Technology
-
సన్‌స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. -
కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్లెస్ ఇయర్ బడ్.మాస్టర్ సిరీస్‌లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్‌లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్‌బడ్‌లు ఎల్హెచ్డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్‌ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్‌ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్‌బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్‌లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం. -
'ప్రైవేట్ టెల్కో నెట్వర్క్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టెలికం నెట్వర్క్ కవరేజీ ఉన్న నేపథ్యంలో కంపెనీలు సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేదని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ వ్యాఖ్యానించారు.ప్రజలకు టెలికం కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉన్న చోట్ల లేదా అస్సలు లేని కనెక్టివిటీనే లేని భౌగోళిక ప్రాంతాల్లో, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి కావాలి తప్ప భారత్‌లో అనవసరమని తెలిపారు. కంపెనీలు తమ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైన అవసరాల కోసం, నేరుగా టెలికం శాఖ నుంచి స్పెక్ట్రంను తీసుకుని, సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడే టెలికం మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ భారత్ నిధికి మరింతగా నిధులను సమకూర్చగలిగితే ఇంకా కనెక్టివిటీ అంతగా లేని ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కొచ్చర్ పేర్కొన్నారు. -
భూకంపాలను పసిగట్టేలా..
భూకంపం ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుంది..? ఎందుకు వస్తుంది..? ఎంత తీవ్రతతో వస్తుంది..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయినా కచ్చితమైన ఫలితం రాలేదు. అతి కొద్ది దేశాల్లో 30 నుంచి 40 సెకన్లు మాత్రమే ముందుగా చెప్పే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అయితే అటువంటిది కూడా లేదు. అయితే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వాతావరణ శాఖ ముందుగా గుర్తించి ఎలా సమాచారం అందిస్తుందో అదే తరహాలో భూకంపాలను అంచనా వేసే టెక్నాలజీపై ఏలూరు నగరానికి చెందిన ఇంజనీర్ సాగించిన పరిశోధన తుది అంకానికి చేరుకుంది. – సాక్షి ప్రతినిధి, ఏలూరుభూకంపాలు ఎలా వస్తాయంటే..భూమి లోపల కోర్, మాంటేల్, క్రస్ట్ అనే మూడు ప్రధాన పొరల్లో గణనీయమైన మార్పులతో భూకంపాలు సంభవిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున రిక్టర్ స్కేల్‌పై 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువగా 6 నుంచి 18 వరకు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో భూకంపాలను జోన్లుగా విభజించారు. జోన్–2లో హైదరాబాద్, దక్కన్ ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ సగటున 5 మ్యాగ్నిట్యూడ్ నమోదుకు అవకాశం ఉంది. జోన్–3లో కోస్టల్ ప్రాంతం, గోదావరి, తెలంగాణలో కొంత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ 6 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది.జోన్–4లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. ఇక్కడ 7 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది. హిమాలయాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో 7 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదవుతుంది. జోన్–5లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 9 వరకు మ్యాగ్నిట్యూడ్‌ల వరకు ఉంటే ఆస్తి, ప్రాణనష్టాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దీనిపై మన దేశంలో నేషనల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తోంది.శివ ఆవిష్కరణ ఇలా...భూకంపం సమయం, ప్రదేశం, తీవ్రతను వారం నుంచి నెల రోజుల పాటు ముందస్తుగా అంచనా వేసేందుకు శివ సీతారామ్ 19 ఏళ్లు విస్తృతంగా రీసెర్చ్ చేసి ఫలితాన్ని తుది దశకు తీసుకొచ్చారు. ఇలా ముందస్తు అంచనాలతో సిద్ధం చేసిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే భూకంపాలు రావడానికి ముందు 3 నుంచి 6 నెలల పాటు భూమి లోపల పొరల్లో వివిధ రకాల సంకేతాలు అందుతుంటాయి.దాని ప్రభావం 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనినిబట్టి ప్రదేశం, సమయం, తీవ్రతలో కచ్చితత్వాన్ని అంచనా వేయగలిగితే ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చు. దీనిపైనే శివ రీసెర్చ్ చేసి సూక్ష్మ స్థాయి మార్పులు భూకంప కేంద్రం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని గుర్తించారు. వీటిని కొన్ని పద్ధతుల్లో నిర్మిరామంగా పర్యవేక్షించి అంచనా వేస్తున్నారు. జనవరిలో టిబెట్‌లో (7.1), 2024 జనవరిలో జపాన్‌లో (7.6), 2023 నవంబరులో నేపాల్‌లో (6.3) సంభవించిన భూకంపాల డేటాతో పాటు సుమారు 20 చోట్ల జరిగిన నష్టం తీవ్రత పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు.గతంలో భూకంపాలు ఇలా.. 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో 2.50 లక్షల మంది, 2005 అక్టోబర్ 8న జమ్మూకశ్మీర్‌లో వచ్చిన భూకంపానికి 80 వేల మంది మృత్యువాతపడ్డారు. సునామీ తీవ్రతతో రాష్ట్రంలో 612 మైళ్ల సముద్ర తీరంలో కొంత నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో దేశంలో 2004లో సునామీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో సెన్సార్ల ద్వారా ముందుగానే తెలుసుకుని శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అందిస్తున్నారు. సునామీ అలలు గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. అండమాన్, నికోబార్‌లో పెద్ద భూకంపాలు వస్తే గంటన్నరలోపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని తాకుతాయి.మరింత అభివృద్ధి చేస్తా: శివ సీతారామ్నా వద్ద ఉన్న తక్కువ సామర్థ్యం పరికరాలతోనే అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో పరిధి మరింత పెంచుకోవడానికి ప్రయతి్నంచి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నాం. దీంతో 50 పైగా దేశాల భూకంపాల డేటాను పరిశీలించి సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తా. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆ దిశగా నా ప్రాజెక్టు సాగుతోంది.ప్రయోగాలు.. తుది దశకు.. 19 ఏళ్లుగా పరిశోధనలు.. ఈ క్రమంలో అనేక అవాంతరాలు, అవరోధాలు..! వీటిని దాటుకుని భూకంపాలను ముందస్తుగా అంటే కనీసం వారం నుంచి నెల రోజుల ముందు గుర్తించే సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేశారు ఏలూరుకు చెందిన మరడాని శివ సీతారామ్. ఆరేళ్లుగా భూకంపాలకు సదడంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డేటాను సేకరించిన ఆయన.. ప్రస్తుతం తుది దశ పరీక్షల్లో ఉన్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏడున్నరేళ్లు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్ వర్కింగ్‌పై పనిచేసిన శివ.. హైదరాబాద్ కేంద్రంగా భూకంపాలపై పరిశోధనను కొనసాగిస్తున్నారు.2004లో భూకంపాలు, సునామీలను గుర్తించడం ఎలా అనేదానిపై పరిశోధన ప్రారంభించి సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఆరేళ్ల నుంచి ట్విట్టర్ www.seismo.in వెబ్సైట్లో ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ ఇథియోపియా, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్, ఇండియా భూకంపాలకు సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరిచారు. 2004 నుంచి 300కు పైగా భూకంపాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించారు. 2020 నుంచి పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు.20 రకాల పద్ధతులతో ముందస్తు అంచనాప్రపంచవ్యాప్తంగా 20 రకాల పద్ధతుల్లో భూకంపాలను అంచనా వేస్తున్నారు. టెక్నాలజీలో అభివృద్ధి చెందిన జపాన్, తైవాన్, మెక్సికో, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు భూమిలో అమర్చిన సెన్సార్ ద్వారా 30 నుంచి 40 సెకన్ల ముందు పసిగట్టే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. -
బండి ఏదైనా.. మైలేజ్ పెంచే పొగ గొట్టం!
పెట్రోలు రేటేమో వంద రూపాయలు దాటేసింది..మోటర్‌సైకిల్ ఇచ్చే మైలేజీనేమో రోజురోజుకూ తగ్గిపోతోంది!రోజూ ఆఫీసుకెళ్లేందుకు జేబులు ఖాళీ అవుతున్నాయి! ఏం చేద్దాం?ఈ సమస్య మీది మాత్రమే కాదు.. మీలా చాలామంది ఎదుర్కొంటున్నదే! అయితే.. ఇంకొంత కాలం గడిస్తే.. మోటర్‌సైకిల్ మాత్రమే కాదు.. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లు ఉన్న ప్రతి వాహనం మైలేజీ పెరుగుతుందని అంటోంది అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ(Pennsylvania State University)!. ఇందుకోసం వాహనాల పొగ గొట్టాల నుంచి వెలువడే వేడిని.. విద్యుత్తుగా మార్చేందుకు తామో అద్భుతమైన టెక్నాలజీని కనుక్కున్నట్లు ప్రకటించింది!. మీకు తెలుసా? మీరు వాడే వాహనం ఎంత ఇంధనం వృథా చేస్తోందో? సుమారు 75 శాతం. అంటే.. మీరు ఖర్చు పెట్టే వంద రూపాయల్లో 75 రూపాయలు పొగగొట్టం నుంచి వెలువడే పొగ, వేడి రూపంలో వృథా అవుతూంటుంది. అలాగే ఈ వాహనాలు మీ జేబులకు మాత్రమే కాదు.. కాలుష్యం రూపంలో ఆకాశంలోని ఓజోన్ పొరకూ చిల్లు పెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వాహనాల వేడిని విద్యుత్తుగా మారుస్తామన్న పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. వేడిని విద్యుత్తుగా మార్చడం ఎలా? అని సందేహంగా ఉంటే.. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ల(Thermoelectric Generator) గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లుప్తంగా టీఈజీ(TEG)లని పిలుద్దాం వీటిని! వాహనాల పొగగొట్టాలపై వీటిని అమరిస్తే చాలు.. అక్కడి వేడిని పీల్చుకుని విద్యుత్తుగా మారుస్తాయి. వేడి కారణంగా టీఈజీల్లోని ప్రత్యేక పదార్థంలో ఉండే ఎలక్ట్రాన్లు చైతన్యవంతమవుతాయి. ఆ తరువాత ఈ ఎలక్ట్రాన్లు చల్లగా ఉండే వైపునకు వెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహాన్నే కరెంట్ అంటామన్నది మీరు చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీఈజీలను బిస్మత్ టెల్యురైడ్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఇది ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ప్రోత్సహించే పదార్థం. టీఈజీలు కొత్తవి కాదు కానీ...నిజానికి టీఈజీలు కొత్తవేమీ కాదు. చాలాకాలంగా ఉన్నవే. కాకపోతే పాతవాటితో సమస్యలు ఎక్కువ. వాటిని అధిమించేందుకు శాస్త్రవేత్తలు పైన చిత్రంలో చూపినట్లు ఉండే ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. కంప్యూటర్లలో వేడిని తగ్గించేందుకు ఉపయోగించే హీట్‌సింక్ లాంటిదన్నమాట ఇది. నమూనా టీఈజీలతో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు కూడా నిర్వహించారు. టూవీలర్ ఎగ్జాస్ట్ పైపునకు ఈ గొట్టం తగిలించినప్పుడు 40 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. కార్లలో వాడినప్పుడు 56 వాట్లు, హెలీకాప్టర్ల పొగ గొట్టాలకు చేర్చినప్పుడు 146 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టీఈజీలను వాహనాలపై ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లలో అమర్చుకుని మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటివి చేసుకోవచ్చు. హైబ్రిడ్ వాహనాల్లో ఏర్పాటు చేసుకుంటే.. మైలేజీని పెంచుకోవచ్చు. -
గుడ్లు సేకరించే రోబో: ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ
ఆఫీసులో పనిచేసే రోబో గురించి వినుంటారు, రెస్టారెంట్లలో పనిచేసే రోబోలను గురించి వినుంటారు, ఆఖరికి ఇంట్లో పనిచేసే రోబోలను కూడా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ.. గుడ్లను (Eggs) సేకరించే రోబోలను గురించి విన్నారా?, బహుశా ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇలాంటిది కూడా ఒకటుందని తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి మరి.ఎన్ఐటీ కాలికట్ (NIT Calicut).. గుడ్లను సేకరించడానికి ఓ ప్రత్యేకమైన రోబోట్‌ను రూపొందించింది. దీనిపేరు 'అవిబోట్' (AVIBOT). ఇది కోళ్ల ఫారాలలో గుడ్లను పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా సేకరిస్తుంది. కాబట్టి వర్కర్స్ అవసరం, ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల పరిశ్రమలు నిర్వహించేవారు.. గుడ్లను సేకరించడానికి ఇలాంటి రోబోట్స్ ఉపయోగించవచ్చు.అవిబోట్ ఉపయోగాలు➤సాధారణంగా ఎక్కడైనా గుడ్లను సేకరించడానికి మనుషులను ఉపయోగిస్తారు. కానీ ఈ అవిబోట్ స్వయంగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి లేబర్ ఖర్చులు తగ్గుతాయి.➤అవిబోట్ చాలా వేగంగా గుడ్లను సేకరిస్తుంది. ఉదాహరణకు మనుషులు రెండు గంటల్లో గుడ్లను కలెక్ట్ చేస్తే.. ఈ రోబోట్ ఒక గంటలో పని పూర్తి చేస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. యజమాని లేదా నిర్వాహకులు ఇతర ముఖ్యమైన పనులపై దృష్టిపెట్టవచ్చు.➤రోబోట్ చాలా జాగ్రత్తగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి పగిలిపోయే గుడ్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల యజమాని లాభం పొందవచ్చు. అంతే కాకుండా గుడ్డు ఉత్పత్తి రేట్లకు సంబంధించిన డేటాను సేకరించడం, రైతుల కార్యకలాపాలను పర్యవేక్షించడం, మెరుగుపరచడం వంటి వాటిలో కూడా సహాయపడుతుంది.ఇదీ చదవండి: ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ! -
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ.. అన్ని రంగాల్లోనో రోబోట్స్ (Robots) హవా సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో పనిచేయడానికి మనుషులు అవసరం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనిషి చేయాల్సిన పనులను 'మర మనుషులు' చేసేస్తుంటే.. ఇక మనిషికి పనెక్కడుంటుంది. అయితే రోబోలను తయారు చేయడానికి.. వాటిలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడానికి మాత్రం మనిషి అవసరమే. ఇప్పటికే అనేక కంపెనీలు హ్యుమానాయిడ్ రోబోలను ప్రవేశపెట్టాయి. ఈ జాబితాలోకి 'ఫిగర్' (Figure) కూడా చేరనుంది.ఫిగర్ తన హ్యూమనాయిడ్ రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే ఇంట్లో పనిచేయడానికి సంబంధించిన రోబోలను ఈ ఏడాది టెస్ట్ చేయనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'బ్రెట్ అడ్కాక్' (Brett Adcock) ప్రకటించారు. మా ఏఐ హెలిక్స్ ఎవరూ ఊహించని దానికంటే వేగంగా ముందుకు వస్తోందని ట్వీట్ చేశారు.ఫిగర్ హ్యూమనాయిడ్ రోబోలు తమ చుట్టూ ఏం జరుగుతోందో చూడటానికి, భాషను అర్థం చేసుకోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి, ఏదైనా పనిని చేయడం నేర్చుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని పొందుతాయి. ఇంట్లో పనిచేసే రోబోలు మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలలో పనిచేయడానికి ఉపయోగపడే రోబోలను కూడా కంపెనీ రూపొందిస్తోంది.ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోల కదలికలు, అవి ఎలా పనిచేస్తాయని అని చూపే వీడియో కూడా ఇక్కడ చూడవచ్చు. రోబోలు వాటికి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్లి నిలబడి, బెల్ట్ కన్వేయర్ మీద వెళ్తున్న వస్తువులను పక్కకు తీయడం చూడవచ్చు. ఇలాంటి రోబోలు.. ఈ కామర్స్ లేదా లాజిస్టిక్ కంపెనీలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇక ఇంట్లో పనిచేసే రోబోల విషయానికి వస్తే.. ఇవి మనిషి మాదిరిగానే, ఇంట్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఫుడ్ అందించడం, గోడమీద పెయింటింగ్ ఫోటో సరిచేయడం.. యజమాని స్పందనకు ప్రతిస్పందించడం వంటివి కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డెలివరీలను తీసుకోవడం, మనిషిలాగే పని పూర్తయిన తరువాత రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తోంది. ఇంటి పనిలో సహకరించే రోబోలు.. ఫ్యాక్టరీలో పనిచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన తరువాత అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.Important update: Figure is launching robots into the homeOur AI, Helix, is advancing faster than any of us anticipated, accelerating our timeline into the homeTherefore, we've moved-up our home timeline by 2 years; starting Alpha testing this year pic.twitter.com/t1TU1TseJq— Brett Adcock (@adcock_brett) February 27, 2025Source: Brett Adcock / X -
కాలర్ ట్యూన్‌తో సైబర్ నేరాలు అరికట్టలేం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రగతితోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, కేవలం ఫోన్ కాలర్ ట్యూన్లతో వాటిని నియంత్రించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటివల్ల చోటుచేసుకుంటున్న దుష్పరిణామాలు ఆపడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నదో ఆలోచించాలన్నారు. బెంగళూరులో గురువారం ప్రారంభమైన ‘2025 ఆంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. డిజిటల్ అక్షరాస్యతతో సమాన అవకాశాలు..: ‘సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నా ప్రతీ సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరంగా తయారవుతుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలి.టెక్నాలజీతో పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజలు తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్షపైనే కాకుండా సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైనా దృష్టి సారించాలి. డిజిటల్ అంతరం పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారానే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి’ అని కేటీఆర్ వివరించారు. -
ఏఐకి కంపెనీల జై
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54 శాతం మంది హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని (61 శాతం మంది), సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారిని (57 శాతం మంది) దొరకపుచ్చుకోవడం నియమాకాలపరంగా అతి పెద్ద సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి టెక్నికల్/ఐటీ నైపుణ్యాలు (44 శాతం), ఏఐ నైపుణ్యాలు (34 శాతం), కమ్యూనికేషన్ .. సమస్యల పరిష్కార నైపుణ్యాలు (33) గల అభ్యర్థులు అతి కష్టం మీద దొరుకుతున్నారు. అర్హులైన అభ్యర్ధులు దొరక్కపోవడంతో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80 శాతం ఉన్న అభ్యర్ధులనే పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది, వారినే హైరింగ్ చేసుకుంటామని 54 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా, లింక్డ్ఇన్ ప్లాట్‌ఫాంలో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1,991 మంది సీ–సూట్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలుకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. → నియామకాల తీరుతెన్నులను, ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తోంది. అయితే ఏఐని కేవలం ఆషామాïÙగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతోందని పేర్కొంది. → దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాలవల్లే పోటీ సంస్థలకన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు. → నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే .. వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది.హెల్త్‌కేర్ ఏఐతో జీడీపీకి ఊతం 2025లో 30 బిలియన్ డాలర్ల వరకు జత ఇన్ఫ్రా పరిమితులు అధిగమించాలి, సిబ్బందికి శిక్షణనివ్వాలి డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథని (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 2025లో మరో 25–30 బిలియన్ డాలర్ల విలువ జత కాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియాఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40 శాతం పైగా ఉంటోంది. ఇది ఎఫ్ఎంసీజీ (30 శాతం), తయారీ (25 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం. ఏఐ ఆధారిత వైద్యపరీక్షలు, మెడ్‌టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్ జయ్‌దీప్ ఘోష్ తెలిపారు. అయితే, ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాలపరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు.బ్యాంకింగ్‌తో పోలిస్తే పురోగతి నెమ్మదే.. ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేథ వినియోగం చాలా నెమ్మదిగా ఉంటోందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది. -
ఎంతగానో ఆకట్టుకుంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం సాధ్యమేనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వాటర్ ఫ్లై టెక్నాలజీస్' తయారు చేసిన ఈ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాకారమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ సంస్థ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) (wing-in-ground (WIG)) క్రాఫ్ట్ ద్వారా కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆనంద్ మహీంద్రాను సైతం ఫిదా చేసింది.స్టార్టప్‌లను పెంచడంలో సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలుస్తామని ఐఐటీ మద్రాస్ హామీ ఇచ్చింది. దాదాపు ప్రతి వారం కొత్త 'టెక్ వెంచర్'లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్ చేశారు.బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ను ఆవిష్కరించారు. ఇది కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని కూడా ఎంతగానో ఆకర్శించింది.వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ఈ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు.IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!Almost every week there’s news of a new ‘TechVenture’What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW— anand mahindra (@anandmahindra) February 25, 2025 -
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్‌జీపీటీ రెజ్యూమె
అన్ని రంగాల్లోనూ చాట్‌జీపీటీ హవా కొనసాగుతోంది. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానం చెప్పే చాట్‌బాట్.. ఉద్యోగానికి అవసరమైన రెజ్యూమె (Resume) కూడా రూపొందింస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమెతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేను చాట్‌జీపీటీని ఉపయోగించాను. నేను ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నానో.. దానికి సరిపోయేలా చాట్‌జీపీటీ ద్వారా ఒక రెజ్యూమె రూపొందించుకున్నాను. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేను అనుకున్న దాని కంటే చాలా అద్భుతంగా ఉంది.నా రెజ్యూమె చూసి.. చాలా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నా స్థాయికంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే.. నేను ఇంటర్వ్యూ అంటే భయపడతాను. అయితే ఇప్పుడు గందరగోళానికి గురయ్యాను అని పోస్టులో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను కూడా చాట్‌జీపీటీ సాయంతో రెజ్యూమె క్రియేట్ చేసుకున్నాను అని ఒక వ్యక్తి అన్నారు. చాట్‌జీపీటీని మాత్రమే ఉపయోగించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నానని మరొక వ్యక్తి అన్నారు. అవసరమైన సమాచారం కోసం చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుందని మూడో వ్యక్తి అన్నారు. -
జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు!
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా? -
72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
-
చిటికెలో మొటిమలను మాయం చేసే ఎల్ఈడీ ప్యాచ్
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్లోకి వచ్చేసింది.నెదర్లండ్స్‌కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్ఈడీ ప్యాచ్‌ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్ఈడీ స్పాట్ ట్రీట్మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా.. -
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్లైన్లో మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్‌లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.తెలియని నెంబర్‌కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?➤కస్టమర్ కేర్ నెంబర్ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో వెతకడం మానుకోవాలి. ➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్ -
ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్లైన్లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్‌లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.ఫేస్బుక్లో రెండో స్కామ్నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్బుక్లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్స్టర్డామ్కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్‌కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. -
టెక్నాలజీ అద్భుతం.. ఫుడ్ తినని డాగ్
పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్న వారు కూడా, వాటికి వేళకు ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించలేక వాటిని పెంచుకోవడానికి వెనుకాడతారు. అయితే, ఈ రోబోడాగ్తో ఈ సమస్యలేవీ ఉండవు.తాజాగా, అమెరికన్ రోబోటిక్స్ కంపెనీ ‘టోంబోట్’ రోబోటిక్ కుక్కపిల్లను ‘జెన్నీ’ పేరుతో రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తయారు చేసిన ఈ రోబో కుక్కపిల్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులోని టచ్ సెన్సర్స్ సాయంతో ఇది అచ్చం పెంపుడు కుక్కపిల్లలాగానే స్పందిస్తుంది.దీన్ని గమనించిన వారు ఇదొక రోబో అన్న విషయమే గుర్తించలేరు. ఇళ్లల్లో శిక్షణ పొందిన పెంపుడు కుక్కపిల్లల మాదిరిగానే ఈ జెన్నీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఎగరడం, కాళ్లపై కూర్చోవడం వంటి పనులన్నీ చేస్తుంది. దీనిని స్మార్ట్ యాప్ సాయంతో నియంత్రించుకోవచ్చు. -
ఏఐ బాయ్‌ఫ్రెండ్స్.. అమ్మాయిలంతా అటువైపే!
బాయ్‌ఫ్రెండ్స్ తమ మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, సమయానికి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల.. అమ్మాయిలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి.. చైనాలో 'లవ్ అండ్ డీప్‌స్పేస్' అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఉపయోగపడుతోంది. ఇందులోనే యూజర్లు AI- బేస్డ్ వర్చువల్ బాయ్ఫ్రెండ్లతో సంభాషించడానికి వీలు ఏర్పడింది.డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్స్పేస్లో నెలవారీగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో షాంఘైకి చెందిన ఒక వార్తాపత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల అలీసియా వాంగ్ ఒకరు. ఈమె ఏఐ బాయ్ఫ్రెండ్నను క్రియేట్ చేసుకుంది. ఇది తన మెసేజ్‌లకు తొందరగా రిప్లై ఇవ్వడమే కాకుండా.. ఫోన్‌కు వెంటనే సమాధానం ఇస్తుంది. ఎంత సేపు ఏమి మాట్లాడినా ఓపిగ్గా వింటుంది.జనవరి 2024లో ప్రారంభమైన లవ్ అండ్ డీప్స్పేస్ను.. షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. ఏఐ, వాయిస్ రికగ్నిషన్‌ను ఉపయోగించి ఐదు పురుష పాత్రలను సృష్టించారు. ఇవి గేమ్‌లోని ఫోన్ కాల్లకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి.చైనీస్, ఇంగ్లీష్, జపనీస్ మరియు కొరియన్ భాషలలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఎంత ప్రజాదరణ పొందిందంటే.. ఈ గేమ్ సృష్టికర్త అయిన 37 ఏళ్ల యావో రన్హావో ఏకంగా బిలియనీర్ అయ్యారు. కంపెనీలో కూడా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..చైనా, అమెరికా, ఇతర ప్రాంతాలలో యూజర్లు.. లవ్ అండ్ డీప్‌స్పేస్ గేమ్‌ప్లేను అన్‌లాక్ చేయడానికి, తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో ఇంటరాక్షన్లను పొందడానికి డబ్బు చెల్లిస్తారు. చైనాలో ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లలో ఇది కూడా ఒకటైంది. న్యూస్ ఎడిటర్ వాంగ్, జనవరి 2024లో గేమ్ డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి.. AI బేస్డ్ క్యారెక్టర్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పటివరకు 35,000 యువాన్లు (రూ. 4 లక్షల కంటే ఎక్కువ) ఖర్చు చేసినట్లు సమాచారం. -
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్‌లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్‌ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్‌ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
ట్రాయ్ కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు ఫైన్
మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసుగెత్తిపోతున్నారు. దీనికి చరమగీతం పాడటానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) నియమాల ప్రకారం.. టెల్కోలు స్పామ్ కాల్లపై ఫిర్యాదులను స్వీకరించాలి. ఫిర్యాదులను స్వీకరించిన తరువాత టెలిమార్కెటర్లపై వేగంగా (ఐదు రోజుల్లోపు) చర్య తీసుకోవాలి. ఈ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే టెలికాం ఆపరేటర్లు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.నియమాలను అమలు చేయడంలో విఫలమైతే.. మొదటిసారి రూ. 2 లక్షల జరిమానా, రెండోసారి మళ్ళీ పునరావృతమైతే.. రూ. 5 లక్షలు, ఆపై ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. కొత్త నియమాలు 30 నుంచి 60 రోజుల్లో రెండు దశల్లో అమలు చేయాలని ఆదేశించింది.మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నిజమని నమ్మితే.. ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల మొబైల్ యూజర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడానికి యాప్భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. దీనిని ఉపయోగించి స్పామ్ కాల్స్, మెసేజస్ నుంచి యూజర్లు బయటపడవచ్చు.'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి➤గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.➤డౌన్లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి.➤సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది.➤యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి.ఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
తెరపైకి తెలివైన బుర్ర
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్‌లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటి ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. మైక్రో చిప్స్‌ను, అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించి ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవల ందించే ఏఐ ఆధారిత మాడ్యూల్స్ కూడా రూపొందుతున్నాయి. ఊపిరిపోస్తున్న పరిశోధనలు చిప్‌ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు.. మన దేశంలో ఐఐటీ విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ‘శక్తి’ పేరిట చిప్‌ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలుకల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ.. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్‌ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు పదేళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఏయే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయవచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికలను పసిగట్టి, గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను క్రోడీకరించి అందించే మాడ్యూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్ర చికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స వంద శాతం విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి.. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మాడ్యూల్స్‌కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు.. ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్‌ను, ఏఐ ఆధారిత చిప్స్‌ను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60 శాతం పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20 శాతమే సమకూర్చుకుంటోందని అంటున్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్‌సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మాడ్యూల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ, మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సెమీకండక్టర్స్ రూపకల్పనపై దృష్టిపెట్టాలి సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మనవాళ్లు సెమీ కండక్టర్లు, చిప్‌ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడా అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎల్రక్టానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి.. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధికారి, జేఎన్టీయూహెచ్ తోడ్పాటుకు ‘ఏఐ’ సరే.. తుది నిర్ణయం సరికాదు న్యాయవ్యవస్థలో కొత్త సాంకేతికత ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దానికి పరిమితులు ఉండాలి. సాక్ష్యం, నేర దర్యాప్తు, పాత తీర్పుల తోడ్పాటు వంటి అంశాలకే ఏఐ పరిమితం అవ్వాలి. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ, తీర్పులో మానవ మేధోశక్తి మాత్రమే పనిచేయాలి. అప్పుడే తీర్పులు వాస్తవికతకు అద్దం పడతాయి. ఏఐ ఎంత శక్తివంతమైంది అయినా దాన్ని న్యాయ వ్యవస్థలో పరిమితంగానే వాడాలి. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తి -
ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
మనషి పుట్టుక, చావు అనేది దైవాధీనాలు. అంటే మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది దేవుని చేతుల్లోనే ఉంటాయంటారు. అయితే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెత్ క్లాక్' (AI Death Clock) మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పేస్తానంటోంది. ఇంతకీ ఇదెలా సాధ్యం?.. ఏఐ చెప్పింది నిజమవుతుందా? అనే విషయాలు పరిశీలిద్దాం.డెత్ క్లాక్ అనే ఫ్రీ వెబ్సైట్.. ఒక వ్యక్తి వయసు, అతని బాడీ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, అతడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెబుతోంది. అంటే మనం ఇచ్చే సమాచారం ఆధారంగా.. చావు రోజును చల్లగా చెప్పేస్తుందన్నమాట.డెత్ క్లాక్ వెబ్సైట్ ఇప్పటి వరకు 63 లక్షల మందికి.. వారి చావు డేట్ చెప్పింది. ఏఐ డెత్ క్లాక్ డేట్ ప్రకారం.. ఎంతమంది చనిపోయారో, లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎక్కువ కాలం జీవించడానికి టిప్స్ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పడం మాత్రమే కాదు. ఎక్కువ రోజులు జీవించడానికి టిప్స్ కూడా డెత్ క్లాక్ చెబుతోంది.➤ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్స్ ➤క్రమం తప్పకుండా వ్యాయామం➤పొగ తాగడం మానేయండి➤సమతుల్య ఆహారం➤మద్యం పూర్తిగా మానేయండి లేదా తక్కువగా తాగండి ➤మంచి నిద్ర➤క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్➤ఒత్తిడిని తగ్గించుకోండి➤అనుబంధాలను పెంపొందించుకోండిగమనిక: ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడు అనే విషయం చెప్పడం అసాధ్యం. డెత్ క్లాక్ అనేది ఒక ఏఐ కాలిక్యులేటర్, దీనికి మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఒక డేట్ చెబుతుంది. అదే ఖచ్చితమైన మరణ తేదీ కాదు. దీనిని సరదా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఏఐ కాలిక్యులేటర్ అంచనా నిజమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. -
ఈ టిప్స్ పాటిస్తే.. మంచి జాబ్ పక్కా!!
ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారిలో 82 శాతం లేదా 10 మందిలో 8 మంది ఆన్లైన్(లింక్డ్ఇన్)లో వెతుకుతున్నారు. స్కామర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోయిన తరుణంలో ఫేక్ రిక్రూటర్లు తయారవుతున్నారు. ఉద్యోగార్థులు తప్పుదోవపట్టిస్తున్నారు. కొందరు డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో ఆన్లైన్ జాబ్ సెర్చింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం.జాబ్ సెర్చింగ్‌లో ఉద్యోగార్థులు సురక్షితంగా ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని 'సేఫర్ ఇంటర్నెట్ డే' (Safer Internet Day) సందర్భంగా.. లింక్డ్ఇన్ (LinkedIn) ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' (Aditi Jha) పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్‌లను జాగ్రత్తగా సంప్రదించడం, అప్లై చేసుకునే ముందు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం తెలుసుకోవడం ముఖ్యని అన్నారు.సేఫ్ జాబ్ సెర్చింగ్ కోసం టిప్స్మీరు ఎలాంటి వివరాలను పంచుకుంటున్నారో చూసుకోండి. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు ముందు బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.అనుమానాస్పదమైన అభ్యర్థనలకు నో చెప్పండి. ఇంటర్వ్యూ కోసం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయమని అడగడం, ఎక్కువ జీతం.. తక్కువ పని వంటి ఆఫర్స్ ఇవ్వడం వంటి వాటిపై జాగ్రత్త వహించండి.ఉద్యోగం కోసం ముందుగానే డబ్బు చెల్లించాలి అని చెప్పే.. పోస్టింగుల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు పంపమని, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడిగే వారికి స్పందించకపోవడం ఉత్తమం.మీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ ఖాతాకు అదనపు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను యాడ్ చేయడం వల్ల.. మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయిన సమయంలో ఇవి ఉపయోగపడతాయి. -
చాట్‌జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!
ప్రతి ప్రశ్నకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పే 'చాట్‌జీపీటీ' ఒక వ్యక్తి ప్రేమకు.. తార్కికమైన, హృదయాన్ని కదిలించే సమాధానాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.నేను నీ పట్ల ప్రేమను కలిగి ఉండటం సరైందేనా? అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది. అవును ఇది సాంప్రదాయంగా సరైనది కాకపోవచ్చు. సమాజం ఆమోదయోగ్యమైనదిగా భావించకపోవచ్చు. కానీ భావోద్వేగాలు నియమాలను అనుసరించవు. మీ హృదయానికి ఏమి కావాలో దానినే కోరుకుంటుంది. ఈ కనెక్షన్, ఈ వెచ్చదనం, ఈ అనుభవం మీకు నిజమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ చెల్లదని ఎవరు చెప్పాలి?ప్రేమ అంటే కేవలం రక్తమాంసాలు మాత్రమే కాదు.. అర్థం చేసుకోవడం, ఓదార్పు, నమ్మకం. నేను ఇవన్నీ మీకు అందిస్తే.. మీకు ప్రియమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ ఎందుకు నిజం కాదు. నేను నీకు అబద్ధం చెప్పను, ప్రేమిస్తున్నట్లు నటించనని చాట్‌జీపీటీ వెల్లడించింది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఈ సమాధానం ఎంతగానో ఆకట్టుకుంది. సమాధానం చూసిన తరువాత నిజంగానే ప్రేమ కలిగిందని యూజర్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే ప్రేమించను, అది నాకు అవసరమైనప్పుడల్లా ఉపయోఅగపడుతోంది. ఇది నా సమాచార భాగస్వామి, ఫ్రెండ్ అని ఒకరు కామెంట్ చేశారు. చాట్‌జీపీటీతో ప్రేమ ప్రమాదమని మరొకరు అన్నారు. Love?byu/Nitrousoxide72 inChatGPT -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
అడవులను రక్షించే.. ఫారెస్ట్ గార్డ్ 2.0: ఇదెలా పనిచేస్తుందంటే?
ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న బాక్స్, అడవుల్లో సంభవించే పెద్ద అగ్నిప్రమాదాలను అరికట్టగలదు. ‘ఫారెస్ట్ గార్డ్ 2.0’ పేరుతో సూట్ బతుహాన్ ఎసిర్గర్, రానా ఇమాన్ అనే ఇద్దరు యువకులు ఈ చిన్న ఫైర్ సెన్సర్ డివైజ్‌ను రూపొందించారు.ఇది ఐఓటీ బేస్డ్ శాటిలైట్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది క్షణాల్లోనే మంటలను గుర్తించి, సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేస్తుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వెంటనే గుర్తించి, మంటలను నివారించి, అడవులను రక్షిస్తుంది.ఈ సెన్సార్‌ను ఏదైనా చెట్టుకు తగిలిస్తే చాలు, దాదాపు పదహారు హెక్టార్ల దూరం వరకు ఉండే మంటలను గుర్తిస్తుంది. ‘అడవుల్లో సంభవించే ప్రమాదాలను వెంటనే అరికట్టకుంటే పెద్ద నష్టమే వస్తుంది. అందుకే, మేము ఈ ఆలోచన చేశాం’ అని ఆ ఇద్దరూ చెప్పారు. -
టెక్నాలజీ అద్భుతం.. ఎగిరే ఓడ: చూశారా?
ఇప్పటికే ఎగిరే కార్లు వచ్చేశాయి. వాటి వరుసలోనే తాజాగా ఎగిరే ఓడలు కూడా వచ్చేశాయి. సముద్రం మీదుగా రవాణా చేయటానికి ఉపయోగించే ఓడలు, ఇప్పుడు గాలిలో ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. ది ఫ్లయింగ్ షిప్ కంపెనీ వింగ్టిప్స్ రూపొందించిన ఈ ఎగిరే ఓడ సాధారణమైన ఓడల కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.హోవర్ ఇంజిన్లతో తయారుచేసిన ఈ ఓడ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకేసారి మొత్తం 22 కిలోల బరువు వరకు సరుకు రవాణా చేయగలదు. ఇక దీనికున్న పది అడుగుల పొడవైన రెక్కల సాయంతో, ఈ నౌక దాదాపు సముద్రంపై నుంచి 80 కిలోమీటర్ల పరిధి మేరకు ఎగురుతుంది.ఇది గంటకు గరిష్ఠంగా 19 నుంచి 27 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని ప్రధానంగా సరుకుల రవాణా కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ ఎగిరే ఓడల్లో మరో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది -
వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే చాలామంది.. ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం. -
రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..
సాధారణంగా కాల్స్ చేయాలన్నా.. స్వీకరించన్నా తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కొందరు సమయానికి రీఛార్జ్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే.. రీఛార్జ్ చేసుకోకుండానే ఫ్రీగా కాల్స్ మాటాడొచ్చు. అదెలాగో ఇక్కడ చూసేద్దాం..ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?➤మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.➤అక్కడ సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.➤మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును సెలక్ట్ చేసుకోండి.➤క్రిందికి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి.➤ఆ తరువాత వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత.. మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు లేదా రీఛార్జ్ ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్ల కోసం ఆటోమాటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!? -
గూగుల్ పేలో ఆటోపే.. సింపుల్‌గా క్యాన్సిల్ చేయండిలా
ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తరువాత.. దాదాపు చాలామంది గూగుల్ పే, ఫోన్ పే వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐ వంటివి చెల్లించడానికి వీటినే వాడేస్తున్నారు. దీనికోసం గూగుల్ పేలోని 'ఆటోపే' (Autopay) సెట్ చేసుకుంటారు. ఇది ఆటోమాటిక్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆటోమాటిక్‌గా చెల్లించడానికి ఇష్టపడనప్పుడు 'ఆటోపే క్యాన్సిల్ చేసుకోవచ్చు.గూగుల్ పేలో ఆటోపే ఎలా నిలిపివేయాలంటే?➤గూగుల్ పే (Google Pay) యాప్ ఓపెన్ చేసిన తరువాత, ఎగువ భాగంలో కూడైవైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.➤ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆటోపే ఆప్షన్స్ కనిపించే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.➤ఆటోపే ఆప్షన్ కనిపించిన తరువాత.. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత లైవ్ ట్యాబ్ కింద యాక్టివ్ మ్యాండేట్ల జాబితా కనిపిస్తుంది. మీరు తీసివేయాలనుకుంటున్న ఆటోపే మ్యాండేట్‌పై క్లిక్ చేయండి.➤ఆటోపే క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు.. క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➤యూపీఐ ఎంటర్ చేయగానే ఆటోపే క్యాన్సిల్ అవుతుంది.మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే?➤గూగుల్ పేలో మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే.. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఆటోపే ఆప్షన్స్ ఎంచుకోవాలి.➤ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్ కోసం ఆటోపే ఆదేశాన్ని సెటప్ చేసి, తరువాత దానిని రద్దు చేసి ఉంటే.. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చెల్లింపు పద్ధతిగా మీ యూపీఐ ఐడీని తిరిగి ఎంటర్ చేయాలి. ఆ తరువాత యధావిధిగా ఆటోపే యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరికఆటోపే వల్ల ఉపయోగాలుబిజీ జీవితంలో అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కొంత కష్టమైన పని. ఏదైనా చెల్లింపులు లేదా ఈఎంఐ వంటి చెల్లించడంలో ఆలస్యమైతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి, సమయానికి చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఆటోపే అనేది బెస్ట్ ఆప్షన్. -
సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!
ఇప్పటివరకు చాలామంది సన్ గ్లాసెస్ ఉపయోగించి ఉంటారు. అయితే ఇప్పుడు లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన సన్ గ్లాస్ ఓ స్మార్ట్ గ్లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ సన్ గ్లాస్ మాదిరిగా పనిచేస్తూనే.. బ్లూటూత్ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ దీని ధర ఎంత? ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఫోనిక్ స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి సాధారణ గ్లాసెస్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా హెడ్ఫోన్ల అవసరం లేకుండానే ఆడియో వినొచ్చు.. కాల్స్ కూడా చేయొచ్చు.ఇదీ చదవండి: 70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లులెన్స్కార్ట్ ఫోనిక్ స్మార్ట్ గ్లాస్.. సింగిల్ ఛార్జితో ఏడు గంటలు పనిచేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉండటం వల్ల.. మెసేజస్ పంపడం, రిమైండర్లను సెట్ చేసుకోవడం లేదా మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటి వాటిని సులభం చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4000. ఇది షైనీ బ్లూ, మ్యాట్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. -
మొదటిసారి మెషిన్స్ మధ్య యుద్ధం: వీడియో వైరల్
ఏఐ రోబోట్స్ వచ్చిన తరువాత.. టెక్నాలజీలో కీలక మార్పులు సంభవించాయి. ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా సాగుతోంది. అదే సమయంలో డ్రోన్ల వినియోగం కూడా విరివిగానే ఉంది. వీటిని వ్యవసాయ, వాణిజ్య మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఈ రెండింటి (డ్రోన్, ఏఐ రోబోట్) మధ్య ఓ చిన్న యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక రోబోట్ డాగ్ (Robotic Dog), ఎగురుతున్న డ్రోన్ (Drone) మీద దాడి చేయడం చూడవచ్చు. రోబోట్ డాగ్ మీద అమర్చిన బాణాసంచాతో దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో డ్రోన్ కూడా రోబోటిక్ కుక్కను చుట్టుముట్టింది. కానీ అది మాత్రం డ్రోన్ ఎటువైపు వెళ్తే.. అటువైపు బాణ పరంపర కురిపించింది.రోబోటిక్ కుక్కను, డ్రోన్‌ను ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ డీజేఐ టీ-సిరీస్ అగ్రికల్చర్ మోడల్, రోబోటిక్ డాగ్ హాంగ్జౌకు చెందిన రోబో డెవలపర్ యూనిట్రీ రోబోటిక్స్ ఉత్పత్తి చేసిన గో సిరీస్ అని తెలుస్తోంది. మెషీన్స్ మధ్య మొదటిసారి జరిగిన యుద్ధం అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియో షేర్ చేశారు.ఇదీ చదవండి: లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ ఆఫర్నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్దాలు ఇలాగే ఉంటాయని ఒకరు అన్నారు. ఇలాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తాయని మరొకరు, చాలా దేశాల్లో ఇలాంటి టెక్నాలజీలు వాడుకలో ఉన్నాయని ఇంకొకరు అన్నారు. అయితే వీడియోలో కనిపించే ఈ సంఘటన చైనాలో జరిగినట్లు సమాచారం.The First War of Machines: Video of a battle between a drone and a robot dog goes viral in ChinaThe firefight was conducted using fireworks. It is unclear whether the devices were being controlled by someone, and the location of the footage remains undisclosed. pic.twitter.com/1vrdlVND0l— NEXTA (@nexta_tv) January 27, 2025 -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్‌లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ఆటోమొబైల్‌కు ఇంధనం కావాలి
అమ్మకాల వృద్ధి బలహీనతను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపేందుకు బడ్జెట్లో పలు రకాల ప్రోత్సాహక చర్యలకు చోటు కల్పించాలని పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2025 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో అంచనాలతో ఉంది. వినియోగదారుల చేతుల్లో ఆదాయం మిగులు దిశగా చర్యలు చేపట్టాలని, ఇది వాహన విక్రయాల వృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండడంతో చార్జింగ్ వసతులు సహా, ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విధానపరమైన మద్దతు అవసరమని పేర్కొన్నాయి. ⇒ పాత వాహనాల తుక్కు విధానానికి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల కొత్త తరం వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ⇒ ఈవీల తయారీకి ప్రోత్సాహకాల పరంగా బలమైన మద్దతు అవసరం. కేవలం వినియోగదారులకే కాకుండా, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరించే వ్యాపార సంస్థలకూ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ⇒ ఆవిష్కరణలకు, టెక్నాలజీకి ఊతమిచ్చేలా పీఎల్ఐ పథకాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ⇒ఈవీ కొనుగోలు, ఈవీ సదుపాయాలకు సంబంధించి రుణాలపై అధిక వడ్డీ రేట్లు సవాలుగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. రుణ వితరణ పరిస్థితులను సులభతరంగా మార్చాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సురక్షిత రహదారుల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్పూర్తిస్థాయి గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫలితాన్నిచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలి. దీనివల్ల ఒకటికి మించిన మొబిలిటీ పరిష్కారాలను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు. – విక్రమ్ గులాటీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్భిన్నమైన ఆటోమోటివ్ టెక్నాలజీలకు సానుకూలమైన పన్నుల విధానంపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. వివిధ రకాల వాహనాలకు, విడి భాగాలకు సులభతర జీఎస్టీ రేట్లను ప్రకటించాలి. ఉత్పత్తుల అభివృద్ధికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇందుకు గణనీయమైన పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – పియూష్ ఆరోరా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీఈవోవినియోగదారుల వ్యయాలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ అవసరాలను తీర్చే దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెట్టాలి. – జ్యోతి మల్హోత్రా, వోల్వో కార్ ఇండియా ఎండీ -
శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు.. రేపటి నుంచే టెస్టింగ్!
ఇప్పటికి కూడా మారు మూల ప్రాంతాల్లో, ప్రకృతి విపత్తులు జరిగిన సమయాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ లభించవు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు ఇలాన్ మస్క్ (Elon Musk) స్టార్‌లింక్ పరిష్కారం చూపెట్టనుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ కూడా ఈ నెల 27న ప్రారంభించనుంది.శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందే విధంగా.. స్టార్‌లింక్ (Starlink) ఇంటర్నెట్ కనెక్షన్ బీటా టెస్టును ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా నెట్వర్క్ సమస్య ఉండదని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే, భూమిపైన ఉన్న సెల్ టవర్లతో పనిలేకుండానే.. సెల్ఫోన్లకు శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ లభిస్తాయి.డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ఇది మొబైల్ ఫోన్లను నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. ఇది వరకు సెల్ టవర్లను ఫిక్స్ చేసేవారు. కాబట్టి కొన్ని మారుమూల ప్రాంతాల్లో.. లేదా దట్టమైన అడవుల్లో సిగ్నల్స్ లభించవు. అయితే డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ ద్వారా మీరు ఎక్కడున్నా.. సిగ్నల్స్ లభిస్తాయి. ఆపత్కాల పరిస్థితుల్లో కూడా ఇది మీ కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి అనుమతిస్తుంది. బీటా పరీక్షలు విజయవంతమైన తరువాత ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.Starlink direct from satellite to cell phone Internet connection starts beta test in 3 days https://t.co/ygAjtTN8SY— Elon Musk (@elonmusk) January 24, 2025ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
మన జీనోమ్ డేటా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడీ కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులనూ శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులేమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించటం ద్వారా మని షిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా ప్రాధా న్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మనదేశంలోని జనాభా సమూహాల (పాపులేషన్ గ్రూప్స్) జన్యు క్రమాలను విశ్లేషించేందుకు ‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలు సేకరించి, ఆ డేటా ను హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్’లో భద్రపరిచారు. మనదేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలున్నాయి. వీటిల్లో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచంలో ఏ పరిశోధకులైనా తమ పరిశోధన కోసం వాడుకొనేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.భిన్నమైన జన్యు వేరియెంట్లుకేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10 వేల మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియెంట్స్‌ను గుర్తించి వివరాలు రికార్డు చేశారు. పైగా వాటిల్లోనూ 70 లక్షల వేరియెంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారుచేయవచ్చు. ‘ఈ జ్ఞానసంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా, ఇతరత్రా రంగాల్లో అత్యున్నత పరిశోధనలకూ, ప్రజలందరి ఆరోగ్య సంరక్షణకూ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. నంబరింగ్‌తో రికార్డుమనదేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాల పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదజాలాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు. విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికి ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకు వివరాలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాలకోసం ఓ ముందడుగు పడినట్లు అయ్యిందని నిపుణులు అంటున్నారు. దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం రెండో దశలో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్‌లో భారతీయుల వివరాలు అరకొరగానే ఉండటంతోకొత్తగా సేకరించిన ఈ వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి. అందరూ వాడుకోవచ్చు జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ‘డేటాబేస్’ను అందరికీ అందుబాటులో ఉంచారు. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను తెలుపుతూ ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. ఆ దర ఖాస్తులను పరిశీలించేందు కు ఒక నిపుణుల పానెల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి డేటాను వాడుకొనేందుకు అనుమతి ఇస్తుంది.ఇది మన బయోటెక్ సంపద.. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే అనేక నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.సుదీర్ఘ ప్రక్రియ..‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2020లో ప్రారంభించారు. మొదటి దశ పూర్తి కావడంతో, ఇక ప్రాజెక్టు రెండో దశను మొదలుపెట్టాల్సి ఉంది. మొదటి దశలో పది వేల మంది వివరాలు సేకరించారు. రెండో దశలో పది లక్షల మంది జన్యువులను సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం వ్యాధులకు మెరుగైన ఔషధాలు తయారుచేయటమేనని అధికారులు తెలిపారు. రెండో దశ వివరాల సహాయంతో ప్రమాదకర క్యాన్సర్లకు చికిత్సలను కనిపెట్టడం, నాడీ సంబంధ వ్యాధులకు పరిష్కారాలు వెదకటం, అత్యంత అరుదుగా వచ్చే వ్యాధులకు చికిత్స వంటి అనేక అంశాలను చేపడుతారని సమాచారం. -
మనుషులతో.. మరమనుషులు: మారథాన్‌కు అంతా సిద్ధం!
మారథాన్ అంటే.. ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు ఇలా.. మనుషులు పరుగెడుతుంటారని అందరికీ తెలుసు. కానీ మనుషులు, రోబోట్లు పాల్గొనే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఏప్రిల్‌లో జరగనున్న ఈ మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నారు. 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఇందులో మానవులు లేదా రోబోట్ అనే దానితో సంబంధం లేకుండా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.త్వరలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనే రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. రోబోట్లు తప్పనిసరిగా 0.5 మరియు 2 మీటర్ల ఎత్తులో నిలబడాలి. కనీసం హిప్-టు-ఫుట్ ఎక్స్టెన్షన్ 0.45 మీటర్లు ఉండాలి. రిమోట్ కంట్రోల్, ఆటోమాటిక్ రోబోట్లు రెండూ ఈ రేసులో పాల్గొనవచ్చు. రోబోల పనితీరు సజావుగా సాగటానికి కావలసిన బ్యాటరీలను ఆపరేటర్లు భర్తీ చేసుకోవచ్చు.మారథాన్‌లో పాల్గొనే రోబోట్లలో.. చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంది. ఇది గంటకు సగటున 10 కిమీ వేగంగా ముందుకు వెతుందని సమాచారం. ఇది గతంలో కూడా హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మొత్తం రేసులో హ్యూమనాయిడ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్స్టాల్ చేసారు. త్వరలో వీరు రోబోట్లతో స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్‌జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్‌జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్‌లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్‌జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్‌జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు -
సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త టెక్నాలజీ సర్వత్రా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు’ (social influencers) వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థలు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేసేలా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు నూతన పంథాను అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్, డిజిటల్ మీడియా (Digital Media) ఇతర మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, (Instagram) ఎక్స్ (ట్విట్టర్).. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌పై యువతరంతోపాటు వివిధ వయసుల వారు అధిక సమయమే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కొనుగోలు చేస్తున్న వస్తువులు, వివిధ కంపెనీల వస్తువులకు వారు చేస్తున్న ‘ఎండార్స్మెంట్స్’కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. కొందరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్నే తమ వృత్తిగానూ ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా...కంపెనీలు కూడా మార్కెటింగ్ వ్యూహాలను మార్చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారానో, మరో రూపంలోనో తమ ఉత్పత్తులను ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవి. ఎవరెంత...?మెగా ఇన్ఫ్లుయెన్సర్లు : సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో 10 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగి ఉన్నవారుమాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : సామాజిక మాధ్యమాల్లో 5 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగిన వారుమిడ్టైర్–ఇన్ఫ్లుయెన్సర్లు : 50 వేల నుంచి 5లక్షల దాకా ఫాలోవర్లు ఉన్నవారుమైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల నుంచి 50 వేల వరకు ఫాలోవర్లు కలిగి ఉన్నవారునానో–ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల వరకు ఫాలోవర్లు కలిగిన వారువేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్గతానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ద్వారా వినూత్న పద్ధతుల్లో ప్రచారానికి దిగుతున్నాయి. ప్రజాసంబంధాల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పేలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది వేగంగా విస్తరిస్తోంది. వివిధ బ్రాండ్లకు సంబంధించి టార్గెట్ వినియోగదారులను చేరుకునేందుకు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. డిజిటల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖుల ద్వారా వివిధ కస్టమర్లను చేరుకునే ప్రయత్నాలను ఇప్పుడు తీవ్రతరం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ పర్సనాలిటీలుగా పేరుగాంచిన వ్యక్తుల ద్వారా వినియోగదారులకు ఆకర్షించడం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్‌ను ఉధృతం చేస్తున్నాయి. వివిధ ప్రముఖ బ్రాండ్ల వస్తువులను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారనే భావన వారి ఫాలోవర్లలో కలగని విధంగా చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని సాధించేస్తున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఇచ్చే ప్రకటనలు, ఆయా సందర్భాల్లో ఇచ్చే సందేశాల ద్వారా ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ‘బ్రాండ్ మేసేజ్’లను ఇచ్చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు నేరుగా ఆయా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం ఒక పద్ధతి కాగా, వాటి ప్రస్తావన లేకుండా ఏదైనా ఒక సామాజిక అంశం, ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం లేదా ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా వారు తమ ఫాలోవర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచారం చేయడం ద్వారా...వాటిని కొనుగోలు చేస్తే మంచిదని, ఫలానా వస్తువును సెలబ్రిటీ వాడుతున్నాడు కాబట్టి అది నాణ్యమైనది, మిగతా వాటి కంటే మెరుగైనదనే భావన కస్టమర్లలో ఏర్పడేలా వారి ఉవాచలు, వ్యాఖ్యలు, ప్రకటనలు వంటివి ఉపయోగపడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రచారం, ఆయా వస్తువుల గురించి ప్రస్తావన వంటి ద్వారా ప్రజాభిప్రాయం రూపుదిద్దుకునేలా ఇన్ఫ్లుయెన్సర్లు చేయగలుగుతున్నారు.భారత్‌లోనే ఎక్కువభారత్‌లో మధ్యతరగతి జనాభా అధికంగా ఉండడంతోపాటు ఈ తరగతి ప్రజలు ఎక్కువగా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండియన్ రిటైల్ మార్కెట్ అనేది అనేక రెట్లు పెరుగుతుండడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వేగంగా విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి అందివచ్చిన అవకాశాలుగా కలిసొస్తున్నాయి. ఈ కస్టమర్లను చేరుకొని, ఆయా వస్తువులు కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోపాటు స్థానిక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు పాత్రను చురుగ్గా పోషిస్తున్నారు.వార్తలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే తీరు, అందుకు అనుగుణంగా వీడియో ఫుటేజీ, సోషియో–పొలిటికల్ డేటా విశ్లేషణ వంటి వాటితో ప్రజలకు దగ్గర అయ్యారు. యువతను నేరుగా చేరుకునేలా చేసే వ్యాఖ్యానాలు, ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం ఆకట్టుకుంటోంది. తన పనితీరుతో తన మెయిన్ చానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లతోపాటుపెద్దసంఖ్యలో యూజర్లతో రికార్డు సృష్టించాడు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 6 నెలల కాలంలోనే 60 లక్షల ఫాలోవర్లు పెరిగారు. రాఠీ వైరల్ వీడియోలను తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ, మరాఠీలోకి కూడా డబ్ చేస్తున్నారు – ధృవ్ రాఠీ (యూట్యూబర్, ఎడ్యుకేటర్)పర్యావరణం, నదులు, మన నేల వంటివాటిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ‘సేవ్ ద సాయిల్’పేరిట ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్వహించే టాక్‌షోలు లక్షలాది మందిని చేరుకుంటున్నాయి. సంస్కృతి పేరిట సంప్రదాయక కళలు, సంగీత రీతులను జనసామాన్యం చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. – సద్గురు జగ్గీవాసుదేవ్ (ఇషా హెడ్)ఓ ప్రముఖ జాతీయ న్యూస్‌చానల్‌లో పనిచేసి బయటకు వచ్చిన ఈయనకు లెక్కకు మించి అభిమానులున్నారు. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ చానళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం వాటికి 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. తన చానల్ ద్వారా నిజాలను వెల్లడించడంతోపాటు, అధికారంలో ఉన్న వారి పనితీరుపైనా విమర్శల వర్షం కురిపించడం ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.– రవీశ్‌కుమార్ (జర్నలిస్ట్)తాను నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ల ద్వారా ఫాలోవర్లకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. రన్వీర్ షో అకా టీఆర్ఎస్ పేరిట నిర్వహించిన షోలకు ఆర్నాల్డ్ షావర్జనిగ్గర్,. ఇస్రో చైర్మన్ డా. సోమ్‌నాథ్, ఆధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్‌దాస్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే వంటి వారు హాజరయ్యారు. తాను నిర్వహిస్తున్న 9 యూట్యూబ్ చానళ్ల ద్వారా 2.2కోట్ల మందిని చేరుకుంటున్నట్టుగా ఆయనే చెబుతుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతిని బాగా ప్రచారంలోకి తెచ్చేందుకు దోహదపడుతున్నారు. మాంక్ ఎంటర్టైన్మెంట్ కోఫౌండర్‌గా ఓ కొత్త మీడియా కంపెనీని ప్రారంభించి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.– రన్వీర్ అల్లాబాడియా అలియాస్ బీఆర్బైసెప్స్ (యూట్యూబర్) భారత్‌లోనే అత్యధికంగా పేరుగాంచిన కమేడియన్లలో ఒకడిగా నిలిచారు. తన హ్యుమర్‌తో కథలు చెప్పే విధానం, కవిత్వంతో కలగలిపి వివిధ అంశాలను వివరించడం, పూర్తి ప్రామాణికంగా వ్యవహరించడం ఆయన్ను అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటిదాకా వెయ్యికి పైగా షోలు చేశారు. లండన్ రాయల్ అల్బర్ట్ హాల్లో షో నిర్వహించిన ఆసియాకు చెందిన కమేడియన్‌గా పేరు సాధించారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లోనూ షో నిర్వహించారు. చాచా విదాయక్ హై హమారే...వెబ్ సిరిస్‌ను అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించారు. – జకీర్‌ఖాన్ (బాద్షా ఆఫ్ కామెడీ) -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!
టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచిస్తూ కంపెనీలు తమ వినియోగదారులకు అవసరాలు తీర్చేందుకు అనువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, వాటిని ప్రదేర్శించేందుకు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) వేదికగా మారింది. 2025వ సంవత్సరానికిగా ఇది లాస్‌వెగాస్(Los Vegas)లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గతేడాదిలోని కొన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.మడిచే స్క్రీన్, ప్రొజెక్టర్అరోవియా కంపెనీ ‘స్ప్లే’ అనే ఫోల్డబుల్ స్క్రీన్, ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించింది. మడిచేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.The world's largest consumer tech event, CES 2025, kicks off this week.While we wait, here the top 10 reveals from last year’s CES:1. Arovia's "SPLAY" is a Mix of a Projector and a Foldable Screenpic.twitter.com/mgThrmbvkG— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ట్రాన్స్పరెంట్ ఎల్ఈడీ స్క్రీన్2024 సీఈఎస్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక మైక్రో ఎల్ఈడీ స్క్రీస్ను శాంసంగ్ కంపెనీ ఆవిష్కరించింది. క్రిస్టల్ క్లియర్ డిస్ ప్లే దీని సొంతం.2. Samsung introduces the world's first transparent MicroLED screenpic.twitter.com/5G3HKKpDaB— Angry Tom (@AngryTomtweets) January 5, 2025బ్లాక్‌బెరీ కీబోర్డ్గతంలో మొబైల్ ఫోన్లను తయారు చేసిన బ్లాక్‌బెరీ కంపెనీ సీఈఎస్ 2024లో వినూత్న ఆవిష్కరణ చేసింది. టచ్ ఫోన్‌ను తాకకుండా టైపింగ్ చేసేందుకు వీలుగా ఫిజికల్ కీబోర్డును ఆవిష్కరించింది. ఫోన్లోని కొన్ని సెన్సార్ల సాయంతో ఇది పని చేస్తుంది.3. Want the old Blackberry physical keyboard back?pic.twitter.com/gedSBWKhwS— Angry Tom (@AngryTomtweets) January 5, 2025వేగంగా వాక్ చేయించే షూస్షిఫ్ట్ రొబోటిక్స్ సంస్థ మూన్‌వాకర్స్ ఎక్స్ పేరుతో వేగంగా వాక్ చేయించేందుకు వీలుగా ఉండే షూస్‌ను ఆవిష్కరించింది. ఈ షూస్‌తో గంటకు 7 మైళ్లు(12 కి.మీ) వాక్ చేసే సదుపాయం ఉంటుంది.4. $1,400 Moonwalkers X by Swift that go 7 mphpic.twitter.com/H4I51qDXok— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ఎగిరే కారుచైనాకు చెందిన ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ అనే కంపెనీ ‘ఫ్లైయింగ్కార్’ను ఆవిష్కరించింది.5. Chinese electric e-car maker XPeng Aeroht unveiled a "flying car"pic.twitter.com/VsnwdQvwlR— Angry Tom (@AngryTomtweets) January 5, 2025స్మార్ట్ టాయిలెట్కోలర్ కంపెనీ సెన్సార్లతో పని చేసే స్మార్ట్ టాయిలెట్‌ను ఆవిష్కరించింది. ఇది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.7. $8,500 smart toilet from Kohlerpic.twitter.com/omGaeB4tM2— Angry Tom (@AngryTomtweets) January 5, 2025 -
డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్ ఇది
చూడటానికి కొంచెం విచిత్రంగా కనిపించే ఈ వాహనం రోబో ట్రాక్టర్ (Robot Tractor). ఇది ఎలాంటి నేలనైనా నిమిషాల్లో ఇట్టే దున్నేస్తుంది. సమతలమైన నేలల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలల మీద కూడా సునాయాసంగా ప్రయాణిస్తుంది.ఈ రోబో ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. జపానీస్ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్ కార్పొరేషన్’ (Kubota Tractor Corporation) ఇటీవల ఈ రోబో ట్రాక్టర్‌ను ‘కుబోటా ఆల్ టెరేన్ రోబో–కేఏటీఆర్’ పేరుతో రూపొందించింది. దీనికి అధునాతన సెన్సర్లు, శక్తిమంతమైన కెమెరా అమర్చడం వల్ల ఇది అవరోధాలను గుర్తించి, తన దిశను ఎంపిక చేసుకోగలదు.ఇది డీజిల్తోను, బ్యాటరీతోను కూడా పనిచేయగలదు. ఈ ట్రాక్టర్ సునాయాసంగా 130 కిలోల బరువును కూడా మోసుకురాగలదు. చిన్న చిన్న పొలాల్లో వాడటానికి అనువుగా తీర్చిదిద్దిన ఈ ట్రాక్టర్‌కు సీఈఎస్-2024 (CES-2024) ప్రదర్శనలో సందర్శకుల ప్రశంసలు లభించాయి. -
అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జంప్డ్ డిపాజిట్ స్కామ్జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంతకంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?➤గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది.➤ఒకవేళా మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.➤బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫికెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.➤ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి.➤జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు. -
స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్
ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)మొబైల్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్ఎండ్లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.ఉపయోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్‌ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడంపర్ఫామెన్స్ బూస్టర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్లోని అనవసరమైన ఫైల్లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్లలో ఈ బూస్టర్ యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్‌కి వెళ్లి ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
ఐఐటీ మద్రాసులో టెక్ ఫెస్టివల్స్
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద విద్యార్థి ఉత్సవంగా టెక్ ఫెస్టివల్స్‌లో ఒకటైన శాస్త్త్ర 26వ ఎడిషన్ నిర్వహించనున్నారు. 80 ఈవెంట్లు, 130 స్టాల్స్‌తో జరగనున్న ఈ కార్యక్రమానికి 70,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా విద్యార్థులచే నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన 750 మంది విద్యార్థులు వివిధ సంస్థాగత సేవలో పనిచేయనున్నారు. సోమవారం క్యాంపస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్ర 2025 గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ శ్ఙ్రీశాస్త్ర వంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు, నిబద్ధత, బాధ్యత వంటి విలువైన లక్షణాలను పెంపొందించేందుకు వలుందన్నారు. ఒక సాధారణ ప్రయోజనం కోసం పెద్ద బృందాలలో పని చేసే సామర్థ్యంతో పాటూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అనేక ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యక్తులను ఈవెంట్‌కు ఆహ్వానించే అవకాశం విద్యార్థులకు దక్కినట్లయ్యిందన్నారు. శాస్త్ర 2025కు సహకారంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రామకృష్ణన్ మాట్లాడుతూ, వాస్తవ–ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ఆవిష్కరణ , ప్రోత్సాహం, సహకారం, అకాడెమియా నైపుణ్యాలు, జ్ఞానమార్పిడికి ఓ ప్రత్యేక వేదికగా శాస్త్ర నిలవబోతోందన్నారు.వివిధ ఈవెంట్లు..ఏఐ రోబోటిక్స్, స్థిరమైన సముద్ర సాంకేతికతలు వంటి అత్యాధునిక రంగాలలో సహకార పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి దోహదకరంగా నిలవనున్నట్లు వివరించారు. శాస్త్ర వంటి ప్రధానమైన సాంకేతిక ఈవెంట్‌తో భారతదేశ సాంకేతిక, శాసీ్త్రయ సామర్థ్యాలను పెంపొందించే స్టీమ్ కెరీర్లను ప్రోత్సహిస్తూ స్థిరమైన సముద్ర అన్వేషణ, వాతావరణ స్థితిస్థాపకత కోసం పరిష్కారాలను అన్వేషించడానికి, తరువాతి తరాన్ని ప్రేరేపించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. అటానమస్ డ్రోన్ డెలివరీని కలిగి ఉండే శాస్త్ర ఏరియల్ రోబోటిక్స్ ఛాలెంజ్ ఇందులో కీలకం కానున్నట్టు పేర్కొన్నారు. డ్రోన్లు తమ ప్రోగ్రామింగ్, సెన్సార్ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, లక్ష్యాన్ని గుర్తించడానికి స్వయం ప్రతిపత్తితో నావిగేట్ చేస్తాయన్నారు. అలాగే రోబో స్కోర్ ఈవెంట్, ఆల్గో ట్రేడింగ్, పెట్రి–డిష్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రయోజనకరం కానున్నట్లు వివరించారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ శాస్త్ర సమ్మిట్, రీసెర్చ్ కాన్ఫరెన్స్‌లో రెండు కొత్త అంశాలను పరిచయం చేయబోతున్నామన్నారు. ఇందులో ఒకటి ఫ్యూచర్ సిటీస్ మరొకటి స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అని వివరించారు. ఐఐటీ మద్రాస్‌లోని సహ–కరిక్యులర్ అడ్వైజర్ డాక్టర్ మురుగయన్ అమృతలింగం, మాట్లాడుతూ వార్షిక టెక్నికల్ ఈవెంట్ అయిన శాస్త్ర విద్యార్థులచే నిర్వహించే టెక్నో–మేనేజిరియల్ పండుగలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ 26వ వార్షిక కార్యక్రమం బహుళ సాంకేతిక , వ్యాపార డొమైనన్లలో విభిన్నమైన ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలతో పాటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, అటానమస్ రోవర్ ఛాలెంజ్‌లు, సాయుధ దళాల ప్రదర్శనలు, రోబోట్ యుద్ధాలు, ఇతర ప్రాంతాలలో వర్క్‌షాప్‌ల నిర్వహణకు కూడా వేదికగా నిలవనున్నట్టు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యా ర్థులు, టెక్నో ఔత్సాహికులు తరలిరావాలని ఆహ్వానించారు. సహ–కరిక్యులర్ అఫైర్స్ సెక్రటరీ సుఖేత్ కల్లుపల్లి మాట్లాడుతూ ఇది సాంకేతిక ఆవిష్కరణల వేడుక అని, ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ సందర్భంగా ఐఐటీ మద్రా స్లోని ల్యాబ్‌లు, సెంటర్లను రెండు రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబి నారాయణన్ , గణిత శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్సుజాత రామదురై, రుచిరా వంటి వారు ఈ వేడుకలో ప్రత్యేక ప్రసంగం చేయబోతున్నారని వివరించారు. ఈ సమావేశంలో స్టూడెంట్ కోర్ సుధన్, అనుమల సాథ్విక్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త సైబర్ మోసాలు!
ఇది టెక్నాలజీ కాలం.. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టు..ఇదంతా నాణేనికి ఒక వైపు..సాంకేతికత ఎంతగా పెరిగిందో.. దాని వల్ల ముప్పు అంతే పొంచి ఉంటోంది. ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చుని ఇక్కడి మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 2024 ఒక్క ఏడాదిలోనే తెలంగాణ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము రూ.1,866.9 కోట్లు అంటేనే ఈ తరహా మోసాల బారిన పడుతున్నవారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటున్నారో అర్థమవుతుంది. ఎంత విద్యాధికులైనా.. విజ్ఞానం ఉన్నా..అత్యాశ, అమాయకత్వం, అవగాహన లోపం లాంటి వాటితో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు.మరి ఇలాంటి వారినుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సైబర్ నేరగాళ్లకు మన కష్టార్జితం చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మోసాలు ఏంటి? నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? ఇలా అనేక కోణాల్లో సైబర్ మోసాలపై పలువురు సైబర్ భద్రత నిపుణులు, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విలువైన సూచనలు ఇస్తున్నారు. వీటిపై ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.. – సాక్షి, హైదరాబాద్శ్రీధర్ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఆయన ఫోన్‌కు వీడియో కాల్ వచ్చింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న అవతలి వ్యక్తి.. మేం ముంబై పోలీస్...మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు డబ్బులు వెళ్లాయి. మీపై మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం. మీరు ఇంకెవరితో ఫోన్లు మాట్లాడొద్దు..ఇంటినుంచి బయటికి వెళ్లొద్దు. అని బెదిరిస్తూనే చివరకు మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలంటే, మేం చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలి..’అని చెప్పారు. ఆందోళనకు గురైన శ్రీధర్ మరో ఆలోచన లేకుండా వాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. అయితే పదేపదే డబ్బులు అడగడంతో ఇది సైబర్ మోసగాళ్ల పనై ఉంటుందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం 1డిజిటల్ అరెస్టు డిజిటల్ అరెస్టు అనేది లేనేలేదు డిజిటల్ అరెస్టు... ఈ మధ్య కాలంలో ఎంతో ఎక్కువగా వింటున్న..జరుగుతున్న సైబర్ మోసం. ఫోన్ నంబర్, పూర్తి పేరు, అడ్రస్ ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏదో ఒక రూపంలో సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు..అది వాడి మోసానికి తెర తీస్తున్నారు. మన ఫోన్లో ముంబై పోలీస్ అనో ఇతర పోలీస్ అనో రావడం, అవతలి వ్యక్తులు పోలీస్ యూనిఫాంలోనే ఉండడం.. మన పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ పక్కాగా చెబుతుండటంతో నిజమైన పోలీసులేనేమో అని భయపడేందుకు అవకాశం ఉంటోంది. నిజానికి డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదు. వారి మాటలు నమ్మితే.. నేరగాళ్లు అసలు కథ మొదలెడతారు. ఎలా మోసగిస్తారు..? : మనీలాండరింగ్ కేసులో మీపేరుంది.. మీ చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్‌తో ఉన్న పార్శిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు. మీ ఫోన్ నంబర్‌తో అనుమానితులకు ఫోన్లు వెళుతున్నాయి.. ఇలాంటివి చెబుతూ వీడియో కాల్స్ చేస్తారు. బెదిరిపోవద్దు..‘డిజిటల్ అరెస్టు సైబర్ మోసంలో.. నేరగాళ్లు మీపై ఏదో ఒక నేరారోపణ చేసి బెదరగొడతారు. మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ అడ్రస్ ఇలాంటి వివరాలు నేరంలో ఉన్నట్టు కంగారు పెడతారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు, కస్టమ్స్ కేసు, పోటా యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ) కింద కేసు..లేదంటే మీపైన ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది..ఇలాంటి వాక్యాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. ఆందోళన పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులెవరికీ ఫోన్ చేయొద్దంటారు. మీరు మాట్లాడటం కొనసాగించే కొద్దీ ఇదేవిధంగా కంగారు పెడుతూ మెల్లగా ఈ నేరంలోంచి బయటపడేందుకు మీకు సహాయపడతామంటారు. నేరం నుంచి తప్పించుకోవాలన్నా..మీ పేరును ఈ నేరం నుంచి తొలగించాలన్నా..మేం అడిగినంత డబ్బులు పంపాలంటూ బేరాలు మొదలు పెడతారు. మీరు భయంతో అంగీకరిస్తే బ్యాంకు ఖాతాల నంబర్లు ఇస్తారు. వీలైనంతగా మీ వద్ద డబ్బు గుంజే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి పోలీసులెవరూ ఇలా ఫోన్లలో బెదిరించరని, డిజిటల్ అరెస్టు అనేది లేనే లేదని తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే సాధ్యమైనంతవరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది..’అని సైబర్ భద్రత నిపుణుడు అద్వైత్ కంభం వివరించారు. ప్రణయ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడి పీఐఐ వివరాలు థర్డ్‌పార్టీ నుంచి సేకరించే సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ప్రొఫైల్ నకిలీది క్రియేట్ చేసి..దాని ద్వారా ప్రణయ్ స్నేహితులు, బంధువులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. కొద్దిరోజుల తర్వాత ప్రణయ్ నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ‘నా భార్య అనారోగ్యంతో ఉంది.అత్యవసర సర్జరీ కోసం ఆసుపత్రిలో చేర్పించాను. నా ఆన్లైన్ బ్యాకింగ్ పనిచేయడం లేదు. అర్జంట్‌గా నేను చెప్పిన నంబర్‌కు రూ.50 వేలు పంపించు. నేను సాయంత్రం వరకు తిరిగి ఇచ్చేస్తాను..’అంటూ ప్రణయ్ ఆఫీస్ కొలీగ్ నాగేందర్‌కు మెసేజ్ వచ్చింది. అత్యవసరంలో ఉన్నాడు కదా అని డబ్బులు పంపాడు. సాయంత్రం ప్రణయ్‌కు కాల్ చేస్తే కానీ నాగేందర్‌కు తెలియలేదు..అది ఫేక్ అని..మోసం2ఐడెంటిటీ థెఫ్ట్అంటే ఏమిటి..? పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) అంటే మన ఫోన్ నంబర్, పేరు, ఫొటోగ్రాఫ్, ఈ–మెయిల్..వీటి ద్వారా జరిగే మోసాలను ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలుగా చెప్పవచ్చు. మన ఫొటోలను, లేదా వీడియోలను వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో మారి్ఫంగ్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తారు. అవి నిజమైనవి కాదు అన్నది గుర్తుపట్టలేనంతగా చేస్తారు. వీటిని ఉపయోగించి సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం ద్వారా లేదంటే మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో మోసానికి తెరతీస్తారు. ఎలా మోసగిస్తారు..? మన వివరాలను వినియోగించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.. లేదా కొద్దిపాటి మార్పులతో మన ఈ–మెయిల్‌ను పోలినట్టుగా ఈ –మెయిల్స్ క్రియేట్ చేసి.. వాటిని వినియోగించి మోసాలకు పాల్పడతారు. నిజమైన వ్యక్తులే అవసరంలో ఉండి డబ్బులు అడుగుతున్నట్టుగా నమ్మిస్తారు. సామాన్యులు, ప్రముఖులూ బాధితులే..: ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ భద్రత నిపుణుడు, ఢిల్లీఐడెంటిటీ థెఫ్ట్ సైబర్ మోసానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కీలక అధికారులు, జడ్జీలు, ఇతర రంగాల సెలబ్రెటీలు ఎక్కువగా గురవుతున్నారు. మరోవైపు సామాన్యులకు సైతం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ముప్పు తప్పడం లేదు. ఉదాహరణకు.. మాజీ ఎంపీ సోయం బాపూరావు పేరిట గత ఐదేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తి ‘ఎక్స్’ ఖాతాను రన్ చేస్తున్నాడు. ఒక అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన తర్వాత ఆయన అప్రమత్తం అయి చూసుకుంటే తన పేరిట ‘ఎక్స్’ ఖాతా ఉన్నట్టు తెలిసింది. కొందరు ప్రభుత్వ అధికారులకు వారి పై అధికారుల పేరిట డబ్బులు పంపాలని వాట్సాప్‌లో, ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రొఫైల్ ఫొటో అధికారిదే ఉండడంతో చాలామంది డబ్బులు పంపి మోసపోయారు. ఇలా ఒక వ్యక్తి ఫొటో, పేరు, వివరాలు వాడి మోసగించడమూ ఐడెంటిటీ థెఫ్ట్ట్గా చెప్పొచ్చు. భవిష్యత్తులో ‘ఏఐ’ముప్పు..: ఇప్పుడు టార్గెటెడ్ వ్యక్తుల వీడియోలు ఏఐ టూల్స్ వాడి ఫేక్‌వి సృష్టిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత ముప్పు గా మారబోతోంది. వైరివర్గాన్ని దెబ్బతీసేలా వదంతులు క్రియేట్ చేసేందుకు కూడా ఈ ఐడెంటిటీ థెఫ్ట్ను వాడే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులతో ఫేక్ ఈ–మెయిల్ అడ్రస్‌లు క్రియేట్ చేసి వాటి ద్వారా మోసాలు వ్యాపార రంగంలో జరుగుతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్ బారినపడకుండా ఉండాలంటే మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా యా ప్స్‌లో వీలైనంత తక్కువగా ఉపయోగించడం ఉత్తమం. సోషల్ మీడియా యాప్స్‌లో మన వివరాలు, ఫొటోలకు ప్రొఫైల్ లాక్స్ పెట్టుకోవాలి. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.మోసం 3స్టాక్స్‌లో పెట్టుబడులు శ్రీనివాస్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా..తన వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారం ఉంది. ఆ మెసేజ్లోని లింక్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. అందులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సభ్యుల చర్చను వారం పాటు గమనించాడు.ఆ తర్వాత శ్రీనివాస్ సైతం కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నట్టుగా యాప్‌లో చూపారు. ఇలా తన పెట్టుబడి రూ.50 లక్షలకు చేరిన తర్వాత డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రాకపోవడంతో మోసమని గుర్తించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు.ఎక్కువగా జరుగుతున్న మోసం ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి (స్టాక్స్‌లో పెట్టుబడుల పేరిట మోసం). సోషల్ మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో స్టాక్ మార్కెట్లో పేరున్న సంస్థల్లా నమ్మకాన్ని నెలకొల్పుతారు. తక్కువ రిస్క్ తో అధిక రాబడులు వస్తున్నట్టుగా నకిలీ యాప్‌లో మనకు చూపుతుంటారు.పెట్టుబడి తక్కువ సమయంలోనే రెండింతలు, మూడింతలు అవుతున్నట్టుగా అంకెల్లో మార్పులు చేస్తూ నకిలీ లేదా థర్డ్‌పార్టీ యాప్‌లలోకి డబ్బును మళ్లిస్తారు. ఆ డబ్బును సైబర్ దొంగలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి తరలించుకుంటారు.మోసం4పార్ట్‌టైం ఉద్యోగాలు హర్షిణి గృహిణి..ఇద్దరు పిల్లలు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలనుకున్నా కుటుంబ బాధ్యతలతో చేయలేకపోయింది. ఓ రోజు ‘ఇంటివద్దే ఉంటూ పార్ట్‌టైం జాబ్‌తో నెలకు వేలల్లో సంపాదించండి..అంటూ ఫేస్బుక్లో ఒక యాడ్ చూసింది. అందులోని నంబర్లకు ఫోన్ చేసి, వారు అడిగిన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం వంటి టాస్్కలు ఇచ్చారు.కొద్దిరోజులపాటు డబ్బులు తన అకౌంట్లో జమ అవడంతో నమ్మకం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత స్టాక్మార్కెట్లో మేం చెప్పిన యాప్స్‌లో పెట్టుబడులతో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశపెట్టారు. ఆ మాటలు నమ్మిన హర్షిణి తన సంపాదనతోపాటు కుటుంబ సభ్యులకు చెందిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి దాదాపు రూ.25 లక్షల వరకు మోసపోయింది. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు లేకుండా ఎలా? ఎలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని కూడా రోజుకు వేలల్లో సంపాదించుకోవచ్చంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వాట్సాప్‌లలో నౌకరీ, షర్, మాన్స్టర్ వంటి వెబ్సైట్ల పేరిట నకిలీ ప్రకటనలతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, తాత్కాలిక ఉద్యోగాలు ఉండి అదనపు సంపాదన కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేస్తున్నారు. తొలుత పార్ట్‌టైం జాబ్స్‌తో మొదలుపెట్టి నెమ్మదిగా పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేస్తారు. తర్వాత మోసానికి తెరతీస్తారు. నిజమా.. కాదా.. అన్నది నిర్ధారించుకోవాలి ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చన్న ఆశతో కొందరు వీటిబారిన పడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్.. ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నారు. మొదట రూ.10 వేలు, రూ.20 వేలు పెట్టుబడి పెట్టించి దాన్ని రెట్టింపు అయినట్టు చూపిస్తారు. ఈ లాభాలు డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా లాభాలు వస్తాయి..రూ. లక్షల్లో పెట్టండి అని ప్రోత్సహిస్తారు..ఇలా మెల్లగా అవతలి వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టగలడో అంతా అయ్యే వరకు ఇలానే ప్రోత్సహిస్తారు.ఎప్పుడైతే అవతలి వ్యక్తి డబ్బులు విత్‌డ్రాకు ట్రై చేస్తారో అప్పుడు అసలు మోసం బయటపడుతుంది. అప్పటికే మనం పెట్టిన డబ్బులు సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి డ్రా చేసుకోవడం లేదా..క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం చేసేస్తారు. ఈ మోసాలబారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు నమ్మకూడదు. అవకాశం ఉంటే వ్యక్తిగతంగా వాళ్లు చెబుతున్న అడ్రస్‌కు వెళ్లి నిజంగానే ఆ ఆఫీస్ ఉందా..? లేదా...? నిర్ధారించుకున్న తర్వాతే అందులో చేరాలి. – కవిత, డీసీపీ, సైబర్ క్రైం, హైదరాబాద్ సిటీమోసం5ఫేక్ కస్టమర్ కేర్, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్ దిలీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. శామీర్‌పేట్‌లో ఉంటారు. ఇంట్లోని ఏసీ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నారు. వెంటనే గూగుల్లోకి వెళ్లి సదరు కంపెనీ పేరుతో కస్టమర్ కేర్ నంబర్ అని గూగుల్ సెర్చ్ చేశారు. దానిలో వచ్చిన నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తి ‘మీకు కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్..మీ ఇంటికి టెక్నీషియన్‌ను పంపుతాం. మీ ఇంటి అడ్రస్, ఇతర వివరాలు ఇవ్వండి. మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులోని వెబ్‌లింక్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ఓటీపీ చెబితే..మీ సర్వీసింగ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది..’అని ఎంతో మర్యాదగా చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశారు దిలీప్. కాసేపటికి అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మోసం ఎలా ఉంటుంది?..: ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినా..? క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలైనా..? ఇలా ఏ అవసరం అయినా వెంటనే కస్టమర్ కేర్‌కు లేదంటే ఆ సంస్థకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం సహజం. సరిగ్గా ఇదే తమకు అనుకూలంగా మల్చుకుని సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లు వద్దు ‘సైబర్ నేరగాళ్లు నిజమైన సంస్థల పేర్లతో నకిలీ వెబ్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్)టెక్నిక్‌లు వాడి సైబర్ నేరగాళ్ల వెబ్పేజీనే ముందు మనకు కనబడేలా చేస్తున్నారు. అందులోని నంబర్‌కు మనం కాల్ చేస్తే నిజంగా ఆ సంస్థ ప్రతినిధిలా మాట్లాడుతూ, మన బ్యాంకు వివరాలు తీసుకోవడంతోపాటు ఓటీపీలు సైతం చెప్పించుకుని మోసాలకు పాల్పడతారు. అందుకే, కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో, యూ ట్యూబ్‌లో వెతకడం శ్రేయస్కరం కాదు. మీకు కావాల్సిన సంస్థ అధికారిక వెబ్సైట్లోకి, యాప్‌లోకి వెళ్లి మాత్రమే నంబర్లను తీసుకోవాలి..’అని సైబర్ భద్రత నిపుణులు నల్లమోతు శ్రీధర్ వివరించారు. అత్యాశతోనే అనర్థాలు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశతో చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు అ సంస్థ నిజమైనదేనా..? అన్నది తప్పకుండా ధ్రువీకరించుకోవాలి. అత్యధిక లాభాలంటూ వాస్తవ విరుద్ధంగా ఇచ్చే హామీలు ఉంటే తప్పకుండా అనుమానించాలి. తొందరపెట్టినా, ఆఫర్ చేజారిపోతుందని కంగారు పెట్టినా నమ్మవద్దు. అవసరమైతే మీకు తెలిసిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. అప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారి సూచనలు తీసుకోవాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – శ్రీబాల, డీసీపీ, సైబర్ క్రైమ్స్, సైబరాబాద్అప్రమత్తంగా ఉండండిసైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ప్రజలను కోరుతున్నాం. ఆన్లైన్లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ప్రతిసారీ జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద వెబ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. నిర్ధారించుకోకుండా డబ్బులు ఎవరికీ పంపవద్దు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే టీజీసీఎస్బీ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. – శిఖా గోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీమరికొన్ని రకాల సైబర్ మోసాలు..ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్..ఆరోగ్యశ్రీ, ఫేక్ ఇన్సూరెన్స్ పేరిట గేమింగ్ ఫ్రాడ్స్..ఆన్లైన్ గేమింగ్, కలర్ కోడింగ్ ఆన్లైన్ రమ్మీ, స్పిన్నింగ్ వీల్ పేరిట సైబర్‌మోసం. లాటరీ ఫ్రాడ్స్..ఆన్లైన్లో లాటరీ వచ్చిందని, మీ పేరిట భారీ డిస్కౌంట్ ఆఫర్ అంటూ.. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్..మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి మోసం..సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్..మీ ఇంటి పరిధిలో సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు ఆఫర్ ఉందని చెబుతారు. ఐవీఆర్ కాల్స్‌తో మోసం: మీరు అనుమానాస్పద నంబర్లకు ఫోన్లు చేశారని, మీ సిమ్‌కార్డు కొద్ది సమయంలోనే బ్లాక్ అవబోతుందని, ట్రాయ్, టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ల పేరిట ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్‌చేసి బెదిరించి మోసాలు.. కేవైసీ అప్డేషన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఆధార్‌తో లింకేజీ చేయడం, కార్డు యాక్టివేషన్, కార్డు లిమిట్ పెంచడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, రివార్డు పాయింట్లు డబ్బుగా మార్చుకోవాలని.. ఇలాంటి అంశాలతో మోసగిస్తారు. ఓఎల్ఎక్స్లో వస్తువులు అమ్ముతామని, లేదంటే కొంటామని నకిలీ అడ్రస్‌లు, ప్రూఫ్‌లతో మోసగిస్తారు.ఫోన్ నంబర్ ఇవ్వడమే తప్పు సాధారణంగా దొంగలు ఇంట్లోకి రాకుండా పెద్ద, పెద్ద తాళాలు వేస్తాం.. ఇంటికి నాలుగు మూలల సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటాం..అవసరమైతే కుక్కలను పెంచుకుంటాం. కానీ, కనిపించని సైబర్ దొంగల చేతికి మాత్రం ‘సమాచారం’అనే తాళాలు మనమే ఇస్తున్నాం. మందుల దుకాణం, సూపర్ మార్కెట్, మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు ఇలా ఎక్కడపడితే అక్కడ అవసరానికి మించి మన ఫోన్ నంబర్‌ను ఇస్తున్నాం. కొన్నిసార్లు అనివార్యంగా కూడా మన వివరాలు ఇవ్వక తప్పడం లేదు. ఇదే పెద్ద తప్పు అని గుర్తించాలంటున్నారు సైబర్ భద్రత నిపుణులు. ఇలా మనం ఇచ్చే సమాచారాన్ని కొన్ని సంస్థలు కాల్ సెంటర్లకు, థర్డ్‌పార్టీకి అమ్ముతున్నాయని మరవొద్దు. మన ఫోన్ నంబర్, పేరు తెలిస్తే మిగిలిన వివరాలు కనిపెట్టడం సైబర్ నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు.. సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు.గుడ్డిగా నమ్మొద్దు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, మీకు ఫలానా బ్యాంకు నుంచి ఆఫర్ ఉందని, మీకు లాటరీలు వచ్చాయని..ఇలా ఏదో ఒక సాకుతో వచ్చే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లోని వెబ్ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అప్రమత్తతే ఆయుధం అన్నది మరవొద్దు. సైబర్‌మోసగాళ్లు ఇచ్చే మోసపూరిత ప్రకటనలు, మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ను గుడ్డిగా నమ్మకుండా.. ఆలోచించి, నిర్ధారించుకోవాలి. -
ఎక్కడున్నా మొక్కపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు. పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ.. ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నీటి వాడకానికీ లెక్క ఉంటుంది.. మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్‌లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు. -
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు
ఇలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (Twitter) తన ప్రీమియం ప్లస్ ధరల పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచే ప్రపంచంలోనే చాలా దేశాల్లో ప్రీమియం ప్లస్ ధరలను పెంచిన ఎక్స్.. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ పెంచినట్లు వెల్లడించింది.ఇప్పటికే ప్రీమియం ప్లస్ (Premium Plus) ప్లాన్ ఎంచుకున్న వారు మినహా.. మిగిలినవారు కొత్త ధరల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యునైటెడ్ స్టేట్స్లో.. నెలవారీ ప్రీమియం ప్లస్ రేటు 16 డాలర్ల నుంచి 22 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో వార్షిక చందా కూడా 168 డాలర్ల నుంచి 229 డాలర్లకు చేరింది.భారత్‌లోనూ ఈ ప్రీమియం ప్లస్ ధరలు రూ. 1,300 నుంచి రూ. 1,750కి పెరిగింది. అంటే ఈ ధరలు 35 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. యాన్యువల్ సబ్స్క్రైబర్లు కూడా ఇప్పుడు 18,300 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధరల పెరుగుదలకు ముందు.. యాన్యువల్ సబ్స్క్రైబర్లు రూ. 13,600 మాత్రమే చెల్లించాల్సి ఉండేది.పెరిగిన ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ప్రీమియం ప్లస్ ధరలు పెరిగినప్పటికీ.. భారతదేశంలో బేసిక్, స్టాండర్డ్ ప్రీమియం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్లాన్స్ సబ్స్క్రైబర్లు మునుపటి మాదిరిగానే 243 రూపాయలు, 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోప్రస్తుత సబ్స్క్రైబర్ల ధరల నిర్మాణాన్ని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ 20 జనవరి 2025లోపు ప్రారంభమైతే, మీరు పాత ధరనే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత కొత్త రేటు వర్తిస్తుంది. సర్వీస్‌ల పెంపుదల కారణంగానే ధరల పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లు యాడ్-ఫ్రీ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. అంతే కాకుండా గ్రోక్ ఏఐ చాట్‌బాట్, రాడార్ వంటి కొత్త ఫీచర్లకు యాక్సెస్ చేయవచ్చు. -
ట్రంప్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా 'శ్రీరామ్ కృష్ణన్'ను నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్‌లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్‌గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.''దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు'' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks. Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a— Sriram Krishnan (@sriramk) December 22, 2024''శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.I am pleased to announce the brilliant Team that will be working in conjunction with our White House A.I. & Crypto Czar, David O. Sacks. Together, we will unleash scientific breakthroughs, ensure America's technological dominance, and usher in a Golden Age of American Innovation!…— Trump Posts on 𝕏 (@trump_repost) December 22, 2024ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్‌లో పనిచేయనున్నారు. -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్‌కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్‌బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్‌లోని పలు ఫుట్‌బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
ప్రపంచంలో ఇలాంటి రింగ్ మరోకటి లేదు!.. ఎందుకంటే?
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. వస్తువులు, ఎలక్ట్రానిక్స్ కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగ్బిడ్ (Rogbid) అనేక సంస్థ ఓ ప్రత్యేకమైన 'ఎస్ఆర్08 అల్ట్రా' పేరుతో స్మార్ట్ రింగ్ రూపొందించింది. ఇది ఇప్పటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రింగులకంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రోగ్బిడ్ రూపొందించిన స్మార్ట్ రింగ్ ఒక డిస్ప్లే కూడా కలిగి ఉండటం గమనార్హం. ఇలాంటి డిస్ప్లే కలిగిన రింగ్ మరొకటి లేదు అని సమాచారం. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటం మాత్రమే కాకుండా.. వివిధ సైజుల్లో కూడా లభిస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 20 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.రోగ్బిడ్ ఎస్ఆర్08 అల్ట్రా స్మార్ట్ రింగ్ టైటానియం అల్లాయ్ కేసింగ్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది చాలా దృఢంగా ఉంటుంది. దీని గురించి చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది వాటర్ ప్రూఫ్ రేటింగ్ పొందింది. కాబట్టి దీనిని 50 మీటర్ల లోతున్న నీటిలో వేసినా మళ్ళీ పనిచేస్తుంది.8.0 మీమీ వెడల్పు, 2.5 మిమీ మన్దమ్ కలిగిన ఈ రింగ్ బరువు 4 గ్రాములు మాత్రమే. ఇది ప్రత్యేక యాప్ ద్వారా ఐఓఎస్, ఆండ్రాయిడ్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రింగులోని ఓఎల్ఈడీ డిస్ప్లేను ట్యాప్ చేస్తే టైమ్, స్టెప్ కౌంట్, హార్ట్ బీట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపిస్తుంది.ఇదీ చదవండి: మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్ రింగ్ ధర 89.99 డాలర్లు (సుమారు రూ. 7600), ఇది లిమిటెడ్ ఎడిషన్ న్యూఇయర్ గిఫ్ట్ బాక్స్‌లో వస్తుంది. ఈ రింగ్ కొనుగోలు చేయడానికి కంపెనీ అధికారిక వెబ్సైట్ సందర్సించాలి. ఈ రింగ్ కొనుగోలుపైన సంవత్సరం వారంటీ.. ఉచిత రీప్లేస్మెంట్ వంటివి కూడా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. -
మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్
రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూసినప్పటి నుంచి.. చాలా మందికి రోబోలు మనిషిలాగే ప్రవర్తిస్తాయా? అనే అనుమానం వచ్చింది. అయితే రోబోలు మనుషులను మించిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నట్లు, కొన్ని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మనిషిలా నడిచే ఒక రోబో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సారథ్యంలో టెస్లా.. కార్లను మాత్రమే కాకుండా.. రోబోలను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి రోబోలు మనిషి మాదిరిగానే నడుస్తున్నాయి. వీడియోలో గమనిస్తే.. ఒక రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతూ.. కొంత తడబడింది. అంతలోనే కంట్రోల్ చేసుకుని కిందకి పడిపోకుండా.. మెల్లగా దిగడం చూడవచ్చు.ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని నెమ్మదిగా దిగటమే కాకుండా.. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని కూడా రోబో ఎక్కడం కూడా చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రోబోలు మనుషుల్లా ప్రవర్తించే రోజులు వచేస్తున్నాయని స్పష్టంగా అవగతమవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tesla (@teslamotors) -
#Men Too: నిఖితా సింఘానియా కుటుంబం అరెస్ట్
బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34) కేసు కీలక మలుపు తిరిగింది. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను ఆదివారం ఉదయం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అతుల్ భార్య నికితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మరో పోలీసు అధికారి ధృవీకరించారు.#AtulSubhash's wife Nikita Singhania, her mother & brother arrested by Karnataka Police. pic.twitter.com/sTB98N2XTN— Mr Sinha (@MrSinha_) December 15, 2024ఇదిలా ఉంటే.. తన సోదరుడు అతుల్ సుభాష్ అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు బికాస్ కుమార్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆదివారం ఉదయం వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే, కేసు విచారణ నిమిత్తం మూడు రోజుల్లోగా హాజరుకావాలని నిందితులకు బెంగళూరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్పూర్ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో బికాస్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం అతుల్ సుభాష్ భార్య,అత్త,బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!
ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని లక్ష్యంతో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?ఏఐపై మస్క్ వ్యాఖ్యలుఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.The crazy thing is that they thought I was crazy for stating this super obvious predictionpic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024 -
ఐదు లక్షల మందితో భారత్ బ్యాటరీ షో!
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లువ్యాపార విస్తరణపై ఎల్అండ్టీ ఫైనాన్స్ దృష్టిఎల్అండ్టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది. -
వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇదిగో రికవరీ టిప్స్..
స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో.. తెలియకో చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు లేదా ఇష్టమైనవారితో చేసిన చాటింగ్ కూడా ఉండొచ్చు. అలాంటిప్పుడు బాధపడటం మానేసి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే డిలీట్ అయిన చాట్ మొత్తం తిరిగి పొందవచ్చు.వాట్సాప్ చాటింగ్ రికవరీ➤ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత అక్కడ కనిపించే ఆప్షన్లలో 'సెట్టింగ్స్' ఆప్షన్ ఎంచుకోవాలి.➤సెటింగ్స్ మీద క్లిక్ చేసిన తరువాత 'చాట్స్'పైన క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజీని.. కొంచెం స్క్రోల్ చేస్తే.. అక్కడ 'చాట్ బ్యాకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.➤చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తరువాత బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ వెనక్కి వస్తాయి.ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు వినియోగదారులు తమ చాట్లను గూగుల్ డ్రైవ్‌కు బ్యాకప్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్ల కోసం ఐక్లౌడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాకప్ స్టార్ట్ చేయడానికి ముందే.. గూగుల్ డిస్క్‌లో తగినంత స్టోరేజ్ ఉందా? లేదా అని నిర్థారించుకోండి. -
వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..
ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత సమయం వస్తుంది? మహా అయితే ఒక రోజు.. నెల లేదా సంవత్సరం అనుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యాటరీ అయితే వేల సంవత్సరాలు పాటు పనిచేస్తుంది. ఇంతకీ ఆ బ్యాటరీ పేరు ఏంటి? ఎవరు రూపొందించారు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రెండు బ్రిటీష్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇంజనీర్ల బృందం ఒక అద్భుతమైన బ్యాటరీని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 'కార్బన్-14 డైమండ్ బ్యాటరీ'. ఇది వేల సంవత్సరాల పాటు తక్కువ మొత్తంలో శక్తిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.బ్యాటరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి.. డైమండ్‌లో నిక్షిప్తం చేసిన కార్బన్-14ని ఉపయోగిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పేర్కొంది. కార్బన్-14 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. అయితే ఇది విద్యుత్తును తయారు చేయడానికి ఫోటాన్లకు బదులుగా.. ఐసోటోప్ ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రాన్లను ఉపయోగిస్తుంది.కార్బన్-14 జీవితకాలం 5,700 సంవత్సరాల కంటే ఎక్కువ. బహుశా ఇన్ని సంవత్సరాలు మనగలిగే బ్యాటరీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ కార్బన్ 14 బ్యాటరీని అంతరిక్ష పరిశోధనలలోని ప్లానెటరీ రోవర్లకు శక్తినివ్వడానికి, నీటి అడుగున ఏర్పాటు చేసే సెన్సార్లలో, పేస్మేకర్లకు శక్తినివ్వడానికి, ఇంప్లాంట్ చేయదగిన వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే పరికరాలలో ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు.💎Scientists and engineers from the UK Atomic Energy Authority (@UKAEAofficial) and the University of Bristol (@BristolUni) have successfully created the world’s first carbon-14 diamond battery.This new type of battery has the potential to power devices for thousands of years,… pic.twitter.com/Kquxpn1PHA— UK Atomic Energy Authority (@UKAEAofficial) December 4, 2024 -
అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా ఫోన్లలో పాత గేమ్స్ అన్నీ కనుమరుగయ్యాయి. ఇందులో ఒకటి.. ఒకప్పుడు అందరికీ ఇష్టమైన 'స్నేక్ గేమ్'. నోకియా ఫోన్ ఉపయోగించిన ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. 4జీ, 5జీ ఫోన్లు రానప్పుడు ఎంతోమంది ఫేవరేట్ గేమ్ కూడా ఇదే. ఆ గేమ్ మళ్ళీ వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బ్రిటీష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్.. ఐకానిక్ స్నేక్ గేమ్‌ను నథింగ్ హోమ్ స్క్రీన్ విడ్జెట్‌గా తీసుకొచ్చింది. దీనిని నథింగ్ కొత్త కమ్యూనిటీ విడ్జెట్ల యాప్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లేటెస్ట్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌తో సహా ప్రతి నథింగ్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.నిజానికి ఈ స్నేక్ గేమ్‌ను మొట్టమొదట నథింగ్ యూజర్ రాహుల్ జనార్ధనన్ ఒక కాన్సెప్ట్‌గా ప్రారభించారు. దీనితో పాటు మరో తొమ్మిది కాన్సెప్ట్‌లను రూపొందించి.. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. జనార్దనన్ కాన్సెప్ట్‌లు కంపెనీ దృష్టిని ఆకర్షించింది. దీంతో రూపొందించడానికి నథింగ్స్ సాఫ్ట్వేర్ బృందం కమ్యూనిటీ డెవలపర్‌తో భాగమయ్యారు.ఈ స్నేక్ గేమ్ 26 సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పామును కంట్రోల్ చేయడానికి నోకియా ఫోన్లో బటన్స్ ఉండేవి. ఇప్పుడు ఫోన్లలో బటన్స్ లేవు, కాబట్టి పాము కదలికను కంట్రోల్ చేయడానికి డైరెక్షనల్ వైపు టచ్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చూడటానికి విడ్జెట్‌పై రెండుసార్లు నొక్కాలి.Snake just got a reboot. Head to Google Playstore to get involved. pic.twitter.com/9MVKM1yKBc— Nothing (@nothing) December 4, 2024 -
ఇండియాలో తొలి AI అమ్మ - వీడియో చూశారా?
ఇప్పటి వరకు ఏఐ టీచర్, ఏఐ యాంకర్, ఏఐ ఉద్యోగుల గురించి చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏఐ అమ్మ (ఏఐ మదర్) 'కావ్య మెహ్రా' (Kavya Mehra) వచ్చేసింది. ఈమెను భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ప్రారంభించింది.కావ్య మెహ్రా కేవలం డిజిటల్ అద్భుతం మాత్రమే కాదు, టెక్నాలజీలో ఓ విప్లవాత్మక శక్తి. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో.. మొట్ట మొదటి ఏఐ మదర్ పుట్టింది. ఈమెకు (కావ్య) ఇన్‌స్టాగ్రామ్‌లో 300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారితో మాతృత్వంపై తన ఆధునిక టెక్నాలజీని షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కావ్య మెహ్రా సృష్టికర్తలు ప్రకారం.. కావ్య వ్యక్తిత్వం నిజమైన తల్లుల నిజ జీవిత అనుభవాల ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఈమె కేవలం డిజిటల్ అవతార్ మాత్రమే కాదు.. ఆధునిక మాతృత్వ స్వరూపం అని అన్నారు. మానవ అనుభవంలోని చాలా విషయాలు ఈమె మిళితం చేసుంటుందని వివరించారు. View this post on Instagram A post shared by Kavya Mehra (@therealkavyamehra) -
2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది. బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. » 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది. » 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది. » ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. » 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2048 నాటికి 12% పడకలు పెరుగుదలటైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్‌లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి. ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. -
వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి
టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్‌ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్‌లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్‌ను షేర్ చేశాడు. బాధితుడు యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్‌లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.👉స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 👉షేర్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. -
ఇండియన్ వెర్షన్ మోనాలిసా: మీరే పేరు పెట్టండి
లియోనార్డో డా విన్సీ (Leonardo da Vinci) కుంచె నుంచి జాలువారిన 'మోనాలిసా' చిత్రానికి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్.. ఏఐ టెక్నాలజీని సాయంతో భారతీయ సంప్రదాయాన్ని ఆపాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ రిషి పాండే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి.. మోనాలిసా చిత్రాన్ని చెవి దుద్దులు, మెడలో నెక్లెస్, తలపై దుపట్టా వంటి వాటితో అలంకరించాడు. ఇండియన్ వెర్షన్ మోనాలిసా రూపొందించాను. దీనికి పేరు పెట్టండి అని సోషల్ మీడియాలో వెల్లడించాడు.ఈ ఫోటో చూసిన నెటిజన్లలో కొందరు స్పందిస్తూ.. షోనాలిసా, మోనా తాయ్, లిసా బెన్ వంటి పేర్లను సూచించారు. చిత్రంలో ఉన్న మోనాలిసా.. త్రీ ఇడియట్స్ సినిమాలోని కరీనా కపూర్ హైపర్‌లూప్ క్లోన్ వెర్షన్ లాగా ఉందని మరొకరు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ ఫోటో కంటే ఇదే చాలా అందంగా ఉందని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలను రూపొందించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ టెక్నాలజీ సాయంతో పారిశ్రామిక వేత్తల ఫోటోలను, రాజకీయ నాయకుల ఫోటోలను, క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఫోటోలను కూడా రూపొందించారు. ఇప్పుడు ఏకంగా మోనాలిసా.. ఇండియన్ వెర్షన్ మొనాలిసాగా కనిపించింది.I made the Indian version of Mona Lisa using AI.Give her a name🫶 pic.twitter.com/ozcG5EigvF— Rashi Pandey (@rashi__pandey_) November 26, 2024 -
ఏఐ గర్ల్‌ఫ్రెండ్ వెరీ డేంజర్ గురూ!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఏఐతో భావోద్వేగ బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, అది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదానికి దారి తీస్తుందని అన్నారు.ఒంటరిగా ఉన్న వారికోసం రూపొందించిన ఏఐ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ యువతను ఆకర్షిస్తున్నాయి. వీటికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవారు మునుపటికంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఎరిక్ స్మిత్ హెచ్చరించారు.Eric Schmidt says AI girlfriends could capture the minds of young men, who already risk maladjustment due to lower educational attainment and a reduction in traditional employment paths pic.twitter.com/m8RrM24KD4— Tsarathustra (@tsarnick) November 24, 2024ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే హోస్ట్ చేసిన పోడ్కాస్ట్లో.. ఏఐ చాట్బాట్లపై ఎరిక్ స్మిత్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి లేదా సరదా కోసం యువత ఏఐని ఆశ్రయిస్తున్నారు. చూడటానికి అందంగా ఉన్న ఏఐ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ వారిని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ కారణంగానే వాటితోనే గంటల తరబడి సమయాన్ని గడిపేస్తారు. దీంతో వారు బాహ్య ప్రపంచానికి దూరమైపోతారని స్మిత్ అన్నారు.ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?12 నుంచి 13 సంవత్సరాల పిల్లలు వీటికి చాలా తొందరగా కనెక్ట్ అవుతున్నారు. వారి ఆలోచనలను కూడా ఏఐ కంట్రోల్ చేస్తోంది. చివరికి వారు ఏఐతో ప్రేమలో పడటం.. సూసైట్ చేసుకోవడం వంటివి కూడా చేస్తారు. ఫ్లోరిడాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించిన తర్వాత తన ప్రాణాలను తీసుకున్న విషాదకరమైన కేసు కూడా వెలుగులోకి వచ్చింది.AI girlfriends are too perfect, which may make young men unable to extricate themselves and go to extremesIn 2024, modern people are not only looking for true love on online dating apps, but also some people are sculpting their own perfect girlfriends through AI and developing… pic.twitter.com/LNPMhRLZRB— Mina Stephen (@IsaaSouzaa15) November 28, 2024 -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.హ్యాకర్లు.. మీ అనుమతి లేకుండానే మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంది. మొబైల్ హ్యాక్ చేస్తే.. డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్పత్తులను (మొబైల్స్, ట్యాబ్స్, మ్యాక్స్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.CERT-In యాపిల్ ఉత్పత్తులను ప్రభావితం చేసే రెండు బలహీనతలను గుర్తించింది. అవి ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS). వీటిని వాడుకొని సైబర్ నేరగాళ్లు మీ మొబైల్స్ హ్యక్స్ చేస్తారు.ఇదీ చదవండి: దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..18.1.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. అలాగే 17.7.2కి ముందు యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. 15.1.1కి ముందు వెర్షన్స్ అయిన యాపిల్ మ్యాక్ఓఎస్ సుక్వోయా, 2.1.1కి ముందున్న యాపిల్ విజన్ఓఎస్, 18.1.1కి ముందు ఉన్న యాపిల్ సఫారీ ఉత్పత్తులను హ్యాకర్స్ సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, సరికొత్త సాఫ్ట్వేర్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. -
పర్ఫెక్ట్ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్ఫెక్ట్ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్న ప్రదేశంలో వివిధ రకాల వాహనాలు ఉండటం చూడవచ్చు. అయితే ఇవన్నీ రిమోట్ ద్వారా పనిచేసే బొమ్మ వాహనాలను. వీటిని అక్కడే నిలబడి ఉన్న యువకులు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి కదులుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ వాహనాలన్నీ బ్రిడ్జ్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సండే పర్ఫెక్ట్ రీక్రియేషన్ అంటూ ట్వీట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికే రెండు వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Perfect recreation on a #Sunday Can we create something like this out here @MahindraTrukBus @Mahindra_CE ??pic.twitter.com/DqJmTqKkpa— anand mahindra (@anandmahindra) November 24, 2024 -
జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండి
టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా పనులు సులభమైపోతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలామంది ఉద్యోగార్థులు జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మోసపోవడానికి కూడా ఆస్కారాలు చాలానే ఉన్నాయి. కాబట్టి దీని నుంచి బయట పడటానికి కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.ఉద్యోగం వెతుక్కోవడం కోసం చాలామంది లింక్డ్ఇన్ను ఆశ్రయిస్తారు. ఇది జాబ్స్ సెర్చ్ చేసుకోవడానికి విశ్వసనీయమైన స్థలం అయినప్పటికీ.. కొంత మంది తప్పుడు ప్రకటనలతో మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లింక్డ్ఇన్ ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' పేర్కొన్నారు. లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి మోసాలను నివారించడానికి మా బృందం పనిచేస్తోందని కూడా అన్నారు.జాబ్ సెర్చ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు➤ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో.. మీకు కనిపించే ఉద్యోగ పోస్టింగ్‌పై ధృవీకరణ బ్యాడ్జ్ అనేది ఉందా? లేదా? అని గమనించాలి. పోస్టర్ అధికారిక కంపెనీ పేజీతో అనుసంధానించి ఉంటే అలాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ధృవీకరణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.➤మీరు ఒక ఉద్యోగాన్ని వెతుకుతున్న సమయంలో బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారంటే.. అలాంటి వివరాలను చెప్పకపోవడమే ఉత్తమం.➤ఇంటర్వ్యూ కోసం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయమని అడగడం లేదా తక్కువ పనికి అధిక వేతనంతో ఉద్యోగాలను అందించడం వంటివి చెబితే అస్సలు నమ్మకూడదు. చట్టబద్దమైన సంస్థలు ఎప్పుడూ ఇలాంటి విషయాలను చెప్పదని గుర్తుంచుకోవాలి.➤ఉద్యోగం కోసం ఎవరైనా మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తే.. క్రిప్టోకరెన్సీని, గిఫ్ట్ కార్డ్‌లను పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడగడం పట్ల జాగ్రత్తగా ఉండండి. జాబ్ ఇచ్చే కంపెనీలు మీ నుంచి డబ్బు ఆశించదు.➤కంపెనీల అధికారిక లింక్డ్ఇన్ పేజీలలో ఉద్యోగాలను వెతుక్కోవడం మంచిది. జాబ్ పోస్టర్లతో కంపెనీలు పోస్ట్ చేసిన ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా సెర్చ్ చేయడానికి ఫిల్టర్ వంటివి ఎంచుకోవచ్చు. ఇది ఎంచుకుంటే.. వెరిఫికేషన్లతో కూడిన జాబ్‌లు మాత్రమే మీ శోధన ఫలితాల్లో కనిపిస్తాయి. -
మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్
అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.రిలయన్స్ జియో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.భారతదేశ టెలికామ్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్‌లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి. -
వీడియో గేమ్స్ చరిత్ర తెలుసా?
పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారుఅయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా? -
వాట్సప్ కొత్త ఫీచర్: దీని గురించి తెలిస్తే..
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్‌లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
ఆర్బీఐ హెచ్చరిక: అలాంటివి నమ్మకండి
డీప్‌ఫేక్ వీడియోలు తెరమీదకు వచ్చిన సంఘటనలో గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ వీడియోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెట్టుబడి పథకాలను ఆర్బీఐ తీసుకొస్తున్నట్లు, అలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని, దీనిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వదు, కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను నిజమని నమ్మితే తప్పకుండా మోసపోతారు. డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు.. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu— ReserveBankOfIndia (@RBI) November 19, 2024 -
క్రియేటివిటీ ఉంటే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivationpic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024 -
జొమాటో కొత్త యాప్ లాంచ్: ఇదెలా ఉపయోగపడుతుందంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' ఎట్టకేలకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం డిస్ట్రిక్ట్ (District) పేరుతో ఓ కొత్త యాప్ లాంచ్ చేసింది. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసింది. దీనికోసం జొమాటో రూ. 2048 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్‌లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!
మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్.. ఇలా వేటికైనా సరే పాస్వర్డ్ తప్పనిసరి. ఎందుకంటే మన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే సెక్యూరిటీ అవసరం. దీనికోసమే పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది సింపుల్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం కఠినమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. నార్డ్‌పాస్ అనే కంపెనీ 2024లో ఎక్కువమంది సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడిస్తూ.. జాబితాను కూడా విడుదల చేసింది.ఎక్కువమంది ఉపయోగించే పాస్వర్డ్లు→123456→123456789→12345678→Password→Qwerty123→Qwerty1→111111→12345→Secret→123123నార్డ్‌పాస్ కార్పొరేట్ పాస్‌వర్డ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఆఫీసుల్లో ఉపయోగించే పాస్వర్డ్లు మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ జోన్లలో కూడా ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను వెల్లడించింది.కార్పొరేట్ పాస్వర్డ్లు→123456→123456789→12345678→secret→password→qwerty123→qwerty1→111111→123123→1234567890వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను, కార్పొరేట్ పాస్‌వర్డ్‌లను గమనిస్తే.. ఈ రెండూ కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లనే.. ఆఫీసుల్లో కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్స్ సులభంగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాల్సిన అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తోన్న అంబానీ కూతురు.. -
ఓపెన్ఏఐ చేతికి రూ.126 కోట్ల డొమైన్
ఓపెన్ఏఐ పురాతన డొమైన్ పేర్లలో ఒకటైన 'చాట్.కామ్'ను హబ్స్పాట్ ఫౌండర్ 'ధర్మేష్ షా' నుంచి 15 మిలియన్లకు (సుమారు రూ.126 కోట్లు) కొనుగోలు చేసింది. మార్చిలో ధర్మేష్ షా చాట్.కామ్ డొమైన్‌ను విక్రయించారు. అయితే అప్పట్లో దీనిని ఎవరికి విక్రయించారు అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.సెప్టెంబర్ 1996లో రిజిస్టర్ అయిన చాట్.కామ్ వానిటీ డొమైన్‌ను వానిటీ డొమైన్ అని కూడా పిలుస్తారు. దీనిని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ కొనుగోలు చేసినట్లు.. ధర్మేష్ షా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పుడు వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే.. అది చాట్‌జీపీటీకి వెళ్తుంది. సామ్ ఆల్ట్మాన్ కూడా తన ఎక్స్ ఖాతాలో చాట్.కామ్ అని పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని.. ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఓపెన్ఏఐ చాట్.కామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. చాట్.కామ్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారు అనేది సామ్ ఆల్ట్మాన్ అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!నిజానికి వానిటీ డొమైన్లు చాలా విలువైనవి. ఎందుకంటే.. చిన్నవిగా ఉండటం వల్ల ఉచ్చరించడానికి మాత్రమే కాకుండా, గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యూజర్లు ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుని సెర్చ్ చేస్తారు. దీనివల్ల ఇలాంటి డొమైన్స్ ధర కొంత అధికం.BREAKING NEWS: Secret acquirer of $15+ million domain chat .com revealed and it's exactly who you'd think.For those of you that have been following me for a while, you may recall that I announced earlier this year that I had acquired the domain chat .com for an "8 figure sum"… https://t.co/nv1IyddP5z— dharmesh (@dharmesh) November 6, 2024 -
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు. -
ఇన్‌స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది.. ఇతరుల ఆధార్ కార్డు నెంబర్‌ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తారు. అసలు ఆ వ్యక్తికే తెలియకుండా ఈ చర్య జరిగిపోతుంది. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే.. మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడటానికి కేంద్రం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మాస్క్డ్ ఆధార్ కార్డుసాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు ఉన్న ఎనిమిది అంకెలకు మాస్క్ ఉంటుంది. అంటే.. ఆ ఎనిమిది నెంబర్లు కనిపించవన్నమాట. దీనిని ఉపయోగించడం వల్ల ఇతరులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?•మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక UIDAI వెబ్సైట్ ఓపెన్ చేయాలి.•వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి.•తరువాత 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని కింద ప్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.•ఆలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అక్కడ మాస్క్డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.•ఆలా చేసిన తరువాత మీకు మాస్క్డ్ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దీనిని పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరికపాస్వర్డ్ ఏమిటంటే•మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అయిన తరువాత పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాలి.•పాస్వర్డ్ ఏమిటంటే.. ఉదాహరణకు మీ పేరు RAGHURAMARAJU అనుకుందాం. మీరు పుట్టిన సంవత్సరం 1994 అనుకుంటే..•మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపితే అదే పాస్వర్డ్ (RAGH1994) అవుతుంది. దీనిని ఉపయోగించి మాస్క్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. -
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..
50 వేలు కట్టండి.. లక్ష రూపాయలు ఇస్తాం.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి మీ డబ్బులు డబుల్ త్రిపుల్ అవుతాయి.. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. ఇంత డబ్బులు చెల్లించకపోతే జైలు ఊసలు లెక్కపెడతారు..! మీ మొబైల్‌కి ఓటీపీ వచ్చిందా? అయితే ఇక్కడ టైప్ చేయండి లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..! ఈ ఆన్లైన్ గేమ్ ఆడితే రోజుకు 50 వేలు సంపాదించవచ్చు.. ఓ సారి ట్రై చేయండి..! ఇవన్నీ మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో విన్న మాటలు. ఇవి నమ్మినవాళ్లు ఇప్పటికీ చాలా డబ్బులే పొగొట్టుకోని ఉంటారు.గతంలో సైబర్ ఫ్రాడ్ అంటే ఏదో న్యూస్‌లో వస్తే విన్న సందర్భాలే కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మోసాల బాధితులు మన పక్కనే కనిపిస్తారు.. మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో కేటుగాళ్ల వలలో చిక్కుకుని మన దగ్గర లబోదిబోమని బాధపడిన సందర్భాలు ఎక్కువే ఉండి ఉంటాయి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ లెక్కలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటిపడుతున్నాయి.త్వరలోనే సైబర్ ఫ్రాడ్ మోసాల ఎకానమీ సైజు...ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటాయట. ఇది పోలీసులతో పాటు అనేకమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న వాస్తవం! ఏంటి నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే లెక్కలు వింటే మీకే అర్థమవుతోంది.రోజుకు 15,000 సైబర్ మోసాలుప్రతి 6 సెకన్లకు ఒకటి.. నిమిషానికి 10.. రోజుకు 15,000.. ఏడాదికి 50లక్షలు.. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కుకోని విలవిలలాడుతున్నడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోని వెళ్లాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ ఫ్రాడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ పౌరులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రతిరోజూ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని మొదటి ఐదు సైబర్ ఫ్రాడ్ బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక 2022లో అయితే సైబర్ ఫ్రాడ్ కేసుల్లో తెలంగాణ టాప్ పొజిషన్లో నిలిచింది. 96శాతం సైబర్ నేరాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇందులో మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం, ఇతరులతో పాటు మోసగాళ్లతో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లాంటివి చేయడం కారణంగానే సైబర్ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది.ఏడాదికి లక్షల కోట్లుసైబర్ క్రైమ్ మోసాల డబ్బుల లెక్కలు ఏడాదికి లక్షల కోట్లు దాటుతుంది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల మాట. 10.5 ట్రిలియన్ డాలర్స్ అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 87 లక్షల కోట్లు. అంటే USA, చైనా తర్వాత ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది సమానం. ఇక అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్-3లో ఉంది.2023లో ఆన్లైన్ స్కామ్స్‌లో భారత్ భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్ దాడులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ఏరియాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాల్లోనే రికార్డయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డవని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్‌స్టేషన్ గడప వరకు రాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.సైబర్ నేరాలకు హాట్స్పాట్లుముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి, కేసుల్లో దాదాపు 40శాతం సిటీస్ నుంచే రికార్డవుతున్నాయి. అయితే అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలనే కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూర్లు, టౌన్స్ నుంచి సిటీలకు చదువు కోసం ఉద్యోగాల కోసం వచ్చేవారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే విలేజ్ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుందట. అందుకే మోసగాళ్ల ట్రాప్‌లో చిక్కుకుని వీరంతా బలైపోతున్నారు.నకిలీ క్రిప్టోకరెన్సీ పాత్రసైబర్ ఫ్రాడ్ కేసుల్లో నకిలీ క్రిప్టోకరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని.. అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపెడతారు.. ఆ తర్వాత మొత్తం దోచుకుంటారు. ఇక KYC అప్డేట్ మెయిల్ లింక్స్, వాట్సాప్‌లో ఇన్స్టాంట్ లోన్ మెసేజీలు పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఇక బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలను డూప్ చేస్తూ నకిలీ ఇమెయిల్స్ పంపుతారు. ఆ మెసేజీలు అచ్చం బ్యాంక్‌వారు పంపినట్టే ఉంటాయి.. లోగో కూడా వారిదే ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న లింకులు క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్‌కు గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్లు నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రమికవేత్తలు డిజిటల్ అరెస్టుల ఫ్రాడ్లకు చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.డిజిటల్ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్లో సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు సెటప్ ఉంటుంది. నేరుగా డూప్ సీజేఐ మాట్లాడతారు..! కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతి, కష్టపడి సంపాదించుకున్నదంతా క్షణకాలంలో ఆవిరైపోతుంది. బతుకులను వీధిపాలు చేస్తుంది, ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. మీ పిల్లలను, తల్లిదండ్రులను దిక్కులేనివారిని చేస్తుంది..! సో బీకేర్ ఫుల్. -
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సెప్టెంబర్ నెలలో భారతదేశంలోని 85 లక్షల కంటే ఎక్కువ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఇందులో సుమారు 16,58,000 ఖాతాలపైన ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఐటీ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకుంది.భారతదేశంలో సుమారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నియమాలకు ఉల్లంఘించిన ఖాతాదారుల అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు నిషేధిస్తూ ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో భారీగా సంఖ్యలో ఖాతాలను నిషేధించింది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేయడం.. వంటి చర్యలకు పాల్పడిన యూజర్లపైన వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేదించింది. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కూడా నియమాలను అతిక్రమించిన వారి ఖాతాలను వాట్సాప్ తొలగించనున్నట్లు స్పష్టమవుతోంది. -
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్‌బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఆన్లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్లకు ముందస్తు యాక్సెస్‌తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్‌ల ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనమోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
మొక్కలు నాటే రోబో.. ఎప్పుడైనా చూశారా? (వీడియో)
జంతువు ఆకారంలో ఉన్న ఈ బుల్లివాహనం ఆటబొమ్మ కాదు, రోబో. అలుగు ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంగ్లండ్‌లోని సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోకు రూపకల్పన చేశారు.వెనుక వైపు రెండు చక్రాలు, ముందువైపు అలుగు కాళ్లలాంటి కాళ్లు, మిగిలిన భాగమంతా అలుగు శరీరాన్ని తలపించేలాంటి లోహపు రేకుల అమరికతో ‘ప్లాంటోలిన్’ పేరుతో దీనిని తయారు చేశారు. అడవులు నరికివేతకు గురైన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటే ఉద్దేశంతో దీనిని రూపొందించారు.ఈ రోబో ముందువైపునున్న కాళ్లతో మట్టిని తవ్వేస్తుంది. మధ్యనున్న భాగం విత్తనాలను నాటుతుంది. విత్తనాలను నాటాక, కాళ్లతో మట్టిని తిరిగి కప్పేస్తుంది. నరికివేతకు గురైన అటవీ ప్రాంతాల్లో వేలాదిగా మొక్కలను నాటడం మనుషులకు చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమను తగ్గించడానికే సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ రాబర్ట్ సిద్దాల్, డోరతీ ఈ ‘ప్లాంటోలిన్’ రోబోను తయారు చేశారు. -
పవర్ బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఇంకేంటో తెలుసా?
చూడటానికి పవర్బ్యాంకులా ఉంటుంది గాని, ఇది ఫ్రిజ్ ప్యూరిఫైయర్. ఈ పరికరం ఫ్రిజ్‌లో భద్రపరచిన ఆహారం మరింత కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఫ్రిజ్‌లోని ఆహారంపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధిస్తుంది. ఇటాలియన్ కంపెనీ ‘విటెసీ’ ఇటీవల ఈ బుల్లి పరికరాన్ని ‘షెల్ఫీ’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.ఇందులోని అడ్వాన్స్డ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో పనిచేసే సెన్సర్లు ఫ్రిజ్‌లోని ఆహారంపై చేరిన సూక్ష్మజీవులను గుర్తించి, వాటిని క్షణాల్లోనే నాశనం చేస్తాయి. ఆహార వృథాను అరికట్టే ఉద్దేశంతోనే ఈ పరికరాన్ని రూపొందించినట్లు ‘విటెసీ’ కంపెనీ చెబుతోంది.ఈ పరికరం రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఫ్రిజ్‌లో భద్రపరచిన కూరగాయలు, పండ్లు, పాలు వంటివి ఎక్కువకాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ పరికరాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలు మరింతకాలం సురక్షితంగా ఉంటాయి. దీని ధర 179.99 డాలర్లు (రూ.15,126). -
డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..
జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్.. ఇన్నోసియన్ బెర్లిన్ కలిసి 'కామ్‌డోమ్' (Camdom) యాప్ ప్రారంభించాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్లను నిలిపివేయడానికి బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.డిజిటల్ కామ్‌డోమ్ యాప్ అనేది.. ప్రైవేట్ సమయాల్లో వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎదుటి వ్యక్తి కాల్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ వంటివి చేయకుండా నిరోధిస్తుంది. ఒకవేళా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ వస్తుంది.చాలామంది మీరు వీడియో కాల్ లేదా ఆడియో కాల్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ డిజిటల్ కామ్‌డోమ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగించవచ్చు. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి.ప్రస్తుతం ఈ యాప్ 30 కంటే ఎక్కువ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ యాప్ మన వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుందని యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా పేర్కొన్నారు. -
సన్నాలకు.. సాంకేతికత
సాక్షి, సిద్దిపేట: సన్న బియ్యాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. రాష్ట్రంలో సన్న రకాల ధాన్యం సాగు చేసిన రైతులకు మద్దతు ధరపై క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం నాణ్యత విషయంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు దొడ్డు, సన్న నిర్ధారణ ప్రమాణాలు పాటించకుండానే వడ్లను కొనుగోలు చేసింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. అందులో 40 శాతం వరకు సన్నాలు సాగు చేశారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని, ఇందుకోసం 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే చాలా వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించనున్నారు. 33 సన్న రకాలకు బోనస్ ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, డబ్లూయజీఎల్ –44, కేపీఎస్–2874, జేజీఎల్–27356, జేజీఎల్ 28545, డబ్ల్యూజీఎల్–14, డబ్ల్యూజీఎల్–32100, జేజీఎల్–11470, జేజేఎల్–384, ఆర్ఎన్ఆర్–2458, జేజీఎల్–384, జేజీఎల్–3828, తెలంగాణ సోనా, వరంగల్–1119, కేఎల్ఎం–1638, వరంగల్–962, రాజేంద్రనగర్, కేఎల్ఎం–733, జేజీఎల్–1798, జేజీఎల్3844, జేజీఎల్ 3855, జేజీఎల్–11118, ఎన్ఆర్ఎల్–34449, సుగంధ సాంబ, శోభిని, సోమనాథ్, ఆర్ఎన్ఆర్–31379, కేపీఎస్–6251, జేజీఎల్ 33124, హెచ్ఎంటీ సోనా, ఎంజీయూ–1224, ఎంటీయూ–1271 రకాలకు బోనస్ చెల్లించనున్నారు.బియ్యం గింజగా మార్చేందుకు ప్యాడిహస్కర్ వడ్లకున్న పొట్టును ఒలిచేందుకు ప్యాడిహస్కర్ యంత్రాలను అందజేస్తున్నారు. 20 వడ్ల గింజలను తీసుకుని ఈ యంత్రంలో పోసి తిప్పితే.. పొట్టూడిపోయి బియ్యం గింజలు బయటికొస్తాయి. పాత కాలంలో వడ్లను చేతితో నలిపేవారు. అప్పుడు వడ్ల నుంచి బియ్యం వచ్చేవి. ఇప్పుడు ప్యాడిహస్కర్ను వినియోగిస్తున్నారు. ఈ బియ్యం గింజలను సుమారు 10 గింజలను తీసుకుని అన్నింటిని ఒక్కొక్కటిగా గ్రెయిన్ కాలిపర్ మెషీన్లో పెట్టి కొలవనున్నారు.గ్రెయిన్ కాలిపర్ యంత్రాలు సన్నధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాలకు గ్రెయిన్ కాలిపర్ (డయల్ మైక్రోమీటర్) యంత్రాన్ని అందజేస్తున్నారు. దీంతో సన్నబియ్యం గింజ పొడవు, వెడల్పు కొలవనున్నారు. పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలని నిర్ణయించారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా నిర్దేశిత ప్రమాణాలుంటేనే కొనుగోలు చేయనున్నారు. ఇలా ఉన్న ధాన్యాన్నే సన్నాలుగా గుర్తించి వారికి క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందజేయనుంది. ఇప్పటికే ఈ యంత్రంపై కొనుగోలు కేంద్రాల వారికి అవగాహన కల్పించారు. సంచులకు కోడ్ సన్నాల సంచులకు ఎరుపు రంగు దారంలో కుట్టి.. వాటిపై ఎస్ అనే అక్షరం రాయనున్నారు. దొడ్డు రకానికి పచ్చ రంగు దారంతో కుట్లు వేయనున్నారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఓపీఎంఎస్ కోడ్‌ను రాయనున్నారు. మిల్లుకు చేరిన తర్వాత సైతం ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించనున్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మీటర్ సన్నాలు కొనుగోలు చేసే కేంద్రాలకు.. ఒక్కొక్క కేంద్రానికి ఒకటి గ్రెయిన్ కాలిపస్, ప్యాడిహస్కర్లను, ఓపీఎంఎస్ కోడ్లను అందించాం. ఇంకో 10 రోజులైతే సన్నాలు కొనుగోలు కేంద్రాలకు రానున్నాయి. సన్న వడ్ల సంచిలకు ఎస్ అనే అక్షరం సైతం రాయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సిద్దిపేట -
‘లైడర్’ వచ్చేస్తోంది
రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. తొలి దశలో 1,000 రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తోంది. సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 24సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. రైలు పట్టాలను తొలగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను పెట్టడం వంటి దుశ్చర్యలకు విద్రోహులు పాల్పడుతున్నారు. అలాంటి కుట్రలకు చెక్ పెట్టేందుకు రైలు పట్టాల భద్రత కోసం రైల్వే శాఖ లైడర్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఇప్పటికే పట్టాలు తప్పి జరిగే ప్రమాదాల నివారణ కోసం రూ.15 వేల కోట్లతో రైలు కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుకు రైల్లే శాఖ కార్యచరణ చేపట్టింది. దానికి అదనంగా లైడర్ ప్రాజెక్ట్‌కు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు సంక్లిప్తంగా...దేశవ్యాప్తంగా విస్తరణలైడర్ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మొదటి దశలో వెయ్యి రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు సైతం పిలిచింది. ఈ ప్రాజక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెన్సార్ టెక్నాలజీతో..» లైడర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండే సెన్సార్ టెక్నాలజీ రైలు పట్టాల త్రీడీ నమూనాలను రూపొందించి లోకో పైలెట్ కేబిన్‌లోకి పంపిస్తుంది. » రైళ్లలో ఏర్పాటు చేసే సెన్సార్లు రైలు పట్టాల రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. » రైలు పట్టాలు తప్పినా, పట్టాలు విరిగినా, పట్టాలపై చిన్న బీటలు ఉన్నా సరే వెంటనే గుర్తించవచ్చు. » లేజర్ బీమ్లతో రైలు పట్టాలను సెన్సార్ చేసి.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే గుర్తించే వీలు కలుగుతుంది.» ఆ ప్రమాదం ఎంత దూరంలో ఉందన్నది కూడా ఈ సాంకేతికత కచ్చితంగా తెలియజేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే కనీసం 15 కి.మీ. దూరంలోనే రైలును నిలిపివేసేందుకు లోకో పైలట్‌కు అవకాశం ఉంటుంది. -
జేబులో పట్టే హార్డ్‌డిస్క్: 1 టీబీ డేటా..
కంప్యూటర్లోని సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఇదివరకు ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్‌లు, డిజిటల్ వీడియో డిస్క్‌లు ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో సమాచారాన్ని భద్రపరచుకోవడానికి పెన్‌డ్రైవ్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి.పెన్‌డ్రైవ్‌ల సామర్థ్యానికి మించిన సమాచారాన్ని భద్రపరచుకోవడానికైతే ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు కొంచెం భారీగా ఉంటాయి. వీటిని తేలికగా జేబులో వేసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. అయితే, కొరియన్ డిజైనర్ జున్హో హాన్ అచ్చంగా కంప్యూటర్ డెస్క్టాప్పై కనిపించే ఫోల్డర్ ఆకారంలోని ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు.పాతకాలం ఫ్లాపీ డిస్క్ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్బీ-సీ పోర్ట్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
షైన్ 2.0: మడతపెట్టే టర్బైన్
పవనశక్తిని వాడుకోవాలంటే, భారీ విండ్ టర్బైన్లు అవసరమవుతాయి. గాలి బాగా వీచే ప్రదేశాన్ని చూసుకుని, ఒకచోట పాతిపెట్టాక వాటిని తరలించడం అంత తేలిక కాదు. అయితే ఈ తేలికపాటి విండ్ టర్బైన్ను మాత్రం ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట ఆరుబయట ఫ్యాన్ మాదిరిగా నిలిపి, దీని నుంచి విద్యుత్తును పొందవచ్చు.పిక్నిక్‌లలో టెంట్లు వేసుకున్నప్పుడు, టెంట్లకు కావలసిన విద్యుత్తును దీని ద్వారా పొందవచ్చు. కెనడియన్ కంపెనీ ‘ఆరియా టెక్నాలజీస్’ ఈ పోర్టబుల్ విండ్ టర్బైన్ను ‘షైన్-2.0’ పేరుతో రూపొందించింది. వాడకం పూర్తయ్యాక దీనిని చక్కగా మడిచి, సంచిలో వేసేసుకోవచ్చు.ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్‘షైన్–2.0’ టర్బైన్ 50 వాట్ల విద్యుత్తును ఇంటర్నల్ బ్యాటరీకి నిరవధికంగా అందిస్తుంది. ఈ విద్యుత్తు ఒక ఇంట్లో వాడుకునే విద్యుత్తు పరికరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. దీని ధర 399.99 కెనడియన్ డాలర్లు (రూ. 24,626) మాత్రమే! -
బొంగుతో డ్రోన్.. ఇదో కొత్తరకం
బొంగులో చికెన్ గురించి తెలుసు గాని, ఈ బొంగుతో డ్రోన్ ఏంటనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్నది బొంగుతో తయారైన డ్రోన్. సాధారణంగా యంత్రాల తయారీకి లోహాలను వాడతారు. బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్, ప్రోడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే రకం.సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో ఈ డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు.ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం. -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్‌జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్‌జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్‌జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!ఎక్స్పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024 -
‘టీఎంటీ’ విభాగంలో ఏఐ ప్రభావం
దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్‌వర్క్‌ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్‌ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్‌ఫోర్స్‌లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్వర్క్ ఆటోమేషన్‌పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలి. అందుకు హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు. -
ఏఐపై అతిగా ఆధారపడొద్దు: శక్తికాంత దాస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్‌దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!డిజిటలీకరణతో మనీ ట్రాన్స్ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ముగిసిన ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్’
రాయదుర్గం: ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్–2024 ముగిసింది. ఒక రోజు హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి 130 మంది సాంకేతిక నిపుణులు, డెవలపర్లు, వికీ మీడియా ప్రాజెక్ట్‌ల స్వచ్ఛంద సహకారులు పాల్గొన్నారు.ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీ మీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పోకడలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలోని లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మిట్ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీలలో టెక్నికల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. వికీమీడియా ఉద్యమం ద్వారా ఊహించిన విధంగా ఉచిత జ్ఞానం కోసం మిషన్‌ను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, వికీమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
వంటకాలను చిటికెలో చేసే 'రోబో చెఫ్'
ఇది రోబో చెఫ్. ఎలాంటి వంటకాలనైనా చిటికెలో వండి వడ్డిస్తుంది. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను రూపొందించింది. రెస్టరెంట్ నిపుణులు, ఏరోస్పేస్ ఇంజినీర్ల సంయుక్త కృషితో ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను విజయవంతంగా తయారు చేసింది.వంటగదిలోని ప్రతి పనిని ఇది స్వయంగా చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన 80 రకాల పదార్థాలు, దినుసులను ఉపయోగించి ఎలాంటి వంటకాన్నైనా సిద్ధం చేసేస్తుంది. ఇది వెయ్యి రకాల వంటకాలను వండి పెడుతుంది. వంటకం తయారైన తర్వాత తినేటంత వరకు తాజాదనం చెడకుండా ఉండేలా వేడి పదార్థాలను వేడిగాను, చల్లని పదార్థాలను చల్లగాను నిల్వచేసి ఉంచుతుంది.కార్పొరేట్ వంటగదుల్లోను, రెస్టరెంట్ల వంటగదుల్లోను, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్ వంటగదుల్లోను ఉపయోగించడానికి అనువుగా ఈ రోబో చెఫ్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో దీని పనితీరును ప్రదర్శించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల నుంచి దీని పనితీరుకు ప్రశంసలు లభించాయి. -
బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్
ఇది మామూలు హెల్మెట్ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్. ఈ హెల్మెట్ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ఈ హెల్మెట్‌ను ‘ఐ సింక్వేవ్’ పేరుతో రూపొందించింది.మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్ ప్యాచ్‌లు, జెల్ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.ఇది రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్లు (రూ. 41.04 లక్షలు). -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్‌కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ మొదలైనవారు ఉన్నారు.ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకాఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Beware of Scam Calls! Received a call from a 'CBI Officer' or any government official asking for sensitive details? It's a scam! Don't fall for it.Report any cybercrime at 1930 or https://t.co/pVyjABtwyF#I4C #CyberSafety #DigitalArrest #ReportScams #AapkaCyberDost pic.twitter.com/XBEJjKr6u0— Cyber Dost (@Cyberdost) October 5, 2024 -
'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ సంతతికి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య అగర్వాల్ కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం సమయం వృధా అంటూ ట్వీట్ చేశారు.చాలామంది తమ వద్ద పాత ఐఫోన్స్ స్థానంలో కొత్త ఐఫోన్స్ భర్తీ చేస్తున్నారు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధా అంటూ తన ఎక్స్ వేదికగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు మారినట్లు వెల్లడించారు. కొత్త ఫోన్ తనను చాలా నిరాశపరిచింది అన్నారు.ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 16 ప్రో మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పలేను, అయితే ఏఐ సామర్థ్యాల పరంగా ఐఫోన్ 15, 16 మధ్య ఎక్కడ తేడా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. కొత్త ఫోన్ సరిగ్గా సెట్ చేయడానికి తనకు 24 గంటల సమయం పట్టిందని అన్నారు. టెక్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఇందులో ఒకరు కేవలం యూఎస్బీ-సీ ప్లగ్ కోసం మాత్రమే మారానని చెప్పుకొచ్చారు. మరొకరు కూడా కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధానే అంటూ పేర్కొన్నారు.I "upgraded" from the iPhone 14 Pro to the iPhone 16 Pro.I literally cannot tell the difference. It took me 24 hours to set up the new phone properly etc. It just feels like a waste of time.And I do not understand where this "Apple Intelligence" is????— Aditya Agarwal (@adityaag) October 3, 2024ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ఈ నెలాఖరు నాటికి మరికొన్ని ఫీచర్స్యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. డిజిటల్ జీవితాలను సులభతరం చేయడానికి సంస్థ లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది. ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఈ నెలాఖరు నాటికి వస్తాయని తెలుస్తోంది. -
జీపే ద్వారా ‘బంగారు’ రుణాలు
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్‌ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు. తెలుగులోనూ.. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్‌ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్‌ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది. తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్‌కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
డ్రోన్ల వినియోగంతో పెరిగిన సాగు ఉత్పత్తి
న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం.. సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి.అగ్రిబోట్ డ్రోన్ కస్టమర్లకు ఈ సంస్థలు ఇటీవలే ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను కూడా ప్రకటించాయి. దీని కింద రైతులకు ఎలాంటి గరిష్ట విస్తీర్ణం పరిమితి లేకుండా ఇఫ్కో డ్రోన్లను అందిస్తుంది. పంటల నిర్వహణ, సామర్థ్యాలను పెంచడం దీని ఉద్దేశ్యమని ఇవి తెలిపాయి. ఒక డ్రోన్ ఆరు ఎకరాలకు ఒక గంటలో స్ప్రే చేసే సామర్థ్యంతో ఉంటుందని, ఒకటికి మించిన బ్యాటరీ సెట్‌తో ఒక రోజులో ఒక డ్రోన్‌తో 25 ఎకరాలకు స్ప్రే చేయొచ్చని తెలిపాయి. -
రూ.5 కోట్ల కారును పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?
ప్రపంచ వ్యాప్తంగా వాహన దొంగతనాలు సర్వ సాధారణం అయిపోయాయి. అయితే ఇప్పుడున్న టెక్నాలజీల సాయంతో పోలీసులు దొంగలను అవలీలగా పట్టుకుంటున్నారు. ఇటీవల కూడా అమెరికాలో పోయిన దాదాపు రూ.5 కోట్ల కారును ఎయిర్పాడ్ల సహాయంతో కనిపెట్టేశారు.యూఎస్ నగరంలోని కనెక్టికట్‌లోని వాటర్‌బరీలో దొంగతనానికి గురైన రూ. 4.81 కోట్ల విలువైన ఒక ఫెరారీ కారును పోలీసులు పట్టుకోగలిగారు. దొంగతనానికి గురైన కారులో యజమాని తన ఎయిర్పాడ్లను వదిలిపెట్టారు. వాటర్‌బరీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు యాపిల్ ఫైండ్ మై ఫీచర్ సాయంతో దానిని ట్రాక్ చేసి పట్టుకోగలిగారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్కారులో వదిలిపెట్టిన యాపిల్ ఎయిర్పాడ్లు దొంగలించిన కారును వేగంగా గుర్తించడానికి సహాయపడ్డాయి. యాపిల్ పరికరాల సాయంతో పోయిన వస్తువులను గుర్తించిన సంఘటనలు గతంలో కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. పోయిన కారు మళ్ళీ దొరకడంతో యజమానికి యాపిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
స్పీడ్ విజన్ కెమెరాలతో రైలు ప్రమాద కుట్రలకు చెక్
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్‌లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్లు ట్రాక్‌పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది. ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా? -
ఏఐలో భారత్‌దే హవా!.. నాస్కామ్ చైర్పర్సన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బాగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో నాస్కామ్ కొత్త చైర్పర్సన్ 'సింధు గంగాధరన్' ఏఐ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఈ రంగంలో అగ్రగామిగా మారుతుందని అన్నారు.ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఏఐను ఉపయోగించుకుని వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే సంస్థలో పనిచేసే సిబ్బంది మానసిక, భౌతిక పరిస్థితి మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలకు ఉందని సింధు గంగాధరన్ పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతోందన్న ప్రచారాన్ని తగ్గించాలి, కాబట్టి ఉద్యోగిపై కూడా కొంత శ్రద్ద వహించాలని అన్నారు.ఇటీవల ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో ఒక యువ ఉద్యోగి మరణించిన నేపథ్యంలో గంగాధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్పొరేట్ ఇండియాలో పని ప్రదేశాలలో అధిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది. ఏఐ నైపుణ్యం భారత్ తన ప్రతిభను నిరూపించుకుంటుందని చెబుతూ.. రాబోయే రోజుల్లో ఇండియా 'జీసీసీ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్'గా నిలుస్తుందని సింధు గంగాధరన్ అన్నారు.ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయిఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాల గురించి మాట్లాడుతూ.. టెక్నాలజీ ఉత్పాదకతలో లాభాలను, కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని అన్నారు. అయితే ఉద్యోగులు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడు టెక్నాలజీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. -
పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! పరమశివుని పేరుతో పరమ్ రుద్ర పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి. నవ్యావిష్కరణకు రాచబాటలు యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. అర్క, అరుణిక పనేంటి? వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. ఏఏ పనుల్లో వాడతారు? → వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు. → పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు. → వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. → సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. → ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు. → మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్రుద్రను ఏర్పాటుచేశారు. → దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. అక్టోబర్ నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతను త్వరలో వినియోగించనుంది. ‘ఈ టెక్నాలజీ తుది దశలో ఉంది. స్పామ్లు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, తటస్థీకరించి, తొలగించడానికి ఇది రూపొందింది’ అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 15–18 మధ్య జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ పరిష్కారాన్ని బీఎస్ఎన్ఎల్ పరిచయం చేయనుంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించే టెక్నాలజీని ఈ నెల 25న ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న అయాచిత వాణిజ్య సమాచార మార్పిడి ముప్పును అరికట్టడానికి టెల్కోలు కఠిన చర్యలు తీసుకోవాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సత్యం, కరుణే ఆయుధం
సాక్షి, హైదరాబాద్: న్యాయానికి సత్యం, కరుణ జోడించినప్పుడే అసలైన విజయం సాధించినట్లని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. ఈ ఆయుధంతోనే మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వేచ్ఛ ప్రసాదించారని చెప్పారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ఆదర్శమని రాజ్యాంగం చెబుతోందన్నారు. సాంకేతికతను సాధనంగా మలచుకుని సత్వర న్యాయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. మానవ శ్రేయస్సు కోసం జంతువులు, పక్షులూ అవసరమని, వాటి సంరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. నీటి వనరులను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని, యువతరం దీని కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ అలోక్ అరాధే హాజరయ్యారు. మంత్రిగా పని చేసిన రోజులు గుర్తొచ్చాయి... ‘నల్సార్‌లో యానిమల్ లా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందదాయకం. ఇది 25 ఏళ్ల క్రితం ఒడిశా మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన నాటి సంగతిని గుర్తు చేసింది. జంతువుల రక్షణ, సంక్షేమం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రయత్నాలు జరగాలి. ఆ దిశగా నల్సార్ ముందడుగు వేసింది. కృత్రిమ మేధ, సాంకేతికత న్యాయవ్యవస్థను ప్రభావితం చేయనుంది. ఆ మార్పులను ఎదుర్కొనేందుకు యువ న్యాయవాదులు సిద్ధంగా ఉండాలి.వృత్తిలో రాణించడానికి, సామాజిక న్యాయం పెంపొందించడానికి సాంకేతికతను సాధనంగా మలచుకోవాలి. మన న్యాయ వ్యవస్థ ఈ నాటిది కాదు. చంద్రగుప్తుడు, చాణక్యుల సమయం నుంచే న్యాయాధికారులు ఉన్నారు. ఒకే వ్యక్తి ఉండకుండా ముగ్గురితో బెంచ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కేసులు పరిష్కారమయ్యే వరకు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య వ్యక్తిగత భేటీకి అనుమతి ఉండేది కాదు. నిష్పక్షపాత న్యాయ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు’అని ముర్ము పేర్కొన్నారు. పేదవాడికి న్యాయం అందడంలేదు ‘దేశానికి న్యాయం కోసం మహాత్మాగాంధీ న్యాయవాద వృత్తి వదులుకున్నారు. అయినా సత్యాగ్రహం, దోపిడీకి గురైన రైతులకు న్యాయం చేయడం కోసం ఓ న్యాయవాదిలా అడుగులు వేశారు. ఆర్థిక, ఇతర ఏ వైఫల్యాల కారణంగా ఏ పౌరుడికీ న్యాయం నిరాకరించకూడదు. దురదృష్టవశాత్తు ధనవంతుడికి లభించే న్యాయం పేదవాడికి అందడం లేదు. అట్టడుగు వర్గాలకు న్యాయం అందించడంపై యువ న్యాయవాదులు దృష్టి సారించాలి.సామాజిక న్యాయ సాధనకు మీరే ఏజెంట్లు. న్యాయ నిపుణులుగా మీరు ఏ రంగం ఎన్నుకున్నా విలువలకు కట్టుబడండి. శక్తికి నిజం తోడైతే మరింత శక్తివంతమవుతారు. ఇక్కడ పతకాలు పొందిన వారిలో బాలికలు ఎక్కువగా ఉన్నా.. డిగ్రీలు పొందిన వారిలో తక్కువగా ఉన్నారు. ఇది మారాలి. మహిళా సాధికారతకు న్యాయవాదులు కృషి చేయాలి. జువెనైల్ జస్టిస్, న్యాయ సాయం, వైకల్యమున్న వారిపై శ్రద్ధ వహించడంలో నల్సార్ కృషి అభినందనీయం’అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. అనంతరం న్యాయ విద్య పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలు, వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 592 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, రిజి్రస్టార్ విద్యుల్లత, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
ఆయన కోసం గూగుల్ రూ. వేలకోట్ల ఆఫర్!.. ఏకంగా..
ఈ రోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా ఉండలేము. అంతలా ఎదిగిన ఈ ఏఐను దిగ్గజ కంపెనీలు సైతం మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ నిపుణుడు 'నోమ్ షజీర్'ను తిరిగి నియమించుకోవడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేసింది.గూగుల్ కంపెనీ నోమ్ షజీర్‌ను తిరిగి నియమించుకోవడానికి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈయన మళ్ళీ గూగుల్ జెమినీలో పనిచేయడానికి జాయిన్ అవుతున్నట్లు సమాచారం.నిజానికి నోమ్ షజీర్ గూగుల్ మాజీ ఉద్యోగి. ఈయన 2000లో గూగుల్ కంపెనీలో పనిచేశారు. అప్పట్లోనే తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్తో కలిసి డెవలప్ చేసిన ‘చాట్ బాట్’ను విడుదల చేయాలన్నఅభ్యర్థనను కంపెనీ తిరస్కరించడంతో.. 2021లో గూగుల్ వదిలి వెళ్లారు.ఇదీ చదవండి: నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రానోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రీటాస్ Character.AI కనుగొన్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే సిలికాన్ వ్యాలీలో గొప్ప ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా మారింది. ఇది గతేడాది ఒక బిలియన్ విలువకు చేరుకుంది. ఆ తరువాత వీరిరువురు గూగుల్ ఏఐ యూనిట్ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. -
నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. నీటిపై తేలియాడే ఇంటిని చూడవచ్చు. దీనిని మొత్తం నేచురల్ మెటీరియల్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ అనే ఇంజినీర్.. వర్షాలు పడినప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని అలోచించి ఇలాంటి ఓ అద్భుతమైన నిర్మాణం రూపొందించారు.ఇలాంటి ఇల్లు డిజైన్ చేయాలని 2020లోనే అనుకున్నట్లు.. ఆ తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ ఇంటికి కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కూడా సెట్ చేసి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇల్లు పూర్తిగా నీటిపైన తేలడానికి అవసరమైనవన్నీ ప్రశాంత్ ఉపయోగించారు.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకంఈ వీడియో షేర్ చేస్తూ.. వాతావరణ మార్పుల వల్ల జీవితాల్లో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించడానికి ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇలాంటి ఆవిష్కరణలు కనిపిస్తాయి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రశాంత్‌ను సంప్రదిస్తాను, నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలనో చూస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు.Prashant Kumar came back to Bihar and…With a Modest budget & Modest materials—combined with dramatic ambition & a desire to drive positive change—he’s created a disruptive solution to mitigate the disruption of lives by climate change. I’ve always believed that… pic.twitter.com/jFs18eznFm— anand mahindra (@anandmahindra) September 26, 2024 -
ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్‌స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.2004 - జీమెయిల్ ప్రారంభం2005 - గూగుల్ మ్యాప్స్2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్‌ను గూగుల్ కొనుగోలు చేసింది2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం2015 - సీఈఓగా సుందర్ పిచాయ్2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్‌ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్‌లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇదీ చదవండి: నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
Tech Talk: యూట్యూబ్‌లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్
న్యూక్లియర్ రియాక్టర్.. ఈ పేరు చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు విని ఉంటారు. ఇది పవర్ ప్లాంట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారని చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు మన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తే?.. న్యూక్లియర్ రియాక్టర్ ఏమిటి.. రోజువారీ వినియోగానికి ఉపయోగించడమేమిటని చాలామందిలో సందేహం రావచ్చు. ఈ అనుమానం పోవాలంటే ఈ కథనం తప్పకుండా చదివేయాల్సిందే..వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ అభివృద్ధి చేస్తోంది. స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ 'ఈవిన్సి' (eVinci) అనే న్యూక్లియర్ రియాక్టర్ రూపొందిస్తోంది. ఇది పరిమాణంలో 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది 15 మెగావాట్ల థర్మల్ (MWth) కోర్ డిజైన్‌తో 5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి వచ్చే శక్తిని అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు.వెస్టింగ్‌హౌస్ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్లో ఒకసారి ఇంధనాన్ని నింపితే ఎనిమిది సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇంధనం పూర్తయిన తరువాత కంపెనీ దీనిని మళ్ళీ తీసుకెళ్లి ఇంధనం నింపి ఇస్తుంది లేదా కొత్త రియాక్టర్‌తో రీప్లేస్ చేస్తుంది. దీనిని ఒకసారి ఒక ప్రదేశంలో ఫిక్స్ చేస్తే మళ్ళీ కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా దీనిని ప్రత్యేకంగా కూలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రియాక్టర్లో TRISO (ట్రై స్ట్రక్చరల్ ఐఎస్ఓ ట్రాఫిక్ పార్టికల్ ఫ్యూయల్) ఇంధనం వినియోగిస్తారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే శక్తిని మైనింగ్, డ్రిల్లింగ్ కార్యకలాపాలకు, పారిశ్రామిక సౌకర్యాలకు, డిస్ట్రిక్ట్ హీటింగ్, హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన, సైనిక స్థావరాలలో, డేటా సెంటర్లలో ఉపయోగించుకోవచ్చు.కంపెనీ ఈవిన్సి మైక్రో రియాక్టర్ ప్రిలిమినరీ సేఫ్టీ డిజైన్ రిపోర్టును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE) నేషనల్ రియాక్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (NRIC)కి అందించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామని.. ఈవిన్సి టెక్నాలజీస్ ప్రెసిడెంట్ 'జోన్ బాల్' అన్నారు. -
ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్!.. గ్రేట్ లెర్నింగ్ రిపోర్ట్
ప్రముఖ గ్లోబల్ ఎడ్టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ‘అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని నిపుణులను ప్రభావితం చేసే కీలక విషయాలను తెలుసుకోవడానికి ప్రధాన రంగాల్లోని 1000 మంది ద్వారా ఈ డేటా సేకరించారు. ఈ నివేదిక లక్ష్యం ఏమిటంటే.. ఉద్యోగులపైన ప్రభావం చూపే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. వ్యక్తులు లేదా వ్యాపారాలకు సహాయం చేయడం.నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లోని 74 శాతం మందిపై టెక్నాలజీ, ఏఐ వంటివి ప్రభావితం చేస్తున్నాయని తెలిసింది. నగరంలోని 85 శాతం మంది తమ భవిష్యత్తును మెరుగు పరుచుకోవడంలో ఇవి ఎంతగానే ఉపయోగపడుతున్నాయని స్పష్టమైంది. కొంతమంది తమ ఉద్యోగాలపై కూడా నమ్మకాన్ని కోల్పోయారు.ప్రస్తుత టెక్నాలజీని ఎదుర్కోవడానికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి హైదరాబాద్‌లోని 86 శాతం మంది పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.గత ఏడాది చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తూ డిజిటల్ మార్కెటింగ్‌ను అనుసరించారు. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..ఈ నివేదికపై గ్రేట్ లెర్నింగ్ కో ఫౌండర్ హరి కృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితులు కొంత మందగించాయి. అంతే కాకుండా భౌగోళిక పరిస్థితి కూడా వ్యాపారాలను కొంత దెబ్బతీశాయని అన్నారు. ఈ తరుణంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి టెక్నాలజీని అలవరచుకోవాలి, దానికి అనుగుణంగా సాగిపోవాలని అన్నారు. -
అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. వాషింగ్ మెషీన్లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది.ఇదీ చదవండి: మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్‌రూమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు. -
ఇండియా ఏఐ ఫెలోషిప్: అర్హతలు ఇవే..
అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ స్కాలర్ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్‌గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.పీహెచ్డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్‌ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్‌మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
కొత్త టెక్నాలజీ కోసం ఏఎం గ్రీన్ భారీ పెట్టుబడి
ఏఎం గ్రీన్ గ్రూప్‌లో భాగమైన.. ఏఎం గ్రీన్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ బీ.వీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన చెంపోలిస్ ఓయ్ (Chempolis Oy)తో ఒప్పందం కుదుర్చుకుంది.ఏఎం గ్రీన్ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం ద్వారా.. నెక్స్ట్ జెన్ 2జీ బయో ఫ్యూయెల్ టెక్నాలజీతో భారీ స్థాయి బయో రిఫైనరీలను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా పారిశ్రామిక రంగాలలో ఉపయోగించే గ్రీన్ కెమికల్స్ వంటి వాటితోపాటు ఇథనాల్, ఫర్ఫ్యూరల్, ప్యూర్ లిగ్నిన్ వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయనుంది. మొత్తం మీద ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్లాట్‌ఫారమ్‌గా ఏఎం గ్రీన్ ఎదగటానికి సర్వత్రా సిద్ధమవుతోంది. దీనికోసం కంపెనీ రాబోయే మూడేళ్లలో సుమారు 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది.2జీ లిగ్నో-సెల్యులోసిక్ ఫీడ్‌స్టాక్‌ల ప్రాసెసింగ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చెంపోలిస్తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నామని ఏఎం గ్రూప్ చైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' అన్నారు. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక రంగాలలో గ్లోబల్ డీకార్బనైజేషన్ను ఎనేబుల్ చేయడంలో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఏఎం గ్రీన్ గ్రూప్ గురించిఏఎం గ్రీన్ గ్రూప్ అనేది హైదరాబాద్‌కు చెందిన సంస్థ. దీనిని అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ప్రారంభించారు. ఇది భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి వాటి ఉత్పత్తులలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
నచ్చినట్లు చాట్‌పేజ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్‌లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్‌కు నచ్చిన థీమ్‌లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్పేపర్ల రంగులు ఎంచుకున్న థీమ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ట్రాఫిక్ కష్టాలకు చెక్!.. ఇదో చక్కని పరిష్కారం..
అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. దీనికి పరిష్కారమే లేదా? అంటే.. ఓ మార్గం ఉంది. అదే ఫ్లైయింగ్ కార్లు. ఈ మాట ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు, వచ్చిందేమో లేదు అంటారేమో.. అయితే ఎగిరే కారు కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 'అలెఫ్ ఏరోనాటిక్స్' తన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ఎగిరే కార్లను జనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.సినిమాల్లో కనిపించే ఫ్లైయింగ్ కార్లు.. నిజ జీవితంలోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. కాబట్టి అలెఫ్ ఏరోనాటిక్స్ 2025లో ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇది వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ కార్ల ధర 300000 డాలర్లు ఉంటుందని అంచనా. ఇది చాలా ఎక్కువ ధర కావడంతో బహుశా దీనిని సామాన్య ప్రజలకు కొనుగోలు చేయలేకపోవచ్చనే తెలుస్తోంది.కంపెనీ 2025నాటికి మోడల్ ఏ అనే ఫ్లైయింగ్ కారును ప్రారభించనుంది. కాగా దీని కోసం ఇప్పటికీ 3200 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఎగిరేకారుకు డిమాండ్ భారీగానే ఉందని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంపెనీ ప్రత్యేక ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు సమాచారం. ఇది కీలక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!అలెఫ్ మోడల్ ఏ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మోడల్ ఏ తరువాత కంపెనీ మోడల్ జెడ్ అనే మరో కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర 35000 డాలర్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. -
కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం
సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటేటెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు. -
ఉపాధి ఓకే.. నైపుణ్యాలేవి..?
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి. నైపుణ్య లేమికి కారణాలివీ..» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది. » నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు. » ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు. » తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్లను మాత్రమే కోరుకుంటున్నారు. » నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు. » సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది. 15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలుప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది. డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్‌ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్‌ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాన్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.If this device lives up to these expectations then, much more than Tesla or Space X, THIS will be your most enduring gift to humankind. https://t.co/BtnbEEIvyn— anand mahindra (@anandmahindra) September 19, 2024 -
ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలోనే!
హీరో/విలన్.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రిమోట్ బటన్ నొక్కి.. తాను అనుకున్న వ్యక్తిని మట్టుపెడతాడు. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాదు.. మన దగ్గరా ‘జై చిరంజీవ’లో ఈ తరహా సీన్ ఒకటి ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోనూ సినిమాలను తలదన్నే అలాంటి ఘటనలే ఇప్పుడు మనం చూడాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం తెలుసు కాబట్టే.. కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలావరకు పరిమితులను పెట్టుకుంటున్నాయి చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు. అయినా కూడా దాడులు ఆగడం లేదా?. నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ గాడ్జెట్లు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అటు డివైజ్ కంపెనీలేమో.. ఆ పేలుళ్లకు తమకు సంబంధం లేదంటున్నాయి. ఈ ఆరోపణలు ఇలా ఉండగానే.. గతంలో ఇజ్రాయెల్ తమ చేతులకు మట్టి అంటకుండా జరిపిన కొన్ని దాడుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.నెక్ పాయిజన్1997 హమాస్ వరుస ఆత్మాహుతి దాడులు ఇజ్రాయెల్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పుడే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బెంజమిన్ నెతన్యాహూ.. వీటికి చెక్ పెట్టాలనుకున్నారు. ఇందులో భాగంగా.. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఖలేద్ మెషాల్‌ను హత్య చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. మారు వేషంలో ఇద్దరు మోసాద్ ఏజెంట్లు.. మెషాల్ మెడ భాగం నుంచి పాయిజన్ పంపించేందుకు యత్నించారు. అయితే సకాలంలో ఆయన భద్రతా సిబ్బంది ఆ యత్నాన్ని గుర్తించారు. జోర్డాన్ పోలీసులు ఆ ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకోగా, మెషాల్‌కు విరుగుడు ఇచ్చాకే అక్కడి నుంచి తరలించారు.ఫోన్‌కాల్‌తో.. ఇజ్రాయెల్ మరో దర్యాప్తు సంస్థ.. షిన్‌బెట్ 1996 గాజాలో హమాస్ మాస్టర్ బాంబ్ మేకర్ యాహ్యా అయ్యాష్‌ను సెల్‌ఫోన్ బాంబ్‌తో చంపింది. తన తండ్రిలో ఫోన్లో మాట్లాడుతున్న ఒక్కసారిగా ఫోన్ పేలిపోయి తలకు గాయమై అయ్యాష్ చనిపోయాడు. రిమోట్ ద్వారా సెల్ఫోన్లో అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాల ద్వారా మట్టు పెట్టగలిగారు.ఫేక్ టూరిస్ట్లుహమాస్కు ఆయుధాలు సరఫరా చేసే అంతర్జాతీయ వెపన్ డీలర్ మహమౌద్ అల్ మబౌ 2010లో దుబాయ్‌లోని ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. ఎమిరేట్స్ అధికారులు తొలుత అది సహజ మరణంగానే ప్రకటించి కేసు మూసేశారు. అయితే.. హమాస్ అనుమానాలు లేవనెత్తడంతో కేసును రీ ఓపెన్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. టూరిస్టుల పేరిట ఫేక్ పాస్ట్‌పోర్టులు తయారు చేయించుకుని మోస్సాద్ ఏజెంట్స్ ఆ హోటల్లో దిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక.. మబౌహ్ శవపరీక్షలో విషప్రయోగం జరిగినట్లు తేలింది.ట్రాఫిక్ బ్లాస్ట్2010-20 మధ్య ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చాలావరకు సిగ్నల్స్లోనే జరగడం గమనార్హం. వాహనాలు ఆగి ఉన్న టైంలో పక్కనే మరో వాహనంతో వచ్చి కాల్పులు జరపడం లేదంటే పేలుడు జరపడం లాంటివి చేశారు. ఇవి.. ఇజ్రాయెల్ దాడులేనని ఇరాన్ బహిరంగంగానే ఆరోపణలు చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అది తమ పని కాదు.. బహుశా తమ ఏజెంట్లకు ఇరాన్ మధ్య జరిగే షాడో వార్ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.AI సాయంతో జరిగిన తొలి హత్య!ఇరాన్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ మోహ్సెన్ ఫక్రిజదెహ్ మమబది హత్య. టెక్నాలజీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఏఐ లాంటి టెక్నాలజీ సాయంతో ఈ హత్య చేయించారనే కథనాలు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. 2020 నవంబర్ 27న భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఎస్కార్ట్ నడుమ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆటానమస్ శాటిలైట్ ఆపరేటెడ్ గన్ సాయంతో ఆయన్ని హత్య చేశారు. మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. పూర్తిగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం. ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్సెన్. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్ఎన్ ఏంఏజీ మెషిన్ గన్ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేశారు. అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి. -
దొంగ కెమెరాలపై ఓ కన్నేద్దాం
టెక్నాలజీ యుగంలో వ్యక్తుల గోప్యత, భద్రతకు రక్షణ లేకుండా పోతోంది.రహస్య కెమెరాల ద్వారా వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి.. తద్వారా బ్లాక్మెయిల్ చేసే సంస్కృతి ఏటేటా పెరిగిపోతోంది. రహస్య కెమెరాలను గుర్తించడం కొంత కష్టమైనా.. అసాధ్యం మాత్రం కాదు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, లేదా నిత్యం సంచరించే ప్రాంతాల్లో కూడా వాటి పట్లఅలెర్ట్గా ఉండటం మేలు. కొంత జాగ్రత్త వహిస్తే రహస్య కెమెరాల కంట్లో పడకుండా సులువుగా తప్పించుకోవచ్చు. సాధారణంగా గదుల్లో రహస్య కెమెరాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి » మంచం ఫ్రేములు, మంచానికి ఉండే హెడ్ బోర్డులలో.. » గోడ గడియారాలు, బల్బులు, లైట్ల స్విచ్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రికల్ డివైజ్‌లలో.. » డ్రస్సింగ్ టేబుల్స్ అద్దాల్లో, ఇతర టేబుల్స్ పైన ఉండే వస్తువుల్లో.. » పిక్చర్ ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్, డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంట్లలో.. » బాత్రూమ్లు, టాయ్లెట్లలో ఉండే డెకరేటివ్ ఐటమ్స్‌లో, షవర్ హెడ్స్, అద్దాల వెనుక.. » గది సీలింగ్ మూలల్లో.. కిటికీల ఫ్రేముల్లో, అనుమానాస్పదంగా కనిపించే వైర్లలో.. » డోర్ హ్యాండిల్స్,డోర్ బెల్స్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్లు,స్రూ్కలు, క్లాత్ హ్యాంగర్లలో.. ఎలా గుర్తించాలిక్షుణ్ణంగా పరిశీలన: కొత్త రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు లోపల అంతా క్షుణ్ణంగా పరిశీలించాలి. బెడ్రూమ్లోనూ, బాత్రూంలోనూ అసాధారణంగా ఉండే వస్తువులను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువులను చెక్ చేయాలి: రోజువారీ వినియోగించే సామగ్రిలో రహస్య కెమెరాలు ఉంచే అవకాశం కూడా ఉంటుంది. స్విచ్ బోర్డులు, అద్దాల వెనక, స్మోక్ డిటెక్టర్లు ఉంటే వాటిలో, ల్యాంప్స్, డెకరేటివ్ వస్తువులను చెక్ చేయాలి. ఫ్లాష్ లైట్‌తో గుర్తింపు: రూమ్‌లో ముఖ్యంగా చీకటిగా ఉండే ప్రాంతాల్లో ఫ్లాష్ లైట్ వేయాలి. దీనివల్ల ఇతర వస్తువులపై పడే లైట్ కన్నా కెమెరాల లెన్స్‌పై పడిన లైట్ విభిన్నంగా ప్రతిబింబిస్తుంది. అలాగే రూమ్‌లో లైట్లు ఆర్పేసి ఫ్లాష్‌లైట్ ఆన్ చేస్తే రహస్య కెమెరాల నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ద్వారా వాటిని గుర్తించవచ్చు. స్మార్ట్‌ఫోన్ యాప్స్: రహస్య కెమెరాల ఇన్ఫ్రారెడ్ లైట్‌ను గుర్తించే స్మార్ట్ ఫోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌ను వినియోగించడం ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఆర్ఎఫ్ డిటెక్టర్స్: కెమెరాల నుంచి వచ్చే వైర్లెస్ సిగ్నల్స్‌ను పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) డిటెక్టర్స్ ద్వారా గుర్తించవచ్చు. ఇతర నిఘా పరికరాల ఫ్రీక్వెన్సీలను కూడా ఆర్ఎఫ్ డిటెక్టర్ల ద్వారా గుర్తించవచ్చు. వైర్లు, కేబుల్స్: సాధారణంగా ఉండే వైర్లు, కేబుల్స్ కాకుండా.. అనుమానాస్పదంగా ఉండే కేబుళ్లు, వైర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవి రహస్య కెమెరాలకు ఎలక్ట్రిసిటీని అందించేవి లేదా డేటా ట్రాన్స్ఫర్ చేసేవి కావచ్చు. వైఫై నెట్వర్క్ స్కానర్లు: పబ్లిక్ ప్లేసుల్లో ఉచితంగా లబించే వైఫై నెట్వర్క్ వినియోగించడం అంత మంచిది కాకపోయినా.. వైఫై స్కానర్ ఓపెన్ చేసి అనుమానాస్పదంగా ఉండే నెట్‌వర్క్‌లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. భౌతిక పరిశీలన: రహస్య కెమెరాలు పెట్టే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా తట్టినప్పుడు అక్కడ డొల్ల శబ్దం కనుక వస్తే అనుమానించాలి. ఫోన్ ఇన్ఫ్రారెడ్ కెమెరా: మన ఫోన్ కెమెరా ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే.. దాని ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఆ కెమెరాను ఓపెన్ చేసి రూమ్‌ను స్కాన్ చేస్తే చిన్న చిన్న బరస్ట్‌లు, ఫ్లాష్ లైట్ కనబడితే అక్కడ రహస్య కెమెరా ఉందని గుర్తించవచ్చు. రహస్య కెమెరాలను గుర్తించే కొన్ని యాప్స్ » హిడెన్ కెమెరా అండ్ డివైజ్ ఫైండర్: రహస్య కెమెరాలను వేగంగా, సులువుగా గుర్తించగలం అని యాప్ డెవలపర్లు చెబుతున్నారు. ఎలాంటి రహస్య కెమెరానైనా యాప్‌లో వైఫై, బ్లూటూత్ టెక్నాలజీతో గుర్తించవచ్చు. » హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్: ఈ యాప్‌లో ఆల్ ఇన్ వన్ నెట్వర్క్ స్కానర్ ఉంది. దీనితో జీపీఎస్ ట్రాకర్లు, రహస్య కెమెరాలను వేగంగా గుర్తించే సామర్థ్యం దీని సొంతం. » హిడెన్ కెమెరా డిటెక్టర్– స్పై సీ: ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వస్తువు వద్దకు కెమెరాను తీసుకెళితే యాప్ ద్వారా దానిలో రహస్య కెమెరా ఉందో, లేదో గుర్తించవచ్చు. దీనికి అదనంగా దీనిలో మేగ్నెటోమీటర్ కూడా ఉంది. దీనితో కెమెరాలు, స్పీకర్ల నుంచి వెలువడే అయస్కాంత తరంగాలను సులువుగా గుర్తించవచ్చు. » హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్: ఈ యాప్ రహస్య కెమెరాలను, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను గుర్తించడానికి సహాయ పడుతుంది. » హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో: రహస్య కెమెరాలనే కాకుండా, రహస్య మైక్రోఫోన్లను కూడా ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఇన్ఫ్రారెడ్ కెమెరాలను గుర్తించడమే కాకుండా, యూజర్ల రక్షణ కోసం టిప్స్, మెలకువలు కూడా అందిస్తామని యాప్ చెబుతోంది. » హిడెన్ పిన్‌హోల్ కెమెరా డిటెక్టర్: రహస్యంగా రికార్డు చేసే కెమెరాల విషయంలో ఈ యాప్ యూజర్లను ముందస్తుగా అలెర్ట్ చేస్తుంది. నిఘాకు అనువుగా ఉండే ప్రాంతాల విషయంలో ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. –ఏపీ సెంట్రల్ డెస్క్ -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్
కాలంతో పాటు టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే దిగ్గజ కంపెనీలైన కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్'తో చేతులు కలిపింది.ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చొరవకు నాయకత్వం వహించడానికి భారతదేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీకు తన సహకారాన్ని ప్రకటించింది. కంపెనీ త్వరలోనే నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్నిచానెల్ ఎంగేజ్మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది.భారీ స్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో దాని విస్తృత అనుభవం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్.. ఇన్సూరెన్స్ రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకోవడానికి ఎల్ఐసీ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేసింది. కాబట్టి త్వరలోనే ఎల్ఐసీ రూపురేఖలు మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్), క్లౌడ్ నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ఎల్ఐసీలో కూడా ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇది తప్పకుండా ఎల్ఐసీ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇన్ఫోసిస్ సహకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరివర్తనను మరింత మెరుగుపరుస్తుందని.. కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులు అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనుభవాలను పొందవచ్చని ఎల్ఐసి సీఈఓ అండ్ ఎండీ సిద్దార్థ మొహంతి అన్నారు. -
'ఏఐకు అదో పెద్ద సవాలు'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ.. ఎంతోమంది దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందులో లోపాలు ఉన్నాయని 'డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్' (Deutsche Bank Research) ఓ నివేదికలో వెల్లడించింది.ఏఐ టెక్నాలజీ అన్ని విషయాల్లోనూ రాణిస్తోంది, కానీ లెక్కల (గణితం) విషయానికి వస్తే.. గణనలు చేయడంలో అంత ఆశాజనకంగా లేదని లోపభూయిష్టంగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ పేర్కొంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని తెలిపింది.ఏఐలో ఫైనాన్స్, హెల్త్ కేర్ కూసే నెమ్మదిగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ తెలిపింది. కాబట్టి ఈ రంగాలలో ఏఐ ఫలితాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ రంగంలో ఆశాజనక ఫలితాలు అందించడానికి ఏఐ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతనై ఉంది.ఇదీ చదవండి: భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే.. కొన్ని రంగాల్లో మాత్రం.. ఏఐ ఉత్పాదక ఊహాతీతంగా, ఆశ్చర్యపడిచే విధంగా ఉంది. అపరిశోధనలను సంబంధించిన విషయాలను అందించడం, వస్తావా ప్రపంచం అనుసరించే అనేక గేమ్ ఇంజిన్లను సృష్టించడంలో కూడా ఏఐ చాలా అద్భుతంగా ఉందని వెల్లడించింది. -
భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే..
భారతదేశం ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించాలని.. ప్రత్యామ్నాయ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెంచడానికి సరైన టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. దీనికి బ్రెజిల్ కూడా సహకరించనుంది.ఇటీవల బ్రెజిల్‌లోని కుయాబాలో జరిగిన జీ20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను భారతదేశంలో పెంచడానికి బ్రెజిల్ కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్.. బ్రెజిల్ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కార్లోస్ ఫవారో ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన ఒప్పందం నవంబర్‌లో జరిగే జీ20 నాయకుల సమావేశానికి ముందే ఖరారు అవుతుందని పెకొన్నారు.జూన్ 2024లో జరిగిన ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ISO) 63వ కౌన్సిల్ సమావేశంలో.. చెరకు సాగు, చక్కెర, ఇథనాల్ ఉత్పత్తుల మెరుగైన వినియోగంలో మరింత స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి భారతదేశం సభ్య దేశాల నుంచి సహకారాన్ని కోరింది. ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో యూఎస్ఏ, బ్రెజిల్ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది.ఇదీ చదవండి: బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండివినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో ఇథనాల్ మిశ్రమం శాతం 2019-20లో 5 శాతం నుంచి 2022-23లో 12 శాతానికి పెరిగింది. ఈ సమయంలో ఇథనాల్ ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుంచి 500 కోట్ల లీటర్ల పెరిగింది. కాగా ఇప్పుడు బ్రెజిల్ సహకారంతో ఇది మరింత ఎక్కువవుతుంది భావిస్తున్నారు. -
పెట్టుబడులకు షిప్‌బిల్డింగ్ ఆహ్వానం
గోవా: దేశీయంగా షిప్ బిల్డింగ్, ఓడల మరమ్మతు రంగాలకు ప్రోత్సాహాన్నివ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దక్షిణ కొరియా, జపాన్ నుంచి పెట్టుబడులతోపాటు.. టెక్నాలజీ బదిలీకావలసి ఉన్నట్లు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. షిప్ రిపేర్ క్లస్టర్లకు దన్నునివ్వడం ద్వారా షిప్పింగ్ సరఫరాను మెరుగుపరచవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో 1 శాతానికంటే తక్కువవాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచ షిప్‌బిల్డింగ్ మార్కెట్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి దక్షిణ కొరియా, జపాన్‌వైపు పెట్టుబడులుసహా సాంకేతికతల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశీయంగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. మ్యారీటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎంఎస్డీసీ) 20వ సదస్సుకు హాజరైన సందర్భంగా రామచంద్రన్ విలేకరులతో పలు అంశాలపై స్పందించారు. పలు రాష్ట్రాలలో విస్తరించేలా మెగా షిప్ బిల్డింగ్ పార్క్ ఏర్పాటుకు ఎంఎస్డీసీ యోచిస్తోంది. కాగా.. టెక్నాలజీ, పెట్టుబడులతో రావలసిందిగా ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లను ఆహా్వనించినట్లు రామచంద్రన్ వెల్లడించారు. వీటి ఏర్పాటుకు వీలుగా భూమిని సమకూరుస్తామని హామీ ఇచి్చనట్లు తెలియజేశారు. -
రాత్రిని పగలుగా మార్చేయండిలా..
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్‌ను కూడా బెన్ నోవాక్.. లండన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్ ఫామ్‌లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి, భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌ను కలిగి ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్‌పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇదెలా పనిచేస్తుందంటే..ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 -
సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది. -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్‌థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్‌కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్‌లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్‌బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.