SPSR Nellore district
-
‘ఏపీఈఆర్సీ సాక్షిగా రుజువైందిగా.. ఇప్పుడేమంటారు చంద్రబాబూ.?’’
నెల్లూరు: సెకీ(SECI) ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. సెకీతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వార్తలు రాసిందని, ముందు చూపుతో వైఎస్ జగన్(YS Jagan) చేసిన ఒప్పందంతో రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ లభించిందన్నారు.నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘ఏపీ(AP) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ కు మరక అంటించేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డిస్కమ్ లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదుజగన్ ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల ఆదాయం వస్తే.. చంద్రబాబు వల్ల 87వేల 500 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎల్లో మీడియాకు క్రెడిబులిటీ ఉంటే.. తప్పుడు రాతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్యుత్ రంగాన్ని చంద్రబాబునాయుడు తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై బురద చల్లుతున్నారు’అని ధ్వజమెత్తారు.కాగా, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది.‘సెకీ’ ఒప్పందం సక్రమమే -
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేసిన పచ్చ నేతలు
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్‌కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. -
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కొట్టేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాఫై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం...కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు. -
అప్డేట్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచకాలు
Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు..బుచ్చి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ డౌర్జన్యాలకు పాల్పడింది. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ వైఎస్జగన్ బొమ్మను చూసే మాకు, కౌన్సిలర్లకు ఓట్లు వేశారు పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదు.. కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారు.. ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పక్కన నిలబడ్డారూ.. వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తాం..టీడీపీకి ఓట్లు వేసిన వారు వెన్నుపోటుదారులయ్యారు: మాజీ మంత్రి కాకాణి టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెన్నుపోటుదారులులాగా మిగిలిపోయారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికే టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు.. విప్ దిక్కరించిన వారందరూ అనర్హులవుతారు వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన అరుగుర్ని వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తాం.. వారికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కార్యకర్తలకు అండగా ఉంటాం మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు.. క్యాష్, పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుతమ పార్టీ కార్పొరేటర్లు ను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు హైకోర్టులో పిటిషన్కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్విచారణ జరిపిన హైకోర్టురక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్‌కు కోర్టు ఆదేశంకార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్‌కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలుతాడేపల్లి:అసలు చంద్రబాబు మనిషేనా: మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి పదవులు గెలుపొందారురాష్ట్రంలో ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదుకానీ మావారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటుమా కార్పోరేటర్లు వెళ్లే బస్సు మీద దాడి చేయడం దారుణంతిరుపతి ప్రతిష్టను దిగజార్చారుఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారుఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ, కేజ్రివాల్‌ని తిట్టారుఅసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా?సిద్దాంతాలు, విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబుఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవటానికే చంద్రబాబు ఢిల్లీ ప్రచారానికి వెళ్లారుఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వంవైసీపి కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారుపవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారుఈ దాడులు, దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలిఅధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలిఎన్టీఆర్ జిల్లా:కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందిఎమ్మెల్సీ,మొండితోక అరుణ్ కుమార్రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలే అందుకు నిదర్శనంఎలాగైనా గెలవాలని వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారుటీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారుసైకిల్ గుర్తు పై గెలిచిన వారు కేవలం ఆరుగురేఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు 13 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని గెలవాలని చూశారువైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని కూడా ఎన్నికలను నిర్వహించుకోలేకపోయారునందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ ఎమ్మెల్యేఎంపీకి , ఎమ్మెల్యేకి పొసగడం లేదని మీ అనుకూల మీడియాల్లోనే చెబుతున్నారుపార్టీ విప్ ను టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారని వార్తలొస్తున్నాయిమీరు డమ్మీ ఎమ్మెల్యే అని మేం చెప్పడం లేదు...మీ పార్టీవాళ్లే చెబుతున్నారు13 మంది సభ్యుల బలం ఉందని చెప్పుకుంటున్న మీరు ఎందుకు ఎన్నిక జరుపుకోలేకపోయారువైఎస్సార్సీపీ కౌన్సిలర్ మంద మరియమ్మ ఇంటిని ప్రొక్లెయినర్లతో కూల్చేశారుటీడీపీకి ఓటేయకపోతే నీ ఇంటిని కూల్చేసినట్లు నిన్ను కూడా కూల్చేస్తామని మరియమ్మను హెచ్చరించారుబెదిరించి,భయపెట్టి మంద మరియమ్మను టీడీపీలో చేర్చుకున్నారుతమకు లొంగకపోతే బెదిరిస్తున్నారు...భయపెడుతున్నారు...ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నందిగామలో అరాచకాలు పెరిగిపోయాయిప్రభుత్వం రాగానే జగనన్న వాక్‌ను ధ్వంసం చేశారుమేం చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారుగత ఐదేళ్లలో నందిగామలో రాజకీయంగా ఒక్క 307 కేసు కూడా పెట్టలేదుకానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 307 కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారునందిగామ మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై మేం కోర్టుకు వెళ్లాంఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారు చనిపోతే ఆ వార్డులలో ఎన్నికల కోసం మేం కోర్టుకు వెళ్లాంనందిగామలో టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారుకౌన్సిలర్లను ఐదు గంటలుగా బంధించారు.. ఫోన్లు లాక్కున్నారుస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సూచిస్తున్నాఇంకా ఎన్నాళ్లు డమ్మీ ఎమ్మెల్యేగా ఉంటారునందిగామ నియోజకవర్గాన్ని అపహాస్యం చేశారుటీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంతా మాతో టచ్ లో ఉన్నారుసరైన సమయంలో సరైన ట్విస్ట్ ఇస్తాం ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు..విజయవాడ..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదుతిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై ఫిర్యాదుఈసీకి ఫిర్యాదు చేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మికుట్రలతో టీడీపీ విజయం..ఏలూరు..కుట్రలతో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ను దక్కించుకున్న టీడీపీబలం లేకపోయినా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసిన మంత్రి పార్ధసారధితీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లుఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరు14 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో టీడీపీకి ఓటేసిన ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్18 ఓట్లు రావడంతో టీడీపికి దక్కిన నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిమున్సిపల్ వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణగతంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన పగడాల సత్యనారాయణసత్యనారాయణను టీడీపీలో చేర్చుకుని మళ్లీ అతన్నే వైస్ చైర్మన్‌గా చేసిన టీడీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..తిరుపతి జిల్లా..డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులుటీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి నెల్లూరు జిల్లా..మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.వైఎస్సార్సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదువైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించింది..తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుందిన్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తిఅనంతపురం జిల్లా..మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్సీపీకి బలం ఉందిఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారుఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారుచంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాంముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహిహంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గంమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా..టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాటచైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతుస్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానంతనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యఅధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీనేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్యఅభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళినందిగామలో ఎన్నిక వాయిదాఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదారేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలిప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దుదాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందిఅలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాంపోలీసు బలగాలను పెంచాలని కోరాంమా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోందిప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారుతిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారుమావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారుబీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారుఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారుఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారునిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాంపోలీసులపై నమ్మకం లేదని చెప్పాంఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాంతిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారుగతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్‌షా పై దాడి చేశారుప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..శ్రీసత్యసాయి జిల్లా..హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీపార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపువైఎస్సార్సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీహిందూపురంలో మొత్తం 38 వార్డులు తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. నూజివీడులో ఉత్కంఠ..ఏలూరు..నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడుఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్వైఎస్సార్సీపీ బలం 24 , టీడీపీ బలం 8బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీవైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథిరాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలంఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటుమంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలునూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లుమహిళలపై దాడి అమానుషం: గడికోటవైఎస్సార్ జిల్లా..లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలుఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గంబీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టసొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబంకూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలిబీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణంమీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరువృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.కాకినాడ..కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్లోకి అనుమతించని పోలీసులుఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులుఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహంనెల్లూరు..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.కార్పొరేటర్స్‌తో కలిసి కార్పొరేషన్‌కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ..ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తివిప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.తిరుపతి..మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్పై టీడీపీ నేతలు దాడి.టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్చల్ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్తిరుపతి..భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విజయవాడ..నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలుబలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలుఅనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుచనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వంచనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీనేడు తీర్పునివ్వనున్న కోర్టుకోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వంఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీనూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికబలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలురాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ హిందూపురంలో టీడీపీ కుట్రలు..వైఎస్సార్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నికహిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.టీడీపీ బరితెగింపు రాజకీయాలు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాడేపల్లి..నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీకార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశంపార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలువిప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంతిరుపతి..తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దంఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తివైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డితిరుపతి..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీడిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్‌గా నియామకంతిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలువిప్ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికతిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్హిందూపురంలో 144 సెక్షన్..శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు. చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్తిరుపతి..పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుభూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులుఆటో నగర్లో కార్పొరేటర్ ఉమా అజయ్‌కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులుకూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
అరచేతిలో వైకుంఠం.. హామీలతో కనికట్టు.. చంద్రబాబుపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, హామీలతో కనికట్టు చేసిన దీ గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు. ఎలాంటి సంకోచం, భయం లేకుండా ప్రజలను మోసం చేయగల ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..సంపద సృష్టించిన తరువాతే హామీల అమలు అని తేల్చేశారుచంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అని చంద్రబాబు నిరూపించుకున్నాడు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ పోల్చి చూస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిబోయే సమయం ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న మొత్తం రూ.5000 కోట్లు.అటువంటి నేపథ్యంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్దాలను నిస్సిగ్గుగా మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఒక్కసారి చూస్తే… ‘‘అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోరో మనీ ఉంటే మోరో క్యాపిటల్ వ్యయం ఖర్చు పెడతాం. మోర్ గ్రోత్ రేట్ వస్తుంది. మోర్ రెవెన్యూ వస్తుంది. సస్టైనబులిటీ వస్తుంది. ఆ సస్టైనబులిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేం చెప్పిన సూపర్ సిక్స్ఇస్తాం. ఇంకా బెటర్‌గా ఇస్తాం. పీ4 తీసుకొస్తాం.’’ ఇదీ నీతి ఆయోగ్ నివేదిక పై ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు.9 నెలల్లో రూ.1.19 కోట్లు అప్పులుప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి… వారిని రోడ్డు మీదకు పెడుతున్నారన్నది నిజం కాదా? వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు కుదించడం దగ్గర నుంచి, బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాల్లో లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తున్నది వాస్తవం కాదా? పైగా జగన్ ఒక ముందుచూపుతో, విజన్ తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే.. వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా?ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతోపాటు, మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నంచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇక సంపద సృష్టి ఎక్కడ జరుగుతోంది. సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడుగారి మనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు. ఇసుక, మద్యం మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఫ్లైయాష్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు.నియోజకవర్గాల్లో ప్రతి పనికీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.. ఈరకంగా సంపద సృష్టి మీ వాళ్లకు జరుగుతోంది తప్ప.. పేదలకు, సామాన్యులకు సంపద సృష్టి దక్కడం లేదు. మీ పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరగుతోంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు. అందుకే చంద్రబాబుగారు… సంపద సృష్టి అన్నది వట్టిమాటలేనని చెప్పకనే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా, స్లోగా ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు.హామీల అమలుకు చంద్రబాబుకు మనసు రావడం లేదుతాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలను అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతగాని తనంతో, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు, ఆ నేరాన్ని జగన్ గారి మీద నెట్టేయడానికి ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేవేసిన, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారు. దాంట్లో భాగమే తాజా ఆయన చెప్తున్న నీతి ఆయోగ్ నివేదిక. అసలు నీతి ఆయోగ్ పేరుమీద చంద్రబాబు విడుదలచేసిన రిపోర్టును చూస్తుంటే.. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.ఒక రాష్ట్రం ఆర్థిక పనితీరు చెప్పాలంటే, ఒక ఏడాదికి, తర్వాత ఏడాదికి పోల్చి చూడ్డం సహజం. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో ప్రగతి ఎలా ఉంది? అన్నది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు. లేదంటో గత ఐదేళ్లతో, తర్వాత ఐదేళ్లతో పోల్చి చూస్తారు. సహజంగా ఎవరైనా చేసే పని ఇది. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వ పనితీరును ఆయన పనిచేసిన ఐదేళ్లకాలానికి, అంతకుముందు నాయకుడు పనిచేసిన ఐదేళ్లకాలానికి పోల్చిచూస్తారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏంటి? ఎవరి పనితీరు ఎలా ఉందో చూస్తారు. పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం ఇది. కాని చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన 2018-19 ఆర్థిక సంవత్సరంతో, వైయస్ జగన్ గారు పరిపాలించిన ఐదేళ్లకాలంలోని 2022-23 సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. రెండు పరిపాలనా కాలంలో ఎంపికచేసుకున్న రెండు సంవత్సరాల మధ్య పోలిక చూడటం అనే కొత్త పద్దతిని చంద్రబాబు మాత్రమే సిగ్గు లేకుండా ప్రవేశపెట్టారు.మూలధన వ్యయంపైనా అవాస్తవాలుచంద్రబాబు గత పరిపాలనా కాలం అంటే 2014-19 మధ్య కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు. కాని జగన్మోహన్ రెడ్డిగారి హయాంలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ ప్రపంచంమీద దాడిచేసింది. మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని తీసుకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తి లేదు, చేసిన వాటిని ఎగుమతి చేసే వీలులేదు, పంపిణీ వ్యవస్థలు లేవు. 2020లో మొదటి వేవ్, 2021లో రెండో వేవ్, 2023లో మూడో వేవ్ ఇలా ఆ రెండున్నర సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రపంచంమీద దాడి చేసింది. ఇంతటి సంక్షోభం ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ జగన్ మెరుగైన పనితీరు చూపించారు.వాస్తవంగా నీతి ఆయోగ్ రిపోర్టును చూస్తే కేవలం జగన్ గారి హయాంలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బాగోలేదని, 13వ స్థానానికి దిగిపోయామని చెప్పారు. అదే నీతి ఆయోగ్ రిపోర్టులో కూడా కోవిడ్ లేని సమయంలో చంద్రబాబు హయాంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13 కాగా, ఆ తర్వాత కోవిడ్ లాంటి సంక్షోభం ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13వ స్థానమే. చంద్రబాబు మూలధన వ్యవయం మీద కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 2014-19 మధ్య కాలంలో, చంద్రబాబుగారి గడచిన ఐదేళ్లలో మూల ధన వ్యయం కింద సగటున ఏడాది రూ.13,860 కోట్లు ఖర్చుపెడితే, జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య సగటున ఏడాదికి రూ. 15,632 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కాగ్ ఇచ్చిన లెక్కులు. మరి ఎవరు ఆర్థిక అరాచకవాదో ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో క్షీణించిన రుణాల లభ్యతలో స్థిరత్వం2024-25 అంటే నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకాలంలో తెచ్చిన అప్పులు వారి లెక్కల ప్రకారమే రూ.73,635కోట్లు కాగా, అందులో మూలధన వ్యయం కింద పెట్టిన ఖర్చు కేవలం రూ.8894.98 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి విపత్తు ఉన్నప్పుడు జగన్ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో రూ.67,985 కోట్లు అప్పులు తెస్తే, అందులో సుమారుగా రూ.7300 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఒక విపత్తు నడుస్తున్న సమయంలో, ఏ పనులు కూడా నడవని సమయంలో చేసిన ఖర్చు ఇది. మరి ఎవరు ఆర్థిక అరాచకవాది?ఒక రాష్ట్రం తానుచేసిన అప్పులు మీద చెల్లించే వడ్డీల వృద్ధిరేటు, జీఎస్డీపీ వృద్ధిరేటు కన్నా అధికంగా ఉంటే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించినట్టేనని గొప్ప ఆర్థిక నిపుణుడుగా, విజనరీగా తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారు. 2013-14లో విభజిత రాష్ట్రం జీఎస్డీపీ రూ.4,64,272 కోట్లు అయితే, వడ్డీ చెల్లింపులు రూ.7,488 కోట్లు. అదే 2018-19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,73,721 కోట్లు అయితే, వడ్డీల కింద చెల్లింపులు రూ.15,342 కోట్లు. అప్పులపై కట్టే వడ్డీ వృద్ధిరేటు 15.42% కాగా, GSDP వృద్ధిరేటు 13.48%. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన నిర్వచనం ప్రకారం చేస్తే మీ పాలనలోనే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణమైన పాలన అందించిన చంద్రబాబును ఆర్థిక అరాచకవాది అనడం తప్పవుతుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూటకో మాటఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పులుమీద కూడా చంద్రబాబు చేస్తున్న డ్రామాలు, గిమ్మిక్కులు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పులు మీద ఇలాంటి ప్రచారం చేశాడు. కాని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయాడు. 05.04.2022న రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ చంద్రబాబు ప్రకటన చేశారు.17.05.2022న శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని చంద్రబాబు పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబు గారి వదినమ్మ పురంధీశ్వరి గారు ప్రకటించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 21.04.2024న ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబుకు వంతపాడే ఈనాడు దినపత్రిక ఒకాయనను పట్టుకొచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు అని ప్రకటించి ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.అప్పుల లెక్కలపై తన మాటలపైనే చంద్రబాబుకు నిలకడలేదురాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, అప్పుల పైన ఇంత దారుణంగా ప్రచారంచేసిన చంద్రబాబు మే 29, 2023న రాజమండ్రిలో సూపర్ సిక్స్ అంటూ హామీలను ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి డబ్బుల్లేవు, కొండల్లా అప్పులున్నాయి, చూస్తే భయమేస్తోందని కథలు చెప్పడం ప్రారంభించాడు. జూలై 10, 2024న ఆర్థికశాఖ పై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 2024న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ అప్పులు ఉన్నాయని చెప్పించారు.అదే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదలచేస్తూ రాష్ట్రం అప్పులు రూ.12,93,261 కోట్లు ఇది ఆర్ధిక విధ్వంసం అంటూ కొత్త లెక్కలు చెప్పారు. చివరకు అప్పులు మీద తాను చెప్పిన అంకెలు నిజం అని నిరూపించేందుకు చివరకు బడ్జెట్‌ను కూడా వాయిదా వేశాడు. నవంబర్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పులు రూ.4,91,734 కోట్లు అనిమాత్రమే చూపించాడు.ప్రభుత్వ గ్యారెంటీలకు చెందిన అప్పులు రూ.1,54,797 కోట్లు అంటే ఇవి రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. అంటే చంద్రబాబు గతంలో అప్పులపై చేసిన ప్రకటనలు అన్నీ అబద్దాలే అని స్పష్టం అయ్యింది.బడ్జెట్ సాక్షిగా చెప్పిన లెక్కలను కూడా కాదంటూ ఇప్పుడు చంద్రబాబు నేటి వరకు మొత్తం అప్పులు రూ.9.75 లక్షల కోట్లు మరో కొత్త లెక్క చెబుతున్నాడు. ఒక్క మాట మీదైనా చంద్రబాబుకు నిలకడ ఉందా? పోనీ చంద్రబాబు అప్పులు తీసుకు రావడంలేదా? అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ తొమ్మిది నెలల కాలంలో అన్నిరకాల అప్పులు కలిపి సుమారు రూ.1.19 లక్షల కోట్లు తెచ్చాడు. వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. చట్టం అనుమతించిన ప్రకారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాని చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
‘ వివాదాస్పదంగా జిల్లా కలెక్టర్ నిర్ణయాలు’
నెల్లూరు: జిల్లా కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ పాటిస్తున్నారని విమర్శించారు.రెడ్ క్రాస్(Red Cross) ప్రాథమిక సభ్యత్వం నుంచి వైఎస్సార్సీపీ(YSRCP) సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్‌కి లేదని స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన కాకాణి.. కలెక్టర్ హోదాలో కూర్చొనే అర్హత ఆనంద్ కి ఉందో లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ గా బీజేపీ(BJP) ఎంపీనే ఉన్నారని, రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదన్నారు కాకాణి.ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రెడ్‌క్రాస్ వివాదాస్పదం కాకూడదనే చైర్మన్ పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారని, రెడ్ క్రాస్ విలువ పెంచేలా ఆయన వ్యవహరించారన్నారు.‘రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి కారకులు mlc చంద్రశేఖర్ రెడ్డి అని, ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని ూచూస్తున్నారు. మంత్రి నారాయణకి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్ క్రాస్ విషయంలో గత కలెక్టర్లకు రాని ఇబ్బంది, ఇప్పుడు కలెక్టర్‌కి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. రెడ్ క్రాస్ ద్వారా టీడీపీ నేతలే సేవల చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తాం’ అని ఆయన తెలిపారు.వైఎస్సార్సీపీ వారి సభ్యత్వమే రద్దు చేయడం దారుణంరెడ్ ్క్రాస్ సంస్థలో వైఎస్సార్సీపీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రెడ్ క్రాస్‌లో ఐదు వేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90 శాతం మంది పొలిటికల్ ాపార్టీ వారే ఉన్నారని, కానీ వైఎస్సార్సీపీ వారికి మాత్రమే సభ్యత్వం రద్దు చేయడం ాదారుణమన్నారు. మంత్రి నారాయణకు రెడ్ క్రాస్ మీద అవగాహన లేదని, కాబట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ఆయన కనీసం ఇందులో సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ లోకీలకంగా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెడ్ క్రాస్ లోమెంబర్గా చేర్చి, దాన్ని నాశనం చేయాలని మంత్రి చూస్తున్నారన్నారు. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్‌రెడ్డి. -
ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు: కూటమి సర్కార్‌పై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ క్యాడర్‌పై కూటమి దాడులు చేస్తున్నారని.. పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు.అక్రమ కేసులు, అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తప్పవు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. నా పై మరిన్ని కేసులు పెట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానులను ఆపలేరు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదాకా పోరాడుతా’’ అని కాకాణి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు...ప్రతీ ఇంటికీ వెళ్లి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం.జగనే కరెక్ట్ అంటున్నారు..బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రతీనెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతీనెలా ఏదో పథకం వచ్చేది. ఐదేళ్ల పాటు షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. బాబు బాదుడు..కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. మనం చెప్పినవి చేసి చూపించాం. అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. అధికారం కోసం ఏ గడ్డైనా మనం తినలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేల మీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదు. మనం ప్రతీ మూడు నెలలకూ విద్యా దీవెన కింద డబ్బులు చెల్లించాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కానీ, ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగమే..రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతీ గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి. కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి.నెలఖారు నుంచి ప్రజలతోనే..నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతీ వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతీ రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.సోషల్ మీడియా వినియోగించుకోవాలి..గ్రామస్థాయిలో ఉన్న ప్రతీ కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. చంద్రబాబుని నిలదీసే కార్యక్రమం చేయాలి. దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు కట్ అయిపోయాయి. ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు. -
రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) రేపు(బుధవారం) నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్లు హాజరుకున్నారు.రేపు(బుధవారం) నెల్లూరు(nellore) జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
అరెస్ట్‌పై ప్రశ్నిస్తే కేసులా?.. ఎవర్నీ వదలేది లేదు: కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులే(AP Police) నేరస్థులుగా మారుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘జిల్లాలో పోలీసులే నేరస్థులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. తనకు సంబంధం లేనట్టు.. జిల్లాకి తాను ఎస్పీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు చేర్చారు. నేరస్థులను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి వెంకట శేషయ్య వ్యవహారమే ఉదాహరణ.శేషయ్య అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ న్యాయవ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించింది. శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో.. అన్ని నీళ్లు తాగిస్తా.. పోలీసులకు, కూటమి నాయకులకు ఇదే నా హెచ్చరిక. ఈ కేసులో జరిగిన తప్పిదాలను సమాజం ముందు ఉంచుతాం. జిల్లా అధికారులు ఈ కేసులో న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎస్పీ విచారణకు ఆదేశించాలి. నా కళ్ల ముందు జరిగిన వ్యవహారం ఇది. ఇందులో ఎవరినీ వదలం పెట్టేది లేదు. కోవూరులో కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టం. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తాం. ఇక్కడ పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా వేస్తాం అని హెచ్చరించారు. -
రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ రంగం(Agricultural sector) సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.ఇప్పటివరకు 95 మంది రైతులు(Farmers) ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.రైతుల ఆత్మహత్యలు బాధాకరం:తాజాగా వైయస్సార్ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 150కి పైగానే అని సమాచారం.రైతు ఆత్మహత్యలపై కూటమి పార్టీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ చూపిస్తే చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజల్లో ఆగ్రహం వెల్లుబుకుతుందని వారి భయం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో ఒకసారి చంద్రబాబు అనడం అందరికీ గుర్తుంది.పరిహార చెల్లింపులోనూ బాబు వంచన:రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆయనది అదే ధోరణి. లక్ష రూపాయల పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నాటికి ఆ పరిహారం కూడా ఆపేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత కూడా 2015, ఫిబ్రవరి 18 వరకు ఆ పరిహారం రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పి, ఆ డబ్బును నేరుగా బాధిత కుటుంబానికి కూడా అందజేయకుండా వంచించారు.లక్షన్నర బ్యాంకు రుణాల కోసం కేటాయించి, మిగతా మూడున్నర లక్షలు కూడా వారికి ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసి వడ్డీతోనే జీవించాలనేలా చేసి మోసగించాడు. 2014– 19 మధ్య చూస్తే దాదాపు 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వం గుర్తించింది కేవలం 1223 మందిని మాత్రమే. ఆ మొత్తం కుటుంబాలకు కాకుండా, కేవలం 450 కుటుంబాలకు మాత్రమే రూ.20.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిహారం:2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని ఒకేసారి రూ.7 లక్షలకు పెంచడంతో పాటు, చంద్రబాబు పాలనా కాలంలో ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాలకు కూడా న్యాయం చేశారు. ఆ విధంగా 474 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1794 కుటుంబాలకు రూ.116.10 కోట్ల పరిహారం అందించగా, వారిలో 495 కుటుంబాలు కౌలు రైతులవి.రైతులకు చంద్రబాబు మోసం:నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే.. 2014 అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు, వారిని దారుణంగా మోసగించారు. మళ్లీ మొన్న ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని కూడా అమలు చేయకుండా మరోసారి మోసం చేశారు. రైతు భరోసా కింద వైయస్సార్సీపీ ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి రూ.20 వేలు ఇవ్వాలంటే, ఈ ఏడాది రూ.10,718 కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో ఆ కేటాయింపు చేయకుండా మరోసారి చంద్రబాబు రైతులను వంచించారు.ఎన్నికల కోడ్ వల్ల గత ప్రభుత్వం చెల్లించలేకపోయిన రూ.930 కోట్ల రైతుల ప్రీమియం, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెల్లించని కారణంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు దక్కాల్సిన రూ.1385 కోట్ల బీమా దూరమైంది. ఉచిత పంటల బీమా పథకానికి కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. మా ప్రభుత్వ హయాంలో యూనివర్సలైజేషన్ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం, కేంద్ర ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గనరైతులకు బాబు బకాయి రూ.12,563 కోట్లు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏమేం ఎగ్గొట్టిందనేది చూస్తే.. ఆ విలువ ఏకంగా రూ.12,563 కోట్లు. 2023–24 రబీ సీజన్లో దాదాపు 3.91 లక్షల మంది రైతులకు చెందాల్సిన కరువు సాయం రూ.328 కోట్లు. సున్నావడ్డీ రాయితీ కింద 2023 సీజన్‌కి సంబంధించి 6.31 లక్షల మంది రైతులకు రూ.132 కోట్లు. పెట్టుబడి సాయం. సున్నా వడ్డీ పంట రుణాలు. కరవు సాయం.. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు హామీ ఇచ్చి చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తం సాయం దాదాపు రూ.12,563 కోట్లు. వెంటనే ప్రభుత్వం వాటన్నింటినీ అందించాలి.కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు:రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు బీమా పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు కూటమి పాలనలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైంది.ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందడం లేదు. రైతులే బహిరంగంగా కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియాపై రూ.100 అదనంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తే తప్ప యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాజ్యం నడుస్తోంది. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే కొంటానని చెబుతాడే తప్ప ఎక్కడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు.ఇవీ మా డిమాండ్స్:ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున అందించాలి. ప్రతి పంటకు ఈ–క్రాపింగ్ చేసి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. ఆర్బీకే వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి. రైతులకు బోనస్‌తో కలిపి మద్ధతు ధర చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు Heavy Rain Forecast to Tirupati, Nellore Districts -
అక్కడికి వచ్చే దమ్ముందా?.. సోమిరెడ్డికి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇదే సమయంలో సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు. -
ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వడ్డీతో సహా చెల్లిస్తా: అనిల్ కుమార్ హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్ చేసేలా కృషి చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు.నా మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని చానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. నా మీద వార్త రాయడం వల్ల ఛానల్స్ రేటింగ్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను.. నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తాం. పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారు. అధికారం చేతిలో పెట్టుకుని.. నాపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా.ఎవరు పోస్టింగ్ పెట్టినా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం శునకానందం పొందుతోంది. నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. గతంలో మా ప్రభుత్వంలో మేము ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవి. కానీ, మేము అలా చేయలేదు. రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరేగా ఉంటాయి. అరెస్ట్‌లపై కూటమి నేతలు మాకు ఒక దారి చూపించారు. రానున్న కాలంలో తప్పకుండా తప్పులకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎండీ ఫరూక్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు.అయితే, మంత్రులకు బొకేలు ఇచ్చి ఎంపీని అధికారులు పట్టించుకోలేదు. ప్రభాకర్‌రెడ్డిని ఆనం రామనారాయణరెడ్డి సముదాయించారు. అయినా కూడా వేమిరెడ్డి పట్టించుకోకుండా అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
జమిలి ఎన్నికలపై కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు జిల్లా: జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2027లో జమిలి ఎన్నికలు వస్తే రెండేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలోకి ఉంటుందన్నారు. టీడీపీ నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.చంద్రబాబు లిక్కర్ మాఫియాపై కాకాణి మాట్లాడుతూ.. లాటరీ విధానంలో వైన్‌షాప్‌ల కేటాయింపులో 90 శాతం మద్యం దుకాణాలు టీడీపీ నేతలకే దక్కాయని, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని, అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. వైన్‌షాప్‌ల్లో మొత్తం ఎల్లో సిండికేట్‌దే దందా అని, రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, గ్రావెల్, విద్య, వైద్యంలో సిండికేట్స్‌దే రాజ్యం కొనసాగుతోందని, యథేచ్ఛగా దోపిడి జరుగుతోందని ఆయన తెలిపారు.ముందస్తు ప్రణాళికలతో దోచుకోవడంతో బాబు నేర్పరి అన్న కాకాణి, చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ బాగు కోసమే మద్యం పాలసీ ప్రకటించారని, ఇప్పుడు వైన్ షాప్‌ల కేటాయింపు తర్వాత అదే తేటతెల్లం అయిందని చెప్పారు. డిస్టిల్లరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్న మాజీ మంత్రి, చీప్ లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తూ, ఇతర మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముతారని.. నాసిరకం, పనికిరాని మద్యాన్నే తక్కువ ధరకు సరఫరా చేస్తారని చెప్పారు. బెల్ట్ షాప్స్ కూడా పుట్టగొడుగుల్లా రాబోతున్నాయన్న ఆయన, భవిష్యత్తులో మద్యాన్ని డోర్ డెలివరి కూడా చేస్తారని అభిప్రాయపడ్డారు. లిక్కర్ పాలసీతో సీఎం చంద్రబాబుకు, కూటమి నాయకులకు కిక్కెక్కుతుందేమో కానీ, తాగేవాడికి మాత్రం కక్కు రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైన్‌షాప్‌లు దక్కించుకున్నవారు సిండికేట్లుగా మారి 60–40 లెక్కల్లో వాటాలు పంచుకుంటున్నారని ఆక్షేపించారు.లిక్కర్ షాప్‌ల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి దుయ్యబట్టారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కిందిస్థాయి నాయకులు దోచుకుంటారని ఆరోపించారు. అందుకే వైన్‌షాప్‌ల డ్రా కు అవి ఎక్కడ ఉండాలనేది ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇకపై మద్యం రేట్లతో పాటు, విక్రయ వేళల్ని కూడా నాయకులే నిర్ణయిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే చేరిందన్న మాజీ మంత్రి, ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో లిక్కర్ సిండికేట్లు ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నారని ఆరోపించారు.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
పోరాటం కొత్త కాదు.. వెనకడుగు వేసేది లేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, నెల్లూరు: తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. తన స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పోరాటం చేయడం వైఎస్సార్సీపీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు.కాగా, వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్పర్స్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి వ్యక్తిని గతంలో ఎప్పుడూ చూడలేదు. తన స్వార్ధ రాజకీయాలు కోసం తిరుమల పవిత్రతను దెబ్బతిశాడు. మనం ఓడిపోయాం తప్ప.. ప్రజలని ఎప్పుడూ మోసం చేయలేదు. ఒక్క సీటుతో ప్రయాణం ప్రారంభించిన డీఎంకే.. ప్రతిపక్షానికి కేవలం నాలుగు సీట్లే మిగిల్చి అధికారంలోకి వచ్చింది. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకోండి.. అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ధ్వంసం చేసిన వారి సొంత ఖర్చులతోనే నిర్మాణాలు చేయిస్తాం. జమిలీ ఎన్నికలు వచ్చినా.. 2029 ఎన్నికలు వచ్చినా గెలుపు వైఎస్సార్సీపీదే. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారికే భవిష్యత్తులో పదవులు వస్తాయి. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందాం. రూరల్‌లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. పార్టీ కష్ట కాలంలో మనతో ఉండే వారికీ భవిష్యత్తులో పదవులు వరిస్తాయి. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. రూరల్ నియోజకవర్గానికి బలమైన నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ద్వారా దొరికారు. సిటీ, రూరల్‌లో మళ్ళీ మన జెండా ఎగరేస్తాం.రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రూరల్‌లో వైఎస్సార్సీపీ గెలిచింది. రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాంటిది. ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం. స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీ మారారు. కార్యకర్తలు మాత్రం పార్టీలో ఉన్నారు. పార్టీ మారిన వారికి భవిష్యత్తులో తన్నులు తప్పవు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పెడతాడని.. ఆయన్ను తిడుతూనే పంచన చేరుతున్నారు. నా నేతల జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తాం. ఊరికే వదిలిపెట్టం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మా టైమ్ కూడా వస్తుంది. అప్పుడు చెబుతాం.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లతో దేశంలో శక్తివంతమైన నాయకుడిగా వైఎస్ జగన్ ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఏపీలోని పార్టీలకు లేవు. రాష్ట్రం నాశనం అయిందనే భావన మూడు నెలల్లోనే వచ్చింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌తోనే ఉంటాం. పోరాటాలు చేయడం మాకు కొత్త కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తాడో పేడో తేల్చుకునే వాళ్ళకే జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసి కొట్లాడతాం.. కార్యకర్తలను బతికించుకుంటాం. ఎల్లో మీడియా నన్ను నిత్యం కలవరిస్తోంది. నేను ఎక్కడికి పోలేదు.. విజయదశమి తర్వాత యాక్టివ్ అవుతా’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ -
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వరద బాధితులకు చిన్నారి సాయంవరద బాధితులకు అండగా నేను ఉన్నానంటూ పులివెందులకు చెందిన చిన్నారి వర్ణిక ముందుకొచ్చింది. తాను దాచుకున్న పాకెట్‌మనీని వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అందజేసింది. తాన బాబాయితో వచ్చిన విద్యార్థిని వరద బాధితుల కోసం రూ.72,500 ఆర్థిక సాయాన్ని అందించింది.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు? -
కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, నెల్లూరు: కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.జనసేనలో లుకలుకలు మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్‌పై వెంకటగిరి జనసేన నేత వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ పాయింట్ ఆప్ కాంటాక్ట్‌గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇంచార్జ్‌లకు గౌరవం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జెండా మోసిన తనను పార్టీకి దూరం చేయాలని అజయ్ కుమార్ చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ.. -
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్‌లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్‌నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక ఇస్తున్నారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతల సిఫార్సులు ఉంటేనే ఇసుక దొరుకుతుంది. లేదంటే ఇసుక దొరికే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాణి చెప్పుకొచ్చారు.నెల్లూరులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతోంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక దొరుకుతుంది.. లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తే ఉండదు.సంగం దగ్గర ఉన్న సూరాయపాలెం ఇసుక రీచ్ దగ్గర సోమిరెడ్డి అధిక ధరకు ఇసుక అమ్మాలి అని ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జిల్లా మైనింగ్ డీడీగా ఉన్న అధికారినే ఎందుకు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడి ఉంటే జిల్లా మైనింగ్ డీడీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని సరసమైన ధరలకు ప్రజలకు అందేలా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. జిల్లా యంత్రాంగమంతా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తుంది. జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి.. వైఎస్ జగన్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తాడా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్బంలో కలిసిపోయారు.. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదన్నారు. -
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల..
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైలులో ఉన్న ఉండాల్సి వచ్చింది.ఇక, పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి ఏం నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ, పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలి అవుతతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన, లోకేశ్‌తో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబును ప్రజలు చీ కొడుతున్నారు. చంద్రబాబు పాలన చూసి ప్రజలు చీ కొడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేసులకు, అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
సంపద సృష్టిస్తానని.. ప్రజలను దోచుకుంటున్నాడు: చంద్రబాబుపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు జిల్లా: హత్యలు, అనైతిక కార్యకలాపాలలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫ్‌రెన్స్‌లో పరోక్షంగా చెప్పారు. కలెక్టర్ల సమావేశం మొక్కుబడిగా జరిగింది.. రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారింది’ అని కాకాణి దుయ్యబట్టారు.ఉచిత ఇసుకలో ‘ఉచితం’ అనే పదం మాయం అయింది.. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. 14 లక్షల కోట్లు అప్పున్నా సరే.. హామీలన్నిటిని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. చివరికి 7 లక్షల 48 వేల కోట్లు అప్పు ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్ బొమ్మ ఉందని విద్యాదీవెన కిట్స్ కూడా పంపిణీ చేయలేదు. సంపద సృష్టిస్తానని.. ప్రజల సంపదను దోచుకుంటున్నాడు.. ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జగన్‌ని విమర్శించడం.. సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యేలు కూడా శిలఫలాకాన్ని కూల్చడం ఏపీలో ఇదే తొలిసారి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన వాటిని వారి చేతే కట్టిస్తాం. దుందుడుకు చర్యలకు పాల్పడిన వారిని వదలం.. ప్రభుత్వం రాగానే వారిపై చర్యలు ఉంటాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు. -
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
సాక్షి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. అటవీ ప్రాంతంలో చిన్నారిని హత్య చేశాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. -
ఏ విచారణకైనా సిద్ధం.. సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లే అవుట్లు వేశారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని.. అక్రమ అక్రమ లే అవుట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని కాకాణి తెలిపారు.‘‘40 లే అవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. 25 లే అవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విజిలెన్స్ విచారణ చేసి రూ.6.5 కోట్లు జరిమానా విధించారు. కానీ అప్పట్లో సోమిరెడ్డి జోక్యం చేసుకుని డబ్బు కట్టకుండా చేశారు. ఈ వ్యవహారమంతా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని’’ కాకాణి వివరించారు.‘‘నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దమ్ముంటే విచారణ చేయండి. పొదలకూరులోని లేఅవుట్ దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. -
నెల్లూరు జిల్లా: టీడీపీ అరాచకాలు.. ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా ఎస్పీని వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలు, దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కాకాణి తెలిపారు.మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆదాల తెలిపారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం.. నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా కాటంరెడ్డి
గుంటూరు, సాక్షి: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నియమించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో విష్ణువర్దన్‌కు బాధ్యతలు అప్పజెప్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర సమయంలో ఏప్రిల్ 4వ తేదీన తిరుపతి ఎద్దల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే టీడీపీ స్థితి నానాటికీ దిగజారిపోతుండడం, ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిపోతూ వస్తున్న కారణంగా ఆయన టీడీపీని వీడారు. -
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్ కోరారు. -
Watch Live : సీఎం జగన్ కందుకూరు బహిరంగ సభ
-
చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఉందా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు -
ఉప్పొంగిన అభిమానం.. జన జాతరలా బస్సు యాత్ర (ఫొటోలు)
-
Nellore Bus Yatra Photos: జై కొట్టిన సింహపురి (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్ -
కులతత్వ, మతతత్వ పార్టీలు ఒక్కటయ్యాయి: విజయసాయిరెడ్డి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని, జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు. నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ నేతలు వీధి రౌడీలు, చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది. చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే.. వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లకు మించి రావు. సీబీఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడటం ఖాయం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్విట్ పెడితే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: జేపీని నమ్మొద్దు.. ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా: పోసాని -
YSRCP నెల్లూరు జిల్లా అభ్యర్థులు వీళ్లే
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
‘కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో చంద్రబాబూ!’
సాక్షి, నెల్లూరు: ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులే అవుతారు.. జీరోలైన మిమ్మల్ని కూడినా.. గుణించినా వచ్చేది జీరోనే.. నెల్లూరు చేరికలతో ప్రజలంతా ఇక తన వెంటే అన్నట్లు చంద్రబాబు ఢాంబికాలు పలుకుతున్నారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోటీ చేయటానికి అభ్యర్థులు దొరికితే...ప్రజలు మద్దతు పలికినట్లేనా?. ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలో చూపించడానికి సంసిద్ధం అంటున్నావా చంద్రబాబూ? అంటూ ధ్వజమెత్తారు. మంత్రి కాకాణి ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనింద టీడీపీలో చేరికల కార్యక్రమం అని శనివారం నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు ఆ వేదికగా అనేక విమర్శలు చేశారు. ఎంతో అనుభవం, పరిణితితో చంద్రబాబు మాట్లాడతారని ఆశిస్తారు. కానీ చంద్రబాబు చాలా దిగజారిపోయాడు. చంద్రబాబు ప్రసంగంలో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు అంటాడు. ప్రజలు, ఓటర్లు లేరు. నాయకుల చేరికలు చాలు బలపడటానికి అని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబుకు పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లు ఆకర్షితులై.. ప్రజలు మద్దతు పలుకుతారని అనుకోవటం పెద్ద పొరపాటు. నాయకులు చేరినంత మాత్రాన ప్రజలు టీడీపీ వెంట నడిచే పరిస్థితి ఉందా అన్నది చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు సమాధానమే చెప్పట్లేదు చంద్రబాబుకు సిద్ధం సభలో సీఎం జగన్ కొన్ని ప్రశ్నలను సంధించారు. ప్రజలకు చంద్రబాబు ఏ మేలు చేశారో స్పష్టంగా చెప్పమన్నారు. ప్రతి కుటుంబానికి చంద్రబాబు వల్ల మేలు జరిగిందా? వైఎస్ఆర్ సీపీలాగా ఇది ముఖ్యమంత్రిగా నా వల్ల ఈ మేలు జరిగిందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఈ గ్రామంలో ఇది అభివృద్ధి చేశానని చెప్పే పరిస్థితీ లేదు. గ్రామాల్లో ప్రజలకు ఏమి ఇచ్చావో.. చెప్పలేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు, రైతులు, మహిళలకు ఏ మేలు చేశారో చంద్రబాబు చెప్పుకోలేరు. బహిరంగ సభల్లో వాటికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ ఆత్మస్తుతి వల్లె వేస్తున్నారు. మరి, చంద్రబాబు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదురయ్యాయి. టీడీపీ ఎందుకు బంగాళా ఖాతంలో కలసి పోయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. మరోసారి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధం అంటున్న సీఎం జగన్ అధికారం ఇచ్చిన ప్రజలకు ఐదేళ్లు సేవ చేశాం. మరోసారి ప్రజల సేవ చేసేందుకు మేం సిద్ధం అని సీఎం జగన్ సిద్ధమన్నారు. దానికి చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. అంటే.. గతంలో హామీలు ఇచ్చి జనాలను ఎలా మోసం చేశానో అదే పంథాలో కొనసాగటానికి సిద్ధమని చెప్పదల్చుకున్నారా? మరలా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని మోసం చేయటానికి సంసిద్ధమని చంద్రబాబు చెబుతారా?. తద్వారా ప్రజలను తీరని ద్రోహం చేయటానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారా? జగన్మోహన్రెడ్డి నేను చెప్పాను.. ప్రజలకు ఇచ్చాను.. మరలా అవకాశం ఇస్తే.. మీ కుటుంబానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటానికి సిద్ధమని జగన్ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను, పొరుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు తప్ప.. సొంతంగా ఇది చేస్తానని చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు మోసగాడు అని బ్రాండ్ పడిపోయింది. ఇచ్చిన మాట మీద బాబు నిలబడడు. జనాలను మోసం చేస్తాడని ఓటేస్తే మనం నష్టపోతామనే భావం ప్రజల్లో ఉంది. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు వలస వెళ్లింది చంద్రబాబే చంద్రబాబు తనకున్న మోసగాడు అనే బ్రాండ్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సీఎం జగన్ మోహన్ రెడ్డిని దూషించటం మొదలు పెట్టారు. నిన్న నెల్లూరు టీడీపీ సభలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమైనా చెప్పగలిగారా? ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పావా? చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? తన్నుకుంటే పోతే అభ్యర్థులు బయటపడతారా? అసలు చంద్రబాబు నీ నియోజకవర్గం, సొంత గ్రామం ఏదో చెప్పు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది ఎక్కడ? సొంతూరు నారావారిపల్లె ఉండేది ఎక్కడ. చంద్రగిరి నియోజకవర్గంలో. నీ గ్రామంలో గెలవలేక.. కుప్పంలో నిలబడిన వాడివి.. మిగతా వారిని ఇక్కడ తన్నితే.. అక్కడ పడ్డారని సిగ్గులేకుండా మాట్లాడటం ఏమిటి? ఒక్కసారి చంద్రబాబు నీ గతాన్ని తరిచి చూడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది, వైఎస్ రాజశేఖరరెడ్డిది పులివెందుల నుంచి. తన సొంత ప్రాంతం అయిన పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నీ సొంత ప్రాంతం నుంచి పోటీ చేయలేని నువ్వు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? నీ నోటికి అడ్డూఅదుపూ లేవా? నీ కొడుకుది ఏ ఊరు. తంతే మంగళగిరి ఎందుకు బోర్లా పడ్డాడు. మరొకరిని నువ్వు ఎగిసి తంతే ఆత్మకూరులో ఎందుకు పడ్డాడు. పవన్ కల్యాణ్‌ది ఏ ప్రాంతం. ఆయన ఏవిధంగా గాజువాక, భీమవరంలో పోటీ చేశాడు. ఒక దగ్గర పోటీ చేసి గెలవలేక.. వేరే దగ్గరకు వెళ్లిన మీరు సిగ్గులేకుండా విమర్శలు చేయటం దౌర్భాగ్యం. చంద్రబాబును నెగటివ్ షేడ్‌తో ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు స్థాయికి తగని మాటలు మాట్లాడి.. ఆక్రోశం, ఆవేశాన్ని వెల్లగక్కటం తప్ప.. ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ప్రారంభం అయింది. నెగిటివ్ షేడ్‌తో చూస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు. మీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేసింది చంద్రబాబే చంద్రబాబు నాయకులను పేర్చుకుని కూర్చుకుని టీడీపీ బ్రహ్మాండం అంటున్నారు. మరి, ఇంతవరకు చంద్రబాబు.. సీట్లు ప్రకటించలేకపోతున్నాడు. ఒక సీటు ప్రకటిస్తే.. వాడు డబ్బులు పెట్టుకుంటాడా? లేకపోతే ఇంకో కార్యకర్తను తొక్కైనా డబ్బున్నోడికి ఇవ్వండి. జనసేనతో అవసరం ఉంది మనవాడిని ముంచైనా వాడికి టిక్కెట్ ఇవ్వండన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 175 సీట్లు ప్రకటించకుండా బీజేపీకి కొన్ని ఎత్తిపెట్టి.. టీడీపీ జెండా మోసిన వాడిని మొన్నటి దాకా టిక్కెట్ ఇస్తానన్న చంద్రబాబు ఇవాళ అన్యాయం చేయటానికి సిద్ధపడ్డాడు. టీడీపీతో ప్రజలు.. ఓటర్లు లేరని చెప్పకనే చెప్పిన చంద్రబాబు నిజంగా చంద్రబాబుకు బలమే ఉంటే.. ఎందుకు ఇతర పార్టీల అండదండల కోసం అర్రులు చాస్తూ తిరుగుతున్నాడు. ఎందుకు ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాట పడుతున్నాడు. నాయకులు వచ్చినంత మాత్రాన ప్రజలు వస్తారా? పార్టీలతో పొత్తులు చేసుకున్నంత మాత్రాన ప్రజలు వస్తారా? అన్ని పార్టీలు, నాయకులు కలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పినవన్నీ చేశాడని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ ఏవీ చేయలేదని ప్రజలే చెబుతారు. ప్రస్తుతం పొత్తులు ఎలా పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కొన్ని చోట్ల అభ్యర్థులు దొరికితే జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అని ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు. 2014లో నెల్లూరు ప్రజలు చంద్రబాబుకు కేవలం మూడు సీట్లే ఇచ్చారు. ఈసారి నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదం. చంద్రబాబు ముఖం చూసి జనాలు ఎవరైనా ఓటేస్తారా? కొంతమంది నాయకులను రకరకాలుగా మభ్యపెట్టి తీసుకెళ్లావు. అంతమాత్రాన టీడీపీ బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పగలుగుతారు. కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో బాబూ! నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినప్పుడు కాకాణి కోర్టు దొంగ అన్నారు. సీబీఐ విచారణపై చంద్రబాబు ప్రకటిస్తాడని అనుకున్నా. మరి, చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే.. సీబీఐ విచారణ వేయించుకుని ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సందేశం ఏమైనా ఇస్తాడని అనుకున్నా. కానీ, తోక ముడిచి చంద్రబాబు పారిపోయాడు. అంటే.. చంద్రబాబుకు ధైర్యం లేదా. అవినీతిపరుడు అని ఒప్పుకున్నట్లేనా. దోచుకున్న మాట వాస్తవమని ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నీతిమంతుడు అయితే.. అవినీతితో కోట్లు సంపాదించకపోతే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? పైగా కోర్టులకు వెళ్లి విచారణను అడ్డుకున్నది చంద్రబాబే. పైగా కడిగిన ముత్యానివి అనటం ఏమిటి? చంద్రబాబుది ముత్యం మొహమేనా? పైగా నన్ను ఇంతమాట అంటారా అని చంద్రబాబు అనటం సరికాదు. జనాలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బావుంటుంది. ఏమి నైతికత ఉంటే.. వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తే కనీస అర్హత ఉందా? నీ గబ్బు నోట వెంట జగన్ పేరు ఉచ్ఛరించటమే అపశృతిగా భావిస్తున్నాం. చంద్రబాబు నీచుడు, అబద్ధాల కోరు, నీతిమాలినవాడు. బలహీనులైన పవన్, బాబులను కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుని నడుస్తున్నామని అంటాడు. 2019 ఎన్నికలకు ముందు పవన్ ఊగిపోయాడు. నా కుటుంబ సభ్యులు, మా అమ్మను దూషిస్తే వదిలిపెడతానా అన్నాడు. ఆ రోజున లోకేశ్ చేత దూషించిన సంగతి చంద్రబాబు మర్చిపోయాడా? గతాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఇద్దరు బలహీనపడిపోయారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులు అవుతారు కానీ.. బలవంతులు కాలేరు. శూన్యమైన మీరు కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే. చంద్రబాబు, పవన్ ఎక్కువగా ఊహించుకుని మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థుల మార్పు ఉంటుందన్నారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. చంద్రబాబు కూడా నిన్నగాక మొన్న ప్రకటించి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నట్లు వారి చేత ప్రకటన ఇప్పిస్తున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు మళ్లీ అభ్యర్థులను చంద్రబాబు మారుస్తారు. పవన్ 5 సీట్లు తప్ప 19 సీట్లలో అభ్యర్థులు ఎవరో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. ఏ పార్టీ అయినా అభ్యర్థులను మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ. ఒక్కో పార్టీ విధానం ఒక్కోలా ఉంటుంది. ఎవరైతే బలంగా ఉంటాడో వారికి సీటు ఇవ్వాలనేది పార్టీ అధినాయకుడు ఇష్టం. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఎక్కడైనా పొరపాటు జరిగితే.. స్థానిక నాయకుడిపై ఆదరణ చూపించకపోతే అది ఎన్నికల ప్రక్రియపై పడుతుంది. అందుకే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు. మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారో అన్న దానికి సమాధానం చెప్పలేదు. టీడీపీ, జనసేన కన్నా బీజేపీ మెరుగ్గా ఉన్నట్లు ఉంది. అభ్యర్థులను ఖరారు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన నాయకులకు కండువా కప్పే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. సర్వేపల్లిలో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని చంద్రబాబును మీడియా వారే అడగాల్సింది. నాపైన సోమిరెడ్డి తిరుగుతున్నారు. ఆయనకు ఇవ్వకపోవటం ధర్మం కాదు. మనసు బాధేసింది. ఇంత సీనియర్‌కు అన్యాయం జరిగిందని ఆ బాధను నేను మీడియా ముందు వ్యక్తపరిచాను. ఎన్ని సందర్భాల్లో సొంత అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ చేయలేదు. వీరంతా ఒక్కటై.. జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ మీద ఆమె కోడలు పోటీ చేయలేదా? సంజీవ్ గాంధీ ఒకవైపు.. రాజీవ్ గాంధీ మరోవైపు రాజకీయంగా ఉన్నారు. ఒకే కుటుంబంలో సభ్యులు ఒకరిపై మరొకరు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. షర్మిల చెప్పే మాటలకు ఎంత క్రెడిబులిటీ ఉన్నది అనేది జనాలు చూస్తారు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీకి వచ్చారు. రాజకీయాల్లో కొంతమంది అనుకూలం, మరికొంతమంది ప్రతికూలంగా ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ. ఉమ్మడి నెల్లూరులో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత మందిని నేను చేర్చుకుంటున్నాను. సోమిరెడ్డి మరికొంత మందిని చేర్చుకుంటున్నారు. చేరికల ఆధారంగా గెలుపు ఓటములు ఆధారపడవు. రాజధాని కబ్జా చేసిన చంద్రబాబు నోటి వెంట (తప్పు చేయలేదు) అలాంటి మాటలు రాకూడదు. దానిపైన కూడా క్వాష్ పిటిషన్ వేసి కోర్టుకు వెళ్లాడు. నెల్లూరులో వేమిరెడ్డికి పోటీగా విజయసాయిరెడ్డి వచ్చారని ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఊగిపోయాడు. ఎన్నికల్లో సర్వేపల్లిలో నేను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రత్యర్థిగా చంద్రబాబు ఎవరిని దింపినా భయపడే పరిస్థితి లేదు. సమన్వయకర్త అంటేనే.. అభ్యర్థి. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి -
అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు
నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అనేకసార్లు చెప్పుకున్నారు. అందుకే జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని అక్కడి నేతలు ఆశించారు. కనీసం ఒక్క సీటులో అయినా జనసేన పోటీ చేస్తుందని భావించారు. కాని చంద్రబాబు, పవన్ ప్రకటించిన జాబితాలో నెల్లూరు జిల్లాలో జనసేన పేరే ప్రస్తావనకు రాలేదు. పవన్‌ను నమ్మితే నిండా ముంచాడని అక్కడి నేతలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. నెల్లూరు జనసేన పరిస్థితిపై లుక్కేద్దాం. పుట్టి పెరిగిన నెల్లూరు అంటే తనకు ఎంతో అభిమానం అని..ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టానని పవన్ అనేకసార్లు ప్రకటించారు. జిల్లాలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని కూడా అక్కడకు వచ్చినపుడు వారికి హామీ ఇచ్చారు. కాని పవన్ మాటలకు చేతలకు..అసలు పొంతనే ఉండదని..టీడీపీ, జనసేన కలిసి విడుదల చేసిన ఉమ్మడి జాబితాతో మరోసారి రుజువైంది. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటుకు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపని పవన్..తన పుట్టినగడ్డకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తేలిపోయిందని అక్కడి జనసైనికులు మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన సిటీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. నగర అధ్యక్షుడు సుజయ్ బాబుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ.. నెల్లూరు సిటీ టికెట్ తమకేనంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని..తనకు అవకాశం కల్పిస్తే సిటీ నుంచి పోటీ చేస్తానని మనుక్రాంత్‌రెడ్డి పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను కలిసి చెప్పారని తెలిసింది. ఇది జరుగుతున్న క్రమంలోనే టీడీపీ నేత, విద్యావ్యాపారి పొంగూరు నారాయణ స్క్రీన్ మీదకు వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకేనంటూ ప్రచారం ప్రారంభించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన తొలి జాబితాలో నెల్లూరు సిటీ టికెట్ నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పొంగూరు నారాయణకి కేటాయించారు. దీంతో మనుక్రాంత్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. జిల్లా పార్టీ ఆఫీస్ ఎదుట పలువురు నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం తన కెరీర్‌ను త్యాగం చేశానని.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా..తనకు టికెట్ ఇవ్వకుండా పవన్ మోసం చేశారంటూ మనుక్రాంత్ రెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకొని బాధపడ్డారట. నెల్లూరు సిటీ లేదా రూరల్ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని మనుక్రాంత్ భావిస్తున్నారట. నెల్లూరు సిటీ నియోజకవర్గం కాకపోయినా.. కనీసం నెల్లూరు రూరల్ టికెట్ అయినా తనకు వస్తుందని మనుక్రాంత్ రెడ్డి భావించారు. అది కూడా రాకపోవడంతో ఆయన వర్గం పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అగ్రహంతో ఉన్నారనే చర్చ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉండే కొందరు నేతలు మునుక్రాంత్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుపడ్డారని.. ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.. టికెట్ విషయంపై మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్‌ని అపాయింట్మెంట్ అడిగినా.. ఆయన లైట్ తీసుకున్నారనే ప్రచారం నెల్లూరులో జరుగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసమనే విషయం గత పదేళ్ళుగా ఆయన నడవడిక చూస్తేనే తెలుస్తోంది. చంద్రబాబు ప్యాకేజీ కోసం పనిచేసే పవన్‌ను ఎలా నమ్మావని మనుక్రాంత్‌రెడ్డిని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. పవన్‌ను నమ్ముకుంటే మునుగుడు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం -
టీడీపీకి కొత్త టెన్షన్.. అక్కడ అభ్యర్థి కరువు?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ నాయకత్వంపై ఆ పార్టీకి నమ్మకంలేక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎర్రతివాచీ పరిచింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు కంచుకోట కావడంతో పోటీ చేసినా ఓటమి తప్పదనే సంకేతాలు ఆనంకు అందాయి. దీంతో పార్టీ కండువా కప్పుకోకముందే ఈ సీటు తనకొద్దంటూ తెగేసి చెప్పి మరోసారి వెంకటగిరి వైపు చూస్తున్నారు. నో చెప్పలేక వెంకటగిరి సీటును ఆనంకే ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాలతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ఇంకా కొలిక్కి రాలేదు. వైఎస్సార్సీపీ గ్రాఫ్పైపైకి.. ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి విద్యావంతుడు కావడంతో అభివృద్ధి విషయంలో ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో విక్రమ్‌రెడ్డి దూసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు.. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు పనులను చేపడుతూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఆత్మకూరా.. నాకొద్దు..! టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆత్మకూరులో చేపట్టిన సమయంలో అన్నీతానై ఆనం రామనారాయణరెడ్డి నడిపించారు. ఆత్మకూరు బాధ్యత ఇక ఆయనదేనని లోకేశ్ ప్రకటించారు. దీంతో నెల పాటు నియోజకవర్గంలో హడావుడి చేసిన ఆనం ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని ముఖం చాటేశారు. పార్టీతో పాటు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం ఓటమి తప్పదని తేలడంతో ఆత్మకూరు అంటేనే హడలిపోతున్నారు. దూరమైన సీనియర్ నేతలు స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆనం రామనారాయణరెడ్డికి సహకరించడంలేదు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యనాయుడు, గూటూరు కన్నబాబు లాంటి నేతలూ దూరంగా ఉన్నారు. అటు కేడర్ కలిసిరాక.. ఇటు నేతలు సహకరించక ఆయన మీమాంసలో పడ్డారు. ఆత్మకూరు టు వెంకటగిరి వయా నెల్లూరు సిటీ ఆత్మకూరు కలిసి రాకపోవడంతో నెల్లూరు సిటీ వైపు ఆనం మొదట్లో కన్నేశారు. నగరంలో తన కుటుంబానికి రాజకీయ బలంతో పాటు అభిమాన గణం ఉండటంతో నెల్లూరు సిటీ సీటును ఇవ్వాలని చంద్రబాబును ప్రాధేయపడ్డారని సమాచారం. అయితే నారాయణకు ఖరారు చేశామని స్పష్టం చేసిన బాబు.. సర్వేపల్లిలో ఛాన్స్ ఇస్తామని చెప్పినా సిట్టింగ్ సీటు కావాలని పట్టుబట్టడంతో ఓకే చేశారని తెలుస్తోంది. సిట్టింగ్ స్థానంలోనూ తప్పని కుస్తీ ఆనం రామనారాయణరెడ్డి తన సిట్టింగ్ సీటు వెంకటగిరిని మరోసారి దక్కించుకునేందుకు కుస్తీ పడాల్సి వస్తోందనే వాదనా వినిపిస్తోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండుసార్లు విజయం సాధించి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్రమంలో తన ప్రత్యర్థి ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి సీటు తనదేనంటూ ప్రకటనలు చేయడంపై కురుగొండ్ల తీవ్రంగా మండిపడుతున్నారు. సీటు విషయంలో వీరిద్దరూ కుస్తీ పడాల్సి వస్తోంది. మరోవైపు వెంకటగిరి సీటును బీసీలకు కేటాయించాలని మరో నేత యత్నాలు ప్రారంభించారు. కాగా ఈ ముగ్గురిలో సీటు ఎవరికొచ్చినా మిగిలిన ఇద్దరూ హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలొస్తున్నాయంటే సాధారణంగా ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడతారు. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడి తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆది నుంచి ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ అక్కున చేర్చుకుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణతో ఇక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని తెలియడంతో ఆనం విముఖత చూపుతున్నారు. ఈ పరిణామాలతో రండి బాబూ రండీ అనే రీతిలో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణను ప్రారంభించింది. -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: పార్టీ మార్పుపై ఉత్త ప్రచారాలపై నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా..నాపై వస్తున్న రూమర్స్ నమ్మొద్దు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా.. అసెంబ్లీయా.. పార్లమెంట్ బరిలోనా అనేది అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పారు. అలాగే.. పార్టీలో నెలకొన్న అసంతృప్త పరిణామాలపైనా అదాల స్పందించారు. అసంతృప్త నేతలను తాను స్వయంగా కలిసి నచ్చజెప్పే యత్నం చేసినా.. చర్చలు ఫలించలేదని చెప్పారాయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను కలిసి నచ్చజెప్పే యత్నం చేశా. వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాగుంట మాత్రం కాస్త సానుకూలంగానే స్పందించారని ఎంపీ ఆదాల తెలిపారు. ఇదీ చదవండి: కొత్త గ్రూపులకు ‘సారథి’! -
Nellore City: మాజీ మంత్రి నారాయణకి ఇక చుక్కలే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. నెల్లూరు సిటీ పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్ ప్రకటించిన పేరు సోషల్ ఇంజనీరింగ్‌లో భాగం అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ నుంచి గత రెండుసార్లుగా బీసీ నేతలనే బరిలో దించి అసెంబ్లీకి పంపించారు జగన్. ఈ సారి నెల్లూరు డిప్యూటీ మేయర్‌ను ప్రకటించారు. ఇంతకీ సిటీ డిప్యూటీ మేయర్ ఎవరు? ఆ పేరు సంచలనంగా ఎందుకు మారింది? వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్యే జరగబోతున్నాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెత్తందారులు బరిలో ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం జనాల్లో ఉండే సామాన్యులకు అవకాశాలు కల్పిస్తోంది. నెల్లూరు జిల్లా చరిత్రలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని సీఎం జగన్ చేశారు. స్వాతంత్రానంతరం నెల్లూరు సిటీ నుంచి ఇప్పటివరకు మైనార్టీలను అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఏ పార్టీకి లేదు. గత ఎన్నికలకు ముందు అబ్దుల్ అజిజ్ అనే మైనార్టీ నేతకు మేయర్ గా అవకాశం కల్పించింది వైస్సార్సీపీ. తర్వాత అజిజ్ టీడీపీలోకి జంప్ అయ్యాడు. రాబోయే ఎన్నికల్లో కూడా నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ నేతను అసెంబ్లీకి పంపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించడం ఇక్కడి రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్‌కు తెర తీస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలో మైనారిటీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రత్యేకించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో 18 నుంచి 21 శాతం వరకు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. నెల్లూరు సిటీలో 38 వేలు నుంచి 40వేల వరకు మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అందుకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనారిటీని అభ్యర్థిని నిలిపితే జిల్లాలోని మైనారిటీలంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతిస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా జిల్లాలో సైకిల్ తుక్కుతుక్కుగా ఓడిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మైనార్టీల శాసనసభ ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే.. 1970వ దశకానికి ముందు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒకరు మాత్రమే అసెంబ్లీకి ఎన్నియ్యారు. ఆ తర్వాత జిల్లా నుంచి మైనారిటీ నేతలనెవ్వరూ అసెంబ్లీ గడప తొక్కలేదు. అయితే నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం మైనారిటీలకు తగిన ప్రాధాన్యం లభిస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వైస్సార్సీపీ మైనారిటీ నేతగా.. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఖలీల్ అహ్మద్‌కి కేటాయించడంతో ఆ సామాజిక వర్గం నేతలు జోష్‌లో ఉన్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్‌ను గెలిపించుకుంటామని.. జిల్లాలోని ఉండే తమ సామాజిక వర్గం వైస్సార్సీపీ కి అండగా ఉంటుందని మైనారిటీ నేతలు చెబుతున్నారు. పెత్తందారు మాజీ మంత్రి నారాయణకి సామాన్యుడు చుక్కలు చూపించబోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: మాజీ మంత్రి నారాయణపై మరదలు ఫిర్యాదు -
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్చిట్ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా.. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా?. బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి’’ అంటూ కాకాణి డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్‌షీట్ చెంపపెట్టు. విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది. సీబీఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు. కాగా, నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. -
మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
సాక్షి, విజయవాడ: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించింది. సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్ తగిలింది. రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌షీట్‌తో పటాపంచలయ్యాయి. ఇదీ చదవండి: టీడీపీ వెన్నులో వణుకు.. జగన్ జన బలం సుప్ర‘సిద్ధం’! -
సోమిరెడ్డికి బిగ్ షాక్?!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే.. స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి వస్తే అవమానిస్తారా..! నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్‌ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి! కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
టీడీపీలో రచ్చకెక్కుతున్న ‘సీటు’ రాజకీయాలు
ఓడిపోయే పార్టీ అయినా టిక్కెట్ల కోలాహలం బాగానే ఉంటుంది. ఆ మాత్రం బిల్డప్ ఇస్తేనే టిక్కెట్లు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీలో అదే జరుగుతోంది. సీటు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ ఉన్న తనను కాదని వేరే వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేదే లేదని ఆ మాజీ ఎమ్మెల్యే ఓపెన్‌గానే పార్టీ అధినేతకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఇక్కడ చంద్రబాబు రాజకీయాల్లో పావుగా మారుతున్న నేత ఎవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పచ్చపార్టీ టిక్కెట్ ఫైట్ రోజు రోజుకూ ముదురుతోంది. వెంకటగిరి టికెట్ తనదే అంటూ ముగ్గురు నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి అధికార పార్టీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. టీడీపీలో చేరేసమయంలోనే తనకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ తన ఆటలు సాగవని భావించిన ఆనం తిరిగి వెంకటగిరికి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. తనకు వెంకటగిరి టిక్కెట్టే ఇవ్వాలంటూ చంద్రబాబును ఆనం రామనారాయణరెడ్డి కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి తమకే టిక్కెట్ ఇస్తున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేతగా ఉన్న మస్తాన్ యాదవ్ సైతం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా టిక్కెట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.. నేను లోకల్ టికెట్ నాకే అంటూ మస్తాన్ యాదవ్ విస్తృతంగా జనాల్లో తిరుగుతూ ఉండడంతో అటు అనంకి ఇటు కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ భయం పట్టుకుందట. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చరిష్మాతో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఆనం టిడిపిలోకి జంప్ అవడం.. టిడిపి టికెట్ ని ఆశిస్తూ ఉండడంతో చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని కురుగొండ్ల రామకృష్ణ పబ్లిక్ గా చెబుతుంటే.. ఆనం మాత్రం సైలెంట్ గా ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారని యాంటీ కురుగొండ్ల వర్గం చెబుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పార్టీ ఫండ్ ఇచ్చే వారికీ ప్రయారిటీ ఇస్తారా లేక పార్టీని నమ్ముకున్న నేతకు టికెట్ ఇస్తారో చూడాలి. -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్సార్సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ముత్తుకూరులో సామాజిక ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో శనివారం సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు అశేష జనవాహిని జేజేలు పలికింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముత్తుకూరులోని పాత వాణి థియేటర్ నుంచి జంక్షన్ వరకు మేళతాళాలు, కేరళ డ్రమ్స్, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఓ పండుగలా ర్యాలీ జరిగింది. దారి పొడవునా బడుగు, బలహీన వర్గాలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరిగిన మేలును తలచుకుంటూ జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సభ జనసంద్రాన్ని తలపించింది. కిలోమీటర్ల పొడవున జనం నిల్చుని నేతల ప్రసంగాలు వింటూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌తోనే సామాజిక విప్లవం: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలు సైతం లబ్ధి పొందారని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమాలతో ఈ వర్గాలు సామాజిక సాధికారత సాధించి, నేడు తలెత్తుకొని తిరగగలుగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు రాక్షస మూకలు మళ్లీ బయల్దేరాయని, వారిని మరోసారి చిత్తుగా ఓడించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని బతికిస్తే.., చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ బొమ్మ పెట్టుకొనే అర్హత లేదన్నారు. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్‌కు పట్టం కట్టి, మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తండ్రిని మించిన తనయుడు జగన్: ఎంపీ బీదా మస్తాన్‌రావు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసి, వారిని అభివృద్ధి దిశగా నడిపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు చెప్పారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఉంటే వీరిలో ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. పేదలకు అత్యంత ఆవశ్యకమైని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానాలకు గురిచేస్తే, వైఎస్ జగన్ అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు వర్గాలకు బంగారు బాట: తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బంగారు బాటలు వేసిన ఘనత సీఎం వైఎస్ జగనకే దక్కుతుందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. గత పాలకులు బడుగు వర్గాలను ఓటు బ్యాంకుగా చేశారని, కానీ, వారి అభ్యున్నతికి కృషి చేసిన సీఎం జగన్ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. మైనారిటీలకు రూ.26 వేల కోట్లు : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతస్థాయిలో ఖర్చు పెట్టలేదని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. తెలుగు, లెక్కలు రాని లోకేశ్ సీఎం కావాలని తాపత్రయపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు చోట్ల గ్లాసులు పగలగొట్టుకొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రూ.979 కోట్ల మేరకు సంక్షేమ ఫలాలు : మంత్రి కాకాణి సీఎం జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు సంక్షేమ పథకాల ద్వారా రూ.979 కోట్ల మేర లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రూ.442 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 1.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. మేలు జరిగితేనే ఓటు వేయమన్నారు : నెల్లూరు మేయర్ స్రవంతి మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయండంటూ అడిగే ధైర్యం ఈ రాష్ట్రంలో సీఎం జగనన్నకు మాత్రమే ఉందని నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి అన్నారు. గిరిజన మహిళనైన తనను మేయర్ సీట్లో కూర్చొబెట్టడమే కాకుండా ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కూడా జగనన్నే అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పిలుపునిచ్చారు. -
AP: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు.. లారీని ఢీకొట్టిన కారు
సాక్షి, నెల్లూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్వతరెడ్డికి తీవ్రంగా గాయపడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం, పర్వతరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు చికిత్స అనంతరం.. మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి కారు అద్దాలు గుచ్చుకోవడంతో తల భాగంలో గాయాలు ఉన్నాయి. అన్ని పరీక్షలు నిర్వహించాం. బ్రెయిన్, చెస్ట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెన్నునొప్పి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు. రెండు వారాలు విశ్రాంతి అవసరం అని తెలిపారు. -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి చురకలు..
సాక్షి, నెల్లూరు: పేదల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగుపరిచారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మనుబోలు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులు, విద్యార్థులకు ట్యాబ్‌లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిచాంగ్ తుపాను వచ్చినప్పుడు సోమిరెడ్డి ఇంట్లో పడుకున్నాడని, ఇప్పుడు నిద్రలేచి నష్టపరిహారం తక్కువ ఇచ్చారని మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ హయాంలో ఎంత నష్టపరిహారం ఇచ్చారో మా దగ్గర జీవోలున్నాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. సోమిరెడ్డిని హిజ్రాలు తన్నేసరికి ఆయన మైండ్ పాడైపోయింది’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం -
AP: బడుగుల ‘సాధికార’ ప్రదర్శన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ నార్తురాజుపాళేనికి కదలి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించాయి. మంగళవారం వైఎస్సార్సీపీ రాజుపాళెంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. వారికి రాజుపాళెంలో వీధివీధినా ఘనస్వాగతం లభించింది. జై జగన్ నినాదాలతో రాజుపాళెం హోరెత్తింది. యాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. పలువురు నేతలు రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రపథంలో నిలుపుతున్న తీరును వివరించారు. నేతలు సీఎం జగన్ పేరు పలికిన ప్రతిసారీ ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రస్థానంలో నిలిపిన సీఎం జగన్: డిప్యూటీ సీఎం రాజన్నదొర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. లంచాలు, రికమెండేషన్లు లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల డబ్బు జమ చేస్తున్నారని, ఇంతటి పారదర్శకమైన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలో నిలుపుతూ ఆ వర్గాలు సాధికారత సాధించేందుకు దోహదపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని, సీఎం జగన్ ఇద్దరికి మంత్రి పదవులే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవీ ఇచ్చారన్నారు. సీఎం జగన్ 2 లక్షల మంది గిరిజనులకు 3 లక్షల ఎకరాలకుపైగా భూమి ఇచ్చారని వివరించారు. పోడు భూములకు రైతు భరోసా అమలు చేసి 3.45 లక్షల మంది రైతులకు అందిస్తున్నారన్నారు. జగనన్నతోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సామాజిక విప్లవం దేశంలో ఒక్క సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. పేదవాళ్ల పిల్లలు బాగు పడటం ఇష్టం లేని చంద్రబాబు కోర్టుకెళ్లాడన్నారు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీష్ మీడియం చదవొచ్చు కానీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దన్నది వారి భావమన్నారు. సీఎం జగన్ 31 లక్షలమంది పేదలకు ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, వారిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని అన్నారు. జగనన్న పేదోడి కడుపు చూస్తారు: సినీ నటుడు అలీ సీఎం జగన్ ప్యాలెస్‌లో ఉన్నా పేదవాడి కడుపు చూస్తారని సినీ నటుడు అలీ చెప్పారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని పేదవాడు కూడా ఆపరేషన్ చేయించుకుంటున్నాడని, ఇది సీఎం జగన్ వల్లే సాధ్యపడిందని చెప్పారు. 2024లో జగనన్న వన్స్‌మోర్ అంటూ మనమంతా వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక నేరుగా వలంటీర్లనే ఇంటికి పంపి మనకు కావల్సినవన్నీ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ వస్తే వలంటీర్లను పీకేస్తామని లోకేశ్, చంద్రబాబు చెబుతున్నారని, ఇలాంటి వారు మనకు అవసరంలేదని చెప్పారు. కోవూరు అభివృద్ధికి సీఎం జగన్ కృషి : ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. 1.28 లక్షల కుటుంబాలకు రూ.981 కోట్లు నేరుగా ఖాతాల్లో వేశారన్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంతటి సంక్షేమం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ అందించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక జైత్రయాత్ర: ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన
సాక్షి, నెల్లూరు జిల్లా: గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్.. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి భరోసా కల్పించారు. చేసిన మేలును వివరించేందుకు మంగళవారం కోవూరు నియోజకవర్గంలోని నార్తురాజుపాళెంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు. సామాజిక సాధికార యాత్ర మధ్యాహ్నం టపాతోపు వద్ద నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాళెం సెంటర్‌కు చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి పీ రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, నెల్లూరు నగర ఎమ్మెల్యే పీ అనిల్‌కుమార్‌యాదవ్, ప్రముఖ సినీనటుడు అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన: రాజన్న దొర ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన జరుగుతుందని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి లంచాలు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గిరిజనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.. వైసీపీ హయాంలో గిరిజనులకు సమ న్యాయం జరుగుతుంది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులకు 40 వేల ఎకరాలు ఇస్తే.. సీఎం జగన్ నాలుగన్నర ఏళ్లలో గిరిజనులకు ఇచ్చిన భూమి మూడు లక్షల ఎకరాలు. దళిత, గిరిజన పిల్లలు ఇంగ్లిష్ విద్యను అభ్యసించడం చంద్రబాబుకి ఇష్టం లేదు. టీడీపీ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయంపై విజయవాడ, విజయనగరంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. మాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేసిన విషయాన్నీ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. దగుల్బాజీ, దగాకోరు, మోసగాళ్లు అందరూ టీడీపీ, జనసేనలోనే ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నిలిచిపోతుంది: మంత్రి మేరుగ నాగార్జున ఎస్టీ,ఎస్టీ,బీసీల సామాజిక స్థితిగతులు పెరగాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్‌కి తెలిసిన సామాజిక సాధికారత. దళితులపై దాడులు, దౌర్జన్యాలు టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిన విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబుకి వయస్సు పైబడి.. మతిస్థిమితం కోల్పోయారు. భావితరాల భవిష్యత్తును ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి దొరికారు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. రాజ్యాంగబద్ధంగా దళితులకీ వచ్చిన హక్కులను చంద్రబాబు కాలరాశారు టీడీపీ కళ్లకు కనిపించడం లేదా?: ఎమ్మెల్సీ పోతుల సునీత లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఇస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదని యువగళం సభలో లోకేష్ మాట్లాడటం సిగ్గు చేటు. అభివృద్ధి జరగలేదని ఎల్లో మీడియతో ప్రచారం చేయిస్తున్నారు. పరిశ్రమల స్థాపన.. ఫిషింగ్ హార్భర్లు ఏర్పాటు.. టీడీపీకి కళ్లకి కనిపించడం లేదు. 2019లో వచ్చిన ఫలితాలే.. 2024లో కూడా రిపీట్ అవుతాయి. పవన్, చంద్రబాబు, లోకేష్‌లు టూరిస్ట్ రాజకీయాలు చేసే నాయకులు సీఎం జగన్ ఆలోచన గొప్పది: అలీ పేదల కష్టాలను సీఎం జగన్ దగ్గర నుంచి చూశారు. వారి కడుపు నింపేందుకు సంక్షేమ పథకాలకు రూప కల్పన చేశారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతి నిరుపేదకి సొంత ఇళ్లు ఉండాలనే సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పది. అదే జరిగితే సంక్షేమ పథకాలు అందవు: మాజీ మంత్రి అనిల్ ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. వలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతుంది. అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవు. జగన్ గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి జగన్. పవన్, చంద్రబాబు కట్ట కట్టుకుని వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు. -
సర్వేపల్లిలో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీని వీడి 50 కుటుంబాలు.. వైఎస్సార్సీపీలోకి చేరాయి. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ భూ స్థాపితం అయిందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు, నారా లోకేష్ టార్చిలైట్ వేసుకొని వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: పవన్.. చంద్రబాబు, లోకేష్ ఆ మాట చెప్పగలరా? -
AP: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. Strong breeze now in Vizag . Similar 30-40kmph wind speed along the AP coast now !! #CycloneMichaung pic.twitter.com/BpcYuJrB1w — Vizag Weatherman@AP (@VizagWeather247) December 2, 2023 తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
నారాయణ మనుష్యులు మరీ..!
సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్‌లోని నారాయణ కాలేజీ వార్డెన్‌గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. -
సామాజిక సాధికార యాత్ర: నాలుగో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: సామాజిక విప్లవ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఇక, నాలుగో రోజు సామాజిక సాధికార యాత్ర అల్లూరి జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగనుంది. పాడేరు సమీపంలోని వంతాడపల్లి చెక్ పోస్టు నుంచి సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►ఉదయం 11 గంటలకు పాడేరు మెడికల్ కాలేజీ పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►11:15 గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►11:30 గంటలకు మోదకొండమ్మ తల్లి స్టేడియం నుంచి బైక్ ర్యాలీ. ►మధ్యాహ్నం 12 గంటలకు కిందిబజార్ వద్ద బహిరంగ సభ. నెల్లూరులో ఇలా... ►నెల్లూరు జిల్లా వింజమూరులో చిన్నకేశవ స్వామి టెంపుల్ నుండి బయలుదేరనున్న బస్సుయాత్ర ►జగీరవనంలో 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న పార్టీ నేతలు ►దుత్తలూరు మీదుగా ఉదయగిరి చేరుకోనున్న బస్సుయాత్ర ►హైస్కూల్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:30 గంటలకి బహిరంగ సభ ఏలూరు జిల్లాలో ఇలా.. ►ఏలూరు జిల్లాలో దెందులూరు మండలం సోమవరప్పాడు నుండి బస్సు యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం ►వీరభద్రాపురం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల్పించనున్న నేతలు ►గోపన్నపాలెం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ -
నెల్లూరులో జనసేనకు భారీ షాక్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు. అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదని, అయినా తనను వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని.. నారాయణతో మనం కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు పలువురు తనకు తెలిపారన్నారు. 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాలపైనని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఆయన అక్రమాలపై గళం వినిపించానని తెలిపారు. పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా.. తాను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని.. ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా..? అంటూ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోందని దుయ్యబట్టారు. కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారన్నారని విమర్శించారు. తండ్రి అరెస్ట్ అయితే కొడుకు ఢిల్లీలో కూర్చుని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూశాడంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాబు చీకట్లో కలిసిపోయాడు.. ఆయన జీవితం చీకటిమయం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిని ఇంటింటికి తెలియజేయాలని లోకేష్ చెప్పాడు. మంత్రి స్థాయిలో ఉన్న రోజాను విమర్శించడం సిగ్గుచేటు. టీడీపీ నేతల నోటికి అడ్డూ అదుపూలేకుండా పోయింది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ నిధులు దారి మళ్లాయి ‘టీడీపీ అబద్ధాలు మాట్లాడుతోంది. టీడీపీకి కాంతి లేకుండా చేస్తాం. దర్యాప్తులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులు దారి మళ్లాయి. చంద్రబాబు కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవాలి - రాష్ట్రంలో వ్యవస్థలు బాగానే ఉన్నాయి. సోమిరెడ్డి నాపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు - నాపై సోమిరెడ్డి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలి’ అని సవాల్ విసిరారు మంత్రి కాకాణి. సీఎం జగన్ అభివృద్ధి చేసి చూపించారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ: అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేసి చూపించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘‘విద్య, వైద్య రంగాలలో ఎలాంటి మార్పు వచ్చిందో జనం చూస్తూనే ఉన్నారు. ప్రతి రంగంలోనూ జగన్ తనదైన అభివృద్ధి ముద్ర వేశారు. ఏ పల్లెకి వెళ్లినా అభివృద్ధి ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఈ విషయాలనే ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తాం. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రేపు ప్రారంభం అవుతుంది. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ ఎమ్మెల్యే విష్ణు కొట్టిపారేశారు. చదవండి: మీరే సింబాలిక్‌గా చెప్పడం ఎదైతో ఉందో.. టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్లు.. -
స్కిల్ స్కామ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు:మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సీఐడీ గుర్తించిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చి టీడీపీ నేతలు తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని హడావుడి చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం రెండు కళాశాలలలో మాత్రమే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘రూ.3 వేల 370 కోట్ల పథకంలో 370 కోట్లను చంద్రబాబు కొట్టేశారు. సీమెన్స్ కంపెనీ పేరుతో డబ్బులు స్వాహా చేశారు. మాకు ఈ పథకంతో సంబంధం లేదని సీమెన్స్ ఇండియా సంస్థ చెబుతోంది. టీడీపీ నేతలు ఆలోచన లేకుండా యూనివర్సిటీకి వచ్చి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు కుంభకోణానికి పాల్పడలేదని యూనివర్శిటీలోని కంప్యూటర్లు చూపెడుతున్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి నిధులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు. ‘‘ఈ కేంద్రాన్ని చూపించి టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందని ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా విశ్వవిద్యాలయానికి రూ.57 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ పైసా కూడా నిధులు ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయంలో లైబ్రరీ.. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌తో పాటు హాస్టళ్లను నిర్మించాం’’ అని మంత్రి కాకాణి తెలిపారు. చదవండి: వామ్మో చినబాబు.. రింగ్‌రోడ్డులో ఎన్ని మలుపులో! -
‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది.. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం. చంద్రబాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి’’ అని అనిల్ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుకు 23 లక్కీ నంబర్.. మా పార్టీకి చెందిన 23 మందిని లాక్కున్నాడు.. 2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23.. జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే.. చంద్రబాబు అరెస్ట్ పై సొంత పార్టీ నేతలే సైలెంట్‌గా ఉంటే.. మా పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువైంది’’ అని అనిల్ ఎద్దేవా చేశారు. ‘‘మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు. తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు. ఏ వయస్సులో తప్పు చేసినా.. నేరం నేరమే.. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అనిల్ స్పష్టం చేశారు. చదవండి: CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం -
నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తనకు అనారోగ్యంగా ఉన్నా.. ఓపిక చేసుకొని రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు పోలీసులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు ప్రియ సోమవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. తాను జనసేన పార్టీకి, పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమానినని తెలిపారు. తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని, ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాను చెప్పిన వాటిల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కో టెస్ట్‌కు సిద్ధమని, తనది తప్పని తేలితే నారాయణ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరతానని చెప్పారు. నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నారాయణ వైద్యశాలలో సుప్రసిద్ధులైన మహిళా డాక్టర్లు చాలా మంది నారాయణ లైంగిక వేధింపులు తాళలేక అక్కడ ఉద్యోగాలు మానేసి వెళ్లిన వాస్తవాలు ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయన్నారు. సాటి మహిళల పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వారి పేర్లను చెప్పడంలేదని తెలిపారు. -
మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు. నన్ను టార్చర్ చేసేవాడు’’ అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నారాయణ నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. -
పవన్ క్షమాపణ చెప్పాల్సిందే..!
పెడన/చేజర్ల(సోమశిల): జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు పోరాటం ఆపబోమని పలువురు వలంటీర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై సోమవారం కూడా పలు ప్రాంతాల్లో వలంటీర్లు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ‘పవన్ డౌన్ డౌన్...’ అంటూ నినాదాలు చేశారు. వలంటీర్లు మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న తమను కించపరిచేలా మాట్లాడటం అన్యాయమన్నారు. తక్షణమే పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అనంతసాగరంలో వలంటీర్లు నిరసన ప్రదర్శన నిర్వహించి పవన్‌కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టికల్ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని గత విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నేటికి(జులై 18కి) వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. -
భర్త దూరం.. యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూసి..
నెల్లూరు(క్రైమ్): గోనెసంచిలో మృతదేహం కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. స్నేహితుడు తనతోనే ఉండాలని, అతడి భార్య జైలుకు వెళ్లాలనే కుట్రతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. పొదలకూరురోడ్డుకు చెందిన జహీర్ బాషా డైకస్‌రోడ్డులో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఎ.కావ్య అలియాస్ షేక్ సమీరా పనిచేస్తోంది. ఆమెకు అప్పటికే వివాహమై భర్త నుంచి దూరంగా ఉంటోంది. కాగా జహీర్, కావ్య సన్నిహితంగా ఉండేవారు. జహీర్‌కు అప్పటికే అస్మా అనే యువతితో వివాహమైంది. ఎలాగైనా స్నేహితుడు తనతోనే ఉండాలని భావించిన కావ్య ఈ విషయాన్ని తన స్నేహితురాలైన వెంగళరావ్‌నగర్‌కు చెందిన కృష్ణవేణికి తెలియజేసింది. ఆమె ద్వారా యూట్యూబ్‌లో వశీకరణ పూజలు చేస్తామని వీడియోలు చేసిన ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన మణికంఠ (33) గురించి తెలుసుకుంది. గతేడాది ఇద్దరూ కలిసి అతడిని సంప్రదించారు. దీంతో మణికంఠ నెల్లూరుకు రాగా కావ్య, కృష్ణవేణి కలిశారు. హత్య చేసి.. జహీర్ తనతోనే ఉండిపోయేలా వశీకరణ చేయాలని కావ్య మణికంఠను కోరగా మందు చేసి ఇచ్చాడు. అది పనిచేయలేదని మహిళలు భావించారు. దీంతో మణికంఠను హత్య చేసి ఆ నేరాన్ని జహీర్ భార్యపై నెట్టేస్తే అతను తనతోనే ఉండిపోతాడని కావ్య పథకం రచించింది. ఈ విషయాన్ని కృష్ణవేణి, తన కుమార్తె సాయిప్రియకు తెలియజేసింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో మణికంఠకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అప్పటికి అతను చనిపోకపోవడంతో గొంతునులిమి హత్య చేశారు. కావ్య తన కుమార్తె చేత అస్మాపై అనుమానం వచ్చేలా సూసైడ్ నోట్ రాయించి మృతుడి జేబులో పెట్టారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి స్కూటీపై తీసుకెళ్లి గౌతమ్‌నగర్ రెండో వీధిలో పడేసింది. దర్గామిట్ట ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో లభ్యమైన లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మణికంఠది హత్యేనని తేలడంతో కేసును మార్చి విభిన్న కోణాల్లో దర్యాపు చేపట్టారు. నగదు డ్రా చేసి.. మణికంఠ హత్య అనంతరం కావ్య మృతుడి ఏటీఎం కార్డు ద్వారా రూ.3.50 లక్షలను విడతల వారీగా నగదు డ్రా చేసింది. అందులో రూ.లక్ష నగదు స్నేహితురాలికి ఇచ్చి మిగిలిన నగదుతో బంగారం కొనుగోలు చేసింది. సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను హత్య చేసింది కావ్య అని గుర్తించారు. ఆమెకు సాయిప్రియ, కృష్ణవేణి సహకరించారని గుర్తించి శనివారం రాత్రి వారందరినీ అరెస్ట్ చేశారు. 25 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన పోలీసు« అధికారులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై రమే‹Ùబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు. ‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేష్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా?. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది?. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అనిల్ పేర్కొన్నారు. చదవండి: ‘రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా?’ -
రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు.. లోకేష్‌పై అనిల్ ఫైర్
సాక్షి, నెల్లూరు జిల్లా: నారా లోకేష్‌కు ఏమాత్రం పరిపక్వత లేదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చిన అనిల్.. రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. భూములు కబ్జా అంటూ లోకేష్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తనకు సంబంధంలేని భూములు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘లోకేష్‌కి గల్లీ లీడర్‌కు ఉండే స్థాయి కూడా లేదు.. పసలేని, ఆధారాలు లేని ఆరోపణలు లోకేష్ చేశాడు.. ప్రమాణానికి నేను సిద్దంగా ఉన్నాను.. లోకేష్ స్పందించాలి.. లోకేష్ చేసిన ఆరోపణల ద్వారా నా చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. బృందావనం, పొగతోటలో నాలుగు ఎకరాలు ఉన్నట్లు లోకేష్ ఆరోపిస్తున్నారు.. నిజంగా అదీ నిజమైతే.. లోకేష్ తీసుకోవచ్చు.. ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు ఉన్నట్లు ఆరోపించాడు.. అందులో నాకు ఉండేది కేవలం 3.9 ఏకరాలు మాత్రమే’’ అని అనిల్ స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటాం: మంత్రి కారుమూరి -
నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్‌కు ఉందా?. దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెల్లూరు సిటీలో నాపై పోటీ చెయ్.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అంటూ మాజీమంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్ధమన్నారు. ‘‘సభలో స్టేజిపై నుంచి నిన్న చర్చకు పిలవడం కాదు.. ఇప్పుడు రా చర్చకు.. మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇస్తా.. చెప్పిన అరగంటలో నేను వస్తా. చర్చలకు సింగిల్‌గా వస్తా.. యుద్ధానికి రమ్మంటే వస్తా.. కావాలంటే నువ్వు వేల మందితో వచ్చినా ఒకే’’ అంటూ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్‌ను ఎందుకు పక్కన పెట్టారన్న అనిల్.. బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్లందరూ లోకేష్ పక్కనే ఉన్నారంటూ మండిపడ్డారు. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు -
CM Jagan: ఆనం జయకుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, వైయస్సార్సీపీ నేత కోటిరెడ్డి కూడా వెంటే ఉన్నారు. రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని చాలాకాలంగా టార్గెట్ చేశారంటూ, పైగా చంద్రబాబు సైతం మోసం చేస్తూ వస్తున్నారని, తనను నమ్ముకున్న వర్గీయులకు సైతం ఏం చేయలేకపోతున్నానని ఆనం జయకుమార్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: జేసీవి శవరాజకీయాలు.. భగ్గుమన్న పెద్దారెడ్డి -
Nellore: 3 నెలల కిందటే పెళ్లి.. నారాయణ కళాశాలలో హౌస్‌సర్జన్ ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధి లోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాలలో ఓ హౌస్‌సర్జన్ తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(24) నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శరత్‌చంద్రతో ఆమెకు వివాహమైంది. శరత్చంద్ర విజయనగరంలోని వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో పీజీ చదువుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి చైతన్యను భర్త వేధింపులకు గురిచేసేవాడని, నగదు, కారు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తుండేవాడని తెలుస్తోంది. భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన చైతన్య రూమ్‌లో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైతన్యకు తల్లి జ్యోతికుమారి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది చైతన్య గది వద్దకు వెళ్లి రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి -
ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట. ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. -
ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటా: అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(బారకాసు): తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొద్దిరోజుల పాటు నెల్లూరు నగరంలో తాను లేకపోవడంతో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేశారన్నారు. కొన్ని పచ్చపత్రికలు, మీడియాల్లో కూడా తనపై దుష్ప్రచారం చేస్తూ వార్తలు వచ్చాయని చెప్పారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందుతానని స్పష్టం చేశారు. రాజకీయ పరంగా పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబితే తప్ప.. ఇంకెవరు చెప్పినా తాను పార్టీ నుంచి వెళ్లేది లేదన్నారు. తాను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, ఎవరి వద్ద నుంచి కూడా ఒక్కరూపాయి తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలకు మరో 9 నెలలు గడువు ఉందని.. ఇక నుంచి నిత్యం నగర ప్రజలతోనే ఉంటానని వివరించారు. ఇది కూడా చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’ -
‘పోలవరం, వెలిగొండ పూర్తి కావాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలి’
సాక్షి, నెల్లూరు: ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ లోకేష్ నవ్వులపాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు.. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఘాటుగా రాజమోహన్‌రెడ్డి బదులిచ్చారు. నెల్లూరులో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైఎస్సార్, జగన్ పుణ్యమేనని చెప్పారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆర్ధిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉంటే.. జగన్‌కు మాత్రం ప్రజా బలం ఉందన్నారు. లోకేష్ బుజ్జి బాబు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేకపాటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ -
భర్త వేధింపులు తాళలేక... బావమరుదులతో కలిసి భార్య ప్లాన్.. ఏం చేసిందంటే!
నెల్లూరు(క్రైమ్): పెయింటర్ షేక్ సుబహాన్ అలియాస్ బత్తల చిన్న(39) రాళ్లపై పడడం వల్ల అయిన గాయాలతో మృతి చెందలేదని, ఆయనను భార్య, బావమరుదులు హత్యచేశారని వేదాయపాళెం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పీవీ నారాయణ తెలిపారు. సోమవారం ఆయన వేదాయపాళెం పోలీసుస్టేషన్లో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. వివరాలు..గాందీనగర్‌లో షేక్ సుబహాన్(39), అబీదా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సుబహాన్ పెయింట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7న రాత్రి సుబహాన్ రెవెన్యూకాలనీ చివరలో తీవ్రగాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అతని భార్యకు సమాచారం అందించగా భర్తను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా సుబహాన్ మార్గం మధ్యలో మృతిచెందారు. తన భర్త మద్యం మత్తులో రాళ్లపై పడడంతో మృతి చెందాడని అప్పట్లో అబీదా వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో లోతుగా దర్యాప్తు చేయగా వేధింపుల నేపథ్యంలో సుబహాన్‌ను బావమరుదులు, భార్య కలిసి హత్యచేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు కేసును హత్యకేసుగా మార్పు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నిందితులు పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. వేధింపులు తాళలేక... సుబహాన్కు మద్యం అలవాటు ఉంది. మద్యం మత్తులో భార్యను తీవ్రంగా వేధించేవాడు. పలుమార్లు పద్ధతి మార్చుకోమని బావమరుదులైన షేక్ మహమ్మద్, షేక్ గౌస్‌బాషా సూచించినా పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న సాయంత్రం సుబహాన్ మద్యం మత్తులో భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన బావమరుదులు ఎలాగైనా అతనికి తగిన బుద్ధి చెబుదామని అబీదాకు చెప్పగా అందుకు అంగీకరించింది. దీంతో సుబహాన్‌ను రెవెన్యూకాలనీలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సిమెంట్ రబ్బీస్ రాయితో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అక్కడి నుంచి వెళ్లిపోయి అబీదాకు సమాచారం అందించారు. ఆమె భర్తను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెంచినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజ్‌కుమార్, ఏఎస్ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు జీ సుబ్బారావు, సురేష్, కానిస్టేబుల్స్ మస్తాన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
‘అన్నా మళ్లీ మీరే సీఎం కావాలి.. మేమంతా మీ వెనకే ఉంటాం’
సాక్షి, నెల్లూరు జిల్లా: దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే జగనన్న మళ్లీ సీఎం కావాలి.. అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య వికలాంగురాలు పెన్షన్ ఇవ్వమని గత ప్రభుత్వంలో అడిగితే ఖాళీ ఉంటే ఇస్తామని ఇవ్వలేదు, కానీ జగనన్న పాలనలో నా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు, రూ. 3 వేలు తలుపుతట్టి ఇస్తున్నారు, నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నేను దళితుడిని, నేను రెండు ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రూ. 41,500 నాకు పెట్టుబడి సాయం అందింది, జగనన్నను నేను జీవితంలో మరిచిపోలేను, మన దళితులు ఎదగాలంటే జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మనం మళ్లీ సీఎం చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్ బావుంటుంది. ధన్యవాదాలు. -మద్దెల ప్రసాదు, రైతు, ముంగమూరు, బోగోలు మండలం మేమంతా మీ వెనకే ఉంటాం.. అన్నా నమస్కారం, మాకు 3 ఎకరాల పొలం ఉంది. అది మేం పండించుకుంటాం కానీ హక్కులు లేవు, మీరు ఈ రోజు మాకు ఆ భూమిపై హక్కులు కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మీరు రూ. 50 లక్షల విలువైన పొలానికి వారసురాలని చేశారు, నేనే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వస్తుంది, నేను వారిని ఇంగ్లీష్ మీడియంలో ప్రేవేట్ స్కూల్ లో చదివించాలనుకునేదానిని, కానీ మీరు అవన్నీ ఇవ్వడంతో వారు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళని స్కూల్‌కు పంపుతుంటే చూడముచ్చటగా ఉంది, పిల్లలకు గోరుముద్ద పథకం కింద మంచి భోజనం ఇస్తున్నారు. మేం తల్లిదండ్రులుగా కూడా ఆలోచించని విధంగా మీరు మేనమామగా ఆలోచించి చేస్తున్నారు, మా డ్వాక్రా సంఘంలో నాకు మూడు విడతలుగా రూ. 22 వేలు వచ్చాయి, మా సంఘానికి బ్యాంకులో రూ. 10 లక్షలు ఇవ్వగా నా వాటాగా రూ. 1 లక్ష వచ్చాయి, దానికి కూడా సున్నా వడ్డీ పథకం కింద ఏప్రిల్ నెలలో వడ్డీ కూడా వేస్తున్నారు, బయట అధిక వడ్డీలకు ఇస్తుంటే మీరు సున్నా వడ్డీకి ఇస్తున్నారు. మాకు రైతుభరోసా సాయం అందింది, మా మామయ్యకు పెన్షన్ వస్తుంది, ఉదయం ఆరుగంటలకే వలంటీర్ వచ్చి మీ మనవడు ఇచ్చారని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మేమంతా మీ వెనకే ఉంటాం, ధన్యవాదాలు. -మమత, మహిళా రైతు, జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం వైనాట్ 175.. తప్పకుండా గెలుస్తాం.. అందరికీ నమస్కారం, ఈ రోజు పండుగ రోజు, ఎన్నో ఏళ్లుగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యను సీఎం పరిష్కరించారు. సీఎం రైతుల పక్షపాతి, ఆయన తండ్రి బాటలో ముందుకెళుతూ, రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నారు, నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి, వాటిని విముక్తి చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఉపయోగకరం, పిల్లల చదువుల కోసం దేశంలో ఏ సీఎం చేయని విధంగా వేల కోట్లు ఖర్చుపెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చారు, గడప గడపకు వెళుతున్న సమయంలో ప్రతి ఇంటిలో ఏ విధంగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంటింటికీ తలుపుతట్టి మరీ పెన్షన్స్ ఇస్తున్నారు, కావలి నియోజకవర్గ అభివృద్ది జగనన్న వల్లే సాధ్యమైంది, ఈ రోజు రామాయపట్నం పోర్ట్ పనులు ఏ విధంగా పరిగెత్తుతున్నాయో మనకు తెలుసు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా అతి త్వరలో పూర్తి అవుతున్నాయి, చంద్రబాబు శంకుస్ధాపనలు చేశారే తప్ప ఒక్క పని చేయలేదు. కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాదాపు 7,8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది, సోమశిల నుంచి కావలికి నీరు వచ్చే పరిస్ధితి లేదు, మాకు సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వాలని కోరాం, కావలి పట్టణంలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మేం ఆ పనులు పూర్తిచేసుకుంటాం, గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ కాలనీలో 6 వేల ఇళ్ళు మంజూరు అయ్యాయి కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలని కోరుతున్నాం, జగనన్న మళ్లీ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు, చాలా సంతోషం, మీరు అన్నట్లు వైనాట్ 175, తప్పకుండా గెలుస్తాం, ధన్యవాదాలు. -కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి -
చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం. ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం అన్నారు. ‘‘దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం. గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుంది. నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల కోసమే వేశాం రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు. వారికి తోడుగా రావణ సైన్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిలిచాయి. రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేశారు. రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని ఒక్క మాట అడగరు. ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించడమే మానేశారు’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. ‘‘ఎన్నికలు దగ్గరపడుతున్నందున వీళ్లంతా రోడ్డెక్కారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను డైలాగ్లుగా మార్చిన ప్యాకేజీ స్టార్ ఒక వైపు.. బాబు, దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా తందానా. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశాం. లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే. చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి వీళ్ల విధానం డీపీటీ.. దోచుకో,పంచుకో, తినుకో’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు. చదవండి: పవన్ లొంగిపోయింది ఇందుకేనా?.. అర్థం అదేనా?.. పాపం వారి పరిస్థితేంటో! ‘‘జీవీరావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దయింది. ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని, దివాలా తీస్తుందని చెప్పిస్తారు. రామోజీ పురుగులు పట్టిన బుర్రలోంచి ఇలాంటి వారు పుడతారు. చంద్రబాబు, ఎల్లో మీడియా మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తారు. చంద్రబాబు, ఎల్లో మీడియాది పెత్తందారీ మనస్తత్వం. వీళ్లు చేసే ప్రతి పని, ప్రతి మాట ప్రతి రాతలోనూ మోసం. పేదలందరికీ ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట’’ అని సీఎం అన్నారు. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
సాక్షి, అమరావతి: నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. శుక్రవారం.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్షనేత చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో ధైర్యంగా చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఈదగాలి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగించడం తప్ప చంద్రబాబు కొత్తగా ఏం చేశారో చెప్పాలన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు హయాంలో కొత్తగా పెన్షన్ పొందాలంటే గ్రామాల్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పెన్షన్ పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందునే ఒంటరిగా, ధైర్యంగా పోటీ చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నారని, అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని చుక్కల భూముల సమస్యను పరిష్కరించడంతో జిల్లాలో 23,023 రైతులకు సంబంధించి 43,270 ఎకరాలకు త్వరలో విముక్తి కలగనుందని తెలిపారు. -
ఇన్స్టాగ్రామ్ పరిచయమే కొంప ముంచింది! క్లాస్‌రూంలోనే బీటెక్ విద్యార్థిని
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రేమ ఆ విద్యార్థిని పాలిట యమపాశమైంది. నయవంచకుడి మాటలకు మోసపోయిన ఆమె గర్భం ధరించింది. తర్వాత ప్రేమికుడు ముఖం చాటేశాడు. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాననే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది. హాస్టల్ గదిలోనే స్వీయ గర్భస్రావానికి ఒడిగట్టి అపస్మారక స్థితికి చేరుకోగా.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కక చివరకు ప్రాణాలొదిలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మధు దంపతుల ఏకైక కుమార్తె కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అధిక రక్తస్రావం కావడంతో.. కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో ఆ విద్యార్థిని తరగతులకు హాజరుకాకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. అదేమని అడిగితే ఆరోగ్యం బాగాలేదని సహచర విద్యార్థినులకు చెప్పింది. 8వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో అదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థిని భోజనం తీసుకు వెళ్లగా.. ఆమె తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉంది. గది నిండా రక్తం ఉండటం, డస్ట్‌బిన్‌లో పిండం పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థిని కేకలు వేయడంతో మరికొందరు గదిలోకి వెళ్లారు. వెంటనే అధ్యాపకులకు తెలియజేయడంతో వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్వీయ గర్భస్రావానికి ప్రయతి్నంచిన విద్యార్థిని అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. సీఐ పి.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఎస్ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలికి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ శశికుమార్‌తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం శశికుమార్‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిసింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు ఆమె గర్భం దాల్చిందని సమాచారం. పరువు పోతుందన్న భయంతోనే ఆ విద్యార్థిని స్వీయ గర్భస్రావానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని వైద్యులు, పోలీస్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని గర్భవతి అయిన విషయంలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్టు సమాచారం. లేకలేక పుట్టిన సంతానం మృతురాలి తల్లి పోలియో బాధితురాలు కాగా.. తండ్రి వ్యవసాయ కూలీ. పెళ్లయిన పదేళ్ల తర్వాత పుట్టిన ఏకైక గారాలపట్టి కావడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఆ విద్యార్థిని చదువుల్లో రాణిస్తోంది. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడుతుందని భావిస్తున్న తమ కలల్ని కల్లలుగా మార్చి ఒక్కగానొక్క కుమార్తె తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లిదండ్రులు బావురుమంటున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. నా భార్యతోనే చనువుగా ఉంటావా అంటూ.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఇంటికి వచ్చిందని.. బంధుమిత్రులతో సందడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. చివరకు ఆమె విగతజీవిగా గ్రామానికి రావడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ప్రేమ పేరుతో యువతిని వంచించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. -
‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’
సాక్షి,నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీలోని ముఖ్యనేతలు ఏకమౌతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మండలాల నేతలు భారీగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఉదయగిరి నియోజకవర్గ మాజీ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగానే ఉంది.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని.. మండల కన్వీనర్ పదవులను చంద్రశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ పదవులను ఎమ్మెల్యే అమ్ముకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. తన పై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటం చేస్తానన్నారు. -
టీడీపీ అంతర్గత సమావేశం.. అంతా గందరగోళం
నెల్లూరు(టౌన్): జిల్లాలో నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ ఘటన ఉదయమే చోటు చేసుకోవడంతో ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని నేతలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జోన్–4కు సంబంధించి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చారు. అయితే ఆయన అనుచరులకు అనుమతి లేదని రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఉండే వారు నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కొమ్మి ఆత్మకూరు టీడీపీకి చెందిన కన్నబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుచరులకు అనుమతి లేకుండా వేరే వాళ్లను ఎలా పంపిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచాలని కన్నబాబుకు ఇస్తే.. ఎక్కడా పంచకుండా దాచుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ నెలకో, రెండు నెలలకో ఆత్మకూరుకు వచ్చే కన్నబాబుకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారని దుర్భాషలాడారు. దీంతో కన్నబాబు అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. దీంతో అసంతృప్తికి లోనైన కొమ్మి సమావేశానికి చంద్రబాబు వచ్చిన తర్వాత కనిపించలేదు. ఇంకా భోజనాల దగ్గర మీడియా ప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఇంకా నెల్లూరు నగరం నుంచి రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జి నుంచి ప్రతిస్పందన కరువైంది. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్‌పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
నెల్లూరు: హారిక మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, నెల్లూరు: గుర్రాలమడుగు సంఘం చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్లేస్‌లో ఓ బొమ్మ ఉంచి.. పాపను ఎత్తుకెళ్లిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. చిన్నారి హారిక ఆచూకీ కోసం చేపట్టిన గాలింపులో చివరికి ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృత దేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయ్యి ఉంటుంది భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు. మణికంఠ హోటల్ నడుపుతుండగా. అనూష భర్తకు దూరంగా ఉంటూ ఎంసీఏ చదువుతూ గుర్రాల మడుగు సంఘంలోనే ఉంటోంది. భర్త మణికంఠ అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి పోతుంటాడు. ఈ క్రమంలో.. ఆదివారం తన తల్లి బయటకు వెళ్లడంతో.. దగ్గర్లో ఉన్న తన పిన్ని ఇంటికి పిల్లలతో వెళ్లింది అనూష. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో డోర్లు తీసి పడుకుందామె. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా.. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని బలి తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిన్నటి వరకు ప్రభుత్వంపై ఫ్రస్టేషన్ చూపించారు. ఉద్యోగులపై సోమిరెడ్డి వాడిన భాష మంచిది కాదు. సోమిరెడ్డి చెప్పినట్టు అధికారులు వినలేదనే వారిపై నోరు పారేసుకున్నారు. నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని కాకాణి అన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని -
‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’
సాక్షి, నెల్లూరు జిల్లా: జిల్లాలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, టీడీపీకి సరైన నేతలు లేకపోవడంతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో నియోజకవర్గంలో పర్యటిస్తే తెలుస్తుంది. నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు. అందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం -
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్! -
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి
సాక్షి, ఆత్మకూరు(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు (48) గుండెపోటుతో మృతి చెందారు. ఆరు నెలల క్రితమే అమరావతి నుంచి బదిలీపై వచ్చి ఆత్మకూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో భాగంగా సోమవారం మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయమై వెళ్లి విచారణ చేసి వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన అనంతరం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు. -
స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో
నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ టైలర్ తన దుకాణంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి నీచునీరు బయటకు రావడం, దుర్ఘందం వెదజల్లుతుండటాన్ని గుర్తించిన స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని షర్టర్ పగులగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. పోస్టల్‌కాలనీ ఆరోవీధికి చెందిన పచ్చియప్పన్ రామస్వామి(48) – రాజేశ్వరి దంపతులు. వారికి సంతోష్‌కుమార్, ఐశ్వర్య సంతానం. ఆయన టైలరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను కరెంటాఫీస్ సెంటర్లో టైలరింగ్ దుకాణం నిర్వహిస్తున్నప్పుడు చంద్రమౌళినగర్‌కు చెందిన కె.సుభాషిణి ఆయన వద్ద పనికి చేరారు. ఆమె భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఈ విషయమై రామస్వామికి, భార్య రాజేశ్వరికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయినా రామస్వామి ఇవేమీ పట్టించుకోలేదు. స్నేహితురాలి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. అప్పుడప్పుడు భార్య, పిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. స్నేహితురాలికి విద్యుత్‌భవన్ వద్ద పండ్ల వ్యాపారం పెట్టించాడు. దాని పక్కనే ఆయన టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. స్నేహితురాలి కుమారుడు, కోడలు ఆమంచర్లలో ఉంటున్నారు. వారు ఆర్థికంగా నష్టపోయి ఇటీవల తల్లి వద్దకు వచ్చారు. రామస్వామి సైతం వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే గత కొద్దిరోజులుగా వారిని ఇంటి నుంచి పంపివేయాలని రామస్వామి స్నేహితురాలిపై ఒత్తిడి తేవడంతోపాటు విపరీతంగా కొట్టేవాడు. దీంతో ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో సుభాషిణి అతనిని దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి తన స్నేహితుడి ద్వారా సుభాషిణితో రాజీప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. శనివారం భార్య, పిల్లల వద్దకు వెళ్లి కొంతసేపు వారితో గడిపి అనంతరం షాపునకు వచ్చాడు. షాపులోనే మద్యం తాగి స్నేహితురాలి కోడలితో గొడవపడ్డాడు. షట్టర్ లోపల గడియపెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటాడని రాజేశ్వరి, తాను దూరం పెట్టడంతో భార్య వద్దనే ఉంటాడని స్నేహితురాలు భావించారు. సోమవారం సుభాషిణి పండ్ల షాపునకు వచ్చింది. రామస్వామి టైలరింగ్ షాపులో నుంచి నీచునీరు బయటకు రావడం, దుర్ఘంధం వస్తుండడాన్ని గమనించిన ఆమె దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్గామిట్ట ఏఎస్సై బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రామస్వామి భార్య, కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో పోలీసులు షట్టర్ పగులగొట్టి చూడగా రామస్వామి ఉరేసుకుని ఉన్నాడు. మృతదేహం కుళ్లి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతూ ఉండడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. స్నేహితురాలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని రామస్వామి భార్య ఆరోపించింది. తన భర్త మృతిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..
సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లింది. భార్య సుభాషిణిని గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చదవండి: హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ! -
దుఃఖం ‘ఒక్కటే’ మిగిలింది
గుడుపల్లె: ఉన్నత చదువులు పూర్తయి త్వరలోనే ఉద్యోగాలు అందుకోవాలనున్న వారి ఆశలను విధి తుంచేసింది. చదువుల్లో రాణిస్తూ సమాజంలో ఉన్నతంగా రాణిస్తారని కలలుగన్న తల్లిదండ్రుల కలలను చిదిమేసింది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, పెనుబర్తి గ్రామానికి చెందిన సుచింద్రారెడ్డి కుమారుడు శ్రీవికాస్‌రెడ్డి(21), అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమారుడు ప్రవీణ్(24) కుప్పం పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుండగా.. రాజంపేటకు చెందిన రమణయ్య కుమారుడు కల్యాణ్(20) మదనపల్లె మిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారులు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. శనివారం సాయంత్రం మదనపల్లె నుంచి కుప్పం పీఈఎస్‌కు వచ్చిన కల్యాణ్.. ఆదివారం వేకువజాము 3 గంటల సమయంలో తన స్నేహితుని కారు తీసుకుని శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌తో కలిసి కుప్పానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం, చిన్నశెట్టిపల్లె వద్ద ముందు వెళ్తున్న లారీ ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. గుడుపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుప్పం ఆస్పత్రికి చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది. తమపై ఎన్నో ఆశలు పెంచుకున్నామని, ఉన్నత చదువులు చదివి తమను ఉన్నతంగా చూసుకుంటారని ఆశపడ్డామని, ఇంతలో తమ ఆశలు తుంచేసి వెళ్లిపోయా రా నాయనా అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ‘చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం. కష్టాన్ని నమ్ముకుని కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తున్నారని పైసాపైసా కూడబెట్టుకుని పెద్ద చదువులు చదివించాలని నిశ్చయించాం. పెద్ద ఉద్యోగం చేసి మా పేరు నిలబెడతారని కలలుగన్నాం. చరమాంకంలో తోడుగా నిలుస్తున్నారని ఆశలు పెంచుకున్నాం. మిమ్మల్నే తలుచుకుని జీవితాలు నెట్టుకొస్తున్నాం. ఇంతలోనే మమ్మల్నందర్నీ వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయారా నాయనా.. మేమెట్టా బతికేది తండ్రీ’ అంటూ రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కుప్పంృపలమనేరు రహదారిలో ఆదివారం వేకువజాము జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు విగతజీవులు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. -
నెల్లూరు: తోడేరు చెరువులో ఆరుగురు యువకుల గల్లంతు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన. -
కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో
కావలి రూరల్(నెల్లూరు జిల్లా): పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆడుకుంటున్న మూడో తరగతి బాలిక (8)ను గంజాయి మత్తులో ఖాదర్‌బాషా (30) అనే వ్యక్తి గొంతు కోసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కలకలం రేపింది. గురువారం రెండో పట్టణ ఎస్సై మాల్యాద్రి తెలిపిన వివరాల మేరకు.. కావలి వెంగళరావునగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బాలిక తండ్రి కొయ్య పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలిద్దరినీ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె పాఠశాల నుంచి వచ్చాక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఇదే సమయంలో గంజాయి మత్తులో ఉన్న తుఫాన్‌నగర్‌కు చెందిన ఖాదర్‌బాషా అటుగా వెళుతూ బాలికను పిలిచి బ్లేడ్‌తో కిరాతకంగా గొంతుకోశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పరుగున బయటకు వచ్చి చూశారు. చికిత్స నిమిత్తం బాలికను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఖాదర్‌బాషా తానే బాలిక గొంతు కోశానని తల్లిదండ్రులకు చెప్పి పరారవుతుండడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మాల్యాద్రి తెలిపారు. కాగా బాలికకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆమె గొంతుకు కట్లు వేసి ఇంటికి పంపారు. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! -
మరువలేని నేత.. సదాస్మరామి.. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది ఏడాది అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. మరువలేని నేతను.. మరోసారి స్మరించుకునేందుకు అభిమానులు వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇందుకుతగ్గట్టుగానే కుటుంబ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మేకపాటి అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
అంకుపల్లి.. మంత్రి కాకాణి వైపే.. మంత్రికి అపూర్వ స్వాగతం
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఆర్.వైపాళెం సచివాలయ పరిధిలోని అంకుపల్లి గ్రామంలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాకాణి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తామని అంకుపల్లి గ్రామస్తులు అన్నారు. -
నెల్లూరు, సంగం బ్యారేజ్‌లకు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డుకు ఎంపికయ్యాయి. పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా నెల్లూరు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్ (0.45 టీఎంసీలు)లను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసింది. 4.22 లక్షల ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ప్రశంసించింది. అత్యుత్తమ ప్రాజెక్టులుగా నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రకటించి సీబీఐపీ–2022 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును మార్చి 3న సీబీఐపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర అధికారులకు ప్రదానం చేయనున్నారు. సీబీఐపీ.. దేశంలో నీటివనరులు, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తోంది. కరోనాను, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెన్నా డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌ల నిర్మాణ పనులను చేపట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ బ్యారేజ్‌ల పనులకు గ్రహణం పట్టుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆరి్థక ఇబ్బందులను అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను 2022, ఆగస్టు 31 నాటికి పూర్తి చేశారు. సెపె్టంబర్ 6న ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. సీఎం జగన్ దార్శనికతకు పట్టం నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను చిత్తశుద్ధితో యుద్ధప్రాతిపదికన సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. బ్యారేజ్‌లతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సీఎం జగన్ దార్శనికతకు పట్టం కడుతూ సీబీఐపీ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో నో చాన్స్..! అజీజ్ ప్లాన్‌తో ఎమ్మెల్యేకు షాక్?
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో ఎంట్రీకి దారులు మూసుకుపోతున్నాయి. ఆ పార్టీ నేతలు కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోటంరెడ్డి ఎపిసోడ్ ప్రారంభమైనప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తనకు తానుగా బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఉన్న అబ్దుల్ అజీజ్ శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా శ్రేణులను కూడగడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఊహల్లో తేలియాడిపోతున్న అజీజ్‌కు కోటంరెడ్డి ఎపిసోడ్‌తో గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. వైఎస్సార్సీపీలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై చక్రం తిప్పిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన రాజకీయాలతో గ్రాఫ్ కోల్పోయాడు. ఈ దఫా టికెట్ వచ్చే అవకాశాలు లేవని ముందుగానే పసిగట్టిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా టచ్‌లోకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడని సమాచారం. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాక.. ఫోన్ ట్యాంపింగ్ హైడ్రామాతో రాజకీయ అలజడి సృష్టించారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యరి్థగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ రూరల్ టికెట్ నాదే అనుకుంటూ ఇదే ఎమ్మెల్యే కోటంరెడ్డిపై, ప్రభుత్వం నోరుపారేసుకున్న అబ్దుల్ అజీజ్ షాక్‌కు గురయ్యాడు. అప్పటికప్పుడే పార్టీ పెద్దలతో కలిసి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టాడు. చంద్రబాబు సైతం కోటంరెడ్డి రాకపై స్పష్టత ఇవ్వకపోవడంతో అజీజ్ మల్లగుల్లాలు పడుతున్నాడు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి అలి్టమేటం పంపిస్తున్నాడు. కోటంరెడ్డి మౌనం.. అజీజ్ అల్లరి నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ నాదేనంటూ బహిరంగంగానే ప్రకటించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అంతర్గత సమావేశాల్లోనూ ధీమాగా చెప్పుకుంటున్నాడు. అయితే మరో వైపు నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్చార్జి, టికెట్ ఆశావహుడు అజీజ్ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. కోటంరెడ్డి మాత్రం మౌనంగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. సోదరుడు గిరిధర్‌రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వారా కోటంరెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు అజీజ్ కూడా చంద్రబాబు, లోకేశ్‌లతో జిల్లా పెద్దల ద్వారా మాట్లాడించారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ అధిష్టాన పెద్దలు మాత్రం పైకి కోటంరెడ్డిని పారీ్టలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ అధిష్టాన పెద్దలపై నమ్మకం లేని అజీజ్ మాత్రం కోటంరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను సమీకరించి సమావేశాలు పెడుతున్నాడు. నిప్పులు చెరిగిన తమ్ముళ్లు ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జరిగిన నెల్లూరు రూరల్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. మూడేన్నర ఏళ్ల కాలంగా పార్టీ నేతలను అష్టకష్టాలు పెట్టి, దాడులతో భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేను పార్టీ లోకి తీసుకోవద్దని ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఒకరిద్దరిని కాదు ఎంతో మంది నేతలను రౌడీమూకలతో చితక్కొట్టించిన ఎమ్మెల్యేను ఎలా తీసుకుంటారని? నేతలు, కార్యకర్తలు మండి పడ్డారు. ఓ ముస్లిం మహిళ అయితే ఏకంగా మా శవాలపై వెళ్లి పారీ్టలోకి ఆహా్వనించడంటూ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నేతను కొట్టించి వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలుసు. అలాంటి అరాచక వాదిని పార్టీ లోకి ఎలా తీసుకువస్తారని, ఆయనతో కలిసి ఎలా నడవాలని ఆ మహిళ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. కార్యకర్తల అభీష్టానానికి వ్యతిరేకంగా కోటంరెడ్డికి పారీ్టలో రాచబాట వేస్తామంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే చంద్రబాబు వద్దే పంచాయితీ తేల్చుకుంటామంటూ నేతలందరూ తీర్మానించారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. కోటంరెడ్డికి టీడీపీలోకి దారేది?.. అన్నట్లుగా ఉంది. -
నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. -
కోటంరెడ్డి.. ఆనంరెడ్డి.. ఏ రెడ్డి వెళ్లినా.. ప్రజారెడ్లు జగన్ వెంటే..
శివరాత్రి వచ్చేస్తుంది. అప్పుడే ఎండలు మండిపొతున్నాయి. శివరాత్రి వెళ్లాక చలి కూడా శివ..శివ అంటూ వెళ్లిపోతుందట..!!. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కూడా మండే ఎండలతో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంట రాజకీయ వేడి గాలులు వీస్తున్నాయి. ఆ వేడి గాలులతో ఏర్పడిన బంగాళాఖాతంలో ఏర్పడిన రాజకీయ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు జిల్లాలో తీరం దాటింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే 'కోటంరెడ్డి' తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాలని ప్రయత్నించింది. 'కోటంరెడ్డి'తుఫాన్ వెంట వచ్చిన 'ఆనంరెడ్డి' తుఫాన్ తీరాన్ని టచ్ చేసి తుస్ మంటే.. 'కోటంరెడ్డి' తుఫాన్ మాత్రం 'ఎల్లో గాలుల' సహయంతో విధ్వంసాన్ని సృష్టించాలని చూసింది. కానీ.. రాజకీయ వాతావరణవేత్తలు అంచనాలను, ఎల్లో వ్యూహకర్తల అంచనాలను 'కోటంరెడ్డి' నెరవేర్చలేకపోయారు. నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు 'కోటంరెడ్డి' తుపాన్ సృష్టిస్తుందని చంద్రబాబు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. గత కొన్ని నెలలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్.. అలానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో టచ్‌లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ ఆరోపణ కాదు నిజం కావొచ్చు. ఎందుకంటే..అమరావతి పాదయాత్రికులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపర్యలు చేశారు. భోజనం పెట్టారు, మంచినీళ్లు ఇచ్చారు. ఇదంతా చేసింది మానవతాదృక్పథంతో అనుకోవడానికి వీళ్లేదు. దీనిలో రాజకీయ వ్యూహం, కోణం ఉన్నాయి. తన పార్టీ ఫిరాయింపుకు కోటంరెడ్డి ఆ రోజు నుంచే పునాదులు వేసుకుంటున్నాడు. కోటంరెడ్డి ప్రతి అడుగు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వేశాడు. 'జగనన్న మాట గడప గడపకూ కోటంరెడ్డి బాట' పేరుతో కోటంరెడ్డి పాదయాత్ర చేసినా ఆ పాదయాత్ర తన రాజకీయ స్వార్ధంతో చేసిందే. తన పరపతి పెంచుకోవడానికి చేసిందే తప్పితే పార్టీ, ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ కోసం చేసింది కాదు. వైఎస్ఆర్ సీపీ స్థాపించక ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త. అటువంటి కోటంరెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మొదటి సారి టికెట్ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో నెల్లూరులో అందరికీ తెలుసు.. రెండోసారి టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు రూరల్ నుంచే ఎన్నో వినతలు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి గెలిపించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మొదటి నుంచి ఆ జిల్లా నేతలు, కార్యకర్తలకు అనుమానమే కానీ..సీఎం వైఎస్ జగన్ తన మనిషిగానే కోటంరెడ్డిని చూశారు. 'శ్రీధరన్న' అని ఆప్యాంగా పిలిచేవారు. ఆ మంచి మనసుకు , ఆ మంచి మాటకు కోటంరెడ్డి వెన్నుపోటు పొడిచాడు. రాజకీయాల్లో "హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి'. వైఎస్ఆర్ సీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్లాలనే కోటంరెడ్డి నిర్ణయం 'రాజకీయ ఆత్మహత్య'. దీనిలో సందేహం లేదు. వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నాడు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఏమైందీ...ఆ 23 మంది, ముగ్గురు ఎంపీలు ఎక్కడున్నారు..? కోటంరెడ్డి ఆలోచన చేసుకోవాలి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. నడిపించే నాయకుడు ముఖ్యం. కోటంరెడ్డిలో పదవి కాంక్ష ఎంతగా పెరిగిపోయిందంటే చంద్రబాబును చీకట్లో కలిసే అంతగా పెరిగిపోయింది. కోటంరెడ్డికి పదవిపై ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో డిన్నర్ చేసే అంతగా..!!. జగనన్నను ఎంతగానో అభిమానిస్తానని చెప్పుకునే కోటంరెడ్డి.. చంద్రబాబును ఎందుకు కలిశాడు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి ఎందుకు డిన్నర్ చేశాడు..? వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లు 'కోటంరెడ్డి ఫోన్ కాల్ ట్యాప్ చేయలేదు.. చంద్రబాబు ట్రాప్‌లో కోటంరెడ్డి పడ్డారు". కాకాణి మాటలు అక్షర సత్యం. " పార్టీ లేదు బొక్కా లేదు" అని అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. "రోజు రోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుందని" చంద్రబాబు స్వయంగా అన్నారు. కుప్పంలో తన పరిస్థితి బాగోలేక పక్క జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందో అని చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. కుప్పంలో కూర్చొని పక్క చూపులు చూస్తున్నారు. లోకేష్‌కు మంగళగిరిలో పోటీ చేసే ధైర్యం లేదు. హిందూపూర్‌లో బాలయ్య ఓడిపోతాడనే టాక్ గట్టిగా వినిబడుతోంది. నా దృష్టిలో టీడీపీ సోషల్ మీడియాలోనే బతుకుతుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పాడె మీద ఉంది. పాడె మీద ఉన్న టీడీపీలోకి పోయి కోటంరెడ్డి ఏం సాధించాలని..?!!. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఏ రెడ్డి అయినా పదవి కాంక్షతో కాకుండా వాస్తవ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. చంద్రబాబు కౌగిలి విష కౌగిలి, దృతరాష్ట్ర కౌగిలి అని కోటంరెడ్డి, ఆనంరెడ్డి గ్రహించాలి. మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటాడు..తరువాత కరివేపాకులా పడేస్తాడు. ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన బాబుకు కోటంరెడ్డి, ఆనంరెడ్డి ఓ లెక్కా..?. నెల్లూరు జిల్లాలో కావాలనే అసంతృప్తిగా ఉన్న రెడ్లను టార్గెట్ చేశాడు చంద్రబాబు. అనుకున్నదే తడువుగా రాధాకృష్ణను రంగంలోకి దింపాడు. కోటంరెడ్డి గాలం వేశారు. ఆనంను కదిలించారు. ఎందుకు..? నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ కంచు కోట. 2019లో నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ సీటు వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ తుఫాన్ అలజడి అటు రాయలసీమ రెడ్లలోనూ..ఇటూ ప్రకాశం, పల్నాడు రెడ్లలోనూ ఉంటుంది అనేది చంద్రబాబు అంచనా. కానీ..కోటంరెడ్డి వెనుక కార్పొరేటర్ కూడా పోవడానికి సిద్దంగా లేడు. ఇదీ కోటంరెడ్డి బలం. సోనియాతో కలిసి చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ఆర్ కుటుంబాన్ని, జగనన్నను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు, ఎల్లో మీడియా రెడ్లకు సహజ శత్రువులు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం, ఎల్లో మీడియా ఉన్నంత కాలం ఆ శత్రత్వం కొనసాగుతూనే ఉంటుంది. పదేళ్లు ప్రాణాలు ఫణంగా పెట్టి జగనన్న జెండా ఎగిరేలా కష్టపడ్డాం. జగనన్నను సీఎం సీటు మీద చూసుకున్నాం. మన అంచనాలకు మించి జగనన్న పరిపాలన చేస్తున్నారు. దేశమే కాదు, ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తున్నారు. ఎల్లో రాక్షసులతో మహా యుద్ధమే చేస్తున్నారు. ఆ మహా యుద్ధంలో జగనన్నకు మనమంతా తోడుగా ఉండాలి. అండగా నిలబడాలి. జగనన్న చేతిలో మనమే ఆయుధాలమై ఎల్లో రాక్షసుల నీచ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. అంతేకాని..పదవుల కోసం జగనన్నను వదిలేసి వెళ్లకూడదు. 10 ఏళ్లు కష్టపడ్డాం..జగనన్న మాకేం చేయలేదనే రెడ్లు ఒక్కటీ ఆలోచించాలి. జగనన్న ఆలోచనను అర్థం చేసుకోవాలి. జగనన్న కళ్లతో భవిష్యత్తును సందర్శించాలి. గాంధీ జీ, అంబేద్కర్ కలల సాధకుడు సీఎం వైఎస్ జగన్. పదవుల కోసం ఆశపడే వారే జగన్‌ను విడిచి వెళ్తారు.. చరిత్రలో నిలిచి, చరిత్ర సృష్టించాలి అనుకునేవారు వైఎస్ జగన్‌తో ఉంటారు.. మళ్లీ ఆయనను సీఎం చేసుకుంటారు. అంటే..ప్రజారెడ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. 'కోటంరెడ్డి' తుఫాన్లు ఎన్ని వచ్చినా తీరం కూడా దాటనీయకుండా అడ్డంగా అడ్డుపడతారు. భవిష్యత్తు దివిటీలై వెలుగుతారు. ::: వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ.. సామాజిక విశ్లేషకులు -
కోటంరెడ్డికి మంత్రి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని, ఆనాడు జగన్మోహన్రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాతిక్రేయ సమావేశం నిర్వహించగా.. దానికి కౌంటర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు కాకాణి. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయం. కానీ, వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం సరికాదు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డిని ట్యాప్ చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు కోటంరెడ్డి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని కాకాణి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు.. ఏమైంది?. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావు అంటూ కోటంరెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్. కోటంరెడ్డి నువ్వు వీరవిధేయుడివి కాదు.. వేరే వాళ్లకు విధేయుడివి. సీఎం జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావు. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా?. సీఎం జగన్ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం. ఆ ఒక్కటే లేకపోతే.. మనమంతా జీరోలం. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి జోస్యం పలికారు. -
కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు. ‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? -
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్ కామెంట్స్
సాక్షి, నెల్లూరు: ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్‌ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్‌పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది. సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది?. మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన చలిమంట.. సోషల్ మీడియాలో పోస్ట్‌తో..
సాక్షి, నెల్లూరు(వెంకటాచలం): చలి కాచుకునేందుకు వేసిన మంట ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అంటుకుని ఇద్దరు చిన్నపిల్లలు, కాపాడేందుకు వెళ్లిన తల్లి గాయపడ్డారు. రెండేళ్ల వయసున్న చిన్నకుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయట పడింది. అయితే పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన మానికల రవికృష్ణ పెయింట్ పని చేస్తుంటాడు. అతడికి భార్య నాగభూషణమ్మ, కుమార్తెలు లహరిశ్రీ, శ్రీవర్ష (2) ఉన్నారు. ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున నాగభూషణమ్మ థిన్నర్ వాడి ఇంటి ముందు చలిమంట వేసింది. కుమార్తెలు చలి కాచుకుంటుండగా ఆమె సమీపంలో ముగ్గు వేస్తోంది. రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. కాగా మంట ఆరిపోతుండడంతో లహరిశ్రీ థిన్నర్ పోసింది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగి లహరిశ్రీ, శ్రీవర్ష శరీరానికి అంటుకున్నాయి. తల్లి చూసి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రవికృష్ణ, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ముగ్గురిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవర్ష మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కొందరు వ్యక్తులు బాధిత గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా వైరలైంది. కాగా ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలు, మీడియాకు తెలియజేసి ఉంటే బాధితులకు సాయం అందేదని చెబుతున్నారు. చలి కాచుకునేందుకు వేసిన మంట చిన్నారిని బలి తీసుకోవడం, మరో బాలిక, తల్లి గాయాలపాలవడంతో కంటేపల్లి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. -
కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఎన్హెచ్ఆర్సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదుదారుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు. -
రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ప్రమీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వెంకటాచలం తహసీల్దార్ నాగరాజు, తోటపల్లిగూడూరు తహసీల్దార్ హమీద్, గుడ్లూరు తహసీల్దార్ లావణ్యను సస్పండ్ చేస్తూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీశాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై చివరకు స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు తహసీల్దార్లు అర్జీలు సమర్పిస్తున్నారు. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్‌బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్‌ను నియమించారు. జేసీ విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులదిగా చూపి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్ చేశారు. ఇలా పలు చోట్ల అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను గుర్తించి సస్పెండ్ వేటు వేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది. చదవండి: (విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు) -
పారిశ్రామిక నగరాల సరసన.. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు
సాక్షి, నెల్లూరు: ఎందరో నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, కళాకారుల జన్మస్థలమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా.. భవిష్యత్‌లో పెద్ద పారిశ్రామిక నగరాల సరసన చేరేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న జిల్లా గతంలోనే ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉండేది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలతోపాటు రామాయపట్నం పోర్టు జిల్లాకు అందివచ్చిన అవకాశంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాజాగా క్రిస్ సిటీకి గ్రీన్‌సిగ్నల్ రావడంతో మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో.. చెన్నై– విశాఖ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు మండలాల్లోని తీర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిబ్బిక్), రాష్ట్ర పభుత్వ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ సకల సదుపాయాలు సమకూర్చి పరిశ్రమలకు కేటాయిస్తారు. రానున్న మూడేళ్లలో సరికొత్త పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అందుబాటులోకి రానుంది. అందులో రూ.37,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో ఇప్పటికే 2,500 ఎకరాలకు గానూ 2,091 ఎకరాల భూసేకరణ చేశారు. 36 నెలల కాలవ్యవధిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 50 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అందుకోసం 2022 మే 10వ తేదీన పర్యావరణ అనుమతులు లభించాయి. కండలేరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అనుమతులు సైతం పూర్తయ్యాయి. ►కొడవలూరు మండలం బొడ్డువారిపాళెంలో నాల్కో–మిథానీ సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో అల్యూ మినియం పరిశ్రమ 110 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. అందుకు రూ.6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇది ఏర్పాటైతే 2 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి ఉంటుంది. ►సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం క్రిబ్కో ఎరువుల కర్మాగారాన్ని 290 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.2 వేల కోట్లతో నెలకొల్పి రెండువేల మందికి ఉపాధి కల్పించనున్నారు. శరవేగంగా రామాయపట్నం పోర్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం జెట్స్పీడ్తో సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ పరిధిలోని మొండివారిపాళెం, ఆవులవారిపాళెం, సాలిపేట పంచాయతీ పరిధిలోని కర్లపాళెం గ్రామాల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద పోర్టు నిర్మాణానికి 850 ఎకరాల భూములను సేకరించి కేటాయించారు. రూ.3,736 కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటిదశలో నాలుగు బెర్తుల నిర్మిస్తారు. ప్రస్తుతం నార్త్, సౌత్ బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులతోపాటు, బెర్తు నిర్మాణ ప్రాంతంలో సముద్ర లోతును పెంచే డ్రెజ్జింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తులు నిర్మించి 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదటిదశ పనులు చేపట్టారు. అనంతర క్రమంలో దీన్ని పది బెర్తులకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే 3 నుంచి 4 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెట్టు వద్ద రైల్వేస్టేషన్ ఉండడంతోపాటు, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పోర్టు సమీపం నుంచే వెళ్తుంది. పోర్టుకు అనుబంధంగా తెట్టు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనికి గానూ జాతీయ రహదారిపై ఉన్న తెట్టు జంక్షన్ నుంచి గుడ్లూరు వైపు వెళ్లే మార్గంలో తెట్టు–శాంతినగర్ మధ్యలో 2,024 ఎకరాల భూములను పరిశీలిస్తున్నారు. మరోవైపు గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పనున్నారు. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మరింతగా ప్రోత్సాహం అందించారు. పరిశ్రమల శాఖామంత్రిగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో గత మూడేళ్లలోనే 13 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. రూ.1,806.72 కోట్లతో ఏర్పాటైన వీటిలో సుమారు 1,780 మంది ఉపాధి పొందుతున్నారు. ఇంకా 2,568 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు రూ.1,785.54 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై 18,031 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో అపార అవకాశాలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గత మూడేళ్లలోనే మెగా, భారీ ప్రాజెక్టు లు ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిథానీ, క్రిబ్కో వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టుల పరిధిలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం. – జి.ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం, నెల్లూరు వైఎస్సార్ హయాంలోనే శ్రీకారం ఆసియాలోని అతి పెద్దదైన కృష్ణపట్నం ఓడరేవును 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. 14 బెర్తులతో ఏర్పాటైన ఈ పోర్టు 2014–15లోనే రూ.1,800 కోట్ల వార్షికాదాయం ఆర్జించింది. ఆ పోర్టుకు అనుబంధంగా ఏడు పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. బొగ్గు దిగుమతి అవకాశాలు మెరుగవడంతో ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను రెండు దశలుగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశం రావటంతో తడ మండలం మాంబట్టు, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య శ్రీసిటీ, నాయుడుపేట వద్ద మేనకూరు సెజ్‌లను అప్పట్లోనే ఏర్పాటు చేశారు. శ్రీసిటీలో 300 పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సుమారు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్షమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మాంబట్టు సెజ్‌లో 20 పరిశ్రమల వరకు ఏర్పాటు చేయగా పదివేల మంది ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా, మేనకూరు సెజ్‌లో 29 పరిశ్రమలు ఏర్పాటుకాగా దాదాపు 15 వేల మంది ప్రత్యక్షంగా, 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. -
ఖమ్మం అమ్మాయి.. నెల్లూరు అబ్బాయి.. పారిపోయి వచ్చి..
సాక్షి, నెల్లూరు(కొండాపురం): ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొండాపురం పోలీసులను గురువారం ఆశ్రయించింది. వివరాలు.. పామూరు మండలం కుంటపల్లికి చెందిన గురవయ్య, వరలక్ష్మి దంపతులు. వారు కుమారుడు గురుబ్రహ్మంతో కలిసి తెలంగాణం రాష్ట్రం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. అక్కడ పీ సంధ్య అనే యువతితో గురుబ్రహ్మానికి పరిచయం ఏర్పడింది. ఇరువురు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి ఐదు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కొండాపురంలోని యువకుడి బంధువుల వద్దకు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇరువురు మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేశామని ఎస్సై ఖాజావళి తెలిపారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
పోలీసుల అదుపులో ఇంటూరి బ్రదర్స్.. బైక్‌లకు పెట్రోలు పోయించి మరీ..
సాక్షి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దర్ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత నెల 28న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎనిమిదిమంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని కందుకూరు తీసుకొచ్చారు. లోతుగా దర్యాప్తు ఈ ఘటనపై పోలీసులు సీఆర్పీసీ 174 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. సభ జరిగిన ప్రాంతంలో డ్రోన్ ద్వారా షూట్ చేసిన వీడియో విజువల్స్ సేకరించారు. అనుమతిలేకుండా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రోత్సహించి స్థానిక పెట్రోలు బంకు వద్ద బైక్‌లకు పెట్రోలు పోయించిన వివరాలు తీసుకున్నారు. సభకు జనాలను తరలించేందుకు వాహనాలు సమకూర్చి నగదు పంపిణీ చేసిన వివరాలు, సభకు వచ్చిన వారికి భోజనాలు, డీజే ఏర్పాటు చేసినవారి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌గా గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కందుకూరు ఘటనలో మృతిచెందిన వారిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీలున్నారు. దీంతో పోలీసులు అదనంగా సెక్షన్ 304(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్లను కలిపారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. -
టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో చంద్రబాబు పర్యటన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు భవిష్యత్‌పై అయోమయంలో పడ్డారు. తొలుత కందుకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని ప్రకటించినా.. ఆఖరి క్షణంలో ఉదయగిరి పర్యటన వాయిదా వేసుకున్నారు. చివరాఖరుకు మూడు నియోజకవర్గాల్లో తిరిగినా.. వాటిల్లో ఫలానా అభ్యర్థి ఉంటారని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం, సీఎంను దూషించడం.. ఈ రెండింటి మీదే పర్యటన సాగింది. కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కూతవేటు దూరంలోని నెల్లూరులో ఉంటున్న నగర ఇన్చార్జిని కూడా పరామర్శించడానికి వెళ్లలేదు. టీడీపీలోకి పక్క పార్టీల్లోని సమర్థులైన నాయకులు రావాలని పిలుపునివ్వడం చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్టీలో కింగ్లనుకునే అందరూ కరివేపాకులే అని సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. కందుకూరు సభలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కావలి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించినా పార్టీ నేతల్లో జోష్ నింపలేకపోయారు. అధినేత పర్యటనకు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఆశావహులు రూ.లక్షలు కుమ్మరించి భారీ ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. అయితే అధినేత మాత్రం ఏ నియోజకవర్గంలో తన పార్టీ తరఫున ఫలానా నాయకుడు మీకు అండగా ఉంటారని, పోటీలో ఉండబోతారని ఎక్కడా చెప్పలేదు. కాగా పక్క పార్టీల్లో బలమైన, సమర్థులైన నేతలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందంటూ పిలుపునివడంతో ఇన్నాళ్లు పార్టీ కోసం పాకులాడుతున్న సీనియర్లు కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసంతృప్తి జ్వాలలు.. వర్గ విభేదాలు చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత అడుగడుగునా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు, వర్గ విభేదాలు రగిలాయి. కావలి నియోజకవర్గ ఇన్చార్జి కరివేపాకేనని స్పష్టమైంది. కావలిలో బీద రవిచంద్ర కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పైకి మాత్రం కావలి తనకు వద్దంటూనే బీద గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కాదని తన అనుచరుడిగా ఉన్న ఓ మండల స్థాయి లీడర్ సుబ్బానాయుడుకి ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేలా చేశాడు. టీడీపీ హయాంలో సహజవనరులు దోచుకుని రూ.కోట్లు సంపాదించిన ఈ చోటా నేతతో చంద్రబాబు పర్యటనకు భారీగా ఖర్చు పెట్టించాడు. అయితే చంద్రబాబు సభలో కావలి అభ్యర్థి ఫలానా అని చెప్పకపోవడంతో సుబ్బానాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. కోవూరులో పరిస్థితిలో మరోలా ఉంది. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన చంద్రబాబు పర్యటనలో కూడా ఇరువురూ కలిసి పనిచేయలేదు. వేర్వేరుగా స్వాగతం పలికారు. కోవూరు సభలో మాత్రం పోలంరెడ్డి తనయుడు దినేష్‌రెడ్డి ప్రచార వాహనంలో ఉన్నాడు. కోవూరు టికెట్ తన కొడుక్కే దక్కుతుందని శ్రీనివాసులురెడ్డి ఇది వరకే కార్యకర్తలకు పరిచయం చేయడం, ఇంకా ప్రచార వాహనంలో బాబు పక్కనే ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ చేజర్ల కరివేపాకులా మారాడు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న ఆయనకు కనీసం ప్రచార వాహనంలో కూడా స్థానం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు తమ అభ్యర్థిగా దినేష్‌ను పరిచయం కూడా చేయకపోవడం ఇరువర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇకపోతే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ కరివేపాకులా మారారనే చెప్పాలి. కోవూరు టికెట్ సాధించేందుకు రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడు. ప్రతి ఎన్నికల సమయంలో పెళ్లకూరుకు టికెట్ అంటూ ప్రచారం మాత్రం జోరుగా ఉంటుంది. చివరాఖరుకు ఇంకొకరు పోటీలో నిలబడతారు. ఒకానొక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పేరు ఖరారు చేసి చివరి క్షణంలో ఆయన్ను తప్పించి వలస నేత అబ్దుల్ అజీజ్‌కు ఇచ్చారు. ఇలా ఎన్నోసార్లు పెళ్లకూరు మరో కరివేపాకు అయ్యాడు. చదవండి: నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’ బలంగా వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీకి బలమైన పట్టు ఉన్న జిల్లాలో టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థలు, తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు ఉప ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు సైకిల్ పంక్చరైంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయక పోయినా బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇచ్చినా వృథా అయింది. ఈ క్రమంలో జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా జిల్లాలో మూడు రో జుల పాటు పర్యటన చేసినా పార్టీలో జోష్ రాలేదు.. నేతల్లో అసంతృప్తి జ్వాలలను రగిల్చి వెళ్లాడు. ముఖం చాటేశారు పార్టీ కోసం చొక్కాలు చించుకుని పనిచేసిన టీడీపీ ముఖ్య నేతలకు సైతం చంద్రబాబు ముఖం చాటేశారు. టీడీపీ ముఖ్య నాయకుల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒకరు. ఇటీవల ఆయన ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. మూడురోజులు జిల్లాలో ఉండీ.. నెల్లూరుకు కూతవేటు దూరంలోని కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కనీసం పరామర్శకు కూడా రాలేదు. బాబు పర్యటన షెడ్యూల్లో కోటంరెడ్డికి పరామర్శ కార్యక్రమం ఉన్నట్లు చూపించారు. అయితే రాకుండానే వెళ్లిపోయారంటే ముఖ్య నేతలకు చంద్రబాబు దగ్గర ఉన్న విలువెంతో అర్థమవుతోంది. జిల్లా పార్టీ నేతల ద్వారా కోటంరెడ్డి చంద్రబాబును తన ఇంటికి తీసుకురమ్మని శతవిధాలా ప్రయత్నాలు చేయించినా సక్సెస్ కాలేదు. ఆయన్ను బాబు కరివేపాకులా తీసేశాడని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణకు సహకరించలేదనే లెక్కలు ఉండడంతో చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. -
సాయంత్రం కాగానే వారికి బాబే గుర్తొస్తారట! అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారుగా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆయన చెబుతున్న ఈ సుభాషితాలు విన్నవారు ముక్కున వేలేసుకోవల్సిందే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిలో అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే .. తమ్ముళ్లూ ..సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు నేనే గుర్తుకు వస్తాను.. అని ఆయన గర్వంగా చెప్పుకోవడం. తాగినప్పుడు బూతులు తిడతారు.. తర్వాత మర్చిపోతారు.. అన్నారు. అంటే మద్యం బాబులు బ్రాందీ, విస్కి వంటివి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుని, ఆ తర్వాత వారు మర్చిపోతున్నారట. ఇది ఆయన బాధ. జగన్ మద్యం రేట్లు పెంచేశారని, మంచి బ్రాండ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎవరైనా పెద్ద నాయకుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాలి. అది మంచిదికాదని వారించాలి. కాని చంద్రబాబు ఏమంటున్నారు! సాయంత్రం అయితే పెగ్గు వేసుకోవాలని గతంలో అన్నారు. ఇప్పుడేమో సాయంత్రం అయితే తానే గుర్తుకు వస్తానని చెబుతున్నారు. అవును నిజమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపారు. ఇళ్లకు కూడా మద్యం సరఫరా చేశారు. మహిళలంతా తమ భర్తలను తాగుబోతులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని మండిపడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాని ఆయన మాత్రం మారలేదు. మద్యం ఏదో అత్యవసర వస్తువుగా ఆయన భావిస్తున్నారు. దానిని చౌకగా అందుబాటులోకి తేవాలట. జగన్ ఏవేవో బ్రాండ్లు తెచ్చారట. వాటికి నాణ్యత లేదట. ఇంతవరకు ఆ బ్రాండ్ల వల్ల ఏమైనా హానీ కలిగిందా? అంటే లేదు. పోనీ ఆ బ్రాండ్లు ఏమైనా జగన్ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ బ్రాండ్ లన్నీ ఇచ్చారని స్వయంగా జగన్ అసెంబ్లీలో పేర్లు చదివి మరీ వినిపించారు. అయినా చంద్రబాబు మాత్రం అదే అసత్యాన్ని వల్లె వేస్తుంటారు. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు ఎంత ప్రయోజనం చేకూరుతుందంటే అనుమానమే. మరో మాట చెబుతున్నారు. రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా జగన్ నే దూషిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదికార వైసిపిపై పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలి. అంతా డబుల్ స్టాండర్డే. చంద్రబాబు నిజంగానే అంత బాగా చేసి ఉంటే జనం ఎందుకు అంత దారుణంగా ఓడిస్తారు? అదేదో జనం చేసిన తప్పు మాదిరిగా ఆయన ఊహించుకుంటూ , శుద్దిమంతుడి మాదిరి గా ఉపన్యాసాలు చెబుతుంటారు. మీడియా వారిని బాగున్నారా? అని అడిగితే బాగున్నాం అంటే ఆయనకు నచ్చలేదట. దానిని గమనించిన ఒకరిద్దరు బాగోలేదని అనగానే మళ్లీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు అందుకున్నారట. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారని, ఇంకా ఏవేవో అన్నారు. ఏ జర్నలిస్టుపై ప్రశ్నిస్తే కేసు పెట్టారు. తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన ఒక రిటైర్డ్ జర్నలిస్టుపై చర్య తీసుకుంటే కోర్టు ద్వారా రక్షణ పొందారు కదా! ఇప్పుడు ఎవరు జగన్ ను విమర్శించినా, అధికారికంగా ఎవరిపైనా చర్య తీసుకోలేకపోతున్నారు. అదే ప్రధాని మోదీనో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నో అని చూడమనండి .. తమాషా ఏమిటో తెలుస్తుంది. న్యాయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారట. నిజానికి న్యాయ వ్యవస్థ అయినా మరో వ్యవస్థ అయినా అన్నిటి సమస్యలు ఎదుర్కొంటున్నది జగన్ ప్రభుత్వం. అయితే ఈయన ఎదురుదాడి చేస్తుంటారు. అసలు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని కదా చంద్రబాబుకు పేరు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన కోర్టు, చంద్రబాబు ఆస్తుల విషయంలో ఎన్ని మలుపులు తిప్పింది అందరూ గమనించారు కదా? చాలామందికి నాట్ బిఫోర్ అన్న పదం న్యాయ వ్యవస్థలో ఉంటుందన్న సంగతి తెలియదు. కాని చంద్రబాబు కేసులో మాత్రం అది బాగా పాపులర్ అయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ ను ఆడిపోసుకోవడమే కాని, తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేక నోటికి వచ్చిన దూషణలతో కాలం గడుపుతున్నారు. అదే రాజకీయం అని, తనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఆ దూషణలతో ప్రజలను ప్రభావితం చేయాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. మరి అది సాద్యమేనా? -హితైషి -
సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..
కావలి: దామవరం విమానాశ్రయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆద్యంతం డూప్ షోగా సాగించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఎయిర్‌పోర్టు శంకుస్థాపన డూప్ షో చేసింది. ఐదేళ్లూ అధికారంలో ఉండీ ఏ బడ్జెట్లోనూ రూపాయి నిధులు కేటాంచని చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు హడావుడిగా స్టిక్కర్లతో శిలాఫలాలు వేసి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతిపాదిత భూముల్లో పిచ్చిమొక్క కూడా పీకలేదు. దీన్ని బట్టి కాంట్రాక్టర్ డూప్ అని తేటతెల్లమైంది. జిల్లాకే ప్రతిష్టాత్మకమైన దామవరం ఎయిర్‌పోర్టుకు టీడీపీ నేతల భూ దోపిడీనే శాపంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు భూ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఆ శాపం నుంచి విముక్తి కలిగించేందుకు మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దామవరంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు స్వయంగా ఆ పార్టీ నేతలనే ఖంగుతినేలా చేశాయి. భూ రాబందుల్లా మారిన టీడీపీ నేతల నిర్వాకం కారణంగానే విమానాశ్రయ నిర్మాణం నిలిచిపోయిందని జిల్లా అంతా తెలిసినా చంద్రబాబు మాత్రం యథావిధిగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. భూ దోపిడీ ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి సైంధవుల్లా అడ్డుపడిన జిల్లా నేత, భూ దందా చేసిన నియోజకవర్గ ఇన్చార్జి, అతని బినామీని పక్కన పెట్టుకునే చంద్రబాబు పసలేని విమర్శలు చేయడం విశేషం. ఇదీ విమానాశ్రయం కథ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో జిల్లా పర్యటనలో విమానాశ్రయాన్ని ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా, జాతీయ రహదారిని ఆనుకుని రవాణాకు సౌకర్యంగా ఉండేలా కావలి నియోజకవర్గంలోని దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,300 ఎకరాల్లో భారీ విమానాశ్రయం నిర్మించేలా డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం చెందడంతో అనంతరం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. 2009–2014 మధ్య విమానాశ్రయ నిర్మాణంపై నిర్లిప్తత ఆవరించగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగింది. 2014లో టీడీపీ అధికారంలో రావడంతో విమానాశ్రయ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములు ఉన్న ప్రాంతంపై రాబంధుల్లా వాలిపోయారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు విమానాశ్రయం కోసం భూసేకరణ వ్యవహారం తల»ొప్పి కట్టేలా చేసింది. దామవరం ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణ భూముల అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు భీతిల్లిపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో అప్పటి కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో 2017 మే నెల 18న నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని పక్క జిల్లాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో అన్ని రాజకీయ పారీ్టలు అధికార టీడీపీ నేతల వైఖరిని తూర్పార బట్టాయి. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదలిక 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయ నిర్మాణానికి భూ సేకరణపై దృష్టి పెట్టి వివాదాలు పరిష్కరిస్తూ 1,310 ఎకరాలు సేకరిచింది. కేంద్ర విమానాయన శాఖకు చెందిన ‘ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా’ దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాశ్రయ నిర్మాణ సంస్థ తమ వద్ద నిధులు లేవని ఏడాదిన్నర తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. ఈ క్రమంలో నిర్మాణ ప్రక్రియ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇటీవల ముంబయికి చెందిన విమానానాశ్రయ నిర్మాణ సంస్థ ప్రతినిధులను సంప్రదించి వారిని దామవరం తీసుకొచ్చి భూములు, విమానాశ్రయ లాభదాయక నిర్వహణ అంశాలను తెలియజేశారు. ఇది ప్రైవేట్, ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించి, నిర్వహించే విమానాశ్రయం కావడంతో ఈ రంగంలో అనుభవం ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నడిపిన డ్రామా దామవరం వద్ద ఎయిర్‌పోర్టు రద్దు వివాదం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ఇక్కడే ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నట్లు మళ్లీ ప్రకటించి రెండేళ్లకు పైగా షో చేసింది. తొలుత ప్రతిపాదిత భూ విస్తీర్ణాన్ని కుదించింది. - 1,352 ఎకరాల్లో రూ.398.56 కోట్లతో దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సెప్టెంబర్ 2017లో ఓ నిర్మాణ సంస్థకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. - ఈ మేరకు 21 జూన్ 2018లో ఆ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్లో నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను కనపరచాల్సి ఉంది. అయితే అదే ఏడాది డిసెంబర్ 21వ తేదీ వరకు కూడా నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను ప్రభుత్వానికి చూపలేదు. ఇదొక బోగస్ నిర్మాణ సంస్థ అని తెలిసినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు విమానాశ్రయ నిర్మాణానికి 11 జనవరి 2019 శంకుస్థాపన చేశారు. - ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులు ప్రారంభిస్తుందని ఏడాది పాటు ప్రభుత్వం ఎదురు చూసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో 15 జూలై 2019లో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్‌ను రద్దు చేసింది. - దీన్ని బట్టి నిర్మాణ సంస్థ ఓ బోగస్, శంకుస్థాపన ఒక డూప్ షో అని తేలిపోయింది. దామవరంలోనే విమానాశ్రయం దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి టీడీపీ నాయకులు చేసిన దుర్గార్మాలు దారుణాల వల్లే సమస్య జఠిలంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసేకరణ చిక్కుముళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అధికారులు దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సాధ్యపడలేదన్నారు. ఎన్నికలకు ముందు అదే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ టీడీపీ ప్రజలను వంచిచే పనులకు పరాకాష్ట. దామవరం విమానాశ్రయ నిర్మాణానికి సంక్లిష్టతగా మారిన భూసేకరణ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేయించగలిగింది. అయితే నిర్మాణానికి పెట్టుబడులు పెట్టే వారికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి -
ఎనిమిది మంది ప్రాణాలు పోయినా.. చంద్రబాబు మారలా
సాక్షి, నెల్లూరు/కోవూరు: అసలే ఇరుకు సందులు.. వాటిలో పదడుగుల ఫ్లెక్సీలు.. గట్టిగా వెయ్యిమంది వస్తే రోడ్డు కిక్కిరిసినట్టు కనిపించేలా డ్రోన్‌షూట్.. చివరికి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు కోల్పోవడం.. ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనల సారాంశం. మూడురోజుల పర్యటనలో టీడీపీ నేతలు ఒకే ఫార్ములా అనుసరించారు. ఫలితంగా బుధవారం కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా మార్పురాలేదు. కందుకూరు ఘటనతోనైనా చంద్రబాబు సభలు విశాలమైన ప్రదేశాల్లో పెట్టకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ ఎక్కడా ప్రచారయావ తగ్గించుకునేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి సాగింది. కావలిలో: కావలిలో గురువారం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద కూడా ఇరుకురోడ్లను ఎంచుకుని ఇదే ఫార్ములాతో సభ నిర్వహించారు. అక్కడ కూడా రెండు వైపులా 30 అడుగుల రోడ్లు, డ్రైనేజీ కాలువ, పదడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచార వాహనాన్ని సెంటర్లో ఉంచి ప్రసంగించారు. కోవూరులో: ఇరుకురోడ్ల ఫార్ములాను అమలు చేస్తున్న చంద్రబాబు అండ్ టీం శుక్రవారం కోవూరులో కూడా అదే తరహా పబ్లిసిటీ కోసం బజార్‌సెంటర్ లాంటి చిన్న జంక్షన్లో సభ నిర్వహించింది. కూడలి అయినప్పటికీ నాలుగు వైపులా రోడ్డు ఇరుగ్గా ఉంటుంది. వందమంది గుమిగూడితే ఇరుకైపోతుంది. అలాంటి ప్రదేశాన్ని టీడీపీ నేతలు ఎంచుకోవడం చూస్తే వారి పబ్లిసిటీ యావ ఎంతదూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తామంటూ నేతలు జనసమీకరణ చేపట్టినా.. కోవూరు బైపాస్ రోడ్డు సాయిబాబా మందిర కూడలి నుంచి బజారు సెంటరు దాకా చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోలో జనం పలుచగానే కనిపించారు. చదవండి: (జనాలు ఛీ కొడుతున్నా చంద్రబాబుకు పట్టింపుల్లేవు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్) -
బాగా చదువుకోమని యువతకు నేనే చెప్పా
సాక్షి, కోవూరు: ఆనాడు యువత బాగా చదువుకోవాలని తానే చెప్పానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, ఐటీని తానే తెచ్చానని అన్నారు. ‘ఐటీ ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పాను. దానికనుగుణంగానే ఐటీ ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి..’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు తలచారని, ఆయన త్యాగ ఫలితంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను సాధించామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి మృతి బాధాకరమన్నారు. రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లను రౌడీలుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. చదవండి: (సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ) -
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది. చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం) -
‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ..
కందుకూరు(నెల్లూరు జిల్లా): కందుకూరులో తొక్కిసలాట సమయంలో బాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల వద్దకు వెంటనే వెళ్లాల్సిందిపోయి నాయకుల్ని పంపాను. విషయం తెలుసుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా.. ఎక్కడికీ వెళ్లొద్దని ఆయన చెప్పడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా... బుధవారం మాత్రం కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చదవండి: బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ -
బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ
కందుకూరు(నెల్లూరు జిల్లా): ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. కందుకూరు రూరల్: కందుకూరు మండలం కొండముడుసుపాళేనికి చెందిన కలవకూరి యానాది తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఎప్పుడు ఎక్కడ టీడీపీ సమావేశాలు జరిగినా అక్కడ వాలిపోతుంటాడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కందుకూరులో చంద్రబాబునాయుడిని చూసేందుకు సమావేశం వద్దకు వచ్చాడు. అక్కడ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందాడు. ఈయనకు భార్య కాంతమ్మ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. ఎస్సీ కాలనీలో కూడా టీడీపీ నాయకుడిగా నాయకత్వం వహిస్తుంటాడు. కందుకూరు మండలంలో ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు టీడీపీకి వీరాభిమాని. ఆ గ్రామ నాయకుడు చల్లా శ్రీనివాసరావు వద్దే పని చేస్తుంటాడు. శివమాల ధరించిన మధుబాబు టీడీపీ మీటింగ్‌కు వచ్చి తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు. మధుబాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. భార్య మాధవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేడు పోస్టుమార్టం తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను ప్రస్తుతం ఏరియా వైద్యశాలలోనే ఉంచారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఏరియా హాస్పిటల్ ప్రాంగణం మార్మోగిపోయింది. చంద్రబాబు సభకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం మా కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాపం వీళ్లు కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో నివాసం ఉండే ఇదిమూడి రాజేశ్వరి అక్కడే టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుంటాడు. వారికి పిల్లలు లేరు. రాజేశ్వరి తమ్ముడు చిలకపాటి మధు టీడీపీ బీసీ సెల్ నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు మీటింగ్‌కు జన సమీకరణలో భాగంగా రాజేశ్వరి మీటింగ్‌కి వచ్చింది. గుండంకట్ట వైపున ఉండడంతో ఒక్కసారిగా తోపులాటలో కింద పడిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె వైద్యశాలకు తీసుకెళ్లగానే మృతిచెందింది. ఆమెను కొండపి మండలం పెట్లూరు గ్రామానికి చెంది వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా బతుకుదెరువు నిమిత్తం కందుకూరు వచ్చి నాంచారమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. రాజేశ్వరి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాళేనికి చెందిన కాకుమాని రాజా ఆర్టీసీ డిపో వద్ద కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తుంటాడు. టీడీపీపై ఉన్న అభిమానంతో చంద్రబాబును చూసేందుకు మీటింగ్ వద్దకు వచ్చాడు. గుండంకట్ట వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నిలిపి ఉంచారు. ఈక్రమంలో తొక్కిసలాట జరిగి మృతిచెందాడు. ఈయనకు భార్య, కళ్యాణి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ఇంజినీరింగ్, కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో పిల్లలు చదువులు ఎలా? అంటూ భార్య, కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కందుకూరు మండలం విక్కిరాలపేటకు చెందిన ఉన్నం ప్రభాకర్, గుడ్లూరు మండలం మోచర్లకు చెందిన గోచిపాతల రమేష్, తెట్టుకు చెందిన ఎస్కే మన్సూర్, గుండ్లపాళేనికి చెందిన మద్దులూరి రాగమ్మ, దప్పళంపాడు గ్రామానికి చెందిన చెరుకూరి మాల్యాద్రి, కందుకూరు మండలం శ్రీరంగరాజపురానికి చెందిన వంకదారి పిచ్చయ్య, వీవీపాళెం మండలం అమ్మపాలేనికి చెందిన డి.మస్తాన్, పోలినేని చెరువు గ్రామానికి చెందిన శనివరపు మణికంఠ అనే వారు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రుల్లో ఉన్నం ప్రభాకర్, గోచిపాతల రమేష్, ఎస్కే మన్సూర్, రాగమ్మలు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశం గందరగోళంగా మారిపోయింది. జనం ఎటువారు అటు పరుగులు పెట్టే హడావుడిలో చెప్పులు జారిపోయి, వస్తువులు పోగొట్టుకుని అవస్థలు పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి.. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు పోలీసులు, స్థానికులు, తోటి కార్యకర్తలు తక్షణం స్పందించడంతో ప్రమాద బాధితుల సంఖ్య పెరగకుండా ఆపగలిగారు. ఆస్పత్రిలో సైతం వైద్య సిబ్బంది సకాలంలో వైద్యసేవలు అందించడంతో మృతుల సంఖ్య తగ్గింది. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్ రావడంతో ఇరుకుగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. ప్రసంగం మొదలు పెట్టేందుకు బాబు సిద్ధమైన సమయంలోనే గుండంకట్ట రోడ్డులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఎస్సై ఉన్నారు. నివారించడం ఆయన వల్ల కాలేదు. అప్పటికే పలువురు కింద పడిపోయారు. ఇది గమనించిన కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని కింద పడిన పలువురిని పక్కకి లాగిపడేశారు. చదవండి: ‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం పోలీసులతోపాటు పక్కను ఉన్నవారు స్పందించి కిందపడిపోయి ఉన్న 16 మందిని చేతులపై మోసుకుంటూ ఎన్టీఆర్ సర్కిల్లోనే ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు వెంటనే స్పందించి క్షతగాత్రులకు చికిత్స ప్రారంభించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారిని గుండెలపై గట్టిగా ఒత్తుతూ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం జరుగుతుండగానే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ
‘అప్పట్లో.. అనగనగా ఓ ఊరు.. రాత్రయితే కానరాని వెలుతురు.. కిరోసిన్ బుడ్డి కిందే చదువు.. అయినా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే.. సాధారణ రైతు బిడ్డగా జన్మించి.. అగ్రరాజ్యానికి హృదయ స్పందనై నిలిచారు.. జన్మ భూమిని.. పల్లె ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు.. సప్త సముద్రాల అవలి నుంచే సొంతూరి దాహం తీరుస్తూ.. విద్యతోనే ఉన్నతని నిరూపిస్తూ.. గ్రామంలో బాటలు వేస్తూ.. ప్రజలందరితో ఎంతమంచి మా ‘ప్రేమ్’యో అంటూ కీర్తి పొందారు. ఆయన మరెవరో కాదు.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి..’ సాక్షి,అమరావతి: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అక్కడ అడుగు పెట్టాలంటేనే ఎంతో కష్టం. కానీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో ఆస్పత్రి కట్టాడు. అప్పటి వరకు ఏ తెలుగువాడికి కూడా ఇంత సాహసం చేయలేదు. అనతి కాలంలోనే ప్రైమ్ హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రేమ్ అమెరికాకు హృదయ స్పందనగా మారిపోయారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం అనే ఒక చిన్న గ్రామంలో 1949లో జూన్ 26న ననమాల సుందరామిరెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో ప్రేమ్ పెద్దవారు. గ్రామంలోనే హైసూ్కల్ వరకు చదువుకున్నారు. విజయవాడలో పీయూసీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెల్లూరులో హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోరి్నయాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో ప్రేమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇంటర్నేషన్ల్ సంస్థను స్థాపించి వైద్య అవసరాలకు అనుగుణంగా విస్తరించారు. ఇందులో భాగంగానే చినోవ్యాలీలో 126 పడకల చినోవ్యాలి మెడికల్ సెంటర్‌ను, కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. 45 వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యూఎస్‌లో అగ్ర వైద్య వ్యవస్థల్లో ఏడాదికి 5 బిలియన్ల డాలర్ల టర్నోవర్‌తో టాప్ 5 స్థానంలో ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమెరికాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, స్థానిక ప్రభుత్వం నుంచి అనేక ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. సాహితీ సేవలోనూ.. సాహిత్యం అంటే ప్రేమ్‌రెడ్డికి చాలా ఇష్టం. దువ్వూరి రామిరెడ్డి రచించిన గులాబీ తోట, పండ్లతోట అనే ముద్రణకు నోచుకోని రెండు కావ్యాలను సొంతంగా ముద్రించారు. కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం కూడా చేశారు. ఆయని ఇతర రచనలను ద లాస్ట్ ఫేర్వెల్ అండ్ అదర్ పోయెమ్స్ పేరుతో పెద్ద సంపుటిగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇదీ కుటుంబం.. ప్రేమ్ ఎస్.రెడ్డి తనతోపాటు మెడిసిన్‌ను అభ్యసించిన అమ్మాయినే (శాంతిరెడ్డి) వివాహం చేసుకుని జంటగా అమెరికాలో అడుపెట్టారు. ప్రేమ్‌రెడ్డికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి కవితారెడ్డి అమెరికాలోని పిడియాట్రిక్స్ పూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రెండో అబ్బాయి అశోక్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మూడో సంతానం సునీతారెడ్డి. నేడు ప్రేమ్‌కు పౌర సన్మానం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు నెల్లూరులో ప్రేమ్‌సాగర్‌రెడ్డికి పౌర సన్మానం చేయనున్నారు. 15 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు వస్తున్న నేపథ్యంలో సోమవారం గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మధ్య ఘనంగా సత్కరించనున్నారు. సొంతూరిని మర్చిపోలేదు ప్రేమ్ ఎస్.రెడ్డి ఎంత ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోలేదు. అందుకే తన సొంత గ్రామంలో హైసూ్కల్‌ను కట్టించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 50 చుట్టుపక్కల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ.కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన బాధ్యతను చాటుకున్నారు. సంపాదించినదంతా సమాజానికే.. ‘నేనెప్పుడూ పేరు కోసమో, ప్రచారం కోసమో పనిచేయలేదు... సంపాదించినదంతా సమాజానిదే.. అందుకే సమాజసేవకే దానిని ఉపయోగించాలి. ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే సమాజసేవకు ఉపయోగిస్తున్నాను. జన్మనిచ్చినందుకు మాతృభూమికి కూడా సేవ చేస్తున్నాను‘.. అంటారు డాక్టర్ ప్రేమ సాగర్‌రెడ్డి. -
తనను విడిచి కొడుకు విదేశాలకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): కొడుకు తనను విడిచి విదేశాలకు వెళ్తున్నాడని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని న్యూమిలటరీ కాలనీ 6వ క్రాస్‌రోడ్డులోని సాయిబాబా మందిరం వద్ద చల్లా పెంచల నరసింహారెడ్డి, విజయకుమారి (45) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి సదాశివారెడ్డి, భరత్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడైన భరత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, పెద్ద కుమారుడు సదాశివారెడ్డి బీటెక్ పూర్తి చేయగా, ఫారిన్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అతను వెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈక్రమంలో పెంచల నరసింహారెడ్డి అయ్యప్పమాల వేసి ఈనెల 18వ తేదీన శబరిమలకు వెళ్లాడు. దీంతో సదాశివారెడ్డి తల్లి విజయకుమారితో తాను విదేశాలకు వెళ్తానని చెప్పాడు. ఇంటి బాధ్యతలు చూసుకోవాలని, అలా కాకుండా విదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కొడుక్కి చెబుతూ ఉండేది. అయినా సదాశివారెడ్డి మాత్రం ఈనెల 25వ తేదీన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయకుమారి బుధవారం ఇంట్లోని బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేదాయపాళెం పోలీసులకు భరత్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (దేశం కాని దేశంలో.. మన కుర్రాళ్ల ఇబ్బందులు) -
మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల!
ఉదయగిరి కేంద్రంగా వ్యవసాయ విద్యకు బీజం పడింది. మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల మారనుంది. మారుతున్న ప్రపంచీకరణలో తిరిగి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. కంప్యూటర్ కోర్సులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారిన ఎందరో తిరిగి ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రస్తుతం విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, మెడిసిన్ తర్వాత వ్యవసాయ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. ఉదయగిరి (పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక పాలనకు కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో కాలక్రమేణా కరవు రాజ్యమేలింది. అలనాటి రాజుల స్వర్ణయుగం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. ఉదయగిరి కేంద్రంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.250 కోట్ల ఆస్తులను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించి వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేసి అందుకు అవసరమైన నిధులు కేటాయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్, çహార్టికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టనుంది. వ్యవసాయ రంగానికి ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరికి వ్యవసాయ కళాశాల మంజూరు కావడంతో అగ్రికల్చర్ కోర్సులు ఇక్కడే అభ్యసించే అవకాశం ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. దాని పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల కూడా దీని పరిధిలోకి రానుంది. త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్పు చెందితే ఈ కళాశాలలన్నీ కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది. రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆలోచన. ఆయన అందుకు అనుగుణంగానే ఆది నుంచి విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించారు. 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఉదయగిరిలో డిగ్రీ కళాశాలకు సొంత నిధులు ఇచ్చారు. అనంతరం వందెకరాల విశాల ప్రాంగణంలో మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.250 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. మెరిట్స్‌లో ప్రస్తుతమున్న సదుపాయాలు 150 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాల ఉంది. 5 లక్షల చ.అ. అకాడమీ బ్లాక్స్ ఉన్నాయి. సుమారు 1,350 మంది విద్యార్థులు నివాసముండేందుకు హాస్టల్ భవనాలున్నాయి. 89 మంది స్టాఫ్ ఉండేందుకు క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, విశాలమైన లైబ్రరీలో 27 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 3 బస్సులు, జనరేటర్లు, క్యాంటిన్, గెస్ట్‌హౌస్, ఎన్ఎస్ఎస్ భవన సముదాయాలు, ప్లేగ్రౌండ్, తదితర వసతులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. మరో యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెరిట్స్ కళాశాలలో పని చేసే 108 మంది బోధన, బోధనేతర సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద వ్యవసాయ కళాశాలకు తీసుకుంటూ కేబినెట్ ఆమోదించింది. దీంతో మెరిట్స్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మేలుచేకూర్చినట్టయింది. కేబినెట్ ఆమోదంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 18 నుంచి తరగతుల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 250 మంది విద్యార్థులకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 18వ తేదీ నుంచి వ్యవసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయగిరి వ్యవసాయ కళాశాల అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరికి వ్యవసాయ కళాశాల రాకతో వ్యాపార ఆర్థిక కలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి ఈ వ్యవసాయ కళాశాలలో 250 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది స్టాఫ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతులు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కళాశాల ప్రముఖపాత్ర పోషించే అవకాశముంది. – డాక్టర్ కరుణసాగర్, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల, ఉదయగిరి -
ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం
గుడ్లూరు(కందుకూరు)నెల్లూరు జిల్లా: ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్థాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల శ్రీనివాసులు కుమార్తె నక్కల శ్రావణి (24) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సంజీవ్ అనే యువకుడితో వివాహమైంది. సంజీవ్ బీఫార్మసీ చేసి ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం శ్రావణి 7 నెలల గర్భిణి. దీంతో ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రావణి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఫోన్ చేసి చెన్నైలోని ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాల్సింగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం తాను గర్భిణిని, అని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రస్తుతం ఆఫీసుకు రాలేనని, మరికొంత కాలం వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని శ్రావణి విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించి కచ్చితంగా ఆఫీసుకు రావాలని సూచించారు. దీనికి శ్రావణి ఒప్పుకోకపోవడంతో 15 రోజుల క్రితం శ్రావణిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఉద్యోగం పోయిందని బాధపడుతూ ఉంది. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. గ్రామంతో పాటు బంధువులు, ఇతర ప్రదేశాల్లో వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే మంగళవారం గ్రామంలోని చెరువులో యువతి మృతదేహం ఉన్నట్లు గురించి శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణి మనస్థాపంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుడ్లూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి -
తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: అప్పులు బాధ తట్టుకోలేక శంకుల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి (46) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను కుమార్తెలు సోమవారం నిర్వహించారు. ఈ ఘటన మండలంలోని చౌకచెర్ల గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామానికి చెందిన శంకుల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చిన్నపాటి కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య శారద, కుమార్తెలు తేజ, లిఖిత ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అక్కడ ఓ సంస్థలో సబ్ కాంట్రాక్టర్‌గా ఆయన పని చేసేవాడు. ఇందులో భాగంగా నాగాలాండ్‌లో ఒక పనిని సుమారు రూ.12 కోట్లు అప్పు చేసి పూర్తి చేశాడు. అయితే ఈ పని నిమిత్తం సదరు సంస్థ వారు రూ.4.03 కోట్లను చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన డబ్బును ఇవ్వాలని సంస్థను బాలసుబ్రహ్మణ్యంరెడ్డి కోరగా కాలయాపన చేశారు. సెపె్టంబర్ నెలలో నాగాలాండ్ నుంచి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన అతడిపై అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో అదే నెలలో తిరిగి నాగాలాండ్‌కు వెళ్లిపోయాడు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన చివరిగా తన భర్త నుంచి ఫోన్ వచ్చిందని శారద చెబుతున్నారు. ఈనెల 8వ తేదీన బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్ పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన సూసైడ్ నోట్ అక్కడ లభించింది. అందులో ఆ సంస్థ చేస్తున్న అక్రమాలను వివరించాడు. ఆత్మహత్యకు వారే కారణమని బాలసుబ్రహ్మణ్యంరెడ్డి రాశాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. తలకొరివి పెట్టిన కుమార్తెలు తండ్రి మరణ వార్తను విని కుమార్తెలు తేజ, లిఖిత జీరి్ణంచుకోలేకపోయారు. ఆదివారం ఉదయం చెన్నై ఎయిర్‌పోర్టులో బాలసుబ్రహ్మణ్యంరెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాత్రి స్వగ్రామమైన చౌకచెర్లకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించారు. కుమార్తెలు తండ్రికి తలకొరివి పెట్టారు. -
మాండూస్ ఎఫెక్ట్: కుండపోత వర్షాలు.. ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
Cyclone Mandous Andhra Pradesh Updates ప్రకాశం జిల్లా: సముద్రంలో చిక్కుకున్న 7 గురు మత్స్యకారులు కొత్తపట్నం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ నెల 4 తేదీన చీరాల ఓడరేవు మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లారు. తుపాను ఉధృతికి సముద్రంలొనే చిక్కుకుపోయారు. జిల్లాలో రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం కురవగా, ఈ రోజు ఉదయం నుండి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బైరవకొన జలపాతం ఉరకలేస్తుంది. భారీ వర్షాలతో శనగ, పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. తిరుపతి: పోటెత్తిన వరద నీరు స్వర్ణముఖి నదికి వరద నీరు పోటెత్తింది. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నదికి అవతల వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్లేమడుగు రిజర్వాయర్ 12 గేట్లను ఎత్తివేసి స్వర్ణ ముఖి నదిలో దిగువకు నీరు విడుదల చేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరుపతి, తిరుమలలో జనజీవనం స్తంభించింది. తిరుపతి జిల్లాలో నాయుడుపేట, బాలాయపల్లె, ఓజిలి, శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, తిరుపతి, వాకాడు, చిల్లకూరు, నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు, ఆత్మకూరు, కలువోయ, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, తదితర ప్రాంతాల్లో జనం పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను ప్రభావంతో రాష్ట్రమంతటా చలి గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కే పద్మావతి అనే మహిళ మృతి చెందింది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి అధికార యంత్రాంగం 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 33 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో ఆహారపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందించారు. ఆయా జిల్లాల్లో 4 ఎస్డీఆర్ఎఫ్, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. లోతట్లు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ఈ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కండలేరు, మానేరు, స్వర్ణముఖి నదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నదీ తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. వాయుగుండంగా బలహీనపడిన తుపాను మాండూస్ తుపాను శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరు వైపు కదులుతూ తీవ్ర వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడింది. రాబోయే కొద్ది గంటల్లో ఇది క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తతో తగ్గిన నష్టం తీవ్రత మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు ఇస్తున్నాం. అధికార యంత్రాంగం 24 గంటలు పని చేస్తూ సత్వరమే స్పందించేలా ఏర్పాట్లు చేశాం. ప్రమాదాలను స్పష్టంగా అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్లే నష్ట తీవ్రతను బాగా తగ్గించ గలిగాం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించాం. – జి సాయిప్రసాద్, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉ.8.30 గంటల నుంచి శనివారం ఉ.8.30 వరకు వర్షపాతం ప్రదేశం సెంటీమీటర్లలో నాయుడుపేట, తిరుపతి జిల్లా 28.1 హస్తకావేరి, తిరుపతి జిల్లా 24.1 కట్టవపల్లె, నెల్లూరు జిల్లా 23.8 అరిమనిపాడు, తిరుపతి జిల్లా 23.4 బ్రహ్మదేవం, నెల్లూరు జిల్లా 22.2 వెంకటాచలం, నెల్లూరు జిల్లా 21.5 శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా 21.3 పాలూరు, నెల్లూరు జిల్లా 21.2 విద్యానగర్, తిరుపతి జిల్లా 21 తొట్టెంబేడు, తిరుపతి జిల్లా 20.9 శనివారం ఉ.8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం ప్రదేశం సెంటీమీటర్లలో భట్టేపాడు, నెల్లూరు జిల్లా 13.3 బల్లిపల్లి, ప్రకాశం జిల్లా 11.9 పెదచెర్లోపల్లి, ప్రకాశం జిల్లా 11.6 చీపినపి, నెల్లూరు జిల్లా 11.1 మోపిదేవి, కృష్ణా జిల్లా 9.4 ఆత్మకూరు, నెల్లూరు జిల్లా 8.9 రేవూరు, నెల్లూరు జిల్లా 8.8 వాసిలి, నెల్లూరు జిల్లా 8.8 మర్రిపాడు, నెల్లూరు జిల్లా 8.4 పాకల, ప్రకాశం జిల్లా 8.2 తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుమలను పొగ మంచు చుట్టుముట్టింది. ఘాట్ రోడ్డులో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు స్తంభించాయి. అలిపిరి వద్ద భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కెవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవటంతో 16 గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టారు. ఫలితంగా 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహానికి పూడి, పోలినాయుడు కండ్రిగ, రాజులకండ్రిగ కాజ్ వే లు కొట్టుకుపోయాయి. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్ రిజర్వాయర్, పెనుమూరు మండల పరిధిలోని ఎన్టీఆర్ జలాశయానికి భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి, కుశస్థలి, నీవా, అరుణానది, కైవల్యా, కాళంగి, బహుదా, కౌండిన్య, గార్గేయ నదులు, గొడ్డేరు వాగు, పాములకాలువ, నేరేడు కాలువ, ఉప్పుటేరు, అలపలేరు వాగు, బడబళ్లు వాగు, ఏటి చెరువు, పెద్దేరు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను తీవ్రతకు జిల్లాలో పది పశువులు మృతి చెందాయి. వందకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రైల్వేకోడూరు–తిరుపతి రహదారిపైకి వరద నీరు అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల పరిధిలో సుమారు 20 గ్రామాలకుపైగా రాకపోకలు స్తంభించాయి. అరటి, బొప్పాయి తోటల్లోకి నీరు చేరింది. రైల్వేకోడూరు–తిరుపతి ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తింది. నిమ్మనపల్లె వద్ద ఉన్న బాహుదా ప్రాజెక్టుతోపాటు గాలివీడు పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోనూ పలు చోట్ల పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం డ్యామ్‌కు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మైలవరం డ్యామ్ నుంచి 3 వేల క్యూసెక్కులను పెన్నానదిలోకి వదిలారు. చిత్రవతి రిజర్వాయర్ నుంచి 2 గేట్లు ఎత్తి 2400 క్యాసెక్కుల నీటికి నదిలోకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా మనుబోలు మండలంలో 277 మి.మీ. వర్షం కురిసింది. బొగ్గేరు, పైడేరు, ఆల్తుర్తి, బీరాపేరులో నీటి ప్రవాహం పెరిగింది. సోమశిల ప్రాజెక్ట్‌కు వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో పొలా నీట మునిగాయి. నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, వైఎస్సార్ నగర్, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. – ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఐదు మండలాల పరిధిలో 57 గ్రామాల్లోని పొలాల్లో నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జడివానకు తోడు ఈదురు గాలులు జనాన్ని వణికించాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు లాంటి శుభాకార్యాలు ఎక్కువగా ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, రబీ సాగుకు ఈ వర్షాలు ఊరటనిస్తాయని చెబుతున్నారు. రవాణాకు ఇబ్బంది కలగనివ్వం మాండూస్ తుపాను వల్ల వివిధ జిల్లాల్లో పంచాయతీరాజ్ రోడ్లకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ఎప్పడికప్పుడు తెలియజేయాలని పీఆర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బాలునాయక్ ఆదేశించారు. శనివారం కర్నూలు వచ్చిన ఆయన స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్ ఎస్ఈ కార్యాలయం నుంచి చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్ఈలతో వెబె కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజల రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. తుపాను తగ్గిన అనంతరం జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను పంపాలన్నారు. ఏ ఒక్క రైతునూ నష్టపోనివ్వం : మంత్రి కారుమూరి తణుకు అర్బన్: మాండూస్ తుపాను కారణంగా పంట తడిసినా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఆఫ్‌లైన్ ద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి గింజనూ సత్వరమే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే రైతాంగానికి అనుకూలంగా అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడాలనే తపనతో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. -
నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు
నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) -
నెల్లూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు(బుధవారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. హెలిప్యాడ్ నుంచి వేడుక జరిగే విపీఆర్ కన్వెన్షన్ వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరు కానున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మధ్యాహ్నం ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ద్వారా నెల్లూరు కనుపర్తిపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఇరవై నిమిషాలపాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. ఆపై రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని.. కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేదిక వద్దకు చేరుకుని వధూవరులను ఆశీర్వదిస్తారు. హెలికాప్టర్లో బయలుదేరి తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. -
దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: ధాన్యం కొనుగోలుపై నా మాటలను ఈనాడు పత్రిక వక్రీకరించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు కష్టమని నేను చెప్పలేదు. అందరూ వరి పండిస్తే రైతులకు తలకు మించిన భారం అవుతుందని చెప్పాను. అలా కాకుండా లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచించామన్నారు. 'మార్గదర్శిలో దోచుకొంటున్న రామోజీ గురువింద సామెతలా వ్యవహరిస్తున్నారు. దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?. సిగ్గుమాలిన వార్తలు ఎలా రాస్తున్నారు. చంద్రబాబుని అర్జంట్‌గా సీఎంని చేయాలన్నదే రామోజీ అజెండా. అలా అని తప్ప్పుడు వార్తలు రాసి బురదజల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని' హెచ్చరించారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తే ఏనాడైనా వార్త రాశావా రామోజీ అని ప్రశ్నించారు. ఎవరి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారో చర్చిద్దాం. దమ్ముంటే చంద్రబాబుని తీసుకొనిరా అని సవాల్ విసిరారు. పత్రికలు ప్రజాహితం కోరి వార్తలు రాయాలే తప్ప ఇలాంటి తప్పుడు వార్తలు రాయకూడదంటూ మీడియా ముందు క్లిప్పింగులను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రదర్శించారు. చదవండి: (‘లోకేష్ సంక్షేమం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు’) -
సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. అయితే ఇది ప్రత్యర్థుల మధ్య ఉంటుంది. సింహపురి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అనేక తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. స్వపక్షంలో పైచేయి సాధించాలనే తపనతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు అధిష్టానం మెప్పు, ఇటు జిల్లాలో పార్టీపై ఆధిపత్యం రెండు దక్కించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కంటే ముందుగా జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకరి తర్వాత ఒకరు ప్రజా మద్దతు కంటే ముందు అధిష్టానం వద్ద పరపతి పెంచుకోవాలనే తపన టీడీపీ నేతల్లో మెండుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అదే ఒరవడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగింది. జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్లో తెలుగుదేశం కండువా కనుమరుగైంది. ఒక్కరంటే ఒక్క ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఆ పార్టీకి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం అధిష్టానం మెప్పు పొందాలనే దిశగా జిల్లాలో టీడీపీ నేతల అడుగులు పడుతున్నాయి. ఒకరి తర్వాత ఇంకొకరు వివాదస్పద వ్యాఖ్యలతో తెరపైకి వస్తుండడం విశేషం. చదవండి: (Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ') ఆధిపత్యం కోసం ఆరాటం జిల్లాలో పార్టీపై ఆధిపత్యం కోసం సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరాటపడుతున్నట్లు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు లోకేష్ ఓ సందర్భంలో మంగళగిరిలో ప్రకటించారు. టీడీపీ దానికి కట్టుబడి ఉంటే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి టికెట్ దక్కదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన సోమిరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. క్రైమ్ రేట్ పెరిగిందని బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటించాలని, ఆ దిశగా అనుచరగణంతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈనెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా జవనరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈలోపు జిల్లాలో సోమిరెడ్డి పాదయాత్ర చేయాలనే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు కనీసం పార్టీ టికెట్ అయినా దక్కించుకోకుంటే భవిష్యత్‌లో రాజకీయ పరిస్థితులు ఊహించుకోలేమని పాదయాత్ర ఆలోచనలో ఉన్నారని తెలిసింది. -
‘శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం’
సాక్షి, నెల్లూరు: నాపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం. జిల్లాలో ఏది జరిగినా నాకు ఆపాదించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అనిల్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి వ్యక్తిగత విషయంలోనే గొడవ జరిగింది. శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నారు అని ఆరోపించారు. -
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో చోరీ కేసుకు సంబంధించి సుమోటో పిల్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏస్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించిన తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు) -
రాబిన్‌శర్మ టీమ్ సర్వే: ఈ సారి వారికి టికెట్టు కూడా డౌటే!
టీడీపీ అధినేత నిర్ణయంతో తమ్ముళ్లకు టికెట్ ఫీవర్ పట్టుకుంది. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణలేదు. అధికార పార్టీ పై పైచేయి సాధించే సత్తా కొరవడిన నేపథ్యంలో సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ మాజీలకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని టెన్షన్ పడుతున్నారు. సాక్షి, నెల్లూరు: టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. క్షేత్రస్థాయిలో అధికార వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, ప్రజాదరణ స్థిరంగా ఉండడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల బరిలోకి ‘కొత్త ముఖాలు’ వ్యూహానికి తెర తీయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందు కోసం తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా సర్వే ప్రారంభించింది. ఆ పార్టీ సీటింగ్ మాజీల పట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన టీమ్ అధినేతకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సర్వే ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో టికెట్ తమదేనని అనుకుంటున్న సీటింగ్ మాజీలతో పాటు ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామనే భ్రమ మినహా అందలం ఎక్కే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్ లేదనే ఇప్పటికే స్పష్టం చేయడంతో జిల్లాలో చాలా మంది టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. సోమిరెడ్డి పరిస్థితి అంతే.. వరుసగా మూడు పర్యాయాలు ఒకే నియోజకవర్గంలో ఓటమి చెందిన నాయకులను ఈదఫా ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా పెట్టాలనే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ మహనాడులోనే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇదే విషయాన్ని బాహాటంగా వెల్లడించారు. ఈ కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉంటారు. ఈ దఫా ఆయనకు టికెట్ రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ నాటికే నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు తుది రూపు తీసుకురావాలనే సంకల్పంతో టీడీపీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్‌శర్మ టీమ్ సర్వేలో సామాన్య ప్రజానీకంలో అధికార పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జిలతో నిమిత్తం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్‌కు ధీటైన వారినే అభ్యర్థులుగా ప్రతిపాదించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: (పదే పదే క్లీన్‌బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?) ఆ ఇద్దరి భవిష్యత్ ప్రశ్నార్థకమే.. తెలుగుదేశం పార్టీలో ఎదురులేదని భావిస్తూ వచ్చిన నాయకులకు ఈ దఫా టికెట్ విషయంలో భంగపాటు తప్పేటట్లు లేదు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో నేరుగా సమీక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆశావహుల వారీగా సర్వే చేయిస్తున్నారు. పార్టీ పరంగా, ఆశావహుల వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు ఇద్దరికీ ఈ దఫా పార్టీ టికెట్ ఎంపిక ప్రశ్నార్థకంగా మారనుంది. ఇద్దరికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్ ముందు ఆ ఇద్దరు చాలా వెనుకబడినట్లు సమాచారం. ఇదే పరిస్థితి సర్వేపల్లి, కందుకూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నట్లు టీడీపీ సర్వే టీమ్ అధినేతకు నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల్లో వ్యాపారాల్లో స్థిరపడిన వారి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. -
భగవంతుడా.. బిడ్డ కోసమైనా బతికించు
17 ఏళ్ల వయసు నిండకముందే పెళ్లి.. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అంతలోనే ఆ ఇల్లాలికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి.. భార్య అనారోగ్య విషయం తెలుసుకున్న భర్త కనికరం లేకుండా ఆమెపై దాడి చేసి వెళ్లిపోయాడు. గుండెకు మూడు రంధ్రాలతోపాటు, ముక్కుకు సంబంధించి ఇంకో సమస్య. నిరుపేదరాలైన గృహిణి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. సాక్షి, నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న మరియమ్మ, సుబ్బారావు దంపతులు నిరుపేదలు. వారికి ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వారిలో ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా.. సుభాషిణి ఐదో సంతానం. ఆరో సంతానమైన కుమారుడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు కూలి పనులు చేస్తుంటాడు. ఏమైందంటే.. సుభాషిణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆమెకు ముక్కుల నుంచి రక్తస్రావం జరిగింది. నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రి, కిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించగా గుండెకు రంధ్రాలున్నట్టు తేలింది. దీంతో భర్త భార్యతో గొడవ పెట్టుకుని రోకలి బండతో తల పగులగొట్టి మరో మహిళ వద్దకు వెళ్లిపోయాడు. సుభాషిణికి తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ రావడంతో చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి భర్త చేసిన దాడి కారణంగా మెదడు నుంచి ముక్కుకు వచ్చే నరాలు దెబ్బతిన్నాయని తేల్చారు. వారి సూచన మేరకు చెన్నై పూనమలై కేకేఆర్ ఆస్పత్రికి సుభాషిణిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అప్పులు చేసి రూ.3.80 లక్షలతో ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత గుండె వైద్యం కోసం మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రికి వెళ్లగా వారు సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేసి గుండె సాగిందని (ప్రొలాప్స్), 3 రంధ్రాలున్నట్లు తెలిపారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మందులు రాయించుకుని నెల్లూరుకు వచ్చారు. అంతలోనే శరీరం మొత్తం అలర్జీ వచ్చింది. తర్వాత సుభాషిణికి మరో అనారోగ్య సమస్య వచ్చింది. ఉన్నట్టుండి ఫిట్స్ రావడం మొదలైంది. మరో వైపు సరైన తిండి లేక మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ ఒక్కటే మార్గం సుభాషిణికి వైద్యం చేయించేందుకు తల్లి మరియమ్మ కనిపించిన వారందరిని సాయం అడిగింది. ఎవరైనా నగదు ఇస్తే వైద్యం చేయించింది. రెడ్‌క్రాస్ వారు రూ.5 వేలు సాయం చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి విషయం రాగా నారాయణ ఆస్పత్రి వారితో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయాలన్నారు. సుభాషిణిని నారాయణ ఆస్పత్రిలో రెండువారాల పాటు వైద్యం చేశారు. రకరకాల పరీక్షలు చేశారు. స్కిన్ సమస్య తగ్గించారు. అయితే అప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి దాటిపోయింది. కాగా నరాల సమస్యకు, పరీక్షలకు ఆస్పత్రిలో రూ.5 వేల వరకు డబ్బు తీసుకున్నారు. ఫిట్స్ రావడానికి కారణం మెదడులోని ఒక రక్తనాళంలో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. దానిని కరిగించాలని మరో వైపు గుండెకు కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు పేర్కొన్నారు. గుండె ఆపరేషన్‌కు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. గుండెకు స్టంట్ వేయడం సాధ్యం కాదని, ఆపరేషన్ ఒక్కటే మార్గమన్నారు. డబ్బుల్లేక.. ప్రస్తుతం సుభాషిణి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. రోజుకు నాలుగైదు సార్లు ఫిట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మందులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బుల్లేవు. ఇప్పుడు మందులు వాడడం లేదు. నారాయణ ఆస్పత్రిలో ఐదు నెలల క్రితం చేసిన పరీక్షల్లో కేవలం 40 శాతం మాత్రమే రక్తం శరీరంలో ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి శరీరం పాలిపోయింది. మరియమ్మ కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అయితే కుమార్తె ఆరోగ్య ముఖ్యమని చెబుతోంది. సుభాషిణి తన కుమార్తె ఐశ్వర్య జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీరుమున్నీరవుతోంది. సుభాషిణి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నంబర్ 911020 42915 ఎస్ఎంబీ బ్రాంచ్, బీవీనగర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏపీజీబీ 0004114 బాధితురాలి తల్లి ఫోన్ నంబర్ : 72889 03283 నా ఆపరేషన్ వాయిదా వేసుకున్నా నాకు కడుపునొప్పి వస్తోంది. పెద్దాస్పత్రిలో చూపించాను. గర్భసంచిలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే సుభాషిణి, మనుమరాలు ఐశ్వర్యను చూసే దిక్కులేక కడుపు నొప్పి భరిస్తున్నా. ఆపరేషన్ వాయిదా వేసుకుస్తున్నా. దాతలు స్పందించి సాయం చేస్తే నా బిడ్డకు వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటాను. – మరియమ్మ, సుభాషిణి తల్లి -
నాడు బహిష్కరణ.. నేడు కాళ్లు కడిగి.. పూలు చల్లి.. బ్రహ్మరథం
కావలి(నెల్లూరు జిల్లా): అది 2019 ఎన్నికల ప్రచార సమయం. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు మండలం ఆదినారాయణపురం గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే గ్రామస్తులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని భీష్మించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలయ్యాయి.. ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు గ్రామస్తులకు అందుతున్నాయి. ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి సొంత మండలంలోని ఆదినారాయణపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చూపించారు. మత్స్యకార గ్రామమైన ఆదినారాయణపురం గ్రామస్తులంతా ఒక కట్టుబాటుతో ఉంటారు. దశాబ్దాలుగా తరతరాలుగా ఎన్నికల సమయంలో తమకు మేలు చేకూర్చిన వారికే మద్దతుగా ఉండడం వారి కుల కట్టుబాటు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఊరిలోకి రాన్వికపోయినా.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అందించడం, తమకు అండగా నిలబడడంతో గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు. ఎమ్మెల్యే ఇవన్నీ వద్దని వారించినా గ్రామస్తులు తాము చేయాలనుకున్న సత్కారం చేసి తీరుతామని మొండికేసి.. పూలు చల్లి పసుపు నీళ్లతో కాళ్లు కడిగి, హారతులు ఇచ్చారు. ఆదివారం ఆ గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గ్రామంలో పురుషులు ఈలలు, కేరింతలతో స్వాగతం చెప్పి అక్కున చేర్చుకున్నారు. మహిళలు అయితే పసుపు నీళ్లతో ఎమ్మెల్యే కాళ్లు కడిగి, పూలు చల్లి హారతులు ఇచ్చారు. నాడు బహిష్కరించిన గ్రామస్తులే.. నేడు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి -
చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం: కాకాణి
-
లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. బుడ బుక్కల పవన్ పగటివేషాలు వేస్తున్నాడు. ఏపీకి చంద్రబాబు, పవన్ రాహు కేతువుల్లా దాపురించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే ఈనాడు పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేసింది. మండలాలకు మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. జలాశయాలు ఎడారులను తలపించాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో కరువు అనే మాటే లేదు. సంక్షేమానికి ప్రకృతికూడా సహకరిస్తోంది. క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయి. సాగునీటి సమస్యలే తలెత్తలేదు. పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. రామోజీరావు లాంటి వ్యక్తి దిగజారి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. పత్రికలు పారదర్శకంగా ఉండాలి. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తాం’’ అని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. చదవండి: ‘ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ ఏం అడిగారు?’ -
నెల్లూరులో కుంభవృష్టి.. టెన్షన్ పెడుతున్న మరో మరో అల్పపీడనం
ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. మూడు రోజులుగా సాధారణ స్థాయిలో కురిసిన వర్షం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. ప్రధానంగా జిల్లాలో కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలంలోని పలు గ్రామాల్లో వీధుల్లో నడుము లోతు నీళ్లు చేరగా, నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు.. మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో వర్షాలు ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిని బ్యారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. మన్సూర్‌నగర్, మనుమసిద్ధినగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. గాంధీబొమ్మ, రాయాజీవీధి, పొగతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు డ్రైయినేజీతో కలిసి ప్రవహిస్తోంది. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిలిచిన నీరు పోయేందుకు తాత్కాలిక అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు.. భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయక చర్యలు పొందవచ్చునని డీపీఓ ఎం ధనలక్ష్మి తెలిపారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్అండ్బీ తదితరశాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో ప్రచారం చేయడంతో పాటు సముద్రం వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు లోతట్టు, శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అడ్డంకి ఏర్పడడంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని జయలలితానగర్, పొర్లుకట్ట, బోడిగాడితోట, అహ్మద్‌నగర్, మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంత పోలీసు అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 9440796383కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు. బుచ్చి, కోవూరు, పొదలకూరు, కలువాయి. రాపూరు. వింజమూరు, అనంతసాగరం, గుడ్లూరు, కందుకూరు పోలీసులు వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో అటుగా రాకపోకలను నిషేధించారు. వర్షపాతం నమోదు.. అత్యధికంగా కావలి మండలంలో 227.5 మి.మీ., అత్యల్పంగా చేజర్ల మండలంలో 24.8 మి.మీ. వర్షం కురిసింది. జలదంకి మండలంలో 191.0, బోగోలు 154.8, లింగసముద్రం 150.2, ఉలవపాడు 149.4, నెల్లూరురూరల్ 141.2, గుడ్లూరు 137.8, వెంకటాచలం 137, కందుకూరు 134 విడవలూరు 124. ముత్తుకూరు 122.2, కొండాపురం 120.8, దగదర్తి 117.4, నెల్లూరు అర్బన్ 111.6, తోటపల్లి గూడూరు 109.8, కొడవలూరు 109.4, పొదలకూరు 107.2, మనుబోలు 104.2, కలిగిరి 99.2, ఉదయగిరి 99.0, బుచ్చిరెడ్డిపాళెం 98.6, అనుమసముద్రంపేట 95.0, సైదాపురం 94.6, అల్లూరు 92.2, ఇందుకూరుపేట 89.8, కోవూరు 86.6, వింజమూరు 86.4, ఆత్మకూరు 78.6, రాపూరు 66.8, అనంతసాగరం 61.8, మర్రిపాడు 61.4, వరికుంటపాడు 61.2, వలేటివారిపాళెం 58.0, దుత్తలూరు 57.6, కలువాయి 53.8, సీతారామపురం 50.0, సంగం 45.2 మి.మీ. వర్షం కురిసింది. -
స్టూడెంట్‌కి పీఆర్వో లైంగిక వేధింపులు.. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, నెల్లూరు: అభం, శుభం తెలియని చిన్నారి విద్యార్థినిపై ఆ పాఠశాల పీఆర్వో లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన బ్రహ్మయ్య పొదలకూరురోడ్డు డైకస్‌రోడ్డు విజయలక్ష్మీనగర్‌లోని ఓవెల్ 14 స్కూల్లో పీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఆయన అదే పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్న బాలికతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించసాగాడు. కొద్ది రోజులుగా బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతోంది. పీఆర్వో వైఖరిపై పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో శనివారం పాఠశాలకు వెళ్లిన బాలిక అనారోగ్యంగా ఉందంటూ కొద్ది సేపటికే ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు అసలేం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పీఆర్వో ఏదో ఒక సాకుతో ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని పీఆర్వో వైఖరిపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. చదవండి: (మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం) పీఆర్వో వికృత చర్యలపై పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటంటూ మండి పడ్డారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం పీఆర్వోను వెనకేసుకు రావడంతో వారు ఆగ్రహానికి గురై పాఠశాల కిటికీ అద్దాలు పగులగొట్టారు. అక్కడే ఉన్న బ్రహ్మయ్యను చితకబాదారు. ఈ విషయమై స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె. నరసింహరావు, ఎస్ఐ శ్రీహరిబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ నరసింహరావు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీపుటేజ్‌లను సేకరించారు. ఇదిలా ఉంటే బ్రహ్మయ్యపై గతంలో పలు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అతనిపై పాఠశాల యాజమన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంఈఓ విచారణ ఈ విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేకెత్తించడంతో డీఈఓ విచారణకు ఆదేశించారు. ఎంఈఓ తిరుపాల్ స్కూల్లో విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను విచారించారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా డిప్యూటీ డీఈఓ, తాను విచారణ నిర్వహిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం నివేదికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు బాలికపై పీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడం, ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్చార్జి డీఈఓ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను వారికిష్టమైన పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. -
ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తా: ఎంపీ వేమిరెడ్డి
సాక్షి, నెల్లూరు: రేడియంట్ డెవలపర్స్‌కు సంబంధించి ఎలాంటి కుంభకోణం జరగలేదని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అది రెండు ప్రైవేటు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అని, రేడియంట్ సంస్థతో తనకు 30 ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మా ఒప్పందంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్లో మీడియా మమ్మల్ని టార్గెట్ చేసి దుష్ఫ్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వ పరంగా సాయం తీసుకుని ఉంటే ఎప్పుడో పని పూర్తయ్యేది.. వైఎస్సార్సీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా?. అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందనే విషయం మరవకూడదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మమ్మల్ని టార్గెట్ చేశాయి. ఎల్లో పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..? -
‘మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు.. నాకు బతకాలని లేదు’
కొండాపురం(నెల్లూరు జిల్లా): ‘నాకు బతకాలని లేదు’ అంటూ ఓ విద్యార్థి సొంత తమ్ముడు, మరికొందరికి మెసేజ్ పెట్టి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చింతలదేవి పంచాయతీ తూర్పు బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కొండాపురం ఎస్సై ఎస్కే ఖాజావలీ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలపాటి శ్రీరాములు, రాజేశ్వరి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. వారికి అజయ్ (20), విజయ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ బంధువులతో కలిసి నెల్లూరులో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. చదవండి: మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్ చేస్తుండగా యువకుడు షాకింగ్ ట్విస్ట్.. అజయ్ డిగ్రీ ఫైనలియర్, విజయ్ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నారు. పెద్దవాడైన అజయ్ ఆదివారం స్వగ్రామమైన తూర్పు బ్రాహ్మణపల్లికి వచ్చి అత్త అంకమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి ప్రాజెక్ట్ వర్క్ ఉందని అత్తకు చెప్పి తన సొంత ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తన సెల్‌ఫోన్ ద్వారా తమ్ముడు విజయ్, బంధువులు, మరికొంతమంది స్నేహితులకు ‘నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు. నాకు బతకాలని లేదు. చనిపోతున్నా..’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో తమ్ముడు విజయ్ మెసేజ్ చూసి గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందజేశాడు. వారు అజయ్ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచారు. అప్పటికే అతను ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులకు సమాచారం వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించామని ఎస్సై తెలిపారు. -
కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
సాక్షి, కోవూరు: తనను నమ్ముకొన్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అండగా నిలిచారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇటీవల అకాల మరణం చెందారు. అశోక్‌కుమార్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న పార్టీని, తనను నమ్ముకున్న ఆ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ప్రసన్న సోమవారం పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష వంతున నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాధను తెలుసుకుంటూ ప్రసన్న కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కంట కన్నీరు గమనించిన పార్టీ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని పలువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ సతీష్ రెడ్డి, వెంకయ్య, శేషు, చరణ్, మస్తాన్ ఉన్నారు. -
నెల్లూరులో భారీగా కుళ్లిన చికెన్.. అక్కడ వేస్ట్‌గా కొనుగోలు చేసి.. ఇక్కడ ఫ్రెష్‌గా..
కాసుల వేటలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమిళనాడులో చికెన్ వ్యర్థాలుగా పడేసే లివర్, కందనకాయలతో పాటు నిల్వ చికెన్‌ను వేస్ట్‌గా కొనుగోలు చేసి నెల్లూరులో ఫ్రెష్ చికెన్‌గా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో సర్దుమణిగిన నిల్వ చికెన్ వ్యాపారం మళ్లీ ఇటీవల కాలంలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై పరిసరాల నుంచి కొనుగోలు చేసిన ఇలాంటి వ్యర్థాలను హోటల్స్‌కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షి, నెల్లూరు: తమిళనాడులో చికెన్ లివర్, కందనకాయలకు డిమాండ్ తక్కువ. ఇక్కడ చికెన్ కేజీ ధరలతోనే లివర్, కందనకాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేస్తున్నారు. నగరంలోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా జరుగుతోంది. గతంలో ఇప్పటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు దుకాణాలపై దాడులు చేసి గుర్తించిన విషయం తెలిసిందే. తిరిగి వెంకటరమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ ముఠా ఆగడాలకు మరోసారి అడ్డుకట్టవేశారు. కేజీ రూ.100లకే విక్రయం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రతి వారం భారీగా నిల్వ చికెన్, లివర్, కందనకాయల మాంసాన్ని రూ.40లకే కొనుగోలు చేసి ట్రక్కుల ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ఇళ్లలో నిల్వ చేసి చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు రూ.100లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులో లివర్, కందనకాయలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని వాటిని కొనుగోలు చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చికెన్ ధరతో సమానంగా లివర్, కందనకాయలను విక్రయిస్తుంటారు. తమిళనాడులో నిల్వ ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వెంకటరమణ గతంలో విధులు నిర్వహించిన సమయంలో నగరంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. బోడిగాడితోట వద్ద కుళ్లిన మాంసం నిల్వలపై, చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై వరుస దాడులతో విక్రయదారుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఆయన మరో విభాగానికి బదిలీ కావడంతో కొంత కాలం ఈ ముఠా ఆగడాలు మళ్లీ చెలరేగాయి. తిరిగి ఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో దాడులు చేస్తే ఇలాంటి నిల్వ మాంసం విక్రయాలు గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది. 400 కేజీల నిల్వ మాంసం పట్టివేత ►నోటీసులు జారీ, రూ.25 వేల జరిమానా నగరంలోని మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్లో గుట్టుచప్పుడు కాకుండా 27వ తేదీ నాటి నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. 400 కేజీల చెడిపోయిన మాంసాన్ని గుర్తించారు. దీంతో ఫినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. మాంసాన్ని చెత్త వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసేందుకు వస్తారని, ఇలా చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. ప్రజలకు అనారోగ్య కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ 27వ తేదీనాటి మాంసాన్ని నెల్లూరుకు తరలించి దిగుమతి చేయడాన్ని వెంకటరమణ బృందం దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారా న్ని మాత్రమే విక్రయించాలన్నారు. -
ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నాం: సీఎం జగన్
-
ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. చదవండి: CM YS Jagan: కలిసికట్టుగా క్లీన్ స్వీప్ ‘‘వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాం. ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. 326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. మరో 150 కుటుంబాలకు నవంబర్‌లో ఉద్యోగాలు ఇస్తామని’’ సీఎం అన్నారు. గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారు. 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు 35.74 కోట్ల సాయం అందించాం. స్థానికుల కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీ నిర్మిస్తున్నాం.ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశాం’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్సార్ 2008లో ఈ విద్యుత్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వరంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్‌పవర్ స్టేషన్‌కు ఆనాడు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఇవాళ పూర్తిసామర్థ్యంతో మనం ప్రారంభించడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. వినియోగదారులకు రోజంతా నాణ్యమైన కరెంటు సరఫరాకు అన్నిచర్యలూ తీసుకుంటున్నాం. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు మన ప్రభుత్వంలో అక్షరాల రూ.3,600కోట్లు ఇచ్చాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తిచేస్తున్నాయి. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం అవుతుంది. తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘కృష్ణపట్నంతో పాటు, విద్యుత్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో అభివాదం తెలియజేస్తున్నా. ఇది వరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. రెండో దశలో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ మాసం పూర్తయ్యేలోగానే ఈ ఉద్యోగాలను కల్పిస్తాం. ఎన్నికల వేళ మీ అందరికీ ఇచ్చిన హామీని కూడా ఇవాళ అమలు చేస్తున్నాను. ఐదేళ్లలో మేలు చేయకపోయినా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు హడావిడిగా వచ్చి మోసం చేస్తున్నారని మీరు నా దృష్టికి తీసుకు వచ్చారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఆరోజే చెప్పాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యారేతర కుటుంబాలు మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి… నేరుగా రూ.36 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నాను’’ అని సీఎం అన్నారు. ఆ రోజు హడావిడిగా చంద్రబాబు మోసం చేసే ఉద్దేశంతో కేవలం 3500 మందికి, అదికూడా కేవలం రూ.14వేలుచొప్పున కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. వీరి క్కూడా మిగిలిన డబ్బు కూడా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెన్నానది మధ్యలో ముదివర్తి పాలెం వద్ద సబ్మెర్జబుల్ చెక్‌డ్యాం నిర్మాణంకోసం రూ.93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దీనివల్ల సముద్రంనుంచి వచ్చే బ్యాక్ వాటర్‌ను ఆపగలుగుతాం. నాలుగు మండలాలకు నీటి సమస్యను కూడా తీర్చగలుగుతాం. శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజీని కూడా ప్రారంభించడం జరిగింది. నెల్లూరు బ్యారేజీకి కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుకూడా పెడుతున్నాం. మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత మత్స్యకారులకోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జట్టీని నిర్మిస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచి చేయాలన్న తపనతో అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో అడుగులు ముందుకేస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు. -
నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్‌కు ప్రారంభోత్సవం
-
ముగిసిన సీఎం జగన్ నెల్లూరు పర్యటన
Live Updates కృష్ణా: నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి బయల్దేదారు. ► రేణిగుంట విమనాశ్రయం నుండి విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు విమానం లో బయలుదేరిన సీఎం జగన్ అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ ►రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. ►కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సీఎం సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ►నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్ జెట్టికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. జెన్కో మూడో యూనిట్ ప్రారంభించనున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా చేరుకున్నారు. కాసేపట్లో ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్ ప్రారంభించనున్నారు. జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసుదన్ రెడ్డి, కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుకు బయలుదేరారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్‌ను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు. పూర్తి స్థాయిలో సన్నద్ధం కృష్ణపట్నం ప్లాంట్ మొత్తం సామర్థ్యం నాలుగు యూనిట్లు కాగా, స్టేజ్–1లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడవ యూనిట్‌గా స్టేజ్–2లోని 800 మెగావాట్ల ప్లాంట్‌ను రూ.5,082 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం కొంత పెరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5,935.87 కోట్లు, రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంఘం ద్వారా రూ 1,000 కోట్ల రుణ సాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండవసారి ట్రయల్ రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాల్చేర్ నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు రవాణా జరుగుతుంది. బంగాళాఖాతం నుంచి సముద్రపు నీటిని గ్రహించి, ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటిగా మార్చి వినియోగిస్తారు. కాగా, ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 జూలై 17న శంకుస్థాపన చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయడం విశేషం. కాగా, నేడు 3వ యూనిట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. స్వప్నం సాకారం.. కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ సైతం పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో కోరిన విన్నపాన్ని సీఎం హోదాలో ఆచరణలో అమలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణంతో సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదన 16 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. హార్బర్ నిర్మించాలని కూడా గతంలో పలు సర్వేలు, పరిశీలనలు చేపట్టారు. అందుకోసం పాలకులు అంచనాలు కూడా రూపొందించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భావించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల కలగా మిగిలిపోయిన ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు జెన్కో మూడో యూనిట్ ప్రారంభోత్సవానికి గురువారం రానున్న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.25 కోట్లతో ఫిషింగ్ జెట్టి ముత్తుకూరు మండలంలోని నేలటూరు పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేపట్టనున్నారు. జెట్టి అందుబాటులోకి వస్తే ఉప్పు కాలువల్లో, క్రీక్‌ల్లో బోట్లు, వలలను భద్రపరుచుకునే బాధ మత్స్యకారులకు తప్పుతోంది. ఫిషింగ్ జెట్టీ వద్ద భద్రపరుచుకొనే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి బోట్లు, వలలను కాపాడుకోవచ్చు. సముద్రంలో వేట చేసిన మత్స్య సంపదను ఈ జెట్టి వద్ద ఎండబెట్టుకొని, భద్రపరుచుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. పైగా వలలు అల్లుకొనే వెసులుబాటు లభిస్తుంది. రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది. కొనుగోలుదారులు నేరుగా ఈ జెట్టిల వద్దకు వచ్చి మత్స్యసంపదను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. క్రమంగా ఈ జెట్టిల వద్ద కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి రానున్నాయి. చేపలు, రొయ్యలు చెడిపోకుండా ఈ కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫిషింగ్ జెట్టి క్రమంగా మినీ ఫిషింగ్ హార్బర్‌గా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని పలువురు వివరిస్తున్నారు.