siddaramaiah
-
డీకేకు షాక్!.. సీఎం పదవిపై సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో ఐదేళ్లపాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్య కర్తలను హామీ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా నియమించడం ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించిందని బీజేపీ ఆరోపించింది. ఇలాంటి నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని ప్రతిపక్షనేత ఆర్.అశోక ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే స్పందించారు. ‘మేం ఎక్కడికీ పోం. మేం మళ్లీ గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.ఇక, ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన చన్నపట్న, షిగ్గావ్, సండూర్లలో బీజేపీ ఓటమిని సీఎం గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు దమ్ముందా అంటూ తమకు సవాల్ విసిరారని, ఆ తరువాత ఫలితాలనూ చూశారని ఎద్దేవా చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, తదుపరి ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనకు మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కాగా, ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్లు, సభ్యులుగా కాంగ్రెస్ తమ పార్టీ వారిని నియమించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కమిటీలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బుధవారం కలిసి బీజేపీ.. వినతిపత్రం సమర్పించింది. ఇది శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనని బీజేపీ ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో రెండో రోజు నిరసనను కొనసాగించింది. దీంతో మధ్యాహ్న భోజనం తరువాత అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.అయితే ఎమ్మెల్యేలను అగౌరవ పరిచే పనిని తాను చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం ముందు నుంచి ఉన్నదేనని, గతంలో బీజేపీ కూడా ఇలాగే చేసిందని చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా పార్టీ కార్యకర్తలను చేయడం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మంత్రుల వ్యక్తిగత సహాయకులుగా చేశారని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు మరింత గందరగోళంగా మారాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కమిటీ చైర్మన్లను చేయడానికి తాము వ్యతిరేకం కాదని, వారికి కార్యాలయం ఇవ్వడం, నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయడంపైనే తమ అభ్యంతరమని ప్రతిపక్ష నేత అశోక తెలిపారు. -
సిద్దరామయ్యకు ఝలక్.. కర్ణాటక సీఎంగా డీకే?
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇక, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరొకరు ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం’అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధూ దృష్టికి తేగా.. ‘నేను హైకమాండ్ అదేశాల మేరకే నడుచుకుంటాను’ అని ఆయన బదులిచ్చారు. -
కన్నడ రాజకీయంలో ట్విస్ట్.. కుమారస్వామికి ఝలక్!
శివాజీనగర: కర్ణాటకలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ. కుమారస్వామిని విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో, కన్నడ రాజకీయం హీటెక్కింది.గతంలో బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే చార్జ్‌షీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్చి సమర్పించారు. ఈ నేపథ్యంలో గరవ్నర్ అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో కేంద్రమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు.అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయనకు ఊరట దక్కింది. -
MUDA Scam.. సీఎం సిద్ధరామయ్యకు ఊరట
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుండి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమయి కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్ ఎం నాగప్రసన్న తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు. లోకాయుత్త దర్యాప్తు చేయగలదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సిద్దరామయ్య తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు.ముడా స్కాం ఇదే..మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది. -
‘ముడా’ స్కాంలో ‘ఈడీ’ దూకుడు.. సీఎం భార్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు. -
సీఎంకు క్లీన్చిట్ వచ్చేసిందా?
బనశంకరి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన మైసూరు ముడా ఇళ్ల స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది, మరికొందరిపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఇందులో విచారించిన రాష్ట్ర లోకాయుక్త.. సీఎంకు, ఆయన సతీమణి పార్వతికి క్లీన్చిట్ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. లోకాయుక్త పోలీసులు సీఎంతో పాటు ఇతరులను పిలిచి విచారించారు. ఆ నివేదికను రూపొందించి సోమవారం మైసూరులో కోర్టుకు సమర్పించారు. అందులో సీఎం దంపతులకు క్లీన్చిట్ ఇచ్చినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపాయి. ఏదేమైనా నివేదిక అధికారికంగా బయటకు వస్తేనే పూర్తి వివరాలు తేటతెల్లమవుతాయి. నాకు తెలియదు: స్నేహమయి ఈ కేసులో ఫిర్యాదిదారు స్నేహమయి కృష్ణ స్పందిస్తూ క్లీన్చిట్ ఇవ్వడం గురించి తనకు తెలియదన్నారు. ఇది తన పోరాటానికి ఎలాంటి అడ్డంకి కాదని, సీఎం హస్తం లేకుండా అధికారులు అక్రమాలకు పాల్పడటం సాధ్యం కాదని, ఇందులో సిద్దరామయ్య పాత్ర ఉందని ఆరోపించారు. నాకు కూడా తెలియదు: సీఎం ముడా కేసులో తనకు, భార్యకు లోకాయుక్త క్లీన్చిట్ ఇచ్చారనేది తెలియదని సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా ఇంకా తెలియదన్నారు. తాను ఐదేళ్లు పదవిలో ఉండాలా అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని అన్నారు. బడ్జెట్ పనుల వల్ల దావోస్ టూర్‌కి వెళ్లలేదని, గత ఏడాది కూడా వెళ్లలేదని చెప్పారు. -
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్
బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్‌ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్‌గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: గులాబ్జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు -
524 మీటర్లకు ఆల్మట్టి డ్యామ్
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. 13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్‌కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
నా చివరి శ్వాస వరకు సిద్ధరామయ్య కోసం నిలబడతా: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కౌంటరిచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘25 ఏళ్ల తర్వాత హాసన లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలచుకున్న కాంగ్రెస్ 2028లోనూ ఇక్కడి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడని దేవేగౌడ.. తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టారు. నందిని పాలను అమూల్ బ్రాండ్‌లో విలీనం చేయాలని ఎన్డీఏ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్‌ను మేము ఢిల్లీలో ఆవిష్కరించామని గుర్తుచేశారు. కర్ణాటక ప్రజలు కాంగగ్రెస్ వైపు నిలబడ్డారు. 2028 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే నిరూపించండి
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు. -
ఈడీ కేసు ఎలా పెడుతుంది?
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్ ఎ.ఎన్.రఘునందన్ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతించడం తెలిసిందే. ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ‘‘గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవడం రివాజే అయినా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఇది అలాంటి కేసే’’ అని అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో లబి్ధదారు స్వయానా పిటిషనర్ కుటుంబానికి చెందిన వ్యక్తే. కనుక అభియోగాలపై విచారణ అవసరమన్నది నిస్సందేహం’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు.గవర్నర్ ఏమాత్రం ఆలోచన లేకుండా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బాగా ఆలోచించిన మీదటే దర్యాప్తుకు అనుమతిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ముడా కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆగస్టు 16న అనుమతించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.విచారణకు తానేమీ వెనకాడటం లేదన్నారు. అయితే, ‘‘నేనెందుకు రాజీనామా చేయాలి? అవినీతి ఆరోపణల్లో బెయిల్‌పై తిరుగుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామా చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ కేసు నాపై, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాల్లో భాగం. అందుకోసం గవర్నర్ అధికారాలను కూడా దురి్వనియోగపరుస్తున్నారు’’ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకు దన్నుగా ఉందని చెప్పారు.రాజీనామా చేయాలి: బీజేపీ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మీ అబద్ధాల సామ్రాజ్యం కుప్పకూలింది. గౌరవప్రదంగా రాజీనామా చేయండి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలు కలి్పంచండి’’ అని పార్టీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆయన రాజీనామా చేయబోరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘‘ఇదో కుట్ర. సిద్ధరామయ్య నిర్దోíÙత్వాన్ని నిరూపించుకుంటారు’’ అన్నారు. ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచి్చతంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదించారు. ఈ ఆరోపణలపై జూలైలో సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసిచ్చారు. అనంతరం విచారణకు అనుమతిచ్చారు. -
కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు..
-
నేడు హైకోర్టులో సీఎం సిద్దు పిటిషన్?
శివాజీనగర: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) ఇంటి స్థలాల స్వీకారంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గెహ్లాట్ అనుమతినివ్వడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం కోర్టును ఆశ్రయించనున్నారు. గవర్నర్ ఆదేశాలపై స్టే, లేదా కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ సమర్పించనున్నారు. కాంగ్రెస్ నేతలు, సీనియర్ వకీళ్లు అయిన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ నుంచి ఆదివారం బెంగళూరుకు వచ్చారు. వీరిద్దరితో సిద్దరామయ్య న్యాయ పోరాటం గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం సైతం సిద్దరామయ్యకు అండగా ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ముడా కేసును, ఫిర్యాదిదారుల లేఖలను, ప్రాసిక్యూషన్ ఆదేశాలను లోతుగా అధ్యయనం చేసి ఎలా ముందుకెళ్లాలనేది సిబాల్, సింఘ్విలు మంతనాలు జరిపారు. రాష్ట్రానికి చెందిన రాజ్యాంగ, న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాక ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.ప్రజా ప్రతినిధుల కోర్టులో..ముడా కేసులో సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 20న జడ్జి ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. అంతలోపే తమ విన్నపాలను ఆలకించాలని సిద్దరామయ్య సోమవారం మధ్యంతర పిటిషన్ సమర్పించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహాం కోర్టులో సీఎంపై ప్రైవేట్ కేసు వేసి ఎఫ్ఐఆర్ నమోదుకు విజ్ఞప్తి చేశారు.అన్ని జిల్లాల్లో ధర్నాలు: డీసీఎంకాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. సోమవారం అన్ని జిల్లాల్లో బీజేపీ, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు జరుపనున్నారు. మైసూర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయాలను తెలిపారు. ప్రతి జిల్లాలో ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోంది. వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాత్మాగాంధీ బాటలో అహింసా పద్ధతిలోనే మా పోరాటం జరుగుతుంది అని చెప్పారు. -
MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.కేబినెట్ అత్యవసర భేటీ..మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి -
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
ముక్కుసూటి మనిషిపై అవినీతి మరక
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ముక్కుసూటి మనిషి. కాంగ్రెస్‌లో అధిష్టానానికి.. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి విధేయుడి గుర్తింపు. 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ అపర చాణక్యుడు.. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు చూసిన సిద్ధరామయ్యను ప్రస్తుతం వాల్మీకి కుంభకోణం, ముడా స్థలాల పంపిణీలో అక్రమాల పేరిట ఉన్న రెండు కేసులు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. 1983లో తొలిసారి ఏడో అసెంబ్లీలో అడుగుపెట్టిన సిద్ధరామయ్య, 1985లోనే మంత్రి పదవిని అలంకరించారు. 1996లో ఉప ముఖ్యమంత్రిగాను, 2013లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో పార్టీ, ప్రభుత్వ పదవులు చేపట్టిన సిద్ధరామయ్య మలి వయసులో ఇబ్బందులు పడుతున్నారు.సోషల్ మీడియాలో బీజేపీ విమర్శల దాడి :40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి బ్లాక్ మార్కు లేదని గర్వంగా చెప్పుకుని తిరిగే సిద్ధరామయ్యకు జీవితంలో ఒంటి నిండా అవినీతి మరకలు ఉన్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణలకు బదులు చెప్పలేక సిద్ధరామయ్య మాటలు తడబడుతున్నాయి. ఇదే క్రమంలో సిద్ధరామయ్య పరిపాలన కాలంలో ఏకంగా 9 అవినీతి మరకలు, కుంభకోణాలు ఉన్నాయని బీజేపీ ఒక జాబితాను తయారు చేసి విడుదల చేసింది. ఈ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధరామయ్యపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి తాను సత్యహరిశ్చంద్రుడినని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి. తన నిష్కళంక రాజకీయ జీవితంపై బ్లాక్ మార్కు వేయాలని బీజేపీ ముఖ్య నేతలు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిద్ధరామయ్య మాత్రం పదే పదే చెబుతున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బదులు చెప్పలేక, ప్రతిపక్ష పార్టీ నేతలపై కూడా చాలా వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయని, కానీ వాటిపై ఎప్పుడు విచారణ జరగలేదని ఎద్దేవా చేశారు. తాను మాత్రం ముడా కేసులో న్యాయ విచారణకు సిద్ధపడ్డానని, ఇంతకుమించి ఇంకేమీ చేయాలంటే ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నం చేశారు.తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి చేయలేదని, తన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముడా కేసు విషయంపై తనకు ఎలాంటి భయం లేదని, ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఈ బ్లాక్ మార్కు ఎవరు పెడుతున్నారు. సిద్ధరామయ్య తన ఒంటి నిండా అవినీతి మరకలు పెట్టుకుని మాపై నిందలు వేయడమా అంటూ బీజేపీ 9 అవినీతి కుంభకోణ కేసులను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.సిద్దూపై బీజేపీ ఆరోపణలు ఇవే⇒ వజ్రాలతో పొదిగిన హ్యుబ్లాట్ వాచ్ ధరించడం⇒ ఆర్కావతి లేఔట్ డీనోటిఫిపై⇒ కృషి భాగ్య పథకంలో వందలాది కోట్ల అవినీతి⇒ అన్నభాగ్య పథకంలో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు⇒ ఇందిరా క్యాంటీన్లో అవినీతి⇒ ఇందిరా క్యాంటీన్ అవినీతిని కప్పిపుచ్చేందుకు లోకాయుక్త మూసివేత⇒ వాల్మీకి నిగమలో వందలాది కోట్ల రూపాయల గోల్మాల్⇒ ముడాలో అక్రమంగా స్థలాల పంపిణీ⇒ సిట్‌ను తమ చేతి కీలుబొమ్మగా మార్చుకుని క్లీన్చిట్ పొందడం -
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్ వచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్‌లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్.. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.మోదీ అబద్ధాలు మాట్లాడుతున్నారని, భావోద్వేగంతో దోపిడీ చేస్తారని ప్రజలు గ్రహించారని అన్నారు. తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఆయనను సజీవంగా సమాధి చేయాలని ఎందుకు అనుకుంటారు. బదులుగా, మోదీ చేస్తున్న రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా ఆయన (మోదీ) ప్రధానిగా ఉన్నారు. పేదల కోసం చేసిందేమీ లేదు . దానికి తోడు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ఆయన అబద్ధాల మాస్టర్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానిని ఓడించడం తప్ప, సజీవ సమాధి చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్బార్లో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న కొందరు తనను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, వారు తనకు ఎలాంటి హాని జరగనివ్వబోరని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని నిరాశలో, ఓటమి భయంతో ఉన్నారు. భయం, నిస్పృహతో ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ అబ్ధాలు, భావోద్వేగంతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమైందని ..తమను మానసికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలకు తెలుసునని, ఈ విషయం తెలిసి ప్రజలు ఓట్లు వేయరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పైకి వెళ్లిన వారు కిందకు దిగి రావాల్సిందేనన్నారు. -
నోరు జారిన అమిత్ షా!
-
రాహుల్ వచ్చారు.. సిద్దయ్య పోతారు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేస్తుంటడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేసింది. ‘రాహుల్ వచ్చారు. సిద్దరామయ్య వెళ్లిపోతారు’ అంటూ బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో సిద్దరామయ్య ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ‘గడిచిన ఐదు ఏళ్లలో సీఎం సిద్దరామయ్య ఏమీ చేయలేదు. ఇప్పటివరకు పడుకొని ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు నిద్రలేచి.. తన కారునిండా ఇటుకలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళితే.. అక్కడ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఏమీ చేయని సిద్దరామయ్య.. ఇప్పుడు నవకర్ణాటకను నిర్మిస్తున్నానని చెప్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు’ అని మురళీధర్‌రావు మండిపడ్డారు. తుముకూరులో నిర్వహించిన బీజేపీ గొల్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాకటలో యాదవ సామాజికవర్గం జనాభా 35 లక్షల వరకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హామీ ఇచ్చారు. -
మళ్లీ ట్వీటేసిన సిద్ద రామయ్య
సాక్షి, బెంగళూరు : బీజేపీపై విమర్శల దాడిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య దూసుకెళుతున్నారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీని నిలదీస్తున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమల బకాయిలను రద్దు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులెందుకు కనిపించడం లేదని, వారికి ఎందుకు రుణ విముక్తి కలిగించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ వెన్నెముక లేని పార్టీగా వ్యవహరిస్తోందని, కార్పోరేట్ లోన్ల రద్దు విషయం లెక్కల పాఠాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతోందంటూ వ్యాఖ్యానించారు. 'రైతుల రుణాలు మాఫీ చేయాలని అడగాల్సింది పోయి కర్ణాటక బీజేపీ వెన్నెముక లేనిదిగా ప్రవర్తిస్తోంది.. పైగా లోన్లపై లెక్కల పాఠాలు చెప్పుకొస్తోంది. ప్రజలేం మూర్ఖులు కారు. కేంద్రం బడా పారిశ్రామిక వేత్తల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తుందిగానీ, రైతులకు మాత్రం కోట్లలో ఉన్న రుణాలు రద్దు చేయలేదా?' అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడితో యుద్ధం చేస్తున్నాయి. The Karnataka BJP is so spineless that instead of asking the center to waive farmers’ loans it is giving accountancy lessons on Twitter. People will not be fooled. Center can write off lakhs of crores of a few industrialists but can’t give debt relief to crores of farmers. https://t.co/D9LH60Asaz — Siddaramaiah (@siddaramaiah) March 22, 2018 -
కర్ణాటకపై కన్నేసిన రాహుల్
-
కర్ణాటకలో రాహుల్ వ్యూహం ఏంటి?
సాక్షి, బెంగళూరు : రాజకీయంగా దిగాలుపడి మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నాల్లో భాగంగా 1978 లో చిక్మగుళూరు నుండి లోక్‌సభకు పోటీచేస్తూ ఇందిరాగాంధీ తుంగనది ఒడ్డున ఉన్న శృంగేరి మఠంలో అడుగుపెట్టారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఆర్స్ ఇందిరాగాంధీకి పూర్తి అండగా నిలబడి తన నాయకురాలి రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు వేసారు. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ మనవడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శృంగేరి మఠంలో బుధవారం అడుగు పెట్టనున్నారు. దాదాపు అదే పరిస్థితుల్లో... వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉపెన్నికల్లో దెబ్బతిన్న బీజీపీకి కర్ణాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం. ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘10 శాతం ప్రభుత్వం’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు ... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపినాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే. ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికల్లో బీజీపీ చావు దెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్నఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు. బీజేపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జీజిఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జేడీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోదీ హవా వేరు. గత సంవత్సర కాలంలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు తొమ్మిదిలో పాగా వేసాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఈ నిర్ణయం ఎంతవరకు కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. ఎస్ . గోపీనాథ్‌రెడ్డి -
లింగాయత్‌లకు ప్రత్యేక మతమైనారిటీగా గుర్తింపు
-
ఆ వర్గం వారు.. ఇక ప్రత్యేక మతస్తులు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాకట కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మతమైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరించిన నేపథ్యంలో ఈ అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మత మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్దరామయ్య లింగాయత్‌ల డిమాండ్ నెరవేర్చాలని నిర్ణయించడం.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుకు కలిసివస్తుందని భావిస్తున్నారు. -
సంతోషంలో రామయ్య.. యోగికి చురకలు
సాక్షి, బెంగళూరు : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెట్టింపు సంతోషంతో తన స్వరాన్ని పెంచారు. ట్విటర్ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు ఉపన్యాసాలు తగ్గించుకోండి' అంటూ హితబోధ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధపడుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు. ముందు ఆయన ఉండే చోటులో అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై దృష్టిని సారించింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపై అని చెప్పింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, పైగా దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ ఆదిపత్యం కొనసాగిన చోట ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
సిద్దరామయ్య రూటే సెపరేటు
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏడాది కాలంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ జాతీయవాదానికి దీటుగా కన్నడ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూ సమరాంగణంలో సవాలు విసురుతున్నారు. కాషాయపక్షం వ్యూహాలకు దీటైన రీతిలో ఆయన జవాబిస్తున్నారు. బెంగళూరు మెట్రో రైల్ నమ్మ మెట్రో సైన్ బోర్డుల్లో హిందీ మాటలు తొలగించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఆయన కిందటేడాది లేఖ రాశారు. రాష్ట్రంలో కన్నడ భాష విషయంలో తమిళుల మాదిరిగా ఆత్మగౌరవం అంశాన్ని ముందుకు తెచ్చి మెజారిటీ కన్నడిగుల ఆదరణ సంపాదించాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. దాదాపు 28 ఏళ్లు కాంగ్రెసేతర పార్టీల్లో కొనసాగినా 2006లో కాంగ్రెస్‌లో చేరిన ఏడేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సిద్దరామయ్య రాజకీయ ఎత్తుగడలకు, సామర్ధ్యానికి అద్దంపడుతోంది. కర్ణాటకకు ప్రత్యేక జెండా! అలాగే కన్నడిగుల ‘అస్మిత’, ఉనికిని చాటిచెప్పేలా సిద్దరామయ్య సర్కారు కర్ణాటకకు ప్రత్యేక జెండా ప్రతిపాదన చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులేవైనా ఉన్నాయా? అనే విషయం పరిశీలకు కిందటి డిసెంబర్లో నిపుణలతో ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అందుకు పచ్చ జెండా చూపించాక ప్రభుత్వం జెండా రూపొందించింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 370 అధికరణ వల్ల జాతీయ పతాకంతో పాటు రాష్ట్ర జెండా ఎగురవేసే అవకాశం ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ఉంది. కన్నడిగుల స్వాభిమానానికి సంబంధించిన ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడదంటూ సిద్దరామయ్య ప్రశ్నించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. వీరశైవులకు ప్రత్యేక మతంగా గుర్తింపు! రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో పెద్దదైన లింగాయత్‌లను(జనాభాలో 10 శాతం) కాంగ్రెస్‌వైపు మళ్లించడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు ఉత్తర కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. లింగాయత్లందరూ ఏకాభిప్రాయంతో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరితే, తాను ఈ కోర్కె తీర్చాలని కేంద్రానికి సిఫార్సు చేస్తానని సిద్ధరామయ్య హామీ ఇవ్వడంతో ఈ సామాజికవర్గంలో కదలిక మొదలైంది. లింగాయత్‌లు మరో వ్యవసాయాధార సామాజికవర్గం వొక్కళిగలతో పాటు వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జాబితాలో ఉన్నారు. అయితే, తాము హిందూ సమాజంలో అంతర్భాగం కాదని, తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్‌లలో కొందరు చాలా ఏళ్ల క్రితమే డిమాండ్‌చేశారు. ఉత్తర కర్ణాటకలో ఇటీవల వరుసగా అనేకచోట్ల ఈ డిమాండ్‌పై వేలాది మందిని సమీకరించి సమావేశాలు నిర్వహించారు. తొలుత వీరశైవులు, లింగాయత్‌లు అనే రెండు వర్గాలుగా ఉన్న జనం ఇటీవల లింగాయత్‌లనే పేరుతో కలిసిపోయారు. చివరి కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను పదవిలో ఏడాది కూడా పూర్తి చేయకుండానే 1990లో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తొలగించింది. అప్పటి నుంచీ ఈ సామాజికవర్గం నెమ్మదినెమ్మదిగా బీజేపీకి దగ్గరవుతూ వస్తోందని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ మాజీ సీఎంలు బీఎస్ యెడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్లు లింగాయత్‌లే. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలని నిపుణుల కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్ర కేబినెట్వెంటనే ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరుతూ ఇటీవల లింగాయత్‌లు అధిక సంఖ్యలో ఉండే కలబురగిలో జగతిక లింగాయత మహాసభ నిరవధిక ప్రదర్శన ప్రారంభించింది. ఈ సిఫార్సును అంగీకరించేదిలేదని బీజేపీ నేత యెడ్యూరప్ప ప్రకటించారు. మహదాయి జలాలపై వివాదం వాయవ్య కర్ణాటకలో ఎప్పుడూ మంచినీటి కొరత ఎదర్కునే బెళగావి, విజయపుర సహా ఆరు జిల్లాల అవసరాలు తీర్చడానికి మహదాయి నది నుంచి 7.56 శతకోటి ఘనపుటడుగుల నీటిని తరలించడానికి ఉపనదులైన కలస, బందూరిలను అనుసంధానం చేయాలన్న 16 ఏళ్ల నాటి డిమాండ్‌ను ఇప్పుడు సిద్దరామయ్య మళ్లీ తెరపైకి తెచ్చారు. గోవాలో మాండోవిగా పిలిచే మహదాయి నీటి తరలింపునకు అక్కడి బీజేపీ సర్కారు సుముఖంగా లేకపోవడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. 2002లోనే కేంద్రంలోని ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం కర్ణాటక ప్రతిపాదనకు ఆమోదముద్రవేసింది. తమిళనాడుతో నిరంతరం వివాదాలకు కారణమైన కావేరీ జలాల పంపిణీ విషయంలో కూడా సిద్దరామయ్య కర్ణాటక ప్రయోజనాలు కాపాడుతున్నారనే ‘ఇమేజ్’ సంపాదించారు. భాషాభివృద్ధి నినాదంతో రాజకీయ జీవితం ప్రారంభం సోషలిస్ట్నేత రామ్‌మనోహర్‌లోహియా స్ఫూర్తితో సిద్దరామయ్య మొదట మాతృభాషాభివృద్ధికి కన్నడ కావలు సమితి అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ప్రస్తుత రూపంలో కర్ణాటకగా అవతరించడానికి ముందు బొంబాయి కర్ణాటక, హైదరాబాద్‌కర్ణాటక, మద్రాస్కర్ణాటక, మైసూరు అనే నాలుగు పాలనా విభాగాలుగా ఉన్న కారణంగా కన్నడిగులకు భాష విషయంలో స్వాభిమానం ఎక్కువ. అందుకే కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇటీవల కన్నడ రక్షణ వేదిక నుంచి వినతిపత్రం అందుకోవడానికి తన మంత్రివర్గసభ్యుడు ఎం.కృష్ణప్పను బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌కు పంపించారు. కన్నడ అనుకూల వైఖరి అవలంబించడానికి కారణం కేవలం బీజేపీ అసలు స్వరూపం బయట పెట్టడమే కాదని, జేడీఎస్వంటి ప్రాంతీయపక్షాన్ని కట్టడి చేయడానికి కూడా అది ఉపకరిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆదిత్యనాథ్‌కు సలహా! కిందటేడాది కర్ణాటక పర్యటనకు వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. వాటికి సిద్దరామయ్య ట్విటర్‌ద్వారా దీటైన జవాబు ఇచ్చారు. ‘‘ యూపీ సీఎంను మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. మీరు ఇక్కడ ఉండగా ఇందిరా క్యాంటీన్లు, రేషన్‌షాపులు చూడండి. అలా చేస్తే మీ రాష్ట్రంలోని ఆకలి చావులు నివారించవచ్చు’’ అని సిద్దరామయ్య ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే, కిందటి జనవరిలో మహదాయి జలాలను కర్ణాటక ప్రజలు దొంగచాటుగా వాడుకుంటున్నారంటూ గోవా నీటి వనరుల మంత్రి వినోద్పలియెంకర్విలేకరుల సమావేశంలో ఆరోపించిన సందర్భంలో కన్నడిగులను ‘హరామీ’ (ద్రోహులు)అని వర్ణించారు. అప్పుడు కూడా సిద్దరామయ్య గట్టిగా స్పందించి నదీ జలాలపై కన్నడిగులకున్న హక్కును తేల్చి చెప్పారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆ వీడియోలో ఉంది సిద్ధరామయ్యేనా?
సాక్షి, బెంగళూర్ : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. తనదైన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఆయన పేరిట డాన్స్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆయన హుషారుగా డాన్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. చౌక సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ అల్లాడ్సు.. అల్లాడ్సు సాంగ్‌పై వీడియోలో ఉన్న పెద్దాయన హుషారుగా గంతులేయటం చూడొచ్చు. అది పాతదో.. కొత్తదో.. తెలీదు, అసలు అందులో ఉంది సిద్ధారామయ్య అన్నది కూడా గ్యారెంటీ లేదు(పంచె కట్టు, వేషాధారణ మాత్రం అలాగే ఉంది). ఎక్కడి నుంచి ఇది వైరల్ అవుతుందో స్పష్టత లేదు. అయినా సీఎం సిద్ధారామయ్య చిందుల పేరిట ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఫేక్ వీడియోతో పరువు తీస్తున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అది ఆయనేనంటూ వైరల్ చేస్తున్నారు. వీడియోకు కామెంట్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. -
ఆ వీడియోలో ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా?
-
‘ప్రత్యేక జెండా ఉండకూడదన్న నిబంధన లేదు’
కర్ణాటక, బెంగళూర్ : కర్ణాటకలోని సిద్ధ రామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అన్నంత పని చేసింది. రాష్ట్రం కోసం కొత్త జెండాను రూపకల్పన చేసిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు దానిని ఆవిష్కరించింది. గురువారం ఉదయం విధాన సౌధాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న నాడా ద్వజ(జెండా) రాష్ట్ర చిహ్నం గంఢ బెరుండను, రెండు తలల పక్షిని కలిగి ఉంది. ప్రత్యేక జెండాకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయగా.. ఆవిష్కరణానంతరం ఏర్పాటు చేసిన కమిటీని సిద్ధరామయ్య అభినందించారు. ఈ జెండాను కేంద్రం ఆమోదం కోసం పంపనున్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూదన్న నిబంధన రాజ్యాంగంలో పొందుపరచలేదు. అలాంటప్పుడు కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉంటే తప్పేం కాదు’ అని ఈ సందర్భంగా సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు. అప్పట్లో ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకత ప్రదర్శించగా.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర జెండాకు ఆమోదం లభించటం అనుమానమే. అయితే త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
సీఎం డ్యాన్స్ అదుర్స్
-
దరువేస్తూ చిందేస్తూ సీఎం డ్యాన్స్ అదుర్స్
సాక్షి, బెంగళూరు : జాతీయ పార్టీల అధ్యక్షుల రాకతో కర్ణాటక కళకళ లాడుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో అడుగుపెట్టి కాంగ్రెస్‌పై, సీఎం సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు చేస్తుండగా తాజగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగారు. సోమవారం కర్ణాటక వచ్చిన ఆయన గోడచిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బెలగావిలోని సౌందట్టి ప్రాంతంలో యల్లమ్మ ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం సిద్ద రామయ్య సాంప్రదాయ డప్పులపై దరువులు వేశారు. దరువు వేసే క్రమంలో తన ఊపును ఆపుకోలేక సిద్ద రామయ్య చిందేశారు. దరువేస్తూ చిందేస్తున్న సిద్దరామయ్య ఆ వీడియో ఇప్పుడు హల్చల్ అయింది. ఒకసారి మీరు ఆ వీడియోను చూడండి. -
మోదీ ప్రధానిగా కొనసాగడానికి అనర్హుడు!
సాక్షి, బెంగళూరు: తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా.. ప్రధాని మోదీ వాటి గురించి నోరు మెదపడంలేదని విమర్శించారు. ఆయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు. మోదీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి అనర్హులని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అవినీతిమయమైందని, రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోందని ప్రధాని మోదీ సోమవారం మైసూరు సభలో విమర్శించిన సంగతి తెలిసిందే. తాను ఇటీవల బెంగళూరు సభలో సిద్దరామయ్య సర్కారును పదిశాతం కమీషన్ల ప్రభుత్వమని విమర్శించానని, అయితే అది అంతకంటే ఎక్కువని తనకు తర్వాతే తెలిసిందన్నారు. కర్ణాటక సంపదను, ప్రజాధనాన్ని దోచుకుంటూ రాష్ట్రానికి దరిద్రం పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ ఈ సభలో పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీనే గెలిపించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. -
ఎమ్మెల్యే కుమారుడి వీరంగం..
బెంగళూరు: శాంతినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్ తన 10 మంది స్నేహితులతో కలసి శనివారం అర్ధరాత్రి ఓ రెస్టారెంట్లో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో విద్వత్ అనే వ్యక్తిని చితకబాదడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఎమ్మెల్యే కుమారుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ నలపాడ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎమ్మెల్యే హ్యారిస్ స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరమైన ఘటన.. బాధితుడి కుటుంబసభ్యులను పరామర్శించాను. నా కుమారుడు నలపాడ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది’’అని అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘటనకు సంబంధించి ‘‘నిందితుడు ఎంతటి వ్యక్తి అయినా శిక్ష అనుభవించాల్సిందే’’అని ట్వీట్ చేశారు. -
ఆయన జయంతి జరిపితే.. ఖబడ్దార్
సాక్షి, బెంగళూరు: ఇప్పటికే టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలను జరిపి విమర్శలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య సర్కారు తాజాగా బహుమని సుల్తాన్ జయంతిని జరపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జయంతిని నిర్వహిస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే విషయమై బెంగళూరులో బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసి వేలమంది హిందువులను క్రూరంగా హత్య చేసిన బమమని సుల్తాన్ జయంతిని నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోసారి రాష్ట్రంలో మతఘర్షణలను రెచ్చగొట్టడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతామని చెప్పారు. కలబురిగిలోని బహుమని సుల్తాన్ కోటలో జయంతి వేడుకలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఆ వార్తలు అవాస్తవం: సీఎం సిద్ధు బహుమని సుల్తాన్ జయంతి వార్తలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసలు బహుమని సుల్తాన్ ఎవరో కూడా తమకు తెలియదని, అటువంటి పరిస్థితుల్లో ఆ జయంత్యుత్సవాలున నిర్వహించే అవకాశమే లేదన్నారు. మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలపై స్పందిస్తూ ఆ సంగతి నాకు తెలియదు, మంత్రినే అడగాలని సూచించారు. -
సవాల్... దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి
సాక్షి, బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని ప్రధానికి రామయ్య సవాల్ విసిరారు. పరివర్తన యాత్ర ముగింపు సభలో ర్యాలీలో ప్రధాని మోదీ.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన సిద్ధరామయ్య ప్రధానిపై మండిపడ్డారు. మోదీ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని రామయ్య పేర్కొన్నారు. అవినీతి ప్రస్తావన ఎక్కడిది? ‘‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పెట్టుబడుల విషయంలో కర్ణాటక దేశంలో 11వ స్థానంలో ఉంది. గత రెండేళ్లుగా ఆ జాబితాలో మేం మొదటి స్థానంలో కొనసాగుతున్నాం. ఇది మేం చెబుతున్నది కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు అవినీతి ఆరోపణల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకాయుక్తను నియమించకపోవటంతోనే అవినీతిపై మోదీ పోరాటం ఏపాటిదో స్పష్టమైపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక యాడ్యూరప్ప లాంటి వారిని పక్కన పెట్టుకుని మాపై ప్రధాని అవినీతి ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని చెప్పారు. హత్యా రాజకీయాల కామెంట్లపై... ‘మా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు వారి గురించి కూడా కాస్త ఆలోచించుకోండి. గోద్రా ఘటనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? సుమారు 2000 మందికి పైగా కదా! ఇప్పుడు హర్యానాలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ అధికారంలో ఉంటే మైనార్టీలకు రక్షణే ఉండదు. అలాంటి వాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు’ అని సిద్ధరామయ్య తెలిపారు. మా డబ్బు మాకివ్వటానికేం... కేంద్ర రాష్ట్రాల నిధుల విషయంలో పక్షపాతం లేకుండా పారదర్శకత్వ పాటిస్తున్నామని.. కర్ణాటక ప్రభుత్వానికి కూడా వేల కోట్లు ఇచ్చామని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘‘అసలు మీకు ఆ ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో డబ్బులు సేకరించి వసూలు చేస్తున్నదే కదా. తిరిగి వాటిని రాష్ట్రాలకు పంచుతున్నారు. అంటే మా డబ్బును మాకే ఇస్తున్నారు. అందులో గొప్పేముంది. బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్న సమయంలో 73వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పన్నుల రూపంలో కేంద్రానికి జమ చేసింది. ఇప్పుడు మా(కాంగ్రెస్) ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూ. ఆదాయానిస్తోంది. మరి ఆ సొమ్మును మీరు ఎవరికి పంచుతున్నారు’’ అని ఆయన రామయ్య ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. షా, యెడ్డీపై కూడా... ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై కూడా రామయ్య విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఓ హత్య కేసులో షా పేరు కూడా ఉంది. నోరు తెరిస్తే ఆయన పచ్చి అబద్ధాలే మాట్లాడతారు. ఆయన మా ప్రభుత్వాన్ని కూలదోస్తాడంట అంటూ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్పపై కూడా సెటైర్లు వేశారు. జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి, పైగా ఆయన ఇప్పుడు అవినీతి పోరాటం చేస్తారంట! అంటూ ఛలోక్తులు పేల్చారు. చివర్లో మోదీపై కాంగ్రెస్ నేత దివ్య స్పందన చేసిన ట్వీట్‌పై సిద్ధరామయ్య స్పందిస్తూ.. వ్యక్తిగత విమర్శల వ్యవహారంలో తాను జోక్యం చేసుకోబోనని తెలిపారు. -
ట్విట్టర్లోనూ మాటల తూటాలే
సాక్షి, బెంగళూరు: బీజేపీ పరివర్తన ర్యాలీ ముగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని ప్యాలెస్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమం, ప్రధాని నరేంద్రమోదీ పర్యటన, చేసిన ప్రసంగంపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల యుద్ధం, కన్నడ సంఘాల నిరసనలు చోటుచేసుకున్నాయి. సిద్ధు ట్వీట్.. యడ్డి రిట్వీట్ బెంగళూరుకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం సిద్ధరామయ్య... నంబర్ వన్ రాష్ట్రానికి ప్రధాని మోదీకి ఘన స్వాగతం ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప స్పందిస్తూ.. అవును కర్ణాటక రాష్ట్రం దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది, అది కేవలం అవినీతి, అక్రమాలు, రైతుల ఆత్మహత్యలు,నేరాల్లో మాత్రమే.. అని రిట్వీట్ చేశారు. ట్విట్టర్లో కుమారస్వామి కూడా ట్విట్టర్ నుంచే మోదీకి జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి స్వాగతం పలికారు. దశాబ్దాల కాలంగా ఉత్తర కర్ణాటక తాగు,సాగునీటికి ప్రాణవాయువు లాంటి మహదాయి, కళసా బండూరీ నదీ జలాల పంపిణీ వివాదాన్ని కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మహదాయి రైతుల నిరసన మహదాయి నదీ జలాల పంపిణీపై ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడంపై మహదాయి పోరాట సంఘాల కార్యకర్తలు నగరంలో పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి మోడీజీ గెట్వెల్ సూన్ ఫర్ మహదాయి నినాదాలతో కూడిన ప్లకార్డులతో నిరసనలు జరిపారు. కన్నడ పోరాట సంఘాల కార్యకర్తలు ప్యాలెస్ మైదానం వెలుపల శవయాత్రను నిర్వహించారు. పకోడీల విక్రయాలతో నిరసనకు యత్నం పకోడీలు విక్రయించడం కూడా గౌరవప్రదమైన వ్యాపారమేనని ప్రధాని చెప్పడం సరికాదంటూ ప్యాలెస్ మైదానం ఎదుట పకోడీలు విక్రయించడం ద్వారా కాంగ్రెస్ విద్యార్థి సంఘం కార్యకర్తలు నిరసనకు విఫలయత్నం చేశారు. నిరసనలకు అనుమతినివ్వాలని ఎన్ఎస్యూఐ చేసిన విన్నపాన్ని పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తిరస్కరించారు. అయినప్పటికీ కార్యకర్తలు పకోడీ విక్రయం ద్వారా నిరసన చేయడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
దొందూ దొందే....యోగి బాటలోనే సిద్దూ..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనతో సహా పలు అల్లర్ల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న 20 వేల మంది నిందితులకు జైళ్ల నుంచి విముక్తి కల్పిస్తూ గత డిసెంబర్ 22వ తేదీన సవరణ బిల్లును తీసుకొచ్చారు. అందులో గోరక్‌పూర్‌లోని పీపీ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో 188వ సెక్షన్ కింద ఆదిత్యనాథ్‌పై దాఖలైన కీలకమైన కేసు కూడా ఉంది. ఇలా వివిధ అల్లర్ల కేసుల్లో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న వారంతా మెజారిటీ హిందువులే. వారంతా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో అరెస్టైన వారే. వారిని కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ బిల్లు తేవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఆదిత్యనాథ్ మతం ప్రాతిపదికన రాజకీయాలు నెరపుతున్నారంటూ విమర్శలు గుప్పించింది. దాదాపు ఇలాంటి పనినే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేశారు. ఆయన ఆదేశాల మేరకు అదే డిసెంబర్ 22వ తేదీన, మళ్లీ జనవరి 2వ తేదీన రాష్ట్ర డీజీపీ 23 జిల్లాల్లోని తన సబార్డినేట్లకు లేఖలు రాశారు. వివిధ అల్లర్ల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అమాయక మైనారిటీల(ఇన్నోసెంట్ మైనారిటీస్)పై కేసులు ఉపసంహరించుకోవడం పట్ల అభిప్రాయాలేమిటో తెలియజేయమని ఆ లేఖల్లో తన కింది అధికారులను డీజీపీ అడిగారు. ఆ తర్వాత ఈ లేఖలను పట్టుకున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీంతో దొరికిపోయామనుకున్నకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్నదే తమ ఉద్దేశమని, ఇన్నోసెంట్ మైనారిటీస్ అని పొరపాటున వచ్చిందని, అది టైపోగ్రాఫికల్ తప్పిదమేనని సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. 2013లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక ఇప్పుడు, అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనారిటీల విడుదలకు ప్రయత్నించడం అంటే ఓట్ల రాజకీయమేనన్నది ఎవరికైనా అర్థం అవుతుంది. ఒకవేళ ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్న మాటనే నిజం అనుకుంటే అమాయకులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారన్న అర్థం వస్తుంది. మరి అన్యాయంగా అమాయకులను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా? మున్ముందు తీసుకునే ఉద్దేశం ఉందా? సాధారణంగా అల్లర్ల కేసుల్లో సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా కోర్టులు కేసులను కొట్టివేస్తాయితప్పా, పోలీసులు విడుదల చేయరు. ఆదిత్యనాథ్ ఏకంగా బిల్లునే తీసుకరాగా, సిద్దరామయ్య కూడా ఆ దిశగానే ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ హిందూత్వ పేరిట మత రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగైనా వరుస రాష్ట్ర విజయాలతో ముందుకొస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మతం ప్రాతిపదికనే వ్యవహరిస్తోంది. ఇది ఆ పార్టీ సిద్ధాంతానికే కాదు, లౌకిక వ్యవస్థ మనుగడకే ముప్పు తెస్తుంది. -
'అమిత్ షాకు బ్రెయిన్ లేదు.. ఓ జైలు పక్షి'
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంట అన్న చందాన కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు మాటల దాడులు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో సిద్ద రామయ్య కూడా గట్టిగానే స్పందించారు. అమిత్ షా ఒక బ్రెయిన్ లెస్ మనిషని, ఒకప్పటి జైలు పక్షి అని ఎద్దేవా చేశారు. 'ఒకప్పటి జైలు పక్షి మరో జైలు పక్షిని కర్నాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంది' అని ట్విటర్లో పరోక్షంగా అమిత్ షాను కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పను ఉద్దేశించి విమర్శించారు. అంతేకాకుండా తనపై చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు నిరూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. సోహ్రాబుద్దీన్ హత్య కేసు విషయంలో 2010లో అమిత్ షా మూడు నెలలపాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, సిద్దరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. ఇక కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందిస్తూ ఇందిరాగాంధీ 1977లో జైలుకు వెళ్లారు.. ఆమె కుమారుడు బోఫోర్స్ కుంభకోణంలో జైలు కెళ్లారు.. ఇది చాలా ఇంకా జాబితా కావాలా సార్ అంటూ గౌడ విమర్శించారు. -
సురక్షిత స్థానం కోసం సిద్దూ అన్వేషణ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య చాముండేశ్వరీ స్థానాన్ని వదులుకుంటున్నారా? వేరే చోట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సిద్ద రామయ్య ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయనకు ఎదురు గాలి బలంగా వీస్తోంది. ఈ దఫా ఇక్కడ నుంచి బరిలోకి దిగితే ఓటమి తథ్యమన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో సిద్దరామయ్య 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పాల్, బాదామి లేదా భాగల్‌కోట్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గెలవడం కష్టమే చాముండేశ్వరీలో ఈ దఫా సిద్దరామయ్య విజయం సాధించడం కష్టమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రికి స్పష్టం చేశాయి. స్థానికంగా బీజేపీ బలపడడం, హిందుత్వ వాదులు చాలావరకు బీజేపీకి బాసటగా ఉండడంతో ఇటువంటి పరస్థితులు తలెత్తాయి. అదే సమయంలో జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవేగౌడ కూడా బలంగా ఉన్నారు. ఈ ముక్కోణపు పోటీలో సిద్దరామయ్యకు అవమానకర ఫలితం ఎదురవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. సీటు మార్పు.. ప్రతికూల ఫలితం కర్ణాటకలో ముఖ్యమంత్రి తన స్థానాన్ని మార్చుకున్న ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన దాఖలాలులేవు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గాన్ని మార్చుకోవడం ప్రజల్లోకి వ్యతిరేక భావనలు పంపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఎం కృష్ణ కూడా తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. ఆ ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని విమర్శకులు చెబుతున్నారు. -
త్వరలో కురుక్షేత్రమే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండవులైతే, బీజేపీ నాయకులు కౌరవులని వర్ణించారు. మంగళవారం నగరంలో కేపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తమ పార్టీ సరైన మార్గంలో వెళ్తోందని, కౌరవులైన బీజేపీ నేతలు తప్పుడు మార్గంలో పోతున్నారని విమర్శించారు. ఎన్నికల కోసం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర నేతృత్వంలో సరైన బృందాన్ని తమ అధిష్టానం ఇచ్చిందని తెలిపారు. కుమార, యడ్డిలు ఏం చేయలేరు కుమారస్వామి, యడ్యూరప్ప తదితర నేతలు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం అన్నారు. ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంత్ కుమార్ హెగ్డేని ప్రధాని మోదీ కేబినెట్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో మోదీ, అమిత్ షాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బీజేపీ శోభా కరంద్లాజే వంటి నేతలను తమపైకి ఉసిగొల్పుతోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నేతల డంపింగ్.. దేశంలో ప్రస్తుతం ఒక్క కర్ణాటకలో తప్పించి ఎక్కడా ఎన్నికలు లేవని, ఈ క్రమంలో దేశంలోని ఆర్ఎస్ఎస్ నేతలందరిని ఇక్కడి ఎన్నికల కోసం బీజేపీ నేతలు డంప్ చేస్తున్నారని సిద్ధు ఆరోపించారు. బీజేపీ హిందుత్వ అని పేరు పెట్టుకుని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని, 70 ఏళ్లుగా దేశంలో హిందుత్వాన్ని పరిరక్షించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. హిందుత్వం పేరిట బీజేపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని తెలిపారు. గెలుపులో బూత్ కమిటీలే కీలకం డిసెంబర్ 13 నుంచి జనవరి 12 వరకు నిరంతరంగా కొనసాగిన తన పర్యటనలో అన్ని వర్గాలతో సమావేశమైనట్లు సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లో 90 శాతం బూత్ కమిటీలో నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్క బూత్ కమిటీ నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ నాయకులకు త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఈడీ ఉచ్చులో మంత్రి, కుటుంబం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మంత్రి రోషన్ బేగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రోషన్ బేగ్, ఆయన కుమారుడు, కుమార్తెకు ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. రోషన్ బేగ్ కుటుంబానికి చెందిన రుమన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి గత 8 సంవత్సరాల నుంచి అరబ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు డబ్బు బదిలీ అయింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో ఈడీ అధికారులు రోషన్ బేగ్, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రోషన్ బేగ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారుతుంది. ఏమిటీ వ్యవహారం రుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ 2007లో ప్రారంభమైంది.ఈ కంపెనీని బేగ్ కుమార్తె సబీహా ఫాతిమా, కుమారుడు రుమన్ బేగ్ పర్యవేక్షిస్తున్నారు. కంపెనీకి 2008 మేలో సౌదీ అరేబియాలోని ఫెజూరియా స్టీల్ బ్యారల్స్ కంపెనీ నుంచి రూ.1.14 కోట్లు చొప్పున రెండుసార్లు కలిపి రూ.2.28 కోట్లు జమయ్యాయి. ఇందులోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. సీఎంను కలిసిన రోషన్ ఈడీ నోటీస్ జారీ కావటంతో నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్ బేగ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కృష్ణలో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. ఈడీ నోటీస్‌లు ఇచ్చినట్లు వివరణ ఇచ్చి పది నిమిషాల్లోనే వెళ్లిపోయినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
వీడియోతో రాహుల్, రామయ్యలకు కౌంటర్
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల విమర్శలు-ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఓ వీడియోను విడుదల చేశారు. మాట్లాడితే హిందువునని చెప్పుకునే సిద్ధరామయ్య.. తన హయాంలో జరిగే హిందువుల హత్యల గురించి ఎందుకు స్పందించరని ఆ వీడియోలో ఉంది. గత మూడేళ్లలో 12 మంది హిందువులు దారుణంగా హతమయ్యారంటూ బాధితుల ఫోటోలతోసహా వీడియోను విడుదల చేశారు. యోగి ప్రశ్నలు కురిపించినప్పుడల్లా.. తానో హిందువునని చెప్పుకునే సిద్ధరామయ్య ఈ దారుణాలపై ఏం సమాధానం చెబుతారని వీడియోలో ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావన కొస్తూ... గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శించటంపై విమర్శలు గుప్పించారు. మత రాజకీయాలతో దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని రాహుల్ ప్రయత్నించాడని ఆరోపించారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ సిద్ధరామయ్య వైఫల్యాన్ని వీడియోలో ఎండగట్టారు. కాగా, ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్ బీజేపీ విభాగం ఈ వీడియోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. काम जो कर लिया होता 5 साल में तिनका भर, यूँ रेसिपी नहीं बना रहे होते कांग्रेस के राजकुंवर। pic.twitter.com/Ah0gmaZU39 — BJP Uttar Pradesh (@BJP4UP) January 13, 2018 -
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్సే
బొమ్మనహళ్లి: దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ ఎంపీ శోభాకరందాజ్లే ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఉగ్రవాదులు, జీహాదిలని ఆరోపించిన దినేష్ గుండూ రావు, సీఎం సిద్దరామయ్యలు తక్షణమే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి జైల్‌భరో నిర్వహిస్తామన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తమను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో శోభాకరందాజ్లే విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపి కార్యకర్తలు చేతుల్లో తల్వార్లు,చాకులు పట్టుకోని తిరగలేదని అన్నారు. రాష్ట్ర హోం మంత్రి రామలింగారెడ్డి, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌గుండూరావు వ్యాఖ్యలతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఉన్న కేసులను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటణలతో పొత్తు పెట్టుకోవాలని ముందుకెళ్లాలని యోచిస్తోందని ఆరోపించారు. -
సిద్దరామయ్య యూటర్న్..!
సాక్షి, బెంగళూరు: త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ 'ఉగ్రవాదం' అంశంపై వాగ్బాణాలు సంధించుకుంటున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ ఉగ్రవాద సంస్థలంటూ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా యూటర్న్ తీసుకున్నారు. తాను నేరుగా బీజేపీ, ఆరెస్సెస్‌లను నిందించలేదని, హిందూత్వ ఉగ్రవాదం గురించే మాట్లాడానని సిద్దరామయ్య చెప్పారు. 'రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ ఉగ్రవాదాన్ని బీజేపీ, ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్నాయనే నేను చెప్పాను. విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసేవాళ్లు నా దృష్టిలో ఉగ్రవాదులే' అని సిద్దరామయ్య గురువారం మైసూర్ సమీపంలోని ఎంఎం హిల్స్‌లో విలేకరులతో అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్ సంస్థల్లో ఉగ్రవాదులు ఉన్నారని సిద్దరామయ్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అతివాద ఎస్డీపీఐ అయినా, బజరంగ్ దళ్ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని ఆయన అన్నారు. -
సిద్దరామయ్యపై నిప్పులు చెరిగిన అమిత్‌షా
సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సిద్దరామయ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భారత వ్యతిరేక సంస్థ అయిన ఎస్పీడీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)పై నమోదైన కేసులను ఎందుకు ఎత్తివేశారని సిద్దరామయ్యను ప్రశ్నించారు. బుధవారం కర్ణాటకలోని చిత్తదుర్గలో పర్యటించిన అమిత్‌షా మాట్లాడారు. 'కేంద్రం కర్ణాటకకు ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఐదేళ్ల కిందట పూరి గుడిసెలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు నాలుగంతస్తుల ఇళ్లు కట్టుకొని.. ఖరీదైన కార్లు ఇంటి ముందు పార్క్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి' అని అమిత్‌షా ప్రశ్నించారు. 'కర్ణాటకకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందని సీఎం ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు వచ్చాను. 13 ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా యూపీఏ ప్రభుత్వం హయాంలో కర్ణాటకకు రూ. 88,583 కోట్లు ఇస్తే.. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ఎన్డీయే ప్రభుత్వం కర్ణాటకకు రూ. 2 లక్షల19 కోట్లు ఇచ్చింది' అని అమిత్ షా అన్నారు. -
యోగి.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు, విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నోరు అదుపులో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. మంగళవారం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అవినీతి పెరిగిపోయిందని అందుకు సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి చేసిన ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. దేశంలో అవినీతిలో, నేరాల్లో మొదటిస్థానంలో నిలిచే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమేనన్న విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ విస్మరించారని పేర్కొన్నారు. ముందు యూపీలో అవినీతి, నేరాలను అదుపు చేసిన తర్వాత యోగి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులపై విమర్శలు చేయాలంటూ హితవు పలికారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి బాధపడ్డ యోగికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే జాతీయ బ్యాంకుల్లో రాష్ట్ర రైతుల రుణాలను మాఫీ చేయించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం సిద్దరామయ్య మతం, ఆహారపు అలవాట్లపై హిందూ యువతను రెచ్చగొడుతూ మతవిద్వేషాల వైపు వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. సిద్దరామయ్యతో పాటు తాము కూడా హిందువులేమనని అయితే తాము అన్ని మతాలు, వర్గాల ప్రజలను సమానదృష్టితోనే చూస్తామని బీజేపీ నేతల్లా తాము ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టలేదన్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అక్కడి హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సందర్భాలను బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. చివరికి పర్తివర్తన ర్యాలీలో తాము చేయబోయే అభివృద్ధి గురించి కాకుండా కేవలం మత ఘర్షణల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారంటూ విమర్శించారు. చావులపై కూడా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్‌రావ్ హత్య వెనుక బీజేపీ కార్పొరేటర్ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలోనే ఈ విషయం పోలీసుల విచారణతో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్నారు. -
సీఎం పేరు ‘జై శ్రీరామ్’ అన్నా ఆశ్చర్యమేమీ లేదు!
సాక్షి, బెంగళూరు: ఓ వైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా మరోవైపు హిందుత్వ అజెండా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధారామయ్యపై ఓ సెటైర్ పేల్చారు. అసలేమైందంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా మీ రాష్ట్రంలో ఆకలి చావుల గురించి పట్టించుకుంటే మంచిదని సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతో పాటుగా కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు ముందురోజు హిందుత్వ అజెండాపై పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి ఘాటుగా స్పందించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి కర్ణాటక పర్యటనకు వస్తారన్న ముందురోజు మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందుత్వ అజెండా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యోగి రెండోసారి కర్ణాటకలో పర్యటించినప్పుడు సిద్ధరామయ్య తన పేరులో రామ్, సిద్ధా అని ఉందని పేర్కొన్నట్లు గుర్తుచేశారు. యోగి మరోసారి కర్ణాటకలో పర్యటిస్తే సిద్ధరామయ్య తనపేరును జై శ్రీరామ్ అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కర్ణాటక పర్యటనల నేపథ్యంలోనే సిద్ధరామయ్య హిందుత్వ పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. కాగా, యూపీలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని.. కర్ణాటకలోని రేషన్ షాపులను, ఇందిరా క్యాంటీన్లను సందర్శించి ఆదర్శంగా తీసుకోండంటూ సిద్ధరామయ్య యోగికి ఓ సలహా ఇవ్వగా, ఆదిత్యానాథ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘మీ (కాంగ్రెస్) హయాంలోనే కర్ణాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నాను. నిజాయితీ పరులైన అధికారుల బదిలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమవుతుందంట కదా’ అంటూ యోగి కౌంటర్ ఇచ్చారు. తాజాగా బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధరామయ్య తీరును తప్పుపట్టారు. -
తుంగభద్రలో కొంత సర్దండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల్లో తమ రాష్ట్ర అవసరాలు అధికంగా ఉన్న దృష్ట్యా, ఈ ఏడాది తమకు కొంత నీటిని సర్దాలని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఆలస్యంగా వర్షాలు కురిసిన దృష్ట్యా, ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమైందని, ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశలో ఉన్నందున వాటిని కాపాడేందుకు తుంగభద్రలో తెలంగాణకు దక్కే 3.5 టీఎంసీలను తమకు వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. నిజానికి తుంగభద్రలో ఆర్డీఎస్ కింద 16.9 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నా, కాల్వల ఆధునీకరణ జరగని కారణంగా ఏటా సగటున 6 నుంచి 8 టీఎంసీల మేర నీటిని మాత్రమే రాష్ట్రం వాడుకుంటోంది. ఈ సారి తుంగభద్ర పరీవాహకంలో సరైన వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆర్డీఎస్ కింద వినియోగమే జరగలేదు. ప్రస్తుతం తుంగభద్ర నదిలో మొత్తంగా 9 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో 5.5 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, 3.5 టీఎంసీలను తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ ఖరీఫ్ పంటలను కాపాడేందుకు 3.5 టీఎంసీలను వాడుకునే అవకాశం ఇవ్వాలని సిద్దరామయ్య కోరారు. ఇదే అంశంపై ఏపీకి దక్కే వాటా నీటిని సైతం తమ వినియోగానికే ఇవ్వాలని సిద్దరామయ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి లేఖపై తెలంగాణ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్డీఎస్ కింద 8 వేల ఎకరాల మేర ఆరుతడి పంటల సాగు జరుగుతోంది. ఈ అవసరాలకు సరిపడే నీటిని పక్కనపెట్టి 2.5 టీఎంసీలను కర్ణాటకకు సర్దే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణకు తాగునీటి కొరత సమయంలో కర్ణాటక తన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి ఉదారత చాటుకున్న దృష్ట్యా, అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతను కోరుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో దీనిపై సానుకూల నిర్ణయమే వెలువడుతుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
నువ్వూ బూట్లు నాకావా?
సాక్షి, బళ్లారి: రాజకీయాలల్లో విమర్శలు చేయడం సర్వసాధారణం. అయితే వాడే పదజాలాలు ఇతరులను నొప్పించకుండా ఉండాలి. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే సంస్కృతి అనిపించుకోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సాధనా పర్వలో భాగంగా ఆయన చిత్రదుర్గ జిల్లాలో హొళల్కెరె తాలూకాలో విలేకరులతో మాట్లాడారు. తాను అధికారం కోసం బూట్లు నాకుతానని ఎవరో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయితే అదే వ్యక్తి అధికారం కోసం పదవులు అనుభవించేందుకు బూట్లు నాకాడా? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో నిర్మించాల్సిన కనక భవనాన్ని తాలూకా కేంద్రంలో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని మంత్రి ఆంజనేయపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెగ్డే వల్ల బీజేపీకి నష్టం కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే నీచ పదజాలాలు ఉపయోగిస్తుండడం ఆయన హోదాకు తగదన్నారు. బ్రాహ్మణ కులంలో మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారని, ముఖ్యమంత్రి గుండూరావు ఎంతో సంస్కృతితో వ్యవహరించారని గుర్తు చేశారు. అనంత్‌కుమార్ హెగ్డే మాట తీరు వల్ల బీజేపీకి ఓట్లు వస్తాయనే భ్రమల్లో ఉన్నారని, కానీ.. ఆ పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ తగ్గిపోతోందన్నారు. హిందూ ధర్మంలో కూడా ఎక్కడా పరధర్మంపై విమర్శలు చేయమని చెప్పలేదన్నారు. ఒక సమాజం ఎక్కువ, మరొక సమాజం తక్కువ చేసి మాట్లాడడం మానుకోమన్నారు. -
టిప్పును కొలిస్తే హిందూ వ్యతిరేకులా?
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు ముగిశాక కూడా వాటిపై వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ఈ అంశానికి హిందుత్వాన్ని అపాదించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బీజేపీని ఉద్దేశిస్తూ హిందూయిజాన్ని లీజుకు తీసుకున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘‘టిప్పు సుల్తాన్ హిందువులకు హని చేశారు. అయినా సిద్దరామయ్య టిప్పును కొలుస్తున్నాడు. అంటే ఆయన హిందువుల సరసన లేనట్లే లెక్క. అలాంటి వ్యక్తి హిందువుల సంరక్షణ గురించి ఆలోచిస్తాడనుకోవటం లేదు’’ అని బీజేపీ ఎంపీ వినయ్ కుమార్ కటియార్ ఢిల్లీలో తెలిపారు. ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యానాథ్ హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్‌ను ఆరాధిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా మొదలైన దుమారం.. సిద్దరామయ్య కౌంటర్ ట్వీట్లతో మరింత ముదిరిపోయింది. కేవలం బీజేపీ నేతలే హిందువుతా? మేం కాదా? హిందూయిజాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? నా పేరు సిద్దరామయ్య. సిద్ధూ, రామయ్య.. అన్ని మతాలకు గౌరవం ఇస్తేనే అది అసలైన హిందుత్వం అవుతుంది అని కన్నడ భాషలో వరుస ట్వీట్లతో ఆయన ఆదిత్యానాథ్‌కు చురకలు అంటించారు. పాత ఫోటోలతో కౌంటర్... యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు. హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకోవద్దంటూ ఆదిత్యానాథ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ నేతలు టిప్పు జయంతి వేడుకలు, ఇఫ్తార్లలో పాల్గొన్న ఫోటోలతో ప్రకాష్ రాజ్ మీ ఎజెండా ఏంటసలు అని యోగిని ప్రశ్నిస్తూ ఓ సందేశం ఉంచారు. Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e — Prakash Raj (@prakashraaj) December 22, 2017 -
సిద్దూపై వ్యతిరేకం.. యడ్డీపై విముఖం
సాక్షి, బెంగళూరు : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ తన దృష్టిని దక్షిణాది మీద కేంద్రీకరించింది. అందులోనూ గతంలో అధికారంలో ఉన్న కర్ణాటక మీద ప్రత్యేకదృష్టిని సారించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాలను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కమలం నేతలు కర్ణాటకను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుజరాత్ ఫలితం బయటకు రాగానే సిద్దరామయ్య ప్రభుత్వంపై బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ట్విటర్ వేదికగా మాటల యుద్ధం మొదలు పెట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధిని, సుపరిపాలనను కోరుకుంటున్నారంటూ మరో ట్వీట్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ప్యాకప్ చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ.. యడ్యూరప్ప తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హస్తానికి ఎదురుగాలేనా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కన్నడ రాష్ట్రంలోనూ గుజరాత్ తరహా ఫలితమే వస్తుందని ప్రముఖ ఆర్థిక వేత్త, రాజకీయ విశ్లేషకులు నరేందర్ ఫణి చెబుతున్నారు. పంజాబ్‌లో అధికార బదలాయింపు ఎందుకు జరిగిందో.. ఇక్కడ కూడా అదే కారణాలతోనే సిద్దరామయ్య ఓటమి చెందే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అయితే కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోరాటం ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. ఇదిలావుండగా.. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిద్దరామయ్య ప్రతికూలతలు కొంతకాలంగా సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అవే నేడు కాంగ్రెస్ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీకి వెన్నుముకలా ఉండే లింగాయత్ సామాజిక వర్గంపై జరిగిన చర్చ ప్రధానమైనది. అంతేకాక బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ భాషతో కూడిన సైన్ బోర్డులు కన్నడికుల ఆలోచనను మార్చిందని అంటున్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం కూడా ప్రభావం చూపనుందని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సిద్దరామయ్య ప్రభుత్వంపై మాటల దాడిని మొదలు పెట్టారు. ప్రధానంగా సిద్దరామయ్య ప్రభుత్వ అనినీతి లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాక మైసూర్ పాలకుడు టిప్పు జయంతిని నిర్వహిచడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందనే వాదన ఉంది. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై హిందూ అతివాదిగా ముద్రపడింది. యడ్యూరప్పపై విమర్శలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాష్ట్ర బీజేపీలో లుకలుకలు అప్పుడే మొదలయ్యాయి. యడ్యూరప్పను ఆగస్టులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ కమిటీ ప్రకటించినా.. రాష్ట్ర నేతలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. యడ్యూరప్ప విషయంపై పార్టీ చీఫ్.. అమిత్ షా రాష్ట్రనేతలతో సమీక్ష జరిపిన తరువాత పరిస్థితిలో కొంత వరకూ మార్పు వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక సమస్యలు గుజరాత్ విజయం తరువాత బీజేపీ స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం చేసిన తప్పిదాలు బీజేపీకి ఆయుధాలుగా మారే అవాశం ఉందని వారు అంటున్నారు. -
బీజేపీ గెలిస్తే సిద్ధరామయ్య ఎందుకు నవ్వారు?
సాక్షి, బెంగళూరు : అది సోమవారం ఉదయం 7గంటల ప్రాంతం. గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభానికి ముందు సమయం. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో 80 సీట్ల వరకు సాధించుకుంటే మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ విజయం ఖాయం అన్నారు. ఆయన చెప్పినట్లుగానే దాదాపు 80 సీట్లకు దగ్గరగా 79 సీట్లను కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో గెలుచుకుంది. వెంటనే సిద్దరామయ్య ముఖం ఒక నవ్వుతో వెలిగిపోయింది. వెంటనే పార్టీ ముఖ్యనేతలను, కార్యకర్తలను పిలిచి మరోసారి మనం కర్ణాటకలో గెలుస్తున్నాం అని చెప్పేశారు. సొంత రాష్ట్రం గుజరాత్లో మోదీ మ్యాజిక్ పెద్దగా అంతగా ప్రభావం చూపలేకపోయిందని, ఇక కర్ణాటకలో విజయం మళ్లీ కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మీడియా వద్దకు వచ్చిన ఆయన.. 'మేం కోల్పోయాం. కానీ, రాహుల్ గాంధీ చాలా గొప్పగా పోరాడారు. దాదాపు ప్రధాని మోదీని ఆయన సొంత రాష్ట్రంలోనే ఓడించినంత పనిచేశారు. బీజేపీ ధనబలం, కండబలం, అధికారబలం మొత్తాన్ని గుజరాత్లో గెలిచేందుకు ఉపయోగించింది. ఈ ఫలితాల ఆధారంగా మా రాష్ట్రం (కర్ణాటక)లో ఏం జరగబోతుందో స్పష్టమవుతోంది. మేం మరోసారి గెలుస్తాం. గుజరాత్లో ఒకప్పుడు మాకు(కాంగ్రెస్) 44 సీట్లు ఉండేవి. ఇప్పుడు 80వరకు ఉన్నాయి. ఎక్కడ కర్ణాటక ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందో అని ఇప్పుడే మా రాష్ట్రంలోని బీజేపీ నేతలు అదొక పెద్ద విజయం అయినట్లు చెప్పుకుంటున్నారు. గుజరాత్ మాదిరిగా కర్ణాటక కాదు. ఇక్కడ బలమైన కాంగ్రెస్ నేతలు డజన్లలో ఉన్నారు' అని ఆయన చెప్పారు. -
ఈవీఎం వద్దు..బ్యాలెటే కావాలి: సిద్ధరామయ్య
బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనని తనతో కొందరు నిపుణులు చెప్పారని వెల్లడించారు. ఈసీ స్వతంత్ర సంస్థే అయినా అధికార బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. పాత పద్ధతి అయిన బ్యాలెట్ విధానానికి వెళ్లడంలో సమస్య ఏముందని ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంపై స్పందిస్తూ...చాలా సందర్భాల్లో అంచనాలు తప్పాయని, ఫలితాలు వెలువడే డిసెంబర్ 18న ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్నారు. -
కర్ణాటకలో కాక పుట్టిస్తున్న పోల్ సర్వేలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలు.. ఎన్నికల శంఖాన్ని పూరించాయి.కర్ణాటకలో విజయం సాధించడం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారింది. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ, చేతిలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. గెలిస్తే.. మరోసారి ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2013లో.. కర్ణాటకకు 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 122 సీట్లతో అధికారంలోకి తెచ్చిన సిద్దరామయ్య మీదే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకొచ్చిన యడ్యూరప్ప పరోక్షంగా ఆ పార్టీ ఓటమిని శాసించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీకి జేడీఎస్‌కు సమానంగా 40 సీట్లు వచ్చాయి. తాజా పరిస్థితులు కర్ణాటకలో 2013తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో తీవ్రంగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా అప్పుడు బీజేపీ అప్పుడు దూరం చేసుకున్న యడ్యూరప్పని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడంతో పాటు.. ప్రచార పగ్గాలు కూడా అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు బలమైన లింగాయత్ సామాజిక వర్గం అండ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా జరగనుందని పలు ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ప్రీ-పోల్ సర్వేలు ఎవరు చేశారు? కర్ణాటక ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్న అంశంపై మూడు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు జరిపాయి. సీ-ఫోర్స్, క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ (సీఓపీఎస్), ఏజెడ్-సువర్నా న్యూస్ సంస్థలు ప్రీ-పోల్ సర్వేలు నిర్వహించాయి. ప్రీ - పోల్ సర్వేల ఫలితాలు? సీ-ఫోర్స్ ప్రీ పోల్ సర్వే : . కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగనుంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ జేడీఎస్ మాత్రం బరిలో దాదాపు తోక పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో మెజారిటీ ప్రజలు సిద్దరామయ్య తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తేలింది. . మొత్తం మీద కాంగ్రెస్-బీజేపీలు అటూఇటుగా 60 నుంచి 72 సీట్లు సాధిస్తాయని సీ - పోర్స్ సర్వే తెలిపింది. జేడీఎస్‌కు 24 నుంచి 30 సీట్లు లభించే అవకాశం ఉంది. సీఓపీఎస్ సర్వే : క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ సర్వే మాత్రం బీజేపీకి పూర్తి అనుకూలంగా ఫలితాలను ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని సీఓపీఎస్ పేర్కొంది. బీజేపీ నుంచి యడ్యూరప్ప మరోసారి మఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. బీజేపీకి 117 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. అదే విధంగా కాంగ్రెస్‌కు 86 సీట్లు, జేడీఎస్‌కు 25 సీట్లు రావచ్చని సర్వే తెలిపింది. ఏజెడ్ సువర్నా సర్వే : ఏజెడ్ సువర్నా సర్వే మాత్రం 2018 ఎన్నికల్లో కర్నాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని ప్రకటించింది. కాంగ్రెస్‌కు 74 నుంచి 93 సీట్లు వస్తాయని తెలిపింది. అదే విధంగా బీజేపీకి 77 నుంచి 99 సీట్లు వస్తాయని, జేడీఎస్‌కు 11 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే ప్రకటించింది. -
సీఎంపై విమర్శలు.. కేంద్రమంత్రిపై కేసు!
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో నేతలు అదుపుతప్పి ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దూషణలు దిగుతున్నారు. మొత్తానికి కర్ణాటకలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో మత ఉద్రిక్తతలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు బీజేపీని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో పోలుస్తూ కర్ణాటక హోమంత్రి రామలింగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కర్ణాటకలో బీజేపీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారు. వారు ఐఎస్ఐఎస్ తరహాలో ఉన్నారు. అమిత్ షా వారి అధిపతి' అని రామలింగారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై నిందాత్మక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153, 504 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
‘హనుమంతుని రాజ్యంలో రావణ పాలన’
సాక్షి, మైసూరు: హనుమంతుని రాజ్యంలో రావణ పాలనను సాగిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు చోటుచేసుకోవడానికి ముఖ్య కారకులవుతున్నారంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ ఆరోపించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దరామయ్య నేతృత్వంలోని పాలన రావణ పాలనను తలపిస్తోందన్నారు. టిప్పు జయంతి, ఈద్‌మిలాద్, పీఎఫ్ఐ ఊరేగింపులకు అనుమతులిచ్చి, హనుమజ్జయంతి ఊరేగింపులను అడ్డుకుంటూ సిద్ధరామయ్య హిందూ మత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. హనుమంతుని నాడుగా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలో హనుమజ్జయంతి ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా సీఎం సిద్ధరామయ్య మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రుద్రేశ్, శరత్ మడివాళ ,రాజు, కుట్టప్ప తదితర 19 మంది హిందూ సంఘాల కార్యకర్తలు హత్యలకు గురైనా, హంతకులెవరో తెలిసినా కూడా మౌనం వహిస్తూ సిద్ధరామయ్య రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హుణుసూరులో హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేయించి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేలా సీఎం సిద్దరామయ్య కుట్రలు చేశారని ఆరోపించారు. సీఎం కుట్ర పూరిత ఆదేశాలతో రాజ్యాంగం, చట్టాలను అతిక్రమించి జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒక ఎంపీని అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణించామని కలెక్టర్, ఎస్పీలు ఎంపీ హక్కులను ఉల్లంఘించిన ఘటనపై ఇదే నెల 15 నుంచి జరుగనున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. -
రాజకీయాల్లోకి నా భార్యా, బిడ్డలు రారు
సాక్షి, బెంగళూరు: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ మరోసారి టికెట్ ఇస్తే పోటీచేస్తా, అంతేకానీ నేను కాకుండా నా భార్యకానీ, కుమారుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయరు’ అని ఎమ్మెల్యే, శాండల్‌వుడ్ రెబల్‌స్టార్ అంబరీష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యేందుకు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాకు అంబరీష్ వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది. టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తాను. లేదంటే లేదు. ప్రజలు కోరుకుంటేనే రాజకీయాల్లో ఉండడం సాధ్యమవుతుంది.’ అని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండడం లేదు, పార్టీ మారే ఆలోచన ఉందా? ఏ పార్టీ నుంచి అయినా ఆహ్వానం అందిందా? అన్న ప్రశ్నకు అంబరీష్ సమాధానమిస్తూ...‘నాకు జేడీఎస్, బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజూ వారితో కలిసి మాట్లాడుతుంటాను. భోజనం చేస్తుంటాను. ఇందులో రాజకీయాలకు చోటు లేదు’ అని అన్నారు. కాగా, నటి రమ్యా మండ్య నుంచి పోటీ చేస్తానంటే తాను స్వాగతిస్తానని అంబరీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం రమ్యా స్టార్ క్యాంపెయినర్ అని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారని అన్నారు. రమ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేయాల్సి ఉంటుందని అంబరీష్ తెలిపారు. -
మెత్తబడిన సర్కారు?
సాక్షి, బెంగళూరు (బెళగావి): ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణకు సంబంధించి రూపొందించిన కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (కేపీఎంఈ)పై సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కు తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎల్పీ సమావేశంలో కేపీఎంఈ పై అసలు చర్చ జరగకపోవడంతో ప్రైవేటు లాబీయింగ్‌కి ప్రభుత్వం తలొగ్గిందా అన్న అనుమానాలు ముసురుకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... బుధవారం ఉదయం బెళగావి సువర్ణసౌధలో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులతో ‘ఈ బిల్లుకు సంబంధించి మీరెవరూ చర్చించాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’ అని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్ నిరాశకు లోనయ్యారు. ఏదిఏమైనా ఈ బిల్లును చట్టం చేస్తామని చెప్పే మంత్రి రమేష్‌కుమార్, సీఎల్పీ సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో మాత్రం ....‘మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే మా సీఎల్పీ నాయకుడిని అడగండి. ఈ విషయం పై నేను ఏమీ మాట్లాడలేను’ అని సమాధానమిచ్చారు. దీనిని బట్టి ముసాయిదాపై సిద్ధు మెత్తబడినట్లు అంచనా. ప్రైవేటు వైద్యుల తీవ్ర నిరసనలు, వైద్యమందక అక్కడక్కడ జనం మరణాలే పునరాలోచనకు పురికొల్పి ఉంటాయని భావిస్తున్నారు. మంత్రి ఆంజనేయపై ‘కమీషన్ల’ విమర్శలు సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయపై స్వపక్ష ఎమ్మెల్యేలే విమర్శలతో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎం.టి.బి.నాగరాజు తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ‘మంత్రి ఆంజనేయ నుండి సంక్షేమ పథకాల నిధులను ఎమ్మెల్యేలు పొందాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. మంత్రి ఆంజనేయ ఏజెంట్లను నియమించుకొని కమీషన్లు వసూలు చేస్తున్నారు’ అని సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని గమనించిన సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను శాంతపరిచిన అనంతరం, ఈ లోపాలన్నింటిని సరిచేయాలని మంత్రి ఆంజనేయకు సూచించారు. కాగా, ఎమ్మెల్యేలందరూ సభలకు తప్పనిసరిగా హాజరు కావాలని సిద్ధు ఆదేశించారు. -
బీజేపీలో చేరాలంటూ.. బెదిరింపులు
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతాపార్టీ అధినాయత్వంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అవినీతి అరోపణలు, నల్లధనంపై పోరాటం అంటూ కర్నాటక ఎక్సైజ్ మంత్రి డీకే శివకుమార్ ఇంటిపై గతంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసిన దాడిని ఆయన కుట్రగా ఆరోపించారు. ఐటీ దాడులు చేస్తున్న సమయంలోనే శివకుమార్‌ను.. బీజేపీలో చేరాలంటూ అధికారులు ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. డిమానిటైజేషన్‌కు వ్యతిరేకంగా నవంబర్ 8న కర్నాటకలో చేపట్టిన బ్లాక్ డే కార్యక్రమంలో పాల్గొన్న సిద్దరామయ్య బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు చేస్తూ.. బీజేపీలో చేరితో ఇటువంటి సమస్యలు, ఇబ్బందులుఏ ఉండవని ఆయనకు ఐటీ అధికారులు చెప్పినట్లు సిద్దరామయ్య ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను తన ఆధీనంలో పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. గత ఆగస్టులో శివకుమార్ ఇంటిపై జరిగిన ఐటీ దాడిలో లెక్కల్లోకి రాని రూ. 300 కోట్ల రూపాయలు, రూ. 15 కోట్ల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్
-
అవినీతిలో అన్ని రికార్డులు బద్దలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఘాటుగా విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడటంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రికార్డులను అధిగమించిందని ధ్వజమెత్తారు. గురువారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్స్‌లో ‘నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్ర’ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం అత్యధికంగా అవినీతికి పాల్పడినట్లు ఓ సర్వేలో వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన పరివర్తన యాత్ర సిద్ధ రామయ్యను గద్దె దించేందుకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో కీలకపాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు ప్రజలకు చేరడం లేదన్నారు. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నవంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పు బట్టారు. ఇదంతా ఓటు బ్యాంకు కోసమేనని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కన్నడ రాజ్యోత్సవ్ను నిర్వహించడం కంటే టిప్పు జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను 75 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు. -
నేనంటే మోదీకి భయం : సిద్ధు
మైసూరు: తానంటే ప్రధాని నరేంద్రమోదీతోపాటు రాష్ట్ర బీజేపీ నాయకులు, జేడీఎస్ నాయకులు భయపడతారని, అందుకే తమపై అవాస్తవాలు, ఆరోపణలు చేస్తారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నగరంలోని రామకృష్ణనగర్లోనున్న తమ ఇంట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి భోగభాగ్యాలు కల్పించారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూసి అసహనంతోనే ప్రధాని మోదీ ఇటువంటి ఆరోపణలు చేశారన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గంలో తనను ఓడించడానికి బీజేపీ–జేడీఎస్‌లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయని, అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనందుకే మంత్రి జార్జ్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తనపై పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశంకర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తప్పకుండా స్వాగతం పలుకుతామన్నారు. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న యోగేశ్వర్ కాంగ్రెస్‌లో చేరతానంటూ కొన్ని రోజుల క్రితం తమ వద్దకు వచ్చారన్నారు. అయితే అందుకు తాము నిరాకరించడంతో యోగేశ్వర్ ఇటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లా మద్దూరులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్సకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అనంతరం జనతాదర్శన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. -
ప్రధానమంత్రి కార్యక్రమానికి నేను రాను : సీఎం
సాక్షి, బెంగళూరు: బీదర్‌లో ఆదివారం జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాన్ని తాను బహిష్కరిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. బీదర్-కల్బుర్గి మధ్య ఏర్పాటు చేసిన నూతన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానాన్ని ఆలస్యంగా అందజేశారని సీఎం తెలిపారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ప్రారంభోత్సవానికి కేవలం రెండు రోజుల ముందుగా నాకు ఆహ్వానాన్ని పంపారు. కార్యక్రమం గురించి ముందుగా మాతో చర్చించ లేదు. ఇది సరికాదు. బీదర్-కల్బుర్గి రైల్వే మార్గానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించింది. పథకానికి 50 శాతం మేరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇంతకుముందే నా షెడ్యూల్ ఖరారైనందున ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను. నాకు బదులుగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే పాల్గొంటారు’ అని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ముందు యడ్యూరప్ప రాజీనామా చేయాలి డీఎస్పీ ఎం.కె.గణపతి ఆత్మహత్య కేసులో మంత్రి జార్జ్‌ను రాజీనామా చేయాలంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పే ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలని సీఎం సిద్ధరామయ్య అన్నారు. సుమారు ఏడాది కిందట కొడగులో డీఎస్పీ గణపతి లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి హోంమంత్రి జార్జ్, ఇద్దరు ఐపీఎస్‌లపై గణపతి అంతకుముందు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ జార్జ్, ఇద్దరు ఐపీఎస్‌లపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో జార్జ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ పట్టుబడుతోంది. యడ్యూరప్పపై చీటింగ్, ఫోర్జరీ, డీనోటిఫికేషన్, అవినీతి వంటి అనేక క్రిమినల్ కేసులున్నాయి, ఇన్ని క్రిమినల్ కేసులున్న యడ్యూరప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముందు రాజీనా చేయాలని అని సీఎం డిమాండ్ చేశారు. -
టిప్పు చుట్టూ కన్నడ రాజకీయాలు
చాలా కాలం తరువాత కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాది కర్నాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఇరు పార్టీలు ఉపయోగించుకునే పనిలో పడ్డాయి. బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 10 మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దశలో మరోమారు టిప్పు జయంతి వేడుకలపై వివాదాలు రాజుకున్నాయి. టిప్పు జయంతి వేడుకల్లో పాల్గొనాలంటూ.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న ఈ ఆహ్వానాన్ని ఇప్పటికే పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ఒక అడుగు ముందుకేసి.. ఈ అవమానకర కార్యక్రమానికి నన్ను అహ్వానించకండి అంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దీంతో వివాదం మరో మలుపు తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ.. టిప్పు సుల్తాన్ తన పాలనలో వేలమంది హిందువులను ఊచ కోతకోశారని పేర్కొన్నారు. అంతేకాక బలవంతంగా వేల మందిని మతమార్పిడి చేయించారని అన్నారు. కర్నాటక ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టిప్పు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. 2015 నుంచి వివాదమే! టిప్పు సుల్తాన్ జయంతి వివాదం 2015 నుంచి కొనసాగుతూనే ఉంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టిప్పు జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ మొదట నుంచి వ్యతిరేకిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇరు పార్టీలు టిప్పు జయంతి ఉత్సవాలను రాజకీయం చేసే పనిలో పడ్డాయి. ఎందుకోసం? కర్ణాటకలో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ముస్లిం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ 266వ జయంతి వేడుకలను 2015లో తొలిసారి నిర్వహణకు సిద్ద రామయ్య ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీనిని బీజేపీ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో హిందువులు, క్రైస్తవును టిప్పు సుల్తాన్ ఊచ కోత కోశాడని బీజేపీ వాదిస్తోంది. టిప్పు సుల్తాన్.. హిందూ, కన్నడ వ్యతిరేకిగా బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ వాదన టిప్పు సుల్తాన్ విషయంలో బీజేపీ వాదనను కాంగ్రెస్ పార్టీ అదే విధంగా తిప్పికొడుతోంది. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్.. స్వతంత్ర పోరాట యోధుడని కీర్తిస్తోంది. బ్రిటీష్ పాలనను అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి రెండు జాతీయ పార్టీల మధ్య ఓటు బ్యాంక్ రాజకీయాలకు వేదికగా టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవం మారిపోయింది. -
ముఖ్యమంత్రి ముందే రచ్చ రచ్చ
సాక్షి, బెంగళూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలోనే ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. వివరాలు... వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మంగళూరు బజ్పె విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక జిల్లా నాయకులైన మాజీ మంత్రి అభయ్‌చంద్ర జైన్, చీఫ్ విప్ ఐవాన్ డిసౌజా సీఎంకు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలో అభయ్‌చంద్ర జైన్ తన పలుకు పడిని అంతా ఉపయోగించి ఐవాన్ అనుచరులను విమానాశ్రయం బయటే ఉంచడానికి యత్నించారు. అయితే ఐవాన్, ఆయన అనుచరులు ఎలాగో విమానాశ్రయం లోపలికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలతో పాటు నాయకులు ఒకరి పై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకున్నారు. సిద్ధరామయ్య పక్కనే ఉన్నా ఎవరూ విచక్షణ పాటించలేదు. చివరికి సీఎం కలుగజేసుకుని పరిస్థితి శాంతింపజేశారు. అయినా సిద్ధు కార్యక్రమంలో ఇరు వర్గాలు తలోదారి అన్న రీతిలో ప్రవర్తించాయి. ఇదేం కొత్త కాదు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో చిత్రదుర్గలో కాంగ్రెస్ ఇన్చార్జ్ వేణుగోపాల్ ముందే నాయకులు గొడవసడి ఒకరినొకరు కొ ట్టుకోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాల్కర్ తీరుతో బెళగావితో పాటు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో గ్రూపు రాజ కీయాలు మొదలయ్యాయి. ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇటువం టి ‘ఒక ఇల్లు– మూడు వాకిల్లు’ పరిస్థితి తలెత్తుతోంది. టిప్పు జయంతిని నిర్వహిస్తాం: సిద్ధరామయ్య విమానాశ్రయం బయట మీడియాతో సిద్ధరామయ్య కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ‘టిప్పు జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రులతో పాటు స్థానిక పార్లమెంట సభ్యులను కూడా కార్యక్రమానికి పిలుస్తాం. వారు రావడం రాకపోవడం వారి వ్యక్తిగతం. ఒకవేళ కార్యక్రమానికి హాజరయ్యి శాంతిభద్రతలకు సమస్యలు తీసుకురావాలని ప్రయత్నిస్తే వారి పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. టిప్పు జయంతి విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది’ అని పేర్కొన్నారు. -
టిప్పు లొల్లి.. షరా మాములే!
సాక్షి, బెంగళూర్ : కన్నడనాట మళ్లీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల రగడ మొదలైంది. ప్రతీయేడూ లాగే ఈసారి కూడా టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని హిందుత్వ సంఘాలు పిలుపునిస్తుండగా.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లేఖతో ఈసారి అది మరింత రసవత్తరంగా మారింది. టిప్పును హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ... నవంబర్ 10న నిర్వహించబోయే జయంతి వేడుకలకు తననను ఆహ్వానించొద్దంటూ హెగ్డే కర్ణాటక ప్రభుత్వానికి ఈ యేడాది కూడా లేఖ రాశారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త ఘాటుగా స్పందించారు. జయంతి వేడుకలను హేగ్డే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ శనివారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య మండిపడ్డారు. బ్రిటీష్ వారి వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడి విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేయటం సరికాదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగం అయి ఉండి ఆయన(హెగ్డే) ఇలాంటి పని చేయటం సరికాదు. ఆహ్వానాలు అందరికీ పంపుతాం. వాటిని తీసుకోవటం.. తీసుకోకపోవటం.. రావటం.. రాకపోవటం.. అనేది వాళ్ల ఇష్టం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ శోభా కరందల్జే హెగ్డేకు మద్ధతు తెలిపారు. టిప్పు సుల్తాన్ ఓ కన్నడ వ్యతిరేకని.. హిందూ వ్యతిరేకని ఆమె తెలిపారు. టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని కన్నడ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. గతేడాది కూడా అనంతకుమార్ ఇదే రీతిలో తనను మైసూర్ సుల్తాన్ టిప్పు జయంతి వేడుకలకు ఆహ్వానించొద్దంటూ లేఖ రాశారు కూడా. విమర్శలు... భారతదేశపు మొట్టమొదటి మిస్సైల్ మ్యాన్ గా టిప్పు సుల్తాన్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. కానీ, కొందరు విమర్శకులు మాత్రం ఆయన హిందువులను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొడగు, శ్రీరంగపట్నంలో ఈ నరమేధం ఎక్కువగా జరిగిందని చెబుతుంటారు. మోహన్‌దాస్ లాంటి విద్యావేత్తలు సదస్సులు నిర్వహించి మరీ విమర్శలు గుప్పిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉత్సవాల నిర్వహణలో వెనక్కి తగ్గటం లేదు. -
‘నేను మీ సీఎం.. ఈ గుంతలకు నేనే కారణమా?’
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా మారిపోయాయి. వీటిలో చిక్కి వాహనదారులు ప్రమాదాలు, మరణాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్లను బాగు చేయాల్సిన ఆవశ్యకతపై నగర వాసులు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. నవ భారత డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఇందిరానగర్ వంద అడుగుల రోడ్డులో గుంతలు పడిన చోట ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్ల పోస్టర్లను అంటించి ప్రజలు ఆక్రోశం వెళ్లగక్కారు. ‘నేను మీ ముఖ్యమంత్రిని, ఈ గుంతలకు నేనే కారణమా?’, ‘నేను మీ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిని, గుంతలకు నేను కారణమా?’ అని వారిని ఎద్దేవా చేస్తున్నట్లు ఈ పోస్టర్లపై రాసి ఉంది. నగర పౌరులు ఈ పోస్టర్లను ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
కన్నడ ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు లేనట్లే!
బెంగళూరు: కర్ణాటక విధాన సౌధ భవన వజ్రోత్సవాల (60 ఏళ్లు) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల ఖర్చును భారీగా తగ్గించుకోవాలని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. రెండ్రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ముందుగా భావించారు. ఈ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు, ఉద్యోగులకు వెండి ప్లేట్లు ఇవ్వాలని, ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు కలిపి రూ. 26 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వెనక్కు తగ్గిన సీఎం సిద్దరామయ్య.. ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల వేడుకలను ఒక్కరోజుకే కుదించి రూ.10కోట్లతోనే ఖర్చులను సరిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కర్ణాటక ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 1951లో ఈ భవనానికి అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగా 1956లో నిర్మాణం పూర్తయింది. ఇందుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.84 కోట్లు. -
హడావుడిగా ఢిల్లీకి సీఎం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు పూనుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మొరపెట్టుకోనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం హడావుడిగా ఢిల్లీకి చేరుకున్నారు. కేబినెట్ విస్తరణ తరువాత కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు పరమేశ్వర్ ముఖం చాటేస్తున్నారు. ఏవేవో కారణాలను పరమేశ్వర్ చెబుతున్నప్పటికీ, ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఐకమత్యంగా ఎదుర్కొనలేక పోతే ఓటమి పాలవుతామన్న విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేసేందుకే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పయనమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆదివారం సోనియాగాంధీని కలిసి పరమేశ్వర్ విషయంలో జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య కోరనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా మేడంకి నివేదిక ఇవ్వనున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గౌరి లంకేష్ హత్య ఉదంతం పై సోనియాగాంధీ నివేదిక కోరడం తెలిసిందే. ఈ పరిణామాలను కూడా సిద్ధరామయ్య, సోనియాగాంధీకి వివరించనున్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
కేంద్రమంత్రిపై మండిపడ్డ సీఎం
సాక్షి, మైసూరు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘గౌరీ లంకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని మా ప్రభుత్వానికి ముందుగా తెలిసినట్టు ఆ కేంద్ర మంత్రి చెప్పారు. ఆమె కోరినా మేము భద్రత కల్పించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి బాధ్యతారహితంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నార’ని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపిన గౌరికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని రవిశంకర్ ప్రసాద్ అంతకుముందు ప్రశ్నించారు. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందన్న విషయం తమతో గౌరి చెప్పలేదని, భద్రత కూడా కోరలేదని సిద్ధరామయ్య తెలిపారు. గౌరీ లంకేశ్ చాలా మంచి మనిషి అని, ఆమెను ఎవరూ ద్వేషించరని చెప్పారు. గౌరికి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించారా, లేదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానని రవిశంకర్ ప్రసాద్ తాజాగా పేర్కొన్నారు. -
‘కుటుంబసభ్యులు కోరితే కేసు సీబీఐకి’
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తాము ఎన్నడూ చెప్పలేదని ఆయన అన్నారు. గౌరి లంకేష్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐతో విచారణకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తే తాము సీబీఐ విచారణకు ఆదేశించాలా అని ఆయన ప్రవ్నించారు. తన పత్రికలో సంఘ్ పరివార్ గురించి హేళనగా కథనాలు రాయకపోయి ఉంటే ఈ రోజు గౌరి లంకేష్ చనిపోయి ఉండేవారు కాదు కదా? అన్న బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ వ్యాఖ్యల అర్థమేంటి? గౌరి లంకేష్ హత్య వెనక ఎవరి హస్తం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది కదా?’ అని అన్నారు. బైక్ ర్యాలీ ద్వారా బీజేపీ నేతలు సమాజంలో శాంతి, సామరస్యాలను చెడగొట్టి అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ‘మంగళూరులో పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేతలు ముందుగా చెప్పి ఉంటే అప్పుడే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండేవాళ్లమని, అయితే వాళ్లు ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం వల్లే తాము అనుమతులు ఇవ్వలేదన్నారు. నిరసన తెలిపేందుకు, సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు తాము ఎక్కడైతే అనుమతి ఇచ్చామో ఆ ప్రదేశాన్ని వదిలేసి, రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. -
ఐటీ తనిఖీలు చేసుకోవచ్చు: సీఎం
సాక్షి, బెంగళూరు: ‘అబద్ధపు ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులు తనిఖీలు చేసుకోనివ్వండి, ఆ తర్వాత చూద్దామ’ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. ఆర్టీఐ కార్యకర్త రామమూర్తి సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై గవర్నర్‌తో పాటు ఐటీ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు, ఫిర్యాదులకు నేను భయపడబోను. ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం కూడా లేద’ ని పేర్కొన్నారు. బీజేపీ తలపెట్టిన ‘మంగళూరు చలో’ కార్యక్రమంపై స్పందిస్తూ.. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని సిద్ధరామయ్య అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డాక్టర్ డీకె శివకుమార్, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
యడ్డిపై కేసు మా పని కాదు
► మంత్రి డీకేపై ఐటీ దాడులెవరు చేశారు? ► సీఎం సిద్ధరామయ్య బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పపై భూముల డీనోటిఫికేషన్ కేసు వ్యవహారం అధికార– విపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆ కేసు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంటే, తమకు ఏం తెలియదని అధికార పార్టీ అంటోంది. కేసుకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ధర్నాలకు దిగాయి. సాక్షి, బెంగళూరు: భూముల డీనోటిఫికేషన్ కేసులో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక తమ ప్రభుత్వం ఒత్తిడి ఉందని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ అరసు 102వ జయంతి సందర్భంగా ఆదివారం విధానసౌధ ఆవరణలోనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇళ్లు లేని పేద ప్రజల కోసం 2008లో బెంగళూరులోని యశ్వంతపుర, యలహంక హోబళిల పరిధిల్లో 3,546 ఎకరాలను సేకరించడానికి అప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో భూముల నోటిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే అప్పటి సీఎం యడ్యూరప్ప కొంత మంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రజల ఇళ్ల కోసం సేకరించిన స్థలాల్లో 257 ఎకరాలను డీనోటిఫై చేయడంతో ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దీంతో జనసామాన్యర వేదిక అధ్యక్షుడు అయ్యప్ప ఈ విషయాలన్నింటిపై ఈ ఏడాది జూన్ నెలలో ఏసీబీ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయాలేవి తెలియని బీజేపీ నేతలు యడ్యూరప్పపై తమ ప్రభుత్వమే ఏసీబీతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఏసీబీని దుర్వినియోగపరుస్తున్నట్లు నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఏసీబీని తాము దుర్వినియోగం చేస్తున్నామని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు రాజకీయ కక్షతో తమ మంత్రి డీ.కే.శివకుమార్‌పై ఐటీ దాడులు చేయించిన కేంద్ర ప్రభుత్వ చర్యకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల కోసం కేటాయించిన స్థలాలను డీనోటిఫై చేసి తప్పు చేసిన యడ్యూరప్పకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండడం విచారకరమన్నారు. -
సిద్ధూ.. హద్దు మీరుతున్నావ్
► కక్ష సాధింపు రాజకీయాలు తగవు ► కేంద్రమంత్రి సదానందగౌడ శివాజీనగర(కర్ణాటక): మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఏసీబీని ప్రయోగించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ ఆరోపించారు. అధికార అహంకారానికి, రాజకీయ స్వలాభానికి పరిమితులు ఉన్నాయని, అయితే సిద్ధరామయ్య అన్ని హద్దులను దాటి స్వార్థం కోసం ఏసీబీని వాడుకొంటూ దుర్వినియోగానికి పాల్పడటం సరైన విధానం కాదన్నారు. ఆదివారం మహాలక్ష్మీపురంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పరిసర పరిరక్షణ గణేశ్ జాగృత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, పలు బడ్జెట్లను ప్రవేశపెట్టారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు, ఇలాంటి వ్యక్తి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడటంపై దేశమంతా కూడా చర్చనీయాంశమైనదని తెలిపారు. అధికారం శాశ్వతం కాదు యడ్యూరప్పను అణచివేసేందుకు సిద్ధరామయ్య కుట్ర ఫలించదని, ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పటం తథ్యమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, దీనిని సిద్దరామయ్య తెలుసుకోవాలని సదానంద అన్నారు. ధనబలంతో సిద్ధరామయ్య కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇదే ఆయనకు ఎదురుదాడి అవుతుందని సదానందగౌడ తెలిపారు. ఏసీబీని, అధికారులను దుర్వినియోగం చేసుకోవటంపై కేఏఎస్ అధికారి ఒకరు ఫిర్యాదు చేయటం సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్నారు. ప్రకృతికి హానిచేయని రీతిలో వినాయక చవితిని ఆచరించాలని కేంద్రమంత్రి సూచించారు. -
ఇక ఐదుకు టిఫిన్, పదికి భోజనం
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లు ఇప్పుడు పలు రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. పేద ప్రజలకు అవసరమైన ఆహారాన్ని చౌక ధరలకు అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు తరహాలో టిఫిన్లు, భోజనాలు సరసమైన ధరలకు సరఫరా చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు స్కీములు నిర్వహిస్తుండగా, తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చౌక ధరలకు ఆహారాన్ని సరఫరా చేసే క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. కర్ణాటకలో బుధవారం 101 పేదల క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో కొన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఓ క్యాంటీన్లో సీనియర్ నేతలతో కలసి భోజనం కూడా చేశారు. ఒక్కో క్యాంటీన్ రోజుకు మూడు వందల మంది ఐదు వందల మంది వరకు భోజన వసతిని కల్పిస్తుంది. ఇందిర పేరిట ఏర్పడిన ఈ క్యాంటీన్లలో టిఫిన్‌ను ఐదు రూపాయలకు, భోజనాన్ని పది రూపాయలకు వడ్డిస్తారు. ఎంపిక చేసిన కొన్ని క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు, కూరలు 25 రకాల వరకు ఉంటాయి. ఎక్కువ వాటిలో తక్కువ రకాలే ఉన్నప్పటికీ రోజుకో వెరైటీ ఉండేలా చూస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 27 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో కిచెన్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కిచెన్ పలు క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. బెంగళూరు నగరంలోని ప్రతి వార్డులో ఓ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. టిఫిన్‌కు ఎక్కువగా ఇడ్లీలు, లంచ్‌కు రైస్, సాంబార్ ఎక్కువగా సరఫరా చేస్తారు. ఒక్కో క్యాంటీన్‌ను వేగంగా ఎనిమిది రోజుల్లోనే నిర్మించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 27 కిచెన్లలో 5 కిచెన్లను స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఇందిర క్యాంటీన్లు మనకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలియకపోతే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఎక్కడెక్కడ ఉన్నాయో యాప్ తెలియజేయడమే కాకుండా ఈ రోజు మెనూ ఏమిటో కూడా తెలియజేస్తోంది. క్యాంటీన్ రుచులనుబట్టి వినియోగదారులు రేటింగ్‌లు కూడా ఇవ్వొచ్చు. బాగోలేకపోతే యాప్ ద్వారానే ఫిర్యాదులు పంపవచ్చు. -
ముందస్తు ఎన్నికల్లేవు: సీఎం
మైసూరు: రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఏ చెరువులను కూడా డినోటిఫికేషన్ చేయాలన్న ప్రతిపాదన లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తెలిపారు. మైసూరు నగరంలో లలిత మహాల్ హెలిప్యాడ్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగవని సీఎం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీతో పాటు ఇక్కడా ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మాత్రమే జరుగుతాయని, త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదని, అధికారం నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. డీనోటిఫైపై తప్పుడు ప్రచారం ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న చెరువులను డీనోటిఫై చేస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న చెరువుల డీనోటిఫై పై మంత్రిమండలిలో చర్చ జరిగిందని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బస్టాండు గతంలో చెరువుగా ఉండేది. అనేక మురికివాడలు కూడా చెరువులుగా ఉండేవన్నారు. అయితే రెవెన్యూ శాఖ రికార్డుల్లో ఇప్పటికీ కూడా ఈ స్థలం చెరువు అని ఉందని, దానిని మార్చాలని సూచించడం జరిగింది తప్ప డీనోటిఫై చేయాలని తాము చెప్పలేదన్నారు. ఐటీ దాడులకు బెదరం బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులను వెతికి పట్టుకుని మరీ ఐటీ దాడులు చేయిస్తున్నారని, ఎన్ని దాడులు చేసినా తాము భయపడేది లేదని చెప్పారు. లింగాయతలకు ప్రత్యేక మతం విషయంలో తనపై ఆరోపణల తగదని, ఒక వర్గాన్ని కూలదోయడం బీజేపీ నాయకులు చేసే పని అని ఆరోపించారు. -
ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు : ఐటీ దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని, తమను బదనాం చేసేందుకే దాడులు చేశారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ నివాసాలపై ఐటీ శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే శివకుమార్, సురేశ్ సోదరులు, బంధువుల ఇళ్లతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగల్ టన్ రిసార్ట్‌లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టారు. కాగా ఐటీ సోదాల్లో సుమారు 7.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేసి, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. -
సీఎం సంచలన వ్యాఖ్యలు
కన్నడ రాకుంటే కర్ణాటకలో ఉండొద్దు అధికారులకు సీఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ బనశంకరి (బెంగళూరు): కన్నడ భాష రాని అధికారులకు కర్ణాటకలో ఉండేహక్కు లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్ కేఆర్ నందిని సహా 59 మంది కర్ణాటక ర్యాంకర్లను సిద్ధరామయ్య సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇక్కడ పనిచేసే ఏ అధికారి అయినా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఓ ఐఏఎస్ అధికారి కన్నడ నేర్చుకునేది లేదని అన్నప్పుడు, మీ సేవలు అవసరం లేదని అధికారిని కేంద్రానికి తిప్పిపంపించినట్లు గుర్తు చేశారు. సివిల్స్ ర్యాంకర్లందరూ ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించేటప్పుడు ఆ స్థానిక భాషను నేర్చుకుని మంచి పరిపాలన అందించాలని సూచించారు. మొదటి ర్యాంకర్ నందిని కర్ణాటక సర్వీసునే ఎంచుకోవాలని సీఎం కోరారు. మరోవైపు హిందీ భాషకు వ్యతిరేకంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. హిందీ భాషలో రాసిన ప్రకటనలపై నల్ల రంగు పూశారు. యశ్వంత్‌పూర్ మెట్రో స్టేషన్ వెలుపల ఉన్న హిందీ అక్షరాలతో రాసిన పేరు కనిపించకుండా బుధవారం రాత్రి నల్లరంగు వేశారు. ఇందిరా నగర్ మెట్రోస్టేషన్ వెలుపల హిందీ ప్రకటనలు కనిపించకుండా పోస్టర్లు అతికించారు. కేంద్రంపై తమపై హిందీని రుద్దుతోందని కర్ణాటక రక్షణ వేదిక ఆరోపిస్తోంది. కాగా, తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. బీజేపీ హిందుత్వ అజెండాకు కౌంటర్‌గానే ఆయనీ కార్యం తలపెట్టారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఇవన్ని చేస్తున్నారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
మా రాష్ట్రానికో ప్రత్యేక జెండా!
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ► రూపకల్పనకు కమిటీ ఏర్పాటు ► రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్న సీఎం బెంగళూరు: ప్రత్యేకంగా తమ రాష్ట్రానికి ఓ జెండా కావాలని కర్ణాటక బలంగా కోరుకుం టోంది. జెండా రూపకల్పన కోసం 9 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చర్యపై విపక్షాలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు. అయితే, దేశానికంత టికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏరాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తాజాగా ఇదే అంశంపై సిద్ధరామయ్య నేతృ త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జెండా అంశాన్ని తెరపైకి తేవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. గతనెలలోనే కమిటీ ఏర్పాటు కర్ణాటకలో ప్రముఖ రచయిత, జర్నలిస్టు పాటిల్ పుట్టప్ప, సామాజిక కార్యకర్త భీమప్ప గుండప్ప గడదలు ప్రభుత్వానికి గత నెలలో ఇచ్చిన ఓ నివేదికలో కన్నడ నాడుకు ఓ ప్రత్యేక జెండా ఉండాలని ప్రతిపాదిం చారు. అనంతరం జెండా రూపకల్పనకు సీఎం సిద్ధరామయ్య కన్నడ సాంస్కృతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేవల విభాగం, హోం శాఖ, లా, పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శులు, కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు, కన్నడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కన్నడ విశ్వవిద్యాలయం హంపి వీసీ సభ్యులుగా ఉంటారు. ఈ జెండా ఎరుపు, పసుపు రంగు ల కలయికతో ఉండనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది. -
నేను వందశాతం హిందువునే: ముఖ్యమంత్రి
మైసూరు: 'నేను కూడా హిందువునే. నా పేరు ఏమిటి. సిద్ద-రామ.. నేను వందశాతం హిందువుని' అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో బీజేపీ హిందూత్వ అజెండాను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. దక్షిణ కన్నడలో మత ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఆయన.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతోనే ఓటర్లను విభజించేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తాను హిందువునే అయినా బీజేపీ తరహాలో ప్రజలను విభజించేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు. మతం పేరిట ఓటర్లను సమీకరించి ఉత్తరప్రదేశ్ తరహాలో కర్ణాటకలోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, రాష్ట్రంలో దానిని జరగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు. -
అక్కడి నుంచే ఆఖరి పోటీ: ముఖ్యమంత్రి
బెంగళూరు: వచ్చే శాసనసభ ఎన్నికలే తన చివరి ఎన్నికలని, తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శనివారం మైసూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. తనను చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నియోజకవర్గం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, అదే విధంగా వరుణ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరుతున్నారని, ఈ రెండు నియోజకవర్గాలు తనకు ఎంతో ఇష్టమని సిద్ధరామయ్య అన్నారు. రాజకీయంగా తనకు పునర్ జన్మనిచ్చిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో చివరిసారి అక్కడి నుంచి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలని, గెలుపోటములు వారి చేతుల్లో ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామిలను ప్రజలు నమ్మరని, వారి కుట్రలు ఫలించవని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నివేదిక వచ్చాకే చర్యలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో ముంగారు వర్షాల ఛాయలే లేవని, దీంతో జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిద్ధు చెప్పారు. ఇక ఇక దక్షిణ కన్నడ జిల్లా ప్రశాంతంగా ఉందని, మీడియా, రాజకీయ పార్టీలు సంయమనంతో ఉండాలని, లేని పోనివి ప్రచారం చేయరాదన్నారు. బీజేపీ నాయకులే హిందువులు కాదని, తాను కూడా హిందువేనని వ్యాఖ్యానించారు. -
‘దళితులతో బీజేపీ నాయకులు పెళ్లిళ్లకు సిద్ధమా?’
బెంగళూరు: దళితులపై బీజేపీ నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని దళితుల ఇళ్లల్లో తింటున్నట్లు నటించడం కాదు, దళితులతో వైవాహిక బంధం పెంచుకోవాలని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. దళిత యువకులకు వారి ఇంటి అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలని, అలాగే దళిత యువతులను బీజేపీ నేతల కుటుంబాల్లోకి కోడళ్లుగా చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కిత్తగనూరులో 65 ఎంఎల్డీ సామర్థం కలిగిన నీటి శుద్ధీకరణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్న బీజేపీ నేతలు ఓట్ల కోసమే వారి ఇళ్లల్లో భోజనాలు చేస్తూ కపట నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాటకాలను ప్రజలు పసిగట్టడంతో ఇక అధికారంలోకి రావడం కష్టమని భావించి గతంలో రాష్ట్రంలో 150 స్థానాల్లో గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ మధ్యకాలంలో 150 స్థానాల్లో గెలుపు గురించి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. మురికివాడల వాసుల తాగునీటి కోసం రోజూ పది లక్షల లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
కర్ణాటకలో రైతు రుణమాఫీ
సాక్షి, బెంగళూరు: నాలుగేళ్ల నుంచి కరువుతో అల్లాడుతున్న కర్ణాటక రైతుకు కాస్త ఊరట.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే, అది కూడా రూ.50 వేల వరకే మాఫీ వర్తించనుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకూ వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక ఇప్పటికైనా ప్రతిపక్ష బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రంలోని ప్రైవేటు, జాతీయ, గ్రామీణ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న నిరసనలు, ఒత్తిళ్లకు తలొగ్గే రుణమాఫీని ప్రకటించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. -
ఒక్కో తలపై రూ.35 వేల అప్పు
⇒ రాష్ట్ర రుణభారం రూ.2.42 లక్షల కోట్లు ⇒ విచ్చలవిడిగా సిద్ధు సర్కారు అప్పులు ⇒ విధానసభలో బీజేపీ పక్ష నేత శెట్టర్ బెంగళూరు: సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అప్పుల ఊబిలోకి తోసేస్తోందని విధానసభలో బీజేపీ పక్ష నేత జగదీష్ శెట్టర్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.2,42,420 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని ఒక్కొక్కరి తల పై రూ.32 – 35వేల అప్పు ఉందని ఆయన చెప్పారు. బుధవారం విధానసభలో శెట్టర్ మాట్లాడుతూ సర్కారు ఆర్థిక నిర్వహణపై దుమ్మెత్తిపోశారు. ఎస్.ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటకలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు కోసం రూ.35,902 కోట్లను రుణంగా తీసుకుందన్నారు. ధరంసింగ్ సీఎంగా ఉండగా ఈ మొత్తం రూ.15,635 కోట్లు కాగా కుమారస్వామి హయాంలో రూ.3,545 కోట్లు మాత్రమే రుణంగా కర్ణాటక పొందిందన్నారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో రూ.25,653 కోట్లు, సదానందగౌడ సమయంలో రూ.9,357 కోట్లు, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.13,464 కోట్లు రుణంగా తీసుకున్నానన్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హయాంలో అభివృద్ధి పేరుతో అవసరం లేకపోయినా ఎక్కువగా రుణాలను పొందుతోందన్నారు. దీంతో గత నాలుగేళ్లలో రూ.2,42,420 కోట్ల రుణాలను పొందారన్నారు. ఈ రుణభారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోందన్నారు. అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని అప్పుడు ఆర్థిక క్రమశిక్షణ తప్పక పాటిస్తామని ఆయన చెప్పారు. అటవీశాఖలో కోట్ల అక్రమాలు రాష్ట్ర అటవీశాఖలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హుబ్లీ అటవీ విభాగంలోనే చెట్లు నాటే కార్యక్రమంలో రూ.6 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్నారు. మిగిలిన అన్ని వలయాల్లోని అక్రమాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం వందల కోట్లలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు కాగ్ నివేదికలో పేర్కొందన్నారు. ఈ విషయలన్నింటి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఐక్యతతోనే గెలుపు
► కాంగ్రెస్ భేటీలో రాహుల్‌గాంధీ సాక్షి, బెంగళూరు: ‘రాజకీయ పార్టీ ఒక కుటుంబం వంటిది. కుటుంబంలోని సభ్యులందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అయితే సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే మనుగడ సాధ్యం. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు నడిపించాలి. అప్పుడే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాం.’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో జరిగిన ఎంపిక చేసిన 1,500 మంది కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీలో ఉన్న అనైక్యతను తొలగించడానికి కొత్త ఇన్చార్జ్గా వేణుగోపాల్‌ను నియమించానని, ఆయన ప్రయత్నం తనకు సంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీల నుంచి ప్రభుత్వానికి మంచి మద్దతు లభిస్తోందని, ఇందుకు సిద్ధరామయ్య అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. ఆయనకు మీ (ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు) నుంచి సంపూర్ణ సహకారం లభిస్తే రానున్న ఎన్నికల్లో మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకులకు మాత్రమే టికెట్లు దక్కుతాయన్నారు. ధన బలం ఉన్నవారు ఎంత ప్రయత్నించినా ఈసారి టికెట్లు ఇవ్వబోమన్నారు. ఎన్నికల్లో పోటీచేసి గెలవడానికే వచ్చేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇవ్వబోమన్నారు. మొదటి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేసేవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు సామూహిక నాయకత్వంలో వెళ్తామని చెప్పారు. -
ఇలాగైతే ఎలా..?
► సమావేశాలకు హాజరుకాని అమాత్యులపై సీఎం ఫైర్ ► ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్పాలి ? ► సమావేశాలు ముగిసేవరకు విధిగా హాజరు కావాల్సిందే ► రుణమాఫీ అసాధ్యం సాక్షి, బెంగళూరు: శాసన మండలి సమావేశాలకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడాన్ని ప్రశ్నిస్తూ గురువారం ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సమావేశాలకు హాజరుకాని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విధానసౌధలోని సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకాక పోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయా శాఖల మంత్రులు సమావేశాలకు గైర్హాజరు కావడంతో ఆయా శాఖలకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు గైర్హాజరు కావడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంవహిస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుతుందన్నారు. తద్వారా ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీచే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సోమవారం నుంచి సమావేశాలు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలంటూ ఆదేశించారు. రుణమాఫీ సాధ్యం కాదు.... ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యాప్తంగా 22 శాతం మంది రైతులు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకోగా 78 శాతం మంది రైతులు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడానికి ముందకు వస్తే సహకార బ్యాంకుల్లో రైతుల రుణాలు మాఫీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నమని తెలిపారు. పదే పదే రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని దీని వల్ల సహకార రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. రుణమాఫీ ప్రకటిస్తే సహకార బ్యాంకులకు రూ.11 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని దీనివల్ల ప్రభుత్వం దివాళా తీసే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి వాస్తవిక పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప పదే పదే రుణాలు మాఫీ చేయాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తామంటూ సాధ్యతరం కాని అబద్దపు హామీలతో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. -
సిద్ధరామయ్యపైనే కర్ణాటక కాంగ్రెస్ భారం
-
యువ ఐఏఎస్ మృతి.. అసలేం జరిగింది?
⇒ యువ ఐఏఎస్ మృతిపై లోతైన విచారణ ⇒ రాష్ట్రానికి రానున్న యూపీ పోలీసులు ⇒ సీఎస్, ఇతర ముఖ్య అధికారులతో భేటీ ⇒ ఆహార పౌరసరఫరాల శాఖ నుంచి సమాచార సేకరణ సాక్షి, బెంగళూరు: నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అనుమానాస్పద రీతిలో మరణించిన కర్ణాటక కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి మరణంపై యూపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది. ఈ బృందం విచారణ కోసం కర్ణాటకకు రానుంది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్ర కుంటియాతో భేటీ కానుంది. ఆయన నుంచి సమాచారాన్ని సేకరించిన అనంతరం ఆహారపౌర సరఫరాల శాఖ సిబ్బందిని కూడా విచారించి సమాచారాన్ని సేకరించనున్నారు. 2007 బ్యాచ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్తివారి ఈ నెల 17న లక్నో రోడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది సహజ మరణం కాదని ఎవరో హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వారంతా పేర్లు బయటకు చెప్పకుండా కర్ణాటకకు చెందిన కొంతమంది అధికారులు, మంత్రుల పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులపై తివారి సోదరుని ఆరోపణలు తివారి తమ్ముడైన మయాంక్ తివారి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ‘మా అన్న కర్ణాటకలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసే సమయంలో దాదాపు 2వేల కోట్ల రూపాయాల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీబీఐకి కూడా పంపించాలని భావించారు. దీంతో ఆయనపై సీనియర్ అధికారుల ద్వారా మంత్రులు ఒత్తిళ్లు తీసుకువచ్చారు. తివారి ఈ విషయాలన్నీ నాకు చెప్పడమే కాకుండా ఆ వివరాలు వాట్సప్‌లో నాకు పంపించారు.’ అని బహిరంగంగా ప్రకటించారు. ఆధారాలను సైతం అక్కడి అధికారులకు అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బందం ఇక్కడికి రానుంది. అనురాగ్ తివారి కర్ణాటకలో ఆహార శాఖ కమిషనర్‌గా పనిచేసే సమయంలో ఆయన పనితీరు, సిబ్బందితో వ్యవహరించిన తీరు, సీనియర్ అధికారుల ప్రవర్తన తదితర విషయాల పై సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. మానసిక కుంగుబాటు కారణమా? తివారి అనుమానాస్పద మృతి పట్ల సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇందుకు పూర్తి సహకారం అందించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాయడం తెలిసిందే. ఇక బీజేపీ రాష్ట్రశాఖ కూడా ఈ విషయం పై సమగ్ర దర్యాప్తునకు పట్టుబడుతోంది. ఇదిలా ఉండగా కుటుంబ కలహాల వల్ల తివారి కొంత కాలంగా మానసికంగా కలత చెందినట్లు వాదన కూడా వినిపిస్తోంది. భార్యతో విడాకులు తీసుకున్నారని, దీనివల్ల తీవ్రంగా కుంగిపోయారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
మరో ఏడాది నేనే సీఎం
► నా నాయకత్వంలోనే ఎన్నికలకు ► మెజారిటీ సీట్లు మాకే ► చిత్రదుర్గ సభలో సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: తన నాయకత్వంలోనే రానున్న శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత శాసనసభ పక్షంలో చర్చించి ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేల్చుతామని అన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం చిత్రదుర్గలోని ప్రభుత్వ కళాశాలలో జరిగిన కృతజ్ఞతా సభలో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ తాను ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పార్టీలోని యువకులతో పాటు సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలనను కొనసాగించడం వల్లే నాలుగేళ్ల పాటు సీఎం స్థానంలో ఉన్నానన్నారు. మరో ఏడాది కూడా ఆ పదవిలో కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలోబ్రాండ్ అంబాసిడర్ అభివృద్ధి విషయంలో కర్ణాటకను బ్రాండ్ అంబాసిడర్‌గా చూపిస్తూ ఎన్నికలకు వెళ్తామన్నారు. విపక్ష బీజేపీ చెబుతున్నట్లు గుజరాత్లో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. గత నాలుగేళ్లలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బీజేపీ విడుదల చేసిన ‘చార్జ్‌షీట్’ వాస్తవానికి విరుద్ధమన్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామన్నారు. ముఖ్యంగా బెంగళూరులోని 28 నియోజకవర్గాలనూ గెలుచుకుంటామన్నారు. అయితే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప మాదిరి ‘నా జేబులో 150 సీట్లు’ ఉన్నాయని చెప్పబోమని వ్యంగ్యంగా అన్నారు. పీసీసీ అధ్యక్ష నియామకంలో తన అభిప్రాయాన్ని హై కమాండ్‌కు తెలియజేశానన్నారు. కార్యక్రమంలో మంత్రులు పరమేశ్వర్, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని సీఎం అందజేశారు. ఒక దంపతులు సీఎంకు పాదాభివందనాలు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. -
తెలుసుకుని మాట్లాడండి..
► కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సీఎం సిద్ధు విమర్శలు మైసూరు: రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. కర్ణాటక మరో బీహార్‌లా తయారయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం మైసూరు నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక నుంచే ఎంపీగా ఎన్నికయిన నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై అవగాహన పెంచుకొని మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో న్యాయం, చట్టం వ్యవస్థ పకడ్బందీగా అమలు చేస్తుండడం వల్లే అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏమేం జరిగాయో ఆమె తెలుసుకోవాలన్నారు. కరువు నిధులపై శ్వేతపత్రం ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరువు పరిహార నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్‌పై స్పందిస్తూ ఆ అవసరం లేదని సీఎం తెలిపారు. వర్షాల కొరతతో ఖరీఫ్ సీజన్లో చోటు చేసుకున్న పంట నష్టాలకు పరిహారంగా రూ.3,300 కోట్లు అదేవిధంగా రబీ సీజన్లో పంటనష్ట పరిహారంగా రూ.4,702 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరామన్నారు. అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.1,670 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అందులో ఇప్పటికే రూ. 1,100 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. మిగిలిన రూ.570 కోట్లను ఇతరాత్ర అవసరాల కోసం తమ వద్దే అంటిపెట్టుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే బదులు రాష్ట్రానికి మరిన్ని కరువు పరిహార నిధులను విడుదల చేయాలంటూ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే సంతోషిస్తామన్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అప్పుడప్పడూ రాష్ట్ర పర్యటన చేస్తుంటారని అందులో భాగంగానే మే18 నుంచి రాష్ట్ర పర్యటన చేస్తున్నారంటూ చమత్కరించారు. కేపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్టానందే తుది నిర్ణయమని తెలిపారు. ఎవరూ కాంగ్రెస్‌ను విడిచి వెళ్లరని అన్నారు. -
‘ప్లీజ్ సీఎంగారు.. మా సినిమా చూడండి’
బెంగళూరు: సాధారణంగా సమస్యలు ఉన్నవాళ్లే ముఖ్యమంత్రి నివాసం ముందు భారీ క్యూలు కడుతుంటారు. ఎంతకష్టమైనా వాటిని పరిష్కరిస్తామని హామీ వచ్చే వరకు అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి కూడా వారి సమస్యలు సావధానంగా వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం వారికి ముఖం కూడా చూపించడం లేదు. ఎందుకంటే వచ్చినవాళ్లంతా సమస్యలు ఉన్నవాళ్లు కాదు.. సినిమా నిర్మాతలు. అవును ఇప్పుడు పొద్దున లేస్తే సీఎం సిద్ద రామయ్య ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో సినీ నిర్మాతలే క్యూ కడుతున్నారు. అందుకు కారణం ఆయన కార్యాలయ సిబ్బంది చేసిన పనే. ఇంతకీ వాళ్లేం చేశారంటే.. ఇటీవల సీఎం సిద్దు రాజ్‌కుమార్ నటించిన రాజకుమార వీక్షించారు. ఈ ఫొటోను ఆయన కార్యాలయ సిబ్బంది అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టింది. అనంతరం రాజ్‌కుమార్ సీఎం సిద్దరామయ్యను ప్రత్యేకంగా కలిసి ఇందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, ఇటీవలె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రభుత్వం తరుపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరొగొచ్చే సమయంలో విశ్రాంతి కోసం ఒకే రోజు బాహుబలి-2, నిరుత్తర అనే చిత్రాన్ని చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన కార్యాలయ సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు నిర్మాతలంటూ ఆయన కోసం క్యూ కట్టారు. సాధారణంగా సీఎం సినిమా చూశారంటే ఆ సినిమాకి మంచి ప్రచారం కావున సీఎం తమ సినిమా అంటే తమ సినిమా చూడాలంటూ నిర్మాతలు తెగ ఎగబడుతున్నారు. అయితే, కాలేజీ రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసే తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పటికో చూసేందుకుగానీ వీలు కావడం లేదని, ప్రస్తుతం బిజీ పనుల కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు చూడటం కుదరదని అన్నారు. నిర్మాతలకు తనపై ఉన్న ప్రేమకు ధన్యవాదాలని చెప్పారు. -
ఎర్రబుగ్గ నేనెందుకు తొలగిస్తా?: సీఎం
దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ప్రముఖుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశానికి మద్దతు పలుకుతూ చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు మీడియా ముందు హడావిడిగా తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఎర్రబుగ్గను తొలగించలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. ‘నేనెందుకు తొలగించాలి? మే 1 నుంచి కదా ఈ ఆదేశాలు అమలు అయ్యేది’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆయన లెక్క ప్రకారం మే 1కి ముందు ఒక్క క్షణం కూడా ఎర్రబుగ్గను తొలగించకూడదు. కానీ, తన తీరుపై విమర్శలు వస్తాయని అనుకున్నారేమో ఆయన వెనుకకు తగ్గారు. ఆయన వాహనంపై ఎర్రబుగ్గ మాయమైంది. దీనిపై కర్ణాటక సీఎంవో వివరణ ఇస్తూ.. వాహనాలపై ఎర్రబుగ్గులు తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రానికి తెలియజేయలేదని, అయినా, ప్రధాని మోదీ అభీష్టం మేరకు సీఎం సిద్దరామయ్య తన వాహనం నుంచి దానిని తొలగించారని తెలిపింది. మొత్తానికి దేశంలో ‘వీఐపీ సంస్కృతి’కి నిలుటద్దంలా నిలిచిన వాహనాలపై ఎర్రబుగ్గను తొలగించడంలో నేతలు మహా ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం తన వాహనంపై ‘లాల్ బత్తీ’ని తొలగించారు. ఈ విషయంలో విమర్శలకు జడిసి సిద్దరామయ్య కూడా తొలగించి ఉంటారని తెలుస్తోంది. -
సీఎం హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమాదం తప్పింది. సోమవారం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కర్ణాటక సీఎం.. హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో బయల్దేరారు. కాగా హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో పైలట్ వెంటనే బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢీకొనడం వల్ల హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం బృందం అదే హెలికాప్టర్లో శ్రావణబెళగలకు బయల్దేరి వెళ్లింది. -
ఇక్కడ మోదీ ఆటలు సాగవు..
► జేడీఎస్ తప్పిదాలతోనే బీజేపీ బలోపేతం ► అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కసరత్తులు ► హస్తినలో సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: దేశంలోని పలు రాష్ట్రాల్లో తన మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కుయుక్తులు కర్ణాటకలో మాత్రం సాగవంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీలో మార్పులు, చేర్పుల గురించి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించడానికి ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య ఆదివారం అక్కడ మీడియాతో మాట్లాడారు. గతంలో జేడీఎస్ వ్యూహాత్మక తప్పిదాల వల్ల కర్ణాటకలో బీజేపీ బలపడింది, కానీ బీజేపీ మళ్లీ పాతాళానికి పడిపోయినట్లు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత బలోపేతం చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల రుణమాఫీ సాధ్యం కాదంటూ స్పష్టం చేసిన ఆయన రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి రుణమాఫీకి సహకరించినట్లయితే తాము కూడా సిద్ధమన్నారు. పంటనష్ట పరిహారాన్ని విడుదల చేయించండంలో కేద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు రైతుల రుణ మాఫీ చేయట్లేందటూ తమ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదంటూ విమర్శించారు. మహదాయి పరిష్కారంలోనూ నిర్లక్ష్యం మహదాయి నదీ జలాల పంపిణీలో గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్యను పరిష్కరించి రాష్ట్రానికి తాగునీటిని అందించడంలో ప్రధాని నరేంద్రమోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం విమర్శించారు. నదీ జలాల పంపిణీలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా కూడా చేష్టలుడిగిన రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్న తమ ప్రభుత్వాన్ని నిందించే నైతిక హక్కు లేదంటూ దుయ్యబట్టారు. గుండ్లుపేట ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా మహదేవ ప్రసాద్‌పై అనుచిత, అవహేళనకర వ్యాఖ్యలు చేయడం ద్వారా మైసూరు ఎంపీ ప్రతాప సింహా రాజకీయ అవివేకత్వాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు అందరితో ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా వారి సమస్యలను పరిష్కరించి వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపునకు కసరత్తులు ప్రారంభించామన్నారు. -
ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి: సీఎం
ఒకవైపు ఈవీఎంల గురించి దేశంలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాత్రం సొంత పార్టీకే ఝలక్ ఇస్తూ ఈవీఎంలను వెనకేసుకు వస్తున్నారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేస్తున్నారని, వాటివల్లే ఎన్నికల ఫలితాలు మారిపోతున్నాయని స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చెబుతుండగా.. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతో ఉన్న సిద్దు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగిన రెండు నియోజకవర్గాల్లోను ఈవీఎంలు బాగా పనిచేశాయని, ఎక్కడా ట్యాంపరింగ్ జరగలేదని సిద్దరామయ్య అన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకుండా వాటిని రిగ్గింగ్ చేసి ఉంటే తాను ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కానని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయింది తమ పార్టీయేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ఢిల్లీలో చెబుతుంటే, ఇక్కడ రాష్ట్రాల్లో వీరిద్దరు మాత్రం వాటిని వెనకేసుకు రావడం గమనార్హం. -
'సిద్ధుపై పరువునష్టం దావా వేస్తా'
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరువునష్టం దావా వేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హెచ్చరించారు. నిర్దోషిని అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా సిద్ధరామయ్య తనను జైలుకు పోయివచ్చాడని, కేసులున్నాయని అని బహిరంగ సమావేశాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నంజనగూరు నియోజకవర్గంలో బదనవాళు గ్రామంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్‌కు మద్దతుగా యడ్యూరప్ప ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపైన ఉన్న కేసులను కోర్టులు కొట్టివేసినా సిద్దరామయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. సిద్ధు ఆరోపణలకు భయపడబోనని చెప్పారు. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడైన నాయకుడని వ్యాఖ్యానించారు. డైరీల కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యడ్యూరప్ప సవాల్ విసిరారు. -
బెంగళూరులో ‘నమ్మ’ క్యాంటీన్లు
బెంగళూరు: తమిళనాడులో అత్యంత ప్రజాధారణ పొందిన ‘అమ్మ క్యాంటీన్’ల స్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో చౌకధరల క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా సామాన్యులకు రాయితీపై తక్కువ ధరలకే అల్పాహారం, భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అల్పాహారం రూ.5, భోజనం రూ.10లకే అందించనున్నట్టు పేర్కొన్నారు. క్యాంటీన్ల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినట్టు సిద్ధరామయ్య తెలిపారు. -
చితి పేర్చుకుని.. రైతన్న సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు రుణమాఫీ అంశం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెలువేగౌడ(68) అనే రైతు సజీవ దహనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకా నాటనహళ్లిలో ఈ ఘటన జరిగింది. చెలువేగౌడకు గ్రామంలో సుమారు మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో పంటల సాగు కోసం బ్యాంకులో రూ. 1 లక్ష వరకు అప్పు చేశాడు. కరువు వల్ల నీరు లేక పంటలు పండకపోవడంతో నష్టాలకు తోడు రుణభారం పెరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరువు నేపథ్యంలో బుధవారం సీఎం ప్రకటించే బడ్జెట్లో రైతుల రుణాలను మాఫీ చేస్తుందని చెలువేగౌడ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి రుణమాఫీ చేయలేకపోతున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చెలువేగౌడ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న చెత్తను చితిగా మార్చి.. నిప్పు పెట్టి ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత రైతు భార్య పార్వతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
మద్యంపై వ్యాట్ ఎత్తివేత!
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలావరకు మద్యం ఉత్పత్తుల మీద వ్యాట్ ఎత్తేసింది. వైన్, బీర్, హార్డ్ లిక్కర్ మీద ఈ పన్నును తీసేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక శాఖను కూడా తనవద్దే ఉంచుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోనే ఆయన ఈ చర్యల గురించి చెప్పారు. మద్యం మీద విలువ ఆధారిత పన్ను ఎత్తేయడంతో పాటు తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'నమ్మ క్యాంటీన్లు' ఏర్పాటు చేయనున్నట్లు కూడా సిద్దరామయ్య చెప్పారు. వీటిలో పేదలకు ఉదయం అల్పాహారం 5 రూపాయలకు, మధ్యాహ్న భోజనాన్ని 10 రూపాయలకు అందించనున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ. 5080 కోట్లు కేటాయించారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్రంలో పేద కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 కిలోల బియ్యం కోటాను 7 కిలోలకు పెంచారు. బడ్జెట్లో మొత్తం ఖర్చును రూ. 1.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు. -
సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు పాత మిత్రుడని, ఆయన పాలనపై వ్యాఖ్యలు చేయబోనని జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ అన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య నాలుగేళ్ల పాలన ఎలావుందని అడగ్గా... ‘దీనిపై నేను ఎలా మాట్లాడగలను. సిద్ధరామయ్య నాకు పాత మిత్రుడు. ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేద’ని సమాధానం ఇచ్చారు. బంగారప్ప, అంబరీష్ బీజేపీ చేరనున్నారని వార్తలపై స్పందించేందుకు దేవెగౌడ నిరాకరించారు. బీజేపీలో చేరే విషయంపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజశేఖర్ మూర్తి, బంగారప్ప వంటి నాయకులను వాడుకుని వదిలేశారన్నారని గుర్తు చేశారు. యూపీలో బీజేపీ గెలిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. -
అశ్లీల ఫొటోలు పంపిస్తే..ఇక అంతే
కఠిన చర్యల దిశగా బెంగళూరు పోలీసులు బెంగళూరు : సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో అవహేళనకరంగా పోస్టు. కావేరి కోసం కర్ణాటక ప్రజలు రోడ్డు పైకి వచ్చి నిరసనలకు దిగుతుంటే కర్ణాటక విరుద్ధంగా ట్విట్టర్లో వ్యంగ్య చిత్రాలు. ఇలా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావప్రకటన విపరీతస్థాయికి చేరింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, వుయ్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత ఇతర మతాలపై అనుచిత సందేశాలు అప్లోడ్ చేస్తుండటంతో సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో ఇటువంటి అనర్థాలకు బ్రేక్ వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నారు. అశ్లీల, అవహేళన రీతిలో ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేసే వ్యక్తులపై గట్టి చర్యల ద్వారా ఇటువంటివి అరికట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత కొద్ది కాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ఇతర మతాలపై కూడా నిందాపూర్వకంగా సందేశాలు పోస్ట్ చేస్తున్న ఘటనలు పెచ్చు మీరడంతో సదరు వ్యక్తులపై సుమోటో కేసును నమోదు చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి అనర్థాలకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు అటువంటి çవ్యక్తులను అరెస్ట్ చేయడానికి చర్యలను ముమ్మరం చేశారు. ఇటువంటి ఘటనల్లో బాధితులు స్టేషన్‌కు రాకుండానే కేవలం మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోనున్నారు. సైబర్‌క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడానికి నిర్ణయించుకున్న పోలీసుశాఖ అందుకు తగ్గట్లుగా పోలీసు సిబ్బందికి కూడా సైబర్‌క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి చర్యలను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎస్పీ కేడర్ అధికారుల వరకు అందరికీ సైబర్‌క్రైమ్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఫేస్బుక్, యూట్యూబ్‌లో అవహేళనకర పోస్టులు చేసే వ్యక్తుల ఖాతాలను భాధితుల ఫిర్యాదులు మేరకు రద్దు చేసే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసుశాఖలోని ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. -
మోపెడ్‌పై కూతురు మృతదేహంతో..
బెంగళూరు: మొన్న ఒడిశా నేడు కర్ణాటక.. రెండు దాదాపు సారూప్యం ఉన్న సంఘటనలే.. ఒడిశాలో చనిపోయిన తన భార్యను భుజాలపై ఎత్తుకెళితే కర్ణాటకలో మాత్రం చనిపోయిన తన కూతురుని ఓ తండ్రి మోపెడ్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తాము పోలీసుల వ్యవహారాలు భరించలేమని చెప్పారు. తొలుత పోస్టుమార్టం అంటారని, ఆ తర్వాత ఇంకేవో కావాలని చెబుతారని, చివరకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేసి మొత్తానికి సమస్య వచ్చేలా చేస్తారేమో అనే భయంతోనే ఈ పనిచేశామని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని తుంకూరు జిల్లాలోని ఓ గ్రామంలో తిమ్మప్ప అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి రత్నమ్మ అనే కూతురు ఉంది. ఆమె తీవ్ర జ్వరం రావడంతోపాటు శ్వాస తీసుకొనే సమస్య ఏర్పడటంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడి వైద్యుడు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలనని చెప్పడమే కాకుండా ఆమెకు కనీస వైద్యం కూడా చేయలేదు. దీంతో అతడి చేతుల్లోనే కన్నకూతురు చనిపోయింది. కూలీ పనులు చేసుకుంటూ బతికే తిమ్మప్ప అప్పటి కప్పుడు మోపెడ్ వాహనంపై 20 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం వద్ద ఆరా తీయగా తాము గ్రామీణ ప్రాంతాలకు సైతం అంబులెన్స్‌లు వైద్య సౌకర్యాలు ఏర్పాటుచేసినా వైద్యం చేసేందుకు వైద్యులు రావడంలేదని ఇది పెద్ద తలనొప్పిగా మారిందన చెబుతోంది. మరోపక్క, ఈ ఘటనపై సిద్దరామయ్య స్పందిస్తూ నిజానికి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే రత్నమ్మ చనిపోయిందా అనే అంశంపై దర్యాప్తు చేయించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ముఖ్యమంత్రిపై రెట్ట వేసిన కాకి
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్దరామయ్యను కాకి గోల విడిచిపెట్టడం లేదు. రాష్ట్రకవి మంజీశ్వర్ గోవింద్ పాయ్ ను స్మరిస్తూ కేరళలోని మంజీశ్వరంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, లోక్ సభ సభ్యుడు వీరప్పమొయిలీలలతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తుండగానే వేధిక పక్కనే ఉన్న ఓ చెట్టు పై నుంచి ఓ కాకి వచ్చి సిద్దరామయ్యపై రెట్టవేసి తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. దీంతో కంగుతిన్న సిద్ధరామయ్య దగ్గరకు మంగళూరు నగర నార్త్ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవ వెంటనే వెళ్లి టిష్యుతో రెట్టని తుడిచారు. కాకి రెట్ట వేయడంతో తెల్లటి దోతి పాడవడంతో మాజీ మూడా(ఎంయూడీఏ) ఛైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత తేజోమయ కూడా వెంటనే సీఎం దగ్గరికి వెళ్లి ఆయన డ్రెస్ క్లీన్ చేశారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి కాకులను అక్కడి నుంచి తరిమివేశారు. కాకులతో సిద్ధరామయ్యకు ఇదేమీ మొదటి సమస్యకాదు..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్ చేశారు. అది అప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకనే 35 లక్షలు ఖర్చు పెట్టి కొత్త కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు రావడంతో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు. కారు మార్చేయాలని సిబ్బందికి తానే చెప్పానని అన్నారు. అయితే, ఆ కారు అప్పటికే 2 లక్షల కిలోమీటర్లు తిరిగేసిందని, అందువల్ల పాతది అయిపోయింది కాబట్టే దాన్ని మార్చాల్సిందిగా సూచించానని పేర్కొన్నారు. అంతేతప్ప తాను మూఢవిశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మనని ఆయన చెప్పాల్సి వచ్చింది. (ఫైల్ ఫోటో) -
'ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు'
బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు నగరం ప్రముఖ ఎంజీ రోడ్డులో నూతన సంవత్సరం ప్రారంభసమయంలో మహిళలు, యువతులపై జరిగిన లైంగిక వేధింపులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పందించారు. ఈ కేసును తాము చాలా తీవ్రంగా భావిస్తున్నామని, నిందితులను కచ్చితంగా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. ఐటీ రాజధానిలో మహిళల సంరక్షణకే తాము పెద్ద పీట వేస్తున్నామని, న్యూఇయర్ రోజు జరిగిన అసహ్యకరమైన ఘటనకు తాము చింతిస్తున్నామని చెప్పారు. ఇలాంటి నీచమైన నేరాలు చేసేవారిని తాము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మహిళలపై పెద్ద మొత్తంలో లైంగిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించింది. దీనిపై యావత్తు మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు సోషల్ మీడియాలో సైతం కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ద రామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘ట్వీట్’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ వాక్యములో చిన్న పదం తప్పు దొర్లితే అర్థం మారిపోతుంది. బాధ్యత గల హోదాలో ఉన్నవారు ఇలాంటి పొరపాట్లు చేస్తే వివాదం అవుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది పొరపాటుగా చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైనాకు చెందిన ప్రతినిధి బృందం కర్ణాటక సీఎంను కలిసింది. బెంగళూరు అభివృద్ధి ఇతర విషయాల గురించి వారు సిద్ధరామయ్యతో చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది.. ‘చైనాలోని సియాచిన్ ప్రావిన్స్ నుంచి లీ జోంగ్ సారథ్యంలో వచ్చిన బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పలు విషయాలు చర్చించారు’ అని ట్వీట్ చేసింది. విషయం ఏంటంటే సియాచిన్ అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో సిచువాన్ అనే ప్రావిన్స్ ఉంది. కర్ణాటకకు వచ్చిన బృందం ఈ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు. కాగా కర్ణాటక సీఎం కార్యాలయం చేసిన ట్వీట్లో సియాచిన్ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఈ ట్వీట్ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు. ‘సియాచిన్ చైనాలో ఉందా? ప్రతినిధి బృందం సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌కు, సిచువాన్‌కు గల తేడా చెప్పేవారు లేరా?’ అని మరికొందరు విమర్శించారు. -
రాసలీలల మంత్రి రాజీనామా
అసెంబ్లీలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించారన్న ఆరోపణలతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేతి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అందజేశారు. బాగల్కోట్కు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయం కొన్నిరోజుల ముందు మేతీ వద్దకు వచ్చింది. మేతీ ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధచోట్ల రాసలీలలు సాగించారని ఆరోపణలొచ్చాయి. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియో బయటకు రావడం, అదంతా తీవ్ర గందరగోళానికి దారితీయడంతో మరింత నష్టం జరగకుండా నివారించేందుకు మేతీతో సిద్దరామయ్య రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి హెచ్.వై. మేతి రాజీనామాను సీఎం సిద్దరామయ్య తక్షణం ఆమోదించారు. (చదవండి.. కర్ణాటక మంత్రి రాసలీలలు) -
‘పాత నోట్లపై గడువు పెంచండి’
బెంగళూరు: పాత పెద్ద నోట్ల చెలామణి గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కేంద్రాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కోపరేటివ్ బ్యాంకులకు సరిపడా కరెన్సీ నోట్లు సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ లాబ్స్, బ్లడ్ బ్యాంకుల్లో కూడా పాతనోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పాత రూ.500, రూ. వెయ్యి నోట్ల చెలామణిని నవంబర్ 24 వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టిక్కెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు వాడుకోవడానికి కేంద్రం సడలింపు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశముంది. -
‘అశ్లీల చిత్రాల’ వ్యవహారంలో మరో ట్విస్ట్
బెంగళూరు: మొబైల్లో అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోయిన కర్ణాటక ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్‌తో పాటు కెమెరామెన్‌పై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 504 కింద టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మొదట నివేదికను పరిశీలించాక దీనిపై విచారణ జరిపించి అనంతరం చర్య తీసుకుంటామన్నారు. అశ్లీల దృశ్యాల వీక్షణపై మంత్రితో మాట్లాడానని, తాను ఏ తప్పు చేయలేదని తన్వీర్ సేఠ్ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎవరు చేసినా తప్పు తప్పేనని సిద్ధరామయ్య అన్నారు. కాగా రాయ్‌చూర్ జిల్లాలో నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా గురువారం మంత్రి తన్వీర్ సేఠ్ సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన్వీర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.... బీజేపీతో పాటు జేడీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏముంటుందని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన్వీర్ తేల్చిచెప్పారు. అలాగే ఈ ఘటనపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందిస్తూ... తన్వీర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మొబైల్ లో అభ్యంతరకర ఫోటోలు చూస్తు దొరికిపోయిన మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రధాని మోదీ ఓ నియంత : సీఎం
గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో సీఎం సిద్ధు ఆగ్రహం అభివృద్ధికి సహకరించలేదని ఆరోపణ బెంగళూరు: పాలన పరంగా ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఆదివారం విదురాశ్వత్థంలో జరిగిన గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... గల్లి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సముచిత పాలన అందించాల్సిన ప్రధాని మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి రైతులు, ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఫసల్ భీమా పథకానికి రూ.666 కోట్లు రిజర్వు చేశామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, రైతులు, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. కావేరి నదీ జలాల పంపిణీలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులు రాష్ట్రానికి,ప్రజలకు శరాఘాతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, కె.హెచ్.మునియప్ప. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కేపీసీసీ కార్యదర్శి దినేశ్ గుండూరావ్, డిప్యూటీ స్పీకర్ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కావేరి’పై ఢిల్లీలో కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఎడప్పడి కే పళని సామి గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమాభారతి అధ్యక్షతన కర్ణాటక, తమిళనాడు ప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
-
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. రేపు 11.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం జయలలిత, తనకు ఉమాభారతి వర్తమానం పంపారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ భేటీ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నది జలాల విడుదలను వాయిదా వేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిలో సమావేశం తర్వాత నీటి విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు సీఎంలతో ఉమాభారతి సమావేశమవుతున్నారు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తరపున ఆమె ప్రతినిధుల బృందాన్ని పంపనున్నారని సమాచారం. -
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
-
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
బెంగళూరు: కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించడం ఇబ్బందికరమైనా, తాము ఇప్పటికీ తీర్పుకు కట్టుబడిఉన్నామని తెలిపారు. కర్ణాటకలో తాగునీటికి సమస్య ఏర్పడినా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశామని చెప్పారు. కావేరి జలాల వివాదంతో కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సిద్ధరామయ్య మంగళవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. 'కావేరి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రధానిని కలిసేందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరాను. రేపు నేను ఆయనతో కలిసే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పిలిచి చర్చించాల్సిందిగా మోదీనికి విజ్ఞప్తి చేశా. ఏ సమస్యకైనా హింసే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది' అని సిద్ధరామయ్య అన్నారు. కావేరి వివాదం కారణంగా తమిళనాడులో కన్నడిగులపై, కర్ణాటకలో తమిళులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మైసూర్, మండ్యా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆందోళనకారులు దహనం చేశారు. బస్సు డిపోలో ఆపిన 40 ఓల్వో బస్సులకు నిప్పంటించారు. సరిహద్దుల్లో తమిళనాడుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తమిళుల ఆస్తులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించాడు. -
మోసం చేశారంటూ సీఎంపై ఫిర్యాదు
కావేరీ నదీ జలాల సంక్షోభం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కష్టాలను తెచ్చిపెడుతోంది. కొందరు బీజేపీ కార్యకర్తలు సీఎంపై మాండ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. రాష్ట్రానికి ఓ వైపు అవసరమైన నీళ్లు లేని సమయంలో ఇతర రాష్ట్రాలకు నీళ్లు వదిలి కర్ణాటక రైతులను సిద్ధరామయ్య మోసం చేస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కావేరి జలాలను క్రిష్ణ రాజ సాగర రిజర్వాయర్ నుంచి తమిళనాడుకు విడుదల చేయడంపై ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలసిందే. పొరుగు రాష్ట్రానికి నీళ్లు ఇస్తూ తనను నమ్ముకున్న కర్ణాటక రైతులను మోసం చేశారని ఆ కార్యకర్త ఆరోపించాడు. నీటి విడుదల కారణంగా మాండ్య జిల్లాలోని పంటలకు నీటి కష్టాలు తప్పవు. సిద్దరామయ్య చర్య వల్ల ఆ జిల్లా రైతులు మోసపోతున్నారని ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించడానికి మాత్రమే నీటిని విడుదల చేశామని, వాస్తవానికి తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని కూడా ప్రధానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మాకు తాగేందుకు కూడా నీళ్లుండవు: సీఎం
తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. కావేరీ నదీ జలాల సంక్షోభంపై ఆయన ప్రధానికి రెండు పేజీల లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, తనకు మీ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటుచేయాలని అందులో కోరారు. తమిళనాడుకు నీటి విడుదల వల్ల కావేరీ పరివాహక ప్రాంతంలో రైతులకు కూడా తీవ్ర కష్టాలు తప్పవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయొద్దని బీజేపీ రాష్ట్ర శాఖ చెబుతోందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. అయితే.. రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందువల్ల తాను మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తున్నానని అన్నారు. తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని, మెట్టూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు బాగున్నాయని, ఆ రాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో కూడా వర్షాలు బాగున్నాయని చెప్పారు. ఆ నీళ్లు వరి పంటకు సరిపోతాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి.. సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. -
కావేరిపై భగ్గుమన్న కర్ణాటక
-
కావేరిపై భగ్గుమన్న కర్ణాటక
తమిళనాడుకు నీటి విడుదలపై కన్నడ సంఘాల బంద్ - 10 రోజులు 15 వేల క్యూసెక్కుల చొప్పున ఇవ్వండి: సుప్రీం ఆదేశం సాక్షి,బెంగళూరు: తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో మంగళవారం నిరసనలు మిన్నంటాయి. తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని విడుదల చేయాలని సోమవారం కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో కావేరీ రాజకీయాలకు కేంద్రమైన మాండ్యా జిల్లా మంగళవారం భగ్గుమంది. ఆందోళనకారులు బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మంగళవారం ఉదయం నుంచి మాండ్యా జిల్లాలో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్ని బలవంతంగా మూయించారు. కావేరీ నదీ పరివాహకం ప్రాంతంలో వందలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపారు. కృష్ణరాజసాగర్ డ్యాం చుట్టుపక్కలా నిషేధాజ్ఞలు విధించారు. కావేరి ప్రవహిస్తోన్న మైసూరు, హసన్ జిల్లాలతో పాటు బెంగళూరు, హుబ్లీ, తుమకూరు, చామరాజనగరలో కూడా ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు సుప్రీం ఉత్తర్వుల్ని పాటిస్తూ తమిళనాడుకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళవారం మంత్రులు, అధికారులు, ప్రతిపక్ష నేతలతో చర్చల అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. సుప్రీం తీర్పును అమలు చేయడంలో ఉన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ మార్పులతో కూడిన పిటిషన్‌తో ఆ కోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
సీఎంను ఇబ్బంది పెడుతున్న నిమ్మకాయ
-
సిద్ధు ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరు: 'శవాలతో రాజకీయం చేయొద్దు. ఇలాంటి రాజకీయాల పట్ల మాకు నమ్మకం లేద'ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి కేజే జార్జి రాజీనామా అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో స్వచ్ఛందంగా మంత్రి పదవికి జార్జి రాజీనామా చేశారని చెప్పారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదైనా ఎందుకు రాజీనామా చేయించలేదని బీజేపీని ప్రశ్నించారు. 'మాథుర వైద్యుడి మృతి కేసులో స్మృతి ఇరానీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమెకు మంత్రిగా కొనసాగే హక్కు ఉందా? నరేంద్ర మోదీ కొత్తగా తీసుకున్న 19 మంత్రుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. దీనిపై బీజేపీ పార్టీ నోరు మెదపదు. జార్జి రాజీనామా చేయాలని మాత్రం డిమాండ్ చేస్తుంద'ని సిద్ధరామయ్య మండిపడ్డారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేశాయని వాపోయారు. -
డిష్యుం..డిష్యుం
మండలిలో సిద్దు, ఈశ్వరప్ప మధ్య తీవ్ర వాగ్వాదం ‘ఆయన్ను బయటికి పంపించేయండి’: సీఎం సిద్ధు నన్ను పంపడానికి మీరెవరు : ఈశ్వరప్ప చట్టసభల్లో గందరగోళం బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై చట్టసభల్లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గణపతి ఆత్మహత్యపై సీఎం సిద్ధరామయ్య శాసనమండలిలో గురువారం వివరణ ఇస్తూ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కె.ఎస్.ఈశ్వరప్ప కలగజేసుకున్నారు. దీంతో సీఎం తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘ముందు ఈశ్వరప్పను బయటికి తోసేయండి’ అని సిద్ధరామయ్య అనడంతో శాసన మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు... గురువారం ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రతిపక్షాలు ఆయనకు అడ్డుతగిలాయి. గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు మంత్రి జార్జ్‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపాయి. అయినా కూడా సీఎం సిద్ధరామయ్య వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడంతో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కె.జె.జార్జ్‌ను పదవి నుంచి తప్పించి ఆ తర్వాత సభకు వివరణ ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకానొక సందర్భంలో ‘ఈశ్వరప్పను సభ నుంచి బయటికి పంపేయండి’ అంటూ మండిపడ్డారు. దీంతో కె.ఎస్.ఈశ్వరప్ప సైతం తనదైన శైలిలో సీఎం సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను సభ నుంచి పంపడానికి మీరెవరు, కేవలం చైర్మన్‌కు మాత్రమే ఆ అధికారం ఉంది, కావాలంటే మీరే పదవికి రాాజీనామా చేసి బయటికి వెళ్లండి’ అని పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఎంత సేపటికీ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడంతో మండలి చైర్మన్ శంకరమూర్తి సభా కార్యకలాపాలను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. -
డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం
బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఆత్మహత్య కేసుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం సిద్దరామయ్య జ్యూడీషియల్ విచారణకు ఆదేశించారు. తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి. -
'సిద్ధు సర్కార్‌ను దించడమే లక్ష్యం'
-బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు: రైతులు, మధ్యతరగతి ప్రజలకు సిద్ధు సర్కారు కంటకంగా మారిందని, ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా విభాగం అధ్యక్షుడిగా ప్రతాప్ సింహ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందన్నారు. కనీసం 150 స్థానాలను గెలుచుకోవాలన్నది పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షా ఆశయమన్నారు. ఇందు కోసం కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా రుణమాఫీ విషయంలో సిద్ధరామయ్య మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఇక పారిశ్రామిక అభివృద్ధి తిరోగమన దిశలో ప్రయాణిస్తోందన్నారు. ఫలితంగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందగా ఉందని అభివర్ణించారు. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాల వల్లే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే భ్రమ పెట్టుకోవద్దని, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకుపోయేలా ప్రచారం చేయాలన్నారు. బూత్ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని యడ్యూరప్ప దిశానిర్దేశం చేశారు. మహిళల సంక్షేమం కోసం భాగ్యలక్ష్మీ పథకాలను తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేయగా ప్రస్తుతం చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకోవడమే కాకుండా యథాతథంగా అమలు చేస్తున్నాయన్నారు. అయితే రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రాజకీయ కోణంతో అలోచించి ఈ పథకం అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యడ్యూరప్ప అరోపించారు. -
ముఖ్యమంత్రిని శపించిన మాంత్రికుడు!
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటివద్ద శపించాడు. కాగా, శపించిన వ్యక్తి రాష్ట్రంలో చేతబడులు ఎక్కువగా చేసే కొల్లెగల ప్రాంతానికి చెందినవాడని సమాచారం. ఇంటి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన వస్త్రాన్ని సీఎం సిద్దరామయ్య స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను కారు డ్రైవర్ పక్కన కిటికీ నుంచి ముఖ్యమంత్రిని శపించారని తెలిసింది. ఈ ఘటనను సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలే సీఎం ప్రతిష్ట దిగాజారుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి సీఎంను శపించడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు. ఎలా జరిగింది..? మైసూరులోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న బారికేడ్లలో నుంచి దూసుకుపోయి, సెక్యూరిటీ నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి అప్పుడే కారులోకి ఎక్కబోతున్న సీఎం సిద్ధరామయ్యను కలిసి పూజచేసిన వస్త్రాన్ని తీసుకోవాలని కోరాడు. అయితే, ఇలాంటి వాటిమీద పెద్దగా నమ్మకం లేని సీఎం అందుకు నిరాకరించడంతో.. అతడు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన సీఎం ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు, అబద్ధాలతో బతకాలని ప్రయత్నిస్తారని కార్యకర్తలతో అన్నారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన అతను పోలీసుల నుంచి తప్పించుకుని కారు డ్రైవర్ కు పక్కగా వెళ్లి కిటికీలో నుంచి సీఎంను శపించాడు. కొల్లెగలకు మాంత్రికవిద్యలకు సంబంధం ఏంటి? కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో కొల్లెగల పట్టణం ఉంది. ఈ పట్టణానికి రాజకీయనేతలకు కొన్నేళ్లుగా ప్రత్యేక సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతానికి మకాం మారుస్తారు. మాంత్రిక విద్యలను సాధన చేసే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎలాగైనా ఓడించేందుకు వీరి సాయం తీసుకుంటుంటారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఈ ఊరి పేరు పెద్దగా వినిపించేది ఎవరైనా రాజకీయ నాయకుడు అనారోగ్యం పాలైనప్పుడే. జేడీ(ఎస్) నేతలు మంత్రగాళ్లతో తమవారిని శపింపజేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ ఆరోపించడం ఇందుకు నిదర్శనం. 2011లో అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనకు మాంత్రిక శక్తుల వల్ల ప్రాణహాని ఉందని వ్యాఖ్యనించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. -
సీఎం పదవికి ముప్పు తప్పదా ?
నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్న అసమ్మతి నేతలు సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యేందుకు సమాలోచనలు సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణను సారథ్యం వహించాల్సిందిగా కోరుతున్న వైనం బెంగళూరు : మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ద్వారా అధికార పార్టీ కాంగ్రెస్‌లో రేగిన అసమ్మతి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ ‘జ్వాలలు’ సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పులా పరిణమించాయి. సీఎం సిద్ధరామయ్యపై అసంతృప్తితో రగిలిపోతున్న తాజా మాజీ మంత్రులు, మరికొంత మంది ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను కలిసి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించే దిశగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగకపోతే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం కష్టమంటూ హైకమాండ్‌కు విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల పదవిని పోగొట్టుకున్న శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్, అంబరీష్లతోపాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్ తదితరులు 20 మంది అసంతృప్తులు గ్రూపుగా ఏర్పడి తమకు సారథ్యం వహించాల్సిందిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఎస్.ఎం.కృష్ణ మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ అనంతర పరిణామాలపై అసంతృప్త నేతలతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అసంతృప్త నేతల విన్నపాన్ని ఆలకించిన ఎస్.ఎం.కృష్ణ మాత్రం ‘దుందుడుకు నిర్ణయాలు ఏవీ వద్దు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని హైకమాండ్ గమనిస్తోంది. ఈ విషయంపై హైకమాండ్ నిర్ణయమేమిటో వేచి చూద్దాం, అంతవరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటి కార్యక్రమాలేవీ చేయబోకండి’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ అసంతృప్త నేతలంతా వారం రోజుల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ ఎదుర్కొనే సమస్యలను వివరించేందుకు సమాయత్తమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటితో పాటు జాఫర్ షరీఫ్ వంటి సీనియర్ నేతలు సైతం సీఎం సిద్ధరామయ్యను ‘ఆయనింకా చిన్నపిల్లాడు’ అంటూ సంబోధిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పు తెచ్చిపెట్టే విషయం కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో పదువులను కోల్పోయిన వారితో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు అటు బీజేపీ, ఇటు జేడీఎస్‌లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో, అటు తనపై చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంతో పాటు పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడడంలో సీఎం సిద్ధరామయ్య తలమునకలయ్యారు. ఇక మంత్రి పదవిని పోగొట్టుకొని తనపై విమర్శలకు దిగిన తాజా, మాజీ మంత్రులను బుజ్జగించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయలను సీఎం సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం. -
కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. తన కేబినెట్ నుంచి 14 మంత్రులను తొలగించిన సిద్ధరామయ్య కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ ఆర్ వలా కొంత్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో 9 మంది కేబినెట్ మంత్రులు, మరో నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కేబినెట్ మంత్రులు: కే తిమ్మప్ప, కేకే రమేష్ కుమార్, బసవరాజ రాయరెడ్డి, మేటిహుల్లప్ప యమనప్ప, తన్వీర్ సేఠ్, ఎస్ఎస్ మల్లికార్జున, ఎంఆర్ సీతారామ్, సంతోష్ ఎస్ లాడ్, రమేష్ లక్ష్మణ రావు సహాయ మంత్రులు: ప్రియాంక్ ఎం ఖర్గే, ఈశ్వర్ కండ్రె, ప్రమోద్, రుద్రప్ప మనప్ప -
కర్ణాటక కాంగ్రెస్ లో 'కేబినెట్' చిచ్చు
బెంగళూరు: కర్ణాటకలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. 14 మంత్రులపై సీఎం సిద్ధరామయ్య వేటు వేయడంతో హస్తం పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించాలని నిర్ణయించారు. రాజీనామాలు సమర్పించాలని సదరు మంత్రులను కోరినట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. శ్యామనూరు శివశంకరప్పను బుజ్జగించేందుకు ఆయన కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర)కు కేబినెట్ లో చోటు కల్పించారు. సతీశ్ స్థానంలో రమేశ్ కుమార్ ను తీసుకున్నారు. 14 మంత్రులు ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న సమాచారంతో ఎమ్మెల్యే ఎం.క్రిష్ణప్ప మద్దతు దారులు బెంగళూరులో ఆందోళనకు దిగారు. -
14 మంది మంత్రులపై వేటు
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ మరో 14మందికి మంత్రి మండలిలో చోటు నేడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం! పదవులు కోల్పోనున్న మంత్రుల తిరుగుబావుటా ? ఎమ్మెల్యే స్థానానికి కూడా రాజీనామా చేస్తానని అంబి హెచ్చరికలు బెంగళూరు: రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం లభించింది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో సీఎం సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కల్పించారు. ఇదే సందర్భంలో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాటను కూడా పూర్తిగా తీసేయకుండా ఆయన కోరిన వారిలో ఒకరిద్దరిని మంత్రి పదవుల్లో కొనసాగించడంతో పాటు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి మండలిలో స్థానం కల్పించాల్సిందిగా సోనియాగాంధీ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఇదే సందర్భంలో చక్కని పనితీరును కనబరుస్తున్న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్‌ను సైతం మంత్రి పదవి నుంచి తప్పించరాదని సోనియాగాంధీ, సీఎం సిద్ధరామయ్యను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కసరత్తు ముగిసింది. దీంతో శనివారం సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను కల్పించడంతో మొత్తం 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య నిర్ణయించారు. మంత్రులు కిమ్మనె రత్నాకర్, శ్యామనూరు శివశంకరప్ప, పరమేశ్వర్ నాయక్, అంబరీష్, శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, అభయ్ చంద్రజైన్, మనోహర్ తహశీల్దార్, వినయ్‌కుమార్ సూరకె, దినేష్ గుండూరావ్, ఎస్.ఆర్.పాటిల్, సతీష్ జారకీహోళీ, శివరాజ్ తంగడగి, బాబూరావ్ చించన్సూర్లను మంత్రి మండలి నుంచి తప్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ వీరందరికీ తమ తమ రాజీనామా పత్రాలను అందజేయాల్సిందిగా సీఎం సిద్ధరామయ్య సూచించినట్లు సమాచారం. వీరిలో శ్యామనూరు శివశంకరప్ప, అంబరీష్‌లను వారి వయసు, అనారోగ్య కారణాల వల్ల మంత్రి పదవుల నుంచి తప్పిస్తుండగా, మిగతా వారిలో కొంతమందిని అవినీతి ఆరోపణలు, సరైన పనితీరును కనబరచకపోవడం వంటి కారణాలతో మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది అప్పుడే తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. 14 మందికి ‘మంత్రి భాగ్య’...... ఇక 14 మంది ఎమ్మెల్యేలకు ‘మంత్రి భాగ్య’ను సీఎం సిద్ధరామయ్య కల్పించనున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా చేరనున్న వారిలో రమేష్‌కుమార్ (శ్రీనివాసపుర), ప్రమోద్ మద్వరాజ్(ఉడుపి), ప్రియాంక్ ఖర్గే(చిత్తాపుర), బసవరాజ రాయరెడ్డి(యలబుర్గా), ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర), కాగోడు తిమ్మప్ప (సాగర), రుద్రప్ప లమాణి (హావేరి), ఎం.కృష్ణప్ప (విజయనగర), రమేష్ జారకీహోళీ (గోకాక్), ఈశ్వర్ ఖండ్రే (బాల్కీ), హెచ్.వై.మేటి (బాగల్కోటె), ఎన్.ఎ.హ్యారిస్ (శాంతినగర), తన్వీర్‌సేఠ్, ఎమ్మెల్సీ ఎం.ఆర్.సీతారామ్లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. వీరంతా నేడు (ఆదివారం) రాజ్‌భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. -
మా పోలీసులు మంచివారు
బెంగళూరు: కర్ణాటక పోలీసులు మంచివారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సామూహిక సెలవులపై వెళ్లరని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కితాబు ఇచ్చారు. వారి ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేతన పెంపు విషయమై పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించకపోవడంతో వచ్చేనెల 4న సామూహిక సెలవులపై వెళ్లనున్నట్లు పోలీసు సిబ్బంది రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శశిధర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విధంగా సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా ప్రతిధులతో మాట్లాడుతూ... రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయమై చర్చించడానికి ఢిల్లీ వచ్చానన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో శుక్రవారం భేటీ అయ్యి ఎన్నికల విషయమై చర్చిస్తానన్నారు. మంత్రిమండలి పునఃరచన, విస్తరణకు సంబంధించి కూడా చర్చిస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
రాష్ట్రంలోనూ ఆ ఫలితాలే!
2018 ఎన్నికల్లో సత్తా చాటుతాం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తుమకూరు: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే కర్ణాటక రాష్ట్రంలో కూడా పునరావృతం కానున్నాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప జోస్యం చెప్పారు. నగరంలోని సిద్ధగంగా మఠ శివకుమార్ స్వామీజీని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్న అభ్యర్థులపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. విధాన పరిషత్‌కు జర గనున్న ఎన్నికలకు త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనంతో ఉన్న ప్రజలు 2018లో జరిగే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎంఎల్ఏ బీ.సురేశ్‌గౌడ పాల్గొన్నారు. -
కర్ణాటక సీఎంతో టి.కాంగ్రెస్ నేతల భేటీ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీయ్యారు. ఆర్డీఎస్ పనులను వెంటనే చేపడతామని కర్ణాటక సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
ఐదేళ్లూ నేనే సీఎం
= నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు = అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలు = త్వరలో మంత్రివర్గ విస్తరణ = సీఎం సిద్దరామయ్య సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, ఇందులో ఎలాంటి అనుమానం వద్దని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన బళ్లారి జిల్లాలో కరువు ప్రాంతాలు పరిశీలన, బళ్లారి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో కరువు నివారణ గురించి ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశం అయిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు సీఎం దృష్టికి తీసుకుని రాగా ఆయనపై విధంగా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు పూర్తి అధికార అవధి తానే నిర్వర్తిస్తానన్నారు. తనను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించి మరొకరిని నియమించడం జరగదన్నారు. అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలేనని కొట్టి పారేశారు. ముఖ్యమంత్రిని మార్పు చేయాలనే ఉద్దేశం హైకమాండ్‌కు కూడా లేదన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు, మంచినీటి సమస్య తీర్చేందుకు వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నానని, ఇదంతా ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో చర్చించి మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పారు. బళ్లారి జిల్లాలో ఇసుక బంగారంలా మారిందని, కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం లేదని సీఎం దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, ఆయన స్పందిస్తూ ఇసుకను అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మంత్రులు హెచ్‌కే.పాటిల్, ఖమరుల్ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధూ సీటుకు ఎసరు?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు కిందకు నీళ్లు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. తన పీఠం కదలం ఖాయమని ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. గత కొద్ది వారాలుగా ప్రతిఒక్కరితో తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని, పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య చెబుతున్నారు. తన మంత్రులతో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. పరిస్థితి ఆయనకు అర్థమైనట్టు కనబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరుస వివాదాలతో సతమవుతున్న సిద్ధూను సాగనంపేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన కుమారుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.అంతకుముందు లక్షల ఖరీదు చేసే వాచీని ధరించి వివాదంలో చిక్కుకున్నారు. 32 నెలల పాలనలో తన విమానయాన ప్రయాణాలకు రూ.20,11,34,971 ఖర్చు చేసి సిద్దూ విమర్శలు పాలయ్యారు. సిద్ధరామయ్య వారసుడెవరన్న దానిపై కర్ణాటక రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. సిద్ధూకు ఉద్వాసన పలికితే సీఎం ఛాన్స్ దక్కే అవకాశముందంటూ ఇద్దరు పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ముందజలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. హస్తినలో ఆయన ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గతవారం ఢిల్లీలో అధినేత్రి సోనియా గాంధీ దర్శనం చేసుకున్న ఆయన పనిలో పనిగా తన కోరికను 'మేడమ్' చెవిన వేశారట. అయితే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఎలా ఉంటుందని కూడా హస్తిన పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దళితుడిని సీఎం చేయాలనుకుంటే కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పరమేశ్వర కూడా గతవారం ఢిల్లీలో సోనియమ్మను కలిశారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎం కృష్ణకు వయోభారం మైనస్ గా మారింది. ఈ నెల 23న 'మేడమ్'ను కలవాలని సిద్ధరామయ్య అనుకున్నా ఆమె కుదరదని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. సిద్ధూ స్థానంలో మల్లిఖార్జున ఖర్గేను సీఎంను చేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే అవసరం బెంగళూరు కంటే ఢిల్లీకే ఎక్కువ ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మే 15 -20 మధ్య కర్ణాటక సీఎంను మార్చడం ఖాయమని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పదవీ గండం నుంచి సిద్ధరామయ్య బయటపడతారో, లేదో చూడాలి. -
బెంగుళూరును రెండుగా విభజించనున్నారా ?
బెంగళూరు: బెంగుళూరు మహానగరం దీనిని రెండుగా విభజిస్తే పరిపాలనకు వీలుగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య అభిప్రాయపడ్డారు. కెంపెగౌడ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్లొన్న ఆయనపై విధంగా స్పందించారు. దీంతో గతంలో బలమైన ప్రతిపక్షం కారణంగా ఆగిపోయిన బెంగుళూరును రెండుగా విభజించాలన్న ప్రతిపాదనకు ఊపిరిపోసినట్లయింది. అవార్డుల ప్రధానోత్సవంలో మాట్లాడుతూ.. కెంపెగౌడ దూరదృష్టిని ఆయన కొనియాడారు. ఆయన నిర్మించిన కృత్రిమ చెరువులు బెంగుళూరు ప్రజల అవసరాల తీరుస్తున్నాయని భవిష్యత్ తరాలకు కూడా అవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. నీటి కొరతను జయించడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మునిసిపల్ కార్పొరేషన్లో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా సాధ్యమైనన్ని నిధులు కేటాయించానని ఆయన తెలిపారు. ఎడ్యుకేషన్, మెడిసన్, మీడియా, సోషల్ సర్వీస్, ఆర్స్ట్, కల్చర్, సినిమా తదితర రంగాల్లో కృషి చేసిన 150 మంది ప్రముఖులకు ఆయన కెంపెగౌడ అవార్డులను ప్రదానం చేశారు. -
ఆయన అలా మాట్లాడటం సరికాదు
బెంగళూరు: కరువు పరిస్థితులు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొనడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు విషయంలో కూడా రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ కరువు పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణులను కర్ణాటకకు పంపించి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించిందన్నారు. అధికారుల నివేదికను అనుసరించి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని నిధులను కరువు నివారణ పనుల నిమిత్తం రాష్ట్రానికి కేటాయించిందని యడ్యూరప్ప ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరువు ఉందనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటించలేదా? అని యడ్డీ ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంతో నివారణ పనుల కోసం తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు. -
సీఎంగారు ఢిల్లీకి రండి
సీఎం సిద్దుకు అధిష్టానం పిలుపు బెంగళూరు : ఇటీవల వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటిపై ఇప్పటికే సమాచారాన్ని క్రోడీకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయాలపై సీఎం సిద్ధరామయ్యను వివరణ కోరనుంది. ఇదే సందర్భంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన సైతం సిద్ధరామయ్యలో నెలకొంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో తాను చేపట్టిన పర్యటన వివరాలను సైతం సిద్ధరామయ్య పార్టీ హైకమాండ్‌కు తెలియజేయనున్నారు. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. -
‘సిద్ధు’పై హైకమాండ్ గరం...
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ను ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం రాష్ట్ర పరిణామాలపై సోనియా ఆరా బెంగళూరు: లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ వాచ్ వ్యవహారంతో ప్రతిపక్షాల విమర్శలకు గురైన సిద్ధరామయ్య ఆ తర్వాత ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు చేసి అటు విపక్షాలు, వివిధ సంస్థలతో పాటు స్వపక్షంలోని నేతల నుంచిసైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం సీఎం సిద్దరామయ్యను వివరణ కోరింది. ఇక కరువు నిర్వహణలో సైతం సిద్ధరామయ్య విఫలమయ్యారంటూ స్వయానా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడిన విషయమూ తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ఏదో ఒక విషయంపై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సీఎం సిద్ధరామయ్య ఇప్పుడేమో పుత్రవ్యామోహంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం రాష్ట్రంలో మరో వివాదాన్ని రేకెత్తించింది. కేవలం ల్యాబ్‌ల ఏర్పాటు విషయమే కాదు తన కుమారుడి స్నేహితుడికి నిబంధనలకు విరుద్ధంగా బీడీఏ స్థలాన్ని కేటాయించడం ద్వారా రూ.150 కోట్ల అక్రమాలకు తెరతీశారని వచ్చిన ఆరోపణలు సిద్ధరామయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు సిద్ధరామయ్యపై ఉన్న అసహనాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా వివరాలు తెలుసుకున్నారు. పరమేశ్వర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు...... రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బి.ఎస్.యడ్యూరప్ప బాధ్యతలను చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో సీఎం సిద్ధరామయ్యపై తలెత్తుతున్న వివాదాలు బీజేపీకి అనుకూలిస్తాయని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన పరమేశ్వర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై దాదాపు అరగంట పాటు చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కేటాయించడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఏమీ లేదని ఆయన సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతోనే ప్రతిపక్షాలు ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారని అధినేత్రికి వివరించారు. అయితే సోనియాగాంధీ మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదని సమాచారం. సిద్ధరామయ్యపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీని సైతం చిక్కుల్లోకి నెట్టేస్తాయని సోనియాగాంధీ భావిస్తున్నారు. మే 13 నాటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటిని వివరిస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పించే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
'సీఎం కుమారుడు వైదొలగాలని సూచించా'
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్న కంపెనీ మ్యాట్రిక్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆ సంస్థ నుంచి వైదొలగమని సిద్ధరామయ్య.. ఆయన కుమారుడికి చెప్పాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. కాగా మ్యాట్రిక్స్‌కు కాంట్రాక్టు అప్పగించిన విషయంపై విచారణకు ఆదేశించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రిని కోరుతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు దిగ్విజయ్ అవసరంలేదని బదులిచ్చారు. 'కాంట్రాక్టు ఇచ్చే విషయం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఈ ఫైలు సీఎం దగ్గరకు రాలేదు. విచారణకు ఆదేశించాలని నేను సీఎంను కోరను. కంపెనీ నుంచి సిద్ధరామయ్య కొడుకు వైదొలగాలని మాత్రమే సలహా ఇచ్చాను. ఇది ఆదేశం కాదు. సలహా మాత్రమే' అని దిగ్విజయ్ చెప్పారు. రాజేష్గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రి తనయుడిపై దుమారం!
బెంగళూరు: ఖరీదైన చేతి గడియారం వివాదం ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మరో బాగోతం చుట్టుముట్టుకుంది. తన కొడుకు డైరెక్టర్‌గా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు దక్కడం దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఏర్పాటుకు ఇటీవల మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తో కర్ణాటక ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. 2009 అక్టోబర్‌లో రమేశ్ గౌడ సీఎం, సతీష్ ప్రసాద్ భాగస్వాములుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. 2014 సెప్టెంబర్ లో ఈ కంపెనీ డైరెక్టర్‌గా సీఎం కొడుకు డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య చేరారు. విక్టోరియా ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ ఏర్పాటుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వేలంపాట నిర్వహించగా.. ఈ కాంట్రాక్టును ప్రభుత్వం మాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. ఇలా సీఎం తనయుడి సంస్థకు ప్రభుత్వ లబ్ధి చేకూర్చడం.. అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతమేనని తనపై రాజకీయంగా తీవ్ర ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. 'ఈ వ్యవహారమంతా పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగింది. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి తప్పు జరగలేదు. నా కొడుకు వృత్తిరీత్య డాక్టర్. అతని స్నేహితుడు ఈ కంపెనీ స్థాపించాడు. నా కొడుకు డైరెక్టర్‌గా ఉన్నాడు' అని సిద్దరామయ్య తెలిపారు. ఈ కాంట్రాక్టు విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలంటే ఈ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమని సీఎం కొడుకు యతీంద్ర తెలిపారు. ప్రతిపక్ష బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై డిమాండ్ చేస్తోంది. 'ఆయన సీఎం కొడుకు అయినంతమాత్రాన ఏ పని చేయకూడదని కాదు. కానీ, ఆ కాంట్రాక్టు చట్టప్రకారం ఇచ్చారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిందే' అని కర్ణాటక ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప అంటున్నారు. -
ఇప్పుడు ‘రామయ్య’ వంతా..?
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల తీరు, వాటి భవిష్యత్‌పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోందట. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల తర్వాత ఇక వచ్చేది కర్ణాటక వంతేనని కాంగ్రెస్‌నాయకులే గుసగుసలు పోతున్నారట. అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో జరిగింది, ఏ కారణం వల్ల అవి జరిగాయన్నది పక్కన పెడితే కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలకు మాత్రం నూటికి నూరుశాతం కాంగ్రెస్ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ పార్టీలోనే అంతర్గత చర్చలు సాగుతున్నాయట. ఆ రాష్ర్టంలో కూడా అధికారమార్పిడి లేదా ఫిరాయింపులతో కొత్త నాయకత్వ ఆవిర్భావం వంటివి జరిగితే మాత్రం అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అవుతుందని ఈ చర్చల సారాంశమట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఏదో ఒకరూపంలో నాయకత్వం మొదలుకుని, ఆ రాష్ట్రపార్టీలోని హైప్రొఫైల్ నాయకులు విసిగిస్తున్నారట. సీఎంకు అత్యంత విలువైన గడియారాన్ని ఎవరో బహూకరించారన్న దానిపై సొంతపార్టీ నేతలే లేవనెత్తిన పంచాయితీ ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకే బాగా నష్టం చేసిందంటున్నారు. ఇప్పటికైనా సిద్ధరామయ్యకు పాలన, ఇతరత్రా విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, అసంతృప్త, అసమ్మతి నేతల ప్రభావం పడకుండా సరిదిద్దుకుంటే తప్పా.. పరిస్థితి సద్దుమణిగేలా లేదంటున్నారు. సిద్ధరామయ్యలో అసంతృప్తి ఇతరత్రా పరిణామాలను ఆసరాగా తీసుకుని బీజేపీ పావులు కదిపినా కదపవచ్చుననే అనుమానాలను కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, జేడీ(ఎస్)ను కూడా కలుపుకుని తన సొంతపార్టీని ఏర్పాటు చేసుకుంటే పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతుందని ఆ పార్టీ నాయకులు ముక్తాయింపునిస్తున్నారు. -
సీఎంకు ఆ వాచీ ఎలా వచ్చిందో తేల్చండి
ఏసీబీకి తొలి ఫిర్యాదు ఫిర్యాదు చేసిన న్యాయవాదులు బెంగళూరు: స్వపక్షంలోని నేతలతో పాటు విపక్షాలు, సాధారణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అవినీతిని అరికట్టడానికి అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెల 14న ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ)కు శనివారం మొదటి ఫిర్యాదు అందింది. అయితే ఏసీబీని ఏర్పాటు చేసి పదహేను రోజులైనా ఆ సంస్థకు కార్యాలయం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోకాయుక్తను మూసివేసే చర్యల్లో భాగంగా ఏసీబీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సీఎం స్థానంలోని ముఖ్యమంత్రికి దాదాపు రూ.75 లక్షల విలువైన వాచ్ గిఫ్ట్‌గా వచ్చిన విషయమై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. దీని వెనక పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్యాప్తు చేయాల్సింది.’ అని లిఖిత పూర్వకంగా కోరుతూ న్యాయవాదులైన అమృతేష్, నటరేశ్ శర్మలు ఖనిజభవన్కు వచ్చారు. ఈ విషయమై అమృతేష్ మీడియాతో మాట్లాడుతూ...‘ రాష్ట్ర హైకోర్టు కూడా ఏసీబీ అవసరం ఏమిటని తలంటింది. అసలు ఏసీబీ కార్యాలయం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బెంగళూరులోని ఖనిజభవన్లో ఏసీబీ కార్యాలయం ఉందని సామాన్య ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును అందజేయవచ్చునని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొణ్ణన్న సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందువల్లే మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఏసీబీ కార్యాలయమే కాక ఏసీబీ కోసమంటూ ప్రభుత్వం నియమించిన అధికారి ఒక్కరూ లేరు. ఇలా అయితే అవినీ పై దర్యాప్తు ఎలా సాగుతుంది. లోకాయుక్త ఉన్నప్పుడు ఏసీబీ అవసరమేలేదు’ అని పేర్కొన్నారు. అనంతరంనృపతుంగ రోడ్డులోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేశారు. -
‘నాయకత్వ మార్పు ఉండబోదు’
బెంగళూరు: బడ్జెట్ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించనున్నారనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆంజనేయ మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేలందరి మద్దతు ఉందని అన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యకు మద్దతు నిస్తోందని పేర్కొన్నారు. సిద్ధరామయ్య పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతారని స్పష్టం చేశారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి దళిత సంఘాలతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి ఆంజనేయతో పాటు దళిత సంఘాల నేతలు సిద్ధలింగయ్య, మారసంద్ర మునియప్ప, వెంకటస్వామి, మావళ్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వాచీ కథ సుఖాంతం!
గత వారం పది రోజులుగా మీడియాతో పాటు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య వాచీ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. తన వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన సీఎం.. దాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. తనకు ఓ ఎన్నారై మిత్రుడు ఈ వాచీని బహుమతిగా అందించాడని సీఎం సిద్దు చెప్పినా.. దాన్ని దొంగిలించిన వాచీ అని విపక్షాలు ఆరోపించాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండటంతో.. విపక్షాలు సర్కారును కడిగి పారేశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా బీజేపీ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. -
సీఎంను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు
సాక్షి, బెంగళూరు:‘సిద్ధరామయ్యను అడిగి నేను ఈ మంత్రి పదవిలో కూర్చోలేదు. సిద్ధరామయ్య కంటే నేనే సీనియర్. నేను మంత్రి వర్గంలో ఉండడం వల్లే మంత్రి మండలికి గౌరవం వచ్చింది. నేను మంత్రిని కావడమే మంత్రి వర్గానికి గర్వ కారణం’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. మంత్రి మండలిలో తనకు ఎంతో నమ్మకమైన అనుచరుడిగా పేరున్న శ్రీనివాస ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్తంత ఇరకాటంలోనే పడ్డారు. ఇక శ్రీనివాస ప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో పరిశీలిస్తే. ....కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ కొన్ని రోజుల క్రితం ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘సిద్ధరామయ్య మంత్రి మండలిలో కొంతమంది అసమర్థ మంత్రులు ఉన్నారు. వారిని తప్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలుతగ్గిపోతాయి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మంత్రి మండలిలో మార్పులు చేయనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కదా, ఇందుకు మీరేమంటారు అంటూ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ను పాత్రికేయులు మంగళవారం ప్రశ్నించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస ప్రసాద్ స్పందిస్తూ...‘నేనేమీ సిద్ధరామయ్యను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు. వయసులో, అనుభవంలో కూడా నేను ఆయనకంటే సీనియర్నే. ’ అంటూ వాగ్భాణాలు విసిరారు. తద్వారా తనను మంత్రి మండలి నుంచి తప్పిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న విషయాన్ని సీఎం సిద్ధరామయ్యకు మంత్రి శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. విశ్వనాథ్‌కు ప్రచార పిచ్చి... ఇక కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి శ్రీనివాస ప్రసాద్ మండిపడ్డారు. ‘విశ్వనాథ్‌కు ప్రచార పిచ్చి, అందుకే ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. విమర్శలు చేసేందుకు ఎవరూ దొరక్కపోతే ఆయన కుటుంబ సభ్యులపైనే విమర్శలకు దిగుతారు. విశ్వనాథ్ నాకు స్నేహితుడైనంత మాత్రాన ఒక మంత్రిగా ఉన్న నేను ఎక్కడికి వెళుతున్నాను, ఏం చేస్తున్నాను అన్న విషయాలన్నీ ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నన్ను ప్రశ్నించేందుకు ఆయనెవరు’ అంటూ మంత్రి శ్రీనివాస ప్రసాద్ మండిపడ్డారు. -
సీఎం వాచీ చోరీకి గురైనదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన వాచీ రూ.70లక్షలు విలువ చేసేదంటూ రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మరో బాంబ్ పేల్చారు. ఆ వాచీ ఇంతకుముందు చోరీకి గురైందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి ఇంట్లో చోరీకి గురైన వాచ్, సిద్ధరామయ్య ధరిస్తున్న లగ్జరీ వాచ్ ఒకేలా ఉన్నాయంటూ సుధాకర్ శెట్టి స్నేహితుడొకరు తనకు స్వయంగా చెప్పారంటూ వెల్లడించారు. అయితే సుధాకర్ శెట్టి మాత్రం ఇందులో నిజం లేదని, తన ఇంట్లో చోరీకి గురైనవాచ్, సీఎం సిద్ధరామయ్య వద్ద ఉన్న వాచ్ వేర్వేరని చెబుతున్నారు. విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ....‘నేను సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన సందర్భంలో మీడియాలో ఆ వాచ్‌ను చూసిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి తన స్నేహితుని ద్వారా నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్ తన ఇంట్లో చోరీకి గురైన వాచ్ అని, స్వయంగా కలిసి అన్ని వివరాలను చెబుతానని అన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. ఈ విషయంలోకి తనను లాగవద్దని అంటున్నారు. అయినా నేను ఆయనకు ధైర్యం చెప్పాను. 2015 జూలై 7న బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ శెట్టి తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఓ వజ్రాలు పొదిగిన వాచ్‌తో పాటు కొన్ని బంగారు, వజ్ర ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని వివరించారు. ఇక లగ్జరీ వాచ్ విషయమై సీఎం సిద్ధరామయ్య చెబుతున్న మాటలు కట్టు కథల్లా అనిపిస్తున్నాయని విమర్శించారు. నిజంగానే సిద్ధరామయ్య ప్రాణస్నేహితుడు ఆ వాచ్‌ను బహూకరించి ఉంటే ఆ విషయం చెప్పడానికి సీఎం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారంటూ కుమారస్వామి ప్రశ్నించారు. కుమారస్వామిది దిగజారుడు రాజకీయం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కుమారస్వామి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ఏవో ఆరోపణలు చేయడం కుమారస్వామికి అలవాటే. ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలను నేను ఇప్పటికే వెల్లడించా. ఈ వాచ్‌పై నా స్నేహితుడు ఇప్పటికే అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆ వాచ్ నాది కాదు : ఇక ఈ వివాదంలో ముఖ్య వ్యక్తి అయిన డాక్టర్ సుధాకర్ శెట్టి ఈ అంశంపై స్పందించారు. ‘నేను నా భార్య ఇద్దరం డాక్టర్లమే. 35 ఏళ్లుగా విదేశాల్లో ఉంటూ కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాం. మా ఇంట్లో దొంగతనం జరిగి ఖరీదైన వాచ్‌లు పోయిన విషయం నిజమే. అయితే సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్, మా ఇంట్లో చోరీకి గురైన వాచ్ ఒకటే అనడంలో నిజం లేదని సుధాకర్ శెట్టి స్పష్టం చేశారు.