tirumala
-
తిరుమలలో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో గొడవకు దిగాడు. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి తిరుమలలో హల్చల్ చేశాడు. నేను లోకల్ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త (ఫోటోలు)
-
Tirumala: ఇక ఫ్లయింగ్ జోన్‌గానే తిరుమల?
తిరుపతి, సాక్షి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్ కొత్తేం కాదు. ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అంతెందుకు గతంలో టీడీపీ తరఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. కానీ, అడుగులు ముందుకు పడలేకపోయాయి. అయితే.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు విమానయానశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు భావించారు. కానీ, అదీ జరగడం లేదు.తాజాగా విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమలపై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు. ఈ లేఖకు మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని అన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు. అయితే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా.. తిరుమలను ఫ్లయింగ్ జోన్‌గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగమశాస్త్రం ఏం చెబుతోందంటే.. దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది. ఆలయాలు ఉన్నత ప్రాంతాలు. భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దైవానికి నివేదన చేసేటప్పుడు.. గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పించి.. మరేయితర శబ్ధాలు వినిపించకూడదు. అలా జరిగితే అది అపచారం. కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు, రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. పైగా తిరుమలలాంటి స్వయంవ్యక్త క్షేత్రం కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక కాబట్టి సముచితమైన రీతిలో కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు. -
తిరుపతి స్వామి సన్నిధిలో కిరణ్ అబ్బవరం 'దిల్రూబా' టీమ్ (ఫోటోలు)
-
ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (ఫోటోలు)
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22,910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుపతిలో బుల్లితెర జంట విష్ణుప్రియ- సిద్దార్థ్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)
-
భర్తతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హన్సిక (ఫోటోలు)
-
ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)
-
మరోసారి తొక్కిసలాట తిరుమలలో తీవ్ర విషాదం..
-
టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగుల నిరసన ఫలించింది. టీటీడీ బోర్డుపై ఉద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు ఈవో. దీంతో, ఉద్యోగులు నిరసనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పాలక మండలి దిగొచ్చింది. ఎట్టకేలకు బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు. అయితే, ఉద్యోగిపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో పాలక మండలి సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. నరేష్ వెంటనే క్షమాపలు చెప్పాలని ఉద్యోగులు 48 గంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నరేష్ వారిని క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,327 మంది స్వామివారిని దర్శించుకోగా 22,804 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది -
రెండోరోజు టీటీడీ ఉద్యోగుల నిరసనలు.. ఐక్యవేదిక హెచ్చరిక ఇదే..
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు మౌన నిరసన తెలుపుతున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌ను బోర్డు నుంచి తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ ఉద్యోగి బాలాజీపై దురుసు ప్రవర్తనకు నిరసనగా ఉద్యోగులు మౌన నిరసనలు తెలుపుతున్నారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా వారు రెండో రోజు నిరసనల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు.. పాలకమండలి సభ్యుడు నరేష్‌ను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరికలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలం
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో టీటీడీ అడిషనల్ ఈవో, జేఈవో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని టీటీడీ సభ్యులు కోరారు. పాలక మండలి సభ్యుడు నరేష్‌ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు.ఉద్యోగిని దూషించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 48 గంటలపాటు మౌన నిరసన చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది. -
TTD పరిపాలనా భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన
-
తిరుమలలో మరోసారి విమానం చక్కర్లు
-
క్షమాపణలు చెప్పాల్సిందే.. టీటీడీ ఉద్యోగులు నిరసన
సాక్షి, తిరుపతి: టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, బోర్డు సభ్యుడు నరేష్.. వెంటనే టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం లోపలికి మీడియాను సెక్యూరిటీ అనుమతించడం లేదు. పరిపాలన భవనం లోపల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నారు. పరిపాలన భవనం మెయిన్ రోడ్ గేట్ ముందు మీడియాను లోపలికి పంపించడం లేదు.ఇదిలా ఉండగా..తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్.అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయం వద్ద మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇంతలోనే తాజాగా విమానం చక్కర్లు కొట్టడం గమనార్హం.తిరుమలలో గురువారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరగా వెళ్లింది. భక్తులు విమానం వెళ్లే సమయంలో విమానం చక్కర్లు కొట్టడంతో వారంతా ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని చెబుతారు. దీనిపై టీటీడీ గతంలోనూ కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లింది.. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరింది. కానీ, కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.అయితే ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదని.. అపచారం అంటున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇలా విమానం, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతీసారి విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అవుతోంది. వివరాలు ఆరా తీస్తోంది. -
పెళ్లి రోజు కాలినడకన తిరుమలకు టాలీవుడ్ యాంకర్ లాస్య (ఫోటోలు)
-
టీటీడీ ఉద్యోగిపై టీటీడీ బోర్డ్ మెంబర్ బూతుపురాణం
సాక్షి,తిరుమల : తిరుమల శ్రీవారి మహా ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడడం కొండపై హాట్టాపిగ్గా మారింది. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. భయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఉంచుకోవద్దని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. -
నేటి నుంచి శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ‘మే’ కోటా విడుదల
తిరుమల/తిరుపతి రూరల్: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు మే నెల కోటాను మంగళవారం ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ టికెట్లు పొందిన భక్తులు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, అటువంటి వారికి మాత్రమే టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఇక 21వ తేదీన ఆర్జిత సేవ, 22న అంగప్రదక్షిణం టోకెట్లు, శ్రీవాణి టికెన్ల ఆన్లైన్ కోటా, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మే నెల తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్ కోసం https:/ ttddeva sthanams. ap.gov.in వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తదితరులు దర్శించుకున్నారు. కాగా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ‘ఉపమాక’ ఆలయ అభివృద్ధికి సహకరించండి అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని హోం మంత్రి అనిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచి్చన మంత్రి దర్శనానంతరం టీటీడీ చైర్మన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల విరాళం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌కు సోమవారం రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసిద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ అనే భక్తుడు విరాళాన్ని తిరుమలలో టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. అలాగే ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన భక్తుడు రూ.10 లక్షలు, తిరుపతి చెందిన పృథ్వీ రూ.10 లక్షలు డీడీలను అదనపు ఈవోకు అందజేశారు. -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐశ్వర్య రజినీకాంత్ (ఫోటోలు)
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి10 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,527 మంది స్వామివారిని దర్శించుకోగా 23,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఏడుకొండలు అపవిత్రం..
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
పవన్.. కల్తీ మీ బుర్రలో జరిగింది: భూమన
తిరుపతి, సాక్షి: సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కిందటి ఏడాది సెప్టెంబర్ 20 తేదీన తిరుమలడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ రిపోర్ట్‌లో ఎక్కడా ‘నిర్ధారణ’ అనే విషయం ప్రస్తావించలేదు. .. తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు?కేరళకు వెళ్లి.. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారు. ఇది మాపై వేస్తున్న నింద కాదు.. స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద. మా హయాంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్ అన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండి. .. పవన్ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు.. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు. సనాతన ముసుగులో రాజకీయం చేసి, ప్రత్యర్థులు పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు. తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష కు మద్దతు ఇవ్వండి అని పవన్‌కు భూమన సూచించారు. -
తిరుపతి తొక్కిసలాటపై.. తదుపరి ఆదేశాలు అక్కర్లేదు
సాక్షి, అమరావతి :వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో పాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలేవీ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, విచారణ కమిషన్ తన నివేదికను గవర్నర్‌కు మాత్రమే సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ నివేదికను గవర్నర్‌కు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఏదీ చట్టంలో లేదని గుర్తుచేసింది.అంతేకాక.. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ చట్టం కింద కమిషన్‌ను ఏర్పాటుచేయడం, విచారణ గడువును నిర్ధేశించడం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని తేల్చిచెప్పింది. కమిషన్ విచారణకు సమయం పడుతుందని.. అందువల్ల విచారణ పూర్తికి గడువును నిర్ధేశించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో పాటు, ఘటనపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లా, పాండురంగాపురానికి చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం, బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు.. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వంగవీటి నరేంద్ర పిల్‌ను సైతం హైకోర్టు పరిష్కరించింది. -
కూటమి కుట్రల నుంచి ఏడుకొండల్ని రక్షించుకుందాం (ఫొటోలు)
-
తిరుమలపై కూటమి కుట్రలు.. భగ్గుమన్న హిందూ సంఘాలు
తిరుపతి/అమరావతి, సాక్షి: ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 👉🏼 ఏడుకొండల్ని రక్షించుకుందాంకూటమి సర్కార్‌కు హిందూ సంఘాల ప్రశ్నిలివే.. సనాతన ధర్మ రక్షణ వీరుడు, సూరుడు, ధీరుడు.. పవన్‌కల్యాణ్ ఎక్కడ?వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల దివ్య క్షేత్రానికి గుండు కొట్టడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే.. తిరుమల ఏడు కొండలను నాశనం చేయడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల ఏడు కొండలలో ముంతాజ్ హోటల్ నిర్మించడమా పవన్ కల్యాణ్ గారు?సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కల్యాణ్?తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులుతిరుమల ప్రక్షాళన అంటే తిరుమలను అపవిత్రం చేయడమా? చంద్రబాబు నాయుడు గారుతిరుమల ప్రక్షాళన అంటే.. ముంతాజ్ హోటల్ నిర్మించడమా? చంద్రబాబు నాయుడు గారుశేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా?ఏడు కొండలను పాడు చేయడమేనా? ప్రక్షాళన అంటే.. -
తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష
-
తిరుమల శ్రీవారి ప్రతిష్ట దిగజార్చేలా కూటమి కుట్రలు
-
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
సాక్షి,తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా.. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని.. లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:ఆ విషయం రిమాండ్ రిపోర్టులో లేదు: నిందితుల రిమాండ్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్ విచారణ జరిపి రిమాండ్ బాధ్యులను రిమాండ్‌కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం:కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్ ఇచ్చాడు. తిరుపతిలో పవన్ ముందుకు వెళ్లి పవానంద స్వామి వేషంలో సనాతనధర్మం కోసం నడుం బిగించాను అని, తిరుపతిలో లడ్డూను నీచులు అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని డిప్యూటీ సీఎం పవనానంద స్వామి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశారు..నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్ బోరాను అరెస్ట్ చేయాలి.కల్తీ నెయ్యి వినియోగించే ఛాన్స్ లేనేలేదు:చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా క్షుద్ర రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని కూడా వాడుకున్నాడు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో దశాబ్దాలుగా ఉంది. గత మా వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య నాణ్యత పరీక్షల్లో విఫలమైన 18 ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే విధంగా చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య 15 ట్యాంకర్లు తిప్పి పంపించడం జరిగింది. నెయ్యి నాణ్యత టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్లను వెనక్కి పంపడమే తప్ప వాడటం అనేది జరగదు.టీటీడీ ఈఓ కూడా ఏమన్నారు?:తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్పారు. జూన్ 12, 20, 25, జూలై4న వచ్చిన నెయ్యిని పరిశీలించి టెస్టులు పాసయ్యాక వినియోగానికి పంపించామని, గత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలారావు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా జూలై 6, 12న ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ పరీక్షించగా,వనస్పతి ఆయిల్ కలిసిన ఆనవాళ్లు తేలడంతో, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపామని చెప్పారు. కాబట్టి, లడ్డూల తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టంగా తేలిపోయింది. పెరిగిన నెయ్యి నాణ్యత:2019కి పూర్వం నెయ్యి నాణ్యత నిర్ధారణకు హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు. తిరుమల నెయ్యి నాణ్యతను మరింత పెంచడంలో భాగంగా వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే రిటైర్డ్ సైంటిస్టుని సీఎఫ్టీఆర్టీఐ నుంచి టీటీడీ ల్యాబరేటరీకి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరో 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు రకరకాల ప్రాంతాల్లో ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరణ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ల్యాబ్ అప్‌గ్రేడేషన్ చేయడం కోసం కమలవర్థన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి సూచనలు తీసుకోవడం జరిగింది. ఎన్డీడీబీ సాయంతో రూ.46 కోట్లతో ల్యాబ్ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.8 కోట్ల పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కానీ ఒకే కంపెనీ ముందుకుడరావడంతో టెండరింగ్ ఆలస్యమైంది.నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం:‘మేం ఆరోపణలు చేస్తాం.. వైఎస్సార్సీపీ తుడుచుకోవాలి’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అనేలా తొందర్లోనే చంద్రబాబుకి వినాశనం తప్పదు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలి. వైఎస్సార్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టుల్లో తేడాలు రావొచ్చని, మా నివేదిక నూటికి నూరుపాళ్లు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇకనైనా ఎల్లో మీడియా దేవదేవుని విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ (ఫోటోలు)
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
-
తిరుమల లడ్డూ కేసులో నలుగురు అరెస్ట్
-
కల్తీ నెయ్యి ఆరోపణలపై నలుగురి అరెస్ట్
తిరుమల: తిరుమలకు(tirumala) కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్ది నెలలుగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోంది.విచారణకు సహకరించక పోవడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా వీరేశ్ ప్రభు తిరుపతిలో మకాం వేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి కొనుగోలు చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఆర్ డెయిరీకి సహకరించిన సంస్థల ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం విపిన్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, భగవాన్‌పూర్, రూర్కీ, ఉత్తరాఖండ్), పోమిల్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), అపూర్వ చావ్డా (సీఈఓ) వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పునబాక, తిరుపతి జిల్లా), రాజురాజశేఖరన్ (ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు ఎండీ)లను అరెస్ట్ చేసింది. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరచనుంది. -
సప్త వాహనాలపై శ్రీనివాసుని వైభవం
తిరుమల: రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో సప్త వాహనాలపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. లక్షా 50 వేల మందికి పైగా తరలివచ్చిన భక్తజనులు..వాహన సేవలను దర్శించుకుని పునీతులయ్యారు. రథసప్తమి పర్వదినం..ఒకరోజు బ్రహ్మోత్సవాలను తలపించింది. సూర్యోదయాన సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమైన సప్త వాహన సేవోత్సవం..రాత్రి చంద్రప్రభ వాహనంతో పరిసమాప్తమైంది. శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. చక్రస్నానాన్ని శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు నిర్వహించారు. వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. చిన్న శేష వాహనంలో అపశ్రుతి రథసప్తమి వేడుకల్లో శ్రీవారి గొడుగు గాలికి ఒరిగింది. సూర్యప్రభ వాహనం అనంతరం చిన్నశేష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. ఈ ఊరేగింపు సమయంలో వాహనంపై స్వామివారికి ఇరువైపులా ఛత్రాలు ఉంచుతారు. అర్చకులు వీటిని పట్టుకొని వస్తారు. వాహనం ముందుకు కదులుతుండగా..ఒక్కసారిగా వాహనం ఎక్కువగా అదిరిపోవడంతో గొడుగు కిందకు వాలిపోయింది.వాహన సేవల్లో న్యాయమూర్తులు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్పతి రాజేంద్రన్ శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శ్రీవారి దర్శనం అనంతరం మాడ వీధుల్లో నిర్వహించిన వాహన సేవల్లో పాల్గొన్నారు. -
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు (ఫొటోలు)
-
రథసప్తమికి తిరుమల ముస్తాబు
తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. ఏడు వాహన సేవల్లో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు అశేష భక్తకోటి తరలివచ్చింది. ఉ.5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేసింది. ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు.గ్యాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకధాటిగా ఏడు వాహన సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మ.2 గంటల నుంచి 3 మధ్యలో పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. సుదర్శన చక్రత్తాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు ప్రవేశించకుండా ఇనుప కమ్మీలు ఏర్పాటుచేశారు. ఇక రథసప్తమి ఏర్పాట్లను, స్వామివారిని ఊరేగించనున్న వాహనాలను టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం పరిశీలించి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మీడియాకు తెలిపారు.పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దుఇక రథసప్తమి వేడుకలకు భారీగా భక్తజనం వస్తుండడంతో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి. ⇒ ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ రద్దు. ⇒ తిరుపతిలో ఫిబ్రవరి 3–5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు. ⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. ⇒ ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడి) టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్మిత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి.భారీగా భద్రతా ఏర్పాట్లురథసప్తమి పురస్కరించుకుని 1,250 మంది పోలీసులు, 1,000 మంది విజిలె¯న్స్ సిబ్బందితో టీటీడీ భద్రతా ఏర్పాట్లుచేసింది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగి్నమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అత్యవసర మార్గాలు ఏర్పాటుచేశారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల రంగంలోకి దించారు. గ్యాలరీల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లుచేశారు.వాహన సేవల వివరాలు ఉ.5.30–8 గంటల వరకు : సూర్యప్రభ వాహనం ఉ.9–10 గంటల వరకు : చిన్న శేష వాహనం ఉ.11 నుంచి మ.12 వరకు : గరుడ వాహనం మ.1 నుంచి 2 వరకు : హనుమంత వాహనం మ.2 నుండి 3 వరకు : చక్రస్నానం సా.4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సా.6 నుంచి 7 వరకు : సర్వభూపాల వాహనం రాత్రి 8 నుంచి 9 వరకు : చంద్రప్రభ వాహనం -
శ్రీవారి ఆలయంపై జెట్ విమానం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,871గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు కాగా, నిన్న తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,257గా ఉంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (ఫోటోలు)
-
తిరుమల, ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల సంచారం
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. దీంతో, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్ , హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే, గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.ఇక, తిరుమలలో కూడా చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
తిరుమలలో చిరుత కలకలం.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ వద్ద అలర్ట్!
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.వివరాల ప్రకారం.. తిరుమలలో చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
తొలి గడప కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో సింగర్ సునీత (ఫోటోలు)
-
Tirumala: తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (సోమవారం) 65,278 మంది స్వామివారిని దర్శించుకోగా 22,077 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
చాలా సింపుల్‌గా ఆ గుడిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మూలాలు తమిళనాడులోనే అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో బాల తారగా నటించి అందరి మన్ననలను పొందిన శ్రీదేవి ఆ తర్వాత కథానాయకిగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించారు. అలాంటి శ్రీదేవి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మొదట హిందీలో కథానాయకిగా తెరంగేట్రం చేసిన ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపైన దృష్టి సారించారు. అలా ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మరిన్ని అవకాశాలు జాన్వీ కపూర్ వైపు చూస్తున్నాయి. అలా త్వరలోనే కోలీవుడ్‌లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తిరుపతి , తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి చాలా ఇష్టం. గతంలో తన అమ్మగారు శ్రీదేవి నిత్యం తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఈమె తిరుపతి నుంచి కాలినడకన 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇటీవల కొత్త ఏడాది ప్రారంభ సమయంలో కూడా జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే ఈమెకు ఎంతో ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా..? అని జాన్వీని ప్రశ్నించారు. తన వద్దకు పెళ్లి ప్రస్తావన రాగానే తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది. నిజంగా ఇదే జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె తెలిపింది. జాన్వీ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, జాన్వీ మాత్రం తిరుమలలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తనలోని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంది. -
తిరుమలలో యాంకర్ శ్రీముఖి, గజరాజు ఆశీర్వాదం (ఫోటోలు)
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు77,651 మంది స్వామివారిని దర్శించుకోగా 26,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీశైలం మల్లశ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రన్న ఆలయానికి పెశ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీరిగిన భక్తుల రద్దీశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మల్లన్న దర్శనానికి భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల చేశారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుం. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.రిలీజ్ వాయిదా..గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన 'రాబిన్ హుడ్' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025 -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని హైకోర్టు కొత్త జడ్జీలు రేణుక యార, నర్సింగ్‌రావు నందికొండ, తిరుమలాదేవి ఈద, మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య ప్రమాణం చేశారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్లో శనివారం ఉదయం 10.45 గంటలకు నలుగురితో న్యాయమూర్తులుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్ జనరల్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, రిజి్రస్టార్లు, ఏఏజీలు, కోర్టు సిబ్బందితోపాటు కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ఈ నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 11న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారే కావడం గమనార్హం. న్యాయాధికారుల కోటాలో వీరిని ఎంపిక చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కాగా, జస్టిస్ తిరుమలాదేవి 2026, జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనుండగా, మిగతా ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు. -
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
తిరుమల సమాచారం ఇలా.. నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: తిరుమలకు సంబంధించి నేటి సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.మరోవైపు.. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.ఇదిలా ఉండగా.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యధా ప్రకారం విడుదల చేస్తారు. కాగా, https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ (ఫొటోలు)
-
తిరుమలలో సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
టీటీడీ పాలక మండలిని వెంటనే రద్దు చేయాలి
సాక్షి, అమరావతి: తిరుమలలో 7 నెలలుగా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై స్వామీజీలు, హైందవ పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిని వెంటనే రద్దు చేయాలని, తిరుమలను స్వతంత్ర ప్రతిపత్తి గల ఆధ్యాతి్మక కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వధర్మ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తిరుమల తాజా పరిణామాలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సోమవారం వెబినార్ జరిగింది.తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వామీజీలు, పీఠాధిపతులు, హైందవ సంఘాల ప్రతినిధులు వర్చువల్‌గా హాజరయ్యారు. తిరుమలలో సాధారణ భక్తులను చాలా చులకనగా చూస్తున్నారని, పాలకమండలి సభ్యుల్లో కొందరు కొండపై వ్యాపారులకు లబ్ధి చేస్తూ క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. 7 నెలల్లో కొండపై జరిగిన అవాంఛనీయ ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ, తిరుమల వైశిష్టతను కాపాడుకునేందుకు ధారి్మక సంఘాలు, స్వామీజీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఎవరేమన్నారంటే..హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలితిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనల వల్ల తిరుమల ప్రతిష్టకే విఘాతం కలుగుతోంది. భక్తుల సొమ్ముతో పాలకమండళ్లకు, అధికారులకు విలాసాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజూ 18 గంటల్లో 60 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. అంటే ఒక్కో భక్తుడికి కేవలం ఒక సెకను మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులను ఒకేసారి బయటకు వదలడం వల్ల ఆరుగురు తొక్కిసలాటలో మృతి చెందారు. తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. – వీవీఆర్ కృష్ణంరాజు, స్వధర్మ విజ్ఞాన వేదిక చైర్మన్తిరుమల నిఘా వ్యవస్థలో వైఫల్యం తిరుమలలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. స్వామి ప్రసాదంపైనా దారుణమైన ఆరోపణలను విన్నాం. స్వామి సన్నిధిలో నిఘా వ్యవస్థలో వైఫల్యం కనిపిస్తోంది. ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఆగమ శాస్త్ర నిపుణులతో టీటీడీ ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవాలి. – గౌర కృష్ణ స్వామిజీ, పెదముత్తేవితిరుమల ఘటనలు బాధాకరం తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట, తిరుమలలో బాలుడు చనిపోవడం వంటి ఘటనలు బాధాకరం. కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకే సాధారణ దర్శనం కల్పించారు. ఆయన ప్రవచనాన్నీ చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. – పొక్కులూరి సుబ్బారావు, చైర్మన్, గీతా విజన్ ట్రస్ట్రాజకీయ నేతలు ఉండకూడదు సామాన్యులు, వీఐపీలంటూ భగవంతుని సమక్షంలో విభజన చేయడమే తప్పు. పాలకమండళ్లలో రాజకీయ నాయకులు ఉండటం వల్ల భక్తులు భగవంతుడికి దూరమవుతున్నారు. పాలక మండలిలో రాజకీయ పెత్తనం ఉండకూడదు. స్వతంత్ర వ్యవస్థ అంటే స్వామీజీ వ్యవస్థ ఉండటం వల్ల పూజాధికాలతో పాటు భక్తులు స్వామివారికి దగ్గరయ్యే మార్గాలను సూచిస్తారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై ఆగమ పండితులతో ఇప్పటివరకు కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరం. దీనిపై టీటీడీని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాం. – వెంకట సత్యనారాయణ ప్రసాద స్వామీజీ, తాళ్లూరి మఠం పీఠాధిపతి, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు పాలకమండలిలో క్రిమినల్స్, వ్యాపారవేత్తలా?టీటీడీ పాలకమండళ్లలో వ్యాపారవేత్తలు, క్రిమినల్స్ ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వాలకు దేవాలయాలపై పెత్తనం చేసే హక్కు లేదు. ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. – డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, చైర్మన్, రామానుజ సంక్షేమ సమితి ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమించాలి టీటీడీలో పరిణామాలపై ప్రజలను జాగృతం చేస్తూ స్వామీజీలు, ధార్మిక సంఘాలు ఉద్యమించాలి. చిలుకూరి బాలాజీ వంటి ఆలయాల్లో భక్తులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. అన్ని ఆలయాల్లో అలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాలి. – తుర్లపాటి నాగభూషణరావు, కో–కన్వీనర్, హిందూ ధర్మపరిరక్షణ సమితి -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 75,931 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.40 కోట్లు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు విఐపీ దర్శనాలు రద్దు -
తిరుమలలో ఎగ్ పలావ్!
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శనివారం కొందరు కొడిగుడ్ల పలావ్ (ఎగ్ బిర్యానీ) తింటూ కనిపించడం కలకలం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం గుమ్ముడిపూండికి చెందిన 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్ నిండా కోడిగుడ్ల పలావ్ తమ వెంట తెచ్చుకున్నారు. వారు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్, లగేజ్ స్కానింగ్ దాటుకుని తిరుమలకు చేరుకున్నారు. రాంబగీచా అతిథిగృహం సమీపంలోని బస్టాండ్ వద్ద బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావ్ తినసాగారు.ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి సమీపంలోని పోలీస్ కాంప్లెక్స్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి గుమ్ముడిపూండికి చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలకు ఇలాంటి ఆహారం తీసుకురాకూడదని పోలీసులు మందలించారు. ఈ అంశంపై టూ టౌన్ సీఐని సంప్రదించగా.. అది చాలా చిన్న విషయమని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం గమనార్హం. కాగా, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం నిఘా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తిరుమలలో బయటపడ్డ ఎగ్ పలావ్ -
గోవిందా.. ఏమిటీ అపచారాలు?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోనే పెద్ద అభాండం వేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందంటూ జరిగిందంటూ కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.ఈ ఘటన జరిగినప్పటి నుంచి తిరుమల తిరుపతిలో వరుస సంఘటలు అధకార కూటమి నేతలు చేసిన తప్పులకు పర్యావసానమేనని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఇటీవల తిరుపతి క్యూలైన్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం సహా పలు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ పలావ్‌ని కొండపైకే తెచ్చి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. అయినా ఒక చిన్న అవాంఛనయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్నంత పటిష్టమైన ప్రణాళికలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే 9 నెలల క్రితం అయోధ్య రామాలయం ట్రస్ట్ నిర్వాహకులు తిరుమలలోని క్యూలైన్ వ్యవస్థను పరిశీలించి, టీటీడీ అధికారులతో చర్చించి వెళ్లారు. అనంతరం టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులు అయోధ్యకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు కూడా. అంతటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో కూటమి ప్రభుత్వం స్వార్ధపూరిత చర్యలకు దిగింది. దాని పర్యవసానమే ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్లో తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఎందుకింత నిర్లక్ష్యం? తొక్కిసలాట ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ లో షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తిరుమల రెండో ఘాట్ రోడ్ వద్ద ఆర్టీసి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తుల్లో 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం తిరుమల పద్మనాభం యాత్రిక సదన్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారిపడి మృతి చెందాడు.గత ఆదివారం పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ని చోరీ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇదే వ్యక్తి పరకామణిలో మరిన్ని దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు తెలిసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. తిరుమల ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.ఇంకోపక్క తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఇలా తరలిస్తున్న వారిలో కొందరిని టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు ఎగ్ పలావ్ తో తిరుమల కొండ పైకి వచ్చేశారు. తిరుపతిలోనే పూర్తిగా తనిఖీ చేసి పంపే పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వీరు నిషేధిత ఆహార పదార్థాలతో తిరుమలకు చేరుకోవడం, శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని రాంబగీచ వద్దే ఆరగించడం అందరినీ విస్తుగొలిపింది.ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఇంతేనా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు జారీకి సరైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ ఫలితమే భైరాగిపట్టెడ పద్మావతి పార్క్, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువేమిటో ఇక్కడే వెల్లడైంది. చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షలు చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, ప్రతి కుటుంబానికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని పలు పారీ్టలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోడంలేదు. -
తిరుమల కొండపై అపచారం
-
బాబు, పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి? అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న భూమన.. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దుయ్యబట్టారు.‘‘శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడిందంటే.. టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. మారణాయుధాలలతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ చైర్మన్ పని చేస్తున్నారు, భక్తులను పట్టించుకోవడం లేదు...తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారు. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారు. లడ్డూ ప్రసాదం విషయంలో మాపై నింద మోపారు. మాపై నేరారోపణలు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబును ప్రశ్నించాలని కోరుతున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
తిరుమలలో మరో అపచారం.. భద్రత డొల్లతనం?
సాక్షి, తిరుపతి: తిరుమలలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. అధికారులను దాటుకుని మాంసాహారం ఆలయానికి సమీపంలోకి చేరింది. రాంభగీచా బస్టాండు వద్ద గుడ్డు భోజనం తింటూ కొందరు పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది బృందంగా వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.నిషేధిత తిను బండరాలతో తమిళనాడు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్ తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. సెక్యూరిటీ తనిఖీ దాటుకొని వచ్చిన తమిళనాడు భక్త బృందం.. రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటున్నట్లు కొందరు భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని ఆ బృందాన్ని మందలించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసనఅలిపిరి జూపార్క్ రోడ్డులో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన చేపట్టారు. ఏడు కొండలకు వెన్ను పోటు పొడవద్దంటూ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మం కోసం తిరుపతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్షణమే ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ శ్రీనివాసనంద స్వామి నిలదీశారు. -
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్తుల రద్దీ ఇలా..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటితో వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపు రద్దు చేశారు. మరోవైపు.. స్వామి వారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.తిరుమలలో నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,142 మంది ఉంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,736 మంది కాగా.. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు. మరోవైపు.. టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అలాగే, 20వ తేదీన సర్వ దర్శనంలో మాత్రమే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. ఇక, 20 తేదీన వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.ఇక, శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటా విడుదల చేయనుంది టీటీడీ. నేడు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల చేయనున్నారు. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్ల, వర్చువల్ సేవల కోటా విడుదల. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు. జనవరి 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల, 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల. జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి -
తిరుమలలో విషాదం.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటంతిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం. -
తిరుమలలో సందడి చేసిన నితీష్ కుమార్ రెడ్డి
-
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా రైజింగ్ స్టార్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై తిరుమల దర్శనానికి వెళ్లాడు. నితీశ్ ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన విషయాన్ని నితీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నితీశ్ మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC— Pari (@BluntIndianGal) January 13, 2025కాగా, నితీశ్ ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ భారత్ తరఫు రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ సాధించి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సెంచరీతో నితీశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్.. ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో నితీశ్ ఐదు టెస్ట్‌ల్లో 37.25 సగటున 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.బీజీటీతో భారత్‌కు నితీశ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ లభించాడు. ఈ సిరీస్‌లో నితీశ్ రాణించినా భారత్ 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. బీజీటీ అనంతరం భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. నితీశ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత్ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగనుంది. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 19న ప్రకటించే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దృవ్ జురెల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల లడ్డూ కౌంటర్లో మంటలు
-
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. అయితే.. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు. -
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
-
శ్రీవారి పరకామణిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం
తిరుమల: శ్రీవారి పరకామణిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి బంగారు బిస్కెట్లను చోరీ చేయగా టీటీడీ విజిలెన్స్ అధికారుల అప్రమత్తతో నిందితుడు పట్టుబడ్డాడు. తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన వీలిశెట్టి పెంచలయ్య తిరుమలలోని యూనియన్ బ్యాంక్ వారి అబ్రిబోస్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను పరకామణిలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పరకామణి సిబ్బందికి అందిస్తుంటాడు. ఈ క్రమంలో పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పైన ఉన్న మరో అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకెళ్లే సమయంలో సమీపంలోని ఓ బంగారు వస్తువులు ఉన్న ట్రే వద్దకు వెళ్లివచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ విజలెన్స్ సిబ్బంది సదరు ట్రాలీని తనిఖీ చేయగా అందులో ఉన్న ఓ కన్నంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ కెమేరా నిఘా కేంద్రంలో వీడియో ఫుటేజీని పరిశీలించి.. వన్‌టౌన్ పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం: జ్యోతుల నెహ్రూ
-
తిరుమలలో పోలీసుల దురుసు ప్రవర్తన
-
తిరుమలలో తగ్గిన భక్తులు
-
పవన్‌కు మానవత్వం లేదు: RK Roja
-
మంత్రి ఆనంకు భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
-
తొక్కిసలాట ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా తగ్గిన భక్తులు
-
వైకుంఠ ఏకాదశి.. తిరుమలకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య ఆధిపత్య పోరు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ, క్రీడా ప్రముఖులు (ఫోటోలు)
-
ఆ ఆరుగురు ఇక్కడే చనిపోయారు.. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్..
-
తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరం
-
మీరందరూ క్షమాపణ చెప్పాలి BR నాయుడుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు..
-
వైకుంఠ ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
వైకుంఠ ద్వార దర్శనంలో YSRCP నేతలు
-
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు
సాక్షి, తిరుమల: తిరుమల విషాదకర ఘటనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటెద్దు పోకడలే కారణమని అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ కనీసం పట్టించుకోలేదని తాజాగా అధికారులు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ముందే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును అధికారులు ఏకిపారేశారు. దీంతో, బీఆర్ నాయుడు వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.తిరుమలలో భక్తుల తొక్కిసలాట అంశంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటెద్దు పోకడలే ఈ దుస్థితికి కారణమన్నారు. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలను టీటీడీ చైర్మన్ తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై బీఆర్ నాయుడు కనీసం పట్టించుకోలేదన్నారు. అలాగే, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఆయన ఇష్టానుసారం మాట్లాడారు. అధికారులతో చెప్పకుండానే టీటీడీ చైర్మన్ నియంతలా వ్యవహరించారని ఆరోపించారు.సీఎం చంద్రబాబు సాక్షిగా టీటీడీ చైర్మన్ బండారం బట్టబయలైంది. ఈ ఘటన అనంతరం.. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై సీఎంకు ఫిర్యాదు చేసిన ఈవో, ఇతర అధికారులు. ఈ సందర్బంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్‌ను అధికారులు ఏకిపారేసినట్టు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ నాయుడు.. టీటీడీ చైర్మన్‌గా ఉంటే టీటీడీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుందని అధికారుల ఫిర్యాదు చేశారు.ఇది కూడా చదవండి: వీళ్లా టీటీడీ పాలకులు?అయితే, తనకు భజన చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ సేవలో కాకుండా టీడీపీ సేవలో బీఆర్ నాయుడు తరలిస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను పూర్తిగా గాలికొదిలేశారు. తిరుమలలో ఆరుగురు మరణించిన తర్వాత దైవాదీనం అంటూ బీఆర్ నాయుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సంగతి విధితమే. భక్తులకు కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా ఏర్పాటు చేయించలేదు. ఇదే సమయంలో చైర్మన్ బీఆర్ నాయుడు.. వీఐపీ సేవలో పూర్తిగా తరించారు.ఇది కూడా చదవండి: వైఎస్ జగన్ వస్తున్నారని.. బాధితుల డిశ్చార్జ్!ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనలో చర్యలకు సీఎం చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్నారు. మొత్తం పెత్తనం చేసే టీటీడీ చైర్మన్, వెంకయ్య చౌదరిపై చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన ఎస్పీ సుబ్బరాయుడుని కూడా సస్పెండ్ చేయలేదు. మరోవైపు.. ఈ ఘటనకు బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి, శ్యామలరావులే బాధ్యులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భక్తుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై హిందూ భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూటమి సర్కార్ పాలనలో ప్రజలు మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తలోమాట -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్బంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు. తిరుమల(Tirumala), యాదాద్రి(Yadadri), భద్రాద్రి, ద్వారకా తిరుమలలో భక్తులు రద్దీ కిటకిటలాడుతున్నారు. మరోవైపు.. తిరుమలకు వీఐపీలు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుమలలో గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4:30 గంటలకు దర్శనం ప్రారంభమైంది. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు పొటెత్తారు.శ్రీవారిని దర్శించుకున్న వారిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, హోం మినిస్టర్ అనిత, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ సీఎం రమేష్తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిసినీ నటులు బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి,యోగా గురువు రాందేవ్ బాబా, చాముండేశ్వరి నాథ్, బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు.భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను దర్శించుకుంటున్నారు భక్తులు. దర్శనం కోసం గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.#WATCH | Tirumala, Andhra Pradesh: Sri Venkateswara Temple decked up on the occasion of Vaikuntha Ekadashi Festival. pic.twitter.com/34yJSzq324— ANI (@ANI) January 9, 2025 -
LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
అంబులెన్సుకు ఫోన్ చేయమంటే ఫోన్లో వీడియోలు చూస్తున్నారు
-
బాబు దొంగ డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని
-
రోజా ఫైర్...!
-
అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్
-
వైకుంఠ ఏకాదశికి లక్షల మంది వస్తారని తెలిసినా నిర్లక్ష్యం
-
రేణిగుంట ఎయిర్ పోర్టుకు YS జగన్
-
తిరుపతి తొక్కిసలాట.. ఎస్పీ సుబ్బారాయుడు ఎస్కేప్..?
-
టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం
-
తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే
సాక్షి,తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్‌లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ ఛానెల్లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్‌గా ఉండి కూడా జగన్‌పై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైఎస్సార్సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వారికి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
-
తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
-
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేశారు. క్యూ లైన్లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్ ఇమేజ్ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్: తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్ దగ్గర సింగిల్ లైన్ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్ వద్ద ఒకే వ్యక్తి టోకెన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్ విచారం సాక్షి, హైదరాబాద్: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. -
కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి (ఫొటోలు)
-
ఆయనకు ఎన్ని నాలుకలో!
‘ఖర్చు పెట్టి మేం సినిమా తీస్తే... రేట్లు డిసైడ్ చేయ డానికి వాళ్లెవరు? వాళ్లకేం హక్కు ఉంది? చిత్ర పరిశ్రమ చిన్నదేమీ కాదు. కోట్లతో ముడిపడిన వ్యవహారం. అది బాధ్యతతో కూడింది.’‘సినిమాలనేవి చిన్న ఇష్యూ. మరీ చీప్‌గా అడ గొద్దు. అసలు వాటి గురించి అంతగా ఆలోచించను.’పరస్పర విరుద్ధమైన ఈ మాటలు అన్నది ఒకరే అంటే మీరు నమ్ముతారా? ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్! ఆయన మనిషొక్కరే, నాలుకలే రెండు... చాలా విషయాల్లోనూ ఆయనది ఇదే ధోరణి. కులాల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదంటారు. ఇష్టానుసారంగా మతాల గురించే మాట్లాడుతారు. ఆ మధ్య జరిగిన తిరుమల లడ్డూ వివాదంలో ఆయన ప్రవర్తించిన తీరే ఇందుకు ఉదాహరణ. అసలు లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలీదు. వేషం మార్చి ప్రజలను ఏ మార్చాలని ప్రయత్నించారు. ‘ఓ పవన్ స్వామీ అధికారంలో ఉన్నది నీవే. విచారణ జరిపించు. జరిగి ఉంటే దోషుల్ని శిక్షించు’ అని ఎంతమంది మొత్తుకున్నా చెవి కెక్కించుకున్న పాపాన పోలేదు. పైగా పాపానికి ప్రాయ శ్చిత్తం అంటూ గుడి మెట్లు కడిగారు. (తర్వాత ఈ విషయంపై కోర్టు చీవాట్లు పెట్టడం, విచారణకు ఆదేశించడం తెలిసిందే) నిజానికి కుల మతాలకు అతీతంగా ప్రజలు తిరుమల లడ్డూను పవిత్రంగా చూస్తార న్నది అందరికీ తెలిసిందే. ఇంత ‘సున్నితమైన’ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసిన ఘనుడు ఈయన.‘సార్... విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అదానీ పాత్ర అవినీతిపై మీరేమంటార’ని ఆ మధ్య మీడియా వారు ప్రశ్నించారు. ఒక్క క్షణం ఆలోచించకుండా ‘ఇది సున్నితమైన అంశం’ అంటూ జారుకున్నారు. సున్నితమైన లడ్డూ వివాదంలో ఊరంతా తెలి సేలా... పైగా మరో మత విషయాలు లాగి... ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పవన్‌కి ప్రభు త్వాల మధ్య జరిగిన వ్యవహారం సున్నితంగా కనిపించడం విడ్డూరమే! పవన్‌కల్యాణ్‌లోని కోణాలు వ్యక్తులను బట్టి మారతాయి. పరి స్థితులను బట్టి తారుమారవు తాయి. వైఎస్సార్సీపీలో క్షేత్ర స్థాయిలో ఒకడు తప్పు చేస్తే చాలు... ఆ క్షణమే ఆ తప్పును ఎండగడతారు. అంతటితో ఆగరు. ఆ పార్టీ అధినేత జగన్‌నూ దూషిస్తారు. స్వయానా జనసేన ఎమ్మెల్యే తప్పు చేసినా... ఓ దళిత ప్రొఫెసర్‌పై దాడికే దిగినా చూస్తుంటారు తప్ప... అస్సలు మాట్లాడరు.చేగువేరా ఇష్టమంటారు, ఎర్రజెండాతో జత కడ తారు. కొద్ది రోజులకే ఆ కత ముగిస్తారు. గాంధీజీకి జై కొడతారు... గాడ్సే మంచోడంటూ తన అన్నతోనే చెప్పి స్తారు. ‘పాచిపోయిన లడ్డూలు ఇచ్చార’ని బీజేపీపై తెగ ఆవేశపడిపోతారు. అంతలోనే నమోన్నమః అంటూ కాషాయానికి కట్టుబానిసవుతారు. ఒకటా రెండా... చెప్పుకుంటూ పోతే కల్యాణ్‌లోని కోణాలు కోకొల్లలు.– షబ్బీర్అన్నీ మాయమాటలే తప్ప...ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల్లో కంటే నిజ జీవితంలో బాగా నటిస్తాడని పేరు సంపాదించుకున్నారు. తన అభిమానులపై ఒక్కోసారి ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తారు. కోప్పడిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఛీ కొట్టడం, ‘మీరు లేకపోతే నేను లేనబ్బా’ అనడం ఆయనకే చెల్లింది. నిత్యం మాయమాటలతో అభిమాన తరంగాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు పవన్.‘ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాల్లేవు. ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వడా నికి టైం పడుతుంది. కనీసం సినిమాకెళ్లి చొక్కా చించుకుని అరవకపోతే... ఎక్స్‌లేటర్ పెంచుకుంటూ బైక్‌లో వెళ్లకపోతే... ఆ ఎనర్జీ అంతా ఎటెళ్తది?’ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్లో డిప్యూటీ సీఎం మాటలివి. లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివానని పలు సంద ర్భాల్లో చెప్పిన పవన్ అభిమానుల విషయంలో ఏ స్థాయిలో దిగజారి ఆలోచి స్తున్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.సినిమాలు, రాజకీయాలను మిక్స్ చేసేసి తన అభిమానులపై పూర్తిస్థాయిలో రుద్దుతూ వారికి మరో లక్ష్యం లేకుండా చేస్తున్నారాయన. ఇద్దరు అభిమానులు చని పోతే బాధ్యత లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనే నెట్టాలని చూసిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించ గలమని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాడు హీరోలు, దర్శకులు తదితరులు కలిస్తే గగ్గోలు పెట్టిన పవన్... అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకున్నారు.‘మీరు కోరుకున్నట్టుగా సీఎం స్థానానికి వెళ్లలేక పోయినా... డిప్యూటీ సీఎం అయ్యాను. రాష్ట్రానికి మంచి చేస్తాను. మీరు బాగా చదువుకుని బాగుపడండి’ అని చెప్పాల్సింది పోయి సినిమాల్లేకపోతే ఏం చేస్తార నడం ఎంత మాత్రం సబబుగా లేదనేది ప్రజాస్వామ్య వాదుల మాట. ఈ దేశంలో క్రికెట్, సినిమాలతో జనానికి విడదీయరాని అనుబంధం ఉంది. కానీ ఒకప్పటిలా వాటిపై పిచ్చితో లేరు. యువత కెరీర్ పైనే అధికంగా ఫోకస్ పెట్టింది. ఓటీటీలో వచ్చినప్పుడు ఆ మూవీ చూడొచ్చులే అనుకునే వారెందరో! మంచి చెప్పకుండా ఎక్స్‌లేటర్ పెంచి తిరగండి అంటే రోడ్డుపై తిరిగే జనం ఒప్పుకోరు.నిద్ర లేచింది మొదలు జగన్‌పై పడి ఏడుస్తుంటారు పవన్. కానీ జగన్ ఏనాడూ బాధ్యత మరిచి మాట్లాడ లేదు. ప్రతి ఇంట్లో ఉన్నత చదువులు చదివిన వారుండాలని కలలుగన్నారు. పేద కుటుంబాలు సమాజంలో గౌరవం పొందాలంటే చదువే మార్గమన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తన వంతు కృషి చేశారు. ఉద్యోగాలివ్వడానికి టైం పడుతుంది అనకుండా అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే యువతకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అవకాశాలు కల్పించారు. వారిలో పవన్ అభి మానులు కూడా ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయాలు చూడలేదు. యువత బాగుండాలని మాత్రమే కోరు కున్నారు.– వెంకట్ -
TTD: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?
తిరుపతి: తిరుమలలో (ttd) శ్రీవారి భక్తుల రద్ది తగ్గింది. ఆదివారం స్వామివారిని 66,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,647 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లను భక్తులు కానుకలుగా సమర్పిచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంటులో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి సుమారు 9 గంటల సమయం పట్టనుంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 4 గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (koil alwar thirumanjanam) జరగనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ ఆలయం శుద్ది చెయనుంది. రేపు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేసిన ఆలయ అధికారులు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే...తమిళంలో కోయిల్ అంటే కోవెల (గుడి) అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.మహాయజ్ఞం .. తిరుమంజనంక్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు.ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.ఆలయ ప్రాకారాలకు లేపనంనామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారుచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా సంవత్సరంలొ నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్ధానం, బ్రహ్మొత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేయబడినది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
Rashi Singh: తిరుమల మెట్లు ఎక్కిన హీరోయిన్ (ఫోటోలు)
-
తిరుమల సన్నిధిలో తెలుగు టాప్ కమెడియన్స్ (ఫోటోలు)
-
తిరుమల : హే.. గోవిందా! మళ్లీ ఆగమశాస్త్ర ఉల్లంఘన
-
Tirumala: తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (బుధవారం) 69,630 మంది స్వామివారిని దర్శించుకోగా 18,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.13 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభ శెట్టి (ఫోటోలు)
-
Tirumala: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల
తిరుమల: ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవింద నామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదంను పంచుకున్న భక్తులు తిరుమలలో నేడు (బుధవారం) తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. . మంగళవారం శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా, 19,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా
-
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.కాగా, అక్టోబర్ నెలలో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది.ఇదీ చదవండి: బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు -
శ్రీవారి సేవలో పీవీ సింధు దంపతులు
-
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫొటోలు)
-
9 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందురోజు టోకెన్లు జారీచేస్తామని ఈవో తెలిపారు.ఇందుకోసం తిరుపతి, తిరుమలలో కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫొటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీచేస్తామని తెలిపారు.టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి ఈవో తనిఖీ చేశారు. -
శ్రీవారి సన్నిధిలో రోజా
-
తిరుమలలో బ్రాండెడ్ హోటళ్లు
తిరుమల: తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా పేరొందిన బ్రాండెడ్ హోటళ్లు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. బ్రాండెడ్ హోటళ్లు వాటి పేరు, ప్రఖ్యాతుల కోసం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో మీడియాకు వివరించారు.తిరుమలలోని బిగ్, జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. లడ్డూల స్కాంపై విచారణ చెన్నైలోని టీటీడీ సమాచారం కేంద్రం నుంచి శ్రీవారి ప్రసాదాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంపై విచారణ చేపట్టామని ఈవో చెప్పారు. సోమవారం ‘సాక్షి’లో ‘శ్రీవారి లడ్డూల గుటకాయ స్వాహా!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై విచారణ చేపట్టామన్నారు. విచారణ అనంతరం లడ్డూలు పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఏస్వో శ్రీధర్ పాల్గొన్నారు. పాలకమండలి ప్రధాన నిర్ణయాలివీ » టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్టెన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు. » దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా కమిటీ ఏర్పాటుకు ఆమోదం. » స్విమ్స్ ఆస్పత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. » కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం. » భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ మేరకు ఏపీ డిజిటల్ కారొరేషన్ సహకారంతో భక్తుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయం. » మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం. » కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం. » భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం. » ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. » ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.అరగంటలో ‘వైకుంఠ ఏకాదశి’ టికెట్లు ఖాళీతిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేసిన అరగంటకే ఖాళీ అయిపోయాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతిస్తుంది. ఇందుకోసం ఆ పది రోజులకు 1.40 లక్షల రూ.300 టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. వీటి కోసం 14 లక్షలు మంది ఆన్లైన్లో పోటీపడ్డారు. -
పక్కదారి పడుతున్న శ్రీవారి లడ్డూలు
-
శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహా!
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటిదొంగల నిర్వాకంతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డూ ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి సింహభాగం స్వాహా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ తెగ గుండెలు బాదుకున్న ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు ఇప్పుడీ చేతివాటం గురించి తెలీదనుకోవాలా? తెలిసీ తెలియనట్లు నటిస్తున్నారనుకోవాలా? నిఘా విభాగం కూడా ఏమీ పట్టనట్లు ఉంటోంది. లోగుట్టు శ్రీవారికే ఎరుక. తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్ సమాచార కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ నిఘాలో పలు విషయాలు తెలిశాయి. ఇవిగో ఆ వివరాలు..తిరుమల: శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పించింది. ఇందులో భాగంగా.. తిరుమల శ్రీవారి లడ్డూ పోటు నుంచి నేరుగా చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలు.. విజయవాడ, విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపాలు.. హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాలకు వీటిని తరలించి భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ఎంతో సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ విధానానికి కొందరు ఇంటిదొంగలు శ్రీవారి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తూ తూట్లుపొడుస్తున్నారు. చెన్నై నడివీధుల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్నలడ్డూలు 2, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి రూ.1,500కు అమ్మేసుకుంటున్నారు.చెన్నైలో బ్లాక్మార్కెట్లోకి..తిరుమలలో ఉన్న పోటు ఏఈఓ ఏ సెంటర్‌కు ఎన్ని లడ్డూలు పంపించాలన్న ఇండెంట్, డిమాండ్ ఆధారంగా వాటిని పంపిస్తారు. చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున చెన్నై కేంద్రానికి ప్రతీవారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు పంపిస్తున్నారు. కానీ, చెన్నై టి.నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిగే దగ్గరే పెద్దఎత్తున లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ పదేళ్లుగా చెన్నైలో తిష్టవేసిన ఇద్దరు అసిస్టెంట్ షరాబులు ‘శ్రీనివాసుడి’ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి టీటీడీ వాహనంలో వచ్చిన స్టాక్‌ను ఇక్కడి సిబ్బంది శ్రవణం హాల్లో దించి అటునుంచి అటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో లడ్డూలను ట్రేల నుంచి బాక్స్‌లకు మార్చి ఓ ప్రైవేట్ వాహనంలో తరలించేస్తున్నారు. వచ్చిన లడ్డూల్లో కొన్నింటిని మాత్రమే విక్రయించి.. ఆ తర్వాత చిన్న లడ్డూల స్టాక్ అయిపోయిందంటూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టేస్తున్నారు. 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఏనాడూ సామాన్య భక్తులకు విక్రయించిన దాఖలాల్లేవు. నిఘా వైఫల్యం..తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం అధిక ధరకు విక్రయిస్తే తీవ్రంగా పరిగణించే విజిలెన్స్ అధికారులు.. ఇక్కడ వేలకు వేలు లడ్డూలు ప్రైవేట్ వాహనంలో పక్కదారి పడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కంచే చేను మేస్తోందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి ప్రైవేట్ వాహనాల్లో స్టాక్ తరలిపోతుంటే సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లోపలికి వచ్చే ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది రికార్డుల్లో ఎంట్రీ చేయాలి. కానీ, అలాంటిదేమీ జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. వాళ్లకు ఎలాంటి సంబంధం లేదంట?ఇదిలా ఉంటే.. చెన్నైలో జరుగుతున్న ఈ అవకతవకలపై తమకెలాంటి సంబంధంలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. కేవలం స్టాక్ పంపించడం వరకే తమ బాధ్యత అని చేతులెత్తేస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో టీటీడీ వాహనంలోనే ప్రసాదాలను పంపిస్తామని స్పష్టంచేస్తున్నారు. శ్రీవారి లడ్డూ విక్రయాలకు లెక్కా పత్రం లేదు..ఇక చెన్నైలో లడ్డూ ప్రసాదాల విక్రయాలకు లెక్కాపత్రం లేదు. సీసీ కెమెరాల నిఘా అంతకన్నాలేదు. అక్రమార్కుల ఆగడాలు చెల్లుబాటయ్యేలా సమాచార కేంద్రంలో ఉన్న శ్రవణం హాల్‌ను కేంద్రంగా చేసుకుని ఇష్టారాజ్యంగా బయటకు తరలించేస్తున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బట్టబయలైంది. నిజానికి.. లడ్డూ ప్రసాదం విక్రయం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలి. తిరుమలలో ఇస్తున్నట్లుగా ఆధార్ కార్డు ప్రామాణికంగా భక్తులకు రెండు లడ్డూలే ఇవ్వాలి. కానీ, ఇక్కడ అలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందకుండా ఏఈవో, అసిస్టెంట్ షరాబులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా ఇక్కడ తిష్టవేసిన సిబ్బందిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. లడ్డూ ప్రసాదాలు విక్రయించే కౌంటర్ నుంచి కాకుండా.. శ్రవణం హాల్ నుంచి విక్రయాలు చేస్తుండడంపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
శ్రీవారి సన్నిధిలో ఎంపీ తనుజా రాణి
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
ఆ పది రోజులు టోకెన్ లేకుంటే దర్శనం లేదు
తిరుమల: తిరుమలలో వచ్చేనెలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమ తించమని టీటీడీ పీఆర్వో విభాగం శని వారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో వచ్చేనెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్య మిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్ర మే అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ ఆర్ఐ మొదలైన వారికి పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్, విశేష దర్శనాలు రద్దు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించబడరు. 11 నుంచి 19 తేదీ వరకు అనుమతిస్తారు. 28న డయర్ యువర్ ఈవోటీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్ర మా న్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసా రం చేస్తుంది. భక్తులు తమ సందేహా లను, సూచనలను టీటీడీ ఈఓ శ్యామల రావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877– 2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది. -
తిరుమలలో అర్ధరాత్రి నుంచి ఎడతెగని వర్షం
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
తిరుమలలో భారీ వర్షం.. సీమకు ఎల్లో అలర్ట్
సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్‌పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్‌లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
తిరుమలలో నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుతో కలిసి ఏడడుగులు వేశారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ .. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తిరుమల వేదికగా నేడు చాందిని రావుతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు సాగడంతో వారు చాలా సంతోషంగా కనిపించారు. పెద్దల అంగీకారంతోనే జరిగిన ఈ వేడుకలో కలర్ ఫోటో సినిమాలో నటించిన హీరో సుహాస్, వైవా హర్ష పాల్గొన్నారు.'కలర్ ఫోటో' సినిమా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. సందీప్ రాజ్ ప్రస్తుతం సుమ- రాజీవ్ కనకాల తనయుడు రోషన్‌తో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: వైభవంగా పంచమితీర్థం
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
Tirumala: తిరుమలపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
-
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)