Saif Ali Khan Attacked
-
సైఫ్‌పై దాడి చేసింది అతడే..! గుర్తించిన అత్యాధునిక టెక్నాలజీ
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు.ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామేనని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదన్న ప్రచారం నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ నిర్ధారణ కీలకంగా మారింది. కాగా,జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు నిందితుడు ముంబయి బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. దాడి అనంతరం నటుడి ఇంటిని పరిశీలించిన పోలీసుల బృందం అక్కడి నుంచి సుమారు 19 వేలిముద్రలను సేకరించింది. ఈ ఫింగర్ ప్రింట్స్లో ఏవీ నిందితుడు ఇస్లాం ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోవడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరిగడంతో దర్యాప్తుకు బ్రేక్ పడింది. నిజానికి సైఫ్ ఇంట్లోకి నిందితుడు ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని ఈ క్రమంలో అడ్డుకున్న సైఫ్‌తో తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. -
సైఫ్ అలిఖాన్పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్!
ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్ఇస్లాం సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్‌గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సైఫ్‌పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్‌పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
సైఫ్‌పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్‌పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్?
-
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్ ఇంట్లోకి దొంగోడు ఎలా చేరాడో, ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
-
సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్‌ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్‌లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్‌పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్‌లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్‌ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు.