్నారు. నామినేషన్‌కు అర్హత సాధించాలంటే బైడెన్‌కు 1,968 డెలిగేట్స్ మద్దతు అవసరంకాగా.. ఆ ఫిగర్‌ను ఆయన దాటేశారని సమాచారం. తాజాగా వెలువడుతున్న ప్రైమరీ ఫలితాల్లో.. జార్జియా విజయంతో బైడెన్ ఆ ప్రతినిధుల సంఖ్యను అధిగమించేశారని తెలుస్తోంది. మరోవైపు మిసిస్సిప్పి, వాషింగ్టన్, నార్తన్ మరియానా ఐల్యాండ్స్ ఫలితాల్లోనూ బైడెన్ పైచేయి సాధించవచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తోంది. 1952, 1956 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి డ్వైట్ D. ఐసెన్‌హోవర్.. మాజీ ఇల్లినాయిస్ గవర్నర్(డెమొక్రటిక్) అడ్లై స్టీవెన్సన్ను రెండుసార్లూ ఓడించారు. తొలిసారి కంటే కంటే రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఐసెన్‌హోవర్ మెరుగైన ఫలితంతో ఘన విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు డొనాల్డ్ ట్రంప్‌నకు 1,215 మంది ప్రతినిధులు అవసరం. అయితే ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం.. సోమవారం నాటికి ట్రంప్‌కు 139 మంది అదనపు ప్రతినిధులు అవసరం. అయితే జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి వాషింగ్టన్ రాష్ట్రాల్లో 161 మంది ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్ట్ ట్రంప్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వరుసగా రాష్ట్రాల్లో ప్రైమరీ ఫలితాల్లో విజయం సాధిస్తూ సమీప పత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్ పైచేయి సాధించారు. 15 రాష్ట్రాల్లో 14లో ఆయన విజయం సాధించగా.. గత మంగళవారం నాటి ఫలితాల తర్వాత హేలీ తన ప్రచారాన్ని ముగించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవడానికి, పరోక్ష ఎన్నికలు(ప్రైమరీ) నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఓటర్లు ప్రతి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధుల్ని నిర్ణయిస్తారు. ఆపై ఈ ప్రతినిధులు తమ తమ పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రైమరీలలో.. పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను గెలవడానికి అభ్యర్థులకు సమావేశంలో ప్రతినిధుల ఓట్లలో మెజారిటీ అవసరం. అయితే.. నాలుగేళ్లకొకసారి అమెరికాలో జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలే. అంతిమంగా బరిలో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసేది మాత్రం ప్రజలే. -
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
కొరకరాని కొయ్య ట్రంప్!
ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్నీ, ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్నీ డోనాల్డ్ ట్రంప్ గెల్చుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికలో బ్యాలెట్ పత్రంపై ట్రంప్ పేరు తొలగించాలన్న ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చటం ఆయనకు కొత్త శక్తినిస్తుందనటంలో సందేహం లేదు. ‘సూపర్ ట్యూజ్‌డే’ కింద మంగళవారం ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ట్రంప్ ఇప్పటికే అయోవా, న్యూహాంప్‌షైర్, నెవడా ప్రైమరీలను గెల్చుకోవటంతోపాటు తన ప్రత్యర్థి హేలీకి బలం వుంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్ కరోలినాలో సైతం సత్తా నిరూపించుకున్నారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ పోలింగ్‌లో సైతం ఆయనదే పైచేయి అని ప్రాథమిక సమాచారం చెబుతోంది. అయితే రకరకాల కేసుల్లో చిక్కుకుని వాటినుంచి బయటపడటానికి అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సిరావటం, న్యాయస్థానాలకు హాజరుకావటం ట్రంప్ ప్రచారాన్ని దెబ్బతీస్తోందనే చెప్పాలి. న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో సైతం సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు. అయితే ఇదంతా ట్రంప్ స్వయంకృతం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ కాపిటల్ హిల్‌పైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకులయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి. ఆయన ప్రత్యర్థి, డెమాక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించటానికి 2021 జనవరిలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచింది. నిజానికి ఈ కేసులోనే కొలరాడో సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అర్హతను ట్రంప్ కోల్పో యారని తీర్పునిచ్చింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టటానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్ 3కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మెయిన్, ఇల్లి నాయీ సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదని అందరూ అనుకున్నారు. కానీ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో అవి నిలిచిపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులపై ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటే... అవి పరస్పర విరుద్ధంగా వుంటే ఒకరకమైన అరాచకానికి దారితీస్తుందని ధర్మాసనంలోని తొమ్మిదిమంది న్యాయ మూర్తులూ భావించారు. వీరిలో ఆరుగురు మితవాద న్యాయమూర్తులైతే మరో ముగ్గురు ఉదార వాదులు. దేశమంతటికీ వర్తించేలా పార్లమెంటు మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. అయితే పార్లమెంటు ఉభయసభలైన సెనేట్, ప్రతినిధుల సభల్లో అధికార విపక్షాలిద్దరికీ చెరోచోటా ఆధిక్యత వున్నప్పుడు సమస్య మరింత జటిలంగా మారుతుంది. ట్రంప్ అధ్యక్ష పదవి గెల్చుకున్నాక దాన్ని ధ్రువీకరించటానికి నిర్వహించే పార్లమెంటు సమావేశం కాస్తా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయన్నది ఊహాతీతం. కాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించి ట్రంప్‌పై నాలుగు వేర్వేరు కేసులు విచారణలో వున్నాయి. వాటిల్లోని దాదాపు 93 ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రమే కాదు... ఇవన్నీ పదవిలో వుండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ వుంటుందంటున్నారు. అధ్యక్ష పదవిలో వున్న నాయకుడిపై క్రిమినల్ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. కాపిటల్ హిల్‌పై దాడికి ఆయన పిలుపు ఇచ్చివుండొచ్చుగానీ, ఆయన స్వయంగా ఈ దాడిలో పాల్గొనలేదన్నది ట్రంప్ న్యాయవాదుల వాదన. ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి వచ్చే నెల 22న సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి. కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగనిస్తారా అన్నది చూడాల్సివుంది. అయితే ట్రంప్ కష్టాలు ఈ కేసుతో తీరిపోతాయనడానికి లేదు. ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ తనపై ఆరోపణలు చేయకుండా వుండటానికి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన్న అభియోగం అందులో ఒకటి. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయన 50 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని సమీకరించటానికి ఆయన పాట్లు పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించటం సరేసరి. ఇదిగాక ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాలమిస్టు జీన్ కరోల్ ఆరోపించారు. అందులో 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఆమె పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారన్న ఆరోపణకు సంబంధించి 8 కోట్ల 30 లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది. వీటిపై అప్పీళ్లకు వెళ్లదల్చుకున్నారు. జనంలో వరస విజయాలు సాధిస్తున్న ట్రంప్‌ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమాక్రాటిక్ పార్టీ వ్యూహం వారికి ఏమేరకు లాభిస్తుందో వేచిచూడాలి. -
సుప్రీంలో ట్రంప్‌కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్‌పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్‌పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్‌ను ఉపయోగించి ట్రంప్‌ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్‌ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్‌కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
అమెరికా రాజకీయాల్లో భారతీయులు
సిద్ధాంతపరంగా అమెరికా రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. కానీ ఆచరణలో, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమలో తామే సంకీ ర్ణాలుగా ఉంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ దాని ఆధిపత్య స్థానంలోని కరడుగట్టిన మితవాదులకూ, పార్టీ లోపలే తమ వాణిని అట్టిపెట్టుకోవడానికి ఘర్షణ పడుతున్న గతకాలపు సంప్రదాయవాదులకూ మధ్య గొప్ప అంతర్యుద్ధానికి సాక్షీభూతంగా ఉంది. ఇక డెమోక్రటిక్ పార్టీ శిబిరం...సెంట్రిస్టులు, సెంటర్– లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులకు నిలయంగా ఉంటోంది. అయితే, మితవాద పక్షం నుంచి ప్రగతిశీల వామపక్షాల వరకు, అమెరికాకు చేతనత్వం కలిగిస్తున్న ఐదు రాజకీయ పక్షాలలోనూ భారతీయ అమెరికన్ నాయకులు ప్రధాన పాత్రధారులుగా ఉండటమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. కరుడుగట్టిన మితవాదం (ఫార్–రైట్)తో ప్రారంభిద్దాం. ఈ రాజకీయ ధోరణి, కింది విధానాలను కలిగివుంది. 1.కార్పొరేట్ పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మించడంపై అమెరికా దృష్టి కేంద్రీకరించాలి. ఇంధన వాడకాన్ని ఎంతకైనా పెంచాలి. ఇప్పటికే ఉన్న ట్రేడింగ్ ఏర్పాట్లపై పూర్తిగా తిరోగమించాలి. 2. అమెరికా తన అంతర్జాతీయ కట్టుబాట్లను తగ్గించుకోవాలి. ఐరోపా నుండి వెనక్కి తగ్గాలి. ఎక్కువగా చైనాపై దృష్టి పెట్టాలి. 3. అమెరికా తన సరిహద్దులను పటిష్టంగా కాపాడు కోవాలి. సామాజిక జనాభా మార్పులు సంఘర్షణలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు శ్వేత క్రైస్తవ జనాభా రాజకీయ ఆధిపత్యానికి కలగబోయే ముప్పును సూచిస్తున్నారు. 4. అమెరికా ‘మేలుకొలుపు’ (వోకిజం) రాజకీయాలను తిప్పికొట్టాలి. అవి లైంగికత లేదా జాత్య హంకారంపై విద్యా బోధన లేదా నిశ్చయాత్మక చర్య లేదా యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు వంటివి ఏవైనా కావచ్చు. 5. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, నిఘా సంస్థలు రాజకీయంగా రాజీ పడ్డాయి. వీటి సిబ్బందిని తగ్గించడంతో సహా నాటకీయంగా రీబూట్ చేయడం అవసరం. డోనాల్డ్ ట్రంప్ ఈ ధోరణికి నిజమైన మార్గదర్శకుడు, ముఖ చిత్రం కూడా. అయితే, ఈ రోజు ఈ ఉద్యమం తదుపరి తరం ముఖా లలో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. నిజానికి, వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సమావేశంలో, ట్రంప్ ఉపాద్యక్షుడి ఎంపికగా రామస్వామి కూడా ఫేవరెట్లలో ఒకరుగా ఉద్భ వించారు. మధ్యేవాద–సంప్రదాయవాద ధోరణిని పరిశీలిద్దాం. ఈ అంతరి స్తున్న మితవాద రిపబ్లికన్ ల తరం మూడు కీలక అంశాలలో, కరుడు గట్టిన మితవాదం నుండి భిన్నంగా ఉంటుంది. 1. అంతర్జాతీయ కట్టు బాట్ల పరంగా, అమెరికా బలం... పొత్తులపై, ‘నాటో’ కూటమి పట్ల నిబద్ధతపై, భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ స్కూల్ విశ్వసిస్తుంది. ఐరోపాలో రష్యా సవాలును, ఇండో–పసిఫిక్‌లో చైనా సవాలును, పశ్చిమాసియాలో ఇరాన్‌ను అమెరికా కలిసి ఎదుర్కోవాలని నమ్ముతుంది. 2. సంస్కృతీ యుద్ధాల పరంగా – మితవాద రిప బ్లికన్ లు అబార్షన్, తుపాకీ హక్కులు, విద్యపై పార్టీ ఎజెండాతో సరిపెట్టుకుంటారు. అన్నింటికీ మరీ ఎక్కువ ఆందోళన చెందకుండా విభిన్న దృక్కోణాల పట్ల అంగీకారంగా ఉంటారు. 3. మితవాద రిప బ్లికన్ లు అమెరికన్ సంస్థలపై విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ప్రజా స్వామ్య నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ మీద జనవరి 6న జరిగిన మూక దాడి సమర్థకుల నుండి వైరుధ్యాన్ని సూచిస్తుంది. సెనేట్‌లో మిచ్ మెక్కానెల్ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, నిక్కీ హేలీ ఇప్పుడు మితవాద రిపబ్లికన్ పార్శా్వనికి ప్రజా ముఖంగా ఉన్నారు. ఆమె అయోవా, న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలలో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ ఓడారు. నెవాడాలో అయితే ‘ఈ అభ్యర్థులు ఎవరూ కారు’ విభాగంలో పోల్ అయిన ఓట్ల కంటే తక్కువ ఓట్లను పొందడం అనేది ఈ భావజాలం ఈరోజు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉందో చూపి స్తుంది. కానీ మొత్తంగా నియోజకవర్గాల పరంగా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. న్యూ హాంప్‌షైర్‌లో హేలీకి వచ్చిన 43 శాతం ఓట్లు, సౌత్ కరోలినాలో వచ్చిన 39 శాతం ఓట్లలో ఇది కనిపిస్తుంది. గెలవడానికి సరిపోదు కానీ, ఈ వర్గాలు ఇంటిలోనే ఉంటే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ అవకాశాలు నాటకీయంగా మసక బారుతాయి. డెమోక్రాట్లలో సెంట్రిస్టులు, సెంటర్ లెఫ్టులు, లెఫ్టులు... ఇక మనం డెమోక్రటిక్ పార్టీ శిబిరానికి మరలుదాం. డెమోక్రటిక్ సెంట్రిస్ట్లకు, సెంటర్–లెఫ్ట్‌కు అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వం వహిస్తున్నారు. వివిధ ప్రపంచ రంగాల్లో అమెరికా పాత్రకు సంబంధించి మధ్యేవాద రిపబ్లికన్ల నిబద్ధతను ఈ స్కూల్ కూడా పంచుకుంటుంది. ఇది కరుడుగట్టిన మితవాద, ప్రగతిశీల భావజాలాలు రెండింటినీ కలుపుకొని, అమెరికాలో పెట్టుబడి వికాసంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని నడిపించింది. ఇది అబార్షన్ హక్కులపై ప్రగతిశీల దృక్ప థాన్ని కనబరుస్తుంది. అయితే దీనిని ప్రజారోగ్య సమస్యగా, మహిళల హక్కుల సమస్యగా చూస్తుంది. ఇది నిర్మాణాత్మక జాతి వివక్షను గుర్తిస్తుంది కానీ పెరుగుతున్న సంస్కరణలను కూడా విశ్వసిస్తుంది. అధిక లోటును దృష్టిలో ఉంచుకుని సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించేందుకు ఇది కట్టుబడి ఉంది. వలసలపై, మరింత కఠినమైన చట్ట అమలు, మరింత మానవీయ విధానం రెండింటి మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. భారతీయ అమెరికన్లలో, ఇల్లినాయికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మధ్యేవాది(సెంట్రిస్ట్). కానీ సిలికాన్ వ్యాలీ నుండి హౌస్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న రో ఖన్నా మాత్రం సెంటర్–లెఫ్ట్ వర్గా నికి చెందిన అత్యంత ప్రముఖ హక్కుదారు. ఆయన మధ్యేవాదులకు, అభ్యుదయవాదులకు కుడివైపున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. పైగా 2028లో అధ్యక్ష ఎన్నికల కోసం తానూ ఒక రాయి విసరాలని భావిస్తున్నారు. మార్కెట్‌కు సాంకేతిక పరిజ్ఞానం, మధ్య అమెరికాలో శ్రామిక వర్గానికి ఆర్థిక దేశభక్తి గురించి ఈయన మాట్లాడతారు. బహుళవాదం, మైనారిటీలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతారు. చైనాపై కఠినమైన జాతీయ భద్రతా చర్యలు, గాజాలో కాల్పుల విరమణ, కార్పొరేట్ దోపిడీ, ప్రచార సంస్కరణల భాష గురించి కూడా మాట్లాడతారు. చివరగా, ప్రగతిశీల ధోరణిలోకి వెళ్లి చూడండి. వారు తమ సొంత అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ, విస్తృతంగా చెప్పా లంటే, ప్రగతిశీలురు స్వేచ్ఛా వాణిజ్యంపై సందేహాస్పదంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ చర్యలను సైనిక–పారిశ్రా మిక సముదాయం నడపడాన్ని వ్యతిరేకిస్తారు. అసమానత, దాన్ని ఎదుర్కొనే విధానపరమైన నిర్ణయాల్లో జాతి, లింగవివక్షలను ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారు. కార్పొరేట్ అధికారానికి బలమైన ప్రత్యర్థులు. అధిక పన్నుల ప్రతిపాదకులకు వ్యతిరేకులు. తీవ్రమైన వాతావరణ విధాన రక్షకులు. ప్రపంచంలోని మానవ హక్కుల వంటి సమస్యలపై మరింత చురుకైన అమెరికన్ జోక్యానికి లాబీయిస్టులు. ఈ విభాగంలోని ప్రముఖ ముఖాలు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హౌస్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ ప్రమీలా జయపాల్. పురోగామి విశ్వాసాలను కమలా హారిస్ పంచుకుంటున్నప్పటికీ, విదేశాంగ విధా నాల విషయంలో మాత్రం ఆమె సెంట్రిస్ట్ వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. ఈ ఐదు రకాల ధోరణులు... అమెరికా రాజకీయాలు ఈరోజు ఎందుకు సందడిగా విభజించబడి ఉన్నాయో, పైగా మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా ఎందుకు ఉన్నాయో వివరించడంలో సహాయ పడవచ్చు. పైగా భారతీయ అమెరికన్లు అక్కడ తమ కొత్త నేల భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా, తరచుగా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
USA presidential election 2024: మరో మూడు ప్రైమరీలు
కొలంబియా(యూఎస్): అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థత్వం డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపుగా ఖాయమైనట్టే. తాజాగా మిస్సోరీ, ఐదహో, మిషిగన్ ప్రైమరీల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు మద్దతు పలికిన డెలిగేట్ల సంఖ్య 244కు పెరిగింది. ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 24 డెలిగేట్ల మద్దతుతో చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కాలంటే 1,215 డెలిగేట్ల మద్దతు కావాలి. మిషిగన్ రాష్ట్ర ప్రైమరీలో 68 శాతం ఓట్లు ట్రంప్‌కు, 27 శాతం ఓట్లు హేలీకి పడ్డాయి. మంగళవారం జరగబోయే 16 ప్రైమరీల ఫలితాలతో రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు దాదాపు తేలిపోనున్నారు. మొత్తం డెలిగేట్లలో మూడింట ఒక వంతు మంది ఆ రోజున తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది ఓటేసి నిర్ణయిస్తారు. ఇప్పటివరకు కొనసాగిన ట్రంప్ అజేయ జైత్రయాత్ర చూస్తుంటే బైడెన్‌కు పోటీగా బరిలో దిగే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేనని దాదాపు ఖరారైనట్టు కన్పిస్తోంది. -
Us Elections: ప్రైమరీల్లో ట్రంప్ హవా.. ఖాతాలో మరో మూడు విజయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేందుకు జరుగుతున్న పార్టీ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన ఇదాహో, మిస్సోరి, మిచిగన్ రిపబ్లికన్ ప్రైమైరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్‌నకు మద్దతుగా ఇప్పటి వరకు 244 డెలిగేట్లు ఉండగా ప్రత్యర్థి నిక్కీ హాలేకు మద్దతుగా కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేట్ అవ్వాలంటే మొత్తం 1215 డెలిగేట్ల మద్దతు అవసరం. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద ఈవెంట్‌గా చెప్పే మార్చి 5 (సూపర్ ట్యూస్డే) మంగళవారం రోజు ఏకంగా 16 రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రైమరీ బ్యాలెట్ పోరు జరగనుంది. రెండు పార్టీల్లో సూపర్ ట్యూస్డే విజేతలు దేశ తుది అధ్యక్ష పోరులో తలపడతారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల తరపున గతంలో తలపడ్డ అభ్యర్థులు జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారనేది దాదాపు ఖాయమైంది. ఇటు బైడెన్ విషయంలో అధిక వయసు, మతిమరుపు వంటి అంశాలు, అటు ట్రంప్‌ను వేధిస్తున్న న్యాయపరమైన కేసుల చిక్కులు ఉన్నప్పటికీ ఇద్దరే మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
ట్రంప్‌కు 3 వేల కోట్ల జరిమానా
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఆయనకు కొత్త కష్టాలు వచి్చపడుతున్నాయి. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు శుక్రవారం 364 మిలియన్ డాలర్ల (రూ.3,020 కోట్లు) జరిమానా విధించింది. తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు, బీమా పొందడంతోపాటు ఇతరత్రా ఆర్థికంగా లాభపడినట్లు ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. న్యూయార్క్ అటారీ్న, జనరల్ డెమొక్రటిక్ పార్టీ నేత జేమ్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై న్యాయస్థానం రెండున్నర నెలలపాటు విచారణ జరిపింది. ట్రంప్‌పై వచి్చన అభియోగాలు నిజమేనని తేలి్చంది. ట్రంప్ నిర్వాకం వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోయినట్లు గుర్తించింది. ఈ కేసులో ట్రంప్‌నకు 355 మిలియన్ డాలర్లు, ఆయన ఇద్దరు కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు 4 మిలియన్ డాలర్ల చొప్పున, ట్రంప్ మాజీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌కు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంటే ట్రంప్ మొత్తం 364 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన డైరెక్టర్ లేదా ఆఫీసర్‌గా ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది సివిల్ కేసు కావడంతో ట్రంప్‌కు జైలు శిక్ష విధించడం లేదని స్పష్టం చేశారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు చెప్పారు. -
US presidential election 2024: మరో ప్రైమరీలో ట్రంప్ గెలుపు
లాస్‌వెగాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మరో రాష్ట్రంలో గెలుపు సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగవుతున్నాయి. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా బరిలో నిలవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. ఇప్పటిదాకా ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు. -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలిచిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీ, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగుచూసినా.. రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉన్నారని రుజువైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రాలవారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్ బోణీ కొట్టడం రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్‌కు 21.2 శాతం ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, సౌత్ కరోలీనా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు పడ్డాయి. సగానికిపైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థి తానేనని ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. అయోవా రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి. ఓట్ల పరంగా చూస్తే మరో అభ్యర్థి అసా హుచిన్సన్కు కేవలం 191 ఓట్లు, ఇంకో అభ్యర్థి క్రిస్ క్రిస్టీకి 35 ఓట్లు పడ్డాయి. అత్యల్ప ఓట్లు సాధించడంతో తాను ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రకటించారు. ఈసారి మొత్తంగా 1,10,000 మంది ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఇంత తక్కువగా ఓటింగ్ జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక ట్రంప్‌కే నా మద్దతు: వివేక్ రామస్వామి అయోవా ప్రైమరీ ఎన్నికల్లో తక్కువ ఓట్లలో నాలుగో స్థానానికి పరిమితమైన భారతీయవ్యాపారి వివేక్ రామస్వామి ఇక ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ రాష్ట్ర ప్రైమరీలో ఆశ్చర్యకర ఫలితాలను ఆశించి భంగపడ్డా. ఇక ప్రచారానికి స్వస్తి పలుకుతున్నా. అధ్యక్షుడినయ్యే మార్గమే లేదు. ఇక నా మద్దతు ట్రంప్‌కే’’ అని తన మద్దతుదారుల సమక్షంలో వివేక్ మాట్లాడారు. -
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు వివేక్ మద్దతు ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, కేవలం 7.7 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వివేక్ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన పోటీ ప్రకటన తర్వాత వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారాయన. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకున్నారాయన. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ తరహాలో ప్రచారం చేస్తూ వచ్చారాయన. అలాగే.. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అంటూ ప్రకటన చేశారాయన. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. భారీ ఊరట -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్‌పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్
పోర్ట్‌ల్యాండ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్‌నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్‌నకు కలి్పంచారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
మరో షాక్.. ట్రంప్‌కు మూసుకుపోతున్న దారులు
అగస్టా: అగ్రరాజ్య అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌కు రెండోసారి చేరుకునే క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో న్యాయస్థానం ప్రకటించిన పట్టుమని పదిరోజుల గడవక ముందే.. మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనే(Maine) స్టేట్ గురువారం ప్రకటించింది. అమెరికా చట్టసభ క్యాపిటల్(US Capitol Hill)పై 2021, జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అయితే ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతీ తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనే స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ అక్కడి ఎన్నికల విభాగం నిర్ణయించింది. దీంతో.. మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్‌పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరారు అని షెన్నా బెల్లోస్ పేర్కొన్నారు. ఇక.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. తాజా పరిణామాలతో (సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప).. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్ జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్‌హాట్‌గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
యూఎస్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్ స్కాట్
కొలంబియా(యూఎస్ఏ): 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అయోవాలో ఓటింగ్ ప్రారంభం కానున్న వేళ ఆదివారం అర్ధరాత్రి టిమ్ స్కాట్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉపాధ్యక్ష పదవికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. రిపబ్లికన్ సెనేటర్లలో ఏకైక నల్లజాతీయుడైన స్కాట్ అందరి కంటే ముందుగా మేలోనే అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు తెలిపారు. -
USA: అమెరికా మాజీ అధ్యక్షుడు మైక్ పెన్స్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిపబ్లికన్ నేత మైక్ పెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్ కొయిలేషన్ వార్షిక సదస్సులో మైక్ పెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ..‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. 🚨🚨🚨Mike Pence DROPS OUT of 2024 Presidential Race Watch: pic.twitter.com/xRTucsmFqV — Benny Johnson (@bennyjohnson) October 28, 2023 ఇక, పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో పెన్స్ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదితరులు పోటీపడుతున్నారు. -
స్పీకర్నే దించేసుకున్నారు!
వాషింగ్టన్: అమెరికాలో విపక్ష రిపబ్లికన్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్ పదవి నుంచి రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్ పారీ్టతో చేతులు కలిపారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్‌లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్ అనంతరం మెకార్తీ స్పీకర్‌గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొంప ముంచిన షట్‌డౌన్ కెవిన్ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్‌డౌన్‌ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్ చేతులు కలిపారన్నది గేట్జ్ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్‌కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు. రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే... గేట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ రిపబ్లికన్ సభ్యులకు నిజానికి కెవిన్ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్‌గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్‌కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్‌గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్ చేస్తుండటంతో రిపబ్లికన్ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది! ఇప్పుడేంటి? ► తదుపరి స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ► అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే. ► గత జనవరిలో జరిగిన ఓటింగ్‌లో గెట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్ అయ్యారు. ► అక్టోబర్ 11న కొత్త స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు. ► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది. ► ప్రస్తుతానికి రిపబ్లికన్ నేతలు స్టీవ్ స్కలైస్ (లూసియానా), టామ్ ఎమ్మర్ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. -
అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం నమోదు అయ్యింది. ఊహించని రీతిలో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మెక్కార్తి తన పదవిని కోల్పోయారు. ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానానికి motion to vacate.. సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు మద్దతు ప్రకటించడం గమనార్హం. తద్వారా అమెరికా 234 ఏళ్లలో తొలిసారిగా స్పీకర్ ఓటింగ్ ద్వారా తొలగింపు పరిణామం చోటు చేసుకున్నట్లయ్యింది. అధికారిక డెమొక్రట్స్‌కు సహకరిస్తున్నారనే ప్రధాన ఆరోపణపై రిపబ్లికన్లు ఆయనపై మంటతో ఉన్నారు. ఈ క్రమంలోనే డెమొక్రట్స్ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 216 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 210 ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది రిపబ్లికన్ రెబెల్స్ ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో రిపబ్లికన్ల రెబల్ గ్రూప్ నేత మ్యాట్ గాయెట్జ్ కూడా ఉన్నారు. డెమొక్రట్స్తో రెబల్స్ మెక్కార్తి వైఖరిపై రిపబ్లికన్లు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి మంజూరు చేయడంలోనూ ఆయన అలసత్వం ప్రదర్శించడంపై రగిలిపోయారు. అయితే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ట్రంప్‌పై న్యాయపరమైన చిక్కులు తదితరాలతో సంయమనం పాటించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించడానికి నిధులను పాస్ చేయడానికి డెమొక్రాట్లపై ఆయన ఆధారపడటాన్ని రిపబ్లికన్లలో కొందరు సహించలేకపోయారు. ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసే ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రోజు ఎవరూ ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఓటింగ్‌కు తర్వాత సభ్యులు నినాదాలు చేశారు. రిపబ్లికన్ రెబల్ మ్యాట్ గాయెట్జ్.. ఈ తీర్మానాన్ని ముందుండి నడిపించడం గమనార్హం. తద్వారా మెక్కార్తితో సుదీర్ఘకాలం వైరం ఉన్న గాయెట్జ్.. అదను చూసి దెబ్బ కొట్టినట్లయ్యింది. I will not seek to run again for Speaker of the House. I may have lost a vote today, but I fought for what I believe in—and I believe in America. It has been an honor to serve. https://t.co/4EMpOuwtzy — Kevin McCarthy (@SpeakerMcCarthy) October 3, 2023 ఎన్నిక కూడా ఉత్కంఠే 2022 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి సెనేట్‌లో స్వల్ఫ ఆధిక్యం లభించింది. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ దక్కడంతో స్పీకర్ ఛాన్స్ దక్కింది. రిపబ్లికన్ పార్టీ తరపున కాలిఫోర్నియా 20th కాంగ్రెసియోనల్ డిస్ట్రిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. 58 ఏళ్ల ఈ మాజీ ఎంటర్ప్రెన్యూర్.. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. 15 రౌండ్ల ఓటింగ్.. అతికష్టం మీద ఐదు రోజుల సమయం పట్టింది. ఓట్లకు ఓట్లు తగ్గించుకుంటూ పోగా.. చివరకు ఆయన స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ►చివరిసారిగా.. 1910లో తిరుగుబాటు తర్వాత జోసెఫ్ జి కెనాన్‌ను తొలగించేందుకు మోషన్ ప్రవేశపెట్టారు. కానీ, అది విఫలమైంది. ►ఇక 2015లోనూ జాన్ బోహెనర్ను తొలగించేందుకు ప్రతినిధి మార్క్ మెడోస్ మోషన్ ప్రవేశపెట్టగా.. బోహెనర్ రాజీనామాతో అది జరగలేదు. ►స్పీకర్ పదవికాలం రెండేళ్లు. కానీ, ఈలోపే మెక్కార్తి పదవిని కోల్పోయారు. తద్వారా.. అమెరికాలో 147 ఏళ్లలో అతితక్కువ కాలం స్పీకర్‌గా పని చేసిన మూడో వ్యక్తిగా మెక్కార్తి నిలిచారు. -
అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన తప్పదా?
వాషింగ్టన్: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది. రిపబ్లికన్ల డిమాండ్ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. అదే జరిగితే 20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు. -
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న భారతీయ అభ్యర్థి వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఆ తర్వాత క్రమ క్రమంగా పాయింట్లను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా అప్పటి వరకు రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రాధమిక పోలింగ్‌లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అతని పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వచ్చారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి మాజీ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ విషయానికి వస్తే జులైలో 26 శాతం మద్దతుతో ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు 6 శాతానికి పడిపోయారు. In a just released CNN-University of New Hampshire poll, DeSantis has dropped 13 points since July's survey. He's now at 10% among likely GOP primary voters, while Vivek Ramaswamy is at 13%, Nikki Haley at 12% and Chris Christie is at 11%. Trump is the first choice at 39%. — Kaitlan Collins (@kaitlancollins) September 20, 2023 ఇది కూడా చదవండి: తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు
నార్త్ కరొలైనా మాజీ గవర్నరు నిక్కీ హేలీ, 38 ఏళ్ల పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడటం! రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీకి నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమెరికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకిది ముందరి ఏడాది కావడంతో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ‘ప్రైమరీ’లు (ప్రాథమిక ఎన్నికలు) రాజకీయ వాతావర ణాన్ని వేడెక్కిస్తున్నాయి. యూఎస్‌లో 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. యూఎస్ మొత్తం జనాభాలో ఇది దాదాపుగా 1.3 శాతం. యూఎస్ కాంగ్రెస్‌లో గత దశాబ్ద కాలంలో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కరొలైనా మాజీ గవర్నరు, ఐక్యరాజ్యసమితిలో యూఎస్ శాశ్వత ప్రతినిధి అయిన నిక్కీ రణ్‌ధవా హేలీ... రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఆమె పాలనా సామర్థ్యానికి ఇప్పటికే అనేక నిరూపణలు ఉన్నాయి. బయోటెక్స్ స్టార్టప్‌ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్న 38 ఏళ్ల భారతీయ సంతతి పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి కూడా ప్రస్తుతం వెలుగులో ఉన్నారు. అతడు డబ్బు వరదలో కొట్టుకుని పోతున్నవాడు. అమెరికా గుండెకాయగా పేర్గాంచిన మిడ్వెస్ట్ ప్రాంతంలో పెరిగి పెద్దవాడైనవాడు. ఐవీ లీగ్ ప్రావీణ్యాలతో పరిపుష్ట మైనవాడు. ప్రఖ్యాత మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. ఆయన కథనాల్లో అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ఓటర్లు ఏం కోరు కుంటున్నారన్న విషయమై ఆయనకు చక్కటి అంచనా ఉంది. అత్యధిక సంఖ్యలో డెమోక్రాట్ల వైపున ఉన్న యూఎస్‌లోని ప్రవాస భారతీయులకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ రామ స్వామి ఆలోచనలు గిట్టనివే కావచ్చు. పని ప్రదేశాలలో వైవిధ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో వైవిధ్యభరిత మైన ఆలోచనలను ఇష్టపడతానని చెబుతుంటారు. వైవిధ్య వ్యతిరేక తకు ‘తెలివి’ని జోడించడం ఇది. రామస్వామి ఒక రాజ్యాంగ సవర ణను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం 18–24 ఏళ్ల మధ్య వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే యూఎస్ ప్రభుత్వ స్వరూప స్వభావాలలోని ప్రాథమిక అంశాలపై వారెంత అవగాహ నను కలిగి ఉన్నారో నిర్ణయించే ‘సివిక్స్ టెస్ట్’ను ఉత్తీర్ణులై ఉండాలి. మళ్లీ ఇదొక పైకి మంచిగా కనిపించే కపటపూరితమైన ఆలోచన. ఈ వయఃపరిమితిలో ఉన్న జనాభాలో ఎక్కువమంది డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చేవారిలో మధ్య వయస్కులు అత్యధికం. ‘సివిక్స్ టెస్ట్’ నిర్వహణ ద్వారా యువజనుల ఓటర్లలో తగ్గించగలిగినంత మందిని తగ్గిస్తే రిపబ్లికన్లకు ప్రయో జనం చేకూర్చవచ్చన్నది రామస్వామిలోని మరో ఆలోచనా వైవిధ్యం. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమె రికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా డెమోక్రాట్లకు ఓటు వేస్తుండే భారతీయ అమెరికన్లు ఎందుకని రిపబ్లికన్ పార్టీ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, పర్యవసాన వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తర ఫున పోటీ పడటం! ఈ సందర్భంలో ఎవరైనా యూఎస్‌కు భారతీ యుల వలస వెనుక ఉన్న ప్రత్యేక అంశాల మీద, వారు ఏ సామాజిక స్థాయుల నుంచి వలస వచ్చారనే దాని మీద దృష్టిపెట్టడం అవసరం. భారతీయుల వలసల్లోని మొదటి దశ ప్రధానంగా 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో శాన్ఫ్రాన్సిస్కోలోని ఆధునిక టెక్ హబ్ ద్వారా మొదలైంది. ఆసియా సంతతి వారిపై ఉన్న చట్టపరమైన పరి మితుల కారణంగా నాటి వలసదారులు సంఖ్యాపరంగా స్వల్పంగా ఉన్నారు. రైలు–రోడ్లు పనులు, కలప డిపోలు, వ్యవసాయ పొలాల్లో ఉపాధిని వెతుక్కున్నారు. ఆఖరికి కాంగ్రెస్ సభ్యుడు దలీప్ సింగ్ సౌంద్ కూడా 1924లో బర్కిలీలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందినప్పటికీ, యూఎస్ ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరించిన కారణంగా 1949 వరకు రైతుగా పని చేయవలసి వచ్చింది. అమృత్‌సర్‌లో జన్మించిన దలీప్ 1956లో డెమోక్రాటిక్ పార్టీ టికెట్‌పై క్యాలిఫోర్నియా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి ఆసియా – అమెరికన్, మొదటి భారతీయ– అమెరికన్, మొదటి సిక్కు మతస్థుడు దలీప్. 1965 అక్టోబర్ 3న అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇమిగ్రేషన్ బిల్లుపై సంతకం చేయడంతో ఆసియా దేశాల నుండి వచ్చే వలసలపై ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఆ తర్వాత వలస వచ్చి తమ విజయాలతో గుర్తింపు పొందిన అనేక ఆసియా సమూ హాల పిల్లల్లో భారతీయ అమెరికన్ల సమూహంలోని పిల్లలు అధికంగా ఉన్నారు. ఇది భారతీయులలోని ఉన్నత విద్యావంతులు యూఎస్‌లో చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి తోడ్పడింది. వారిలో చాలామంది స్కాలర్‌షిప్‌లపై అక్కడికి వెళ్లారు. వారిని జర్న లిస్ట్ అనితా రాఘవన్ తన పుస్తకం ‘ది బిలియనీర్స్ అప్రెంటిస్: ది రైజ్ ఆఫ్ ది ఇండియన్ – అమెరికన్ ఎలీట్ అండ్ ది ఫాల్ ఆఫ్ గాలియన్ హెజ్ ఫండ్’లో ‘రెండుసార్లు ఆశీర్వదించబడిన తరం’గా చేసిన అభివర్ణన ఎంతో ప్రసిద్ధి చెందినది. యూఎస్ వలస చట్టాల సడలింపు వల్లా, స్వాతంత్య్రానంతరం విద్యారంగంపై భారత్ అపారంగా పెట్టు బడులు పెట్టడం వల్లా రెండు రకాలుగా లబ్ధి పొందిన తరం అది. 1995 తర్వాతి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏర్పడిన డిమాండు, ఆ తర్వాత వై2కె మైగ్రేషన్ ప్రాజెక్టుతో... వలసలు అకస్మాత్తుగా విస్ఫోట స్థాయిలో పెరిగాయి. దాంతో పాటుగా భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై యూఎస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇది చాలామంది ఆర్థిక నిపుణులకు ద్వారాలను తెరిచింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత అంశాలలో బలమైన నేపథ్యం, ఆంగ్ల భాషపై క్రియాత్మక అనర్గళత ఉండి హెచ్–1బి నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకుని అమెరికా వెళ్లినవారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులే. వారిలో అనేకమంది దశాబ్ద కాల వ్యవధిలో అమెరికన్ పౌరులుగా మారారు. 2000 తర్వాత, లేదా గత 10 సంవత్సరాలలో వలసవెళ్లినవారు యూఎస్‌లో శాశ్వత నివా సులుగా ఉంటూ, ప్రస్తుతం పౌరసత్వం పొందే దారిలో ఉన్నారు. వలసల విశిష్టతల దృష్ట్యా భారతీయ అమెరికన్లు రెండు పార్టీల లోనూ ప్రాతినిధ్యం వహించే ధోరణి ఎంత ఎక్కువ మంది పౌరసత్వం పొందితే అంతగా పటిష్ఠం అవుతుంది. ఇతర మైనారిటీ సమూహాల పోరాటం చాలామంది యువ భారతీయ అమెరికన్ల జీవితాలలో ప్రతిబింబించదు. ఎందుకంటే వీరంతా ఉన్నత విద్యావంతులైన మొదటి తరం భారతీయ అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించినవారు. నాణ్యమైన విద్య, సమయపాలన, అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థల మద్దతుతో ఈ యువ బృందం ఆర్థికంగా లాభదాయకమైన అనేక వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించింది. జెనరేషన్ జడ్, లేదా మిలీనియల్ జనరేషన్ నుంచి కొందరు తక్కువ ఆదాయ పన్ను, ప్రైవేట్ హెల్త్ కేర్ వంటి విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఇతర మైనారిటీ సమూహాలకు భిన్నంగా సంక్షేమ పథ కాల పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండవచ్చు. భారతీయ అమెరికన్ల రాజకీయ పొత్తులు యూఎస్‌లోని ఇతర మైనారిటీ సమూహాల రాజ కీయాలపై మన అవగాహన నుండి ఉత్పన్నం అయినవైతే కాదు. లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US presidential election 2024: రిపబ్లికన్ రేస్ షురూ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయముంది. 2024 నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కానీ రెండు ప్రధాన పక్షాల్లో ఒకటైన విపక్ష రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే బరిలో దిగింది. పార్టీ అభ్యర్థిని నిర్ణయించే సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియకు బుధవారమే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైతే వివాదాస్పద మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో అందరి కంటే ముందున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వైపే స్పష్టమైన మొగ్గుంది. అయినా సరే, ట్రంప్‌నకు ఎంతో కొంత పోటీ ఇస్తారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ డి శాంటిస్తోపాటు మరో ఏడుగురు ఆశావహులు బరిలో దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తొలి రౌండ్ డిబేట్ ఎప్పుడు? ► బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వేదిక: రాజకీయంగా అతి కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో ► రెండో రౌండ్ డిబేట్ సెపె్టంబర్ 27న కాలిఫోరి్నయాలో జరుగుతుంది. అర్హత... అంత సులభం కాదు రిపబ్లికన్ అభ్యరి్థత్వ బరిలో నిలవడం అంత సులువేమీ కాదు. అందుకు పార్టీ నేషనల్ కమిటీ పెట్టే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరెన్నో పార్టీపరమైన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. ► లేదంటే కనీసం రెండు నేషనల్ పోల్స్‌తో పాటు అయోవా వంటి ఒక అర్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► ప్రచారం కోసం కనీసం 40 వేల మంది నుంచి విడివిడిగా విరాళాలు సేకరించాలి. ► మూడు విడివిడి నేషనల్ పోల్స్‌లో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► అంతిమంగా నెగ్గి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే అభ్యరి్థకి పూర్తి మద్దతిస్తామని ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. అయితే రేసులో ముందున్న ట్రంప్ మాత్రం ఇలా సంతకం చేయకపోగా, తిరస్కరించడం విశేషం! డిబేట్లో వీరే... 1. టిమ్ స్కౌట్ (దక్షిణకరోలినా సెనేటర్) 2. డి శాంటిస్ (ఫ్లోరిడా గవర్నర్) 3. నిక్కీ హేలీ (ఐరాసలో అమెరికా మాజీ రాయబారి) 4. వివేక్ రామస్వామి (భారత సంతతి వ్యాపారవేత్త) 5. క్రిస్ క్రిస్టీ (న్యూజెర్సీ మాజీ గవర్నర్) 6. మైక్ పెన్స్ (మాజీ ఉపాధ్యక్షుడు) 7. డౌగ్ బర్గం (నార్త్ డకోటా గవర్నర్) 8. అసా అచిన్ సన్ (అర్కన్సాస్ మాజీ గవర్నర్) ఏం ఒరిగేను? రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌నకు మద్దతు వెల్లువెత్తుతోందనే చెప్పాలి. తమ అభ్యర్థి ఆయనేనని సీబీఎస్, యూగవ్ గత వారం చేసిన పోల్‌లో ఏకంగా 62 శాతం రిపబ్లికన్ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. అలాంటప్పుడు ఈ డిబేట్లతో పార్టీ సాధించేది ఏముంటుందని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఆశావహులు డిబేట్లలో ట్రంప్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలో సమర్థంగా చెప్పగలగాలని అదే సర్వేలో ఏకంగా 91 శాతం స్పష్టం చేశారు. కనుక ఏమైనా జరగొచ్చని, చివరికి అనూహ్యంగా ఎవరైనా అధ్యక్ష అభ్యర్థి కావచ్చని అంటున్న వారికీ కొదవ లేదు. కొసమెరుపు రేసులో అందరి కంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి రౌండ్ డిబేట్లో పాల్గొనడం లేదు. ‘నాకున్న పాపులారిటీకి ఇలాంటి పిల్ల పందాల్లో పాల్గొనడమా? నాన్సెన్స్! నేనెవరో, అధ్యక్షునిగా ఎంత సాధించానో పార్టీ ఓటర్లందరికీ బాగా తెలుసు’’ అంటున్నారాయన! అయితే, సరిగ్గా డిబేట్ల సమయానికే ప్రి రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. సీఎన్ఎన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపగలను.. అందుకు రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా చైనా భాగస్వామ్యాన్ని వేరుచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యపడాలంటే మనం మొదటిగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముంది. లేదంటే 1972లో నిక్సన్ చైనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. నా దృష్టికి పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తుంతయారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి రష్యాను చైనా బిగి కౌగిలి నుండి విడిపిస్తానని అన్నారు. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రధానమైనదని వెల్లడించారు. I will end the Ukraine War on terms that require Putin to exit his military alliance with China. The goal shouldn’t be for Russia to “lose.” It should be for the U.S. to *win.* https://t.co/pmsxaiFR2I — Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 18, 2023 ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
ట్రంప్ ముందున్న మార్గం క్లిష్టమే!
రిపబ్లికన్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ విధానం ఒకటే... ఆయన నేరాలనూ, దుష్ప్రవర్తనలనూ విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడం! అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి నీలిచిత్రాల తారలతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. మరోవైపు, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అమెరికాలో 2023 వేసవికాలం క్రూరంగా ఉండబోతోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ సాంస్కృతిక జ్వరాలకు ఇది ఒక సూచన. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ దూరమే ఉంది. ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అమెరికాను తనవైపు తిప్పుకుంది. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి, తిరిగి భవిష్యత్ అమెరికన్ అధ్యక్షుడిగా భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్నే తీసుకోండి... రహస్య పత్రాలను దుర్వినియోగం చేసిన కేసులో ఆయన వచ్చే ఏడాది మేలో విచారణను ఎదుర్కోనున్నారు. కానీ 2024లో ఆయన ఎదుర్కొనే అనేక కేసుల్లో ఇది ఒకటి మాత్రమే. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన లైంగిక కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ట్రంప్ ఇచ్చిన నగదు చెల్లింపుపై క్రిమినల్ విచార ణను మార్చిలో మొదలెట్టాలని నిర్ణయించారు. జార్జియాలో గత ఎన్నికల్లో పొందిన ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నా లపై కూడా విచారణ కొనసాగుతోంది. చివరగా, ఆయన నకిలీ ఓటర్లతో కూడిన కుట్ర ద్వారా 2020 ఎన్నికల తీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నించాడనే అభియోగంపై కూడా దర్యాప్తు పూర్తి కావస్తోంది. ఈ కుట్రపూరిత ప్రయత్నం 2021 జనవరి 6న క్యాపి టల్‌పై దాడితో ముగియడం తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే రిపబ్లికన్ పార్టీ ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ విధానం ఆయన నేరాలను, దుష్ప్రవర్తన లను విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడంగా కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఈ అభిప్రాయానికి ఎలా వచ్చిందో, ఎలా చేరుకుందో స్పష్టం కావడం లేదు. కానీ ‘లా అండ్ ఆర్డర్’గా తనను తాను చెప్పుకొనే ఈ పార్టీ... 2021 జనవరిలో జరిగిన అల్లర్లలో అసాధారణమైనది ఏమీ కనిపించలేదని భావించే స్థాయికి చేరుకుంది. పైగా ఆ పార్టీ ఇప్పుడు ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)ని కూడా రద్దు చేయాలనుకుంటోంది. అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి పోర్న్ స్టార్లతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. వారి పూర్వ నాయకుడు రొనాల్డ్ రీగన్ సోవియట్ ‘దుష్ట సామ్రాజ్యం’కు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించిన చోట, వారి ప్రస్తుత నాయకుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మరోవైపున డెమొక్రాట్లకు వారి సమస్యలు వారికి ఉన్నాయి. కనీస జనాదరణ కూడా లేని జో బైడెన్ రెండోసారి పదవిని కోరు తున్నారు. అయితే కాగితంపై విషయాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది, ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి, పైగా, రాబోయే ఆరు నెలల్లో పరిస్థితులు మరింత మెరుగు పడతాయన్న అంచనాలున్నాయి. అధ్యక్షుడిని అభిశంసిస్తామంటూ బెదిరించడం ద్వారా బైడెన్‌ను అణగదొక్కాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. బైడెన్, ఆయన కుమారుడు హంటర్ చర్యలు అవినీతితో ముడిపడి ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు, అయినప్పటికీ అధ్య క్షుడు స్వయంగా తప్పు చేసినట్లు చెప్పే సాక్ష్యాలు పెద్దగా లేవు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సంస్కృతీ యుద్ధాలు కూడా అంతే నాట కీయంగా ఉన్నాయి. అమెరికా సమకాలీన చరిత్రలో అతిపెద్ద విభజన, వాస్తవానికి గర్భస్రావ అంశమే. అమెరికన్ సుప్రీంకోర్ట్ అబార్షన్ హక్కుల కోసం రాజ్యాంగ పరమైన రక్షణను తీసివేసిన తర్వాత, అనేక రిపబ్లికన్ రాష్ట్రాలు అబార్షన్ ను నిషేధించడమే కాకుండా, అబార్షన్ చేసేవారి చర్యను నేరంగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలను ఆమోదించాయి. అయితే, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయా సర్వేలు చూపిస్తున్నట్లుగా, అమెరికన్లలో ఎక్కువ మంది కొన్ని పరిమితులతో అబార్షన్ హక్కుకు మొగ్గు చూపుతున్నారు. 1955లో మిసిసిపిలో, శ్వేతజాతి మహిళపై ఈల వేసినందుకు అపహరణకు గురై, చిత్రహింసలపాలై హత్యకు గురైన 14 ఏళ్ల నల్ల జాతి బాలుడు ఎమ్మెట్ టిల్ స్మారక చిహ్నాన్ని గత వారం అధ్యక్షుడు బైడెన్ ప్రారంభించారు. ఆ హత్య, అతని హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడం అనేది 1960లలో పౌర హక్కుల ఉప్పెనను ప్రేరే పించింది. పైగా గత దశాబ్దంలో, ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ (నల్లజాతి జీవి తాలూ విలువైనవే) ఉద్యమ పెరుగుదలను చూశాం. ఈ పరిణామం అమెరికాలో నిలకడగా కొనసాగుతున్న జాత్యహంకార ఫలితమే. సమకాలీన అమెరికన్ జాత్యహంకారం ఎలా పని చేస్తున్నదో చూడాలంటే... ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆశా జనకంగా ఉన్న రాన్ డిసాంటిస్ ఉదాహరణ చూడాలి. బానిసత్వాన్ని కొట్టివేసేలా ఆయన చర్యలు ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో సవరించిన పాఠ్య పుస్తకాలు... పని చేస్తూ బానిసలు కొన్ని నైపుణ్యాలను సంపా దించుకున్నందున వారు తమ బానిసత్వ స్థితి నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నాయి. లైంగిక విద్య, లైంగిక ధోరణి, లింగ గుర్తింపుపై యుద్ధాలు జరుగుతున్నాయి. స్వలింగ సంపర్కుల హక్కులను స్థాపించడానికి విజయవంతమైన ప్రయత్నాలపై ఆధారపడి, ద్విలింగ, లింగ మార్పిడి వ్యక్తులు ప్రస్తుతం తమ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం, దాదాపు 21 శాతం జెన రేషన్ జెడ్ – అంటే 1990ల మధ్య నుంచి 2010 మధ్య జన్మించిన వారు– తమను తాము లెస్బియన్, గే, బైసెక్సువల్ లేదా ట్రాన్్సజెండర్ (ఎల్జీబీటీ)గా గుర్తించుకుంటున్నారు. 1980ల ప్రారంభంలో, 1990ల మధ్యకాలంలో జన్మించిన ‘మిలీనియల్స్’లో ఎల్జీబీటీ సంఖ్య 10 శాతమే. జెనరేషన్ జెడ్ రాక దేశాన్ని ఇతర మార్గాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. అమెరికన్లుగా ఉన్నందుకు ‘అత్యంత గర్వంగా’ భావిస్తున్నా మని చెప్పుకొనే యువకుల (18–34 ఏళ్లు) వాటా 2013లో దాదాపు 40 శాతం ఉండగా, ఇప్పుడది 18 శాతానికి పడిపోయిందని గాలప్ పోల్ వెల్లడించింది. ఈ ఏడాది, ఎల్జీబీటీ హక్కులను పరిమితం చేయడానికి ఉద్దేశించిన 75 బిల్లులు అమెరికా అంతటా చట్టసభలలో ఆమోదించబడ్డాయి. లైంగిక ధోరణి ఆధారంగా ద్వేషపూరిత నేరాలు పెరిగాయి. పైగా ప్రదర్శనలు, ప్రతి– ప్రదర్శనలు ఒక సాధారణ లక్షణంగా మారాయి. పాఠశాల, విశ్వ విద్యాలయ పాఠ్యాంశాలు కూడా రణరంగంలో చేరిపోయాయి. ‘సంస్కృతి యుద్ధాలు’ అని పిలిచే ఇవి నిజానికి మార్పుపై పోరాడటానికి సంప్రదాయవాదులు చేసిన ప్రయత్నం. వలస దారులు, స్వలింగ సంపర్కులు, మహిళలు, పేదలు, నల్లజాతీయులు, ఇతర సమూహాలకు తమ ఖర్చుతో అన్యాయమైన అధికారాలు ఇస్తు న్నందున, ఉదారవాదం యొక్క బాధితులుగా సంప్రదాయవాదులు తమను తాము అభివర్ణించుకుంటున్నారు. సందడి ఎలా ఉన్నప్పటికీ, ట్రంప్‌కు మాత్రం రహదారి క్లిష్టంగానే ఉంది. ఒక ఎన్నికల సర్వే ప్రకారం, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. స్పష్టంగా, అమెరికా మార్పునకు గురవుతోంది. ఇదేమీ అసాధారణ మైనది కూడా కాదు. మితవాదుల ఆధిపత్యంలోని సుప్రీంకోర్టు వంటి సంస్థల సహాయంతో, రిపబ్లికన్లు ‘శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని’ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. మనోజ్ జోషి వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
వేధిస్తున్న తప్పులు
నాలుగు నెలల్లో మూడోసారి నేరాభియోగాలను ఎదుర్కోవడం... అదీ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి అంటే అసాధారణమే! అందులోనూ ఏకంగా దేశాన్నే మోసం చేశారంటూ ఆరోపణ రావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందులోనూ రికార్డు సృష్టించారు. పదవిలో ఉన్నా, లేకున్నా వింత ధోరణి, విచిత్రమైన మాటలతో వార్తల్లో నిలిచిన ట్రంప్‌ను పాత తప్పులు వెంటాడుతున్నాయి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాల ప్రయత్నించారంటూ 4 అంశాల ప్రాతిపదికన 45 పేజీల్లో మంగళవారం ఆయనపై నమోదైన నేరాభియోగం అందుకు తాజా ఉదాహరణ. ఈ ఏడాది ఇప్పటికే మరో రెండు నేరాభియోగాలు మీదపడ్డ ట్రంప్ మెడకు రోజురోజుకూ చట్టం ఉచ్చు బిగిస్తోంది. మళ్ళీ అమెరికా అధ్యక్ష పోటీలో నిలవాలనుకుంటున్న ఆయన వీటి నుంచి బయటపడగలరా? మరో 15 నెలల్లో జరిగే ఎన్నికలపై వీటి ప్రభావమేంటి? నేరాభియోగాలు ఎదుర్కోవడం ట్రంప్‌కు ఇప్పుడు నిత్యవ్యవహారమైపోయింది. 2016 ఎన్నికల ప్రచారవేళ ఓ నీలిచిత్రాల తార నోరు మూయించేందుకు భారీగా డబ్బు చెల్లించారంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో 30 అంశాల ప్రాతిపదికన మన్హాటన్ కోర్ట్ అభిశంసించింది. రహస్య జాతీయ భద్రతా పత్రాలను అనధికారికంగా ట్రంప్ ఉంచుకున్నారంటూ జూన్‌లో ఫ్లోరిడాలోని గ్రాండ్ జ్యారీ 37 అంశాలతో నేరాభియోగం మోపింది. ఆ రెండు నేరాభియోగాల తర్వాత ఈ ఆగస్ట్ 1న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ చేసిన అభియోగం ముచ్చటగా మూడోదన్న మాట. అయితే, మునుపటి రెండింటి కన్నా ఇది భిన్నమైనది, తీవ్రమైనది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ విజయం సాధించినా ట్రంప్, మరో ఆరుగురితో కలసి ఆ ఫలితాన్ని మార్చాలని చూశారన్నది తాజా అభియోగం. ఓటింగ్‌లో మోసమేమీ లేదని ట్రంప్‌కు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలతో కుట్ర చేశారనీ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగొట్టేందుకు ప్రయత్నించారనీ ఆరోపణ. నిరుడు సభాసంఘం నివేదిక సైతం ఇలాంటి నిర్ణయాలకే వచ్చింది. ఎన్నికల తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై ట్రంప్ సమర్థకుల మూకదాడికీ, దానికి దారితీసిన పరిస్థితులకూ పూర్తి బాధ్యత ట్రంప్‌దేనని తేల్చేందుకు చట్టపరమైన తొలి ప్రయత్నం ఈ తాజా నేరాభియోగం. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టుగా... 2020 ఎన్నికల్లో ఓడిపోయినా సరే అధికార పీఠంపై కొనసాగేందుకు అమెరికా లాంటి ప్రజాస్వామ్య అగ్రరాజ్యపు అధ్యక్షుడు ప్రవర్తించడం, ఎన్నికల ఫలితాలకు కుట్ర సిద్ధాంతాలు ఆపాదించడం ఎలా చూసినా సమర్థించలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ, ప్రశాంతంగా అధికార బదలాయింపు అనేవి గణతంత్ర అమెరికాకు మూలస్తంభాలు. కానీ, ఎన్నికల కౌంటింగ్ నియమాలు ఏర్పాటు చేశాక, గత 130 ఏళ్ళ పైగా అంతా ప్రశాంతంగా సాగితే, 2021లో ట్రంప్ తన చర్యలతో మూలాలకే దెబ్బకొట్టారు. ఎన్నికల్లో మోసం జరిగిందన్న తన వాదనకు మద్దతునివ్వాలంటూ అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చారు. చివరకు బైడెన్ విజయాన్ని ఖరారు చేసే శాసననిర్మాతల్ని సైతం ఆ జనవరి 6 నాటి మూకదాడితో భయపెట్టే ప్రయత్నమూ చేశారు. ఇది నేరమే కాదు... ఘోరం. అయితే, ఎన్నికల్లో మోసం జరిగిందని తాను చేస్తున్న వాదన బోగస్సని తెలిసినాసరే, ట్రంప్ కావాలనే అలా అడ్డంగా వాదించారని ప్రాసిక్యూటర్లు నిరూపించగలరా అన్నది ప్రశ్న. అలా నిరూపించడం మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి. ట్రంప్ మాత్రం ఈ అభియోగాలన్నీ తనపై రాజకీయ వేధింపుల్లో భాగమని ఆరోపిస్తున్నారు. వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని 77 ఏళ్ళ ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నారు. చిత్రంగా మునుపు మీద పడ్డ రెండు నేరాభియోగాల వల్ల ఆయన ఎన్నికల రేటింగ్ తగ్గకపోగా విపరీతంగా పెరిగింది. కోర్టు వ్యవహారాల వల్ల ట్రంప్ ఆర్థిక వనరులు తరిగిపోవచ్చు. కోర్ట్ విచారణ మాటెలా ఉన్నా తాజా అభియోగాన్ని సైతం ట్రంప్ తన రాజకీయ లాభానికి వాడుకోవడం ఖాయం. కక్ష సాధిస్తున్నారనీ, అసలైన బాధితుణ్ణి తానే అనీ ఆయన తన ప్రచారంలో వేడి పెంచగలరు. అసలు నిజం, సాక్ష్యాధారాలేమైనా, గణనీయ సంఖ్యలో అమెరికన్ ఓటర్లు ట్రంప్ వాదననే సమర్థించవచ్చు. వెరసి అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు ఓటర్లు పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ తన రాజకీయ చాణక్యంతో కోర్టులో ఉచ్చు నుంచి జారుకొనే ప్రయత్నం చేస్తారు. వకీళ్ళ ద్వారా వ్యవహారాన్ని వీలైనంత జాప్యం చేసి, రేపు మళ్ళీ శ్వేతసౌధ పీఠమెక్కితే అక్కడ నుంచి ఇక అంతా తన కనుసన్నల్లో జరపాలన్నది ఆయన పేరాశ. నిజానికి, శృంగార తార కేసు వచ్చే మార్చిలో, రహస్య పత్రాల కేసు వచ్చే మేలో కానీ తేలవు. వచ్చే జనవరిలో ఎంపిక ప్రక్రియ ప్రారంభించే రిపబ్లికన్ పార్టీ ఆ లోగా తమ అభ్యర్థి ఎవరో ఖరారు కూడా చేసేస్తుంది. ఈ పరిస్థితుల్లో సత్వరమే ఈ అభియోగాలపై విచారణ జరిపి, తప్పొప్పులు తేల్చడమే అమెరికన్ కోర్టుల కర్తవ్యం. ట్రంప్ తప్పు లేదని తేలితే చేసేది లేదు. ఒకవేళ తప్పు చేసినట్టు ఆయనపై నేరాభియోగాలు రుజువైతే తగిన శిక్ష విధించి, చట్టం ముందు ఎంతటి వారైనా ఒకటేనని చూపవచ్చు. అమెరికా ప్రజాస్వామ్య స్ఫూర్తిని లోకానికి చాటవచ్చు. దేశ రాజ్యాంగ వ్యవస్థనే అవహేళన చేసిన ఘటనలో రాజకీయాల రొచ్చులోకి పోకుండా కోర్టులు అప్రమత్తతతో వ్యవహరించడమే ప్రజాస్వామ్య విలువలకు శ్రీరామరక్ష. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది అందుకే! -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
సాక్షులతో మాట్లాడొద్దు
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్‌కు తోడుగా ఆయన వెంట కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్‌కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్‌పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్ టాన్ బ్లాంచ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్ గూడ్‌మ్యాన్ ట్రంప్ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు. అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్ 14 బుధవారం ట్రంప్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
ఇది తెలివైన పనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరం చేశారని కోర్టు అంగీకరించవచ్చు. ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున మరోసారి పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ ఈ కేసు తెరమీదకు రావడం గమనార్హం. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు. ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభేదించేవాళ్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం. ‘యూగవ్’ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది అమెరికన్ ఓటర్లు ఆయనకు మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టు విచా రణ చేపట్టడం న్యాయపరంగా బాగానే కనిపిస్తుంది కానీ రాజకీయంగా అంత తెలివైన పనేనా? ఈ విచారణ ఆయనకు మద్దతిచ్చేవారి సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. గత వారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. కారణం? ఆయన నేరానికి పాల్పడటమే. ఈ విషయం కోర్టు అంగీకరించవచ్చు... ఫలితంగా ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ట్రంప్ ఇంకో సారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశమే ఉండదు. బాగానే ఉంది కానీ, రాజకీయంగా చూస్తే ఇదేమంత తెలివైన విషయంగా కనిపించదు. యాదృచ్ఛికమేనా? అమెరికా న్యాయవ్యవస్థ రాజకీయమైందేమీ కాదు కానీ చేసేందుకు అవకాశాలెక్కువ. డోనాల్డ్ ట్రంప్‌పై ఏ అంశంపై శిక్ష పడుతుందన్నది స్పష్టంగా తెలియదు. ‘పోర్న్ స్టార్’ స్టార్మీ డేనియల్స్‌కు అక్రమంగా డబ్బులిచ్చి ఆ విషయాన్ని దాచడంపై అని చాలామంది అనుకుంటున్నారు. అల్విన్ బ్రాగ్ అనే డెమోక్రటిక్ జిల్లా న్యాయవాది ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అది కూడా నేరం జరిగిందన్న కాలానికి ఆరేళ్ల తరువాత! పైగా 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ కావడం గమనార్హం. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయంటే నమ్మడం కష్టమే.రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం, ట్రంప్ కథ దాదాపుగా ముగిసిపోయినట్లే. ఆయన ర్యాలీలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ప్రసంగాలు కూడా చప్పగా ఉంటున్నాయి. ఫ్లోరిడాకు చెందిన రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రిపబ్లికన్ల కొత్త ఆశల్లా కనిపిస్తున్నారు. 2020లో పోటీ నుంచి తప్పుకొని ట్రంప్‌ను వీరు నేరుగా విమర్శించారు కూడా! ప్రజాదరణ ట్రంప్‌కే ఎక్కువ ట్రంప్ కేసును న్యాయపరంగా విశ్లేషించినప్పుడు ఆయన జైలుకెళ్లే అవకాశాలు తక్కువే అన్నది స్పష్టమవుతుంది. అకౌంట్లను తారుమారు చేసిన నేరానికి రకరకాల ఉపశమన మార్గా లున్నాయని మాజీ ప్రాసిక్యూటర్, న్యాయశాస్త్ర అధ్యాపకుడు జెఫ్రీ బెల్లిన్ అంటున్నారు. ఈ పరి స్థితుల్లో దేశ మాజీ అధ్యక్షుడిని జైల్లో పెట్టడం ఎంత అసాధ్యమో, రాజకీయంగా ఎంత ప్రమాదకరమో జ్యూరీ సభ్యులకూ, న్యాయమూర్తులకూ తెలుసు. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు మరి! ఒకవేళ ట్రంప్ జార్జియా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నాడనో, కాపిటల్‌పై దాడికి మూకను ఉసిగొల్పాడనో విచారణ జరిపితే పర్యవసానాలు వేరుగా ఉండేవేమో! ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభే దించే రిపబ్లికన్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం. ఇదిలా ఉంటే, ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని సంబరంగా ఉన్నారు. ట్రంప్‌పై నమ్మకం ఎప్పుడో సన్నగిల్లినప్పటికీ రిపబ్లికన్ నాయ కులు మైక్ పెన్స్, రాన్ డిశాంటిస్ కూడా ఈ కేసు అక్రమమని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులోని పార్టీ నేత లందరూ ఇదే మాట చెబుతూండటం దీనికి కారణం. కానీ ట్రంప్ విషయంలో ప్రజాభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. యూగవ్ వెబ్సైట్ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు. డిశాంటిస్ విషయంలో ఇది కేవలం 31 శాతం మాత్రమే. హార్వర్డ్ సీఏపీస్/హ్యారిస్ పోల్‌లో ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే నాలుగు పాయింట్లు ముందుండటం గమనార్హం. డెమోక్రాట్లు తమ రాజకీయం కోసం న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజ ల్లోనూ వ్యక్తమైంది. స్టాలిన్ కాలపు హార్రర్ షో... మధ్య అమెరికా ప్రాంతంలోని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నినింపడం... న్యూయార్క్, వాషింగ్టన్లకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు, లిబరల్స్‌ను బూచిగా చూపడం ట్రంప్ రాజకీయంగా ఎదిగేందుకు కారణమైన అంశాలు. సాధారణ ప్రజలకు రక్షకు డిని తానేనని, వారి కోసం పోరాడేదీ తానేనని చెప్పుకొనే వాడు. అలాగే 2020లో తాను ఎన్నికల్లో ఓడిపోయేందుకు ‘వాళ్లు’ కార ణమని నమ్మించగలిగాడు. 2024లోనూ వాళ్లు తనను ఓడిస్తారని చెబుతున్నాడు. అందుకే ట్రంప్‌కు ఈ కేసు రష్యా నియంత స్టాలిన్ కాలం నాటి దమనకాండ మాదిరిగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు ఇప్పుడు నమ్మాల్సిన విషయం ఒకటే. ఎలాగోలా ట్రంప్‌కు కోర్టు ద్వారా నష్టం జరగాలి అని! ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇదెలాగూ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విచారణను పూర్తిగా వాడుకోవడం ద్వారా రిపబ్లికన్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న డిశాంటిస్‌కు ఎంతో కొంత ఆదరణ పెరిగేలా చేయడం... కానీ అది జో బైడెన్ తో పోటీలో గెలిచేంత కాకుండా చూడటం డెమోక్రాట్లకు అత్యవసరం అవుతోంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్నికలకు ఉన్న 18 నెలల కాలాన్ని ట్రంప్ వ్యక్తిత్వంపై దాడికి వాడుకోవాలి. ప్రపంచ స్థాయి వాణిజ్య పోరాటాలు, మరింత జటిలమవుతున్న ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను పట్టించుకోకుండా ట్రంప్‌పైనే దృష్టి పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమతో విభేదించే వారి అడ్డు తొలగించుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి. ప్రజల విషయంలో ఇది మరీ ముఖ్యమవుతుంది. అమెరికన్లలో చాలామంది డోనాల్డ్ ట్రంప్‌ను ఇష్టపడుతున్నారు. నమ్ముతున్నారు కూడా! న్యూయార్క్‌లోని జడ్జి మీద కంటే ఈ విశ్వాసం, ఇష్టం ఎక్కువ. ఈ ధోరణి ప్రమాదకరమైంది కూడా! ఆశ్చర్యకరంగా ఇది అమెరికాతో పాటు పశ్చిమ దేశాల రాజకీయాలన్నింటిలోనూ వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇది నాయకత్వ సంక్షోభానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. సైమన్ జెన్కిన్స్ వ్యాసకర్త కాలమిస్ట్, రచయిత (‘ద గార్డియన్ ’ సౌజన్యంతో) -
US presidential election 2024: ట్రంప్ కేసు దారెటు!?
అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది. ట్రంప్‌పై నమోదైన హష్ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది... గాగ్ ఆర్డర్ ఇస్తారా? ► డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ► న్యాయమూర్తులపై ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మెర్చాన్, మన్‌హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్పై విరుచుకుపడ్డారు. ► ట్రంప్ మంగళవారం మన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది. ► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు, ప్రవర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్ హితవు పలికారు. ► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్ నోరు పారేసుకున్నారు. జువాన్ మెర్చాన్, అల్విన్ బ్రాగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్ బ్రాగ్ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అల్విన్ బ్రాగ్ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్ మండిపడ్డారు. ► ట్రంప్ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ గాగ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ► గాగ్ ఆర్డర్ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు. ► గాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్‌కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో? ► ట్రంప్ హష్ మనీ చెల్లించిన కేసులో మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది. ► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్బ్రాగ్ చెబుతున్నారు. ► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు. ► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్ బ్రాగ్ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ పోటీ ఖాయమేనా? ► ట్రంప్ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. ► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్‌పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ► మార్చి నుంచి జూన్ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు. ► ట్రంప్‌పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు. ► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు. ► రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెడతారా? ► ట్రంప్‌ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్‌కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ► ట్రంప్ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్‌హట్టన్ నుంచి సమీపంలోని స్టాటెన్ ఐలాండ్‌కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్హట్టన్లో ట్రంప్ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్ బృందానికి జడ్జి మెర్చాన్ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్ 19వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించారు. ► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్ న్యాయవాది జోయ్ టాకోపినా చెప్పారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్ ప్రైమ్‌టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
అమెరికా అధ్యక్ష రేసులో నిమ్రత నిక్కీ రాంధవా హేలీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్ తరపున నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీళ్ల అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల కోసం ట్రంప్‌కు తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీదారురాలిని కాబోనని ఆమె రెండేళ్ల కిందట ప్రకటించారు. తాజాగా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారామె. ఇదిలా ఉంటే జో బైడెన్‌పై ఆమె కొంతకాలంగా విమర్శలు చేస్తూనే.. అధ్యక్ష పదవి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకత్వం ద్వారా రిపబ్లికన్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం తన అభిమతమని ప్రకటించారు. Get excited! Time for a new generation. Let’s do this! 👊 🇺🇸 pic.twitter.com/BD5k4WY1CP — Nikki Haley (@NikkiHaley) February 14, 2023 నిక్కీ హేలీ అలియాస్ నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. ఆమె పూర్వీకులది పంజాబ్. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రాంధవా, తల్లి రాజ్ కౌర్ రాంధవా. వాళ్లు అమృత్సర్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు. 51 ఏండ్ల నిక్కీ హేలీ తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నారు. 2004లో తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 2008లో రెండోసారి గెలుపొందారు. 2010లో కాలిఫోర్నియా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేసిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా సేవలందించారు. సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించినా.. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో నిక్కీ హేలీ ఓ అడుగు ముందుకేశారు. ట్రంప్, నిక్కీ హేలీతోపాటు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెస్సెంటీస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తదితరులు పోటీ పడే అవకాశాలున్నాయి. నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: నిక్కీ హేలీ
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్‌ధావా, రాజ్ కౌర్ రన్‌ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్ సింగ్ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు. -
US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
ఎస్.రాజమహేంద్రారెడ్డి అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్‌పై అధికార డెమొక్రాట్ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్‌కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం. నెత్తిన పాలు పోసిన ట్రంప్ ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్‌లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్‌లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్‌పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్‌పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్‌కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. అధికార పక్షాలకు ఎదురుగాలే...! అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ పార్టీ సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్‌లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది! మన మాదిరిగా కాదు... మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్ టర్మ్) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్‌తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. -
సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు అమెరికా పార్లమెంట్ కమిటీకి ఉందంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ రిటర్స్లను బయటపెట్టని ట్రంప్‌కు సమస్యలు ఎదురుకానున్నాయి. 2015–2020 కాలానికి సంబంధించి ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా స్థిరచరాస్తుల ట్యాక్స్ రిటర్న్‌ల వివరాలను బహిర్గతంచేయలేదు. ట్రంప్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ హౌజ్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఆరోపించింది. కమిటీ దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ ట్రంప్‌కు చుక్కెదురైంది. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
నేను రెడీ.. అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్
వాషింగ్టన్: అమెరికా వ్యాపార దిగ్గజం, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు బుధవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. వైట్ హౌస్ బిడ్ కోసం 76 ఏళ్ల వయసున్న ట్రంప్ పత్రాలను సైతం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి ప్రధాన అభ్యర్థిగా ఆయన నిలిచినట్లయ్యింది. అమెరికా పునరాగమనం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అంటూ ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి టెలివిజన్ స్పీచ్ ద్వారా ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి.. ఈ రాత్రి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రకటిస్తున్నా అని తెలిపారాయన. ఆపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నా’’ అంటూ పోస్ట్ చేశారు. BREAKING: President Donald J. Trump, the 45th President of the United States, announces his candidacy for re-election as president in 2024. pic.twitter.com/R7zBQmhLtk — RSBN 🇺🇸 (@RSBNetwork) November 16, 2022 బిజినెస్ టైకూన్, రియాలిటీ టీవీ స్టార్ అయిన డొనాల్డ్ ట్రంప్.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అయితే 2020 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఆయనకు ఫాలోయింగ్ మాత్రం ఈనాటికీ తగ్గలేదు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఫర్ ప్రెసిడెంట్ 2024 పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారమే ఆయన US ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద సమర్పించినట్లు తెలుస్తోంది. -
తప్పిన అంచనాలు
‘డెమోక్రసీకి ఇది శుభదినం!’ అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళిని చూసి, ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అమెరికాలోని డెమోక్రసీ మాటెలా ఉన్నా, బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీకి మాత్రం దాదాపు సార్వత్రిక ఎన్నికల లాంటి ఈ పోల్స్ కొంత శుభప్రదంగా పరిణమించాయి. భారీ ద్రవ్యోల్బణం, ప్రజల్లో బైడెన్‌పై పెరిగిన అసంతృప్తి ఆసరాగా రిపబ్లికన్ల జెండా రంగైన ‘ఎర్ర గాలి’ దేశమంతటా వీస్తుందన్న అంచనా తప్పింది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు ఎగువ సభ సెనేట్‌లోనూ తిరుగులేని ఆధిక్యం తమదే అవుతుందన్న రిపబ్లికన్ పార్టీ అంచనాలను మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలు నీరుగార్చాయి. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీకి రిపబ్లికన్లు మెల్లగా దగ్గరవుతున్నారు. సెనేట్‌లో నువ్వానేనా పోటీ నడుస్తోంది. అయితే, నేవడా, అరిజోనా రాష్ట్రాల ఫలితాల్లో తప్పని జాప్యం – డిసెంబర్ 6న జరిగే జార్జియా ఎన్నిక వల్ల పార్లమెంట్లో అంతిమ బలాబలాలు తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయంగా ఏమంత ఆసక్తి వ్యక్తం కాదు. ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్ అయ్యారు, ఎవరు సెనేటర్ అయ్యారనేది ప్రపంచానికి పెద్దగా పట్టని వ్యవహారం. కానీ, ట్రంప్ హయాం నుంచి పరిస్థితి మారింది. అయితే, మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలంతగా అందరి దృష్టినీ ఆకర్షించినవి చాలాకాలంగా మరేవీ లేవనే చెప్పాలి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఆ ఎన్నికల ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేశారన్న అప్పటి ట్రంప్ తప్పుడు వాదననే ఇప్పుడీ నవంబర్ 8 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్లు తెగ ఊదరగొట్టడం గమనార్హం. అలా చివరకు ఈ ఎన్నికలు ట్రంప్వాదపు దీర్ఘకాల మన్నికకు అగ్నిపరీక్షగా, అమెరికన్ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుంటుందో పరీక్షించే గీటురాయిగా మారాయి. ప్రపంచం ఆసక్తిగా చూసేలా చేశాయి. అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపిన ఎర్రరంగు రిపబ్లికన్లకూ, అధికార పీఠంపై అస్తుబిస్తు అవుతున్న నీలిరంగు డెమోక్రాట్లకూ ఈ ఎన్నికలు పాఠాలు నేర్పాయి. నిజానికి, అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ళ పదవీకాలంలో దాదాపు మధ్యలో జరిగే మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీ, దేశాధ్యక్షుల పనితీరుపై రిఫరెండమ్ లాంటివి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రతి మిడ్‌టర్మ్ పోల్స్‌లోనూ అధికార పార్టీ సగటున 26 స్థానాలు సర్వప్రతినిధి సభలో, 4 సీట్లు సెనేట్‌లో కోల్పోతుందని లెక్క. ఆ లెక్కన అధికార డెమోక్రాట్ పార్టీకీ ఎదురు దెబ్బలు అనూహ్యమేమీ కాదు. కానీ, దిగువసభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తున్నా అంచనాలకు తగ్గట్టు భారీ సంఖ్యలో విజయాలు రాలేదు. భయపడినంత గట్టిదెబ్బ డెమోక్రాట్లకు తగలలేదు. ఇది సర్వేలు సైతం అంచనా వేయని ఆశ్చర్యకర పరిణామం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల గెలుపుతో, ఫలితాలు తాము అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఉన్నాయని బైడెనే ఒప్పుకున్నారు. ఇక, ట్రంప్ గట్టిగా బలపరిచిన పలువురు మితవాదులు వివిధ రాష్ట్రాల్లో ఓటమి పాలవడం విడ్డూరం. మిగిలిన బైడెన్ పదవీకాలం ఎలా గడుస్తుంది, అమెరికా రాజకీయాలపై ట్రంప్ నీడ ఏ మేరకు పరుచుకుంటుంది లాంటివన్నీ ఇక ఆసక్తికరం. మునుపెన్నడూ లేని విధంగా దేశం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో, దిగువసభలో రిపబ్లికన్ల ఆధిక్యం బైడెన్‌కు కష్టాలు తేనుంది. ఒకప్పుడు ఎరుపు, నీలం పార్టీలు రెంటికీ సమాన బలాబలాలుండి, అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్టంలో ఇప్పుడు దాదాపు 20 శాతం పాయింట్ల పైగా భారీ తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డీశాంటిస్ గెలవడం గమనార్హం. ఆ రాష్ట్రం అంతకంతకూ ఎరుపుమయం అవుతోందనడానికి ఇది నిదర్శనం. వచ్చే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంలో ట్రంప్‌కు గట్టి సవాలు ఆయన నుంచే ఎదురుకావచ్చు. ఏమైనా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను బట్టి ఒకటి స్పష్టమవుతోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం అస్వాభావికమేమీ కాదు. ఆ సంగతి గ్రహించిన అమెరికా మిత్రపక్షాలు రానున్న రోజుల్లో నాటో, ఉక్రెయిన్లకు మద్దతు లాంటి వాటిపై ఎలా వ్యవహరిస్తాయన్నదీ ఆసక్తికరమే. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురి నేపథ్యాలు వైవిధ్యానికి ప్రతీకగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భారత అమెరికన్లు అయిదుగురు ప్రతినిధుల సభకు ఎన్నికైతే, మేరీల్యాండ్‌కు గవర్నర్‌గా నల్లజాతీయుడు, లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణా మిల్లర్, ఇతర రాష్ట్రాల్లో ఒక స్వలింగ సంపర్క మహిళ, ఒక ట్రాన్స్‌జెండర్ గవర్నర్లుగా గెలవడం విశేషం. వీరందరూ డెమో క్రాట్ అభ్యర్థులే కావడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు బాగున్నా, అమెరికా రాజకీయాలు అంతకంతకూ రెండు విరుద్ధ వర్గాల విద్వేషంగా మారుతున్నాయనే బెంగ పుట్టిస్తోంది. ఇప్పటి దాకా దిగువ, ఎగువ సభలు రెంటిలోనూ ఆధిక్యం డెమోక్రాట్లదే. ఎన్నికల తుది ఫలితాలతో రేపు బలాబలాల్లో తేడా వస్తే బైడెన్ అజెండా భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రతినిధుల సభ పూర్తిగా రిపబ్లికన్ల చేతిలోకి వెళితే, మిగిలినవన్నీ పక్కకు పోయి బైడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తుల పరంపర మొదలవుతుంది. సెనేట్ గనక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కైవసమైతే న్యాయ నియామకాల్లోనూ అధ్యక్షుడు బైడెన్ సత్తా కుంటుపడుతుంది. వెరసి, అమెరికన్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయం. -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెనే మన శత్రువు.. అమెరికా అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల ర్యాలీలో మాట్లాడుతూ బైడెనే మన శత్రువు అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి ప్రజలు ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. ఈ ఘటనను న్యాయానికి అపహాస్యంగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో బైడెన్లా ఏ అధ్యక్షుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు. ఇటీవల తనను విమర్శిస్తూ బైడెన్ చేసిన ప్రసంగంపైనా ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ భాష ప్రజాస్యామ్య పునాదులను బెదిరించేలా అతివాదాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు ఇలాంటి అత్యంత దుర్మార్గపు, విద్వేషపూరిత, విభజన ప్రసంగం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు అని చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా! -
రిపబ్లికన్లే అడ్డంకి
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి. పదేళ్ల క్రితం శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు నుంచి నిన్నటి టెక్సాస్ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ? సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది. తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్ ఫ్రీ స్కూలు జోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్ఆర్ఏ సీఈవో వేన్ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం. మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ► 2012 డిసెంబర్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే. ► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే. ► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్ అనునూయులు హింసకు, హేట్ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ విమర్శించారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్య అని మార్క్ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్ అన్నారు. అంతకుముందు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు. ఐదుగురు అటువైపే అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్ రోమ్నీ, బెన్సాసే, సుసాన్ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటే సెనేట్‌లో మూడింట్ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్‌ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు. ట్రయల్ కొనసాగుతుంది సెనేట్‌లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్‌పై అభిశంసన ట్రయల్ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్‌లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్‌లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్‌తో తేలింది. అందువల్ల ట్రంప్‌పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. చదవండి: ట్రంప్ అభిశంసన దిశగా..! అమెరికా సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్‌కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరగనుంది. చదవండి: ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత -
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్‌లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్‌కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా -
ఎన్నికల్లో నేనే గెలిచాను
వాషింగ్టన్: ఓటమిని అంగీకరించబోనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమైనప్పటి నుంచీ, ఎన్నికల్లో, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. రెండు రోజుల క్రితం మాత్రం ఒక్కసారి ఓడిపోయినట్లు అంగీకరించారు. తాజాగా సోమవారం మళ్లీ, ‘నేనే గెలిచాను’ అని ట్వీట్ చేశారు. అధికార వర్గాలు ఎన్నికల ఫలితాలను మరోలా చెబుతున్నాయని పేర్కొంటూ ట్విట్టర్ ఈ ట్వీట్‌ను తప్పుబట్టింది. మెజారిటీకి అవసరమైనవి 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా.. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని యూఎస్ ప్రధాన మీడియా పేర్కొంది. ట్రంప్ ఓటమిని ఖాయం చేసిన పెన్సిల్వేనియాతో పాటు నెవాడ, మిషిగన్, జార్జియా, అరిజోనాల్లో ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ కోర్టులో కేసులు వేశారు. విస్కాన్సిన్‌లోనూ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, తన ఆరోపణలను రుజువుచేసే ఎలాంటి ఆధారాలను కూడా ట్రంప్ చూపడం లేదు. -
ట్రంప్ క్యాంపులో చీలికలు?
వాషింగ్టన్: అధికారం చేపట్టినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడి విమర్శలకు దిగడం, కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేతకు న్యాయస్థానాల్లో కేసులు, కౌంటింగ్ సాగుతూండగానే తాను గెలిచినట్లుగా ప్రకటించుకోవడం వంటి వాటిపై రిపబ్లికన్ పార్టీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారు. దీంతో ట్రంప్ చర్యలకు పార్టీ తరఫు నుంచి తగిన మద్దతు లేదు సరికదా.. రిపబ్లికన్ల నేతగా మరోసారి ఎన్నుకునే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి. సెనేట్‌లో ట్రంప్ మద్దతుదారుగా ఇప్పటివరకూ వ్యవహరించిన మిచ్ మెక్కానెల్ ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరుగుతూండగానే గెలిచినట్లు ట్రంప్ ప్రకటించడాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడం వేరు’’అని కెంటకీ నుంచి గెలుపొందిన మిచ్ స్పష్టం చేశారు. ట్రంప్‌పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసిన వారిలో మిచ్ ఒక్కరే లేరు. ఫ్లారిడా సెనేటర్, ఇటీవలే ట్రంప్ ర్యాలీలో ప్రసంగాలు చేసిన మార్కో రూబియో ట్విట్టర్ వేదికగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చెప్పుకోవాల్సిన అంశం. ‘‘చట్టబద్ధంగా పోలైన ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడం మోసం కాదు’’అని ట్వీట్ చేశారు. చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే నాదే గెలుపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన ఓట్లనే లెక్కిస్తే తనదే గెలుపన్నారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నిజాయతీగా గెలవలేరని డెమొక్రాట్లకు తెలుసు. అందుకే భారీగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలాదిగా గుర్తు తెలియని మెయిల్ ఇన్ ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి’ అని తెలిపారు. నిజాయతీతో కూడిన ఎన్నికలు, నిజాయతీతో కూడిన లెక్కింపు కోరుకుంటున్నామన్నారు. ‘చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే తేలిగ్గా గెలుపు సాధిస్తా. అక్రమ ఓట్లను లెక్కిస్తే ఫలితాలను తారుమారు చేస్తున్నట్లే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించాలనుకుంటే మేం ప్రతిఘటిస్తాం. కానీ, చాలా ఓట్లు ఆలస్యంగా వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషకులు, ప్రముఖ టెక్ సంస్థలు, మీడియా.. డెమొక్రాట్ల పక్షాన నిలబడి ఓటర్లను మభ్యపెట్టాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ప్రసారం చేయని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశాన్ని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ వంటి వార్తా చానళ్లు పట్టించుకోలేదు. ట్రంప్వ్యాఖ్యలపై సీఎన్ఎన్కు చెందిన ఆండర్సన్ కూపర్.. తన సమయం ముగిసిందని తెలిసి వెనక్కి తిరిగి వెళ్తున్న ఊబకాయం తాబేలు వంటి వాడంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అక్రమాలు జరగలేదని అందరూ భావిస్తుండగా ట్రంప్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుండటం వల్లే ఆ సమావేశాన్ని తాము ఆపేశామని ఎన్బీసీకి చెందిన లెస్టర్ హోల్ట్ చెప్పారు. భారీగా దొంగ ఓట్లు పడ్డాయనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని, ఇది ట్రంప్ చేస్తున్న ఆరోపణ అని సీబీఎస్ కరస్పాండెంట్ నాన్సీ కోర్డెస్ చెప్పారు. అధ్యక్షుడు చేస్తున్న తప్పును సరి చేసేందుకే తాము ట్రంప్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఎంఎస్ఎన్బీసీ వ్యాఖ్యాత బ్రియాన్ విలియమ్స్ అన్నారు. ‘మాకు తెలిసినంత వరకు చట్ట విరుద్ధమైన ఓట్లు ఏమీ లేవు. మాకు తెలిసిన ప్రకారం ట్రంప్‌కు గెలుపు కూడా లేదు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జాప్యం అవుతుండటంతో ట్రంప్ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
అడుగు దూరంలో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దేశాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని స్పష్టంగా తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది. అయితే, మేజిక్ మార్క్ 270కి అత్యంత చేరువలోకి వచ్చిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం లాంఛనమేనని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ కొనసాగుతున్న పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నందున తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బృందం ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 264 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అడుగు దూరంలో నిలిచారు. మేజిక్ మార్క్ 270 కి ఆయన కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమైన విస్కాన్సిన్, మిషిగాన్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపు, ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఫినిషింగ్ లైన్‌కు చాలా దూరంలో ఉన్నారు. కానీ, ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు తన ఖాతాలోనే పడుతాయని, దాంతో విజయం తనకే దక్కుతుందని ట్రంప్ నమ్మకంతో ఉన్నారు. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. 11 అరిజోనా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా ఫలితాన్ని పలు మీడియా సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. ‘సీఎన్ఎన్’ సంస్థ అరిజోనాను మినహాయించి బైడెన్ సాధించిన ఎలక్టోరల్ ఓట్లు 255 అని పేర్కొంది. అరిజోనాలో కౌంటింగ్ ముగియలేదని, 86% కౌంటింగ్ అనంతరం, బైడెన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని పేర్కొంది. కానీ, మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి, ఆయన గెల్చుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264 అని పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా.. జార్జియాలో.. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 91% ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ట్రంప్ 1,35,671 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ 71% పోస్టల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా, 7.63 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలాగే, నార్త్ కరోలినాలో 95% కౌంటింగ్ ముగిసిన తరువాత ట్రంప్‌నకు 77,337 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 15. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో 96% కౌంటింగ్ అనంతరం ట్రంప్ మెజారిటీ 18,586కి తగ్గింది. ఇక్కడ ఇంకా 90, 735 ఓట్లను లెక్కించాల్సి ఉంది. 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో 86% కౌంటింగ్ తరువాత బైడెన్ 8వేల స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తాను ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాలతో పాటు, బైడెన్ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్‌నకు విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం దక్కని పక్షంలో.. కోర్టులో తన పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, తాము రేసులోనే ఉన్నామని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రొన్నా మెక్‌డేనియల్ చెప్పారు. ‘ఈ వారాంతానికి ఈ దేశానికి అధ్యక్షుడుగా మరో నాలుగేళ్లు ట్రంపే ఉంటారని స్పష్టమవుతుంది’ అని ట్రంప్ ప్రచార బృందంలోని జేసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు. ‘కౌంటింగ్ మొత్తం ముగిసి, పూర్తి ఫలితాలు వెలువడిన తరువాతనే నేను విజేతగా భావిస్తాను. అమెరికా అధ్యక్షుడిగా నిష్పక్షపాతంగా నేను వ్యవహరిస్తాను’ అని బుధవారం బైడెన్ వ్యాఖ్యానించారు. విస్కాన్సిన్లో ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో తేడా 1 శాతం లోపే ఉంది. అందువల్ల రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసే చట్టబద్ధ అవకాశం ట్రంప్‌నకు ఉంది. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మిషిగన్‌లో కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ ప్రచార బృందం స్థానిక కోర్టులో కేసు వేసింది. కోర్టులో తొలి విజయం ఎన్నికల వివాదాల్లో ట్రంప్ తొలి విజయం సాధించారు. ‘పరిశీలకులను ఆరు అడుగుల లోపు నుంచి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు అనుమతించాలి’ అని పెన్సిల్వేనియాలోని కామన్వెల్త్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పు వచ్చిన వెంటనే.. ‘పెన్సిల్వేనియాలో న్యాయపరంగా భారీ విజయం’ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ను కూడా పరిశీలిస్తామని పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార మేనేజర్ స్టెపిన్ తెలిపారు. షికాగోలో బైడెన్ మద్దతుదారుల నిరసన -
నీరజ్ అనంతాని అరుదైన రికార్డు
వాషింగ్టన్: సెనేట్‌లోనూ హోరాహోరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అనంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మార్క్ ఫోగెల్‌పై విజయం సాధించారు. విజేతగా నిలిచిన తరువాత నీరజ్ మాట్లాడుతూ కేవలం 70 ఏళ్ల క్రితం మాత్రమే స్వాతంత్య్రం సాధించిన భారత్‌లో తన పూర్వీకులు బ్రిటిష్ ఏలుబడిలో జీవించారని, అటువంటి కుటుంబానికి చెందిన తాను సెనేటర్‌గా ఎన్నిక కావడం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని వ్యాఖ్యానించారు. భారతీయ సంతతి సమూహం తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ( సెనేట్‌లోనూ హోరాహోరీ ) సెనేటర్‌గా గెలిపించిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలిపిన నీరజ్ వారి తరఫున స్టేట్‌హౌస్‌లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్ హౌస్‌కు ఎన్నికైఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. ‘‘స్టేట్ సెనేటర్‌గా ఓహాయో వాసులందరూ తమ అమెరికన్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తా’’అని నీరజ్ హామీ ఇచ్చారు. నీరజ్ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు. -
ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. వైట్‌హౌజ్ లక్ష్యంగా సాగుతున్న రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఫలితాల సరళి క్షణక్షణం మారుతూ, అభ్యర్థులు, అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తోంది. పోలింగ్ బూత్‌ల్లో మంగళవారం నమోదైన ఓట్ల లెక్కింపు పూర్తయినా.. ఫలితాలను ప్రకటించే అవకాశం కనపించడం లేదు. ఈ సారి పెద్ద సంఖ్యలో నమోదైన ‘మెయిల్ ఇన్(పోస్టల్)’ బ్యాలెట్లను లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాల్లో మరింత సమయం పట్టనుండటమే అందుకు కారణం. కౌంటింగ్ కొనసాగుతుండగానే, కీలక రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడకముందే, విజయం సాధించేశానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, కౌంటింగ్‌ను నిలిపేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. జో బైడెన్ కూడా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో విజేత 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. బుధవారం రాత్రి(భారత కాలమానం) వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 237 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ ముందంజలో ఉండగా.. 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించి ట్రంప్ బైడెన్‌కు దగ్గరగా నిలిచారు. అయితే, ఈ ఫలితాలను పలు మీడియా సంస్థలు పలు విధాలుగా వెల్లడిస్తున్నాయి. ట్రంప్‌నకు ఇష్టమైన మీడియా సంస్థ ‘ఫాక్స్ న్యూస్’ కూడా ట్రంప్ ఇప్పటివరకు 213 సీట్లే గెలుచుకున్నారని, బైడెన్ 238 స్థానాల్లో విజయం సాధించారని ప్రకటించింది. మొత్తం నమోదైన ఓట్లలో బైడెన్ 50% ఓట్లను బైడెన్, 48.4% ఓట్లను ట్రంప్ సాధించారని పేర్కొంది. బైడెన్ 224 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. బైడెన్ 220 ఓట్లను, ట్రంప్ 213 ఓట్లను సాధించారని ‘సీఎన్ఎన్’ వెల్లడించింది. ప్రస్తుతం, మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలు విజేతను నిర్ధారించే పరిస్థితి నెలకొంది. వీటిలో మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మరోవైపు, పెన్సిల్వేనియాలో దాదాపు 14 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. మిషిగన్‌లోని ప్రధాన పట్టణాల కౌంటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో చివరకు మొగ్గు బైడెన్ వైపే ఉండొచ్చని డెమొక్రట్లు ఆశిస్తున్నారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ ఫలితాల ప్రక్రియతో అమెరికా ప్రజలను మోసం చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. తానే విజయం సాధించానని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాల్లో మోసానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం గట్టిగా తిప్పికొట్టింది. అవి అహంకారపూరిత, తప్పుడు వ్యాఖ్యలని విమర్శించింది. అమెరికన్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తొలగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళితే.. వారి ఆరోపణలను ఎదుర్కొనేందుకు తమ లీగల్ టీమ్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయని బైడెన్ ప్రచార మేనేజర్ జెన్‌ఓ మాలీ డిలాన్ పేర్కొన్నారు. కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరే హక్కు ఏ నేతకు ఉండదని, కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరుతూ ట్రంప్ కోర్టుకు వెళ్తామనడం ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసే నిర్లక్ష్యపూరిత ప్రయత్నమని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. మరోవైపు, డెలావర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తూ.. విజయం తమదేనని, ఫలితాలను ప్రకటించేవరకు ఓపికగా ఉండాలని వారిని కోరారు. అమెరికా మీడియా ఏం చెబుతోందంటే..! అమెరికాలో ప్రధాన మీడియా ఎన్నికల ఫలితాలు తేలడానికి మరి కొద్ది రోజులు పడుతుందని అంచనా వేస్తోంది. ‘‘అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి నెలకొంది. రాజకీయంగా ప్రజలు రెండుగా విడిపోయారు. వారి మనసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి’’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ‘‘అమెరికా ఎన్నికల చరిత్రలో ఇంత గందరగోళం, అనిశ్చితి ఎప్పుడూ చూడలేదు. బుధవారం ఉదయం లేస్తూనే అందరికీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కనిపించింది. కీలక రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యాలే నమోదు కావడంతో తుది ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది’’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. అమెరికా ప్రజలు ఒక అనిశ్చితితో నిద్రలేచారు, అదెప్పటికి వీడుతుందో చెప్పలేకుండా ఉన్నామని వాషింగ్టన్ పోస్టు పత్రిక వ్యాఖ్యానించింది. బైడెన్ ఆచితూచి వ్యవహరిస్తూ సహనం పాటించాలని తన సహచరులకు పిలుపునిచ్చారని ఆ పత్రిక పేర్కొంది. అయితే డెమొక్రాట్లు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఊహించలేని పరాజయాలు మూట కట్టుకున్నారని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ‘కీ’లకం, ఫలితం తేలని రాష్ట్రాలు 6 ఈ రాష్ట్రాలే అమెరికాకాబోయే అధ్యక్షుడిని నిర్ణయించనున్నాయి. ►పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ దాదాపు 8.1% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్ కంటే 4.61 లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ 80% ఓట్ల లెక్కింపే పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 10 లక్షలదాకా మెయిల్ ఇన్ ఓట్లున్నాయి. డెమొక్రాట్ మద్దతుదారులు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. 4.61 లక్షల మెజారిటీని అధిగమించి బైడెన్ ముందుకు దూసుకెళ్లడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయితే విస్కాన్సిన్, మిషిగాన్లలో మెయిల్ ఇన్ ఓట్లలో 70–75% బైడెన్‌కే పడ్డాయి. పెన్సిల్వేనియాలోనూ అదే ఒరవడి కొనసాగితే... బైడెన్‌కు ఇక్కడ విజయావకాశాలు ఉంటాయి. డెమొక్రాట్లు ఇదే ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడ 6వ తేదీకి ఓట్ల లెక్కింపు పూర్తికావొచ్చని అధికారులు చెబుతున్నారు. ►అరిజోనా 11 బైడెన్ 51శాతంతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 47.6% ఓట్లు వచ్చాయి. 86% కౌంటింగ్ పూర్తయింది. మరికోపా కౌంటీ ఓట్ల లెక్కింపు ఇంకా జర గాల్సి ఉంది. ఈ కౌంటీలోనే ఫినిక్స్ నగరం ఉంది. ఈ సిటీలో సర్వేల్లో బైడెన్‌కు ఆరుపాయింట్ల అధిక్యం కనపడింది కాబట్టి అరిజోనాలో ఆయన ఆధిక్యం నిలుస్తుందని అంచనా. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి కౌంటింగ్ పూర్తికానుంది. ►జార్జియా 16 93% ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి ట్రంప్ 50.3 శాతం, బైడెన్ 48.5 శాతం ఓట్లు సాధించారు. డెకాబ్ కౌంటీ, అట్లాంటా నగర శివార్లలోని కౌంటీల్లో అధికభాగం ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో బైడెన్‌కు మొగ్గు కనపడింది. అర్ధరాత్రి దాటాక ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. ►మిషిగాన్ 16 94% ఓట్ల లెక్కింపు పూర్తయిన మిషిగాన్‌లో హోరాహోరీ కొనసాగుతోంది. బైడెన్ 0.9% స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటిదాకా బైడెన్ 49.6%, ట్రంప్ 48.7% ఓట్లు సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటగా భావించే వేన్ కౌంటీ (ఇందులోనే డెట్రాయిట్ నగరం ఉంది)లో ఇంకా 25% ఓట్లను లెక్కించాలి. అందుకే మిషిగాన్ తమదేననే ఆశాభావంతో డెమొక్రాట్లు ఉన్నారు. ►నెవెడా 6 86% కౌంటింగ్ పూర్తికాగా.. బైడెన్ 0.6%తో ఆధిక్యంలో ఉన్నారు. లెక్కించిన ఓట్లలో బైడెన్ 49.3%, ట్రంప్ 48.7% సాధించారు. ఇంకా లెక్కించాల్సిన వాటిలో... ఎన్నికల తేదీన, తర్వాత అందిన మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఉండటంతో ఆధిక్యాన్ని కొనసాగిస్తామన్న ధీమా డెమొక్రాట్లలో ఉంది. ►నార్త్ కరోలినా 15 లెక్కించిన ఓట్లలో ట్రంప్ 50.1% , బైడెన్ 48.7% సాధించారు. 95% కౌంటింగ్ పూర్తయింది. మిగిలిన 5% ఓట్లలో మూడింట రెండొంతులు సాధిస్తేనే బైడెన్‌కు విజయావకాశాలు ఉంటాయి. లేకపోతే నార్త్ కరోలినా రిపబ్లికన్ల ఖాతాలో చేరిపోతుంది. ►బైడెన్ ఖాతాలో విస్కాన్సిన్ బైడెన్ 0.6% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విస్కాన్సిన్ (10 ఎలక్టోరల్ ఓట్లు) ను దక్కించుకున్నారు. బైడెన్‌కు 49.4%, ట్రంప్‌కు 48.8% ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక విస్కాన్సిన్ ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచిన కోట్లాది మందికి ధన్యవాదాలు. విజయోత్సవాలను జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఏ మాత్రం ఊహించని రాష్ట్రాల్లోనూ విజయ ఢంకా మోగిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోండి. ఫ్లోరిడా, ఓహియో, టెక్సాస్, జార్జియా, పెన్సిల్వేనియాలో గెలవడం ఎనలేని ఆనందాన్నిచ్చింది. – ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలు ఎప్పటికి వస్తాయో తెలీదు. రేపే రావొచ్చు. ఇంకా ఆలస్యం కావొచ్చు. మెయిల్ ఇన్ ఓటింగ్ కారణంగా ఈ సారి కౌంటింగ్ ఆలస్యమవుతుంది. అయినప్పటికీ ప్రతీ ఓటుని లెక్కపెట్టి తీరాలి. కానీ అంతిమ ఫలితం మనకే అనుకూలంగా ఉంటుంది. నమ్మకం ఉంచండి మనమే గెలవబోతున్నాం. ఎన్నికల్లో ఎవరు గెలిచారో చెప్పాల్సింది ట్రంపో, బైడెనో కాదు.. ప్రజలు చెప్పాలి. –డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఫ్లోరిడాలో ట్రంప్ అభిమానుల ఆనందహేల ఫ్లోరిడాలో ఫలితాల్ని ఆసక్తిగా గమనిస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభిమాని -
కుట్ర జరుగుతోంది, సుప్రీం కోర్టుకు వెళతాం: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోట్లాది అమెరికన్లకు నా ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలవబోతున్నాం, భారీగా సంబరాలు చేసుకుంటాం. ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం, కానీ, భారీ విజయం దక్కింది. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లో మనం గెలిచాం. పెన్సిల్వేనియాలో మనం ఘన విజయం సాధిస్తున్నాం. మిషిగాన్‌లోనూ ఆధిక్యంలో ఉన్నాం, గెలుస్తాం. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోంది. ( ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు ) ఈ విజయం ఎవరూ ఊహించలేనిది. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ఆపాలి. దీని కోసం మేము సుప్రీం కోర్టుకు వెళతాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకు జో బైడెన్ 236, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు. -
ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు
వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులిద్దరి మధ్యా గట్టి పోటీ నడుస్తోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు, ప్రకటనలు సైతం చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మీడియా ముందుకు రాకపోయినా ట్విటర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ( ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్ ) అంతేకాకుండా ‘‘ భారీ విజయం దిశగా ఉన్నాం. వాళ్లు ఎన్నికల్లో మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అలా జరగనివ్వం. పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు వేయటానికి ఒప్పుకోం!’’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ ట్వీట్లోని వ్యాఖ్యలు ఎన్నికల్ని తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయంటూ ట్విటర్ దాన్ని తొలగించింది. కాగా, ఇప్పటివరకు జో బైడెన్ 224, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. We are up BIG, but they are trying to STEAL the Election. We will never let them do it. Votes cannot be cast after the Polls are closed! — Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020 -
అమెరికా ఎన్నికలు: మారుతున్న ఓటర్ల మూడ్
ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేచే సమయం ఆసన్నమైంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అందరిలోనూ అదే ఉత్కంఠ... స్వింగ్ భళా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్ రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్లు స్వింగ్ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రి ట్రంప్ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్‌ను సవాల్ చేస్తాం: ట్రంప్ ఫెయేట్‌విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్ బ్యాలెట్ల ద్వారా ఓట్లేశారు. 9కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు. కంప్యూటర్ల యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్–ఇన్ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. ‘అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్వింగ్ ఎలక్టోరల్ రాష్ట్రాలు కాలేజీ ఓట్లు అరిజోనా 11 విస్కాన్సిన్ 10 మిషిగాన్ 16 పెన్సిల్వేనియా 20 ఓహియో 18 నార్త్ కరోలినా 15 జార్జియా 16 ఫ్లోరిడా 29 -
‘ట్రంప్ ఎన్నికల’తో చరిత్ర తిరగబడేనా?
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్లయితే అమెరికా ఎన్నికల చరిత్ర తిరగబడినట్లే. దేశాధ్యక్షుడు రెండో సారి ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటి సారి అవుతుంది. 28 ఏళ్ల క్రితం అంటే, 1992లో బిల్ క్లింటన్ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్లూ బుష్ ఓడిపోయారు. ఆ మాటకొస్లే 231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో కేవలం పది మంది మాత్రమే రెండోసారి విజయం సాధించకుండా పరాజయం పాలయింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేదిదే..!) ప్రపంచంలోని పలు ప్రజాస్వామ్య దేశాల్లోలాగానే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అసమ్మతి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎక్కువగానే ఉంటుంది. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, ఆయన నిర్లక్ష్యమే అందుకు కారణమని అమెరికా ఓటర్లు భావిస్తున్నారు. అమెరికా వందేళ్ల చరిత్రలో 25 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా 11 సార్లు పాలకపక్ష పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. అందులో ఆరుసార్లు డెమోక్రట్లు, ఐదుసార్లు రిపబ్లికన్లు గెలిచారు. ఇక భారత్‌లో 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, అందులో ఏడు ఎన్నికల్లో పాలకపక్ష పార్టీ లేదా సంయుక్త కూటములు ఓడి పోయాయి. అలాగే బ్రిటన్‌కు జరిగిన ఎన్నికల్లో 27 సార్లకుగాను పది సార్లు పాలకపక్షం ఓడిపోయింది. (మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?) అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 78 శాతం మంది పాలకపక్షం అభ్యర్థులే విజయం సాధించారు. అదే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌కు కలసొచ్చే అంశం అని విశ్లేషకులు భావిస్తుండగా, అసమ్మతి పవనాలు బలంగా వీస్తున్నప్పుడు పాలకపక్ష అభ్యర్థులు ఓడి పోవడం కూడా అంతే సహజమని వారు భావిస్తున్నారు. ట్రంప్ ఇటీల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోని నియమించడం ఆయనకు కలసొచ్చే అంశం. నియామకంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో రిపబ్లికన్లు–డెమోక్రట్ల బలం 6–3 నిష్పత్తికి చేరుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా విషయంలో ‘బుష్ వర్సెస్ గోర్’ వివాదం ఎలా చెలరేగిందో ట్రంప్, బైడెన్ విషయంలో అలాంటి వివాదమే ఏర్పడుతోందని, అప్పుడు సుప్రీం కోర్టు సానుకూల వైఖరి కారణంగా ట్రంప్ విజయం సాధిస్తారని విశ్లేషిస్తున్న వారు కూడా లేకపోలేదు. (పెద్దన్న ఎన్నిక ఇలా..) -
పెద్దన్న ఎన్నిక ఇలా..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఆ దేశానికి అధ్యక్షుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అన్ని దేశాలపై ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంత శక్తిమంతమైన పదవి రావడం అంత సులభం కాదు. ఈ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉండే రెండే రెండు పార్టీలు రిపబ్లికన్, డెమొక్రాట్లు. ఈ రెండు పార్టీలు అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి అగ్రరాజ్యాధీశుడు శ్వేతసౌధం చేరుకునేవరకు ప్రతీ దశ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు? నాలుగేళ్లకి ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా ఎన్నిక అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ట్రంప్ వర్సెస్ బైడెన్ అంటూ అభ్యర్థుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి కానీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష విధానంలోనే జరుగుతుంది. అమెరికాలో రాష్ట్రాలే ఎక్కువ శక్తిమంతమైనవి. వాస్తవానికి ప్రజలు అధ్యక్షుడిగా నేరుగా ఓటు వెయ్యరు. వారు నివసించే రాష్ట్రంలో రిపబ్లికన్ లేదంటే డెమొక్రాటిక్ పార్టీ ఎలక్టోరల్‌కు ఓటు వేస్తా రు. రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయించారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. దేశానికి అధ్యక్షుడు కావల్సిన వ్యక్తికి 270 అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావాలి. అప్పుడే ఆ వ్యక్తి అధ్యక్ష పీఠం అధిరోహిస్తారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అ«భ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే కేటాయిస్తారు. అలా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి అగ్రరాజ్యాధీశుడు అవుతారు. అధ్యక్షుడిగా ఎక్కువ ఓట్లు వచ్చినా.. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా లాభం లేదు. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వారే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవిని చేపడతారు. గత ఏడాది ఎన్నికలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. వాస్తవానికి ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి 28 లక్షల పాపులర్ ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధికంగా ఉండే కీలక రాష్ట్రాల్లో హిల్లరీ కంటే ట్రంప్‌కి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనకే అధ్యక్ష పీఠం దక్కింది. ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లతో విజయదుందుభి మోగిస్తే, హిల్లరీ 232 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వింగ్ రాష్ట్రాలు కీలకం అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అత్యంత ముఖ్యం కావడంతో తటస్థంగా ఉండే రాష్ట్రాలనే రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్లకి మద్దతు ఇస్తే, మరికొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్ల వైపు ఉంటారు. అందువల్ల ఆఖరి నిమిషంలో ఓటుపై నిర్ణయం తీసుకునే స్వింగ్ రాష్ట్రాలు అత్యంత కీలకం. అరిజోనా (11 ఎలక్టోరల్ ఓట్లు), నార్త్ కరోలినా (15), ఫ్లోరిడా (29) పెన్సిల్వేనియా (20), మిషిగావ్ (16), విస్కాన్సిన్ (10) లను ఈసారి ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే 101 ఎలక్టోరల్ ఓట్లు ఎటు వైపు వస్తాయో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌కి కూడా ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 435 మంది సభ్యులుండే సర్వ ప్రతినిధి సభకి రెండేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్లకి మరోసారి జరుగుతాయి. ఇక కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో 100 స్థానాలున్నా యి. వీటిలో 33 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. వీరి పదవీకాలం ఆరేళ్లు. విజేత గద్దెనెక్కేది ఎప్పుడు ? అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన వెంటనే అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించరు. తన కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి గడువు ఇస్తారు. ఆ కసరత్తు పూర్తయ్యాక జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ (అమెరికా కాంగ్రెస్) భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి కొత్త అధ్యక్షుడు వైట్‌హౌ స్ (అధికారిక నివాస భవనం)కి వెళతారు. ఫలితాలు ఎప్పుడు? ప్రస్తుత సంవత్సరం కరో నా సంక్షోభంతో ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు. అందుకే ఈ సారి ఎన్నికల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికలు జరిగిన మర్నాడే ప్రజా నాడి తెలిసిపోతుంది. ట్రంప్ అనే వ్యక్తికి ఓటేశా ట్రంప్ శనివారం ఉదయం ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌బీచ్ లైబ్రరీలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. ‘ట్రంప్ అనే వ్యక్తికి ఓటేశాం. బ్యాలెట్ ఓటు కంటే స్వయంగా వచ్చి ఓటు వేయడమే ఎక్కువ సురక్షితం’ అని ఓటేశాక ట్రంప్ అన్నారు. గతంలో ఆయన న్యూయార్క్‌లో ఓటు వేసేవారు. డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంకా ఓటుహక్కు వినియోగించుకోలేదు. నవంబర్ 3వ తేదీన డెలావెర్‌లో ఆయన ఓటేస్తారు. -
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడన్ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు. మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
రిపబ్లికన్ల పైయెత్తు
అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద ప్రాచీనమైన పార్టీ(జీఓపీ)గా అందరూ పిల్చుకునే రిపబ్లికన్ పార్టీ ఆన్లైన్ సదస్సు మొదలైంది. మూడురోజులపాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ మూలాలున్న నిక్కీ హేలీని ఎంపిక చేసి డెమొక్రాటిక్ పార్టీకి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సవాలు విసిరారు. అమెరికాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న భారతీయ ఓటర్లను ఆకర్షించడానికి ఇప్పటికే డెమొక్రాటిక్ పార్టీ కాలిఫోర్నియా సెనెటర్ కమలాహారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంచుకుంది. ఆమె తల్లి తమిళనాడువాసి కాగా, తండ్రి జమైకాకు చెందినవారు. నిక్కీ హేలీ తల్లి దండ్రులిద్దరూ భారతీయులే. వారు పంజాబీలు. ట్రంప్ ఈసారి నెగ్గకపోవచ్చని దాదాపు సర్వేలన్నీ చెబుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ సీనియర్లలో ఆయనపై వ్యతిరేకత వుంది. కానీ ట్రంప్ ఆ వ్యతి రేకతను అధిగమిస్తారని తొలినాటి సదస్సులోనే తేలిపోయింది. రిపబ్లికన్లకు మొదటినుంచీ ఒక ముద్ర వుంది. మిన్ను విరిగి మీద పడుతుందన్నా సంప్రదాయ విధానాలనుంచి జరగరని, జనాకర్షక విధానాలవైపు మొగ్గు చూపరని ఒక అభిప్రాయం వుంది. అబార్షన్లు, వలసలు, విదేశాంగ విధానం, వాణిజ్యం తదితర అంశాల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఎవరు గెలిచినా ఒకే వైఖరి ఉంటుంది. కానీ ట్రంప్ రంగ ప్రవేశంతో అదంతా మారింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ధోరణిని పార్టీ అలవర్చుకుంది. ఇప్పుడు ట్రంప్ ఓడినా, గెలిచినా ఇకపై రిపబ్లికన్ పార్టీ ఆయన వేసిన బాట లోనే పయనిస్తుందని ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎవరికైనా అనిపించకమానదు. తన నాలుగేళ్ల ఏలుబడిలో వలసలపై ట్రంప్ విరుచుకుపడని రోజంటూ లేదు. ఆయన తీసు కొచ్చిన కఠిన నిబంధనలు వలసదారులను వెతలపాలు చేశాయి. కానీ ఇప్పుడు రిపబ్లికన్ సదస్సు సందడిలోనే ట్రంప్ తీరిక చేసుకుని వైట్‌హౌస్‌లో బొలివియా, లెబనాన్, భారత్, సూడాన్, ఘనా లకు చెందిన అయిదుగురు పౌరులకు అమెరికా పౌరసత్వం అందజేశారు. ఇన్నేళ్లుగా అమెరికా ఎదు ర్కొంటున్న సమస్త ఇబ్బందులకూ వలసలే కారణమని చెబుతూ, ఆఖరికి కరోనా వైరస్ వ్యాప్తి వారి పుణ్యమేనని ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్ హఠాత్తుగా ఇలా కొందరికి పౌరసత్వం ఇవ్వడం యాదృ చ్ఛికమేమీ కాదు. వలసల విషయంలో తాము సరళంగానే వ్యవహరిస్తామన్న అభిప్రాయం కలిగిం చడం ఆయన ధ్యేయం. నేరుగా అలా చెబితే శ్వేతజాతి అమెరికన్ ఓటర్లు దూరమవుతారు కనుక ఆ మాట మాత్రం చెప్పరు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా)కు మొదటినుంచీ అనుకూలం. చైనాతో వాణిజ్యం, వివిధ దేశాలతో కొత్త ఒప్పందాలు వగైరాలన్నీ రిపబ్లికన్లకు ప్రీతిపాత్రమైనవి. వాణిజ్య సంబంధాల విస్తరణతో సంపద మరింత పెరుగుతుందని రిపబ్లికన్ పార్టీ విశ్వాసం. జార్జి బుష్ ప్రవచించిన కొత్త ప్రపంచ విధానం ప్రకారం అమెరికా నిర్దేశకత్వంలోనే ఏ దేశమైనా మెలగాలి. ఎవరికి భద్రత కావలసివచ్చినా తమపైనే ఆధార పడాలి. కానీ ట్రంప్ దాన్ని తలకిందులు చేశారు. ‘అమెరికాకే అగ్ర ప్రాధాన్యం’ అన్న నినాదంతో అధి కారంలోకొచ్చి ‘ప్రపంచంపై పెత్తనం వద్దు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అన్న విధానం అమలు చేయడం మొదలుపెట్టారు. వేరే దేశాల్లో వున్న అమెరికా సేనలకయ్యే వ్యయం ఆ దేశాలే భరించాలని, లేదంటే సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తామని షరతు పెట్టారు. చైనాతో కయ్యానికి దిగారు. అసలు అమెరికా విధానమేమిటో అర్థంకాని రీతిలో రోజుకో రీతిగా మాట్లాడి అయోమయం సృష్టించారు. కరోనా వైరస్‌పై నిర్దిష్టమైన వ్యూహం లేకపోవడంతో దేశం అసాధారణ సంక్షోభంలో చిక్కుకుంది. ట్రంప్ పాలనతో జనం విసిగిపోయారని, ఈసారి తమకే పట్టం కడతారని డెమొక్రాట్లు అను కుంటున్నా అదంత సులభమేమీ కాదు. వలస విధానాలు, కరోనా అరికట్టడంలో వైఫల్యాలు, జాతి విద్వేషాలు, తుపాకి సంస్కృతి, పర్యావరణ మార్పులు వగైరా అంశాల్లో ట్రంప్ వైఖరి జనంలో ఏవ గింపు కలిగించినా... ఆయన హయాంలోనే తక్కువ నైపుణ్యం వున్న కార్మికులకు రెండు దశాబ్దాల తర్వాత మెరుగైన వేతనాలు లభించడం మొదలైంది. పన్ను సంస్కరణలు, నియంత్రణల సడలింపు, దేశీయ ఇంధనరంగంలో ఉత్పత్తి పెంచడం వగైరాలతోనే ఇదంతా సాధ్యమైంది. నల్లజాతీయుల ఓట్లలో అత్యధికం తమకే వస్తాయని డెమొక్రాట్లు విశ్వసిస్తున్నా ట్రంప్ హయాంలో ఆ వర్గంలో నిరు ద్యోగిత 5.4 శాతం మాత్రమే వున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఒబామా రెండు దఫాల ఏలుబడిలో కూడా అది 7.5 శాతంకన్నా తగ్గలేదని గుర్తుంచుకుంటే ఆ వర్గాల్లో ట్రంప్‌పై అనుకూలత ఏవిధంగా వుంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇతర అంశాల్లో ట్రంప్‌ను దుయ్యబడుతున్న డెమొ క్రాట్లు, ఆర్థికాభివృద్ధి కోసం ఆయనకన్నా మెరుగ్గా ఏం చేయదల్చుకున్నదీ ఇంతవరకూ చెప్పలేదు. ఆ విషయంలో ఓటర్లకు భరోసా ఇవ్వగలిగితేనే డెమొక్రాట్లకు మెరుగైన అవకాశాలుంటాయి. ఈ ఎన్నికల్లో ఏటికి ఎదురీదుతున్నానన్న భావన ట్రంప్‌లో లేకపోలేదు. అందుకే ప్రతి చిన్న అంశంలోనూ ఆయన జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. డెమొక్రాట్లు కమలాహారిస్‌ను ఎంపిక చేసిన వెంటనే రిపబ్లికన్ పార్టీ గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ పాల్గొన్న భారీ సభ వీడి యోలను ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ నిక్కీ హేలీని ఎంపిక చేసింది. ఎంపికయ్యాక హేలీ చేసిన ప్రసంగం రిపబ్లికన్ పార్టీ ప్రచారం ఎలా వుండబోతున్నదో చెబుతోంది. అమెరికాలో జాతి విద్వేషాలున్నాయన్న ఆరోపణను హేలీ ఖండిం చారు. అందుకు తన రాజకీయ ఎదుగుదలనే ఉదాహరణగా చూపారు. ఇంతవరకూ వరసగా రెండో సారి అధ్యక్షుడిగా పోటీచేసి నెగ్గిన ఏకైక రిపబ్లికన్ నాయకుడు జార్జి డబ్ల్యూ. బుష్ మాత్రమే. ట్రంప్ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో, డెమొక్రాట్లు ఏమేరకు సత్తా చాటగలరో నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తేలుతుంది. -
ట్రంప్‌కు మద్దతుగా విరాళాల వర్షం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం సంయుక్తంగా 16.5 కోట్ల డాలర్లను అత్యధికంగా ఒక్క జూలై నెలలోనే విరాళంగా పొందారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తంగా 1.1 బిలియన్ డాలర్లు వారికి విరాళంగా వచ్చాయి. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో సిద్ధంగా ఉన్నాయని రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) ప్రకటించింది. ట్రంప్ ప్రచారం కోసం ఆర్ఎన్సీ 300 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను తాజాగా రిక్రూట్ చేసుకుంది. దాంతో ట్రంప్ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారి సంఖ్య 1,500కు చేరింది. ఫేస్బుక్ నుంచి ట్రంప్ వ్యాఖ్యలు తొలగింపు ‘చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు’ అని ట్రంప్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌ని ఫేస్బుక్ తొలగించింది. కరోనా వైరస్‌కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేదిగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది తమ విధానానికి విరుద్ధమని, అందుకే దీన్ని తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది. -
పోటీ బైడెన్, శాండర్స్ మధ్యే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎవరనే విషయంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, పార్లమెంటు సభ్యుడు బెర్నీ శాండర్స్ల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అమెరికాలోని పద్నాలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన ప్రైమరీ (అభ్యర్థి ఎన్నిక) ఎన్నికల్లో ఇద్దరూ గణనీయమైన విజయాలు సాధించారు. సూపర్ ట్యూస్డే ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్ తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, శాండర్స్.. కాలిఫోర్నియా, కొలరాడో, యూటా, వెర్మాంట్‌లో తన ఆధిక్యత చాటుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఒకరు నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్ పార్టీ తరఫున నిలబడనున్నారు. ఎన్బీసీ న్యూస్ అంచనాల ప్రకారం బైడెన్ మంగళవారంనాటి ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 342 మంది ప్రతినిధుల మద్దతు గెల్చారు. మునుపు జరిగిన ఎన్నికలను కలిపి చూసుకుంటే మొత్తం 395 మంది ప్రతినిధుల మద్దతు బైడెన్‌కు దక్కాయి. శాండర్స్ మంగళవారంనాటి ప్రైమరీల ద్వారా 245 మంది మద్దతు, మొత్తమ్మీద 305 మంది మద్దతు లభించింది. కాలిఫోర్నియాలో ఆధిక్యత సాధించడం ద్వారా శాండర్స్ తాను డెమొక్రటిక్ తరఫున అభ్యర్థి రేసులో ఉన్నానని నిరూపించుకున్నారు. -
యూఎస్ కాంగ్రెస్ బరిలో మంగ అనంతత్ములా
వాషింగ్టన్ : అమెరికా చట్ట సభ బరిలో భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళ నిలిచారు. ఐవీ లీగ్ పాఠశాలలో అసియా ప్రజలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మంగ అనంతత్ములా వర్జీనియా స్టేట్ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన ఆమె ఇప్పటికే రక్షణ సంబంధిత కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సెనేట్ పోటీకి సంబంధించి మంగ ఇప్పటికే 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి రిపబ్లిక్ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. తద్వారా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా నిలిచారు. ఈమె ఇటీవలే హెర్న్‌డన్ నుంచి తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. సంపన్న జీవితాన్ని విడిచి.. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ.. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించంచారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం భర్త ఉన్నత చదువుల నిమిత్తం కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంపన్న కుటుంబంలో జన్మించిన తాను.. భర్త చదువుల కోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలి అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైతే అమెరికా ఇండియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్యాక్స్‌లను తగ్గించేందుకు, మహిళల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మెరుగు పరుస్తానని, చిన్న, మధ్య తరహ పరిశ్రయలను అభివృద్ధి పరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజానికి, ముఖ్యంగా అమెరికాలోని హిందువుల తరఫున పోరాడుతానని తెలిపారు. అదే విధంగా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ మహళ ప్రమీలా జయపాల్‌ను అనంతత్ములా విమర్శించారు. కాంగ్రెస్‌లో కశ్మీర్ అంశంపై తీర్మానం చేసినందుకు ఆమెపై మండిపడ్డారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు జెర్రీ కొన్నోలీని నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓడిస్తానని అనంతత్ములా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఈ సారి పెద్ద సంఖ్యలో రిపబ్లికన్ పార్టీలోకి మారుతున్నారు. వర్జీనియాలోని హెర్న్ డన్ డెమొక్రాటిక్ కంచుకోట కోట అని చెప్పవచ్చు. హెర్న్‌డన్ దాదాపు 17 శాతం ఆసియా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఏడు శాతం భారతీయ సంతతికి చెందినవారు ఉన్నారు. -
అమెరికాను గొప్పగా చేస్తా
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా. మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది. -
‘సాధినేని యామినిని అరెస్ట్ చేయాలి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ఫిర్యాదు నమోదైంది. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధినేని యామినిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యామిని వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఇష్టానుసారం నోరుపారేసుకొంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. -
ఎన్నికల బరిలో రెజ్లింగ్ సూపర్‌స్టార్
వాషింగ్టన్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ సూపర్ స్టార్ కేన్ త్వరలో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున టెన్నెస్సె రాష్ట్రంలోని నాక్స్ కౌంటీ పట్టణ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మంగళవారం రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో 51 ఏళ్ల కేన్ గెలుపొందారు. కేన్ అసలు పేరు గ్లెన్ జాకోబ్స్. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి యాజమాని అయిన జాకోబ్స్.. రెజ్లింగ్ స్టార్‌గా విపరీతమైన ఆదరణ పొందారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రాథమిక పోటీల్లో కేవలం 17 ఓట్ల తేడాతో జాకోబ్స్ గెలుపొందారు. ‘బహుశా రెజ్లింగ్ స్టార్ అయినందుకే నాకు ఓట్లేసి ఉంటారేమో’ అని ఫలితాల అనంతరం కేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ పాలనపై జాకోబ్స్ ప్రశంసలు కురిపించాడు. ఆగష్టులో జరగబోయే మేయర్ ఎన్నికల్లో డెమొక్రట్ అభ్యర్థి లిండా హనే పై ఆయన పోటీ చేయబోతున్నారు. కేన్ తరపున మరో స్టార్ రెజ్లర్ అండర్ టేకర్ కూడా ప్రచారంలో పాల్గొనటం విశేషం. Thanks to everyone who helped win this historic victory!! The people who cast a ballot for me, my great team, my wonderful volunteers. Looking forward to VICTORY in the general election! — Glenn Jacobs (@GlennJacobsTN) 2 May 2018 -
ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి..??
వాషింగ్టన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను వరించనుందా?. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యానికి ఆయన్ను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి బుధవారం నామినేట్ చేశారు. శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ తెరపైకి లేచింది. గత శనివారం మిచిగాన్‌లో ఓ ర్యాలీకి హాజరైన ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన అభిమానులు నోబెల్..!! నోబెల్..!! అంటూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్(నవ్వుతూ) ‘ నా కర్తవ్యం నేను నిర్వహించాను’ అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్రంప్ సమర్థించారు. ఉత్తరకొరియాతో నేను శాంతినే కోరుకున్నానని అన్నారు. కాగా, అణ్వాయుధాగారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాంతి గ్రామం పాన్ మున్ జోమ్లో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్తో చరిత్రాత్మక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షులుగా పని చేసిన నలుగురికి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి. వీరిలో థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, జిమ్మి కార్టర్, బరాక్ ఒబామాలను శాంతికాముకులుగా గుర్తించి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. -
ట్రంప్‌కు షాక్.. స్తంభించిన అమెరికా
వాషింగ్టన్ : అనుకున్నదే జరిగింది. అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడింది. గడువులోగా ‘ద్రవ్య వినిమయ బిల్లు’ ఆమోదం పొందలేదు. దీంతో షట్ డౌన్ ప్రకటించేశారు. ఈ కారణంగా ప్రభుత్వ వార్షిక లావాదేవీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిధులు నిలిచిపోవటంతో.. ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. స్వాప్నికుల భద్రత విషయంలో స్పష్టమైన హామీ కోరిన డెమోక్రట్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. శుక్రవారం అర్ధరాత్రి దాకా ద్రవ్య వినిమయ బిల్లుపై రిపబ్లికన్లు-డెమోక్రట్లకు మధ్య ఎడతెరగని చర్చలు జరిగాయి. అయితే అవి విఫలం కావటంతో బిల్లు ఆమోదం పొందకుండా పోయి షట్ డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో ట్రంప్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న మరుసటి రోజే షాక్ తగిలినట్లయ్యింది. షట్‌డౌన్ అంటే... ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి వినిమయ బిల్లులో వేటిని చేర్చాలి.. ఎంత కేటాయింపులు చేయాలన్న దానిపై అమెరికన్ కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగితే ఈ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే రోజువారీ వ్యవహారాలకు అవసరమైన నిధులు నిలిచిపోయి షట్‌డౌన్ మొదలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా మూసివేస్తారు. అత్యవసర విభాగాలు(రక్షణ వ్యవహారాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ వంటివి) మినహా అధిక శాతం ప్రభుత్వ సర్వీసులు నిలిచిపోతాయి. ఈ సమయంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవు ప్రకటిస్తారు. షట్‌డౌన్ వల్ల అమెరికా ప్రభుత్వానికి ఒక్కో వారానికి దాదాపు 6.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 42 వేల కోట్లు) నష్టమని ‘ఎస్ అండ్ పీ గ్లోబల్’ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు షట్‌డౌన్ ఎందుకంటే... తల్లిదండ్రుల వెంట అమెరికాకు వచ్చిన పిల్లల్ని(స్వాప్నికులు) తిప్పి పంపకుండా.. వారి పరిరక్షణకు తీసుకునే చర్యల్ని బిల్లులో చేర్చాలని డెమోక్రట్లు పట్టుబడుతున్నారు. ఒబామా హయాంలో స్వాప్నికులకు తాత్కాలికంగా చట్టబద్ధ హోదా కల్పించినా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వీరికి చట్టపరంగా లభిస్తోన్న భద్రతను తొలగించేందుకు గత సెప్టెంబర్‌లో చర్యలు ప్రారంభించారు. దీనిని డెమోక్రట్లు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. అయితే వలస విధానం భిన్న అంశమని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నారు. ఫండింగ్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 230-197 ఓట్లు పోలయ్యాయి. కొందరు రిపబ్లికన్లు కూడా దానిని వ్యతిరేకించటంతో.. ప్రభుత్వం చర్చలకు డెమోక్రట్లను ఆహ్వానించింది. ఈ క్రమంలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. గతంలో కూడా... 1981 నుంచి ఇంతవరకూ అమెరికాలో 12 సార్లు ‘గవర్నమెంట్ షట్‌డౌన్’ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బిల్ క్లింటన్ హయాంలో అత్యధికంగా 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి వరకూ 21 రోజులు షట్‌డౌన్ కొనసాగింది. ప్రస్తుత షట్ డౌన్ పిబ్రవరి 16 వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఏలియన్లు ఆమెను కిడ్నాప్ చేశాయంట!
సాక్షి : గ్రహాంతర వాసులు ఉన్నయా? అన్న చర్చ జరిగినప్పుడల్లా... జరిగిన ఘటనలు.. సాక్ష్యాలు మాత్రం అది నిజమేమోనన్న వాదనను తెరపైకి తెస్తుంటాయి. దీనికితోడు స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఈ విశ్వంలో మనకు తెలియని ప్రపంచాలు బోలెడు ఉన్నాయని.. ఎలియన్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కూడా. అదే సమయంలో రాజకీయ వేత్తలు, మేధావులు, సెలబ్రిటీలు కూడా తామూ ఫ్లైయింగ్ సాసర్(ఏలియన్లు వాడే వాహనాలు) లాంటి వాటిని చూశామని చెప్పటం చూశాం. అయితే అమెరికాలోని మియామి కి చెందిన ఓ పొలిటీషియన్ మాత్రం ఏలియన్లు ఏకంగా తనను కిడ్నాప్ చేశాయని వెల్లడించటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. 59 ఏళ్ల బెట్టినా రోడ్రిగుజ్ అగులెరా మియామి స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆమె ఏలియన్ ఇంటర్వ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. తనకి ఏడేళ్ల వయసులో ఉన్న సమయంలో ఆడుకోమ్మని తల్లిదండ్రులు బయటకు పంపించగా.. ఏలియన్లు తనను తమ వెంట తీసుకెళ్లాయని ఆమె చెప్పారు. ‘మొత్తం మూడు ఏలియన్లు అక్కడ ఉన్నాయి. అవి నన్ను స్పేస్ షిప్‌లోకి తీసుకెళ్లి కాసేపు మాట్లాడాయి. ఓ విమానం లాగే అది ఉన్నప్పటికీ గుండ్రటి ఆకారంలో ఉంది. లోపల సీట్లు.. ఇతర పరికరాలు చాలా తేడాగా ఉన్నాయి. వాటి భాష నాకు అర్థం అవుతోంది. రియో డి జనెరియోలోని జీసస్ విగ్రహం గురించి అవి ప్రస్తావించాయి. భగవంతుడు అంటే మనిషి కాదు.. ఓ శక్తి మాత్రమేనని అవి నాతో చెప్పాయి. దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, అది అర్థం చేసుకునే శక్తి మనుషులకు లేదు. ఈ విశ్వంలో ఒక్క మతం మాత్రమే ఉంది’ అని అవి నాకు వివరించాయి అని ఆమె తెలిపారు. ఆపై అవి తనని ఇంటి వద్ద వదిలేశాయని ఆమె అన్నారు. ఆ తర్వాత కూడా టెలీపతి విధానం ద్వారా అవి తరచూ తనతో మాట్లాడేవని.. ఏఎస్ఐఎస్(ఉగ్రవాద సంస్థ కాదు) అనే ఈజిప్ట్ దేవత గురించి చెప్పాయని.. మాల్టా దీవుల్లో 30 వేల అస్థిపంజరాల గురించి.. సౌత్ ఫ్లోరిడాలోని కొరల్ కాస్ట్లే పిరమిడ్ చరిత్ర గురించి తనతో చర్చించాయని బెట్టినా చెప్పుకొచ్చింది. ఆమె వాదన అసంబద్ధం... రోడ్రిగుజ్ చెప్పే వాటిని కొట్టిపడేసే వాళ్లు లేకపోలేదు. ఆమె చెప్పేది చాలా అసంబద్ధంగా ఉంది. ఇలాంటి ప్రకటనల ద్వారా ఆమె గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. ప్రజలు ఆమెను గుడ్డిగా నమ్మే ప్రసక్తే లేదు అని రిక్ యాబొర్ అనే రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. దీనికి తోడు ఆమెకు పోటీ ఇస్తున్న రిపబ్లికన్ అభ్యర్థులు బ్రూనో బార్రిరో, రఖ్యూల్ రెగలదో.. ట్రాక్ రికార్డుల ఆధారంగా ప్రజలు వారిపై ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని రిక్ అంటున్నారు. డొరల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా పని చేసిన ఆమె.. తర్వాత వైస్ మేయర్‌గా కూడ ఆకొంత కాలం విధులు నిర్వహించారు. రెండేళ్ల క్రితం మహిళల కోసం నెలకొల్పిన ఓ ఇనిస్టిట్యూట్‌లో సహ భాగస్వామిగా ఉన్న ఆమెకు.. రాజకీయంగా మంచి పరపతి ఉంది. అయితే ఎటొచ్చి ప్రచారం కోసం బెట్టినా ఏలియన్ల కథను మళ్లీ తెరపైకి తీసుకురావటంతో.. అది ఆమె విజయానికి ఏ మేర సహకరిస్తుందన్నది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వైట్ హౌజ్‌లో రియాల్టీ షో!
సాక్షి : గత రెండు రోజులుగా వైట్ హౌజ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. అస్తవ్యస్త పాలనతో ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆ పార్టీ సెనెటర్ ఒకరు బుధవారం మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యకుడు కిమ్ జంగ్ ఉన్‌తో మాటల యుద్ధం, లాస్ వెగాస్ కాల్పుల ఘటన, ఫ్లోరిడా తుఫాన్ బాధితులను ఆదుకోవటంలో ట్రంప్ విఫలం అయ్యాడంటూ ఆయన చెబుతున్నారు. ‘‘గత రెండు రోజులుగా వైట్ హౌస్ లో పెద్ద రియాటి షో జరుగుతోంది(ట్రంప్ భార్యల వ్యవహారాన్ని ఉద్దేశించి). ప్రథమ పౌరురాలు ఎవరన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు’’ ఆ సెనేటర్ మండిపడ్డారు. జాతీయ భద్రత కార్యదర్శిగా పనిచేస్తున్న రేటెల్లర్సన్ పై ట్రంప్ వ్యవహరించిన తీరును ఆ సెనెటర్ తప్పుబట్టారు. రేటెల్లర్సన్ ను ఐక్యూ టెస్ట్ కు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించటాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిని ఆయన(ట్రంప్) ఎలా దూషిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన సూచించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరుపుదామన్న రేటెల్లర్సన్ సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఇంకోవైపు రిపబ్లికన్ సెనేటర్ బాబ్ కొర్కర్.. ట్రంప్‌ను మూర్ఖుడిగా అభివర్ణించారు. ఫేక్ మీడియాపై ట్రంప్ ఫైర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డాడు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్బీసీ నెట్‌వర్క్‌తోపాటు మరికొన్ని అమెరికన్ ఛానెళ్లను మూసివేయిస్తానని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాలనను తప్పుబడుతూ తరచూ ఆయా ఛానెళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయిందని, పన్నుల సంస్కరణలో ట్రంప్ దారుణంగా విఫలం అయ్యాడంటూ ఏకీపడేశాయి. దీనికి తోడు వైట్‌హౌజ్ ప్రధాన అధికారి జాన్ ఈ కెల్లీని ట్రంప్ తొలగించబోతున్నాడంటూ మరో వార్తను ప్రసారం చేశాయి. దీంతో ట్రంప్ బుధవారం తన ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేశారు. ఫేక్ మీడియా కారణంగా దేశం గొప్పతనం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ఇది ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని, అవసరమైతే వాటి లైసెన్లు రద్దు చేసేందుకైనా సిద్ధమని ట్రంప్ చెప్పారు. Network news has become so partisan, distorted and fake that licenses must be challenged and, if appropriate, revoked. Not fair to public! — Donald J. Trump (@realDonaldTrump) October 12, 2017 -
30 లక్షల మంది వలసదారులను పంపిస్తాం
ట్రంప్ వెల్లడి వాషింగ్టన్: అమెరికాలో తిష్ట వేసిన వలసదారుల పట్ల కఠినమైన వైఖరి అవలంబిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సరైన పత్రాలు లేని నేరస్తులు, మత్తు పదార్థాల సరఫరాదారులు, ముఠా సభ్యులు వంటి దాదాపు 30 లక్షల మంది వలసదారులను తక్షణమే ఖైదు చేయడమో, లేదా దేశం నుంచి పంపించి వేయడమో చేస్తానని ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతోనే వారిని వెల్లగొడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిపబ్లికన్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, సభ స్పీకర్ అరుున పాల్ ర్యాన్ మాత్రం ఇప్పుడే అలాంటిదేమీ లేదని, సరిహద్దు భద్రతపై తాము దృష్టి పెట్టామని అన్నారు. -
పరిపాలనలో పది సూత్రాలు
ట్రంప్ టీమ్ కార్యాచరణ ప్రణాళిక వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అప్పుడే పరిపాలనా కార్యాచరణపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ట్రంప్ బృందం సన్నద్ధమవుతోంది. అమెరికా వలస వ్యవస్థలో సమగ్రతను పాదుగొల్పేలా 10 సూత్రాల ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ట్రంప్ ట్రాన్సిషన్ బృందం వెల్లడించింది. వలస సంస్కరణలు తీసుకురావడంతో పాటు మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, కొన్ని దేశాల పౌరులకు వీసాల నిరాకణ వంటివి ఇందులో ఉంటాయంది. కాగా, ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నారుు. ట్రంప్ ’మా అధ్యక్షుడు కాదు’ అన్న నినాదం సోషల్ మీడియాలోనూ, నిరసనల్లో హోరెత్తుతోంది. నిరసన కారులను మీడియా రెచ్చగొడుతోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ భార్య, త్వరలో ఫస్ట్ లేడీ కానున్న మెలానియా ట్రంప్‌కు మిషెల్ ఒబామా వైట్‌హౌస్‌లో స్వాగతం పలికారు. వైట్‌హౌస్ మొత్తం తిప్పి స్వయంగా చూపించారు. -
ట్రంప్ గెలిచాడు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయ కేతనం ట్రంప్‌కు 305, హిల్లరీకి 232 ఎలక్టోరల్ ఓట్లు పాపులర్ ఓటులో మాత్రం హిల్లరీకే ఆధిక్యం... హిల్లరీకి 47.7 శాతం ట్రంప్‌కు 47.5 శాతం హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ ఆధిక్యం పాపులర్ ఓట్లలో మాత్రం హిల్లరీదే పై చేయి సర్వేలన్నీ బోల్తా కొట్టాయి.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి.. ‘హిల్లరీ.. హిల్లరీ..’ అన్నవారు నోళ్లెళ్లబెట్టారు.. ‘స్వదేశీ’ నినాదం నింగినంటింది.. ‘స్ట్రాంగ్ టుగెదర్.. ’ అంటూ వచ్చిన హిల్లరీకి షాక్.. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్..’ అంటూ దూసుకొచ్చిన ట్రంప్ రాక్స్.. స్త్రీలోలుడని, కయ్యాలమారి అని, వలసల వ్యతిరేకి అని, ట్యాక్స్ ఎగవేతదారు అని.. ఒకటా.. రెండా.. ఎన్నెన్నో..! వాటన్నింటినీ ‘సెంటిమెంట్’తో తుత్తునియలు చేస్తూ.. ఈస్ట్, వెస్ట్‌ను ఓ ఊపు ఊపేస్తూ.. ‘బ్లాక్’ అండ్ ‘వైట్’ గోడల్ని బద్దలు కొట్టేస్తూ.. అమెరికాలో వినూత్న ఒరవడికి తెరదీస్తూ.. దూసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్..!! 45వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ 70 ఏళ్ల బిజినెస్‌మ్యాన్!!! అందరి లెక్కల్ని తారుమారు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. గెలుపు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా కోసం కలసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ... హిల్లరీదే అధ్యక్ష పీఠమని చివరి వరకూ వేసిన లెక్కల్ని తారుమారు చేస్తూ... రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన విజయం సాధించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం జరిగినా... ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసినా అమెరికన్లు మాత్రం ఆయనకే పట్టంగట్టారు. ఉద్యోగ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి దేశానికి విముక్తి, వలసలకు అడ్డుకట్ట హామీలకే జనం ఓటేశారు. తనకు పట్టున్న రాష్ట్రాలతో పాటు డెమోక్రాట్ల కంచుకోటలన్నింటిని ట్రంప్ బద్దలుకొట్టారు. ఫలితాన్ని తారుమారు చేసే ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినా రాష్ట్రాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. - వాషింగ్టన్/న్యూయార్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు మొత్తం 538. ఇందులో ట్రంప్ 305 ఓట్లు సాధించగా, డెమోక్రాట్ల అభ్యర్థి క్లింటన్‌ను 232తో సరిపెట్టుకున్నారు. 18 నెలల క్రితమే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన 70 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రంప్... ఈ గెలుపుతో జనవరి 20న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. అయితే పాపులర్ ఓట్లు(అత్యధిక ఓట్లు) హిల్లరీనే సాధించడం విశేషం. హిల్లరీ 47.7 శాతం(5,93,21,645), ట్రంప్47.5 శాతం(5,91,50,974) సాధించారు. మిషిగన్, న్యూహ్యాంప్‌షైర్, మిన్నెసోటా రాష్ట్రాలతో పాటు నెబ్రాస్కాలో ఒక ఫలితం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గెలుపు అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ... ‘మన మధ్య విభేదాలతో ఏర్పడ్డ గాయాల్ని మర్చిపోదాం. అమెరికన్లందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటా. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ఇండిపెండెంట్స్ అందరూ ఐక్యంగా సాగేందుకు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి హిల్లరీని పొగుడుతూ... ‘ఆమె గొప్ప పోరాటం చేశారు. హిల్లరీ సేవలకు దేశం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కావాలన్న ఆశలు గల్లంతవడంతో హిల్లరీ ఓటమిని వినయంగా అంగీకరించి శ్వేతసౌధ విజేత ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మూడు రాష్ట్రాలే ముంచాయి పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్, ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపుతో సీన్ మొత్తం మారిపోయింది. ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినాల్లో హోరాహోరీ ఉంటుందని మొదటి నుంచి భావించారు. అక్కడ ట్రంప్ హవాతో హిల్లరీ ఓటమి ముందే తెలిసిపోయింది. డెమోక్రాట్లకు పెట్టని కోటలైన పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్లు మొదటి నుంచి డెమోక్రాట్లకు పూర్తి పట్టున్న రాష్ట్రాలు ... ఈ రాష్ట్రాల్లో మొత్తం 46 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఇవి తప్పకుండా హిల్లరీకే వస్తాయని భావించారు. ఇవి హిల్లరీ ఖాతాలోకి వెళ్తే ఆమెకు దాదాపు 274 సీట్లు దక్కేవి. స్వింగ్ స్టేట్స్లో విజయం సాధించకపోయినా హిల్లరీ విజయం ఖాయమయ్యేది. స్వింగ్ స్టేట్స్ ఓహయో, నార్త్ కరోలినా, ఫ్లోరిడాల్లో కనీసం ఏదో ఒక రాష్ట్రంలో హిల్లరీ గెలుస్తుందని భావించారు. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్ల్లో ఓడినా... ఫ్లోరిడా, ఒహయోలో గెలిస్తే 47 సీట్లు దక్కేవి. ఈ అంచనాలేవీ పని చేయలేదు. ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది? విస్కాన్సన్, మిషిగన్, పెన్సిల్వేనియాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత, చిన్నాచితకా పనులు చేసే ఓటర్లే.. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వలసదారులను నిరోధిస్తానని ట్రంప్ ఇచ్చిన నినాదం పనిచేసింది. అలాగే చివరి వారం రోజులు ఈ రాష్ట్రాల్లో ట్రంప్ అత్యధిక సభల్లో పాల్గొన్నారు. మరోవైపు విస్కాన్సన్, మిషిగన్ ప్రైమరీల్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డ బెర్నీ శాండర్స్ చేతిలో హిల్లరీ ఓడిపోయారు. ఆ ప్రభావం కూడా పడిఉండొచ్చని విశ్లేషకుల అంచనా... ఫ్లోరిడా, నెవడా రాష్ట్రాల్లో స్పానిష్ మాట్లాడే ఓటర్లు ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా ఎక్కువగా హిల్లరీకి ఓటేసినా... తెల్లజాతి ఓటర్లు ఎన్నికల రోజు క్యూ కట్టడంతో ట్రంప్ విజయం సులువైంది. హిల్లరీ శిబిరంలో ఆనందం ఆవిరి ఎన్నికలు ప్రక్రియ ముగిసేవరకూ గెలుపు తమదేననుకున్న హిల్లరీ శిబిరం ఆనందంలో మునిగితేలింది. మన్‌హటన్‌లోని కన్వెన్షన్ సెంటర్లో సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఫలితాలు వెలువడడం మొదలైంది. కౌంటింగ్ సరళి ఇలా.. ♦ భారత కాలమానం ప్రకారం.. బుధవారం పొద్దున 5.30 గంటలకు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. ఇండియానా(11), కెంటకీ(8)ల్లో ట్రంప్ గెలుపు. హిల్లరీ వెర్మాంట్(3)లో గెలుపు. ♦ ఉదయం 6.05 గం. వెస్ట్‌వర్జీనియాలో ట్రంప్ గెలుపు ♦ 6.25 గం. నార్త్ కరోలినా, ఒహయోల్లో పోలింగ్ పూర్తి... అందరిలో ఉత్కంఠ. ♦ 6.35 గం. సగం రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి.. ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, న్యూ హ్యాంప్‌షైర్, వర్జీనియాల కౌంటింగ్ ప్రారంభం . ♦మరోవైపు దక్షిణ, మధ్యపశ్చిమ రాష్ట్రాల్ల్లో అనుకున్నట్లే ట్రంప్ విజయం... తూర్పు తీర రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపు ♦ 7.40 గం. టెక్సాస్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, వయోమింగ్, కాసస్లో ట్రంప్.. ఇలినాయ్, న్యూయార్క్‌లో హిల్లరీ గెలుపు. ఆ సమయంలో ట్రంప్ ఆధిక్యం 123... క్లింటన్ ఆధిక్యం 97... ♦ 7.50 గం. రిపబ్లికన్ పార్టీ ఖాతాలో ఆర్కాన్సాస్.. 8.02 గం. లూసియానాలో ట్రంప్, కనెక్టికట్‌లో హిల్లరీ గెలుపు ♦ 8.08 గం. ట్రంప్‌కు ఆధిక్యంతో కుప్పకూలిన ఆసియా మార్కెట్లు ♦ అక్కడి నుంచి ట్రంప్ దూసుకుపోయారు. ఉదయం 9.15 గం. ఒహయోలో గెలుపు. ట్రంప్ ఆధిక్యం 168, హిల్లరీ 109 ♦ 9.33 గం. కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ మోత... తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మార్గం సుగమం ♦ 10.27 గం. జార్జియా, ఉటావా విజయాలతో 244కు ట్రంప్ ఆధిక్యం ♦ 12.59కి విస్కాన్సన్ విజయం ట్రంప్ గెలుపు పరిపూర్ణం... 270 ఎలక్టోరల్ సీట్లు దాటిన ట్రంప్ ఆధిక్యం. ట్రంప్ గెలుపొందిన రాష్ట్రాలు పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అలాస్కా, ఉటావా, అయోవా, అరిజోనా, విస్కాన్సన్, జార్జియా, ఒహయో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కాసస్, ఒక్లహోమా, టెక్సాస్, వయోమింగ్, ఇండియానా, కెంటకీ, టెన్నెసే, మిస్సిసిపీ, అర్కాన్సాస్, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలాబామా, సౌత్ కరోలినా, మోంటానా, ఐడహ, మిస్సోరీ, న్యూహ్యాంప్‌షైర్, మిషిగన్ రాష్ట్రాలు. క్లింటన్ గెలుపొందిన రాష్ట్రాలు కాలిఫోర్నియా, నెవెడా, హవాయ్, ఇలినాయిస్, న్యూ యార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, డెలావేర్, కొలొరాడో, న్యూ మెక్సికో, వర్జీనియా, ఒరేగాన్, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, మిన్నెసోటా, మైనేలో మూడు స్థానాలు డెమోక్రాట్ల ఖాతాలో... ఒకటి రిపబ్లికన్‌స ఖాతాలో. ఒబామా పిలుపు ట్రంప్‌కు... ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేసి అభినందించారు. అధికార మార్పిడికి సంబంధించి చర్చించేందుకు వైట్ హౌస్‌కు రావాలం టూ ఆహ్వానించారు. ట్రంప్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధం న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని హిల్లరీ చెప్పారు. న్యూయార్క్‌లో బుధవారం రాత్రి మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అమెరికన్లందరికీ ట్రంప్ విజయవంతమైన అధ్యక్షుడిగా పాలన అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం పడ్డ కష్టానికి, ఆశించినదానికి రావాల్సిన ఫలితం ఇది కాదు. ఎన్నికల్లో గెలవలేకపోరుునందుకు క్షమాపణలు చెబుతున్నా’అని ఉద్వేగంతో అన్నారు. ఒక దశలో ఉబికివస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు.‘ట్రంప్‌కు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పాను. దేశం కోసం కలసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల ఫలితాల్ని దేశం అంగీకరించాలన్నారు. ‘మీరు ఎంత బాధపడుతున్నారో... ఆ బాధ అనుభవిస్తోన్న నాకు తెలుసు’ అని అన్నారు. సర్వే ఫలితాలు తారుమారు వాషింగ్టన్: ఎన్నికలపై వచ్చిన సర్వే ఫలితాల్లో 90 శాతం తప్పుగా వచ్చాయి. 322 సీట్లను హిల్లరీ అవలీలగా గెలుస్తారని, ట్రంప్ గల్లంతవడం ఖాయమన్న అంచనాలు పటాపంచలయ్యాయి. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొని ఓటమి తప్పదన్న అంచనాలను తోసిరాజని రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ అగ్రరాజ్యం పీఠాన్ని కై వసం చేసుకోవడం భారీ సంచలనాన్నిసృష్టించింది. సీబీఎస్, ఏబీసీ/వాషింగ్టన్ పోస్టు, సీఎన్ఎన్, బీబీసీ, బ్లూమ్‌బెర్గ్, రాస్ముస్సేన్, మాన్మౌత్ యూనివర్సిటీ, ఎన్బీసీ న్యూస్/సర్వే మంకీలు హిల్లరీదే గెలుపని తేల్చిచెప్పాయి. ఎన్నికల రోజు రాత్రి న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంచనా ప్రకారం హిల్లరీకి 85 శాతం గెలుపు అవకాశాలున్నాయని వెల్లడించారు. సీఎన్ఎన్ పోల్ ప్రకారం హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికలకు రెండ్రోజుల ముందు ప్రకటించారు. అయితే లాస్ఏంజెలిస్ టైమ్స్, ఐడీబీ/టీఐపీపీ సర్వేలు మాత్రం ట్రంప్ విజయం సాధిస్తాయని వెల్లడించాయి. ఫైవ్థర్టీ ఎయిట్ వెబ్సైట్ ట్రంప్‌కు 66 శాతం గెలుపు అవకాశలున్నాయని చెప్పింది. ఆందోళనలో పలు దేశాలు ట్రంప్ గెలుపుతో పలు దేశాలు ఆందోళనలో మునిగిపోయాయి. ట్రంప్ మెజార్టీ సీట్లు వార్త వెలువడగానే ప్రపంచ మార్కెట్లు సైతం కుప్పకూలాయి.‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా, ముస్లింలనుతాత్కాలికంగా అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పాటు... వలసల్ని నిరోధిస్తా. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా చేస్తా’ అంటూ ట్రంప్ చేసిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు అనేక మందికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ముస్లిం ప్రపంచం ఆందోళనతో గమనిస్తోంది. ఇతర దేశాల ఉద్యోగులు అమెరికన్ల అవకాశాలు కొల్లగొడుతున్నారంటూ ట్రంప్ ప్రచారంతో భారత్, చైనా, వియత్నాం, లాటిన్ అమెరికా దేశాలు కూడా ఆందోళనలో పడ్డాయి. ట్రంప్ అభ్యర్థిత్వంపై తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలు, వలసవాదులపై చేసిన వ్యాఖ్యల్ని అనేక మంది సీనియర్లు వ్యతిరేకించడంతో పాటు మద్దతిచ్చేందుకు ఒప్పుకోలేదు. -
ఎవరిది పైచేయి?
అమెరికా సమాజంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేడు జరగబోయే పోలింగ్‌తో ముగియబోతోంది. రెండు ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమయంలోనే ఈ ఉత్కంఠ బయల్దేరింది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్‌పై సోషలిస్టు భావాలుగల బెర్నీ సాండర్స్ పోటీపడటం...రిపబ్లికన్ పార్టీలో అంతవరకూ దాదాపు ‘బయటి వ్యక్తి’గా ముద్రపడిన డోనాల్డ్ ట్రంప్ తెరపైకి రావ డమేకాక ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేయడం ఇందుకు కారణం. అటు సాండర్స్ అయినా, ఇటు ట్రంప్ అయినా లేవనెత్తిన అంశాలు కూడా కీలకమైనవి. ఆ అంశాలు వర్తమాన అమెరికా సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్య లను ప్రతిఫలిస్తాయి. అవి ఆ సమాజం అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని, వివక్షను విప్పి చెబుతాయి. అక్కడి అప్రజాస్వామిక పోకడలను ఎత్తిచూపుతాయి. ప్రపంచంపై తానే రుద్దిన ప్రపంచీకరణ విధానాల పర్యవసానాలను అమెరికా కూడా చవిచూడటాన్ని వెల్లడిస్తాయి. ప్రపంచీకరణను అంతక్రితం ఎలా చూసినా...వాణిజ్యం, పెట్టుబడి, వలసలు తదితర అంశాల్లో ఎలాంటి ఆంక్షలూ లేకపోవడమే అసలైన ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 2000 సంవత్సరంలో ప్రకటించాక అది కొత్త పుంతలు తొక్కింది. అది సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ రంగాలకు సైతం విస్తరించింది. ప్రపంచీకరణ వల్ల పెట్టుబడులు రావడం, వినియోగ వస్తు వులు వెల్లువలా వచ్చిపడటం, పేరెన్నికగన్న బ్రాండ్లు అందుబాటులోకి రావడం అందరినీ సమ్మోహనపరిచాయి. మెరుగైన వస్తువులు చవగ్గా లభ్యంకావడానికి అది తోవలుపరిచింది. కొత్త కొత్త రంగాల్లో అవకాశాలను పెంచింది. అదే సమయంలో యాంత్రికీకరణ పెరిగింది. ఉపాధి దెబ్బతింది. పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థలు లేని చోట పెట్టుబడుల ప్రవాహం కరెన్సీ సంక్షోభాలను సృష్టించింది. సహజ వనరులను బహుళజాతి సంస్థలకు అప్పగించడం, విదేశీ పెట్టుబడుల కోసం పర్యావరణ అంశాల్లో రాజీపడటం ఎక్కువైంది. ఆదాయ వ్యత్యాసాలు అధికమయ్యాయి. వీటిల్లో అనేక అంశాలు అమెరికాను కూడా వేధించడం మొదలెట్టాయి. తయారీ రంగంలో సింహభాగం చైనాకు తరలడంతో ఆ దేశంలో ఉపాధి తీవ్రంగా దెబ్బ తింది. దీనికితోడు వలసొచ్చినవారు తక్కువ వేతనాలకు పనిచేయడానికి ముందు కొస్తుండటం శ్వేతజాతీయులకు శాపమైంది. ఆర్ధిక తారతమ్యాలు హెచ్చాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలు ఉండవు గనుక ఈ పరి ణామాలన్నీ సాధారణ పౌరులను మరింతగా కుంగదీశాయి. ఇలాంటి అంశాలను బెర్నీ సాండర్స్ ఒక కోణం నుంచి చూస్తే డోనాల్డ్ ట్రంప్ మరో కోణం నుంచి చూశారు. సాండర్స్ కుబేరులపై అధిక పన్నుల గురించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానన్నారు. రాజకీయ రంగంపై కార్పొరేట్ల అజ్మాయిషీని పోగొడతానన్నారు. ట్రంప్ మాత్రం శ్వేత జాతి అహం కారాన్ని రెచ్చగొట్టారు. భారత్, చైనా తదితర దేశాలనుంచి వలసొస్తున్నవారు ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు గనుక వారి కట్టడికి చర్యలు తీసుకుంటానన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తానన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అవమానకరమైన రీతిలో మాట్లాడారు. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా ప్రపంచంలో ఇతరచోట్ల వలే అక్కడ కూడా మహిళలపై వివక్ష అధికం. మహిళలపై ఉండే అన్ని రకాల వివక్షనూ పారదోలాలన్న అంతర్జాతీయ ఒడంబడిక(సెడా)ను ధ్రువీకరించడానికి అదింకా సిద్ధపడలేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదో ఏటా నివేదికలు తయారు చేసే అలవాటున్న అమెరికాలో ఈ దుస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1789 మొదలుకొని అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న అమె రికాలో ఒక మహిళ బరిలో నిలబడటం ఇదే మొట్టమొదటిసారని గుర్తుంచుకుంటే ఆ వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. 1848లో అమెరికాలో జరిగిన తొలి మహిళా హక్కుల సదస్సు స్త్రీ, పురుష సమానత్వం కావాలని, మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలని కోరితే 1919 వరకూ వారికి ఓటు హక్కే లేదు. దీన్నంతటినీ చక్కదిద్దవలసిన తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకుని రంగం లోకి దిగిన ట్రంప్ ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చారు. మహిళలపై గతంలో అత్యంత నీచంగా చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించిన వీడియోలు బయటపడినా క్షమాపణ చెప్పడం సంగతలా ఉంచి...అలాంటి అభిప్రాయాలుండటం తప్పేనని విచారం వ్యక్తం చేయడానికి కూడా ఆయనకు నోరు పెగల్లేదు. డెమొక్రటిక్ పార్టీ విధానాలనూ, వివిధ అంశాల్లో హిల్లరీ క్లింటన్ వైఖరినీ విమర్శించి, అందులోని లొసుగులను ఎత్తి చూపాల్సిన ట్రంప్ అందుకు భిన్నంగా ఆమెను మహిళగా మాత్రమే చూసి కించప రచడం ప్రజాస్వామికవాదులందరినీ కలవరపరిచింది. హిల్లరీ వ్యతిరేకులు సైతం ఆమెకే ఓటేద్దామని నిర్ణయించుకునేలా చేసింది. అమెరికా ఇప్పుడు ట్రంప్ అనుకూల, ట్రంప్ వ్యతిరేక శిబిరాలుగా విడి పోయింది. ఒక మహిళ తొలిసారి అధ్యక్ష బరిలో ఉండటంపై ఉత్సాహం ఉరక లెత్తాల్సి ఉండగా అధ్యక్షురాలిగా ఎన్నికైనాక ఆమె తీసుకోనున్న నిర్ణయాలపై ఆందో ళన అలుముకుంది. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ సక్రమంగా వ్యవహ రించలేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటి పర్యవసానంగానే వివిధ సర్వేల్లో హిల్లరీ కొన్నిసార్లు ట్రంప్ కంటే వెనకబడ్డారు. తాజా సర్వేల్లో సైతం ఇద్దరి మధ్యా వ్యత్యాసం చాలా తక్కువుంది. ఈమెయిల్ వివాదంలో హిల్లరీ నిర్దోషి అని చివరి నిమిషంలో ఎఫ్‌బీఐ ప్రకటించడం ఆమెకు ఊరటనిచ్చే అంశం. అయితే ట్రంప్‌కు బదులు రిపబ్లికన్ అభ్యర్థిగా మరెవరున్నా ఆమెను సునాయాసంగా ఓడించేవారన్న అభిప్రాయం ఉంది. అమెరికా- రష్యాల మధ్యా...అమెరికా- చైనాలమధ్యా విభే దాలు ముదురుతున్న దశలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఆ దేశాన్నీ, ప్రపంచాన్నీ ఎలాంటి దిశగా తీసుకెళ్లగలవో చూడాల్సి ఉంది. -
అమెరికా పీఠం ఎవరిది?
రేపే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు - హిల్లరీ, ట్రంప్ భవితవ్యం తేల్చనున్న 15 కోట్లకు పైగా ఓటర్లు - గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి - కాలిఫోర్నియాలో 55, మరో 8 రాష్ట్రాల్లో మూడేసి ఎలక్టోరల్ ఓట్లు - ఒహయోలో గెలిచిన వారిదే అధ్యక్ష పీఠం! - భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రారంభం - 9వ తేదీ మధ్యాహ్నంకల్లా పూర్తి ఫలితం సాక్షి, నేషనల్ డెస్క్: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు... మొత్తం 12 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ల భవితవ్యం తేల్చనున్నారు. ఇప్పటికే దాదాపు 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా ఉండడంతో చివరి నిమిషం వరకూ ఫలితాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ పోరు హోరాహోరీ అంటూ సర్వేలు ప్రకటించగా... తాజాగా హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చారు. అక్టోబర్ మధ్య వరకూ హిల్లరీ రెండంకెల పాయింట్ల ఆధిక్యంలో దూసుకుపోయారు. ఎఫ్‌బీఐ ఈమెయిల్ వివాదంతో ఆధిక్యం కాస్తా ఒకటి, రెండు పాయింట్లకు పడిపోయింది. అంతవరకూ ట్రంప్ ఓటమి తప్పనిసరన్న సర్వేలు ఈ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయంటూ ప్రకటించాయి. ఎక్కువ ఓట్లు పడ్డ పార్టీకే మొత్తం సీట్లు అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 4 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియాకు 55, టెక్సాస్ 38, న్యూయార్క్, ఫ్లోరిడాలకు 29 చొప్పున ఓట్లు ఉండగా... 10 లక్షలు ఆ లోపు జనాభా ఉన్న మోంటానా, అలాస్కా, డెలావేర్, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాలకు 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ సభ్యులు(435 మంది), సెనేట్ ప్రతినిధుల(100) సంఖ్య మొత్తం 535.. వాటి ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ణయించారు. డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా నుంచి ముగ్గురు ఎలక్టోరల్స్ కలవడంతో మొత్తం ఓట్లు 538 అవుతాయి. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ పాపులర్ ఓటు(ఎక్కువ ఓట్లు) సాధిస్తే మొత్తం ఎలక్టోరల్ సీట్లు ఆ పార్టీకి సొంతమవుతాయి. తేడా 3 గంటలు.. అమెరికాలో 9 టైమ్ జోన్లు(కాలమానాలు) ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రతీరం ప్రాంత రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్‌షైర్, జార్జియా, నార్త్, సౌత్ కరోలినా, మసాచుసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర రాష్ట్రాలు ఈస్ట్రన్ టైమ్ జోన్లో ఉంటే... ఇలినాయ్, ఫ్లోరిడా, కెంటకీ, టెక్సాస్ వంటి రాష్ట్రాలు సెంట్రల్ టైమ్ జోన్లో ఉన్నాయి. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, నెవెడాలు పసిఫిక్ టైం జోన్లో, అరిజోనా, కొలరాడో, నెబ్రాస్కా, కాన్సాస్‌లు మౌంటెన్ టైమ్ జోన్లో ఉన్నాయి. అలాస్కా, హవాయ్‌లకు వేర్వేరు టైమ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టైమ్ జోన్‌కు మధ్య గంట తేడా ఉంటుంది. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటలైతే లాస్‌ఏంజెలిస్‌లో ఉదయం 7 గంటలు. న వంబర్ 8 న ఈస్ట్రన్ టైమ్ జోన్లో ఉదయం 6 గంటలకు(భారత కాలమానం సాయంత్రం 5 గంటలు) ఎన్నికలు ప్రారంభమవుతాయి. సెంట్రల్ టైమ్ జోన్ రాష్ట్రాల్లో(రాత్రి 6 గంటలు), మౌంటెన్ టైమ్ జోన్లో(రాత్రి 7 గంటలకు), పసిఫిక్ టైమ్ జోన్లో(రాత్రి 8 గంటలకు) ఎన్నికలు మొదలవుతాయి. కెంటకీ, ఇండియానాల్లో ఎన్నికలు ముందుగా ముగుస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా మంచు ప్రాంతం అలాస్కాలో పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. తొలి ఫలితం న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్‌లో నవంబర్ 8 ఉదయం 10.30కే (భారత కాలమానం రాత్రి 9 గంటలు) వెల్లడవుతుంది. అక్కడ 12 మంది ఓటర్లే ఉన్నారు.9న ఉదయం 6 గంటల(భారత కాలమానం) నుంచి ఎగ్జిట్ పోల్స్‌తో పాటు కౌంటింగ్ ప్రాంరభమవుతుంది. 10 గంటలకు ఫలితంపై ఒక అంచనా వస్తుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడి అవుతాయి. ఫ్లోరిడా, ఒహయో, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్‌షైర్, మిన్నెసొటా, అయోవా, మిచిగన్, కొలరాడో, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సన్‌లు ఫలితాన్ని తారుమారు చేసే(స్వింగ్) రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ఒహయో రాష్ట్రంలో గెలవకుండా ఇంతవరకూ ఏ రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. డెమోక్రాట్ల నుంచి జాన్ ఎఫ్ కెనడీ ఒకరే దీనికి మినహాయింపు. అందుకే అభ్యర్థులు దీనిపై ఎక్కువ దృష్టిపెడతారు. ఎలక్టోరల్స్ అంటే... పార్టీలు ముందుగానే ప్రతి రాష్ట్రంలో ఎలక్టోరల్ సంఖ్య ప్రకారం ప్రతినిధుల్ని నియమిస్తాయి. ఓటర్లు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలో దేనికి ఓటు వేసినా ఓట్లు ఎలక్టోరల్ సభ్యుల ఎంపికకు వేసినట్టే. తాము సూచించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఎలక్టోరల్స్‌కు ఓటర్లు సూచిస్తున్నట్లు భావించాలి. ఉదాహరణకు కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ పాపులర్ ఓటు(అత్యధిక ఓట్లు) సాధిస్తే అక్కడి మొత్తం 55 ఎలక్టోరల్స్ (డెమోక్రటిక్ ప్రతినిధులు) తుది అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా హిల్లరీకే ఓటేయాలి. డిసెంబర్ రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం రోజున అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎలక్టోరల్స్ ఎన్నుకుంటారు. విజేతను జనవరి 2, 2017న ప్రకటిస్తారు. జనవరి 20న అధికారికంగా ఎన్నికైన అభ్యర్థి దేశాధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8నే పూర్తయినా... జనవరి 6, 2017న ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఫలితం అధికారికంగా ప్రకటించాక ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ సభలో కలకలం గన్ అరుపుతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపై నుంచి ట్రంప్ తరలింపు రెనో: నెవడా రాష్ట్రం రెనోలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒక్కసారిగా ట్రంప్‌ను వేదిక నుంచి తీసుకుపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారుపడ్డారు. సభలో పాల్గొన్న ఒక వ్యక్తి గన్ అని అరవడంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అప్రమత్తమై ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పూర్తిగా తనిఖీలు చేశాక ఎలాంటి గన్ లేదని నిర్ధారించారు. అనంతరం సభ యథావిధిగా కొనసాగింది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టారు. ఎన్నికలకు మరో రోజే సమయం ఉందనగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్.. ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్ల ఓట్లు పొందేందుకు ట్రంప్ కుమారుడు ఎరిక్.. ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండోలోని హిందూ దేవాలయం సందర్శించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హిల్లరీకి 4 శాతం ఆధిక్యం అధ్యక్ష ఎన్నికలకు మరొక్క రోజే సమయముందనగా నిర్వహించిన తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు శాతం ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్‌జర్నల్ / ఎన్బీసీ న్యూస్ పోల్ ప్రకారం 44 శాతం మంది హిల్లరీని సమర్థించగా, 40 మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. మరో 6 శాతం లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికల రోజు అమెరికా ఓటర్లను చంపేస్తాం: ఐసిస్ వాషింగ్టన్: ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే అమెరికన్ ఓటర్లను చంపేస్తామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ముస్లింలు ఈ ఎన్నికల్లో పాల్గొనరాదని ఐసిస్ సూచించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఎస్ఐటీఈ నిఘా బృందం డెరైక్టర్ రీటా కట్జ్ ట్విటర్లో తెలిపారు. ఐసిస్‌కు చెందిన అల్ హయత్ మీడియా సెంటర్ ఒక లేఖలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు రీటా తెలిపారు. ఈ వ్యాసంలో ఓటర్లను ఉగ్రవాదులు చంపేస్తారని, బ్యాలట్ బాక్సులను ధ్వంసం చేస్తారని ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐసిస్ ఈ వ్యాసంలో మతానికి సంబంధించి సుదీర్ఘ వివరణలు ఇస్తూ దాడులను సమర్థించుకుంది. ఇస్లాం, ముస్లింల పట్ల వ్యవహరించే తీరులో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవని తెలిపింది. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్‌లలో దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
ఆ తొమ్మిది రాష్ట్రాలే కీలకం
- రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు - వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్న హిల్లరీ, ట్రంప్ తాజా సర్వేల్లో హిల్లరీకే ఆధిక్యం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజులే సమయముంది. ఇంతవరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తై ఈ రెండ్రోజుల ప్రచారం మరో ఎత్తు... 3 వారాల క్రితం వరకూ హిల్లరీ గెలుపు ఖాయమన్న సర్వేలు... తాజాగా పోరు హోరాహోరీ అని చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిల్లరీకే కొద్దిపాటి ఆధిక్యం కట్టబెట్టినా చివరి నిముషం వరకూ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. దీంతో గెలుపు కోసం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తమకు పట్టున్న రాష్ట్రాల్ని పక్కన పెట్టి... విజేతను నిర్ణయించే రాష్ట్రాలపై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ 120 ఎలక్టోరల్ ఓట్లపై ఊగిసలాట ఫ్లోరిడా, ఒహయో, నెవెడా, పెన్సిల్వేనియా, మిచిగన్, కొలరాడో, వర్జీనియా, అయోవా, న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఎక్కువ ఎవరు గెలిస్తే వారిదే అమెరికా అధ్యక్ష పీఠం. అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా ఈ 9 రాష్ట్రాల్లో 120 ఓట్లు ఉన్నాయి. దీంతో హిల్లరీ, ట్రంప్‌లు కీలక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు, ర్యాలీలతో ఊదరగొట్టేస్తున్నారు. పెన్సిల్వేనియా, మిచిగన్, ఒహయోలపై హిల్లరీ ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ వర్గం కూడా న్యూ హ్యాంప్‌షైర్, ఒహయో, పెన్సిల్వేనియా తమదేనంటున్నారు. ఒహయోలో ట్రంప్, పెన్సిల్వేనియాలో హిల్లరీ!: కచ్చితమైన సర్వేలు ఇవ్వడంలో దిట్టైన రియల్ క్లియర్ పాలిటిక్స్ నవంబర్ 4న వెల్లడించిన వివరాల ప్రకారం... ఒహయోలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా... పెన్సిల్వేనియాలో హిల్లరీ మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఒహయో, పెన్సిల్వేనియాలో ఇద్దరు అభ్యర్థులు వరుస ర్యాలీలు నిర్వహించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్, మిచిగన్‌లో హిల్లరీలు ప్రచారంతో హోరెత్తించారు. చివరి నాలుగు రోజుల్లో ప్రముఖ గాయకులు, సినీతారలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం(భారత కాలమానం) ఒహయో, పెన్సిల్వేనియాలో హిల్లరీతో పాటు గాయకురాలు బేయోన్స్ అతని భర్త, గాయకుడు జే జెడ్‌లు పాల్గొన్నారు. యువతను, మైనారిటీల ఓటర్లను ఆకర్షించేందుకు క్లింటన్ శిబిరం పలువురు ప్రముఖులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్ మాత్రం వీటికి దూరంగా సొంతగానే ప్రచారం చేస్తున్నారు. ఊగిసలాటలో ఫ్లోరిడా ఓటరు అయితే ఇద్దరి అసలు లక్ష్యం ఫ్లోరిడా... 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఫలితాన్ని తారుమారు చేసింది కూడా ఈ రాష్ట్రమే... ఫ్లోరిడాలో మొత్తం 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎన్నికల ఫలితాల్ని కూడా ఫ్లోరిడా నిర్ణయిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ కచ్చితంగా ఈ రాష్ట్ర ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపలేదు. హిల్లరీ గెలవకపోయినా ఫ్లోరిడాలో ట్రంప్ గెలుపు తప్పనిసరి. ట్రంప్ గెలిస్తే అధ్యక్ష పీఠం ఖాయమని చెపుతున్నారు. చివరి రెండు రోజులు ట్రంప్, హిల్లరీలు ఈ రాష్ట్రంలో వరుస ర్యాలీల్లో పాల్గొంటారు. అలాగే నార్త్ కరోలినా, నెవెడాల్లో కూడా ట్రంప్ పర్యటిస్తారు. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్లోరిడాలో ట్రంప్ బలం పెరిగినా హిల్లరీ కంటే వెనుకంజలోనే ఉన్నారు. రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ఫ్లోరిడాలో హిల్లరీ కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతుండగా... ఫైవ్థర్టీఎయిట్ వైబ్‌సైట్ విశ్లేషణ మేరకు 52.4 శాతంతో ట్రంప్‌కు గెలుపు అవకాశాలున్నాయి. 2012 ఎన్నికల్లో ఫ్లోరిడాలో బరాక్ ఒబామా కేవలం 0.9 శాతం ఓట్లతో రిపబ్లికన్ మిట్ రోమ్నీపై గెలుపొందారు. ఫ్లోరిడాలో ట్రంప్‌కు వలస ఓటర్ల మద్దతు ఫ్లోరిడాలో ఎక్కువగా ఉండే లాటిన్ వలస ఓటర్ల మద్దతు హిల్లరీకి అత్యంత కీలకం. ఆ ఉద్దేశంతోనే ఫ్లోరిడా తమదేనని డెమోక్రాట్లు అంచనా వేశారు. వలసవాదులకు వ్యతిరేకంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు తమకు కలిసొస్తాయని భావించారు. అయితే ఫ్లోరిడాలో కొద్దిమంది లాటిన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపడం విశేషం. దాదాపు 16 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఫ్లోరిడాలో స్పానిష్ మాట్లాడే ప్రజల్లో ఎక్కువ మంది డెమోక్రాట్లే. క్యూబా వలస ఓటర్లు మాత్రం సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తున్నారు. ట్రంప్ భార్యపై ఆరోపణలు.. ట్రంప్ భార్య మెలేనియాపై తాజాగా ఆరోపణలు వెల్లవెత్తాయి. రెండు దశాబ్దాల క్రితం మోడలింగ్ చేసేందుకు అమెరికాలో అక్రమంగా కొద్ది కాలం ఉన్నట్లు కొన్ని పత్రాలు వెలుగు చూశాయి. ట్రంప్‌తో తనకున్న సంబంధాల వివరాలు వెల్లడిస్తే ప్లేబాయ్ పత్రిక మాజీ మోడల్‌కు అమెరికా టాబ్లాయిడ్ ద నేషనల్ ఎంక్వైరర్ రూ. కోటికి పైగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరో వివాదం వెలుగు చూసింది. ఆమెకే పట్టం! హిల్లరీ ఈమెయిల్స్ వివాదంతో ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకొచ్చినా తాజా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ మాత్రం హిల్లరీకే ఆధిక్యం కట్టబెట్టాయి. తాజాగా(నవంబర్ 5) ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం మంది మద్దతు పలికారు. వారం క్రితం ఫాక్స్ న్యూస్ సర్వేలో హిల్లరీ మూడు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగగా... అక్టోబర్ మధ్యలో ఆ తేడా 6 పాయింట్లకు పైనే... ► సీఎన్ఎన్ తాజా పోల్ ప్రకారం హిల్లరీ 268 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోవచ్చు. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ట్రంప్‌కు మాత్రం 204 ఎలక్టోరల్ ఓట్లే వస్తాయని తేల్చింది. మిగతా 66 ఓట్లకు హోరాహోరీ పోరు సాగవచ్చని పేర్కొంది. సీఎన్ఎన్ ప్రకారం అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, న్యూ హ్యాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఒహయోలో పోటాపోటీ ఉంటుంది. గత రెండు వారాల్లో ట్రంప్ కొద్ది పాటి ఆధిక్యం సాధించారని సీఎన్ఎన్ వెల్లడించింది. ► ఇక రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ట్రంప్ కంటే హిల్లరీ 1.6 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► న్యూయార్క్ టైమ్స్ అంచనా మేరకు క్లింటన్‌కు 67.8 శాతం గెలుపు అవకాశాలున్నట్లు తేలింది. ► బీబీసీ న్యూస్ ఇంతవరకూ నిర్వహించిన సర్వేల సరాసరిలో హిల్లరీనే ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 44 శాతం ఓట్లు దక్కాయి. ► హఫింగ్టన్ పోస్టు అంచనా ప్రకారం హిల్లరీకి 97.9 శాతం విజయావకాశాలుండగా, ప్రిన్స్టన్ ఎలక్షన్ కన్సార్టియం క్లింటన్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టింది. ప్రముఖ సర్వే సంస్థలు ఫైవ్థర్టీఎయిట్, టాకింగ్పాయింట్మెమో(టీపీఎం)లు హిల్లరీకి 1 నుంచి 3 పాయింట్ల వరకూ ఆధిక్యం కట్టబెట్టాయి. -
అగ్ర పీఠం పోరు హోరాహోరీ
- తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నిక - హిల్లరీ-ట్రంప్‌ల మధ్య ఉత్కంఠ సమరం - హిల్లరీకే గెలుపు అవకాశాలు ఎక్కువంటున్న సర్వేలు - నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికల్లో తేలనున్న ఫలితం అమెరికా అధ్యక్ష పదవి! ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం! దానిని దక్కించుకోవడానికి హేమాహేమీల మధ్య హోరాహోరీ పోరాటం! రెండేళ్ల కిందట మొదలైన ఈ పోరు తుది అంకానికి చేరింది. ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషణల పర్వం పతాక స్థాయికి చేరింది. పరస్పర ఆరోపణలతో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఎంతో ఉత్కంఠగా, ఉద్రిక్తంగా సాగుతున్న ఈ సమరం మరో 15 రోజుల్లో ముగియనుంది. నవంబర్ 8న అమెరికన్లు తీర్పు ఇవ్వనున్నారు. ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్లో విజేత ఎవరనేది ఆ రోజు జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి. అయితే.. అమెరికన్లు ఇప్పటికే చాలా వరకూ నిర్ణయం తీసేసుకున్నారని సర్వేలు చెప్తున్నాయి. కొంత కాలం కిం దటి వరకూ ప్రజాభిప్రాయం ఇరువురు ప్రధాన అభ్యర్థుల మధ్యా పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతోందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నా యి. ఇందుకు ప్రధాన కారణం.. హిల్లరీ విధానాల కన్నా కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపెట్టిన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై విముఖతేననీ చెప్తున్నాయి. అయినప్పటికీ.. దేశంలో ‘స్వింగ్ స్టేట్స్’గా పరిగణించే కొన్ని కీలక రాష్ట్రాలకు ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉంటుందని వివరిస్తున్నాయి. యూఎస్ఏ టుడే తాజా సర్వే ఫలితాలు.. మొత్తం 538 ఎలొక్టరల్ ఓట్లలో హిల్లరీకి 263 ఓట్లు, ట్రంప్‌కు 180 ఓట్లు వస్తాయని.. మరో 95 ఓట్లు ఎటువైపైనా పడవచ్చని చెప్తున్నాయి. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవడానికి 270 ఓట్లు అవసరం. ఈ సర్వే ఫలితాన్ని బట్టి.. అమెరికా ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోవడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. వివాదాల ట్రంప్ మాత్రం.. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందని ముందే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను గెలిస్తే మాత్రమే ఫలితాలను అంగీకరిస్తానంటూ మరో వివాదానికి తెరతీశారు. ఇటువంటి ఆరోపణల ద్వారా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్.. హిల్లరీ చరిత్ర సృష్టించే దిశగా... అమెరికా మాజీ అధ్యక్షుడు (1993-2001) బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ (68). ఆమె 2000 సంవత్సరంలో న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ప్రథమ మహిళగా ఉంటూ సెనెటర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అనంతరం 2006 లోనూ రెండోసారి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం బరాక్ ఒబామాతో పోటీ పడి ఓడిపోయారు. ఆమె 2008 ఎన్నికల తర్వాత ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2013 వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నామినేషన్ సంపాదించి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిస్తే.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు. జాతి, వయసు ప్రభావం.. ఈ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో అమెరికా పౌరుల జాతి, వయసు, లింగభేదం, మతం, దేశీయత తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ నిపుణుల అంచనా. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల ప్రకారం.. ⇒ అమెరికా నల్లజాతి వారిలో అత్యల్పంగా 3% మంది, హిస్పానిక్(లాటిన్ అమెరికా జాతీయులు) ప్రజల్లో 17% మం ది ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. కీలకమైన 4 ‘స్వింగ్ రాష్ట్రా’ల్లోని జనాభాలో హిస్పానిక్ జాతీయులు ఐదో వంతు మంది ఉన్నా రు. శ్వేతజాతీయుల్లో 51% మంది ట్రంప్‌ను బలపరుస్తున్నారు. ⇒ పురుషులు, మహిళల వారీగా చూస్తే.. పురుషుల్లో 49% మంది ట్రంప్‌కు, మహిళల్లో 49% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. హిల్లరీకి మద్దతిచ్చే పురుషుల సంఖ్య 33%గా ఉంటే.. ట్రంప్‌కు మద్దతిచ్చే మహిళల సంఖ్య 34%గా ఉంది. ⇒ వయసు వారీగా చూస్తే.. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న యువతరంలో హిల్లరీ బలం అధికంగా ఉంది. వారిలో 41% మంది ఆమెకు మద్దతు ఇస్తోంటే, ట్రంప్‌కు మద్దతిస్తున్న ఆ వయసు వారి సంఖ్య 29 శాతమే ఉంది. 40 నుంచి 64 మధ్య వయస్కుల్లో ఇద్దరు అభ్యర్థులకూ కొంచెం తేడాతో ఒకే విధమైన మద్దతు లభిస్తోంది. వీరిలో ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 44 శాతమైతే.. హిల్లరీని సమర్థిస్తున్న వారి సంఖ్య 43 శాతంగా ఉంది. ఇక 65 ఏళ్లు ఆపై వయసుగల పెద్దల్లో మాత్రం ట్రంప్ హవా ఉంది. వారిలో 49 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే.. కేవలం 39 శాతం మంది మాత్రమే హిల్లరీకి మద్దతునిస్తున్నారు. నిజానికి యువకులు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా కూడా ఓట్లు వేయడం తక్కువని, పెద్ద వాళ్లు ఠంచనుగా ఓటు వేస్తారని ఓటింగ్ సరళులు చెప్తున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో యువత బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్న తీరు పెరుగుతోందనీ పరిశీలకులు చెప్తున్నారు. ⇒ ఇక విద్యాభ్యాసం స్థాయిని బట్టి కూడా ఇరువురు నేతలకు మద్దతిస్తున్న వారి సంఖ్యలో తేడాలున్నాయి. తక్కువ విద్యాభ్యాసం గల వారిలో ట్రంప్‌కు మద్దతు ఎక్కువగా ఉంటే.. విద్యాధికుల్లో హిల్లరీకి ఆదరణ అధికంగా ఉంది. ఉన్నత పాఠశాల అంతకన్నా తక్కువ చదువు గల వారిలో 44% మంది ట్రంప్‌కు, 36% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. కాలేజీ విద్యను అభ్యసించిన వారిలో ట్రంప్‌కు 46%, హిల్లరీకి 40% మద్దతు ఉంది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ట్రంప్‌ను సమర్థిస్తున్న వారి సంఖ్య 37% అయితే, హిల్లరీకి మద్దతిస్తున్న వారి సంఖ్య 46% గా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది హిల్లరీకి మద్దతు ప్రకటిస్తే.. కేవలం 33 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తామని చెప్తున్నారు. ట్రంప్ దురుసుగా.. దూకుడుగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ (70) రియల్ ఎస్టేట్ వ్యాపారి, టెలివిజన్ ప్రొడ్యూసర్. వ్యాఖ్యాత. 1996 నుంచి 2015 వరకూ మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ అందాల పోటీల నిర్వహణ యజమాని కూడా. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్న ట్రంప్.. 2000 సంవత్సరంలోనే రిఫార్మ్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడటానికి నామినేషన్ కోసం ప్రయత్నించారు. అయితే ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందే విరమించుకున్నారు. తాజా ఎన్నికల కోసం తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు గత ఏడాదే ప్రకటించారు. దురుసుగా, దూకుడుగా దూసుకెళ్తూ నామినేషన్ సాధించి హిల్లరీతో తలపడుతున్నారు. ఆయన గెలిస్తే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కుతారు. సర్వేల్లో హిల్లరీ ముందంజ ఎన్నికల రేసులో ఆరంభంలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య ప్రజాభిప్రాయం పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతూ వస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ముఖాముఖి పోటీలో హిల్లరీ 48% మంది మద్దతు ఉంటే.. ట్రంప్‌కు 41% మద్దతు ఉందని వెల్లడైనట్లు యూఎస్ఏ టుడే పత్రిక ప్రకటించింది. అంటే ట్రంప్ కన్నా హిల్లరీ ఏడు శాతం ఆధిక్యంలో ఉన్నారని, రెండు నెలల కిందటికన్నా ఆమె ఆధిక్యం ఇప్పుడు ఒక శాతం పెరిగిందని చెప్పింది. ఇంకా నిర్ణయించుకోని ఓటర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోందని కూడా పేర్కొంది. అయితే.. సర్వేలో నాలుగు పక్షాల పోటీలో.. హిల్లరీకి 42%, ట్రంప్‌కి 35%, లిబర్టేరియన్ అభ్యర్థి గారీ జాన్సన్‌కు 9 శాతం ఓట్లు, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్‌కు 4 శాతం ఓట్లు చొప్పున లభించగా.. 10 శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదని జవాబిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో తాము మద్దతిస్తున్న అభ్యర్థి గెలుస్తాడన్న ఆశ కన్నా.. ప్రత్యర్థి అభ్యర్థి గెలుస్తారేమోనన్న ఆందోళన అత్యధిక శాతం మంది ఓటర్లలో కనిపిస్తున్నట్లు యూఎస్ఏ టుడే వివరించింది. అంతేకాకుండా.. హిల్లరీకి మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు తాము ట్రంప్‌కు వ్యతిరేకంగా హిల్లరీకి మద్దతు ఇస్తున్నామని, ఆమె కోసం కాదని చెప్పారు. అలాగే.. ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో నలుగురు తాము హిల్లరీకి వ్యతిరేకంగా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విచిత్రమేమిటంటే.. సర్వే చేసిన వారిలో సగం మందికి పైగా ఇద్దరు ప్రధాన నేతలనూ విశ్వసించడం లేదు. హిల్లరీ నిజాయితీపరురాలు, విశ్వసించదగ్గ వ్యక్తి అని తాము నమ్మడం లేదని 59 శాతం మంది పేర్కొన్నారు. అందులో హిల్లరీకి మద్దతిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరిది ఇదే మాట. ఇక ట్రంప్‌కు నిజాయితీ లేదని, ఆయనను నమ్మలేమని అనేవారి సంఖ్య 61 శాతంగా ఉంది. ట్రంప్‌కు మద్దతిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరిది ఇదే అభిప్రాయం. సామాజిక అంశాల చుట్టూ.. అమెరికా అధ్యక్ష పదవిని గత రెండు పర్యాయాలూ డెమొక్రటిక్ పార్టీ(ఒబామా) దక్కించుకుంది. అంతకుముందు రెండు సార్లు రిపబ్లికన్ పార్టీ (బుష్) చేతుల్లో ఆ పదవి ఉంది. తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న సమరం అనేక ఉత్కంఠ మలుపులు తిరుగుతోంది. రెండు వందల ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా ఈ అధ్యక్ష ఎన్నికలు చరిత్రకెక్కుతున్నాయి. ముఖ్యంగా గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో.. అప్పటికే మందగించిన దేశ ఆర్థిక పరిస్థితులు, వాటిని చక్కదిద్దడం అనేవి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో సామాజిక అంశాలు కీలక స్థానంలోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా జాతి వివక్ష, లింగ వివక్ష, లైంగిక దాడి, వలసలు, ముస్లిం భయం, యూదు వ్యతిరేకత, ధనికస్వామ్యం, అధికారస్వామ్యం వంటి అంశాల చుట్టూనే ప్రధాన ప్రత్యర్థుల చర్చ, ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన అభ్యర్థులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, వెలుగుచూస్తున్న అంశాలు అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు తమ తమ అభిప్రాయాల మేరకు చెరోవైపుగా చీలుతున్నారు. ఆరోపణలు, విమర్శలు.. అందులో.. మహిళలపట్ల ట్రంప్ వ్యవహార శైలి, చేస్తున్న దూషణపూర్వక వ్యాఖ్యలు, గతంలో వచ్చిన, ఇప్పుడూ వస్తున్న లైంగిక దాడుల ఆరోపణలు, అమెరికా నుంచి వలసదారులను పంపించివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు, ఉగ్రవాదానికి - ముస్లింలకు ముడిపెడుతూ చేసిన విమర్శలు మరింతగా ప్రభావం చూపుతున్నాయి. ఈ ఆరోపణల ముందు హిల్లరీ అవినీతిపరురాలని, డబ్బు తీసుకోనిదే ఏ పనీ చేయరని, 30 ఏళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నా ఏమాత్రం సామర్థ్యం లేదని, విదేశాంగ మంత్రిగా అధికారిక ఈ-మెయిళ్లను ప్రైవేటు సర్వర్ ద్వారా పంపించారని ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయి. దీంతో పార్టీ ప్రైమరీల సమయంలో తనకు లభించిన మద్దతును ఆయన క్రమంగా కోల్పోతున్నారు. పలువురు మహిళలు తమపై ట్రంప్ గతంలో లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తే.. అవి నిరాధారమని కొట్టివేసిన ట్రంప్.. తాను కూడా హిల్లరీ క్లింటన్ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై లైంగిక ఆరోపణలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. చర్చల్లో హిల్లరీ పైచేయి.. ఇటీవల బయటపడిన పదేళ్ల కిందటి తన వీడియో క్లిప్ వ్యాఖ్యలతో ట్రంప్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మహిళలను అత్యంత అసభ్యంగా చిత్రిస్తూ మాట్లాడటమే కాక.. ఒక మహిళపై తాను లైంగిక దాడికి పాల్పడ్డ సూచనలు కూడా ఈ వీడియోలోని ట్రంప్ వ్యాఖ్యల్లో వినిపించడం పెను దుమారం రేపింది. సొంత పార్టీ నాయకులు కొందరు ఆయనను బరిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. చివరికి తనే ఎంపిక చేసుకున్న ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన దుస్థితి. అయినా తాను ‘పోరాటం విరమించన’ంటూ ట్రంప్ భీష్మించారు. ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూనే, తాను ఇప్పుడు మారానని, అయినా గతంలో బిల్ క్లింటన్ ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు తనతో చేశారని ఎదురు దాడికి దిగారు. అలాగే.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన మూడు ముఖాముఖి చర్చల్లోనూ ట్రంప్‌పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ వ్యక్తిత్వ లోటుపాట్లతో పాటు విధానాల విషయంలోనూ ఆయన అనుభవరాహిత్యాన్ని ఎండగట్టారు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తూ ఈ-మెయిల్స్ విషయంలో పొరపాటు చేశానని అంగీకరించారు. హిల్లరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో కీలుబొమ్మ అని, రష్యా ద్వారా అమెరికాలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ట్రంప్ తాను చెల్లించిన పన్ను వివరాలను బయటపెట్టాలని హిల్లరీ డిమాండ్ చేస్తే.. హిల్లరీ ప్రైవేటు సర్వర్ నుంచి డిలిట్ చేసిన వేలాది ఈ-మెయిళ్లను బయటపెట్టాలని ట్రంప్ ఎదురుదాడి చేశారు. న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెలెస్ టైమ్స్, హూస్టన్ క్రానికల్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు, వార్తా పత్రికలు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటించాయి. 1940 నుంచీ డెమొక్రటిక్ పార్టీకి మద్దతివ్వని డాలస్ మార్నింగ్ న్యూస్ కూడా ఈసారి హిల్లరీకి మద్దతునిచ్చింది. 1857వ సంవత్సరం నుంచీ ప్రచురితమవుతూ.. గతంలో అబ్రహాం లింకన్, లిండన్ జాన్సన్‌లకు మాత్రమే మద్దతిచ్చిన ద అట్లాంటిక్ వార్తాపత్రిక.. ఇంత కాలానికి మళ్లీ హిల్లరీకి మద్దతు ప్రకటించింది. 34 ఏళ్ల కిందట స్థాపితమై, ఇప్పటివరకూ ఏ అభ్యర్థికీ మద్దతివ్వని యూఎస్ఏ టుడే పత్రిక ఇప్పుడు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ‘అధ్యక్ష పదవికి అనర్హుడు’ అంటూ తన వ్యతిరేకతను ప్రకటించింది. ప్రత్యర్థులను ఓడించి... అమెరికా 58వ అధ్యక్ష పదవి నామినేషన్ కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి ఆరుగురు, రిపబ్లికన్ పార్టీ నుంచి ఏకంగా 17 మంది బరిలోకి దిగారు. ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థిని ఎంచుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి - జూన్ నెలల మధ్య ప్రైమరీలు, కాకస్‌లు నిర్వహించాయి. రెండు పార్టీల సభ్యులు లేదా మద్దతుదారులు వార్డుల వారీగా సమావేశమై.. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తాము ఎవరికి, ఎందుకు మద్దతివ్వాలని అనుకుంటున్నామో చర్చించి.. ఓటింగ్ నిర్వహించటాన్ని ప్రైమరీ లేదా కాకస్ అని వ్యవహరిస్తారు. ప్రైమరీలో రహస్య ఓటింగ్ ఉంటుంది. కాకస్‌లో చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. మిగతా ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. ఆ ఓటింగ్‌లో తమ తరఫున అభ్యర్థులను ఎన్నుకునేందుకు డెలిగేట్లను (ప్రతినిధులను) ఎన్నకుని పార్టీ జాతీయ ప్రైమరీలకు పంపిస్తారు. జాతీయ ప్రైమరీల్లో ఈ డెలిగేట్ల ఓట్లు ఎక్కువ సంపాదించిన అభ్యర్థికి పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు నామినేషన్ లభిస్తుంది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్.. ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌తో పాటు మార్టిన్ ఓ మాలీ, లారెన్స్ లెస్సిగ్, లింకన్ చాఫీ, జిమ్ వెబ్లను ఓడించి జూలై 26న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్.. ప్రైమరీలు, కాకస్‌లలో ప్రత్యర్థులు టెడ్ క్రూజ్, జాన్ కాసిచ్, మార్కో రూబియో, జెబ్ బుష్‌లతో పాటు ఇతర అభ్యర్థులను ఓడించి జూలై 19న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ దక్కించుకున్నారు. అధ్యక్ష అభ్యర్థులే తమతో కలిసి పోటీ చేసే ఉపాధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసుకునే సంప్రదాయం ప్రకారం.. హిల్లరీ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ కెయిన్‌ను, ట్రంప్ తన సహచరుడిగా మైక్ పెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య అధ్యక్ష ఎన్నికల సమరం మొదలయింది. మూడో పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు లిబర్టేరియన్ పార్టీ నుంచి న్యూ మెక్సికో మాజీ గవర్నర్ గారీ జాన్సన్, గ్రీన్ పార్టీ నుంచి మసాచుసెట్స్‌కు చెందిన వైద్యుడు జిల్ స్టీన్, కాన్స్టిట్యూషన్ పార్టీ నుంచి డారెల్ కాసిల్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎవాన్ మెక్ములిన్, వ్యాపారవేత్త రాకీ డి లా ఫూంటే, ఎకానమిక్స్ ప్రొఫెసర్ లారెన్స్ కోట్లికాఫ్ తదితరులు మూడో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో గల ‘బ్యాలెట్ యాక్సెస్’ చట్టాల ప్రకారం వీరు పోటీకి దిగుతున్నారు. ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. పౌరులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు కానీ వారు ఎన్నుకునేది అధ్యక్షుడిని కాదు. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీకి తమ రాష్ట్రం నుంచి ప్రతినిధులను ఆయా రాష్ట్రాల్లోని సామాన్య ఓటర్లు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఎలక్టర్లు అంటారు. నిజానికి ఈ ఎలక్టర్లు ముందుగానే ఏదో ఒక పార్టీ అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా ఉంటారు. తాము కోరుకునే అధ్యక్ష అభ్యర్థికి మద్దతునిచ్చే ఎలక్టర్ల బృందాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎలక్టర్లందరూ కలిసి ఎలక్టొరల్ కాలేజీ అవుతారు. వారంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ.. వారందరూ కలిసి ఒకే చోట సమావేశమై అధ్యక్షుడికి ఓట్లు వేయరు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎలక్టర్లు సమావేశమై తాము ముందే కట్టుబడ్డ అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతారు. మేజిక్ ఫిగర్ 270... అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభల్లో.. ఆ రాష్ట్రానికి గల సభ్యుల (సెనెటర్లు, ప్రతినిధులు) సంఖ్యకు సమానంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను (ఎలక్టర్లను) ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏ మాత్రం ఉండదు. అదనంగా.. దేశ రాజధాని జిల్లా అయిన వాషింగ్టన్ డి.సి.కి దేశంలోని అతి చిన్న రాష్ట్రానికి గల సభ్యులకు సమానంగా ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను కేటాయిస్తారు. అంటే.. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు 435, సెనేట్ సభ్యులు 100 మంది, వాషింగ్టన్ డీసీకి ముగ్గురు అదనపు సభ్యులు.. మొత్తం కలిపి 538 మంది ఎలక్టర్లు ఈ ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. వీరు ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో కనీసం 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు. ఒక రాష్ట్రం ఓట్లన్నీ ఒక్కరికే.. ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికయ్యే ఎలక్టర్లను ఆయా పార్టీలు సాధారణ ఎన్నికలకు ముం దుగా ఎంపిక చేయడం లేదా, నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సారి నవంబర్ 8న సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు సాధారణ పౌరులు బ్యాలట్‌లో.. అధ్యక్ష పదవికి తాము కోరుకున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించే విధివిధానాలకు అనుగుణంగా.. ఆ బ్యాలట్‌లో పార్టీకి చెందిన ఎలక్టర్ల పేర్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తారు. వీటిలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి పార్టీకి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా ఉంటారు. అంటే.. ఒక రాష్ట్రంలో సాధారణ ఓటర్లు వేర్వేరు అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేసినా.. అందులో మెజారిటీ ఓట్లు సంపాదించిన అభ్యర్థికే ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు గంపగుత్తగా చెందుతాయి. అయితే.. మొత్తం 50 రాష్ట్రాలకు గాను 48 రాష్ట్రాల్లో ఇదే విధానం ఉంటుంది. మెయిన్, నెబ్రాస్కాలు మాత్రం పోలైన ఓట్లను బట్టి తమ ఎలక్టర్లను ఆయా అభ్యర్థులకు దామాషాలో పంచుతాయి. అంటే.. ఆ రెండు రాష్ట్రాలకు చెందిన ఎలక్టర్ల ఓట్లు.. ప్రజల ఓట్లను బట్టి వేర్వేరు అభ్యర్థులకు లభించే అవకాశముంటుంది. ఎలక్టోరల్ కాలేజీ లాంఛనమే..! నిజానికి ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు ఏ అభ్యర్థికి లభించాయనేదాన్ని బట్టి.. మొత్తంగా ఏ అభ్యర్థికి ఎన్ని ఎలక్టర్ల ఓట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారనేది సాధారణ ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. అయితే.. సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన ఎలక్టర్లంతా కలసి లాంఛనంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఈ సారి డిసెంబర్ 19న సమావేశమై ఈ లాంఛనాన్ని పూర్తి చేస్తుంది. ఆ రోజున ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర రాజధానిలోనే సమావేశమై తమ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఓట్లు వేస్తారు. ఈ ఓట్లను వచ్చే ఏడాది జనవరి 6న కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో లెక్కిస్తారు. ఎన్నిక ఫలితాలను సెనేట్ అధ్యక్షుడు లాంఛనంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఏ అభ్యర్థికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో.. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ - దిగువ సభ) అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. అదే.. ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సెనేట్ (ఎగువ సభ) ఆ ఎన్నిక చేస్తుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. చివరిసారిగా 2002 ఎన్నికల్లో ఇలా జరిగింది. ఇలా ఈ సుదీర్ఘ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన మూడు, నాలుగు నెలల తర్వాత వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధినేత అధ్యక్ష పదవి చేపడుతూ ప్రమాణ స్వీకారం చేస్తారు. -
ట్రంప్ లైంగికంగా వేధించారు
- మరో ఇద్దరు మహిళల ఆరోపణ - అంతా అబద్ధమన్న డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ! ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మరో ఇద్దరు మహిళలు ఆరోపించారు. టీవీ రియాలిటీ షో ‘అప్రెంటీస్’ మాజీ అభ్యర్థి సమ్మర్ జర్వోస్, జెస్సికా లీడ్స్ ఈ ఆరోపణలు చేశారు. ట్రంప్ 2007లో తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని జర్వోస్ ఆరోపించగా.. 1980ల్లో విమానంలో తాము పక్కపక్కనే కూర్చుని ప్రయాణిస్తున్నపుడు ట్రంప్ తనను ముద్దుపెట్టుకున్నాడని జెస్సికా వెల్లడించారు. ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపడేశారు. శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఆ మహిళల ఆరోపణలు అంతా అబద్ధాలని చెప్పారు. మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వరుస ఆరోపణలతో తానో బాధితుడిగా మారుతున్నానన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడారని, వేధించారని ట్రంప్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ట్రంప్ నోట మళ్లీ ‘హెచ్1బీ’
ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎక్కుపెట్టిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వాషింగ్టన్: హెచ్1బీ వీసాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలో మళ్లీ ప్రచారాస్త్రంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీటిని తెరపైకి తెస్తున్నారు. వర్క్ వీసాల పేరుతో కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా తల్లుల్లో చాలా మంది తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోనని ఆందోళనపడుతున్నారని, కాలేజీ విద్యార్థులకు అతిపెద్ద ముప్పు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలేనని పేర్కొన్నారు. హెచ్1బీ వీసాలతో చాలా కంపెనీలు తక్కువ వేతనానికే విదేశీయులను దిగుమతి చేసుకుని కాలేజీల్లో చదువుతున్న అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్1బీ వీసాలను ఎక్కువగా ఐటీ రంగం వారే దక్కించుకుంటున్నారని, వారిలో ఎక్కువ మంది భారతీయులేనన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందిస్తూ.. వాస్తవానికి తానే బాధితుణ్నని, తనపై డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ కుట్రపన్నారని ఆరోపించారు. మహిళలపై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను క్షమించలేమని దేశాధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషల్ పేర్కొన్నారు. హిల్లరీకే 72 శాతం ముస్లింల మద్దతు! ప్రతి పదిమంది అమెరికన్ ముస్లింలలో ఏడుగురు హిల్లరీకే ఓటేస్తామని చెప్పినట్లు ఓ సర్వేలో తేలింది. -
లైంగికంగా వేధించారు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా ఐదుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన వ్యాఖ్యల ద్వారా తలెత్తిన వివాదాలతో సతమతమవుతున్న 70 ఏళ్ల ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికలకు నిండా నెలరోజుల వ్యవధి కూడా లేని సమయంలో.. తాజా ఆరోపణలు వచ్చి మీద పడడంతో మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. మహిళల గురించి అభ్యంతరకరంగా ట్రంప్ మాట్లాడిన 2005 నాటి వీడియో విడుదలైన కొద్దిరోజులకే కొత్తగా ఈ ఆరోపణలు రావడం గమనార్హం. మూడు దశాబ్దాల క్రితం తాను విమానంలో ట్రంప్‌తో కలసి ప్రయాణించానని, అప్పుడు ఆయన తనను అసభ్యంగా తాకినట్టు జెస్సికా లీడ్స్ అనే 74 ఏళ్ల మహిళ తెలిపారు. ట్రంప్ టవర్లోని ఓ సంస్థలో 2005లో తాను పనిచేసినప్పుడు లిఫ్ట్‌లో ట్రంప్‌తో కలసి వెళుతుండగా ముద్దు పెట్టుకున్నారని రిచర్స్ క్రూక్స్ అనే మహిళ వెల్లడించారు. 13 ఏళ్ల క్రితం ఒక వేడుక సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని మెక్గిల్లివ్రే(36) అనే మహిళ తెలిపారు. 2005లో ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు తనను ట్రంప్ ముద్దు పెట్టుకున్నారని జెన్నిఫర్ మర్ఫీ అనే మరో మహిళ సైతం ఆరోపించారు. అయితే మహిళల కథనాలను, న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్రంప్ ప్రచార శిబిరం కొట్టిపడేసింది. -
బోల్తాపడిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని ‘ఎలాగైనా...’ గెల్చుకోవాలన్న తపనతో రిపబ్లికన్ పార్టీ అమెరికా ప్రజలపై రుద్దిన అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ రోజు రోజుకీ తాను దిగజారుతూ ఎన్నికల స్థాయిని కూడా దిగజారుస్తున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యానాలు, ఆ దేశం ఎదుర్కొంటున్నదంటున్న సంక్షోభానికి ఆయన సూచించిన పరిష్కార మార్గాలూ ఎందరినో దిగ్భ్రాంతిపర్చగా ఇప్పుడు బయటికొచ్చిన పాత ఆడియో, వీడియో టేపులు ఆయనలోని మగ దురహంకారాన్ని, నీతిమాలినతనాన్ని వెల్లడించాయి. ఆయన మానసిక స్థితిగతులపై కొత్త సందేహం రేకెత్తించాయి. ట్రంప్ తీరుతెన్నులు చూసి రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకులు కొందరు నెమ్మదిగా జారుకుంటున్నా... ఆయన ఎంపికలో తమ పాపాన్ని వారు కప్పిపుచ్చుకోలేరు. ఇప్పుడింతగా చెలరేగి మాట్లాడుతున్న వ్యక్తి గురించి వారికి ఏ దశలోనూ అనుమానం తలెత్తలేదంటే తాము తెలివితక్కువవాళ్లమని ఒప్పుకోవాలి లేదా తమ దురాశే ఇలాంటి ఎంపికకు పురికొల్పిందని అంగీకరించాలి. ఈ రెండింటి మాటా ఎత్తకుండా ట్రంప్ వ్యక్తిత్వం ఇప్పుడే తెలిసొచ్చినట్టు మాట్లాడటం వంచన. నిజానికి రిపబ్లికన్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన విధానాల వికృత పర్యవసానమే ట్రంప్‌ను తెరపైకి తెచ్చింది. ఇరాక్ అనే చిన్న దేశం నుంచి పెను ఉత్పాతం ముంచుకు రాబోతున్నదని ఊదరగొట్టి, లేనిపోని అబద్ధాలను ప్రచారంలో పెట్టి ప్రపంచాన్ని వంచించిన చరిత్ర రిపబ్లికన్లది. తమ పౌరుల్లో భయాందోళనలు రేపి ఇరాక్ దురాక్రమణకు రంగం సిద్ధం చేసుకుని ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చడాన్ని ఎవరూ మర్చిపోలేరు. సరిగ్గా అవే ఎత్తుగడలను ట్రంప్ అమెరికా ఎన్నికలకు కుదించాడు. ఒబామా వారసుల్ని ఓడించడం పార్టీలో తనతో పోటీ పడుతున్న టెడ్ క్రుజ్, జాన్ కాసిష్లాంటివారి వల్ల కాదని... దేన్నీ లెక్కచేయకుండా ఏమైనా మాట్లాడగలిగే తానే అందుకు అర్హుడినని నచ్చజెప్పగలిగాడు. లేని సమస్యలను ఉన్నట్టుగా భ్రమిం పజేసి, వాటికి పరిష్కార మార్గాలంటూ ట్రంప్ చిత్తం వచ్చినట్టు మాట్లాడుతుంటే పార్టీలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు సైతం నోరెత్తలేదు. చైనా వల్ల, భారత్ వల్ల, మెక్సికో వల్ల దేశానికి అన్యాయం జరిగిపోతున్నదన్న ప్రచారం లంకించు కుని... ఆ దేశాల పౌరులను గెంటేస్తే అంతా సర్దుకుంటుందని మభ్యపెడుతుంటే చిద్విలాసంగా ఉండిపోయారు. శ్వేత జాతి పౌరులను ఈ మాటలు ప్రభావితం చేస్తున్నాయన్న విశ్వాసం పెరిగినకొద్దీ రిపబ్లిన్లు ‘మానింది మందు...’అన్నట్టు అతన్ని సమర్ధించడం మొదలుపెట్టారు. ఒక్క ట్రంప్‌ను మాత్రమే అనుకోవడానికి లేదు. ఇటు డెమొక్రటిక్ పార్టీ సైతం విశ్వసనీయత కలిగిన అభ్యర్థిని నిలపలేకపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికకు తొలిసారి మహిళా అభ్యర్థిని ఎంపిక చేయడం నిస్సందేహంగా మెచ్చదగ్గదే అయినా సజావుగా సాగుతున్న లిబియాలో నిష్కారణంగా నెత్తురుటేర్లు పారించడంలో హిల్లరీ పాత్ర తక్కువేమీ కాదు. ఆమె విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు క్లింటన్ ఫౌండేషన్‌కు నిధులు వరదలా పారడం, ఆ సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలపై దాని ప్రభావం ఉండటం ఎవరికీ తెలియంది కాదు. ఇక ప్రొటోకాల్ ప్రకారం మంత్రి హోదాలో అధికారిక సర్వర్ల ద్వారా మాత్రమే పంపాల్సిన ఈమె యిల్స్ను వ్యక్తిగత సర్వర్ ద్వారా పంపడం, అలా పంపిన మెయిల్స్‌లో అత్యంత రహస్యమని వర్గీకరించినవి సైతం ఉండటం ఆమె విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసింది. ఇక అధ్యక్ష అభ్యర్థిత్వానికి పార్టీలో ఆమెతో పోటీపడ్డ బెర్నీ శాండర్స్‌ను ఓడించేందుకు తెర వెనక ఎన్ని ఎత్తులు వేశారో వికీలీక్స్ వెల్లడించింది. నిజానికి ఆయన లేవనెత్తిన అంశాలు అత్యంత ప్రధానమైనవి. వీటిపై తన వైఖరేమిటన్నది హిల్లరీ ఏనాడూ వెల్లడించలేదు. సరిగదా ఆయనకు ఖచ్చితంగా మద్దతు పలకగల రన్నవారు డెమొక్రటిక్ సదస్సుకు రాకుండా చూడటంలో ఆమె వర్గీయులు విజయం సాధించారు. అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి ప్రత్యర్థి ఉండటమే ఆమెకిప్పుడు అనుకూ లాంశంగా మారిందనడంలో వింతేమీ లేదు. వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలు దీన్నే సూచిస్తాయి. చాలాసార్లు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఉండటం, ఒక్కోసారి ట్రంప్ ముందంజ వేయడం, హిల్లరీ ఆధిక్యత స్వల్పంగా ఉండటం వంటివి అమెరికా ప్రజల నిరాశానిస్పృహలనూ... ఎటూ తేల్చుకోలేని మనస్తత్వాన్ని తెలియపరుస్తాయి. ప్రత్యర్థిపై వ్యతిరేక ప్రచారం చేయడాన్నే ఇద్దరూ ఆశ్రయిం చారు తప్ప తమ విధానాలేమిటో, వాటి విశిష్టతలేమిటో చెప్పిన పాపాన పోలేదు. ఈ ప్రచారంలో వివిధ సందర్భాల్లో ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అత్యంత భయంకరమైనవి. నాగరిక సమాజాల్లో ఎవరూ అంగీకరించలేనివి. నల్లజాతీ యులపై, ముస్లింలపై ద్వేషాన్ని రగల్చడం... మహిళలను అత్యంత దారుణంగా కించపరుస్తూ మాట్లాడటంవంటివి ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంతో అభివృద్ధి సాధించినట్టు చెప్పుకునే అమెరికా సమాజంలో మహిళలను ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం తగ్గలేదు. దాన్ని ఎంతో మెరుగుపరచవలసిన అవసరం ఉన్న తరుణంలో ట్రంప్‌లాంటి కనీస విలువల్లేని వ్యక్తి అధ్యక్ష పీఠంపై కూర్చుంటే ఆ దేశం గతి ఏమవుతుందో సులభంగానే అంచనా వేయొచ్చు. చేసిన తప్పులు వెల్లడైనప్పుడు ఎవరైనా క్షమాపణ కోరడం సహజం. అలా కోరే వ్యక్తికి కొన్ని లక్షణాలుండాలి. గండం గట్టెక్కుదామని కాకుండా చిత్తశుద్ధితో, పశ్చాత్తాప హృదయంతో ఆ పని చేసినట్టు అందరికీ కనబడాలి. తన కుమార్తెను గురించి చేసిన వ్యాఖ్యలు, ఒక మోడల్ గురించి వేరొకరితో మాట్లాడిన మాటలు బయటపడ్డాక ట్రంప్ కూడా సారీ చెప్పాడు. అయితే అందులో ఏమాత్రం నిజాయితీ లేదని దానికి కొనసాగింపుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయి. అమెరికా ఎన్నికల వ్యవస్థలోని అనుకూలాంశం గురించి చెప్పుకోవాలి. అధ్యక్ష పీఠానికి పోటీపడేవారి గుణగణాలేమిటో, వారి సత్తా ఎంతో అభ్యర్థుల మధ్య జరిగే చర్చలు తేల్చేస్తాయి. వారి గతమేమిటో బహిరంగమవుతుంది. ఎంపిక చేసుకోవడం ఓటర్లకు తేలికవుతుంది. ఇప్పుడు ట్రంప్ పల్టీలు కొట్టడం దాని పర్యవసానమే. -
మహాసంక్షోభంలో ట్రంప్!
సొంత పార్టీలో తీవ్రమవుతున్న వ్యతిరేకత అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటున్న రిపబ్లికన్ నేతలు మరో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళల పట్ల అత్యంత కిరాతకంగా లైంగిక వ్యాఖ్యలు చేసిన వీడియో వెల్లడి కావడం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఈ వీడియో నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు మూకుమ్మడిగా గళమెత్తుతున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న రిపబ్లికన్ పార్టీ నేతల జాబితా నానాటికీ పెరిగిపోతుండటంతో.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచే మాట అటుంచితే.. అసలు అమెరికా కాంగ్రెస్ ఉభయ చట్టసభల్లోనూ పార్టీకి ప్రాతినిధ్యం ఉండదేమోనన్న సందేహాలు అమెరికాలో అత్యంత పురాతన పార్టీ (గ్రాండ్ ఓల్డ్ పార్టీ-జీవోపీ)లో వినిపిస్తున్నాయి. మహిళల పట్ల అత్యంత దుర్భాషపూరితమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ వీడియోను వాషింగ్టన్ పోస్టు విడుదల చేయడంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సమీకరణాలు మారిపోయాయి. అత్యంత కీలకమైన సెయింట్ లూయిస్ అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ (చర్చ) సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాను మూర్ఖమైన మాటలు మాట్లాడానని, తనను క్షమించాలని ట్రంప్ వేడుకున్నా.. ఆ వీడియో సెగలు మాత్రం చల్లారడం లేదు. అమెరికాలోని అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు ఈ వీడియోలోని దుర్భాషలపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ లూయిస్ డిబేట్‌తో ట్రంప్ వ్యతిరేక సెగలు మరింతగా చెలరేగవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో బిత్తరపోయిన సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు దాదాపు డజనుకుపైగా మంది.. ఆయన అధ్యక్ష ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్థిగా తప్పుకోవాల్సిందేనని బాహాటంగా డిమాండ్ చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన రిపబ్లికన్ నేతల్లో సెనేటర్ జాన్కెయిన్, 2008నాటి పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఆర్ ఆరోజోనా తదితర కీలక నాయకులు ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ.. ఆయన రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌కు మద్దతు పలుకలేదు. విస్కాన్సిన్ హౌస్ స్పీకర్ పాల్ రియాన్, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్కొన్నెల్, పార్టీ చైర్మన్ రీన్స్ ప్రీబస్ మాత్రం ట్రంప్‌కు అండగా నిలబడ్డారు. మరోవైపు ట్రంప్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అధ్యక్ష బరినుంచి తప్పుకొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
ట్రంప్‌కు భంగపాటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని సాధించేందుకు తోడ్పడిన వ్యూహమే ట్రంప్‌కు ఇప్పుడు శాపంగా మారినట్టుంది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో మంగళవారం జరిగిన తొలి సంవాదంలో ఆయన ఘోరంగా విఫల మయ్యారు. ప్రారంభంలో చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉన్నట్టు కనబడిన ట్రంప్... కాసేపటికే చెప్పదల్చుకున్నదేమిటో, చెబుతున్నదేమిటో తెలియని అయో మయ స్థితికి చేరుకున్నారు. అసహనంతో, ఉద్రేకంతో ఊగిపోయారు. దాదాపు ఏడాదిపాటు పార్టీలో ప్రత్యర్థులను నోర్మూయించిన వ్యక్తే... మెజారిటీ ప్రతినిధుల అభిమానాన్ని సంపాదించిన వ్యక్తే ఇప్పుడు పేలవంగా మిగిలిపోవడం తొలి రౌండ్ చర్చల్లో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అమెరికా ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మూడు దఫాలు సాగే సంవాదాలకు ఎంతో ప్రాముఖ్యముం టుంది. మొదటి, చివరి రౌండ్లలో అధ్యక్ష అభ్యర్థులు, రెండో రౌండ్లో ఉపాధ్యక్ష అభ్యర్థులు చర్చల్లో పాల్గొంటారు. వాగ్యుద్ధాలు సాగుతాయి. పక్కా సమాచారంతో, తర్కంతో వెళ్లి ప్రత్యర్థిని గుక్క తిప్పుకోకుండా చేయడానికి అభ్యర్థులు ప్రయ త్నిస్తారు. ఏ దేశంలో ఎన్నికలైనా అక్కడి ఆర్ధిక, రాజకీయ సమస్యల చుట్టూ తిరుగుతాయి. నిరుద్యోగం, అధిక ధరలు, సంక్షేమంలాంటి అంశాలకే అవి పరిమి తమవుతాయి. అమెరికాలో కూడా ఆంతరంగిక సమస్యలు ప్రస్తావనకు రావడం, వాటిపట్ల ఆయా పార్టీల వైఖరులపై విమర్శలు, సమర్థనలు ఉండటం సాధా రణమే. అయితే అది అక్కడితో ఆగదు. ప్రపంచం బాధ తన బాధ అనుకోవడం అమెరికాకు రివాజు. అందుకే ప్రపంచ పటంలోని మారుమూల దేశాలు, వాటిపట్ల అధికార పక్షం సాఫల్య వైఫల్యాలు ఈ చర్చల్లోకి చొరబడతాయి. ప్రపంచ భద్రత తన భుజస్కంధాలపై ఉన్నదని ఆ దేశం నమ్మడమే ఇందుకు కారణం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తాము ఏ వైఖరి తీసుకోవాలో, ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవడానికి ఈ చర్చలు పౌరులకు ఉపయోగపడతాయి. ప్రధానంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య సాగే చర్చల్ని మూడు నుంచి ఏడు కోట్లమంది పౌరులు వీక్షిస్తారని ఒక అంచనా. ఈసారి వీక్షకుల సంఖ్య పది కోట్లకు చేరిందని చెబుతున్నారు. అయితే ఈ చర్చల అనంతరం ప్రకటించే ఫలితాలే ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని చెప్పలేం. అలాగే మొదటి రౌండ్ తరహా ఫలితాలే మిగిలిన రెండు రౌండ్ల లోనూ ఉంటాయని చెప్పడం కూడా కష్టమే. ఇరాక్‌పై దురాక్రమణకు దిగి దేశాన్ని అన్నివిధాలా దివాలా తీయించిన రిపబ్లికన్ పార్టీని 2008 ఎన్నికల్లో ఒబామా సునాయాసంగా ఓడించగలిగారు. ఆయన నల్లజాతీయుడంటూ రిపబ్లికన్లు జాత్య హంకార ధోరణులను రెచ్చగొట్టినా ఫలితం లేకపోయింది. ఆ ఎన్నికకు ముందు జరిగిన చర్చల్లో ఒబామా నాయకత్వ పటిమ వెల్లడైంది. ఆయన ముందు రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెకైన్ వెలవెలబోయారు. 2012లో రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఒబామాకు కాస్త కష్టమే అయింది. మొదటి రౌండ్ బహిరంగ చర్చలో ఆయన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీని అధిగమించలేకపోయారు. ఒబామాకు 43 శాతంమంది మద్దతు లభిస్తే రోమ్నీవైపు 49 శాతంమంది మొగ్గు చూపారు. దాన్నుంచి కోలుకుని మిగిలిన రెండు రౌండ్లలోనూ ఒబామా, ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థి జోయ్ బిడెన్లిద్దరూ విజేతలుగా నిలిచారు. ఈసారి ఎన్నికలకు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడలేని ఆకర్షణనూ తీసుకొచ్చారు. తాను ప్రత్యర్థులపై పిడుగులు కురిపిస్తున్నానని, కోలుకోలేని దెబ్బతీస్తున్నానని ఆయన అనుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు సైతం ఆయనైతేనే విజయాన్ని ఖరారు చేస్తారన్న అతి విశ్వాసానికి పోయారు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదని ఇప్పుడు తొలి రౌండ్ చర్చలు పూర్తయ్యాక వెలువడిన ఫలితాలు చెబుతున్నాయి. చర్చల తీరును చూసిన విశ్లేషకులు ట్రంప్ ఎన్నిసార్లు హిల్లరీ మాటలకు అడ్డం వచ్చారో, ఆమె అలా వారించిన సందర్భాలెన్నో లెక్కలుగట్టారు. ట్రంప్ 51సార్లు, హిల్లరీ కేవలం 17సార్లు అలా చేశారని తేల్చారు. అయితే మహిళ కావడం వల్లనేమో... హిల్లరీ చాలా సున్నితంగా ఆ పని చేశారు. ట్రంప్ అబద్ధా లను, ముఖ్యంగా మహిళల విషయంలో ఆయన చేసిన దుర్వ్యాఖ్యానాలను గుర్తు చేయడానికే ఆమె జోక్యం చేసుకున్నారు. పర్యావరణం ప్రమాదంలో పడిందనడం వెనక చైనా కుట్ర ఉన్నదని తాను ఎన్నడూ అనలేదని... మహిళలను కించపరుస్తూ మాట్లాడలేదని ట్రంప్ చెప్పడం అందరినీ నిర్ఘాంతపరిచింది. కెమెరాల సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అనలేదని బుకాయించడం ట్రంప్‌లోని భీరువును బయటపెట్టింది. ట్రంప్ తీవ్ర స్వరంతో విరుచుకుపడటాన్ని, వెనకా ముందూ చూడకుండా తోచినట్టు మాట్లాడటాన్ని హిల్లరీ చాలాసార్లు చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. తన ప్రసంగానికి అడ్డొస్తున్న ట్రంప్ కోసం ఆమె కొన్నిసార్లు మాట్లాడటం ఆపేశారు. ఇలా అడ్డుతగలడం సరికాదని సమన్వయకర్త పలుమార్లు ట్రంప్‌కు గుర్తు చేయాల్సివచ్చింది. తనను తాను సంబాళించుకోవడానికి, పద్ధతిగా మెలగడానికి ట్రంప్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మహిళలపై ఆధిపత్యం చలాయించాలన్న మగ మన స్తత్వమే ఈ మాదిరి ధోరణికి కారణమని చర్చకు ముందు కొందరు మానసిక శాస్త్రవేత్తలు తేల్చారు. 2000 సంవత్సరంలో హిల్లరీ సెనేట్‌కు పోటీ పడినప్పుడు ఆమె ప్రత్యర్థి రిక్ లజియో మాట్లాడిన తీరును సైతం వారు ప్రస్తావించారు. ఇది అతని ఓటమికి కారణమైందని కూడా గుర్తుచేశారు. కానీ ఇలాంటి అభిప్రాయాలు సైతం ట్రంప్‌ను మార్చలేకపోయాయి. ఆయన తనకలవాటైన రీతిలో చెలరేగి పోయారు. ఫలితంగా వైఫల్యం మూటగట్టుకున్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న ప్పుడు హిల్లరీ తీసుకున్న నిర్ణయాలను, వివిధ అంశాల విషయంలో ఆమె అనుసరించిన విధానాలను విమర్శించడానికి, లోపాలను ఎత్తి చూపడానికి అవ కాశం ఉన్నా ట్రంప్ తన మరుగుజ్జు మనస్తత్వంతో వాటి జోలికి పోలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ట్రంప్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించకపోతే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు వరసగా మూడోసారి కూడా భంగపాటు తప్పదని తొలి రౌండ్ చర్చలు గమనిస్తే అర్ధమవుతుంది. -
అన్నీ ఉన్నవారికీ కావాలి కోటా!
రాజకీయ పలుకుబడి గల మరాఠాలు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరడం విచిత్రం. గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు శాసించేది వారే. విద్యా సామ్రాజ్యాల స్వాధీనం లేదా ఫీజులలో రాయితీలు వారు కోరడం లేదు! మరాఠాలు ఒకప్పటి యుద్ధ యోధులు, రైతులతో కూడిన వారు. అలా అని ఆ రెండు వర్గాలూ పూర్తిగా వేరు వేరుగా ఉండేవీ కావు. మహారాష్ట్ర అధికార వ్యవస్థలో కీలక స్థానం మాత్రం మొత్తంగా మరాఠాలదే. వారే తరచుగా ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారు. జనాభాలో దాదాపు మూడోవంతు ఉంటారు. అయినా వారికి పలు సమస్యలున్నాయి, అందులో ఒకటి వారికి రిజర్వేషన్లు లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లనే చేస్తున్న జాట్లు, పటేళ్ల లాగే మరాఠాల తీరూ విడ్డూరమే. ఆగస్టు నుంచి అపూర్వమైన రీతిలో వారు తమ డిమాండ్లను వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల నినాదాలు, మైక్రోఫోన్లు లేకుండా ప్రదర్శనలను నిర్వహించారు. ఒక్క నినాదం కూడా వినరాలేదు. ఒక్క నేతైనా వేదిక మీద మైక్ అందుకున్నది లేదు. కోటాలు కావాలని, దళితులపై అత్యాచారాల చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఒక మరాఠీ బాధితురాలుగా ఉన్న సామూహిక అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్‌పై తేల్చా లని ప్లకార్డులను ప్రదర్శించారు. పలు విధాలుగా ఈ ప్రదర్శనలు అపూర్వమైనవి. ఒకటి, వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్లారా చూస్తేనే అది నమ్మగలం. లక్షలను రెండు అంకెల్లో చెబుతున్నట్టు మీడియా వారి సంఖ్యను తక్కువగా పేర్కొంది. రెండు, ఏ రాజకీయ నేతో లేదా ఏ రాజకీయ పార్టీనో సంఘటితపరచడం లేదా నేతృత్వం వహిస్తు న్నట్టు కానరాలేదు. మూడు, అధికారులతో సంఘర్ష ణకు దారి తీసిన ఘటన ఒక్కటీ జరగలేదు. ప్రదర్శకుల మధ్య సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించ లేదు. నాయకులంతా అస్పష్టంగానే గోచరమయ్యారు. అంతా రాజకీయాలకు అతీతంగా ఒకే విధమైన ప్రయో జనాలు, ఉద్దేశం ఉన్నవారు. ప్రదర్శనల తేదీలు, వేళలు, స్థలాలు, మార్గాలు, ఏర్పాట్లు, వగైరా అన్నీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే అందరికీ చేరాయి. భాగ స్వాములైన వారిలో ప్రతి ఒక్కరూ మరో 100 మందిని సమీ కరిస్తామని వాగ్దానం చేశారు. వేదికలనుంచి నల్ల దుస్తులు ధరించిన బాలికలు మరాఠాల డిమాండ్ల చదివి వినిపించారంతే. అవన్నీ ప్లకార్డులపై ఉన్నవే. అధికారులు తమ మధ్య చీలికలను సృష్టించడానికి యత్నిస్తారని నాయకత్వం తెరవెనుకనే ఉండిపోయింద నేది స్పష్టమే. అయితే, రాజకీయవేత్తలు వారిలో తప్పక ఉన్నారు. అవసరమైన డబ్బును, సీసాల్లోని మంచినీటిని వారే సమకూర్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు తెరవెనుక ఒకరిని మించి మరొకరు ఈ ప్రదర్శన లకు సహాయం అందించాలని పోటీపడి ఉంటారు, ఎవరికి వారే పైచేయి సాధించాలని యత్నించి ఉంటారు. అందువల్ల లాభపడింది ప్రదర్శకులు మాత్రమే. కీలక సమస్యలపై రాజకీయాలను దూరంగా ఉంచే ధోరణి ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో ఉంది. దివంగత శరద్ జోషి ఈ విధంగానే అందరినీ షేత్కారీ సంఘటనలోకి సమీకరించి, నేతృత్వం వహిం చారు. ‘‘ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పడు మీరు మీ రాజకీయ పాదరక్షలను బయటే వదలి రండి’’ అంటూ రైతులనుద్దేశించి ప్రకటిస్తూ ఆయన తన సభలను ప్రారంభించేవారు. అయితే ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, తాను పరిహసించిన పార్టీల మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980లలో దళితులు కూడా రిపబ్లికన్ పార్టీలోని చీలికలకు అతీతంగా ఏకమై, తమను అవమానాలకు గురిచేస్తున్న మరాఠాలకు వ్యతిరేకంగా సమరశీల పోరా టాన్ని నిర్వహించారు. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్పించారు. దళితులు తమపై అత్యాచారాల చట్టాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని మార్చాలని నేడు మరా ఠాల కోరికల జాబితా కోరుతోంది. దీంతో ఒక సంక్ర మణం పూర్తయిందని అనుకోవచ్చు. రాజకీయ పలుకుబడి కలిగిన మరాఠాలు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లును కోరడం అతి విచిత్రం. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారాన్ని శాసించేది వారే. పేరుకు ఒక వీపీ నాయక్ లేదా సుధాకర్ నాయక్ లేదంటే మనోహర్ జోషి లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కావచ్చు. కాసులు కురిపించే విద్యాసంస్థలకు యజమానులు, నిర్వాహకులుగా ఉన్నవారు కూడా మరాఠాలకు చెందినవారే. కాలక్రమంలో మరాఠాల అధికారం పదును సరిగ్గా ఎప్పుడు తగ్గిందో చెప్పడం కష్టం. అధికార చట్రానికి, ప్రగతికి తమను దూరంగా ఉంచుతున్నారన్న భావన ఏర్పడింది. తమ కులానికే చెందిన పెద్దలు రాజకీయాలను వ్యాపారంగా నిర్వహిం చినా... మరాఠాల ఆర్థిక ప్రయోజనాల పట్ల వారు శ్రద్ధ వహిస్తున్నంతకాలం దాన్ని పట్టించుకోరు అన్నట్టుంది. విద్యా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని లేదా ఫీజులలో రాయితీలు ఇవ్వాలని వారు కోరడం లేదు. అది ఆసక్తికరం అనడం ఈ విషయాన్ని తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
ట్రంప్ ఓటమికి రూ.13 కోట్ల విరాళం
డెమొక్రాట్లకు ఇచ్చిన ఎఫ్బీ సహ వ్యవస్థాపకుడు న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మస్కోవిట్జ్ ప్రకటించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు డెమోక్రటిక్ పార్టీకి రెండు కోట్ల డాలర్ల (రూ. 13.38 కోట్లు)ను విరాళంగా ఇచ్చారు. ‘ట్రంప్ గెలిస్తే దేశం వెనుకబడి పోతుంది. అంతర్జాతీయ సమాజం నుంచి విడిపోయి ఒంటరయ్యే ప్రమాదముంది’ అని తన బ్లాగ్‌లో ‘కంపెల్డ్ టు యాక్ట్’ శీర్షికతో పోస్ట్ చేశారు. ఈ పోస్టు కింద ఆయన భార్య కూడా సంతకం చేశారు. ట్రంప్ విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని డస్టిన్ పేర్కొన్నారు. -
ఇక మంచివాడిని కాను: ట్రంప్
హిల్లరీ తనకు అభినందనలు చెప్పలేదంటూ ధ్వజం వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విషయంలో తాను ఇక ఏమాత్రం ‘మంచి మనిషి’గా వ్యవహరించబోనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కొలరాడోలో శుక్రవారం జరిగిన పార్టీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఈ పోరులో ఇక నిర్దయగా వ్యవహరిస్తానన్నారు. హిల్లరీ గురువారం పార్టీ జాతీయ సదస్సులో చేసిన ప్రసంగంలో.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందినందుకు తనకు అభినందనలు చెప్పకపోవటాన్ని తప్పుపడుతూ ఆమె గొంతును అనుకరించి ఎద్దేవా చేశారు. ట్రంప్ మరో సభలో మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేసిన డెమోక్రటిక్ నేతలకు దిమ్మతిరిగిపోయేలా బుద్ధి చెప్తానన్నారు. హిల్లరీకి నిర్ణయం తీసుకోవటం రాదంటూ.. జాతీయ భద్రతపై అధికారిక సమాచారం చెప్పొద్దని ఆ తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కునుకుతీస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ.. ఆమె ‘అబద్ధాలతో బిల్ కూడా విసిగిపోయార’ని విమర్శించారు. కాగా పార్టీ నామినేషన్లను స్వీకరిస్తూ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని 3.22 కోట్ల మంది, హిల్లరీ చేసిన ప్రసంగాన్ని 2.98 కోట్ల మంది టీవీల్లో చూశారని ఓ సర్వేలో తేలింది. -
ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు
మహామహులను ఓడించిన వైనం - ‘మరింత కష్టపడతా.. అమెరికా ఫస్ట్’ అని వ్యాఖ్య వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇందుకోసం 13 నెలలుగా పార్టీలోని మహామహులతో పోటీ పడి ట్రంప్ విజయం సాధించారు. ఒహయొలోని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో నామినేటింగ్ ఓట్ల ప్రక్రియలో తన కుమారుడు డొనాల్డ్ జే ట్రంప్ వేసిన ఓటుతో ఆయన పార్టీ అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లు (మొత్తం రిపబ్లికన్ ప్రతినిధుల ఓట్లలో సగం) సాధించారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ అధికారికంగా ధ్రువీకరించారు. ఏడాది క్రితం పార్టీలో చేరిన ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదంతో బరిలో ఉన్న జాన్ కసిచ్, జెబ్ బుష్ లాంటి ప్రముఖులను ప్రైమరీల్లో ఓడించారు. ‘విజయం సాధించాం. మరింత కష్టపడి పనిచేస్తా. మిమ్మల్ని (రిపబ్లికన్లను) ఓడిపోనివ్వను. అమెరికా ఫస్ట్’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదే ఊపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచి సరైన నాయకత్వంతో దేశంలో మార్పు తీసుకువస్తానన్నారు. కాగా, షికాగోకు చెందిన శాలభ్ శాలీ కుమార్ అనే భారత సంతతి వ్యక్తి, ఆయన భార్యతో రూ.6.03 కోట్లు ట్రంప్‌కు ఎన్నికల విరాళంగా అందజేశారు. గతేడాది రిపబ్లికన్ హిందూ సంఘాన్ని ఈయన ప్రారంభించారు. పాకిస్తాన్‌పై స్పష్టతతో ఉన్న ట్రంప్‌కు మద్దతివ్వటంలో తప్పులేదని శాలీ తెలిపారు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్‌తో ట్రంప్ పోటీపడనున్నారు. కాగా, శ్వేతసౌధంలో కూర్చునేందుకు ట్రంప్‌కు అవకాశం ఇవ్వొద్దని హిల్లరీ అమెరికన్లను కోరారు. ట్రంప్‌కు డిప్యూటీగా (ఉపాధ్యక్ష పోటీదారుగా) ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ నామినేట్ అయ్యారు. చివరి నిమిషం వరకు అడ్డంకులే! డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నిక అభ్యర్థిత్వానికి అవసరమైన మెజారిటీ సాధించినా.. రిపబ్లికన్ పార్టీలోని నేతలు మాత్రం దీనికి అంగీకరించలేదు. చివరి నిమిషం వరకు ట్రంప్‌కు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ట్రంప్‌కు వచ్చిన ఓట్లను వెనక్కు తీసుకునేలా పార్టీ నిబంధలను సవరించే ప్రయత్నమూ జరిగింది. -
నల్ల పిడికిళ్ల నవ సందేశం
ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్లజాతి ప్రజలపైన సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపు తుండగా, రిపబ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ‘అమెరికాలో ఏటా వందల మంది నిరాయుధులైన నల్లజాతి యువతీ యువకులను పోలీసులు కాల్చి చంపుతున్నారు. ఎంతమంది పోలీసుల చేతిలో చనిపోతున్నారో నిర్ధారించే నిర్దిష్టమైన లెక్కలు లేవు. శాంతిభద్రతల పేరుతో నల్లజాతి యువతీయువకులను పోలీసులు పొట్టన పెట్టుకుంటు న్నారు.’ 2015 జూన్‌లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిని నివేదించింది. పోలీసులు ఆయుధాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, మనుషుల ప్రాణాలకు కనీస భద్రత, రక్షణ కరువయ్యాయని ఆమ్నెస్టీ ఆక్రోశించింది. స్వదేశీ చట్టాలనూ, ఐక్యరాజ్య సమితి నిబంధనలనూ కూడా అమెరికా పోలీసులు ఖాతరు చేయడంలేదనీ, వర్ణవివక్ష వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనీ నివేదిక పేర్కొ న్నది. పోలీసు విధులకు సంబంధించి అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో అంత ర్జాతీయ నిబంధనలను అమలు చేయాలి. కానీ వాషింగ్టన్ (డిసి) సహా తొమ్మిది రాష్ట్రాల్లో విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలను వినియో గించడం పైన నిబంధనలు లేవు. పదమూడు రాష్ట్రాల్లో చట్టాలూ, శాసనాలూ చాలా లోపభూయిష్టంగానే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో జరిగిన ఘటన లను ఇదే నేపథ్యం నుంచి పరిశీలించాలి. గత బుధవారం మినిసాంటాలో 32 సంవత్సరాల ఫిలాండో కాస్టిలె అనే నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపినట్టు తెలిపే వీడియోను ఆయన స్నేహితురాలు డైమండ్ రెనాల్డ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది అమెరికాను కలచివేసింది. ఇందుకు నిరసనగా నల్లజాతీయులు వీధుల్లోకి వచ్చారు. ఇందులో భాగం గానే డాలస్ నగరంలో జరిగిన ప్రదర్శనలో ఒక నల్లజాతి యువకుడు ఐదుగురు పోలీసు అధికారులను కాల్చివేసాడు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ కాల్పులు జరిపిన ఇరవై అయిదు సంవత్సరాల యువకుడు మికా జాన్సన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ‘ఇటీవల జరిగిన పోలీసు హత్యలు నన్ను కలవరపరిచాయి. ఇది చేసింది శ్వేత జాతికి చెందిన పోలీసు అధికారులు. అందుకే ఆ తెగకు చెందిన అధికారులను లక్ష్యంగా ఎంచుకున్నాను.’ అని చెప్పారు. అయితే ఆ తరువాత పోలీసులు మికా జాన్సన్‌ను కూడా రోబోట్ ద్వారా కాల్చి చంపారు. నల్లజాతి యువతీయువకులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరస నగా గత కొద్దిరోజులుగా అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలు జరుగు తున్నాయి. ఈ ప్రదర్శనల్లో అనేక నినాదాలతో పాటు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అన్న నినాదం ప్రత్యేకంగా కనిపిస్తున్నది. నిజానికి అది నినాదం కాదు, సంస్థ పేరు. ఇటీవలి కాలంలో విస్తృతంగా కొనసాగుతున్న పోలీసు హత్యలను నిరసిస్తూ అమెరికాలో వెల్లువెత్తిన ఉద్యమాలు గత అనుభవాలనుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. అమెరికాలోని నల్లజాతి హక్కుల ఉద్యమకారులు ఈ ఉద్యమంలో సోషల్ మీడియాను చాలా శక్తిమంతంగా ఉపయోగించుకున్నారు. ఆ మీడియాని ఆయుధంగా వాడుకున్నారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ను సంక్షిప్తంగా బి.ఎల్.ఎమ్. అని ప్రచారంలోకి తెచ్చారు. 2013 జూలైలో ఉద్యమం మొదలైనప్పటికీ, 2014 వేసవిలో ఇది ఊపం దుకున్నది. ఫెర్గుసన్లో మైఖేల్ బ్రౌన్, న్యూయార్క్ సిటీలో ఎరిక్ గార్నర్లను పోలీసులు కాల్చి చంపిన ఘటనలపై బి.ఎల్.ఎమ్. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. జార్జి జిమ్మర్ మాన్ అనే అధికారిని, నల్ల జాతీయుడైన ట్రేవాన్ మార్టిన్ హత్యకేసులో నిర్దోషిగా ప్రకటించడంతో బి.ఎల్.ఎమ్. ప్రస్థానం మొదలైంది. ‘నల్లజాతీయుల ప్రాణాలు కూడా ప్రాణాలే’ అనే సందేశంతో సోషల్ మీడియా అట్టుడికిపోయింది. అలిసియా గార్జా, పాట్రిస్సె కుల్లర్స్, వోపల్ టొమెటె అనే ముగ్గురు ఈ ఉద్యమ వ్యవస్థాపకులు. నల్ల జాతిలో నాయకత్వ లక్షణాలను, ఆత్మగౌరవాన్ని వృద్ధి చేయడానికి పని చేస్తున్న ‘బోల్డ్’ అనే సంస్థలో వీరంతా కలిశారు. ఆఫ్రికన్ - అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం, బ్లాక్ పవర్ మూవ్ మెంట్, 1980 బ్లాక్ ఫెమినిస్ట్ ఉద్యమం, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం, హిప్ హాప్, వాల్‌స్ట్రీట్ స్వాధీన ఉద్యమాల నుంచి తాము స్ఫూర్తి పొందినట్టు బి.ఎల్.ఎమ్. వ్యవస్థాపకులు ప్రకటించుకున్నారు. ఈ బృందంలో ఒకరైన అలిసియా గార్జా మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్చేసిన నినాదాలలో ‘అవర్ లైవ్స్ మ్యాటర్-బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కూడా ఒకటి. 2014 ఆగస్టులో ఫెర్గుసన్లో మైఖేల్బ్రౌన్ను కాల్చి చంపిన సంఘటనకు నిరసనగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఫ్రీడం రైడ్’ ప్రదర్శనను మొదటిసారిగా నిర్వహించారు. ఆ విధంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే నినాదం ఉద్యమ నాదమైంది. దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గొన్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2014 నవంబర్‌లో అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఉన్న పెద్ద దుకాణాలు, మాల్స్ ఎదుట చేపట్టిన నిరసనలు కూడా అమెరికా ప్రజల్లో ప్రభావాన్ని కలుగజేసాయి. 2015లో మేరిలాండ్‌లోని బాల్టిమోల్లో ఫ్రెడ్డిగ్రే హత్యానంతరం మరింత శక్తిమంతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించడానికి ఉద్యమకారులు పథకాలను రూపొందించారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పాత తరం నల్లజాతి ఉద్యమ నాయకులతో వీళ్లు తెగతెంపులు చేసుకున్నారు. ఉద్యమంలో చర్చి ప్రభావాన్ని తగ్గించారు. రాజకీయ పార్టీలకు విధేయంగా ఉండే విధానాలను తిరస్కరించారు. మరొక ముఖ్య అంశం ఉద్యమాన్ని ప్రభావితం చేసే సాధనంగా సంగీతాన్ని ఎంచుకున్నారు. కెండ్రిక్ లామర్ అనే ప్రముఖ సంగీతకారుడు ఈ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉన్నారు. ఎన్నో సంఘటనలను వాళ్లు వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నల్లజాతి అనగానే నేరగాళ్లనే దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమ తాత్వికతను గురించి వ్యవస్థాప కులలో ఒకరైన అలిసియా గార్జా మాట్లాడుతూ, ‘నల్లజాతి ప్రజలు మానవ హక్కులను, పరువు, గౌరవాన్ని కోల్పోతున్న విధానాన్ని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఎత్తిచూపుతున్నది. నల్లజాతిపైన జరుగుతున్న నరమేధాన్ని, వారు అనుభ విస్తున్న పేదరికాన్ని సమాజం ముందు ఉంచుతున్నది. దాదాపు పది లక్షల మంది నల్లజాతి ప్రజలు ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న క్రూర నిర్బంధం పిల్లలను, మహిళలను సైతం వెంటాడుతున్నది. వేటాడుతున్నది. వీటన్నింటిపైన నిరసనగానే ఈ ఉద్యమాన్ని నడుపుతు న్నాం’ అని వివరించారు. ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్ల జాతి ప్రజలపైన సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమో క్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతుండగా, రిప బ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయ కులు, శ్వేతజాతి నాయకులు ఈ ఉద్యమాన్ని అతివాద ఉద్యమంగా ముద్ర వేసి విమర్శిస్తున్నారు. కేవలం నల్లజాతి ప్రజల జీవితాల గురించే మాట్లాడు తారా? మిగతా వాళ్లు మనుషులు కారా అని ప్రశ్నిస్తున్నారు. జాత్యహం కారంతో మాట్లాడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ప్రశ్నించిన బి.ఎల్.ఎమ్. కార్యకర్తపైన రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. దానికి నిరసనగా మరొక చోట బి.ఎల్.ఎమ్. కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శనతో డొనాల్డ్ ట్రంప్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విమర్శ లన్నింటి కీ బి.ఎల్.ఎమ్. సమాధానం ఇచ్చింది. ‘నల్లజాతి ప్రజల జీవితాలు విలువైనవంటే, ఇతరులవి కావని కాదు. నల్లజాతిపై శ్వేతజాతీయుల ఆధి పత్యం, అధికారం కింద నలిగిపోకుండా ఉండాలని మేము కోరుకుంటు న్నాం’ అని స్పష్టం చేసింది. అమెరికా నల్లజాతి ఉద్యమం ఒక నూతన పంథాలో పయనిస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవకాశాలను వాడుకోవడంలో విజయ వంతమైంది. సంఘటనలు జరిగిన వెంటనే స్పందించే విధంగా ఒక నెట్ వర్క్‌ను కూడా వృద్ధి చేసుకోగలిగింది. రాజకీయ నాయకత్వాన్ని నిలదీయడం వల్ల విధాన నిర్ణయాల వైపు, పాలనారంగంలో మార్పుల వైపు సరైన మార్పులు జరగడానికి అవకాశం చిక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలు, అభ్యర్థులు అధికారులు ఎవరైనా ఆ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అణచివేతలకు బాధ్యత వహించాలని ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం మరొకసారి రుజువు చేసింది. ప్రపంచ దేశాల్లో వివక్షకు వ్యతిరేకంగా సాగుతోన్న వేనవేల ఉద్యమాలకు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఒక నూతనోత్తేజాన్ని అందిస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
చైనా దోచుకుంటోంది: ట్రంప్
పిట్స్బర్గ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందుకు దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ చైనాపై మళ్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘చైనా స్వేచ్ఛా వాణిజ్యాన్ని దుర్వినియోగం చేస్తోంది. మేధో సంపత్తిని దొంగిలిస్తూ అమెరికాను దోచుకుంటోంది. నేను అధ్యక్షుణ్ని అయితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని ఆదివారం ఓ సభలో చెప్పారు. -
ట్రంప్ ఫొటోతో టాయిలెట్ పేపర్లు!
బీజింగ్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న ట్రంప్ అమెరికా ఉద్యోగాలను, వ్యాపార లాభాలను చైనీయులు కొల్లగొడ్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై చైనా కంపెనీలు వినూత్న నిరసన తెలిపాయి. ట్రంప్ హావభావాలు, ముఖ కవళికలను ముద్రించిన టాయిలెట్ పేపర్లను ఉత్పత్తి చేసి అమెరికాలో ‘డంప్ విత్ ట్రంప్’ అంటూ అమ్ముతున్నాయి. వీటికి మంచి డిమాండ్ వస్తోంది. కాగా, దివంగత లిబియా నియంత గడాఫీతో పలు ఒప్పందాలు కుదుర్చుకుని భారీగా ఆర్థిక లాభం పొందినట్లు ట్రంప్ చెప్పారు -
పారిస్ ఒప్పందం రద్దు చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: చారిత్రక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ శపథం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే చేపట్టనున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ట్రంప్ శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐరాస గ్లోబల్ వార్మింగ్ ప్రోగ్రామ్‌కు అమెరికా అందిస్తున్న నిధులను ఆపేస్తామని చెప్పారు. అమెరికాకు ఎనర్జీ పరంగా స్వతంత్రత వచ్చేందుకు ఈ చర్యలు అవసరమన్నారు. -
రండి.. ఇస్లాం నేర్పిస్తా!
♦ డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ మేయర్ సాదిక్ ఆహ్వానం ♦ సాదిక్ వ్యాఖ్యలను పట్టించుకోనన్న ట్రంప్ లండన్: లండన్ కొత్త మేయర్ సాదిక్ ఖాన్, అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్యుద్ధం ముదురుతోంది. అమెరికాలో ముస్లింలకు వీసా నిరాకరించినా.. లండన్ కొత్త మేయర్ సాదిక్‌కు ఆహ్వానం ఉంటుందని ట్రంప్ అనడంతో వివాదం మొదలైంది. ఓ బ్రిటన్ టీవీ చానల్‌కు మంగళవారమిచ్చిన ఇంటర్వ్యూలో సాదిక్ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ను లండన్‌కు ఆహ్వానిస్తున్నాను. మా కుటుంబ సభ్యులు, మిత్రులు, చుట్టుపక్కలవారిని పరిచయం చేస్తా. ముస్లింలైనా లండన్ ప్రజలుగా, బ్రిటన్లుగా ఎలా సంతోషంగా ఉంటున్నామో వివరిస్తా. ఆయనకు ఇస్లాం గురించి అర్థమయ్యేలా చెబితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’అని తెలిపారు. అనవసరంగా మతాల గురించి మాట్లాడి.. వివిధ నాగరితకల మధ్య గొడవపెట్టాలనుకునే ఆలోచనను ట్రంప్ మానుకోవాలన్నారు. ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పనికీ.. ట్రంప్ ఆలోచనకు పెద్ద తేడాఏమీ లేదన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విభజన విధానం చాలా ప్రమాదకరమైందని సాదిక్ అన్నారు. ఐ డోంట్ కేర్: ట్రంప్ కాగా,సాదిక్ మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. అసలు సమస్యనే తను ప్రస్తావిస్తున్నానని అంతే తప్ప ముస్లిం వ్యతిరేకిని కాదన్నారు. ‘ఆయన మాటలను నేను పట్టించుకోను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆయనకు సరిగా అర్థం కాలేదు. ఇస్లాం టైజం గురించి మాట్లాడినందుకు నా ముస్లిం మిత్రులు నన్ను ప్రశంసించారు’ అని అన్నారు. ఖాన్ తననెప్పుడూ కలవలేదని.. అసలు ఖాన్‌కు తన గురించి పూర్తిగా తెలియదన్నారు. -
ఎన్నికలంటే రియాల్టీ షో అనుకున్నావా..?
ట్రంప్‌పై మండిపడ్డ ఒబామా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటమంటే రియాల్టీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని డోనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశ్నించారు. శనివారమిక్కడ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి చేరువలో ఉన్న ట్రంప్‌పై మండిపడ్డారు. టీవీ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించిన ఒబామా..అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడటమంటే వినోదం కాదన్నారు. ‘ఇది రియాల్టీ షో కాదు ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష పదవికి జరిగే పోటీ అని గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు. అమెరికాలోని సమస్యలపై ట్రంప్ అనేక సమయాల్లో పలురకాలుగా స్పందించారన్నారు. అమెరికాలో ముస్లింలు, అక్రమ వలసదారులను అనుమతించనంటూ, మెక్సికో వలసదారులు ప్రవేశించకుండా గోడ కడతానని ట్రంప్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒబామా మాట్లాడుతూ విదేశాంగ విధానంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా, వాస్తవిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తమ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, అమెరికాలో రానున్న కొత్త ప్రభుత్వానికి అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు వీలుగా పన్నెండు మంది సభ్యులతో కూడిన ‘వైట్‌హౌస్ ట్రాన్సిషన్ కమిటీ’ని ఒబామా ఏర్పాటు చేశారు. -
ట్రంప్‌పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు కాక మొదలైంది. ఇండియానా ప్రాథమిక ఎన్నికల తర్వాత పోటీ దారులమధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన అనంతరం డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో హిల్లరీ స్పందించారు. ట్రంప్ ఓ చంచల స్వభావి అని, అమెరికా ప్రజలు అతడిని ఎన్నుకునేంత తెలివితక్కువ వారని తాను భావించడం లేదని అన్నారు. ట్రంప్‌కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం అమెరికాకు సమస్యలు కొనితెచ్చుకోవడమే అని చెప్పారు. ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కోని ప్రచారం ఎలా నిర్వహించాలో తనకు బాగా తెలుసని అన్నారు. అదే సమయంలో.. ట్రంప్ పార్టీలోని రెబల్స్ అతడిపై పైచేయి సాధించలేకపోయారని, ఎందుకంటే అంతకంటే ముందే వారు ట్రంప్‌తో ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'ట్రంప్ ఓ పేలని ఫిరంగి. పేలని ఫిరంగులు ఉపయోగిస్తే అవి మిస్ ఫైర్ అవుతాయి' అని ఆమె విమర్శించారు. 'ట్రంప్ పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒక దేశ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నప్పుడు అసలు ప్రజలకు ఏం చేస్తారో అనే విషయం తప్పక చెప్పాలి. ప్రజలకు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో.. దానికోసం ఎలా ముందుకు వెళతారో వివరించాలి. స్వతహాగా వ్యాపారస్తుడైన ట్రంప్ కు విదేశాంగ విధానం అస్సలు తెలియదు. అతడిని అధ్యక్షుడికి ఎన్నుకోవడం మాత్రం అమెరికాకు పెద్ద చిక్కే' అని ఆమె చెప్పారు. -
ట్రంపే రిపబ్లికన్ అభ్యర్థి!
♦ ఇండియానాలో గెల్చిన ట్రంప్, ఓడిన హిల్లరీ ♦ రిపబ్లికన్ రేసు నుంచి తప్పుకొన్న క్రుజ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. ప్రైమరీ రేసులో మాత్రం అనూహ్యంగా ముందుకెళ్తున్నారు. మంగళవారం ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇండియానాలో ఓటమి పాలైన టెడ్ క్రుజ్ రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థి అయిన క్రుజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి ట్రంప్‌కు మార్గం సులువైంది. రేసులో ఇంకా ఓహియో గవర్నర్ కాసిచ్ ఉన్నప్పటికీ ఆయన ట్రంప్‌కు పోటీగా నిలిచే పరిస్థితి లేదు. అయితే జూన్ నెల వరకు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పుడే అధికారిక ప్రకటన వెలువడుతుంది. తాజా విజయంతో 1,047 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. మేజిక్ నంబర్‌కు చేరుకోవాలంటే మరో 190 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఒకప్పటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు, ఇండియన్ అమెరికన్ బాబీ జిందాల్ ట్రంప్‌కే తన ఓటు అని ప్రకటించారు. హిల్లరీ నామినేషన్ ఆశలు పదిలం మరోవైపు డెమోక్రాటిక్ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ.. ఇండియానాలో ఆమె ప్రత్యర్థి బెర్న్ శాండర్స్ చేతిలో ఓటమి పాలయ్యారు. రేసులో బాగా వెనుకంజలో ఉన్న శాండర్స్ ఈ విజయం సాధించినా హిల్లరీ డెమోక్రాటిక్ నామినేషన్‌కు ఢోకా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
'అతడికి నేనంటే ఇష్టమో.. కాదో'
న్యూయార్క్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే అమెరిక అధ్యక్ష పదవి కోసం నామినేషన్ అర్హత దాదాపు సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి కాస్త నెమ్మదించి మాట్లాడారు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యర్థి టెడ్ క్రూజ్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్.. క్రూజ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఎన్నో పోటీలు ఎదుర్కొన్నానని, తమ పార్టీ తరుపునే బరిలోకి దిగిన క్రూజ్ గట్టి పోటీ ఇచ్చాడని అన్నారు. 'నా జీవితమంతా పోటీల మయం. ఎన్నో పోటీలు దిగ్విజయంగా ఎదుర్కొన్నాను. భిన్న పోటీలు నా జీవన ప్రయాణంలో చూశాను. కానీ, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టెడ్ క్రూజ్... అతడు నన్ను ఇష్టపడతాడో లేదో నాకు తెలియదు. కానీ పోటీ దారుల్లో మాత్రం అతడు మేటి. అతడితో కాంపిటేషన్ చాలా టఫ్.. బాగా తెలివైన వాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను అతడికి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అతడి ముందున్న పరిస్థితి కొంత కఠినమైనది. నిజంగానే కఠినమైనది. టెడ్, హైదీ ఆయన కుటుంబం మొత్తం బాధపడుతూ ఉండొచ్చు. ఒక విషయం మాత్రం చెప్పగలను. అతడిని ఎదుర్కోవడం మాత్రం నిజంగా చాలా కష్టమే.. గొప్ప పోటీదారు క్రూజ్' అంటూ ట్రంప్ చెప్పాడు. నవంబర్ లో అధ్యక్ష పీఠం తమ వశమవుతుందని, అమెరికా నెంబర్ 1 అవుతుందని చెప్పారు. ఇక కంపెనీల వ్యవహారాలన్ని మూసేసి తాను దేశ సేవకు అంకితం అవుతానని ట్రంప్ చెప్పారు. -
అధ్యక్ష పదవికి రూట్ క్లియర్ చేశాడు
ఇండియానాపొలిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందేందుకు బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. ఇండియానాలో కూడా ఆయన పై చేయి సాధించారు. ఇక్కడ తనకు గట్టి పోటీ దారుడైన టెడ్ క్రుజ్‌ను మట్టి కరిపించి నామినేషన్ తన పేరిట ఖరారు చేసుకున్నారు. ఈ ఎన్నికలతో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి తానే అనే ట్రంప్ నిరూపించుకున్నాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ట్రంప్ ఈ విజయం సాధించడం గమనార్హం. మరోపక్క, డెమోక్రటిక్ పార్టీ తరుపున నామినేషన్ కోసం పోటీ పడుతున్న శాండర్స్, హిల్లరీ క్లింటన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు హిల్లరీదే పై చేయి ఉండగా ఇండియానా ఎన్నికల్లో శాండర్స్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఇండియానాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు 481573 ఓట్లు రాగా.. టెడ్ క్రూజ్ కు 336492, శాండర్స్ కు 259341, హిల్లరీ క్లింటన్ కు 227693 ఓట్లు వచ్చాయి. ఈ విజయం సాధించిన సందర్భంగా బిజినెస్ టైకూన్ అయిన ట్రంప్ తన కుటుంబ సభ్యులు బంధువుల కుటుంబ సభ్యులతో కలిసి వేదికపై నడుస్తూ మీడియాతో మాట్లాడారు. 'హిల్లరీ గొప్ప అధ్యక్షరాలు కాలేదు.. ఆమె మంచి అధ్యక్షురాలు కూడా కాలేదు, ఆమె ఒక బలహీనమైన అధ్యక్షురాలిగానే ఉంటారు. ఆమెకు వర్తకం అంటే అసలే అర్థం కాదు' అంటూ చురకలు అంటించారు. జూన్ 7న ట్రంప్ తన నామినేషన్ వేయనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి. -
సిక్కు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సిక్కు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. చంఢీగఢ్ కు చెందిన హర్మీత్ కౌర్ ధిల్లాన్ రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఎన్నికైంది. లాయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ధిల్లాన్.. గతంలో కాలిఫోర్నియా రిపబ్లికన్ పార్టీకి వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవిలో కొనసాగిన తొలి మహిళగానూ ఆమె అందరికీ సుపరిచితురాలు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు అమెరికాకు వలసవచ్చారు. నార్త్ కరోలినాలో ఆమె కుటుంబుం నివాసం ఉంటోంది. కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఈ కమిటీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. జూలై చివర్లో ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ విధానాలకు మరింత ముందుకు తీసుకెళ్తానని, మరో నాలుగేళ్లు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు హర్మీత్ కౌర్ ధిల్లాన్ తెలిపారు. -
'భారత్.. హాట్ పిస్టల్ లాంటిది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి భిన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, వియత్నాం, జపాన్ లతో పాటు మెక్సికో పై కూడా తనకు ఎలాంటి కోపం లేదంటూ తన వైఖరి మార్చుకున్నాడు. భారత్ పై కూడా తనకు కోపం లేదంటూనే తమ దేశ ఉద్యోగాలతో పాటు ఎన్నో విషయాల్లో అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. 'చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోంది. తాను అధికారంలోకి వస్తే చైనా అత్యాచారాలను కొనసాగనివ్వను' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తనకు ఏ దేశంపైనా విముఖత లేదంటూ కొత్తతరహా ప్రచారానికి తెరతీశాడు. పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్ లాగ భారత్ ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్ ను ఓ సందర్భంలో విమర్శించడం, మరోసారి తనకు ఆ దేశంపై కోపంగా ఉండటం లేదని అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇండియానాలో ప్రచారంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఒబామా ఆర్థిక, వ్యాపార విధానాల వల్ల తాను ప్రస్తావించిన దేశాలు తమ ఉద్యోగాలను కొల్లగట్టాయని పేర్కొన్నారు. 1990లో తలెత్తిన ఆర్థికమాంధ్యం కారణంగా మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు కోల్పోయారని తన ప్రసంగంలో వివరించారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి మా ఉద్యోగాలు కొల్లగొట్టడమే వాళ్ల పని అంటూ భారత్, చైనా, జపాన్ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. -
పాకిస్తాన్‌పై భారత్ సాయం కావాలి: ట్రంప్
వాషింగ్టన్: పూర్తి స్థాయి న్యూక్లియర్ వ్యవస్థ లేని పాకిస్థాన్ సమస్య గురించి ఇండియా తదితర దేశాల సాయాన్ని కోరుతున్నట్లు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియానా పోలీస్‌లోని టౌన్‌హాల్ లో మాట్లాడుతూ... పాకిస్తాన్ వంటి దేశాలతో ఎలా డీల్ చేస్తారనే ప్రశ్న అడగ్గా ట్రంప్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే నిజమైన సమస్య అని ఆయన అన్నారు. మొత్తం తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి. ఇది ఒకే ఒక్క పెద్ద సమస్య అని అన్నారు. పాకిస్తాన్‌తో కొద్దిపాటి సత్సంబంధాలు ఉన్నాయి. తాను వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌కు అమెరికా చాలాసార్లు ఆర్ధికంగా సాయం చేసింది. ఆ దేశ ప్రవర్తన మీద తర్వాతి పరిణామాలు, విపరిణామాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. భారత్, మరికొన్ని దేశాలు అమెరికాకు సాయం చేస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా చాలా దేశాల నుంచి ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సాయం చేసిందని, ఇక ముందు అలా జరగదని ట్రంప్ పేర్కొన్నారు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒబామా ప్రభుత్వం బిలియన్ డాలర్ల కొద్దీ పాక్‌కు సాయం చేయడాన్నిఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు 9/11 దాడుల తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన 25 బిలియన్ డాలర్ల సాయాన్ని ఆ దేశం తన మిలటరీ సారథ్యంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఊపిరి ఊది భారత్‌లో ప్రాణాంతక దాడులు చేసిందని అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన నేత మ్యాట్ సల్మాన్ వాదించారు. 180 మిలియన్ల జనాభా, 100కు పైగా న్యూక్లియర్ ఆయుధాలు, రాజకీయంగా వెనుకబడి టెర్రరిస్టులకు ఆవాసంగా మారిన పాకిస్తాన్ 2016-2017 సంవత్సరానికిగాను 742.2 మిలియన్ల యూఎస్ డాలర్ల సాయాన్ని కోరినట్టు, ఇవన్నీ దేశ భద్రతకే ఉపయోగపడాలని భారత్‌తో యుధ్దానికి కాదని మరో కాంగ్రెస్ నేత బ్రాడ్ షేర్మ్యాన్ చెప్పారు. -
ట్రంప్, హిల్లరీ దూకుడు
5 రాష్ట్రాల్లో ట్రంప్, 4 చోట్ల హిల్లరీ విజయం ఫిలడెల్ఫియా: డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించే దిశగా దూసుకు పోతున్నారు. మంగళవారం కీలక ప్రాంతాలైన మేరీల్యాండ్, కనెక్టికట్, డేలావేర్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ వెరసి ఐదు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఐదింటిలోనూ ట్రంప్ ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి విజయకేతనం ఎగురవే శారు. హిల్లరీ కూడా ఐదు రాష్ట్రాలకు గాను రోడ్ ఐలాండ్ మినహా నాలుగింటిలో గెలిచారు. కాగా, ఈ ఎన్నికలతో దాదాపు 950 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి కావల్సిన మేజిక్ నంబర్ 1,237కు చేరువవుతున్నారు. మరోవైపు హిల్లరీ కూడా డెమోక్రాటిక్ నామినేషన్ సాధించే దిశగా 2,141 మంది డెలిగేట్ల మద్దతుతో మేజిక్ నంబర్ 2,383కు చేరువలో ఉన్నారు. ట్రంప్‌పై ప్రియాంక చోప్రా మండిపాటు డోనాల్డ్ ట్రంప్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన టైమ్ 100 గాలాకు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక ఉగ్రవాదంపై మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించడం అనేది అనాగరిక చర్యగా ఆమె అభిప్రాయ పడ్డారు. -
అక్రమంగా అబార్షన్లు చేయించుకుంటే శిక్షించాలి: ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి మహిళలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విమర్శలకు దిగారు. అక్రమంగా అబార్షన్లు చేయించుకునే మహిళలను శిక్షించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అబార్షన్లు చేయించుకునే మహిళలకు ఏదో ఒక శిక్ష విధించాలని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్ మాటలు చాలా ఘోరమైనవని, ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సిగ్గుపడాలని పేర్కొన్నారు. కీలకమైన అంశాలపై తాను ఎక్కువగా ఆలోచించకుండా మాట్లాడతానని ట్రంప్ నిరూపించుకున్నారని రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న టెడ్ క్రూజ్ ఆరోపించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ట్రంప్ వెంటనే వివరణ ఇచ్చారు. అక్రమంగా అబార్షన్లు చేసిన డాక్టర్లు బాధ్యులని, మహిళలు కాదని స్పష్టం చేశారు. -
కీలక ప్రైమరీల్లోనూ వారిదే హవా
♦ ‘రెండో సూపర్ ట్యూస్డే’లో ట్రంప్, హిల్లరీ ఘనవిజయం ♦ ట్రంప్ దెబ్బకు రుబియో అవుట్ క్లీవ్‌లాండ్/వాషింగ్టన్: ‘రెండో సూపర్ ట్యూస్డే’గా అభివర్ణించిన కీలకమైన 5 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఘన విజయాలు సాధించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డె మోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ నామినేషన్ సాధించే దిశగా దూసుకుపోతున్నారు. తన సొంత రాష్ట్రం ఫ్లారిడాలో ట్రంప్ చేతిలో రుబియో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పోటీకి దూరం కావాల్సి వచ్చింది. ఐదు రాష్ట్రాల్లోనూ హిల్లరీ ముందంజ ఇలినాయ్, ఫ్లారిడా, మిస్సోరి, నార్త్ కరోలినా, ఒహయో రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో హిల్లరీ ఐదింటిలోనూ ముందంజలో నిలిచారు. కాకుంటే ఆమె ప్రత్యర్థి శాండర్స్ రెండు (ఇల్లినాయ్, మిస్సోరీ) రాష్ట్రాల్లో పోటాపోటీగా నిలిచారు. ఈ రెండు రాష్ట్రాల్లో హిల్లరీకి 51 శాతం, 50 శాతం ఓట్లు పోలవగా.. శాండర్స్‌కు రెండింటిలోనూ 49 శాతం ఓట్లు లభించాయి. డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌కు 4,763 మంది పార్టీ డెలిగేట్లలో 2,382 మంది మద్దతు అవసరం. అయితే తాజా ఫలితాలతో ఇప్పటికి హిల్లరీ 1,561 మంది, శాండర్స్ 800 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు. మూడు రాష్ట్రాల్లో ట్రంప్: ట్రంప్ మూడు (ఫ్లారిడా, ఇలినాయ్, నార్త్ కరోలినా) రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. మిస్సోరిలో మాత్రం క్రూజ్‌తో సమానంగా 41% ఓట్లు సాధించారు. ఒహయోలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఒహయో గవర్నర్ జాన్ కాషిష్ 47 శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో ట్రంప్ 661 మంది, క్రూజ్ 405 మంది, రుబియో 161, కాషిష్ 141 మంది డెలిగేట్ల మద్దతు సాధించినట్లయింది. రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌కు 1,237 మంది డెలిగేట్ల మద్దతు అవసరమన్న సంగతి తెలిసిందే. అల్లర్లు జరుగుతాయి: ట్రంప్ ట్రంప్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీగా తాను ఎన్నికవకపోతే అల్లర్లు చెలరేగుతాయని హెచ్చరించారు. పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన తనకు ఆ అవకాశం రాదని భావించవద్దని సీఎన్ఎన్ చానల్‌తో చెప్పారు. ప్రవాస భారతీయుడి విజయం వాషింగ్టన్: ఇలినాయ్‌లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రైమరీ ఎన్నికల్లో ప్రవాస భారతీయుడు రాజా కృష్ణమూర్తి ఘన విజయం సాధించారు. 8వ కాంగ్రెసేనియల్ జిల్లాలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన స్టేట్ సెనెటర్ మైక్ నోలాండ్పై భారీ విజయం సాధించారు. కృష్ణమూర్తికి 57 శాతం ఓట్లు రాగా నోలాండ్కు 29 శాతం, మరో పోటీదారు డెబ్ బుల్వింకెల్కు 13 శాతం ఓట్లు లభించాయి. ఢిల్లీలో జన్మించిన 43 ఏళ్ల కృష్ణమూర్తి న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా ప్రసిద్ధులు. -
సద్దాం హుస్సేన్ చాలా మంచోడు: ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, టెర్రరిస్టులను చంపడంలో చాలా మంచివాడని అమెరికన్ అధ్యక్షబరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున ముందు వరుసలో ఉన్న ట్రంప్ వ్యాఖ్యనించారు. సద్దాం విషయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఓహియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మట్లాడుతూ... ఇరాక్, ఇరాన్ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడాయిల్ పై ఆధిపత్యం చెలాయించాలని ఒబామా యత్నించారని ట్రంప్ మండిపడ్డారు. అందులో భాగంగానే ఇరాక్ పైకి అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. 2003లో ఇరాక్ పై అమెరికా పాల్పడిన చర్యలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నియంత్రణ కోసం ప్రయత్నించవద్దని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ కారణాల వల్లే ఐఎస్ఎస్ ఉద్భవించిందంటూ ఆరోపించారు. సద్దాం హుస్సేన్ గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు మంచివాడని ఎవరు చెప్పారు, కేవలం టెర్రరిస్టులను చంపడంలోనే ఆయన చాలా మంచివాడని తాను పేర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇరాక్ లో టెర్రరిజం రావడానికి గతంలో ఒబామా తీసుకున్న చర్యలే అని చెప్పాడు. -
ట్రంప్‌కు అగ్ని పరీక్ష
అమెరికన్ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ‘రెండో సూపర్ ట్యూస్డే’ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన నేతలంతా ‘రెండో సూపర్ ట్యూస్డే’ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలో తన ప్రత్యర్థులందరినీ వెనక్కినెట్టి దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అగ్నిపరీక్షే. మంగళవారం కీలకమైన ఐదు రాష్ట్రాలు.. ఫ్లారిడా, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, మిస్సోరి, ఒహయోల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 360 మంది ప్రతినిధులు ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి 2,472 మంది ప్రతినిధులున్నారు. అధ్యక్ష అభ్యర్థి కావాలంటే వీరిలో 1,237 మంది మద్దతు ఉండాలి.ఇప్పటికి ఈ రేసులో ట్రంప్ (460) ముందంజలో ఉండగా.. టెడ్ క్రుజ్ (367), రుబియో (153), ఒహయో గవర్నర్ జాన్ కాషిష్ (63) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యలతో ట్రంప్ ఇంటా, బయటా తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. పైగా ఇటీవల జరిగిన వాషింగ్టన్ డీసీ, వ్యోమింగ్ రాష్ట్రాల్లో ఆయన ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మిట్ రోమ్నీవంటి సీనియర్లు మిగతా అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ట్రంప్‌ను 1,237 మంది బలపరచకుండా అడ్డుకోగలిగితే జూలైలో జరిగే పార్టీ కన్వెన్షన్‌లో నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తారు. మెజారిటీ రిపబ్లికన్ నాయకులు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నందున ఆయన అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ముందంజలో ఉండటం కేవలం రిపబ్లికన్లనే కాదు అటు డెమోక్రాట్లను, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా కలవరపరుస్తోంది. తన వారసుడిగా ట్రంప్‌ను అమెరికన్లు ఎన్నుకోరని ఆయన విశ్వసిస్తున్నారు. అమెరికాకు వలస వచ్చినవారు ట్రంప్ విషయంలో ఆందోళనగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ట్రంప్ ర్యాలీల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అం దుకే ట్రంప్ కూడా భారతీయుల గురించి స్వరం మార్చారు. అమెరికా విద్యాలయా ల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తెలివైన వారని, వారిని వెనక్కి పంపరాదని, అలా పంపితే మనకే నష్టమని అన్నారు. -
ట్రంప్ షికాగో ర్యాలీ రద్దు
మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ కారణంగా.. వాషింగ్టన్: మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వల్ల డోనాల్డ్ ట్రంప్ తన షికాగో ప్రచార ర్యాలీని రద్దు చేసుకున్నారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ శుక్రవారం రాత్రి ఇలినాయ్ వర్సిటీలో జరిగే సభలో పాల్గొనాల్సి ఉండింది. అయితే అక్కడికి వందల సంఖ్యలో నిరసనకారులు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు, ట్రంప్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించి, ముష్టియుద్ధానికి దిగాయి. ఉద్రిక్తత పెరుగుతుందని గ్రహించిన ట్రంప్ అక్కడి పరిస్థితిపై పోలీసులతో చర్చించారు. వారి సూచన మేరకు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నిరసనల కారణంగా ఓ రాజకీయ ర్యాలీ రద్దవడం అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా నిపుణులు అభివర్ణించారు. ఈ గొడవలో సపన్ దేవ్ అనే భారతీయ జర్నలిస్టుకు కూడా గాయాల య్యాయి. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ గాయపడటం తనకు ఇష్టం లేదని, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ర్యాలీని రద్దు చేశానని అన్నారు. జర్నలిస్టుకు గాయంపై విచారం వ్యక్తం చేశారు. దేశంలోని ఆర్థిక సమస్యే ఆందోళనకు కారణంగా పేర్కొన్నారు. ఈ హింసకు ట్రంప్ కారణమంటూ రిపబ్లికన్ పార్టీకే చెందిన ఆయన ప్రత్యర్థులు టెడ్ క్రజ్, మార్క్ రుబియోలు ఆరోపించారు.