Uber
-
ఉబర్ ఆటో బుకింగ్.. ఇక ఓన్లీ క్యాష్ పేమెంట్!
ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసినప్పుడు పేమెంట్ ఆయా రైడ్ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.ఉబర్ (Uber) ఆటో రైడ్లకు పేమెంట్ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్ ద్వారా ఆటోలు బుక్ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది. ‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.కొత్త మార్పులు ఇవే.. ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు. నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్, ప్రమోషన్ ఆఫర్లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్ ప్రమేయం ఉంటుంది. -
యాపిల్.. ఓలా.. ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు
సాఫ్ట్వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.యాపిల్‌పై ఆరోపణలు..యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు..యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు. -
ఒక్కో ఫోన్లో ఒక్కోలా.. రైడ్ సంస్థల మాయాజాలం!
ఫుడ్, ట్రావెల్, కిరణా.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఆన్లైన్ యాప్‌లనే చాలా మంది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా కోసం అనేక రైడ్ హెయిలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలు ఒక్కో ఫోన్లో ఒక్కో రకంగా ఉంటున్నాయని, వేరు ధరలతో వినియోగదారులను మోసగిస్తున్నాయన్న ఆందోళనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ ఉబర్ (Uber) ధరల అల్గారిథమ్‌పై చేసిన ప్రయోగం రైడ్-హెయిలింగ్ సేవల్లో పారదర్శకత, నైతికత గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది.టెక్కీలకు ప్లేస్మెంట్ సర్వీసులు అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంజనీర్‌హబ్ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ వివిధ ఫోన్లలో, వేరు వేరు బ్యాటరీ స్థాయిలలో ఉబర్ చార్జీలపై ధరలను పరీక్షించి ఆ ఫలితాలను స్క్రీన్ షాట్లతో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఉబర్ ధరల వ్యత్యాసాన్ని పరీక్షించేందుకు రిషబ్ సింగ్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు ఐఫోన్లు వినియోగించారు. అన్నింటిలోనూ ఒకే ఉబర్ ఖాతాలోకి లాగిన్ అయ్యారు.ఒకే సమయంలో ఒకే విధమైన రైడ్లకు ఛార్జీలు ఎలా మారుతున్నాయో రిషబ్ సింగ్ గమనించారు.ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఛార్జీల వ్యత్యాసాలను రిషబ్ సింగ్ గమనించారు. డిస్కౌంట్లలోనూ తేడాలు కనిపించాయి. ఒక దాంట్లో 13% తగ్గింపు అని మరో దాంట్లో "50% తగ్గింపు"ను కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి పరికర ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉబర్ ధర భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఒకే ఖాతా, లొకేషన్, సమయం ఒకే విధమైన షరతులు ఉన్నప్పటికీ ధరలు మారుతూ కనిపించాయని రిషబ్ సింగ్ పేర్కొన్నారు.బ్యాటరీ శాతం ప్రభావంపూర్తిగా ఛార్జ్ చేసిన ఫోన్లతో పోలిస్తే చార్జింగ్ తక్కువగా ఉన్న ఫోన్లో ఎక్కువ ఛార్జీలు కనిపించాయి. ఇది ప్రవర్తనా వ్యూహమని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుందని రిషబ్ వివరించారు. తక్కువ బ్యాటరీలు ఉన్న వినియోగదారులు అత్యవసరం కారణంగా అధిక ధరలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉందని భావించే సిద్ధాంతానికి ఇది అనుగుణంగా ఉందని రాసుకొచ్చారు. దీనినే "బిహేవియరల్ ఎకనామిక్స్" అంటారని, బ్యాటరీ డేటాను తెలుసుకోవడం ద్వారా, ధరల అల్గారిథమ్‌లు వినియోగదారు పరిస్థితులను ఉపయోగించుకుంటాయని వివరించారు.ఈ ప్రయోగం ద్వారా రైడ్ కంపెనీల చార్జీల పారదర్శకత గురించి ఆందోళనలను ఆయన లేవనెత్తారు. ఛార్జీలను సర్దుబాటు చేయడానికి ఉబర్ అల్గారిథమ్‌లు ఫోన్ల రకం, బ్యాటరీ స్థాయి వంటి వినియోగదారు డేటాను ఉపయోగించుకుంటాయా అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా ప్రతిస్పందించారు. రిషబ్ సింగ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. -
డాక్టర్ చేసిన పనికి.. దిగొచ్చిన ఉబర్!
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డ్రైవర్లు మన ముందు వాలిపోతుంటారు. అయితే కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.ఒక డాక్టర్ (Doctor) తెల్లవారుజామున 3.15 గంటలకు ఉబర్ రైడ్(Uber Ride) బుక్ చేసాడు. కానీ డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడమే కాకుండా.. ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ఉబర్ కస్టమర్ సపోర్ట్‌కు తెలియజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకుని ఆ డాక్టర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఫ్లైట్ అప్పటికే వెళ్లిపోయింది.తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో.. మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే తనకు కలిగిన అసౌకర్యానికి.. డాక్టర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసు విచారణకు ఉబర్ ఇండియా హాజరు కాలేదు. చివరికి ఉబర్ ఇండియా వల్ల కలిగిన అసౌకర్యానికి కోర్టు.. డాక్టరుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది.ఇదీ చదవండి: ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. ఉబర్ ఇండియా ఢిల్లీ స్టేట్ కమీషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ కూడా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థిస్తూ.. ఉబర్ ఇండియా (Uber India) 45 రోజుల్లో 54,100 రూపాయలు డాక్టరుకు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించడంలో ఆలస్యమైతే 6 శాతం వడ్డీ చెల్లించాలని వెల్లడించింది. ఇందులో రూ. 24100 అదనంగా టికెట్ కొనుగోలు చేసినందుకు, అతని మానసిక ఒత్తిడికి రూ. 30,000 అని తెలిపింది. -
ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ట్యాక్సీ, ఆటో సేవల యాప్‌లు చార్జీల విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై విచారణ(inquiry) జరపాలంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ(CCPA)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి తెలిపారు. ఆండ్రాయిడ్, యాపిల్(Apple) డివైజ్‌లపై ఒకే తరహా రైడ్‌కి సంబంధించి వేర్వేరు రేట్లు చూపిస్తుండటం అసమంజసమైన వాణిజ్య విధానమే అవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన జోషి పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు లభించాల్సిన పారదర్శకత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ, టికెట్ బుకింగ్ యాప్స్ తదితర రంగాలకు కూడా దీని పరిధిని విస్తరించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటున్నాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్(Tweet), ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024 -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!
ఆన్లైన్ రవాణా సేవలందిస్తున్న ఉబర్ కొత్తగా జల రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రోడ్లపై వాహనాలను బుక్ చేసుకున్నట్లే, ఇకపై నీటిలో బోట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఆసియాలో తొలిసారిగా జల రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా(సంప్రదాయ చెక్క పడవలు) బుకింగ్‌ను పరిచయం చేసింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో ప్రయాణించే ఈ శికారా పడవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సరస్సు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. శతాబ్దాలుగా సరస్సులో రవాణా, విశ్రాంతి కోసం శికారాలను ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల‘సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా శికారా రైడ్ అందించి వారికి మరుపురాని అనుభవాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కశ్మీర్‌లోని ఉత్కంఠభరిత ప్రకృతి దృశ్యాన్ని మరింత మందికి చేరువ చేయడం, పర్యాటకాన్ని మెరుగుపరిచే ఈ ఐకానిక్ అనుభవాన్ని సృష్టించడం గర్వకారణం’ అని ఊబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ తెలిపారు. ఉబర్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శికారా రైడ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వేదికగా 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకునే వీలుంది. దాల్ లేక్‌లో దాదాపు 4,000 శికారాలు ఉన్నట్లు అంచనా. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
అదర్‌సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
ఉబర్‌కు షాక్.. రూ. 2,718 కోట్లు ఫైన్
-
డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండి’
ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్ జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని తమ యూఎస్ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
వైరల్ వీడియో.. ఉబర్ డ్రైవర్‌పై పెప్పర్ స్ప్రేతో యువతి దాడి
ఉబర్ డ్రైవర్‌పై ఓ యువతి పెప్పర్ స్ప్రేతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మన్హట్టన్లో అర్ధరాత్రి సమయంలో పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. కారులో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా ఆ మహిళ పెప్పర్ స్ప్రే కొట్టింది. దాడి చేయొద్దంటూ బాధితుడు వేడుకున్న కానీ ఆ మహిళ వినలేదు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. దాడి సమయంలో యువతితో పాటు మరో మహిళ కూడా కారులో ఉంది.నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. అయితే.. డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం తెలియలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే ఈ దాడి ఘటన తర్వాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళనకరం.. ఇది సరికాదు. హింసను సహించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నట్లు ఉబర్ వెల్లడించింది.NYCWoman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024 -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
ఢిల్లీ రోడ్లపైకి ఉబెర్ ఏసీ బస్సులు
దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్, అవేగ్ బస్సులను నడపడానికి లైసెన్స్‌లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం. -
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్‌లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్‌కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్.. బస్సులను నడపడానికి సిద్ధమైంది. ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ సర్వీసు ప్రారభించనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సేవను దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభించనుంది.ఉబెర్కి బస్సులను నడపడానికి ఢిల్లీ రవాణా శాఖ అగ్రిగేటర్ లైసెన్స్ మంజూరు చేసింది. యాప్‌లో 'ఉబర్ షటిల్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత లైవ్ లొకేషన్, రూట్‌ని ట్రాక్ చేయవచ్చు.ఉబర్ బస్సులో ఒకసారికి 19 నుంచి 50 మంది ప్రయాణికులు పయనించవచ్చు. రోజు వారీ ప్రయాణాలను కూడా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసును మొదటి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరీక్షించారు. ఇక త్వరలోనే ఈ సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత కోల్‌కతాలో ప్రారంభించే అవకాశం ఉంది.బస్సు సర్వీస్ కోసం లైసెన్స్ పొందిన మొదటి కంపెనీగా ఉబెర్ అవతరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ఢిల్లీ ప్రభుత్వంలోని రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇతర ప్రధాన నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్‌లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఫేక్ ఉబర్ డ్రైవర్ల హల్ చల్..
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైడ్‌షేర్ డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు. ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? -
8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్ తాజాగా వినియోగదారుడికి రూ.10వేలు పరిహారం చెల్లించాలంటూ చండీగఢ్ కన్జూమర్ ఫోరమ్ తీర్పు చెప్పింది. తక్కువ దూరాలకు సంబంధించిన రైడ్లకు ఉబర్ అధికమొత్తంలో ఛార్జీ వసూలు చేస్తుండడంతో అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. పూర్వాపరాలు విచారించిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల్లోని వివరాల ప్రకారం.. ఆగస్టు 6, 2021న చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ తను ఉన్న ప్రదేశం నుంచి వేరేచోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను వెళ్లాలనుకునే ప్రదేశం గూగుల్ మ్యాప్స్‌లో 8.83 కిలోమీటర్లుగా చూపించింది. దాంతో ఉబర్ బుక్ చేయాలనుకున్నారు. తాను ఎంచుకున్న రైడ్‌కు ముందస్తు ఛార్జీలు రూ.359గా చూపించింది. వెంటనే రైడ్ కన్ఫర్మ్ చేశారు. అయితే రైడ్ ముగిసి క్యాబ్ దిగేప్పుడు ముందస్తు ఛార్జీలతో పోలిస్తే అదనంగా రూ.1,334 రైడ్ ఛార్జీలు చూపించాయి. దాంతో చేసేదేమిలేక ఆ మొత్తాన్ని చెల్లించారు. తర్వాత అశ్వనీ ప్రశార్ కస్టమర్ చాట్, ఈమెయిల్ల ద్వారా కంపెనీకి సమస్యను వివరించారు. ఎంత ప్రయత్నించినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దాంతో పూర్తివివరాలతో కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించిన కోర్టు తాజాగా ఉబర్ కంపెనీ రూ.10,000 పరిహారంతో పాటు చట్టపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10,000లను ప్రయాణికుడికి చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. విచారణ సమయంలో ఉబర్ ఇండియా ఛార్జీల పెంపును సమర్థించింది. అందుకు అనేక రూట్ డివియేషన్స్ కారణమని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఛార్జీలు, వాస్తవ ఛార్జీల మధ్య భారీ వ్యత్యాసం అన్యాయమని ఫోరమ్ తేల్చి చెప్పింది. -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
ఉబర్ సీఈఓను పొగడ్తలతో ముంచేసిన 'ఆనంద్ మహీంద్రా' - ట్వీట్ వైరల్
భారతదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఈఓ 'దారా ఖోస్రోషాహి'ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా అతని నాయకత్వంలో రైడ్-హెయిలింగ్ యాప్ కంపెనీ ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్నీ వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు. దారా ఖోస్రోషాహి ఉబర్ సీఈఓగా నియమితులైన తొలి రోజుల్లో ఎన్నో సందేహాలు కలిగాయని, ఆ తరువాత దావోస్‌లో కలిసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న ఉబర్ గట్టెక్కుతుందా అనిపించిందని, కాబట్టి ఆయన ఎక్కువ రోజులు సీఈఓగా ఉండలేరని ఆనంద్ మహీంద్రా ఊహించనట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఉబర్ ఈ రోజు లాభాల బాట పట్టిందంట ఖచ్చితంగా దారా ఖోస్రోషాహి కృషి అని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజమైన నాయకుల గొప్ప లక్షణమే సంస్థ అభివృద్ధికి కారణమవుతుందని వెల్లడించారు. నేడు ఉబర్ 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. I first met @dkhos in Davos shortly after he had taken the helm at @Uber I must confess that I wondered how long he would stay at the company & indeed, how long Uber would survive. Today, the company is solidly profitable, its corporate culture is disciplined and no-frills, &… pic.twitter.com/hHwFPCq7P9 — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
ఉబర్ సీఈఓతో గౌతమ్ అదానీ.. అసలేం జరుగుతోంది!
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'గౌతమ్ అదానీ' శనివారం ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'దారా ఖోస్రోవ్షాహి'తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను అదానీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారతదేశంలో గ్రీన్, పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను కూడా వేగవంతం చేయడానికి చేయడానికి, ఉబెర్‌తో భవిష్యత్ సహకారాల కోసం ఈ సమావేశం జరిగింది. ఫొటోలను షేర్ చేస్తూ.. భారతదేశంలో ఉబర్ విస్తరణకు సంబంధిచి దారా ఖోస్రోవ్షాహి విజన్ ప్రశంసించదగ్గదని కొనియాడారు. ప్రత్యేకించి భారతీయ డ్రైవర్ల గౌరవాన్ని పెంచడంలో అతనికున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. దేశంలో పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అగ్రగామిగా నిలువడానికి సంస్థ కృషి చేస్తోంది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ.. ఇక ఉబర్ విషయానికి వస్తే.. ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ ఫ్లీట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉబర్ గ్రీన్ అని పిలువబడే ఈవీ సర్వీస్ ఢిల్లీలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలను ఈ సర్వీస్ విస్తరించనున్నట్లు సమాచారం. Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s — Gautam Adani (@gautam_adani) February 24, 2024 -
డెలివరీ బాయ్‌గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్‌గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్‌గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ ఉబర్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ ఇ-కామర్స్ విపణిలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఫ్యాషన్ సంస్థలు ఎక్కువగా ఓఎన్డీసీ వేదికను వినియోగించుకుంటుండగా, కొత్తగా రవాణా రంగ సంస్థలూ ఈ వేదికపైకి వస్తున్నాయి. తాజాగా తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశంలో ఇంటర్సిటీ బస్సు, మెట్రో రైలు టిక్కెట్ బుకింగ్‌ల వంటి ఆఫర్లను ఉబెర్ కల్పించనుంది. ఈ కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా ఖోష్క్రోవ్సహి ‘పెద్ద మొత్తంలో టెక్నాలజీని నిర్మించడం’ అనే అంశంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనితో గురువారం చర్చించారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని తెలిపారు. టెక్నాలజీ కంపెనీగా ఓపెన్ సోర్స్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఉబర్ ఎప్పుడూ ముందుంటుందని డారా చెప్పారు. ఉబర్‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏమిటని నందన్ నిలేకని అడగగా, ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు. ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా దేనికీ డబ్బు చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. లో–కాస్ట్ సర్వీస్‌లను విస్తరిస్తామని డారా చెప్పారు. ఏమిటీ ఓఎన్డీసీ? దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్ నిలేకని, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. -
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్‌తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్‌పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్‌ను అమలుచేసే అవకాశం ఉంది. -
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
సాదాసీదా క్యాబ్ డ్రైవరే కావొచ్చు.. ఓలా, ఉబెర్‌లకు గట్టిపోటీ ఇస్తున్నాడు!
ఓ సాదాసీదా క్యాబ్ డ్రైవర్ దేశీయ దిగ్గజ రైడ్ షేరింగ్ సంస్థలు ఓలా, ఉబెర్ గుత్తాదిపత్యానికి చెక్ పెడుతున్నాడు. చాపకింద నీరులా రైడ్ షేరింగ్ మార్కెట్‌ని శాసించే దిశగా వడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? ఓలా, ఉబెర్ మార్కెట్‌ను తనవైపుకి ఎలా తిప్పుకుంటున్నాడు? చేతిలో వెహికల్ లేదు. అత్యవసరంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలి. ఆ సమయంలో మనం ఏం చేస్తాం. ఫోన్ తీసి వెంటే ఓలా, ఉబెర్‌తో పాటు ఇతర రైడ్ షేరింగ్ యాప్స్ ఓపెన్ చేసి అవసరానికి తగ్గట్లు బైక్, ఆటో, కారు ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం. సెకన్లు, నిమిషాల వ్యవధిలో సదరు క్యాబ్ డ్రైవర్ వచ్చి మనల్ని కోరుకున్న గమ్యానికి సురక్షితంగా వెళుతుంటారు. అలాంటి ఓ క్యాబ్ డ్రైవర్ సొంతంగా రైడ్ షేరింగ్ సంస్థను స్థాపించాడు. మార్కెట్లో కింగ్ మేకర్‌గా ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. Peak Bengaluru: Mr Lokesh my uber cab driver informed me that he has launched his own app to compete with uber and ola and already has more than 600 drivers on his app. Moreover, today they launched their IOS version for apple too. #Bengaluru #peakbengaluru@peakbengaluru pic.twitter.com/IGdiWItPG4 — The Bengaluru Man (@BetterBengaluro) December 20, 2023 600 మందికి పైగా డ్రైవర్లతో బెంగళూరు కేంద్రంగా ఒకప్పటి ఓలా, ఉబెర్‌లలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసిన లోకేష్ ‘నానో ట్రావెల్స్’ పేరుతో సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభిచాడు. ఇప్పటికే ఆ సంస్థతో సుమారు 600పైగా డ్రైవర్లు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ని కాదు.. ఓ కంపెనీకి బాస్‌ని ఈ తరుణంలో లోకేష్ నడుపుతున్న క్యాబ్‌ను బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ప్రయాణించాడు. ప్రయాణించే సమయంలో కస్టమర్, నానో ట్రావెల్స్ ఓనర్ లోకేష్‌లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తాను క్యాబ్ డ్రైవర్ని కాదని, ఓలా,ఉబెర్ల తరహాలో నానో ట్రావెల్స్ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెప్పాడు. అంతేకాదు నేటినుంచి యాపిల్ ఐఓఎస్ యూజర్లకు తమ సంస్థ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఆ యాప్స్‌ను సొంతంగా డెవలప్ చేసింది తానేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సదరు కష్టమర్ వంతైంది. అవసరం అయితే ఫోన్ చేయండి ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇతర అత్యవసర సమయాల్లో క్యాబ్ కావాల్సి ఉంటే ఫోన్ చేయమని కోరుతూ ఇరువురి ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నారు. లోకేష్ జరిపిన సంభాషణను కస్టమర్ ఎక్స్. కామ్‌లో ట్వీట్ చేయడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఎదుగుతున్నందుకు శుభాకాంక్షలు చెబుతుంటే రైడ్ షేరింగ్ మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. నిలబడడం కష్టమేనని అంటున్నారు. కొత్త సంస్థలు పుట్టుకు రావడం మంచిదే మరికొందరు ఉబెర్, ఓలా వంటి దిగ్గజ సంస్థ కొన్ని సార్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన ప్రయాణాల్ని అందించలేవు. రైడ్ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ క్యాబ్ కోసం ఎదురు చూసే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నానో ట్రావెల్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందంటూ రిప్లయి ఇస్తున్నారు. చదవండి👉 రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ! -
ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు. -
క్యాబ్‌లలో ఈ స్ట్రాటజీ గురించి తెలుసా? ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు!
అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్‌టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్‌లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా? క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్‌గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు. స్ట్రాటజీ ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్ట్‌లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్లను క్యాన్సిల్ చేస్తాడు. కస్టమర్ల డిమాండే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్‌కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు. రైడ్ రిక్వెస్ట్‌లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్‌ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు. ఇబ్బందులు తప్పవ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్‌ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు. చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ -
300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు. ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్! భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు.. ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది. ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు. -
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
అక్రమాలకు పాల్పడున్న భారతీయ అమెరికన్‌కు జైలు.. వివరాలివే..
న్యూయార్క్: అక్రమాలకు పాల్పడుతున్న 49 ఏళ్ల భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. అతను అక్రమంగా భారతీయ పౌరులను ఉబెర్ సాయంతో కెనడా నుంచి అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించడం, అలాగే వారిని మిడ్వెస్ట్, అక్కడి కన్నా ముందుకు తీసుకురావడం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతనికి మూడేళ్లకు పైబడిన జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ.. కాలిఫోర్నియాకు చెందిన ఎల్మ్గ్రోవ్ నివాసి రాజిందర్ పాల్ సింగ్ ఉరఫ్ జస్పాల్ గిల్ మనీలాండరింగ్‌కు పాల్పడుతూ విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సియెటల్ జిల్లా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అక్రమంగా సరిహద్దులలోకి ప్రజలను తరలించేందుకు ఉబెర్‌ను ఉపయోగించిన స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడైన రాజిందర్ సింగ్ తాను అర మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని అందుకున్నట్లు గత ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు. సరిహద్దులు దాటించేందుకు ఉబెర్.. తీర్పు సందర్భంగా యూఎస్ తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వ్యవధిలో సింగ్ 800 మందికి పైగా ప్రజలను ఉత్తర సరిహద్దుల గుండా యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేలా అవకాశం కల్పించాడన్నారు. 2018 జూలై ప్రారంభంలో సింగ్, అతని సహచరులు కెనడా నుండి సియెటల్ ప్రాంతానికి ప్రజలను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ఉబెర్‌ను ఉపయోగించారని’ తెలిపారు. 2018 నుండి 2022 మే మధ్యకాలంలో భారతీయ పౌరులను యునైటెడ్ స్టేట్స్కు అక్రమంగా పంపేందుకు సింగ్ 600 ఉబెర్ ట్రిప్పులను ఏర్పాటు చేశాడు. ఇలా వారిని యూఎస్‌లోకి అక్రమంగా తరలించిన తర్వాత సింగ్ తన సహచరుల సాయంతో వాషింగ్టన్ రాష్ట్రం వెలుపలి నుంచి వారిని గమ్యస్థానాలకు తరలించేందుకు ప్లాన్ చేసిన మార్గాలకు ఒక్కొక్కటి చొప్పున పలు వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. సింగ్, అతని సహచరులు నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించారని రుజువయ్యింది. మహమ్మారి తర్వాత వేగవంతం.. వీరి అక్రమ రవాణా వ్యవహారాలు 2018 నుండి కొనసాగుతున్నాయని న్యాయవాద కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సమయంలో వీరి అక్రమ కార్యకలాపాలు మందగించాయి. మహమ్మారి పరిమితులు ఎత్తివేసిన తరువాత వారు తిరిగి తమ అక్రమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. జూలై 2018- ఏప్రిల్ 2022 మధ్య ఈ స్మగ్లింగ్ రింగ్‌తో లింక్ అయిన 17 ఉబెర్ ఖాతాల ద్వారా $80,000కు పైగా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
కిడ్నాప్ అనుమానంతో డ్రైవర్‌పై కాల్పులు
టెక్సాస్: ఉబర్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్‌కు చెంది ఫోబె కోపాస్ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీతో డ్రైవర్ డేనియల్ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. -
అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్ కష్టాలు: మిలియన్ డాలర్ల సెల్ఫీ వైరల్
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్ సెల్ఫీవైరల్గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు) మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్‌హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ సమావేశానికి కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్‌నకు హాజరైనారు. అయితే అంబానీ ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో 3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో మాటల్లో పడి , తర్వాతి లంచ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్‌ను మిస్ అయిపోయారు. చివరికి ఉబెర్ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్‌షేక్ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని కలిశారు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఈ సందర్భాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్‌కు బదులుగా సునీతా స్పేస్ షటిల్లో వెళదామా అని సునీతాని అడిగామంటూ వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు. ఇది 10 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌తో వైరలైంది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్ వినీత్ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో.. ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI — anand mahindra (@anandmahindra) June 25, 2023 -
ఉబెర్ మరోసారి ఉద్యోగాల కోత: 200మందికి ఉద్వాసన
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇదీ చదవండి: అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..! రిక్రూట్మెంట్ విభాగంల 200 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు బుధవారం తెలిపింది. 32,700 గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 1శౠతం కంటే తక్కువ మందిని ఇది ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో దాని సరుకు రవాణా సేవల విభాగంలో 150 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇటీవలి నెలల్లో ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్ కంటే చిన్న కోతలను అమలు చేసింది. అయితే 2020 కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో సిబ్బంది సంఖ్యను 17శాతం సిబ్బందిని తొలగించింది. 🔵 Uber Technologies said on Wednesday it was cutting 200 jobs in its recruitment division amid plans to keep the staff count flat through the year and streamline costs.Full Story → https://t.co/XaDmqpELDF pic.twitter.com/5la7M80Fln— PiQ (@PriapusIQ) June 21, 2023 -
ఉబర్, ర్యాపిడోలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
-
ర్యాపిడో, ఊబర్లకు షాక్.. అప్పటి వరకు సర్వీసులు బంద్!
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బైక్-ట్యాక్సీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ సంస్థలు అందించే సేవలను నిషేదిస్తూ ఢిల్లీ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ర్యాపిడో,ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లగా.. వీటి సర్వీసులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్-ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై పరిపాలన ద్వారా తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్లను దేశ రాజధానిలో తమ సర్వీసులు నిలిపివేయాలని తెలిపింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అయితే ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మే 26న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఈ అంశంపై.. జులై ఆఖరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని తమ వాదనను వినిపించగా... జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. చదవండి: Cyclone Biparjoy Updates: అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్జోయ్ -
ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల, సుస్థిర వ్యాపార విధానానికి మద్దతుగా ఉబర్ గ్రీన్ పేరుతో కొత్త సేవలకు రైడ్ హెయిలింగ్ యాప్ ఉబర్ శ్రీకారం చుట్టింది. ప్రయాణం కోసం ఉబర్ యాప్‌లో కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా కోరవచ్చు. జూన్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని 100కుపైగా నగరాల్లో ఉబర్ గ్రీన్ ఆన్ డిమాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. 2040 నాటికి పూర్తిగా.. ‘ఈవీల వాడకం ఊపందుకోవడంతో భారత మార్కెట్ కంపెనీకి ప్రాధాన్యతగా నిలిచింది. 2040 నాటికి సంస్థ వేదికగా ప్రతి రైడ్ ఎలక్ట్రిక్ వాహనం ఆధారంగా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని ఉబర్ మొబిలిటీ, బిజినెస్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు యాక్టివ్ డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నట్టు చెప్పారు. బుకింగ్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థకు భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ వృద్ధిని నడిపించడానికి పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. భారత్‌లో 125 నగరాల్లో ఉబర్ సేవలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 10,000 నగరాల్లో ఉబర్ వాహనాలు పరుగెడుతున్నాయి. పెద్ద ఎత్తున భాగస్వామ్యం.. ఉబర్ భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్ చేస్తోంది. తాజాగా పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 25,000 ఎలక్ట్రిక్ కార్లను తన వేదికపై జోడించనుంది. ఉబర్ చేతులు కలిపిన కంపెనీల్లో లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్, మూవ్ ఉన్నాయి. అలాగే 2024 నాటికి ఢిల్లీ నగరంలో 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిప్ ఎలక్ట్రిక్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఉబర్ ఈవీల ఫాస్ట్ చార్జింగ్ కోసం జియో–బీపీ, జీఎంఆర్ గ్రీన్ ఎనర్జీతోనూ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. రుణ సౌకర్యం కోసం.. డ్రైవర్ పార్ట్నర్స్, ఇతర భాగస్వాములకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించేందుకు సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకుంది. పూర్తిగా ఈవీలకు మళ్లడం ఒక సవాల్. ఈవీలకు మారే ప్రక్రియలో ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదు అని ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ అన్నారు. ‘ఈవీ రంగంలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రైడ్–షేరింగ్ పరిశ్రమలో డ్రైవర్లు వేగంగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సాయం చేస్తున్నాం. 2030 నాటికి యూరప్, ఉత్తర అమెరికాలో సున్నా ఉద్గార స్థాయికి చేరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఈ లక్ష్యానికి చేరుకుంటాం’ అని వివరించారు. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?
ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది. ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది. ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది. (ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు) గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. -
ఉబర్ డ్రైవర్ ఔదార్యం! అపరిచిత ప్రయాణికుడి కోసం..
మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్ డ్రైవర్ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్‌కి తెలియదు. తను డ్రాప్ చేయాల్సిన కస్టమర్ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన బిల్ సుమీల్ అనే వ్యక్తి డయాలసిస్ సెంటర్‌కి వెళ్లాలని ఉబర్ బుక్ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్ సుమీల్ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ టిమ్ లెట్స్తో మాటలు కలిపాడు. తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్‌తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్ డ్రైవర్ టిమ్ తన కిడ్నిని సుమీల్‌కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్‌కి సూట్ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్ టిమ్ సుమీల్‌కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్‌కి ఆపరేషన్ చేశారు. అది విజయవంతమయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్ డెలావేర్ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్ డ్రైవర్ టిమ్ లైట్స్ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్ డ్రైవర్ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: విమానంలో అనౌన్సర్‌గా బీజేపీ ఎంపీ..షాక్‌లో ప్రయాణికులు) -
Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ 'ఉబర్' (Uber) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ రోజు మన ప్రయాణాలను మరింత సుగమనం చేయడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్‌లో కంపెనీ కూడా గుర్తించని ఒక బగ్ ఒక ఇండియన్ గుర్తించి సంస్థ నుంచి భారీ నజరానా పొందాడు. నివేదికల ప్రకారం.. ఉబర్ యాప్‌లో ఫ్రీ రైడింగ్‌కి సంబంధించిన ఒక బగ్ ఉన్నట్లు భారతీయ ఎథికల్ హ్యాకర్ 'ఆనంద్ ప్రకాశ్' కనిపెట్టాడు. ఈ విషయాన్నీ స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి కంపెనీ అతనికి రూ. 4.5 లక్షలు బహుమతిగా అందించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్‌లో కనిపించిన ఈ కొత్త బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఫ్రీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అప్పుడు కంపెనీ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు ఇది హ్యాకర్ కంటపడి కంపెనీ దృష్టికి చేరటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. దీని గురించి ఒక వ్యక్తి చెప్పే వరకు కంపెనీ గుర్తించకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!) ప్రకాష్ 2017లో ఈ కనుగొన్నట్లు, 2019లో దీని గురించి కంపెనీకి వివరించినట్లు సమాచారం. కంపెనీకే తెలియని విషయం చెప్పిన ఇతనికి సంస్థ జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి వివరంగా తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించారు. -
Uber Ride: 90 రోజుల ముందే ఉబర్ రైడ్ బుక్ చేసుకోండి!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ 'ఉబర్' (Uber) వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఇకపై ఉబర్ సర్వీస్ కోసం 90 రోజులకు ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన టెన్షన్ దూరమవుతుంది. (ఇదీ చదవండి: Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి) ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేవారు లేదా వచ్చేవారికి ఇప్పటికే ప్రధాన ఎయిర్ పోర్టులలో ఉబర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పికప్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాలను కలిగి ఉండటం వల్ల వినియోగదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మూడు నెలలకు ముందే (90 రోజులు) బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఇతర ప్రయాణాలకు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఉబర్ డ్రైవర్లు కూడా ముందుగానే బుకింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనదేశంలో కొన్ని ఎయిర్ పోర్టులలో ఉబర్ సర్వీస్ మరింత సులువుగా ఉంటుంది. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ఒక యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి అలాంటి సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్..
ఇటీవల ఢిల్లీలో ఓ కస్టమర్‌కు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ షాక్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 లకుపైగా వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్.. టైమ్స్‌నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్ బుక్ చేసుకున్నారు. ఆమె ప్రయాణం పూర్తయి గమ్య స్థానం చేరుకోగానే ఉబర్ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది. ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు. ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు తేలింది. బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరింది. దీంతో ఇంత మొత్తంలో బిల్లు వచ్చింది. బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది. ఉబెర్ క్యాష్ వాలెట్లో రూ.900 రీఫండ్ చేసింది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్ తమ సేవల్ని మెరుగుపర్చింది. ఉబర్ రిజర్, పికప్ డైరెక్షన్స్, వాకింగ్ ఈటీఏస్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. -
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉబర్ ఆగ్రహం?
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొల్యూషన్‌ను తగ్గించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగర పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని క్యాబ్ సర్వీస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మాత్రమే ట్యాక్సీలుగా వాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయిస్తే లక్ష మందికి పైగా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తింటుందని పేర్కొంది. అంతేకాదు లక్షలాది మంది రవాణా అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈవీను మాత్రమే ట్యాక్సీలు వాడాలన్న ఢిల్లీ సర్కార్ అమలు చేయడం అసాధ్యమని, కావాలంటే దీనిపై సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌ను కోరింది. మరోవైపు ఉబర్ సంస్థ 2040 నాటికి క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహనాలన్నీ కర్భన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే మూడేండ్లలో 25 వేల ఈవీలను క్యాబ్ సర్వీసులుగా వాడనున్నట్లు ఉబర్ ప్రకటించింది. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్‌ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బైక్ సర్వీస్ అగ్రిగేటర్లకు దేశ రాజధానిలో భారీ షాక్ తగిలింది. ఓలా, ఉబర్, రాపిడో బైక్ సర్వీసులను నిలిపివేస్తూ ఢిల్లీ రవాణాశాఖ ఆదశాలు జారీ చేసింది. వాటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. అంతేకాదు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే మహారాష్ట్ర నిషేధాన్ని ఎదుర్కొంటున్న క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబెర్, ర్యాపిడో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, రాపిడోలు తమ బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఢిల్లీ రవాణా శాఖ ఫిబ్రవరి 20న పబ్లిక్ నోటీసును జారీ చేసింది.రవాణాయేతర (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ గుర్తు/నంబర్లు కలిగిన ద్విచక్ర వాహనాలు ప్రయాణీకులను తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని, ఇది పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు, మోటారు వాహన చట్టం, 1988ని ఉల్లంఘించినట్టేననని రవాణా శాఖ తెలిపింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే మొదటి నేరానికి రూ. 5వేలు జరిమానా, రెండు, తదుపరి నేరానికి రూ. 10,000 జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని రవాణా శాఖ హెచ్చరించింది. అంతేకాదు, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తామని తాజా నోటీసులో పేర్కొంది. -
ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉబర్ క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రైవర్ ఫోన్ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్ లొకేషన్ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. -
ఓలా, ఉబర్, రాపిడోలకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్‌కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్‌కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు. కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్‌లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
భారత్‌కు ఉబర్ గుడ్‌బై.. స్పందించిన సీఈవో
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా, ఉబర్లు మెర్జ్ అవుతున్నాయా?ఊబర్ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. పలు నివేదికల ప్రకారం.. ఓలా- ఉబర్లు మెర్జ్ అవుతున్నాయని, ఇందులో భాగంగా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్..అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో మంతనాలు జరిపారని నివేదికల సారాంశం. అయితే ఆ వార్తల్ని భవిష్ అగర్వాల్ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్ అయ్యే అవకాశం లేదని ఖండించారు. భారత్ నుంచి బెర్ అవుట్ మరో రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్ షేరింగ్ మార్కెట్ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని అన్నారు. బ్లూం బెర్గ్ ఏం రాసిందంటే ఈ ఏడాది జూన్‌లో ఓలా, ఉబెర్ల గురించి బ్లూం బెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. పెరిగిపోతున్న ధరల కారణంగా ఆ సంస్థలు అభివృద్ధితో పాటు లాభాల్ని గడించడంలో ఇబ్బందులు పడుతున్నాయని హైలెట్ చేసింది. అందుకే భారత్ మార్కెట్ నుంచి ఉబర్ నిష్క్రమించవచ్చని సూచించింది. అయితే భవిష్యత్తులో ఉబెర్ భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగించేందుకు దేశీయంగా మరో రైడ్ షేరింగ్ సంస్థతో జతకట్టవచ్చని వెల్లడించింది. అందుకు ఉబర్ చైనాలో దీదీ గ్లోబల్‌తో, ఆగ్నేయాసియాలో గ్రాబ్ హోల్డింగ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉదహరించింది. -
విలీనమా.. నో వే!...కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్ సంస్థల విలీనం గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది. అయితే ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్ బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 -
భారత్‌లో నైజీరియా స్టార్టప్ ఎంట్రీ.. ఆ మూడు నగరాలే టార్గెట్!
న్యూఢిల్లీ: వాహన రుణ రంగంలో ఉన్న నైజీరియా స్టార్టప్ మూవ్ తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలను ప్రారంభించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. మొబిలిటీ ఎంటర్ప్రైసెస్కు రెవెన్యూ ఆధారిత రుణాన్ని కంపెనీ అందిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ఉబర్‌కు వాహనాల సరఫరా భాగస్వామిగా ఉంది. ఉబర్ డ్రైవర్ పార్ట్నర్లకు ప్రత్యేకంగా రుణం సమకూరుస్తోంది. రుణం అందిస్తున్న వాహనాల్లో 60 శాతం హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. 13 దేశాల్లో కార్యకలాపాలను మూవ్ సాగిస్తోంది. డ్రైవర్ పార్ట్నర్లు 50 లక్షల ట్రిప్‌లను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది. సంస్థ ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు సమీకరించింది. చదవండి: Karur Vysya Bank: అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది! -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్‌ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్‌తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్‌లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్‌లోని సేఫ్టీ టూల్ కిట్‌లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్‌తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్‌లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
ప్రయాణికులకు భారీ షాక్, పెరిగిన క్యాబ్ ఛార్జీలు!
ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రైడ్ షేరింగ్ సంస్థ సిద్ధమైంది. ఉబెర్ కార్ సర్వీస్ ఛార్జీల ధరల్ని పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్ డైర్టకర్ నితీష్ భూషణ్ బ్లాగ్‌లో తెలిపారు. "పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్ డ్రైవర్లు కౌన్సిల్ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త ఫీచర్లను యాడ్ చేసింది రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది అని ఉబెర్ పేర్కొంది. సీపీపీఏ వార్నింగ్‌తో ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) రైడ్ షేరింగ్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం' వంటి ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్లను రైడ్ క్యాన్సిలేషన్లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది. -
ఉమన్ బైక్ ట్యాక్సీ రైడర్
నాన్న, అన్నయ్య, భర్త, కాకుండా ఎంతో దగ్గరి స్నేహితుడైతేనే అమ్మాయిలు ఇతరుల టూవీలర్ ఎక్కుతారు. అటువంటిది తన స్కూటర్ మీద ఎంతోమందిని ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో దించుతూ వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది మౌతుషి బసు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మౌతుషి ఊబెర్ టూవీలర్ రైడర్‌గా మారింది. కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఆకలికి ఉద్యోగం ఉందా ఊడిందా అనేది తెలియదు. అందుకే ఎంతోమంది తమ అర్హతలకు సరిపోని ఉద్యోగాల్లో చేరి మరీ కుటుంబాలను లాక్కొస్తున్నారు. ఈ కోవకు చెందిన 30 ఏళ్ల అమ్మాయే మౌతుషి. కరోనాకు ముందు పానాసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కరోనాతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. దీంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికింది. కానీ ఎక్కడా తనకు సరిపోయే జాబ్ దొరకలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా వెతుకుతూనే ఉంది. చివరికి ఊబెర్లో టూవీలర్ రైడర్‌గా చేరింది. అంతకుముందు రైడింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైడర్‌గా పనిచేస్తోంది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైటర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కాడు. డ్రైవర్ అమ్మాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత మౌతుషితో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా ‘సిస్టర్ నువ్వు ఎంతోమందికి ప్రేరణ’ అని అభినందిస్తున్నారు. అంతేగాక రణవీర్‌ని కూడా తెగపొగిడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని పోస్టు వేలసంఖ్యలో లైక్‌లతో తెగ వైరల్ అవుతోంది. కుటుంబం కోసం తన శాయశక్తులా కృషిచేస్తోన్న మౌతుషి ఎంతోమంది యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
ఉబర్‌లో మరో 500 నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణ సేవలు అందిస్తున్న ఉబర్ టెక్నాలజీస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్తగా 500 మంది సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది. హైదరాబాద్, బెంగళూరులోని సంస్థ కార్యాలయాల్లో ఇప్పటికే 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2021లో 250 మందిని చేర్చుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతను, దేశంలోని ఇంజనీరింగ్ ప్రతిభను గుర్తించడాన్ని ఈ నియామక ప్రణాళిక నొక్కి చెబుతుందని ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్ -
క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్ అగ్రిగేటర్స్) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆయా సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది. సిస్టమ్‌లను సత్వరం మెరుగుపర్చుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించింది. తమ విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘వారి ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న సంగతి వారికి చెప్పాం. గణాంకాలు కూడా చూపించాము. సిస్టమ్‌లను సరిచేసుకోవాలని, ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించాము. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాము‘ అని సమావేశం అనంతరం వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. క్యాబ్ అగ్రిగేటర్స్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. ట్యాక్సీ సేవల సంస్థలు సత్వరం పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా క్యాబ్ అగ్రిగేటర్లు అనుచిత వ్యాపార విధానాలు పాటించకుండా త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తప్పుడు విధానాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే వారికి స్పష్టం చేసినట్లు ఖరే పేర్కొన్నారు. మరోవైపు, సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని క్యాబ్ అగ్రిగేటర్లు పేర్కొన్నారు. క్యాన్సిలేషన్ చార్జీల విషయానికొస్తే, ఆర్డరు రద్దవడం వల్ల డ్రైవరు నష్టపోకుండా పరిహారం చెల్లించేందుకే సదరు చార్జీలు విధిస్తున్నట్లు తెలిపారు. ఓలా, ఉబెర్, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారంపై వినియోగదారుల వ్యవహారాల విభాగంతో కలిసి పని చేస్తున్నామని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ విభాగం హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ఫిర్యాదులు ఇలా..: చార్జీలు, ట్రిప్‌ల రద్దు విషయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లపై భారీగా ఫిర్యాదులు ఉంటున్నాయి. వివిధ కారణాల వల్ల ట్రిప్‌లను అంగీకరించడానికి ఇష్టపడని డ్రైవర్లు వాటిని రద్దు చేసుకోవాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రిప్ క్యాన్సిల్ చేస్తే అగ్రిగేటర్ సంస్థ పెనాల్టీలు విధిస్తోంది. అలాగే, అసలు ఏ ప్రాతిపదికన ప్రయాణ చార్జీలను నిర్ణయిస్తున్నారన్న అంశంపై పారదర్శకత లోపించింది. ఈ నేపథ్యంలో క్యాబ్ అగ్రిగేటర్లు అనుసరిస్తున్న అల్గోరిథమ్‌లు, ఇతరత్రా విధానాలను కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఖరే పేర్కొన్నారు. ట్రావెల్, ఫుడ్ అగ్రిగేటర్లపై ఎఫ్హెచ్ఆర్ఏఐ ఫిర్యాదు.. ఆన్లైన్ ట్రావెల్ (ఓటీఏ), ఫుడ్ అగ్రిగేటర్లు (ఎఫ్ఎస్ఏ) పోటీని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తున్నాయంటూ ఆతిథ్య రంగ సంస్థల సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ తాజాగా ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కమిటీ చైర్మన్ జయంత్ సిన్హాకు లేఖ రాసింది. కొన్ని ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా సంస్థల్లో ఎలాంటి వ్యవస్థా లేకపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎఫ్హెచ్ఆర్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్బక్షీష్ సింగ్ కోహ్లి పేర్కొన్నారు. ఓటీఏలు, ఎఫ్‌ఎస్‌ఏలు.. కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విఫలమవుతుండటం వల్ల ఇటు కస్టమర్లు అటు సర్వీస్ ప్రొవైడర్లు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. పైగా తమకు సంబంధం లేని చార్జీలను వివిధ పేర్లు, సాకులతో రెట్టింపు స్థాయిలో విధిస్తున్నాయన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లే వీటిని విధిస్తున్నాయనే భావనలో కస్టమర్లు ఉంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్ !
ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫాం ఉబర్ తాజాగా క్యాబ్ సర్వీసుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ప్రకటించింది. సీఎన్జీ ధరల పెంపు..! దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ క్యాబ్ సర్వీసులు అధిక సంఖ్యలో నడుస్తాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రయాణ ఛార్జీలను 12 శాతం మేర పెంచుతున్నట్లు ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది.కొద్ది రోజల క్రితమే ముంబై, హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసుల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్యాబ్ డ్రైవర్లు ధరలను పెంచాలని నిరసనలు కూడా చేపట్టారు. ఇక రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఆయా క్యాబ్ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇలాగే ఇంధన ధరలు పెరిగితే క్యాబ్ సర్వీసుల ధరలు పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఏసీ ఆన్ చేస్తే వాతే..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?
ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రం ఆఫీస్ హడావుడి మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. క్యాబ్ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్ ఎక్కిన తర్వాత.. డ్రైవర్ ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓ అని తెలిస్తే?వెంటనే మీరు ఏమి ఆలోచిస్తారు. ఈ కథనం చదువుతున్నవారు మొదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. కానీ, ఇటీవల అనుభవమే న్యూఢిల్లీ ప్రజలకు ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్ సింగ్ సంస్థ చేపట్టిన ఓ పరిశోధనలో భాగంగా ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్ అవతారం ఎత్తారు. సాధారణ క్యాబ్ డ్రైవర్ లాగానే ఢిల్లీ వీధుల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయాలను క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు తమ సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. అనన్యా ద్వివేదీ(లింక్డిన్ యూజర్) ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది. "చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రం ఆఫీస్ కోసం బయటకొచ్చి నేను క్యాబ్ బుక్ చేశాను. డ్రైవర్ ఎవరో తెలుసా? ఉబెర్ ఇండియా బాస్.. ప్రభజీత్ సింగ్! ఓ రీసెర్చ్'లో భాగంగాడ్రైవర్గా మారారంటా. తొలుత నాకు ఏదో సదేహంగా అనిపించి ఆయన గురించి గూగుల్ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే!. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం" అని ఆమె రాసుకొచ్చింది. మరో లింక్డిన్ యూజర్ సౌరభ్ కుమార్ వర్మ కూడా ఉబెర్ ఇండియా సీఈఓపై ప్రశంసలు కురిపించారు. ప్రభజీత్ సింగ్ ఉబెర్ సంస్థ సేవలను మరింత మెరుగుపరించేందుకు పరిశోధనలో భాగంగా డ్రైవర్ అవతారం ఎత్తారు. "ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మన క్యాబ్ డ్రైవర్‌గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్" అని అన్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. (చదవండి: Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!) -
హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్.. ఇకపై ఆ ఆటోలకు ఎంట్రీ లేదు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో నమోదైన ఆటో రిక్షాలను మాత్రమే ఓలా, ఉబెర్‌లలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతించబోమన్నారు. ఇతర ప్రాంతాల్లో నమోదైన ఆటోరిక్షాలు ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండబోదని చెప్పారు. అలాంటి ఆటోలపై జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అనుమతించడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏ నిబంధనల మేరకు వాటిని అనుమతించారో స్పష్టం చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రైవేట్ ద్విచక్ర వాహనాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాహనాల వేగ నియంత్రణపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రముఖ మొబిలిటీ ప్లాట్ ఫామ్ ఉబర్ కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. దీంతో కస్టమర్లు తమ రేటింగ్స్ ను తెలుసుకునే అవకాశం కలగనుంది. కొత్త అప్డేట్... సాధారణంగా ఉబర్ లో ఆయా కస్టమర్ ప్రయానించినప్పుడు సదరు ట్రిప్ పై డ్రైవర్ కు రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఐతే సదరు డ్రైవర్ కూడా రైడ్ పూర్తిచేసిన వారికి కూడా రేటింగ్ ఇస్తారు. ఇది ఆయా కస్టమర్స్ కు కనిపించదు. కాగా ఉబర్ ఇప్పుడు తాజాగా తెచ్చిన ఫీచర్ తో ఇకపై సదరు డ్రైవర్ కస్టమర్ కు ఇచ్చిన రేటింగ్ కనిపించనుంది. రైడర్లు తమ డ్రైవర్ల నుంచి ఎన్ని ఫైవ్-స్టార్ రేటింగ్‌లు లేదా వన్-స్టార్ రేటింగ్‌లు అందుకున్నారో ఇప్పుడు చూడగలుగుతారని ఉబర్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అటు డ్రైవర్లకు కస్టమర్స్ కు... డ్రైవర్లకు, కస్టమర్లకు దృష్టిలో వుంచుకుని ఉబర్ ఈ ఫీచర్ ను తెచ్చింది. డ్రైవర్ల నుంచి సదరు రైడర్ వారు అందుకున్నా రేటింగ్ గల కారణాన్ని కూడా చూడవచ్చు. కాగా ఉబర్‌లో ప్రయాణించేటప్పుడు సదరు వాహనాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కస్టమర్ది. ఉబర్ రైడర్లు, డ్రైవర్లు ఒకరికొకరు అభిప్రాయాన్ని తెలియజేసుకోవడానికి సంవత్సరాలుగా కొత్త మార్గాలపై కంపెనీ పని చేస్తోంది. ఇక 2017లో డ్రైవర్ ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్‌ను అందించే వీలును ఉబర్ కస్టమర్లకు అందించింది. -
ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ తెగ వాడేస్తున్నారా? అయితే, మీకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ వారి వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డేటాను "తృతీయపక్ష ప్రకటనల" కోసం ఉపయోగిస్తున్నారు. సర్ఫ్ షార్క్ డేటా సెన్సిటివిటీ ఇండెక్స్ అనేది రైడ్-హైలింగ్ యాప్స్ అనేవి వారి వినియోగదారుల నుంచి ఏ రకమైన డేటా సేకరిస్తున్నాయో తెలియజేస్తుంది. గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్'గా నిలిచాయి. వినియోగదారుల నుంచి డేటా సేకరిస్తున్న పరంగా స్వదేశీ రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. వినియోగదారులకు సేవలను అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 3 అంశాల ఆధారంగా ఈ డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ తెలిపింది. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు ఇందులో తేలింది. ఉబెర్, లిఫ్ట్ కలిసి 7వ స్థానంలో నిలిచాయి. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ నిలిచింది. (చదవండి: ప్రపంచంలో మరో వింత.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో) -
కొత్త సంవత్సరంలో జీఎస్టీ మోత, వేటి మీద ఎంతంటే..
న్యూయర్ ప్రారంభం నుంచి కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ షాకిచ్చాయి. నేటి నుంచి (జనవరి1) నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ప్రతి కస్టమర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్ పెట్టే కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్స్ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది. గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఓలా,ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్, ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు జనవరి అమల్లోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. ఇక వీటితో పాటు ధరలతో సంబంధం లేకుండా ఫుట్ వేర్ పై నేటి నుండి 12 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. చదవండి: కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే.. -
ఓలా, ఉబెర్.. మరీ ఇంత వరెస్టా?
Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది. కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది. ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చదవండి: మీరు పార్ట్నర్స్.. మీరే లొల్లి చేయడమేంది? -
జనవరి 1 నుంచి ఆటో ఎక్కితే మోత మోగాల్సిందే..!
కొత్త ఏడాదిలో కేంద్రం ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5% జీఎస్టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. వీధులలో తిరిగే ఆటో రైడ్ల మీద ఎలాంటి జీఎస్టీ విధించరు. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ఉబర్, ఓలా, రాపిడో వంటివి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ విషయం మీద తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఏ.సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు వచ్చే బుకింగ్ రైడ్లు తగ్గుతాయని అన్నారు. ఇప్పటికే, ఈ మహమ్మారి వల్ల ఆటోరిక్షాలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షల వల్ల ఆటోలో ప్రయాణీకుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల, ప్రయాణీకుల సమస్యలు మరింత పెరగనున్నట్లు వివరించారు. (చదవండి: ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!) -
అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ..
ఇంతకుముందు ఆకలైతే వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండుకోవడమో.. లేక వండినది రెడీగా ఉంటే అది తినడమో చేసేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకలైతే మొబైల్ ఫోన్ తీసుకొని నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తాం. 30 నిమిషాల్లో వేడివేడి ఆహారం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ రోజుల్లో నగరంలోనైనా.. మారుమూల ప్రాంతమైనా ఇలా ఫుడ్ డెలివరీ అవుతోంది. ఈ టెక్ యుగంలో ఇలాంటిది రోజూ మనకు అనుభవమే. అయితే, భూమ్మీదనే కాదు అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ అవుతోంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఎలాగో తెలుసుకుందాం..! భూమ్మీదనే డెలివరీ చేయాలా? అంతరిక్షానికి డెలివరీ చేయకూడదా అని జపాన్‌లోని ఉబర్ ఈట్స్ కంపెనీ ఆలోచన చేసింది. అనుకున్నదే తడవు గా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే వ్యోమగాములకు మొదటిసారి ఫుడ్ డెలివరీ చేసింది. అయితే, దీనికోసం సాధారణ డెలివరీ బాయ్ వెళ్లలేదు. ఏకంగా జపాన్ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ యుసాకు మేజవాను కంపెనీ రంగంలోకి దింపింది. ఆయన టీషర్ట్, టోపీ ధరించి డెలివరీ బాయ్ వేషంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వ్యోమగాములు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. గోధుమ రంగులో ప్యాక్ చేసిన ఆహారాన్ని ఐఎస్ఎస్ కమాండర్ ఆంటోన్ స్కప్లెరోవ్ చేతికందించారు. అంతరిక్షంలోకి కూడా ఆహారాన్ని డెలివరీ చేసినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ♦మేజవా స్కప్లెరోవ్ జపాన్ వంటకాలతో సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి నుంచి అంతరిక్షానికి ఎగిరారు. 8 గంటల 34 నిమిషాలపాటు 248 మైళ్ల దూరం ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకున్నారు. అయితే, డెలివరీకి 30 నిమిషాలు ఆలస్యమైంది అని అన్నారాయన. ఇంతకీ ఆయన తీసుకెళ్లిన పార్సిల్లో ఏమున్నాయంటే.. చికెన్, బాంబూ షూట్స్, జపనీస్ బీఫ్ బౌల్, సబా మిసోని, ఇతర జపాన్ వంటకాలు. మేజవా 12 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఫుడ్ డెలివరీ చేశారు కదా ఆయనకు అక్కడేం పని అనుకుంటున్నారా? ఆయనకు అంతరిక్ష యాత్ర చేయడమంటే మహా సరదాలెండి. తనకు మొదటి ఫుడ్ డెలివరీ బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆయన సోమవారం అంతరిక్షం నుంచి భూమ్మీదకు సురక్షితంగా చేరారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కోట్లకు అధిపతి.. కానీ డెలివరీ బాయ్‌గా మారాడు
గతంలో తినాలంటే ఇంట్లో చేసిన ఫుడ్ లేదా బయట హాటల్‌కి వెళ్లి కడుపునిండా ఆరగించేవాళ్లం. టెక్నాలజీ పుణ్యమా అని పుడ్ కూడా డెలివరీ యాప్స్ ద్వారా మన గడప వద్దకే వస్తోంది. ఇంకేముంది కదలకుండానే నచ్చిన ఆహారాన్ని లాగించేస్తున్నాం. ఇదంతా నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన చాలా అరుదు అని చెప్పాలి. ఎందుకంటే పుడ్ డెలివరీ అంటే 10 లేదా 20 కిలోమీటర్లు డెలివరీ చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోని వ్యక్తికి డెలివరీ చేశాడు. అది డెలివరీ చేసిన బాయ్ కూడా మామూలు వ్యక్తి కాదు.. ఆయనో బిలినియర్ అవ్వడం విశేషం. ఇలా చేయడం అసాధ్యమే కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఉబర్ పుడ్ డెలివరీ సంస్థ. వివరాల ప్రకారం.. అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఓ వ్యోమగామికి ఉబెర్ ఈట్స్ ఫుడ్‌ను డెలివరి చేసింది. ఆ డెలివరీ ఇచ్చింది జపాన్‌కి చెందిన బిలినియర్ మెజ్వానా. డిసెంబర్ 11న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం ఆయన దాదాపు 12 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలోని కక్ష్యలో ప్రయాణం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Uber Eats のデリバリーは、進化し続けています。 今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMX — Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021 -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, ఉబర్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్ల తయారీపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేసింది. కాగా, ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. 2028 నాటికి తన మొదటి వాణిజ్య విమానాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయలని లక్ష్యంగా చేసుకుంది. హ్యుందాయ్ యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ కోల్ ఈ దశాబ్దం చివరినాటికి ఎగిరే కార్లు వాస్తవ రూపం దాల్చుతాయి అని తాను నమ్ముతున్నానని గతంలో తెలియజేశారు. "ఇవి భవిష్యత్తులో మన జీవితంలో భాగం కానున్నట్లు మేము నమ్ముతున్నాము" అని అతను చెప్పారు. హ్యుందాయ్ ఇప్పటికే ఎస్-ఎ1 కాన్సెప్ట్ అభివృద్ధిపై పనిచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. అలాగే, 600 మీటర్ల వరకు వెళ్లగలదు. ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. (చదవండి: భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!) -
ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
వాహన ప్రయాణికులకు శుభవార్త. చేతిలో ఊబెర్ షేరింగ్ యాప్ లేకపోయినా వాట్సాప్ ఆన్‌లో ఉంటే చాలు ఇకపై ఊబెర్ క్యాబ్స్‌ను బుక్ చేసుకోవచ్చని' ఊబెర్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి మనదేశంలో ఈ తరహా క్యాబ్ సర్వీసుల్ని ఊబెర్ అందించనుంది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రైడ్ షేరింగ్ సంస్థ ఊబెర్ సరికొత్త రైడ్ షేరింగ్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఊబెర్ యాప్ లేకుండా ఊబెర్ లోని చాట్ బోట్‌తో కనెక్టై సులభంగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోనే ప్రారంభించారు. త్వరలో దేశం మొత్తం విస్తరించేందుకు ఊబెర్ ప్రతినిధులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. వాట్సాప్‌తో క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలి వాట్సాప్ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఉబెర్ వాట్సాప్ చాట్ లింక్‌పై క్లిక్ చేస్తే బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడే పికప్, డ్రాప్ లొకేషన్‌తో పాటు ఫేర్ ప్రైస్, క్యాబ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు డిస్ప్లే అవుతాయి. ఫైనల్‌గా మీరు ‘బుక్ ఎ రైడ్’ పై క్లిక్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: ‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...! -
ఉబర్‌లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
డెలివరీ బాయ్ నిర్వాకం: ‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’
పిల్లలు ఆకలి అనడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది ఓమహిళ. ఆర్డర్ పెట్టిన తర్వాత తన అడ్రస్ బదులు స్నేహితురాలి ఇంటి చిరునామా ఇచ్చినట్లు గుర్తించింది. వెంటనే డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. ఆర్డర్లో ఉన్న అడ్రస్‌కు కాకుండా.. తన ఇంటికి ఫుడ్ తీసుకురమ్మని కోరింది. అందుకు అంగీకరించని డెలివరీ బాయ్.. ఆమె ఆర్డర్ చేసిన ఆహారాన్ని చెత్తలో పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు డెలివరీ బాయ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. జీనెట్ ఎరిక్సన్-గ్రే అనే మహిళ తన ఏడు సంవత్సరాల కుమార్తె కోసం ఉబర్ ఈట్స్‌లో మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్స్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత అడ్రస్‌లో తన ఇంటి చిరునామాకు బదులు.. ఫ్రెండ్ అడ్రస్ ఉన్నట్లు గుర్తించింది. వెంటన్ డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. అడ్రస్ తప్పుగా ఉంది.. అందులో ఉన్న చిరునామాకు కాకుండా.. ఇప్పుడు తాను చెప్పబోయే అడ్రస్‌కు ఆర్డర్ తీసుకురావాల్సిందిగా కోరింది. (చదవండి: కాఫీ లేట్ అవుతుందని చెప్పినందుకు ఎత్తి పడేసింది.. అంతా షాక్!) అందుకు డెలివరీ బాయ్ ఒప్పుకోలేదు. ‘‘మొదట ఇచ్చిన అడ్రస్‌కే ఆర్డర్ తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. కావాలంటే మీరే మీ స్నేహితురాలి ఇంటికి రండి’’ అని తెలిపాడు. అందుకు ఆ మహిళ బయట వర్షం వస్తుంది.. ఆర్డర్లో ఉన్న అడ్రస్‌కు సమీపంలోనే మా ఇల్లు ఉంది.. దయచేసి రండి.. కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తాను అని తెలిపింది. తన ఇంటి అడ్రస్ని సెండ్ చేసింది. కానీ డెలివరీ బాయ్ అందుకు ససేమీరా అన్నాడు. ఆ తర్వతా సదరు డెలివరీ బాయ్ జీనెట్కు ఓ ఫోటో షేర్ చేశాడు. మీ ఆర్డర్‌ని ఇక్కడ పడేశాను.. వెళ్లి తీసుకోండి అని మెసేజ్ చేశాడు. తీరా చూస్తే అది తన స్నేహితురాలి ఇల్లు కూడా కాదు.. ఎక్కడో రోడ్డు పక్కన చెత్తలో తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని పడేసి వెళ్లాడు. ఇక చేసేదేం లేక జీనెట్ తన పిల్లలను తీసుకుని.. డెలివరీ బాయ్ పంపిన ఫోటోలోని చోటకు వెళ్లింది. కానీ అక్కడ వారికి తాము ఆర్డర్ చేసిన ఫుడ్ కనిపించలేదు. చేసేదేం లేక ఉత్త చేతులతో అక్కడ నుంచి వచ్చేశారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఇక దీని గురించి జీనట్ ఉబర్ యాప్‌లో ఫిర్యాదు చేసింది. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించలేదు. జరిగిన సంఘటన గురించి జీనట్ సోషల మీడియాలో షేర్ చేయగా.. సదురు డెలివరీ బాయ్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. వ్యవహారం కాస్త ముదరడంతో ఉబర్ యాజమాన్యం దీనిపై స్పందించింది. ‘‘మా డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. జీనట్కు క్షమాపణలు తెలుపుతున్నాం. ఆమె డబ్బులను పూర్తిగా తిరిగి ఇవ్వడమేకాక.. ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని జీనట్కు టిప్‌గా ఇస్తున్నాం’’ అని తెలిపారు. కానీ జీనట్ మాత్ర మళ్లీ జన్మలో ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనని తెలిపింది. చదవండి: మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్ -
హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’
లండన్: ఇటీవల కాలంలో అందరూ ఉబర్, ఓలా, ఆన్లైన్ రైడ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేయించుకుని పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్లోని సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్ కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అని చెప్పాడు. ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్లైన జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF — Jeremy Abbott (@Funster_) October 21, 2021 -
ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించిన ఉబర్..!
Uber To Get 50000 Tesla Electric Cars After Hertz Deal: ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నద్దమైన విషయం తెలిసిందే. సాంప్రదాయ శిలాజ ఇంధన వాహనాలకు చెక్ పెడుతూ..ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. కాగా హెర్జ్ వంటి రెంటర్ కార్ ఆపరేటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు సిద్దమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉబర్ దృష్టి..! ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పేరొందిన టెస్లాతో అమెరికన్ రెంటల్ కార్ కంపెనీ హెర్జ్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. హెర్జ్ సుమారు లక్ష టెస్లా కార్లను ఆర్డర్‌ను చేసింది. తాజాగా మరో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ క్యాబ్ ఆపరేటర్ ఉబర్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా హెర్జ్ కంపెనీ భాగస్వామ్యంతో ఉబర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెర్జ్ రెంటల్ ఎలక్ట్రిక్ కార్లను ఉబర్ వాడనుంది. సుమారు 50 వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉబర్ ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి 50 వేలకు ఎలక్ట్రిక్ కార్ల క్యాబ్ సర్వీస్‌లను ప్రవేశపెడతామని ఉబర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా, యూరప్, కెనడాలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఉబర్ వెల్లడించింది. చదవండి: చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
త్వరలో ఉబర్ డైవర్లకు పెన్షన్
లండన్: ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ యూకేలోని పనిచేస్తున్న అర్హులైన ఉబర్ డ్రైవరలందరి కోసం నెలరోజుల వ్యవధిలోనే పెన్షన్ పథకం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. గత నెలలో ఉబర్ డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్‌లోని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డ్రైవర్లు తాము ఆర్జిస్తున్న సంపాదనలో కనీసం 5% ఆదా చేసుకున్నట్లయితే 3% పెన్షన్ ప్లాన్‌కి దోహదపడుతుందని ఉబర్ పేర్కొంది. అయితే బ్రిటన్ జీఎంబీ యూనియన్ యూకేలోని డ్రైవర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతేకాదు వారికి వర్కఫోర్స్ తరుఫున చర్చించే హక్కు కూడా కల్పించింది. ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలను తమ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లకు కూడా ఇలాటి ప్రయోజనాలను అందించాలని ఉబర్, జీఎంబీ సంస్థలు కోరాయి. ఈ సందర్భంగా ఉబర్ ఎగ్జిక్యూటివ్ జామీ హేవుడ్ మాట్లాడుతూ..."సరికొత్త ఒరవడిని సృష్టించే ఈ పరిశ్రమల పెన్షన్ పథకంలో ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలతో కలిసి చేయడానికి స్వాగతిస్తున్నాను" అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభంకానున్న ఈ పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లందరికీ ఈ పథకం వర్తిస్తుంది. -
ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం.. త్వరలో హైదరాబాద్‌లో
సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి. క్వాడ్రి సైకిల్ బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి. త్వరలో హైదరాబాద్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్. -
సైకిల్ మీద ఉబెర్ సీఈవో ఫుడ్ డెలివరీ.. సంపాదన ఎంతంటే..
ప్రొఫెషనల్ డిగ్నిటీ, వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం.. వీటికి తోడుగా అదృష్టం మనిషిని సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలబెడతాయి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహికి శ్రమ అంటే చాలా ఇష్టం.అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవల్లోకి దిగి.. తోటి వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో ఔటింగ్లకూ వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఆయన స్వయంగా ఫుడ్ డెలివరీలు చేశాడు. అదీ సైకిల్ మీద తిరుగుతూ. ఆదివారం ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో సైకిల్ మీద ఉన్న ఫొటోను షేర్ చేసి.. టైం టు టైం అప్డేట్ పంచుకున్నాడు. పైగా డెలివరీల ద్వారా ఆరోజులో దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు అడగ్గా.. ఒక్కో ఆర్డర్ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు. Spent a few hours delivering for @UberEats. 1. SF is an absolutely beautiful town. 2. Restaurant workers were incredibly nice, every time. 3. It was busy!! - 3:24 delivering out of 3:30 online. 4. I'm hungry - time to order some 🍔🍟🍺 pic.twitter.com/cXS1sVtGhS — dara khosrowshahi (@dkhos) June 27, 2021 పది ట్రిప్పులతో 98.91 డాలర్లు సంపాదించిన స్క్రీన్ షాట్ ఆయన షేర్ చేశాడు. ఇక పాజిటివ్ ఉన్నట్లే ఈ వ్యవహారంలో నెగెటివిటీ మొదలైంది. పబ్లిసిటీ స్టంట్ అదిరిందంటూ 52 ఏళ్ల దారా ఖోస్రోషాహిని కొందరు హేళన చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉబెర్ ఈట్స్ సర్వీసును పొగుడుతూనే.. ఆ వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్వండంటూ దారాకి చురకలంటించారు. pic.twitter.com/MPpvzSceDC — dara khosrowshahi (@dkhos) June 27, 2021 చదవండి: భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక -
ఇంజనీర్లకు ఉబెర్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఇంజినీర్లకు గుడ్ న్యూస్. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశంలో తన ఇంజనీరింగ్ , ఉత్పత్తి కార్యకలాపాల పరిధిని విస్తరించే ప్రయత్నంలో 250 మంది ఇంజనీర్లను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. తద్వారా రైడర్, డ్రైవర్ వృద్ధి, డెలివరీ, ఈట్స్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కప్లైన్స్, మౌలిక సదుపాయాలు, అడ్టెక్, డేటా, భద్రత , ఫైనాన్స్ టెక్నాలజీ టీంను బలోపేతం చేయనున్నామని ఉబెర్ పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మొబిలిటీ, డెలివరీని మరింత అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు టెక్ సెంటర్లలో కొత్తగా ఇంజనీర్లను నియమించుకుంటామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా నగరాల్లో రవాణాలో కీలకంగా మారాలని ఉబెర్ లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ఇందుకు హైదరాబాద్, బెంగళూరులోని తమ బృందాలు ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపింది. ముఖ్యంగావివిధ పరిశ్రమ-మొదటి ఆవిష్కరణలకు మార్గదర్శకంగా ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సేవ చేసే ప్రయత్నాలలో భాగంగా నిపుణులైన ఇంజనీర్లను నియమించుకుంటామని, ఈ బృందాలద్వారా అన్ని గ్లోబల్ మార్కెట్లలో సవాళ్లను అధిగమించాలని భావిస్తున్నట్టు సంస్థ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మణికందన్ తంగరత్నం వెల్లడించారు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర వ్యాక్సినేషన్: టెస్లా కారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా -
వ్యాక్సిన్ వేయించుకోవాలా? ఉబెర్ ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఉచిత రైడ్లను అందిస్తున్నట్లు ఉబెర్ మంగళవారం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి టీకా కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ టీకా కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ .300 విలువైన రైడ్లు (వెళ్లడానికి రూ. 150, రావడానికి రూ. 150 వరకు) పొందవచ్చని ఉబెర్ తెలిపింది. ఈ మేరకు అర్హులైన తన వినియోగదారులకు ఈమెయిల్ సమాచారాన్నికూడా అందించింది. (ఫైజర్ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం) ఈ ఉచిత రైడ్ ఉబెర్ గో, ఉబెర్ గో సెడాన్, ఉబెర్ ప్రీమియర్లలో మాత్రమే చెల్లుతుందని ఉబెర్ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టీకా కేంద్రాల జాబితాను విడుదల చేసింది. అలాగే ఈ ఫ్రీ రైడ్‌ను వినియోగించుకునేందుకు యూజర్లకు యాప్ ఒక ప్రోమోకోడ్‌ను అందిస్తుంది. సర్వీస్ పనిచేసే 36 నగరాల్లోని అన్ని టీకా కేంద్రాలను పేర్కొంది. ఎలా వినియోగించుకోవాలి యాప్ ఓ పెన్ చేసిన తరువాత ఎగువ ఎడమ మూలలో మెనూని క్లిక్ చేసి “వాలెట్” సెలెక్ట్ చేసి ఉచిత ప్రయాణానికి యూజర్లు ప్రోమో కోడ్ (10ఎం21వి) ని ఎంచుకోవాలి. ఆ తరువాత సమీప టీకా కేంద్రానికి పిక్-అప్ లేదా డ్రాప్ వివరాలను ఎంటర్ చేసి, నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఉబెర్ తన యాప్ ద్వారా దగ్గరలోని అధీకృత టీకా కేంద్రాల సమాచారాన్ని కూడా అందిస్తుంది. కాగా మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా మే 1 నుంచి దేశంలో 18నుంచి 45 సంవత్సరాలు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందివ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది
డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదు. పేదరికం అనేక రూపాల్లో, స్వరూపాల్లో ఉంటుంది. చదువు లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఒకరిపై ఆధారపడటం.. ఇవన్నీ పేదరికాలే. శారీరక వైకల్యం కూడా ఒక విధమైన పేదరికమే. దృష్టి, మాట, వినికిడి.. వంటివి లేకపోవడం భౌతిక పేదరికాలు. పేదరికంలో ఉన్నవాళ్లు పోరాటం చేయలేరు. చేసినా వారికి న్యాయం జరిగితే బాగుండన్న ఆశైతే ఉంటుంది తప్ప న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అనే నానుడి ఇందుకే వచ్చి ఉండాలి. అయితే లీసా ఇర్వింగ్ అనే మహిళ ఈ నానుడిని తుడిచేశారు. ఆమెకు కోపం వచ్చింది కానీ ఆ కోపం ఆమెకు చేటు అవలేదు. తనను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోకుండా నిరాకరించిన ఉబర్ కంపెనీ మీద కోపంతో ఆమె వేసిన కేసులో ఇప్పుడు ఆమెకు రాబోతున్న నష్టపరిహారం 1.1 మిలియన్ డాలర్లు. అంటే 8 కోట్ల రూపాయలు! ఆమె పేదరికం.. కంటి చూపు లేకపోవడం. లీసా అంధురాలు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటారు. ఇంట్లో తనొక్కరే ఉంటారు లీసా. ఆ మాట పూర్తిగా నిజం కాదనాలి. ఆమెతో పాటు ఆమె పెంపుడు శునకం బెర్నీ కూడా ఆమెతో ఉంటుంది. లీసా ఓ ప్రేవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే.. ఆమె అనేకసార్లు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు అలస్యంగా వెళ్లారు అంటే క్యాబ్‌లు ఏవీ ఆమెను ఎక్కించుకోలేదు. ఉబర్ క్యాబ్లైతే ఆమెను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోడానికి నిరాకరించాయి. ఆమె అంధురాలు అవడం ఒక కారణం అయితే, ఆమె వెంట బెర్నీ ఉండటం ఇంకొక కారణం. ‘‘కుక్క ఉంటే ఎక్కించుకోం’’ అని క్యాబ్‌లు.. దగ్గరి వరకు వచ్చి కూడా లీసా పక్కన బెర్నీని చూసి వెళ్లిపోయిన సందర్భాలు ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి. కానీ పక్కన బెర్నీ లేకుంటే ఆమెకు జీవితమే లేదు. ఇంట్లో లీసాకు సహాయం చేసేదీ, ఆఫీస్‌కు రోడ్డు దాటించేదీ, క్యాబ్‌లు ‘మాట్లాడిపెట్టి’ (అరుపులతో క్యాబ్‌లను ఆపి) ఇంటికి, ఆఫీస్‌కు ఆమె పక్కన ఉండి మరీ తీసుకెళ్లి తీసుకొచ్చేదీ బెర్నీనే! లీసాకు ఉద్యోగం కంటే కూడా బెర్నీ ముఖ్యం. అందుకే ఉద్యోగం పోతే ఆమెకు పెద్దగా మనసు కష్టం అనిపించలేదు కానీ.. బెర్నీని, తనను క్యాబ్‌లో ఎక్కించుకోడానికి క్యాబ్ డ్రైవర్లు అయిష్టం చూపడం ఆమెను బాధించింది. కొందరు ఎక్కించుకున్నా కూడా.. దారి పొడవునా.. బెర్నీని ఏదో ఒకటి అనడం కూడా ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచింది. తన నిస్సహాయతను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆమెకు ఆవేదనగా ఉండేది. కోపం ఆమెను ఊపేసేది. చివరికి లీసా ఉబర్‌పై కోర్టుకు వెళ్లారు. ఆమె కేసు వేసింది 2018లో. మొన్న గురువారం తీర్పు వెలువడింది. ఉబర్ ఆమెకు 8 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్డర్! ఉబర్ తన వాదనను వినిపించకుండా ఉంటుందా? తమ డ్రైవర్లు కాంట్రాక్ట్ మీద చేరినవారు కనుక వారు చూపిన నిర్లక్ష్యానికి కంపెనీ తరఫున తాము నష్టపరిహారాన్ని చెల్లించే అవసరం లేదని వాదించినా కోర్టు లీసా వైపే నిలబడింది. ‘‘మానవత్వం మరచి, అంధురాలిపై వివక్ష కనబరుస్తూ లీసాకు రైడ్ ఇవ్వడకుండా నిరాకరించినందుకు, ఇచ్చికూడా ఆమెను, ఆమె శునకాన్ని తృణీకారంగా మాట్లాడినందుకు నష్టపరిహారం చెల్లించవలసిందేనని అంతిమంగా తీర్పు చెప్పింది. లీసా ఇర్వింగ్ అప్పట్లో చేస్తూ ఉన్నది పెద్ద ఉద్యోగం కాదు. పెద్ద ఉద్యోగం కాదంటే.. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కాదు. కనుక ఆమె సొంతంగా క్యాబ్‌లో వెళ్లలేరు. రైడ్ షేరింగ్ క్యాబ్‌ను మాట్లాడుకోవలసిందే. యాప్‌తో రైడ్ షేరింగ్‌ని బుక్ చేయడం కూడా ఆమెకు కష్టమే. అలాంటప్పుడు క్యాబ్ డ్రైవర్లే ఆపి, ఆమెకు రైడ్ షేరింగ్ ఇవ్వడం వారి కనీస ధర్మం. పైగా అమెరికాలోని ‘డిజెబిలిటీస్ యాక్ట్’ ప్రకారం అంధులకు ‘గైడ్’ గా ఉన్న డాగ్‌కు ఛార్జి తీసుకోకూడదు. షేర్ రైడింగ్ కనుక డాగ్‌కి కూడా చోటు కల్పించడం కష్టం అనీ, డాగ్ ఉన్నప్పుడు మరొకరు షేరింగ్‌కు రారని క్యాబ్ డ్రైవర్లు అంధుల విషయంలో ఉదాసీనతను ప్రదర్శిస్తుంటారు. నిజానికి క్యాబ్ డ్రైవర్లు ఒకసారి క్యాబ్‌లో ఎక్కిన అంధుడు / అంధురాలి ఫోన్ నెంబర్ తీసుకుని వారు కనుక ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో ప్రయాణించే ఉద్యోగులు అయితే మర్నాడు మళ్లీ అదే సమయానికి వారికి కాల్ చేసి అందుబాటులోకి క్యాబ్‌ని తెస్తారు. అయితే లీసాకు చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె దాదాపుగా పీడకల వంటి ఒక పెద్ద మానసిక క్షోభనే అనుభవించారు. ఆ క్షోభకే ఇప్పుడు ఈ నగదు పరిహారం. ఉబర్ చెల్లిస్తుందా, పైకోర్టుకు వెళుతుందా చూడాలి. ఏమైనా లీసా చేసిన న్యాయపోరాటం వల్ల ‘పేదవారికి’ కూడా పోరాడగలం అనే ధైర్యం వచ్చింది. పోరాడాలి అన్న స్పహ కూడా. -
‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయటం ఒకెత్తయితే.. దారి మర్చిపోయిన డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటం మరో ఎత్తు. రాత్రి వేళల్లో అయితే ఈ పని మరింత కష్టంగా ఉంటుంది. మనం చెప్పే దానికి చీకట్లో అతడు చూసే దానికి పొంతన లేక.. ఆకలి చచ్చిపోయేవరకు అతడికి రూటు చెబుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కోవటానికి ఓ చక్కటి ఉపాయం ఆలోచించాడు ఓ కస్టమర్. ఫుడ్ డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్‌ను వాడాడు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి ‘‘ఎస్పీఎక్స్సీ’’ ట్విటర్ ఖాతాదారుడు ఊబర్ ఫుడ్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఆయన ఇంటిని కనుక్కోలేక ఫోన్ చేశాడు. దీంతో డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్‌ను ఉపయోగించాడాయన. అతడు వస్తున్న వైపు లైటు వేసి ‘ఆకాశాన్ని చూడు.. బ్లూ లైటు వెంబడి రా!’ అని చెప్పాడు. డెలివరీ బాయ్ మొదట తికమకకు గురైనా తర్వాత బ్లూ లైటు వెంట ఇంటికి వచ్చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎస్పీఎక్స్సీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ హ్యాకింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను కూడా ఇలాంటి హ్యాక్‌ను వాడతాను..’’ ‘‘నా జీవితంలో ఇలాంటి బీమ్ లైట్లు చాలా అవసరం’’ .. ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’’.. ‘‘ సూపర్: ఇలా కూడా అడ్రస్ చెప్పొచ్చా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి! -
ఉబర్‌కు ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం కనీస ఉపాధి హక్కులు లభించే కార్మికులుగా తమను గుర్తించాలని దాదాపు 25 మంది డ్రైవర్లు ఒక గ్రూప్‌గా 2016కు ముందు ప్రారంభించిన న్యాయపోరాట ఫలితమిది. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్ లాగ్ ఆన్ అయిన సమయం నుంచి లాగ్ ఆఫ్ అయిన సమయం వరకూ తన డ్రైవర్లను ఉబర్ ‘‘కార్మికులుగానే’’ పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ మేరకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్, ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్, అప్పీలేట్ కోర్ట్ ఉబర్ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. తాజా రూలింగ్‌పై ఉబర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. 2016కు ముందు యాప్‌ను వినియోగించిన డ్రైవర్లందరి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడతామని తెలిపారు. కోర్టు ప్రకటన తరువాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఉబెర్ షేర్లు 3.4 శాతం పడిపోయాయి. -
లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్
లండన్ : ఆన్లైన్ ద్వారా మీరు ఫుడ్ ఆర్డర్ చేసి దాని కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. పిచ్చ ఆకలి మీద ఉండి.. పదేపదే తలుపు వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ డోర్ బెల్ మోగిస్తాడా అని. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ దారిలో ఉంది... డెలివరీ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడు అంటూ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. రావాల్సిన ఫుడ్ రాలేదు. దానికి బదులు ‘‘ సారీ అండీ! మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ నేను తినేశాను’’ అని డెలివరీ బాయ్నుంచి మెసేజ్ వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు?.. మామూలుగా అయితే కోపంతో ఊగిపోతారు. పుడ్ డెలివరీ కంపెనీకి ఫోన్ చేసి నిలదీస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఉద్యోగం పోయేలా చేసి ఆకలి చల్లార్చుకుంటారు. కానీ, బ్రిటన్‌కు చెందిన ఇల్లీ అనే యువతి మాత్రం అలా చేయలేదు. తన కడుపు మాడ్చిన డెలివరీ బాయ్ కడుపు కొట్టకుండా అతడు చేసిన పనికి నవ్వుకుని ఊరుకుంది. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? ) వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన ఇల్లీ ఇలీస్ అనే 21 ఏళ్ల యువతి గత శనివారం ఊబర్ ఈట్స్ యాప్‌లో రెండు బర్గర్లు, చిప్స్, చికెన్ వ్రాప్స్ ఆర్డర్ చేసింది. వాటి విలువ దాదాపు 1500 రూపాయలు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత ‘ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ దారిలో ఉంది’ అని నోటిఫికేషన్ వచ్చింది. మరికొద్దిసేపటి తర్వాత ‘డెలివరీ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడు’ అని వచ్చింది. ఇల్లీ ఎంతో ఆత్రుతగా తను ఆర్డర్ చేసిన ఆహారం కోసం ఎదురుచూడసాగింది. ఏ క్షణంలోనైనా డోర్ బెల్ మోగవచ్చని తలుపువైపు చూడసాగింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఆశలు అడియాశలు చేశాడు. ‘సారీ లవ్! నేను నీ ఫుడ్ తినేశాను’ అని మెసేజ్ పెట్టాడు. దీంతో కంగుతిన్న ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఊబర్ ఈట్స్ యాప్ ఓపెన్ చేసి చూసింది. ఆహారం డెలివరీ అయినట్లు అందులో చూపించింది. ఊబర్ కంపెనీకి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసి ఆహారాన్ని తిరిగిపొందే అవకాశం ఉన్నా ఆమె అలా చేయలేదు. దీనిపై ఇల్లీ మాట్లాడుతూ.. ‘‘ ఏమో! అతడికి నిజంగానే ఆకలిగా ఉన్నట్లుంది అందుకే తినేసుంటాడు. ఈ కరోనా కష్టకాలంలో అతడి ఉద్యోగం పోవటానికి నేను కారణం కాదల్చుకోలేదు. నాకెందుకో అదంతా కామెడీగా అనిపించింది. ఇలా నాకెప్పుడూ జరగలేదు. అతడి మెసేజ్‌తో నాకు నవ్వొచ్చింది. అందుకే అతడ్ని క్షమించేశాను’’ అని అంది. -
ఇంజనీర్లకు ఉబెర్ గుడ్ న్యూస్
సాక్షి,ముంబై : క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ శుభవార్త అందించింది. 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని తాజాగా ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్ వెల్లడించింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించిన ఉబెర్ ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం, మార్కెట్లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి. కాగా కరోనా సంక్షోభం కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఉబెర్ మే నెలలో ఇండియాలో 600 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 6700 మందిని లేదా 25 శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. 2017 లో 80 మందిగా ఉన్న ఇంజనీర్ల సంఖ్య ప్రస్తుతం 600 మంది పెరిగిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఉబెర్ ముంబై ఆఫీసు శాశ్వతంగా మూత?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించిన క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేసినట్లు సమచారం. తాజా నివేదిక ప్రకారం ముంబైలోని తన కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసింది ఉబెర్. అయితే సేవలను మాత్రం కొనసాగించనుంది. ముంబైలోని ఉబెర్ ఉద్యోగులు ఇంటి నుండి డిసెంబర్ వరకు పనిచేయనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఉబెర్ ప్రతినిధి నిరాకరించారు. ప్రపంచవ్యాప్తంగా 6,700 మంది, దేశీయంగా 600 మందిని తొలగించిన దాదాపు నెల తరువాత ఈ పరిణామం చోటు చేసుకోనుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (క్యూ 1 2020) మొదటి త్రైమాసికంలో, ఉబెర్ నికర నష్టం 163 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1.1 బిలియన్ డాలర్ల నష్టం ఈ ఏడాది 2.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం సంవత్సరానికి 14 శాతం పెరిగి 3.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను ఏకీకృతం చేసే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయాలని ఉబెర్ నిర్ణయించింది. ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి తమ ప్రధాన వ్యాపారంపై దృష్టిని రీఫోకస్ చేయనున్నామని ఇటీల ప్రకటించారు. ఆహారం, కిరాణా సామాగ్రి డెలివరీలపై దృఫ్టి కేంద్రీకరించనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంతో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇండియాలో తన ఉద్యోగులపై వేటు వేసింది. భారతదేశంలో 600 మందిని తొలగించింది. వివిధ స్థాయిలు, టీమ్ లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ తాజాగా ధృవీకరించింది. డ్రైవర్ , రైడర్ సపోర్ట్ ఇతర డివిజన్లలో భారతదేశంలో దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరికి కనీసం 10 వారాల జీతం చెల్లింపు, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, ల్యాప్‌టాప్‌ల వాడకానికి అనుమతి నిస్తున్నట్టు ఆయన చెప్పారు. (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత) (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్) కోవిడ్-19 ప్రభావం, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ తగ్గింపులు ఈ నెలలో ప్రకటించిన గ్లోబల్ జాబ్ కోతల్లో భాగమని పరమేశ్వరన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్న మే మొదటి వారంలో ఉబెర్ ప్రకటించింది. లాక్డౌన్ కారణగా పలు సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఓలా కూడా 1400 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
3000 మంది ఉబర్ ఉద్యోగులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్యాబ్‌ల నెట్వర్క్ కలిగిన ఉబర్ సంస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇంతకుముందే ప్రపంచ వ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా మరో 45 ఆఫీసులను మూసివేయడం ద్వారా మరో 3000 మంది ఉద్యోగులకు తిలోదకాలిచ్చింది. తాజాగా మూసివేసిన ఆఫీసుల్లో శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయం కూడా ఆ ఒక్క ఆఫీసును మూసివేయడం ద్వారానే 500 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉద్యోగుల ఉద్వాసన విషయాన్ని వారికి ఈ మెయిల్స్ ద్వారా తెలియజేసినట్లు ఉబర్ కంపెనీ సీఈవో డారా కోష్రోవ్షాహి మీడియాకు తెలిపారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు) కరోనా వైరస్ కారణంగా గతేడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ క్యాబ్‌ల రైడింగ్ 80 శాతం పడి పోయిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉబర్ కంపెనీలో 22 వేల మంది పని చేస్తుండగా ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందిని తొలగించారు. కాంట్రాక్ట్‌పై పనిచేసే క్యాబ్ డ్రైవర్లు ఉద్యోగుల పరిధిలోకి రారు. నిజంగా చెప్పాలంటే మూడు నెలల నుంచి ఉపాధిలేక ఉబర్ డ్రైవర్లు ఎక్కువగా నష్టపోయారు. అసలే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరగి పోతుంటే పుండు మీద కారం చల్లిన చందంగా ఇక ముందు ఉబర్ కంపెనీ డ్రైవర్‌లెస్ కార్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈవో చెప్పారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు) -
జూమ్ కాల్‌తో 3700మందికి ఉబెర్ ఉద్వాసన
న్యూఢిల్లీ: ఇవాళే ఉబెర్ ఉద్యోగులకు చివరి రోజు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన ఉబెర్ టెక్నాలజీస్ ఇటీవల తమ సంస్థ 14 శాతం(3700) ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 3700 మంది ఉద్యోగులకు జూమ్ ద్వారా ఫోన్ చేసి వారిని తొలగించినట్లు సమాచారం అందించినట్లు ఉబెర్ సర్వీసెస్ హెడ్ రుఫిన్ చెవలౌ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మిగతా సంస్థల వలె ఉబెర్ కూడా ఆర్థిక సవాళ్లకు ఎదుర్కొంది. అయితే ఉబెర్ తమ ఉద్యోగులకు ఇకపై వారి సేవలు అవసరం లేదని చెప్పి తొలగించడంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత) దీనిపై రుఫిన్ చెవలౌ స్పందిస్తూ.. ‘మేము 3700 మంది ఫ్రంట్‌లైన్ కస్టమర్ సపోర్టులో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తున్నాము. మీ సేవలు ఇక సంస్థకు అవసరం లేదు. ఉబెర్‌కు పనిచేయడానికి ఇదే మీ చివరి రోజు’ అని జూమ్ ఆప్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేగాక ‘వారికి ఫోన్ చేసి ఈ చేదు వార్తను వారికి అందించడం చాలా కష్టంగా అనిపించింది. ఇక తమ సేవలను ఉబెర్‌కు అందించిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపినప్పటికీ వారు స్పందించిన తీరు తీవ్రంగా ఉంది. కొంత మంది ఉద్యోగులు తమ బాధను వ్యక్తపరిస్తే, మరికొందరూ దీనిపై ముందుగా నోటీసులు ఇవ్వకుండా కేవలం మూడు నిమిషాలు ఫోన్ కాల్‌తో ఉద్యోగాలు ఎలా తీసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు’ అని ఆమె తెలిపారు. (ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్?) కాగా కరోనా మహమ్మారి కారణంగా ఉబెర్ వ్యాపారం దాదాపు సగానికి పడిపోయిందని ఆ సంస్థ వెల్లడించింది. 2020 మొదటి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చూసినట్లు నివేదించింది. ఇటీవల ఉబెర్ జంప్, బైక్, స్కూటర్ బిజినెస్ లైమ్ అనే సంస్థకు ఆఫ్ లోడ్ చేసింది, ఈ సంస్థ 85 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అయితే కారోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుత్ను లాక్డౌన్ వల్ల ఉబెర్‌లో పనిచేసే చాలా మంది కస్టమర్ సపోర్టు ఉద్యోగులకు తగినంత పని లేకపోవడం వల్లే వారిని తొలగించినట్లు వెల్లడించింది. -
కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభానికి ప్రభావితమైన ఉబెర్ టెక్నాలజీస్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా 3,700 పూర్తికాల ఉద్యోగులను తొలగించనుంది. అలాగే ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి మిగిలిన సంవత్సరానికి గాను తన మూల వేతనాన్ని వదులుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో 14 శాతం ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసివేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి తమ వ్యాపారాలను నాశనం చేసిందని పేర్కొంది. ఇవి చాలా కఠినమైన రోజులు. రాబోయే రెండు వారాల్లో మరిన్ని"కష్టమైన సర్దుబాట్లు" జరుగుతాయంటూ సీఈవో తన ఉద్యోగులకు ఒక ఈమెయిల్ సందేశాన్ని పంపారు. గత ఏడాది జూలై నుండి అక్టోబర్ వరకు పలుమార్లు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి సంస్థ తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేయడం ఆదోళన మరింత ఆందోళన రేపింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా యాప్ ఆధారిత రైడింగ్ సేవల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. దీంతో ఉబెర్ ఖర్చులను తగ్గించుకునే చర్యలకు దిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఉబెర్ కు దాదాపు 20 మిలియన్ డాలర్ల వ్యయాలున్నట్టు అంచనా. మరోవైపు అమెరికాలో ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్ కూడా గత వారం 982 మంది లేదా 17శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దీంతోపాటు ఉన్నతాధికారుల మూల వేతనాలను తగ్గించింది. కొత్త ప్రత్యర్థులు, ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా అనుసరించాల్సిన వినూత్న బిజినెస్ మోడల్స్ కారణంగా ఉబెర్, లిఫ్ట్ లాంటి షేరింగ్ క్యాబ్ సంస్థలు భవిష్యత్తులో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాయని వెడ్ బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డేనియల్ ఇవ్స్ చెప్పారు. ఎందుకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడం అనేది సాధారణంగా మారిపోవడం, పాటించాల్సిన ఆరోగ్య నిబంధనలు, ఇతర ఆందోళనల కారణంగా ప్రజల వినియోగంలో మార్పు రావచ్చన్నారు. ఈ మందగమనం డ్రైవర్ల ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుందన్నారు. డ్రైవర్లు కాంట్రాక్ట్ కార్మికులుగా మారిపోతారని అభిప్రాయపడ్డారు. అయితే బుధవారం, ఉబెర్ కొత్త ఈట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇది రియల్ టైమ్ డెలివరీ ట్రాకింగ్‌తో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తన ఆహార పంపిణీ వ్యాపారంతో కొంత కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందే అవకాశం వుందని భావిస్తున్నారు. మరోవైపు డ్రైవర్లను ఉద్యోగులకు బదులుగా స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరించి, కార్మికుల ప్రయోజనాలను నిలిపి వేసిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియా సహా, అతిపెద్ద మూడు నగరాల్లో ఉబెర్, లిఫ్ట్‌పై కేసులు నమోదయ్యాయి. (ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు) -
కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన ఉబెర్ మెడిక్ సేవ ద్వారా ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పట్నా నగరాల్లో వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందివ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన150 కార్లను అందుబాటులో వుంచింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపింది. ప్రతీ రైడ్ తరువాత శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. డ్రైవర్లు భద్రతా విధానాలలో ప్రత్యేకంగా శిక్షణతోపాటు మాస్క్ లు శానిటైజర్లు సహా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అపూర్వ సేవలందిస్తున్న వైద్య సిబ్బదికి ఉబెర్ ఇండియా సౌత్ అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు. -
ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ఎం) క్యాబ్ అగ్రిగేటర్, షేర్డ్ మొబిలిటీ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ప్రధానంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అని పిలిచే క్యాబ్ అగ్రిగేటర్‌ను ప్రారంభించనుంది. రాబోయే రెండు-మూడు సంవత్సరాలలో అలైట్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని ఆనంద్ మహీంద్ర నేతృత్వంలోని ఎం అండ్ ఎండ్ ప్లాన్ చేస్తోంది. తద్వారా ఇప్పటికే ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు ఓలా, ఉబర్‌లకు ప్రత్యక్షంగా గట్టి పోటీ ఇవ్వనుంది. క్యాబ్ సర్వీసుల నిర్ణయంతో పాటు, తన మొబిలిటీ వ్యాపారాలన్నింటినీ ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఎం అండ్ ఎం. అలైట్ (ప్రస్తుతం మహీంద్రా లాజిస్టిక్స్), మేరూ క్యాబ్స్ (మెజారిటీ షేరు ఉన్న ఎం అండ్ ఎం) , గ్లైడ్ (ఎం అండ్ ఎం ఇ-వెహికల్ క్యాబ్ సర్వీస్), ఫస్ట్ ఛాయిస్ యూజ్డ్ కార్ల బిజినెస్) ఇలా అన్నీ మొబిలిటీ సర్వీసులను (అలైట్) ఒకే గొడుగు కిందికి తీసుకురానుంది. ఇందుకోసం ‘అలైట్’ పేరుతో ఒకయాప్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ చెప్పారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన ఇది పని చేస్తుందని తెలిపారు. ప్రాథమికగా కంపెనీ ఉద్యోగులను ఆఫీసులనుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసులకు, లేదా వివిధ కాన్ఫరెన్సులు, సమావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకెళ్లే సేవలు ఉంటాయి. క్రమంగా ఈ సేవలను కాల్-ఆన్ సేవలుగా విస్తరించనుంది. ఓలా కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ టాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో సంస్థ ఉబెర్ కూడా ఉబెర్ ఫర్ బిజినెస్ ఫీచర్ ద్వారా ఈ విభాగంలోకి ఇటీవల ప్రవేశించింది. దాదాపు 10వేల కంపెనీలు ప్రస్తుతం ఓలా కార్పొరేట్ సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఓలా, ఉబెర్ బీటూ సీ సేవలతో పోలిస్తే కార్పొరేట్ భాగస్వామ్యాలతో బీ టూ బీ సేవలతో అలైట్ భిన్నంగా వుంటుందని కంపెనీ వెల్లడించింది. చదవండి: జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే! -
జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో... మరో ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసింది. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసినట్లు జొమాటో మంగళవారం ప్రకటించింది. ఆల్ స్టాక్ ఒప్పందంలో భాగంగా జొమాటో ఈ మేరకు కొనుగోలు చేసింది. ఇకపై ఉబెర్ ఈట్స్ తన కార్యకలాపాలను ప్రత్యక్షంగా నిలిపివేసి అనుబంధ సంస్థ జొమాటోటోకు బదిలీ చేయనుంది. కాగా గతంలోనే ఉబెర్ ఈట్స్‌ను జోమాటో కొనుగోలు చేస్తున్నట్లు అనేక వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. నివేదికల ప్రకారం 350 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీ ప్రకారం రూ. 2,485 కోట్లు) డీల్ కుదుర్చుకొని ఉబెర్ ఈట్స్‌ను జొమాటో తన వశం చేసుకుంది. ఇక ఈ ఒప్పందం మంగళవారం నుంచి అములులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారి భవిష్యత్తు ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. కాగా ఉబర్‌కు 10 శాతం వాటాను ఇవ్వనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించారు. ‘‘ఉబెర్ ఈట్స్ ఇండియా ఇప్పుడు జొమాటోగా మారింది. ఇకపై వినియోగదారులకు మరింత రుచికరమైన ఆహారాన్ని అందించనున్నాం. ఇది కొత్త ప్రయాణం’’ అని ట్వీట్ చేశారు. అలాగే దేశంలోని 500నగరాలకు పైగా జొమాటో తన సేవలను అందిస్తోందని తెలిపారు. ఉబెర్ ఈట్స్‌ను 2017లో ప్రారంభించారు. అప్పటికే ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి వాటితో పోటీపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయింది. భారతదేశంలో ఉబెర్ ఈట్స్ గత రెండేళ్లుగా భారీ మొత్తాన్ని ఆర్జించిందని ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి అన్నారు. భారతదేశంలో ఉబెర్‌కు మంచి మార్కెట్ ఉందని, ఇకపై తమ రైడింగ్ బిజినెస్‌ను పెంచుకోడానికి పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. Uber Eats India is now Zomato. Here's to better food for more people, and new beginnings. For more details: https://t.co/cq8Wp9ikOk pic.twitter.com/nK4ICY2ikW — Deepinder Goyal (@deepigoyal) January 21, 2020 -
క్యాబ్‌లో భయంకర అనుభవం: హీరోయిన్
లండన్: గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. ‘ లండన్‌లో ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి... అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడమే అత్యంత శ్రేయస్కరం. నేనైతే వణికిపోయాను’ అంటూ లండన్ క్యాబ్ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని... దాంతో తాను క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.(చదవండి : ఉబర్ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్’) ఈ క్రమంలో కొందరు సోనమ్ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించగా... మరికొందరు మాత్రం లండన్‌లో ఉబెర్ సేవలపై గతంలో నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ఉబెర్ విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్‌లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లండన్‌లో ఉన్న సోనమ్.. అక్కడికి బయల్దేరిన క్రమంలో బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో.. సదరు సంస్థ తీరు బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని.. మరోసారి అందులో ప్రయాణించబోనని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ అనే ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది. Hey guys I’ve had the scariest experience with @Uber london. Please please be careful. The best and safest is just to use the local public transportation or cabs. I’m super shaken. — Sonam K Ahuja (@sonamakapoor) January 15, 2020 -
ఐఐటీ సూపర్.. ఫారిన్ ఆఫర్..
సాక్షి ప్రత్యేకప్రతినిధి: ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఉద్యోగ నియామకాలకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీపడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులుతీరగా ఈ సీజన్లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభిం చాయి. ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటిపోయిం ది. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్ (34), ఐఐటీ కాన్పూర్ (22), ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి (11), ఐఐటీ గువాహటి (25) కంటే హైదరాబాద్ ఐఐటీ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ‘వచ్చే జనవరి నుంచి మొదలయ్యే తుది సీజన్ నియామకాల తరువాత అంతర్జాతీయ కంపెనీల సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ హైదరాబాద్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎక్కువ ఆఫర్ చేసిన మైక్రోసాఫ్ట్, ఉబర్... ఈ ఏడాది ఐఐటీ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబర్, పేపాల్తోపాటు యాక్సెంచర్ జపాన్, డెస్కెరా, హనీవెల్ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయడం విశేషం. ఉబర్, పేపాల్ వంటి అమెరికన్ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నప్పటికీ కనిష్టంగా రూ. 60 లక్షలు, గరిష్టంగా రూ. కోటి మేర వేతనాలను ఆఫర్ చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన నియామకాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల్లో 60 శాతం మందికి అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందిన వారికి అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్ పర్మిట్ (ఆయా దేశాల్లో పని చేసేందుకు అనుమతి) తీసుకుంటాయి. ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ ఐఐటీ రెండో స్థానం... ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఈసారి అంతర్జాతీయ సంస్థలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటీ బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితేగానీ ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటీని ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభ్యం కావు. అయితే ఇప్పటివరకూ పూర్తయిన నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఖరగ్‌పూర్ తరువాత ఆ స్థానం హైదరాబాద్‌కు దక్కుతుంది. హైదరాబాద్ ఐఐటీని సందర్శించిన అంతర్జాతీయ కంపెనీల సంఖ్య 38. ప్లేస్మెంట్లలో ఐఐటీ హైదరాబాద్ ఈసారి పాత ఐఐటీలు ఎన్నింటినో అధిగమించి రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ, బాంబే ఐఐటీలలో నియామకాల ప్రక్రియ ఇటీవలే మొదలైందని, జనవరి ఆఖరుతో పూర్తవుతుందని, ఆ తరువాత ఐఐటీలవారీగా నియామకాలు చేపట్టిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీల వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘అంతర్జాతీయ పత్రికలు విద్యాసంస్థల రేటింగ్‌లో ఐఐటీలను తక్కువ చేసి చూపుతున్నా వాటిలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విద్యార్థులే రేటింగ్‌లకు చక్కని ఉదాహరణ అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్లేస్మెంట్లు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో కొన్ని... మైక్రోసాఫ్ట్ ఉబర్ పేపాల్ యాక్సెంచర్ జపాన్ డెస్కెరా హనీవెల్ – మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసింది. – ఉబర్, పేపాల్ తక్కువ మందిని నియమించుకున్నా రూ. 60 లక్షలు–రూ. కోటి వరకు ఆఫర్ చేశాయి. -
విశాఖలో ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’.. విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది పనిచేస్తుండగా.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వీరి సంఖ్యను 120కి పెంచనున్నామని, ఇక ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ డైరెక్టర్ (కమ్యూనిటీ ఆపరేషన్స్ ఫర్ ఆసియా పసిఫిక్) వెన్ స్జూ లిన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు, రైడర్లకు పూర్తిస్థాయి మద్దతును అందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రం ఇది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 12వ సెంటర్ భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది. -
క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్
బెంగళూర్ : ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కమీషన్ రూపంలో ఓలా, ఊబర్లు అధికంగా గుంజేస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్న క్రమంలో వారికి ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైడ్‌కు క్యాబ్ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాబ్ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. నూతన మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. -
ఉబర్ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్’
సాక్షి, న్యూఢిల్లీ : క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అడపా దడపా ఫిర్యాదులు వస్తున్న విషయం తెల్సిందే. విదేశాల్లో అయితే క్యాబ్ డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అదే ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ ఫీచర్. ఎందుకంటే డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం కోసం. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్ అమెరికా దేశాల్లో ప్రవేశపెట్టి, ఆ తర్వాత అమెరికాకు విస్తరిస్తామని ఉబర్ యాజమాన్యం తెలిపినట్లు ఓ అమెరికా మీడియా తెలిపింది. కారులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. అదే విధంగా ఈ ఆడియో రికార్డింగ్ డ్రైవర్‌కుగానీ, ప్రయాణికులకుగానీ అందుబాటులో ఉండదని, ట్రిప్పు ముగియగానే ప్రయాణం సౌకర్యంగానే జరిగిందా ? అన్న ప్రశ్న ప్రయాణికులకు వెళుతుందని, వారి నుంచి సానుకూలమైన సమాధానం వచ్చినట్లయితే ఆడియో స్క్రిప్టును ప్రయాణికుల మాటలను విశ్లేషించే అనుబంధ ఏజెంట్‌కు పంపుతారని, ప్రయాణికులకు, డ్రైవర్ మధ్య ఇబ్బందులు, ఘర్షణ పరిస్థితి ఏర్పడితే పోలీసులకు అందజేయడం కోసం ఆడియో రికార్డింగ్‌ను భద్రపరుస్తామని ఉబర్ యాజమాన్యం వెల్లడించింది. అనవసరంగా ఎవరి ప్రైవసీని దెబ్బతీయమని తెలియజేసింది. అమెరికాలో ప్రజల ప్రైవసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలున్నాయని, డ్రైవర్, ప్రయాణికుల మాటలను రికార్డు చేయాలంటే వారిరువురి అనుమతి తప్పనిసరని మీడియా ఉబర్ యాజమాన్యం దృష్టికి తీసుకపోగా అప్పటికీ ఒకే జాతీయ చట్టం రావచ్చేమోనని వ్యాఖ్యానించింది. ప్రయోగాత్మకంగా అమెరికాలో కూడా ‘ఆడియో రికార్డింగ్ ఫీచర్’ విజయవంతం అయితే ఇతర దేశాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం పేర్కొంది. -
భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక
సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. కొత్త కార్లను కొనుగోలు ఉచ్చులో పడొద్దని భారతీయులను కోరారు. దీనికి బదులు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడానికి తగిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎస్టాబ్లిష్డ్ పరిశ్రమలకు దూరంగా వుండాలని హితవు చెప్పారు. ముఖ్యంగా ఆటోరంగం మందగమనానికి దోహదపడే అనేక అంశాలలో ఉబెర్, ఓలా వల్లే యువతరం (మిలీనియల్స్) కార్ల కొనుగోలుకు మొగ్గు చూపకపోవడం కూడా ఒకటి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉబెర్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఇలా సొంతకార్లను కలిగి వుండటం కొన్నిసార్లు ఆవిష్కరణలను నిరోధిస్తుందన్నారు. ఫలితంగా రాబోవు 10-20 సంవత్సరాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలకు బదులుగ గత పది సంవత్సరాలకోసం రూపొందించిన వాటినే ఇప్పటికీ వాడుతున్నామన్నారు.అందుకే కారు సొంతం చేసుకోవడం అనేది నేటి తరం కలగాకూడదు, కోరుకున్నపుడు స్వేచ్ఛగా ప్రయాణించే సౌకర్యాలు, అలాంటి ఆవిష్కరణలు, పరిశ్రమలపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాదు పాతుకుపోయిన పరిశ్రమలు, పద్ధతులు నూతన ఆవిష్కరణలకు శత్రువులుగా మారాయని వ్యాఖ్యానించారు. దీన్ని అధిగమిస్తే భారత్ ఈ రంగంలో అగ్రగామిగా వుంటుందని ఖోస్రోషాహి పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో కలిసి ఉబెర్ తాజాగా మరో నూతన ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫీచర్‌ద్వారా మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల ద్వారా క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఉబెర్ ఇపుడు బస్సులను కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీలో మంగళవారం విడుదల చేసింది. దీనిని ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఆయన తెలిపారు. యాప్‌లో వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను లోడ్ చేసుకోవాలి. అయితే నిర్ణీత ప్రదేశంలో (బస్స్టాప్ల్లాగా అన్నమాట)మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూ రాదు. చాలా తక్కువ ధరలో, తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఉబెర్ పేర్కొంది. -
ఉబెర్ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా
న్యూఢిల్లీ: ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని తీసుకొచ్చింది. ట్యాక్సీలు, ఆటోలు, మోటారు సైకిళ్లపై ప్రయాణించే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం బారిన పడితే ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన లేక వైకల్యం పాలైతే రూ.5లక్షల పరిహారం, ఆస్పత్రి పాలైతే రూ.2లక్షల వరకు పరిహారం (ఇందులో రూ.50,000 వరకు అవుట్ పేషెంట్ ప్రయోజనం కూడా ఉంటుంది) లభిస్తుందని తెలిపింది. ఇందుకోసం భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రమాదాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, రైడర్లకు రక్షణ ఉంటుందన్న భరోసానివ్వడమే ఈ ఆఫర్ ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఓలా సైతం బీమా ఆఫర్‌ను తన రైడర్లకు రూ.2కు ఆఫర్ చేస్తోంది. ఓలా.. ‘రెలిగేర్’ వైద్యబీమా... రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నట్టు ఓలా ప్రకటించింది. రిజిస్టర్ యూజర్లు అందరూ ఈ పాలసీకి అర్హులేనని, యాప్ నుంచి దీన్ని తీసుకోవచ్చని తెలిపింది. ప్రీమియం రోజుకు కనీసం రూ.3 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. వ్యక్తులు విడిగా, తమ కుటుంబం మొత్తానికి కలిపి పాలసీని తీసుకోవచ్చని, నెలకు, సంత్సరం కాల వ్యవధికి తీసుకునే సదుపాయం కూడా ఉన్నట్టు తెలిపింది. -
ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?
దేశంలోని వాహనాల అమ్మకాల పతనానికి, నగర ప్రాంత యువత ఓలా, ఉబెర్ వంటి సంస్థల సేవల వైపు మొగ్గుచూపడమేననీ... వారు కార్లు కొని వాటికి నెలవారీ ఇన్ స్టాల్‌మెంట్లు కట్టడానికి ఆసక్తి చూపడంలేదనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. అంటే, దేశంలో ఎటువంటి ఆర్థిక దిగజారుడు, మాంద్య స్థితులు లేవని చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ వాదన వాస్తవ పరిస్థితితో సరిపోలదు. దేశంలో కార్ల అమ్మకాలు (ఆగస్టు 2019లో 41.09% మేరకు) పతనం అవడానికి కారణం యువతరం వాటిని కొనకపోవడమే. మరి వాణిజ్య, రవాణా వాహనాల అమ్మకాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో, పతనం ఎందుకు జరిగినట్లు? కార్లకు లాగా ఈ వాణిజ్య, రవాణా వాహనాలకు ఓలా, ఉబెర్ల వంటి ప్రత్యామ్నాయాలు లేవన్నది గమనార్హం. మార్కెట్లో డిమాండ్ లేక కార్ల తయారీ కంపెనీ మారుతి సంస్థ లాగానే, వాణిజ్య రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ సంస్థ తన 5 ప్లాంట్లలో సెప్టెంబర్ నెలకుగాను, 5 నుంచి 18 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఆరోగ్యానికి కొలబద్ధలైన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకాల పతనం దేనికి సూచిక? వాటికి కూడా వాణిజ్య వాహనాలలో లాగానే ఇతర రవాణా ప్రత్యామ్నాయాలు లేవు. అలాగే, 2019లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10% మేరన పెరుగుతాయని అంచనా. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వారు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకొంటున్నారన్నమాట. నిజానికి నేడు మార్కెట్లోని అన్ని రంగాలలోనూ, అన్ని రకాల వస్తువులు, సరుకుల అమ్మకాలలోనూ పతనం ఉంది. ఉదా‘‘కు, మిగతా వాటితో పోలిస్తే చాలా వేగంగా, కాస్త తక్కువ ధరకు అమ్ముడుపోయే అమ్మకాలు (బిస్కెట్లు, తల నూనెలు, సబ్బుల వంటివి) జరిపే హిందుస్తాన్ లీవర్ అమ్మకాలు 2018 ఏప్రిల్ జూ¯Œ లో 12% మేరన పెరగ్గా, 2019లో అదే కాలంలో అవి కేవలం 5% పెరిగాయి. అలాగే, అదే కాలానికి గానూ డాబర్ ఇండియా అమ్మకాల వృద్ధి 2018 లో 21% నుంచి, 2019లో 6%కి పడిపోయింది. అలాగే, అదే కాలానికి బ్రిటానియా సంస్థ అమ్మకాల వృద్ధి 2018లో 13% నుంచి 2019లో 6%కి దిగజారింది. నిజానికి ఆగస్టు, 2019 నాటి గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో వినియోగ పతనం వాహన రంగంలో 17% మేర ఉండగా, దీర్ఘకాల వస్తువులు, ఇతర సరుకులు తదితరాల అమ్మకం 36% మేరన ఉంది. అంటే, వాహనాల అమ్మకాలలో కంటే దేశంలోని ఇతర అమ్మకాలలో పతనం మరింత అధికంగా ఉంది. ఇది ఆర్థిక మాంద్యస్థితి తాలూకు సూచికే! కాబట్టి ఓలా, ఉబెర్‌లు మాత్రమే యువజనులలో కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం కాదు. అంతకు మించిన కారణాలు మన ఆర్థిక రంగంలో ఉన్నాయి. నేడు ఆర్థిక మాంద్య స్థితి మన దేశంలో అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థితే. మన ప్రభుత్వ గణాంకాల ప్రకారమే భారతదేశంలో నిరుద్యోగం, నేడు 45 సం‘‘ల గరిష్ఠ స్థాయిలో ఉంది. ఈ కారణం చేతనే మన దేశంలో కూడా యువజనులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్థితిలో పడిపోయారు. దేశీయంగా కార్ల అమ్మకాల పతనానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇక చివరిగా, నిన్నగాక మొన్న ‘మింట్ మిలీనియన్ సర్వే’ అధ్యయనం ప్రకారంగా, నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావిస్తోన్న నగర ప్రాంతాలలోని ‘మిలీనియల్స్’లో (కొత్తతరం యువజనులు) 80% మంది నిజానికి తమకు సొంత వాహనం కావాలనే కలను కంటున్నారు. నిజానికి, తమకంటూ సొంత వాహనం కావాలనే ఆకాంక్షలో యువజనులకూ, మధ్య వయస్సూ ఆ పైబడిన వారికీ ఎటువంటి తేడా లేదని ఈ సర్వే తేల్చింది. మరోవైపున ధనవంతుల బిడ్డలు కొనే లగ్జరీ బైక్‌ల డిమాండ్ 130% పెరిగింది. 2019 ఏప్రిల్ లోనే సాధారణ బైక్‌ల అమ్మకాలు 16% పడిపోయాయి. అంటే, ఇది కేవలం ఓలా, ఊబ ర్లు యువ జనుల కథే కాదు... ఈ దేశంలోని ధనిక పేద అంతరాల కథ.. ఒకవైపు ధనికుల ఇండియా... మరోవైపున వెలవెలబోతోన్న పేదల, మధ్య తరగతి భారతం కథ ఇది..! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు
శాన్ఫ్రాన్సిస్కో: ఫోన్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్ బయటపడింది. ఇది ఎవరి ఖాతాలోకైనా అనధికారికంగా ప్రవేశించేందుకు హ్యాకర్లకు మార్గం కల్పించేలా ఉంది. దీన్ని కనుగొని తెలియజేసినందుకుగాను భారత సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ ప్రకాశ్‌కు ఉబెర్ రూ. 4.6 లక్షలను బహూకరించింది. ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా ఉబర్ క్యాబ్స్, ఉబర్ ఫుడ్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ బగ్ గురించి ఆనంద్ ఉబర్‌కు తెలియజేయగానే బగ్ బౌంటీ ప్రోగ్రాంను ఉబర్ అప్డేట్ చేసింది. జీవితాంతం ఉబర్ క్యాబ్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించే బగ్‌ను గతంలో గుర్తించి ఆకాశ్ తొలగించాడు. 2014లో సెక్యురిటీ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు 2016లో సైబర్ సెక్యురిటీ స్టార్టప్ ‘ఆప్ సెక్యుర్’ను స్థాపించాడు. ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు ఆసియా జాబితాలోనూ అతడు స్థానం దక్కించుకున్నాడు. ఎటువంటి ఖాతా లేకపోయినా ఫేస్బుక్లో లాగిన్ అయ్యే లొసుగును గుర్తించడంతో 2015లో ఫేస్బుక్ సంస్థ అతడికి 15 వేల డాలర్లు నజరానాగా ఇచ్చింది. తమిళనాడులోని వెలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించిన ఆకాశ్.. సైబర్ సెక్యురిటీలోని లోపాలను గుర్తించి ప్రశంసలతో బహుమానాలు అందుకున్నాడు. -
ఉబెర్ నిరంతర భద్రతా హెల్ప్‌లైన్ సేవలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్.. నిరంతర భద్రతా హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. డ్రైవర్ల దుష్ప్రవర్తన, బ్రేక్ డౌన్స్, డ్రైవర్లతో వివాదం వంటి సమస్యలకు వెంటనే పరిష్కారం పొందడం కోసం కంపెనీ ఇన్‌హౌస్ సేఫ్టీ టీమ్‌తో మాట్లాడే వెసులుబాటును కల్పిస్తోంది. చండీగఢ్‌లో మార్చి నుంచి ప్రయోగాత్మకంగా నడుస్తోన్న ఈ సేవలను మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించామని కంపెనీ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ వెల్లడించారు. యాప్ వినియోగదారులకు ఎస్ఓఎస్ బటన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నూతన సేవలు మరింత భద్రతా కల్పించనున్నాయని పేర్కొన్నారు. -
జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌పై హోటల్స్ గుస్సా!!
జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని హోటళ్ల సమాఖ్య నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) తీవ్రంగా ఖండించింది. అగ్రిగేటర్స్ సంస్థలు.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని, తక్షణమే ఈ విధానాలను మానుకోవాలని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యత్వం ఉన్న రెస్టారెంట్లన్నీ లాగ్అవుట్ ఉద్యమాన్ని ఇతర ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాంలకు కూడా విస్తరించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ .. అగ్రిగేటర్స్‌తో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. స్విగీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా సంస్థలకు వేర్వేరుగా ఎన్ఆర్ఏఐ ఈ మేరకు లేఖలు రాసింది. పారదర్శకత లోపించడం, భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం, ఆన్లైన్ డెలివరీ అగ్రిగేటర్స్ తమ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటం వంటి అంశాలపై తమ సభ్యులు, అసోసియేషన్స్, ఇతర రెస్టారెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డెలివరీ పరిశ్రమకు ఇలాంటి పరిణామాలు ఆందోళనకర విషయాలని హెచ్చరించింది. టెక్నాలజీకి తాము వ్యతిరేకం కాదని.. కాకపోతే తాజా పరిణామాలు చిన్న రెస్టారెంట్లు, స్టార్టప్‌ల మనుగడకు, ఉపాధి అవకాశాల వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ అగ్రిగేటర్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ పలు రెస్టారెంట్లు లాగ్అవుట్ ఉద్యమం పేరుతో ఆన్లైన్ యాప్స్ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. -
జొమాటోతో ఉచిత ప్రయాణం; థాంక్యూ!!
మహానగరంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా రాత్రి వేళల్లో అది కూడా అర్ధరాత్రి ఏ ఆటోలోనో, క్యాబ్‌లోనో వెళ్లాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోను ఆశ్రయించాడో కుర్రాడు. పైసా ఖర్చు లేకుండా హాయిగా ఇంటికి చేరుకుని ఎంచక్కా దోశెలు తిన్నాడు. ఏంటీ అర్థం కాలేదా? జొమాటోకు క్యాబ్ సర్వీస్‌కు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా. అయితే మీరు హైదరాబాదీ ఒబేశ్ కొమిరిశెట్టి ఫేస్బుక్ పోస్టు చదవాల్సిందే. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్.. ‘రాత్రి 11 గంటల 50 నిమిషాలకు. నేను ఇనార్బిట్‌మాల్ రోడ్లో ఉన్నా. రూంకు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తున్నా. ఎంతసేపటికీ ఆటో రాకపోవడంతో ఉబెర్ యాప్ ఓపెన్ చేశా. కానీ చార్జీ రూ. 300 దాకా అవుతుందని చూపించింది. అప్పుడే చిన్నగా ఆకలి మొదలైంది. దీంతో జొమాటో యాప్ ఓపెన్ చేసి నేను ఉన్న చుట్టుపక్కల ఏదైనా ఫుడ్ స్టోర్ ఉందేమో చూశా. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ దోశ బండి జొమాటో యాప్‌లో కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఎగ్‌దోశ ఆర్డర్ చేశా. ఇంతలో ఆర్డర్ తీసుకోవడానికి డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు. అతడికి ఫోన్ చేసి ఇది నా ఆర్డరేనని, నన్ను రూం దగ్గర దింపమని అడిగాను. అతడు వెంటనే సరేనన్నాడు. ఆర్డర్‌తో పాటు నన్నూ డ్రాప్ చేశాడు. అంతేకాదు సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగాడు. నేనూ సరేనన్నాను. ఉచిత ప్రయాణం అందించిన జొమాటోకు థాంక్స్’ అంటూ ఒబేశ్ తాను చేసిన ఫ్రీ రైడ్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 6న షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో.. నువ్వు కేక బ్రదర్. ఏమన్నా ఐడియానా. హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఒబేశ్ తెలివితేటలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో జొమాటో కూడా ఒబేశ్ పోస్టుపై స్పందించింది. ‘ సరికొత్త సమస్యలకు సరికొత్త పరిష్కారాలు’ అని జొమాటో కేర్ ట్వీట్ చేసింది. దీంతో ఒబేశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్నపాటి స్టార్ అయిపోయాడు. మీకు కూడా ఒబేశ్ ఐడియా నచ్చింది కదూ!! Modern problems require modern solutions. ^PC pic.twitter.com/2bmo7EMIpu — Zomato Care (@zomatocare) August 6, 2019 -
ఉబెర్‌కు భారీ నష్టాలు
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌కు ఈ క్వార్టర్లో భారీ షాక్ తగిలింది. 2017లో పరిమిత ఆర్థిక డేటాను వెల్లడించడం ప్రారంభించిన అనంతరం ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ అతిపెద్ద త్రైమాసిక రికార్డు నష్టాన్ని చవిచూసింది. ఉబర్ సేల్స్ భారీగా క్షీణించడంతో 5.2 బిలియన్ డాలర్లు (రూ.520 కోట్లు) నష్టపోయినట్టు ఉబర్ ఇంక్ ఒక ప్రకటనలో నివేదించింది. ఆదాయం 14శాతం పెరిగి 3.17 బిలియన్లుగా ఉంది. అయితే ఎనలిస్టులు ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీవో సందర్భంగా స్టాక్ ఆధారిత కంపెన్సేషన్ కారణంగా ఇంత భారీ నష్టం వాటిల్లిందని వాల్‌స్ట్రీట్ అనలిస్టులు అంచనా. ఈ ఫలితాల నేపథ్యంలో ఉబెర్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ త్రైమాసికంలో ఉబెర్ ఖర్చులు 147శాతం పెరిగి 8.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్‌తో పోటీ నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధిపై వెచ్చించిన ఖర్చు గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ట్రిప్ 20 శాతం పెరగగా, ఉబెర్ తన డ్రైవర్లకు చెల్లించిన తర్వాత ఉంచిన మొత్తం కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. కంపెనీలు చారిత్రాత్మకంగా రైడర్లను ఆకర్షించడానికి సబ్సిడీపై ఆధారపడ్డాయి. స్థూల బుకింగ్‌లు15.76 బిలియన్లు (సంవత్సరానికి 37శాతం పెరిగింది)గా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ ఉబెర్ ఈట్స్ ఆదాయం 72 శాతం పెరిగి 595 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఉబెర్ ప్రత్యర్థి లిఫ్ట్ బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయ గణాంకాలను నమోదు చేసింది. ప్రధానంగా రైడింగ్ సేవల వ్యాపారంలో వృద్ధి మందగించడంతో తీవ్ర నష్టాలను చవి చూసింది. దీంతో ఉబర్ వాటాలను 6 శాతం వరకు తగ్గించింది. ఆదాయ వృద్ధి మందగించడం ఉబెర్ పోటీని విస్తరించి నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోవడం నష్టాలకు దారితీసినట్టు ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు హరిస్ అన్వర్ తెలిపారు. అయితే పెట్టుబడుల దూకుడు కొనసాగిస్తామనీ, అది కూడా ఆరోగ్యకరమైన వృద్ధిగా ఉండాలని కోరకుంటున్నామని ఉబెర్ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంతేకాదు ఈ త్రైమాసికంలో ఆ దిశగా మంచి పురోగతి సాధించామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెల్సన్ చాయ్ అన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో పెట్టుబడులు గరిష్టంగా ఉండనున్నాయని, దీంతో నష్టాలు తగ్గుతాయని భావిస్తున్నామని ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దారా ఖోస్రోషాహి చెప్పారు. -
ఆన్లైన్లో నాసిరకం ఫుడ్!
సాక్షి, న్యూఢిల్లీ : జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్..అన్లైన్ ఆహార సరఫరా సంస్థలు కొన్ని వేల రెస్టారెంట్లను మన మునివేళ్ల ముందుకు తీసుకొచ్చాయి. వీటిలో ఏ రెస్టారెంట్ నుంచి ఆహారం కావాలన్నా అరగంటలో మన కళ్ల ముందుంటుంది. ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఆహారంలో క్రమంగా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయని, రెస్టారెంట్లో సరఫరా చేస్తున్న నాణ్యత కన్నా...ఆర్డర్ ద్వారా తెప్పించుకున్న ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటుందని మెజారిటీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పేరెన్నికగన్న రెస్టారెంట్లే కాకుండా చిన్న చిన్న ఆహారం కొట్లు కూడా ‘యాప్స్’ పరిధిలోకి వస్తున్నాయని, వాటిలో పరిశుభ్రత సరిగ్గా ఉండదని ఆరోపిస్తున్నారు. ఎప్పటికీ తాము పరిమాణంకన్నా నాణ్యతా ప్రమాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఎక్కువ మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక వేదిక ఆన్లైన్ ఆహారంపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని 66 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడగా, సకాలంలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తామని 22 శాతం మంది, ప్యాకింగ్, రవాణా సందర్భంగా ఆహారం నాణ్యత పడిపోతోందని 53 శాతం మంది, రెస్టారెంట్లో ఉన్నట్లే ఆన్లైన్ ద్వారా తాము అందుకున్న ఆహారం ఉంటుందని 30 శాతం మంది, క్రమంగా నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని 17 శాతం మంది అభిప్రాయపడగా, ధరలు అధిక ధరలు వసూలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 218 జిల్లాల పరిధిలో 27 వేల మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. స్టార్టప్ కంపెనీలు ఏవైనా మార్కెట్ విస్తరణ, వద్ధిపైనే ముందుగా దృష్టిని సారిస్తాయని, అందుకనే నాణ్యతా ప్రమాణాలు పెద్దగా పట్టించుకోవని ఓ స్టార్టప్ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ స్వతంత్ర విశ్లేషకుడు హెచ్వీ హరీష్ తెలిపారు. మార్కెట్‌పై పట్టు సాధించాక ఆపరేషన్లు, వినియోగదారుల సంతప్తిపై దృష్టిని సారిస్తారని చెప్పారు. రెస్టారెంట్లు, వినియగదారుల మధ్యనున్న దూరాన్నే తగ్గించడం కోసమే ప్రస్తుతం ఈ యాప్స్ వచ్చాయని, అందులో చాలా వరకు విజయం సాధించాయని, ఇక నాణ్యతా ప్రమాణాలపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘టెక్‌సై రీసర్డ్’ సంస్థ కన్సల్టెంట్ సుకతీ సేథ్ వ్యాఖ్యానించారు. ప్యాకేజ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కొన్ని రెస్టారెంట్లకు జొమాటో స్వయంగా ప్యాకేజీ కవర్లను పంపిణీ చేస్తోందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అది విస్తరించే ప్యాకింగ్ సందర్భంగా ఆహారం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు అంటున్నాయి. ప్యాకేజీ మధ్యలో ఆహారం మారటం చాలా అరుదని, రెస్టారెంట్లే ప్యాకేజీ ఆహారానికి సరైన ప్రమాణాలను పాటించడం లేదని స్విగ్గీ, ఉబర్ ఈట్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమైనా ఇక నుంచి తాము కూడా ఆహారం నాణ్యతపై దష్టిని కేంద్రీకరిస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. -
హైదరాబాద్ బిర్యానీ ఎంతపని చేసింది?
సాక్షి, చెన్నై: బిర్యానీని ఆర్డర్ చేసిన యువతికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్ ఈట్స్ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై సౌకార్‌పేటకు చెందిన ప్రియా అగర్వాల్ (21) బుధవారం ఉదయం ఉబర్ ఈట్స్ కంపెనీకి ఆన్లైన్లో హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ ధర రూ.76 ఆన్లైన్ ద్వారానే చెల్లించింది. అయితే అకస్మాత్తుగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా.. మీరు చెల్లించిన రూ.76 తిరిగి పొందాలంటే ముందుగా రూ.5 వేలు చెల్లించండి, మేము రూ.5,076 మీ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే రూ.5 వేలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్ సెంటర్‌ను సంప్రదించగా మరోసారి రూ.5 వేలు చెల్లించండని చెప్పారు. ఇలా 8 సార్లు రూ.5 వేల లెక్కన మొత్తం రూ.40 వేలు చెల్లించింది. అయితే ఆమె రూ.76తో పాటూ రూ.40 వేలను కూడా కోల్పోయింది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఓలా, ఉబెర్‌లకు షాక్ : నగరవాసులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ సర్వీసు సంస్థలు ఓలా, ఉబెర్‌తో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రధానంగా డిమాండ్‌ను బట్టి చార్జీలు, సర్ చార్జీలు బాదేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్న ప్రధాన క్యాబ్ సర్వీసులకు షాకిచ్చేలా టోరా క్యాబ్స్ పేరుతో నగరంలోకి కొత్త క్యాబ్ సర్వీసుల సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్’ లక్ష్యమని టోరా ప్రకటించడం విశేషం. అంతేకాదు తమ యాప్ ఆధారిత సర్వీసు ద్వారా పారదర్శక బిజినెస్‌తో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఇద్దరికీ ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది. జూన్ 12న పైలట్ వెర్షన్‌గా సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్ వచ్చే 45 రోజుల్లో పూర్తి సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొరియన్ సంస్థ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని టోరా క్యాబ్స్ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. తన సేవలను తొలుత హైదరాబాద్‌లోనే ప్రారంభించడం విశేషమన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1500 మంది డ్రైవర్లు తమ ప్లాట్‌ఫాంపై రిజిస్టరై ఉన్నారని, మరో 45 రోజుల్లో ఈ సంఖ్య 4 వేలకు చేరుతుందని టోరా క్యాబ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు.ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతమైన, ప్రయోజనం కల్గించే విధానాన్ని టోరా ప్రవేశపెడుతోందని అన్నారు. టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌పీఎల్) డ్రైవర్లు కేవలం రోజువారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.199, వారానికి రూ. 1194 నెలకు రూ.4975గా నిర్ణయించింది. ఇది మినహా ఎలాంటి కమిషన్లు తీసుకోదు. దీనికి తోడు కంపెనీ నుంచి డ్రైవర్లు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ను పొందుతారు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌ఛార్జ్‌ను వసూలు చేయమని మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక చార్జీలు వసూలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు. -
మా ఆకలి వాయిదా.. బ్యాచిలర్స్ ఇబ్బంది పెడతారు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతోంది. యాప్స్ అందుబాటులోకిరావడంతో ఆన్లైన్లో క్లిక్ చేస్తే చాలు ఇంటికే ఆహారం వచ్చేస్తోంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్.. ఇలా ప్రతిదీ సిటీజనులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో ప్రతినెలా 15లక్షలకు పైగా ఆర్డర్లుఅందుతున్నాయి. వీటిలో దాదాపు 85శాతం బిర్యానీ ఆర్డర్లే ఉండడం విశేషం. అందులోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటేస్తున్నారు. ఉదయం 7–10గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12–3గంటల వరకు లంచ్ ఆర్డర్లువస్తుండగా... సాయంత్రం స్నాక్స్, అర్ధరాత్రి 2:30గంటల వరకు డిన్నర్ ఆర్డర్లు ఉంటున్నాయి. ఇది తమకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతోందని డెలివరీ బాయ్స్ పేర్కొన్నారు. చదువుకుంటూ కొందరు, ఉద్యోగాలు చేస్తూ మరికొందరు డెలివరీ బాయ్స్‌గా ఆదాయం పొందుతున్నారు. వీరు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకుసంపాదిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎంతోమంది ఆకలి తీర్చే విధి నిర్వహణ వాళ్లది. ఆర్డర్ రాగానే ఉరకాల్సిందే. ఆ క్షణంలో వారు తమ ఆకలిని మరిచిపోతారు. ఆర్డర్లు అందిన వెంటనే సదరు హోటల్‌కు వెళ్లి ఆహార పదార్థాలను తీసుకుని ఆర్డర్ వచ్చిన చోట వాలిపోతారు. కస్టమర్‌కు ప్యాకెట్ అందించాక ఓ చిన్న కోరిక కోరతారు.. అది టిప్ ఇవ్వమని కాదు.. ‘సార్.. సర్వీస్ రేటింగ్ చూసి ఇవ్వండి’ అంటూ వినయంగా అడుగుతారు. వారే ‘ఫుడ్ డెలివరీ బాయ్స్’. పెరుగుతున్న నగర జనాభా.. తీరిక లేని జీవితం ఫలితంగా చాలామంది గ్రేటర్ వాసులు ఇంటి భోజనం మరిచిపోతున్నారు. దీంతో ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం ఊపందుకుంది. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఫుడ్ డెలివరీ ఉపాధిగా మారింది. ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ సరైన ఉద్యోగవకాశాలు లభించని వారు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారిపోయారు. జొమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండా, ఉబర్.. వంటి ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ మొబైల్ యాప్స్ ఒకవైపు నగరవాసుల ఆకలి తీరుస్తూ మరోవైపు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకలేసినా, దాహమేసినా, గరం గరం ఇరానీ చాయ్ సిప్ చేయాలనిపించినా, కరకరలాడే స్నాక్స్ ఆరగించాలన్నా ఇప్పుడు అన్నింటికీ మొబైల్ ఫుడ్ యాప్‌లు మేమున్నాయంటున్నాయి. ఇంటికి బంధుమిత్రులొచ్చినా, మరే అత్యవసరమైనా సరే అప్పటికప్పుడు వంట చేయాల్సిన పనిలేదు. మొబైల్ ఫోన్ అందుకొని ఆర్డర్ బుక్ చేస్తే చాలు కొరుకున్నవన్నీ వచ్చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఆర్డర్లు ఇలాగే బుక్ అవుతున్నట్లు అంచనా. ఈ ఆర్డర్లలో 85 శాతానికి పైగా బిర్యానీలే ఉంటున్నాయి. అందులోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యాని పట్ల ఆసక్తి చూపుతున్నారు. అటు వినియోగదారులకు, ఇటు ఫుడ్ డెలివరీ బాయ్‌లకు చక్కటి అవకాశంగా మారిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆహారంలో అగ్రస్థానం బిర్యానీదే ‘ఇంటి వద్దకే భోజనం’ డిమాండ్‌లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డిమాండ్‌ను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బిర్యానీ తర్వాత చికెన్ 65, కబాబ్, పలావ్ వంటివి ఉన్నాయి. నగరవాసులతో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా బిర్యానీకే మొగ్గుచూపుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసేటపుడు శాకాహారంతో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్ ఉంటోందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా బీమా, కుటుంబానికి అత్యవసర వైద్యసేవలతో పాటు మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. డెలివరీ చేసే ఆర్డర్ల మేరకు చెల్లించే కమీషన్ ఉంటుంది. ఫుడ్ డెలివరీ సంస్థలు ఇప్పుడు రెస్టారెంట్లతో ఒప్పందం మేరకు ఆఫర్లను సైతం అందిస్తున్నాయి. నగరంలో దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్ పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్ అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఐపీఎల్ సీజన్లో స్విగ్గీకి ఫుల్.. ♦ ఐపీఎల్ సీజన్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తినట్లు సంస్థ తాజా ప్రకటనలో తెలిపింది. ♦ ప్రధానంగా చికెన్ బిర్యానీకి దేశంలోని పలు మెట్రో నగరాలతో పాటు పలు నగరాల్లోనూ ఆర్డర్లు 30 శాతం మేర పెరిగినట్లు ప్రకటించింది. ఇక ఏపీలోని విజయవాడ, కడప, తెలంగాణాలోని నిజామాబాద్ నగరంలోనూ స్విగ్గీకి ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. ♦ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య తమ ఆర్డర్లలో 30 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ♦ పిజ్జాలు, సమోసాలు, చికెన్ వింగ్స్‌కు సైతం భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయట. ♦ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ సీజన్లో ఆర్డర్లు భారీగా పెరిగినట్లు పేర్కొంది. ♦ గులాబ్ జామూన్, రస్మలాయ్, డబల్ కా మీఠా, బ్లాక్ ఫారెస్ట్ కేక్ వంటి స్వీట్స్‌కు కూడా గిరాకీ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇడ్లీ నుంచి పెరుగన్నం వరకు.. నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు తినే అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్లైన్ ఆర్డర్లపై వచ్చేస్తున్నాయి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం కోసం ఆర్డర్లు మొదలువుతాయి. ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, చాయ్, కాఫీ, వాటర్ బాటిళ్ల కోసం డిమాండ్ ఉంటుంది. బ్యాచిలర్స్, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైన కుటుంబాల్లో ఉదయం లేచిన వెంటనే అల్పాహారం కోసం ఆర్డర్ ఇస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు లంచ్ కోసం ఆర్డర్లు ఉంటాయి. ఎక్కువ శాతం నచ్చిన ఫుడ్డు బుక్ చేసుకుంటారు. అందులోనూ నగరవాసులు బిర్యానీకే పెద్ద పీట వేస్తున్నారు. ఆఫీస్‌లలో పార్టీలకు, ఇళ్లల్లో చిన్న చిన్న వేడుకలకు ఆర్డర్లపైనే ఫుడ్, స్వీట్లు, కూల్ డ్రింక్స్ వచ్చేస్తున్నాయి. ఒకటేంటి.. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెష్, పెరుగన్నం.. పులిహోర వరకు ఆర్డర్లు ఇస్తున్నారు. ‘ఫోన్లో యాప్ ఆన్ చేస్తే చాలు ఆర్డర్లు వచ్చి పడుతూనే ఉంటాయి. మధ్యాహ్నం పూట మాకు అన్నం తినే అవకాశం ఉండదు. ఆర్డర్లు అన్నీ డెలివరీ అయ్యాక 3 గంటల తర్వాతే భోజనం చేస్తాం’ అని ఎల్బీనగర్కు చెందిన డెలివరీ బాయ్ శివప్రసాద్ తెలిపాడు. ప్రతిరోజు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇతడు రోజుకు రూ.600 నుంచి రూ.1000 వరకు ఆదాయం వస్తుందని, అయితే, అన్ని రోజుల్లో ఆర్డర్లు ఒకేలా ఉండవన్నాడు. వీకెండ్స్‌లో ఉండే డిమాండ్ ఇతర రోజుల్లో ఉండకపోవచ్చు. సాధారణంగా టిఫిన్లకు ఎక్కువగా కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏ హోటల్‌కు ఎంత రేటింగ్ ఉందనే సమాచారం ఆధారంగా ఆర్డర్లు ఉంటాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాలకు కూడా ఆర్డర్లు నగరంలో బాగానే చేస్తున్నారు. అందులోనూ మధ్యాహ్నం కంటే రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉండడం విశేషం. ఇక మిడ్నైట్ బిర్యానీ ప్రియులు ఉండనే ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 2.30 వరకూ డెలివరీ బాయ్స్ సేవలు అందిస్తునే ఉంటున్నారు. డెలివరీ ఉపాధి బాగుంది నాగర్ కర్నూలుకు చెందిన శివప్రసాద్ ఒక కొరియర్ సంస్థలో 10 ఏళ్ల పాటు పనిచేశాడు. నెల జీతం రూ.15వేలు దాటలేదు. ‘ఏడాది క్రితం ‘జొమొటో’లో చేరాను. నాటి నుంచి ప్రతి నెలా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. ఒకఆర్డర్పై రూ.40 చొప్పున ఇస్తున్నారు. రోజుకు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తే రూ.1000 లభిస్తుంది. టార్గెట్ ప్రకారం ఆర్డర్లు చేసిన వాళ్లకు ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రోత్సాహకాలను కూడా ఇస్తాయి. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా కమీషన్ ప్రాతిపదికపై వేలాది మంది పనిచేస్తున్నారు. చదువుకుంటూ కొందరు ఉపాధి పొందున్నారు. గత ఉద్యోగాలతో పోలిస్తే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటంతో మరికొందరు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. సగటున 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పైబడిన వారు కూడా ఫుడ్ డెలివరీ విధుల్లో ఉన్నారు. సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ ఉంటే చాలు.. ఉద్యోగం వచ్చినట్లే. సూర్యాపేట్‌కు చెందిన నగేష్ ఒక ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేసేవాడు. ‘రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా రూ.12 వేలు కూడా వచ్చేది కాదు. పైగా డ్రైవింగ్ చాలా రిస్క్. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి డెలివరీ బాయ్ ఏదో ఒక జోన్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఆ జోన్లో 10 కిలోమీటర్ల మేర ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒక జోన్ మారుతూ ఉంటుంది. ఏ జోన్ వాళ్లు అక్కడే పని చేస్తారు. జోన్లో మార్పులు టీమ్ లీడర్లపై ఆధారపడి ఉంటాయి. ప్రతి 3, 4 జోన్లకు కలిపి ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తారు. పలు మెట్రో నగరాల్లో ఐపీఎల్ సీజన్లోఆర్డర్లు వెల్లువెత్తిన వంటకాలివే.. చెన్నై, కోల్‌కతా: చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ బెంగళూరు: మసాలా దోశ, చికెన్ వింగ్స్ ఢిల్లీ: దాల్ మఖానీ, పిజ్జా, సమోసా ముంబై: దాల్ కిచిడీ హైదరాబాద్: చికెన్ బిర్యానీ, కబాబ్స్ మా ఆకలి వాయిదా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టిఫిన్లు, లంచ్ వరుసగా ఆర్డర్లుంటాయి. దీంతో మాకు తినేందుకు తీరిక ఉండదు. మధ్యాహ్నం 3 తర్వాతే భోజనం చేస్తాం. ఒక్కోసారి మిర్చీలు, బజ్జీలు, సమోసాలతో కడుపునింపుకుంకొని డెలివరీ ఇస్తున్నాం. బ్యాచిలర్స్ కొద్దిగా ఇబ్బంది పెడతారు. వారు ఒక ఆర్డర్ ఇచ్చి డెలివరీ మరొకటి అడుగుతారు. వాపస్ చేస్తారు. అలాంటప్పుడు ఆ నష్టం మేం భరించాల్సి వస్తుంది. – శివప్రసాద్, జొమొటో లస్సీ ఆర్డర్లు వస్తున్నాయి వేసవి కావడం వల్ల లక్సీకి ఆర్డర్లు ఇస్తున్నారు. బిర్యానీకి డిమాండ్ బాగా ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 15 పార్శిళ్లను డెలివరీ చేశాను. ఇందులో ఆరు పార్శిళ్లు బిర్యానీ. మూడు లస్సీ ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని చట్నీస్ హోటల్ నుంచి మూడు వెజ్ లంచ్‌బాక్స్‌లు సరఫరా చేశాను. రెండు చోట్ల కూల్‌డ్రింక్ అందజేశాను. లంచ్‌లో ఎక్కువగా బిర్యానీలు పంపిణీ చేశాను. – మనోహర్, డెలివరీ బాయ్ అర గంటకే డెలివరీ ఇష్టమైన ఫుడ్‌ను ఆన్లైన్లో బుక్ చేస్తే అరగంటలో డెలివరీ ఇస్తాం. ప్రతి రూ.900 బుకింగ్ ఆర్డర్‌పై రూ.300 వరకు కమీషన్ వస్తుంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్‌పై ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం మిల్క్, థిక్‌షేక్, బాదం పాలు, ఫ్రూట్ సలాడ్ వంటి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్డర్లు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం విరామం తీసుకుంటాం. – యశ్వంత్, స్విగ్గీ డెలివరీ బాయ్ -
ఆస్ట్రేలియాలో ఉబెర్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఐపీవోకు సిద్ధమవుతున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌కు ఆస్ట్రేలియాలో ఎదురుదెబ్బ తగిలింది. చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలను పొందుతూ తమ ఉపాధిని నాశనం చేసిందని వేల మంది స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు ఆస్ట్రేలియాలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. సరైన లైసెన్సులు లేని డ్రైవర్ల ద్వారా పర్మిట్లు లేని వాహనాలు నడిపి ఉబెర్ చట్టాలను ఉల్లంఘించిందని వారు ఆ దావాలో పేర్కొన్నారు. ఉబెర్ చర్యల కారణంగా తాము కోల్పోయిన మొత్తం ఆదాయాన్ని తిరిగి చెల్లించాలని ట్యాక్సీ డ్రైవర్లు ఆ దావాలో కోరినట్లు వారి తరఫున కేసు వేసిన లా సంస్థ మారీస్ బ్లాక్బర్న్ పేర్కొంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద క్లాస్ యాక్షన్ దావాగా మారుతున్నట్లు సంస్థ తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఉబెర్ చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజంగానే ఉబెర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కంపెనీపై ఎంత మేర ప్రతికూల ప్రభావం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఉబెర్ కేసు ఓడిపోయి పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా.. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయమున్న కంపెనీకి మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లింపు పెద్ద సమస్య కాబోదని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ఉబెర్‌కు పొంచి ఉన్న చట్టపరమైన రిస్కుల గురించి ఇన్వెస్టర్లకు కనీసం హెచ్చరికలాంటిదైనా ఇచ్చినట్లవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా అమెరికాలో 10 బిలియన్ డాలర్ల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సిద్ధమవుతున్న తరుణంలో ఉబెర్‌కు ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
ఆన్లైన్లో అక్షయ పాత్ర!
సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల నగర జీవనంలో తమకు నచ్చే దైనందిన ఆహారాన్ని తామే తయారు చేసుకొని తినే వెసులుబాటు ఏ కొద్ది మందికో ఉంటుంది. రోడ్డు పక్కన టిఫిన్, హోటల్లో మధ్యాహ్న భోజనం, రాత్రి ఆలస్యమైందని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకుని వచ్చి కాస్త నింపాదిగా తినే సమయం కూడా ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారి తిప్పలు వర్ణనాతీతం. ఇలాంటి వారికి కోరుకున్న రుచులను, కోరుకున్న చోటికే కావాల్సిన సమయానికే అందిస్తూ ఆదరణ పొందుతున్నాయి ఆన్లైన్ ఆహార సరఫరా సంస్థలు, యాప్‌లు. ఇవి ఆహార శాలల్ని ప్రజలకు మరింత చేరువ చేశాయి. క్లిక్ చేస్తే చాలు పది నిమిషాల్లోనే కోరుకున్న చోటికి ఆహారం సరఫరా చేస్తున్నాయి. చిన్నస్థాయి నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్నీ టేక్ అవే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయంటే.. ఆహార పదార్థాల సరఫరాకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి నెలా దాదాపు 15 లక్షలకుపైగా యాప్, ఆన్లైన్ ఆర్డర్లు ఉంటున్నాయి. ఏడాది కాలంలో బుకింగ్‌లు దాదాపు పది రెట్లు పెరిగాయి. స్విగ్గీ, జోమాటో, ఫుడ్‌పాండా తదితర సంస్థలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతోంది. టిఫిన్ల నుంచి భోజనం వరకు.. ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం ఇంటికే తెప్పించుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లేవారు, అనారోగ్య సమయంలో వంటచేసే పరిస్థితులు లేనపుడు ఈ యాప్ సేవలపై ఆధారపడుతున్నారు. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్‌లు ఎక్కువగా కార్యాలయాలకు ఉంటున్నాయి. రుచి, సేవలు, నాణ్యతపై ప్రజల నుంచి సమాచారం తీసుకుంటున్నాయి. ఆ మేరకు రేటింగ్ ఇవ్వడం ద్వారా ప్రజలు ఆహార నాణ్యతపై స్పష్టతకు వస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాల కోసం వస్తున్న ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉంటోంది. మిడ్నైట్ బిర్యానీ కోసం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకూ సేవలు అందిస్తున్నాయి. మొబైల్ యాప్‌ల్లో ఆహారాన్ని బుక్‌చేసేవారు 90శాతం వరకు ఉంటున్నారు. నోరూరిస్తున్న బిర్యానీ.. ఇంటి వద్దకే భోజనం డిమాండ్‌లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. మొబైల్ ఆధారిత యాప్‌ల బుకింగ్‌లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. చికెన్ 65, కబాబ్, పలావ్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి హైదరాబాదీలతో పాటు తెలుగేతర ప్రజలూ ఎక్కువగా ఈ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసేటపుడు శాకాహారానితో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్ ఉంటోందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. యాప్ ఆధారిత ఆహార సరఫరా వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైంది. ప్రతి 3 నెలలకోసారి కనీసం సగటున 15శాతం చొప్పున పెరుగుతోంది. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్‌పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. స్వయంగా ఏజెంట్లను నియమించుకుని.. ఇంటి వద్దకే ఆహార సరఫరా (డోర్ డెలివరీ) అన్ని రెస్టారెంట్లకూ విస్తరిస్తోంది. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, పూర్తిస్థాయి ఏజెంట్లుగా పనిచేసేందుకు యువత ముందుకు వస్తోంది. చదువుకుంటూ పనిచేస్తూ కొందరు ఉపాధి పొందుతున్నారు. సగటున 18 నుంచి 30 ఏళ్లలోపు యువత ఈ రంగంలో పనిచేస్తోంది. 18 ఏళ్ల వయసు, సొంత వాహనం, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ పరిశీలించి, ఇంటర్వ్యూలు చేసి ఆన్లైన్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. కొన్నిసంస్థలు మహిళలనూ డెలివరీ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని కంపెనీలు ఒక్కో ఆర్డరుకు గరిష్టంగా రూ.120 వరకు డెలివరీ బాయ్స్‌కి చెల్లిస్తున్నాయి. -
ఇడ్లీ ప్రియుల్లో బెంగళూరు టాప్
న్యూఢిల్లీ: సాధారణంగా చాలామంది ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. త్వరగా జీర్ణమైపోవడంతో పాటు ఆరోగ్యానికి ఇడ్లీ మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. గోధుమ రవ్వ లేదా రాగిపిండితో చేసిన ఇడ్లీల ద్వా రా ఆరోగ్యంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతారు. ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ అల్పాహారం విషయంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఉదయా న్నే అల్పాహారంగా ఇడ్లీ తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచినట్లు ఉబెర్ ఈట్స్ తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరాది నగరం ముంబై రెండోస్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఉదయం 7.30–11.30 కాలంలో గణనీయమైన సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం నేపథ్యంలో ఈ వివరాలను ‘ఉబెర్ ఈట్స్’ విడుదల చేసింది. ఈ నెల 10న దేశమంతటా అత్యధిక సంఖ్యలో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. వెరైటీ ఇడ్లీలపై మక్కువ ఇడ్లీలపై కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ మక్కువ ఎక్కువేనని సర్వే తేల్చింది. భారత్ వెలుపల అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ, బ్రిటన్‌లోని లండన్ వాసులు ఇడ్లీలను లాగించేస్తున్నారని ఉబెర్ ఈట్స్ వెల్లడించింది. ఇక ఇడ్లీ వెరైటీల విషయంలోనూ భారతీయులు వెనక్కి తగ్గట్లేదని ఈ సందర్భంగా తేలింది. తమిళనాడులోని కోయంబత్తూరు వాసులు చికెన్‌ఫ్రై ఇడ్లీపై మనసు పారేసుకున్నట్లు సర్వే పేర్కొంది. తిరుచినాపల్లి వాసులు ఇడ్లీ మంచూరియాను, నాగ్‌పూర్ నగర వాసులు చాకోలెట్ ఇడ్లీపై మనసు పారేసుకున్నారని సర్వే వెల్లడించింది. అలాగే ఆర్డర్ల సందర్భంగా కొంచెం చట్నీ, కారంపొడి, సాంబార్ ఎక్కువగా వేయాల్సిందిగా చాలామంది వినియోగదారులు కోరారంది. అలాగే ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉన్న మరికొందరు వినియోగదారులు వెజిటబుల్ ఇడ్లీని ఆర్డర్ చేశారని పేర్కొంది. ‘ఇడ్లీ ప్రియులు అత్యధికంగా ఉన్న నగరంగా బెంగళూరు అవతరించడం నిజంగా సంతోషకరమైన విషయం. భారత్‌లో అత్యధికులు ఇడ్లీని తమ అల్పాహారంగా తీసుకుంటారు. అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని గత మూడేళ్లుగా జరుపుతున్నారు. తమిళనాడు కేటరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజమణి అయ్యర్ తొలుత ఈ ప్రతిపాదన చేశారు’ అని బెంగళూరుకు చెందిన ‘బ్రాహ్మిణ్స్ థట్టె ఇడ్లీ’ యజమాని సుభాష్ శర్మ తెలిపారు. -
ఫుడ్ డెలివరీ బాయ్‌తో కలిసి భర్తను అంతం చేసింది..
కంటోన్మెంట్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. పక్కా ప్రణాళికతో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ఊపిరాడకుండా చేసిన నిందితురాలు భర్త గుండెపోటుతో మరణించినట్లు బంధువుల నమ్మించి ఖననం చేయించినప్పటికీ పోలీసుల విచారణలో నేరం బయటపడింది. ప్రధాన నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదై చివరకు హత్యకేసుగా తేలిన ఈ కేసు వివరాలను బేగంపేట ఏసీపీ రామ్‌రెడ్డి, బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిద్రమాత్రలు ఇచ్చి, గొంతునులిమి.. సిఖ్‌విలేజ్ చందూలాల్ బౌలికి చెందిన ఇంతి యాజ్ ఖాన్ (34) అలియాస్ బాబాఖాన్ స్థానికంగా టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పన్నెండేళ్ల క్రితమే భార్య ముగ్గురు పిల్లలను వదిలేసిన బాబాఖాన్, ఉప్పల్ బీరప్పగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న జహేదా బేగంను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. బాబాఖాన్‌తో వివాహం నాటికే జహేదాకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే జహేదాకు కొంతకాలం క్రితం ఓల్డ్ బోయిన్పల్లి హెచ్‌ఏల కాలనీకి చెందిన ఉబర్ ఫుడ్ డెలివరీ బాయ్ సయ్యద్ ఫయాజ్ ఆలంతో కొంతకాలం క్రితం వివాహేతర సంబం ధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన బాబాఖాన్ భార్యను మందలించడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు. భార్య కు మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురిపట్ల కూడా బాబాఖాన్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త అడ్డుతొలగించుకోవాలని భావించిన జహేదా, ప్రియుడు ఫయాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్ 15న రాత్రి 11.00 గంటల సమయంలో బాబాఖాన్‌కు బ్లాక్‌టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. బాబాఖాన్ గాఢ నిద్రలోకి వెళ్లాకు జహేదా, ఫయాజ్‌తో పాటు అతని మిత్రులు మహ్మద్ బాబర్, మహ్మద్ అక్రమ్, సయ్యద్ సజ్జాద్‌లతో కలిసి గొంతునులిమి చంపేశారు. మధ్యలో మెలకువ వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన బాబాఖాన్ గొంతుపై గట్టిగా అదిపట్టడంతో గాయాలయ్యాయి. మరునాటి ఉదయం నిద్రలేపేందుకు యత్నించగా, ఎంతకూ లేవడం లేదని జహేదా పొరుగున ఉండే ఓ నర్సుకు సమాచారం ఇచ్చింది. తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వగా అదే రోజు సాయంత్రం బషీర్‌బాగ్‌లోని స్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ సందర్భంగా బాబాఖాన్ గొంతుపై గాయాలను గుర్తించిన అతని సోదరుడు వదినన నిలదీయగా ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ సందర్భంగా ఆ గాయాల ఫొటోలతో బాబాఖాన్ సోదరుడు ఫజ్జుఖాన్ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పంచనామాలతో బలపడిన అనుమానాలు అనుమానాస్పద మృతి కేసు విచారణలో భాగం గా బోయిన్పల్లి పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నవంబర్ 21న బాబాఖాన్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం లో బాధితుడిని చంపేసినట్లు తేలడంతో హత్యకేసుగా మార్చి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో జహేదాతో పాటు ఆమెతో పాటు హత్య లో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు గురువారం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు పరిశోధనలో కీలకంగా వ్యహరించిన ఎస్ఐ రఘువీర్‌రెడ్డి బృందాన్ని ఏసీపీ అభినందించారు. -
‘ఉబర్’లో బుక్ చేయగానే ‘ఎయిర్ ట్యాక్సీ’ వచ్చేస్తుంది!
ఎగిరే ట్యాక్సీలు.. అదిగో అప్పుడొచ్చేస్తున్నాయి.. ఇదిగో ఇప్పుడొచ్చేస్తున్నాయి అనే మాటలు తప్ప.. ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. ఉబర్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. 2023 సరికి తాము ఉబర్ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తొలుత అమెరికాలోని లాస్ ఏంజెలిస్, డాలస్లలో ఈ సర్వీసులను ప్రవేశపెడతామని.. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ఎగిరే ట్యాక్సీలే పరిష్కారమని చెబుతున్న ఉబర్..ప్రస్తుతం వాటి కోసం ఐదు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇంతకీ ఏమిటీ ఉబర్ ఎయిర్..ఎలా ఉండబోతోంది.. వివరాలివిగో.. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు విమాన ఇంధనంతో పనిలేదు. ఇవి ఎలక్ట్రిక్‌వి. సింగిల్ చార్జింగ్‌తో 100 కి.మీ దూరం ప్రయాణించగలవు. 5 నిమిషాల్లో మళ్లీ చార్జ్ అయిపోతాయి. అత్యధిక వేగం 320 కి.మీ. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. భారీగా కాకున్నా పరిమిత స్థాయిలో లగేజీ పెట్టుకునే సదుపాయం ఉంది. వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. ఎత్తైన భవనాలు, షాపింగ్ మాల్స్ వంటివాటిపై ఏర్పాటు చేసే పికప్ పాయింట్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్తాయి. ఇలాంటి తరహాలోనే ఏర్పాటు చేసే డ్రాపింగ్ పాయింట్ల వద్ద దింపుతాయి. నగరం స్థాయిని బట్టి 50 నుంచి 300 ఎగిరే ట్యాక్సీలను అందుబాటులో ఉంచుతారు. తొలుత మాజీ కమర్షియల్ పైలట్లతో వీటిని నడిపిస్తారు. తదనంతర దశలో అదనపు పైలట్లను నియమించుకుని.. శిక్షణ ఇస్తారు. ఎయిర్ ట్యాక్సీ అనేసరికి ఇదేదో డబ్బున్నోళ్ల వ్యవహారమని అనుకునేరు.. ఉబర్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో మామూలు ఉబర్ ట్యాక్సీలో 40 కి.మీ. ప్రయాణానికి మన కరెన్సీలో రూ.4,200 అవుతుందని అనుకుంటే.. ఉబర్ ఎయిర్‌లో అదే దూరానికి రూ.6,500 అవుతుందట. కొన్నేళ్లలో అమెరికాకు..మరికొన్నేళ్లలో మన వద్దకు.. సూపర్ కదూ.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్విగ్గి, జోమాటో, ఉబర్ డెలి‘వర్రీ’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే కంపెనీల వాహన చోదకులు ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో సైబరాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ తదితర సంస్థలకు చెందిన అధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం ‘సెన్సిటైజేషన్ కమ్ సేఫ్టీ’ సమావేశం నిర్వహించారు.ఫుడ్ డెలివరీ వాహనాల ప్రమేయమున్న ప్రజల భద్రత, రోడ్డు భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్, శాంతిభద్రతలు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. తీరు మార్చుకోవాల్సిందే... మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, వ్యతిరేక దశలో డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హారన్లు ఇష్టారీతిన మోగించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్ డెలివరీ వాహనచోదకులు ఆందోళన కలిగిస్తున్నారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిథులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై ఆయా కంపెనీలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే డ్రైవర్లను తీసుకునే సమయంలో వారి పూర్వపరాలు, కస్టమర్ డాటా నిర్వహణ, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు తరచూ అతిక్రమించే వారిపై నిఘా వేసి తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు హామీ ఇచ్చారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సమావేశానికి ఆహ్వనించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించే తమ కంపెనీ వాహన డ్రైవర్లపై కఠినంగా ఉంటామన్నారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు ప్రవీణ్‌కుమార్, అమర్‌కాంత్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు. -
పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలకు భారీ నష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, మేక్‌మై ట్రిప్ ఇండియా, స్విగ్గీ, జొమాటో కంపెనీల పేర్లు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ కంపెనీలు తమ తమ రంగాల్లో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపనీలే. కనుక ఈ కంపెనీలకు భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ప్రతి ఏటా ఈ కంపెనీలకు నష్టాలే వస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ కలిపి ఉమ్మడిగా ఈ ఏడాదిలో అంటే, ఆర్థిక సంవత్సరం ముగిసే 2018, మార్చి నెల నాటికి 7,800 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక్క జొమాటో కంపెనీకి మినహా మిగతా అన్ని కంపెనీలకు గతేడాదితో పోలిస్తే భారీ నష్టాలు సంభవించాయని బిజినెస్ రీసర్చ్ ఫ్లాట్‌ఫామ్ ‘టోఫ్లర్’ డేటా తెలియజేస్తోంది. పేటీఎం, దాని మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్లు, పేటీఎం నుంచి విడిపోయిన పేటీఎం మాల్ కంపెనీలకు కలిపి ఈ ఏడాది 3,393 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మార్కెట్ వృద్ధి రేటు గణనీయంగా పెరిగే వరకు ఈ కంపెనీల పరిస్థితి ఇంతే. అది ఇప్పట్లో జరుగుతుందన్న సూచనలు లేవు. లాభాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా, ఖర్చులకు వెరియకుండా ముందుగా మార్కెట్లోకి దూసుకపోయి, మంచి గుర్తింపు పొందడమే లక్ష్యంగా ఈ కంపెనీలు పనిచేయడంతో లాభాల జాడ కనిపించడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. అలాగే ఉబర్ కన్నా ఓలా పెద్దిదిగా ఎదిగింది. పోటీ కంపెనీలను అధిగమించి మార్కెట్లోకి తాము దూసుకుపోవాలనే తాపత్రయం కారణంగానే ఈ కంపెనీలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయిగానీ, పేరుకు తగ్గట్లు లాభాలు గడించలేకపోయాయి. పైగా పెద్ద ఎత్తున నష్టాలను పోగుచేసుకున్నాయ. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు ఉండడం వల్ల ఎంత నష్టాలొచ్చినా ఈ కంపెనీలు ప్రస్తుతం మనుగడ సాగించకలుగుతున్నాయి. ఆసియా నుంచి కొత్త తరానికి చెందిన ‘బైడు, టెన్సెంట్, సాఫ్ట్‌బ్యాంక్’ పెట్టుబడిదారులు రావడం ఈ సంస్థలకు కలిసి వస్తోంది. (ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!) ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఓయో, ఓలా కంపెనీలు, అమెజాన్‌కు పోటీగా డిస్కౌంట్లతో ముందుకు పోయినంత కాలం ఈ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ‘ఎవరెస్ట్’ గ్రూపునకు చెందిన కన్సల్టింగ్, మార్కెటింగ్ పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు యుగల్ జోషి హెచ్చరించారు. ఎక్కడోచోట లాభాలకు బాట వేయకపోతే కంపెనీలతోపాటు పెట్టుబడిదారులు దారుణంగా మునిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. -
బైక్ రైడ్ కావాలా? అయితే ‘రాపిడో’..!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్ కరెక్ట్!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్ పూర్వ విద్యార్థుల త్రయం. ఓలా, ఉబర్‌లా మాదిరి బైక్ షేరింగ్ సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది విజయవాడ దగ్గర్లోని తిరువూరు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఫ్లిప్‌కార్ట్‌లో చేరా. సొంతగా కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచనతో ఐఐటీలో స్నేహితులైన పవన్ గుంటుపల్లి, రిషికేష్ ఎస్‌ఆర్‌లతో కలిసి 2015 నవంబర్‌లో బెంగళూరు కేంద్రంగా రాపిడోను ప్రారంభించాం. కస్టమర్ల రిజిస్ట్రేషన్ కోసం ట్రూ కాలర్‌తో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌ను డౌన్లోడ్ చేశాక.. రిజిస్టర్ విత్ ట్రూకాలర్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. మొబైల్ నంబర్, ప్రొఫైల్, ఓటీపీ ఏవీ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రైడర్స్‌కు బీమా సౌకర్యం ఉంటుంది. కస్టమర్ యాప్‌లో లాగిన్ అయి.. చేరాల్సిన గమ్యాన్ని ఎంట్రీ చేయగానే.. దగ్గర్లో అందుబాటులో ఉన్న బైక్‌లు కనిపిస్తాయి. డ్రైవర్ ప్రొఫైల్, ధర వస్తుంది. ఒకే చేయగానే రైడర్ రెండు హెల్మెట్లతో మీ దగ్గరికొస్తాడు. గమ్యస్థానాన్ని చేరుకున్నాక నగదు గానీ వ్యాలెట్ ద్వారా గానీ చెల్లింపులు చేయాలి. అంధులు, మానసిక వికలాంగుల కోసం రీడీమ్ ఫీచర్‌ను జోడించాం. గమ్యస్థానాన్ని వాయిస్ రూపంలో పలికితే అది టెక్ట్స్‌గా మారుతుంది. దీంతో పాటూ బ్యాంక్ ఖాతా అనుసంధానంతో వాలెట్ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. ఏపీ, తెలంగాణల్లో 15 లక్షల రైడ్స్.. ప్రస్తుతం 15 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 4 లక్షల మంది. రోజుకు 40 వేల రైడ్స్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 వేల వరకూ ఉంటాయి. నెలవారీ బైక్ పాస్ కూడా ఉంటుంది. నెలకు 50 ట్రిప్పులకు రూ.1,500 చార్జీ. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. ప్రతి రైడ్‌పై 15–20 శాతం డ్రైవర్ నుంచి కమిషన్ తీసుకుంటాం. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులు.. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ పలువురు వీసీలూ పాల్గొంటారు -
డేటా బ్రీచ్ : ఉబెర్‌కు భారీ జరిమానా
కాలిఫోర్నియా: ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఊబెర్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. 2016 నాటి డేటా బ్రీచ్ ఆరోపణలకు సంబంధించి సంస్థకు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంది. ఉబెర్ డ్రైవర్లు, కస్టమర్ల డేటాను చోరీ చేసిన కేసులో ఊబెర్ సంస్థకు ఈ పెనాల్టీ పడింది. ఇది అతి పెద్ద బహుళ డేటా ఉల్లంఘన పరిష్కారమని న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బారా వ్యాఖ్యానించారు. 2016 లో హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల ( 5.7 కోట్లు) వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం ద్వారా రైడ్-షేర్ కంపెనీ డేలా చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిలో 25 .6 మిలియన్ల అమెరికన్ యూజర్లు ఉన్నారు. 6లక్షలమంది డ్రైవర్ లైసెన్స్ నంబర్లతో సహా, 10లక్షలకు పైగా ఉబెర్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్స్ చోరీకి గురయ్యాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగిన ఈ కేసులో అమెరికా రాష్ట్రాలకు భారీ మూల్యం చెల్లించనున్నట్లు ఊబర్ అంగీకరించింది. అమెరికాలోని 50 రాష్ర్టాలతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాకు సుమారు 148 మిలియన్ల డాలర్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఆ రాష్ట్రాల మధ్య పంపిణీ అవుతుంది. మరోవైపు ఊబెర్ కొత్త చీఫ్ కొష్రోవ్‌షాహి నవంబర్ లో ఉల్లంఘనను అంగీకరించారు. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై తమ కస్టమర్ల డాటాను సురక్షితంగా, భద్రగా ఉంచుతామని ఉబెర్ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలతో నిర్మాణాత్మక , సహకార సంబంధాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. డేటా ప్రైవసీ నియంత్రణపై ఒక మానిటర్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. కాగా ఇప్పటికీ రైడర్స్, డ్రైవర్ల డేటా ఉల్లంఘనపై చికాగో, లాస్ ఏంజిల్స్ నగరాల నుంచి ఉబెర్ వ్యాజ్యాలని ఎదుర్కొంటోంది. డేటా ఉల్లంఘనపై ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిన సంస్థఅప్పటి చీఫ్ ప్రైవసీ అధికారిపై వేటు వేసింది. అలాగే గత జులైలో ఇద్దరు ఆఫీసర్లను నియమించుకుంది. రుబీజెఫోను ప్రధాన గోప్యతా అధికారిగాను, మట్ ఓల్స్‌ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌నుగాను నియమించింది. -
ఉబర్, ఓలాలతో అంతా ఉల్టా పల్టా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలోని నగరాలు గంటల గంటల ట్రాఫిక్ జామ్‌లకు, కాలుష్య కషాయానికి పెట్టింది పేరు. భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగుళూరు నగరంలో 52,07,693 ద్విచక్ర వాహనాలు, 14,49,334 ప్రైవేటు కార్లు ఉన్నాయంటే అక్కడ రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రోజుకు ఓ రెండు, మూడు గంటలపాటైనా ఈ వాహనాలన్నీ రోడ్లపైనే ఉంటాయంటే ట్రాఫిక్ జామ్‌లు ఇంకా ఎలా ఉంటాయో ఊహించడమే కాదు, ప్రత్యక్షంగా చూస్తునే ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే పాశ్చాత్య దేశాల్లో ‘కారు పూలింగ్’ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒక అపార్ట్మెంట్ లేదా ఓ కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు లేదా పరిచయస్థులు ఒక్కొక్కరు ఒక్కో కారుతీయకుండా, ఒకే కారులో నలుగురైదుగురు కలిసి ఆఫీసులకు వెళ్లడం, ఆఫీసుల నుంచి తిరిగి రావడం కోసం ఈ ‘కారు పూలింగ్’ ఐడియా కొంత మేరకు బాగానే పనిచేసింది. ఒక్కొక్కరిని ఆఫీసుల వద్ద దించుకుంటూ పోవాలి, మళ్లీ ఎక్కించుకుంటు రావాలి కనుక ‘కారు పూలింగ్’లో ఆఫీసుకు ముందుకు బయల్దేరాల్సి వచ్చేది. వచ్చేటప్పుడు ఇంటికి లేటుగా రావాల్సి వచ్చేది. ఇదే సమయంలో ఉబర్, ఓలా, లిఫ్ట్ లాంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ‘కారు పూలింగ్’ కష్టాలు తప్పాయి. ‘ఇలాంటి క్యాబ్ సర్వీసుల వల్ల రోడ్లపై ప్రైవేటు వాహనాలు తగ్గి ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రైవేటు కార్లతో పోలిస్తే క్యాబ్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక వాతావరణంలో కలిసే కాలుష్యం కూడా తక్కువే’ అని ఉబర్ క్యాబ్‌ల వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ 2015లో వ్యాఖ్యానించారు. పలు పాశ్యాత్య దేశాలతోపాటు భారత్‌లోని అన్ని నగరాలకు ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించిన నేపథ్యంలో ట్రావిస్ కలానిక్ వ్యాఖ్యలు నిజమయ్యాయా? ట్రాఫిక్ రద్దీ తగ్గిందా, పెరిగిందా? కాలుష్యం తగ్గిందా, పెరిగిందా? ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించాక పాశ్చాత్య నగరాలతోపాటు పలు భారతీయ నగరాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగి జామ్‌లు పెరగడమే కాకుండా కాలుష్యం కూడా పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యకర పరిణామాలు. బాస్టన్, న్యూయార్క్, లండన్ నగరాల్లో ట్రాఫిక్ రద్దీలు బాగా పెరిగాయి. ఇక భారత్‌లోని నగరాల్లో క్యాబ్ సర్వీసుల విస్తరణ వల్ల వాహనాల సంఖ్య పెరిగి, ట్రాఫిక్ రద్దీ, జాములు కూడా పెరిగాయి. బెంగళూరులో 2015, మే నెల నాటికి 84,92 టాక్సీలు ఉండగా, 2018 సంవత్సరం నాటికి అవి ఏకంగా 89 శాతం పెరిగి, 1,59,519కి చేరుకున్నాయి. ఇక ఈ కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు 24 శాతం పెరగ్గా, కార్ల సంఖ్య 31 శాతం పెరిగింది. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో ముంబై నగరంలో నలుపు–పసుపు కార్ల సంఖ్య 70 శాతం తగ్గి, క్యాబల సంఖ్య అంతకన్నా పెరిగిందట. దేశంలోని నగరాల్లో రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా వాటికీ పరిమితులు ఉంటాయి. పీక్ అవర్స్ (అత్యవసర వేళల్లో)లో క్యాబ్‌లు ఎక్కువగా రోడ్డపైనే తిరుగుతున్నాయి. సాధారణ వేళల్లో మాల్స్, ఆఫీసులు, విద్యాసంస్థల వద్ద రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. పర్యవసానంగా వాహనాల రాకపోకలకు రోడ్డు ఇరుకవుతోంది. పీక్ అవర్స్‌లో ఈ కార్లన్నీ ఆఫీసులు, మాల్స్, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, మెట్రో స్టేషక్లకే ఎక్కువగా పరుగులు తీయడం వల్ల ఆ ప్రాంతాలన్నీ రద్దీ అవుతున్నాయి. క్యాబ్ సర్వీసులు ఎక్కువగా విస్తరించిన అమెరికాలోని ఏడు నగరాల్లో చేసిన సర్వేలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రైడ్ షేరింగ్ వల్ల ఈ నగరాల్లో 49 శాతం నుంచి 61 శాతం వరకు కొత్త ప్రయాణికుల శాతం పెరిగి వాహనాల కాలుష్యం పెరిగింది. రైడ్ షేరింగ్ కారణంగా క్యాబుల్లో ప్రయాణిస్తున్న ఈ 49 శాతం నుంచి 61 శాతం మంది ప్రయాణికులు ఇంతకుముందు కాలి నడకనో, సైకిల్‌పైనో, ప్రభుత్వ బస్సులోనే వెళ్లే వారు. ఇప్పుడు భారత్ నగరాల్లో కూడా ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కాలి నడక, సైకిల్ లేదా బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు క్యాబుల్లో షేరింగ్ రైడ్లను ఆశ్రయిస్తున్నారు. అమెరికా సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు కార్లు తమ గమ్యం దిశలో ఒక మైలు వెల్లాల్సి వస్తే క్యాబ్‌లు అలా ప్రతి మైలుకు 2.8 మైళ్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నాయట. షేరింగ్ రైడ్‌లో ఒకరి ఒక చోట, మరొకరి మరోచోట ఎక్కించుకొని వారిని గమ్యస్థానాలకు చేర్చడం వల్ల ఈ అదనపు తిరుగుడు అవుతుందట. దేశంలోని నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ‘షేరింగ్ రైడ్లే’ ఉత్తమ మార్గమని కేంద్ర ప్రభుత్వ మేధో మండలి ‘నీతి ఆయోగ్’ ఇదే సమయంలో అభిప్రాయ పడడం గమనార్హం. ప్రభుత్వ బస్సు, మెట్రో రైలు సర్వీసులను విస్తరించడం, సర్వీసుల సంఖ్యను పెంచడం, వాకింగ్, సైక్లింగ్‌లను ప్రోత్సహించడం ట్రాఫిక్ రద్దీ నివారణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇక డ్రోన్లతో ఫుడ్ డెలివరీ
సాక్షి, న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఇంటికి కోరుకున్న ఆహారం అందుబాటులోకి వస్తే తాజాగా టెక్నాలజీ సాయంతో క్షణాల్లోనే ఆహారం అందేలా ఆయా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని కస్టమర్లకు చేరవేయడంపై దృష్టి సారించామని ఊబర్ ఈట్స్ ఆసియాపసిఫిక్ హెడ్ రాజ్ బేరి చెప్పారు. డ్రోన్ డెలివరీ కోసం తామిప్పటికే పైలట్లను ప్రకటించామన్నారు. డ్రోన్ల ద్వారా కేవలం ఏడెనిమిది నిమిషాల్లో ఆహారాన్ని కస్టమర్లు తమ ముంగిట్లో పొందగలుగుతారన్నారు. అయితే భారత్‌లో నూతన డ్రోన్ పాలసీ ఆహార సరఫరా లేదా వాణిజ్య అవసరాలకు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించదన్నారు. టెక్నాలజీలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా సమీప భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరాను చేపడతామని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా రెస్టారెంట్లకు తమ సేవలతో మెరుగైన వ్యాపార అవకాశాలు నెలకొంటాయన్నారు. ఊబర్ ఈట్స్‌కు భారత్‌లో భారీ మార్కెట్ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన 15 నెలల్లోనే ప్రతినెలా 50 శాతం వృద్ధి నమోదు చేశామని రాజ్ బేరీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 నగరాలు, 12,000 రెస్టారెంట్లలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఇప్పటికే దిగ్గజ సంస్థలున్నా, తాము సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వృద్ధి సాధిస్తామని దీర్ఘకాలంలో తమకు మంచి అవకాశాలున్నాయన్నారు. -
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..!!
న్యూఢిల్లీ: బటన్ నొక్కగానే ట్యాక్సీలాగా విమానమే ఇంటి ముంగిట్లో వాలితే.. గంటల తరబడి ట్రాఫిక్ జంఝాటాలేమీ లేకుండా క్షణాల్లోనే గమ్యస్థానాలకు ఎగిరిపోగలిగితే.. అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోంది కదూ.. అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల దిగ్గజం ఉబెర్ ప్రస్తుతం దీన్ని సాకారం చేసే ప్రయత్నాల్లోనే ఉంది. త్వరలోనే ఎయిర్‌ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎలివేట్ పేరుతో అందించే ఈ సర్వీసుల కోసం భారత్ సహా పలు దేశాల్లో అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఆరు నెలల్లోగా అనువైన నగరాల ఎంపిక పూర్తి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముందుగా తొలి విడతలో అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజెలిస్‌లలో ఏరియల్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించాలని.. అంతర్జాతీయంగా మరో నగరాన్ని ఎంపిక చేయాలని ఉబెర్ యోచిస్తోంది. దీనికోసం భారత్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్‌లను షార్ట్ లిస్ట్ చేసింది. వీటిల్లో ఒకదాన్ని అమెరికాకు వెలుపల ఉబెర్ ఎయిర్ సిటీగా ఎంపిక చేయనున్నట్లు ఉబెర్ పేర్కొంది. మార్కెట్ పరిమాణం, అనుకూల పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. 2020 నాటికి ప్రయోగాత్మకంగా పరిశీలన.. ప్రయోగాత్మక ఫ్లయిట్స్‌ను 2020 కల్లా ప్రారంభించాలని, 2023 నాటికి మూడు నగరాల్లో వాణిజ్యపరంగా సేవలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఉబెర్ ఏవియేషన్ ప్రోగ్రామ్స్ హెడ్ ఎరిక్ అలిసన్ వెల్లడించారు. భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాలన్నా గంటల తరబడి సమయం పట్టేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వీసులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఉబెర్ పేర్కొంది. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగే వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీవోఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ సేవలకు ఉపయోగించాలని సంస్థ భావిస్తోంది. ఎత్తైన భవంతుల మీద వీటికోసం హెలీప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. పదిహేను నిమిషాల దూరానికి 129 డాలర్లు ఉబెర్ ఎలివేట్ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని మెరీనా, శాన్జోసీకి ఉబెర్ క్యాబ్‌లో వెడితే 1 గంట 40 నిమిషాలు (56.9 మైళ్లు), కాల్ట్రెయిన్లో వెడితే(55.4 మైళ్లు) 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. అయితే, ఉబెర్ ఎలివేట్ ఎయిర్ ట్యాక్సీలో 15 నిమిషాలే (43.3 మైళ్లు) పడుతుంది. ప్రారంభంలో ఇందుకు చార్జీలు 129 డాలర్లు(సుమారు రూ. 9,030)గా ఉన్నా ఆ తర్వాత 43 డాలర్లకు(3,010), దీర్ఘకాలంలో 20 డాలర్లకు(1,400) తగ్గే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం ఇదే దూరానికి ఉబెర్ ఎక్స్ క్యాబ్‌కి 111 డాలర్లు(సుమారు రూ. 7,700), ఉబెర్‌పూల్ (షేరింగ్)కి 83 డాలర్లు(రూ. 5,810) అవుతోంది. -
గాల్లో ఎగిరే కార్లు!
ఇక ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవాల్సిన పని లేదు. దిల్షుక్నగర్ నుంచి హైటెక్ సిటీకి కేవలం పది నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఎంచక్కా గాల్లోనే హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు. అవును ఇకపై ఉబర్ క్యాబ్‌లలో ఉబర్ పూల్, ఉబర్ గో మాత్రమే కాదు ఉబర్ ఎయిర్ ఆప్షన్ కూడా రాబోతోంది. అమెరికాలోని దల్లాస్, లాస్ ఏంజెల్స్‌లో ఎగిరే కార్లను నడుపుతామని గత ఏడాది ప్రకటించిన ఉబర్ సంస్థ ఇప్పుడు మరో నగరంలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అయిదు దేశాలతో షార్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో భారత్‌కు కూడా చోటు దక్కింది. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఉబర్ ఎలివేట్ ఆసియా ఫసిఫిక్ సదస్సులో ఉబర్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలను ఎంపిక చేసింది. ఈ దేశాల్లోని వివిధ నగరాల్లో మార్కెట్, కొత్త తరహా రవాణా విధానాన్ని వాడడానికి ప్రజలు కనబరిచే ఉత్సాహం, ఇతర పరిస్థితుల్ని అంచనా వేశాక ఎగిరే కార్లను నడిపే మూడో నగరాన్ని ఎంపిక చేస్తుంది. 10 లక్షల జనాభాకు మించి ఉన్న మెట్రోపాలిటన్ నగరంలోనే ఈ సేవలను తీసుకురావాలని భావిస్తోంది. ఆయా నగరాల్లో స్థానిక అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలతో మమేకమయ్యే సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి మరో ఆరు నెలల్లో మూడో నగరాన్ని ప్రకటిస్తామని ఉబర్ వెల్లడించింది. 2020 నాటికల్లా ప్రయోగాత్మకంగా ఈ కార్లను నడిపి చూసి, 2023 నాటికి పూర్తి స్థాయిలో ఎగిరే కార్ల సర్వీసుని అందుబాటులోకి తీసుకురానుంది. ‘భారత్‌లో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ఏ సమయంలో చూసినా ట్రాఫిక్‌తో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఒకట్రెండు కిలో మీటర్ల దూరానికి గంట పట్టేస్తుంది. ఇకపై ఆ బాదరాబందీ ఉండదు. ఎగిరే కార్లను తీసుకువస్తే ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది‘ అని ఉబర్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉబర్ ఎలివేట్ ప్రత్యేకతలు గాల్లో ఎగిరే కార్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉబర్ సంస్థ ఇప్పటికే ఎన్నో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ఉబర్ ఎలివేట్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. బోయింగ్, బెల్ హెలికాప్టర్ వంటి డజనుకు పైగా సంస్థలు పెద్ద సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. వేలకోట్ల డాలర్ల పెట్టుబడిని పెడుతున్నాయి. ఈ ఎగిరే కార్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ కార్లు పూర్తిగా విద్యుత్ మీదే నడుస్తాయి పెద్ద పెద్ద భవంతులపై కూడా సులభంగా వాలిపోగలవు టేకాఫ్, ల్యాండింగ్ నిలువుగా చేస్తాయి (వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఠ్టిౌ∙ఎయిర్‌క్రాఫ్ట్) వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. 15 నుంచి 100 కి.మీ. దూరం ప్రయాణించేలా కార్ల తయారీ గంటకి గరిష్ట వేగం 300 కి.మీ 20 కి.మీ దూరాన్ని కేవలం 10 నిముషాల్లోనే చేరుకోగలవు ఒకేసారి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం పైలెట్ కాకుండా నలుగురు ప్రయాణికులు కూర్చొనేలా కార్ల డిజైన్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ కార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సగటున రోజుకి రెండు గంటల సమయం ఆదా అవుతుందనే అంచనాలున్నాయి. -
క్యాబ్‌కు సెలవు
సాక్షి బెంగళూరు: ఐటీ సిటీలో ప్రయాణం చేయాల్సి వస్తే క్యాబ్‌ను యాప్‌లో బుక్ చేసుకోవడం క్రమంగా తగ్గుతోంది. రవాణా శాఖ ఇటీవల క్యాబ్ రేట్లను పెంచడంతో ప్రజలు క్యాబ్ ట్యాక్సీల సేవలకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఓలా, ఉబర్ తదితర క్యాబ్‌లను మొబైల్ యాప్ ద్వారా తొందరగా బుక్ చేసుకుని ప్రయాణించడం అందరికీ సులువుగానే ఉంటోంది. కానీ వాటి చార్జీలు భగ్గుమంటుండడంతో జనం పొదుపుగా ఉండే రవాణా సాధనాలపై దృష్టి సారిస్తున్నారు. సొంత వాహనాల్లోను, ఆటోలు, బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణాలకూ వెనుకాడడం లేదు. ఓలా, ఉబర్ క్యాబ్‌లు గతంలో తక్కువ రేట్లకే ప్రయాణం చేసేలా ఆఫర్లు ప్రకటించాయి. దీంతో ప్రజలు క్యాబ్‌ల్లో ప్రయాణించేందుకు అలవాటు పడ్డారు. ఒక్కరే వెళ్లడానికి కూడా తక్కువ ధరలు కావడంతో అందరు ఆసక్తి చూపారు. కొత్తగా రేట్లు పెరగడంతో వినియోగదారులు ఒకటికిరెండు సార్లు ఆలోచిస్తున్నారు. గత్యంతరం లేనిపక్షంలోనే క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. కొత్త చార్జీలు ఇలా ⇔ ఈ ఏడాది మార్చి 3న రేట్లను సవరిస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. క్యాబ్ వాహనాల ఖరీదు ఆధారంగా ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి చార్జీలను నిర్ధారించింది. ⇔ డి క్లాస్ వాహనాల్లో (వాహనం రేటు రూ.5 లక్షల వరకు) కనీస చార్జీ రూ.44 ఉంది. – కిలోమీటరుకు రూ.11– 22 ⇔ సి క్లాస్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) వాహనాల్లో అయితే రూ.48. – కి.మీకి రూ.12–24 ⇔ బి క్లాస్ (రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు) వాహనాల్లో రూ.64. – కి.మీ.కి 16–34 ⇔ ఎ క్లాస్ (రూ.16 లక్షల పైగా) వాహనాల్లో కనీస చార్జీ రూ.80. –కి.మీ.కి 25 –45 ⇔ కొత్త నిబంధనల ప్రకారం క్యాబ్ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే వెయిటింగ్ చార్జీ కింద ప్రతి 15 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. కొన్నింటికే పరిమితం అయితే పెంచిన రేట్లు కొన్ని వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు మారుతూ వస్తుంటాయి. ఖరారు చేసిన ధరల కంటే ఒక్కోసారి ఎక్కువగా కూడా వసూలు చేస్తుంటారు. బెంగళూరు టూరిస్టు టాక్సి ఆపరేటర్స్ అసోసియేషన్ (బీటీటీఓఏ) మాత్రం పెంచిన రేట్లపై స్పందించలేదు. నగరంలో మొత్తంగా 1.25 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు రవాణా విభాగానికి అటాచ్ అయి ఉన్నాయి. -
ప్యాసింజర్ పేరుతో డ్రైవర్ జల్సా...!!
సాక్షి, ముంబై : ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ‘ఉబెర్’ లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి ఊహించని పరిణామం ఎదురైంది. క్యాబ్‌లో ఎక్కించుకోకుండానే తన పేరిట నగరమంతా డ్రైవర్ చక్కర్లు కొట్టడంతో కంగుతినడం అతడి వంతైంది. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ప్రేషిత్ దియోరుఖర్ అనే వ్యక్తి జూలై 19న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తాను ఉన్న చోటుకి రావాల్సిందిగా సంబంధిత క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఎంతసేపైనా అతను రాకపోవడంతో ప్రేషిత్ ఫోన్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా అతడు ఫోన్ ఎత్తకపోవడంతో విషయాన్ని గ్రహించిన ప్రేషిత్.. ట్విటర్ ద్వారా తన సమస్యను ఉబెర్ టీమ్‌కు తెలియజేశాడు. కానీ అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తన పేరిట డ్రైవర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో లొకేషన్ షేర్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు. ‘క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..?’ ‘మలాద్ వెస్ట్ నుంచి నన్ను పికప్ చేసుకున్నాడు, ఇప్పుడతను ఉత్తర ముంబైకి చేరుకున్నాడు. ఒకవేళ ఆ క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..? దాని వల్ల ఎవరికి సమస్య..? 857.43 రూపాయలు చెల్లించాలట. జల్సా అతడిది బిల్లు మాత్రం నాది’ అంటూ వరుసగా ట్వీట్లు చేయడంతో ఎట్టకేలకు ఉబెర్ టీమ్ స్పందించింది. ‘మీ డబ్బులు తిరిగి చెల్లిస్తాం. డ్రైవర్‌కు నోటీసు కూడా జారీ చేశాం’ అని సమాధానమిచ్చింది. నా సమయం వృధా చేసి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదంటూ ప్రేషిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా నిమిషాల్లోనే ప్రేషిత్ ట్వీట్లు వైరల్ కావడంతో మరికొంత మంది ప్రయాణికులు కూడా క్యాబ్ డ్రైవర్ల వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. @UberINSupport Hi, your 1-trip driver has started the trip without arriving at the location. His phone isn't reachable. What do I do? pic.twitter.com/L6tRT95gmI — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 Pickup was in Malad West. Driver has now reached the edge of north Mumbai. I'm assuming he has to dump something in the khaadi. pic.twitter.com/pG3QmAo6lg — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 Or he is dumping a dead body sealed in the car deep in the mangroves, me thinks. pic.twitter.com/SBokjKaLkK — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 -
క్యాబ్ ప్రయాణం భయం భయం
సాక్షి బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చినప్పుడు చాలా సంతోషించారు. 2012లో ఓలా, 2013లో ఊబెర్ సేవలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఆటోరిక్షా డ్రైవర్లు ఎంతంటే అంత డిమాండ్ చేస్తూ ప్రయాణికుల పాలిట గుదిబండగా మారిన తరుణంలో ఈ క్యాబ్‌లు అందుబాటులోకి రావడంతో నగరవాసులు ఎంతో ఆనందించారు. తొలినాళ్లలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ధరలో ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తామని క్యాబ్ యజమానులు హామీనిచ్చారు. దీంతో పాటు ఆటోరిక్షాలతో పోలిస్తే క్యాబుల్లో చార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు వాటిని ఎక్కువగా ఆదరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మొత్తం మారాయి. నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న క్యాబ్ డ్రైవర్లు ఆకతాయిల చేష్టల వల్ల వాటిపై ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది. ప్రస్తుతం నగరంలో మొత్తం 1.57 లక్షల క్యాబ్‌లు, 1.85 లక్షల ఆటో రిక్షాలు తమ సేవలను అందిస్తున్నాయి. 2013–14లో 66,264 క్యాబ్‌లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఒకటిన్నర లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఒక్కరోజులో 3.5 లక్షల మంది క్యాబ్‌ల్లో ప్రయాణం చేస్తున్నారు. మోటార్ వాహన చట్టం పాత నియమాల వల్ల క్యాబ్‌లను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సమయంలో మహిళలు తప్పించుకోవడానికి వీలులేకుండా డ్రైవర్లు చైల్డ్ లాక్‌ను ఆన్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ చైల్డ్ లాక్ ఆన్‌లో ఉంటే కేవలం వాహన తలుపును బయట నుంచి మాత్రమే తెరిచేందుకు వీలవుతుందని, తద్వారా లోపల ఉన్న మహిళలు వాటిని తెరిచినా అవి తెరుచుకోలేకపోతున్నాయని తెలిపారు. 2016లో వచ్చిన ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటెడ్ నియమాల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలను మాత్రమే ప్రయాణికుల నుంచి క్యాబ్ యజమానులు వసూలు చేయాలి. అలాగే జీపీఎస్‌ను ఇన్స్టాల్ చేయాలి. హెచ్చరిక బటన్లను ఏర్పాటు చేయాలి. క్యాబ్ డ్రైవర్లు కూడా రాష్ట్రంలో కనీసం రెండేళ్ల నివాసం కలిగిన వారు మాత్రమే ఉండేలా నియమాలను నిర్ధేశించారు. ఇన్ని చర్యలు తీసుకున్నా మహిళలు, యువతులు, బాలికలపై వేధింపులు ఆగడం లేదు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో మరీ ఎక్కువవుతున్నాయి. కాగా, వేధింపులపై పెడుతున్న కేసులు నిలబడడం లేదని పోలీసులు తెలిపారు. 2016లో చేసిన నియమాలపై క్యాబ్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానం ఎదుట పెండింగ్‌లో ఉండడంతో క్యాబ్ యజమానులపై కేసులు పెట్టలేకపోతున్నామని తెలిపారు. త్వరలో మరో మూడు క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవాణా శాఖ వద్ద ఆప్టా క్యాబ్స్, సీఏబీ10 క్యాబ్స్, లెట్జ్ క్యాబ్స్ అనే మూడు సంస్థల లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
విజయవాడలో ఉబెర్ ఈట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ కంపెనీ ఉబెర్ ఈట్స్ విజయవాడలో సేవలను ప్రారంభించింది. ప్యారడైజ్, క్రీమ్‌స్టోన్, డ్రన్కీన్ మంకీ, సెవెన్ డేస్, సదరన్ స్పైస్ వంటి స్థానిక రెస్టారెంట్లతో ఉబెర్ ఈట్స్ ఒప్పందం చేసుకుంది. ఉబెర్ రైడ్స్ కంటే ముందు ఉబెర్ ఈట్స్ సేవలను ప్రారంభించిన తొలి నగరం విజయవాడేనని ఉబెర్ ఈట్స్ హెడ్ భావిక్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఐదు ఆర్డర్లకు 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని.. కనీస ఆర్డర్ విలువ రూ.100గా నిర్ణయించామని ప్రతి డెలివరీ మీద రూ.10 డెలివరీ చార్జీ ఉంటుందని కంపెనీ తెలిపింది. విశాఖపట్నంలోనూ ఉబెర్ ఈట్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. -
ఆర్టీసీ, మెట్రో, ఉబర్‌లతో ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు మళ్లించేందుకు ఆర్టీసీ, మెట్రో, ఉబర్, ఓలా, ఇతర ప్రైవేటు మినీ వాహనాలతో ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ చెప్పారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో సౌకర్యవంత ప్రయాణానికి పరిష్కారాలు అన్వేషించటం కోసం మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ తదితర సంస్థల అధికారులతో కలసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈ టాస్క్‌ఫోర్స్ సమావేశమైంది. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి మెట్రో, ఆర్టీసీ, ఉబర్, ఓలా తదితరాలను దాని పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. వీటన్నిటికి కలిపి ఒకే కామన్ టికెట్ ఉండేలా చూస్తామన్నారు. అయితే ఈ ఆలోచన ప్రస్తుతానికి తొలిదశలోనే ఉందని, నెల రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో మెట్రోరైలుతో ఆర్టీసీకి పోటీ ఉండదని, రెండు ప్రజా రవాణా సంస్థల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. కాలనీ ప్రాంత ప్రయాణికులకు మైట్రో స్టేషన్ వరకు తీసుకువచ్చే విధంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ–మెట్రో అనుసంధానంపై రెండు నెలల్లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే వ్యక్తిగత వాహనాలు, కాలుష్యం తగ్గుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
-
క్యాబ్‌కు వెం‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: ‘చిన్న కార్యాలయం.. కొన్ని మాటలు’ ఇవే వారికి పెట్టుబడి. లాభాలు మాత్రం భారీగా తెచ్చే వ్యవస్థ గ్రేటర్ మరొకటి పుట్టుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు నిలువునా మునిగిపోయి అప్పుల పాలవుతున్నారు. గ్రేటర్లో ఉన్న పలు సాఫ్ట్వేర్ సంస్థలు, బీపీఓ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తరలించేందుకు క్యాబ్‌లను వినియోగించడం పరిపాటి. దీన్నే కొందరు తమకు ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. వారే ‘వెండర్లు’. వీరు వివిధ సాఫ్ట్వేర్ సంస్థలతో లాబీయింగ్ ఒప్పందం చేసుకుని.. ఆపై క్యాబ్ డ్రైవర్లతో మరో ఒప్పందం చేసుకుని ఆపై దోపిడీకి తెరతీస్తున్నారు. క్యాబ్‌ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచేసి డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే ఈ రతహా వ్యవస్థీకృత దోపిడీ కొనసాగుతోంది. ఫైనాన్షియర్ల నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన క్యాబ్ డ్రైవర్లు చివరకు అప్పులు చెల్లించలేక వాహనాలను తనఖా పెట్టేసి రోడ్డుపాలవుతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థలకు, కంపెనీలకు, వివిధ రకాల పరిశ్రమలకు అద్దె ప్రాతిపదికన వాహనాలను ఏర్పాటు చేసే నెపంతో డ్రైవర్లకు, సాఫ్ట్వేర్ సంస్థలకు నడుమ మధ్యవర్తిగా వ్యవహరించే ఈ ‘వెండర్’ వ్యవస్థ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సంస్థలు చెల్లించే సొమ్ములో సగానికి సగం తమ ఖాతాల్లో వేసుకొంటున్నట్లు వాపోతున్నారు. డ్రైవర్‌కు దక్కేది కొంతే.. సాఫ్ట్వేర్ సంస్థలు పెద్ద వాహనాలకు కిలోమీటర్‌కు రూ.18 నుంచి రూ.20 చొప్పున చెల్లిస్తుంటాయి. ఆ మొత్తంలో డ్రైవర్లకు రూ.10 నుంచిరూ.12 మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును వెండర్లు తీసుకుంటున్నారు. చిన్న వాహనాల పైన వచ్చే ఆదాయం మరింత దారుణంగా ఉంది. పైగా ప్రధాన వెండర్లకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య సబ్ వెండర్ల వ్యవస్థ కూడా ఉంటుంది. ఒక క్యాబ్ డ్రైవర్ ఏదో ఒక సంస్థలో వాహనం నడపాలంటే సబ్ వెండర్ల వద్ద ఒప్పందం కుదుర్చుకోవాలి. వారు ప్రధాన వెండర్‌తో మరో ఒప్పందం చేసుకుంటారు. ప్రధాన వెండర్‌కు, సాఫ్ట్వేర్ సంస్థలకు మధ్య మరో ఒప్పందం ఉంటుంది. అంతిమంగా సదరు సంస్థకు ప్రయాణ సదుపాయాన్ని అందజేసే సగటు డ్రైవర్‌కు దక్కేది మాత్రం చాలా తక్కువ. గ్రేటర్లో సుమారు 50 వేల మంది సొంత వాహనం కలిగి ఉన్న డ్రైవర్లు ఈ తరహా దోపిడీకి గురవుతున్నట్లు క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిరుజీవుల ఉపాధిపై వేటు.. నగర శివార్లలోని ఇబ్రహీంపట్నానికి చెందిన రవికుమార్ ఏడేళ్ల క్రితం అప్పుచేసి స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నాడు. హైటెక్‌సిటీలోని ఓ సబ్ వెండర్ వద్ద ఒప్పందంచేసుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీసులకు తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం అతని విధి. ఈ క్రమంలో పనిగంటలతో నిమిత్తం లేకుండా సేవలు అందజేస్తూనే ఉంటాడు. ఆ వాహనంపైన వెండర్‌కు ఒక కిలోమీటర్‌కు రూ.12 చొప్పున లభిస్తే రవి చేతికి వచ్చేది రూ.7 మాత్రమే.‘రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు తిరుగుతాం. కానీ వెండర్స్ మాత్రం 35 నుంచి 40 కిలోమీటర్లకే లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తారు.పైగా ఏ నెలకు ఆ నెల చెల్లించడం లేదు. మూడు నెలలకు ఒకసారి ఇస్తారు. దీంతో నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నాను’ అంటూ రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రైవేట్ రంగంలోని వాహనాల నిర్వహణపై రవాణాశాఖకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం ఈ తరహా మధ్యవర్తుల వ్యవస్థ అక్రమార్జనకు అవకాశం ఇచ్చినట్టయింది. కాల్‌సెంటర్లు, సాఫ్ట్వేర్ సంస్థలు, ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాహనాలను ఏర్పాటు చేసే వెండర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే డ్రైవర్లను దోచుకుంటున్నారు. దీంతో చాలామంది డ్రైవర్లు అప్పులు చెల్లించలేక వాహనాలను వదిలేసుకుంటున్నారు. డీజిల్‌పై 4 శాతం అ‘ధన’ం.. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు నేరుగా బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు వీల్లేదు. వెండర్లకు అనుబంధంగా పనిచేసే సబ్వెండర్ల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలి. ఇలా కొనే డీజిల్‌పైన పెట్రోల్ ధర కంటే 4 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు.‘ఏ నెలకు ఆ నెల డబ్బులు చేతికి రావు. మొదట్లో 45 రోజులకు ఒకసారి ఇస్తామంటారు. చివరకు మూడు నుంచి 5 నెలల వరకు వాయిదాలు వేస్తారు. వాహనం నడిపేందుకు, ఇల్లు గడిచేందుకు ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తోంది. ఏదో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సొంతంగా వాహనం నడిపేందుకు అవకాశం ఉన్నా ఈ వెండర్లు అడ్డుకుంటారు. చాలా కష్టంగా ఉంది’ డ్రైవర్ నాగరాజు ఆవేదన ఇది. నగరంలో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో లక్షకు పైగా ఉబర్, ఓలా సంస్థల్లో తిరుగుతుండగా మరో 10 వేల వాహనాలు ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 వేల నుంచి 60 వేల వాహనాలు ప్రైవేట్ సంస్థలకు సేవలందజేస్తున్నాయి. ఈ వాహనాలన్నీ వెండర్ల ద్వారానే సదరు సంస్థలకు సేవలు అందజేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వెండర్ల వ్యవస్థను తొలగించాలి క్యాబ్‌లకు, ప్రైవేట్ సంస్థలకు నడుమ ఉన్న వెండర్లను తొలగించాలి. ప్రభుత్వమే స్వయంగా చార్జీలు నిర్ణయించాలి. డ్రైవర్లు నేరుగా ఒప్పందం చేసుకొనే అవకాశం కల్పించాలి. పైగా వెండర్ల వల్ల ఎలాంటి ప్రమాద బీమా కూడా లేదు.– సిద్ధార్థగౌడ్,జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉబెర్‌కు షాకిచ్చిన గూగుల్
శాన్ ఫ్రాన్సిస్కో: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు గూగుల్మాప్స్ ద్వారా అనూహ్య పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక, కారణం చెప్పకుండానే ఉబెర్ రైడ్ బుకింగ్ సేవలను తొలగించింది. డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకోలేరని సోమవారం గూగుల్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గూగుల్ తన హెల్ప్‌లైన్ పేజీలో ఈ మేరకు సూచించిందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. అయితే ఉబెర్ యాప్‌లో రూటు చూడడం, రైడ్ రిక్వెస్ట్ లాంటివి చేసుకోవచ్చని తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని గత ఏడాది జనవరిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఉబెర్ అఫీషియల్ యాప్‌తో సంబంధం లేకుండా.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అటు గూగుల్ కానీ, ఇటు ఉబెర్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
కస్టమర్లే టార్గెట్ : ఉబెర్ కొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ ఇండియా సరికొత్త ప్రణాళికలతో దూసుకు వస్తోంది. భారత్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులే లక్ష్యంగా వ్యూహ రచన చేసింది. డారా ఖోస్రోషహీ నాయకత్వంలో ఉబెర్ ఇండియా ఇక్కడి మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది. నెట్వర్క్ లో కనెక్టివిటీ పరిస్థితుల్లోనూ, అలాగే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లలో కూడా బాగా పని చేయడానికి వీలుగా ఉబెర్ యాప్‌లో 'లైట్' వెర్షన్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్ వెర్షన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది. తద్వారా భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రధాన ప్రత్యర్థి ఓలాను ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది. టైర్ -3 నగరాలలో దాని వినియోగదారుల సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి, ప్రజాదరణను పెంచుకోటానికి ఉబెర్ తన యాప్‌లో డేటా-లైట్ సంస్కరణను ప్రవేశపెట్టింది. స్థానిక కస్టమర్లకు ఆకట్టుకునేలా వారికి అందబాటుల్లో భాషల్లో యాప్‌ను లాంచ్ చేయనుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్ ప్రకటించింది. ఏడు భారతీయ భాషలలో దీన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు. -
ట్రాఫిక్ రద్దీతో ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ఏటా 2,200 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో తోటి ఆసియా నగరాల కన్నా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరవాసులు గంటన్నర సేపు ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్ రద్దీలో గడుపుతున్నట్లు ఉబర్ టాక్సీ సర్వీసు సంస్థ ఏర్పాటు చేసిన బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెల్లడించింది. నగర వాసులు ఒక చోటు నుంచి గమ్యస్థానానికి వెళ్లాలంటే పట్టే సరాసరి సగటు సమయం కన్నా ఆసియా నగరాల్లో 67 శాతం పడుతుంటే భారత్ మెట్రోపాలిటిన్ నగరాల్లో 149 శాతం ఎక్కువ పడుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా కూడా దేశానికి ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్ట వాటిల్లుతోందని ఆ సంస్థ తెలియజేసింది. ట్రాఫిక్‌లో అదనపు సమయానికి అయ్యే ఇంధనం ఖర్చు, ఆ సమయానికి మ్యాన్ పవర్‌కు అయ్యే ఖర్చు, కాలుష్యం, ప్రమాదాలకు ఖర్చు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి అయ్యే ఖర్చును అంచనావేసి ఈ లెక్క తేల్చినట్లు సంస్థ వెల్లడించింది. 1980 సంవత్సరంతో పోలిస్తే భారత దేశంలో ట్రాఫిక్ అవసరాలు ఎనిమిదింతలు పెరిగాయి. దేశం ఆర్థికంగా ఎంతో పురోభివద్ధి చెందడం, ప్రజల్లో ఎక్కవ మంది సొంత కారులు కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో జనాభా పెరగడం, జన సాంద్రత ఎక్కువగా ఉండడం, మెట్రో రైళ్ల లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఆశించిన మేరకు విస్తరించకపోవడమే కారణమని ఆ సంస్థ పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఇతర నగరాలకన్నా ముంబై , ఢిల్లీ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి కాస్త మెరగుపడినప్పటికీ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. -
ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
-
మెట్రో రైలు-ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్ తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే ఉబెర్ సీవోవో బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు. మెట్రోరైలు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఓలా, తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌ఎమ్మార్ గురువారం ఉబెర్‌తో కూడా ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఉబెర్ సీవోవో మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో దీనికి బ్రేక్ పడిందా లేక ఒప్పందం జరిగిందా అనేది క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా, ఐటీ సెక్రెటరీ జయేశ్‌రంజన్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబెర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధుకన్నన్, ప్రెసిడెంట్ అమిత్‌జైన్ తదితరులు హాజరైనారు. -
ఊబర్–ఓలా మధ్య మళ్లీ విలీన చర్చలు
ముంబై: ట్యాక్సీ సేవల సంస్థలు ఊబర్–ఓలా మరోసారి విలీనంపై చర్చలు మొదలు పెట్టాయి. ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంకు మధ్యవర్తిత్వం నెరపుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు అందించిన సమాచారం మేరకు... రెండు కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గడిచిన కొన్ని నెలల్లో పలుసార్లు సమావేశమయ్యారు. ఊబర్‌ను ఓలా కొనుగోలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇరు కంపెనీల్లో అతిపెద్ద వాటాదారగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ చర్చలను ముందుండి నడిపిస్తోంది. దీనిపై ఓలా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కార్యకలాపాల విస్తరణకు అన్వేషణ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సాఫ్ట్ బ్యాంకు ఇతర ఇన్వెస్టర్లు సైతం ఈ అశయ సాధనకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఊబర్ తన ఆగ్నేయాసియా వ్యాపారాన్ని ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రాబ్కు విక్రయించి వైదొలగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఓలాతో విలీన చర్చల అంశం వెలుగు చూడడం గమనార్హం. -
ఊహించని ప్రమాదం.. వీడియో విడుదల
శాన్ ఫ్రాన్సిస్కో : ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా అభివృద్ధి చేయకుండా ఈ తరహా వాహనాలను బిజీ రోడ్ల పైకి ఎలా అనుమతించారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించిన వీడియోను టెంపె పోలీస్ శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రమాద సమయంలో వోల్వో వాహనంలోని కెమెరాల ద్వారా లోపల, బయట జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. చీకట్లో ఎలైనే హెర్జ్‌బర్గ్(49) తన సైకిల్‌తో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో లోపల కూర్చున్న వాహనదారు కూడా ఊహించని ఆ పరిణామంతో షాక్ తినటం చివర్లో చూడొచ్చు. ఆదివారం రాత్రి అరిజోనా రాష్ట్రంలోని టెంపె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెర్జ్‌బర్గ్ ఆస్పత్రిలో మృతి చెందింది. కారులోని వ్యవస్థ పాదాచారిని గుర్తించకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఈ తరహా వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. మరోవైపు వీటి పని తనంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తేకపోవటమే ఉత్తమమన్న డిమాండ్‌నూ పలువురు తెరపైకి తెస్తున్నారు. Tempe Police Vehicular Crimes Unit is actively investigating the details of this incident that occurred on March 18th. We will provide updated information regarding the investigation once it is available. pic.twitter.com/2dVP72TziQ — Tempe Police (@TempePolice) March 21, 2018 -
సెల్ఫ్ డ్రైవింగ్ ఉబెర్ కారు: విషాదం
వాషింగ్టన్ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రోడ్లపై పరిగెత్తించే క్రమంలో విషాద సంఘటన ఒకటి కలకలం రేపింది. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ సందర్భంగా మహిళపైకి దూసుకెళ్లడంతో హెర్జ్‌బర్గ్ (49) తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. టెంపె ప్రాంతంలో రాత్రి పూట తన సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్ వే నుంచి ఆమె ఒక్కసారిగా హైవే దారిలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డెమెక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎర్వర్డ్ స్సందిస్తూ.. ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనమైన జన సంచారం లేని ప్రాంతంలో పరీక్షించాలి కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎలా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ తరహ టెక్నాలజీతో ఉబెర్ రూపొందించిన స్వీయ డ్రైవింగ్ వాహనాలను అనుమతి కోరుతూ.. అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై చట్టసభల్లో డెమెక్రటిక్ పార్టీ వ్యతికేకించింది. పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి వాహనాలను అనుమతించాలని సభ్యులు కోరారు. కాగా నార్త్ అమెరికాలో ఈ తరహ వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. -
ఓలా, ఉబెర్ సేవలకు బ్రేక్!
సాక్షి, బిజినెస్ బ్యూరో/సిటీబ్యూరో : డ్రైవర్లకు చెల్లించే నగదు ప్రోత్సాహకాలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉబెర్, ఓలా ట్యాక్సీ డ్రైవర్లు ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లో దాదాపు 50 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో ఈ నిరసన ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడింది. ఢిల్లీ, బెంగళూరు, పుణేలో మాత్రం ప్రభావం తక్కువే ఉంది. ఇరు కంపెనీలు ఒప్పంద సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఆదాయాలు రావటం లేదని, అందుకే సమ్మెకు దిగామని డ్రైవర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ సమ్మె ప్రభావం... దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ట్యాక్సీ డ్రైవర్లు సర్వీసులను నిలిపేశారు. దీంతో చాలాచోట్ల మధ్యాహ్నం వరకు క్యాబ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓలా, ఉబెర్‌లు తమను మొదట భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించి ఎలాంటి ఒప్పందాలు, అంగీకార పత్రాలు లేకుండా నిలువుదోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ ఈ సందర్భంగా విమర్శించారు. నగరంలో రెండు క్యాబ్ సంస్థల్లో వాహనాల సంఖ్య ఒకానొక స్థాయిలో 1.25 లక్షలకు పెరిగింది. డ్రైవర్ ఓనర్లు ప్రత్యామ్నాయాలు చూసుకోవడంతో ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పడిపోయిందని సమాచారం. మరోవైపు ఓలా సంస్థ లీజు ప్రాతిపదికన పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకుంది. దీంతో అప్పటి వరకు బుకింగ్లపైన ఆధారపడి వాహనాలు నడిపిన డ్రైవర్ల పరిస్థితి తలకిందులైంది. అన్నిచోట్లా ఇదే వాతావరణం ఉండటంతో లీజ్ ఒప్పందాలను రద్దు చేయాలనేది కూడా డ్రైవర్ల సమ్మె డిమాండ్లలోకి చేరింది. నెలకు రూ.75,000 ఉండాలి.. ప్రతి నెలా కనీసం రూ.75 వేలు లభించేలా బుకింగ్‌లు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లు నెలకు రూ.25 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి నెలకొంది. లీజు క్యాబ్‌లకు అధిక బుకింగ్‌లు ఇవ్వటం, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు బుకింగ్‌లను భారీగా తగ్గించడమే దీనికి అసలు కారణం. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్‌లకు ప్రత్యామ్నాయంగా క్యాబ్ డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకునేలా ‘టీసీడీఓఏ’ పేరిట మొబైల్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. క్యాబ్ డ్రైవర్ల ఉపాధికి కనీస గ్యారెంటీ లభించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు టీసీడీఓఏ అధ్యక్షుడు శివ చెప్పారు. శంషాబాద్ కేంద్రంగా రెండు నెలల్లో ఈ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. 5,000 మంది డ్రైవర్లతో ప్రారంభించి క్రమంగా దీన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లిలో సమావేశం కూడా నిర్వహించారు. టీసీడీఓఏ లక్ష్యాలు... ♦ ప్రతి డ్రైవర్‌కు రోజుకు రూ.3000 నుంచి రూ.5000 ఆదాయం ♦ ఆర్టీసీ డ్రైవర్ల తరహాలో 8 గంటల పని విధానం ♦ లాభాపేక్ష లేకుండా డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకొనే వెసులుబాటు ♦ ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు ♦ డ్రైవర్ల బీమా, ఇతర అన్ని సదుపాయాలు ఒకే వేదిక నుంచి అమలయ్యేలా చర్యలు తప్పనిసరి కావటంతోనే... ఓలా, ఉబెర్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకొనేందుకు, బుకింగ్‌లు పెంచుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాం. రెండేళ్ల పాటు పోరాటం చేశాం. జైలుకు కూడా వెళ్లాం. కానీ ఫలితం లేదు. ప్రభుత్వం కూడా మా బాధలను పట్టించుకోలేదు. గత్యంతరం లేక మేమే స్వయంగా మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. –శివ (టీసీడీఓఏ) బండ్లు తాకట్టు పెట్టాను ఓలా, ఉబెర్‌లో ఉపాధి బాగుందని మంచిర్యాల నుంచి హైదరాబాద్ వచ్చా. ఏడాది పాటు బాగానే ఉంది. రెండు బండ్లు కొన్నా. ఓలాలో పెట్టా. కానీ క్రమంగా ఆదాయం పడిపోయింది. బండి ఫైనాన్స్ కూడా కష్టమైంది. వాహనాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరిపైనా ఆధారపడకుండా మేమే ఒక యాప్ ఏర్పాటు చేసుకోవడం మంచిదనిపిస్తోంది. –కమలహాసన్, డ్రైవర్ -
ఓలా, ఉబెర్ బుక్ చేస్తున్నారా?
సాక్షి, ముంబై: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల్నిపరిష్కరించాలని కోరుతూ ఓలా, ఉబెర్ డ్రైవర్ల సమ్మె సోమవారం అర్థరాత్రినుంచి ప్రారంభంకానుంది. రాజ్‌థాకరే నాయకత్వంలోని ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పలునగరాల్లో క్యాబ్ సేవల వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలను ఈ సమ్మెతీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతోపాటు పలు నగరాల్లోని క్యాబ్ వినియోగదారులు ఇబ్బంందులను ఎదుర్కోనున్నారు. వేలాదిమంది డ్రైవర్ పార్టనర్స్ తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని ఎంఎన్ఎస్ అనుబంధ సంఘం ప్రకటించింది. యూనియన్ అధ్యక్షుడు సంజయ్ నాయక్ మాట్లాడుతూ, సమ్మెకు సహకరించమని జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తామని.. వినకపోతే ఎంఎన్ఎస్ శైలిలో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. మరోవైపు తమ డ్రైవర్లకు భద్రత కల్పించాల్సిందిగా ఓలా, ఉబెర్ యాజమాన్యాలు పోలీసు అధికారులను కోరాయి. నగరంలో కాబ్ రైడ్ సమయంలో ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలను డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులను కలిశామని ఓలా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అటు మరికొన్ని సంఘాలు ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్‌లో సమ్మెను పాటించడంలేదని ఇప్పటికే కొన్ని సంఘాలు ప్రకటించడం గమనార్హం. ఇదిఇలా ఉంటే నిరవధిక సమ్మెకు క్యాబ్‌డ్రైవర్లకు హెచ్చరించడంతో ముంబై పోలీసులు నగరంలో149 సెక్షన్ విధించారు. ఈ మేరకు వివిధ సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్య తీసుకుంటామని సీనియర్ అధికారి వ ెల్లడించారు.కాగా మార్చి 18 ఆదివారం అర్థరాత్రి నుంచి మూకుమ్మడిగా సమ్మెకు దిగనున్నామని ఓలా, ఉబెర్ డ్రైవర్లు హెచ్చరించారు. అంతేకాదు తమ సమస్యల్ని పరిష్కరించకపోతే నిరవధిక సమ్మకు దిగమనున్నామని మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే.