Telangana Politics
-
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం -
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్ తన మార్క్ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్ వాడీవేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు. -
రేవంత్‌కు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలక పక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారాయన.సాక్షితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయమేమీ కాదు. ఇది బీజేపీ సాధించిన సమిష్టి విజయం. తెలంగాణలో పాలకులు మారినా.. మార్పు రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారు. .. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అర్థమైంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా’’ అని అన్నారాయన. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ.. ఈ విజయం బీజేపీ కార్యకర్తలందరిదని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు, అందరి సహకారంతో ఈ విజయం సాధించాం. మేము ఊహించినట్టే విజయం దక్కింది. మండలిలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతా’’ అని అన్నారు.సాక్షి టీవీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కార్యకర్తల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెంపపెట్టు ఈ విజయం. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది అని అన్నారు. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్ పనులు ముందుకు కదలేదని రేవంత్ చేసిన ఆరోపణలనూ హరీష్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మా హయాంలో టన్నెల్ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్ రావు అన్నారు. అలాగే.. తన దుబాయ్‌పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్‌లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. -
రేవంత్ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారుకేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ దళంలోకి.. గులాబీ వనంలోకి కార్తీక్ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్ అన్నారు.ఇదీ చదవండి: మామునూర్ ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం ఢిష్యూం.. ఢిష్యూం -
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి రేగింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్నవాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో అధికంగా.. 42 శాతం జనాభా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అలాంటి జిల్లాకు దయచేసి అన్యాయం చేయకండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?. ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయంటే రాజీనామాకు నేను సిద్ధం. జిల్లా అభివృద్ధి కోసం.. మంత్రి ప్రాతినిధ్యం కోసం ఇంకొకరిని గెలిపించేందుకు నేను రెడీ అని కాంగ్రెస్ అధిష్టానంను ఉద్దేశించి మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారాయన. ఇక.... పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వొద్దు. ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవద్దు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదు. పని చేసిన వారిని పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి. కార్యకర్తల మనోభావాలను.. నేతల సీనియారిటీనీ పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ క్రమంలో ‘‘పార్టీ లైన్ దాటోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్న’’ అని మల్రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
హెలికాప్టర్ నుంచి చూస్తే టన్నెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా?
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ(గురువారం) ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) జరగడం దురదృష్టకరం. కానీ, ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని.. అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారాయన. ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొంతన లేదు. హెలికాప్టర్లో వెళ్తున్న మంత్రులు పోటాపోటీగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించడం లేదు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది. రేవంత్‌కు కౌంటర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎనిమిది మంది ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. అబద్ధాలు మాట్లాడుతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి. ఎక్కడా SLBC సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. మొత్తం పది ఏజెన్సీలకు డైరెక్షన్ కరువైంది. సహాయక చర్యల్లో విఫలమై.. బీఆర్ఎస్పై బుదరల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను చూడటానికి, మా అనుభవంతో సూచనలు చేయడానికి వెళ్తున్నాం. మూర్ఖులు మమ్మల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాంబీఆర్ఎస్ హయాంలోనే పనులుకరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో SLBC పనులు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే BRS ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం. కాంగ్రెస్ హయంలో పనులు మూలకు పడితే.. రూ.100 కోట్ల రూపాయల మొబలైజేషవ్ నిధులిచ్చాం. మా హయాంలో 13 కిలోమీటర్లు పని జరిగింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి BRS పై బుదర జల్లుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది SLBC సహాయక చర్యలపై. తన పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీష్ రావు అన్నారు. సోయిలేకుండా మాట్లాడుతున్నారుఎస్సెల్బీసీలో జరిగిన ప్రమాదం.. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ తరఫున ఈ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. ఇవాళ హరీశ్ రావు నేతృత్వంలో ఎస్సెల్బీసీ వెళ్తున్నాం. ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేస్తాం. తెలంగాణ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వాటర్, నీళ్లు కలిశాయి అని మాట్లాడటం బాధాకరం. మంత్రుల తీరు జాతీయ స్థాయిలో పరువు తీసేలా ఉంది. అందుకే ఆ పదవుల్లో ఉండాలో లేదో వాళ్లే తేల్చుకోవాలి. ::నల్లగొండలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
మళ్లీ గట్టు దాటి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్‌ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే.. అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్ నిలదీశారు... రాహుల్ గాంధీ స్పిరిట్‌తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. -
చట్టం.. కొందరికి చుట్టమైంది మరోసారి!
‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్‌నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది. మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా. ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది. సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది. చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి. కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది. గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు. రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పటాన్చెరులో ఉద్రిక్తతలు
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గత కొంతకాలంగా పటాన్చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ లీడర్ల బెదిరింపులతో గ్రామసభలు
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). అయితే ఈ పరిణామాలు చాలా చోట్ల గందరగోళానికి దారి తీసింది. అర్హత ఉన్నవాళ్లు సైతం ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. మోసకారి కాంగ్రెస్ సర్కారు(Congress Government)పై ప్రజాతిరుగుబాటు మొదలైంది అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయింది. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైంది. ఇక కాలయాపనతో కాలం సాగదు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు. ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు..నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామసభల(Grama Sabha) సాక్షిగా. గ్రామసభలా...ఖాకీల క్యాంప్ లా!?. సంక్షేమ పథకాల కోసమా.. కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?. ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!. పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?. ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?. ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?. పోలీసుల నడుమ.. అంక్షల నడుమ పథకాలకు అర్హుల గుర్తింపట!. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన! అంటూ ట్వీట్ చేశారాయన.ఇదీ చదవండి: సారూ.. మా పేర్లు ఎందుకు లేవు? -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.సోమవారం ఉదయం తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు.. నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్ అన్నారు. -
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది. సోమవారం ఉదయం గాంధీభవన్‌కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా -
Allu Arjun Controversy: రాజకీయ రగడ
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్ తీరును అధికార కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. .. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా.. రీల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: 'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తారా? : బీఆర్ఎస్ నేత శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు. పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం పంజాగుట్ట (హైదరాబాద్): సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
రాహుల్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బూతులు తిట్టినా, అవమానించినా కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటామని, తమకు పోరాటం కొత్తకాదని కేటీ రామారావు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ‘మీరు ఇచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనను నమ్మి యువత కాంగ్రెస్‌కు ఓటు వేసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉద్యోగాలు లేని కేలండర్‌ను జారీ చేశారు. మళ్లీ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి మీ హామీని ఎలా నెరవేరుస్తారో యువతకు చెప్పండి’.. అని కేటీఆర్ పోస్టు చేశారు. జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్టయి బండ్లగూడ పోలీసు స్టేషన్లో ఉన్న 70 మంది యువతతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాట స్ఫూ ర్తిని చూపుతున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతాం’.. అని భరోసానిచ్చారు. -
రైతుకు వెన్నుపోటు.. పథకాలకు తూట్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని, రైతులను పొగుడుతున్నట్టుగా పొగుడుతూనే ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాల్లో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా చెప్పి రైతులను మోసం చేశారని, ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నైజాన్ని బయటపెట్టుకున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పథకంపై స్పష్టత లేదు. గొర్రెల పథకం లేదు..దళితబంధు లేదు యాదవులకు ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే యాదవులు చెల్లించిన డిపాజిట్లు కూడా వాసప్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. కొత్త విషయం ఏమీలేదు. అత్యంత బడుగువర్గాలకు మేలు చేస్తున్నట్టుగా చెబుతూనే గొంతు కోసింది. దళితవర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. ఇదీ చాలా దురదృష్టకరం. దళిత సమాజంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అవసరం లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఏ ఒక్కవర్గానికి కూడా ఈ బడ్జెట్లో భరోసా లేదు. బడ్జెట్లో విశేషమేమిటంటే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క డబ్బుల గురించి చెప్పినప్పుడు ప్రతిమాటను ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేని పరిస్థితి వచ్చింది. మహిళల పట్ల కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ దీనిని కూడా లక్ష కోట్ల రుణాలు అంటూ వీళ్లేదో ఇస్తున్నట్టు చెప్పారు. ఉన్న స్కీంను చెప్పారే తప్ప..కొత్తగా ఏమీలేదు. వెరసి ఇది పాతదే. దురదృష్టం ఏమిటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ, ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీకి ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటికీ పాలసీ పార్ములేషన్ చేసేటట్టుగా కనిపిస్తలేదు. ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం..చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం ‘ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్..ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి ? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేదవర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక్కదానిపై కూడా స్పష్టత లేదు. చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా.. నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం’అని కేసీఆర్ తేల్చి చెప్పారు. -
ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: హరీశ్‌రావు
రామచంద్రాపురం (పటాన్చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.హరీశ్.. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కండువాతో మాజీమంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కండువాతో హరీశ్ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన మేర సీట్లు రాలేదని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా కలసి రాలేదని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించేందుకు హైకమాండ్ పంపిన కురియన్ కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తోపాటు అస్సాం ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్ గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. మూడు రోజుల షెడ్యూల్లో భాగంగా తొలి రోజు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులతో వీరిరువురూ భేటీ అయ్యారు. 17 మంది అభ్యర్థులకుగాను 16 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కారణంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమిటీ ముందుకు రాలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు కూడా కురియన్ కమిటీని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం సీన్ మారిపోయింది... తొలి రోజు షెడ్యూల్లో భాగంగా ఉదయమే గాం«దీభవన్‌లో కురియన్ కమిటీ ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, ఓడిపోయిన అభ్యర్థులు ఆత్రం సుగుణ, దానం నాగేందర్, సఫీవుల్లా, సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెల్చాల రాజేందర్రావు, చల్లా వంశీచందర్‌రెడ్డి, నీలం మధు, జీవన్‌రెడ్డిలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగిందని, కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జరిగిందని వెల్లడించినట్టు తెలిసింది. ‘అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు లోక్‌సభ ఎన్నికల్లో లేవు. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. బీఆర్ఎస్ బాహాటంగానే బీజేపీకి మద్దతిచ్చింది. తాము గెలవకపోయినా కాంగ్రెస్ గెలవొద్దని, బీజేపీని గెలిపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను రక్షించుకోవాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం’అని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కురియన్ బీజేపీ అంటే బీఆర్ఎస్కు కోపం ఉండాలి కదా... ఓట్లు వేసి సహకరించుకునే సాన్నిహిత్యం ఆ రెండు పార్టీల మధ్య ఉందా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మొదటి నుంచీ తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉండేదని, రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరుధ్యం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం మారిపోయిందని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సహకరించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సహకరించలేదు... కొందరు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు ఎన్నికల్లో సహకరించని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల పేర్లను కూడా కురియన్ కమిటీకి చెప్పారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని, అక్కడ బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన డి.కె.అరుణ కాంగ్రెస్ నుంచి ఎదిగారని, దీంతో చాలా స్వల్పంగా అయినా కాంగ్రెస్ కేడర్ ఆమెకు సహకరించిందని, ఈ నియోజకవర్గంలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయలేదనే చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే మెదక్ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో సహకారం అందలేన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి లాంటి నేతల చేరికలు పార్టీకి కలసి రాలేదని, వాళ్ల ఓట్లు కూడా పడలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వడం కూడా కొంత ప్రభావం చూపిందని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్ లాంటి స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం చివరి నిమిషం వరకు ఆగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వెల్లడైనట్లు తెలిసింది. కాగా, శుక్రవారం కమిటీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జులు, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ భేటీ కానుంది. వారి అంతర్గత పొత్తుతోనే: ఎంపీ చామల కిరణ్ కురియన్ కమిటీతో భేటీ అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను కురియన్ కమిటీకి వివరించామని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 12–13 స్థానాలు వచ్చేవని, బీజేపీ–బీఆర్ఎస్ల అంతర్గత పొత్తు కారణంగానే ఎనిమిది సీట్లకు పడిపోయామని చెప్పారు. కొన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల స్థాయి కంటే తక్కువ ఓట్లను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పొందిందని, పార్లమెంటు ఎన్నికల నాటికి సమీకరణాలు మారిపోయాయని చెప్పారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం పోరుబాట పట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటడంతో హామీల అమలుపై పట్టుబట్టేలా ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 421 హామీలపై ప్రత్యక్ష ఆందోళనలతో వివిధవర్గాల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లేలా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకోసం పార్టీపరంగా ఉన్న యువజన, మహిళా, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆందోళనలను ఇప్పటికే ప్రారంభించింది. రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ‘రైతు సత్యాగ్రహం’ నిర్వహించింది. రైతులకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టకపోతే... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే పెద్దఎత్తున నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన ప్రధాన హామీలైన రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు భరోసా కింద రైతుకూలీల అకౌంట్లలో రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఫసల్ బీమా అమలు, రైతులకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ వంటివాటి అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది. మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై.. ఎన్నికలకు ముందు మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ మంగళవారం మహిళా మోర్చా నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఏడు నెలలు గడిచినా మహిళలకు ప్రతి నెలా రూ. 2 వేల సాయం అమలు కాకపోవడం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ లేకపోవడం, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందకపోవడంతో పాటు మహిళలకు రూ. 500కే వంట గ్యాస్, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానాలు ఏమయ్యాయని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లింపు డిమాండ్‌తో పాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ కాకపోవడం వంటి సమస్యలపై యువమోర్చా ఉద్యమబాట ఉధృతం చేయనుంది. అవినీతి, అక్రమాలపై ఆధారాల సేకరణ... రాష్ట్రంలో సివిల్ సప్లయిస్, ఇతర శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెలికి తీసిన నేపథ్యంలో...ఈ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నందున ఆయా అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం దృష్టికే తీసుకెళ్లాలని పార్టీనాయకులు భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు వస్తున్నందున, వాటిపై కేంద్రం విచారణ కోరేలా, ఆయా శాఖల్లో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి పూరిస్థాయిలోఆధారాలు సేకరించి అందజేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల నాటికి పట్టు సాధించాలని.. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లోగా తొలుత గ్రామీణ (గ్రామపంచాయతీ, జిల్లా/మండల పరిషత్), వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టణ (మున్సిపల్, కార్పొరేషన్) స్థానికసంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పోలింగ్‌బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యావత్ పార్టీ యంత్రాంగం నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందిస్తోంది. -
ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయస్థాయి పోరు
సాక్షి, హైదరాబాద్: పార్టీ బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని బుధవారం కేసీఆర్‌తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. -
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
కాంగ్రెస్ గేట్లు ఎందుకు ఎత్తింది?
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు అన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకులు గొంతు చించుకొని తప్పు పడుతున్నారు. అయితే వారంతా ఈ పరిణామాలపై 2014 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.అంతే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదో మరి! కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ గడీ తలుపులు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం బంతి భోజనాలు చేస్తున్నారు. ఎవరూ పార్టీ మారొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు.ఇక అసలు విషయానికి వద్దాం. ‘గేట్లు ఎత్తేశాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి, మార్పు కావాలి’ అంటూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే రేవంత్ సర్కార్ కొలువుదీరిన కొద్ది రోజుల నుంచే... ‘ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంద’ంటూ ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నాయకులు పదేపదే మాట్లాడుతూ వచ్చారు. ఈ రెండు పార్టీలదీ ఒకే వాయిస్ కావడంతో దీని వెనుక ఏదన్నా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు చర్చకు దారితీశాయి. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ పూనిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన చేయడం ఎంత ముఖ్యమో... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ జరగాలంటే ప్రత్యర్థి పార్టీల కుట్రల్ని ఛేదించడం కూడా ముఖ్యమే మరి. కారు, కమలం పార్టీల రాజకీయ కుట్రని ఛేదించేందుకే ‘కౌంటర్ పాలిటిక్స్’కు రేవంత్ రెడ్డి పదును పెట్టారనుకోవాలి. అందుకే గేట్లు ఎత్తే ఫార్ములాను అనుసరిస్తున్నారని చెప్పక తప్పదు. కానీ, ఇది జనం హర్షిస్తారా? – కోడూరు శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్ -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు హస్తం గూటికి చేరగా.. పార్టీ మారేందుకు మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం.జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్‌స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి నిన్న శనివారం కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్‌తో భేటీ అయినట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు రోజుల్లో వీరిద్దరూ హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. -
బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.కాగా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్‌రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. -
సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం గిదో లెక్కా..!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన సమాజం భవిష్యత్‌లో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీ తంగా తెలంగాణ సమాజం ఎల్లవేళలా బీఆర్ఎస్కు అండగా ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని ఆయన ప్రకటించారు. బుధవారం ఎర్రవెల్లిలోని నివాసానికి వచ్చిన మహబూబాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉద్యమ చరిత్ర.. తెలంగాణ కోసం సాగించిన పోరును మరోసారి గుర్తు చేసుకున్నారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని చెప్పారు. తెలంగాణ సాధన కోసం నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పారీ్టకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఏ ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణ మరింతగా పొందుకుంటూ బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడ్డ దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటునుంచి పదేళ్ల ప్రగతిపాలన దాకా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు, వారు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదన్నారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకోవడంతోపాటు తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయ్యిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ, అన్నితీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజాఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అని..ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని కేసీఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్ పట్టుకొని వెతుక్కుంటూ జనం బీఆర్ఎస్ కోసం వస్తారని కేసీఆర్ అన్నారు. అప్పడిదాక ఓపిక ప్రజాసమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: కేటీఆర్
జగిత్యాల: ‘సీఎం రేవంత్‌రెడ్డి.. నీకు దమ్ముంటే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. వారిని మళ్లీ గెలిపించుకుంటేనే దమ్మున్నోడివి’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రస్తుత సీఎం ప్రయతి్నంచి రూ. 50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఆ పరిస్థితుల్లోనే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యవహరించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా రేవంత్‌రెడ్డే వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా రాజ్యాంగ సవరణ చేస్తామంటూ స్వయంగా రాహుల్‌గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేసీఆరేనని.. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని స్పష్టం చేశారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, మళ్లీ పార్టీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ అనే యువకుడికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగ యువకులపై లాఠీచార్జి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే తమ పార్టీ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించే, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. కరీంనగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ అభి వృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నా మని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే సహకరిస్తున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులిచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేంద్రం పార్టీలకఅతీతంగా ఎంపీలకు నిధులిస్తుందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీని పై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోటమంది ఆనందంతో ఉన్నారని తెలిపారు. -
అలక వీడిన జీవన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యవహారంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనకు సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకో వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి అధిష్టానం హామీతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో భేటీఅయి అరగంట పాటు మంతనాలు సాగించారు. అనంతరం 8 గంటలకు జీవన్‌రెడ్డిని తోడ్కొని దీపాదాస్, శ్రీధర్‌బాబులు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.అండగా నిలిచిన వారిని గుర్తిస్తామన్నారు: జీవన్రెడ్డిఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల మనోభావాలు గుర్తించి, పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రాధాన్యమిచ్చి గుర్తిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారని జీవన్‌రెడ్డి అన్నారు. వేణుగోపాల్‌తో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీకైనా కేడర్ ఆత్మగౌరవమే ప్రధానం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీకి అండగా నిలిచినవారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. వారి కృషికి ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందాను’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యతే అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.తలుపులు తెరిచే ఉంటాయి: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. ‘కాంగ్రెస్‌లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంకా చాలామంది చేరబోతున్నారు. మా పార్టీలోని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కలిసి నడుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నడుస్తోంది’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందా అనే ప్రశ్నకు.. ‘పిక్చర్ అభీ బాకీ హై (సినిమా ఇంకా ఉంది) త్వరలోనే ఉంటుంది. పీసీసీ అ«ధ్యక్షుడి ఎంపిక అధిష్టానం నిర్ణయం. అసెంబ్లీ, పార్లమెంటులాగా కాలవ్యవధి ఉండదు’ అని మున్షీ బదులిచ్చారు.దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: శ్రీధర్బాబుగత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, నష్టపరిచి, బలహీనపరిచిన వారే పార్టీ చేరికలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయితే రాజీనామాలు చేసి రావాలన్న నిబంధనపై పార్టీ ఆలోచన ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు. -
ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్ (అంబర్‌పేట), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), లక్ష్మారెడ్డి (ఉప్పల్)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఎర్రవల్లికి తరలివస్తున్న నేతలు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతున్న నాయకులకు ఎర్రవల్లి నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వస్తున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా కేసీఆర్‌ను కలుస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారితో ఫోటోలు దిగుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్వస్థీకరణ, క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. -
వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచి్చన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు సుదర్శన్‌రెడ్డికి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్‌గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్‌మోహన్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు బిజీబిజీ మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్‌దాస్ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది. పీసీసీ రేసులో ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్ పెద్దల వద్ద చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్‌గౌడ్‌కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్‌గౌడ్ కూడా హైకమాండ్ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగ రావ్, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. -
సంజయ్ చేరిక.. జీవన్ కినుక
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్‌లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్‌రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్‌రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్‌బాబు తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్‌ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
బీఆర్ఎస్ను వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొందరు ప్రతిపక్ష నేతలు అధికారం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. గతంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నాం. ఆనాడు దీనిపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయి. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మళ్లీ చరిత్ర పునరావృతమవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. The power of people is always stronger than the people in powerWe have faced several defections of MLAs in the past in 2004-06 when Congress was in Government Telangana responded strongly by stepping up the people’s agitation & eventually Congress had to bow its head…— KTR (@KTRBRS) June 24, 2024 అయితే, తాజాగా తెలంగాణలో పలువురు సీనియర్ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరొందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలువురు నేతలు హస్తం పార్టీలో చేరారు. అంతకుముందు కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ గూటికి వెళ్లారు. -
జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిలను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్‌రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్ఎస్లో నంబర్ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. రాజకీయంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ తొండిఆట ఆడింది బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తొండిఆట ఆడిందని కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు. బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం లోక్‌సభ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్ఎస్కు కంచుకోటలాంటి మెదక్‌లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రామమందిరం రాజకీయఅంశం కాదు దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
తేడా ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్‌లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆలస్యమే కారణమా?కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.బీజేపీలో జోష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్‌లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్‌లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.జీవన్‌రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్‌లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్‌ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్‌కు ప్రతీ రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు.కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు -
లోక్‌సభ ఎన్నికల్లో లెక్కలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ 2,3 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్కు 2 స్థానాల్లోనే రెండో స్థానం లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్ఎస్కే మెజారిటీ రావడం గమనార్హం. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటర్ల మొగ్గు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది. కరీంనగర్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్ఎస్ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్‌లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ గెలిచిన 18 సీట్లలోనూ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం కాంగ్రెస్ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రెండో స్థానం దక్కింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. -
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్ఎస్ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్ కర్నూల్: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ గెలవగా తర్వాత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్ కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్: సెగ్మెంట్ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాంనాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్ ఆధిక్యమే.. తొలి రౌండ్ నుంచి చివరిదాకా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్ షెట్కార్ ఇదే సెగ్మెంట్ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్‌నగర్: కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్: మళ్లీ కమలమే! ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్ గెలిచారు. హైదరాబాద్: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి. -
లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్’ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్‌ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్‌తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్‌తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్‌తో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ తమకే అనుకూలమంటూ బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నా.. బీఆర్ఎస్ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్ తలపడుతున్న సికింద్రాబాద్ ఫలితంపై అందరి ఫోకస్ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ ఉందంటున్న బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది. -
ఉద్యమాన్ని అవమానిస్తూ.. ఉత్సవాలా?.. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ సహా ఉద్యమకారులు, తెలంగాణవాదులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వా న్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిర సిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవా ల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనడం లేదు..’’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ దశా బ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు ప్రతిగా కేసీఆర్ శని వారం సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. అందులో కేసీఆర్ పేర్కొన్న అంశాలివే..‘‘రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై మీ (కాంగ్రెస్) ప్రభుత్వం ఇటీవల నిర్వహించి న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమై న బీఆర్ఎస్ను ఆహ్వానించక పోవడం అప్రజా స్వామిక వైఖరికి నిదర్శనం. బీఆర్ఎస్ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు.. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చిన న న్ను ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది. తెలంగాణ ప్రజాపోరాటానికి నాయ కత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కల్పించలేదు.రాష్ట్ర సాధనలో నాకున్న అనుభ వాలు పంచుకునేలా ప్రసంగించే అవకాశం క ల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధో రణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించి అవమానించాలనే మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నా రు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే లా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమ కారులు ఇప్పటికే నిరసిస్తున్నారు.జై తెలంగాణ అని నినదించరెందుకు?తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ప్రాణప్రదమైన ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఇప్పటివరకు నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా.. ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక పోవడం ద్వారా ప్రజల మనోభావాలను గాయపరిచారు. అమరుల త్యాగాలతో అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్ర పొడుగునా కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం మొదలు కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.మీ దమన నీతికి సాక్ష్యం.. అమరుల స్తూపంతెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించ నీయకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం కాంగ్రెస్ పార్టీదే.తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చరిత్రాత్మక ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చింది. తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచి ఎన్నికలు, సభలు, సమావేశాలతో రాజకీయ ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించింది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు కాంగ్రెస్ పాల్పడింది.తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండినా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వ చ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరా హార దీక్షకు దిగడంతో కాంగ్రెస్ ‘డిసెంబర్ 9’ ప్రకటన చేసింది. కానీ సమైక్య పాలకుల ఒత్తి డితో వెనక్కితగ్గి మోసం చేసింది. దాంతో వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చే శారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు, క్షమాపణ కోరలేదు. పైగా ద యతో మేమే తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య, అహంభావ ధోరణి ప్రదర్శిస్తూ.. ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా తెలగా>ణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు కాంగ్రెస్ చెప్పినప్పుడే పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.మీకు తెలంగాణ రాజకీయ అవకాశమే..కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు. కాంగ్రెస్ ఎన్నటికీ మారదని మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమ వు తోంది. నాడు, నేడు ఎన్నడూ అంతే. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. ప్రజాపా లన పేరిట అధికారంలోకి వచ్చిన మిమ్మ ల్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులతో వేధింపులు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. తెలంగాణకు గర్వకార ణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కు తూ.. అధికార ముద్ర నుంచి తొలగిస్తామ ని అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమా ని స్తూ.. కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం. -
తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది కాంగ్రెస్ పార్టీ వల్లనే అంటూ విమర్శించారు. అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల? అంటూ ప్రశ్నించారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు?’ ❌ కాంగ్రెస్ ప్రభుత్వం1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు?❌ కాంగ్రెస్ ప్రభుత్వం1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ?❌ కాంగ్రెస్ ప్రభుత్వందేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు?❌ కాంగ్రెస్ ప్రభుత్వం2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ?❌ కాంగ్రెస్ ప్రభుత్వంరేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? ❌… pic.twitter.com/lsI2NMuCjm— KTR (@KTRBRS) May 31, 2024 -
సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి సొంతంగా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. మేడిగడ్డలో ఎంతో కొంత నీళ్లు నింపి, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పంపినా.. అవి ఉంటాయో, ఊడుతాయో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక సైతం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు ‘80 వేల పుస్తకాలు చదివి, సొంత తెలివితేటలతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. అల్లుడు హరీశ్‌రావు వరల్డ్ రికార్డు కోసం ఆగమాగం పనులు చేశాడు. ఇప్పుడు అది కూలింది. మేడిగడ్డలో కూలిన బ్లాక్‌ను సరిచేసి నీళ్లు నిలిపితే, ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు. ఒకవేళ రెండున్నర మీటర్లలో మేడిగడ్డ నింపి అన్నారం, సుందిళ్లకు నీటిని పంపితే వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద నీరు, ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నుంచే కిందికి పోవాలి. ఇప్పటికే 52 టీఎంసీల ఎత్తిన నీళ్లు కిందకు పోయాయి. సముద్రంలోకి పోయిన నీటికి కరెంట్ బిల్లులు కట్టాం. 80 వేల పుస్తకాలు చదివిన తెలివి అట్లుంది. కాళేశ్వరం సమస్య.. 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చిన సమస్య లాంటిది కాదు. విరిగింది వెన్నెముక. మేడిగడ్డ పునరుద్ధరణ అంశంపై ఇప్పటికే మూడు కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన సిఫారసుల మేరకు ముందుకు వెళతాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది. ఇక్కడి తప్పిదాలకు ఎవరు బాధ్యులో అది తేలుస్తుంది. ఇది కాకుండా అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎస్కలేషన్ ఎంత..ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంపై విచారణ మొదలు పెడితే అది ఇక్కడితో ఆగదు. మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. అంచనాల పెంపులో అవకతవకలను విచారిస్తూ పోతే ఏ ప్రాజెక్టూ ముందుకు పోదు. ప్రభుత్వం కూడా పనులు చేయించలేదు. బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ పనులు కొనసాగిస్తే విచారణకు ఆదేశించాక కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని మీడియానే రాస్తుంది. అందుకే అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు. మేడిగడ్డ అంశం తేలాక దానిపై ఆలోచిస్తాం..’ అని సీఎం వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ‘రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో నేనేమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు నాకు కానీ, పారీ్టకి కానీ దక్కే ప్రయోజనం ఏంటి? ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతోంది. విచారణలో నిందితులు చెబుతున్న అంశాలు నేను కూడా పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నా. ప్రతి చిన్న అంశంపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మా ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ వంటి వెధవ పనులు చేయడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ పోలీసుల బదిలీలు జరగలేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కరెంట్ కోతల్లేవు..అంతరాయం మాత్రమే ‘రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతల్లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి తప్పితే ఎక్కడా కోతలు లేవు. తెలంగాణ రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీకి ఇచ్చాం. ఆయన దానికి కీరవాణితో సంగీతం సమకూర్చుకుంటారో, మరొకరితోనో అనేది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూదనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే కొత్త చిహ్నం ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా – సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహ్వానించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గింజ సన్నబియ్యం కూడా కొనుగోలు చేయలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పైసా ఖర్చు చేయలేదన్నారు. అలాంటప్పుడు కుంభకోణానికి ఆస్కారమే ఉండదని వివరించారు. ఈ అంశంపై ఏమాత్రం అవగాహన లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అర్థరహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం కొనుగోలులో ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ.లక్ష్మణ్, సంజీవరెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.30 రూపాయలకు కిలో ఉన్న సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, సన్నబియ్యం రూ.42కు కిలో చొప్పున ఎంత స్టాక్ ఉన్నా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆమేరకు సమాచారం ఉంటే ఇవ్వాలని కేటీఆర్‌కు సూచించారు. పౌరసరఫరాల శాఖలో రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందంటూ చేస్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, సత్యదూరమైన వ్యాఖ్యలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.58వేల కోట్ల అప్పుల భారం మోపిందని, రైస్‌మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.11వేల కోట్ల బియ్యం పెట్టిందని, వాస్తవానికి ఆ స్టాకు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా పాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, తాము మిల్లర్ల దగ్గర బేరాలు, వసూళ్లకు పాల్పడే రకం కాదని స్పష్టం చేశారు. కొంతమంది మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించామని, కొన్నింటిని డిఫాల్టర్ జాబితాలో చేర్చామని, మరికొన్ని యాజమాన్యాలను అరెస్టు చేశామన్నారు. అరెస్టులు చేసి వేధించే విధానం తమ ప్రభుత్వానికి లేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కేంద్రీయ బండార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది..ఆ తర్వాత తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదన్నారు. సరైన అవగాహనతో కేటీఆర్ మాట్లాడాలని హితువు పలికారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిఅధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఓవర్‌స్పీడుతో అర్థం లేకుండా మాట్లాడడం సరికాదని సూచించారు. బాధ్యతతో మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ఫ్లోర్‌లీడర్ పదవి తెచ్చుకున్నాడేమో...అందుకే దూకుడుతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. డీఫాల్టర్ అయిన రైస్ మిల్లుల తరఫున బీఆర్ఎస్, బీజేపీ పొటాపొటీగా మాట్లాడుతున్నాయని, దీనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు రావనే అక్కసుతో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరే సమాధానమన్నారు.సూర్యాపేట సభకు అసలు కరెంటు కనెక్షన్ తీసుకోలేదని, జనరేటర్ల ఆధారంగానే ఆపార్టీ నేతలు ఏర్పాటు చేశారన్నారు. కరెంటు తీసుకోన్నప్పుడు కోతలు ఎలా జరుగుతాయని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయకుండా డిస్కంలను బద్నాం చేయొద్దన్నారు. గతేడాది వరంగల్ ఎంజీఎంలో 121 సార్లు పవర్ బ్రేక్‌డౌన్ అయ్యిందని, రోగులను ఎలుకలు పీక్కుతిన్నాయని, వాటిపై మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు డయాలసిస్ యూనిట్లో విద్యుత్ సమస్యపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. – ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరగానే ఆ పార్టీ చేసిన తప్పులు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాలన్నీ ఒప్పులు అయ్యాయా అని ప్రశ్నించారు. పౌరసరఫరాల సంస్థ అప్పులపాలు కావడానికి గత బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వాలే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రుణమాఫీ చేయనుందని, ఎన్నికల కోడ్ ఉండడంతో జాప్యం జరిగిందని, ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. -
కలిసికట్టుగా ముందుకు..
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఐక్యతారాగం ఆలపించాయి. నాలుగు పార్టీల కేడర్‌కు సమష్టి సందేశం ఇస్తూ ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి నివాసంలో శనివారం ఆయా పార్టీల నేతలంతా భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా నిర్వహించిన ప్రచారం, పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎం. కోదండరాం, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు (టీజేఎస్), కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, బాగం హేమంతరావు (సీపీఐ), ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య (సీపీఎం), మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్ (కాంగ్రెస్) పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు అవసరమని, ఆయన గెలుపునకు సహకరించేలా మిత్రపక్ష పార్టీలు కేడర్‌ను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఈ భేటీలో సూచించారు. కలసికట్టుగా పనిచేసి తీన్మార్ మల్లన్నను గెలిపిద్దామని కోరారు. అనంతరం పలు అంశాలపై దాదాపు గంటపాటు నేతలంతా చర్చించారు. భారీ మెజారిటీతో మల్లన్న గెలుస్తారు: మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్ సమీక్షించారని చెప్పారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పూర్తిగా మద్దతిస్తున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలవాలి: కూనంనేని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కోసం సీపీఐ శ్రేణులన్నీ కృషి చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలుపు అనివార్యమన్నారు. రాజకీయ పొత్తులో భాగంగా తాము మల్లన్నకు, కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. మార్పు కోసం గెలిపించండి: ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలోనూ టీజేఎస్ మద్దతు కాంగ్రెస్‌కేనని చెప్పారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు, మార్పు కోసం కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించాలని టీజేఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మల్లన్నకు ఓటేయండి: సీపీఎం నేత వీరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విద్యాధికులు ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని ఓటేయాలని సీపీఎం నేత ఎస్. వీరయ్య కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలపై చర్చ.... విడివిడిగా భేటీ సమావేశంలో భాగంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా నాలుగు పార్టీల నేతలు చర్చించినట్లు తెలిసింది. దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని రావాలని కోరుతున్నామని, తెలంగాణ ఉద్యమకారులతోపాటు అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున సన్మానించాలని భావిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా సీపీఐ, టీజేఎస్ నేతలు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రేవంత్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు రాగా మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఏం చేయాలనే విషయమై అధ్యయనం చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలియవచ్చింది. సంయుక్త సమావేశం అనంతరం సీఎం రేవంత్‌తో టీజేఎస్, సీపీఐ, సీపీఎం నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న పేదలకు ఆయా స్థలాల్లో పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేతలు వినతిపత్రం ఇచ్చారు. -
T Congressకి కొత్త తలనొప్పి తప్పదా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్‌కు కొత్త బాస్ ఎవరు కానున్నారు?.. సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోంది?.. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి స్థానంలో.. పార్టీకి కొత్త చీఫ్‌గా ఎవరు రాబోతున్నారు?. అసలు ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి అగ్ర వర్ణాలకు ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యమిస్తారా? లేక ఎస్సీ వర్గంలో సీనియర్ నేతకు ఛాన్స్ ఇస్తారా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించినవారు ఎవరు?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి...పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన హైకమాండ్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ వస్తారని తెలిపింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి గనుక.. ఫలితాలు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త నేత వస్తారంటున్నారు. రేవంత్‌రెడ్డి కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇక హైకమాండ్ కూడా గాంధీభవన్‌కు కొత్త బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలనుంచి ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. -
గ్యారంటీలను మరిచిన కాంగ్రెస్: కేటీఆర్
చౌటుప్పల్, నకిరేకల్: ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీ స్కీంలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలో వచ్చారని.. ఆరు నెలలైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలేవీ అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మితే గోస పడుతామని తాము ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఇప్పటివరకు చేయకపోగా దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ మరోసారి రైతులను మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ధాన్యం బోనస్ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి మాట తప్పారని.. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ గ్యారంటీల విషయంలో రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్‌లు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 400కుపైగా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పక్కా 420 వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రేవంత్ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 1.5 లక్షల వివాహాలు జరిగాయని.. ఆ జంటలకు లక్ష రూపాయలతోపాటు 1.5 లక్షల తులాల బంగారాన్ని రేవంత్‌రెడ్డి బాకీ ఉన్నారన్నారు. గోల్డ్ మెడలిస్టు కావాలా.. బ్లాక్ మెయిలిస్టా.. బీఆర్ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోల్డ్ మెడలిస్టు అని.. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిలిస్టని కేటీఆర్ ఆరోపించారు. ఎవరు కావాలో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్ఎస్ ఆభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కిషోర్, అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి: ‘ఎక్స్’లో కేటీఆర్సాక్షి, హైదరాబాద్: అసత్య వార్తలను ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్న సీఎం రేవంత్‌రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘మా బంధువుకు రూ.10 వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్టు దక్కిందంటూ రేవంత్ గతంలో సిగ్గులేకుండా ఓ అబద్ధాన్ని తయారు చేశారు. ఇదే హాస్యగాడు సెక్రటేరియట్ కింద నుంచి నిజాం నగలను తవ్వుకెళ్లామనే అసత్య వాదనను సృష్టించారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోను కూడా సర్క్యులేట్ చేశారు. సీఎం హోదాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారు. తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి..’’అని కేటీఆర్ విమర్శించారు. -
లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.నిజాం షుగర్స్, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్ బూత్‌ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్‌ల వారీగా సరిచూసుకుని ప్లస్‌లు, మైనస్‌లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్, 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్‌షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తమను ఎవరెంత కించపరచినా కుంగిపోమని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలతో, లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందని గుర్తు చేశారు. కాగా, నేడు బీఆర్ఎస పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కృషి చేశారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ది సాధ్యం అని 2014లో ప్రభుత్వం వచ్చింది. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పార్టీ, ప్రభుత్వం రెండు పని చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించింది. కానీ, దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యం. ఇప్పుడు ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరెంత కించపరిచినా మేము కుంగిపోము. 24ఏళ్లలో మాకు ఇచ్చిన గౌరవం, అభిమానానికి ధన్యవాదాలు. వందల మంది రాష్ర్ట సాధన కోసం ప్రాణాలు వదిలారు. మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఐటీ ఉద్యోగులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణకు రానున్నారు. కాగా, ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 30, వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. కొన్ని జిల్లాలను కలిపే విధంగా సభలను ప్లాన్ చేశారు స్థానిక బీజేపీ నేతలు. ఇక, ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీ సభకు ఉండనుంది. ఈ సభకు మోదీ హాజరుకానున్నారు. అలాగే, అదే రోజున సాయంత్రం మోదీ.. ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం కానున్నారు. ఇక, మే మూడో తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ పార్లమెంట్లను కలుపుతూ మరో సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు.. మే నాలుగో తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నారాయణపేటలో, చేవేళ్ల పార్లమెంట్లో వికారాబాద్ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. -
నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్‌లో కాంగ్రెస్ పెండింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు. మరో వైపు, కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
తెలంగాణ రాజకీయంలో తారల కనుమరుగు
‘‘తెరమీద బొమ్మలు పరిపాలన చేస్తాయి’’ అని అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పాడంటారు!. ఆ తర్వాత అది అక్షరం పొల్లుబోకుండా జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో సినీతారలు రాజకీయాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ఉన్నత పదవులూ సైతం చేపట్టిన వాళ్లు కొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపేం కాదు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జన సముద్రం మధ్య నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని (టీడీపీ) ప్రారంభించి.. దేశ రాజకీయాల్లోనే పెను ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో సినీ తారలెవరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. అంతెందుకు తెలంగాణ నుంచి పురుడు పోసుకున్న టీడీపీ.. చంద్రబాబు వైఖరి కారణంగా నేడు అదే రాష్ట్రంలో కనుమరుగైన స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో సినీ తారల ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. విజయశాంతి, బాబూ మోహన్ లాంటి ఒకరిద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా.. తెర ముందుకు వచ్చి వాళ్లు చేస్తున్న రాజకీయం అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్లు పరోక్ష రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ వాళ్ల ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉంటోంది. 2014లో 'బాబు మోహన్' ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్గం నుంచి గెలిచినప్పటికీ.. 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి రేవంత్ రెడ్డి కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. 2018లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి రేష్మా రాథోడ్.. నోటా కంటే తక్కువ ఓట్లను పొంది ఓటమిపాలైంది. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నటి 'జయసుధ' సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీలో నటుడు నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్సీపీలో ఆర్కే రోజా వంటి సినీతారలు మాత్రమే బరిలో ఉన్నారు. ముందుకు రారేం! ఒకప్పుడు తారలు ప్రచారం చేస్తే ఓట్లు రాలేవన్న నమ్మకం ఒకటి నడిచేది. కానీ, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసే నటులు కూడా కరువైపోయారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పటి లోక్‌సభ ఎన్నికలకు సినీతారలంతా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఆ లోటును కాస్తో కూస్తో భర్తీ చేసే యత్నం మాత్రం చేస్తున్నారు. -
కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా మంగళవారం ప్రకటించింది. ఇక, కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే కంటోన్మెంట్ ఉప ఎన్నికల కూడా జరుగనుంది. -
Congress: కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఎవరు?
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా రేవంత్ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఇక, రేపు(శుక్రవారం) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ టికెట్లపై చర్చించి ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులలో టికెట్ దక్కించుకునేది ఎవరోననే చర్చ నడుస్తోంది. ఇక, ముగ్గురు మంత్రుల కుటుంబాలను కాదని కొత్తవారిపై అధిష్టానం దృష్టి సారించిందనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఖమ్మంలో రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కుసుమ కుమార్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, కరీంనగర్ సీటు కోసం ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ టికెట్‌ను ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. మరోవైపు.. కరీంనగర్ టికెట్ రేసులో వెలిచాల రాజేంద్ర రావు, ప్రవీణ్ రెడ్డి , తీన్మార్ మల్లన్న ఉన్నారు. వెలమ సామాజిక వర్గం పట్టున్న కరీంనగర్ సీటులో ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే చర్చ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తనకు టికెట్ ఇస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, కొద్దిరోజులుగా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో, ఇక్కడ కూడా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగానే మారింది. -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్‌కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
ప్రశ్నల టార్గెట్‌కి.. బీబీ పాటిల్ ధీటుగా సమాధానం!
సాక్షి, కామారెడ్డి: జహీరాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నాయి. రెండుసార్లు ఎంపీగా గెలిచిన పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన కనీసం నాయకులను కూడా గుర్తు పట్టరని ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాటిల్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా, చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో సాగిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాకముందే జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరా రు చేశాయి. బీజేపీనుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో దిగగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్నుంచి వేణు గోపాల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి న బీబీ పాటిల్.. రెండుసార్లూ విజయం సాధించారు. తొలిసారి బరిలో నిలిచినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై 1,44,631 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థికన్నా 6,229 ఓట్లే ఎక్కువ వచ్చాయి. అయితే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా తన మెజారిటీ తగ్గిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సంబంధాలు అంతంత మాత్రమయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటిల్ పార్టీ మారాలని నిర్ణయించుకుని బీజేపీ జాతీయ నాయకులను కలిసి, కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన నాటి నుంచే నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్న పాటిల్.. ఆయా ప్రాంతాల్లోని బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ వారి సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. దీంతో కాషాయ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీకి ద్రోహం చేశాడంటున్న బీఆర్ఎస్.. బీబీ పాటిల్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేశాడని బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఎంపీ గా ప్రజలకు అందుబాటులో ఉండకుండా, నాయకులు, కార్యక ర్తలను పట్టించుకోకుండా నిర్ల క్ష్యం చేయడమే గాక స్వార్థం కోసం పార్టీ మారాడంటూ వి మర్శిస్తున్నారు. ఇటీవల జిల్లా లో పర్యటించిన మాజీ మంత్రి హ రీష్రావుతో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎంపీ పాటిల్‌పై ఒంటి కాలిమీద లేస్తున్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అయితే తన ఓటమికి పాటిలే కారణమంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇదిగో అభివృద్ధి అంటున్న పాటిల్.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు విమర్శలతో దాడి చే స్తుండగా.. బీబీ పాటిల్ మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మూ డోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీబీ పాటిల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధి ఇది అంటూ ఓ జాబితాను రూపొందించి కరపత్రాల రూపంలో జనం ముందుంచుతున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధుల మంజూరుతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీ ణ ప్రాంతాలకు కేంద్ర నిధులతో రహదారులు, ఇంకా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్ర భుత్వ నిధులతో చేపట్టిన పనులను వివరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై ప్రత్యక్షంగా ఎక్కడా స్పందించకుండానే.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ, మరోసారి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచార పర్వంలో సాగిపోతున్నారు. ఫెయిల్యూర్ ఎంపీ అంటూ.. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి దామో దర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు సమావేశాల్లో ఎంపీ పాటిల్‌ను టార్గెట్ చేస్తూ మా ట్లాడుతున్నారు. ‘బీబీ పాటిల్ కాదు.. బిజి నెస్ పాటిల్’ అని విమర్శిస్తున్నారు. ఇవి చదవండి: మోదీ హయాంలోనే సురక్షితం -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్‌పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
న్యాయ్ కాదు.. కాంగ్రెస్‌ది నయ వంచన: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా న్యాయ్ పేరిట నయా నాటకానికి కాంగ్రెస్ నాయకులు తెరతీశారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ.. తెలంగాణ అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నయ వంచన చేసిందని మండిపడ్డారు. కాగా, నిన్న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేటీఆర్ ట్విట్టర్లో.. ‘అది జనజాతర సభ కాదు... హామీల పాతర... అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ?? నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది.. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది.. గ్యారెంటీలకు పాతరేసి... అసత్యాలతో జాతర చేస్తోంది.. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు.. కాంగ్రెస్ అసమర్థ పాలనలో... సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు.. రాహుల్ గారు.. మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ? 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ? చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే.. కాంగ్రెస్ కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు చేతి గుర్తుకు ఓటేస్తే.. చేతులెత్తేయడం ఖాయమని.. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన.. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే.. నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. అందుకే.. వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం.’ అని కామెంట్స్ చేశారు. అది జనజాతర సభ కాదు... హామీల పాతర... అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు... అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??… https://t.co/bQk4H9XmaM — KTR (@KTRBRS) April 7, 2024 -
కేసీఆర్‌కు రైతులిప్పుడు గుర్తుకొచ్చారా..? : బండి సంజయ్‌కుమార్
కరీంనగర్: ‘కేసీఆర్ మళ్లీ తన భాషను మొదలు పెట్టారు. తెలంగాణ ఈరోజు అధోగతి పాలుకావడానికి ఆ భాషే కారణం. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులెందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో 11వేల మందికిపైగా రైతులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని పేర్కొన్నారు. లక్ష రుణమాఫీ అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు నయాపైసా సాయం చేయలేదన్నారు. వ్యవసాయ కూలీ ల ఊసే ఎత్తలేదని, ప్రజలు ఛీకొట్టాక ఇప్పు డు ప్రజల్లోకి వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మొగ్ధుంపూర్ వచ్చిన కేసీఆర్ పంట తీవ్రంగా నష్టపోయిన చర్లబూత్కుర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చామనపల్లి గ్రామాల్లో, ఇల్లంతకుంట, వీణవంక సహా అనేక మండలాల్లోని రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గతేడాది వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు వచ్చి ఎకరాకు రూ.10 వేలు విడుదల చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆరే సిరిసిల్ల నేతన్నల ప్రస్తుత దుస్థితికి కారణమన్నారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసినందుకు రూ.270 కోట్లు ప్రభుత్వం బకాయిపడితే, కేసీఆర్ నయాపైసా విడుదల చేయకుండా వారి ఆకలి చావులకు కారణమయ్యాడని మండిపడ్డారు. సిరిసిల్లలో నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేక శనివారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, డి.శంకర్, గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు. ఇవి చదవండి: న్యాయ్ కాదు.. కాంగ్రెస్‌ది నయ వంచన: కేటీఆర్ -
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట!
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట! -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం గణేష్ పేరును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, శ్రీగణేష్ ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక, బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి లాస్య నందిత విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగనుంది. పేరు కంటోన్మెంట్ జిల్లా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య 250,733 పురుషులు 124,245 మహిళలు 122,315 నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాంగ్రెస్ హామీ స్వాగతించదగినది, కానీ..: కేటీఆర్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జంపింగ్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక, కొన్ని పార్టీలు కూడా జంపింగ్ నేతలకే టికెట్ ఇవ్వడంతో పొలిటికల్‌గా అసలు కథ మొదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. Congress party, which is the mothership that promoted the “Aaya Ram, Gaya Ram” culture of political defections in India seems to have had a Big change of heart Welcome their noble proposal of on amending 10th schedule to ensure automatic disqualification of MLAs/MPs if they… pic.twitter.com/gKzhERg1bK — KTR (@KTRBRS) April 6, 2024 పదో షెడ్యూల్ చట్ట సవరణ స్వాగతించదగినది. కానీ, కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయి. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుంది. అందులో ఒక ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చింది. హామీలపై నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడాలి. వారి పార్టీలో చేరిన ఇద్దరితో రాజీనామా చేయించాలి. అనర్హులని స్పీకర్ ప్రకటించాలి. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్ నిరూపించుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
తెలంగాణలో అసలు ఆట మొదలైంది: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఆట మొదలైందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగుకాబోతుందన్నారు. అలాగే, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలు చేస్తోందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, కిషన్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించబోతుంది. ఫిర్ ఏక్ మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారు. మోదీ విశ్వనేతగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కానుంది. కాంగ్రెస్ ఇంతకంటే ఎదగలేదు. తెలంగాణలో అసలు ఆట మొదలైంది. రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేరు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు గారడీలు చేస్తున్నారు. గ్యారంటీల అమలు మీద సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి లేదు కానీ.. పార్టీ ఫిరాయింపుల మీదే ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దుచేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచాం. బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్
సాక్షి, వికారాబాద్ జిల్లా: రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా పాత బీఆర్ఎస్ నేతలేనన్నారు. చెవెళ్లలో కొండా, రంజిత్ రెడ్డి.. మల్కాజిగిరిలో ఈటల, సునీతా.. వరంగల్‌లో ఆరురి, కడియం కావ్య.. ఆదిలాబాద్‌లో నగేష్, భువనగిరిలో బూర.. వీరంతా బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్లేనన్నారు. పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్నుంచి తీసుకెళ్లారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నాకు ఎలాంటి సంబంధం లేదు ‘ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తాం. నేను భయపడను’ అను కేటీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్ -
కేసీఆర్‌పై విమర్శలు చేయను: కడియం శ్రీహరి
సాక్షి, హన్మకొండ: బీఆర్ఎస్ నేతలకు, బీజేపీకి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కాగా, కడియం శ్రీహరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో చేరితే పునీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముంది. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ను వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చాలా మంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపై పార్టీ నేతలు స్పందించలేదు. కానీ, నాపై మాత్రం బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, వారు మాట్లాడే పద్దతి బాగోలేదు. జిల్లా స్థాయి నేతలు కూడా నాపై అనవసర కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. నిన్ను పాలకుర్తి ప్రజలే చీకొట్టారు. ఇలాంటి అహంకార మాటల వల్లే ఓడిపోయావు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఇలాంటి దుస్థితికి రావడానికి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలే కారణం. పల్లా వంటి వ్యక్తి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించని రోజున జనగామలో నిన్ను బట్టలు ఊడదీసి నిలుచోపెడతాను. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి కిషన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించారు. బుద్ధి లేకుండా అనవసర మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీలాంటి అందరి చరిత్రలు నాకు తెలుసు. మీరు చేసిన దారుణాలు బయటపెడితే మీరు భరించలేరు, తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: పార్టీ నాయకులు విభేదాలను పక్కనపెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జి ల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలకు ఏం చేయలేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను ఇంటికి పంపించారన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెలికితీసి ప్రతీ పేదవాని ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి పార్టీ అభ్యర్థి సుగుణను భారీ మెజార్టీతో గెలి పించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సత్తు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ లు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యాంనా యక్, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ ప్రచార రథలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ‘ఇఫ్తార్’కు హాజరైన మంత్రి రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడలోని షాదీఖానాలో నిర్వహించిన ఇఫ్తార్‌కు మంత్రి సీతక్క హాజరయ్యా రు. మైనార్టీ నాయకులతో పాటు విందుకు హా జరైన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి సుగుణ తదితరులు ఆదివాసీ అడబిడ్డను పార్లమెంట్‌కు పంపండి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్‌కు పంపాల ని మంత్రి సీతక్క కోరారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ సమస్యను ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, బోథ్ ఇన్చార్జి గజేందర్, నాయకులు అరుణ్, బోథ్ మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, తలమడుగు, బజార్హత్నూర్ జెడ్పీటీసీలు గణేశ్‌రెడ్డి, నరసయ్య పాల్గొన్నారు. మాజీ మంత్రి భూమన్నను కలిసిన ఎంపీ అభ్యర్థి సుగుణ కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మాజీ మంత్రి పడాల భూమన్నను మర్యాదపూర్వకంగా కలి శారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీని వాసరెడ్డితో కలిసి పట్టణంలోని ద్వారకానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె అప్యాయంగా పలుకరించి శాలువాతో సత్కరించా రు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీయడంతో పా టు కాసేపు జిల్లా రాజకీయాలపై చర్చించారు. మాజీ మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ తదితరులున్నారు. ఇవి చదవండి: మోదీ అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లు అడుగుతాం: కిషన్‌రెడ్డి -
రేపే ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, రఘువీరారెడ్డి, జెడి శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించారు. ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా.. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఖారారు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు పార్లమెంటు స్దానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థులపైనా ఇవాళో, రేపో స్పష్టత వచ్చే అవకావం ఉంది. -
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
టికెట్ ఎవరి చేతికో? అభయ ‘హస్తం’పై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముందుగా అనుకున్న విధంగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కాకుండా తెరపైకి మరో రెండు కొత్త పేర్లు రావడంతో కేడర్ అయోమయంలో పడింది. ఇప్పటికే కరీంనగర్లో లోకల్ నాన్ లో కల్ అంటూ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మరో స్థానికేతరుడు తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే తాము పనిచేసే పరిస్థితి ఉండదని స్థానికనేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన హస్తం అధిష్టానం తెలంగాణలో ఎంతో కీలకమైన కరీంనగర్ ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానికేతరులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రవీణ్‌రెడ్డి అభిమానుల గుస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పార్టీ కోసం త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి అదే సమయంలో ఎంపీ సీటు ఇస్తామని అధిష్టానం మాటిచ్చింది. ప్రవీణ్‌రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పార్లమెంటు పరిధిలో ప్ర చార పోస్టర్లు వేసుకున్నారు. కానీ, అకస్మాత్తుగా తెరపైకి వెలి చాల రాజేందర్రావు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రవీణ్‌రెడ్డి వర్గం కిమ్మనడం లేదు. ఇది చాలదన్నట్లుగా అదనంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేరును తెరపైకి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. దీంతో ప్రవీణ్‌రెడ్డి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజవకర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని, తమను కాదని ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావాల్సిన అగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దూరమైన రోహిత్‌రావు పార్టీ టికెట్ కోసం కొన్నేళ్లుగా ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్‌రావు కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం ఎంపీ ఎన్నికల సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తనకు టికెట్ రాకున్నా.. ప్రవీణ్‌రెడ్డి కోసం పనిచేసేందుకు రోహిత్‌రావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. తీరా ప్రవీణ్‌రెడ్డిని కాదని ఇంకెవరికి ఇచ్చినా రోహిత్‌రావు వర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారిని పోటీలోకి దింపడంపై జిల్లా కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లోకి గులాబీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి వరుసషాకులు తగులుతున్న వేళ.. కరీంనగర్ జిల్లా మాత్రం కంచుకోటలా ఉంటూ వస్తోంది. కొంతకాలంగా హస్తం పార్టీ నేతల లాబీయింగ్ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన కీలక గులాబీ నేతలు ఈనెల 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగే రాహుల్‌గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకోనున్నారని సమాచారం. తెరపైకి మరో వ్యక్తి.. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేందర్రావులతోపాటు మరో ఆసక్తికర వ్యక్తి పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ముఖ్యనేతగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోగానే అతన్నే ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఆసక్తిగా మారింది. ఒకవేళ అదే వాస్తవరూపం దాలిస్తే.. కరీంనగర్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ప్రకటించిన పెద్దపల్లిలో అనిశ్చితే.. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ టికెట్ ఖరారైనా అనిశ్చితే నెలకొంది. గడ్డం కుటుంబానికి చెందిన వినోద్‌కుమార్ బెల్లంపల్లికి, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీగా ఆదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. మాదిగలు ఎక్కువగా ఉండే పెద్దపల్లి స్థానానికి మాదిగ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా గడ్డం వంశీకి టిక్కెట్ కేటాయించారని, పునరాలోచన చేయకపోతే వచ్చే నెల 5న న్యాయ దీక్ష చేస్తానంటూ యువజన జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో టికెట్ మార్పుపై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు రిజర్వ్డ్ స్థానాల్లోని పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లో మాల సామాజికవర్గానికి టికెట్ కేటాయించింది. వరంగల్‌లో మాదిగ సామాజికవర్గంలోని ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికే టిక్కెట్ కేటాయించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ మార్పు చేస్తుందా? గడ్డం వంశీనే కొనసాగిస్తాందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. టికెట్ ఖరారు చేసుకున్న గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోకపోయినా.. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుతూ బలాన్ని పెంచుకుంటున్నారు.. ఇవి చదవండి: ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ కుట్ర : ఎమ్మెల్యే కవ్వంపల్లి -
‘బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు?. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మా పార్టీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. -
నడ్డాను కలిసిన ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని నడ్డా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్వ తంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని సోయం ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. రాజీకి రాష్ట్ర నేతల యత్నం.. బీజేపీ ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోయంను బుజ్జగించే యత్నం చేశారు. కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి హామీ ఇచ్చారు. అప్పు డే సోయం తనకు నడ్డా లేనిపక్షంలో బీఎల్ సంతోష్ ద్వారా హామీ ఇచ్చినట్లయితే పరిశీలన చేస్తానన్నారు. విషయాన్ని కొద్ది రోజులు నాన్చడంతో ఈ హామీ లభించకపోవచ్చనే ప్రచారం జరిగింది. ఇది లా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ బాధ్యులతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ ఇన్చార్జి సునిల్ బన్సల్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోయంను పార్టీ ఆఫీస్‌లో చర్చలకు పిలిచినా ఆయన హాజరుకాలేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యే ద్వారా రాయబారం.. ఎంపీ సోయంతో రాష్ట్ర నేతల రాజీయత్నాలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి.. మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవిస్ ద్వారా ఎంపీ సోయం బంధువు అయిన కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీంరావుతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగి సోయంను చర్చల కోసం శుక్రవారం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నడ్డాను ఈ నేతలు కలిశారు. ఈ విషయంపై సోయం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు పేర్కొన్నా రు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నామినేటెడ్ పదవి విషయంలో హామీ ఇచ్చారని వివరించారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి -
KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్‌లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో.. పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించారని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు… — KTR (@KTRBRS) March 29, 2024 ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్ఎస్పై ఉండబోదంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: కారులో కలకలం -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్‌కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
Lok Sabha: టీకాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. మూడు స్థానాలపై సస్పెన్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మిగిలి ఉన్న ఎనిమది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఇక, ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దఫాల్లో ఏఐసీసీ తొమ్మిది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎనిమిదింటిలో మూడు పార్లమెంట్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగెంధర్, రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, భువనగిరి నుండి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో బీసీ అభ్యర్థికి ఈ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్‌సభ స్థానానికి ఓయూ విద్యార్థి నేత కైలాష్ అప్లికేషన్ పెట్టుకున్నారు. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ముగ్గురిలో ఎవరు? నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మస్కత్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానంపై దమ్మాటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. మెదక్ రేసులో నీలం మధు ఉన్నారు. ఆదిలాబాద్ సీటు కోసం ఆదివాసీ, లంబాడ నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. -
ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్ఎస్తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది. దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..? -
బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’..
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు. ‘అరూరి’ రాజకీయ ప్రస్థానం.. అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
రేవంత్‌రెడ్డిపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. నీస్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు?. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని ఎత్తివేయాలి. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేది తన ఉద్దేశ్యమని వీహెచ్ అన్నారు. ఇదీ చదవండి: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు -
రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: బీజేపీ విలువలతో కూడిన పార్టీ అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో చేరడం గర్వంగా ఉందని మాజీ ఎంపీ, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని ఎస్ఎస్.కాటన్లో ఎమ్మెల్యే రామారావుపటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచిందన్నారు. ఆర్థికంగా ఐదోస్థానంలో నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని, అత్యధిక స్థానాలు గెలుచుకుని మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని, నాయకులు, కార్యకర్తలు సహకరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై తనపై కొందరు అపోహలు ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో పార్టీ నిర్ణయం మేరకే పనిచేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధత, నిజాయితీతో పనిచేశానని గుర్తు చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామారావుపటేల్ కోరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నియోజకవర్గానికి రూ.140 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీని గెలిపించుకుని కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సమావేశంలో నాయకులు బి.గంగాధర్, సోలంకి భీంరావు, సావ్లి రమేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
హోలీ పండగలోపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది’’ అని రేవంత్ పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి’’ అని సీఎం రేవంత్ సూచించారు. -
త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను త్వరలో విడుదల చేయనుంది. దీంతో, హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. వివరాల ప్రకారం.. త్వరలోనే కాంగ్రెస్ మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అంచనా పేర్లు.. నాగర్ కర్నూల్ : మల్లు రవి చేవెళ్ల : రంజిత్ రెడ్డి పెద్దపల్లి : గడ్డం వంశీ మల్కాజ్గిరి : సునీత మహేందర్ రెడ్డి నిజామాబాద్ : జీవన్ రెడ్డి కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి వీరి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. -
జగిత్యాల గడ్డ మీద ప్రధాని మోదీ
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా, జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారు. మొన్ననే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు తెలంగాణకు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వాళ్లను మేము వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుంది. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయి. లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుంది. నాకు ప్రతీ మహిళా.. ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తిని ఖతమ్ చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది. నేను భారతమాతకు పూజారిని’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ @ జగిత్యాల సభ నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది తెలంగాణ ప్రజలు కొత్త ఇతిహాసాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు వికసిత భారత్ లో భాగంగా దేశం అభివృద్ధి చెందితే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు మరోసారి వచ్చాను ఆదిలాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సాఫ్ చేయండి 4 జూన్ కో.. 400 పార్.. బీజేపీకి ఓటు వేయాలని తెలుగులో కోరిన ప్రధాని నా ముందు శక్తి స్వరూపులైన వేషధారణలో ఉన్న చిన్నారి ఉంది.. ఆమెతో పాటు ఇంతమంది శక్తి స్వరూపులైన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారు నిన్న ముంబైలో ఇండి అలయన్స్ ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు వారు శక్తిని ఖతం చేయడానికి యుద్ధం చేస్తున్నారు కానీ నాకు శక్తి స్వరూపులైన మహిళలంతా అండగా ఉన్నారు నేను శక్తి స్వరూపులైన మిమ్మల్ని పూజిస్తాను భారత మాతకు, శక్తి స్వరూపులైన మహిళలకు పూజారిని ఈ ఎన్నికల్లో ఇండి అలయన్స్ శక్తిపై చేస్తున్న యుద్ధాన్ని స్వీకరిస్తున్నాను ఈ యుద్ధంలో నేను మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.. భారత గడ్డపై శక్తిని వినాశనం చేస్తానని మాట్లాడుతున్నారు యావత్ దేశం శక్తిని పూజిస్తాం శివశక్తి పేరుతో చంద్రయాన్ సక్సెస్ చేసుకున్నాం శక్తిని వినాశనం చేసే అవకాశం వారికిద్దామా? శక్తిని విచ్ఛిన్నం చేసే వారు విచ్ఛిన్నం కావాలా? వద్దా? ఈ యుద్ధంలో శక్తిని పూజ చేసే వారు ఒక వైపు.. శక్తిని విచ్ఛిన్నం చేసేవారు ఒకవైపు ఈ యుద్ధంలో గెలుపెవరిదో జూన్ 4వ తేదీన తేలనుంది తెలంగాణ పుడమి సాధారణమైనది కాదు ఆంగ్లేయులు, రజాకార్ల అత్యాచారాలపై పోరాడిన గడ్డ తెలంగాణ కలలను కల్లలు చేసింది కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది ఇక్కడి ప్రజలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలకు చేరుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసింది.. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నోరు మెదపడం లేదు కాళేశ్వరం అవినీతిపై ఎవరూ ప్రశ్నించడంలేదు ఎన్నో గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదు దీనిపై బీఆర్ఎస్ కూడా నోరుమెదపడం లేదు ఈరెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి ఈ రెండు పార్టీలకు మోడీని తిట్టడం తప్పితే వేరే పనిలేదు ఈ పార్టీల నాయకులు ఎన్నడైనా భారత్ మాతా కీ జై అనడం వినిపించిందా? ఈ రెండు పార్టీలు ఎన్ని కవర్ ఫైర్లు చేసినా మేం బయటకుతీస్తాం తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టం.. ఇది మోడీ గ్యారెంటీ కుటుంబ పార్టీలు కేవలం దేశాన్ని దోచుకునేందుకు రాజకీయం చేస్తాయి, అభివృద్ధి కోసం పనిచేయవు దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం ఉంటుంది నేను దీనిపై మీడియా వారికి కూడా హోంవర్క్ ఇస్తున్నా.. కావాలంటే చూసుకోవచ్చు 2జీ స్కామ్, బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరి పేర్లొచ్చాయి? ఇలాంటి అవినీతే.. తెలంగాణలోనూ జరిగింది కాళేశ్వరం అవినీతితో పాటు లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ వరకు వచ్చి కమీషన్లు తిన్నారు కాంగ్రెస్.. అయినా.. బీఆర్ఎస్ అయినా.. వారికి దూరంగా ఉండటమే మనకు మెడిసిన్. అందుకే బీజేపీని గెలిపించాలి శక్తిని వచ్ఛిన్నం చేసే వారిని విచ్ఛిన్నం చేసేందుకు నాకు మీ ఆశీర్వాదాలతో శక్తినివ్వండి కుర్చీతో సంబంధం లేకుండా మీ బాగు కోసం నేనుంటా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనుకున్నారు.. ఓడించారు కానీ ఈసారి జరిగేవి కేంద్రంలో మరోసారి మోడీ సర్కారును తెచ్చేది అందుకే బీజేపీకి ఓటు వేయండి 2014కు ముదు వరకు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధి చూడండి 2014 తర్వాత నుంచి కేవలం పదేండ్లలో జరిగిన అభివృద్ధి చూడండి జూన్ లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. మరింత అభివృద్ధి చేపడుతాం.. బండి సంజయ్, అర్వింద్, గోమాస శ్రీనివాస్ ను తమ్ముళ్లుగా పిలిచి.. మరీ అభ్యర్థులను పరిచయం చేసిన మోడీ నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా.. ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి -
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 17, 2024 -
వంద రోజుల్లో.. వంద తప్పులు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ‘వంద రోజుల్లో.. వంద తప్పులు.. పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు.. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ వంద ప్రశ్నలు సంధించారు. 1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? 3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు? 4. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? 5. ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా? 6. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదు? 7. ఒకటో తేదీన జీతాలన్నారు. అందరికీ ఎందుకు అందడం లేదు? 8. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? 9. గృహజ్యోతికి ఏటా 8 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2400 కోట్లే ఎందుకు పెట్టారు? 10. దళితబంధు పథకాన్ని అర్థాంతకరంగా ఎందుకు నిలిపివేశారు? 11. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? 12. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారు? 13. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు? 14. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? 15. భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు? 16. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా? 17. పదేళ్ల తరువాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? 18. వేళాపాళా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు? 19. సమైక్యరాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా? 20. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారు? 21. యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? 22. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు? 23. బోర్ల రాంరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకొచ్చింది? 24. పల్లెలు పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? 25. నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతున్న మోటర్లకు బాధ్యులెవరు? 26. మళ్లీ యూరియా కోసం క్యూలైన్ లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు? 27. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు? 28. మిషన్ భగీరథను మూలనపడేసి.. మళ్ళీ ట్యాంకర్ల రాజ్యమా? 29. ఫ్రీ బస్సు అని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? 30. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా? 31. పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు? 32. ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు? 33. ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా? 34. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేస్తారా? 35. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకుంటారా? 36. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తారా? 37. కేన్స్ సెమీ కాన్ సంస్థను గుజరాత్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తారా? 38. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్‌ను కాదని.. కొత్త పాలసీ పాట పాడతారా? 39. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం మీ వైఫల్యం కాదా? 40. పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా? 41. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా ? 42. శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దుచేస్తారు ? 43. దేశానికే తలమానికం లాంటి ఫార్మా సిటీని ముక్కలు చేస్తారా ? 44. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది ? 45. Free LRS పై మాటతప్పి ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకుంటారా ? 46. రక్షణ భూముల అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా ? 47. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు పాతరేసి ఆ రూట్లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా ? 48. గొర్రెల పథకం లబ్దిదారులు డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు ? 49. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు ? 50. సాక్షాత్తు ప్రియాంకా గాంధీ హామీఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది ? 51. కేసిఆర్ కిట్ - రూ.13 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తారా ? లేదా ? 52. గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది ? 53. వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు ? 54. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు ? 55. ధరణి పోర్టల్‌ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా ? 56. ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించడం సమంజసమేనా ? 57. 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా ? 58. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా ? 59. సొంత ప్రభుత్వంలోని దళిత ఉపముఖ్యమంత్రిని అవమానిస్తారా ? 60. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు ? 61. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 30 వేల ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా ? 62. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లలో నష్టపరుస్తారా ? 63. ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి.. ఫీజు వసూలు చేస్తారా ? 64. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు ? 65. మూడు నెలలుగా పీహెచ్ సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా ? 66. 38 మందికి పైగా ఆటోడ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా ? 67. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా ? 68. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలకు తెరతీసింది మీరు కాదా ? 69. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా ? 70. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లకు పాలన అప్పగిస్తారా ? 71. అప్పు చేయడం తప్పు అని.. మీరే వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు ? 72. అధికారంలోకి రాగానే మళ్లీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా ? 73. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ? 74. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు ? 75. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారు ? 76. జై తెలంగాణ అని నినదించిన పాపానికి లాఠీలతో రెచ్చిపోతారా ? 77. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలెందుకు ? 78. గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ? 79. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేశారా ? 80. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా ? 81. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు ? 82. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చింది మీరు కాదా ? 83. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అన్నదాతలను అవమానిస్తారా ? 84. కౌలు రైతులకు ఎకరానికి 15 వేల హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు ? 85. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న మాట మరిచిపోయారా ? 86. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడ ? 87. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా ? 88. సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా.. నష్టపరిహారం అందించరా ? 89. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు ? 90. యూత్ కమిషన్ ఏర్పాటు - రూ.10 లక్షలు వడ్డీ లేని రుణ హామీ ఏమైంది ? 91. తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారా ? 92. ఎస్సీ విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతులు పథకం గుర్తుందా ? 93. పవర్ లూమ్స్, ఇతర పరికరాలపై 90 శాతం సబ్సిడీ గ్యారెంటీ ఏమైంది ? 94. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేదెప్పుడు ? 95. మైనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించరా ? 96. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీస్తారా ? 97. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను మీరే కాలరాస్తారా ? 98. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా ? 99. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకు ? 100. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా ? వంద రోజుల్లో.. వంద తప్పులు.. పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు.. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన " అబద్ధాల హస్తం " @INCTelangana 1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ? 2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ? 3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు ? 4. వరి పంటకు… — BRS Party (@BRSparty) March 17, 2024 -
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సమక్షంలో ఆరూరి కాషాయకండువా కప్పుకున్నారు. కాగా, ఆరూరి రమేష్ ఆదివారం బీజేపీలో చేరాలరు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బీజేపీ కండువా కప్పి రమేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమేష్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆరూరి నిన్న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆరూరి వరంగల్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. కాగా, బీజేపీ ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో వరంగల్ సీటు అభ్యర్థిని ప్రకటించలేదు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. -
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ
Live Updates.. బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయి మల్కాజ్‌గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది తెలంగాణను గేట్‌వే ఆఫ్ సౌత్ అంటారు ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దోచుకున్నారు. ►నాగర్ కర్నూల్ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. ►బేగంపేట్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.. ►ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ►కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ►శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. ►అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్‌కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ►ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు. -
కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది: హరీష్‌రావు సెటైర్లు..
సాక్షి, తెలంగాణ భవన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరీష్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని తట్ట మట్టి కూడా ఎత్తలేదు. రైతు రుణమాఫీపై అతీగతీ లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కరువును పెంచడానికి కాంగ్రెస్ పోటీ పడుతోంది. వ్యవసాయాన్ని శిథిలావస్థకు చేర్చుతున్నారు. సీఎం గారు పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి. తాగడానికి నీళ్ళు లేక జనం గోస గోస పడుతున్నారు మీ పాలన వచ్చింది ఖాళీ బిందెలు, నిండుగా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. కర్ణాటక నుంచి తాగునీరైన తెప్పించడంలో విఫమయ్యారు. ప్రాజెక్ట్‌లు అప్పగింత చేసి మేము ఒత్తిడి తేవడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. కేసీఆర్.. కిట్లు ఇస్తు.. రేవంత్ మాత్రం తిట్లతో పోటీ పడుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. ఇదీ కాంగ్రెస్ ఘనత. కరువును పెంచడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ వంద రోజుల పాలన లో 174మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 34మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాం అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మొన్నటి బడే భాయ్ చోటే భాయ్ మీటింగ్‌లో తేలిపోయింది. కాంగ్రెస్ పాలన, యూట్యూబ్.. యూటర్న్ పాలనగా సాగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
BRS: ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా.. బీజేపీ నేతలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు. ఇక, పరిణామాలపై బీజేపీ నేత సీతారాం నాయక్ స్పందించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరూరి రమేష్ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ఉన్నాయి. నిన్న(మంగళవారం) అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు రమేష్ రెడీ అయ్యారు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నా అని ప్రకటిస్తున్నానని మాకు చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లి ప్రవర్తించిన తీరు సరికాదు. రమేష్ తన ఇష్టంతో సొంత నిర్ణయం తీసుకుంటే వీరికి వచ్చిన బాధేంటి?. బీఆర్ఎస్ నేతలు రమేష్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. గతంలో నా రాజకీయ జీవితం కూడా బీఆర్ఎస్ నేతలే నాశనం చేశారు. నాకు BRS చేసిన అన్యాయంపై 151 బుక్స్ రాయవచ్చు. దళితులకు వీళ్ళు గతంలో ఏమి చేశారని ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్లు ఎం హామీ ఇస్తారు?. గతంలో ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి మద్దతుగా ఉన్నాడా?. ఆరూరి జీవితంతో ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆరూరి కోసం కొట్లాట.. చిరిగిన చొక్కా
హనుమకొండ, సాక్షి: నగరంలో ఇవాళ పొలిటికల్ హైవోల్టేజ్ హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సీనియర్ నేత హరీష్‌రావు ఆదేశాల మేరకు బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్మీట్లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. ఆ సమయంలో.. ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు బలవంతంగా ఆరూరిని బుజ్జగించే యత్నం చేశారు. ‘‘చివరి నిమిషంలో వస్తే ఎలా?’’ అని ఆరూరి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టకున్నారు. అయితే హరీష్‌రావు సాయంత్రం వచ్చి అన్నీ మాట్లాడతారంటూ ఆరూరితో చెప్పారు వాళ్లు. అలా వాళ్లతో మాట్లాడిన కాసేపటికి అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి కారులో ఆరూరి ఎక్కారు. అయితే ఆ సమయంలోనూ ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి నిలువరించడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వరంగల్ ఎంపీ సీటు కండిషన్‌పై బీజేపీలో చేరేందుకు ఆరూరి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆరూరిని కిడ్నాప్ చేశారు ఆరూరి రమేష్‌ను తమ వెంట బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లడంపై బీజేపీ నేత రావు పద్మ స్పందించారు. ఆయన్ని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తున్నారామె. ‘‘ఆరూరి బీజేపీలో చేరతానని నిన్న స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశాక.. ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటానని అన్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదు’’ అని పద్మ మండిపడ్డారు. పెంబర్తిలో ఉద్రిక్తత జనగాం జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు ఆయన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు. అయితే బీఆర్ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో.. జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది. ఎలాగోలా వాహనం నుంచి బయటకు వచ్చిన ఆరూరిని .. ఇరు వర్గాలు తమ తమ నేతలకు ఫోన్లు కలిపి కోరుతున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. -
కాంగ్రెస్‌లో చేరికకు రెడీ.. బీఆర్ఎస్ నేతకు చెప్పుదెబ్బ షాక్
సాక్షి, వరంగల్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరాలనుకున్న ఓ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ సదరు నేతను చుక్కలు చూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. దీంతో, రెండు నెలల క్రితమే బీఆర్ఎస్.. మోహన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక, మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు అధికారపక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోహన్‌రెడ్డి హస్తం పార్టీలో చేరడాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారు మంజుల నడివీధిలో ఆయనను చెప్పుతో కొట్టింది. ఆయన కాంగ్రెస్ చేరకూడదని డిమాండ్ చేశారు. అయితే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం. -
క్షమించండి.. బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. సైదిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయినట్టే’’ అంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారింది. హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక, ఈ టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఈ సందర్బంగా సైదిరెడ్డి కామెంట్స్ ఇలా ఉన్నాయి.. ‘తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నారు. ఢిల్లీకి రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీలో చేరాలని కోరుతున్నారు. బీజేపీ చేరితే పార్లమెంట్ టికెట్ నీకే ఖరారవుతుందన్నారు. నేను ఎవరితో చెప్పలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పుడే ఇది పూర్తవుతుంది. ఇప్పుడు నువ్వు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. మీరంతా నా వెంటే ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారని నేను పార్టీ మారాల్సి వచ్చింది. మీకు తెలుసు నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది. ఒక్క సర్పంచ్ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏమీ చేయలేకపోయానని బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తాడు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావచ్చు. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదే అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లే కోరుకుంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్‌కు సహాయం చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి నేను ఒక్కడినే వెళ్లి ఏంచేస్తాను. నాతోపాటు మీరు కూడా ఉంటే ఏదైనా చేయవచ్చు. బీజేపీలో చేరుతున్నట్టు చెప్పకపోవడం తప్పే, రాష్ట్రంలో టీడీపీ ఖతమైంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. బీజేపీకి 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీతో మీటింగ్‌లో మాట్లాడతాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
Telangana Congress: సీటు ఎవరికి ఇద్దాం?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం స్థానాల్లో నాలిగింటిని ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల ఖరారు కోసం నేడు ఇటు హైదరాబాద్‌లో, అటు హస్తినలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మిగిలిన 13 పార్లమెంట్ స్థానాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారామె. ఆయా నియోజకవర్గాల వారీగా.. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్రా నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే దానిపై ఒక్కొక్కరి నుంచి విడివిడిగా ఆమె అభిప్రాయం సేకరిస్తున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ సీఈసీ భేటీ అనంతరం.. మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బీజేపీ రెండో జాబితాపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఓ కొలిక్కి తెచ్చింది. రెండు రోజుల్లో సుమారు 100 నుంచి 150 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు ఆ పార్టీవర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా బీజేపీ అధిష్టానం ప్రత్యేక కసరత్తు చేసిందని వెల్లడించాయి. తెలంగాణలో పెండింగ్ ఉన్న ఎనిమిది స్థానాలలో 7 అభ్యర్థులను ఖరారు చేసింది. గత నెల 29న తొలిసారి భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ప్రధాని మోదీ సహా మొత్తం 195 అభ్యర్థులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేసింది. మార్చి 2న తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రెండో జాబితాపై సోమవారం రాత్రి 8 గంటలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని రెండో జాబితాపై చర్చించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. 370 సీట్ల లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రచారంలోకి దూసుకెళ్లాలని బీజేపీ ఎత్తుగడ వేస్తోంది. తెలంగాణలో ఖరారైన అభ్యర్థులు వీరేనా? మహబూబ్‌నగర్- డీకే అరుణ మెదక్-రఘునందన్‌రావు మహబూబాబాద్- సీతారాం నాయక్ ఖమ్మం-జలగం వెంకట్రావు నల్గొండ- శానం సైదిరెడ్డి పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్ వరంగల్- కృష్ణ ప్రసాద్ ఢిల్లీ చేరిన ‘ఆదిలాబాద్ సీటు పంచాయితీ’ మరోవైపు, ఆదిలాబాద్ బీజేపీ సీటు వ్యవహారం హస్తినకు చేరింది. తొలి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావ్ పేరును బీజేపీ అధిష్టానం పక్కనపెట్టడంతో మొదలైన పంచాయితీ.. ఆదివారం బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ కాషాయ కండువా కప్పుకోవడంతో తారస్థాయికి చేరింది. నగేష్ బీజేపీలో చేరినందున ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని ఆయనకే ఇస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపూరావ్ సహా పలువురు సోమవారం ఢిల్లీకి చేరుకొని బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. పారీ్టలో మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కేటాయించొద్దని అధిష్టాన పెద్దలకు విజ్ఞప్తి చేశారు. చేరి 24 గంటలు కాకముందే సీటు ఎలా? రమేష్ రాథోడ్ రమేష్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలను కలిశామని చెప్పారు. నగేష్ పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకుండానే... ఆదిలాబాద్ సీట్ తమదే అంటున్నారని మండిపడ్డారు. నగేష్‌కు ఇతర పార్టీల్లో అవకాశం దొరకక చివరికి బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీలో అభ్యర్థులకు కొరత ఏమాత్రంలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారికి ఎలాంటి హామీలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆదివాసీల కంటే లంబాడీలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి విభేదాలు లేదని రమేష్ రాథోడ్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: నేను గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి -
TS: బీజేపీలో ముసలం.. ఢిల్లీకి చేరిన టికెట్ పంచాయితీ
సాక్షి, ఢిల్లీ/ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో సీట్ల కేటాయింపు పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు సీటు ఇవ్వకపోవడం పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో కాకరేపుతోంది. దీంతో, కాషాయ పార్టీ నేతలు ఢిల్లీ బాటపడ్డారు. కాగా, బీజేపీ తొలి జాబితాలో భాగంగా తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఇక, వారిలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడంతో ఆయనను, పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. దీంతో, ఆయన హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ లిస్ట్‌లో కూడా తన పేరు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు.. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగష్ కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. నగేష్‌ను బీజేపీలో చేర్చుకోవడాన్ని మెజారిటీ కమలం పార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నగేష్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు బీజేపీ నేతలు హస్తిన బాట పట్టారు. ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు, పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను వారు కలవనున్నారు. ఇదే సమయంలో నగేష్ చేరికపై అభ్యంతరాలను ఆదిలాబాద్ బంజారా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా ఇటీవల చేరిన వారికి ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి సూచించారు. ఇక, బీఎల్ సంతోష్ ఇచ్చే సమాధానం బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. -
రెండో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు.. నేడు కీలక భేటీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్బంగా అభ్యర్థులకు ఖరారు చేయనున్నట్టు సమాచారం. కాగా, తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు సాయంత్రం ఆరు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక, మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
నేడే బీజేపీ రెండో జాబితా?.. తెలంగాణ నుంచి రేసులో వీరేనా!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ సారించింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. అయితే.. ఆ అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రమే వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంతోనే తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగానే జరుగుతున్నాయి. బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, నిన్న(ఆదివారం) బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో, వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్ మహబూబాబాద్: సీతారాం నాయక్ ఖమ్మం: జలగం వెంకట్రావు నల్గొండ: శానం సైదిరెడ్డి వరంగల్: కృష్ణ ప్రసాద్ పెద్దపల్లి: ఎస్. కుమార్ -
ఓడితే మగాడు కాదా?.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానాలని.. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం అని రేవంత్‌ను కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్ ఇకనైనా మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి.. .. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇక చివర్లో.. కామారెడ్డి ఫలితం చేదు అనుభవం మిగిల్చిందన్న కేటీఆర్ ఆ ఎన్నికలపై చర్చ వద్దంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TS: బీజేపీ బిగ్ ప్లాన్.. పార్టీలో చేరుతున్న ముగ్గురికి టికెట్స్!
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ చేరుతున్న నేతలకు టికెట్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ముగ్గురు సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. అయితే, రేపు(సోమవారం) బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో రెండో జాబితాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధిష్టానాకికి జాబితాను పంపించారు. ఇక, నిన్న(శనివారం)రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ కూడా అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరిపారు. కాగా, తెలంగాణలో పార్టీలో చేరికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీతారాంరాయక్, నగేష్, జలగం వెంకట్రావ్‌ను బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఇక, వీరు బీజేపీలో చేరిన అనంతరం, పలు పార్లమెంట్ స్థానాల్లో వీరికే సీట్లు ఇస్తున్నట్టు పలువురు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. సీఈసీ పరిశీలనలో ఉన్న పేర్లు 1. మహబూబ్‌నగర్ :డీకే అరుణ 2. మహబూబాబాద్ : సీతారాం నాయక్ 3. ఖమ్మం : జలగం వెంకట్రావుఔ 4. ఆదిలాబాద్ : నగేష్ 5. వరంగల్ : కృష్ణ ప్రసాద్ 6. నల్గొండ: మనోహర్ రెడ్డి 7. పెద్దపల్లి : ఎస్ కుమార్/ మిట్టపల్లి సురేంద్ర 8. మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి. -
బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. కారు దిగుతున్న కీలక నేతలు!
పార్లమెంట్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ తెలంగాణలో పార్టీల మధ్య కప్ప గెంతులు పెరిగిపోయాయి. ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరిపోయారు. ఆయన కొడుక్కి బీజేపీ ఎంపీ సీటు ఇచ్చేసింది. దీంతో అలిగిన బీజేపీ ముఖ్యనేత ఒకరు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ వచ్చినా రాకపోయినా.. బీజేపీలో ఉండేది లేదని ఆ మహిళా నేత తెగేసి చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నేత ఎవరు?.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. సీట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ ఎస్సీ లోక్‌సభ స్దానం నుంచి పార్టీ అభ్యర్దిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్‌ప్రసాద్ పేరు ప్రకటించింది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించటంతో అక్కడి బీజేపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఎంపీ రాములు ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొంతకాలంగా రాములు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తన కుమారుడు భరత్ప్రసాద్కు ఇవ్వాలని రాములు కోరినా.. జిల్లాలోని కొందరు నేతల కారణంగా ఆయన కోరిక తీరలేదు. రెండుసార్లు భరత్ప్రసాద్కు పదవి చేజారటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాములు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ అచ్చంపేటలో విస్తృతంగా పర్యటించి గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కావాలని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం ఆయన్ను పట్టించుకోలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా పోస్టర్లు, కటౌట్లు వేయరాదని గువ్వల బాలరాజు హుకుం జారీ చేయటం సంచలంగా మారింది. ఇటీవల అచ్చంపేట, నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కూడా ఎంపీ రాములు పాల్గొనలేదు. సమావేశాల గురించి తనకు సమాచారం లేదని రాములు చెప్పటం పార్టీతో ఎంపీకి ఉన్న గ్యాప్ గురించి అందరికీ తెలిసింది. మూడు నెలలుగా రాములు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. నాలుగు రోజుల క్రితమే రాములు, ఆయన తనయుడు భరత్ కమలం గూటికి చేరారు. రాములుకు వయసు మీద పడటంతో తనయుడికి సీటు కేటాయించారు. రాములుకు ఉన్న మంచిపేరుతో పాటు మోదీ చరిష్మా కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. తమ అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం.. మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండటం నాగర్‌కర్నూల్‌లో భరత్‌కు సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో ఈసారి ఇక్కడ బీజేపీ విజయం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి ఈసారి నిరాశ ఎదురైంది. పార్టీ నాయకత్వం తనకు సీటు నిరాకరించటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శృతి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ఆమె బీజేపీని వీడుతారంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్ది ఎవరో ఇంకా తెలియడంలేదు. ఇక కాంగ్రేస్ పార్టీలో సీటు కోసం మల్లురవి, సంపత్‌కుమార్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు రక్తి కట్టిస్తున్నాయి. -
TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్‌కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్‌రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్‌హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు. .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ నుంచే మొదలు కాబోతోంది. ప్రధాని వచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలీదు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతాననేటోడు మన ముఖ్యమంత్రి. ఓ జేబు దొంగలా మాట్లాడుతున్నాడు. అవి సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా..? ‘‘రేవంత్‌రెడ్డి బీపీ పెంచుకోకు. మా వైపు నుంచి నీకు నష్టం లేదు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ .. మానవబాంబులైతామంటున్నాడు రేవంత్. కానీ, ఆయన పక్కనే బాంబులున్నై, అది ఆయన గమనించుకుంటే చాలు. ప్రజలకు కూడా అర్థం కావాలి గాడిదేదో, గుర్రమేదో. చార్సవ్ బీస్ హామీలు అమలు కాకపోతే నిలదీస్తాం. రైతుబంధును రైతుభరోసా అన్నాడు. వచ్చిందా మరి..?. రైతులే ఇప్పుడు రేవంత్ పాలనపై చర్చకు పెడుతున్నారు.. మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజిగిరికి రా.. నేను వస్తానని సవాల్ విసిరా. కానీ, ఆ ఊసే మాట్లాడుతలేడు. మగాడివైతే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపాలని రేవంత్ కు సవాల్ విసురుతున్నా.. ఆత్మగౌరవం కల్గిన ఏ తెలంగాణా బిడ్డ మాట్లాడని మాటలు మోడీ ఎదుట సాగిలబడి రేవంత్ మాట్లాడుతుండు. రాహూల్ ఏమో గుజరాత్ మాడల్ ను తిడితే.. నువ్వేమో పొగుడ్తావా..?. 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయింది రేవంత్ ప్రభుత్వం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. పైనున్న ప్రాంతాలకు నీళ్లు తెచ్చే ఒక విజన్ తో కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం కట్టాడు. రేవంత్, సంజయ్ వంటి పిచ్చోళ్లకు ఇవన్నీ తెల్వవ్. ప్రాజెక్ట్ లో చిన్న సమస్య వేస్తే రిపేర్ చేయకుండా కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్. మహానుభావులు ఎంపీలుగా గెలిచిన ఈ ప్రాంతం నుంచి బండి అడ్డిమారిగా గెల్చిండు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గరకు రా. మా వినోద్ అన్న ఏం చేసిండో.. నువ్వేం చేసినావో తేల్చుకుందాం. బండి సంజయ్ ఓ సైకో లెక్క తిట్లు తప్ప చేసిందేమీ లేదు. శివలింగం మీద తేలులాగా పైన రాముడు కింద బండి సంజయ్. పొన్నంను మీ అమ్మకే పుట్టినావా అనే చిల్లరగాడు ఎంపీగా అవసరమా అంటూ సంజయ్ పై ఫైర్. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ ఐతే కవితపై అసలు కేస్ ఎందుకు అయ్యేది..? కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే అది బీజేపీ గెలుపుకు కారణమవుతుందనేది అంతా గమనించాలి. ఎన్నికల తర్వాత రేవంత్ మరొక ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వాస్ శర్మ కాబోతున్నాడనేది గ్యారంటీ’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం నేడు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ జాబితాను తెలంగాణ పీసీసీ.. సీఈసీకి పంపించింది. సీఈసీ పరిశీలనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 1. మహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డి 2. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి 3. నిజామాబాద్ : జీవన్ రెడ్డి 4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ 5. జహీరాబాద్ : సురేష్ శెట్కార్ 6. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్ 7. నల్గొండ : జానారెడ్డి 8. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి 9. మహబూబాబాద్ : బలరాం నాయక్ 10.వరంగల్ : అద్దంకి దయాకర్ /సర్వే సత్యనారాయణ 11. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి 12. హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్ 13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్ 14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్ 15. మెదక్ : నీలం మధు -
Amit Shah: తెలంగాణకు అమిత్‌షా.. భారీ సభకు బీజేపీ ప్లాన్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈనెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నేతలు గుర్తుచ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి 20వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తలసాని కిరణ్ వినూత్న నిరసన.. అమీర్‌పేటలోని HMDA కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ వినూత్న నిరసన చేపట్టారు. వాటర్ బాబిల్స్‌తో హెచ్ఎండీఏ ముందు నిరసన. ఈ క్రమంలో హెచ్ఎండీఏ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కిరణ్. తాను ఇచ్చిన నీళ్లు తాగి ప్రశాంతంగా ఎల్ఆర్ఎస్ రద్దు అంశం ఆలోచించాలని కోరిన కిరణ్. ఈ సందర్బంగా తలసాని కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం మోపాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడెందుకు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డే బొందపెడతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లోనూ మోదీ ఆశీస్సులు ఉండాలని రేవంత్ అనడంలో అర్థమేంటి?. మళ్లీ మోదీనే ప్రధాని అని రేవంత్ ఒప్పుకున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీకి ఎంత గౌరవం ఇచ్చామో అందరికి తెలుసు. మనకు ఏం చేయలేదనే 2021 నుంచి మోదీ తెలంగాణకు వచ్చినపుడు కేసీఆర్ వెళ్లలేదు. మోదీనీ బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాలుగు నెలల క్రితం గుజరాత్‌ను కించపరిచిన రేవంత్.. నిన్న మోదీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అన్నారు. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలాగా మారి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లో వంద భాగాలు ఉన్నాయి, మూడు బ్యారేజీలు ఉన్నాయి. 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని ఆపాలని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేయడంలేదు’’ అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు -
అందులో ఎలాంటి రాజకీయం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ‘‘తెలంగాణలో ప్రతిపక్ష నేత లేనే లేరు. ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చేవారు కదా. అసెంబ్లీకి రాని నేత అసలు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు. ప్రధానిని పెద్దన్న అనడంలో తప్పేం ఉంది?. దేశానికి ప్రధాని పెద్దన్నే కదా. కేసీఆర్ లాగా మోదీకి నేను చెవిలో ఏం చెప్పలేదు. రాష్ట్రానికి రావాల్సిన విషయాల్నే మైకులో చెప్పాను.. .. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేస్తే.. వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వర్రావు కట్టిన మేడిగడ్డ మేడి పండు అయ్యింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ కూలిపోయింది. మేడిగడ్డను రిపేర్ చేయాలని కేసీఆర్ కోరడం తప్పును కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. మేడిగడ్డ దొంగలంతా మా వెంట రాకుండా ప్రత్యేకంగా వెళ్లి చూసొచ్చారు. అలాగే.. కేసీఆర్‌పై లీగల్ చర్యలకు ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్‌గా కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రేవంత్ అన్నారు. .. కేసీఆర్ చదివింది బీఏ. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చదివినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మాకు మిత్రుడేం కాదు. నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యే లు కలవడం లో ఎలాంటి రాజకీయం లేదు. సీఎం ను ఎమ్మెల్యే లు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదు. లేని పార్టీని ఎందుకు తిట్టాలి. కర్ణాటకలో 40 శాతం కమీషన్‌పై మోదీ ఎందుకు మాట్లాడరు?. జీఎస్టీ వసూళ్లలో పెద్ద కుంభకోణమే జరిగింది. ఆ దొంగల్ని బయటకు తీస్తున్నాం. ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిచ్చిపట్లినట్లు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలి.. ఇంకా సీఎం రేవంత్ ఏమన్నారంటే.. .. సస్పెండైన ప్రణీత్ రావ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజు కు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది. జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది. ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది... చర్యలు తీసుకుంటాం. మా పరిపాలన రిఫరెండం గా ఎన్నికలకు వెళ్తాం. 14 కు పైగా సీట్లు గెలుస్తాం... మా కుటుంబం లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు.. .. ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు? వ్యవసాయం చేసే వారికే రైతు బంధు. అసెంబ్లీ లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అన్ని ప్రైవేటు యూనివర్సిటీ లపై విచారణ జరుపుతాం. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ తెలంగాణ లో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. -
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మరో లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే.. -
రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
PM Modi Telangana Tour Updates.. ►రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రాత్రికి అక్కడే బస ►మరికాసేపట్లో రాజ్ భవన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ►స్వాగతం పలుకనున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్. ►నా తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో మోదీ ప్రసంగం ప్రారంభం. ►బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ►దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్ భారత్‌పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. ►బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కుటుంబ పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది?. ►నా జీవితం తెరచిన పుస్తకం. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి. నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను. ►ఆదీవాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా?. మోదీ గ్యారంటీపై దేశవ్యాపంగా చర్చ జరుగుతుంది. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. ►రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. ►బీజేపీ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో దేశ ముఖచిత్రాన్ని ప్రధాని మోదీ మార్చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి 17 సీట్లు రావాలి. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసే పరిస్థితి లేదు. కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారు. ►బీజేపీ సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్ల కాలంలో ప్రధాని హోదాలో ఒక్క ప్రధాని కూడా రాలేదు. ప్రధాని మోదీ మాత్రమే ఆదిలాబాద్‌కు వచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోంది. ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ సభకు హాజరైన ప్రధాని మోదీ. ►ఆదిలాబాద్‌లో పార్టీ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ ►మోదీకి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావ్, నలుగురు ఎమ్మెల్యేలు ► ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. ►వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. ►ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్ అభివృద్ధిపరంగా మరింత ముందుకెళ్తుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ► రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు వర్చువల్‌గా శంకుస్థాపన. ఆరు ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ►ఇప్పటికే పూర్తి అయిన 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం. సుమారు 10,599 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్‌లో మిగిలిన వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. ►మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ► ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ►ఆదిలాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. ►ఆదిలాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు.. ►ఆదిలాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ►నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. కాగా, మోదీ పర్యటన షెడ్యూల్లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగింది. ఆయన ఈరోజు ఉదయం 11:30 గంటలకు నాగ్‌పూర్‌లో హెలిప్యాడ్ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్(10:20 గంటలకు) కన్నా ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం కానుంది. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన కోసం నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ►ఇక, తెలంగాణలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ►అలాగే, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్‌లో హైఅలర్ట్ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటనల నేపథ్యంలో భారీ భద్రత ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం రెండువేల మంది భద్రతతో రక్షణ వలయం మోదీ పర్యటన ఇలా.. ►ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. ►అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు. ►అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ►మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సీఏఆర్ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ►ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని.. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారన్న కేసీఆర్.. బీఆర్ఎస్తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ పట్టించుకోవద్దని.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే యాదికొస్తాం.. ఎల్ఆర్ఎస్ గతంలో మనం ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామంటూ కామెంట్ చేసినోళ్లు.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి టైం సరిపోతుంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తాం. బీఆర్ఎస్కు గెలుపు, ఓటములు కొత్త కాదు. కుంగి పోయేది...పొంగి పోయేది ఏమీ లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం.. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం వెంకట్రావ్ తన కుటుంబసభ్యులతో వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను వెంకట్రావ్ కలవడం ఇది రెండోసారి. అనంతరం, వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాను. భద్రాచలం రామాలయం అభివృద్ధి. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రేవంత్‌ను కలిశాను అని అన్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్‌కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్‌ది కాదు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్‌ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్‌కు ఇస్తా. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్‌కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్‌తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్‌గిరిని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్‌కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. మాకు(బీఆర్ఎస్)కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హితవు పలికారు. ‘‘డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్ టెస్ట్ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్ మాకు లేదు అంటున్నారు.. ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు. .. మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు. .. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి. .. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కానీ, బీజేపీ కింద పని చెసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు?. కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ కు బరాజ్ కు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ‘‘మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీ చేయాలి. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
బీజేపీ జితేందర్ రెడ్డి: ఆనాడు దున్నపోతు.. ఇప్పుడు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్ చేశారు. దీంతో, బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాదా, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తూ అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇక, ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్కు ట్యాగ్ చేశారు. What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge — AP Jithender Reddy (@apjithender) February 29, 2024 కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక, గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్ధం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. -
టార్గెట్ లోక్‌సభ.. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనుంది. దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో, ఆశాహహుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఇక, తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరుతున్నారు. దీంతో, బీజేపీ ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కివచ్చిందని బీజేపీ నేతల టాక్. నలుగురు సిట్టింగ్‌లు, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరెడ్డి వంటి వారి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది, ఇక మిగిలిన స్థానాల్లో ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. హస్తిన వెళ్లి ఎవరి లాబీయింగ్ వాళ్లు చేస్తున్నారు. ఓ వైపు విజయ సంకల్పయాత్రంలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్న కాషాయదళం.. టికెట్ల కేటాయింపునకు ఏ ప్రామాణికత ఆధారంగా ఇస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిత్వాలపై పలువురు నేతలు ధీమాగా ఉన్నారు, మల్కాజిగిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటల రాజేందర్, చేవేళ్ల నుంచి కొండా, మెదక్ నుంచి రఘునందన్, ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే ఛాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు అలాగే బిఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో తెలుసు: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుడితిలో పడ్డ ఎలుకల పరిస్థితిగా కాంగ్రెస్ స్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకే తెలుసు. రేవంత్‌రెడ్డి తిరిగి పాతమూలాలకు పోతున్నట్టు ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు. ‘‘పథకాలు అమలు కోసం కొత్త కొర్రీలు పెడుతున్నారు. మార్చి 17 వరకు వేచి చూద్దాం.. అవసరమైతే 6 నెలలు ఆగుదాం. ఇంకా రైతు బంధు ఎప్పటికీ వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పాలనపై తప్పుడు ప్రకటన చేయించారు. మోదీ హవా లేదు.. బోడీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. మనం ప్రతిఘటిస్తే తిరిగి తీర్మానం చేశారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అప్పర్ భద్రాకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కారు సర్వీసింగ్‌కు పోయింది.. తిరిగి మంచి స్పీడుతో వస్తుంది. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా అండగా ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచే కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా తామంతా గంటలో వచ్చి అండగా ఉంటాం’’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే.. -
తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా!
సాక్షి, ఢిల్లీ: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినకు బయలుదేరారు. కాగా, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నేడు దాదాపు ఒక్కొక్క అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇక, ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక, బీజేపీ కీలక భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ హస్తినకు పయనమయ్యారు. కాగా, అభ్యర్థుల ఎంపికపై వీరు అధిష్టానంలో తుది చర్చలు జరుపనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్ మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్‌రెడ్డి జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్ -
తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో పొత్తు ఉందంటూ జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెరదించేందుకు సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ సొంతంగానే పోటీచేస్తామని.. బీఆర్ఎస్తో పొత్తుగానీ, ఎలాంటి అవగాహనగానీ ఉండదని ప్రజలకు చాటాలని తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌లకు పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ విజయ సంకల్పయాత్రలను ప్రారంభించి.. అందరికన్నా ముందుగా ఎన్నికల సమరం ప్రారంభించిందని వివరిస్తున్నాయి. వరుసగా పొత్తు వార్తల నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు బీజేపీ ఢిల్లీనేతలు కూడా సుముఖంగా ఉన్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు, కొందరు రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని, ఆ రెండు పార్టీల మధ్య రహస్య బంధం కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీతో పొత్తు ఉండవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్–బీజేపీల పొత్తు ప్రచారం ముమ్మరమైంది. అయోమయానికి తెరదించుతూ.. బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం బీజేపీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళానికి దారితీసింది. ఇదిలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలపైనా ప్రభావం పడవచ్చని భావించిన బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీ రాష్ట్ర కీలక నేతలు ఎలాంటి పొత్తు ఉండదని పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు, సీట్ల సర్దుబాటు వంటివి ఉండబోవని స్పష్టం చేసింది. వచ్చే నెల రెండోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చన్న అంచనా నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులకు ఫోన్‌చేసి స్పష్టమైన సూచనలు చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పొత్తు కోసం బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లారని.. వారు నిర్ద్వందంగా తిరస్కరించారని ఢిల్లీ వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మోదీ ఫ్యాక్టర్.. పెరిగిన మద్దతుతో.. రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని, దీనికి ప్రధాని మోదీ చరిష్మా జతకలిస్తే.. ఇక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు చెప్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా 4 సీట్లు గెలిచామని గుర్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ ఏడెనిమిది సీట్లు గెలుస్తుందని సర్వేల్లో తేలిందని, పార్టీ నాయకులు కొంచెం కష్టపడితే మరో రెండు సీట్లనూ సాధించవచ్చని జాతీయ నాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన పార్టీల కంటే ముందే.. 17 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టినట్టు వివరిస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ఈనెల 24న ఢిల్లీలో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కనీసం సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం, జనసేనతో పొత్తు కారణంగా పార్టీ బలంగా ఉన్న కొన్నిసీట్లను కోల్పోవాల్సి రావడంతో ఇబ్బంది ఎదురైందని అంటున్నాయి. అందువల్ల ఈసారి తొందరగానే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధమైందని చెప్తున్నాయి. కాగా.. ఈనెల 24న లేదా 25న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రావాల్సి ఉందని.. కానీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ నేపథ్యంలో పర్యటన వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడిందని పార్టీ వర్గాల సమాచారం. -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
కాంగ్రెస్ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ.. హస్తం గూటికి ప్లాన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరగా.. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఇక, తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, ఈటల రాజేందర్ కూడా హస్తం గూటికి వెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే, బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో(హుజురాబాద్, గజ్వేల్) పోటీచేసి ఓడిపోయారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? లేక ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వీరి భేటీపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఊపందుకుంది. ఈటల కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్లో నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
బీజేపీతో పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? ఇవ్వాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. -
కొత్త ఈక్వేషన్స్.. ఖమ్మం.. రసవత్తర రాజకీయం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఖమ్మం జిల్లాకు నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారి తీసింది. నిజానికి రాజ్యసభకు వెళ్తున్న ఇద్దరూ ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, పార్టీలు మాత్రం కొత్త ఊహగానాలకు తెరలేపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కలిపి 65 మంది ఉన్నారు. సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోనుంది. ఇక బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల సంఖ్య ఆ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గెలుపు కూడా లాంఛనమే కానుంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ అయినా, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు అయినా.. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కావడం విశేషం. రేణుకాచౌదరీ కమ్మ సామాజిక వర్గం కాగా.. వద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. గత కొన్నాళ్లుగా నేనే పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటి చేయకపోతే ఖమ్మం సీటు నుంచి తానే పోటీ చేస్తానంటూ టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఖమ్మం నుంచి తనకు మాత్రమే అర్హత ఉందని రేణుకా చౌదరీ చెప్పుకోవడం పార్టీలో పెద్ద దూమారమే రేపింది. రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు. అయితే, 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉండగా రేణుకాచౌదరి 1997–98లో దేవెగౌడ కేబినెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే.. ఆమెను ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి అధిష్టానం తప్పించి రాజ్యసభకు పంపింది. ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రేసులో ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతోన్న వద్దిరాజు రవిచంద్రది కాపు సామాజిక వర్గం. తెలంగాణలో కాపులు, మున్నూరు కాపులు, రెడ్డి కాపులున్నారు. ఈ ఓట్లు ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. వద్దిరాజుకు అవకాశం ఇచ్చాం కాబట్టి కాపు ఓట్లపై కన్నేయాలన్న ఆలోచన బీఆర్ఎస్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ దాదాపు ఖారారు అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్ఎస్ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కేఆర్ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి -
సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా మనకు ముఖ్యమని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన పార్టీ నేతలతో భేటీ జరిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్లే చేశారాయన. ‘‘నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ‘‘కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాంకు సున్నం వేయాలన్నా కూడా బోర్డు అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు. .. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక మన పోరాటం. నల్గొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దాం’’ అని పిలుపు ఇచ్చారు. 13వ తేదీన నల్గొండ లో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘నల్లగొండ సభకు నల్లగొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలి. .. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్‌లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ లో సభ జరిగి తీరుతుంది అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్స్ ఇక ఈ భేటీలో కేఆర్ఎంబీ వివాదంతో పాటు కాంగ్రెస్ ఆరోపణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్ట్ లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో.. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా.. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. .. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కి పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం...తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం వరకు ఆశావహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 140 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. ఇక, అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరిరోజు కావడంతో నిన్న(శుక్రవారం) భారీగా దరఖాస్తులు అందాయి. ఆశావహులు వందకుపైగా అప్లికేషన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలో చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి టికెట్ రేసులో ఉన్నారు. కాగా, ఈరోజు ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు నందిని వెళ్లనున్నారు. మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని విక్రమార్క్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రకటించారు. దీంతో, ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
త్వరలోనే వారి బండారం బయటపెడతా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయని, వాటి మీద సమగ్ర విచారణ జరగాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ది అక్రమాల చరిత్ర అని, అందుకే ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ అవసరం లేదని.. గత పదేళ్లలో అభివృద్ధికి బదులు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ దెబ్బ తీసిందని దుయ్యబట్టారు. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి వారి బండారం బయట పెడతామన్నారు. మేము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పీసీ సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికలు ఉంటాయి. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కాంగ్రెస్‌కి ఓటేశారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీఆర్ఎస్ను ఓడించారు. కాంగ్రెస్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి? -
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.