Tirupati
-
Tirumala: ఇక ఫ్లయింగ్ జోన్‌గానే తిరుమల?
తిరుపతి, సాక్షి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్ కొత్తేం కాదు. ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అంతెందుకు గతంలో టీడీపీ తరఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. కానీ, అడుగులు ముందుకు పడలేకపోయాయి. అయితే.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు విమానయానశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు భావించారు. కానీ, అదీ జరగడం లేదు.తాజాగా విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమలపై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు. ఈ లేఖకు మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని అన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు. అయితే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా.. తిరుమలను ఫ్లయింగ్ జోన్‌గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగమశాస్త్రం ఏం చెబుతోందంటే.. దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది. ఆలయాలు ఉన్నత ప్రాంతాలు. భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దైవానికి నివేదన చేసేటప్పుడు.. గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పించి.. మరేయితర శబ్ధాలు వినిపించకూడదు. అలా జరిగితే అది అపచారం. కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు, రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. పైగా తిరుమలలాంటి స్వయంవ్యక్త క్షేత్రం కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక కాబట్టి సముచితమైన రీతిలో కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం.. కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్‌ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.— Subramanian Swamy (@Swamy39) March 12, 2025అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు. -
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్‌లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్‌కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. -
టీటీడీ చరిత్రలో బ్లాక్ డే..!
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండపై కొలువైన వెంకన్నతో ప్రపంచ ఖ్యాతినార్జించిన తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయమూ సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువుగా రూ.153.16 కోట్లతో రన్ వేను విస్తరించి, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ట్రాన్స్– ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (డీవీఓఆర్), డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (డీఎంఈ) ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థల ద్వారా విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుందని విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నె చెప్పారు. అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా కనీస దృశ్యమానత (విజిబులిటీ) 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది. గ్లైౖడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గింది. వీటి ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాలు సజావుగా రాకపోకలు సాగిస్తాయని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఏదైనా సమస్య తలెత్తినా అక్కడ దిగాల్సిన విమానాలు తిరుపతిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా విమానాశ్రయాన్ని అభివృద్ది చేశారు. ఇప్పటివరకు 2,285 మీటర్ల పొడవు ఉన్న రన్న్వేను బలోపేతం చేసి, 3,810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహిస్తున్న విమానాశ్రయాలలోని రన్వేలలో ఇదే అతి పొడవైనది. తద్వారా బోయింగ్ 777, ఎయిర్‌బస్ 330 వంటి అతి పెద్ద, విశాలమైన విమానాలూ ఇక్కడ దిగే అవకాశం కలిగింది. ఆధునిక విమానాశ్రయం ఆధునిక నావిగేషన్ పరికరాల ఏర్పాటు ద్వారా విమానాశ్రయ సేవలు మరింత మెరుగవుతాయి. ముఖ్యంగా అధునాతన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ ద్వారా విమాన సర్వీసుల రాకపోకలు మరింత సులభంగా, సురక్షితంగా మారతాయి. పెద్ద విమానాల రాకపోకలకూ ఈ విమానాశ్రయం అనువుగా ఉంటుంది. రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌లో పనిచేసే వారి సౌకర్యార్థం తిరుపతి నుంచి నేరుగా కువైట్ విమానం ప్రారంభించాలని ప్రయతి్నస్తున్నాం. విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పరిశీలన కేంద్రం (ఎంఆర్ఓ) ఏర్పాటుకి గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచారు. ఆ దిశగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరాం. – ఎం. గురుమూర్తి, తిరుపతి ఎంపీ వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించడానికి 2017లో శంకుస్థాపన చేశారు. అయితే, భూములు ఇచ్చిన రైతులు పలు సమస్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోవటంతో విస్తరణ పనులు ముందుకు సాగలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించారు. నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పలుమార్లు రైతులతో సమావేశమై, వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. విమానాశ్రయం అభివృద్ధిపై అనేకమార్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ప్రధానికి విన్నవించారు. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సంబంధిత అధికారులను కలిసి పెండింగ్ పనులపై చర్చించారు. మూడు రోజుల్లోనే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సిద్ధం చేశారు. -
వసంత యోగం
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి. హైదరాబాద్ అమీర్‌పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్‌లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్‌లోని యోగా ఇన్ స్టిట్యూట్లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు. తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది. ఆరోగ్య భారత్ కోసం....రికార్డ్‌లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం. – వసంతలక్ష్మి – నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/ కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్ -
బోర్డు మెంబర్ నరేష్ తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించిన EO
-
ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు?
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.ఎఫ్ఐఆర్లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. -
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా
-
రెండో రోజు టీటీడీ ఉద్యోగుల నిరసన కొనసాగింపు
-
అభినయ్ ఓటమి కంటే.. అదే ఎక్కువ బాధించింది: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో పేదల కోసం పాటుపడే వ్యక్తి వైఎస్ జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా? అని ప్రశ్నించారు. కుట్రలకు తెరలేపిన వాళ్ళను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు.తిరుపతి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీనియర్ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్పీ నేతలు మండిపడ్డారు.తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘జగనన్నను గెలిపించుకోవాలని పేద ప్రజలు అందరూ భావిస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం అనే భావన వారిలో ఉంది. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియ సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని సమాచారం తెలుసుకుని జన ప్రవాహం తరలివచ్చింది. నిన్న విజయవాడలో వంశీని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ప్రజలకు చేసిందేమీ లేదు. పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు. నేను కార్యకర్తలు కోసమే పనిచేస్తాను అని చాలా స్పష్టంగా జగన్ చెప్పారు. ఆయన అనుచరులుగా, శిష్యులుగా మేము గర్వపడుతున్నాము. డిప్యూటి మేయర్ ఎన్నిక సందర్భంగా నమ్మకద్రోహం చేసిన వాళ్లం చూశాం. నా కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు బాధ కంటే, నేను నమ్మిన నాయకులు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్ళిపోయినప్పుడు బాధ పడ్డాను. అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా?. నెత్తిన పైసా పెడితే మారని వ్యక్తుల్ని నాయకుల్ని చేశాను. రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను. మేయర్ పదవి కోసం అవిశ్వాసం పెడితే త్యాగం చేసైనా కాపాడుకుంటాం. అవసరమైతే జగన్‌ను తిరుపతికి రప్పిస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం చేసేంత వరకు కష్టపడి పనిచేస్తామన్నారు.భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తుని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ పోరాటానికి తిరుపతి పార్టీ నేతలే స్పూర్తి. స్థానిక సమస్యలపైన రానున్న రోజుల్లో మరింత ఉద్యమం చేస్తాం. మీ పాలనలో తిరుపతి టౌన్ బ్యాంక్ అప్పుల్లో కూరుకు పోయింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని, హ్యూమన్ రైట్స్, కేంద్ర ఎన్నికలు సంఘం, లోక్‌సభలో ప్రివిలేజ్ మోషన్ కింద పెడతామన్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన మరింత పోరాటం చేస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, రౌడీలు కలిసి పోయి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి చేశారు. కుట్రలు తెరలేపిన వాళ్లను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య వేదికలు, రాజ్యాంగ హక్కుల వేదికల దృష్టికి తీసుకు వెళ్తాం. కుట్రలో భాగస్వామ్యం అయిన వారు అందరికీ బుద్ధి చెబుతాం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు.తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి అనేది రాష్ట్రంలో చర్చ లేదు. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. ఎలా వేధించాలి అనేది చర్చ జరుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అమ్మాయిల వీక్నెస్.. నేనింతే: లక్ష్మితో కిరణ్ రాయల్!
తిరుపతి, సాక్షి: సంచలనంగా మారిన జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్లిప్ బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే.. ఎలాగైనా డబ్బులిచ్చేస్తానంటూ కిరణ్ బాధితురాలితో చెప్పిన మాటలు బయటకొచ్చాయి. అంతేకాదు..అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడిన మాటలు కూడా ఆడియో క్లిప్‌లో ఉన్నాయి. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆడియోలో ఏమని ఉందంటే.. ‘‘నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా... ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం ఫర్వాలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారెంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabutvam) రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా’’ అని కిరణ్ రాయల్(Kiran Royal) తన మాటల గారడీని లక్ష్మిపై ప్రయోగించాడు. నా కూతురి మీద ఒట్టు.... నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చు..’’ అంటూ బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆ ఆడియోలో వాయిస్ ఉంది. -
‘తెలుగు వికీపీడియా పండగ-2025’ విజయవంతం
సాక్షి,తిరుపతి: తిరుపతిలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకుపైగా వ్యాసాలను కలిగి ఉండడం విశేషం.సదస్సు సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి ప్రజలకు వికీపీడియాపై అవగాహన కల్పించారు."తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావచ్చని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకుడిగా యర్రా రామారావు సత్కారం పొందారు. వికీ పునస్కార గ్రహీతల్లో ఎన్.ఆర్. గుళ్ళపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేష్, బి.కె. విశ్వనాధ్ తదితరులున్నారు. -
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్‌చుప్‌గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. -
కిరణ్ రాయల్‌కు శ్రీవారి వస్త్రం, నల్లి సిల్క్స్‌తో సంబంధమేంటి?: లక్ష్మీ
సాక్షి, తిరుపతి: జనసేన నాయకుడు కిరణ్ రాయల్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు లక్ష్మీ. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అమ్ముకుని బ్రతికే వ్యక్తి కిరణ్ అని చెప్పారు. అలాగే, శ్రీవారి వస్త్రం అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. ఇదే సమయంలో అమ్మాయిలను మోసం చేసి విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి కిరణ్ రాయల్ అని ఆరోపించారు. ఆయన కుటుంబానికి కావాల్సింది డబ్బులు మాత్రమేనని వెల్లడించారు.జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీ శనివారం తిరుపతితో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మీ.. ‘కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు. అంత లగ్జరీ జీవితం ఎలా గడుపుతున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి.. ఇంత డబ్బు ఎక్కడిది?. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని బ్రతుకుతున్నాడు. తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేసే దుర్మార్గుడు. కిరణ్ రాయల్‌కు చెన్నైలోని నల్లి సిల్క్స్‌తో ఏం సంబంధం ఉంది?. తాను మోసం చేసే ప్రతీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లి వారితో ఖరీదైన చీరలను కొనుగోలు చేయిస్తాడు. వేలు ఖర్చు చేయించి మరీ చీరలు కొంటాడు. నల్లి సిల్క్స్లో ఏం జరుగుతుందో నేను చెప్పను. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక, తిరుమలలో శ్రీవారికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే వస్త్రం అది. ఒక టికెట్ ద్వారా అది ఇస్తారంటా. అక్కడ కొన్ని చీరలను ఇంటికి తీసుకువచ్చి పసుపు, కుంకుమ చల్లి.. రాత్రి వాళ్ల ఇంట్లోనే ఉంచి.. దేవుడి చీరలని అమ్ముకుంటాడు. శ్రీవారి వస్త్రం టికెట్ అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు. వస్త్రం, చీరల బాధితులు కూడా ఉన్నారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఏడు కొండల స్వామిని కూడా మోసం చేస్తున్న వ్యక్తి కిరణ్. ఇలా మోసం చేసి సంపాదించడమే కిరణ్ రాయల్‌కు తెలుసు. ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసి.. అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు.. బెదిరిస్తాడు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇవ్వన్నీ అతడి భార్యకు, కుంటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ, వారికి కావాల్సిందే డబ్బు మాత్రమే. అందుకే కిరణ్‌కు వారి సపోర్టు ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కిరణ్ రాయల్ పరమ నీచుడు.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు: లక్ష్మీ -
కూటమి మాయ.. 460 కోట్ల భూమి 31 లక్షలకే!
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శ్రీ గాలి గోపురం మఠానికి చెందిన అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆక్రమణదారులకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, స్వధర్మ విజ్ఞాన వేదిక కన్వీనర్ వీవీఆర్ కృష్ణంరాజు ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. 1413వ సంవత్సరంలో తిరుపతిలో ఏర్పాటైన గాలి గోపురం మఠానికి ఉన్న విలువైన భూముల్లో 23 ఎకరాలు అనేక సంవత్సరాల క్రితం ఆక్రమణలకు గురయ్యాయని.. ప్రస్తుతం వాటి విలువ ఎకరం రూ.20 కోట్లు ఉంటుందన్నారు. ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.460 కోట్లు కాగా.. దానిని కేవలం రూ.31 లక్షలకే ఆక్రమణదారులకు కట్టబెట్టడానికి దేవదాయ శాఖ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. నిజానికి.. ఈ భూముల వివాద పరిష్కారానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయగా అది 2022 ఆక్టోబరు 10న ఇచ్చిన నివేదికలో ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఆక్రమణలు క్రమబద్ధీకరించాలని సూచించిందని కృష్ణంరాజు వివరించారు.అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నివేదికను బుట్టదాఖలు చేయగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇదే నివేదిక సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈఓ కార్యాలయం ఎదురుగా సింగాలకుంట నుంచి ఇస్కాన్ రోడ్డు వరకూ విస్తరించిన ఈ ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం రూ.40 వేలు ఉందని, ఇంత విలువైన భూమిని ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఎలా క్రమబద్ధీకరిస్తారని వారు ప్రశ్నించారు. ఆక్రమణల చెరలో 87 వేల ఎకరాలు.. ఇక చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందని, ఆక్రమణలకు గురైన భూములను కారుచౌకగా క్రమబద్ధీకరించడానికి నాంది పలికిందని ప్రసాదబాబు ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సర్వే నెంబర్ 233లోని ఎకరా 72 సెంట్ల భూమిని గజం కేవలం రూ.500లకే విక్రయించిందని గుర్తుచేశారు. అయితే, 2019 సెప్టెంబరులో అప్పటి సీఎం జగన్ హయాంలో టీటీడీ సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 188 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం దేవదాయ శాఖకు ఉన్న మొత్తం నాలుగున్నర లక్షల ఎకరాల భూముల్లో 87వేల ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయని.. వాటిని కూడా అతితక్కువ రేట్లకే క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రసాదబాబు ఆరోపించారు. -
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
-
మరో వీడియో విడుదల చేసిన కిరణ్ రాయల్ బాధితురాలు
సాక్షి, తిరుపతి: కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. ‘‘నేను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదు.. నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్ రాయలే కారణం’’ అంటూ ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను తిరుపతిలో కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు అండగా ఉంటారా?’’ అని లక్ష్మి ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అభ్యర్థించినా నాకు న్యాయం జరగలేదు. నేను తిరుపతికి వచ్చిన వెంటనే మరో వ్యక్తి ఉన్నాడు ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను’’ అని లక్ష్మి పేర్కొన్నారు. కాగా, కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమెకు జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్‌కు షాక్కాగా, తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ మొదటిసారిగా లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా సంచలనంగా మారింది.సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇవాళ బెయిల్ వచ్చిన తర్వాత లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్ -
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు? -
లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్‌రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi)ని సోమవారం తిరుపతిలో జైపూర్ పోలీసులు అరెస్ట్(Jaipur Police Arrest) చేశారు. కిరణ్‌రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు.ఇప్పుడు అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకెళ్లిన పోలీసులుజైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్టుచేశాక రుయాలో పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలో లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుప రిచారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని మీడియా వారు లక్ష్మిని ప్రశ్నిస్తుంటే.. ఆరోగ్యంగా ఉందని పోలీసులు సమాధానం ఇస్తూ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందిలక్ష్మిపై 2021లో జైపూర్‌లో కేసు నమోదైందని, అందులో ఆమె ఏ6గా ఉన్నారని, ఈ కేసుకు 41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందని తిరుపతికి చెందిన న్యాయవాది విజయకుమార్ తెలిపారు. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో కాలేదని చెప్పారు. పవన్ అభిమానినని కాలర్ ఎగరేసుకు తిరుగుతా రెండేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది వైఎస్సార్సీపీనే అని జనసేన నేత కిరణ్‌రాయల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వైఎస్ జగన్‌పై తాను పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే తనకు రూ.10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారన్నారు. రూ.25 లక్షలు లక్ష్మికి ఇచ్చి తనపై ప్రయోగించారని ఆరోపించారు. తాను పవన్ అభిమానినని, కాలర్ ఎగరేసుకు తిరుగుతానని చెప్పారు. -
తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నా వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని కిరణ్ రాయల్ నన్ను బెదిరించేవాడు. మహిళలను మోసం చేయాలని ఆయనకు పవన్ కళ్యాణ్ చెప్పారా?’ అని జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi) ప్రశ్నించారు. కిరణ్ రాయల్‌పై తాను సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత జనసేన పార్టీ నాయకులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లా డారు.‘నా బాస్ వస్తున్నారు... డబ్బులు కావాలని కిరణ్‌రాయల్ అడిగేవాడు. అందుకే నాకు అత్తగారి నుంచి వచ్చిన ఆస్తులు విక్రయించి కిరణ్‌రాయల్‌కు ఇచ్చాను. కిరణ్ రాయల్ అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే. నాకు ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారం ఇప్పించాలని పవన్‌కళ్యాణ్‌ను కోరుతు న్నా. అప్పుల వాళ్ల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నేను చెప్పేవి అబద్ధాలైతే కాణిపాకం వచ్చి కిరణ్‌రాయల్ ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా’ అని లక్ష్మి చెప్పారు. నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు...‘కిరణ్ రాయల్ చేతిలో మోసపోయింది నేను ఒక్కదాన్నే కాదు... మరో అమ్మాయి కూడా ఉంది. అతని కోసం ఆమె సొంత బిడ్డను కూడా వదిలేసింది. ఆమె తర్వాత నన్ను నాశనం చేశాడు. ఆ అమ్మాయి విషయం బయటపెట్టకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. కిరణ్ రాయల్ నా వద్ద డబ్బులు ఉన్నంతవరకు వాడుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల కోసమే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నా బిడ్డకు సర్జరీ కోసం డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడి ఖాళీ చెక్ తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు. అందుకు సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆడబిడ్డకు కష్టం వస్తే ముందు ఉంటానని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారే.. మరి కిరణ్ రాయల్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోట్ విడుదల చేస్తే సరిపోతుందా?’ అని లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే తన నుంచి తీసుకున్న నగదుకు రెండు రెట్లు అధికంగా తిరిగిస్తానని కిరణ్‌రాయల్ చెప్పాడని, అతని మాటలు నమ్మి మోసపోయానని తెలిపారు.అధికార బలగాన్ని ఉపయోగించి తన ప్రాణం తీసినా.. తన ఇద్దరు బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆమె కన్నీటిపర్యంతమవుతూ పలు ఆడియోలు, వీడియోలు, చెక్కులు, బాండ్ పేపర్లను మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అంతుకుమందు ఆమె తిరుపతి ఎస్పీని గ్రీవెన్స్‌లో కలిసి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కోరారు. కిరణ్ రాయల్ చేసిన అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను అందించారు. -
కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు?
తిరుపతి: కూటమి ప్రభుత్వంలోని నేతల అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. అరెస్టులు, దాడులు తప్పితే న్యాయం జరగదు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘రెడ్‌బుక్’ పాలన షురూ చేస్తారు.ఆంధ్రా బిడ్డకు ఈ అన్యాయమేంటో?.నాకు అన్యాయం జరిగింది మహాప్రభో.. న్యాయం చేయండి.. నేను ఒక జనసేన నాయకుడి చేతిలో మోసపోయాను’ అని అరిచి గీపెట్టుకుంటే ఆమెను అరెస్ట్ చేసిన వైనం ఏమిటో అర్థం కాదు. అది కూడా జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎక్కడో ముంబై లో ఉండే సినీనటి కాదంబరి జెత్వానిని తీసుకొచ్చి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం అంటూ బీరాలు పలికిన కూటమి ప్రభుత్వం.. నేడు ఆంధ్ర ఆడబిడ్డకు జనసేన నేత అన్యాయం చేశాడు అని కేస్ పెడితే రివర్స్ లో పాత కేస్ ఏదో ఉందని ఇప్పుడు ఆ మహిళను అరెస్ట్ చేయించారు.కూటమి ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక్కో న్యాయం అనుకుంటా...?అరెస్ట్ అంటూ ముందుగానే జోస్యం?రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ మీడియా ముఖంగా చెప్పాడు కిరణ్ రాయల్. తిరుపతి జనసేన ఇంచార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేతికి కోటి ఇరవై లక్షలతో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసం పోయింది లక్ష్మీ అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే.. ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్. ‘ చూడండి.. ఆమె రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వుది.. జైపూర్ నుంచి పోలీసులు వస్తారు’ అని చెప్పాడు.ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వస్తారని కిరణ్ కు ఎలా తెలుసు. ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్ పోలీసుల్ని రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని, ఏకంగా జైపూర్‌కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్ నుంచి పోలీసుల్ని ఇక్కడకు రప్పించి ఆమెను అరెస్ట్ ేచేయిండంలో చక్రం తిప్పింది ఎవరు? అనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో #saveAPFromRedbookRuling అనేది ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతోంది. -
లక్ష్మి ఇంట్లోకి జనసేన కిరణ్ రాయల్
-
పవన్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కిరణ్ రాయల్ సంగతేంటి..?
-
మోసపోయిన నన్నే తిరిగి ట్రోల్ చేస్తున్నారు : లక్ష్మి
-
జనసేన తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై లక్ష్మి ఫిర్యాదు
-
ఎవరీ కిరణ్ రాయల్?
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్వారు.. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్‌రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్‌రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్‌కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్‌పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటి వెలుగులోకి.. కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.మాయమాటలతో మహిళలకు వల!తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది. రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది. నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్‌ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్‌పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.సస్పెన్షన్‌కు రంగం సిద్ధం! సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్‌ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్‌రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు స్పష్టం చేశారు.ఎవరీ కిరణ్? కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్‌లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్‌గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్‌కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్‌కల్యాణ్‌కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.దర్శన టికెట్లలో అవినీతి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్‌రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్‌ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్‌ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం. ‘గో బ్యాక్ ఆరణి అంటూ’.. జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్‌ను సైతం బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
అమాయక మహిళను బెదిరించి మోసం చేసిన జనసేన నేత కిరణ్ రాయల్
-
నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా: కిరణ్‌రాయల్
నీ పిల్లల కాళ్లు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన బాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరెంతో మంది కిరణ్‌రాయల్ బాధితులు బయటకొస్తారు మీడియాతో బాధితురాలు లక్ష్మి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్‌రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది.తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిరణ్‌రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.పత్రికలో రాయలేని భాషలో ఆ మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్‌ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్‌రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌కళ్యాణ్ న్యాయం చేయాలి: బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్‌కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని చెప్పారు. కాగా, కిరణ్‌రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్‌రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలి.. ఇదిలా ఉండగా.. కామాంధుడు కిరణ్‌రాయల్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతాయాదవ్, మధుబాల, విజయరాయల్, దుర్గా, రాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించండి : పవన్‌కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్‌రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించారు. అతని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్‌రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్‌రాయల్‌పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదుఅయినా పట్టించుకోని పోలీసులు తిరుపతి క్రైం: కిరణ్‌రాయల్‌పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్ష్మి భర్త బృందకుమార్రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్రెడ్డికి కిరణ్‌రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నా వెనుక పవన్‌కళ్యాణ్ ఉన్నాడు.. ‘నా ఆరి్థక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లలను చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారు నగలను, డబ్బులను తిరిగి ఇచ్చేస్తా..’ అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్‌రాయల్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం రూ.పదకొండు లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రూ.కోటీ ముప్పై రెండు లక్షలు, 300 గ్రాముల బంగారు నగలను తీసుకుని.. ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే ‘నిన్ను, నీ బిడ్డలను నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా’ అంటూ బెదిరించే వాడని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెనుక పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద వాళ్లున్నారని బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని ఆధారాలనూ సైతం పోలీసులకు అందించారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
కిరణ్ రాయల్ మోసాలపై లైవ్ లో బాధితురాలు
-
జనసేన కిరణ్ రాయల్ లీలలు.. వెలుగులోకి మరో సంచలన వీడియో
సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలుజనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరించారు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేదని.. మహిళలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఇదేనా మీరు రక్షణ కల్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమగ్ర విచారణ జరిపించాలిజనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. పార్టీ నాయకుడు కాబట్టి చర్యలు తీసుకోమంటే చూస్తూ ఊరుకోం. కిరణ్ రాయల్ తప్పు ఉందని విచారణలో తేలితే ఆందోళన చేపడతాం. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్మరోవైపు, కిరణ్ రాయల్ నీచుడు.. రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు. కిరణ్ రాయల్‌ను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
జనసైనికుడి చీకటి బాగోతాలు
-
జనసేన నాయకుడి అరాచకాలు
-
తాజాగా వెలుగులోకి వచ్చిన జనసేన నేత కిరణ్ రాయల్ మరో వీడియో
-
కిరికిరి కిరణ్ రాయల్.. అమాయక మహిళను బెదిరించి మోసం..
-
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్‌రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్‌చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్‌రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్‌రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్‌ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.బాధితురాలు ఏమంటోందంటే..తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్‌రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్కి ఫోన్‌చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.బూతులు తిడుతూ..వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్‌రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్‌లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్‌ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్‌రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్‌రాయల్ తనకు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్‌లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి. -
AP: కూటమి సర్కార్ లీలలు.. పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేతలు!
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్ చేస్తూ కొందరు కూటమి నేతలతో ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత జరిగింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లపై కూటమి నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో తాజాగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్లలోని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం, అర్థరాత్రి వేళ రేణిగుంట పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.ఇదిలా ఉండగా, చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారు. అర్థరాత్రి ఇల్లు కూల్చివేయడంతో గువ్వల కాలనీవాసులు ఆర్తనాదాలు చేశారు. గువ్వల కాలనీలో 52 కుటుంబాలను ఖాళీ చేయించి ఇంటి సామాన్లను పోలీసులు సహాయంతో అధికారులు బయట పడేశారు. దీంతో, వారి ఆవేదన తెలుసుకుంటున్న మీడియాను సైతం రేణిగుంట పోలీసులు అడ్డుకున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. తమను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపారని విలపిస్తున్నారు. -
ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడీ బాంబ్ పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు ఆగంతకుడు మెయిల్ చేశాడు. కళాశాల అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ కళాశాలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కేరళ రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చినట్టు కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గతంలో కూడా పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డిపై తప్పుడు కేసు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డి(Bhumana Abhinay Reddy)పై కేసు నమోదైంది. అలిపిరి పోలీస్ స్టేషన్(Alipiri Police Station)లో భూమన అభినయ్‌పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. రాజేష్ అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో అక్రమ అరెస్ట్‌ను అభినయ్‌రెడ్డి నిలదీశారు. రాజేష్‌ను పీఎస్ నుంచి తీసుకెళ్లారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదైంది.కాగా, సోమవారం నిర్వహించాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కూటమి గూండాల బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిప్యూటీ మేయర్ పదవిపై కన్నేసిన నేపథ్యంలో టీడీపీ గూండాలు మొదటి రోజు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో ఉప ఎన్నిక సమావేశ మందిరానికి వెళ్తున్న బస్సుపై రాడ్లతో దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. దీంతో కోరం లేక ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. నడి రోడ్డులో ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పచ్చముఠాలు రెండో రోజు మరింత బరి తెగించాయి. ఉప ఎన్నిక వాయిదా పడిన వెంటనే అదే రోజు రాత్రి కిడ్నాప్‌నకు గురైన అనీష్ రాయల్ భార్య మమతను సైతం కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి.. అనీష్ రాయల్ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్ డ్రైవర్ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది. -
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేసిన టీడీపీ గూండాలు
-
ఇవాళ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు
-
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం
-
‘పచ్చ’ తాలిబన్లు.. కూటమి గూండాల విధ్వంసకాండ
Updates:మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు. ⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. -
తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్.. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌చేసి కూటమి గెలిచింది. దాడులు, దౌర్జన్యాలతో మునికృష్ణను కూటమి గెలిపించుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిక జరిగిదని.. ఈ గెలుపు ప్రజాస్వామ్య విరుద్ధం అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.కూటమి మోసం చేసి గెలిచింది: భూమన కరుణాకర్రెడ్డిడిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి మోసం చేసి గెలిచింది. కూటమి క్యాన్సర్ కన్నా ప్రమాదం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విరోచితంగా పోరాడారు. మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించారు. ఎమ్మెల్సీనే ఓటింగ్‌కు రాకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. మేయర్‌ను దించాలని కూటమిప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కాగా, మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు.వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. -
అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
సాక్షి, తిరుపతి జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేత రవి నాయుడు.. దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది.తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది.కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌ను టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ సతీమణి కిడ్నాప్‌నకు యత్నంతిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ రాయల్ సతీమణి మమతను కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తిరుపతిలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వారిలో అనీష్ రాయల్ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్ రాయల్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.సమాచారం తెలసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతను ఆర్సీ రోడ్డులోని రాయల్ నగర్లో పారీ్టకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.వెంటనే అభినయ్ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్లపై దాడి చేయగా, అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు. -
తిరుపతిలో హైటెన్షన్.. పోలీసుల ముందే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్
-
చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం తిరుపతి మేయర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని కామెంట్స్ చేశారు. -
భూమన కరుణాకరరెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
-
తిరుపతిలో కూటమి గూండాగిరి
-
తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన నేతల రాళ్ల దాడి
సాక్షి, తిరుపతి: మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై మూకలు రాళ్లతో దాడి చేశాయి. అనంతరం, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. వివరాల ప్రకారం.. తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించారు. శంకర్ యాదవ్ ఓవరాక్షన్ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు.ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్పొరేటర్లను రక్తం వచ్చేలా కొట్టారు. మేము పోలీసులకు ఫోన చేసినా కావాలనే ఆలస్యంగా వచ్చారు. మా కార్పొరేటర్ల కొడ్నాప్కు యత్నించారని తెలిపారు. తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. అనంతరం, వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ మాట్లాడుతూ.. కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ కూటమి నేతల అరాచకం.. అర్ధరాత్రి రమాదేవి ఇంటిపై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరులో భాస్కర హోటల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు నిర్బంధించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా ప్లాన్ చేశారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు రాకుండా కూటమి నేతలు హోటల్లో నిర్బంధించారు. కార్పొరేటర్లు బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు. రౌడీయిజం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు.హోటల్ వద్దకు అభినయ్ రెడ్డి వెళ్లడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీకి సంబంధించి జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ తదితరులు రౌడీలతో ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో ఆవరణలో ఉన్న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ఇంటిపై దాడి చేయించాడని ఆరోపించారు. దాడి జరగక ముందే జెడ్పీటీసీ భర్తను చంపేస్తామని మంత్రి ఫోన్ చేసి బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ మూకలు మంకీ క్యాప్‌లు ధరించి కత్తులతో ఇంటిపై దాడికి తెగబడినట్లు తెలిపారు. దీంతో, అర్ధరాత్రి గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. -
తిరుపతిలో భారీ చోరీ
తిరుపతి రూరల్: తిరుపతి శివారు తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మొత్తం నాలుగు విల్లాల్లోకి చొరబడిన దుండగులు రెండు విల్లాల్లోంచి దాదాపు 1.48 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల వారిని భయాందోళనకు గురిచేసింది. సీపీఆర్ విల్లాల సముదాయంలో 30కి పైగా విల్లాలున్నాయి. వాటి ప్రధాన ద్వారం వద్ద హై సెక్యూరిటీతో పాటు చుట్టూ సోలార్ ఫెన్షింగ్, అక్కడక్కడా హై రెజల్యూషన్ సీసీ కెమెరాలున్నా.. దొంగలు చాకచక్యంగా లోనికి చొరబడ్డారు. ఆ రెండు విల్లాల్లో ఏమీ దొరకలేదు.. 81వ నంబర్ విల్లా యజమాని మేఘనాథరెడ్డి పైఅంతస్తులో నిద్రిస్తుండగా.. కింది అంతస్తులో కేజీ బంగారు ఆభరణాలను దోచుకున్నారు. 82వ నంబర్ గల విల్లా యజమాని కేశవులనాయుడు కుమారుడు జగదీష్ ఇంటి నుంచి 48 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కేజీల వెండి వస్తువులను చోరీ చేశారు. ఇక 80, 83 నంబర్లు గల విల్లాల యజమానులు వాటిని కేవలం గెస్ట్ హౌస్‌లుగా మాత్రమే వినియోగించుకుంటున్నారు. వాటి తలుపులను కూడా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులకు అక్కడ విలువైన వస్తువులేమీ దొరకలేదు. ఉదయాన్నే చోరీ విషయాన్ని గమనించిన యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతాపరంగా పటిష్టంగా ఉన్న సీపీఆర్ విల్లాలోకి దొంగలు ప్రవేశించడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. -
ఇంత అరాచకమా?.. ‘కూటమి’ మితిమీరిపోతుంది: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు...చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు. -
తిరుపతిలో భారీ చోరీ
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,871గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు కాగా, నిన్న తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,257గా ఉంది. -
కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధుల్లేవు: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్‌కు మెయిల్ చేయాలి.కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్‌రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం. గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు. -
తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
-
కూటమి కవ్వింపు.. వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేతకు ప్లాన్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కూటమి సర్కార్ అండతో ఏపీలో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు దిగారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు.ఇక, కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతిలో @JanaSenaParty కక్ష సాధింపు రాజకీయాలు వైయస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చేసేందుకు కూటమి నేతలు పన్నాగం శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ.. లీగల్ టీమ్‌తో కలిసి ఆ భవనం వద్దకు వెళ్లిన తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్… pic.twitter.com/rfB5G03b6F— YSR Congress Party (@YSRCParty) February 1, 2025 -
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
180 రోజులు..14 రాష్ట్రాలు.. 4,900 కి.మీలు
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు. గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు. -
‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మరో ఆరుగురు అరెస్ట్
తిరుపతి క్రైం: డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలికి ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక వీడియో కాల్ వచ్చింది. ‘‘నేను ఢిల్లీ నుంచి సీబీఐ అధికారిని మాట్లాడుతున్నాను. రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించాను’’ అని నమ్మించాడు. వృద్ధురాలి పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి చట్ట వ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయని, అందువల్ల డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేశారు. వివిధ అకౌంట్లలోకి నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి, మనీ ల్యాండరింగ్ కేసుతో సంబంధం లేకపోతే తరువాత డబ్బులు రిలీజ్ చేస్తామని నమ్మించారు. వృద్ధురాలు తన ఖాతాలో ఉన్న రూ.2.50 కోట్లు వారు చెప్పిన వివిధ అకౌంట్లలో జమచేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో ఈ నెల 13న వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 22న అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ మణికంఠ రాజమండ్రి కి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 24.5 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 16 గ్రాముల బంగారం కూడా స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. అదే కేసులో తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, సిమ్ మాడ్యూల్‌ను సీజ్ చేశామని, మరో రూ. 10 లక్షలు ఫ్రీజ్ చేశామని చెప్పారు.నిందితుల వివరాలు 1. సింగంపల్లి గణేష్(34), త్రినాధపురం, విశాఖపట్నం. 2. పాలకొల్లు రవికుమార్(28), చిన్న వాల్తేరు, విశాఖపట్నం . 3. యుల్లి జగదీష్(37), సత్యనగర్, ఇండ్రస్టియల్ ఎస్టేట్, కంచరపాలెం, విశాఖపట్నం. 4. పెంకి ఆనంద్ సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (39), రామ్‌నగర్, శ్రీ హరిపురం, విశాఖపట్నం 5. ఊటా అమర్ ఆనంద్ (33), సుజాతా నగర్, గొల్లవెల్లివాని పాళెం, ఎల్ఐసి కాలనీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం రూరల్ 6. వాసుదేవ్(34), మురళీనగర్, విశాఖపట్నం -
తిరుపతి : సామూహిక సూర్యనమస్కార్–2025 (ఫొటోలు)
-
ఐపీఎస్ సుబ్బారాయుడుపై కూటమి సర్కారు ఎనలేని ప్రేమ
-
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
యువకులపై ఏనుగుల దాడి..ఒకరు మృతి
-
దేవుడి సంపద మీద పచ్చ ముఠా కన్నేసిందా ?
-
టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది. -
సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్!
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరుపతి సభలో హిందూ డిక్లరేషన్ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మానికి విరుద్ధంగా సాగుతున్న విషయాలపై ఎందుకు నోరు మెదపటం లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని నిలదీశారు. తిరుమలలో అపచారాలు, తిరుమల కొండకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శనివారం స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి గోవింద నామస్మరణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..సనాతన ధర్మం రక్షణ అంటే ఇదేనా?తిరుమల శ్రీవారు తమ కులదైవమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. హిందూ డిక్లరేషన్ అంటూ పవన్‌కళ్యాణ్ సభపెట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్ట విరుద్ధంగా ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇస్తూ దగా చేయడం దుర్మార్గం. చెప్పిందొకటి చేసేది మరొకటిగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉంది. – శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అధ్యక్షుడు, ఏపీ సాధు పరిషత్పవిత్రతకు భంగం కలిగిస్తే శంఖారావం పూరిస్తాంతిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులకు స్వస్తి చెప్పకపోతే గోవింద శంఖారావం పూరించి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాం. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మ విరుద్ధ పనులు సాగుతున్నా ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. మందు, మాంసాహార విందుల సౌకర్యాలతో కూడిన ముంతాజ్ హోటల్ ఏర్పాటును హిందూ సమాజం వ్యతిరేకిస్తోంది. – తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడురాజకీయం చేయడం దుర్మార్గంతిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చి ధర్మబద్ధతకు తూట్లు పొడవడం విడ్డూరం. సనాతన ధర్మం పేరుతో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్‌కళ్యాణ్ నేడు తిరుమలలో సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు సాగుతున్నా మాట్లాడకపోవడం దారుణం. ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం హేయమైన చర్య. తిరుమలకు మాంసాన్ని తీసుకెళ్లి పవిత్రతను దెబ్బతీసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించడం చేతకానితనానికి నిదర్శనం. – శివానంద స్వామీజీ, ఏపీ సాధు పరిషత్ ప్రతినిధిహోటల్ అనుమతులు రద్దు చేయాలితిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అలిపిరి సమీపంలో చట్టవిరుద్ధంగా చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులును వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో పవిత్రత దెబ్బతీసే కార్యక్రమాల పట్ల పటిష్ట చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పరిరక్షణను విస్మరించడం శోచనీయం. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్ర మంటగలుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం– విజయ భాస్కర్, హిందూ సంఘాల ప్రతినిధి, కర్ణాటకపుట్టగతులుండవుతిరుమల శ్రీవారితో చెలగాటాలాడితే పుట్టగతులుండవు. సనాతన ధర్మ పరిరక్షణ, తిరుమల ప్రక్షాళనే లక్ష్యమన్న కూటమి అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. తిరుమలకు మాంసం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. – సాధు మహరాజ్, శ్రీజ్ఞానపీఠం ప్రతినిధిధర్మరక్షణకు చర్యలు చేపట్టాలితిరుమలలో వరుసగా సాగుతున్న అపవిత్ర కార్యక్రమాలకు స్వస్తి పలికి సనాతన ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగితే ఆందోళనలు చేపట్టక తప్పదు.– కిరణ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
తిరుమలలో వరుస ఘటనలు: కేంద్ర హోంశాఖ సీరియస్
తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్ కుమార్ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధానంగా తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ భేటీ కానున్నారు. వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది. తిరుమలలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపంఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ(TTD) పాలకుల మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం -
మోసం చేసిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి: మహిళలు
-
Magazine Story: చంపేసి సారీ చెప్తే సరిపోతుందా..?
-
తిరుపతి జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు (ఫోటోలు)
-
డాక్టర్ అవతారమెత్తి.. చైన్ కొట్టేసి!
తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా రుయాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్ వార్డుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్ వేషం ధరించి చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది . ఈ క్రమంలోనే తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో చోటుచేసుకుంది... వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి పరిచయం చేసుకుంది. అనంతరం స్కానింగ్ కోసం తీసుకెళ్లి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్తకు ఇవ్వాలని చెప్పింది. అయితే శ్రీవాణి చేతివాటం ప్రదర్శించి ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. ఇందులో మరో చైన్ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగడంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. స్కానింగ్ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో బంగారు చైన్‌ను గుర్తించారు. వెస్ట్ పోలీసులకు యువతిని అప్పగించారు. -
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ వద్ద టెన్షన్ వాతావరణం
-
ప్రజలపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు: YV Subba Reddy
-
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
వేంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలకు విలువలేదు అన్నట్లు కూటమి సర్కార్ వైఖరి
-
భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..టీటీడీలో బాబు బినామీలు పాగా..పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు.ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగంతిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.పరారైన బాబు ముఠాతమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి. -
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
Big Question: తొక్కిసలాట వెనుక జనసేన కార్యకర్తలు.. ప్రజా శక్తిలో సంచలన వార్త!
-
భక్తులు పోతేనేం.. మనోళ్లు భద్రమే..!
‘సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు...! అయితేనేం..! మనోళ్లు సేఫ్ కదా...! ఇక కేస్ క్లోజ్ చేద్దాం..’... సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు!!‘ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు.. ఇక చాల్లే.. తగ్గు..!’... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారు!! ‘అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్‌చుప్...!’’‘అయినాకానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకు ఆదేశం..!’‘ఎవరో చెబితే మేం చేస్తామా?.. క్షమాపణలు చెప్పాలనడంపై బీఆర్ నాయుడు ప్రతి స్పందన!!సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యంతోనే తిరుపతిలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాట సంభవించి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని యావత్ భక్త కోటి మండిపడుతుండటంతో సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో రంగంలోకి దిగారు. ఈ దుర్ఘటన తమను కలచి వేసిందని మొసలి కన్నీళ్లు కారుస్తూ తిరుపతిలో హై డ్రామాకు తెర తీశారు. సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు... చిందులు తొక్కినట్టు వీడియో కెమెరాల ఎదుట కపట నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ చంద్రబాబు కుయుక్తులు బెడిసి కొట్టాయి. ఇవి కచ్చితంగా సర్కారీ హత్యలేనని యావత్ ప్రజానీకం తేల్చి చెప్పింది. దీంతో కొందరు అధికారులపై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే సమయంలో గతంలో తాము చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయని టీటీడీ అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చంద్రబాబు కుట్రలకు నిదర్శనం. వైఫల్యానికి కారకులైన తన అస్మదీయ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వారిని కాపాడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ఒక్కటే స్పష్టం చేస్తున్నాయి.. తిరుపతి దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని నిగ్గు తేలుస్తున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఈ డ్రామాలో తన వంతు పాత్రను రక్తి కట్టించారు. పనిలో పనిగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ససేమిరా అనడం గమనార్హం. సీఎం ఆదేశాల మేరకే ఆయన ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చినా పవన్ కళ్యాణ్ సూచనను మొదట తిరస్కరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలతో అసలు విషయాన్ని బయట పెట్టారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో టీటీడీ, ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఏమాత్రం సమన్వయం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్వాకాలు, వైఫల్యాల కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుని అమాయక భక్తులు మృత్యువాత పడినట్లు చంద్రబాబు సమీక్ష సాక్షిగా నిర్ధారణ అయింది.చైర్మన్, అదనపు ఈవో సేఫ్తిరుపతిలో భక్తుల దుర్మరణం దుర్ఘటనకు బాధ్యులైన అస్మదీయ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని విషాదానికి బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఆయన సమ్మతించకపోయినా ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించాలి. కానీ ఆయన్ను చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల్లో టీడీపీకి బాకాగా పని చేసిన టీవీ5 చానల్‌కు బీఆర్ నాయుడు అధినేత కావడం దీనికి ప్రధాన కారణం. ఇక శ్రీవారి ఆలయం దర్శనాలు, సౌకర్యాల కల్పనకు ప్రధాన బాధ్యత వహించాల్సింది తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరే! తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కూడా శ్రీవారి ఆలయ దర్శనం టికెట్ల కోసమే. అయినా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం కనీసం బదిలీ చేయలేదు. అస్మదీయ అధికారులకు రక్షణవైకుంఠ ఏకాదశి క్యూలైన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ విజిలెన్స్ డీఎస్పీ ఎన్టీ రామ్కుమార్దే. అయినా సరే ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఆయన ప్రధాన రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాట సంభవించిన ప్రాంతాలు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంత డీఎస్పీ వెంకటనారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే అదనుగా సహకరించని అధికారులపై వేటుతిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులైన అనుకూల అధికారులను కాపాడుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ తమకు సహకరించని అధికారులకు పొగబెడుతున్నారు. ఇదే అదనుగా గతంలో అక్రమ కేసుల నమోదుకు తమకు సహకరించని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ విజిలెన్స్ ప్రధాన అధికారి (సీవీఎస్ఓ) శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలంటూ శ్రీధర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అయితే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసుల నమోదుకు ఆయన తిరస్కరించడంతో తిరుపతి దుర్ఘటనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం శ్రీధర్‌ను బదిలీ చేసింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలతో ఏమాత్రం సంబంధంలేని తిరుపతి జేఈవో గౌతమిని ప్రభుత్వం బదిలీ చేసింది. అదే రీతిలో డీఎస్పీ రమణకుమార్, క్యూలైన్ల నిర్వహణతో సంబంధం లేని టీటీడీ గోశాల డైరెక్టర్ హర్‌నాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరిపై మంత్రుల ఫిర్యాదు.. వారించిన బాబుమంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి గురువారం సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరుపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఆ విషయాలు తరువాత మాట్లాడదామంటూ దాటవేశారు. బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోబోనని సంకేతాలిచ్చారు. ఈవో బదిలీకి రంగం సిద్ధం..టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వెంటనే బదిలీ చేస్తే ఆయనతోపాటు తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల తరువాత శ్యామలరావుని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవోకు అవమానం...!టీటీడీ ఈవో శ్యామలరావును సాగనంపేందుకు సిద్ధమైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు పొగబెడుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను అందరి ఎదుట ఏక వచనంతో సంబోదిస్తూ తీవ్రంగా అవమానించారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఈవో శ్యామలరావును చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్దేశపూర్వకంగానే అగౌరవపరిచేలా వ్యవహరించడం గమనార్హం. ఆలయంలో ఆయనతో ఎవరూ మాట్లాడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దన్నుతోనే ఆయన సామాజికవర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఇలా వ్యవహరిస్తున్నట్లు టీటీడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: ఉషశ్రీచరణ్
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగింది
-
తిరుపతి తొక్కిసలాట విషాదం.. పద్మావతి హాస్పిటల్ వద్ద దృశ్యాలు
-
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు
-
Big Question: ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
తల్లీ అధైర్య పడొద్దు.. నేనున్నాను
తిరుమల:‘తల్లీ ఏమైందమ్మా.. అధైర్య పడకండి.. నేనున్నాను’ అంటూ బాధితులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రి (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న బాధితులను పేరు పేరున పరామర్శించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. పడిపోయినా పట్టించుకోలేదు నాయనా?‘అయ్యా.. తండ్రీ.. కొడుకా’ అంటూ హైదరాబాద్‌కు చెందిన సావిత్రమ్మ, విశాఖపట్నంకు చెందిన ఆదిలక్ష్మి అనే వృద్ద మహిళలు ఆప్యాయంగా జగన్ చేయి పట్టుకుని మాట్లాడారు. ఈ రోజు నీతో మాట్లాడుతామని అనుకోలేదు తండ్రీ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తొక్కిసలాటలో కింద పడిపోయి సాయం చేయమని ప్రాధేయ పడుతున్నా ఎవరూ వచ్చి కాపాడలేదు తండ్రీ.. అంటూ విలపించారు. తమిళనాడుకు చెందిన ఆలగరాణి అనే మహిళ మాట్లాడుతూ.. టోకెన్ల కేంద్రం వద్ద ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని, తాను ఏం చెబుతున్నా అర్థం చేసుకునే వారు కనిపించలేదని కన్నీరు పెట్టుకున్నారు. తన పక్కన ఉన్న మహిళ తొక్కిస లాటలో తన కళ్ల ముందే చనిపోయిందంటూ బోరుమన్నారు. క్యూ లైన్ల వద్ద అధికారుల పర్యవేక్షణ సరిగా లేదని, ఏమి జరుగుతుందో చెప్పేవారు లేరని బాధితులు వైఎస్ జగన్‌కు విన్నవించారు. తాము ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి వస్తుంటామని, ఎన్నడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీ పెరుగుతున్నా పట్టించుకోలేదుటోకెన్లు ఇచ్చే కేంద్రం వద్ద ఉదయం నుంచీ వేచి ఉన్నామని, ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ బోరుమంది. గంట గంటకూ రద్దీ పెరుగుతున్నా అధికారులు గానీ, పోలీసులు గానీ క్యూలైన్లోకి భక్తులను వదిలి పెట్టలేదన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలాది మందిని వదిలి పెట్టడంతో తోపులాట జరిగి వందలాది మంది కింద పడిపోయారని మరో మహిళ వివరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తల్లీ..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తల్లీ.. అంటూ ఆరా తీశారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ‘క్షతగాత్రులకు అండగా ఉంటాం. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నా సొంత మనిషి. మీకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. దారి ఖర్చులతోపాటు మందులు, దుస్తులు, వాహనాల ఏర్పాటు తదితర విషయాలన్నింటినీ చూసుకుంటారు’ అని వైఎస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి క్షతగాత్రులకు వసతులు కల్పించారు. వారికి ఆర్థిక సాయం కూడా చేశారు. -
బాబు పాపాలే యమపాశాలై!
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల–తిరుపతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలే అమాయక భక్తుల పాలిట యమపాశాలుగా మారాయి! కక్ష సాధింపు చర్యలతో తిరుమల పవిత్రతకు కళంకం తేవాలన్న కుట్రతో సమర్థ టీటీడీ వ్యవస్థను దిగజార్చారు. ఇక తిరుమల–తిరుపతిని వేదికగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి సాగించిన సనాతన డ్రామా శ్రీవారి దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించి పటిష్ట వ్యవస్థను దెబ్బతీసింది. తన వందిమాగదులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి తిరుమల–తిరుపతిలో తిష్ట వేయించిన సీఎం చంద్రబాబు నిర్వాకాలే అమాయకుల అకాల మరణానికి కారణ భూతమ య్యా యి. లక్షలాది మంది తరలి వస్తారని తెలిసినా సరే కనీస ఏర్పాట్లలో తీవ్ర అల సత్వమే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాటకు దారితీసి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం పూర్తిగా చంద్రబాబు సర్కారు చేసిన హత్యలేనన్నది స్పష్టం! దీన్ని దురదృష్టకర ఘటనగా ముద్ర వేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నది యావత్ భక్త కోటి ఏకాభిప్రాయం. ఓ ప్రణాళిక లేదు.. సమీక్షలూ లేవుతిరుమలకు రోజూ 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏటా 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏటా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. తిరుమల జేఈవో నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, తిరుపతి పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. క్యూలైన్లలో భద్రత, ఇతర సౌకర్యాలను ఈవో, జేఈవో, ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షిస్తారు. అదనపు ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీలు, తహశీల్దార్లు, భారీ సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు 24 గంటలూ అక్కడే ఉంటూ ప్రణాళిక కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత పాలక మండలి వీటిపై దృష్టి పెట్టలేదు. టికెట్ల జారీకి కనీస మార్గదర్శకాలను పాటించలేదు. టికెట్ల జారీ ప్రణాళిక, ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించ లేదు. కనీసం అధికారులను ఆరా కూడా తీయలేదు.సర్కారు వైఫల్యాలకు రుజువులివిగో..వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్ల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి చేరుకుని ముందు రోజు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని ఎంజీవో పాఠశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా టీటీడీ వారిని క్యూ లైన్లలోకి అనుమతించకుండా రోడ్లపైనే నిలబెట్టేసింది. వచ్చినవారిని వచ్చినట్టుగా క్యూలైన్లలోకి పంపించి టికెట్లు జారీ చేసి ఉంటే భక్తులు సులభంగా ముందుకు కదులుతూ టికెట్లు తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ క్యూ లైన్లలోకి అనుమతించకుండా ప్రవేశ ద్వారం వద్దే గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారు. మరోవైపు ఎముకలు కొరికే చలిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.భోజనం, ఇతరత్రా అవసరాలకు బయటకు వెళితే మళ్లీ రద్దీలో రాలేమన్న ఆందోళనతో గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. టీటీడీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చారనే అంచనా కూడా వేయలేదు. ఆహారం, తాగు నీటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. ఉన్న కొద్ది మంది భక్తులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. లక్షలాది మంది భక్తులు గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించిన తరువాత.. తాపీగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించి గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉపద్రవాన్ని గుర్తించిన తరువాత కూడా టీటీడీ, పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించ లేదు. అసలు అక్కడ తగినంత మంది పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో (తిరుమల) వెంకయ్య చౌదరి నుంచి తక్షణ స్పందన కొరవడి విషాదం చోటు చేసుకుంది.తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇంతటి పెను విషాదానికి ప్రధాన కారణం. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా టికెట్ల జారీ కోసం పటిష్ట క్యూలైన్లు, ఇతర వ్యవస్థలు తిరుమలలో మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమల వెళ్లేందుకు అలిపిరి వద్ద అనుమతిస్తామని ప్రభుత్వం, టీటీడీ ప్రకటించాయి. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు పొందితే కానీ అలిపిరి దాటి వెళ్లలేరు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతిలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారనే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ కనీసం అంచనా వేయలేదు. పది రోజులపాటు దర్శనం ఏర్పాటు చేశామని చెబుతూ అతి ధీమాతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాయి. ఎన్ని రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించినా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికే లక్షలాది భక్తులు మొదటి ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని పట్టించుకోలేదు.బాబు విధేయుడు బదిలీతో సరిసాక్షి, అమరావతి: తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమివ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు. ఆశ్చర్యకరమేమిటంటే.. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ను వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి పాల్పడుతున్నారు. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయనకు మరో ప్రధాన పోస్టింగు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. భద్రత ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ల పరామర్శ ముగిసినప్పటికీ.. వైఎస్ జగన్‌ను ఆస్పత్రి వద్దకు వెళ్లకుండా కావాలనే అడ్డుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన స్విమ్స్‌కు బయలుదేరారు.అంతలో కూటమి ప్రభుత్వ పెద్దలు క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా జగన్ ఆలస్యంగా చేరేలా కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటగానే ఇసుక ట్రాక్టర్లు, లారీలను రోడ్డుపై ఆపేశారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసరావు వైఎస్ జగన్ వద్దకు వచ్చి.. ఇటుగా వెళ్లటానికి అనుమతి లేదు.. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి తాను వచ్చానని, వారి వద్దకు వెళ్తానని తేల్చి చెప్పారు.అందుకు డీఎస్పీ ససేమిరా అన్నారు. దీంతో తాను నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్తానని జగన్ వాహనంలోంచి కిందకు దిగారు. నడచుకుంటూ తిరుపతి వైపు పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌లు బయలు దేరారు. జగన్ వచ్చారని తెలిసి స్థానికులు పెద్దఎత్తున తరలి వచ్చారు. కిలోమీటర్ దూరం నడిచాక.. తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారులో వైఎస్ జగన్ ఎక్కి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద హై డ్రామా..వైఎస్ జగన్ స్విమ్స్‌కు చేరుకునేలోపే ఎనిమిది మందిని తరలించారని సిబ్బంది చర్చించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆస్పత్రి వద్దకు వచ్చినప్పుడు పోలీసుల భద్రత కల్పించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉండటంతో జగన్‌ను ఆస్పత్రి లోనికి అనుమతించకుండా అరగంట పాటు ఆపేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు, ప్రజలు భారీగా చుట్టుముట్టారు. జగన్ పర్యటన మొత్తం మీద అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది. -
దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో!
చిత్తూరు అర్బన్/తిరుపతి అర్బన్: ‘తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను వాళ్లే చేశారేమో..! దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి ఇలా చేశారని అనుమానం ఉంది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకో వడానికి తిరుపతిలో టోకెన్లు ఇస్తారనే విషయం నాకు తెలియదు’ అంటూ సీఎం చంద్రబాబు అన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల క్యూలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు గురువారం పరిశీలించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసలు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలాంటి ఘనటలు జరుగుతున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని, అలాకాదంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏకాదశి దర్శనం ఉంటుందన్నారు. పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. దీనికి ఆగమ శాస్త్రాలు ఒప్పుకుంటాయో లేదో తనకు తెలియదని చెప్పారు. ఆలయ పద్ధతులు ఆగమన శాస్త్రం ప్రకారం ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో కొన్ని మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం తన జీవితంలో చూడలేదని చెప్పారు. బీఆర్ నాయుడుకు ఇందులో అనుభవంలేదు కదా అని అన్నారు. బైరాగిపట్టెడ వద్ద పార్కులోని భక్తులను అనుమతించడం సరికాదన్నారు. భక్తుల రద్దీని చూసిన తరువాత అర్ధ గంట ముందే వాళ్లకు టోకెన్లు ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఇక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ రమణకుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి ఘటన స్థలంలో ఉండి కూడా పర్యవేక్షణలో విఫలమయ్యారని, వారిద్దరిన సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులుగా గుర్తించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, టీటీడీ జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. జరిగిన మొత్తం ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను టీటీడీ ద్వారా అందిస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తిమ్మక్క, ఈశ్వర్‌కు చెరో రూ.5 లక్షలు, గాయపడ్డ మరో 33 మందికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ 35 మందికి ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం కల్పించి, వారి సొంత ఊళ్లల్లో దిగబెడతామని చంద్రబాబు చెప్పారు.ముగ్గురిపై బదిలీ వేటుతిరుపతి ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు టీటీడీ జేఈవోను ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ జేఈవో(హెల్త్అండ్ఎడ్యుకేషన్) గౌతమిని ఆ పోస్టు నుంచి తప్పించారు. ఈమెను తక్షణమే జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, తిరుపతి (అర్బన్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడును కూడా బదిలీ చేశారు. వీరిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిర్లక్ష్యమే చంపేసింది
తిరుపతి తుడా/తిరుపతి సిటీ/చంద్రగిరి: మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. అరుపులు, కేకలు.. నరకయాతన శ్రీనివాసం సముదాయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు వేచి ఉన్న భక్తుల్లో సేలంకు చెందిన మల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. భక్తుల రద్దీతో తోపులాటలో భాగంగా ఆమెకు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో క్యూలైన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు భర్త కృష్ణన్ తెలిపారు. తొలుత అంబులెన్స్‌లో స్థానిక డీబీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించే క్రమంలో ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ ఘటన చోటు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే సత్యనారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ తోపులాట చోటు చేసుకుంది. అయితే ఇక్కడ పరిస్థితి కొంత సేపటికి అదుపులోకి రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో బైరాగిపట్టెడలోని రామానాయుడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద భారీ తోపులాట చోటు చేసుకుంది. దీనికి తోడు అదే సమయంలో తొక్కిసలాటలో కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లావణ్య స్వాతిని బయటకు తీసుకొచ్చే క్రమంలో వెలుపలదారి గేట్లను పోలీసులు తెరవడం మరింతగా తొక్కిసలాటకు కారణమైంది. అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అక్కడి నుంచి తోసుకొచ్చారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ముందు వరుసలోని భక్తులు కిందపడి పోవడంతో.. వెనుక ఉన్న వారు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అక్కడ ఏం జరుగుతోందో తెలియక వెనుక, ముందు ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి వెలుపలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కింద పడిన వారిని సైతం తొక్కుకుంటూ తమ కుటుంబ సభ్యులను కాపాడేయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.నీళ్లు లేవు.. టాయ్లెట్లు లేవు.. ఇవేం ఏర్పాట్లు?కౌంటర్ల వద్ద తాగునీరు, పాలు, అల్పాహారం అందించాలన్న కనీస ఆలోచన కూడా టీటీడీకి రాకపోవడం దుర్మార్గం అని భక్తులు మండిపడ్డారు. చాలా మంది భక్తులు ఆకలితో అలమటించి, నీరసించిపోయారు. క్యూలోంచి పక్కకు వెళితే వెనుకబడిపోతామనే భయంతో చాలా మంది అక్కడి నుంచి కదల్లేదు. చంటి పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు గంటల తరబడి వేచి ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహిళలకు కనీసం మొబైల్ టాయ్లెట్లను సైతం ఏర్పాటు చేయకపోవడంతో వారు నరకయాతన అనుభవించారు. ఇన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తుంటే.. ఏర్పాట్లు ఘనంగా చేశామని టీటీడీ చైర్మన్ మీడియాకు పదే పదే ఎందుకు చెప్పారని భక్తులు నిలదీశారు. దైవ దర్శనానికి వస్తే ప్రాణాలు తీశారని మండిపడ్డారు. -
దేవదేవా.. ఏమిటీ విషాదం!
వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవదేవుని దర్శనం చేసుకుంటే జీవిత కాలం ఆ తదాత్మ్యంలో, భగవంతుడు మోక్ష ప్రాప్తి కలిగిస్తాడన్న ఆనందంలో గడిపేయొచ్చు. ఇదే విశ్వాసంతో లక్షలాది భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమలేశుని దర్శించుకోవాలని తలంచారు. కానీ, ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్య ధోరణి వల్ల దేవదేవుని దర్శనం కాకుండానే, ఆ ఆనందాన్ని పొందకుండానే ఆరుగురు ప్రాణాలొదిలారు. దేవుడిని దర్శించుకొని వస్తామని ఇంటి నుండి వెళ్లిన వారు విగతజీవులై వస్తున్నారన్న వార్త వారి కుటుంబాలకు శరాఘాతంలా తగిలింది. ఓ కుటుంబంలో పిల్లలకు తల్లి దూరమైంది. మరో కుటుంబంలో లక్ష్మీ కళ తప్పింది. మరో ఇంట్లో కుమారుడి క్షేమం కోసం నిత్యం పూజలు చేసే తల్లే దూరమైంది. ఇంకొక ఇంటి పెద్ద కానరాని దూరాలకు వెళ్లిపోయిడు.. – సీతంపేట, మద్దిలపాలెం, కంచరపాలెం (విశాఖపట్నం), నర్సీపట్నంఅమ్మ చనిపోయిందని పిల్లలకు ఎలా చెప్పాలి?‘తిరుపతి వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం ఒక్కసారైనా చేసుకుంటానని అనడంతో కాదనలేకపోయాను. కానీ, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదు. మా అక్క, మరో ముగ్గురు బంధువులతో కలిసి ఈ నెల 5న తిరుపతికి బయల్దేరింది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలో ఉండగా ఫోన్ చేసింది. భోజనం చేశారా? పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది. ఫోన్లో గోలగా వినిపించడంతో, జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. మళ్లీ ఫోన్ చేయలేదు. గంట తర్వాత ఫోన్ చేస్తే కలవలేదు. రాత్రి 11 గంటల సమయంలో మా అక్క ఫోన్ చేసి తొక్కిసలాటలో అందరం తలో దిక్కు అయిపోయామని, అందరం కలిశాం.. కానీ లావణ్య కనిపించడంలేదని చెప్పింది. ఆస్పత్రికి వెళ్లి చూడగా లావణ్య చనిపోయి ఉందని రాత్రి 12.30 సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పారు. దర్శనానికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని నా పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తల్లిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని, దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందని నా నోటితో ఎలా చెప్పను’ అంటూ లావణ్య భర్త సతీష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే విశాఖపట్నం వెంకటేశ్వర కాలనీ ప్రజలహృదయాలు బరువెక్కాయి. విశాఖలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య తన ఆడపడుచు, మరో ముగ్గురు మహిళలతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 5న తిరుమల వెళ్లారు. టోకెన్ల కోసం క్యూలో ఉండగా జరిగిన తొక్కిసలాటలో లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సతీష్ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప శ్రీలాస్య 9వ తరగతి, చిన్న పాప కీర్తి 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తల్లి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తల్లి మరణవార్తను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియక సతీష్ వారిని బాజీ జంక్షన్‌లోని తన అక్క ఇంటికి పంపించేశాడు.‘శాంతి’ దూరమై విలపిస్తున్న కుటుంబంవిశాఖపట్నం కంచరపాలెం సమీపంలోని గాంధీనగర్‌లో కండిపిల్లి శాంతి కుటుంబం వేంకటేశ్వర స్వామి భక్తులు. ఆమె భర్త వెంకటేష్ ఆటో డ్రైవర్. కుమారుడు మహేంద్ర వరప్రసాద్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముగ్గురూ గోవింద మాల దీక్ష చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు గోవింద నామస్మరణతో కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష చేశారు. 11వ రోజున దీక్ష విరమణ కోసం ఆ కుటుంబం తిరుపతికి వెళ్లింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో శాంతి దుర్మరణం పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి వెంకటేష్, వరప్రసాద్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఇందిరానగర్‌లోని శాంతి తల్లి, అన్నదమ్ములు, బంధువులు, గాంధీనగర్‌లోని అత్తమామలు విషాదంలో కూరుకుపోయారు. శాంతి అందరితో మంచిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, తిరుమల వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు ఉన్న అమ్మ చనిపోయింది‘టోకెన్ల కోసం క్యూలో ఉండగా గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. నేను, నాన్న వెనుక ఉన్నాం. ముందు ఉన్న అమ్మ తొక్కిసలాటలో మిగతావారి కాళ్ల కింద నలిగిపోయింది’ అని ఆమె కుమారుడు కండిపిల్లి వరప్రసాద్ రోదిస్తూ జరిగిన సంఘటనను వివరించాడు.నా కూతురిని పొట్టన పెట్టుకున్నారుతిరుపతి దర్శనానికి వెళ్లిన నా కూతురు శాంతిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. వైకుంఠ ఏకాదశికి లచ్చల్లో భక్తులు వస్తారని తెలిసినా, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా భక్తుల మరణానికి కారణమయ్యారు. నా కడుపు కోత నాయకులకు శాపంగా మారాలి. – కిల్లాడి అప్పలనరసమ్మ, శాంతి తల్లిమా కుటుంబాన్ని బాగా నడిపించేది మా కోడలు శాంతి మరణవార్త వినగానే మా ప్రాణాలు పోయినట్టు అయ్యింది. ఆమె అందరినీ కలుపుకొంటూ కుటుంబాన్ని నడిపేది. గ్రామంలో, చుట్టుపక్కల ఇళ్లలో, బంధువులతో కలుపుగోలుగా ఉండేది. మమ్మల్ని బాగా చూసుకునేది. – కండిపిల్లి అప్పారావు, శాంతి మామయ్యకుమారుడి ఉన్నతి కోసం పరితపించి..విశాఖపట్నం మద్దిలపాలెం రామాలయం సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ గుడ్ల లక్ష్మారెడ్డి, రజనీ (47) దంపతులకు ఒక్కడే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎంతో కష్టపడి అతన్ని బాగా చదివించారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ చదువు కోసం అమెరికా పంపించారు. ఇందుకోసం ఇంట్లో సగభాగాన్ని విక్రయించారు. కుమారుడి భవిష్యత్తు బాగుండాలని రజని నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు చేసేదని సమీప బంధువులు తెలిపారు. ప్రతి శనివారం ఆమె స్వామిని ప్రత్యేకంగా ఆరాధించేది. కుమారుడికి మంచి ఉద్యోగం రావాలని కోరుకునేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిత్యం ఆరాధించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్ష్మారెడ్డి దంపతులు, బంధువులు పది మంది తిరుపతి వెళ్లారు. వారంతా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో రజనీ ప్రాణాలు కోల్పోయింది. కుమారుడి చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చే సమయంలోనే రజని మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పైసా పైసా కూడబెట్టి తనను అమెరికా పంపిన తల్లి ఇక లేదన్న వార్త విని హర్షవర్ధన్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతను శుక్రవారం అమెరికా నుంచి విశాఖపట్నం చేరుకుంటాడని రజని బంధువులు తెలిపారు.ఆ ఇల్లే దేవాలయం గుడ్ల రజని పరమ భక్తురాలు. నిత్యం భగవత్ ఆరాధనలో గడిపేది. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా దేవుని చిత్రపటాలే కనిపిస్తాయి. ఆమె ఇల్లే ఓ దేవాలయం. కుమారుడి భవిష్యత్తు కోసం వేంకటేశ్వరస్వామికి నిత్యం పూజలు చేసేది. సాయిబాబాని ఆరాధించేది. అంతటి భక్తురాలు ఇలా అర్ధంతరంగా మరణించడంతో మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. – ఎం.లక్ష్మి, మద్దిలపాలెంవెళ్లిపోయిన పెద్ద దిక్కు..తిరుపతి తొక్కిసలాట మృతుల్లో ఒకరైన బొడ్డేటి నాయుడుబాబు నర్సీపట్నం పట్టణంలోని పెదబొడ్డేపల్లి నివాసి. బోరుబావుల నిర్మాణ కార్మికుడు. భార్య మణికుమారి, కుమార్తె సునీత ఉన్నారు. ఈ నెల 6న నాయుడుబాబు, మణికుమారి, నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన కుటుంబ స్నేహితులైన కరణం సత్యనారాయణ, అతని భార్య సంతోషి కలిసి తిరుపతి వైకుంఠ దర్శనానికి వెళ్ళారు. క్యూలో జరిగిన తొక్కిసలాటలో భార్య, భర్త తలోదారి అయ్యారు. మణికుమారిని పోలీసులు రక్షించారు. నాయుడుబాబు మరణించారు. ఆయన ఫోన్ నుంచే పోలీసులు మణికుమారికి ఈ విషయం చెప్పారు.ఏటా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదునాన్నకు వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్తుంటాడు. అప్పుడు కాకుండా మరో మూడు నాలుగుసార్లు దర్శనానికి వెళ్తాడు. ఈ సారి రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లవద్దని చెప్పాం. ఏటా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదు. మాకు నాన్నే పెద్ద దిక్కు. మా కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి’ అంటూ కుమార్తె సునీత రోదిస్తోంది. – సునీత, నాయుడుబాబు కుమార్తె నా కుడి భుజం పోయింది...నా కుడి భుజం పోయింది. నాకు అన్ని విషయాల్లో నా సోదరుడు అండగా ఉండేవాడు. స్వామి సన్నిధిలో ఇలా జరగటం బాధాకరం. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – బి.వి.రమణ, నాయుడుబాబు సోదరుడు -
తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)
-
ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి
-
తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ తలోమాట
తిరుపతి : తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల వారికి తోచినట్లు మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తలోమాట మాట్లాడారు. ఇక్కడ వేర్వేరు అధికారులను టార్గెట్ చేశారు. అయితే ముందుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. కానీ పవన్ మాత్రం ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడుల తప్పుందని తేల్చేశారు. వారిమధ్య సమన్వయలోపం వలనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు, కానీ వేరే అధికారులదే తప్పంటూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్షవర్ధనరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల తలో మాట్లాడటంపై చర్చ జరుగుతుంది. పవన్ మాట్లాడుతూ..ప్రమాద బాధితుల్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తిరుపతిలో తప్పు జరిగింది. టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి,ఛైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య సమన్వయ లోపం ఉంది. పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి’అని వ్యాఖ్యానించారు. -
తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
పద్మావతి మెడికల్ కాలేజీ నుంచి క్షతగాత్రుల డిశ్చార్జ్
-
ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి: వైవీ సుబ్బారెడ్డి
అమరావతి: తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede Incident) జరిగి ఆరుగురి మృతి చెందడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). ఈ ఘటన అత్యంత దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయన్నారు. ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలన్నారు.తిరుపతి తొక్కిసలాట ఘటనపై ‘సాక్షి’తో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ‘లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం సమీక్షలైనా నిర్వహించారా?, వైఎస్సార్సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ ప్రమాదం జరగలేదు. నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని. సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. అధికారులతో టీటీడీ సరిగా పనిచేయించలేదు. మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని ఆయన కోరారు.కాగా, వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లా -
టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట : రోజా
-
ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శనం: రోజా
-
తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం
-
అల్లు అర్జున్ లాగే వీళ్ల మీద కేసులు పెట్టాలి!
-
చంద్రబాబు చేసిన పాపం.. BR నాయుడు రాజీనామా చేయలి
-
బాబు సేవలో పోలీసులు.. బలైన భక్తులు!
-
ప్రచారం పీక్స్.. తొక్కిసలాట ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
భక్తులను బలిగొన్న నిర్లక్ష్యం.. చేతులెత్తేసిన టీటీడీ!
-
అంతులేని నిర్లక్ష్యం.. ఆసుపత్రుల్లో మృత్యుఘోష
-
ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
-
తిరుపతి ఘటన ఘోరమైనది.. బీఆర్ నాయుడు మాటలు దుర్మార్గం.. టీటీడీనే బాధ్యత వహించాలి
-
నిన్న తొక్కిసలాట సమయంలో 10 మంది పోలీసులు కూడా లేరు
-
అంతులేని నిర్లక్ష్యం
-
అడ్డదారిలో వైకుంఠం టిక్కెట్లు.. నిజాలు బయటపెట్టిన అవుతు శ్రీధర్ రెడ్డి
-
KSR Live Show: భక్తులకు మృత్యు ద్వారం తెరిచిన యమదూతలు.. బాబు, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి
-
తిరుపతి తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ వింత వ్యాఖ్యలు
-
నా చావు కళ్ళ ముందే కనిపించింది.. ఆ దేవుడే కాపాడాడు
-
భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. ఎందుకు ఇలా చేశారు
-
టీటీడీ, చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
-
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘క్యూలైన్లలో సౌకర్యాలు లేవు.మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు. క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట’’ జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి..ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు. హిందూ ధర్మంపై భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు.తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు. అధికారుల, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ చైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. ఆయన పనంతా రాజకీయ దు్రష్పచారం చేయడమేనని, టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
తిండి లేదు, నీళ్లు లేవు.. సంచలన నిజాలు బయట పెట్టిన తిరుపతి భక్తులు
-
తిరుపతిలో తొక్కిసలాటకు కారణం అదే..
-
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. -
తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)
-
భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి
-
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన వార్త తెలిసి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తొక్కిసలాట ఘటన నన్నెంతో బాధించింది. ఆప్తులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది’ అని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందేశాన్ని ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’ ఖాతాలో బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసింది. తీవ్ర బాధాకరం: సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు బుధవారం డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చంద్రబాబు అన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో వైఫల్యంపై అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ టోకెన్ల కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునస్సమీక్షించాలన్నారు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పెనువిషాదం: రాహుల్తిరుపతిలో తొక్కిసలాట ఘటన నిజంగా పెనువిషాదకరం. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. ఈ కష్టకాలంలో అక్కడి భక్తులను శాయశక్తులా ఆదుకోవాలని, సహాయ సహకారాలు అందించాలని అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులకు సూచిస్తున్నా.బాధాకరం: కేజ్రీవాల్తిరుపతిలో దుర్ఘటన చాలా బాధాకరం. ఘటన నన్నెంతగానో కలచివేసింది. మృతుల ఆత్మలు దేవుని పాద పద్మములను చేరాలి. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా. దర్శనం తర్వాత భక్తులంతా క్షేమంగా తమతమ ఇళ్లకు చేరాలి.తీవ్ర ఆవేదన కలిగించింది: పవన్కళ్యాణ్తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యా. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరాను. భక్తుల మృతి బాధాకరం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంది. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు. ఈ ఘటన అత్యంత విచారకరం. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. మా హయాంలో వారం ముందే టోకెన్లు జారీ చేసేవాళ్లం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 10 రోజుల నుంచి నిద్రాహారాలు మాని శ్రమపడే వాళ్లం. హృదయాన్ని కలచివేసింది: పురందేశ్వరితొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా న్యాయం చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: ఎంపీ మాణిక్కం ఠాకూర్ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తిరుపతి ఘటన జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాధ్యతాయుతమైన నిర్వహణ ఎంతటి అత్యావశ్యకమో ఈ ఘటన నిరూపిస్తోంది. డ్రామా గురువు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నాటకీయతపై కంటే పరిపాలనపై దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే: వెలంపల్లిముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వస్తారని తెలిసినా ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ చైర్మన్ మార్చేశారు. బీఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలితొక్కిసలాట ఘటనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. -
ఆస్పత్రుల్లో హాహాకారాలు
తిరుపతి కల్చరల్/తిరుపతి అర్బన్: తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటల కారణంగా ఆరుగురు భక్తులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. వారిలో నలుగురు రుయా ఆస్పత్రిలోను, మరో ఇద్దరు స్విమ్స్ ఆస్పత్రిలోను మరణించారని చెప్పారు. తమిళనాడులోని సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన 10 మంది భక్తులు విష్ణునివాసం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట చోటుచేసుకుంది. జనాల మధ్య ఇరుక్కుపోయిన కృష్ణన్ భార్య ఆర్.మల్లిగ (50) ఊపిరాడక మృతి చెందింది. మల్లిగ కాలు విరిగి, తీవ్ర అస్వస్థతకు గురవడంతో కాపాడాలని ఆమె భర్త పోలీసులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వెంటనే అదే ఆటోలో రుయాకు బయలుదేరగా ఆమె మార్గంమధ్యలో మృతి చెందారు. తన భార్య దుస్థితిని పోలీసులకు చెప్పినా కనీసం స్పందించకపోవడంపై ఆమె భర్త కృష్ణన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోవడం బాధాకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, 40 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.కాలి నడకన వచ్చి..అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన 360 మంది భక్తులు గోవిందమాల వేసుకుని వైకుంఠ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు. నాలుగు రోజుల కిందట గ్రామం నుంచి కాలినడకన బయలుదేరిన వారంతా 135 కిలోమీటర్లు నడుచుకుంటూ బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి చేరుకున్నారు. బైరాగిపట్టెడిలోని రామానాయుడు స్కూల్లో టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్లో టోకెన్లు తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పోలీసులు వదిలిపెట్టడంతో 38 మంది కుప్పకూలి పడిపోయారు. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో వారి బంధువులు రామానాయుడు స్కూళ్ల వద్ద పద్మావతి పార్క్‌లో రాత్రంతా కూర్చుని రోదిస్తున్నారు. మరికొందరు రుయా, స్విమ్స్ ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు.అన్నమయ్య జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడినవారు : నరసమ్మ, గణేష్, లక్ష్మిదేవి, గంగిరెడ్డి, మణిరెడ్డి, తిమ్మక్క, వసంతమ్మసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లాపోలీసుల బాధ్యతారాహిత్యం వల్లే..పోలీసుల బాధ్యతారాహిత్యం కారణంగానే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భక్తులను వదిలిపెట్టడంతో పెద్దప్రమాదం చోటుచేసుకుంది. మా గ్రామం నుంచే 360 మంది వచ్చాం. ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియడం లేదు. భక్తుల సంఖ్యకు సరిపడా విధంగా పోలీసులు భద్రత కల్పించలేదు. అందువల్లే ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరుగుతున్నా.. పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోయారు. – జే.వెంకట రమణ, నరసాపురం గ్రామం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ జరగలేదుఇలాంటి దారుణం ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున టోకెన్లు ఇచ్చారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. తోపులాటలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. కానీ.. ఈసారి రామానాయుడు స్కూల్ వద్దకు అత్యధికంగా భక్తులు వచ్చారు. వారిని సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఎంతో భక్తిభావంతో 140 కిలోమీటర్లు నడుచుకుంటా తిరుపతి వచ్చాం. కనీస ఏర్పాట్లు చేపట్టకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోండి. – పి.అంజప్ప, నరసాపురం, అన్నమయ్య జిల్లాచాలా దారుణంభక్తుల ప్రాణాలతో టీటీడీ అధికారులు ఆటలాడుకున్నారు. దూరప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయలేదు. క్యూ నిర్వహణ అస్సలు బాగాలేదు. ఎలా పడితే అలా తోసేశారు. భోజనం లేదు. తాగునీరు లేదు. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి వర్ణనాతీతం. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ ఒకే క్యూలోకి నెట్టేశారు. పోలీసులు అత్యుత్సాహంతోనే ఇబ్బందులు వచ్చాయి. భక్తులతో వారు వ్యవహరించిన తీరు చాలా దారుణం. – లక్ష్మి, భక్తురాలు, విశాఖపట్నంబాధ్యత ఎవరు వహిస్తారుఅధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తొక్కిసలాటకు ఎవరిది బాధ్యత. ఇన్ని కుటుంబాల్లో విషాదం నిండేందుకు ఎవరు కారణం. ఎంతో ఆశగా శ్రీవారి దర్శనానికి వస్తే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసీ ఇంత అన్యాయంగా ఏర్పాట్లు చేస్తారా. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – కందన్, భక్తుడు, తిరువణ్ణామలై, తమిళనాడు ఘోరానికి కారకుల్ని వదిలిపెట్టకూడదుఇంత దారుణమైన ఘటనను ఇప్పటివరకు చూడలేదు. శ్రీవారిని దర్శించుకుందామని వస్తే భక్తుల ప్రాణాలతోనే టీటీడీ అధికారులు ఆడుకున్నారు. కళ్ల ముందే మనుషులు కూలిపోతుంటే చూడలేకపోయాం. పోలీసులు మాత్రం అందరినీ తోసేసి వేడుక చూశారు. ఆస్పత్రికి కూడా సకాలంలో తీసుకెళ్లలేదు. ఇంకా ఎంతమంది చనిపోతారో ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంతటి ఘోరానికి కారణమైన వారిని వదలిపెట్టకూడదు. – వైతీశ్వరి, భక్తురాలు, తిరుచ్చి, తమిళనాడుఅడుగడుగునా నిర్లక్ష్యం» వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించాల్సిందన్న భక్తులు »ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతోనే ఉపద్రవం తిరుపతి తుడా : వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది. మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం.. టోకెన్ల జారీ కేంద్రం వద్ద పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తొక్కిసలాటలో ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత నేనూ పడిపోయాను. నన్ను ఒక అమ్మాయి తీసుకెళ్లింది. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని అందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చలేదు. అంబులెన్సులు కూడా వెంటనే రాలేదు. ఆ తర్వాత చాలామందిని ఒకేసారి తీసుకొచ్చి స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. – ఆస్పత్రి వద్ద ఓ బాధితురాలు -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
సాక్షి, తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఒక పురుషుడుగా గుర్తించారు. 40 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.రుయాలో వైద్యులు పట్టించుకోకపోవడంతో క్షతగాత్రుల బంధువులు సిమ్స్‌కు తరలించారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శన టోకెన్లను కోసం భక్తులు పడిగాపులు పడుతున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి టికెట్ల జారీ ఉంటుందని టీటీడీ ప్రకటించింది. 10 ,11 ,12 తేదీలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను గురువారం జారీ చేయనున్నారు. లక్ష 20 వేల సర్వ దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ జరగనుంది. ఇంకా సమయం ఉన్న కారణంగా భక్తులను క్యూలైన్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్ల మీద కూర్చొని భక్తులు గోవింద నామ స్మరణలతో నిరసన తెలిపారు. రోజుకు 40 వేలు టికెట్ల చొప్పున తొలి 1,20000 మూడు రోజుల టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు కౌంటర్లకు చేరుకోవడంతో ఈ రోజు అర్ధరాత్రి 12 పైన చెప్పిన సమయం కన్నా ముందుగానే టికెట్లను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం షామియన కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రమైన చలికి వృద్ధులు పిల్లలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రామచంద్ర పుష్కరిణి నుంచి స్విమ్స్ వరకు రోడ్లపైనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు -
మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం!
-
తిరుపతి: భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే, 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది
‘డ్రీమ్ బిగ్... అచీవ్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప కల కనాలి... ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. ఈ రెండు మాటలనూ ఒంట పట్టించుకుందా అమ్మాయి. తనకిష్టమైన టెన్నిస్ రాకెట్‌ని చేతిలోకి తీసుకుంది. టెన్నిస్‌ని ప్రేమిస్తోంది... టెన్నిసేప్రాణం అంటోంది... కానీ... ‘టాలెంట్ ఉంటేనే సరిపోతుందా’ అని పరిహసిస్తోంది రూపాయి. ప్రత్యర్థి మీద గెలవడం ఆమెకు ఏ మాత్రం చాలెంజ్ కాదు. ఆర్థిక పరిస్థితితో నిత్యపోరాటమే ఆమెను కుంగదీస్తోంది. తిరుపతికి చెందిన చందన పోతుగారి టెన్నిస్ ప్లేయర్. నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 30లో ఉంది. మనదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు మాత్రమే ఆడుతోంది. దేశం దాటి వెళ్లడానికి చేతిలో డబ్బు లేదు. ‘దేశంలో ఎక్కడికైనా సరే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లిపోతాను, విదేశాల్లో ఆడాలంటే విమానం టికెట్ కొనుక్కోలేను’ అంటున్నప్పుడు చందన కళ్లలో టెన్నిస్ ఆట పట్ల ప్రేమతోపాటు తన ఆర్థిక పరిస్థితి పట్ల నిస్సహాయత వ్యక్తమైంది. ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది. వెలుగు–చీకటి సామాన్య కుటుంబంలో పుట్టిన చందన ఎనిమిదేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. లెక్కకు మించిన విజయాలతో సాగిపోతోంది. ఆటలో రాణించాలంటే మెరుగైన శిక్షణ అవసరమని నాలుగేళ్ల కిందట కుటుంబం హైదరాబాద్‌కి వచ్చింది. గణేశ్ రామన్ టెన్నిస్ అకాడమీలో చేరింది. చందనలో ఆట పట్ల ఉన్న అంకితభావం, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోచ్ ఫీజు గురించి పట్టుపట్టకుండా దేశం మెచ్చే క్రీడాకారిణిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు.సరిగ్గా ఇక్కడే చందనకు కాలం కొత్త పరీక్షలు పెట్టింది. జీవితంలోకి వెలుగు–చీకటి ఒక్కసారిగా వచ్చినట్లయింది. ‘శిక్షణ కోసం నగరానికి వెళ్లడమేంటి, వయసు వచ్చిన ఆడపిల్ల తెలియని మనుషుల మధ్య మెలగడమేంటి’... అని బంధువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. వారి మాటలను పట్టించుకోలేదు, కానీ తండ్రి కూడా ‘ఇక ఆట చాలు, పెళ్లి చేస్తాను’ అనడంతో హతాశురాలైంది. ఆమె కన్నీళ్లు తల్లికి అర్థమయ్యాయి. కానీ తండ్రిని కరిగించలేకపోయాయి. కుటుంబం రెండయింది. తల్లి మునిలక్ష్మి ఒంటరిగా కూతురి బాధ్యత మోస్తోంది. దేశం తరఫున ఆడాలి! ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించి గెలవాలనేది నా లక్ష్యం’ అంటున్న చందన టోర్నమెంట్లో గెలిచినప్పుడు వచ్చిన డబ్బును బస చేసిన గదికి అద్దె చెల్లించేసి తిరుగు ప్రయాణానికి డబ్బులు లెక్క చూసుకుంటూ జనరల్ టికెట్ కొనుక్కుని ఇంటికి వస్తోంది. చందనకు కొత్త రాకెట్ కూడా లేదని, తోటి క్రీడాకారులిచ్చిన రాకెట్, దుస్తులు, షూస్‌తో టోర్నమెంట్‌కు వెళ్తున్నదని, టెన్నిస్ కోసం చందన పడుతున్న కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మునిలక్ష్మి. భగవంతుడి దయ వల్ల స్పాన్సర్స్ ముందుకు వస్తే రాకెట్లా దూసుకుపోతానని, దేశానికి మెడల్స్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది చందన. రాయలసీమ టోర్నీ నుంచి ఇంటర్నేషనల్ టోర్నీల వరకు నొవాక్ జొకోవిచ్, సెరీనా విలియమ్స్ తన రోల్ మోడల్స్ అంటున్న చందన అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్. అండర్ 12 ఏజ్ గ్రూప్‌లో రాయలసీమ టోర్నమెంట్ గెలిచింది. అండర్ 14లో చిత్తూరు, చెన్నై, పులివెందుల టైటిల్స్ సొంతం చేసుకుంది. చందన తొలి డబుల్స్ టైటిల్ కూడా పులివెందుల నుంచే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్స్‌లో నాలుగు సార్లు పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇంటర్నేషనల్ టోర్నీలు 15 ఆడింది. ఈ రైట్ హ్యాండెడ్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ డబుల్స్ (21), సింగిల్స్ (35), ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒన్ లాక్ రుపీస్ ఉమెన్స్ టోర్నమెంట్ సింగిల్స్‌లో 5 సార్లు విజేతగా, మరో 12 సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆరుదఫాలు డబుల్స్ ఫైనలిస్ట్. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా రాకెట్‌ని వదల్లేదు చందన. సరైన ఆహారం లేక కళ్లు తిరుగుతున్నా అలాగే టోర్నమెంట్ ఆడి, మజిల్ క్రాంప్తో కడుపు నొప్పితో బాధపడినప్పుడు కూడా ‘టెన్నిస్ అంటే నాకుప్రాణం’ ఆట కోసంప్రాణమైనా ఇస్తానన్నది చందన. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
2 రోజులే గడువుందంటూ.. టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు వాయిస్ మెసేజ్‌లు చేస్తూ బరితెగించేశారు. రూ.100తో టీడీపీ సభ్యత్వ నమోదు, సీఎంఆర్ఎఫ్, రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్వయం ఉపాధి డ్వాక్రా మహిళలను టీడీపీ నేతల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.టీడీపీ నేతల సభ్యత్వ నమోదు వైరల్‌గా మారింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే వైఖరి టీడీపీ అవలంభిస్తోంది. 2 రోజులే గడువు ఉందంటూ డ్వాక్రా గ్రూప్‌లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలంటూ డ్వాక్రా సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.అధికారుల సాక్షిగా.. తమ్ముళ్ల దాష్టీకం!భాకరాపేట: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు.. పోలీసుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతులతోపాటు పంట పొలాలపై దాడికి తెగబడ్డారు. అన్నదాతలపై ప్రతాపం చూపారు. పట్టా భూమిలో కాలువ, కాలినడక బాట ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లను నరికివేశారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు ఏర్పాటుచేసిన కంచెను జేసీబీలతో పెకలించేశారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఉత్తర్వులు చూపించేందుకు వచ్చిన రైతులపై దాడిచేశారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారు.కళ్లముందు రైతులపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు చూస్తుండిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు రెవెన్యూ గ్రామం మట్లువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. దిగవూరు రెవెన్యూ లెక్క దాఖలు 182, 183 సర్వే నంబర్లులో విశ్రాంత అధ్యాపకుడు దొడ్డిపల్లి రాజారెడ్డికి దాదాపు 12.5 ఎకరాల వారసత్వ ఆస్తి ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న కాలినడక వదలివేసి కంచె వేసుకున్నానని రాజారెడ్డి చెబుతున్నారు.తమకు చెందిన భూమిలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదని, పొలంలో వర్షపు నీరు వెళ్లడానికి చిన్న కాలువ తీసుకుంటే అదే కాలువను బండిబాటగా వేయాలని టీడీపీ నాయకులు వచ్చి తనను, తన సోదరుడు సుధాకర్‌రెడ్డిని చితకబాదినట్లు రాజారెడ్డి తెలిపారు. సుధాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ ధ్వంసం చేశారని తెలిపారు. ఇదంతా భాకరాపేట ఎస్ఐ, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి వేసుకున్న రెండు గేట్లు తొలగించి, వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ కంచెను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు కూడా వినలేదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొలం తనకు అప్పగించి న్యాయం చేయాలని విన్నవించారు. -
శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు
-
కూటమి ప్రభుత్వంలో జోరుగా కాలం చెల్లిన లిక్కర్ విక్రయం
-
భూమన గూస్బంప్స్ స్పీచ్ దద్ధరిల్లిన తిరుపతి
-
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్‌లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
చంద్రబాబు కళ్ళుమూసుకోవడం వల్లే.. తిరుపతిలో పబ్‌ల తలుపులు తెరుస్తున్నారు..
-
‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్ ఎక్కడ?’
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమంతిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైం: నగరంలోని భవానీనగర్‌లో ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేసి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... భవానీనగర్‌లోని ఓ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చి దాడులు చేశారు. బుజ్జమ్మ, శారద, సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తూ కోస్తా నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. వీరిని యువకులకు ఎరవేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1000 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. ఓ మహిళను గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ.. -
తిరుపతిలో దంచికొడుతున్న వర్షం..
సాక్షి, తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు.తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం భన్సల్. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020తిరుపతి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)