Shankar
-
కాపీరైట్ కేసు.. హైకోర్టులో డైరెక్టర్ శంకర్‌కి భారీ ఊరట!
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. -
రోబో సినిమా ఎఫెక్ట్.. దర్శకుడు శంకర్ రూ.10 కోట్ల ఆస్తులు జప్తు
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. తన దర్శకత్వం వహించిన రోబో సినిమా విషయంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.2010లో రోబో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్‌గా రూ.11.5 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
స్వచ్ఛమైన వినోదంతో...
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రాగ్ మయూర్ మాట్లాడుతూ– ‘‘బద్మాషులు’ టీజర్ చాలా ఆర్గానిక్‌గా ఉంది. స్వచ్ఛమైన వినోదంతో రూపొందుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. శంకర్ చేగూరి మాట్లాడుతూ– ‘‘టీజర్ జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చిన శంకర్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అందరూ స΄ోర్ట్ చేయాలి’’ అన్నారు మహేశ్ చింతల. ‘‘ఈ చిత్రంలో ఆరోగ్యకరమైన వినోదం పండించాం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని విద్యాసాగర్ కారంపురి తెలిపారు. ‘‘నాకు ఈ మూవీ చేసే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని కెమేరామేన్ వినీత్ పబ్బతి చెప్పారు. -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన
నటుడు కమలహాసన్(Kamal Haasan), శంకర్(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇండియన్.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇకపోతే దర్శకుడు శంకర్ తొలిసారిగా తెలుగులో రామ్‌చరణ్ కథానాయకుడుగా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. దీంతో దర్శకుడు శంకర్ మరో చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చకు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ రాసిన రచించిన నవల ఆధారంగా కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు చెప్పారు.బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఇండియన్-2గత ఏడాదిలో విడుదలైన ఇండియన్ 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్) వరకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులో కూడా భారతీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రికల్ రన్లో పదమూడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది. -
'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్
గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రాన్ని తమ లోకల్ ఛానెల్లో (local channel) ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానల్స్‌లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం చెందడమే కాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే, కేబుల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం ప్రసారం అవతుందని కొందరు స్క్రీన్ షాట్స్ తీసి చిత్ర నిర్మాణ సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: మహానగరంలో బాలీవుడ్ ప్రముఖలపై జరిగిన దాడులు ఇవే)ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. వారిపై కూడా చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ కలెక్షన్లపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కలెక్షన్ల వివరాలు తప్పుగా చెప్పారని పలువురు నెటిజన్లు విమర్శించారు. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్‌లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్‌ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025#GameChanger#GameChangerReview First Half:Very Entertaining, fast paced screenplay by @shankarshanmugh sir. Superb first half. #SJSuryah and #RamCharan𓃵mass acting 🔥🔥🔥@MusicThaman Music is top work and #Dhop song is Hollywood level making #BlockbusterGameChanger— Mr.Professor (@EpicViralHub_) January 10, 2025SPOILER ALERT !! ⚠️⚠️IPS, IASInterval bang kosam CMMalli ventane IASImmediate ga Chief Electoral OfficerMalli climax bang kosam CMNeeku ishtam ochinattu thippav atu itu @shankarshanmugh 🤦🏻#GameChanger— . (@UrsPG) January 10, 2025Shankar’s corruption theme is outdated and he should choose a different script. Else its a Game Over for him.#GameChanger— CB (@cinema_babu) January 10, 2025భారతీయుడు శంకర్ చివరికి ఎన్. శంకర్ అయిపోతాడు అనుకోలేదు 🙏Outdated & Cringe #GameChanger— 🅰️⛓️ (@UaReports689gm1) January 10, 2025#RamCharan #GameChanger•More of a message-driven movie.•Set against a political backdrop.•Unbelievable solutions in the narrative.•Commercial elements are relatively less.•Every actor excelled in their roles, which is a very, very big plus for the movie!— USAnINDIA (@USAnINDIA) January 10, 2025 -
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. -
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) ని వరుసపెట్టి సినిమా కష్టాలు వెన్నాడుతున్నాయి. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి దేశీయ కష్టాల నుంచి అంతర్జాతీయ కష్టాలు కూడా ఈ సినిమాకి తప్పడం లేదు. ఈ సంవత్సరంలో తొలి భారీ–టికెట్ చిత్రంగా విడుదల అవుతున్న గేమ్ ఛేంజర్ రూ.500 కోట్ల కనీస టార్గెట్‌తో వస్తోంది. ఈ సినిమా రాబోయే చిత్రాల విడుదలకు టార్గెట్ సెట్ చేస్తుందని భావిస్తున్న నేపధ్యంలో చుట్టుముడుతున్న కష్టాలు కలెక్షన్స్‌పై సందేహాలు కలిగిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు)మన దేశంలో, ఈ చిత్రం దాదాపు రూ. 25 కోట్లతో తొలి రోజు ప్రారంభమవుతుందని ఇది రామ్ చరణ్ సోలో చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్గా నిలుస్తుందని అంచనా. మరోవైపు భారతదేశం వెలుపల తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారిన నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లపై ఆశపెట్టుకుంది. (చదవండి: 'ఆ సాంగ్ చేసినందుకు సిగ్గుపడాలి'.. ఊర్వశి రౌతేలాపై విమర్శలు!)అయితే కంటెంట్ కన్వర్షన్లో జాప్యం కారణంగా, నార్త్ అమెరికాకి సమయానికి కంటెంట్ అప్లోడ్ వైఫల్యానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందట. హిందీ తమిళ వెర్షన్లు ఆ భాషల్లో షోలను నిర్ధారిస్తూ, సమయానుకూలంగా అప్లోడ్ చేశారు. అయితే, ఆలస్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద థియేటర్ చైన్లలో ఒకటైన ఎఎమ్‌సి సినిమా కోసం బుకింగ్‌లను నిలిపివేసిందని తెలుస్తోంది. ప్రారంభ ట్రెండ్ల ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోల టిక్కెట్ల విక్రయాలు 8,5లక్షల్ని దాటాయి పదిలక్షల చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా, మొత్తం అమ్మకాలు 7.5లోపునకు పడిపోయాయని సమాచారం. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదనీ కంటెంట్ సమయానికి సినిమా థియేటర్లకు చేరుకుంటే, సినిమా ఇప్పటికీ 10లక్షల మార్కును దాటగలదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పులి మీద పుట్రలా మరోవైపు కొనసాగుతున్న దావానలం గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ రికార్డ్ కలెక్షన్స్ ఆశల్ని దహించే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రేపు(జనవరి 10) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్ తేజ్ కలయికలో ఈనెల 10న విడుదల కానున్న ‘గేమ్‌చేంజర్’ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇటీవల పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో నెలకొన్న ఘటనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపునకు మాత్రం ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 10వ తేదీన 6 షోలు ప్రదర్శించుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ తొమ్మిది రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్స్ జారీ చేసే అధికారులను ఆదేశించింది. -
Game Changer: కాఫీ కప్పులోనే ఊరి సెట్.. ఆ పాటకే 30 కోట్లు
గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ లిరికల్ వీడియో వచ్చినప్పుడు చూసి నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ రీసెంట్గా పూర్తి పాటను చూసి షాకయ్యాను. దాదాపు రూ.25-30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాటను తెరకెక్కించారు. కాఫీ కప్పులోనే ఊరి సెట్ వచ్చేలా శంకర్ ప్లాన్ చేశారు. థియేటర్లో ఆ పాట బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఆ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోయాయనిపిస్తుంది. అంతలా శంకర్ గారు మ్యాజిక్ చేశారు’ అన్నారు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్(Game Changer) కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.→ ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.→ నటుడిగా ఓ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. శంకర్(Shankar) గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.→ ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.→ గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ).→ గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.→ నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే..ఖషి2 తెరకెక్కిస్తాను. -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ ట్రైలర్.. పేలుతున్న డైలాగ్స్ ఇవే!
రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేసింది. శంకర్ శైలీలోనే ఈ సినిమా ట్రైలర్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్లోనే చూపించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నందన్, అప్పన్న పాత్రల్లో నటించబోతున్నాడు. ఈ రెండు పాత్రలను ట్రైలర్లో పరిచయం చేశారు. అలాగే కియరా అద్వానీ, అంజలి పాత్రలు కూడా ఎలా ఉండబోతున్నాయని ట్రైలర్లో క్లియర్‌గా చూపించారు. తమన్ బీజీఎం బాగుంది. వీటన్నింటికంటే ఎక్కువగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శంకర్ సినిమాల్లో గతంలో ఎప్పుడు చూడలేనన్ని డైలాగ్స్ ఈ చిత్రంలో చూడబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్న డైలాగ్స్ ఇవే.→ కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపేడితే.. పెద్దగా దానికి వచ్చే నష్టమేమి లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం.. నేను మీ దగ్గర అడుగుతుంది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే (రామ్ చరణ్)→ ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ.. ఒప్పుకో(అంజలి)→ కలెక్టర్‌కి ఆకలేస్తుందట.. ఓ ముద్ద ‘అన్నం’ అడుగుతున్నాడు.→ నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్వి..నేను చనిపోయే వరకు ఐఏఎస్→ మా పార్టీ సేవ చేయడానికే కానీ.. సంపాదించడానికి కాదు→ అర్థం అయింది రా(ఎస్ జే సూర్య).. అయిందా రాసివ్వరా( చరణ్).. ‘రా’నా?(సూర్య).. ‘రా’కి రా.. సర్కి సార్(చరణ్)→ ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ -
Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!
ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో రామ్ చరణ్(Ram Charan) ముందు వరుసలో ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరాడు. ఆయన నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినా.. చరణ్‌లో మాత్రం కించిత్తు అహం కూడా పెరగలేదు. ఆయనపై వచ్చిన రూమర్స్ కూడా చాలా తక్కువే. నిర్మాతలతో పాటు అందరితోనూ చాలా అనోన్యంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తోటి నటీనటులు చెబుతుంటారు. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త రామ్ చరణ్‌లో మంచితనం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తుంది. గేమ్ ఛేంజర్ కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా?)పెరిగిన బడ్జెట్ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల అనుకున్నారట. అందులో రామ్ చరణ్ రెమ్యునరేషన్‌నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది. చరణ్ కూడా ముందే అంతే స్థాయిలో తీసుకుంటానని చెప్పారట. కానీ బడ్జెట్ పెరగడంతో రెమ్యునరేషన్ తగ్గించారట. ఈ సినిమాకు మొత్తంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతోనే బడ్జెట్ పెరిగింది.చరణ్‌తో పాటు శంకర్ కూడారామ్ చరణ్‌కు మొదటి నుంచి ఒక అలవాటు ఉందట. సినిమా ఒప్పుకున్న వెంటనే రెమ్యునరేషన్ తీసుకోడట. షూటింగ్ మొత్తం పూర్తయిన చెప్పిన అమౌంట్ తీసుకుంటాడు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. తొలుత రూ. 100 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. కానీ బడ్జెట్ పెరగడంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ చిత్రానికి అది చాలా తక్కువ రెమ్యునరేషనే. శంకర్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించి రూ. 35 కోట్లతో సరిపెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మనసు చాలా మంచిది..తక్కువే తీసుకొని ఉంటాడని అంటున్నారు. -
గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా?
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘గేమ్ ఛేంజర్’(game Changer) రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతవారం అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఈవెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రమోషన్స్ మొదలు కాలేదు కానీ నెట్టింట మాత్రం గేమ్ ఛేంజర్‌పై చర్చ జరుగుతూనే ఉంది.(చదవండి: ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చు చేశాడు. రెమ్యునరేషన్లతో కలిసి దాదాపు రూ. 500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్(shankar)సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ ఉండాల్సిందే. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తాడు. ఇక గేమ్ ఛేంజర్‌లో కూడా శంకర్ శైలీ పాటలు మూడు ఉన్నాయట. విజువల్ ట్రీట్ ఇచ్చేలా వాటిని తెరకెక్కించామని శంకర్ చెబుతున్నాడు. బయటి కంటే థియేటర్లో చూస్తేనే పాటలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు కూడా అంటున్నాడు. అయితే ఆ పాటలు చిత్రీకరించేందుకు శంకర్ భారీగా ఖర్చు చేశాడట. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ కోసం కోట్లల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించాడు శంకర్. వైజాగ్, అమృత్ సర్ వంటి ఏరియాల్లో షూట్ చేశారు. ఈ పాట షూటింగ్ సమయంలో ఒక్కరోజుకే రూ. 78 లక్షల వరకు ఖర్చు చేశారట. సినిమా మొత్తంలో ఒక్కరోజులో అయిన హయ్యెస్ట్ ఖర్చు ఇదేనట. మొత్తంగా ఈ పాట కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ పాటల స్థాయి తెలుస్తుందని దిల్ రాజు అంటున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan)కి జోడీగా కియరా అద్వానీ నటించగా..శ్రీకాంత్, అంజలి, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. Amritsar lo #Gamechanger song kosam okka roju ayina karchu 78 lakhs !!💲💸💰That was the day when the highest amount of money was spent while I was there🎯500 dancers participated in that song 🔥💥#RamCharan @AlwaysRamCharan @SVC_official pic.twitter.com/Q3L7VLHDje— Mr.RK 🎯🦁 (@RavikumarJSP) December 27, 2024 -
తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్, ‘ గేమ్ ఛేంజర్’పై 300 కోట్ల భారం!
టాలీవుడ్ సినిమా బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. పదేళ్ల కిందట రూ.30, 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తేనే అది భారీ బడ్జెట్ మూవీ అనేవారు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ స్థాయిలో ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చిన్న హీరోలు సైతం రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసుకున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల బడ్జెట్‌కు అయితే లెక్కే లేదు. మినిమం రూ.150-200 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. అందుకే నిర్మాతలు పెద్ద హీరోలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కాబోతుంది. అదే గేమ్ ఛేంజర్(Game Changer).దిల్ రాజు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి శంకర్(shankar) దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్. మూడేళ్ల క్రితం ఈ సినిమాకి బీజం పడింది. కరోనాతో పాటు ఇతర కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. పబ్లిసిటీ, రెమ్యునరేషన్స్తో కలిసి చూస్తే.. ఈ సినిమాకు రూ.500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాలు అంటేనే బడ్జెట్‌కు పరిమితులు ఉండవనే విషయం తెలిసిందే. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. పాటలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పాటలతో పాటు కొన్ని సీన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది.రూ.300 కోట్ల భారంగేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని రీతిలో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు మేకర్స్. అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించడంతో గేమ్ ఛేంజర్‌పై మరింత హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు నాన్ థియేటర్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్ నుంచి 300 కోట్లకు పైగా రాబడితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి.. హిట్ టాక్ వస్తే వీకెండ్లోనే ఆ సంఖ్యను దాటేయ్యొచ్చు. కానీ ఒకవెళ తేడా కొడితే మాత్రం అంత మొత్తం రాబట్టడం చాలా కష్టమే. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు రూ.150 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మరో రూ.150 కోట్ల తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఓవర్సీస్ నుంచి రావాలి.దిల్ రాజు ప్లాన్ ఏంటి?సినిమాను నిర్మించడమే కాదు.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ దిల్ రాజు దిట్ట. తనదైన శైలీలో ప్రమోషన్స్ చేసి యావరేజ్ సినిమాను కూడా హిట్ చేయించగలడు.గతంలో చాలా సినిమాలు దిల్ రాజు ప్రమోషన్స్ వల్లే మంచి కలెక్షన్స్‌ని రాబట్టాయి. ఇక తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌పై దిల్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రిలీజ్‌ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసి మంచి పనే చేశాడు. పండగ సీజన్లో యావరేజ్ టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే దిల్ రాజు కాస్త లేట్ అయినా..రిలీజ్‌ని సంక్రాంతికి మార్చాడు. ఇక నైజాంతో పాటు వైజాగ్‌లోనూ ఆయనే సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. మిగతా ప్రాంతాల్లో తన రెగ్యులర్ బయ్యర్లుకు సినిమాను అప్పజెప్పాడు. సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఈజీగా బ్రేక్ ఈవెట్ దాటేస్తుంది. ఇక హిందీలో బాగా ఆడితే మాత్రం.. దిల్ రాజు పంట పండినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. -
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి మరో పాట రిలీజైంది. 'దోప్' అనే లిరిక్స్‌తో సాగుతూ మంచి కలర్ఫుల్గా ఉంది. కాకపోతే చాలావరకు ఇంగ్లీష్ లిరిక్స్ వినిపించాయి. ఒకటో రెండో తెలుగు పదాలు కనిపించాయి. విజువల్‌గా చూసుకుంటే మాత్రం చాలా రిచ్‌గా ఉంది.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. అమెరికాలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన 'రా మచ్చా', 'నానా హైరానా', 'జరగండి' పాటలు అలరించగా.. ఇప్పుడొచ్చిన పాట కూడా మెల్లగా జనాలకు అలవాటు కావొచ్చనిపిస్తోంది.జనవరి 10న థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ కానుంది. ఇందులో చరణ్ సరసన కియారా అడ్వాణీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటించారు. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతికి బిగ్ స్క్రీన్స్‌పైకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు) -
భారతీయుడు 2 ఫ్లాప్ మీద స్పందించిన శంకర్
-
‘గేమ్ ఛేంజర్’ గెటప్‌తో ఇంటికి వెళ్లా..అమ్మ షాకైంది: శ్రీకాంత్
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది’అన్నారు నటుడు శ్రీకాంత్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘గేమ్ ఛేంజర్’లో నా గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా నాన్నగారి గెటప్ చూసే నాకు ఈ పాత్ర ఇచ్చారు. ఓ సారి ఆ గెటప్ వేసుకొని ఇంటికి వెళ్తే.. నన్ను చూసి మా అమ్మ షాకయ్యింది. అప్పుడే నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అర్థమైంది.→ నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమాకు ముఖ్యమైన క్యారెక్టర్ నాది. ఇంత మంది అవకాశం రావడం నా అదృష్టం.→ శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.→ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి పని చేశాడు. అప్పుడు రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు.→ ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.→ అందరి డేట్లు సెట్ అవ్వకపోవడం వల్లే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.→ ప్రస్తుతం రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వెలమలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తోందని.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. -
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు. -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. -
గేమ్ ఛేంజర్ కు పోటీగా బాలయ్య, వెంకీ, అజిత్, విక్రమ్...
-
మళ్ళీ భారతీయుడి 3 పై రూమర్లు..
-
Game Changer Teaser: వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను మొదట విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లా కేంద్రాల్లోని థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతో పాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. -
నా మార్కెట్ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా
జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. విజయాలతో విర్రవీగిన మహామహులు కూడా అపజయాలను చవి చూశారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది భామ గత 12 ఏళ్ల క్రితం టాలీవుడ్,కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాల నుంచి ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా తెలుగుతో పాటు తమిళ్లో మళ్లీ అవకాశాలు దక్కుతున్నాయి.గతంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు సూపర్‌హిట్ కావడంతో పూజాహెగ్డేకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. దీంతో కోలీవుడ్ స్వాగతం పలికింది. అయితే అలా తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం కూడా పూర్తిగా నిరాశ పరిచింది. అదే సమయంలో టాలీవుడ్, బాలీవుడ్లో పూజాహెగ్డే నటించిన చిత్రాలు ప్లాప్ కావడంతో ఇక ఈ అమ్మడి పనైపోయింది అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం హిట్స్ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్యకు జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించి పూర్తి చేశారు. తాజాగా నటుడు విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జత కడుతున్నారు. అలాగే తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఈ సందర్బంగా నటి పూజాహెగ్డే ఒక భేటీలో తన కెరీర్ గురించి పేర్కొంటూ తన మార్కెట్ పడిపోయిందనే ప్రచారం గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అలాగే అపజయాల గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదన్నారు. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్ కోసం సహనంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నట్లు ,అందులో రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని నటి పూజాహెగ్డే పేర్కొన్నారు. -
Actress Kasthuri: నాకు అండగా తెలుగు వారున్నారు...
-
'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కానుంది. నవంబర్ 9న గ్రాండ్‌గా గేమ్ చేంజర్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్‌కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు మరింత రేంజ్లో పెరగనున్నాయి. టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్‌ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా మెప్పించనున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. Ready, Set... Command 😎Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024 -
తెలుగులోనూ విడుదలైన హిట్ సినిమా రీమేక్‌లో జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ అన్న విషయం తెలిసిందే. తిను ధడక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే బాగా పాపులర్ అయిన జాన్వి కపూర్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు ఉండడం విశేషం. అయితే సరైన హిట్స్ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే జాన్వీ కపూర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలు ఆఫర్స్ రావడం మొదలెట్టాయి. దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను సాధించింది. తాజాగా తెలుగులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తెలుగులో మరో అవకాశం ఈమె కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కోలీవుడ్ దృష్టి జాన్వీ కపూర్‌పై పడినట్టు తాజా సమాచారం. ఇక్కడ ఒక భారీ చిత్రంలో ఈమెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఈరం' (తెలుగులో వైశాలి) చిత్రం హిందీ రీమేక్‌లో నటించే అవకాశం జాన్వీ కపూర్‌ను వరించినట్లు తాజా సమాచారం. తమిళంలో దర్శకుడు శంకర్ నిర్మించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించారు. 2009లో విడుదలైన ఈ చిత్రం నటుడు ఆది పినిశెట్టి, నంద, సింధు మేనన్, శరణ్య మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నట్లు అందులో నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది ఈ చితం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస దర్శకుడుగా పరిచయం కానున్నారు. కాగా ఈరం చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని చేర్పులు మార్పులు చేయగలరా? అని జాన్వీ కపూర్ కోరగా అందుకు దర్శక టీం ఓకే చెప్పినట్లు సమాచారం. -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్ 3?
‘ఇండియన్ 3’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే సమాధానాలే కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరవైఎనిమిదేళ్ల తర్వాత ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. రెండు సీక్వెల్స్‌లోనూ కమల్‌హాసన్ హీరోగా నటించారు. ‘ఇండియన్ 2’ విడుదలైన ఆరు నెలల తర్వాత ‘ఇండియన్ 3’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఏడాది జూలై 12న ‘ఇండియన్ 2’ థియేటర్స్‌లో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ‘ఇండియన్ 3’ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్‌లో టాక్ వినిపించింది. అయితే ‘ఇండియన్ 2’ సక్సెస్ కాని నేపథ్యంలో ‘ఇండియన్ 3’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రయూనిట్ ఆలోచిస్తోందనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చి0ది. మరి... తమిళ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నట్లుగా ‘ఇండియన్ 3’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందా? అనేది చూడాలి. ఇక ‘ఇండియన్ 3’ సినిమాను లైకాప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... నయనతార, సిద్ధార్్థ, మాధవన్, మీరా జాస్మిన్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ది టెస్ట్’. శశికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్ ప్రోమో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా రెండో పాట గురించి మేకర్స్ సమాచారం ఇచ్చారు. ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్. సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 'గేమ్ చేంజర్' నుంచి విడుదలైన 'జరగండి జరగండి' అనే పాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.గేమ్ చేంజర్ నుంచి తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'రా మచ్చా మచ్చా..' అనే లిరిక్స్‌తో మొదలైన ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులేశారట. ఇదే పాట గురించి సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ శంకర్ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. -
ఫైనల్‌గా తండ్రి దర్శకత్వంలో కూతురు?
కోలీవుడ్‌లో స్టార్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో ముందుండే పేరు శంకర్. భారీ సినిమాలని తీసి రికార్డులు కొల్లగొట్టే ఈయన.. రీసెంట్ గా వచ్చిన 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో శంకర్ తీసిన 'గేమ్ ఛేంజర్'పై లేనిపోని సందేహాలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. దీని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే.. 'భారతీయుడు 3'పైన శంకర్ ఫోకస్ పెట్టాడు. మరికొన్ని సీన్స్ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో)వీటన్నింటి తర్వాత శంకర్ ఏం సినిమా చేస్తాడా అనేదే సస్పెన్స్‌గానే ఉంది. 'వేలప్పారి' నవలను భారీ బడ్జెట్‌తో శంకర్ తీయాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులోనే తన కూతురిని కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం తమిళంలో యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్న అదితీకి.. తండ్రి శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తే జాక్‌పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
శంకర్ ఆశలన్నీరామ్ చరణ్ పైనే..
-
మెగా ప్యాన్స్‌ని భయపెడుతున్న ‘భారతీయుడు’
సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే..దాని ఎఫెక్ట్ నెక్ట్స్ ఫిల్మ్‌పై కచ్చితంగా ఉంటుంది. సదరు డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్ చేసి ఉంటే.. సదరు హీరో అభిమానులకు టెన్షన్ తప్పదు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్ పట్టుకుంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూసి వారు భయపడిపోతున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో టెన్షన్ మొదలైంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కావడంతో రీలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్‌పై ఒత్తిడి తెచ్చారు. అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడయా వేదికగా శంకర్‌కి, నిర్మాత దిల్‌రాజ్‌కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్.. ఇప్పట్లో రిలీజ్ వద్దంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శంకర్‌పై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. భారతీయుడు 2 చిత్రాన్ని నాసిరకంగా తెరకెక్కించారంటూ శంకర్‌ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. ట్రోలింగ్ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్ డేట్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి అని చిత్ర యూనిట్‌కి మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. -
'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ సెట్స్ మీదే ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు 'భారతీయుడు 2' తీయాలనుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చి పడింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్-శంకర్ మూవీపై సందేహాలు తలెత్తాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సముదాయించుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)ఇకపోతే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్నా సరే చాలా ఓపిగ్గా చేస్తూ వచ్చిన రామ్ చరణ్.. ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట.పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్కి 'గేమ్ ఛేంజర్'.. థియేటర్లలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) -
పొరపాటు సరిదిద్దుకున్న 'భారతీయుడు 2'.. ఇదేదో ముందే చేసుంటే!
తప్పు జరిగిన తర్వాత కానీ సేనాపతి తాతయ్యకి ఎంత పొరపాటు జరిగిందో తెలిసీ రాలేదు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'భారతీయుడు 2' తొలిరోజు తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభ షోలు చూసిన వాళ్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం టాక్ పూర్తిగా మారిపోయింది. చాలా తక్కువమంది మాత్రమే పాజిటివ్ అన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే మూవీ టీమ్ పొరపాటు సరిదిద్దుకుంది.యాక్షన్ సినిమాల్లాంటివి అంటే మూడు గంటలు చూస్తారు గానీ డ్రామా ఉండే సినిమాలు ఎంత క్రిస్పీగా ఉంటే అంత బెటర్. ఇలానే తను తీసిన సీన్లపై నమ్మకంతో దాదాపు 3 గంటల నిడివితో 'భారతీయుడు 2'ని డైరెక్టర్ శంకర్.. ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంత ల్యాగ్ ఏంట్రా బాబు అని చెప్పి అదే ఆడియెన్స్ సైడ్ చేసేశారు. దీంతో సినిమాలో అనవసరంగా అనిపించిన 20 నిమిషాల సన్నివేశాల్ని ఇప్పుడు తీసేశారు.(ఇదీ చదవండి: Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)అలా 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్‌ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చిన వెంటనే.. నెటిజన్లు కూడా తలో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ పనేదో ముందే చేసుంటే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా చేతులు కాల్చుకున్న తర్వాత గానీ భారతీయుడు తాతయ్య ఆకులు గుర్తుకురాలేదు!ఇదిలా ఉండగా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 'భారతీయుడు 2' సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెగిటివ్ టాక్, మరోవైపు సీన్లు తీసేసిన దృష్ట్యా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) -
'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!
'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్‌కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్‌గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి) -
ఫ్యాన్స్ ఎదురుచూపులను నీరుగార్చిన శంకర్
-
పాన్ ఇండియా.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి
-
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఎట్టకేలకు భారతీయుడు తాత థియేటర్లలోకి వచ్చేశాడు. అప్పుడెప్పుడో 1996లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ని తాజాగా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అలానే స్ట్రీమింగ్ డేట్ కూడా ఇదే కావొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)కమల్ హాసన్ - శంకర్ కాంబోలో అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. తీసింది తమిళంలో అయినా తెలుగు డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కొన్నేళ్ల క్రితం రెండో భాగాన్ని మొదలుపెట్టగా.. కొవిడ్, షూటింగ్ స్పాట్లో ప్రమాదం వల్ల ఏళ్లకు ఏళ్లు లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా పూర్తి చేసి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చారు.సినిమా మరీ ల్యాగ్ ఉందని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. తాతయ్య మరీ విసిగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 'భారతీయుడు 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే 6-8 వారాల తర్వాత రావొచ్చు. కానీ టాక్ తేడాగా వస్తుండటంతో 4-5 వారాల్లోపే వచ్చే అవకాశముంది. దీనిబట్టి చూస్తే ఇండిపెండెన్స్ డే వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు) -
భారతీయుడు 2 దెబ్బకు అక్షయ్ వెనక్కి
-
Bharateeyudu 2 X Review: ‘భారతీయుడు 2’ టాక్ ఎలా ఉందంటే.. ?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు(1996)’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి(కమల్ హాసన్) చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా భారతీయుడు 2(ఇండియన్ 2) వచ్చింది. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న శంకర్.. మరోసారి తనదైన మార్క్ సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘భారతీయుడు కథేంటి?, సేనాపతిగా మరోసారి కమల్ ఆకట్టుకున్నాడా? లేదా? శంకర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో ‘భారతీయుడు 2’కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Bharateeyudu2 Movie Review 🔥🔥🔥 1/2Hats off to director #Shankar for his top level direction.#KamalHassan is steel the complete show. Social Message of the movie will reach to every audience.Overall movie wins normal audience heart💐💐#Bharateeyudu2Review#Indian2Review pic.twitter.com/tRB6cidHsV— Movie Muchatlu (@MovieMuchatlu1) July 12, 2024 డైరెక్టర్ శంకర్‌కి హాట్సాఫ్. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్ హాసన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్ మెసేజ్ ప్రతి ఆడియన్‌కి రీచ్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Genuine #Indian2Review/#Bharateeyudu2ReviewDISASTER👎Rating 1.5/5Impactless,Dragged, Boring,Outdated,Cringe Movie👎#Siddharth #KamalHaasan (Less Screen time) &Director #Shankar gone Outdated👎#Indian2 #Bharateeyudu2#Hindustani2Review #Hindustani2 https://t.co/3c9WuK58GK— #Kalki2989AD ❤ (@TheWarriorr26) July 12, 2024 భారతీయుడు 2 డిజాస్టర్ మూవీ. బోరింగ్, ఔడేటెడ్ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. first half: movie starts well, but follows conventional shankar sir’s screenplay making it very predictable and boring.. no gripping/exciting sequences.. needs a very strong second half #Indian2 #Bharateeyudu2 https://t.co/fgOf5prfHJ— movie buff (@newMovieBuff007) July 12, 2024 ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్‌గా అనిపించింది. శంకర్ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్‌గా, ఎగ్జైట్మెంట్ చేసే సీక్వెన్స్లేవి లేవు. సెకండాఫ్ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.. #Indian2 Review 1.5/5Fully disappointed Bad screenplay Emotions lackIndian 3 kastame... pic.twitter.com/fcaOB7vPHX— 👥𝕳𝖆𝖗𝖘𝖍𝖆💫 (@Harsh___07__) July 12, 2024 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.#Indian2 is an outdated and tedious movie. Though the movie tries to give honest messages, it’s done in a boring way with no proper emotion and drama at all. Shankar tried to repeat the screenplay of his old movies but fails to recreate the magic big time. All of the emotions…— Venky Reviews (@venkyreviews) July 12, 2024#Indian2 #Bharateeyudu2 #indian2review Telugu review:It’s just an average to below average movie. There is no story it is just like a set up to Indian3. Yes Indian3 trailer was played after the rolling titles and Indian3 seems pretty interesting and I think Indian3 would be…— Vijay (@vijay827482) July 12, 2024#Bharateeyudu2 #Indian2 Stil remember the first part can't say whether the sequel could match it as the bench mark was high it releases today but there is no buzz at least in Hindi. Why aren't films being promoted ##Kalki2898AD too was released in a similar way. WOM will decide.— Bhaskar Agnihotri (@BHASKARAGNIHOT) July 12, 2024#Indian2 #Bharateeydu2 #Indian2Review #Bharateeydu2Review #Review *Not Engaging at all*No shankar mark*No emotional ConnectDid Shankar directed this movie for real ?— Raju (@rsofficial18) July 12, 2024Finally Kamal Hassan's entry.. But it has zero impact in the audience with 30 mins of lag boring scenes. Even Kamal Hassan's entry failed to excite the mass audience. Till now, there is not even a single scene of Shankar's calibre #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/gztpLV2iwJ— Taran Adarsh (@tarann_adarshh) July 12, 2024 -
భారతీయుడు 2 రిలీజ్.. టెన్షన్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్‌కి ప్లస్ అవుతుంది. (చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
ఇండియన్ 2 అమ్ముతున్నాం అందరూ కొనండి ప్లీజ్
-
గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కి రామ్ చరణ్ గుడ్ బాయ్
-
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఇకపై నా లక్ష్యం అదే: కమల్‌హాసన్
‘‘యాభై రెండేళ్ల క్రితం నేను హైదరాబాద్‌కు ఓ సాంకేతిక నిపుణుడిలా వచ్చాను. నటుడిగా మూడుతరాలుగా నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంతకాలం నన్ను ప్రేక్షకులు స్టార్డమ్లో ఉంచారు. ఇక నాకు ఏదైనా లక్ష్యం ఉందా? అంటే బాలచందర్గారిలా చాలామందిని చిత్ర పరిశ్రమకు తీసుకురావాలి. నాలాంటి నటులను తయారు చేయాలి. అలా ప్రేక్షకుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను’’ అని కమల్‌హాసన్ అన్నారు.శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్ర ఖని, బాబీసింహా, గుల్షన్ గ్రోవర్ ఇతర రోల్స్‌లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ‘భారతీయుడు 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీలక్ష్మి మూవీస్ దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ–‘‘కమ్‌బ్యాక్ ఇండియన్ ’ అంటే ఇండియన్ తాత గురించి కాదు.. మనవడు రావాలి.. వస్తాడు. ‘ఇండియన్ 2’ను హిట్ చేయండి.. త్వరగా ‘ఇండియన్ 3’ చూస్తారు. ‘భారతీయుడు’ నిర్మించిన ఏఎయం రత్నంగారికి ధన్యవాదాలు. శంకర్గారిలాంటి విజన్ ఉన్న దర్శకులు ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయి సినిమా చేశారు. ఇందులో తెలుగు సినిమాకు పెద్ద భాగం ఉంది. కళాకారులు భాష సరిహద్దులను చేరిపేశారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్, బాలచందర్, శంకర్గార్ల వంటి దర్శకులు, ఆర్టిస్టులు ఉన్నారు’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ–‘‘లంచగొండి వార్తలను చదివిన ప్రతిసారి ‘భారతీయుడు’ మళ్లీ రావాలని నాకు అనిపించేది. కానీ స్టోరీ కుదరలేదు. ‘2.ఓ’ తర్వాత కమల్‌గారికి ‘భారతీయుడు’ సీక్వెల్ కథ చె΄్పాను. నేను రాసిన ఓ సన్నివేశాన్ని తన నటనతో పదింతలు గొప్పగా ఉండేలా చేస్తారు కమల్‌గారు. బ్రహ్మానందంగారికి నేను అభిమానిని. ‘ఇండియన్ 2, గేమ్‌చేంజర్’లో ఆయన అతిథి పాత్ర చేశారు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సునీల్, తిరుపతి ప్రసాద్‌గార్లకు థ్యాంక్స్. రామ్‌చరణ్‌తో ‘గేమ్‌చేంజర్’ చేస్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేస్తాం’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం నాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు’’ అన్నారు ఏస్జే సూర్య. ‘‘నా అభిమాన నటుడు కమల్‌గారితో నటించాలన్న నా కల నిజమైంది.కమల్‌హాసన్ గారికి నేను ఎప్పటికీ విద్యార్థినే. యువతరానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? అన్నది ‘భారతీయుడు 2’లో ఉంటుంది’’ అన్నారు సిద్ధార్థ్. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ‘‘ఈ విశ్వంలో కమల్గారిలాంటి నటుడు మరొకరు లేరు. ఆయనతో నటించానని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. ఈ వేడుకలో నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్, నటులు బాబీసింహా, సముద్రఖని, గీత రచయితలు సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆట పూర్తయింది
‘గేమ్ చేంజర్’ ఆటను పూర్తి చేశారు రామ్‌చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ వంతు షూటింగ్ శనివారంతో ముగిసిందని సమాచారం.హైదరాబాద్‌లో జరిగిన ‘గేమ్ చేంజర్’ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణలో రామ్‌చరణ్ పాల్గొన్నట్లుగా తెలిసింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకుగా రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్‌చంద్ర, జయరాం, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. -
భారతీయుడు 2 సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా..?
అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. అయితే, ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3.04 గంటల పాటు నిడివి ఉంది. ఈ చిత్రం నుంచి కొన్ని అభ్యంతకరమైన సీన్లును తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఇంత నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే కథ ప్రధాన బలంగా ఉండాలి. ఈ విషయంలో శంకర్ విజయం సాధిస్తాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.రంగస్థలం నుంచి ఈ మధ్య వచ్చిన యానిమల్, సలార్, కల్కి వంటి చిత్రాలు మూడు గంటల నిడివితో వచ్చినవే కావడం విశేషం. ఇప్పుడు తాజాగా భారతీయుడు 2 కూడా ఎక్కువ రన్‌టైమ్ ఉన్న లిస్ట్‌లో చేరిపోయింది. భారీ అంచనాలతో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపిన కమల్ ఇప్పుడు భారతీయుడు చిత్రంతో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఉన్నారు. -
శంకర్ దర్శకత్వంలో 3 భారీ చిత్రాలు
దర్శకుడు శంకర్ అంటే బ్రహ్మాండం . బ్రహ్మాండ మంటే శంకర్ అనేలా ఆయన చిత్రాలు ఉంటాయి. ఈయన చిత్రా లు నిర్మించడంలో లేట్ అయినా, చిత్రాలు మాత్రం లేటెస్ట్గా ఉంటాయి. కాగా 1996లో నటుడు కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా సుమారు 28 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇండియన్– 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇండియన్ – 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్లో బిజీ బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఒక భేటీలో తన తదుపరి చిత్రాల గురించి పేర్కొన్నారు. తదుపరి 3 భారీ కథా చిత్రాలను చేయబోతున్నట్లు చెప్పారు. అందులో ఒకటి చారిత్రాత్మక కథాంశంతో ఉంటుందని, మరొకటి జేమ్స్‌బాండ్ తరహాలో సాగే కథా చిత్రం అని, ఇక మూడోది స్పై కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ మూడు చిత్రాలు భారీ బడ్జెట్లో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. వీటికి ప్రపంచంలోనే ఆధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో రూపొందించ తలపెట్టినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. కాగా ఇండియన్ –3 చిత్రం షూటింగ్ కూడా పూర్తి కావడంతో మరో ఆరు నెలలు ఈ చిత్రం కూడా విడుదల అవుతుందని చెప్పారు. ఇక తాను తెలుగులో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ మరో 15, 20 రోజుల్లో పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ అవకాశమే లేదు!
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పేరు చెప్పగానే ఫ్యాన్స్ డీలా పడిపోతారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కరోనా టైంలో ప్రకటన వచ్చింది. దీంతో ఆహా ఓహో అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇంకా సెట్స్ మీదే ఉంటోంది. శంకర్ ఒకేసారి రెండు మూవీస్ చేయడం వల్లే ఈ చిక్కొచ్చిపడింది. ఇప్పుడు 'భారతీయుడు 2' రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ గురించి దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)'గేమ్ ఛేంజర్' మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని అన్నారు. 'భారతీయుడు 2' రిలీజైన వెంటనే ఆ పనిమీదే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలానే ఈ రెండు చిత్రాలకు అస్సలు పోలికే లేదని క్లారిటీ ఇచ్చాడు. 'గేమ్ ఛేంజర్' విషయంలో రెండో భాగం లాంటిది ఏం ఉండదని, ఆ స్టోరీ స్కోప్ లేదని పేర్కొన్నాడు. దీంతో చరణ్ మూవీకి సీక్వెల్ ఏం ఉండదని స్పష్టత వచ్చేసింది.'గేమ్ ఛేంజర్'లోని రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తాడు. నవంబరులో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే టైంలో అంటే దీపావళికి 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఈ తేదీ మిస్సయితే క్రిస్మస్ మాత్రం పక్కా అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. (ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్)10-15 Days Shoot Pending. #GameChanger. pic.twitter.com/sROnvfAWIY— Johnnie Walker (@Johnnie5ir) July 1, 2024 -
ఇండియన్ 2 సినిమాకు విడుదల చిక్కులు
అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 చిత్రానికి విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తున్నాయి.భారతీయుడు సినిమాలో అవినీతిపరులను అంతం చేసేందుకు కమల్ హాసన్ తన రెండు వేళ్ల సాయంతో శత్రువుల మెడ భాగంపై సింపుల్‌గా నొక్కి హతమారుస్తాడు . భారతీయుడు సినిమా కోసం మర్మక్కలై (మర్మకళ) అనే విద్యకు సంబంధించిన కొన్ని ట్రిక్స్‌ను కమల్ నేర్చుకున్నారు. 1996 సమయంలోనే ఆ విద్యను రాజేంద్రన్ అనే వ్యక్తి నుంచి కమల్ నేర్చుకున్నారు. ఇప్పుడు భారతీయుడు 2 సినిమా కోసం తను నేర్పించిన విద్యనే వెండితెరపై చూపించబోతున్నారని, అందుకు సంబంధించి తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని మదురై జిల్లా న్యాయస్థానంలో కాపీరైట్ కేసును రాజేంద్రన్ వేశారు. భారతీయుడు సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు.రాజేంద్రన్ తన పిటీషన్లో ఇలా పేర్కొన్నారు..' 1996 భారతీయుడు సినిమా సెట్లో కమల్‌హాసన్‌కు వర్మక్కలై విద్యకు సంబంధించి కొన్ని ముద్రలు నేర్పించాను. కొన్ని ఫైట్ సీన్స్‌కు అవసరమైన విద్యను నా నుంచే నేర్చుకున్నారు. మర్మకళ కళలోని శాస్త్రీయ పద్ధతులను చిత్ర దర్శకుడు శంకర్‌తో పాటు రచయిత సుజాతకు వివరించాను. అలా భారతీయుడు-1 సినిమాలో పనిచేసిన వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉంది.ఈ సందర్భంలో భారతీయుడు 2 సినిమా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో నేను కమల్ హాసన్‌కి శిక్షణ ఇచ్చిన మర్మకళ ముద్రలను మళ్లీ ఉపయోగించారు. కానీ సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు లేదు. ఇండియన్ సినిమా కోసం నా నుంచి ట్రైనింగ్ తీసుకున్న వర్మ ముద్రలనే ఇండియన్-2 సినిమాలో కూడా వాడారు కాబట్టి ఈ సినిమాలో కూడా నా పేరు ఎందుకు వేయలేదు. కాబట్టి ఈ సినిమా విడుదలను నిషేధించాలి.' అని పిటిషన్లో రాజేంద్రన్ పేర్కొన్నారు.ఈ కేసు మదురై జిల్లా న్యాయమూర్తి సెల్వ మహేశ్వరి ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇండియన్ 2 నిర్మాత సుభాస్కరణ్, దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్‌లకు కాపీరైట్ నోటీసులు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. జూలై 12న భారతీయుడు సినిమా విడుదల కానుంది. -
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్‌లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్‌హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
భారతీయుడు 2 బ్యాడ్ గా ఉందా..?
-
కమల్‌హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
గేమ్ చేంజర్ తర్వాత శంకర్ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరో ఎవరు..?
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. ఈ విషయంలో మరోమాటకు తావు లేదు. కొత్తవారితో చేసినా అది భారీగా ఉంటుంది. అందుకు చిన్న ఉదాహరణ బాయ్స్ చిత్రం. ఇకపోతే తొలి రోజుల్లోనే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో భారీ తనాన్ని చూపించిన దర్శకుడు శంకర్. ఇక ఇండియన్, రోబో, అపరిచితుడు, ఐ వంటి చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఇండియన్–2, తెలుగు చిత్రం గేమ్ చేంజర్ ఉన్నాయి. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీని తరువాత రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ చిత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. దీంతో శంకర్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. అందుకు సమాధానంగా ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే అజిత్ హీరోగా శంకర్ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారట. అజిత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో సూపర్ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ఆయన. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో తన 63వ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రెండు చిత్రాల తరువాత అజిత్ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు శంకర్ దర్శకత్వంలో నటించనున్నారని టాక్ వస్తోంది. అజిత్, దర్శకుడు శంకర్ల క్రేజీ కాంబినేషన్లో ఇప్పటి వరకూ చిత్రం రాలేదు. తాజాగా బాహుబలి చిత్రాన్ని మించే స్థాయిలో భారీ బడ్జెట్ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, నిజం అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
అప్పుడే ఇండియన్ 2 గురించి శంకర్‌తో మాట్లాడా!: కమల్‌హాసన్
‘‘ఇరవైఎనిమిదేళ్ల క్రితం నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాల్సింది. అదే సమయంలో ‘ఇండియన్’ కథతో దర్శకుడు శంకర్ వచ్చారు. ఈ రెండు చిత్రాల కథలు దగ్గర దగ్గరగా ఉన్నాయని శివాజీగారితో చెప్పాను. ‘శంకర్గారితోనే సినిమా చేయండి. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. శివాజీగారు అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతో శంకర్‌గారితో ‘ఇండియన్ ’ సినిమా చేశాను. నిర్మాత ఏఎం రత్నంగారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ సమయంలోనే ‘ఇండియన్’కు సీక్వెల్ గురించి శంకర్‌గారితో మాట్లాడాను. కథ రెడీగా లేదన్నారు.28 ఏళ్ల తర్వాత ‘ఇండియన్ 2’ చేశాం. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు కమల్‌హాసన్. హీరో కమల్‌హాసన్– దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలు రూపొందాయి. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో శంకర్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్ వంటి నటులు ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇండియన్ 2’ పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఇండియన్’ సినిమాకు ఏఆర్ రెహమాన్‌గారు గొప్ప సంగీతం ఇచ్చారు. ‘ఇండియన్ 2’కి నేను సంగీతం ఇచ్చాను. శంకర్‌గారు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు అనిరు«ద్ రవిచందర్. -
'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?
'విక్రమ్' సినిమాతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. దీంతో పలు భారీ చిత్రాల్లో భాగమయ్యారు. వీటిలో ఒకటే 'ఇండియన్ 2'. 'భారతీయుడు' మూవీకి సీక్వెల్ ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దర్శకుడు-హీరో కలిసి పనిచేశారు. ఇలా చూసుకుంటే అంచనాలు ఏ రేంజులో ఉండాలి? కానీ రియాలిటీలో అలా ఉందా?(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)ఇప్పుడు సినిమాల విషయంలో భాషతో ఎవరికీ సంబంధం లేదు. మంచి కంటెంట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పర్వాలేదనిపించాయి. పూర్తి ఆల్బమ్ కూడా ఓకే ఓకే అనుకునేలా ఉంది తప్పితే సూపర్ అనే టాక్ రాలేదు. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ కాజల్ సీన్స్ ఏం లేవంట. అంటే సేనాపతికి భార్య క్యారెక్టర్ ఉండదేమో? అలానే తమిళంలో బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు. ఇప్పటివరకు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మూవీ ఒకటుందని సగటు ప్రేక్షకుడికి ఇంకా రిజిస్టర్ కావట్లేదు. విడుదలకు మరోనెల మాత్రమే ఉన్న నేపథ్యంలో 'భారతీయుడు 2' జోరు పెంచాలి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
శంకర్ కు ఏమైంది.. భారతీయుడు 2 సాంగ్స్ ఎందుకు ఇలా ఉన్నాయ్...
-
పుష్ప 2 పాటలు ఫలించాయా.. ?
-
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
శంకర్ డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్ నటిస్తోన్న చిత్రం ఇండియన్-2. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ట్వీట్ చేశారు.కాగా.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందించిన భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Vanakkam INDIA! 🇮🇳 The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! 🥁 Get ready to welcome the comeback of SENAPATHY! 🤞🏻 Releasing worldwide in cinemas 12th July 2024! 🎬🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5— Lyca Productions (@LycaProductions) May 19, 2024 -
Indraja Sankar Birthday Photos: విజిల్ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
-
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
తమిళ సినిమా: కోలీవుడ్‌లో లక్కీయస్ట్ కథానాయకి ఎవరంటే ప్రస్తుతం నటి అదితి శంకర్ పేరే వినిపిస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ వారసురాలైన ఈమె డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ విధంగా విరుమాన్ చిత్రంలో కార్తీకి జంటగా నటించి తొలి విజయాన్ని అందుకున్నారీమె. అదే చిత్రంలో పాట పాడి గాయనిగాను ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా ఈమెకు సక్సెస్ అందించింది. అలా ఇప్పటికీ నటించింది రెండు చిత్రాలు అయినా పలు చిత్రాల్లో నటించిన ప్రచారాన్ని పొందారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో నవ నటుడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. ఈయన దివంగత ప్రముఖ నటుడు మురళి రెండవ కొడుకు. కాగా నటి అదితి శంకర్‌ను త్వరలో నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వరించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. కాగా అదితి శంకర్ పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటనను పెద్ద ఫ్యాషన్‌గా భావించే ఈమె అంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతారని భావించలేం. కాగా సమీపకారంలో అదితి శంకర్ అక్క రెండవ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసింది. ఇకపోతే అదితి శంకర్ తరచూ ఫొటో సెషన్లను నిర్వహించుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఆమె పెళ్లి కూతురుగా తయారైన ఒక అందమైన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అక్క పెళ్లి అయ్యింది.. తర్వాత అదితి శంకర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారా? అనే కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మరింత ఆలస్యంగా ‘ఇండియన్ 2’..?
భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌తోనే ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్. ‘ఇండియన్ 2’ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్ రవిచందర్. -
శంకర్ ఇండియన్ 2 సినిమా పై భారీ ప్లాన్
-
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
పారిస్ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ మోకాలి గాయంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సమయంలో శ్రీశంకర్ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఈ ఏడాది మొత్తం శ్రీశంకర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. కేరళకు చెందిన 25 ఏళ్ల శ్రీశంకర్ గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను కూడా సంపాదించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2023 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడినా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. -
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్‌రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
Aishwarya Wedding Reception: డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్లో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఏనుగు దాడిలో రైతు మృతి
చింతలమానెపల్లి (సిర్పూర్): ఏనుగు దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని అటవీప్రాంతం నుంచి బుధవారం తెల్లవారుజామున ప్రాణహిత నది దాటి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూము ల్లోకి చొరబడింది. అక్కడే ఉన్న ఓ రైతుపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం బూరెపల్లిసమీపంలోని ప్రాణహిత నదిలో ఏనుగును గ్రామస్తులు కొంతమంది గమనించారు. ప్రాణహిత నది నుంచి బూరెపల్లి వ్యవసాయ భూముల వైపు వెళ్లింది. ఆ సమయంలోనే గ్రామ శివారులోని మిరపతోటలో అల్లూరి శంకర్(55) భార్య సుగుణబాయి, మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నాడు. ఏనుగు రాకను గమనించిన సుగుణ బాయి భర్తతోపాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరుగెత్తింది. తోట నుంచి వెళ్లలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. నేరుగా అక్కడికే వచ్చిన ఏనుగు శంకర్‌ను తొండంతో పైకి లేపి విసిరింది. ఎగిరి కింద పడిన అతడిని మళ్లీ కాలితో తొక్కడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగు అక్కడి నుంచి బాబాపూర్ వైపు వెళ్లడంతో కుటుంబసభ్యులు శంకర్ మృతదేహం వద్దకు వెళ్లారు. శంకర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, డీఎఫ్ఓ నీరజ్‌కుమార్ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.10వేలు అందించారు. చిక్కని ఏనుగు: కౌటాల సీఐ సాదిక్ పాషా, ఖర్జెల్లి రేంజ్ అధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందాలు ఏనుగును అనుసరించాయి. గంగాపూర్ నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాలువల మీదుగా ఖర్జెల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఖర్జెల్లి గ్రామస్తులు ఏనుగు గ్రామం వైపు రాకుండా మంటలు పెట్టారు. రాత్రి కావడంతో ఏనుగు వెళుతున్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాకపోకలు నిలిపివేశారు. రాత్రి పది గంటల వరకు రుద్రాపూర్ సమీపంలో ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి కొండా సురేఖ ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ మృతి చెందడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామన్నారు. -
‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్‌చరణ్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మూవీని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గొప్ప సినిమాలను అందించాలనే తపనపడి, ఎంతటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధపడే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ తోడు కావటంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతం అని అందరూ మెచ్చుకోవాలనేలా సినిమాలు తీయటం శంకర్ అలవాటు. రామ్ చరణ్‌కి వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. నేడు 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. -
కమెడియన్ ఇంట వేడుకలు.. బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నటి
కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్మెంట్ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరుముద్దలు.. 'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్(విజిల్) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్ సేన్ 'పాగల్' మూవీలో 'ఈ సింగిల్ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. View this post on Instagram A post shared by sai sreedevi (@sai.sree.devi) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) చదవండి: బాలీవుడ్ స్టార్స్.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
లక్కీ హీరోయిన్ రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?
ఏ రంగంలోనైనా విజయాల ప్రభావం చాలానే ఉంటుంది. అందుకు ప్రతిభ, శ్రమ మాత్రమే సరిపోదని, అదృష్టం తోడవ్వాలన్నది వాస్తవం. ఒక్కోసారి హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు విజయం సాధించినా, తదుపరి అవకాశాలు రావడం కష్టంగా మారుతుంది. అయితే నటి అదితి శంకర్ పరిస్థితి ఇందుకు విరుద్ధం అనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్ ఇద్దరు కూతుళ్లలో చిన్న కూతురు అదితి శంకర్. వైద్య విద్యను అభ్యసించిన ఈ భామ నటనపై ఆసక్తితో సినీ రంగప్రవేశం చేశారు. అలా 2022లో కార్తీకి జంటగా విరుమాన్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంతో గాయనిగానూ పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమె పాడిన పాట హిట్ కావడంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈమె నటించిన రెండో చిత్రం మావీరన్. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దీంతో కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేసుకున్నారు. కాగా ప్రస్తుతం విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దివంగత నటుడు మురళీ రెండో కొడుకు, నటుడు అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు సూర్య సరసన జత కట్టే అవకాశం అదితి శంకర్‌ను వరించిందన్న టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మించనున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే నటుడు అధర్వ సరసన కూడా అదితి శంకర్ నటించనున్నారనేది తాజా సమాచారం. ఇలా రెండేళ్లలో ఈమె నటించిన రెండు చిత్రాలు విడుదలై సక్సెస్ కాగా, మరో మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం విశేషం. ఇకపోతే అదితి శంకర్ పారితోషికం విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.25 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు విజయం సాధిస్తే ఈ అమ్మడి పారితోషికం కోటికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వర్గం టాక్. అంతా లక్కు ప్రభావం. కాగా అదితి శంకర్ ఇప్పటికే రూ.80 లక్షల వరకూ కూడబెట్టినట్లు సమాచారం. ఇకపోతే ఈమె తండ్రి దర్శకుడు శంకర్ ఆస్తి రూ.250 కోట్లకు పైనేనట. -
34 రోజుల్లో సినిమా కంప్లీట్.. ఆ డైరెక్టర్ ఏమన్నాడంటే ?
-
జర్నలిస్ట్ శంకర్‌పై దాడి
నాగోలు(హైదరాబాద్): జర్నలిస్టు శంకర్‌పై కొందరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ సీరిస్ రోడ్డులో చెలమల శంకర్ అలియాస్ జర్నలిస్ట్ శంకర్ న్యూస్‌లైన్ తెలుగు చానల్‌తోపాటు ‘తెలంగాణం’పేపర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. గురువారం రాత్రి తన కార్యాలయం మూసివేసి రాత్రి 10:40 గంటల సమయంలో తోటి జర్నలిస్టులు దండిగ నర్సింహ, పుల్కారం శివతో కలసి తుర్కయాంజాల్‌కు కారులో బయలుదేరారు. కొద్దిదూరం ప్రయాణించగానే ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో శంకర్ తన కారును స్లో చేశాడు. యాక్టివాపై ఇద్దరు యువతులు వస్తూ వెనుక నుంచి ఆ కారు ఢీకొట్టారు. వెంటనే శంకర్ కారులో నుంచి దిగి యువతులను ప్రశ్నిస్తుండగానే, వారు అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. తప్పు చేసింది మీరే కదా అని అంటుండగానే ఆ యువతులకు తెలిసిన కొందరు యువకులు బైకులపై అక్కడకు చేరుకొని శంకర్‌ను చేతులు, రాళ్లతో కొట్టారు. వారిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన దండిగ నర్సింహ, శివపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న శివను ఆ యువకులు అడ్డుకుని సెల్‌ఫోన్ పగులగొట్టారు. ఈ క్రమంలోనే శంకర్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు తీసుకొని, మూకుమ్మడి దాడి చేయడంతో అక్కడినుంచి ప్రాణభయంతో శంకర్ ఓ ఇంట్లోకి వెళ్లాడు. రోడ్డుపై గొడవ పెద్దది కావడంతో స్థానికులు 100 సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు దండిగ నర్సింహ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కాలనీలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించి జర్నలిస్ట్‌లు శంకర్, శివపై దాడి చేసిన కవాడిగూడకు చెందిన ప్రవీణ్, హయత్‌నగర్‌లోని ఎల్లారెడ్డి కాలనీకి చెందిన మహేష్, ఎల్బీనగర్ హాస్టల్లో ఉండే శ్రీదుర్గ, హేమలతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. దాడికి పాల్పడిన మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులే తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ నల్లగొండలోని ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ చెందిన శ్రీదుర్గ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది జర్నలిస్టు శంకర్, శివతో పాటు తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని, జర్నలిస్టు దండిగ నర్సింహ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచకాలు, తప్పిదాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో కాపు కాసి దాడి చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొండగల్‌లో పేదల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారనే విషయంపై ఇటీవల తాము ప్రసారం చేశామని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పారీ్టకి చెందిన వారే తమపై దాడులకు పాల్పడ్డారని, ఇందుకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి: కేటీఆర్ తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి మొదలైందని, మీడియాపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపైనే దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శంకర్‌పై దాడి ఘటనను ‘ఎక్స్’వేదికగా ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే దాడులా: హరీశ్‌రావు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడటం హేయ మైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అన్నారు. -
'గేమ్‌చేంజర్' టార్గెట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్‌చేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. ఇటీవల ‘గేమ్‌చేంజర్’ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివు డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో రామ్‌చరణ్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్తోపాటుగా, రామ్‌చరణ్, నవీన్‌చంద్ర, మరికొందరు కీలకపాత్రధారులపై టాకీపార్టు చిత్రీకరణ కూడా జరగనుంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను జూలైలోపు పూర్తి చేయాలని చిత్రయూనిట్ టార్గెట్ పెట్టుకుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్’ డిసెంబరులో విడుదల కానుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. -
ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. యువకుడి విషాదం!
మహబూబ్‌నగర్: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా శివారులోని హైదరాబాద్ రోడ్డుపై కారు ఢీకొని శంకర్(శివ)(18) గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం, అప్పక్‌పల్లికి చెందిన శ్రీనివాసులు, అంజిలమ్మ కుమారుడు శంకర్ హైదరాబాద్ రోడ్డు వెంట ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందగా.. కారు నిలుపకుండా పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువకుడు నారాయణపేటలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోకరి తెలియజేశారు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి విషాదం! -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
శంకర్ ను టార్గెట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్..!
-
దళారి రాజకీయం
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్, అక్షా ఖాన్ ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి’. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెంకట్ రెడ్డిగారిలాంటి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ‘దళారి’ ట్రైలర్ బాగుంది.. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆకృతి క్రియేషన్స్ పతాకంపై రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘సమాజంలో ఏ పని జరగాలన్నా ఒక దళారి ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే మా సినిమా’’ అన్నారు గోపాల్ రెడ్డి. -
స్టార్ డైరెక్టర్ కూతురు షాకింగ్ నిర్ణయం.. నిజమేనా?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్. చాలా చలాకీగా ఉండే ఈమె మల్టీ టాలెంటెడ్. చదివింది వైద్య విద్య అయినా నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగు పెట్టింది. దీంతో ఎలాగైనా కథానాయకిగా నటించాలనే పట్టుదలతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించారు. అలా విరుమాన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా నటించి మెప్పించారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే గాయని అవతారం ఎత్తి తన మల్టీ టాలెంటెడ్‌ను నిరూపించుకున్నారు. ఆ చిత్రం తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ రెండు సూత్రాలు సక్సెస్ అయ్యి అదితి శంకర్‌ను లక్కీ హీరోయిన్ చేశాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రాంకుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్ నటనకు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె డాక్టర్ దుస్తులు ధరించిన ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫొటోలు వైరల్ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? లేక ఏదైనా చిత్రంలోని ఫొటోలను సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కథానాయకగా సక్సెస్ బాటలో పయనిస్తున్న అదితి శంకర్ నటనకు గుడ్ బై చెబుతున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అదితి శంకర్ చేస్తున్న కొత్తరకం పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
చలో మైసూర్
హీరో రామ్‌చరణ్ కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చనున్నారట. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్ ప్లాన్ చేశారట. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
Bharateeyudu 2: భారతీయుడు 2 మూవీ స్టిల్స్
-
భారతీయుడు ఈజ్ బ్యాక్
‘‘హలో... ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడుకి చావే లేదు’ అంటూ ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం చివర్లో కమల్‌హాసన్ చెప్పే డైలాగ్‌తో ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) ఇంట్రో గ్లింప్స్ మొదలవుతుంది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందిన ‘ఇండియన్’ (1993)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రధారులు. సుభాస్కరన్, ఉదయ నిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఇండియన్ 2’ తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి షేర్ చేశారు. ఈ వీడియోలో ‘నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ కమల్‌హాసన్ చెప్పిన డైలాగ్ ఉంటుంది. -
Bharateeyudu 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇండియన్ 2 ఇంట్రో వచ్చేసింది..
విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 1996లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. . శుక్రవారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు. ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు దేశంలో మళ్లీ లంచగొండితనం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవరూ ఏ పనులు చేయటం లేదు. దీంతో సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది. అప్పుడు భారతీయులందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగుపెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు. వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు.. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్లీ లంచాలు తీసుకోవటానికి కారణం ఎవరు? పేట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి? అనే విషయాలను గ్లింప్స్‌లో చూపించారు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి.. ఈ గ్లింప్స్‌లో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు కనిపించారు. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
ఇంట్రో రెడీ
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄పొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ షూట్ పూర్తయింది. తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించిన వీడియోను ‘ఇండియన్ 2 యాన్ ఇంట్రో’ టైటిల్‌తో నవంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
ఊర మాస్ శంకర్
‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్లు.. సూపర్ మ్యాన్లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్‌లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్‌గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. -
‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!
కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్–2. ఇది 1996లో కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ఇండియన్ సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్‌న్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ్రహ్మాండ కథాచిత్రాన్ని శంకరే తెరకెక్కిస్తున్నారు. నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం ప్రారంభమై ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇండియన్ 2 చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోందని అనుకుంటున్న సమయంలో తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మరో 30 రోజులు నిర్వహించాల్సి ఉందని తెలిసింది. కారణం ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలను పరిశీలించిన శంకర్ దీని పరిధి పెరిగినట్లు గమనించినట్లు సమాచారం. దీంతో దీనికి మరో సీక్వెల్ కూడా రూపొందించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అంటే ఇండియన్ చిత్రానికి మూడో భాగం కూడా పోతుందన్నమాట. ఇండియన్ చిత్రం మూడో సీక్వెల్ నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. ఇప్పుడు మరో 30 రోజులు షూటింగ్ నిర్వహిస్తే ఇండియన్–3 చిత్రం కూడా పూర్తి అవుతుందని సమాచారం. ఈ షూటింగ్ కూడా కమలహాసన్ కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాగా ఇందుకోసం ఆయనకు మరో రూ.120 కోట్లు చెల్లించనున్నారని తెలిసింది. కాగా ఇండియన్–3 చిత్రం కూడా రూపొందడంతో కమలహాసన్ ఇప్పటికే నటించడానికి అంగీకరించిన హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించడం 233వ చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో నటించనున్న 234వ చిత్రాల షూటింగ్ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కమలహాసన్ మరో పక్క బిగ్‌బాస్ రియాల్టీ గేమ్‌షో 7 సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్‌ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
సినిమా ఇండస్ట్రీకే గేమ్ ఛేంజర్.. 30 ఏళ్లుగా టాప్ దర్శకుడిగా..
చిత్ర పరిశ్రమలో అందరూ సినిమాను ప్రేమించే వారే. అయితే సినిమానే శ్వాసగా భావించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శంకర్ ఒకరు. తొలి చిత్రంతోనే స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తొలి చిత్రం జెంటిల్మెన్. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఆదివారం (జూలై 30) నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే శంకర్ ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకొని కమర్షియల్ అంశాలు చొప్పించి ప్రయోజనాత్మక, జనరంజక కథా చిత్రంగా జెంటిల్మెన్ను మలిచారు. ఆ తర్వాత కూడా శంకర్ తన చిత్రాల్లో సామాజిక అంచాలను తెరపై ఆవిష్కరించడాన్ని విస్మరించలేదు. ఇక ఒక దర్శకుడిగా 30 ఏళ్ల క్రితం ఉదయించిన శంకర్ ఇప్పటికి 13 చిత్రాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఈయన తమిళంలో ఇండియన్– 2, తెలుగులో గేమ్ ఛేంజర్ చిత్రాలను చేస్తున్నారు. అలా తక్కువ చిత్రాలు చేసినా నేడు టాప్ 10 దర్శకుల్లో ఒకరిగా రాణించటం శంకర్‌కే చెల్లింది. ఇప్పటి వరకు ముదల్ వన్, బాయ్స్, ఇండియన్, ఎందిరన్, శివాజీ, రోబో –2, నన్బన్ తదితర చిత్రాలు బ్రహ్మాండానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే శంకర్‌ను బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు అని పేర్కొంటారు. కాగా జెంటిల్మెన్ చిత్రం 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శిష్య బృందం (జెంటిల్మెన్ , ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పనిచేసిన సిబ్బంది) ఆదివా రం చైన్నెలోని శంకర్ కార్యాలయంలో ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకలో శంకర్ పాల్గొని కేకను కట్ చేశారు. A true #GameChanger in Indian Film Industry ❤️🔥 Congratulations @shankarshanmugh sir for completing 30 splendid years. Here's to more exemplary work and accolades that await you.😊 pic.twitter.com/KSWSHa91j6 — Ram Charan (@AlwaysRamCharan) July 30, 2023 చదవండి: ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బాలీవుడ్ జంట -
కూలిన విరాటపర్వం శంకరన్న ఇల్లు..
కరీంనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేసిన దొంత మార్కండేయ ఉరఫ్ శంకరన్న ఇల్లు గురువారం కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శంకరన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో 1993 జనవరి 25న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించారు.మూడు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఆకర్షితుడై పార్టీలోచేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శి స్థాయిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
కోపంతో రగిలిపోతున్న మెగా ఫ్యాన్స్ ఎందుకంటే...!
-
Aditi Shankar: పోర్చుగల్‌లో అదితి శంకర్ హల్చల్!
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే కార్తీ, శివకార్తీకేయన్‌కు జంటగా నటించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతిథి శంకర్ తన ఫొటోలను తరచూ పోస్ట్ చేస్తూ ఇటు చిత్ర పరిశ్రమల దృష్టిని తనవైపు పడేలా చూసుకుంటూ, అటు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాగా ఇటీవల విధులైన మావీరన్ చిత్రంలో కథానాయికగా అదితి శంకర్ మంచి పాత్ర పోషించారు. తాజాగా ఈమె తన మూడో చిత్రానికి సిద్ధమయ్యారు నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో అదితి శంకర్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్స్ బీ ఫిలిమ్ క్రియేటర్స్ పతాకంపై సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను చైన్నెలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లిస్బన్లో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనటానికి నటి అది శంకర్ సోమవారం పోర్చుగల్ దేశానికి బయలుదేరారు. అక్కడ వచ్చే నెల చివరి వరకు షూటింగ్ జరుగుతుందని సమాచారం. -
అందరికీ కంటి వైద్యం అందేలా..ప్రత్యేక సేవకు శంకర నేత్రాలయ శ్రీకారం
శంకర నేత్రాలయ దాతలు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ శంకర నేత్రాలయ యూఎస్ఏ (SN USA) అడాప్ట్-ఎ-విలేజ్ మొబైల్ సర్జికల్ యూనిట్ దాతలు డాల్లస్ మహానగరంలో డా. ప్రేమ్‌రెడ్డి గారితో కలిసి జరిపిన కార్యక్రమములో అంధత్వ నిర్మూలనకై 350,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు) భూరి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు ప్రత్యేక అతిథిగా రాగా, ఎందరో ప్రముఖ దాతలు వివిధ నగరాల నుంచి రావడం ఒక ప్రత్యేక ఆకర్షణగా జరిగింది. గత నాలుగు దశాబ్దాలుగా, శంకర నేత్రాలయ లక్షలాది మంది కంటి చూపు లేని నిరుపేదలకు దృష్టిని పునరుద్ధరించింది. శంకర నేత్రాలయ అందించే ప్రత్యేక సేవలలో ఒకటి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (మేసు - మొబైల్ ఐ సర్జికల్ యూనిట్). ఈ రంగంలో రిమోట్‌గా కంటి శస్త్రచికిత్సలు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏకైక సంస్థ శంకర నేత్రాలయ. మేసు అనేది రెండు ప్రత్యేక వాహనాలు కలిసి ఒక వైద్య శిబిరంగా మారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఉచిత కంటి చికిత్స చేస్తుంది. మేసు అనగా చక్రాలపై ఉన్న ఆసుపత్రి, ఇది రెండు బస్సుల్లో ఆస్పత్రి మాదిరి వైద్యం అందిస్తుంది. ఒకటి రోగి ప్రిపరేటరీ గదిగా మరొకటి ఆపరేషన్ థియేటర్‌గా పనిచేస్తుంది. ఈ బస్సుల్లో దాదాపు 25 మంది వైద్య సిబ్బంది కలిసి మారుమూల గ్రామాలకు వెళ్లి, సుమారు 2 వేల నుంచి 3 వేల మంది రోగులను పరీక్షించి, రెండు వారాల వ్యవధిలో 150 నుంచి 300 మంది రోగులకు కంటి శుక్లం శస్త్రచికిత్స చేసి, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత తిరిగి బేస్ ఆస్పత్రికి చేరుకుంటారు. వేరే కీలక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను బేస్ ఆసుపత్రికి పంపుతారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ అనేది శంకర నేత్రాలయ ఇండియా నిధుల సేకరణ విభాగం. ప్రతియేటా నిధులు సేకరించి భారతదేశంలో ఉన్న శంకర నేత్రాలయకు పంపుతుంది. ఇప్పటివరకు, రెండు మేసు విభాగాలు ఉన్నాయి - ఒకటి చెన్నైలో మరొకటి జార్ఖండ్‌లో. జనవరి 2023 నుంచి మూడవ మేసు యునిట్ హైదరాబాద్లోలో ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ఏ. ఐ. జి. సంస్థ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక్కో మేసు యునిట్ బేస్ హాస్పిటల్ నుంచి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు వెళ్ళి కంటి శుక్ల సేవలు నిర్వహిస్తుంది. దీంతో పూర్తి తెలంగాణా ప్రాంతానికి మేసు ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తుంది . 2023 నుంచి ఝార్ఖాండ్, హైదరాబాద్, చెన్నై నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఏ మారుమూల ప్రాంతానికైనా ఈ వసతి లభిస్తుంది. శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీ. బాలా రెడ్డి ఇందుర్తి విదేశాలలో నివసిస్తున్న భారతీయులలో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సేవలు పెంచడానికి ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. అతని అమూల్యమైన సేవలకు ఆ సంస్థలో అత్యున్నత పురస్కారమైన శంకరరత్నను ప్రదానం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా - నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) కూడా ఇటీవల డల్లాస్‌లో నిర్వహించిన సమావేశంలో అతని అత్యుత్తమ సేవలను గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీ సర్వీస్ అవార్డును ప్రదానం చేసింది. శంకర నేత్రాలయ గురించి అవగాహన పెంచడానికి, శంకర నేత్రాలయ యూఎస్ఏ జులై 1, 2023న నాటా కన్వెన్షన్‌లో ప్రముఖ వైద్యుడు, పారిశ్రామికవేత్త మరియు పరోపకారి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంని నిర్వహించింది. ఆయన ఇటీవల తన స్వస్థలమైన నెల్లూరు సమీపంలోని నిడిగుంటపాలెంలో స్పాన్సర్ చేసిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం కంటి సమస్యలతో బాధ పడుతున్న వందలాది మంది పేద రోగుల చూపుని పునరుద్ధరించింది. బాల ఇందుర్తి, కోర్ కమిటీ సభ్యులు ఆనంద్‌బాబు దాసరి, శ్రీధర్‌రెడ్డి తిక్కవరపులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శంకర నేత్రాలయ యు. యస్. ఏ. బృందం డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజానికి చేసిన విశిష్ట సేవలకుగానూ ధీన బంధు పురస్కారంతో సత్కరించింది. ఈ సమావేశంలో, హైదరాబాద్, చెన్నై మరియు జార్ఖండ్‌లలో 2023, 2024లో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి సహకరించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ జట్టు మరియు మేసు దాతలను డాక్టర్ ప్రేమ్ రెడ్డి సత్కరించారు. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2023 దాతలు: డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, రమేష్ రెడ్డి వల్లూరు, ప్రసాద్ రెడ్డి మల్లు, డాక్టర్ కిషోర్ రెడ్డి రాసమల్లు, రూబీ నహర్, ఆనంద్ బాబు దాసరి. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2024 దాతలు: మూర్తి రేకపల్లి, కిరణ్ రెడ్డి పాశం, కరుణాకర్ ఆసిరెడ్డి, కృష్ణదేవ్ రెడ్డి లట్టుపల్లి, డాక్టర్ చీమర్ల నరేందర్ రెడ్డి, రమేష్ చాపరాల, డాక్టర్ బాల్ టి. రెడ్డి, ఎ. జలంధర్ రెడ్డి, ప్రియా కొర్రపాటి , రవి రెడ్డి మరక, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, డా. మోహన్ మల్లం, నారాయణ రెడ్డి గండ్ర, తిరుమల రెడ్డి కుంభం, ప్రసూన దోర్నాదుల, మీనల్ సిన్హా BOXA, శ్రీని రెడ్డి వంగిమళ్ల, సతీష్ కుమార్ సెగు, రాజేష్ తడికమళ్ల, చైతన్య మండల, భాస్కర్ గంటి, బాల రెడ్డి ఇందుర్తి, నారాయణరెడ్డి ఇందుర్తి, రవి ఇందుర్తి. ఈ కార్యక్రమానికి హాజరైన SNUSA ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీల బోర్డు గత ధర్మకర్తల మండలి: బాల రెడ్డి ఇందుర్తి (అధ్యక్షుడు), మూర్తి రేకపల్లి (వైస్ ప్రెసిడెంట్), శ్యామ్ అప్పాలి (జాయింట్ సెక్రటరీ), సోమ జగదీష్ (జాయింట్ ట్రెజరర్), ప్రసాద్ రాణి, శ్రీని రెడ్డి వంగిమళ్ల, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ఆనంద్ బాబు దాసరి, రాజశేఖర్ రెడ్డి ఐల, మెహర్ చంద్ లంక, డాక్టర్ జగన్నాథ్ వేదుల, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఏరువరం, రాజు పూసపాటి, వినోద్ పర్ణ, ప్రియా కొర్రపాటి, రమేష్ బాబు చాపరాల, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, మరియు రవి రెడ్డి మరక. నిరుపేద రోగుల చూపుని పునరుద్ధరించే ఈ ఉదాత్త కారణానికి ఇచ్చే మద్దతు అందరిచే మీట్ అండ్ గ్రీట్‌లో చాలా ప్రశంసించబడింది. ఆ సమావేశంలో పలువురు దాతలు ముందుకు వచ్చి, అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఉదార సహకారాలు పేద రోగుల జీవితాల్లో మార్పు తెస్తాయి. ఈ ఉదాత్తమైన కారణం కోసం పనిచేస్తున్న వాలంటీర్లకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాయి. వ్యవస్థాపకుడు ఎస్వీ ఆచార్య, ఎస్ఎన్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ఎస్ బద్రినాథ్, చెన్నై నాయకత్వం డాక్టర్ గిరీష్ రావు, డాక్టర్ సురేంద్రన్, కన్నన్ నారాయణన్, రామచంద్రన్ గోపాల్, సురేష్ కుమార్‌లకు నిరంతర మద్దతు కోసం ధన్యవాదాలు. కోర్ కమిటీ సభ్యులు బాలారెడ్డి ఇందుర్తి, ఆనంద్ బాబు దాసరి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పల్లి, వంశీ కృష్ణ ఏరువరం, సోమ జగదీష్, నారాయణరెడ్డి ఇందుర్తి, వినోద్ పర్ణ, మీనల్ సిన్హా, తీగరాజన్, దీనదయాళన్ మరియు కులతేజలకు ధన్యవాదాలు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు) -
ఐఏఎస్ ఆకాశ్‌పై భార్య వందన ఫిర్యాదు
కర్ణాటక: భర్త, అతని కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మహిళ బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త ఆషామాషా వ్యక్తి కాదు, ఓ ఐఏఎస్ అధికారి. అప్పట్లో సివిల్స్‌లో దేశంలో వంద లోపు ర్యాంకు తెచ్చుకుని మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఏం లాభం.. భార్యను వేధించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కొడగు జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ఆకాశ్ శంకర్‌పై ఆయన భార్య డాక్టర్ వందన ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘనంగా పెళ్లి చేసినా.. రిటైర్డు ఐపీఎస్ టీఆర్ సురేశ్ కుమార్తె డాక్టర్ వందనకు గత ఏడాది జూన్‌లో ఆకాశ్ శంకర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో బాగా కట్న కానుకలు సమర్పించారు. కానీ మళ్లీ డబ్బు బంగారం , విలువైన కానుకలు తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు వందన గత మార్చిలో ఆరోపించారు. అప్పటినుంచి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. హేళనగా ప్రచారం ఇటీవల ఆకాశ్ శంకర్ సోదరుడు వికాస్ శంకర్, ఆతని భార్య చేతన, ఐసిరి శివకుమార్ అనేవారు వందన గురించి హేళనగా మాట్లాడి ఆ వీడియోలను ఆమె స్నేహితులకు పంపారు. ట్రాఫికింగ్ ఆఫ్ ఖాకీస్ డాటర్, ట్రాఫికర్ డాక్టర్ వందన అని తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వందన కుంటుబం గురించి ఇంటర్నెట్లో అగౌరవంగా రాతలు రాసినట్లు ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా శంకర్ ‘బ్లడ్ అండ్ చాక్లెట్’
‘ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడు శంకర్ తాజాగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ చిత్రాన్ని నిర్మించారు. ‘షాపింగ్ మాల్, ఏకవీర’ తదితర చిత్రాల దర్శకుడు వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ దాస్ హీరోగా, దుషారా విజయన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా నిర్మాత ‘దిల్ రాజు’ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న రిలీజ్ కానుంది. తెలుగులో ఎస్.ఆర్.డి.ఎస్ సంస్థ విడుదల చేయనుంది. -
శంకర్ కి కమల్ హాసన్ స్పెషల్ గిఫ్ట్
-
గేమ్ ఛేంజర్ కి షాకుల మీద షాకులు
-
డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా సినిమా విడుదలై, అది హిట్ కొట్టిన తర్వాత సదరు దర్శకులకు ఖరీదైన బహుమతులని నిర్మాతలు ఇస్తుంటారు. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీకవర్మకు అలానే రీసెంట్గా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ మాత్రం తన సినిమా విడుదలకు చాలా నెలల ముందే దర్శకుడు శంకర్‌ని సర్ప్రైజ్ చేశాడు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన కమల్ హాసన్‌కు 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని ఇచ్చింది. దీంతో అదే ఊపుతో 'ఇండియన్ 2' చేస్తున్నాడు. 2001లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగులోనూ 'భారతీయుడు' పేరుతో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు తీస్తున్న రెండో భాగంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) అందుకు తగ్గట్లే సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే దాదాపు రూ.8.77 లక్షల విలువైన పనేరాయ్ ల్యూమినార్ చేతివాచీని శంకర్ కి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. గతంలో సూర్యకి రోలెక్స్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు శంకర్ కి పనేరాయ్ ఇచ్చారు. నెక్స్ట్ నాగ్ అశ్విన్ ఏం వాచ్ ఇస్తారో ఏంటో? 'ఇండియన్ 2 సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని ఈరోజే చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ చిత్రం మీ అత్యుత్తమ పని కాకూడదు. మీ క్రియేటివ్ లైఫ్ లో ఇది హైయస్ట్ స్టేజ్. అందుకే దీన్ని తలకు ఎక్కించుకుని గర్వపడొద్దని నా సలహా. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B — Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023 (ఇదీ చదవండి: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) -
నగల షాపు పక్కనే గది అద్దెకు తీసుకుని..
సుజాతనగర్: జ్యూయిలరీ షాపు పక్కనే ఉన్న రూంలోకి అద్దెకి దిగి.. రాత్రి పూట షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి బడా చోరీకి పాల్పడ్డ ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా.. కొత్తగూడెంకు చెందిన అలువాల శంకర్ సుజాతనగర్‌లోని రవి కాంప్లెక్స్‌లో తొమ్మిదేళ్లుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. సదరు దుకాణం ప్రక్కన ఓ గది ఖాళీగా ఉండడంతో ఇద్దరు వ్యక్తులకు గత నెల 26న కాంప్లెక్స్ యజమాని అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో గత నెల 31న శంకర్ వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కి వెళ్లాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దుండగులు షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న సీసీ కెమెరాల వైర్లు తొలగించి గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌ను కట్ చేశారు. దాంట్లో ఉన్న 42 కిలోల వెండి, 1,242 గ్రాముల బంగారం.. మొత్తంగా రూ.87లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చిన దుకాణ యజమాని శంకర్ చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుంచుపల్లి సీఐ రమాకాంత్, క్లూస్ టీం బృందం చేరుకుని పరిశీలించగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ పుటేజీని పరిశీలించగా 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చోరీ చేసి కారులో పారిపోయినట్లు తేలింది. నగదు దుకాణంలో చోరీ కోసమే దుండగులు గది అద్దెకు తీసుకున్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఈ సినిమాలో రియల్ కార్లతో స్టంట్స్ చేసినపుడు ..!
-
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. చదవండి: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిపోయిందని, ఇప్పుడు తన ఫోకస్ ఇండియన్-2 సినిమాకు షిఫ్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆయన రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్, కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్-2 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఇండియన్-2పై ఫోకస్ పెట్టనున్నారు శంకర్. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet — Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023 -
ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్
ఇతర రంగాల కంటే సినీ రంగంలో వారసత్వం అనేది కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. ఇక్కడ నటీనటుల వారసులే కాకుండా దర్శకుడు, నిర్మాతల వారసులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు. అలా ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలిగా ఆయన కూతురు అదితి శంకర్ కథానాయకిగా విరుమాన్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ఈ హైటెక్ సిటీ బ్యూటీ పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలా చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుమల్లేల చేసుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్ చిత్రంలో నటిస్తోంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్) విశేషం ఏంటంటే ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. అలా నటి ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. తాజాగా మరికొన్ని కొత్త చిత్రాలను కమిట్ అయిన ఈమె తరచూ సోషల్ మీడియాలో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అలా తాజాగా ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దర్శకుడు శంకర్ ఇంతకుముందు విజయ్, శ్రీకాంత్, జీవ హీరోలుగా నన్భన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో నటి ఇలియానా కథానాయకి. కాగా ఆ చిత్రంలో విజయ్ ఇలియానాలపై చిత్రీకరించిన చిల్లీ టెల్లీ అనే పాట మంచి హిట్ అయ్యింది. కాగా ఆ పాటకు నటి అదితి శంకర్ చాలా ఫాస్ట్‌గా డాన్స్ చేసింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్ సీక్వెన్స్
దాదాపు వెయ్యిమంది ఫైటర్స్‌తో పోరాడటానికి రెడీ అవుతున్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. (చదవండి: పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!) హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం వరకూ జరుగుతుందని సమాచారం. కాగా ఈ ఫైట్ చిత్రీకరణలో దాదాపు వెయ్యిమంది స్టంట్మ్యాన్లు పాల్గొంటారట. అలాగే ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు ఈ క్లైమాక్స్ ఫైట్‌ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
పుట్టబోయే బిడ్డ కోసం రామ్‌చరణ్ కీలక నిర్ణయం!
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరైన రామ్‌చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన గర్బవతిగా ఉన్నారు. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ జంట పేరేంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు రామ్‌చరణ్-ఉపానస. ఈ క్రమంలో కడుపులో బిడ్డతో వెకేషన్ పేరిట ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వారం చివర్లో లేదా వచ్చే వారంలోగా షెడ్యూల్‌ను పూర్తి చేసి సుమారు 3 నెలల వరకు రామ్‌చరణ్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు సమాచారం. తమ మొదటి సంతానం కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఉపాసనతో ఉండేందుకు రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్నారట. డెలీవరీకి సమయం దగ్గర పడుతుండటంతో పుట్టబోయే బిడ్డ కోసం చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -
అఫీషియల్: శంకర్ డైరెక్షన్లో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్‌ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨ 🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr — Lyca Productions (@LycaProductions) April 17, 2023 -
'ఇండియన్-2'పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గ్లోబల్ స్టార్‌కు డబుల్ సర్ప్రైజ్.. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెర్పీ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటికే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్గా అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ బైక్‌పై కళ్లద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్న లుక్ అదిరిపోయింది. తాజా పోస్టర్‌ను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే టైటిల్ రివీల్ చేయడంతో చెర్రీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా పవర్‌స్టార్ ఇమేజ్‌కు తగ్గ టైటిల్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ ఖరారు చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I couldn’t have asked for a better birthday gift !! #GameChanger Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0 — Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023 -
రామ్‌చరణ్-శంకర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ రివీల్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేసేశారు. ప్రస్తుతం RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ అంటూ ఈ పాన్ ఇండియా చిత్రానికి పేరు పెట్టిన మేకర్స్ మరో అప్డేట్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా డబుల్ ధమాకాగా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులను మరింత ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. #GAMECHANGER it is…💥💥https://t.co/avGa74S8vH Mega Powerstar @alwaysramcharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/2htttRsvPx — Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023 -
RC15 సెట్స్‌లో అదిరిపోయిన రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. ఇక రేపు(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్‌లో యూనిట్ సభ్యుల మధ్య రామ్‌చరణ్ తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్‌కట్ చేయించారు. ఈ వేడకలో శంకర్, దిల్‌రాజు, కియారాలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ram charan. RC (@rc_15_love_) Global star @AlwaysRamCharan birthday celebrations begins #RC15 #GlobalStarRamCharan #Ramcharan pic.twitter.com/CqnpfZeBuJ — SivaCherry (@sivacherry9) March 25, 2023 -
హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న రామ్‌చరణ్.. త్వరలోనే అనౌన్స్మెంట్
‘సీఈఓ’గా కనిపిస్తారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌గా ఇప్పటికే ‘అధికారి’, ‘సర్కారోడు’ వంటి పేర్లు తెరపైకి రాగా తాజాగా ‘సీఈఓ’ తెరపైకి వచ్చింది. ఫైనల్ టైటిల్‌ను ఈ ఉగాదికి లేదా రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27)కి ప్రకటిస్తారని టాక్. హాలీవుడ్‌కి... ఆస్కార్ బరిలో నిలిచిన ‘నాటు నాటు’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హాలీవుడ్లో తన తొలి సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వెల్లడి కానుందని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ యాక్టర్స్‌లో ఒకరైన నటి జూలియా రాబర్ట్స్‌తో నటించాలని ఉందని, ఆమె సినిమాలో గెస్ట్ రోల్ అయినా ఇష్టమేననీ రామ్ చరణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. -
‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్లు.. ముగ్గురు హిరోయిన్లు
తమిళ సినిమా: కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ 2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనా షూటింగ్ స్పాట్లో ప్రమాదాలు, దర్శకుడికి నిర్మాణ సంస్థ మధ్య వివాదం, కరోనా కారణాలతో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. కాగా పలు పంచాయితీలు, కేసులు అనంతరం ఇటీవలే ఇండియన్ 2 చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుపుకుంటోంది. చిత్రంలో సేనాపతిగా కమలహాసన్ గెటప్‌తో కూడిన పోస్టర్ విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. గత వారం రోజులుగా చెన్నై, పనైయూర్లో చిత్ర షూటింగ్‌ను రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో తమిళ్, బ్రిటీష్ స్టంట్ కళాకారులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రంలో కమల్ హాసన్‌కు ఏడుగురు విలన్లు ఉంటారని అందులో ఒకరు సముద్రఖని అని సమాచారం. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లు, ఏడుగురు విలన్లతో కమలహాసన్ ఇండియన్ 2 చిత్రంతో మరోసారి తెరపై విజృంభిస్తున్నారన్నమాట. -
పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఫోటో పోస్ట్ చేసిన కియారా
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న సిద్-కియారాలు భార్యభర్తలుగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలో సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక సిద్ కూడా తన నెక్ట్స్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నాడు. తాజాగా ఇద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో సందడి చేశారు. చదవండి: కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా? -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
ఇండియన్ 2: నెల రోజులు నాన్‌స్టాప్ షూటింగ్
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, గండికోట లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చాలా కీలకమైనదని తెలిసింది. ఎందుకంటే నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు కమల్‌హాసన్. ముందుగా కమల్‌హాసన్, హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ కాంబినేషన్స్లోని సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లోనే ఈ చిత్రకథానాయిక కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యే చాన్స్ ఉందని టాక్. ఇంకా రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
తన స్కిల్‌తో డైరెక్టర్ శంకర్‌ను సర్ప్రైజ్ చేసిన చరణ్!
ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం RC15. సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో షూటింగ్‌ను జరపుకుంటోంది. అయితే తాజాగా రామ్ చరణ్ తన డాన్స్ స్కిల్‌తో శంకర్‌ను ఇంప్రెస్ చేశాడట. చదవండి: పెళ్లికి ముందే తల్లయిన హీరోయిన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ.. అతి కష్టమైన స్టెప్‌ను సింగిల్ టేక్‌లో చేసి మెప్పించాడట. ఈ తాజా బజ్ ప్రకారం.. 80 సెకన్ల నిడివి గల క్రిటికల్ డాన్స్ స్టెప్‌ను చరణ్ సింగిల్ టేక్‌లో చేశాడట. ఇక చరణ్ ఎనర్జీ, డాన్స్ స్కిల్ చూసి అక్కడ ఉన్న మూవీ యూనిట్ మాత్రమే కాదు డైరెక్టర్ శంకర్ సైతం ఆశ్చర్యపోయాడట. సాధారణంగా శంకర్ ఏ ఆర్టిస్ట్ విషయంలో అంత ఈజీగా ఇంప్రెస్ కాడు. కానీ చరణ్ మాత్రం తన డాన్స్ స్కిల్‌తో శంకర్‌ని మెప్పించడం విశేషం. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. చదవండి: పొలిటికల్ లీడర్‌తో గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ పెళ్లి కాగా చరణ్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రిని మించిన మెగా తనయుడిగా చరణ్ తన నటన, డాన్స్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు తనదైన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఫిదా అయ్యారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరిలో నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. -
సతీ భూదేవి
యముడితో పో రాడి భర్తప్రా ణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ మనకు తెలుసు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భర్తను పరాయి దేశం నుంచి విడిపించుకుని రావడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది ఈ భూదేవి. నేడు వేలంటైన్స్ డే. ప్రేమకు పట్టం కట్టే రోజు. భర్త పట్ల భార్యకు ఎంత ప్రేమ ఉంటుందో... అతని శ్రేయస్సు కోసం ఆమె ఎంత తపన పడుతుందో ఈ రోజున ఈ ఘటన ద్వారా కాకుండా మరెలా తెలుసుకుంటాం? భార్య ప్రేమకు శక్తి ఉంటే అది ఇంత బలంగా ఉంటుంది. ఇంత అచ్చెరువొందేలా కూడా ఉంటుంది. తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ‘రోజా’ సినిమాలో హీరోయిన్ తెగువను ఆస్వాదించాం. అచ్చం అలాంటి కథను పో లిన నిజజీవిత ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాగంధం ఏమంతగా అంటని మాకూరి భూదేవి మరణశిక్ష ఖరారైన తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపో రాటం చేసి విజేతగానే కాదు, వార్తలలో కూడా నిలిచింది. భూదేవి 14 ఏళ్లుగా చేసిన న్యాయపో రాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఇప్పుడు భూదేవి, ఆమె కుమారుడు రాజు, భర్త శంకర్ ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అసలేం జరిగిందంటే... మెండోరాకు చెందిన మాకూరి శంకర్‌కు సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ కూలి పని చేస్తే పెద్దగా సంపా దించుకోవడం కష్టం అనుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్‌కు వెళ్లిపో యాడు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఫోర్‌మెన్ (సూపర్వైజర్)గా చేరాడు. అతనికింద పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు భవనం ఆరో అంతస్థుపై నుంచి పడి చనిపో యాడు. ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాజస్థాన్ వాసి మరణించాడని దుబాయ్ పో లీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్య కేసుగా నమోదు చేసిన అక్కడి పో లీసులు శంకర్‌ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేసి పుజీరా జైలులో పెట్టారు. కోర్టు విచారణలో రామావతార్ కుమావత్ మృతికి తను బాధ్యుణ్ణి కాదని, అతను ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్ ఎంత మొరపెట్టుకున్నా దుబాయ్ కోర్టులో చెల్లలేదు. పో లీసుల విచారణ నివేదిక ప్రకారం శంకర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 2013లో మరణశిక్షను ఖరారు చేసింది. చదువులేకపో యినా... ఈ ఘటన 2009లో చోటు చేసుకుంది. మాకూరి శంకర్‌కే కాదు అతని భార్యకు కూడా చదువు రాదు. ఎవరిని సంప్రదించాలో, తమకేవిధంగా న్యాయం జరుగుతుందో తెలియదు. పుజీరా జైలులో ఉన్న శంకర్‌కు తన భార్య భూదేవితో నెల రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడేందుకు జైలు పో లీసులు అవకాశం కల్పించారు. ‘‘అప్పుడు ఆయన నా గురించి, మా అబ్బాయి గురించి అడిగి ఏడ్చేవాడు. తాను బతికి బట్టకట్టాలంటే రాజస్థాన్ వాసి రామావతార్ కుమావత్ కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించాలని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కుటుంబం అడ్రస్ తెలియదు. మా ఊళ్లో పెద్దలందరికీ ఈ విషయం చెప్పాను. కనపడినవారికల్లా మా కష్టం చెప్పాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఏడ్వనిరోజు లేదు. రోజూ దిగులుగా ఉండేది. అలాగే నెలలు, ఏళ్లు గడిచిపో తున్నాయి. కానీ, దిగులుగా కూర్చుంటే అయ్యే పనులు కావు. నేనూ, నా బిడ్డ బతకాలి. కూలి పనులు చేసుకుంటూ బిడ్డను పో షించుకుంటూ వచ్చాను. గతంలో ఆర్మూర్ మండలం దేగాం వాసులు ముగ్గురు దుబాయ్‌లో మరణశిక్ష నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారని తెలిసింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్ కృషి చేశారని తెలిసింది. గంపెడాశతో వెళ్లి యాదాగౌడ్‌ను సంప్రదించి ఎలాగైనా నా భర్తను మరణశిక్ష నుంచి తప్పించాలని వేడుకున్నాను..’ అని ఇన్నేళ్ల తన కష్టాన్ని వివరించింది భూదేవి. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి... ‘మా ఆయనకు ఫోన్ చేసినప్పుడల్లా ఊళ్లో విషయాలు, నేను చేస్తున్న పనుల గురించి, మా అబ్బాయి క్షేమం గురించి చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెబుతూ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేదాన్ని. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలని కానీ, వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలియదని యాదాగౌడ్‌ను కలిసినప్పుడు చెప్పాను. అతను అన్ని వివరాలు కనుక్కొని, రాజస్థాన్ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు ఆర్థికసాయం రూ.5 లక్షలు అందించాలంటే అందరినీ బతిమాలుకున్నాను. కూలీ చేసుకొని బతికేదాన్ని, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది. మా ఊరి వాళ్లు, ఇంకొంతమంది దయగలవాళ్లు తమకు తోచినంత ఇచ్చారు. అలా వచ్చిన డబ్బును రాజస్థాన్‌లోని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశాం. మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు’ అని తెలిపింది భూదేవి. అలా వారు సంతకాలు చేసిన పత్రాలను యాదాగౌడ్ ద్వారా న్యాయవాది అనురాధ సహకారంతో భూదేవి దుబాయ్‌లోని కోర్టుకు పంపించింది. దుబాయ్ కోర్టు ఈ పత్రాలను పరిశీలించి మరణశిక్షను రద్దు చేయడమేకాకుండా అతన్ని విడుదల చేస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో మరణశిక్షను తప్పించుకున్న శంకర్ ఇంటికి చేరుకున్నాడు. కథ సుఖాంతమైంది. మా వాళ్లను చూస్తానని అనుకోలేదు నేను దుబాయ్‌కు వెళ్లే సమయంలో నా భార్య గర్భవతి. కొన్ని నెలలకే కొడుకు పుట్టాడు. ఈ సంతోష వార్త వినే సమయంలో నా భార్యకు చెప్పాను ‘త్వరలోనే వస్తాను’ అని. కానీ, అది సాధ్యం కాదని తర్వాత తెలిసింది. రాజస్థాన్ వ్యక్తి మరణించడంతో నేను ఈ ఘటనలో అరెస్టు అయ్యి జైలుపా లు కావడం, ఆ తరువాత మరణశిక్ష పడటం వరుసగా జరిగాయి. ఇక నా వాళ్లను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా భార్యతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ నాకు ఎంతో ధైర్యం చెప్పేది. జైల్లో ఎంతో మనోవేదనతో ఉన్నా నా భార్య మాటలు నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాయి. నా విడుదల కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. – మాకూరి శంకర్ – ఎన్.చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్, నిజామాబాద్ -
కియారా దంపతులకు RC15 సర్ప్రైజ్.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రతో ఆమె ఈనెల7న ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైసల్మైర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా రామ్‌చరణ్ సరసన ‘RC15’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితేపెళ్లి కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కియారాకు మూవీ టీం క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. సిద్-కియారాలకు వెడ్డింగ్ విషెస్ చెబుతూ మూవీ టీం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. దీనిపై స్పందించిన కియారా ఈ సర్ప్రూజ్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life! Wishing you a lifetime of happiness, love and light❤ Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI — Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023 -
శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్? రూ. 900కోట్ల బడ్జెట్!
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్‌తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడు రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆయన రూ.900 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఆ క్రేజీ కాంబినేషన్ దళపతి విజయ్, బాద్షా షారుక్ ఖాన్. ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను తీసుకునే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి అండర్ వాటర్‌లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక దళపతి విజయ్ ఇంతకుముందే శంకర్ దర్శకత్వంలో నన్బన్ చిత్రంలో నటించారు. విజయ్ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్ ఖాన్‌కు విజయ్‌కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌లో విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
హైదరాబాద్ టు వైజాగ్ వయా కర్నూలు
దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు విజువల్ ట్రీట్‌లా ఉంటాయి. భారీ ఖర్చుతో పాటలు చిత్రీకరించడం శంకర్ స్టయిల్. పైగా ఒకే పాటను వివిధ రకాల లొకేషన్స్‌లో తీస్తుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ అలానే జరుగుతోంది. ఈ చిత్రం కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో న్యూజిల్యాండ్‌లో ఓ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు మరో పాట చిత్రీకరణలో ఉన్నారు. ఈ పాటను తెలుగు రాష్ట్రాల్లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్ లొకేషన్లో ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత కర్నూలులోని కొండారెడ్డి బురుజు లొకేషన్లో, ఆ నెక్ట్స్ వైజాగ్‌లోని జగదాంబ సెంటర్లో చిత్రీకరణను ప్లాన్ చేశాను. కొండారెడ్డి బురుజు దగ్గర కొంత భాగం చిత్రీకరించి, వైజాగ్ షిఫ్ట్ అయింది యూనిట్. ఈ పాటను దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారని టాక్. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
భువనేశ్వర్: బిజూ జనతాదళ్ అభ్యర్థి, తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిజయ్శంకర్ దాస్ చిక్కుల్లో పడ్డారు. ఆయన స్నేహితురాలు సోమాలికా దాస్(29) దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించి, విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు నిందిత శాసనసభ సభ్యుడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... 2022 మే 13న సోమాలికా దాస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పట్ల కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రధానంగా జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ఆమె సమస్యలను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా సీఆర్పీసీ 154(3) సెక్షన్ కింద ఏదైనా చర్య తీసుకోవడంలో జిల్లా ఎస్పీ చొరవ కల్పించుకోవాలి. ఈ మేరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సోమాలికా దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 27న జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు బిజయ్శంకర్కు వ్యతిరేకంగా తాజా ఫిర్యాదుతో పాటు తన ఆర్డర్ కాపీతో ఐఐపీ, జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా అనుబంధ సమాచారంతో ఫిర్యాదు ఆమోదించి, కేసు నమోదు చేయాలని జగత్సింగ్పూర్ ఐఐసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. హైకోర్టు ఆదేశాల మేరకు సోమాలికా జగత్సింగ్పూర్ ఐఐసీని సంప్రదించి, రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. దీని ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఆమెకు సంబంధిత అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో దాఖలు చేసిన ఫిర్యాదు వ్యతిరేకంగా ఠాణా పోలీసు అధికార వర్గాలు స్పందించక పోవడంతో హైకోర్టుని ఆశ్రయించడం అనివార్యమైందని స్పష్టంచేశారు. బీజేడీ ఎమ్మెల్యే తన ఎన్నికల ఖర్చుల కోసం డబ్బును సేకరించేందుకు సెక్స్ రాకెట్లను నిర్వహిస్తున్నారని సోమాలికా గతంలో ఆరోపించారు. అలాగే పెళ్లి చేసుకుంటానని దగా చేశారని, జగత్సింగ్పూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి అన్నీ సిద్ధం చేసి, సకాలంలో కానరాకుండా అదృశ్యమై తనను మోసం చేశారని విమర్శించింది. దీనిపై తనపై సంబంధిత ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపించింది. వీటికి సంబంధించి అన్ని సాక్ష్యాలను అందిస్తానని పేర్కొంది. -
హెలికాప్టర్లో షూటింగ్‌కి వెళ్లిన స్టార్ హీరో.. ఫోటో వైరల్
హెలికాప్టర్లో షూటింగ్ లొకేషన్‌కు వెళుతున్నారు కమల్‌హాసన్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షటింగ్ ప్రస్తుతం కడపలోని గండికోట విలేజ్‌లో జరుగుతోంది. తిరుపతి నుంచి గండికోట లొకేషన్‌కు రోజూ హెలికాప్టర్లో వెళ్తున్నారు కమల్‌హాసన్. కాగా కమల్ హెలికాప్టర్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, కాల్షీట్స్, షూటింగ్ సమయం వృథా కాకుండా చూసేందుకు కమల్ ఇలా హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. #KamalHaasan sir pic.twitter.com/8JzAJIXdH7 — Expendables Bouncers (@Sathya45222505) February 1, 2023 -
Air India pee-gate: ఇంతకు ఇంత అనుభవిస్తావు!
న్యూఢిల్లీ: న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పటియాలా కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని శంకర్ మిశ్రా ఆరోపించాడు. తనకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, సాక్ష్యులను ప్రభావితం చేసే స్థాయిలో లేనని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు. అయితే.. కేసు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పైగా ఓ మహిళ పట్ల నిందితుడు వ్యవహరించిన తీరు ఏమాత్రం సహించరానిదని తెలిపింది. అంతకు ముందు శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ.. శంకర్ మిశ్రా లైంగిక కోరికలతోనో లేదంటే ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాలనో అలా ప్రవర్తించలేదని వాదించాడు. అయితే.. బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌ను బెదిరించారనే విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి తండ్రి.. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపించాడని, చేసినదానికి ఇంతకు ఇంత అనుభవిస్తావు అంటూ మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేశాడని, పైగా నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించే యత్నం కూడా చేశారని తెలిపారు. దీంతో బెయిల్‌ను నిరాకరించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోమల్ గార్గ్.. శంకర్ మిశ్రాకు బెయిల్ నిరాకరించారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు పోలీసులు శంకర్ మిశ్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించకుండా జ్యూడీషియల్ కస్టడీ విధించింది. -
ఆ ప్రబుద్ధుడి ఉద్యోగం ఊడింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైవాసి శంకర్ మిశ్రాపై అతడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వేటు వేసింది. ఉద్యోగంలోనుంచి తొలగించింది. శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో అనే బహుళజాతి సంస్థలో ఇండియా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ హుందాగా ప్రవర్తించాలని తాము కోరుకుంటున్నామని వెల్స్ ఫార్గో్గ ఒక ప్రకటనలో వెల్లడించింది. శంకర్ మిశ్రా చేసిన పని తమకు తలవంపులు తెచ్చిందని పేర్కొంది. కేసు పెట్టొద్దని వేడుకున్నాడు విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిందితుడి ముఖం చూడాలంటే అసహ్యం వేసిందని బాధితురాలు వెల్లడించారు. కేసు పెట్టొద్దని వేడుకున్నాడని, క్షమాపణ కోరాడని చెప్పారు. -
చరణ్ - శంకర్ సినిమాలో మోహన్ లాల్
-
RC15 : న్యూజిలాండ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన రామ్‌చరణ్, కియారా
న్యూజిలాండ్‌కి బై బై చెప్పారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, కియారాలపై బాస్కో వర్టిస్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారు. ‘న్యూజిలాండ్‌లో సాంగ్ షూటింగ్ పూర్తయింది. అద్భుతమైన విజువల్స్ వచ్చాయి’’ అని బుధవారం ట్వీట్ చేశారు రామ్‌చరణ్. కాగా ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ.15కోట్లు ఖర్చుచేశారట చిత్రయూనిట్. సో.. ఈ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
శంకర్-సూర్య కాంబోలో పాన్ ఇండియా చిత్రం! దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో..
ఇప్పుడు చారిత్రక కథా చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఇలాంటి చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ తరువాత టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి ఆ తరహా చిత్రాలకు ఊతమిచ్చారని చెప్పవచ్చు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలే ఇందుకు ఉదాహరణ. తాజాగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు రాజమౌళినే స్ఫూర్తి అని మణిరత్నం స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఈ దర్శకుల వరుసలో మరో స్టార్ డైరెక్టర్ శంకర్ చేరనున్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మాండ చిత్రాలకు కేరాఫ్ శంకర్ అనే ముద్ర వేసుకున్నారాయన. ప్రస్తుతం కమలహాసన్ కథా నాయకుడిగా ఇండియన్ –2, అలాగే టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో ఒక భారీ చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్న శంకర్ తదుపరి ఒక చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని రూ.వెయ్యి కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి శంకర్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మదురై పార్లమెంట్ సభ్యుడు ఎస్.వెంకటేశన్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. చేర, చోళ, పాండియన్ రాజుల తరువాత తరం రాజైన నేర్పాలి. రాజు ఇతివృత్తమే శంకర్ దర్శకత్వం వహించనున్నారని టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. India is waiting for #RC15 🔥#RamCharanpic.twitter.com/cU9yGvDZex — South Cinemas™ (@SouthCinemas_) August 3, 2022 -
BWF Championships: ఫైనల్లో ఓడినా.. శంకర్ ముత్తుస్వామి అరుదైన రికార్డు
సాంటెండర్ (స్పెయిన్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్ –19 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టీనేజర్ శంకర్ ముత్తుస్వామి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైకు చెందిన 18 ఏళ్ల శంకర్ 14–21, 20–22తో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 30 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రజత పతకం నెగ్గిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా శంకర్ నిలిచాడు. గతంలో జూనియర్ మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్ (1996లో), సైనా (2006లో)... జూనియర్ పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ (2015) ఫైనల్లో ఓడి రజతం సాధించారు. 2006లో రన్నరప్‌గా నిలిచిన సైనా 2008లో విజేతగా నిలువగా... గురుసాయిదత్ (2008లో), సాయిప్రణీత్, ప్రణయ్ (2010లో), సమీర్ వర్మ (2011లో), లక్ష్య సేన్ (2018లో) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలు గెలిచారు. చదవండి: Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ -
సత్తా చాటిన ముత్తు
శాంటండెర్ (స్పెయిన్): భారత రైజింగ్ షట్లర్ శంకర్ ముత్తుసామి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అతను పురుషుల అండర్–19 సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఈ భారత ఆటగాడికి కనీసం కాంస్యమైనా దక్కుతుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముత్తుసామి 21–18, 8–21, 21–16తో హు జె అన్ (చైనా)ను కంగుతినిపించాడు. ఒక గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత టీనేజ్ షట్లర్‌కు చైనా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను గెలిచేందుకు చెమటోడ్చిన శంకర్‌కు రెండో గేమ్‌లో నిరాశ తప్పలేదు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌ను గెలిచి ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్ థాయ్‌లాండ్‌కు చెందిన పనిత్చఫొన్ తీరరత్సకుల్తో తలపడతాడు. జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం దక్కించుకున్న 9వ భారత ఆటగాడు ముత్తుసామి. లక్ష్యసేన్ 2018లో చివరిసారిగా భారత్‌కు పతకం (కాంస్యం) అందించాడు. -
RC15: శంకర్ భారీ స్కెచ్.. ఒక్క పాటకే అన్ని కోట్లా?
డైరెక్టర్ శంకర్-మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక శంకర్-రామ్ చరణ్ కాంబో అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ నిర్మాణంలో కూడా శంకర్ ఎక్కడ రాజీ పడడనే విషయం తెలిసిందే. ముఖ్యం పాటలను ఆయన చాలా రిచ్‌గా ప్లాన్ చేస్తాడు. అలాగే ఈ సినిమాలోనూ చరణ్-కియారాల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్‌ను భారీగా ప్లాన్ చేశాడట శంకర్. చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి ఈ పాట కోసం ఏకంగా ఆయన రూ. 23 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఫిలిం ధునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈపాటలో రామ్ చరణ్-కియారాలతో కలిసి 1000మందికి పైగా డ్యాన్సర్స్ స్టెప్పులు వేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతున్నది క్లారిటీ. దీనిపై స్పష్టత రావాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మొదలైప్పటి నుంచి ఆర్సీ 15 సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఒక్క ఫస్ట్‌లుక్ పోస్టర్‌కే దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టాడని, అలాగే ఈ సన్నివేశం కోసం రూ. 10 కోట్లతో ఓ సెట్ వేసినట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! -
రామ్‌చరణ్‌కు భార్యగా అంజలి.. లీకైన ఫోటోలు
ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో ఉన్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలను తీస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరో వారం పాటు అక్కడి లొకేషన్స్‌లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తాయని, 1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్‌లో రామ్‌చరణ్, అంజలి భార్యభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపోస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి. అంతేకాదు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. -
తిరుపతిలో 'ఇండియన్-2' షూటింగ్
కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అయిందని సమాచారం. ఈ కొత్త షెడ్యూల్లో కమల్‌హాసన్, కాజల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రసవం అనంతరం కాజల్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఈశ్వరమ్మతో ‘నాకు వివాహేతర బంధం’ ఉంది.. గట్టిగా కేకలు వేయడంతో
సాక్షి, విశాఖపట్నం: జింక్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ సిద్ధార్థ శంకర్ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కుమారుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి క్రైం డీసీపీ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం... టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్ పట్నాయక్ మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ దగ్గర శంకర్ రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. మొత్తంగా చీటీలకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపి రూ.7లక్షల వరకు బాకీ పడ్డాడు. అయితే ఈశ్వరమ్మతో వివాహేతర సంబంధం కారణంగా బాకీ తీర్చకుండా జాప్యం చేశాడు. విషయం తెలుసుకున్న ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడు (బాలుడు) డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో... ఇవ్వను అని శంకర్ చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా ఈశ్వరమ్మతో తనకు వివాహేతర బంధం ఉందని కించపరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టడంతో ఆమె కుమారులు తట్టుకోలేకపోయారు. శంకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడాలని జూలై 25న తమ ఇంటికి పిలిచారు. తాగిన మైకంలో ఉన్న శంకర్ గొంతు, చేతి మణికట్టుపై కోసి ఈశ్వరమ్మ, గౌరీ శంకర్, అతని తమ్ముడు కడతేర్చారు. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్ మీద తీసుకెళ్లి జింక్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. అర్ధరాత్రి ఇల్లు కడగడంతో దొరికేశారు... జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో శంకర్ మృతదేహం జూలై 26న కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు అతని సహచర ఉద్యోగి, మల్కాపురం గాంధీజీ వీధికి చెందిన పాండా జితేంద్ర మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సిద్ధార్థ శంకర్ పట్నాయక్ జూలై 25న విధులకు హాజరుకాలేదని, మరుసటి రోజు జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో చనిపోయి కనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రైం ఏడీసీపీ డి.గంగాధరం పర్యవేక్షణలో గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్ఐ కె.సతీష్ బృందం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మింది గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులను విచారించగా... యడ్ల ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో శంకర్ గొడవపడ్డాడని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల వారితో మాట్లాడగా జూలై 25న అర్ధరాత్రి ఈశ్వరమ్మ ఇల్లు కడిగిందని స్థానికులు చెప్పారు. ఆ విషయం ఆధారంగా విచారించగా తామే శంకర్‌ను హతమార్చామని, రక్తపు మరకలను కడిగేశామని నిందితులు అంగీకరించారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ గంగాధరం, శ్రావణ్‌కుమార్, సీఐ ఎల్.భాస్కర్‌రావు, ఎస్ఐ కె.సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివాహేతర బంధంతో హత్యాయత్నం తన భార్యతో వివాహేతర బంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హతమార్చాలని దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంట్యాడ సమీప యారాడ గ్రామానికి చెందిన మొల్లి శ్రీను కూలి పనులు చేసుకుంటూ నివసించేవాడు. 2007లో మేనమామ కూతురుతో వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్యకు, ఎస్బీసీ డాలి్ఫన్ హిల్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొల్లి తాతారావుకు వివాహేతర బంధం ఏర్పడడాన్ని జీరి్ణంచుకోలేకపోయాడు. తాతారావును హతమార్చాలని శ్రీను నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి బీ షిప్ట్ ముగించుకుని తన సూపర్వైజర్ ఎస్.ప్రవీణ్‌తో కలిసి తాతారావు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 8.40 గంటలకు వారు డాలి్ఫన్ హిల్స్ గేటు ఎదురుగా రాగానే మొల్లి తాతారావుపై శ్రీను కారం చల్లి, ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన తాతారావు ఈ నెల 18న మల్కాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ లూథర్‌బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో శ్రీను దాడి చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చాకు, ఇనుపరాడ్డు స్వా«దీనం చేసుకున్నారు. -
న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు
సాక్షి, చెన్నై: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎస్. శంకర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం తన ఛానల్లో న్యాయ మూర్తులు, న్యాయవర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయశాఖ అవినీతి మయమైందని అందులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాన్ని మధురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి, నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. చదవండి: (మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి) -
సూర్య హీరోగా రూ. 1000కోట్ల బడ్జెట్‌తో శంకర్ సినిమా
తమిళసినిమా: ఈ ఆధునిక యుగంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కథలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. అయితే దర్శకుడు శంకర్ తన చిత్రాల కథల విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెంటిల్మెన్ నుంచి 2.ఓ చిత్రం వరకు ఈయన చిత్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రా మ్చరణ్ కథానాయకుడిగా చేస్తున్న చిత్రంతో పాటు తమిళంలో కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. వీటి తరువాత పొన్నియన్ చిత్ర హిందీ రీమేక్‌కు సిద్ధం అవుతారని సమాచారం. ఆ తరువాత రూ. 1000 కోట్ల బడ్జెట్లో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ సభుయడు ఎస్.వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి నవలను చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీని స్క్రీన్‌ప్లేను వెంకటేశ్, శంకర్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీనిని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రం, శివ దర్శకత్వంలో తాను 42వ చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చేయాల్సి ఉంది. ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించే అవకా శం ఉందని టాక్. ఇలాంటి చారిత్రక కథా చిత్రాలు కోలీవుడ్‌లో వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రూపొంది సంచలన విజయం సాధించాయి. వాటి ఇన్సిఫిరేషన్తోనే శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది. -
ఇట్స్ అఫీషియల్.. RC15లో ప్రముఖ నటుడు సూర్య
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా శంకర్ సినిమా అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దీనికి తగినట్లుగానే నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో ఏమాత్రం రాజీపడరాయన. తాజాగా RC15 కోసం ఓ స్టార్ యాక్టర్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సూట్ వేసుకొని చేతిలో ఫైల్ పట్టుకొని స్టైల్‌గా నడుస్తున్నట్లున్నఎస్.జే సూర్య పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. Versatile actor @iam_SJSuryah joins our stellar cast! Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta — Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022 -
బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!
బాలీవుడ్ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్‌లో కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లు–బాలీవుడ్ హీరోల కాంబినేషన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్’, ‘బిగిల్’ వంటి హిట్ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. (చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?) ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమాకి సై అన్నారు రణ్వీర్ సింగ్. 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్’ హిందీ రీమేక్ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో శంకర్ ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్‌ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిందీలో శంకర్ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్’ (2001)గా తెరకెక్కించారు శంకర్. ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్ వేదా’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పుష్కర్–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌నూ తెరకెక్కించారు. పుష్కర్– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరోవైపు తక్కువ టైమ్‌లో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్’ హిందీ రీమేక్) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్‌తో లోకేశ్ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఇంకోవైపు రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ హిందీలో ఓ సినిమా కమిట్ అయ్యారు. జార్ఖండ్‌కు చెందిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్’గా చెప్పుకునే పి. రాజగోపాల్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్‌ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
'ఆ హీరోతో నటించొద్దు'.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్
పెళ్లై అత్తవారింటికి వెళ్లే వరకు కూతుళ్లకు తమ రక్షణ అవసరమని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఇలానే భావించారన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్. ఈమెకు సినిమా హీరోయిన్ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది ఆమె తండ్రి దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించాట. అయితే ఆయనకు అసలు టెన్షన్ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట. ఈ నేపథ్యంలో కరోనా కుమార్ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ టెన్షన్ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి!
నెపోటిజం(బంధుప్రీతి) ఈ పేరు వినగానే మొదట గుర్తోచ్చేది బాలీవుడ్. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం బాలీవుడ్లో నెపోటిజంపై ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్లో వినిపించే ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది. తాజాగా యువ నటి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్‌లో సైతం నెపోటిజం ఎఫెక్ట్ ఉన్నా ఇప్పటివరకు దీనిపై మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ధైర్యం చేసి ఈ అంశాన్ని లెవనెత్తినట్లు కనిపిస్తోంది. ‘సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా. మరి మిగతావాళ్ల సంగతేంటి’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఆమె ట్వీట్ చూస్తుంటే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ బంధుప్రీతిపై తొలిసారి నోరు విప్పిన ఈ బ్యూటీ పెద్ద స్టార్ ఏమీ కాదు. ఈమధ్యే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ యువ నటి. ఇప్పటి వరకు ఆమె చేసింది ఒకట్రెండు సినిమాలు మాత్రమే. ఇంతకి ఈ బ్యూటీ పేరు ఏంటంటే ఆత్మిక. ‘మిసాయి మురుకు’ అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆత్మికకు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మిక తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ నేపథ్యంలో ఇటీవలే నటిగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌కు పరోక్షంగా ఆమె చురకలు వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అదితి.. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాదు సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు కన్ను కుట్టినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. కాగా అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్గా చాన్స్ కొట్టేయగా.. తాజాగా ఆమె శివ కార్తికేయన్ సినిమాలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. It’s good to see privileged getting easy way through the ladder while the rest 🥲 Paathukalam 🙌🏽 — Aathmika (@im_aathmika) August 4, 2022 -
డైరెక్టర్ శంకర్‌కు అరుదైన గౌరవం
తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్. జెంటిల్మెన్తో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ముదల్వన్, బాయ్స్, శివాజీ, ఇండియన్, ఎందిరన్, ఐ, ఎందిరన్–2 ఇలా ఒక దానికి ఒకటి పూర్తి భిన్నంగా చిత్రాలు చేసి స్టార్ డైరక్టర్‌గా ప్రసిద్ధికెక్కారు. అలాగే సినీ దర్శకుడిగా 30 ఏళ్ల మైలురాయిను టచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వేల్స్ ఇంజినీరింగ్, రీసెర్చ్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శుక్రవారం పల్లావరంలోని వర్సిటీ ఆవరణలో 12వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, పతకాలను ప్రదానం చేశారు. అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. అందులో దర్శకుడు శంకర్, అణు శాస్త్ర విజ్ఞాన కేంద్రం డైరక్టర్ అజిత్‌కుమార్ మొహతీ, భారతీయ క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా, నాటి జూన్ బ్లూ గ్రూప్ అధ్యక్షుడు విక్రమ్ అగర్వాల్ గౌరవ డాక్టరేట్ పురస్కారాలు అందుకున్నారు. ముందుగా వేల్స్ విశ్వవిద్యాలయం చైర్మన్ ఐసరి గణేష్ అతిథులకు స్వాగతం పలికారు.