team india
-
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్‌ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్‌ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
చాంపియన్స్ మనమే..!
చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్‌ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్‌గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్‌లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్‌కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్‌కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్‌పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
అపురూపంగా అక్కున చేర్చుకొని...
దుబాయ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల చేతుల్లో నాలుగో ఐసీసీ టైటిల్స్...రవీంద్ర జడేజాకు ముచ్చటగా మూడోది. గిల్, పంత్, పాండ్యా, అక్షర్, అర్‡్షదీప్ సింగ్, కుల్దీప్ ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ ట్రోఫీని అందుకోగా... షమీ, అయ్యర్, రాహుల్, సుందర్, రాణా మొదటిసారి కప్‌ను ముద్దాడారు... 15 మంది సభ్యుల జట్టులో అందరి ఘనతలు వేర్వేరు కావచ్చు... కానీ ఇప్పటికే ఎన్ని గెలిచినా, ఏం సాధించినా మరో విజయం దక్కినప్పుడు అందరిలో కనిపించే ఆనందం ఒక్కటే... సంబరాల్లో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జడేజా బౌండరీ కొట్టి ఛేదన పూర్తి చేయడంతో మొదలైన జోష్ సోమవారం వరకు సాగింది. స్టేడియంలో ఒకవైపు జట్టు సహచరులతో విజయాన్ని పంచుకుంటూనే మరోవైపు రోహిత్, కోహ్లి, జడేజా, షమీ, గిల్ తమ కుటుంబ సభ్యులతో ట్రోఫీ ఆనందాన్ని ప్రదర్శిస్తూ సుదీర్ఘ సమయం గడిపారు. అక్కడి నుంచి ఇదే ఉత్సాహం డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కొనసాగింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్‌ను కెప్టెన్ రోహిత్ కట్ చేసిన తర్వాత తమ విజయానుభూతిని అంతా పంచుకున్నారు. అనంతరం హోటల్ చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కుల్దీప్ చెప్పినట్లు రాత్రంతా పార్టీ కొనసాగింది. గిల్, పాండ్యా, వరుణ్ హోటల్ గదుల్లోనే చాంపియన్స్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిస్తూ ఈ మధుర క్షణాలను చిరస్మరణీయం చేసుకున్నారు. సోమవారం ఉదయం విజేత కెప్టెన్‌తో ఐసీసీ ప్రత్యేక ఫొటో షూట్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఐసీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టోర్నీ జ్ఞాపికలుగా మ్యాచ్‌లలో ఉపయోగించిన బంతులు, స్టంప్స్‌పై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా నేపథ్యంగా జరిగిన షూట్లో ట్రోఫీతో భారత సారథి సగర్వంగా నిలిచాడు. గత ఏడాది రోహిత్ నాయకత్వంలోనే గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌ను కూడా చాంపియన్స్ ట్రోఫీతో కలిపి ప్రదర్శించడం విశేషం. స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లుచాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి సంబరాలు ముగించిన వెంటనే టీమిండియా స్వదేశం పయనమైంది. సోమవారం రాత్రికే జట్టు ఆటగాళ్లంతా భారత్‌కు చేరుకున్నారు. -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్‌పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025 -
భారత్ జట్టుకు అభినందనలు తెలుపుతున్న సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు
-
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్‌ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్‌ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్‌పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్‌పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
టీమిండియాకు అసలుసిసలైన మొనగాడు
-
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్‌ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్‌మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్‌మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్‌మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. -
వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్‌తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.అయితే అకౌంట్లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్‌ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్‌మీడియా కోడై కూసింది. ఇన్‌స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్‌ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్‌మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడి 79.92 స్ట్రయిక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి బ్యాటింగ్‌తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్‌కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్‌కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా
-
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్‌తో... ఆపై చక్కటి బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్‌లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్‌కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్‌లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్‌లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్‌కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్‌లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్‌లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్‌కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్‌కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్‌లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్‌ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారతీయ ఫీల్డర్‌గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న రెండో ఫీల్డర్‌గానూ కోహ్లి (161 క్యాచ్‌లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్‌గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్‌వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.ప్రతీకారం తీర్చుకున్న భారత్తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. హ్యాట్రిక్ విజయాలుఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్‌లో గెలుపుతో భారత్ ఆసీస్‌పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
ఫైనల్‌కు చేరిన టీమిండియాకు కిషన్‌రెడ్డి అభినందనలు
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(మంగళవారం) జరిగిన తొలి సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. . ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రోహిత్ సేనకు అభినందనలు తెలియజేశారు. ఇదే జోష్ ను ఫైనల్ కూడా కనబరిచి చాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.ఆసీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), రాహుల్(42 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడగా, హార్దిక్ పాండ్యా( 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ 28)లు బ్యాట్ ఝుళిపించారు. దాంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ తలపడనుంది. -
CT 2025, IND VS AUS 1st Semis: 97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!ఈ మ్యాచ్‌లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్‌లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాయి. మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్‌పై ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్‌లో ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన జట్లు..సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్‌పై గెలుపుపాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమిశ్రీలంక (2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్)- న్యూజిలాండ్‌పై గెలుపుభారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్) -
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్‌లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్‌లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్-49 (30 ఇన్నింగ్స్‌లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్‌లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్‌కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ స్కోర్‌కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్‌కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్‌లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్‌తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్‌ల్లో పాల్గొని 335 క్యాచ్‌లు అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు పట్టాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, ద్రవిడ్ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351) జాక్ కల్లిస్ (338) ఉన్నారు. విరాట్ 335 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కూపర్ కన్నోలిని షమీ డకౌట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్ హెడ్ మెరుపులు మెరిపించాడు. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్‌ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిస్ (11) కొద్ది సేపే క్రీజ్‌లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లిస్ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్ స్మిత్, క్యారీ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
CT 2025: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్‌కు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్‌లో ఫలితంతో రెండో సెమీస్‌లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్‌లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్‌పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
CT 2025: ఐదేసిన వరుణ్.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.రాణించిన శ్రేయస్, హార్దిక్, అక్షర్తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.ఐదేసిన వరుణ్250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి భారత్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. వీరందరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, బ్రేస్‌వెల్ 2, మ్యాట్ హెన్రీ 2, విలియమ్ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (28) బ్యాట్ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
Champions Trophy 2025: టీమిండియా మేనేజర్ ఇంట విషాదం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ దేవరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవరాజ్ తల్లి కమలేశ్వరి ఇవాళ (మార్చి 2) ఉదయం మృతి చెంచారు. దీంతో దేవరాజ్ భారత బృందాన్ని వదిలి హైదరాబాద్‌కు బయల్దేరారు. దేవరాజ్ తిరిగి టీమిండియాతో కలుస్తారా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. మంగళవారం జరిగే సెమీఫైనల్ ఫలితంపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. దేవరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దేవరాజ్ తల్లి మృతి పట్ల హెచ్‌సీఏ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో తెలిపింది. దేవరాజ్ ఇటీవలే టీమిండియా మేనేజర్ ఎంపికయ్యారు.ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
Champions Trophy 2025: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయంన్యూజిలాండ్పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విలియమ్సన్కు మిగతా కివీస్ బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో వరుణ్‌తో పాటు కుల్దీప్ (2), హార్దిక్ పాండ్యా (1), అక్షర్ పటేల్ (1), రవీంద్ర జడేజా (1) వికెట్లు తీశారు.అంతకుముందు భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్.. ఆస్ట్రేలయాతో తలపడనుంది. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తివరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్ హెన్రీ (2) వికెట్ ఈ మ్యాచ్‌లో వరుణ్‌కు ఐదవది. విరాట్ కోహ్లి క్యాచ్ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.సాంట్నర్ క్లీన్ బౌల్ట్.. వరుణ్ ఖాతాలో నాలుగో వికెట్న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్ చివరి ఆశాకిరణం మిచెల్ సాంట్నర్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ విలియమ్సన్ ఔట్169 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ కేన్ విలియమ్సన్ (81) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విలియమ్సన్ స్టంపౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. బ్రేస్‌వెల్ ఔట్.. వరుణ్ ఖాతాలో మూడో వికెట్159 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ (2) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డేంజర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరుసటి బంతిరే డేంజర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. ఫిలిప్స్‌ను వరుణ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35.4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 151/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 86 బంతుల్లో 99 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్133 పరుగుల వద్ద (32.2 ఓవర్లు) న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా కీలకమైన టామ్ లాథమ్ (14) వికెట్ తీశాడు. లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 117 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్జడేజా బౌలింగ్‌లో బౌండరీతో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్‌కు వన్డేల్లో ఇది 47వ హాఫ్ సెంచరీ. కేన్ తన హాఫ్ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. మ్యాజిక్ చేసిన కుల్దీప్.. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్93 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ డెలివరీతో డారిల్ మిచెల్‌ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 104/3గా ఉంది. కేన్ విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ విలియమ్సన్కు (19) జతగా డారిల్ మిచెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టడంతో రచిన్ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్ యంగ్‌కు (10) జతగా కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు.రాణించిన శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (కోహ్లి), కేన్ విలియమ్సన్ (జడేజా) పట్టిన క్యాచ్‌లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్246 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ సింగిల్స్ తీయకుండా ఓవరాక్షన్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు (17) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్128 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్న అక్షర్ పటేల్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో అక్షర్ ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అక్షర్‌ను పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్‌కు (51) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 127/3గా ఉంది. శ్రేయస్ 51, అక్షర్ పటేల్ 42 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (35 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జేమీసన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే -
ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్‌లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఫైనల్ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు బ్యాటర్‌గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్‌లో భారత భావి కెప్టెన్‌గా గిల్‌ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్‌గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్‌లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్‌మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే... -
ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్ -
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్‌ను ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్‌ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్‌తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్‌తో పాక్ టీమ్‌ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్‌కు ఫేస్‌కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు. -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.అద్భుత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. -
Champions Trophy 2025: పాక్‌తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
INDvsPAK: ఆదివారం.. ‘ఆట’విడుపు
సాక్షి, హైదరాబాద్: హాలిడే బద్ధకం ఎగిరిపోనుంది. రోజంతా కళ్లార్పనివ్వని ఉద్వేగం దరి చేరనుంది. నగర వాసులకు ఈ సన్డే.. అసలు సిసలు హాట్ హాట్ విందును వడ్డించనుంది. ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ క్రికెట్ పోరును వీక్షించేందుకు ఎవరి స్థాయిలో వారు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్ధమైన వేదికలు... పాక్– ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని సందడి. పైగా ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెండింతలైంది. దీంతో యువత, చిన్నా, పెద్దా, క్రికెట్ అభిమానులందరి వారాంతపు రొటీన్ మారిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే డేఅండ్ నైట్ మ్యాచ్‌ను మిస్ కాకూడదు అదొకటే ప్లాన్. మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చోవడం మాత్రమే లక్ష్యం. రివెంజ్ తీరేనా? గత 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని ఈసారి టీం ఇండియా తిప్పికొడుతుందనే నమ్మకం ధీమా నగర వాసుల్లో కనిపిస్తోంది. రెండు జట్లూ శాయశక్తులా పోరాడతాయి కాబట్టి.. ఉత్కంఠభరిత మ్యాచ్ తప్పదని నమ్ముతున్న సిటిజనులు ఆ థ్రిల్‌ని తనివితీరా ఆస్వాదించాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబ్స్, ఓపెన్ థియేటర్స్, ఇతర ప్రదేశాల్లో స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్పెషల్ మెనూలు సిద్ధం చేశారు. ఫ్రెండ్స్‌తో కొందరు, ఫ్యామిలీస్‌తో కలిసి కొందరు.. ఎవరికివారు తమకు అనువైన వేదికలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.. ఏదేమైనా.. అందరి నోటా ఒకటే మాట ‘జయహో ఇండియా’. -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్‌పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్‌లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్‌లో (బర్మింగ్హమ్) పాక్ భారత్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్‌లో మరోసారి పాక్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్‌లో భారత్, పాక్‌లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్‌ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్‌లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్‌దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్‌లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్‌ను ఓడించి తమ తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఓవల్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్‌పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్‌తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కూడా మాంచి టచ్‌లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్‌కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా పాక్‌తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్‌లోకి వచ్చాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్‌తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్‌లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్‌పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్‌తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్‌లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్‌లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్‌ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్‌పై పైచేయి సాధించేందుకు భారత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
వీడియో: మాజీ కెప్టెన్ గంగూలీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
కోల్కత్తా: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంగూలీ పది నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి చూశారు.వివరాల ప్రకారం.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్లారు. ఈవెంట్‌కు వెళ్తున్న సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో ఆయన కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది.దీంతో, ఆయన కారు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ సౌరవ్ గంగూలీ, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, గంగూలీ అక్కడే కాసేపు వేచి చూశారు. అనంతరం, ఆయన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. Sourav Ganguly News:सौरव गांगुली की कार का एक्सीडेंट, बाल-बाल बचे दादा#SauravGanguly #Accident #LatestNews @khanduri_pooja pic.twitter.com/7ZnuBdhDYi— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) February 21, 2025 -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్‌లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్‌ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్‌లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్‌లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్‌లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్‌కు 260వ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్‌ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్‌లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!
భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచ క్రికెట్ అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:1998 (బంగ్లాదేశ్)1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్ ఆతిధ్యమిచ్చింది. నాకౌట్ ఫార్మాట్లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్ 307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు. కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్) రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2000 (కెన్యా)కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి 141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.2002 (శ్రీలంక)2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు. భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.ఫైనల్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది. కానీ భారత్ లక్ష్య సాధనకి వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్ రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.2004 (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్‌లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.2006 (భారత్)భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.2009 (దక్షిణాఫ్రికా)2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్‌ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్‌ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి అది సరిపోలేదు.2013 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)ఎమ్ ఎస్ ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2017 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో భారత్ సెమీఫైనల్స్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. -
Champions Trophy 2025: ఎట్టకేలకు పాక్‌లో భారత జెండా ఎగిరింది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్‌లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది. భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు. The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025. Via - @imransiddique89 #ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. నేటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్‌తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్ 2025-26 కౌంటీ సీజన్ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్‌తో డీల్‌లో శార్దూల్ ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శార్దూల్ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్.. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్ చివరిగా 2023 బాక్సింగ్ డే టెస్ట్‌లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్ దేశవాలీ క్రికెట్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో రాణిస్తుండటంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాట్‌తోనూ సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో శార్దూల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో ముంబై సెమీస్‌కు చేరడంలో శార్దూల్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్ విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఓ వికెట్ తీసి, 37 పరుగులు చేశాడు.కష్టాల్లో ముంబైవిదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (67 నాటౌట్), తనుశ్ కోటియన్ (5) ముంబైను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విదర్భ యువ స్పిన్నర్ పార్థ్ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ షోరే (74), దనిశ్ మలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు. -
CT 2025: రోహిత్ సేన కొడుతుందా!.. స్పిన్నర్ల ప్రభావం కీలకం
సాక్షి క్రీడా విభాగం: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు అజేయంగా తమ జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా పది విజయాలతో ఆల్‌టైమ్ గ్రేట్ వన్డే టీమ్‌లలో ఒకటిగా కనిపించింది. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడినా... ఇప్పుడు దాదాపు పదిహేను నెలల తర్వాత ఇదే ఫార్మాట్లో శిఖరాన నిలిచే అవకాశం మళ్లీ జట్టు ముందుకు వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్న ఆటగాళ్లే దాదాపుగా ఈ మెగా టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు. కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ విజయం వారికి ప్రత్యేకంగా మారవచ్చు. ఫామ్‌పరంగా చూసినా ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ సేననే బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి మన జట్టు టైటిల్ కొడుతుందా అనేది ఆసక్తికరం.2017లో రన్నరప్‌గా నిలిచిన జట్టులోని ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుత టీమ్‌లో భాగంగా ఉన్నారు. యూఏఈలో 2021 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరడంలో విఫలమైన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఐసీసీ టోర్నీలో బరిలో నిలిచింది. బ్యాటింగ్‌లో సత్తా ప్రదర్శిస్తే... టీమిండియా వన్డే బ్యాటింగ్ కూర్పు చాలా కాలంగా అనూహ్య మార్పులు లేకుండా నిలకడగా ఉంది. అదే జట్టుకు ప్రధాన బలం కూడా. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో టాప్–5 విషయంలో ఎలాంటి సమస్య లేదు. 2023 నుంచి చూస్తే వీరంతా కనీసం 1000 పరుగులు సాధించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించడం కూడా సానుకూలాంశం. గిల్, అయ్యర్ చెలరేగిపోతుండగా ఫామ్‌ను అందుకున్న రోహిత్ సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లి, రాహుల్ కూడా ఆకట్టుకున్నారు. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల బ్యాటింగ్ మనకు ఎప్పుడూ అదనపు ప్రయోజనాన్ని అందించింది. వీరికి ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా జత కలిశాడు. ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో అక్షర్ అంచనాలకు మించి మెరుగై ఏ స్థానంలోనైనా ఆడి ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ విఫలమైతే పంత్ రూపంలో తగిన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి బెంగ లేదు. పేసర్లు రాణిస్తారా... జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడం నిస్సందేహంగా జట్టుకు పెద్ద దెబ్బ. రవిశాస్త్రి చెప్పినట్లు అతని గైర్హాజరు జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అయితే అందుబాటులో ఉన్నవారిలో షమీ ఆ స్థాయి బౌలర్. కానీ గాయం నుంచి కోలుకొని వచ్చిన అతను ఎంత వరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడనేది చూడాలి. పెద్దగా అనుభవం లేని అర్‡్షదీప్, హర్షిత్ రాణా ఒత్తిడిని తట్టుకొని షమీకి అండగా నిలవడం అవసరం. హార్దిక్ పాండ్యా సత్తా చాటగలడు కాబట్టి మూడో పేసర్ బెంగ లేదు. ముగ్గురు ఖాయం! చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపుపై ఆశలు రేపుతున్న కీలక విభాగం స్పిన్ బౌలింగే. మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతుండటం కచ్చితంగా సానుకూలాంశం. అందుకే టీమ్ ఐదుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. ఫిబ్రవరి 9 వరకు ఐఎల్టి20 మ్యాచ్‌ల నిర్వహణలో పిచ్‌లన్నీ నెమ్మదిగా మారిపోయాయి. 11 రోజుల వ్యవధిలో జీవం ఉన్న పిచ్‌లను తయారు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇవన్నీ స్పిన్‌కు అనుకూలించవచ్చు.బౌలింగ్‌లో వైవిధ్యం ఉన్న మన స్పిన్నర్లు ఫామ్‌లో కూడా ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టంగా మారిపోనుంది. ఆరేళ్లుగా ఇక్కడ పెద్ద జట్లేవీ వన్డేలు ఆడలేదు. అయితే 2018 నుంచి ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 213 మాత్రమే. తక్కువ స్కోరింగ్‌ల మ్యాచ్‌లలో స్పిన్నర్లు ప్రభావం చూపడం ఖాయం. తుది జట్టులో కనీసం ముగ్గురిని జట్టు ఎంచుకుంటుంది. 2 చాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు (2002, 2013)లలో విజేతగా నిలిచిన భారత్ మరో రెండుసార్లు (2000, 2017)లో ఫైనల్లో ఓడింది. 9 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత్ 9 వన్డేలే ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. వీటిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై సిరీస్ నెగ్గగా... శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. -
CT 2025: ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన టీమిండియా జెర్సీల ఆవిష్కరణ (ఫొటోలు)
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బౌలింగ్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తండ్రి హఠాన్మరణం కారణంగా భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మోర్కెల్.. టీమిండియాతో కలిసి ఫిబ్రవరి 15న భారత్ నుంచి దుబాయ్‌కు వచ్చాడు. ఫిబ్రవరి 16న తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న మోర్నీ.. ఆతర్వాత తండ్రి మరణవార్త విని సౌతాఫ్రికాకు బయల్దేరాడు. మోర్నీ తిరిగి భారత బృందంతో ఎప్పుడు కలుస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. మోర్నీ లేని లోటు టీమిండియా పేస్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్‌లో భారత పేస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. మోర్నీ అండర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా సత్తా చాటాడు. మోర్నీ ఆథ్వర్యంలోనే హర్షిత్ రాటుదేలాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికైనా మోర్నీ అందుబాటులోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. దీని తర్వాత భారత్.. మార్చి 2న న్యూజిలాండ్‌తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
Champions Trophy 2025: పాక్‌లో ఎగరని భారత జెండా
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్‌ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్‌లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్‌కు చేరుకున్నాయి. 1996 వరల్డ్‌కప్ తర్వాత పాక్‌లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్
-
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్‌కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్‌లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్‌లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్‌కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్‌లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్‌పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్‌కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్‌లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
Champions Trophy 2025: రాణా మెరుపులు మెరిపిస్తాడా?
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్‌లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది. సిరాజ్‌ను మినహాయించడం ఆశ్చర్యకరంసిరాజ్ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన రాణా ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం. -
ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదు: టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలో దిగనుంది. వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా ఈ పేస్ గుర్రం ఐసీసీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో బుమ్రా లేని లోటు టీమిండియాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా స్థానాన్ని వేరొక ఆటగాడు భర్తీ చేయడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను ఉద్దేశించి డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో అంతగా అనుభవం లేని అర్ష్‌దీప్.. నేరుగా ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తాడని ఊహించలేమన్నాడు.సిరాజ్‌ను కాదనికాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా దూరమవుతాడని ముందుగానే ఊహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. పేస్ దళంలో సీనియర్ మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటిచ్చింది. అయితే, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై మాత్రం నమ్మకం ఉంచలేకపోయింది.సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ను ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేయడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించాడు కూడా. ఆరంభంలో కొత్త బంతితో ప్రభావం చూపుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం రాణించలేకపోతున్నాడని పేర్కొన్న సిరాజ్.. అర్ష్‌దీప్ మాత్రం రెండు సందర్భాల్లోనూ మ్యాజిక్ చేయగలడని పేర్కొన్నాడు. అందుకే తాము ఈ యువ పేసర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘ఒకరు జట్టులో లేకపోవడం వల్ల మరొకరికి చోటు దక్కడం నిజంగా ఓ గొప్ప అవకాశమే. అయితే, బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతడు జట్టులో లేకుంటే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది.ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదుఇక అర్ష్‌దీప్ విషయానికి వస్తే.. టీ20లకు, వన్డే ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. నాలుగు ఓవర్లు వేయడానికి.. పది ఓవర్ల బౌలింగ్‌కు కచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడానికి ఇది టీ20 కాదు. వరుస ఓవర్లు, దీర్ఘమైన స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అయితే, అర్ష్‌దీప్‌నకు అలాంటి అనుభవం లేదు’’ అని పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20లలో అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటి వరకు 99 వికెట్లు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమిండియా తరఫున కేవలం తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ పద్నాలుగు వికెట్లు తీయగలిగాడు. తొమ్మిది వన్డేలు ఆడిఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొన్న అర్ష్‌దీప్ సింగ్ ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ వన్డేలో ఐదు ఓవర్లు బౌల్ చేసిన అర్ష్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక అర్హత సాధించాయి. కాగా బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కోసం భారత్, శ్రీలంక జట్ల ప్రకటన
ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్‌కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్‌కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్‌కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే -
ప్రేమ పెళ్లి చేసుకున్న టాప్ క్రికెటర్లు (ఫొటోలు)
-
మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే
భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, తన సతీమణి చేతనతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా కుంబ్లే దంపతులు మహాకుంభ్ మేళాలో పాల్గొన్నారు. అమృత స్నానం ఆచరిస్తున్న దృశ్యంతో పాటు పౌర్ణమి చంద్రుడి ఫోటోను, బోటులో భార్య చేతనతో తీసుకున్న సెల్ఫీని కుంబ్లే ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇందుకు బ్లెస్డ్ అని క్యాప్షన్ పెట్టి, మహాకుంభ్, ప్రయాగ్‌రాజ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F— Anil Kumble (@anilkumble1074) February 12, 2025కాగా, బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో మహాకుంభ్‌కు జనం పోటెత్తారు. నిన్న ఒక్క రోజే రెండు కోట్ల మందికిపైగా పుణ్య స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. మహాకుంభ్‌ను నిన్నటి వరకు దాదాపుగా 50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు. మహాకుంభ్‌కు లెక్కలేని సంఖ్యలో జనం పోటెత్తుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాల అనుమతిని నిషేధించారు. ఎక్కడో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ల వరకు జనం నడిచి వెళ్తున్నారు.అనిల్ కుంబ్లే విషయానికొస్తే.. 54 ఏళ్ల ఈ దిగ్గజ స్పిన్నర్ భారత్ తరఫున 132 టెస్ట్‌లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. టెస్ట్‌లు, వన్డేల్లో కలుపుకుని కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు తీశాడు. కుంబ్లేకు ఐపీఎల్లో కూడా ప్రవేశముంది. కుంబ్లే ఆర్సీబీ తరఫున 2008-10 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఆటగాడిగా రిటైరైన అనంతరం కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. కుంబ్లే ఆథ్వర్యంలో టీమిండియా చారిత్రక విజయాలు సాధించింది. కుంబ్లే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
ప్రాణాపాయస్థితిలో రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి
టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్‌ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు. రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్‌తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది. రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్‌నగర్ పోలీసులకు (ఉత్తర్‌ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్‌కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
కటక్ నుంచి అహ్మదాబాద్‌కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్నెస్ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇటీవలే స్కానింగ్ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్‌లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) టీమ్‌లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. -
రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్‌రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
IND Vs ENG: హిట్‌మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్‌మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్‌రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్‌లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్‌మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్‌కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్‌తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్‌ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్‌తో (England) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్‌మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్‌లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్‌లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్‌కు నో ప్లేస్ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్‌లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్‌లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్‌కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
IND VS ENG 1st ODI: కొనసాగుతున్న రోహిత్ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ (Rohit Sharma) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. కొద్ది రోజుల కిందటి వరకు టెస్ట్‌లకే పరిమితమైన రోహిత్ బ్యాడ్ ఫామ్.. ఇప్పుడు వన్డేలకు కూడా పాకింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచే రోహిత్ కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్‌లను ఎదుర్కొనేందుకు హిట్‌మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అత్యంత చెత్తగా ఔటైన అనంతరం రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీ పని అయిపోయింది పో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ రంజీల్లో ఆడి, అక్కడా మర్యాద పోగొట్టుకున్నాడు. పసికూన జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 3, 28 పరుగులకు ఔటయ్యాడు. అంతకుముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్‌లో ఫామ్‌తో తెగ ఇబ్బంది పడిన రోహిత్ చివరి టెస్ట్ నుంచి స్వతాహాగా తప్పుకున్నాడు. 2024-25 సీజన్లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు పరిశీలిస్తే దారుణంగా ఉన్నాయి. గత 16 ఇన్నింగ్స్‌లలో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. అతను బ్యాటింగ్ సగటు కేవలం 10.37గా ఉంది. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ కేవలం 166 పరుగులే చేశాడు.2024-25లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..652382520818113610392 (నేటి మ్యాచ్)టెస్ట్‌లతో పోలిస్తే వన్డేల్లో పర్వాలేదనిపించే రోహిత్.. ఇక్కడ కూడా విఫలం కావడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే తమ ఆరాధ్య ఆటగాడి పని అయిపోయిందా అనుకుంటూ మదనపడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 249 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (59) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 111 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. -
IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా (Team India) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే.ఏకైక భారత స్పిన్నర్ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్‌తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్‌ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య (445 మ్యాచ్‌ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (247 మ్యాచ్‌ల్లో 317), డేనియల్ వెటోరీ (295 మ్యాచ్‌ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయంనాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్‌తో పాటు అక్షర్ (29) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్మంచి టచ్‌లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్‌కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (18) క్రీజ్‌లో ఉన్నాడు.వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్‌మన్ గిల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ డౌన్.. లివింగ్‌స్టోన్ ఔట్183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి లివింగ్‌స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉన్నారు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/430 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణాఅరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్‌ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్‌ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.రాణా బౌలింగ్‌లో చితక్కొట్టిన సాల్ట్ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్‌నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్‌నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం వచ్చింది. యశస్వి.. రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్‌లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC T20 Rankings) టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడిన శర్మ.. ఒక్కసారిగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం శర్మ కెరీర్లో అత్యుత్తమంగా 829 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శర్మ దెబ్బకు సహచరుడు తిలక్ వర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి దిగజారాడు. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ దెబ్బకు టాప్-10 (హెడ్ మినహా) బ్యాటర్లు తలో స్థానం కోల్పోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే 38 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆదిల్ రషీద్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టాప్-5లో ఉన్న ఏకైక బౌలర్ వరుణ్ ఒక్కడే. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. హసరంగ, ఆడమ్ జంపా తలో స్థానం దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో ఓ మోస్తరుగా రాణించిన భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. టీ20ల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్ అర్షదీప్ 8 నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇవి మినహా బౌలర్ల విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ జట్టుకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. 19561 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12417 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. -
అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో హిట్‌మ్యాన్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్-2023 మాదిరి ఈ మెగా టోర్నీలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడుగానే ఆడతాడని అంచనా వేశాడు.ఘోర పరాభవాలుకాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ముంబైకర్.. గతేడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఘోర పరాభవం పాలైంది.దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయింది. అనంతరం.. టెస్టులతో బిజీ అయిన రోహిత్ శర్మ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో, ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో ఈ రెండు సిరీస్‌లనూ టీమిండియా కోల్పోయింది.అనంతరం రంజీ బరిలో దిగిన రోహిత్ శర్మ అక్కడా ముంబై ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంఓ 37 ఏళ్ల రోహిత్ శర్మను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుందని పేర్కొన్నాడు.అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం‘‘చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడతాడని అనుకుంటున్నా. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ అతడు అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడు. కాబట్టి ఈసారీ అదే జోరు కొనసాగిస్తాడు. అయితే, అతడితో పాటు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగేది ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.శుబ్‌మన్ గిల్ వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ గిల్ గనుక ఓపెనర్‌గా ఉంటే.. అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం. ఏదేమైనా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కానుంది. ఒకవేళ ఇందులో గనుక భారత్ గెలిస్తే.. నాలుగు ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన తొలి టీమిండియా ప్లేయర్‌గా అతడు చరిత్రకెక్కుతాడు.ఇక సారథిగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. అయితే, అతడు ఈ టోర్నీలో బ్యాటర్‌గానూ రాణించాల్సి ఉంది’’ అని సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ఇక కెప్టెన్‌గా 2024 టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీనీ ముద్దాడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడుతున్నాయి.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
వరుణ్ చక్రవర్తికి బంపరాఫర్..?
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) బంపరాఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో (Team India) వరుణ్‌కు చోటు కల్పించనున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో వరుణ్‌కు చోటు దక్కలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ ఖరారైందని తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ముగిసినా వరుణ్ భారత వన్డే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.వరుణ్ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి నాగ్‌పూర్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.Varun Chakaravarthy training with Indian ODI Team in Nagpur 🚨- He's not officially part of the squad yet.📸: Sandipan Banerjee#INDvENG #ChampionsTrophy #Nagpur pic.twitter.com/vqfyQJtdLe— OneCricket (@OneCricketApp) February 4, 2025కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో చెలరేగిన నేపథ్యంలో వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల రిటైరైన భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సిఫార్సు చేశాడు. ఒకవేళ వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌కు యాడ్ చేస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వరుణ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుణ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడిపోయారు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ (టీ20 సిరీస్‌లో) ఇరగదీశాడు. ఆ సిరీస్‌లో వరుణ్ 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లపై వరుణ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా భాగమన్న విషయం తెలిసిందే.వన్డేల్లో ఇదే జోరు కొనసాగించగలడా..?ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ విషయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతుంది. టీ20 ఫార్మాట్లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వరుణ్ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదో వేచి చూడాలి. వరుణ్ భారత్ తరఫున 18 టీ20ల్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లోనే 9 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. వరుణ్‌కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. వరుణ్ గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్‌కు మరో 19 ఇన్నింగ్స్‌ల సమయం ఉంది.ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు చేస్తే సచిన్‌ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్‌లేమి కారణంగా రోహిత్ వాలంటీర్‌గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డే రోహిత్‌కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.రంజీల్లోనూ నిరాశేఇంగ్లండ్తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్‌లో లేని రోహిత్ రంజీ మ్యాచ్‌తో అయినా తిరిగి టచ్‌లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుఇంగ్లండ్తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.చిత్తుగా ఓడిన ఇంగ్లండ్వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. సంజూ శాంసన్‌కు గాయం..?
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ (Sanju Samson) శాంసన్ గాయపడినట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజూ చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఆతర్వాత సంజూ బ్యాటింగ్‌ను కొనసాగించినప్పటికీ.. కొద్ది సేపటికే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సంజూ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్‌కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. దీంతో సంజూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా సంజూ రంజీ బరిలో ఉండడని సమాచారం. రంజీలో సంజూ ప్రాతినిథ్యం వహించే కేరళ, క్వార్టర్ ఫైనల్లో జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడాల్సి ఉంది.డగౌట్లో సంజూఇంగ్లండ్తో చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సంజూ.. ఆతర్వాత స్కానింగ్‌కు వెళ్లలేదు. డగౌట్లో ఎక్స్ట్రా ప్లేయర్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీన్ని చూసి అభిమానులు సంజూకు ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సంజూ చూపుడు వేలుకు బాగా వాపు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు స్కానింగ్‌కు వెళ్లగా డాక్టర్లు ఫ్రాక్చర్‌ను గుర్తించినట్లు సమాచారం.ఘోర వైఫల్యంఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్‌లో ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సంజూ వీక్నెస్ను గుర్తించిన ఇంగ్లండ్ పేసర్లు పదేపదే ఒకే తరహా బంతులు వేసి అతన్ని ఔట్ చేశారు.4-1 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ విఫలమైనప్పటికీ భారత్ 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సంజూ సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి టీ20లో విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్‌రేట్‌తో 276 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మార్చి 21 నుంచి ప్రారంభంఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ ఆరంభ ఎడిషన్‌లో మాత్రమే టైటిల్ సాధించింది. గత సీజన్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. -
అజేయం... అద్వితీయం
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్‌ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్‌రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్‌లో కనబరిచిన ఆల్‌రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్‌లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది. సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్‌సైడ్ అయ్యింది. కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్‌తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్‌రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది. స్పిన్ వలలో విలవిల దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది. రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. ధనాధన్ ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్‌ను ఓపెనర్ త్రిష తన షాన్‌దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్‌తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3. భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్‌తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0. -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్‌తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్‌లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్‌లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్‌కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
IND VS ENG 5th T20: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్‌లో చెలరేగిన అభిషేక్ బౌలింగ్లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.ప్రస్తుత సిరీస్‌లో వరుణ్ ప్రదర్శనలు..తొలి టీ20-3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)రెండో టీ20-2/38మూడో టీ20-5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)నాలుగో టీ20-2/28ఐదో టీ20-2/25 -
IND VS ENG 5th T20: అభిషేక్ శర్మ మహోగ్రరూపం.. 37 బంతుల్లోనే శతకం
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓ భారీ రికార్డు సాధించింది. పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉండింది. 2021లో స్కాట్లాండ్పై భారత్ ఈ స్కోర్ చేసింది.టీ20 పవర్ ప్లేల్లో భారత్ అత్యధిక స్కోర్లు95/1 ఇంగ్లండ్‌పై (2025)82/2 స్కాట్లాండ్పై (2021)82/1 బంగ్లాదేశ్‌పై (2024)78/2 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం హాఫ్ సెంచరీతో ఆగలేదు. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 143/2గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 7 బంతుల్లో 16, తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ కాస్త పర్వాలేదనిపించగా.. శాంసన్ వరుసగా ఐదో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/5. అభిషేక్ (108), రింకూ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్‌కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్‌ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్‌పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్‌దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్‌సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్‌ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్‌ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్‌కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్‌దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్‌లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్‌కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్‌కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్‌లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేసి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్‌స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్‌తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
IND VS ENG 4th T20: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్‌రేట్‌తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్‌లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్‌స్టోన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
తీరు మార్చుకోని సంజూ శాంసన్.. వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న సూర్య
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పలువురు టీమిండియా బ్యాటర్ల వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (5,3,1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. సూర్య విషయానికొస్తే.. ఏదో కెప్టెన్సీ బాధ్యత మోస్తున్నాడని తప్పిస్తే, ఈ సిరీస్ మొత్తంలో సూర్య ప్రదర్శనలు శూన్యం. సిరీస్‌ను డకౌట్‌తో ప్రారంభించిన సూర్య.. ఇవాళ జరుగుతున్న నాలుగో టీ20లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మధ్యలో రెండు, మూడు మ్యాచ్‌ల్లో అతను 12, 14 పరుగులు చేశాడు. సూర్య ప్రదర్శన ఈ సిరీస్‌కు ముందు నుంచే చెత్తగా ఉంది. చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యపై విమర్శలు తారా స్థాయికి చేరాయి. కెప్టెన్సీకి వేరే వాళ్లకు కట్టబెట్టి ముందు అతన్ని జట్టులో నుంచి తీసేయండని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అభిషేక్ శర్మది అదే తీరు.. మంచి ఆరంభాలు లభించినా..!ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ కాస్త పర్వాలేదనిపిస్తున్నా అతని నిలకడలేమి ఆందోళన కలిగిస్తుంది. తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ (34 బంతుల్లో 79) ఆడిన అభిషేక్ ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు, మూడు టీ20ల్లో వరుసగా 12, 24 పరుగులు చేసిన అభిషేక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే అతను చివరి వరకు క్రీజ్‌లో ఉండాల్సింది. అయితే అతను తన సహజ సిద్దమైన దూకుడును ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. అభిషేక్ వికెట్ సమర్పించుకోవడంతో పాటు భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు.తిలక్ ఖాతాలో వరుసగా రెండు వైఫల్యాలుసిరీస్లోని రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ (55 బంతుల్లో 72 నాటౌట్) ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో టీ20లో 18 పరుగులు చేసిన తిలక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో తిలక్‌పై కూడా విమర్శలు మొదలవుతున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. తొలుత హ్యాట్రిక్, ఇప్పుడు..?
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్లో ముంబై ఆల్‌రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్‌లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్‌తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది. 90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు. -
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం
చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) తొలి ఇన్నింగ్స్‌లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో రాహుల్ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.కాగా, ఈ మ్యాచ్‌లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ ఇన్నింగ్స్‌లో తొలుత రాహుల్‌ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్ టచ్‌లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.ఈ మ్యాచ్‌లో హర్యానా టాస్ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేవీ అవనీశ్ ఔట్ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటయ్యాక దేవ్‌దత్ పడిక్కల్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్ 121/2గా ఉంది. మయాంక్ 63, పడిక్కల్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌ను ఔట్ చేసిన కంబోజ్ అనీశ్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్రాహుల్ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్ట్‌ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్ లేమి కారణంగా రాహుల్ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్‌కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో (77).. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో (84) మాత్రమే రాహుల్ రాణించాడు. -
IND Vs ENG: భారత్‌ను ముంచిన బ్యాటర్లు
ఇంగ్లండ్ స్కోరు 7 వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. కానీ రెండో వికెట్ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్ మొదటి వికెట్ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్ వశమయ్యే మ్యాచ్‌లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్‌ను ముంచింది. రాజ్‌కోట్: సిరీస్‌ను గెలిపించే మ్యాచ్‌ను భారత్ సిరీయస్‌గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్... వరుణ్ బిగించిన స్పిన్ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్ 26 పరుగులతో భారత్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెన్ డకెట్ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు సాల్ట్ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెడితే వరుణ్ ఉచ్చులో ఇంగ్లండ్ చిక్కుకుంది. బట్లర్ సహా, స్మిత్ (6), ఓవర్టన్ (0), కార్స్ (3), ఆర్చర్ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం! భారత్ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్ (3), అభిషేక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (14), తిలక్ వర్మ (18), సుందర్ (6), అక్షర్ (15), జురేల్ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. హార్దిక్ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 5; డకెట్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 51; బట్లర్ (సి) సామ్సన్ (బి) వరుణ్ 24; హ్యారీ బ్రూక్ (బి) బిష్ణోయ్ 8; లివింగ్‌స్టోన్ (సి) జురేల్ (బి) పాండ్యా 43; స్మిత్ (సి) జురేల్ (బి) వరుణ్ 6; ఓవర్టన్ (బి) వరుణ్ 0; కార్స్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 3; ఆర్చర్ (బి) వరుణ్ 0; రషీద్ నాటౌట్ 10; మార్క్‌వుడ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్: షమీ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 4–0–33–2, సుందర్ 1–0–15–0, వరుణ్ 4–0– 24–5, రవి బిష్ణోయ్ 4–0–46–1, అక్షర్ పటేల్ 3–0–19–1, అభిషేక్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 3; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) కార్స్ 24; సూర్య (సి) సాల్ట్ (బి) వుడ్ 14; తిలక్ వర్మ (బి) రషీద్ 18; హార్దిక్ పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 40; సుందర్ (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 6; అక్షర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 15; జురేల్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; షమీ (సి) బ్రూక్ (బి) ఓవర్టన్ 7; రవి బిష్ణోయ్ నాటౌట్ 4; వరుణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–2, వుడ్ 3–0–29–1, బ్రైడన్ కార్స్ 4–0–28–2, లివింగ్‌స్టోన్ 1–0–11–0, రషీద్ 4–0–15–1, జేమీ ఓవర్టన్ 4–0–24–3. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్ 62 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.తొలి పేసర్‌గా చరిత్రకెక్కనున్నాడు..!నేటి మ్యాచ్‌లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్‌కు తన 63వ మ్యాచ్‌లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్ చేసే అవకాశం వచ్చింది.రషీద్ 53 మ్యాచ్‌ల్లోనే..!టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 53 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఫీట్‌ను సాధించాడు. రషీద్ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్ 54 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లురషీద్ ఖాన్ (53 మ్యాచ్‌లు)సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్‌లు)వనిందు హసరంగ (63 మ్యాచ్‌లు)ఎహసాన్ ఖాన్ (71 మ్యాచ్‌లు)హరీస్ రౌఫ్ (71 మ్యాచ్‌లు)నేటి మ్యాచ్‌లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న అర్షదీప్‌కు నేటి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్‌లోనూ భారత్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్‌లో తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (జనవరి 27) ప్రకటించింది. గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించినందుకు గానూ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే.గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ అత్యధిక వికెట్లు సాధించాడు. అట్కిన్సన్ గతేడాది 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా, అట్కిన్సన్ తర్వాత షోయబ్ బషీర్ (49), మ్యాట్ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.బుమ్రా టెస్ట్‌ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్‌గానూ నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన వికెట్ టేకింగ్ స్పెల్స్ వేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో బుమ్రా లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీపడ్డారు. అంతిమంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు బుమ్రానే వరించింది. 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ బుమ్రానే.మరోవైపు ఇవాళ ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన గెలుచుకుంది. మంధన గతేడాది (2024) ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైంది. మంధన గతేడాది 13 వన్డేల్లో నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది. ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు.ఇవాళే ప్రకటించిన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ గెలుచుకున్నాడు. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీపడ్డారు.ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది.ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- స్మృతి మంధన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
అన్ని ఫార్మాట్లలో రాణించగల బ్యాటర్ తిలక్ వర్మ
ఎంతో మంది హేమాహేమీలున్న భారత్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అదీ మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలాంటి మిడిలార్డర్లో నిలదొక్కుకొని రాణించాలంటే ఎంతో నైపుణ్యంతో పాటు పరిణితి ఉండాలి. పరిస్థితుల తగిన విధంగా తన ఆటతీరు ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జట్టుని ఆదుకోవాలి. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యాటన్ హైదరాబాద్ కి చెందిన 22 ఏళ్ళ తిలక్ వర్మ. అనతి కాలంలోనే జట్టులో నిలకడ గల బ్యాటర్ గా తిలక్ వర్మ పేరు గడిస్తున్నాడు.తిలక్ వర్మకు కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అతని ఆటని పరిశీలించి త్వరలోనే భారత్ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్ అని అంచనా వేసాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. తిలక్ టెక్నిక్, ఆటతీరు, అతని షాట్ మేకింగ్ సామర్థ్యం గురుంచి రోహిత్ ముందే ఊహించి చెప్పడం గమనార్హం.బయాష్ ముందుచూపు తిలక్ వర్మ చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి వద్ద ప్రైవేట్ కోచింగ్ కి పంపేందుకు సరైన వనరులు లేనప్పుడు వర్మని అతని కోచ్ సలాం బయాష్ ఆదుకున్నాడు. అతనికి ఫీజులు, క్రీడా సామాగ్రి అందించి వర్మ క్రికెట్‌కు దూరమవ్వకుండా చూసుకున్నాడు. బయాష్ ముందుచూపు ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. వర్మ 2018-19లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో 86 పరుగులు చే సి, భారత్ ఫైనల్‌కు చేరుకునేందుకు దోహదపడ్డాడు.ఐపీఎల్ అనుభవంఆలా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వంటి ప్రముఖ జట్టుకి ఎంపిక కావడం బాగా కలిసి వచ్చింది. శనివారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ స్కోర్ తో చరిత్ర సృష్టించాడు. తిలక్ కేవలం 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో, తిలక్ టీ20ల్లో అవుట్ కాకుండా 300 పైగా పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. భారత్ తరుఫున గత నాలుగు ఇన్నింగ్స్‌లలో తిలక్ దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 47 బంతుల్లో 120, ఇంగ్లాండ్‌పై 19, నాటౌట్‌గా 72 పరుగులు చేశాడు. అంతకుముందు, ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మన్ టీ20 క్రికెట్లో అజేయంగా నిల్చి 271 పరుగులు చేశాడు.తిలక్ వర్మ బాధ్యతాయుత బ్యాటింగ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా తిలక్ ఒత్తిడికి గురికాకుండా రాణించడం విశేషం. "తిలక్ బ్యాటింగ్ చేసిన విధానం చాలా సంతోషం కలిగించింది. అతనిలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఆడుతుంటే ఇతర బ్యాటర్ల పై ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహం లేదని సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు.పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు తిలక్ ని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కూడా ప్రశంసించడం విశేషం. గతంలో ఒకసారి భారత్ భవిష్యత్ బ్యాటర్ గురుంచి అడిగినప్పుడు భారత్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ పేరు చెప్పాడని బాసిత్ గుర్తుచేసుకున్నాడు. "నేను మొహమ్మద్ అజారుద్దీన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, 'తిలక్ వర్మ ఆటతీరు చూసారా అని అడిగాడు. అతను అప్పటికి చాలా చిన్నవాడు. ఐపిఎల్‌లో మాత్రమే ఆడుతునున్నాడు. నాడు అజారుద్దీన్ చెప్పింది నేడు నిజమైంది, అని బాసిత్ గుర్తు చేసుకున్నాడు. చిన్న తనంలోనే ఎంతో పరిణతిని కనబరుస్తున్న తిలక్ వర్మ భవిష్యత్ లో భారత్ జట్టు తరుఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశిద్దాం. -
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
భారత్ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్ రషీద్ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్‌దీప్‌ను అవుట్ చేయడంతో మళ్లీ టెన్షన్... టెన్షన్... అప్పుడు రవి బిష్ణోయ్ (5 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్ డిజిట్ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్ యాదవ్ జోరు కనిపించలేదు. హార్దిక్ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్షాట్ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్ జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్ కార్స్ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్ ఆరంభంలోనే ఓపెనింగ్ జోడీ సాల్ట్ (4)ను అర్ష్‌దీప్, డకెట్ (3)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 4వ) వేసేందుకు దిగిన సుందర్ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్‌స్టోన్ (13)లను వరుణ్, అక్షర్ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్ బట్లర్ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్‌దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. తిలక్... అంతా తానై... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ (12)కు మార్క్ వుడ్, సామ్సన్ (5)కు ఆర్చర్ చెక్ పెట్టారు. తిలక్ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్ సూర్యకుమార్ (12), ధ్రువ్ జురేల్ (4), హార్దిక్ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్ పటేల్ (2) బ్యాటింగ్ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 4; డకెట్ (సి) జురేల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్‌స్టోన్ (సి) సబ్–హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ వర్మ (బి) అభిõÙక్ 22; ఓవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 10; మార్క్ వుడ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–40–1, హార్దిక్ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్ సుందర్ 1–0–9–1, అక్షర్ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–27–0, వరుణ్ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 5; అభిõÙక్ (ఎల్బీ) (బి) వుడ్ 12; తిలక్ వర్మ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురేల్ (సి) సబ్–రేహన్ (బి) కార్స్ 4; పాండ్యా (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్‌స్టోన్ 2; అర్ష్‌దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–60–1, మార్క్ వుడ్ 3–0–28–1, కార్స్ 4–0–29–3, ఆదిల్ రషీద్ 4–0–14–1, ఓవర్టన్ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్ 2–0–14–1. -
మహాకుంభ మేళాలో ‘టీమిండియా క్రికెటర్లు’.. అంతా AI మహిమ!
-
2024 ఐసీసీ వన్డే జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు..!
టీమిండియాకు అవమానం జరిగింది. 2024 ఐసీసీ పురుషుల వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీమిండియా గతేడాది వన్డే ఫార్మాట్లో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడటమే ఇందుకు కారణం.2024లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ఐసీసీ ఇవాళ (జనవరి 24) ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు శ్రీలంక ప్లేయర్లు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెరి ముగ్గురు.. వెస్టిండీస్‌కు చెందిన ఓ ఆటగాడు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు సారధిగా లంక కెప్టెన్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు. గతేడాది ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ రాణించినందుకు ఐసీసీ అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.అసలంక గతేడాది 16 వన్డేల్లో 50.2 సగటున 605 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక గతేడాది 18 వన్డేలు ఆడి 12 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏ జట్టూ గతేడాది ఇన్ని వన్డేలు ఆడలేదు.దాయాది పాక్ గతేడాది 9 వన్డేలు ఆడి ఏడింట విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గతేడాది 14 వన్డేల్లో 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది.ఐసీసీ వన్డే జట్టులో ఏకైక నాన్ ఏషియన్ వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. 2023లో వన్డే అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్డ్ గతేడాది 9 మ్యాచ్‌లు ఆడి 106.2 సగటున 425 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా రూథర్‌ఫోర్డ్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.ఐసీసీ జట్టులో భారత్‌తో పాటు SENA దేశాలైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌కు కూడా ప్రాతినిథ్యం లభించలేదు. రెండోసారి ఇలా..!ఐసీసీ వన్డే జట్లను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి (2004) భారత్‌కు ప్రాతినిథ్యం లభించకపోవడం ఇది రెండో సారి మాత్రమే. 2021లో కూడా ఐసీసీ మెన్స్ వన్డే టీమ్‌లో భారత ఆటగాళ్లకు చోటు లభించలేదు. 2023లో జట్టు నిండా భారతీయులే..!2023 ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: చరిత్ అసలంక (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్ -
విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..?
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తుంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సెహ్వాగ్, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం.. సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తుంది. కొడుకులు ఇద్దరూ క్రికెట్లో రాణిస్తున్నారుసెహ్వాగ్కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.అర్యవీర్.. గతేడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే ఆర్యవీర్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు.రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. వేదాంత్.. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఆర్తి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసిందిఆర్తి.. సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యా భవన్లో చదువుకుంది. సెహ్వాగ్-ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కాని, ఆర్తి కాని ఇప్పటివరకు స్పందించలేదు.భారత క్రికెట్ సర్కిల్స్‌లో వరుస విడాకుల వార్తలుకాగా, ఇటీవలికాలంలో భారత క్రికెట్ సర్కిల్లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. విడాకుల ప్రచారాన్ని చహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. మరో భారత క్రికెటర్ మనీశ్ పాండే కూడా తన భార్య అశ్రిత షెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తుంది. మనీశ్, అశ్రిత్ సైతం సెహ్వాగ్-ఆర్తి, చహల్-ధనశ్రీ తరహాలో సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్ఫాల్లో చేసుకున్నారు. వీరిద్దరికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్‌కు ముందు షమీ, శిఖర్ ధవన్ కూడా తమతమ భార్యలతో విడాకులు తీసుకున్నారు.సెహ్వాగ్ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. సెహ్వాగ్‌ను క్రికెట్ సర్కిల్స్‌లో ముద్దుగా నజఫ్ఘడ్ నవాబ్, వీరూ అని పిలుస్తారు. వీరూ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17000కు పైగా పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరఫున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు. -
రోహిత్, జైస్వాల్, గిల్, పంత్ మాత్రమే కాదు.. రహానే, పుజారా కూడా..!
రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.ఇవాల్టి నుంచి ప్రారంభంరంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన- ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్- మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన- ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)- జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి- ఇదే మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్- హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్- చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)- ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్ - మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్- హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ -
Karun Nair: ఇంత గొప్పగా ఆడినా టీమిండియాలో చోటివ్వరా..? మతి పోయే గణాంకాలు..!
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బారత జట్లను కొద్ది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్ల ప్రకటనకు ముందు భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఓ పేరు బలంగా వినపడింది. అదే కరుణ్ నాయర్. ఈ విదర్భ ఆటగాడు తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో నమ్మశక్యం కాని రీతిలో పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో 779 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడైనా జాతీయ జట్టులో చోటు ఆశించడం సహజం. అయితే భారత సెలెక్టర్లు కరుణ్ అద్భుత ప్రదర్శనను పక్కకు పెట్టి ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ అతన్ని ఎంపిక చేయలేదు.కరుణ్ కేవలం విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనలతోనే భారత జట్టులో చోటు ఆశించాడనుకుంటే పొరబడినట్లే. కరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ ట్రోఫీలోనూ రెచ్చిపోయి ఆడాడు. గడిచిన ఎడిషన్‌లో కరుణ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.గతేడాది ఇంత ఘన ప్రదర్శనలు చేసిన కరుణ్ భారత జట్టులో చోటు ఆశించడం సహజమే. అయితే కరుణ్ కలలు కన్నట్లు భారత జట్టులో చోటు లభించకపోగా ఎలాంటి ముందస్తు హామీ కూడా లభించలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలోనైనా సెలెక్టర్లు అతన్ని కరుణిస్తారా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి జాతీయ జట్టుకు ఎంపిక కాని క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కరుణ్ నాయరే అని చెప్పాలి. టీమిండియాకు ఆడిన అనుభవం లేక అతన్ని పరిగణలోని తీసుకోవడం లేదా అంటే అలాంటదేమీ లేదు. కరుణ్ ఎనిమిదేళ్ల కిందట టీమిండియా తరఫున ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, కరుణ్ మాత్రమే ట్రిపుల్ సాధించారు. ఇంత టాలెంట్ కలిగి ఉండి కూడా కరుణ్ జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిజంగా చింతించాల్సిన విషయమే. -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
Champions Trophy 2025: మా జెర్సీలపై పాక్ పేరు వద్దు.. మా కెప్టెన్ మీ దేశానికి రాడు..!
ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతున్న వేల మరో వివాదం తెరపైకి వచ్చింది. మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ భారత క్రికెటర్ల జెర్సీలపై తమ దేశం పేరును ముద్రించింది. ఇందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్ పేరును తమ దేశ క్రికెటర్ల జెర్సీలపై ఉండేందుకు ఒప్పుకోమని భీష్మించుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. బీసీసీఐ అభ్యంతరాన్ని పీసీబీ కూడా అంతే గట్టిగా వ్యతిరేకిస్తుంది. బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను లాగేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగే సమయంలో ఆ టోర్నీ పేరుతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా ఆయా జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని పీసీబీ ఆరోపిస్తుంది. వేదిక విషయంలో నానా యాగీ చేసిన బీసీసీఐ ఇప్పుడు జెర్సీల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని పాక్ మాజీలు మండిపడుతున్నారు.జెర్సీల వివాదం నడుస్తుండగానే బీసీసీఐ తాజాగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఫోటో షూట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్లబోడని స్పష్టం చేసింది. ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను వేరే వేదికకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. తాజా వివాదాల నేపథ్యంలో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టోర్నీ జరిగినా భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ పెడుతున్న కండీషన్లకు పీసీబీ ఒప్పుకునేలా కనిపించడం లేదు. వేదిక విషయంలో తలోగ్గామని బీసీసీఐ ప్రతి విషయాన్ని రద్దాంతం చేస్తుందని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జెర్సీల విషయం అటుంచితే ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనేందుకు అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐసీసీ పీఠంపై బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే. షా జోక్యంతో ఈ వివాదాలన్నిటికీ పుల్‌స్టాప్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీని సజావుగా సాగేలా చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి హోల్ అండ్ సోల్‌గా పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం తమ జట్టును పాక్ పంపబోమని తేల్చి చెప్పింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత పీసీబీ భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించుకునేందుకు ఒప్పుకుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఫైనల్‌కు చేరినా దుబాయ్‌లోనే ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్ ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడనుంది. -
IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అర్షదీప్ ఇవాళ (జనవరి 22) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లో ఐదు వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అర్షదీప్ ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 2 నాలుగు వికెట్ల ఘనతల సాయంతో 95 వికెట్లు తీశాడు. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అర్షదీప్ కంటే ఓ వికెట్ అధికంగా తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 80 మ్యాచ్‌ల్లో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత సాయంతో 96 వికెట్లు తీశాడు.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్-10)..యుజ్వేంద్ర చహల్-96అర్షదీప్ సింగ్-95భువనేశ్వర్ కుమార్-90జస్ప్రీత్ బుమ్రా-89హార్దిక్ పాండ్యా-89అశ్విన్-72కుల్దీప్ యాదవ్-69అక్షర్ పటేల్-65రవి బిష్ణోయ్-56రవీంద్ర జడేజా-54కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ వేదికగా ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 6, ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తొలి టీ20కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు 7 టీ20లు ఆడింది. ఇందులో భారత్ ఆరింట విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఆ ఒక్క ఓటమి భారత్ ఇంగ్లండ్ చేతుల్లోనే (2011) ఎదుర్కోవడం గమనార్హం.జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో పాటు మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయం.భీకర ఫామ్‌లో తిలక్, సంజూటీమిండియా టాపార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరిద్దరూ చెలరేగిపోయారు. తిలక్ చివరి రెండు టీ20ల్లో మెరుపు సెంచరీలు చేయగా.. సంజూ మొదటి, నాలుగు మ్యాచ్‌ల్లో శతక్కొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంజూ సెంచరీ చేశాడు. సంజూ గత ఐదు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు.ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు జేకబ్ బేతెల్ తొలిసారి భారత్‌తో తలపడనున్నాడు.ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్‌కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్‌లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. -
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడతాడు. విరాట్ రంజీల్లో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరుగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. మెడ నొప్పి కారణంగా విరాట్ సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఉన్నాడు.సౌరాష్ట్ర తరఫున టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్‌ల్లో చాలా మంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు.రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విరాట్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.ఈ సిరీస్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇదే సిరీస్‌తో స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతా వేదికగా జరుగనుంది. అనంతరం జనవరి 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పూణే), ఫిబ్రవరి 2వ (ముంబై) తేదీల్లో మిగతా నాలుగు టీ20లు జరుగనున్నాయి.టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉండనుంది. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగనుండగా.. ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కటక్, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.ఇంగ్లండ్‌తో టీ20ల కోసం ఎంపిక చేసిన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హర్షిత్ రానాఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి -
చాంపియన్స్ ట్రోఫీ పూర్తి జట్లు.. కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు వీరే
క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వరల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటి ఏడు టీమ్‌లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.రౌండ్-రాబిన్ ఫార్మాట్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్లో ఢీకొంటాయి. నాకౌట్ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, (India) న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లున్నాయి. గ్రూప్ బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.ఫిబ్రవరి 19న కరాచిలో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా (Team India) మ్యాచ్‌లు ఉంటాయి. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లోనే జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న టీమిండియా తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో మన మ్యాచ్ ఉంటుంది. మార్చి 4న దుబాయ్‌లో మొదటి సెమీఫైనల్, మార్చి 5న లాహోర్‌లో రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. టైటిల్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. కాగా, పాకిస్థాన్ తప్ప మిగతా దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.Group Aఇండియాకెప్టెన్: రోహిత్ శర్మవైస్ కెప్టెన్: శుభమన్ గిల్స్టార్ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాభారత పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిన్యూజిలాండ్కెప్టెన్: మిచెల్ సాంట్నర్కీలక ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీన్యూజిలాండ్ పూర్తి జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.పాకిస్తాన్కెప్టెన్: బాబర్ ఆజంవైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్ కీలక ఆటగాళ్లు: షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్పాకిస్థాన్ జట్టు (అంచనా): బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, నసీమ్ షా, ఇహ్సానుల్లా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఉస్మాన్ ఖాదిర్, తయ్యాబ్ తాదిర్, హసన్ అలీబంగ్లాదేశ్కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్కీలక ఆటగాళ్లు: ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లాబంగ్లాదేశ్ పూర్తి జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రానాGroup Bఇంగ్లండ్కెప్టెన్: జోస్ బట్లర్వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్కీలక ఆటగాళ్లు: జో రూట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ఇంగ్లండ్ పూర్తి జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ఆస్ట్రేలియాకెప్టెన్: పాట్ కమిన్స్కీలక ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ఆస్ట్రేలియా పూర్తి జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిషెల్ హార్డీ, హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాదక్షిణాఫ్రికాకెప్టెన్: టెంబా బావుమాకీలక ఆటగాళ్లు: కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్దక్షిణాఫ్రికా పూర్తి జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జేఅఫ్గానిస్థాన్కెప్టెన్: హష్మతుల్లా షాహిదీవైస్ కెప్టెన్: రహమత్ షాకీలక ఆటగాళ్లు: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీఅఫ్గానిస్థాన్ పూర్తి జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, మహ్మద్ నబీబ్, రహమ్మద్ నబీబ్, గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దర్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటీ, బిలాల్ సామివేదికలుకరాచీ నేషనల్ స్టేడియంలాహోర్: గడాఫీ స్టేడియంరావల్పిండి క్రికెట్ స్టేడియందుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంమ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2.30కు ప్రారంభమవుతాయి. -
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
రంజీ బాటలో జడేజా
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్‌దేవ్ షా తెలిపారు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు. విదర్భతో పోరుకు సిరాజ్ భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. ‘వర్క్‌లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్‌సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్‌ను కాదని అర్‡్షదీప్ సింగ్‌ను ఎంపిక చేశారు. -
Kho Kho World Cup: రెండు ప్రపంచకప్‌లు మనవే..
న్యూఢిల్లీ: భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే.. భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుదిపోరులోభారత్ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల జట్టు.. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్ ను కట్టిపడేసిన భారత్.. విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్‌కప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చాంపియన్స్‌గా నిలవడంవిశేషం. ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్‌కప్ ఫైనల్లో ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది.ఈ ప్రపంచకప్‌లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్‌కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్‌ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇరు జట్లకు వైఎస్ జగన్ అభినందనలుఖోఖో వరల్డ్‌కప్-2025లో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళల, పురుషుల జట్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీల్లో రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
తాజాగా టీమిండియా కోచింగ్ బృందంలో మరో కొత్త కోచ్
-
భారత ఆటగాళ్లు.. బహుపరాక్.. ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు బీసీసీఐ 10 పాయింట్ల మార్గదర్శకాలను రూపొందించింది. భారత ఆటగాళ్లు కింద పేర్కొన్న గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలికాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న బీసీసీఐ ఈ కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.బీసీసీఐ ప్రవేశపెట్టిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలు..దేశవాలీ క్రికెట్ ఆడటం తప్పనిసరిజాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలంటే ఇకపై ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి. ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే కూడా దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి.కుటుంబాలతో వేరుగా ప్రయాణం చేయడం నిషేధంమ్యాచ్లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరుగా ప్రయాణాలు చేయడం నిషేధం. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బీసీసీఐ భావిస్తుంది.అధిక లగేజీ భారాన్ని ఆటగాళ్లే మోయాల్సి ఉంటుందిఆటగాళ్లు పరిమితికి మించి లగేజీని క్యారీ చేస్తే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణాలు ఆపండివిదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ళు వంటవారు, హెయిర్ డ్రెస్సర్లు, స్టైలిస్టులు, సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించడాన్ని నిషేధించాలని బీసీసీఐ నిర్ణయించింది.అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలిబీసీసీఐ అధికారిక కార్యక్రమాలకు (షూటింగ్‌లు, ప్రమోషన్స్, ఫంక్షన్లు) ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి.టూర్ ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలిఆటగాళ్లు టూర్ లేదా సిరీస్ అధికారికంగా ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి. మ్యాచ్ తొందరగా ముగిసినా జట్టును వీడ కూడదు.ప్రాక్టీస్ తర్వాత ప్రయాణంషెడ్యూల్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు ప్లేయర్లందరూ కలిసి ఉండాలి. ప్లేయర్లు ప్రాక్టీస్ అనంతరం కలిసి ప్రయాణించాలి.ఎండార్స్మెంట్లపై నిబంధనలుపర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూట్లు లేదా ఎండార్స్మెంట్లకు అనుమతి లేదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఇది నిర్దేశించబడింది.కుటుంబ సభ్యుల అనుమతి45 రోజుల కంటే ఎక్కువ గల విదేశీ పర్యటనల్లో మాత్రమే ప్లేయర్ల కుటుంబ సభ్యులకు రెండు వారాల అనుమతి ఉంటుంది.ఈ కొత్త పాలసీ ప్రకారం జట్టు సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ, జట్టు కోసం కట్టుబడి పనిచేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు మాంచి ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత జట్టు ఇటీవల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఓటమితో పాటు అంతకు ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ రెండు సార్లూ మన బ్యాటింగే పెద్ద బలహీనతగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు ముందుగా టీమిండియా సన్నద్ధత మెరుగ్గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. భారత టెస్టు జట్టు సభ్యులంతా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనా... ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో ఒకటికి మించి రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైతే ఎరుపు బంతితో సాధన అసాధ్యం! దాంతో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే నాలుగు రోజులు మ్యాచ్‌లు ఆడాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ యువ జట్టు ‘లయన్స్’తో భారత్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్ ముగిసే మే 25 నుంచి తొలి టెస్టు ప్రారంభమయ్యే జూన్ 20 మధ్య ఉన్న సమయంలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడి బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం మాత్రమే కాకుండా టెస్టు టీమ్‌లో స్థానాన్ని ఆశించే ఆటగాళ్లు కూడా తమ సత్తాను చాటేందుకు ఈ మూడు మ్యాచ్‌లు ఉపకరిస్తాయని బోర్డు ఆశిస్తోంది. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన రోహిత్, కోహ్లిలతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు. -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్ నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాన్షు 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. భారత ‘ఎ’ జట్టు పర్యటనల్లో పలు మార్లు కోచ్‌గా పని చేసిన సితాన్షు... సీనియర్ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లిన సిరీస్‌లలో అతనికి అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. సితాన్షు లెవల్–3 క్వాలిఫైడ్ కోచ్ కూడా. తాజా ఎంపికతో భారత టీమ్‌లో అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా ...మోర్నీ మోర్కెల్ (బౌలింగ్), టి.దిలీప్ (ఫీల్డింగ్)లతో పాటు అభిషేక్క్ నాయర్, టెన్ డస్కటేలకు కూడా ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. దాంతో మన బ్యాటర్లను సాంకేతికంగా మరింత మెరుగుపర్చే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్లో సౌరాష్ట్ర టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు కూడా ఆడిన సితాన్షు 42.23 సగటుతో 3083 పరుగులు సాధించాడు. -
‘అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావడమే లక్ష్యం’
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి 2024లో 5 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. వాటిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 26 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటిన మ్యాచ్ కూడా ఉంది. ఇదే ఏడాది 7 టి20ల్లో కేవలం 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో వరల్డ్ కప్‌లో తీసిన 7 వికెట్లు కూడా ఉన్నాయి. ఎలా చూసినా భారత మహిళల జట్టు కోణంలో ఇది మెరుగైన ప్రదర్శనే. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఆమెపై వేటు వేశారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లతో పాటు ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా అరుంధతిని ఎంపిక చేయలేదు. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అరుంధతిపై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇలాంటివన్నీ తన చేతుల్లో లేవని... తన వైపు నుంచి అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తాను చేయగలిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో నాకూ తెలీదు. అయితే ఈ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు. క్రికెట్ బాగా ఆడటం మాత్రమే నాకు తెలిసిన విద్య. కాబట్టి భారత్ తరఫున ఎప్పుడు అవకాశం దక్కినా అదే చేసి చూపిస్తా. ఏ స్థాయిలో ఏ జట్టు తరఫున ఆడినా మైదానంలోకి దిగగానే జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తా. మొదటినుంచి నేను క్రికెట్‌ను ఇలాగే ఆడాను’ అని అరుంధతి పేర్కొంది. కోచ్ అండతో... భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఆడిన చాలెంజర్ ట్రోఫీ తనకు కూడా తగిన సవాల్ విసిరిందని... కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి తన జట్టు (టీమ్ ‘ఎ’)ను ఫైనల్ చేర్చడం సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించింది. అయితే ఆటలో ఉండే అనిశ్చితిని ఎదుర్కోవడం అంత సులువు కాదని అరుంధతి అంగీకరించింది. జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో తాను మానసికంగా నిరాశకు లోను కాకుండా తన కోచ్ అర్జున్ దేవ్ అండగా నిలిచారని అరుంధతి గుర్తు చేసుకుంది. బెంగళూరులోని ఎన్ఐసీఈ అకాడమీలో అర్జున్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘భారత జట్టుకు ఆడినా ఆడకపోయినా... వేరే ఏ టీమ్‌కు ఆడినా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారాలనే పట్టుదలతో సాధన చేయి అని ఆయన నాకు చెప్పారు. నేను మళ్లీ భారత్‌కు ఆడగలనా లేదా అంటే జవాబివ్వలేను. ప్రస్తుతం ఉండే అనిశ్చితిలో ఏ ప్లేయర్‌కు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ క్రికెటర్వు అంటూ ప్రతీ రోజు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. అదే నన్ను నడిపిస్తుంది’ అని ఈ హైదరాబాదీ తన మనసులో మాటను చెప్పింది. ఎక్కడైనా ఆట ఒక్కటే... ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ప్రస్తుతం నాకు వచ్చిందని చెప్పగలను. ఇప్పుడు ఏ టీమ్‌కు ఆడినా సీనియర్లలో ఒకరిగా ఉంటున్నాను. ఇది నాకు ఎంతో మేలు చేస్తోంది. జూనియర్ అమ్మాయిలకు కొన్ని విషయాలు నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను. నా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఆడుతున్నాను. ఏ జట్టు కోసం ఆడుతున్నాను అనేది పట్టించుకోకుండా దీనిపైనే దృష్టి పెడుతున్నాను’ అని ఆమె స్పష్టం చేసింది. జట్టు మార్పుతో... దేశవాళీ క్రికెట్లో ఐదేళ్ల పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రెండేళ్ల క్రితం అరుంధతి రెడ్డి కేరళ జట్టుకు మారింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎన్నో విధాలా ఆలోచించాల్సి వచ్చినా చివరకు ధైర్యం చేసింది. అయితే కేరళకు మారిన తర్వాత అటు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఆమె ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. అయితే గత రెండేళ్లుగా నా ఆటలో ఎంతో మార్పు వచ్చిందనేది వాస్తవం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కానీ అవి నాకు మేలు చేశాయి. ఇప్పుడు నా ఆటపై నాకు మరింత స్పష్టత రావడంతో టోర్నీలకు సరైన రీతిలో సిద్ధమవుతున్నా. ఆపై ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు నాలో ఓటమిభయం కూడా తగ్గింది’ అని అరుంధతి వివరించింది. ‘అటాకింగ్’పై దృష్టి... ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అరుంధతి... స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తన బౌలింగ్‌లో పలు మార్పులు చేసుకుంది. ముఖ్యంగా ఆమె బౌలింగ్‌లో ‘అటాకింగ్’ పెరిగింది. గతంలో బ్యాటర్‌ను ఆడకుండా చేసే లక్ష్యంతో ఆఫ్‌స్టంప్ బయటే వరుసగా బంతులు వేసేది. ఇప్పుడు నేరుగా స్టంప్స్‌పైకే బంతులు గురి పెడుతూ బౌలింగ్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా...ఈ తరహా బౌలింగే ప్రస్తుతం తన బలంగా మారిందని ఆమె స్పష్టం చేసింది. -
కోచ్‌లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్‌ను రోల్ చేయడం సహా కోచ్‌లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్‌కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్‌కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్‌కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్‌బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్‌లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్‌ను రోల్ చేయడం, కోచ్‌ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌తో కలిసి జోరావర్‌కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్‌ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా రైజింగ్ స్టార్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై తిరుమల దర్శనానికి వెళ్లాడు. నితీశ్ ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన విషయాన్ని నితీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నితీశ్ మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC— Pari (@BluntIndianGal) January 13, 2025కాగా, నితీశ్ ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ భారత్ తరఫు రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ సాధించి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సెంచరీతో నితీశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్.. ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో నితీశ్ ఐదు టెస్ట్‌ల్లో 37.25 సగటున 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.బీజీటీతో భారత్‌కు నితీశ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ లభించాడు. ఈ సిరీస్‌లో నితీశ్ రాణించినా భారత్ 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. బీజీటీ అనంతరం భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. నితీశ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత్ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగనుంది. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 19న ప్రకటించే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దృవ్ జురెల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్‌కప్‌కు సంబంధించిన కిట్‌బ్యాగ్‌లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్‌కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్‌కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్‌పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్‌కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు. -
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?
ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం. -
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్‌పై (2025)358/2 ఐర్లాండ్‌పై (2017)358/5 వెస్టిండీస్‌పై (2024)333/5 ఇంగ్లండ్‌పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్‌పై (2022)314/9 వెస్టిండీస్‌పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది. -
ప్రతీక, తేజల్ గెలిపించగా...
రాజ్‌కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది. జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. రాణించిన గాబీ, లియా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్‌కు కలిసొచ్చిoది.మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్‌లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది. భారీ భాగస్వామ్యం... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది. ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్‌తో సయాలీ సత్ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్‌గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0. -
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యాష్ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ— Sun News (@sunnewstamil) January 9, 2025అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని స్టూడెంట్స్‌ను అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్, ఇంగ్లిష్ అని అశ్విన్ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అశ్విన్ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాష్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్‌లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు. అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 537 వికెట్లు తీసి భారత్ తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న యాష్.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్ తదుపరి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. -
వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయం
మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు ఆటగాడు వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీ రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తన ఐదు వికెట్ల ప్రదర్శనలో ఏకంగా ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ ఓ క్యాచ్ కూడా పట్టాడు. వరుణ్‌తో పాటు సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ద సెంచరీతో కదం తొక్కడంతో రాజస్థాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అభిజీత్ తోమార్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో బాధ్యతాయుతమైన సెంచరీ చేయగా.. లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ 4, దీపక్ హూడా 7, అజయ్ సింగ్ 2, మానవ్ సుతార్ 1, అనికేత్ చౌదరీ 2, ఖలీల్ అహ్మద్ 1, అమన్ షెకావత్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.Varun Chakravarthy with a peach of a delivery. 🤯🔥 pic.twitter.com/kL0BfOHH5m— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2025అనంతరం 268 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0) ఔట్ కాగా.. నారాయణ్ జగదీశన్ (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (13) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీకి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 183 పరుగులు చేయాలి.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయంఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించడానికి ముందు వరుణ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అనంతరం వరుణ్ టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని తెలుస్తుంది. భారత జట్టులో చోటు విషయంలో వరుణ్‌కు రవి భిష్ణోయ్ నుంచి పోటీ ఉండింది. అయితే తాజా ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుణ్ ఇటీవల టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొట్టాడు. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వరుణ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే, ఇవాళే జరుగుతున్న మరో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో (మొదటిది) హర్యానా, బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
విరాట్ కోహ్లికి అవమానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు. ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
అరివీర భయంకరమైన ఫామ్‌లో అయ్యర్.. టీమిండియాలో చోటు పక్కా..!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దేశవాలీ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్ ఆడాడు. శ్రేయస్ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్‌రేట్‌తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్‌టీలో శ్రేయస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ యావరేజ్ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్‌రేట్ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్ ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఇదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు తిరుగే ఉండదు. శ్రేయస్ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ తన చివరి టీ20ను 2023 డిసెంబర్లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శ్రేయస్‌కు చివరి టీ20. టెస్ట్‌ల విషయానికొస్తే..శ్రేయస్ టెస్ట్‌ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్‌తో) ఆడిన శ్రేయస్.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (ఇంగ్లండ్) ఆడాడు. 33 ఏళ్ల శ్రేయస్ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్‌తో పరిమత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్‌కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్ రాకతో మిడిలార్డర్లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్లో మొదటి నుంచి శ్రేయస్‌కు తిరుగులేదు. ఈ ఫార్మాట్లో అతను 62 మ్యాచ్‌లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్‌రేట్‌తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లోనూ శ్రేయస్‌కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రేయస్ 51 మ్యాచ్‌లు ఆడి 136.12 స్ట్రయిక్‌రేట్‌తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్.. 14 మ్యాచ్‌ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టాప్-10లోకి రిషబ్ పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. పంత్ 12వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌లో పంత్ మెరుపు అర్ద శతకం బాదాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. బ్యాటర్ల టాప్-10లో పంత్ ఒక్కడే వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉన్నాడు. భారత్ నుంచి పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్ టాప్-10లో ఉన్నాడు. జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరాడు. జింబాబ్వే ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ 10 స్థానాలు మెరుగపర్చుకుని 37వ స్థానానికి చేరగా.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ప్లేస్‌కు చేరాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఏకంగా 48 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 54వ స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా టాప్-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. జడ్డూ తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 42 స్థానాలు మెరుగుపర్చుకుని 93వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు జనవరి 22 నుంచి మొదలవుతాయి. తొలుత ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే జరుగుతున్న సిరీస్‌లు కావడంతో ఈ సిరీస్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిమత ఓవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.ఇంగ్లండ్ వన్డే జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్ఇంగ్లండ్ టీ20 జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, భారత జట్టు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (2024-25) ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఆసీస్ బీజీటీని సొంతం చేసుకుంది. బీజీటీ పూర్తయిన 17 రోజుల్లో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల అనంతరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం (భారత్ వర్సెస్ పాక్) ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాకు మరో పరాభవం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్, బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.సెలెక్టర్లకు సవాల్..తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ఈ మ్యాచ్‌లో బెంగాల్ కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్), కౌశిక్ మైతి (20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్యన్ పాండే, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్, సాగర్ సోలంకీ చెరో వికెట్ దక్కించుకున్నారు.270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు. శుభమ్ శ్యామ్ సుందర్ శర్మ (53), కెప్టెన్ రజత్ పాటిదార్ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. -
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by shivam dube (@dubeshivam)31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు. -
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్‌ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
‘ఇప్పటికే ఎక్కువైంది’
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ‘వైట్‌వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు జట్టు కోచ్‌గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్‌లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది. వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్... ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్‌స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్‌లో ఇటు సారథిగా, అటు బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. పుజారా కోసం పట్టుబట్టినా... గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్‌కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా... ‘హిట్‌మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్‌దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)3. శుభాష్చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియాపై)6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికాపై)8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియాపై)9. జస్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై)కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ఎప్పుడూ కొత్త సవాళ్లను విసురుతుంది. అదీ ఆస్ట్రేలియా గడ్డ పై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో పోటీ ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. భారత్ ఆటగాళ్ల క్రీడా జీవితానికి ఇది ఎప్పుడూ కఠిన పరీక్ష గా నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఈ సిరీస్ కి సన్నద్ధమయ్యే తీరు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ గడ్డ పై జరిగే టెస్ట్ సిరీస్ కి అత్యున్నత స్థాయిలో సిద్దమౌవుతారు. అదే స్థాయిలో పోటీ పడతారు. అందుకు భిన్నంగా భారత్ ఆటగాళ్లు ఈ సిరీస్ కి ముందు చాల పేలవంగా ఆడి సొంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వరసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసారు.అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో జట్టుకి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో భారత్ ని గెలిపించాడు. అయితే తొలి టెస్ట్ కి వ్యకిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో పునరాగమనం భారత జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఇందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్. రోహిత్ శర్మ కి జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో ఘోరంగా విఫలవడంతో ప్రస్తుత వారి టెస్ట్ క్రికెట్ జీవితం కొనసాగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాధ్యతారహితమైన షాట్ ల పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ లో చివరి రోజున కొట్టిన దారుణమైన షాట్. టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్న సమయంలో రిషబ్ (104 బంతుల్లో ౩౦ పరుగులు) ఒక చెత్త షాట్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు కొత్త ఉత్సాహాన్ని అందించాడు. దీంతో భారత్ వికెట్లు వడి వడి గా పడిపోవడంతో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషబ్ పంత్ కొట్టిన షాట్ ఆటలో భాగంగా జరిగిందనీ చెబుతూ అతన్ని హెచ్చరించాడు. పంత్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన షాట్ లు కొట్టేందుకు ప్రయత్నించాలి, అని రోహిత్ వ్యాఖ్యానించాడు. "పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అతని హై-రిస్క్ పద్ధతులు గతంలో జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందించాయని అంగీకరించాడు. అయితే పంత్ అవుటైన తీరును బాధాకరం అంటూనే అతను జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. "రిషబ్ పంత్ స్పష్టంగా జట్టు కి తన నుంచి ఎలాంటి అవసరమో ఉందో అర్థం చేసుకోవాలి," అని రోహిత్ వ్యాఖ్యానించాడు.అయితే పంత్ ని భారత్ మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సమర్ధించాడు. "పంత్ తన ఆటతీరును మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను సహజంగానే అద్భుతమైన ఆటగాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో జట్టుని చాల సార్లు గెలిపించాడు. కానీ అప్పుడప్పుడు అనుచిత షాట్లతో జట్టుని నిరాశపరుస్తాడు," అని దోషి వ్యాహ్యానించాడు. మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు రిషబ్ పంత్, హైదరాబాద్ మీడియం పేసర్ మహ్మద్ సిరాజ్ లు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జట్టులో పంత్ స్థానానికి ప్రస్తుతం ఢోకా లేకపోవచ్చు కానీ అతని బ్యాటింగ్ తీరు పై నిఘా నేత్రం ఉంటుందనేది స్పష్టం.