Tollywood Heroine
-
నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌ను అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు అవార్డ్‌ను బహుకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఏ మాయ చేశావే మూవీతో సామ్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి సమంత మాట్లాడింది. ఈ సినిమాలో ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించింది. అయితే ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవటం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాననని తెలిపింది. అంతేకాకుడా తనకు తమిళం రాకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు సామ్ చెప్పింది.అయితే సమంతా 2010లో రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరిలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాయ చేశావే కంటే ముందే చిత్రీకరించినప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా కంటే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమాలోని ప్రతి షాట్ గుర్తుండిపోతుందని సమంత చెబుతోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను కలిసే మొదటి సన్నివేశం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని సమంత వెల్లడించింది. గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.కాగా.. 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. అంతేకాకుండా గతేడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో నటించింది. -
ధైర్యమే ఆయుధం
భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్ స్క్రీన్‌పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.క్రిమినల్... లెజెండ్ ‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌లో అనుష్క యాక్షన్ టాలెంట్‌ని ఆడియన్స్ చూశారు. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్‌గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్‌గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్.మా ఇంటి బంగారం కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్–కామెడీ ఫిల్మ్ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేశారని సమాచారం. భర్త కోసం... ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లీడ్ రోల్లో నటించారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.వీరోచిత పోరాటం ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. బ్యాగ్‌లో బాంబు ఓ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్‌లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్‌లో ‘రివాల్వర్ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడెంట్ స్టోరీ రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్డేట్ రావాల్సి ఉంది. సుబ్బు సాహసం అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్ హీరోయిన్ రోల్లో అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే కోర్టు రూమ్ డ్రామాలోనూ, ‘లాక్ డౌన్’ అనే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలోనూ అనుపమ నటించారు. నెగటివిటీ తగ్గాలంటే... సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎస్సీ యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. సతీ లీలావతి ‘హ్యపీబర్త్ డే’ తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సైన్ చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.బూమరాంగ్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటించిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.సత్యభామ కథ పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.మహిళలు ఎదగాలి మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్ రోల్ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. అయితే కొత్త ఏడాదిలో ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో రీ ఎంట్రీకి మాత్రం నానా తంటాలు పడుతోంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన సొంత బ్యానర్లోని మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది.అయితే తాజాగా సమంతను ఓ అవార్డ్ వరించింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రముఖ సంస్థ ఆమెను సత్కరించింది. చెన్నైకి చెందిన ఎంసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు సమంతకు అవార్డ్‌ను అందజేశారు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ అందించే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌కు ఆమెకు అందించారు. చెన్నైలో జరిగిన వేడుకలో సమంత ఈ అవార్డ్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సామ్. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్‌కు కూడా మరో అవార్డ్‌ను అందుకుంది ఈ ముద్దగుమ్మ.(ఇది చదవండి: 'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్)కాగా.. సమంత 2010లో అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే అనే సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. సామ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సిటాడెల్ హనీ బన్నీ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు, డీకే కూడా హాజరయ్యారు.రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తలుకాగా.. ఇటీవల రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ సమంతపై వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో మరోసారి రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి సమంత, రాజ్ నిడిమోరు ఓకే వేదికపై మెరిశారు. దీంతో మరోసారి సమంతపై డేటింగ్ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే సామ్ కానీ.. రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
డ్రాగన్ సక్సెస్.. టాలీవుడ్ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరోయిన్ కాయాదు లోహర్. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించింది. ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఇందులో తమిళంతో పాటు తెలుగులోనూ మాట్లాడి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అస్సాం బ్యూటీ.. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్లో యంగ్ హీరోతో జత కట్టనుందని లేటేస్ట్ టాక్. అందుకే తెలుగు భాషను నేర్చుకుంటోందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కా దాస్ నటించబోయే ఫంకీ మూవీలో కాయదు లోహర్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీ జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గ్లామర్ బ్యూటీ నటిస్తే యూత్ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. కాయదు లోహర్ ఇప్పటికే శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాయాదు లోహర్ తెలుగులో మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. నేను త్వరలో టాలీవుడ్లో సినిమా కనిపించబోతున్నా. మీ అందరూ నన్ను బాగా ఆదరించారు. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అని వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఫంకీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
సెట్లో అడుగుపెట్టిన అక్కినేనివారి కోడలు.. పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్ట్
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాల గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే చైతూతో పెళ్లి తర్వాత ఇటీవల తండేల్ మూవీ ఈవెంట్లో మెరిసింది అక్కినేని కోడలు. తాజాగా తన పెళ్లి తర్వాత తొలిసారిగా మూవీ సెట్లో అడుగుపెట్టింది శోభిత. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో షూటింగ్లో పాల్గొన్నారామె. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చైతూతో పెళ్లి తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అంతకుముందు బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శోభిత ధూళిపాల. బాలీవుడ్లో 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. Here are some photos of #SobhitaDhulipala shooting for her next film. ✨#Celebs pic.twitter.com/PTAXN54Ab4— Filmfare (@filmfare) February 24, 2025 -
కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారు?.. శ్రీలీల క్యూట్ వీడియో చూశారా?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను కట్టిపడేసిన భామ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పల్లీల పొడిని కారంలో కలుపుకుని తింటున్న వీడీయోను శ్రీలీల టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందులో పీనట్ పొడిలో కారం కలుపుకుని ప్రతి రోజు తింటానంటోంది ముద్దుగుమ్మ. అంతేకాకుండా కారం పొడిని ఇంగ్లీషులో ఏమంటారని క్యూట్‌గా అడిగింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శ్రీలీలీ బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. Cutest video on internet ❤️❤️🥹@sreeleela14 #Sreeleela pic.twitter.com/o8xckGmsor— Team Sreeleela™️ (@Teamsreeleela) February 19, 2025 -
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
సమంత వెబ్ సిరీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. బెస్ట్ వెబ్ సిరీస్‌గా అవార్ట్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా హనీ బన్నీ డైరెక్టర్ డీకే సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెబ్‌సిరీస్ తీయడం వెనుక చాలా మంది కష్టముందని.. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డేటింగ్ రూమర్స్..కాగా.. సమంత ఇటీవల పికిల్ బాల్ లీగ్‌లో మెరిసింది. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఇద్దరూ కలిసి పికిల్ బాల్ కోర్టులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. -
కిస్సిక్ భామ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దక్షిణాదిలో ఓ ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. -
వాటితో జీవితానికి ఎలాంటి ఉపయోగం లేదు: రష్మిక ఆసక్తికర కామెంట్స్
వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బ్యూటీ, నేషనల్ క్రష్ నటి రషి్మక మందన్నా. మాతృభాష అయిన కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె తెలుగులో అల్లు అర్జున్ ఫ్యాషన్ నటించిన పుష్ప– 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో అందం, అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇటీవల హిందీలో గుడ్ బై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఆ చిత్రం నుంచి ఆశించిన విజయాన్ని సాధించకపోయినా.. అక్కడ వరుసగా అవకాశాలు మాత్ర వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత నటించిన యానిమల్ చిత్రం ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్‌గా మార్చింది. తాజాగా విక్కీ కౌశల్‌తో సరసన ఛావా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది.ఇందులో నటి రష్మిక మహారాణి పాత్రలో తన సత్తాను చాటారు. ఈ సందర్భంగా నేషనల్ క్రష్ వంటి బిరుదులు జీవితంలో ఏ విధంగానూ ఉపకరించవని పేర్కొన్నారు. దీని గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో లభించే బిరుదులు , పేర్లు జీవితంలో ఉపయోగపడవు అన్నారు. అవీ అభిమానుల ఆదరాభిమానాలతో వచ్చేవి అన్నారు. అందుకే అవి కూడా పేర్లు మాత్రమేనని పేర్కొన్నారు.అయితే తన మంచిని కోరేవారిని తాను గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే అభిమానులు ఆదరించే చిత్రాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభిమానుల ప్రేమనే ప్రధానంగా భావిస్తానన్నారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది చిత్రాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రమగా మారిందన్నారు. అదే సమయంలో అభిమానుల ప్రేమ కోసం తాను తన నిద్రకే గుడ్ బై చెబుతున్నానని నటి రష్మిక మందన్నా. -
క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్‌గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్ కేర్ వారితో ఫోన్లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.అనన్య తన ట్వీట్లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు సింపుల్‌గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్‌ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్ కేర్‌కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025 -
నాకు ఎదురైన వాటి గురించే మాట్లాడతా.. అలా చేయొద్దంటోన్న అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ ఇటీవలే పుష్ప-2 సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో తనదైన పాత్రలో అభిమానులను మెప్పించారు. పుష్ప పార్ట్-1లో దాక్షాయణిగా అలరించిన అనసూయ.. పార్ట్-2లోనూ మరోసారి సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అరి మూవీ(Ari)తో అభిమానులను పలకరించనుంది. పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.(ఇది చదవండి: స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ)అయితే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ నేను కేవలం నా అనుభవాన్ని మాత్రమే పంచుకున్నట్లు తెలిపింది. అవగాహన కల్పించడం కోసమే నా కెరీర్లో ఎదురైన సంఘటనల గురించి మాత్రమే మాట్లాడనని పేర్కొంది. నా మాటలను ఎవరూ వక్రీకరించవద్దని ప్రేక్షకులను, మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చింది. ఇలాంటివీ నన్ను క్యారెక్టర్‌ను డిసైడ్ చేయలేవ్.. నిజమే ఎప్పటికీ నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి ప్రేమను పంచుతూనే ఉంటా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. I shared my experience—what I faced, I spoke. Not to blame, but to bring awareness. I sincerely request the audience and media not to twist my words into something I never meant. The noise doesn’t define me—truth does. Sending love to those who understand. ❤️ #StayStrong— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 11, 2025 -
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి.. బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ కృతి కర్బందా!
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి చిల్..బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ కృతి కర్బందా..పింక్ శారీలో మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్..దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్‌పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్‌తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
పెళ్లి కూతురి చీరలో కీర్తి సురేశ్.. వజ్రంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
పెళ్లి కూతురి చీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్..క మూవీ హీరోయిన్ తన్వీరామ్ చిల్..ఇండియన్ ఆర్ట్ ఫెయిర్‌లో రానా సతీమణి మిహికా..బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హోయలు..వజ్రాల డ్రెస్‌లో ఒదిగిపోయిన్ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత..మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..!
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత...లవ్ యాపా మూడ్‌లో బాలీవుడ్ భామ ఖుషీకపూర్...మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త స్పెషల్ విషెస్..అలాంటి డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బరుచ్చా.. View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. చైతూ భార్య శోభిత ధూళిపాల అలాంటి పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల థియేటర్లలో విడుదలైంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు.అయితే శోభిత తన భర్త సినిమా రిలీజ్‌కు ముందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా విడుదల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసని అన్నారు. ఈ లవ్ స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉందని శోభిత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇకనైనా మీరు గడ్డం గీసుకుంటారు.. మొదటిసారి గడ్డం లేకుండా నీ ముఖం చూసే దర్శనభాగ్యం కలుగుతుంది సామీ అని ఆమె రాసింది.' అంటూ తెలుగులోనే రాసుకొచ్చింది.కాగా.. గతేడాది డిసెంబర్లో శోభిత ధూళిపా- నాగచైతన్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో శోభిత దూళిపాల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్షిప్లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.నాగచైతన్య రెండో పెళ్లి..నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
మా పెళ్లి ప్లానింగ్ అంతా తనదే: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా కనిపించనుంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మన తండేల్ హీరో చైతూ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా వెడ్డింగ్ ప్లానింగ్ విషయంలో క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందన్నారు. శోభిత మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. మా పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమెనే డిజైన్ చేసిందని వెల్లడించారు. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనని నాగచైతన్య అన్నారు. -
'అలా వైకుంఠపురములో చిత్రంపై పూజా హెగ్డే కామెంట్స్'.. బుట్టబొమ్మపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్లో బుట్టబొమ్మగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే అంతుకుముందు ఈ సినిమా ప్రమోషన్లలో మెరిసింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతే కాదు.. బుట్టబొమ్మ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందా.టాలీవుడ్లో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేశారు. అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురములో పూజా హెగ్డే మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉద్దేశించి తాజాగా పూజా చేసిన కామెంట్స్ ఆగ్రహానికి దారితీశాయి. అలా వైకుంఠపురములో మూములుగా తమిళ చిత్రం అంటూ మాట్లాడింది. అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారని మాట్లాడింది. దీంతో పూజా హెగ్డే కామెంట్స్‌పై టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు మీరు ఏ భాషలో మూవీ చేశారో కూడా మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే సిగ్గుగా ఉందని.. తెలుగు చిత్రంలో మీరు లీడ్ రోల్ చేసిన సినిమాను తమిళ్ చిత్రమని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు. కాగా.. అలా వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షెహజాదాగా బాలీవుడ్లో రిలీజ్ చేయగా.. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. -
కేపీ చౌదరి ఆత్మహత్య.. టాలీవుడ్ నటి కూతురు ఎమోషనల్ నోట్
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక నుంచి నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేశావ్ కదా అన్న అంటూ సుప్రీత తన నోట్లో రాసుకొచ్చింది.నీకోసం చెల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.. వెనక్కి వచ్చేయ్ అన్న అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 'మిస్ యూ కేపీ అన్న.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావ్.. ఐ లవ్ యూ సో మచ్.. రెస్ ఇన్ పీస్' అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: 'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే)కాగా.. కేపీ చౌదరి నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించారు. కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ.. మహబూబ్ నగర్లో డాకు మహారాజ్ భామ!
విదేశీ పర్యటనలో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..మహాకుంభ్ మేళాలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ లుక్స్..మహబూబ్‌నగర్‌లో డాకుమహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..కళ్లతోనే ఆకట్టుకుంటోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
ఆ డైరెక్టర్‌తో సమంత.. వైరల్‌గా మారిన ఫోటోలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. టాలీవుడ్లో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన కనిపించింది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు సామ్.అయితే మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్‌తో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. గతంలోనే చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్‌ను కొనుగోలు చేసిన సమంత తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లో సమంత సందడి చేసింది. తన టీమ్‌కు సపోర్ట్ చేస్తూ కనిపించింది.రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని..అయితే ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్లో మెరిసింది. ఇద్దరు జంటగా కనిపించి సందడి చేశారు. దీంతో మరోసారి వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. గతంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓకే వేదికపై జంటగా కనిపించడంతో డేటింగ్లో రూమర్స్ నిజమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు ఆమె షేర్ చేసిన ఫోటోల్లో దర్శకుడి చేతిని పట్టుకున్నట్లు సామ్ కనిపించింది. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. కాగా.. వీరిద్దరు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నీలో సన్నిహితంగా ఉండడం చూసిన ఫ్యాన్స్ సామ్ డేటింగ్లో మునిగి తేలుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం: రాశీ ఖన్నా
హీరోయిన్ రాశి ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్ ఎదుగుదలకు ఊపయోగపడతుందని తెలిపింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో నటించడంపై రాశీ ఖన్నా మాట్లాడింది.రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు.' అని పంచుకున్నారు.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. కాగా.. రాశి ఖన్నా చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్‌లో కనిపించింది. -
'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్‌షిప్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో బాలీవుడ్ చిత్రం ఛావాతో అభిమానులను పలకరించనుంది. ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన రిలేషన్షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది.రష్మిక మాట్లాడుతూ.. " నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో గెలుపు అనేది వస్తూ, పోతూ ఉంటుంది. విజయమనేది మన లైఫ్‌లో శాశ్వతం కాదు. కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం. అందుకే అక్కడి నుంచే పనిచేస్తున్నా. అక్కడ నేను పొందిన ప్రేమ, కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా. అంతే కాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.. అంటే ఎప్పుడు స్మైలీ ఫేస్‌తో పాటు తన చుట్టు ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకు ఇష్టం.' అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.రిలేషన్‌పై రూమర్స్..కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్లో ఉన్నట్లు బయటికి చెప్పారు. అయితే ఎవరనేది మాత్రం పేరును వెల్లడించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశాడు.అయితే రష్మిక మందన్నా చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది. గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. చాలాసార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. దీంతో విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు రిలేషన్‌పై క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. కాగా.. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. -
ఆ ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి: విశ్వక్ సేన్ విజ్ఞప్తి
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విశ్వక్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025 -
ఈ ఒక్క పాత్ర చాలు.. ఇక రిటైర్ అయిపోతా: రష్మిక కామెంట్స్ వైరల్
పుష్ప-2 అభిమానులను అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఛావా చిత్రంతో అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఛావా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మూవీలో మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ పాత్రతో ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వెల్లడించింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇది నాకు గొప్ప గౌరవం. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది. నా సినీ కెరీర్లో అత్యంత విశేషమైన, ప్రత్యేకమైన పాత్ర. అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్‌తో ఒక విషయం చెప్పాను. ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతా అని చెప్పా' అని అన్నారు.తననే ఈ పాత్రకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ..' ఈ విషయంలో నేను షాక్ అయ్యా. అసలు లక్ష్మణ్ సర్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు. నాకు లక్ష్మణ్ సర్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా. ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్‌గా అనిపించింది. కానీ లక్ష్మణ్ సార్‌కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నా అన్న ధైర్యమిచ్చా' అని అన్నారు.గాయంతోనే ఈవెంట్‌కు..కాగా.. ఇటీవల రష్మిక మందన్నా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది. కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.కాగా.. ఛావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
రెండేళ్లుగా ఆ పద్ధతినే పాటిస్తున్నా.. అదే నా గేమ్ ఛేంజర్: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత చివరిసారిగా సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఫుల్ బిజీగా ఉంది. గతంలో చాలాసార్లు ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.అయితే తాజాగా సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండేళ్లుగా తాను ఓ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. ఇది తన కష్టతరమైన క్షణాల నుంచి బయపడేసిందని వెల్లడించింది. అంతేకాదు ఇది చాలా సులభమైన, శక్తివంతమైందని సామ్ అంటోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నా. ఇది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలిగించింది. ఇది చాలా సులభమైంది.. అంతే కాదు శక్తివంతమైనది కూడా. ప్రస్తుత ఎక్కడ ఉన్నాను.. అలాగే మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీరు కాస్తా సాఫ్ట్‌గా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ అది నిజం కాదు.. ఇది మీకు సహాయపడుతుందని నిరూపించడానికి తన వద్ద తగినంత సమాచారం ఉంది' రాసుకొచ్చింది.సామ్ తన పోస్ట్‌లో.. 'రైటింగ్ అనేది మీకు సహజంగా వచ్చినట్లయితే.. ఈ రోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి. అవి పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా, బలవంతంగా అనిపిస్తే మీరు బాగా విశ్వసించే వారితో షేర్ చేయండి. అంతే కాదు ఏమీ చేయకపోయినా కొన్నిసార్లు సైలెంట్‌గా కూర్చున్నా చాలు. ఈ చిన్న అభ్యాసం మొదట చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ప్రతిదీ మీరు చూసే విధానాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది.' రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కుంటుతూనే ఈవెంట్‌కు పుష్ప భామ.. సాయం చేసిన హీరో
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కొద్ది రోజుల క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయమైంజి. అయితే చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించింది. ఇవాళ ముంబయిలో జరిగిన ఛావా ట్రైలర్ లాంఛ్‌కు ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.తన కాలు సహకరించుకున్నా ఛావా (Chhaava) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు రష్మిక హాజరైంది. రష్మిక కుంటుతూ ఈవెంట్‌కు వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ ఆమెను చేతపట్టుకుని స్టేజీపై నడిపించుకుంటూ వెళ్లారు. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ఛావా. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. #TFNExclusive: Beautiful @iamRashmika snapped in a stunning look for #Chhaava trailer launch in Mumbai!!♥️#RashmikaMandanna #Pushpa2TheRule #TheGirlfriend #Kubera #TeluguFilmNagar pic.twitter.com/qEpiTvn59I— Telugu FilmNagar (@telugufilmnagar) January 22, 2025 -
'అక్కడ ఎక్కడో చావడానికి రూ.70 లక్షలా?'.. ఆసక్తిగా టీజర్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'పిచ్చి గిచ్చి పట్టిందా తనకీ.. అక్కడ ఎక్కడో చావడానికి 70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ఈ కథ అంతా పర్వత ప్రాంతాల్లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
కలర్‌ఫుల్ శారీలో హన్సిక.. సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్!
మూవీ షూట్లో బిజీగా సన్ని లియోన్..ఈవెంట్లో మెహరీన్ ఫిర్జాదా సందడి..కలర్‌ఫుల్ శారీలో హన్సిక పోజులు..ఖుషీ కపూర్ ఫ్యాషన్ డ్రెస్ లుక్స్..బుల్లితెర భామ తేజస్వినీ గౌడ్ లేటేస్ట్ పిక్స్..బిగ్ బాస్ బ్యూటీ దివి అలాంటి లుక్..పింక్ శారీలో సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్..హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ టాప్-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.హీరోయిన్లలో సమంత టాప్..హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/cRd7Jb4WsI— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 Ormax Stars India Loves: Most popular male film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/Tniww2cO7Z— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్‌తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
రాజకీయాల్లోకి వస్తానంటోన్న హీరోయిన్.. ఆమెనే ఆదర్శం!
సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరుచేసి చూడలేం. నటులే కాదు.. నటీమణులు కూడా రాజకీయ రంగప్రవేశానికి సై అంటున్నారు. ఈ మధ్య నటి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. తాజాగా మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమంటోంది. దక్షిణాదిలో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న ఆ నటి ఎవరో తెలుసుకుందాం.తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తానూ రాజకీయాల్లోకి వస్తానని అంటోంది. తెలుగులో గతేడాది హనుమాన్తో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది సచ్ దేవ్ నికోలయ్‌ను పెళ్లి చేసుకుని నటనను కొనసాగిస్తున్నారు.తాజగా విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటి అంజలి హీరో, హీరోయిన్లుగా నటించిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా చిత్రం పొంగల్ సందర్భంగా తెరపైకి రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. పోడా పోడీ చిత్రం తరువాత తాను నటించిన రెండవ చిత్రం ఇదేనని చెప్పారు. కమర్శియల్ అంశాలతో కూడిన వినోదభరిత కథా సినిమా అన్నారు. పది ఏళ్లలో సినిమా చాలా మారిపోయిందన్నారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నెగెటివ్ కామెంట్స్‌పై వరలక్ష్మి స్పందిచారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్తన్నారని అన్నారు. తాను ఒక సారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళుతుండగా పలువురు వచ్చి తనతో ఫొటోలను తీసుకున్నారన్నారు.అప్పుడు ఒకతను వచ్చి ఫొటో తీసుకుంటానని అడిగారన్నారు. కానీ నాకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాన్నాననీ, దీంతో అతను తమతో ఫొటో తీసుకోనివ్వరా? మరి మీరెందుకు నటనలోకి వచ్చారని కామెంట్ చేశాడన్నారు. అలాంటి వారికి బుద్ధి లేదని, వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. తనకు స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని అన్నారు. -
'అందరికీ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం'.. నక్కిన త్రినాథరావు అభ్యంతరకర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.మహిళా కమిషన్ ఆగ్రహం..తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)ఇలా చేయడం రెండోసారి..అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్లో మాట్లాడారు. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఈవెంట్లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. -
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్‌లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్‌లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
పుష్ప భామకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయాలైనట్లు సన్నిహితులు వెల్లడించారు. రష్మికను గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీవల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరోవైపు సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 (Pushpa 2 The Rule) మూవీతో హిట్ కొట్టి శ్రీవల్లి.. బాలీవుడ్లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు.తెలుగులో మరో మూడు చిత్రాలు..టాలీవుడ్లో ప్రస్తుతం కుబేర మూవీలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాన్–ఇండియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేర పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బరిలో ఉంటుందని ఆడియన్స్ అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేర విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి..ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్నా ఈ మూవీతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కనిపించనుంది. -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్‌లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
కథను నమ్ముకునే ఈ సినిమా తీశాం: టాలీవుడ్ నిర్మాత
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నిర్మాత ముత్యాల సుబ్బయ్య మాట్లాదుతూ.. "ప్రముఖ హీరోలందరితో సినిమాలు చేశా. దర్శకుడిగా 50 సినిమాలను తీశా. మంచి కథలను ఎంచుకోవడమే కాదు వాటికి తగ్గ మంచి టైటిల్స్ పెట్టి.. ప్రేక్షకుల ఆదరణతో నా సినీ ప్రయాణం సాగింది. నా యాభై సినిమాలలో అద్భుతమైన సక్సెస్ సినిమాలే కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఏ రోజు ఏదో ఒక సినిమా చేయాలని అనుకోలేదు. ఏదో ఒక కోణంలో సమాజానికి పనికి వచ్చే పాయింట్‌తో పాటు సెంటిమెంట్, కామెడీ, డ్రామా లాంటి అంశాలను మేళవించి సినిమాలు చేశా. ఒక దశలో కొన్ని సెంటిమెంట్ సినిమాల కారణంగా నాకు సెంటిమెంట్ సుబ్బయ్య అని కూడా పేరొచ్చింది. నేను దర్శకుడిగా 50 సినిమాలను చేశా. తప్ప నిర్మాతగా గతంలో ఏ సినిమాను తీయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్‌కు నిర్మాతగా ఒక మంచి సినిమా తీయాలనే అభిరుచి మేరకు నిర్మించడం జరిగింది. మంచి కథ దొరికే వరకు వేచి చూసి మా బ్యానర్ ముత్యాల మూవీ మేకర్‌పై ఈ సినిమాను రూపొందించాం. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా అన్నీ తానై అనంత కిషోర్ ఎంతో చక్కగా చూసుకున్నారని' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. 'నా దగ్గర.. అలాగే చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం గురించిన వి శ్రీనివాస్ (సిప్పీ)ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నేను సీనియర్ దర్శకుడిని అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో కానీ దర్శకత్వంలో కానీ సూచనలు, సలహాలు ఇచ్చానే తప్ప ఎక్కడా తలదూర్చలేదు. ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ అని సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించడం ఆనందం కలిగించింది. ఒకరు ఓల్డ్ టైటిల్లా అనిపిస్తోందని కామెంట్ చేశారు. అందుకు నేను చెప్పింది ఒక్కటే... తల్లి లేకుండా ప్రపంచమే లేదు. మనుష్యులకే కాదు సమస్త జీవ రాశికి, ఆఖరికి చెట్లకు సైతం తల్లి వేరు వల్లే పుట్టుక జరుగుతుందని, బదులిచ్చా. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. చూస్తున్న ప్రేక్షకులు ప్రతీ ఒక్కరూ కథలో పాత్రలతో లీనమవుతారు. పాత్రలకు తగ్గ నటీ నటులనే ఎంచుకున్నాం. టైటిల్ పాత్రదారి కోసం ఎందరో నటీమణులను ప్రయత్నించాం. ఎట్టకేలకు కన్నడలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రచిత మహాలక్ష్మి అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్టు మూడు పాటలు ఉంటాయి. మా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి కోటి సంగీతమందించారు. -
వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. అంతేకాకుండా జయం రవి సరసన కాదలిక్క నెరమిళ్లై అనే సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హీరోయిన్ నిత్యామీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్లో నిత్యామీనన్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ నిత్యా అతన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో నిత్యామీనన్ తీరుపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెత్త బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ అంతకుముందు ఇదే ఈవెంట్లో నిత్యా వ్యవహరించిన తీరు అందరిని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఇదే ఈవెంట్లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుంది. అంతేకాకుండా మూవీ హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్‌తో నిత్యా మీనన్ తీరు సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్)కాగా.. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో సినీ కెరీర్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Worst behaviour from #Nithyamenon !pic.twitter.com/8mmHTcYg4a— Kolly Censor (@KollyCensor) January 9, 2025 -
దుబాయ్‌లో కీర్తి సురేశ్.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య..!
దుబాయ్‌లో కీర్తి సురేశ్ చిల్...సెల్ఫీ మోజులో శ్రద్ధాకపూర్..శారీలో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సాక్షి అగర్వాల్...బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో చేసిన కామెంట్స్‌పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.అసలేం జరిగిందంటే..'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్‌ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిజామాబాద్‌లో నిర్వహించారు. 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. "I will file a case if you don't apologise for this comments" @MukhiSree https://t.co/VbhguoJwqI— Siri Vennela Goud Palle (@VennelaPalle) January 8, 2025 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రాశీ ఖన్నా స్టన్నింగ్ ఫోటో షూట్.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్..!
రాశీ ఖన్నా స్టన్నింగ్ ఫోటో షూట్..దుబాయ్‌లో బేబీ జాన్ హీరోయిన్ చిల్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్..పూనమ్ బజ్వా అలాంటి పోజులు..విదేశాల్లో నభా నటేశ్ హోయలు..జ్యోతి పూర్వాజ్ బ్యూటిఫుల్ లుక్.. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.విజువల్ వండర్‌గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
15 కోట్లు రెమ్యునరేషన్.. పెంచేసిన సౌత్ హీరోయిన్
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. -
సినిమాల్లోకి అకీరా నందన్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే?
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు. -
ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్..గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్..న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని..2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..మలేషియాలో శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి...న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఆలియా భట్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj) -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
' సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు సమస్య లేదు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ కావడంపై తనదైన శైలిలో పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రితో కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ట్విటర్ వేదికగా ప్రశ్నించింది.మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. కేవలం హీరోలకు, బిజినెస్ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చింది. తాజా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతోందని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.కాగా.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, త్రివిక్రమ్, వెంకటేశ్ లాంటి ప్రముఖులంతా సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరఫున ఏ ఒక్క మహిళ డైరెక్టర్ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీన్ని ఉద్దేశించే నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue - none can have one .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024 -
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి.. హాట్ హాట్‌గా ఉప్పెన భామ!
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి లుక్స్..మరింత హాట్‌గా ఉప్పెన భామ కృతి శెట్టి!టోక్యో షూట్లో బిజీ బిజీగా సుహాసిని..సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పూనమ్ బజ్వా..మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఆదితి గౌతమ్..అనసూయ డిసెంబర్ మెమొరీస్..న్యూ ఇయర్ మూడ్‌లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor (@aditigautamofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
'అప్పటికే నా పెళ్లి అయిపోయింది'.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ పన్ను తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లి గతేడాదిలోనే అయిపోయిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఉదయ్‌పూర్‌లో కేవలం వివాహా వేడుక మాత్రమే నిర్వహించామని తాప్సీ అసలు విషయాన్ని రివీల్ చేసింది. వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని.. అందుకే బయటపెట్టలేదని పేర్కొంది. పర్సనల్ విషయాలు బయటపెడితే వర్క్ లైఫ్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చింది.కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉదయ్ పూర్లోని ఓ కోటలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమె సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది తాప్సీ. -
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిపెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్‌బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
'ఆ ప్రేమను మించింది మరొకటి లేదు'.. సమంత మరో పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సామ్ ఇటీవల మరోసారి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.కానీ అంతలోనే సమంత చేసిన మరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'షాషా(పెట్ డాగ్) ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అది కాస్తా వైరల్ కావడంతో నెట్టంట చర్చ మొదలైంది. ఏదేమైనప్పటికీ సామ్‌కు మాత్రం తన పెట్ డాగ్ ప్రేమ కంటే ఈ లోకంలో మరేదీ లేదని చెబుతోంది.గతంలోనూ ప్రేమపై పోస్ట్గతంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది. -
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
నాగచైతన్య- శోభిత పెళ్లి.. వైరల్‌గా మారిన సమంత పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది. -
అల్లు అర్జున్ పుష్ప-2.. తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్!
అల్లు అర్జున్ పుష్ప-2 నిరీక్షణకు మరో రోజులోనే తెరపడనుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరే వినిపిస్తోంది. పుష్ప డైలాగ్స్‌తో ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఇంతలా హంగామా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, సినీప్రియులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ సినీతారలు కూడా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా పుష్ప-2 విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ వీడియోలో పుష్ప డైలాగ్‌తో అదరగొట్టింది ముద్దుగుమ్మ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ మేనరిజం చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి బెస్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
బిగ్‌బాస్ దివి బైక్ రైడ్.. శోభిత మంగళస్నాన వేడుకలో సమంత సందడి!
బిగ్‌బాస్ బ్యూటీ దివి బైక్ రైడ్..ముంబయిలో మెరిసిన మహేశ్ బాబు కూతురు సితార..శోభిత మంగళస్నానం వేడుకలో సోదరి సమంత సందడి...కూతురితో సండే చిల్ అవుతోన్న ప్రణీత సుభాష్..కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్..యానిమల్ రోజులను గుర్తు చేసుకున్న త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్‌గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లలో మెరిసింది. మరో వారం రోజుల్లో పుష్ప-2 విడుదల కానుండగా మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది యానిమల్ మూవీలో మెరిసిన ముద్దుగుమ్మ.. ఛావా అనే చిత్రంలో నటిస్తోంది.బాలీవుడ్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా ఛావా మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఒక్క రోజు ముందే డిసెంబర్ 5న పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.పోటీనుంచి తప్పుకున్న ఛావాదీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్ప-2తో పోటీపడడం కంటే వాయిదా వేయడమే మేలని భావించారు. అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా పోటీపడి నిలవడం కష్టమేనని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ ఖాయమని మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అందుకే ఛావాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.ఫిబ్రవరిలోనే ఎందుకంటే?తాజాగా ఛావా మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.VICKY KAUSHAL - RASHMIKA - AKSHAYE KHANNA: 'CHHAAVA' NEW RELEASE DATE ANNOUNCEMENT... #Chhaava is now set for a theatrical release on 14 Feb 2025... The release date holds special significance since it coincides with Chhatrapati Shivaji Maharaj Jayanti on 19 Feb 2025.Produced… pic.twitter.com/kDMrY7RDqN— taran adarsh (@taran_adarsh) November 27, 2024 -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. బలమైన కారణం ఉందన్న శ్రీలీల!
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అయితే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీలీల తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.అయితే ఈ సాంగ్ చేయడం వెనక బలమైన కారణం ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. రాబిన్‌హుడ్ మూవీ ప్రెస్మీట్లో కిస్సిక్ సాంగ్ చేయడం గురించి మాట్లాడారు. ఇది యావరేజ్ ఐటమ్ సాంగ్ కాదన్నారు. గతంలో ఎన్నో సినిమాలకు ఐటమ్ సాంగ్ చేయమని అడిగారు. కానీ ఇప్పటివరకు నేను చేయలేదు..ఈ సాంగ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని శ్రీలీల అన్నారు. పుష్ప-2 రిలీజైనప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల.. నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ మూవీ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించనుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి టాలీవుడ్ ప్రియులను మెప్పించనున్నారు. -
'పుష్ప 2' ఈవెంట్ లో రష్మిక , శ్రీలీల కిస్సిక్ (ఫొటోలు)
-
అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!
మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్ వెడ్డింగ్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. -
'మీరు ఒక చాట్ జీపీటీ సార్'.. అల్లు అర్జున్‌పై శ్రీలీల ప్రశంసలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. కిస్సిక్ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్లో కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.(ఇది చదవండి: అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ..' అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన చాలా ఫన్‌గా ఉంటారు. నాకు మొదట కొంచెం భయంగా అనిపించింది. కానీ బన్నీ సార్‌తో మాట్లాడాక ఆ భయం పోయింది. మీరు ఒక చాట్ జీపీటీ.. అంతేకాదు మీరు ఒక వైబ్ సార్. థ్యాంక్ యూ సోమచ్ సార్. అల్లు అర్జున్‌తో డ్యాన్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను సెట్స్‌లో వెళ్లాక అవసరం లేదనిపించింది. నేను ఇక్కడ అల్లు అర్జున్ కాదు.. పుష్ప అని చెప్పారు' అంటూ శ్రీలీల ప్రశంసలు కురిపించింది. కాగా పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓ హీరో కమిట్మెంట్ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. -
కాబోయే భార్యతో స్పెషల్ ఈవెంట్‌కు నాగచైతన్య.. ఫోటోలు వైరల్!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఇటీవలే శోభిత తరఫు వారి పెళ్లి కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే రెండు ఫ్యామిలీస్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే శోభిత, నాగచైతన్య తాజాగా ఓ ఈవెంట్లో సందడి చేశారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ -2024) వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, అమల, హీరో సుశాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ప్రసారం చేయనున్నారు. ఇది వీక్షించేందుకు నాగార్జున సతీసమేతంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28 వరకు జరగనుంది. When style meets grace💫 Yuva Samrat @chay_akkineni and #SobhitaDhulipala are the true definition of red carpet royalty at #IFFI2024. #NagaChaitanya #SoChay pic.twitter.com/Jwpcym5r8j— Trends NagaChaitanya™ (@TrendsChaitu) November 21, 2024 Elegance and legacy come alive at #IFFI2024! Yuva Samrat #NagaChaitanya & #SobhitaDhulipala grace the red carpet ahead of the special screening of ANR's timeless masterpiece ♥️✨@chay_akkineni@sobhitaD#ANR100 #SoChay pic.twitter.com/gNKDJtjjfK— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 21, 2024 -
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
పెయింటింగ్‌తో దేవర భామ.. గోవాలో బిజీగా ఊర్వశి రౌతేలా!
జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రాపెయింటింగ్తో దేవర భామ జాన్వీ కపూర్...గోవాలో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ కావ్యథాపర్..తన ఫ్రెండ్స్‌తో లైగర్ భామ అనన్యపాండే చిల్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
ఫ్యాన్స్‌లో పుష్ప-2 ఫీవర్.. మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రీవల్లి!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తోన్న చిత్రం 'పుష్ప 2 ది రూల్'. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పార్ట్-1 శ్రీవల్లిగా మెప్పించిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. మరోసారి సినీ ప్రేక్షకులను అదే రేంజ్లో అలరించనుంది. పుష్పర-2 మరో రెండు రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో సోషల్ మీడియాగా వేదికగా ఫోటోలు పంచుకుంది. పుష్పలో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.పుష్ప-2 మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముందు పుష్పకు సంబంధించిన అనుభవాలను ఓసారి వెనక్కి తిరిగి చూసుకున్నంటూ తెలిపింది. ఈ విశేషాలను మీతో పంచుకోలేదనిపించింది.. అందుకే తనకిష్టమైన టాప్- 10 జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వాటిని వరుసగా వివరిస్తూ ఫ్యాన్స్‌తో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. అవేంటో మీరు కూడా చూసేయండి.1. శ్రీవల్లి లుక్2. రష్యాలో పుష్పతో శ్రీవల్లి3.జీనియర్ పుష్ప డైరెక్టర్ సుకుమార్‌తో ఫోటో4.పుష్ప గ్యాంగ్‌తో ఏకైక ఫోటో5. శ్రీవల్లి ఫస్ట్ లుక్ టెస్ట్6.సామీ పాటలో అమ్మాయిల గ్యాంగ్7.శ్రీవల్లి జుట్టు అలంకరణ8.సాధారణ లుక్‌లో శ్రీవల్లి కళ్లు9.పుష్ప పోస్టర్‌తో శ్రీవల్లి, బన్నీ10. తిరుపతి వెళ్లి క్యారెక్టర్ కోసం రీసెర్చ్ చేయడం.. నిజానికి శ్రీవల్లి తిరుపతిలోనే మొదలైందని తన స్వీట్ మెమొరీస్‌ను పంచుకుంది.ఇక పుష్ప-2తో మరోసారి శ్రీవల్లిగా అలరిస్తానంటోంది రష్మిక. కాగా.. పుష్ప-2 ట్రైలర్ భారీస్థాయిలో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్‌ను బిహార్‌లోని పట్నాలో నిర్వహిస్తున్నారు. నవంబర్ 17న జరగనున్న ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ భారీ ఈవెంట్‌కు బన్నీ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరు కానున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. కొత్తకారుతో సెలబ్రేషన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది.అంటే సుందరానికి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ తన్వీ రామ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. తాజాగా కిరణ్ అబ్బవరం క మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఏడాది పుట్టినరోజున కొత్తకారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మా కుటుంబంలో కొత్త మెంబర్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
అనుష్క శెట్టి బర్త్ డే.. అరుంధతిని మరిపిస్తోన్న గ్లింప్స్!
టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ప్రేక్షరులను పలకరించింది. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. దీంతో అనుష్క ఫ్యాన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందా అన్న డైలామాలో పడ్డారు.అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఘాటీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 47 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ అనుష్క ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో కొడవలి పట్టుకున్న అనుష్క ఫుల్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. ఈ సినిమాను మహిళ ఓరియంటెడ్ కథగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర చూస్తుంటే ఓ రేంజ్లో ఉండనుందని గ్లింప్ల్తోనే అర్థమవుతోంది. మరోసారి అరుంధతి రేంజ్ నటనను ఘాటీ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
'తెలుగు ఆడియన్స్ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్మెంట్ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. "Telugu audience andariki chala pedda thanks" ❤️ Heroine @Sai_Pallavi92 at #Amaran Success Meet ❤️🔥#AmaranMajorSuccess #MajorMukundVaradharajan #saipallavisenthamarai #SaiPallavi #YouWeMedia pic.twitter.com/YYbGoGHPNU— YouWe Media (@MediaYouwe) November 6, 2024 -
సాయిపల్లవికి కొత్త బిరుదు.. చైతూ అంత మాట అనేశాడేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగ చైతన్య హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. సాయిపల్లవి బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు. అంతేకాకుండా సినిమాలో కేవలం తన పాత్రకే పరిమితం కాదని.. ప్రతి విషయాన్ని చర్చిస్తుందని నాగచైతన్య తెలిపారు.నాగచైతన్య మాట్లాడుతూ..' మన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి. ఈ సినిమాలో కేవలం తన క్యారెక్టర్ మాత్రమే కాదు.. నా సీన్స్ గురించి కూడా చర్చిస్తుంది. అందరి గురించి మాట్లాడుతూ నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్‌గా ఉంటుంది. డ్యాన్స్ విషయంలో కూడా సాయిపల్లవితో కష్టమే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశా' అని అన్నారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లి పనులతో బిజీగా శోభిత..శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. -
యంగ్ హీరోయిన్ సింప్లీసిటీ.. రోడ్డు పక్కన టీ తాగిన ముద్దుగుమ్మ!
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ మోషన్ పోస్టర్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవల తంగలాన్ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ. -
నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
మా లైఫ్‌లో ఎప్పుడు సర్‌ప్రైజ్‌లే: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్-మారుతి కాంబోలో వస్తోన్న ది రాజాసాబ్, పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమాల్లో కనిపించనుంది. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నిధి అగర్వాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఆర్టిస్టుల పూర్తిగా సర్ప్రైజ్లతో నిండి ఉంటుందని.. కానీ వాటిలో కొన్ని గొప్ప అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే రోజు రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. అంతేకాదు ఒకటి ఆంధ్రలో షూటింగ్ జరిగితే మరొకటి తెలంగాణ. ఒక్కరోజులో రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాలు. నా పనిని మీ ముందుక తీసుకొచ్చేందుకు ఎదురుచూస్తున్నా. ఆ తర్వాత గొప్ప వేడుక చేసుకుంటానని' పోస్ట్ చేసింది.కాగా.. మారుతి డైరెక్షన్ వస్తోన్న ది రాజాసాబ్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే రోజు అప్డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్కేఎన్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. హారర్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. An artists life is full of surprises, but some leave you feeling truly blessed and grateful. I’m delighted to have shot for 2 much waited pan-Indian films on the same day, that too one in Andhra and another in Telangana1 day 2 film shoots 2 states 🤗Eagerly waiting for you all…— Nidhhi Agerwal (@AgerwalNidhhi) October 17, 2024 -
అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్
సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్లో సిరీస్, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్, డైలాగ్స్ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్ చేశా అని తెలిపింది.కాగా.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్. దీనికి ఇండియన్ వెర్షన్ సిటాడెల్: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు తంత్ర అనే హారర్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల అనన్య ఓ వీడియో షేర్ చేసింది. దానిపై ఓ రేంజ్లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.దీంతో తన వీడియోపై వస్తున్న ట్రోల్స్‌పై అనన్య స్పందించింది. ఎందుకింత నెగెటివీటీ అంటూ మండపడింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వీడియో షేర్ చేశా. దానిపై కొందరు విమర్శలు చేశారు. నేను చెప్పిన విషయం నచ్చితే చేయండి.. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనన్య.. ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. అందులో స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండం నీళ్లు తాగుతూ కనిపించారు. మాములుగా నేను స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను.. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయి అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు.2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సమంత.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో పయనిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. బాలీవుడ్లో సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసిన సమంత మరోసారి అమ్మవారికి పూజలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నవరాత్రుల సందర్భంగా పూజలో పాల్గొంది. దేవి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.కాగా.. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో సమంత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య- సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నాగార్జునపై మంత్రిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'చాలామందితో రిలేషన్లో ఉన్నా.. కానీ'.. రెజీనా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ సినీ ప్రియులకు రెజీనా పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించింది. ప్రస్తుతం ఉత్సవం మూవీతో మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన తాజా చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈరోజే అంటే సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేసింది. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్ నిర్మించారు.అయితే అంతకుముందు మూవీ ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను చాలామందితో రిలేషన్లో ఉన్నానని తెలిపింది. అయితే నాకు చాలా ప్రపోజల్స్ ఉన్నాయని.. ఈ విషయంలో నేను ఒక సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది రెజీనా.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్)అయితే గతంలో ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్తా ఆగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ప్రభాస్‌తో తొలిసారి ఛాన్స్.. చెప్పకుండానే తొలగించారు: రకుల్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. టాలీవుడ్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్.. చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది. సినిమా ఛాన్స్‌ల గురించి ఇంతకీ రకుల్ ఏమన్నారో చూద్దాం.తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కానీ ఊహించని విధంగా తనకు చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ప్రభాస్‌తో మొదటిసారి నటించే అవకాశమొచ్చింది.. కానీ నాలుగు రోజుల పాటు షూటింగ్ అయ్యాక చెప్పకుండానే మరొకరితో రీప్లేస్ చేశారని రకుల్ వెల్లడించింది.నాకు సమాచారం ఇవ్వలేదునా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లానని.. ఆ తర్వాతే సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. ఈ విషయంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని రకుల్ పేర్కొంది. అంతేకాకుండా మరో తెలుగు ప్రాజెక్ట్‌లోనూ ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారని వెల్లడించింది. ఆ తర్వాతే నాకు ఇండస్ట్రీపై కాస్తా అవగాహన పెరిగిందని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నానని తెలిపింది.కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించింది. ఇటీవల ఇండియన్-2 చిత్రంలో మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం దే దే ప్యార్ దే -2 చిత్రంలో నటిస్తోంది. -
'ఆ ప్రమాదం వల్లే యాక్టివ్‌గా లేను'.. పుష్ప భామ రష్మిక పోస్ట్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2లో కనిపించనుంది. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి అభిమానులను అలరించనుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంద డి చేయనుంది. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఎందుకంటే గత నెల రోజులుగా యాక్టివ్‌గా లేకపోవడానికి ఓ కారణం ఉందని వెల్లడించింది. నాకు చిన్న ప్రమాదం జరిగిందని.. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని శ్రీవల్లి చెప్పుకొచ్చింది. డాక్టర్ల సలహాతో కోలుకున్నానని.. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి నా రోజువారీ కార్యకలాపాలతో యాక్టివ్‌గా ఉంటానని రాసుకొచ్చింది.అంతే కాకుండా 'మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి.. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది.. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు.. అందుకే ప్రతి రోజు సంతోషంగా జీవించండి' అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది ముద్దుగుమ్మ. త్వరలోనే ఫుల్‌గా లడ్డులు తింటూ మరో అప్డేట్ ఇస్తానని ఫన్నీగా పోస్ట్ చేసింది రష్మిక. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Hey guys🥰How've you been?💛I know it's been a whileeeee since I came on here or was even seen in the public.. 🏃🏻♀️➡️The reason I haven't been very active in last month is because I had a little accident, (a minor one) and I was recovering and was staying at home as I was… pic.twitter.com/TrTieza3eM— Rashmika Mandanna (@iamRashmika) September 9, 2024 -
వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి!
వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు గ్రాండ్ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా సందడి చేసింది.ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్ ష్రాఫ్‌లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు. గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్‌కుమార్‌రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. -
'ముగ్గురు హీరోయిన్లతో సినిమా'.. ఘనంగా షూటింగ్ ప్రారంభం!
శ్యామ్ షెల్వన్, హాన్విక, రితిక, గ్రీష్మ, ఎస్తేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.."కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి ఈ కథను నమ్మి ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది . ఈ చిత్రం యూత్, కుటుంబ సమేతంగా చూసే విధంగా తెరకెక్కించబో తున్నాం'.అని అన్నారు.నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నాం' అని తెలిపారు. ఈ సినిమాకు గాజుల శివ సినిమాటోగ్రఫీ, చరణ్ అర్జున్ సంగీతమందిస్తున్నారు. -
సమంత సర్ప్రైజ్ ఇదే.. మీరు ఊహించింది మాత్రం కాదు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. చివరిసారిగా ఖుషి చిత్రం మెరిసిన ముద్దుగుమ్మ.. ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ కావడంతో అందరి చూపు సమంత వైపు మళ్లింది. ఆమె కూడా త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటుందా అనే రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.అయితే ఆ సర్ప్రైజ్ను రివీల్ చేసింది సామ్. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.అయితే సర్ప్రైజ్ అనగానే అభిమానులు ఏదేదో ఊహించుకున్నారు. తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తుందేమో అనుకున్నారు. ఇంకా ఏదైనా బిగ్ న్యూస్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. తీరా పికిల్‌బాల్ లీగ్ ప్రకటనతో అందరినీ నిరాశకు గురిచేసింది. ఏదేమైనా సమంత కొత్త బిజినెస్‌లో అడుగుపెడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'త్వరలోనే ఆ సినిమా చూస్తా'.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీతారలు సైతం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని కొనియాడారు. వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీలో నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ అంతా కొత్తవారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు.Hearing great things about #CommitteeKurrollu!Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024 -
మురారి రీ రిలీజ్.. హీరోయిన్ రియాక్ట్ అయిందిగా!
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో అభిమానులు సందడి చేశారు. కొందరైతే ఏకంగా థియేటర్లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున వైరలయ్యాయి.అయితే తాజాగా మురారి రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించిన బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మహేశ్‌తో మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్ కృష్ణ వంశీకి అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. Shooting Murari with Mahesh was such a joy, and finding Nandini during that time was a wonderful surprise. It’s incredible to see the same love for the movie even after 23 years! Thank you for all the love ❤️A special mention to VamsiGaru for making this film so special for us pic.twitter.com/UqW75w8cUz— Sonali Bendre Behl (@iamsonalibendre) August 9, 2024 -
సమంత సలహాపై విమర్శలు.. ఈ పని అప్పుడే చేయాల్సింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటించనుంది. గతేడాది చివరిసారిగా ఖుషీ చిత్రంలో కనిపించింది సామ్. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఫుల్ యాక్టివ్ అవుతోంది.గతంలో మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి పాడ్‌కాస్ట్‌లు విడుదల చేస్తోంది. కొద్ది రోజుల క్రిత ఆమె ఇచ్చిన వైద్య సలహాపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. నెబ్యులైజేషన్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలంటూ సమంత సూచించింది. అయితే దీనిపై కొంతమంది వైద్యులతో పాటు పలువురు సమంత సలహాను తప్పుబట్టారు.అయితే సమంత తాజాగా మరో పాడ్‌కాస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా పంచుకుంది. అయితే ఈ సారి ముందు జాగ్రత్తగా డిస్క్లైమర్ను కూడా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్లో ఉన్న ఆడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు కేవలం సమాచారం కోసమేనని తెలిపింది. ఈ ఎపిసోడ్‌లోని అంశాలు వైద్య సలహా, రోగ నిర్ధారణ, చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించింది కాదు.. వైద్య చికిత్సకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించండి అంటూ డిస్‌క్లైమర్‌లో వివరించింది. కాగా.. గతంలో తన సలహాపై పెద్దఎత్తున విమర్శలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరోసారి విమర్శలు రాకుండా సమంత జాగ్రత్త పడిందని మరికొందరు అంటున్నారు. కాగా.. సమంత రూత్ ప్రభు టేక్ -20 అనే పేరుతో హెల్త్ పాడ్‌క్యాస్ట్‌ని నిర్వహిస్తోంది. -
ఆ పాత్ర చేయడం కోసం వారిని గమనించా: బడ్డీ హీరోయిన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రిషా సింగ్ బడ్డీ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. 'నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యా. అయితే పాత్రలోని వేరియేషన్స్ నేను చేయగలనా అని కూడా ఆలోచించా. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర కోసం చాలా మంది ఎయిర్ హోస్టెస్లను గమనించా. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను దగ్గరగా గమనించా. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి అనుభవం. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.అంతే కాకుండా తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే అభిరుచి ఎక్కువని చెబుతోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్ల ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదని అంటోంది. వాటి సహజమైన భావోద్వేగాలను కమెరాల్లో బంధించటమేనని వెల్లడించింది. మన కెమెరాల్లో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుందని.. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసిందని తెలిపింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా నటిస్తున్నా అని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చింది. కాగా.. బడ్డీ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రముఖ నట దిగ్గడం శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌కు చెందిన ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తమిళంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన జూలై 21, 2001లో కన్నుమూశారు. శివాజీ గణేశన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ), నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను పొందారు.ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటి మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన ఫోటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన వర్ధంతి రోజున శివాజీ గణేశన్‌ను మీనా గుర్తు తెచ్చుకున్నారు. నన్ను భారతీయ సినిమాకి పరిచయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మీతో నటించినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది. తాజాగా మీనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. మీనా చిన్నారిగా ఉన్న సమయంలో శివాజీ గణేశన్‌తో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీనా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన మీనా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
స్కూల్లో ఉన్నప్పుడే ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్: అనన్య నాగళ్ల
2019లో విడుదలైన ' మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ మూవీతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ప్రియదర్శి నటించిన డార్లింగ్ చిత్రంలో మెరిసింది ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య.. టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు? అన్న ప్రశ్నకు అనన్య నాగళ్ల స్పందించింది. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఏ క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి చేస్తానని చెప్పింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఆయనంటే క్రష్. ఆ సమయంలో నేను స్కూల్లోనే చదువుతున్నా. ఆ సినిమాను నేను థియేటర్లో చూడలేదు. టీవీల్లో వచ్చినప్పుడు నేను, మా ఫ్రెండ్ కలిసి వర్షం సినిమా చూశామని అనన్య నాగళ్ల నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో తంత్ర మూవీతో డిఫరెంట్ రోల్లో అనన్య నాగళ్ల మెప్పించారు. -
కల్కి సినిమా చూసి థ్రిల్ అయ్యా: టాలీవుడ్ హీరోయిన్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో సినీ ప్రముఖులు సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.తాజాగా కల్కి సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రాశి ప్రశంసలు కురిపించారు. కల్కి మూవీ అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు. చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని అన్నారు. తన కూతురితో కలిసి వెళ్లి కల్కి సినిమా చూశానని వెల్లడించారు. 3డీ అద్దాల్లో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశామని.. ఈ మూవీని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిపింది. కాగా.. రాశి టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన సినిమాల్లో నటించారు. Old telugu golden actress #Raasi garu sharing her opinion about #Kalki2898AD movie 🎬 💥 Family audience lo darling mass ❤️#Prabhas #Kalki pic.twitter.com/yhYzZ4G6o4— Cinema Factory (@Cinema__Factory) July 20, 2024 -
చిరంజీవితో హిట్ సినిమా.. ఉత్తమనటిగా అవార్డ్.. ఎవరో గుర్తుపట్టారా?
1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. అయితే ఆమె కేవలం డ్యాన్సర్ మాత్రమే కాదండోయ్.. మంచి సింగర్ కూడా. తాజాగా ఆమె పాట పాడుతున్న ఓ వీడియో నెట్టింట తెగవైరవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ అభిమాన నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా.. మీనాక్షి శేషాద్రి తెలుగు చిరంజీవి సరసన నటించింది. ఆపద్భాంధవుడు మూవీలో మెగాస్టార్‌తో నటించి మెప్పించింది. ఈ సినిమాకు గానూ ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అంతకుముందు తెలుగులో మొదట జీవన పోరాటం సినిమాలో ప్రత్యేకపాత్రలో కనిపించింది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే చిత్రంలోనూ నటించింది. అయితే 1995లో మీనాక్షి శేషాద్రి.. హరీశ్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం ఉన్నారు. ఎవరో గుర్తుపట్టారా? 🧡🧡pic.twitter.com/k6NClbnTYu— Sarath శరత్🚵 (@sarathuniverse) July 20, 2024 -
దళపతితో పాటు ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా?
దళపతి విజయ్ ప్రస్తుతం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. లియో సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి విజిలేస్కో అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే విజయ్ మూవీ షూటింగ్ ప్రస్తుతంలో కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రంభను కలిశారు. ఆమె తన కుటుంబంతో కలిసి విజయ్‌తో దిగిన ఫోటోలను తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ రంభ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. It was nice meeting you and catching up after years at @actorvijay :) Congratulations! Wish you the very best #tamilagavetrikalagam #NortherUni #Magickhome #magickhomecanada #Magickwoods pic.twitter.com/Rv2wztbl5q— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024Shivin with our favourite beloved Thalapathy @actorvijay 🥰 pic.twitter.com/G4XqGDw8ei— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024 -
మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఏడాది నుంచి ఓ మ్యూజీషియన్‌ని ప్రేమిస్తుండగా.. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేసింది. కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)తెలుగుతో పాటు బెంగాలీ చిత్రపరిశ్రమని కూడా టాలీవుడ్ అనే అంటారు. ఈ ఇండస్ట్రీకి చెందిన సోహిని సర్కార్.. మ్యూజీషియన్ షోవన్ గంగూలీని తాజాగా పెళ్లాడింది. జూలై 15న ఈ శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించిన సోహిని.. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సోహిని సర్కార్.. సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీసుల్లో హీరోయిన్గా చేస్తోంది. గతేడాది ఓ పార్టీలో మ్యూజీషియన్ సోవన్ గంగూలీని కలిసింది. తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ స్పందించలేదు. ఇప్పుడేమో సైలెంట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు. పెళ్లి ఫొటోలపై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Sohini Sarkar (@sohinisarkar01) View this post on Instagram A post shared by TOLLYWOOD ONLINE (@tollyonline) -
లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: రాజ్ తరుణ్ హీరోయిన్
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలపై తిరగబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని మాల్వీ కొట్టిపారేసింది. నా కుటుంబం గురించి ఆమె చేసిన కామెంట్స్ నిజం కాదని తెలిపింది. ఆమెపై తప్పకుండా ఫిర్యాదు చేస్తానని.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించింది. మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ..'ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ తీసుకుంది. అవీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సేకరించిందో తెలియాలి. లావణ్యను నేను ఇప్పటివరకు కలవలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే కాదు.. తన గురించి నాకేలాంటి వివరాలు తెలియదు. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాజ్ తరుణ్‌తో మాట్లాడతా. సెప్టెంబర్ నుంచి నాకు, రాజ్ తరుణ్‌కు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాపై లావణ్య చేస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. దీనివల్ల నా రిప్యూటేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా ఆమెపై పరువునష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు. కాగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తున్నారు. -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్ హీరోల సరసన అలరించింది. జెంటిల్‌మేన్ నుంచి వకీల్ సాబ్ వరకు తనదైన నటనతో మెప్పించింది. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ లాంటి టాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్లో లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నివేదా థామస్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకీ నివేదా ప్రియుడు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఏదైనా మూవీ అప్డేట్ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్‌కు డౌటానుమానాలు క్లియర్ అవుతాయి. It’s been a while….. but. Finally! ❤️— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024 -
స్టార్ హీరో సరసన సమంత.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అందుకే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. ఇటీవలే ఇషా ఫౌండేషన్‌లో సామ్ మెరిసింది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. పూర్తిగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.అయితే తాజాగా సమంత ఓ క్రేజీ కాంబోలో పని చేయనున్నట్లు వార్త తెగ వైరలవుతోంది. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన నటించనుందని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొచ్చాయి. కాగా.. గతేడాది ఆయన డైరెక్షన్లో వచ్చిన డుంకీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే షారూఖ్ సరసన సమంత నటిస్తోందన్న వార్తలను రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ రాసే దశలోనే ఉన్నారని తెలిపారు. ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ ఫేక్ అని డైరెక్టర్ సన్నిహితులు వెల్లడించారు. ఏ ప్రాజెక్ట్‌కి సంబంధించి షారుఖ్, సమంతతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.కాగా.. 2022 ఇంటర్వ్యూలో సమంత ఒకసారి షారుఖ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ కో-స్టార్స్ ఎవరని అడిగినప్పుడు.. మహేష్ బాబు, సూర్య, షారూఖ్ పేర్లను సామ్ చెప్పింది. నేను ఇప్పటికీ షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయలేదు.. నా కల ఇప్పటికీ నిజం కాలేదు సమంత వ్యాఖ్యానించింది.మరోవైపు షారూక్ తదుపరి చిత్రం ది కింగ్‌లో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటించనున్నాడు. దీనికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన ముద్దగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలా పాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈనెల 11 వ తేదీన బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని వెల్లడించింది. కాగా.. మైనా చిత్రం ద్వారా కోలీవుడ్‌లో పాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో అభిమానులను మెప్పించింది. View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
నా ముందు సైలెంట్‌గా ఉండాలి!
తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, రవితేజ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్‌హుడ్’లో ఆమె చేస్తున్న లేడీ బాస్ నీరా వాసుదేవ్ ΄పాత్ర లుక్, టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. ‘ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.‘యునిక్ యాక్షన్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్‌హుడ్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
శ్రీలీల బర్త్ డే.. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్!
పెళ్లిసందడి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆ తర్వాత రవితేజ ధమాకా, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రవితేజ సరసన మరో సినిమాకు సిద్ధమైంది. దీంతో నితిన్‌తో మరోసారి జతకట్టింది. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది.తాజాగా ఇవాళ శ్రీలీల బర్త్ డే కావడంతో రాబిన్‌హుడ్ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపారు. శ్రీలీల బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల, వెన్నెల కిశోర్ మధ్య ఫన్నీ డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. 'సునామీలో టీ సైలెంట్‌గా ఉండాలి.. నా వద్ద నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అంటూ వెన్నెల కిశోర్‌కు శ్రీలీల వార్నింగ్ ఇస్తుంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ చిత్రంలో శ్రీలీల గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీకి బేబీ హీరోయిన్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో ఆశిష్, బేబి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'లవ్ మీ'. ఇఫ్ యూ డేర్ అనేది సబ్ టైటిల్. మే 25న ఈ మూవీ థియేటర్ల రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హారర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా.. దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.Get ready to be spooked and enchanted by #GhostLove! Brace yourself for chills and thrills in the ultimate love story. 🥶❤️#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' coming soon on @PrimeVideoIN! @AshishVoffl @iamvaishnavi04 @iamsamyuktha_ @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu… pic.twitter.com/edT60T2o1c— Dil Raju Productions (@DilRajuProdctns) June 12, 2024 -
అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ ఇండియా వర్షన్లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు. గతేడాది మయోసైటిస్ కోలుకున్న సమంత పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తోంది తాజాగా సామ్ ఇషా ఫౌండేషన్‌లో మెరిసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఇషా ఫౌండేషన్‌లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. కానీ మీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం అనేది చాలా అరుదైన సందర్భం. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుచతుంటాయి. మన ఆలోచన సాధారణమో.. అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల సమంత ఆమె తన 37వ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిదే. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ సమీరా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. అయితే ప్రస్తుతం సమీరా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. అయితే నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. కొందరు ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహాలిచ్చాలంటూ వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.సమీరా మాట్లాడుతూ..'నా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను' అని చెప్పింది. -
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్‌లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్‌ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. -
హెబ్బా పటేల్ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్ వచ్చేసింది!
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం: పొలిమేర నటి
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గతేడాది పొలిమేర-2 చిత్రంతో ఆకట్టుకుంది. గతంలో వచ్చిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు. చేతబడుల కాన్సెప్ట్, హారర్ థ్రిల్లర్ కావడంతో అభిమానుల ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో కామాక్షి తన నటనకు గానూ ప్రశంసలు అందుకుంది. అంతే కాదు ఆమెకు అవార్డు కూడా లభించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కామాక్షి తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని తెలిపింది. ఏ పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమని పేర్కొంది. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించాల్సి వచ్చినా చేస్తానని తేల్చి చెప్పింది. అంతే కాకుండా తాను మంచి డ్యాన్సర్ అని వెల్లడించింది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో చేసే అవకాశాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని కామాక్షి తెలిపింది. -
రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల 29న పుష్ప-2 రెండో సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌తో దేశవ్యాప్తంగా కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా రష్మిక టాలీవుడ్ మూవీ గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైంది.అయితే రష్మికకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. రష్మిక ఈవెంట్లో మీరు చాలా అందంగా కనిపించారు..మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది.. కానీ మీరు తెలుగులో మాట్లాడటంతో మాకు అర్థం కాలేదు. నార్త్‌లోనూ మీ అభిమానులు మీ మాటలు వినడానికి ఎంతో ఇష్టపడతారు. అలాంటి వారికోసం ఇంగ్లీషులో మాట్లాడాలని ట్విటర్ వేదికగా రష్మికను కోరారు. దయచేసి మా అభ్యర్థనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాం అంటూ పోస్ట్ చేశారు. అయితే దీనికి రష్మిక సైతం రిప్లై ఇచ్చింది.రష్మిక ట్వీట్ రాస్తూ..' మీరు ఎక్కడి నుంచి వచ్చినా.. మీరందరూ నన్ను అర్థం చేసుకునేలా ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని కోరుకుంటారు. వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతా. దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్ కోసం ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తా' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరలవుతోంది. I try my best to talk in English so that everyone of you understand me no matter where you are from..❤️ but I am just uncomfortable with the fact that many people who want me to speak in their language will think that I am disrespectful of the language or that I don’t know the…— Rashmika Mandanna (@iamRashmika) May 28, 2024 -
మరోసారి రష్మిక వీడియో వైరల్..!
డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు దుండగులు ఆధునిక టెక్నాలజీతో దుర్వినియోదగానికి పాల్పడుతున్నారు. మొదట రష్మిక మందన్నా డీప్ ఫేక్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖ తారలు సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఇదిలా ఉండగా మరోసారి రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఆమె ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఎడిట్ చేసిన ఈ వీడియోను రూపొందించారు. అందులో రష్మిక ఫేస్ వచ్చేలా మార్చిన వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. కాగా.. గతేడాది నవంబర్లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ బాధితులుగా నిలిచారు. సినిమాల విషయానికొస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించనుంది. -
Kajal Aggarwal: అందమైన చందమామ.. వయ్యారి సత్యభామ (ఫోటోలు)
-
అప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నా: టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం "భజే వాయు వేగం". ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం. ఐశ్వర్య మాట్లాడుతూ..' సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ క్యారెక్టర్ చేశా. ఇందులో ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించడానికే ఇష్టపడతా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.' అని అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ..'తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న పట్టణం మాది. మధ్య తరగతి కుటుంబం. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్లో చదువుకుంటున్న కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ అయ్యాక నటన మీద ఫోకస్ చేశా. ఇప్పటివరకు తెచ్చుకున్న గుర్తింపు పట్ల గర్వంగా ఉంది. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమాకు సైన్ చేశా. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా' అని వెల్లడించింది. -
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. -
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ అభిమానిపై ప్రశంసలు కురిపించింది.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ సమంత రాసుకొచ్చింది. తన అభిమాని అయిన స్టూడెంట్ను స్టార్ హీరోయిన్ సమంత అభినందించడం చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.అయితే ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం లవ్ మీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఆశిష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉండగానే ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసింది వైష్ణవి. ఫోన్లోనే తనకు 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' చెప్పాలని వైష్ణవి కోరింది. అయితే దీనికి షాక్ అయిన ఆనంద్ నేనే చెప్పాలా? అని అడిగారు. బేబీ సినిమా మొత్తం చూసినా కదా.. అవన్నీ చెబితే బాగోదేమో అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. ఆ పదాన్ని రిపీట్ చేయాలని మళ్లీ కోరింది వైష్ణవి చైతన్య. దీంతో చివరికీ 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' అంటూ చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా కేకలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. లవ్ మీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది.#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 📱Actress @iamvaishnavi04 takes up a dare and calls @ananddeverkonda during #LoveMeTrailer launch live event!😃Watch Live here - https://t.co/CKcEqqOreD#VaishnaviChaitanya #AnandDeverakonda #TeluguFilmNagar pic.twitter.com/0cHFxZjroQ— Telugu FilmNagar (@telugufilmnagar) May 16, 2024 -
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్‌దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్‌పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు. -
పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్‌కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే విషయంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్ ఎలా డీల్ చేస్తారో చాలా ఎంటర్టైనింగ్గా చూపించాం. ఇందులో నరేశ్ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే. అంతే కాదు హీరోయిన్గా మాస్ మసాలా, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
Ketika Sharma: టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
‘టెనెంట్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్‌కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్‌లో తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్‌కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా ఐదుసార్లు!
టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. పెళ్లి రూమర్స్‌పై అంజలి స్పందిస్తూ.. ' ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగుసార్లు పెళ్లి చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశా. ఏకంగా పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని ఏంటంటే.. నేను అవుట్ డోర్ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అది ఇప్పుడైతే కాదు. దానికి ఇంకా టైముంది' అని చెప్పుకొచ్చింది. కాగా.. గీతాంజలి మళ్లీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. గీతాంజలి.. విశ్వన్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ కనిపించనుంది. అంతే కాకుండా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం నటించనుంది. వీటితో పాటు మరో 6 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. -
'వారికి దూరంగా ఉండటమే మంచిది'.. మంగళవారం బ్యూటీ పోస్ట్ వైరల్!
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి యూత్‌లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. గతేడాది మంగళవారం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే పాయల్ టాలీవుడ్లో అంతకుముందు ఆర్డీఎక్స్ లవ్’, వెంకీమామ, డిస్కోరాజా, తీస్ మార్ఖాన్, జిన్నా చిత్రాల్లో కనిపించింది. మంగళవారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. పాయల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు యత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి. మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
అలాంటి సినిమాలు చూడను.. కానీ: హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
దక్షిణాదిలో కథానాయకిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక గాయనీ, గీత రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. డబ్బింగ్ కళాకారిణిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆండ్రియా ఇప్పుడు హీరోయిన్గా కూడా రాణిస్తున్నారు. ఒకవైపు సింగర్‌గా రాణిస్తూన్నారు. అదే విధంగా హీరోయిన్‌గానే నటిస్తానని స్టాండ్ తీసుకోలేదు. పాత్రలో సత్తా ఉంటే విలనిజాన్ని పండించడానికై నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా నటించడానికి రెడీ అంటోంది. అలా వడచైన్నె చిత్రంలో తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో మెప్పించారు. మరోపక్క సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆండ్రియా తాజాగా నటించిన కా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్బంగా ఆండ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హారర్, వయలెన్స్ ఉన్న కథా చిత్రాలను చూడనని.. అలాంటి చిత్రాలు తనకు నచ్చవని చెప్పారు. అయితే అలాంటి కథా చిత్రాల్లో నటిస్తానని మాత్రం చెప్పారు. చూడడం వేరు.. నటించడం వేరు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా మిష్కిన్ దర్శకత్వంలో కథానాయకిగా నటించిన మరో హారర్, ధ్రిల్లర్ కథా చిత్రం పిశాచి- 2 నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. తెలుగులో ఆ ఒక్క సినిమా మాత్రమే!
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) -
'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది యశోద మూవీతో మెప్పించిన సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ తర్వాత కోలుకుంది. ఇప్పుడిప్పుడే తన మళ్లీ రీస్టార్ట్ అవుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండియా టుడే కాన్క్లేవ్ -2024లో పాల్గొన్న సామ్ తాను అందంగా.. ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించడం కూడా లేదని వెల్లడించింది. అంతే కాకుండా పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడంపై సమంత మాట్లాడింది. సమంత మాట్లాడుతూ... 'రాజీ (ఫ్యామిలీ మ్యాన్-2) చేయడం లాంటిదే ఇలాంటి నిర్ణయం. మీ చుట్టూ మంచి వ్యక్తులు లేకపోతే.. మన అభిప్రాయాలను గౌరవించుకోవడం మంచి విషయంగా భావిస్తున్నా. మరో వైపు నేను తప్పులు చేయాలి.. వాటి నుంచి నేర్చుకోవాలి. అలాగే నా గట్స్‌ను పెంచుకోవాలి. పుష్ప చిత్రంలో ఊ అంటావా.. అనే సాంగ్ చేయాలనే నిర్ణయం నాదే. నేను ఒక నటిగా ఆ కోణాన్ని అన్వేషించాల్సి సమయం వచ్చిందని' తెలిపింది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఎప్పుడూ చాలా అసౌకర్యంగా ఉంటా. ఆ విషయంలో నాపై నాకు పూర్తి నమ్మకంగా లేను. నేను అందంగా లేను అనే భావన ఉంది. అంతే కాదు ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించను" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సెక్సీ అనే పదం తనకు సెట్ కాదని తెలిపింది. కాగా.. సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి స్పై సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. -
ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్‌కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‌గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‌కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్‌కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు. పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. -
సముద్రం తీరంలో తేజస్వీ ప్రకాశ్ చిల్.. హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్..!
మెక్సికోలో చిల్ అవుతోన్న తేజస్వీ ప్రకాశ్.. మంచుకొండల్లో భూమిక చావ్లా చిల్.. లైట్ బ్లూ డ్రెస్‌లో హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్.. పింక్ డ్రెస్‌లో రీతూ చౌదరి హోయలు.. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్‌లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
రాత్రి పది తర్వాత అలా చేయడం ఇష్టముండదు: తాప్సీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిన్నింటిని కొట్టిపారేసింది. ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం సీక్రెట్‌గానే మెయింటెన్ చేస్తోంది. కానీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీల్లో కూడా పెద్దగా కనిపించదు. ఇటీవల జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం హాజరు కాలేదు. మీరేందుకు పార్చీలకు వెళ్లరంటూ ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం తనకు ఇష్టముండదని వెల్లడించింది. తాప్సీ మాట్లాడుతూ..'పెద్ద స్టార్స్‌కి మెసేజ్‌లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితేనే నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తా. అందుకే త్వరగా పడుకోవాలి. నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు. పార్టీలకు వెళ్లి ఏం చేయాలో నాకు తెలియదు' అని అన్నారు. అంతే కాకుండా.. 'నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకునే ఉద్దేశం లేదు. వారితో ఏమి మాట్లాడాలనేది నాకు తెలియదు. పార్టీలకు రాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్లో ముందుకెళ్లడం చాలా సులభం. అంతే కాకుండా రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కేవలం ఇప్పటివరకు నా కష్టంతోనే ఇక్కడి వరకు వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. తాప్సీ, మథాయుస్ బ్రో అనే వ్యక్తితో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. వేదిక ఫిక్స్!
మరికొద్ది గంటల్లో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా తన ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ.. మంగళవారం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. రెండేళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్‌లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్‌లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి, పుల్కిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. కాగా.. పుల్కిత్‌కి గతంలోనే శ్వేతా రోహిరా అనే అమ్మాయితో వివాహమైంది. ఈ జంట 2015లోనే విడిపోయారు. కాగా.. బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది. కాగా.. పుల్కిత్ ఇటీవలే ఫుక్రే-3 చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్‌ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
'ఆ తెలుగు హీరో నా మొదటి క్రష్'.. యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల..!
2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ మూవీ తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన కెరీర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అంతే కాదు టాలీవుడ్ యంగ్ హీరో అంటే క్రష్ అని ఓపెన్ అయింది ముద్దుగుమ్మ. ఆ వివరాలేంటో చూద్దాం. (ఇది చదవండి: అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!) అనన్య మాట్లాడుతూ.. 'తనకు కాబోయేవాడు నిజాయితీగా ఉంటే చాలు. అలాంటి వాడైతే ఓకే. సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నా. ఇండస్ట్రీ వాళ్లయితే కొంచెం కష్టం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చు. సినిమా వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో నా ఫస్ట్ క్రష్ నాగశౌర్య. నా చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్‌ను అంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగా. నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారు. కానీ నేను మాత్రం కమిటేడ్ కాదు. అంతేకాదు నాకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురవ్వలేదు ' అని అన్నారు. -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
టాలీవుడ్ హీరోయిన్‌కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్‌లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024