Supreme court of India
-
అనుమానాస్పద మరణ వాంగ్మూలంతో... నేర నిర్ధారణ తగదు: సుప్రీం
న్యూఢిల్లీ: అనుమానాస్పద మరణవాంగ్మూలం ఆధారంగా నేర నిర్ధారణ సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతరత్రా గట్టి సాక్ష్యాధారాలు లేనప్పుడు కేవలం అలాంటి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకోజాలమని స్పష్టం చేసింది. భార్యకు నిప్పంటించి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని నిరపరాధిగా తేలు స్తూ న్యాయమూర్తులు సుధాన్షు ధూలియా, ఎ.అమానతుల్లా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అతనికి దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మరణ వాంగ్మూలం కీలక సాక్ష్యమన్నది నిస్సందేహం. దాని ఆధారణంగా నేర నిర్ధారణ చేయడమూ సబబే. కానీ ఆ వాంగ్మూలమే అనుమానాస్పదమైన సందర్భాల్లో దాని ఆధారంగా నిందితున్ని దోషిగా నిర్ధారించడం సరికాదు. ప్రస్తుత కేసులో భార్య పరస్పరం పూర్తి విరుద్ధమైన వాంగ్మూలాలిచ్చింది. పైగా వరకట్న వేధింపులు జరగలేదని దర్యాప్తులో స్పష్టంగా తేలింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతర సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి రావాలి’’ అని సూచించింది. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది. ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. -
సుపరిపాలనకు దోవ
‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు. సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు. ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్ఎస్లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు. అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
16 ఏళ్లు రిలేషన్లో ఉండి రేప్ అంటే ఎలా?
న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్‌గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్‌గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి. -
ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది. ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల మధ్య జరుగుతున్న ఈర‡్ష్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు. ‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎçప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ గవాయ్ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది. అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
లోక్‌పాల్ వర్సెస్ న్యాయమూర్తులు
ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికి ‘లోక్‌పాల్’ను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రాయపడింది. దీంతో లోక్‌పాల్ అధికారాల పరిధి, న్యాయ మూర్తులకు లభించే రక్షణల గురించిన ప్రశ్నలు చర్చనీయాంశాలయి నాయి. అంతేకాదు, న్యాయవ్యవస్థ స్వతంత్రత మీద నీలినీడలు ఏర్పడినాయి.2025 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్ ఓకాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్‌పాల్ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్‌పాల్ బెంచ్... ‘హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది. పార్లమెంట్ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులలోని న్యాయ మూర్తులు కాబట్టి వారు ఈ చట్టాల పరిధిలోకి వస్తారని లోక్‌పాల్ బెంచ్ అభిప్రాయపడింది.‘ఇది చాలా కలవరపెట్టే విషయం’ అని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగకుండా ఉండటానికి సుప్రీంకోర్టు తన అధి కారాన్ని వినియోగించుకొని ఈ విషయంలో జోక్యం చేసుకుంది. లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టేని మంజూరు చేసింది.అంతేకాదు లోక్‌పాల్ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై విచారణ చేపట్టే ముందు లోక్‌పాల్ 1991వ సంవత్సరంలో న్యాయమూర్తి కె. వీరాస్వామి కేసుని కూడా ఉదహ రించింది. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిని పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం నుండి మినహాయించలేరు. అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారణని చేపట్టినామని లోక్‌పాల్ తన ఉత్తర్వులలో పేర్కొంది.1991వ సంవత్సరంలో ‘కె. వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం – న్యాయ మూర్తులందరూ ‘అవినీతి నిరోధక చట్టం–1988’ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.న్యాయమూర్తులను – అవసరం లేని ప్రాసిక్యూషన్ నుంచి, అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయంలో సంతృప్తి చెందిన తరువాత సంబంధిత న్యాయ మూర్తిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి లేదా ఎఫ్ఐఆర్ని విడుదల చేయడానికి రాష్ట్రపతికి తగు సలహాని ఇవ్వాలి. ఈ తీర్పుని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లోక్‌పాల్ ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకి పంపింది. 2013వ చట్టంలోని సెక్షన్ 20(4) ప్రకారం ఫిర్యాదును పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కేసుని నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఆదేశించింది.హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్ అనుకున్నట్టు చట్ట బద్ధమైన అధికారులు మాత్రమే కాదని, వాళ్ళు రాజ్యాంగ బద్దమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా విచారణ సందర్భంలో అన్నారు. సుప్రీంకోర్టు వెలి బుచ్చిన ఆందోళనలో భారత సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది కపిల్ సిబాల్ కూడా పాలుపంచుకున్నారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి వస్తాయని లోక్‌పాల్ అభిప్రాయపడింది కానీ దాని యోగ్యతలను లోక్‌పాల్ ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే లోక్‌పాల్ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214(1)ను లోక్‌పాల్ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేస్తారు.రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు రక్షణలను కల్పించింది.అందులో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషనర్లు వస్తారు. వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులూ వస్తారు. లోక్‌పాల్ అభిప్రాయం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సవాలు విసురుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఈ జోక్యం వల్ల అత్యున్నత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యాలు, ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ప్రేరేపిత ఆరోపణల నుంచి రక్షణ లేకుండా పోతుంది. అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జవాబుదారీ తనం లేకుండా పోతుంది. హైకోర్టు న్యాయ మూర్తుల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. దీనివల్ల అవినీతికి స్థానం దొరికేలా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానం మెరుగు పడాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఇటీవలి కాలంలో తమ పరిధికి మించి ఉత్తర్వులను, బెయిల్ షరతులను విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం. అదే విధంగా కేసు విచారణ సందర్భంలో, బయట సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వారి పరిధి నుంచి కేసుల ఉపసంహరణ లాంటి చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో... జవాబు దారీ తనం కూడా అంతే ముఖ్యం. లోక్‌పాల్ అభిప్రాయం సరైంది రాకపోవచ్చు. కానీ చాలా అంశాలు సుప్రీం తీర్పు ముందుకు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి!మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
దృష్టి లోపమున్నా...న్యాయ నియామకాలకు అర్హులే
న్యూఢిల్లీ: దృష్టి లోపం ఉన్నంత మాత్రాన జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగావకాశాలను నిరాకరించడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాలకు వాళ్లు అనర్హులని పేర్కొంటున్న మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ (ఎంపీజేఎస్) నిబంధనలను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దృష్టి లోపమున్న వారికి పలు రాష్ట్రాలు జ్యుడీషియల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కల్పించకపోవడం తదితరాలపై దాఖలైన కేసులను ధర్మాసనం విచారించింది. ‘‘వైకల్యం ఆధారంగా వివక్ష చూపరాదన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 కూడా అదే చెబుతోంది’’ అని పేర్కొంది. ‘‘దృష్టి లోపమున్న అభ్యర్థులకు జ్యుడీషియల్ పోస్టుల్లోనూ సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ ఇందుకు అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వాలు చేపట్టాలి. వారికి కటాఫ్ మార్కులను విడిగా నిర్ణయించాలి. మెరిట్ లిస్టునూ విడిగానే సిద్ధం చేయాలి. దాని ఆధారంగానే ఎంపిక జరగాలి’’ అని ఆదేశించింది. దృష్టి లోపం కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే కటాఫ్ మార్కులను తగ్గించేందుకు కూడా ధర్మాసనం ఈ సందర్భంగా అనుమతించింది. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే చేపట్టిన, ఇకపై చేపట్టబోయే భర్తీ ప్రక్రియలన్నింటికీ ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది.రాజ్యాంగ స్ఫూర్తీ అదేజ్యుడీషియల్ సర్వీసులకు పోటీ పడేందుకు దృష్టి లో పమున్న వాళ్లు పూర్తిగా అర్హులేనని జస్టిస్ మహదేవన్ స్పష్టం చేశారు. ధర్మాసనం తరఫున ఈ మేరకు 122 పేజీల తీర్పు ఆయనే రాశారు. ‘‘ఈ విషయంలో ఎంపీజేఎస్లో పొందుపరిచిన నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు తదితరాలకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఇలాంటి విషయాల్లో సముచిత ప్రాతినిధ్య సూత్రాలను పాటించాలి. అంతే తప్ప కాఠిన్యం కూడదు. కఠినమైన కటాఫ్ నిబంధనలు తదితర పరోక్ష అడ్డంకుల ద్వారా దివ్యాంగులను ఉద్యోగావకాశాలకు దూరం చేయకూడదు. పలు అంతర్జాతీయ సూత్రాలు, ఒప్పందాలు కూడా అదే చెబుతున్నాయి’’ అన్నారు. ‘‘పౌరులందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్న సూత్రమే మన రాజ్యాంగానికి పునాది. రాజ్యాంగపు మౌలిక స్వరూపంలో విడదీయలేని భాగం. సమానత్వం తదితర ప్రాథమిక హక్కులన్నింటికీ మూలాధారం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్స్ 14, 15, 16ల్లో దీన్ని విస్పష్టంగా పేర్కొన్నారు’’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు. ‘‘సముచిత ప్రాతినిధ్యం పౌరుల ప్రాథమిక హక్కే తప్ప విచక్షణాత్మక చర్య కాదు. దివ్యాంగులకు సమానత్వం కూడా అందులో అంతర్భాగమే’’ అని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ‘‘సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతగా మార్చుకున్నాం. ఈ నిర్వచనం పరిధిలోకి శారీరక, మానసిక వికలాంగులు కూడా వస్తారు’’ అని వివరించారు. -
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
చట్టసభలకూ పరిమితులు!
నిబద్ధత, సచ్ఛీలత, నిబంధనలపట్ల సంపూర్ణ అవగాహన కలిగినవారి సారథ్యంలో చట్టసభలుంటే అలాంటిచోట ఆరోగ్యవంతమైన చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఆ సభ తలమానికమవు తుంది. కానీ అధికార పక్షానికి వంతపాడేవారు, వారి ఇష్టారాజ్యానికి పక్కతాళం వేసేవారు అధ్యక్ష స్థానాల్లో కూర్చుంటున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి బాపతు నేతలకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. తనను బిహార్ శాసనమండలి నుంచి బహిష్కరించటాన్ని సవాలుచేస్తూ ఆర్జేడీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఆయన్ను తక్షణం సభలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలితప్ప మితిమీరకూడదని తేల్చిచెప్పింది. నిరుడు మార్చిలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సునీల్ కుమార్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. పాము కుబుసం విడిచినట్టు తరచు రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవటం నితీశ్‌కు అలవాటని, ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ప్రజలనుంచి ఎన్నిక కాలేదని సునీల్‌కుమార్ సింగ్ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ, మరోసారి ఎన్డీయే కూటములతో చెలిమి చేయటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన్ను ‘పాల్తూరామ్’ అని హేళన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి నివేదించారు. సునీల్ తప్పు చేశారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించి సభా బహిష్కారానికి సిఫార్సుచేసింది. శాసనమండలి దీన్ని ఆమోదించి ఆయన్ను బహిష్కరిస్తూ తీర్మానించింది. మన రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన చేసింది. చట్టసభలకు ప్రత్యేక హక్కులుంటాయని, వాటి కార్యకలాపాల్లో లేదా నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని సభాధ్యక్షులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదుల్ని ఎటూ తేల్చకుండా వదిలేస్తూ తమను ప్రశ్నించరాదంటున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం, బహిష్కరణ వేటు వేయటం వంటివి రివాజయ్యాయి. కేవలం పాలకపక్ష ప్రయోజనాలను నెరవేర్చటం కోసమే స్పీకర్లు ఇలా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. నిజమే... రాజ్యాంగంలోని 212(1) అధికరణ ప్రకారం చట్టసభల కార్యకలా పాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణతో ఆ కార్యకలాపాల చెల్లుబాటును న్యాయ స్థానాల్లో సవాలు చేయటానికి వీల్లేదు. నిర్వహణ సంబంధమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంనుంచి చట్టసభలకు ఇది రక్షణనిస్తుంది. అయితే ఆ కార్యకలాపాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విరుద్ధత కనబడినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నది నిపుణుల వాదన. తాజా కేసులో జరిగింది ఇదే. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌కు అసలు విచార ణార్హత లేదని, 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యాన్నుంచి తమకు రక్షణనిస్తున్నదని శాసన మండలి తరఫు న్యాయవాది వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అంగీకరించలేదు. చట్ట సభల కార్యకలాపాలు వేరు, అందులో తీసుకునే నిర్ణయాలు వేరు అని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు... సునీల్‌కుమార్ సింగ్‌ను బహిష్కరిస్తూ తీసు కున్న ఎథిక్స్ కమిటీ నిర్ణయం పాలనాపరమైన చర్యే తప్ప శాసనవ్యవస్థ కార్యకలాపంగా పరిగణించలేమని తేల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభ నియంత పోకడలు పోకూడదు. మెజారిటీ ఉందన్న సాకుతో విపక్ష సభ్యుల గొంతు నొక్కడానికీ, వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించటానికీ ప్రయత్నించకూడదు. ఆ పరిస్థితులు తలెత్తితే న్యాయస్థానాలుమౌనంగా ఊరుకోబోవని తాజా తీర్పు తేటతెల్లం చేసింది. చట్టసభ కార్యకలాపాలు సాఫీగా సాగటానికి అనువైన నిబంధనలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగంలోని 208వ అధికరణ అధికారమిస్తోంది. సభ క్రమశిక్షణగా నడవటానికి ఎలాంటి నిబంధనలుండాలో, వాటిని ఉల్లంఘించినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో ఈ నిబంధనలు నిర్దే శిస్తాయి. అయితే నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏర్పడిన కమిటీలు తీసుకునే నిర్ణయాలు పాలనాసంబంధ పరిధిలోకి వస్తాయని గుర్తించటం తప్పనిసరని తాజా తీర్పు చెబుతోంది. ఆ నిర్ణయాలకు మెజారిటీ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో దీనికి సంబంధం లేదు. ఒక చర్యకు ప్రతిగా తీసుకునే ఏ నిర్ణయమైనా హేతుబద్ధతకూ, తార్కికతకూ లోబడివుండటం అవసరం. పిచ్చు కపై బ్రహ్మాస్త్రం తరహాలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. చట్టసభలు ఇష్టానుసారం వ్యవహరించే రోజులు పోయాయి. సభానిర్వహణ సవ్యంగా జర గటం, క్రమశిక్షణ కట్టుతప్పకుండా చూడటం అవసరమే. కానీ అందుకోసం అమలుచేసే చర్యలు అతిగా ఉండకూడదు. సభ్యులు పరిధి మీరారని భావించినప్పుడు అభిశంసించడం, మందలించడం, నిర్దిష్ట కాలానికి సభనుంచి సస్పెండ్ చేయడంవంటి అవకాశాలున్నాయి. కానీ విచక్షణ మరిచి నేరుగా బహిష్కరణ వేటు వేయటం అతిగా వ్యవహరించటమే అవుతుంది. ఎథిక్స్ కమిటీల నిర్ణ యాలు పాలనానిర్వహణ కిందికే వస్తాయని, వాటిపై న్యాయసమీక్ష తప్పదని సుప్రీంకోర్టు నిర్ణయించటం హర్షించదగ్గది. నియంతృత్వ పోకడలు పోయే పాలకపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు. -
లక్ష్యసేన్‌కు ఊరట
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... » ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్‌తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. » లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. » తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. » కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. » దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి. » మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. » పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. » లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది. -
‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
ప్రభాస్ సినిమా.. సుప్రీకోర్టులో నిర్మాతకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భార్య నుంచి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. భర్త, అత్తమామల నుంచి వివాహిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరమైన నేరంగా భావించలేమని వెల్లడించింది. సెక్షన్ ప్రకారం 498ఏ ప్రకారం క్రూరత్వం అనేపదానికి విస్తృతమైన అర్థం ఉంది. కట్నం కింద ఆస్తులు గానీ, విలువైన వస్తువులు గానీ ఇవ్వాలని డిమాండ్ చేయడం చట్టవిరుద్ధమే. అయితే, కట్నం కోసం మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుంది. కేవలం కట్నం డిమాండ్ చేశారని 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 12న ఆదేశాలు జారీ చేసింది. -
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
పాలిచ్చే తల్లులకు ప్రైవసీ కల్పించండి
న్యూఢిల్లీ: పాలిచ్చే తల్లులకు ప్రైవసీని కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాలిచ్చే తల్లులకోసం బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించిందచి. బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ కోసం గదులు, పిల్లల సంరక్షణ కోసం సౌకర్యం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను కాపాడాలని గుర్తు చేసింది. ఇది పాలిచ్చే తల్లులకు సౌకర్యాన్ని, రక్షణను ఇస్తుందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలు చేసేలా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఈ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత స్థలం కేటాయించేలా చూడాలని, ఇప్పటికే ఉన్న బహిరంగ ప్రదేశాల్లో గదులను కేటాయించాలని కోర్టు అభిప్రాయపడింది. -
అన్ని అంశాలను ఇక్కడ విచారించలేం
న్యూఢిల్లీ: స్థిరాస్తుల కూల్చివేత విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారంటూ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై తాము విచారణ చేపట్టలేమని, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అన్ని అంశాలనూ తాము ఇక్కడ విచారించలేమని స్పష్టంచేసింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆస్తులను కూల్చడానికి వీల్లేదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 13న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారులు తగిన సమయం ఇవ్వకుండానే ఆస్తులు కూల్చేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వెళ్లాలని -
హైకోర్టు జడ్జిపై లోక్‌పాల్ విచారణా?
న్యూఢిల్లీ: ఒక హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిపై లోక్‌పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొంది. ఈ మేరకు లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒక హైకోర్టు జడ్జిపై నమోదైన రెండు ఫిర్యాదులను విచారిస్తూ లోక్‌పాల్ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రకు భంగం కల్గించేలా లోక్‌పాల్ వ్యవహరిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు జడ్జి ఉదంతంలో స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌తోపాటు హైకోర్టు జడ్జిపై ఫిర్యాదుచేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. హైకోర్టు జడ్జి ఎప్పుడూ కూడా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం,2013 పరిధిలోకి రారని మెహతా వాదించారు. ఈ కేసులో హైకోర్టు జడ్జి పేరు బహిర్గతం కాకుండా చూడాలని, ఆ ఫిర్యాదుదారు పేరు, అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను రహస్యంగా ఉంచాలని లోక్‌పాల్ రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశంలో కోర్టుకు సాయపడతా. హైకోర్టు జడ్జీల విషయంలో ఇలాంటివి పునరావృతంకాకుండా ఒక చట్టం ఉంటే మంచిది’’ అని ఈ అంశంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కేసును నమోదుచేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఈ హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిని ఈ ప్రైవేట్ సంస్థ కోరింది. ఈ జడ్జి గతంలో లాయర్‌గా ఉన్న కాలంలో ఇదే సంస్థకు చెందిన కేసును వాదించారు. ఇప్పుడు ఆయన జడ్జీ అయ్యాక ఈ కేసులో హైకోర్టులో మరో జడ్జి, అదనపు జిల్లా జడ్జీలను ఈయన ప్రభావితం చేశారని ఫిర్యాదుదారు లోక్‌పాల్‌లో కేసు వేశారు. దీంతో లోక్‌పాల్ జనవరి 27వ తేదీన హైకోర్టు జడ్జిపై ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013లోని సెక్షన్ 20(4) ప్రకారం హైకోర్టు జడ్జిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సారథ్యంలోని లోక్‌పాల్ బెంచ్ పేర్కొనడంతో సుప్రీంకోర్టు చివరకు ఇలా కలగజేసుకుంది. -
పబ్లిక్ స్థలాల్లో మహిళలు, శిశువులకు వసతులు కల్పించాలి
న్యూఢిల్లీ: పబ్లిక్ స్థలాల్లో నిర్మించిన భవనాలు, నిర్మించబోయే భవనాల్లో శిశువుల సంరక్షణకు, వారికి తల్లులు స్తన్యం ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని సూచించింది. ప్రత్యేక గదుల్లాంటివి నిర్మిస్తే తల్లుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని, పిల్లలకు సైతం మేలు జరుగుతుందని వెల్లడించింది. పబ్లిక్ స్థలాల్లో ఫీడింగ్ రూమ్‌లు, చైల్డ్‌కేర్ గదులు నిర్మించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తల్లులు, బిడ్డల కోసం భవనాల్లో తగినంత స్థలం కేటాయించి, వసతులు కల్పించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాది స్పందిస్తూ... పబ్లిక్ స్థలాల్లో తల్లులు, శిశువులకు వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 2024 ఫిబ్రవరి 27న కేంద్ర మహిళ, శిశు అభివృద్ది శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆదేశాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. ఆదేశాలను రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేయాలని పేర్కొంది. -
ఉచితమా? అనుచితమా?
ఉచిత పథకాల గురించి సుప్రీం కోర్టు ఈనెల 12న వ్యాఖ్యానించటంతో ఈ విషయం మరొకమారు చర్చలోకి వచ్చింది. ఈ ధోరణులకు మూలం ఎక్కడున్న దనేది ఒక ప్రశ్న అయితే, అందుకు అసలు పరిష్కారం ఉందా అన్నది రెండవ ప్రశ్న. ఇండియా మధ్యయుగాల కాలం నుంచి ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత దానితో పాటు కొన్ని వందల సంవత్సరాలపాటు వలస పాలనలో మగ్గిపోయి అన్ని విధాలుగా వెనుకబడింది. అట్లాగని దేశంలో సహజ వనరులకు, కష్టించి పనిచేసే మానవ సంపదకు కొరత లేదు. ఏవో కొన్నిచోట్ల తప్ప, గ్రామీణ ఆర్థికతపై, అవసరాలపై ఆధారపడి సాగే సకల వృత్తుల వారున్నారు. అయినప్పటికీ, 1947లో దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే నాటికి, అత్యధిక శాతం ప్రజలు దయనీయంగా వెనుకబడి ఉన్నారు. తమ స్థితిగతుల పట్ల, అందుకు కారణాలపట్ల, ప్రజలలో చైతన్యానికి ఎంత మాత్రం కొరత లేదు. వాస్తవానికి అటువంటి చైతన్యాలు గలవారు అనేక రూపాలలో సాగించిన ఉద్యమాలూ, తిరుగుబాట్లూ, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికీ, 1885 నుంచి కాంగ్రెస్ నాయకత్వాన స్వాతంత్య్రోద్యమానికీ భూమికగా పనిచేశాయి.ప్రణాళికలు సరిగ్గా అమలైవుంటే...ఈ నేపథ్యాన్నంతా ఇంతగా చెప్పుకోవటానికి కారణాలున్నాయి. వనరులు, ప్రజల చైతన్యాలు గల దేశంలో గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర కాలంలో తగిన విధానాలు, వాటి అమలు ఉండిన పక్షంలో ఈరోజు అసలు ఉచితాల అవసరమే ఏర్పడేది కాదు. ఎన్నిక లకు ముందు ఎందుకీ ఉచితాలని, అందువల్ల ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడటం లేదని, ఆ విధంగా పరాన్నజీవుల తరగతి ఒకటి సృష్టి అవుతున్నదని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించవలసిన పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. దేశం పేదరికం నుంచి బయటపడి అభివృద్ధి సాధించేందుకు చేయవలసిందేమిటన్న అవగా హన స్వాతంత్య్రోద్యమ నాయకులకు 1947 కన్న ముందే స్పష్టంగా ఉంది. వ్యవసాయిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నింటికి సంబంధించి వారంతా బాగా చదివి అనేక దేశాలను, అక్కడి ఆలోచనా విధానాలను, అభివృద్ధి విధానాల తీరుతెన్నులను గమనించినవారు. వాటిని భారతదేశ పరిస్థితులకు ఏ విధంగా అన్వయించాలో అర్థం చేసుకున్నవారు. ఇటువంటి నేపథ్యాల వల్లనే వారి మేధస్సుల నుంచి, సుదీర్ఘ చర్చల నుండి, అప్పటికే చిరకాలంగా ప్రజాస్వామికంగా ఉండిన దేశాలకు మించి, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్ప రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. దేశ స్వాతంత్య్రోద్యమం వలెనే రాజ్యాంగం కూడా ఆసియా, ఆఫ్రికాలలోని ఇతర వలస వ్యతిరేక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తర్వాత కాలంలో చట్టాలు, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపు తీసుకున్నాయి. అవి సక్రమంగా అమలై ఉండినట్లయితే ఈ చర్చలకు ఆస్కారమే ఏర్పడేది కాదు.స్వాతంత్య్రం వచ్చిన నాటి పేద స్థితిగతులను బట్టి సంక్షేమం తప్పనిసరి. దేశం, దానితోపాటు వారూ అభివృద్ధి చెందటం రాత్రికి రాత్రి జరిగేది కాదు. సంక్షేమ దృక్పథం పారిశ్రామిక విప్లవం నుంచి యూరప్‌లో, ఇంకా చెప్పాలంటే మన దేశంలోనూ మొదటి నుంచి ధార్మిక భావనలలో భాగంగా ఉన్నదే. అయితే, ఆధునిక ప్రజా స్వామిక, ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత, సకల జనుల అభివృద్ధి క్రమంలో, ఆ పని సవ్యంగా జరిగినట్లయితే, సంక్షేమ చర్యల అవసరం క్రమంగా తగ్గిపోవాలి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడ గలగాలి. అదే ప్రభుత్వం లక్ష్యమై, దాని విధానాలు, ఆచరణలు అందుకు దోహదం చేయాలి. ఆ పని జరగనపుడు అంతా అస్తవ్యస్త మవుతుంది. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చేదే పాప్యులిజం.సంక్షేమం కాస్తా పాప్యులిజంగా లేదా జంక్ వెల్ఫేర్‌గా మారటం. అభివృద్ధి మార్గంస్వాతంత్య్ర సమయానికి దేశ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలిసిన నాయకులు అందుకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించినట్లు పైన చెప్పుకున్నాము. వారి అవగాహనలు, అన్వేషణలు అంతకుముందే ఉండినట్లు 1947కు ముందు కాంగ్రెస్ మహాసభల ఆర్థిక సంబంధ తీర్మానాలను, 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యలను పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. అటువంటపుడు 1947 తర్వాత, 1951–52 నాటి మొదటి ఎన్నికల వెనుక జరిగిందేమిటి? పరిస్థితులను మార్చేందుకు నెహ్రూ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది. వాటిలో భూసంస్కరణలు, గ్రామ పంచాయితీ వ్యవస్థ, సహకార సంఘాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మొదలైనవి ఉన్నాయి. ఇవి అమలైనట్లయితే గ్రామీణ భారతంలో పేదలకు భూములు లభించటం, పంచాయితీలలో, సహకార సంఘాల ద్వారా లభించే వాటిలో వారికి అవకాశాలు, రిజర్వేషన్ల ద్వారా విద్యా – ఉద్యోగాలు, అంతిమంగా ఫ్యూడల్ శక్తుల పట్టు క్రమంగా సడలి పేద ప్రజల అభ్యున్నతి వంటివి జరుగుతాయి. పలు దేశాలలో భూసంస్కరణలు ఇటువంటి ఫలితాలను ఇవ్వటమే గాక, వ్యవసాయ రంగంలో సంపదల సృష్టి జరిగి అది పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగ పడింది. భారతదేశంలో అటు వంటి క్రమం మొదలై సాగి ఉంటే, సంక్షేమం ఉచితాలుగా, ఉచితాలు ఊబిగా మారి ఉండేవి కావు. నిజానికి చాలా కాలం వరకు సంక్షేమం కూడా సరిగా అమలు కాలేదు. కనుక ఇదంతా కేవలం స్వయంకృతం.ప్రహసన ప్రాయంగా...అదట్లుంచితే, తొలి దశలో రూపొందిన ఈ గొప్ప ప్రణాళికలు ఎందువల్ల విఫలమైనట్లు? సూటిగా చెప్పాలంటే, కాంగ్రెస్‌లో స్వాతంత్య్రోద్యోమ కాలం నుంచే బలంగా ఉండిన ఫ్యూడల్ వర్గాలు, తర్వాత ఆ పార్టీలో చేరిన మాజీ రాజసంస్థానాలవారు, గొప్పగా కాకున్నా ఒక మేరకు ఉండిన పారిశ్రామిక వర్గాలు కలిసి, అధికార యంత్రాంగాన్ని తమకు విధేయులుగా మార్చుకుని, తమ ప్రయో జనాల కోసం అన్నింటినీ కుంటుపరిచారు. నెహ్రూ నిస్సహాయునిగా మిగిలారు. అందుకే ఏ ఒక్కటీ సవ్యంగా అమలుకాక, స్వాతంత్య్ర ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండిన పేదలు, మధ్య తరగతి వర్గాలను తీవ్రంగా నిరాశపరచింది. దాని పర్యవసానంగానే 1957 ఎన్నికలలో కాంగ్రెస్ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో ఓడటం, 1960ల మధ్యకు వచ్చేసరికి వివిధ తరగతుల ఆందోళనలు, 1967లో కాంగ్రెస్‌ను 9 రాష్ట్రాలలో ఓడించి సంయుక్త విధాయక్ దళ్ ప్రభు త్వాల ఏర్పాటు, 1969 నుంచి నక్సలైట్ ఉద్యమం వంటివి వరుసగా జరుగుతూ వచ్చాయి. భూసంస్కరణలు, పంచాయితీరాజ్ వ్యవస్థ, సహకార సంఘాలు, రిజర్వేషన్ల అమలు ప్రహసనంగా మిగిలాయి. ఇందుకు ప్రజలను నిందించటంగానీ, వారు ఉచితాల కారణంగా పనులకు వెళ్లటం లేదనటంగాని పూర్తిగా నిర్హేతుకమైనది. మారుతున్న పరిస్థితులలో వారికి నిత్య జీవిత వ్యయం, ఇతర అవస రాల ఖర్చు చాలా పెరుగుతున్నాయి. కేవలం ఉచితాలు ఎంత మాత్రం సరిపోవు. ఉచితాల ఊబికి ఏకైక పరిష్కారం ప్రభుత్వాలు, పార్టీలు తామే చేసిన రాజ్యాంగాన్ని, చట్టాలను నిజాయితీగా అమలు పరచటం. పేదలు పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం సరిగా పని చేయా లన్నా, తిరుగుబాట్లు చేయవద్దనుకున్నా వారికి సంక్షేమ పథకాలు అవసరమని సిద్ధాంతీకరించి సవ్యంగా అమలు చేసిన బ్రిటిష్ వ్యవస్థను, జర్మన్ నియంత బిస్మార్క్‌ను మనం ఒకసారి చదువుకుంటే ఉపయోగపడుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
CEC appointment hearing: వాయిదా కోరిన కేంద్రం.. సరికాదన్న పిటిషనర్ లాయర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.వివాదం ఏంటంటే..2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. -
మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పబ్లిక్‌గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి నోటీసులు..యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
‘కొత్త ‘సీఈసీ’ నియామకం రాజ్యాంగ విరుద్ధం’
న్యూఢిల్లీ:నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ‘సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ నియామక నిర్ణయం తొందరపడి చేశారు. సీఈసీ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది.ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం(ఫిబ్రవరి)19 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో కనిపిస్తోంది.ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్,ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’అని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొత్త సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ సోమవారమే నియమితులైన విషయం తెలిసిందే. -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
రఘురామ ‘క్వాష్’ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట
జర్నలిస్ట్‌పై దాడి కేసులో టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు(preme Court)లో భారీ ఊరట లభించింది.ఈ కేసులో మోహన్‌బాబు(Mohan Babu)కి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గురువారం ఉదయం ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సుదాంత్ దులియా ధర్మాసనం.. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది?మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనా బోరా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లే విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టిపారేసింది. అదే సమయంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుండడంతో ట్రయల్ కోర్టుపై అసహనం వ్యక్తం చేసింది.ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా.. గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కిందటి ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టులో ఇంద్రాణీ ముఖర్జీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం.. ఇవాళ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. కేసు విచారణ జాప్యం అవుతుండడం దృష్టికి రావడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలోపు ఈ కేసుకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ వాదనఇది ఎంతో సున్నితమైన కేసుప్రస్తుతం ఈ కేసు విచారణ మధ్యలో ఉందిఇప్పటికే 96 మంది సాక్ష్యులను విచారించాం ఇలాంటి సమయంలో ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం సరికాదు. ఇంద్రాణీ తరఫు వాదనలు ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉంది. ట్రయల్ కోర్టులో విచారణ జరపాల్సిన బెంచ్ నాలుగు నెలల కూడా ఖాళీగానే ఉందికాబట్టి ఈ కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి కాబట్టి మా క్లయింట్‌కు విదేశాలకు వెళ్లేందుకు ఊరట ఇవ్వాలి సీబీఐ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. షీనా బోరా కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్ డైరీలో ఏముందంటే..ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. తన రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టైన ఆమె.. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత బయటకు వచ్చారు. అయితే తన బిడ్డను తాను చంపుకోలేదని, ఆమె ఇంకా బతికే ఉందంటూ ఇంద్రాణీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుండడం గమనార్హం.షీనా బోరా కేసు టైం లైన్ఏప్రిల్ 24, 2012: షీనా బోరా కనిపించకుండా పోయింది2015, ఆగష్టు 21: ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్.. నేరం ఒప్పుకోలు2015, ఆగష్టు 25: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా కోల్‌కతాలో అరెస్ట్2015, సెప్టెంబర్ 1: షీనా అసలు తండ్రిని తననేంటూ సిద్ధార్థ్ దాస్ ప్రకటన2015, సెప్టెంబర్ 18: షీనా బోరా కేసు సీబీఐకి అప్పగింత2015, నవంబర్ 19: పీటర్ ముఖర్జీ అరెస్ట్.. ఇంద్రాణీ, సంజీవ్, శ్యామ్వర్ మీద ఛార్జ్‌షీట్ దాఖలుఫిబ్రవరి 16, 2016: ఛార్జ్ షీట్లో పీటర్ ముఖర్జీ పేరు నమోదుజనవరి-ఫిబ్రవరి 2017: ఈ కేసులో విచారణ ప్రారంభంఅక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు మంజూరుమార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరుమే 18, 2022: ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఆరేళ్ల తర్వాత బయటకుఫ్రిబవరి 12, 2025: విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని ఇంద్రాణీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. ట్రయల్ ఏడాదిలోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం -
ఈవీఎంల డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. -
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
గౌనును బట్టి గౌరవం లభించదు
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అభిప్రాయం చెప్పకుండా గవర్నర్ బిల్లుల్ని ఆపరాదు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిష్టంభన ఎలా తొలుగుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏదైనా బిల్లు కేంద్ర చట్టానికి విఘాతం కలిగిస్తుందని మీరు భావిస్తే, ఆ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లు గవర్నర్ చెప్పాలి. లేకపోతే ప్రతిష్టంభన తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభనను ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి ప్రతిష్టంభనను మీరే తొలగించాలి. ఈ విషయం గమనించండి’అని గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణికి సూచించింది. అటార్నీ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. -
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్‌లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్‌గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్‌కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘ఎమ్మెల్యేల అనర్హత’పై 10న తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈ పిటిషన్ ప్రతిని, ప్రతివాది అయిన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్ఎస్ను వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌తో కేటీఆర్ పిటిషన్‌ను జత చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి ధర్మాసనం..తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటే ఎంత కాలం? అసెంబ్లీ గడువు ముగిసే దశలో నిర్ణయం తీసుకుంటారా?’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
TG: గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ:తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఫిరాయిపులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే గనుక ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయ నేతలకు సూచించింది.కూథట్టుకులమ్ మున్సిపల్ కౌన్సిలర్ కళా రాజును అపహరించి, దాడి చేసిన కేసులో ఐదుగురికి ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారాయన.‘‘ఒక ప్రతినిధి రాజకీయ విధేయతను మార్చుకోవాలనుకుంటే(పార్టీ మారాలనుకుంటే).. ఆ వ్యక్తి మొదట రాజీనామా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక కోణం. అప్పుడే ఓటర్ల నమ్మకాన్ని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయకుండా ఉంటారు. అలా జరగకుంటే.. ప్రజల ప్రజల అభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అలాంటి ప్రజాప్రతినిధిని తర్వాతి ఎన్నికల్లో ఓడించం ద్వారా ప్రజలు తమ సత్తా చాటగలరు. ప్రజాస్వామ్యానికి ఉన్న అందం అదే కూడా’’ అని న్యాయమూర్తి అన్నారు.ప్రస్తుత కేసులో.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఇరు వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిని ఓడించాలంటే అది ఎన్నికల ద్వారానే.. హింస ద్వారా కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణలో బీఆర్ఎస్ మీద నెగ్గిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వ్యహారం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత టైం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇటు.. కేరళ హైకోర్టు కూడా ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.కేసు ఏంటంటే..సీపీఎం కౌన్సిలర్‌గా నెగ్గిన కళా రాజు ఆ తర్వాత యూడీఎఫ్‌లో చేరారు. అయితే అవిశ్వాస తీర్మానం వేళ.. ఓటేయకుండా తనను అడ్డుకున్నారని, బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ దాడికి పాల్పడ్డారని సీపీఎం నేతల మీద ఆరోపణలకు దిగారామె. ఆ ఆరోపణలను సీపీఎం ఖండించింది కూడా. అయితే ఈ ఘటనపై కళా రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 45 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లలో ఐదుగురు ముందస్తు బెయిల్ కోరగా.. షరతులతో మంజూరు చేసింది కేరళ హైకోర్టు. -
రామోజీపై ‘రాజ’భక్తి!
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో హైకోర్టుని కోరింది. దాటవేత ధోరణే... రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్లో పొందుపరిచింది. అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో కోరింది. చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి... ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్‌యూఎఫ్‌లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది. వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్‌కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్‌రావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్‌రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు. బాబు బాటలోనే రేవంత్...ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి. ‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది. -
ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం
న్యూఢిల్లీ: దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్మోహన్ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయడం, సామాన్యులు ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే అదనంగా రుసుము వసూలు చేయడాన్ని ఆయన సవాలు చేశారు. 12 జ్యోతిర్లాంగాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతి విపరీతంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పౌరులంతా సమానమేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సూచిస్తున్నట్లు గుర్తుచేశారు. దర్శనాలకు అదనంగా రుసుము వసూలు చేయడం సమానత్వ హక్కులను, మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. విజయ్‌కిశోర్ గోస్వామి పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. సమస్యను పరిష్కరించడానికి సమాజం, ఆలయ మేనేజ్మెంట్ కమిటీలే చొరవ తీసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రముఖులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, భక్తులందరినీ సమానంగా చూడాలన్న అభిప్రాయం తమకు కూడా ఉందని పేర్కొంది. కానీ, మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేమని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఈ కేసు వస్తుందని తాము భావించడం స్పష్టంచేసింది. పిటిషన్‌ను విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నామని తెలియజేసింది. అయితే, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం అనేది వీఐపీ సంస్కృతిని అరికట్టే సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదని ఉద్ఘాటించింది. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయకుండా స్థానికంగా చర్యలు తీసుకోవచ్చని పరోక్షంగా తేల్చిచెప్పింది. -
రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట
ఢిల్లీ : సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. -
ఆర్జీకర్ కేసులో కీలక మలుపు
కోల్‌కతా ఆర్జీకర్ హత్యాచార కేసులో న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో దోషి సంజయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలనే అభ్యర్థన ఉన్నతన్యాయస్థానం ఎదుటకు చేరింది. అయితే సంజయ్‌కు ఉరిశిక్ష పడడం తమకు ముఖ్యం కాదని, ఈ నేరంలో భాగమైన వాళ్లందరి పేర్లు బయటకు రావాలని అభయ(బాధితురాలి) తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.అభయ తల్లిదండ్రులు గురువారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. తమ ఆవేదనను(ఫిర్యాదును) రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆయన.. అవసరమైతే వాళ్ల అప్పాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం అభయం తల్లిదండ్రుల్ని కలిసి.. వాళ్ల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.అభ్యంతరాలు దేనికి?..ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై అభయ తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ కేసులో ఆధారాలను కోల్‌కతా పోలీసులు నాశనం చేశారని ఆరోపించారు. ఇటు.. సీబీఐ జరిపిన దర్యాప్తుపైనా తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. ఈ నేరంలో సంజయ్ ఒక్కడే భాగం కాదని, ఇంకా బయటకు రావాల్సిన పేర్లు ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులతో కలిసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా.. తొలి ఐదురోజులు దర్యాప్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని అంటున్నారు.సుప్రీంలో పిటిషన్ వెనక్కిఆర్జీకర్ కేసులో మళ్లీ విచారణ జరిపించాలని అభయ తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ చేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను వాళ్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి ఏడాది ఆగష్టులో సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో తమను భాగం చేయాలని Intervention Application ద్వారా అభయ తల్లిదండ్రులు అభ్యర్థించారు. కానీ, ఈ కేసులో సంజయ్‌కు శిక్షపడక ముందే కలకత్తా హైకోర్టులో ‘ఫ్రెష్ విచారణ’ కోరుతూ ఓ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం తమ పరిశీలనలో గుర్తించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్ తరఫు మహిళా న్యాయవాదిని హెచ్చరించింది. సత్వరమే పిటిషన్ వెనక్కి తీసుకుని.. కావాలనుకుంటే కొత్తగా పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో.. అభయ తల్లిదండ్రులు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఇక ఆర్జీకర్ కేసులో.. సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అయితే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ల విచారణకు స్వీకరించే అంశంపై విచారణ జరిపి.. తీర్పును కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. -
తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టులో 18 లక్షలకుపైగా క్రిమినల్ కేసులు పోగుబడటంతో ఆ కేసుల కొండ కరిగించేందుకు హైకోర్టులకు సుప్రీంకోర్టు అదనపు అధికారాలిచ్చింది. సొంతంగా తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులను నియమించుకునేందుకు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు లేదా మూడేళ్ల కాలానికి జడ్జీల నియామకానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుల్లో ఇలా అదనపు జడ్జీల నియాకంపై 2021 ఏప్రిల్ 20వ తేదీన విధించిన షరతుల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘‘హైకోర్టుల వారీగా ఆ కోర్టులో అనుమ తించిన సామర్థ్యంలో 10 శాతానికి మించి తా త్కాలిక జడ్జీలను తీసుకోవద్దు. ఇద్దరు లేదా ఐదుగురు జడ్జీలను తీసుకోండి. సిట్టింగ్ జడ్జి సూ చించిన ధర్మాసనంలో కొత్త జడ్జీలు కూర్చోవాలి. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వినాలి. డివిజన్ బెంచ్‌లో భాగ స్వాములుగా ఉన్నాసరే శాశ్వత జడ్జీలతోపాటు కాకుండా విడిగా కూర్చుని కేసులను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. షరతులను విధిస్తూ గతంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ఏ బోబ్డే ఆ తీర్పు చెప్పారు. రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలను కేవలం ఒక్కసారి మాత్రమే రెండు లేదా మూడేళ్ల కాలానికి తాత్కాలిక జడ్జీగా నియమించుకోవచ్చని ఆయన తీర్పు చెప్పడం తెల్సిందే. నేషనల్ జుడీషియల్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హైకోర్టులో 62 లక్షల కుపైగా కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం గతంలో హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్లను అవసరమైతే తిరిగి తాత్కాలిక జడ్జీలుగా నియమించవచ్చు. అయితే ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం అత్యంత అరుదుగా వినియోగించుకుందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
‘సుప్రీం’ తీర్పుతో తెలంగాణకు నష్టం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో 50 శాతం స్థానిక కోటా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పుతో మెడికల్ కాలేజీల ఏర్పాటులో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో స్థానిక విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను చదివే అవకాశం కోల్పోతారని తెలిపారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చొరవతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో వాటి సంఖ్య 34కు చేరింది. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 2,924 పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ కింద 1,462 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా ప్రత్యేక దృష్టి సారించి వైద్య విద్యను ప్రోత్సహించాయి’అని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వేషన్లు కూడా దెబ్బతినే ప్రమాదం సుప్రీంతీర్పు రిజర్వేషన్లను కూడా ప్రభావితం చేస్తుందని హరీశ్‌రావు అన్నారు. ‘ఈ తీర్పుతో రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతి నే ప్రమాదం ఉంది. పీజీలో ఇన్‌సర్వీస్ కోటా ప్రశ్నార్థకంగా మారి, గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. పీజీ విద్యార్థులకు స్టైఫెండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ తీర్పుతో నష్టం జరుగుతుందని భావించిన తమిళనాడు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూ డా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లి స్టే తీసుకురావాలి. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి’అని హరీశ్ సూచించారు. -
తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: యూపీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనంటూ ఓ అడ్వొకేట్ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. త్రివేణి సంగమం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే..మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాలో అన్ని రాష్ట్రాల సమన్వయంతో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయించేలా అధికార యంత్రాగాన్ని ఆదేశించాలని కోరారాయన.మరోవైపు తీవ్ర విషాదం నేపథ్యంతో.. మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించింది. అలాగే.. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్‌రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్‌వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్‌వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్‌కు వెళ్లేందుకు అఖాడా మార్గ్వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో(PG medical quotas) రాష్ట్రాలు స్థానికత ఆధారంగా కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. స్థానిక కోటాను అనుమతిస్తే.. అది అభ్యర్థుల ప్రాథమిక హక్కులను అతిక్రమించడమే అవుతుందని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భాటిల ధర్మాసనం పేర్కొంది. ‘మనందరం భారత్‌లోని ఏదో ఒక ప్రదేశంలో స్థానికులమే. భారతీయ పౌరులం.దేశంలో నివసించే వాళ్లమే. దేశ పౌరులుగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మనకుంది. అలాగే దేశంలో ఎక్కడైనా వృత్తి, వ్యాపారాన్ని కొనసాగించే హక్కు ఉంది.అలాగే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని కోరే హక్కును కూడా మనకు రాజ్యాంగం కల్పిస్తోంది. విద్యాసంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కొంతమేరకే పరిమితం. ఆ రాష్ట్రంలో నివసించే వారికే సీట్లు కేటాయించడమనేది సరైనది కాదు. మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) కూడా స్థానిక కోటా ఎంబీబీఎస్కే పరిమితం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పీజీ ప్రవేశాల్లో దేశమంతా ఓపెన్ కేటగిరి కిందకు వస్తుందని స్పష్టం చేసింది. స్పెషలిస్టు డాక్టర్ల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చూస్తే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొంది.ఇలాంటి రిజర్వేషన్లను అనుమతిస్తే అది విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగకరమని పేర్కొంది. భారత సమాఖ్యలోని మరో రాష్ట్రానికి చెందిన వారని చెప్పి.. వారిని సమానంగా చూడకపోవడం తప్పు. ఆర్టికల్ 14 చెప్పే సమానత్వపు హక్కుకు భంగకరం అని ధర్మాసనం(Supreme Court) తేల్చి చెప్పింది.చట్టం ముందు అందరూ సమానులేననడాన్ని నిరాకరించడం అవుతుందని స్పష్టం చేసింది. అఖిల భారత పరీక్షల్లో రాష్ట్ర కోటా సీట్లు, సంస్థాగత రిజర్వేషన్లు వర్తించే సీట్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ప్రవేశాలకు సంబంధించి పంజాబ్– హరియాణా హైకోర్టు ఈమేరకు ఇచి్చన తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్థానికత విషయంలో మెడికల్ కాలేజి నిబంధనలు చెల్లవని పంజాబ్– హరియాణా హైకోర్టు తీర్పునిచ్చింది.చండీగఢ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుల ప్రవేశానికి మార్చి 28, 2019లో అడ్మిషన్లు ప్రారంభించారు. మొత్తం 64 పీజీ సీట్లను రాష్ట్ర కోటా కింద వర్గీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌కు స్థానికులైన వారికి లేదా ఇదే కాలేజీలో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసిన వారికి ఈ 64 సీట్లను కేటాయిస్తామని నిబంధనలు పెట్టారు. ఈ 64 సీట్లలో సగం.. అంటే 32 సీట్లు అదే కాలేజీలో చదివిన వారికి రిజర్వు చేయడం సబబే అయినా... చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతవాసులకు మిగిలిన 32 సీట్లను కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టు.. అసలైన ప్రజాకోర్టు
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు అసలు సిసలైన ప్రజా న్యాయస్థానం అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డైమండ్ జూబ్లీని పురస్కరించుకొని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ప్రత్యేకంగా కొలువుదీరింది. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ధర్మాసనం మన సుప్రీంకోర్టు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను, మన సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన, సమర్థవంతమైన న్యాయస్థానంగా ఎదిగిందని హర్షం వ్యక్తంచేశారు.ఏళ్ల క్రితం మన ప్రయాణం మొదలైందని అన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) 1950 జనవరి 28 నుంచి ఆమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిజమైన ప్రజల కోర్టుగా ప్రదర్శించిన విశిష్టమైన గుణమే మన సుప్రీంకోర్టును ఉన్నత స్థానంలో నిలిపిందని జస్టిస్ ఖన్నా వివరించారు. 75 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కాలానుగుణంగా మార్పులను అందిపుచ్చుకుంటూనే రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో మన సుప్రీంకోర్టు పనిచేస్తోందని వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేకూరుస్తూ ప్రజల కలలను నిజం చేస్తోందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటని అధిగమిస్తూ ముందుకెళ్లాలని న్యాయవాదులు, న్యాయమూర్తులకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పిలుపునిచ్చారు. మన అత్యున్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉందని వివరించారు. ప్రాణంలేని శిల్పం కాదు.. సజీవ సంస్థ న్యాయం అనేది కేవలం ఉత్తర్వుల్లోనో, నోటి మాటగానో కాకుండా ఆచరణాత్మకంగానూ ఉండాలన్నదే తమ ఉద్దేశమని జస్టిస్ ఖన్నా వివరించారు. ప్రజల హక్కులను కాపాడడంలో, వారికి చేరువకావడంలో సుప్రీంకోర్టు ముందంజలో ఉందన్నారు. ప్రస్తుతం మూడు రకాల సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోర్టు ఖర్చులు పెరిగిపోతుండడంతో ప్రజలు న్యాయం పొందడంలో ఆలస్యం జరుగుతోందని అన్నారు. చాలామంది ఖర్చులకు భయపడి కోర్టుల వరకు రావాలంటే సంకోచిస్తున్నారని తెలిపారు. అసత్యమే సత్యంగా చెలామణి అవుతున్న చోట న్యాయం బతికి బట్టకట్టడం కష్టమని వ్యాఖ్యానించారు. సవాళ్లను పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.కోర్టు రూమ్‌ల్లో న్యాయమూర్తుల్లోనూ వైవిధ్యం ఉందని, భిన్నప్రాంతాల నుంచి వచ్చినవారు జడ్జిలుగా సేవలందిస్తున్నారని తెలిపారు. తద్వారా న్యాయ వ్యవస్థలో ప్రజల గొంతుక వినిపించే అవకాశం దక్కుతోందని అభిప్రాయపడ్డారు. 7 దశాబ్దాలకుపైగా సాగుతున్న ప్రయాణంలో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు అంటే రాతి నుంచి చెక్కిన ప్రాణంలేని శిల్పం కాదని, ఇదొక సజీవ సంస్థ అని ఉద్ఘాటించారు. 1990వ దశకంలో పౌరుల హక్కుల పరిరక్షణతోపాటు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య అంతరాన్ని పూడ్చేందుకు కృషి చేసిందని వివరించారు.21వ శతాబ్దంలో సుప్రీంకోర్టు పాత్ర మరింత పెరిగిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ నుంచి పర్యావరణ పరిరక్షణ దాకా.. మేధోసంపత్తి హక్కుల నుంచి గోప్యత దాకా.. ఇలా ఎన్నో అంశాలపై తీర్పులిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయాలకు భారతదేశ ఆర్థికవ్యవస్థను సైతం బలోపేతం చేశాయన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో హామీలు సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా వాస్తవరూపం దాల్చాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై కేసుల విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్‌పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్‌పై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్
సాక్షి,న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి తెలంగాణ సర్కారుకు గట్టి షాక్ తగిలింది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి మొదటిసారి బెయిల్ లభించింది. కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం(జనవరి27) విచారించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేసు విచారణకు సహకరించాలని బెయిల్ ఇచ్చిన సందర్భంగా తిరుపతన్నను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని,అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని సూచించింది. కాగా, తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాలని,దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిందితుల్లో ఒకరైన తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో మరో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు నేతృత్వం వహించారని ఆరోపణలున్న టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌పోల్ ద్వారా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది. ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది. -
ప్రజలు కోర్టుకొచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్టార్ల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. చట్టాల విషయంలో అధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో పిటిషన్లు వరదలా దాఖలవుతున్నాయని, ప్రజలను కోర్టులకు వచ్చి తీరే పరిస్థితులు కల్పిస్తున్నారని స్పష్టం చేసింది. వేలంలో కొన్న ఆస్తికి మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండాలంటే రిజ్రిస్టార్, సబ్ రిజ్రిసా్టర్లకు న్యాయవ్యవస్థలో, చట్టాలలో వస్తున్న కొత్త మార్పులపై జ్ఞానోదయం కలిగించాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు, శిక్షణ తరగతులు నిర్వహించాలంది. ఇందుకోసం ఓ ‘లీగల్ మాడ్యూల్’ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పుడే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపింది. ఈ లీగల్ మాడ్యూల్ రూపకల్పన విషయంలో అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ లీగల్ మాడ్యూల్‌ని రూపొందించాలని తేల్చి చెప్పింది. అనంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలంది. తమ ఈ ఆదేశాల అమలు పురోగతికి సంబంధించిన వివరాలతో 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లు వేలంలో కొన్న ఆస్తికి దాని విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు ఖరారు చేయాలని తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యమిదీ కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి తిరుపతి కెనరా బ్యాంక్ నిర్వహించిన ఈృవేలంలో తిరుపతి సెంట్రల్ పార్క్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని పలు షాపులను రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ ఆస్తిని తమ పేర రిజిస్టర్ చేయాలంటూ తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను మల్లికార్జున తదితరులు ఆశ్రయించారు. సదరు ఆస్తికి మార్కెట్ విలువ (రూ.3.65 కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్ డ్యూటీ, 1 శాతం రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లించాలని సబ్ రిజ్రిస్టార్ స్పష్టం చేశారు. ఈ మొత్తం చెల్లిస్తేనే రిజ్రిస్టేషన్ చేస్తామని తేల్చి చెప్పారు. తాము వేలంలో ఈ ఆస్తిని కొన్నామని, అందువల్ల మార్కెట్ విలువ ప్రకారం కాకుండా ఆస్తి విలువ (రూ.2.17 కోట్లు) ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లిస్తామని, నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయని మల్లికార్జున తదితరులు చెప్పారు. సబ్ రిజ్రిస్టార్ ఒప్పుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. -
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. విచారణ సందర్బంగా కూటమి సర్కార్ పెట్టిన కేసుల్లో సెక్షన్లను చూసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డిపై కూటమి సర్కార్ అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.వాదనల సందర్భంగా.. కేసులో సెక్షన్లను చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది. అనంతరం ధర్మాసనం.. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు కుట్ర చేశారన్న గౌతమ్‌రెడ్డిని విచారించాలి కదా?. ఈ కేసులో నిందితులంతా బెయిల్‌పైనే ఉన్నారు. ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. కుట్రను మీరు విచారణలో తేల్చండి అని పేర్కొంది. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. -
లోన్ల మంజూరులో జాగ్రత్త.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు. -
హైకోర్టుకు కొత్తగా.. నలుగురు జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నర్సింగ్‌రావు నందికొండ, హైకోర్టు రిజి్రస్టార్ జనరల్ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిజి్రస్టార్ (అడ్మినిస్ట్రేషన్) మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య పేర్లను ఈ నెల 11న ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరంతా 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైనవారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటాలో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2026 జూన్ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. మిగతా ముగ్గురు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని.. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ఈ నెల 25న కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ నలుగురితో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా, వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు. -
సుప్రీంకోర్టులో నేడు ఆర్జీకర్ కేసు విచారణ
సాక్షి,ఢిల్లీ:కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై బుధవారం(జనవరి22)సుప్రీంకోర్టు,కోల్‌కతా హైకోర్టుల్లో విచారణ జరగనుంది. కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని భాధితురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ కె వి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష,50 వేల జరిమానా విధిస్తూ కోల్‌కతా కోర్టు జనవరి20వ తేదీన తీర్పిచ్చింది.సంజయ్‌రాయ్‌కి యావజ్జీవ కారాగర శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ కోల్‌కతా హైకోర్టులో బెంగాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు విచారించనుంది. జస్టిస్ దేబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రష్దీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. కాగా, మహిళా ట్రైనీ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం చేసి చంపినందుకుగాను దోషి సంజయ్‌రాయ్‌కి కోర్టు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది. దీంతో ఇటు హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, మెడికోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్‌కి మరణశిక్ష విధించాల్సిందేనని కోల్‌కతాలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
ఈడీది బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుబట్టడం పరిపాటే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరును కేంద్ర ప్రభుత్వమే తప్పుబట్టిన అసాధారణ ఘటనకు సాక్షాత్తూ సుప్రీంకోర్టే వేదికైంది! ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్‌పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సరీ్వసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణకు వచి్చంది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశమంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ‘‘ఈడీ జవాబుదారీతనంపైనే ఈ ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నివిధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)దే కదా’’ అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ను బాధ్యున్ని చేయలేమని ఏఎస్జీ బదులివ్వడంతో అయిష్టంగానే విచారణను చేపట్టింది. కానీ ‘‘దీన్ని మేమింతటితో వదిలేయదలచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌తో మీకేమీ సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?’’ అని ఏఎస్జీని ప్రశ్నించింది. దాంతో అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్‌ను ఓసారి సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. ‘‘ఇది కేవలం సమాచార లోపమే. అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సిందిగా ఈడీ డైరెక్టర్‌ను ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి’’ అని అభ్యరి్థంచారు. ధర్మాసనం మాత్రం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్‌కు ‘సుప్రీం’లో ఊరట -
‘సుప్రీం’లో ఆప్ సర్కార్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
కేసుల మాఫీకి బాబు కుట్రలు
-
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
సిట్ క్లోజ్.. బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ, సాక్షి: స్కిల్ కుంభకోణం కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ సీఐడీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతోనే బుధవారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ స్కాం(Skill Scam Case) కేసులో దర్యాప్తు దాదాపు పూర్తి అయిందని, కేసును పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు అయిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ రద్దు పిటిషన్ చేశారని తెలిపారాయన. ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదా ? అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.బేలా త్రివేది ప్రశ్నించారు. ‘లేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ తరఫున న్యాయమూర్తికి సూచించారు. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉండడంతో.. బెయిల్ షరతులు(Bail Conditions) ఉల్లంఘించినా, విచారణకు సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.కూటమి ప్రభుత్వం కొలువు దీరరాక.. స్కిల్ స్కాం కేసులో దర్యాప్తు స్పీడ్ మొత్తం తగ్గిపోయింది. చంద్రబాబు సీఎం కావడంతో ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు అందరూ ఆయన్ని బయటపడేసేందుకు మూకుమ్మడిగా కృషి చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్రద్దు పిటిషన్లో స్వర్ణాంధ్ర పత్రికా విలేకరి బాలాగంగధర్ తిలక్ భాగమయ్యారు. ఆయన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది హరిన్ రావల్ వాదనలు వినిపించారు. చంద్రబాబే(Chandrababu) ప్రభుత్వం కావడంతో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని హరిన్ రావల్ వాదించారు. ప్రభుత్వం మారగానే సిట్ ఆఫీస్‌ను మూసేయించారని, పైగా అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్కిల్ స్కాం కేసులో మీకేం సంబంధమంటూ పిటిషనర్‌ను మందలిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. గతంలో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ తరఫున ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.స్కిల్ స్కాం కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే.. 6.9.2023: ‘రేపో మాపో నన్నూ అరెస్టు చేస్తారేమో?’ అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు వ్యాఖ్యలు 9.9.2023: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ 10.9.2023: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచిన సీఐడీ అధికారులు. రోజంతా కొనసాగిన విచారణ. 14 రోజుల రిమాండు విధించిన కోర్టు. అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు 11.9.2023: జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని, నైపుణ్యాభివృద్ధి కేసు దస్త్రాలివ్వాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 12.9.2023: హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు 13.9.2023: క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకూ ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం. విచారణ 19కి వాయిదా 14.9.2023: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలుచంద్రబాబును ములాఖత్‌లో కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్. 15.9.2023: బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 17.9.2023: నైపుణ్యాభివృద్ధి కేసుపై దిల్లీలో సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల మీడియా సమావేశం 19.9.2023: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 21కి వాయిదా 20.9.2023: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ. 21న నిర్ణయం వెల్లడిస్తామన్న ఏసీబీ కోర్టు సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులు భద్రపరచాలని పిటిషన్. కౌంటర్ వేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 21.9.2023: స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ 22.9.2023: రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు. రిమాండ్ 24 వరకు పొడిగింపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు బెయిలు పిటిషన్, పీటీ వారంట్ల పిటిషన్‌పై విచారణ 25కి వాయిదా 23.9.2023: చంద్రబాబును తొలిరోజు దాదాపు 5 గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయటంతో సుప్రీంకోర్టులో చంద్రబాబు అప్పీలు సీఐడీ కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు. అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరణ 24.9.2023: రెండో రోజూ చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు. అక్టోబరు 5 వరకు జ్యుడిషియల్ రిమాండు పొడిగించిన ఏసీబీ కోర్టు 25.9.2023: చంద్రబాబును మరో 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 26.9.2023: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 27.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు బెయిలు, కస్టడీ పిటిషన్ల విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 28.9.2023: చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 30.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారించే ధర్మాసనం ఖరారు 3.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. హైకోర్టులో సమర్పించిన దస్త్రాలన్నీ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశం 4.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 5.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ చంద్రబాబు రిమాండ్‌ను 19 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు 6.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు 9.10.2023: చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ వర్తించేలా కనిపిస్తోందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు 10.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 12.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను 17కు వాయిదా వేసిన హైకోర్టు 13.10.2023: కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 14.10.2023: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశం 17.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా 19.10.2023: ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట వర్చువల్‌గా చంద్రబాబు హాజరు 20.10.2023: ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారంట్‌పై చంద్రబాబును నవంబరు 9 వరకు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచొద్దని, అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లకు అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు కాల్‌డేటా పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 26.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల వెల్లడి 27.10.2023: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకొన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి సీఐడీ కాల్ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు తమ పార్టీ బ్యాంకు లావాదేవీల వివరాలను సీఐడీ కోరడంపై హైకోర్టుకు టీడీపీ 28.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుడి నిర్ధారణ 30.10.2023: చంద్రబాబు మధ్యంతర బెయిలుపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు 31.10.2023: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు -
‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ప్రభుత్వ వాదనలతో అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. దీంతో.. ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనవరి 8వ తేదీన సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అయితే అంతకు ముందే.. కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో.. ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కేటీఆర్ తరుఫున లాయర్ సుందరం వాదనలు ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అంటూ వాదనలు వినిపించారు.ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తునకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అని అన్నారు.ఇరువైపులా వాదనల అనంతరం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ స్టేజ్‌లో క్వాష్ పిటిషన్‌ను అనుమతించలేమని తెలిపింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని లాయర్ సుందరం కోర్టుకు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదుతమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం. ఏసీబీ FIRలో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అని మోహిత్ రావు పేర్కొన్నారు. -
భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది. -
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్‌గా నటిస్తూ భౌమిక్‌కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్‌లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!
సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్. తన కొడుకు మైనర్ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే మొదటి పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఆధారంగా బోన్ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జువైనల్ జస్టిస్ యాక్ట్(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్ అని నిరూపించుకునేందుకు పిటిషన్ వేయొచ్చు. అందుకు సెక్షన్ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్‌సర్వీసెస్ అథారిటీకి ధర్మాసనం సూచించింది.1994లో ఏం జరిగిందంటే..డెహ్రాడూన్(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్ ఖన్నా అనే రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.ప్రతీక్ చాదా అనే లాయర్ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్ తరఫున పిటిషన్ వేయగా.. ఎస్ మురళీధర్ ఓం ప్రకాశ్ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, అడ్వొకేట్ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు. -
‘స్వలింగ వివాహాల’పై తీర్పు సరైనదే: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. -
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
కుదరదు.. 15నే విచారణ చేపడతాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ఊరట దక్కలేదు. పిటిషన్‌ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో క్వాష్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(శుక్రవారం) విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే.. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఏసీబీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఏసీబీ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోమని పేర్కొంటూ.. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ సైతం ఇవ్వలేదు. -
నగదు రహిత చికిత్స పథకం తీసుకురావాలి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్‌లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. -
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్‌లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్‌టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు
సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్‌జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే -
సుప్రీం కోర్టుకు ఈ-కార్ రేసు పంచాయితీ!
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది. -
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
గౌతమ్ రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది.ఇక, సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గౌతమ్ రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు కాకుండా, ప్రభుత్వమే ఎందుకు యాక్టివ్‌గా ఉందని కోర్టు ప్రశ్నించింది. -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
ECపై ‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్‌కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక.. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు -
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
కొబ్బరి నూనె.. హెయిర్ ఆయిలా? వంటనూనా?
కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె.. హెయిర్ ఆయిలా లేక వంటలనూనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రెండింటికీ వాడతారు. మనదేశంలో హెయిర్ ఆయిల్గానే అధికంగా కొబ్బరి నూనె వాడతారు. కాళ్లు, చేతులతో పాటు శరీరాన్ని మర్దన చేయడానికి కూడా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? దశాబ్దన్నర కాలం నుంచి కొబ్బరినూనెపై జరుగుతున్న ‘పన్ను’ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ముగింపు పలికింది. ఎక్సైజ్ శాఖ, తయారీదారుల మధ్య సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఏమిటా వివాదం?చిన్నచిన్న సీసాల్లో విక్రయించే కొబ్బరి నూనెను ఎడిబుల్ ఆయిల్ (తినదగిన నూనె)గా వర్గీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తయారీదారులు, వినియోగదారులకు ఊరట లభించనుంది. కొకొనట్ ఆయిల్‌పై ‘పన్ను’ వివాదం 2009లో ప్రారంభమైంది. మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తుంటాయి. అలాగే రెడీమేడ్ కొబ్బరినూనె అమ్మకాలపై కూడా పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ (సెట్ యాక్ట్) 1985 ప్రకారం ఎడిబుల్ ఆయిల్ కేటగిరీ కింద కొబ్బరినూనెపై 8 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. సెట్ యాక్ట్‌కు 2005లో కేంద్రం సవరణ చేసింది. దీని ప్రకారం 2009, జూన్‌లో కొబ్బరినూనెను కేశసంరక్షణ ఉత్పత్తిగా పేర్కొంటూ సుంకాన్ని 16 శాతానికి పెంచింది.అయితే 2009లో సర్క్యులర్ జారీ చేయడానికి ముందే, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు 2007లో మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు పలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిగా వర్గీకరిస్తూ కొబ్బరి నూనెపై అధిక పన్ను రేటు విధించాలని నోటీసుల్లో ప్రతిపాదించారు. మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొబ్బరి నూనెను 5 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ప్యాకెట్లలో విక్రయిస్తుంటుంది. పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(సెస్టాట్)ను మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. సెస్టాట్ తీర్పును సుప్రీంకోర్టులో సేలం సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సవాల్ చేశారు.ఎటూ తేల్చని ద్విసభ్య ధర్మాసనంకొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్ విభాగంలో చేర్చాలా, వంటనూనెగా పరిగణించాలా అనే దానిపై 2018లో జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా కొబ్బరి నూనెను తినదగిన నూనెగా వర్గీకరించాలని జస్టిస్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్గా పరిగణించాలని జస్టిస్ భానుమతి పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది.15 ఏళ్ల న్యాయవివాదం15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. కొబ్బరి నూనెను చిన్న బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎడిబుల్ ఆయిల్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే వంటనూనె, హెయిర్ ఆయిల్ మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా ఏదైనా చేయాలని ధర్మాసం సూచించింది. తినదగిన నూనెగా విక్రయించబడే కొబ్బరి నూనె తప్పనిసరిగా 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది.చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్రూ. 740 కోట్లు పెండింగ్రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వ్యవహారంలో వడ్డీ, జరిమానాలు కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 740 కోట్లు రావాల్సి ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉండడంతో కొకొనట్ ఆయిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ ప్రకారం చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్‌పై 5 శాతం, హెయిర్ ఆయిల్‌పై 18 శాతం పన్ను ఉంది. స్వల్ప పరిమాణంలో విక్రయించే కొబ్బరినూనెను ఎడిబుల్ ఆయిల్ జాబితాలో చేర్చడం వల్ల పన్నుల భారంతో పాటు ధర కూడా తగ్గుతుంది. ఫలితంగా తయారీదారుడితో పాటు వినియోగదారుడికి ఊరట లభిస్తుంది. -
ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దిగ్గజ కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్ సుబ్బులక్ష్మిని గతంలో టీఎం కృష్ణ తీవ్ర పదజాలంతో అవమానించి అప్రతిష్ట పాల్జేశారంటూ ఆమె మనవడు వి.శ్రీనివాసన్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎం కృష్ణ ఇప్పటికే ఈ అవార్డును స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు తెలిపింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ, ది హిందూ గ్రూప్‌లను ఆదేశించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఏటా ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును అందజేస్తుంటుంది. -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
కుమార్తె అంటే.. సొంత ఆస్తి కాదు!
న్యూఢిల్లీ: మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున, వివాహమాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైలులో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె ఓ వస్తువు కాదు. ఆ పెళ్లికి ఆమోదం తెలపండి’అని సూచించింది. పెళ్లయిన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి, లైంగిక దాడి చేశాడంటూ మహిద్‌పూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేననీ, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది. -
అవును.. వైవాహిక అత్యాచారం నేరమే.. కాదు!
ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే... ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు.. చిన్నదైనా..పెద్దదైనా ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ జరిగితే... ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికి ఏమీ పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు.. ఇవాళ శారీరంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెబితే... ఇక ఆ రాత్రి పిడి గుద్దులు కురిపించి.. నరకం చూపిస్తాడు.. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు.." తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పినదంతా వింటే మీకేం అనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటలు లాగా అనిపించడంలేదా? అయితే కేంద్రానికి మాత్రం దీన్ని రేప్ లాగా భావించడంలేదు.. కారణం ఒక్కటే.. వారిద్దరూ భార్యభర్తలు! అదేంటి.. దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు.. ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు .. భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు..! ఇంతకీ మ్యారిటల్ రేప్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిత అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు?'పురుషుడు పురుషుడే.. చట్టం చట్టమే.. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే..' కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న రెండేళ్ళ క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి! అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్‌ను నేరంగా అసలు అంగీకరించడంలేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 👉ఇక భారత న్యాయ సంహిత-BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహబంధాలకు హాని కలుగుతుందన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థను ఓ sacred institutionగా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెబుతుంటాయి. Consent.. అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకమంటారు. నిజానికి కేవలం భార్య అయినంతా మాత్రనా ఏ మహిళా కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే Marriage is not an excuse for any kind of rape అని చెబుతారు మహిళా సంఘాల నేతలు!👉అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్‌ను క్రిమినలైజ్ చేయడం లేదని పదేపదే చెబుతుంటుంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని.. ఇది ఓవరాల్‌గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తుంటుంది. అటు ఈ మ్యారిటల్ రేప్‌ని నేరంగా పరిగణించాలని పోరాడే వారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టే వారూ ఎక్కడైనా ఉంటారని.. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. 👉నిజానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం, వివాహితులలో 29శాతం మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగో ఉంటుంది. ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. 👉గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతిని సాధించింది కానీ ఈ వైవాహిక అత్యాచార విషయంలో మాత్రం సాంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరంకాదని చెబుతుండడం బాధకరమని బాధితులు వాపోతుంటారు. నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పని చేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి. నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలా మంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు..! వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపులు వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది..!:::త్రినాథ్ బండారు, సాక్షి డిజిటల్ -
భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే ‘భరణం’ విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవనభృతిని నిర్ణయించడానికి ముందు ఎనిమిది అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.కుమారుడి కోసం కోటి రూపాయలుప్రవీణ్ – అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లయిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు, విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వీరి పెళ్లికి కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రా యపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కో ర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశమైంది.కోర్టు సూచించిన ఎనిమిది సూత్రాలు1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు2. భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు3. ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం4. ఆదాయ మార్గాలు, ఆస్తులు5. అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు6. కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయపోరాటానికి సహేతుకమైన మొత్తం8. మెయింటెనెన్స్ అలవెన్స్‌తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
-
ఎనిమిది మార్గదర్శకాల జారీ...
ఢిల్లీ: భార్యాభర్తల విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడం సాధారణమైన విషయం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భరణం గురించి సుప్రీంకోర్టు విధివిధానాలు వెలువరించింది. ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సూచించింది.ఎనిమిది మార్గదర్శకాలు ఇవే..1. భార్యాభర్తల సామాజిక ఆర్ధిక స్థితిగతులు.2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు.3. ఇరు పార్టీల ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు.4. ఆదాయం మరియు ఆస్తి సాధనాలు.5. అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం.6. కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?.7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం.8. భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు.ఇదిలా ఉండగా.. తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ బలవనర్మణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.భరణం విషయంలో ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి సాధారణమైనవి కాదని, చాలా కీలకమైనవని వ్యాఖ్యానించింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్టు అతుల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం గమనార్హం.ఇది కూడా చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..ఇది కూడా చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు -
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భర్తపై తప్పుడు కేసు.. సుప్రీం కోర్టు సీరియస్
భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెక్కీ బలవనర్మణానికి పాల్పడడం.. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.న్యూఢిల్లీ: వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘498ఏ సెక్షన్(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోం’’ అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: పేజీల కొద్దీ సూసైడ్ నోట్.. కదిలించిన ఓ భర్త గాథతెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ పరిశీలనలో ఈ విషయం గుర్తించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపై ఆమె చట్టాన్ని ఆయుధంగా ప్రయోగించాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందామె. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఆమె ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేకుంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ ఉన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర తప్పిదం.’’ అని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే.. అలాగని.. అన్ని కేసులపై తాము ఈ వ్యాఖ్య చేయడం లేదని, ఇలాంటి వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపై మా ఆందోళన’’ అని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.ఐపీసీ సెక్షన్ 498ఏ.. జులై 1వ తేదీ నుంచి కాలం చెల్లింది. ఆ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 86 అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఘటన జరిగిన మూడేళ్లలోపు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. -
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే.. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్‌ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు.అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ‘‘కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుంది’’ అని జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం అభిప్రాయపడింది. -
‘సుప్రీం’ జడ్జిగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. జస్టిస్ మన్మోహన్‌ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు. -
ఢిల్లీలో జీఆర్ఏపీ ఉపసంహరణకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 161గా నమోదైంది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య కట్టడికి విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన ప్లాన్-4 (జీఆర్ఏపీ) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. గాలి నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో జీఆర్ఏపీ ఆంక్షలను ఉపసంహరించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. గా గత నెల రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యంగా తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఒకానాక దశలో ఏక్యూఐ 500 స్థాయికి కూడా చేరడంతో. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేసింది. దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో క్లాస్‌లు నిర్వహించారు. ఇదిలా ఉండగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. -
నెలసరి పురుషులకూ వస్తే తెలిసేది!: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఓ మహిళా జడ్జికి గర్భస్రావం అయిన పరిస్థితిని కనీస పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుమోటోగా విచారణ జరుపుతోంది. అయితే..ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఊరట దక్కని ఇద్దరు.. ఎంత విజ్ఞప్తి చేసినా ఉన్నత న్యాయస్థానం వినలేదు. అయితే.. ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతోపాటు తన సోదరుడు క్యాన్సర్ బారినపడినట్లు హైకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ నాగరత్న, ఎన్కే సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మంగళవారం విచారణ జరిపింది.‘‘ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంది. పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఏంటనేది తెలిసేది’’ అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించిన వివాదాల ప్యానెల్ కేసు విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వైదొలిగారు. సీజేఐ ఈ పిటిషన్ నుంచి తప్పుకోవడంతో.. ఇది మరో బెంచ్‌కు వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన విచారణ మొదలుకానుంది.ఈ ప్యానెల్లో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం అనేది పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిప్రాయం అని ఆ టైంలో కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని ఆ సమయంలో స్పష్టం చేసింది. కానీ..కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ఓ నిర్ణయం తీసుకుంది. సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని ప్రధాన మంత్రి ఈ ప్యానెల్‌కు కేటాయించారు. ఈ మేరకు సీఈసీ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్‌ను నాడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ధర్మాసనం. అయితే.. సీఈసీ బిల్లు వివాదాన్ని పట్టించుకోకుండానే.. కేంద్రం ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమించింది. ఇక.. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ఉండడంతో ఈ కేసు నుంచి త్ప్పుకోవాల్సి వచ్చింది. -
Delhi: ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్ఏపీ-4) నిబంధనలను సడలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి చాలా పేలవమైన కేటగిరిలో కొనసాగుతోందని.. ఇది మరింత స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిబంధనలను సడలించేందుకు అనుమతిస్తామ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఢిల్లీ కాలుష్యంపై విచారణ చేపట్టింది.ఢిల్లీలో జీఆర్‌పీఏ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యాణ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.‘భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలన్న మా ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు ఏవీ పాటించలేదని మేము గుర్తించాము. పైసా చెల్లించినట్లు కూడా రుజువు చూపలేదు. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వారికి సమన్లు జారీ చేస్తేనే వారు సీరియస్‌గా తీసుకుంటారు,’అని ధర్మాసనం పేర్కొంది. -
సెంథిల్ బాలాజీ కేసుపై సుప్రీంకోర్టు విస్మయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: డీఎంకే నేత డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి అవినీతి కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే తమిళనాడు మంత్రిగా ఆయనతిరిగి బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యక్తి వమంత్రివర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతారనే అభిప్రాయం ఎవరికైనా వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ మేరకు జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం..సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ ఉత్తర్వులు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాయని, కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే బాలాజీ మంత్రి వర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానిపై పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు తెలిపింది.‘మేము బెయిల్ ఇచ్చిన మరుసటి మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉంఉన్నారు. ఈ సమయంలో సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.. ఏం జరుగుతోంది’ అని సెంథిల్ బాలాజీ తరఫున న్యాయవాదిని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. అయితే దీనిపై తమకు కొంత సమయం కావాలని బాలాజీ న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణకు డిసెంబరు 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.కాగా డీఎంకే పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సెంథిల్ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అన్న డీఎంకేలో చేరారు. 2011 నుంచి 2015 వరకు జయలలిత ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌లో ఆయనను అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత మంత్రిపదవికి బాలాజీ రాజీనామా చేశారు. 14 నెలలు జైల్లో ఉన్న అనంతరం సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం స్టాలిన్ మంత్రివర్గంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రిగా చేరారు. -
సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట లబించింది. భార్గవరెడ్డికి రెండు వారాలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో వాదనలు వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది.కాగా టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులపై సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సజ్జల భార్గవ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడ్డారని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించి వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై రెండు వారాల్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా ఉండాలని పేర్కొంది. -
కాలపరిమితి ఆదేశాలు సరికాదు
న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టుల పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలిచ్చే సంస్కృతిని హైకోర్టులు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్‌ను నిరాకరిస్తూ, కాలపరిమితిలోపు విచారణ పూర్తిచేయాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్ల కేసులో రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుచేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కాల పరిమితిలోపు కేసు విచారణ పూర్తికాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్టప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గుచూపాలి. మరో అవకాశంలేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కిందికోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి, ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆదేశాలను కచ్చితంగా అమలుచేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. బెయిల్‌ను నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తిచేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కలి్పంచినవారమవుతాం. ఇది ఒకరకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే’’అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
అనర్హులను ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ.. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
సంభాల్ కేసులో విచారణ నిలిపివేయండి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కేసుతోపాటు సర్వే వ్యవహారంలో తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సంభాల్ సివిల్ జడ్జి కోర్టును ఆదేశించింది. సంభాల్ టౌన్లో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టంచేసింది. 1526లో మొఘల్ పాలకుడు బాబర్ హయాంలో ఆలయాన్ని కూల్చివేసి షాహీ జామా నిర్మించారని, సర్వే చేసి ఆలయం ఆనవాళ్లు గుర్తించాలని కోరుతూ కొందరు సంభాల్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మసీదులో సర్వే చేయాలంటూ ఈ నెల 19న ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే కొనసాగిస్తుండగా ఈ నెల 24న హింసాకాండ చోటుచేసుకుంది. నలుగురు మరణించారు. సంభాల్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సంభాల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మసీదు సర్వేపై కోర్టు కమిషనర్ రూపొందించిన నివేదికను సీల్ చేయాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తెరవకూడదని పేర్కొంది. సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి సూచించింది. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చేవరకూ ట్రయల్ కోర్టు తదుపరి విచారణ చేపట్టడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రశాంతంగా ముగిసిన ప్రార్థనలు షాహీ జామా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. సంభాల్ జిల్లాలోని ఇతర మసీదుల్లోనూ ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోలేదు. సంభాల్ పట్టణంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. -
సంభాల్ ప్రార్థన మందిరం సర్వేపై..
-
స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి
‘క్రీడాకారులకు మీరిచ్చే ప్రోత్సాహం ఇదేనా? ముఖ్యమంత్రి ప్రకటనలు, హామీలు కాదు... ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఓ చాంపియన్ క్రీడాకారిణి పట్ల మీరు వ్యవహరించిన తీరు గర్హనీయం’.. అని సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో (2014)లో స్వర్ణ పతక విజేత పట్ల వ్యవహరించిన తీరు సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా పూజ ఠాకూర్ అనే క్రీడాకారిణి ఇంచ్వాన్ (దక్షిణ కొరియా) ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన భారత కబడ్డీ జట్టు సభ్యురాలు. అయితే స్పోర్ట్స్ కోటా కింద గ్రేడ్–1 ఉద్యోగానికి అర్హురాలైన ఆమెకు ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చిన హిమాచల్ ప్రభుత్వం నియామకం మాత్రం జరపలేదు. దీని కోసం ఏళ్ల తరబడి హిమాచల్ సీఎం కార్యాలయం చుట్టూ పూజా ఠాకూర్ తిరుగుతోంది.స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జిఈ నేపథ్యంలో.. జూలై 2015 నుంచి పూజ ఠాకూర్ చేస్తున్న పోరాటానికి స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి... ఆమెను ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్‌గా నియమించాలని తీర్పు ఇచ్చారు. అయినా సరే నియామకం జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఈ క్రమంలో.. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ద్విసభ్య బెంచ్ వెంటనే ఆమెను ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది.సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తిఈ సందర్భంగా.. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును యథాతథంగా అమలు చేయాలని... ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. అదే విధంగా.. ఇన్నేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం పూజ ఠాకూర్ నియామకానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. జూలై 2015 నుంచే సినియారిటీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు లోబడి పొందే అన్ని ప్రయోజనాలకు ఆమె అర్హురాలని సుప్రీం బెంచ్ తీర్పులో వెల్లడించింది. -
సుప్రీంకోర్టు తీర్పుపై కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్: సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొలికపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కులాలకు రిజర్వేషన్లు అందిస్తే.. సుప్రీంకోర్టు మతాలకు ముడిపెట్టడం దారుణం. ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినా.. ఎవరిచ్చినా తప్పు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఏ.ఎస్.ఓకా సుప్రీంకోర్టు కొలీజియంలోని ఇతర సభ్యులు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
జాతికి కరదీపిక మన రాజ్యాంగం: మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని జాతికి దారి చూపే కరదీపికగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. కీలకమైన పరివర్తన దశలో మన రాజ్యాంగం దేశానికి అన్ని విషయాల్లోనూ దారి చూపుతూ చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు. ‘‘మన రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం కాదు. అదో సజీవ స్రవంతి. కోట్లాది మంది భారతీయుల అవసరాలు, ఆశలను తీర్చడంలోనే గాక వారి ఆకాంక్షలు, అంచనాలను అందుకోవడంలో ఏనాడూ విఫలం కాలేదు. చివరికి ఎమర్జెన్సీ వంటి అతి పెద్ద సవాలును కూడా తట్టుకుని సమున్నతంగా నిలిచింది’’ అంటూ కొనియాడారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దిన వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. దేశమే ముందన్న భావన పౌరులందరిలో నిండుగా ఉండాలని హితవు పలికారు.ఆ భావనే మన రాజ్యాంగాన్ని మరిన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. స్వీయ అవసరాల కంటే దేశ ప్రయోజనాలను మిన్నగా భావించే కొద్దిమంది నిజాయతీపరులు దేశానికి చాలని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ తొలి భేటీలో బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తు చేశారు. ‘‘కాలానుగుణంగా వచ్చే మార్పులను రాజ్యాంగం తనలో ఇముడ్చుకునేలా దాని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.స్వతంత్ర భారత ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, పౌరుల అవసరాలు, సవాళ్లు కాలంతో పాటు ఎంతగానో మారతాయని వారికి బాగా తెలుసు’’ అని అన్నారు. జమ్మూ కశ్మీర్లో తొలిసారి రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండటం ఆనందకరమన్నారు. ‘‘పౌరుల్లో మానవీయ విలువలను పాదుగొల్పాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అందుకే రాజ్యాంగపు తొలి హస్తలిఖిత ప్రతిలో రాముడు, సీత, గురు నానక్, బుద్ధుడు, మహావీరుడు తదితరుల చిత్రాలను చేర్చారు’’ అని గుర్తు చేశారు.ఎన్నడూ పరిధి దాటలేదు: మోదీరాజ్యాంగ పరిధులను తానెన్నడూ దాటలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా ఎప్పుడూ రాజ్యాంగం నిర్దేశించిన సరిహద్దులకు లోబడి పని చేసేందుకే ప్రయతి్నంచానని స్పష్టం చేశారు. ‘‘ఇతర వ్యవస్థల్లో చొరబాట్లకూ నేనెన్నడూ ప్రయత్నించలేదు. నా దృక్కోణాన్ని, అభిప్రాయాలను కూడా పరిధులకు లోబడే వెల్లడించేందుకే శాయశక్తులా ప్రయతి్నంచా. ఈ వేదికపై ఇంతమాత్రం చెబితే చాలనుకుంటా. వివరించి చెప్పాల్సిన అవసరం లేదనే ఆశిస్తున్నా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.మోదీకి ముందు మాట్లాడిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘తామే సర్వోన్నతులమనే భావనతో అవి అప్పుడప్పుడు అతి చేస్తున్నాయి. చట్టాలను వ్యక్తిగత, రాజకీయ అజెండాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి’’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే పై విధంగా మోదీ స్పందించారని భావిస్తున్నారు.నడిపించే శక్తి రాజ్యాంగం: సీజేఐ‘‘ప్రభుత్వ వ్యవస్థలన్నీ తమకు దఖలుపడ్డ రాజ్యాంగపరమైన బాధ్యతలను గౌరవించాలి. వాటికి లోబడే నడుచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఎన్నికల ప్రక్రియ తాలూకు పర్యవసానాలతో న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా ఉండేందుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తి వంటి రక్షణలను రాజ్యాంగం కలి్పంచిందని గుర్తు చేశారు. అయితే, ‘‘ఏ వ్యవస్థా దానికదే స్వతంత్ర విభాగం కాదు. అవన్నీ పరస్పరం ఆధారితాలే. కనుక దేశ శ్రేయస్సే లక్ష్యంగా పరస్పర సమతుల్యతతో సమైక్యంగా సాగాలి’’ అని హితవు పలికారు.‘‘భారత్‌ను ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడంలో రాజ్యాంగం అతి కీలక పాత్ర పోషించింది. ఫలితంగా దేశ విభజన, నిరక్షరాస్యత, పేదరికం తదితర పెను సవాళ్లను అధిగమించగలిగాం. అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంగా, అంతర్జాతీయంగా బలమైన శక్తిగా భారత్ నిలిచింది. వీటన్నింటి వెనకాల అడుగడుగునా రాజ్యాంగపు వెన్నుదన్ను ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్మెంట్ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది. -
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్‌లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్‌పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
జీహెచ్ఎంసీలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు -
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
పరిహారమివ్వకుండా సేకరణ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సరైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కేనని గుర్తు చేసింది. పరిహారమివ్వకుండా భూ సేకరణ చెల్లదంటూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రోడ్డు విస్తరణ కోసం సేకరించదలచిన భూమికి గాను హైకోర్టు ఆదేశించిన మేరకు సొంతదారులకు హిమాచల్ సర్కారు ముందుగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. -
‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
ఢిల్లీ ఎంట్రీ పాయింట్లను పర్యవేక్షించండి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.ఇక జీఆర్ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుంది. -
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
కఠిన చర్యలపై ఆలస్యమెందుకు?: ఢిల్లీ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ, గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది. గాలి నాణ్యత సూచీ (AQI) 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంత దాటే వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. అలాగే.. స్టేజ్-4 ఆంక్షల అమలులో ఆలస్యంపై నిలదీసింది. మూడు రోజులు ఆలస్యం ఎందుకు అయిందని అడిగింది. గాలి నాణ్యత 'సీవియర్ ప్లస్' కేటగిరీకి చేరిన దేశ రాజధానిలో.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) అమలులో జాప్యం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర కమిషన్‌ను (ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్)పై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేజ్-4 ఆంక్షలు అమలులో ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటిందని.. 400 దిగువన ఉన్నా ఆంక్షలు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.కాగా ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారి 'సీవియర్ ప్లస్'కి పడిపోయింది. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేస్తోంది. ఈ కాలుష్య నివారణ ప్రణాళిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చింది.దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధిస్తారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు.సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం ఉదయం 481గా ఉంది. దేశ రాజధానిలోని 35 మానిటరింగ్ స్టేషన్లలో అత్యధికంగా 400 ఏక్యూఐ నమోదైంది, ద్వారకలో అత్యధికంగా 499గా నమోరైంది. -
Supreme Court: దుష్ప్రభావాలు రాయడం కుదరదు
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్ఎఫెక్ట్లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్‌చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి. ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్‌ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్ఎఫెక్ట్లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు. చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
సమాధి ఆక్రమణపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్(డీసీడబ్ల్యూఏ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న లోధి హయాం నాటి సమాధిని ఆక్రమించుకోవడం పట్ల మండిపడింది. ఆ సమాధిని ఎందుకు పరిరక్షించకపోతున్నారని భారత పురావస్తు పరిశోధన విభాగాన్ని(ఏఎస్ఐ) ప్రశ్నించింది. ఆ ప్రాచీన కట్టడానికి ఎంత మేరకు నష్టం జరిగిందో అధ్యయనం చేయడానికి, పునరుద్ధరణకు అవసరమైన చర్యలను సూచించడానికి పురావస్తు నిపుణుడిని నియమిస్తామని వెల్లడించింది. 15వ శతాబ్దంలో నిర్మించిన సమాధికి చెందిన స్థలాన్ని, కట్టడాలను 1960వ దశకంలో డీసీడబ్ల్యూఏ ఆక్రమించుకుంది. ఓ గదిలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాచీన కట్టడాన్ని సంఘ విద్రోహ శక్తులు చాలావరకు ధ్వంసం చేశామని, అందుకే తాము ఆ«దీనంలోకి తీసుకున్నామని డీసీడబ్ల్యూఏ వాదించింది. ప్రాచీన కట్టడాన్ని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన రాజీవ్ సూరీ తొలుత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ఆ సమాధిని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని, దాన్ని పరిరక్షించేలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానం బుధవారం విచారణ చేపట్టింది. సమాధికి చెందిన గదిలో ఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆక్షేపించింది. దానికి అద్దె చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రాచీన కట్డడాలను కాపాడాల్సిన ఏఎస్ఐ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాధి స్థలాన్ని ఖాళీ చేయాలని డీసీడబ్ల్యూఏను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. -
కారుణ్య నియామకాలు హక్కు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది.