Tollywood
-
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ చేశారు.'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
'నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేకపోయాం': కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
హైదరాబాద్‌లో 'రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్'.. ఎప్పుడంటే?
బుక్ మై షో ప్రారంభించిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ (Red Lorry Film Festival ) సౌత్‌కు వచ్చేస్తోంది. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీప్రముఖులు తమ అనుభవాలను, సినిమా వెనక ఉండే కష్టాలను, సాహసాలను పంచుకోనున్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, శిఖరన్ బీచరాజు, శేఖర్ కమ్ముల, నటులు శివ బాలాజీ, నవదీప్, సినిమాటోగ్రఫీ వెంకట్ సి.దిలీప్, దర్శకరచయితలు వీఎన్ ఆదిత్య, జి. నీలకంఠ రెడ్డి, రచయిత అంజున్ రాజాబలి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సినీ ఇండస్ట్రీలో గమనించిన అంశాలను, వైవిధ్యాన్ని, కావాల్సిన మార్పుల గరించి వీరు మాట్లాడనున్నారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టాలీవుడ్లో క్లాసిక్స్‌గా నిలిచిన మాయాబాజర్, పుష్పక విమానం, మిస్సమ్మ, ఆదిత్య 369, హ్యాపీ డేస్, నేనే రాజు నేనేమంత్రి, చందమామ, మన్మథుడు వంటి చిత్రాలను మరోసారి బిగ్స్క్రీన్పై చూసే అవకాశం కల్పించనున్నారు.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు
-
కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.కథేంటంటే?బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ -
అదిరేటి పోజులుతో ఈషా రెబ్బ కొత్త ఫోటోలు..
-
పచ్చ కోకలో సుప్రీత.. అందాల అయస్కాంతంలా ఉందే! (ఫొటోలు)
-
దేవుడిపై ఒట్టేశా.. 23 ఏళ్లుగా దాని జోలికి వెళ్లలేదు: సప్తగిరి
సప్తగిరి (Sapthagiri) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kani Prasad Movie). ఈ మూవీ మార్చి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ.. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కమెడియన్‌గా, హీరోగా, నిర్మాతగా పని చేస్తున్నాను. అయితే ఇప్పటికీ నన్ను విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు కమెడియన్‌గా పని చేసుకోక హీరోగా చేయడమేంటి? హీరోగా చేయడం వల్లే కామెడీ పాత్రలు తగ్గాయి అని కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేనేంటో నాకు తెలుసు. అవతలివారిని తృప్తి పరిచేందుకు నేను బతకట్లేదు.నేను చేసినవాటిలో 'ప్రేమకథా చిత్రం' నాకెంతో ఇష్టం. హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బీ' ఇష్టం. పర్సనల్ విషయానికి వస్తే.. నాన్న అటవీశాఖ ఉద్యోగి.. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అమ్మ గృహిణి. తిరుపతిలో సెటిలయ్యారు. హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కున్నాను. 23 ఏళ్ల క్రితం మాంసం తినడం ఆపేస్తానని వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఏనాడూ నాన్‌వెజ్ తినలేదు. లవ్ అంటేనే అసహ్యం. కానీ మంచి అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.చదవండి: శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా? -
శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా?
నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. కొంతకాలంపాటు దాగుడుమూతలు ఆడారు. డేటింగ్ గురించి ప్రశ్నలొస్తే.. ప్రేమాగీమా ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.అతడిపై మనసు పారేసుకున్న శోభితఅప్పటికే నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదు. అతడి గురించే ప్రత్యేకంగా..అతడి ప్రవర్తన చూసి నాకు బాధేసేది. అప్పుడు వ్యాసరచన వంటి కొన్ని అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేశాను. అందులో టాప్ వస్తేనైనా నన్ను చూస్తాడేమోనని! కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి పట్టించుకోవడం మానేశాను. కొంచెం పరిపక్వత చెందాను.సినిమా..కాలేజీలో నాకు లవ్ ప్రపోజల్స్ వచ్చేవి. నేను కూడా కొన్ని లెటర్స్ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్ అస్సలు బాగుండేది కాదు అని పేర్కొంది. గూఢచారి, మేజర్, కల్కి 2898 ఏడీ సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్లో హీరోయిన్గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.చదవండి: సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్ -
వాళ్లు వదిలేశారు.. కీర్తి సురేశ్ స్టార్ అయ్యింది!
కష్టపడితే కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. మరికొన్నిసార్లు అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓ హీరో చేయాల్సిన మరో హీరో చేసి హిట్ కొట్టడం, ఓ హీరోయిన్ కి రావాల్సిన అవకాశం లాస్ట్ మినిట్ లో మరో బ్యూటీకి దక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇక కీర్తి సురేశ్ అదృష్టం విషయానికొస్తే.. బాలనటిగా మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. 'నేను శైలజ' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. కానీ కీర్తి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రమంటే మాత్రం 'మహానటి' అని చెప్పొచ్చు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. అంతలా పేరు తెచ్చిన ఈ సినిమాకు తొలి ఆప్షన్ కీర్తి సురేశ్ కాదని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మహేశ్ డబ్బింగ్ చెప్పిన 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)'మహానటి' కోసం నిత్యామేనన్ సహా తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. కానీ చివరకు కీర్తి సురేశ్ దగ్గరకు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. అలానే తమిళంలో విజయ్ తో చేసిన 'భైరవ'లో కూడా తొలుత త్రిషని అనుకున్నారు. కానీ కీర్తి సెట్ అయింది. హిట్ కొట్టేసింది.మహానటి తర్వాత చాన్నాళ్ల పాటు కీర్తి సురేశ్ కి సరైన మూవీస్ పడలేదు. దీంతో ఈమె పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అలాంటి టైంలో 'దసరా' సినిమా ఈమెకు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇందులో తొలుత సమంతని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అదృష్టం కీర్తిని వరించింది. అలా వేరే వాళ్లని అనుకుని వద్దనుకోవడం వాళ్లకు ఓ రకంగా బ్యాడ్ లక్ కాగా.. కీర్తి సురేశ్ కి విపరీతంగా కలిసొచ్చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వీకెండ్ లో పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. సరే వాటి సంగతి పక్కనబెడితే ఓ తెలుగు మూవీ.. పెద్దగా హడావుడి లేకుండానే దాదాపు ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఏ మూవీ? ఎందులో ఉందనేది చూద్దాం.స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కథతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు(1974) ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. కొన్నిరోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్'లోనూ రామ్ చరణ్ అల్లూరి గెటప్ లో కనిపించి అలరించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇక అల్లూరి జీవిత కథతో తీసిన ఓ తెలుగు సినిమా 'మన్యం ధీరుడు'. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఈ చిత్రం ఒకటి ఉందని కూడా తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ.. అల్లూరిగా నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు 'మన్యం ధీరుడు' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం ఇలానే 'తల', 'జాతర' మూవీస్ ఇదే ఓటీటీలోకి వచ్చాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో) -
నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో కేతిక శర్మ (ఫొటోలు)
-
‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
కోపం తగ్గలే.. హీరోయిన్ ని మళ్లీ పక్కనబెట్టేశారు!
సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఆ ఘనత ఆయనకే దక్కుతుంది: ఆది సాయికుమార్
‘‘నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. ఈ నెల 21న ‘షణ్ముఖ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఘనత అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుంది. మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఆది సాయికుమార్(Adi Sai kumar) చెప్పారు.షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలకు ముందే అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.‘‘డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ మూవీ చేయడం హ్యాపీ’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాని ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు’’ అన్నారు షణ్ముగం సాప్పని. -
రామాయణం ఆధారంగా...
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. మహేశ్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.అలాగే మంగళవారం నుంచి ఈ షెడ్యూల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.అలాగే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేశారని సమాచారం. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట... దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని భోగట్టా. -
రాబిన్ హుడ్ నా పుట్టిన రోజు కానుక: నితిన్
‘‘నేను, వెంకీ కుడుముల కలిసి సోమవారం రాత్రి ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమా చూశాం. ఈ మూవీ మా కెరీర్లో పెద్ద సినిమా కాబోతుందని చాలా నమ్మకం ఉంది. ఈ నెల 30న నా బర్త్‌డే. ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న వస్తుంది. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’’ అని హీరో నితిన్ చెప్పారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నితిన్ మాట్లాడుతూ–‘‘నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్‌గారు, ‘వెన్నెల’ కిషోర్... మా మధ్య వచ్చే సన్నివేశాలు పోట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను చేసిన మీరా పాత్ర చాలా ప్రత్యేకం. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు.వెంకీ కుడుముల మాట్లాడుతూ–‘‘సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఈ సినిమాలో అతిథిగా చేసిన డేవిడ్ వార్నర్ గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘అద్భుతమైన కథకి వినోదం మిక్స్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్ ని అలరిస్తుంది’’అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో వినోదం, మంచి యాక్షన్‌తో పాటు అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. మూవీ మంచి సక్సెస్ అవుతుందని మేమంతా నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు. -
ఆరెంజ్ సినిమా నా ఫేవరేట్.. ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు: ప్రియదర్శి
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్‌లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్‌గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్‌గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
'ఛావా' తెలుగులో కలెక్షన్స్ రికార్డ్.. క్లైమాక్స్ మేకింగ్ వీడియో చూశారా..?
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఫైనల్‌గా రూ. 20 కోట్ల మార్క్‌ను ఛావా టాలీవుడ్లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.ఛావా క్లైమాక్స్ మేకింగ్ఛావా సినిమాలో సంగమేశ్వర్ వద్ద జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా కీలకంగా ఉంటుంది. మూవీకి అత్యంత బలాన్ని ఇచ్చే ఈ సీన్‌ను ఎలా తెరకెక్కించారో ప్రేక్షకులకు చూపారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ను ఎలా రెడీ చేశారో చూపారు. శంభాజీ మహారాజ్‌గా కనిపించేందుకు తాను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ కౌశల్ ఇప్పటికే చెప్పారు. రోజుకు ఆరు నుంచి 8 గంటలకు పైగానే శిక్షణ కోసమే కేటాయించానని ఆయన అన్నారు. ఆయనలా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీల వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే. -
‘షణ్ముఖ’ ట్రైలర్ లాంచ్ లో మెరిసిన నటి అవికా గోర్ (ఫొటోలు)
-
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్‌మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
హేయ్ మాగా..! 'దిల్ రూబా' కేసీపీడీ సాంగ్ వచ్చేసింది
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పారు. ఈ కథ గురించి ఆయన రెండు మాటల్లో ఇలా చెప్పారు 'ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.' అంటూ హింట్ ఇచ్చారు.అలాగే ఊరికే ఎవరికీ కోపం రాకూడదని,... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడని ఆయన అన్నారు. ఈ అంశం కూడా సినిమాలో ఉందని తెలిపారు. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే కథలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. -
'వార్2'లో గాయపడిన స్టార్ హీరో.. సినిమా వాయిదా..!
'వార్2' విడుదల కోసం పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్, హృతిక్ రోషన్ మధ్య ఒక సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ గాయపడినట్లు బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్‌ను మేకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్‌ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
నాకిష్టమైన 'తోబుట్టువు' నువ్వే అంటూ రేర్ ఫోటో షేర్ చేసిన బ్యూటీ
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది. అయితే, తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ తన అక్క రేవతి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో తన సోదరితో ఆమెకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది. నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తెగా కీర్తి సురేశ్ 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగులో 'నేను శైలజ' సినిమాతో పరిచయం అయింది.కీర్తి అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్ ఫిల్మ్ కోసం కావడం విశేషం. అయితే, నేడు తన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు చెబుతూ కీర్తి ఇలా పోస్ట్ షేర్ చేసింది. 'నా ఒడిదుడుకుల సమయంలో నా చుట్టూ ఒక గోడలా నిలబడ్డావు. వాటిని నేను అధిగమించేందుకు నాకు అండగా నిలిచావు. నువ్వు నా పక్కన ఉంటే చాలు.. ఈ జీవితం చాలా సులువుగా ఉంటుంది. బహుశా నాకు అత్యంత ఇష్టమైన తోబుట్టువు నువ్వే అనుకుంటా' అంటూ ఒక స్మైలీ ఎమోజీని చేర్చి తన అక్కపై ఉన్న ప్రేమను కీర్తి పంచుకుంది.కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా కొద్దిరోజుల క్రితం వారు షేర్ చేశారు. రేవతి కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. చెన్నై శస్త్ర యూనివర్సిటీలో ఫిలిం కోర్సులో మాస్టర్స్ పట్టా అందుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కార్తీ' డబ్బింగ్ పనుల్లో బిజీ.. నెక్ట్స్ విడుదలయ్యే సినిమా ఇదే
కోలీవుడ్‌లో ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు కార్తీ. ఈయన ఇటీవల నటించిన 'సత్యం సుందరం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో సర్ధార్ 2 ఒకటి. నటుడు కార్తీ పోలీస్ అధికారిగా, సర్ధార్‌గా ధ్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్ధార్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణన్ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో పార్ట్-2 ప్లాన్ చేశారు. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన నటి మాళవిక మోహన్, ఆషీకా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు ఎస్జే.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సర్ధార్ –2 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంబించారు. కాగా ప్రస్తుతం నటుడు కార్తీ ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలు సంతరించుకున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్ విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్ –2 చిత్రం త్వరలోనే తెరపైకి రానుందన్నమాట. -
అందమైన ప్రేమ కథ
నాని హీరోగా ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మాతగా మారారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ ని స్థాపించిన ఆయన ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’ అనే మూవీని ప్రకటించారు. ఈ మూవీ ద్వారా చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘2009లో గోదావరిఖని ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న అందమైన ప్రేమకథ ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’.ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే ఓ అమ్మాయి లోతైన భావోద్వేగాలను ఈ మూవీ చూపిస్తుంది. ఈ చిత్రం ప్రీప్రోడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నానిగారు సలహాలు ఇచ్చేవారు: ప్రియదర్శి
‘‘కోర్ట్’ కథ నానిగారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాణంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయమని నిర్మాతలు దీప్తి, ప్రశాంతిగార్లకు చెప్పారు. వారిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీప్తిగారు సెట్స్‌లో ఉండేవారు. నానిగారు మాత్రం అప్పుడప్పుడు మా సినిమా రషెస్ చూసి ఏౖవైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు’’ అని ప్రియదర్శి తెలిపారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్’.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘2022లో నేను, రామ్ జగదీష్ ‘కోర్ట్’ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో లాయర్ పాత్రని ఓ పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు జగదీష్. కానీ, నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాడు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అని చాలా పరిశోధన చేసి, ఈ మూవీ తీశాడు జగదీష్.ఈ చిత్రంలో నేను లాయర్ పాత్ర చేశాక వారిపై నాకు గౌరవం పెరిగింది. ‘కోర్ట్’ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ‘ఈ చిత్రం నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడొద్దు’ అని నానిగారు చెప్పారు. నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే జనాలు థియేటర్స్‌కి వస్తారు.. లేదంటే రారు. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే అది కమర్షియల్ హిట్టే.అలా ‘కోర్ట్’కి మంచి వసూళ్లు వస్తే నేను కమర్షియల్ హీరోనే(నవ్వుతూ). శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను నటించిన ‘సారంగపాణి జాతకం’ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ‘ప్రేమంటే..’ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు. 2020లో బయటపడిందినాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.నయమవుతుందో.. లేదో!స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది.చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా -
క్రైమ్ థ్రిల్లర్ 'ది సస్పెక్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్..
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది సస్పెక్ట్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 21న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో మార్చి 21న విడుదల చేయబోతున్నారు.చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక -
భారీ ప్రాజెక్ట్‌లో గోపిచంద్.. డైరెక్టర్‌గా ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ ఏడాదిలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. గతేడాది విశ్వం, భీమా చిత్రాలతో మెప్పించిన గోపిచంద్ కొత్త ఏడాదిలో ప్రాజెక్ట్ ప్రకటించారు. అతని కెరీర్లో 33వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను గోపీచంద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఐబీ 71, ఘాజీ వంటి చిత్రాలతో సంకల్ప్ రెడ్డి ఫేమస్ అయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూలి మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదివరకెన్నడు చూడని పాత్రలో గోపిచంద్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. Excited to announce my next from the vision of #SankalpReddy, teaming up once again with my producers @srinivasaaoffl garu & Pavan garu under @SS_ScreensNeed all your love..! pic.twitter.com/8wHOdw7d70— Gopichand (@YoursGopichand) March 10, 2025 -
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. అంజలిపై సాఫ్ట్ కార్నర్వీరు రిలేషన్లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కోన వెంకట్ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.ఆస్తి కబ్జాతనకు ఒక సపోర్ట్ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడిందినన్ను ఫ్రెండ్, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్‌డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.చదవండి: #SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి? -
తెలుగులో చావా కలెక్షన్ల మోత
-
సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టుచీరలో చూడముచ్చటగా యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
3 పండుగలకు 3 సినిమాలు.. ఎన్టీఆర్ ప్లాన్ అదుర్స్..
-
గోపీచంద్ మలినేనికి 'విలన్' దొరికేశాడు
బాలీవుడ్ టాప్ హీరోలలో సన్నీ డియోల్ ఒకరు అని తెలిసిందే.. ఆయనతో మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘జాట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ఆయన పాత్రను చూపుతూ ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు.జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీతో గోపీచంద్ మలినేని క్రేజ్ మరింత స్థాయికి పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ
పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. -
మరింత గ్లామర్‌గా మారిపోయిన 'పూర్ణ’ (ఫొటోలు)
-
ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలోకి 'కోర్ట్', 'దిల్ రుబా' అనే తెలుగు చిత్రాలతో పాటు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరోవైపు 'యుగానికి ఒక్కడు' ఈ వారమే రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)ఇవి కాకుండా ఓటీటీల్లోకి కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ 'ఏజెంట్', రామం రాఘవం, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్ ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 10-16 వరకు)సోనీ లివ్ఏజెంట్ (తెలుగు సినిమా) - మార్చి 14అమెజాన్ ప్రైమ్వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 13బీ హ్యాపీ (హిందీ మూవీ) - మార్చి 14ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) - మార్చి 14నెట్ ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 10హాట్ స్టార్పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) - మార్చి 14మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 14జీ5వనవాస్ (హిందీ సినిమా) - మార్చి 14సన్ నెక్స్ట్రామం రాఘవం (తెలుగు మూవీ) - మార్చి 14 ఆహారేఖాచిత్రం (తెలుగు సినిమా) - మార్చి 14ఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
కోలీవుడ్‌లో సెన్సేషనల్ చిత్రంగా నిలిచిన సినిమా 'ఫైర్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో రచిత మహాలక్ష్మి గ్లామర్ డోస్ పెంచడంతో ఈ చిత్రం పేరు నెట్టింట వైరల్ అయింది. 'ఫైర్' చిత్రంలోని ఒక పాటలో ఆమె మితిమీరిన రొమాన్స్ సీన్లతో అదరగొట్టేసింది. ఇంకేముంది ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమెకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో రచిత నటించిన తాజా చిత్రం 'ఫైర్' ఫిబ్రవరి 14న విడుదల అయింది.'ఫైర్' చిత్రంలో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్ నటించారు. జెఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. క్రైమ్,థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాస్త ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. మార్చి 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అయితే, తమిళ్లో పాపులర్ అయిన టెంట్కొట్టా (Tentkotta)లో స్ట్రీమింగ్ కానుంది. రచిత మహాలక్ష్మి ఇచ్చిన గ్లామర్ ట్రీట్‌కు భారీ ధరను చెల్లించి ఫైర్ చిత్రాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో టెంట్కొట్టా ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.తెలుగులో రచితతెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. -
డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ఆమెతో పాటు ఎంట్రీ
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్ మరో యువతితో డేటింగ్లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్‌మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్, మహ్వాష్ ఫోటోలను షేర్ చేశారు.ఆర్జే మహ్వాష్ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL— Cinemania (@CinemaniaIndia) March 9, 2025 -
కేవలం రూ. 2500 కోసం రోడ్డుపైనే డ్యాన్స్ చేశా: వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్గా టాప్ స్టార్ ఇమేజ్ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది. కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్ సచ్దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్‌ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్ వినగానే తనకు డాన్స్ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది. దీంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి రోడ్డుపైనే డాన్స్ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్లో డాన్స్ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. -
కొలంబో కాలింగ్
కొలంబో వెళ్లనున్నాడట డ్రాగన్. ఎన్టీఆర్(Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గత నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలోప్రారంభమైంది.కానీ ఈ షూటింగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదని తెలిసింది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలోని కొలంబోలో జరగనుందట. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. -
ప్రేమకథను కొత్తగా చెప్పాను: దర్శకుడు విశ్వ కరుణ్
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, నజియా డేవిసన్ హీరోయిన్లు. విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు. -
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు
ఆదర్శ్ గౌరవ్ (Adarsh Gourav).. సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించాడు. ద వైట్ టైగర్ సినిమాతో విశేష ఆదరణ సంపాదించుకున్న ఇతడు హిందీలో దాదాపు 9 సినిమాలవరకు చేశాడు. హాస్టల్ డేజ్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించాడు. తెలుగు వెండితెరకు పరిచయం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నాడు. కానీ దారి తెలియక బాలీవుడ్లోనే ఆగిపోయాడు.టాలీవుడ్లో కనిపించాలన్నది ఆశఅలాంటి సమయంలో సమంత సాయం చేసిందని, తన ఒత్తిడి వల్లే తెలుగులో ప్రయత్నాలు చేసి ప్రాజెక్ట్ దక్కించుకున్నానంటున్నాడు. ఆదర్శ్ గౌరవ్ మాట్లాడుతూ.. నా మాతృ భాష తెలుగు. తెలుగు సినిమాల్లో (Tollywood) పని చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. కానీ ఎవర్ని సంప్రదించాలి? ఎలా అవకాశాలు తెచ్చుకోవాలన్నది నాకేమీ తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే! సమంత సాయంతో..సిటాడెల్ సిరీస్ పూర్తయ్యాక ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకున్న పార్టీకి నేనూ వెళ్లాను. అప్పుడు నాకు తెలుగులో పని చేయాలనుందని సమంత (Samantha Ruth Prabhu)కు చెప్పాను. సరే, అలాగైతే టాలీవుడ్లో జరిగే ఆడిషన్స్‌కు వెళ్లు అని నొక్కి చెప్పింది. కావాలంటే కొన్ని మీటింగ్స్‌కు నన్ను తీసుకెళ్లేందుకు సాయం చేస్తానంది. తన మేనేజర్ సాయంతో తెలుగులో చాలామందిని కలిశాను. పలువురితో చర్చలు కూడా జరిగాయి.(చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి)అవన్నీ నిజ జీవితంలో..అలా ఓ దర్శకుడు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాను. ఇది సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నేను ఎక్కువగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానె, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ సినిమాలే ఎక్కువగా చూశాను. అందులో వారు చూపించే పాత్రలు నిజ జీవితంలో నాకు తారసపడినట్లే కనిపిస్తాయి. ఇకపోతే నా చిన్నతనంలో మా ఇంట్లో ఓ కఠిన నియమం ఉండేది. అదేంటంటే.. బయట ఏ భాష అయినా మాట్లాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధన ఉండేది.ఇప్పుడర్థమవుతోందిఅప్పుడు నాకర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకెంతగానో ఉపయోగపడుతోంది. నాకు చిన్నప్పటినుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త, ఇక్కడికి వచ్చి కొన్నాళ్లే అవుతున్నా ఏదో దగ్గరి సంబంధం ఉన్న అనుభూతి వస్తుంది. నాకు ఎవరూ తెలియకపోయినా భాష వల్ల అంతా ఒక్కటే అన్న ఫీలింగ్ వస్తోంది అని చెప్పుకొచ్చాడు. తన తెలుగు సినిమా టైటిల్, దర్శకుడెవరు? వంటి వివరాలు మాత్రం చెప్పలేదు.చదవండి: 'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్ -
లైట్ కలర్ శారీలో అనసూయ అందాలు.. ఫోటోలు
-
ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ..
-
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
కామెడీ, రియాలిటీ షోలతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. రాజమండ్రి గోదావరి నదిలో అస్థికలు కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చింది.సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలని కుటుంబ సభ్యులు.. పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలని రాజమండ్రి దగ్గరున్న గోదావరిలో కలిపింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్)తాను ఎంతగానే ప్రేమించిన శునకానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. 'జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధలేకుండా పుడతావని కోరుకుంటున్నాను. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. ప్రశాంతంగా వెళ్లు చుట్కీ గౌతమ్' అని రాసుకొచ్చింది.ఇకపోతే రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో వీధి కుక్కల తనవంతు సాయంగా ఆహారం పెట్టింది. పలు శునకాల్ని కూడా పెంచుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల
మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.! ఇదే పాయింట్‌తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.23 సినిమా టీజర్‌లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటనతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించనున్నారు. -
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను: కీర్తి సురేష్
సౌత్ ఇండియా హీరోయిన్ కీర్తీ సురేష్ ముందు రకరకాల రుచికరమైన ఆహారపదార్థాలు ఎన్ని పెట్టినా, తను మాత్రం దోశ కోసమే ఎదురుచూస్తుంది. దోశ అంటే అంత ప్రాణం. ఒకరోజు హీరో నాని ఇంటికి వెళ్లినప్పుడు, డైనింగ్ టేబుల్‌పై ఉండే ఐటమ్స్ నచ్చక, తానే కిచెన్‌లోకి వెళ్లి, దోశ వేసుకొని తినింది. ఇక చిరంజీవి గారి వంటవాడికి అయితే, ‘భోళా శకంర్’ షూటింగ్ సెట్లోనూ తనకు పంపే ఆహారం ఎలా ఉండాలో ఫోన్ చేసి, చెప్పి మరీ చేయించుకునేది.చిలిపి అలవాటుచిన్నప్పుడు తరచు రుపాయి నాణేలను నోట్లో పెట్టుకోవడం అలవాటు ఉండేది. అలా రెండుసార్లు మింగేసింది. ఆ అలవాటు మానడానికి చాలా కాలమే పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తనని తిడితే, వాళ్లు రెస్ట్‌రూమ్‌కి వెళ్లినప్పుడు బయట గడియ పెట్టి వెళ్లిపోతుందట! అలా వాళ్ల అమ్మను చాలాసార్లు ఏడిపించింది. ఇప్పటికీ అలాగే చేస్తుందట!అన్నీ ఫ్లాపులేకీర్తి సినీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. మొదట్లో తను నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. ఆపై విడుదలైన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. దీంతో దశాబ్దంపాటు ఐరన్‌లెగ్ ముద్రను ధరించింది.చాలా భయపడ్డాకీర్తి ఎక్కువగా భయపడింది సావిత్రిగారిలా నటించడానికేనట! మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందుగా చాలామంది హీరోయిన్లను అనుకున్నా, చివరకు కీర్తికే ఆ చాన్స్ దక్కింది. ఆ సినిమాకు ఆమెను ఒప్పించడానికి డైరెక్టర్‌కు తలప్రాణం తోకకొచ్చింది.నా పాట..గాత్రంతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది కీర్తి. ‘సామి స్క్వేర్’లో ‘పుదు మెట్రో రైల్’ పాట పాడింది కీర్తినే.. ‘కల్కి 2898 ఏడీ’ లోనూ బుజ్జిగా ఒక కారుకు వాయిస్ అందించింది. ఇలా నటి, గాయని మాత్రమే కాదు, స్విమ్మర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా!బ్యూటీ సీక్రెట్.. ఆరోగ్యం, అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది కీర్తి. ఇందుకోసం, సహజమైన పద్ధతుల్నే పాటిస్తుంది. నారింజ తొక్కల పొడి, పచ్చి పసుపు, పాల మీగడ ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. షూటింగ్ లేనప్పుడు అసలు మేకప్ వేసుకోదు.అక్క సిద్ధమైందికీర్తి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అక్క’ వెబ్ సిరీస్‌లో లేడీ డాన్‌గా చాలా బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించబోతోంది. -
'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు. జైపుర్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం మొదలయ్యాయి. చిత్రసీమకు చెందిన చాలామంది నటీమణులు ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్‌ను వినిపించారు. పరిశ్రమలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సినిమాకు సంబంధించి హీరోల్లాగే తాము కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఇక్కడ అందరం సమానంగా పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో నటులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని వారు ఆశించారు. ‘స్త్రీ2’ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిసిందే అంటూ బాలీవుడ్ కథానాయకులు తమ గళాన్ని వినిపించారు.సినిమా విభాగంఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలాఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)ఉత్తమ సహాయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)ఉత్తమ సహాయ నటుడు: దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)ఉత్తమ కథ ఒరిజినల్: కనికా ధిల్లాన్ (దో పట్టి)వెబ్ సిరీస్ విభాగంఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్- 3ఉత్తమ నటి (సిరీస్): శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)ఉత్తమ నటుడు (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ దర్శకుడు (సిరీస్): దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ సహాయ నటి (సిరీస్): సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)ఉత్తమ సహాయ నటుడు (సిరీస్): ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
మంచు విష్ణు 'ఢీ' కొట్టగలడా..?
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ థియేటర్స్‌లలో సందడి చేసింది. ఇప్పుడు ఢీ సినిమాను మార్చి 28 రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో వాటిని ఢీ కొట్టగలదా అనే సందేహాలు ఉన్నాయి.మార్చి 28 రెండు కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్ వేసి ఉంది. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే సమయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ రంగంలోకి దిగుతుంది. సితార బ్యానర్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మార్చి 27న విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ విడుదల కానుంది. అదే తేదీన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో 'ఢీ' కొట్టడం చాలా కష్టం అని నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు. మరో తేదీ చూసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ తప్పకుండా రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. -
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్ బ్యూటీపై సెటైర్స్
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు. -
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్‌కు విలన్‌గా...స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్‌చరణ్‌కు విలన్‌గా...రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి -
అసత్య ప్రచారాలు.. మహిళా కమిషన్‌కు కల్పన ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సింగర్ కల్పన (Kalpana Raghavendar) మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. తనపై తప్పుడు ప్రచారం చేసినటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కల్పన ఫిర్యాదుపై నేరెళ్ళ శారద స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్‌ను హెచ్చరించారు.ఏం జరిగింది?సింగర్ కల్పన ఇటీవల తన ఇంట్లో అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న కల్పన.. తాను చనిపోవడానికి ప్రయత్నించలేదని, కేవలం మంచి నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకున్నానని తెలిపింది. అయితే మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానని, అది భర్త సహకారంతోనే సాధ్యమైందని వివరించింది.చదవండి: అమ్మపై దాడి చేసి రూ.4.50 లక్షల బంగారం దోచేశారు.. నాకు 3 కిలోల బంగారం మిగిల్చింది: సింగర్ కుమారుడు -
కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు
కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది లెజెండరీ సింగర్ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్‌రాజు పలు సినిమాల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్ అయ్యారు.ఏడేళ్లకే గాయనితాజాగా అనిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్ బాలచందర్ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. ఆ మాటలు బాధించేవిఅయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్ అనే గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.3 కిలోల బంగారండ్రైవర్ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.నేను హిజ్రా..నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్‌స్టిక్ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్‌కి ఊహించని ఓపెనింగ్స్! -
హీరో ముద్దుపెడితే మరొకరితో పెళ్లి.. ఫన్నీగా ట్రైలర్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ లిరిక్స్ తోనే తెలుగులో ఓ సినిమా రిలీజ్ కాబోతుంది. 'కిస్ కిస్ కిస్సిక్' టైటిల్ తో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)మార్చి 1న హిందీలో 'పింటూ కీ పప్పీ' పేరుతో సినిమా రిలీజైంది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి, దక్షిణాది భాషల్ల విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫన్నీగా ఉంది. హీరో ఎవరికి ముద్దుపెడితే.. ఆ అమ్మాయిలకు మరొకరితో వెంటనే పెళ్లి అయిపోయింది. ఈ క్రమంలోనే హీరో.. తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇందులో అతిథి పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని
ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న కౌశిక్ అనే కుర్రాడు.. గతేడాది 'దేవర' రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చాడు. ఇతడి తల్లి అభ్యర్థన మేరకు స్వయంగా ఎన్టీఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆ అభిమాని ఇంట్లో విషాదం నెలకొంది.(ఇదీ చదవండి: నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి)తిరుపతికి చెందిన కౌశిక్.. జూ.ఎన్టీఆర్ కి వీరాభిమాని. డిగ్రీ చదువుతున్నప్పుడు ఓసారి జ్వరం రావడంతో పలు ఆస్పత్రుల్లో చూపించగా క్యాన్సర్ ఉందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చివరగా తన అభిమాన హీరో నటించిన 'దేవర' చూసేంతవరకు బ్రతకాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కౌశిక్ వీడియో.. పలువురు అభిమానుల ద్వారా ఎన్టీఆర్ వరకు వెళ్లింది. అలా గతేడాది 'దేవర' విడుదలకు ముందు స్వయంగా ఎన్టీఆర్.. కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు. వైద్యానికి కావాల్సిన సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. తర్వాత కౌశిక్ వైద్యం కోసం టీటీడీ రూ40 లక్షలు, ప్రభుత్వం రూ.11 లక్షలు, తారక్ అభిమానులు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే డిసెంబరులో అలా కౌశిక్ తల్లి ప్రెస్ మీట్ పెట్టి తమకు ఎన్టీఆర్ ఏం సాయం చేయలేదని చెప్పారు. దీంతో తారక్ ఫ్యాన్స్ వెళ్లి ఆమెతో మాట్లాడించి క్లారిటీ ఇవ్వడం లాంటివి జరిగాయి.అలా కాస్తోకూస్తో వార్తల్లో నిలిచిన కౌశిక్ కొన్నాళ్ల క్రితమే ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయిపోయాడు. ఇప్పుడు అతడు అనారోగ్యంతో చనిపోయాడు. తారక్ తో వీడియో కాల్ అయితే మాట్లాడాడు కానీ కలవడం అనే చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడని తోటి ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్, లైగర్‌తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా..సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్‌బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్ -
నా జీవితంపై వెబ్ సిరీస్.. ఎన్నో అవమానాలు, బెదిరింపులు.. నటి కన్నీళ్లు
నటి సోనా (Sona Heiden).. ఒకప్పుడు గ్లామరస్, బోల్డ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్న ఆమె తన జీవితంపై ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది. ఆ బయోగ్రఫీ సిరీస్ పేరు స్మోక్. సోనా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ షార్ట్ బ్లిస్‌లో రిలీజ్ కానుంది. ఇందులో ముకేశ్ ఖన్నా, ఆస్త అబే, ఇలవరసు, జీవా రవి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సిరీస్ గురించి సోనా మాట్లాడుతూ.. 'స్మోక్ తెరకెక్కించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతోమంది ఈ సిరీస్‌ను వ్యతిరేకించారు. కొందరు ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయమని బెదిరించారు. మరికొందరు అవమానించారు. ఆర్థికంగానూ మోసపోయాను.. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఒంటరిగా సిరీస్ పూర్తి చేశాను' అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. గ్లామర్ పాత్రలకు నో'ఎవరిపైనో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సిరీస్ తెరకెక్కించలేదు. గ్లామర్ నటి అన్న ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఒక డైరెక్టర్‌గా నిరూపించుకోవాలనుకున్నాను. ఇకమీదట గ్లామర్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చింది. స్మోక్ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా తెరకెక్కింది. ప్రతి ఎపిసోడ్ నిడివి 30 నిమిషాలు ఉంటుంది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో సోనా జీవితంలో జరిగిన సంఘటలను సిరీస్‌లో చూపించనున్నారు. అలాగే స్మోక్‌కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ కూడా ఉంటుందని సోనా పేర్కొంది.ఎవరీ సోనా?కుసెలన్ మూవీలో వడివేలు భార్యగా సోనా గుర్తింపు తెచ్చుకుంది. గురు ఎన్ ఆలు, అళగర్ మలై, ఒంబాధులే గురు వంటి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన ఆమె మలయాళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆయుధం, విలన్, ఆంధ్రావాలా, కథానాయకుడు, -
నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.మెగా బ్రదర్స్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు. -
ఐఫా అవార్డ్స్‌కు అంతా సిద్ధం.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. భారత్‌లోని జైపూర్ వేదికగా ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డులు 2000 సంవత్సరంలో మొదటిసారి ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాలలో మెప్పించిన నటీనటులు, చిత్రాలను గుర్తించి అవార్డ్స్ అందిస్తారు. ఈసారి హోస్ట్‌లుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరించనున్నారు.మార్చి 8,9 తేదీల్లో జైపుర్ వేదికగా ఐఫా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే భారీగా నటీనటులు అక్కడకు చేరుకున్నారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమాన్ని భారత్‌లో జరపడం ఇది రెండోసారి. సుమారు ఐదేళ్ల క్రితం ముంబైలో నిర్వహించారు. ప్రతి ఏడాది అబుదాబి, సింగపూర్,మలేషియా, అమెరికా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే, ఐఫా అవార్డ్స్ ప్రయాణానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి భారత్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్,కరీనా కపూర్, శ్రేయా ఘోషల్ వంటి స్టార్స్ ఐఫా వేదిక మీద తమ డ్యాన్సులతో మెప్పించనున్నారు. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
రెడ్ డ్రెస్‌లో కృతి శెట్టి జిగేల్ జిగేల్ (ఫోటోలు)
-
ఆపరేషన్ వల్ల చాలా బాధలు పడ్డాను.. ఎవరూ అడగలేదు: రాధికా శరత్‌కుమార్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధికకు సర్జరీ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. కష్ట సమయంలో మహిళలు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలో ఆమె తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె కాలికి తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దాని గురించి రాధికా ఎక్కడా స్పందించలేదు.అయితే, తాజాగా రాధికా శరత్ కుమార్ తన గాయం గురించి ఇలా చెప్పారు. 'గత రెండు నెలలుగా చాలా బాధలు పడుతున్నాను. ఎవరూ నా వర్క్, నా గురించి మాట్లాడలేదు. రెండు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో నేను అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నా మోకాలికి తీవ్రమైన గాయం అయింది. అప్పుడు నా మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి నివారణ కోసం ఎన్నో మందులతో పాటు మోకాలి బ్రేస్, క్రయోథెరపీ వంటి వాటిని పాటించాను. కానీ, ఎలాంటి ఫలితం లేదు. తప్పని పరిస్థితిలో రెండు నెలల క్రితం సర్జరీ చేపించుకున్నాను.' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నట్లు కూడా చెప్పారు.నొప్పి భరిస్తూనే సినిమా ఎలా పూర్తి చేశారని తన స్నేహితుడు ఒకరు ఆశ్చర్యపోయాడని రాధిక గుర్తుచేసుకున్నారు. ఆ నిర్మాతలు కృతజ్ఞతలు ఏమైనా చెప్పారా..? అని కూడా ఆ స్నేహితుడు అడిగినట్లు రాధిక చెప్పుకొచ్చారు. కానీ, తనకు కృతజ్ఞతలు వంటి వాటిని పట్టించుకోనని రాధిక చెప్పారు. అలాంటివి ఎప్పుడూ తాను ఆశించలేదని, ఉత్తమంగా పనిపై మాత్రమే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మరింతగా ప్రేమించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఇతరులు చూపే సింపతీ తీసుకోవద్దని తెలిపారు. అయితే, శస్త్రచికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్ కుమార్ తనను చిన్నపిల్లలా చూసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో మూలస్థంభంలాంటి వ్యక్తి తన భర్తే అంటూ ఆమె చెప్పారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
వెంకీకో రూల్, రవితేజకు మరో రూల్ !
-
ప్రేమలో పడిన బేబీ హీరోయిన్?
-
మెరిసేటి డ్రెస్‌లో ఫోజులు ఇచ్చిన మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఫోటో షేర్ చేసిన చిరంజీవి
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రత్యేకమైన ఫోటోను తన షోషల్మీడయాలో పంచుకున్నారు. తనతో నటించిన హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అని తెలిపారు. ఈ ఫోటోలో చిరుతో పాటు సురేఖ, నదియా, రాధిక, మీనా, జయసుధ, ఖుష్బూ,టబు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025 -
కోర్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్
-
'కోర్ట్' సినిమా నచ్చకుంటే.. నా 'హిట్ 3'ని చూడొద్దు: నాని
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు. -
రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను మూడురోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు కోర్టు అనుమతి ఇచ్చింది.కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. -
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్‌కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్‌గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్‌గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్‌గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్‌గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్‌హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్‌హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్‌తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. -
మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమే 'బందీ': ఆదిత్య ఓం
టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం ఇటీవలే బందీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'బందీ సినిమా అద్భుతంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీశాం. మేము ఊహించినట్లే అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య ఓం ఎంతో విలక్షణ నటుడు. యూపీ నుంచి ఇక్కడకు వచ్చి ప్యాషన్‌తో చేస్తున్నారు. రఘు తిరుమల మంచి పాయింట్‌తో సినిమా తీశారు. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.రఘు తిరుమల మాట్లాడుతూ.. 'మా లాంటి కొత్త వాళ్లని ఆదిత్య ఓం చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాం. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. వెంకటేశ్వరరావు ఈ మూవీని చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్' అని అన్నారు.ఆదిత్య ఓం మాట్లాడుతూ.. 'బందీ సినిమాను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన బందీ మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాను.' అని అన్నారు. -
ఆయన వద్దనడంతోనే వెంకటేశ్‌తో సినిమా ఆగిపోయింది: ప్రసన్నకుమార్
ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) రాసిన ఎన్నో కథలు వెండితెరపై హిట్లు, సూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా.. ఇప్పుడు మజాకా చిత్రాలకు ప్రసన్నకుమార్ కథ అందించగా వాటిని నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు. ఇటీవలే వీరి కాంబినేషన్లో మజాకా మూవీ కూడా వచ్చింది. తన కెరీర్లో నాని, రవితేజ, నాగార్జున వంటి పెద్ద హీరోలతో పని చేసిన ప్రసన్నకుమార్ ఓసారి వెంకటేశ్ (Daggubati Venkatesh)తోనూ సినిమా చేయాలనుకున్నాడట!కథ ఓకే అయింది కానీ..ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. వెంకటేశ్‌గారికి గతంలో ఓ కథ పూర్తిగా వివరించి చెప్పాం. ఆయన సరేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. డేట్స్ చెప్పి షూటింగ్ మొదలుపెట్టేయండి అన్నారు. అయితే వెళ్లేముందు వాళ్ల అన్నయ్య సురేశ్‌బాబుకు కూడా కథ చెప్పమన్నారు. ఆయనతో రెండుమూడుసార్లు కూర్చున్నాం.. కథ వివరించాం.. ఆయనకేవో కొన్ని డౌట్స్ వస్తే వివరణ ఇచ్చాం. మాకు నమ్మకముందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. సురేశ్‌బాబు వల్లే..ఆయనకు తెలిసిన ఇద్దరుముగ్గురిని పిలిపిస్తాను. వారి అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడదాం అన్నారు. ఎక్కడెక్కడి నుంచో ముగ్గురు వివిధ సమయాల్లో వచ్చారు. ఒక్కొక్కరికి సెపరేట్‌గా కథ చెప్పాను. ఆ ముగ్గురూ కథ బాగుందన్నారు. నాకు కథపై పట్టుందని, నన్ను డిస్టర్బ్ చేయకపోతే బెటర్ అని సురేశ్‌బాబు దగ్గరకు వెళ్లి చెప్పారు. కానీ సురేశ్‌బాబు నన్ను పిలిచి.. వేరేవాళ్ల నిర్ణయాలను పట్టించుకోను, తన నిర్ణయమే ఫైనల్ అన్నారు. అలాంటప్పుడు ఎందుకు వారికి కథ చెప్పడం అనిపించింది. అలా ఆయనకు నచ్చక సినిమా కుదర్లేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్‌డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా..రాధికా ఆప్టే ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్‌తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. -
అల్లు అర్జున్- స్నేహారెడ్డి మ్యారేజ్ డే.. పిల్లలతో కలిసి సెలబ్రేషన్స్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి. తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. బన్నీ- స్నేహారెడ్డి 2011లో మార్చి 6వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ టాలీవుడ్ కపుల్ తమ 14వ వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన మూడేళ్లకు 2014లో అల్లు అయాన్ జన్నించగా.. ఆ తర్వాత 2016లో ఈ జంటకు కూతురు పుట్టింది. బన్నీ తమ ముద్దుల కూతురికి అల్లు అర్హ అని నామకరణం చేశారు. తమ అభిమాన హీరో పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2 మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ చిత్రం భారీ రికార్డులు సృష్టించింది. ఏకంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాల రికార్డ్లను దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Happy Anniversary to the most adorable couple's#alluarjun #AlluSnehaReddy 💙🤍 pic.twitter.com/ph25JnihdF— SAITEJA_Bunny🚩 (@SaiTeja307799) March 6, 2025 -
సింగిల్‌గా కంటే ప్రేమలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నా..: తమన్నా
హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia), నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుని జంటగా ఒక్కటవుతారనుకుంటే అంతలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని తెలుస్తోంది. ప్రేమికులుగా కాకుండా ఇకపై స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ బ్రేకప్ రూమర్స్ తమన్నా, విజయ్ ఎవరూ స్పందించనేలేదు.రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దుతాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమకు ఎలాంటి షరతులు ఉండకూడదు. ఇది కేవలం ప్రేమజంటకే కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు.. ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. నీ పార్ట్‌నర్‌పై నువ్వు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావడంటే అప్పుడా బంధం బిజినెస్‌గా మారుతుంది. నేనిలా అనుకుంటే నువ్విలా చేశావ్.. నేను చెప్పినవాటిలో కొన్నే చేశావ్.. ఇలా లిస్టు తయారుచేసుకోవాల్సి వస్తుంది.వ్యాపార లావాదేవిగా మార్చొద్దుప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంది. ప్రేమ పుట్టాకే రిలేషన్షిప్ మొదలవుతుంది. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి. కొన్నిసార్లు అది ఏకపక్షం కూడా కావచ్చు. అయితే నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే! నేను ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను. వారికి నచ్చినట్లుగా బతకనిస్తాను.తెలివిగా ఆలోచించండిసింగిల్గా ఉన్నప్పటి కంటే రిలేషన్లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఒక తోడు దొరికితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవర్ని ఎంచుకుంటున్నావన్నది ముఖ్యం.. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి అని చెప్పుకొచ్చింది.చదవండి: ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్ -
సోషల్‌మీడియాను షేక్ చేసిన సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గోల్డెన్ స్పారో' సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది. నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే, ఒక ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.ఈ మూవీలో ‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలయ్యే ఒక హిట్ సాంగ్ తాజాగా వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ హిట్ సాంగ్‌ను జీవీ ప్రకాష్ కుమార్‌తో సుబ్లాషిణి, ధనుష్, అరివు ఆలపించారు. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. -
ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
-
ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
తండేల్ సినిమా (Thandel Movie)తో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రేమకథలతో హిట్లు అందుకోవడం చైకి కొత్తేమీ కాదు. కానీ సెంచరీ కొట్టడం మాత్రం ఇదే తొలిసారి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టేసిన ఈ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (మార్చి 7) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.బుజ్జి తల్లి సాడ్ వర్షన్ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం నేడు బుజ్జితల్లి సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ అద్భుతంగా పాడారు. శ్రీ మణి గుండెల్ని మెలిపెట్టే లిరిక్స్ రాశారు. చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
సినిమా టికెట్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య 2025-26కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాజాగా రూ. 4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రస్తావించారు. అయితే, కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని చర్చించారు. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సిద్ధ రామయ్య ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది.కర్ణాటక చిత్ర రంగాన్ని ప్రోత్సాహించేందుకు సినిమా టికెట్ ధరలను రూ.200గా ఉండాలని నిర్ణయించాలనుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లతో పాటు ఇతర థియేటర్స్‌లలో కూడా ఇదే రేటు ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ అందుబాటులో ధరలు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్ధ రామయ్య పేర్కొన్నారు. సినిమా విడుదల రోజే కాదు.. ప్రీమియర్ షోలు ప్రదర్శించినా ఇదే రేటుతో టికెట్లు ధరలు ఉండాలని ఆయన తెలిపారు. భారీ బడ్జెట్ పెట్టి చిత్రాలు నిర్మించినా సరే ఇక నుంచి టికెట్ ధర మాత్రం రూ. 200 మించి ఉండకూడదని చెప్పారు.కర్ణాటక సినిమా ఇండస్ట్రీ కోసం తాము ఎప్పటికీ ముందు ఉంటామని సీఎం అన్నారు. ఈ క్రమంలో మైసూర్లో ఒక భారీ ఫిలిం సిటీని నిర్మాస్తామని చెప్పారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. నిర్మాణం కోసం రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు. -
'వైరల్ ప్రపంచం' మూవీ రివ్యూ
టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా! టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే అవి జీవితాలనే తలకిందులు చేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. తాజాగా అలాంటి జానర్లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రిజేష్ టాంగి దర్శకత్వం వహించగా అకిల తంగి నిర్మించారు. మార్చి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ‘వైరల్ ప్రపంచం’ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథఅమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ).. రవి (సాయి రోనక్)తో ప్రేమలో ఉంటుంది. తన 4 సంవత్సరాల సంబంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్యశెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాను కలిసే ప్రవీణ్ (సన్నీ నవీన్)తో ఎమోషనల్ బాండింగ్‌ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను తర్వాత ఇంటర్నెట్ను మాత్రమే నమ్ముతారు. మరి వారి నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఎవరు? ప్రాణాలను బలిగొన్న ఘటన ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా చూస్తాం. నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుంచి దూకడంతో కథ ఆసక్తిగా మారుతుంది. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జరుగుతుంది. వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయన్నది చూపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది కథలో చక్కగా చూపించారు. ఇంటర్నెట్లో మహిళల గోప్యతను మంటగలుపుతున్న సైబర్ నేరాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు.ఎవరెలా చేశారంటే?రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్.. ఈ తరం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతారు. సహజంగా నటించారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర యాక్ట్ చేశారు.సాంకేతిక విభాగంమ్యూజిక్ ఎంతో ఎమోషనల్ ఫీల్ కలిగిస్తుంది. కానీ కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోదు. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది. కెమెరా పనితనం పర్వాలేదు.విశ్లేషణ‘ఇంటర్నెట్లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాలనుకున్న సబ్జెక్టును తెరకెక్కించడంలో దర్శకుడు బ్రిజేష్ టాంగి దాదాపు సఫలమైనట్లే! కానీ కొన్నిసీన్లు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల యువతీయువకుల జీవితాలు ఎలా మారిపోయాయనేది నేటి యువతకు అర్థమయ్యేలా చూపించారు. ఆన్లైన్ మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. యువతకు విలువైన సందేశం ఇస్తుంది.చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. పాక్ గడ్డపై మన ఫైటర్ పోరాటం
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారు.ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్కై ఫోర్స్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ.249 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు. స్కై ఫోర్స్ చిత్రానికి మౌత్ టాక్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.1965లో జరిగిన భారత్ - పాకిస్థాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో స్కై ఫోర్స్ సినిమా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్యకు సంబంధించిన సాహస పోరాటాన్ని ఈ సినిమా కథకు స్ఫూర్తిగా తీసుకున్నారు. పాకిస్థాన్ వైమానిక స్థావరానికి గుండెకాయలాంటి సర్గోదపై భారత్ ప్రతీకార దాడికి దిగినప్పుడు ఏం జరిగింది..? అనేది ఈ మూవీలో చూపారు. ఆ యుద్ధంలో దేవయ్య ధైర్య సాహసాలు, అతని పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు. విజయవంతంగా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహసమనే చెప్పవచ్చు. ఆయన త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అధికారులు గుర్తుచేసుకుంటారు. ఆ పోరాటంలో పాల్గొన్న ఆయన మళ్లీ తిరిగిరాలేదు. కనుమరుగైపోయిన ఆయన పాకిస్థాన్ గడ్డపై ఏమయ్యాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన పాత్రలో వీర్ పహారియా నటించగా, ఆయన గురువైన వింగ్ కమాండర్ అహుజా పాత్రలో అక్షయ్ కుమార్ మెప్పించారు. అక్షయ్ పాత్రకి భారత వైమానిక దళ అధికారి, గ్రూప్ కెప్టెన్ ఓం ప్రకాశ్ తనేజా స్ఫూర్తి అని మేకర్స్ తెలిపారు. -
విక్రమ్ 'వీర ధీర శూరన్' సాంగ్ విడుదల
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న 62వ చిత్రం వీర ధీర శూరన్. నటి దుషార విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై హెచ్ఆర్ రియా శింబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్ అరుణ్ కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంగా రూపొందుతోంది. విక్రమ్ కాళీ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వీర ధీర శూరన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు చిత్రంలోని కల్లూరుమ్ కార్తీ ౠన్ మేల్ అనే పల్లవితో సాగే పాటలు విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభించింది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న వీర ధీర శూరన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా తాజాగా ఆది అడి ఆది అనే పల్లవితో సాగి రెండవ పాటను చిత్ర వర్గాలు గురువారం విడుదల చేయనున్నారు. ఫైవ్ స్టార్ పిక్చర్స్ సెంథిల్ పొందడం విశేషం. చిత్రం సమ్మర్ స్పెషల్ విడుదలకు ముస్తాబవుతోంది. -
నా భర్తపై తప్పుడు ప్రచారాలు ఆపేయండి ప్లీజ్: కల్పన
-
నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన
ప్రముఖ సింగర్ కల్పన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలోకి వెల్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్తపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కల్పన స్పందించారు. తన భర్తపై మీడియాలో ఎలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి అంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. కేవలం పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతోనే టాబ్లెట్స్ వేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.'నన్ను కాపాడిన మీడియా, పోలీసులకు కృతజ్ఞతలు. స్ట్రెస్ వల్ల గత కొద్దిరోజుల నుంచి నాకు సరిగ్గా నిద్రపట్టడం లేదు. అందువల్లే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. అయతే, అది డోస్ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగింది. కానీ, మీడియాలో నాతో పాటు నా భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలని ఆసుపత్రి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు పూర్తి క్షేమంగా ఉన్నాను. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నాను. ఇదంతా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. చాలా రోజులుగా మ్యూజికల్ ప్రోగ్రామ్స్‌లలో పాల్గొనడంతో నిద్ర పట్టడం లేదు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అందుకోసం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నాను. వారు సూచించిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాకుండా ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయాను. ఆ సమయంలో నా భర్త కేరళలో ఉండటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై కాలనీవాసుల, మీడియా సహాయం వల్ల నేను మీ ముందు క్షేమంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త ప్రసాద్ ప్రభాకర్. ఆయనతో పాటు నా కూతురు సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.. ఎవరూ తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్.. నా క్షేమం కోరుకున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు' అని ఆమె తెలిపారు. -
ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'సోనూ సూద్' సినిమా
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం 'ఫతే' సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.‘ఫతే’ మూవీకి రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్హీరోయిన్గా నటించింది. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్, నాగినీడు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో ఈ మూవీ సందడి చేసింది.సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫతే చిత్రం సడెన్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మరో వారంలోపు తెలుగు వర్షన్లో కూడా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన సోనూ ప్రేక్షకులను మెప్పించాడు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఫతే చిత్రాన్ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.కథేంటి..?సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న ఫతేహ్ సింగ్ (సోనూసూద్) వద్ద పని చేసే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహుకల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన ఫతేహ్లో తీవ్రమైన ఆవేదన ఏర్పడుతుంది. అతని ఆత్మహత్యకు కారణం లోన్ యాప్ అని తెలుసుకుని లోతుగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఇదే లోన్ యాప్ వల్ల చాలమంది మరణించారని తెలుసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ (శివజ్యోతి రాజ్‌పుత్)ను ఓ సైబర్ క్రైమ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఆమెను కాపాడే క్రమంలో ఫతేహ్కు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెను వారు ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆ లోన్ యాప్ సంస్థతో నిమ్రత్‌ను కిడ్నాప్ చేసిన ముఠాకు ఉన్న లింక్ ఏంటి..? పాల వ్యాపారం చేసే ఫతేహ్ గతమేంటి..? హ్యాకర్ ఖుషీతో (జాక్వెలైన్) ఫతేహ్కు ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో మితిమీరిన హింస ఉంటుంది. సోనూసూద్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్ బాగా నచ్చుతుంది. -
దుబాయ్ ట్రిప్.. 'రన్యా రావ్'కు ఎంత కమీషన్ ఇచ్చేవారంటే..
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది. డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావ్‌కు రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.అయితే, ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి సహకారమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.అధికారితో గొడవ వల్లే దొరికిపోయిందికొద్దిరోజుల క్రితం రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారితో ఆమె గొడవకు దిగింది. తన బంధువు పేరును వాడుకున్న ఆమె తన దర్పాన్ని ఆ అధికారి వద్ద ప్రదర్శించింది. ఈ గొడవే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఘటన వల్ల రన్యా రావు రాకపోకల వివరాలను ఆ అధికారి పరిశీలించారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణం చేశారో చెక్ చేశారు. అయితే, ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటమే కాకుండా.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తుండటంతో ఆయన అనుమానించారు.ఈసారి ఆమె దుబాయ్ నుంచి మళ్లీ వచ్చినప్పుడు సోదాలు చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది. -
వద్దని చెప్పినా వినకుండా ఫోటోలు తీశారు: హీరోయిన్ అసహనం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన చిత్రం దిల్రూబా (Dilruba Movie). విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) దిల్రూబా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రుక్సార్ (Rukshar Dhillon) తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది. దిల్రూబా సినిమాలో నేను పోషించిన అంజలి పాత్రకు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం ఉంది. రుక్సార్ సీరియస్మీకు కచ్చితంగా నచ్చుతుందని నేను బలంగా చెప్పగలను అని చెప్పుకొచ్చింది. చివర్లో మాత్రం ఓ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటినుంచి దీని గురించి మాట్లాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. కాస్త భయపడుతూనే ఉన్నాను. కానీ ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. మీరు ఎప్పుడుపడితే అప్పుడు ఫోటోలు తీస్తూనే ఉంటారు. నాకు కాస్త అసౌకర్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. అసౌకర్యంగా ఉందని చెప్పినా..మీరు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు ఎదుటివాళ్లు వచ్చి మిమ్మల్ని ఫోటో తీస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా! కాస్త ఇబ్బందిగా ఉంది.. దయచేసి నా ఫోటోలు తీయకండి అని ఎంతో ప్రేమగా, గౌరవంగా చెప్పాను. కానీ కొందరు అస్సలు వినిపించుకోలేదు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. ఈ మెసేజ్ వారికి చేరుతుందని ఆశిస్తున్నాను అని సీరియస్ అయింది.చదవండి: నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త -
హైలెస్సో హైలెస్సా సాంగ్.. సాయిపల్లవి నెమలి నాట్యం చూశారా?
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం (Thandel Movie) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లపైనే రాబట్టింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రమే మ్యూజికల్ బ్లాక్బస్టర్గానూ నిలిచింది. ఈ చిత్రంలోని బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా.. వంటి పాటలు జనాల్ని ఎంతగానో అలరించాయి.తాజాగా హైలెస్సో హైలెస్సా వీడియో సాంగ్ వచ్చేసింది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను అందంగా చూపించారు. అంతేకాదు, సాయిపల్లవి (Sai Pallavi) నెమలిలా డ్యాన్స్ చేసేది ఈ పాటలోనే! దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా నకశ్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. తండేల్ సినిమా..శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. తండేల్ మార్చి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు..
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ హీరోలు హీరోయిన్లను పెళ్లాడడం జరుగుతూనే ఉంది. అయితే గతంలో పెళ్లి తర్వాత హీరోయిన్లు తప్పనిసరిగా తమ నటన కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెళ్లి తర్వాత కూడా టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే మహేశ్‌బాబు (Mahesh Babu)ను పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్న అప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత (Namrata Shirodkar) మాత్రం నటనను వదిలేసుకున్నారు. మరి ఇప్పటి పరిస్థితిని చూసి ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు? అందాల కిరీటం అందుకున్న నమ్రతఎందుకంటే అప్పట్లో అందాల కిరీటం అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశంలోని అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్... మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ఎకాఎకిన సినిమాల్లోకి వచ్చేసినట్టే. ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu) సతీమణిగా గ్లామర్ రంగానికి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్ తొలిసారిగా 1993లో ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని పొందిన ఘనత దక్కించుకుంది. దాంతో అప్పటి బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్, మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన నటించేందుకు వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు హీరోయిన్గా.. ఇప్పుడు ఇల్లాలిగా..మెగాస్టార్ చిరంజీవితో కూడా నమ్రత నటించింది. తన సినీరంగ ప్రవేశం జరిగి మూడు దశాబ్ధాల తర్వాత... ప్రస్తుతం ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్యగా చక్కని సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడు తెర వెనుక పూర్తి జీవితాన్ని అనుభవిస్తోంది మాజీ నటి నమ్రతా శిరోద్కర్. ఆమె 1998లో హిందీ 'ఎల్ఎమ్ జబ్ ప్యార్ కిసీసే హోతా హై'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. నమ్రత కెరీర్.. హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా పలు భాషల్లో విస్తరించింది. ఆమె హీరో హిందుస్తానీ, పుకార్, అస్తిత్వ, దిల్ విల్ ప్యార్ వ్యార్, తెహసీబ్, ఇన్సాఫ్: ది జస్టిస్ వంటి అనేక రకాల టాప్ మూవీస్‌లో నటించింది. వంశీ సినిమాతో మొదలు..ఎజుపున్న తారకన్ చిత్రం ద్వారా ఆమె మలయాళ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అదే క్రమంలో 2000లో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన వంశీతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. వంశీ సినిమా ద్వారానే వారిద్దరూ సన్నిహితంగా మారారు. ఆ సినిమా షూటింగ్ కోసం 52 రోజుల పాటు న్యూజిలాండ్‌లో గడిపారు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే కండీషన్అయితే ఆ సమయంలో మహేశ్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా నమ్రత మహేశ్ కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది కావడం, హిందీ చిత్రసీమకు చెందిన సినీనటిని కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్టపడకపోవడం చిక్కులు తెచ్చిపెట్టింది. చివరికి, వారు అన్ని అడ్డంకులను అధిగమించి 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక మహేశ్‌బాబు నటనకు స్వస్తి చెప్పాలని కోరడంతో పెళ్లికి ముందే నమ్రత తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నమ్రత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు ఆ విషయం వెల్లడైంది.రిలేషన్లో ఉన్నప్పుడే..తామిద్దరూ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మహేశ్ తనకు ఈ విషయాన్ని చెప్పాడని నమ్రత అంటోంది. నటించడం నచ్చక లేదా నటిగా కొనసాగడం నచ్చకే మహేష్ అలా అన్నాడా? అంటే ‘అదేమీ కాదు. ‘మహేశ్‌కు ఇంటిని దిద్దుకునే భార్య కావాలి. నేను వేరే ఏదైనా ఉద్యోగంలో ఉండి ఉంటే కూడా అతను నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు’’ అనేది నమ్రత సమాధానం. ఒకవేళ తాను సినిమాల్లో కొనసాగి ఉంటే మరింత అగ్రస్థానంలో ఉండేదేమో కదా! అని ఎవరైనా అంటే.. ‘‘నాకెప్పుడూ కూడా టాప్ హీరోయిన్ని కావాలనే కోరిక లేదు, కాబట్టి నేను నటించడం మానేయాల్సి వచ్చినప్పుడు, ఏ మాత్రం నిరాశ చెందలేదు.‘ అని నమ్రత స్పష్టం చేసింది. అర్థం చేసుకున్న మహేశ్‘నేను ముంబైలో నివసించిన పరిస్థితులకు మహేశ్‌తో కలిసి హైదరాబాద్‌లో పెద్ద బంగ్లాకు మారడం నాకు చాలా కష్టమైన మార్పు. ఇది అర్థం చేసుకున్నాడు మహేశ్. దాంతో మా పెళ్లి తర్వాత, కొంతకాలం మేం ముంబైలో ఉండిపోయాం’’ అంటూ చెప్పుకొచ్చారు నమ్రత. అయితే నమ్రత, మహేశ్ విడిపోయారని, నమ్రత తమ కొడుకుతో కలిసి ముంబైకి వెళ్లారని అప్పట్లో కొన్ని పుకార్లు షికారు చేశాయి. ‘నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను అలాగే కొన్ని విభేదాల వల్ల కొంతకాలం విడిగా ఉన్నాము.మహేశ్ విజయం వెనక నమ్రతకానీ ఆ సమయంలో, మేము మా అనుబంధంలోని బలం స్పష్టతను కనుగొన్నాం’’ అంటూ చెప్పారామె. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ మహిళ ఉందంటారు.. ’మహేశ్‌బాబు తన విజయానికి కీలకం అని నమ్రతను తరచుగా అంటుంటాడు. తన భర్త నిర్మాణ సంస్థ అయిన జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే నమ్రత తన కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సక్సెస్ఫుల్ భార్యగా, తల్లిగా ఇంటిని తీర్చిదిద్దుతోంది.-సత్యబాబుచదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
#RC16: జాన్వీ బర్త్‌డే స్పెషల్.. లుక్ అదిరిందిగా!
దివంగత నటి శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దేవర సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. తంగంగా తన మాటలు, యాక్టింగ్‌తో అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌చరణ్‌తో కలిసి #RC16 మూవీలో నటిస్తోంది. నేడు (మార్చి 6) జాన్వీ కపూర్ బర్త్‌డే. ఈ సందర్భంగా RC16 చిత్రబృందం జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో జాన్వీ గొర్రెలమంద ముందు నిల్చుంది. కుడిచేత్తో పొట్టేలు పిల్లను చేతిలో పెట్టుకుని మరో చేత్తో గడ్డిపోచలు పట్టుకుంది. ఈ పోస్టర్‌ను చరణ్ ట్విటర్లో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే జాన్వీ కపూర్. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ విజయాలను అందుకోవాలి అని ఆకాక్షించారు. జాన్వీ లుక్ చూసిన జనాలు బాగుందని కామెంట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు, చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్‌కుమార్ ముఖ్యపాత్రలో మెరవనున్నారు. Happy Birthday, #JanhviKapoor ! Excited for all that’s coming your way. Wishing you happiness and success always! pic.twitter.com/uGzmBnaBZI— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2025 చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్ రికార్డ్ -
ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'మనమే' సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7న 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.హీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ది టెస్ట్’ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
ఓటీటీలోకి అదిరిపోయే థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ట్రైలర్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్ చేశారు.'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్‌లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్‌ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్‌స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. -
ఆత్మహత్య కాదు.. కల్పన కూతురు సంచలన వీడియో
-
ఓటీటీలో రామం రాఘవం.. ఎప్పటినుంచంటే?
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్‌గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.కథేంటంటే?సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్‌రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨Watch Ramam Raghavam streaming from March 14th 🔥[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]...#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025 చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా -
ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పిటిషన్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
కల్పన వ్యవహారం.. పోలీసులకు అసలు విషయం చెప్పిన సింగర్
సింగర్ ఆత్మహత్యాయత్నం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని పోలీసులకు తెలిపింది. కేవలం తన కూతురితో వచ్చిన మనస్పర్థల వల్లే నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిపింది. చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని తన కూతురిని అడిగానని.. తాను రానని చెప్పడంతోనే మనోవేదనకు గురైనట్లు వివరించింది. మనస్తాపంతోనే ట్యాబ్లెట్లు వేసుకున్నానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించింది. దీంతో ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.కాగా.. అంతకుముందు కల్పన కూతురు కూడా మాట్లాడారు. నా తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు. కేవలం వైద్యుల సూచన మేరకే నిద్రమాత్రలు వేసుకున్నారని పేర్కొన్నారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కల్పనా రాఘవేందర్ క్లారిటీ ఇచ్చింది.అయితే సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే అసలు విషయం ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం కల్పనా తన భర్త దయ ప్రసాద్‌తో కలిసి నిజాంపేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. -
సోదరుడి మరణం.. రాజమండ్రికి జయప్రద
ఇటీవల అలనాటి సినీ నటి జయప్రద ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె సోదరుడు రాజా బాబు మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 27) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా జయప్రద తన సోదరుడు రాజా బాబు అస్థికలను రాజమండ్రిలోని గోదావరి నది పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా తన సోదరుడి గురించి ఆమె మాట్లాడారు. ఆయన మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా బాధగా ఉందన్నారు. ఆయన కుమారుడు సామ్రాట్‌తో కలిసి రాజాబాబు జన్మస్థానంలో అక్కడే అస్థికలు కలిపేందుకు వచ్చామని జయప్రద తెలిపారు.నా సోదరుడు రాజా బాబు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. అతనితో ఉన్న ఎన్నో మరవలేని క్షణాలు గుర్తుగా ఉండిపోయాయి. నేను రాజమండ్రి ఎప్పుడొచ్చినా నా సోదరుడితోనే కలిసి వచ్చేదాన్ని. మొదటిసారి ఆయన లేకుండా ఇక్కడికి వచ్చా. మా జీవితాల్లో రాజాబాబు లేకపోవడం బాధగా ఉంది. అతని కుమారుడైన సామ్రాట్‌తో కలిసి ఈ రోజు అస్థికలు ప్రదానం చేయడానికి వచ్చాం. నా సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.ఇక జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు. -
మా కుటుంబంలో గొడవల్లేవ్.. కల్పన కూతురు కామెంట్స్
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సరైన సమయంలో స్పందించిన పోలీసులు ఈమెని ఆస్పత్రిలో చేర్పించడంతో పరిస్థితి కుదుటపడింది. కల్పన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.(ఇదీ చదవండి: భర్త కాదు కూతురితో సమస్య.. బయటపడుతున్న నిజాలు)కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే విషయం ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన కల్పన కూతురు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు. డాక్టర్స్ సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుంది. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. హైదరాబాద్ లో మా అమ్మ లా పీజీ చేస్తోంది. మానసిక ఒత్తిడితో నిద్రలేమికి గురవుతూ ఉండేది' అని కల్పన కూతురు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త) -
దాన్ని అడ్డుకోవాలంటే ఓ ఉద్యమం చేయాలి: దిల్ రాజు కామెంట్స్
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎవరి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందో వారు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు. పైరసీ గురించి శుక్రవారం మాట్లాడితే సోమవారానికే మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే పైరసీపై మాట్లాడతారు. ఈ విషయాన్ని శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి మర్చిపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ చెస్తాను . నిర్మాతలందరు కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కాబట్టి అందరూ మేల్కోవాలి. సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి. నేను నిర్మాతగా, పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నితిన్ ఎల్లమ్మ సినిమాల స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.' అని వెల్లడించారు.కాగా.. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీ అనే భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, తండేల్, విదాముయార్చి సినిమాలు సైతం పైరసీ బారినపడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే తండేల్ మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు. -
భర్త కాదు కూతురితో సమస్య.. బయటపడుతున్న నిజాలు
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని.. ఇంటి తలుపులు బద్దలుగొట్టి పోలీసులు రక్షించారు. నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగా ఉంది.(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ లైలాకు వింత వ్యాధి!)ఈ సంఘటనలో కల్పన భర్త ప్రసాద్ ని ఇప్పటికే హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు నిజాలు బయటపడ్డాయి. రోజూ వేసుకునే జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో వేసుకున్నారని, మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేయగా.. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి ప్రసాద్ కాల్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందివ్వగా.. కల్పనని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాస్త కోలుకున్న తర్వాత ఈమె దగ్గర నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేనున్నారు. అయితే మంగళవారంనాడు కల్పన.. కేరళలో ఉంటున్న తన కూతురితో మాట్లాడిందని, హైదరాబాద్ వచ్చేయమని చెప్పగా కూతురు రానని చెప్పడంతో పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతోనే కల్పన ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకుందట. కల్పనని పోలీసులు విచారించిన తర్వాత అసలేం జరిగిందనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్) -
ఆమని ‘నారి’ మూవీ HD స్టిల్స్
-
ఒకప్పటి హీరోయిన్ లైలాకు వింత వ్యాధి!
ఒకప్పటి హీరోయిన్ లైలా చాన్నాళ్ల తర్వాత రీసెంట్ గా మీడియా ముందుకొచ్చింది. తాను నటించిన 'శబ్దం' ప్రమోషన్లలో పాల్గొంది. తన గురించి బోలెడన్ని విషయాల్ని పంచుకుంది. ఈ క్రమంలోనే తనకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది.గోవాకు చెందిన లైలా.. 1996-2006 మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, ఉగాది, ఖైదీ గారు, పవిత్రప్రేమ, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, శివపుత్రుడు తదితర చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెన్ మెహ్దినీని పెళ్లిచేసుకున్న తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది. రీసెంట్ టైంలో కార్తి 'సర్దార్', విజయ్ 'ద గోట్' చిత్రాల్లో నటించింది. తాజాగా 'శబ్దం' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో తన నవ్వు వ్యాధి గురించి బయటపెట్టింది.తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయని లైలా చెప్పింది. 'శివపుత్రుడు' షూటింగ్ టైంలో నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని విక్రమ్ ఛాలెంజ్ చేయగా.. 30 సెకన్లకే ఏడ్చేశానని, దీంతో తన మేకప్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: హీరోయిన్ నయనతార) -
మంచి మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (ఫొటోలు)
-
సింగర్ కల్పన ఎవరు? ఆమె ఫ్యామిలీ డీటైల్స్ (ఫొటోలు)
-
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
-
సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి చనిపోయేందుకు ప్రయత్నించిన ఈమె.. గత రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్లి ఆమెని రక్షించారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఇంతకీ ఏమైంది?కల్పన నివాసముంటున్న వర్టేక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డి చెప్పిన దానిబట్టి చూస్తే.. కల్పన భర్త ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. సాయంత్రం నాలుగన్నరకు కాల్ లిఫ్ట్ చేస్తే సాయం కావాలని అన్నారు. నేను ఆయనకు అపార్ట్ మెంట్ సూపర్ వైజర్ నంబర్ ఇచ్చారు. భర్త ఫోన్ చేసినా సరే కల్పన కాల్ లిఫ్ట్ చేయలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అప్పటికే తన భార్య అపస్మారక స్థితిలో ఉందని ఆయన అన్నారు.దీంతో మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లొచ్చి డోర్స్ పగలగొట్టి చూడగా.. కల్పన బెడ్ పై పడి ఉంది. దీంతో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశామని సెక్రటరీ చెప్పుకొచ్చారు. ఈ విల్లాలో ఐదేళ్లుగా వీళ్లు నివాసముంటున్నారని, గత రెండు రోజులుగా మాత్రం కల్పన భర్త ఇంట్లో లేరని అన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)కల్పన, ఆమె భర్త మంచిగా ఉండేవారు. మాతో మాట్లాడేవారు. ఇద్దరు మధ్య ఏమైనా ఎలాంటి విభేదాలు ఉన్నాయో మాకు తెలియదు. విల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా కల్పన వచ్చేవారని సదరు సెక్రటరీ చెప్పుకొచ్చారు. కానీ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఈమె భర్తని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనని చూసేందుకు సింగర్స్ సునీత, శ్రీకృష్ణ తదితరులు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)గాయని కల్పన భర్త ప్రసాదను హాస్పిటల్ నుండి కేపీఎచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం..@pskkp_cyb @hydcitypolice https://t.co/qG9WggK9aH pic.twitter.com/QWSYlN5720— Telangana Awaaz (@telanganaawaaz) March 4, 2025 -
పార్లమెంట్ సందర్శనలో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (ఫొటోలు)
-
సిరాజ్‌తో 'బిగ్‌బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్‌తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్‌మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్‌తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్‌బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్‌బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
దుబాయ్‌లోనే నిర్మాత 'కేదార్' అంత్యక్రియలు.. కారణం ఇదే
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన ఆంత్యక్రియలు కొంత సమయం క్రితం దుబాయ్‌లోనే ముగిశాయి. సుమారు పది రోజుల క్రితం అనుమానాస్పదంగా ఆయన మరణించారు. కానీ, కేదార్ మృతికి సంబంధించి కారణాలు తెలియడం లేదు. అయితే, ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చడం గమనార్హం. కేదార్ అనారోగ్యం కారణంగానే మరణించారని వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అనుమతితో కేదార్ మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.దుబాయ్‌లో ఇప్పటికే స్థిర నివాసం, వ్యాపారాలు చేస్తున్న కేదార్ అంత్యక్రియలు అక్కడే పూర్తి చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో వారి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. భారత్‌కు కేదార్ మృతదేహాన్ని తీసుకొస్తే ఇబ్బందులకు గురవుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆయన అంత్యక్రియలు ఇక్కడే చేశామని వారు చెప్పుకొచ్చారు. కేదార్ అంత్యక్రియలలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ నాయకులకు బినామీగా కేదార్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన వందల కోట్ల రూపాయలు ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బుతో దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కేదార్ మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలునిర్మాత కేదార్ సెలగంశెట్టి మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి..? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు..? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి..? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని రేవంత్ చెప్పారు. -
సూర్య 'రెట్రో' మెలోడీ సాంగ్ విడుదల
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా సాంగ్ విడుదలైంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను కపిలన్ ఆలపించారు. రెట్రో నుంచి రిలీజ్ అయిన ఈ మెలోడీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. సూర్య జైలులో ఉన్న సీన్లతో ఈ పాట ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్ అంశాలతో తన కొత్త సినిమా రెట్రోను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్‌తో పాటు ఈ సాంగ్‌ను చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం. -
ఓటీటీలో 'మణికంఠన్' హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వంలో మణికంఠన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ‘కుడుంబస్తన్’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్‌లో ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా మణికంఠన్ తన జర్నీ ప్రారంభించాడు. అయితే, జై భీమ్ సినిమాలో చేసిన చిన్న పాత్రే తనను హీరోగా నిలబెట్టింది. 2023లో రొమాంటిక్ కామెడీ మూవీ 'గుడ్ నైట్'తో హీరోగా ఫస్ట్ హిట్ మణికందన్ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తను నటించిన 'కుడుంబస్తన్' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా మణికందన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు వర్షన్ విడుదల కానుంది.కుడుంబస్తన్ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయం దక్కించుకోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ చిత్రం విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుందని జీ5 పేర్కొంది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్కు రానుందని తెలిపింది. థియేటర్లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదలైన కుడుంబస్తన్ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ కావడం విశేషం.మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన్న ఈ చిత్రానికి రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వం వహించారు. జీవితంలో డబ్బు ముఖ్యం కాదని ఈ చిత్రం చాటిచెబుతుంది. చిన్న ఉద్యోగంతో కుటుంబ భారాన్ని మోస్తూ.. ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగతి యువకుడి పాత్రలో మణికంఠన్ అదరగొట్టాడని చెప్పవచ్చు. కేవలం రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 7న తెలుగు వర్షన్‌ను జీ5లో చూసేయండి. -
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతో అరంగేట్రం
పుష్ప డైలాగ్స్‌తో టాలీవుడ్ ప్రియులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బన్నీకి అభిమాని అయిన ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ టాలీవుడ్ సినిమా డైలాగ్స్‌తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్స్‌తో తగ్గేదేలా అంటూ అభిమానులను అలరించాడు. ఆయన తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి.నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా కింగ్స్టన్ మూవీ ఈవెంట్‌కు హాజరైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న రోల్ చేశారని తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్‌తో పాటు వార్నర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప డైలాగ్‌లో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలాసార్లు బన్నీ డైలాగ్స్ చెబుతూ తనదైన స్టైల్లో అలరించాడు. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. -
మహేశ్ సార్, ప్లీజ్.. ఆ ఒక్క పని చేయండి: డ్రాగన్ డైరెక్టర్
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళిగారు నాకు ఇన్స్పిరేషన్. ఎమోషన్స్ కనెక్ట్ అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్వుడ్.. ఎక్కడైనా హిట్ అవుతుందని ఆయన చెప్తుంటారు. మహేశ్ గర్విస్తారుఈ ప్రపంచంలో ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనే మూడు ఎమోషన్స్ సాధారణంగా ఉంటాయి. ఈ మూడూ మా సినిమాలో ఉన్నందునే విజయం సాధించింది. మీ అందరికీ ఓ విజ్ఞప్తి.. నేను డైరెక్ట్ చేసిన ఓ మై కడవులే సినిమా రిలీజైనప్పుడు మహేశ్‌బాబు గారు దాని గురించి ఒక్క ట్వీట్ చేశారు. అంతే.. తెలుగు సినీప్రేక్షకులందరూ ఓ మై కడవులే వీక్షించారు. డ్రాగన్ సినిమాను ఆయన చూడాలని ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా మూవీ చూసి ఆయన గర్విస్తారనుకుంటున్నాను. దయచేసి ఈ సందేశాన్ని ఆయనవరకు చేరవేయండి.. సినిమా చూసేలా చేయండి అని కోరాడు.డ్రాగన్ సినిమాడ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కల్పతి అఘోరం, కల్పతి గణేశ్, కల్పతి సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.చదవండి: అమ్మాయితో చాటింగ్ వైరల్.. తన ఉద్దేశం అది కాదన్న హీరోధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
కేరళకు అల్లు అరవింద్.. నిర్మాత బన్నీవాసు క్లారిటీ
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఛావాను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంపై అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యారని మీడియా ప్రతినిధులు బన్నీవాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అల్లు అరవింద్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలిపారు. ట్రీట్మెంట్ కోసం ఆయన కేరళ వెళ్లారని వెల్లడించారు.అయితే ఆయన కేవలం వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వెళ్లారని బన్నీ వాసు అన్నారు. బరువు తగ్గేందుకు ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. ఛావా నిర్మాతలతో మాట్లాడి తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించాలని అరవింద్ చెప్పారని తెలిపారు. ఆయన డైరెక్షన్లోనే ఛావాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా.. బాలీవుడ్ మూవీ ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. -
నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి రోజు నేడు. 2023 మార్చి 3న ప్రియురాలు భూమా మౌనిక (Mounika Bhuma Manchu) మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లో ఈ శుభకార్యం జరిగింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే! మౌనికకు అప్పటికే ధైరవ్ అనే బాబున్నాడు. అతడి బాధ్యత కూడా తనదేనని వేదమంత్రాల సాక్షిగా మాటిచ్చాడు మనోజ్. గతేడాది మనోజ్-మౌనికల దాంపత్యానికి గుర్తుగా కూతురు జన్మించింది.మనోజ్- మౌనిక పెళ్లిరోజుతమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఇద్దరూ తెగ సంతోషపడిపోయారు. పాపాయికి దేవసేన శోభ ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ఇదిలా ఉంటే నేడు పెళ్లిరోజు సందర్భంగా మౌనిక సోషల్ మీడియా వేదికగా ఓ అందమైన పోస్ట్ షేర్ చేసింది. మనిద్దరి జీవితం మంచిగా ముందుకు సాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మనం ఒకరికొకరు తారసపడినందుకు, ఒకరిపై ఒకరం నమ్మకం పెట్టుకున్నందుకు, ప్రేమ కురిపించుకున్నందుకు థాంక్యూ చెప్పాలనుకుంటున్నాను.మురిసిపోయిన మంచు లక్ష్మిఇంత అందమైన కుటుంబాన్ని పొందినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు మనోజ్.. దడదడలాడిద్దాం.. అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు ధైరవ్‌ను మౌనిక, పాపను మనోజ్ ఎత్తుకున్న ఫోటోను జత చేసింది. ఈ పోస్ట్ చూసిన లక్ష్మి మంచు (Lakshmi Manchu) నీ పోస్ట్ భలే బాగుంది. మీ నలుగుర్నీ ఎంతో ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ సంతోషంగా, ప్రేమగా ఇలాగే కలిసుండాలి కోరుకుంటున్నాను అని కామెంట్ చేసింది. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) చదవండి: నాని 'ప్యారడైజ్' గ్లింప్స్.. ఇది కాకుల కథఆస్కార్ వేదికపై 'హిందీ'.. నామినీలకు రూ.1.9 కోట్లు -
డైరెక్టర్ వినాయక్ అనారోగ్యంపై రూమర్స్.. ఇదీ అసలు నిజం
టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, క్రిటికల్ కండీషన్ లో ఉన్నారని సోషల్ మీడియాలో నిన్నంత ఒక న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని చెబుతూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)'ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా, వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని మనవి. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొంటాం' అని వినాయక్ టీమ్ చెప్పారు.తాజాగా 'దిల్' టీమ్ అంతా అంటే నిర్మాత దిల్ రాజు, అప్పుడు సినిమాకు రైటర్స్ గా పనిచేసిన సుకుమార్, వాసువర్మ, డాలీ తదితరులు డైరెక్టర్ వినాయక్ ఇంట్లో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో వినాయక్ కాస్త బక్కగా ఉన్నట్లు కనిపించడంతో, అనారోగ్యం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం
బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్లను టైట్ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్, దునియా విజయ్, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.అధికార దర్పం: ఫిల్మ్ చాంబర్డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.మీకు సాధ్యమా: అశోక్సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్, కేజీఎఫ్ యశ్, దర్శన్ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్ డిమాండ్ చేశారు. -
ధైర్యమే ఆయుధం
భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్ స్క్రీన్‌పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.క్రిమినల్... లెజెండ్ ‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌లో అనుష్క యాక్షన్ టాలెంట్‌ని ఆడియన్స్ చూశారు. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్‌గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్‌గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్.మా ఇంటి బంగారం కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్–కామెడీ ఫిల్మ్ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేశారని సమాచారం. భర్త కోసం... ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లీడ్ రోల్లో నటించారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.వీరోచిత పోరాటం ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. బ్యాగ్‌లో బాంబు ఓ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్‌లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్‌లో ‘రివాల్వర్ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడెంట్ స్టోరీ రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్డేట్ రావాల్సి ఉంది. సుబ్బు సాహసం అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్ హీరోయిన్ రోల్లో అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే కోర్టు రూమ్ డ్రామాలోనూ, ‘లాక్ డౌన్’ అనే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలోనూ అనుపమ నటించారు. నెగటివిటీ తగ్గాలంటే... సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎస్సీ యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. సతీ లీలావతి ‘హ్యపీబర్త్ డే’ తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సైన్ చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.బూమరాంగ్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటించిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.సత్యభామ కథ పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.మహిళలు ఎదగాలి మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్ రోల్ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
పెళ్లి తర్వాత యంగ్ హీరోతో కీర్తీ సురేష్ కొత్త సినిమా
నటి కీర్తీ సురేష్‌ను లక్కీ హీరోయిన్గా పేర్కొనవచ్చు. బాల నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత కథానాయకిగా మాతృభాషలో పరిచయమైనా, ఆ వెంటనే కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేశారు. అలా చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అంతస్తును పొందారు. అంతేకాదు అతి తక్కువ వయసులోనే జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆపై బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం విశేషం. అలా పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ 32 ఏళ్ల వయసులో పెళ్లి కూడా చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనినీ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ హిందీ చిత్రం బేబీ జాన్ తర్వాత మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అలాంటిది తాజాగా కీర్తి సురేష్ కమ్‌బ్యాక్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తమిళంలో యువ కథానాయకుడిగా రాణిస్తున్న అశోక్ సెల్వన్‌కు జంటగా నటించడానికి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూవీని ఇంతకుముందు గుడ్ నైట్, లవర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో కన్నె వేడి, రివాల్వర్ రీటా చిత్రాలు ఉన్నాయి. -
నటిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోలీవుడ్ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్, నటుడు సీమాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్ షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో సీమాన్ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు. నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్మెంట్ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ చెప్పిన ఎంజాయ్మెంట్ వితవుట్ రెస్పాన్స్ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు. -
97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా'
97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. అవార్డుల కోసం హాలీవుడ్ టాప్ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. అమెరికాకు చెందిన 'అనోరా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్-2025 అవార్డ్‌ను దక్కించుకుంది. అయితే ఇదే చిత్రంలో నటించిన మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ హీరోయిన్గా అవార్డ్ అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆడ్రిన్ బ్రాడీ అందుకున్నారు. ది బ్రూటలిస్ట్ అనే చిత్రంలో ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'డ్యూన్: పార్ట్2' చిత్రం కూడా రెండు విభాగాల్లో అవార్డ్స్‌ను అందుకుంది. ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది ఆస్కార్ విజేతలు- 2025 ఉత్తమ చిత్రం – (అనోరా)ఉత్తమ నటుడు – అడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటి – మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా) ఉత్తమ దర్శకుడు –సీన్ బేకర్ (అనోరా) ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాల్ క్రాలే ( ది బ్రూటలిస్ట్)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్క్లేవ్)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టాజ్వెల్ (విక్డ్- Wicked)ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – (ఫ్లో- FLOW)ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్‌ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్‌ఉత్తమ ఎడిటింగ్ - సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్డ్- Wicked)ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్– నో అదర్ ల్యాండ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రాఉత్తమ సౌండ్ - డ్యూన్- పార్ట్2బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్- పార్ట్2 ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్) -
ఆస్కార్ రేసులో ఉన్నదెవరు.. భారత్‌కు అవార్డ్ దక్కేనా..?
97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డులకు సంబంధించి రేసులో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రేసులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఈ వేడకలకు వ్యాఖ్యాతలుగా అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్లు వ్యవహరించారు.భారతీయ సినిమాకి నిరాశఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్), సంతోష్, స్వతంత్రవీర్ సవార్కర్, ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పుతల్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది. కానీ, 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) మాత్రమే భారత్ నుంచి రేసులో ఉంది. ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్ నోన్ ), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్ నోన్ ), కోల్మెన్ డొమినింగో (సింగ్సింగ్), రే ఫియన్నెస్ (కాన్ క్లేవ్), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ), ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్ నోన్ ), గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్). -
జబర్దస్త్ రాంప్రసాద్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ ఆనిర్వేశ్'. ఈ సినిమా గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే కామెడీకి భిన్నంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ సందర్భంగా సినిమా మంచి హిట్ అవుతుందని టీమ్‌కు శివాజీ అభినందనలు తెలిపారు. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. మార్చి 7వ తేదీ ఈ చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించారు.దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' జబర్దస్త్ రాంప్రసాద్‌తో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం మా చిత్రబృందమే. మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ, మా చిత్రంలో నటించిన తారాగణం ఎంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. -
'మ్యాడ్ స్క్వేర్' డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్లో కామెడీ పంచులు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చిలోనే రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. మొదట అనుకున్న తేదీలో మ్యాడ్ స్క్వేర్ విడుదల కావడం లేదని వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 29న రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ఆ రోజు అమావాస్య ఉన్నందున ఒక రోజు ముందుగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే అదే రోజు నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ కూడా విడుదల కానుందని నాగవంశీ తెలిపారు. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుములకు నాగవంశీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.లాజిక్స్ వెతకొద్దు..కాగా.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ మూవీపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్‌లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్‌లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని తెలిపారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్‌గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు. With the request and support of our esteemed distributors, #MADSquare is arriving a day earlier – March 28th. Since March 29th falls on Amavasya…Our distributors felt it was best to advance the release and we are happy to oblige.Apart from that, there was never any intention… pic.twitter.com/B78xeh64jM— Naga Vamsi (@vamsi84) March 2, 2025 -
ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు
ఈ ఏడాది పొంగల్‌కు రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) ఓ రేంజ్లో అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్లకు క్యూ కట్టారు. కడుపుబ్బా నవ్వుకుని ఎన్నాళ్లవుతుందో అన్నట్లుగా సినీప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు సినిమా చూసి ఎంజాయ్ చేశారు. పోటీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలున్నా వాటిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచింది.ఓటీటీలో ప్రభంజనంవిక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్గా నటించిన ఈ సినిమా మార్చి 1న అటు టీవీలో, ఇటు ఓటీటీలో రిలీజైంది. ఇంకేముంది, వన్స్ మోర్ అంటూ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఓటీటీ ప్రియులు జీ5లో సినిమా తెగ చూసేస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. 13 లక్షలమంది సినిమా వీక్షించారని పేర్కొంది. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్, హనుమాన్ సినిమాల రికార్డులను సంక్రాంతికి వస్తున్నాం బద్ధలు కొట్టిందని వెల్లడించింది. జీ5 ప్లాట్ఫామ్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ రిలీజ్ చేసింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా..సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వెంకీమామ భార్య భాగ్యంగా ఐశ్వర్య, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, వెంకటేశ్ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ భీమల అదరగొట్టారు. కొరికేత్త నిన్ను అంటూ బుల్లిరాజు చేసే కామెడీ కోసమైనా సినిమా చూడాల్సిందే అంటున్నారు. అన్నట్లు ఈ మూవీ ఓటీటీలో తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. HISTORY CREATED! The BIGGEST OPENING EVER on ZEE5 in just 6 hours!Experience the magic of #SankranthikiVasthunam Streaming Now in Malayalam | Hindi | Tamil | Kannada| Telugu @VenkyMama @AnilRavipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo #Dilraju #Shirish @YoursSKrishna pic.twitter.com/udEZi473ov— ZEE5 Telugu (@ZEE5Telugu) March 2, 2025 చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
భాగ్యశ్రీకి మరో బంపర్ ఆఫర్?
-
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతేడాది 'క' మూవీతో అద్బుతమైన హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈసారి 'దిల్ రుబా' అనే ప్రేమకథ మార్చి 14న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు.(ఇదీ చదవండి: 'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే)సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్ నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని, వాటి ఆధారంగా 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటితరం హీరోల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. అలా ఇప్పుడు కిరణ్.. బైక్ ని బహుమతిగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లన్ హీరోహీరోయిన్లుగా నటించారు. విశ్వకరుణ్ దర్శకుడు. మార్చి 14న ఈ మూవీతో పాటు నాని నిర్మించిన 'కోర్ట్' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
మొండిమొగుడు పెంకి పెళ్లాం, వజ్రం, రావణ బ్రహ్మ.. ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది నటి సీత (Actress Seetha). తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. సీత మాట్లాడుతూ.. మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీ అవడంతో సినిమాలు చేయట్లేదు.చిన్నప్పుడే నాన్న మరణం..నా వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కు వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగో స్టేజీ అని తెలిసింది. రెండు నెలలకంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆమెను బతికించమని దేవుళ్లను వేడుకున్నా.. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయింది. (చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?)మొదటి భర్తతో విడాకులునాకు గతంలో పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా.. ఆయనక్కూడా ఇది రెండోదే! మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. ఏదైనా తప్పు జరిగుంటే విడాకులవుతాయి. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులయ్యాయి. తర్వాత నా స్కూల్‌మేట్ పరిచయమయ్యాడు. 2018లో అతడిని పెళ్లి చేసుకున్నాను. గర్భాశయం తీసేశారుపిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కణతులు (ఫైబ్రాయిడ్స్) ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు. అని నటి సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?! -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.This summer, it is going to be a crazy entertaining ride 💥💥#GoodBadUglyTeaser out now!Telugu ▶️ https://t.co/Ynl6esv1jhHindi ▶️ https://t.co/Y5QRRG1E67#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥… pic.twitter.com/5BxIRxZ1sz— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2025 -
మజాకా సూపర్ హిట్.. అప్పుడే మరో సినిమా!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇటీవల మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మజాకా దూసుకెళ్తోంది. ఇటీవల మజాకా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మజాకా సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేయాలని డైరెక్టర్ త్రినాథరావు ఆడియన్స్‌కు సూచించారు.(ఇది చదవండి: సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్)అయితే ఒక పక్కా మజాకా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు త్రినాథరావు. అప్పుడే మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. టాలీవుడ్లో పలు సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ యువ హీరో హవీశ్ కోనేరుతో జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. ప్రతిభావంతులైన యువ హీరోలను ప్రోత్సహిస్తూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. తెలుగులో సినిమా చూపిస్తావా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు త్రినాథరావు. కాగా.. కోనేరు నువ్విలా, జీనియస్, సెవెన్ లాంటి సినిమాలతో యంగ్ హీరో హవీశ్ గుర్తింపు తెచ్చుకున్నారు. -
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్ -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సీనియర్ హీరోయిన్ రంభ (Rambha Re-Entry) రీఎంట్రీకి రెడీ అవుతోంది. చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది.సినిమా అంటే నాకెంతో ప్రేమ. వెండితెరకు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నా.. అని రంభ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే 2023లోనూ రంభ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్లు చెప్పింది. కానీ ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. ఈసారైనా ఆమె చెప్పింది నిజమైతే బాగుండంటున్నారు అభిమానులు. మరి ఎలాంటి రోల్‌తో రంభ రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!రంభ జర్నీ..రంభ అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. ఆమె నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ. తర్వాతి కాలంలో ఆమె రంభగానే కంటిన్యూ అయిపోయింది. తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. వంటి ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది.సినిమాతెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. ఆమె నటించిన చివరి చిత్రం ద ఫిలింస్టార్ (2011లో వచ్చిన మలయాళ మూవీ). 2010లో బిజినెస్మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె కెనడాలో సెటిలైంది. కొంతకాలం తర్వాత బుల్లితెరపై తళుక్కుమని మెరిసింది. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ -
ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.మార్చి 22వ తేదీన హైదరాబాద్ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్టీలు(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert. But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse— rajamouli ss (@ssrajamouli) February 28, 2025