telugu movies
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఓటీటీల్లో కొన్ని సినిమాలు చాలా హడావుడితో రిలీజ్ చేస్తారు. మరికొన్నింటిని మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేస్తారు. అలా ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవేంటి? ఎందులో చూడొచ్చు?కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ 'తల'. తన కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. అసలు విడుదలైనట్లు కూడా తెలియనంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)గతేడాది నవంబర్ 8న రిలీజైన 'జాతర' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఒక ఊరిలో ఉండే గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు.అయితే ఈ రెండు తెలుగు సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ చేసుంటే అయిపోయేది. కానీ రెంట్ విధానంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తెస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 లిస్ట్‌లో నాలుగు తెలుగు సినిమాలు (ఫొటోలు)
-
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
మరో వారం వచ్చేసింది. టాలీవుడ్ ఇంకా 'పుష్ప 2' మేనియాలోనే ఉంది. గతవారం బాక్సాఫీస్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం దాదాపు అరడజను మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ 'బచ్చమల్లి', ఉపేంద్ర 'యూఐ', విజయ్ సేతుపతి 'విడుదల 2', ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' హాలీవుడ్ డబ్బింగ్ 'ముఫాసా', మలయాళ డబ్బింగ్ మూవీ 'మార్కో' రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం ఏకంగా 30 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో సత్యదేవ్ 'జీబ్రా' మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మిగిలనవన్నీ కూడా హిందీ-ఇంగ్లీష్ మూవీసే. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 16 నుంచి 22 వరకు)నెట్ఫ్లిక్స్ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 17రోనీ చింగ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 18మనా మన్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 18ద మ్యానీ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 18దిలాన్ 1983 (ఇండోనేసియన్ సినిమా) - డిసెంబర్ 19ద డ్రాగన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19ఫెర్రీ 2 (డచ్ సినిమా) - డిసెంబర్ 20సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 20ఉంజులో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20యునివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 20ఉజుమాకీ (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 20యోయో హనీసింగ్: ఫేమస్ (హిందీ మూవీ) - డిసెంబర్ 20స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ (హిందీ సినిమా) - డిసెంబర్ 21ద ఫోర్జ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 22అమెజాన్ ప్రైమ్గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ మూవీ) - డిసెంబర్ 18బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19హాట్స్టార్ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్ఫుల్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17వాట్ ఇఫ్? సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 22జియో సినిమాట్విస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 18మూన్ వాక్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 20పియా పరదేశియా (మరాఠీ మూవీ) - డిసెంబర్ 20ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై (భోజ్ పురి సినిమా) - డిసెంబర్ 20థెల్మా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 21ఆహాజీబ్రా (తెలుగు సినిమా) - డిసెంబర్ 20మనోరమ మ్యాక్స్పలోట్టీస్ 90స్ కిడ్స్ (మలయాళ సినిమా) - డిసెంబర్ 18ఆపిల్ ప్లస్ టీవీద సీక్రెట్ లైవ్స్ ఆఫ్ .యనిమల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 18లయన్స్ గేట్ ప్లేబాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20బుక్ మై షోసెంటిమెంటాల్ (బెంగాలీ మూవీ) - డిసెంబర్ 20(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే) -
ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్
మరో వారం వచ్చేసింది. వచ్చేవారం 'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి రానుంది. దీంతో తెలుగు చిత్రాలేవి పెద్దగా రావట్లేదు. అదే టైంలో సిద్ధార్థ్ 'మిస్ యూ', శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)ఓటీటీల్లో ఈ వారం వచ్చే సినిమాల విషయానికొస్తే.. 'వికటకవి', పారాచూట్ అనే తెలుగు వెబ్ సిరీస్‌లు, 'సికందర్ కా మఖద్దర్', 'కృష్ణం ప్రణయ సఖి' అనే చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'లక్కీ భాస్కర్' కూడా ఈ గురువారం ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 25-డిసెంబరు 1 వరకు)అమెజాన్ ప్రైమ్సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) - నవంబర్ 28హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29నెట్ఫ్లిక్స్కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25ఆంటోని జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 26చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 27అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 27లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) - నవంబర్ 28ద మ్యాడ్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 28లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29సెన్నా (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 29సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) - నవంబర్ 29ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) - నవంబర్ 29ద ట్రంక్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 29జీ5వికటకవి (తెలుగు సిరీస్) - నవంబర్ 28డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) - నవంబర్ 29హాట్స్టార్సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 29సన్ నెక్స్ట్కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) - నవంబర్ 29బుక్ మై షోజస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) - నవంబర్ 29ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29లయన్స్ గేట్ ప్లేబాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు) -
ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్
మరో వారంలో దీపావళి రానుంది. దీంతో ఈ వారం థియేటర్ల దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. 'పొట్టేల్', లగ్గం, సీ 202, రోటి కపడా రొమాన్స్, నరుడి బ్రతుకు నటన తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'పొట్టేల్'పై కాస్త కూస్తో బజ్ ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే దో పత్తి, సత్యం సుందరం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో, ఐందమ్ వేదమ్, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ ప్రకటనలు ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (అక్టోబర్ 21 నుంచి 27వరకు)నెట్ఫ్లిక్స్హసన్ మిన్హా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 22ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24టెర్రిటరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24ద 90'స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24దో పత్తి (హిందీ సినిమా) - అక్టోబర్ 25డోంట్ మూవ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 25హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 25ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 25సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 25 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 25లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 25జ్విగటో (హిందీ సినిమా) - అక్టోబర్ 25నౌటిలస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25హాట్స్టార్ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25ఆహాఅన్స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో) - అక్టోబర్ 25జీ5ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25ఆయ్ జిందగీ (హిందీ మూవీ) - అక్టోబర్ 25జియో సినిమాద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 21ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 23ద మిరండా బ్రదర్స్ (హిందీ సినిమా) - అక్టోబర్ 25ఆపిల్ ప్లస్ టీవీబిఫోర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25బుక్ మై షోద ఎక్స్టార్షన్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 25(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు
దసరా హడావుడి అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా అయితే లాఫింగ్ బుద్ధా అనే కన్నడ మూవీ మాత్రం చూడొచ్చులే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవే. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్మైటీ మాన్స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్స్టార్రీతా సన్యల్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 141000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమాక్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆపిల్ ప్లస్ టీవీస్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16బుక్ మై షోబీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?) -
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. అంతా మాయ!
రూ.99కే సినిమా చూసే ఛాన్స్. దేశవ్యాప్తంగా ఏకంగా 4000 స్క్రీన్స్‌లో ఈ ఆఫర్ వర్తింపు. కొత్త సినిమాల్ని కూడా తక్కువ ధరలోనే మల్టీప్లెక్స్‌లో చూసేయొచ్చు. మూడు రోజుల క్రితం మల్టీప్లెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్దగా ప్రచారం చేసుకుంది. మిగతా చోట్ల రూ.99 అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రూ.112 అని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అది కూడా లేదు. పైకి చెబుతున్నది ఒకటి రియాలిటీలో జరుగుతున్నది మరొకటి అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఆఫర్ కొన్నిచోట్లేనేషనల్ సినిమా డే అని ఘనంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లలో తక్కువ రేటు టికెట్ అని ఊరించారు. కానీ నిజంగా అలా చేయట్లేదు. ఈ శుక్రవారం రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటికి అరకొరా థియేటర్లు దొరికాయి. అందులో కొన్నింటిలోనే రూ.112 ఆఫర్ ఉంది.మోసం చేస్తున్నారా?ఆఫర్ అన్నప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు అయితే ప్రదర్శితమవుతున్నాయో అన్నింటికి అప్లై అవుతుందేమో? కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'మత్తువదలరా 2', 'సరిపోదా శనివారం', '35 ఇది చిన్న కథ కాదు' చిత్రాలు కూడా థియేటర్లలో ఉన్నాయి. కానీ వీటిని ఆఫర్లో పెట్టలేదు. మళ్లీ హైదరాబాద్‌లో పలు మల్టీప్లెక్స్‌లో రిలీజైన హిందీ సినిమాలకు పెట్టారు. అంటే తెలుగు ప్రేక్షకులంటే మల్టీప్లెక్స్ అసోసియేషన్‌కి చిన్నచూపా లేదంటే ఆఫర్ చెప్పి మోసం చేయాలని చూస్తున్నారా?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)ఇలా చేస్తే ఎలా?ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు జనాలు వెళ్లడం గతంతో పోలిస్తే తగ్గింది. సినిమా డే నాడు ఆఫర్స్ అని చెప్పినప్పుడు పూర్తిగా పాటిస్తేనే కదా ఆసక్తి లేకపోయినప్పటికీ టికెట్ డబ్బులు తక్కువే కాబట్టి ప్రేక్షకుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేస్తే ఉన్న క్రెడిబులిటీ కూడా పోతుందేమో? ఈ విషయం మల్టీప్లెక్స్‌లు ఆలోచిస్తే బెటర్.. లేదంటే సినిమా డే-ఆఫర్ అని చెప్పేటప్పుడు కేవలం ఉత్తరాదికి మాత్రమే చెప్పుకొంటే బెటర్!రీ రిలీజ్ సినిమాలకు కూడాకొత్త సినిమాలకు ఆఫర్ పెట్టలేదంటే నిర్మాత కోట్లు ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. 'బొమ్మరిల్లు' లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా రూ.250, రూ.300 టికెట్ రేటు పెట్టున్నారు. కనీసం వీటినైనా సరే సినిమా డే ఆఫర్ కిందకు తీసుకొస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)National Cinema Day returns for its 3rd edition on September 20th! Enjoy movies at over 4,000 screens across India for just Rs. 99. Don’t miss this perfect opportunity to catch your favorite films with your friends and family. #NationalCinemaDay2024 #20September pic.twitter.com/hEduoRbGtZ— Multiplex Association Of India (@MAofIndia) September 17, 2024 -
అవార్డులన్నీ ఈ మూడు సినిమాలకే..
-
వరుస ప్లాప్‌లు.. ఏం పర్లేదు శ్రీలీల ఈస్ బ్యాక్
-
2025 సంక్రాంతి మూవీస్ ఇవే..
-
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
‘‘హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘దిల్’ సినిమా ప్రీమియర్‌కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్‌గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్ బ్లోయింగ్‌గా నచ్చింది. ‘ఇడియట్’ మూవీ చూసి ఇలాంటి యూత్ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్‌గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్‌గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్‌గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్), నాతో మాట్లాడి.. సుకుమార్ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్ షూట్ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్‌గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. ఇందుకు సుకుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టాప్ ΄÷జిషన్‌లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఉండటం అనేది గ్రేట్ మూమెంట్.. దీనికి కారణం సుకుమార్. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. -
పల్లె పిలిచింది
పల్లెటూరి కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా సిటీ చుట్టూ తిరిగే కథలే చూస్తుంటారు కాబట్టి పల్లె కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు. పైగా ఆ కథల్లో స్టార్ హీరోలు నటిస్తే క్రేజ్ రెండింతలు ఉంటుంది. అలా ‘పల్లె పిలిచింది’ అంటూ కొందరు హీరోలు రూరల్ స్టోరీలతో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. పల్లెటూరి ఆట రామ్‌చరణ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ (2018) సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రామ్‌చరణ్. కాగా తనకు ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్‌ను అందించిన సుకుమార్‌తో మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ‘రంగస్థలం’కు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.అలాగే ఇది వార్ డ్రామా మూవీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ హీరోగా చేయనున్న సినిమా మాత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాయే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అన్నదమ్ముల పాత్రలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ పల్లె కథలో జాన్వీ కపూర్ హీరోయిన్. రాజు కథ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018లో జీవనోపాధికి గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. ఈ ఘటనలో ఉన్న ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. రాజు పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’ను డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. దసరా కాంబో రిపీట్‘దసరా’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హీరో నాని– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథాంశం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు ఎల్దండి గ్రామీణ నేపథ్యంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందని సమాచారం. మాస్ కుర్రాడు సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ ఎక్కువగా సిటీ అబ్బాయిలానే కనిపించారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ వంటి పల్లె ప్రేమకథను తీసిన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఈ నెల 9న... విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడి కానున్నాయి. లంకల రత్న విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి పరిసర ్రపాంతాల్లోని గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. చీకటి సామ్రాజ్యంలో లంకల రత్న అనే సాధారాణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంటాడు? అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ అని యూనిట్ పేర్కొంది. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. అలాగే హీరోలు రక్షిత్ అట్లూరి ‘శశివదనే’, నార్నే నితిన్ ‘ఆయ్..’ సినిమాలు గోదావరి నేపథ్యంలో సాగే కథలే. ఇంకా గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు ఉన్నాయి. -
పూర్తిగా సీక్వెల్ వుడ్ గా మారుతున్న టాలీవుడ్
-
ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రిపబ్లిక్ డే కానుకగా తలో డబ్బింగ్, హిందీ మూవీ రిలీజ్ అయ్యాయి గానీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ శుక్రవారం పదికి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిలో ఏ మూవీకి హైప్ ఉంది? ఫిబ్రవరి 2న 10 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ మాత్రం ఉన్నవాటిలో కాస్త ఆసక్తి రేపుతోంది. వరసపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న చిత్రబృందం.. సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని తర్వాత 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటించి, నిర్మించిన 'బూట్ కట్ బాలరాజు' కూడా ఉన్నంతలో బెటర్ మూవీ. ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బుల్లేవని సొహైల్ చెప్పాడు. పూర్తిగా కామెడీని నమ్ముకుని వస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) పై రెండు సినిమాలతో పాటు కామెడీని నమ్ముకున్న 'కిస్మత్', లక్ష్ చదలవాడ ధీర', థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'గేమ్ ఆన్' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'హ్యాపీ ఎండింగ్', 'మెకానిక్', 'ఉర్వి', 'చిక్లెట్స్', 'శంకర' చిత్రాలు కూడా ఫిబ్రవరి 2నే బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. అయితే వీటికి థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ హిట్ అయ్యే విషయంలోనే అసలు సమస్య ఉంటుంది. ఎందుకంటే మరీ అంత బాగుంటే తప్పితే జనాలు ఈ పది సినిమాల్లో ఒక్కదానిపై అయిన ఆసక్తి చూపించరు. దీనికితోడు వచ్చేవారం థియేటర్లలోకి రవితేజ 'ఈగల్', యాత్ర 2, రజనీకాంత్ 'లాల్ సలామ్' రాబోతున్నాయి. మరి వీటికోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల్ని.. ఈ వారం థియేటర్లలోకి తీసుకొచ్చే సినిమా ఏది? హిట్ అయ్యే మూవీ ఏది అనేది చూడాలి? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
బడా సినిమాల కంటే చిన్న చిత్రాలకే ఓటీటీల బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అటు థియేటర్లు దొరికేవి కావు, ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే టీవీల్లోనూ పెద్దగా వేసేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్సులు ఇస్తున్నాయి. దీంతో సినీ ప్రేమికులు.. చిన్న చిత్రాలని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడలా రెండు తెలుగు సినిమాలు చాలారోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేశాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) తెలుగులో గతేడాది వచ్చిన ఓ ప్రేమకథా సినిమా 'ప్రేమిస్తే చచ్చేది మేమే'. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ చిత్రం వచ్చేసింది. పూర్తిగా నిబ్బానిబ్బీ తరహా కథతో ఈ చిత్రాన్ని తీశారు. ఓ ధనవంతులైన అమ్మాయి, ఆటో నడుపుకొనే కుర్రాడు ప్రేమలో పడితే.. చివరకు ఏమైందనేదే స్టోరీ. కథ పరంగా ఓకే కానీ బడ్జెట్ పరిమితి అనేది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించింది. గతేడాది అక్టోబరు చివర్లో వచ్చిన మరో తెలుగు సినిమా 'ఓటు'. టైటిల్‌కి తగ్గట్లే ఓటు విలువ చెప్పే ఈ చిత్రం కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో జనాలకు పెద్దగా తెలియదు. పేరున్న నటీనటులు కూడా మూవీలో ఎవరూ లేరు. దీంతో ఈ చిత్రం అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. ఒకవేళ ఏదైనా తెలుగు మూవీస్ చూస్తూ టైంపాస్ చేయాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు
ఇంకా సంక్రాంతి హడావుడి నడుస్తోంది. అలానే మరో వీకెండ్ కూడా వచ్చేసింది. పండగ కానుకగా గతవారం రిలీజైన మూవీస్ సందడి ఇంకా నడుస్తోంది. ఈ నాలుగింటిలో 'హనుమాన్' రచ్చ కొనసాగడం గ్యారంటీ. ఈ క్రమంలోనే ఈ వారం ఒక్కటంటే ఒక్క మూవీ థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కాబట్టి అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే ఈ వీకెండ్ ఓటీటీల రిలీజుల విషయానికొస్తే 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా, 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మిగతావన్నీ కూడా పలు ఇంగ్లీష్ మూవీస్-వెబ్ సిరీసులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏమన్నా సడన్‌గా వీకెండ్ ఓటీటీల్లో రిలీజ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ శుక్రవారం స్ట్రీమింగ్ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (జనవరి 19th) నెట్ ఫ్లిక్స్ ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా సిక్స్ టీ మినిట్స్ - జర్మన్ మూవీ ద బెక్‌తెడ్ - కొరియన్ సిరీస్ ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా ద కిచెన్ - ఇంగ్లీష్ చిత్రం కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ సిరీస్ (జనవరి 20) అమెజాన్ ప్రైమ్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ సిరీస్ ఫిలిప్స్ - మలయాళ సినిమా హజ్బిన్ హోటల్ - ఇంగ్లీష్ సిరీస్ లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ - ఇంగ్లీష్ సిరీస్ జొర్రో - స్పానిష్ సిరీస్ జియో సినిమా లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్ హాట్‌స్టార్ బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్ కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్ క్రిస్టోబల్ బలన్సియా - స్పానిష్ సిరీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ - తెలుగు సినిమా స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్ (జనవరి 20) బుక్ మై షో ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు - తమిళ సినిమా ఆల్ ఫన్ అండ్ గేమ్స్ - ఇంగ్లీష్ చిత్రం (జనవరి 20) -
2023లో యూట్యూబ్ ని షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే
-
ఈసారి సంక్రాంతి ఇంతకు ముందులా ఉండదు..!
-
పాన్ ఇండియాకు పూనకాలు తెప్పిస్తానంటున్న రామ్
-
నార్త్ ఆడియెన్స్ కోసం బీటౌన్ స్టార్స్ కి ప్రాధాన్యత ఇస్తున్న టాలీవుడ్
-
మూవీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి నానా కష్టాలు పడుతున్న అఖిల్, తేజ్
-
షాకివ్వబోతున్న ప్రభాస్..
-
బాక్సాఫీస్ వద్ద సీక్వెల్స్ హల్చల్
-
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
సినిమాలో నటించాలని ఊరి నుంచి పారిపోయి వచ్చి బార్ షాపులో పని చేశా..
-
ముచ్చటగా 3 గంటలు
-
చిన్న సినిమా నిర్మాతలకు గొప్ప వరం
-
ఎంట్రీ అదుర్స్
-
మాస్ రాజా ఫిల్మ్ ఫెస్టివల్
-
వెయ్యి కోట్లు హంగామా
-
ఆయన అంతలా ఏడుస్తుంటే ఎంతమంది కమ్మవాళ్ళు చెప్పుతో కొడతామన్నారు ?
-
ప్రతిభ ప్రామాణికం కాదు బాబూ భజనే కొలమానం
-
నంది పురస్కారాల్లోనూ చంద్రబాబు రాజకీయం
-
తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మీద ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్ శంకర్, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం దసరా అలాంటి కోవకే చెందుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కమర్షియల్గానూ మంచి విజయం సాధిస్తున్నాయి ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపించడంపై మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి మెసెజ్ చేశారు. ‘డియర్ కేటీఆర్ గారు. మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహరణకు బలగం, దసరా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుంది. మరో విషయం ఏంటంటే నాకు 68 ఏళ్లు.. ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లు, జోకర్స్ గా చూపిచండంతో.. గత 20 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశాను’ అని డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కేటీఆర్‌కు వాట్సాప్ మెసెజ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అనుమతితో మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. దీనికి శ్రీరాములు కూడా స్పందింస్తూ.. తప్పకుండా సర్. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను. మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం. థాంక్యూ వెరి మచ్ సర్ అంటూ పేర్కొన్నారు. దీనిని కేటీఆర్ ట్విటర్లో షేర్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంది’ అని కేటీఆర్ తెలిపారు. Messages like this 👇😊 Thanks to KCR Garu for the renaissance on the cultural front A dialect that was ridiculed is now taking centerstage 👍 pic.twitter.com/XuWZBxiYRF — KTR (@KTRBRS) April 1, 2023 -
నాని, అఖిల్ మాస్ మంత్రం ఫలిస్తుందా
-
టాలీవుడ్ ఎంట్రీ కోసం వేచిచూస్తున్న బీటౌన్ భామలు
-
మేకింగ్ ఆఫ్ మూవీ @ 26 March 2023
-
మూవీ మ్యాటర్స్ @ 18 March 2023
-
మూవీ మ్యాటర్స్ @ 10 March 2023
-
మూవీ మ్యాటర్స్ @ 09 March 2023
-
‘రొమాంటిక్’హోలీ.. రంగు పడింది.. ప్రేమ పుట్టింది
హోలీ వచ్చిందంటే ఆ సందడే వేరు. బంధువులు సన్నిహితులంతా ఒక్కచోట చేరి రంగుల్లో మునిగితేలుతూ సంబరాలు చేసుకుంటారు. ఆకాశంలోని ఇంద్ర దనుస్సు నేలకు దిగి వచ్చిందా అనేంతగా ప్రజలంతా రంగుల్లో మునిగిపోతారు. ఇక ఈ పండుగ ప్రత్యేకతను చాటుతూ వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ప్రేమికులను కలిపేందుకు ఈ హోలీ పండుగను వేదికగా మలిచిన ప్రేమ కథ చిత్రాలేన్నో. కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా… అంటూ కింగ్ నాగార్జున అందాల భామలను పడేశాడు. రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలాడు. రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ డార్లింగ్ ప్రభాస్ అందాల భామలతో సందడి చేశాడు. ఇలా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య సయ్యాటలు, పాటలకు ఈ రంగుల పండుగను చేర్చి మరితం ఆకర్షనీయంగా మలిచిన ఆ చిత్రాలేంటో ఓ సారి చూద్దాం! ‘మజిలి’లో చై-సామ్ హోలీ! ఈ సినిమా సమంత, హీరో నాగ చైతన్య చాటుమాటుగా ప్రేమిస్తుంది. క్రికెట్ ఆడుతూ తన స్నేహితులతో జాలిగా తిరుగుతున్న హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అతడి అల్లరి చూస్తూ మురిపోతుంటుంది. తన ప్రేమను చెప్పకుండా వన్ సైడ్ లవ్‌లో పడుతుంది. నేరుగా అతడికి ఎదురుపడేందుకు భయపడే సామ్ హోలీ పండగలో మాత్రం ఏకంగా హీరోకి చాటుగా కలర్ పూసి ఆనందపడిపోతుంది. అలా ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకు ఈ హోలీ పండుగ వేదికగా నిలిచింది. నాని-లావణ్యల ‘భలే భలే’ హోలీ భలే భలే మగాడివో చిత్రంలో నాని-లావణ్య త్రిపాఠిల ప్రేమలో కూడా హోలీ పండుగను చేర్చారు. రోడ్డుపై హీరోయిన్ చూసిన నాని అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వెంటనే మొట్ట మొదటి సారి అంటూ పాట వేసుకుంటాడు నాని. ఇక ఇందులో హీరోయిన్‌తో కలిసి హోలీ ఆడుతూ ఆమెతో ప్రేమ ఆటలు ఆడుతాడు. ఇక ఆ తర్వాత తన మతిమరుపు జబ్బు దాచి హీరోయిన్ ఎలాగోలా ప్రేమలో పడేస్తాడు. ఛార్మితో నాగ్ ‘మాస్’ హోలీ కింగ్ నాగార్జున కెరీర్లో హిట్ సినిమాల్లో ‘మాస్’ సినిమా ఒకటి. అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలతో తర్వాత నాగార్జున యూత్ మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2004లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మిలు హారోయిన్లుగా నటించారు. తన పగ కోసం చార్మి ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండేందకు వచ్చిన నాగ్ తన ఉనికిని ఎవరికి తెలియకుండ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో నాగ్ అపార్ట్మెంట్ వాసులకు దగ్గరయ్యేందుకు లారెన్స్ హోలీ పండగను వేదికగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ‘మాస్’లో ఛార్మితో ఆడిపాడాడు. ఈ పాట తర్వాతే ఛార్మీ నాగ్ ప్రేమలో పడుతుంది. రంగుల్లో భూమిక ప్రేమలో పడ్డ ‘వాసు’ తన ఫ్రెండ్‌ను కొట్టిన విలన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళతాడు వెంకటేశ్. అయితే అప్పుడే హీరోయిన్‌తో వెంకి ప్రేమలో పడతాడు. ఈ సీన్ ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు రంగుల పండుగను తీసుకున్నాడు డైరెక్టర్. విలన్లను కొట్టేందుకు వచ్చిన వెంకీ రంగుల మబ్బుల్లో చందమామల హీరోయిన్ వైట్ డ్రెస్‌తో ఎంట్రీ ఇస్తుంది. తనపై రంగుల పడకుండా నవ్వుతూ పరుగెడుతుంటే వెంకీ ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తునే ఉండిపోతాడు. అలా వైట్ డ్రెస్‌తో చందమామల మెరిసిపోయిన్ హీరోయిన్ భూమికతో లవ్‌లో పడతాడు. అమెరికాలో ‘దేవదాసు’ హోలీ సెలబ్రెషన్స్ రామ్-ఇలియాన వెండితెర ఎంట్రీ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఇండియాలో ఉండే రామ్ అమెరికా సెనెటర్ కూతురైన ఇలియానతో ప్రేమలో పడతాడు. ఇండియాకు వచ్చిన మధుతో లవ్‌లో పడ్డ హీరో తన ప్రేమను గెలిపించుకునేందుకు అమెరికాకు వెళతాడు. అక్కడ ఆమెను కలుసుకునేందుకు హోలీని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. షామిలిని పడేసేందుకు హోలీని అడ్డుపెట్టుకున్న సిద్దూ ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంబంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్‌గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేసి హీరో చివరకు ప్రేమ కథను ముగిస్తాడు. -
మూవీ మ్యాటర్స్ @ 28 February 2023
-
మూవీ మ్యాటర్స్ @ 27 February 2023
-
60వ దశకం నుంచే కన్నడ భామల హల్చల్
-
తెలుగు తెరపై సంక్రాంతి సరిగమల సందడి
-
భారత్ గర్వపడుతోంది
-
నటుడు చలపతిరావు భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
2022 లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ?
-
టాలీవుడ్ రివ్యూ - 2022
-
2022 టాప్ టెన్ సాంగ్స్
-
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే..
మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా... సినిమా పాట సంగీతం బంగార్రాజు కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... అనూప్ రూబెన్స్ రౌడీ బాయ్స్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... దేవిశ్రీ ప్రసాద్ గుడ్‌లక్ సఖి రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... దేవిశ్రీ ప్రసాద్ ఖిలాడీ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్... దేవిశ్రీ ప్రసాద్ సెహరి ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... ప్రశాంత్ ఆర్. విహారి డీజే టిల్లు లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... రామ్ మిర్యాల పటాసు పిల్లా... భీమ్లా నాయక్ భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... ఎస్. తమన్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడాళ్లు మీకు జోహార్లు... దేవిశ్రీ ప్రసాద్ రాధేశ్యామ్ నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... తమన్ ఆర్ఆర్ఆర్ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... ఎంఎం కీరవాణి కొమురం భీముడో కొమురం భీముడో... ఆచార్య సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... మణిశర్మ లాహే లాహే లాహే లాహే లాహే లాహే... సర్కారువారి పాట వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... మ మ మహేశా... ఎస్. తమన్ ఎఫ్ 3 అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. దేవిశ్రీ ప్రసాద్ మేజర్ నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. శ్రీచరణ్ పాకాల అంటే సుందరానికీ.. చెంగుచాటు చేగువేరా... ఎంత చిత్రం... వివేక్ సాగర్ షికారు మనసు దారితప్పెనే... శేఖర్ చంద్ర ది వారియర్ నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడవుతుంది... దేవిశ్రీ ప్రసాద్ బింబిసార గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం... ఎంఎం కీరవాణి సీతారామం ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... ఓ సీతా వదలనిక తోడవుతా... విశాల్ చంద్రశేఖర్ మాచర్ల నియోజకవర్గం మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. మహతి స్వరసాగర్ గాడ్‌ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్.. తమన్ జిన్నా జారు మిఠాయో నా జారు మిఠాయ.. అనూప్ రూబెన్స్ హిట్: ది సెకండ్ కేస్ రానే వచ్చావ వానై నా కొరకే... జాన్ స్టీవర్ట్ ఎడూరి ధమాకా నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో... భీమ్స్ సిసిరోలియో -
హిట్-2 మూవీ పబ్లిక్ టాక్
-
‘యశోద’ సినిమాపై పరువు నష్టం దావా
బంజారాహిల్స్: యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని.. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరీష్ నారాయణ్, హరిశంకర్, నటి సమంతపై రూ.5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు ఇవ–ఐవీఎఫ్ ఎండీ మోహన్‌రావు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఇవ ఐవీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినిమాలో సరోగసీ స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సంస్థ పేరును వాడుకుని తప్పుచేశారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సినిమాలో ఇవ ఐవీఎఫ్ పేరు ను పలుచోట్ల ప్రస్తావించడంతోపాటు దృశ్యాల్లోనూ తమ ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. ఇదీ చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం! -
కృష్ణ డైలాగ్ తో అదరగొట్టిన Jr కృష్ణ
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నటి రోజా
-
స్టార్ పటాస్
-
Sardar Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ
టైటిల్: సర్దార్ నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, బాలాజీ శక్తివేల్ తదితరులు నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్ దర్శకత్వం: పీఎస్ మిత్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్ ఎడిటర్: రూబెన్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 ‘సర్దార్’ కథేంటంటే.. విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు ఇన్స్పెక్టర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటమంటే అతనికి పిచ్చి. పని మీద కంటే మీడియా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓ రోజు ఆంధ్రా యూనివర్సీటీ నుంచి చాలా ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతుంది. అందులో భారత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి సీబీఐ, ‘రా’ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ విషయం విజయ్ ప్రకాశ్‌కి తెలుస్తుంది. అతనికి ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా సీబీఐ, రా అధికారుల కంటే ముందే ఆ ఫైల్ని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో విజయ్‌కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయన చేపట్టిన మిషన్ గురించి తెలుస్తుంది. అసలు సర్దార్ ఎవరు? ఆయన చేపట్టిన మిషన్ ఏంటి? సర్దార్‌పై దేశద్రోహి అనే ముద్ర ఎలా పడింది? చివరకు తండ్రి చేపట్టిన మిషన్‌లో విజయ్ ప్రకాశ్ ఎలా భాగమయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు పీఎస్ మిత్రన్ దిట్ట. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటకు తెచ్చాడు. కమర్షియల్ అంశాలను జోడీస్తూనే ‘హీరో’లో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ‘సర్దార్’లో కూడా ఓ భారీ మోసాన్ని జనాలకు చూపించాడు. నీటి నిర్వాహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు. పైప్‌లైన్ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహి ముద్రవేసుకొని, అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్ కథ. సర్దార్ పాత్రని పరిచయం చేస్తు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విజయ్ కుమార్‌ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా విజయ్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. మీడియాలో పడేందుకు అతను చూపించే ఆసక్తి, హీరోయిన్‌తో ప్రేమాయణం ఇలా సాదాసీదాగా సాగుతుంది. సామాజిక కార్యకర్త సమీరా (లైలా) మరణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. సర్దార్ ప్లాష్‌బ్యాక్, అతను చేపట్టిన మిషన్ సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలు మనకు కొత్తేమి కాదు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అనేది గతంలో చాలా సినిమాల్లో చూపించారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా గత సినిమాల మాదిరే ఉంటుంది. కానీ కార్తి పాత్రలని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎవరెలా చేశారంటే... ఈ సినిమాలో కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. పోలీసు అధికారి విజయ్ కుమార్‌గా, 60 ఏళ్ల వయసుపైబడిన గూఢచారి సర్దార్‌గా రెండూ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అతని బహుళ గెటప్‌లను మెచ్చుకోవాలి. లాయర్ షాలినిగా రాశీఖన్నా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు నిడివి తక్కువనే చెప్పాలి. సామాజిక కార్యకర్త సమీరాగా లైలా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్‌గా చుంకీ పాండే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం బాగుంది. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు గొప్ప విషయం
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో గొప్ప విషయమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలర్‌ఫొటో చిత్ర దర్శకు డు సందీప్‌రాజ్ శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా సందీప్ రాజ్ తనకు లభించిన అవా ర్డు, ప్రశంసా పత్రాన్ని మంత్రికి చూపించారు. మంత్రిని కలిసిన వారిలో యాదవ్ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్ యాదవ్, రాహుల్ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్ ఉన్నారు. -
దసరా సినిమా
-
స్క్రీన్ ప్లే @ 29 August 2022
-
మూవీ మ్యాటర్స్ 21 August 2022
-
సెప్టెంబర్ 16న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్
-
మూవీ మ్యాటర్స్ 07 August 2022
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మహేష్ బాబు
-
మూవీ మ్యాటర్స్ 31 July 2022
-
మూవీ మ్యాటర్స్ 17 July 2022
-
వెండి తెరపై చినుకుల తుళ్లింత
నిజ జీవితంలోనే కాదు సినిమాలో కూడా వాన కురిస్తే సన్నివేశంలోని ఎమోషనే మారిపోతుంది. వానలో ప్రేమ... వానలో వాదన... వానలో సంఘర్షణ బలం ప్రేక్షకుణ్ణి తాకుతాయి. తడుపుతాయి. అయితే అందరు దర్శకులు వానను సరిగ్గా తీయలేరు. వానంటే ప్రేమ ఉన్నవారే గొప్ప వాన సన్నివేశాలు తీశారు.ఈ ఆదివారం కొన్ని గొప్ప వాన సన్నివేశాల గురించి... గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు. స్టూడియోల్లో వాన కాదు ఇది. ఔట్‌డోర్‌లో వాన. ఆ వానలో లాంగ్షాట్లో ఒక మనిషి పరిగెత్తుకొని ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లడం ప్రేక్షకులు నోరు వెళ్లబెట్టుకుని చూశారు. అంటే కథలో వెంటనే లీనమైపోయారు. ఈ సన్నివేశం తీస్తున్నప్పుడు ముందు కురుస్తున్న వానే తప్ప వెనుక కొండల మీదుగా కురుస్తున్న వాన కెమెరాలో రిజిస్టర్ కావడం లేదని కురసావా గమనించాడు. వాన ముందు కురిసి వెనుక కురియకపోతే సహజత్వం ఉండదు. ఈ సమస్య అధిగమించడానికి వెనుక కురిసే వానలో కొంచెం నల్ల ఇంకును కలిపారు. రెయిన్ మిషన్లతో కృత్రిమంగా సృష్టించిన ఈ వాన అందువల్ల అత్యంత సహజంగా ఉంటుంది. దీని తర్వాత ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’లో నటుడు జీన్ కెల్లి తన స్వీయ దర్శకత్వంలో, స్వీయ కొరియోగ్రఫీలో పాడిన ‘సింగింగ్ ఇన్ ద రెయిన్’ పాట చరిత్ర సృష్టించింది. ప్రియురాలికి ముద్దు పెట్టి గుడ్‌నైట్ చెప్పాక ఆ పారవశ్యంతో బయటికొస్తే వాన కురుస్తుంటుంది. టాక్సీని వద్దని అతడు వానలో తడవడానికి ఇష్టపడతాడు. ఆనంద తాండవం చేస్తాడు. బజారులో తెరిచిన, మూసిన దుకాణాల మీదుగా అతడు ఆడి పాడుతూ ఉంటే ఇవాళ్టికి కాపీ చేయని దర్శకుడు లేదు. 1955లో ఇదే మేజిక్‌ని దర్శకుడు రాజ్ కపూర్ ‘శ్రీ 420’లో సాధించాడు. ఆ సినిమాలో భారతీయ తెర మీద ఇప్పటికీ పునరావృత్తం కానంత అందంగా ‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై’ పాటను చిత్రీకరణ చేశారు. హీరో రాజ్ కపూర్, హీరోయిన్ నర్గీస్ అంతవరకూ స్నేహంలో ఉండి ఆ క్షణంలో ఒకరి పై మరొకరికి ప్రేమ ఉన్నట్టు గ్రహిస్తారు. వాన మొదలవుతుంది. అద్భుతమైన పాట కూడా. రాజ్ కపూర్ దీనిని స్టూడియోలోనే తీసినా రోడ్డు, వంతెన, దూరంగా వెళ్లే రైలు, చాయ్ బడ్డీ, వానలో తడిసే పిల్లలు, వణికే ప్రియురాలు, మురిసిపోయి చూసే ప్రియుడు ఇందరిని తెచ్చి పాటను చిరపుంజీ చేశాడు. తెలుగులో 1961లో వచ్చిన ‘ఆత్మ బలం’లో ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాటను మనోహరంగా చిత్రీకరించిన దర్శకుడు విక్టరీ మధుసూదనరావుకు పేరు రావాల్సిందేగానీ నిజానికి ఆ పేరుకు వారసుడు ఆయన కాదు. ఎందుకంటే అక్కడ వాన పాట ఉండాలని అనుకోలేదు. ఆత్రేయ బెంగళూరులో పాట రాయడానికి వెళ్లి పల్లవి తోచక తిరుగుతూ అప్పుడే మొదలైన వానను చూసి రాశాడు. అక్కినేని కంటే బి.సరోజా ఎక్కువ మార్కులు కొట్టేసిన పాట ఇది. వాన సన్నివేశాలు, పాటలు తీయడం కష్టం. కారణం అందుకు చాలా ఖర్చవుతుంది. నటీనటులు పదేపదే తడవాలి. కొందరు ఒప్పుకోరు. నీటి సమస్య. ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కొందరు దర్శకులు పట్టుబట్టి వానను సినిమాల్లోకి తెచ్చారు. ‘బలిపీఠం’ సినిమాలో క్లయిమాక్స్ అంతా భీకరమైన గాలివానలో జరిగినట్టు చూపి ఉత్కంఠ కలిగిస్తాడు దర్శకుడు దాసరి నారాయణ రావు. రీమేకే అయినప్పటికీ బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాలో వానను అత్యంత గొప్పగా తీశాడనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా గాలివానలో ఉన్నట్టు చూపారు ఈ సినిమాలో. అసలు నిజ జీవితంలో పగలూ ఉంటుంది... రాత్రి ఉంటుంది... ఎండ ఉంటుంది... వాన ఉంటుంది. కొందరు దర్శకులు మొత్తం కథంతా పగలే జరుగుతున్నట్టు తీస్తారు. కొందరు దర్శకులు పగలు సన్నివేశాలు, రాత్రి సన్నివేశాలతో కనెక్ట్ చేస్తారు. కొందరు దర్శకులు ఎండను, వానను చూపి కనెక్ట్ చేస్తారు. ‘శంకరాభరణం’లో అవమానం పొందిన శంకరశాస్త్రి దానిని ‘శంకరా నాదశరీరాపరా’ అని శివుడితో చెప్పుకుంటాడు. అంతటితో ఎఫెక్ట్ రాదు. ఆ ఆలయం మీద హోరున కురిసే వానలో ప్రాథేయ నృత్యం చేస్తాడు శంకర శాస్త్రి. గొప్ప ఎమోషన్ కలుగుతుంది. దర్శకుడు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ నాగార్జునను నిలదీసే సన్నివేశానికి వానను వాడుకున్నాడు. అద్భుతంగా ఉంటుంది ప్లాట్‌ఫాం పై కురిసే ఆ వాన. అలాగే ‘అమృత’ సినిమాలో అమృతకు తల్లి కనిపించే క్లయిమాక్స్‌లో గొప్ప వానను చూపిస్తాడు. ఎల్‌టిటిఇ పోరాటంలో ఉన్న ఆ తల్లి వానలాంటిదే. శాశ్వతం కాదు. అందుకే పెంపుడు తల్లి సిమ్రాన్‌కు గాఢంగా ముద్దు పెడుతుంది అమృత. ‘మనసంతా నువ్వే’లో వానను ఒక సన్నివేశంలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. ప్రేమ సఫలమయ్యే వేళకు అది విఫలం అయ్యే ఘడియ రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు ఉదయ్ కిరణ్. బయటకు చెప్పుకోలేడు. స్నేహితుడు సునీల్ ఆ క్షణంలో కుండపోత కురియడం చూసి ‘ఏడవరా... ఈ వానలో నీ ఏడుపును దాచుకో’ అంటాడు. అజిత్ నటించిన ‘ప్రేమలేఖ’ సినిమాలో క్లయిమాక్స్ అంతా వానలో తీయడం దర్శకుడు అగస్త్యన్‌కు పేరు తెచ్చింది. అజిత్‌ను వెతుక్కుంటూ వచ్చిన దేవయాని ఆ రాత్రి సిటీలో ఆటోలో వానలోనే అటూ ఇటూ తిరుగుతుంది. ఆ వాన కృత్రిమంగా అనిపించదు. సినిమాలో అందరూ తడిసినట్టే ప్రేక్షకులూ తడుస్తారు. వానకు తడిసిన షర్ట్ తీయడం వల్లే అజిత్ వేసుకున్న స్వెటర్ బయటపడి దాని ద్వారా దేవయాని అతణ్ణి గుర్తిస్తుంది. ఆ సీన్ పెద్ద హిట్ అయ్యింది. ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’లో దర్శకుడు వేణు ఉడుగుల వానను చాలా సమర్థంగా ఉపయోగించాడు. నక్సలైట్ రవన్నను వెతుక్కుంటూ వెన్నెల పాత్రధారి సాయి పల్లవి భోరున కురిసే వానలో పౌరహక్కుల నాయకురాలు నందితా దాస్ ఇంటికి వెళ్లడం ప్రేక్షకులను కూడా తడిసి ముద్దయిన భావనను కలిగిస్తుంది. అలాగే ‘పలాస’ సినిమాలో దర్శకుడు కరుణ కుమార్ వానను ఎమోషన్ కోసం కీలక సన్నివేశాలలో ఉపయోగించాడు. వానలో జల్లు, తుప్పర, చినుకులు, జడివాన, హోరు వాన, కుండపోత వాన, ముసురు... అంటూ ఇన్ని రకాలు ఉన్నాయి. వేటిని వాడితే ఏ సన్నివేశం పండుతుందో తెలిసినవాడే ధన్యుడు సుమతి. -
సినిమా గ్యారేజ్ @ 19 June 2022
-
వివాదంలో హీరోయిన్ సాయిపల్లవి
-
సాక్షితో న్యాచురల్ స్టార్ నాని
-
వెన్నెల ప్రేమకథ
-
సినిమా బోధపడింది
-
మేకింగ్ ఆఫ్ మూవీ - ఎఫ్3
-
వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Upcoming Telugu Movies 2022: New Films Coming In 3 Months Theater: థియేటర్లలో మళ్లీ సినిమా సందడి మొదలైంది. పుష్పతో ప్రారంభమైన ఈ మూవీ ఫెస్టివల్ మే 27న విడుదలైన ఎఫ్3 (F3) కొనసాగుతోంది. పుష్ప, శ్యామ్‌సింగరాయ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మే రెండోవారంలో సర్కారు వారి పాట ఘనంగా విడుదల కాగా చివరి వారంలో ఎఫ్3 రిలీజైంది. సర్కారు వారి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా అదే తరహాలో నవ్వులు పంచే సినిమాగా ఎఫ్3 విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మే నెల ఎఫ్3తో శుభం కార్డు పడగా.. తర్వాతి నెలల్లో వచ్చే సినిమాలకు ఆహ్వానం పలికేందుకు మరింత ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్ ఏంటో చూద్దామా ! జూన్: విక్రమ్- జూన్ 3 మేజర్- జూన్ 3 అంటే.. సుందరానికి- జూన్ 10 రామారావు ఆన్ డ్యూటీ-జూన్ 17 (ప్రస్తుతానికి వాయిదా పడింది) గాడ్సే- జూన్ 17 సమ్మతమే- జూన్ 24 జూలై: పక్కా కమర్షియల్- జూలై 1 విరాటపర్వం- జూలై 1 రంగ రంగ వైభవంగా- జూలై 1 థ్యాంక్ యూ- జూలై 8 ది వారియర్- జూలై 14 కార్తికేయ 2- జూలై 22 విక్రాంత్ రోణ- జూలై 28 హిట్ 2- జూలై 29 ఆగస్టు: బింబిసార- ఆగస్టు 5 యశోద- ఆగస్టు 12 ఏజెంట్- ఆగస్టు 12 మాచర్ల నియోజకవర్గం- ఆగస్టు 12 లైగర్- ఆగస్టు 25 వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 19 సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే జూన్ 17న రావాల్సిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే వాయిదా పడింది. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఒక వేళ ఈ సినిమా ఈ మూడు నెలల్లోనే రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో కలిపి వచ్చే 3 నెలల్లో మొత్తంగా 20 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పైన ఉన్న సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. చదండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి.. -
ఎఫ్ 3 మూవీ పబ్లిక్ టాక్
-
ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
Upcoming Telugu Movies On May 6 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఇక సినీ ప్రియులు, సినిమా నిర్మాతల దృష్టి వచ్చే శుక్రవారం పడింది. అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముచ్చటగా మూడు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దామా ! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. యాంకర్‌గా బాగా రాణిస్తున్న సుమ కనకాల నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో వస్తున్న ఈ 'జయమ్మ పంచాయతీ' ఎంటో మే 6న తెలియనుంది. ఇక శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్గా వస్తున్న చిత్రం 'భళా తందనాన'. వారాహి బ్యానర్‌పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ 1 ఫేమ్ గరుడ రామ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా తన సత్తా చాటేందుకు మే 6 తేదినే ఎంచుకుంది. ఈ మూడు చిత్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి. చదవండి: తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్.. అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం. త్రిబుల్ సందడి... ‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్‌లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తగ్గేదే లే అంటూ... ‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్లకు సీక్వెల్... నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ హిట్ కోసం... వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే.. రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూవీ మ్యాటర్స్ 10 April 2022
-
ఫిల్మ్ ఫన్ చాంగం
-
తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
John Abraham Comments On Telugu and Regional Movie: తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజా చిత్రం ఎటాక్ ఏప్రిల్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మూవీ టీంతో కలిసి జాన్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్ అబ్రహం తెలుగు, ప్రాంతీయ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మూవీ ప్రమోషన్లో జాన్ అబ్రహం ఆయన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించాడు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే, దక్షిణాది భాషలు మాత్రమే ఇక్కడ.. ఈ సందర్భంగా సలార్ మూవీలో ఆయన నటిస్తున్నట్టు వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. అనంతరం తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను ఓ హిందీ హీరోని. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్ హీరో, సహానటుడి పాత్రలు చేయను. ఇతర నటుల మాదిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటింబోయే ప్రసక్తే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో 'మల్లి' పాత్ర చేసిన చిన్నారి ఎవరో తెలుసా? కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కితున్న పాన్ ఇండియా చిత్రం సలార్‌లో జాన్ అబ్రహం ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు గతంలో జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అలాగే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పఠాన్ కోసం త్వరలోనే స్పెయిన్‌కు వెళుతున్నట్లు తెలిపాడు. పఠాన్ షూటింగ్లో భాగంగా తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, త్వరలోనే ముంబై వచ్చి ఆ తర్వాత స్పెయిన్‌కు పయనమవుతాన్నాడు. జాన్ అబ్రహం లీడ్ రోల్లో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ‘ఎటాక్’ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. -
మూవీ మ్యాటర్స్ 27 March 2022
-
మూవీ మ్యాటర్స్ 20 March 2022
-
మూవీ మ్యాటర్స్ 27 February 2022
-
స్క్రీన్ ప్లే @ 26 February 2022
-
పాపులర్ నవలలు.. వాటి ఆధారంగా వచ్చిన సినిమాలు
Top 10 Telugu Classic Movies Based On Novels: సాధారణంగా మనం చాలా సినిమాలను వాటి ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్స్ నచ్చిన తర్వాత చూస్తాం. ఆ మూవీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటే వాటి గురించి పరిశోధిస్తాం. అవి రీమెక్ చేశారా? డబ్బింగ్ మూవీస్ ఆ? హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొట్టారా? లేదా ఏవైనా పుస్తకాలు, నవలల నుంచి స్ఫూర్తి పొంది తీశారా? అని. ఇలా ఏదో ఒక విధంగా తీసిని చిత్రాలంటే కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి సైతం మనం మొగ్గుచూపుతాం. అలాగే రీమెక్ చిత్రాలైతే ఒరిజనల్ అండ్ రీమెక్ సినిమాలతో పోల్చడం వంటి విషయాలు మనకు ఒకరకమైన కిక్‌ను కూడా ఇస్తుంది. కాపీ సినిమాలు అయితే ఇంతకుముందు అలా మరే సినిమాలు వచ్చాయో తెలుసుకోవాలనే కుతుహలం ఏర్పడుతుంది. ఇలానే పాపులర్ అయిన కొన్ని నవలల నుంచి తీసుకున్న తెలుగు క్లాసిక్ సినిమాలు మీకోసం. 1. అభిలాష- యండమూరి వీరేంద్రనాథ్ (అభిలాష) 2. చంటబ్బాయి- మల్లాది వెంకటకృష్ణ మూర్తి (చంటబ్బాయి) 3. మీనా- యుద్దనపూడి సులోచనరాణి (మీనా) 4. సెక్రటరీ- యుద్దనపూడి సులోచనరాణి (సెక్రటరీ) 5. ప్రేమ్ నగర్- కోడూరి కౌసల్య దేవి 6. కాష్మోరా- యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం) 7. అహా నా పెళ్లంటా- ఆది విష్ణు (సత్యం గారిల్లు) 8. డాక్టర్ చక్రవర్తి- కోడూరి కౌసల్య దేవి (చక్రభ్రమణం) 9. కన్యాశుల్కం- గురజాడ అప్పారావు 10. సితార- వంశీ (మహల్లో కోకిల) -
త్వరలో పుష్ప-2 షూటింగ్ స్టార్ట్
-
స్క్రీన్ ప్లే @ 12 February 2022
-
థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్ సినిమాలు
గతేడాది థియేటర్లలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందండి ఫుల్‌గా ఉంటుందని భావించాయి సినీ వర్గాలు. కానీ ఎప్పటిలాగే కరోనా కోరలు చాచి ఆ సందడిని మాయం చేసింది. ప్రతీ రోజు పెరుగుతున్న కొవిడ్ కేసులతో సినిమా షెడ్యూల్స్ తారుమారు అయ్యాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాయి. కానీ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాన్ని మాత్రం ధైర్యంగా థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ త్రోబ్యాక్ వీడియో.. పూరీ జగన్నాథ్ షాక్ పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో చిన్న సినిమాలకు వరంగా మారింది. దీంతో ప్రస్తుతం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు సిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు: 1. వర్మ: వీడు తేడా, జనవరి 21న విడుదల 2. వధుకట్నం, జనవరి 21న విడుదల 3. ఉనికి, జనవరి 26న విడుదల ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు: 1. అఖండ- జనవరి 21, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. శ్యామ్ సింగరాయ్- జనవరి 21, నెట్‌ఫ్లిక్స్ 3. లూజర్ 2- జనవరి 21, జీ5 ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. -
సీజనల్ ఫైట్
-
టాలీవుడ్ లో దూసుకుపోతున్న శృతిహాసన్
-
మూవీ మ్యాటర్స్ 02 January 2022
-
New Year 2022 Special: హిట్టా.. ఫట్టా
-
2021 యూట్యూబ్ టాప్ హిట్ సాంగ్స్
-
Item Songs 2021: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్ సాంగ్‌లు ఇవే..
సినిమా అంటే యాక్షన్, రొమాంటిక్, కామెడీ సీన్లు, పాటలు వంటి రకారకాల వినోదాల మేళవింపు. ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటే అన్నీ ఉండి తీరాల్సిందే. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా వడ్డించాలి సినిమా దర్శకుడు. అప్పుడే ప్రేక్షకులు సినిమా అనే రుచిని ఆస్వాదిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. ఇక మాంచి కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ప్రతీ మాస్ ప్రేక్షకుడు స్పెషల్ ఫోకస్ పెడతాడు సినిమాపై. సినిమాలో ఐటమ్ సాంగ్ లేదంటే పెదవి విరుస్తారు ఆడియెన్స్. థియేటర్లలో స్పెషల్ సాంగ్ వచ్చిందంటే చాలు విజిల్స్, పేపర్స్ విసిరేస్తూ గోల గోలగా సందడి చేస్తారు. ఇంతలా కేక పెట్టించే ఐటమ్ సాంగ్‌లో ఎవరూ స్టెప్పులేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూసే పక్కా మాస్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. అందుకే ఈ ఐటమ్ సాంగ్స్‌లో తమ అందాలతో కట్టిపడేస్తున్నారు హీరోయిన్స్. ఇదివరకు అయితే ఈ సాంగ్స్‌లో సాధారణ నటీనమణులు నర్తించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే తమ ముందు ఐటమ్ సాంగ్స్ కూడా తక్కువే అని నేరుగా హీరోయిన్లే ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చేసిన 'ఊ అంటావ మావ'తో ఐటమ్ సాంగ్స్‌కు కొత్త కళ వచ్చింది. ఇలా ఈ ఏడాది వచ్చిన 'భూమ్ బద్దలు' నుంచి 'ఊ అంటావా మావ' వరకు అలరించిన స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం. 1. ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ (పుష్ప) 2. ఛాంగురే ఐటమ్ సాంగురే (గల్లీ రౌడీ) 3. పెప్సీ ఆంటీ (సిటీమార్) 4. మందులోడా (శ్రీదేవి సోడా సెంటర్) 5. పైన పటారం (చావు కబురు చల్లగా) 6. రంభ ఊర్వశి మేనక (అల్లుడు అదుర్స్) 7. డించక్ డించక్ డింకా (రెడ్) 8. భూమ్ బద్దలు (క్రాక్) ఈ స్పెషల్ సాంగ్స్‌తో పాటు నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' సినిమాలోని 'దిగు దిగు నాగ' సాంగ్ కూడా చాలా అలరించింది. అయితే ఈ పాటలో కూడా హీరోయిన్ రీతు వర్మ నర్తించింది. -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలై పుష్ప రాజ్ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా రాబట్టాడు. ఇది బన్నీ సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ భాషల్లో రిలీజ్ అయి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. 'ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.' అని పేర్కొన్నాడు కరణ్ జోహార్. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ కూడా అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పుష్ప మేకింగ్ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు -
మూవీ మ్యాటర్స్ 26 December 2021
-
సినిమా 2021
-
అభిమానులు అర్థం చేసుకోవాలి.. సినిమాల వాయిదాపై దిల్ రాజు
Producer Dill Raju Reaction On Movies Postponed: వచ్చే సంక్రాంతి పండగ రిలీజ్ రేసులో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ల ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్), ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ కల్యాణ్-రానాల ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Producers Guild)’ అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుంది. ఈ విషయం గురించి యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నిర్మాతలు ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య స్పందించారు. ‘‘సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు దాదాపు మూడేళ్లుగా వర్క్స్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయన్న కారణంగానే జనవరి 7న విడుదల కావాల్సిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్స్ షేరింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఈ పరిస్థితిలోనే సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాల్సిందిగా ఈ చిత్రనిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్‌ను కోరితే, వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ (వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు) సినిమాకు నిర్మాతను నేనే. ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్స్‌లో చూసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నందుకు నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, పవన్‌లకు థ్యాంక్స్’’ తెలిపారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సమావేశంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
నా కూతురు గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను
‘‘సినిమాల పట్ల నా ఆలోచనా ధోరణి మారింది. నా కుటుంబం, నా కూతురు రాధ నా సినిమాలను చూసి గర్వపడేలా చాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను’’ అని శ్రియ అన్నారు. శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేశ్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన విశేషాలు. ∙‘గమనం’ చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో కనిపిస్తాను. కమలకు వినపడదు. కానీ మాట్లాడుతుంది. ఇందులో మూడు కథలు ఉన్నాయి. ఈ మూడు కథలూ ఓ ప్రకృతి విపత్తు (భారీ వర్షం) కారణంగా కనెక్ట్ అవుతాయి. ‘గమనం’ కథ విన్నప్పుడు ఏడ్చాను. కథకు, కమల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. నిస్సహాయతతో ఉన్న ఓ మహిళ సాగించే ప్రయాణమే కమల జీవితం. ఈ పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. ∙మహిళా దర్శకులతో వర్క్ చేయడం నాకు కొత్త కాదు. దీపా మెహతా, కన్నడంలో ఓ సినిమా చేశాను. అయితే తెలుగులో లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఒకప్పుడు సెట్స్‌లో నేను, నా మేకప్ ఉమన్ తప్ప ఎవరూ మహిళలు ఉండేవారు కాదు. అయినా నా ప్రైవసీకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ మహిళా దర్శకులు అయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పుకోగలం. కాస్త చనువు కూడా ఉంటుంది. ఈ సినిమాకు ఇళయరాజాగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమా ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా ఆయనే సంగీత దర్శకులు. ∙నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయింది. నా తొలి సినిమా ‘ఇష్టం’ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నా సుదీర్ఘమైన ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని నమ్ముతాను. మరో ఇరవయ్యేళ్లు ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉంది. అందుకు కష్టపడతాను. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరి క్షణం వరకు నటించారు. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది. ∙పదినెలల క్రితమే బార్సిలోనాలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నాకు పాప పుట్టాలనే కోరుకున్నాను. ‘రాధారాణి’ పేరును మా అమ్మగారు సూచించారు. రష్యన్ భాషలో రాధ అంటే హ్యాపీ అని మా ఆయన ఆండ్రీ అన్నారు. సంస్కృతంలో కూడా హ్యాపీ అనే అర్థం వస్తుంది. అందుకని ‘రాధ’ అని పెట్టాం. రాధ వచ్చిన తర్వాత మా లైఫ్ మారిపోయింది. పాప జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఈ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ∙బయోపిక్స్ అని కాదు కానీ కథక్ డ్యాన్స్ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో సందర్భంలో మాట్లాడతాను. -
తెలుగులో వచ్చిన జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు ఇవే..
బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఆ డైలాగ్‌లో ఏదో మత్తు ఉందని తెగ సంబరపడిపోతారు. జేమ్స్ బాండ్ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీస్‌లో ఏజెంట్ 007 చేసే సాహసకృత్యాలు ప్రతి ఒక్కరినీ ఔరా అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్‌తో బాండ్ చేసే రొమాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా డానియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై మూవీతో ఇప్పటివరకు 25 బాండ్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్లో వచ్చిన ఈ సినిమాల్లో మొత్తం ఏడుగురు యాక్టర్స్ బాండ్ క్యారెక్టర్‌ను పోషించారు. అయితే మన తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఏజెంట్ 116 పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116తో పాటు తెలుగులో వచ్చిన బాండ్ చిత్రాలపై ఓ స్టోరీ చూసేద్దామా..! 1. గూఢచారి 116 తెలుగులో వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేయగా మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్ కోసం సీక్రెట్ ఏజెంట్ 303ను ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేస్తుంది. ఈ కేసును చేధించడానికి ఏజెంట్ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించారు, ఆ ఫొటోలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది సినిమా కథ. 2. గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన గూఢచారి నెం.1లో మెగస్టార్ చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1983లో విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించారు. 3. విశ్వరూపం ‘విశ్వరూపం’ సినిమాలో కమల్... భారత్ జేమ్స్‌బాండ్‌గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించారు. 4. గూఢచారి అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలైంది. ఇది పూర్తిగా జెమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు. 5. చాణక్య గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. ఇందులో గోపిచంద్ రా ఏజెంట్‌గా మెప్పించారు. ఈ సినిమాకు అబ్బూరి రవి కథ రాయగా డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్‌ను సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూస్తే ప్రభాస్ అభిమానులకు పండగే. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రం కూడా సీక్రెట్ ఏజెంట్ కథాంశంతోనే నవంబర్ 12న రిలీజ్ కానుంది. -
జోష్ తీసుకొస్తామంటున్నకార్తికేయ, ఆనంద్
-
టాలీవుడ్ లో దొంగలు పడ్డారు !
-
‘కొండ పొలం’మూవీ రివ్యూ
టైటిల్ : కొండ పొలం నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటింగ్: శ్రావన్ కటికనేని విడుదల తేది : అక్టోబర్ 8,2021 ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే..? కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ అలియాస్ రవీంద్ర(వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్ ఆపీసర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే... మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్. పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్. అలాగే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో సాగినంత వేగం.. సెకండాఫ్‌లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘రయ్ రయ్ రయ్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్
‘సారంగదరియా’.. ‘రాములో రాములా’.. ‘నాది నక్కిలీసు గొలుసు’.. ‘గున్నా గున్నా మామిడి’... జనం పాటలు జోరు మీదున్నాయి. వెండితెరపై మోత మోగిస్తున్నాయి. పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ సినిమాలకు పదాలిమ్మంటున్నాయి. కల్పించే పాటకు అంగీకారం డౌట్. జానపదానిది గ్యారంటీ సక్సెస్‌రేట్. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ జానపదం ఝల్లుమంటూనే ఉంది. ఘల్లుమంటూనే ఉంది. సండే స్పెషల్... జానపదం జనం నాల్కల మీద ఉంటుంది. అందుకే వెండితెర మీద కనపడి వినిపించగానే కనెక్ట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. జానపద గీతం ఆర్గానిక్‌గా పుడుతుంది. తరాలపాటు నిలిచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సినిమాల్లోకి రాగానే ఆ శక్తితో సూపర్‌హిట్ అవుతూ ఉంటుంది. సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి. సన్నివేశాలకు తగినట్టు పాటలు కడతారు. ఆ అన్ని సన్నివేశాలకు జానపదాలు సూట్ కావు. కాని కుదిరే సన్నివేశాలలో జానపదాలు పెట్టడానికి నిర్మాత దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు తెర మీద మొక్కజొన్నల్ని పండిస్తాయి. భుజం మీద కడవలతో మెరుస్తాయి. మావ మావ మావా... ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావ మావ మావా’ పాట కలెక్షన్ల దుమారం రేపింది. అయితే జానపద గీతాల్లో శృంగారం వాచ్యంగా, అవసరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాటను కొందరు అశ్లీలంగా భావించారు కూడా. కాని సామాన్య ప్రేక్షకుడు ఉత్సాహపడ్డాడు. కేరింతలు కొట్టాడు. తెలుగు సినిమాల్లో కొసరాజు జానపద గీతాలను రసాత్మకంగా ప్రవేశపెట్టారు. జానపదం అంటే కొసరాజు వైపు చూడాల్సి వచ్చేది. ‘పెద్దమనుషులు’ సినిమా కోసం ‘నందామయా గురుడ నందామయా’, ‘శివశివమూర్తివి గణనాథ’... జానపదాల నుంచి ఇచ్చారు. ‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మ’ (రాజు–పేద), ‘ఏరువాక సాగారో’, ‘ఒలియ ఒలి పొలియ పొలి’... (రోజులు మారాయి), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ).. ఇవన్నీ కొసరాజు కలం చివర నుంచి సిఖను అంటించుకున్నాయి. మరోవైపు పింగళి వంటి పెద్దలు జానపదం నుంచి తీసుకుని ‘కాశీకి పోయాను రామా హరే’ సరదా గీతాలను ఇచ్చారు. ఆరుద్ర ‘అత్తా ఒకింటి కోడలు’ సినిమాలో ‘తడికో తడిక’ అంటూ తడికను అడ్డం పెట్టుకుని జానపదులు చేసే సంవాదాన్ని పాట చేశారు. కొనకళ్ల వెంకటరత్నం ‘అదృష్టవంతులు’ సినిమాలో ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’తో భవిష్యత్ ముఖ్యమంత్రి జయలలితకు ఒక అచ్చతెలుగు హిట్ పాట ఇచ్చారు. పట్నంలో షాలిబండ కలర్, బ్లాక్ అండ్ వైట్ సంధికాలపు సినిమాలు వచ్చే సరికి ఈ దూకుడు తగ్గింది. సినారె కొన్ని జానపద వరుసలను పాటలకు వాడి మెరిపించారు. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం)... తదితరాలు జానపదాల రెక్కలను రేకులను తొడుక్కున్నాయి. అప్పుడే ‘అమాయకుడు’ సినిమాలో ఏ.వేణుగోపాల్ రాసిన జానపద వరుస ‘పట్నంలో షాలిబండ’ తెలంగాణ పదాలతో చమ్కాయించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘వచ్చే వచ్చే వానజల్లు యాల్మది యాల’, ‘మంగమ్మగారి మనవడు’లో ‘నోమో నోమన్నలాల’... ఆ మట్టినెత్తావులను కొనసాగించాయి. ఆ తర్వాత తొంభైలలో కూడా అడపా దడపా ఈ పాటలు వినిపించాయి. ‘మొండి మొగుడు పెంకిపెళ్లాం’లో సాహితి రాసిన ‘లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగ’ పాట హిట్ అయ్యింది. ‘తమ్ముడు’ సినిమాలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు’, ‘ఖుషి’లో ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ వంటి జానపదాలు సందర్భానుసారం వినిపిస్తాయి. ‘కాలేజ్’ సినిమాలో ‘మాయదారి మైసమ్మో’ కుర్రకారును గెంతులేయించింది. జానపద బాణీలను తీసుకుని మలిచిన విప్లవ గీతాలు కూడా ఈకాలంలో వచ్చాయి. ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్ మర్రి వేయికాళ్ల జెర్రి’... ఇవన్నీ జనం నోళ్లలో నేటికీ నానుతున్నాయి. గాజులోళ్లమే పిల్లా మేము ఆర్.పి.పట్నాయక్ వంటి సంగీత దర్శకుల హయాంలో ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించడం మొదలెట్టాయి. ‘నువ్వు–నేను’లో ‘గాజులోళ్లమే పిల్లా మేము’ పెద్ద హిట్ అయ్యింది. ‘మగధీర’లో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ లైన్లు మెరిసి మాస్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇది చాలారోజుల తర్వాత తిరిగి ‘పలాసా’ సినిమాతో మళ్లీ ఉత్తరాంధ్ర జానపదాల వైపు అందరూ చూస్తున్నారు. నాది నక్కిలీసు గొలుసు గత ఐదారేళ్లుగా మళ్లీ జానపదాలు ఊపు మీదున్నాయి. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సందర్భం వస్తే జానపదాన్ని వదలడం లేదు. ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ హల్చల్ చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’లో పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ పెద్ద హిట్ అయ్యింది. ‘రాజా ది గ్రేట్’లో ‘గున్నా గున్నా మామిడి’, ‘పలాసా’లో ‘నాది నెక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడోలమ్మ’, ‘శ్రీకారం’ లో ‘వస్తానంటివో పోతానంటివో’ హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘సారంగ దరియా’ పాట ఆ సినిమా రిలీజ్ కాక ముందే పెద్ద హిట్ అయ్యింది. ‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘రాములో రాములా’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా’... ఇవన్నీ కొత్త సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రాబోయే ‘వరుడు కావలెను’ లో ‘దిగు దిగు దిగు నాగ’, ‘భీమ్లా నాయక్’లో మొగిలయ్య సాకీ ఇవన్నీ జానపదం శక్తిని, అవసరాన్ని చూపుతున్నాయి.తెలుగు పల్లెల్లో, తెలుగు సినిమాల్లో జానపదం జెండా ఎగురుతూనే ఉండాలి. -
దోస్తానాపై వచ్చిన తెలుగు చిత్రాలివే..
అమ్మ మీద అంతులేని ప్రేమ ఉన్నా…అన్ని విషయాలు మాట్లాడలేం. నాన్నంటే ఎంత గౌరవం ఉన్నా…అన్నింటినీ షేర్ చేసుకోలేం. జీవిత భాగస్వామి మనలో సగమే అయినా…ఏదో ఒక సీక్రెట్ దాచే ఉంచుతాం. మరి…ఒక మనిషి ఎలాంటి రహస్యాలు లేకుండా, ఓపెన్‌గా ఉండేది ఎక్కడ ? ప్రేమ, గౌరవం, వినయం, బాధ్యత లాంటి భావోద్వేగాలను కూడా దాటుకుని నిలబడేది ఎవరి పక్కన ? ఒక్క స్నేహితుడి దగ్గరే. సాధారణ మనిషికైనా.. స్టార్ హీరోకైనా స్నేహితులు ఉండాల్సిందే. స్నేహానికి ధనిక, పేద తేడాలే కాదు…లింగ భేదాలు కూడా ఉండవు.. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఫ్రెండ్షిప్ మూవీస్ మీ కోసం.. స్నేహం కోసం చిరంజీవి, విజయ్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘స్నేహం కోసం’ సినిమా స్నేహ బంధాన్ని చాటి చెప్పింది. ఈ సినిమాకు గానూ మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ అవార్డును తెచ్చిపెట్టింది. స్నేహానికి ఆస్తులు అంతస్థులు, ధనిక, పేద, కుల,మత బేధాలేవి ఉండవని చాటి చెప్పింది. ' మీసం ఉన్న నేస్తమా.. నీకు కోపం ఎక్కువ' అనే పాట స్నేహితుడు ఎలాంటి వాడో చెపుతుంది. స్నేహమంటే ఇదేరా ఈ చిత్రం స్నేహ బంధంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇందులో నాగార్జున, సుమంత్ స్నేహితులుగా నటించారు. భూమిక చావ్లా, ప్రత్యూష హీరోయిన్లుగా నటించారు. వసంతం వెంకటేశ్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్, ఆకాశ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం వసంతం. 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటించారు. స్నేహానికి లింగభేదం ఉండదని ఈ సినిమా చాటి చెప్పింది. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. నిను పిలిచిందెవరమ్మా) అనే పాట బాధలో ఉండే స్నేహితుడిగా మనోధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఓ మై ఫ్రెండ్ సిద్ధార్థ్, శృతి హాసన్, హన్సిక, నవదీప్ ప్రధాన పాత్రలుగా 'ఓ మై ఫ్రెండ్' అనే సినిమా 2011లో వచ్చింది. సినిమాలో చందు, సిరి అనే అమ్మాయి, అబ్బాయి మధ్య ఓ మంచి స్నేహాన్ని ఈ సినిమాలో చూపించారు. హ్యాపీడేస్ వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, సోనియా తదితరులు ప్రధాన పాత్రలు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం 'హ్యాపీడేస్'. కాలేజ్ డేస్ లో పరిచయమయ్యే స్నేహాలు, వారి నుంచి లభించే స్వీట్ మెమొరీస్ ని బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో స్నేహితుల్లో ఉండే రకాలందరినీ చూపించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఉత్తమ స్నేహ చిత్రంగా రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటితో పాటు నీ స్నేహం, కేరింత, ఆర్య2 లాంటి చిత్రాలు కూడా స్నేహబంధాన్ని చక్కగా చాటిచెప్పాయి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కే బాలచందర్
-
స్క్రీన్ ప్లే10 july 2021
-
స్క్రీన్ ప్లే08 july 2021
-
ప్రేమ చరిత్ర
-
ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా?
-
స్క్రీన్ ప్లే26 june 2021
-
స్క్రీన్ ప్లే24 june 2021
-
స్క్రీన్ ప్లే23 june 2021
-
స్క్రీన్ ప్లే22 june 2021
-
మిడిల్ క్లాస్ డాడీస్
-
వెండితెర పై హీరోగా రాణించిన తండ్రీ కొడుకులు
-
పార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్
-
మూవీ మ్యాటర్స్13 June 2021
-
ఆకాశమే వీళ్ల హద్దు
-
4 వారాలు..4 సినిమాలు..కట్టిపడేసే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ
సూపర్ హిట్ కంటెంట్‌తో లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. అల్లు అరవింద్ ఈ ఓటీటీ కోసం మంచి టీమ్ ను రెడీ చేశాడు. ఇప్పటికే ‘క్రాక్’,‘గాలి సంపత్’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘సుల్తాన్’, ‘చావు కబురు చల్లగా’, ‘థ్యాంక్ యు బ్రదర్’,‘అనుకోని అతిథి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లను అందించిన ఆహా.. ఇక జూన్ నెలలో కూడా సరికొత్త సినిమాలలో అలరించేందుకు రెడీ అవుతుంది. వారానికి ఒక సినిమా చొప్పు నాలుగు డిఫరెంట్ మూవీస్‌ని జూన్‌లో నెలలో విడుదల చేయబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్ మూవీ కాలా తెలుగులో అనువాదమవుతోంది.టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో మూవీ సాగుతుంది. ఫారెస్ట్ హౌస్ లో ఒక రోజులో జరిగే కథ ఇది. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్, సాయి కుమార్ లుక్, కార్తిక్ రత్నం లుక్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. జూన్ 11 నుండి ‘ఆహా’లో ‘అర్ధ శతాబ్దం’ అందుబాటులోకి రానుంది.. ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18న ఆహాలో ప్రసారం అవుతుంది. మలయాళి మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘వన్’. ఈ చిత్రాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయింది ఆహా. సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది. ఇలా ప్రతి వారం ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులను వినోదాన్ని అదించబోతుంది ఆహ. చదవండి: Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే! In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా.. -
వీళ్ళుచాలా కేక గురు
-
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
తల్లి నిను దలంచి
-
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
మహర్షి... జెర్సీకి డబుల్ ధమాకా
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్ – అరేబియన్ కడలింటె సింహం’ (మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (‘భోన్స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘అసురన్’కే దక్కగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ అవార్డును సిక్కిమ్ దక్కించుకుంది. ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్ గంగాధరన్)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్‌లాల్ ‘మరక్కర్’ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది. జయహో... మలయాళం ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం. ఒకటికి రెండు తాజా నేషనల్ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం. అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని ‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్ మిస్ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’ శిల్పకు ధన్యవాదాలు ‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్ డీలక్స్’లో సేతుపతి చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్.’’ – ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను ‘‘నేను డైరెక్టర్ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్‌గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్. అందుకే ఆయనకు ఫోన్ చేసి ‘థ్యాంక్స్’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’ – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాకు ఇది హ్యాపీ మూమెంట్ – ‘దిల్’ రాజు ‘‘మహేశ్ వంటి స్టార్‌ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్ సాల్మన్ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి. -
ఇంట గెలిచి.. రచ్చ గెలవడానికి వచ్చారు
తమిళ పొన్ను (అమ్మాయి), కేరళ కుట్టి (అమ్మాయి).. భాష ఏదైనా తెలుగమ్మాయిలా కనిపించడానికి రెడీ అయిపోతారు. తెలుగు అమ్మాయిలు అక్కడికి వెళుతున్నారు. అక్కడి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న పరభాషా నాయికల్లో కొందరు ఇంట గెలిచారు.. రచ్చ గెలవడానికి వచ్చారు. ఈ తారలపై స్పెషల్ స్టోరీ. ఎమోషనల్... కామెడీ... రొమాంటిక్.. లవ్... ఇలా సీన్ ఏదైనా అద్భుతంగా నటిస్తారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ‘నిరమ్’ (2013), ‘బెంగళూరు డేస్’ (2014) వంటి మలయాళ మూవీస్‌లోనే కాదు...‘రాజా రాణి’ (2013) వంటి తమిళ సినిమాలో కూడా నటించారు నజ్రియా. మాలీవుడ్‌లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్‌గా ఉన్న నజ్రియా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న ‘అంటే...సుందరానికీ!’ సినిమాలో ఈ మలయాళ సుందరి హీరోయిన్గా నటించనున్నారు. నజ్రియా చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. కేవలం నటిగానే కాదు... తన భర్త, హీరో ఫాహద్ ఫాజిల్‌తో కలిసి నిర్మాతగా కూడా మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు నజ్రియా. నజ్రియా నజీమ్ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి హీరోయిన్గా సక్సెస్ అయినవారిలో ప్రియాభవానీ శంకర్ ఒకరు. ప్రస్తుతం అరడజను తమిళ సినిమాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు ప్రియ. మంచు మనోజ్ హీరోగా నటించనున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కి సైన్ చేశారామె. ప్యాన్ ఇండియా స్థాయిలో శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్షన్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో పాటుగా తెలుగులో మరో కొత్త సినిమా చేయడానికి కూడా ప్రియ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రియా భవానీ శంకర్ మరో మలయాళ భామ ఐశ్వర్యా లక్ష్మీ మాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చిన ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో చాన్సులు క్యూ కడుతున్నాయి. బ్రదర్స్ డే, వరదన్ వంటి మలయాళ సినిమాలు చేసిన ఐశ్వర్య తమిళంలో విశాల్, తమన్నా నటించిన ‘యాక్షన్’ సినిమాలో కూడా ఐశ్వర్య ఓ కీ రోల్ చేశారు. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ కాంబినేషన్లో వస్తోన్న ‘గాడ్సే’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక మరో మలయాళీ భామ ఐశ్వర్యా మీనన్ తమిళంలో సిద్ధార్థ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాదలిల్ సొదప్పువదు ఎప్పడి’ (తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’గా విడుదలైంది) సినిమా ద్వారా నటిగా ప్రయాణం ప్రారంభించారు. తమిళంతో పాటు ఇప్పుడు కన్నడ సినిమాలూ చేస్తున్నారామె. ఐశ్వర్యా లక్ష్మి తాజాగా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్‌ను ఐశ్వర్యా మీనన్ దక్కించుకున్నారని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారు. ‘పెళ్లిసందడి’ సినిమా సీక్వెల్లో హీరోయిన్గా చేస్తున్నారు శ్రీలీల. తెలుగులో శ్రీలీలకు హీరోయిన్గా ఇది తొలి సినిమా. ఇక కన్నడలో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న నటి రచితా రామ్. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ వంటి శాండిల్‌వుడ్ టాప్ స్టార్స్ సరసన నటించారామె. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు డైరెక్షన్లో రూపొందుతోన్న ‘సూపర్ మచ్చీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు రచితా. వీరితో పాటు మరికొంతమంది తమిళ, మలయాళ, కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. -
2020 ‘సినిమా’ రివ్యూ
2020.. ప్రపంచానికే ఓ బ్లాక్ ఇయర్. ఈ ఇయర్లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్ అయ్యాయి. ఏవి ప్లాప్‌ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం... సంక్రాంతికి సందడి చేసిన మహేశ్-బన్నీ టాలీవుడ్ సినిమా క్యాలెండర్ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. ప్లాప్‌ను మూటగట్టుకున్న మాస్ మహారాజా మహేశ్, బన్నీ సినిమాలు సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్ కాలేదు. అలరించని ‘అశ్వథ్థామ’ ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. మాయ చేయని ‘జాను’ శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. కానీ శర్వానంద్, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. డిజాస్టర్ మూటగట్టుకున్న‘రౌడీ’ మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మూడు లవ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. ఫలించిన ‘భీష్మ’ బాణం వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్‌ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. ‘హిట్’ సూపర్ హిట్ నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. పర్వాలేదనిపించిన ‘పలాస’ మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్ లేకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్‌డౌస్ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్ టాక్‌ను సంపాదించుంది. వీటితో పాటు కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా!
‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్’ షూట్లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూట్లో జాయిన్ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్’ సెట్లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా! -
కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు
కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్ ‘దర్బార్’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకడు. ఆర్మీమేజర్ అజయ్ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్’ చిత్రాల కొత్త లుక్స్ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ కథుర్వర్, డింపుల్ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘హిట్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది. నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగోని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఓసారి కోలీవుడ్ కాలింగ్ బెల్ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్లుక్ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
హాలీవుడ్ రివ్యూ 2019
-
వెండితెర 2019
-
తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!
పోలీస్ చేతిలో గన్ ఉంటుంది. గన్ మాత్రమే ఉంటుంది. చట్టం ఉండదు. పోలీస్ ఒంటిపై డ్రెస్ ఉంటుంది. డ్రెస్ మాత్రమే ఉంటుంది. చట్టం ఉండదు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా ఉండటం కోసమే పోలీస్‌కి ఆ గన్.. ఆ డ్రెస్! కానీ.. క్రిమినల్స్ చట్టం చేజారినప్పుడు పోలీస్ అయినా.. మామూలు మనిషైనా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుంది. సినిమాల్లో మనం చూస్తున్నదీ.. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్లో మనం చూసిందీ ఇదే! ఏదైనా ‘షూటింగ్’ వరకూ వచ్చిందంటే.. అందులో కథ ఉంటుంది.. కథ వెనుక వ్యథ ఉంటుంది. అప్పుడు రియల్ లైఫ్‌కి, రీల్ లైఫ్‌కి తేడా కనిపించదు. కావాలంటే సీన్ టు సీన్.. రీకన్స్ట్రక్షన్ చేసి చూద్దాం రండి. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే! మానవ రూపంలోనే దానవులై పెరిగితే... సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే... ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’ పాటలోని పదాలివి. వేటూరి సుందరామ్మూర్తి కలం చూపించిన ఆవేశం. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలోని పాట. నిజమే.. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలను చూస్తుంటే... నాడు– నేడు ఈ లోకం ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం’లానే ఉందనిపిస్తోంది. ఇన్నేళ్లల్లో ఏ మార్పూ లేదు. సినిమా కోసం ఆయన రాసిన ఈ పాట సమాజానికి వర్తిస్తుంది. ఏడేళ్ల క్రితం ‘నిర్భయ’, పది రోజుల క్రితం ‘దిశ’.. మధ్యలో ఎందరో నిర్భయలు... ఇంకెంతమంది బలవ్వాలి? దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడు? అంటే ‘గాంధీగారు అన్నట్లు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగలిగినప్పుడు’ అంటారు సీనియర్ నటి శారద. సమాజంలో జరిగేవి సినిమాలో కనిపిస్తాయి. సినిమాలో కనిపించేవి సమాజంలో జరుగుతుంటాయి. సినిమాకి ప్రేరణ సమాజమా? సమాజంలో జరిగేవి సినిమాకి ప్రేరణా? అంటే చెప్పడం కష్టం. భారత చలనచిత్ర చరిత్రలో సమాజానికి అద్దం పట్టే కథలు ఎన్నో వచ్చాయి. నాటి నుండి నేటి వరకు ‘అత్యాచారం’ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. కొన్ని చిత్రాల గురించి చెప్పుకుందాం. దిశపై అత్యాచారం జరిపినవాళ్లను ఏం చేయాలి? ‘చంపేయాలి’. ‘ఎన్కౌంటర్’ చేయడంతో రగిలిన హృదయాలు శాంతించాయి. అయితే ఇది చట్టం చేసింది. ‘రాఖీ’ (2006) సినిమాలో రాకీ (ఎన్టీఆర్) చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అత్తింటివాళ్లు అతని చెల్లెలిని అమానుషంగా చంపేస్తే, తన చెల్లికి జరిగిన అన్యాయం ఏ చెల్లికీ జరగకూడదనుకుంటాడు. అత్యాచారానికి పాల్పడేవారిని వెంటాడి, పెట్రోల్ పోసి, నిప్పంటించేస్తాడు. తెరపై రగిలిన ఈ మంట ప్రేక్షకుడి మనసులను చల్లబరుస్తుంది. ‘ఇలాంటి అన్న ఉండాలి’ అంటూ రాకీకి అమ్మాయిలందరూ రాఖీలు కడతారు. ఇదే ఎన్టీఆర్ ‘టెంపర్’ (2015)లో ముందు కరెప్టెడ్ పోలీస్‌లా కనిపించి, ఆ తర్వాత పరివర్తన చెందుతాడు. కామాంధుల చేతిలో బలైపోయిన యువతికి న్యాయం చేయడానికి సాక్ష్యాలు సాధిస్తాడు. కానీ సాక్ష్యం తారుమారవుతుంది. ఇక చేసేదేం లేక కోర్టు బోనులో నిలబడి, ‘ఆ అమ్మాయిపై అత్యాచారం చేసినవాళ్లల్లో నేనూ ఉన్నానంటాడు. మమ్మల్ని శిక్షించండి’ అంటాడు. ఆ సీన్ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. నేరం చేయని ఎన్టీఆర్ నిందితులతో పాటు జైలుపాలవుతాడు. కానీ జైలులో దుష్టశిక్షణ చేస్తాడు. ►ఓ 30 ఏళ్లు వెనక్కి వెళ్లి పోలీసాఫీసర్ వైజయంతిని గుర్తు చేసుకుందాం. నిజాయతీకి చిరునామా అయిన వైజయంతి అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయడానికి పడే తపనతో రూపొందిన చిత్రం ‘కర్తవ్యం’ (1990). ఇందులో వైజయంతి పాత్ర చేశారు విజయశాంతి. యువతికి న్యాయం చేయడానికి ఆర్థిక బలం ఉన్న పెద్దవాళ్లను ఢీ కొంటుంది వైజయంతి. అత్యాచారం చేసిన ఆ యువకుడితోనే యువతి మెడలో తాళి కట్టిస్తుంది. అయితే? అత్యాచారం చేసినవాడిని పెళ్లాడాలా? అలాంటి వక్రబుద్ధి ఉన్న వ్యక్తితో జీవితం పంచుకోవాలా? అనేది నేటి ప్రశ్న. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు ఆ క్లైమాక్స్ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఆ సంగతలా ఉంచితే.. తెరపై వైజయంతి చూపించిన తెగువ ఎందరో స్త్రీలకు ఆద ర్శం. ప్రతి స్త్రీ పోలీస్ కానక్కర్లేదు. కానీ వైజయంతిలా ధైర్యంగా ఉండాలి. అలాంటి ధైర్యసాహసాలనే ప్రదర్శిస్తుంది ‘ఆమె’ (1994)లో సుధ పాత్ర. మధ్యతరగతి గృహిణి ఆమె. కోడలిపై కన్నేసిన భర్తను నరికి, కోడలిని కూతురిగా చేసుకుంటుంది. ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ‘పెళ్లి’ (1997) సినిమా కూడా దాదాపు ఇలాంటిదే. కోడలిని హింస పెట్టే కొడుక్కి విషం పెట్టి, చంపేస్తుంది సుజాత. కోడలికి వేరే పెళ్లి చేస్తుంది. ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్థం చేసుకోవాలన్నది ఈ సినిమాలు చెప్పే సందేశం. తప్పు చేసినది భర్త అయినా, కొడుకు అయినా శిక్షించాల్సిందే అనే మనస్తత్వం ఉన్న ఆడవాళ్లు సమాజంలో ఉంటే సగం నేరాలు తగ్గుతాయేమో! అలాంటి ఆడవాళ్లు సమాజంలో ఉన్నారు.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ‘మా పిల్లల్ని చంపేయండి’ అని బహిరంగంగా చెప్పిన తల్లిదండ్రులూ ఉన్నారు. ►ఇక సాటి స్త్రీని అర్థం చేసుకోనివాళ్లు కూడా సమాజంలో ఉంటారు. ఆ విషయాన్ని ‘పెళ్లి చేసుకుందాం’ (1997) కళ్లకు కట్టినట్లు చూపించింది. అందులో సౌందర్య అత్యాచారానికి గురైతే చుట్టుపక్కల ఆడవాళ్లే హేళన చేస్తారు. అందుకే ‘నువ్వేమి చేశావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం’ అని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం ఆ యువతిని వెనకేసుకొచ్చింది. నిజమే.. అత్యాచారం చేసినవాడు దుర్మార్గుడు. అత్యాచారానికి గురైన యువతి నిస్సహాయురాలు. అందుకే ఆ సినిమాలో సౌందర్యను చేరదీస్తాడు హీరో వెంకటేశ్. ►ఇక నేరం చేసినవాడికి ఏ శిక్షా పడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘పరుత్తివీరన్’ (2007) ఒక ఉదాçహరణ. తెలుగులో ‘మల్లిగాడు’ పేరుతో విడుదలైంది. హీరో కార్తీకి ఇది మొదటి సినిమా. ప్రియమణి అప్పటికే కొన్ని సినిమాలు చేసింది. అల్లరి చిల్లర బ్యాచ్‌తో ఆవారాగా తిరుగుతాడు పరుత్తివీరన్ (కార్తీ). ఇంటర్ చదువుతుంటుంది ముత్తళుగు (ప్రియమణి). ఇద్దరూ ప్రేమలో పడతారు. చివరికి ప్రియుడి అల్లరి చిల్లర బ్యాచే ఆమె పాలిట కీచకులవుతారు. అత్యాచారం చేస్తారు. చనిపోతుంది. పరుత్తివీరన్ పిచ్చివాడైపోతాడు. ఇది క్లైమాక్స్. మరి.. అత్యాచారం చేసినవాళ్లు? అంటే.. దర్శకుడు వారి గురించి ప్రస్తావించలేదు. కానీ శిక్ష పడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అది సహజమే కదా. నేరం చేసినవాళ్లకు బతికే అర్హత ఉంటుందా? ఆ కథకు చిత్రదర్శకుడు అమీర్ ఆ ముగింపు ఇచ్చాడు. కానీ, మోసం చేసిన స్నేహితులను వదిలిపెట్టకూడదని దర్శకుడు సుకుమార్ తాను రాసిన కథలో శిక్ష విధించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ‘కుమారి 21 ఎఫ్’ (2015)కి సుకుమార్ కథ అందించి, నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది. కుమారి (హెబ్బా పటేల్)ని ప్రేమిస్తాడు సిద్ధు (రాజ్ తరుణ్). ఫ్రీ బర్డ్‌లా ఉండే ఆ అమ్మాయి గురించి స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎక్కడో మూల సిద్ధూకి కూడా అనుమానం ఉంటుంది. అయితే అనుమానించాల్సింది స్నేహితులను. చివరికి స్నేహితులే కుమారిపై అత్యాచారం జరుపుతారు. అంతే.. వారిని నరమానవుడు లేని చోట బంధించి, రోజూ ఆహారం తీసుకెళ్లి, వారికి పెట్టి మరీ కొడుతుంటాడు. ఈ చిత్రహింసలు భరించలేమని, ఒకేసారి చంపేయమని వేడుకుంటారు స్నేహితులు. చిత్రహింసలకు గురవుతున్న వారిని చూసి ప్రేక్షకులకు పైశాచికానందమే కలుగుతుంది. ‘ఒకేసారి చంపేస్తే ఏం ఉంటుంది? ఇలా కదా చంపాలి’ అన్నది నేడు సమాజంలో చాలామందికి ఉన్న అభిప్రాయం. అవును.. అమ్మాయి పడిన వేదన ఎలా ఉంటుందో కిరాతకులకు చూపించాలి కదా. సిద్ధూకి జరిగినట్లే గుణకూ జరుగుతుంది. నమ్మిన స్నేహితుడే గుణ ప్రేయసికి ద్రోహం చేస్తాడు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ నటించిన చిత్రం ‘గుణ 369’ (2019). ఏడుగురు కిరాతకుల చేతిలో బలైపోతుంది గుణ ప్రేయసి. ఆ ఏడుగురికీ గుణ ప్రాణ స్నేహితుడు అండగా ఉంటాడు. ప్రేయసికి జరిగినది తెలుసుకున్నాక గుణ రగిలిపోతాడు. ఒకరి చేతులు నరుకుతాడు. ఒకరి కాళ్లు నరికేస్తాడు. ఇంకొకరి తలను నరుకుతాడు. మరో స్నేహితుడి కాళ్లూ, చేతులూ రెండు తీసేస్తాడు. తెరపై దాదాపు పది నిమిషాల పాటు ఈ మారణకాండ సాగుతుంది. గుణ చేసిందే కరెక్ట్ అంటారు ప్రేక్షకులు. ‘‘దిశ ఘటన తర్వాత ‘గుణ 369’లోని క్లైమాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నా ఫేస్‌తో ఆ వీడియో వైరల్ అవుతోంది. నేను మాత్రం ఓ ట్వీట్ వేసి ఏం చేయలేకపోయానే అని గిల్టీగా ఫీలయ్యాను’’ అన్నారు కార్తికేయ. ►ఇలా ఎన్నో సినిమాల్లో ‘అత్యాచారాలు’ జరగడం, హీరో లేదా హీరోయిన్ ప్రతీకారం తీర్చుకోవడం చూశాం. ప్రతి స్త్రీ తన జీవితానికి తానే ‘హీరోయిన్’ అవ్వాలి. ఎవరో వస్తారు? కాపాడతారు? అనుకోకుండా ‘నా రక్షణ నేనే’ అనే భావన పెంచుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు అలా చెప్పే పెంచాలి. అమ్మాయిలూ... మీ బ్యాగుల్లో పెట్టుకోవాల్సింది ‘ఫేస్ పౌడర్’ కాదు.. ‘మిర్చి పౌడర్ (కారప్పొడి), బాడీ స్ప్రే కాదు.. ‘పెప్పర్ స్ప్రే’. ఇవి ఉంటే చాలదు.. ఆపదలో ఇరుక్కున్నప్పుడు సమయస్ఫూర్తితో స్పందించి, 100కి డయల్ చేయండి. ఇతర హెల్ప్లైన్లు ఉన్నాయని మరచిపోకండి. వీలైనంతవరకూ పోరాడండి. అయితే పోరాడే పరిస్థితులు రాకూడదు. మళ్లీ గాంధీ మాటలను గుర్తు చేసుకుందాం. ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు అన్నారు గాంధీ. ఆ రోజు రావాలని కోరుకుందాం. – డి.జి. భవాని దుష్టులు ‘నిమజ్జనం’ కావాలి అత్యాచారానికి గురైతే జీవితం అంతమైపోయినట్లే? ఒకప్పటి సమాజం ఆలోచన ఇలానే ఉండేది. అందుకే ఇక బతకడం అనసవరమని ఆత్మహత్య చేసుకుంటుంది ‘నిమజ్జనం’ సినిమాలో భారతి (శారద). సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి ఆమె. మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్తతో కాశీ వెళుతుంది. అయితే బండి నడిపేవాడికి ఆమెపై కన్ను పడుతుంది. భర్త లేని సమయం కోసం చూసి, ఒంటరిగా ఉన్న భారతి పై అత్యాచారం చేస్తాడు బండివాడు. భర్తకు మొహం చూపలేక గంగా నదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది భారతి. బండివాడికి పశ్చాత్తాపం మొదలవుతుంది. భారతి ఆత్మహత్యకు తానే కారణం అని ఆమె భర్తకు చెప్పి, ఎక్కడైతే భారతిని బలాత్కారం చేశాడో అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. పశ్చాత్తాపంతో అతను చనిపోయాడు. క్షణికావేశం తప్పులు చేయిస్తుంది. నిండు జీవితాలను బలి తీసుకుంటుంది. అందుకే తప్పు చేసే ముందు దాని ప్రభావం గురించి ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. అత్యాచారానికి గురైతే బతికే అర్హత లేదా? ‘‘కానే కాదు’’ అంటారు శారద. ఆమె మాట్లాడుతూ– ‘‘అత్యాచారానికి గురైన స్త్రీ ఎందుకు చనిపోవాలి? అప్పటి ‘నిమజ్జనం’ కథలో ఆ తీర్పు ఉంది కాబట్టి.. అలా జరిగింది. కానీ మన జీవితానికి రచయితలం మనమే. మన తప్పు లేనప్పుడు ఎందుకు చనిపోవాలి? అత్యాచారానికి గురైన స్త్రీలను చిన్న చూపు చూడకూడదు. వాళ్లను బతకనివ్వాలి. ఆ సంగతి అలా ఉంచితే.. మొన్న దిశ విషయంలో దేశవ్యాప్తంగా ఆడవాళ్లందరూ న్యాయం కోరి నడుం కట్టిన తీరు అభినందనీయం. ఈ కట్టు ఇలానే బలమైనదిగా ఉండాలి. దిశ న్యాయం కోసం గొంతెత్తిన స్త్రీలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇన్ని గొంతులు మాట్లాడాయి కాబట్టి దిశపై అమానవీయ చర్యకు పాల్పడినవారికి శిక్ష పడింది. వాళ్లను అలా కాల్చి పారేయడం కరెక్ట్’’ అన్నారు. మంచి మామ్ సవతి తల్లి అంటే కచ్చితంగా సరిగ్గా చూడదనే అభిప్రాయం సమాజంలో బలపడింది. అయితే దేవకిలాంటి మంచి సవతి తల్లి కూడా ఉంటుందని చెప్పిన సినిమా ‘మామ్’ (2017). దేవకి (శ్రీదేవి) ఓ స్కూల్ టీచర్. సవతి తల్లి దేవకి అంటే ఆర్యకు ఇష్టం ఉండదు. అనుకోని పరిస్థితుల్లో ఆర్య అత్యాచారానికి గురవుతుంది. అది తెలుసుకుని దేవకి తల్లడిల్లిపోతుంది. తప్పుడు సాక్ష్యాలతో నిందితులు తప్పించుకుంటారు. అప్పుడు దేవకి వాళ్లను శిక్షించే పనిని చేతుల్లోకి తీసుకుంటుంది. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిని ఒక్కరొక్కరిగా ప్లాన్ చేసి తెలివిగా చంపుతుంది. చనిపోయిన వ్యక్తి తాలూకు న్యూస్ టీవీలో వచ్చినప్పుడు ఆర్య కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. చివరికి దేవకియే అంతా చేసిందని తెలుసుకుని ‘మామ్’ అని అప్పుడు పిలుస్తుంది. అందాల రాశి, అద్భుతమైన నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్’. ఇది ఆమెకు 300వ చిత్రం. వాళ్లే నిజమైన హీరోలు నయనతార నటించిన మలయాళ చిత్రం ‘పుదియ నియమమ్’ (2016). ‘వాసుకి’ పేరుతో తెలుగులో విడుదలైంది. భర్త, కుమార్తెతో కలిసి హాయిగా జీవితం సాగిస్తుంది వాసుకి (నయనతార). ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో ఉంటుందీ కుటుంబం. అదే అపార్ట్మెంట్లో ఇస్ట్రీ బట్టలు చేసే వ్యక్తి, ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు నయనతారను రేప్ చేస్తారు. భర్తకు చెప్పుకోలేక కుంగిపోతుంది. తనకు అన్యాయం చేసినవాళ్లు కళ్లెదుటే దర్జాగా తిరుగుతుంటే తట్టుకోలేకపోతుంది. ఆ సమయంలో సరిగ్గా దీపిక అనే పోలీసాఫీసర్ సహాయం దొరుకుతుంది వాసుకికి. ఆమె సహాయంతో ఆ ముగ్గుర్నీ చంపుతుంది. అయితే పోలీసాఫీసర్‌గా గొంతు మార్చి, భర్తే (మమ్ముట్టి) వాసుకికి సహాయం చేస్తాడన్నది క్లైమాక్స్. ‘శీలం పోగొట్టుకున్న భార్య’ అంటూ వెలివేయకుండా తానే సహాయం చేస్తున్న విషయాన్ని బయటపెట్టని హుందా భర్త అతను. సమాజంలో ఇలాంటి భర్తలు ఉంటారా? ఉండొచ్చేమో. ఇక దిశ ఘటనపై నయనతార స్పందిస్తూ – ‘‘సినిమాల్లో కనిపించే కొన్ని ఘటనలను నిజం చేసిన నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు. దోషులు శిక్షింపబడిన రోజును నిజమైన న్యాయం చేకూరిన రోజుగా దేశంలోని మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. న్యాయం చేకూరిందని మనమందరం ఆనందించే కన్నా ఇలాంటి పరిస్థితులపై మన పిల్లలను చైతన్యపరచాలి. ఎడ్యుకేట్ చేయాలి. ముఖ్యంగా అబ్బాయిలను.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే మగవారు నిజమైన హీరోలు అవుతారని వారికి చెప్పాలి’’ అన్నారు. -
హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది
ఒక తాడు, గుడ్డ పీలిక ఉంటే చాలుతీసే సినిమాలు కొన్ని ఉంటాయి. తాడు చేతులు కట్టేయడానికి. గుడ్డ పీలిక అరవకుండా నోటిలో కుక్కడానికి. కిడ్నాప్ డ్రామా అంటే ఎవరికైనా ఆసక్తే.కిడ్నాప్ చేశాక ‘హలో... రేపు సాయంత్రంలోగా డబ్బు అందలేదో’ అనే బెదిరింపులకు టెన్షన్ వస్తుంది. నేరం ప్రమాదం. శిక్షార్హం. ఆ నేరానికి పాల్పడేవాళ్ల తిప్పలే హిట్ సినిమాలు. భారతీయ ఇతిహాసంలో నమోదైన తొలి కిడ్నాప్‌ను రావణాసురుడు చేశాడు. సీతను చెరబట్టి అతడు లంకా వినాశనానికి కారణమయ్యాడు. అయినవారు చనిపోతే ఆ దుఃఖం వేరు. యదార్థాన్ని స్వీకరించే కొద్దీ వేదన తగ్గుతుంది. కాని కిడ్నాప్ సంగతి అలా కాదు. మనం ప్రాణంగా ప్రేమించినవారు ఎక్కడో ఉంటారు. ఎవరి చేత్లులోనో బందీగా ఉంటారు. ఎప్పుడు విడుదల అవుతారో తెలియని అవస్థలో ఉంటారు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేరో అనే ఆందోళన కలిగిస్తూ ఉంటారు. వారి కోసం మనం ఏదో ప్రయత్నం చేస్తే తప్ప, వారి బదులుగా ఏదో చెల్లిస్తే తప్ప బయటపడని దురవస్థలో ఉంటారు. మరణం కంటే భయంకరమైనది కిడ్నాప్. అందుకే నేరగాళ్లు కిడ్నాప్‌ను ఒక ఆయుధంగా వాడి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఏ నేరమైనా చివరకు శిక్షతోనే ముగుస్తుంది. కిడ్నాప్ చేసినవారు కూడా అంతిమంగా కటకటాల వెనక్కు వెళతారు. కాని ఈలోపు జరిగే డ్రామాలో మాత్రం కుటుంబసభ్యులు, పోలీసులు పాత్రధారులు అవుతారు. ఆ కథ సినిమాలోది అయితే ప్రేక్షకులు కూడా భాగస్తులు అవుతారు. ఇటీవల ‘బ్రోచేవారెవరురా’ సినిమా కిడ్నాప్ డ్రామాతో విడుదలైంది. మరి గతంలో సినిమాల్లో ఈ ఆటను ఆడింది ఎవరు? విక్రమ్ (1986) అంతవరకూ అక్కినేని కుమారుడుగా మాత్రమే ఉన్న నాగార్జున ‘విక్రమ్’ సినిమాతో సినిమా హీరో నాగార్జున అయ్యాడు. ఇది కిడ్నాప్‌డ్రామా. హిందీలో దర్శకుడు సుభాష్ ఘాయ్ దీనిని రచించాడు. అరెస్టయ్యి ఉరి శిక్షకు దగ్గరగా ఉన్న తన గాడ్‌ఫాదర్‌ను రక్షించుకోవడానికి పోలీస్ అధికారి కుమార్తెను హీరో కిడ్నాప్ చేయడం కథ. జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగు రీమేక్‌లో కూడా నాగార్జునను నిలబెట్టింది. కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసినవాడితోనే ప్రేమలో పడుతుంది. హీరో కూడా ఆమెను ఏ పాడుబడ్డ మహల్లోనో ఉంచకుండా చక్కగా ప్రకృతి మధ్యలో, అందమైన పర్ణశాలలో ఉంచుతాడు. పైగా ఫ్లూట్ ఊదుతూ తనలోని భావుకత్వం ప్రదర్శిస్తుంటాడు. ఫ్లూట్ ఊదే కుర్రాడితో ప్రేమలో పడటం ఆ రోజుల్లో ఫ్యాషన్ కనుక శోభన నాగార్జునతో ప్రేమలో పడుతుంది. అయితే చాలా పరీక్షలకు నిలబడి ఈ ప్రేమ గెలుస్తుంది. నాగార్జునకు హిట్ ఇచ్చిన ఈ కిడ్నాప్ డ్రామా చాలా రోజుల తర్వాత ఆయనే మళ్లీ నటించిన ‘గగనం’లో నిరాశపరిచింది. విమానంలో బందీ అయిన ప్రయాణికులను గగనంలో విడుదల చేయించే అధికారిగా నాగార్జున నటించారు. వింత దొంగలు (1989) రాజమండ్రి రేవులో లాంచీ మీద గైడ్‌గా పని చేసే గుమాస్తా రావు గోపాలరావు, అదే ఊళ్లో హోటల్ సర్వర్‌గా పని చేసే రాజశేఖర్ మధ్యతరగతి డబ్బు కటకటలు తట్టుకోలేక ఒక డబ్బున్న అమ్మాయి నదియాను కిడ్నాప్ చేస్తారు. సాధారణంగా కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసిన వారిని చూసి భయపడాలి. కాని ఈ సినిమాలో కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసిన వారిన భయపెడుతుంటుంది. చిన్నప్పటి నుంచి గారాబం చేసి చెడకొట్టానన్న కోపంతో అమ్మాయి విడుదల కోసం డబ్బు ఇవ్వనంటాడు తండ్రి. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు కిడ్నాపర్లు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి కాలక్షేపం సినిమాగా నిలిచింది. ‘ఏంటి మేటరు’ అనేది ఈ సినిమాలో రావుగోపాలరావు ఊతపదం. ఆ తర్వాత అది పాపులర్ అయ్యింది. ఇప్పటికీ జనం ఏంటి మేటరు అంటుంటారు. ఒకే సంవత్సరం ‘అంకుశం’ లో నవ్వే తెలియని పోలీసాఫీసర్‌గా రాజశేఖర్‌ను నటింపచేసిన కోడి రామకృష్ణ ఆ వెంటనే ఈ సినిమాలో నవ్వులు పూయించే కామెడీ హీరోగా చేయించడం గమనించాలి. రాజశేఖర్ రెంటిలోనూరాణించారు. మగాడు (1990) ఈ సినిమా హీరో రాజశేఖర్ కాలు విరిగేలా చేసింది. కాని దాని వల్ల తర్వాతి కాలంలో జీవిత భాగస్వామి అయిన జీవితను దగ్గర చేసింది. ‘మగాడు’ రాజశేఖర్ కెరీర్లో పెద్ద హిట్. అందులో కూడా నేరస్తుడైన తన అన్నను కాపాడుకోవడానికి తమ్ముడు ఏకంగా కేంద్ర మంత్రినే కిడ్నాప్ చేస్తాడు. విడుదలకు 100 కోట్లు అడుగుతాడు. ఈ గొంతెమ్మ కోరిక తీర్చడం కంటే చావో రేవో తేల్చుకునే అధికారిని పంపడమే మేలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ అధికారే హీరో రాజశేఖర్. ఒన్ మేన్ కమెండోగా రాజశేఖర్ అడవుల్లో ప్రయాణించి కిడ్నాప్ డెన్‌కు చేరుకుని సాహసంగా బందీలను విడిపిస్తాడు. మలయాళంలో పెద్ద హిట్ అయిన మోహన్‌లాల్ సినిమాను అదే దర్శకుడి దర్శకత్వంలో జీవిత నిర్మించగా పెద్ద హిట్ అయ్యింది. లిజిని ఆ సినిమాలోనే తెలుగు ప్రేక్షకులు చూశారు. తమిళ హీరో త్యాగరాజన్ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. రోజా (1992) కమలహాసన్ నటించిన ‘గుణ’ 1991లో వచ్చింది. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేని కమలహాసన్ స్త్రీలోని అమ్మను బంధించడానికి ఒక ప్రియురాలిని ఊహించుకుంటూ ఆ ఊహ నిజమనే భ్రాంతి చెంది ఏకంగా ఒక అమ్మాయినే కిడ్నాప్ చేస్తాడు. సినిమాలో ఉమాదేవి అనే పాత్ర ముందు అతణ్ణి అసహ్యించుకున్నా చివరకు ప్రేమిస్తుంది. ‘ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే’ పాట తెలుగులో ఇప్పటికీ నిలిచిన పాట. ఆ వెంటనే మణిరత్నం ‘రోజా’ వచ్చింది. సత్యవంతుడి ప్రాణాల్ని యుముడి నోటి నుంచి తన్నుకొని తిరిగి తెచ్చుకున్న సావిత్రిలా ఈ సినిమాలో మధుబాల టెర్రరిస్టుల వల్ల కిడ్నాపైన అరవింద్ స్వామి ప్రాణాలను తిరిగి తెచ్చుకుంటుంది. కిడ్నాపైన వారి కోసం పోలీసులు పోరాడాలి. భార్య పోరాడటం వల్ల సెంటిమెంటు పండి బాక్సాఫీసు పసుపుకుంకుమలతో కళకళలాడింది. మనీ (1993) చాలా మంది కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు శివనాగేశ్వరరావుకు ఎప్పటికీ చెప్పుకునే సినిమా అయ్యింది. అప్పులపాలయిన భర్త పరేశ్ రావెల్ చెక్‌బుక్‌ను కంట్రోల్ చేసే భార్య జయసుధను కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కాని పూటకు ఠికానా లేని ఇద్దరు బేచిలర్ కుర్రాళ్లు జె.డి చక్రవర్తి, చిన్నా ఒక్క కిడ్నాప్‌లో లైఫ్‌లో సెటిల్ పోవాలని పరేశ్ రావెల్ కంటే తామే ముందు జయసుధను కిడ్నాప్ చేస్తారు. ఇందులోకి ఖాన్ దాదా అయిన బ్రహ్మానందం దూరడం విశేషం. మనీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యింది. రేణుకా సహానీ, పరేశ్‌రావెల్ వంటి ఫ్రెష్ ముఖాలు కనిపించాయి. అల్లరి వేషాలు వేసే బ్రహ్మానందం సీరియస్ కామెడీ చేయడం ఈ సినిమాతో మొదలెట్టాడు. ఒరు విరల్ కృష్ణారావు చిన్న పాత్ర అయినా మెరుస్తాడు. పరేశ్ రావెల్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్ చెప్పారు. ‘వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసూ’ పాట, ‘ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు’ డైలాగు హిట్. పనికిమాలిన ప్రొడక్షన్ మేనేజర్‌గా తనికెళ్ల భరణి నటన కూడా నవ్వులే. సిసింద్రీ (1995) చిన్నపిల్లలను కిడ్నాప్ చేయకుండా కిడ్నాప్ సినిమాలు ఉండవు. తెలుగు సినిమాలలో ఈ అంశాన్ని కృష్ణ నటించిన ‘దొంగల వేట’లో మొదట చూపించారు. ఆ తర్వాత బేబి షాలినితో ఉషాకిరణ్ మూవీస్ తీసిన ‘చందమామ రావే’ కూడా కిడ్నాప్ డ్రామాయే. అందులో బేబీ షాలినిని కిడ్నాప్ చేసినవారు చివరకు ఆ చిన్నారి వల్లే పూర్తిగా మారిపోతారు. అయితే హాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా తెలుగులో తీసిన ‘సిసింద్రీ’ మంచి హిట్‌గా నిలిచిందని చెప్పాలి. దీనికి కూడా దర్శకుడు శివ నాగేశ్వరరావే. సినిమాలో బుజ్జి పిల్లాడిగా అఖిల్ అక్కినేని నటించడం అప్పట్లో వార్త అయ్యింది. కిడ్నాపర్లుగా గిరిబాబు, సుధాకర్, తనికెళ్ల భరణి నటించారు. ఆమని మీద తీసిన ‘చిన్నతండ్రీ నిను చూడగా’ పాట పెద్ద హిట్. నాగార్జున, టబూ కలిసి ఒక పాటలో చిందులు తొక్కారు. చిన్నపిల్లల కిడ్నాప్ అంశంగా కమలహాసన్ తీసిన ‘ముంబై ఎక్స్‌ప్రెస్’ క్లాసిక్ కామెడీ అయినా ప్రేక్షకులు అందుకోలేదని చెప్పాలి. ఐతే (2003) మాఫియా డాన్ పవన్ మల్హోత్రా దేశం వదిలి పారిపోవాలనుకుంటాడు. కాని అతని మీద నిఘా ఉంటుంది. అందుకని హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లే ఫ్లయిట్‌ని కిడ్నాప్ చేసి ఖాట్మండు తీసుకెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌కి పారిపోవాలని ప్లాన్. తాను మాత్రం ప్రయాణికుల్లో ఒకడిగా ఉంటాడు. కిడ్నాప్ చేయడానికి నలుగురు కుర్రాళ్లని సెట్ చేస్తాడు. ఫ్లయిట్లో కేంద్ర మంత్రి ఉంటాడు కనుక అతణ్ణి ఫ్లయిట్లోనే ఉంచి ఖాట్మాండులో ప్రయాణికులను వదిలిపెడితే ఆ గందరగోళంలో తాను తప్పించుకోవాలని అనుకుంటాడు. కాని డామిట్ అనకుండానే కథ అడ్డం తిరుగుతుంది. మరో నలుగురు కుర్రాళ్లు ఏకంగా పవన మల్హోత్రానే కిడ్నాప్ చేస్తారు. చట్టానికి సహకరించే ఉద్దేశ్యంతోనే ఆ పని చేస్తారు. చివరకు ప్రైజ్ మనీ దక్కించుకుంటారు. ‘ఐతే’ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌ను మంచి దర్శకుడిగా నిలబెట్టింది. ఇందులో నటించిన శశాంక్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సింధు తులానీ హీరోయిన్ అయ్యింది. కల్యాణి మాలిక్ సంగీతంలో కీరవాణి పాడిన ‘చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే’ పాట హిట్. కిడ్నాప్ డ్రామాకు బిగువైన స్క్రిప్ట్ అవసరమని నిరూపించిన సినిమా ఇది. బ్రోచేవారెవరురా (2019) ఈ నేపథ్యంలో మొన్నటి వెంకటేష్ ‘ఘర్షణ’, ఇటీవలి ‘స్వామి రారా’ వంటి సినిమాలు కూడా కిడ్నాప్ డ్రామాతో నడిచాయి. తాజాగా ‘బ్రోచేవారెవరురా’ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇందులో హీరోయిన్ నివేదితా థామస్‌ను ఆమె కోరిక మీదే కిడ్నాప్ చేసిన ఆమె ఫ్రెండ్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లి బయటపడతారో వినోదభరితంగా చూపించారు. మంచి స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు ఉండటం వల్ల కలెక్షన్లు విపరీతంగా వచ్చాయి. మనిషి అవసరానికి మించిన భూమిని బంధిస్తాడు. అవసరానికి మించిన నీళ్లను బంధిస్తాడు. అవసరానికి పశువులను, పక్షులను బంధిస్తాడు. కాని తనని ఎవరైనా బంధిస్తే మాత్రం గగ్గోలు పెడతాడు. ఈ గగ్గోలు ఉన్నంత కాలం కిడ్నాప్ సినిమాలు వస్తూనే ఉంటాయి. – కె. -
పీవీ కూడా ఆయన అభిమాని అట...
మనసుకి రిలాక్స్ కావాలన్నా.. టెన్సన్ష్నుంచి బయటపడాలన్నా మెడిసిన్ ఏం అక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే చాలు. సైడ్ ట్రాక్‌లో ఉన్న హాస్యాన్ని మెయిన్ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన నటుడు ఆయన. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారి... ఎన్నో విజయవంతమైన సినిమాల్లోనటించారు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించడలడని నిరూపించారు రాజేంద్రప్రసాద్. నవ్వుల రారాజు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సాక్షి.కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
పెళ్లికూతురు కనిపించడం లేదు!
బెంగాలీ చిత్రం ‘అగ్నిపరీక్ష’ ఆధారంగా వచ్చి, అచ్చ తెలుగు చిత్రంలా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఆ దేవాలయ పరిసరాల్లో ఎవరిగోల వారిది అన్నట్లుగా ఉంది. ఆ గోల మధ్యలో నుంచే...‘పెళ్లికూతురు కనిపించడం లేదు’ అని పెద్దకేక ఒకటి వినిపించింది.తన కారు దగ్గర నిల్చున్న కైలాసం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకు వచ్చారు. ఆ ఇద్దరిలో అరవై సంవత్సరాల వ్యక్తి ఆందోళనగా...‘‘అబ్బాయ్ అబ్బాయ్...ఇటు పిల్ల పారిపోయి వచ్చింది. నీకేమైనా కనిపించిందా?’’ అని అడిగాడు.‘‘మీ అమ్మాయా?’’అడిగాడు కైలాసం.‘కాదు’’ అన్నాడు పెద్దాయన.‘‘మీ మనవరాలా?’’‘‘కాదు... నా పెళ్లాం’’ తాపీగా సమాధానం ఇచ్చాడు పెద్దాయన.అదిరిపడ్డాడు కైలాసం.‘‘నీకు పెళ్లాం కూడానా!’’ వెటకారం చేశాడు కైలాసం.‘‘ఆ... ఇంకా పెళ్లి కాలేదు. వీరికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకునేలోపే ఆ పిల్ల పారిపోయింది’’ అసలు విషయం చెప్పాడు ఆ పెద్దాయనపక్కాయన.‘‘మంచిపని చేసింది’’ మనసులోని మాటను గట్టిగా అన్నాడు కైలాసం.‘‘మంచిపని చేసిందా మంచిపని...’’ అంటూ కైలాసం పైకి ఒంటి కాలి మీద లేచాడు పెద్దాయన.‘‘లేకపోతే ఈ వయసులో పెళ్లేంటి... పండ్లవి ఊడిపోయి’’ వెటకారానికి పదును పెట్టాడు కైలాసం.‘అన్నావు... నువ్వు ఇదే అన్నావు. ఈరోజుల్లో ఈ కుర్రాళ్లందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు కలిసి శేరు బియ్యం తిను నీ సంగతి ఏందో తెలుస్తుంది’’ సవాలు విసిరాడు పెద్దాయన.‘‘మేము తినేది అన్నం. బియ్యం కాదు తాతయ్య’’ వ్యంగ్యంగా అ సవాలుకు చురక పెట్టాడు కైలాసం.తాత అనగానే ఆ తాతగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇలా విరుచుకుపడ్డాడు...‘‘తాతయ్యట తాతయ్య! నువ్వు నా కూతురి కొడుకువా? కొడుకు కొడుకువా!’’పరిస్థితి చేయిదాటుతుందని పసిగట్టిన పెద్దాయన పక్కాయన...‘‘వీడితో మనకెందుకండీ... పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం పదండి’’ అంటూ తొందరచేశాడు.‘‘పడుచోడు బయలుదేరారండి... బయలుదేరాడు’’ అంటూ కారు స్టార్టు చేశాడు కైలాసం.కొద్దిదూరం ప్రయాణం చేసిన తరువాత నీటి కోసం ఒక జలపాతం సమీపంలో ఆగాడు. జలపాతం దగ్గరికి వెళుతున్నప్పుడు ఒకచోట అమ్మాయి కనిపించింది.‘ఎవరది? వరూధినా? లేక కామిని పిశాచమా? ఆడమనిషే... ఆ సింగారమంతా చూస్తే ఎవరో ప్రియుడి కోసం వచ్చినట్లుంది’ అనుకున్నాడు చేతిలో డబ్బా పట్టుకున్న కైలాసం. అక్కడ ఆమె ఇలా అనుకుంది...‘వీడెవడు? చేతిలో డబ్బా వీడూనూ! ఆ డొక్కు కారు డ్రైవరు కాబోలు. నేను డిక్కీలో నుండి దిగడం చూశాడేమో’’‘ఇదే ప్రేమతతంగమైతే గంట ముందు వచ్చి మగాడు పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడా మగపురుగు కనబడడం లేదు. బహుశా ఆ మగధీరుడు ఏదో మోసం చేసి ఉండాలి’ అనుకున్నాడు కైలాసం. ‘ఎందుకైనా మంచిది కాస్త దగ్గరికి వెళ్లి చూద్దాం’ అంటూఅడుగులు వేశాడు.‘వీడికి ఏదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకలా నా వైపు చూస్తున్నాడు’ ఆమె అనుమానపడింది.కైలాసం తన వైపు రావడం గమనించి.‘హమ్మయ్యో ఇటే వస్తున్నాడు. ఈ మగాళ్లకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటపడతారు’ అని విసుక్కుంది.‘ఈ పిల్ల ఆ పిల్లే... పెళ్లిపీటల మీది నుంచి తప్పించుకొని వచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకొచ్చిందబ్బా? ముసలాడికి ఇచ్చి కట్టబెడితే ఏంచేస్తుంది? చావాలనే వచ్చి ఉంటుంది’ తనే ప్రశ్న వేసుకొని సమాధానం తనే చెప్పుకున్నాడు కైలాసం.ఛీ వెధవ బతుకు. చావడానికి కూడా అడ్డేనా నాకు’ తనను తాను విసుక్కుంది ఆ అమ్మాయి.‘నేను అడ్డనుకుంటుందేమో! నా దారిన నేను పోయినట్లు నాటకం ఆడతాను’ అని వెనక్కి వెళుతున్నట్లు నటించాడు కైలాసం.హమ్మయ్య వెళ్లిపోయాడు’ అని ఆమె ఆత్మహత్యకు సిద్ధపడుతున్న సమయంలో...‘‘ఏవండీ... ఆగండి... మిమ్మల్నే... మిమ్మల్నే’’ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు కైలాసం.‘‘ఏమిలేదండీ... ఏమీ లేదు’’ అని బుకాయించబోయింది ఆమె.‘‘లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి’’ ‘‘లేదండి’’ ‘‘చూడండి మీకు చావు అంటే అనుభవం లేనట్లుంది. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసళ్లు ఉంటాయి. అవి కరకర మింగి నములుతాయి’’ ‘‘అయ్యబాబోయ్.... ఈ నీటిలో మొసళ్లు ఉంటాయా?’’‘‘ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడైనా చూసి బయటికి లాగితే మీరు బతికిపోతారు. చావాలని చావకుండా బతికున్నందుకు పోలీసులు కేసులు పెడతారు’’‘‘కేసా? అమ్మయ్యో’’‘‘బతికి ఉంటే ఊరుకుంటుందా ప్రభుత్వం. శిక్ష వేస్తుంది. జైల్లోకి పంపించేస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీక మీదికి వస్తుంది’’‘‘మీకా?’’‘‘అవును. ఆత్మహత్య ప్రయత్నానికి సాయపడ్డానని మధ్యలో నన్ను జైల్లో కుక్కుతారు. చూశారా... చావంటే ఎంత చావో’’‘‘ఇవేమీ నాకు తెలియవండీ’’‘‘తెలియకపోతే నాలాంటి వాళ్లను అడిగి తెలుసుకోవాలి. అది సరే మీరు ఎందుకు చావాలనుకుంటున్నారో కాస్త టూకీగా చెబుతారా?’’‘‘బతకడం అనవసరం అనిపించింది’’ చెక్‌పోస్ట్ దగ్గర... ‘‘ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్లు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు?’’ అన్నాడు సీనియర్ కానిస్టేబుల్ జూనియర్‌తో.‘‘అంతే బాబాయ్’’ అన్నాడు జూనియర్ తల ఊపుతూ.‘‘ఛా... బాబాయ్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా! డ్యూటీలో ఉండగా సార్ అనాలి. జాగ్రత్త. ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏంచెప్పాలో చెప్పు!’’‘‘సరే సార్! ఆ రిపోర్ట్ అడిగిన వాళ్లను ఒక వివరం అడగడం మరిచిపోయాం సార్’’ అన్నాడు జూనియర్.‘‘ఏమిటది?’’ అడిగాడు సీనియర్.‘‘ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా?’’ -
అరవింద సమేత.. నాన్–బాహుబలి రికార్డు!
అరవింద ఆల్రెడీ మెప్పించింది.. పండగ మార్కులు కొట్టేసింది.ఈ రోజు మరో రెండు సినిమాలకు తోరణాలు రెడీ అయ్యాయి. అభిమానులకు ఇంతకు మించి పండగ ఏముంటుంది? మూడు సినిమాలు! ఒకటి హిట్టు, రెండు మంచి టాపిక్. ఎంజాయ్ ది సినిమా దసరా. కుటుంబ సమేతంగా... ‘కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ల దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్ క్లాక్ టవర్ దాకా.. బళ్లారి గనుల నుండి బెలగావ్ గుహల దాకా తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’... పవర్ఫుల్ డైలాగ్.‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు లేదు’.. అర్థవంతమైన డైలాగ్.. ‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’ ఆలోచింపజేసే డైలాగ్... ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈ డైలాగ్స్ చాలు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేయడానికి. హీరో అంటే విలన్‌తో హోరాహోరీగా తలపడాలి. ఫర్ ఎ చేంజ్ ‘శాంతి’ మార్గం అంటే.. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఆ మాట అంటే? సినిమా చప్పగా ఉంటుంది. కానీ హీరోతో ఆ మాట అనిపించి, అభిమానులకు కావాల్సిన యాక్షన్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. అందుకే ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దసరా పండగకి వారం ముందే ఈ సినిమా విడుదలై, ఎన్టీఆర్ అభిమానులకు పండగని ముందే తెచ్చింది. దాదాపు 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లను ‘సేఫ్ జోన్’లో ఉంచుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్.. అన్నీ కుదిరిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం విడుదలైన ఈ సినిమా ఈ మంగళవారం సెకండ్ షో కలెక్షన్లు వరకూ ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం ఈ విధంగా... – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కలెక్షన్స్ – 115 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన షేర్ 55 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ 74 కోట్లు. ఓవర్సీస్ 12 కోట్లకు అమ్మితే మంగళవారం వరకు 11కోట్ల 30 లక్షలు రాబట్టింది. నైజాం హక్కులను ‘దిల్’ రాజు 18 కోట్లకు కొన్నారు. ఆయన ఫుల్ సేఫ్‌లో ఉన్నారట. ఇప్పటికే గుంటూరు, సీడెడ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లంతా సేఫ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా వైజాగ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కర్ణాటక బయ్యర్లు ఈ శుక్రవారం నుండి లాభాల బాటలో ఉంటారని ట్రేడ్ వర్గాల అంచనా. ఇవే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను, శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 45 కోట్లకు అమ్మారట చిత్రనిర్మాతలు. మొత్తం మీద ‘అరవింద సమేత...’ చిత్రబృందానికి దసరా పండగే పండగ. ‘బాహుబలి’ తర్వాత! ‘అరవింద సమేత...’ ఓపెనింగ్ వీకెండ్ సేల్స్‌లో నాన్–బాహుబలి రికార్డును సాధించినట్లు బుక్ మై షో నిర్వాహకులు అధికారికంగా పేర్కొన్నారు. ‘‘బుక్ మై షోలో ‘అరవిందసమేత’.. చిత్రానికి 12 లక్షల టిక్కెట్స్ సేల్ అయ్యాయి. ఈ ప్లాట్ఫామ్లో ఓపెనింగ్ వీకెండ్ సేల్స్ విషయంలో ‘బాహుబలి–2’ తర్వాత ఈ ప్లేస్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానిదే. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి’’ అని బుక్ మై షో ప్రతినిధి పేర్కొన్నారు. ఇద్దరు మగువల మధ్య... స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. జాయినైన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెలుసా... అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా? అని అమ్మాయిలు. అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా? అని అబ్బాయిలు ఏరుకోవడం. రామ్ లాంటి హుషారైన ఓ కుర్రాడు ఇలాంటి డైలాగ్ చెప్పాడంటే.. ఇంకా అతను ఎవర్నీ ఏరుకోనట్టే. అదేనండీ.. ప్రేమలో పడనట్టే. కానీ అతను అనుపమా పరమేశ్వరన్‌ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది ఫాలోయింగ్ స్టార్ట్ చేశాడు రామ్. కానీ ఈజీగా పడితే వాళ్లు అమ్మాయిలు ఎందుకు అవుతారు? పైగా అది వాళ్ల హక్కాయే. ఈ లవ్‌ట్రాక్ అలా ఉండగానే... రామ్ లైఫ్‌లోకి మరో అమ్మాయి ప్రణీత వస్తుంది. ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో రామ్‌కి ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ప్రకాశ్‌రాజ్ ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ ఫ్రెండ్ రామ్‌కి మావయ్య అవుతాడట. ఆ మావయ్య కూతురే అనుపమ అట. అంటే.. విడిపోయిన కుటుంబాలను కలపడం కోసమే అనుపమాను రామ్ ప్రేమించాడా? ఏమో.. ఈ రోజు థియేటర్స్‌కి వెళ్లి ‘హలో గురు ప్రేమ కోసమే’ చూస్తే తెలుస్తుంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ బిజినెస్ 28 కోట్లు అయిందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. ‘హలో..’ కొన్ని డైలాగ్స్ ‘‘పెళ్లయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండటం వల్ల బాగుటుంది’’ – అనుపమ‘‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’’ – రామ్ ‘‘అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా?’’ – ప్రకాశ్‌రాజ్‘‘అబద్ధం చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు’’ – రామ్ ‘‘గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి.. మర్చిపోవాలి అని అనుకునే అమ్మాయిని మాత్రం...చచ్చేదాకా మర్చిపోలేం’’ – రామ్ పొట్టేల్ని కాదురా... పులివెందుల బిడ్డని ‘‘నీకు దమ్ముంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ మా ఊరికి రా.. చూసుకుందాం’’... విలన్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు హీరో. విలన్ కూడా తక్కువోడేం కాదు. పవర్‌ఫుల్లే. మరి.. హీరో ఊరికి విలన్ వెళతాడా? పగ తీర్చుకుంటాడా? పందెంలో గెలిచేది ఎవరు? దసరా పండగకి తెలిసిపోతుంది. దసరా బాక్సాఫీస్ బరిలోకి పందెం కోడిలా దూసుకొచ్చారు విశాల్. కెరీర్ స్టార్టింగ్‌లో విశాల్ చేసిన మంచి మాస్ మాసాలా మూవీ ‘పందెం కోడి’. ఈ సినిమాకి సీక్వెల్ ‘పందెం కోడి–2’. పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పార్ట్ కథని గుర్తు చేసుకుందాం.హీరో విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, వేరే ఊళ్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. ఆ ఫ్రెండ్ చెల్లెలు మీరా జాస్మిన్ అందచందాలకు, అల్లరికి పడిపోతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చుట్టపు చూపుగా వచ్చిన హీరో మళ్లీ తన ఊరికి ప్రయాణం అవుతాడు. కట్ చేస్తే.. సరిగ్గా బస్ ఎక్కుతున్న సమయంలో ఓ గూండా ఓ వ్యక్తిని చంపడానికి వెంటాడతాడు. అతన్నుంచి ఆ వ్యక్తిని కాపాడి, గూండాని రప్ఫాడిస్తాడు విశాల్. అతనెవరో కాదు.. పేరు మోసిన గూండా. ఊరుకుంటాడా? విశాల్ వివరాలన్నీ అతని స్నేహితుడి కుటుంబం ద్వారా తెలుసుకుని, అతని ఊరెళతాడు. అక్కడికెళ్లాక తెలుస్తుంది.. విశాల్ తండ్రి చాలా పవర్ఫుల్ అని. అయినా విశాల్ కుటుంబాన్ని అంతం చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురు చూస్తాడు. గుడి ఉత్సవాల్లో ఆ పని పూర్తి చేయాలనుకుంటాడు. ఒకవైపు విలన్ ప్లాన్‌లో అతనుంటే మరోవైపు రెండు కుటుంబాలూ మాట్లాడుకుని విశాల్‌కి, మీరా జాస్మిన్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. గుడి ఉత్సవాలు రానే వచ్చాయి. విలన్ ప్లాన్ ఫెయిలవుతుంది. అప్పుడు హీరో.. దమ్ముంటే మళ్లీ మా ఊరు రా అని విలన్‌తో పందెం కాస్తాడు. 13ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పందెం కోడి’ కథ ఇది. ఇప్పుడర్థమైంది కదా.. పార్ట్ 2 ఎలా ఉంటుందో? రెండు భాగాలకు లింగుస్వామియే దర్శకుడు. దసరా సందర్భంగా ఇవాళ సినిమా రిలీజవుతోంది. శాంపిల్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘కత్తిని చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డన‘ఏసేస్తా ఏసేస్తా అని చెప్పడం కాదు.. ఏసెయ్యాలి’.‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండ్రా’, ‘మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకుంటున్నావా? ఆడది నరికినా నరుకుద్ది రా’‘మా వంశంలోని చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకూ మేము ఉంటాం’.ఇదండీ ట్రైలర్. టీజర్లోనూ ఆకట్టుకునే డెలాగ్స్ ఉన్నాయి.‘‘పవర్ఫుల్ డైలాగ్స్‌తో, పవర్ఫుల్ యాక్షన్‌తో, కుటుంబం మొత్తం చూసే మంచి సెంటిమెంట్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫెస్టివల్ ఫీస్ట్‌లా ఉంటుంది’’ అని చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు తెలిపారు. విశాల్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదలవుతోందని ‘పందెం కోడి–2’ యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మీరా జాస్మిన్ చేసిన అల్లరి అమ్మాయి పాత్రను ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ చేయడం విశేషం. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట. -
అసలు మా తాత అలా చేసి ఉండకపోతే!
ఒక మరాఠీ చిత్రానికి రిమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్, స్ట్రెస్‌బస్టర్ అనిపించుకుంది. ప్రతి డైలాగులో నవ్వుల పువ్వులు పూసే ఈ సినిమాలో ప్రతి సీన్... నవ్వుల విందే! నవ్వుకు బ్రహ్మానందరథం పట్టిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... వంటరూమ్‌లో కూర్చొని కూరల ఆరా తీస్తున్నాడు బ్రహ్మానందం. ఈలోపే భళ్లుమని పెద్దశబ్దం. వంటరూమ్ కిటికీలో నుంచి ఎవరో దూకారు. ‘దొంగా దొంగా’ అని భయంతో కళ్లు మూసి కళ్లు తెరిచాడు బ్రహ్మానందం. కళ్లు తెరిచిన టైమ్‌లో వాస్తవం కళ్లకు కట్టింది. వచ్చిన వాడు దొంగకాదు... తన క్లోజ్‌ఫ్రెండ్ రాజా! స్వీట్షాక్!!‘‘ఎన్నాళ్లకు కనిపించావురా. మేమందరం కలిసే ఉన్నాం. నువ్వు లేక లైఫంతా డల్‌గా, డిమ్‌గా, చద్దన్నంలో పెరుగేసుకొని తిన్నట్లుగా ఉంది’’ అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్నేహితుడిని రూమ్మెట్స్ మరియు పాతస్నేహితుల దగ్గరికి తీసుకువెళ్లాడు బ్రహ్మానందం. దొరలా కనిపిస్తున్న రాజా కిటికీలో నుంచి దొంగోడిలా ఎందుకు వచ్చాడు? బామ్మతో కలిసి పల్లెటూళ్లో ఉండే రాజా ఉన్నపళంగా పట్టణానికి ఎందుకు వచ్చాడు?అసలు ఏం జరిగింది?ఇప్పుడు మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం:రాజా అంటే నాటకాలు పడి చస్తాయి. రాజా స్టేజి ఎక్కితే చప్పట్లే చప్పట్లు, ఈలలే ఈలలు. అలాంటి రాజా ఈసారి కూడా కప్పు కొట్టేశాడు.మండలాధ్యక్షుడు ఆ కప్పును రాజా చేతిలో పెడుతూ ఇలా స్పీచిచ్చాడు:‘‘ఈ కప్పును తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దీన్ని చూసుకుంటూ తుడుచుకుంటూ, తుడుచుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ చప్పట్లకు చాన్సు ఇస్తున్నాను. కొట్టుకోండి...కొట్టుకోండి’’ చప్పట్లే చప్పట్లు! ఆ చప్పట్ల వానలో తడిసి ముదై్దన రాజా మైక్ అందుకొని ముద్దు ముద్దుగా ఇలా మాట్లాడాడు:‘‘మండలాధ్యక్షుడన్న ఇచ్చిన ఈ వెండికప్పును బంగారుకప్పుగా భావిస్తున్నాను. ఇది జీవితాంతం అద్దాల బీరువాలో ఉండేట్లు చూసుకుంటాను. అది నా బాధ్యత. నా ధర్మం’’రాజా నోటి నుంచి ‘నా బాధ్యత, నా ధర్మం’ అనే మాటలు పూర్తయ్యాయో లేదో...రేయ్...’ అంటూ రాజా బామ్మ నార్త్‌కొరియా క్షిపణిలా స్టేజీ మీదికి దూసుకువచ్చింది. మనవడు రాజాను తప్పించుకుపోయిన దొంగలా ఇంటికి ఈడ్చుకొచ్చింది.అధ్యక్షా!రాజావారు చేసిన తప్పేమిటి?కళామతల్లి పాదల చెంత పడి ఉండటం తప్పా?నాటకాలు వేయడం తప్పా?చప్పట్లను ఆస్వాదించడం తప్పా?కప్పులు అందుకోవడం తప్పా?‘తప్పా! తప్పున్నరా’ అంటుంది బామ్మ. ఎందుకో ఆమె మాటల్లోనే విందాం:‘‘ఒరేయ్... ఒరేయ్... దొంగోడివైనా సంతోషిస్తానుగానీ ఇలా నాటకాల రాయుడివైతే మాత్రం భరించలేను... భరించలేను. నీకు తెలుసా? మీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగుల పిచ్చిలో పడే నాశనమయ్యారు. ఈ నాటకాల కోసం ఎకరాలకెకరాలు హారతి కర్పూరంలా కరిగించేశారు. ఈవేళ పూటకు గతి లేని స్థితికి వచ్చాం. వద్దురా వద్దు. ఆ వేషాల మోజులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ జీవితం కూడా బుగ్గిపాలు చేసుకోవద్దు. బాగా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకోరా. అది నీ వల్ల కాకపోతే... నేను ఎక్కడైనా బిచ్చమెత్తుకొనైనా సరే నిన్ను పోషిస్తా. అంతేకాని, బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి వెళ్లకు. ఒరేయ్...ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడావంటే ఆ స్టేజీ మీదే ఉరి పోసుకొని చస్తాను’’ మ్యాటర్ అర్థమైంది కదా...అదీ విషయం! బామ్మ మాటలకు మనవడు రాజా భోరుమన్నాడు. ఇలా కూడా అన్నాడు...‘‘గత్యంతరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. నన్ను ఇన్నాళ్లు పోషించిన నిన్ను పోషించాలనే బాధ్యత తప్ప రంగు పిచ్చి కాదే... ఆ...ఆ...అలాగే... రేపటి నుంచి నాటకాలు ఆడ్డాం మానేస్తా... హైదరాబాద్‌కు వెళ్లి ఏదో ఉద్యోగం ఎలాగో అలాగ వెదుక్కుంటా’’అలా వచ్చాడండీ రాజా హైదరాబాద్‌కి.ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్రూమ్లోకి వెళదాం:రాజా అతని స్నేహితుడు రాఘవ హ్యాపీగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత రాఘవ రాజాను కుశలం అడిగాడు..‘‘ఆ ఏమిటి సంగతులు. బాగున్నావు కదా!’’‘‘బాగుంటే కిటికిలో నుంచి ఎందుకు దూకుతానురా? నా పరిస్థితంతా పాతాళభైరవి అయిపోయింది. ఉద్యోగప్రయత్నాలకు ఇక్కడొచ్చి పడ్డాను’’ తాను ఎందుకు వచ్చింది సూటిగా చెప్పాడు రాజా.‘ఉద్యోగప్రయత్నం’ అనే మాట వినగానే భల్లుమని నవ్వాడు బ్రహ్మానందం.‘‘ఉద్యోగప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం చూసుకోవడం కంటే టికెట్ కొనుక్కొని లాటరీ కోసం ప్రయత్నించడం మంచిది’’ అని సలహా ఇచ్చి ‘హ్హా హ్హా హ్హా’ అని పెద్దగా నవ్వాడు బ్రహ్మానందం. ఈ నవ్వులు విని భయంగా పరుగెత్తుకు వచ్చిన మరో స్నేహితుడు సుధాకర్...‘‘కంకరరాళ్ల మీద రోడ్డు రోలర్లా ఏంట్రా ఆ నవ్వు? ఇంటి ఓనర్ పైకి వచ్చాడంటే కొంప మునుగుతుంది’’ అని హెచ్చరించాడు. ఈ వార్నింగ్ మాట ఎలా ఉన్నా...‘‘ఛ! వెధవ జీవితం. మనసారా నవ్వుకోవడానికి కూడా లేదు’’ అని మూతిముడిచి...‘‘తప్పు నీది కాదురా... అసలు మా తాత అలా చేసి ఉండకపోతేనాకీ ఖర్మ పట్టేది కాదు’’ విషాదం ఒలకబోస్తూ అన్నాడు బ్రహ్మానందం.‘మా తాత అలా చేసి ఉండకపోతే’ అనే మాట విని రూమ్‌లో పిడుగు పడ్డట్లు అదిరిపడ్డారు స్నేహితులు.‘‘మీ తాత ఏంచేశాడ్రా’’ ఆందోళనతో కూడిన ఆసక్తితో, ఆసక్తితో కూడిన ఆందోళనతో అడిగాడు రాజా.‘‘ఏం చేశాడా! ఏ బిర్లాలాగో బిజినెస్ చేసి ఉంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. మైసూర్ మహారాజులా దర్జాగా ఉండేవాడిని. వాడేమో రేషన్ షాప్‌లో గుమస్తాగా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో జీతం లేని సర్వరును అయ్యాను’’ అని దుఃఖంతో ముక్కుచీదాడు బ్రహ్మానందం.‘‘వార్నీ... మా తాత బాబరై ఉంటే నేను అక్బర్నై ఉండేవాడిని అని ఫీలయ్యేవాడిని నిన్నే చూస్తున్నాను’’ అని తెగ ఆశ్చర్యపోయాడు రాజా. -
ఇద్దరి కల
తమిళంలో క్లాసిక్ అన్న పేరున్న ఒక డబ్బింగ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. విడుదల సమయంలో ఫ్లాప్ అయిన ఈ సినిమా, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... సమర సూర్యం, ఆనంద్.. వాళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం కావడానికి చాలా ముందు నుంచే ఇద్దరికీ కొన్ని కలలున్నాయి. సమర సూర్యం పెద్ద రచయిత. సినిమాల్లోనూ అప్పుడప్పుడే బిజీ అవుతున్నాడు. కానీ రాజకీయాలను, సమాజాన్ని మొత్తం మార్చేయాలన్నది అతడి కల. గాంధీజీ స్ఫూర్తితో మొదలైన ఒక కొత్త పార్టీలో చేరి పనిచేస్తున్నాడు. ఆనంద్‌కు నటుడవ్వాలన్నది కల. కనిపించిన స్టూడియోలన్నీ తిరుగుతున్నాడు. ‘ఒక్క అవకాశం ఇప్పించండి’ అని బతిమిలాడుకుంటున్నాడు. ఆనంద్‌కు సూర్యం పరిచయమయ్యాడు. ఆనంద్ మాటకు, సూర్యం రాత తోడైంది. ఇద్దరూ కలిసి అవకాశాల కోసం తిరిగారు.ఆనంద్ పడుతున్నాడు, లేస్తున్నాడు. చివరికి గట్టిగా నిలబడ్డాడు. కథానాయకుడి పాత్ర. సూర్యం వరుస సమావేశాలతో పార్టీలో ఓ కీలక వ్యక్తిగా ఎదుగుతున్నాడు. ఇద్దరి జీవితాలూ అప్పుడే ఒక మలుపు తీసుకుంటున్నాయి. ఆనంద్ సినీ పరిశ్రమలో కథా నాయకుడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. సూర్యం తన కల కోసం పార్టీని జనాల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళుతున్నాడు. ప్రజలకు సేవ చేయడానికి తానూ పార్టీలో చేరతానన్నాడు ఆనంద్. సూర్యం తమ నాయకుడికి ఆనంద్‌ను పరిచయం చేశాడు. ‘‘ఆకాశంలో ఎగిరే తార ఒడిలో వచ్చి వాలతానంటే అందరికీ సంతోషమేగా!’’ అన్నాడు వాళ్ల నాయకుడు. ఆనంద్ కొత్త ఆశలతో పార్టీలో చేరాడు. ‘‘నేను పార్టీలో చేరడం సమరసూర్యానికి నచ్చలేదా?’’ సూర్యాన్ని కౌగిలించుకుంటూ అడిగాడు ఆనంద్. గట్టిగా నవ్వాడు సూర్యం, తను సమాధానం చెప్పే రోజు ఇంకా రాలేదన్నట్టు.అలాంటిరోజు వచ్చింది. ఆనంద్‌ను భోజనానికి ఇంటికి పిలిచాడు సూర్యం. అతడు తింటూండగానే, మధ్యలోనే చెయ్యి కడగమని బలవంతం చేసి, మేడ మీదకి తీసుకెళ్లాడు. ఆ ఇంటి మేడ మీదినుంచి కిందకు చూస్తే చుట్టుపక్కల ఎంత దూరం ఖాళీ స్థలం ఉంటే అంత దూరం జనంతో నిండిపోయింది. ‘‘ఇదే ప్రజాశక్తి. లెనిన్, స్టాలిన్ ఎంతో కష్టపడి సాధించిన ప్రజాశక్తి. ప్రజల మనస్సులోకి వెళ్లగల శక్తి.’’ ఉద్వేగంతో చెబుతున్నాడు సూర్యం.‘‘కానీ నేను ఒట్టి నటుడ్ని కదా!’’ అన్నాడు ఆనంద్. ‘‘వాళ్లలా అనుకోవడం లేదు. అలా చూడు! వాళ్ల మనస్సులో నీ రూపాన్ని చెరగని ముద్ర వేసుకున్నారు. నీకోసం ప్రాణాలిస్తారు. ఈ శక్తిని నువ్వేం చేస్తావ్?’’ అంతే ఉద్వేగంతో అడిగాడు సూర్యం. ‘‘ఏం చేయాలంటావ్?’’ ‘‘ఇంతటితో వదలకూడదు. దాన్ని కొన్ని వేల రెట్లు పెంచాలి. పార్టీ కోసం ఉపయోగించాలి. అంతా నీ మొహంలోనూ, ఆ వెండితెరలోనే ఉంది.’’ ఆనంద్‌ను గట్టిగా కౌగిలించుకొని చెప్పాడు సూర్యం. ఆనంద్ రెండు చేతులూ పైకెత్తి కిందనున్న వాళ్లకు అభివాదం చేశాడు. ఇద్దరి వేర్వేరు కలలు ఆరోజు ఒక్క కలగా మారాయి. పార్టీ కోసం కలిసి పనిచేశారు. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపారు. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. ఆనంద్ కథానాయకుడి పాత్రలు చేస్తూ సూపర్‌స్టార్ స్థాయికి వెళ్లాడు. ఆయన ఎక్కడ కనబడితే అక్కడ జనం కుప్పల్లా పోగై కనిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ నాయకుడు సూర్యాన్నే ముఖ్యమంత్రి పదవి స్వీకరించమని కోరాడు. సూర్యం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. రోజులు గడుస్తున్నాయి. సూర్యం ముఖ్యమంత్రిగా తాను చేయాలనుకున్న పనులు ఒక్కొక్కటిగా చేస్తూ వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు.ఒకరోజు సూర్యం ముందు కూర్చుని, ‘‘మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారని విన్నాను. సూర్యం! నాకు ఆరోగ్య శాఖ ఇవ్వాలి. పెద్దాయన నాతో అన్నారు, మంత్రి పదవి స్వీకరించాలని.’’ అన్నాడు ఆనంద్ చాలా ప్రశాంతంగా. సూర్యం ఆలోచిస్తున్నాడు.‘‘ఏం సూర్యం? మంత్రిపదవి స్వీకరించే అర్హత నాకు లేదంటావా?’’ అడిగాడు ఆనంద్. ‘‘ఈ పార్టీకి మిగతా వాళ్ల కంటే నువ్వు చేసిన సాయం ఎక్కువ. అందుకే మొదటి మంత్రివర్గంలోనే నీ పేరు సూచించా. కానీ వర్కింగ్ కమిటీ నువ్వు నటనకు స్వస్తి చెప్తేనే పదవి అన్నారు. వాదించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.’’‘‘సూర్యం నాకు మంత్రి పదవి ఇవ్వడన్నమాట!’’‘‘ఆనందూ! నువ్వు సినిమాలు వదిలేస్తే...’’ అని ఆగాడు సూర్యం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకొచ్చేశాడు ఆనంద్. సూర్యం ఈర్ష్యతోనే ఇదంతా చేశాడని ఆనంద్‌కు ఎంతమంది చెప్పినా అతను స్నేహాన్నే నమ్మాడు. ఆనంద్, సూర్యం మధ్యన దూరం పెరిగింది. పార్టీ నాయకుడు పెద్దాయన అనారోగ్యంతో చనిపోయాడు.పెద్దాయన సంతాప సభలో ఆనంద్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెద్ద ప్రసంగం ఇచ్చాడు. అవినీతి పెరిగిందని, ప్రజల్లో పార్టీపై నమ్మకం పోకుండా ఉండటానికి, పెద్దాయన ఆశయ సాధన కోసం నాయకులంతా తమ తమ ఆస్తులను బయటకు లెక్క చూపాలని అరిచి చెప్పాడు. పార్టీలో చీలిక మొదలైంది. ఆనంద్‌ను పార్టీ బహిష్కరించింది. ‘‘ఇది నిజంగానే నాకు మంచి రోజు.’’ అని సమాధానమిచ్చాడు ఆనంద్, తనను పార్టీ బహిష్కరించడం గురించి చెప్తూ. ఆనంద్ కొత్త పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టడంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇద్దరు మిత్రులు అధికారం, ప్రతిపక్షంలో కూర్చున్నారిప్పుడు. ఆ తర్వాత ఆనంద్, సూర్యం స్నేహితుల్లా మాట్లాడుకున్నది లేదు. ముఖ్యమంత్రిగా జనాల గుండెల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆనంద్ గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు మాత్రం స్నేహితుడ్ని తల్చుకొని బాగా ఏడ్చాడు సూర్యం. -
మీదీ మాదీ మనదీ ఒకే కథ
కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం. వేణు ఊడుగుల సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ అలాంటిదే. ఉదాత్తమైన ఒక దృశ్యకావ్యం కాలం గడిచి చాలా దూరం నడిచివచ్చినా బట్టల పొత్తిళ్ళలో దాక్కుని కూర్చున్న అపురూప పరిమళంలా మనల్ని మనోరంజితం కావిస్తూనే ఉంటుంది. కలతపరచి దిగులుపరచి, మనం ఆలా ప్రవర్తించకూడదనే తెలివిడిని కలిగి స్తూనే ఉంటుంది. చాలా కాలం క్రితం నేను చూసిన ‘రీడర్’ సినిమా నాకివాళ జ్ఞాపకమొస్తోంది. తనకు చదువు రాదని చెప్పుకోవడానికి సిగ్గు పడిన ఒక అమ్మాయి మౌనంగా అనేక సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవి స్తుంది. అట్లాగే ‘షిండ్లర్స్ లిస్ట్’ నాజీల దురాగతాల సమయంలో ఒక యూదుడు చూపిన అత్యున్నత హృదయస్పందన ఏళ్ళు గడిచినా బాధాభరితమైన రసాయనిక అసమతుల్యతను మనలో కలుగజేస్తుంది. కొరియన్ సినిమా, ‘ఏప్రిల్ స్నో’ అవాంఛితమైన పరిస్థితులలో వైవాహికేతర సంబంధంలోకి వెళ్లిన వివాహిత స్త్రీ పురుషుల ఘర్షణ జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి హృదయం బరువై మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కధ’’ నాకు ఇలాటి భావాన్నే కలి గించింది. కనుక. కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం . వేణు ఊడుగుల సినిమా అలాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని, మార్కెట్ చెబుతున్న మార్గంలో పయనించలేక, సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ రేస్‌లో నిలువలేక రాలి పడిపోతున్న, అయోమయానికి, ఆత్మన్యూనతకు లోనవుతున్న అనేకమందిని వేణు మనకు పరిచయం చేశాడు. చాలా సినిమాలు ఉదాత్తతను చెబుతూనే మధ్యలో ఎక్కడో పురుష దాస్యాన్ని చెబుతుంటాయి. ఫిదా సినిమా చూస్తున్నపుడు నాకు ఇలాటి ఆశ్చర్యమే కలిగింది. తాటి చెట్టంత మగవాళ్ళు ఇద్దరుండగా, అక్కకు సహాయానికి చెల్లి ఇండియానుంచి రావడమూ, కాలేజ్‌లో తన మీదికి వచ్చిన మగపిల్లలపై, వీరనారిని అని చెప్పుకునే నాయిక నాయకుడి వీరత్వ ప్రదర్శనకు ఎదురుచూడటం, ఇంటి చాకిరీ బాధ్యతగా చేయడం, ఆమె వూగిసలాట చాలా చిరాకు తెప్పించింది. వేణు సినిమాలో అలాంటి ద్వైదీయతలు ఉండవు. మొదటినుండి కడదాకా ఒకటే విషయం, స్థిరచిత్తంతో ప్రశ్నిస్తూ వెడతాడు. ‘మీరు సాధించగలరు’ అని ఒకలాటి భ్రమాత్మకత మాదకత వైపుకి నేటి యువతరాన్ని నెడుతున్న అనేక అంశాలను వేణు ప్రశ్నిస్తాడు . వేణు చాలా మృదువైన అబ్బాయి. మితభాషి, ముఖంనిండుగా మాటలు అక్కరలేని మౌనం చిద్విలాసంగా వెలుగుతూ ఉంటుంది. అతనిది ‘‘లవ్ ఎట్ రీజనల్ మైల్ స్టోన్’’ నేను చదివిన మొదటి కవిత. అట్లాగే మనసుకు హత్తుకు పోయింది. ప్రేమ సంబంధాలలోకి ఓ ప్రాంతం ఎలా చొచ్చుకొస్తుందో చెప్తాడు ఈ అబ్బాయి ఎంతో హృద్యంగా. ‘‘వంద ప్లాస్టిక్ సర్జరీలు కావాలి–ఆమె చెంపలపైనున్న నా ముద్దుల తడి ఆరడానికి! ఏడు సముద్రాలు కావాలి – నేను మాత్రమే కని పించే ఆ రెండు కళ్ళని కడుక్కోవడానికి’’ అంటూ నీది మా ఏరి యానే అయితే ఈ గొడవే ఉండేది కాదు అని వెళ్ళిపోయిన ప్రాంతీయేతర ప్రియురాలి గురించి అతను రాసిన కవిత సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. సామాజిక స్పృహ నిండుగావున్న వ్యక్తి తన ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తే అది కచ్చితంగా చాలా పాతదే అయిన మట్టిని చీల్చుకుని బుజ్జి బుజ్జి మారాకులు వేసుకుని ఆత్మవిశ్వాసంతో సూర్యుని దిక్కుకి ధిక్కారంతో తల ఎత్తి ప్రశ్నలు వేస్తున్న చిట్టి మొలకలా ఉంటుంది. వేణు ఇప్పుడు మనముందుంచిన ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’ అచ్చం అలాటి సినిమానే. ఎన్నో విలువయిన ప్రశ్నలను ఒక అమాయకుడయినా ఎదిగీ ఎదగని అబ్బాయి చేత అడిగించాడు ఈ దర్శకుడు. సంతృప్తిగా బ్రతకడమంటే ఏమిటీ? సంతృప్తికి కొలమానాలేవి? యూనివర్సిటీలో ఉన్నపుడు క్లాస్ నుంచి తిరిగివస్తుంటే అంత వరకు మట్టి పని చేసిన కూలీలు కేరేజీలు విప్పి వరుసగా కూర్చుని భోజనం చేస్తుండేవారు, మధ్యమధ్యలో బోలెడు చతురులు. ఒక ముద్ద అడిగి పెట్టించుకు తినాలనిపించేది వాళ్ళని చూస్తే. వాళ్ళు సంతృప్తిగా లేరనా? ఇంటికెళ్లి ఉడుకు నీళ్లు పోసుకుని పడుకుంటే వాళ్లకి పట్టే నిద్ర చిరంజీవికి పడుతుందా, మోదీకి పడుతుందా. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది వ్యక్తిత్వ వికాస తరగతులూ, పుస్తకాలు. ఈ మధ్య కాలంలో వేలం వెర్రిగా మార్కెట్‌ను ఆక్రమించుకుంటున్న ఈ అంశం గురించి వేణు భలే చెప్పాడు. ‘‘గొప్ప విజయాలకు ఎల్లప్పుడూ గొప్పత్యాగాలు అవసరమవుతాయి’’ అంటాడు మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ. శాక్రిఫైస్ అనేదానికి పరిమితి ఏమిటీ? ఎంతవరకూ? తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూ అల్లిపెడుతున్న బంగారు వలలో పడి పిల్లలు చేస్తున్న త్యాగాల అత్యాచారాన్ని ఎవరైనా కొలతలు వేస్తున్నారా? వేణు వేసిన అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న ఒకటి ఉంది అది ’’డిగ్నిటీ ఆఫ్ లేబర్’’. డిగ్నిటీ అఫ్ లేబర్ అంటే ఏమిటీ, మనమూ, మనపక్కన వ్యక్తి చేస్తున్న పని ఏదయినా అది విలువయినదే. నేను కార్ నడుపుతాను, నువ్వు ఆ కార్ ఓనర్‌వి అయితే ఏమిటీ, నాకు ఈ వృత్తి వచ్చు, నీకు మరో వృత్తి వచ్చు. ఒక వృత్తి మాత్రమే గొప్పది అని నిర్వచించిన కుట్ర ఎక్కడ మొదలయింది? లేచీ లేవగానే తిండి గింజల కోసం రెక్కలల్లార్చుకుని ఆకాశపు దారుల్లో బయలుదేరే పిట్ట కడుపు నిండాక పడే తృప్తి ముందు రేపటి చింత నిలబడగలదా? సాదా సీదా సెట్టింగుతో, ఎక్కడా కించిత్తు శారీరక ప్రదర్శనలు లేకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిన ఈ అబ్బాయికి, ఇంత మంచి సినిమా తీసిన ఈ అబ్బాయికి భవిష్యత్తు మరిన్ని అవకాశపు వాకిళ్ళను తెరిచే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక చూడండి, ఎప్పుడో ఒకప్పుడు మనం ఫీలయిన కథ మనందరి కథ, వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
‘10’ మూవీ న్యూ స్టిల్స్
-
మహానటి
పండు వెన్నెల, నిండు జాబిలి అని మహానటి సావిత్రిని పోల్చడం అంటే.. చెప్పిందే చెప్పడం. కొత్తగా కూడా ఆమె కోసం ఏమీ కవిత్వాన్ని సృష్టించలేం. చిరునవ్వు వెలుగు సావిత్రి. చిరుగాలి అల్లరి సావిత్రి. కళ్లే కాదు, ఆమె మౌనమూ ఒక చక్కటి పలకరింపు. సహజ నటి అంటారు కదా.. అది సహజత్వం మాత్రమే కాదు. నటనలోని సంపూర్ణత్వం కూడా! మంచి మంచి సినిమాలను మన కోసం మిగిల్చి వెళ్లిన సావిత్రి.. జయంతి నేడు. ఆ సందర్భంగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరితో ‘సాక్షి’ సంభాషణ. మీ అమ్మగారి గురించి మాట్లాడగానే మీకు గుర్తొచ్చే విషయాలు? అందమైన ఆ నవ్వు, చిలిపితనం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం. ఇవే గుర్తొస్తాయి. నిజమే.. ఆ నవ్వు, కొన్ని పాత్రల్లో చూపించిన చిలిపితనాన్ని మేమూ మరచిపోలేం.. మీరు సినిమాల్లో చూసినవి. నేను అమ్మను రియల్ లైఫ్‌లో దగ్గరగా చూశాను. ‘దేవదాసు’ సినిమాలో ఎర్లీ స్టేజెస్‌లో కొంచెం కొంటెగా, హ్యాపీగా కనిపిస్తుంది కదా.. రియల్ లైఫ్‌లోనూ అలానే ఉండేది. అమ్మ 45 ఏళ్లు మాత్రమే బతికింది. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆవిడ హ్యాపీగా ఉండటమే నాకు తెలుసు. కానీ, సావిత్రిగారిది ‘ట్రాజెడీ లైఫ్’ అనే ఇమేజ్ మిగిలిపోయింది. అది బాధగా ఉంటుంది కదా... అవును. జనరల్‌గా సినిమా ఫీల్డ్ అనేటప్పటికి ఏ విషయాన్నయినా ఎక్కువ చేసి చెబుతారు. అసలు ఏమీ జరిగి ఉండదు. ఓ వార్త పుట్టిస్తారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఆ వార్త చేరేలోపు పెద్దదైపోతుంది. చివరికి బెలూన్ని బాంబ్లా చూపించేస్తారు. అమ్మ విషయంలో అదే జరిగింది. మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని కూడా అంటుంటారు... అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్ అనదగ్గ ఏ డాక్టర్నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు. సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో? నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ ‘నువ్వు ఎగ్జామ్స్ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. అమ్మ దగ్గరకెళ్లి ‘నేనూ, తమ్ముడూ బాగున్నాం. బాగా చదువుకుంటున్నాం’ అని బాబ్జీ పెద్దమ్మ చెప్పమనేది. అలానే చెప్పేదాన్ని. కోమాలో ఉండేవారు కాబట్టి, మీరలా చెప్పినప్పుడు సావిత్రిగారిలో చలనం ఉండేది కాదు.. కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా? కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. ఆవిడ కూడా అమ్మను బాగానే పట్టించుకునేది. ఆవిడకు ఎంతమంది పిల్లలు. రేఖ (నటి) పుష్పవల్లిగారి కూతురు కదా? అవును. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి కూతురు రేఖ. తనకో సిస్టర్ (రాధ) కూడా ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. ‘దగ్గరుండి పెద్దమ్మ ఎగ్జామ్స్ రాయించారు’ అని చెప్పారంటే.. మీరంతా బాగా ఉండేవారన్న మాట.. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటే మేం కొడైకెనాల్ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ.. ఆడుకునేవాళ్లం. పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా? నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు. మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం? పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టావు. చేష్టలన్నీ ఆవిడవే’ అని ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్ అండర్స్టాండింగ్స్ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా? చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్ అటు ఓల్డ్ కాని ఏజ్ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి. అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు? వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం. ఒకవేళ తెలిసి ఉంటే.. ఆ మిస్ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని ఇప్పుడు మీకు అనిపిస్తోందా? ఆ ఫీలింగ్ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయేది. జెమినీ గణేశన్‌గారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే సమానంగా చూసేవారా మీ అమ్మగారు? ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు. జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా? ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్ అనే ఫీలింగ్ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది. జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది... అది నిజం కాదు. ఎవరూ ఎవరి ఆస్తినీ కొల్లగొట్టలేదు. మా అమ్మగారు మా ఇంటికి ఏమైనా కొంటే, ఆ ఇంటికీ కొనాల్సిందే. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నేను చెవికి జూకాలు పెట్టుకుని వెళ్లాను. అటు నాన్నవైపు బంధువుల్లో ఒకామె దగ్గర కూడా అలాంటిదే ఉంది. ‘మీ అమ్మ కొనిచ్చిందే’ అన్నారు. అమ్మ ఏదైనా ఇష్టంగా కొనిచ్చిందే తప్ప ఎవరూ అడిగి కొనిపించుకోలేదు. కానీ, అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు. ∙మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి? కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు. అది సరే.. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్ కావాలనుకోలేదా? అమ్మ స్టార్ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్ ఉండేది. మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్? ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్ చేసేది. మరి.. అలా ఇవ్వొద్దని మీరు, మీ తమ్ముడూ చెప్పేవాళ్లు కాదా? అప్పుడు మాకంత వయసు లేదు. నాన్న మాత్రం, ‘వాళ్లు చెబుతున్నది నిజమా? కాదా? తెలుసుకుని హెల్ప్ చేస్తే బాగుంటుంది’ అనేవారు. అయినా అమ్మ పట్టించుకునేది కాదు. మనకి ఇంత డబ్బుంది కదా.. ఇస్తే ఏం పోతుంది? అనే ధోరణిలో ఉండేది. ఇప్పుడు సావిత్రిగారి లైఫ్ ఆధారంగా వైజయంతీ మూవీస్ ‘మహానటి’ తీస్తున్నారు కదా.. దర్శకుడు నాగ అశ్విన్ మీకు కథ చెప్పారా? చెప్పారు. కొన్ని విషయాలు అడిగితే చెప్పాను. షూటింగ్ చేస్తున్న టైమ్‌లో కూడా ఏదైనా డౌట్ వస్తే, ఫోన్ చేస్తున్నారు. చెబుతున్నాను. దాసరిగారి డైరెక్షన్లో మీ అబ్బాయి అభినయ్ ‘యంగ్ ఇండియా’ మూవీ ద్వారా పరిచయమయ్యారు కదా.. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం? అమ్మమ్మ బ్యాగ్రౌండ్ చూపించి, అభినయ్ చాన్సులు తెచ్చుకోవాలనుకోలేదు. అప్పుడు దాసరిగారు కూడా ఫొటోషూట్ చేసి, కరెక్ట్‌గా ఉంటాడని తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కథలు విన్నాం. కొన్ని నచ్చాయి. అయితే మంచి ప్రొడ్యూసర్ సెట్ కాలేదు. నచ్చని కథలకు మంచి ప్రొడ్యూసర్స్ కుదిరారు. అయినా ఆ సినిమాలు చేసి ఏం లాభం? అన్నీ ప్రాపర్‌గా కుదిరితేనే చేద్దామనుకుంటున్నాం. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ లైఫ్ స్టోరీతో తీసిన తమిళ సినిమా ‘రామానుజన్’లో టైటిల్ రోల్ చేశారు అభినయ్. గెటప్ చాలా బాగుంది... థ్యాంక్స్. ఆ సినిమా చాన్స్ కూడా దానంతటదే వచ్చింది. మంచి క్యారెక్టర్. అభినయ్ చాలా బాగా చేశాడనే పేరు కూడా వచ్చింది. జనరల్‌గా మంచి బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు పిల్లల కోసం సినిమాలు తీస్తున్నారు.. మీకా ఆలోచన? అభినయ్‌తో ఈ మాటే అన్నాను. ‘వారసుల కోసం కొందరు సొంత బేనర్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. నేను, నాన్న (గోవింద రావు) నీకోసం సినిమాలు తీయడంలేదనే బాధ ఉంటే చెప్పు. కోట్లు కోట్లు లేకపోయినా సినిమాలు తీసే స్థితి అయితే ఉంది’ అన్నాను. అభినయ్ ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆ మనీతో సినిమాలు వద్దు. నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని, అవకాశాలు తెచ్చుకుంటాను’ అన్నాడు. కాలిఫోర్నియాలో ఉన్న మీ తమ్ముడి గురించి? తమ్ముడి పిల్లలు కూడా సెటిలయ్యారు. తను హ్యాపీ. మేం అప్పు డప్పుడూ వెళుతుంటాం. అమ్మ మా కోసం కష్టపడింది. మేమంతా ఆనందంగా ఉన్నాం. చిన్నప్పుడు తెలియలేదు కానీ, పెద్దయ్యాక ‘ఇంత ఆస్తి సంపాదించడానికి అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో’ అనిపిస్తుంటుంది. అప్పుడు మాత్రం గుండె కలుక్కుమంటుంది. – డి.జి.భవాని నేడు సావిత్రి జయంతి సందర్భంగా ‘మహానటి సావిత్రి కళాపీఠం’ ఆధ్వర్యంలో విజయవాడలోని ‘తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం’లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ‘‘ఈ సందర్భంగా ‘మిస్ ఏషియా ఇంటర్నేషనల్ 2016’ ఫస్ట్ రన్నరప్ రష్మీ ఠాగూర్‌కి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందించనున్నాం’’ అని కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులు పి. శ్రీనివాస్ తెలిపారు. సావిత్రిగారు ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ – నాగ అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నాగ అశ్విన్. ప్రస్తుతం సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు నాగ అశ్విన్ మాటల్లోనే... సావిత్రిగారి జీవిత కథతో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? ఆమె ‘ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్’ అని నా ఒపీనియన్. ఆవిడ జీవితాన్ని ప్రజలు మరచిపోక ముందే చెప్పాలనిపించింది. అందుకే ‘మహానటి’ మొదలుపెట్టా. ఆవిడ జీవితంలో మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? ఫిమేల్ ఆర్టిస్టులకు మేల్ ఆర్టిస్ట్‌ల కన్నా తక్కువ పారితోషికం ఉంటుంది. బాలీవుడ్లో దీపికా పదుకోన్ వంటి హీరోయిన్లు ఈ విషయం గురించి అప్పుడప్పుడూ చెబుతుంటారు. కానీ, 60 ఏళ్ల క్రితం సావిత్రిగారు తనతో పాటు యాక్ట్ చేసిన హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. హిందీలో మధుబాల వంటి హీరోయిన్లకు కూడా అది సాధ్యం కాలేదు. దీన్నిబట్టి సావిత్రిగారి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ తరానికి చెందిన మీరు సావిత్రిగారి గురించి వాళ్లూ వీళ్లు చెబితేనో, సినిమాలు చూశో తెలుసుకుని ఉంటారు.. ఆవిడ గురించి సినిమా తీయాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పుడు అమ్మమ్మవాళ్లు ఏ సినిమా చూసినా అందులో దాదాపు సావిత్రిగారు ఉండేవారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. ఇలాంటివన్నీ అన్నమాట. అలా నాకు సావిత్రిగారు స్క్రీన్ మీద పరిచయమయ్యారు. ఆవిడ ఎంత గొప్ప నటో తెలిసింది. కొంచెం పెద్దయ్యాక ఆవిడ లైఫ్ గురించి తెలుసుకున్నాను. సీనియర్ డైరెక్టర్స్ కూడా చెప్పారు. అవన్నీ విన్నప్పుడు ఇలాంటి మంచి నటి లైఫ్‌ని స్క్రీన్ మీద సెలబ్రేట్ చేయాల్సిందే అనుకున్నా. ఈ సినిమా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుంది. సావిత్రిగారి పాత్రకు కీర్తీ సురేశ్ న్యాయం చేస్తున్నారా? ఓ సినిమా బాగా రావాలంటే కాస్టింగ్, టెక్నికల్ డిపార్ట్మెంట్, నేచర్ అన్నీ సహకరించాలి. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఓ పదేళ్ల క్రితం కీర్తీ ఈ పాత్రకు సరిపోయి ఉండేది కాదు. మరో పదేళ్ల తర్వాతా సరిపోయి ఉండేది కాదు. రైట్ టైమ్‌లో ఈ రోల్ చేస్తోంది. పర్ఫార్మెన్స్ బాగుంది. -
‘సినిమాల్లో అవే ఎక్కువ చూపిస్తున్నారు’
ఒకప్పటి వెండితెర స్వర్ణయుగ రూపశిల్పుల్లో ప్రముఖ సినీనటి జమున ఒకరు. దాదాపు 200 సినిమాల్లో, అందులోనూ అత్యధిక బాక్సాఫీస్ హిట్లు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో మూడు దశాబ్దాలకు పైగా ముందువరుసలో కొనసాగిన నటీమణి. కళాభారతి, ప్రజానటిగా గుర్తింపుపొందిన జమున స్వస్థలమైన తెనాలిలో పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తొమ్మిదో నాటికోత్సవాల్లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. నేటి తెలుగు సినిమాలు తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. తెనాలి అంటే నాకెంతో మమకారం. కళానిలయం తెనాలి అనగానే గుర్తొచ్చేది జగ్గయ్య, గుమ్మడి, కృష్ణ.. మూడుసార్లు ఊర్వశి అవార్డు పొందిన శారద. ఇలా ఒక్కొక్కరినీ తలచుకుంటే ఎంతో ఆనందమేస్తుంది. ప్రసిద్ధి చెందిన నాటక కళాకారులకు పుట్టిల్లు తెనాలి. చిన్నతనంలో ఇక్కడకొచ్చి సినిమాలు చూసేవాళ్లం. జగ్గయ్య తీసిన ‘పదండి ముందుకు’ సినిమాలో ఆయనతోపాటు నేనూ, జి.వరలక్ష్మి నటించాం. ఇక్కడే కాలువ ఒడ్డున షూట్ చేశారు. బ్రిటిష్ వారి దౌర్జన్యానికి బలైన పాత్రలో జి.వరలక్ష్మి నటించారు. ఆమె శవాన్ని మోసుకెళుతున్న సీను ఇక్కడ తీశారు. ఇక్కడే బాపూజీని చూశా నేను కర్ణాటకలోని హంపీలో పుట్టానని నన్ను హంపీ సుందరి అంటారు. పసుపు, పొగాకు ఎగుమతి వ్యాపారంలో మా నాన్న దుగ్గిరాల వచ్చి స్థిరపడ్డారు. ఐదో ఏట నుంచి సినిమాల్లోకి వెళ్లే వరకూ నా బాల్యం అక్కడే గడిచింది. దుగ్గిరాల అమ్మాయిగానే చలామణి అయ్యాను. బాల్యంలోని ఎన్నో మధురస్మృతులు ఇంకా గుర్తున్నాయి. 9–10 ఏళ్ల వయసులోనే తెనాలి సమీపంలో పూజ్య బాపూజీని చూడటం గొప్ప అనుభూతి. హైస్కూల్లో చదివేటపుడే ప్రజానాట్యమండలి వారి ‘మా భూమి’ నాటకంలో ఒక పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టాను. ఆ క్రమంలోనే చెన్నైకి వెళ్లి సినిమా రంగంలోకి ప్రవేశించాను. రంగస్థల సమాఖ్య ఏర్పాటు రంగస్థలంపై మమకారంతో రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్యను ఏర్పాటుచేశాను. తెనాలిలోనూ శాఖ నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా 26 శాఖల్లో 10వేల మంది కళాకారులు సభ్యులుగా ఉండేవారు. అన్నం పెట్టిన రంగస్థలానికి ఊపిరిపోస్తున్న కళాకారులు, సమాజాలను ప్రోత్సహించాలనే భావనతో పింఛన్లు, ఇళ్ల నిర్మాణానికి సహకారం, ఇతర సేవాకార్యక్రమాలు నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి అధ్యక్షురాలిగా వీటిని విస్తృతం చేశాను. పేదకళాకారులకు నెలనెలా పింఛన్లు, సురభి సమాజాలకు ప్రోత్సాహం, బళ్లారి రాఘవ పేరిట తపాలబిళ్ల విడుదల నా హయాంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక స్తబ్దత ప్రస్తుతం సాంస్కృతికపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్తబ్దత నెలకొంది. ఔత్సాహికులకే కాదు, వృత్తి కళాకారులకు సైతం ఎలాంటి ప్రోత్సాహకాలు అందట్లేదు. ఎప్పట్నుంచో ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ‘సురభి’ వైభవం తెలంగాణ వచ్చాక తగ్గిపోయిందని నా భావన. ప్రభుత్వపరంగా అకాడమీల పునరుద్ధరణ జరగాలన్నది నా అభిమతం. ఈ మాత్రమైనా కళాసేవ జరుగుతుందంటే ఇలాంటి నాటక సమాజాల వల్లనే. చెడు ఎక్కువ చూపిస్తున్నారు.. తెలుగు సినిమాల్లో చోటుచేసుకున్న మార్పులు కచ్చితంగా సమాజానికి మంచి కలిగించేవి కావు. నాడు భక్త పోతన సినిమా చూసి ఒక బాలయోగి వస్తే, ఈ రోజుల్లో సినిమాలు చూసి రోడ్డుసైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారు. నాలాంటి సీనియర్ నటీనటులు తలదించుకునేలా ఉంటున్నాయి. మేం చిత్రరంగానికి వచ్చాక ప్రభోదాత్మక/ ప్రయోగాత్మక సినిమాలెన్నో వచ్చాయి. నైతిక విలువలే కాకుండా సంఘానికి పనికొచ్చే మంచిని ప్రభోదించాయి. ప్రస్తుతం చెడు ఎక్కువగా చూపిస్తున్న ఫలితంగా యువతరం చెడుమార్గంలో నడుస్తోంది. సామూహిక అత్యాచారాలనూ ఎక్కువగా వింటున్నాం. ఇది మంచి పరిణామం కాదని నా భావన. -
ప్రేమ పెళ్లే బెటర్..: లక్ష్మీ గోపాలస్వామి
లక్ష్మీ గోపాలస్వామి భారతనాట్య కళాకారిణి, ‘ఉత్తమ’ బహుభాష నటి, ట్యాలెంట్షో జడ్జి... ఇలా విభిన్నప్రతిభావంతురాలైన ఆమె జువెల్స్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కెరీర్‌తో పాటు తెలుగు సినిమాలో నటించాలన్న ఆసక్తిని వ్యక్తపరిచారు. ఇక ప్రేమ పెళ్లి ఉత్తమమని చెబుతున్న లక్ష్మీ గోపాలస్వామికి వివిధ విషయాలపై ఉన్న అభిప్రాయలు ఆమె మాటల్లోనే... సంప్రదాయ నృత్యం... క్రమశిక్షణను నేర్పిస్తుంది ఇంత పేరుప్రఖ్యాతలు రావడానికి స్థితిలో ఉండటానికి మొదటి కారణం భరతనాట్యమే. ఈ నృత్యం నాకు క్రమశిక్షణను, సమయ పాలనను నేర్పించింది. పెద్దలను ఎలా గౌరవించాలో చూపించింది. మొదట నాట్యకారిణిగా గుర్తింపబడటానికి ఇష్టపడుతాను. అటు పై మాత్రమే మిగిలిన రంగాల్లో నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఆస్వాధిస్తాను. అందువల్లే పిల్లలకు ఏదో ఒక సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇప్పించాలని చెబుతా. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మ విశ్వాసం వారు ఎంచుకునే రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఓ మంచి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించే ఆలోచన ఉంది. సినిమా...: ‘నేటి మహిళ’ రోల్ వస్తే తెలుగులో.. నటీనటులకే ఎక్కువ అవకాశాలు భాష ఏదైనా భావం. అభినయం ముఖ్యమని నమ్ముతా. నేను కళ్లతో వివిధ భావాలను అవలీలగా పలికిస్తుంటాను. అందువల్లే మళయాలం, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా పేరుంది. ఇందుకు నాకు భరత నాట్యంలో ఉన్న అనుభవమే కారణం. మళయాలంలో ఎక్కువ అవకాశాలు రావడం వల్లే ఆ ఇంటస్ట్రీలో బిజీ అయ్యాను. ప్రస్తుతం నేను హీరోయిన్ (నవ్వుతూ) వేషాలు వెయ్యలేనని తెలుసు. అందువల్ల ‘నేటి భారతీయ మహిళ’ తరహా క్యారెక్టర్లు వస్తే తెలుగులో నటించడానికి సిద్ధం. ఇంచుమించు ఇలాంటి తరహా రోల్ అంటే మధ్యతరగతి గృహిణిగా నటించినందుకే నాకు ‘విధాయ’ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్ని చిత్రసీమలు మూసధోరణి నుంచి బయటికి వచ్చి కొత్త తరహా సినిమాలు నిర్మిస్తున్నాయి. అందువల్ల హీరో, హీరోయిన్ల కంటే నటీ నటీలకు మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. టీవీ.. టాలెంట్షో...: ఫేమ్ లేకపోయిన జీవించడం నేర్పించాలి... చలనచిత్ర సీమతో సమానంగా టీవీ రంగంలోని నటీనటులకు పేరొస్తోంది. ఇందుకు విభిన్న అంశాలతో కూడిన కార్యక్రమాలు రూపొందించడమే. టాలెంట్షోల వల్ల పిల్లలలో దాగున్న నైపుణ్యం వెలికి వస్తోంది. ‘తకథిమి’ కార్యక్రమం జడ్జిగా ఇది నా స్వానుభవం. అయితే ఇక్కడ మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న వయసులో వచ్చే పేరు ప్రఖ్యాతలు చాలా మందిలో అలాగే కొనసాగవు. ఇందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఈ సమయంలో సదరు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించి ఫేమ్ లేకపోయినా ఎలా జీవించాలో నేర్పించాలి. ఇక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి మాత్రమే టీవీ రంగం ఆదరిస్తుంది అనడం సరికాదన్నది నా అభిప్రాయం. ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు పెద్ద పెద్ద నటీనటులతో సమానంగా రెమ్యునురేషన్ తీసుకుంటున్నారు. ఆభరణాలు...: పురాణాలు దాగి ఉంటాయి అందరి అమ్మాయిల వలే నాకు ఆభరణాలంటే ఇష్టం. అందులోనూ సంప్రదాయాలను ప్రతిబింభించే నగలు ఎక్కువగా ధరిస్తా. మిగిలిన దేశాలతో పోలిస్తే భారతీయ నగల్లో పురాణాలు దాగి ఉంటాయి. నగలను కూడా భక్తితో పూజించే సంస్కృతి మన వద్ద మాత్రమే ఉంది. మనకు నచ్చిన నగలనే కొనాలి. అప్పుడు మాత్రమే నగలు ధరించడానికి ఆస్వాదించగలుగుతాము. ప్రేమించే పెళ్లి చేసుకుంటా... ప్రేమ, పెళ్లి వేర్వేరు కాదని నా అభిప్రాయం. నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటా. ఏదో నా అందం చూసి సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వారు నాకు అవసరం లేదు. ఇవి ఏవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడే వాడిని పెళ్లి చేసుకుంటా. ఇక నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటాడో అంతే గౌరవాన్ని ఉదాహరణకు వెయిటర్, జంతువులకు ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందం, ఆస్తికంటే మానవత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. -
సినీ కృష్ణుడు
-
తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు
పరిశోధన: డాక్టర్ పైడిపాల; పేజీలు: 320; వెల: 175; ప్రతులకు: రచయిత, 11-20, కొంకాపల్లి, అమలాపురం-533201; ఫోన్: 9989106162 ‘తెలుగు సినిమాపాట చరిత్ర’, ‘తెలుగు సినీగేయకవుల చరిత్ర’ వెలువరించిన పైడిపాల నుంచి వచ్చిన తాజా పరిశోధన ఈ గ్రంథం. ఈ ‘అనుసంధాన కళ’ గురించిన పూర్వరంగం చెప్పి, డబ్బింగ్ పాటలు రాయడంలో ఎవరి శైలి ఏమిటి, వారి గొప్ప పాటలు ఏమిటి, మూలం నుంచి దూరం జరిగికూడా గొప్పమార్కు చూపించిన పాటలేమిటి, మూలాన్ని పట్టుకోలేని పాటలేమిటి లాంటి అంశాలను నిర్మొహమాటంగా ప్రస్తావిస్తూ వెళ్తారు. శ్రీశ్రీ, రాజశ్రీ, వెన్నెలకంటి నుంచి నేటి వనమాలి, కందికొండ దాకా ముఖ్యమైన డబ్బింగ్ కవులందరినీ స్పృశించారు. తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాల, డబ్ చేసినవాళ్ల జాబితాలు అదనంగా ఇచ్చారు. విశ్వపతి కార్టూన్లకు ప్రశంస విశ్వపతి కలంపేరుతో కార్టూన్లు వేసే టి.వి.ఆర్.కె.మూర్తి ఇటీవల ‘సిన్సియర్లీ యువర్స్’ పేరిట కార్టూన్ల సంకలనం తెచ్చారు. ‘కార్టూన్లు సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దం పడుతున్నా’యని ఆయన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు కె.రోశయ్య, సీహెచ్.విద్యాసాగరరావు కూడా అభినందనలు తెలిపారు. -
నేరాలకు ప్రేరణ.. ఈ సినిమాలే!
సినిమాకు చాలా సందర్భాల్లో నిజజీవితమే ప్రేరణ. వాస్తవ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరమీదకొచ్చాయి. అయితే ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. నిజజీవితం ఆధారంగా వచ్చే సినిమాల కన్నా.. సినిమాల ఆధారంగా జరిగే నేరాల సంఖ్యే అధికంగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో 15 ఏళ్ల అభయ్ మోధానిని అపహరించి.. అతని మరణానికి కారణమైన ఘటనకు కూడా ఓ సినిమా కథనే ప్రేరణ తీసుకున్నట్టు తేలింది. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని ప్రేరేపణగా తీసుకొని ఈ కిడ్నాప్ దారుణానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో దారుణాలకు స్ఫూర్తిగా నిలిచిన టాలీవుడ్ సినిమాలు గురించి ఓ కథనం ఇది. డాన్! నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ముంబైలో ఓ దారుణానికి కారణమైంది. 2015 జూలైలో ముంబై నలాసోపారా ప్రాంతంలో 13 ఏళ్ల నిలేశ్ తివారీని అతని పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్లు హత్య చేశారు. నాగార్జున 'డాన్' హిందీ డబ్బింగ్ ను టీవీలో పలుసార్లు చూసిన ఆ ఇద్దరు అబ్బాయిలు తాము కూడా స్థానిక దాదాలు కావాలని కలలు కన్నారు. సినిమాలో మాదిరిగా దాదాగిరి చేస్తూ స్థానిక పిల్లల్ని వారు బెదిరించారు కూడా. ఈ సినిమాలో నాగార్జున మంచి డాన్ గా కనిపించినప్పటికీ, విలన్ పాత్ర పోషించిన కెల్సీ డోర్జీనే ఆ పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించాడు. ఆఖరికీ వాళ్ల దాదాగిరి హత్యకు దారితీసింది. బిజినెస్ మ్యాన్! మహేశ్ బాబు విజయ్ సూర్యగా నటించిన ఈ సినిమాలో మంచి-చెడు రెండూ కలిసి ఉన్న బిజినెస్ మ్యాన్ గా కనిపించాడు. అయితే నేరస్తులకు ఈ సినిమాలోని చెడ్డ మహేశ్ బాబే ఎక్కువగా ప్రేరణ ఇచ్చాడు. 2012లో 2,11,256 మంది నేరస్తులను అరెస్టు చేయగా, అందులో 85శాతం మంది యువతే ఉన్నారని, ఈజీ మనీతో లావిష్ లైఫ్ గడుపాలన్న ఆలోచనే వారితో నేరాలు చేయించిందని జాతీయ నేర నమోదుబ్యూరో వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలైన తర్వాత నేరాల రేటు పెరిగిందని, ఈ సినిమా స్ఫూర్తితో నేరాలు పెరిగిపోయాయని స్వయంగా ఓ పోలీసు అధికారే అప్పట్లో పేర్కొన్నారు. బాడీగార్డ్ ఈ సినిమా కొచ్చి బ్లాక్ మెయిల్ కేసుకు ప్రేరణగా నిలిచింది. రుక్సానా, బిందియా అనే మహిళలు ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు వలపుల గాలం వేశారు. బాడీగార్డ్ సినిమాలో 'వాయిస్ చేంజింగ్' సాఫ్ట్ వేర్ తో వెంకటేశ్ ను బురిడీ కొట్టిస్తుంది. అదే తరహాలో ఈ ఇద్దరు మహిళలు ఓ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేశారు. వెంకటేశ్ మరో సినిమా 'దృశ్యం' తరహాలో తమ సెల్ ఫోన్ ను కర్ణాటక ఆర్టీసీ బస్సులో వదిలేసి.. తాము మాత్రం త్రివేండ్రం పరారయ్యారు. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో అసలు గుట్టు రట్టయింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ యువత చైన్ స్నాచింగ్ చేస్తూ.. కిడ్నాప్ లకు పాల్పడుతూ డబ్బు సంపాదించే కథనంతో రూపొందిన ఈ సినిమా చాలా నేరాలకే ప్రేరణగా నిలిచింది. తాజాగా హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంత పరిచిన 15 ఏళ్ల అభయ్ మోధాని కిడ్నాప్, హత్య వ్యవహారానికి ఈ సినిమానే ప్రేరేపణ అయింది. ఒక రొమాంటిక్ ప్రేమ కథలోని ఓ సీన్ చూసి.. అభయ్ కిడ్నాప్ కు పథకం రచించామని, ఈ కిడ్నాప్ ద్వారా భారీగా డబ్బు రాబట్టాలని అనుకున్నామని 20, 23 ఏళ్ల మధ్య వయసున్న అందరూ నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిజానికి ఈ సినిమా విడుదల కాగానే ఒక్క వరంగల్ లోనే 26 చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఈ సినిమాలో మహిళలు ముఖానికి స్కాఫ్ కట్టుకొని.. ఆ ముసుగులో నేరాలకు పాల్పడినట్టు చూపారు. ఇదే తరహాలో ఇద్దరు బాలికలు ముఖానికి ముసుగు ధరించి ఓ దుకాణానికి వచ్చి.. కారం కొంటామంటూ ఆ కారాన్ని యజమాని కంట్లో కొట్టి రూ. 50వేలతో ఉడాయించారు. సింగం! అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా ముంబైలో ఓ కిడ్నాప్ కు ప్రేరేపణగా నిలిచింది. సినిమాలోని దృశ్యాల తరహాలోనే హరీశ్ మోహన్ పురోహిత్ అనే వ్యక్తి ఓ వ్యాపారవేత్త ఐదేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లాడిని విడిచిపెట్టేందుకు రెండో వాయిదాగా రూ. 10 లక్షలు తీసుకుంటూ అడ్డంగా అతడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయాడు. ఇక మలయళంలో మొదట తెరకెక్కి ఆ తర్వాత ఇతర భాషల్లో రిమేక్ అయిన 'దృశ్యం' సినిమా కూడా పలు నేరాలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా సునీతా అహిరే అనే యువతిని ఆమె ప్రియుడు వికాస్ మహత్రే హత్య చేసి.. సినిమా తరహాలోనే దొంగ సాక్ష్యాలు అల్లేందుకు అతడు ప్రయత్నించాడు. -
సినిమాల పందెం కోళ్లు
సినిమా సంక్రాంతి తెలుగు సినిమాకీ, సంక్రాంతికీ అవినా భావ సంబంధం ఉంది. 1955లో కమర్షియల్‌గా సంక్రాంతి సీజన్లో మార్కెట్‌ని కొల్లగొట్టిన కోడి ‘మిస్సమ్మ’. అందులో అన్న ఎన్టీఆర్, మహానటుడు ఏఎన్ఆర్ కలిసి నటించడంతో హీరోలుగా పోటీ లేకుండా సినిమా గెలిచేసింది. అప్పట్నుంచి ప్రతి యేడూ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా సంక్రాంతికి ఒక సినిమా తనకుండేలా చూసుకున్నారు. 56లో ‘తెనాలి రామకృష్ణ’, 59లో ‘అప్పుచేసి పప్పుకూడు’, 60లో ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’, 61లో ‘సీతారామ కల్యాణం’, 62లో ‘గులేబకావళి కథ’, 63లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, 64లో ‘గుడి గంటలు’, 65లో ‘పాండవ వనవాసం’, 66లో ‘శ్రీకృష్ణ పాండవీయం’, 67లో ‘గోపాలుడు- భూపాలుడు’, 68లో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’, 69లో ‘వరకట్నం’, 70లో ‘తల్లా, పెళ్లామా’,71 నుంచి 76 వరకూ హిట్లు తగల్లేదు కానీ సినిమాలు పోటీలో ఉన్నాయి. మళ్లీ 77లో ‘దానవీరశూరకర్ణ’ తో విజృంభించి సంక్రాంతి పందెంలో ఫస్ట్ బెస్ట్ కోడి తనదేనని నిరూపించారు. 82లో ‘అనురాగ దేవత’ వరకు అన్నగారే సంక్రాంతికి తెలుగువాళ్ల అభిమాన గెలుపు కోడి. తర్వాత ఆ వారసత్వాన్ని సూపర్‌స్టార్ కృష్ణ అందుకున్నారు. 1976లో ‘పాడిపంటలు’తో ప్రారంభించి, 1997 తప్ప, వరుసగా 76 నుంచి 99 వరకూ అంటే 22 ఏళ్లు నిరాటంకంగా సంక్రాంతి బరిలో నిలబడ్డ స్టార్ కోడి తనదే అయ్యేలా చూసుకున్నారు. తెలుగువారితో ఎక్కువసార్లు గెలిపించుకున్నారు. 87లో ‘ఊరికి మొనగాడు’, 82లో ‘బంగారు భూమి’, 84లో ‘ఇద్దరు దొంగలు’, 85లో ‘అగ్నిపర్వతం’, 93లో ‘పచ్చని సంసారం’, 94లో ‘నంబర్ వన్’, 95లో ‘అమ్మదొంగ’... ఇవన్నీ కృష్ణ ప్రైజ్ విన్నింగ్ గెలుపు కోళ్లు - ఆయా సంవత్సరాల సంక్రాంతి పందాల్లో. మెగాస్టార్ చిరంజీవి 87లో ‘దొంగ మొగుడు’తో, 89లో ‘అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు’తో, 97లో ‘హిట్లర్’తో, 2000లో ‘అన్నయ్య’తో సంక్రాంతి బరిలో భారీగా గెలిచినా, 2001 ‘మృగరాజు’, 2004 ‘అంజి’ తేడా కొట్టేశాయి. అయినా మెగాస్టార్ సంక్రాంతిని కంపల్సరీ రిలీజ్ డేటుగా చూసుకున్న దాఖలాలు లేవు. ఇలా అడపాదడపా వచ్చి పందెం గెలిచిన చుట్టం ‘కోడే’ ఆయన. నందమూరి అన్న ఎన్టీఆర్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్యబాబు, సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వీళ్లిద్దరూ మాత్రం వీలైనంత వరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా సంక్రాంతి బరిలో పందెంలో దిగడానికే ప్రయత్నం చేసే రసవత్తరమైన ఛాంపియన్ ‘కోళ్లు’ - 1985 నుంచి బాలకృష్ణ దాదాపు ప్రతి ఏడూ సంక్రాంతి బరిలో నిలబడ్డారు. క్రమం తప్పకుండా ఈ ఏడాది 2016 వరకూ... ఈ ఏడు ‘డిక్టేటర్’తో మళ్లీ బలంగా పందెంలో నిలుచున్నారంటే అర్థమౌతోంది - సంక్రాంతిని అభిమానుల కోసం ఎలా సందడిగా మారుస్తున్నారో అని. 1985 నుంచి 2016 వరకూ అంటే దాదాపు ముప్ఫైఏళ్లకు పైగా అయిదుసార్లు మినహాయించి పందెంలో నిలబడ్డ కోడి నిజంగా గొప్ప కోడి. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ ఈ కోడి విజయాలు. సంక్రాంతి పందెంలో కన్సిస్టెంట్గా నిలబడుతున్న మరో ఛాంపియన్ పందెం కోడి మహేశ్‌బాబు. 1979 నుంచి 1990 వరకూ బాలనటుడిగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టిన విజయాలనిచ్చిన ఈ సూపర్‌స్టార్ 2002లో ‘టక్కరిదొంగ’తో సంక్రాంతి బరిలోకి దిగారు. 2003లో ‘ఒక్కడు’తో ఆ ఏటి మేటిగా నిలిచారు. మళ్లీ 2012లో ‘బిజినెస్‌మ్యాన్’గా అలరించారు. 2013లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో తమ్ముడిగా గెలిచారు. 2003లో ‘నాగ’తో, 2004లో ఆంధ్రావాలాతో, 2005లో ‘నా అల్లుడు’తో సంక్రాంతి బరిలో పోటీచేసిన నందమూరి స్టార్ హీరో తారక్ 2010లో ‘అదుర్స్’తో సంక్రాంతి పందెంలో గెలుపు రుచి చవిచూశారు. 2004లో వర్షంతో ప్రభాస్ సంక్రాంతి పందెంలో బాలయ్యతోను, మెగాస్టార్ తోను పోటీపడి మరీ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. రామ్ 2006లో వై.వి.ఎస్. చౌదరి నిర్మాత, దర్శకుడుగా సంక్రాంతి బరిలోనే ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసి ‘చుక్కల్లో చంద్రుడు’గా వచ్చిన సిద్ధార్థతో ఢీకొని ఆ ఏడాది ఛాంపియన్ కోడిగా ముద్రేయించుకున్నారు. 2011లో రవితేజ ‘మిరపకాయ్’తోను, 2013లో రామ్‌చరణ్ ‘నాయక్’తోను, 2014లో అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తోను, 2015లో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘గోపాల గోపాల’తోను, అదే ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’గా వచ్చి పందాల్లో నిర్మాతలు పెట్టిన డబ్బులు పోకుండా గెలిపించేశారు. చాలా అరుదుగా ఒక్కో ఏడు రెండు, మూడు కోళ్లు గెలుస్తాయి. అది ఈ పందాల్లో ప్రత్యేకత. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 2009లో నిర్మించిన ‘అరుంధతి’ ఆ ఏడాది సంక్రాంతి గెలుపు కోడిగా అనుష్కని నిలబెట్టింది. మొదటిసారి పందెం గెలిచిన ఆడ కోడి అనుష్క. విక్టరీ వెంకటేష్ తన సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2000లో ‘కలిసుందాం రా’ అంటూ, చిరంజీవి ‘అన్నయ్య’తోను, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’తోనూ కలిసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఒక రకంగా సోలోగానూ, మల్టీస్టారర్తోను కలిపి సంక్రాంతికి ఘన విజయాలు దక్కించుకున్న హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, వెంకటేష్, మోహన్‌బాబు, కృష్ణంరాజులనే చెప్పాలి. 2002లో ‘సీమసింహం’, ‘టక్కరి దొంగ’ల భారీ పోటీ మధ్య తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వై.కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో పందెంలో గెలిచేసింది. 2003లో ఒక్కడు ప్రభంజనంతో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోని ‘పెళ్లాం ఊరెళ్తే’ బాగానే కాసులు రాబట్టింది. 2008లో ‘కృష్ణ’ సినిమాతో రవితేజ మరోసారి సంక్రాంతి సూపర్‌హిట్టు కోడిగా నిలబడినా ఆ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ 2010లో తారక్‌తో ‘అదుర్స్’ని కూడా సంక్రాంతి బరిలో విజేతగా నిలబెట్టారు. ఎన్టీఆర్‌తో మొదలైన సంక్రాంతి సినిమాల పండుగ సందడి రేపు రానున్న 2016 సంక్రాంతికి నందమూరి అభిమానుల మధ్యే పెద్ద పోటీకి తెరతీసింది. నందమూరి తారక్ ‘నాన్నకు ప్రేమతో’ అని సుకుమార్ దర్శకత్వంలో వస్తూండగా, నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా బరిలో ముందే ఉండడం ఈ సంక్రాంతికి బాగా ఆసక్తి రేపిన విషయం. మామూలుగా హిట్ అయ్యే సినిమాలు వేలకు వేలున్నా, సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలు, వాటి గురించిన చర్చలు, వాటి కలెక్షన్ల తీరే మిగిలిన సీజన్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రిలీజయ్యే సినిమాలకి మాత్రమే పోటీ అని ఫీలౌతాం. మిగిలిన సమయాల్లో ఏ రెండు సినిమాలున్నా సంక్రాంతికి ఉన్న చర్చ ఉండదు. కాబట్టి పోటీ గెలిచిన హీరోల అభిమానులు ఏడాదంతా కాలరెగరేసుకుని తిరుగుతారు. పైగా క్యాలెండర్ సంవత్సరం మొదలయ్యేది జనవరి కాబట్టి సంక్రాంతికి ప్రేక్షకుడు ఏ టైప్ చిత్రానికి పందెంలో గెలుపు పట్టం కడతాడో, ఆ ఏడాదంతా ఆ టైపు చిత్రాల నిర్మాణం బలవంతంగా జరిగిపోతుంది. అయితే, సంక్రాంతి నేపథ్యంలోని కథాంశంతో రూపొందిన సినిమాలు చాలా తక్కువే. దర్శకరత్న దాసరి నారాయణరావు ‘ఊరంతా సంక్రాంతి’ అనే మల్టీస్టారర్‌లో అక్కినేని, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అదొక్కటే సహజమైన తెలుగు స్వాభావిక సంక్రాంతి చిత్రం అయితే, హీరో వెంకటేష్ ‘సంక్రాంతి’ అనే సూపర్‌గుడ్ చిత్రంలో శ్రీకాంత్, శర్వానంద్‌లతో కలిసి నటించారు. ఇది తమిళ ‘ఆనందం’ చిత్రానికి రీమేక్. అరవ సాంబారు, పొంగల్ లాంటి కథా కథనాలు తప్ప తెలుగు పులిహోరలు, బొబ్బట్లు ఈ సంక్రాంతిలో మృగ్యం. అందుకే ఈ సంక్రాంతి, జనవరిలో రిలీజవ్వలేదు. కానీ మంచి హిట్ చిత్రం అయింది. సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం రాక. కొత్త చుట్టాల, అల్లుళ్ల రాక. కొత్త సినిమాల రాక. ‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’ అన్న మహాకవి గురజాడవారిని గుర్తుచేసుకుంటూ, ఆ పండగలో పోటీని ఆస్వాదిద్దాం. ఆ పండుగని ఆనందంగా అనుభవించి ఈ ఏడాది ప్రారంభిద్దాం. అందరికీ నూతన సంవత్సర, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. - వి.ఎన్.ఆదిత్య