TDP
-
బడుగు బతుకులపై పచ్చ జేసీబీలు
శాంతిపురం: టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఆ పార్టీ నేతలు పన్నిన కుట్రను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు కట్టారంటూ 9 ఇళ్లను కూల్చివేసి, ఆయా కుటుంబాలను నిర్వాసితులను చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు సమీపంలోని చెల్దిగాని చెరువు పక్కన మిట్టపై 9 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని పాతికేళ్లుగా నివసిస్తున్నాయి. వీరిలో దళితులైన గణేష్, అశ్వత్, సోమశేఖర్, మంగమ్మ, భవానీ కుటుంబాలతో పాటు బీసీలైన నారాయణప్ప, కనకమ్మ, కావలి నారాయణప్ప, నరసింహులు కుటుంబాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరి ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అనుమానంతో అధికార పార్టీ నాయకులు వీరిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు కరెంటు, నీటి సదుపాయాలను ఇప్పటికే తొలగించారు. బాధితులు కలెక్టర్, కడ పీడీ, శాంతిపురం తహసీల్దార్, ఎంపీడీవోలను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. మరోచోట ఇంటి స్థలాలు కేటాయిస్తే అక్కడికి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. కానీ 48 గంటల్లో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన అధికారులు గడువు తీరగానే కూల్చివేతలకు పూనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ రెండు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చేశారు. ఇళ్లలోని వస్తువులు, ధాన్యం అంతా మట్టి పాలు చేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లాపాపలు, వృద్ధులతో సహా వీధిన పడ్డాయి. సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యమా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితులు, పేదలపై అధికారుల జరిపిన దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షడు కోదండరెడ్డి, మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, నాయకులు సైపుల్లా, కావలి వెంకటరమణ, గజ్జల రమేష్, చలపతి ఖండించారు. బాధితులను పరామర్శించిన అనంతరం అక్రమ నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చిన అధికారులు మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్యను కొనసాగించగలరా అని ప్రశ్నించారు. పిల్లలు, వృద్ధులకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసత్వం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటివరకూ పునరావాస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించారు. ఎలా బతకాలి రోడ్డు ప్రమాదంలో భర్త, నాన్న చనిపోయారు. ముసలి వాళ్లైన అమ్మ మంగమ్మ, అమ్మమ్మ, వికలాంగుడైన కొడుకుతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాను. రోజూ కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుని రేకుల ఇల్లు కట్టుకుంటే దిక్కులేని వాళ్లమనే కనికరం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు మేం ఎలా బతకాలి?. ఎక్కడ తలదాచుకోవాలి?. – అశ్వని, బాధితురాలు అడవుల పాల్జేశారు ఓటు వేయలేదనే అనుమానంతో మా ఇంటిని కూలదోసి ఏమీ లేకుండా చేశారు. మతిస్థిమితం లేకుండా తన లోకాన తాను తిరిగే భర్త. స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బిడ్డలతో బతుకుతున్నా. కూలి పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తుంటే మా నోట్లో మట్టి కొట్టారు. మమ్మల్ని అడవుల పాలు చేశారు. – శారదమ్మ, బాధితురాలు -
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌లతో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ పెత్తనంతో.. నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ సంప్రదాయానికి తూట్లు.. వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం. పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
లోకేశ్ ‘లెక్కే’ వేరు..!
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్‌కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్‌కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే. కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.రాజ్యసభ స్థానాల్లోనూ అంతేమూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్‌బాబు, బీద మస్తాన్‌రావుకి ఇచ్చారు. సానా సతీష్‌బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్‌రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. -
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు అంతా సిద్ధం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబుకాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
-
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
యనమలకు బాబు ‘షాక్’ హ్యాండ్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు.. టీడీపీలో ప్రస్తుతం లోకేశ్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆశపెట్టి హ్యాండిచ్చారు
సాక్షి, అమరావతి: అవసరానికి వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం విస్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుది ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ అని ఓ సందర్భంగా గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసొచ్చింది. ఎన్నికల సమయంలో పని చేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పని చేయించుకోవాల్సిన వారికి, ఆరి్థకంగా ఆసరాగా ఉన్న వారికి ఆయన ఎడాపెడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో పని చేయించుకున్నారు. కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారితో చంద్రబాబుకి పని లేకపోయింది. పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలతో కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు హతాశులయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారు.ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశగా ఎదురుచూసి, బాబు కొట్టిన దెబ్బకు తెల్లమొహాలు వేసిన టీడీపీ ఆశావహుల జాబితాశ్రీకాకుళం జిల్లా 1. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ 2. టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి అల్లూరి సీతారామరాజు జిల్లా 1. మత్స్యరాస మణికుమారి కాకినాడ జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా 1. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు 2. తాడేపల్లిగూడెం నియోజకవర్గ్గ ఇన్చార్జి వలవల బాబ్జి 3. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి 4. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 5. మాజీ మంత్రి పీతల సుజాత 6. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఏలూరు జిల్లా 1. పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా 1. దేవినేని ఉమామహేశ్వరరావు 2. నెట్టెం రఘురాం 3. వంగవీటి రాధాకృష్ణ 4. బుద్ధా వెంకన్న 5. నాగుల్ మీరా పల్నాడు జిల్లా 1. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చిత్తూరు జిల్లా 1. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు 3. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనంతపురం జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 2. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ 3. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప 4. గుండుమల తిప్పేస్వామి కర్నూలు జిల్లా 1. డోన్‌కు చెందిన ధర్మవరపు సుబ్బారావు 2. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు. పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. -
నామినేషన్లు వేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానికి ఇంతకుముందే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో మిగిలిన నాలుగు స్థానాలకు టీడీపీ తరఫున ముగ్గురు, బీజేపీ తరఫున ఒకరు నామినేషన్లు వేశారు. తొలుత టీడీపీకి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేయగా, ఆ తర్వాత బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థుల వెంట మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు వచ్చారు. బీజెపీ అభ్యర్థి వీర్రాజు వెంట మంత్రులు సత్యకుమార్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరంతా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి వనితారాణికి సమర్పించారు. సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న అసెంబ్లీ సహాయ కార్యదర్శులు ఆర్.శ్రీనివాసరావు, ఈశ్వరరావు ఆ పత్రాలను పరిశీలించారు. నామినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ తదితరులతో కలిసి సీఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం ఉదయం ప్రకటించింది. సోము వీర్రాజు 2015–21 మధ్య బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగారు. 2020–23 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏకగ్రీవమే.. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన తర్వాత 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ ఉపసంహరణ తేదీ తర్వాత ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. -
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. -
నంద్యాల జిల్లా బనగానపల్లెలో రెడ్ బుక్ రాజ్యాంగం
-
YSRCPలో చేరిన టీడీపీ కౌన్సిలర్లు
-
టీడీపీ సీనియర్లకు చంద్రబాబు హ్యాండ్
-
‘ప్రైవేట్’ నోట.. ‘డీమ్డ్’ పాట!
సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది.ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ 16,500బీ కేటగిరి 13,20,000ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులుకన్వీనర్4,96,800బీ కేటగిరి 9,93,600ఎన్ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందేడీమ్డ్ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్ హోదా దక్కించుకుంది. అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధనరాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ హెల్త్ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డీజీహెచ్ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు. మన విద్యార్థులకు తీరని నష్టం..నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్డ్ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. -
మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకు జాక్‌పాట్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ (kavali greeshma) బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రసంగించిన ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడ కొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ‘ఎవడైనా సరే జగన్మోహన్రెడ్డి అంటూ ఇంటికొచ్చినా.. బస్సు యాత్రలో వచ్చినా.. బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా కొ... ల్లారా.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూ, శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే (తొడ కొడుతూ).. తెలుగుదేశం గడ్డలో పుట్టినవాళ్లమే కాదు’ అంటూ చంద్రబాబు (Chandrababu) సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అంతేకాకుండా.. ‘మీరే మాకు అండ.. మీరే మాకు ధైర్యం.. మీరే మాకు స్ఫూర్తి (చంద్రబాబును చూస్తూ).. లోకేశ్ అన్న కోసం అందరం ఉంటామని గట్టిగా చెప్పండి తమ్ముళ్లూ.. జై తెలుగుదేశం’ అంటూ కావలి గ్రీష్మ టీడీపీ మహానాడులో వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, వందల మంది సీనియర్ పార్టీ నేతల సమక్షంలోనే గ్రీష్మ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. తొడ కొడుతూ బూతులతో విరుచుకుపడ్డా చంద్రబాబు కనీసం ఇదేంటని ఆమెను వారించలేదు. వైఎస్సార్సీపీ నేతలు... ఆయన భార్యను ఏమీ అనకపోయినా.. అన్నారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి కావలి గ్రీష్మను ఎంపిక చేసి తన మనస్తత్వం ఎలాంటిదో చాటుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు.. విడదల రజనిఆమె బూతులకు మెచ్చే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గ్రీష్మను నియమించారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వడం ద్వారా ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని సీఎం చంద్రబాబు నిరూపించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
నంద్యాల జిల్లాలో ఆగని పచ్చ మూకల అరాచకాలు
-
నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచక పర్వం.. వంతపాడుతున్న పోలీసులు
సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
చంద్రబాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
ఐదుగురు సిట్టింగ్‌లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్!
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అబద్ధాల్లో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
కూటమి నేతల్లో క్రెడిబులిటీ లేదు : శ్యామల
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది. ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు. -
మహిళలకు టోకరా.. ఉచిత బస్సుపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి, విజయవాడ: మహిళ దినోత్సవం ముందే మహిళలకు కూటమి సర్కార్ టోకరా వేసేసింది. ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాసన మండలి సాక్షిగా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుంచైనా ఉచిత బస్ ప్రయాణం అంటూ ప్రకటనలు హోరెత్తించారు. ప్రతి సభలో ఎక్కడ నుండి ఎక్కడవరకైనా ఉచితం అంటూ చంద్రబాబు ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చేసింది. దీంతో సోషల్ మీడియాలో మహిళలు తీవ్రంగా మండి పడుతున్నారు.ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని ప్రదర్శించిన చంద్రబాబు తాను బురిడీ బాబునని మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.. చివరికి జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెలవిచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్ తెలిపారు. -
నేను గాంధీ గారి బాటలో నడిచేవాణ్ణి.. జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
రియల్ ఎస్టేట్ ఢమాల్.. కొనేది లేదు... అమ్మేది లేదు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతినెలా బోలెడు లోటు కనిపిస్తోంది దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం.. కుదిరినన్నిచోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేసారు. భూముల ధరలు పెంచేశారు.. దీంతో పదివేలున్న గజం భూమి ఒకేసారి పదిహేను వేలు అయింది.. దానిమీద జరిగే క్రయవిక్రయాలమీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతుంది. బాబు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఆఫీసు మామూళ్లు చూసి జనం భీతిల్లుతున్నారు.ఇసుక ధరలు.. గుండెలు గుభేల్ఇదిలా ఉండగా ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక ప్రజలకళ్ళలో ఇసుక పోసింది. మారాజా అంటే మరి రెండు తన్నండి అన్నట్లుగా.. వైఎస్ జగన్ హయాంలో ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయ్.. మేమొస్తే ఫ్రీ ఇసుక అని నమ్మించి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండలనుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస ఐంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇదంతా కలిసి ప్రజలకు ఇసుక అనేది మహాప్రసాదం ఐంది. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి.. వ్యాపారం చేయడం గగనం అయిపోతోంది.వెంచర్లమీద వాలుతున్న పచ్చ రాబందులురాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు వాతావరణం సరిగా లేదు. మొన్నటికిమొన్న మద్యం వ్యాపారం మోసం లక్షల్లో అప్పులుచేసి లైసెన్సులు తీసుకుని షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వాలిపోయారు.. మాకు పావలా వాటా ఇస్తావా.. షాప్ మూసుకుని వెళ్ళిపోతావా అని బెదిరించారు. అనంతపురం.. తాడిపత్రి ప్రాంతాల్లో జెసి బ్రదర్స్ అయితే లైసెన్స్ దారులమీద చేసిన రుబాబు రాష్ట్రంమొత్తం చూసింది. ఇప్పుడు ఇదే సంస్కృతి రియల్ ఎస్టేట్ లోకి కూడా పాకింది. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి.. అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టిడిపి నేతలు వాలిపోతున్నారు. మాకు రౌడీ మామూలు కడితే సరేసరి.. లేదంటే ఆ భూములు వివాదాస్పదం అంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ తొమ్మిదినెలలుగా ఇంటి స్థలాలు.. అపార్టుమెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక.. వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. ఇదేకాదు చిన్నాచితకా పరిశ్రమలు నడిపేవారిపైనా తెలుగుదేశం నేతలు రుబాబు చేస్తున్నారు. దీంతో డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు - సిమ్మాదిరప్పన్న -
పూర్తిగా అమ్మేసి కాష్ చేసుకుంటున్నారు.. ఏపీ అసైన్డ్ భూములపై షాకింగ్ నిజాలు
-
టీడీపీ కుట్రపూరితంగా PV సునీల్ ని సస్పెండ్ చేసింది
-
భీమవరంలో రోడ్డెక్కిన ఆక్వా రైతులు..
-
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
అన్నదమ్ముల మధ్య ముదిరిన వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తొమ్మిదేళ్లుగా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలను ఈ దఫా ఒంగోలు నగరంలో నిర్వహించడం చర్చనీయంగా మారింది. తన సోదరుడు, ఎమ్మెల్యే జనార్దన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా సత్య నగర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్, సత్యల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం రాజుకోవడంతో సత్య తన పుట్టిన రోజు వేడుకలను పట్టుబట్టి ఒంగోలు నగరంలో నిర్వహించుకున్నారు.భాగ్యనగర్‌లో జరుపుకున్న ఈ వేడుకలకు కొండపి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనార్దన్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఇకనుంచి ఒంగోలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందిని ఈ వేడుకలకు ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. అసెంబ్లీ జరుగుతుందన్న సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన ఒంగోలులో టీడీపీకి ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఒకటి భాగ్యనగర్‌లో ఉండగా, గుంటూరు రోడ్డులో జనార్దన్ ఆధ్వర్యంలోని మరో కార్యాలయం ఉంది. తాజాగా సత్య రంగ ప్రవేశంతో మూడో కార్యాలయం సిద్ధమవుతోంది. -
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. ఒక్కో ఇంటి పట్టాకు రూ. 50 వేలు టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నారు. టీడీపీ నేతలు పబ్లిగ్గా డబ్బు వసూలు చేస్తున్నా కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతల వసూళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్టోర్ డీలర్‌పై టీడీపీ నేత దాడిమరోవైపు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. తాము హెచ్చరించినా రేషన్ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్ షాపు డీలర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్ఫీ షాప్‌నంబర్ 1257060) డీలర్‌గా పనిచేçసూŠత్ జీవనం సాగిస్తున్నాడు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్ షిప్ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్‌గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు.దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్‌సీ షాపునకు నెలసరి రేషన్ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఇవాళ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికార పక్షం. రెండోది ప్రతిపక్షం. సభా నాయకుడికి సభలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికీ అంతే సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజల గొంతుకను ప్రతిపక్షం వినిపించగలుగుతుంది. కానీ, ప్రజల గొంతుక వినిపించకూడదని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘గవర్నర్ ప్రసంగం, బడ్జెట్లో లోపాలను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ ప్రజలకు వివరించడానికి ఇప్పుడు మీడియా సమావేశంలో రెండు గంటలు పట్టింది. ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడే అసెంబ్లీ వేదికగా ఈ తరహాలో ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా కల్పించలేదు కాబట్టే మీడియా ద్వారా ప్రజల గొంతుక వినిపిస్తున్నాం’’ అని పునరుద్ఘాటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ఇంత మంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు.ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులే ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీకి 23 మంది సభ్యులే ఉన్నప్పుడు.. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నారు. మరో పదిమందిని లాగేద్దాం.. సభలో టీడీపీ బలం తగ్గిద్దామని మావాళ్లు చెబితే నాడు నేను వద్దని వారించా. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. అసెంబ్లీలో ఎంత సమయం మాట్లాడతావో మాట్లాడు అంటూ చంద్రబాబుకు మైక్ ఇచ్చాం. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇదీ.. చంద్రబాబుకు మాకు ఉన్న తేడా’’ అని చెప్పారు. ‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ఎప్పుడైనా చూశామా? ఇక్కడ చంద్రబాబు చేశాడు.. అయినా ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలో మాస్టార్లు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు కదా? ఎందుకంటే, అక్కడ రిగ్గింగ్ సాధ్యం కాదు. కారణం.. టీచర్లే ఓటర్లు, ఏజెంట్లు కాబట్టి’’ అని మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం పేర్కొన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవితకాలంలో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు’’ అంటూ ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.అప్పులపైఅవే అబద్ధాలు..» మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు..!»మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు : వైఎస్ జగన్ »అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?»బాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది»రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు»మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది» మరి చంద్రబాబు చెబుతున్నట్లు జీఎస్డీపీ 12.94 శాతానికి ఎలా పెరుగుతుంది? ‘‘చంద్రబాబు మోసాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బహిరంగ సభలో రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పాడు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లన్నారు. ఆ తర్వాత రూ.12 లక్షల కోట్లన్నారు. గతేడాది బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లని చెప్పించారు. రాష్ట్రానికి అప్పులుఎంత ఉన్నాయన్నది కాగ్ రిపోర్టులో ఉంది. 2023–24లో కాగ్ అకౌంట్స్‌లో అప్పులు రూ.4,91,734.11 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పు రూ.1,54,797.11 కోట్లు. రెండు కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,531 కోట్లు’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. – సాక్షి, అమరావతి 2018–19 నాటికి అంటే.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,57,509 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు రూ.55,508 కోట్లు. రెండు కలిపి రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయని తన తొలి బడ్జెట్లోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ అప్పులు మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా దుష్ఫ్రచారం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, అన్యాయస్తుడు అంటే.. మొన్న చిత్తూరులో గంగాధర నెల్లూరు పబ్లిక్ మీటింగ్‌లో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పాడు. ఆయన మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా కాదా? అబద్ధాన్ని ఇంతలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి.. అదే నిజమని నమ్మిస్తూ.. అందుకే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు.ప్రజల ముందు లెంపలేసుకుని గుంజీలు తీయి. అప్పుడు ప్రజలేమైనా క్షమిస్తారేమో.. అలాంటివి చేయకుండా అబద్ధాలు చెప్పడం, మళ్లీ మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్‌లో అప్పుల ప్రస్తావన కనపడకుండా మాయ చేసేందుకు ప్రయత్నించారు. బడ్జెట్ డాక్యుమెంట్ లోతుల్లోకి వెళ్లి వాల్యూమ్ 5లో బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్లో రెవెన్యూ అండ్ రిసీప్ట్స, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్టుమెంట్.. ఇలా ఇన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి రాష్ట్రానికి చెందిన అప్పులు ఎంత ఉన్నాయని మేం ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాం. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, వివరాలు సామాన్యులకు అర్ధం కాకూడదన్న దుర్బుద్ధితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చంద్రబాబు ఎంత దారుణమైన వ్యక్తో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మా ప్రభుత్వంతో పోలిస్తే.. చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. 2023–24లో రూ.62,207 కోట్లు అప్పు చేస్తే,. ఈ పెద్దమనిషి 2024–25లో రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.73,362 కోట్లు అప్పు చేసినట్లు చూపించారు. రూ.93 వేల కోట్లు అప్పులు చేసి, దాన్ని ఎడ్జెస్ట్‌మెంట్ చేసి రివైజ్డ్ ఫైనల్ ఎస్టిమేట్స్‌లో రూ.73 వేల కోట్లుగా చూపించారు. అయినా సరే మా హయాంతో పోలిస్తే ఏ మేరకు ఎక్కువగా అప్పులు చేశారో కనిపిస్తోంది. ఈ అప్పులకు తోడు అమరావతి పేరుతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణాలు రూ.15 వేలు, హుడ్కో రుణం రూ.11 వేల కోట్లు, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.8 వేల కోట్లు, సివిల్ సప్లయిస్ ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కేఎఫ్‌డబ్ల్యూ రుణం మరో రూ.5 వేల కోట్లు ప్రాసెస్‌లో ఉంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక మాదిరిగా, స్పీచ్‌లో మరో మాదిరిగా ఉంటుంది. అమరావతి కన్స్ట్రక్షన్స్ కింద రూ.6 వేల కోట్లు చూపించారు. అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?బడ్జెట్ మొత్తం అంకెల గారడీ..రాష్ట్రానికి సొంత ఆదాయం 2023ృ24లో రూ.93,084 కోట్లు వస్తే.. 2024-25లో రూ.1,01,985 కోట్లకు పెరిగిందని, 9.56 శాతం పెరుగుదల నమోదైందని బడ్జెట్లో చూపారు. కానీ కాగ్ ఆడిటెడ్ ఫిగర్స్ చూస్తే.. 2023-24లో రాష్ట్రాదాయం పది నెలల్లో రూ.72,866 కోట్లు ఉంటే 2024-25లో పది నెలల్లో రూ.72,873 కోట్లుగా చూపించారు. అంటే మైనస్ 0.01 శాతం తక్కువగా నమోదైనట్టు కనిపిస్తోంది. రెండు నెలల్లో ఏకంగా రూ.1,01,985 కోట్లకు పోతుందని చూపిస్తున్నారు. 2025-26లో 25.63 శాతం పెరుగుదల చూపిస్తూ రూ.1,28,125.82 కోట్లకు పెరుగుతుందని చూపిస్తున్నారు. ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకింత మోసాలు చేస్తున్నారు? ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు రావడంలేదు. ఇసుక మద్యం, క్వార్ట్స్, సిలికా ఏదైనా సరే చంద్రబాబు మనుషులజేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మిస్లీనియస్ జనరల్ సర్వీస్ కింద ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్లో రూ.226.43 కోట్లు చూపిస్తే 2025-26 బడ్జెట్‌కు సంబంధించి రూ.7,916.60 కోట్లుగా చూపిస్తున్నారు. మిస్లీనియస్ జనరల్ సర్వీస్ అంటే ఏమిటి? ఏ విధంగా బాదబోతున్నారో, ఏం చేయబోతున్నారో ఆర్థిక వేత్తలకు కూడా అర్ధం కావడం లేదు. ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.1,342 కోట్లు చూపిస్తున్నారు. ఈ పది నెలల కాలానికి వచ్చింది రూ.196 కోట్లు. అంటే రైతులను సిస్తు, నీటి తీరువాతో ఈ రెండు నెలల్లో బాదుతారా? ఏ విధంగా వసూలు చేయబోతున్నారు?2023-24లో మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా ఉంది. 2023-24లో పది నెలలతో ఇప్పుడు గత పది నెలల కాలాన్ని పోల్చి చూస్తే.. నాడు మేం రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు ఇప్పుడు రూ.10,854 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. మాకంటే 3.18 శాతం ఎక్కువ ఖర్చు చేశామని చూపించేందుకు రివైజ్డ్ ఎస్టిమెట్స్లో రూ.15 వేలు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చూపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2025ృ26లో మూలధన వ్యయం రూ.40 వేల కోట్లుగా చూపిస్తున్నారు. ఇంత దారుణంగా లెక్కలు చెబుతూ, మోసాలు చేస్తుంటే ఏమనాలి ఈ మనిషిని?ఈ లెక్కలన్నీ చూస్తే చంద్రబాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు. మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జీఎస్డీపీ 12.94 శాతానికి పెరుగుతుందంటున్నారు. ఎలా పెరుగుతాయి? రెవెన్యూ తగ్గుముఖంలో ఉన్నప్పుడు జీఎ‹స్‌డీపీ ఏ విధంగా పెరుగుతుంది? మూలధనం వ్యయం ఎస్క్లేట్ చేసి 2023-24 కంటే 318 శాతం అధికంగా పెంచి చేసినట్టు చూపిస్తున్నారు. ఎస్ఓపీ 2023-24 కన్నా 9.5 శాతం ఎక్కువ పెంచి చూపిస్తున్నారు. వీటన్నింటిని పెంచి జీఎస్డీపీని కూడా పెంచి 12.94 శాతం పెరుగుతుందని తప్పుడు లెక్కలు చూపుతున్నారు. 2025-26లో రూ.3,22,359 కోట్ల బడ్జెట్ అంకెల గారడి కాదా? ఇవన్నీ మోసంకాదా ? దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది!! -
వ్యవస్థలు ధ్వంసం: వైఎస్ జగన్
‘‘ఆ 143 ఎన్నికల హామీలు కాకుండా చంద్రబాబు ఇంకా ఏమన్నాడో తెలుసా..? జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలేవీ ఆగిపోవని, ఇంకా మెరుగ్గా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా అని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాత్రం సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోందంటాడు. ఆదాయం వచ్చే మార్గం ఏదైనా ఉంటే తన చెవిలో చెప్పమంటాడు. ఈ రోజు ప్రతి ఇంట్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే.. జగన్ పలావ్ పెట్టాడు..! చంద్రబాబు బిర్యానీ అన్నాడు..! ఇవాళ పలావ్ పోయింది.. బిర్యానీ మోసంగా మారింది!!’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రతి వ్యవస్థను నీరుగార్చి పిల్లల నుంచి పెద్దల దాకా రైతుల నుంచి ఉద్యోగుల వరకు మోసగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా.. ఈ పథకాలన్నీ ధ్వంసం చేశారు. రూ.25 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ.2.5 లక్షలకు తగ్గిస్తున్నారు. నిజంగా వీరు మనుషులేనా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా నాడు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. జాతీయ స్థాయిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన హయాంలో రాష్ట్రంలో 4 శాతం మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వ్యవసాయం నాశనం..వ్యవసాయాన్ని నాశనం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, ఈక్రాప్, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, పాలవెల్లువ ద్వారా సహకార రంగంలో విప్లవం లాంటివన్నీ నీరుగార్చారు. నాడు అమూల్ రాకతో పాల సేకరణ రేట్లు ఏడుసార్లు పెరిగాయి. గేదె పాలు రూ.18.29 పెరిగితే, ఆవుపాలు రూ.9.49 పెరిగింది. ఇప్పుడు హెరిటేజ్ లాభాల కోసం అమూల్‌ను లేకుండా చేస్తున్నారు. పాడి రైతుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మిర్చిపై గారడీలు.మిర్చి రైతుల విషయంలోనూ గారడీ, మోసాలే కనిపిస్తున్నాయి. 40 రోజులుగా మిర్చి రైతుల అవస్థలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు లేక పంట అమ్ముకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఒక్క రైతు నుంచి ఒక్క కేజీ మిర్చిని కూడా చంద్రబాబు కొనుగోలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదంటారు. అదే బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్లో జోక్యం చేసుకుని పరిష్కారం చూపించేశామంటారు. ఎవరికి పరిష్కారం చూపించారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ కోసం రూ.300 కోట్లు ప్రతిపాదించారు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించాం. సీఎం యాప్ ద్వారా ధరలపై నిరంతరం పర్యవేక్షించాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. క్వింటాకు రూ.300 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వచ్చింది. మిర్చి, టమాటా, పత్తి, మినుము, కందులు పెసలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. సంక్షేమ పాలన...వైఎస్సార్సీపీ పాలనలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లు పారదర్శకంగా అందచేశాం. మరోవైపు నాలుగు పోర్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. రామాయపట్నం పోర్టు 70 శాతం పూర్తి కాగా మచిలీపట్నం, మూలపేట 30 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టాం. మా హయాంలోనే ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాం. 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చేపట్టాం. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ప్రతి అవసరంలోనూ తోడుగా నిలిచాం. అమ్మ ఒడి, ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కల్యాణమస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచాం.ఐటీసీ, ప్రాక్టర్ గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి మహిళల ఆదాయాన్ని పెంచేలా తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.వెయ్యిగ ఉన్న పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్లాం. పిల్లల చదువుకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో ఎప్పుడూ చూడని సంస్కరణలు తెచ్చాం. నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలన్నీ మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణానికి బాటలు పడ్డాయి. 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను అందచేశాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు అందించాం. పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యాదీవెన, బోర్డింగ్, లాడ్జింగ్‌కు ఇబ్బంది లేకుండా వసతి దీవెన అందించాం. ఈరోజు విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మఒడి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు ధ్వంసమైపోయాయి.ఉద్యోగులకు తీవ్ర మోసంఉద్యోగులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడు. అధికారంలోకి రాగానే సీపీఎస్, జీపీఎస్ పునః సమీక్షిస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను తొలగించాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. 10 నెలలు గడిచినా ఐఆర్ ప్రకటించలేదు. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో తేదీన జీతాలు ఒకే ఒక్క నెల ఇచ్చారు. ఈరోజుకు కూడా జీతాల కోసం ఉద్యోగస్తుల ఎదురు చూపులే! ఉద్యోగుల జీపీఎఫ్, జీఎల్ఐ డబ్బులను వీళ్ల అవసరాల కోసం వాడుకుంటూనే ఉన్నారు. డీఏలు, జీపీఎఫ్‌లు, సరండర్ లీవ్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మా హయాంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 3 వేల మందిని రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7 వేల మందికి డిపార్టుమెంటల్ రివ్యూ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా పూర్తి చేయలేకపోయాం. రోస్టర్, రిజర్వేషన్, లెంత్ ఆఫ్ సర్వీస్ అన్నీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పూర్తి చేశాం. ఆ 7 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 9–10 శాతం జీతాలు పెరుగుతాయి. రెండు డీఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా పెరుగుతాయి. కానీ.. జీతాలు పెరగని పరిస్థితి ఒక్క చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నెలకొంది. పైగా బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించారు. బేసిక్ పే రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి రూ.35,431 కోట్లకు తగ్గాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్ (యూనివర్సీటీల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు) 2023–24లో రూ.3,927 కోట్లు కాగా 2025–26లో రూ.2,944 కోట్లు మాత్రమే. అంటే కొత్త వీసీలను నియమించింది ఉన్న ఉద్యోగస్తులను తొలగించేందుకేనా? రిటైర్డ్ ఉద్యోగులకూ కేటాయింపులు పెరగకపోగా తగ్గాయి. బాబు బకాయిలు మేం చెల్లించలేదా?బడ్జెట్ స్పీచ్ చూస్తే.. ఆర్థిక శాఖ మంత్రి బకాయిలు తీర్చామని, అదొక ఘన కార్యంగా చెబుతున్నారు. బకాయిలు చెల్లింపు ఏటా జరిగే ప్రక్రియ. చంద్రబాబు వదిలేసిన బకాయిలు రూ.42,187 కోట్లు మేము చెల్లించాం. డిస్కంలకు పవర్ సరఫరా చేసిన సంస్థలకు మరో రూ.21,541 కోట్లు.. ఈ రెండు కలిపితే రూ.63,724 కోట్లు. చంద్రబాబు వదిలి పెట్టిన ఈ బకాయిలు మేం చెల్లించలేదా? 12న ఫీజులపై కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలుఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పిల్లలను చదువులకు దూరం చేస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెనకింద గతేడాది రూ.3,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా చంద్రబాబు రూ.3,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ సంవత్సరం మరో రూ.3,900 కోట్లు చెల్లించాలి. ఈ రెండూ కలిపితే రూ.7,100 కోట్లు కావాలి. మరి బడ్జెట్లో ఆయన పెట్టింది కేవలం రూ.2,600 కోట్లు. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వారికి కట్టాల్సిన డబ్బులు కట్టక వారు వెళ్లిపోయారు. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసే పరిస్థితి దాపురించింది. విద్యాదీవెన, వసతి దీవెన కోసం పిల్లల తరఫున, తల్లిదండ్రుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మార్చి 12న జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. -
సచివాలయానికి ‘పచ్చ’ రంగు
‘ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు’ అన్నట్టు... వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలకు, సచివాలయాలకు పార్టీ రంగు వేశారంటూ గగ్గోలుపెట్టిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తాము అధికారంలోకి వచ్చిన తరువాత.. వరుసపెట్టి ప్రభుత్వ భవనాలకు ‘పచ్చ’రంగు పులుముతోంది. తాజాగా కృష్ణాజిల్లా, యనమలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సచివాలయాలకు పసుపు రంగులు వేస్తోంది. దీంతో జనాలంతా పై విధంగా విమర్శిస్తున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడనాన్నా... సాధించా..!గుంటూరు వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) వేడుకలు మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్డి.ఎస్.వి.ఎల్. నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థి డిగ్రీ సాధించిన క్రమంలో తన ఉత్సాహాన్ని తండ్రితో ఈ విధంగా పంచుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరుఆకర్షిస్తున్న అడుగు ఎత్తు పుంగనూరు గిత్త దూడ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణం, గునుపూడిలోని పురోహితుడు వేలూరి రామకృష్ణ గోశాలలో నందిని అనే ఆవుకు అడుగు ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ పుట్టింది. ఒక్క అడుగు ఎత్తుతో చూడముచ్చటగా కనిపిస్తోంది. సాధారణంగా పుంగనూరు ఆవు ఎత్తు సుమారు 1.5 నుంచి 3 అడుగుల మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా పుంగనూరు ఆవు గుర్తింపు పొందింది. – భీమవరం (ప్రకాశంచౌక్) నేలపై నింగి నీలిముద్ర పరిశీలించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ సుందర దృశ్యమే. మండుటెండలో ఈ నీలినీడ చూపరులను ఆకట్టుకుంది. కడప నగరంలోని చెమ్ముమియాపేట–రాయచోటి వంతెనపై మంగళవారం మధ్యాహ్నం ఈ నీలి నీడలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ కడపవేసవితాపం.. వీటితో దూరం వేసవి వచ్చిందంటే రోడ్లపై ఎక్కడికక్కడ పుచ్చకాయలు కుప్పలుపోసి అమ్ముతుంటారు. వేసవితాపం నుంచి సేదతీరేందుకు ప్రజలు కూడా వీటినే ఎక్కువగా తీసుకుంటారు. నెల్లూరు మినీ బైపాస్‌లో అమ్మకం కోసం పెట్టిన పసుపు రంగు పుచ్చకాయలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుపిలవని అతిథి విరిసిన పూలపైకి పిలవని అతిథిగా వచ్చి ఊటలూరే మకరందాన్ని ఒడుపుగా సేకరిస్తుంది తేనెటీగ. ఇలా మైళ్లకొద్ది ప్రయాణించి సేకరించిన మకరందాన్ని తేనెపట్టులో భద్రపరుస్తుంది. గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో తేనెటీగ (Honey Bee) పూల నుంచి మకరందాన్ని సేకరిస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు
సాక్షి,విజయవాడ: ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించింది. అయితే ప్రస్తుత శాసన మండలి సమావేశాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అక్రమాలు జరిగాయా? అని టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమాధానంలో అవినితీ జరిగిందని చెప్పలేదు. క్రీడా మంత్రి రాం ప్రసాద్ జవాబులోనూ అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. దీంతో మండలి సాక్షిగా టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టయ్యింది. -
బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ..!
-
బాబు పాలన.. ప్రతీ నిరుద్యోగికి 72,000 ఎగనామం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ముందు చెప్పినట్టుగా బాబు ష్యూరిటీ,, మోసం గ్యారెంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారని చెప్పుకొచ్చారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్‌లో అబద్దాలు చెప్పించారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పారు. ఇవ్వన్నీ ఎక్కడ ఇచ్చారు?. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన ఉద్యోగులు, ఉద్యోగాలు ఎక్కడ?. చంద్రబాబు అనే వ్యక్తి చేసేదంతా మోసమే.. చెప్పేవన్నీ అబద్దాలే’ అని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబత్తుల, గాదె గెలుపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. -
రిగ్గింగ్.. బూత్ క్యాప్చరింగ్.. దొంగ ఓట్లతో గెలిచారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారుపలు పోలింగ్ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు. అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కూటమి శ్రేణులకే పనులు చేయాలి
సాక్షి, అమరావతి : కూటమి పార్టీల నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పనులు చేయాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొందరు టీడీపీ, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ శ్రేణులకు మేలు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేయొద్దని తేల్చి చెప్పారు. మొన్న చిత్తూరు జిల్లాలో ఈ మాట చెప్పినందుకు వైఎస్సార్సీపీ నేతలు గుంజుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలు లంచాలు ఇచ్చి, అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారిని దగ్గరకు రానివ్వొద్దని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పని చేస్తే కూటమికి తిరుగుండదన్నారు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పని చేసిన వారిని విస్మరించకూడదన్నారు. తమపై చాలా బాధ్యతలు ఉన్నాయని, నాలుగవసారి సీఎం అయ్యానని, అన్ని విధాలా దోపిడీకీ గురైన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామని, ఖజానా చూస్తే దిక్కుతోచడం లేదన్నారు. గత ఎన్నికల్లో 57 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 63 శాతానికి ఓటు శాతం పెరిగిందని తెలిపారు.బనకచర్లపై అభ్యంతరం చెప్పొద్దుపోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణను కోరారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదంటున్నారని, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదని, పైగా స్వాగతించానని తెలిపారు. ఏటా 1000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, రాజకీయ నేతలు పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. మోదీ దేశాన్ని నడిపిస్తే తాను తెలుగుజాతిని అగ్ర జాతిగా చేయాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో వర్షం నీటిని వారు నిలబెట్టుకోలేక పోవడం వల్లే ఆనీరొచ్చి పడి విజయవాడ మునిగిందన్నారు. ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ రెడ్ బుక్ పని మొదలైందని, దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్ బుక్ గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో కూటమిదే విజయం అన్నారు. సీఎం నోట ఆ మాటలేంటి?రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాబు మాటలపై కూటమి పార్టీల నేతలే విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం.. ఇవేవీ చూడకుండా కేవలం అర్హత ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందాయని ముక్త కంఠంతో జనం చెబుతుంటే, చంద్రబాబు మాత్రం పూర్తిగా కక్ష సాధింపుతో ముందుకెళ్తుండటం దారుణం అని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అంతా తన వాళ్లేనని గత సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మొన్న చిత్తూరు జిల్లాలో ఈ వ్యాఖ్యలను పొరపాటున చేశారనుకుంటే.. ఈ రోజు వాటిని మరీ గుర్తు చేయడం కక్ష సాధింపునకు నిదర్శనమని తేలిపోయిందంటున్నారు. బాబు తీరుతో రాజకీయాలు మరింత భ్రష్టు పట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీకి రెండేనా!.. కూటమి మల్లగుల్లాలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న ఐదు సీట్లను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ స్థానాలను ఆశిస్తున్న నేతలు.. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి చేరుకుని ముఖ్యులను కలిసి తమ వాదన వినిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సోమవారం సభ ముగిసిన తర్వాత ఇదే అంశంపై చర్చించిన విషయం బయటకు పొక్కడంతో ఆశావహుల్లో ఉత్కంఠత పెరిగింది. ఇప్పటికే ఒక స్థానం పవన్ సోదరుడు నాగబాబుకు దాదాపు ఖరారైంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనమే.కూటమిలో రెండు నెలల క్రితం జరిగిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తున్నారు. అయితే, జనసేన కోసం పనిచేసిన చాలామంది పదవులు కోరుతున్నారని వారికోసం మరో ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్‌కళ్యాణ్ కోరినట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఒక స్థానం కోసం బీజేపీ పట్టు..బీజేపీ కూడా కచ్చితంగా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబడుతోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, పీఎన్వీ మాధవ్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యాయంగా అయితే సోము వీర్రాజుకు అవకాశం దక్కాల్సివున్నా.. టీడీపీ పట్ల ఆయన వైఖరి కారణంగా చంద్రబాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఒక స్థానం ఇస్తే మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. టీడీపీలో ఆశావహుల జాబితా చాంతాడంత..జనసేన, బీజేపీ కోరిక మేరకు మూడు స్థానాలు వారికి పోతే టీడీపీకి మిగిలేది రెండే. ఆ పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. చంద్రబాబు సమకాలీకులు, ఆయనతో కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కని నేతలు గట్టిగా అడుగుతున్నారు. ఈ జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నేత బుద్ధా వెంకన్న, నెల్లూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జి.మాడుగుల నాయకుడు పైలా ప్రసాదరావు, నెల్లిమర్ల నేత, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు తదితరులు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధా, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, సిట్టింగ్ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు తదితరులు కలిశారు. కొద్దిరోజులుగా పలువురు నేతలు చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటివారు 25 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది లోకేశ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పరిశీలనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలినవారి పేర్లు ఇంకా బయటకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
డీఎస్సీపై సర్కారు డ్రామాలు..
మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!– ఎన్నికల సభల్లో టీచర్ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..– తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇదే మాట చెప్పారు!సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది! ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు! రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు.. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్ ద పీపుల్’ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా? రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 13.28 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్సీపీసీఆర్ రాసిన లేఖ నోరు విప్పని సర్కారు ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్.. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది. పది లక్షల మంది పడిగాపులు..దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు.అంకెలగారడీగా మారిన రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలులో మోసం, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
‘చంద్రబాబు మీద కూడా అవే సెక్షన్లు పెట్టవచ్చు’
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చుపోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు? -
అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్
సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నాయకులకు బెయిల్ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధారాలు ఇచ్చాం.. ‘కూటమి’ తోక ముడిచింది: బొత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు.బొత్స ఇంకా ఆయన ఏమన్నారంటే..గవర్నర్ నియమించిన విసిలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకంపోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలిపోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతోంది. వైఎస్సార్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.చేనేత కార్మికులను మోసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్‌లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. -
మండలిలో లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. -
ఓటమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్
సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్‌కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.కూటమి పాలనలో రిషికొండ బీచ్‌కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్ను బీచ్‌లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. -
పోసాని కృష్ణమురళిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
-
కూటమికి ఓటేసిన వారికి మాత్రమే పథకాలందాలన్నది బాబు యోచన
-
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె విజయం
-
జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోను గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల మనస్సుల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం చేస్తోందని.. ఎవరిది విధ్వంసం అనేది ప్రజలకు తెలుసునని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై మండలిలో చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దు్రష్పచారాలను తూర్పారబట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన ప్రగతిని అంకెలు, రుజువులతో సహా వివరించారు. రవిబాబు ఏమన్నారంటే.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు కలిసి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎప్పటిలాగే తన మేనిఫెస్టోను ఏ చెత్తబుట్టలో వేశారో ప్రజలు గమనిస్తున్నారు.విశాల తీర ప్రాంతాన్ని వినియోగించుకుని ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? ఇక కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా? ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. లేక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్లో కోతలు పెట్టిన చంద్రబాబు విధ్వంసకారుడా? ఎవరు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు. సమీక్షలకు ఐదేసి గంటలు పడుతోందిటీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే.. అందులోంచి బయటకు రావడానికి చంద్రబాబు అధ్యక్షతన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వ్యవస్థను గాడిలో పెట్టేలా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్దడానికి చంద్రబాబు సమీక్షలు పెడితే ఐదేసి గంటలు పడుతోందన్నారు. -
అవి సీఎం పదవిలో ఉన్న వారు మాట్లాడే మాటలేనా?
సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటలు సోమవారం శాసనమండలిలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే వ్యవస్థలే సిగ్గుపడాలి అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తలకు చిన్న పనిచేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైన సరే ప్రజాప్రతినిధులైన సరే. వైఎస్సార్సీపీ వాళ్లకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ ఉపకారమూ చెయ్యొద్దు.వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే..’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మండలి’లో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాడికే సహాయం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఈ వ్యవస్థ సిగ్గుపడాలి.లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా? అర్హులందరికీ ప్రతి పథకం దక్కేలా చూడాల్సిన బాధ్యత గలవారు.. రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు, పార్టీలకతీతంగా, కార్యక్రమాలు చేస్తామని చెప్పాల్సిన వారు మాట్లాడే మాటలేనా ఇవి? పార్టీ మీటింగ్‌లో సీఎం మాటలు వైరల్ అవుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా. మంత్రిని (అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి) కోరుతున్నా.. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఇదేమన్నా మన సొంత ఆస్థా? ప్రజల డబ్బు, వారి మద్దతుతో ప్రభుత్వాలను నడుపుతున్నాం. సీఎం ఆ మాటలు ఎలా మాట్లాడతారు? గత ఐదేళ్లూ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధంలేకుండా, అర్హులందరికీ సాయం చేశాం.అంతేగానీ.. పార్టీల గురించి ఆలోచించలేదు’ అంటూ బొత్స మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అని చెప్పారు. అర్హులెవరికైనా పథకాలు అందకపోతే, అది తమ దృష్టికి తీసుకొస్తే వారికీ ఇస్తామన్నారు. బొత్స మళ్లీ జోక్యం చేసుకుంటూ.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వారి మాటలా? లేక పార్టీ తరఫున లేదా సీఎం తరఫున మాట్లాడుతున్నారా స్పష్టం చేయాలన్నారు.దీనిపై అచ్చెన్నాయుడు మళ్లీ వివరణ ఇస్తూ.. తాను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు.. టీడీపీ తరఫున కాదు.. ఎన్డీయే ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా అని చెప్పగా బొత్స మళ్లీ స్పందిస్తూ.. అయితే, సీఎం మాటలు అబద్ధమా అని ప్రశ్నించారు. ఇంతలో మండలి చైర్మన్ మరో మంత్రి పార్థసారథికి అవకాశం ఇవ్వడంతో ఈ అంశానికి అక్కడితో బ్రేక్ పడింది. అనంతరం.. మీడియా పాయింట్ వద్ద కూడా బొత్స మాట్లాడారు.అమరావతిపై ఒక విధానం లేదుఅమరావతి రాజధాని విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదని, 2014–19 మధ్య ఇదే టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లే ఖర్చుచేసిందని.. పైగా అవి తాత్కాలిక భవనాలని చెప్పారని, ఇప్పుడు శాశ్వత భవనాలంటూ టెండర్లు పిలిచారని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ‘మండలి’లో టీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని స్మశానం అన్నారంటూ విమర్శించారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని చూడటానికి రావాలని కొందరు కోరడంతో.. అమరావతి నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లతో భవనాలు కట్టారని, అంతకుమించి అక్కడ చూడడానికి ఏం అభివృద్ధి జరిగిందని మాత్రమే అన్నానని బదులిచ్చారు.వాస్తవానికి.. అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలేనని అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, పైగా దానికి కూడా ఏకంగా అడుగుకి ఏకంగా రూ.10,500 వెచ్చించారన్నారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఇది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు తంతు కాదు కదా అని బొత్స ఎద్దేవా చేశారు. అవి తాత్కాలికమని చెప్పలేదుమంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ఇవి తాత్కాలిక భవనాలు అని తామెక్కడా చెప్పలేదని, కొత్తగా శాశ్వత భవనాలు కట్టేవరకు వీటిని వాడుకుంటామని మాత్రమే చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని వదిలేశారని, విశాఖ రుషికొండ నిర్మాణాల్లో ఎంతో దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రుషికొండ కాంట్రాక్టర్‌కు వేరే పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చామన్నారు.ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. అప్పట్లో మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానంగా తీసుకున్నామని.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. వాస్తవాలను మరుగుపరిచి మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలు ఎవరివని.. ప్రభుత్వానికి ఆ భవనాలను వాడుకోవడం చేతగాక విమర్శలు ఎందుకని బొత్స ప్రశ్నించారు.రుషికొండలో టూరిజానికి చెందిన పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించామని, అందులో అవినీతి, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టిన ఇప్పుడా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించారని కూడా ఆయన నిలదీశారు. ఇదే విషయం వారి గెజిట్ వచ్చిందని.. అంటే రుషికొండ నిర్మాణాలు సక్రమమే కదా అని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతామని బొత్స ఘాటుగా బదులిచ్చారు. -
గెలిచినోడే... మా వాడు!
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ.. తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్‌కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్‌తో పాటు లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు... ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు!!పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘రఘువర్మకే కూటమి మద్దతు’ అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు.ఇవే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్టు మాట్లాడారు. ‘‘మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.... స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలు పెట్టారు.బుట్టలో వేసుకునే యత్నం...!వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచీ గాదె శ్రీనివాసులు నాయుడుకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ది చెప్పారన్న అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాదె గెలుపు దిశగా వెళుతున్న సమయంలో ... నేరుగా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్ ద్వారా గాదెతో మాట్లాడినట్టు చెబుతున్నారు. రఘువర్మ విజయానికి పనిచేయాలని పిలుపునిస్తున్న మంత్రి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అదితి తదితరులు రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ... మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని... గాదె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గాదె తమ వాడేనని.... గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. -
బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్’ స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్‌బుక్ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్ కమిషనర్ ఫోన్ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది. సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం కోసం పోటాపోటీ... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. రాజకీయ జోక్యంతో...! టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. కూటమికి చెంపదెబ్బ: బొత్ససాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.విశాఖ ఏయూలోని కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బంది అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా! : గాదెతమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు. ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు. కూటమికి కౌంట్‌డౌన్ : ధర్మాన కృష్ణదాస్నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్‌డౌన్ మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితంఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి, గడ్డం సు«దీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.ఆధిక్యంలో ఆలపాటిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 84,595, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి తొలిరౌండ్ ఫలితాల వెల్లడిసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్‌కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్‌కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్‌లో మార్పులు చేశారు. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, సీఎఫ్ఎంఎస్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. – డాక్టర్ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీఆర్టీయూపాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం. – హృదయరాజు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడుకూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి గెలిపించుకున్నాయి. – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధంఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత -
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
ఏపీ వ్యాప్తంగా పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 16 కేసులు నమోదు
-
చంద్రబాబు మీది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం
తిరుపతి జిల్లా: చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను ఆమె పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి ,అక్రమంగా ఇరికించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైఎస్సార్సీపీ శ్రేణులు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్‌తో ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ,మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు? బటన్ నొక్కడానికి వైఎస్ జగన్ అవసరం లేదన్నారు. అదే బటన్‌ను చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైఎస్ జగన్ చేసిన ఏ ఒక్క హామీని ప్రజలకు చేరవేయడం లేదురెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే రేపు అదే రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. వైఎస్సార్సీపీకి సహాయం చేయొద్దన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? రాష్ట్రానికి ముఖ్యమంత్రా?చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి. వైఎస్సార్సీపీ హాయంలో 30 వేల మహిళలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా?’అని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ దాడి
-
చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం
సాక్షి, అమరావతి: సీఎం హోదాలో చంద్రబాబు రాజ్యాంగ ద్రోహానికి స్వయంగా పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన రాజ్యాంగబద్ధ పదవీ స్వీకార ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవజు్ఞడినని పదేపదే చెప్పుకునే ఆయన రాజ్యాంగం అంటే తనకు లెక్కలేదన్న రీతిలో బరితెగించారు.వైఎస్సార్సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చెయ్యొద్దని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశించడంపై రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో పదవీ స్వీకార ప్రమాణం పవిత్రత, నిబద్ధత గురించిస్పష్టంగా వివరించారు. అసలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన చేసిన పదవీ స్వీకార ప్రమాణం అర్థం తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాయడమే.. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రయోజనం కలిగించడం ప్రభుత్వ ధర్మమని రాజ్యాంగం విస్పష్టంగా ప్రకటిస్తోంది. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, రాజకీయ, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా ప్రజలకు అన్ని హక్కులను రాజ్యాంగం కల్పించింది. ఆ విషయాన్ని రాజ్యాంగంలోని నిబంధనలు 14, 21లలో పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకునే పాలకులు ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి.అంతేగానీ.. రాజకీయ కారణాలతో ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందకుండా చేయడమంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే. ఇలా పాల్పడే వారిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను సవాల్ చేస్తే న్యాయస్థానాలు ఇలా స్పందించే అవకాశముందని వారు చెబుతున్నారు. అదెలాగంటే.. ⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్–123 ప్రకారం అది అవినీతి కార్యకలాపాలకు కిందకు వస్తుంది. అందుకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని న్యాయస్థానాలు పిలిచి వివరణ కోరవచ్చు. ⇒ రాజ్యాంగంలోని ఆర్టీకల్–226 ప్రకారం.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు మాండమస్, కో–వారెంట్ వంటి రిట్లు జారీ చేయవచ్చు. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆదేశించవచ్చు. ⇒ రాజ్యాంగంలోని ఆర్టీకల్–32 ప్రకారం.. ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు రిట్ జారీచేయవచ్చు.రాజ్యాంగ ధర్మాన్ని పాటించిన జగన్.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తన రాజ్యాంగబద్ధ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటించారు. ‘కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. చివరికి పార్టీలు కూడా చూడం.. మీరు ఎవరికి ఓటేశారో అన్నది మాకు సంబంధంలేదు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం కల్పిస్తాం’.. అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.తన ఐదేళ్ల పదవీ కాలంలో అదే విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేశారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకివ్వాలని కొందరు ప్రశ్నిస్తే ఆయన వారిపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలను ఓటర్లుగా చూడదని తేల్చిచెప్పారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ మేలు చేయాలన్నదే తమ విధానమని ఆయన తేలి్చచెప్పారు. అలాగే, ఐదేళ్లపాటు అదే విధానాన్ని చిత్తశుద్ధిగా అమలుచేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు చేసిన పదవీ స్వీకరణ ప్రమాణం ఏమిటంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’.. అని చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్ చేయించిన తరువాతే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లిలో శనివారం చంద్రబాబు ఏమన్నారంటే.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయకూడదు’.. అని ఆదేశించారు. అంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. సీఎంగా రాజ్యాంగబద్ధమైన తన బాధ్యతలను ఉల్లంఘించారు. -
లోకేశ్ లెక్కలతో టీడీపీలో తికమక!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో వాటి కోసం కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. సంఖ్యా బలం ప్రకారం ఈ ఐదు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లే పరిస్థితి ఉండడం, సీఎం తనయుడు లోకేశ్ వాటిని ఎవరికివ్వాలో నిర్దేశించే స్థితిలో ఉండడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురవుతూ తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానాల సిట్టింగ్ నేతలైన యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పి అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తిలకు మళ్లీ అవకాశం దక్కడం కష్టమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.యనమల రామకృష్ణుడికి దాదాపు తలుపులు మూసుకుపోయాయి. ఆయన కూతురు ఎమ్మెల్యేగా, అల్లుడు ఎంపీగా ఉండడంతోపాటు ఇటీవల అధిష్టానంతో తేడా రావడమే ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరికీ మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు తర్వాత మంత్రివర్గం కూర్పు, రాజ్యసభ సభ్యుల నియామకం, నామినేటెడ్ పదవులు, అధికారుల పోస్టింగ్లన్నింటినీ సీఎం కుమారుడిగా మంత్రి లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన కోటరీలో ఉన్న వారికి, ధనబలం ఉన్న వారికి మాత్రమే ఆయన అవకాశం ఇస్తున్నారు. అందుకే పార్టీలో సీనియర్లు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్నారు.మమ్మల్ని పట్టించుకోండి మహాప్రబో..ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభాకర్ చౌదరి, కర్రి బంగార్రాజు, కేఎస్ జవహర్, హనుమంతరాయ చౌదరి, రమే‹Ùరెడ్డి, అప్పలనాయుడు వంటి నేతలు తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ప్రాధేయ పడుతున్నారు. బుద్దా వెంకన్న, పీతల సుజాత, వర్ల రామయ్య, అశోక్‌బాబు వంటి నేతలు కూడా తమకు ఆ పదవి కేటాయించాలని కోరుతున్నారు. ఇలాంటి ఆశావహుల జాబితా టీడీపీలో చాలా పెద్దగానే ఉంది. వారంతా చంద్రబాబును కలుస్తున్నా, ఆయన చినబాబును కలవాలని చెబుతున్నారు.పార్టీ కోసం ఎవరు బాగా పని చేశారో, ఎవరి అవసరం పార్టీకి ఉందో సర్వే చేయిస్తున్నామని, దాని ప్రకారం స్థానాలు కేటాయిస్తామని చెబుతున్నారు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు, ఆశావహులు లోకేశ్‌ను కలవడం కోసం తెగ పాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో పవన్ కోసం పని చేయించారు.ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు పార్టీలో కరివేపాకులా మారిపోయారు. ఎమ్మెల్సీ ఇచ్చి తన పరువు కాపాడాలని ఆయన చంద్రబాబును, లోకేశ్‌ను వేడుకుంటున్నారు. అయితే అది ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. బుద్దా వెంకన్న వంటి వారైతే జగన్‌ను తిట్టడంలో ఛాంపియన్ అనిపించుకుని ఎమ్మెల్సీ పదవి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నా, అది అంతగా ఫలించక పోవచ్చని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. లోకేశ్ మనసులో వేరే వారు ఉన్నారని, ఆయన లెక్కలు వేరని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నాగబాబుకు పక్కా.. మరోవైపు ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వడం ఖాయమని కూటమిలోని ఒక సీనియర్ నేత తెలిపారు. త్వరలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన అన్న మంత్రివర్గంలోకి వస్తారని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లాంఛనమేనని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఒక స్థానాన్ని కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే బీజేపీకి ఎక్కువ అవకాశం కల్పించామని, ఈసారికి ఇవ్వలేమని టీడీపీ పైకి చెబుతున్నా, అగ్ర నేతలు జోక్యం చేసుకుంటే ఒకటి బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!
అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూములు రిటర్న్‌బుల్ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్ డీడ్ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్లో అసైన్డ్ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగుతుండగా.. మరోపక్క అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్ భూములకు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూడదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. -
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
బరితెగించిన పచ్చ సైకోలు.. వైఎస్ జగన్ అభివృద్ధి శిలాఫలకాల ధ్వంసం
-
జెడ్పీ నిధులపై తమ్ముళ్ల కన్ను
లేపాక్షి: జెడ్పీ నిధులు కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు కన్నేశారు. గ్రామీణా ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆరు నెలల కిందట మండాలనికి జెడ్పీ నుంచి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ.40 లక్షల నిధులతో పనులు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడు నిధులు మంజూరు చేయించుకున్నాడు. రెండో విడతలో వచ్చిన రూ. 64 లక్షల జెడ్పీ నిధులు సైతం తనకే దక్కాలంటూ ఆయనతోపాటు ఆయన వర్గీయులు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే అదే పార్టీకి చెందిన మరోవర్గం వారిని అడ్డుకుంటున్నారు. మండలంలోని కంచిసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఉన్న విబేధాలు భగ్గుమంటున్నాయి.అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడున్న రెండు వర్గాల నాయకులు సర్పంచ్‌ను డమ్మీ చేశారు. పంచాయతీకి మంజూరైన జిల్లా పరిషత్ నిధులను చేజిక్కించు కోవడానికి హిందూపురం పట్టణానికి చెందిన ఓ నాయకుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సర్పంచ్‌ను కాదని పనులు చేయడానికి అధికారులతో కుమ్మక్కై తీర్మాణాలు కూడా చేయించాడు. టీడీపీలో మరో వర్గం నాయకులు స్థానికంగా ఉండే నాయకులే పనులు చేయాలని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం వుందని సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీలో సమావేశం కంచిసముద్రం పంచాయతీలో జెడ్పీ నిధులతో పనులు చేయడానికి శనివారం సమావేశం ఏర్పాటు చేసారు. వార్డు సభ్యులు అందరూ అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి అజెండా కాపీలను జారీ చేశారు. అయితే 12 మంది వార్డు సభ్యుల్లో నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అజెండాలో ఉన్న అంశాలను కార్యదర్శి సభ్యులకు చదివి వినిపించకుండా సంతకాలు తీసుకున్నారు. వారు సంతకాలు చేసిన వెంటనే తీర్మానం చేశామనే సాకుతో వెళ్లి పోయారు.దళిత సర్పంచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అధికార పార్టి నాయకుడు హిందూపురం పట్టణానికి చెందిన గ్రీన్ పార్కు నాగరాజుతో పాటు ఆయన అనుచరులు దళిత మహిళా సర్పంచ్ అయిన నన్ను ప్రతి విషయంలోను అగౌరవ పరుస్తున్నారు. పంచాయితీ నిధులు కేటాయింపుల్లో తన ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారు. దళిత మహిళ సర్పంచ్‌కు ఇచ్చే గౌరం ఇదేనా సర్పంచ్ గంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం: శైలజానాథ్
అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకులు శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.రెడ్‌బుక్ పేరుతో లోకేష్ అరాచకలు..మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌దే’ అని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ యూత్ లీడర్ ఈశ్వర్ అరెస్ట్
నర్సీపట్నం(అనకాపల్లి): కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తూ వైఎస్సార్సీపీశ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్ట్ లకు తెరతీసింది. ఆదివారం నర్సీపట్నం వైఎస్సార్సీపీయూత్ లీడర్ ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయింది అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. ఈశ్వర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయన్న పాత్రుడు పని చేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పని చేస్తున్నారు. ఈ శ్వర్ పై పెట్టిన కేసు అక్రమ కేసని పోలీసుల మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ అయ్యన్న ఒత్తిడి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కల్గించింది’ అని పేర్కొన్నారు.ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నేత వల్లభనేని వంశీతో పాటు, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పచ్చ పగ.. పచ్చి బూతులు
-
AP: ఉద్యోగులకు ఉత్తచెయ్యి
సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్‌కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డీఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్‌లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్‌తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పీఆర్సీ ఆశలపై నీళ్లుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్‌పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘జల్‌జీవన్’కు రాజకీయ జాఢ్యం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటుకు అమలు చేస్తున్న జల్‌జీవన్ కార్యక్రమానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికి మళ్లీ అనుమతిస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, కుళాయిల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 పనులను రద్దు చేసింది. వీటిల్లోని 7,792 పనులను తిరిగి కొనసాగించేందుకు శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రద్దు చేసిన పనుల విలువ రూ.10,680.50 కోట్లు కాగా.. వాటిలో తిరిగి కొనసాగించాలని నిర్ణయించిన పనుల విలువ రూ.2,210 కోట్లు. ఎన్నికల్లో అందరికీ అని హామీ ఇచ్చి..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ ఉమ్మడి మేనిఫెస్టోలో ‘ఇంటింటికీ తాగునీరు–ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్’ అంటూ హామీ ఇచ్చారు. కానీ, వీరి ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది కేవలం మూడు లక్షలకే. ఈ హామీ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 25.08 లక్షల ఇళ్లకు కుళాయిల ఏర్పాటు పనులను రద్దు చేసేదే కాదు. పైగా.. అలా రద్దయిన వాటిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ నేతలు సూచించిన కొన్ని పనులను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమే అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కుళాయిలు..వాస్తవానికి.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లుండగా.. 2019 ఆగస్టు 15 వరకు అంటే గత 72 ఏళ్లుగా కేవలం 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్తగా 39.71 లక్షల ఇళ్లలో ఏర్పాటుకాగా, ఇందులో 39.34 లక్షల కుళాయిలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఇంకా 25.08 లక్షల ఇళ్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను: చంద్రబాబు
చూశారా.. ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో! తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది.. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది.. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలని అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది.. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది.. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చేయాలన్న ఆరాటం ఒకరిది.. మనవాళ్లు కాని వారందరినీ అణచి వేయాలన్న కుట్ర మరొకరిది.. చిత్తూరు అర్బన్/ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయ పరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం విస్తుగొలిపింది.విజనరీనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. సీఎం స్థానంలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం తగదంటున్నారు. నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా.. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదేపదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరా అందరితోపాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదట! ఓ వైపు రాష్ట్రంలో ఆదాయం లేదని, ఏం చేయాలో దిక్కు తోచడం లేదని చెప్పుకొచి్చన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించేశానని లేని గొప్పలు చెప్పడం విస్తుగొలుపుతోంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియడం లేదని అంటూనే వృద్ధి రేటు పెంచేశానని చెప్పుకోడం పచ్చి అబద్ధమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయం అంతా తన చుట్టూ ఉన్న వారికి కమిషన్ల రూపంలో దోచిపెట్టి.. ‘నీకింత.. నాకింత’ అని పంచుకోవడానికే సరిపోతోందని అంటున్నారు.నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తూ.. వాటిలో కమిషన్లు కొట్టేస్తూ ఆదాయం లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం వైఎస్సార్సీపీ నేతలను తిట్టిపోశారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పుల నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని.. తానొక్కడినే పరుగెడుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారి బాగోగులను చూసే బాధ్యత తనదన్నారు. సూపర్ సిక్స్ హామీల సంగతి చెప్పవయ్యా అంటే.. ఆకాశానికి నిచ్చెన వేసేలా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం అన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. ఎనిమిది, పదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ పిల్లల్ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు.. వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడటం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనస్సును ఎంతగా గాయ పరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం.. వాసు, సెల్వి దంపతుల ఇంట్లోకి వెళ్లి పింఛన్ డబ్బులిచ్చారు. ‘సార్ కాస్త నీళ్లు తాగండి..’ అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా.. ‘అవి వద్దమ్మా.. నా వద్ద ఉన్న నీటినే తాగుతాను’ అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు. సర్పంచ్ వి.సి. సుబ్రమణ్యం యాదవ్ వైఎస్సార్సీపీకి చెందిన వారని వేదికపై చోటు కల్పించలేదు. -
ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి ఎసరు!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రతినెలా లబ్దిదారుల ఇళ్ల వద్దనే విజయవంతంగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి టీడీపీ కూటమి ప్రభుత్వం క్రమంగా తూట్లు పొడుస్తోంది. లబ్దిదారుని ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఎక్కడైనా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో శనివారం రాష్ట్రంలో అనేకచోట్ల లబ్దిదారులను ఒకచోటకు పిలిపించుకుని పంపిణీ చేశారు. లబ్దిదారుని ఇంటి వద్ద కాకుండా వేరేచోట పింఛను పంపిణీ చేసేటప్పుడు నిర్ణీత కారణాన్ని మొబైల్ యాప్‌లో నమోదుచేసి డబ్బులు పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. సాధారణంగా.. అత్యధిక గ్రామాల్లో 2,000 మంది లోపే జనాభా నివాసం ఉంటారు. అంటే.. ఆయా గ్రామాల మొత్తం విస్తీర్ణం కూడా ఆ 300 మీటర్ల పరిధిలోపే ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం లబ్దిదారులను ఒకచోటకు పిలిపించే కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షణ.. కర్నూలు జిల్లా కోసిగి సచివాలయం–4 పరిధిలోని సిద్దప్పపాళెం సూగూరేశ్వర దేవాలయం వద్ద పింఛన్లు అందించారు. అలాగే, కోసిగికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పీకలబెట్ట పొలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న లబ్దిదారులు సచివాలయం–2 వద్ద ఉ.9 నుంచి సా.4.30 గంటల వరకు తిండితిప్పలు మానుకుని పడిగాపులు పడ్డారు. ప్రతినెలా ఇలాగే అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఇక విజయవాడ వన్‌టౌన్, ఏలూరు తూము సెంటర్లో లబ్ధిదారులు పింఛన్ల కోసం మండేఎండలో నిరీక్షించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా లబ్దిదారులందరినీ రోడ్డు మీదే నిలబెట్టి పెన్షన్లు అందజేశారు. జగనన్న హయాంలో తెల్లవారకముందే ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు ఎక్కడ, ఎప్పుడిస్తారోనని ఎదురుచూడాల్సి వస్తోందని వారంతా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడియో ప్రచారంతో పంపిణీలో జాప్యం.. మరోవైపు.. ప్రభుత్వం కొత్తగా ఈనెల నుంచి పింఛన్ల పంపిణీలో చేపట్టిన ఆడియో ప్రచార కార్యక్రమం కారణంగా అనేకచోట్ల పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది. సర్వర్ సమస్యలవల్ల కూడా పలు ప్రాంతాల్లో ఆలస్యమైంది. అలాగే, నెట్వర్క్ ప్రాబ్లం పేరుతో అందరినీ ఒకేచోటకు పిలిపించి పంపిణీ చేశారు. దీంతో.. వికలాంగులు, వృద్ధులు అతికష్టం మీద పింఛన్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకుని అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వచ్చింది.గతనెల 63.53 లక్షలు.. ఈనెల 63.36 లక్షలే.. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 63,53,907 మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మార్చి ఒకటిన పంపిణీకి మాత్రం 63,36,932 మందికి మాత్రమే మంజూరు చేసింది. నెలరోజుల్లో పింఛన్ల సంఖ్య 16,975 తగ్గడం గమనార్హం. దీంతో.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు తగ్గిన పింఛన్ల సంఖ్య 2.06 లక్షలు. -
ఐసీఐసీఐ కుంభకోణంలో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన టీడీపీ నేతను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము కాజేసిన ఈ కుంభకోణంలో ఈ టీడీపీ నేతే సూత్రధారి అని అప్పట్లోనే తేటతెల్లమైనా, ఆయన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆయన అరెస్టుకు సుదీర్ఘకాలం పట్టింది. కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న బ్యాంకు మేనేజర్ దూడ నరేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రూ. 35 కోట్ల అజిత్‌కుమార్, ఆయన తల్లి ఖాతాల్లో జమ అయినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అజిత్ కుమార్‌ను అరెస్టు చేయక తప్పలేదు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించటంతో నెల్లూరు జైలుకు తరలించారు. అరెస్టు సందర్భంగా అజిత్‌కుమార్, అయన సోదరుడు దీపక్ సీఐడీ అధికారులపై దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన తనను అరెస్టు చేస్తారా అంటూ ఎదురు తిరిగాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజిత్కుమార్పై కేసు నమోదు చేసిననట్లు రూరల్ ఎస్ఐ అనిల్‌కుమార్ చెప్పారు. టీడీపీ నేతగా హల్చల్ ఈ కుంభకోణం వెలుగు చూసిన వెంటనే మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా విడదల చేశాడు. ఇందులో కీలక సూత్రధారి సింగ్ అజిత్‌కుమార్ అనే విషయం అప్పట్లోనే వెల్లడైంది. తనకు టీడీపీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని, పార్టీ ఫండ్‌గా రూ. 4 కోట్ల ఇచ్చానని, టీడీపీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకొన్నారు. ఎన్నారైగా చెప్పుకుంటూ పెద్ద కాన్వాయ్, దాంట్లో బౌన్సర్లతో హల్చల్ చేసేవాడు. అమెరికాలో ఉంటున్నట్లు చెప్పుకున్నప్పటికీ, తరుచూ స్వగ్రామానికి రావడంతో స్థానికుల్లోనూ అనుమానాలు ఉండేవి. ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ప్రత్తిపాటి పుల్లారావుకు రావడంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశాడు. ఆయనకు ఎలక్షన్ ఫండ్ కింద రూ. 2 కోట్లు ఇచ్చినట్టు సైతం ప్రచారంలో ఉంది. ఇదీ జరిగింది.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో ఖాతాదారుల సొమ్ము కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గతేడాది అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పలువురు ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడంతోపాటు గోల్డ్ లోన్లు పొందారు. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు రావడంతో వారి ఖాతాల్లో డిపాజిట్లు మాయమైనట్లు తేలింది. దీంతో బాధితులు పెద్దఎత్తున బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ హెడ్ రమేష్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి చేరుకొని విచారణ జరిపి, కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. 2017 నుంచి చిలకలూరిపేట బ్రాంచి మేనేజర్‌గా వ్యవహరించిన దూడ నరేష్ చంద్రశేఖర్ ఈ గోల్‌మాల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన 2021లో నరసరావుపేట, 2023లో విజయవాడలోని భారతీనగర్ బ్రాంచికి బదిలీ అయ్యారు. 2024లో చిలకలూరిపేట బ్రాంచి కుంభకోణం వెలుగు చూడటంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. -
‘రియల్’ ఢమాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖలో ‘రియల్’ రంగం ఆటుపోట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! టీడీపీ కూటమి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో అస్థిర వాతావరణం నెలకొంది. తింటే గారెలే తినాలి... కొంటే వైజాగ్‌లోనే ఇల్లు కొనాలనే పరిస్థితి నుంచి రాజకీయ కుట్రలకు బలవుతామేమోనన్న భయంతో కొనుగోలుదారులు ఇతర నగరాలవైపు చూస్తున్న పరిస్థితి తలెత్తింది. గతేడాది దేశవ్యాప్తంగా టైర్–2 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినా విశాఖలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. గృహ విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ నివేదికలో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. అమ్మకాల్లో అట్టడుగున విశాఖ దేశవ్యాప్తంగా 15 ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే నిర్వహించింది. టైర్–2 నగరాల్లో విశాఖలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గృహ విక్రయాలు బాగా పడిపోయిన నగరాల్లో విశాఖ సైతం టాప్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. విశాఖతో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, నాసిక్, జైపూర్, నాగపూర్, భువనేశ్వర్, మొహాలీ, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్, త్రివేండ్రంలో 2024లో ఇళ్ల అమ్మకాలు, నూతన గృహాల నిర్మాణాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే చేపట్టింది. విష ప్రచారంతోనే.. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేలా అడుగులు వేసింది. నగరంలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపింది. గత ప్రభుత్వ కృషితో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే విశాఖపై కూటమి పారీ్టలతో పాటు ఎల్లో మీడియా అక్కసు పెంచుకుంటూ వచ్చాయి. ఏటా సముద్ర మట్టం పెరిగి విశాఖ మునిగిపోతుందంటూ తప్పుడు కథనాలు వెలువరించాయి. నగరంలో భూ కబ్జాలు, హత్యాకాండలు అంటూ దు్రష్పచారానికి తెర తీశాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖలో ఒక్కసారిగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ఈ ప్రభావం ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ రంగంపై పడింది. ఫలితంగా మిగిలిన టైర్–2 నగరాలతో పోలిస్తే విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 21 శాతం తగ్గాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మినహా కొత్తవి ఏవీ పట్టాలు ఎక్కకపోవడానికి విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోయంబత్తూర్‌లో అత్యధికం2024లో టైర్ 2 సిటీల్లో గృహ విక్రయాలు నాలుగు శాతం పెరగగా విలువ పరంగా 20 శాతం వృద్ధి కనిపించింది. 15 నగరాల్లో 1,78,771 యూనిట్లు విక్రయించగా వీటి విలువ రూ.1,52,552 కోట్లుగా ఉంది. 2023లో రూ.1,27,505 కోట్ల విలువైన 1,71,903 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏకంగా 36 శాతం వృద్ధితో కోయంబత్తూర్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. అమ్మకాల విలువ పరంగా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే విక్రయాల విలువలో 47 శాతం వృద్ధి రేటును భువనేశ్వర్ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో రూ.49,421 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2023లో రూ.42,063 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది. ఏడాదిలో ఎంత తేడా ఏడాదిన్నర క్రితం వరకూ రియల్ బూమ్‌తో ఉప్పొంగిన విశాఖ ఇప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అధికార పార్టీ నేతల భూ దందాలతో క్రయ విక్రయాలు సుప్తావస్థలోకి చేరుకున్నాయి. ఫలితంగా విశాఖలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 2023లో విశాఖలో 5,361 ఇళ్లు అమ్ముడు కాగా 2024లో ఇది 4,258కి పడిపోయింది. ఇళ్ల నిర్మాణ విషయంలోనూ విశాఖలో తిరోగమనం కనిపించిందని ప్రాప్ ఈక్విటీ సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా విశాఖలో ఏటా సగటున 4,997 కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. గతేడాది మాత్రం దాదాపు 8శాతం తగ్గుదల నమోదైంది. అటు విక్రయాలతో పాటు ఇటు నిర్మాణాల్లోనూ విశాఖలో రియల్ రంగం తిరోగమనంలోనే సాగుతోంది. -
మాయలేళ్లూ... మరీచికలు!
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
సాక్షి, అమరావతి: పోసాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సినీ నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం. ‘‘వ్యక్తిగతంగా నాకు భారీ నష్టం జరిగినప్పటికీ, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అంటూ ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.కాగా, పోసాని కృష్ణమురళి విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. పోసాని అనారోగ్యంతో ఉన్నా కానీ కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తమ దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారంటూ సంబేపల్లి ఎస్ఐ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెల్లారిందాకా జీపులోనే తిప్పుతూ పోసానిని ఖాకీలు తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. 27న మధ్యాహ్నం ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు. అక్కడ ఏకంగా తొమ్మిది గంటల పాటు విచారించారు. -
‘మేం చర్చకు సిద్ధం ...మీరు సిద్ధమా?’
విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తూ జగన్ పాలన పై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ అవినాష్.. ఇరు ప్రభుత్వాల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరినీ మోసం చేసింది. ఈ బడ్జెట్ చూసి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. రైతులను,విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళల్ని మోసం చేశారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో టార్గెట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకులు హింసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడితే పార్టీ అండగా ఉంటుంది’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. -
కర్నూలు ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడని మంత్రి టీజీ భరత్
-
ఏపీ బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30,000 కోట్ల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్ లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్లో దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్క నెలలో మాత్రమే దానిని కార్యరూపంలో చూపించారు. గత ఎనిమిది నెలల నుంచి ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ, డీఏ ఎరియర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సకాలంలో ఇవ్వాల్సని బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.తాత్కాలిక ఉద్యోగులను మోసం చేశారుఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీని నేటికీ నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మా ప్రభుత్వం రాగానే అయిదు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింద పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకువచ్చారు. వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సీ ఉంది. గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి, వారిలో మూడు వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏడు వేల మందికి ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామసచివాలయాల్లో పదిహేను వేలు, రైతుభరోసా కేంద్రాల్లో ఆరువేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం.మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వ దగాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మెగా డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫైల్‌గా దీనిపైనే సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్ షెడ్యూల్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఇవ్వేవీ చేయకుండా బడ్జెట్లో డీఎస్సీ కింద 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే వచ్చే అయిదేళ్ల పాటు ఇదే చెప్పుకుంటూ పోతారా? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పారు.అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తున్నామంటూ బడ్జెట్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే అమలు జరిగిపోతోందోని చెప్పడం ఎంత వరకు సమంజసం? పోలీస్ విభాగంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.920 కోట్లు ఉంటే, దానిలో రూ.250 కోట్లు చెల్లించామని చెప్పుకున్నారు. మిగిలిన బకాయిల విషయం ఏమిటనే దానిపై స్పష్టత లేదు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు డీఏలు బకాయి పెట్టారు. ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే డీఏ ఇస్తుంటారు. దానిని కూడా మూడు విడతలు బకాయి పెట్టడం దారుణం. నిరుద్యోగభృతి అమలుకు కేటాయింపులు లేవు. కొత్త ఉద్యోగాల భర్తీకి గానూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదీ? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకు గత ప్రభుత్వం అప్కాస్ ను తీసుకువచ్చింది. దానిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం దళారీల వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు సంబంధించిన హెల్త్ కార్డ్ లకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటాను వారు చెల్లిస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల కుమ్ములాట
-
అధికారం అండతో.. బరితెగింపు
మదనపల్లె : రెడ్‌బుక్ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. అధికారంలో ఉన్నది తామేనన్న అహంతో కళ్లు కనిపించక ఏకంగా రెవెన్యూ అధికారులపైనే దాడులకు పాల్పడుతున్నారు. ఆక్రమణలకు అడ్డువచ్చిన అధికారులను మారణాయుధాలతో హత్యచేసేందుకు వెనుకాడటం లేదు. రెండురోజుల క్రితం మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్...సర్వే నంబర్.1029లో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై మారణాయుధాలతో దాడికి పాల్పడి, జేసీబీకి నిప్పుపెట్టి బెదిరింపులకు పాల్పడిన భూకబ్జాదారుడు టీడీపీ నాయకుడేనని తెలిసింది. టీడీపీలోని ప్రధాన నాయకుల అండదండలతో మదనపల్లె పట్టణం, మండలంలో సుమారు రూ.2కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాలను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకోవడమే కాకుండా, వాటిని యథేచ్ఛగా ఇతరులకు లీజు అగ్రిమెంట్‌పై విక్రయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత జోరు పెంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దేవతానగర్‌లోని ప్రభుత్వ గయాలు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడం, అడ్డువచ్చిన రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడటం జరిగింది. రెవెన్యూ అధికారులపై భూకబ్జాదారుడి దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన నిందితుడు చలపతి ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిగ్గుతేల్చాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాలపై...దేవతానగర్ సర్వేనెం.1029లోని ప్రభుత్వ గయాలు స్థలం, బీకే.పల్లె సర్వేనెంబర్.516/1లో 6 సెంట్ల స్థలంలో రెండు పునాదులు, రెండు షాపురూములు, కోమటివానిచెరువు సమీపంలోని ఎస్బీఐ కాలనీలో ఇంటిస్థలం, సీటీఎం క్రాస్‌రోడ్డులో ఇంటిస్థలం ఆక్రమించినట్లు నిర్ధారించారు. దీంతో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, ఆక్రమణలను తొలగించడంతో పాటుగా, అక్రమనిర్మాణాలను నేలమట్టం చేయాల్సిందిగా ఆదేశించారు. బుధవారం రాత్రి వరకు పట్టణంలోని ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, గురువారం ఉదయం సీటీఎం క్రాస్‌లోని అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే..ఆ స్థలంలో భైరవేశ్వర ఎలక్ట్రికల్స్, హార్డ్వేర్స్ పేరుతో దుకాణం ఉండటంతో ఖాళీ చేయాల్సిందిగా అధికారులు కోరారు. దుకాణదారుడు...తాను రూ.10లక్షలకు చలపతి నుంచి స్థలాన్ని కొనుగోలు చేశానని, 20లక్షలకు పైగా ఖర్చుచేసి దుకాణాన్ని నిర్మించుకున్నానన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నఫళంగా దుకాణాన్ని కూల్చేస్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీబీకి అడ్డుగా కుటుంబ సభ్యులతో బైఠాయించాడు. ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేయడం నేరం కిందకే వస్తుందని, పై అధికారుల ఆదేశాలు తాము తప్పక పాటించాల్సిందేనని, పోలీసుల సహాయంతో ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే... అక్కడ గుమికూడిన ప్రజలు, గ్రామస్తులు..రెవెన్యూ అధికారిపై దాడిచేశాడని ఆక్రమణల తొలగింపుకు హడావిడి చేస్తున్నారే కానీ, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, భూకబ్జాదారుడైన టీడీపీ నాయకుడు చలపతికి మధ్య జరిగిన పోరులో అమాయకుడు తన కష్టార్జితాన్ని 30 లక్షలకు పైగా నష్టపోయి, రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ తొలగింపులో తాలూకా సీఐ కళా వెంకటరమణ, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వోలు, పోలీసులు పాల్గొన్నారు. -
బడ్జెట్ ప్రసంగం కాదు.. లోకేష్‌ను పొగిడే కార్యక్రమం: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్‌కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్‌ను విమర్శించడం.. నారా లోకేష్‌ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు.హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ.. అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశ పడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికివందనం పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27000 కోట్లు ఇవ్వాలి. హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు.. వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డీఎస్సీకి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డుక్కె పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు?. సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా?. మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
విశాఖలో సినిమా నిర్మాణం పేరిట టీడీపీ నేత మోసం
-
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.
-
పల్లెను చిదిమేశారు!
సాక్షి, అమరావతి : పల్లెలు కళ తప్పుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కళావిహీనంగా తయారవుతున్నాయి. బడ్జెట్లో పల్లెల ప్రగతి కోసం పైసా కూడా కేటాయించక పోవడం పట్ల గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి బాటలు పడ్డాయి. 2 వేల జనాభా కలిగిన ప్రతి గ్రామంలో ఓ సచివాలయం, ఆ పక్కనే రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రం, పల్లెవాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ క్లినిక్, పిల్లల చదువుల కోసం డిజిటల్ లైబ్రరీ.. నాడు–నేడు ద్వారా ఆధునిక సౌకర్యాలతో రంగు రంగుల స్కూళ్లు.. ఇలా గ్రామ స్వరూపాన్నే మార్చేశారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రూ.4,750 కోట్లతో 10,893 సచివాలయ భవనాలు మంజూరు చేయగా, 9,585 సచివాలయాల భవన నిర్మాణాలు చేపట్టి, 6,879 సచివాలయాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.575 కోట్లతో 3,589 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. నాడు–నేడు పథకం కింద గ్రామాల్లో ఉండే పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టి.. తొలి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌ను అభివృద్ధి చేశారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలు, 447 జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.1,726 కోట్లతో 8,299 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టి, 3,104 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. రూ.2,446 కోట్లతో 10,216 ఆర్బీకేల నిర్మాణం చేపట్టగా, దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి 5,333 ఆర్బీకే భవనాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.281 కోట్లతో 1,589 బల్క్ చిల్లింగ్ సెంటర్లు నిర్మించారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన భవనాలన్నీ దాదాపు 70–80 శాతం పూర్తయ్యాయి.కొద్దిపాటి నిధులు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతుంది. అలాంటిది బడ్జెట్లో వీటి ప్రస్తావన మాట మాత్రంగా కూడా లేకపోవడం విచారకరం. గతేడాది బడ్జెట్లో పైసా కేటాయించలేదు. కనీసం ఈ ఏడాదైనా నిధుల కేటాయింపులుంటాయని భావించారు. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దురాలోచనతోనే ఇలా నిర్లక్ష్యం చేశారని ప్రజలు మండి పడుతున్నారు. -
‘పొదుపు’ మహిళలకు ‘సున్న’మే
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నిర్వీర్యం చేసే దిశగానే అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ ప్రకారం.. ఈ పథకం అమలుకు ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటే.. శుక్రవారం నాటి బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి వారి ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు జల్లింది. నిజానికి.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన ‘పొదుపు’ మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అమలైన సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు కోటి మందికి పైగా ‘పొదుపు’ మహిళలు తాము 2023 ఏప్రిల్ – 2024 మార్చి మధ్య ఏడాదిపాటు ప్రతినెలా అసలుతో కలిపి చెల్లించిన వడ్డీ డబ్బులను ‘సున్నా వడ్డీ’ పథకం కింద ప్రభుత్వం తిరిగి ఎప్పుడు చెల్లిస్తుందా అని వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో ఏప్రిల్ నెలలోనే చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 2024 మార్చి మధ్యలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకావడం జరిగిపోయింది. ఇప్పుడు మరో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా ప్రస్తుత సర్కారు సున్నావడ్డీ పథకం ఊసే ఎత్తడంలేదు. మరోవైపు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ సకాలంలో రుణ వాయిదాలను చెల్లించిన మహిళలకు ఈ ఏడాది మార్చి ఆఖరు తర్వాత సున్నా వడ్డీ పథకం కింద మరో రూ.నాలుగైదు వేల కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. కానీ, శుక్రవారం నాటి బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లే కేటాయించడం చూస్తుంటే ‘పొదుపు’ మహిళలకు చంద్రబాబు సర్కారు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. 2014–19 మధ్య కూడా ఇంతే..ఇక రాష్ట్ర విభజనకు ముందు నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని 2014–19లో కూడా నాటి సీఎం చంద్రబాబు పూర్తిగా నీరుగార్చారు. అప్పట్లో ఐదేళ్లకుగాను కేవలం రెండేళ్ల నాలుగు నెలల కాలానికి సంబంధించిన సున్నావడ్డీ డబ్బులను మాత్రమే చెల్లించారు. 2016 ఆగస్టు తర్వాత కాలానికి మొండిచెయ్యి చూపించారు. -
ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నా
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, అందుకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడంలేదని, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్ద ఉందన్నారు.ఎమ్మెల్యేలకు, కేడర్ మధ్య సమన్వయం లేకుండాపోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయాలని.. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలి..ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు వారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చి ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులను భర్తీచేస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులు తమ మాట వినడంలేదని, పోస్టింగ్‌ల విషయంలోనూ ఇబ్బందులున్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని, ఏ చిన్న పనిచేయడానికి అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు. -
తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి. -
కూటమి పానలపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది
-
AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? -
వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేస్తున్నారు: పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినపుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు.‘‘ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు కాదా?. వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా. వంశీని ఇబ్బందులు పడుతున్నారు’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.చంద్రబాబు కుటిల రాజకీయం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్ ఉండి, ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో వంశీని ప్రథమ ముద్దాయిగా పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతిఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు?. 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్‌ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుందిహోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా?. జబర్దస్త్ నటులతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..?.కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్‌ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలి, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారు. వంశీకి వైఎస్సార్‌షీపీ పార్టీ అండగా ఉంటుంది. వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. -
‘కొమరవోలా.. అదెక్కడుంది? ఆ ఊరికి ఈ జన్మలో రాను’
సాక్షి, కృష్ణా జిల్లా: ఒకసారి మీ అమ్మమ్మగారి ఊరొచ్చి అక్కడ సమస్యలు పరిష్కరించండయ్యా..అని అభ్యర్థిచిన గ్రామస్తులకు ఆ ఊరికి తాను ఈ జన్మలో రానంటూ షాకిచ్చారు సినీ నటుడు, హిందూపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గురువారం తన స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామానికి బాలకృష్ణ వచ్చారు.అక్కడి స్థానికులు, కుటుంబ సభ్యులు, చుట్టాలతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్వరలో అమరావతిలో కూడా దాతల సహకారంతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారని తెలియడంతో సమీపంలోని కొమరవోలు గ్రామస్తులు అక్కడికి వచ్చి ఆయనను కలుసుకున్నారు.మీ అమ్మగారి పుట్టిల్లు, మీ అమ్మమ్మగారి ఊరు కొమరవోలు రావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు బాలకృష్ణను కోరారు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ ‘కొమరవోలా..అదెక్కడుంది? ఆ ఊరికి ఈ జన్మలో రాను’ అని వ్యాఖ్యానించారు. ‘వారు లింగాయతులు..ఆ ఊరుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు.. -
బూతులు తిడుతూ నీతులు..
సాక్షి, అమరావతి: పాల బూతులు.. పోలింగ్ బూతుల గురించి మాత్రమే తెలిసిన రాష్ట్ర ప్రజలకు రాజకీయాల్లో పచ్చి బూతులను పరిచయం చేసిన పార్టీ టీడీపీనే! ప్రత్యర్థి నేతలను నోటికొచ్చినట్లు నానా దుర్భాషలాడటం నేర్పింది పచ్చ ముఠాలే! నీతి చంద్రికలు వల్లిస్తూ ఆచరణలో మాత్రం బూతు చంద్రికను అనుసరించింది బాబు పరివారమే!! తాను తప్పుడు పనులు చేస్తూ.. వాటిని ప్రత్యర్థులు చేస్తున్నట్లు ప్రజల్ని మాయ చేయడం చంద్రబాబు నైజం! 40 ఏళ్లుగా ఆయన చేస్తున్న రాజకీయం అదే! అధినేత బాటలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ సైనికులు ఆరితేరిపోయారు. చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేశ్, పార్ట్నర్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేతల దాకా.. వైఎస్ జగన్‌ను, ఆయన సతీమణిని, వైఎస్సార్ సీపీని, పార్టీ నేతలను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూనే ఉంటారు. పచ్చి బూతులు, అసభ్యకరమైన తిట్లు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్నింటినీ వారే చేసి.. వైఎస్సార్సీపీ నేతలు బూతులు మాట్లాడతారని, ఆ పార్టీ బూతుల పార్టీ అని దుష్ప్రచారం చేస్తారు. అదే నిజమనుకునేలా ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తమ వాదనే నిజమన్నట్లు.. బూతులు తిట్టారంటూ ఇష్టానుసారంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబును, మంత్రి లోకేశ్‌ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తిట్టారంటూ అక్రమ కేసులు మోపి అరెస్టు చేశారు. నిజానికి ప్రత్యర్థులను దుర్భాషలాడటం, బూతులు తిట్టడంలో టీడీపీకి మరే రాజకీయ పార్టీ సాటి రాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌నుద్దేశించి ‘సైకోగాడు..! వాడు, వీడు..! నా కొడుకులు..!’ అంటూ కొన్ని వందల సార్లు అనరాని మాటలనడం రాష్ట్రమంతా చూసింది. ఇక ఎన్నికల సభల్లో ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, మాట్లాడిన బూతులు, తిట్లకు అంతే లేదు. ఆయన పార్ట్నర్, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. చంద్రబాబును మించిపోయి బూతు ప్రసంగాలతో తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేవారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను ఏకవచనంతో సంబో«ధిస్తూ.. ‘వైఎస్సార్సీపీ నా కొడుకుల చర్మం ఒలుస్తా..! తోలు తీస్తా..! నార తీస్తా..! తొక్కిపెడతా...!’ అంటూ ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడిన అసభ్య మాటలు రాష్ట్ర ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి సర్వసంగ పరిత్యాగిలా మారిపోయినట్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో చేసిన బూతు ప్రసంగాలు ఆయన సభ్యతను, సంస్కారాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కుమారుడు లోకేశ్.. సీఎంగా ఉన్న జగన్‌ను సైకో అంటూ తరచూ దూషించేవారు. లోకేశ్ పాదయాత్రలో బ్లేడ్‌బ్యాచ్ స్థాయిలో వైఎస్సార్సీపీ నేతల్ని బూతులు తిట్టేవారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పుడు మారిన మనిషిలా నీతి వచనాలు పలుకుతున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా అధికారిని కూడా బట్టలూడదీస్తానని బెదిరించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను, మహానాడు వేదికపై నుంచే చంద్రబాబు పక్కనుండగానే ‘సైకో నా కొడుకు’, ‘చెత్త నా కొడుకు’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టిన వ్యక్తి అయ్యన్న. ఆయన నోరు తెరిస్తే బూతుల వరదే. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బండ బూతులకు పేటెంట్ హక్కు తీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా.. ఏ వేదికైనా.. ఏ కార్యక్రమమైనా ఆయన నోటి వెంట ముందుగా వచ్చేది బూతే. ఇటీవలే తన కారుకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కారు అడ్డుగా ఉందని డ్రైవర్‌ను ‘ముం.. కొడక..!’ అంటూ రాయలేని విధంగా తిట్టిన వీడియో వైరల్ అయింది. నాడు సీఎంగా ఉన్న జగన్‌ను ‘బోషడికే’ అని దూషించిన కొమ్మారెడ్డి పట్టాభికి చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. జగన్‌ను ఎంత తిడితే అంత ప్రోత్సాహం ఉంటుందని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చాక అలాంటి నేతలందరికీ పదవులు వడ్డించారు! స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వటాన్ని బట్టి చంద్రబాబు నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పలు సభల్లో..1. డైమండ్ రాణి రోజా కూడా నన్ను తిడుతుంది. నువ్వు కూడానా..! ఇక ఏమనుకోవాలి.2. కాకినాడ సభలో జనసేన వచ్చిన రోజున బట్టలూడతీసి కాకినాడలో గల్లీ గల్లీ.. సందు సందు తిప్పిస్తా. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి. లెక్కపెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావ్. వీధి వీధి తన్ని తీసుకెళతా. చెమడాలు ఒలుస్తా..!’3. జనసేన ఆఫీసులో తమాషాగా ఉందా కొడకల్లారా.. ప్యాకేజీ గీకేజి అంటే (చెప్పు చూపిస్తూ..) పళ్లు రాలగొడతా.. అరేయ్ వెధవల్లారా.. సన్నాసుల్లారా. చవటల్లారా.. దద్దమ్మల్లారా.. ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా’ 4. ‘నేను సై.. రా.. ఈరోజు నుంచి.. కొడకల్లారా.. గుర్తుపెట్టుకోండి.. చెప్పండ్రా.. రాడ్లా.. హాకీ స్టిక్కులా.. రాళ్లా.. ఒట్టి చేతులా.. దేనికైనా రెడీ.. ఛాలెంజ్ విసురుతున్నా రండ్రా కొడకల్లారా..!’ టీడీపీ ఆఫీసులో పట్టాభి బరితెగింపుతాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకు చెబుతున్నా... అరె బోసిడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవ్వు నోటీసులు... తమిళనాడు, యూపీ పోలీసులకు ఇవ్వురా నోటీసు..అయ్యన్నపాత్రుడి విద్వేష వ్యాఖ్యలు..1. ‘జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు... చచ్చేదాకా కొట్టాలి’ 2. మహానాడులో : ‘ముఖ్యమంత్రి సైకో నాకొడుకు.. చెత్తపై పన్ను వేసే వాడిని చెత్త నాకొడుకు అని కాకుండా ఏమనాలి’ యువగళం సభలో అచ్చెన్నాయుడు..‘తాట తీసి.. తోలు వలుస్తాం.. కొంతమంది పోలీసు అధికారులున్నారు. ఎస్పీని అడిగితే 500 మందిని బందోబస్తు కోసం ఇచ్చామన్నారు. ఎందుకు వచ్చారు. దెం.. తినడానికి వచ్చారా?’ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాబు బూతులు..1. ఎన్నికల సభలో..సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ.. ‘నీ తల్లి మొగుడిచ్చాడా..! మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా..! మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా..! మీ జేజి తాత మొగుడిచ్చాడా..! ఎవడిచ్చాడు..?’ అంటూ అసభ్య వ్యాఖ్యలు.2. మంగళగిరి మీడియా సమావేశంలో ‘ఒక సైకో ముఖ్యమంత్రి, పిచ్చోడు ముఖ్యమంత్రి, ఇష్టానుసారం చేస్తున్నాడు’3. విశాఖలో ‘ఈ రెండేళ్లలో ఏం చేశారు మీరు. గడ్డి పీకారా.. పిచ్చి కుక్కల్లా తిరుగుతూనే ఉన్నారు’4. రాజానగరంలో..‘ఇక్కడ ఉండే సైకోకి చెబుతున్నా.. ఖబడ్డార్.. అణగదొక్కుతా.. తిరిగి లేవలేరు.. చిత్తు చిత్తుగా చితక్కొడతా’5. గుంటూరులో ‘ప్రజలకు రోషం లేదు.. మీకు బుద్ధుందా.. సిగ్గుందా.. రాజధాని గురించి మాట్లాడడంలేదు. కుర్రాళ్లంతా స్వార్థపరులైపోయారు. చేవ చచ్చిపోయారు’6. కాళహస్తి సభలో ‘ముఖ్యమంత్రి గాల్లో వస్తాడు.. గాల్లో పోతాడు.. గిరా గిరా తిరుగుతాడు. ఎప్పుడో కిందపడి పోతాడు. శాశ్వతంగా ఫినిష్ అయిపోతాడు. గుర్తు పెట్టుకో జగన్‌రెడ్డి..!’7. ప్రచార సభలో ‘పీక్కోమన్నా ఆరోజే.. ఏం పీక్కున్నారో నాకే తెలియదు’8. అంగళ్లు సభలో ‘వాణ్ణి పట్టుకోరా.. తన్ను వాణ్ణి.. తరమండి నా కొడుకుల్ని.. చేతగాని దద్దమ్మల్లారా, పనికిమాలిన వ్యక్తుల్లారా.. దరిద్రుల్లారా..!’9. టీడీపీ కార్యాలయంలో.. ‘ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవం అవుతాయా.. వీడేం పెద్ద పోటుగాడా ముఖ్యమంత్రి.. ఫేక్ ముఖ్యమంత్రి.. గాలి ముఖ్యమంత్రి’లోకేశ్ దుర్భాషలు..1. చంద్రబాబు అరెస్టు సమయంలో ‘సిగ్గుందా నీకు.. సైకో జగన్ చెప్పాడా.. లండన్ నుంచి ఫోన్ చేశాడా.. ముండలను మింగడానికెళ్లాడా అక్కడికి..’ (పోలీసులనుద్దేశించి)2. కాళహస్తిలో ‘వాళ్ల పార్టీ ఆఫీసులను వంద పగలదెం.. వాళ్లను కడ్రాయర్లతో ఊరేగింపు చేస్తాం’ 3. వైఎస్సార్ జిల్లా..‘పోలీసులతో గొడవ పెట్టుకుని ఫ్లెక్సీలను చించిపాడి దెం...!’4.పాదయాత్రలో‘సన్న బియ్యం సన్నాసిని కట్ డ్రాయర్తో గుడివాడలో ఊరేగిస్తా.. ఉచ్చబోయిస్తా..’5. సభలో ‘మైకు లాగేసుకున్నాడు. చేతగాని నాకొడుకు జగన్మోహన్రెడ్డి..!’6. సభలో ‘ఏం పీకలేడు... జగన్ తాతే పీకలేదు.. అతని తండ్రే పీకలేకపోయాడు... మా వెంట్రుక కూడా పీకలేడు’2018లో ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ బూతులు రాజ్యాంగంతోపాటు నీ(మోదీ) భార్యను గౌరవించడం నేర్చుకో.. బీజేపీ, వైఎస్సార్సీపీలు కొజ్జాల్లాగా సీట్లు గెలవాలనుకుంటున్నాయి. -
దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు
కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత.. సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోకపోవడానికి తోడు డీఎస్సీ ప్రకటించక పోవడం, గ్రూప్–2 అభ్యర్థులతో ఆటలాడుకోవడం.. తదితర కారణాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దీంతో ఎలాగైనా సరే గెలవాలని సర్కారు పెద్దలు బరితెగించారు. వీరి కనుసైగతో పోలింగ్ బూత్‌లలోనే డబ్బులు పంచడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఏజెంట్లను తరిమేయడం మరో ఎత్తు. ఫలితంగా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని నయా సంస్కృతి ఇది.సాక్షి, అమరావతి/పిఠాపురం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, విశాఖపట్నం/గుంటూరు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని రీతిలో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నించాయి.ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలు చోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని 96, 97, 98 పోలింగ్ బూత్‌ల పక్కనే టీడీపీ నేతలు తిష్ట వేసి కూర్చున్నారు.ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. ‘డబ్బులు తీసుకోండి.. కూటమి అభ్యర్థికి ఓటు వేయండి’ అని కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పక్కనే ఉన్న మున్సిపల్ కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్.. వచ్చిన ప్రతి ఓటరు వద్ద ఓటరు స్లిప్ తీసుకుని, సరి చూసి మరీ ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు.ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో కూడా ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు వారికి సమాచారం ఇచ్చి.. అక్కడికి వెళ్లారు. ఆలోపే టీడీపీ నేతలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అంటూ చెప్పుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ కావడం చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్‌కు అతి సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అని విమర్శలు వెల్లువెత్తాయి. లింగపాలెంలో దొంగ ఓట్లుఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దకు పసుపు చొక్కాలు వేసుకువచ్చి డబ్బులు పంపిణీ చేశారు. పీడీఎఫ్ ఏజెంట్లపై దాడి చేశారు. చివరి రెండు గంటల్లో దొంగ ఓట్లు వేయించారు. పెదవేగి బూత్ నంబర్ 327లో పీడీఎఫ్ ఏజెంట్ గేదెల శివకుమార్‌పై కూటమి అభ్యర్థులు దాడి చేశారు.లింగపాలెం మండలంలోని శింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 277, 278 బూత్‌లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. అక్కడ పీడీఎఫ్ ఏజెంట్ సూర్యకిరణ్‌ను బెదిరించి మొబైల్ లాక్కుని బయటకు గెంటేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను తీసుకుని చివరి నిమిషంలో ఓట్లు వేశారు. దీంతో మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 4 గంటలకు 69.50 శాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలో 24.21 శాతం ఓటింగ్ పెరిగిందంటే దొంగ ఓట్ల వల్లేనని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించారని దౌర్జన్యం.. దాడులుఓటమి భయంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు బాపట్ల జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చాలాచోట్ల పీడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాపట్లలోని మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేఛ్చగా దొంగ ఓట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం దొంగ ఓట్లు వేశారు. టీడీపీ మహిళా నేత పోలింగ్ కేంద్రంలో మకాంవేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి స్థానిక టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్ వారిని అడ్డుకున్నారు. పోలింగ్ సమయం ముగిశాక టీడీపీ వారిని లోపలికి ఎలా అనుమతిస్తారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు మరికొందరు కలిసి పీడీఎఫ్ నాయకుడు అనిల్‌కుమార్‌పై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. భట్టిప్రోలులో పీడీఎఫ్ ఏజెంట్ లింగం శ్రీనుపై టీడీపీ నాయకులు దాడిæచేసి కొట్టారు. కూటమి అభ్యర్థి ఆలపాటికి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను లింగం శ్రీను నిలదీశారు. దీంతో టీడీపీ వారు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు.చుండూరులో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగు చేసేందుకు పలుమార్లు యత్నించారు. దీనిని పీడీఎఫ్ నేతలు అడ్డుకున్నారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, అడవులదీవి, రేపల్లె, వేమూరుతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని పీడీఎఫ్ నేతలు ఆరోపించారు.మా ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టారు: లక్ష్మణరావు కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని, వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున నియమించిన ఏజెంట్‌ను అనుమతించలేదని అన్నారు.దుర్గిలో ఏజెంట్‌ను బయటకు పంపడంతోపాటు బెల్లంకొండ ఏజెంట్‌ను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూత్‌లలోకి ప్రవేశించి, హడావుడి సృష్టించారని, చీఫ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మె ల్యేలకు బూత్‌లలోకి వెళ్లేందుకు ఎటువంటి అధికారం లేద న్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని అమలు పర్చిందని ఆరోపించారు.తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్ పాఠశాలతో పాటు అమరావతి, పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లకు తెగబడిందన్నారు. సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదు కావడం సహజమేనని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. పల్నాడులోని పలు బూత్‌లలో 90 శాతం పోలింగ్ జరిగినట్లు నమోదైతే, అది కచ్చితంగా దొంగ ఓట్లు వేయించినట్లేనని స్పష్టం చేశారు. పోలైన ఓట్లు, తదితర పూర్తి వివరాలు వచ్చిన తరువాత, రీ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలురాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు 92.40 శాతంకుపైగా పోలింగ్ నమోదు కాగా, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28 శాతం, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58 శాతం పోలింగ్ నమోదైంది.నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించడానికి అనుమతించడంతో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీలో అత్యధిక మంది ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు వేసే సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది, ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీలో ఉండటంతో అభ్యర్థులకు ప్రాధాన్యతా నంబర్లు కేటాయించి బ్యాలెట్ పేపర్ మడత పెట్టి బ్యాలెట్ బ్యాక్స్‌లో వేయడానికి అయిదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంది.దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తి ఎదుట ప్రాధాన్య ఓటు సంఖ్య కాకుండా టిక్కులు పెట్టడంతో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నిరంతర పర్యవేక్షణపోలింగ్ సజావుగా నిర్వహించడానికి 6,287 మంది పోలీస్, 8,515 మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడమే కాకుండా సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యవేక్షించారు. విజయవాడలోని పటమట హైస్కూల్, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల, కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కాలేజీ, శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల బ్యాలెట్ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. -
అనేక పోలింగ్ బూత్ ల నుండి మా ఏజెంట్లను పంపించారు: లక్ష్మణరావు
-
Ponnavolu Sudhakar Reddy: పోసానిపై 111 సెక్షన్ కేసు దుర్మార్గం..
-
మంగళగిరిలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం
-
సత్య వర్ధన్‌కు నార్కో టెస్ట్‌లు చేయిస్తే నిజాలు బయటకొస్తాయి.. కోర్టులో వంశీ
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వద్ద వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.సత్య వర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని,తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇబ్బందని అని అన్నారు. అందుకే తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని కోరారు.వంశీ విజ్ఞప్తిపై స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా? అని ప్రశ్నించారు. అందుకు వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్లో ఒంటరిగా ఉంచామని జైలు అధికారులు వివరణిచ్చారు. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్‌ను ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో వంశీతో పాటు వేరే వారిని సెల్ ఉంచేందుకు న్యాయమూర్తి జైలు అధికారులకు జారీ చేశారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
-
పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకు నోటు
-
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్‌లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్‌ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్లా జరుగుతుందనేది నిజం.డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్‌కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్‌పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.చదవండి: మీరు చాలా మారాలి సార్!కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్‌ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.– వెంకట్ -
YSRCP కార్యకర్త హరికృష్ణపై టీడీపీ నేతల దాడి
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం
నూజివీడు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో జరుగుతున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వాల్ క్లాక్‌లు, గిఫ్ట్ బాక్స్‌లు, ఇతర వస్తువులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గురువారం పోలింగ్ జరుగుతుండటంతో బుధవారం వీటిని పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంవ్యాప్తంగా బుధవారం ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేశారు. బత్తులవారిగూడెంలోని నగరవనంలో ఉదయం సమావేశం నిర్వహించి, మండలాల వారీగా వాల్‌క్లాక్‌లను నాయకులకు అప్పగించి, వారి ద్వారా ఓటర్లకు అందజేశారు. ఈ వాల్క్లాక్లపై సీఎం చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి, అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల ఫొటోలతో కూడిన స్టిక్కర్ అంటించి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా గిఫ్ట్‌లు పంపిణీ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు క్షేత్ర స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. దీంతో టీడీపీ నేతలు టీచర్లకు గిఫ్ట్‌బాక్సులు అందజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి చెందిన కొంతమంది వీటి పంపిణీ బాధ్యత తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంట్యాడ మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి కుటుంబానికి చెందిన రైస్ మిల్లు వద్ద నుంచే ఇతర ప్రాంతాలకు గిఫ్ట్‌బాక్స్‌లు పంపిస్తున్నారు. సీలేరులో మద్యం పట్టివేత సీలేరు (అల్లూరి జిల్లా): ఉత్తరాంధ్ర ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్న నేప«థ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. జీకే వీధి మండలం సీలేరులోని ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపారు. నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో బరి తెగిస్తున్న చంద్రబాబు సర్కారు ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కుతోంది. దర్యాప్తు పేరిట కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేకపోయిన సీఐడీ సరికొత్త కుట్రకు తెరతీసింది. న్యాయ ప్రక్రియలో అత్యంత కీలకమైన 164 సీఆర్పీసీ వాంగ్మూలాల (183 బీఎన్ఎస్ఎస్) నమోదు ముసుగులో కుతంత్రం పన్నుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాంగ్మూలాలను నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌తో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడం ద్వారా కుట్రకు మరింత పదునుపెట్టింది. ఆ అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా రెడ్‌బుక్ కుట్రను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. టీడీపీ ఆఫీసులో తయారీ.. న్యాయమూర్తి ఎదుట నమోదువైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసు దర్యాప్తులో సీఐడీ అడ్డదారులు తొక్కుతోంది. పూర్తిగా టీడీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు దర్యాప్తును కొనసాగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తాము అందచేసిన జాబితాలో ఉన్నవారిపై అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ఈమేరకు దర్యాప్తు పేరిట వేధింపులను పర్యవేక్షించే బాధ్యతను రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించారు. దీంతో మద్యం అక్రమ కేసులో సీఐడీ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్యప్రసాద్‌ను సీఐడీ అధికారులు అనధికారికంగా అదుపులోకి తీసుకుని బెదిరింపులకు గురి చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా అక్రమ కేసులతో వేధిస్తామని హెచ్చరించారు. దీంతో సీఐడీ అధికారులు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సత్యప్రసాద్ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో తిష్టవేసిన రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను సీఐడీ అధికారులు సంప్రదించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అప్పటికే రూపొందించిన వాంగ్మూలం ప్రతిని ఆయన సీఐడీ అధికారులకు పంపినట్లు సమాచారం. అందులో ఉన్నట్లుగా సత్యప్రసాద్‌తో 164 సీఆర్పీసీ కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని ఆదేశించారు. దాంతో సీఐడీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సత్యప్రసాద్‌ను తరలించి న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇప్పించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథాతథంగా తాను వాంగ్మూలంగా న్యాయమూర్తి ఎదుట చదివి వినిపించానని సత్యప్రసాద్ తన సన్నిహితుల వద్ద పేర్కొనడం గమనార్హం. సంబంధం లేని వ్యక్తుల పేర్లు...!మద్యం కేసులో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తోంది. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదుకు నిర్దేశించిన విధానాన్ని సీఐడీ నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో వాంగ్మూలం నమోదు చేయించిన తీరే అందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయం రూపొందించిన వాంగ్మూలాన్నే ఆయన న్యాయమూర్తి ఎదుట వల్లె వేసేలా పక్కా కుట్రతో కథ నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వర్తించని వారు.. రాష్ట్రంలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనివారు... పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు... ఇలా పలువురి పేర్లను మద్యం విధానం, వ్యవహారాలతో ముడిపెడుతూ తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించినట్లు తెలుస్తోంది. అసలు బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, ప్రభుత్వంలో ప్రత్యక్షంగాగానీ పరోక్షంగా భాగస్వాములుకానివారు, జీవితంలో తాను ఏనాడూ ప్రత్యక్షంగా చూడనివారు, అసలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే లేనివారి పేర్లను కూడా ప్రభుత్వ పెద్దలు సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలం ద్వారా చెప్పించినట్టు సమాచారం. 164 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కేసుతో నేరుగా ప్రమేయం ఉన్నవారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి. అంతేగానీ ఆ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. తాము చెప్పే వాటికి సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటినే చెప్పాలి. అంతేగానీ గాలి కబుర్లు, అక్కడ ఇక్కడ విన్నవాటిని చెప్పడం నిబంధనలకు విరుద్ధం. 164 సీఆర్పీసీ వాంగ్మూలం స్వచ్ఛందంగా ఇవ్వాలేగానీ అధికారులు, ఇతరుల ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ రెండు నిబంధనలకు విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సీఐడీ అధికారులు నిబంధనలను కాల రాస్తున్నారు. అంటే చట్టప్రకారం సాగాల్సిన దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు న్యాయమూర్తి ఎదుట నమోదు చేసే వాంగ్మూలం ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తోందనడానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఆ అబద్ధపు వాంగ్మూలాన్ని ఏకైక ఆధారంగా చేసుకుని ఈ కేసులో అక్రమ అరెస్టులకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిలతోపాటు మరికొందర్ని అరెస్టు చేసి వేధించాలన్నది సీఐడీ పన్నాగం. అనంతరం వారిని విచారణ పేరిట వేధించి తాము చెప్పినట్లుగా నడుచుకునేలా ఒత్తిడి తేవాలన్నది కుతంత్రం. దర్యాప్తు నిబంధనలు, న్యాయ విచారణ ప్రక్రియ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ సీఐడీ బరితెగిస్తున్న తీరుపై పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేసే సాధనంగా సీఐడీ దిగజారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రశ్నించే గొంతు నొక్కాలనే..ప్రశ్నించే గొంతు నొక్కాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యం. రాజకీయాల నుంచి తప్పుకున్నానని పోసాని ప్రకటించినా చంద్రబాబు వెంటాడ్డం అన్యాయం. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం రగిలిపోతోంది. నాగరిక సమాజం నుంచి మళ్లీ ఆటవిక సమాజంలోకి తీసుకెళ్తున్నారు. చట్టాలను, న్యాయవ్యవస్థలను సీఎం అపహాస్యం చేస్తున్నారన్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రిప్రజాస్వామ్యం ఖూనీ..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. విమర్శలను టీడీపీ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.– గడికోట శ్రీకాంత్‌రెడ్డి,మాజీ చీఫ్ విప్ఒక నియంతలా చంద్రబాబు చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు. పోసాని అరెస్టుతో ప్రభుత్వ అరాచకం తీవ్రస్థాయికి చేరినట్లయింది. కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నాం. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రికక్ష రాజకీయాలు మంచివి కావురాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానని పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ పాలనలోనే స్వేచ్ఛగా ఉన్నామేమోనన్న భావన ప్రజలకు వస్తోంది. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిపండగ పూటా హింసిస్తున్నారుశివరాత్రి రోజున కూడా చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టే దీనికి నిదర్శనం. చంద్రబాబును ఎవ్వరూ ప్రశ్నించకూడదా? పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నా. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. – అంబటి రాంబాబు, మాజీ మంత్రికక్ష సాధింపులకు పరాకాష్ట..పోసాని కృష్ణమురళి అరెస్టు టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను గాలికొదిలేసి, ఎంపిక చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు దుర్మార్గం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి -
మదనపల్లిలో రెవెన్యూ అధికారులపై కూటమి నేతల దాడి
-
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్‌కి దిమ్మతిరిగే కౌంటర్
-
కూటమి నేతల తీరు పట్ల ప్రజల ఆగ్రహం
-
చంద్రబాబు పాలనపై ‘కూన రవికుమార్’కు ఫోన్
శ్రీకాకుళం: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు(Kuna Ravikumar) మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ క్యాడర్‌తో మాట్లాడుతుండగా.. ఓ ఫోన్‌కాల్(Phone call) వచ్చింది. లిఫ్ట్ చేసి చూస్తే అవతలి వారు ‘ఏపీలో చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉంది.. ఆమదాలవలస ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది..?’ అని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన అందరి ముందు స్పీకర్లో మాట్లాడారు. ‘ఆమదాలవలస ఎమ్మెల్యే మంచివారేనా’ అని అడిగిన ప్రశ్నకు ఆయన మంచివారు కాదని సమాధానం చెప్పారు. ‘మీకు పెళ్లయ్యిందా..? వయసు ఎంత..?’ అని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పి ఆటపట్టించారు. ఈ తంతును అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యేనే ప్రశ్నించడం అందరికీ విచిత్రంగా అనిపించింది. -
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్‌ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది. -
రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలా?
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా..? ఎక్కడో చూపించండి..!’ అని వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాడివేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది. నాలుగు ఉద్యోగాలూ కల్పించలేదుఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా.. కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఏ శాఖలో.. ఏ కంపెనీలో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షలు కాదు.. నలుగురికి కూడా ఉద్యోగాలివ్వలేదని మండిపడ్డారు.ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ.. కల్పించినట్లుగా ఎక్కడా చెప్పలేదు’ అని ఇంగ్లీషు వెర్షన్లో ఉన్న గవర్నర్ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో.. ‘ఇంగ్లీషులో చదువుతున్నా కదా’ అంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు. పొరపాటును లోకేశ్ ఒప్పుకోవాలన్న బొత్స శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. ‘4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది’ అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెబితే సరిపోతుంది కదా! అని హితవు పలికారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? టీడీపీ, జనసేన ఎంపీలపై ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. తాము బేషరతుగానే మద్దతు ఇస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. ‘2014లో మీకు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? అప్పుడు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారు?’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశి్నంచారు. దీనికి మంత్రులు సమాధానం దాట వేశారు. ఏఐ... తెలుగులో ఉంటుందా? వైఎస్సార్సీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేసిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో దేన్ని అనుసరిస్తుందో చెప్పలేకపోతోందన్నారు. సీఎం చంద్రబాబు తరచూ చెప్పే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలుగులో ఉంటాయా? అని ప్రశ్నించారు. తెలుగును అవమానిస్తున్నారని మంత్రులు అనిత, సవిత అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని తూమాటి పేర్కొన్నారు.ఉచిత గ్యాస్ అంటూ 9 నెలల్లో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా ఐదు కాలేజీలను ప్రారంభించడంతోపాటు మరో కాలేజీకి అనుమతి సాధించామన్నారు. మిగిలిన కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయా? ప్రైవేట్‌కు అప్పగిస్తారా? అనేది చెప్పడం లేదన్నారు. ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అని ఆరోపణలు చేశారని, 700 మంది మాత్రమే మిస్సింగ్ అని ఆనాడే డీజీపీ స్థాయి అధికారులు తేలి్చనా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.నాడు తొలి ఆర్నెలల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ అంటూ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం.. రూ.లక్ష కోట్లకుపైగా అప్పులు చేయడం.. బెల్టు షాపులతో మద్యం ఏరులై పారించడం.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం.. 83 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టడం.. ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం.. పోలవరం ఎత్తు తగ్గించడం సుపరిపాలనా? అని నిలదీశారు.జనవరి 1వ తేదీన ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అని చెప్పి పీఆర్సీ చైర్మన్‌ను బెదిరించి వెళ్లగొట్టారన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చివరికి వారిని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. 2023లో వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేకపోయామని, కొనసాగించలేకపోయామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. -
అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్ ఫోన్ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్‌కు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్ కవర్ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రొసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌తో కూడా బలవంతగా రాజీనామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పంపించాం.. అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్‌లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గందరగోళం సృష్టించి.. వీసీ రాజీనామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్. మీరు గవర్నర్‌ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్ ఫోన్ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్ ట్యాప్ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్ అండ్ వాచ్.. టైమ్, డేట్ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్æ ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్ విచారణా లేక డిపార్టుమెంటల్ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్ కోరగా, ‘మేము జ్యూడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్ మాట మార్చారు. ‘ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడుతున్నారు.. ఆధారాలు చూపాక మరొకలా మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్‌కు దీటుగా స్పందించారు. -
ప్రతీ YSRCP కార్యకర్త, నేతలు జగన్‌కు సెల్యూట్ చేయాల్సిన రోజు ఇది
-
మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్సగవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్‌పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం. వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్‌తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు. -
చంద్రబాబు సర్కార్‌పై మిర్చి రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు: గిట్టుబాటు ధర లేక రైతులు పీకల లోతు కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించే ఇంటవెర్షన్ ధర వల్ల రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేజ, డీలక్స్ లాంటి రకాలు 12000 నుంచి 12,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 11 871 కొనుగోలు చేస్తే తమకు ఎలా లాభమో ప్రభుత్వమే చెప్పాలంటూ రైతులు నిలదీశారు.‘‘చంద్రబాబు ఏసీ గదిలో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏంటి లాభం?. మిర్చి యార్డ్‌కి వచ్చి మా పరిస్థితి, బాధలు చంద్రబాబు వింటే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి 19000 నుంచి 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మిర్చి వెంట గిట్టుబాటు ధర రూ.20,000గా ప్రకటించాలి’’ అని మిర్చి రైతులు డిమాండ్ చేశారు.ప్రభుత్వం 20 వేలు రేటు ప్రకటించకపోతే ఎంత మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటారో తెలియదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఎందుకు మిర్చి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వం చేతకానితనం వల్లే మిర్చి పండించిన ప్రతి రైతు ఇవాళ అప్పుల్లో కూరుకుపోయాడు’’ అని రైతులు మండిపడ్డారు. -
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్‌తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్‌ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updatesమంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స ఆగ్రహం👉వీసీలను ఒకేసారి రాజీనామా చేయించారు👉బలవంతంగా చేయించకపోతే దాని మీద లోకేష్ విచారణ కు సిద్ధమా👉విచారణ జరిపిస్తే.. మేము నిరూపిస్తాం👉విచారణ వేయడానికి ఎందుకు భయ పడుతున్నారుశాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదుఏపీ శాసన మండలి:వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.👉రైతులను మోసం చేశారు👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు👉సాఫ్ట్వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలుప్రారంభమైన శాసన మండలి సమావేశాలు👉వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశంఅసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్‌తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. -
క్యాష్ కొట్టు.. ఎంపానెల్మెంట్ పట్టు!
సాక్షి, అమరావతి: బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం పథకం అమలు, ట్రస్ట్ నిర్వహణను తొమ్మిది నెలల్లో అస్తవ్యస్థంగా మార్చేసింది. ఇదే అదునుగా మంత్రుల సిఫార్సులతో ట్రస్ట్‌లో మకాం వేసిన కొందరు అధికారులు అడ్డగోలు దోపిడీకి తెర తీశారు. ఎంపానెల్మెంట్ ప్రక్రియను అవినీతిమయంగా మార్చేశారని ఆస్పత్రుల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.గతంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫీఫో) విధానంలో ఎంపానెల్మెంట్ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించగా ట్రస్ట్‌లో ముఠాగా ఏర్పడిన కొందరు అధికారులు దీనికి తూట్లు పొడిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బీమా విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్న నేపథ్యంలో ఎంపానెల్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ట్రస్ట్ సీఈవోను వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతేడాది ఆదేశించారు. అయితే సీఈవోలు మారిపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వసూళ్ల దందాకు తెర తీశారు. ఫీఫో విధానాన్ని పక్కన పెట్టి 15 – 20 ఆస్పత్రుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి అనుమతులు జారీ చేశారు. కొత్త దరఖాస్తులు.. ఎన్నికల కోడ్ కారణంగా గతేడాది మార్చి నుంచే కొత్త ఎంపానెల్మెంట్ దరఖాస్తులను తీసుకోవడం నిలిపివేశారు. అయితే ట్రస్ట్‌లో పాగా వేసిన ముఠా ఆన్లైన్లో ఎంపానెల్మెంట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించి కొన్ని ఆస్పత్రుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు వెల్లడైంది. సీఈవో ఆమోదం అనంతరం ఎంపానెల్మెంట్ ప్రక్రియ పూర్తయినట్టు ఆస్పత్రులకు నేరుగా మెయిల్ వెళ్లే విధానాన్ని నిలిపివేసి లాగిన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. రెవెన్యూ మంత్రి సిఫార్సుతో డిప్యుటేషన్‌పై ట్రస్ట్‌కు వచ్చిన ఓ అధికారికి కీలకమైన ఎంపానెల్మెంట్ ఇన్చార్జ్ బాధ్యతలను కట్టబెట్టారు.ఎంపానెల్మెంట్ దరఖాస్తుల ఆధారంగా ఆస్పత్రుల్లో తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించి ఆ నివేదిక ఆధారంగా అన్ని అర్హతలున్న దరఖాస్తులనే ఆమోదిస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు పాతరేసి ఎంపానెల్మెంట్ విభాగాధిపతిగా ఉన్న సదరు అధికారి ఆస్పత్రుల్లో ఇన్స్పెక్షన్లు నిర్వహించి, తానే నివేదిక రూపొందించి, ఆమోదించే వరకూ అన్ని పనులను చక్కబెట్టినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ మంత్రి సిఫార్సుతో ట్రస్ట్‌లో మరో అధికారి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉండగా తనిఖీల పేరిట ఆస్పత్రుల్లో హడావుడి చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం, ఇలా ఆస్పత్రులపై ఫిర్యాదులు వచి్చన సందర్భాల్లో ట్రస్ట్‌లో పనిచేసే వైద్యులను తనిఖీలకు పంపుతుంటారు. ఇందుకు విరుద్ధంగా నాన్–డాక్టర్ అయిన సదరు అధికారి తనిఖీలకు వెళ్లడం ఇదే తొలిసారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇష్టారాజ్యంగా సస్పెన్షన్ల ఎత్తివేత ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడటం, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి సంబంధించి సుమారు 10 ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీని తొలగించారు. గుంటూరులో బ్రెయిన్ హెమరేజీ చికిత్సల పేరిట దోపిడీకి పాల్పడిన ఓ ఆస్పత్రిపై గత ఏడాది సస్పెన్షన్ వేటు వేసి రూ.కోటి పెనాల్టీ విధించారు. ఈ ఆస్పత్రి యాజమాన్యంతో డీల్ కుదుర్చుకుని సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీ భారీగా తగ్గించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యులు అందుబాటులో లేని ఓ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిఫార్సు చేస్తే రెండు వారాలు తిరగకుండానే దాన్ని ఎత్తివేశారు. -
గ్రాడ్యుయేట్లను నమ్మలేం.. టీచర్లను ‘చూడండి’
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి.. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్‌లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్‌లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్‌లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్‌పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు. టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్‌గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్‌పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఒక ఎగ్జామ్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. -
జీవీ రెడ్డి ‘ఔట్’
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి(GV Reddy) వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి పోస్ట్ చేశారు. నాలుగు రోజుల కిందటే తీవ్ర ఆరోపణలు నాలుగు రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నాడంటూ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు సంస్థ పని తీరు మెరుగుపరిచేందుకు చైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఐఏఎస్ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్ష ణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. జీవీ రెడ్డి, దినేష్‌కుమార్‌ను మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పిలిచి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఆధారాలు అందించలేకపోయారని సమాచారం. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించి నట్లు తెలిసింది.అసత్య ఆరోపణలు, అర్థంలేని మాటలతో పలచనకావొద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థను రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్‌పై బదిలీ వేటుజీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి కె. దినేష్‌కుమార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం పెట్టుబడులు, మౌలి క వసతుల శాఖ కింద ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సోమవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆర్టీజీఎస్ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేష్న్ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్‌కుమార్‌ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
మీడియాపైనా ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
కూటమి పెద్దల సిలికా ‘స్కెచ్’
సాక్షి టాస్క్ఫోర్సు: తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని వందల ఎకరాల్లో ఉన్న సిలికా నిక్షేపాలను కొల్లగొట్టేందుకు కూటమి పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. ఇప్పటికే కూటమి నేతలు ఇక్కడి ఇసుక, క్వార్ట్ ్జను అక్రమ మార్గాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు సిలికా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. తొలుత సిలికా మైన్స్‌ను మూడు బడా సంస్థలకు కట్టబెట్టాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ సంస్థల ప్రతినిధులు స్థానిక లీజుదారులను లొంగదీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ బడా సంస్థ ప్రతినిధులు కొద్ది రోజులుగా చిల్లకూరు ప్రాంతంలోని ఓ హోటల్లో మకాం వేసి ఇక్కడి లీజుదారులను పిలిపించి తమకే సిలికా మైన్లను ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.గతంలో పరిశ్రమల పేరుతో తీర ప్రాంతంలో సిలికా ఉన్న భూములు దక్కించుకున్న ఈ సంస్థ మైనర్ మినరల్ పేరుతో జీవో తెప్పించుకుంది. అధికంగా సిలికా భూములు తమ దగ్గరే ఉన్నాయి కాబట్టి సిలికా తవ్వకాలను పూర్తిగా తమకే అప్పగించాలని ఇతర లీజుదారులపై ఒత్తిడి తెస్తోంది. నలుగురు ప్రజాప్రతినిధులను అన్నీ తానై నడిపించే మరో సంస్థకు చెందిన బడా బాబు లీజుదారులను చెన్నైకి పిలిపించి గనులు ఆయనకు అప్పగించాలని తెగేసి చెబుతున్నారు.తాజాగా అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సిలికా వ్యాపారం చేసిన సంస్థకే అన్ని గనులు అప్పగించి, మిగిలిన రెండు సంస్థల వారిని కలుపుకొని పోయేలా చూడాలని చెబుతున్నట్లు సమాచారం. ఈ మూడు సంస్థలో ఒక దానికి గతంలో వ్యాపారం చేసిన అనుభవం ఉంది. మరో సంస్థ చేతిలో అధిక శాతం సిలికా ఉన్న భూములున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు పెద్ద ఇంకొకరు. ఈ మూడు సంస్థలకు అప్పజెబితే ఏ ఇబ్బందీ లేకుండా సిలికా తరలించేయొచ్చన్నది కూటమి పెద్దల ప్రణాళికగా చెబుతున్నారు.ప్రజాప్రతినిధి టోకెన్ ఇచ్చినవారికే డీలర్షిప్టమి పెద్దలు సిలికా వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో దాని ప్రభావం డీలర్లపైనా పడింది. ఏడు నెలలుగా వారికి వ్యాపారమే సాగడంలేదు. పది రోజుల క్రితం గనుల శాఖాధికారి 50 మంది డీలర్లకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు సగం మందికి కూడా అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పైకి సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. అన్ని షరతులకు తలొగ్గి, స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే గనుల శాఖాధికారులు పిలిచి అనుమతులు జారీచేస్తున్నట్లు తెలుస్తోంది.పేదల భూముల పైనా కన్ను తీర ప్రాంతంలో బల్లవోలు గ్రామ పేదలకు 40 ఏళ్ల క్రితం పంపిణీ చేసిన భూములపైనా సిలికా లీజుదారుల కన్ను పడింది. గత ప్రభుత్వం ఈ భూముల్లోకి లీజుదారులు రాకుండా అడ్డుకొంది. పేదలు కూడా కోర్టును ఆశ్రయించి సాగు భూముల్లో తవ్వకాలు చేపట్టకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే లీజులు పొందిన ఓ మహిళ తాజాగా నెల్లూరు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ పెద్దల ద్వారా జాయింట్ ఇన్స్పెక్షన్ పేరుతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గనుల శాఖ, రెవెన్యూ శాఖలోని పలువురికి పెద్ద మొత్తంలో ముడుపులివ్వడం, కూటమి పెద్దల అండ కూడా ఉండటంతో వారు కూడా సహకారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్ జగన్
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. – వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీ భవిష్యత్తుకు నాది భరోసా..ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.ప్రజలకు అన్నీ తెలుసు..పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. -
దిగజారిన ప్రజాస్వామ్యం
తుని: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరో మెట్టు దిగజారింది. తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై దారుణంగా ఒత్తిళ్లుతెచ్చారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ‘రాష్ట్రంలో తునికి ఉన్న మంచి పేరును టీడీపీ ప్రభుత్వం కాలరాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను పోలీసుల సహకారంతో చిత్రహింసలకు గురి చేసింది.సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేక కలత చెంది చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని ఆమె ఉద్వేగంతో చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో తుని మున్సిపాలిటీ 30కి 30 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు.ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే.. టీడీపీ గూండాలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి అడ్డుకున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, అధికారులు టీడీపీకి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతియుత వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించినా.. అధికారులు అధికార పార్టీకి వంతపాడటంతో టీడీపీ దాష్టికాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. వీరి దారుణాల కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా వాయిదా పడిందని చెప్పారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించిన తనపై, తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయక తప్పడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సహచర కౌన్సిలర్లు 15 మందితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.మున్సిపల్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానన్నారు. మహిళలతో కన్నీరు పెట్టించిన టీడీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా తుని చైర్పర్సన్ రాజీనామా ఉదంతం రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామా నిర్ణయం తీసుకునేలా చేశారంటే ఎంత ఒత్తిడి చేశారో, ఎంతకు బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ప్రాణంపోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదు : కౌన్సిలర్ జ్యోతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు టీడీపీ నాయకులు ఆదివారం రాత్రంతా నరకం చూపారని ఒకటో వార్డు కౌన్సిలర్ వారాధి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, మళ్ల గణేష్, డి.శ్రీనివాసరాజు తదితరులు తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు లాకెళ్లి వైఎస్సార్సీపీలోంచి టీడీపీలోకి చేరాలంటూ బెదిరించారని.. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అదే జరిగితే దానికి టీడీపీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
తునిలో రెడ్‌బుక్ రాజ్యాంగం.. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు
కాకినాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికే సై అంటోంది. వేరే పార్టీల నాయకులను బెదిరించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి టీడీపీలో చేర్చుకుంటోంది. తాజాగా తునిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. దాంతో వారు టీడీపీలో చేరకతప్పలేదు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవగా, ఇప్పుడు తాజాగా టీడీపీ రాజకీయ కుట్రలకు తెరలేపింది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేరేలా కుట్రలు చేశారు యనమల.ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించిన టీడీపీ.. చైర్మన్ సుధాబాలు రాజీనామా చేసేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలోనే సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. పోలీసుల సహకారంతో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి.. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. -
GV Reddy: టీడీపీకి షాక్.. పార్టీకి జీవీరెడ్డి రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఆ పార్టీ నేత జీవిరెడ్డి షాకిచ్చారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.ఇటీవల, ‘తొమ్మిది నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మాత్రమే. మేం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు... ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండీ మరో ముగ్గురు అధికారులు భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్(బిజినెస్ హెడ్), శశాంక్ (ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్)లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే భరద్వాజ, సురేష్, శశాంక్లను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఏపీఎస్ఎఫ్ఎల్లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్ఆర్) రమేష్‌నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు.దినేష్‌కుమార్, రమేష్ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయన్నారు. తాను అధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని, దీనికి, వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల నిర్వాకం వల్లే వైఎస్ జగన్మోహన్రెడ్డి నష్టపోయారన్నారు. ‘మరో ఆరు నెలల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ చనిపోతుంది. దీనికి కారణమైన మా ప్రభుత్వంలోని అధికారుల నిర్వాకం బహిర్గతం చేయకపోతే జీవీ రెడ్డి వల్లే సంస్థ మూత పడింది. కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. తొలగించిన ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొనసాగిస్తున్నారు.’ అని అనుకునే ప్రమాదం ఉందనే ఈ విషయాలను చెబుతున్నానని ఆయన వివరించారు. -
‘ ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయం?’
కాకినాడ: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Sessions)ల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యడం లేదు. ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమీలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలువిజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది. చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది! -
‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీసీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం (ఫిబ్రవరి24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే. 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా? అదే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైఎస్ జగన్‌ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు.ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు.నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం.ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు. -
జగన్ అసెంబ్లీ వస్తే చంద్రబాబుకు వణుకు