టీ20 ప్రపంచకప్-2024
T20 World Cup 2024
-
టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలుఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు.. ఈసారి మాత్రంముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.ఈ మెగా ఈవెంట్‌ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.ఆసీస్ వర్సెస్ ప్రొటిస్ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.సుమారు రూ.45 కోట్లు నష్టంఅయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్‌లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.చదవండి: కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మనే..! -
ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్‌లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్‌లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్‌కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్‌లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్‌లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్‌లో పదింటికి పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్.. రిషభ్ పంత్ భావోద్వేగం
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు(Laureus World Sports Awards)కు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. అత్యుత్తమ పునరాగమనం(బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్) విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. ఈ అవార్డు కోసం పంత్‌తో పాటు మరో ఐదుగురు పోటీపడుతున్నారు.పంత్ భావోద్వేగంఇక తన పేరు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అవడం పట్ల రిషభ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలని నేను విశ్వసిస్తాను. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన నేను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను.ఆ తర్వాత నాలో చాలా పరివర్తన వచ్చింది. పిచ్‌పై తిరిగి పరుగుల వరద పారించాలనే కసి మరింతగా పెరిగింది. అదంత సులువు కాదని తెలుసు. అయినా.. సరే నేను పోరాడాలనే నిర్ణయించుకున్నా. తిరిగి ఫిట్నెస్ సాధించి టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నాను.అయితే, నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నాతో నేను ఓ యుద్ధమే చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ అవార్డుకు నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవం.నేను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి నా కుటుంబం, బీసీసీఐ, వైద్యులు, నా వైద్య బృందం, మా జట్టు సహాయక సిబ్బంది, ట్రెయినర్లు.. ముఖ్యంగా నా అభిమానులు కారణం. నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నా. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నది నేను నేర్చుకున్న పాఠం. మానసికంగా బలంగా ఉంటే మునుపటి సంతోషాలు అవే వెతుక్కుంటూ వస్తాయి’’ అని రిషభ్ పంత్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.తీవ్రంగా గాయపడి2022, డిసెంబరు 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స అనంతరం బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న 27 ఏళ్ల పంత్.. ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో టెస్టుల సందర్భంగా టీమిండియా తరఫున పునరాగమనం చేయడంతో పాటు టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులోనూ భాగమయ్యాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లకు(లక్నో సూపర్ జెయింట్స్) అమ్ముడుపోయి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడుతున్న భారత జట్టులో పంత్ భాగం. ఇదిలా ఉంటే పంత్‌తో పాటు బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెక ఆండ్రడే, అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెసెల్, స్విట్జర్లాండ్‌కు చెందిన లారా గట్- బెహ్రామీ, స్పెయిన్మోటార్ సైక్లిస్ట్ మార్క్ మార్కేజ్, ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియానే టైట్మస్ కమ్‌బ్యాక్ అవార్డు పోటీలో నిలిచారు. ఇక భారత్ నుంచి లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని పంత్ ఆక్రమించాడు. కాగా ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఈ అవార్డు వేడుక జరుగనుంది. చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్‌గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్‌మ్యాన్‌తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్‌రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్‌తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్‌లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్‌లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్‌లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్‌లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్‌గా గతేడాది అతడు 17 మ్యాచ్‌లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్‌లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్‌కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్‌దీప్ సింగ్(ఇండియా). -
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్‌తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
Rewind 2024: విండీస్‌లో ‘విన్’.. మనూ సూపర్... చెస్‌లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్‌కు, టైటిల్‌కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్‌లో అయితే పతకాల తోరణం!చెస్‌లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్‌లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్‌లో ‘విన్ ఇండియా’ కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్‌ను అందించింది.ప్రతీ మ్యాచ్‌లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్‌తో దంచికొట్టిన ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్‌ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బుమ్రా, యువ పేసర్ అర్ష్‌దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్‌లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్‌లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్‌లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్‌లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్‌గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్‌ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్‌కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్‌దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్‌లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్‌తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్‌లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపికైనా.. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్. రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చిన కారణంగా ఈ వికెట్ కీపర్‌ను ఈవెంట్ ఆసాంతం బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్లో రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంతో వరల్డ్‌కప్ గెలిచిన సభ్యుల జాబితాలో మాత్రం సంజూ తన పేరును లిఖించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సంజూ శాంసన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌కు ముందు తనకు మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందని.. మెగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని యాజమాన్యం చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్ మ్యాచ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు.ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జర్నలిస్టు విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఫైనల్‌కు ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్నపుడు రోహిత్ నన్ను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడు.జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. ‘నేను ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమైంది కదా!.. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని నీకు తెలుసు కదా! ఇది సహజమైన ప్రక్రియే!’ అని నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ.. ‘ముందుగా మ్యాచ్ గెలవాలి.ఇప్పుడు మీ దృష్టి మొత్తం మ్యాచ్ మీదే పెట్టండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని చెప్పాను. అయితే, నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘మనసులో నాకు శాపనార్థాలు పెడుతున్నావని నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వు సంతోషంగా లేవు. మీ మైండ్‌లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోంది’ అన్నాడు.అప్పుడు నేను.. ‘ఓ ఆటగాడిగా మ్యాచ్ ఆడాలని నేను ఆశపడటం సహజం. మీ నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాను. మ్యాచ్ ఆడలేకపోయాననే పశ్చాత్తాపం నాకు ఉంటుంది. మీ లాంటి గొప్ప లీడర్‌తో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అదొక్కటే నా మెదడును తొలిచివేస్తుంది’ అని అన్నాను’’ అంటూ సంజూ శాంసన్ నాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.‘‘ఏదేమైనా ఫైనల్‌కు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పడంతో నేను మానసికంగా రెడీ అయిపోయా. అయితే, టాస్కు ముందు పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు. కాస్తత నిరాశకు గురైనా.. పర్లేదు. ఇలాంటివి సహజమే అని సరిపెట్టుకున్నా. అయితే, టాస్ పడటానికి ముందు కూడా రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి.. నాకోసం పది నిమిషాలు కేటాయించడం మామూలు విషయం కాదు. అతడి స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఇలా చేసే వారు కాదేమో’’ అని సంజూ శాంసన్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్‌కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల అనంతరం వరల్డ్‌కప్‌లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.An emotional win 💯Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్‌కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చదవండి: బోణీ బాగుండాలి -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
బాబర్‌కు ఇప్పుడైనా సిగ్గు వచ్చింది: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్‌పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది.తాజాగా మరోసారి రాజీనామాఅయితే, అమెరికా- వెస్టిండీస్‌లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్‌లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చిందిబ్యాటింగ్పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్‌కప్‌లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పిందిఅప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్‌లా ఊహించుకోవడం బాబర్‌కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినాకాగా టెస్టులకు షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్‌లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
టీ20 వరల్డ్‌కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ అఫీషియల్స్ పేర్ల ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు.మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరాఅంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి షార్జా, దుబాయ్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడనుండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో (అక్టోబర్ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా జరుగనుంది.చదవండి: డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..! -
టీ20 వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.కాగా, టీ20 వరల్డ్‌కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్‌తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
టీ20 వరల్డ్‌కప్.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్‌లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్‌తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్‌తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్‌తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్‌ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్‌కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్‌గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్‌తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్‌లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్‌ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్‌గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్‌గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్‌తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
టీ20 వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్‌గా ఇది తొలి వరల్డ్‌కప్. గత టీ20 ప్రపంచకప్‌లో సూన్ లస్ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరింది. అనంతరం సూన్ లస్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్ లస్, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్సెన్ వంటి యువ ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వరల్డ్‌కప్ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగే మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16-20 వరకు జరుగనుంది.వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్ లస్, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్‌కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్‌లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో హర్మన్ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్‌లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్‌లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనుంది. వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ప్రామాణికంగా వారి ఎంపిక జరుగనుంది. ఈ జట్టుతో పాటు భారత సెలెక్టర్లు ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్‌లు, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లను కూడా ఎంపిక చేశారు. ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఉమా ఛెత్రి (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా ఎంపికయ్యారు.టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రాకాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం దుబాయ్ వేదికగానే అక్టోబర్ 6న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. -
ఆ రెండు పిచ్‌లు అసంతృప్తికరం..!
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య వెస్టిండీస్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన టరోబా పిచ్ సంతృప్తికరంగా లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. మెగా టోర్నీ ముగిసిన రెండు నెలల తర్వాత పిచ్‌లపై ఐసీసీ మంగళవారం నివేదిక విడుదల చేసింది. టరోబా పిచ్‌తో పాటు.. అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్‌లకు వేదికగా ఉన్న న్యూయార్క్ పిచ్‌లు కూడా బాగాలేవని ఐసీసీ వెల్లడించింది. తాత్కాలికంగా నిర్మించిన స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 96 పరుగులకు పరిమితమైంది. అస్థిర బౌన్స్‌తో ఆ పిచ్‌లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయని అప్పుడే వ్యాఖ్యతలు పేర్కొనగా... తాజాగా ఆ రెండింటిని ఐసీసీ ‘అసంతృప్తికరం’ జాబితాలో చేర్చింది.ఐర్లాండ్, భారత్ మ్యాచ్‌లో అయితే అనూహ్య బౌన్స్ కారణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల బారిన పడ్డారు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో టి20 ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్–ఇన్ పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్‌కు ఐసీసీ మంచి రేటింగ్ ఇచ్చింది. సాధారణంగా పిచ్‌ల ప్రమాణాలను బట్టి ఐసీసీ ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సంతృప్తికరం’, ‘అసంతృప్తికరం’, ‘అన్‌ఫిట్’ రేటింగ్స్ ఇస్తుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వగా.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గి భారత్ చాంపియన్‌గా నిలిచింది. -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌ను.. వన్డే సిరీస్‌కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్‌గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్‌ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
నా కోచింగ్ కెరీర్లో చేదు అనుభవం అదే: ద్రవిడ్
టీమిండియా విజయవంతమైన కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఘనంగా వీడ్కోలుఅయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్‌ను వెంటనే కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్‌గా కొనసాగాలని కోరింది.ఇందుకు అంగీకరించిన ద్రవిడ్‌కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్‌కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్‌లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.ఆ ఓటమే బాధించిందిఅయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్‌గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.ఓటమీ మంచికేఅన్ని మ్యాచ్‌లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్‌ను సమర్పించుకుంది.చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు! -
క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయింపు
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్‌తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. సిరాజ్, నిఖత్ జరీన్, ఈషా సింగ్ వేర్వేరు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? భారత్ తరఫున మళ్లీ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతాడా? టీ20 సిక్సర్ల కింగ్‌గా తన పేరును పదిలం చేసుకుంటూ మరిన్ని భారీ షాట్లు బాదుతాడా? అంటూ హిట్‌మ్యాన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇందుకు కారణం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్‌లో అనూహ్య విజయాలతో మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను వరల్డ్ నంబర్ వన్‌గా నిలిపాడు. అయితే, ప్రపంచకప్ గెలవాలన్న కల మాత్రం టీ20 ప్రపంచకప్-2024తో తీరింది. అంతకు ముందు.. రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.లంకతో వన్డే సిరీస్‌తో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఐసీసీ టైటిల్ గెలిచి విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు. వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడగానే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్.. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అని విలేకరులు అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా నేను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఇక ఏదైనా కీలక టోర్నీ వస్తోందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తోంది.పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదుఇప్పటికీ నేను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. ఏదో కొన్నాళ్లు సెలవు తీసుకుని మళ్లీ ఆడాలి కదా అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల.. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్‌బై చెప్పినా.. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చాలాసార్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ బరిలోకి దిగాడు.ఆ అవకాశం లేదు.. కానీకాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాట్ కోహ్లితో పాటు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. వరల్డ్‌కప్-2024కు ముందే రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసిన హిట్‌మ్యాన్.. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇక 2026లో మరోసారి టీ20 వరల్డ్‌కప్‌నకు రంగం సిద్దం కాగా.. రోహిత్ శర్మ వయసు అప్పటికి 39 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక రోహిత్ స్థానంలో టీమిండియా టీ20 నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్ శ్రీలంక తాజా పర్యటనలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.చదవండి: లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!Even we are not over your T20I retirement, @ImRo45 🥹What's your take? 💬#SonySportsNetwork #SLvIND #RohitSharma pic.twitter.com/AMt7HXLR6U— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2024 -
‘రోహిత్ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్‌కు నిద్ర పట్టలేదు’
2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. విండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్‌కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్‌లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్‌ను బార్బడోస్‌కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్‌కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్‌లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయాడు.నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్‌పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
'అతడెప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు'.. ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం
టీ20 వరల్డ్‌కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.ద్రవిడ్ కెప్టెన్‌గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్‌గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్‌కప్‌తో ముగిసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు."రాహుల్ ద్రవిడ్‌తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్‌గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్‌కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు. -
‘పాకిస్తాన్లో అలా ఉండదు.. సూపర్ హిట్ గ్యారెంటీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సూపర్ హిట్ అవుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలా కాకుండా ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యానే తాను ఈ మాట చెప్తున్నట్లు సల్మాన్ బట్ పేర్కొన్నాడు.రూ. 167 కోట్ల మేర నష్టంగతేడాది నుంచి ఐసీసీ టోర్నీల జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహించగా.. అమెరికా- వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2024కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, క్రికెట్‌కు అంతగా క్రేజ్‌లేని అమెరికాలో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఐసీసీ భారీగా నష్టపోయిందనే వార్తలు వచ్చాయి.సుమారు రూ. 167 కోట్ల మేర ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికాలో జరిగిన టీ20 టోర్నీకి.. మా దేశంలో జరిగే ఈవెంట్‌కు అసలు పోలికే ఉండదు.టీ20 వరల్డ్‌కప్ కంటే చాంపియన్స్ ట్రోఫీ పెద్ద హిట్ అవుతుంది. నిజానికి అక్కడ(అమెరికా) పిచ్‌లు సరిగా లేవు. జనావాసాలకు స్టేడియాలు చాలా దూరం. అంతేకాదు హోటల్స్ కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు అక్కడి స్థానికులకు కూడా తమ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.భద్రత విషయంలోనూ విదేశీయులు మాత్రమే అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు వీక్షించారు. అయితే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడి ప్రజలు ఆటగాళ్లను ఆదరించడంతో పాటు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కూడా! క్రికెట్ అంటే ఇక్కడి వాళ్లకు చాలా ఇష్టం.అలాగే జట్లు గంటల పాటు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఆరు నిమిషాల్లో టీమ్ హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవచ్చు. భద్రత విషయంలోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఉపఖండ దేశాల్లో ఉన్నట్లు అమెరికాలో క్రికెటర్లకు క్రేజ్ ఉండదు’’ అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వెళ్లే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు కోసం ఐసీసీ.. బీసీసీఐ కోరినట్లుగానే పాక్ వెలుపల వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
‘రోహిత్, కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటన తమను ఆశ్చర్యపరిచిందని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. వాళ్లు తమ నిర్ణయం గురించి ఒక్కసారి కూడా డ్రెసింగ్‌రూంలో చర్చించనేలేదని తెలిపాడు.ఏదేమైనా దశాబ్దకాలం పాటు జట్టుతో ఉన్న ఈ స్టార్ ప్లేయర్లు సరైన సమయంలో సరైన ప్రకటన చేశారని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్ సేన అద్భుత ఆట తీరుతో టైటిల్ సాధించింది. పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి పారస్ మాంబ్రే తాజాగా గుర్తుచేసుకున్నాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో ముచ్చటిస్తూ..‘‘అభిమానులే కాదు మేము కూడా వాళ్లు ఇలాంటి ప్రకటన చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇలాంటి విషయాల గురించి జట్టులో ముందుగానే చర్చ రావడం సహజం. కానీ వీళ్లు మాత్రం ఎక్కడా విషయం బయటకు రానివ్వలేదు.బహుశా రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడి ఉంటారేమో గానీ.. మాకు మాత్రం తెలియదు. అందుకే ఫ్యాన్స్‌తో పాటు మేము కూడా ఆశ్చర్యపోయాం. అయితే, వాళ్ల కోణం నుంచి చూస్తే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని అనిపించింది.పదేళ్లకు పైగా జట్టుతో ఉన్నారు. 2011లో విరాట్ వరల్డ్‌కప్ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్ టైటిల్ సాధించలేదు. ఇందుకోసం కోహ్లి ఎంతగానో తపించిపోయాడు.ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు నెరవేరింది. అతడి సుదీర్ఘ ప్రయాణం ఒకరకంగా పరిపూర్ణమైంది. ఇక ఈ ముగ్గురి ఆటగాళ్ల వయసు పరంగా చూసినా ఇది సరైన నిర్ణయమే. వారికి అపార అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ.. హై నోట్లో కెరీర్ ముగించే అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు కదా!’’ అని పారస్ మాంబ్రే పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉండగా.. అతడి జట్టులో బ్యాటింగ్ కోచ్‌గా విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి.దిలీప్ సేవలు అందించారు. ఈ టోర్నీ తర్వాత వీరందరి పదవీ కాలం ముగియగా.. కొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో దిలీప్ రీఎంట్రీ(తాత్కాలికం) ఇచ్చాడు. -
'T20 వరల్డ్‌కప్‌లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్‌ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తన ఫేవరేట్ మూమెంట్‌ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్‌ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్‌నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్‌గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్‌గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్‌కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
ICC: ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?
టీ20 ప్రపంచకప్-2024 పొట్టి క్రికెట్ ప్రేమికులకు భిన్నమైన అనుభవాన్ని అందించింది. ఈ ఐసీసీ టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.ఫలితంగా పరుగుల ప్రవాహానికి బదులు వికెట్ల జాతర జరిగింది. న్యూయార్క్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నసావూ కౌంటీ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్ వల్ల మ్యాచ్‌లన్నీ.. టీ20 ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా జరిగాయనే చెప్పవచ్చు.ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం. అయితే, మరో వేదిక వెస్టిండీస్‌లో మాత్రం మెరుగైన స్కోర్లు నమోదయ్యాయి.ఇక ఐసీసీ ఈవెంట్లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ కి సంబంధించిన సంచలన వార్త తెరమీదకు వచ్చింది.ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి నష్టాన్ని మిగిల్చిందని దాని సారాంశం. క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడం వల్ల దాదాపు రూ. 167 కోట్ల(భారత కరెన్సీలో) నష్టం వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.ఈ విషయం గురించి ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చకు రానుందని తెలిపింది. కొలంబో వేదికగా శుక్రవారం ఈ మీటింగ్ జరుగనుంది.అయితే, వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చింననున్న తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఈ పాయింట్ లేకపోయినా.. పోస్ట్ ఈవెంట్ రిపోర్టుకు సంబంధించిన నివేదిక మాత్రం తయారు చేసినట్లు పీటీఐ పేర్కొంది.కొత్త చైర్మన్ ఎవరు?ఇక ఈ ఈవెంట్లో ప్రధానంగా ఐసీసీ కొత్త చైర్మన్ నియామకం గురించి కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని పీటీఐ వెల్లడించింది. గ్రెగ్ బార్క్లే స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా నియామకం, దాని పర్యావసనాల గురించి చర్చ జరుగనున్నట్లు పేర్కొంది.అదే విధంగా.. ఐసీసీ చైర్మన్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి అత్యధికంగా మూడు దఫాలు రెండేళ్ల చొప్పున కొనసాగవచ్చు. అయితే, తాజాగా దీనిని రెండు దఫాలు.. మూడేళ్ల చొప్పున కొనసాగేట్లు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.చదవండి: అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే జట్టుకు దూరం! -
హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. హార్దిక్‌ను ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. A HERO'S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024హార్దిక్ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్‌దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.Hardik Pandya and Krunal Pandya dancing on Chak De India. 🇮🇳 pic.twitter.com/Q2S8OMuCSv— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024కాగా, హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం హార్దిక్ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.ఇదిలా ఉంటే.. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. -
పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.సంస్కరణలకు శ్రీకారంఅదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో లాహోర్‌లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.ఆ రెండిటి ఆధారంగాక్రికెటర్ల ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్‌లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.కోచ్‌తో అతడి గొడవకాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వెంటనే అతడు కోచ్‌కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్‌గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ
అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్-2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్ కీపర్.. కొత్త కోచ్ గౌతం గంభీర్, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట ఆడడు.కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్‌గా చూస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌ను చేయాలి.ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2024లో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్‌కప్ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ కల టీ20 వరల్డ్‌కప్-2024తో నెరవేరింది. ఈ మెగా టోర్నీకి ముందు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. ట్రోఫీని ముద్దాడగానే రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంటర్నేషనల్ టీ20లకు వీడ్కోలు పలికాడు. అయితే, వన్డే, టెస్టుల్లో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీనియర్ల పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించనున్నాడన్న సంకేతాల నేపథ్యంలో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి వంటి వాళ్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇటీవల డల్లాస్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన రోహిత్ శర్మకు లాంగర్ ఫార్మాట్ల రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పాను. మరికొంత కాలం నేను క్రికెట్ ఆడుతాను’’ అని రోహిత్ పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20లలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా రోహిత్ శర్మ పేరుగాంచాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో 159 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. 4231 పరుగులు సాధించాడు.అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించాడు. అదే విధంగా అత్యధిక సిక్సర్లు (205) కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక రోహిత్ శర్మ ఖాతాలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉండటం విశేషం.ధోని సారథ్యంలో 2007 నాటి మొట్టమొదటి పొట్టి క్రికెట్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈ ఏడాది కెప్టెన్ హోదాలో టైటిల్ సాధించాడు. ఇక వన్డేల్లోనూ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డే ఉంది.భారత్ తరఫున 262 వన్డే మ్యాచ్‌లలో 10709 రన్స్ చేసిన హిట్‌మ్యాన్ ఖాతాలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.మరోవైపు టెస్టుల్లో మాత్రం కేవలం 59 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 4138 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి.ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేశాడు.ఈ ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత రోహిత్ ఆటగాడిగా కొనసాగుతాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు: గంగూలీ
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ 11 ఏళ్ల సుదీర్ఘణ అనంతరం ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. భారత జట్టు చివరిగా 2013లో ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా రోహిత్ నేతృత్వంలో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది.టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. భారత్ ట్రోఫీ గెలిచి రెండు వారాలు గడిచినా విజయోత్సవ సంబురాలు ఇంకా జరుగతూనే ఉన్నాయి. తాజాగా భారత విజయానికి సంబంధించి కోల్‌కతాలో వేడుక జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజయర్యాడు.ఈ సందర్భంగా గంగూలీ.. టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. దాదా రోహిత్ గురించి మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంతో నన్నెవరూ నిందించడం లేదు. అయితే రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని మాత్రం అందరూ మరిచిపోయారని సరదాగా అన్నాడు. -
కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్ దూరం
పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పి ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందే పాక్ క్రికెట్ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ సమయంలో బాబర్‌తో పాటు కోచ్‌లతోనూ షాహిన్ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్‌కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్ యూసఫ్‌తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు షాహిన్ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.కాగా పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. -
‘మిస్టరీ గర్ల్’తో హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం.. కెప్టెన్సీకి రాజీనామా
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ స్పష్టం చేశాడు. హసరంగ రాజీనామా విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది.హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతను లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. శ్రీలంక టీ20 జట్టు కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు.. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం భారత్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుండగా.. శ్రీలంక ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. -
హెడ్ కోచ్‌గా గంభీర్ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్ కంటే రెట్టింపు?!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.రెండు పడవల మీద ప్రయాణం చేయలేననిబీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్‌గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్‌కే అంకితమయ్యాడు.ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.టీ20 ప్రపంచకప్-2024 అందించికాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్‌గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.ఇక హెడ్ కోచ్‌గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు?కాగా కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్‌గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.జీతంతో పాటు అన్ని సదుపాయాలువార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్‌కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.అదే నా లక్ష్యం: గంభీర్‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
వాళ్లిద్దరిపై వేటు వేసిన పీసీబీ.. అబ్దుల్ రజాక్‌కు డబుల్ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్‌ను కూడా తప్పించినట్లు సమాచారం.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కనీసం సూపర్-8 కూడా చేరకుండానేపసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రజాక్‌కు డబుల్ షాక్అంతేకాదు రజాక్‌కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్‌పై విమర్శలు వచ్చాయి.అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్‌గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లూ, నేనూ సమానమే!
ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్‌మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్‌లో రోహిత్ సేన వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.సహాయక కోచ్‌ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్‌గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్‌ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్‌తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
నా వర్క్ వైఫ్: ద్రవిడ్‌ను ఉద్దేశించి రోహిత్ భావోద్వేగ పోస్ట్.. వైరల్
‘‘ప్రియమైన రాహుల్ భాయ్.. నా మనసులోని భావాలను వెల్లడించేందుకు సరైన పదాల కోసం వెతుక్కొంటున్నాను. అయితే, ఈ నా ప్రయత్నం వృథా అవుతుందేమో!ఏదేమైనా చెప్పాలనుకున్నది చెప్పి తీరుతా..! కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా.అయితే, వారెవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. నిన్న దగ్గరగా చూడటమే కాదు.. నీతో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.క్రికెట్లో నువ్వొక శిఖరానివి. కఠిన శ్రమకు ఓర్చే ఆటగాడివి. అందుకు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు.అయితే, మా దగ్గరికి వచ్చే సమయంలో ఆటగాడిగా నీ ఘనతలన్నీ పక్కన పెట్టి.. కేవలం కోచ్‌గా మాత్రమే వ్యవహరిస్తావు.నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు.ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. పనిలో ఉన్నపుడు తనను కూడా పట్టించుకోకుండా నేను నీతోనే ఉంటానని నా భార్య ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది.రాహుల్ భాయ్ ‘నీ వర్క్ వైఫ్’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుంది. ఇలా అనిపించుకోవడం కూడా నా అదృష్టమే అని భావిస్తా. నిన్ను చాలా మిస్సవుతాను. అయితే, కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను.రాహుల్ భాయ్ నా నమ్మకం, నా కోచ్, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?! సెల్యూట్’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొంటున్న రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. రాహుల్ భాయ్‌తో తన అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ కోచ్ పట్ల ప్రేమను చాటుకున్నాడు.ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీతో ద్రవిడ్, తాను, తన కుటుంబం దిగిన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టు సారథిగా రోహిత్ పగ్గాలు చేపట్టగా.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు.కల నెరవేరిందివీరిద్దరి హయాంలో టీమిండియా ఆసియా వన్డే కప్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది. అయితే, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో ఈ దిగ్గజాల కల నెరవేరింది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో ద్రవిడ్ మార్గదర్శనంలోని రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. సౌతాఫ్రికాను ఓడించి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఇక ఈవెంట్ తర్వాత తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఇప్పటికే ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.మీరిద్దరూ అరుదైన వజ్రాలుఇందుకు స్పందిస్తూ.. ‘‘మీరిద్దరూ అరుదైన వజ్రాలు’’ అంటూ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. కాగా వరల్డ్‌కప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ముగిసే వరకూ కెప్టెన్‌గా తనే కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్‌తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఇంటర్నేషనల్ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
BCCI: గంభీర్ మనసులో ఏముంది?.. ఆలస్యానికి కారణం ఇదే
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్‌కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్?అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్‌గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.కాగా రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.అదే విధంగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.చదవండి: BCCI: రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం! -
మిల్లర్ క్యాచ్ కాదు.. నా లైఫ్‌లో ఇంపార్టెంట్ క్యాచ్ అదే: సూర్యకుమార్
టీ20 వరల్డ్‌కప్-2024లో విజేతగా భారత్ నిలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ది కీలక పాత్ర. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్.. 13 ఏళ్ల టీమిండియా వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాడు. సూర్య తన సంచలన క్యాచ్‌తో విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. భారత క్రికెట్ చరిత్రలో సూర్య పట్టిన క్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు 10 రోజులు పైగా అవుతున్నప్పటికి సూర్యపై ఇంకా ప్రశంసల వర్షం కురిస్తోంది. అయితే సూర్య తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన క్యాచ్ ఎప్పుడో అందుకున్నాడంట. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడమే ముఖ్యమైన క్యాచ్ అంటూ సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టిలు ఇటీవల తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్ద కేక్‌ను తీసుకువచ్చి కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సూర్యకుమార్ ఇనాస్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "వరల్డ్‌కప్‌లో క్యాచ్ అందుకుని నిన్నటకి 8 రోజులైంది. కానీ నిజానికి నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన 8 ఏళ్ల క్రితమే అందుకున్నానంటూ" ఆ ఫోటోకు సూర్య క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు మీరిద్దరూ కలకలం ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.ఇక వరల్డ్‌కప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 135.37 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్ విజయనంతరం సూర్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి శ్రీలంక పర్యటకు సూర్యకుమార్ అందుబాటులోకి రానున్నాడు. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
T20 WC: ‘క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?’
మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు పెద్ద పీట వేసే షిండే సర్కారు.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు.క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని.. అందరినీ సమానంగా చూడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చిరాగ్ శెట్టి విజ్ఞప్తి చేశాడు. కాగా భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో జయభేరి మోగించి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి రాగానే ఘన స్వాగతం లభించింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే మైదానంలో విజయోత్సవాలు నిర్వహించిన బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానాను అందించింది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో నలుగురు ముంబై ఆటగాళ్లు ఉండటం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీ20 స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివం దూబేలు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యులు.వరల్డ్‌కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానాఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే ఈ నలుగురిని తన నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. శాలువాలు కప్పి.. వినాయకుడి ప్రతిమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.అదే విధంగా.. వరల్డ్‌కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానా కూడా ప్రకటించారు మహా సీఎం. ఈ నేపథ్యంలో చిరాగ్ శెట్టి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?‘‘బ్యాడ్మింటన్‌లో థామస్ కప్.. క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన దానికంటే తక్కువేం కాదు. థామస్ కప్ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి టైటిల్ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని.అంతేకాదు కప్ గెలిచిన జట్టులో ఉన్న ఏకైక మహారాష్ట్ర క్రీడాకారుడిని. వరల్డ్‌కప్ గెలిచిన క్రికెట్ స్టార్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సంతోషం.కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు.అంతెందుకు బ్యాడ్మింటన్ ప్లేయర్లందరం కూడా టీవీలో వరల్డ్‌కప్ ఫైనల్ చూశాం. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవడం పట్ల గర్వపడుతున్నాం.అయితే, గత రెండేళ్ల కాలంలో నేను కూడా గుర్తుంచుకోదగ్గ.. చిరస్మరణీయ విజయాలు సాధించాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కనీసం అభినందించలేదు.ఎలాంటి క్యాష్ రివార్డు కూడా ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్ జట్టు కనీసం సెమీస్ చేరిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము ఏకంగా టైటిల్ గెలిచాం. అయినా తగిన గుర్తింపు కరువైంది’’ అని చిరాగ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ బ్యాడ్మింటన్ స్టార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.అంతేకాదు ప్రఖ్యాత థామస్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. సాత్విక్‌సాయిరాజ్‌తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచాడు. అదే విధంగా.. మలేషియన్ సూపర్ 750, ఇండియా సూపర్ 750 ఫైనల్స్ చేరాడు. తదుపరి ఈ జోడీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.చదవండి: ‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’# Live📡| 05-07-2024 📍वर्षा निवासस्थान, मुंबई 📹 जगज्जेत्या भारतीय क्रिकेट संघाचे वर्षा निवासस्थानी स्वागत https://t.co/TSiJXnHFzw— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 5, 2024 -
IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భారత తుది జట్టు ఇదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే. వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లిలకు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలతో పాటు కనక వర్షం కూడా కురిసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తం పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కనుందనే విషయం గురించి ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు!ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో భాగమైన ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల మేర ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లకు కూడా ఈ మేర భారీ మొత్తం దక్కనుంది.వారికి 2.5 కోట్లు? అదే విధంగా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఇక కోచింగ్ సిబ్బందిలో ప్రధానమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు రూ. 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది.మిగిలిన వాళ్లలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు కమలేశ్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్.. ఇద్దరు మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడే.. అదే విధంగా కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయిలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది.చీఫ్ సెలక్టర్‌కు ఎంతంటే?వీరి సంగతి ఇలా ఉంటే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన 42 మంది సభ్యులకు వారి బాధ్యతలకు అనుగుణంగా రివార్డులోని కొంత మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.సౌతాఫ్రికాను ఓడించికాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.ఈ ఐసీసీ ఈవెంట్లో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. ఫైనల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.ట్రావెలింగ్ రిజర్వ్స్: రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య -
ఏడ్చేసిన నీతా అంబానీ.. రోహిత్ ముంబైని వీడటం పక్కా! వీడియో
ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్‌గా రోహిత్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్‌లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.ఈ సందర్భంగా హార్దిక్‌ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్‌కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్‌కప్ టైటిల్ చేరింది.AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024 -
ఎందుకలా నెట్టేస్తున్నావు?.. రోహిత్‌పై విమర్శలు
ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన క్షణాలను తలచుకుంటూ హిట్‌మ్యాన్ కుటుంబం సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఇలాంటి సంతోషకర సమయంలో కొద్ది మంది నెటిజన్లు మాత్రం రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదంటూ ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మందేమో ఈ విషయంలో విరాట్ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ అతడినీ విమర్శిస్తున్నారు.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.తద్వారా భారత్ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్‌కప్ ట్రోఫీ చేరింది. టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్ సేన బస్ పెరేడ్లో పాల్గొంది.అదే విధంగా.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, అందుకు ప్రతిగా రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.‘‘ఇక చాల్లే.. అందరూ చూస్తున్నారమ్మా’’ అన్నట్లుగా బిడియం ప్రదర్శించిన రోహిత్.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈ క్రమంలో కొంతమంది రోహిత్‌ను టార్గెట్ చేశారు. ‘‘భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? ఆమె అంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇలా చేయడం అస్సలు బాలేదు’’ అని విమర్శిస్తున్నారు.ఇక మరికొంత మందేమో.. ‘‘రోహిత్ కనీసం తన తల్లిదండ్రులనైనా ఇక్కడిదాకా తీసుకువచ్చాడు. కోహ్లి అయితే భార్యను తప్ప తల్లిని ఏనాడూ ఎక్కడికీ తీసుకురాడు’’ అని ట్రోల్ చేస్తున్నారు.అప్పుడే తన నిర్ణయం చెప్పాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సాధించిన విజయం పట్ల అతడి తల్లి పూర్ణిమ శర్మ స్పందించారు. ‘‘ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లే కంటే ముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించాడు.గెలిచినా.. ఓడినా తన ఆలోచనలో మార్పు ఉండదని చెప్పాడు. అప్పుడు నేను గెలవడానికి ప్రయత్నించు అని మాత్రమే చెప్పగలిగాను. నిజానికి ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అంతగా బాలేదు. అయితే, డాక్టర్ అప్పాయింట్మెంట్ మిస్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారు.Such a sweet moment between Rohit Sharma and his mom 🥹❤️ pic.twitter.com/u8hXhr3LVL— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024 -
న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్ రిప్లై ఇదే..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. లీగ్ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్‌మెషీన్’.. సెమీస్ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.అయితే, అసలైన మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.భారంగా తయారయ్యానని కుమిలిపోయాజట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్ భాయ్‌కు చెప్పాను.అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్‌లోకి వస్తావు’ అని భాయ్ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడే సమయంలో రోహిత్‌తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్‌గా లేనని చెప్పాను.పట్టుదలగా నిలబడ్డానుఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వరల్డ్‌కప్-2024లో ఫైనల్‌కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs Zim: వికెట్ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే! -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్.. అభిమానుల ఘన స్వాగతం
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సొంత గడ్డపై అడుగు పెట్టాడు. ఢిల్లీలో టీమిండియా విక్టరీ బస్ పరేడ్ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌కు అభిమానలు ఘనస్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ అతడికి జేజేలు పలికారు. సిరాజ్ మియాతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అనంతరం మహ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహిదీపట్నం నుంచి ఈద్గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీగా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా సిరాజ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా ఆపూర్వ స్వాగతం పలికింది. హైదరాబాద్.. వరల్డ్‌కప్ హీరో మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలకుతుందని ఎస్ఆర్హెచ్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్ నిలవడంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు. అమెరికా వేదికగా జరిగిన లీగ్ స్టేజి మ్యాచ్‌ల్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రాకతో మిగిలిన మ్యాచ్‌లకు సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. #WATCH | Cricket fans welcome Mohammed Siraj on his return to Hyderabad after winning the T20I Cricket World Cup pic.twitter.com/aEzskY51vG— ANI (@ANI) July 5, 2024 -
జగజ్జేతలకు జాక్ పాట్.. రూ.11 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన మహారాష్ట్ర సీఎం
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు మరో జాక్ పాట్ తగిలింది. విశ్వవిజేత టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.భారత విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు ముంబై చెందిన క్రికెటర్లన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ నలుగురిని శుక్రవారం విధాన్ భవన్ (స్టేట్ లెజిస్లేచర్ కాంప్లెక్స్) సెంట్రల్ హాల్లో సీఎం ఏక్నాథ్ షిండే సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా పాల్గోనున్నారు. ఈ సందర్భంగానే నగదు బహుమతిని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అద్బుత క్యాచ్‌ను అందుకున్న సూర్యకుమార్ యాదవ్‌ను షిండే ప్రత్యేకంగా అభినందించారు. కాగా జగజ్జేత నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ సైతం రూ. 120 కోట్ల భారీ ప్రైజ్‌మనీ అందించింది. -
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి.. సచిన్, ధోని లానే: రైనా
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ఘనంగా విడ్కోలు పలికారు. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి వారు తమ టీ20 ప్రయణాన్ని ముగించారు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబర్ 45."బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనకుంటున్నాను. వరల్డ్‌కప్‌ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి. కాబట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను. ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి. ఇప్పటికే జెర్సీ నెం 10(సచిన్), నెం 7(ధోని)లకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్, రోహిత్ జెర్సీ నెంలను ఎవరికీ కేటాయించకూడదు. ఆ జెర్సీ నంబర్లను చూస్తే ప్రతీ ఒక్కరికి స్పూర్తి కలగాలి. నెం.18, నెం. 45ల జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించారు. ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
2007 కంటే ఈ వరల్డ్‌కప్ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్ టీమిండియాకు తమ సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. ముంబైలో వేలాది మంది అభిమానుల నీరాజనాల మధ్య భారత ఆటగాళ్ల బస్ విక్టరీ పరేడ్ అంగరంగవైభంగా జరిగింది. ఆ తర్వాత వాఖండే స్టేడియంలో విశ్వవిజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది.ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలిచ్చారు. టీమిండియా స్టేడియంలో అడుగుపెట్టగానే జయహో భారత్ అంటూ జేజేలు కొట్టారు. భారత ఆటగాళ్లు సైతం వారి అభిమానానికి పిధా అయిపోయారు.దీంతో భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 2007 వరల్డ్‌కప్ విజయం కంటే ప్రస్తుత ప్రపంచకప్ గెలుపు తనకెంతో ప్రత్యేకమైనదని రోహిత్ తెలిపాడు."2007 వరల్డ్‌కప్ విజయాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే అది నా ఫస్ట్ వరల్డ్‌కప్ విజయం. అప్పుడు కూడా ఇదే ముంబైలో విక్టరీ పరేడ్ జరిగింది. అయితే అది మధ్యాహ్నం.. ఇప్పుడు ఇది సాయంత్రం. అయితే ఈసారి వరల్డ్‌కప్ విజయం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే విజేతగా నిలిచిన జట్టుకు నేను సారథిగా ఉన్నాను. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. ఈ విజయం నా ఒక్కడికే కాదు ఎవత్ దేశానికి గర్వకారణం. ఈ ట్రోఫీ కోసమే గత 13 ఏళ్లగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కలనెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని" బీసీసీఐతో రోహిత్ పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్పై స్పందించిన జస్ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి వరల్డ్‌కప్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్ విశ్వవిజేతగా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రా.. టీమిండియాకు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. అయితే టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు విడ్కోలు పలికేశారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడా ఏమో అని అభిమానులు తెగ టెన్ష పడుతున్నారు. తాజాగా బుమ్రా వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలోతన రిటైర్మెంట్ ప్లాన్‌పై స్పందించాడు. ఇప్పటిల్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని బుమ్రా తెలిపాడు. "నా రిటైర్మెంట్కు ఇంకా చాలా సమయం ఉంది. నేను ఇప్పుడే నా కెరీర్‌ను ప్రారంభించాను. ఈ మెగా టోర్నీ విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడం చాలా గర్వంగా ఉంది. నా ఫీలింగ్స్‌ను మాటల్లో చేప్పలేకపోతున్నాను. ఈ వాంఖడే మైదానం నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికి వచ్చా. ముంబై వీధులన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇటువంటి ఘన స్వాగతం నేను ఎప్పుడూ చూడలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఇప్పటికి నేను ఓ యువ క్రికెటర్‌గానే భావిస్తున్నాను. మేము ఈ వరల్డ్‌కప్‌లో సీనియర్ ఆటగాళ్లు, కుర్రాళ్లతో కలిసి భారత జట్టు బరిలోకి దిగింది. ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ఎఫెక్ట్ పెట్టి విజయం సాధించాము. రోహిత్, విరాట్ మన లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నారు. దేశానికి కీర్తి తీసుకొచ్చేందుకు అన్ని విధాల మేము ప్రయత్నిస్తాం. నా కెరీర్లో వరల్డ్ కప్‌ను ఎప్పుడూ గెలవలేదు. ఈ విజమం మాకు మరింత స్పూర్తినిచ్చిందని" బీసీసీఐతో బుమ్రా పేర్కొన్నాడు. -
నేడు (జులై 5) హైదరాబాద్‌కు మొహమ్మద్ సిరాజ్.. భారీ రోడ్ షోతో ఘన స్వాగతం
టీ20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న లోకల్ బాయ్ మొహ్మమద్ సిరాజ్‌కు ఘన స్వాగతం లభించనుంది. సిరాజ్‌ను భారీ ఊరేగింపుతో ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్ పెరేడ్ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ విజయోత్సవ ర్యాలీలో భాగ్యనగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విక్టరీ ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని సిరాజ్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. సిరాజ్ విక్టరీ ర్యాలీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగనుంది.కాగా, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.17 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌తో తిరిగి రావడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
లండన్‌కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లి
ముంబైలో జరిగిన వరల్డ్‌కప్ విజయోత్సవాల అనంతరం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ వెళ్లిపోయాడు. విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు విరుష్క, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ఉంటుంది. వీరిని కలిసేందుకు విరాట్ లండన్‌కు పయనమయ్యాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం విరాట్ నేరుగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. విరాట్ విమానాశ్రమంలోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.విరాట్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, ఇప్పట్లో అతను టీమిండియాకు ఆడే అవకాశం లేదు. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఉన్నప్పటికీ విరాట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికి విరాట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదీ లేదంటే విరాట్ అందుబాటులోకి వచ్చేది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయానికే. ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్ బంప్స్ రావాల్సిందే..!
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. GOOSEBUMPS GUARANTEED...!!!! 😍- Team India singing 'Vande Maataram' with Wankhede crowd. 🇮🇳pic.twitter.com/SfrFgWr4x9— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024నిన్న (జులై 4) జరిగిన వరల్డ్‌కప్ విన్నింగ్ పెరేడ్లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్‌లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.THE DANCE OF ROHIT SHARMA, VIRAT KOHLI & PLAYERS AT WANKHEDE.🥹🏆- One of the Most beautiful Moments in Indian cricket history. ❤️ pic.twitter.com/IjBujoejgb— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
చెట్టెక్కిన అభిమానం.. జడుసుకున్న టీమిండియా క్రికెటర్లు
టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. THE DROW SHOWING INDIAN TEAM VICTORY PARADE AT MARINE DRIVE. 🇮🇳🤯- The Craze and Love for Team India..!!! ❤️pic.twitter.com/krkHJHW0ST— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధుల టీమిండియా క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. అయితే ఈ విన్నింగ్ పరేడ్‌లో ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. ఓ అభిమాని భారత క్రికెటర్లను దగ్గరి నుండి చూసేందుకు చెట్టెక్కాడు. సదరు అభిమాని ఎంచక్కా చెట్టు కొమ్మపై పడుకుని సెల్‌ఫోన్‌తో భారత క్రికెటర్ల ఫోటోలు తీసుకున్నాడు. అభిమానిని సడెన్‌గా చూసిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా జడుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని చేసిన రిస్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్కీ ఫెల్లో.. టీ20 ప్రపంచకప్‌ను, వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలను దగ్గరి నుండి చూశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.टीम इंडिया को करीब से देखने के लिए पेड़ पर चढ़ गया शख़्स, देखिए वीडियो#Shankhnaad #T20WorldCup #IndianCricketTeam #VictoryParade | @chitraaum pic.twitter.com/9zENHdKjV9— AajTak (@aajtak) July 4, 2024కాగా, భారత క్రికెటర్ల వరల్డ్‌కప్ విన్నింగ్ పరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించింది. ఇదిలా ఉంటే, జూన్ 29 జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.Captain Rohit Sharma talking about on support to Team India in Mumbai.❤️- THE PROUD CAPTAIN, ROHIT. 🐐🏆pic.twitter.com/b8m6D4RJoi— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024 -
జగజ్జేతలకు జేజేలు.. వాంఖడేలో టీమిండియా జట్టుకు సన్మానం (ఫొటోలు)
-
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైరల్
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బోడస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లే అంతవరకు జేజేలు కొడుతూ అభినందించారు. ఇప్పుడు ముంబై వంతు. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభమైంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్ జరగనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్‌కు సన్మానం జరగనుంది.హార్దిక్‌కు సారీ చెప్పిన అభిమానిఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. భారత ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంఖడే స్టేడియంకు తరలివచ్చారు. హార్దిక్ హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని లైవ్‌లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది."మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్లో నేను కూడా అతడిని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. అతడు టీ20 వరల్డ్‌కప్‌లో హీరోగా మారాడు. అతడు వేసిన చివరి ఒక అద్భుతం. అతడికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని" సదరు అభిమాని ఇండియా టూడేతో పేర్కొంది. Hardik Pandya is Zlatan Ibrahimovic of Indian Cricket 🏏 who has turned his "haters into fans" 👏🏻The Best All Rounder of ICC T20 World Cup 2024 - @hardikpandya7 💥#IndianCricketTeampic.twitter.com/cNcK2zPiwq— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024 -
విశ్వవిజేతలకు ఘన సత్కారం.. 125 కోట్ల ప్రైజ్ మనీ అందజేత
Team India Victory Parade Live Updates: విశ్వవిజేతలకు ఘన సత్కారం.. 125 కోట్ల ప్రైజ్ మనీవాంఖడేలో టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. వేలాది మంది అభిమానుల మధ్య భారత ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించింది. భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా అందజేశారు. ఇక భారత ఆటగాళ్లు ట్రోఫీని పట్టుకుని మైదానం మొత్తం తిరిగారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా టీ20లకు విడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు."2011 వరల్డ్‌కప్ విజయం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నా సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తోంది. ఈ 15 ఏళ్లలో రోహిత్ ఇంతలా ఎమోషన్ అవ్వడం ఇదే తొలిసారి. ఇక బుమ్రా ఒక అద్బుతం. టోర్నీలో విజయం సాధించడంలో అతడిదే కీలక పాత్ర. అటువంటి ఆటగాడు భారత తరపున ఆడటం మనందరి అదృష్టం"- భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి"మమ్మల్ని స్వాగతించడానికి అభిమానులు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మా లాగే టైటిల్ కోసం ఎన్నో ఏళ్ల ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అన్పించింది. భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు"- భారత కెప్టెన్ రోహిత్ శర్మసందడి చేస్తున్న భారత ప్లేయర్లు..వాంఖడేలో భారత ఆటగాళ్లు డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నారు. మరి కాసేపట్లో విశ్వవిజేలతకు సన్మానం జరగనుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Virat, Rohit, Hardik and others are dancing their hearts out 🔥🔥🔥🔥#T20WorldCup pic.twitter.com/UAWjL89Wxa— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024 ముగిసిన విక్టరీ పరేడ్.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ ఘనంగా ముగిసింది. భారత జట్టు వాంఖడే స్టేడియంకు చేరుకుంది. భారత ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. జేజేలు కొడుతున్న ఫ్యాన్స్..జనసముద్రం మధ్య టీమిండియా విక్టరీ పరేడ్ కొనసాగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి వరల్డ్‌కప్‌ను పట్టుకుని ఫ్యాన్స్‌కు చూపించారు. దీంతో అభిమానులు రోహిత్ , విరాట్ అంటూ జేజేలు కొడుతున్నారు.కొనసాగుతున్న టీమిండియా విజయోత్సవ యాత్రటీమిండియా విజయోత్సవ యాత్ర కొనసాగుతోంది. అభిమానుల నీరాజనాల మధ్య బస్ ముందుకు కొనసాగుతోంది. ఈ పరేడ్ వాంఖడే స్టేడియం వరకు జరగనుంది.ప్రారంభమైన టీమిండియా విక్టరీ పరేడ్ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్ ప్రారంభమైంది. నారిమన్ పాయింట్ నుంచి భారత జట్టు విజయోత్సవ యాత్ర ప్రారంభమైంది. ఓపెన్ టాప్ బస్‌లో భారత ఆటగాళ్లు ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తున్నారు.విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యంటీమిండియా విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యం కానుంది. ముంబైలో భారీ వర్షం కురుస్తుండండతో ఆటగాళ్లు ఇంకా హోటల్ గదులకే పరిమితమయ్యారు. అదేవిధంగా భారత ఆటగాళ్ల ఎక్కాల్సిన పరేడ్ బాస్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. పోలీస్‌లు తీవ్రంగా శ్రమించి నారిమన్ పాయింట్ వద్దకు బస్స్‌ను తీసుకువచ్చారు.టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్ భారత జట్టుకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబైలో అడుగుపెట్టిన భారత జట్టు హోటల్‌కు చేరుకుంది. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్ పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని నెలలగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు పాండ్యా గానీ, నటాషా గానీ ఈ విషయంపై స్పందించలేదు. అయితే తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్టు ఈ విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఉంది."జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండి నిరుత్సాహానికి లోనవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీరు భయపడవద్దు. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా ఉంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు" అని నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. సగర్వంగా భారత గడ్డపై అడుగు పెట్టింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ సత్తాచాటిన హార్దిక్ భారత్‌కు రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను అందించాడు. విజయనంతరం పాండ్యా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గత కొన్ని కొన్ని నెలల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాని పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. భారత విజయం తర్వాత కోహ్లి, రోహిత్ సతీమణిలు తమ భర్తలపై ప్రశంసల వర్షం కురిపించగా.. పాండ్య ప్రదర్శనపై మాత్రం నటాషా ఇప్పటివరకు కనీసం ఒక్క పోస్టు కూడా చేయలేదు. -
థాంక్యూ పీఎం సార్.. చాలా సంతోషంగా ఉంది: విరాట్ కోహ్లి
టీ20 వరల్డ్‌కప్‌ను సాధించి 11 ఏళ్ల నిరీక్షణకు తెరిదించిన భారత జట్టు ఎట్టకేలకు సొంత గడ్డపై అడుగుపెట్టింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రోహిత్ సేనకు ఆపూర్వ స్వాగతం లభించింది.ఎయిర్ పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు టీమిండియాకు జేజేలు పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని భారత జట్టు తన నివాసంలో కలిసింది. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి అప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో భారత జట్టు ఢిల్లీ నుంచి ముంబైకు పయనమైంది.ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. విరాట్ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి కృతజ్జతలు తెలిపాడు."ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మమ్మల్ని మీ నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ" కోహ్లి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం సోషల్ మీడియా మోదీకి ధన్యవాదాలు తెలిపాడు.చదవండి: T20 WC 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై Humbled to meet honorable PM Shri Narendra Modi Sir along with the entire team. Thank you Sir for your encouraging words, means a lot to all of us. 🇮🇳 pic.twitter.com/I6lq3E1nS1— Yuzvendra Chahal (@yuzi_chahal) July 4, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది. -
వాంఖడేలో భారత జట్టుకు సన్మానం.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.వర్షం అంతరాయం..ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
రోహిత్ సేనకు మోదీ విందు
-
T20 ఛాంపియన్స్ ను అభినందించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
T20 World Cup 2024: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు
విశ్వ విజేత టీమిండియా ఇవాళ (జులై 4) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు ఆల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది ముచ్చటించారు. TEAM INDIA MEETS PM NARENDRA MODI. 🇮🇳pic.twitter.com/tCotFhi4QP— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.కాగా, ఇవాళ ఉదయమే భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. హరికేన్ (గాలివాన) కారణంగా భారత బృందం మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది. -
రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ఇవాళ (జులై 3) ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు, హర్షద్వానాలతో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. జయహో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ వరల్డ్‌కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.The Happiness and dance of Captain Rohit Sharma is absolute priceless. 😄❤️pic.twitter.com/G5XQPjH5Qj— Tanuj Singh (@ImTanujSingh) July 4, 2024హోటల్ ఎంట్రెన్స్‌లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్ వాయింపుకు రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డ్యాన్స్ చేశారు. రోహిత్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్‌ను ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేక్‌ను కట్ చేశాడు. ఇదిలా ఉంటే, భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్యలో కాసేపు సేదతీరి ప్రధాని మోదీని కలిసేందుకు వెళతారు. మోదీతో భేటి అనంతరం టీమిండియా ముంబైకు బయల్దేరుతుంది. అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్‌లో ర్యాలీగా వెళ్తారు. చివరిగా టీమిండియా వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆథ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది. -
విశ్వ విజేతలకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం (ఫొటోలు)
-
ప్రధాని మోదీని కలవనున్న విశ్వ విజేతలు.. అనంతరం ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.Captain Rohit Sharma showing the T20I World Cup Trophy to the fans. 🥶- Goosebumps moment...!!!! [PTI] pic.twitter.com/QfouaYW3Tn— Johns. (@CricCrazyJohns) July 4, 2024కాగా, వరల్డ్‌కప్ విజయానంతరం భారత బృందం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో హరికేన్ (గాలివాన) బీభత్సం కారణంగా టీమిండియా రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. హరికేన్ ప్రభావం కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూసివేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది.T20I WORLD CUP TROPHY HAS REACHED INDIA AFTER 17 LONG YEARS 🥺 🇮🇳 pic.twitter.com/T8j1HwcP1D— Johns. (@CricCrazyJohns) July 4, 2024ఎట్టకేలకు 100 మందితో కూడిన భారత బృందం ఇవాళ (జులై 4) తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం టీమిండియాను ఢిల్లీకి చేర్చింది.మోదీని కలువనున్న భారత బృందంభారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలువనుంది. ఈ సందర్భంగా మోదీ టీమిండియాను అభినందిస్తారు. మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలుస్తారు. తొలుత ఆటగాళ్లు, ఆతర్వాత సపోర్టింగ్ స్టాఫ్ మోదీతో ములాఖాత్ అవుతారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భారత బృందం మోదీని కలిసే అవకాశం ఉంది.ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్రఅనంతరం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకు బయల్దేరుతుంది. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. -
టీ20 వరల్డ్‌కప్ బెస్ట్ టీమ్ ఇదే.. కోహ్లి, పంత్‌లకు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంఫియన్స్‌గా భారత్ నిలిచిన విషయం విధితమే. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిపోయాయి. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ప్రత్యేక విమానంలో బార్బోడస్ నుంచి స్వదేశానికి చేరుకోనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024 ముగియడంతో టీమ్ ఆఫ్‌ది టోర్నమెంట్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు.ఈ జట్టులో వరల్డ్‌కప్ ఫైనల్ హీరోలు విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్‌కు చోప్రా చోటివ్వలేదు. అదే విధంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సైతం చోటుదక్కలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్‌కు కూడా చోప్రా ఎంపిక చేయలేదు.కాగా ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా అతడు ఎంపిక చేశాడు. ఇక చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ(భారత్), రెహ్మతుల్లా గుర్భాజ్(అఫ్గానిస్తాన్) అవకాశమిచ్చాడు. ఫస్ట్‌డౌన్‌లో నికోలస్ పూరన్(వెస్టిండీస్)కు చోప్రా చోటిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(భారత్), హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా)లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో చాన్స్ దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా(భారత్), రషీద్ ఖాన్‌లను అతడు ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లగా ఫజాలక్ ఫరూఖీ(అఫ్గానిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా(భారత్), అర్ష్‌దీప్ సింగ్(భారత్)లను చోప్రా ఎంచుకున్నాడు.ఆకాష్ చోప్రా ఎంచుకున్న జట్టు ఇదేరోహిత్ శర్మ(కెప్టెన్), గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్, ఫజాలక్ ఫరూఖీ,హార్ధిక్ పాండ్యా,రషీద్ ఖాన్,ఫజాలక్ ఫరూఖీ,జస్ప్రీత్ బుమ్రా,అర్ష్‌దీప్ సింగ్ -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా.. నెం1 ఆల్‌రౌండర్‌గా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తాచాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా.. భారత్ రెండో సారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్ధానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో నిలిచారు. -
'అతడొక అద్భుతం.. కోహునూర్ డైమండ్ కంటే విలువ ఎక్కువ'
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరపడింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ అసాంతం బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.కీలకమైన ఫైనల్లో సైతం బుమ్రా సత్తాచటాడు. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న ప్రతీసారి బుమ్రా బంతితో మ్యాజిక్ చేసేవాడు. తన బౌలింగ్‌తో వరల్డ్‌క్లాస్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన బౌలర్ మరొకడు లేడని కార్తీక్ కొనియాడాడు."బుమ్రా ఒక వరల్డ్‌క్లాస్ బౌలర్. జస్ప్రీత్ కోహినూర్ వజ్రం కంటే విలువైనవాడు. కామెంటరీలో కూడా ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రాని మించిన వాడు మరొకడు లేడు. ఒత్తడిలో అద్బుతంగా బౌలింగ్ చేయడమే బుమ్రా స్పెషల్. అతడు లాంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎటువంటి పరిస్థితులైనా బుమ్రా రాణించగలడు. ఇది అందరూ బౌలర్లు చేయలేరు. నిజంగా బుమ్రా చాలా బ్రిలియంట్ అంటూ" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడిన జగజ్జేతలు
టీమిండియా క్రికెటర్లు ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత బృందాన్ని న్యూఢిల్లీకి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం బార్బడోస్‌కు వచ్చింది. ఇవాళ (జులై 3) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 9 గంటల లోపు భారత క్రికెటర్లు ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా రాక కోసం భారత్‌లో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. T20I WORLD CUP TROPHY IS COMING BACK TO INDIA AFTER 17 LONG YEARS...!!!! 🇮🇳- The Heroes will reach tomorrow. [Nikhil Naz] pic.twitter.com/3pk57TL7Oy— Johns. (@CricCrazyJohns) July 3, 2024కాగా, "బెరిల్" హరికేన్ (గాలివాన) కారణంగా టీమిండియా క్రికెటర్లు ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గత మూడు రోజులుగా ఇరుక్కుపోయారు. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేశారు. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉండింది. భారత క్రికెటర్లు గత మూడు రోజులుగా హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి ప్రపంచకప్‌తో స్వదేశానికి రానుంది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం భారత ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్‌లో ఊరేగింపుగా వెళ్తారని సమాచారం. గతంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇలాగే చేశారు. -
ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్.. ఓపెన్ టాప్ బస్‌లో ఊరేగింపు
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2007) టీమిండియా టైటిల్‌ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.THE MUMBAI TOUR OF TEAM INDIA IN OPEN BUS...!!!!! 🇮🇳- After meeting PM Narendra Modi, Team India will tour Mumbai in Open bus with T20 World Cup Trophy. 🏆❤️ (Abhishek Tripathi). pic.twitter.com/75tnkBihMD— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్‌లో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించనుందని తెలుస్తుంది.వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. మోదీ భారత బృందం మొత్తాన్ని సన్మానించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆథ్వర్యంలోనే భారత ఆటగాళ్లను ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్‌లో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నీలు, ముఖ్యంగా వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఓపెన్ టాప్ బస్‌ల్లో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని భారత ప్రభుత్వం బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తుంది.Can't wait to see these types of scenes in Mumbai of Team India with T20 World Cup Trophy...!!!!🏆❤️- THIS IS GOING TO BE GOOSEBUMPS. 🇮🇳 pic.twitter.com/o25c2dJDdZ— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో విజయబావుటా ఎగరవేసిన టీమిండియా ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెటర్లు హరికేన్ (గాలివాన) కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో ఇరుక్కుపోయారు. భారత బృందం రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక ఛార్టర్ విమానంలో బార్బడోస్ నుంచి బయల్దేరనుంది. -
T20 World Cup 2024: హరికేన్ ప్రభావం.. ఇంకా బార్బడోస్‌లోనే టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం మరుసటి రోజే (జూన్ 30) భారత్‌కు తిరిగి రావాల్సిన టీమిండియా.. హరికేన్ (గాలివాన) ప్రభావం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత క్రికెటర్లు గత రెండు రోజులుగా హోటల్ రూమ్‌కే పరిమితమయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. Virat Kohli showing Hurricanes to Anushka Sharma on video call at Barbados. ❤️pic.twitter.com/PzZY3RmMMb— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ప్రకృతి శాంతిస్తే టీమిండియా గురువారం ఉదయానికంతా భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత బృందం రిటర్న్ జర్నీ ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. గాలివాన మధ్యమధ్యలో కాస్త ఎడతెరిపినిస్తూ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.బార్బడోస్‌లో భారత బృందం బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్ తీవ్రతను ఫోన్లో చూపించాడు. మూడు రోజులైనా హరికేన్ తీవ్రత తగ్గకపోవడంతో భారత్‌లో ఉన్న క్రికెటర్ల ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. -
T20 World Cup 2024: విరాట్ కోహ్లినా మజాకా.. ఆల్‌టైమ్ రికార్డు
సోషల్‌మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్‌మీడియాలోని ఏ ప్లాట్‌ఫాంలో పోస్ట్ పెట్టినా కోట్లల్లో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్‌కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేసింది.టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్‌గా రికార్డు సృష్టించింది. Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్‌స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాధరణ పొందిన పోస్ట్‌గా రికార్డైంది. ఇన్‌స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్‌గా, సెకెండ్ ఏషియన్‌గా, ప్రపంచంలో ఐదో అథ్లెట్‌గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు.ఐసీసీ ఇన్‌స్టా వీడియోకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీడియోలో కోహ్లి ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్‌టైమ్ హిట్ సాంగ్ "తునుక్ తునుక్ తన్"కు డ్యాన్స్ చేశాడు. కోహ్లికి జతగా అర్ష్‌దీప్, సిరాజ్, అక్షర్ పటేల్, బుమ్రా, రింకూ సింగ్ చిందులేశారు.VIRAT KOHLI'S INSTAGRAM POST ON T20 WORLD CUP VICTORY NOW HAS 20 MILLION LIKES...!!!! 🇮🇳- King Kohli becomes the first Asian to have 20 Million likes on a Instagram post in the History. 🐐🙌 pic.twitter.com/noofdlRQfP— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. విరాట్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం విరాట్.. సహచరులు రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
బాబర్ ఆజం ఒక సెల్ఫిష్.. వారు టీ20లకు అస్సలు సరిపోరు: పార్ధివ్
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాక్ జట్టుపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుబెట్టారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ సైతం బాబర్ టార్గెట్ చేశాడు. ఆజం ఒక స్వార్ధపరుడు అంటూ పార్ధివ్ మండిపడ్డాడు."బాబర్ ఆజం ఒక సెల్ఫిష్ ప్లేయర్. జట్టు ప్రయోజనాలు కంటే తన స్వలాభమే ఎక్కువగా చూసుకుంటాడు. ఫఖార్ జమాన్‌ను కాదని తనే ఓపెనర్‌గా రావాలని బాబర్ నిర్ణయించుకున్నాడు. ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు. బాబర్ ఓపెనర్‌గా వచ్చినప్పుడు జమాన్‌ను కనీసం ఫస్ట్ డౌన్లోనైనా బ్యాటింగ్‌కు పంపాల్సింది. కానీ అది కూడా చేయలేదు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ఆ దేశ దిగ్గజాలు కూడా ఇదే చెబుతున్నారు. ప్రస్తుతం పాక్ జట్టులో టీ20లకు సెట్ అయ్యే ఆటగాళ్లు లేరు. టీ20ల్లో వారి స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా బాగోలేదు. పాక్ ఇతర అంతర్జాతీయ జట్ల కంటే చాలా వెనుకబడి ఉన్నారని" ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ధివ్ పటేల్ పేర్కొన్నాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ కెప్టెన్సీ పగ్గాలు తిరిగి చేపట్టిన బాబర్.. తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. భారత జట్టులో చోటు కొట్టేశాడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్‌కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను జింబాబ్వే సిరీస్‌కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
భారత్, శ్రీలంకల వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2026..
దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉరుత్రూలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. జూన్ 29న బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడింది.తుది పోరులో విజయం సాధించిన భారత్.. ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ వరల్డ్‌కప్ విజయంతో 13 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక వరల్డ్‌కప్ ముగిసి వారం రోజుల తిరగకుముందే టీ20 వరల్డ్‌కప్-2026కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక వచ్చే పొట్టి వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్‌నకు క్వాలిఫై అయ్యాయి. అదే విధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో మూడుజట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్తాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. మిగితా 8 జట్లు క్వాలిఫియర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి. -
చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆధ్యంతం అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ 30 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరోసారి నిరాశే ఎదురైంది. బార్బోడస్ వేదికగా భారత్‌తో జరిగిన టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. గెలుపు అంచుల దాక వెళ్లిన దక్షిణాఫ్రికా.. ఆఖరిలో భారత బౌలర్ల దాటికి చేతులేత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలితే.. మరోవైపు ప్రోటీస్ ఆటగాళ్లు న్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ డేవిడ్ మిల్లర్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.తన చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయానన్న బాధతో మిల్లర్ కుంగిపోయాడు. కాగా ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా..తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో ప్రోటీస్ ఓటమి లాంఛనమైంది. కాగా వరల్డ్‌కప్‌లో ఓటమిపై డేవిడ్ మిల్లర్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్‌ను షేర్ చేశాడు."నేను చాలా నిరాశకు గురయ్యా. రెండు రోజులు గడిచినప్పటికి ఇంకా మా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను. మా జట్టు పోరాటం, ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాము. కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం. మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము. కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉందంటూ" ఇన్‌స్టాలో మిల్లర్ రాసుకొచ్చాడు. -
విరాట్ కోహ్లి ఒక లెజెండ్.. బాబర్‌తో పోలికేంటి: పాక్ మాజీ క్రికెటర్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం అనంతరం పొట్టి క్రికెట్‌కు కోహ్లి విడ్కోలు పలికాడు. ఈ మెగా టోర్నీ మొత్తం పేలవ ఫామ్ కనబరిచి విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. కీలకమైన ఫైనల్లో మాత్రం సత్తాచాటాడు. టాపార్డర్ విఫలమైన చోట కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాకు ముందు మెరుగైన స్కోర్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలర్లు సంచలన ప్రదర్శన చేయడంతో భారత్ రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రదర్శనగాను కింగ్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో కోహ్లికి మించిన క్రికెటర్ మరొకడు లేడని షెహజాద్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి ఒక లెజెండ్. మా తరంలో అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు. విరాట్ తన టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించాడు. తన కెరీరంతటా కోహ్లి అద్బుతంగా ఆడాడు. ఆఖరికి చివరి మ్యాచ్‌లో కూడా కోహ్లి అదరగొట్టాడు. అది విరాట్ కోహ్లి బ్రాండ్. ఫైనల్లో తన సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడితే.. విరాట్ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. అందుకే విరాట్‌ను మించిన వాడు లేడని నేను పదేపదే చెబుతున్నాను. విరాట్‌ను గతంలో చాలా మంది బాబర్ ఆజంతో పోల్చారు. కానీ అది సరికాదు. విరాట్‌కు ఎవరూ సాటిరారు. కోహ్లి ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ , యావరేజ్ కలిగి ఉన్నాడు. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్క విరాట్ కోహ్లి ఉంటాడని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు. -
అందుకే పిచ్‌లోని మట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు ఎప్పుడో 2011లో వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఎట్టకేలకు మళ్లీ 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత్.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం ఎటువంటి పొరపాటు చేయలేదు. ఎనిమిది నెలల తిరిగక ముందే కప్ కొట్టి రోహిత్ సేన 140 కోట్ల మంది భారతీయలను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపొందిన వెంటనే నెలను ముద్దాడాడు. అంతేకాకుండా పిచ్‌లోని మట్టిని తిని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తాను ఎందుకు అలా చేశాడో తాజాగా హిట్‌మ్యాన్ వివరణ ఇచ్చాడు. బార్బడోస్ మైదానం ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు."బార్బడోస్ మైదానం నాకెంతో ప్రత్యేకం. ఈ స్టేడియంలోని పిచ్ మాకు వరల్డ్‌కప్‌ను ఇచ్చింది. మా కలలన్నీ నెరవేరిన చోటు అది. ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. పిచ్‌లోని కొంత భాగాన్ని నాలో భాగం చేసుకోవాలనకున్నాను. అందుకే పిచ్‌లోని మట్టిని తిన్నాను. నిజంగా ఆ క్షణాలు మరలేనివి. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నామని" బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు
టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 సాధించడంలో కీలకపాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన మొదటి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మెగా టోర్నీలో బుమ్రాకు ఒకే ఒక్క సారి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బుమ్రా గోల్డెన్ డకౌటయ్యాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్ ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును గెలుచుకోలేదు. ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన జస్సీ.. 29.4 ఓవర్లలో 8.27 సగటున 15 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగసిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై విజయం సాధించి, రెండో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
T20 ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ.. బీచ్‌లో ఫోటోకు ఫోజులు
-
భీకర హరికేన్ ధాటికి అతలాకుతలమైన కరేబియన్ కంట్రీ బార్బడోస్ (ఫొటోలు)
-
బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా రాక
Update: బార్బడోస్‌లో హరికేన్ ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరనుంది. భారతకాలమానం ఇవాళ సాయత్రం 6 గంటలకు భారత బృందం ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి టేకాఫ్ కానుంది. టీమిండియా రేపు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది.టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గాలివాన (హరికేన్) బీభత్సం ఇంకా కొనసాగుతుంది. హరికేన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. బార్బడోస్‌లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది. మన వాళ్లు బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం.ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ (జులై 2) మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయల్దేరవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
భారీ విజయం... భావి ప్రయాణం...
శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్ విధానంలో తొలి ప్రపంచ కప్‌ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్‌ను అందుకుంది. మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్‌ను జరిపే భారత్ మరోసారి ఆ ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. జూన్ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్– 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్‌లో కొత్తగా వెలసిన స్టేడియమ్ మొదలు వివిధ కరేబియన్ దీవుల్లో సాగిన ఈ వరల్డ్ కప్ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్ గెలుపుతో కోచ్‌గా ద్రావిడ్‌కూ, టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్ ఏదైనప్పటికీ ప్రపంచ కప్ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్ పట్ల, ప్రపంచ కప్ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్ కప్ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్‌లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్‌గా భారత క్రికెట్ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్‌ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్’లో జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్‌లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ తాజా టీ20 వరల్డ్ కప్‌లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ మ్యాచ్ దిశను మార్చేశాయి. ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్‌ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. రోహిత్ శర్మ సారథ్యం, అక్సర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మన్లను ఔట్ చేసిన యువ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్‌కప్ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్ సూపర్‌పవర్. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్ జట్టుతో ఇప్పుడు భారత్ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్ ద్రావిడ్ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్‌లు ఆడకున్నా ఈ వరల్డ్‌కప్ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. -
టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్‌కు నాట్స్ అభినందనలు..
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ జాబితాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేరింది. వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా విజయనంతరం నాట్స్ సంబరాల్లో మునిగి తేలారు.అదే విధంగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇతర టీం సభ్యులకు నాట్స్ అభినందనలు తెలిపింది. అదే విధంగా భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించరాని నాట్స్ కొనియాడింది. మరోవైపు సంచలన క్యాచ్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సైతం నాట్స్ పొగడ్తలతో ముంచెత్తింది. అతడి క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తిండిపోతుందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: చోప్రా
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఎట్టకేలకు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతమైంది.2011లో ధోని సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత్.. మళ్లీ ఇప్పుడు రోహిత్ నాయకత్వంలోనే వరల్డ్‌కప్ కల సాధ్యమైంది. భారత్‌కు వరల్డ్‌కప్‌కు అందించిన రోహిత్ శర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. ప్రపంచకప్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ని యావత్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటందని చోప్రా కొనియాడాడు. కాగా వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు."రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. అతడి కెప్టెన్సీ కెరీర్లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అతడు ఛాంపియన్స్ లీగ్‌లో సైతం ముంబైకు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు టీ20 ప్రంపచకప్‌ను సైతం భారత్‌కు అందించి.. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ముగించాడు.ఒక లీడర్‌కు ఇంతకుమించి ఇంకేమి కావాలి. కేవలం ముగ్గురు భారత కెప్టెన్లు మాత్రమే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోగలిగారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన హిట్‌మ్యాన్ చేరాడు. రోహిత్ సాధించిన ఈ వరల్డ్‌కప్ విజయం కొన్ని తాబ్దాల పాటు గుర్తుండిపోతుంది.రోహిత్ కెప్టెన్సీ అత్యుత్తమంగా ఉంటుంది. అతడు ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఎవరికి అడిగినా రోహిత్ భయ్యా చాలా మంచి కెప్టెన్ చెబుతారు. రోహిత్ మంచివాడు కాదని చెప్పే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. రోహిత్ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమని" తన యూట్యూబ్ ఛానలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. జై షా ఏమన్నాడంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా నిలిచిన అనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రోహిత్ ఇకపై కేవలం వన్డేలు, టెస్టుల్లో భారత సారథిగా కొనసాగనున్నాడు.ఈ క్రమంలో టీ20ల్లో భారత జట్టు తదపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు కెప్టెన్‌గా అనుభవం ఉంది.గతంలో రోహిత్ గైర్హాజరీలో చాలా సిరీస్‌లో భారత జట్టు తాత్కాలిక సారథిగా పాండ్యా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్లో భారత జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్‌కే అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా భారత టీ20 కెప్టెన్సీపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. కెప్టెన్ ఎవరన్నది ఇంకా నిర్ణయంచలేదని జై షా తెలిపాడు."భారత జట్టు టీ20 కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. సెలక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా మేము ప్రకటిస్తాము. హార్దిక్ పాండ్యా గురించి చాలా మంది తమను అడిగారని, వరల్డ్‌కప్‌నకు ముందు అతడి ఫామ్‌పై చాలా ప్రశ్నలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు. అతడిని తనను తాను నిరూపించుకున్నాడు. ఏదేమైనప్పటికి కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయమని" జై షా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ నెలలో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంక పర్యటన సమయానికి భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చే అవకాశముంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.చదవండి: రో.. నీలాంటి వ్యక్తి నా సొంతమైనందకు చాలా గర్విస్తున్నా: రితికా -
రో.. నీలాంటి వ్యక్తి నా సొంతమైనందకు చాలా గర్విస్తున్నా: రితికా
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శకం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయనంతరం పొట్టి క్రికెట్‌కు రోహిత్ శర్మ విడ్కోలు పలికాడు. ఎన్నో ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించి రోహిత్ తన టీ20 కెరీర్‌ను ముగించాడు.140 కోట్ల భారతీయల కలను సారథిగా రోహిత్ సాకారం చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ను ఉద్దేశించి తన భార్య రితికా సజ్దేహ్ భావోద్వేగ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రితికా తెలిపింది."రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ క్షణం కోసం నీవు ఎంతగానో ఎదురుచూశావు. ఈ ఫార్మాట్, ఈ కప్, ఈ ఆటగాళ్లు, ఈ ప్రయాణం.. మొత్తం ఈ పక్రియ అంతా నీవు కన్న కల. నీవు గత కొన్ని నెలలగా ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నావో నాకు తెలుసు.అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. ఎట్టకేలకు నీ కల నేరివేరింనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఈ ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకం. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ నీ ఆటను ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఇప్పడు టీ20లకు విడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా.. జట్టుకు ఏది ఉత్తమైనదో దాని గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు. కానీ నేను మాత్రం నీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఏదేమైనప్పటకి నీలాంటి గొప్ప వ్యక్తి నా సొంతమైనందకు ఒక భార్యగా నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్ వ్యూ సో మచ్’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం రోహిత్‌తో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా సైతం పొట్టి క్రికెట్‌కు ముగింపు పలికాడు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
నేడు 500 మంది ఉద్యోగులకు సెలవు!! కారణం తెలిస్తే..
దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన జట్టు వరల్డ్ కప్ గెలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుంది. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకునేందుకు ఏకంగా సెలవు ఇచ్చేసిందో కంపెనీ.భారత్ టీ20 క్రికెట్ ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో తన ఉద్యోగులందరికీ జూలై1న సెలవు దినంగా ప్రకటించింది. ఈ కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఇందులో సుమారు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. "ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బిల్లింగ్‌లు, పేరోల్ క్లోజర్స్ వంటివి ఉన్నందున నెలలో మొదటి రోజు సాధారణంగా బిజీగా ఉంటుంది. కానీ టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించడంతో ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కంపెనీ నిర్ణయించింది" అని ఎక్స్‌ఫెనో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఎంఎస్ చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది.ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ సంయుక్తంగా వేదికగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఇందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణించి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త
టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని హింట్ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు. టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటల్స్ అని తెలిపాడు. విరాట్, రోహిత్‌లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్‌పాట్ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.అయితే, హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. -
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్‌కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. -
T20 World Cup 2024: బార్బడోస్‌లో ఇరుక్కుపోయిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత క్రికెట్ బృందం బార్బడోస్‌లోనే (ఫైనల్ మ్యాచ్‌కు వేదిక) ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' హరికేన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఇవాళ (జులై 1) ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్ కావల్సి ఉండింది. భారత రూట్ మ్యాప్ బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్ హరికేన్ టీమిండియా రిటర్న్ ప్లాన్లు దెబ్బతీసింది.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్లు చేసుకుంది. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ప్రధాని నివాసంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ నిన్న వరల్డ్‌కప్ గెలిచిన భారత బృందానికి రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ స్థాయి భారీ మొత్తాన్ని క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అందుకుని ఉండకపోవచ్చు. బీసీసీఐ తమ హీరోల గౌరవార్దం ఈ భారీ నగదు నజరానాను ప్రకటించింది. -
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు ప్రకటన.. విరాట్‌కు నో ప్లేస్
ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్‌లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.వరల్డ్‌కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్‌రేట్ 156.7, అర్దసెంచరీలు 3రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్‌రేట్ 124.33, అర్దసెంచరీలు 3పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్‌రేట్ 146.15, అర్దసెంచరీలు 1సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్‌రేట్ 135.37, అర్దసెంచరీలు 2స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7అర్ష్‌దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9ఫజల్హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/912 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7 -
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా (టీ20) నిలిచింది.ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్‌ల్లో 281 పరుగులు), బౌలింగ్‌లో ఫజల్హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నారు.ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం. -
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్ చేశాడు. అత్యుత్తమ విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.కాగా, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD— Jay Shah (@JayShah) June 30, 2024అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీతోనే ముగిసింది. -
క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు.. విరాట్ సాధించాడు..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ (2008), వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 వరల్డ్‌కప్ (2024) గెలిచిన తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇప్పటివరకు ఈ నాలుగు ఐసీసీ ట్రోఫీల విజయాల్లో భాగం కాలేదు.అయితే ఈ రికార్డు విషయంలో విరాట్‌కు దగ్గరగా మరో టీమిండియా స్టార్ ఆటగాడు ఉన్నాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కూడా అండర్ 19 ప్రపంచకప్ (2000), ఛాంపియన్స్ ట్రోఫీ (2002), టీ20 వరల్డ్‌కప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) విజయాల్లో భాగమైనప్పటికీ.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్, శ్రీలంక సంయుక్తంగా (వర్షం కారణంగా ఫలితం తేలలేదు)పంచుకున్నాయి. ఈ ఒక్క విషయంలో విరాట్.. యువరాజ్ కంటే ముందున్నాడు.ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌కు కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత గెలుపులో విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా తన టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. విరాట్, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు (ఇవాళ) రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పాడు.ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్లో వరల్డ్‌కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. -
T20 World Cup 2024: "భల్లే భల్లే" డ్యాన్స్‌తో ఇరగదీసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ 2024 గెలుపును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన విరాట్.. వరల్డ్‌కప్ విజయానంతరం భల్లే.. భల్లే స్టెప్పులేసి ఇరగదీశాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందికి చెందిన పాపులర్ సాంగ్ "తునుక్ తనుక్"కు కోహ్లి.. సహచరుడు అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి చిందేశాడు. టీమిండియా సెలబ్రేషన్స్‌లో భాగంగా మైదానంలోని స్పీకర్స్‌లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా.. విరాట్, అర్ష్‌దీప్‌లతో సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా జత కలిశారు. వీరందరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024కాగా, ఫైనల్ మ్యాచ్ గెలిచాక కాసేపు భావోద్వేగాలకు లోనైన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని ఎంజాయ్మెంట్ మూడ్‌లోకి వచ్చారు. జట్టు సభ్యులంతా ఎవరి స్టయిల్లో వారు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆటగాళ్లంతా స్టేడియం మొత్తం కలియతిరిగి అభిమానులకు అభివాదం చేశారు. కొందరు ఫోన్లలో.. కొందరు నేరుగా తమ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. భారత ఆటగాళ్లందరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆనందబాష్పాలు కార్చడం ప్రతి భారతీయుడి మనస్సుని హత్తుకుంది. వీరితో పాటు కోచ్ ద్రవిడ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మొత్తంగా తొలుత భావోద్వేగాలు, ఆతర్వాత సంబురాలతో బార్బడోస్ మైదానం పులకించిపోయింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. -
ఫైనల్ చూడలేదు.. తెలియకుండానే కన్నీళ్లు: బిగ్‌బీ
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశ్వవేదికపై భారత జెండా రెపరెపలాడింది. టీ 20 వరల్డ్‌కప్ (2024) ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ అపురూప క్షణాలను అభిమానులు, సినీ తారలు టీవీలో చూసి మురిసిపోయారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ విజయం వరించిందని తన్మయత్వానికి లోనవుతున్నారు.టీవీ చూడలేదుబాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్‌గా ఇండియా.. టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచాం.. ఈ ఆనందం, ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. నేను మ్యాచ్ చూస్తే ఎక్కడ ఓడిపోతామోనని టీవీ చూడలేదు. మనందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.ఎమోషనల్ ట్వీట్'తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా.. భారత్ మాతాకీ జై.. జై హింద్! జై హింద్!!' అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. కాగా నిన్న (జూన్ 29న) జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫినాలేలో సౌతాఫ్రికాను వెనక్కునెట్టి భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే!సినిమాల సంగతి..అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన కీలక పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదలైంది. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్లు రాబట్టింది. T 5057 - Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..WORLD CHAMPIONS INDIA 🇮🇳भारत माता की जय 🇮🇳जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024 చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా? -
జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ పిచ్‌పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్‌స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు. View this post on Instagram A post shared by ICC (@icc)జకో.. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.Wimbledon's Facebook post - GOATs eating grass. Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024కాగా, నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వరల్డ్‌కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్‌కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్ సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌కు అందించాడు.ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..భారత్ 176/7సౌతాఫ్రికా 169/87 పరుగుల తేడాతో భారత్ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు) -
'ది గ్రేట్ వాల్'.. కప్పు కొట్టించాడు! తన ప్రస్ధానాన్ని ముగించాడు
టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.భారత జట్టుకు సారథిగా వరల్డ్‌కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది. వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..భారత పురుషల జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్‌ను కోచింగ్‌లోనూ చూపించాలనుకున్నాడు.ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్‌ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్‌లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్‌లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్‌కు నిరాశే మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్‌ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్‌కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్‌కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు. గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్‌కప్‌లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్‌కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్‌కు చేర్చాడు.ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సాధించని వరల్డ్‌కప్ టైటిల్‌ను కోచ్‌గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్‌ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోచ్‌గా ద్రవిడ్ రికార్డులు ఇవే..భారత్ 24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.13 వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్లో ఆడిన 56 మ్యాచ్‌ల్లో 41 విజయాలున్నాయి.77 టీ20 మ్యాచ్‌ల్లో 56 గెలిచింది. Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024 -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్‌తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్‌కు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
జట్టులో చోటు ఎందుకన్నారు.. కట్ చేస్తే అతడే వరల్డ్‌కప్ హీరో
ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024 ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని సెలక్టర్లపై కూడా చాలా మంది మాజీలు ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటకి హార్దిక్ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో హార్దిక్ అదరగొట్టాడు.కీలకమైన ఫైనల్లో సైతం పాండ్యా సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో తన మార్క్ చూపించే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికి బౌలింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. ఓటమి తప్పదనుకున్న పాండ్యా మ్యాజిక్ చేశాడు. 17 ఓవర్ వేసిన పాండ్యా.. చేలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. క్లాసెన్ వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అనంతరం ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కూడా రోహిత్.. హార్దిక్ పాండ్యాకే అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టకున్నాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్ విజయం సాధించగానే పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జెండా పట్టుకుని స్టేడియం మొత్తం పాండ్యా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి 144 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
Rohit And Kohli Retire T20I: వాళ్ల ఆట.. పొట్టి ఫార్మాట్లో ఇక చూడలేం (ఫోటోలు)
-
టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024కు శుభం కార్డ్ పడింది. జూన్ 29(శనివారం) భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోరులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండో సారి జగజ్జేతగా నిలిచింది. దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.టీ20 వరల్డ్‌కప్ విజేతకు ఎన్ని కోట్లంటే?టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది. సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు దక్కాయి. అదే విధంగా సూపర్-8కు చేరుకున్న మొత్తం 8 జట్లకు రూ.3.17 కోట్లు ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు అందనున్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల నగదు బహుమతి లభించనుంది. -
భారత క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఫైనల్లో విజయం.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ అవతరించింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓటమి తప్పదనకున్న చోట భారత బౌలర్లు అద్బుతం చేసి తమ జట్టును మరోమారు విశ్వవిజేతగా నిలిపారు.177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోహ్లి(76), అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను రోహిత్.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. రోహిత్ నమ్మకాన్ని పాండ్యా ఒమ్ము చేయలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆఖరి బంతి ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. హార్దిక్ పాండ్యా అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. పాండ్యాను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లి, సిరాజ్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मुहब्बत जिंदाबाद रहे❤️🇮🇳#HardikPandya #T20WorldCupFinal #ViratKohli𓃵pic.twitter.com/Rj2PK6wWKc— RaGa For India (@RaGa4India) June 30, 2024 -
చాలా గర్వంగా ఉంది.. మాటలు రావడం లేదు! వాళ్లందరికి సెల్యూట్: రోహిత్
ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు! భారత కల నేరవేరింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ వసమైంది. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్..రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో తొలిసారి ఎంఎస్ ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోగా.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత విజయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఛాంపియన్స్‌గా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని రోహిత్ తెలిపాడు."మా కల నేరివేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము. గత నాలుగేళ్లలో మా జట్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొన్ని కీలక మ్యాచ్‌ల్లో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. కానీ మేము ఏ రోజు కుంగిపోలేదు. మేము ఒక యూనిట్‌గా తీవ్రంగా శ్రమించాము. ఈ రోజు మేము విజయం సాధించడం వెనక చాలా కష్టం దాగి ఉంది.మా కష్టానికి తగ్గ ఫలితం ఈ రోజు దక్కింది. ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్ధం కావడం లేదు. జట్టులో ప్రతీ ఒక్కరూ అద్బుతం. ఒకానొక సమయంలో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మలుపు తిరిగినప్పుడు కూడా మేము ఒక యూనిట్‌గా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఎలాగైనా గెలవాలనుకున్నాం. ఒక జట్టుగా ఆఖరికి విజయం సాధించాము.ఒక టోర్నమెంట్‌ను గెలవాలంటే జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. ఈ టోర్నీలో మా బాయ్స్ అదే చేసి చూపించారు. జట్టు మెనెజ్‌మెంట్ కూడా ప్రతీ ఒక్క ఆటగాడికి పూర్తి స్వేఛ్చను ఇచ్చింది. ఈ విజయం వెనక సపోర్ట్ స్టాఫ్ కష్టం కూడా దాగి ఉంది. ఇక విరాట్ ఒక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. కోహ్లీ ఫామ్‌పై నాతో పాటు జట్టులోని ఏ ఒక్కరికి సందేహం లేదు. అతడి సత్తా ఏంటో మాకు తెలుసు. గత 15 ఏళ్లగా వరల్డ్ క్రికెట్లో టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం కచ్చితంగా నిలబడతారు. విరాట్ కూడా అదే చేసి చూపించాడు.ఇక అక్షర్ పటేల్ నిజంగా ఒక అద్బుతం. అతడి చేసిన 47 పరుగులు మా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా బౌలింగ్‌లో బుమ్రా కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. హార్దిక్, అర్ష్‌దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ విజయంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో మాకు పెద్ద ఎత్తు ఎత్తున అభిమానుల నుంచి సపోర్ట్ లభించింది. వాళ్లందరికి సెల్యూట్ చేయాలనకుంటున్నాను. 140 కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా"అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
India's T20 World Cup 2024 Victory: టీమిండియా ఘన విజయంతో దేశవ్యాప్తంగా అంబరానంటిన అభిమానుల సంబురాలు (ఫొటోలు)
-
Suryakumar Yadav Catch: 'సూపర్ మేన్' సూర్య.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్ పట్టంది ఈజీ క్యాచే అయినా అంతటి ఒత్తిడిలో బంతిని ఒడిసిపట్టడం అంత సులభం కాదు. అప్పుడు ఏ క్యాచ్ అయితే భారత్‌ను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిందో.. ఇప్పుడు అటువంటి మరో అద్భుత క్యాచే 17 ఏళ్ల తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది.టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ అద్బుతం చేశాడు. సూర్య సంచలన క్యాచ్‌తో భారత్ రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకులతో పాటు టీవీల ముందు కూర్చుకున్న భారత అభిమానల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ మేన్ సూర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. What A Catch By Suryakumar Yadav 🔥🔥Game changing catch 🥹❤️Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024 -
భారత్‌దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
టీ20 విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకుందని ప్రశంసించారు. టోర్నీ ఆద్యంతం సమష్టి కృషితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో అతడు చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీమ్ ఇండియా మరిన్ని చాంపియన్‌షిప్‌లు సాధించాలని ఆకాంక్షించారు. Congratulations to #TeamIndia on the historic win in the #T20WorldCup! Your perseverance and hard work have paid off. Proud moment for every Indian. Jai Hind! 🇮🇳— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2024 -
టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన భారత్
-
Rohit Sharma Retired From T20Is: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ..
విరాట్ కోహ్లి బాటలోనే భారత కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సైతం నడిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. ఇక టెస్టుల్లో, వన్డేల్లో మాత్రమే భారత జెర్సీలో హిట్‌మ్యాన్ కన్పించనున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలవడంలో రోహిత్ శర్మది కీలక పాత్ర. ఫైనల్లో మినహా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌ను రెండో సారి విశ్వవిజేతగా నిలిపాడు."టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడం చాలా సంతోషం ఉంది. ఈ ట్రోఫీని సాధించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఈ రోజు నా కల నేరవేరింది. ఇక ఈ విజయంతో నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 4231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా రోహిత్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సైతం అంతర్జాతీ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. -
Virat Kohli T20I Retirement: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్‌కు గుడ్‌బై
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బ్యాటింగ్‌లో ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకమైన ఫైనల్లో సత్తాచాటాడు. టైటిల్ పోరులో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.అయితే ఈ విజయనంతరం విరాట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లి తెలిపాడు. "మేము సాధించాలనుకున్నది ఇదే. ఈ రోజు మా కల నేరవేరింది. ఈ క్షణం కోసం చాలా కాలం నుంచి వేచి ఉన్నాం. నిజంగా చాలా సంతోషం ఉంది. ఏమి మాట్లాడాలో ఆర్ధం కావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి గత 11 ఏళ్లగా శ్రమిస్తున్నాం. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20. కుర్రాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను.ఇక ఈ విజయానికి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అర్హుడు. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్. అత్యున్నత స్దాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లి 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 124 మ్యాచ్ ఆడిన విరాట్... 48.38 సగటుతో 4112 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
T20 Word Cup 2024: 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. విశ్వవిజేతగా భారత్
ఒకే ఒక్క విజయం.. 140 కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఒకే ఒక్క విజయం.. భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఒకే ఒక్క విజయం.. సరిగ్గా ఏడు నెలల కిందట తగిలిన గాయాన్ని మాయం చేసింది. ఒకే ఒక్క విజయం.. ఎంతో మంది కళ్లల్లో అనంద భాష్పాలను చిమ్మేలా చేసింది. గత 13 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతం అయింది. విశ్వవేదికపై భారత జెండాను రోహిత్ సేన రెపరెపలాడించింది.టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా అవతరించింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. రెండో సారి టీ20 వరల్డ్ ట్రోఫీని ముద్దాడింది. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ఎంఎస్ ధోని అందించగా.. ఇప్పుడు రోహిత్ శర్మ 17 ఏళ్ల తర్వాత భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.ఆఖరి వరకు ఉత్కంఠ..ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) జట్టును ఆదుకున్నారు.దీంతో దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగింది. అప్పుడే అక్షర్ పటేల్.. స్టబ్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. అయితే స్టబ్స్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్.. డికాక్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది క్లాసెన్ 24 పరుగులు రాబట్టాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసన్.. పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో సౌతాఫ్రికా విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారిపోయింది. దక్షిణాఫ్రికా విజయం ఖాయమని అంతా భావించారు.హార్దిక్ మాయ.. బుమ్రా, అర్ష్‌దీప్ అదుర్స్ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. 16 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినప్పటికి క్రీజులో క్లాసెన్, మిల్లర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో భారత డగౌట్ మొత్తం నిరాశతో నిండిపోయింది. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను పాండ్యా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.అయినా మిల్లర్ ఇంకా క్రీజులో ఉండడంతో భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఓవర్లో పాండ్యా వికెట్‌తో పాటు కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 18 ఓవర్ వేసేందుకు వచ్చిన బుమ్రా తన అనుభవాన్ని మొత్తం చూపించాడు. వరల్డ్‌క్రికెట్‌లో తనకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపించుకున్నాడు. బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మార్కో జాన్సెన్ను ఔట్ చేశాడు. దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 2 ఓవర్లలో 20 పరుగులుగా మారింది. అయితే 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన అర్ష్‌దీప్ సైతం అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి.సూపర్‌మేన్ సూర్య..భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో మిల్లర్ ఉండడంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తొలి బంతిని హార్దిక్ ఫుల్ టాస్‌గా మిల్లర్ సంధించాడు. మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దీంతో అది భారీ సిక్సర్ అందరూ భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్యకుమార్ అద్బుతం చేశాడు. బౌండరీ లైన్ అవతల పడే బంతిని సూపర్‌మేన్‌లా క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. మిల్లర్ వికెట్‌తో భారత్ విజయం ఖాయమైంది. ఆ తర్వాత హార్దిక్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు. No one in India 🇮🇳 will pass away without liking this post ♥️Congratulations Team India 🔥#T20WorldCup #INDvSA #ViratKohli #SuryakumarYadav pic.twitter.com/JbIDlWcCKZ— Satyam Patel | 𝕏... (@SatyamInsights) June 29, 2024 -
అంత తొందరెందుకు రోహిత్.. ఇది ఫైనల్ కదా! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లో మంచి ఆరంభం లభించింది. జానెసన్ మొదటి ఓవర్లో ఏకంగా 15 పరుగులచ్చాయి. వెంటనే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు. మహారాజ్ వేసిన రెండో ఓవర్లో తొలి రెండు బంతులను స్విప్ ఆడి బౌండరీలగా మలిచిన రోహిత్.. మూడో బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే నాలుగో బంతిని మళ్లీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి మాత్రం బంతి నేరుగా బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న క్లాసెన్ చేతికి వెళ్లిపోయింది.దీంతో రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంత తొందరెందుకు రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనప్పటకి భారత్ మాత్రం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ శర్మకు నేను వీరాభిమానిని.. ఫియర్ లెస్‌గా ఆడుతాడు: మహారాజ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించేందుకు హిట్‌మ్యాన్ సిద్దమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరులో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలతో కూడా అదరగొడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. సూపర్-8లో ఆసీస్‌పై అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఫైనల్లోనూ రోహిత్ అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. హిట్‌మ్యాన్‌కు తన పెద్ద అభిమానినని మహారాజ్ చెప్పుకొచ్చాడు."నేను రోహిత్ శర్మకు వీరాభిమానిని. బ్యాటింగ్‌లో అతడు డేరింగ్ అండ్ డాషింగ్. బౌలర్లకు అతడంటే చాలా భయం. కెప్టెన్‌గా కూడా రోహిత్ అద్బుతం. అతడికి అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గేమ్‌ను బాగా ఆర్ధం చేసుకుంటాడు. జట్టులో పూర్తి స్వేఛ్చను రోహిత్ ఇస్తాడు. ఆటగాళ్లను సపోర్ట్ చేసి వారిలో బెస్ట్‌ను తీయడంలో రోహిత్ దిట్ట. ఫీల్డ్‌లో కూడా రోహిత్ చాలా వ్యూహాత్మకంగా ఉంటడాని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాజ్ పేర్కొన్నాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్..
IND vs SA T20 WC Final Live Updates:టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్.. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సౌతాఫ్రికా విజయానికి 23 బంతుల్లో 26 పరుగులు కావాలి.విజయం దిశగా దక్షిణాఫ్రికా..15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడితో పాటు మిల్లర్(14) పరుగులతో క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్.. స్టబ్స్ ఔట్70 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన స్టబ్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 42/26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(20), స్టబ్స్(12) పరుగులతో ఉన్నారు.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ ఔట్దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్క్రమ్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో స్టబ్స్ వచ్చాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్.. హెండ్రిక్స్ ఔట్177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజులో డికాక్, మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఫైనల్లో చెలరేగిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు.విరాట్ కోహ్లి ఫిప్టీ.. కీలకమైన ఫైనల్లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 64 పరుగులతో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 150/4భారత్ నాలుగో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), దూబే(9) పరుగులతో ఉన్నారు.12 ఓవర్లకు భారత్ స్కోర్: 93/3విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(41), అక్షర్ పటేల్(38) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న విరాట్, అక్షర్..వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించిన అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(31), అక్షర్ పటేల్(25) పరుగులతో ఉన్నారు.టీమిండియా మూడో వికెట్ డౌన్..34 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(22), అక్షర్ పటేల్(5) పరుగులతో ఉన్నారు.భారత్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓకే ఓవర్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహారాజ్ వేసిన రెండో ఓవర్లో తొలుత రోహిత్ శర్మ ఔట్ కాగా.. అనంతరం రిషబ్ పంత్ పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సూర్యకుమార్ యాదవ్(0) పరుగులతో ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్బార్బోడస్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు విజిల్ మ్రోగింది. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీభారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాస్టేడియంకు చేరుకున్న ఇరు జట్లుఇక ఫైనల్ మ్యాచ్ కోసం భారత్-దక్షిణాఫ్రికా జట్లు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు వామాప్ చేస్తున్నాయి. మరో 30 నిమిషాల్లో టాస్ పడనుంది.అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఫైనల్ జరిగే బార్బోడస్‌లో ప్రస్తుతం ఎటువంటి వర్షం పడడం లేదు. ప్రస్తుతం ఎండకాస్తోంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికాటీ20 వరల్డ్‌కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. బార్బోడస్ వేదికగా టైటిల్‌పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన ఇరు జట్లు.. ఆఖరి పోరులో తాడోపేడో తెల్చుకోనున్నాయి. భారత్ తమ రెండో టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీపై కన్నేయగా.. సౌతాఫ్రికా తొలి సారి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు సమవుజ్జీగా ఉన్నాయి. ఈ టైటిల్ పోరులో ఎవరిది పై చేయో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
దక్షిణాఫ్రికాతో ఫైనల్.. చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా- భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డును ఊరిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మరో 6 పరుగులు సాధిస్తే టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు కోహ్లి 1,216 పరుగుల చేశాడు. రోహిత్ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో 1,211 పరుగులు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే అవకాశముంది.కాగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 248 పరుగులతో మూడో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
దక్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్కటే మార్గం: మోర్కెల్
టీ20 వరల్డ్-2024 ఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు."బుమ్రా అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్‌లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి. అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు. కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కోహ్లీ ఫామ్ లోకి వస్తే వార్ వన్ సైడ్..
-
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జూన్ 29) భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. వరల్డ్‌కప్ గెలవడం ఓ జట్టుకు (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ అయితే.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.ప్రపంచ కప్‌లో తొలిసారి ఇలా..ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా అజేయ జట్లుగా ఫైనల్‌కు చేరాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా (ఫైనల్‌కు చేరిన జట్లు అజేయ జట్లుగా నిలవడం) జరగడం ఇదే తొలిసారి.ఈ మెగా సమరానికి ముందు పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఎన్ని సార్లు ఎదురెదురుపడ్డాయో ఓ లుక్కేద్దాం. ఈ ఫార్మాట్లో భారత్-సౌతాఫ్రికా పోరాటం 18 ఏళ్ల కిందట మొదలైంది. జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రొటీస్‌ను ఖంగుతినిపించింది. ఆ మ్యాచ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్.టీమిండియాదే ఆధిక్యంఅప్పటి నుంచి పొట్టి క్రికెట్లో భారత్-సౌతాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. టీమిండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సౌతాఫ్రికాపై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఆరు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. భారత్ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన వరల్డ్‌కప్ (2022 ఎడిషన్) మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. -
కమాన్ టీమిండియా.. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ఇవాళ (జూన్ 29) జరుగనుంది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత దేశం కళ్లకు వొత్తులు పెట్టుకుని ఎదురుచూస్తుంది. ఈ సారి టీమిండియా ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు తమ ఇష్ట దైవాలకు ప్రార్దనలు చేస్తున్నారు. Prayers for team India at Siddhivinayak Temple. 🥹🇮🇳 pic.twitter.com/dgwBJ5XiPi— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024దేశవ్యాప్తంగా అభిమానులు తమ ఫేవరెట్ ప్లేయర్ల పేరిట ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ పూజలతో దేశవ్యాప్తంగా ప్రార్ధనాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రజలు అనునిత్యం టచ్‌లో ఉండే సోషల్‌మీడియా టీమిండియా నామస్మరణతో మార్మోగుతుంది. ఏ ప్లాట్‌ఫాంలో చూసినా టీమిండియాను ఉత్తేజపరిచే పోస్ట్‌లే దర్శనమిస్తున్నాయి. 140 కోట్లకుపైగా భారతీయులు ఈసారి వరల్డ్‌కప్ మనదే అని ధీమాగా ఉన్నారు. Fans from Prayagraj offering prayers for team India's victory. 🇮🇳pic.twitter.com/4AGCwdAr0b— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024భారత ఆటగాళ్లు సైతం గతంలో కాకుండా ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రూప్ దశలో, సూపర్-8, సెమీస్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్, రిషబ్ పంత్ సత్తా చాటుతున్నారు. హార్దిక్ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నారు. బౌలర్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. Indian fans doing Havan and prayers in Varanasi for Team India to win this T20 World Cup 2024 Trophy. 🇮🇳🙏pic.twitter.com/ETAuGiMfGP— Tanuj Singh (@ImTanujSingh) June 29, 2024పేసు గుర్రం బుమ్రా అయితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. విరాట్, శివమ్ దూబే ఫామ్ మినహాయించి టీమిండియా అన్ని విషయాల్లో భేషుగ్గా ఉంది. వీరిద్దరు ఫైనల్లో టచ్‌లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు సౌతాఫ్రికా సైతం గెలుపుపై ధీమాగా ఉంది. ఆ జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. సౌతాఫ్రికా సైతం అన్ని విభాగాల్లో టీమిండియాతో సరిసమానంగా ఉంది. మన దగ్గర సూర్యకుమార్ ఉంటే.. వాళ్ల దగ్గర క్లాసెన్ ఉన్నాడు. మన దగ్గర రోహిత్ ఉంటే.. వారి దగ్గర మార్క్రమ్ ఉన్నారు. మన దగ్గర కోహ్లి ఉంటే.. వారి వద్ద మిల్లర్ ఉన్నారు. మన దగ్గర పంత్ ఉంటే.. వారి దగ్గర డికాక్ ఉన్నాడు. THE DAY HAS ARRIVED - IT'S T20 WORLD CUP 2024 FINAL...!!!!! 🏆- Team India will take on South Africa in Final of this T20 World Cup. This is the dream of Billion Indians, Every Indian wants to see India lift the World Cup.- ALL THE BEST, TEAM INDIA, LET'S CREATE HISTORY. 🇮🇳 pic.twitter.com/4P1PbUC4CW— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024మన దగ్గర హార్దిక్ ఉంటే.. వారి దగ్గర జన్సెన్ ఉన్నాడు. బౌలింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో మేటి పేసర్లు ఉన్నారు. మన దగ్గర బుమ్రా, అర్ష్‌దీప్ ఉంటే వారి దగ్గర రబాడ, నోర్జే ఉన్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య తేడా వచ్చేది స్పిన్ విభాగంలోనే. మన దగ్గర ప్రపంచ స్థాయి స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజా ఉండగా.. వారి దగ్గర షంషి, కేశవ్ మహారాజ్ మాత్రమే ఉన్నారు. భారత్ ఈ ఒక్క విషయంలో సఫారీలపై ఆధిక్యం కలిగి ఉంది. ఈ ఆధిక్యమే ఫైనల్లో టీమిండియాను గెలిపించే అవకాశం ఉంది. సో.. ఆల్ ద బెస్ట్ టీమిండియా. -
T20 World Cup 2024 Final: రోహిత్ శర్మ మరో 34 పరుగులు చేస్తే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 తుది అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.హిట్‌మ్యాన్ మరో 34 పరుగులు చేస్తే..వరల్డ్‌కప్ ఆధ్యాంతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్‌లో మరో 34 పరుగులు చేస్తే టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడు. రోహిత్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 41.33 సగటున 155.97 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 248 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్‌గా రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. గుర్బాజ్ 8 మ్యాచ్‌ల్లో 124.34 స్ట్రయిక్‌రేట్‌తో 281 పరుగులు చేశాడు.అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. అర్ష్‌దీప్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నాడు. -
T20 World Cup 2024 Final: శివమ్ దూబేనా..సంజూ శాంసనా..?
మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక. ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్‌లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్‌కు ఓ ఆల్‌రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్‌రౌండర్‌గానే పరిగణించాలి. బౌలర్‌గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..? -
T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్‌గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి.