telangana
-
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్.. రేవంత్‌పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘రేవతి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం. ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo— KTR (@KTRBRS) March 12, 2025మరోవైపు.. జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత ట్విట్టర్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు..జర్నలిస్టు రేవతి @revathitweets గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025 -
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్‌సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు. స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్‌లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. -
ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్ఎస్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్‌లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్‌రెడ్డి కూతురు ఇటీవల మరణించారు. అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ బెటాలియన్‌లో..సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బెటాలియన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్‌వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ‘నవమి’ టికెట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు.ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు. నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు.. ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది. -
గ్రూప్–2 టాపర్ హరవర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో నారు వెంకట హరవర్ధన్‌రెడ్డి నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. మొత్తం 600 మార్కులకుగాను అతడు 447.008 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. గ్రూప్–2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జీఆర్‌ఎల్‌ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. సభ్యులు అమీర్ఉల్లా ఖాన్, ప్రొఫెసర్ యాదయ్య, యం.రామ్మోహనరావు, పాల్వాయి రజిని సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్–2 జీఆర్ఎల్, ఫైనల్ కీ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీలను కూడా వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు. కాగా, టాప్ 31 ర్యాంకుల్లో మహిళలు ఎవరూ లేకపోవటం గమనార్హం. 13 వేలమంది అనర్హత గ్రూప్–2 సర్వీసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 29 డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 5,51,855 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలు ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగాయి. 33 జిల్లాల్లోని 1,368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే మొత్తం నాలుగు పేపర్లు రాశారు. తాజాగా 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఫైనల్ కీలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివిధ కారణాలతో 13,315 మంది అభ్యర్థులు అనర్హతకు గురయ్యారు. టాపర్ కోదాడ వాసి గ్రూప్–2 పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన నారు వెంకట హరవర్ధన్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఈయన తండ్రి రవణారెడ్డి కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. హరవర్ధన్ ఇటీవలే గ్రూప్–4లో మంచి ర్యాంకు సాధించి ఇంటర్బోర్డులో ఉద్యోగం పొందాడు. వీరిది ఆంధ్రప్రదేశ్ కాగా తండ్రి ఉద్యోగ రీత్యా ఖమ్మంలో స్థిరపడ్డారు. గత సంవత్సరమే రవణారెడ్డి కోదాడ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీపై వచ్చారు. ఐఏఎస్ సాధించి తీరుతా సిద్దిపేట జోన్: రెండుసార్లు యూపీపీఎస్సీ పరీక్షలు రాసినప్పటికీ అర్హత సాధించలేక పోయా. అయినప్పటికీ ఎప్పటికైనా ఐఏఎస్ సాధిస్తా. గ్రూప్ – 2 రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావటం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు వడ్లకొండ శ్రీనివాస్‌రెడ్డి, సుజాత ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైంది. నా ప్రాథమిక విద్య సిద్దిపేటలోనే పూర్తిచేశా. హైదరాబాద్‌లో ఇంటర్, ఇంజనీరింగ్ ఢిల్లీలో పూర్తి చేశాను. రెండేళ్లు ఐటీ ఉద్యోగం చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి గ్రూప్ –2లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాను. – సచిన్‌రెడ్డి, 2వ ర్యాంకర్, సిద్దిపేటసంతోషంగా ఉంది.. కొల్చారం(నర్సాపూర్): గ్రూప్–2లో మూడో ర్యాంకు రావటం ఆనందంగా ఉంది. ఇటీవల వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లోనూ ఎకనామిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. –బి.మనోహర్ రావు, 3వ ర్యాంకర్. అంసాన్పల్లి, కొల్చారం మండలం, మెదక్ జిల్లాకోచింగ్ లేకుండానే సాధించా పెన్‌పహాడ్: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే స్వశక్తితో గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధమయ్యాను. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. పెన్‌పహాడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. కోదాడ క్రాంతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, కోదాడ అనురాగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. 2014లో వీఆర్వో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. మున్సిపల్ కమిషనర్‌గా చేయాలనే ఆలోచనతో ఉత్తమ ర్యాంకు సాధించాను. నా తమ్ముడు శ్రీరామ్ నవీన్ కూడా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–2లో 326వ ర్యాంకు సాధించాడు. – శ్రీరామ్ మధు, 4వ ర్యాంకర్, మహ్మదాపురం, పెన్‌పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లారోజుకు 15 గంటలు చదివాను తలమడుగు: గ్రూప్–2లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రోజుకు 12 గంటల నుంచి 15 గంటలు చదివాను. నా విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక లక్ష్యంతో చదివితే కచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. చింతలపల్లి ప్రీతమ్‌రెడ్డి, 5వ ర్యాంకర్. కజ్జర్ల, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నా తల్లిదండ్రులే స్ఫూర్తి లక్సెట్టిపేట: మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు గొడ్డటి కిష్టయ్య, దేవక్క ఎంతో కష్టపడి నన్ను చదివించారు. గ్రూప్–2లో ఏడో ర్యాంకు సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి మంచిర్యాల కలెక్టరేట్లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2కు సన్నద్ధమయ్యాను. – గొడ్డటి అశోక్, 7వ ర్యాంకర్, మంచిర్యాల జిల్లా, గంపలపల్లి గ్రామం ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యం డోర్నకల్: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యంగా చదివాను. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. వాళ్లు కష్టపడి నన్ను చదివించడం, అన్నయ్య కానిస్టేబుల్ ఉద్యోగం సాధించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. ఇటీవల మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. గ్రూప్–2 కోసం తీవ్రంగా కృషి చేశా. – మేకల ఉపేందర్, 9వ ర్యాంకర్, ముల్కలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. సివిల్స్‌కు సిద్ధ్దమవుతున్నాను. బీహెచ్ఎంఎస్ పూర్తి కాగానే పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. అమ్మానాన్నల పోత్సాహంతో మూడేళ్లుగా ఇంట్లోనే యూట్యూబ్‌లో పాఠాలు వీక్షిస్తూ గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. సీడీపీఓ పరీక్షల్లో కూడా టాపర్‌గా నిలిచాను. గ్రూప్–1లో మంచి మార్కులు సాధించాను. సివిల్స్ సాధించి పేదలకు సేవలందించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. –డాక్టర్ వినీషా రెడ్డి, 32వ ర్యాంకర్, హైదరాబాద్.గ్రూప్–2కే ప్రాధాన్యం పాపన్నపేట(మెదక్): గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంకు సాధించాను. గ్రూప్–1 ఫలితాల్లో కూడా 401 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం కొల్చారం గురుకుల పాఠశాలలో పీజీటీ (గణితం)గా పని చేస్తున్నాను. గ్రూప్–1లో ఎంపీడీఓ పోస్టు రావచ్చు. అయితే గ్రూప్–2కే ప్రాధాన్యత ఇస్తాను. –బాయికాడి సుష్మిత, 41వ ర్యాంకర్, అబ్లాపూర్, పాపన్నపేట మండలం, మెదక్ జిల్లాభర్త ప్రోత్సాహంతోనే.. తలమడుగు: నా భర్త నిమ్మల సాత్విక్‌రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రూప్–2లో మంచి ర్యాంకు సాధించాను. మొదటిసారి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాను. తర్వాత అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా, మూడోసారి కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించాను. – నిమ్మల తేజశ్రీరెడ్డి, 190వ ర్యాంకర్. సుంకిడి, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా -
కొత్త సార్లు, క్రమబర్థికరణలు.. అయినా ఖాళీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా 1,292 మంది లెక్చరర్లు చేరబోతున్నారు. వారితోపాటు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతి వేదికగా నియామక ఉత్తర్వులు అందజేస్తారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే కొత్తగా నియామకాలు చేపట్టినా కూడా.. జూనియర్ కాలేజీల్లో గణనీయంగానే లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉండే పరిస్థితి నెలకొంది. రెండున్నరేళ్ల కిందే నోటిఫికేషన్.. ఇంటర్ బోర్డ్ మూడేళ్ల క్రితమే జూనియర్ కాలేజీల్లో ఖాళీలను గుర్తించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వివరాలు అందజేసింది. టీజీపీఎస్సీ 2022 డిసెంబర్లో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. చివరికి అర్హులను ఎంపిక చేసిన కమిషన్.. ఇటీవలే జాబితాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. ప్రస్తుతం ఇంటర్ విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో.. కొత్త వారికి శిక్షణ ఇచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా గణనీయంగానే ఖాళీలు రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల లెక్చరర్ల కొరతతో బోధనకు ఇబ్బంది నెలకొంది. నిజానికి జూనియర్ కాలేజీల్లో మొత్తం 6,008 పోస్టులు ఉండగా.. ఏడాది క్రితం వరకు 900 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టింది. అది ఇంకా పూర్తవలేదు. వీరిని, ఇప్పుడు కొత్తగా నియమించబోతున్న వారిని కలిపితే.. 5,692 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉంటారు. ఇంకా 316 ఖాళీలుంటాయి. ఇవన్నీ రెండేళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడీ ఖాళీల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.కొత్త కాలేజీల మాటేంటి?గత రెండేళ్లలో రాష్ట్రంలో 24 జూనియర్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ అందులో 19 కాలేజీలకు ఇప్పటికీ పోస్టులు మంజూరు చేయలేదు. గెస్ట్ ఫ్యాకల్టీ, ఇతర కాలేజీల లెక్చరర్లతో బోధిస్తున్నారు. కొత్త కాలేజీలకు కనీసం 480 పోస్టులు అవసరమని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అంటే ఇప్పటికే ఉన్న 316 ఖాళీలను కలుపుకుంటే.. మొత్తం ఖాళీల సంఖ్య 796కు చేరుతుంది. పైగా గత రెండేళ్లలో ఖాళీ అయిన పోస్టులు అదనం.దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్చి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. దానికోసం మరికొన్ని అధ్యాపక పోస్టులు అవసరం. ఇక ఇంగ్లి‹Ùలో ప్రాక్టికల్స్‌ను కొత్తగా తీసుకొచ్చారు. మాట్లాడే స్కిల్, గ్రామర్ స్థాయిని పెంచారు.గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి, విద్యార్థి రాతను పరిశీలించి ప్రాక్టికల్స్‌లో మార్కులు వేస్తున్నారు. వీటి ప్రామాణికత పెరగాలంటే ఆంగ్ల భాషా నిపుణుల పోస్టులు మరో 129 అవసరమని అంచనా వేశారు. రసాయన శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాలు చేయగలగాలని బోర్డ్ తీర్మానించింది. ఆ ప్రాక్టికల్స్‌కు నిపుణులు అవసరం. ఇలా ప్రతీ విభాగంలోనూ అధ్యాపకుల కొరత ఏర్పడుతోంది. -
ఎల్ఆర్ఎస్.. సర్కారు ఆశలు తుస్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ద్వారా సుమారు రూ.20 వేలకోట్ల ఆదాయం పొందాలని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది. మార్చి నెలాఖరుకల్లా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్ధీకరించాలని తీసుకున్న నిర్ణయం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పురపాలక శాఖలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన పోర్టల్‌ను రిజిస్ట్రార్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి.. స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించారు. కానీ ఎల్ఆర్ఎస్కు కనీస స్పందన కూడా రావడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారు 336 మంది, వచ్చిన ఆదాయం రూ.1.16 కోట్లు మాత్రమే. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏలలో కలిపి సోమవారం ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించినవారు 42 మంది, సమకూరిన మొత్తం రూ.34.25 లక్షలు మాత్రమేకావడం గమనార్హం. 11 రోజుల ఆదాయం రూ.47 కోట్లే! రాష్ట్రంలో 2020లో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 25.67 లక్షలు.. అందులో 20లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. మరో 2.5 లక్షల దరఖాస్తులు చెరువులు, కుంటలకు 200 మీటర్ల పరిధిలో ఉన్నవికాగా, మిగతావాటిని ఇతర కారణాలతో తిరస్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులు 14.45 లక్షలు. ఇందులో 13,322 దరఖాస్తులకు సంబంధించి రూ.103.13 కోట్లను గతంలోనే చెల్లించారు. వీటిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను స్వీకరిస్తుండగా.. ఇప్పటివరకు 7,188 దరఖాస్తులకు సంబంధించి రూ.47 కోట్లు మాత్రమే సమకూరడం గమనార్హం. దీనితో జీహెచ్ఎంసీ మినహా మిగతా పురపాలికల్లో.. 20,510 దరఖాస్తుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి రూ.151.31 కోట్లు అందాయి. ఇక హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీల నుంచి కలిపి గతంలో 600 మంది వరకు ఫీజులు చెల్లించగా.. ఇప్పుడా సంఖ్య సుమారు 2వేల వరకు ఉండొచ్చని, సమకూరిన మొత్తం రూ.10 కోట్ల వరకే ఉంటుందని అంచనా. భూముల విలువ, ఓపెన్ స్పేస్ చార్జీల్లో తేడాలతో.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో భూమి కొనుగోలు విలువ, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నప్పటి విలువతోపాటు ఓపెన్ స్పేస్ చార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధరల్లో తేడాలు వస్తున్నాయని తెలిసింది. దీనితో దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించడం లేదని సమాచారం. అలాగే రెవెన్యూ గ్రామం పేరు, దరఖాస్తుదారు పేర్కొన్న కాలనీ, గ్రామం పేర్లు వేరుగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ దరఖాస్తులను తిరస్కరించడం లేదా ఫీజుల్లో తేడా చూపించడం జరుగుతోంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో.. ఆన్లైన్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గా సమస్యను పరిష్కరిస్తున్నట్టు డీటీసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇకపై వేగం పుంజుకుంటుందని చెప్పారు. ఇంకా 20 రోజులే గడువు! ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని.. మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలికల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారానికి అర్హమైన దరఖాస్తులు 20 లక్షలకుపైనే ఉండగా.. ఇప్పటివరకు లక్ష దరఖాస్తులకు కూడా మోక్షం లభించలేదు. మరో 20 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో రోజుకు లక్ష దరఖాస్తులను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వం ఆశించిన రూ.20 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ లేఅవుట్లలోని స్థల యజమానులకు మంచి అవకాశం.. అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం స్థలాల సేల్‌డీడ్స్ పూర్తయిన చోట్లలో మిగతా వారికి ఎల్ఆర్ఎస్ పథకం మంచి అవకాశం. వారు గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోకపోయినా, ఇప్పుడు నేరుగా ఫీజు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వ్యక్తులు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకు రావాలి. ఈ నెల 31లోపు క్రమబద్ధీకరించుకుంటే 25శాతం రాయితీ పొందవచ్చు. – కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చైర్మన్, సుడా (కరీంనగర్) -
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలి భేటీతో ఈ సమావేశాలు మొదలవుతాయి. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలి, ఏయే అంశాలను చేపట్టాలన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వీలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. గత బడ్జెట్ కన్నా సుమారు పది శాతం అదనంగా రూ.3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. సభ ముందుకు రెండు బిల్లులు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం.. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈనెల 19న లేదా 20న 2025–26 బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈనెల 27 లేదా 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరసనలకు నో..! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభు త్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరి వ్యూహం వారిదే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతోపాటు ఎంఐఎం, సీపీఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతోపాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీటి కొరత, యూరియా, సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానుంది. బడ్జెట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి్రస్టేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా.. ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు కావాలి. ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.11,500 కోట్లు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -
స్వయం ఉపాధికి రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మంగళవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఆయా వర్గాల కోసం పెట్టిన ఆర్థిక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఆ రోజు నుంచే ఆన్లైన్లో రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని భట్టి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో రుణం ఇప్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు. ఐలమ్మ వర్సిటీకి రూ.540 కోట్లు వీర వనిత చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.540 కోట్లు కేటాయించామని, దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఈ వర్సిటీ ప్రాంగణంలో ఉన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. వర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదిని ఆనుకుని ఉందని, మూసీ పునరుజ్జీవం తర్వాత ఈ ప్రధాన గేటును తిరిగి ప్రారంభిస్తామన్నారు. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి తక్షణమే రూ.15.5 కోట్లు, నూతన భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు భట్టి వెల్లడించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక కట్టడాలను వర్సిటీ వీసీ సూర్య ధనుంజయతో కలిసి భట్టి పరిశీలించారు. భట్టి వెంట ఎంపీ పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ తదితరులు ఉన్నారు. -
అశ్రద్ధ చేస్తే ‘అంధకారమే’
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంట్లో ఏదైన నలతపడి కాసేపు చూడలేకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది కంటి చూపు మొత్తమే లేని జీవితాన్ని ఊహించుకోగలమా? అందుకే శరీర భాగాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం. కానీ, కళ్లకు సోకే వ్యాధుల గురించి ఇప్పటికీ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇటీవల కాలంలో వివిధ రకాల కేన్సర్లపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే కేన్సర్ అంటే ఊపిరితిత్తులు, రొమ్ము, చర్మానికి, కిడ్నీ, లివర్ ఇతర అవయవాలకు మాత్రమే సంబంధించినదనే అపోహ ఉంది. కానీ, కేన్సర్ భూతం కళ్లపైనా దాడి చేస్తుంది. వెంటనే గుర్తించకుంటే జీవితమే అంధకారమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కంటి కేన్సర్ బాధితులు మనదేశంలో కంటి కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా బాల్య కంటి కేన్సర్ల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పిల్లల్లో ప్రాణాంతకమైన రెటీనోబ్లాస్టోమా కలవరపెడుతోంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే ఈ కేన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పదేళ్ల వయసు పైబడిన వారిలో ఆక్కులర్ సర్ఫేస్ స్క్వామస్ నియోప్లసియా (ఓఎస్ఎ‹స్‌ఎన్), సెబాసియస్ గ్లాండ్ కార్సినోమా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కనురెప్పల కేన్సర్లలో 53 శాతం సెబాసియస్ గ్లాండ్ కార్సినోమా ఉంది. కంటిలో ఉన్నట్లుండి కణతులు రావడం, కన్ను నొప్పి పెట్టడం, వాపు రావడం, ఆకారంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెటినోబ్లాస్టోమా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో త్వరితగతిన గుర్తించడం, అవగాహన, చికిత్సలు అందించడానికి ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ మే నెలలో వార్షిక మైటథాన్ పరుగు నిర్వహించనుంది. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
అనుభవం, జ్ఞానం లేదు.. కామన్సెన్స్ వాడరు
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రికి అనుభవం, జ్ఞానం లేకున్నా కనీసం కామన్ సెన్స్‌ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవజు్ఞలు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం, మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. హామీలు, పథకాల అమలును పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలైన సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అసెంబ్లీలో ఎత్తిచూపడమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలు, వేస్తున్న నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అప్పులు సహా.. అన్నీ అబద్ధాలే! ‘‘రాష్ట్ర అప్పుల లెక్కలపై రేవంత్, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గత ఏడాదికాలంలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైంది. బడ్జెట్‌తోపాటు సవరించిన అంచనాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెడుతుంది. ఆదాయ లోటు కూడా భారీగా ఉండబోతోంది. అందువల్ల బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులుగా పనిచేసినవారు మన పార్టీ తరఫున ఉభయ సభల్లోనూ ఉన్నారు. వారు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించి పద్దులపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగునీటి కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ కోతలు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతుండటం, ఎండుతున్న పంటలు వంటి రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వివిధ రంగాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎత్తిచూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు సోషల్ మీడియా అద్దం పడుతోందని, నిజానికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నెలకొందని పేర్కొన్నారు. నలుగురు సభ్యులు గైర్హాజరు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీకి నలుగురు సభ్యులు ముందస్తు సమాచారం ఇచ్చి గైర్హాజరు అయ్యారు. వ్యక్తిగత పనులతో తాము సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిపారు. గైర్హాజరైన వారిలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు ఉన్నారు. దాదాపు 25 అంశాలపై దిశానిర్దేశం సుమారు మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దాదాపు 25 అంశాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ తదితరాలపై గొంతు వినిపించాలని సూచించారు. మహిళలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, వైద్యరంగంలో దిగజారిన ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేత, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వంటి అంశాలు ప్రస్తావించాలన్నారు. ఏపీ నదీ జలాల చౌర్యం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో 20శాతం కమిషన్ల ఆరోపణలు, పరిశ్రమల ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధన, కులగణనలో తప్పులు, బెల్ట్‌షాపుల తొలగింపు, ఎల్ఆర్ఎస్, మేడిగడ్డ పునరుద్ధరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి వచ్చి తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో పాల్గొన్నారు. అనంతరం నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లేదా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు డిప్యూటీ లీడర్లు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ నియమించారు. తాజాగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మండలిలో ఎల్.రమణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీశ్‌రావు డిప్యూటీ లీడర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమల్లో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్నారు. సభ్యులు మొక్కుబడిగా కాకుండా, సమావేశాలు జరిగే రోజుల్లో ఉదయం 9.30కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. -
మన నీళ్లలో నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భజలాలు శుద్ధిచేయకుండా తాగునీటికి ఉపయోగించడం ఏమాత్రం సురక్షితం కాదని తాజా అధ్యయనం తేల్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) ప్రమాణాల కంటే కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ మోతాదులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27.48 శాతం మేర భూగర్భ నీటి నమూనాలను పరిశీలించగా నైట్రేట్ స్థాయిలు లీటర్‌కు 45 మిల్లీగ్రాముల నిర్దేశిత ప్రమాణాలకన్నా అధికంగా ఉన్నట్లు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా–2024 నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతుండటం వల్ల నైట్రేట్స్ మోతాదు, గాఢత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల్లేక మురుగునీరు భూగర్భజలాల్లో చేరుతుండటం కూడా నైట్రేట్స్ మోతాదు పెరుగుదలకు కారణమవుతోందని నివేదిక విశ్లేషిoచింది. దేశవ్యాప్తంగా నైట్రేట్స్ మోతాదులు ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి మూడో స్థానంలో నిలవగా ఆదిలాబాద్ 11వ స్థానంలో, సిద్దిపేట 12వ స్థానంలో నిలిచాయి. రసాయన ఎరువుల అధిక వాడకంతో..రాష్ట్రంలో వరిసాగు అధికం కావడంతో అధిక మోతాదులో ఎరువు మందులు వాడుతున్నారని.. అందులో సుమారు 30 శాతం పంటలు పీల్చుకుంటే మిగతా 70 శాతం మాత్రం నీటినిల్వ కారణంగా నెమ్మదిగా భూగర్భజలాల్లో కలుస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా నైట్రేట్ అధికంగా ఉన్న నీరు తాగేందుకు అనువైంది కాదంటున్నారు. ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–సేŠట్ట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్–2024 నివేదిక ప్రకారం 2021–22లో తెలంగాణలో ప్రతి హెక్టార్‌కు 297.5 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–2022–23 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో 2021–22 నుంచి 2022–23 మధ్య ఎరువుల వినియోగంలో 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు తేలిందని చెప్పారు.నైట్రేట్లు భూగర్భజలాల్లోకి చేరితే వాటిని శుద్ధి చేయడం మరింత కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చెరువులు, కాలువల్లోని కలుíÙతాలనే సరైన పద్ధతుల్లో శుద్ధి చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక భూగర్భజలాల్లో కలిసే నైట్రేట్లను శుద్ధి చేయడం ఇబ్బందేనని అంటున్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఏటా పండిస్తున్న మూడు పంటల్లో ఎకరానికి 10–15 బస్తాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నారని వివరించారు. దీనివల్ల విత్తనం, నేల వంటివి బలహీనంగా ఉండటమే కాకుండా రసాయన ఎరువుల అవశేషాలు పంటల్లోకి చేరుతున్నాయని.. వాటిని మనం ఆహారంగా తీసుకుంటుండటంతో మన శరీరంలోకి సైతం కెమికల్స్ ప్రవేశిస్తున్నాయని వివరిస్తున్నారు.మురుగు శుద్ధిపై పర్యవేక్షణ ఏదీ? హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి మెరుగుపడట్లేదు. దీనిపై స్వతంత్ర సంస్థతో ఇప్పటిదాకా పర్యవేక్షణే లేదు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల సంఖ్య పెరుగుతున్నా సమర్థంగా శుద్ధిచేయక మురుగునీరంతా భూగర్భజలాల్లో చేరడం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. – ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తనైట్రేట్లతో కేన్సర్ ముప్పు.. పంటల ఉత్పాదకతను పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. అవే నీటిని పంటల సాగుకు ఉపయోగిస్తుండటంతో హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా వాటిలో కలుస్తున్నాయి. చేపల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరంలో నైట్రేట్ల శాతాలు పెరిగితే కేన్సర్‌కు దారితీస్తుంది. పంజాబ్‌లో కేన్సర్ కేసుల పెరుగుదలకు పంటల కోసం అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగమే కారణమని తేలింది. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు -
కొండపర్తి దేశానికి రోల్‌మోడల్ కావాలి
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మారుమూలన ఉన్న ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామం అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. కొండపర్తిలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమైన అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారంటూ, వారిని అభినందించారు. మంగళవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన కొండపర్తికి చేరుకున్న ఆయన.. తొలుత కొమురంభీం, బిర్సాముండ విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులు, అంగన్వాడీ కేంద్రం, మసాలా, కుట్టు మెషీన్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం రిమోట్‌తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించి కొండపర్తి గ్రామస్తులతో మాట్లాడారు.అక్కడి నుంచి నేరుగా మేడారం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు కొండపర్తి, మేడారం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని అందులో, కొండపర్తి కూడా ఉందని చెప్పారు. కొండపర్తిలో మహిళల ఆర్థికాభివృద్ధికి ఇంకా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ ఏవిధంగా ప్రసిద్ధిగాంచిందో, అదే తరహాలో కొండపర్తి కారం, పసుపు, మసాలా యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ములుగు ప్రాంతంలో మిర్చి సాగు బాగుందని.. ఇక్కడి మిర్చి పౌడర్‌కు మంచి ఇమేజ్ రావాలని, తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పౌడర్ బాగా ఫేమస్ కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను, రాష్ట్రపతి, రాష్ట్రమంత్రి సీతక్క అందరూ ఆదివాసీ బిడ్డలమని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరిశ్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి భవానిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రంగంలోకి రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోలను బుధవారం నుంచి రంగంలోకి దింపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రోబో టిక్స్ బృందం మంగళవారం సొరంగం వద్దకు చేరుకుంది. మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. వాటిని ఆప రేట్ చేసే మాస్టర్ రోబోను సొరంగం వద్దకు తీసుకొచ్చారు. రోబోటిక్ నిపుణులు విజయ్, అక్షయ్ నేతృత్వంలో రోబోల అనుసంధానం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముమ్మరంగా గాలింపు సొరంగంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే వెలికి తీయగా, మిగతా ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 నుంచి డీ1 స్పాట్ల మధ్యలో ట్రెంచ్‌ను తవ్వుతున్నారు. టీబీఎం కట్టర్ హెడ్ భాగానికి వెనుకవైపు నుంచి డీ1 వరకు సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో ప్రతీ 10 మీటర్లకు ఒక చోట తవ్వకాలు జరుపుతూ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా చోట్ల మళ్లీ కడావర్ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనుషుల కన్నా 15 రెట్ల వేగం సొరంగం లోపల 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా.. చివరి 20 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు వదులుగా ఉండి మళ్లీ కూలే అవకాశం ఉండటంతో రోబోల ద్వారా రెస్క్యూ పనులను చేపట్టనున్నారు. సొరంగంలోని పెద్ద రాళ్లను, శిథిలాలను తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు ఒకటి, బురదను తొలగించేందుకు మరొక రోబోను వినియోగించనున్నారు. సొరంగం చివరన 200 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, బురద పేరుకుని ఉంది. రోబోల ద్వారా మూడు రోజుల్లో మొత్తం మట్టి, శిథిలాలను తొలగించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రోబోల రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగంలోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఇన్‌డెప్త్ ఏఐ కెమెరా, లైటర్ టెక్నాలజీ వినియోగించనున్నారు. -
తెలుగులో రాత... మార్కుల్లో కోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్–1లో అత్యధికంగా 530కి పైబడి మార్కులు వచ్చిన వారున్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలోని వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లిష్ లో పరీక్షలు రాసినవారు టాప్‌లో ఉన్నారని చెబుతున్నారు. మూల్యాంకనంలో ఇంగ్లిష్ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమమ్ మార్కులు వేయలేదని, ఫాక్ట్స్ రాసిన వాళ్లకు కొంత మేర మార్కులు ఇచ్చారని చెబుతున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసినవారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే... త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సాక్షి,హైదరాబాద్ : నల్లగొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు (Pranay Murder case) నిందితులకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు శిక్ష విధించింది. ప్రణయ్‌ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సంచలన తీర్పుతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు. 👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్‌తో పాటు కీ విడుదలైంది. ఓఎంఆర్ షీట్‌ను సైతం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ కొద్ది సేపటిక్రితమే విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకాగా, ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్-2 పరీక్షల ఇలా..టీఎస్పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్షను ,మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహించింది. -
పెళ్లయిన ఏడు రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు!
మణికొండ, హైదరాబాద్: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్‌హౌస్‌లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్‌హౌస్‌లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్‌హౌస్‌లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర! -
పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు. -
TG: ఇంటర్ ప్రశ్నా పత్రాల్లో తప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో పదాల తప్పులు కనిపించాయి. మ్యాథ్స్, బోటని, పొలిటికల్ సైన్స్ పేపర్స్‌లో తప్పులు గుర్తించారు. పదాలను మార్చి చదివేలా పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ల సహాయంతో మార్పు చేసి పదాలను అధికారులు వివరించారు.తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. రెండో సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేశారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్ తన మార్క్ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్ వాడీవేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు. -
మహిళలు.. మహారాణులు..!
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.సోలార్‌ప్లాంట్ ఆలోచనలో ఉన్నాంప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు.– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉందిమా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
Amrutha Pranay: ఒకరి ప్రేమ.. మరొకరి అహం..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి(Amrutha Pranay) ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఈ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!కడుపుతో ఉన్నా కరుగని మనస్సు..కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నాభిన్నమైన కుటుంబాలుప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్ఐసీ సంస్థలో విధులు నిర్వహిస్తుండగా.. పెద్ద కుమారుడు ప్రణయ్ డిగ్రీ వరకు చదివాడు. చిన్న కుమారుడు ఉక్రేయిన్ చదువుకుంటుండగా, యుద్ధ సమయంలో స్వదేశానికి వచ్చిన అతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. కాగా, కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. పెద్దకొడుకు ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చిన సమయంలో బాలస్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు నా కుమారుడు లేడు, అమృతకు భర్త లేడు, నా మనువడికి తండ్రి లేడు’ అంటూ కన్నీరుమున్నీరవుతూనే.. మారుతీరావు కూడా ఆత్మహత చేసుకోవడం కలిచి వేసిందన్నారు. ప్రణయ్ హత్య తరువాత కొద్ది నెలలు అత్తామామల వద్ద ఉన్న అమృత తన తండ్రి మరణం తరువాత తల్లిదగ్గరరకు వచ్చేసింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. తన భర్త హత్య వెనక తన బాబాయి శ్రవణ్‌కుమార్ ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులకు చెప్పడంతో హత్య కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌కు సైతం యాజ్జీవ కారాగార శిక్ష పడటంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత, ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదంగా మారి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. చదవండి: అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ యువ కార్పొరేటర్ హేమ సామల వివాహ వేడుకలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
మంచిర్యాల: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్‌గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్‌రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి.. తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్‌లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్‌చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
లెక్కల్లో గోల్మాల్.. శ్రీచైతన్య కార్యాలయాల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కార్యాలయంతోపాటు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు.పన్ను ఎగవేత ఆరోపణలపై అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో సోదాలు కొనసాగాయి. కాలేజీల నిర్వహణ, విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, సంస్థ ఆయా బ్రాంచీలవారీగా చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందుకు విద్యార్థుల నుంచి అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. రూ. 5 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్వేర్లను ఐటీ అధికారులు పరిశీలించారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటి సోదాలు నిర్వహించగా, గతంలోనూ 11 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తోంది. మాదాపూర్‌లోని శ్రీచైతన్య హెడ్ ఆఫీస్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. -
Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర!
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకు కీలక సూత్రధారులుగా ఉండి, సోమవారం జీవితఖైదు పడిన అస్ఘర్ అలీ, అబ్దుల్ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు వాటిలో ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్ఘరే అని సీబీఐ ఆరోపించింది. పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాద శిక్షణ... నల్లగొండలోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, చోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు.కాశ్మీర్ కు చెందిన ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన అస్ఘర్ నల్లగొండలోని ప్యార్ çసూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. ఆ కేసుల్లో మీర్జా నిందితుడిగా... బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కర సేవకుల్ని టార్గెట్‌గా చేసుకుని నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్ కాంప్లెక్స్ సమీపంలో, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్ బేగ్ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్ గౌడ్లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. తప్పించి తీసుకువెళ్లిన ద్వయం.. మీర్జాను తప్పించడానికి అస్ఘర్, బారీ తదితరులు పథక రచన చేశారు. 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్ చేయించారు. అస్ఘర్ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశీ్మర్కు పంపి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో మీర్జా హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వా«దీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్, బారీల పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. ఐఎంఎంఎంలోనూ అస్ఘర్ పాత్ర.. ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్ 6న ఎన్కౌంటర్ అయ్యాడు) ఇండియన్ ముస్లిమ్ మహ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచి్చన అస్ఘర్ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్ (గ్యాంగ్) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్ళి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు.అప్పట్లో మేడ్చల్‌లో అరెస్టు... ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేలి్చనా..గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్నగర్లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. 2018లో ప్రణయ్ హత్య కేసులో అరెస్టు కావడంతో పోలీసులు, నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హరేన్ పాండ్యా కేసును గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ విచారణ అనంతరం అస్ఘర్‌కు జీవితఖైదు పడింది. దీంతో 2019 ఆగస్టులో ఇతడిని సబర్మతి జైలుకు తరలించారు. -
కేసీఆర్‌ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య
-
హైటెక్ హంగులతో సమీకృత గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక హంగులతో కూడిన భారీ సమీకృత గురుకుల క్యాంపస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మంచి విద్యాబోధన, మెరుగైన వసతులు, మానసిక–శారీరక వికాసానికి వీలున్న పరిస్థితులు, హాస్టల్ వసతి, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణం, శుభ్రతతో కూడిన భోజనం..ఇలా అన్ని రకాలుగా ఇవి మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు.ఇందుకోసం తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. గతంలో రోడ్లు, భవనాల శాఖలో ఈఎన్సీగా పనిచేసి పదవీ విరమణ పొందిన గణపతిరెడ్డిని ప్రభుత్వం తాజాగా దీనికి ఎండీగా నియమించింది. ఇన్ఫోసిస్‌తో ఒప్పందం.. ఈ గురుకులాల్లో విద్యాబోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠ్యాంశాల తయారీ, బోధన పద్ధతులు, ఆధునిక బోధన వ్యవస్థ ఏర్పాటు.. తదితరాల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనితో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ గురుకులాల్లో పూర్తిగా డిజిటల్ బోర్డులు వాడుతారు. ఒక్కో క్యాంపస్ ఇలా... యూనివర్సిటీల మాదిరిగా విశాలమైన ప్రాంతాల్లో ఈ సమీకృత గురుకుల సముదాయాలను నిర్మిస్తారు. ఒక్కో గురుకులం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కనీసం 2,560 మంది విద్యార్థులు, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి 640 మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చూస్తారు. వాటిల్లో నిర్ధారిత దామాషాలో ఓసీ విద్యార్థులను కూడా చేర్చుకుంటారు. ⇒ అకడమిక్ బ్లాక్, డార్మెటరీ బ్లాక్, వంట, భోజనశాల, స్టాఫ్ క్వార్టర్స్ సముదాయం విడివిడిగా ఉంటాయి. ⇒ విద్యార్థులకు పాఠాలు బోధించే అకడమిక్ బ్లాక్ రెండంతస్తులతో నిర్మిస్తారు. ఇందులో 64 తరగతి గదులు, 10 ప్రయోగశాల గదులు, 12 ఉపాధ్యాయుల గదులు, ఒక పరిపాలన బ్లాక్, గ్రంథాలయం, 12 టాయిలెట్లు ఉంటాయి. ఇలాంటివి నాలుగు బ్లాక్స్ ఉంటాయి. ⇒ విద్యార్థుల వసతి గృహాలకు సంబంధించి 11 బ్లాక్స్ నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్‌లో 148 డార్మెటరీ హాల్స్ ఉంటాయి. వీటిని జూనియర్ హాస్టల్స్, సీనియర్ హాస్టల్స్‌గా విడివిడిగా కేటాయిస్తారు. జూనియర్ సెక్షన్లో ఒక్కో హాలులో 14 మంది విద్యార్థుల సామర్థ్యంతో 120 హాల్స్ ఉంటాయి. వాటిల్లో 1,680 మంది విద్యార్థులుంటారు. సీనియర్ సెక్షన్లో 376 మంది విద్యార్థులుండేలా 28 హాళ్లను నిర్మిస్తారు. ⇒ 41,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంట, భోజన శాల బ్లాక్ ఉంటుంది. ఇందులో రెండు డైనింగ్ హాల్స్, ఒక వంటశాల, 2 వెజ్, నాన్‌వెజ్ స్టోర్లు, ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక మల్టీ పర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ హాల్ ఉంటాయి. 1,280 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో దీన్ని వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. అధ్యాపకులు, సిబ్బంది కోసం కూడా ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తారు.ఏ నిర్మాణానికి ఎంత ?⇒ ప్రధాన భవన సముదాయాల నిర్మాణానికి: రూ.140 కోట్లు⇒ ప్రహరీ, పచ్చిక బయళ్లు, సెక్యూరిటీ బ్లాక్, కాంక్రీట్ డ్రెయిన్, రోడ్లు, ఎస్టీపీ, ప్లే గ్రౌండ్స్, భూగర్భ సంప్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, లిఫ్టులు, వీధి దీపాలు, సౌర విద్యుత్ వ్యవస్థ తదితరాలు రూ. 30 కోట్లు⇒ ఎలక్ట్రిక్ ఉపకరణాలు, డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, ఫర్నీచర్, క్రీడా పరికరాలు, వంటగది వ్యవస్థ, పన్నులు తదితరాలు: రూ.30 కోట్లు⇒ 58 నియోజకవర్గాల్లో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11,600 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో క్యాంపస్‌కు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర, సూర్యాపేట నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ మూడు నియోజకవర్గాలు కాకుండా మరో 55 నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఐదు స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. సభలో ఉన్న బలాబలాలను బట్టి మూడు అధికార కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్కు దక్కడం ఖాయం కాగా, మిగిలిన ఐదో స్థానంలో గెలిచేందుకు ఈ అవకాశం లేదు.ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ రెండో అభ్యరి్థని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఆ పార్టీ నుంచి కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఉపసంహరణల ప్రక్రియ ముగిసేసరికి ఉన్న నామినేషన్లను పరిగణనలోకి తీసుకుంటారు.ఉపసంహరణల సమయం ముగియగానే ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే మిగిలితే అందరు అభ్యర్థులు ఏక్రగీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. మొత్తం మీద పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలావుండగా..మరో ప్రధాన పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంది. -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్‌కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్‌రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
పరువు హత్యలు ఆగేనా?
సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుందనో.. తమ సామాజిక వర్గం కాకుండా ఇతరులను ఇష్టపడిందనో.. అవతలి కుటుంబం తమ తాహతుకు తగినది కాదనో.. ఇలా కారణమేదైనా పరువు, ప్రతిష్టల పేరిట దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. పరువు సంగతేమోగానీ.. తమవారిని కోల్పోయి ఓవైపు, హంతకులుగా మారి జైళ్లలో మగ్గుతూ మరోవైపు.. రెండు వైపులా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తాజాగా ప్రణయ్ హత్య కేసులో దోషులకు శిక్షలు విధించిన నేపథ్యంలో.. పరువు హత్యలపై మరోమారు విస్తృత చర్చ మొదలైంది. కులమతాల పట్టింపులతో..: కాలంతోపాటు మనిషి ఎన్నో విషయాల్లో మారుతూ వచ్చి నా.. కులమతాల విషయంలో మాత్రం ఇంకా పట్టింపులను వదలని పరిస్థితులు ఉన్నాయి. పిల్లలకు ఇష్ట ప్రకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇచ్చినా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కట్టుబాట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తెగించి కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. కొన్నిసార్లు పరువు హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రణయ్ హత్య తర్వాత అలాంటి ఘటనలే మరికొన్ని జరిగాయి కూడా.ఆగని పరువు హత్యలు.. ⇒ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడంతో పగ పెంచుకున్న ఆమె తమ్ముడు.. గతేడాది డిసెంబర్ 1న స్కూటీపై వెళుతుండగా వెంబడించి కొడవలితో నరికి హత్యచేశాడు. ⇒ దండుమైలారం గ్రామంలో ఒక యువకుడిని ప్రేమించిందన్న కోపంతో తన కుమార్తె భార్గవిని తల్లి జంగమ్మ చీరతో ఉరివేసి హతమార్చింది. ⇒ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు, అశ్రీన్ దంపతులు 2022 మేలో హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళుతుండగా ఆపి.. నాగరాజును దారుణంగా చంపారు.⇒ 2022 మేలో ప్రేమ వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు బేగంబజార్ మచ్చి మార్కెట్ సమీపంలో నీరజ్ పన్వర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి హత్య చేశారు. -
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ప్రణయ్ హంతకుడికి ఉరి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం అమృత ప్రణయ్‌తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్ చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్ వివాహమై 8 నెలలు గడిచింది.అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ తల్లితో కలసి అమృతను మెడికల్ చెకప్ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. అజ్గర్ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 1,200 పేజీలతో చార్జిషిట్.. ప్రణయ్ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్ 19న 1,200 పేజీలతో చార్జిషిట్‌ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్ 302, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్ అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 మహ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్‌విత్ 120 (బీ), 109, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్‌కుమార్ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్ హత్య కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.అమృతకు బాసటగా కౌసల్య మిర్యాలగూడ అర్బన్: ప్రణయ్ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్‌ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.ప్రణయ్ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.కేరళ ఎంపీ డిమాండ్‌తో..: కేరళకు చెందిన దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. -
ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
రియల్ బ్రోకర్లతో రేవంత్ స్కాం
సాక్షి, హైదరాబాద్: నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రూ. వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు(KTR) ఆరోపించారు. త్వరలో హైదరాబాద్‌లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై పరిమితులు విధించడం ద్వారా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)కు కృత్రిమ డిమాండ్ పెంచే కుట్ర జరుగుతోందన్నారు.హైదరాబాద్‌లో టీడీఆర్‌లను ఎవరు అడ్డగోలుగా కొన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘త్వరలో ఎఫ్ఎస్ఐపై పరిమితులను బూచిగా చూపి టీడీఆర్‌లను తిరిగి బిల్డర్లకు అడ్డగోలు ధరలకు అమ్మేందుకు రేవంత్ ముఠా సిద్ధంగా ఉంది. ఎఫ్ఎస్ఐపై ఉమ్మడి ఏపీలో వై.ఎస్. ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది.గతంలో టీడీఆర్ పద్ధతిలో రూ. వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలను జీహెచ్ఎంసీ ప్రజావసరాల కోసం సేకరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవినీతి మార్గాలు తెలిసింది రేవంత్‌కే.. ‘దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బు సంపాదనకు అత్యధిక మార్గాలు తెలిసింది రేవంత్‌కే. ఆయన పాలనలో ప్రైవేటు దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికే రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్తున్నాడు. రేవంత్, కిషన్‌రెడ్డి దొంగాట ఆడుతూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు. రేవంత్‌ను ఉద్దేశించే కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘స్థానికం’, ఉపఎన్నికల ఉద్దేశంతోనే మండలి ఎన్నికకు దూరం స్థానికసంస్థల ఎన్నికలు, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే శాసనమండలి పట్టభద్రుల స్థానం ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రెండో అభ్యరి్థని మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలపలేదని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు గవర్నర్ ప్రసంగంతోపాటు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడే పిచ్చిమాటలు, పనికిరాని మాటలు, బూతులు వినాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని ఒక కొడుకుగా, పార్టీ కార్యకర్తగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు, రేవంత్ ఆవగింజంత కూడా సరిపోరని వ్యాఖ్యానించారు. మళ్లీ ఫార్ములా–ఈ నోటీసులు రావచ్చు.. ఈ నెల 16 నుంచి 27లోగా మళ్లీ తనకు ఫార్ములా–ఈ కేసు పేరిట విచారణ నోటీసులు రావచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఫార్ములా–ఈ’ని ప్రశ్నిస్తున్న వారు రూ. 200 కోట్లతో రేవంత్ ప్రభుత్వం నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు ఏం ఒరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బయటి దేశాల్లో జరుగుతున్న మరణాలను రేవంత్ తనకు అంటగట్టడం విడ్డూరమని.. తాను కేసీఆర్ అంత మంచివాడిని కానని వ్యాఖ్యానించారు. బీసీలకు రిజర్వేషన్లపై రేవంత్‌కు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపిందీ నేనే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్(KCR)ను బండకేసి కొట్టింది నేనే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఓడగొట్టిందీ నేనే. గద్దె దింపింది నేనే..ఆ కుర్చిలో కూర్చుందీ నేనే. సీఎంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చింది నేనే. ప్రస్తుతం నాది ముఖ్యమంత్రి స్థాయి. ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.స్థాయి అంటే ఏంటని, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? డ్రగ్స్ పెట్టుకుని పార్టీలు చేసుకుంటే వస్తుందా?..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు. కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ‘కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు. ఆయనకు, కొడుకు కేటీఆర్‌కు బలుపు తప్ప ఏమీ లేవు. ఆ కుటుంబానికి ఎందుకంత బరితెగింపో అర్థం కావడం లేదు. అయినా కేసీఆర్ చెల్లని రూపాయి. ఆయన గురించి మాట్లాడడం వృ«థా. బీఆర్ఎస్ చేసిన అప్పులు, తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. అయినా బీఆర్ఎస్కు తెలంగాణతో సంబంధం లేదు. అందుకే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. స్పైడర్ సినిమాలో విలన్ తరహాలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు సంబరపడుతూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు. యూజ్లెస్ ఫెలో మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులు మేము 14 నెలల్లో చేశాం. కాళేశ్వరం, మేడిగడ్డలు లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించాం. అయినా రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి రొయ్యల పులుసు తిన్నోళ్లు ఎవరు? యూజ్లెస్ ఫెలో, హౌలేగాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి హరీశ్‌రావు లొంగిపోయాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పని చేయాలని, కాంగ్రెస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే డబ్బులు పంచి మరీ బీజేపీకి హరీశ్‌రావు ఓట్లు వేయించాడు..’ అని రేవంత్ ఆరోపించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా లెక్కబెడదాం ‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. 2014 జూన్ 2 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్లాయి? మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి? ఏ రూపంలో వచ్చినా సరే లెక్కపెడదాం. నేను, మా ఉప ముఖ్యమంత్రి భట్టి వస్తాం. కిషన్‌రెడ్డితో పాటు ఎవరినైనా రమ్మనండి. చర్చిద్దాం. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా అక్కడే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా..’ అని సీఎం సవాల్ చేశారు. ఎక్కువ సాగుతోనే నీటికి ఇబ్బందులు ‘గత పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎప్పుడైనా యాసంగిలో 35–40 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో ఏకంగా 55 లక్షల ఎకరాలు సాగయింది. అందుకే అక్కడక్కడా నీటికి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఏ రిజర్వాయర్ నుంచి ఏ మేరకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలన్న దానిపై అధికారులు ఎప్పుడో షెడ్యూల్ సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే అనుమతులను బట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పనులు ఉంటాయి. రిజల్ట్స్ వేరు..రిజర్వేషన్లు వేరు కృష్ణమాదిగ బీజేపీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ వేరు, రిజర్వేషన్లు వేరు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ల మేరకు ఇప్పుడు ఫలితాలు ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలను మేము మార్చలేం. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ న్యాయం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ? ‘రీజనల్ రింగు రోడ్డు ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. నేను మెట్రో తెచ్చానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనపడుతోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి నిర్వహించిన సమావేశానికి రమ్మంటే సమయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. మరి కేంద్రమంత్రి ఖట్టర్ సికింద్రాబాద్‌లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేంద్రమంత్రి ఖట్టర్ కూడా కిషన్‌రెడ్డిని హడావుడిగా పిలిచాడా? కేసీఆర్ ఫీలవుతాడనే ఆ సమావేశానికి కిషన్‌రెడ్డి వెళ్లలేదు. కేసీఆర్ చెప్పిన చదువు మా దగ్గర చెపితే ఎలా?..’ అని రేవంత్ అన్నారు. -
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్: దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏపీ,తెలంగాణ చెన్నై,బెంగళూరు,ఢిల్లీ,ముంబై నగరాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. శ్రీచైతన్య సంస్థ పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.హైదరాబాద్ ప్రధానంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరుపుతుందనే సమాచారంతో ఐటీ అధికారులు సోమవారం ఏక కాలంలో శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు చేశారు.విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్ నిర్వహించినట్లు సమాచారం. ఐటీ అధికారుల సోదాల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రణయ్ కేసు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాకింగ్ కామెంట్స్
నల్లగొండ, సాక్షి: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అయితే ప్రణయ్ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రణయ్- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య..ప్రణయ్ హత్య సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఆ సమయంలో ప్రణయ్ హత్యకేసులో మొదటి నుంచి సాక్షలు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. చాకచక్యంగా ఛేదించాండీఎస్పీగా శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్,టాస్క్ ఫోర్స్,కానిస్టేబుల్స్, ఎస్సైలు,రైటర్స్‌తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ, సీనియర్ అధికారురు ఐజీ స్టీఫెన్ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.ముందు లైఫ్‌లో సెటిల్ అవ్వండిప్రణయ్ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముందు పిల్లలు లైఫ్‌లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నేటి యువతకు ఓ గుణపాఠం లాంటిందిలేదంటే ప్రణయ్ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్),అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.అమృతమీద అమితమైన ప్రేమేప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్ ఎస్టేట్‌లో సమస్యల నుంచి బయటపడేవారు.అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో.. కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదుఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్ షీట్ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్ ముగించారు. -
నేనే మెట్రో తెచ్చా అంటున్నారు.. ఆ మెట్రో ఎక్కడుందో?: రేవంత్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. కిషన్‌రెడ్డి.. మెట్రో తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో తనకైతే తెలియదంటూ చమత్కరించారు రేవంత్. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా రేవంత్ మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సహకరించడం లేదు. తెలంగాణకు నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్‌రెడ్డికి తెలియదా?, ఈటల వచ్చారు.. కానీ కిషన్‌రెడ్డి రాలేదు. మెట్రో నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి అంటారు. నాకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్పిస్తోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది?,రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. అదే ఇవ్వమని అంటున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే. మూసీకి నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతాను. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదు? అని రేవంత్ ప్రశ్నించారు.ఇక రేవంత్ తన ఢిల్లీ పర్యటనపై కూడా మాట్లాడారు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తాను. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చాను. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయి. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
TSPSC : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి లాగిన్‌లో ప్రొవిజనల్ మార్కులు చూసుకునే అవకాశం ఉంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు,అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.ఫలితాల విడుదల షెడ్యూల్మార్చి 10 - గ్రూప్-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.మార్చి 11 - గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 14 - గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 17 - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.మార్చి 19 - ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.గతేడాది అక్టోబర్‌లో మెయిన్స్తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసింది.హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. -
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు -
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. బడ్జెట్‌పై మాట్లాడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడాలన్నారు. అలాగే, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.ఎమ్మెల్సీ కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్ వచ్చారు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్‌ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్ నామినేట్ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్ బీఆర్ఎస్ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్ఎస్పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.రెండు జాతీయ పార్టీలదీ ఒకటే ధోరణి. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు టీడీఆర్ ల్యాండ్ కొనే పనిలో తిరుగుతున్నారు. టీడీఆర్ అతి పెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారు. రేవంత్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల ద్వారా శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే యోచనలో రేవంత్ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం లేని అప్పులు చూపించి.. ఎక్కువ మిత్తి చూపిస్తున్నారు. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న రేవంత్.. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒక్క పోరాటమైనా చేసిందా?. బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్‌గా ఉంది. అందుకే అటెన్షన్ కోసం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. ఈ-కారు రేసును ముందుకు తెచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం ఏం సాధిస్తారు?. 200 కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది?. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని ప్రశ్నించారు. -
సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బాబోయ్ బరాత్!.. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం
చిలకలగూడకు చెందిన వర్షిణి ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధవుతోంది. చదువుకునే సమయంలో అర్ధరాత్రి దాటేంతవరకు ఆగకుండా మోగుతున్న డప్పుల చప్పుడుకు ఏకాగ్రత కోల్పోయి, అటు చదువుకు ఇటు నిద్రకు దూరమై.. మరుసటి రోజు పరీక్ష సరిగా రాయలేక పోయింది.రాత్రి 10 గంటల వరకే.. బ్యాండ్ బరాత్‌లు, ర్యాలీలకు రాత్రి 10 గంటల వరకే పోలీసులు అనుమతి ఇస్తున్నా.. అర్ధరాత్రి దాటేవరకు ఇవి సాగుతున్నాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో శబ్ద కాలుష్యంపై డయల్ 100కు మూడుసార్లు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా స్పందించారు’ అని నామాలగుండుకు చెందిన వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, సిటీబ్యూరో/చిలకలగూడ: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కంటే ఎక్కువగా పెళ్లి బరాత్‌ల టెన్షన్ పట్టుకుంది. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర శబ్ద కాలుష్యం వెలువడుతుంటమే దీనికి కారణం. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసు విభాగం సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. డయల్–100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరి బాధ వారిది.. పెళ్లిళ్ల సీజన్ వచి్చందంటే చాలు నగర వ్యాప్తంగా బరాత్‌ల హడావుడి కనిపిస్తుంటుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకని, అందరికీ మధుర జ్ఞాపకంగా మిగలడం కోసం ఇలా చేసుకుంటామని నిర్వాహకులు చెబుతుంటారు. హంగులు, ఆర్భాటాల మాట అటుంచితే.. ఊరేగింపులోని డీజేలు, ఇతర శబ్దాలతో పాటు బాణాసంచా తదితరాల వల్ల ఎదుటి వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారు పట్టించుకోరనేది బాధితుల మాట. రహదారులకు పక్కన, ఫంక్షన్ హాళ్ల చుట్టుపక్కల నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సాధారణ సమయల్లో ఈ ఇబ్బందుల్ని భరిస్తున్నా ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని వాపోతున్నారు. ఆ ప్రాంతాల్లో నిషేధం ఉన్నా.. పెళ్లి బరాత్ అంటేనే నెమ్మదిగా సాగే సమూహం. ఒకప్పుడు బరాత్‌లు కిలోమీటర్ల మేర సాగేవి. అంతర్గత రహదారుల్లోనే కాకుండా ప్రధాన రహదారుల పైనా గంటల పాటు ఈ ఊరేగింపులు నడిచేవి. వీటి కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు కొన్నేళ్ల క్రితం బరాత్‌లను నిషేధించారు. అయినప్పటికీ.. కాలనీలతో పాటు ఫంక్షన్ హాళ్ల సమీపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటున్న పోలీసులు వీటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. సమయపాలన లేకుండా శబ్దాలు.. దీంతో ఇటీవల కాలంలో బరాత్‌ల హంగామా ఎక్కువైంది. నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడాలనే నిబంధన ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి సౌండ్లు చేయడానికి వీలులేదు. ప్రాంతాల వారీగా ఎన్ని డెసిబుల్స్ శబ్ద తీవ్రత ఉండాలనేది నిర్ధారించారు. వీటికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. అయినప్పటికీ బరాత్‌ల నిర్వాహకులు వీటిని పట్టించుకోవట్లేదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు వీరివల్ల నరకం చవి చూస్తున్నారు. పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు.. బరాత్ల్లో వెలువడుతున్న శబ్దాల కారణంగా విద్యార్థులు చదువుకోలేకపోవడమే కాదు.. చివరికి కంటి నిండా నిద్రకూ దూరమై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రభావం ఫైనల్ పరీక్షలపై ఉంటోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా నడుస్తున్న బరాత్‌లు, డీజేలపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండట్లేదని వాపోతున్నారు. కఠిన చర్యలు లేని కారణంగా గస్తీ బృందాలు వచి్చనప్పుడు ఆపేస్తున్న నిర్వాహకులు వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ మొదలెడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు అవసరమైన పట్టించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పరీక్షల సీజన్లో శబ్ద కాలుష్యం లేకుండా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం -
కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ విజయ సంబురాల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లాఠీ ఛార్జ్ ఆరోపణలను కరీంనగర్ పోలీసులు ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.కరీంనగర్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కేంద్ర మంత్రులు పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిని పోస్ట్ చేశారు. అయితే.. విజయ సంబురాల్లో ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రుల ట్వీట్స్ ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. అవి ఫేక్ వీడియోలంటూ స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించారు. కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా.. భారత జట్టు విజయం సాధించిన సందర్బంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.This is how the Congress govt. in Telangana not allowing India’s #ChampionsTrophy2025 win celebrations.Shameful! pic.twitter.com/OxIdrfkn90— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025బండి సంజయ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు?. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ, పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా?. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది?. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.Can the Home Minister of Telangana Shri Revanth Reddy garu clarify - which country is Karimnagar police supporting?We can’t celebrate India’s win, but a flexi with Pakistan’s name will be removed?How does celebrating India’s victory become a “communal issue”? @TelanganaDGP… https://t.co/4Hpyid5ThM— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 9, 2025 -
దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
దుబాయ్‌లో భర్త .. స్కూల్ ప్రిన్సిపాల్‌కి కాల్ చేస్తున్న యువకుడు
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తా’ అంటూ వివాహితను బెదిరిస్తున్న యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే వివాహిత (32) స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా, 2016 నుంచి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. గత ఏడాది తన స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన పోస్ట్ చేసింది. షేక్ వసీం అనే యువకుడు ఆమె ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఫాలో అవుతూ ఆమె ఫోన్ నెంబర్‌ను అడ్మిషన్ కావాలంటూ అడిగి తెలుసుకున్నాడు. తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో స్కూల్లో సిబ్బంది నుంచి ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా లిఫ్ట్ చేయడం ఆపేసింది. ఈ నేపథ్యంలోనే షేక్ వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్ ఇస్తారు.. తీసుకురా అని చెప్పసాగాడు. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ తిరుగుతూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
New Ration Cards: తీసివేతలకు తిప్పలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు మంజూరు మాటేమో గానీ.. పాత కార్డులోని పేర్ల తొలగింపు ప్రక్రియకు సైతం తిప్పలు తప్పడం లేదు. వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబ కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కుటుంబం రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలిగించుకునేందుకు ఉరుకులు పరుగులు చేస్తున్నారు. మీ సేవ, పౌర సరఫరాల సర్కిల్, తహసీల్ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్ దరఖాస్తులు సమరి్పంచి మెంబర్ డిలిషన్ కోసం రెండు మూడుసార్లు చక్కర్లు చేయక తప్పడం లేదు. సంబంధిత సిబ్బంది సైతం సిఫార్సు దరఖాస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా వాటిని పెండింగ్‌లో పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షన్నరకు పైగా దరఖాస్తులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో సుమారు రేషన్ కార్డుల్లోంచి పేర్ల తొలగింపునకు సుమారు లక్షన్నరకుపైగా ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో సగానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. గ్రేటర్ మొత్తమ్మీద సుమారు పన్నెండు అర్బన్ సర్కిల్ పరిధిలో 12,34,873 కార్డులు ఉండగా.. వీటిలో 42,72,820 మంది లబ్దిదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు ఉండగా.. అందులో 17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో మొత్తమ్మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు పెళ్లిళ్లతో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త కుటుంబాలకు ఆసక్తి పెరిగింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబం కార్డులోని పేర్లు తొలగింపు పెద్ద సమస్యగా పరిణమించింది. కొత్త కుటుంబాల్లోని దంపతుల్దిరూ.. వారి తల్లిదండ్రుల కార్డుల్లో లబి్ధదారులుగా ఉండటంతో అందులోంచి వారి పేర్లను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రెండు కార్డుల్లోని ఇద్దరి పేర్లు డిలిషన్ కోసం తంటాలు పడుతున్నారు. రేషన్ కార్డుల్లో అర్బన్ పరిధికి సంబంధించి డిలిషన్ ప్రక్రియ సివిల్ సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రక్రియ తహసీల్ ఆఫీస్‌లో జరుగుతోంది. -
నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరే అభ్యర్థి పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సీపీఐ అభ్యర్థి సత్యం బరిలో ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పోటీలో నిలిచారు. ఇక, నామినేషన్ పేపర్లపై అభ్యర్థులను బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ సేకరించారు. నేడు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. -
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
కరీంనగర్: అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించి మంచి మనసు చాటుకున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదన్‌కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని ఆదివారం కళాభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూసుకున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. మౌనికకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండీ పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి.. వధూవరులకు నూతన వ్రస్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. వివాహానికి జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు, వివిధ శాఖల అధికారులందరూ ఆర్థిక సహాయం అందించారు. కాగా మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. Officials Became Parents: Grand Wedding of an Orphaned Young Woman was performed Karimnagar @Collector_KNR @PamelaSatpathy Satpathy and Manakondur MLA Kavvampalli Satyanarayana Organized a Wedding at KalabharatiA grand wedding ceremony was held at Kalabharati Auditorium in… pic.twitter.com/UMzBkniH0Z— Jacob Ross (@JacobBhoompag) March 9, 2025 -
HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్‌పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025 -
బడిని బాగు చేసేదెలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతుండటం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితిని మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా చేరికలు తగ్గడంపై సర్వే చేయాలని చెప్పింది.దీంతో తొలిసారిగా తెలంగాణ విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు జిల్లాలకు వెళ్లనున్నాయి. ఇందుకోసం తొలుత ఈ నెల 3, 4 తేదీల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లే బృందాలకు 6, 7 తేదీల్లో శిక్షణ ఇచ్చారు.ఒక్కో జిల్లాలో 100 స్కూళ్ల పరిశీలనజిల్లాకు దాదాపు 100 చొప్పున స్కూళ్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. మొత్తం ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి. స్కూళ్లలో అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్, సిలబస్ పూర్తి, ల్యాబొరేటరీ నిర్వహణ, అంతర్గత మూల్యాంకన విధానంపై అధ్యయనం చేస్తాయి. సర్వేలో భాగంగా దాదాపు 9 వేల పాఠశాలల్లోని విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. బృందాలు ఇచ్చే నివేదికలపై ముందుగా విద్యాశాఖ, ఆ తర్వాత ప్రభుత్వం లోతుగా సమీక్షించి చేపట్టవలసిన కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి. ప్రమాణాలు పడిపోతున్నాయన్న ‘ఆసర్’రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని వార్షిక విద్యా స్థాయి నివేదిక (ఆసర్) ఇటీవల వెల్లడించింది. గత ఏడాది ఆసర్ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఇటీవల ఈ నివేదికను అందజేసింది. రాష్ట్రంలోని 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లిన ఆసర్ బృందాలు 3 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, 14–16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో పలు ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి. స్కూళ్లకూ ఫోన్లు.. ఆలోచనా శక్తే లేదు!చిన్నపాటి కూడికలు, తీసివేతల్లో కూడా పాఠశాల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. 96 శాతం విద్యార్థుల్లో ఆలోచన శక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది. అంతా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలకూ వీళ్లు ఫోన్లు తెస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో హాజరు శాతం 2022లో 75.50 శాతం ఉంటే, ప్రస్తుతం 73 శాతానికి పడిపోయింది. 62 శాతం పాఠశాలల్లో ఒకటో తరగతి పిల్లలను ఇతర తరగతులతో కలిపి కూర్చోబెట్టడం వల్ల విద్యాభ్యాసం ఏమాత్రం సాగడం లేదు. రానురాను 60 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉంటే 2024లో 45.20 శాతానికి చేరుకోవడం ఆందోళన కల్గించే అంశం. వచ్చే ఏడాదికల్లా విశ్వాసం కల్పించేలా..గత పదేళ్లలో ప్రభు త్వ స్కూళ్లల్లో చేరికలు 32 శాతం తగ్గిపోయాయి. 2014–15లో 24.85 లక్షల మంది సర్కారీ స్కూళ్లల్లో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలుగా ఉంది. విద్యా ర్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరుతుండటమే ఇందుకు కారణం. కాగా టీచర్ల సంఖ్య పెంచినా, మౌలిక వసతులు కల్పించినా, ఎందుకు ఈ పరిస్థితి ఉందనే దానిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రైవేటు స్కూళ్లలో 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 2024–25లో ఈ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. వీటన్నింటినీ అధ్యయనం చేసి, వచ్చే ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సర్వే చాలా కీలకంరాష్ట్ర విద్యా రంగంలో తీసుకురావా ల్సిన మార్పులపై సరైన ఫీడ్‌బ్యాక్ కోసం తొలిసారిగా సర్వే చేపడుతున్నాం. క్షేత్రస్థా యిలో పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తాం. దాని ఆధారంగా అవసరమైన మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. అందుకే ఈ సర్వే చాలా కీలకమైంది. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్యా డైరెక్టర్ఎక్కడ ఏం చేయాలో తెలుస్తుందిక్షేత్రస్థాయి సర్వేతో ఎక్కడ, ఎలాంటి మార్పులు తేవాలనేది వెల్లడవుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి వీలవుతుంది. అధ్యయనాలతో సరిపెట్టకుండా స్కూళ్లకు అవసరమైన మేర నిధులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు పోటీ కోణంలో విద్యా విధానం ఉంటే ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ప్రవేశాలు పెరుగుతాయి. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూటీఎస్ నేత -
సామాజిక కోణంలోనే ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతిఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఓసీ కోటా మినహాయింపుఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత టి.జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్‌పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటాఅసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
రేపు బీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే చాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం పేరు ఖరారైంది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన నెల్లికంటి సత్యం యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. 1969 జూన్ 6న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతమ్మ, పెద్దయ్య, భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. విస్తృతంగా చర్చించి ఎంపిక.. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థా నం కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివా రం సాయంత్రం ప్రకటించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్లో సమావేశమై చర్చించింది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితోపాటు మరి కొందరు నేతలు ఎమ్మెల్సీ స్థానం కోసం ఆసక్తి చూపినా.. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, ప్రజా పోరాటాల్లో పాల్గొన్న తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. తెలంగాణ శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్‌కు సీపీఐ ధన్యవాదాలు స్నేహధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. -
సన్నాల కోసం చూస్తే.. దొడ్డు బియ్యం కూడా రాలే
సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా జరుగుతుందని ఆశించిన పేదలకు నిరాశే మిగిలింది. సన్నబియ్యం సంగతి దేవుడెరుగు.. నెలనెలా వచ్చే దొడ్డు బియ్యం కూడా ఇంకా రాకపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు సంచులు పట్టుకొని రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు వారం రోజులుగా చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి. దుకాణాలకు చేరని బియ్యంప్రతినెల ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ మొదలై పదో తేదీ నాటికి దాదాపు పూర్తవుతుంది. ఈసారి పదో తేదీ వచ్చినా ఇంకా సుమారు 50 శాతం రేషన్ దుకాణాలకు బియ్యమే చేరలేదు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి నెలాఖరులోగానే దుకాణాలకు బియ్యం సరఫరా కావాలి. ఈసారి ఎంఎల్ఎస్ పాయింట్లకే ఒకటో తారీఖు తరువాత అలాట్మెంట్ ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని 17,335 రేషన్ దుకాణాలకు గాను చాలా దుకాణాలకు కూడా రేషన్ బియ్యం అందలేదు. ఈ నెల కోసం 1.51 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం రావాల్సి ఉండగా, వచ్చింది 62,346 మెట్రిక్ టన్నులే. అంటే 42 శాతమే సరఫరా అయ్యింది.సన్నబియ్యంపై డైలమా..మార్చి నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దొడ్డు బియ్యం బఫర్ స్టాక్‌ను పూర్తిచేసే పనిలో పౌరసర ఫరాల సంస్థ అధికారులు ఉన్నారు. వానాకాలం సీఎంఆర్ సన్న వడ్లను రెండు నెలలుగా మిల్లింగ్ చేయించి గోదా ములకు పంపుతున్నారు. దీంతో దొడ్డు బియ్యం స్టాక్ లేకుండా పోయింది. అయితే ఈ నెలలో కూడా దొడ్డు బియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయించడంతో.. గత నెల 20వ తేదీ నుంచే ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సిన దొడ్డు బి య్యం స్టాక్ వెళ్లలేదు. 2వ తేదీ నుంచి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపినట్లు ఓ అధికారి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం పంపేందుకు కృషి చేస్తున్నట్లు ఓ జిల్లాకు చెందిన డీఎస్ఓ ‘సాక్షి’కి తెలిపారు.ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ...?ఈ వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రాగా, దాన్ని మిల్లింగ్ చేస్తే 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని అంచనా. రాష్ట్ర అవసరాలకు ఈ బియ్యం 8 నెలలు సరిపోతాయి. వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఏప్రిల్‌లో ఇచ్చే కోటాను లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. వానాకాలం సీజన్లో రైతుల నుంచి సేకరించిన సన్న «ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పేదలకు సన్న బియ్యంగా సరఫరా చేస్తే.. కొత్త బియ్యం సరిగా ఉడకదు. అందుకని రెండు నెలలు నిల్వ చేసి మార్చి నుంచి పంపిణీ చేస్తాం. – గత డిసెంబర్లో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ వెల్లడిమార్చి నెల నుంచి రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తాం. – పలు సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ -
బీసీలు ఎదగకుండా అడ్డుకునే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలు ఎదగకుండా, వారికి 42 శాతం రిజర్వేషన్లు అందకుండా ఆదిలోనే అడ్డుకునే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని.. దానితో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్లే ఆయా పార్టీల నేతలు లేనిపోని అపోహలు సృష్టించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను బీసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సమాచారమంతా అధికారికంగా సేకరించినదే. ఇంటి యజమాని ధ్రువీకరణ కూడా తీసుకున్నాం. ఈ సర్వేలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్టు తేలింది. గతంలో కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో బీసీల జనాభా 51శాతమే లెక్కించారు. ఇప్పుడు 5.33 శాతం పెరిగింది. కేసీఆర్ సర్వేలో అగ్రకులాల జనాభా శాతం 21శాతం ఉన్నట్టు చెబితే.. మా సర్వేలో 15.28 శాతమేనని తేలింది. ప్రతి కోణంలో సర్వే చేసి గణాంకాలను క్రోడీకరించాం.అసెంబ్లీలో బిల్లు పెడతాం..: బీసీలకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి ఇవ్వడమంటే మోదీ మెడ మీద కత్తిపెట్టినట్టే. కచ్చితంగా మన డిమాండ్‌ను ఆమోదించాల్సిందే.బీసీల కోసం ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారనే భయం ప్రతిపక్ష పార్టీలకు పట్టుకుంది. బీసీలు ఎదిగితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే బీసీ రిజర్వేషన్లను ఆ రెండు పార్టీలు ఆదిలోనే అడ్డుకునే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితులను బీసీలంతా గుర్తించాలి.నన్ను ఎప్పుడైనా కలవచ్చు..: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యాను. ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా కర్తవ్యం. అందుకోసం 24గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వంలో సీఎంను కలవాలంటే పెద్ద సాహసంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడైనా నన్ను కలవచ్చు. మీ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చి.. వాటిని పరిష్కరింపజేసుకునే బాధ్యత మీదే. తెలంగాణ సాధన కోసం పోరాడిన పద్మశాలి ముద్దు బిడ్డ కొండాలక్ష్మణ్ బాపూజీని పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే.. కేంద్రంతో మాట్లాడి ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం. టైగర్ నరేంద్రకు యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇస్తే... ధృతరాష్ట్రుడి కౌగిలి మాదిరిగా కేసీఆర్ ఆయనను ఖతం చేశారు. కులవృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను మహిళలు కట్టుకోలేదు. అవి పొలాల దగ్గర కట్టడానికే పనికి వచ్చాయి.అందుకే అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపివేశాం. మహిళా సంఘాల్లోని వారికి మంచి చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.600 కోట్ల విలువైన 1.30 కోట్ల చీరల ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నాం. తెలంగాణ పద్మశాలీలు ఇతర రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోటితో షోలాపూర్‌లో పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం..’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేస్తున్నాం: మంత్రి తుమ్మలరాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్లోనే వారి రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల కష్టాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పద్మశాలీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.మగ్గంపై చీర నేసిన సీఎంసీఎం రేవంత్ తొలుత ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అక్కడ సిద్ధం చేసిన చేనేత మగ్గంపై చీర నేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, మినరల్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధా రాణి, అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం ప్రతినిధులు అంబటి శ్రీనివాస్, మురళీధర్, గడ్డం జగన్నా థం, కన్నెగట్ల స్వామి, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్, మచ్చ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడు, సీపీఐ, బీఆర్ఎస్ చెరో స్థానాన్ని దక్కించుకోనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతోపాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు.ఐదుగురు రిటైర్ అవుతుండటంతో.. ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్‌ల పదవీకాలం ఈ నెల 29న ముగుస్తోంది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విజయశాంతికి ఎమ్మెల్సీ చాన్స్⇒ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏఐసీసీ⇒ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్లకూ అవకాశం⇒ ఆదివారం సాయంత్రం ప్రకటించిన కేసీ వేణుగోపాల్సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్గురు నేతలు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్, విజయశాంతిలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరును ఎంపిక చేయడం మాత్రం టీపీసీసీ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.నాలుగు స్థానాలకుగాను.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. సీపీఐకి ఒక స్థానం కేటాయించడంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను సీపీఐ జాతీయ కమిటీ బలంగా కోరింది. సీపీఐ జాతీయ నేత డి.రాజా, మరికొందరు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా మూడు స్థానాలకుగాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను ఎంపిక చేశారు.నేడు ఉదయం 11 తర్వాత నామినేషన్లుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అందుబాటులో ఉన్న వారంతా రావాలని సీఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. -
కుటుంబ కథా చిత్రం!
సాక్షి, హైదరాబాద్: బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాలను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. సమీకృత రాష్ట్ర పౌరుల డేటాబేస్(database)ను తయారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించిన ఐటీ శాఖ.. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్లు అవసరమని, కేంద్రం రూ.25 కోట్లు కేటాయిస్తే, తాము రూ.5 కోట్లు భరిస్తామని తెలిపింది.తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ పథకాలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా, పూర్తిస్థాయి కచ్చితత్వంతో అర్హులైన లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ డేటాబేస్ ఏకైక వాస్తవ వనరుగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ గత ఏడాది చివర్లో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్‌కు లేఖ రాశారు. ఎల్ఆర్.నం.1816/సీఎసీ/ఈఎస్డీ పేరిట పంపిన ఈ లేఖలో డేటాబేస్ ప్రాజెక్టు వివరాలతో పాటు ప్రతిపాదనలు పొందుపరిచారు. ప్రతి కుటుంబానికి ఓ ప్రొఫైల్ ⇒ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రతి కుటుంబానికి విడివిడిగా విశిష్ట గుర్తింపు ఐడీ నంబర్ జారీ చేస్తారు. ఈ నంబర్ కిందే కుటుంబం వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. ⇒ ప్రతి కుటుంబం ప్రొఫైల్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇందులో కుటుంబసభ్యుల వివరాలు, వారి బంధుత్వం, ఫోన్ నంబర్లు, చిరునామాలు పొందుపరుస్తారు. ⇒ కుటుంబంలో ఎవరు, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఎప్పటినుంచి పొందుతున్నారనే వివరాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి కుటుంబసభ్యుని అర్హతలు, సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన వివరాలు పొందుపరుస్తారు. ⇒ కుటుంబసభ్యులందరి డాక్యుమెంట్లు (సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన మేరకు మాత్రమే) అందులో ఉంటాయి. జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు తదితరాలను డిజిటలైజ్ చేసి నిక్షిప్తం చేస్తారు. తద్వారా ప్రభుత్వ పథకాలకు పదేపదే డాక్యుమెంట్లు సమరి్పంచాల్సిన అవసరం ఉండదు. వివరాలు అత్యంత భద్రం ⇒ కుటుంబాల వివరాలన్నింటినీ అత్యంత పకడ్బందీగా భద్రపరుస్తారు. వీటిని ఎవరెవరు తెలుసుకోగలరో పేర్కొంటూ ప్రొటోకాల్‌ను నిర్ధారిస్తారు. ఆ ప్రొటోకాల్ ఉన్నవారికి మాత్రమే కుటుంబ వివరాలు అందుబాటులోకి వచ్చేలా యాక్సెస్ కంట్రోల్ విధానం ఉంటుంది. ⇒ ప్రస్తుతం వివిధ వనరుల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని (డేటా) ఈ కొత్త డేటాబేస్కు బదిలీ చేస్తారు. ఈ డేటా ఏ సమయంలోనూ కోల్పోకుండా ఉండేలా రికవరీ ఏర్పాట్లు చేస్తారు. బహుళ ప్రయోజనార్థంగా..! ఈ డేటాబేస్‌ను తయారు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రానికి పంపిన సమగ్ర నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ప్రయోజనాలను అర్హులకు పంపిణీ చేయడంలో ఎక్కడా పొరపాట్లు జరగవని తెలిపింది. లబ్ధిదారుల దరఖాస్తులను పరిష్కరించడం సుళువు అవుతుందని, ఎప్పటికప్పుడు దరఖాస్తుల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొంది.రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తాయని వివరించింది. ముఖ్యంగా ఏదైనా కుటుంబంలోని ఏ సభ్యుడైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైనా సంక్షేమ పథకం పొందేందుకు అర్హులయితే ఆటోమేటిక్‌గా వారికి నేరుగా సమాచారం వెళ్తుందని, సదరు వ్యక్తి పథకం కింద లబ్ధి పొందేలా శీఘ్రగతిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. -
సమీకృత గురుకులాలకు రూ. 11,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (వైఐఐఆర్ఎస్)...రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు. అన్ని వర్గాల పిల్లలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో దీనికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా తొలివిడత ఒకే దఫాలో 55 సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 55 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది.ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేవిడత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం. కాగా గురుకులాల నిర్మాణానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కుల, మత వైషమ్యాలు తొలగిపోయేలా.. కుల, మత వైషమ్యాలు తొలగిపోవాలని, అందరికీ సమాన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాలల క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం నాలుగు గురుకుల పాఠశాలలుంటాయి. డిమాండ్‌కు అనుగుణంగా కొన్నిచోట్ల జనరల్ గురుకుల పాఠశాలలకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్ విస్తీర్ణం గరిష్టంగా 25 ఎకరాల్లో ఉంటుంది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మినీ యాంఫీథియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 55 నియోజకవర్గాలివే.. మంచిర్యాల, హుస్నాబాద్, ఆంధోల్, వికారాబాద్, షాద్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, వరంగల్ ఈస్ట్, ములుగు, ఖమ్మం, పాలేరు, అచ్చంపేట్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, బోధన్, చాంద్రాయణగుట్ట, చెన్నూరు, చేవెళ్ల, చొప్పదండి, దేవరకద్ర, ధర్మపురి, డోర్నకల్, గద్వాల, స్టేషన్‌ఘన్‌పూర్, జడ్చర్ల, జగిత్యాల, జుక్కల్, కల్వకుర్తి, కోదాడ, కొత్తగూడెం, మక్తల్, మానకొండూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మునుగోడు, నాగార్జునసాగర్, నాగర్‌కర్నూల్, నకిరేకల్, నారాయణఖేడ్, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్, పరకాల, పెద్దపల్లి, పినపాక, రామగుండం, సత్తుపల్లి, తాండూరు, తుంగతుర్తి, వనపర్తి, వైరా, ఇల్లందుల్లో సమీకృత గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇవి దేశంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉంటాయన్నారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.మీడియా సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సమీకృత గురుకులాలకు రూ.11 వేల కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమంటూ.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. -
Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు
సాక్షి,నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు. -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
SLBC: ఒక మృతదేహం వెలికితీత
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. -
TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి. -
న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ. లక్ష వరకూ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల మంది వరకూ చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటోంది. ఇక్కడ సుమారు 40 పైగా సొసైటీలు ఉండగా, వాటిల్లో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. -
TG: తుది దశకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ అభ్యర్థుల ఖరారు అంశం తుది దశకు వచ్చింది ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ గంటన్నర పాటు సమావేశమై తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వీరు ఫోన్ లో మాట్టాడారు. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ ల చర్చలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీ వర్గం నుంచి పరిశీలను నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, కుమార్ రావ/ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, బీసీల నుండి ఇరపత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్సీటీ జైపాల్, గాలి అనిల్ లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎస్సీల నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. -
‘సమాజానికి సేవ చేయడం తప్ప నాకు మరో ఆలోచనలేదు’
సాక్షి,హైదరాబాద్ : నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో మీరు నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా’నంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ను ఖతం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా.ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు.. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నాం. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నా.మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ.600 కోట్ల విలువైన 1 కోటి 30 లక్షల చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం. మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం.. ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ప్రధాని మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయి. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది.కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందిఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి.ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలతో షోలాపూర్‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం. ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా’అని వ్యాఖ్యానించారు. -
Hyderabad: నవ వధువు ఆత్మహత్య
బాలానగర్(హైదరాబాద్): నవవధువు ఆత్మహత్య(Newly Married WomanNewly Married WomanNewly Married Woman) చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్(Balanagar Police Station) పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6న గంటా విజయ గౌరీ (23)కి వివాహం జరిగింది. నూతన దంపతులు బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాల్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈశ్వరరావు ఉద్యోగం నిమిత్తం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తెలిపారు. ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య చైతన్యపురి: ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పాతర్లపాడుకు చెందిన బీమగోని కృష్ణయ్య, మన్నెమ్మ దంపతుల చిన్న కుమార్తె గంగోత్రి (22) చైతన్యపురిలోని తన సోదరి నివాసంలో ఉంటోంది. పాతర్లపాడుకు చెందిన కేశబోయిన మహేష్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ గత ఆరునెలలుగా గంగోత్రిని వేధిస్తున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి తనకు భయంగా ఉందని వాపోయింది. తను ఎక్కడికి వెళ్లినా వెంబడించి వేధిస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఉదయం గంగోత్రి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు గడియ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. మహేష్ వేధింపుల వల్లే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని తండ్రి కృష్ణయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు.. గుట్టు చప్పుడు కాకుండా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (3)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (2)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (1)
-
SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేయనుంది. కాగా, చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయ్యింది. ఇవాళ రాష్ట్ర అగ్రనేతలతో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీస్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు కోరుతున్నారు. నేడు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశముంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది, ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
పార్టీలకతీతంగా ఏకమవుదాం
సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు కావాలి. ఇందుకోసం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలి. రాష్ట్ర అవసరాలను, సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి..’’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల సాధన కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా.. రాష్ట్ర ఎంపీలకు సమాచారం అందించేందుకు శనివారం ప్రజాభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. సమాచారమంతా అందుబాటులో పెట్టాంరాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని, రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. సమావేశానికి రావాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను తాను ప్రత్యేకంగా ఆహ్వనించానని.. అయినా బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు రాలేదని భట్టి తెలిపారు. వారు సమావేశానికి రాకపోయినప్పటికీ ఆయా పార్టీల ఎంపీలకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంతోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నివాసంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఆ సెక్రటేరియట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్న సాయం వివరాలను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు వీలును బట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.పునర్విభజన ద్వారా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, టెక్స్టైల్ పార్కు, మెట్రో రైలు విస్తరణ, నవోదయ విద్యాలయాలు, నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులకు నిధుల మంజూరుపై రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం ఈ సమావేశానికి హాజరుకావాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు తాను స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వనించానని.. కానీ తమకు సమయం లేదని, ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటూ బీజేపీ సభ్యులు రాలేదని భట్టి చెప్పారు. బీజేపీ సభ్యులు కోరిన విధంగా ప్రభుత్వం వారం తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేస్తుందని.. ఆ సమావేశానికైనా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశానికి రావాలని ఆయా పార్టీల ఎంపీలను తాను స్వయంగా కలసి ఆహ్వానిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, బీఆర్ఎస్ కలసివస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమాచారాన్ని ఇచ్చేందుకు ఎంపీలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని.. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అందిస్తున్న సాయాన్ని తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎంఐఎం పక్షాన పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తామన్నారు. చాలాసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎంపీ చామల రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన నిధులు, ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్ని సార్లు ప్రధానిని, సంబంధిత మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల గురించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని.. సభ లోపల మాట్లాడటంతోపాటు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.‘రీజనల్’ రోడ్డు నుంచి నవోదయ విద్యాలయాల వరకు.. ఎంపీల ప్రత్యేక సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన, రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి వివరించారు. మొత్తం 28 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వ స్పందన, ప్రస్తుత స్థితి ఏమిటన్నది తెలిపారు. అందులో రీజనల్రింగ్రోడ్డు, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ వరకు రేడియల్ రోడ్లు, మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, గోదావరి–మూసీ లింకు ప్రాజెక్టు, హైదరాబాద్‌కు సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రీన్‌ఫీల్డ్ హైవే, సింగరేణికి బొగ్గుబ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్ కింద పథకాలు, పీఎం కుసుమ్–ఏ, బీ, సీల కింద సోలార్ ప్లాంట్లు, తాడిచర్ల బ్లాకు బొగ్గు తవ్వకాల లీజు, రుణాల రీస్ట్రక్చరింగ్, ఏపీ నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా రావాల్సిన నిధులు, 2014–15లో పొరపాటున ఏపీకి జమ అయిన సీసీఎఫ్ పథకాల నిధులు, లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, 8 రైల్వే లైన్ల కనెక్టివిటీ, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు, 12 జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు అంశాలను ప్రజెంటేషన్‌లో వివరించారు. -
అప్పుల సాకుతో హామీలకు పాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పుల సాకు చూపి ఎన్నికల హామీలను ఎగ్గొట్టే పథకం వేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.7.50 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం గతంలో అనేకమార్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను సీఎం అయ్యాక కూడా రూ.3.5 లక్షల కోట్ల అప్పే ఉందని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలుపై చేతులెత్తేశారు’అని ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కానందువల్లే గ్యారంటీలు అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన హామీనిచ్చా, పథకాలు ప్రకటించి.. వాటిని కేంద్రం పూర్తిచేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై మాకేమీ తొందరలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’అని ప్రకటించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.జాతీయ రహదారిగా ట్రిపుల్ఆర్ ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్)ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘తెలంగాణలో రూ.6,280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని పార్లమెంటు సమావేశాల తర్వాత గడ్కరీ ప్రారంభిస్తారు. రూ.961 కోట్లతో 51 కి.మీ. రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంపై గడ్కరీతో చర్చించాను. రూ.18,772 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రోడ్డు విషయంలో ఇంకా మూడు పనులు జరగాల్సి ఉంది.పీపీపీ అప్రయిజల్ కమిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం నోట్, నిధులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి వివరించారు. పెండింగ్ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ సేకరణ జరిపి అప్పగించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొత్తం భూమి ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనాభా తగ్గినా తెలంగాణలో కానీ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో కానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టంచేశారు. ఒక దేశం–ఒక ఎన్నిక దేశ భవిష్యత్ ఎజెండా తెలంగాణలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై రాజకీయాలకు అతీతంగా చర్చలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ నిర్వహించాలని తీర్మానించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.ఒకదేశం–ఒక ఎన్నిక అనేది బీజేపీ ఎజెండా కాదని దేశ భవిష్యత్ ఎజెండా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు మరో సారి జరగడం వల్ల రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజల సమయం వృథా అవుతోందని.. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించడానికి వీలులేకుండా పోతోందని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్‌నేషన్ – వన్ ఎలక్షన్‌పై నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు వస్తాయి
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రోజు త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలు అంటే వంటింటి కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తామని తెలిపారు. రూ.535 కోట్లతో చేపడుతున్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలను చేస్తాం.. ‘‘మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేశాం. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించాం. చట్టసభల్లో మహిళలు అడుగుపెడతారు. అసెంబ్లీలో 33శాతం సీట్లు మహిళలకు వచ్చే రోజు వస్తుంది. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు. వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తాం. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్పకీర్తి అని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ యూనివర్సిటీ భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణాన్ని నేనే పర్యవేక్షిస్తా.. రెండున్నరేళ్లలో మహిళా యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని, తాను స్వయంగా నిర్మాణ పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీపడాలని.. మహిళల కోసం రిజర్వేషన్లు తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించండి: అసదుద్దీన్ పాఠశాలలు, కాలేజీల్లో ముస్లిం విద్యారి్థనులు తక్కువగా ఉన్నారని, వారి సంఖ్య పెరగాల్సి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి డైనమిక్ సీఎం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో మెలగాలి.. ఉన్నత లక్ష్యంతో సాగాలి..
సమాజంలో ఒత్తిడులను ఎదుర్కొని విజయవంతమైన మహిళగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలంటూ గురుకుల విద్యార్థి నులకు పలు రంగాల నిపుణులు, ప్రముఖులు మనోనిబ్బరం నింపారు. నవ్వుతూ, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలని.. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో మెలగా లని దిశానిర్దేశం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలగు వర్షిణి ఆధ్వర్యంలో విద్యార్థి నులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జూమ్ మీటింగ్ ద్వారా పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు, ప్రముఖులు చెప్పిన అంశాలు, సూచనలివీ.. –సాక్షి, హైదరాబాద్మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇక్కడ ఒక ఈ–సిగరెట్ కంపెనీ స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పాలకులను, అధికార యంత్రాంగాన్ని సమన్వయపరచి ఆ కంపెనీ నెలకొల్పకుండా చేశాను. ఒకవేళ ఆ కంపెనీ నెలకొల్పి ఉంటే ఎంతోమంది అనారోగ్యా ల బారినపడేవారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ‘బేటీ బచావో.. బేటీ పడావో, ఆయుష్మాన్ భవ’వంటి వినూత్న కార్యక్రమాలను దేశ ప్రజలకోసం ప్రవేశపెట్టే ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. దేశం కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉన్నతంగా ఆలోచిస్తే మన మదిలో ఇంకా ఎన్నో మంచి ఆలోచనలు, పథకాలు పుట్టుకొస్తాయి. – ప్రీతి సుదాన్, యూపీఎస్సీ చైర్మన్సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలిమన ముఖంలో చిరునవ్వుతో, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు. మన ముఖంలో నవ్వు లేకపోతే ఇతరులు కూడా మనతో అలాగే ఉంటారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్లతో పోల్చితే గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నతంగా రాణించేలా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దానిని చేరుకునేలా ముందుకు వెళ్లాలి. – ఛాయా రతన్, రిటైర్డ్ ఐఏఎస్సమయం వృథా చేసుకోవద్దు పస్తుతం మెడికల్ సీటు సాధించాలంటే చాలా కష్టపడాలి. నీట్ కోచింగ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాల్లో చక్కటి తర్పిదు ఇస్తున్నారు. నేను కూడా గౌలిదొడ్డి కళాశాలలో చదివాను. ఆ రోజుల్లో కేవలం సబ్జెక్టు పుస్తకాలను చదివి ర్యాంకు సాధించాను. ఇప్పుడు లైబ్రరీలు, డిజిటల్ రూపంలో పూర్తిస్థాయిలో మెటీరియల్ లభిస్తోంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేయవద్దు. క్రమశిక్షణతో ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల స్రత్పవర్తనతో ఉండాలి. – డాక్టర్ శిరీష, ఎండి (మెడిసిన్) స్విమ్స్, తిరుపతిమన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలిమన జీవితం ఒక తెల్ల కాగితం వంటిది. అందులో ఎంత చక్కగా చిత్రాన్ని గీస్తే అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కోవిడ్ సమయంలో 21వేల కాల్ సెంటర్లు పెట్టి, వేల మంది ప్రజల జీవితాలను కాపాడేలా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. – అలగు వర్షిణి, కార్యదర్శి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్భయం వదిలితేనే విజయం చాలా మంది భయంతో ఏ పనిలోనూ ముందుకు వెళ్లలేరు. భయాన్ని వీడితే ఎన్నో విజయాలు సాధించవచ్చు. విద్యార్థుల్లో భయమే వారి చదువులో వెనుకబాటు తనానికి కారణం.’అన్నారు. భయాన్ని వీడేందుకు పలు చిత్రాలను ఆమె ప్రదర్శించారు. ఈ చిత్రాలను వీక్షించిన విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. – డాక్టర్ గీతా చల్ల, చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకాలజిస్ట్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం తథ్యంచదువుతోపాటు క్రీడలు కూడా నాకు ఎంతో ఇష్టం. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకు 42 పతకాలను సాధించాను. రానున్న ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తానన్న విశ్వాసం ఉంది. విద్యార్థులను ప్రోత్సహించే అధ్యాపకులకు, కోచ్‌లకు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. – అగసారా నందిని, అంతర్జాతీయ క్రీడాకారిణి, బుధేల్ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి జిల్లా -
యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి
శంషాబాద్: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్‌పోర్టు మంజూరు కోసం జీఎంఆర్ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రీజినల్ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. సానుకూలంగా స్పందించారు..తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే.. రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్‌లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి. -
‘కనీస వేతనాల’ తీర్పును 4 వారాల్లో అమలుచేయండి
సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ ప్రింట్ చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా, 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 2023లో పిల్ దాఖలు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయని పిటిషన్ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు.వాదనలు విన్న సీజే ధర్మాసనం.. వెంటనే గెజిట్ ప్రింట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీచేసింది. 6 వారాలు సమయం ఇచ్చినా అమలు చేయలేదంటూ పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించి.. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. -
ట్రిలియన్ డాలర్ల శక్తి మహిళలే!
ఎప్పుడైనా కూడా మహిళలకు అండగా నిలిచింది ఇందిరమ్మ రాజ్యమే. ప్రజలు ఇందిరాగాందీని అమ్మ అని పిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నా అని పిలుస్తున్నారు. తోబుట్టువు మాదిరిగా ఆదరిస్తున్నారు. అలాంటి తోబుట్టువుల కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్లండి. ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధే. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చిదిద్దుతా.సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తి మహిళలేనని.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి(Mahila Shakthi)’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు చంద్రగ్రహణంతో మహిళలు చీకటిలోకి నెట్టబడ్డారు.వారు కనీసం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పదేళ్ల పాటు మహిళాభివృద్ధి జాడలేదు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంతో మహిళలు మళ్లీ వెలుగులోకి వచ్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటే పరిస్థితికి వచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు వడ్డీలేకుండా రుణాలు ఇవ్వడం మొదలు వివిధ ఆర్థిక పురోగతి కార్యక్రమాలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థుల కోసం 1.30 కోట్ల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళలు విజయవంతం చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీలో మహిళా బజార్ ఏర్పాటు చేశాం. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.25 కోట్లతో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం అదానీ, అంబానీలే కాదు.. తెలంగాణ మహిళలు విద్యుత్ వ్యాపారాన్ని చేయగలరనే ధీమాతో వారికి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. వారిని పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. ఆరీ్టసీకి బస్సులు అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నాం.వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను వారి ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఎంఓయూ కుదిర్చాం. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటా. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం. ప్రభుత్వమే మహిళలకు స్థలం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది, గోడౌన్స్ నిర్మించండి, వ్యాపారవేత్తలుగా మారండి. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా మహిళలు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి. మహిళా సంఘాల్లో వయసు సడలింపు.. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీల్లో) 65 లక్షల మంది ఉన్నారు. మేం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఎస్‌హెచ్‌జీలలో చేరే నిబంధనలు సడలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మహిళలందరికీ అవకాశం కల్పించేలా నిబంధనలు తెస్తాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. ఎస్‌హెచ్‌జీలకు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం, జూపల్లి తదితరులు వడ్డీ లేకుండా రూ.21 వేల కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేకుండా రూ.21వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాటు మహిళా సంఘాలకు పైసా సాయం చేయని గత ప్రభుత్వ నేతలు.. ఈరోజు ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలంటే వెకిలిగా నవ్వుతున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలను తీసుకువస్తోందన్నారు.రాష్ట్రంలో మహిళలు తలెత్తుకుని మహాలక్ష్మిలా గౌరవంగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు బడితె మాదిరి పెరిగారే తప్ప మహిళలకు కనీసం రుణాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల సంపద పెరిగేందుకు కృషి చేస్తోందని.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద ప్రజాప్రభుత్వం 20 రకాల అద్భుత కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ విశేషాలివీ.. ⇒ మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్న బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ⇒ కార్యక్రమంలో 2,82,552 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ.22,794.22 కోట్ల రుణాల చెక్కులను సీఎం అందించారు. ⇒ ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందించారు. ⇒ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ⇒ ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీని సీఎం ఆవిష్కరించారు. ⇒ సభకు ముందు సీఎం రేవంత్, మంత్రులు వివి ధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుటీర పరిశ్రమల స్టాళ్లను, మహిళా పెట్రోల్ బంకు నమూనాను పరిశీలించారు.బీఆర్ఎస్ నేతలది పైశాచిక ఆనందం రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నన్ను తిడుతూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్ కూలి కార్మికులు మరణిస్తే సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే నవ్వుతున్నారు. పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయతి్నంచాలి. పదేళ్ల పాలన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. అలాంటివారు బాగుపడరు. -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎకరం కూడా ఎండిపోరాదు
నల్లగొండ: నీరందక ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. వేసవిలో సాగు, తాగునీరు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కాల్వల కింద పలుచోట్ల నీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. కాల్వల్లో మోటార్లు వేసి కొందరు రైతులు కిలోమీటర్ల కొద్దీ తీసుకుపోతుండటం వల్ల.. కాల్వ చివరి రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. అధికారులు అలాంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.క్షేత్ర స్థాయికి అధికారులు వెళ్తే.. సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వేసవిలో తాగునీటి తక్షణ సమస్య పరిష్కారానికి.. కలెక్టర్ల వద్ద కొంత నిధులు ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేసే విషయమై.. ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో నిధులు అందుబాటులో ఉంచితే.. ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరించవచ్చని సూచించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాల్వల విస్తరణతో పాటు లైనింగ్ పనులు చేస్తేనే చివరి భూములకు నీరందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. -
సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటన చేసింది. ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుంది’’ అని లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.‘‘ఇంతకుముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలుసు. దయ చేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండి’’ అంటూ లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. -
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ(Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,. దొరలపై, నిజాములపై పోరాడిన చాకలి ఐలమ్మ.. చరిత్రలో తనకంటూ పేజీ లిఖించుకున్నారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు(శనివారం) అక్కడకు విచ్చేసిన సీఎం రేవంత్(Revanth Reddy).. నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు. వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్. మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అలానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడ బిడ్డలు వంటిళ్లు కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించాలనేది తన ఆశయమన్నారు. -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్ ఎజెండా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: వన్ నేషన్ - వన్ ఎలక్షన్(One Nation-One Election) అనేది దేశ భవిష్యత్ ఎజెండా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఇది బీజేపీ ఎజెండా కాదని, దేశ భవిష్యత్ ఎజెండా అని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సర్, చంద్రశేఖర్ తివారీలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా తెలంగాణలో జరిగాయి. రెండు సంవత్సరాలుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుంది. వికసిత భారత్ కోసం కృషి చేయాల్సిన సమయం.. ఎన్నికల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఎన్నికల కోసం సమయం వృథా అవుతోంది. అభివృద్ధికి అడ్డంకిగా ఎన్నికలు మారుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల పేరు మీద రాజకీయ పార్టీల సమయం వృథా అవుతుంది. తెలంగాణలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై రాజకీయాలకు అతీతంగా చర్చలు పెట్టాలి. స్వచ్చంధ సంస్థలతో విద్యార్థులతో, యువతతో పార్టీతో సంబంధం లేకుండా సంతకాలు సేకరణ చేయాలి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది బీజేపీ(BJP) ఎజెండా కాదు... దేశ భవిష్యత్ ఎజెండా’ అని ఆయన పేర్కొన్నారు. -
అఖిలపక్ష ఎంపీల సమావేశంలో కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్ లో అఖిలపక్ష ఎంపీల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 అంశాలపై చర్చ జరిగినట్లు భట్టి తెలిపారు.‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చించాం. రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ ఇస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించాం. కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించాం.. సమావేశానికి రావాలని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం నుండి రావాల్సిన రాష్ట్ర హక్కుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుండి ఎంపీల అందరికీ వివరాలు పంపిస్తాం.బీఆర్ఎస్ ఆనాడు చేయాల్సిన ప్రయత్నం సరిగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కొంచెం ఒత్తిడి పెంచాం. పార్లమెంట్ లో కేంద్రం మీద ఒత్తిడి చేయాలని మ ప్రయత్నం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు..ప్రాజెక్టులు అందాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ చెప్తం. ముందే సమాచారం ఇస్తాం. అప్పుడైనా బీజేపీ..brs వాళ్ళు కలిసి వస్తారు. కేంద్రం కి ఇచ్చిన లేఖలు..సమాచారం బుక్ లెట్ గా రూపొందించాం’ అని భట్టి పేర్కొన్నారు.నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయంతెలంగాణ ప్రభుతవం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించడం లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు. -
ఎస్సార్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. కుమారుడి మృతి.. తండ్రి, కుమార్తె గల్లంతు
సాక్షి, వరంగల్ జిల్లా: ఎస్సార్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించారు.గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రేవంత్‌కు ఝలక్.. బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. -
ఆడపిల్ల పుట్టినా, వివాహమైనా రూ.2,016 నగదు..!
నల్గొండ: దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన కొర్ర రాంసింగ్ – గౌతమి దంపతులు ఆడబిడ్డలంటే ఎంతో మమకారం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గతంలో ఆడశిశువు జన్మిస్తే భారంగా భావించిన కొన్ని గిరిజన కుటుంబాల పరిస్థితిని కళ్లారా చూశారు. ఆడపిల్లను భారంగా భావించొద్దని.. ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మిలా భావించాలని ఎందరికో అవగాహన కల్పించారు.చివరికి ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్ల వివాహం చేసినా ఆర్థిక సాయం చేయాలని తలిచి గ్రామంలో రామన్న కల్యాణ కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా 2020లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొదట్లో రూ.1,016తో ప్రారంభించిన రామన్న కల్యాణ కానుకను మరుసటి సంవత్సరం నుంచి రూ.2,016 పెంచారు. ఐదేళ్ల నుంచి గ్రామంలో ఆడబిడ్డల వివాహానికి రూ.2,016, ఆడపిల్ల జన్మిస్తే వారి కుటుంబానికి రూ.2,016 అందిస్తున్నారు. దీంతో ఆ దంపతులను పలువురు అభినందిస్తున్నారు. -
Abhishek Mohanty: పోలీస్ ‘సింగం’ బదిలీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఒకప్పుడు కరీంనగర్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే.. కార్పొరేటర్‌కి రూ.లక్ష, ప్రతీ అనుమతికి ఇంత అంటూ ఫిక్స్డ్ రేట్లు ఉండేవి. ఖాళీజాగా కనిపిస్తే ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జారాయుళ్లు దిగిపోయేవారు. తాము అడిగినంత ఇవ్వకపోతే కడుతున్న ఇండ్లు కూడా బుల్డోజర్లతో కూల్చేసేవారు. అప్పుడు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. ఎవరినీ కనీసం అరెస్టు చేయలేకపోయారు. అదే సీపీగా అభిషేక్ మహంతి(Abhishek Mohanty) వచ్చాక సీన్ మారింది. భూదందాలు చేసేవారికి చెమటలు పట్టించారు. భూనేరాల్లో పాలుపంచుకున్న రాజకీయ నేతలు, తహసీల్దార్లు ఎవరినీ వదల్లేదు. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే మహంతి ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. తలొగ్గకుండా.. తనపని తాను చేసుకుంటూ పోయారు. అందరికీ తన మార్కు కోటింగ్ ఇస్తుండటంతో పలువురు నేతలు అరెస్టు భయానికి ఏకంగా దేశం విడిచి పారిపోయిన వారు ఇంకా అక్కడే తలదాచుకోవడం గమనార్హం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే సీపీగా ఉంటారన్న అపవాదు కరీంనగర్ పోస్టింగ్‌తో తొలగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఆయన అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. తప్పులు చేస్తే.. సొంత డిపార్ట్మెంటు వారిని కూడా వదలకుండా డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సిఫారసు లెటర్లు లేకుండా రాష్ట్రంలో నిజాయతీ అధికారులకు ఎస్హెచ్వోలుగా పోస్టింగులు ఇచ్చారు. తమ లెటర్లకు పోస్టింగులు ఇవ్వడంలేదని కొందరు ప్రెస్మీట్లు పెట్టినా.. ఆయన తొణకలేదు. అందుకే, ఆయన్ని సహచరులు పోలీస్ సింగంగా పిలుచుకుంటారు.భూదందా అంటే లోపలికే..భూదందాలు చేస్తూ మోసంచేస్తున్నారన్న ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో డీజీపీ అనుమతితో ఎకానివిుక్స్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటుచేసి భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. రాజకీయనాయకులు, బడావ్యాపారులు తేడా లేకుండా అన్యాయం జరిగిన వారి పక్షాన నిలిచి కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు 250కిపైగా మందిపై కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపించారు. వివిధ పార్టీల నేతలు చేసిన కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎకానివిుక్స్ అఫెన్సెస్ వింగ్‌తో లోతుగా దర్యాప్తు చేయించి ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా అక్రమార్కులను జైలుకు పంపించారు. దీనితర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు పెద్దఎత్తున ఖాతాదారుల వద్ద డబ్బులు డిపాజిట్ చేయించుకొని తిరిగి చెల్లించడం లేదని గమనించి ఒక ప్రముఖ చిట్‌ఫండ్‌పై కేసులు నమోదు చేసి నిర్వాహకులను కటాకటాల్లోకి పంపించి వాటికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం ద్వారా అటాచ్ చేపించారు. వందలాది మంది భూబాధితులు, ఫైనాన్స్‌లతో మోసపోయిన వారికి న్యాయం చేశారు. గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం...కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి వచ్చిన తర్వాత గంజాయి, సైబర్ నేరాలపై దృష్టి పెట్టారు. గంజాయి కేసుల దర్యాప్తుకోసం నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి నిందితులను జైలుకు పంపించారు. సైబర్ పోలీస్‌స్టేషన్‌ను పటిష్టం చేసి ప్రతీ స్టేషన్‌కు సైబర్ వారియర్‌ను కేటాయించి వారితో నేరాల కట్టడికి కృషిచేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించారు. కమిషనరేట్‌లోనూ.. మహంతి ఆధ్వర్యంలో పలుఅభివృద్ధి పనులు జరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఇటీవల డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాఉత్సవాలను కరీంనగర్ వేదిక విజయవంతంగా నిర్వహించారు. కమిషనరేట్‌లో ఫంక్షన్ హాల్ ఆధునీకరణ, పోలీస్ కేఫ్ ఏర్పాటుతోపాటు వివిధ సంక్షేమ పనులు నిర్వహించారు. -
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!
కరీంనగర్ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
శంషాబాద్‌లో హైడ్రామా.. ఫాల్కన్ స్కాం అమర్దీప్ ఫ్లైట్ సీజ్
సాక్షి, హైదరాబాద్: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చార్టెర్డ్ ఫ్లైట్‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, ఫ్లైట్‌లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. పెట్టుబడుల పేరిటి రూ.850 కోట్లు స్కామ్ ఫాల్కన్ కంపెనీలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.14 కోట్లతో కంపెనీ చైర్మన్ అమర్దీప్ చార్టెర్డ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేశారు. ఇక, తాజాగా చార్టెడ్ ఫ్లైట్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో సదరు చార్టెడ్ ఫ్లైట్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు.. ఈడీకి సమాచారం ఇచ్చారు.దీంతో, రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. చార్టెడ్ ఫ్లైట్‌ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, చార్టెడ్ ఫ్లైట్‌లో ఉన్న వారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక, ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్దీప్ సహా మరికొందరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరందరికీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.స్కామ్ ఇదే.. ఫాల్కన్ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Hyderabad: ఆస్తి పన్ను బకాయి వడ్డీలపై 90% మాఫీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీల మొత్తం భారీగా పేరుకుపోయిన వారి సదుపాయార్థం ప్రభుత్వం వన్ టైమ్ స్కీమ్ (ఓటీఎస్)గా పేర్కొంటూ 90 శాతం మాఫీతో రాయితీ సదుపాయం కల్పించింది. దీంతో.. ఈ మార్చి నెలాఖరుకు ముగియనున్న 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల వడ్డీల్లో పది శాతం, అసలు చెల్లించేవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు స్పందించిన ప్రభుత్వం ఈ రాయితీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2 వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది. వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5 వేల కోట్లున్నాయి. రాష్ట్రప్రభుత్వం గతం సంవత్సరం, అంతకుముందు సైతం ఈ సదుపాయాన్ని కల్పించడం తెలిసిందే. భారీగా బకాయిలు పేరుకుపోయిన వారి నుంచి కనీసం రూ. 500 కోట్లయినా వసూలవుతాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జస్ట్ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. -
ORR Accident: రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనువడు మృతి
హైదరాబాద్: ఓఆర్ఆర్పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(ORR Accident) మూసారంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజిత్‌రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి(19)(Kanishk Reddy) దుర్మరణం పాలయ్యాడు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్‌లోని స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై బెంజ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళుతుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై గొల్లపల్లె కలాన్ వద్ద కారు ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు.. ఆలస్యమైంది ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేయగా.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖుల పరామర్శ... కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్‌రెడ్డి, సునరితారెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ ఫతుల్లాగూడ మహాప్రస్థానం హిందూ శ్మశాన వాటికలో కనిష్క్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. -
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
నేడు సాక్షి అవార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు. సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. -
సీపీఐకి ఒకటి.. ఎస్టీ నేతకు మరొకటి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం అధికార కాంగ్రెస్ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశమున్న నేపథ్యంలో.. ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని, మిగతా మూడింటిలో ఒక స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని ఇటీవల సీఎం రేవంత్ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మిగతా రెండింటి కోసం ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో అభ్యర్థుల ఖరారు.. కేబినెట్ విస్తరణతో ముడిపెట్టి జరుగుతున్న కసరత్తులో భాగంగా ఈ మూడు సామాజిక వర్గాల నుంచి అవకాశం కలి్పంచాల్సి ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి, రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి చొప్పున బీసీలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి బీసీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఎస్టీ, ఎస్సీ, ఓసీ వర్గాల నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది.అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యేందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మధ్యాహా్ననికల్లా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మిత్ర పక్షానికి.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మిత్రపక్షం సీపీఐకి అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్టేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులో భాగంగా, నాడు ఇచ్చిన మాట ప్రకారం సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని.. ఈ మేరకు టీపీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటున్నాయి. -
మార్గదర్శి, రామోజీది 45 ఏళ్ల నయవంచన
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.రామోజీ అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.ఇష్టారాజ్యంగా వసూళ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్‌ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్‌పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు. ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు.. ‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్‌యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్‌యూఎఫ్‌ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది. ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్‌యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు. లూథ్రాను మందలించిన ధర్మాసనం ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. నాకు డబ్బులు చెల్లించలేదు... అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.బాధ్యత నుంచి పారిపోలేరు రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్‌యూఎఫ్‌లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా? తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్‌లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ -
బకాయిలన్నీ చెల్లిస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.8 వేలకోట్ల బకాయిలను చెల్లిస్తామని.. ఏప్రిల్ నుంచి ప్రతీ నెలా ఐదారు వందల కోట్ల చొప్పున ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి వచ్చే కొత్త బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా.. ఏ నెలకు ఆ నెలలో క్లియర్ చేస్తామని చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రజా ప్రభుత్వం రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిందని తెలిపారు. జీవితకాలం పనిచేసి దాచుకున్న డబ్బులకోసం ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను అర్థం చేసుకున్నామని చెప్పారు.శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టితో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షుడు శ్యామ్, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులు బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గ్రీన్ చానల్ ద్వారా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలోని రూ.5 వేల కోట్లు, ఈ ప్రభుత్వానివి కలిసి రూ.10,000 కోట్లు పెండింగ్ బిల్లులను ఇప్పటివరకు క్లియర్ చేశాం. మరో ఎనిమిది వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి’’అని చెప్పారు. ఏప్రిల్ నుంచి కొత్త బకాయిలు ఉండవు.. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త బకాయిలు ఉండవని, పాత బకాయిలను ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు చెల్లిస్తామని భట్టి హామీ ఇచ్చారు. గత పదేళ్లు పాలించినవారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థంకాని పరిస్థితి ఉండేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు.కేవలం పదవీ విరమణ ప్రయోజనాలు, మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరి్ధకేతర అంశాలపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 45 ఆర్థికేతర, 12 ఆర్థిక సమస్యలను విన్నవించాం: ఉద్యోగ జేఏసీ డిప్యూటీ సీఎం భట్టితో సమావేశం అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 45 ఆర్థికేతర, 12 ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 4 డీఏలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, హెల్త్‌కార్డులు విడుదల చేయాలని కోరామన్నారు. ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.ఆర్థికేతర అంశాల పరిష్కారానికి వీలైనంత త్వరగా కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించాలని కోరామన్నారు. దీనికి సంబంధించి ఐదారుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి.. పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కలసి వస్తే.. కలదు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా.. రానున్న లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల లోక్‌సభ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. సమావేశానికి హాజరు కావాలంటూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు రాష్ట్ర ఎంపీలందరికీ శుక్రవారం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వనించారు.అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై సమావేశంలో ఎంపీలతో సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసిన సందర్భంగా.. మోదీ ఇచ్చనా వినతిపత్రంలోని అంశాలకు ఎలాంటి సహకారం అందిస్తామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు విధివిధానాలు, రాష్ట్ర రుణ భారం తగ్గించుకునేందుకు గల వెసులుబాటు, కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్పై చర్చించి కేంద్రంపై సమష్టిగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించనున్నారు. -
18 లేదా 19న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 12న ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, బీఏసీలో చర్చ అనంతరం సభా నిర్వహణ తేదీలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించనున్నారు. రెండు కీలక బిల్లులు ఈసారే..: బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఆ తర్వాత హోలీ, ఆదివారం సెలవులు ఉండటంతో సోమవారం మళ్లీ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అదే రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదించి, బీసీల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఈ నెల 18 లేదా 19 తేదీల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్, శాఖలవారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉగాది, రంజాన్ పర్వదినాల నేపథ్యంలో 27వ తేదీతో సమావేశాలు ముగిస్తారని అధికారులు చెబుతున్నారు. -
మహిళకు శక్తి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను, ఈ ఏడాది మహిళలు సాధించిన విజయాలను మిషన్‌లో పొందుపరిచారు. కోటి మంది మహిళలను ఎస్‌హేచ్‌జీల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లను విలీనం చేయనున్నారు.ఈ మిషన్‌కు సబంధించిన పాలసీకి గురువారం రాత్రి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పరేడ్ గ్రౌండ్స్ సభకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు పాల్గొననున్నారు. ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి సీతక్క మంత్రి సీతక్క శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మహిళలకు సైతం సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణకు నిదర్శనం. అందుకే 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల్లో చేర్చుకుంటున్నాం.మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదనలకు గురైన సందర్భాలు ఉన్నందున..15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కూడా సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించాం. సభ్యుల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు రూ.1200 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్లు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా రైస్ మిల్లులు నడిపేలా శిక్షణ ఇవ్వబోతున్నాం. సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి అందరి సోదరుడిలా అండగా ఉంటున్నా రు. ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలి’ అని కోరారు. మహిళా సమాఖ్యలకు ఆహ్వనం పరేడ్ గ్రౌండ్స్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరా మహిళా శక్తి మిషన్–2025 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క ఇప్పటికే ఆహ్వనాలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) 600కు పైగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా అరగంట ముందే సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తుండడంతో ఏడున్నర గంటల లోపే సభను ముగించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం నుంచి జిల్లా డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులతో వీడియో కాన్ఫరె¯న్స్ నిర్వహించారు. నేటి కార్యక్రమాలివీ.. ⇒ మండల మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభిస్తారు. ⇒ 31 జిల్లా సమాఖ్యల ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ⇒ మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేస్తారు ⇒ మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులకు అందజేస్తారు. ⇒ జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులకు యునిఫాం చీరలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం, మంత్రులు సందర్శిస్తారు. ఈ ఏడాది సాధించిన విజయాలు ⇒ మహిళా సంఘాలకు రూ.21,632 కోట్ల రుణాలు ⇒ 2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు ⇒ రూ.110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం ⇒ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ⇒ హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో రూ.9 కోట్లతో మహిళా శక్తి బజార్ ⇒ విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పని ద్వారా మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం ⇒ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
Hyd: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మదీనా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘన్సీ బజార్ లోని హోల్ సేల్ క్లాత్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ఆ ఐదంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేస్తున్నారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తి పన్ను చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గతేడాది బకాయిదారులకు బల్దియా వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని కల్పిచ్చింది.తాజాగా, మరోసారి ఆ అవకాశాన్ని కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తద్వారా 2024-25 సంవత్సరానికి కేవలం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఈ ఓటీఎస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సుమారు రెండు వేల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈ ని ర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, సంగారెడ్డి జిల్లా: కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాలను విద్యార్థినులు గుర్తించారు. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో కెమెరాను గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.కాగా, లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారనే కారణంగా మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేసిన మహేశ్వరరావు.. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కూడా కెమెరా పెట్టాడు. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్‌ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్‌ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్‌గన్‌తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్‌ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కలిగింది.ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మకరీంనగర్ సీపీగా గౌస్ అలంఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహహైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లికామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్రసీఐడీ ఐజీగా ఎన్.శ్రీనివాసులురామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝానిజామాబాద్ సీపీగా సాయిచైతన్యసంగారెడ్డి ఎస్పీగా సంతోష్ పంకజ్వరంగల్ సీపీగా సన్ ప్రీత్సింగ్నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్రసీఐడీ ఐజీగా ఎన్. శ్రీనివాసులునిజామాబాద్ సీపీగా సాయి చైతన్యమంచిర్యాల డీసీపీగా భాస్కర్పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ -
హైదరాబాద్ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందనను పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన.. నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను విక్రయించింది. అహ్మదాబాద్‌కు చెందిన వందనను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వందన.. ఆసుపత్రుల నుంచి, రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణ తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వందనను 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు. -
హస్తిన పర్యటనలతో సెంచరీ కొట్టడం ఖాయం.. రేవంత్‌పై లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 38వ సారి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు. -
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీలు ఎవరు?.. స్థానాలు ‘నాలుగు’ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(మార్చి 9న) తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ , బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. -
SLBC: టెన్నెల్‌లోకి క్యాడవర్ డాగ్స్ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే..
సాక్షి, దోమలపెంట: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక, తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్ డాగ్స్‌తో సహాయక బృందం టన్నెల్లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం 2 గంటల తర్వాత టన్నెల్ నుంచి బయటకు రానుంది.ఇదిలా ఉండగా.. టన్నెల్లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.మరోవైపు.. టన్నెల్‌లోని వ్యర్దాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..
కరీంనగర్‌క్రైం: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పకోరని భావించి ఇద్దరూ కలిసి ఉరేసుకుని తనువు చాలించారు. దూరంగా బ్రతకడం ఇష్టం లేక కలిసే పోయారు. కరీంనగర్ త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం.. జిలలాలోని చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నాంపెల్లి రమ–అంజయ్య దంపతుల రెండోకూతురు అలేఖ్య(21) డిగ్రీ చదివి ఇంటివద్దే ఉంటోంది. ఇదే మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి సరస్వతి– రవికుమార్‌ల కొడుకు అరుణ్ కుమార్(24) కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.ఇద్దరూ బంధువులు కావడంతో దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అమ్మాయికి తన తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. అయితే అలేఖ్య తాను చదివిన కళాశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి బుధవారం కరీంనగర్ వచ్చింది. వావిలాలపల్లిలోని అరుణ్‌కుమార్ వద్దకు వెళ్లింది. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని అద్దెకుంటున్న ఇంట్లో ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ కూతురు ఇంకా ఇంటికి రావడంలేదని తల్లిదండ్రులు ఫోన్ చేయగా అలేఖ్య ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అరుణ్‌కుమార్ ఫోన్ సైతం పనిచేయకపోవడంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా లేకపోవడంతో గురువారం వేకువజామున అరుణ్‌కుమార్ ఉంటున్న అద్దెఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఉరేసుకుని చనిపోయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలేఖ్య కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి తెలిపారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
కేసముద్రం : కొలంబియా(Colombian) యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని(love marriage) పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో(Australia) ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
Beer Bottle: బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్..
వరంగల్: బీరు బాటిళ్లలో స్పూన్లు కనిపించడంతో మందుబాబులు కంగుతున్న సంఘటన గిర్నిబావిలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు కలిసి మద్యం సేవిస్తున్నారు. ఓ బాటిల్లో స్పూన్ మొత్తం ఉండగా.. మరో బాటిల్లో సగం విరిగిన స్పూన్ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన మందుబాబులు స్థానికంగా తాము కొనుగోలు చేసిన మద్యం షాపు వద్దకు వెళ్లి యజమానిని నిలదీశారు. అయితే బాటిల్లో ఉన్న స్పూన్ బయటికి రావడం లేదు. ఖాళీ బాటిల్ తయారు చేసే క్రమంలోనే అందులో చేరి ఉంటుందని, అది గమనించకుండా మద్యం నింపారని గుర్తించారు. కేఎఫ్ లైట్ కంపెనీకి చెందిన బీర్లు కావడంతో షాపు యజమాని వాటిని వాపస్ తీసుకుని రెండు బాటిళ్లు మళ్లీ ఇచ్చాడు. ఈ ఘటనను సదరు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని షాపు నిర్వాహకులు తెలిపారు. -
ఎర్రవల్లి: బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్
సాక్షి, ఎర్రవెల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్బంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.ఇదే సమయంలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. -
HYD: మద్యం మత్తులో యువతి హల్చల్.. బైక్‌ను ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్‌యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్‌యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
పసుపు.. ఈసారి పసిడి పంటే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పండించిన రైతులకు ధర గిట్టుబాటు అవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది. అతివృష్టి లేకపోవడంతో దుంపకుళ్లు తెగులు (నీరు నిలిస్తే వచ్చే తెగులు) రాలేదు. దీంతో దిగుబడి సైతం గత ఏడాది కంటే ఎక్కువగా వస్తోంది. రాష్ట్రంలో పండించిన పసుపు పంటలో 80 శాతం నిజామాబాద్ మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటివరకు ఫింగర్ పసుపు రకానికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 13,311 ధర పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.11,300 ధర దక్కుతోంది. గోళా పసుపునకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10 వేలు పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.9,900 దక్కుతోంది. ఫింగర్ పసుపునకు కనీస ధర రూ.10 వేలు, గోళా పసుపునకు కనీస ధర రూ.9వేలు తగ్గకుండా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చొరవ తీసుకుంది. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం తేమ ఉంటోందని, రైతులు తేమ శాతాన్ని 12 శాతానికి పరిమితం చేసుకుంటే మరింత ధర దక్కుతుందని మార్కెట్ కమిటీ చెబుతోంది. తగ్గుతూ వచ్చి.. మళ్లీ పెరుగుదల దిశగా.. నిజామాబాద్ మార్కెట్‌కు ఈసారి ఎక్కువగా పసుపు రానున్నట్టు అధికారులు చెబుతున్నా రు. 2019–20లో 10,78,821 క్వింటాళ్లు, 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021 –22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5,00,985 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసు పు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 2.25 లక్షల క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్లు పసుపు ఇక్కడి మార్కెట్‌కు వస్తుందని అధికారుల అంచనా. మొత్తంగా మరో 3.65 లక్షల క్వింటాళ్లు రానున్నట్టు లెక్కలు వేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లా రైతులు సాగు చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లా రైతులు 22 వేల ఎకరాలు పసుపు సాగు చేశారు. నిరంతర పర్యవేక్షణ పసుపు రైతులకు మేలు చేసేవిధంగా పసుపు ట్రేడింగ్ విషయమై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్వింటాల్‌కు రూ.10 వేల ధర తగ్గకుండా కటాఫ్ పెట్టాం. ఈ–నామ్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్ విషయమై పక్కాగా వ్యవహరిస్తున్నాం. రైతులు 12 శాతం కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి. తద్వారా ట్రేడర్లు తక్కువ ధరకు కోట్ చేయకుండా చూస్తాం. – ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ -
కొమురయ్య.. దీవెనలివ్వాలయ్యా..
రామగుండం: ఆరు దశాబ్దాల క్రితం నాటి మాట ఇది.. గోపు వంశీయుడొకరు భవిష్యవాణి చెప్పేవారు. తన మరణాన్ని కూడా ముందుగానే ప్రకటించి కన్ను మూశారు. ఆ రోజు నుంచి ఆయనను దైవంగా గో పు వంశీయులు కొలుస్తూ జాతరను నిర్వహిస్తు న్నారు. గోపు వంశీయులు భక్తి ప్రపత్తులతో కొలిచే ఆ దైవం పేరు గోపు కొమురయ్య. 65 ఏళ్లుగా జాతరపెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు కొమురయ్య మరణానంతరం.. ఆయన పేరిట 65 ఏళ్లుగా (మల్లికార్జున కల్యాణం) గోపు వంశీయులు జాతరను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భవిష్యవాణితోనే బహుళ ప్రాచుర్యంఆరు దశాబ్దాల క్రితం గోపు కొమురయ్య బతికుండగానే భవిష్యవాణి చెప్పారని ఆయన భక్తులు విశ్వసిస్తారు. సమాజంలో జరిగే శుభాలు, దుష్పరిణామాలు ముందుగా గ్రహించేవారని.. పూనకం వచ్చిన సమయంలో.. తన వద్దకు వచ్చే వారికి భవిష్యవాణిని వినిపించేవారంటారు. తన మరణ తేదీని ముందుగా ప్రకటించారని.. తన పేరుతో జాతర నిర్వహించాలని ప్రకటించిన సమయానికే శివైక్యం పొందారని భక్తుల కథనం. దీంతో కొమురయ్య సమాధిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. యాదవ కులబాంధవులు ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటున్నారు. కొమురయ్య సమాధికి గది నిర్మించి ఆలయంగా పూజిస్తున్నారు. దశాబ్దాల తరబడి.. రోజూ ఉదయం క్రమం తప్పకుండా సమాధి వద్ద గోపు వంశీయులు దీపారాధన చేస్తున్నారు. సమాధి వద్ద గోపు వంశీయులు శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం పేరిట జాతర నిర్వహిస్తుండడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ కులస్తులు రావడం జాతర ప్రత్యేకత. ఈ క్రమంలో ప్రతీ హోలీ పండుగకు ముందు ఫాల్గుణ మాసం ఆది, సోమవారాల్లో జాతర నిర్వహిస్తుంటారు.జాతరకు సకల ఏర్పాట్లుఅంతర్గాం మండలం ముర్మూర్ శివారులోని ఆయ న సమాధి (ఆలయం) వద్ద ఈనెల 9 నుంచి కార్య నిర్వాహక ప్రతినిధి గోపు అయిలయ్య యాదవ్ నేతృత్వంలో జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు దృష్టి కుంభం, మైల లు తీయడం, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్ద పట్నంతో పాటు ఉదయం 11.45 గంటలకు శ్రీమల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. 10వ తేదీ వేకువజామున 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఇప్పలపల్లి భరత్ స్వామి జంగమ మహేశ్వరులచే కొమురన్న జీవిత చరిత్రపై ఒగ్గు కథ ప్రదర్శించనున్నారు. ఈసారి తొలిసారిగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించనుండగా, ముగ్గురికి భారీగా ప్రోత్సాహక బహుమ తులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొ న్నారు. రెండు రోజుల పాటు జాతరకు వచ్చే భక్తుల కు అన్నదానం చేస్తారు.కొమురయ్య ఉన్నట్టే భావిస్తాంగోపు కొమురయ్య జ్ఞాపకార్థం నిర్వహించే జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 65 ఏళ్లుగా మా వంశీయులు నిష్టతో దీపారాధన చేస్తున్నారు. ఆయన మా మధ్య లేకపోయినా.. జీవించి ఉన్నట్లుగానే భావిస్తున్నాం. – గోపు అయిలయ్యయాదవ్, జాతర కార్యనిర్వాహక ప్రతినిధి -
జాప్యానికి జరిమానా..!
సాక్షి, హైదరాబాద్: ఐదున్నరేళ్ల జాప్యంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపుతున్న ఉప్పల్–మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం మొదలైన పనులు ఇంకా సగం కూడా పూర్తి కాకపోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ కారణమని తేల్చి.. రెండింటికి పెనాల్టీ విధించింది. పనుల్లో జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరగనుండటంతో దాదాపు రూ.60 కోట్ల మేర అంచనాను పెంచింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ కారిడార్‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఇదీ నేపథ్యం..: హైదరాబాద్–భూపాలపట్నం 163 జాతీయ రహదారి మీద హైదరాబాద్–వరంగల్ మధ్య వాహనాల రద్దీ బాగా పెరిగి ఉప్పల్ సమీపంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. దీంతో దిగువన 150 మీటర్ల సర్వీసు రోడ్డు నిర్మిస్తూ, ఘట్కేసర్ వైపు వెళ్లే వాహనాలకు నిరాటంక ప్రయాణానికి వీలు కల్పించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2017లో ప్రతిపాదించారు. ఉప్పల్ కూడలి నుంచి మేడిపల్లి వరకు 6.2 కి.మీ నిడివితో 45 మీటర్ల వెడల్పు ఉండే ఆరు వరుసల ఫ్లైఓవర్‌కు డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 11.5 కి.మీ. నిడివితో నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత, ఇదే పెద్ద ఫ్లైఓవర్ కానుండటం గమనార్హం. 2018 జూలైలో ప్రారంభమైన పనులను 2020 జూలై నాటికి పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. రూ.670 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. కానీ, నిర్మాణ సంస్థ అసాధారణ రీతిలో వ్యవహరించిన తీరు మొదటికే మోసం తెచ్చింది. ఓ రష్యన్ కంపెనీతో కలిసి నిర్మాణ సంస్థ ఏకంగా 25 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. అంత తక్కువ మొత్తంలో ఈ వంతెనను పూర్తి చేయటం కష్టమని దానికి తర్వాత తెలిసొచ్చింది. అదే సమయంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 43 శాతం మాత్రమే పనులు చేసి ఆపేసింది. అసంపూర్తి పనులతో ఆ మార్గంలో వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడేళ్లుగా వాహనదారులు ఆ ప్రాంతాన్ని దాటేందుకు నానా అవస్థలకు గురవుతున్నారు. నిర్మాణం పాత సంస్థదే.. పర్యవేక్షణకు స్వతంత్ర సంస్థటెండర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్త టెండర్ పిలిచి మరో నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగించాలని తొలుత అధికారులు భావించారు. కానీ, దీనివల్ల మరింత జాప్యంతోపాటు ఖర్చు కూడా పెరుగుతుందని గుర్తించి, పాత నిర్మాణ సంస్థకే బాధ్యత అప్పగించారు. పని పూర్తి చేసేందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. కంపెనీ ఆర్థిక నష్టాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యవహారం నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను నియమించాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలు సహా మొత్తం ఆ సంస్థే పర్యవేక్షించనుంది. మరో సంస్థతో అవగాహన కుదుర్చుకుని నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. 20 నెలల్లో పూర్తి: ప్రాజెక్టు పనులను 20 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. 2026 అక్టోబర్ 31 నాటికి వంతెనను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించింది. తాజా నిర్ణయాలు ఇవీరూ.28 కోట్ల పెనాల్టీ: పనుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థల తీరు కారణమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ తేల్చింది. సకాలంలో భూసేకరణ పూర్తి చేయలేకపోవటం, నిర్మాణానికి వీలుగా స్తంభాలు, ఇతర కట్టడాలను తొలగించకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. పనులు మొదలయ్యాక నిర్మాణ సంస్థ మధ్యలో ఆపేసి ఆ జాప్యాన్ని కొనసాగించింది. దీంతో.. ఆ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసేందుకు భవిష్యత్తులో ఖర్చుచేసే మొత్తంపై 10 శాతాన్ని పెనాల్టీగా విధించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ చెరిసగం భరించాలని పేర్కొంది.అంచనా రూ.60 కోట్లు పెంపు: ఈ ప్రాజెక్టు ఒప్పంద అంచనా రూ.425.10 కోట్లు. ఇందులో ఇంకా 225.56 కోట్ల పని చేయాల్సి ఉందని లెక్క తేలింది. కానీ, ఆ మొత్తంతో పని పూర్తి కాదు. మరో రూ.60 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. అంటే రూ.286 కోట్లు ఖర్చవుతుందన్నమాట. నిర్మాణ సంస్థ పెనాల్టీగా రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించే క్రమంలో రూ.14 కోట్ల పెనాల్టీని మినహాయించుకోవాలని అధికారులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశించింది. -
అడవిలోనే ప్రతిఫలం దక్కేలా!
సాక్షి, సిద్దిపేట: అమ్మలాంటి అడవి మనిషి అత్యాశకు అంతరించిపోయే దుస్థితికి చేరుకుంది. దీంతో అడవినే ఆవాసంగా చేసుకొని బ్రతికే జంతువులు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వానరాలు అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాలపై దండెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. అంతరించిపోతున్న అటవీ పండ్ల మొక్కలకు ప్రాణం పోసి కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో వైల్డ్ ఫ్రూట్ గార్డెన్‌ను పెంచుతున్నారు. 70 రకాల అరుదైన పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ అలరారుతోంది. మామిడి, జామ, ద్రాక్ష, సంత్ర, దానిమ్మ లాంటి అందరికీ తెలిసిన చెట్లతోపాటు దట్టమైన అడవుల్లో పెరిగే ఫాల్–సా, లక్ష్మణ ఫలం, నారపండు, బొట్కు, కలిమి పండు, చిన్న కలింగ, నల్ల జీడి, నార మామిడి, బుడ్డ ధరణి, గార్సినియా, తెల్ల నేరడు వంటి చెట్లను కూడా ఈ గార్డెన్లో పెంచుతున్నారు. ఒక్కో పండ్ల రకం 5 మొక్కల చొప్పున మొత్తం 350 మొక్కలు ఈ గార్డెన్లో ఉన్నాయి. ప్రతి మొక్క వద్ద దాని పేరు, శాస్త్రీయ నామం, నాటినవారి పేరుతో నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాల్–సాఈ చెట్లు ఎక్కువగా శ్రీలంకలోనూ, మన అమ్రాబాద్ అడవుల్లోనూ పెరుగుతాయి. ఇవి అచ్చం పరికి పండ్ల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్టు సుమారు 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండ్లను ఆయుర్వేద మందులలో సైతం వినియోగిస్తారు. బొట్కు.. ఈ పండును కోతులు ఇష్టంగా తింటాయి. మధ్యప్రదేశ్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పకాయ మాదిరిగా ఉంటుంది. నొప్పులకు, వాపులకు ఈ చెట్టు ఆకుల రసాన్ని వినియోగిస్తారు. కలిమి పండు..ఇది చెర్రీ పండు మాదిరిగా ఉంటుంది. వికారాబాద్ అడవుల్లో అధికంగా పెరుగుతుంది. దీనిని వికారాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఈ పండును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. కోతులు, పక్షులు ఇష్టంగా తింటాయి. గార్సినియా కర్ణాటక, మహారాష్ట్ర అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చింతపండుగా వినియోగిస్తారు. ఈ మొక్కలను కర్ణాటక అడవుల్లో నుంచి తీసుకువచ్చారు. వీటిని కోతులు, పక్షులు, మనుషులు ఇష్టంగా తింటారు. వివిధ అడవుల్లో సేకరించాం అడవుల్లో పలు రకాల అటవీ పండ్ల చెట్లు అంతరించి పోవడంతో కోతులకు తిండి లభించడం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అడవుల్లో వివిధ పండ్ల గింజలను సేకరించి వాటి ద్వారా మొక్కలను పెంచుతున్నాం. ఇప్పటివరకు 70 రకాల అడవి పండ్ల మొక్కలను నాటాం. ఇంకా 30 రకాల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలా ఉత్పత్తి అయిన తర్వాత అడవుల్లో మొక్కలను నాటుతాం. దీంతో కోతులు మళ్లీ అడవుల బాట పట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త తరానికి సైతం ఆ పండ్లు తెలుస్తాయి. – డాక్టర్ హరీశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అటవీ కళాశాల, పరిశోధన సంస్థ, ములుగు -
కాంగ్రెస్‌లో కులాల ‘లెక్కలు’
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి కులాల కోణంలోనే కసరత్తు జరుగుతోంది. ముందుగా కేబినెట్ బెర్తుల్లో రెడ్లు, బీసీలకు రెండేసీ పదవులు ఇవ్వాలా అనే విషయంలో పోటీ ఏర్పడుతోందని సమాచారం. ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు కావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గట్టిగా అడుగుతుండగా, రెడ్డి నాయకులకు కచ్చితంగా రెండు కేబినెట్ బెర్తులు అవసరమే అని మరో ముఖ్యనేత పట్టుపడుతున్నట్టు తెలిసింది.ఎస్సీల్లో మాల, మాదిగలు, బీసీల్లో ప్రధాన ఐదు కులాలతోపాటు ఎంబీసీలు, ఎస్టీల్లో లంబాడ సామాజికవర్గాన్ని నొప్పించకుండా పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని ప్రత్యేక ప్రతి«నిధులుగా, ప్రభుత్వ సలహాదారులుగా నియమించే అవకాశాలున్నాయి. ఈనెల 10వ తేదీ కల్లా పదవుల కసరత్తు పూర్తి చేసేలా..7న కీలక భేటీ జరగనుంది. భర్తీ చేసే పదవులు ఇవే.. ఆరు కేబినెట్ బెర్తులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, రెండు లేదా మూడు ప్రభుత్వ సలహాదారులు, నాలుగు ఎమ్మెల్సీలు, నలుగురు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ కోశాధికారి, 20 మంది వరకు ఉపాధ్యక్షులు, 25–30 మంది ప్రధాన కార్యదర్శులు, 20 వరకు కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. మూడు సూత్రాల ఆధారంగా... మంత్రివర్గ విస్తరణ విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు నేతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో పదవుల పంచాయితీలు ఉండొద్దని, సామాజిక న్యాయం జరగాలని, బీసీలు, మాదిగలకు ప్రాధాన్యం తగ్గొద్దని ఏఐసీసీ సూత్రీకరించింది. అక్కడి నుంచి సంకేతాల మేరకు వివిధ పదవుల భర్తీకి టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది. రెండింటికీ లింకు పెట్టి.... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు.. కేబినెట్ భర్తీకి లింకు పెట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్లో ఎస్టీ (లంబాడ)లకు అవకాశం ఇవ్వలేని నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే అటు లంబాడ, ఇటు మహిళ కోటాలో ఖమ్మం జిల్లాకు చెందిన విజయాబాయి పేరు తెరపైకి వచ్చింది. దీంతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా లంబాడ వర్గానికే చెందిన బాలూనాయక్‌ను నియమించనున్నారు. ఎంపీ బలరాంనాయక్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మాలలకు కేబినెట్లో అవకాశమిస్తే మాదిగసామాజిక వర్గానికి చెందిన దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్లలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌ను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పంపనున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా పంపే అవకాశాలున్నాయి. మల్లురవి, మధుయాష్కీలలో ఒకరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఓసీ కోటాలో వేం నరేందర్‌రెడ్డి, టి. జీవన్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు కాదంటే జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించే చాన్స్ ఉంది. బీసీ కోటాలో ఈసారి ఎమ్మెల్సీగా యాదవసామాజిక వర్గానికి చెందిన నేతను నియమించొచ్చు. మున్నూరుకాపు, ముదిరాజ్, పద్మశాలి, గౌడ్లకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభిస్తే.. కచి్చతంగా ఎమ్మెల్సీగా యాదవ వర్గానికి అవకాశం దక్కుతుంది. ఈ కోటాలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ పేరు వినిపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ అంశం పూర్తి గా సామాజిక కోటాలోనే జరుగుతుండడం గమనార్హం. మంత్రి పదవులు ఐదా.. ఆరా?రాష్ట్ర కేబినెట్ 18 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశముంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. » ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రెడ్లకు, రెండు బీసీ (ముది రాజ్, మున్నూరుకాపు), ఒకటి ఎస్సీ (మాల), ఒకటి మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నారు. ఒకవేళ ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే మైనార్టీ లేదంటే రెడ్లలో ఒకటి తగ్గించొచ్చు. » అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ మాట ఇచ్చిన విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు బెర్తులు ఖాయమైనట్టే. » బీసీల కోటాలో వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్లకూ దాదాపు ఓకే అయినట్టే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)కి కూడా మంత్రి పదవి ఖరారైనట్టే. » మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ లేదంటే ఆమేర్ అలీ ఖాన్ల పేర్లు వినిపిస్తున్నాయి. » ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే సుదర్శన్‌రెడ్డిని ఆపేసి షబ్బీర్‌అలీని మంత్రిని చేసే అవకా శాలున్నాయి. లేదంటే మైనార్టీ కోటాను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టి ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ నేతతో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయి. » మంత్రివర్గ విస్తరణ కసరత్తులో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లభించే అవకాశం లేనందున, ఆ జిల్లా కు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల లో ఒకరిని అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఎంబీసీ వర్గాలకు చెందిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను విప్‌గా అవకాశమిస్తారు. -
ఆపరేషన్ ‘కడావర్ డాగ్స్’
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది. నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలించనుంది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.కొనసాగుతున్న టీబీఎం భాగాల తొలగింపు..సొరంగం లోపల 13.650 కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉండటం తెలిసిందే. దీంతో ఆయా భాగాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి టీబీఎం భాగాలను కట్ చేస్తూ, మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు.కన్వేయర్ బెల్టును ప్రమాదస్థలం వరకు కొనసాగించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్, జాయింట్ మెషీన్, కమిషన్ పనులు పూర్తవగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి కన్వేయర్ బెల్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు.నేడు రంగంలోకి టన్నెల్ ప్రత్యేక నిపుణులు..సొరంగంలో ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీత కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఐఐటీ చెన్నైకి చెందిన టన్నెల్ నిపుణులు శుక్రవారం దోమలపెంటకు రానున్నారు. ఇప్పటికే ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ప్రమాదస్థలానికి పరిశీలించారు. ప్రత్యేక పరికరాలు లేదా ఏఐ రోబోల ద్వారా కార్మికుల వెలికితీత సాధ్యమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన నిపుణులు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని సొరంగం పైభాగంలో భూమి పరిస్థితులపై సర్వే పనులను కొనసాగిస్తున్నారు.13 రోజులుగా శిథిలాల కిందే..ఎస్ఎల్బీసీ సొరంగం కుంగిన ప్రమాదంలో 8 మంది కారి్మకులు, ఇంజనీర్లు గత 13 రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 12 ఏజెన్సీలు, సంస్థలు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకుండానే 14 కి.మీ. వరకు ఏకధాటిగా టీబీఎం ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రమాదస్థలంలో రెస్క్యూ బృందాలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. టన్నులకొద్దీ పేరుకుపోయిన మట్టి, శిథిలాలను బయటకు తరలించేందుకు రోజుల సమయం పడుతోంది. దీంతో ఈ తరహా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ వారి ఆచూకీ నేటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. -
‘పాలమూరు’ అంచనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 కింద నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కి.మీ.ల ఓపెన్ కాల్వ నిర్మాణం పనుల అంచనాల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అంచనాలను రూ.416.1 కోట్ల నుంచి రూ.780.63 కోట్లకు సవరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వను 12.65– 31.2 కి.మీ.ల మధ్య రూ.148.76 కోట్ల అంచనాలతో లైనింగ్ చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. రూ.153 కోట్లతో రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపు పనులకు కూడా ఓకే చెప్పింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ, ఆ మేరకు రూ.574.56 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చింది. గతంలో ఈ పనులను రూ.860.25 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనపర అనుమతులివ్వగా, రిజర్వాయర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఆ తర్వాత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు తగ్గించారు. సీతారామపై మంత్రుల మధ్య సంవాదం !సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనాలు సవరించే అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య సంవాదం జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324 కోట్లకు పెంచాలనే ప్రతిపాదనలపై వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించకుండా, రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో దీనిని రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేసిందంటూ ఓ మంత్రి తప్పుబట్టినట్టు తెలిసింది. 67.5 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 3.89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన నేపథ్యంలో మళ్లీ పాత పథకాల ప్రస్తావన అనవసరమని మరో మంత్రి బదులిచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ నుంచి అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని, మళ్లీ పాత ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి సమస్యను జటిలం చేయవద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 18న గత ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచింది. -
పెను ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ‘ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం భద్రత పెను ప్రమాదంలో ఉంది. డ్యామ్ పునాదుల కింద భూగర్భంలోని భారీ రాతిఫలకాల మధ్య పెళుసుతో కూడిన బలహీన అతుకులున్నట్టు జియలాజికల్ సమాచారం స్పష్టం చేస్తోంది. నిలువుగా రెండు భారీ జాయింట్లు, వాటికి అనుబంధ జాయింట్లూ ఉన్నట్టు తెలుపుతోంది. అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయి జారిపోయే ప్రమాదం ఉంది. ఇది డ్యామ్ భద్రతకు అత్యంత ప్రమాదకరం. డ్యామ్ దిగువన ఏర్పడిన భారీ గుంత (ప్లంజ్‌పూల్) 120 మీటర్ల లోతైనదని 2018 జూలైలో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో తేలింది. గుంత లోతు డ్యామ్ పునాదుల లోతుకు మించిపోయినట్టు తెలుస్తోంది. గుంత.. డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెళుసుతో ఉన్న జాయింట్ల (షీర్ జోన్)ను ప్రభావితం చేసి ఉండవచ్చు. డ్యామ్ జారిపోకుండా రక్షణ కల్పించే పునాదుల మందం గణనీయంగా తగ్గిపోయి ఉండవచ్చు..’ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి చెందిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే పలు అధ్యయనాలు, మరమ్మతులు చేపట్టాలని సిఫారసు చేసింది. 2009 వరదలతో పెరిగిన ముప్పుఎన్డీఎస్ఏ సభ్యులు (విపత్తుల నిర్వహణ) వివేక్ త్రిపాఠి నేతృత్వంలో డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్, కన్సల్టెంట్ కమలేశ్ జైన్‌తో సంస్థ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు, సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల నిపుణులు కూడా కమిటీలో ఉ న్నారు. ఈ కమిటీ గత ఏడాది శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. అనంతరం తన నివేదికను సమర్పించింది. తాజాగా వెలుగు చూసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి.78 గంటల భీకర వరదతో తీవ్ర నష్టంశ్రీశైలం జలాశయం నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తైంది. 1975–76లో జలాశయం దిగువన బకెట్ ఏరియా కోతకు గురైనట్టు గుర్తించి, నిపుణుల కమిటీ సూచన మేరకు రక్షణగా ఆప్రాన్ ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. మళ్లీ కమిటీ సూచన మేరకు 1984–85లో కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను ఆప్రాన్‌కు రక్షణకు పాతిపెట్టగా, అవీ కోతకు గురయ్యాయి. శ్రీశైలం జలాశయాన్ని గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించగా, 2009 అక్టోబర్‌లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీటర్లకు పెరిగిపోవడంతో జలాశయం పొంగిపొర్లింది. 78 గంటల పాటు భీకర వరద కొనసాగడంతో జలాశయానికి తీవ్ర నష్టం వాటిల్లింది.ప్లంజ్‌పూల్‌పై కమిటీ సిఫారసులు⇒ శ్రీశైలం జలాశయం దిగువన డైక్/కాఫర్ డ్యామ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. దీంతో దిగువ భాగంలో నీటి నిల్వల స్థాయి పెరిగి గుంత మరింతగా కోతకు గురికాకుండా ఉంటుంది. ⇒ గుంత కారణంగా జలాశయం పునాదుల కింద రాతిపొరల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి ఆధునిక పద్ధతుల్లో సిమ్యూలేషన్ అధ్యయనాలు చేయాలి. వేర్వేరు వరద తీవ్రతలను ప్రామాణికంగా తీసుకుని జలాశయానికి ఉండే ముప్పును, స్థిరత్వాన్ని, జారిపోయే ప్రమాదాన్ని అంచనా వేయాలి. ⇒ జలాశయం దిగువన దెబ్బతిన్న కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను పునరుద్ధరించాలి. ⇒ ప్లంజ్పూల్కి రెండువైపులా స్థిరత్వం కోసం రాతిఫలకాలకు బోల్టులు అమర్చి కాంక్రీట్‌తో రీఎన్‌ఫోర్స్ చేయాలి. ⇒ దిగువన గుంత పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాలి. ⇒ జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా? లేదా? అనే అంశాన్ని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించాలి. ⇒ జలాశయం ఎగువన ఎడమగట్టుకు రక్షణగా నిర్మించిన గోడకు మరమ్మతులు జరపాలి. పియర్, స్పిల్‌వే ఎగువ భాగానికి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ మరమ్మతులు చేపట్టాలి.ఇతర సిఫారసులు⇒ జలాశయం 17/18 బ్లాకులకు రెండుచోట్ల అడ్డంగా వచ్చిన పగుళ్లకు మరమ్మతులు చేయాలి. భవిష్యత్తులో మళ్లీ ఏర్పడకుండా నివారించేందుకు వీలుగా పగుళ్లకు కారణాలను శోధించాలి. ⇒ డ్యామ్ దిగువన 4, 9, 10 నంబర్ల గేట్ల వద్ద ఏర్పడిన గుంతల లోతును అధ్యయనం చేసి, దాని ఆధారంగా మరమ్మతులను నిర్వహించాలి. ⇒ 16, 17వ బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన రివర్ స్లూయిస్ల నుంచి లీకేజీని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యతతో మరమ్మతులు చేయాలి. ⇒ డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో ఆందోళనకర రీతిలో పెద్దమొత్తంలో సీపేజీ జరుగుతోంది. సీపేజీ అధికంగా ఉన్న బ్లాకులకు కర్టైన్ గ్రౌటింగ్ నిర్వహించాలి. ⇒ భూకంపాల ముప్పుపై ఎప్పుడో జలాశయం నిర్మాణ సమయంలో అధ్యయనాలు చేశారు. ఇప్పుడు అత్యాధునిక సమాచారం లభ్యతగా ఉన్న నేపథ్యంలో మళ్లీ కొత్తగా అధ్యయనం జరపాలి. ⇒ జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. -
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల ఫీజు బకాయిలు చెల్లించలేదని కాకతీయ విశ్వవిద్యాలయం 112 ప్రైవేటు కాలేజీలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపివేసింది. మొత్తం బకాయిలు చెల్లించే వరకూ వెల్లడించబోమని తేల్చి చెప్పింది. దీంతో యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మిగతా వర్సిటీలు కూడా కాకతీయ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, ద్వితీయ, మూడో ఏడాది విద్యార్థులకు వివిధ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. వర్సిటీ పరిధిలోని 390 కాలేజీల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ నెల 4వ తేదీన ఫలితాలు ప్రకటించారు. కానీ ఫీజు బకాయిలు ఉన్న 112 కాలేజీల ఫలితాలు మాత్రం నిలిపివేశారు. ఏంటీ ఫీజులు?ప్రైవేటు డిగ్రీ కాలేజీలు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, విద్యార్థుల గుర్తింపు, విద్యార్థుల సంక్షేమ నిధి, ఇంటర్ టోర్నమెంట్, అనుబంధ గుర్తింపు ఫీజులను ఏటా యూనివర్సిటీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కోర్సును బట్టి రూ.1,000 నుంచి రూ.5 వేల వరకూ ఉంటుంది. అన్ని యూనివర్సిటీల పరిధిలో దాదాపు రూ.100 కోట్ల ఫీజు బకాయిలుండగా.. కాకతీయ పరిధిలోనే 112 కాలేజీలు రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉంది.రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు!కొన్నేళ్ళుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కింద ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరం వరకే రూ.5,195 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.8 వేల కోట్లకు చేరుతుంది. కొన్నేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలకు నిధుల కొరత ఏర్పడింది. అధ్యాపకులకే వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో గత పరీక్షల సమయంలో కాలేజీలు ఆందోళనకు కూడా దిగాయి. అప్పుడు నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సాధారణంగా వర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులను కాలేజీలు విద్యార్థుల నుంచి ముందే వసూలు చేస్తాయి. రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు విద్యార్థులకు తిరిగి చెల్లిస్తాయి.అయితే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కాలేజీలు యూనివర్సిటీలకు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. కాలేజీలు ఎక్కువ ఉండటం, పోటీ పెరగడంతో ఫీజులు ఒత్తిడి చేసి వసూలు చేసే పరిస్థితి లేదని మరోవైపు యాజమాన్యాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఫలితాల నిలిపివేతతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రీయింబర్స్మెంట్ రావడం లేదుమూడేళ్ళుగా ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ప్రతి కాలేజీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం. అయినా ఫలితం లేదు. వర్సిటీని కూడా కొంత సమయం అడిగాం. పట్టించుకోకుండా ఫలితాలు నిలిపి వేయడం సరికాదు. తక్షణమే ప్రకటించాలి.– జె.శ్రీధర్‌రావు (ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) సమయం ఇచ్చినా చెల్లించలేదువర్సిటీకి చెల్లించాల్సిన దాదాపు రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించమని కాలేజీలను కోరాం. వారితో చర్చలు జరిపాం. కొంత సమయం కూడా ఇచ్చాం. అయినా చెల్లించలేదు. ఫీజులు చెల్లించకపోతే యూనివర్సిటీ నడిచేదెలా? అందుకే ఫలితాలు నిలిపివేశాం. – ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి (కాకతీయ యూనివర్సిటీ వీసీ)మాకెందుకీ శిక్ష?కష్టపడి చదివి పరీక్షలు రాశాం. కాలేజీలకు, వర్సిటీకి ఉన్న లావాదేవీలు వాళ్ళు చూసుకోవాలి. మేమేం తప్పు చేశాం. మాకు ఎందుకీ శిక్ష? – బి.సరిత (బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని, ఖమ్మం) -
‘ఘర్’కు సూర్య గ్రహణం
సాక్షి, హైదరాబాద్: ఇంటిపై సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తున్నా..రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పీఎం సూర్యఘర్ పథకం కింద 3 కిలోవాట్స్ (కేడబ్ల్యూహెచ్) కోసం కేంద్రం రూ.78 వేల సబ్సిడీ ఇస్తోంది. మొదటి రెండు కిలోవాట్స్‌కు రూ.60 వేలు, మూడో కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడీ ఉంటుంది. అపార్ట్మెంట్లపై కూడా సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గరిష్టంగా 500 కిలోవాట్స్ వరకు అనుమతి ఉంది. అయితే ప్రతీ కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. అయితే మొత్తాన్ని అపార్ట్మెంట్లోని వ్యక్తులందరూ వినియోగించుకునేలా (ఉదాహరణకు లిఫ్ట్, నీటి అవసరాలు, మెట్లు, కామన్ స్పేస్‌లో లైటింగ్) వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో దాదాపు 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో విద్యుత్ అందుబాటులో లేకుంటే కోతలు విధించాల్సిన పరిస్థితులు ఈ వేసవిలో తలెత్తే అవకాశముంది. దరఖాస్తు ఇలా...మిద్దెలపై సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు నేరుగా జాతీయ రెన్యూవబుల్ ఎనర్జీ సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వెంటనే సంబంధిత డిస్కమ్ నుంచి అధికారులు వచ్చి..మీ గృహాన్ని సందర్శిస్తారు. ఎన్ని కిలోవాట్స్ సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది? ప్రస్తుత విద్యుత్ వినియోగం ఎంత? తదితర వివరాలు తెలుసుకొని సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక ఇస్తారు. ఆ తర్వాత సైట్లోనే మీరు సౌర ఫలకలు ఏర్పాటు చేసే వెండర్స్ జాబితాను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం డి్రస్టిబ్యూషన్ కంపెనీలు నెట్‌మీటరింగ్‌ను ఏర్పాటు చేస్తాయి. సౌరవిద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, మీ వినియోగం ఆధారంగా డిస్కమ్‌లు మీ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తుంది. మీ సోలార్ యూనిట్ ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే తక్కువగా వినియోగించుకుంటే, మిగిలిన యూనిట్లను డిస్కమ్ వినియోగించుకుంటుంది. అలా ప్రతీ ఆరునెలలకోమారు మీరు ఏర్పాటు చేసుకున్న యూనిట్ నుంచి ఉత్పత్తి మిగిలిందా? లేక తగ్గుదల ఉందా అన్న అంశాన్ని పరిశీలించి విద్యుత్ బిల్లుల్లో సంబంధిత డిస్కమ్ సర్దుబాటు చేస్తుంది.వినియోగం నెలకు 150కు పైగా ఉంటే.. మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ప్రతీనెలా 150 యూనిట్ల కంటే అధికంగా ఉంటే 3 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని కలుపుకొని దాదాపు రూ. 2.10 లక్షల వరకు వ్యయం అవుతుంది. సోలార్ పవర్ కోసం మీరు చేసే వ్యయం..నాలుగైదేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. ఒకసారి ఈ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. – సంపత్‌కుమార్, రెడ్కో అధికారి -
బ్యాంకులాగా ‘ఈపీఎఫ్ఓ 3.0’ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు అందిస్తున్న సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాన్నుట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. గతంలో ఈపీఎఫ్ఓ ద్వారా సేవలు పొందేందుకు చందాదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని.. తమ ఖాతాలో వివరాల సవరణ కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన ఈపీఎఫ్ఓ తెలంగాణ జోనల్ కార్యాలయంతోపాటు బంజారాహిల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.8.25 శాతం వడ్డీ ఏ బ్యాంకూ ఇవ్వట్లేదు..ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా సేవల సులభతరంతోపాటు చందాదారుల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఒక సంస్థగా ఉందని.. భవిష్యత్తులో అది కార్మికుల బ్యాంకుగా మారబోతోందన్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం రూ. 25 లక్షల కోట్ల మేర నిల్వలున్నాయని చెప్పారు. కార్మికులు దాచుకుంటున్న నిధిపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని, దేశంలో ఇంత వడ్డీ ఏ బ్యాంకూ ఇవ్వటం లేదని మంత్రి గుర్తుచేశారు. చందాదారులు క్లెయిమ్స్‌ను ఆటోజనరేషన్ పద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో చందాదారులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న సొమ్మును ఏటీఎం కార్డుల ద్వారా ఉపసంహరించుకొనే వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి వివరించారు. మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు, ఈపీఎఫ్ఓ కార్యాలయాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రామగుండం లాంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులు మొదలుపెడతామన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేశ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొననున్నారు. -
బీసీలకు 42% కోటా
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో, విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే మరో ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు విలేకరులకు వెల్లడించారు. చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ గత నెల 3న సమర్పించిన తొలి విడత సిఫారసులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగులేటి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 37 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2017లో సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇక 3 సెక్టార్లుగా రాష్ట్రం! ‘రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియాగా, అక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డుకు ఆవల 2 కి.మీల బఫర్ జోన్ వరకు ఫ్యూచర్ సిటీగా, మిగిలిన ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా విభజించాలని నిర్ణయించాం. రూరల్ తెలంగాణ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావు. 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉన్న 30 కి.మీల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశాం. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులను ఆమోదించాం. హెచ్ఎండీఏ పరిధి విస్తరణ హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డుకు 2 కి.మీల బఫర్ జోన్ వరకు పొడిగించాం. 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించింది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి..’ అని పొంగులేటి తెలిపారు. సెర్ప్, మెప్మా విలీనం ‘కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ–2025ని కేబినెట్ ఆమోదించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అందించిన సహకారాన్ని మళ్లీ కొత్త పాలసీతో పునరుద్ధరిస్తాం. మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించాం. ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించడంతో పాటు సభ్యులుగా చేరేందుకు కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు కుదించాం..’ అని మంత్రి చెప్పారు. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ను సవరించాలని నిర్ణయించాం. తెలంగాణ పర్యాటక పాలసీ–2025ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. పర్యాటక విధానంతో వచ్చే 5 ఏళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నాం..’ అని పొంగులేటి తెలిపారు. మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు.. ‘మేలో జరగనున్న మిస్ వరల్డ్– 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. 140 దేశాల నుంచి హాజరుకానున్న అతిథులకు ఎక్కడా లోటు జరకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం..’ అని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. తాజాగా మళ్లీ వారిలో యోగ్యులను జీపీఓలుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో కేంద్రం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. పారా ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 361 పోస్టులను మంత్రివర్గం మంజూరుచేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 అవుట్ సోర్సింగ్ పోస్టులు కలిపి మొత్తం 495 పోస్టులను ఆమోదించింది. దక్షిణాదికి అన్యాయంపై త్వరలో అఖిలపక్ష భేటీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. కేంద్రంతో కొట్లాడి ఉత్తరాది రాష్ట్రాలకు సమానంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తెచ్చుకోవడానికి త్వరలో హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పోరాడాలని నిర్ణయించామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందం – అందుకే ‘పట్టభద్రుల’ అభ్యర్థి ఓటమి – మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందంతో వెళ్లినందునే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యాడనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనితో పాటు ఎన్నికలు ఎదుర్కొన్న తీరులో ఎక్కడైనా లోపాలుంటే భవిష్యత్తులో సవరించుకోవాల్సి ఉంటుందని కొందరు సూచించినట్లు తెలిసింది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా మంత్రులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలురాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2025–26ను సభలో ప్రవేశపెట్టనుంది. -
పాతబస్తీ బహదూర్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహదూర్‌పుర క్రాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న లారీ మెకానికల్ వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదం ధాటికి పక్కనే మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. అయితే, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. -
‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం. ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఇక్రిశాట్ నూతన డైరక్టర్ జనరల్‌గా డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. తాజాగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకునే క్రమంలో ఇక్రిశాట్ హిమాన్షు పాఠక్‌కు సాదర స్వాగతం పలికింది.మొట్టప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ హిమాన్షూ పాఠక్ దేశంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ శాస్త్రవేత్త. నేల, వ్యవసాయ రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విసృ్తత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యనభ్యసించారు.భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో సాయిల్ సైన్స్ ఎమ్మెస్సీతోపాటు పీహెచ్డీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌గా, ఐసీఏఆర్ జాతీయ వరి పరిశోధన సంస్థ (కటక్) డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ (బారామతి) డైరెక్టర్‌గానూ పనిచేశారు. యూకేలోని ఎస్సెక్స్ యూనివర్శిటీ, జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటరాలజీ అండ్ క్లైమెట్ రీసెర్చ్‌లలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పని చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని మెట్టప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్ పాఠక్‌ది కీలకపాత్ర. -
అధికార పక్షాలకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు!
శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్సీపీకి కొంత నష్టం జరిగింది.శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.వైఎస్సార్సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంటర్మీడియట్ పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 4 (బుధవారం) నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 15వందలకు పైగా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.అయితే ఈ సమయంలో విద్యార్థలు కొన్ని ప్రిపరేషన్ టెక్నిక్స్‌ను అనుసరించాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీస్,సలహాలతో కీలకమైన ఈ ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాదు మంచి మార్కులు సాధించవచ్చు.దీంతో పాటు సమయం నియంత్రణ,స్మార్ట్ స్టడీ మెథడ్స్,ముఖ్యమైన ప్రశ్నలపై ఫోకస్,సిలబస్ పూర్తిగా రివైజ్ చేయడం,మాక్ టెస్ట్ రాయడం, గైడ్లను ఫాలో అవ్వడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర, సరిపడ ఆహారం తీసుకోవడం, పాజిటీవ్ థింకింగ్ లక్షణాలు అలవరుచుకోవాల్సి ఉంటుంది.👉 మరింత విశ్లేషణాత్మకమైన ఉత్తమ ప్రిపరేషన్ టిప్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. -
‘తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి.కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు