transactions
-
ఒక్కరోజే రూ.99,835 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు దూసుకెళ్తున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు తక్కువేం కాదు..2023–24లో యూపీఐ లావాదేవీల విలువ రూ.200 లక్షల కోట్లు దాటింది. లావాదేవీల సంఖ్య 13,100 కోట్ల పైచిలుకు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీల వాటా 62.35 శాతం. వ్యక్తుల మధ్య జరిగినవి 37.75 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య జరిగిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ చేసేవి ఏకంగా 86 శాతం నమోదయ్యాయి. ఇక మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 80 శాతానికి చేరిందని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2025 జనవరి నాటికి 641 బ్యాంకులు, 80కిపైగా యాప్స్ యూపీఐ సేవలు అందించాయి.అగ్రస్థానంలో ఫోన్‌పేయూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?జనవరిలో ఇలా..2025 జనవరిలో నమోదైన రూ.23,48,037 కోట్లలో వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు 73 శాతం. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగినవి 27 శాతం. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.2,000లకుపైగా విలువ చేసే లావాదేవీల వాటా 87 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10%, రూ.500 లోపు 3% నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.2,000పైగా విలువ చేసే లావాదేవీలు 67 శాతం, రూ.501–2,000 మధ్య 17 శాతం, రూ.500 లోపు 16 శాతం ఉన్నాయి. ఇక లావాదేవీల సంఖ్య పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 62 శాతం, వ్యక్తుల మధ్య 38 శాతం నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 86 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10 శాతం, రూ.2,000పైన 4 శాతం ఉన్నాయి. -
ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు రద్దు!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై ప్రభావం చూపే కొత్త నిబంధనను 2025 ఫిబ్రవరి 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేయనుంది. తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.యూపీఐ లావాదేవీ ఐడీల జనరేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడానికి, యూపీఐ టెక్నికల్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండేలా చూడటానికి ఎన్పీసీఐ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 9, 2025న జారీ చేసిన ఆదేశాల ప్రకారం లావాదేవీ ఐడీలను జనరేట్ చేయడానికి యూపీఐ భాగస్వాములందరూ ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను (అక్షరాలు, సంఖ్యలు) మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చింది. ప్రత్యేక సింబల్స్‌ను వాడకూడదని సూచించింది. ఇదీ చదవండి: ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రంఈ చర్య వల్ల వ్యవస్థ సామర్థ్యాన్ని, భద్రతను పెంచడం, యూపీఐ లావాదేవీల అంతటా ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పేమెంట్ అగ్రిగేటర్లు ఈ ఆదేశాలను ఇప్పటికే పాటించినప్పటికీ, కొంతమంది ఇంకా ఈ నిబంధనలు పాటించలేదు. ఫలితంగా 2025 ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అక్షరాలతో ఉన్న యూపీఐ ఐడీలకు సంబంధించిన లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేయనుంది. కొత్త మార్గదర్శకాలను పాటించని యూపీఐ యాప్‌ల వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. -
క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి.ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్లో మెనూ మీద ట్యాప్ చేయాలి.‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది. -
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పీపీఐ లావాదేవీలకు అనుమతి
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది. -
డిజిటల్ లావాదేవీల వైపు రుణగ్రహీతల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్‌లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్లైన్ షాపింగ్‌లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్‌లు లేదా వెబ్‌సైట్లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు. డేటా గోప్యత కోసం డిమాండ్ రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు. సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్సైట్లు, యాప్‌లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్‌తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెరిగిన చాట్‌బాట్స్, వాట్సాప్ వాడకం వినియోగదారుల సేవలో చాట్బాట్లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్‌లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్‌కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్‌బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది. -
చార్జీలు విధిస్తే .. వాడటం ఆపేస్తాం..
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. ఎన్పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి. -
439 బిలియన్ యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ వినియోగం ఏటేటా గణనీయగా పెరుగుతూనే ఉంది. 2028–29 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి యూపీఐ లావాదేవీలు మూడు రెట్ల వృద్ధితో 439 బిలియన్లకు (ఒక బిలియన్ వంద కోట్లకు సమానం) చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 131 బిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ఈ కాలంలో లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ హవా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పుడు యూపీఐ వాటా 80 శాతాన్ని అధిగమించిందని.. 2028–29 నాటికి 91 శాతానికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఏటేటా చక్కని వృద్ధిని చూస్తోందంటూ.. లావాదేవీల పరిమాణంలో 57 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని చూసిందని, కొత్తగా 1.6 కోట్ల కార్డులను పరిశ్రమ జోడించుకున్నట్టు వివరించింది. దీంతో లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, లావాదేవీల విలువ 28 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. 2028–29 నాటికి క్రెడిట్‌కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఇక డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. లావాదేవీల పరిమాణం, విలువలోనూ క్షీణత కనిపించింది. వచ్చే ఐదేళ్లలో చెల్లింపుల పరిశ్రమ ఎకోసిస్టమ్ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్‌లపైనే కొత్త వినియోగ అవకాశాలను గుర్తించొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పేమెంట్స్ పార్ట్నర్ మిహిర్ గాంధీ అంచనా వేశారు. -
పేటీఎమ్‌కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
యూపీఐ సరికొత్త రికార్డ్.. రోజుకు రూ .65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ తెలిపింది.ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. -
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. -
రుపీ ట్రేడ్‌కు పలు దేశాలు రెడీ
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలు చేపట్టేందు(రుపీ ట్రేడ్)కు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడ చూపడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన పండిట్ హృదయ్నాథ్ కుంజ్రు మెమోరియల్ లెక్చర్స్ 2024లో ప్రొఫెసర్లు, విద్యార్ధుల నుద్దేశించి సీతారామన్ ప్రసంగించారు. ప్రతీ రంగంలోనూ ప్రయివేట్ పెట్టుబడులకు భారత్ తలుపులు తెరచినట్లు వెల్లడించారు. ఏఐ, సెమీకండక్టర్స్, కొత్త పద్ధతుల్లో తయారీ తదితర రంగాలకు ఆర్థికంగానేకాకుండా విధానాల ద్వారా సైతం మద్దతును కొనసాగిస్తున్నట్లు వివరించారు. డాలర్‌మినహా.. డాలరును మినహాయిస్తే ఇతర ప్రపంచ కరెన్సీలలో రూపాయి చాలావరకూ నిలకడను ప్రదర్శిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ప్రస్తావించారు. అయితే ఇదే విషయంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీ కరెన్సీ నిలకడను ప్రదర్శిస్తున్నట్లేనని తెలియజేశారు. వెరసి పలు దేశాలు రుపీ ట్రేడ్ ద్వారా వాణిజ్య నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర యూనివర్శిటీగా జేఎన్‌యూ తనకు దేశవ్యాప్త అవగాహనను కలి్పంచినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఇది విద్యారి్ధగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసినట్లు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. జేఎన్‌యూలో సీతారామన్ ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. -
వెయ్.. ‘సిప్’ వెయ్
న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. టికెట్ సైజు తక్కువే 18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. -
హైరిస్క్ డెరివేటివ్స్తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు. దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు. దీర్ఘకాలిక దృష్టి.. దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు వెల్లడించారు. -
యూపీఐ కొత్త పుంతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్‌లో 1,123.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.17.4 లక్షల కోట్లను తాకింది. ఈ వేగాన్నిబట్టి చూస్తే డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే చెల్లింపులు ఇందుకు దోహదం చేయనున్నాయి. డిసెంబర్ 1–18 తేదీల మధ్య 703 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.11 లక్షల కోట్లు. పండుగల సీజన్‌తో.. ఈ ఏడాది జూలై నుంచి సెపె్టంబర్ మధ్య యూపీఐ లావాదేవీల విలువ ప్రతి నెల రూ.15.3–15.8 లక్షల కోట్ల మధ్య నమోదైంది. పండుగల సీజన్ కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో యూపీఐ లావాదేవీలతోపాటు విలువ కూడా అనూహ్యంగా పెరిగింది. గడిచిన రెండు మాసాల్లోనూ ప్రతి నెల విలువ రూ.17 లక్షల కోట్ల మార్కును తాకింది. 2023 అక్టోబర్‌లో 1,140.8 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022 డిసెంబర్లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన 783 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.11.9 లక్షల కోట్ల విలువైన 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తొలి స్థానంలో ఫోన్‌పే.. ప్రస్తుతం భారత్‌లో 516 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. థర్డ్ పార్టీ యాప్, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్న ఫోన్‌పే నవంబర్ నెలలో రూ. 8,54,939 కోట్ల విలువైన 528 కోట్ల లావాదేవీలతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లావాదేవీల విలువ పరంగా గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, యెస్ బ్యాంక్ యాప్స్, భీమ్, అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ యాప్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చిన్న మొత్తాలే ఎక్కువ.. నవంబర్‌లో విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు ఏకంగా 74.31 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వీటి విలువ రూ.12.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీలు 25.69 శాతం వాటాతో రూ.4.46 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 58.62 శాతం వాటాతో 658.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు 41.38 శాతం వాటాతో 464.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు చెల్లించిన మొత్తాల్లో రూ.500 లోపు లావాదేవీల సంఖ్య ఏకంగా 83.75 శాతం ఉంది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాల్లో రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా 54.85 శాతం నమోదైంది. దీనినిబట్టి చూస్తే చిన్న మొత్తాలే అధిక సంఖ్యలో చేతులు మారుతున్నాయి. -
మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది(2024)లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్కు తెరతీయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురి బచ్ తాజాగా వెల్లడించారు. వెరసి 2024 మార్చి నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను ప్రవేశపెట్టనున్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రపంచ ఆర్థిక విధానాల వేదిక 2023లో బచ్ పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే సెబీ స్టాక్ లావాదేవీల సెటిల్మెంట్ గడువులను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం లావాదేవీ చేపట్టిన మరుసటి రోజు (టీప్లస్1) సెటిల్మెంట్ అమలవుతోంది. దీన్ని మరో 3 నెలల్లోగా ఒకే రోజుకు పరిమితం చేయనున్నట్లు బచ్ చెప్పారు. కాగా.. టీప్లస్‌జీరో సెటిల్మెంట్ అమలు తదుపరి అప్పటికప్పుడు(ఇన్‌స్టేనియస్) సెటిల్మెంట్ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఇది ఆప్షనల్‌గా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్! క్యాష్ అస్సలు తీసేట్టులేరుగా..
UPI Transactions Cross 10 Billion Mark: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్ నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు వరుసగా రెండో సారి 10 బిలియన్ లావాదేవీల మార్క్‌ను దాటాయి. గడిచిన ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు మొదటిసారిగా 10 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. మళ్లీ సెప్టెంబర్ నెలలో రెండో సారి 10 బిలియన్ లావాదేదీలు జరిగాయి. సెప్టెంబర్ 30 వరకు 10.55 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 'X' (ట్విటర్)లో పేర్కొంది. చెల్లింపు వ్యవస్థల గణాంకాలను షేర్ చేసింది. అయితే ఆగస్టులో నమోదైన 10.58 బిలియన్ల లావాదేవీలతో పోల్చితే సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీలు కాస్త తక్కవగా ఉన్నాయి. కానీ ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 6.78 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే 55 శాతం పెరిగాయి. రూ. 15.79 లక్షల కోట్లు యూపీఐ లావాదేవీల మొత్తం విలువను పరిశీలిస్తే ఆగస్టు నెలలో రూ. 15.76 లక్షల కోట్ల నుంచి సెప్టెంబర్‌లో రూ. 15.79 లక్షల కోట్లకు చేరింది. 2022 సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీల విలువ రూ. 11.16 లక్షల కోట్లు. వరల్డ్‌లైన్ డేటా ప్రకారం.. యూపీఐ లావాదేవీల సంఖ్య 2018 జనవరిలో 151 మిలియన్లు ఉండగా 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంది. 30th SEPTEMBER 2023: DAILY PAYMENTS STATISTICS #BHIMUPI #IMPS #NETC pic.twitter.com/hvh1UyEjMe — NPCI (@NPCI_NPCI) October 1, 2023 -
యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్‌లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్‌కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్‌లో టాప్–5లో వరుసగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. చిన్న మొత్తాలే అధికం.. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. -
చంద్రబాబు ముడుపుల కేసులో కీలక మలుపులు
-
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్‌లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
వస్త్ర వ్యాపారిపై దాడికి వ్యాపార లావాదేవీలే కారణం
విజయవాడ స్పోర్ట్స్: ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారిపై ఓ దుకాణం యజమాని దాడికి పాల్పడిన ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలే ఘటనకు కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ మీడియాలో వెలువడ్డ కథనాల్లో నిజం లేదని, అసత్యాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. చెక్కు చెల్లకపోవడంతో.. ధర్మవరానికి చెందిన హోల్‌సేల్ వస్త్ర వ్యాపారి అన్ని ప్రాంతాలకు వ్రస్తాలను సరఫరా చేస్తుంటారు. విజయవాడ పటమటలోని ఆలయ సిల్‌్క్స షాపు యజమానికి గతేడాది డిసెంబర్లో రూ.2.34 లక్షల విలువ చేసే వ్రస్తాలను సరఫరా చేశారు. దీనికి సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో డబ్బులివ్వాలని ఆలయ సిల్‌్క్స యజ మాని గుడవర్తి అవినాష్ గుప్తాను పలుమార్లు ఫోన్లో కోరారు. ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి ఈ నెల రెండో తేదీన విజయవాడ వచ్చారు. దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆలయ సిల్‌్క్స యజమాని అవినాష్ గుప్తా, సూపర్వైజర్ చీవేళ్ల నాగేశ్వరరావు, మరో వ్యక్తి కలసి వస్త్ర వ్యాపారిని, అతడి స్నేహితుడిని చేతులతో కొట్టారు. దుస్తులు విప్పించి నగ్నంగా నాలుగు గంటల పాటు బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు గుడవర్తి అవినాష్గుప్తా, నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. తెనాలిలో అలాంటి నాయకులెవరూ లేరు.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలి: వస్త్ర వ్యాపారిపై తెనాలికి చెందిన వైఎస్సార్ సీపీ అవినాష్ గుప్తా జులుం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజం లేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కొల్లిపరలో ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో స్థానం ఉండదని, తప్పు చేస్తే సీఎం జగన్ ఏమాత్రం ఉపేక్షించరని స్పష్టం చేశారు. 2011లో పారీ్టలో చేరిన తాను అవినాష్ గుప్తా అనే వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లో మీడియా కథనాలు వికృత చేష్టలకు నిదర్శమన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జుత్తు పట్టుకుని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన ఉదంతాన్ని ప్రజలు మరచిపోలేదని చెప్పారు. -
పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు!
దేశంలో ప్రతి ఆర్థిక లావాదేవీకీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్ తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు తెరవవాలన్నా.. లోన్లు పొందాలన్నా.. చెల్లింపులు చేయాలన్నా.. ఆదాయపు పన్ను చెల్లించాలన్నా ఈ పాన్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం, 2023 జూన్ 30లోపు ఆధార్ నంబర్‌ను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ గడువు కూడా ఇప్పుడు పూర్తయింది. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డలు 2023 జూలై 1 నుంచి పనిచేయకుండా (ఇన్ఆపరేటివ్) పోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. పనిచేయని పాన్ కార్డు ఉన్న వారు కింది ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరు. ఆ లావాదేవీలు ఇవే.. బ్యాంకులు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం (టైమ్ డిపాజిట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు మినహా). డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీస్ కస్టోడియన్ లేదా సెబీ నియంత్రణలోని సంస్థల్లో డీమ్యాట్ అకౌంట్ తెరవడం. హోటల్ లేదా రెస్టారెంట్‌కి ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం. విదేశీ ప్రయాణానికి లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయడం. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000లకు మించి చెల్లింపులు ఆర్బీఐ బాండ్లను పొందడం కోసం రూ. 50,000 మించి చెల్లింపులు బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒకే రోజులో రూ.50,000 లకు మించి నగదు జమ బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేసేందుకు ఒకే రోజులో రూ. 50,000 లకు మించి నగదు చెల్లింపులు టైమ్ డిపాజిట్‌కు సంబంధించి ఒక సారికి 50,000 లేదా సంవత్సరంలో మొత్తంగా రూ. 5 లక్షలకు మించి డిపాజిట్ చేయడం ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్ ద్వారా రూ. 50,000లకు మించిన పేమెంట్లు బీమా సంస్థకు జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000లకు మించి చెల్లించడం. రూ. లక్షకు మించిన సెక్యూరిటీల (షేర్లు మినహా) అమ్మకం లేదా కొనుగోలు కోసం ఒప్పందంలోకి ప్రవేశించడం. రూ. లక్షకు మించిన అన్‌లిస్టెడ్ కంపెనీ షేర్ల విక్రయం లేదా కొనుగోలులో పాల్గొనడం. ఇదీ చదవండి: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్‌లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
ఆకర్షణ కోల్పోతున్న డెబిట్ కార్డు.. దూసుకుపోతున్న క్రెడిట్ కార్డు!
న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ ఇప్పుడు తన ఆకర్షణ కోల్పోతోంది. దీని స్థానంలో క్రెడిట్ కార్డు ఆకర్షణీయంగా మారుతోంది. డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డుతో చెల్లింపుల లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దం క్రితం డెబిట్ కార్డులే చెల్లింపుల్లో సింహ భాగం వాటా కలిగి ఉంటే, నేడు క్రెడిట్ కార్డులు ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటున్నాయి. కార్డుతో చెల్లించినప్పటికీ, 45 రోజుల వరకు ఆ బకాయి తీర్చేందుకు వ్యవధి ఉండడం, చెల్లింపులపై రివార్డులు ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డుల ద్వారా 22 కోట్ల మర్చంట్ (వర్తకులు) చెల్లింపులు నమోదు అయితే, అదే నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల లావాదేవీలు 25 కోట్లుగా ఉన్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే.. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపుల జరిగితే, డెబిట్ కార్డుల లావాదేవీల విలువ ఇందులో సగానికంటే తక్కువ రూ.53,000 కోట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ–కామర్స్, భౌతిక దుకాణాల్లో చేసిన లావాదేవీలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో క్రెడిట్ కార్డుల స్వైప్ (చెల్లింపు)లు 20 శాతం పెరగ్గా, డెబిట్ కార్డు స్వైప్‌లు 31 శాతం క్షీణించాయి. ఫిన్‌టెక్‌ల మద్దతు స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి ప్రాధాన్యం చూపిస్తున్నాయి. మింత్రా కోటక్ మహీంద్రా బ్యాంకుతో, పేటీఎం ఎస్బీఐ కార్డ్‌తో కలసి ఇటీవలే క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రభుత్వరంగ పీఎన్బీ బ్యాంక్‌తో కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకురావడం గమనార్హం. ఇలా పెద్ద సంస్థలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి. ‘‘వస్త్రాలను విక్రయించే పెద్ద మార్కెట్‌ప్లేస్‌కు అమ్మకాలపై ఎంతలేదన్నా 50–60 శాతం లాభాల మార్జిన్ ఉంటుంది. దీంతో అవి తమ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వగలవు. తద్వారా కస్టమర్ల విశ్వసనీయతను చూరగొనవు’’అని ఓ ఫిన్‌టెక్ సంస్థ ఉన్నతోద్యోగి తెలిపారు. బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో వాటా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ, అది వాటికి పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు శాఖ తరఫున ఒక్క క్రెడిట్ కార్డు కస్టమర్‌ను పొందేందుకు అవి రూ.2,000ను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పోలిస్తే కో బ్రాండెడ్ ఒప్పందం ద్వారా అయితే తక్కువ ఖర్చులోనే ఎక్కువ కస్టమర్లను చేరుకోవడం వాటిని ఆ దిశగా దృష్టి సారించేలా చేస్తోంది. అందుకే అవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ప్ర ముఖ ఫిన్‌టెక్‌లు, కన్జ్యూమర్ కంపెనీలతో టైఅప్ కోసం కృషి చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ సాయంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్ చేస్తుండడం గమనార్హం. పరిశ్రమ వ్యాప్తంగా క్రెడిట్ కార్డు యాక్టివిటీ రేటు 50 శాతంగా ఉంటే, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డులో ఇది 70 శాతంగా ఉన్నట్టు అమెజాన్ పే ఇండియా హోల్‌టైమ్ డైరెక్టర్ వికాస్ బన్సాల్ తెలిపారు. యూపీఐ ప్రభావం.. డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి క్రెడిట్ కార్డులే కాకుండా, యూపీఐ చెల్లింపుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండడంతో డెబిట్ కార్డు ప్రాధాన్యం తగ్గింది. మే నెలలో 536 కోట్ల యూపీఐ మర్చంట్ లావాదేవీలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 254 కోట్ల లావాదేవీలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఇప్పుడు అన్ని చెల్లింపుల సాధనాల్లోనూ యూపీఐ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డు చెల్లింపులకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం వీటి సంఖ్య 7.5 కోట్లు. మూడేళ్ల క్రితం 5 కోట్ల కంటే తక్కువే ఉన్నాయి. ‘‘యూపీఐ మాదిరిగా కాకుండా క్రెడిట్ కార్డు అనేది మొత్తం ఎకోసిస్టమ్‌లో ఉన్న అందరికీ ఆదాయాన్నిచ్చే సాధనం. సాధారణంగా అధిక విలువ కొనుగోళ్లకు, వినియోగ చెల్లింపులకు దీన్ని స్వైప్ చేస్తుంటారు’’అని ఓ బ్యాంకర్ తెలిపారు. -
వీడియోకాన్‌పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
రెపో లావాదేవీల్లో ఫండ్స్ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు ప్రోత్సాహకంగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ పేపర్లు, సర్టిఫికెట్ ఆఫ్ బాండ్లు తదితర సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించింది. ఏఏ, అంతకు మించి రేటింగ్ కలిగిన కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టుకోవ చ్చని సెబీ స్పష్టం చేసింది. రెపో లావాదేవీలను రెపో అని లేదంటే విక్రయ–కొనుగోలు ఒప్పందంగా పరిగణిస్తారు. సెక్యూరిటీలను విక్రయించిన సంస్థే అంగీకరించిన రేటుపై తిరిగి వాటిని కొనుగోలు చేస్తుంది. నూతన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సెబీ ప్రకటించింది. -
డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే
న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్ సెగ్మెంట్లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది. దేశీయంగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్ కార్డు లావాదేవీలను మించనుంది. ► క్రెడిట్ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్ కార్డును ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్‌కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్‌డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గనుంది. ► 2022–23లో బ్యాంకులు, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కార్డుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే 1వ తేదీ నుంచి కస్టమర్ల ఖాతాలలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ లావాదేవీకి రూ.10 చొప్పున పెనాల్టీ ఛార్జీని బ్యాంక్ విధంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అలాగే ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయడానికి ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించింది. అయితే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే ఆ సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొందించింది. విఫలమైన ఏటీఎం ట్రాన్సాక్షన్ గురించి కస్టమర్లు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800180222 లేదా 18001032222 ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. కాగా మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10తోపాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు బ్యాంక్ ఇదివరకే సమాచారం అందించింది. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్ చేసిన కోడ్ లేదా నంబరు లేదా టోకెన్లను వర్చువల్ డిజిటల్ అసెట్లుగా పరిగణిస్తారు. (ఇదీ చదవండి: ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు) -
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. -
ఆధార్ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్‌లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్‌లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి. ఈ–కేవైసీ వల్ల పేపర్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు, టెలికం సిమ్ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్ హోల్డర్ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. -
క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త
-
షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్‌పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్‌ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్‌ను యాక్సెస్‌కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్‌లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్‌ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్‌గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్‌గా టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
వామ్మో రూ.12.11 లక్షల కోట్లు.. ఏం వాడకం రా బాబు!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్‌లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్‌లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్‌ని ఏఈపీఎస్‌తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్‌లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్! -
స్లైస్ కార్డు యూజర్లకు అలెర్ట్, ఇక ఆ కార్డులు పనిచేయవ్!
స్లైస్ కార్డు యూజర్లకు ముఖ్య గమనిక. ఆర్బీఐ నిబంధనల మేరకు స్లైస్ కార్డు తన ప్రీపెయిడ్ కార్డు సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు వినియోగించే అవకాశం ఉండదని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల మేరకు స్లైస్ తరహా సంస్థలు లోన్లు ఇవ్వడం, తిరిగి చెల్లించే ట్రాన్సాక్షన్లు ఇకపై అన్నీ బ్యాంక్ అకౌంట్ల నుంచి జరపాల్సి ఉంది. ఇందులో భాగంగా స్లైస్ వినియోగదారులకు ఇచ్చే రుణాల్ని ఇకపై బ్యాంకు అకౌంట్లకే ట్రాన్స్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్లైస్ కార్డులో ఉన్న నగదు రోజువారీ ట్రాన్సాక్షన్లకు ఉపయోగించుకోవచ్చు. స్లైస్ బారో పేరిట లోన్లు, యూపీఐ పేమెంట్స్ కోసం స్లైస్ యూపీఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. -
ఆధార్ ఈకేవైసీ లావాదేవీలు 25 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈకేవైసీ లావాదేవీలు సెప్టెంబర్ నెలకు 25.25 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే ఇవి 7.7 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) అన్నది అన్ని ముఖ్య లావాదేవీలకు అవసరమని తెలిసిందే. పేపర్లతో సంబంధం లేకుండా ఆధార్ బయోమెట్రిక్‌తో ఈకేవైసీ విధానం పలు చోట్ల అమల్లో ఉన్న విషయం గమనార్హం. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సైతం ఆర్థిక సేవల విస్తృతికి కీలకమని ఈ ప్రకటన పేర్కొంది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏఈపీఎస్, మైక్రో ఏటీఎంల ద్వారా మారుమూల ప్రాంతాల్లో మొత్తం మీద 1,594 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే 21.03 కోట్ల ఏఈపీఎస్ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరిగాయి’’అని వెల్లడించింది. ఆధార్ ద్వారా సెప్టెంబర్ నెలలో 175.41 కోట్ల ధ్రువీకరణ లావాదేవీలు నమోదయ్యాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
సైబర్ మోసాలపై వెంటనే ఫిర్యాదు...లేదంటే! ఎస్బీఐ కీలక హెచ్చరిక
సాక్షి, ముంబై: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సూచనలు జారీ చేసింది. డిజిటల్ చెల్లింపు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అనధికారిక లావాదేలపై తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను అప్రమత్తం చేసింది. తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు ఫిషింగ్, ర్యాన్సమ్ దాడుల నుండి, సైబర్ కేటుగాళ్ల మోసాలనుంచి సురక్షితంగా ఉండవచ్చని పేర్కొది. ఎస్బీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా ఆర్థిక మోసం జరిగినట్లయితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అలా కాకుండా ఫిర్యాదుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. అనధికార లావాదేవీని గమనించిన వెంటనే తమ టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని వెల్లడించింది. తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకొనే అవకాశం తమకు ఉంటుందని, లేదంటే భారీ మూల్యం తప్పదని పేర్కొంది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిఎస్బీఐ బ్యాంకింగ్ అవసరాలను తీసు కోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సైబర్ నేరగాళ్ల ఎత్తులనుంచి, సైబర్ దాడులనుంచి కస్టమర్లు తమని తాము రక్షించు కోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. టోల్-ఫ్రీ నంబర్‌ను డయల్ చేయడంతో పాటు, కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ , భీమ్ ఎస్బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత ఛానెల్‌ను బ్లాక్ చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. Fulfill your banking needs, just call! Call SBI Contact Centre toll-free at 1800 1234 or 1800 2100.#SBI #SBIContactCentre #TollFree #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/RtrXf042KO — State Bank of India (@TheOfficialSBI) October 25, 2022 -
అన్నింటికీ ఒక్కటే కేవైసీ
న్యూఢిల్లీ: అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉంది. అయితే, ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించాం. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది’’అని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్ 2022 కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లకు ఉమ్మడి కేవైసీ విధానంపై ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ మధ్య గత వారం సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మరింత డిజిటైజ్ అవుతుందన్నారు. ప్రభుత్వం, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సయోధ్య పెరగాలి ప్రభుత్వం, ఫిన్‌టెక్ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని ఆమె సూచించారు. ‘దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుంది. కాబట్టి దూరం తగ్గించుకోవాలి. ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాలి. ఎంత తరచుగా సంప్రదింపులు జరిగితే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిశ్రమ, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం నెలకొనేలా చూసేందుకు తీసుకోతగిన చర్యలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. చర్చించేందుకు, ఐడియాలను పంచుకునేందుకు ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు అందరూ కూడా సదా అందుబాటులోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుందని వివరించారు. ఫిన్‌టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరీక్షించుకునేందుకు, ఫలితాలను బట్టి వాటిని విస్తరించేందుకు ఆర్బీఐ రూపొందించిన శాండ్బాక్స్ విధానం తోడ్పడుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022–23లో 7 శాతం వృద్ధి భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల నేపథ్యంలో క్రితం 8 శాతం అంచనాలను ఒకశాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ బాగుందని పేర్కొన్న ఆయన, ఈ దిశలో అన్ని స్తాయిల్లో మరింత సమన్వయ చర్యలు అవసరమని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో అన్నారు. కోవిడ్ అనంతర సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధికి విఘాగంగా ఉన్నాయని అన్నారు. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
రూపీ వర్తకానికి మొగ్గు చూపండి
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను రూపీ మారకంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపాలని వాణిజ్య మండళ్ల ప్రతినిధులు, బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. సీమాంతర చెల్లింపులు రూపీలో జరిగేలా చూసేందుకు విదేశాల్లోని భాగస్వామ్య బ్యాంకులతో కలసి ప్రత్యేక రూపీ వాస్ట్రో ఖాతాలు ఆఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్ మారకంలో కొనసాగుతుండడం గమనార్హం. దీని కారణంగా ఎక్కువ అస్థిరతలు నెలకొనడంతో తాజా సూచన చేయడం గమనార్హం. వాణిజ్య సంఘాలు, వాటి విదేశీ భాగస్వామ్య సంస్థలు రూపీ మారకంలో లావాదేవీలకు వీలుగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. వాణిజ్య మండళ్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూపీ మారకంలో వాణిజ్యానికి శ్రీలంక, అర్జెంటీనా, జింబాబ్వే సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వాణిజ్య సంస్థలు రూపీలో మారకానికి ఆసక్తితో ఉన్నందున.. రూపీ మారకంలో ఎగుమతులు, దిగుమతులకు వీలు కల్పించేందుకు బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి మన దేశం చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రూపాయి మారకంలోనే ఆ దేశం నుంచి అధిక శాతం దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
ఫారెక్స్ ట్రేడింగ్‌పై ఆర్బీఐ హెచ్చరికలు
ముంబై: దేశీయంగా ఫారెక్స్‌లో లావాదేవీలు నిర్వహించేందుకు అధికారిక అనుమతులులేని సంస్థల జాబితాను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. వీటిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది. అక్టాఎఫ్ఎక్స్, అల్పారి, హాట్ఫారెక్స్, ఒలింప్ ట్రేడ్సహా మొత్తం 34 సంస్థలతో జాబితాను ప్రకటించింది. ఫారెక్స్‌లో లావాదేవీలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణకు వీటికి అధికారిక అనుమతులులేవని తెలియజేసింది. అధీకృత వ్యక్తుల ద్వారా మాత్రమే విదేశీ మారక చట్ట(ఫెమా) నిబంధనల ప్రకారం అనుమతించిన కారణాలతో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టవచ్చని వివరించింది. ఇలాకాకుండా అనధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టిన వారు ఫెమా చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్‌లో డీల్ చేసేందుకు అధీకృతంకాని సంస్థలతో తమ వెబ్సైట్లో అలర్ట్ లిస్ట్‌ను ఉంచేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలియజేసింది. జాబితాలో ఫారెక్స్4మనీ,ఈటోరో,ఎఫ్ఎక్స్సీఎం,ఎన్టీఎస్ ఫారెక్స్ ట్రేడింగ్,అర్బన్ ఫారెక్స్,ఎక్స్ఎమ్ తదితరాలున్నాయి. -
మీ మీద ఇన్‌కంట్యాక్స్ రైడ్ తప్పదు
-
హై క్యాష్ ట్రాన్సాక్షన్స్: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ విషయాలు మర్చిపోతే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితికి మించి జరిపే నగదు లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచుతుంది. పరిమితికి మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్‌లో తప్పకుండా సమచారాన్ని అందించాలి. లేదంటే ఐటీ అధికారుల నుండి నోటీసులొచ్చే అవకాశం ఉంది. అలా నోటీసులు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో తెలియజేయాలి. అధిక-విలువ లావాదేవీలకు సంబంధించి వ్యక్తుల రికార్డులను యాక్సెస్ నిమిత్తం ఐటీ శాఖ అనేక ప్రభుత్వ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు సహా అధిక-విలువ నగదు లావాదేవీలపై ఐటీ విభాగం నిఘా ఉంచుతుంది. లావాదేవీలు థ్రెషోల్డ్ పరిమితిని మించి ఉంటే సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో పొందుపరచాలి. టాప్ 5 హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవో చూద్దాం. సేవింగ్స్ అకౌంట్ క్యాష్ డిపాజిట్ లిమిట్ ఒక వ్యక్తికి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ తమ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేస్తే.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షలు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చి వివరణ కోరవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు ఆదాయపు పన్ను శాఖ అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు నగదు రూపంలో చెల్లించే క్రెడిట్ కార్డ్ బిల్ పరిమితి రూ.1 లక్షగా ఉంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లావాదేవీల పరిమితి దాటితే ఐటీకి సమాచారం అందించాలి. లేదంటే నోటీసులు తప్పవు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్డీలలో 10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై ఐటీ విభాగానికి తెలియజేయాలి. ఫారమ్ 61Aని ఫైల్ చేయడం ద్వారా సింగిల్ లేదా మల్టిపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేసిన మొత్తం నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే బ్యాంకులు లావాదేవీలను బహిర్గతం చేయాలి స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు దేశంలోని అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్-రిజిస్ట్రార్ వద్ద రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఏదైనా స్థిరాస్తిని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం గురించి పన్ను అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌లు, బాండ్లు లేదా డిబెంచర్లలో పెట్టుబడులకు సంబంధించిన నగదు లావాదేవీల పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించకూడదు. -
జూన్‌లోనూ భారీగానే, కానీ మే నెలతో పోలిస్తే
న్యూఢిల్లీ: యూయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీలు జూన్ నెలలోనూ భారీగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో రూ.10లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా స్పష్టం చేస్తోంది. అయితే మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువ జూన్‌లో 3 శాతం తగ్గింది.యూపీఐ లావాదేవీలు మేతో పోలిస్తే జూన్‌లో వాల్యూమ్ , విలువ రెండింటిలోనూ తగ్గిపోయాయని ఎన్పీసీఐ డేలా తెలిపింది. జూన్ నెలకు రూ.10,14,384 కోట్ల విలువ చేసే యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, మే నెలకు ఈ మొత్తం రూ.10,41,506 కోట్లుగా ఉంది. జూన్ నెలలో 596 కోట్ల యూపీఐ లావాదేవీలు (సంఖ్య) నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు యూపీఐ లావాదేవీలు 558 కోట్లుగా ఉంటే, వీటి విలువ రూ.9,83,302 కోట్లుగా ఉండడం గమనార్హం. -
క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డుదార్లు ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల లావాదేవీలు జరిపారు. అంత క్రితం నెలలో ఈ లావాదేవీలు రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయనడానికి ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదార్లు ఆన్లైన్లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లు చెల్లించారు. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల లావాదేవీలు జరిపారు. ఆన్లైన్లో 11.5 కోట్లు, పీవోఎస్ మెషీన్ల (ఆఫ్‌లైన్) వద్ద 12.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో అధిక విలువ కలిగిన చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఆన్లైన్ లావాదేవీలకై రూ.65,652 కోట్లు చెల్లించారు. ఇక పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద వీరు రూ.39,806 కోట్ల లావాదేవీలు జరిపారు. డెబిట్ కార్డులతో ఇలా.. వినియోగదార్లు ఆన్లైన్, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్ నెలలో రూ.65,957 కోట్ల లావాదేవీలు జరిపారు. మే నెలలో డెబిట్ కార్డులతో పీవోఎస్ ద్వారా రూ.44,305 కోట్లు, ఈ–కామర్స్ కోసం రూ.21,104 కోట్లు ఖర్చు చేశారు. ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డు కలిగిన వారు 7.51 కోట్లు. వీరికి మే నెలలో 20 లక్షల మంది తోడయ్యారు. సంఖ్య పరంగా అత్యధిక క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ 1.72 కోట్లతో ముందంజలో ఉంది. మే నాటికి జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.33 కోట్లుగా ఉంది. స్వల్పంగా తగ్గిన డిపాజిట్ల వృద్ధి మార్చిలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి స్వల్పంగా తగ్గి 10 శాతానికి వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 11.9 శాతం వృద్ధి నమోదైందని ఆర్బీఐ వెల్లడించింది. 2021–22లో కరెంట్ 10.9 శాతం, సేవింగ్స్ 13.3, డిపాజిట్లు 7.9 శాతం అధికమయ్యాయి. మొత్తం డిపాజిట్లలో గృహస్తుల వాటా ఏకంగా 62.6 శాతం ఉంది. డిపాజిటర్లలో మహిళలు 19.8 శాతం ఉన్నారు. టెర్మ్ డిపాజిట్లలో రూ.1 కోటి ఆపైన ఉన్న భారీ డిపాజిట్లు 40 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. -
శ్రేయీ గ్రూప్ లావాదేవీల మోసం
న్యూఢిల్లీ: మొత్తం రూ. 3,025 కోట్ల మోసపూరిత లావాదేవీలపై పాలనాధికారికి ట్రాన్సాక్షన్ ఆడిటర్ నుంచి నివేదిక అందినట్లు ప్రయివేట్ రంగ కంపెనీ శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ తాజాగా పేర్కొంది. ఇది 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన నివేదికగా వెల్లడించింది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, శ్రేఈ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ బోర్డులను గతేడాది అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఆపై బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీజీఎం రజనీష్ శర్మను శ్రేయీ గ్రూప్ కంపెనీలకు పాలనాధికారిగా నియమించింది. తదుపరి పాలనాధికారికి సహకరించేందుకు ముగ్గురు సభ్యుల సలహాదారుల కమిటీని నియమించింది. శ్రేయీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఆల్గో ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అల్గోరిథమిక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేసే అనియంత్రిత ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. కీలకమైన వ్యక్తిగత వివరాల్లాంటివి వాటికి ఇవ్వొద్దని సూచించింది. ‘ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లు నియంత్రణ పరిధిలో లేవు. కాబట్టి వాటిపై ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థ లేదు. అందుకే ఆయా ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీల విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. ట్రేడింగ్ లావాదేవీలను ఆటోమేటిక్‌గా నిర్వహించే ఆల్గో సర్వీసులతో అధిక లాభాలు ఆర్జించవచ్చంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆశపడ్డారో.. కొంప కొల్లేరే! కుక్కపిల్లని కూడా వదలరు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఉన్నచోటనుంచే కడుపులో చల్ల కదలకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాం. అంతేనా ఒక చిన్న క్లిక్‌తో ఇన్‌స్టంట్‌గా రుణాలు, యాప్ ద్వారా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలకసమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచే స్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదోవిధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ 2 వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్తో జాగ్రత్త !
ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ రేజర్‌పేకు గట్టి షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు రేజర్ పే కమ్యూనికేషన్స్‌ని హ్యాక్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏడు కోట్ల రూపాయలకు పైగా గుట్టు చప్పుడు కాకుండా కాజేశారు. ఆలస్యంగానైనా జరిగిన మోసం గమనించిన రేజర్‌పే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేజర్‌పే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి 2022 మార్చి 6 నుంచి మే 13 వరకు 831 ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో పారదర్శకత లోపించిందంటూ రేజర్‌పేకి అధికారికంగా పేమెంట్ సర్వీసులు అందిస్తున్న ఫైసర్వ్ సంస్థ తెలిపింది. ఇందుకు సంంధించిన వివరాలు అందించింది. వివరాలు అందుకున్న వెంటనే రేజర్‌పే అంతర్గత విచారణ జరగగా.. మోసం జరిగిన తీరు బట్టబయటైంది. గుర్తు తెలియని హ్యాకర్లు కమ్యూనికేషన్ వ్యవస్థను దారి మళ్లించి లావాదేవీల్లో నగదును తమ ఖాతాల్లోకి మరల్చుకున్నట్టు గుర్తించింది. ఈ తప్పుడు లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. అప్పటికే కేటుగాల్లు రూ.7.38 కోట్లు కాజేశారు. -
ఆర్బీఐ డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు వేగవంతం: డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)తో లావాదేవీలు వేగవంతం అవడమే కాకుండా, వ్యయాలు ఆదా అవుతాయని డెలాయిట్ సంస్థ తెలిపింది. డిజిటల్ రూపీపై ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చే ప్రణాళికల్లో ఆర్బీఐ ఉండడం తెలిసిందే. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు సీబీడీసీ వినూత్నమైన, పోటీతో కూడిన చెల్లింపుల వ్యవస్థ కాగలదని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఎక్కువ శాతం సెక్యూరిటీల క్లియరింగ్, సెటిల్మెంట్ ప్రక్రియకు ఎన్నో రోజులు తీసుకుంటోందని, డిజిటల్ రూపీని ప్రవేశపెడితే సామర్థ్యాలు పెరగడంతోపాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేసింది. అదే సమయలో భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘‘ఇతర డిజిటల్ సాధనాలతో పోలిస్తే సీబీడీసీలకు సావరీన్ ఆప్షన్ ఉండడం అదనపు ఆకర్షణ. అదే ఇతర డిజిటల్ సాధనాలు అంత విశ్వసనీయమైనవి కావు. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ సైతం ఎక్కువ అస్థిరతలతో ఉంటుంది’’ అని ఈ నివేదిక వివరించింది. భవిష్యత్తులో నగదు వినియోగం తగ్గినప్పడు విలువ బదిలీకి ప్రత్యామ్నాయం అవుతుందని, మరిం త విస్తృతంగా వినియోగించే పేమెంట్ సైకిల్‌గా మారొచ్చని తెలిపింది. -
2021లో జరిగిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఓకేఎక్స్ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది. 21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..! ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనువైన ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్‌ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్‌టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. 2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..! OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్కాయిన్లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్ఛేంజ్ తెలిపింది. స్టేబుల్‌కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది. ఓకేఎక్స్ఛేంజ్ టాప్-5లో ఒకటి..! స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ ఓకేఎక్స్ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయ్యాయి. చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..? -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
పెద్దనోట్ల రద్దుపై హార్వర్డ్ కీలక వ్యాఖ్యలు, మరి ఆర్బీఐ ఏమందంటే..!
పెద్దనోట్ల రద్దు నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016 నవంబర్ 8న అప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దు చేసిన ఆ రెండు పెద్దనోట్లను డిసెంబర్ 30వ తేదీలోపల ప్రజలు బ్యాంకుల్లో జమ చేసి రూ.2000,రూ.500కొత్త పెద్ద నోట్లను తీసుకోవచ్చని గడువు విధించారు. అయితే కేంద్రం ఈ నిర్ణయంపై తీసుకొని 5ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగిపోయాయి కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్ కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్ లలో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు జరిగి గడించిన రెండేళ్లైనా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేశారే తప్పా నగదు చెల్లింపులు జరపలేదని పేర్కొంది. నవంబర్ 8, 2016న డీమానిటైజేషన్ ప్రభావంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయని, అదే సమయంలో సాంప్రదాయ ట్రాన్సాక్షన్లు తగ్గాయని,డిజిటల్ లావాదేవీలు 2017 నుండి స్థాయిలు, వృద్ధి రేటులో సాంప్రదాయ లావాదేవీలను స్థిరంగా అధిగమించినట్లు తేలింది. ఆర్బీఐ నివేదిక ఇక,ఆర్బీఐ నివేదిక ప్రకారం..నోట్ల రద్దు దేశాన్ని తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చినట్లు తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2014-15 కంటే 14.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రేటు ప్రకారం, 2020-21 చివరి నాటికి చెలామణిలో ఉన్న నోట్లు రూ.32.62 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే, 2021 చివరి నాటికి ఇది చాలా తక్కువగా రూ.28.26 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా! -
బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో!
Buying Gold On PhonePe: కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. టీ బిల్లు దగ్గరి నుంచి ఇంటి రెంట్ వరకు అంతా యూపీఐ పేమెంట్స్‌లోనే చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు జోరు మీదున్నారు. ఆన్లైన్లో కొనేస్తున్నారు పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర ఆనవాయితీ. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్లైన్లో బంగారం కొనుగోలుకు ఓకే అనేస్తున్నారు. ఇటీవల ఫోన్ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్‌పే యాప్ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్‌పే యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 ఫోన్‌పేకు తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్‌ల కంటే ఫోన్‌పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. ఆన్లైన్ ట్రాన్స్క్షన్స్కి సంబంధించి యూనైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్ సేవలు అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో 42 శాతం తమ యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్‌పే ద్వారానే ట్రన్సాక్షన్స్ జరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్‌పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నాటక తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫోన్‌పే యాప్ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఫోన్ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైర్ టూ సిటీల్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి టైర్ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయి. అదే టైర్ 3 సిటీస్‌కి వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి రెంటు, హోటల్ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్ 3 సిటీస్‌లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతానికి పరిమితమయ్యాయి. అదే టైర్ 1 విషయానికి వస్తే ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు అయ్యింది. ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదు అయ్యాయి. పెరిగిన లావాదేవీలు ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో చేయడం మొదలైంది. అయితే 2020 మార్చిలో కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగింది. 2020 మార్చికి ముందు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో జరిగే ఆర్థిక లావాదేవీ విలువ ప్రతీరోజు సగటు 2 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 6 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్లలో రాని మార్పు కేవలం 18 నెలల్లోనే మూడింతలు అయ్యింది. చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే? -
చార్మీ దాదా ఎవరు?
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విచారణ 8 గంటలపాటు సాగింది. కెల్విన్‌తో చార్మీ, పూరీ జగన్నాథ్ తదితరులకు సంబంధం ఉన్న అంశాల పైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు తన ఆడిటర్ సతీష్, న్యాయవాది, సహాయకుడితో కలిసి చార్మీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని బృందం సాయంత్రం 6.30 గంటల వరకు చార్మీని ప్రశ్నించింది. అధికారులు కోరిన మేరకు తనతోపాటు తన సంస్థకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల వివరాలను చార్మీ ఈడీ బృందానికి అందించింది. తన సినిమాలకు ఈవెంట్ మేనేజర్‌గా.. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన డ్రగ్ కేసు ఆధారంగానే ఈడీ కేసు దర్యాప్తు సాగుతోంది. అప్పట్లో ఎక్సైజ్‌కు చెందిన సిట్ అధికారులూ చార్మీని ప్రశ్నించారు. నాటి వివరాలతోపాటు రెండు నెలల క్రితం ఈడీ విచారణలో కెల్విన్ చెప్పిన అంశాల ఆధారంగా చార్మీ విచారణ సాగింది. కెల్విన్ కాల్‌డేటాతోపాటు వాట్సాప్‌లో చార్మీ దాదా అనే పేరుతో కాల్స్, చాటింగ్స్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన ఆధారాలను సేకరించిన అధికారులు చార్మీ దాదా ఎవరంటూ ఆమెను ప్రశ్నించారు. 2015–17 మధ్య కెల్విన్ ఖాతాలోకి చార్మీ ఓ దఫా రూ.2 లక్షలు, తర్వాత మరికొన్నిసార్లు మరికొంత మొత్తాన్ని బదిలీ చేశారు. ఈ ఆర్థిక లావాదేవీలకు కారణాలేంటని అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ చార్మీ దాదా పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ తనదేనని అంగీకరించిన చార్మీ.. తన సినిమాలకు అతడు ఈవెంట్ మేనేజర్‌గా పని చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంప్రదింపులతోపాటు ఆర్థిక లావాదేవీలు జరిగాయని వివరించారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మనీల్యాండరింగ్ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈడీ అడిగిన కొన్ని అంశాలకు ఆమె తరఫున ఆడిటర్ సమాధానం ఇచ్చారని తెలిసింది. పూరీ చెప్పిన సమాచారం పైనా... ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి కూడా చార్మీని ఈడీ బృందం ప్రశ్నించింది. ప్రతి ప్రశ్నకూ కొన్ని అనుబంధ ప్రశ్నలు జోడిస్తూ చార్మీ విచారణ సాగింది. ఇప్పటికే చార్మీ బ్యాంకు స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్స్, బ్యాలెన్స్‌షీట్లను సేకరించిన ఈడీ అధికారులు చార్మీ చెప్పిన విషయాలతో వాటిని సరిచూడనున్నారు. అవసరమైతే ఆమెను మరోసారి విచారించే అవకాశం ఉంది. అడిగిన వివరాలన్నీ ఇచ్చా: మీడియాతో చార్మీ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, తదితరాలకు సంబంధించిన రికార్డులనూ సమర్పించా. మరోసారి విచారణకు రావాలని కోరితే తప్పకుండా వస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. రకుల్ విజ్ఞప్తి మేరకు.. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆమె ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో తాను ఆ రోజు హాజరుకాలేనని, తేదీ మార్చాలని రకుల్ గురువారం ఈడీ అధికారులకు లేఖ రాశారు. దీంతో నేడు (శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా రకుల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. -
డీసీబీ బ్యాంకులోనూ ఇకపై ప్రభుత్వ లావాదేవీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు (వ్యాపారం) ఆర్బీఐ నుంచి ఆమోదం లభించినట్టు డీసీబీ బ్యాంకు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వీలుగా డీసీబీ బ్యాంకును ఏజెన్సీ బ్యాంకుగా నియమించినట్టు తెలిపింది. ప్రైవేటురంగ బ్యాంకులనూ ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మే నెలలో నిర్ణయాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే డీసీబీ బ్యాంకుకు ఈ ఆమోదం లభించింది. -
అసైన్డ్‌కు ‘ధరణి’ చిక్కులు.. ఆప్షన్లు రాలేదా? మరి ఎలా?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు, దానం చేసేందుకు వీలు లేని నేపథ్యంలో ఆ మేరకు లావాదేవీలపై మాత్రమే నిషేధం విధించాల్సి ఉండగా ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు బంద్ అయ్యాయి. కనీసం అసైనీ చనిపోతే సదరు లబ్ధిదారుని వారసునికి ఆ భూమిపై హక్కులు బదిలీ చేసుకునేందుకు కూడా వీలు లేకుండాపోవడంతో రాష్ట్రంలోని పేద రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయితే, తమ చేతిలో ఏమీ లేదని, సీసీఎల్ఏ స్థాయిలో రావాల్సిన ఆప్షన్లు ఇంకా ఇవ్వలేదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. అన్నీ సమస్యలే.. వాస్తవానికి, రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు దాదాపు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ చట్టం కింద పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొన్ని కబ్జాలకు గురికాగా, రైతుల చేతిలో ఉన్న భూములకు కూడా లావాదేవీలు జరగక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి దాదాపు 30 శాతం లబ్ధిదారులకు పాస్‌పుస్తకాలు లేవని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. లబ్ధిదారుల పేర్లు ధరణి పోర్టల్‌లో నమోదయ్యాయి కానీ, పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ల డిజిటల్ సంతకాలకు అవకాశం లేకుండా పోయింది. పాస్‌పుస్తకాలు లేని కారణంగా పేద రైతాంగానికి ప్రభుత్వం అందజేసే రైతుబంధు రావడం లేదు. ఈ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి. అసైన్డ్ మార్టిగేజ్ ఆప్షన్ అందుబాటులోకి రాకపోవడంతో కోఆపరేటివ్ సొసైటీల్లో తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. వీటికితోడు రికార్డుల్లో తప్పుల సవరణ, మార్పులుచేర్పుల ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. క్రమబద్ధీకరణ ఎప్పుడో? అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం–1977 ప్రకారమే రాష్ట్రంలోని 6–7 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను అమ్ముకునే వీలుందని భూ చట్టాల నిపుణులు చెపుతున్నారు. ఈ చట్టంలోనే ఆరు రకాల మినహాయింపులు ఇచ్చారని, ఆ భూములను అమ్ముకునే వీలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై గతంలో ఆలోచన చేసింది. అసైన్డ్ భూముల్లో ఎంత మేరకు లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాలు థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? తదితర వివరాలను ఏడాది క్రితమే తెప్పించుకుంది. కానీ, క్రమబద్ధీకరణపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ, నిషేధిత చట్టం వర్తించని భూములను అమ్ముకునే అవకాశం కల్పించడంతోపాటు ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్ భూముల లావాదేవీలు గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. -
ప్రైవేటు బ్యాంకులకు సై
న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్బీఐకి అధికారాలు లభించినట్టు అయింది. -
ఎంఎస్ఎంఈ మార్ట్‌తో అంతర్జాతీయ లావాదేవీలు
సాక్షి, అమరావతి : సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్ఎంఈ) వ్యాపార సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్ఐసీ) అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ మార్ట్ (msmemart.com) ద్వారా గ్లోబల్ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చిన్న వ్యాపార వేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఎంఎస్ఎంఈ మార్ట్ పోర్టల్ గురించి అవగాహన కల్పించండంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులు ఏడాది పాటు ఈ పోర్టల్‌లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఏడాది పాటు ఉచితంగా సేవలు వినియోగించుకోవచ్చు. ఏడాది తర్వాత కొనసాగితే ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఇతర వ్యాపార సంస్థలకు 30 రోజులు ఉచిత సభ్యత్వాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉచిత సభ్యత్వం సమయంలో పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా ప్రయోజనం బాగుందని అనిపిస్తే ఏడాదికి రూ.7,080 (జీఎస్టీతో కలిపి) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ మార్ట్ అందించే సేవలు వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్, ఐఎల్వో వంటి అంతర్జాతీయ సంస్థలు టెండర్లలో పాల్గోనే అవకాశం కొనుగోలు/అమ్మకాలకు సంబంధించి ట్రేడ్ లీడ్స్ ఆన్లైన్లో 24 గంటలు ఉత్పత్తుల ప్రదర్శన ఆన్లైన్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్. అంతర్జాతీయ ట్రేడ్ షో వివరాలు, వాటి ప్రదర్శన పాత మిషనరీ కొనుగోలు, అమ్మకం యూనిట్ల మెర్జింగ్ అండ్ అక్విజేషన్స్ ఎప్పటికప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్, ధరల వివరాలు ఫ్రాంచైజీ, డిస్ట్రిబ్యూటర్‌షిప్ సొంతంగా వెబ్ డెవలప్మెంట్కు టూల్స్ కొటేషన్స్ (ఆసక్తి వ్యక్తీకరణ)లో పాల్గొనే అవకాశం ఎదుటి సంస్థల యాజమాన్యం గురించి తెలుసుకునే అవకాశం. -
ఏటీఎంలో 5వేలు మాత్రమే విత్‌డ్రా..!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది. (వడ్డీమీద వడ్డీనా..?) ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. అలాగే 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను 24శాతం పెంచాలని నివేదికలో పేర్కొంది. కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది. -
భారత్ నుంచి లావాదేవీలు చేస్తే జీఎస్టీ
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ కంపెనీ విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసి, వాటిని మరో దేశానికి విక్రయించిన సందర్భంలో .. భారత్‌కు రాకపోయినప్పటికీ (నేరుగా ఒక దేశం నుంచి మరో దేశానికి) ఆయా వస్తువులపై జీఎస్టీ చెల్లించాల్సిందేనని జీఎస్టీకి చెందిన ముందస్తు ఆదేశాల మండలి (ఏఏఆర్) గుజరాత్ బెంచ్ తీర్పునిచ్చింది. స్టెరిలైట్ టెక్నాల జీస్ దాఖలు చేసిన అప్లికేషన్ విషయంలో మండలి ఈ ఆదేశాలు వెలువరించింది. వర్తక వాణిజ్య లావాదేవీలపై (ఎంటీటీ/మన దేశానికి సంబంధించిన వ్యక్తి మధ్యవర్తిగా నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలు) జీఎస్టీ వర్తిస్తుందా అన్న విషయమై దరఖాస్తుదారు వివరణ కోరడం గమనార్హం. -
జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే పన్ను అంటూ బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మరోసారి వినియోగదారులకు, వ్యాపారులకు బంపర్ ఆఫర్ గెల్చుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలీస్తోంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) , వ్యాపారాల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భంగా తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద, రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితోపాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు. -
ఫోన్‌పేలో కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల సౌలభ్యం కోసం సరికొత్త వెసులు బాటునుకల్పించింది. తన ప్లాట్‌ఫాంలో లావాదేవీలను మరింత సులువుగా జరుపుకునేలా వినియోగదారులకు చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో చాట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ అనువర్తనం అవసరం లేకుండా డబ్బును అడగడం లేదా ధృవీకరణ కోసం చెల్లింపు రసీదును కూడా సెండ్ చేసుకోవచ్చు. ఫోన్‌పే చాట్ ద్వారా వినియోగదారులు, అవతలివారితో చాట్ చేస్తూ ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. అలాగే ఈ చాట్‌కు సంబంధించిన చాట్ హిస్టరీ కూడా ‘చాట్ ఫ్లో’ లో డిస్ ప్లే అవుతుంది. దీంతో ఆ తరువాత లావాదేవీ కూడా సులభం అవుతుంది. తమ చాట్ ఫీచర్ తమ కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన అనుభవంగా మారుతుందని ఫోన్‌పే అని సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే వారాల్లో ఫోన్‌పే చాట్‌ను గ్రూప్ చాట్ ఫీచర్‌తో మరింత మెరుగుపరుస్తామని చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌పే యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? యాప్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ నుంచి సంబంధిత కాంటాక్ట్ నెంబరును ఎంచుకోవాలి ఇక్కడ రెండు ఆప్లన్లు ఉంటాయి. 1. చాట్ 2. సెండ్ చాటింగ్ కోసం చాట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. నగదు పంపడానికి సెండ్ అనే ఆప్షన్ ఎంచుకొని, నగదును పంపొచ్చు. -
పన్ను వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్: మీరు సక్రమంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తున్నారా? మీ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో జమ చేస్తున్నారా? సమాజంలో పలుకుబడి, ప్రతిష్ట ఉన్న మీ పరపతి దెబ్బతినే విధంగా మీరు సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ పన్ను కట్టడం లేదంటూ నోటీసులు వస్తున్నాయా? సమన్లూ అందుతున్నాయా? అరెస్టు చేస్తామంటూ వారెంట్లు విడుదలవుతున్నాయా? ఈ వేధింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. పన్ను చెల్లింపు సక్రమంగా లేదంటూ డీలర్లపై ఎలాంటి విచారణ చేపట్టాలన్నా ఇక నుంచి మాన్యువల్‌గా చేస్తే ఒప్పుకోబోమని, ప్రతి డీలర్‌కు డాక్యుమెంటేషన్ ఐడింటిఫికేషన్ నెంబర్ (డీఐఎన్) ఇచ్చి ఆ నెంబర్ ద్వారా విచారణ ప్రక్రియకు సంబంధించిన లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులకు లేఖలు రాసింది. పరోక్ష పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు గాను సీజీఎస్టీ– 2017 చట్టంలోని సెక్షన్ 168 (1), కేంద్ర ఎక్సైజ్ చట్టం – 1944, సెక్షన్ (37), కస్టమ్స్ చట్టం – 1961లోని సెక్షన్ 151(ఏ)ల ప్రకారం డీఐఎన్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్టు ఈ లేఖలో పేర్కొంది. నంబర్ జనరేట్ చేసిన తర్వాతే జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ అయిన ప్రతి డీలర్‌కు ఈ చట్టం ప్రకారం డీఐఎన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈనంబర్‌ను కేవలం విచారణ ప్రక్రియకు మాత్రమే పరిమితం చేస్తున్నా, మరో నెలరోజుల వ్యవధిలో అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈ నెంబర్ ద్వారానే తెలియజేయాలని సీబీఐసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది కూడా. తాజాగా వచి్చన ఉత్తర్వుల ప్రకారం డీలర్ల నుంచి పన్ను వసూలు చేసేందుకుగాను సోదాలకు అనుమతివ్వడం, సమన్లు జారీ చేయడం, అరెస్టు మెమోలివ్వడం, తనిఖీ నోటీసులు పంపడం, విచారణ పేరుతో లేఖలు పంపడం లాంటివి ఈ నంబర్ ద్వారానే ఎల్రక్టానిక్ పద్ధతిలో జరపాల్సి ఉంటుంది. అలా చేయని ఎలాంటి లావాదేవీ అయినా చెల్లుబాటు కాదని రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. చాలా పరిమితమైన కేసుల్లో మాత్రమే మాన్యువల్ పద్ధతిలో విచారణ చేపట్టవచ్చని, ఇందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించిన 15 రోజుల్లోపు సంబంధిత ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఉన్నతాధికారులు అనుమతి ఇస్తున్న మాన్యువల్ ప్రక్రియను కూడా 15 రోజుల్లోగా కంప్యూటరైజేషన్ చేయాల్సిందే నని స్పష్టం చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో çపన్ను ఎగవేతదారుల నుంచి పన్ను వసూలు చేసే క్రమంలో ఇటు జీఎస్టీ, అటు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు జరిపే ప్రతి లావాదేవీ ఆన్లైన్లోనే జరగనుంది. దీంతో పన్ను వేధింపుల నుంచి తమకు ఊరట లభిస్తుందని రాష్ట్రంలోని కొందరు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూకి రక్షణ ‘ఈ విధానం ద్వారా ప్రభుత్వం నుంచి పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లెటర్ వచి్చనా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీని ప్రభుత్వం స్రూ్కటినీ చేస్తుంది. నోటీసులు లేదా ఇతర లేఖలు జారీ చేసే అధికార్లకు బాధ్యత ఉంటుంది. గతంలో ఈ విధానం లేకపోవడంతో అవినీతికి ఆస్కారం ఉండేది. అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కయి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు పన్ను ఎగవేతకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ రెవెన్యూకి ఈ విధానం రక్షణగా ఉంటుంది.’ సుదీర్ వి.ఎస్, చార్టర్డ్ అకౌంటెంట్, హీరెగంగే అండ్ అసోసియేట్స్ ప్రతి లావాదేవీ ట్రాక్.. ‘ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు జరిపే ప్రతి లావాదేవీ ట్రాక్ అవుతుంది. లావాదేవీల తారుమారుకు అవకాశముండదు. పన్ను వసూలులో ఇది మంచి సంస్కరణ. దీని ద్వారా అసలైన డీలర్ ఎవరనేది నిర్ధారణ అవుతుంది. పన్ను చెల్లింపు విధానంలో వేధింపులు తగ్గిపోతాయి.’ గడ్డం రామకృష్ణ, చార్టర్డ్ అకౌంటెంట్, ఎస్‌వీఆర్‌ఎల్ అసోసియేట్స్ -
పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు
ముంబై: బహుళ పన్నుల భారంతో మన క్యాపిటల్ మార్కెట్లు పోటీపడలేకపోతున్నాయని, పెట్టుబడుల రాకను పెంచేందుకు ప్రభుత్వం వీటిని తగ్గించాలని ఎన్ఎస్ఈ చీఫ్ విక్రమ్ లిమాయే కోరారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), మూలధన లాభాల పన్ను (సీజీటీ), స్టాంప్ డ్యూటీ చార్జీలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అన్నవి భారత్ వర్ధమాన మార్కెట్లతో పోడీపడే విషయంలో విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి ఆరేళ కనిష్ట స్థాయికి చేరి, మందగమనం ఎదుర్కొంటున్న తరుణంలో విక్రమ్ లిమాయే ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘పన్నుల నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం అన్నది మన మార్కెట్ల ఆకర్షణీయతను గణనీయంగా పెంచుతుంది. మరింత మంది పెట్టుబడులు పెట్టడం వల్ల లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది’’ అని ఎన్ఎస్ఈ 25 ఏళ్ల ప్రయాణం సందర్భంగా మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లిమాయే అన్నారు. అదే సమయంలో కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘‘భారత మార్కెట్ల పోటీ తత్వాన్ని పెంచేందుకు మొత్తం మీద లావాదేవీల వ్యయాలు (పన్నులు సహా), మార్జిన్లు, నిబంధనల అమలు వ్యయాలు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి, సెబీ చైర్మన్ అజయ్ త్యాగిలను కోరుతున్నాను. అంతర్జాతీయంగా భారత వెయిటేజీ పెరిగేందుకు ఇది సాయపడుతుంది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను మన మార్కెట్లు ఆకర్షించగలవు’’ అని లిమాయే ప్రకటన చేశారు. జన్‌ధన్ యోజన తరహా పథకం కావాలి... సామాన్యులూ షేర్లలో ట్రేడ్ చేసుకునేందుకు గాను డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన తరహా పథకం అవసరమని విక్రమ్ లిమాయే అన్నారు. అప్పుడు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ సాయంతో ఇన్వెస్టర్లు ఖాతాను తెరిచేందుకు వీలుంటుందన్నారు. త్వరలో మరిన్ని సంస్కరణలు ఉంటాయ్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై: ప్రజలు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టబోతోందని ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వం గతంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రయతి్నంచినప్పటికీ .. రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో కొన్ని సాధ్యపడలేదని పేర్కొన్నారు. దేశం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే, సంస్కరణల అమలుకు సంబంధించి ఈసారి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదని ఆమె స్పష్టం చేశారు. మందగమనం బాటలో ఉన్న ఆరి్థక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం.. భూ, కారి్మక చట్టాలు మొదలైన వాటికి సంబంధించి తక్షణమే సంస్కరణలు చేపట్టాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రూ.100 కోసం.. రూ.77 వేలు
సాక్షి, పట్నా: బిహార్ రాజధాని పట్నాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రెప్పపాటులో సొమ్మును పోగొట్టుకోవడం ఖాయం. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసి బ్యాంక్ లావాదేవీలు చేస్తే...సైబర్ నేరగాళ్ల బారిన పడక తప్పదు. పట్నాలోని ఒక ఇంజనీర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదునైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన వైనం ఒకటి చోటు చేసుకుంది. దీంతో కోల్పోయిన తన సొమ్ముకోసం బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు వివరాలు ఇలా వున్నాయి...సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విష్ణు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా ఫుడ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహార నాణ్యతపై సంతృప్తి చెందక దాన్ని తిరిగి పంపించేశాడు. ఇందుకు డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరగా..జొమాటో కస్టమర్ కేర్‌ను సంప్రదించమని. అందులోని మొదటి నంబరుకు ఫోన్ చేయమని డెలివరీ బాయ్ సలహా ఇచ్చాడు. దీంతో విష్ణు గూగుల్ సెర్చ్‌లోని "జొమాటో కస్టమర్ కేర్" అని వున్న నంబరుకు ఫోన్ చేశాడు. వెంటనే జోమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నంటూ ఒక వ్యక్తం కాల్ చేశాడు. రూ.100 రిఫండ్ చేయాలంటే 10 అదనంగా డిపాజిట్ చేయాల్సి వుంటుందంటూ ఒక లింక్‌ను పంపాడు. ఏ మాత్రం ఆలోచించని ఇంజనీర్ వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రూ.10 డిపాజిట్ చేశాడు. అంతే ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు బ్యాంక్ ఖాతాలోంచి సొమ్ము మొత్తం గల్లంతైంది. చూస్తూండగానే బహుళ లావాదేవీల ద్వారా 77 వేల రూపాయల మొత్తాన్ని అవతలి వ్యక్తి మాయంచేస్తోంటే.. విష్ణు అచేతనంగా మిగిలిపోయాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 10 జరిగింది. దీంతో లబోదిబోమంటూ విష్ణు తన సొమ్మును వెనక్కి తెచ్చుకునే పనిలో పడ్డాడు. -
కార్డుల్ని మించిన యూపీఐ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్.. డిస్కౌంట్లు, స్క్రా^Œ కార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 నాటికి 80 శాతం .. ఏడాది క్రితం పేమెంట్ గేట్వేస్ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్ మాథుర్ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్ పేమెంట్స్ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది. డిజిటల్‌దే అగ్రభాగం: ఆర్బీఐ తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019– 2021ను ఆర్బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి డిజిటల్ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుంది. -
ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టాలి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు ప్రలోభాలకు గురికాకుం డా నగ దు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టా లని జిల్లా కలె క్టర్ రామ్మో హన్ రావు ఆదా య పన్ను శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లో పది లక్షలకు పైన జరిగిన లావాదేవీలను ఐటీ శాఖకు ప్రతిరోజు అందజేస్తార ని తెలిపారు. అక్రమంగా తరలిస్తు న్న నగదును పసిగట్టేందుకు నిఘా పెటాలని, బస్టాండు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరమైన సందర్భంలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీఏడీ లక్ష్మన్బాబుకు సూచించారు. నోడల్ అధికారులతో సమీక్ష... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల దరఖాస్తులకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ నోడల్ అధికారులకు సూచించారు. తన చాంబర్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. వాహనాలు, సమావేశాలు, ర్యాలీ, హెలికాప్టర్ ల్యాండింగ్ తదితర అనుమతుల కోసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సువిధ వెబ్‌సైట్‌కు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి మాత్రమే జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన చేసి అనుమతి జారీ చేస్తారన్నారు. రవాణా, ఆర్అండ్బీ, పోలీసులు ఇతర సంబంధిత అధికారులు ఆర్ఓ కార్యాలయానికి లైజన్ అధికారులను నియమించాలన్నారు. ఈ అధికారులందరూ ఆర్ఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని, ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం బాధ్యతగా సత్వరమే నివేదికలు అందజేయడానికి కృషి చేయాలన్నారు. ఎన్నికలకు అవసరమైన ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను గుర్తించి సోమవారం వరకు నివేదిక అందజేయాలని ఆర్టీఓ వెంకటేశ్వర్ రెడ్డిని ఆదేశిం చారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు కలిసి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ సమకూర్చేందుకు టెండర్ పిలిచి తక్కువ ధరకు రేటు కోడ్ చేసిన వారిచే సరఫరా చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు సరఫరా చేసే సందర్భంలో వాహనాలను సిద్ధం చేయాలని మెటీరియల్ నోడల్ అధికారి చతుర్వేదికి సూచించారు. అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సాలూర, కందకుర్తిల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, అడిషనల్ డిప్యూటీ సీపీ శ్రీధర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
రూ. 100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఐటీ అధికారులు ఈనెల 12న హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో, కడపలో ఎంపీ రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన మీదట సీఎం రమేష్ డైరెక్టర్‌గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. గత ఆరేళ్లుగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎడ్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. అయితే రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎడ్కో స్టాంప్, సీల్ ఆయన వద్ద ఉన్నట్టు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఇక రూ. 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది. స్టీల్ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో వివరణ లేదని పేర్కొంది. ఢిల్లీ సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ర్టక్షన్స్కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు బ్యాంకుల నుంచి రుణంగా పొందిన రూ. 2.97 కోట్లను కంపెనీకి చెందిన కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలచే స్టీల్ కొనుగోళ్లకు సంబంధించి రూ 25 కోట్ల బిల్లులను అనుమానాస్పదమైనవిగా గుర్తించిన ఐటీ శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఇక రికార్డుల్లో చెల్లింపులుగా చూపిన రూ. 8.4 కోట్ల మొత్తానికి సరైన వివరణ ఇవ్వలేదని, రమేష్ నివాసం నుంచి రూ. 13 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీఎం రమేష్‌ను ప్రశ్నించగా, వీటిపై నన్ను అడగవద్దని, ఐటీ అధికారులనే అడగాలని బదులిచ్చారు. టీడీపీ నేతల బుకాయింపు రాజకీయ కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్‌పై ఐటీ దాడుల సందర్భంగా టీడీపీ నానా హంగామా చేసింది. సీఎం రమేష్ సైతం తనపై రాజకీయ కక్షతోనే దాడులు చేపట్టారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఐటీ శాఖకు రమేష్ ఇచ్చిన నోటీసుల ఫలితంగానే సోదాలు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సైతం ఆరోపించారు. గతంలో సుజనా చౌదరి ప్రస్తుతం సీఎం రమేష్‌లపై ఐటీ దాడులే ఇందుకు సంకేతమని చినబాబు అప్పట్లో ఆరోపించారు. -
తాత్కాలికంగా ఛార్జీలు ఎత్తివేసిన ఎస్బీఐ
తిరువనంతపురం : వరద బీభత్సంతో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రానికి, ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా ఆపన్న హస్తం అందించింది. ఆ రాష్ట్రంలో తాత్కాలికంగా అన్ని బ్యాంకింగ్ లావాదేవీల ఛార్జీలను, ఫీజులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వరద సహాయ చర్యల కోసం మంజూరు చేసే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులకు కూడా ఈ మాఫీ వర్తించనుంది. డూప్లికేట్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, ఈఎంఐ లావాదేవీలపై ఆలస్యపు పేమెంట్ ఫీజులను ఎస్బీఐ రద్దు చేసింది. రెమిటెన్స్‌లపై వచ్చే అన్ని ఛార్జీలను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి మరలించనున్నట్టు పేర్కొంది. దీనిలోనే ఇతర బ్యాంక్‌ల నుంచే వచ్చే ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ రెమిటెన్స్‌లు ఉండనున్నాయి. ఏమైనా ఛార్జీలను విధిస్తే వాటిని రీఫండ్ చేయనున్నట్టు ప్రకటించింది. సహాయ చర్యల్లో భాగంగా ఎవరైతే తమ వ్యక్తిగత డాక్యుమెంట్లను కోల్పోతారో, వారు కేవలం ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్రతోనే చిన్న అకౌంట్లను తెరిచేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏటీఎంలను, బ్రాంచ్‌లను వెంటనే తెరిచేలా చర్యలు చేపడతామని ఎస్బీఐ తెలిపింది. అంతేకాక కేరళలో వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఎస్బీఐ రూ.2 కోట్లను అందిస్తోంది. తన 2.7 లక్షల ఉద్యోగులు కూడా తమ వంతు సహాయ సహకారం అందించేందుకు ఎస్బీఐ ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి, సీఎండీఆర్ఎఫ్కు విరాళంగా ఇస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. -
నెట్ అక్కర్లేదు... సౌండ్‌తోనే నగదు చెల్లించొచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాజుల కాలంలో లావాదేవీలన్నీ వస్తు మార్పిడి విధానంలో జరిగేవి. అక్కడి నుంచి నగదుతో కొనుగోలు చేసే తరానికి చేరాం. టెక్నాలజీ వచ్చాక డిజిటల్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్ చేసేస్తున్నాం. కానీ, ఇకపై ఇవేవీ అక్కర్లేదు జస్ట్.. ధ్వని తరంగాలతో లావాదేవీలు చేసేయొచ్చు. దేశంలో తొలిసారిగా సౌండ్ వేవ్స్‌తో వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది టోన్‌ట్యాగ్. బెంగళూరులో ఆరంభమైన టోన్‌ట్యాగ్ వివరాలు, సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ కో–ఫౌండర్ వివేక్ కుమార్ సింగ్ ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘నఫ్ఫ ఇన్నోవేషన్ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన యాప్ పేరే టోన్‌ట్యాగ్. నేను, కుమార్ అభిషేక్ కలిసి రూ.25 లక్షల పెట్టుబడితో 2013లో బెంగళూరు కేంద్రంగా దీన్ని ఆరంభించాం. టోన్‌ట్యాగ్ ద్వారా లావాదేవీలు జరపాలంటే వర్తకుడి వద్ద టోన్‌ట్యాగ్ అభివృద్ధి చేసిన రిటైల్ పీవోడీ పరికరం ఉండాలి. ఒకవేళ అప్పటికే వర్తకుడి దగ్గర పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), ఎలక్ట్రానిక్ డాటా క్యాప్చర్ (ఈడీసీ) మిషన్లుంటే వాటిలో మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్(ఎస్డీకే) టెక్నాలజీని ఇన్స్టాల్ చేస్తాం. ఇక లావాదేవీలు జరిపే కస్టమర్‌కు మొబైల్ బ్యాంకింగ్, వ్యాలెట్, పేమెంట్ యాప్స్ ఉండాలి. ఎప్పుడైతే కస్టమర్ తన ఫోన్‌ను టోన్‌ట్యాగ్ డివైజ్ దగ్గర పెడతాడో.. వెంటనే పరికరంలోని ఎస్డీకే ఆల్గరిథం డాటాను ధ్వని తరంగాల రూపంలో మార్చేస్తుంది. వెంటనే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటోమెటిక్‌గా కస్టమర్ ఫోన్లో టోన్‌ట్యాగ్ యాప్ నుంచి పేమెంట్ అప్షన్స్ ఓపెన్ అవుతాయి. పిన్ నంబర్, చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేసి ఎంటర్ చేస్తే చాలు 3 సెకన్లలో లావాదేవీ పూర్తవుతుంది. అంతే! మరి, సురక్షితమేనా? టోన్‌ట్యాగ్ యాప్‌ను స్పీకర్ ఉన్న ఎలాంటి ఫోన్లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కస్టమర్లు టోన్‌ట్యాగ్ యాప్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మీద ఉండే 11 అంకెల నంబర్‌ను, పేరు, సీవీవీ నంబర్లను నమోదు చేయాలి. ఈ వివరాలన్నీ ఫోన్లో కాకుండా టోన్‌ట్యాగ్ సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా టోన్‌ట్యాగ్ యాప్ ద్వారా లావాదేవీలు జరపలేరు. ఎందుకంటే యాప్‌లోకి ఎంటర్ కావాలంటే పిన్ నంబరు కావాలి! ఎస్డీకే టెక్నాలజీని ఇన్స్టాల్ చేసిన ఏటీఎంలల్లో నుంచి డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు. 10 లక్షల మంది వర్తకులు.. ప్రస్తుతం దేశంలో 10 లక్షల మంది వర్తకులు టోన్‌ట్యాగ్ కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 2.9 లక్షల మంది దగ్గర పేమెంట్ అకౌంట్ డివైజ్ (పీఏడీ) ఉంది. ప్రస్తుతం నెలకు 5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. రూ.50–200 వరకు లావాదేవీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి లావాదేవీ మీద పేమెంట్ కంపెనీ నుంచి 1.5 శాతం ఫీజు రూపంలో తీసుకుంటాం. ఇదే మా ఆదాయ మార్గం. ఈ ఏడాది ముగింపు నాటికి నెలకు 15 లక్షల లావాదేవీలకు చేరాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు టోన్‌ట్యాగ్ టెక్నాలజీపై 7 పేటెంట్లకు దరఖాస్తు చేసుకున్నాం. 18 పేమెంట్ సంస్థలతో ఒప్పందం.. మాస్టర్ కార్డ్, ఫినాకిల్, ఫస్ట్ డేటా, ఎయిర్టెల్ మనీ, ఫ్రీచార్జ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి 18 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో రెండు పేమెంట్ బ్యాంక్‌లతో, వ్యాలెట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నాం. చర్చలు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సింగపూర్, అమెరికా దేశాలకు విస్తరిస్తాం. ఈ ఏడాది మరిన్ని నిధుల సమీకరణ.. ప్రస్తుతం సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో రూ.16 కోట్లను సమీకరించాం. ఇందులో రూ.8 కోట్లు ట్రోపికాల్ స్టార్, రూ.6 కోట్లు రిలయెన్స్ వెంచర్ అసెట్స్ మేనేజ్మెంట్ల నుంచి సమీకరించాం. మిగిలినవి నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీ అరుణ్ సేత్, టీవీ మోహన్‌దాస్ పాయ్, అనంద్ చంద్రశేఖరన్, దీపక్ గైసాస్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రౌండ్ నిధుల సమీకరణ చేస్తాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్త వాళ్లతో సంప్రతింపులు ప్రారంభించాం. ఈ ఏడాది ముగింపులోగా డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని వివేక్ వివరించారు. -
ఉద్యోగాలే కాదు... స్థలాల్లోనూ కోతే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ఉద్యోగులను తొలగించటం మాత్రమే కాకుండా... స్థలాల విషయంలోనూ కోతలు విధించాయి. 2017లో దేశంలోని మొత్తం కార్యాలయాల లావాదేవీల్లో ఐటీ రంగం వాటా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2016లో మొత్తం క్రయవిక్రయాలు జరిగిన కార్యాలయ స్థలాల్లో ఐటీ రంగం వాటా 49 శాతం కాగా... 2017లో ఇది 32 శాతానికి పడిపోయినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలియజేసింది. ‘భారతదేశం: కార్యాలయాల స్థల లావాదేవీలు’ పేరిట కంపెనీ విడుదల చేసిన నివేదికలో పలు కీలకాంశాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... 2016లో 2 శాతంగా ఉన్న కో–వర్కింగ్ స్పేస్ (బిజినెస్ సెంటర్స్) రంగం అనూహ్యంగా 2017లో 6 శాతానికి పెరిగింది. 2017లో ఈ రంగం మొత్తం 2.6 మిలియన్ చ.అ. స్థలాన్ని ఆక్రమించింది. బీఎఫ్ఎస్ఐ రంగం 13 శాతం నుంచి 19 శాతానికి, ఇంజనీరింగ్ అండ్ తయారీ రంగం 14 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. కొత్త ఆఫీస్ స్పేస్ 18 శాతం డౌన్.. దేశంలో ఆఫీసు స్థలాల లావాదేవీలు వరుసగా మూడో ఏడాది 40 మిలియన్ చ.అ.లను దాటాయి. 2017లో మొత్తం 42 మిలియన్ల చ.అ. లావాదేవీలు జరగ్గా.. ఇందులో 50 శాతం వాటాను బెంగళూరు, ఢిల్లీ– ఎన్సీఆర్ నగరాలే ఆక్రమించేశాయి. అయితే కొత్త కార్యాలయాల సప్లయి మాత్రం 2016తో పోలిస్తే 18 శాతం తగ్గి 29 మిలియన్ చ.అ.లకు చేరింది. 2017లో జరిగిన మొత్తం లావాదేవీల్లో 50 వేల చ.అ.ల కంటే తక్కువ లావాదేవీలే 90 శాతం వాటాను ఆక్రమించాయి. -
6 నెలల్లో రూ. 120 కోట్ల పసిడి లావాదేవీలు
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం తమ ప్లాట్‌ఫామ్‌పై గడిచిన ఆరు నెలల్లో రూ.120 కోట్ల విలువ చేసే పసిడి విక్రయ లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించింది. ధంతెరాస్ రోజున పసిడి అమ్మకాలు ఏకంగా 12 శాతం పెరగ్గా, కొనుగోలుదారుల సంఖ్య పది లక్షల స్థాయి దాటిందని తెలిపింది. ‘పేటీఎం గోల్డ్ అమ్మకాల్లో దాదాపు 60 శాతం.. చిన్న పట్టణాల నుంచే నమోదయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో గరిష్టంగా డిమాండ్ కనిపించింది‘ అని వివరించింది. కస్టమర్లలో చాలా మంది సగటున రూ.500 విలువ చేసే పసిడి కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 70 శాతం మంది కస్టమర్లు మిలీనియల్సే (1982– 2004 మధ్య పుట్టినవారు) ఉన్నారని, కస్టమర్లు దీర్ఘకాలిక పొదుపు కోసం పేటీఎం గోల్డ్‌ను ఎంచుకుంటున్నారనడానికి ఇది నిదర్శనమని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా చెప్పారు. ఎంఎంటీసీ –పీఏఎంపీతో చేతులు కలిపిన పేటీఎం ఆరు నెలల క్రితం తమ ప్లాట్‌ఫాంపై ఆన్లైన్లో పసిడి విక్రయాలు ప్రారంభించింది. దీని ద్వారా కొనుగోలు చేసిన 24 క్యారట్స్ బంగారాన్ని కస్టమర్లు ఎంఎంటీసీ–పీఏఎంపీ లాకర్స్‌లో ఎలాంటి అదనపు చార్జి లేకుండా భద్రపర్చుకోవచ్చు. కావాలనుకుంటే నాణేల రూపంలో ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా ఆన్లైన్లోనే మార్కెట్ ఆధారిత ధరకు మళ్లీ ఎంఎంటీసీ–పీఏఎంపీకే విక్రయించవచ్చు. -
‘జీరో’ ఖాతాల్లో భారీ డిపాజిట్లు
న్యూఢిల్లీ: నల్లధన చలామణికి వీలు కల్పించాయని భావిస్తున్న షెల్ కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారం అందింది. 5.800 షెల్ కంపెనీల జీరో బ్యాలన్స్ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రూ.4,574 కోట్ల వరకూ నగదు జమయిందని, ఆ తరవాత అందులో రూ.4.552 కోట్ల మేర విత్‌డ్రా చేసుకోవడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది. 2,09,032 అనుమానిత కంపెనీలకు సంబంధించి లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటి ఖాతాల్లో నగదు జమలపై 13 బ్యాంకులు కీలకమైన సమాచారాన్ని అందించాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏడాది ఆరంభంలో కంపెనీల రిజిస్ట్రార్ గుర్తింపును కోల్పోయినవే. ఈ తరహా కంపెనీల బ్యాంకు లావాదేవీలపై గత నెలలో కేంద్రం ఆంక్షలు కూడా విధించింది. కాగా, బ్యాంకులు అందించిన సమాచారం ప్రకారం... ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలను కలిగి ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీలకు 900 ఖాతాలు, కొన్నిటికి 300 ఖాతాలు కూడా ఉన్నాయి. గతేడాది పెద్ద నోట్ల రద్దు నాటికి (2016 నవంబర్ 8) ఈ కంపెనీల ఖాతాల్లో (రుణ ఖాతాల మినహా) రూ.22.05 కోట్ల బ్యాలన్స్ ఉంది. నవంబర్ 9న డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నుంచి ఈ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే నాటికి వీటి ఖాతాల్లో రూ.4,573.87 కోట్ల మేర నగదు డిపాజిట్లు అయింది. ఇందులో రూ.4,552 కోట్లను విత్ డ్రా చేసుకున్నారు’’ అని కేంద్రం తన ప్రకటనలో వివరించింది. -
కార్డు లావాదేవీల్లో పెరుగుదల 7 శాతమే
న్యూఢిల్లీ: గతేడాది పెద్ద నోట్ల రద్దు అనంతరం మొత్తం మీద డిజిటల్ లావాదేవీలు 23% పెరగ్గా, అందులో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల పెరుగుదల 7%గానే ఉంది. ఈ మేరకు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానల్‌కు వివరాలు తెలిపారు. దీని ప్రకారం గతేడాది నవంబర్‌లో అన్నిరకాల డిజిటల్ లావాదేవీలు 22.4 మిలియన్లుగా ఉండగా, 23% వృద్ధితో ఈ ఏడాది మే నెల నాటికి 27.5 మిలియన్లకు చేరాయి. యూపీఐ ఆధారిత లావాదేవీల్లో ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఐఎంపీఎస్ లావాదేవీలు 1.2 మిలియన్ల నుంచి 2.2 మిలియన్లకు చేరాయి. అతి తక్కువ వృద్ధి మాత్రం కార్డులదే. 6.8 మిలియన్ల నుంచి 7.3 మిలియన్లకు పెరిగాయి. -
ఉబెర్ చెల్లింపులకు యూపీఐ యాప్
బెంగళూరు: ఆన్లైన్ మాధ్యమంలో చెల్లింపులను సులభతరం చేసే ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీని ద్వారా నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే సంస్థల జాబితాలో తాజాగా ట్యాక్సీ సర్వీసుల కంపెనీ ఉబెర్, ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరనున్నాయి. ఇవి రెండూ కూడా తమ లావాదేవీలకు యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌ను వినియోగించడం ఈ నెల నుంచే ప్రారంభించనున్నాయి. అటు సెర్చి దిగ్గజం గూగుల్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే తమ సేవలకు సంబంధించి యూపీఏ పేమెంట్ సర్వీసుల విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం పూర్తి చేసింది. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ ఏపీ హోతా ఈ విషయాలు తెలిపారు. ‘వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ మొదలైన కంపెనీలు కూడా యూపీఐ విధానాన్ని ఉపయోగించే క్రమంలో ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇవి సాకారం కాగలవు. ఇప్పటికే టెస్టింగ్ మొదలైనవి పూర్తి చేసుకున్న గూగుల్ .. మిగతా వాటన్నింటికన్నా ముందుగా దీన్ని అందుబాటులోకి తేవొచ్చు‘ అని ఆయన వివరించారు. -
ఏటీఎం, బ్యాంకింగ్ సేవలపై బాదుడు షురూ
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నుల ప్రభావం ఏటీఏం, బ్యాంకింగ్ సేవలపై భారీగా పడనుంది. కేవలం వివిధ వ్యాపార పరిశ్రమలపైనే కాకుండా ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రభావితం చేయనుంది. ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్లను (ఎటిఎంలు) ఏర్పాటు చేయడం ఇక ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ముఖ్యంగా జీఎస్టీ పన్ను పరిధిలో ఏటీఎం కేంద్రాలపై పన్ను రేటు గరిష్టంగా 28శాతం నిర్ణయించడంతో ఈ సేవలు ఇకపై ప్రియం కానున్నాయి. దీంతో చిన్నబ్యాంకులు, కొత్తగా ఏర్పాటైన పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలపై భారీగా పడనుంది. ముఖ్యంగా ఆర్థిక సేవలపై విధించిన పన్ను పోటుతో వినియోగదారులపై మరింత భారం పెరిగింది. ఆర్థిక సేవల్లో భాగంగా ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియం, నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. ఏటీఎం ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు , చెక్ బుక్ జారీ సహా ఇతర బ్యాంకింగ్ సేవలు కొత్త పన్ను పాలన కింద రానున్నాయి. దీని ప్రకారం బ్యాంకింగ్ లావాదేవీలపై 15 శాతానికి బదులుగా 18 శాతం సర్వీస్ టాక్స్ వసూలు చేస్తారు. ఈ పన్నుల స్లాబ్‌లలో మార్పుల ప్రకారం నిర్ణీత లావాదేవీలు ముగిసిన తరువాత రూ.100ల ప్రతి బ్యాంకింగ్ లావాదేవికి, ప్రతి కస్టమర్ రూ.3 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగదు డిపాజిట్, ఏటీఏం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియంలు, ఈఎంఏ చెల్లింపులపై 15 శాతం సేవా పన్నును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ లాంచింగ్‌కుముందు కౌన్సిల్ తో టాప్ బ్యాంక్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్ పర్సన్ అరుధంతి భట్టాచార్య మాట్లాడుతూ సర్వీస్ టాక్స్ తో కలిపి జీఎస్టీ వసూలు చేయాలని చెప్పారు. తత్ఫలితంగా ప్రస్తుత సర్వీసు రేటు 15 శాతం 18 శాతానికి చేరుతుందని వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్ సహా వివిధ బ్యాంకులు చార్జీల విధింపుపై వారి కస్టమర్లకు ఎస్ఎంఎస్ సమాచారాన్ని కూడా అందిస్తుండడం గమనార్హం. -
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు – 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు – ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసినా బాదుడే – నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత – ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్ సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్ కార్డుల బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు. ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్ కౌంటర్లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ఏటీఎం.. ఎనీ టైం నో మనీ... వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. సర్వీస్ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే.. పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. – రత్నాకర్, శ్రీ కంప్యూటర్ వరల్డ్, రాజమహేంద్రవరం. సేవలకు సర్వీస్ చార్జీలు తప్పనిసరి పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. – సుబ్రమణ్యం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, కాకినాడ. -
రేషన్ దుకాణాల్లో నగదు రహితం తప్పనిసరికాదు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి కాకినాడ సిటీ: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు తప్పని సరికాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ప్రత్తిపాటి ముఖ్య అతిథిగాను, రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళిశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంత్రులకు స్వాగతం పలికి, పౌరసరఫరా కార్యక్రమాలు, రైతులకు మద్దతు ధర కల్పన, దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ తదితర అంశాలు జిల్లాలో అమలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రజల ఇష్టం మేరకే నిర్వహించాలని, బలవతం చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా లాటరీ ద్వారా ఒకరికి రూ.లక్ష బహుమతి, రూ.5 వేలు విలువైన స్మార్ట్ఫోన్లు బహుమతిగా అందజేస్తున్నామని, ఆసక్తి కలిగిన వారందరూ నగదు రహిత లావాదేవీల్లో పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి కృషి... రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళి శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేతివృత్తుల వారికి అధునాతన పనిముట్లుపై శిక్షణ కల్పించి, వాటిని పంపిణీ చేస్తామన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. ఆహార సలహా కమిటీల ఏర్పాటు... ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ కోసం అన్ని స్థాయిల్లోని ఆహార సలహా కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలను తరచుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ లేదని, సన్నబియ్యం కేజీ రూ.50కి అమ్మతున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి
కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు చెల్లని రూ.500, రూ.1,000 నోట్లతో నిర్వహించిన లావాదేవీలు వివరాలు, ఆ సమయంలో ఎన్ని నోట్లు ఉన్నాయన్నది కంపెనీలు తమ వార్షిక బ్యాలన్స్ షీట్లలో వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అలాగే, ఆ కాలంలో చెల్లని నోట్లతో జరిపిన లావాదేవీల వివరాలను కంపెనీలు సరిగ్గానే వెల్లడించాయని ఆడిటర్లు తమ నివేదికల్లో పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
అలజడి
- నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి - అంతకు మించితే నగదు రహితమే.. - కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై వాణిజ్య వర్గాల ఆందోళన - చిరు వ్యాపారాలకు నష్టమేనని ఆవేదన - నేడు వర్తక నేతల సమావేశం సాక్షి, రాజమహేంద్రవరం : అమ్మకందార్లను, కొనుగోలుదార్లను పన్ను పరిధిలోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై రూ.3 లక్షల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. దీనిని తాజాగా రూ.2 లక్షలకు కుదించింది. దీనిపై వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వ్యాపార సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో.. సోమవారం రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన దాదాపు 70 వర్తక సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం, దాని అమలులో వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులు, చిరువ్యాపారులు ఎంతమేర నష్టపోతారన్న అంశాలపై చర్చించనున్నారు. జిల్లాలో దాదాపు 15వేల మంది వ్యాపారులు అమ్మకం పన్ను పరిధిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారి పన్ను స్లాబ్ మారనుంది. రూ.2 లక్షలు దాటిన లావాదేవీలు నగదు రహితంగా చేయాలన్న నిబంధనతో అమ్మకంపై తప్పనిసరిగా పన్ను చెల్లిచాల్సి వస్తుంది. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గ్రామాలు, పట్టణాల్లో కిరాణా, ఇతర వ్యాపారాలు చేస్తున్నవారు అరకొర ఆదాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరందరూ పన్ను పరిధిలోకి రానున్నారు. అలాగే ఏడాదిలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నగదు లావాదేవీలు ఏదైనా ఒక సందర్భంలో రూ.2 లక్షలు దాటితే, అధికారులు లెక్కల్లో అది తేలితే, అమ్మకందారుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారన్న ఆందోళన వర్తక వర్గాల్లో నెలకొంది. చిరు వ్యాపారులు దెబ్బతింటారు కేంద్రం నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు దెబ్బతింటారు. చిరు వ్యాపారుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుంది. రోజుకు నాలుగైదొందలు సంపాదన వచ్చేవారు ప్రతి రోజూ దాదాపు రూ.5 వేల వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఏడాదికి నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి విధించడంవల్ల చిరు వర్తకులు వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. - బూర్లగడ్డ సుబ్బారాయుడు, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, రాజమండ్రి అమలులో అనేక ఇబ్బందులుంటాయి గ్రామీణ రైతులు లేదా ఇతరులు ఏదైనా శుభకార్యాన్ని పురస్కరించుకుని బంగారం కొంటారు. ఇది రూ.2 లక్షలకు మించి ఉంటుంది. ఆ సమయంలో నగదు కాకుండా చెక్కు, డీడీ ఇవ్వాలని అడిగితే వారికి ఆ సదుపాయం ఉండదు. బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నా నగదు లావాదేవీల పరిమితితో సాధ్యం కాదు. ఇది ఇబ్బందికరమే. - కడియాల శ్రీనివాస్, అధ్యక్షుడు, సువర్ణ వర్తక సంఘం, రాజమహేంద్రవరం -
నగదు రహిత లావాదేవీలు జరగాలి
అనంతపురం అర్బన్ : జిల్లాలో నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావా దేవీలు జరిపేందుకు పెం డింగ్‌లో ఉన్న 200 డీలర్ల ఖాతాలను వెంటనే మ్యాపింగ్ చేయా లన్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల అభ్యర్థన మేరకు ఈ–పాస్ యం త్రాల ను ఎస్బీఐ సరఫరా చేయా లన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత బ్యాంకులు ఒక కరెంట్ ఖాతాను ప్రారంభించాన్నారు. వినతులు పరిష్కరించకుంటే చర్యలు అనంతపురం అర్బన్ : ‘ప్రజలు తమ సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని నమ్మ కంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీలిస్తుంటారు..వాటిని గడువుదాటినా పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ బి.లక్షీ్మకాంతం హెచ్చరించారు. మంగâýæవారం ఆయన తన చాంబర్లో ‘మీ కోసం’ పెండింగ్ అర్జీలపై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా పౌర సరఫరాల శాఖలో 6,764 అర్జీలు, గనులు భూగర్భ శాఖకు సంబంధించి 1,549, పరిశ్రమల శాఖలో 1,549, వ్యవసాయ శాఖలో 1,065, విద్యుత్ శాఖలో 1,430, మునిసిపల్ అడ్మినిస్ట్రేష¯ŒSలో 1,139 అర్జీలు గడువు దాటినా పరిష్కారం కాలేదన్నారు. -
‘భీమ్’తో రూ.361 కోట్ల లావాదేవీలు
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భీమ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు రూ.361 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ⇔ ఉద్యోగుల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించడం లేదా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేయడానికి వీలు కల్పించే వేతనాల చెల్లింపు(సవరణ) బిల్లు–2017కు పార్లమెంట్లో ఆమోదం లభించింది. ⇔ వ్యాధులను నయంచేయడంలో పంచగవ్య (ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో తయారయ్యే మిశ్రమం) పాత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ⇔ దిగుబడి నష్టం, తెగుళ్ల దాడులు, ధరల పతనంతో ఆదాయంలో తగ్గుదల నుంచి రైతులను ఆదుకునేందుకు తోట పంటలకు ఆదాయ బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే...
అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నల్లధనం కట్టడికి దేశంలో ప్రతి లావాదేవీ బ్యాంకు ద్వారానే జరగాలని అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ అన్నారు. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఆహ్వానం మేరకు హైదరాబాద్ విచ్చేసిన ఆయన ఆదివారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. బ్యాంకు ద్వారా మాత్రమే లావాదేవీలు పూర్తి అయితే ట్రాక్ చేయడానికి వీలవుతుందని చెప్పారు. బ్యాంకింగు వ్యవస్థలోకి డిపాజిట్లు రావడంతో ద్రవ్య సరఫరా పెరిగి ఎకానమీ గాడిన పడుతుందని తెలిపారు. ‘లెక్కచూపని నగదు లావాదేవీలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పారదర్శకంగా ఉండే బ్యాంకు లావాదేవీలే ఇందుకు పరి ష్కారం. దేశంలో కస్టమ్స్ సుంకాలు మినహా మిగిలిన అన్ని పన్నులను రద్దు చేయాలి. బ్యాంకు వద్ద మా త్రమే పన్ను వసూలవ్వాలి. సొమ్ము స్వీకర్త మాత్రమే పన్ను చెల్లించాలి. రూ.100, ఆపైన ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేయాల్సిందే. చిన్న నోట్లు అంటే రూ.50 వరకు మాత్రమే సరఫరాలో ఉండాలి. పన్నులు లేని, తక్కువ నగదు లావాదేవీలు జరిగే ఎకానమీ ఉండాలని ప్రధానికి అర్థక్రాంతి సంస్థాన్ ప్రతిపాదించింది. మా ప్రతిపాదనలు అమలైతే జీఎస్టీ అవసరమే లేదు’ అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ’ కార్డులు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత లావాదేవీల్లో భాగంగా ‘ఇ–మనీ ఈజ్‌మై మనీ’ కార్డులను అందచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం నగదురహిత లావాదేవీలపై పెట్రోల్, గ్యాస్ కంపెనీల డీలర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగదురహిత లావాదేవీల్లో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. జిల్లాలో 18 ఏళ్లు నిండి బ్యాంక్ ఖాతా లేని వారికి ఖాతాలు ప్రారంభింపచేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ ఈజ్‌మై మనీ’ కార్డులను అందిస్తామన్నారు. ఈ కార్డులో వ్యక్తి పేరు, ఎంఎంఐడీ, మొబైల్ నెంబర్, వర్చ్యువల్ ఐడీ, క్యూఆర్ కోడ్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఉంటాయన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా, ఇంటర్నేట్ లేకపోయినా కార్డును ఉపయోగించి ఎంఎంఐడీ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలను భద్రతతో నిర్వహించుకోవచ్చన్నారు. టెక్నాలజీ వినియోగం ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్నా భవిష్యత్‌లో సులభంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ యాసిస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిక్నెట్ సైంటిస్ట్ శర్మ, భారత పెట్రోలియం సేల్స్ అధికారి ప్రవీణ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ అధికారి దుర్గాప్రసాద్, గ్యాస్, పెట్రోలు డీలర్లు పాల్గొన్నారు. -
మొరాయించిన ఇంటర్నెట్
సంగెం : స్థానిక ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం ఇంటర్నెట్ సమస్య ఏర్పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం ఇం టర్నెట్ నిలిచిపోగా ఉద్యోగులు హన్మకొండ వెళ్లి తమ లావాదేవీలు ముగించుకున్నారు. అయితే, శుక్రవారం బ్యాంకు తెరిచాక కూడా ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఉద్యోగులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నెట్ పనిచేయడంతో వినియోదారులకు డబ్బు అందజేశారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
పేటిఎం వాడకం తెలీక రైతుల ఇబ్బందులు
-
ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు సమాచారం అందించింది. 2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో ఎక్కువ మంది ప్రజల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
నగదు రహిత లావాదేవీల విస్తృతికి చర్యలు
1,976 స్వైపింగ్ మెషీన్ల జారీ జేసీ సత్యనారాయణ కొత్తపేట :పెద్ధ నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రమేపీ నగదు రహిత లావాదేవీలు శాతం పెంచేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వైపింగ్ మెషీన్లు వాడకంలోకి తెస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో అందరూ మొబైల్ బ్యాంకింగ్, స్వైపింగ్ మెషీన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగించేలా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో స్వైపింగ్ మెషీన్లకు 8,785 దరఖాస్తులు రాగా సుమారు 6,500 ఆన్లైన్లో ఉన్నాయన్నారు.1,976 మెషీన్లు జారీ చేశామన్నారు.అలాగే 44,437 యాప్స్ డౌన్లోడ్ చేయగా 1,642 ఓకే చేశామన్నారు. దీనిపై 8,618 మందికి అవగాహన కల్పించామని తెలిపారు.7,54,304 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు జన్‌ధన్ ఖాతాదారులు కాగా వారిలో 3,23,673 మందికి, సుమారు 4,60,000 మంది ఉపాధి హామీ కూలీలలో 1,22,085 మందికి రూపే కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. మిగిలిన వారికీ దశలవారీగా జారీ చేస్తామన్నారు.ఈ నెల సామాజిక పింఛను పథకం కింద ఎస్బీఐ ద్వారా సుమారు రూ.67 లక్షలు, ఆంధ్రాబ్యాంక్ ద్వారా సుమారు రూ.24 లక్షలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జేసీ వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, స్థానిక తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఆర్ఐ ఎంటీఆర్ ప్రసాద్ తదితరులున్నారు. -
సంక్షోభ నివారణకే నగదు రహితం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ’సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కరెన్సీని పూర్తిగా రద్దు చేయలేదని, ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను అధిగమించేందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు ఉంచడం, చిన్ననోట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏటీఎంల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం ఉందని, బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు ఉపసంహరణ పరిమితి నిర్దేశించినప్పటికీ సక్రమంగా అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు. దీనివల్ల ధరల స్థిరీకరణకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ–బ్యాంకింగ్ అందుబాటులోకి రావడం ద్వారా లావాదేవీలు మరింత సులభతరమవుతాయని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బినామీలు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధారాణి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కేఎస్వీ సత్యన్నారాయణ, ఎంపీడీవో ఎ.రాము, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మ¯ŒS పరిమి హరిచరణ్, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, స్పెషల్ గ్రేడ్ ఏఎంసీ కార్యదర్శి ఏఆర్కే ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS దుద్దుపూడి రాజారమేష్, మున్సిపల్ టీపీవో పి స్వరూపారాణి, అసిస్టెంట్ ఏసీటీవో ఎంఎస్ ప్రకాశరావు, ఏపీఎం ఇ.మహాలక్ష్మి, సీడీపీవో వైబీటీ సుందరి, ఈవోపీఆర్డీ కె. జా¯ŒSలింకన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధి వీరభద్రస్వామి(భద్రం), సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడు పులపా సత్యన్నారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు చిలంకుర్తి వెంకట సుబ్బారావు(బాబి), రైస్ అండ్ కిరాణా మర్చంట్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు), సీఐటీయూ నాయకులు ఎంఎం సుందరబాబు, దగ్గు రాధాకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మ¯ŒS మట్టే నారాయణమూర్తి, పాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా..
విద్యార్థులకు అవగాహన కల్పించనున్న విద్యాశాఖ ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఆదేశాలు రాయవరం : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలో మేలనే రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం జిల్లాలోని అన్ని మండల విద్యాశాకాధికారి కార్యాలయాలకు సోమవారం పీవో ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయమై అవగాహన కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులకు గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీల విషయంలో చైతన్యపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకిగ్ ఏ విధంగా చేయాలి? స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించే పద్ధతులను విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగదురహిత లావాదేవీలను పెంచితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆయన తెలిపారు. అందరు ప్రధానోపాధ్యాయులు/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ఎంఈవో/కేజీబీవీ అధికారులు నగదు లావాదేవీలు కాకుండా, అన్ని చెల్లింపులు కేవలం అకౌంట్ పేయి చెక్‌ల ద్వారా చెల్లించవలసినదిగా ఆదేశించడమైనది. -
నగదు రహిత బదిలీ అమలు చేయాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : నగదు రహిత బదిలీలను మీ–సేవా కేంద్రాల్లో అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం జిల్లా శిక్షణ కేంద్రం ఆద్వర్యంలో మీ–సేవా ఆపరేటర్లకు వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు త్వరిత గతిన అందించేందుకు ఏర్పాటు చేసిన మీ–సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో ఆయా సేవలను నిర్ధేశించిన రేట్లకే అందించాలన్నారు. నగదు రహిత సేవలకు సంబంధించి స్వైపింగ్ మెషీన్లు, యాప్‌లను వినియోగించాలన్నారు. ప్రభుత్వ సేవలను విస్తృతంగా ప్రజలకు అందించాలని, సర్వీసులు ఎక్కువైన తరువాత దుర్వినియోగానికి పాల్పడినా, నిర్ణయించిన చార్జీల కంటే ఎక్కువ వసూలు చేసినా జరిమానా విధింపు, విధుల నుంచి తొలగింపు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న ఆపరేటర్లు అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకోవాలన్నారు. జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ఎన్వీఎస్ సూరపురాజు, ఎన్ఐసీ డీఐవో ఉస్మాన్ పాల్గొన్నారు. -
వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు
ఎల్పీజీ డీలర్లకు జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఎల్పీజీ డీలర్లు విధిగా నగదు రహిత బదిలీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఎల్పీజీ డీలర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు సర్క్యులేషన్ లేక మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత బదిలీలు, స్వైపింగ్, యాప్‌ల డౌన్లోడ్ల ద్వారా నగదు బదిలీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో 13 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, వీరందరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా సీడింగ్ జరిగిందన్నారు. వీరందరికీ నగదు రహిత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల లబ్ధి ఉంటుందన్నారు. ఈ పోస్ మెషీన్ ద్వారా స్వైపింగ్ ఆంధ్రా బ్యాంక్ బిజిలీ యాప్, స్టేట్‌బ్యాంక్ బడ్డీ, ఎం–పే యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని నెట్ కనెక్టివిటీ ఉంటే వీటిని నిర్వహించుకోవచ్చున్నారు. డెలివరీ బాయస్కు యాప్‌లు, స్వైప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉంటే దానికి స్వైపింగ్ కనెక్టివిటీ ఇస్తారని, దాన్ని మొబైల్గా ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చన్నారు. యాప్స్ అయితే వినియోగదారులు, డీలర్లు ఇద్దరూ డౌన్లోడ్ చేసుకుంటేనే నగదు రహిత బదిలీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు యాప్‌ల డౌన్లోడ్, స్వైపింగ్లపై డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాద్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
ఆ వాడలో ఎదురుచూపులు...
జీవిత చిత్రం ‘వారం రోజులైంది. ఒక్క మగాడు రావడం లేదు’ అంది ఢిల్లీ జి.బి.రోడ్‌లోని ఒక సెక్స్ వర్కర్. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిజమే కాని ఆ చర్య ఫలితంగా ఊహించని శిబిరాలు పడుతున్న ఇక్కట్లు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో నడిచే సెక్స్‌వర్కర్ల లావాదేవీలు గత వారం రోజులుగా పూర్తిగా కుదేలయ్యాయని తెలుస్తోంది. ‘అప్పటికీ మేం పాత నోట్లు తీసుకుంటాం అనే అంటున్నాం. కాని మగాళ్లు రావడం లేదు. వాళ్లు అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుక్కునే పనిలో ఉన్నారు. లేదంటే క్యూలలో ఉన్నారు. డబ్బు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు’ అని మరొక సెక్స్ వర్కర్ అంది. పెద్ద నోట్లు రద్దయిన వెంటనే అందరు వ్యాపారులకు మల్లే ఢిల్లీలోని సెక్స్ వర్కర్లు కూడా పాత నోట్లను తీసుకోము అని ప్రకటించారు. అయితే ఒకటి రెండు రోజుల్లోనే ఇది జరిగే పని కాదని గ్రహించారు. కొత్త నోట్లు ఎవరి దగ్గరా లేవు కనుక పాత నోట్లు తీసుకొని తర్వాత ఏదో విధంగా చెల్లుబాటు చేసుకుందామని భావించారు. కాని ఢిల్లీ పురుషులు మాత్రం ఎంతమాత్రమూ ఈ కాలక్షేపం కోసం తమ సమయాన్ని డబ్బును వెచ్చించే స్థితిలో లేరు. ‘ఢిల్లీలోని కోఠాల్లో దాదాపు 5000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరంతా బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు. ఎవరికీ ఆధార్ కార్డులు కాని, బ్యాంక్ అకౌంట్లు కాని లేవు. వచ్చిన డబ్బు పెట్టెల్లో దాచుకోవడమే తెలుసు. మా దగ్గర ఉన్న పాత నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియదు. ఆ నష్టం ఒకటైతే వారం రోజులుగా ఎదుర్కొంటున్న నష్టం మా జీవితాన్ని దెబ్బ తీసింది’ అని మరో సెక్స్ వర్కర్ అంది. ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలో ఒక్కో సెక్స్‌వర్కర్ సగటున వెయ్యి రెండు వేలు సంపాదిస్తుందని అంచనా. ఆ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పోయింది. కాగా ఢిల్లో జోరుగా నడిచే ఎస్కార్ట్ గర్ల్స్ రంగం కూడా అరవై నుంచి 80 శాతం పతనం అయ్యింది. ‘అప్పటికీ మేం రేట్లు తగ్గించాం. ఎవరూ మా మొహం చూడటం లేదు’ అని ఒక ఏజెంట్ అన్నాడు. 5000 రూపాయలకు ఏ సర్వీసులు ఇచ్చేవారమో ఇప్పుడు 3500 రూపాయలకు ఆ సర్వీసులే ఇస్తున్నాము. కాని లాభం లేదు’ అని అతడు అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆన్లైన్ ద్వారా వీరికి చెల్లింపు జరిపే వీలున్నా ఎవరూ ప్రస్తుతం ఈ ‘ఆహ్లాదసేవల’ను పొందే మూడ్‌లో లేరు. పెద్దనోట్ల రద్దు వల్ల ఈ వృత్తికి దెబ్బ ఏర్పడి అంతరించిపోతే అంతకు మించి కావల్సిందేముంది? అయితే వీరికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించే పనులు చేయాలి... వీరిని ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఊబి నుంచి బయట పడేయాలి. -
ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!!
• మోదీని హీరోలా పొగిడేస్తున్న మొబైల్ వాలెట్ సంస్థలు • లావాదేవీలు బీభత్సంగా పెరిగాయంటూ ప్రకటనలు • మున్ముందు మరింత పెరుగుతాయంటూ అంచనాలు • వాలెట్లను ఆశ్రరుుస్తే లైన్ల బాధ కొంతరుునా తప్పుతుంది • ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన ఉంటే బెటర్ • తరచూ బ్యాంకుకు వెళ్లటాన్ని తప్పించుకోవచ్చు • భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు • ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు • నేరుగా డిపాజిట్ కూడా చేయలేం; ఆన్లైన్లో చేయాల్సిందే • డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు • మున్ముందు ఇవి కూడా లావాదేవీలు ఛార్జీలు వేసే అవకాశం నవంబర్ 8 అర్ధరాత్రి!!.ప్రధానమంత్రి ప్రకటనతో...ఆ క్షణం దాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు చెల్లకుండా పోయారుు. నవంబర్ 9 ఉదయం!! పలు పత్రికల్లో నరేంద్రమోదీ ఫోటో పెట్టి మరీ మొబైల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ ప్రకటనలు. డిజిటల్ మనీకి దారులు తెరుస్తున్న మోదీకి అభినందనలు కూడా అందులోనే. అంతేకాదు!! ఆ రోజు మధ్యాహ్నానికల్లా... ఎఫ్ఎం రేడియో, టీవీ, సోషల్ మీడియా అన్నిటా పేటీఎం, మొబీ క్విక్, ఫ్రీచార్జ్ వంటి మొబైల్ వాలెట్ల ప్రచార విజృంభణ మొదలైంది. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు సైతం నగదు లేకుండా ప్రయాణం చేయటానికి తమ వ్యాలెట్లు వాడాలంటూ హోరెత్తించేశారుు. నవంబర్ 10 ఉదయం... తమ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 200 శాతం పెరిగిందని, లావాదేవీల సంఖ్య 250 శాతం పెరిగిందని పేటీఎం ప్రకటించింది. తమ వ్యాలెట్ రీచార్జ్‌లు ఆ ఒక్కరోజే ఏకంగా 1,500 శాతం పెరిగినట్లు ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా మనీ ప్రకటించింది. ఇంకా మొబీక్విక్, ఫ్రీచార్జ్ కూడా ఇలాంటి ప్రకటనలే చేశారుు. ఇన్ని జరుగుతున్నా... అసలు మొబైల్ వాలెట్ అంటే ఏంటో!! ఎలక్ట్రానిక్ లావాదేవీలంటే ఏంటో తెలియని జనం... పర్సుల్లో ఉన్న పెద్ద నోట్లు చెల్లక, ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో చాంతాడంత లైన్లలో నిల్చోలేక నానా యాతనలు పడుతూనే ఉన్నారు. బిల్లులు చెల్లించడానికి పాత నోట్లు ఇవ్వవచ్చని కొన్ని ప్రభుత్వ సంస్థలు వెసులుబాటు కల్పించటంతో అక్కడ కూడా లైన్లలో నిల్చోక తప్పలేదు వారికి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది. పూర్తిగా కాకపోరుునా... మొబైల్ వాలెట్లను వాడితే వీటిలో కొన్ని కష్టాలరుునా తప్పేవి. ఎలక్ట్రానిక్ లావాదేవీలు అలవాటైన వారు కొన్ని చెల్లింపులైనా ఉన్న చోటు నుంచే చేయగలిగేవారు. నిజానికి అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో డిజిటల్ లావాదేవీలపై అందరికీ అవగాహన ఎక్కువ కనక అక్కడ చిన్నచిన్న లావాదేవీలూ ఎలక్ట్రానిక్ లేదా మొబైల్ మనీతో పూర్తి చేసేయొచ్చు. పర్సులో కరెన్సీ లేకున్నా రోజులు గడిపేయొచ్చు. కానీ అత్యధిక శాతం కిరాణా షాపుల యజమానుల నుంచి వాటిని వాడే కస్టమర్లు కూడా నిరక్షరాస్యులే అరుున భారతదేశంలో అది సాధ్యమా? డిజిటల్ మనీని పూర్తి స్థారుులో అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని జనం స్వాగతిస్తారా? కరెన్సీ లేకుండా రోజును ఊహించుకోగలమా? ఒక్క మాటలో చెప్పాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ క్రమంగా ఈ-లావాదేవీల సంఖ్య పెరుగుతోందన్నది మాత్రం కాదనలేని నిజం. అది సరే! నగదు అవసరం లేకుండా కొన్ని లావాదేవీలనైనా జరపటానికి అవకాశం కల్పిస్తున్న ఈ మొబైల్ వాలెట్ల సంగతేంటి? కాస్తరుునా సౌలభ్యాన్నిస్తున్న ఈ ఫోన్ వాలెట్లతో లాభమేనా? ఎలక్టాన్రిక్ లావాదేవీలు అసలు మంచివేనా? సురక్షితమేనా? సాధా రణ ప్రజలకు వీటితో లాభ నష్టాలేంటి? ఇతరత్రా వివరాలను తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఎందుకీ మొబైల్ వాలెట్లు? మనలో చాలా మందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసు. అరుుతే తెలియని వారూ లేకపోలేదు. మనకు బ్యాంకులో ఉన్న ఖాతాను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవటానికి వీలు కల్పించేదే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ప్రతి ఖాతాదారుకూ తన సొంత ఐడీ, పాస్వర్డ్ ఉంటారుు. వాటిని మనకు ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచీకి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా వేరే ఖాతాలోకి నగదు బదిలీ చేయటం... క్రెడిట్ కార్డుతో పాటు బీమా, కరెంటు, టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించటం, స్థానిక సంస్థల పన్నులు చెల్లించటం వంటివి చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... దాదాపు ఏ చెల్లింపరుునా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఇటీవల ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ వేసిన అంచనాల ప్రకారం దేశంలో ఇప్పటికీ 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ సౌకర్యమే లేదు వారికి. కాకపోతే వీళ్లలో చాలా మందికి మొబైల్ ఫోన్లున్నారుు. ఇలాంటి వారికి ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవటానికి కొన్ని మొబైల్ వాలెట్లు ఉపయోగపడుతున్నారుు. ఎరుుర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స జియో వంటి టెలికం సంస్థలు తెచ్చిన వాలెట్లతో... అన్ని రకాల లావాదేవీలూ జరుపుకోవచ్చు. ఇంకో విశేషమేంటంటే... పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్ వంటి ఏ వాలెట్లో డబ్బులు డిపాజిట్ చేయటానికై నా మీకో లేదా మీ బంధుమిత్రులకో ఆన్లైన్ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండి తీరాలి. వాటిలోంచే ఈ వాలెట్లలో నగదు డిపాజిట్‌కు వీలుంటుంది. కానీ టెల్కోల వాలెట్లలో నగదు వేయాలంటే నేరుగా ఆయా సంస్థలకు చెందిన ఔట్‌లెట్లలోకి వెళ్లి, నగదు చెల్లించొచ్చు. టెలికం సంస్థల వాలెట్లివీ... ఎరుుర్‌టెల్‌కు చెందిన ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్‌కు చెందిన వొడాఫోన్ ఎం పెసా, ఐడియా మనీ, జియో మనీ ఈ కోవలోకి వస్తారుు. వీటన్నిట్లోనూ చూస్తే రిలయన్‌సకు చెందిన జియో మనీకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే దేశవ్యాప్తంగా రిలయన్‌సకు చెందిన జియో స్టోర్లతో పాటు రిలయన్స ఫ్రెష్, రిలయన్స డిజిటల్ దుకాణాల్లోనూ నగదు చెల్లించి జియో మనీలో డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే... రిలయన్సకున్న రిటైల్ నెట్వర్క్ దానికి ఈ రకంగా కలిసొచ్చిందన్న మాట. బ్యాంకులకూ ఉన్నాయ్ వాలెట్లు!! నిజం చెప్పాలంటే వాలెట్లతో చేసే ప్రతి పనినీ ఆన్లైన్ బ్యాంకింగ్‌తో కూడా చెయ్యొచ్చు. కాకపోతే ప్రతిసారీ బ్యాంకు ఖాతాలో ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇపుడు ఇలాంటి అవసరమేదీ లేకుండా బ్యాంకులు సైతం తమ సొంత మొబైల్ వాలెట్లను తెస్తున్నారుు. ఎస్బీఐ ‘బడ్డీ’, ఐసీఐసీఐ ‘ఐ-మొబైల్’, హెచ్డీఎఫ్సీ ‘పే జాప్’ ఇవన్నీ ఇలాంటివే. వీటిని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని లావాదేవీలూ మిగతా మొబైల్ వాలెట్ల మాదిరే చేసుకోవచ్చు. కాకపోతే ముందే చెప్పుకున్నట్లు... దేశంలో బ్యాంకింగ్ సదుపాయం లేనివారు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తెలియనివారు కోట్ల మంది ఉన్నారు. వారందరి ఆదరణే ఈ మొబైల్ వాలెట్ల బలం. ఎన్ని రకాలున్నాయంటే... ⇔ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్. ⇔ క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలా చాలా ఆన్లైన్ కంపెనీలు తమ సొంత వాలెట్లు అందిస్తున్నారుు. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వీటిలో వస్తువులే కొనాలి. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల పరిధిలో ఉంటారుు కనక వీటికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నారుు. లాభాలు: కంపెనీలు తమ వాలెట్ ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటారుు. ⇔ కంపెనీల వాలెట్లు గనక వీటిలో వేసే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. నష్టాలు: వీటిలోనే లావాదేవీలు జరపాలి. వేరే కంపెనీల్లో తక్కువ ధరకు వస్తువులు వస్తున్నా ఈ డబ్బుతో కొనలేం. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నారుు. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవు. ఏ ఉబెర్ నుంచో బుక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!. ⇔ ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నారుు. ఏదైనా కొనాలంటే వివిధ ఈ-కామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి? ⇔ డబ్బును వేయటమే తప్ప విత్‌డ్రా చెయ్యటానికి వీలుండదు. ఎలాంటి వడ్డీ రాదు. సెమీ క్లోజ్డ్ వాలెట్లలో డబ్బులు వేస్తే వీటిని ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వాడొచ్చు. అరుుతే ఈ వాలెట్‌ను నిర్వహిస్తున్న కంపెనీకి ఏఏ సంస్థలతో ఒప్పందాలున్నాయో వాటిలోనే లావాదేవీలు జరిపే వీలుంటుంది. పేటీఎం, మొబిక్విక్, పేయు, సిట్రస్ క్యాష్, ఆక్సిజన్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే. లాభాలు: ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు చెల్లింపులు చేయొచ్చు. ⇔ వీటితో ఒప్పందం ఉన్న కంపెనీలే కాదు, వాలెట్ సంస్థలు కూడా తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తుంటారుు. వాటిని అవకాశాన్ని బట్టి వాడుకుంటే లాభమే. నష్టాలు: బిల్లుల చెల్లింపుల పరిమితి రూ.10వేల లోపే. అంటే రూ.10వేలకన్నా ఎక్కువ దీన్లో డిపాజిట్ చేయలేం. అంతకన్నా ఎక్కువ అవసరమైతే ఆ లావాదేవీల్ని దీంతో చెయ్యలేం. ⇔ డిపాజిట్ చేస్తే తిరిగి వెనక్కి తీసుకోలేం. ఎలాంటి వడ్డీ రాదు. ఓపెన్ వాలెట్లు ఒకరకంగా బ్యాంకు ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేయొచ్చు. వీటిలో సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తారుు. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంకుతో జియో మనీ ఒప్పందం చేసుకుంది. ఎరుుర్ టెల్ మనీ, టాటా టెలీ ఎం రుపీ కూడా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారుు. ఇక గతేడాదే పేటీఎం, ఎరుుర్‌టెల్, రిలయన్స, వొడాఫోన్ వంటివి పేమెంట్ బ్యాంక్ లెసైన్సును పొందారుు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్లతో నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు. డిజిటల్ వాలెట్లతో లాభాలివీ.. ⇔ నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటారుు. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు. ⇔ డిజిటల్ వాలెట్ పాస్వర్డ్ వేరొకరికి తెలిసిపోరుునా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది. ⇔ ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నారుు. ⇔ వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లిస్తున్నారుు. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావటంతో పాటు లాయల్టీ పారుుంట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అరుు ఉంటారుు. దీనివల్ల ఏ కొనుగోలుకు ఏ కార్డు వాడితే మంచిదని ఆలోచించే అవసరం ఉండదు. మొబైల్ వాలెట్లు అవసరమా?! ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంస్థ ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ను అందుబాటులోకి తెచ్చింది. అంటే మీకు వివిధ బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నా... అన్నిటినీ ఒకే మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పటికే 29 బ్యాంకుల వరకూ దీని పరిధిలోకి చేరారుు. మరో ఏడాది కాలంలో దేశంలోని బ్యాంకులన్నీ దీని పరిధిలోకి వస్తాయన్నది ఎన్పీసీఐ మాట. అదే జరిగితే అపుడు యూపీఐతో అన్ని బ్యాంకింగ్, మర్చెంట్ లావాదేవీలనూ 365 రోజులూ, 24 గంటలూ అందుకోవచ్చు. అదే జరిగితే మొబైల్ వాలెట్ల అవసరమే ఉండదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే దేశంలో ఇప్పటికీ బ్యాంకుల మొహం చూడనివారు 23 కోట్లకు పైగా ఉన్నారని, వారంతా మొబైల్ వాలెట్లతోనే బ్యాంకింగ్ లావాదేవీలు చేయాల్సి ఉంటుందన్నది వాలెట్ కంపెనీల మాట. అరుుతే బ్యాంకులు సొంత అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చి, అన్ని కార్యకలాపాలకూ అనుమతిస్తున్న తరుణంలో మున్ముందు మొబైల్ వాలెట్ల మనుగడ ఎలా అన్నది వేచి చూడాల్సిందే. చార్జీలెంత ఉంటారుు? చాలా మందికి ఒక ప్రశ్న మొదులుతుంది. ఈ మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఏమైనా చార్జీలుంటాయా? అని. నిజానికి ప్రస్తుతం చాలా మొబైల్ వాలెట్లు దాదాపు అన్ని లావాదేవీలనూ ఉచితంగానే ఆఫర్ చేస్తున్నారుు. బ్యాంకులు మాత్రం ప్రతి చెల్లింపునకూ ఎంతో కొంత చార్జీ విధిస్తున్నారుు. ఓపెన్, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ వాలెట్లలో మనం వేసిన నగదుపై ఎలాంటి వడ్డీ ఉండదు కనక ఈ సంస్థలు దాన్ని లిక్విడ్ ఫండ్సలో పెట్టినా కొంత వడ్డీ వస్తుంది. అది ఆయా సంస్థల ఖర్చులకు కొంతవరకూ కలిసొస్తుందని, అరుుతే చాలా వాలెట్లు ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టులు పెడుతున్న పెట్టుబడులపై ఆధారపడుతున్నారుు. కనుక సరైన ఆదాయ మార్గాలను వెదకటం లేదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే త్వరలో వీటిక్కూడా లాభార్జన ఒత్తిడి పడుతుంది. అపుడు ఇవి కూడా ఎంతో కొంత చార్జీలు వసూలు చేయక తప్పదు. ప్రస్తుతం కస్టమర్లను సంపాదించటం, డౌన్లోడ్లను పెంచుకోవటంపైనే దృష్టి పెట్టిన ఈ వాలెట్లు... మున్ముందు ఆదాయం కోసం చార్జీలు వేయటం మొదలుపెడితే... అపుడు ఎంతమంది కస్టమర్లు నిలుస్తారన్నదే అసలైన ప్రశ్న. అరుుతే అటు బ్యాంకులూ చార్జీలు వసూలు చేసి, ఇటు వాలెట్లు కూడా అదే తీరులో వసూళ్లు మొదలుపెడితే... ఏది తక్కువో చూసుకుని వాడుకోవాల్సిన బాధ్యత కస్టమర్లదే!!. -
పథకం ప్రకారమే దీనజ్యోతి హత్య!
కడప అర్బన్ : కడప రాజారెడ్డివీధికి చెందిన రిటైర్డ్ ఏఎస్‌డబ్లు్యఓ దీనజ్యోతి (62)ను దారుణంగా పథకం ప్రకారమే హత్య చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, తన దగ్గర పనిచేస్తున్న పనిమనిషి భర్త, అతని స్నేహితునితో కలిసి పక్కా ప్రణాళికతో దీనజ్యోతిని అంతమొందించారని తెలిసింది. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి, దీనజ్యోతికి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి. మరికొంత మొత్తంలో డబ్బును తన అవసరాలకు ఇవ్వాలని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు దీనజ్యోతిని కోరింది. ససేమిరా అనడంతో ఆమె బంగారు ఆభరణాలపై నిందితురాలు కన్నేసింది. ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తన దగ్గర పనిచేస్తున్న పని మనిషి భర్తకు డబ్బు ఆశ చూపి దీనజ్యోతిని హత్య చేసే విషయంలో సహాయం కోరింది. ఈ విషయాలన్నీ పనిమనిషి భర్తతో ప్రధాన నిందితురాలైన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు గంటల తరబడి రాత్రి వేళల్లో ముఖ్యంగా దీనజ్యోతి అదృశ్యం కావడానికి ముందుగా రెండు రోజులు చర్చించింది. తర్వాత అనుకున్న సమయానికి దీనజ్యోతి ఇంటి నుంచి ఫేషియల్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. చివరి ఫోన్‌కాల్ దీనజ్యోతి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలితోనే మాట్లాడినట్లు సమాచారం. తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయబడింది. దీనజ్యోతి ఫేషియల్ చేయించుకునేందుకు రాగానే ఆమెను కుర్చీలో కూర్చొబెట్టారు. ఫేషియల్ చేసిన అనంతరం పథకం ప్రకారం పనిమనిషి భర్త , ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు, ఇందుకు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహకరించినట్లు తెలుస్తోంది. తర్వాత సాయంత్రం వరకు ఎదురుచూసి మృతదేహాన్ని పని మనిషి భర్త స్నేహితుడు, ఆటో డ్రైవర్ సహాయంతో నగర శివార్లలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అప్పటికే ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను కాజేసినట్లుగా తెలుస్తోంది. సదరు బంగారు ఆభరణాలలో కొన్నింటిని బీకేఎం వీధిలోని ఓ సేఠ్ వద్ద కుదవకు పెట్టిన పనిమనిషి భర్త, ఆటో డ్రైవర్లు ఆ డబ్బుతో తమ అవసరాలను తీర్చుకున్నారు. దీన జ్యోతికి, బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు మధ్య లావాదేవీలతో మనస్పర్థలు ఏర్పడడంతో దారుణ హత్యకు దారి తీసిందని అనుకుంటున్నారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనజ్యోతి మృతదేహానికి నగర శివార్లలో తగులబెట్టబడిన మృతదేహం ఒకటేనా? కాదా? అనే విషయంపై స్పష్టత వస్తే మిస్టరీ వీడిపోతుంది. ఈ సంఘటనపై మహిళా అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూదీన జ్యోతి వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. -
పీఏసీఎల్ ఆస్తులతో లావాదేవీలొద్దు
జస్టిస్ లోధా కమిటీ హెచ్చరిక న్యూఢిల్లీ: పీఏసీఎల్ కంపెనీ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని జస్టిస్ ఆర్.ఎం. లోధా అథ్యక్షతన గల కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్ గ్రూప్ కంపెనీల, అనుబంధ కంపెనీల సంబంధిత ఆస్తులను, కొనుగోలు చేయడం విక్రయించడం, మరే ఇతర తరహా లావాదేవీలనైనా నిర్వహించడం చేయరాదని ఈ కమిటీ పేర్కొంది. ఇలాంటి లావాదేవీలను నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమైనదిగా భావించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ విధమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని వివరించింది. ఎవరి సొమ్ములు వారికివ్వడానికే...: పీఏసీఎల్ సంస్థ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులను సమీకరించింది. 18 ఏళ్లుగా ఈ కంపెనీ అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి రూ.49,000 కోట్లు సమీకరించిందని సెబీ గుర్తించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఇన్వెస్టర్లకు వారి సొమ్ములను వారికి తిరిగి చెల్లించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇన్వెస్టర్లకు వారి డబ్బులు వారికి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను నిర్వహిస్తోంది. -
ఇక ఆధార్ ఏటీఎంలు
ఎటువంటి ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరుంటే చాలు!! కార్డ్‌లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మిషన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మిషన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మిషన్లకు విస్తరింప చేయనున్నారు. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.5,124 కోట్లు * ఇపుడు వివరాలన్నీ బ్యాంకు సైట్లలో లభ్యం * క్లెయిమ్‌కు కేవైసీ వివరాల సమర్పణ తప్పనిసరి ప్రసాద్‌కు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. కనీస నిల్వ ఉంచాలి కనక ప్రతి ఖాతాలో రూ.10 వేలకు తగ్గకుండా ఉంచుతాడు. అన్ని ఖాతాలున్నా... అత్యధిక లావాదేవీలకు వాడేది మాత్రం రెండు ఖాతాలనే. ఒకటి ఆఫీసు జీతం జమచేసే ఖాతా. రెండోది తన పర్సనల్‌గా ఇంటి దగ్గరి బ్రాంచిలో తీసుకున్న ఖాతా. మిగిలిన ఖాతాల్లో ఎప్పుడోకానీ లావాదేవీలుండవు. కొన్నాళ్లకు వాటి ఊసే మరిచిపోయాడు ప్రసాద్. పదేళ్ల పాటు ఏ లావాదేవీ లేకపోవటంతో ఆ ఖాతాల్లోని సొమ్ము అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ఇంతలో ప్రసాద్ మరణించటంతో అతని కుటుంబీకులకు కూడా విషయం తెలియకుండానే ఉండిపోయింది. శంకర్రావుది మరో కథ. ఆయనకు వెనకా ముందూ ఎవ్వరూ లేరు. ఉన్న డబ్బుల్లో కొంత బ్యాంకులో డిపాజిట్లుగా పెట్టాడు. నామినీ ఎవ్వరినీ పెట్టలేదు. విషయం తన దగ్గరి వాళ్లక్కూడా చెప్పలేదు. అతను మరణించటంతో ఆ డబ్బును తీసుకునేవారే లేకుండా పోయారు. కొన్నాళ్లకు అది అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ప్రసాద్, శంకర్రావు లాంటి వ్యక్తులు దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్లెయిమ్ చేయకుండా వదిలేసిన మొత్తమెంతో తెలుసా? 2013 సంవత్సరాంతానికి ఈ మొత్తం ఏకంగా రూ.5,124 కోట్లు. నిజానికి ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంకులు అనేక జాగ్రత్తలు తీసుకుని, పదేళ్లు నిండిన తరవాతే వీటిని అన్క్లెయిమ్డ్గా ప్రకటిస్తున్నాయి. ఇంకా పదేళ్లు నిండకపోయినా అన్క్లెయిమ్డ్గా ఉన్న మొత్తం చాలా ఎక్కువే ఉంటుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. అన్క్లెయిమ్డ్ వివరాలు తెలుసుకోవటమెలా? నిజానికి ప్రతి ఒక్కరూ వారి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. బ్యాంకులు కూడా ఆన్క్లైయిమ్డ్ డిపాజిట్ల తాలూకు డిపాజిటర్లు, ఇతర వివరాలను వాటి వెబ్సైట్లలో ఉంచాయి. ఇన్ని చేసినా మీ ఇంట్లో వాళ్ల డిపాజిట్ల వివరాలు వారి మరణానంతరం కూడా మీకు తెలియకపోతే... ఇంట్లో ఏవైనా బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయేమో వెదకండి. ప్రయోజనం లేకపోతే బ్యాంక్ వెబ్సైట్లలో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను జల్లెడ పట్టండి. బ్యాంకు ఖాతాదారుని పేరు మీద సెర్చ్ చేస్తే వివరాలను తెలసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతాదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, పాస్‌పోర్ట్ సంఖ్య వంటి ఆప్షన్ల ద్వారా కూడా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలియజేస్తున్నాయి. క్లెయిమ్ చేసుకోవాలంటే... ఆయా బ్యాంకుల వెబ్సైట్ల ద్వారా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకున్నాక ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు తెలియజేయాలి. కొన్ని బ్యాంకులు మీకు కాల్ చేస్తాయి. లేకపోతే స్వయంగా మీరే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి విషయాన్ని చెప్పాలి. ఆ డిపాజిట్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలని భావిస్తే.. క్లెయిమ్ ఫామ్‌ను సదరు బ్యాంకుకు సమర్పించాలి. మీరు బ్యాంక్ వెబ్సైట్ నుంచి/బ్రాంచ్ నుంచి ఈ ఫామ్‌ను పొందొచ్చు. దీంతోపాటు బ్యాంకు వారికి ఖాతాదారు బ్యాంక్ పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. చనిపోయిన మీ కుటుం బ సభ్యుల ఖాతాకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు వారి మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బ్యాంకుకు సమర్పించాలి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేస్తే... అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ ఖాతాలు ఉండొచ్చు. ఫిక్స్డ్ డి పాజిట్ల వడ్డీ రేట్లు, ఇతర ఖాతాల వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు అన్ క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు బ్యాంకు మీకు సాధారణ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటునే చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతేడాది ఫిబ్రవరిలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఒక ప్రకటన జారీ చేసింది.బ్యాంకులు అన్క్లెయిమ్డ్ డిపాజిటర్ల వివరాల సేకరణపై అధిక దృష్టి కేంద్రీకరించాలని బ్యాంకులకు సూచించింది. 2015, మార్చి 31 నాటికి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఆయా బ్యాంకులు వాటి వెబ్సైట్లలో తప్పక ఉంచాలని ఆదేశించింది. బ్యాంక్ వెబ్సైట్లలో మనకు ఖాతాదారు పేరు, అడ్రస్ మాత్రమే కనిసిస్తాయి. అకౌంట్ నంబర్, బ్రాంచ్ వివరాలు ఉండవు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బ్యాంకులు సెర్చ్ ఆప్షన్‌ను ఉంచాలని, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని కూడా ఆర్బీఐ సూచించింది. క్లెయిమ్ ఫారాలను వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని కూడా పేర్కొంది. -
డీమ్యాట్ ఖాతా కావాలా?
డీ మ్యాట్ అంటే... కొనుక్కున్న షేర్లను దాచుకునే ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. అయితే దీన్లో షేర్లను కొని దాచిపెట్టుకోవాలన్నా... ఇందులో ఉన్న షేర్లను విక్రయించాలన్నా... అందుకు ట్రేడింగ్ ఖాతా కావాలి. క్రయవిక్రయాలకు డబ్బులుండాలి కనక ఈ ట్రేడింగ్ ఖాతాలోకి డబ్బులు వెయ్యాలన్నా, తియ్యాలన్నా ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ సేవలు మూడు విధాలుగా పొందవచ్చు. 1. కొన్ని బ్యాంకులు సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలన్నిటినీ కలిపి ఇచ్చే 3 ఇన్ 1 స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి రీసెర్చ్ రిపోర్టులివ్వటంతో పాటు ఏ షేర్లను కొనాలి? వేటిని విక్రయించాలి? వంటి సూచనలు కూడా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ వంటి బ్యాంకులతో పాటు కోటక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలూ ఈ 3 ఇన్ 1 సేవలందిస్తున్నాయి. 2. ఇక రెండో తరహా స్టాక్ బ్రోకర్ల విషయానికొస్తే... ఇవి కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్‌ను మాత్రమే అందిస్తాయి. వీటికి మనకు ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు సేవింగ్స్ అకౌంట్‌ను జత చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలోకి నగదు వేయటం, అందులోంచి నగదు తీసుకోవటం వంటివి కాస్తంత ఆలస్యమవుతాయి. ఇండియా ఇన్ఫోలైన్, ఏంజెల్, షేర్‌ఖాన్, వెంచురా వంటి పలు సంస్థల్ని ఈ తరహావిగా చెప్పొచ్చు. 3. ఈ మధ్యకాలంలోనే మూడో రకం బ్రోకరేజ్ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి చిన్న ఇన్వెస్టర్లను, చిన్న ట్రేడర్లను దృష్టిలో పెట్టుకుని... లావాదేవీలతో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు లేదా చాలా తక్కువ చార్జీలతో సేవలందిస్తున్నాయి. అందుకే వీటిని డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలుగా పేర్కొంటున్నారు. మూడింట్లో ఏది ఉత్తమం? ఈ మూడింట్లో ఏది ఉత్తమమనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కానీ అదంతా మీరు నిర్వహించే లావాదేవీలు, ఇన్వెస్ట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారైతే ఏ బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవాలన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్లు ఎదురు చూస్తారు. ఏడాదిలో 30 నుంచి 40 లావాదేవీలకు మించవు. ఇలాంటి వారు ఫీజులు, చార్జీల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వీరు చక్కని సర్వీసులు అందించే 3 ఇన్ 1 బ్రోకర్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొనాలనుకున్న వెంటనే కొనుగోలు చేయొచ్చు. పెపైచ్చు విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి. బ్యాంకుల్లోనే కనక డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. అటు ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ట్రేడింగ్ కూడా చేసేవారైతే... రెండు బ్రోకింగ్ అకౌంట్స్‌ను తీసుకోవటం మంచిదన్నది నిపుణుల సలహా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసమైతే మరొకటి ట్రేడింగ్ కోసం. అలా కాకుండా కేవలం ఇంట్రాడే ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ మాత్రమే చేసేవారైతే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలకేసి చూడొచ్చు. ఇవన్నీ కాకపోతే చెల్లించే వార్షిక ఫీజులు ఆధారంగా కూడా బ్రోకింగ్ సంస్థలకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం చాలామంది ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. ఏడాదిలో చెల్లించే చార్జీలు రూ. 3,000 మించకపోతే మరో ఆలోచనేదీ లేకుండా ఆ బ్రోకింగ్ సంస్థలో కొనసాగవచ్చు. అదే చెల్లించే ఫీజులు రూ. 3,000 నుంచి రూ. 6,000 మధ్యలో ఉంటే అందులో ఎఫ్ అండ్ వో లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో బ్రోకింగ్ సంస్థ కేసి చూడండి. ఇక రూ.6,000 పైన చెల్లిస్తుంటే తప్పకుండా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ తలుపు తట్టండి. ట్రేడింగ్, డీమ్యాట్ మాత్రమే అయితే..! త్రీ ఇన్ ఒన్ సేవలందించే బ్యాంకులతో పోలిస్తే కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలందించే బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు చాలా తక్కువే. ఎందుకంటే వీటిలో సేవింగ్స్ ఖాతాలోంచి అప్పటికప్పుడు డబ్బులు వేయటం, ఆ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవటం ఉండదు. అయితే ఒకేసారి ఏక మొత్తంలో నగదు కేటాయించి, భారీగా ట్రేడింగ్ చేసేవారికి ఛార్జీల భారం తగ్గుతుంది కనక ఇవి మంచివనే చెప్పొచ్చు. దాదాపు ప్రతి బ్రోకింగ్ సంస్థా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను (సాఫ్ట్వేర్) అందిస్తుంది కనక లావాదేవీలు నెమ్మదిగా జరగటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. కొన్ని ప్రధాన సంస్థల బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు.. డిస్కౌంట్ బ్రోకింగ్... పూర్తి స్థాయి సేవలందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకుంటే ట్రేడింగ్‌లో వచ్చే లాభాల్లో అత్యధికం వాటి జేబుల్లోకే పోతాయి. ఒకపక్క ట్రేడింగ్ లాట్ సైజులు పెరిగి ప్రీమియంలు పెరిగిపోతే... మరో పక్క వచ్చిన స్వల్ప లాభాలు బ్రోకింగ్ సంస్థలకు కట్టడానికే సరిపోవడం లేదన్నది ట్రేడర్ల మాట. అందుకే వీరు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలవైపు చూస్తున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ లేదా స్థిరమైన రేట్లకే ఎన్ని లావాదేవీలైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తాయి. జీరోదా, ఆర్కేఎస్వీ, ఇండియన్ ట్రేడింగ్ లీగ్, ట్రేడ్జిని వంటివి ఈ రంగంలోని ప్రధాన సంస్థలు. వీటిలో చాలా సంస్థలు అకౌంట్ ఓపెనింగ్‌కి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఉండే ప్రధానమైన లోపం... లో బ్యాండ్‌విడ్త్. దీనివల్ల మార్కెట్లు బాగా పెరిగిన, లేదా పడిన సమయాల్లో పొజిషన్లను వదిలించుకోవడం కష్టమవుతుంది. మిగిలిన పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలతో పోలిస్తే కస్టమర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వివిధ సంస్థల ఛార్జీలివీ... తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న సంస్థలు డిస్కౌంట్ బ్రోకరేజీలుగా రంగంలోకి త్రీ ఇన్ వన్ సేవలకు చార్జీలూ ఎక్కువే ట్రేడింగ్ చేసేవారికి కొన్ని బెటర్; ఇన్వెస్టర్లకైతే ఇంకొన్ని మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర్నుంచి ముగిసే వరకు ఏదో ఒక షేరు కొనటమో... అమ్మటమో చేస్తూనే ఉంటాడు సుబ్బు. రూపాయి, బంగారం, ఇతర కమోడిటీలు... ఇలా దేన్నీ వదలడు. అన్నిట్లోనూ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్న పరిమిత శ్రేణిని కూడా ట్రేడింగ్‌కు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ భారీ ఒడిదుడుకులను క్యాష్ చేసుకుంటూ లాభం జేబులో వేసుకుంటున్నాడు. కానీ తీరా బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూస్తే... ఆ స్థాయి లాభాలు కనిపించడం లేదు. దీనికి కారణమేంటో తెలుసా..? వస్తున్న లాభాలన్నీ బ్రోకరేజ్ చార్జీలు చెల్లించడానికే సరిపోతున్నాయి. ఒక్క సుబ్బు మాత్రమే కాదు. రోజూ భారీగా ట్రేడింగ్ చేసే వారిలో చాలా మంది పరిస్థితి ఇదే. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించడానికిపుడు అనేక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అసలీ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలంటే ఏంటి? వీటిలో ఉండే లాభనష్టాలేంటి? ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఎవరికి ఎలాంటి బ్రోకింగ్ సంస్థలు బాగుంటాయి? ఎవరి దగ్గర డీమ్యాట్ ఖాతా తెరిస్తే బెటర్? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... ఫీజులు పరిశీలించుకోండి... కొన్ని ప్రధాన బ్రోకింగ్ సంస్థల ఫీజులు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఆయా బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే సగటు చార్జీలు. ఖాతాదారులు నిర్వహించే లావాదేవీల స్థాయిని బట్టి ఇవి మారిపోతుంటాయి కూడా. వీటిల్లో లాభనష్టాలివీ... పై బ్యాంకులకు సంబంధించిన ఖాతాల్లో ట్రేడింగ్ చేసేవారిని సంప్రదించినపుడు వివిధ రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఐసీఐసీఐ వరకూ చూస్తే సాఫీగా ట్రేడింగ్ చేసుకునే ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కూడా ఇది సరైన ప్లాట్‌ఫామ్‌గానే చెప్పాలి. ఎందుకంటే సైట్‌నే విగేషన్, నగదు లావాదేవీల వేగం వంటివన్నీ దీన్లో బాగుంటాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్త ఎక్కువ. పెపైచ్చు ట్రేడింగ్ చేసేవారు మొత్తం సొమ్మును ట్రేడింగ్‌కు కేటాయించి, సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వలుంచని పక్షంలో వారికి ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు. ట్రేడింగ్‌లో సంపాదించేదంతా ఈ ఖర్చులకే పోతుందని వాపోయిన వారూ ఉన్నారు. హెచ్డీఎఫ్సీది కూడా ఇదే గొడవ. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు ఉంచాల్సిన అవసరం దీన్లోనూ ఉంది. కోటక్ సెక్యూరిటీస్ది మామూలుగానే మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువ ఛార్జీల వ్యవహారం. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఛార్జీలు కాస్త తక్కువే అయినా... ఇది ట్రేడింగ్ చేసేవారికి ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే దీన్ని యాక్సిస్ చేసుకోవటమే చాలా స్లో కనక... ఒకసారి షేర్లు కొన్ని కొన్నాళ్ల పాటు వదిలేసేవారికైతే మంచిదనే చెప్పొచ్చు. ఎస్బీఐ కూడా ఇలాంటి సేవలందిస్తున్నా... యాక్సిస్ మాదిరే ట్రేడింగ్ చేసేవారికి చాలా ఇబ్బందని చెప్పొచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
అమ్మకాలు అదుర్స్
అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఒక్క రోజులో రూ. కోటి వ్యాపారం ఈ సీజన్లో ఇదే రికార్డు బెల్లం ఉత్పత్తి వైపు రైతుల మొగ్గు నిరాశ పరిచిన ధరలు అనకాపల్లి: స్థానిక బెల్లం మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్‌కు సంబంధించి నెల రోజుల నుంచి లావాదేవీలు ఊపందుకున్న నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. సోమవారం ఒక్కరోజు జరిగిన లావాదేవీలు విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఈ నెల 8న మార్కెట్‌కు 24,121 దిమ్మలు రాగా సోమవారం మార్కెట్‌కు 29,788 దిమ్మలు వచ్చాయి. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ కొనుగోళ్లు, అమ్మకాలతో కిటకిటలాడాయి. బెల్లం లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ అమ్మకాలు ప్రతిపాదన, ప్రారంభం జరిగిన నేపథ్యంలో వ్యాపారంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నప్పటికీ లావాదేవీలపై ఈ ప్రభావం పడకపోవడంతో మార్కెట్ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది హుద్‌హుద్ చేదు అనుభవాలు, ఈ ఏడాది తగ్గిన చెరకు పంట విస్తీర్ణం, బెల్లం ఉత్పత్తిపై పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. లావాదేవీల పరంగా రికార్డు నమోదైనప్పటికీ ధరలు మాత్రం రైతులను నిరాశ పరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు 2890 పలకడం రైతులకు అసంతృప్తి కలిగించింది. ఇక మూడోరకం కనిష్టంగా మరీ దయనీయంగా 2240 రూపాయలు పలకడంతో ఏ మాత్రం గిట్టుబాటు లేకుండాపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే నల్లబెల్లం కంటే మార్కెట్లో విక్రయించే మూడో రకం ధర తక్కువుగా ఉండడం రైతులను నిరాశ పరుస్తోంది. బెల్లం తయారీపైనే మొగ్గు మరో వైపు తుమ్మపాల కర్మాగారం గానుగాటపై స్పష్టత లేకపోవడం, ఏటికొప్పాక కర్మాగారం పరిధిలో చెరకు మద్దతు ధర చెల్లింపుపై నెలకొన్న జాప్యం కారణంగా పలువురు రైతులు చెరకును చక్కెర కర్మాగారానికి తరలించే కంటే బెల్లం తయారు చేయడం మేలని భావిస్తున్నారు. అయితే బెల్లం తయారు చేసేందుకు అవసరమైన సుదీర్ఘ ప్రక్రియ కొద్దిగా ప్రతిబందకంగా మారడం వలన రైతులు తప్పనిసరి పరిస్థితిలోనే చెరకును కర్మాగారానికి తరలిస్తున్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగార గానుగాటపై స్పష్టత రాకపోవడంతో కర్మాగారంపై ఆధారపడిన కుంచంగి, తుమ్మపాల రైతుల్లో కలవరం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తుమ్మపాల రైతుల్లో కొందరు సమీపంలోని బెల్లం తయారీ కేంద్రాలకు చెరకును తరలించి బెల్లాన్ని వండుతున్నారు. తీరా బెల్లాన్ని ఎంతోఆశతో అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర లేక నిరాశ పరుస్తోంది. కాకపోతే కర్మాగారం ద్వారా చెల్లించాల్సిన మద్దతు ధర రావాలంటే ఏడాది పడుతుంది. అదే బెల్లం విక్రయం ద్వారా వచ్చే ధర రోజుల వ్యవధిలోనే జమ కావడం వలన రైతులకు కొంత ఊరటగా ఉంటుంది. -
ఆన్లైన్ బ్యాంకింగ్ సురక్షితమేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. మన క్రికెట్ టీమ్ ఎప్పుడూ పేపర్ మీద బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్లోకి వెళ్లాకే అసలు విషయం తేలుతుంది. క్రికెట్ టీమ్‌లాగే ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారం కూడా. పేపర్ మీద, నిబంధనల పరంగా చూస్తే.. ఆన్లైన్ బ్యాంకింగ్ సురక్షితంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జరగాల్సిన తంతు జరిగిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. హైదరాబాద్‌కు చెందిన రఘు అనే వ్యక్తి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు రూ.1.23 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు ఎలా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యిందో అతనికి కూడా తెలియదు. బ్యాంక్ దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకుంటే.. ఆ డబ్బు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అకౌంట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును తిరిగి రికవరీ చేసుకోవాలంటే చాలా సమయం పట్టొచ్చు. ఇలాగే ఆన్లైన్లో ఎన్నో రకాల మోసాలు జరుగుతూవుంటాయి. ఇలాంటివాటి బారిన పడకుండా వుండాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్‌కు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు ఇవి... * ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉండాలి. * పబ్లిక్ కంప్యూటర్లలో లాగిన్ అవకపోవడం మంచిది. * మీ అకౌంట్ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. * సేవింగ్స్ అకౌంట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే అకౌంట్ నోటిఫికేషన్సను సెట్ చేసుకోవాలి. * లెసైన్స్డ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. * అవసరం లేని సమయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయాలి. * తెలియని మెయిల్స్‌ను ఓపెన్ చేయకూడదు. * ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పూర్తై వెంటనే లాగ్అవుట్ అవ్వండి. * మీ అకౌంట్లో ఏవైనా తెలియని లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. -
స్క్రూటినీ అసెస్మెంట్కు సిద్ధమేనా?
ఇంకొక నెల రోజుల సమయం ఉంది. ట్యాక్స్ ఆడిట్స్, రిటర్న్స్, రిపోర్ట్స్ మూడింటి దాఖలుకూ ఈ నెల 31తో గడువు తీరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక పెద్ద పర్వం సమాప్తమవుతోంది. అయితే ఇంతలోనే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్క్రూటినీ నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ మీరు మీ ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలోనే వేసి ఉంటారు. దీనికి సంబంధించిన రిఫండ్ కూడా వచ్చే ఉంటుంది. అయినా కూడా ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని కేసులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికను కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇలా చేయటాన్ని కంప్యూటర్ అసిస్టెడ్ స్క్రూటినీ సెలెక్షన్ (సీఏఎస్ఎస్) అంటారు. కొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఈ ప్రక్రియ ఉం టుంది. ఎంపిక చేసిన తర్వాత అధికారులు నోటీసులు పంపుతారు. మీకు స్క్రూటినీ నోటీసు వచ్చిందా? మీ కేసు స్క్రూటినీకి ఎంపికయితే ఇప్పటికే నోటీసు మీ చేతికి వచ్చి ఉంటుంది. వచ్చిన నోటీసులను స్వీకరిం చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దు. అలా తిరస్కరించటం వల్ల నాలుగు రోజులు వృథా అవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నోటీసుకి సమాధానమివ్వండి... మీకు వచ్చిన నోటీసులో మీరు కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తి కానీ అధికారుల్ని ఎప్పుడు కలవాలనే విషయం ఉంటుంది. దీంతోపాటు నోటీసులో వారు అడిగిన సమాచారం, లెక్కలు, సాక్ష్యాలు ఇవ్వమని ఉంటుంది. ఇవ్వన్నీ కూడా ఆయా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించే. మీరు సంబంధిత అధికారులను స్వయంగా కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తిని పంపించి కానీ విషయాన్ని తెలుసుకోవచ్చు. అవసరమైతే వారు అడిగిన అన్ని వివరాలను ఇవ్వడానికి సమయాన్ని అడగవచ్చు. ఇలా మొదటి నోటీసుకు సమాధానమిస్తే అధికారుల దృష్టిలో మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు చట్టానికి సహకరించిన వారు అవుతారు. దీంతో వారు మీరు అడిగినంత సమయాన్ని ఇవ్వడమే కాకుండా మీకు సహకరిస్తారు. తర్వాతేంటి? ఆ తర్వాత మొదలౌతుంది అసెస్మెంట్ ప్రక్రియ. ఈ లోపల మీరు గతంలో దాఖలు చేసిన రిటర్ను నఖళ్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయ లెక్కింపుల్లో వేతనం, ఇంటి అద్దె, వ్యాపారం, మూల ధన లాభాలు, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యవసాయం మీద ఆదా యం, డివిడెండ్ వంటి పన్నుకి సంబంధించని ఆదాయాలూ ఉంటాయి. సాధారణంగా అసెస్మెంట్ వీటి పరిధిలోనే జరుగుతుంది. అందులో మీరు క్లెయిమ్ చేసిన తగ్గింపులు/మినహాయింపులుంటాయి. వీటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, అకౌంట్ పుస్తకాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, బిల్లులు, ముందస్తు పన్ను చలానాలు, టీడీఎస్ పత్రాలు, ఫారమ్ 16/16ఏ ఇలా ఎన్నో వాటిని సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఇతర వివరాలను అడగవచ్చు. మీరు అధికారులకు ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ నఖలును మీ దగ్గర ఉంచుకోండి. పైవిధంగా సహకరిస్తూ ఉంటే మీ అసెస్మెంట్ సజావుగా అవుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు 1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి 2. కె.వి.ఎన్ లావణ్య -
యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్
చెన్నై: బ్యాంకింగ్, చెల్లింపులు, వాలెట్, షాపింగ్ లావాదేవీలకు ఉపయోగపడేలా యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం లైమ్ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. యూజర్లు ఉత్పత్తులు, సర్వీసుల ధరలు, చార్జీలను పోల్చి చూసుకుని, కొనుగోలు చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ తెలిపింది. నో యువర్ కస్టమర్ ప్రక్రియకు అవసరమైన వివరాలు పొందుపర్చి మొబైల్ ద్వారానే డిజిటల్ మాధ్యమంతో పూర్తి స్థాయి పొదుపు ఖాతా తెరిచేందుకు ఇది తోడ్పడగలదని బ్యాంక్ ఎండీ శిఖా శర్మ తెలిపారు. -
లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరగాలి
మొయినాబాద్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరగాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం బుధవారం సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ సమాఖ్య సభ్యులతో ముఖాముఖి చర్చించారు. గ్రామాల్లో చిన్న సంఘాల నిర్వహణ ఎలా ఉందని, సమావేశాలు, పొదుపు, రుణాలు, రికవరీ ఏవిధంగా ఉన్నాయని సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల పనితీరుపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా మహిళా సమాఖ్య ప్రస్తుతం నెలకు ఒకరోజే సమావేశం నిర్వహించి పనిచేస్తుందని, ఇక నుంచి ప్రతి రోజు పనిచేయాలని చెప్పారు. చిన్న సంఘాల మాదిరిగానే జిల్లా మహిళా సమాఖ్యలోనూ ప్రతి నెలా కనీసం రూ.500 చొప్పున పొదుపు చేయాలన్నారు. జిల్లా సమాఖ్య సమావేశానికి వచ్చే సభ్యులు తమ మండలంలోని పూర్తి వివరాలను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆ నెలలో జరిగిన లావాదేవీల వివరాలన్నీ క్లుప్తంగా ఇవ్వాలన్నారు. సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ బ్యాంకుల నుంచి తీసుకుని ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉన్నా ఈ విషయంలో ఏసీలు, ఏపీఎంల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఏసీలు, ఏపీఎంలు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రతి మంగళవారం అన్ని శాఖల అధికారులతో జరిగే సమావేశంలో మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై చర్చించి అవసరమైన సర్టిఫికెట్లు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, కార్యదర్శి సునీత, జేడీఎం హమీద్, డీపీఎం గిరిజ, ఏరియా కోఆర్డినేటర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు పాల్గొన్నారు. పనులే పూర్తి కాలేదు.. అప్పుడే పగుళ్లా: ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం పనులే పూర్తికాలేదు అప్పుడే గోడలకు పగుళ్లా... మీ సొంత ఇల్లయితే ఇలాగే కట్టుకుంటారా... ఏం పనిచేస్తున్నారు... పనుల్లో నాణ్యత పాటించరా..? అంటూ కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించిందని, పనులు పూర్తి కాకముందే పగుళ్లు రావడం ఏమిటని పంచాయతీరాజ్‌శాఖ ఏఈ భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించారు. దగ్గరుండి పనులు చూసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కోటి రూపాయలతో నిర్మిస్తున్న భవనం ఇలాగేనా నిర్మించేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా పనులు చేపడితే పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన భవనం మూణ్నాళ్లకే పోతుందని అన్నారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏఈని హెచ్చరించారు. అనంతరం అదే ప్రాంగణంలో జరుగుతున్న మరో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని పంచాయతీ రాజ్ డీఈ జగన్మోహన్రెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, ఎంపీడీఓ సుభాషిణి తదితరులు ఉన్నారు. కాగా కలెక్టర్ రఘునందన్‌రావు ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.ఆయన వచ్చీ రావడంతోనే జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు పరిశీలించి ఇంజినీరింగ్ విభాగం అధికారులపై మండిపడటంతో అక్కడున్న వారందరూ ఖంగుతిన్నారు. -
బడ్జెట్ రోజు మరింత అప్రమత్తం
- స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు అవకాశం - మరింత పటిష్టంగా నిఘా వ్యవస్థ న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా నేడు(శనివారం) స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి. లావాదేవీలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారొకరు చెప్పారు. బడ్జెట్ అంచనాలను అవకాశాలుగా తీసుకొని కొంతమంది ట్రేడర్లు మోసపూరితంగా వ్యవహరిస్తారేమోన్న అంచనాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సహా పలు దేశీయ సంస్థలు ట్రేడింగ్‌లో పాల్గొంటాయని, భారీ టర్నోవర్ నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎలాంటి అకస్మాత్తు ఒడిదుడుకునైనా ఎదుర్కొనేలా సిస్టమ్‌లను, మౌలిక సదుపాయాలను అప్రమత్తం చేసుకోవాలని వివిధ మార్కెట్ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయనే అంచనాలతో ట్రేడింగ్ మార్జిన్‌ను పెంచుతున్నామని పలువురు బ్రోకర్లు ఇప్పటికే తమ తమ క్లయింట్లకు సమాచారమందించారు. విదేశాల్లో శనివారం స్టాక్ మార్కెట్లు సెలవు కాబట్టి, పలువురు విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. -
రుణమాఫీలతో ఒరిగేదేమీలేదు: దువ్వూరి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న రైతు రుణ మాఫీ పథకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. పైగా ఈ రుణ మాఫీ వల్ల వ్యతిరేక పరిణామాలు సంభవిస్తాయన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి, వారి ఈ స్థితికి దిగజారడానికి గల కారణాలు తెలుసుకుని, వారిని గట్టెక్కించడానికి ఇతర పరిష్కారమార్గాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ఆయన అన్యాపదేశంగా సూచించారు. శుక్రవారం ఇక్ఫాయ్ విద్యార్థులతో మాట్లాడుతూ 100 కోట్ల మంది ప్రజలు చెల్లించిన పన్నులను ఇలా రుణ మాఫీ పథకం కింద రైతులకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. ‘మీరు, మేము చెల్లించిన పన్నులతో రుణాలను ఎలా రద్దు చేస్తారని’ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ రైతు రుణ మాఫీ భారాన్ని భరిస్తున్న 100 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ సొమ్ము ఏ విధంగా వృథా అవుతున్నది తెలియకపోవడం దారుణమన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని తగ్గించుకుంటూ రెండంకెల వృద్ధిపై దృష్టిసారించాలన్నారు. జనధన యోజన కింద కేవలం బ్యాంకు అకౌంట్లు తెరిపించడమే కాకుండా పేదలకు రుణాలు, లావాదేవీలు అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలన్నారు. -
రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు
* సీజన్లో గరిష్టంగా 32,664 దిమ్మల రాక * కిటకిటలాడిన మార్కెట్ * రైతుల్లో ఉత్సాహం అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో సోమవారం ఈసీజన్‌కు రికార్డు స్థాయిలో లావాదేవీలు సాగాయి. మార్కెట్‌కు 32664 దిమ్మలొచ్చాయి. ఈ నెల 22న మార్కెట్‌కు 25962 ది మ్మలు రాగా, సోమవారం పెద్ద మొత్తంలో రైతులు తీసుకురావడంతో మా ర్కెట్ కళకళలాడింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో రైతులు బెల్లాన్ని పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్‌కు తరలించడం ఆనవాయితీ. అయితే ధరలు నిరాశజనకంగానే ఉన్నాయి. సీజన్ మొత్తంగా ఈ నెల 19న క్వింటా రూ. 3120లు ధర పలకడంతో రై తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అనంతరం ధరల్లో పెరుగుదల ఆశించినంతగా లేదు. సోమవారం మొదటిరకం గరిష్టంగా రూ.2830లకు మాత్ర మే అమ్ముడుపోవడంతో రైతులు ధరల పరంగా నిరాశకు గురయ్యారు. -
హైటెక్ మోసం
* బ్యాంక్ ఖాతా నుంచి రూ. 52 వేలు స్వాహా * హైదరాబాద్‌లో లావాదేవీలు * లబోదిబోమంటున్న బాధితుడు ముత్తారం :ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న మోసగాళ్లు రోజురోజుకూ హైటెక్ తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముత్తారం మండలం బుధవారంపేట(రామయ్యపల్లి)కి చెందిన కన్నూరి సదయ్య ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ.52 వేలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం.. మంథని ఆంధ్రాబ్యాంకులో 0843100008712 నంబరుతో ఖాతా ఉంది. దీనిపై 4688 1708 4305 9785 న ంబర్ గల ఏటీఎం కార్డు ఉంది. ఇటీవలే గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయగా దానికి సంబంధించిన వాయిదా కిస్తీ చెల్లించడం అప్పుగా తెచ్చుకున్న రూ. 61,500 బ్యాంకు ఖాతాలో జమచేశాడు. ఈనెల 2న సదయ్య మొబైల్‌కు ఫోన్ వచ్చింది. తాము ఏటీఎం కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు బ్యాంకు ఖాతా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏటీఎం తీసుకున్నారా? దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తున్నారా? కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పండి అని అడిగారు. ఇదంతా నిజమేననుకున్నా సదయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. జవాబులు చెప్పిన రోజే ఆయన ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయి. అయితే భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించే గడువు రావడంతో బ్యాంక్‌లోని డబ్బులు డ్రా చేయడం కోసం వెళ్లిన ఆయనకు అసలు నిజం తెలియడంతో లబోదిబోమన్నాడు. తాను డబ్బులు డ్రా చేయకుండా ఎలా ఖాతా నుంచి డ్రా అవుతాయని మేనేజర్ నిలదీయడంతో ఆయన చెప్పిన నిజాన్ని విని సదయ్య షాక్‌కు గురయ్యాడు. ఈ నెల 2 నుంచి 5 వరకు దాదాపు రూ.52 వేలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయిన ట్లు మేనేజర్ వివరించారు. ఇట్టి డబ్బులు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ప్రాంతంలో డ్రా అయినట్లు స్పష్టం చేశారు. ఆందోళన గురైన ఆయన ముత్తారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ విషయంపైన బ్రాంచీ మేనేజర్ సత్యనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయని, అయితే ఎవరు స్వాహా చేసిన విషయం తెలియదని చెప్పారు. హైటెక్ మోసంపై తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బెల్లం మార్కెట్‌కు చేదు ఫలితం
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఏడాదికేడాది లావాదేవీలు తగ్గిపోతున్నాయి. 2014-15 సీజన్ చేదు గణాంకాలను నమోదు చేసుకోనుంది. మా ర్కెట్ వర్గాలే పరిస్థితి నిరాశజనకంగా ఉంటుందని పేర్కొంటున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో లావాదేవీలు 50శాతం తగ్గిపోనున్నాయని విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం పొలాల్లోని చెరకు తోటలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా బెల్లం దిగుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదముందని అంటున్నారు. దీనివల్ల టర్నోవర్‌తో పాటు మార్కెట్‌కు లభించే సెస్ కూడా తగ్గనుంది. గతేడాది అక్టోబర్‌లో 7981 క్వింటాళ్ల బెల్లం (రూ.2.27 కోట్లు) లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది అదే నెలలో కేవలం 4942 క్వింటాళ్ల బెల్లం (రూ.1.19 కోట్లు) లావాదేవీలు ఇందుకు నిదర్శనం అంటున్నారు. 2013-14 సీజన్లో 6,06,475.4 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.144.65 కోట్ల వ్యాపారం జరిగింది. 2014-15 సీజన్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,87,079 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.41.03 కోట్ల వ్యాపారం జరిగింది. గత సీజన్ లావాదేవీలను చేరుకోవాలంటే రానున్న ఐదు నెలల్లో రూ.వంద కోట్లు పైబడి వ్యాపారం జరగాలన్నమాట. సోమవారం 3888 బెల్లం దిమ్మలు మార్కెట్‌కు రాగా, మొదటిరకం గరిష్టంగా రూ. 3010లు, మూడో రకం రూ.2300లు పలికింది. దీంతో మార్కెట్ కళకళలాడగా, మంగళవారం నాటికి బెల్లం దిమ్మల సంఖ్య 1742కి పడిపోయింది. మొదటిరకం గరిష్టంగా క్వింటా రూ.3290లు, మూడో రకం రూ.2250లకు తగ్గింది. వాస్తవానికి మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్లలో తుఫాన్లు, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా అనకాపల్లి మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగా.. ఈ ఏడాది హుద్‌హుద్‌తో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అనకాపల్లి మార్కెట్ నుంచి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌కు బెల్లం ఎగుమతి అవుతుంటుంది. జనవరి నాటికి చిత్తూరు నుంచి కూడా బెల్లం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడవన్నీ ఉత్తరప్రదేశ్‌లో బెల్లం ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వర్తకులు చెబుతున్నారు. -
పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు
* నగదు మార్కెట్లో క్షీణిస్తున్న లావాదేవీలు * ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణం సాక్షి ప్రత్యేక ప్రతినిధి,హైదరాబాద్: ధమాకా దీపావళి వచ్చేసింది. మూరత్ ట్రేడింగ్‌తో కొత్త సంవత్సరం ఖాతాలు తెరుచుకుంటున్నాయ్. గతేడాదితో పోలిస్తే..కొన్ని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు రాకెట్లా దూసుకుపోతోంది. గత నాలుగైదునెలలుగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి వ్యాపార పరిమాణం పెరుగుతోంది. పది లక్షల కొత్తఇన్వెస్టర్ అకౌంట్లు రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలయిన ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్లలో ఈ ఏడాది నమోదయ్యాయి.అయితే అదేం విచిత్రమోకానీ, ఒక వైపు బ్రోకింగ్ బిజినెస్ పెరుగుతున్నా, ఎంతో కాలంగా ఈ వ్యాపారంలో స్థిరపడ్డ బ్రోకర్లు వైదొలగుతుండటం ఆందోళనకలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో 335 మంది వ్యక్తిగత స్టాక్ బ్రోకర్లు, 136 కార్పొరేట్ బ్రోకర్లు, 5,773 మంది సబ్‌బ్రోకర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలిగారు. రిటైల్ ఇన్వెస్టర్ లావాదేవీలు ఆశించినంతగా లేకపోవడం, తక్కువ మార్జిన్లుండే ఆప్షన్ల వ్యాపారంపై డే ట్రేడర్లు ఆసక్తి చూపించడం, పెరిగిపోతున్న నిర్వహణా వ్యయాలను తట్టుకోలేకపోవడంతో బ్రోకర్లు వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాష్ మార్కెట్లో మందకొడి లావాదేవీలు... మార్కెట్లో 90 శాతం వ్యాపారం కేవలం 10 మంది టాప్ బ్రోకర్ల చేతిలో ఉందని, షేర్ల లావాదేవీల్లో 90 శాతం వ్యాపారం కేవలం ఆప్షన్స్ సెగ్మెంట్లో జరుగుతుందని ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మురళి తెలిపారు.గతంలో లాగా షేర్లు కొని డెలివరీ తీసుకునేవారు బాగా తగ్గిపోయారన్నారు. బ్రోకరేజీతో పాటు, సెక్యూరిటీ ట్రేడ్ టాక్స్ (ఎస్టీటీ), సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ లాంటి వ్యయాలతో పాటు ఒకే ఏడాది వ్యవధిలో షేర్లు కొని అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ లావాదేవీ పరిమాణంలో 15 శాతం చెల్లించాల్సిరావడంతో క్యాష్ మార్కెట్లో లావాదేవీలు గ ణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో మంచి ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోందని, బ్రోకరేజ్ సంస్థలు ట్రేడర్ను బట్టి మార్జిన్లలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారన్నారు. ఒక్కో ట్రేడర్ జరిపే లావాదేవీల పరిమాణంబట్టి అతి తక్కువ బ్రోకరేజ్కూడా ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధపడుతున్నాయన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించాలి... స్టాక్మార్కెట్లో లావాదేవీలు జరిపే క్లయంట్లకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ప్రశాంత్ శ్రీమాలి, ఎండీ, పీసీఎస్ సెక్యూరిటీస్ తెలిపారు. తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినంత మాత్రాన అందరూ ఆన్లైన్ లావాదేవీలు జరపలేరని, సాంప్రదాయబద్ధంగా షేర్ మార్కెట్ బిజినెస్‌చేసే వారు బ్రోకరేజ్ సంస్థలకు దూరం కాలేరని ఆయన చెప్పారు. గత ఏడెనిమిది దశాబ్దాలుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడు కూడా తమ వ్యాపారంలో 50 శాతం ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుండగా మిగతా సగం బ్రోకర్ ఇంటరాక్షన్‌తోనే జరుగుతుందన్నారు. రానున్న అడ్వైజరీ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అందిస్తే ఈ వ్యాపారంలో ఎంతకాలమైనా కొనసాగవచ్చన్నారు. అమెరికాలోలా ఇండియాలో ఫుల్సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అనే విధానంలేదని, ఇక్కడున్నదల్లా డిస్కౌంట్బ్రోకరే జ్ సంస్థలేని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వివికే ప్రసాద్ సాక్షి ప్రతినిధికి తెలిపారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్‌బ్రోకింగ్ సంస్థలు హైస్పీడ్ ట్రేడింగ్‌కు అనుగుణంగా సేవలందించేందుకు ముంబైలో కోలొకేషన్ సర్వర్లను ఏర్పాటుచేసుకోలేకపోవడంతోనే ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. ఒక్కో కోలొకేషన్ సర్వర్‌కు రూ. కోటి రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పాటు ముంబైలో కార్యాలయం నిర్వహించాలంటే అయ్యే ఖర్చులు అదనం కావడంతో పోటీలో నిలవలేని సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చౌక ధరలే ఆకర్షణ... ఆన్లైన్ ట్రేడింగ్ పుంజుకోవడంతో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుండి స్టాక్స్ కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ కొనుగోలు చేయాలంటే గతంలో వంద రూపాయలు బ్రోకరేజ్ చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు ఒక లాట్ ఆప్షన్స్ బ్రోకరేజీ రూ. 10-20కి పడిపోయింది. దీంతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే బ్రోకరేజీ సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయని జాజూ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజయ్‌జాజూ చెప్పారు. -
బ్యాంకింగ్.. ‘సెల్’చల్!
దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరుగుతుండటంతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు రెండు రెట్లు పెరగడం విశేషం. 2013-14 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ రూ. 3,190 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది రూ. 10,118 కోట్లు దాటింది. గతేడాది మొత్తం మీద జరిగిన లావాదేవీల విలువ రూ. 37,698 కోట్లు మాత్రమే. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగితే ఈ ఏడాది టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమీక్షా కాలంలో లావాదేవీల సంఖ్యలో కూడా భారీ వృద్ధి నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో 63 లక్షల లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 1.11 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో సగటు లావాదేవీ విలువ రూ. 5,145 నుంచి రూ. 9,198కి పెరగడం విశేషం. ప్రైవేటు బ్యాంకులే టాప్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులే ముందున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐ తప్ప మిగిలిన వాటిల్లో నామమాత్రపు లావాదేవీలే జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జూలై నెలలో రూ. 1,000 కోట్ల లావాదేవీలను నమోదు చేయడం ద్వారా ఈ మార్కును అందుకొన్న తొలి బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ రికార్డులకు ఎక్కింది. గతేడాది మొత్తం మీద రూ. 5,741 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ. 2,635 కోట్ల లావాదేవీలను నమోదు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబాంటీ బెనర్జీ తెలిపారు. గతేడాది మొదటి మూడు నెలల్లో రూ. 941 కోట్ల లావాదేవీలను ఐసీఐసీఐ బ్యాంక్ నమోదు చేసింది. ఈ ఏడాది మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ రూ. 2,269 కోట్లు, యాక్సిస్ రూ.1,826 కోట్లు, ఎస్బీఐ రూ.1,535 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి. బిల్లు చెల్లింపులే అధికం... మొబైల్ బ్యాంక్ ద్వారా జరుగుతున్న లావాదేవీల్లో ప్రధానంగా యుటిలిటీ బిల్లులు, మొబైల్ ఫోన్ రీ-చార్జ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్సే ప్రధానంగా నమోదవుతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు, ఖాళీ సమయంలో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండటం కూడా లావాదేవీలు పెరగడానికి కారణంగా బెనర్జీ పేర్కొన్నారు. రానున్న కాలంలో మొబైల్ బ్యాంక్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 15.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని, ఈ సంఖ్య 2017 నాటికి 48 కోట్లు దాటుతుందని గూగుల్ తాజా సర్వే వెల్లడించింది. -
దేవుడి సొమ్మే కదా..!
రాజన్న సొమ్ముతో చెలగాటం.. - గదుల విచారణ విభాగంలో రూ.50వేల లోటు - ఎవరు పూడ్చాలన్న దానిపై వాగ్వాదం.. - సిబ్బంది మధ్యన తలెత్తిన వివాదం వేములవాడ : దేవుడి సొమ్మే కదా.. మాకేంటి అనుకుంటున్నారు రాజన్న ఆలయ ఉద్యోగులు. ఉన్నతాధికారుల భయం అసలే లేనట్లుంది. రాజన్న సన్నిధిలో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మొన్న ముఖ్య బుకింగ్ కౌంటర్లలో వెలుగుచూసిన అక్రమాల లెక్కతేలకముందే నేడు వసతిగదుల విచారణ విభాగంలో మరో అక్రమం వెలుగులోకి రావడం నివ్వెరపరిచింది. ఏటా రూ.2కోట్లమేర ఆదాయం సమకూర్చే ఈవిభాగంలో నిత్యం సగటున రూ.55 వేల మేర లావాదేవీలు సాగుతాయి. తాజాగా శనివారం రూ.50 వేలమేర లోటు తలెత్తింది. ఈ మొత్తం నువ్వంటే నువ్వే.. చెల్లించాలంటూ సదరు విభాగం సిబ్బంది వాగ్వాదానికి దిగడం అందరినీ విస్తుపోయేలా చేసింది. అసలేం జరిగింది... ఓ వైపు ఆలయ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అక్రమాల పుట్టను వెలికితీసే ప నిలో నిమగ్నమైంది. ముఖ్యబుకింగ్‌తోపాటు పలు విభాగాల్లో వెలుగుచూసిన అక్రమాల లెక్కతేలేలోగానే మరోసారి లెక్కల తేడా పొడసూపింది. ఈసారి అది ఉద్యోగుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సదరు విభాగంలోని సిబ్బంది ఏకంగా నువ్వంటే నువ్వు చెల్లించాలంటూ వాగ్వాదానికి దిగడంతో కార్యాలయం దద్దరిల్లింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘రాజన్న సొమ్ము గోల్మాల్’ కథనంతో అన్ని విభాగాల పర్యవేక్షకులు అప్రమత్తమయ్యారు. కిందిస్థాయి ఉద్యోగులను విశ్వసించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలోనే ఆలయానికి సమకూర్చే ఆదాయంలో సింహభాగమైన వసతిగదుల విభాగం సూపరింటెండెంట్ తమ విభాగం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం సందర్భంగా సమకూరిన ఆదాయం పెద్దమొత్తంలో ఉంటుంది గనక తేడాలు రావొచ్చన్న సందేహంతో మరోసారి పరిశీలించారు. ఊహించినట్లుగానే రూ. 50వేలమేర లోటురావడడంతో అవాక్కయినట్లు సమాచారం. దీంతో సదరు విభాగంలోని సిబ్బందిని పిలిచి ఆరాతీశారు. ఇంకేముంది తేలుకుట్టిన దొంగల్లా సదరు సిబ్బంది చిందులు మొదలయ్యాయి. ‘తప్పు నీదంటే నీదంటూ’ పరస్పరం దూషించుకున్నారు. ఇదంతా చూస్తున్న అక్కడివారు నివ్వెరపోయారు. సమగ్ర విచారణ చేపడతాం.. సిబ్బంది పరస్పర వాగ్వాదానికి దిగిన ఘటన మాదృష్టికి వచ్చింది. అసలేం జరిగిందన్నది తేల్చుతాం. ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. బహుశా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సంబంధిత విభాగం అధికారి లెక్కలు పరిశీలించడంతో ఈవైనం వెలుగుచూసిందని భావిస్తున్నాం. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తాం. -హరికిషన్ ఏఈవో, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి -
ఎదురుచూపులు ఫలించేనా..!
- రుణమాఫీ కోసం కొందరు... - కొత్త రుణాల కోసం మరికొందరు.. - పెండింగ్ దరఖాస్తులు - బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవీలు..! విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రుణమాఫీ కోసం కొందరు.. కొత్త రుణాల కోసం మరి కొందరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆయనుుఖ్యమంత్రి అయితే తమ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో జిల్లాలోని 90 శాతం డ్వాక్రా గ్రూపు మహిళలు ఫిబ్రవరి నుంచి నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. ఫలి తంగా బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే సమయంలో ఆయన రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారని చెబుతున్నారు. దీంతో తమ రుణాలు మాఫీ అవుతాయని మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 31 వరకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తారా.. పాత బకాలయిలు మొత్తం రద్దు చేస్తారా.. అనే విషయమై డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రుణాలు మాఫీ చేస్తే వందల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభిస్తాయని భావించిన బ్యాంకర్లు మూడు నాలుగు నెలలుగా కొత్త రుణాలను మంజూరుచేయడం లేదు. ఫిబ్రవరి నుంచి డబ్బు చెల్లించని వైనం.. జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వాటిలో 24వేల వరకు గ్రూపులు రుణాలు పొందాయి. ఒక్కో గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్నాయి. స్వయం శక్తి సంఘాల సభ్యులు కూడా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై ఆశతో వీరిలో 90 శాతం మంది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు బ్యాంకులకు నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. విజయవాడ నగరపాలక సంస్థ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు, నూజివీడు మున్సిపాలిటీల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో మున్సిపాలిటీలో నెలకు సుమారు కోటి రూపాయల చొప్పున డ్వాక్వా రుణాల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు. విజయవాడ నగరంలో లక్షన్నర మంది డ్వాక్వా గ్రూపు సభ్యులు ఉండగా... ఏప్రిల్‌లో 20శాతం మంది, మేలో 10 శాతం మంది మాత్రమే నెలవారీ వాయిదాలను చెల్లించారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ చొప్పున నగరంలో నెలకు మూడు కోట్లకు పైగా ప్రతీ బ్యాంక్‌కు డ్వాక్వా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత నాలుగు నెలలుగా సుమారు రూ.470 కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయినట్లు భావిస్తున్నారు. పాత బకాయిలు సక్రమంగా చెల్లిస్తేనే కొత్త రుణాలిచ్చే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇతర రుణాలపైనా ప్రభావం...! సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్న డ్వాక్రా గ్రూపు సభ్యులు తిరిగి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో లావాదేవీలు నిలిచిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలను కూడా మంజూరు చేయలేకపోతున్నారు. తమకు డబ్బులు రొటేషన్ కావడం లేదని, అందువల్లే రుణాల దరఖాస్తులను పక్కన పెడుతున్నామని ఓ వాణిజ్య బ్యాంకు అధికారి తెలిపారు. -
చర్మం నుంచి నాడీకణాలు!
మనిషి చర్మ మూల కణాల నుంచి పరిణతి చెందిన నాడీకణాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. చర్మకణాల నుంచి సృష్టించినా.. ఇవి సహజ నాడీకణాల మాదిరిగానే పనిచేస్తుండటం విశేషం. ఈ కొత్త నాడీకణాలపై పరిశోధనల ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీసంబంధమైన వ్యాధులకు కొత్త చికిత్సలు, ఔషధాలు కనుగొనేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నాడీకణాలతో నాడీకణాల మార్పిడి కూడా వీలు కావచ్చని అంటున్నారు. సాధారణంగా మూలకణాలు శరీరంలో ఏ కణంగానైనా మారే శక్తిని కలిగి ఉంటాయి. ఎప్పుడు విభజన చెందాలి? ఎప్పుడు విభజన చెందడం ఆగాలి? ఎప్పుడు ఏ కణంగా మారాలి? అన్నదీ ఇవి నియంత్రించుకోగలవు. అయితే శరీరంలోని చాలా అవయవాల్లో కణజాలాల్లో ఉండే ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనే ప్రొటీన్లకు కూడా ఇలాంటి మూలకణాలను ఏర్పర్చే శక్తి ఉందని గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో కప్ప టాడ్‌పోల్ డింభకాల్లో నాడులు ఎలా ఏర్పడుతున్నాయన్న కోణంలో పరిశోధించిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు మనిషి నాడీకణాలను వేగంగా పరిణతి చెందించేందుకు ఉపయోగపడే ప్రక్రియను గుర్తించారు. ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ప్రొటీన్లను చర్మకణాలకు జతచేసి చర్మకణాలతో పరిణతి చెందిన నాడీకణాలను వారు విజయవంతంగా తయారు చేయగలిగారు. -
తెలంగాణ లావాదేవీలకు లైన్ క్లియర్!
మూడు బ్యాంకులతో ఒప్పందానికి ఆర్థిక శాఖ అనుమతి హైదరాబాద్: విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా మూడు జాతీయ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఖజానా శాఖకు తాజాగా అనుమతి లభించింది. అపాయింటెడ్ డే అయి న జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ లావాదేవీలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెవెన్యూ వసూళ్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు తదితర ప్రక్రియను ఎస్బీఐ, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా ఏర్పా టు కానున్న తెలంగాణకు సంబంధించి కూడా ఈ మూడు జాతీయ బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మేరకు ప్రస్తుత డీటీఏకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణకు ప్రత్యేకంగా ‘ట్రెజరీ.తెలంగాణ.జీవోవి.ఐఎన్’ పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ)లో నమోదు చే సుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌గా ‘తెలంగాణ.జీవోవి.ఐఎన్’ డొమైన్‌ను వినియోగించేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి -
బ్యాంకు ఖాతాలపై నిఘా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో బ్యాం కుల లావాదేవీలపై నిఘా పెట్టినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు, అంతకు మించి నగదు జమ చేసినా/విత్ డ్రా చేసినా వారి వివరాలను ఏ రోజుకు ఆరోజు తమ కార్యాలయానికి అందజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఎవరైనా ఆన్లైన్ పద్ధతి(ఆర్టీజీఎస్)లో నగదును ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసినా..సంబంధితుల వివరాలను సైతం అందజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీల ఖాతాల నుంచి రూ.లక్ష డ్రా చేసినా ఈ వివరాలను తెలపాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని జ్యుడిషియల్ హాల్లో బ్యాంకుల అధికారులతో సమావేశమై పలు సూచనలు జారీ చేశారు. ఏటీఎంలు, ఇతర బ్రాంచీలకు డబ్బులను రవాణా చేసే వాహనాల్లో ఇతరులకు చెందిన డబ్బును ఎట్టిపరిస్థితిల్లో రవాణా చేయవద్దని సూచించారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే సిబ్బందికి గుర్తిం పు కార్డులు అందజేయాలని సూచించారు. అభ్యర్థులు ఖాతా తెరవాలి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన ఏజెంట్ల పేర్లతో ప్రత్యేకంగా జాయింట్ ఖాతాను తెరవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖాతాలు తెరవడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చులను నగదు రూపంలో చెల్లించకుండా క్రాస్డ్ చెక్కుల ద్వారానే జరపాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ, ఏజేసీ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.