Robbery
-
చిత్తూరు ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు
చిత్తూరు, సాక్షి: పట్టణంలో జరిగిన దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ కోసం చేసిన ప్రయత్నమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బుధవారం వేకువ జామున కాల్పుల కలకలంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి ప్రవేశించిన దొంగల ముఠా.. ఆపై పోలీసులు రావడంతో తుపాకులతో హల్చల్ చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకోగలిగారు. అనంతరం నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రముఖ ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టాలతో బాగా అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో కర్ణాటక, ఉత్తర రాష్ట్రాలకు చెందిన మొత్తం ఆరుగురు దొంగలతో డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ ఉదయం డమ్మీ గన్స్, రబ్బరు బుల్లెట్లతో ఆ ముఠా గాంధీ రోడ్డులోని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సుబ్రహ్మణ్యం డమ్మీ గన్‌తో చంద్రశేఖర్‌ను బెదిరించాడు. అయితే.. చంద్రశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి దొంగలను లోపలే లాక్ చేయగలిగాడు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.ఆపై బయటకు వచ్చిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అది గమనించిన స్థానికులు వాళ్లపై దాడికి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ దొంగల నుంచి మూడు తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం..బిల్డింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది. డీఎస్సీ మణికంఠ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్, అక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల భవనాల నుంచి జనాలను ఖాళీ చేయించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పోలీసులు బలగాలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అది గమనించిన దొంగలు పారిపోయే యత్నం చేశారు. ఈ క్రమంలో శివారులో మరో దొంగను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. -
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.అరగంటకు పైగా షాపులోనే..దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా.. ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారుదీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు. ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు. -
యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!
తన కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్‌కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్మ్యాన్కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు. పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు. దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్మెంట్ వెలుగులోకి వచ్చింది. సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు. ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్‌కు సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది. సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది. -శ్రీరంగం కామేష్(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!) -
రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ
-
పోలీసులకే దొంగలు సవాల్
-
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. వరుస దోపిడీలతో కలకలం రేపుతున్న దొంగలు.. భారీగా నగదు, బంగారం చోరీ చేస్తూ ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని ఇళ్లనే ప్రధానంగా టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంట్లో రూ. 3 లక్షల విలువగల బంగారాన్ని, రూ. 45 వేల రూపాయల్ని దోచుకెళ్లారు దొంగలు. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రెండు ఇళ్లల్లో లక్షా 50 వేల నగదు చోరీ చేశారు దొంగలు.చందర్లపాడు మండలంప కాండ్రపాడులో ఇళ్లలో సైతం దొంగలు చోరీకి పాల్పడ్డారు. చిన్న వెంకటరెడ్డి ఇంటిలో రూ. 12 లక్షల విలువగల బంగారం, రూ. 15 వేల నగదు చోరీ చేశారు. మహేశ్వర్ రెడ్డి ఇంటిలో రూ. 1 లక్ష 50 వేలు విలువగల బంగారం చోరీ చేశారు. నందిగామ ప్రాంతంలో ఒక్కరోజే రూ. 20 లక్షల రూపాయల విలువగల బంగారం, నగదు చోరీ చేశారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. -
2 నిమిషాల్లో ఖాళీ..
-
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. మనీష్‌తో అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. నిందితుల చోరీలు వారం రోజుల క్రితం మొదలయ్యాయి.ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి మనీష్ అండ్ కో రూ.70 లక్షల రూపాయలు కాజేశారు. గురువారం బీదర్‌లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసి 93 లక్షలు ఎత్తుకెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్‌గంజ్ వచ్చిన మనీష్ కాల్పులు జరిపాడు. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులు ఉన్నాయి.గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. కేసు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టాడు. మనీష్‌ను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో మనీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. రాయ్‌పూర్ వెళ్లడానికి అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు. ఇదీ చదవండి: Saif Ali Khan Case: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..
మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్‌తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కాగా, నిన్న(గురువారం) బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. చోరీ కోసం వచ్చి దాడి!ముంబై పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అలీకాన్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్.. సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీనా.. కుట్రనా?సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు..పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌కి లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తి పోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం’ అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దిగ్భ్రాంతిసైఫ్ అలీఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్‌కు గురయ్యయానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దేవర 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025 విలన్‌గా రాణిస్తున్న సైఫ్ అలీఖాన్ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సైఫ్ అలీఖాన్..ఇటీవల నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భైరవ పాత్రను సైఫ్ పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత సైఫ్ పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 1991లో, సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, అమృతలకు ఇద్దరు పిల్లలు - సారా, ఇబ్రహీం. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ కరీనాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
దుకాణమంతా దోచేయండి
పెర్త్: ఆషాడం సేల్. సగం ధరకే పట్టుచీర. బట్టల దుకాణాల్లో తరచూ కనిపించే ప్రకటన ఇది. ఇక జనరిక్ మందుల దుకాణాల్లో 70 శాతం, 80 శాతం డిస్కౌంట్ బోర్డులను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా 100 శాతం డిస్కౌంట్. అంటే ఉచితంగా పట్టుకెళ్లండి అనే షాప్ మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి దుస్తుల దుకాణం కొద్దిసేపు తెరచి ఉంచితే మరు నిమిషంలో సరుకంతా మటుమాయమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. పెర్త్ నగరంలో స్ట్రీట్‌ఎక్స్ అనే దుస్తుల షోరూమ్ ఉంది. దాని యజమాని డేనియల్ బ్రాడ్షాకు కొత్త ఆలోచన వచ్చింది. ‘‘టీ–షర్ట్‌లను షాప్‌లో సిద్ధంగా ఉంచుతా. దోచేయండి’’అని యువతకు మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. అంతే ఇక. టీ–షర్ట్‌లను పట్టుకెళ్లేందుకు యువత పోటెత్తింది. గురువారం ఉదయం దుకాణం షట్టర్ పైకెత్తగానే యువతీయువకులు పరుగుపరుగున లోపలికి దూరేసి దొరికింది పట్టుకెళ్లారు. ఎగబడి కలబడి టీ–షర్ట్‌లను ఎగరేసుకుపోయారు. తొక్కిసలాటలో దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా ఒక యువకుడు హెల్మెట్, మోకాళ్లు, మోచేతులకు ప్యాడ్లు ధరించిమరీ జనంలోకి దూకాడు. తోపులాటలో చిన్నపాటి గీసుకుపోవడం లాంటి దెబ్బలు తప్ప చెప్పుకోదగ్గ, ఆస్పత్రిలో చేరేంత స్థాయి గాయాలు ఎవరికీ కాలేదు. గతంలో సైతం షాప్ యజమాని ఒక భారీ ట్రక్కు నిండా దుస్తులు ఇలాగే ఉచితంగా దోచేసే ఆఫర్ ఇచ్చాడని అక్కడికొచి్చన ఒకావిడ చెప్పింది. గురువారం దుకాణంలో దాదాపు 400 టీ–షర్ట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. -
అయ్యో పాపం అని పని ఇస్తే
-
HYD: బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీ
సాక్షి,హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్‌లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.దోపిిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
-
భలే చోరీ చేసినవ్ అవ్వ..
-
బాపట్ల బీచ్ లో బాదుడే బాదుడు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్గేట్లో డబ్బులు వసూలుచేసేవారు. ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.వేలంపాటకు మంగళం..నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే!
ఓ మహిళా తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది. ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని.. వారితో పోరాడింది. దొంగల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చివరికి దొంగలు చేసేందేంలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది. మన్దీప్ కౌర్ అనే మహిళ తన భర్త జగ్గీత్సింగ్, పిల్లలతో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం మన్దీప్ కౌర్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు.మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరుగెత్తింది. అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్‌ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు. కానీ కౌర్ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది. చివరికి డోర్‌కు తాళం వేసి.. పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది.ఈ దృశ్యాలు అన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం, డోర్ పెట్టి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగట్టిగా అరుస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్ కూడా చేసింది. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆమె కొడుకు, కూతురు అటు ఇటు కంగారుగా చూడటం కనిపిస్తుంది. చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सीसीटीवी में कैद हुई मनप्रीत की बहादुरी, तीन चोरों को अकेले ही घर में घुसने से रोका पंजाब के अमृतसर जिले के वेरका इलाके की महिला मनप्रीत की बहादुरी की चर्चा सोशल मीडिया पर सभी कर रहे हैं। मनप्रीत ने अकेले अपने साहस के दम पर तीन चोरों को अपने घर में घुसने से रोक दिया। pic.twitter.com/YKXFgOVDZ0— Sharad Kumar Tripathi (@officesharad) October 2, 2024 మహిళా ధైర్య సాహాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఏకే సోహి తెలిపారు. జగ్గీత్ సింగ్ నగల వ్యాపారి కాగా..దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వీడెవండీ బాబు... తాగిన మత్తులో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
నిర్మల్‌లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో దోపిడీకి యత్నం
-
జర్మనీ పర్యాటకుణ్ణి దోచుకున్న పాక్ పోలీసులు
పాకిస్తాన్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్లో జరిగిన ఓ లూటీ సంచలనంగా మారింది.జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ పోన్‌తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్‌పై పాకిస్తాన్లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే..
సాక్షి, ఖమ్మం జిల్లా: దొంగల బీభత్సం సృష్టించిన షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్‌లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం.బి3,బి4,బి5 ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్‌లో ఆందోళన దిగారు..రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు
ప్రముఖ నటికి ఫారెన్ ట్రిప్‌లో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుని, కొన్నిరోజులు ఎంజాయ్ చేద్దామని టూర్‌కి వెళ్తే దొంగలు మొత్తం దోచేశారు. పాస్పోర్ట్స్తో పాటు డబ్బులు, విలువైన వస్తువుల్ని పట్టపగలే దొంగతనం చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటి?యే హై మొహబత్తీన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. ప్రస్తుతం పలు రియాలిటీ షోల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2016లో తోటి నటుడు వివేక దహియాని పెళ్లి చేసుకున్న ఈమె.. తాజాగా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు యూరప్ వెళ్లారు. స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) అయితే ఫ్లోరెన్స్ అనే ఊరిలో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఉండేందుకు ఇల్లు చూసే క్రమంలోనే ఓ చోటుకి వెళ్లి వచ్చే లోపు కారులో ఉన్న పాస్‌పోర్ట్, విలువైన వస్తువులు, డబ్బులని దొంగలు దోచుకున్నారు. దీంతో నటి దివ్యాంకతో పాటు ఆమె భర్త రోడ్డున పడ్డారు. సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.ప్రస్తుతం తాత్కాలిక పాస్పోర్ట్స్ పొందే ప్రయత్నంలో దివ్యాంక-ఆమె భర్త ఉన్నారు. దొంగతనం జరిగిన రోజు ఎంబసీకి వెళ్లగా అది మూసి ఉంది. తాజాగా అక్కడికి వెళ్లి తమ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తిరిగి వీళ్లిద్దరూ స్వదేశానికి తిరిగి రావొచ్చని సమాచారం.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?) -
నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు...
-
NH 65 యమ డేంజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత కీలక రహదారుల్లో ఒకటైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నం. 65 డేంజర్ మార్గ్‌గా మారిపోయింది. హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న దీనిపై అనునిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ప్రయాణంలో అలసిపోయిన కొందరు రహదారి పక్కన, సర్వీస్ రోడ్లలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఇలాంటి వారితోపాటు లారీ డ్రైవర్లకు ఎర వేసి దోచుకునే ముఠాలతో ఈ రహదారి యమడేంజర్‌గా మారిపోయింది. గడిచిన నెల రోజుల్లో ఈ తరహాకు చెందిన నాలుగు ఉదంతాలు చోటుచేసుకోగా... నిందితులు ఇప్పటివరకు చిక్కలేదు. వీరి కోసం నల్లగొండ జిల్లా, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ 65పై ఆగే ప్రయాణికులకు పోలీసులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.గత నెలలో కట్టంగూర్ పరిధిలో⇒ హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని కట్టంగూర్ సమీపంలో సరీ్వస్ రోడ్డులో వాహనం ఆపి విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి దోచుకున్నారు. ⇒హైవేపై ఉన్న మరో ప్రాంతంలో సెల్‌ఫోన్ తస్కరణకు గురైంది. నిద్రిస్తున్న వ్యక్తికి ఏమాత్రం తెలియకుండా కారు డోర్ తెరిచి ఫోన్ దొంగిలించారు.ఈ నెలలో నార్కట్‌పల్లి, చిట్యాలలో⇒ ఏపీ లింగోటం దగ్గర టార్చ్లైట్లు వేసి నిల్చున్న ఇద్దరు మహిళల్ని చూసి ఆకర్షితుడైన లారీ డ్రైవర్ ఎల్లేష్ వాహనం ఆపి వారితో మాటలు కలిపాడు. అప్పటివరకు చీకటిలో మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు అదును చూసుకుని అతడిపై విరుచుకుపడ్డారు. కాళ్లు, చేతులు కట్టేసి లారీలోని టూల్ బాక్సులో ఉన్న రూ.22 వేల నగదు తీసుకుని నలుగురూ ఉడాయించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఓ కుటుంబం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద విశ్రాంతి కోసం ఆగింది. ముసుగులు ధరించి వచి్చన ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు. ఆ శబ్ధానికి నిద్రలేచిన బాధితులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.ఎక్కువగా వ్యక్తిగత వాహనాలే...⇒ ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల్లో అత్యధికం వ్యక్తిగత వాహనాలైన కార్లు, జీపులు వంటి తేలికపాటివే ఉంటాయి. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌తోపాటు మధ్యలో ఉన్న కోదాడ, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పగటిపూట కంటే రాత్రి వేళల్లోనే ఈ బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సమయాభావం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతోపాటు అనివార్య కారణాల నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు.ఈ రెండు నగరాల మధ్య దూరం 277 కిలోమీటర్లే కావడంతో వాహనం నడిపే వాళ్లు అలసిపోవడం అనేది చాలా తక్కువ. హైదరాబాద్, విజయవాడల కంటే దూరమైన ప్రాంతాల నుంచి వీటి మీదుగా ప్రయాణించే వాళ్లు రాత్రి వేళల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా రహదారి పక్కన, ట్రక్ లే బైలో, సరీ్వస్ రోడ్లపై నిద్రిస్తున్న వారే దొంగలకు టార్గెట్‌గా మారుతున్నారు. లైట్ వేశారంటే స్కెచ్ వేసినట్లే..వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్కులు తదితరాలు నడిపే వారూ బాధితులుగా మారిన సందర్భాలున్నాయి. అనునిత్యం హైవేలపై సంచరించే వీరికి ఏయే రూట్లలో, ఏయే ప్రాంతాలు సురక్షితం? ఎక్కడ వాహనాలు ఆపుకోవాలి? ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అయితే ఈ కమర్షియల్ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు వారి బలహీనతల కారణంగా దొంగల బారినపడుతున్నారు. కమర్షియల్ వాహనాల డ్రైవర్లు ఉద్యోగనిమిత్తం దీర్ఘకాలం ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటారు.ఇలాంటి వారిని ఆకర్షించడానికే అనేక ప్రాంతాల్లో హైవే వ్యభిచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ తరహా బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకునే ముఠాలు ఎన్‌హెచ్ 65లో రంగంలోకి దిగాయి. రాత్రివేళల్లో రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రాంతాల్లో నక్కి ఉండే దొంగలు... తమ భాగస్వాములైన మహిళలు టార్చిలైట్లు లేదా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించేలా పథకం వేస్తారు. వీటిని చూసి ఆకర్షితులై వచ్చే వాణిజ్య వాహనాల డ్రైవర్లపై దాడి చేసి దోచుకుంటున్నారు. ఈ లోపాలే ప్రధాన కారణం..హైవేపై జరుగుతున్న ఉదంతాల్లో అనేకం పోలీసుల వరకు రావట్లేదు. భారీ సొత్తు పోగొట్టుకోవడమో, గాయపడటమో జరిగితేనే ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న ఉదంతాలు, బలహీనతల కారణంగా చోటు చేసుకున్నవి బయటకు రావట్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ హైవేపై గస్తీ కోసం ప్రత్యేకంగా వాహనాలు ఉండేవి. ఆపై తేలికపాటి వాహనాల స్థానంలో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బృందం చొప్పున విధులు నిర్వర్తించేది.కొన్నాళ్లు ఈ గస్తీ బృందాలు కనుమరుగయ్యాయి. జాతీయ రహదారి వెంట ఉన్న శాంతిభద్రతల విభాగం ఠాణాలకు చెందిన అధికారులు, సిబ్బందే గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్లలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత నేపథ్యంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ సాధ్యం కావట్లేదు. ఈ హైవేపై వెలిమినేడు వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ, గస్తీ బాధ్యతల్ని వీరికే అప్పగించాలనే ప్రతిపాదన ఏళ్లుగా ఫైళ్లకే పరిమితమైంది. బస్ బేలు, ట్రక్ లే బైలో ఎక్కడా సరైన వెలుతురు, నిఘా లేకపోవడమూ దుండగులకు కలిసొస్తోంది.ఈ చర్యలు తీసుకోవాలి...⇒ వాహనచోదకులు కేవలం టోల్‌ప్లాజాల వద్ద, దాబాలు, హోటళ్ల సమీపంలో మాత్రమే తమ వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.⇒ నిర్మానుష్య ప్రాంతాలు, ట్రక్ లే బైల్లో నిలపాల్సి వస్తే నిరీ్ణత సంఖ్యలో వాహనాలున్న చోటనే ఆపుకోవాలి.⇒ ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను రాత్రి వేళల్లో హైవేలపై మోహరించాలి. ఒక్కో వాహనానికి నిరీ్ణత ప్రాంతం కేటాయించి పెట్రోలింగ్ చేయించాలి. ⇒మఫ్టీ పోలీసులను కార్లలో ఉంచడం ద్వారా ఆపరేషన్లు చేపట్టాలి. ఇలా వీళ్లు ప్రయాణికుల్లా వ్యవహరిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది.⇒జాతీయ రహదారుల వెంట ఉన్న బస్ బేలు, ట్రక్ లే బైల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంచాలి.⇒ఎన్‌హెచ్ 65లో అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే వీటిలో అత్యధికం మరమ్మతులకు గురయ్యాయి. వీటిని తక్షణం వినియోగంలోకి తేవాలి.నిఘా ఉన్న చోటే పార్క్ చేసుకోండి ఎన్‌హెచ్ 65పై చోరీలతోపాటు స్నాచింగ్స్ కూడా నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ విస్తృతం చేయడంతోపాటు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ప్రయాణికులు సైతం తమ వాహనాలను సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లోనే పార్క్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆథరైజ్డ్ హోటళ్లలోనే బస చేయాలి. కొత్త వారు ఎవరైనా సమీపంలోకి వస్తున్నా, మాట్లాడాలని ప్రయతి్నస్తున్నా అప్రమత్తం కావాలి.ఏదైనా నేరం బారినపడితే వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితులు భయాందోళనలకు లోనై గందరగోళానికి గురికాకూడదు. నేరం చేసిన వ్యక్తి ధరించిన దుస్తులు, అతడి వేషభాషలతోపాటు అతడు ఏదైనా వాహనంపై వస్తే దాని నంబర్ తదితరాలు గమనించి నోట్ చేసుకోవాలి. ఎంత త్వరగా పోలీసులకు సమాచారమిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. –ఎం.రాజేశ్ చంద్ర, డీసీపీ, యాదాద్రి -
మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ఆ రోజు ఏం జరిగిందంటే?ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. -
USA: సీక్రెట్ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు
కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్లో డెమొక్రాట్ల ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టస్టిన్ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు. అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు. ఈ సమయంలో ఆ సీక్రెట్ ఏజెంట్ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని, ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మాస్టర్ ప్లాన్.. రెండు రైళ్లలో దోపిడీ
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం
ప్రముఖ నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులు కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సదరు పోలీసులకు ఫిర్యాదు చేసి, చోరీ గురించి అసలు నిజాలు బయటపెట్టింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎంత మొత్తం దోపీడికి గురైంది?మరాఠీ నటి శ్వేత షిండే.. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నిర్మాతగానూ పలు సీరియల్స్ తీస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి ఈమె నివాసముంటోంది. అయితే జూన్ 3న ఎవరూ ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బు కూడా దొంగతనం చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో పనిలో భాగంగా శ్వేత, ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)దొంగతనం జరిగిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి శ్వేత షిండే ఫిర్యాదు చేసింది. 10 గ్రాముల బంగారంతో పాటు చాలా డబ్బు దొంగతనానికి గురైందని పేర్కొంది. అయితే డబ్బులు మొత్తం ఎంతనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ప్రముఖ నటి ఇంట్లోనే దొంగలు పడటం అనేది చాలామంది అవాక్కయ్యేలా చేసింది.శ్వేత వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో సందీప్ భన్సాలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. 2016లో నిర్మాతగా మారి అప్పటినుంచి యాక్టింగ్ కాస్త పక్కనబెట్టి పలు సీరియల్స్, సినిమాలు తీస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో చోరీ జరగడంతో ఈమె వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్) -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..
లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు. తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘The Sleeping Thief’: A Person has been arrested from UP’s Mathura for stealing from passengers sleeping on railway stations. The CCTV Footage shows the cunning modus operandi of the thief where he pretends to sleep beside a traveller & swiftly pick pockets the mobile phone. pic.twitter.com/6OVSYydwaZ — Tanishq Punjabi (@tanishqq9) April 10, 2024 -
ఆ ధైర్యసాహసాలకు సలాం కొట్టాల్సిందే (ఫొటోలు)
-
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
బంగారం షాపులో దోపిడీ..సీసీటీవీ విజువల్స్
-
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్‌లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బెదిరించి రూ.16 లక్షల సైబర్ మోసం
-
తిరుపతి ఎస్ఎస్ జ్యువెలరీ చోరీ కేసులో పురోగతి
-
అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట
అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలోగల ఫుల్లెర్టన్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ విజయ్ వాలి, డాక్టర్ జ్యోతిక వాలి దంపతులపై వారి ఇంటి సమీపంలోనే దాడి జరిగింది. ఇద్దరు దుండగులు వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఉదంతమంతా వారి ఇంటి వద్ద నున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను వారి కుమార్తె ఫేస్బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో.. ఒక ఆగంతకునికి డాక్టర్ విజయ్‌కు మధ్య వాగ్వాదం జరగడం.. అతను డాక్టర్ విజయ్‌ని బలవంతంగా నెట్టడం కనిపిస్తుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం విజయ్, అతని భార్య తమ ఇంటి ప్రాంగణంలోకి వచ్చాక, అతని భార్య జ్యోతిక కారులో నుంచి విలువైన వస్తువులను బయటకు తీశారు. ఇంతలో అక్కడికి వచ్చిన దుండుగుల్లో ఒకడు డాక్టర్ విజయ్‌పై దాడి చేయబోతుండగా, విజయ్ తన భర్యతో ఆ వస్తువులను దాచాలంటూ గట్టిగా అరిచి చెప్పాడు. భర్త మాటలు విన్నంతనే జ్యోతిక తన భర్తకు సహాయం చేయడానికి ప్రయత్నించగా, ఆమెపై కూడా ఆ ఇద్దరు దుండగులు దాడి చేసి, ఆమె వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి జ్యోతిక మీడియాకు తెలియజేస్తూ తాను తన భర్తను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక ఆగంతకుడు తనపై దాడి చేసి, తన దగ్గరున్న పర్సు లాక్కున్నాడని తెలిపారు. తాను సహాయం కోసం పెద్దగా అరిచానని జ్యోతిక పేర్కొన్నారు. తన తల్లి నుంచి పర్సును లాక్కోవాలని ఓ దొంగ స్పానిష్‌లో తన సహచరుడికి సూచించాడని ఆ దంపతుల కుమార్తె డాక్టర్ ప్రియాంక వలీ ఫేస్బుక్ పోస్ట్‌లో వివరించారు. ఈ దోపిడీకి ముందు దొంగలు 25 కిలోమీటర్ల దూరం వరకు తమ తల్లిదండ్రుల కారును అనుసరించారని ప్రియాంక పేర్కొన్నారు. చోరీకి గురైన వస్తువులలో తమ కుటుంబ వారసత్వ నగలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటిని తమ పూర్వీకుల గుర్తుగా చూసుకుంటున్నామని ప్రియాంక పేర్కొన్నారు. కాగా బాధితుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫుల్లెర్టన్ పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: గ్రహశకలాలకు ‘గాలం’! -
బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. వజ్రాలు, బంగారం మాయం
హైదరాబాద్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 8లోని వైట్‌హౌస్ సెలెస్టియా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కొడాలి ధనలక్ష్మి అక్టోబర్ 16వ తేదీన మంగోలియా దేశం విజిట్చేసేందుకు బ్యాగులో మూడు వజ్రాలు పొదిగిన గాజులు, ఒక బంగారు గాజు, మరో వాచీని సర్దుకుంది. ఆ బ్యాగు తీసుకొని మంగోలియా యాత్రకు వెళ్లిది. అక్కడికి చేరిన తర్వాత బ్యాగు తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ. 10 లక్షల వజ్రాభరణాలు, వాచ్ కనిపించలేదు. ఈ నెల 24వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చూడగా ఎక్కడా కనిపించలేదు. బ్యాంకు లాకర్లో కూడా దొరకలేదు. అయితే ఇంట్లో పని చేసే శ్రీలత అనే పనిమనిషి తాను మంగోలియా వెళ్లే సమయంలో బ్యాగును సర్దిందని ఆ సమయంలో వాటిని తస్కరించి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ!
ఖమ్మం: ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గంగారం 15వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోరం లక్ష్మణ్‌రావు, నాగకుమారి దంపతులు బేతుపల్లిలోని గౌండ్లబజార్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్తుపల్లిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. కిచెన్ తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని రూ.12 లక్షల విలువ చేసే 18 తులాల బంగారంతో పాటు రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి ఎస్ఐ కుశకుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఇంట్లో కూడా.. గ్రామంలోని పటంబజార్లో దొడ్డా శ్రీనివాసరావు ఇంట్లోకి ముసుగులు ధరించిన దుండగులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూంలోని కబోర్డులో దుస్తులు, వస్తువులను కిందపడేసి వెతికినా వారికి ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. ఇంటి యజమాని అమెరికా వెళ్లినట్లు తెలిసింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
IDBI బ్యాంకులో రూ.46 లక్షలు చోరీ
-
తన తాగుడు కోసం కూతురి ఇంట్లోనే దొంగతనం చేసిన తండ్రి!
ప్రొద్దుటూరు క్రైం : అతను తాగుడు కోసం స్వయానా బిడ్డ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డబ్బు, సెల్‌ఫోన్‌తో పాటు మూడు నెలల పసికందును ఎత్తుకెళ్లాడు. మనిషి తాగుడుకు బానిసైతే ఏ స్థాయికి దిగజారుతాడన్న దానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. వివరాలిలా.. గురుప్రియ, నాగునాయక్ దంపతులు ప్రొద్దుటూరులోని సూపర్‌బజార్ రోడ్డులో నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. గురుప్రియ తండ్రి గురుశేఖర్ అధికంగా అప్పులు చేసి సొంత ఊళ్లో ఉండలేక కొన్ని రోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. పసికందును తండ్రికి అప్పగించి శుక్రవారం గురుప్రియ పని కోసం బయటికి వెళ్లింది. ఆమె ఇంటికి వచ్చే సరికి పాపతో పాటు తండ్రి కూడా కనిపించలేదు. ఇంట్లో డబ్బు, సెల్‌ఫోన్ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె వీధిలోనూ, బంధువుల ఇళ్లలో వెతికింది. అయినా వారి జాడ కనిపించలేదు. దీంతో కంగారు పడిన గురుప్రియ దంపతులు త్రీ టౌన్ పోలీస్‌ష్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక సాయంతో రాజంపేటలో ఉన్న గురుశేఖర్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందును తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. మద్యానికి బానిసై డబ్బు, సెల్‌ఫోన్‌ను గురుశేఖర్ తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పసికందును ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే ప్రమాదమనే ఉద్దేశంతో అతను మనవరాలిని ఎత్తుకొని వెళ్లాడని పోలీసు అధికారులు తెలిపారు. తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించిన త్రీ టౌన్ పోలీసులకు గురుప్రియ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 36 గంటల్లోనే కేసును ఛేదించిన త్రీ టౌన్ సీఐ వెంకటరమణ, సిబ్బంది శ్రీనివాసులు, తిరుమల, దస్తగిరి, పక్కీరప్ప, శివానంద, హోంగార్డు సురేంద్రయాదవ్‌లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించారు. -
థక్ థక్ గ్యాంగ్: కాలు తొక్కారు.. అద్దం దించండి
ఢిల్లీలో ఒంటరిగా కారు నడుపుతున్న స్త్రీల వస్తువుల చోరీకి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఆ గ్యాంగ్‌ను థక్‌థక్ గ్యాంగ్ అంటారు. వీరు ఎలా చోరీ చేస్తారు? ఒంటరి స్త్రీలు కారు ప్రయాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విస్తృతంగా వాహనాలు నడుపుతున్న స్త్రీలూ... బహుపరాక్. థక్‌థక్ గ్యాంగ్ ఎక్కడైనా ఉండొచ్చు. సంఘటన 1: నిర్మానుష్య ప్రాంతం అక్కర్లేదు. బాగా రద్దీ ఉన్న రోడ్డు మీదే. ట్రాఫిక్ సమయంలోనే. మీరు కారు మెల్లగా పోనిస్తుంటారు. ఒక మనిషి మీ కారు ముందు నుంచి దాటుతాడు. ఆ తర్వాత వేగంగా వెనక్కు వచ్చి మీ పక్క అద్దం మీద ‘టక్ టక్’మని వేలితో కొట్టి అద్దం దించమని కోపంగా అంటాడు. ‘నా కాలు తొక్కావు. అద్దం దించు’ అని హడావిడి చేస్తాడు. మీరు కంగారులో అద్దం దించుతారు. అంతే! మీ పక్క సీటులో మీరు ఉంచుకున్న హ్యాండ్‌బ్యాగ్, పర్స్, ల్యాప్‌టాప్ తీసుకుని తుర్రుమంటాడు. మీరు కారు దిగి వెంటాడ లేరు. ట్రాఫిక్‌లో ఉంటారు. ఇదీ ‘టక్ టక్’ లేదా ‘థక్‌థక్ గ్యాంగ్’ నేరం చేసే తీరు. సంఘటన 2: ఇలాగే ట్రాఫిక్‌లో మీరు వెళుతుంటారు. మెల్లగా వెళుతున్న మీ కారు వెనుక టైరు ఏదో ఎక్కి దిగినట్టుగా అవుతుంది. వెంటనే ఒక మనిషి డ్రైవింగ్ సీట్ దగ్గరకు వచ్చి అద్దం మీద బాది ‘నా కాలు తొక్కావ్’ అంటాడు. మీరు ఇంజన్ ఆఫ్ చేసినా, కారు పక్కకు తీసి ఆ మనిషితో వాదనకు దిగినా, మరో మనిషి మీ కారు వెనుక సీటులో ఉన్న వస్తువు తీసుకుని ఉడాయిస్తాడు. మీరు స్లోగా వెళుతున్నప్పుడు వెనుక టైరు కింద రాయి పెట్టి కాలు తొక్కిన భావన కలిగిస్తారు. ఇంకా ఏం చేస్తారు?: మీ కారు బైక్ మీద వెంబడించి ఇంజన్ లీక్ అవుతుంది అంటారు. అలా అనిపించడానికి వారే వెనుక కొంత ఆయిల్ వేస్తారు. మిమ్మల్ని అలెర్ట్ చేసిన వారు మిమ్మల్ని దాటి వెళ్లిపోతారు. కాని మీరు కారు ఆపి ఇంజన్ ఆయిల్‌ను చెక్ చేస్తుంటే ఇంకో బ్యాచ్ వచ్చి డోర్లు తీసి దోచుకుని పోతుంది. కారు ఎక్కేటప్పుడు కొన్ని నోట్లు కింద పడేసి మీ డబ్బు పడింది అంటారు. మీరు నోట్లు ఏరుకుంటుంటే కారులో ఉన్న వస్తువులు పట్టుకెళతారు. బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని చెప్తారు. కారు ఆపితే అంతే సంగతులు. కొన్నిసార్లు క్యాటపల్ట్ (క్యాట్‌బాల్)తో రాయి విసిరి అద్దం మీద కొడతారు. టప్పున అద్దం తాకితే మీరు కంగారులో కారు ఆపి దిగుతారు. వారు చేతివాటం చూపుతారు. ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ థక్ థక్ గ్యాంగ్ చాలా సులువుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలి? అద్దాలు ఎప్పుడూ ఎత్తి పెట్టాలి ► ఎవరు వచ్చి వాదనకు దిగినా అద్దం దించకుండా పోలీసులకు ఫోన్ చేయాలి. ఇంజన్ ఆఫ్ చేయకూడదు. చేస్తే డోర్లు తెరుచుకుంటాయి. ► మీ పక్క సీటులో, వెనుక సీటులో విలువైన ఏ వస్తువులూ కనిపించేలా పెట్టకూడదు. ► ఏదైనా రాయి వచ్చి అద్దాన్ని కొట్టినా వెంటనే ఆపకుండా బాగా దూరం వెళ్లి ఎవరూ వెంబడించడం లేదని గమనించుకుని ఆపాలి. ► ముఖ్యంగా ఫ్లై ఓవర్లు దిగేప్పుడు, ట్రాఫిక్ ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. ఫ్లై ఓవర్ మీద కారు పక్కకు తీసి మీరు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఫ్లై ఓవర్ల మీద జాగ్రత్తగా ఉండాలి. -
25 కేజీల బంగారం దొంగతనం.. ఎక్కడంటే?
ప్రముఖ బంగారం స్టోర్ నుంచి గ్రాముల్లో కాదు ఏకంగా కేజీల్లో బంగారాన్ని దోచేసిన సంఘటన మంగళవారం తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కోయంబత్తూరులోని జోస్ అలుక్కాస్ సంస్థకు చెందిన గాంధీపురం బ్రాంచ్‌లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో వారు ఏకంగా 25 కేజీల బంగారు ఆభరణాలను దోచేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి షాపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం ఎప్పటిలాగే షాపు మూసిన ఉద్యోగులు తెల్లవారిన తర్వాత షోరూమ్ తెరిచి చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. షోరూమ్ వెనుకవైపు దొంగలు ఏసీ వెంటిలేటర్ ద్వారా స్టోర్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దాంతో వెంటనే కంపెనీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. VIDEO | Gold ornaments weighing up to 25 kg looted from Jos Alukkas & Sons in Gandhipuram, Coimbatore. Police are at the spot and investigating the matter. More details are awaited. pic.twitter.com/J1z19L9XFp — Press Trust of India (@PTI_News) November 28, 2023 ప్రస్తుతం కోయంబత్తూరు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దొంగలించబడిన బంగారం విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 200 సవర్ల బంగారం మాయం కావటంపై పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. జోస్‌అలుక్కాస్‌ను 1964లో అలుక్కా వర్గీస్ స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ స్టోర్లున్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5500 కోట్లతో 100 స్టోర్లు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీకి ఏటా దాదాపు రూ.9000 కోట్ల రెవెన్యూ ఉందని సమాచారం. Approximately 150-200 sovereigns of gold jewellery robbed at Jos Alukkas showroom in Coimbatore in the early hours today. The police have formed five special teams to nab the accused. As per CCTV visuals, only one person is seen inside the store during the scene. @IndianExpress pic.twitter.com/nVyvKjpidp — Janardhan Koushik (@koushiktweets) November 28, 2023 -
నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!
ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒకామె.. లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. ఇప్పుడీ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పనిమనిషి కాదని, దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: 'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!) ఇంతకీ ఏం జరిగింది? మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఇంటిపనులు చూసుకోవడంతో పాటు ఇతడి తండ్రి బాగోగులని చూసుకోవడం వాళ్ల పని. కానీ ఇందులో ఉష(41) అని ఆమె మాత్రం 5-6 నెలల నుంచి పుష్కర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈమెనే.. పుష్కర్ ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షలు డబ్బులు, 60 వేల విదేశీ కరెన్సీని.. అక్టోబరు 22న దొంగతనం చేసింది. కానీ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం యజమానికి తిరిగొచ్చేసింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న.. బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది. బీరువాలో బంగారం ఉన్నా సరే దాన్ని పరిశీలించి చూడగా, అది నకిలీది అని తేలింది. పనిమనిషి ఉషనే.. రూ.10 లక్షలు విలువ చేసే బంగారంతో ఆల్రెడీ పరార్ అయిపోయినట్లు బయటపడింది. దీంతో పుష్కర్, అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడీ ఇదంతా వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
దొంగలు బాబోయ్ దొంగలు..
-
దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు
తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు. పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు సెప్టెంబర్ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు. మెయిన్ ఆయిల్ లైన్‌కు డ్రీల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
HYD: 21 కిలోల గణేషుడి లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈనెల 18న వినాయక చవితితో మొదలైన నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం గణేషుడిని 28న నిమజ్జనం చేయనున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఝాన్సీ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లారు. అనంతరం ఆ లడ్డూని పంచుకొని తినేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజీ దృశ్యాలు పరీక్షించగా.. మైనర్ విద్యార్థులు చోరికి పాల్పడినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసిన స్టూడెంట్స్ pic.twitter.com/0Q4jYIQ6Q1 — Telugu Scribe (@TeluguScribe) September 24, 2023 -
ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులు అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరుచూ రావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం చూపించారు. అది కూడా ప్రయాణికుడికి సంబంధించిన బ్యాగ్ నుంచి డబ్బులు, వస్తువులు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. అయితే జూన్ 29న జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకి చ్చింది. అసలేం జరిగిందంటే.. మియామి ఎయిర్‌పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ప్రయాణికుల సామాన్లను భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ స్కానర్ మెషిన్‌పై ఉంచిన బ్యాగ్‌లో నుంచి 600 డాలర్లను కాజేశారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఎవరికి కనపడకుండా మెల్లగా ఆ డబ్బులను బ్యాగ్ నుంచి కాజేసి తన జేబులో వేసుకున్నారు. డబ్బులతోపాటు ఇతర వస్తులను సైతం దొంగిలించాడు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash from passengers’ bags at Miami airport. pic.twitter.com/LhFW9yNRNV — Mike Sington (@MikeSington) September 13, 2023 ఈ దృశ్యాలన్నీ ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సెక్యురిటీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితులను టీఎస్ఏ సిబ్బంది 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా గుర్తించారు. వారిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులు కలిసి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రోజు దాదాపు వెయ్యి డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురిని స్క్రీనింగ్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని, చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించామని టీఎస్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
నగల వ్యాపారిని కొట్టి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. కేజీ పైగా బంగారం
పశ్చిమ గోదావరి: బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. వారిని విచక్షణారహితంగా కొట్టి కేజీ పైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన మంగళవారం రాత్రి తణుకులో చోటుచేసుకుంది. బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తణుకు నరేంద్ర సెంటర్ వద్ద బంగారు నగల దుకాణాల వీధిలో రేణుక జ్యూయలరీ పేరుతో నామ్‌దేవ్ వ్యాపారం చేస్తున్నారు. షాపు మేడపైన రెండో అంతస్తులో నామ్‌దేవ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సెలవు కావడంతో షాపులన్నీ మూసి ఉన్నాయి. ఇదే అదునుగా ఐదుగురు దుండగులు సుమారు 7.30 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించి నేరుగా నామ్‌దేవ్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు శ్రేయ, చైత్ర, చేతన ట్యూషన్‌కు వెళ్లగా ఇంట్లో నామ్‌దేవ్, అతని భార్య సవిత, కుమారుడు చేతన్ ఉన్నారు. దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి తమతో పాటు తెచ్చుకున్న టేపుతో వారి కాళ్లు, చేతులు కట్టేశారు. ప్రతిఘటించిన నామ్‌దేవ్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. బెడ్రూమ్లో ఉన్న లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి కిలోకి పైగా తాకట్టు బంగారం, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసినట్టు బాధితులు చెబుతున్నారు. దుండగులు కారులో పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తేరుకున్న నామ్‌దేవ్ తప్పించుకుని ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ రాజ్‌కుమార్, సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు పట్టణంలోని ప్రధాన కూడలి నరేంద్ర సెంటర్లో భారీ దోపిడీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలో ఐదుగురు పాల్గొనగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా టోల్గేట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. దుండగుల్లో ఒక వ్యక్తి గతంలో నామ్‌దేవ్ వద్ద పనిచేసిన సూరజ్కుమార్గా భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్
ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్‌లో బ్యూటీషియన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్‌లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్‌కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు. క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్‌బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు సమీక్షల్లో దొంగలు చోరీల్లో
వరంగల్ క్రైం/రామన్నపేట: చోరీలు, నేరాలను ఎలా కట్టడి చేయాలా..అని పోలీసులు ఓ పక్కన సమీక్షిస్తుండగా.. మరోపక్క అదే సమయంలో దొంగలు స్వైర విహారం చేసి దర్జాగా దోచుకుపోయిన ఘటనలు వరంగల్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నాయి. పోలీస్ కమిషనర్ రంగనాథ్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష జరుపుతుండగా అదే సమయంలో దొంగలు మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోని ఆరు ఫ్లాట్లలో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 178 తులాల బంగారం, కొంత నగదు, వెండి అపహరించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి నయీంనగర్‌లోని కల్లెడ అపార్ట్మెంట్లో సుమారు 12 తులాలు, కిషనపురలోని లహరి అపార్ట్మెంట్లో 14 తులాలు, మారుతీ వాసవి అపార్ట్మెంట్లో 60 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ అపార్ట్మెంట్లో ప్రకాశ్‌రెడ్డికి చెందిన 401 ప్లాట్‌లో తాళం పగులగొట్టి 14 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేశారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రీ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో 52 తులాల బంగారంతోపాటు సుమారు రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. దాని పక్కనే ఉన్న వద్దిరాజు అపార్ట్మెంట్లో 39 తులాల బంగారం, రూ.22వేల నగదు అపహరించారు. ముఖాలకు మాస్క్ ధరించి చోరీ చేసిన తరువాత దుండగులు దర్జాగా వెళ్తున్న దృశ్యాలు ఆయా అపార్ట్మెంట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఒక కారులో వచ్చినట్లు తెలిసింది.వరంగల్ క్రైం/రామన్నపేట -
నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ..
రోజూ మాదిరిగానే ఆమె తన అత్యవసర పనుల కోసం బయటకు వచ్చింది. నగరంలోని రోడ్లు బిజీగా ఉన్నాయి. ఎంతో కష్టమీద ఆమెకు ఆటో దొరికింది. ఆమె ఆటోలో కూర్చుంది. ట్రాఫిక్ అధికంగా ఉన్న కారణంగా ఆటో మెల్లగా ముందుకు కదులుతోంది. ఇంతలో ఆమెకు రోడ్డుపై కాషాయవస్త్రాలు ధరించిన ఇద్దరు సాధువులు కనిపించారు. వారిద్దరూ ఆమె ప్రయాణిస్తున్న ఆటో దగ్గరకు వచ్చి.. ‘అమ్మా దానం చేయండి.. మీకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. ఆమె ఆ సాధువులను చూసి, తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి, కొంత డబ్బు ఇవ్వాలనుకుంది. అయితే ఇంతలో వారు తమ దగ్గరున్న జోలెలో నుంచి ఒక పామును బయటకు తీశారు. ఆ పామును ఆ మహిళ ముఖం దగ్గరకు తీసుకువచ్చారు. పామును చూడగానే ఆమె హడలెత్తిపోయింది. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీనిని గమనించిన ఆ సాధువులు ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు. దానిలో రూ. 2000 ఉన్నాయి. ‘భగవంతుడు మీకు మేలు చేస్తాడు’ అంటూ ఆ బ్యాగుతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తరహా మోసాలకు పాల్పడే గ్యాంగ్ ఢిల్లీలో ఉంటూ గురుగ్రామ్‌లో జనాలను లూటీ చేస్తోంది. ఈ గ్యాంగ్‌లోని వ్యక్తులు సాధువుల వేషం ధరించి, జనానికి ఉండే భక్తి సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. బైక్, కారు, బస్సులలో ప్రయాణిస్తున్నవారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంటోంది. వీరు ముందుగా జనాలను డబ్బులు అడుగుతారు. ఎదుటివారు పర్సు తీయగానే వారిపైకి పామును వదులుతారు. వారు భయపడగానే వారి దగ్గరున్న సొమ్ము లాక్కుని పాముతో సహా పారిపోతుంటారు. కొద్ది రోజుల క్రితం గుర్గ్రామ్కుచెందిన రాధావాణి అనే మహిళ తనకు జరిగిన ఈ విధమైన మోసం గురించి సెక్టార్-52 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాబాల వేషంలో తన దగ్గర నుంచి రూ.2000 లాక్కున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ మోసగాళ్లను పట్టుకున్నారు. ఇది కూడా చదవండి: చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో! -
న్యూడ్ కాల్‌తో.. మాజీ సీఎం ఓఎస్డీకి వల..
కర్ణాటక: ఆయనో పెద్ద అధికారి, పైగా మాజీ ముఖ్యమంత్రి వద్ద పనిచేస్తున్నారు, కానీ న్యూడ్ కాల్లో చిక్కుకుపోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మాజీ సీఎం ఓఎస్డీ హనీట్రాప్‌లో ఇరుక్కున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు... బెంగళూరు మల్లేశ్వరం నివాసి ఓ మాజీ సీఎం వద్ద ప్రత్యేకాధికారిగా ఉన్నారు. పని మీద మహారాష్ట్ర నాసిక్ కు వెళ్లి అక్కడ అతిథి గృహంలో బసచేశారు. గత నెల 12 తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి వస్తుండగా గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ మాట్లాడగా అపరిచిత మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. వారే కాల్ కట్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం మరో నంబర్‌నుంచి కాల్చేసి మహేంద్రసింగ్ అని పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ కాల్ చేశారని మహిళ ఫిర్యాదు చేసిందని, వీడియోను యూట్యూట్, ఫేస్బుక్, వాట్సాప్‌లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. లేదంటే డబ్బివ్వాలని అడిగాడు, రత్నేశ్కుమార్ పేరుతో రెండు బ్యాంకు అకౌంట్లు పంపించి నగదు జమ చేయాలన్నాడు. ఓఎస్డీ మొత్తం రూ.4.80 లక్షలు పంపించాడు. మళ్లీ రూ.7.2 లక్షలకు డిమాండ్ చేయడంతో బాధితుడు బెంగళూరుకు చేరుకుని పోలీస్ కమిషనర్ దయానంద్‌ను కలిసి వివరించి సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
చందానగర్ నగల దుకాణంలో భారీ చోరీ..
హైదరాబాద్: చందానగర్‌లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి -
వైన్స్‌లో చోరీ..! ఎందుకీ తేడా? పలు అనుమానాలకు దారితీస్తున్న చోరీ..!!
ఆదిలాబాద్: జాతీయ రహదారికి కూతవేటు దూరాన భోరజ్ సమీపంలో ఉన్న వైన్స్ షాపులో శనివారం రాత్రి జరిగిన చోరీలో కొత్త కోణం బయటపడింది. దాదాపు 26 పెట్టెల మద్యం, రూ.70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలు సేకరించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులు చెప్పిన సొమ్ముకు, పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సొమ్ముకు పొత్తన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.3 లక్షల వరకు చోరీకి గురైనట్లు నిర్వాహకులు చెప్పారు. రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కాగా, చోరీ సొత్తుపై స్పష్టత కొరవడింది. ఎందుకీ తేడా? వైన్స్షాపులో చోరీని గుర్తించి నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.2.30 లక్షల విలువ చేసే మద్యం, రూ.70 వేల నగదును ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వైన్స్ షాపును పరిశీలించారు. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైందని, నిర్వాహకులు అబద్దం చెబుతున్నారని అనధికారికంగా వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చోరీకి గురైన సొమ్మును నిర్వాహకులు ఎక్కువగా చేసి చూపుతున్నారని కేసు నమోదు చేయడానికి వెనక ముందు చేశారు. చోరీ విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. రూ.62 వేల విలువ చేసే మద్యంతోపాటు మరో రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు మాత్రం రూ.3లక్షల వరకు చోరీ అయిందని చెప్పడం గమనార్హం. ఏదీ నిజం ? వైన్స్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించడం అనే పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. రూ.3 లక్షల వరకు సొత్తు చోరీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోద చేస్తే, అంత మొత్తం రికవరీ చూపించడం కష్టం ఉంటుందని పోలీసులే కావాలనే రూ.70 వేలు మాత్రమే అని నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నిర్వాహకుల నిజాయితీపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఊరికి బయట ఉన్న వైన్స్‌లో రాత్రి వేళ కౌంటర్లో రూ.70 వేల వరకు నగదు ఉంచాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత డబ్బులు, మద్యం సీసాలతో నిండిన షాపులో కాపలాగా ఎవరిని ఎందుకు నియమించలేదు? రూ.3 లక్షలు చోరీకి గురైతే ఎఫ్ఐఆర్లో రూ. 70వేలు అని పోలీసులు రాస్తే, నిర్వాహకులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నలకు సమాధానాలు లేవు. అసలు సీసీ టీవీలో కనిపిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? చోరీకి గురైన సొత్తు ఎంత? నిర్వాహకులు, పోలీసుల చెబుతున్నది ఎవరిది నిజం? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ టీవీల్లో రికార్డ్ అయిన దొంగలు దొరకాలి. ఈ విషయమై సీఐ కోల నరేశ్‌ను వివరణ కోరగా, కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
కూరగాయల దుకాణంలో చోరీ...కొట్టేసింది ?
-
ఒంటరి మహిళలే లక్ష్యంగా!
నిజామాబాద్: ఒంటరి మహిళలే లక్ష్యంగా జి ల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ద్విచక్రవాహనాలపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. అంతేగాకుండా రద్దీ ఎక్కువగా ఉండే అంగడి లాంటి ప్రాంతాల్లో సైతం చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని గొలుసులను సైతం చోరీ చేస్తున్నారు. అడ్రస్ అడగినట్లు వచ్చి చైన్ లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్‌లో ఓ మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. కరువైన నిఘా.. పోలీసులు నిఘా లోపించడంతో చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. సీసీ పుటేజీలను ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ లేకపోవడంతో అవి సక్రమంగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచి చైన్ స్నాచర్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ నెల 18న నిజామాబాద్‌లోని మహాలక్ష్మి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ► పదిహేను రోజుల క్రితం ఆర్మూర్‌లోని కుమ్మరిగల్లీకి చెందిన మీనాక్షి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ► రెండు నెలల క్రితం ఆర్మూర్‌లోని తిరుమల కాలనీలో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల చైన్‌ను లాక్కెళ్లారు. అనుమానం వస్తే స్థానికులకు చెప్పాలి ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఎవరైన బైక్‌పై మెల్లగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికంగా ఉండే వారికి విషయం చెప్పాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు డయల్ 100కు కాల్ చేయాలి. – కిరణ్‌కుమార్, ఏసీపీ, నిజామాబాద్ -
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
దొంగలు దొరికారు !
వికారాబాద్: పనిచేసిన యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ వ్యక్తి.. ఇంట్లో భారీగా నగదు ఉందనే పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల తాండూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.19లక్షలను రికవరీ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యాపారి ఎండీ వాజీద్ ఇటీవల ప్లాట్ విక్రయించగా రూ. 20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇంట్లో పెట్టి ఈ నెల 14న హైదరాబాద్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు. తరువాతి రోజు ఇంట్లో చోరీ జరిగింది. రూ. 20లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తెలిసిన వ్యక్తి పనే.. వాజీద్ వద్ద అబూబాకర్ ఖురేషి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. ఇంట్లో డబ్బు ఉందన్న సమాచారంతో దొంగతానికి ప్లాన్ చేశాడు. తన పెద్దమ్మ కొడుకు అబూ సోఫియాన్ ఖురేషికి విషయాన్ని చెప్పాడు. అదే కాలనీలో ఉంటున్న ఖలీల్, తౌసిఫ్, దీపక్ అలియాస్ కిట్టుతో కలసి ప్లాన్ వేశాడు. ఈ నెల 15న రాత్రి అబూబాకర్, ఖలీల్‌లు రాడ్‌తో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. మిగిలిన ముగ్గురు బయటనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. బీరువాలో ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. అందులో రూ.లక్షను మొదట అందరూ పంచుకున్నారు. మిగిలిన రూ. 19 లక్షలను యాదిరెడ్డి చౌక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దాచి పెట్టారు. తరువాత వచ్చి నగదును తీసుకెళ్లి పంచుకుందామనుకున్నారు. సీసీ కెమెరాలే పట్టించాయి బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, పలు ముఖ్య కూడళ్లలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే మాణిక్ నగర్ వద్ద ఉన్న కెమెరాలో అబూబాకర్ ఖురేషి అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబూ సోఫియాన్ ఖురేషిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసు ఛేదనకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. 72 గంటల్లోనే నిందితుల అరెస్టులో కీలకపాత్ర వహించిన కానిస్టేబుళ్లు అమ్జద్, శివ, సాయికుమార్, షబీల్అహ్మద్లను ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆటో, బైక్‌ను సీజ్ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
సికింద్రాబాద్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
-
టమాటాతో కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు.. అంతలోనే ఊహించని షాక్!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దేశవ్యాప్తంగా టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేజీ రూ.200తో విక్రయిస్తున్నారు. దీంతో ఆ పంటపై దొంగల కన్ను పడింది. రాత్రికి రాత్రే పంటను దోచుకెళ్తున్నారు. దొడ్డ తాలూకా లక్ష్మిదేవపురం గ్రామంలో రైతు జగదీష్ తన ఎకరా భూమిలో టమాట సాగు చేశాడు. మంచి దిగుబడితోపాటు ధరలు పెరగడంతో తన కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోకి చొరబడి టమాట కాయలు తెంపుకొని ఉడాయించారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన జగదీష్ చెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యాడు. చోరీకి గురైన టమాట విలువ రూ.1.50లక్షలు చేస్తుందని రైతు తెలిపాడు. చదవండి: Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. నగర చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు -
సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం.. అసలు విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!
వాషింగ్టన్: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు. మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు -
అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం
బికనేర్: అవినీతి, అక్రమాలకు మరో రూపమే కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణమే కాంగ్రెస్ అన్నారు. ప్రజాగ్రహంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగిపోవడం ఖాయమని చెప్పారు. విద్వేష బజార్లో ప్రేమ దుకాణం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసే వ్యాఖ్యలపై ఆయన ఈ సెటైర్ వేశారు. శనివారం ప్రధాని బికనేర్ జిల్లా నొరంగ్దేశార్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేరుగా మారిందని ఆరోపించారు. ‘మహిళలపై నేరాల్లో, అత్యాచార ఘటనల్లో రాజస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ రక్షకులే వేటగాళ్లుగా మారారు. హత్యలు, అత్యాచార నిందితులను రక్షించుకోవడంలో మొత్తం ప్రభుత్వం నిమగ్నమై ఉంది’అని ప్రధాని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, దేశాన్ని గుల్ల చేస్తుంది. అధికారం నుంచి దిగిపోతే విమర్శలతో దేశం ప్రతిష్టను మంటగలుపుతుంది. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లి దేశం పరువు తీస్తారు’ అని ఆరోపించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే కొందరు మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసి సొంతిళ్లకు మకాం మార్చినట్లు నాకు సమాచారమొచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేతలకు మాత్రమే నమ్మకం కుదిరింది’ అని ఎద్దేవా చేశారు. -
కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ
మార్కెట్లో కూరగాయాల ధరలు ప్రజలను ఠారేత్తిస్తున్నాయి. ఏకంగా సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకాయి ధరలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ.120 పైనే పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అడ్డగోలు ధరలతో టమాట దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. మార్కెట్లో, దుకాణాల్లో నిల్వ చేసిన వాటితోపాటు ఏకంగా తోటలో నుంచి సైతం టమాటలను సైతం చోరీ అవుతున్నాయి. టమాటా తోటకు ఓ రైతు ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఓ రైతు చేనులో నుంచి రూ. 2.5 లక్షల విలువైన టమాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని సోమనహళ్లి గ్రామం మంగళవారం జరిగింది. చదవండి: 12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్ అప్పు తీసుకొని మరీ తనకున్న రెండు ఎకరాల భూమిలో టమాట పంట సాగు చేస్తున్నట్లు మహిళా రైతు ధరణి తెలిపింది. ప్రస్తుతం టమాట ధర బెంగుళూరులో కిలో రూ.120 పలుకుతుండటంతో టమాట పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ మంగళవారం రాత్రే టమాట తోటలో దొంగలు పడ్డారని, 50-60 బ్యాగుల టమాటాను దొంగిలించారని వాపోయింది. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక మిగిలిన పంటనుకూడా దొంగలు ధ్వంసం చేశారని ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హలబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4. A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr — ANI (@ANI) July 6, 2023 కాగా గడిచిన నెలలో ఎండల తీవ్రతోపాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది పోయింది. ఇతరప్రాంతాల నుంచి రవాణా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాట ధర 129 రూపాయలు ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లో రూ. 150కు చేరింది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీకి అందించాలని కోరుతున్నారు. -
గుంటూరు కొత్తపేట మంగళభావి వీధిలో భారీ చోరీ
-
వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..
ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్‌లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE — The Best (@Figensport) June 27, 2023 వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
షాప్‌లో వృద్ధుడి నుంచి రూ.లక్ష దోచుకెళ్లిన కేటుగాళ్లు.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్‌తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు. ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్‌లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్‌ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్ ముందే బైక్ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్‌తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video: 70-Year-Old Delhi Man Robbed Of ₹ 1 Lakh At Gunpoint https://t.co/FAi8GKfL0P pic.twitter.com/2EIPqvClY5 — NDTV (@ndtv) June 27, 2023 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి -
దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్ వేసిన దొంగలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు! దీంతో ఆ జంట సరాసరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్‌పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్‌లో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్‌లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. #WATCH | In a bizarre turn of events, two drunk men who were trying to rob a Delhi couple at gunpoint, handed Rs 100 to them instead. They did so when they realised that the couple only had Rs 20 with them. pic.twitter.com/9BpIp0JEFs — Daily Excelsior (@DailyExcelsior1) June 26, 2023 -
రెచ్చిపోయిన దొంగలు.. టన్నెల్లో కారును అడ్డగించి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయారు. 1.5 కిలోమీటర్ల పొడవు ఉండే ప్రగతి మైదాన్ టన్నెల్లో గన్‌తో బెదిరించి దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని గుర్‌గ్రామ్ వెళుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి టన్నెల్ మధ్య భాగంలో నడి రోడ్డుపై కారును అడ్డగించారు. గన్‌తో బెదిరిపంచి రూ.2 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకుపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi. If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ — Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023 ఇదీ చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనాకు చేతకాకపోతే తమకు ఆ బాధ్యతను అప్పగించవలసిందిగా కోరారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచినట్లు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! రద్దీ రోడ్డులో స్కూటీపై ఏడుగురు పిల్లలతో ప్రయాణం..వీడియో వైరల్.. -
తప్పతాగి..దొంగకు తాళాలిచ్చి.. ఆ తర్వాత..
గురుగ్రామ్: మద్యం సేవించిన తర్వాత చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తారో? ఎందుకు చేస్తారో? తెలియదు. ప్రపంచాన్నే మరిచేంత మైకంలో ఉంటారు. మత్తు నుంచి బయటకు రాగానే అసలు విషయం తెలుసుకుని తలదించుకుంటారు. పూటుగా తాగి గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. రాత్రి తప్పతాగి.. తన కారును దొంగకు అప్పగించాడు. ఉదయం అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. గురగ్రామ్‌కు చెందిన వ్యక్తి అమిత్ ప్రకాశ్(30). పరిమితికి మించి మద్యం సేవించిన తర్వాత మళ్లీ మద్యం కొనుగోలుకు వెళ్లారు. కేవలం రూ.2000 ఉండే వైన్ బాటిల్‌కు రూ.20 వేలు ఇచ్చాడు. అయితే..బార్ యజమాని తనకు రిటన్లో రూ.18 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కారులో కూర్చుని వైన్ తాగుతుండగా అపరిచిత వ్యక్తి వచ్చి వైన్ షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు కలిసి కారులో సుభాష్ చౌక్ వరకు వెళ్లినట్లు తెలిపాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ అపరిచితుడు కారులోంచి దిగిపోమ్మని అడగగానే.. కారు తనదేనని మరిచి దిగిపోయినట్లు పోలీసులకు తెలిపాడు. కారు దిగిపోగానే అపరిచిత వ్యక్తి కారును అపహరించినట్లు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు తన రూ.18000, ల్యాప్‌టాప్ కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం.. -
లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్ సెక్యూరిటీస్ కార్యాలయం నుంచి సుమారు రూ.7 కోట్ల నగదును ఆగంతకులు ఎత్తుకుపోయారు. న్యూ రాజ్‌గురు నగర్లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 10 మంది ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. భద్రతా సిబ్బందిని తుపాకీతో బెదిరించి, గదిలో బంధించారు. వారి సెల్ఫోన్లను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు. చోరీ సమాచారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులకు అందింది. లుధియానా పోలీస్ కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధు ఘటనాస్థలిని పరిశీలించారు. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్పూర్ దాఖా వద్ద దొంగలు వదిలేసి వెళ్లారని, అందులో రెండు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ‘సీఎంఎస్ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగింది. లాకర్లలో భద్రపరచాల్సి ఉండగా నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు తేలింది. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎంత నగదు పోయిందనే విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. -
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ
-
విజయవాడలో దొంగల బీభత్సం
-
ఆలయంలో చోరీ
-
చీమకుర్తిలో పట్టపగలే దొంగతనం
-
భాగ్యనగరంలో బంగారం చోరీ.. హీరో సూర్యా గ్యాంగ్ మూవీ లెవెల్లో..
హైదరాబాద్:సూర్య గ్యాంగ్ మూవీ చూశారుగా?. ఐటీ అధికారులుగా వెళ్లి.. నిమిషాల్లో కోట్ల సంపదను దోచేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఐటీ అధికారులుగా గోల్డ్ షాపులోకి వెళ్లి 1.7కిలోల బంగారాన్ని నిమిషాల్లోనే దర్జాగా ఎత్తుకెళ్లారు కెటుగాళ్లు. మోండా మార్కెట్లో ఓ బంగారం షాపు రోజూలాగే ఉదయం ప్రారంభమైంది. యజమాని వేరే ఊరికి వెళ్లిన కారణంగా దగ్గరి బంధువు షాప్‌ను చూసుకుంటున్నారు. కస్టమర్లు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఈ క్రమంలోనే సూటు.. బూటు ధరించిన కొంతమంది షాపులోకి ప్రవేశించి హడావిడి చేశారు. ఐటీ అధికారలమంటూ.. ఫేక్ ఐడీలను చూపించి దుకాణంలోని స్టాఫ్‌ను పక్కకు కూర్చోబెట్టారు. అధికారుల లాగే స్వరం పెంచి షాపులోని బంగారం అమ్మకాల అకౌంట్ బుక్కులను చెక్ చేశారు. ట్యాక్స్ చెల్లించలేదంటూ 1.7కిలోల బంగారం బిస్కెట్లను దుండగులు తీసుకువెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఇతర షాపు ఓనర్లకు ఫోన్ చేసి కనుక్కోగా అసలు విషయం బయటపడింది. ఐటీ అధికారులు నేరుగా షాపులోకి వచ్చేయరని, ముందు నోటీసులు ఇస్తారని ఇతర షాపు యజమానులు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సికింద్రబాద్ నుంచి ఉప్పల్ మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి:టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..: -
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది! -
ఐఫోన్ కోసం ఎన్ని తిప్పలో.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వీడియో వైరల్!
ఐఫోన్ క్రేజ్ మామూలుగా ఉండదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఆ ఫోన్ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు. ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే.. అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్ స్టోర్‌కి వెళ్లి నచ్చిన మోడల్ ఐఫోన్ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka — Crazy Clips (@crazyclipsonly) May 17, 2023 -
సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం
ఇటీవల సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్‌ల ఇళ్లలో ఈమధ్య భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. చదవండి: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి? ఈనెల 16న తన డైమెండ్ ఇయరింగ్స్ పోయాయని గమనించిన అర్పితా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ. 5 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఇంటిదొంగల పనే అని కనిపెట్టారు. అర్పితాఖాన్ ఇంట్లో 11మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో సందీప్ హెగ్డే అనే పనిమనిషి మాత్రం దొంగతనం జరిగిన రోజు నుంచీ కనిపించకుండా పోయాడు. అతడి ఇంట్లో పోలీసులు సోదా చేయగా అర్పితా ఖాన్ చెవిపోగులు దొరికాయాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సందీప్ హెగ్డేను అరెస్ట్ చేశారు. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట -
జూబ్లీహిల్స్ దోపిడి కేసులో అగంతకుడి కోసం పోలీసుల గాలింపు
-
టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆగంతకుడు బ్లాక్పాయింట్లో ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారును దొంగలించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ABC) వివరాల వెల్లడించింది. కిర్గియోస్ తల్లి నొర్లాలియా టెస్లా కారులో షాపింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె కారుకు ఒక దుండగుడు అడ్డు వచ్చాడు. కారు ఆపి ప్రశ్నించేలోపే దుండగుడు నొర్లాలియా తలకు తుపాకీ గురిపెట్టాడు. టెస్లా కారు తాళాలు ఇవ్వమని బెదిరించాడు. దీంతో నొర్లాలియా భయపడిపోయి పక్కకు తప్పుకోవడంతో సదరు దుండగుడు కారుతో ఉడాయించాడు. ఆ తర్వాత నొర్లాలియా పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కిర్గియోస్ తల్లిని కలిసి జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే తన ఫోన్లో ఉన్న యాప్ సాయంతో కారు ఎక్కడుందో కనుక్కోగలిగాడు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకొని.. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. The mother of Aussie tennis champion @NickKyrgios was left terrified after she was carjacked at gunpoint in Canberra, the thief stole her son's @Tesla. But in a fighting twist, Kyrgios then used the car's technology to stop the offender in his tracks. https://t.co/ywidXMpIlD pic.twitter.com/mXh0f2Ga0M — 7NEWS Sydney (@7NewsSydney) May 2, 2023 చదవండి: Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో.. -
పోలీసుల అదుపులో ఐదుగురు వ్యక్తులు
-
విజయవాడలో బయటపడ్డ టీడీపీ నేతల దారుణాలు
-
దొంగతనం చేసిన సొత్తును కరిగించి అమ్ముకునేందుకు సిద్దమైన టీడీపీ నేతలు
-
విజయవాడ చోరీ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు
-
నెల్లూరు: కావలిలో భారీ చోరీ
-
ఎయిర్పోర్ట్ నుంచే గోల్డ్ కంటెయినర్ ఎత్తుకెళ్లారు
అట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచే బంగారంతో కూడిన ఓ కంటెయినర్‌ను మాయం చేశారు దుండగులు. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులో 14.8 మిలియన్ డాలర్ల విలువైన బంగారంతో పాటు అదనంగా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కూడిన కంటెయినర్ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చోటుకి దీనిని తరలించారు. అక్కడి నుంచి దానిని గమ్యస్థానానికి భద్రంగా చేర్చాలని ఏర్పాట్లు చేయబోయారు. ఇంతలోనే అది మాయం అయ్యింది. ఈ కంటెయినర్ ఎవరికి చెందిందనే వివరాలను, ఎక్కడికి చేరుకోవాలనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికాలో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న భారీ దోపిడీ ఇది. అలాగే.. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని అభివర్ణిస్తున్నారు అక్కడి అధికారులు. ఐదున్నర స్క్వేర్ ఫీట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ కంటెయినర్‌ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు పీల్ రీజినల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ దుయివెస్టెయిన్ ప్రకటించారు. ఇది లోకల్ గ్యాంగ్‌ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. అది ఇంకా కెనడాలోనే ఉందా? లేదా కంటెయినర్‌ను దేశం దాటించారా? అనే విషయంపైనా పోలీసులకు స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. గతంలోనూ కెనడా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనలే రెండు, మూడు జరిగాయి కూడా. -
హైదరాబాద్ లో పట్టాపగలు చోరీకి పాల్పడిన చిన్నారి..
-
యాక్సిస్ బ్యాంకు అధికారులకు టోకరా వేసిన కేటుగాడు
-
యేసుదాస్ కొడుకు ఇంట్లో చోరీ.. బంగారు, వజ్రాభరణాలు మాయం
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ యేసుదాసు ఇంట్లో భారీగా చోరీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ నివాసంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై విజయ్ భార్య దర్శన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నారు. -
దొంగతనం చేయడానికి ఐశ్వర్యే కారణం.. పనిమనిషి షాకింగ్ స్టేట్మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఈమెను అరెస్ట్ చేసి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ విస్తుపోయే సమాధానం ఇచ్చింది. 'నేను ఐశ్వర్య ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాను. ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. అయితే ఐశ్వర్య దగ్గర బోలెడు డబ్బులు ఉన్నా నాకు రూ. 30వేల జీతమే ఇచ్చేవారు. ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టా. మొదట చిన్నచిన్న వస్తువులు దొంగిలించేదాన్ని. కానీ దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశాను' అంటూ విచారణలో ఈశ్వరి చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఐశ్వర్య చెప్పినదాని కంటే ఈశ్వరి ఇంట్లో ఇంకా ఎక్కవ బంగారమే దొరికింది. ఆమె ఐశ్వర్య ఇంటితో పాటు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో కూడా పనిచేసేదట. దీంతో ఆ నగలు అక్కడ దొంగిలించిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐశ్వర్య అనుమానమే నిజమైంది.. ఇంటి పనివాళ్లే దొంగలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఇటీవల దుండగులు దొంగతనానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐశ్వర్య అనుమానించినట్టుగానే ఆమె ఇంటి పనివాళ్లే ఈ చోరీ చేసినట్లు వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరగగా ఈ ఘటనలో 60 లక్షలు విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో ఐశ్వర్య తేనాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసివిచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య నివాసంలో దాదాపు 18 ఏళ్లుగా పని చేస్తున్న మండవేలికి చెందిన ఈశ్వరి(46) మరో మహిళ లక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్‌తో పాటు మరో ముగ్గురు ఈ దొంగతనానికి తెగబడ్డారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు అనేక కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన నటి.. దంపతులమని నమ్మించి మరో వ్యక్తితో కలిసి గది అద్దెకు.. అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. కాగా తన ఇంట్లో చోరి జరగడంతో పోలీసుల ఆశ్రయించిన ఐశ్వర్య తన ఇంటి పనివాళ్లైన ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకటేశన్‌తో సహా ముగ్గురిపై అనుమానం ఉందని, తరచూ వారు తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లవారని.. లాకర్ కీలు కూడా ఎక్కడ ఉన్నాయో వారికి తెలుసని ఆమె ఫిర్యాదు పేర్కొంది. కాగా ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. -
షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంట్లో చోరి జరిగిందని, లక్షలు విలువ చేసే నగలు, వజ్రాలు దొంగతనానికి గురైనట్లు చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు లాకర్లో ఉన్న నగదు పోవడంతో ఐశ్వర్య తన ఇంట్లో పని చేసే ముగ్గురు సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ తేనాం పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ చోరికి గురైన వాటిలో డైమండ్ సెట్, ఆలయ అభరణాలలో అన్‌కట్ డైమండ్స్, పురాతన బంగారు ముక్కలు, నవరత్నం సెట్లు, బంగారు, వజ్రాలతో కూడిన రెండు నెక్ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్, సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ ఉన్నాయని పేర్కొంది. వీటి విలువ సుమారు 3.6లక్షల ఉంటుందని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. కానీ వాస్తవంగా వాటి విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు.. ఆ తర్వాత నుంచి వాటిని బయటకు తీయలేదని ఫిర్యాదు పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని తన తండ్రి రజనీకాంత్ పోయేస్ గార్డెన్ నివాసంలోని లాకర్లో ఈ నగదు భద్రపరిచనట్లు ఆమె చెప్పారు. అయితే లాకర్ కీ మాత్రం తన దగ్గరే ఉందని, ప్రస్తుతం తాను నివసిస్తున్న సెయింట్ మేరిస్ రోడ్ అపార్టుమెంటులోని పర్సనల్ స్టీల్ అల్మారాలో లాకర్ కీ ఉంచినట్లు ఐశ్వర్య తెలిపారు. దీని సమాచారం తన పనివాళ్లకే తెలుసని, వారే నగదు దొంగతనం చేసుంటారని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆయుధాలతో వచ్చి నగల దుకాణం చోరీ.. అంతా క్షణాల్లోనే..
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ రేమన్లో జరిగిన ఓ దొంగతనం అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడుగురు ఆగంతుకులు ఆయుధాలతో వెళ్లి సిటి సెంటర్ బిషాప్ రాంఛ్ షాపింగ్ సెంటర్ నగల దుకాణాన్ని దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు తలపై తుపాకీ గురిపెట్టి జ్యువెల్లరీ షాపులోకి చొరబడ్డారు. అందరు డోర్స్ లాక్ చేసుకోవాలని సిబ్బందిని బెదిరించారు. అనంతరం సుత్తెతో డిస్ప్లే కేస్ అద్దాలు పగలగొట్టి నగలన్నీ ఎత్తుకెళ్లారు. క్షణాల్లో చోరీని పూర్తి చేసి ఎంచక్కా రెండు కార్లలో పారిపోయారు. ఇలాంటి చోరీ ఘటనను జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి భయాందోళన వ్యక్తం చేశాడు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని, రెండు కార్లు ముందే పార్కు చేసుకుని చోరీ అనంతరం వాటిలో పారిపోయారని పేర్కొన్నాడు. గుంపుగా వచ్చి దుకాణంలోకి సెకన్లలో చొరబడ్డారని వివరించాడు. ఈ సమయంలో తాను పక్కనే రెస్టారెంట్లో ఉన్నానని, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వివరించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దొంగతనం జరగడంతో షాపును శనివారం మూసివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలించారు. చదవండి: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. -
తుపాకీతో బెదిరించి.. ఫ్లిప్‌కార్ట్ సామాగ్రి దొంగతనం.. కళ్లకు గంతలు కట్టి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు దొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రితో వెళుతున్న డీసీఎంను అడ్డగించారు. డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భానూర్–బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ప్లిప్ కార్డ్ కంపెనీ నుంచి గజ్వేల్‌కు ఓ డీసీఎం వెళుతుండగా, పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్ సర్వీస్ రోడ్డు వద్ద ఐదుగురు కారులో వచ్చి అడ్డగించారు. డీసీఎం డ్రైవర్‌ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కళ్లకు గంతలు కట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేలోపు తుపాకీతో బెదిరించారు. ఓ గంట తర్వాత కారులోంచి దింపారు. కళ్లకు కట్టిన గంతలు విప్పుకొని చూడగా, సుల్తాన్పూర్ ఎగ్జిట్–4 సర్వీస్ రోడ్డు వద్ద ఉన్నాడు. కొద్దిదూరంలో డీసీఎం ఉంది. అక్కడకు వెళ్లి చూడగా, డీసీఎంలో ఉన్న 20 బ్యాగులు కనిపించలేదు. సుమారు రూ.1,78,000 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే బాధితుడు పటాన్చెరు పోలీసులకు తెలుపగా వారు సంఘటన స్థలానికి వెళ్లాక పోలీసులు ఇది భానూర్–బీడీఎల్ ఠాణా పరిధిలోకి వస్తుందని వారికి సమాచారం ఇచ్చారు. డ్రైవర్ ఎండీ సత్తార్ ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భలే దొంగలు.. సీసీ ఫుటేజీ వైరల్.. ‘తొలిసారి దొంగతనం చేశాం క్షమించండి’
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. ► మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కార్పియో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ►ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. ► వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కార్పియో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ►ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కార్మికుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. షాపింగ్ మాల్స్‌లో దుస్తులకు ట్యాగ్స్ ఉంటాయి. వాటిని చోరీ చేస్తే మాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు స్కానర్ వద్ద దొరికిపోతామని గుర్తించిన ఈ ముఠా.. ట్యాగ్స్ లేకుండా ఉండే సాధారణ షాపుల్లో మాత్రమే చోరీలకు పాల్పడుతోంది. కొత్త స్టాక్ రాగానే కస్టమర్లను ఆకర్షించేందుకు దుకాణాదారులు సోషల్ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే ఈ ముఠా.. నిరంతరం పోస్టులను ఫాలో అవుతూ ఖరీదైన చీరలు ఉండే షాపులను టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
లాలూ కొడుకు ఇంట చోరీ!
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్ ప్రతాప్ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్ ఇంచార్జ్ భగీరథ్ ప్రసాద్ తెలిపారు. -
కొడుకునే దోచుకునేందుకు మెడపై కతిపెట్టాడు..కానీ ట్విస్ట్ ఏంటంటే..
కన్న కొడుకునే దోచుకునేందుకు యత్నించాడు ఓ తండ్రి. విచిత్రమేటంటే తాను దొంగతనం చేస్తుంది తన కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. దీంతో సదరు తండ్రికి కోర్టు 26 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నివశిస్తున్న17 ఏళ్ల టీనేజర్ ఓ రోజు తన ఇంటి సమీపంలోని ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లాడు. అతను డబ్బులు కలెక్ట్ చేసుకుని కార్డుని జేబులో పెట్లకుంటుండగా.. ఎరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి గోడకు బలంగా నెట్టేశారు. పైగా ఆ యువకుడిని గోడకు నొక్కెస్తూ వెనక్కు తిరగనివ్వకుండా మెడపై కత్తిపెట్టి బెదిరించాడు ఓ ఆగంతకుడు. దీంతో సదరు యువకుడు భయంతో ఏం కావాలని అడగగా.. ముసుగు ధరించిన వ్యక్తి ఆ యువకుడి వద్ద ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయమని డిమాండ్ చేస్తాడు. ఐతే ఆ ఆగంతకుడి గొంతు విని తన తండ్రి అని గుర్తించి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నిదానించుకుని నేనెవరో తెలుసా అని గట్టిగా అడుగుతాడు యువకుడు. నిజంగానే నన్ను డబ్బులు అడుగుతున్నావా అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తిని. ఐతే ఆగంతకుడు అదేమి పట్టనంటూ ఔను! అంటూ డబ్బలిస్తావా లేదా అని డిమాండ్ చేస్తూనే ఉంటాడు. దీంతో ఆ యువకుడు వెంటనే వెనక్కు తిరిగి అతని ముసుగు ఒక్కసారిగా లాగేసి..ఏంటిదా నాన్న! అని ఆగంతకుడి రూపంలో ఉన్న తండ్రిని గట్టిగా నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తాడు ఆ తండ్రి. వెంటనే ఆ యువకుడు ఆ ఏటీఎం మెషన్ వద్ద నుంచి వేగంగా బయటకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఆగంతకుడిని అరెస్టు చేయగా..నేరాన్ని అంగీకరిస్తాడు. ఈ మేరకు కోర్టులో సదరు నిందితుడు తన నేరాన్ని అంగీకరించటమే గాక తన కొడుకే ఏటీఎం వద్ద ఉన్నాడిని తనకు తెలియదని చెప్పాడు. దొంగతనం చేసేందుకే ఏటీఎంలోకి వచ్చానని అంగీకరించాడు కూడా. దీంతో కోర్టు దీన్ని ఊహించని అసాధారణమైన కేసుగా పేర్కొంటూ నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించింది. -
ఫుల్ ట్రాఫిక్..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!
అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం ప్రారంభించారు. ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్, అబిషేక్గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ) -
కొండగట్టు ఆలయ ఆభరణాల చోరీ కేసులో ముందడగు
-
జగిత్యాల : కొండగట్టు ఆలయంలో చోరీ
-
చుట్టాల్లా వెళ్లి పట్టేశారు!
సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల తయారీ కేంద్రంలో పని చేస్తూ రూ.కోటి విలువైన వజ్రాభరణాలతో ఉడాయించిన కార్మికులను పట్టుకోవడానికి పోలీసులు వారి చుట్టాలుగా మారారు. ఇలానే పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గాలించి నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై సొత్తుతో సహా సిటీకి తీసుకువచ్చినట్లు మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ పూర్ణచంద్రర్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనే... పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిసర ప్రాంతాలకు చెందిన హిమాన్షు సర్దార్, మహదేబ్ సర్దార్, ఉత్తమ్ ఓఝా ఐదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసచ్చారు. ఉప్పుగూడలోని లలితబాగ్‌లో ఉంటూ అబిడ్స్‌లోని ఆర్వీజే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. బంగారు, వజ్రాభరణాలు తయారు చేసే ఈ సంస్థకు గోపాల్ కృష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాన్షు, ఉత్తమ్ కుటుంబీకులు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైంది. ఇదే కార్ఖానాలో పని చేసేందుకు మూడు నెలల క్రితం హౌరాకే చెందిన కార్తీక్ బాగ్ వచ్చాడు. కార్తీక్ సలహాతో... అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురూ అతడు ఇచ్చిన సలహా నేపథ్యంలోనే తుది మెరుగుల కోసం యజమాని ఇచ్చిన సొత్తుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న గోపాల్ కృష్ణ రూ.కోటి విలువ చేసే 83 తులాల బంగారు ఆభరణాలు, 119 క్యారెట్ల వజ్రాలు, విలువైన రాళ్లు వీరికి అప్పగించాడు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు వీటిని తీసుకున్న నలుగురూ ఓ పెట్టెలో పెట్టుకుని మధ్యాహ్నం అక్కడినుంచి ఉడాయించారు. గోపాల్ కృష్ణ ఫిర్యాదుతో అబిడ్స్ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ బి.ప్రసాదరావు, డీఐ బి.అభిలాషతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితులు నలుగురూ ట్యాక్సీ, బస్సుల్లో విజయవాడ వెళ్లి అక్కడ హౌరా వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. ఏ మాత్రం సమాచారం అందకుండా... దీంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని గోపాల్ కృష్ణ ఇచ్చిన ఆధార్ కార్డుల ఆధారంగా గాలింపు చేపట్టారు. పోలీసుల రాకపై ఏ మాత్రం ఉప్పందినా నిందితులు పారిపోతారని భావించిన పోలీసులు ‘చుట్టాలుగా’ మారారు. తాము కార్తీక్ ఇంటికి వచ్చిన బంధువులమని, చాలా కాలం తర్వాత రావడంతో ఇల్లు గుర్తించలేకపోతున్నామని, అతడి ఫోన్ పని చేయట్లేదని స్థానికులకు చెప్పారు. అప్పటికే అతడు మిగిలిన ముగ్గురు నిందితులతో పాటు వచ్చి ఉండటంతో వీళ్లూ అతడి బంధువులై ఉండవచ్చునని భావించిన స్థానికులు స్పందించారు. ఇలా ఇంటిని గుర్తించిన టీమ్ స్థానిక పోలీసులను రప్పించి దాడి చేసింది. నలుగురు నిందితులతో పాటు సొత్తునూ స్వాధీనం చేసుకుంది. ఈ బృందాన్ని అభినందించిన డీసీపీ రివార్డు అందించారు. -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..
ఒక దొంగ దొంతనానికని వచ్చి.. హాయిగా బాత్రూంలో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా యజమాని లోపలకి రావడంతో ఊహించని విధంగా కథ మలుపు తిరిగింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది. దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు. చివరికి ఆ దొంగ బాత్‌టబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి..అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. పాపం ఆ దొంగ బాత్‌టబ్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పట్టుబడ్డ ఆ 27 ఏళ్ల నిందితుడు తన గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. (చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష) -
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
Hyderabad: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు
సాక్షి, కూకట్పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఓ ఇంట్లో గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్‌టాప్ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ పరిశీలన దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్‌రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, రాము, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. -
మేడ్చల్ జిల్లాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి..
సాక్షి, మేడ్చల్: సినీ ఫక్కీలో మద్యం దుకాణం వద్ద రూ.2.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు నగర శివారులోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గుర్తు తెలియని ఆగంతుకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రిలోని వినాయక వైన్స్‌లో బాలకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్‌గా, హెల్పర్‌గా జైపాల్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం సైతం మద్యం అమ్మగా వచ్చిన నగదు రూ.2.8 లక్షలు తీసుకుని రాత్రి 10.30 గంటలకు వైన్స్ షాపును మూసివేసి బయటకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు (25 నుంచి 30 ఏళ్ల వయసు) మంకీ క్యాపులు, కర్చీష్‌లు ధరించి బైక్‌పై వచ్చారు. పైసా దేవో అంటూ తుపాకితో బెదిరించారు. దీంతో వైన్స్ సిబ్బంది పక్కనే ఉన్న కర్రలతో వారిపై దాడి చేస్తుండగా.. దుండగులు తుపాకీతో బాలకృష్ణపై కాల్పులు జరపడంతో అతను తప్పించుకున్నాడు. తూటా వైన్స్ షెటర్‌కు తగిలి లోపల ఉన్న 5 మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దుండగులు మరో రౌండ్ కాల్పులతో వైన్స్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.2.8 లక్షల నగదుతో పరారయ్యారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే దోపిడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి చివర మద్యం దుకాణం ఉండటంతో పాటు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో పారిపోయేందుకు సులువుగా ఉంటుందని ఈ దుకాణాన్ని దుండగులు ఎంచుకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. చదవండి: Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా -
వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లోకి ప్రవేశించి వాళ్లను నిర్బంధించారు. అనంతరం గొంతుపై కత్తిపెట్టి బెదిరించి డబ్బులు, నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పదునైన కత్తి మెడపై పెట్టి డబ్బు, నగలు ఇవ్వకపోతే చంపేస్తానని దొంగ తనను బెదిరించాడని యజమాని సునీల్ కుమార్ శర్మ తెలిపారు. డబ్బులు, నగలు కలిపి వాటి విలువ మొత్తం రూ.కోటి వరకు ఉంటుందని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇంట్లో ఇద్దరూ వృద్ధులు ఉంటున్నారని తెలిసే దొంగలు కావాలనే వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్ దొంగ
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రాజధాని హోటల్ యజమాని అరిహంత్ జైన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్ఐ మల్లికార్జున్‌తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ నాగోర్ జిల్లా బేగాన మండలం గుండీసన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్ జైన్ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు. పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్‌కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్ రామకిషన్‌తో ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్ ఇంటి వాచ్మెన్ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్ వేసిన చంద్రశేఖర్ రామకృష్ణను రాజస్తాన్ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న లాకర్‌ను చంద్రశేఖర్ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్న చంద్రశేఖర్ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్‌కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది. దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్ కుమార్ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్‌ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్ గది ముందు లాకర్ దొరికింది. తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్‌ను దొంగిలించిన చంద్రశేఖర్ గ్యాస్ కట్టర్‌తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్‌కు వెళ్ళే ప్లాన్ వేసుకున్న చంద్రశేకర్ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్‌ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు. (చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!) -
రెస్టారెంట్‌కు నకిలీ తుపాకీతో వెళ్లి దోపిడీ.. చివరకు..
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఓ దొంగ. రెస్టారెంట్లో వెళ్లి కస్టమర్లను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అతని దగ్గరున్న గన్ నకిలీదని తెలియక కస్టమర్లు భయపడ్డారు. అయితే రెస్టారెంట్‌లోని ఓ కస్టమర్ దొంగను చావుదెబ్బతీశాడు. అదును చూసి తన దగ్గరున్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో అతనికి తూటాలు తగిలి కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగకుండా దొంగ దగ్గరకు వెళ్లి పలు మార్లు కాల్పులు జరిపాడు కస్టమర్. దీంతో దొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant 📌#Houston | #Texas Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023 గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే దొంగను కాల్చిచంపిన కస్టమర్‌ను పోలీసులు విచారించాల్సి ఉంది. దొంగ నుంచి తనను తాను కాపాడుకునేందుకే షూట్ చేసినందున అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. ఇంతకీ దొంగను కాల్చి చంపిన కస్టమర్ ఎవరనే విషయం తెలియలేదు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం
-
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
షాకింగ్.. ఢిల్లీ ఘటన అంజలి ఇంట్లో చోరీ.. ఫ్రెండ్ నిధిపైనే అనుమానం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమన్ విహార్‌లోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మరొకొన్నింటిని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం 7:30గంటల సమయంలో అంజలి తల్లిదండ్రులకు పొరుగింటివారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇంట్లో టీవితో పాటు ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని అంజలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ చోరీలో అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇంటివద్ద భద్రతగా ఉన్న పోలీసులు దొంగతనం జరిగిన రోజు ఎందుకు లేరని ప్రశ్నించారు. అయితే పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. జనవరి 1న అంజలి, ఆమె స్నేహితురాలు నిధి స్కూటీపై వెళ్తుండగా మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టారు. అంజలి కారు చక్రాల కింద ఇరుక్కున్నా పట్టించుకోకుండా వాహనాన్ని 12 కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. న్యూ ఇయర్ రోజున అంజలి మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. అయితే అంజలి కారు కింద పడిపోయినప్పుడు నిధి ఆమె పక్కనే ఉంది. కానీ ఎలాంటి సాయం చేసేందుకు ప్రయత్నించకుండా అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
పోలీసులే డబ్బు రికవరీ చేస్తారని పక్కాగా స్కెచ్..కానీ చివర్లో..
ఒక వ్యక్తి పోలీసులనే బురిడీ కొట్టించాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని థానేలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తి డబ్బులు పోయాయంటూ థానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కంపెనీకి సంబంధించిన బ్యాంకు నుంచి సుమారు రూ. 5 లక్షల నగదును డ్రా చేసి వస్తుండగా.. నలుగురు దుండగులు తన బైక్‌ని ఆపి కళ్లలోకి కారం జల్లి నగదు బ్యాగ్ పట్టుకుపోయారంటూ కట్టుకథ అల్లి మరీ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేయడం ప్రారంభించారు. అతను ఎక్కడ డబ్బు పోయిందన్నాడో ఆయా పరిసరాల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లో పరిశీలించగా..వాటిల్లో ఎక్కడా అతను బైక్‌పై బ్యాగుతో వెళ్తున్నట్లు కనిపించలేదు. ఆఖరికీ అతని బైక్‌ని ఆపిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఆ వ్యక్తిపై మరింత అనుమానం కలిగి తమదైన తరహాలో విచారించారు. దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలు వినీ పోలీసులే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సంస్థ తరుఫున విత్ డ్రా చేసిన మనీ తన వద్దే ఉంచుకోవాలనిపించిందని, అందుకనే ఇలా కట్టుకథ అల్లి ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఆ డబ్బును పోలీసులే ఏదోవిధంగా రికవరీ చేస్తారనుకున్నాని చెప్పడంతో..పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్) -
నార్సింగి దారి దోపిడీ కేసులో విస్తుపోయే విషయాలు
-
దోపిడీ దొంగల బీభత్సం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్‌ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్‌షాకోట్‌కి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక(నరేష్) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్‌ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు. కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్లను డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్‌రెడ్డి(35)కి ఫోన్ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. శివరాజ్ ఆ తర్వాత దారి కాచి హత్య... ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్‌రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్‌లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటి పోలీసులపై దాడి జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్‌సింగ్.. కూకట్పల్లి సిక్ బస్తీలోని భగవాన్‌సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్ సింగ్ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్ను మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్ డీసీపీ సందీప్ గోనె, మాదాపూర్ ఎస్ఓటీ క్రై మ్ అడిషనల్ డీసీపీ నారాయణ, బాలానగర్ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు
సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ సమీన్ అలియాస్ డాక్టర్ మల్లిక్, సైఫ్ అలీ, మహ్మద్ రహీస్. ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష
సాక్షి, మండ్య: స్నేహితురాలి ఇంటిలో చోరీకి పాల్పడిన మహిళకు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మద్దూరు పట్టణం జేఎంఎఫ్ 1వ సివిల్ కోర్టు న్యాయమూర్తి వీ కోనప్ప తీర్పు వెలువరించారు. మద్దూరు తాలూకా తొరెశెట్టిహళ్లికి చెందిన సుమిత్ర, జయమ్మలు స్నేహితులు. 2012 డిసెంబర్ 31న సుమిత్ర పక్క వీధిలో మంచినీటి కోసం వెళ్లిన సమయంలో బీరువాలోని రూ.1.16లక్షల విలువైన 58 గ్రాముల నగలు, రూ.18వేల నగదును జయమ్మ చోరీ చేసింది. సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జయమ్మను అరెస్ట్ చేశారు. నిందితురాలి నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. (చదవండి: ఏటీఎం కార్డు మర్చిపోయానని భార్యని దుకాణంలో కుర్చోపెట్టి.. కాసేపు తర్వాత!ఝ) -
రోడ్డు ప్రమాదంలో పంత్ వస్తువులు, డబ్బులు చోరీ.. పోలీసుల క్లారిటీ
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత రిషభ్ పంత్ నగలు, గిఫ్టులు చోరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ కోసం కుటుంబ సభ్యులకు పంత్ విలువైన కానుకలు కొన్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లిన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అతన్ని కాపాడుతున్నట్లు నటిస్తూ డబ్బు, నగలు చోరీ చేశారని, కానుకలతోపాటు క్రికెటర్ మెడలోని గొలుసు, బ్రేస్లెట్ కూడా చోరీకి గురైనట్లు సమాచారం. తాజాగా దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పోలసులు ఏమన్నారంటే.. రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ గాయాలతోపడి ఉంటే అతని దగ్గరున్న విలువైన వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అతని వస్తువులు, డబ్బులు ఎవరూ దొంగిలించలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. పంత్‌ను కాపాడిన వారు స్వయంగా అతని వస్తువులను సేకరించి భద్రపరిచారని వాటిని క్రికెటర్ తల్లికి అందజేసినట్లు ఉత్తరాఖండ్ డీజేపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హరిద్వార్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడిన వీడియోను డీజీపీ షేర్ చేశారు. చదవండి: Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ సీసీటీవీ ఫుటేజీ చెక్‌చేశాం అందులో.. ‘రిషబ్ పంత్‌ను కాపాడిన వారే.. అతను ధరించిన విలువైన వస్తువులు. ముఖ్యంగా అతని మెడలోని ప్లాటినం చైన్, గోల్డ్ బ్రాస్లెట్. రూ. 4 వేల నగదు గుర్తించారు. కారులో కొత్త బట్టలు కలిగి ఉన్న బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్ రాగానే పంత్‌ను ఎక్కించి అతని వస్తువులు, డబ్బు, బ్యాగ్‌ను కూడా అందులో పంపించారు. తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు(అతని తల్లి) అందజేశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని ధృవీకరించాం. దీనిని విశ్లేషించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించాం. కొంతమంది యువకులు రిషభ్ పంత్ వస్తువులను దొంగిలించారని పలు మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి అలాంటి సంఘటన ఏదీ మాకు కనిపించలేదు. కాబట్టి ఈ కథనం పూర్తిగా అబద్ధం. నేను అతని కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాను కాబట్టి ఈ వార్తలన్నీ నిరాధారమైనవని స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. सड़क दुर्घटना के बाद क्रिकेटर #RishabhPant जी के सामान को लोगों द्वारा चोरी किये जाने की सूचना असत्य है। जो यह भ्रामक खबरें फैला रहे हैं, कृपया ऐसा न करें। ऐसे लोगों के साथ SSP हरिद्वार अजय सिंह का वीडियो शेयर करें। pic.twitter.com/xmSBttaCUh — Ashok Kumar IPS (@AshokKumar_IPS) December 30, 2022 కాగా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో పంత్ ప్రయాణిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో ప్రమాదం సంభవించింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పంత్ కిటికీ అద్దాలు పగలగొట్టుకొని కారు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢికొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్ పంత్‌ను కాపాడి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ట్రీట్మెంట్ కొనసాగుతోందని తెలిపింది. టీమిండియా యువ బ్యాటర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, క్రికెట్ అభిమనులతోపాటు యావత్ దేశం ప్రార్ధిస్తుంది. ఇది కూడా చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు -
బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు..
ముంబై: యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది ఓ పనిమనిషి. భర్తతో కలిసి బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించింది. వెండి, బంగారం, వజ్రాభరణాలు, నాణేలు.. ఇలా రూ.47 లక్షలు విలువచేసే నగలు ఎత్తుకెళ్లింది. మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26-27 మధ్యన ఈ ఘటన జరిగింది. యజమాని సూరజ్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పనిమినిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్‌పాల్ హర్గెను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.27లక్షలు విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొమ్ము కోసం ఆమెను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు యజమాని సూరజ్ అగర్వాల్ కుటుంబం ఇంట్లో లేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అలీబాగ్ వెళ్లారు. దీన్నే అదునుగా తీసుకున్న పనిమనిషి.. మొగుడితో కలిసి పథకం పన్ని చోరీకి పాల్పడింది. చివరకు కటకటాలపాలైంది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
ఒంటిపై కేవలం అండర్వేర్..అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్ ఇంటి ముంగిట ఉన్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్‌కి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు. విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్‌ని 'అండర్ వేర్ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Not all heroes wear capes, in fact some just wear a pair of undies. Steve Middleton was up early on Boxing Day when he spotted some thugs trying to steal from his car - the tradie decided to take matters into his own hands. #9News pic.twitter.com/ocg3s37W2f — 9News Gold Coast (@9NewsGoldCoast) December 26, 2022 (చదవండి: ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!) -
నల్లమలలో దారి దోపిడీ
గిద్దలూరు రూరల్: గుర్తు తెలియని దుండగులు బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారును అటకాయించి.. అందులోని వారిని చితకబాది రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం దోచుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారి షేక్ బాజీవలి వద్ద షేక్ పీరావలి, సుభాషిణి, సైదా పనిచేస్తున్నారు. ఆ ముగ్గురు శుక్రవారం నరసరావుపేట నుంచి కారులో నంద్యాల చేరుకున్నారు. వ్యా పార లావాదేవీలు ముగించుకున్న అనంతరం రూ.14 లక్షల నగదు, ఒక కిలో 300 గ్రాముల బంగారాన్ని కారులోని సీక్రెట్ లాకర్లో పెట్టి శనివారం రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇదే తరహాలో నరసరావుపేటకు చెందిన మరో ఇద్దరు బంగారు వ్యాపారులు పవన్‌ప్రదీప్, మొహిబ్ రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని నరసరావుపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు లేవంటూ మొహిబ్ తనకు తెలిసిన తోటి బంగారు వ్యాపారి పీరావలికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారిద్దరినీ తమ కారులోనే నరసరావుపేటకు రావచ్చని చెప్పడంతో అందరూ కలిసి ఒకే కారులో నరసరావుపేట బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారును ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు నంద్యాల నుంచి మరో కారులో వెంబడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడ్డగించి కారు లోని ఐదుగురిని చితకబాదారు. అనంతరం వారిని బయటకు లాగిపడేసి కారుతో పాటు గా దుండగులు గిద్దలూరు వైపుగా వచ్చారు. దొంగిలించిన కారును కేఎస్ పల్లె సమీపంలోని బైరేనిగుండాల పైలట్ ప్రాజెక్టు క్రాస్ రోడ్డులో ఆపి కారులో పవన్‌ప్రదీప్, మొహిబ్లకు చెందిన రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు ఐదుగురు నంద్యాల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో వారు గిద్దలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను గిద్దలూరు వైపు తీసుకొస్తున్న నేపథ్యంలో కేఎస్ పల్లె సమీపంలో కారును గుర్తించారు. కారులోని సీక్రెట్ లాకర్‌ను తెరిచి చూడగా కిలో 300 గ్రాముల బంగారం, రూ.14 లక్షల నగదు జాగ్రత్తగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్పీ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. -
దోపిడికి వచ్చి జంట హత్యలు..నిందితుడిని చూసి కంగుతిన్న పోలీసులు
దోపిడి చేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితులు 60 ఏళ్ల ఇబ్రహీం, అతడి భార్య హజ్రాగా గుర్తించారు. ఇబ్రహీం స్క్రాప్ డీలర్. అతడు ఇంటిలో శవమై కనిపించగా అతడి భార్య టాయిలెట్ బాత్రూంలో మెడకు గుడ్డతో ఉరి వేసి చంపినట్లు కనిపించింది. ఈ జంట హత్యలకు కీలక సూత్రధారి 12 ఏళ్ల బాలుడా! అని పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు . వాస్తవానికి ఆ బాలుడు ఆ దంపతులకు బాగా తెలిసినవాడే. అతను ఇబ్రహీం స్క్రాప్ బిజినెస్‌తో చాలా డబ్బులు కూడబెట్టాడని తెలుసుకుని వారిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ముగ్గురు వ్యక్తులను తనతో చేర్చుకుని వారి సాయంతో దోపిడి చేసేందుకు యత్నించాడు. ఐతే దోపిడి చేసే ప్రయత్నం కాస్త చివరికి వారి హత్యలకు దారితీసింది. ఈ మేరకు పోలీసులు ఆ బాలుడి తోపాటు ఈ ఘటనలో పాలుపంచుకున్న మంజేష్, శివరాంలను కూడా అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సందీప్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. వారి నుంచి సుమారు రూ. 12 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, బంగారు గొలుసు తదితరాలను స్వాధీనం చేసుకున్నమాని ఘజియాబాద్ సీనియర్ పోలీసు ఇరాజ్రాజా తెలిపారు. (చదవండి: అక్క కళ్లలో ఆనందం కోసం బావను హత్య చేసిన బావమరిది) -
హైదరాబాద్‌లో రూ. కోటి వజ్రాభరణాల చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): రెండు రోజుల క్రితం ఫిలింనగర్ ఫేజ్–2లోని శమంతక డైమండ్స్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డైమండ్స్ నాణ్యతను పరిశీలించే భూతద్దం ఆధారంగా దొంగను పట్టుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే... మాజీ మంత్రి చెంచు రామయ్య మన వడు పవన్‌కుమార్ ఫిలింనగర్లో శమంతక డైమండ్స్ షోరూం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20న సింగాడికుంటకు చెందిన మైలారం పవన్ కుమార్, చింతల్‌బస్తీకి చెందిన మచ్చ అలియాస్ అంజి నెంబరు ప్లేట్ లేని బైక్‌పై వచ్చి షోరూం కిటికీ అద్దాలు తొలగించి రూ. కోటి విలువైన ఆభరణాలతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా వారి ఓ దొంగ ఆ సమయంలో సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులో బంజారాహిల్స్ క్రైం పోలీసుల ఎదుటే ఉన్నాడు. చదవండి: (Hyderabad: రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ) దొరికింది ఇలా.. ఈ నెల 19న పవన్‌కుమార్ సింగాడికుంటలోనే పక్కింట్లో రెండు సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదు తస్కరించి పరారయ్యాడు. ఆ మర్నాడు రాత్రి స్నేహితుడు అంజితో కలిసి ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డాడు. సెల్ఫోన్లు తస్కరించిన అనంతరం బాధితుడు ప్రవీణ్ అక్కడి సీసీ ఫుటేజీ పరిశీలించగా పక్కింట్లో ఉంటున్న పవన్ వాటిని దొంగిలించినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని పవన్‌కు ఫోన్ చేసి అడగ్గా ఆ రెండు సెల్ఫోన్లు పంపించాడు. అయితే దొంగిలించిన నగదు ఇవ్వాలంటూ బాధితుడు కోరగా సమాధానం చెప్పలేదు. ఈ నెల 22న ఉదయం జహీరానగర్ చౌరస్తాలో ఉన్న పవన్‌ను ప్రవీణ్ అతడి స్నేహితు పట్టుకున్నారు. డబ్బుల కోసం నిలదీయగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాధితుడు 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పవన్‌ను నెంబరు ప్లేట్ లేని స్కూటర్‌తో సహా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లపై నిందితుడిని ప్రశ్నిస్తుండగా జేబుల్లో ఉన్న ఇతర సామగ్రిని తీసి క్రైం ఎస్ఐ టేబుల్‌పై ఉంచాడు. అందులో డైమండ్స్‌ను పరీక్షించే భూతద్దం కూడా ఉంది. దొంగతనం జరిగిన ఇంటికి పెయింటింగ్ వేసిన వారితో పాటు మరికొందరిని విచారించే క్రమంలో ఆభరణాల వ్యాపారి పవన్‌కుమార్‌ను పోలీసులు పిలిపించారు. ఎస్ఐ ఎదురుగా ఉన్న భూతద్దాన్ని చూసిన నగల వ్యాపారి పవన్‌కుమార్ ఇది తమ షోరూంలోదేనని ఇక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీంతో నిందితుడు పవన్‌ను పోలీసులు లోతుగా విచారించగా సదరు భూతద్దాన్ని నగల షోరూం నుంచి తెచ్చిందేనని తనతో పాటు అంజి చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. దొంగను ఎదురుగానే పెట్టుకుని సీసీ ఫుటేజీల పేరుతో ఐదు ప్రత్యేక బృందాలు నగరమంతా గాలిస్తున్న విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. చోరీకి వినియోగించిన బైక్‌ను పరిశీలించగా అందులో కొన్ని ఆభరణాలు, డైమండ్లు లభ్యమయ్యాయి. మిగతా వాటి కోసం గాలిస్తుండగా మరో దొంగ పరారీలో ఉన్నాడని, డైమండ్స్ ఉన్న లాకర్‌ను శ్మశానంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ శ్మశానం ఎక్కడ ఉందో తేలాలంటే మరో దొంగ అంజి దొరకాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత నేరస్తుడే.. చోరీ కేసులో నిందితుడు మైలారం పవన్‌కుమార్ సెపె్టంబర్ 15న పోక్సో యాక్ట్ కింద బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందే పవన్‌పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున ఆరు స్నాచింగ్ కేసులు నమోదై ఉన్నాయి. పేదోడి ఇంట సీసీ కెమెరా.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని సింగాడికుంటలో ఈ నెల 19న ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆయన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొంగను పట్టించింది. స్థానికంగా పవన్ అనే పాత నేరస్తుడు ఈ సెల్‌ఫోన్ తస్కరించగా సీసీ ఫుటేజీలో స్పష్టంగా నమోదైంది. ఈ సీసీ ఫుటేజీ ఆధారంగానే రూ. కోటి విలువైన ఆభరణాల దొంగను పట్టించాయి. తీరా చూస్తే ఆభరణాలు దొంగిలించిన షోరూం యజమా ని సీసీ కెమెరాలే పెట్టుకోలేదు. చుట్టుపక్కల ప్రాంతా లు, రహదారులపై కెమెరాలు లేకపోవడంతో పోలీసులు మళ్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు ఓ సాధారణ పౌరుడు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఓ పేరు మోసిన దొంగల ముఠాను పట్టించినట్లయింది. -
Hyderabad: రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఫేజ్–2 ప్లాట్ నెంబర్ 26ఏలో కొనసాగుతున్న శమంతక డైమండ్స్ ఎల్ఎల్పీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు షోరూం యజమాని నల్లబోతు పవన్‌కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి నల్లబోతు చెంచురామయ్య మనువడు పవన్‌కుమార్ వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నాడు. 2016 నుంచి ఈ వ్యాపారంలో కొనసాగుతున్న ఆయన వజ్రాభరణాలు తయారు చేయించి కస్టమర్లకు పంపిణీ చేసేవాడు. మూడు రోజుల క్రితం మాదాపూర్ నుంచి శమంతక డైమండ్స్ షోరూంను ఫిలింనగర్ వెంచర్–2కు మార్చారు.. ఈ నెల 20న రాత్రి ఉద్యోగి జీవన్ కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. 21న ఉదయం షాప్ తెరిచి చూడగా షోరూంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. క్యాబిన్లు, డ్రాలు తెరిచి ఉండటంతో వాటిని పరిశీలించగా కబోర్డ్‌లో ఉండాల్సిన వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు హారాలు కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 200 క్యారెట్ల డైమండ్లు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, కిలో గోల్డ్ సెట్ హారం, నాలుగు ఉంగరాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ షోరూం వెనుకాల కిటికీ గ్రిల్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించి ఆభరణాలను సంచుల్లో వేసుకుని అదే దారి నుంచి బయటికి వెళ్లినట్లుగా గుర్తించారు. షాపు వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఫిలింనగర్ నుంచి రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా నెంబర్ ప్లేట్ లేని యాక్టీవాపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మంకీ క్యాప్‌లు ధరించి లోపలికి వెళ్లడమే కాకుండా ఓ బ్యాగ్‌లో ఆభరణాలు పెట్టుకుని సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? కాగా చోరీ వ్యవహారంలో అనుమానితుడిని గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒకరిని గుర్తించినట్లు తెలుస్తుంది. పట్టుబడిన వ్యక్తి ద్వారా మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో అనుమానితుడు చిక్కితే నగలు జాడ చిక్కే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉన్న టిప్ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్‌లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్‌లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్‌గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్‌గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్‌కి ఒక దొంగ కస్టమర్‌లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
షాకింగ్ ఘటన: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల కార్లు హాంఫట్
సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు. వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఈ హైటెక్ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్ బరో గ్రామంలో బ్రెంట్వుడ్ రోడ్ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్ చేసుకుంటూ జస్ట్ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు. సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: వాటే ఐడియా! స్కూటర్ సాయంతో నిర్మాణ పనులు) -
కొరియర్ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి..
సాక్షి, రాంగోపాల్‌పేట్: కొరియర్లో పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే గోల్డ్, డైమండ్ నగలను తీసుకెళుతున్న యవకుడి కళ్లల్లో కారంకొట్టి, కత్తితో దాడి చేసి నగలను దోచుకెళ్లిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్ కుమార్ సైనీ పాట్ మార్కెట్లో జై మాతా లాజిస్టిక్ పేరుతో కొరియర్ నిర్వహిస్తూ బంగారు నగలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. అతడి వద్ద పవన్‌కుమార్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పవన్‌కుమార్ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్ నుంచి రూ.8.65 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. అనంతరం హయత్‌నగర్‌లోని శ్రీ రాధే డైమండ్స్‌కు వెళ్లి రూ.18,47,472 విలువైన 148.492 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను తీసుకుని బైక్‌పై పాట్‌మార్కెట్‌కు బయలుదేరాడు. ఈ ఆభరణాలను ముంబైకి పంపాల్సి ఉంది. రాత్రి 9.45 ప్రాంతంలో పవన్‌కుమార్ ఆర్పీరోడ్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి కళ్లలో కారంపొడిని చల్లారు. అయితే అతను హెల్మెట్ పెట్టుకోవడంతో కారంపొడి కళ్లలో పడలేదు. దీంతో అప్రమత్తమైన పవన్‌కుమార్ వేగంగా బైక్‌ను ముందుకు నడిపించాడు. అదే సమయంలో సిటీలైట్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆటోను ఢీకొట్టడంతో అతను వాహనంతో సహా కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వాహనం దిగి పవన్‌కుమార్ దగ్గర ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతను కత్తితో పవన్‌కుమార్ ఎడమవైపు చేతిపై పొడిచి బైక్‌పై పరారయ్యాడు. ట్రాఫిక్, వాహనాల మధ్య క్షణాల్లో జరిగిపోయింది. గాయపడిన పవన్‌కుమార్ యజమానికి సమాచారం అందించడంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలోకు తరలించారు. ప్రస్తుతం పవన్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నాగోల్‌లో బంగారం షాపు యజమానిపై కాల్పులకు తెగబడి దోపిడీకి యతి్నంచిన గ్యాంగుకు దీనికి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
ట్రెండ్ మారింది.. అర్ధరాత్రి మద్యం కోసం ఆమె ఏం చేసిందంటే?
ఇప్పటి వరకు పలు సందర్భాల్లో పురుషులే రాత్రి సమయాల్లో లిక్కర్ షాపులను షటర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడిన ఘటనలు చాలానే చూశాము. కానీ, ఇక్కడి ఓ మహిళ లిక్కర్ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. లిక్కర్ కోసం ఏకంగా వైన్ షాపునే టార్గెట్ చేసిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. పెద్ద రాడుతో లిక్కర్ షాపు వద్దకు వచ్చిన సదరు మహిళ.. తాళం పగులగొట్టేందుకు శ్రమించింది. షాపు తాళం ఎంతకు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం సౌండ్ విని అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా షాపు బయట ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. उन्नाव में लड़कियों के हौसले बुलंद : CCTV कैमरे में कैद हुई घटना, लड़कियों ने ज्वेलरी शॉप का ताला तोड़ा वीडिओ हुआ वायरल....#viralvideo #SocialMedia #Unnao #ViralVideos #Viral #UPPolice @unnaopolice pic.twitter.com/vsEUDPEh0E — Nedrick News (@nedricknews) December 3, 2022 -
హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్‌లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే, కల్యాణ్ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
హైదరాబాద్: జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి పక్కా స్కెచ్? కాల్పులు జరిపి భారీ చోరీ
సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్ చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్కేపురం వైపు వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూధన్ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్ చెవికి బుల్లెట్ తగలగా, సుఖ్‌దేవ్‌కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా? హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్‌దేవ్ వద్ద ఉన్న నగల బ్యాగ్‌ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం.