song
-
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు. -
సల్మాన్ ఖాన్ సికందర్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం సికందర్. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రష్మిక హవా కొనసాగుతోంది. ఇటీవలే ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ.. రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.తాజాగా సికందర్ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. భమ్ భమ్ భోలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సల్మాన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, జోహ్రా జబీన్ పాటకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కాననుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
'కన్నప్ప' నుంచి లవ్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
కోలీవుడ్‌లో సెన్సేషనల్ చిత్రంగా నిలిచిన సినిమా 'ఫైర్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో రచిత మహాలక్ష్మి గ్లామర్ డోస్ పెంచడంతో ఈ చిత్రం పేరు నెట్టింట వైరల్ అయింది. 'ఫైర్' చిత్రంలోని ఒక పాటలో ఆమె మితిమీరిన రొమాన్స్ సీన్లతో అదరగొట్టేసింది. ఇంకేముంది ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమెకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో రచిత నటించిన తాజా చిత్రం 'ఫైర్' ఫిబ్రవరి 14న విడుదల అయింది.'ఫైర్' చిత్రంలో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్ నటించారు. జెఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. క్రైమ్,థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాస్త ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. మార్చి 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అయితే, తమిళ్లో పాపులర్ అయిన టెంట్కొట్టా (Tentkotta)లో స్ట్రీమింగ్ కానుంది. రచిత మహాలక్ష్మి ఇచ్చిన గ్లామర్ ట్రీట్‌కు భారీ ధరను చెల్లించి ఫైర్ చిత్రాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో టెంట్కొట్టా ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.తెలుగులో రచితతెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. -
ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
తండేల్ సినిమా (Thandel Movie)తో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రేమకథలతో హిట్లు అందుకోవడం చైకి కొత్తేమీ కాదు. కానీ సెంచరీ కొట్టడం మాత్రం ఇదే తొలిసారి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టేసిన ఈ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (మార్చి 7) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.బుజ్జి తల్లి సాడ్ వర్షన్ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం నేడు బుజ్జితల్లి సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ అద్భుతంగా పాడారు. శ్రీ మణి గుండెల్ని మెలిపెట్టే లిరిక్స్ రాశారు. చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
నాగ చైతన్య 'తండేల్'.. 'బుజ్జి తల్లి' వచ్చేసింది
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్ చైతూ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.(ఇది చదవండి: నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన తండేల్ ఓటీటీలోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. -
సికందర్ సాంగ్.. రష్మిక డ్యాన్స్‌తో అదరగొట్టేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.సికందర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. జోహ్ర జబీన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సాజిద్నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్- 3లో కనిపించారు. -
ఏపీ బడ్జెట్ పై సింగర్ దేవి శ్రీ అదిరిపోయే సాంగ్..
-
రమణ గోగుల పాడిన 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' సాంగ్ రిలీజ్
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి.. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని చెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా (Naari: The Women) మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న విడుదల కానుంది. బుధవారం (ఫిబ్రవరి 26న) మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట (Na Gunde Lona Song)ను రిలీజ్ చేశారు. వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. రీసెంట్‌గాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద.. పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న "నారి" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'ఈడు మగాడేంట్రా బుజ్జి..', 'నిశిలో శశిలా..' సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట కూడా అందర్నీ అలరించనుంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు "నారి" చిత్రంలోని సాంగ్స్ పాడారు. చదవండి: -
సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025 -
సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర సాంగ్.. నయనతార పిల్లల ఎంజాయ్ చూశారా?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమాలోని ఓ సాంగ్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలోని 'చుట్టమల్లే చుట్టేస్తావే' సాంగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ పాటతో ప్రతి ఒక్కరూ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అంతలా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది ఈ సాంగ్.అయితే తాజాగా ఆ పాటను వింటూ నయనతార కవలలు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ చుట్టమల్లే సాంగ్ తమిళ వర్షన్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.కాగా.. నయనతార ప్రస్తుతం టెస్ట్ అనే మూవీలో కనిపించనుంది. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. మరోవైపు విఘ్నేష్ శివన్.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టితో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్‌తో కలిసి.. ఎవరీ వైశాలి?
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.ఛావా కోసం కష్టపడ్డ హీరోమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట పాడిందెవరో తెలుసా?ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.మిలియన్ల వ్యూస్ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది. చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే? -
సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
ఏమండోయ్ చంద్రలు.. ఏమయ్యాయి హామీలు.. దుమ్మురేపుతున్న కొత్త పాట
-
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్‌తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్‌లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
సీరియల్స్‌లో పద్ధతిగా నటించిన కన్నడ బ్యూటీ.. ఈ సాంగ్‌తో ట్రెండింగ్
కోలీవుడ్ సోషల్‌మీడియాలో రచిత మహాలక్ష్మి పేరు భారీగా వైరల్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమె తాజాగా 'ఫైర్' అనే కోలీవుడ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే, ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మళ్లీ అదే పాటను వీడియో వర్షన్లో ప్రోమో విడుదల చేశారు. ఇందులో కన్నడ బ్యూటీ రచిత మరింత గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మితిమీరిన గ్లామర్ సన్నివేశాల్లో ఆమె నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఫైర్ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పూర్తి సాంగ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని కామెంట్లు చేస్తున్నారు.సీరియల్ బ్యూటీస్.. సినిమాల్లోకి రావడం కొత్తేం కాదు. తెలుగు లేదంటే తమిళం ఇలా ఏ భాషలో తీసుకున్నా సరే మూవీస్‌లో వీళ్లకు సహాయ పాత్రలు మాత్రమే దక్కుతుంటాయి. కానీ ప్రధాన పాత్రల్లో నటించే ఛాన్సులు దక్కేది చాలా తక్కువ. అలా ఇప్పుడు సీరియల్ కమ్ తమిళ్ బిగ్‌బాస్ బ్యూటీ.. సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. తమిళ్లో 'శరవణన్ మీనాక్షి' సీరియల్ ద్వారా నటి రచిత మహాలక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో రచితతెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. భర్తతో దూరంపిరివం సంతిప్పమ్ అనే తమిళ సీరియల్లో దినేశ్ కార్తీక్, రచిత మహాలక్ష్మి జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లు ఆఫ్ స్క్రీన్‌లోనూ ప్రేమలో పడ్డారు. దీంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే నటుడు దినేశ్ మాత్రం ఎప్పటికైనా గొడవలు సద్దుమణిగి కలిసుంటామని ఆశిస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి వారిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు. -
'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అంటోన్న విశ్వక్ సేన్.. ఈ మాస్ సాంగ్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన తాజా చిత్రం లైలా(Laila). ఈ మూవీ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించునున్నారు మాస్ హీరో. ఈ సినిమాకు రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ మూవీలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది.ఈ నేపథ్యంలో లైలా మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓహో రత్తమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్‌కు పెంచల్ దాస్ లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మధుప్రియ, పెంచల్ దాస్ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మాస్ ఆడియన్స్‌ను తెగ ఊపేస్తోంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ ఎత్తుగడలో ఈ మధ్య బాగా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అనే లిరిక్స్ వాడడంతో ఈ సాంగ్ తెగ వైరలవుతోంది.లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే సోనూ మోడల్, లైలాగా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవలే లైలా మేకోవర్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో దాదాపు రెండు గంటల పాటు కష్టపడినట్లు వివరించారు. కాగా.. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mass vibe shuruuu! 😎Here's the massiest folk number #OhoRathamma from #Laila 🔊🕺💥▶️ https://t.co/DC4OjBYYlmA @leon_james musical Sung by #PenchalDas and #MadhupriyaLyrics by #PenchalDasGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma… pic.twitter.com/kAZJDM4eCr— VishwakSen (@VishwakSenActor) January 31, 2025 -
'బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ'.. వెంకీమామ ఫుల్ సాంగ్ చూశారా?
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. జనవరి 14న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ మూవీలో ఓ సాంగ్ విక్టరీ వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ.. అంటూ సాగే పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ పాడిన సాంగ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. భీమ్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
మోహన్ బాబు రిపబ్లిక్ డే విషెస్.. ఆ సాంగ్ వింటే ఇప్పటికీ గూస్ బంప్స్!
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను నటించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో సాంగ్‌ను అభిమానులతో పంచుకున్నారు. 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నటించారు.ఈ చిత్రంలోని దేశభక్తి సాంగ్ ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 'పుణ్య భూమి నాదేశం నమోనమామి.. ధన్య భూమి నాదేశం సదా స్మరామీ' అంటూ సాగే ఈ పాట దేశభక్తిని చాటి చెబుతుంది. ఈ పాటను జాలాది రాజారావు రాయగా.. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతమందించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. Wishing you all a Happy Republic Day!🇮🇳"Major Chandrakanth" (1993): 🎶"Punyabhoomi Naadesam" – A timeless patriotic anthem that resonates deeply with Telugu audiences. With lyrics by Sri. Jaladi Raja Rao, sung soulfully by Sri. S.P. Balasubrahmanyam, and composed masterfully by… pic.twitter.com/xvVqP6Ht66— Mohan Babu M (@themohanbabu) January 26, 2025 -
ఆ ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి: విశ్వక్ సేన్ విజ్ఞప్తి
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విశ్వక్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025 -
గుంటూరు కారం సాంగ్.. ఆ దేశంలో క్రేజ్ చూశారా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరించింది.అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్‌లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. #KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025 -
మోనికా ఓ మై డార్లింగ్..!
ఢిల్లీ : మోనికా ఓ మై డార్లింగ్..! అంటూ ఇండియన్ నేవీ బృందం చేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి 26న గణతంత్ర దినోవ్సత వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విన్యాసాలు చేసేందుకు భారత నావికాదళం బృందం సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఎర్రకోట ముందు రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ విరామ సమయంలో ఉత్సాహం, వినోదాన్ని జోడిస్తూ నేవీ బృందం మోనికా ఓ మై డార్లింగ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో బ్యాండ్ వాయించే నేవీ గ్రూప్ సభ్యులు మోనికా ఓ మై డార్లింగ్ సాంగ్ రిథమ్‌కు తగ్గట్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం సంబంధిత వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Monica oh my darling ❤️ pic.twitter.com/m5XVOeRNzG— Prayag (@theprayagtiwari) January 20, 20252022లో బాలీవుడ్లో వాసన్ బాల డైరెక్షన్లో రాజ్‌కుమార్‌రావు, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో మోనికా ఓ మై డార్లింగ్ సినిమా క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అంచిత్ థక్కర్ నేపథ్య సంగీతం డిఫరెంట్‌గా ఉంది. ఓల్డ్ మెలోడీ థీమ్‌లో సాగే మ్యూజిక్ ఆయా సన్నివేశాలకు కొత్తదనం తెచ్చింది. నేవీ బృందం డ్యాన్స్ వేసింది కూడా ఈ సినిమాలోని పాటకే. -
అజిత్ కుమార్ విదాముయార్చి.. రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వాయిదా..ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. #PATHIKICHU Out Now 💥➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025 -
Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో మొదటగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie) నేడే (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. శుక్రవారం రిలీజైన గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది.ఆ కారణం వల్లే..డైరెక్టర్ శంకర్ పాత ఫార్ములానే వాడారని కొందరు అంటుంటే.. ఇండియన్ 2 కంటే బెటర్‌గానే ఉందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే థియేటర్లో నానా హైరానా పాట (#NaanaaHyraanaaSong) కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సినిమాలో ఆ పాటనే కనిపించలేదట! దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ స్పందించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను మూవీలో యాడ్ చేయలేకపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్‌ను థియేటర్లో ప్లే చేస్తామని పేర్కొంది. కోట్లు పెట్టి తీసింది ఇందుకేనా?చిత్రయూనిట్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టింది ఇలా ఎడిటింగ్‌లో తీసేయడానికేనా? చెత్త నిర్ణయాలు.., ఇదేదో ముందే చెప్పొచ్చుగా.. ఈ పాట కోసమే టికెట్ బుక్ చేసుకున్నా.., కనీసం ఆ పాట పెట్టుంటే గేమ్ ఛేంజర్‌పై నెగెటివిటీ కాస్త తగ్గేదేమో.. ఈ ఒక్కటైనా బాగుందని సంతృప్తి చెందేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏం పర్లేదు, జనవరి 14 తర్వాత మరోసారి టికెట్లు కొని సినిమా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విశేషాలు..ఈ ఏడాది రిలీజవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్‌చరణ్, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. తమన్ సంగీతం అందించాడు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫస్ట్ డే ఫస్ట్ ఫోనే సినిమా బాలేదంటూ ఎక్కువ నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదే టాక్ కొనసాగితే సినిమా గట్టెక్కడం కష్టమే!పాటల కోసమే రూ.75 కోట్లుఅసలే సినిమాలోని ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టానని గర్వంగా చెప్పుకున్నాడు నిర్మాత దిల్‌రాజు. తీరా థియేటర్లో చూస్తే మెలోడీ సాంగ్ నానా హైరానా వేయనేలేదు. సాంకేతిక సమస్యలంటూ ఏదో సాకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాతే థియేటర్లో నానా హైరానా పాట వినిపిస్తుందని సమాధానం చెప్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్‌ను ఇంత లైట్ తీసుకోవడం ఏమీ బాగోలేదంటున్నారు చరణ్ ఫ్యాన్స్కథేంటంటే?ఓ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్. గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Everyone's favorite, #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa from #GameChanger has been edited out due to technical challenges encountered during the processing of infrared images in the initial prints. Rest assured, we are diligently working towards adding the song back… pic.twitter.com/N1mQO2GAG6— Game Changer (@GameChangerOffl) January 9, 2025 చదవండి: Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. -
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
బెల్లంకొండ బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భైరవం. ఈ చిత్రంలో ఆదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఓ వెన్నెల అంటూ సాంగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన సాంగ్ ఓ వెన్నెల సాంగ్‌కు తిరుపతి జావన లిరిక్స్ అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తోన్న ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదితి శంకర్‌తో పాటు దివ్యా పిళ్లై, ఆనంది కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.Happy to launch this soothing melody #OoVennela from #Bhairavam ▶️ https://t.co/BvAn6n84rt Happy Birthday @BSaiSreenivas, wish you all the luck and success this year.All the best @AditiShankarofl, @KKRadhamohan Garu , @DirVijayK, @sricharanpakala & Team pic.twitter.com/eZ9lNclFkK— Nani (@NameisNani) January 3, 2025 -
బాలకృష్ణ దబిడి దిబిడి ఆడేసుకుంది ఈ బ్యూటీతోనే! (ఫోటోలు)
-
Daaku Maharaaj: దబిడి దిబిడి పాట వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. గురువారం (జనవరి 2న) మూడో పాట రిలీజైంది. 'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'దబిడి దిబిడి' సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు. అలా బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌తో రూపుదిద్దుకున్న పాటే 'దబిడి దిబిడి'. ఈ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వాగ్దేవి ఆలపించారు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను మాస్ ట్రీట్‌లా మార్చింది.డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. చదవండి: ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ -
మళ్లీ పాడారు
‘తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల తర్వాత హీరో పవన్ కల్యాణ్ మరోసారి పాట పాడారు. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రంలోని ‘మాట వినాలి...’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. పెంచల్దాస్ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్ కల్యాణ్ పాడారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
బాలకృష్ణ 'డాకు మహారాజ్'.. న్యూ ఇయర్ అప్డేట్ ఇదే
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పటికే రెండు పాటలు కూడా మేకర్స్ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితమే చిన్నీ చిన్నీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్‌లోని మూడో సింగిల్‌ను జనవరి 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దబిడి దిబిడి అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. A GUARANTEED MASS BLAST that will have you going ballistic in theatres this Sankranthi! 😎🤘#DaakuMaharaaj 𝟑𝐫𝐝 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 ~ #DabidiDibidi is going to Lit up your speakers from TOMORROW! 🕺💃🔥A @MusicThaman Vibe 🥁A @dirbobby Film 💥In Cinemas Worldwide from Jan 12,… pic.twitter.com/4wMgXN1F7m— Sithara Entertainments (@SitharaEnts) January 1, 2025 -
మహేశ్ బాబు టైటిల్‌తో మూవీ.. హీరోగా ఎవరంటే?
వరుణ్ రాజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పోకిరి. ఈ మూవీలో మమతా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి నా గుండె జారిపోయిందే అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. 'మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఫిక్స్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకముంది' అని అన్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ.. "ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్, వరుణ్ సర్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీనే గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరో వరుణ్ రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. మూవీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌కు అభిమానిని. ఈ సినిమా టైటిల్ పోకిరికి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నా. మా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకముంది' అనిఅన్నారు. -
బుజ్జితల్లి క్రేజ్.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨▶️ https://t.co/52ZLxEJe7IA 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024 -
తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు(Himanshu Rao) పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యానిమల్(Animal) సినిమాలోని 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి' అంటూ స్వయంగా పాట పాడిన హిమాన్షు.. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను కూడా యాడ్ చేసి వీడియోగా రూపొందించారు.దీంతో తన కుమారుడు తన కోసం ఓ పాట పాడటంతో సంబరపడిపోయిన కేటీఆర్.. సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జూలైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు ఈ పాటను రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు పాట సాహిత్యం.. గానం అద్భుతంగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. తాను దీని పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కు అభినందనలంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తన పాటను తండ్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని హిమాన్షు రీట్వీట్ చేశారు. The best Gift for me in what has been a difficult year Thank you Binku @TheHimanshuRaoK ❤️ Loved the vocalsApparently, my son recorded this for my birthday in July. But shied away from releasing it as he didn’t think it was good enough!!!I’ve only heard it last week for… pic.twitter.com/NTIBgcxQAa— KTR (@KTRBRS) December 28, 2024 -
Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్
పుష్ప 2 .. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దెబ్బలు పడ్తయ్రో.., పీలింగ్స్.., పుష్ప పుష్ప పాటలు విడుదల చేయగా నాలుగు రోజుల క్రితం 'దమ్ముంటే పట్టుకోరా..' సాంగ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.అయితే అదేరోజు పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పోలీసులను ఉద్దేశించే ఈ పాట విడుదల చేశారని పలువురూ భావించారు. ఈ క్రమంలో ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ పాట అలాగే ఉంది. ఇప్పుడేకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మొదట షెకావత్‌కు సారీ చెప్పిన పుష్పరాజ్.. తర్వాత మాత్రం తనకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ పోలీస్ ముందే తొడ కొట్టాడు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా? -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.#Sawadeeka 🕺💃⚡️ https://t.co/Pm5XIZtP2LHappy New Year and love you all 🎉🎉🎉Dearest AK sir #MagizhThirumeni @trishtrashers Sung by @anthonydaasan 🎙️Written by @Arivubeing ✍🏻Choreography by @kayoas13 🕺#Vidaamuyarchi #EffortsNeverFail@LycaProductions #Subaskaran…— Anirudh Ravichander (@anirudhofficial) December 27, 2024ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
అది దా సారు!
హీరోయిన్ మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సః కుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నారు. హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నాగరత్న నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘అది దా సారు...’ పాట లిరికల్ వీడియోను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం ఇవ్వగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘కుటుంబ నేపథ్యంలో వస్తున్న మా ‘సః కుటుంబానాం’ టైటిల్‌తోనే అంచనాలు పెంచేసింది. ‘అది దా సారు...’ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మధు దాసరి, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, లైన్‌ప్రొడ్యూసర్: అంకిత్ కనయ్. -
యార్కర్ కింగ్ లసిత్ మలింగా పాడిన ఈ పాట విన్నారా?
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. దశాబ్దన్నర పాటు క్రికెట్లో తన కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. సింగర్‌గా సరికొత్త అవతారం ఎత్తారు. సాంగ్ రైటర్‌గా ఇప్పటికే ఎంటర్టైన్ చేస్తున్న ఈ స్పీడ్ స్టర్ ఈసారి మరో సాంగ్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శ్రీలంక సింగర్లతో గొంతు కలిపారు. ఆయన పాడిన పాటలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఓ సాంగ్‌ను పాడారు. ఇప్పుడా ఆ సాంగ్ సంగీత ప్రియుల్ని అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట ఎలా ఉందో మీరూ వినేయండి.From Slinga Malinga to Singer Malinga!One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024 -
Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా..
ఓ పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వివాదంలో చిక్కుకోగా మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా రాబట్టింది. అందులో ఒక్క హిందీలోనే రూ.704 కోట్లు వసూలు చేయడం విశేషం.అల్లు అర్జున్ పాడిన సాంగ్ఇకపోతే మంగళవారం నాడు పుష్ప టీమ్ దమ్ముంటే పట్టుకోరా పాట (Dammunte Pattukora Song) రిలీజ్ చేసింది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ సాగుతుంది. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించాడు. రెండు మూడు లైన్లు మాత్రమే ఉన్న లిరిక్స్‌ను సుకుమార్ అందించాడు. లక్షల వ్యూస్యూట్యూబ్లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. డిసెంర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వివాదంలో అల్లు అర్జున్ఇదిలా ఉంటే డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లగా అక్కడ తొక్కిసలాట (Sandhya Theatre Stampede) జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా మరోసారి పోలీసులు బన్నీని విచారించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: అమ్మాయిలు మిమ్మల్ని బకరాలను చేసి వాడుకుంటారు!: నటుడు -
బృందావనంలో గోపికలుగా ఎంత ముద్దుగున్నారో.. గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
బాలయ్య డాకు మహారాజ్.. ఆ సాంగ్ వచ్చేసింది!
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డాకు మహారాజ్ నుంచి చిన్నీ చిన్నీ అంటూ సాంగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
'కిస్ కిస్ కిస్ కిస్సిక్'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. హ్యాపీ లైఫ్‌కి మైక్రో మంత్ర!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. -
డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి.. యూట్యూబ్‌లో మార్మోగుతున్న సాంగ్
జయతి.. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్‌లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన ఈమెకు అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్‌లా ఉందంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండేవారు. వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఆ అమ్మడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా! తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది.ఆల్బమ్ సాంగ్స్అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తోంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు అందుకుంది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజైన ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్‌లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది. బిగ్‌బాస్ ఫేమ్ భోలె షావళి సంగీతం అందించిన ఈ పాటకు వరం ఆలపించాడు. -
సినిమా సాంగ్ కోసం గ్లామర్ డోస్ పెంచిన నిహారిక (ఫోటోలు)
-
నాగ చైతన్య- శోభిత మాంగల్యం తంతునానేనా ఫోటోలు
-
పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!
'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్‌తో రప్పా రప్పా చేశాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ అయితే వేరే లెవల్ అనేలా ఉంది. ముందు నుంచి చెబుతున్నట్లే ఆ పార్ట్ వచ్చినప్పుడు.. చూస్తున్న ఆడియెన్స్‌కి పునకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎపిసోడ్లో వచ్చే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)'గంగో రేణుక తల్లి' అని సాగే ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. చీరకట్టులో వేసిన స్టెప్పులు బాగున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పాట లిరికల్ సాంగ్ మాత్రమే విడుదల చేశారు. ఒకవేళ వీడియో కావాలంటే కొన్నిరోజులు ఆగాలి. అప్పటివరకు ఆగాలేకపోతున్నామంటే బిగ్ స్క్రీన్‌పై మూవీ చూసి అనుభూతి చెందాల్సిందే.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు) -
కుర్చీ మడతపెట్టి పాటకు మైండ్ బ్లాక్ అయ్యే రికార్డ్
కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా క్లిక్ అవుతాయి. అలా ఈ ఏడాది కుర్చీ మడతపెట్టి పాట సూపర్‌డూపర్ హిట్టయింది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లోనూ ఈ పాట మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం సినిమాలోనిదే ఈ పాట!పాట బ్లాక్బాస్టర్ హిట్మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటకైతే విజిల్స్ పడ్డాయి.వన్స్మోర్ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రిపీట్ మోడ్‌లో పాట వింటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట అరుదైన రికార్డు అందుకుంది. ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. ఈ సంతోషకర సమయంలో ఫ్యాన్స్ వన్స్‌మోర్ అంటూ మరోసారి కుర్చీ మడతపెట్టి సాంగ్ వింటున్నారు. చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్రప్రసాద్ -
'డ్రింకర్ సాయి' నుంచి యూత్ ఫుల్ లవ్ సాంగ్ విడుదల
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.'బాగి బాగి..' లిరికల్ సాంగ్‌ను శ్రీ వసంత్ మంచి బీట్తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాట ఎ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌లో హీరో ధర్మ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్‌హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024 -
'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ సినిమాకు మరింత బజ్‌ను క్రియేట్ చేయనుంది.ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న 'ఎర్రచీర - ది బిగినింగ్' చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. -
అల్లరి నరేశ్ బచ్చలమల్లి.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తోన్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు.తాజాగా ఈ మూవీ నుంచి అదేనేను.. అసలు నేను అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.Good luck team ❤️#AdeNenuAsaluLenu from #BachhalaMalli beautifully captures the feeling TholiPrema. So happy to launch this soulful composition 🤗I am sure you all will like this one.▶️ https://t.co/NLtZcIlq8gA wonderful melody by @Composer_Vishal and brilliantly sung by…— thaman S (@MusicThaman) November 22, 2024 -
నాగచైతన్య తండేల్.. బుజ్జి తల్లి వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Divided by the ocean, united by love 💕The 'Love Song of the year' is here for your to express the feelings of long distance love ✨ #Thandel First Single #BujjiThalli out now 🫶▶️ https://t.co/ZqKgx9roRiA @ThisIsDSP melody 🎼Sung by @javedali4u 🎙️Lyrics by @ShreeLyricist… pic.twitter.com/umR1JLTvHp— Geetha Arts (@GeethaArts) November 21, 2024 -
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఐ హేట్ యూ మై డాడీ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రతో అలరించనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, నరేష్ వీకే, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. It’s a new vibe, for sure😂Listen to our #IHateuMyDaddy from #MechanicRocky 🛠🔥🔗https://t.co/C0XtVfkoPW#MechanicRockyOnNOV22 🛠🎵 @JxBe🎤 #RamMiriyala✍️ #Sanare@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies… pic.twitter.com/lpU6FzRc9X— VishwakSen (@VishwakSenActor) November 6, 2024 -
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ మూవీలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను జేజేఆర్ ఎంటర్టైన్మెంట్, ఎల్ఎల్పీ బ్యానర్లపై యలమంచి రాణి సమర్పణలో జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ అందుకున్న గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'కావాలయ్యా..'అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతమందించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
సూర్య 'కంగువా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కంగువా'. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చేనెల థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం కంగువా టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.కంగువా విడుదలకు మరో రెండు వారాలు ఉండడంతో చిత్రయూనిట్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాయకా..' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. -
'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత'.. ఫియర్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఫియర్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దేవర ఫియర్ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. The thumping #FearSong Video is out now! 🔥https://t.co/ifDty3vMEi Let the fear grip every nerve and ignite the madness ❤️🔥#Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 29, 2024 -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దావూదీ అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ పాటలో హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దావూదీ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. -
లెజెండరీ సింగర్ పాటను ఖూనీ చేశారు: పాకిస్తాన్ నటుడు
పాత పాటల్ని రీమిక్స్ చేయడం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని హిట్ సాంగ్స్‌ను టచ్ చేయకపోవడమే బెటర్ అంటున్నాడు పాకిస్తాన్ నటుడు అద్నానీ సిద్దిఖి. ఇటీవలే 'దో పత్తి' సినిమాలో నుంచి కృతి సనన్ 'అఖియాన్ డి కోల్..' పాటను రిలీజ్ చేశారు. నిజానికి ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ పాకిస్తాన్ ఫేమస్ సింగర్ రేష్మ పాడింది. ఆ క్లాసిక్ సాంగ్‌ను బాలీవుడ్ మూవీ కోసం మార్చేసి వాడుకున్నారు.ఆమె పాటను ఖూనీ..ఇది పాక్ నటుడు అద్నానీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. పాటను కాపీ కొడితే అది ఇంకా బాగుండాలే తప్ప చెడగొట్టకూడదు. లెజెండ్ రేష్మగారిపై కాస్తైనా గౌరవం చూపించండి. తన పాటల్ని ఖూనీ చేయకండి ఎక్స్ (ట్విటర్)లో మండిపడ్డాడు. ఈ ట్వీట్‌కు కృతి సనన్ డ్యాన్స్ స్టిల్‌ను జత చేశాడు.బాలీవుడ్ సాంగే బెటర్కొందరు ఆయన అభిప్రాయాన్ని గౌరవించగా మరికొందరేమో తప్పుపడుతున్నారు. 'అలాంటప్పుడు మీ పాటల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఇండియన్ లేబుల్స్‌కు అమ్మకండి. అప్పుడే మీ పాటలు భారతీయ సినిమాల్లో కనిపించవు', 'ఒరిజినల్ కన్నా బాలీవుడ్ సాంగే బెటర్‌గా ఉంది' అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమా..దో పత్తి సినిమా విషయానికి వస్తే.. కాజోల్, కృతి సనన్, షాహీర్ షైఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన అఖియాన్ డి కోల్ పాటను శిల్పారావు ఆలపించింది. తనిష్క్ బగ్చి సంగీతం అందించగా కౌసర్ మునీర్ లిరిక్స్ సమకూర్చాడు. Imitation can be flattering, but not when it means tearing apart a classic by a legend. Please show some respect for Reshma jee and the legacy she left behind. Her music deserves to be treated with the dignity it commands, not reduced to just another sordid ripoff. pic.twitter.com/aNBLHIjGvB— Adnan Siddiqui (@adnanactor) October 20, 2024 చదవండి: -
మన్యం ధీరుడు మూవీ.. ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
మన్యం ధీరుడు సినిమాలోని "నమోస్తుతే నమోస్తుతే భారత మాతా" అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథానాయకుడైన ఆర్వీవీ సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడడమే కాకుండా హిమాలయాల్లో చిత్రీకరించారు. అందుకే ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది.ఇటీవల ఈ సాంగ్‌ను థాయిలాండ్,మలేషియా, బ్యాంకాక్, మయన్మార్ లాంటి దేశాల్లోని ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభల్లో ఈ పాట పాడనున్నారు. ఆ తర్వాత జర్మనీలో కూడా ఈ సాంగ్ పాడబోతున్నట్లు విశాఖకు చెందిన శేఖర్ ముమ్మోజీ బృందం తెలిపారు. కాగా.. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. మన దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాటకు మరింత ఆదరణ దక్కాలని ఆశిద్దాం. -
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్‌తో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వయంభూ సెట్స్‌పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. -
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
'దావూది సాంగ్ ఎందుకు పెట్టలేదంటే'.. అసలు కారణం చెప్పేసిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్.. యాంకర్ సుమతో ఇంటర్వ్యూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్ జర్నీ ఆఫ్ దేవర’ పేరుతో ఎన్టీఆర్, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరలోని దావూది సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్లో దావూది సాంగ్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు.'ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి. మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. ఐదు భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూది పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు సినిమా చూస్తు ఉంటే కథ సీరియస్‌గా మొదలైపోయింది. ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్‌లా అనిపించింది. కథను చెప్పేటప్పుడు మనం బ్రేక్ ఇవ్వకూడదు. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం. అక్కడ దావుది సాంగ్ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం' అని అన్నారు. -
'మిస్టర్ ఇడియట్గా' రవితేజ వారసుడు.. సాంగ్ రిలీజ్ చేసిన హీరో!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఎల్ఎల్పీ పతాకంపై జెజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారుతాజాగా ఈ మూవీ నుంచి కాంతార అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇప్పటికే మిస్టర్ ఇడియట్ ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
దేవర ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. అదేంటంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మూవీ టీం సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.అయితే దేవర చిత్రంలో ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిన విషయం ఆ ఒక్కటే. మాస్ సాంగ్ దావూది సాంగ్ థియేటర్లో రాకపోవడంతో డైహార్డ్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సాంగ్‌ను యాడ్ చేసినట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే బిగ్ స్క్రీన్‌పై దాపూది సాంగ్ చూసేయండి అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.To all the fans who have been waiting to get into the KILI KILIYE mood 🕺🏻Enjoy #Daavudi at your nearest cinemas now! 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/MIxMveHW8b— Devara (@DevaraMovie) October 4, 2024 -
'వస్తాను వస్తానులే' అంటోన్న గోపిచంద్.. రొమాంటిక్ సాంగ్ చూశారా!
టాలీవుడ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ చిత్రంలో డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్‌కు మరోసారి కౌంటర్!)ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'మొరాకన్ మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వస్తాను వస్తానులే' అంటూ సాగే లవ్ అండ్ రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా.. వెంగి లిరిక్స్ అందించారు. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. ఈనెల 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. -
గేమ్ ఛేంజర్: 'రా మచ్చా' సాంగ్ ప్రోమో వచ్చేది అప్పుడే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ పక్కా మాస్ బీట్ ఇచ్చాడని ఇట్టే తెలిసిపోతుంది.ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పండగ మొదలు! பண்டிகை முதல்!त्यौहार शुरू!Let the festivities begin 💥❤️🔥#RaaMachaMacha #DamTuDikhaja #GameChanger pic.twitter.com/R0VtIF81DS— Game Changer (@GameChangerOffl) September 25, 2024 చదవండి: దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ -
నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా.. పాట విన్నారా?
కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల చేసిన గు...గుగ్గు అనే పాటకు కూడా మంచి స్పందన వస్తోంది.తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ చూడకయ్యో.. నెమలికళ్ల అనే పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా ఉంది. గాయనీ సునీత, సాయిచరణ్ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి'. టైటిల్ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను' అన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. -
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఓ పిల్లో అంటోన్న మాస్ కా దాస్!
మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.(ఇది చదవండి: 'మెకానిక్ రాకీ' గ్లింప్స్.. ఎల్ అంటే సరికొత్త చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్)'ఓ పిల్లో.. బీటెక్‌లో నేను మిస్సయ్యానే కొంచెంలో' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రాన్ని ముక్కోణపు ప్రేమకథగా రూపొందిస్తున్నారు. అంతేకాకుండా మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్‌కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. -
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
వినాయకచవితికి కొత్త పాట.. వరలక్ష్మి విశ్వరూపం
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వినాయక చవితి స్పెషల్‌గా తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన భక్తి పాటను రిలీజ్ చేశారు.ఇంత ఎనర్జీగా..‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వినోద్ ఇచ్చిన బాణీకి గణేశ్ లిరిక్స్ అందించాడు. ఈ పాట మార్మోగడం ఖాయంఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
దేవర మూడో సాంగ్: స్టెప్పులతో అదరగొట్టిన తారక్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే దేవర నుంచి రిలీజైన రెండు పాటలు ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తారక్- జాన్వీ కపూర్ల జోడీని చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. మూడో పాట..తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. దావూదీ.. అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు. ఏ భాషలో ఎవరు పాడారంటే?పాడిన వారి విషయానికి వస్తే నకష్ అజీజ్, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాడారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. ‘దేవర: పార్ట్ 1’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
పెళ్లి బరాత్ లో జగనన్న పాట.. గూస్ బంప్స్
-
అలనాటి సూపర్ హిట్ సాంగ్ పాడి అలరించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత సినిమాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపే వేరు. అది ఈ మధ్యకాలంలోనే దక్కుతుందని అనుకుంటే పొరపాటే. దశాబ్దాల క్రితమే మన సినిమా ఖండాంతరాలు దాటిపోయింది. ముఖ్యంగా.. పొరుగు దేశాల్లో మన చిత్రాల దక్కే ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఆ అభిమానమే ప్రదర్శించారు. మలేషియా ప్రధాని హోదాలో ఇబ్రహీం తొలిసారి భారత్‌కు వచ్చారు. మూడు రోజుల పర్యటన ముగియడంతో.. ఢిల్లీ తాజ్ మహల్ హోటల్లో ఆయనకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో 60వ దశకం నాటి పాపులర్ పాటను ఆలపించారాయన. రాజ్ కపూర్ ‘సంగమ్’(1964) కోసం గాయకుడు ముకేష్ ఆలపించిన ‘దోస్త్ దోస్త్ నా రహా’.. ఈనాటికీ గుర్తుండిపోయింది. ఆ పాటనే మలేషియా ప్రధాని ఇబ్రహీం పాడి వినిపించారు. మ్యూజిక్ సిబ్బంది భుజాలపై చేతులు వేసి మరీ సరదాగా పాడి అక్కడున్నవాళ్లను అలరించారాయన.Watch: Malaysian PM #AnwarIbrahim sings the famous song 'Dost Dost Na Raha' from the movie Sangam during his first visit to India as Prime Minister.#ViralVideo #Viral #Malaysia pic.twitter.com/NMrafjHBKG— TIMES NOW (@TimesNow) August 22, 2024 Video Credits: TIMES NOW -
కిరణ్ అబ్బవరం పెళ్లి.. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ అబ్బవరం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 22న హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వీరిద్దరు కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారింది.టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం క చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచి పాటను అందించిన చిత్రబృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా పాటలకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. అలాగే ఈ సాంగ్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాటకు సంగీతం, లిరిక్స్ అందించిన టీమ్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Thank you all ☺️🙏#WorldofVasudev #KA pic.twitter.com/RDQauPl5PN— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 20, 2024 -
రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. సూపర్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు ముందు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్‌ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్‌తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. This isn’t something I usually do, but this time, it’s for you all 😘#NallanchuThellacheera from #MrBachchan out Tomorrow, August 12th ❤🔥 pic.twitter.com/NokEYn4y0z— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2024 -
జూనియర్ ఎన్టీఆర్ బామర్ది సినిమా.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మ్యాడ్ మూవీతో నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఆయ్. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి అంజి కె.మణపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. జీఎ2 బ్యానర్లో బన్నీవాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైవర్షన్ బ్యూటీ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా.. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సింగర్ మంగ్లీ ఆలపించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. Vibe to the Madness!🔥💃Celebrate the Diversion Beauty ❤️🔥Here's the lyrical video of #DiversionBeauty from #AAYMovie▶️ https://t.co/HQ0F6LR2th🎤 @IamMangli✍️ @LyricsShyam🎶 @arasadaajay#AAY #AAYonAUG15#AlluAravind @TheBunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan… pic.twitter.com/pzV4kmSLAj— Geetha Arts (@GeethaArts) August 10, 2024 -
ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పారావు ఆలపించారు. కాగా.. ఇప్పటికే దేవర నుంచి ఫియర్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
దళపతి విజయ్ గోట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం గోట్(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి స్పార్క్ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐదు నిమిషాల పాట.. 'బాహుబలి' బ్యూటీ రెమ్యునరేషన్ రూ.2 కోట్లా? (ఫొటోలు)
-
మాస్ మహారాజా 'మిస్టర్ బచ్చన్'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే సితార్ అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెప్పల్ డప్పుల్ అంటూ సాగే పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే రోజున ఈ సినిమా రిలీజ్ కానుంది. Here’s #ReppalDappul from #MrBachchan for you all :))- https://t.co/fnoX3aw9VREnjoy the beats now! pic.twitter.com/dltXxgEkvb— Ravi Teja (@RaviTeja_offl) July 25, 2024 -
పరాక్రమం మూవీ.. 'మనిషి నేను' అనే సాంగ్ రిలీజ్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని 'మనిషి నేను' అనే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను.. హైమత్ మహమ్మద్ ఆలపించారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. "పరాక్రమం చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన 'మనిషి నేను' అనే పాటను విడుదల చేశాం. ఈ పాటని హైమత్ మహమ్మద్ పాడారు. నా పాట అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. మా చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
పవన్ కుమార్ కొత్తూరి, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ సినిమాతో పవన్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు. ‘సారా సారా’ అంటూ సాగే ఓ మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివకృష్ణచారి ఎర్రోజు లిరిక్స్ అందించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి కీలక పాత్రలు పోషించారు. -
'కంగ్రాట్స్..నోబెల్ ప్రైజ్‌కు దరఖాస్తు చేసుకో'.. నెటిజన్‌కు డైరెక్టర్ కౌంటర్!
మాస్ మహరాజా రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సితార్ అంటూ సాగే సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే ఈ సాంగ్‌పై నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్లను కేవలం ఓ వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.అయితే దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు. నెటిజన్‌కు రిప్లై ఇస్తూ..'కంగ్రాట్స్.. చాలా బాగా కనిపెట్టావ్.. నోబెల్ ప్రెజ్‌కు దరఖాస్తు చేసుకో.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు.. దీన్ని నువ్వు ఇలాగే కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్‌ను ప్రశ్నిస్తూ ఉండాలి.. నీలాంటి వారికి ఎప్పుడు వెల్కమ్ చెబూతూనే ఉంటా' అని ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాలాగే చూడాలంటూ మరికొందరు నెటిజన్స్ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍 And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK— Harish Shankar .S (@harish2you) July 10, 2024 -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న వినోద్ కిషన్.. లిరికల్ సాంగ్ వచ్చేసింది!
'నా పేరు శివ', 'అంధగారం' చిత్రాలతో మెప్పించిన వినోద్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'పేక మేడలు'. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడపిల్ల అనే పాటకు సాకే రాజశేఖర్ పాడగా.. భార్గవ కార్తీక్ లిరిక్స్ అందించారు. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిన మురళి మోహన్!
చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "నేను-కీర్తన". ఈ సినిమా ద్వారా చిమటా రమేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి "కొంచెం కొంచెం.. గుడుగుడు గుంజం" అనే లిరికల్ వీడియో ఐటమ్ సాంగ్‌ను నటుడు మురళిమోహన్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ..'ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను - కీర్తన మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. -
'నేను-కీర్తన' సినిమా సాంగ్‌కు భారీ రెస్పాన్స్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నేను కీర్తన'. ఈ మూవీ నుంచి నుంచి విడుదలైన 'సీతాకోకై ఎగిరింది మనసే' లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులుమనాలిలో ఉన్న పలు లొకేషన్స్ లో చిత్రీకరించారు. దీంతో పాటలోని విజువల్స్ కూడా చాలా అందంగా వచ్చాయి.చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత,డైరెక్షన్,హీరో చిమటా రమేష్ బాబునే కావడం విశేషం.'బేబి' దర్శకుడు సాయి రాజేష్ గారు రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయంపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ.. ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 'నేను - కీర్తన' చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కోపాలు చాలండి శ్రీమతి గారు.. సాంగ్ విన్నారా?
"మహానటి", "సీతారామం" సినిమాలతో తెలుగులో ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం "లక్కీ భాస్కర్". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. బుధవారం ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు.సాంగ్ అదిరిందిజి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. పాన్ ఇండియా స్థాయిలో..మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. -
ప్రభాస్ 'కల్కి' సాంగ్ రిలీజ్ ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. మరో రెండు వారాల్లో అంటే జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా భైరవ యాంథమ్ పేరుతో ఓ సాంగ్ రెడీ చేశారు. ఫుల్ సాంగ్ ఆదివారం రానుండగా, తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజేతో కలిసి ప్రభాస్.. ఈ ప్రమోషనల్ పాటలో కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ సాంగ్.. కథలో అంతర్భాగంగా ఉంటుందని, అందుకే ప్రమోషన్ కోసం స్పెషల్‌గా ఈ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం మంచి స్టైలిష్‌గా ఉంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ప్లేసులోకి 'ఇస్మార్ట్'.. వాయిదా పడినట్లేనా?) -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
హెబ్బా పటేల్ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్ వచ్చేసింది!
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
స్నేహం... బాలు చేవ్రాలు!
తెలుగు జాతి గర్వించదగిన గాన గంధర్వునిగా, బహుముఖ కళాపారీణునిగా బాలును ఎరగని వాళ్ళుండరు. ఆయన నేపథ్య గాయకునిగా, అద్వితీయునిగా రాణించిన కాలంలో సాటి గాయకుల కెవరికీ అవకాశాలు రాకుండా చేస్తున్నారని కొందరు అసూయాపరులు ఆరోపణలు చేసినా, ‘పాడుతా తీయగా’ కార్యక్రమ వీక్షకులను బాలు వ్యక్తిత్వం, హృదయ సంస్కారం ముగ్ధుల్ని చేశాయి. ఆయన అంతరంగం స్నేహ పారిజాతమని ఆ పరిమళాల్ని శ్వాసించి పరవశించిన ఆత్మీయ మిత్రులకు మాత్రమే తెలుసు. మాంగల్య బంధం కంటే స్నేహబంధం పటిష్టమైనదనీ, అది ఎప్పటికీ ఇగిరిపోని గంధం అనీ బాలు అభిప్రాయపడేవారు. స్నేహం చేసేముందు అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ, స్నేహం కుదిరిన తర్వాత మిత్రునిలో లోపాలు బయటపడినా వాటిని సరిదిద్దాలి కాని ఏకంగా ఆ బంధాన్ని తెంచుకోకూడదనీ బాలు స్నేహ ధర్మానికి భాష్యం చెప్పేవారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్నేహాన్ని ఒక పవిత్రబంధంగా, పారాయణ గ్రంథంగా పాటించిన మనస్వి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.బాలు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లనూ, చిన్న నాటి నేస్తాలనూ మర్చిపోలేదు. అందుకు ఆయన కృతజ్ఞతా పూర్వకంగా చేయి అందించిన బీవీ మురళి, ఎమ్ విఠల్‌రావు, వై కామేశ్వరరావు, శ్యామ్, డా‘‘ వై.దివాకర్ వంటి సహచరులు ప్రత్యక్ష సాక్షులు. 1964లో మద్రాసు ఆంధ్రా క్లబ్లో జరిగిన లలిత సంగీతం పాటల పోటీలో పాల్గొనడానికి బాలు ఇష్టపడకపోయినా... చెప్పకుండా ప్రవేశ రుసుము చెల్లించి బాలుకి ప్రథమ బహుమతి రావడానికీ, కోదండపాణి వంటి వారి దృష్టిలో పడటానికీ కారకుడు; 1966 డిసెంబరు 15వ తేదీన ‘విజయా గార్డెన్స్’లో తన మొట్టమొదటి సినిమా పాట రికార్డింగ్‌కు సైకిలు మీద తోడుగా వచ్చి ప్రోత్సహించిన తన రూమ్మేట్ బీవీ మురళిని కోదండపాణి ఆడియో లాబ్‌లో ఆడియో అసిస్టెంట్‌గా నియమించడమే కాకుండా ఎన్నో వేదికల మీద అతని సహాయాన్ని గుర్తు చేసుకునేవారు. రంగస్థలం మీద సహ నటులైన శ్యామ్‌ను స్టూడియో మేనేజర్ గానూ, వై. కామేశ్వరరావును ‘పాడతా తీయగా’లో అసిస్టెంట్ గానూ, కొన్ని చిత్రాలలో నటుడి గానూ అవకాశాలు కల్పించి వారి ఉపాధికి తోడ్పడ్డారు. విఠల్‌ను పీఏగా పెట్టుకోవడమే కాకుండా తన ఇంటికి దగ్గర్లో అతనికో ఇల్లు కట్టించడంతో పాటు అనేక విధాలుగా ఆదుకున్నారు. ‘ఈటీవీ’ వారి వార్షికోత్సవ సంగీత కార్యక్రమంలో తను మెచ్చిన రాంప్రసాద్‌ను ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి పరిశోధకునిగా చివరి వరకు కొనసాగించారు. బాలు స్నేహ ప్రీతి బాల్యమిత్రులకే పరిమితం కాలేదు. స్టూడియో నిర్మాణానికి సహకరించిన ప్రాణమిత్రుడు బిల్డర్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా జూన్ 1వ తేదీన చనిపోతే ఆనాటి నుంచి బాలు తన పుట్టినరోజును (జూన్ 4వ తేదీ) అట్టహాసంగా జరుపుకోవడం మానేశారు. ఎమ్వీఎల్, వై. కామేశ్వరరావు వంటి ఆప్తమిత్రుల అవసాన దశలలో వారిని బతికించడానికి హాస్పిటల్స్‌కు సంబంధించిన మొత్తం ఖర్చులను భరించారు. ఎమ్వీఎల్ చనిపోయిన తరువాత కూడా అతని స్నేహ బృందాన్నీ, నూజివీడునూ మర్చిపోకుండా అనేక స్మారక కార్యక్రమాలకు హాజరయిన స్నేహశీలి, ఆత్మ బంధువు బాలు. 1990లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా పరిచయమైన ఈ వ్యాసకర్త సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ను అయాచితంగా, ఐచ్ఛికంగా స్పాన్సర్ చేసి ప్రచురించడమే కాకుండా దానికి విస్తృత ప్రాచుర్యాన్ని కలిగించారు బాలు. స్వల్ప పరిచయం స్నేహంగా మారడానికీ, ఈ వ్యాసకర్తకు సినీగేయ సాహిత్య పరిశోధకునిగా గుర్తింపు రావడానికీ బాలు సహృదయతే కారణం. నంది పురస్కారాల నందుకున్న వ్యాసకర్త రెండు సిద్ధాంత గ్రంథాలనూ స్పాన్సర్ చేసిన బాలు స్నేహ వాత్సల్యాన్ని ఈ రచయిత మర్చిపోలేడు. వెన్నెలకంటి ప్రతిభను గుర్తించి అతనిని సినీరంగంలో ప్రోత్సహించడం, డా‘‘ పీఎస్ గోపాలకృష్ణ రచనలు ‘మన ఘంటసాల’, తన జీవిత చరిత్ర ‘జీవన గానాలు’కు బాసటగా నిలవడం బాలు ఉత్తమాభిరుచికి నిదర్శనాలు. 1993 ఫిబ్రవరిలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లక్షలు వెచ్చించి మద్రాసు చిత్ర పరిశ్రమలోని తన మిత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించి సత్కరించడం బాలు మైత్రీ యానంలో ఓ మైలురాయి. బాలుది బాలుడి మనస్తత్వం. ఆ విషయాన్ని ఘంటసాల విగ్రహావిష్కరణ సభలో అతని కన్నీళ్లు రుజువు చేశాయి. బాలు సంగీత సత్కార వేదికల మీద ఎన్నో సార్లు తన అంతిమ క్షణాల గురించి ప్రస్తావించేవారు. తనను నూరేళ్ల వరకు మృత్యువు సమీపించదనీ, మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలనీ, అప్పుడు కూడా తన మిత్రులు, అభిమానులు తనతో ఉండాలని కోరుకుంటున్నాననీ అనేవారు. పసి మనస్సును తలపించే ఆ మహోన్నత మూర్తి పుట్టినరోజున ఆయన ఆత్మకు అంజలి ఘటిద్దాం. అంతటి మహనీయుని సమకాలికులుగా పుట్టినందుకు, ఆయన స్నేహ సంపదను పంచుకున్నందుకు జన్మ ధన్యమైందని గర్విద్దాం. డా‘‘ పైడిపాల వ్యాసకర్త సినీగేయ పరిశోధకులు ‘ 99891 06162(నేడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి) -
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.కె.ఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీన్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. సాంగ్ బాగుంది. మా దర్శకుడు బాలకు, సినిమాలోని నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు. -
పుష్ప పాటకు RGV డ్యాన్స్
-
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్‌లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్‌గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు. -
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్‌బంప్సే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్ అనే పేరుతో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్లోని హుకుమ్ సాంగ్ కంపోజ్ చేసి అనిరుధ్ తనదైన మార్క్ చూపించారు. దీంతో దేవర సాంగ్ తర్వాత హుకుమ్ సాంగ్ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్ చేయడంతో గూస్ బంప్స్ ఖాయంగా కనిపిస్తోంది. It's a warning notice from the Lord of Fear…. #FearSong Promo out now! #Devara pic.twitter.com/RJYOs59mNL— Devara (@DevaraMovie) May 17, 2024 -
సిల్క్ సారీ.. చేతులోన స్కాచ్ గ్లాస్
వాసుదేవ్ రావు హీరోగా, రీవా చౌదరి, ప్రతీ గోస్వామి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సిల్క్ సారీ’. చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని కోరుకుంటున్న . అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను’ అన్నారు. -
విశ్వక్ సేన్ యాక్షన్ ఎంటర్టైనర్.. బ్యాడ్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రంలో డీజే టిల్లు భామ నేహాశెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.'అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తేదీ మరోసారి మారింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. మొదట ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఈ సినిమాలోని ‘సెట్ అయ్యిందే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, సహ–నిర్మాత: అజయ్ కుమార్ రాజు .పి. -
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్‌లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
పుష్ప స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్‌లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్‌కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్‌తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ఆమ్ఆద్మీపార్టీకి ‘ఈసీ’ షాక్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి ఎన్నికల కమిషన్(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్న పాటలో పలుసార్లు రిపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్‌ను ఆదేశించింది. పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్ కె జవాబ్ మే హమ్ ఓట్ సే దేంగె’అన్న నినాదం వచ్చినపుడు కేజ్రీవాల్ జైళ్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. కాగా, తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆప్ మండిపడింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సీబీఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. -
శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్ రిలీజ్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. సాంగ్ చాలా ప్రత్యేకంగా..పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు. చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప–2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ తొలి లిరికల్ వీడియో ్రపోమోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాటని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్’ (2021) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప–2 ది రూల్’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈఓ: చెర్రీ. -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
-
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్‌ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్‌ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
పుష్ప సాంగ్ క్రేజ్.. వారి స్టెప్పులకు సమంత ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్‌గా చేయాల్సిందని ఫన్నీ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. -
సీఎం జగన్ పాటకు ఫ్లాష్ మాబ్..
-
టాలీవుడ్ యంగ్ హీరో సస్పెన్స్ థ్రిల్లర్.. సాంగ్ రిలీజ్!
ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని 'నిన్నా మొన్న' అనే సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్‌లో సుహాస్, పాయల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘నీ గొంతు గుర్తు పట్టాను సుమా’.. అంధుడి ముఖంపై చిరునవ్వు
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి.. ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో... విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు.. కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్లో తను.. తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు! కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది.. ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు.. చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు.. నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని! ఇదీ ఓ బంధమే. అపురూపమైంది! ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే.. ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు! View this post on Instagram A post shared by Priya Gamree (@gamreepriya) -
సరికొత్త టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. క్రేజీ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అందుకోవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. 'మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు. లెజెండరీ సింగర్ చిత్ర మా పాటను పాడటం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని అన్నారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా మూవీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి అందుకోవా అనే పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎబెనెజర్ పాల్ సంగీతమందిస్తున్నారు. -
జగన్ పాటకు.. మహిళల డ్యాన్స్
-
గోదావరి నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శశివదనే. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'గోదారి అటు వైపో' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ శశివదనే, డీజే పిల్లా అనే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్ ఆడియన్స్ ఊహించని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. -
లవ్ మాక్‌టైల్ 2 నుంచి బ్యూటిఫుల్ సాంగ్..
కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయిత, దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన చిత్రం లవ్ మాక్‌టైల్ 2. ఈ మూవీ నుంచి బుధవారం నాడు.. ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, లవ్ మాక్‌టైల్ 2 చిత్రాలు కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. 'కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. -
హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్‌పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్‌బాబు డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్‌ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్‌కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
కలియుగం పట్టణంలో మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం చూసుకున్నారు. ప్రస్తుతం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారభించింంది చిత్రబృందం. ఈక్రమంలోనే ఈ చిత్రం నుంచి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చంద్రబోస్ రాసిన గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. అజయ్ అరసాద అందించిన బాణీలు అందించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
రోటీ కపడా రొమాన్స్ మూవీ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఓహ్... మేడమ్...
నచ్చిన అమ్మాయి మనసు దోచేయడానికి ‘ఓహ్... మేడమ్...’ అంటూ పాట అందుకున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం కోసమే ఈ పాట. ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నరేశ్–ఫరియాపై చిత్రీకరించిన తొలి పాట ‘ఓహ్.. మేడమ్’ను సంగీతదర్శకుడు ఎస్ఎస్ తమన్ విడుదల చేశారు. గోపీచందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హీరోయిన్ పట్ల హీరో వ్యక్తపరిచే భావోద్వేగాల నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
చిపి చిపీ చాపా... డుబిడుబిడు
వైరల్ ట్రెండ్ క్రియేట్ కావడానికి కొలతలు, ప్రమాణాలు అంటూ ఏవీ ఉండవు. తాజా వీడియో ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు తెస్తోంది. అర్థం తెలియని ఒక పదబంధం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దృష్టిని ఆకర్షించి వైరల్ ట్రెండ్‌గా మారింది. ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు’ అనే పదబంధాలను లయాత్మకంగా పలుకుతూ, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో వెల్తువెత్తుతున్నాయి. అసలు ఈ ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు అనే వింత సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయానికి వస్తే... జనవరిలో విడుదలైన ఒక ఫిలిప్పినో పాటలోని సౌండ్స్ ఇవి. ట్రెండ్‌ను ఉన్నది ఉన్నట్లు ఫాలో కాకుండా వివిధ రూపాల్లో తమదైన సృజనాత్మకతను జోడిస్తున్నారు క్రియేటర్స్. పవర్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ నుంచి నవ్వు తెప్పించే లిప్‌సింక్ వరకు... వారి సృజనాత్మకతకు హద్దులు లేవు. టిక్‌టాక్‌లో పుట్టిన ఈ ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించింది. -
పాన్ ఇండియా మూవీగా వస్తోన్న రికార్డ్ బ్రేక్..!
నిహార్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. మళ్లీ పుట్టి వచ్చినవా అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తోంది. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అతి త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో 8 భాషల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలత పాత్రల్లో నటిస్తున్నారు. -
'చూసుకో' అంటోన్న యంగ్ హీరోయిన్.. ఆకట్టుకుంటోన్న కెమిస్ట్రీ!
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ రూపొందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు మెరిశారు. త్రిగుణ్, ఆయుషి పటేల్ జంటగా ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'చూసుకో అంటూ' సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. ఈ సాంగ్‌లో త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
‘పుష్ప’ఫేం రాజలక్ష్మీ నోట ‘ఇంటి నెం.13’ పాట
కాలింగ్‌బెల్, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన పన్నా రాయల్ తెరెకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇంటి నెం.13’. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్ విజువల్స్‌ను కూడా జోడించారు. డైరెక్టర్ పన్నా రాయల్ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్ వెర్షన్లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు ఉంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘తెలుగు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’ అని నిర్మాత హేసన్ పాషా అన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘పరవశవమే’ మెలోడీ సాంగ్
ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. యూత్ ఆడియెన్స్ అంతా కూడా లవ్ స్టోరీలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా' రాబోతోంది. అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఎంతో వినసొంపుగా ఉంటుంది. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్!
వికాస్ జీకే, శాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. ఈ చిత్రానికి డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎల్వీ సూర్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి అందమా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లు సినిమా అవుట్‌పుట్ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా.. ఈ సినిమాకి నిజాని అంజన్ సంగీతం అందించారు. -
జగన్ మామ.. జగన్ మామ పాటకు.. పరవశించిన రాప్తాడు సభ
-
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
రొమాంటిక్ లవ్ స్టోరీగా 'జస్ట్ ఏ మినిట్'.. లిరికల్ సాంగ్ రిలీజ్!
అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం "జస్ట్ ఎ మినిట్". ఈ సినిమాను రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మించారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నువ్వంటే ఇష్టం అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణాస్ యశ్వంత్ మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ.. డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.'మని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫస్ట్ లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ ఏ మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
'గుంటూరు కారం' క్రేజీ సాంగ్.. ఇలా కూడా వాడేస్తున్నారా?
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. అమెరికాలోనూ తగ్గని క్రేజ్.. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. 'కుర్చీని మడతబెట్టి' అనే పాట చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఈ సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరేమో. అంతలా వైరలైంది గుంటూరు కారం సినిమాలోని పాట. ఇప్పుడు ఇండియాలోనే కాదండోయ్.. కుర్చీ సాంగ్ ఫీవర్ కాస్తా అమెరికాకు చేరింది. ఏకంగా ఈ పాటకు స్టెప్పులు వేయడమే కాదు.. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్ ప్లే అవుతుండగా ట్యూన్‌కు తగ్గట్టుగా వర్కవుట్ చేస్తూ కనిపించారు. కుర్చీని మడతపెట్టి.. వార్మప్ అంటూ ఎంజాయ్ చేస్తోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబుగారి "గుంటూరు కారం" సినిమా హిట్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ అమెరికాలో మాత్రం ఇదీ పరిస్థితి ఇప్పుడు 👇😊#GunturKaaram #GunturKaaramCelebrations pic.twitter.com/TF9XtYr87y — Prakash Arige (@prakasharige) February 7, 2024 -
మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానుంది. ఈ మూవీని మార్చి 1 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనుండగా.. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆడియన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. జనవరి 26న రిపబ్లిక్ డేకు ముందు దేశభక్తి జ్వాలని రగిలించే ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన' అనే పాటను అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో వరుణ్‌తేజ్ ఆసక్తిక ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అంటూ విద్యార్థులు వరుణ్‌తేజ్‌ను అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ..'నేను నా ఫేవరేట్ హీరోయిన్నే పెళ్లి చేసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. మా ఇద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది నేనే' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానం అని తెలిపారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి మాస్ మూవీ మట్కా. గద్దల కొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉండనుంది.' అని అన్నారు. Love takes flight and so do we!#OperationValentine second song out now❤️ - https://t.co/FeQNC1gjrd#Gaganaala #RabHainGawah#OPVonMarch1st@ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ArmaanMalik22 @singer_shaan @sonypicsfilmsin @RenaissancePicz @saregamaglobal pic.twitter.com/0OC575Ndot — Varun Tej Konidela (@IAmVarunTej) February 6, 2024 -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందంలోని 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాటకు పనిచేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ సాంగ్ వస్తోంది. కాగా..ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐదురోజుల పాట..గిన్నిస్ వరల్డ్ రికార్డు
వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్ సదర్భంగా ఆమె తన గాన మారథాన్ ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్‌ను బ్రేక్ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్ సునీల్ వాగ్మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు. -
ముకాబులా పాట ఘంటసాల పాడితే...
‘రెహమాన్‌జీ... ముక్కాలా ముకాబులా పాటను ఘంటసాల గొంతులో వినిపిస్తే వినాలని ఉంది’ ‘ఒకే ఒక్కడు సినిమాలో జానకి పాడిన ధీరా మగధీరా పాటను భానుమతి గొంతులో వినిపించగలరు’... ఇలాంటి విన్నపాలెన్నో సోషల్‌మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ‘లాల్ సలాం’ సినిమాలోని ఒక పాట కోసం దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హుమీద్ గొంతులను ఏఆర్ రెహమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రెహమాన్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా...‘బంబా బక్యా–షాహుల్ హమీద్‌ల గురించి తెలియనివారు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వారి గురించి విశేషాలు తెలుసుకుంటున్నారు. -
ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన దేశభక్తి గీతం పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియోని కైరోలోని భారత రాయబార కార్యాలయం నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ జిప్ట్కి చెందిన కరీమాన్ అనే అమ్మాయి దేశభక్తి గీతం "దేశ్ రంగీలా" పాటను ఎంతో చక్కగా ఆలపించింది. ఈ వీడియోని చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నానికి ఆమెను అభినందిస్తున్నాను. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కాగా, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీమాన్ పాడిన పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడి రాయబార కార్యాలయంలో కరీమాన్ గానం అటు భారతీయులను, ఈజిప్షియన్లను ఎంతగానో ఆకట్టుకోవడం విశేషం. A young Egyptian girl Kariman presented a patriotic song "Desh Rangeela" during 75th #RepublicDay celebrations at 'India House'. Her melodious singing and correct intonation impressed the large gathering of Indians and Egyptians. @MEAIndia @IndianDiplomacy @MinOfCultureGoI pic.twitter.com/7mQiZY4Q77 — India in Egypt (@indembcairo) January 28, 2024 (చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?) -
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
శ్రీరాముని కోసం సీనియర్ నటి ప్రత్యేక గీతం..!
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.