UGC
-
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
విద్య.. కేంద్ర గుత్తాధిపత్యం కాదు
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, దానిపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం పనికిరాదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యపై కేంద్రానికి గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాలు తమ సొంత విద్యావిధానాన్ని రూపొందించుకోవడానికి అధికారం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేరని తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో భట్టి మాట్లాడారు. ‘యూజీసీ నిబంధనలు మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్నట్లుగా ఉన్నాయి.వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. కీలకమైన వైస్–చాన్స్లర్ల నియామకం, ప్రవేశాలపై అధికారం మాత్రం కేంద్రానికి ఇవ్వాలని ముసాయిదాలో ఉంది. వైస్ చాన్స్లర్ల నియామకానికి సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ చాన్స్లర్ల అర్హతలు మార్చడం ఆందోళనకరం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయి’ అని పేర్కొన్నారు. రాష్ట్రాలకు విద్యపై స్వయంప్రతిపత్తి ఉండాలి: స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాల ఉమ్మడి విజ్ఞప్తిని కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకారమంటే బలవంతంగా రుద్దడం కాదని చురకలంటించారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వని ఎంత దూరమైనా చేరుతుందని అన్నారు. తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భట్టి వివరించారు.సరైన మార్గాన్ని ఎంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్ నుంచి సర్దార్ హరోజ్ సింగ్ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినట్టు కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు వెల్లడించారు.కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈరోజు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిశారు. భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలను రాష్ట్ర గవర్నర్‌కి బాధ్యతలు ఇవ్వడం సరికాదని చెప్పాము. వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు తెలిపారు.గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉంది. ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారికి సరైన విధానాలు పాటించాలని కేంద్రమంత్రిని కోరాం. NH-365బీ సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు పొడిగించాలని, టూరిజం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కోరడం జరిగిందన్నారు.ఇదే సమయలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన విచారణ జరగబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పుకొచ్చారు. -
పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు. సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్‌కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. విశ్వగురువు ఎలా అవుతాం?2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి. అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు. జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.బోధన–పరిశోధనఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి. విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
కేంద్రం చేతి కీలుబొమ్మ యూజీసీ!
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 లోగా ప్రజాభిప్రాయం సేకరించి, నూతన మార్గదర్శకాలు (guildelines) వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ముసాయిదా (Draft) పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీన పరుస్తు న్నాయి.ఇప్పటి వరకూ వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ (Search Committee) వేస్తూ వస్తోంది. కమిటీలో ముగ్గురు సభ్యులు – యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూని వర్సిటీ కౌన్సిల్ ప్రతినిధి ఉంటు న్నారు. ఈ సెర్చ్ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు సవరించిన నియమాలు వైస్–ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ (Kerala) వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్లతో విభేదిస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వరుసలో ఉన్నాయి.మొదటిసారిగా వీసీల నియామకాల్లో నాన్ అకడమిక్ వ్యక్తులను నియమించాలని తాజా ముసాయిదా సిఫార్సులు చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్‌గా లేదా కీలకమైన పరిశోధనలో లేదా అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో, ప్రభుత్వ లేదా కనీసం ప్రభుత్వరంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది.ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవటానికే కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ–నెట్లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ (UGC) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యా పకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరిచేందుకు కీలు బొమ్మలా ఆడిస్తోంది.చదవండి: బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశంకరిక్యులమ్, బోధనపరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి. – కె. ప్రసన్న కుమార్,ఆంధ్రప్రదేశ్ ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షులు -
‘క్వాలిటీ’ ర్యాంకులు
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలు తీసుకు వస్తోంది. ఇందులో జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ ఇచ్చే న్యాక్ అక్రిడిటేషన్‌లో అదనపు ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేస్తోంది. ఈ ప్రక్రియలో రెండు దశల్లో విద్యా సంస్థల మదింపు చేసి ర్యాంకులు ఇవ్వనుంది. తొలి దశ ‘ఎలిజిబులిటీ క్వాలిఫైయర్’లో ప్రాథమిక అర్హతలను పరిశీలిస్తారు.ఇందులో ఎంపికైన విద్యా సంస్థలు రెండో దశ పరిశీలనకు వెళ్తాయి. తొలి దశలో విద్యా సంస్థ 11 రకాల అంశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో యూజీసీ గుర్తింపు, న్యాక్ అక్రిడిటేషన్, ఏఐఎస్హెచ్ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్, విద్యార్థుల ఫిర్యాదు పరిష్కార కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రాథమికంగా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే రెండో దశకు అర్హత లభిస్తుంది. రెండో దశలో నాణ్యత ధ్రువీకరణ కోసం నిర్ణీత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యా సంస్థలోని కనీసం 75 శాతం బోధనా పోస్టుల్లో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఈ శాశ్వత సిబ్బంది మాలవీయ మిషన్ ద్వారా శిక్షణ పొంది ఉండాలి. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, పర్యావరణ విద్యను ఆయా సంస్థలు బోధిస్తూ ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 3 వేల మంది విద్యార్థులను చేర్చుకున్నారా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా? తదితర ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 49 ప్రశ్నలకు గానూ 30 ప్రశ్నలు అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. మరో 13 ప్రశ్నలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సంబంధించినవి. ముఖ్యంగా వైస్ చాన్సలర్ల నియామకం యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదో పరిశీలించనున్నారు. ఈ తాజా మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని యూజీసీ కోరింది. అయితే జాతీయ విద్యా విధానం అమలు ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇవ్వడాన్ని తమిళనాడు, కర్ణాటక విశ్వవిద్యాలయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్ఈపీని అమలు చేయని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. -
సరికొత్తగా ‘డిగ్రీ’
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సులను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, సంప్రదాయ కోర్సుల్లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలపై అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కమిటీ వేసింది.త్వరలో సిలబస్‌ను ఖరారు చేయబోతోంది. త్వరలోనే విధివిధానాలను వెల్లడిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి పూర్తి నైపుణ్యంతో ధైర్యంగా ఉపాధి కోసం వెళ్లేలా సిలబస్ ఉండబోతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. క్రెడిట్స్‌కే ప్రాధాన్యం.. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానం క్రెడిట్ స్కోర్ ఆధారంగా నడుస్తోంది. టెన్త్, డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానం వల్ల ఇతర దేశాల్లోనూ ఉపాధి కోసం వెళ్లవచ్చని అధికారులు అంటున్నారు. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది.ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే నాలుగేళ్ల కోర్సులోనే ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు. ఆనర్స్‌కు కొత్త బోధనా ప్రణాళిక.. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకార మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూ డా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో వర్సిటీలు అందించే బ్రిడ్జ్ కోర్సు లు చేయటం తప్పనిసరి. నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించబోతున్నారు.మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టీఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా ఇస్తారు. మూడేళ్లు చది వితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ కోర్సులో చేరేందుకు అవకాశం ఇస్తారు. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.డిగ్రీలోనూ ఏఐ కోర్సులుడిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో సూచించింది. తెలంగాణలో నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చా రు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది.ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) లో చేరికలు కూడా ఆరేళ్లలోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్లను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో ట్యాక్స్ నిపుణుల అవసరం రెట్టింపైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. -
సంప్రదాయానికే జై.. టోపీ, గౌన్లకు బై బై
భారతీయ విద్యాసంస్థల స్నాతకోత్సవ సంప్రదాయాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి నల్లటోపీ, గౌన్ల స్థానాన్ని సంప్రదాయ చేనేత వస్త్రాలు భర్తీ చేస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2015లో మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణకు మారాలని పిలుపునిచ్చింది. తద్వారా చేనేత పరిశ్రమ పునరుద్ధరణతో పాటు నేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పాటునివ్వాలని కోరింది. కేవలం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా వేడి, తేమతో కూడిన వాతావరణంలో చేనేత వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలోనే ఐఐటీలు, ఐఐఎంలు సహా దాదాపు 70 కేంద్ర విద్యాసంస్థలు యూజీసీ డ్రెస్ ఇండియన్ అడ్వైజరీ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించాయి. వీటిలో 62 విద్యాసంస్థలు ఇప్పటికే సంప్రదాయ దుస్తుల్లో స్నాతకోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు కొనసాగిన శాటిన్ దుస్తులు, గౌన్లు, హుడ్స్, మోర్టార్బోర్డ్లు (టోపీలు) త్వరలో కనమరుగు కానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల వైద్య సంస్థలను కూడా వారి స్నాతకోత్సవ వేడుకలకు భారతీయ దుస్తుల కోడ్‌ను అనుసరించాలని కోరడం విశేషం. – సాక్షి, అమరావతికొన్ని వర్సిటీల్లో హైబ్రిడ్ డ్రెస్ కోడ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 48 సెంట్రల్ వర్సిటీలలో 34 సంస్థలు స్నాతకోత్సవాల్లో గౌన్లు, టోపీలను దశలవారీగా రద్దు చేశాయి. వీటిలో మహారాష్ట్రలోని వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయ, పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్‌లోని విశ్వభారతి, అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం యూజీసీ సిఫారసులకు ముందునుంచే సంప్రదాయ దుస్తులను అనుసరిస్తున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ జార్ఖండ్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ తమిళనాడు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లేకుండా భారతీయ, పాశ్చాత్య దుస్తులను మిళితం చేస్తూ హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండటం గమనార్హం. బెనారస్ వర్సిటీ నుంచి మొదలై.. సెంట్రల్ వర్సిటీల్లో వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ డ్రెస్ కోడ్ మార్పునకు మొదటగా స్పందించింది. ఇక్కడ స్నాతకోత్సవానికి విద్యార్థులు పసుపు రంగు ఉత్తరీయం, సఫాల(టోపీ)తో పాటు పురుషులైతే తెల్లటి కుర్తా–పైజామా, మహిళలు చీరలు ధరిస్తూ భారతీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా 11 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డ్రెస్ కోడ్ మారలేదు. వీటిల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం, మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, నాగాలాండ్ విశ్వవిద్యాలయం, మణిపూర్ విశ్వవిద్యాలయంలో త్వరలో మార్పుల కోసం ఆలోచిస్తున్నట్టు ధ్రువీకరించాయి. ఇప్పటికే నాగాలాండ్ విశ్వవిద్యాలయం తమ స్నాతకోత్సవ వేడుకలకు సంప్రదాయ నాగా దుస్తులను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుపుతోంది. లద్ధాఖ్లోని సింధు సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఒడిశా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినవి కావడంతో ఇంకా స్నాతకోత్సవ వేడుకను నిర్వహించలేదు. వివాదాలూ ఉన్నాయ్! స్నాతకోత్సవాల్లో భారతీయ సంప్రదాయ దుస్తుల ధారణపై విమర్శలు లేకపోలేదు. విద్యావేత్తలు స్నాతకోత్సవం భావన పాశ్చాత్యమైనదని.. ఇందులో భారతీయ దుస్తుల కోడ్ ఎందుకని ప్రశి్నస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐఐటీ–ఖరగ్‌పూర్ స్నాతకోత్సవంలో డ్రెస్ కోడ్ వివాదాన్ని రేకెత్తించింది. ఆ సంస్థ వస్త్రధారణ శైలిపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. పొడవాటి దుస్తులు, పాదరక్షలు, ఆభరణాలను కూడా ధరించాలని సూచించడంతో విద్యార్థులు మండిపడ్డారు. ఇప్పటికే భారతీయ తరహా దుస్తులు ధరిస్తున్నందున కొత్త మార్గదర్శకాలు ఏమిటని ప్రశి్నంచడంతో ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2021లో ఐఐటీ– జమ్మూ కాశీ్మరీలో ఫెరాన్లు (మోకాళ్ల వరకు ఉండే వస్త్రం), పకోల్స్ (పురుషుల టోపీ) స్ఫూర్తితో స్నాతకోత్సవ వేషధారణ కోసం ప్రణాళికలను ప్రకటించిన తర్వాత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత తెల్ల కుర్తాలు–పైజామాలకు మారింది. యూజీసీ సిఫారసు చేసిన డ్రెస్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ లక్నోకు చెందిన బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని దళిత్ స్టూడెంట్స్ యూనియన్ 2019లో అంబేడ్కర్‌కు నివాళిగా పాశ్చాత్య దుస్తులు(సూట్) ధరించడానికి అనుమతి కోరింది. ఐఐటీ ఢిల్లీ మినహా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ వర్సిటీలు కలిపి 92 ఉన్నాయి. యూజీసీ సిఫారసులతో 76 శాతం కంటే ఎక్కువ వర్సిటీలు పాత డ్రెస్ కోడ్‌ను తొలగించాయి. మొత్తం 23 ఐఐటీల్లో ఒక్క ఐఐటీ–ఢిల్లీ తప్ప మిగతావన్నీ భారతీయ దుస్తులను స్వీకరించాయి. వీటిలో 18 ఐఐటీలు 2015 తర్వాత మార్పు చేశాయి. యూజీసీ సలహా కంటే ముందే భువనేశ్వర్, జోధ్‌పూర్, బాంబే, గాంధీనగర్, గౌహతి ఐఐటీలు భారతీయ దుస్తులను అనుసరిస్తుండటం విశేషం. ఐఐటీ భువనేశ్వర్‌లో మహిళలకు కుర్తా డ్రెస్ కోడ్‌కు బదులుగా చీరల ఎంపికను తీసుకొచి్చంది. ఐఐటీ బాంబేలో ఖాదీ ఉత్తరీయాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతకు అద్దం పట్టేలా ఐఐటీ–మండిలో సంప్రదాయ నీలిరంగు శాటిన్ వస్త్రానికి బదులుగా ఇప్పుడు ఆఫ్–వైట్ కుర్తా–పైజామా, సల్వార్–కుర్తాలు (హిమాచలీ శాలువా, టోపీ)లతో జత చేసిన చీరలను ధరిస్తున్నారు. ఇక 21 ఐఐఎంలలో 14 సంస్థలు పాత డ్రెస్ కోడ్‌ను రద్దు చేశాయి. కానీ, వీటిల్లో అన్నీ స్నాతకోత్సవ సంప్రదాయ వేషధారణను భారతీయ దుస్తులతో భర్తీ చేయలేదు. ఏడు ఐఐఎంలు స్టోల్‌తో కూడిన పాశ్చాత్య శైలి ఫార్మల్ దుస్తులను ఎంచుకున్నారు. అయితే బెంగళూరు, కలకత్తా, లక్నో, ఇండోర్, రోహ్తక్, ఉదయ్‌పూర్, అమృత్సర్ ఐఐఎంలు ఇంకా పాత డ్రెస్ కోడ్‌నే కొనసాగిస్తున్నాయి. ఐఐఎం షిల్లాంగ్‌లో స్థానిక ఖాసీ ర్యాప్ దుస్తులను ఎంచుకున్నారు. -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి. తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు. ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. -
మూడేళ్లకు ముందుగానే ‘డిగ్రీ’
సాక్షి, అమరావతి: ఇక నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలు ఉంటే రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించి నాలుగేళ్లలో ముగించవచ్చు. ఈ మేరకు సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సామర్థ్యం కలిగిన విద్యార్థులు వేగంగా చదువును పూర్తి చేసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక విద్యార్థి కోర్సు వ్యవధిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మూడేళ్ల డిగ్రీని రెండు లేదా రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేయవచ్చు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ డిగ్రీ విద్యలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.సమయం.. ఆర్థిక వనరులు ఆదా!నూతన జాతీయ విద్యావిధానం–2020తో దేశ ఉన్నత విద్యలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సామర్థ్యం కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ యాక్సిలరేటెడ్, స్లో–పేస్డ్ డిగ్రీలపై సిఫార్సులు చేసింది. దీనికి యూజీసీ సైతం ఆమోదం తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందుగానే విద్యార్థి తన డిగ్రీ చదువును ముగించడం ద్వారా త్వరగా వర్క్ ఫోర్స్‌లోకి, ఉన్నత విద్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సమయంతోపాటు ఆర్థిక వనరులను ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో సమతుల్యం చేసుకోవడానికి కూడా ఈ విధానం సహాయపడుతుందని యూజీసీ భావిస్తోంది.విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తల ఆందోళన యూజీసీ ఇప్పటికే డిగ్రీ విద్యలో నిష్క్రమణ ఎంపికలను ప్రవేశపెట్టింది. ఈసారి విద్యాపరమైన సవాళ్ల ఆధారంగా విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించాలనుకునే వారికి అవకాశం ఇస్తోంది. ఇది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ జీవిత బాధ్యతలను సమతుల్యం చేసుకోవాడానికి అనువుగా ఉంటుందని భావిస్తోంది. అయితే డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ఇప్పటికే కోర్ కంటెంట్ తగ్గిపోతుందని, ఇలాంటి చర్యలతో విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీసిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్న క్రమంలో కోర్సు కాల వ్యవధిని తగ్గించడం అంటే విద్య నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి..
ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.దేశ స్వాతంత్ర్య సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్ర్య ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం -
ద్రవిడియన్ వర్సిటీకి యూజీసీ నోటీసులు
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలపై యూజీసీ విచారణ చేపట్టింది. ఈ మేరకు వర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక ప్రొఫార్మా సూచించిన యూజీసీ, దాని ప్రకారం పీహెచ్‌డీల వివరాలు అందించాలని వర్సిటీని ఆదేశించింది. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ గురువారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేసిన పీహెచ్‌డీలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2010లో టూ మెన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా 95శాతం పీహెచ్‌డీలు మంజూరు చేసినట్టు నిర్ధారించిందన్నారు. 2023 –24, 2024–25 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీల మంజూరు ప్రక్రియలో విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాలు, కోర్టు ఉత్తర్వులు, జస్టిస్ శేషశయనరెడ్డి కమిటీ సమర్పించిన విచారణ నివేదిక అంశాలను ఉల్లంఘించడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు. లైబ్రేరియన్ నియామకంపై ఏసీబీ దర్యాప్తు వర్సిటీలోని లైబ్రేరియన్ అసిస్టెంట్ నరేష్ నియామకంపై ఏసీబీ విచారణ చేపట్టింది. వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ సమయానికి కూడా సదరు వ్యక్తికి విద్యార్హత సరి్టఫికెట్లు లేకుండానే ఉద్యోగంలో చేరినట్టు గతంలో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ వాస్తవాలు గుర్తించేందుకు నరే‹Ùను విచారించినట్టు సమాచారం. అయితే కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏసీబీ అధికారులను పిలిపించి ఎటువంటి తప్పు జరగలేదని నివేదిక ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే కోర్టుకు సమరి్పంచే నివేదిక కావడంతో అధికారులు తాము ఏమీ చేయలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. -
డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుపై రాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయా లని భావిస్తోంది. అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ’సాక్షి’ లో ‘వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కన్ను’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు.ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వినర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, డీమ్డ్ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతోనూ మంత్రి సమీక్ష చేసినట్టు తెలిసింది. యూజీసీ తీరు బడుగు, బల హీన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం చేసే విధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్టు అధికారులు చెబుతున్నారు. ‘మల్లారెడ్డి’ బాటలో మరికొన్ని కాలేజీలు! మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ హోదాను ఇస్తూ ఇటీవలే యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటివన్నీ వర్సిటీ హోదాలో సొంతంగా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ స్థానిక కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 150 బీడీఎస్ (డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. గతేడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్లో మంచి ర్యాంక్ సాధించిన ప్రతి భ గల విద్యార్థులకు ఈ సీట్లు దక్కేవి. ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయించేవారు. కానీ ఇకపై ఈ నిబంధనలు ఏవీ పాటించాల్సిన అవసరం లేకుండా యూజీసీ ‘మల్లారెడ్డి’కి మినహాయింపులు ఇచి్చంది. ‘మల్లారెడ్డి’చూపిన బాటలో అపోలో, సీఎంఆర్ కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. కోట్లలో ఆదాయం! డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు రూ. వందల కోట్ల లబ్ధి చేకూరుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ. 60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెగ్యులేటరీ కమిటీ ఫీజులను నిర్ణయిస్తోంది. అయితే డీమ్డ్ యూనివర్సిటీలు ఈ కమిటీతో సంబంధం లేకుండా, సొంతంగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని యూజీసీ కల్పిస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు సంవత్సరానికి రూ.17.5 లక్షలుగా ఉన్నట్టు కాళోజీ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్వినర్ కోటా ఫీజు కింద 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అవే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక్క బ్యాచ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది. -
దూర విద్య మరింత భద్రం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక, దూర విద్యల తో పాటు ఆన్లైన్ విద్య ప్రవేశాల్లో గుణాత్మక మార్పులు చేపట్టినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. యూజీసీ అనుమతి ఉన్న విద్యా సంస్థల వివరాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌ను పరిశీ లించాలని కోరింది. ఎలాంటి అనుమతిలేని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు చేసిన విద్యా ర్థులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారని, ఇక మీదట ఈ పరిస్థితి తలెత్తకుండా చేయ డమే దీని ఉద్దేశమని తెలిపింది. మరింత పార దర్శకంగా ఉండేందుకు చేపట్టిన ఈ మార్పు లు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వెబ్ పోర్టల్‌తో పాటు విద్యార్థులకు ఉపయుక్తంగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను అందు బాటులోకి తెచ్చామని తెలిపింది. విద్యార్థి చేసే కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ ఏడాది అకడమిక్ సెషన్ సెప్టెంబర్ నుంచి మొదల వుతుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ వెల్లడించారు. -
పరిశోధనలతో సమాజానికి మేలు
(వివేకానంద్ తంగెళ్లపల్లి) ; పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధనా రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువగా దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తగినంత మంది అధ్యాపకులు ఉండాలి ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయతి్నస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కలి్పస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదుపరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’అని చెప్పారు. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
ఏటా రెండుసార్లు ప్రవేశాలు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా తీసుకురానున్న ఏటా రెండు సార్లు ప్రవేశాల విధానంపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు తర్జన భర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోయినా, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలనే యూజీసీ ఆదేశాలు ఎలా సాధ్యమనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో భారీగా బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. ఏడాదికి రెండు బ్యాచ్‌లకు ఒకే అధ్యాపకుడు బోధించడం ఎలా సాధ్యమనే వాదన ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు చేపట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయించింది. ఇప్పుడు జూలై–ఆగస్టు మధ్య మాత్రమే ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్ కాకుండా జనవరి–ఫిబ్రవరి మధ్య మరో దఫా అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలోనే దీన్ని అమలు చేయాలని భావించడంపై వర్సిటీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికానే ఆదర్శం... అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ద్వైవార్షిక ప్రవేశాల విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశ విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చారు. మార్కులు కాకుండా క్రెడిట్లు ఇవ్వాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. విదేశాల్లోనూ ఇదే విధానం ఉండటం వల్ల డిగ్రీ గుర్తింపు తేలికగా ఉంటుందని భావిస్తున్నారు. అడ్మిషన్లు కూడా ఏడాదికి రెండుసార్లు ఉంటే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని యూజీసీ చెబుతోంది. వివిధ కారణాలతో తొలి దశలో ప్రవేశం పొందలేని వారికి జనవరి– ఫివ్రబరిలో తేలికగా అడ్మిషన్ పొందే వీలుంది. ఏడాదిపాటు ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండబోదని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామిక వర్గాలు కూడా ఏడాదికి రెండు దఫాలు క్యాంపస్ సెలెక్షన్ చేసే వీలుందని చెబుతున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు. సన్నద్ధత ఎలా? ద్వైవార్షిక ప్రవేశాలపై సన్నద్ధతను కోరుతూ దేశంలోని అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు యూజీసీ లేఖలు రాస్తోంది. దీనిపై ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండుసార్లు అడ్మిషన్ల వల్ల ఒకే కోర్సును రెండు సెషన్లుగా నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సెషన్ సెపె్టంబర్లో మొదలైతే, రెండో సెషన్ మార్చిలో మొదలవుతుంది. అప్పటికే మొదటి సెషన్ విద్యార్థులు ఒక సెమిస్టర్ పూర్తి చేసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు సెషన్ల నిర్వహణకు అవసరమైన ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, తరగతి గది రూపంలో అవసరమైన వనరులు వర్సిటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వర్సిటీలతో మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా అదనపు క్లాసుల నిర్వహణ తేలికగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు విదేశీ వర్సిటీలు తోడ్పాటును అందిస్తాయి. అయితే, ఇందుకు తగ్గ వనరులు, ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఏర్పాటుపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీ కారణంగా నిర్వహణ ఏమేర సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్రోల్మెంట్ పెంచడం, స్వయంగా ఆర్థికంగా బలపడే కొన్ని కోర్సులు తెచ్చే ఆలోచన కూడా యూజీసీ చేసే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. మార్గదర్శకాలు రావాల్సి ఉంది: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ద్వైవార్షిక ప్రవేశాలపై యూజీసీ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది ఎలా నిర్వహించాలనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అవి వచ్చిన తర్వాతే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అన్ని స్థాయిల్లో చర్చించాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెరుగుతుంది: ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, నిట్ డైరెక్టర్, రాయపూర్ ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఇది నడుస్తోంది. ఇది విద్యార్థులకు ఉపయుక్తంగానే ఉంటుంది. కాకపోతే వనరుల సమీకరణ సవాల్‌గా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనమే: ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి అమెరికా వంటి దేశాలు అమలు చేస్తున్న తరహాలో భారత్‌లోనూ ద్వైవార్షిక ప్రవేశాలు ఉంటే విద్యార్థులకు ఉపయోగమే. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడొచ్చు. ఒకసారి ప్రవేశ పరీక్ష పాసైతే రెండోసారి అడ్మిషన్లకూ ఇది అర్హతగానే ఉంటుంది. కాబట్టి సాంకేతికపరమైన సమస్యలు ఉండొకపోవచ్చు. -
గుడ్ న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) అనుమతించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్పర్సన్ ఎమ్ జగదీష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. మే 5న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్‌లో అకడమిక్ సెషన్‌ను ముగిస్తున్నాయి.గత ఏడాది ఒక అకాడమిక్ సంవత్సరంలో దూరవిద్యలో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) విద్యార్థులు జనవరి, జూలైలో రెండుసార్లు ప్రవేశం పొందేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు. ‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్ వెల్లడించారు.రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్, క్లాస్రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు. -
ర్యాగింగ్‌ను నిరోధించండి
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను ఎలా నిరోధించాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోకపోయినా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనా ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు పంపిన లేఖల్లో జిల్లా స్థాయి ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీకి కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజి్రస్టేట్ అధిపతిగా ఉండాలని, సభ్యులుగా వర్సిటీ/కళాశాల అధిపతులు, ఎస్పీ/ఎస్ఎస్పీను నియమించాలని పేర్కొంది. మెంబర్ సెక్రటరీగా అదనపు జిల్లా మేజి్రస్టేట్ ఉంటారని, కమిటీలో మీడియా ప్రతినిధులు, జిల్లాస్థాయి ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పోలీసులు, స్థానిక పరిపాలనతో పాటు సంస్థాగత అధికారులు ఉండాలని సూచించింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కీలక ప్రదేశాల్లో సీసీటీవీలను అమర్చాలని చెప్పింది. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తూ యాంటీ ర్యాగింగ్ వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలని కోరింది. వర్సిటీలు/విద్యా సంస్థల్లోని ముఖ్య ప్రదేశాల్లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను ప్రదర్శించాలని వీటిని యూజీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ర్యాగింగ్ బాధితులు హెల్ప్‌లైన్ 1800–180–5522 కు కాల్ చేయవచ్చని లేదా helpline @antiragging.in కు మెయిల్ పెట్టి సహయాన్ని కోరవచ్చని పేర్కొంది. -
‘అటానమస్’లోనూ ఏపీ అదుర్స్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. యూజీసీ కంటే ముందుచూపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు. ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్‌లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు. వీసీలతో యూజీసీ చర్చలు.. 2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
పీజీ ఇంకా ఈజీ
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏడాదిలోనే పూర్తి ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్ విధానం అమలు చేయబోతున్నారు. ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్ వరకు ఒక గ్రేడ్, ప్లస్ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్‌కు ఇంకో గ్రేడ్ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్ స్కిల్ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనూ అవకాశం ఏడాది పీజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్క్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి. -
MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక
ఢిల్లీ: మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(MPhil) కోర్సులపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసీంది. ఎంఫీల్(MPhil)కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు యూనివర్సిటీలు ఇచ్చే ఎంఫీల్ (MPhil) ప్రోగ్రామ్‌కు ఎటువంటి గుర్తింపు లేదని (UGC)యూజీసీ వెల్లడించింది. ఎంఫీల్(MPhil)ను రద్దు చేసినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నందున విద్యార్థులు ఎవరూ చేరవద్దని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరంలో ఎంఫీల్(MPhil) అడ్మిషన్లు నిలిపిలి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2022 నాటి యూజీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఎంఫీల్(MPhil)కు గుర్తింపు లేదని యూజీసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్‌లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్‌తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్‌డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్‌వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్‌లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్‌ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్‌గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్‌లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్‌కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్‌లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్‌లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్‌లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్‌లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్‌తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్‌లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఓడీఎల్ అడ్మిషన్లు కఠినతరం
సాక్షి, అమరావతి: ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓడీఎల్ ప్రోగ్రాముల పేరిట అనేక ఆన్లైన్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఇష్టానుసారంగా కోర్సులను అందిస్తామంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు యూజీసీ పటిష్ట విధివిధానాలను ప్రకటించింది. ఆండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్లలో ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలకు సంబంధించి తాజా నియంత్రణ నిబంధనలను విడుదల చేసింది. అలాగే, 2020లోనూ యూజీసీ కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. యూజీ, పీజీ డిగ్రీలకు సంబంధించి ఆయా సంస్థల నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా 2021లో మరికొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రోగ్రాముల్లో కనీస బోధనా ప్రమాణాలుండేలా తాజాగా మరిన్ని నిబంధనలను రూపొందించింది. ఈ అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు నో.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలలో కొన్ని అంశాలను మాత్రమే యూజీసీ అనుమతులిస్తోంది. ప్రాక్టికల్స్, ఇతర క్షేత్రస్థాయి ప్రయోగాలతో సంబంధమున్న అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను నిషేధించింది. అవి.. ♦ ఇంజనీరింగ్, మెడికల్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, పారామెడికల్, ఫార్మసీ, నర్శింగ్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, అగ్రికల్చర్, హారి్టకల్చర్, హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ, కలినరీ సైన్సెస్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, విజువల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఏవియేషన్. ♦ ఇవేకాక.. అధికారిక నియంత్రణ సంస్థలు అనుమతించని ప్రోగ్రాములు వేటినీ ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల కింద ఆయా సంస్థలు అందించడానికి వీల్లేదు. యోగా, టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో యూజీ, పీజీ ప్రోగ్రాంలు అందించడానికీ వీల్లేదు. అలాగే, ఆయా సబ్జెక్టులలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రోగ్రాంలను ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులుగా అందించకూడదు. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలు అందించే ఉన్నత విద్యాసంస్థలు ఆయా కోర్సులకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతుల పత్రాలు, అఫిడవిట్లు, ఇతర సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్సైట్లో పొందుపరచాలి. అడ్మిషన్లు తీసుకునే ముందే పరిశీలించాలి.. ఇక విద్యార్థులు ఆయా సంస్థలు అందించే ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల్లో చేరే ముందు అవి అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నాయో లేదో ముందుగా పరిశీలించుకోవాలని.. అలాగే, ఆయా ఉన్నత విద్యాసంస్థల వెబ్సైట్లలో ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అకడమిక్ సెషన్ల వారీగా అనుమతుల స్థితిని యూజీసీ వెబ్సైట్ ‘హెచ్‌టీటీపీఎస్://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో యూజీసీ అందుబాటులో ఉంచింది. అడ్మిషన్లు తీసుకునే ముందు యూజీసీ వెబ్‌సైట్‌లోని నోటీసులు, ఇతర ప్రజాసంబంధిత హెచ్చరికలను పరిశీలించాలని కోరింది. యూజీసీ వెబ్సైట్లో ఆయా సంస్థల సమాచారం.. ఓడీఎల్ కోర్సులందించేందుకు అనుమతులున్న సంస్థల వివరాలను కూడా తమ వెబ్సైట్లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆయా డిగ్రీ ప్రోగాంల పేర్లు, వాటి కాలపరిమితి, ఆయా సబ్జెక్టుల అంశాలు యూజీసీ సవరణ నిబంధనలు–2024 ప్రకారం ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. నిషేధిత జాబితాల్లోని ప్రోగ్రాములుంటే కనుక వాటిలో చేరకుండా జాగ్రత్తపడాలి. ఇదిలా ఉంటే.. ఈ కోర్సులను అందించడానికి సంబంధించి కొన్ని విద్యాసంస్థలను డిబార్ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. అందులో నర్సీ ముంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (మహారాష్ట్ర), శ్రీ వేంకటేశ్వర వర్సిటీ (ఆంధ్రప్రదేశ్) పెరియార్ యూనివర్సిటీ (తమిళనాడు) ఉన్నాయి. ఈ సంస్థలు 2023 జూలై–ఆగస్టు, 2024 జనవరి–ఫిబ్రవరి సెషన్లకు సంబంధించి ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులు అందించకుండా డిబార్ చేసినట్లు వివరించింది. ఫ్రాంఛైజీలపై నిషేధం.. సెంట్రల్ వర్సిటీలు, రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు ఏవైనా సరే తమ కేంద్ర కార్యాలయాల ద్వారా మాత్రమే అందించాలి. ఫ్రాంచైజీల రూపంలో ఓడీఎల్ ప్రోగ్రాములు అందించడానికి వీల్లేదు. అలాగే, లెర్నర్ సపోర్టు కేంద్రాలను నేరుగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే నిర్వహించాలి. ఫ్రాంఛైజీల ద్వారానో, ఔట్ సోర్సింగ్ ద్వారానో నిర్వహించేందుకు వీల్లేదు. ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలు, ఆన్లైన్ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే బాధ్యులుగా ఉండాలి. ఫ్రాంఛైజీల ద్వారా అందించేందుకు యూజీసీ అనుమతించదు. ఆయా విద్యాసంస్థలు అందించే ప్రోగ్రాంలు యూజీసీ నియమ నిబంధనలకు లోబడి ఉంటేనే వాటికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో సమానత వర్తిస్తుంది. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు అడ్మిషన్లను కూడా నిర్ణీత గుర్తింపు ఉన్న కాలానికి మాత్రమే చేపట్టాలి. టెరిటోరియల్ పరిధిలోనే కోర్సులు.. మరోవైపు.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను అందించే సంస్థల టెరిటోరియల్ పరిధిని కూడా యూజీసీ నిర్దేశించింది. ఆయా సంస్థలు తమ కోర్సులను అనుమతులున్న కాలంలో ఎక్కడి వారికైనా అందించవచ్చు. అయితే, వాటి కార్యకలాపాలు కేవలం తమ సంస్థకు నిర్దేశించిన పరిధిలోనే చేపట్టాలని యూజీసీ పేర్కొంది. ♦ సెంట్రల్ వర్సిటీలు వాటి చట్టంలో నిర్దేశించిన టెరిటోరియల్ నిబంధనల ప్రకారం ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలను అమలుచేయవచ్చు. ♦ స్టేట్ వర్సిటీలు వాటి చట్టంలో పేర్కొన్న పరిధికి లోబడి.. లేదా తమ రాష్ట్ర పరిధిలో మాత్రమే ఈ ఓడీఎల్ కోర్సులను అమలుచేయాలి. ♦ ప్రైవేటు వర్సిటీలు కూడా తమ చట్టంలో నిర్దేశించుకున్న రాష్ట్ర పరిధికి మించి ప్రోగ్రాములను అందించరాదు. హెడ్ క్వార్టర్ పరిధిలో మాత్రమే ప్రోగ్రాంలను అందించవచ్చు. గుర్తింపు ఉన్న ఆఫ్ క్యాంపస్‌ల ద్వారా కూడా అమలుచేయవచ్చు. ♦ ప్రోగ్రాములను లెర్నర్ సపోర్టు కేంద్రాల ద్వారా అమలుచేయడానికి వీల్లేదు. డీమ్డ్ వర్సిటీలు తమ హెడ్ క్వార్టర్ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్న ఆఫ్ క్యాంపస్‌ల ద్వారా ఈ ప్రోగ్రాములను అమలుచెయ్యొచ్చు. -
త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3,480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 2,635 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల పోస్టుల భర్తీని ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టనుంది. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు కూడా వర్సిటీలు ఇంటర్వ్యూలు చేసి, ఎంపిక చేస్తాయి. త్వరలోనే ప్రత్యేక పోర్టల్‌లో వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అభ్యర్థులు వాటిని చూసుకొని నచ్చిన వాటికి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సమయం ఆదాతో పాటు దరఖాస్తు రుసుము తగ్గుతుంది. వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీనీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని చంద్రబాబు చంద్రబాబు పాలనలో ఏనాడూ వర్సిటీలను పట్టించుకోలేదు. ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోగా వర్సిటీల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి భ్రష్టుపట్టించారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీని నియమించారు. యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా, వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టులవారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలా మంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు. ఈ అవకతవకలతో నష్టపోయిన వారు కోర్టుల్లో కేసులు వేశారు. పనిభారం, కేడర్ నిష్పత్తి ప్రకారం.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వర్సిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. వర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ఇందుకోసం జేఎన్టీయూ–అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ కె.లాల్ కిషోర్ అధ్యక్షతన ఐదుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీల్లో అన్ని విభాగాల పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పోస్టులపై మార్గదర్శకాలను రూపొందించింది. వర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాలవారీగా పోస్టుల హేతుబద్ధీకరణకు సిఫారసు చేసింది. ఈ పోస్టులు తప్పనిసరి బోధన పోస్టులతోపాటు ప్రతి వర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్శిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు.. యూజీసీ కీలక ఆదేశాలు
డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థా విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. UGC Letter regarding display of Aadhaar number on provisional certificates and degrees issued by universities. Read:https://t.co/jtxN2oDipB pic.twitter.com/TSK9ne8hdV — UGC INDIA (@ugc_india) September 1, 2023 -
సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు సీటు రద్దు చేసుకున్నప్పుడు అప్పటికే చెల్లించిన వార్షిక ట్యూషన్ ఫీజును తిరిగి ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 మాత్రం సంబంధిత సంస్థలు తీసుకోవచ్చని తెలిపింది. సీటు రద్దు చేసుకునే సమయాన్ని బట్టి ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఫీజు రిఫండ్ పాలసీని యూజీసీ విడుదల చేసింది. అన్ని కౌన్సెలింగ్‌లు ముగిసి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తేదీని కటాఫ్‌గా నిర్థారించింది. చెల్లింపు ప్రక్రియను ఐదు కేటగిరీలుగా విభజించింది. ఈ పాలసీని ఈ ఏడాది నుంచే ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఇది లక్షల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల వేధింపుల నేపథ్యంలోనే... సీటు వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో రూ.1,000 చెల్లిస్తారు. సీటు ఖరారైనప్పుడు కాలేజీకి మొత్తం ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే కొన్నిసార్లు విద్యార్థులకు ఇతర అవకాశాలు వస్తాయి. అప్పుడు అప్పటికే చేరిన కాలేజీలో సీటు వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా, చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటిపై యూజీసి గత నెల 27న నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమవుతుందా? ఏ సంవత్సరంలో సీటు వదులుకున్నా వర్తిస్తుందా? అనే దానిపై యూజీసి స్పష్టత ఇవ్వలేదు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి తేదీని కటాఫ్‌గా నిర్ణయించడం వల్ల కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే ఇది పరిమితమని ప్రైవేటు కాలేజీలు అంటున్నాయి. ఐదు కేటగిరీలుగా.. ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని యూజీసీ సూచిస్తోంది. ఈ తేదీకి ముందు, ఆ తర్వాత సీటు రద్దు చేసుకునే విద్యార్థులను వివిధ కేటగిరీలుగా విభజించారు. – అక్టోబర్ 31కి 15 రోజలు కంటే ముందే సీటు రద్దు చేసుకుంటే 100 శాతం ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించాలి. – ప్రవేశాల నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి ముందు 15 రోజుల్లో సీటు రద్దు చేసుకుంటే 90 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ల ముగింపు తేదీ తర్వాత 15 రోజుల్లో ఎప్పుడు సీటు రద్దు చేసుకున్నా 80 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ తేదీ ముగిసిన 15 నుంచి నెల రోజుల్లో సీటు వద్దనుకునే విద్యార్థులకు 50 శాతం ఫీజు వాపసు ఇవ్వాలి. ఆ తర్వాత సీటు వద్దనుకునే వారికి చెల్లించిన ఫీజు ఏమాత్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. స్పష్టత కొరవడిన యూజీసీ ఆదేశాలు ఫీజు వాపసు ఇచ్చేందుకు యూజీసీ ఇచ్చిన ఆదేశాలు మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. మార్గదర్శకాలు మొదటి సంవత్సరం విద్యార్థులకే సంబంధించినవిగా కన్పిస్తున్నాయి. అలా కాకుండా కోర్సు పూర్తయ్యే వరకూ వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టం చేసి ఉంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – డాక్టర్ వి.బాలకృష్ణారెడ్డి (రాష్ట్ర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
‘జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ టాప్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమి షన్ చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. ఈ వి ద్యా విధానాన్ని అమలు చేయాలనుకున్న తొలినుంచి ప్రభుత్వం తోడ్పాటు, సహకారం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చాలా పటిష్టంగా ఉందని ప్రశంసించారు. జేఎన్టీయూ(కే)లో 2 రోజులపాటు జరిగే ఉన్నత విద్య ప్రణాళిక 5వ సమావేశం శనివారం జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రారంభమైంది. దీనికి హాజరైన జగదీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. జాతీయ విద్యా విధానంతో 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ విద్యావిధానం అమలు చేయడంలో రా ష్ట్రాలు, స్థానిక సంస్థలు, పాఠశాలల స్థాయి లో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 600 వర్సిటీలలో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వివిధ రకాల పరిశోధనల కోసం రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వినియోగించేందుకు యూజీసీ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందని జగదీష్ కుమార్ చెప్పారు. యువ తకు ఉద్యోగవకాశాలు రావాలంటే నైపుణ్యం ఉండాల్సిందేనన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి బాగుందన్నారు. ఈ యూనివర్సిటీల ఏర్పాటుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ–వర్సిటీలలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులను చే ర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు -
లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్‌లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి. ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్స్ విధానం ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. బోధనలోనూ మార్పులు.. ళీయూజీ ఆనర్స్‌ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు. లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్‌లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆనర్స్ వైపే అందరిచూపు.. విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. – ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి -
విదేశీ విద్యార్థీ ‘వెల్కమ్’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను ఆకర్షించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు ఉండే ఉన్నత విద్యా సంస్థలకు అత్యధిక నిధులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు వాటి సీట్లలో 25 శాతం సమానమైన సంఖ్యలో సూపర్ న్యూమరరీ విధానంలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ఈ సీట్లను విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ప్రవేశాలను సులభతరం చేయొచ్చని, దేశ సంస్కృతి, ఉన్నత సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లవచ్చని యూజీసీ పేర్కొంది. విదేశీ మారకద్రవ్యం కూడా సమకూరి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశాలు ఇలా ఉన్నత విద్యా సంస్థల్లో యూజీ, పీజీలో విదేశీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు, ప్రవేశాలకు యూజీసీ విధివిధానాలను ప్రకటించింది అంతర్జాతీయ విద్యార్థులకు దేశీయ విద్యార్థులకు నిర్దేశించిన అర్హతలతో సమానమైన అర్హతలు తప్పనిసరి. ప్రవేశాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యా సంస్థల్లోని సీట్లలో 25 శాతానికి సమాన సంఖ్యలో విదేశీ విద్యార్థులకు సూపర్ న్యూమరరీ సీట్లు. ఈ సీట్లకు యూజీసీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం పొందాలి. వాటి మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి ప్రొఫెషనల్, సాంకేతిక విద్యా కోర్సుల సీట్లకు కూడా సంబంధిత నియంత్రణ సంస్థల నిబంధనలు పాటించాలి. పీహెచ్డీ ప్రోగ్రాముల సీట్లు యూజీసీ, నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ విద్యార్థులకు ప్రవేశాల్లో వీసా, విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భారత విదేశాంగ శాఖ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ విద్యాసంస్థలు తమ ఇన్‌టేక్ సీట్లకన్నా ఎక్కువ శాతంలో సీట్లను వారికి కేటాయించవచ్చు. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో ప్రవేశాలు నేరుగా నిర్వహించాలి. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో విదేశీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. సీట్లు మిగిలిపోయినా ఇతరులకు ఇవ్వకూడదు. -
విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం
సాక్షి, అమరావతి: విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచిస్తోంది. ఇందులో భాగంగా కళాశాలలు, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థి సేవాకేంద్రాలను (ఎస్ఎస్సీలను) ఏర్పాటు చేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. తాజాగా విద్యార్థుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించనుంది. అనంతరం విద్యార్థులకు మేలు చేసేలా కమిటీ సిఫారసులను ఎస్‌ఎస్‌సీల ద్వారా అమలు చేయాలని యోచిస్తోంది. సంపూర్ణ సహకారం అందించేలా.. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సామాజిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని వారి భావోద్వేగాలను పరస్పరం గౌరవించేలా ఎస్ఎస్సీలు పనిచేస్తాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని అధిగమించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఆరోగ్య సలహాదారులు, శారీరక, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచుతారు. ఈ మేరకు కళాశాలలకు సమీపంలోని అంకితభావం కలిగిన మానసిక వైద్యనిపుణులతో పాటు ప్రఖ్యాత వైద్యసంస్థలు ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్–నిమ్హాన్స్)తో ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఆయా కళాశాలల్లోని సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల నిపుణుల సేవలను ప్రాజెక్టు డ్రివెన్మోడ్లో వినియోగించుకోవాలని పేర్కొంది. సింగిల్‌విండో సేవలు సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైకియాట్రీ, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాల్లో అనుభవం గడించిన ప్రొఫెసర్లు విద్యార్థి సేవాకేంద్రాన్ని డైరెక్టర్/డీన్ హోదాలో నిర్వహించనున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్, వ్యక్తిగతంగా, టెలిఫోన్, గ్రూప్ కాలింగ్ కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యసేవలను అందించనున్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడంతోపాటు డ్రాపౌట్ రేట్లను తగ్గించే లక్ష్యంతో సింగిల్‌విండో పద్ధతిలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విద్యార్థుల్లో ఫిట్నెస్ సామర్థ్యాన్ని పెంచడానికి జిమ్‌లు, యోగా సెంటర్లు నిర్వహించడంతోపాటు ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. -
‘నీట్’లా ఇంజనీరింగ్‌కూ ఒకే ఎంట్రన్స్!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ‘నీట్’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కొనసాగుతున్న చర్చలు గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025–26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలతోపాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు.. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. -
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్‌టైమ్ వర్క్‌లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్‌టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్‌టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్‌షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్‌టైమ్ జాబ్‌లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్‌గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్‌టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది. -
తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఇందులోభాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్‌తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. ఓయూలో లైఫ్‌సైన్స్ ఆనర్స్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో మండలి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. డిగ్రీలో ఎంచుకునే ఏదైనా సబ్జెక్టును పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, లోతైన బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచన ఉంది. కొంతకాలంగా దేశ విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. పారిశ్రామిక అనుభవం తప్పనిసరి ఆనర్స్ కోర్సులకు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. విదేశాల్లో సైతం ఉపాధి లభించేలా నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. బీఎస్సీ ఆనర్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కచ్చితంగా పరిశ్రమల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఉపాధికి ఊతం: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో మంచి ఉద్యోగాలు పొందడమే కాదు... సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని తెచ్చే లక్ష్యంతో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కోర్సులు అన్ని దేశాల్లోనూ సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు ఇంజనీరింగ్ బాట పడుతున్నారు. అయితే, డిగ్రీతోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌ను జోడించబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు. -
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది. స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు. తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. -
ఒకే విద్యా విధానం.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశమని చెప్పారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)ను యూజీసీ సోమవారం విడుదల చేసింది. దీనిపై వస్తున్న సందేహాలపై యూజీసీ ఛైర్మన్ సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏమిటీ ఎన్సీఆర్ఎఫ్? విద్యావిధానానికి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం సమీకృత క్రెడిట్ విధానాన్ని అన్ని విద్యా సంస్థలు అనుసరిస్తాయి. పాఠశాల, ఉన్నత విద్య, ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్.. ఏదైనా మార్కులతో పనిలేకుండా క్రెడిట్స్గానే పరిగణిస్తారు. దీనికోసం జాతీయ స్థాయిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలకు ప్రత్యేక క్రెడిట్ విధానంతో మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. క్రెడిట్ విధానం అంటే..? వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి 40 క్రెడిట్స్ వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 1200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందే వీలుంటుంది. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత దీన్ని లెవర్–1గా భావిస్తారు. 6–8 తరగతులు పూర్తి చేస్తే లెవల్–2, తర్వాత 9, 10 తరగతులు పూర్తి చేస్తే లెవల్–3గా, 11, 12 పూర్తి చేస్తే లెవల్–4గా గుర్తిస్తారు. స్కూల్ విద్య మొత్తంగా 160 క్రెడిట్స్ ఉంటాయి. మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్ చొప్పున మొత్తం 120 క్రెడిట్స్ ఉంటాయి. నాలుగేళ్ళ డిగ్రీని 6.5 లెవల్‌గా, మూడేళ్ళ డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీని లెవల్ 7గా, నాలుగేళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ, పీహెచ్‌డీని కలిపి 8 లెవల్‌గా చూస్తారు. పీహెచ్డీ పూర్తిచేసిన విద్యారి్థకి మొత్తం 320 క్రెడిట్స్ ఇస్తారు. ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్‌కు కూడా వివిధ స్థాయిలో (4.5 నుంచి 8 లెవల్స్) క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ నిల్వ ఇలా... ప్రతీ లెవల్లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్ అన్నీ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్‌ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్సీఆర్ఎఫ్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఐటీఐ పాస్ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్లైన్ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్‌ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి ఉంటాయి. ఇవి కూడా క్రెడిట్సే.. అకడమిక్ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్ సిస్టమ్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్‌ను అన్‌స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్‌ను స్కిల్ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ విధానం ఇచ్చేందుకు ప్రయతి్నస్తోంది. -
విద్యా సంస్థలకు యూజీసీ లేఖ
సాక్షి, అమరావతి: దేశంలో అనాధ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్లతో ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది? ఎన్ని విద్యా సంస్థల్లో వారికి సీట్లు ఇచ్చారో తెలపాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన నోటీసును తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. కోవిడ్‌తో 2020, 2021ల్లో అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాధలుగా మారారు. వీరిలో కొంతమంది పాఠశాల చదువుల్లో ఉండగా మరికొంతమంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరు తదుపరి ఉన్నత తరగతుల్లో చేరేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్’ కింద అన్ని విద్యాసంస్థల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లు ప్రవేశపెట్టాలని గతేడాది మార్చిలో సూచించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలూ సూపర్ న్యూమరరీ సీట్లను అనాధ విద్యార్థులకు కేటాయించేలా చేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ న్యూమరరీ సీట్లతో లబ్ధి పొందిన వారి సమాచారాన్ని తెలియచేయాలని యూజీసీ ఆయా విద్యాసంస్థలకు సూచించింది. విద్యార్థుల సంఖ్యతో పాటు వారు ఏయే కోర్సులు అభ్యసిస్తున్నారు? వారు ఎలాంటి సహాయం పొందుతున్నారు? వంటి అంశాలను కూడా అందించాలని కోరింది. -
కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది. సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సాహంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవడంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. మూడు విభాగాల్లో కళా గురువులు.. ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు. పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేదికను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు. కళారూపాల జాబితా ఇలా.. హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్ ఉడ్ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్, ఉడ్ కారి్వంగ్, ప్రింటెడ్ టెక్స్టైల్స్, నేచురల్–ఆర్గానిక్ డైస్ ప్రిపరేషన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కార్పెట్ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్ గోయ్ తదితరాలు. శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్/జుగల్బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్/జాజ్, కోయిర్ గానం తదితరాలు. డ్యాన్స్: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదితరాలు. జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలాము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెండి, పంతి, కర్మ, దమ్కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తుల్లాల్, కర్మ, గౌర్ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్ చోలోమ్, నోంగ్క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలికాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్ తదితరాలు. వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, టెక్స్టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్ ఆర్ట్ (రంగోలి/మందన/కోలమెట్సీ), కథకులు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, కామిక్ ఆర్ట్ తదితరాలు. -
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్‌లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్‌తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
వచ్చేస్తోంది.. దేశంలో తొలి డిజిటల్ వర్సిటీ
దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీ (ఎన్డీయూ) అందుబాటులోకి రాబోతోంది. 2023–24 విద్యాసంవత్సరం నుంచే దీని సేవలు ప్రారంభించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూజీసీ ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుడుతోంది. విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులను అనుసరించి వారి ఇంటివద్దే నచ్చిన కోర్సులను డిజిటల్ విశ్వవిద్యాలయం అందించనుంది. ఉన్నత విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సహా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలను ఇందులో భాగస్వామ్యం చేసి ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యను అందించడం, పరీక్షలు నిర్వహించడం, సర్టిఫికెట్ల ప్రదానం వంటివన్నీ కేంద్రీకృత వ్యవస్థగా డిజిటల్ వర్సిటీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం వివిధ విద్యాసంస్థల ద్వారా అమలవుతున్న విధానాలకు భిన్నమైన రీతిలో ఈ యూనివర్సిటీ సేవలందించనుంది. హబ్–స్పోక్ మోడల్లో సేవలు స్పోక్ అండ్ హబ్ అంటే ఒక కేంద్రీకృత పంపిణీ వ్యవస్థలా డిజిటల్ వర్సిటీ పనిచేస్తుంది. సైకిల్ చక్రానికి హబ్ మాదిరిగా యూనివర్సిటీ ఉంటుంది. ఊచలు (స్పోక్) కేంద్ర ప్రదేశంలో కలుస్తూ తిరిగి అన్ని వైపులకు తమ సేవలను పంపిణీ చేసేలా వివిధ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇది పని చేయనుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థలన్నీ ఈ డిజిటల్ వర్సిటీ పరిధిలో తమ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నాయి. విద్యార్థులు తమ సంస్థలలో చదువుతూనే డిజిటల్ వర్సిటీ ద్వారా ఇతర సంస్థల కోర్సులను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. వారు ఆ సంస్థల ద్వారా క్రెడిట్లను అందుకోగలుగుతారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలను ఈ క్రెడిట్ల ఆధారంగా వారు అందుకోగలుగుతారు. సీట్లు లేవనే సమస్య ఉండదు విద్యార్థి తాను కోరుకొనే వర్సిటీలో అభ్యసించాలనుకునే కోర్సులో చేరే వెసులుబాటును డిజిటల్ వర్సిటీ కల్పించనుంది. సీట్లు లేకపోవడం లేదా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడం వంటి వాటితో సంబంధం లేకుండా విద్యార్థులు ఆసక్తి ఉన్న కోర్సును అభ్యసించడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలతో ప్రారంభమయ్యే ఈ వర్సిటీ సేవలు రానున్న కాలంలో పీజీ డిగ్రీలు, డాక్టరేట్లను కూడా అందించేలా యూజీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ డిజిటల్ వర్సిటీ ద్వారా ప్రస్తుత వర్సిటీల్లో అదనపు సీట్ల ఏర్పాటు, అందుకు తగ్గ సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన వంటి భారాలు తగ్గుతాయి. 50% క్రెడిట్లు సాధిస్తేనే అర్హత విద్యార్థులు ఏ కోర్సులో అయినా 50 శాతం క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీలకు అర్హులవుతారు. ఈ క్రెడిట్లను ఒకేసారి కాకున్నా తమకు నచ్చిన సమయాల్లో సాధించినా డిగ్రీని ప్రదానం చేస్తారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్లను బదలాయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ల్యాబ్‌లు, ప్రాక్టికల్ వర్కులతో సంబంధం లేని కోర్సులు మాత్రమే ప్రస్తుతం డిజిటల్ వర్సిటీ ద్వారా అందిస్తారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇప్పటికే డిజిటల్ యూనివర్సిటీ ద్వారా కోర్సులు అందించేందుకు రంగం సిద్ధం చేశాయి. -
ప్రైవేటు పీహెచ్‌డీలకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్‌డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీహెచ్డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్‌గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్‌డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు. నాణ్యత ఉంటుందా...? అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు. పీహెచ్‌డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్ల చేత పీహెచ్డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు. నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండే వ్యక్తికి పీహెచ్డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్‌లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాణ్యత దెబ్బతింటుంది ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. – డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అర్హత ఉన్న వారికే అవకాశం గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు. – ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్టీయూహెచ్ -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
అసలు పేచీ స్క్రీనింగ్ టెస్టే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలనుకుంటున్న స్క్రీనింగ్ టెస్ట్ విధానమే వివాదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ ఆమోదించపోవడానికి ఈ నిబంధనే కారణమని తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు ఇది విరుద్ధమని గరవ్నర్ భావిస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్తగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ అనుమతి కోసం పంపింది. దీనిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయాలని విద్యామంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతోకలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి సబిత గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. అయినప్పటికీ నెలల తరబడి ఈ బిల్లుకు మోక్షం కలగడంలేదు. అసలా రూల్ ఎక్కడిది? ఇప్పటివరకు వర్సిటీలన్నీ సొంతంగా నియామకాలు చేపట్టేవి. అయితే కామన్ బోర్డు బిల్లులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసేవారికి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక పోస్టుకు 200 మంది దరఖాస్తు చేస్తేనే పరీక్ష పెట్టాలనే నిబంధన ఉన్నట్లు గవర్నర్ కార్యాలయం గుర్తించింది. యూజీసీ నిబంధనల ప్రకారమే చట్టా న్ని తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం... లేని పరీక్ష ను ఎందుకు తెచ్చిందనే దానిపై గవర్నర్ కార్యాల యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీన్ని మారిస్తేనే బిల్లును ఆమోదిస్తామని ప్రభుత్వానికి గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడ ట్లేదు. అవసరమైతే వర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్ ను తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పీటముడి నేపథ్యంలో వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల కోసం నిరీక్షిస్తున్న 3 వేల మంది నిరాశ చెందుతున్నారు. వీసీల నుంచి వ్యతిరేకత... కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటును పలు వర్సిటీల వీసీలు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నియమాక ప్రక్రియకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని వర్సిటీల నిధుల నుంచే ఖర్చు చేసే ప్రతిపాదనను వారు ఆక్షేపిస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా బోర్డు ను ఏర్పాటు చేసినా నియామకాల్లో వీసీలకే ప్రాధా న్యం ఇచ్చారని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే తరహా విధానం కొనసాగుతోందని ఓ వీసీ తెలిపా రు. విశ్వవిద్యాలయాల పరిస్థితులతో సంబంధం లేని ఐఏఎస్ అధికారులకు బోర్డు సభ్యులుగా పూర్తి అధికారాలు ఇవ్వడం వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బోర్డు ఏర్పాటుపై గవర్నర్, ప్రభు త్వం మధ్య నెలకొన్న వివాదం కారణంగా నియామక ప్రక్రియే ఆగిపోయిందని, దీనివల్ల అధ్యాపకులు లేక బోధన కుంటుపడుతోందని వీసీలు అంటున్నారు. ఇది చెల్లదు.. సుప్రీం తీర్పు ఉంది.. ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. 2017లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇది కూడా చేయకుండా కొత్త నియామకాలు ఎలా చేపడతారు. – డాక్టర్ ఎం. రామేశ్వరరావు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ చైర్మన్ -
పీహెచ్డీ ఇక.. ఆషామాషీ కాదు.. నిబంధనలు సవరించిన యూజీసీ
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన కోర్సుల నిర్వహణ నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరింత కఠినతరం చేసింది. పరిశోధనల్లో సమగ్రత లేమి, నాణ్యతారహితంగా థీసెస్‌ల రూపకల్పన, ఏళ్ల తరబడి కొనసాగింపు వంటి విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూజీసీ పీహెచ్డీ కోర్సుల నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. – సాక్షి, అమరావత ప్రవేశాలనుంచే పకడ్బందీ చర్యలు ► అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, ఒక ఏడాది మాస్టర్ డిగ్రీ, లేదా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీచేసిన వారు 55 శాతం మార్కులు సాధించి ఉంటేనే పీహెచ్డీ కోర్సుల్లో చేరడానికి అర్హులు. విదేశీ విద్యార్థులకైనా దీనికి సమాన ప్రమాణార్హతలుండాలి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఆర్థికంగా వెనుకబడినవర్గాలు (ఈడబ్ల్యూఎస్) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఐదుశాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. ► గతంలో ఎంఫిల్ పూర్తిచేసి ఇప్పుడు పీహెచ్డీ కోర్సుల్లో చేరాలనుకునేవారికి కూడా 55% మార్కులు ఉండాలి. గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్న విద్యాసంస్థల అభ్యర్థులకు పాయింట్ల స్కేల్లో సమానమైన గ్రేడ్ ఉండాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారానే ప్రవేశాలు ► ప్రత్యేక ప్రవేశపరీక్షల ద్వారానే ప్రవేశాలు చేపట్టాలి. ► యూజీసీ, ఇతర సంబంధిత అధీకృత ఉన్నతసంస్థల మార్గదర్శకాలననుసరించి రిజర్వేషన్లను పాటించాలి. ► యూజీసీ–నెట్, యూజీసీ–సీఎస్ఐఆర్, నెట్, గేట్, సీఈఈడీ ఫెలోషిప్, స్కాలర్‌షిప్‌లకు అర్హతపొందిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించవచ్చు. లేదా ఆయా వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ప్రవేశపరీక్షలు నిర్వహించి చేర్చుకోవచ్చు. ► ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్‌లో 50 శాతం రీసెర్చ్ మెథడాలజీ, 50 శాతం సబ్జెక్టు ఉండాలి. ప్రవేశపరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. ► ప్రవేశపరీక్ష మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి అర్హులను ఎంపికచేయాలి. ► మౌలిక సదుపాయాలు, తగినంతమంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటే ప్రైవేటు పీజీ కాలేజీలు కూడా పీహెచ్డీ కోర్సులను అమలు చేయవచ్చు. అడ్వయిజరీ కమిటీతో నిత్యం పరిశీలన ► ప్రతి వర్సిటీలో ఒక సీనియర్ ప్రొఫెసర్ కన్వీనర్‌గా యూనివర్సిటీ రీసెర్చి అడ్వయిజరీ కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రీసెర్చి ప్రతిపాదనలను పరిశీలించి టాపిక్‌ను నిర్ణయిస్తుంది. పరిశోధన పద్ధతి, మెథడాలజీలను పరిశీలిస్తుంది. పరిశోధన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ► అభ్యర్థి తన పరిశోధనపై ప్రతి సెమిస్టర్‌కు ఈ కమిటీకి సంక్షిప్త నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీ.. వర్సిటీ లేదా సంస్థకు పరిశోధనపై పురోగతి నివేదిక ఇవ్వాలి. ► పరిశోధన సంతృప్తికరంగా లేకపోతే అభ్యర్థికి కమిటీ సూచనలివ్వాలి. ఆ సూచనల ప్రకారం పరిశోధన చేయలేకపోతే ఆ పీహెచ్డీ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసేలా కమిటీ సిఫార్సు చేస్తుంది. ► అభ్యర్థి థీసెస్‌ను సమర్పించేముందు దానిపై అడ్వయిజరీ కమిటీ, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, పీహెచ్డీ అభ్యర్థుల సమక్షంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. థీసెస్ సంతృప్తికరంగా లేకపోతే తిరస్కరణ, పీహెచ్‌డీకి అనర్హత ► ఆయా ఉన్నత విద్యాసంస్థలు థీసెస్‌ను ప్లాగరిజం (కాపీకొట్టడం) కనిపెట్టేందుకు నిర్దేశించిన సాఫ్ట్వేర్ ఉపయోగించి పరిశీలించాలి. ► కాపీకొట్టలేదని, ఇంకెక్కడా సమర్పించలేదని అభ్యర్థి అండర్‌టేకింగ్ తీసుకుని పర్యవేక్షకుల సంతకాలతో థీసెస్‌ను అనుమతించాలి. ► తరువాత పర్యవేక్షకుడితోపాటు ఆయా రంగాల్లో పబ్లికేషన్లలో నిష్ణాతులైనæ ఇద్దరు బయటి నిపుణులతో అభ్యర్థిని పరిశీలన చేయించాలి. వీలైతే అందులో ఒకరు విదేశీ నిపుణులై ఉండాలి. ► బయటి నిపుణుల్లో ఏ ఒక్కరైనా థీసెస్‌ను రిజెక్టు చేస్తే ప్రత్యామ్నాయంగా మరో బయటి నిపుణుడి పరిశీలనకు పంపించాలి. అతను సంతృప్తి చెందితే.. ఫ్యాకల్టీ, పీహెచ్డీ స్కాలర్ల సమక్షంలో వైవా నిర్వహించాలి. ► ప్రత్యామ్నాయ పరిశీలకుడు థీసెస్‌ను ఆమోదించకపోతే దాన్ని ఆ ఉన్నత విద్యాసంస్థ తిరస్కరిస్తుంది. ఆ అభ్యర్థిని పీహెచ్డీ అవార్డుకు అనర్హుడిగా ప్రకటిస్తుంది. ► పీహెచ్డీ అవార్డు ప్రక్రియను ఆయా సంస్థలు ఆరునెలల్లో పూర్తిచేయాలి. ► థీసెస్ సంతృప్తికరంగా ఉండి పీహెచ్డీ అవార్డుకు అర్హత సాధించినవారికి దాన్ని జారీచేసేముందు ఆయా విద్యాసంస్థలు ఆ థీసెస్ సాఫ్ట్‌కాపీ (ఎలక్ట్రానిక్ కాపీ) ఇతర సంస్థలకు అందుబాటులోకి వచ్చేలా యూజీసీ ఆధ్వ2ర్యంలోని ఇన్‌ఫ్లిబినెట్ (ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్)కు సమర్పించాలి. నిర్దిష్ట కాలపరిమితి ► ప్రవేశం పొందిన రోజునుంచి కనీసం మూడేళ్లలో.. గరిష్టంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. ► ఆయా సంస్థల నిబంధనలను అనుసరించి గడువును అదనంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు. ► 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యమున్న వారికి మరో రెండేళ్లు గడువు ఇవ్వవచ్చు. గరిష్టంగా పదేళ్లకు మించి గడువు ఇవ్వరాదు. ► మహిళలకు 240 రోజులు ప్రసూతి, శిశుసంరక్షణ సెలవులు ఇస్తారు. అదనపు అర్హతలుంటేనే పర్యవేక్షణ బాధ్యత ► పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ లేదా సూపర్వైజర్, సహ సూపర్వైజర్లుగా నియమితులయ్యేవారికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు ఐదు, అసిస్టెంటు ప్రొఫెసర్లకు మూడు రీసెర్చి పబ్లికేషన్లు ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమై ఉంటేనే గైడ్లుగా నియమించాలి. ► ఇతర సంస్థల్లో గైడ్‌గా వ్యవహరించేవారికి బాధ్యత ఇవ్వరాదు. అలాంటి వారిని కో సూపర్వైజర్గా నియమించవచ్చు. ► ఇతర సంస్థల నిపుణుల పర్యవేక్షణలోని పరిశోధనలకు పీహెచ్‌డీలను ప్రదానం చేయడం నిబంధనలకు విరుద్ధం. ► ప్రొఫెసర్ ఎనిమిదిమందికి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆరుగురికి, అసిస్టెంటు ప్రొఫెసర్ నలుగురికి పర్యవేక్షకులుగా ఉండవచ్చు. ► మహిళలు పెళ్లి, ఇతర కారణాలవల్ల అదే పరిశోధనను ఇతర విద్యాసంస్థల్లోకి మార్చుకోవచ్చు. ► అభ్యర్థులు తమ పరిశోధనతోపాటు ఆ అంశంపై విద్యాబోధన, రచన అంశాలపైనా శిక్షణ పొందాలి. ట్యుటోరియల్, లేబొరేటరీ వర్కు, మూల్యాంకనాలతోసహా వారానికి నాలుగు నుంచి ఆరుగంటలు బోధన, పరిశోధన అసిస్టెంట్‌షిప్‌లలో పాల్గొనాలి. ► థీసెస్ సమర్పించాలంటే యూజీసీ నిర్దేశించిన 10 పాయింట్ల ప్రామాణికాల్లో 55 శాతం పాయింట్లు సాధించాలి. -
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇకపై కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్‌ను అనుసరించి డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. నూతన జాతీయ విద్యా విధానం–2020లో పేర్కొన్న ప్రకారం.. బహుళ ప్రవేశ, నిష్క్రమణలతో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అమలు కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీని విధివిధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయనుంది. 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే..యూజీసీ కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ నిబంధనల ప్రకారం.. విద్యార్థులు నాలుగేళ్లు పూర్తి చేశాకే యూజీ ఆనర్స్ డిగ్రీని అందుకోగలుగుతారు. అన్ని ఆనర్స్ డిగ్రీ కోర్సుల కాలపరిమితిని మూడేళ్లకు బదులుగా నాలుగేళ్లకు తప్పనిసరి చేసింది. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతంఅంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల డిగ్రీ చేస్తున్నా ఆనర్స్‌కు.. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం.. మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. వారు ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి వర్సిటీలు వారికి బ్రిడ్జ్ కోర్సులను (ఆన్‌లైన్‌తో సహా) అందించవచ్చని యూజీసీ తెలిపింది. డిగ్రీ కోర్సు నుంచి ఆనర్స్ కోర్సుల్లో చేరడానికి ఇది తప్పనిసరి అని వివరించింది. బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే విద్యార్థికి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వైవిధ్యంతో పాఠ్యాంశాలు.. నూతన కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. కోర్సుల పాఠ్యాంశాలు వైవిధ్యంతో ఉంటాయి. యూజీసీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాషా, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివాటిని కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధిని పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులనూ చేర్చారు. నూతన విధానం ప్రకారం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారొచ్చు. ఓపెన్, దూరవిద్య, ఆన్లైన్ లెర్నింగ్ లేదా హైబ్రిడ్ మోడ్ వంటి ప్రత్యామ్నాయ విధానాలకు కూడా మారేందుకు అవకాశముంది. -
వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎమ్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్), యూనివర్సిటీ ఆఫ్ లండన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు. పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు.. ► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే ఉంటుంది. ► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు ► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు ► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి ► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి ► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు ► ఇప్పటికే టీచింగ్ పొజిషన్లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. -
ఈ మార్పులు మంచికేనా?
ఎక్కడైనా, ఎప్పుడైనా.... కాలాన్ని బట్టి నియమ నిబంధనల్ని మార్చాల్సిందే. కానీ, కొత్త నియమ నిబంధనలు పురోగమింపజేస్తాయా, తిరోగమింపజేస్తాయా అన్నదే కీలకం. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు సంబంధించిన డాక్టోరల్ డిగ్రీల రూల్స్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన సమూలమార్పులు ఇప్పుడు అదే చర్చకు దారి తీస్తున్నాయి. ఎంఫిల్ కోర్సుల రద్దు, పీహెచ్డీ రావడానికి చేయాల్సిన కోర్స్‌వర్క్‌ను సడలించడం, నాలుగేళ్ళ డిగ్రీ కోర్స్ చేసిన వెంటనే పీహెచ్‌డీలో పేరు నమోదుకు అనుమతించడం లాంటి మార్పులపై భిన్నాభిప్రాయాలున్నాయి. యువ విద్యార్థులను మరింతగా పరిశోధన వైపు ఆకర్షించడానికే ఈ చర్య అని యూజీసీ చెబుతోంది. కానీ ఆచరణలో ఇది ప్రమాణాల క్షీణతకూ, పర్యవేక్షకుల కొరతకూ దారితీస్తుందనే వాదన బలంగా వినపడుతోంది. నిజానికి యూజీసీ 2009లో, తర్వాత 2016లో కొన్ని నియమాలు పెట్టింది. వాటి స్థానంలో కొత్తవాటిని ఈ నెల 7న వెల్లడించింది. ఈ కొత్త ‘యూజీసీ (పీహెచ్డీ కనీస ప్రమాణాలు, విధానాల) నిబంధనలు 2022’ వల్ల పీహెచ్డీ చేయడానికి అర్హత నుంచి ప్రవేశ విధానం, మూల్యాంకన పద్ధతుల దాకా అన్నీ మారనున్నాయి. మునుపటి నిబంధనల కింద అనుమతి లేని వర్కింగ్ ప్రొఫెష నల్స్ పార్ట్‌టైమ్ పీహెచ్‌డీలకు సైతం పచ్చజెండా ఊపారు. మాస్టర్స్ డిగ్రీ ఒక ఏడాది (2 సెమిస్టర్లు) చదివినా, లేక నాలుగేళ్ళ (8 సెమిస్టర్ల) బ్యాచ్‌లర్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించినా పీహెచ్‌డీలో చేరవచ్చు. ఎప్పటిలానే నెట్/ జేఆర్ఎఫ్ అర్హతలు, ప్రవేశపరీక్షలతో ప్రవేశాలు చేసుకో వచ్చు. అయితే పీహెచ్డీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష చర్చను ప్రస్తావించకుండా వదిలేశారు. పీహెచ్డీ చేస్తున్నవారు తప్పనిసరిగా ప్రత్యేక జర్నల్స్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాలనీ, సదస్సుల్లో కనీసం రెండు పత్రసమర్పణలు చేయాలనీ పాత నిబంధనలు. ఆ రెండూ ఇక తీసేశారు. ఇప్పటి దాకా పరిశోధనకు ప్రవేశద్వారంగా ఉన్న ఎంఫిల్ కోర్సును ‘జాతీయ విద్యావిధానం’ సిఫార్సుకు అనుగుణంగా ఎత్తేశారు. ఇవన్నీ పరిశోధనలో నాణ్యతను దెబ్బతీస్తాయనేది విద్యావేత్తల్లో ఒక వర్గం ఆందోళన. మరో వర్గం మాత్రం తప్పనిసరి తద్దినంగా మారిన పత్రాల నిబంధనల్లో పలు లోపాలున్నాయనీ, వాటితో ప్రయోజనం లేదు గనక ఎత్తేయాలన్న నిర్ణయం సరైనదేననీ అంటోంది. అసలీ పత్రాల ప్రచురణ అంశంపై యూజీసీ చాలాకాలంగా తర్జనభర్జన పడుతోంది. పరిశోధక విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసి, పత్రాలను ప్రచురించే ‘దోపిడీ జర్నల్స్’, గ్రంథచౌర్యం పెరగడంతో సమస్య వచ్చిపడింది. విశ్వవిద్యాలయ పత్రాల్లో నూటికి 75 ‘స్కోపస్’ గుర్తింపు పొందని జర్నల్స్‌లోనే ప్రచురిత మవుతున్నాయనేది ఒక అధ్యయనం. అందుకే, ఆ తరహా జర్నల్స్‌లో, వాటి ప్రచురణకర్తలు పెట్టే సదస్సుల్లో ఇచ్చిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని 2019లోనే యూజీసీ ప్యానెల్ సిఫార్సు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు విస్తృత సంబంధాలు, ఆర్థిక స్థోమత ఉండవు గనక అలాంటి దోపిడీ జర్నల్స్‌కు అడ్డుకట్ట వేయాల్సిందే. రిసెర్చ్ స్కాలర్లపై ఒత్తిడిని తగ్గించాల్సిందే. కానీ, ప్రత్యామ్నాయం చూడకుండా, పత్రాలే అక్కర్లేదనడం వివేకవంతమేనా? మన దగ్గర ఇప్పటికీ విద్యార్థులు ఎక్కువ, నాణ్యమైన జర్నల్స్ తక్కువ. ఇదో పెనుసమస్య. ప్రపంచ పరిశోధకుల్లో 12 శాతం మంది మనవాళ్ళే అయినా, భారత పరిశోధనా పత్రాలు 4.52 శాతమేనట. 2020 నాటి స్కోపస్ శాస్త్రీయ ప్రచురణల డేటాబేస్ తేల్చింది. ఆచరణలో లోపాలున్నా, పత్రాల ప్రచురణ ఆలోచన అసలంటూ మంచిదే. ఐఐటీల్లో పత్రాల ప్రచురణ తప్పనిసరి కాకున్నా నాణ్యమైన పరిశోధన సాగుతోందంటే ఆచార్యులు, విద్యార్థుల నిబద్ధతే కారణం. అలాంటి వాతావరణం కరవైన విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడిక పత్రాలు లేకుండానే పరిశోధనాసక్తి, ప్రమాణాలు తగ్గకుండా ఎలా చూస్తారు? అలాగే, డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలో చేరిన విద్యార్థికి పరిశోధనా జ్ఞానం ఎలా ఉంటుంది? పీజీ చేసి, ఎంఫిల్‌లో మౌలిక పరిశోధనా పద్ధతులు తెలుసుకున్నాక ఆసక్తితో పీహెచ్డీ చేయడం వేరు. పరిశోధనలో ఓనమాలు తెలియకుండా డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలోకి దిగడం వేరు. అలా దిగినా, ఆరేళ్ళ నిర్ణీత వ్యవధిలో తొలి ఏళ్ళన్నీ పరి శోధనా పద్ధతులు తెలుసుకోవడానికే ఖర్చయిపోతుంది. అలాగే, పత్రసమర్పణ, ప్రచురణ తప్పని సరి కానప్పుడు విద్యార్థులకు లోతైన అధ్యయనానికి ప్రేరణ లేకుండా పోయే ప్రమాదమూ ఉంది. పరిశోధనను సైతం మామూలు చదువులంత తేలిగ్గా తీసుకోవడం మన దగ్గరే. మొదట్లో 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. కానీ, ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. తీరా, 2017 కల్లా వాటి సంఖ్య 912. అంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యు యేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. ఇప్పటికే నాసిరకమని పేరుపడ్డ మన విశ్వవిద్యాలయ రిసెర్చ్ ప్రమాణాలు మరింత దిగజారడానికి కొత్త నిబంధనలు కారణం కాకూడదు. లోతుగా పునఃపరిశీలన చేసినా తప్పు లేదు. ప్రామాణిక పరిశోధనలకై ఒక అడుగు వెనక్కి వేసినా... ప్రగతికి అది ముందడుగే! -
తెలంగాణ సర్కార్‌కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. అమిత్‌షాను కలిసిన గవర్నర్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గవర్నర్ తమిళిసై కలిశారు. రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందజేశారు. గవర్నర్‌గా మూడో ఏడాది పదవీ కాలంపై రాసిన పుస్తకాన్ని అమిత్‌షాకు ఆమె అందజేశారు. చదవండి: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే? -
అలా పీహెచ్‌డీలు చేస్తే చెల్లవు: యూజీసీ హెచ్చరిక
ఢిల్లీ: పీహెచ్డీ కోర్సుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా శుక్రవారం ఒక జాయింట్ అడ్వైజరీ రిలీజ్ చేశాయి. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్టెక్) కంపెనీలు నిర్వహిస్తున్న పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చెల్లవని ప్రకటించింది. ఆన్లైన్ పీహెచ్డీ కోర్సులకు ఎలాంటి గుర్తింపు ఉండబోదని పేర్కొంటూ.. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీసును జారీ చేసింది కంట్రోలర్స్ ఆఫ్ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తమ మార్గదర్శకాల ప్రకారం.. ఎడ్టెక్ కంపెనీలు నిర్వహించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు గుర్తింపు ఉండబోదని స్పష్టం చేసింది. యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ప్రామాణికాలు పాటించాల్సిందేనని, అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కూడా యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. UGC advises Students and public, at large, not to be misled by advertisements for online Ph.D programmes offered by EduTech Companies in collaboration with Foreign Educational Institutes. For more details please see the attached public notice. @PMOIndia pic.twitter.com/RlP33Ziv7B — UGC INDIA (@ugc_india) October 28, 2022 విదేశీ యూనివర్సిటీల సహకారంతో.. ఆన్లైన్ పీహెచ్డీ అంటూ వచ్చే ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటికి ఆకర్షితులు కావొద్దంటూ విద్యార్థులకు సూచించింది ఆ నోట్. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేముందు యూజీసీ రెగ్యులేషన్ 2016లోబడి ఉందో క లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. ఈ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న పలు ఉదంతాలు ఇటీవల తెరపైకి రావడంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు యూజీసీ, ఏఐసీటీఈ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మీ స్మార్ట్ ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి -
దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ నకిలీ యూనివర్సిటీ అని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీల వివరాలను బహిర్గతం చేసింది. ఆయా వర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. వాటికి ఎలాంటి డిగ్రీలను అందజేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: Viral Video:ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు.. హాస్టల్లో అమ్మాయిలపై పైశాచికత్వం!
Seniors ragging.. కాలేజ్ డేస్ అనగానే చాలా మందికి హ్యాపీడేస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసే సీన్స్ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్‌ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్‌లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్లో జూనియర్లను తమ రూమ్స్‌లోకి పిలిపించుకుని ఓవర్‌గా బిహేవ్ చేశారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరికొకరు కొట్టుకోవాలని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచారణ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ‘Have sex with pillows, abuse girls’: Freshers allege ragging in Indore's MGM Medical College#indorenews #MadhyaPradesh #CollageRagging #nvbcnews pic.twitter.com/fRiQUIX2gP — NVBC News (@NewsNvbc) July 30, 2022 ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్.. వీడియో వైరల్ -
స్వదేశం నుంచే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: విదేశీ విశ్వవిద్యాలయాల్లోని అత్యున్నత విద్యను ఇకపై స్వదేశం నుంచే అభ్యసించే అవకాశం మన విద్యార్థులకు కలగబోతోంది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యావిధానంలో చేసిన నిర్ణయాల ఫలితంగా ఆయా విదేశీ వర్సిటీల అనుబంధ విద్యావిభాగాలు మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా.. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యావిధానంలో కొత్త నిబంధనలు పొందుపరిచిన సంగతి తెలిసిందే. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ.. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాములతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి అనుగుణంగా ‘ట్విన్నింగ్’ కార్యక్రమాల కోసం పలు కొత్త నిబంధనలను కేంద్రం రూపొందించింది. వీటిని యూజీసీ 2020 ఏప్రిల్‌లోనే నోటిఫై చేసి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం పలికింది. ట్విన్నింగ్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల అమలుకు, పరస్పర సహకారానికి ముందుకు రావాలని కోరింది. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని విద్యార్థులు దేశీయ వర్సిటీలు, విదేశీ వర్సిటీలు అందించే డ్యూయెల్ డిగ్రీలను ఒకేసారి అందుకోగలుగుతారు. దీనికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి సానుకూల స్పందన లభించినట్లు యూజీసీ వెల్లడించింది. ఇప్పటికే స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్ విద్యా సంబంధిత అనుసంధానంపై సుముఖత వ్యక్తపరచగా, ఆస్ట్రేలియాలోని డాకిన్ యూనివర్సిటీ కూడా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు తోడ్పాటునందిస్తుందని తెలిపింది. ఇవే కాకుండా.. అనేక ఇతర విదేశీ వర్సిటీలు తమ శాటిలైట్ క్యాంపస్ (అనుబంధ విభాగాలు)లను భారత్‌లో ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌లాండ్ తమ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తపరచడంతో పాటు వచ్చే నెలలో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాక.. జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని మరో యూనివర్సిటీ కూడా దేశంలో శాటిలైట్ వర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. జపాన్‌లోని వివిధ వర్సిటీలు కూడా తమ ఆసక్తిని వ్యక్తపరిచినట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉన్నత విద్య అంతర్జాతీయకరణకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానంలో చేసిన కొత్త నిర్ణయాలతో విద్యా సంబంధిత వ్యవహారాలు మరింత బలోపేతమవుతాయంటూ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అభిప్రాయపడుతూ పరస్పర మార్పిడి ప్రక్రియకు సానుకూలతను తెలిపింది. వేల్స్‌లోని బంగోర్ వర్సిటీ, సోస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కూడా ఉన్నత విద్యా వ్యవహారాల్లో పరస్పర మార్పిడి ప్రక్రియకు ముందుకొస్తున్నాయి. ఇక జర్మనీలోని యూనివర్సిటీ జెనా, దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు సహ దాదాపు 48 విదేశీ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యలో పరస్పర సహకారానికి ప్రతిపాదించాయి. ఎంఐటి, స్టాన్ఫోర్డ్లు కూడా సంసిద్ధత ఇక అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు కూడా తమ విభాగాల ఏర్పాటుకు ముందుకొస్తుండడంతో దేశంలోని విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాముల ద్వారా ఆయా వర్సిటీల కోర్సులను కూడా మన విద్యార్థులు స్వదేశంలో చదువుతూనే వాటినీ అభ్యసించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇవే కోర్సులను విదేశాల్లోని ఆయా వర్సిటీలలో చదవాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించడంతోపాటు అనేక వ్యయప్రయాసలకోర్చవలసి ఉంటుందని వివరిస్తున్నారు. కానీ, ఇక్కడే ఆయా డిగ్రీ కోర్సుల అధ్యయనంతో పైచదువుల కోసం విదేశీ వర్సిటీల్లో మన విద్యార్థులు సులభంగా ప్రవేశాలు పొందే అవకాశముంటుందంటున్నారు. -
ఆనర్స్ డిగ్రీతో నేరుగా పీహెచ్డీ.. వివరాలు ఇదిగో..
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రోగ్రాముల్లో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై నేరుగా పీహెచ్డీ చేయొచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పిస్తోంది. ఆనర్స్ కోర్సులో నిర్ణీత స్కోరు పాయింట్లు సాధించి ఉంటే నేరుగా పీహెచ్డీ చేయవచ్చు. జాతీయ నూతన విద్యా విధానంలో పీహెచ్డీ ప్రవేశాలకు కొన్ని నూతన అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. వీటిని అనుసరించి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలో ప్రవేశానికి విధివిధానాలను యూజీసీ ఖరారు చేసింది. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులో 10 స్కోరు పాయింట్లలో 7.5 పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 0.5 స్కోరు పాయింట్ల మినహాయింపునిచ్చింది. ఆనర్స్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పరిశోధన అంశాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో 7.5 స్కోరు పాయింట్లుకన్నా తక్కువ వచ్చిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన తరువాతే పీహెచ్డీ చేసేందుకు అర్హత ఉంటుంది. సీట్ల భర్తీలోనూ మార్పులు యూనివర్సిటీల్లోని పీహెచ్డీ కోర్సుల సీట్లను భర్తీ చేసే విధానంలోనూ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయా యూనివర్సిటీలే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజా విధానాన్ని అనుసరించి ఇకపై జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా వర్సిటీల్లోని సీట్లను భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయా వర్సిటీలు, రాష్ట్రాలు సొంతంగా భర్తీ చేసుకోవాలంటే 60:40 నిష్పత్తిలో ప్రవేశాలు కల్పించారు. యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు లేదా రాష్ట్రాల కామన్ ప్రవేశ పరీక్షల ద్వారా 40 శాతం సీట్లను భర్తీ చేస్తే మిగతా 60 శాతం సీట్లను జాతీయస్థాయి పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, ఆనర్స్ డిగ్రీలో నిర్ణీత స్కోరు సాధించిన వారు కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే పీహెచ్‌డీకి ఎంపిక కావాలి. -
కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2008లో మచిలీపట్నం కేంద్రంగా ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు ఉన్నాయి. కృష్ణా తప్ప మిగతావన్నీ 12–బీ గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇటీవల వరకు అద్దె భవనాల్లోనే (ఆంధ్ర జాతీయ కళాశాలలో) కొనసాగడం, వర్సిటీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 12–బీ గుర్తింపు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పెత్తందారులు చేసిన రాజకీయ క్రీడతో వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 12–బీ సాధనకు ఇదే సరైన సమయమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రామిరెడ్డి తమ బృదానికి దిశానిర్దేశం చేశారు. దీంతో 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు సొంతమైంది. ఇకపై వర్సిటీ కార్యకలాపాలకు 80 శాతం నిధులు యూజీసీ నుంచి మంజూరవుతాయి. ఉన్నత విద్యకు ఊపిరి ► 2008–09లో అద్దె భవనాల్లో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం రుద్రవరం వద్ద 102 ఎకరాల సువిశాల ప్రదేశంలో సొంతభవనాల్లో నడుస్తోంది. ► వర్సిటీకి అనుబంధంగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు కలిపి164 కాలేజీల్లో ఏటా సుమారు 53 వేల మంది చదువుతున్నారు. ► వర్సిటీ క్యాంపస్‌లో ఆర్ట్స్అండ్ సైన్సు కోర్సులతో పాటు, ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ కోర్సులను సైతం అందిస్తున్నారు. 2011–12 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ అందుబాటులో ఉండగా, ఇటీవలనే వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటైంది. ► వర్సిటీలో ఆరు డిపార్టుమెంట్లు, నూజివీడులో మూడు డిపార్టుమెంట్లు పనిచేస్తున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాలకు అవకాశం 12–బీ గుర్తింపుతో విద్యార్థులతో పాటు, బోధనా సిబ్బందికీ మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకయ్యే నిధులను యూజీసీ సమకూరుస్తుంది. ఈ గుర్తింపు సాధన కమిటీలో నేనూ కూడా ఓ సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ ప్రయోగాలకు కేంద్రంగా నిలువనుంది. – డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నాక్ గుర్తింపుపై దృష్టి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 12–బీ గుర్తింపు సాధ్యమైంది. ఈ గుర్తింపు సాధనలో ఉన్నత విద్యామండలి పెద్దల సహకారంతో ఎంతో ఉంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. నా హయాంలో 12–బీ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాక్ గుర్తింపుపై దృష్టిపెట్టాం. – కె.బి.చంద్రÔశేఖర్, వైస్ చాన్స్‌లర్ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం కృష్ణా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఎక్కువగా పేదవర్గాల విద్యార్థులు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయా లకు అనుగుణంగా విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. సొంత భవనాల్లో మౌలిక సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. వర్సిటీ మరింత అభివృద్ధికి యూజీసీ 12–బీ గుర్తింపు ఊతమిస్తుంది. – డాక్టర్ ఎం.రామిరెడ్డి, రిజిస్ట్రార్ -
అక్కడ చదివితే.. డిగ్రీలు చెల్లవు, ఉద్యోగాలు ఇవ్వం!
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశాయి. భారతీయులు కానీ ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ కలిగిన వ్యక్తులు ఎటువంటి ఉన్నత విద్య కోసమైనా పాకిస్తాన్ వెళ్లవద్దంటూ సూచించింది. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్‌కి చెందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో కోర్సులను అభ్యసిస్తే వాటిని గుర్తించమని తెలిపింది. ఈ కోర్సులు, సర్టిఫికేట్ల ఆధారంగా ఇండియాలో ఉద్యోగాలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాటకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఎవరైనా భారతీయ వలస కార్మికులు పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఉద్యోగులు, ఇతర అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ — ANI (@ANI) April 23, 2022 చదవండి👉🏾 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు, స్థానిక డ్రైవర్ మృతి -
యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అమల్లోకి తెచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతోపాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. అలాగే వర్సిటీలకు కూడా ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ భారమూ ఉండదని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు సీయూఈటీలో చేరాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే గతేడాది ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీపీజీసెట్–2021ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్ర వర్సిటీలు యూజీసీ నిర్వహించాలనుకుంటున్న సీయూఈటీలో చేరలేదు. రాష్ట్రం నుంచి సీయూఈటీకి కేవలం 1,080 దరఖాస్తులు మాత్రమే అందాయి. అవి కూడా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ (అనంతపురం)తో పాటు ఇతర సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాల కోసం దాఖలైనవే. ఒక అడుగు ముందే ఏపీ.. రాష్ట్రంలో 15 సంప్రదాయ వర్సిటీలు ఉండగా వాటిలో పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆయా వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఆయా వర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థులు పలు ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. దీనివల్ల వేర్వేరుగా ఫీజులను చెల్లించడంతోపాటు పరీక్షలకు హాజరవడానికి వ్యయప్రయాసలు తప్పేవి కావు. ఇక ఆయా వర్సిటీల్లో ప్రవేశాలు ఒకే తేదీల్లో ఉంటే ఏదో ఒకదానికే హాజరు కావలసి వచ్చేది. ఈ దుస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహించేలా గతేడాదే చర్యలు చేపట్టాయి. యూజీసీ ఇప్పుడు చేస్తున్న ఆలోచనలను ఏడాది ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఏపీపీజీసెట్ విషయంలోనే కాకుండా విద్యారంగ పురోగతికి చేపట్టే వివిధ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్.. ఇతర రాష్ట్రాలు, వ్యవస్థలకంటే అడుగు ముందే ఉంది. నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అనేక సంస్కరణలు అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల ఏర్పాటు, కరిక్యులమ్ సంస్కరణలు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇలా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉన్నత విద్యలో చేరికలు పెంచేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చులను సైతం అందిస్తోంది. ఒక్క పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం ఏపీపీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా 15 వర్సిటీల్లో చేరడానికి విద్యార్థులకు అవకాశం దక్కింది. దీనివల్ల ఫీజుల భారం తగ్గడంతోపాటు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవస్థ తప్పింది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను యోగి వేమన వర్సిటీ చేపట్టింది. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, కర్నూలు క్లస్టర్ వర్సిటీలతోపాటు జేఎన్టీయూ అనంతపూర్– ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (జేఎన్టీయూఏ–ఓటీపీఆర్‌ఐ)లలోని సీట్లను ఏపీపీజీసెట్ ద్వారా భర్తీ చేశారు. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్‌సెట్ (రీసెర్చ్సెట్)ను కూడా ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. ఈ సెట్లో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఆయా వర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుల వల్ల ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లపరంగా అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయి. -
డబుల్ ధమాకా!
అవును... విద్యార్థులకు ఇది అచ్చంగా డబుల్ ధమాకా! ప్రస్తుత విద్యావిధానంలో లాగా ఒకసారి ఒకే డిగ్రీ కాకుండా, ఏకకాలంలో రెండు కోర్సులు చదివి, రెండు డిగ్రీలూ పొందే అరుదైన అవకాశం. నూతన విద్యావిధానంలో భాగంగా వీలు కల్పిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన సరికొత్త ప్రతిపాదన. ప్రతిపాదిత ఏకకాలపు రెండు డిగ్రీల చదువుకు మార్గదర్శకాలను బుధవారం యూజీసీ ప్రకటించింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో రెండు డిగ్రీలు చదువుకొనే వీలు కల్పించే ఈ విధాన మార్పు సంచలనం సృష్టిస్తోంది. నిర్ణీత వ్యవధిలోనే ఒకటికి రెండు డిగ్రీలు చేసేందుకు ఇది మంచి అవకాశమని కొందరు స్వాగతిస్తున్నారు. ఇంకొందరు ప్రొఫెసర్లేమో ఒకేసారి లెక్కలు– సంగీతం... ఇలా రెండు విభిన్న అంశాల్లో డిగ్రీలు చేయడం ఏం విడ్డూరమంటున్నారు. వెరసి ఉన్నత విద్యలో అత్యున్నత చట్టబద్ధ సంస్థ యూజీసీ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఈ కొత్త ప్రతిపాదన పుణ్యమా అని విద్యార్థులు ఒకేసారి రెండు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కానీ, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కానీ, రెండు డిప్లమోలు కానీ చేయవచ్చు. రెండింటిలోనూ స్వయంగా తరగతి గదికి హాజరై కానీ, లేదంటే ఒక డిగ్రీకి స్వయంగా హాజరై – మరొకటి ఆన్ లైన్లో కానీ, అదీ కాదంటే రెండు డిగ్రీలూ ఆన్లైన్ విధానంలో కానీ చదవవచ్చు. ‘అటు విద్యావిషయకంగానూ, ఇటు విద్యకు సంబంధంలేని ఇతర రంగాల్లోనూ విద్యార్థుల సమగ్ర పురోగతిని ప్రోత్సహించడం కోసమే’ ఈ రెండు డిగ్రీల చదువనేది యూజీసీ ఆలోచన. దీనివల్ల సైన్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, వివిధ భాషలతో పాటు ప్రొఫెషనల్, టెక్నికల్, ఒకేషనల్ – ఇలా ఏ అంశమైనా తీసుకొని చదివే వీలు విద్యార్థికి కలుగుతుంది. ఆ ఉన్నత సంస్థకు చైర్మన్ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి ఎం. జగదీశ్ కుమార్ ఈ ఆలోచనను మంగళవారం ప్రకటించారు. ఆ మర్నాడే దేశవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీలన్నిటికీ దీనిపై మార్గదర్శకాలు చేరాయి. ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని, లోతుగా చదువుకొని, జ్ఞానతృష్ణ, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంచుకోవచ్చని యూజీసీ భావిస్తోంది. ఆ మాటెలా ఉన్నా, ఎక్కువమంది చదవని సంగీతం, సాహిత్యం, లలిత కళలు లాంటి కోర్సులకు ఈ సరికొత్త విధాన మార్పుతో కొత్త ఊపు రావచ్చని కొందరు ఆచార్యుల ఆశాభావం. కానీ, అదే సమయంలో అసలే ఒత్తిడితో కూడిన చదువులతో సతమతమవుతున్న విద్యార్థులకు ఇది మరింత ఒత్తిడి కలిగించవచ్చు. అసలే అస్తుబిస్తుగా ఉన్న చదువుల నాణ్యత ఈ ఒకటికి రెండు డిగ్రీల ప్రతిపాదనతో మరింత క్షీణించవచ్చు. పలువురు ప్రొఫెసర్ల అభ్యంతరం కూడా అదే! అయితే గమ్మత్తేమిటంటే – వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ కొత్త విధానాన్ని విద్యాలయాలు యథాతథంగా అమలుచేయాలన్న నిబంధన ఏదీ లేకపోవడం! కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సొంత టై–అప్లు పెట్టుకోవచ్చట. ప్రవేశపరీక్షలు ఏమైనా పెట్టుకోవాలా అన్నది నిర్ణయించుకోవచ్చట. కొత్త పద్ధతిలో సైన్సు డిగ్రీ చేస్తూనే, కామర్స్, సోషల్ సైన్స్ లాంటివి చదవచ్చు. కామర్స్ డిగ్రీ చేస్తూనే, సైన్స్ చదవచ్చు. ఇది విభిన్న శాఖల మధ్య జ్ఞానపంపిణీకీ, అర్థవంతమైన సంభాషణలకూ ఉపయుక్తం. సరిగ్గా ఆచరణలో పెడితే, విద్యార్థుల్లో విశాల దృక్పథానికీ, ఆలోచనా పరిధి పెరగడానికీ ఈ ఉదార విద్య దీర్ఘకాలంలో ప్రయోజనకరమే. కానీ, కొత్త విధానం ఏ మేరకు ఆచరణ సాధ్యం? డిగ్రీతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామో, డిప్లమోనో చేస్తే ఫరవాలేదు. అలాకాకుండా ఏకంగా రెండు డిగ్రీలు చేస్తూ, ఏకకాలంలో అటూ ఇటూ కుప్పిగంతులు వేస్తుంటే ఒక్కటైనా ఒంటపడుతుందా? ఇప్పటికే ‘నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్’ (ఎఫ్‌వైయూపీ) ఉంది గనక ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల పథకంతో ఒరిగేదేమిటి? దీర్ఘకాలంగా ఉన్న ఆనర్స్ కోర్సులకు విలువ పోదా? ఇలా అనేక సందేహాలూ ఉన్నాయి. కొత్త విధానం అమలులో నిర్వహణపరమైన సవాళ్ళు సరేసరి. ఆర్థిక సరళీకరణ అనంతర ప్రపంచంలో పెరిగిన ఆకాంక్షలకు తగ్గట్టు దేశంలో విద్యాసంస్థలు ఏ మేరకు సిద్ధమయ్యాయన్నది ప్రశ్నార్థకమే. వివిధ విశ్వవిద్యాలయాలు దేశంలో టాప్ 100 లో ఉండడమే అరుదు. ఇక, అంతర్జాతీయ ర్యాకింగుల చిట్టాలో వాటి పరిస్థితి చెప్పనక్కర లేదు. విభిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు తగ్గట్టు చదువు చెప్పేలా అధ్యాపకులందరికీ ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తున్నారా? ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల చదువంటే, దానికి తగ్గట్టు కోర్సులు తయారు చేయాలి. బోధన పద్ధతుల్ని తీర్చిదిద్దుకోవాలి. భౌతిక శాస్త్రంలోనో, అర్థశాస్త్రంలోనో ఒక డిగ్రీ చేస్తున్న విద్యార్థి వచ్చి, చరిత్ర, సాహిత్యం తరగతి గదిలో రెండో డిగ్రీ చదువుకు కూర్చుంటారు. వాళ్ళకు ప్రధాన పరిజ్ఞానానికి తగ్గట్టుగా రెండో చదువు నేర్పేందుకు కొత్త బోధనా శైలి అవసరం. మారిపోతున్న ఈ తరగతి గది స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఆచార్యులకు బోధనలో యూజీసీ శిక్షణనివ్వాలి. కానీ, అది నేటి వరకు పెడుతున్న శిక్షణ తరగతుల సరుకు, సారం జగద్విదితం. ఇదే మూసలో వెళితే ఈ నూతన విద్యావిధాన ప్రయోగం నిష్ఫలమయ్యే ప్రమాదం ఉంది. నేటికీ మన యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యాప్రమాణాలు అంతటా ఒకేలా లేవు. వసతులు, బోధన సహా వివిధ అంశాల్లో హస్తిమశకాంతరం. దేశమంతటా ఒకేలా ఉండేలా ప్రమాణాలను పెంచకపోతే కష్టం. కాలేజీలో చదువు బాగా చెప్పకపోతే, ఇప్పుడు విద్యార్థి ఒక డిగ్రీ చేసినా, రానున్న రోజుల్లో రెండు డిగ్రీలతో బయటకొచ్చినా ఒరిగేది జ్ఞానశూన్యమే. తస్మాత్ జాగ్రత్త! -
ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి
న్యూఢిల్లీ: ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్‌టైమ్ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ చేస్తామని, ఈ అవకాశం 2022–23 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు ఒకేసారి బహుళ నైపుణ్యాలు ఆర్జించేందుకు వీలుగా ఒకేమారు రెండు డిగ్రీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు. ఒకే విశ్వవిద్యాలయం లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేయవచ్చని చెప్పారు. చదవండి: (ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్ నూతన ప్రధాని) -
యూజీసీ అకౌంట్‌కి చిక్కులు, ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ చొరబడిన హ్యాకర్లు
ప్రతిష్టాత్మక సంస్థ యూనిర్సిటీ గ్రాంట్ కమిషన్ ఖాతా హ్యాక్ అయ్యింది. ట్విట్టర్లో యూజీసీకి చెందిన అధికారిక ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూజీసీ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి డీపీ, కవర్ ఫోటోలను మార్చివేశారు. అజూకీ క్యారెక్టర్లతో డీపీ, కవర్ ఫోటోలను కొత్తగా లోడ్ చేశారు. యూజీసీ ట్విట్టర్ అకౌంట్‌కి 2,96,000ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022 ఏప్రిల్ 10న యూజీసీ ఖాతాలో వచ్చిన మార్పులు డీపీ చేంజ్ కావడం చూసిన వారు వెంటనే అప్రమత్తమయ్యారు, హ్యాకింగ్ గురించి రిపోర్టు చేశారు. సాయంత్రానికి ట్విటర్ ఖాతాను యూజీసీ రిస్టోర్ చేసుకోగలింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లుగా అజూకీ క్యారెక్టర్లు ఉన్నాయి. యూజీసీ ట్విట్టర్ ఖాతాను వశం చుసుకున్న హ్యాకర్లు ఈ ఖాతా ద్వారా అజూకీ ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ ప్రకటించారు. UGC India's official Twitter account hacked. pic.twitter.com/t37ui8KNuC — ANI (@ANI) April 9, 2022 చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..! -
చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, అమరావతి: చైనాలో చదవాలనుకునే విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాటిలో చేరే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ ఉమ్మడిగా, ఎన్ఎంసీ వేర్వేరుగా ఇటీవల సర్క్యులర్లు విడుదల చేశాయి. గత కొంతకాలంగా చైనాలో మళ్లీ కోవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. విద్యార్థులకు ఆన్లైన్లో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఎంసీ సూచించాయి. ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని కోరాయి. ‘కోవిడ్ నేపథ్యంలో చైనా ప్రభుత్వం నవంబర్ 2020 నుంచి అన్ని వీసాలను సస్పెండ్ చేసింది. వీటి కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు చైనాకు తిరిగి వెళ్లలేకపోయారు. ఆ ఆంక్షలను ఇంకా తొలగించలేదు సరికదా చదువుల కొనసాగింపునకు వీలుగా ఇప్పటివరకు పరిమితులతో కూడా సడలింపు ఇవ్వలేదు. ఈ తరుణంలో చైనాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రస్తుత, రాబోయే విద్యా సంవత్సరాలకు వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటీసులు జారీ చేశాయి. వివిధ కోర్సుల్లో చేరిన వారితోపాటు కొత్తగా చేరే వారికి ఆయా కోర్సులను ఆన్లైన్లో నిర్వహిస్తామని ఆ వర్సిటీలు తెలిపాయి. భారతదేశంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఆన్లైన్ విధానంలో అభ్యసించే డిగ్రీ కోర్సులను యూజీసీ, ఏఐసీటీఈ గుర్తించవు. విద్యార్థులు నిర్దిష్ట డిగ్రీ కోర్సును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేశంలో అనుమతులు లేని కోర్సులను విదేశాల్లో అభ్యసించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి’ అని ఏఐసీటీఈ, యూజీసీ హెచ్చరించాయి. ఆన్లైన్ విధానంలో సమస్యలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కూడా ఇదే విధమైన నోటీసును ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసింది. చైనా వర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం విధించిన కఠినమైన ఆంక్షల గురించి ముందుగానే నోటీసు ద్వారా తెలియజేసింది. విదేశీ వర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి తగిన దేశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో 2020 మార్చిలో భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్ విధానంలో చదువులను కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ విషయంలో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను చైనాతో చర్చించి పరిష్కరించాలని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
CUCET 2022: ఇంటర్ వెయిటేజీ రద్దు మంచిదే
దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల (సీయూల) ప్రవేశాల కోసం 2022–23 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ రద్దు చేయడం సరైన నిర్ణయం. ఇంటర్మీడియట్ మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేసే విధంగా ప్రయోగాలకు ఎక్కువ మార్కులు వేస్తూ ఉండటాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గమనించి ఈ నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. సీయూ సెట్‌ని దేశవ్యాప్తంగా 13 భాషల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించడం కూడా అభినందించదగ్గదే. ఈ క్రమంలో రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూ సెట్‌ను అనుసరించి ప్రవేశాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించటం మంచి పరిణామం. సీయూ సెట్లో వచ్చిన మార్కులు, డిగ్రీ మార్కులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రాలలో అమలులో ఉండే రిజర్వేషన్ ఆధారంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించడానికి యూజీసీ నిర్ణయించడం వల్ల... దొడ్డిదారిన సీట్లు పొందే వాళ్లకి చెక్ పెట్టినట్లు అవుతున్నది. (క్లిక్: కేంద్రీయ వర్సిటీల యూజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష) ఇక మల్టిపుల్ ఛాయిస్‌లో ప్రశ్నలు, తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండటం అనేవి పరీక్షార్థులకు కొంచెం ఇబ్బందికరమే అయిన ప్పటికీ... జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కనుక వడపోత జరగాలంటే ఇటువంటి మార్పులు తప్పవు. అయితే ప్రవేశాలకు సంబంధించిన మెరుగైన సంస్కరణలు చేపట్టే యూజీసీ తదనుగుణంగా విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు చేయడం; ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలలో ప్రవేశాల సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు వేయడం సీయూ సెట్‌ని బలోపేతం చేస్తుంది. ఇంగ్లీష్‌తో పాటు, మన తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో, టెస్ట్ ఉండటం మాతృభాషలో చదువుకున్న వారికి ప్రయోజనకరం. – డాక్టర్ నూకతోటి రవికుమార్, ఒంగోలు -
ఇక ఎంసీఏ రెండేళ్లే...కొత్త డిగ్రీ కోర్సులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్‌ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో తొమ్మిది కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణుల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ డిజైన్ (వ్యవధి: నాలుగేళ్లు), బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ (వ్యవధి: మూడేళ్లు) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనేదాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది. కొత్త మార్పులు ఇలా.. యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ) కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. 12వ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సోవా రిగ్పా మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్‌ఆర్‌ఎంఎస్) కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాలవ్యవధి.. ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఈ బీఎస్‌ఆర్‌ఎంఎస్ కోర్సును అందిస్తారు. (చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్..) -
సెంట్రల్ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్ వెయిటేజి రద్దు
సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి. ఇకపై ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది. -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు. -
మల్టీ డిసిప్లినరీ అటానమస్ సంస్థలుగా కాలేజీలు
యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది. – సాక్షి, అమరావతి 2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది. భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్ సీట్ అలకేషన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్ డిగ్రీతో డ్యూయల్ డిగ్రీకి అవకాశం ఉంటుంది. క్లస్టర్లుగా కాలేజీలు ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్‌గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లస్టర్ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్ అక్రిడిటేషన్, ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. -
అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...
ఇటీవల విశ్వవిద్యాలయాల నిధుల జారీ సంస్థ అయిన యూజీసీ నూతన జాతీయ విద్యా విధానంలో అకడమిక్ బ్యాంకు క్రెడిట్ (ఏబీసీ)లను ప్రారంభించాల్సిందిగా ఆదే శాలు జారీ చేసింది. అకడమిక్ బ్యాంకు క్రెడిట్ అంటే ప్రతి విద్యార్థికీ ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయడం అన్నమాట. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఏబీసీ పోర్టల్ ద్వారా అతను పూర్తిచేసిన వివిధ కోర్సుల మార్కులు, గ్రేడ్, ర్యాంకులను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఐదేళ్ళపాటు భద్రంగా దాచిన ఈ మార్కులు, గ్రేడ్లను విద్యార్థి తదనంతర కాలంలో తిరిగి చదువు కొనసాగించాలన్నా, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన చదువును సాగించాలన్నా... తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏబీసీల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా... విద్యార్థి సంపాదించిన కోర్సు సర్టిఫికెట్లకు గుర్తింపు ఇవ్వడం అనివార్యం అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లకు కొన్నిచోట్ల గుర్తింపు లభించడం లేదు. ఏబీసీల్లో స్టూడెంట్ విద్యాపరమైన అన్ని విష యాలనూ నిక్షిప్తం చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. మరో ప్రయోజనం ఏమిటంటే... ఏబీసీ పోర్టల్‌కు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒక విద్యార్థి ఒక విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినా మరొక విశ్వవిద్యాలయంలో మరొక కోర్సు చదివే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి బొంబాయిలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా అతనికి ఇష్టమైన కృత్రిమ మేధ అనే ఐచ్ఛిక కోర్సు ఆ కళాశాలలో బోధించనట్లయితే... అతను వేరొక ప్రదేశంలోని వేరొక కళాశాల నుండి ఆ కోర్సు చేసే వెసులు బాటు ఉంటుంది. భారత ప్రభుత్వం అందిస్తున్న ‘స్వయం’, ఎన్పీటీఈఎల్ అందిస్తున్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోర్సులూ, మైక్రోసాఫ్ట్ వంటి గుర్తింపు పొందిన సంస్థలు అందించే కోర్సులను పూర్తి చేసి వాటి ద్వారా లభించిన క్రెడిట్లను విద్యా నిధిలో దాచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని కళాశాలలో చేరిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని పేరున్న కళాశాలలోని కోర్సులు చదివే అవకాశం ఇక నుండి ఏర్పడుతుంది. అంతేకాక ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఐఐఎంలలోని అత్యంత ప్రతిభావంతమైన అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేసే అవకాశం ఏర్పడనుంది. అయితే ఇవన్నీ కూడా చెప్పుకోడానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఆచరణలో మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఏబీసీ పోర్టల్ ద్వారా కోర్సులను అందించే విద్యాసంస్థలు తప్పనిసరిగా నాక్ ఏ గ్రేడ్ పొంది ఉండాలనే నిబంధనను ఒకటి విధించడం జరిగింది. కానీ నేడు దేశంలోని అనేక విద్యా సంస్థలు నాణ్యత ప్రమాణాలను పాటించనప్పటికీ నాక్ ‘ఏ’ గ్రేడు రావడం మనమందరం చూస్తున్నాం. ఏబీసీ విధానం ప్రకారం నాక్ ‘ఏ’ గ్రేడ్ పొందిన ఒక నాసిరకం విద్యాసంస్థ నుండి కోర్సు పూర్తి చేసిన విద్యార్థి అదే కోర్సు ఐఐటీ వంటి సంస్థల్లో పూర్తి చేసిన విద్యార్ధితో సమానంగా గుర్తింపు పొందుతాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకే కోర్సును ఐఐటీ వంటి ఒక ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ, ఒక సాధారణ ప్రాంతీయ కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉంచినప్పుడు సహజం గానే విద్యార్థులు అందరూ కూడా ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవటానికి ఉత్సాహం చూపిస్తారు. ప్రాంతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గి బోధనలో నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఇందువల్ల చాలా విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే యూజీసీ అకడమిక్ బ్యాంక్ క్రెడిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. - ఈదర శ్రీనివాసరెడ్డి సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకే తికతను చేరువ చేసేం దుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ముందుకు వచ్చింది. యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం అంది స్తామని యూజీసీ తెలిపింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్‌ల బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ నూతన చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌ను కలిసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తీసుకొస్తున్న మార్పులను, పురోగతిని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం ఆనర్స్ కోర్సుల విషయాన్ని ప్రొఫెసర్ రవీందర్ యూజీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వ డం, పరిశోధన విధానాలను విస్తరింపజేయడంపై విశ్వవిద్యాలయాలు ప్రధానంగా దృష్టి పెట్టాయని ప్రొఫెసర్ వి.వెంకటరమణ యూజీసీ చైర్మన్‌కు వివరించారు. త్వరలో వీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా యూజీసీ చైర్మన్ అంగీకరించారు. తర్వాత వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యంను కలసి రాష్ట్రంలో వివిధ వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలపై తోడ్పాటు గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశాల వివరాలను ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. -
పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల నుంచి వివరాలను కోరినట్లు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివిధ కారణాల వల్ల గతంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించిన 52 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్ప టివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే అందులో 24 వేలమంది ప్రవేశాలు పొందగా.. ఇంకా 28 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్స్ గ్రూపుల్లో తక్కువ సంఖ్యలో చేరారన్నారు. అయితే, గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన కొంతమందికి బ్యాక్‌లాగ్స్ ఉండటంతో వీటిని ఇటీవల జరిగిన పరీక్షల్లో పూర్తిచేశారు. కానీ ఫలితాలు వచ్చే నాటికి పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాయి. ఫలితంగా అధికారులు చర్చించి చివరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. -
ప్రమాణాలు లేకపోతే.. ఒక తరం నష్టపోతుంది
ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్రమాణాల పెంపే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతానని యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సరైన ప్రమాణాలు లేకపోతే ఆ తరమే నష్టపోతుందని, ఆ నష్టం వాటిల్లకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ యూజీసీ నూతన చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ వర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట లోతైన పరిశోధనలు లేకపోతే మెరుగైన ఆవిష్కరణలకు అవకాశం ఉండదు. దానివల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తా. మెరుగైన పరిశోధనలు జరిగినప్పుడే వాటి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే పరిశోధన ఫలాలు ప్రజల దగ్గరికి చేరితేనే సార్థకత ఉంటుంది. నియామకాలు వేగవంతం చేస్తా రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల అంశమే ప్రధాన సమస్యగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నియామకాలు ఆగిపోయాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్స్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తా. నియామకాలు వేగవంతం జరిగేలా కృషి చేస్తా. అనుమతి లేని విద్యా సంస్థలపై కొరడా అనుమతిలేని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కఠిన చర్యలు చేపడతాం.కొన్ని వర్సిటీలు, కాలేజీలు విద్యార్థులకు విద్యను అందించడం లేదు. పేపరుపైనే విద్యా సంస్థలుగా ఉన్నాయి. కొన్నిటికి అనుమతులే ఉండటం లేదు. అధికారుల తనిఖీల్లోనూ ఈ విషయం వెల్లడైంది. అలాంటి వాటిని అలాగే వదిలేస్తే విద్యలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. వీటిపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం. నూతన విద్యా విధానంతో ప్రయోజనాలెన్నో.. నూతన విద్యా విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మెరుగైన విద్యా బోధన అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అవసరమే. అయితే మాతృభాషలో బోధన చేపడితే విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుంది. వచ్చే ఏడాది అమల్లోకి ‘హెకీ’ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా వచ్చే ఏడాది హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతున్నాం. అందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న యూజీసీ రెగ్యులేటరీ వ్యవహారాలు చూస్తుంది. మరో సంస్థ నిధులు, ఇంకో సంస్థ అసెస్మెంట్స్, గ్రేడింగ్, నాలుగో సంస్థ నాణ్యత ప్రమాణాల పెంపు వంటి కార్యకలాపాలను చూడనుంది. యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలకు విధించిన భౌగోళిక పరిధిని అవి దాటడానికి వీల్లేదన్న అంశంపై తగిన చర్యలు చేపడతా. తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది యూజీసీ చైర్మన్‌గా నియామకంతో తెలుగు ప్రజల నుంచి అందుతున్న అభినందనలు ఎంతో శక్తిని ఇస్తున్నాయి. వారి అభిమానం మరువలేనిది. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ యూజీసీ చైర్మన్‌గా అనేక బాధ్యతలు ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పని చేస్తా. చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్స్లర్లు, విద్యాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా చర్చిస్తా. ఈ మేరకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తా. యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలేంటి? వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, యూజీసీ నుంచి ఎలాంటి సహకారం అవసరం.. అన్న అన్ని అంశాలపై చర్చించి తగిన చర్యలు చేపడతా. -
ఎన్సీసీ విద్యార్థులకు వేరుగా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఎన్సీసీ క్యాడెట్లకు సెమిస్టర్ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది. ఈ ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది. ‘ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రిపబ్లిక్ డే క్యాంప్ కోసం ప్రిపరేషన్/ట్రైనింగ్ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది. వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని యూజీసీ బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
యూజీసీ సాయం కొనసాగేలా చూడాలి
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎయిడెడ్ కళాశాలల్లోని శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో యూజీసీ నుంచి వచ్చే ఆర్థిక, సాంకేతిక ఇతర సహకారాలను యథావిధిగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రైవేట్ యూజీ అండ్ పీజీ ఎయిడెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం రాష్ట్ర సమావేశం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.లక్ష్మణరావు, తూనుకుంట్ల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, అయితే శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం యథావిధిగా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
50 వేల మంది ఆశలు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దాదాపు 50 వేల మంది అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకు ముందే ఆయా పోస్టులను భర్తీచేసి ఉంటే వారంతా అర్హులయ్యేవారని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్డీ చేసి ఉండాలన్న యూజీసీ నిర్ణయం అనేకమంది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖ రాయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దశాబ్దంగా వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరగలేదు. 2017లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఈ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) అర్హతగా నిర్ధారించారు. ఇవి లేనివారికి ఎంఫిల్, పీహెచ్డీ చేసినా సరిపోయేది. కానీ తాజాగా నెట్, స్లెట్ ఉన్నా వాటికి వెయిటేజీ మార్కులు మాత్రమే ఉం టాయని, పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. పైగా ఈ నిర్ణయాన్ని గత నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంతో కష్టపడి నెట్ లేదా స్లెట్‌లలో అర్హత సాధించిన వారంతా నష్టపోతారని అంటున్నారు. వారికి పీహెచ్డీ చేసే అవకాశం ఉన్నా అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్టులకు నెట్, స్లెట్ సరిపోతుందని భావించి చాలామంది ఊరుకున్నారు. కానీ యూజీసీ నిర్ణ యం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని అం టున్నారు. యూజీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కేవలం ఆరు వేల మంది పీహెచ్డీ పూర్తి చేసిన వారే అర్హులవుతారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే పోస్టుల భర్తీ జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరిశోధన అంశంపై నిర్ణయం యూజీసీదే.. ప్రస్తుతం పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారు ఏ అంశంపై పరిశోధన చేయాలన్నది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఆ మేరకు అభ్యర్థి తాను ఎంచుకున్న అంశంలో పరిశోధన తీరును వివరిస్తూ క్లుప్తంగా నివేదిక తయారు చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అయితే వారి సొంతానికి పరిశోధన అంశాన్ని వదిలేయడం వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని, సులువైన అంశాలు తీసుకొని చాలామంది తూతూమంత్రంగా పీహెచ్డీ పూర్తి చేస్తున్నారన్నది నిపుణుల ఆరోపణ. అంతేకాక ఇతరులు పూర్తి చేసిన పీహెచ్డీ థీసిస్‌లను దగ్గర పెట్టుకొని కొందరు కాపీ కొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరిశోధన అంటే అది సమాజానికి ఉపయోగపడాలన్నది యూజీసీ భావన. కాబట్టి ఏ అంశంపై పీహెచ్డీ చేయాలన్నది కూడా యూజీసీనే నిర్ణయిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. -
అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం: యూజీసీ
న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వహించాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనందున ఒకవేళ ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిలైనా, వేరే చోటికి మారినా వారు చెల్లించిన ఫీజులను పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. -
యూజీసీ జాబ్ పోర్టల్ ప్రయోజనాల గురించి తెలుసుకోండి
యూజీసీ నెట్, నెట్–జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారా.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్లో అర్హత సాధించారా.. ఏదైనా సబ్జెక్టులో పీహెచ్డీ పూర్తి చేశారా.. అయినా ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నారా?! అయితే వెంటనే యూజీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జాబ్ పోర్టల్‌లో పేరు నమోదుచేసుకోండి!! మీ ప్రొఫైల్ నేరుగా రిక్రూటర్లు, విశ్వవిద్యాలయాల దృష్టికి వెళ్తుంది. దాంతో చదువుకు తగ్గ ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ జాబ్ పోర్టల్ ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. సాధారణంగా నెట్, సెట్లో అర్హత పొందిన వారిని, పీహెచ్డీ ఉత్తీర్ణులను ఉన్నత విద్యావంతులుగా, ప్రతిభావంతులుగా పరిగణిస్తాం. ఇలాంటి వారెందరో చదువుకు తగ్గ కొలువు దొరక్క నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి అవకాశాలు ఉన్నా.. సరైన జాబ్ సెర్చింగ్ వేదికలు లేకపోవడంతో చాలామంది తమ ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో యూజీసీ కొత్తగా తెచ్చిన జాబ్ పోర్టల్ ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న వారికి ఎంతగానో లాభిస్తుందని చెప్పొచ్చు. పోర్టల్ స్వరూపం యూజీసీ అందుబాటులోకి తెచ్చిన జాబ్‌పోర్టల్.. నెట్, నెట్–జేఆర్ఎఫ్, పీహెచ్డీ ఉత్తీర్ణులు, రిక్రూటర్లను ఒకే ఆన్లైన్ వేదికపైకి తెస్తుంది. తద్వారా అటు రిక్రూటర్లు, ఇటు ఉద్యోగార్థులకు ఏకకాలంలో ప్రయోజనం చేకూర్చనుంది. పోర్టల్‌లో క్యాండిడేట్, ఎంప్లాయర్, సెర్చ్ అండ్ బ్రౌజ్ విభాగాలను పేర్కొన్నారు. అభ్యర్థుల విభాగం ఇందులో రిజిస్టర్, లాగిన్, క్రియేట్/అప్డేట్ ప్రొఫైల్, సెర్చ్ జాబ్స్.. ఉప విభాగాలుగా ఉం టాయి. అభ్యర్థులు ముందుగా పేరు, మెయిల్ ఐడీలను నమోదు చేసి.. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ లాగిన్ ఐడీ సమస్యల దృష్ట్యా సెక్యూరిటీ క్వశ్చన్‌ను ఎంచుకొని.. సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా పోర్టల్‌లో ప్రవేశించి.. తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా అప్డేషన్ చేసుకోవచ్చు. అనంతరం జాబ్‌సెర్చ్ ద్వారా సరితూగే కొలువును ఎంచుకోవచ్చు. రిక్రూటర్లకు అభ్యర్థుల విభాగం తరహాలోనే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు సైతం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సదరు రిక్రూటర్లు పోర్టల్‌లో జాబ్ పోస్టింగ్స్‌తో క్యాండిడేట్ సెర్చ్ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే సెర్చ్ అండ్ బ్రౌజ్ విభాగంలో.. నెట్, సెట్, పీహెచ్డీ ఉత్తీర్ణుల వివరాలను పొందవచ్చు. ఉపయోగాలు జాబ్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు, రిక్రూటర్లు ఒకే వేదికపైకి వస్తారు. తద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. నెట్, సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాని ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అందరికీ చేరకపోవడంతో ప్రతిభ ఉన్నా.. చాలా మంది ఆయా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. తాజాగా యూజీసీ జాబ్ పోర్టల్ అందుబాటులోకి రావడంతో.. అభ్యర్థులంతా దేశవ్యాప్తంగా ఆయా కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రకటనల గురించి ఒకే వేదిక ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జాబ్ పోర్టల్ ద్వారా ఉద్యోగార్థులతోపాటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రతిభావంతుల సమాచారం అందుబాటులోకి రావడంతో సరైన అభ్యర్థిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. నెట్, సెట్, పీహెచ్డీ క్వాలిఫయర్ల వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉండటంతో ప్రయివేట్ రిక్రూటర్స్ ఈ వివరాల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. విశేష స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నెట్ఉత్తీర్ణులు– 60,958 మంది, నెట్–జేఆర్ఎఫ్–15,659 మంది, సెట్–18,519 మంది, పీహెచ్డీ ఉత్తీర్ణులు 30,417 మంది ఇప్పటికే యూజీసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరెంత మంది ఇప్పటి వరకు యూజీసీ జాబ్ పోర్టల్‌లో మొత్తం 60,958 మంది నెట్ క్వాలిఫయర్లు నమోదు చేసుకోగా... వీరిలో మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి 6,570 మంది, కామర్స్ 6,622, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 3,720 ఎడ్యుకేషన్ 3,479, లైఫ్ సైన్సెస్ 2,502 మంది ముందు వరుసలో ఉన్నారు. నెట్–జేఆర్ఎఫ్కు సంబంధించి ఇప్పటి వరకు 15,659 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో కామర్స్ నుంచి 1302 మంది, మేనేజ్మెంట్ నుంచి 1085 మంది, ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ నుంచి 853 మంది, జాగ్రఫీ నుంచి 710 మంది, హిందీ నుంచి 676 మంది, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నుంచి 648 మంది ఉన్నారు. ప్రస్తుతానికి 18,519 మంది సెట్ క్వాలిఫయర్లు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో కామర్స్ 1993, బయాలజీ 1487, ఇంగ్లిష్ 1369, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్1100, మేనేజ్మెంట్ 883, ఎకనామిక్స్ 820, ఎడ్యుకేషన్ 800, కెమిస్ట్రీ 809 విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. మొత్తం 30,417 మంది పీహె చ్‌డీ హోల్డర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బయాలజీ 4893, కెమిస్ట్రీ 2968, ఫిజిక్స్ 2018 , కామర్స్1417, మేనేజ్మెంట్ 1360, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్1242 అభ్యర్థులు ముందున్నారు. వెబ్సైట్: www.ugc.ac.in/jobportal -
Engineering Academic Calendar: ఈ షెడ్యూలు అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 2021–22 విద్యా సంవత్సరానికి అకడమిక్ కేలండర్‌ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసింది. కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల జారీ తేదీలు, ప్రవేశాలు పూర్తి చేయాల్సిన గడువు, తరగతుల ప్రారంభం వంటి అన్ని అంశాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 9 నాటికి ప్రవేశాలను పూర్తి చేసి, 15వ తేదీ నాటికల్లా ప్రథమ సంవత్సర విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రథమ సంవత్సరం మినహా ఇతర సంవత్సరాల వారికి మాత్రం సెప్టెంబర్ 1 నుంచే తరగతులను ప్రారంభించాలని వెల్లడించింది. మరోవైపు పీజీడీఎం/పీజీసీఎం కోర్సుల్లో జూలై 1 నుంచే తరగతులను ప్రారంభించాలని, జూలై 10లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది. షెడ్యూలు ప్రకారం జరిగేనా? దేశవ్యాప్తంగా కరోనా కారణంగా గతేడాది అక్టోబర్ లో తరగతుల బోధనను ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ఓవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను, ఈనెలలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా అదుపులోకి వస్తే తప్ప వాటిని నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రాల వారీ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెట్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఐసీటీఈ జారీ చేసిన అకడమిక్ కేలండర్ అమలు అవుతుందా లేదా? అన్నది అనుమానమే. గతేడాది కూడా సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా అకడమిక్ కేలండర్‌ను జారీ చేసినా తరువాత దాన్ని పలుమార్లు మార్పు చేయాల్సి వచ్చింది. కరోనా వల్ల చివరకు అక్టోబర్‌లో ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఈసారి కూడా కరోనా కేసులు అదుపులోకి రాకపోతే అదే పరిస్థితి ఉంటుందని అధ్యాపక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంకా పూర్తికాని బోధన.. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విద్యే కొనసాగుతోంది. ఇంకా తరగతులు పూర్తి కాలేదు. వచ్చే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా వారికి పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచే ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే వారికి ఏఐసీటీఈ నిర్దేశిత సమయంలో బోధనను ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అధ్యాపక సంఘాల నేతలు అయినేని సంతోష్‌కుమార్, బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండానే అకడమిక్ కేలండర్‌ను జారీ చేసిందని ఆరోపించారు. ఈనెలలో పరీక్షలు వద్దు: యూజీసీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలలో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రస్తుతానికి నిలిపివేయాలని యూజీసీ పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ పరీక్షల విషయంలో కేంద్రం, తాము జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానమని, ఈ పరిస్థితుల్లో మే నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను నిలిపేయాలని స్పష్టం చేసింది. ఇదీ ఇంజనీరింగ్, ఫార్మసీ అకడమిక్ కేలండర్.. 30–6–2021: సాంకేతిక విద్యా సంస్థలకు అనుమతులకు చివరి గడువు 15–7–2021: యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు పూర్తికి చివరి తేదీ 31–8–2021: మొదటి దశ కౌన్సెలింగ్, సీట్లు కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 1–9–2021: ప్రథమ సంవత్సరం మినహా మిగతా వారికి తరగతులు ప్రారంభం. 9–9–2021: రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 10–9–2021నాటికి: సీట్లు రద్దు చేసుకున్న వారికి పూర్తి ఫీజు తిరిగి ఇచ్చేయాలి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో మిగిలిన ఖాళీల్లో విద్యార్థుల చేరికలు పూర్తి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో చేరిన వారికి తరగతుల ప్రారంభానికి చివరి గడువు 20–9–2021: ద్వితీయ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పూర్తి -
యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం యుజిసి నెట్ 2021 మేలో పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షకు సంబందించిన తేదీలను యూజీసీ నెట్ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. యూజీసీ నెట్ 2021 పరీక్షా తేదీలు వరుసగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్) జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. జూన్ నెలలో తొలి పరీక్ష, డిసెంబర్ నెలలో రెండో తుది పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అలాగే పేపర్-II 200 మార్కులకు ఉంటుంది. దీనిలో 100 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పరీక్ష యొక్క వ్యవధి మూడు గంటలు ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభం కానున్న యూజీసీ నెట్ మే 2021 పరీక్ష దరఖాస్తుల తుది గడువు మార్చి 3న ముగియనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అవకాశం లభిస్తుంది. గతేడాది కరోనా కారణంగా ఒక్కసారే పరీక్ష నిర్వహించారు. మిగతా వివరాల కోసం యూజీసీ నెట్ లింకు క్లిక్ చేయండి. -
ఉన్నత చదువులు ఇక విద్యార్థుల అభీష్టం
సాక్షి,అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాని కార్యాచరణకు సమాయత్తమవుతోంది. నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత చదువులు విద్యార్థి కేంద్రంగా సాగేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు తమ అభీష్టానుసారం ఉన్నత చదువుల అభ్యసనానికి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనుంది. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఏ కోర్సు అయినా చదువుకునేందుకు వారికి వీలుకలుగనుంది. ఈ క్రమంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదిలీ కోసం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్– (ఏబీసీ)’ అనే నూతన కార్యక్రమానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. ఇదీ లక్ష్యం ► నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌ను అనుసరించి విద్యార్థులు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఇంటర్ డిసిప్లినరీ/మల్టీ డిసిప్లినరీ కోర్సులు అభ్యసించడానికి, వారి క్రెడిట్లు ఆయా సంస్థల నుంచి పరస్పరం బదిలీకి (క్రెడిట్ ట్రాన్స్ఫర్)కు ఈ కొత్త విధానం వీలు కల్పించనుంది. ► తమ చదువులను సొంతంగా నిర్ణయించుకుంటూ డిప్లొమో, డిగ్రీ, పీజీ డిప్లొమో వంటి వాటిని ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఏ స్థాయి నుంచైనా అభ్యసించడానికి వీలుగా బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంటుంది. ► నూతన ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు మార్గమేర్పడేలా బహుళ కోర్సుల అధ్యయనానికి వీలుంటుంది. ఏ విద్యా సంస్థలోనైనా, ఎప్పుడైనా నచ్చిన కోర్సులు, వివిధ కాంబినేషన్లలో చదువుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► తమ డిగ్రీలను తమకు నచ్చిన రీతిలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలలో అభ్యసించే అవకాశం. బహుళ ప్రవేశ, బహుళ నిష్క్రమణలతో విద్యార్థులు ఆయా కోర్సుల పూర్తికి స్వయం సమయ నిర్దేశం. ► అకడమిక్ మొబిలిటీ కోసం బోధనాభ్యసన ప్రక్రియలను అన్ని విద్యా సంస్థలు బ్లెండెడ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానంలో అందించేలా ఏర్పాట్లు. ఫుల్‌టైమ్, పార్టు టైమ్ అభ్యసనానికి వీలు. బ్యాంకు లావాదేవీలు ఇలా.. ► ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’కు విద్యార్థులు, విద్యా సంస్థలు స్టేక్ హోల్డర్లు. విద్యార్థుల క్రెడిట్లను భద్రపరిచే డిజిటల్, వర్చువల్, ఆన్లైన్ స్టోర్ హౌస్లా ఈ బ్యాంక్ ఉంటుంది. ‘నేషనల్ అకడమిక్ డిపోజిటరీ’ మాదిరిగానే ఏబీసీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఉంటుంది. ఉన్నత విద్యలో స్టేక్ హోల్డర్లకు ఎంతో ఉపయుక్తమైన డైనమిక్ వెబ్సైట్ ద్వారా ఇది సేవలందిస్తుంది. ► అన్ని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల క్రెడిట్ రికార్డులను నిర్వహించేలా ఏబీసీకి కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారిక గుర్తింపునిచ్చాయి. ఏబీసీ ద్వారా విద్యార్థులు ఆయా కోర్సుల క్రెడిట్లను యూనిక్ అకౌంట్, ఇండివిడ్యువల్ అకౌంట్ల ద్వారా డిజిటల్ ఫామ్‌లో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ► ఏబీసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల క్రెడిట్లనే జమ చేసుకుంటుంది. యూజీసీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా క్రెడిట్ల వేలిడిటీ ఉంటుంది. విద్యార్థుల క్రెడిట్లను ఆయా విద్యా సంస్థల ద్వారానే ఏబీసీలో డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ కోర్సులు నిర్వహించే స్వయం ప్లాట్‌ఫాంతో పాటు వర్సిటీలు, ఇతర సంస్థలు కూడా విద్యార్థుల క్రెడిట్లను వారి యూనిక్ ఐడీ నంబర్ అకౌంట్ ద్వారా ఏబీసీలో జమ చేస్తాయి. విదేశాల్లోని విద్యా సంస్థల్లో అభ్యసించే కోర్సుల క్రెడిట్లను కూడా ఏబీసీలో భద్రపరిచేందుకు ఆవకాశం ఉంటుంది. అర్హత ఉన్న సంస్థలకే ఖాతాలకు అవకాశం ► ఏబీసీ ప్రస్తుతానికి యూజీసీ గుర్తించిన అన్ని ఉన్నత విద్యా కోర్సుల క్రెడిట్ల భద్రతకు అవకాశమిస్తుంది. ► యూనివర్సిటీ గుర్తింపు, అటానమస్ కాలేజీలకు మాత్రమే అవకాశం. వాటికి కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి కనీసం ఏ గ్రేడ్ గుర్తింపు ఉన్న సంస్థలకు మాత్రమే ఏబీసీలో రిజిష్టర్‌కు అవకాశం. ► ఆడియో విజువల్ సదుపాయం, ఈ–రిసోర్సులు, వర్చ్యువల్ క్లాస్ రూములు, స్టుడియోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆన్లైన్ కోర్సుల సదుపాయంతో పాటు ప్రభుత్వ విభాగాలు నిర్దేశించిన ఇతర మౌలిక వసతులన్నీ కలిగి ఉండాలి. ► ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, లా తదితర కోర్సుల క్రెడిట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, అఖిల భారత వైద్య విద్యా మండలి తదితర విభాగాల ఆమోదంతో డిపాజిట్‌కు అవకాశం ఇవ్వనుంది. ► యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదాపై ఆయా విద్యా సంస్థలు, విద్యావేత్తలు, ఇతర స్టేక్ హోల్డర్లు ఏబీసీఆర్ఈజీయూఎల్ఏటీఐఓఎన్ఎస్2021 ఃజీమెయిల్.కామ్ కు తమ అభిప్రాయాలు పంపవచ్చు. -
నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ తరగతులను నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అవి పూర్తయి, ఫలితాలు ప్రకటించగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి 19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అవి పూర్తవగానే పీజీ ప్రవేశాలను కూడా వచ్చే నెలలో చేపట్టి పూర్తి చేయనుంది. ఇప్పటికే సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వాటికి సంబంధించిన పరీక్షల నిర్వహణను నవంబర్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే వాటి ప్రవేశాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాలు మాత్రం పూర్తి కానున్నాయి. యూజీసీ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్ కేలండర్‌ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 3లోగా ఎంసెట్ ఫలితాలు! సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభిం చింది. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసే అవకాశాలనూ కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల 1న లేదా 3న విడుదల చేయనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. -
యూజీసీ నిర్ణయం సరైందే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాలు ఫైనలియర్ పరీక్షలను రద్దు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు అనుమతించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థ్ధించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 30లోగా పరీక్షలు జరపడం వీలుకాదని భావించే రాష్ట్రాలు, యూజీసీని సంప్రదించి, పరీక్షలకు ప్రత్యామ్నాయ తేదీలను ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు, వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలనీ, ఏవైనా మినహాయింపులు ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం ఆదేశించింది. పరీక్షల ద్వారానే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు, వర్సిటీలు ఫైనలియర్/ టెర్మినల్ పరీక్షలు చేపట్టకుండా విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయజాలవని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం–2005 చట్టం కింద.. విద్యార్థులకు ఫైనలియర్ పరీక్షలు జరపకుండా అంతకుముందు సంవత్సరం ఫలితాలు/అంతర్గత మదింపు ఆధారంగా ప్రమోట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది. పరీక్షలు తప్పనిసరి చేస్తూ జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చి న రివైజ్డు మార్గదర్శకాలు నిపుణుల సూచనల మేరకు చేసినవేననీ, చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్‌ను కారణంగా చూపుతూ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సుల ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలంటూ తీసుకున్న నిర్ణయం ఉన్నతవిద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని యూజీసీ తెలిపింది. ఈ చర్య రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించింది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ శివసేన పార్టీ యువజన విభాగం తదితరులు వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పై ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచి, రాజకీయ అవగాహన పెంచుకుందామని పిలుపునిచ్చారు. -
విద్యార్థులూ.. బహుపరాక్
సాక్షి, అమరావతి: దేశంలో అనుమతులు లేని యూనివర్సిటీలు ఇతర విద్యాసంస్థల (ఫేక్ వర్సిటీలు, సంస్థల) పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ దూరవిద్య, ఆన్లైన్ మోడ్ కోర్సులు అందించే సంస్థల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. సదరు సంస్థలకు, అవి అందించే కోర్సులకు తమ గుర్తింపు ఉందో లేదోననే విషయాన్ని యూజీసీ అధికారిక వెబ్సైట్లో సూచించిన పోర్టళ్ల ద్వారా పరిశీలన చేసుకోవాలని పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. నిషేధిత ప్రోగ్రామ్స్ ఇవీ.. ► ఇంజనీరింగ్, మెడిసిన్, లా, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపి, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, పాక అధ్యయనాలు(కలినరీ స్టడీస్), వేల్యూయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ► చట్టబద్ధమైన కౌన్సిల్స్, రెగ్యులేటరీ సంస్థల ద్వారా ఓడీఎల్ మోడ్‌లో అందించడానికి అనుమతించని ఇతర కార్యక్రమాలు. ► ఎం.ఫిల్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు కూడా ఓడీఎల్, ఆన్లైన్ మోడ్లలో అందించడాన్ని నిషేధించారు. ► ఏ విద్యాసంస్థ అయినా దానికి నిర్దేశించిన ప్రాదేశిక ప్రాంతాలకు లోబడి మాత్రమే ఓడీఎల్ సెషన్స్, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ డెలివరీ, పరీక్షల నిర్వహణ, ప్రవేశాలను చేపట్టాలి. దాని ప్రాదేశిక ప్రాంత పరిధిలో మాత్రమే పనిచేయాలి. ► కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు తమ ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ ద్వారా ఫ్రాంచైజీల తరహాలో నిర్వహించడాన్ని నిషేధించారు. కేవలం వాటి ప్రధాన కార్యాలయాల నుంచి మాత్రమే ఓడీఎల్ ప్రోగ్రాములను అందిస్తాయి. ► ఏదైనా విద్యాసంస్థ వీటికి భిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని యూజీసీ సూచించింది. చెక్ చేసుకోండి ► ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లకు అనుమతి పొందిన విద్యాసంస్థల జాబితాను ► యూజీసీ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్/డీఈబీ’, లేదా ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లలో చూడవచ్చు. ► స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ఓడీఎల్ ప్రోగ్రామ్స్ అందించేందుకు యూజీసీ అనుమతి పొందిన సంస్థల వివరాలను ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐ ఎన్/ఎన్ఓటీఐసీఈఎస్’ లేదా హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్/ఎన్ఓటీఐసీఈఎస్.హెచ్ టీఎంఎల్’ పోర్టల్‌లో పరిశీలన చేసుకోవాలి. ► ప్రవేశం పొందేముందు యూజీసీ వెబ్‌సైట్‌లోని ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో నోటీసుల ద్వారా తెలుసుకోవాలి. ► కోవిడ్ నేపథ్యంలో ఓడీఎల్ ప్రోగ్రామ్స్ కాలవ్యవధిని 12 నెలలకు పరిమితం చేశారు. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ప్రారంభించేలా అనుమతి ఇచ్చింది. ► డిగ్రీ, పీజీ కోర్సులను ఓడీఎల్ మోడ్‌లో అందించే సంస్థలు తప్పనిసరిగా నిర్దేశిత అర్హతా ప్రమాణాలను పాటించాలి. -
విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు. గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు. ‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు. -
ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సిలబస్‌ను రీడిజైన్ చేయండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీల పరీక్షల నిర్వహణలో.. యూజీసీ నిర్దేశించిన కోవిడ్–19 ప్రొటోకాల్‌ను పాటించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వైస్ ఛాన్సలర్లను ఆదేశించారు. వర్సిటీ వీసీలతో ఆయన రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సదస్సు నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విసిరిన సవాలును సమర్థంగా ఎదుర్కొంటూ ఆన్లైన్లో తరగతుల నిర్వహణకు వీలుగా (సిలబస్‌ను రీడిజైన్) పాఠ్యాంశాలను పునర్ వ్యవస్థీకరించాలని సూచించారు. -
విద్యాశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశంపై సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు ఫైనలియర్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు సైతం యూజీసీ వాయిదా వేసింది. -
ఉన్నత విద్యలో తొలిసారిగా ‘అవుట్‌కమ్ బేస్డ్ సిలబస్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా ఉన్నత విద్యాకోర్సుల్లో అవుట్ కమ్ బేస్డ్ సిలబస్ ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 2020–21 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి రూపొందింపచేసిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)కు సంబంధించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ► యూజీసీ సూచనల మేరకు 2015–16 నుంచి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పేరుకు సీబీసీఎస్ సిలబస్ అయినా క్రెడిట్ ట్రాన్సఫర్ చాయిస్‌ను విద్యార్థులకు కల్పించలేదు. గత ఐదేళ్లలో ఈ సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ► 2020–21 విద్యాసంవత్సరానికి కొత్త సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఉన్నత విద్యామండలి ద్వారా రూపకల్పన చేశాం. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని రూపొందించారు. ఈ సిలబస్‌లో ముఖ్యాంశాలు.. ► ఫౌండేషన్ కోర్సుల స్థానంలో లైఫ్ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టడం. ► లైఫ్ స్కిల్ కోర్సులను ఎంపిక చేసుకొనే అవకాశం విద్యార్థులకే కల్పించడం. ► నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్‌హేన్స్‌మెంటు కోర్సులకు రూపకల్పన. ► సీఎం జగన్ సూచనల మేరకు తొలిసారి విద్యార్థులందరికీ 10 నెలల నిర్బంధ అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్ (ఉద్యోగావకాశాల మెరుగుకు) ఈ సిలబస్ ప్రత్యేకత. -
‘ఉన్నత’ పరీక్షలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: డిగ్రీ సహా ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి తప్పనిసరని కేంద్ర మానవ వనరుల శాఖతోపాటు యూజీసీ స్పష్టం చేస్తోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహించకున్నా ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలను నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొంటున్నాయి. డిగ్రీ తదితర ఉన్నతవిద్యాకోర్సుల ఫైనలియర్ విద్యార్థులకు సెప్టెంబర్ ఆఖరులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యూజీసీ ఇటీవల ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ దృష్ట్యా పరీక్షలపై పునరాలోచించాలని తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూజీసీ తాజా సూచనలు చేసింది. పరీక్షలు తప్పనిసరి ఎందుకంటే..? ► డిగ్రీ తదితర ఉన్నతవిద్య కోర్సుల పరీక్షలను నిర్వహించి మూల్యాంకనం చేయడం ద్వారా అభ్యర్థుల ప్రమాణాలు,సామర్థ్యాల ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ► పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ► పరీక్షల నిర్వహణతో మెరిట్ అభ్యర్థులకు జారీచేసే సర్టిఫికెట్ల ఆధారంగా ప్రయోజనాలు చేకూరతాయి. పరీక్షలు లేకుంటే వీటిని కోల్పోతారు. ► పరీక్షల వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు, పైస్థాయి విద్యాభ్యాసానికి వెళ్లేవారికి మెరుగైన స్కాలర్షిప్లు లభించే అవకాశాలుంటాయి. ► ఈ నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్, లేదా రెండు మోడ్లలో కలిపి అయినా పరీక్షలు పూర్తిచేసి మూల్యాంకనం చేయడం తప్పనిసరి. జాగ్రత్తలు తప్పనిసరి.. ► పరీక్షల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలపై యూజీసీ ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థలకు పలు సూచనలు చేసింది. వీటిని తప్పక పాటిస్తూ పరీక్షలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తోంది. ► పరీక్షలు జరిగే భవన ప్రాంగణం మొత్తం శానిటైజేషన్ చేసి, థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. భౌతిక దూరాన్ని పాటించేలా చూడడంతో పాటు మాస్కులు, గ్లౌజ్‌లు సిద్ధం చేసుకోవాలి. ► చుట్టు పక్కల ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయా? తదితర అంశాలను పరిశీలించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా హాల్‌టికెట్లు, ఐడీ కార్డులనే పాస్లుగా పరిగణించేలా ఏర్పాట్లు చేయాలి. ► ఇన్విజిలేటర్లకు, ఇతర సిబ్బందికి పాస్‌లు ఇచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలి. ► గోడలు, తలుపులు, గేట్లతో సహా పరీక్ష కేంద్రాన్ని క్రిమిసంహారక మందుతో పిచికారీ చేయాలి. సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు రోజూ అందించాలి. పరీక్ష కేంద్రాలు, గదుల ప్రవేశద్వారాల వద్ద శానిటైజర్ బాటిళ్లను ఉంచాలి. ► చేతులు శుభ్రం చేసుకొనేందుకు ద్రవ హ్యాండ్‌వాష్‌లను ఉంచాలి. ► ప్రతి సెషన్‌కు ముందు, తరువాత పరీక్ష కేంద్రంలోని కుర్చీలు, బల్లలన్నిటినీ శానిటైజ్ చేయించాలి. ► వాష్ రూమ్‌లన్నీ శుభ్రం చేసి క్రిమిసంహారక మందు స్ప్రే చేయాలి. ► డోర్ హ్యాండిల్స్, స్టెయిర్‌కేస్ రెయిలింగ్, లిఫ్ట్ బటన్లను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ► పరీక్షలు నిర్వహించే సిబ్బంది, హాజరయ్యే విద్యార్థులు తమ ఆరోగ్య స్థితి గురించి సెల్ఫ్ డిక్లరేషన్ అందించాలి. ఇందుకు నిరాకరిస్తే పరీక్షలకు అనుమతించరాదు. ► సిబ్బంది, విద్యార్థులు ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాలి. పరీక్షకు వచ్చేవారికి మాస్కులు, గ్లౌజ్‌లు ప్రతిరోజూ కొత్తవి అందించాలి. ► విద్యార్థులు, సిబ్బంది వెళ్లేటప్పుడు ఒక్కొక్కరి మధ్య 2 మీటర్ల మేర భౌతికదూరం పాటించేలా చూడాలి. -
ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన ఆఖరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందిం చారు. విద్యార్థుల ఉన్న త చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పా రు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచిం చారు. ఆన్లైన్ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు. -
పీజీ చివరి సెమిస్టర్‌కు పరీక్ష తప్పనిసరి..
ఎచ్చెర్ల క్యాంపస్: కరోనా నేపథ్యంలో డిగ్రీ, పీజీ కోర్సుల పెండింగ్ పరీక్షల నిర్వహణ గురించి ఆయా వర్సిటీ యాజమాన్యాలే తగు నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. అయితే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని, మిగతా సెమిస్టర్ల విషయంలో ఏం చేయాలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కరోనా కారణంగా ఫైనల్ సెమిస్టర్ మినహా మిగతా పరీక్షలను రద్దు చేసి, అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నారు. బీఆర్‌ఏయూ కూడా అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముంది. కరోనా బెడద ప్రారంభమయ్యాక పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సులకు సంబంధించి పరీక్షల రద్దును యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వ్యతిరేకించింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వర్సిటీ వీసీలతో సమీక్ష నిర్వహించింది. వర్సిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నందున పరీక్షల నిర్వహణ, రద్దు వంటి అంశాలపై వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, రద్దు అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అధికారులు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఏయూలో పరిస్థితి ఇది.. వర్సిటీ పరిధిలో 101 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు 15,211 మంది రాశారు. వీరుకాక సెమిస్టర్ విధానం రాక ముందు చదివి పరీక్ష తప్పిన ఇయర్ ఎండ్ బ్యాక్లాగ్ విద్యార్థులు 2875 మంది ఉన్నారు. వర్సిటీ పరిధిలో ఫైనల్ సెమిస్టర్, ఇయర్ ఎండ్ పరీక్షలను మార్చి 11–23 మధ్య నిర్వహించారు. ఏప్రిల్‌లో నిర్వహించవల్సిన డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు మాత్రం పూర్తయ్యాయి. పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు మాత్రం మిగిలిపోయాయి. ముగిసిన పరీక్షలకు మూల్యాంకనం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని చెప్పడంతో మూల్యాంకనంపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. పరీక్షల ప్రక్రియను ఎలా పూర్తి చేయాలన్న విషయమై విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫైనల్ సెమిస్టర్ మినహా మిగతా పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా ఇవ్వాలన్న అంశంపై నిపుణుల సూచనలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి పరిధిలో చర్చించి, తీర్మానం చేసి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యా లయం పాలకమండలి కమిటీ సమావేశాన్ని గత నెల 23న నిర్వహించారు. ఆన్లైన్ సమావేశం సాంకేతిక లోపం వల్ల వాయిదా పడింది. ఈ నెలలో మళ్లీ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పరీక్షలు నిర్వహణ, రద్దులపై నిర్ణయం తీసుకుంటారు. యూజీసీ సూచనలు పరిశీలిస్తాం ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ సూచించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వర్సిటీ నిర్ణయానికే విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో పాలకమండలిలో చర్చించి తీర్మానం చేస్తాం. అనంతరం నిర్ణయం అమలు చేస్తాం –ప్రొఫెసర్ కూన రామ్‌జీ, బీఆర్‌ఏయూ వీసీ -
పరీక్షల బాధ్యత వర్సిటీలకే
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా కోర్సుల్లో 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫైనలియర్ పరీక్షలను సెప్టెంబర్ చివరికల్లా పూర్తిచేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2019–20 విద్యాసంవత్సరం డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తదితర కోర్సుల పరీక్షల నిర్వహణ షెడ్యూళ్లను రూపొందించుకునే బాధ్యతను ఆయా వర్సిటీలకే అప్పగించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సెప్టెంబర్‌లోగా తమ పరిధిలోని ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలను పూర్తిచేసేలా స్థానిక పరిస్థితులను అనుసరించి షెడ్యూళ్లను ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే రూపొందించుకోవాలని సూచించింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం.. కాగా, 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫైనలియర్ విద్యార్థులు కాకుండా ఇతర తరగతుల విద్యార్థుల టెర్మ్, సెమిస్టర్ పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన సవరణ క్యాలెండర్‌లోని అంశాలు యథాతథంగా అమల్లో ఉంటాయని యూజీసీ పేర్కొనడం తెలిసిందే. ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలతోసహా ఇతర విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఇంతకుముందు యూజీసీ ఇదివరకటి మార్గదర్శకాలను అనుసరించి ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. దానిప్రకారం జూలై 1 నుంచి 15 లోపల ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నా ఇప్పుడు అవి సెప్టెంబర్‌లోగా పూర్తి చేయనున్నారు. ఇతర తరగతుల పరీక్షలు, కొత్త విద్యాసంవత్సరపు ప్రవేశాలు, తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళికలో మార్పులు చేసి అమల్లోకి తేనున్నారు. ► ఫైనలియర్ విద్యార్థులు మినహా ఇతర సెమిస్టర్ల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను 2020–21 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ప్రకటించేలా ఇంతకుముందు ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. అందుకు వీలుగా ఫైనలియర్ కాకుండా ఇతర సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులను వారి అటెండెన్సును అనుసరించి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ► పీహెచ్డీ స్కాలర్ల సెమిస్టర్, వైవా వాయిస్‌ల పరీక్షలను యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్లో పూర్తిచేయాలి. వైవా వాయిస్‌ను రికార్డుచేసి వర్సిటీలో భద్రపర్చాలి. ఇప్పటికి సెట్ల షెడ్యూల్లో మార్పు లేదు.. ఎంసెట్ సహా ఇతర సెట్లకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. కోవిడ్–19 పరిస్థితిలో మార్పు వచ్చి పరీక్షలకు అనుకూల వాతావరణమే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సెట్లకు సంబంధించి అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తుల్లో కరెక్షన్లకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ప్రతికూల వాతావరణం ఉంటే కనుక సెట్లపై అప్పటి పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటారు. ప్రొఫెషనల్ కోర్సుల షెడ్యూల్ ఇలా.. 2019–20 చివరి సంవత్సరం పరీక్షలను జూలై 1 నుంచి ప్రారంభించాలని భావించినా యూజీసీ సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగింపు ఇచ్చినందున ఆ మేరకు వర్సిటీలు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. ► 2019–20 విద్యాసంవత్సరం ఇతర సెమిస్టర్ పరీక్షలకు కూడా తాజాగా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి కొత్త షెడ్యూళ్లను ప్రకటిస్తారు. -
ఫైనల్ సెమిస్టర్ వారికి ఇక పరీక్షలే..
సాక్షి, హైదరాబాద్: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఉన్నత విద్యాశాఖ ఆలోచనకు భిన్నంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పందిం చింది. డిగ్రీ, పీజీ, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం నిర్ణయించింది. పరీక్షలు లేకుండా వారిని ప్రమోట్ చేయడం సరికాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు కేంద్రం ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. అయితే ఇదివరకే సంప్రదాయ డిగ్రీల్లో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులను పై సెమిస్టర్లకు ప్రమోట్ చేస్తూ యూనివర్సిటీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇంజనీరింగ్‌లోనూ ఒకటి నుంచి ఏడో సెమిస్టర్ వరకు విద్యార్థులను పైసెమిస్టర్లకు ప్రమోట్ చేసేలా చర్యలు చేపట్టింది. పీజీలోనూ అంతే. ఇలా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై సెమిస్టర్లకు ప్రమోట్ చేసింది. సెప్టెంబరులో 3.7 లక్షలమంది విద్యార్థులకు పరీక్షలు కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీలు, పీజీ కోర్సుల్లో ఫైనల్ సెమిస్టర్ చదివే విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ మార్కులు, కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కులు వేసి ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపింది. అయితే, తాజాగా యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు దాదాపు 3.7 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. కేంద్రమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీఎంకు ఫైలు వెళ్లినా, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ జారీ చేసిన తాజా ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
40శాతం బోధన ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో 40% సిలబస్ బోధన ఆన్లైన్లోనే సాగేలా వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఉన్నత విద్య కార్య క్రమాలు, విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహ ణకు సంబంధించి యూజీసీ ఇటీవల మార్గదర్శ కాలు జారీ చేసింది. అందులో 25% సిలబస్‌ను ఆన్లైన్లో బోధించేందుకు అవకాశమిచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటీవలి మార్గదర్శకాలను మరోసారి పరిశీలించాలని, విద్యార్థుల భద్రతకు చర్యలు చేపడుతూ మార్పులు చేయాలని రెండ్రోజుల కిందట యూజీసీని కేంద్ర ఎంహెచ్ఆర్డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదేశిం చారు. దీంతో ఆన్లైన్ బోధనకు వెసులుబాటు కల్పించేలా యూజీసీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కిందిస్థాయి సెమిస్టర్ పరీక్షలతో పాటు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలనూ రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్‌చేసే అంశాలపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కామన్ పేపర్‌తో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు త్వరలోనే నిర్ణయం.. వీలైతే జూన్ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుది ంచాలనే యోచనలో ఉంది. కామన్ పేపరు విధానం అవలంబించాలని, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా ప్రశ్నల సరళి ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చి అందులో సగం (5 నుంచి 7 ప్రశ్నలకు) ప్రశ్నలకు జవాబు రాయాలనే విధానం అమలుపై యోచిస్తున్నారు. వీలైతే ఆబ్జెక్టివ్‌లోనూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ చెప్పినా, రాష్ట్రంలో విద్యార్థులకు డిస్క్రిప్టివ్ విధానం అలవాటు ఉండటంతో ఇబ్బంది పడతారనే ఆలోచనతో దాని అమలు అవసరం లేదన్న భావనకు వచ్చారు. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
విద్యాసంస్థలకు హెచ్ఆర్డీ గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉదయపు అసెంబ్లీలను రద్దు చేయడం. క్రీడాకార్యకలాపాలను నిలిపివేయడం, స్కూల్ బస్సులకు నిబంధనలను తయారుచేయడం, స్కూల్ యూనిఫామ్‌లో మాస్కులను తప్పనిసరి చేయడం. మరుగుదొడ్లు వినియోగించడంలో పాటించాల్సిన నియమాలూ, క్యాంటీన్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యాసంస్థల భవనాలను క్రమం తప్పకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయడం లాంటి కీలకమైన విషయాలు ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి కొన్ని విద్యాసంస్థల్లో భౌతిక దూరం పాటించేందుకూ, విజిటర్స్‌ని పరిమితం చేసేందుకూ, షిఫ్ట్‌ల విధానంలో తరగతులు, లాబొరేటరీల సమయాల్లో మార్పు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు, పోటీ పరీక్షల నిర్వహణలో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నూతన విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి, సీనియర్ విద్యార్థులకు ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించనున్నటు యూజీసీ ప్రకటించింది. సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో కానీ, నేరుగా గానీ జూలై నెలలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సిఫార్సు చేసింది. పది, పన్నెండు తరగతులలో మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలను త్వరలోనే నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) తెలిపింది. -
విద్యాసంవత్సరం ఖరారు చేసిన యూజీసీ
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో చేరనున్న కొత్త విద్యార్థులకు నూతన అకడమిక్ సెషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్‌లోనే ప్రారంభించవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సర ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు అన్నింటికీ యూజీసీ ఆమోదం తెలిపింది. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంతోపాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు, ఓపెన్ చాయిస్ అసైన్మెంట్స్, ప్రజెంటేషన్ బేస్డ్ అసెస్మెంట్కు ఆమోదం తెలిపింది. అలాగే పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించడానికి ఓకే చెప్పింది. అవకాశముంటే గతంలో సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం మార్కులను ఇవ్వడం, 50 శాతం మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వడానికి అంగీకరించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ముందు సెమిస్టర్ మార్కులుండవు కనుక 100 శాతం ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వొచ్చని పేర్కొంది. ప్రతి విద్యార్థిని తదుపరి సెమిస్టర్/సంవత్సరానికి ప్రమోట్ చేయాలని పేర్కొంది. విద్యార్థులు గ్రేడ్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే వచ్చే సెమిస్టర్లో ప్రత్యేకంగా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో రెండో సెమిస్టర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్ని కోర్సులకు ఒకే రకమైన విధానాన్ని అవలంభించాలని పేర్కొంది. చదవండి: రికార్డు స్థాయిలో మరణాలు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లోనా అన్న విషయాన్ని తమకున్న వనరులు, విద్యార్థుల వెసులుబాటులను దృష్టిలో పెట్టుకుని వర్సిటీలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లకు హాజరయినట్లే భావించాలంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు అదనంగా ఆరు నెలల సమయం ఇవ్వాలని పేర్కొంది. వైవా పరీక్షను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. తాము పేర్కొన్నవన్నీ సూచనలుగా భావించాలని, పరిస్థితులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం సెమిస్టర్‌కే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే చేపట్టాల్సిన చర్యలపైనా మార్గదర్శకాలు జారీ చేసింది. ►కొన్ని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆన్లైన్, ఈ–లెర్నింగ్ విధానంలో మిగిలిపోయిన సిలబస్‌ను మే 31వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్క్స్‌ను మే 16 నుంచి 31లోగా పూర్తి చేయాలని తెలిపింది. జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలంది. జూన్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి వస్తే మాత్రం జూన్ 15 వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. ఇవి మినహా 2020–21, 2021–22లో విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలకు, పరీక్షల విధానాలకు ఓకే చెప్పింది. ►ప్రస్తుత కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థ విద్యార్థులు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. వాటిని త్వరగా పరిష్కరించాలి. ►యూజీసీ కూడా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పరీక్షలు, అకడమిక్ కార్యక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ►విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనివర్సిటీలు సోషల్ డిస్టెన్స్ అమలు చేసేలా పక్కా ఏర్పాట్లు చేయాలి. ►విద్యా సంస్థల్లో 25 శాతం బోధన ఆన్లైన్లో చేపట్టేలా, 75 శాతం బోధన ప్రత్యక్ష పద్ధతిలో చేసేలా చర్యలు చేపట్టాలన్న సిఫారసుకు యూజీసీ ఓకే చెప్పింది. ►రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చినా సాధారణ పరిస్థితి వచ్చాక, వీలైతే జూలైలో వారికి పరీక్షల నిర్వహించాలని పేర్కొంది. ►ప్రతి యూనివర్సిటీ కరోనా (కోవిడ్–19) సెల్‌ను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, అకడమిక్ కేలండర్, పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలి. ►ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించేలా ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలి. 6 రోజుల పని విధానం అమలు చేయాలి. ►ఇప్పటికే ఉన్న విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి, ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తరగతులూ ప్రారంభిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం మాత్రం 2021 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. -
కాలేజీల రీఓపెన్‌పై యూజీసీ కీలక ప్రకటన
సాక్షి ,న్యూఢిల్లీ : కోవిడ్-19తో మూతపడిన కాలేజ్‌లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెరదించింది. కళాశాలల పునఃప్రారంభంపై బుధవారం కీలక ప్రకటన వెల్లడించింది. కరోనా మహమ్మారితో మూతపడిన కాలేజ్‌లు ఆగస్ట్‌లో తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. నూతన విద్యార్ధుల ప్రవేశాలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని పేర్కొంది. కాగా సెప్టెంబర్ నుంచి నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తారని ఇటీవల పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు పెండింగ్ పరీక్షల గురించి యూజీసీ ప్రస్తావించలేదు. చదవండి : సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి -
యూనివర్సిటీలు, కాలేజీలకు త్వరలో యూజీసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన పరీక్షలు, ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్‌పై చర్చించేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైంది. విద్యా సంవత్సరంలో కోత, ఆన్లైన్ ఎడ్యుకేషన్‌పై ఏర్పాటు చేసిన ప్యానెళ్లు ఇచ్చిన నివేదికలపై చర్చించారు. త్వరలో యూనివర్సిటీలు, కాలేజీలకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని యూజీసీ సెక్రెటరీ రజనీష్ జైన్ చెప్పారు. -
కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతులకు సంబంధించిన పరీక్షల వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం వెల్లడించారు. ఆయా తరగతుల్లో అతి ముఖ్యమైన 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు పెట్టేలా సీబీఎస్ఈకి మంత్రి రమేశ్ సూచించారు. పరీక్షలు పెట్టదగ్గ సమయం వచ్చినప్పుడు పరీక్షలు ఉంటాయని అయితే అది కేవలం ఆ 29 సబ్జెక్టులకు మాత్రమే ఉంటాయన్నారు. మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలుగానీ, మార్కులుగానీ ఉండవని తెలిపారు. 1–8 క్లాసుల విద్యార్థులు ప్రమోట్! కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో 1–8 తరగతులు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు కొత్త తేదీలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించింది. కొన్నింటిని ఈనెల 30 వరకు, కొన్ని పరీక్షలకు వచ్చే నెల 15, 16, 31 తేదీల వరకు గడువును పెంచింది. మార్చి 31తో ముగిసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్డీ, ఎంబీఏ ప్రవేవేశాలకు నిర్వహించాల్సిన అడ్మిషన్ టెస్టు దరఖాస్తుల స్వీకరణ గడువు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు కూడా ఈనెల 30 వరకు పొడిగించారు. యూజీసీ నెట్ (జూన్) దరఖాస్తుల గడువును మే 16కి పొడిగించారు. సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తుల గడువు మే 15కి, ఆల్ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (ఏఐఏపీజీఈటీ) దరఖాస్తు గడువును మే 31కి పెంచారు. -
ఎప్పుడంటే అప్పుడే పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్, బీబీఏ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆన్ డిమాండ్ పరీక్షల విధానం భవిష్యత్తులో రాబోతోంది. విద్యార్థులు తాము పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడే పరీక్షలు నిర్వహించే విధానం అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్యానెల్ కమిటీ సిఫారసు చేసింది. పరీక్షల నిర్వహణకు విద్యా సంస్థల సంసిద్ధత ముఖ్యం కాదని, విద్యార్థుల సంసిద్ధతే ప్రధానమని స్పష్టం చేసింది. దీని ద్వారా పరీక్షల్లో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గించొచ్చని, మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించొచ్చని పేర్కొంది. దేశంలో పరీక్షల సంస్కరణలపై కేంద్రం 2018 మేలో భారతీ విద్యా పీఠ్ వైస్ చాన్స్‌లర్ ఎంఎం సాలంఖే నేతృత్వంలో యూజీసీ ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏడాదిన్నర కాలంగా పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేసింది. సంప్రదాయ డిగ్రీలు, సాంకేతిక డిగ్రీ, వృత్తి విద్యా డిగ్రీ కోర్సుల్లో పరీక్షలు, పేపరు వ్యాల్యుయేషన్, మార్కుల విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. తాము గుర్తించిన అంశాలను క్రోడీకరించి, పలు సిఫారసులతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రానికి అందజేసింది. ఆన్ డిమాండ్ పరీక్షల విధానం అమల్లోకి తేవడం వల్ల విద్యార్థులపైనా ఒత్తిడి తగ్గుతుందని, ప్రతిభకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ప్రత్యేక క్వశ్చన్ బ్యాంకు.. ఆన్ డిమాండ్ పరీక్షల విధానం అమలుకు ఎక్కువ కృషి అవసరమని ప్యానెల్ కమిటీ పేర్కొంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్ వినియోగం అవసరమని, క్వశ్చన్ బ్యాంకు విధానం ఉండాలని స్పష్టం చేసింది. క్వశ్చన్ బ్యాంకును ఏర్పాటు చేసి, వాటి నుంచి ఎప్పుడంటే అప్పుడు ప్రశ్నపత్రాలను తీసుకునేలా ఉండాలని పేర్కొంది. అయితే ఇదీ ఆన్లైన్ విధానంతో కొంత సులభం అవుతుందని సూచించింది. మరోవైపు ఆన్ డిమాండ్ పరీక్షల అమలును పర్యవేక్షించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకం గా బోర్డు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో అమలుకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 2,75,54,749 మంది విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీలు చేస్తుండగా, 26,99,567 మంది దూర విద్యా విధానంలో డిగ్రీలను చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ డిమాండ్ పరీక్షలను ముందుగా దూర విద్యా విధానంలో నిర్వహించేందుకు కోర్సుల్లో యూనివర్సిటీలు ప్రవేశ పెట్టాలని పేర్కొంది. ఆ తర్వాత రెగ్యులర్ కోర్సుల్లో అమలు చేయాలని సూచించింది. ఇందులో వయసు, అర్హతలకు సంబంధించిన ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. సామర్థ్యాలు, నాలెడ్జి, నైపుణ్యాలే ముఖ్యం.. ప్రస్తుత విద్యా విధానాల్లో సమూల మార్పులు అవసరమని పేర్కొంది. మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. ఉత్తీర్ణత ఒక్కటే ముఖ్యం కాదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని విద్యా సంస్థల నుంచి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకొస్తున్న వారిలో అత్యధిక మంది ఉద్యోగాలకు పనికి రావట్లేదని తెలిపింది. అందుకే ఉత్తీర్ణత ఒక్కటే ముఖ్యం కాదని, అభ్యసనలో ఎంత మేరకు నేర్చుకున్నారు.. ఏ మేరకు సామర్థ్యాలను పెంపొందించుకున్నారు.. విజ్ఞానాన్ని ఎంత మేర సముపార్జించారు.. నైపుణ్యాలను ఏ మేరకు పెంపొందించుకున్నారన్నదే ముఖ్యమని వివరించింది. ఐఐటీ తరహాలో గ్రేడింగ్.. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చే మార్కులకు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇచ్చే అబ్జల్యూట్ గ్రేడింగ్ (పర్సంటేజీ ప్రకారం ఇచ్చే గ్రేడ్) కాకుండా రిలేటివ్ గ్రేడింగ్ లేదా కుమ్యులేటివ్ గ్రేడింగ్ విధానం ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని ఐఐటీ, ప్రైవేటు యూనివర్సిటీలు కుమ్యులేటివ్ గ్రేడింగ్ విధానాన్ని (సీజీపీఏ) అమలు చేస్తున్నాయని, ఇందులో విద్యార్థికి సంవత్సరం చివరలో నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ఏడాదిలో పలుసార్లు నిర్వహించే పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ఒక రోజు పరీక్షతో విద్యార్థిని అంచనా వేయకుండా, ఏడాది పొడవునా సాధించిన సామర్థ్యాలను అంచనా వేయడం శాస్త్రీయంగా ఉంటుందని పేర్కొంది. -
చదువునూ దాచుకోవచ్చు!
సాక్షి, అమరావతి: బీఏ సెకండియర్‌లో ఉన్న ఓ విద్యార్థికి ఆ చదువు మధ్యలో ఉండగానే మంచి అవకాశాలున్న మరో కోర్సుకు వెళ్లాలనిపించింది.. ఇష్టంలేకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో డిగ్రీలో చేరిన మరో విద్యార్థి అక్కడ చదవలేక తనకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకున్నాడు....వీరిద్దరూ తమకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకుంటే నిబంధనల ప్రకారం ప్రస్తుతం చదువుతున్న కోర్సులను పూర్తిగా వదులుకోవాల్సిందే. దీనివల్ల వారు చదివిన రెండేళ్లు వృధా అయినట్లే. ఇలా విలువైన సమయాన్ని విద్యార్థులు కోల్పోకుండా కొత్త కోర్సులు చదివేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘నేషనల్ అకడమిక్ క్రెడిట్ (ఎన్ఏసీ) బ్యాంకు’కు శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులు ప్రస్తుత కోర్సులో సాధించిన క్రెడిట్లను దాచుకుని తమకు నచ్చిన ఇతర కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ కొత్త విధానం తోడ్పాటునందిస్తుంది. అంటే.. ఆ కోర్సు పూర్తయ్యాక మళ్లీ పాత కోర్సును పూర్తిచేసేందుకు ఈ విధానం వీలు కల్పించనుంది. ఇలా ఉన్నత విద్యారంగంలో ప్రస్తుత నిబంధనలను విద్యార్థులకు అనుకూలంగా యూజీసీ సరళీకరించనుంది. దీనిపై ఇటీవల నిపుణుల బృందం అందించిన విధానపత్రాన్ని యూజీసీ విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ఏయే కోర్సులు ఈ స్కీం పరిధిలోకి వస్తాయంటే.. యూజీ, పీజీ కోర్సులన్నీ దీని పరిధిలోకి రానున్నాయి. అయితే, ముందుగా పీజీ స్థాయిలో ఈ విధానాన్ని ప్రారంభించి యూజీకి విస్తరింపచేయాలని యూజీసీకి ఇచ్చిన విధాన పత్రంలో నిపుణుల కమిటీ పేర్కొంది. అలాగే, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున ప్రస్తుతానికి వాటికి చేపట్టరాదని సూచించింది. అదే మాదిరిగా ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను కూడా దీని నుంచి మినహాయించింది. క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి నుంచి ఎన్ఏసీ బ్యాంకు రుసుము వసూలు చేయనుంది. 20లోగా అభిప్రాయాలు పంపాలి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కొత్త విధానంపై తమ అభిప్రాయాలను ఈనెల 20లోగా ‘nacb. ugc@gmail. com’కు పంపించాలని యూజీసీ పేర్కొంది. బ్యాంకు కార్యకలాపాలు ఇలా.. ►క్రెడిట్ల క్రోడీకరణ ►క్రెడిట్ల బదలాయింపు ►క్రెడిట్లను విముక్తి చేయడం లేదా విడుదల చేయడం ►క్రెడిట్ల ప్రారంభ, ముగింపు నిల్వలను మదింపు చేయడం విద్యార్థులు నచ్చినట్లుగా చదువుకోవచ్చు ►సంప్రదాయ కోర్సుల స్థానే కొత్త కోర్సులను, పాఠ్యాంశాలను రూపొందిస్తున్న నేపథ్యంలో తమకు నచ్చిన కోర్సులు అవసరమైన సమయంలో చదివేందుకు ఈ కొత్త విధానం విద్యార్థులకు స్వేచ్ఛనివ్వనుంది. ►డిజిటల్, ఆన్లైన్, వర్చ్యువల్ కోర్సులతో పాటు వేరే కాలేజీల్లో చేరి ఇతర కోర్సులు చదివేందుకు ఈ కొత్త విధానం అవకాశమిస్తుంది. ►ఒక కోర్సు పూర్తిచేయకుండానే మధ్యలో అంతవరకు సాధించిన క్రెడిట్లను ఎన్ఏసీ బ్యాంకులో దాచుకుని ఇతర కోర్సులో చేరవచ్చు. ఈ బ్యాంకు.. సాధారణ బ్యాంకు మాదిరిగా విద్యార్థులకు డిపాజిట్ అకౌంట్లు ఇస్తుంది. విద్యార్థి కొత్త కోర్సుల్లో సాధించిన క్రెడిట్లు ఈ బ్యాంకు ఖాతాలోకి మళ్లించి క్రెడిట్ ఖాతాను వృద్ధి చేసుకోవచ్చు. ►దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ బ్యాంకులో భాగస్వాములు కానున్నాయి. తద్వారా ఆయా విద్యార్థులకు సంబంధించిన క్రెడిట్ ఖాతాల నిర్వహణ ఒకసంస్థ నుంచి మరో సంస్థకు మారినా ఇబ్బంది లేకుండా కొనసాగింపునకు అవకాశముంటుంది. ►అలాగే, ఎన్ఏసీ బ్యాంకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)కి అనుసంధానమై ఉంటుంది. ►విద్యార్థులు తమ క్రెడిట్లను తిరిగి తీసుకుని తమ పాత కోర్సుల్లో ఇతర సెమిస్టర్లను పూర్తిచేసి కొత్త క్రెడిట్లను దానికి జోడించేందుకు ఆస్కారం కల్పించనున్నారు. ►ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో తమకు నచ్చిన సంస్థల్లో నైపుణ్యం కలిగిన గురువుల వద్ద చదువులు కొనసాగించేందుకు వీలు కలుగుతుంది. ►బ్యాంకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వదు. -
నిఖార్సుగా కోర్సు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సమూల మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లెర్నింగ్ ఔట్‌కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎల్‌వోసీఎఫ్) రూపొందించింది. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మోడల్ కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ, పీజీలో వివిధ కోర్సుల కాంబినేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ కరిక్యులమ్‌ను సిద్ధం చేసింది. ప్రతి విద్యా సంస్థ సమాజం, పరిశ్రమలతో కచ్చితంగా అనుసంధానమై ఉండేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి దీనిని రూపొందించింది. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కరిక్యులమ్‌ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. తమ రాష్ట్రాల్లో అందిస్తున్న కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగున్నాయనుకుంటే వాటినే కొనసాగించే సదుపాయం ఉంది. ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఈ మోడల్ కరిక్యులమ్‌కు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 50% మందికి ఉపాధి లక్ష్యంగా.. దేశంలో 2022 నాటికి డిగ్రీ, పీజీ కోర్సులు చేసే విద్యార్థుల్లో కనీసంగా 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువులకు పారిశ్రామిక రం గంతో అనుసంధానం చేసేలా వాటిని రూపొందించింది. తద్వారా చదువుకునే సమయాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధిని పొందేలా చూసే లక్ష్యంతో కరిక్యులమ్‌ను రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, టీమ్‌వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్‌ను నేర్పించేలా ఈ మార్పులు తీసుకువచి్చంది. వీటితోపాటు మానవ విలువలు, ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా నేర్చుకోవడాన్ని కోర్సుల్లో భాగం చేసింది. మరోవైపు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా కోర్సుల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ప్రతి అంశానికీ నిర్ణీత క్రెడిట్స్.. లెరి్నంగ్ ఔట్‌కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను డిగ్రీ, పీజీల్లో 16 రకాల కోర్సుల్లో రూపొందించింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మ్యాథమెటిక్స్, బోటనీ, ఆంత్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్, ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్పులు చేసింది. అలాగే పోస్టు గ్రాడ్యుకేషన్లోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. ఉదాహరణకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఆంత్రోపాలజీలో విద్యార్థులకు పక్కాగా బేసిక్ కాన్సెప్‌్ట, ప్రొసీజరల్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ స్కిల్స్ కచి్చతంగా ఉండేలా దీనిని రూపొందించింది. వాటితోపాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఇష్యూస్, ప్రాబ్లం సాలి్వంగ్ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఐసీటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్, ఎథికల్ బిహేవియర్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకునేలా దీనిని రూపొందించింది. అందుకు అనుగుణంగా క్రెడిట్స్ ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా డిగ్రీలో 148 క్రెడిట్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని, అందులో ప్రధాన సబ్జెక్టులతోపాటు ప్రతి అంశానికీ నిరీ్ణత క్రెడిట్స్ ఇచ్చేలా కోర్సుల వారీగా పరీక్షల విధానాన్ని పొందుపరిచింది. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సూచన.. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు బోధించే అధ్యాపకుల ఖాళీలు 10 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమాజంలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో పురోగతిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు అందించాలని వెల్లడించింది. 2022 నాటికి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం 2.5 స్కోర్‌తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం... యూజీసీ జారీ చేసిన మోడల్ కరిక్యులమ్‌ను పరిశీలించాక ఉన్నత స్థాయిలో చర్చించి ముందుకు సాగుతాం. మోడల్ కరిక్యులమ్‌లో పేర్కొన్న కోర్సులు, మార్పులు, తెలంగాణలో ఉన్న కోర్సులను పరిశీలించి అవసరమైన వాటిని పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే తగిన మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –-ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
తెలుగు విద్యార్థులకు అన్యాయం..
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఫెలోషిప్ ఎంపికలో తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగు పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే నేషనల్ ఫెలోషిప్‌లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే ఎంపిక చేసిందని ఆరోపిస్తున్నారు. 2018–19 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫెలోషిప్‌నకు ఎంపికైన ఓబీసీ విద్యార్థుల జాబితాను యూజీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 1,000 మందిని ఎంపిక చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 54 మంది తెలుగు వారే ఎంపికయ్యారు. మరో 13 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను కలుపుకొంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 67 మంది మాత్రమే ఎంపికయ్యారు. పరిశోధనలో మేటిగా ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారని పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో లోపం ఉందని ఆరోపిస్తున్నారు. యూజీసీ ఎంపిక కమిటీ కావాలనే తెలుగు విద్యార్థులపై వివక్ష చూపిందని పేర్కొంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? నేషనల్ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసే విద్యార్థి ఎంఫిల్/పీహెచ్‌డీలో రిజిస్టర్ అయి ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారే ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని యూజీసీ ప్రకటించింది. ఈ అర్హతలతో పాటు విద్యార్థులకు పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా (మెరిట్) ఎంపిక చేస్తామని యూజీసీ ప్రకటించింది. అన్ని అర్హతలు కలిగి ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.25 వేల చొప్పున, తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.28 వేల చొప్పున యూజీసీ ఇస్తుంది. కంటింజెన్సీ కింద మొదటి రెండేళ్లు ఏటా కనీసంగా రూ.10 వేలు, రెండేళ్ల తర్వాత ఏటా కనీసంగా రూ.20 వేలు ఇస్తుంది. ఈ నిబంధల ప్రకారం అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐదారు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. అందులో 54 మందినే ఎంపిక చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే ఇది ముమ్మాటికి తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే. ఏ ప్లస్ గ్రేడ్ అక్రెడిటేషన్ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 7 మందినే ఎంపిక చేయడం సరికాదు. ఇక్కడ నెట్/సెట్ కలిగిన వారు వేలల్లో ఉన్నారు. పీహెచ్‌డీలు చేస్తున్న వారు ఉన్నారు. నాణ్యమైన పరిశోధన ఇక్కడే జరుగుతోంది. యూజీసీలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అన్యాయం చేశారు. కావాలనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించి తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. – విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెనగాని దయాకర్ -
టార్గెట్ జాబ్..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉన్నత విద్యలో మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. దీని కోసం ఓ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. లెర్నింగ్ ఔట్‌కమ్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎల్‌వోసీఎఫ్) రూపొందించింది. అందులో డిగ్రీ, పీజీ స్థాయిల్లో హిందీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ తదితర సబ్జెక్టులకు సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. గతేడాదే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినా ఆచరణకు నోచుకోలేదు. ఈసారి అమలుకు పక్కా చర్యలకు సిద్ధమవుతోంది. దీని కోసం విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని యూజీసీ నిర్ణయించింది. తమ వెబ్సైట్లో ఎల్‌వోసీఎఫ్ డ్రాఫ్టును అందుబాటులో ఉంచింది. ఈనెల 16లోగా మెయిల్ ద్వారా(locfugc@ gmail.com) సలహాలు అందజేయాలని కోరింది. మార్పు ఇలా.. కాలేజీల్లో చేయిస్తున్న ప్రాక్టికల్స్‌కు, బోధిస్తున్న పాఠ్యాంశాలకు పొంతన ఉండటం లేదని యూజీసీ తేల్చింది. పది ప్రధాన అంశాల్లో మార్పులు అవసరమని యూజీసీ నిర్ణయించింది. విజ్ఞానం పొందడం, అర్థం చేసుకోవడం, నైపుణ్యాలను మెరుగు పర్చడం, ప్రవర్తన వంటి ప్రధాన అంశాలతో విద్యా బోధనలో మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్, అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్, సైంటిఫిక్ అప్రోచ్, యాటిట్యూడ్, వ్యాల్యూస్, ఎథిక్స్ విద్యార్థుల్లో పెంపొందేలా బోధనలో మార్పులను తేవాలని నిర్ణయించింది. వీటికి ప్రాధాన్యం.. ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్, అనాలిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ ప్రధానమని యూజీసీ గుర్తించింది. ఏదేని ఓ సమస్యను వివిధ రకాలుగా ఎలా సాల్వ్ చేయొచ్చో విద్యార్థులకు నేర్పించే బోధన పద్ధతులు అవసరమని పేర్కొంది. విశ్లేషణాత్మకంగా వివరించడం, తార్కిక ఆలోచన, శాస్త్రీయ ధృక్కోణాన్ని పెంపొందించేలా విద్యా బోధన ఉండాలని చెప్పింది. పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేలా విద్య, బోధన సాగాలని తెలిపింది. ప్రతి విద్యార్థిలో కోఆపరేషన్, టీం వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్‌ను పెంపొందించేలా సిలబస్‌ను మార్చాలని స్పష్టం చేసింది. యూజీసీ సూచనలు.. - డిజిటల్ లిటరేచర్ను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైనా అవగాహన కల్పించేలా బోధన ఉండాలి. - సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకొని బోధన ఎలా కొనసాగించాలన్న అంశంలోనూ మార్పులు అవసరం. - సెల్ఫ్ డైరెక్టివ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెంచాలి. మోరల్, ఎథికల్ వ్యాల్యూస్‌తో విద్యను కొనసాగించడం, నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం, థియరీని ప్రాక్టికల్స్‌కు అనుసంధానించడం వంటివి చేయాలి. - ఫీల్డ్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం, ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ విజిట్, ఇండస్ట్రీ విజిట్ వంటి వాటిని పెంచాలి. వీటిపై పరీక్షలు, క్లోజ్డ్ అండ్ ఓపెన్ బుక్స్ ఎగ్జామినేషన్ విధానం తీసుకురావాలి. -
ఏకకాలంలో రెండు డిగ్రీలు
న్యూఢిల్లీ: త్వరలో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అవకాశం కలగనుంది. దీనిపై సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు గతనెలలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. విద్యావేత్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని యూజీసీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఆలోచన అమలైతే ఒకే వర్సిటీ నుంచిగానీ, వేర్వేరు వర్సిటీల నుంచిగానీ దూరవిద్య, ఆన్లైన్, పార్ట్‌టైమ్ కోర్సుల ద్వారా ఏకకాలంలో రెండు డిగ్రీలను పూర్తిచేసే అవకాశముంటుంది. -
‘వైఎస్ జగన్ డైనమిక్ సీఎం’
సాక్షి, న్యూఢిల్లీ : తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్ అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లు పాటించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్ డీపీ సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశమై యూజీసీ చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. తద్వారా డైనమిక్ సీఎం అనిపించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. -
ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్
న్యూఢిల్లీ: విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో పారదర్శకతకు, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, మార్కుల జాబితాపై క్యూఆర్ కోడ్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని వైస్ చాన్స్లర్లకు రాసిన లేఖలో యూజీసీ సెక్రటరీ రజనీశ్‌జైన్ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
న్యాక్ గుర్తింపులో వెనుకంజ
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు తెచ్చుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఆ దిశగా శ్రద్ధ పెట్టడంలేదు. న్యాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే నిధుల్ని మంజూరు చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెట్టిన నిబంధనను విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో యూజీసీ ఆశించిన విద్యా ప్రమాణాలను చేరుకోలేక న్యాక్ గుర్తింపును పొందలేక రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల్ని కోల్పోతున్నాయి. 206 విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు రాష్ట్రంలో 2,193 ఉన్నత, వృత్తి విద్యా కాలేజీలు ఉంటే అందులో కేవలం 206 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే రాష్ట్రంలోని 10% సంస్థలకు కూడా న్యాక్ గుర్తింపు లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు 18 ఉంటే అందులో 13 వర్సిటీలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉన్నట్లు లెక్కలు వేసింది. ఈ లెక్కన ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ దాదాపుగా చివరి స్థానంలో ఉంది గతేడాదే స్పష్టం చేసిన రూసా విద్యా సంస్థలకు తాము నిధులను ఇవ్వాలంటే న్యాక్ గుర్తింపు ఉండాలని మూడేళ్ల కిందటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేయగా, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి తాము నిధులివ్వాలంటే న్యాక్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని గతేడాది మార్చిలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్పష్టం చేసింది. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇక న్యాక్ నిబంధనలను కఠినతరం చేయడం కూడా మరో కారణంగా అధికారులు చెబుతున్నారు. గతంలో కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే న్యాక్ బృందం దానిని అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తింపు ఇచ్చేది. ముఖ్యంగా విద్యా ప్రమాణాలను చూసేది. అయితే ఇప్పుడు కూడా అవే అంశాలు ప్రధానం అయినప్పటికీ బోధన పరిస్థితులు, విద్యా ప్రమాణాలు, పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది, నాణ్యత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు తదితర సమగ్ర వివరాలపై విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని న్యాక్ గుర్తింపు ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు కష్టంగా మారిందని, బోధన, విద్యా ప్రమాణాలు లేక గుర్తింపు లభించడం లేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. భారీగా పెంచుకున్న మహారాష్ట్ర, కర్ణాటక... న్యాక్ గుర్తింపు తెచ్చుకోవడంలో మహారాష్ట్ర విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయి. 1,539 న్యాక్ గుర్తింపు పొందిన విద్యా సంస్థలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అదే తెలంగాణ కేవలం 206 విద్యా సంస్థలతో 14వ స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో కేవలం 587 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉండగా, 2018–19 విద్యా ఏడాదిలో దాదాపు 1000 కాలేజీలకు అదనంగా గుర్తింపును తెచ్చుకోగలిగింది. ఇక రెండో స్థానంలో కర్ణాటక నిలిచింది. కిందటి విద్యా సంవత్సరంలో అక్కడ 336 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉండగా, గత విద్యా సంవత్సరంలో మొత్తంగా 800 విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకోగలిగింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువ విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు లభించినా తెలంగాణలోని విద్యా సంస్థలు కిందటేడాది కంటే గతేడాది అదనంగా 102 విద్యా సంస్థలు మాత్రమే న్యాక్ గుర్తింపు తెచ్చుకోగలిగాయి. -
గిరిజనులకు ఇక నేషనల్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగలకు చెందిన పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. గతంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ద్వారా ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఫెలోషిప్ కార్యక్రమ అమలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో పరిశోధన విద్యార్థుల ఎంపికను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. గైడ్ టీచర్ల ఎంపిక ప్రక్రియ మొదలు దరఖాస్తు విధానం, సబ్జెక్టుతో పాటు ప్రజెంటేషన్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ధారిస్తుంది. కార్యక్రమ అమలులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది. గిరిజన పరిశోధన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘నేషనల్ ఫెల్లోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్’కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీల పరిధిలో 157 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన తెగల నుంచి పరిశోధన విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 750 మంది గిరిజన పరిశోధన విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం కింద అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాగ్రత్తగా వడపోసి అర్హులను ఎంపిక చేసేందుకు శాస్త్రీయ పద్ధతిని అవలంభించనున్నారు. పీవీటీజీ తెగలకు చెందిన గిరిజనులకు 3 శాతంతో పాటు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు పరిశీలించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కేంద్రానికి పంపిస్తారు. అనంతరం వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వడపోసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఎంఫిల్ విద్యార్థులకు ప్రతి నెల రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.22 వేలు కంటింజెన్సీ కింద ఇస్తారు. అదేవిధంగా పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.28 వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందిస్తారు. కంటిజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. సగటున ఒక్కో పరిశోధన విద్యార్థికి ఏడేళ్ల కాలానికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఎంఫిల్‌కు... రెండేళ్ల పాటు ప్రతి నెలా 25 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా 22 వేలు ఇస్తారు. పీహెచ్డీ... ఐదేళ్ల పాటు ప్రతి నెల 28 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. -
అప్పుడు కాదు.. ఇప్పుడే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు రాకముందే యూనివర్సిటీల్లోని దాదాపు 1,110 పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలిలోని తన మనుషుల ద్వారా పావులు కదుపుతోంది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారం చేజారితే ఏమీ చేయలేమన్న ఆందోళనతో అంతకు ముందుగానే ఈ పోస్టుల భర్తీని ముగించాలని హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యామండలిలోని వైస్ చైర్మన్, సీఎంఓలోని కొందరు అధికారుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు చేయించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇంటర్వ్యూలు, నియామకాలు చేయడానికి వీల్లేనందున ఉన్నత విద్యామండలి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. ఈ లేఖను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించగా ఇంటర్వ్యూల నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపింది. దీని ఆధారంగా నియామకాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అనుమతించినా, పోస్టుల రేషనలైజేషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని యూనివర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడంపై రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలపై స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవేవీ పరిష్కారం కాకుండానే నియామకాలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు ఇంటర్వ్యూల నిర్వహణకు నిబంధనల మేరకు ముందుకు వెళ్లవచ్చని గత నెల 25న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ పోస్టుల భర్తీకి వీలుగా కోర్టుల్లో ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ విషయాన్ని పక్కన పెట్టి నియామకాలు త్వరగా పూర్తి చేయించాలని ఆయా వర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూళ్లు పంపించాలని ఉన్నత విద్యామండలి ద్వారా ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. ఆ షెడ్యూళ్లు వచ్చాక కామన్ షెడ్యూల్ ఇచ్చి భర్తీ చేయించాలని చూస్తున్నారు. భారీ మొత్తాలకు పోస్టుల అమ్మకాలు వర్సిటీల్లోని బోధనా పోస్టులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి డబ్బును కూడా తీసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తేటతెల్లమవుతుండడంతో వారందరి నుంచి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఇంటర్వ్యూలు పూర్తి చేయించాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసులు పరిష్కారం కాకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడం సరికాదని, దీన్ని నిలుపుదల చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం అనుమతిచ్చిందన్న సాకుతో భర్తీకి ముందుకు వెళ్తే ఆయా యూనివర్సిటీల అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కూడా దాఖలు చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడితే తదనంతర పరిణామాలకు ఆయా వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని వర్సిటీల అధికారులకు నిపుణులు సూచిస్తున్నారు. యూజీసీ ఉత్తర్వులూ బేఖాతర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున తుది నిర్ణయం వెలువడే వరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని నెలల క్రితం యూజీసీ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు పోస్టుల భర్తీని నిలిపి వేయాలని ఉన్నత విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆదేశించింది. అయినా ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ఒకరు ఫోన్ చేసి ఆయా వర్సిటీల అధికారులపై ఒత్తిడి చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అంతా అక్రమాల మయం యూనివర్సిటీ బోధనా పోస్టుల భర్తీ వ్యవహారం ఆది నుంచి అక్రమాలమయంగా మారిందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 1,385 పోస్టులకు కుదించింది. ఇది కూడా సీఎంవోలో ఉన్న ఒక సలహాదారు, ఉన్నత విద్యామండలిలోని ఉపాధ్యక్షుడొకరు కలసి తమకు నచ్చిన రీతిలో తమ సామాజికవర్గ వ్యక్తులకు వీలుగా చేయించారన్న ఆరోపణలున్నాయి. రేషనలైజేషన్ అక్రమాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్ 101, అసోసియేట్ ప్రొఫెసర్ 174, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,110 ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపైనా కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తోంది. ఇన్ని వివాదాలున్నప్పటికీ పోస్టుల భర్తీకి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తుండటానికి కారణం జేబులు నింపుకోవడానికేనని స్పష్టమవుతోంది. -
అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు. అధ్యాపక నియామకాలు ప్రారంభించండి కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్ చాన్స్లర్లకు సూచించింది. -
సంకల్పం మంచిదేగానీ...
ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు? దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్’ జాబితా వెల్లడించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) టాప్–100 జాబితాలో మాత్రం మన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది. ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు. కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి సీ. రంగ రాజన్ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్ కొఠారి కమిషన్ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట! పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి. ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు? దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్’ జాబితా వెల్లడించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) టాప్–100 జాబితాలో మాత్రం మన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది. ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు. కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి సీ. రంగ రాజన్ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్ కొఠారి కమిషన్ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట! పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి. -
అన్ని విద్యా సంస్థలకు 2022 నాటికి న్యాక్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణల పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు 2022 నాటికి నేషనల్ అసేస్‌మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘పరాంశ్’పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఇండియన్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనుంది. వాటిని మెంటార్ సంస్థలుగా ఎంపిక చేసి, ప్రతి విద్యా సంస్థ న్యాక్ గుర్తింపు పొందేలా చేయాలని నిర్ణయించింది. న్యాక్ గుర్తింపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి? ఉత్తమ ప్రమాణాలుగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాలపై ఆయా విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు కోరుకునే కాలేజీలకు మార్గదర్శనం చేయనున్నాయి. మొత్తానికి 2022కి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం న్యాక్ 2.5 మినిమమ్ స్కోర్‌నైనా సాధించేందుకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు కృషి చేసేలా పరాంశ్ అమలుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే న్యాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే కేంద్ర ఆర్థిక సహాయం, గ్రాంట్లు, ఇతర పరిశోధన నిధులు ఇచ్చేలా చర్యలు చేపట్టిన కేంద్రం, తాజా నిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది. -
కేంద్రానికి షాకిచ్చిన అలీఘడ్ యూనివర్సిటీ..!
లక్నో: దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై యూపీలో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్జికల్ దాడుల దినోత్సవంను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మషుష్కర్ అహ్మద్ ఉస్మానీ తెలిపారు. భారత సైన్యం దాడులు చేయడం ఇదే తొలిసారి కాదని... ఇంతకు ముందు కూడా అనేక సందర్భల్లో దాడులు నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాలు ఇలా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ఆయన పేర్కోన్నారు. దేశభక్తిని చాటిచెప్పేందుకు ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు ఈ దినోత్సవాలు ఎందుకని ఉస్మానీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడుల దినోత్సవం జరుపుకోవాలి అనుకుంటే, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని అన్నారు. కాగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా జారీ చేసిన ఈ సర్కులర్‌ను విద్యార్థులు, అధ్యాపకులు పలువురు తప్పుపడుతున్నారు. -
పరువుకు పాడెకట్టిన ‘యూజీసీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశ్వవిద్యాలయాల్లో బోధన, పరీక్షలు, పరిశోధనల ప్రమాణాలను కొనసాగించడమే కాకుండా వాటిని పెంచేందుకు, అలాగే యూనివర్శిటీ విద్య ప్రోత్సహానికి దోహదపడుతాయని భావించిన చర్యలను ఎప్పటికప్పుడు యూనివర్శిటీలు లేదా సంబంధిత సంస్థలతో సంప్రతింపులు జరపడం ద్వారా అమలు చేయడం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సాధారణ విధులు’ అని 1956 నాటి చట్టం నిర్దేశిస్తోంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా ఓ సర్కులర్ జారీ చేసింది. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సర్కులర్‌కు యూజీసీ విధులకు ఎలాంటి సంబంధం లేదు. విద్యా, బోధన, పరిశోధనకు సంబంధించిన ఏ అంశం ఇందులో లేదు. పైగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా ఈ సర్కులర్‌ను జారీ చేసింది. ఇప్పుడే కాదు, గత నాలుగేళ్లుగా సంస్థ ప్రమాణాలను, పరువును పణంగా పెట్టి, తనకు అస్సలు సంబంధంలేని వ్యవహారాలకు సంబంధించి సర్కులర్లను జారీ చేసింది. ‘స్వచ్ఛ భారత అభియాన్’లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా ప్రమాణాలకిచ్చే అవార్డులు ఇవ్వాలని యూనివర్శిటీలను ఆదేశిస్తూ, ఐక్యతా పరుగులో పాల్గొనాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిస్తూ, యూనివర్శిటీ ఆవరణలో భారత సైనిక ధైర్య సాహసాలను ప్రతిబింబించే గోడలను ఏర్పాటు చేయాలంటూ యూజీసీ పలు సర్కులర్లను జారీ చేసింది. ఇలా తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చి ఉన్న మెదడు కాస్త యూజీసీ పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంఫిల్, పీహెచ్డీ, టీచింగ్ పోస్టుల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను తరచూ మారుస్తూ విద్యార్థుల లోకంలో గందరగోళం సృష్టించడమే కాకుండా తాను గందరగోళంలో పడిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో వేలాది టీచింగ్ పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. సరైన లైబ్రరీలు, లాబరేటరీలు లేక యూనివర్శిటీలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోవాల్సిన యూజీసీ ఈ యాత్రలో పాల్గొనండీ, ఆ యాత్రలో పాల్గొనండంటూ సర్కులర్ల మీద సర్కులర్లు జారీ చేస్తోంది. రెండేళ్ల క్రితం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత సైన్యం జరిపిన ‘సర్జికల్ స్ట్రైక్స్’కు ఇప్పుడు, అంటే ఇంత ఆలస్యంగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో?! ఇవేవి విద్యకు సంబంధించిన సర్కులర్లు కాకపోవడం వల్ల వీటిని పట్టించుకోవాల్సిన అవసరమే యూనివర్శిటీలకు లేదు. అయితే గ్రాంటుల కోసం యూజీసీ మీద ఆధారపడాలి కనుక యూజీసీ ఆదేశాలనుగానీ సూచనలనుగానీ తిరస్కరించే పరిస్థితుల్లో యూనివర్శీటీలు ఉండకపోవచ్చు. కానీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు ఇలాంటి సర్కులర్లను ప్రశ్నించవచ్చు. యూజీసీ గత నాలుగేళ్లుగా తన స్వయం ప్రతిపత్తిని, పరువును పణంగా పెట్టి కేంద్రంలోని పాలక ప్రభుత్వానికి ఓ కొరియర్‌గా పనిచేస్తున్నా ఒక్క వీసీ అంటే ఒక్క వీసీ ప్రశ్నించడం లేదంటే ఎంత సిగ్గు చేటో! -
సర్జికల్ స్ట్రయిక్స్ సంబరాలు : యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రయిక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మాటువేసిన తీవ్ర వాదులను మట్టుబెడుతూ.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి.భారత సైన్యం జరిపిన ఈ దాడులతో పాక్ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒళ్లు గగుర్పుటించే వీడియోలు కూడా బయటకి వచ్చాయి. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన తర్వాత భారత సైన్యాన్ని వెల్లువెత్తిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. మరో వారం రోజులకు భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్‌కు రెండేళ్ల పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్ 29వ తేదీని సర్జికల్ స్ట్రయిక్స్ దినోత్సవంగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు, ప్రత్యేక కవాతులు, సాయుధ దళాలకు తమ మద్దతు తెలుపుతూ డిజిటల్ లేదా చేతిరాత గ్రీటింగ్ కార్డులను పంపడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్సీసీ యూనిట్లు కూడా సెప్టెంబర్ 29న ప్రత్యేక పరేడ్లను నిర్వహించనున్నాయి. ఎన్సీసీ కమాండర్లు కూడా సరిహద్దు రక్షణ గురించి ప్రసంగించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రత్యేక మల్టీమీడియా ఎగ్జిబిషన్లో నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించే అవకాశం ఉందని, వీటిని విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించాలని ఉపకులపతులకు గురువారం రాసిన లేఖలో యూజీసీ వెల్లడించింది. -
ఉన్నత విద్యలో సమూల మార్పులు
స్వాతంత్య్రానంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్య క్షతన ఏర్పడిన తొలి విద్యా కమిషన్, విద్య లక్ష్యం నూతన ఆవిష్కరణలకు, నవకల్పనలకు, నవభారత దేశ స్వావలంబనకు దోహ దపడే విజ్ఞాన సముపార్జ నగా ఉండాలని అభిప్రాయ పడింది.విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, ఉన్నత విద్య నిరంతర పరిశోధనా స్థానంగా, నవ కల్పనలకు నిలయంగా ఉండాలని ఈ కమిషన్ భావించింది. బాధాకరమైన విషయ మేమంటే, 2009లో వచ్చిన నాలెడ్జ్ కమిషన్ నివేదిక కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాల్సి వచ్చింది. ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాల నిర్ధారణ, సమన్వయానికి 1956లో విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ) ఏర్పడింది. ఆనాటికి దేశంలో 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలు ఉన్నాయి. సుమారు 2.10 లక్షలమంది విద్యార్థులు అప్పట్లో ఉన్నత విద్యారంగంలో చదువుతున్నారు. యూజీసీ ఏర్పడిన 62 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా రంగంలో విద్యార్థుల స్థూల నమోదు 25.5 శాతానికి, విద్యార్థుల నమోదు 3 కోట్ల 66 లక్షలకు చేరింది. కానీ ఉన్నత విద్యారంగంలో మారుతూ వచ్చిన పరి ణామాలకు అనుగుణంగా లేదా ప్రపంచ మార్పు లకు అనుగుణంగా యూజీసీని సంస్కరించాలని గత ప్రభుత్వాలు భావించలేదు. ప్రపంచీకరణ అనం తరం దేశంలో పెద్ద ఎత్తున అన్ని రకాల విద్యా సంస్థలు వెలిశాయి. కానీ ప్రమాణాల విషయంలో చెప్పుకోదగిన సంస్థ ఒక్కటీ లేదు. రాన్రానూ పని భారంతో యూజీసీ పాలనాపరమైన వ్యవహారాలకే పరిమితమవుతూ వచ్చింది. యూజీసీ తన 62 ఏళ్ల చరిత్రలో అంతర్జాతీయంగా ప్రభావంగల కనీసం ఒక్క ఆవిష్కరణకైనా దోహదపడినట్టు ప్రకటించు కోలేకపోయింది. గతంలో ఎన్నో కమిషన్లు యూజీ సీని పునర్ వ్యవస్థీకరించాలని సూచించాయి. ఇతర కమిటీలు కూడా మార్పు ప్రాధాన్యతను తెలియజే యడంతో యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ), నీతి ఆయోగ్, జీఎస్టీ కౌన్సిల్ తర హాలో జాతీయ సంస్థగా ఏర్పడుతుంది. ఇందులో రాష్ట్రాల విద్యామంత్రులు, రాష్ట్రాల హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్పర్సన్లు సభ్యు లుగా ఉంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. ఉన్నత విద్యా రంగానికి చెందిన అన్ని అంశాలపై తగిన చర్చ అనంతరం ఈ మండలి నిర్ణ యాలు తీసుకుంటుంది. ఈ బిల్లు మరింత సమర ్థవంతమైన క్రెడిట్ల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. విద్యార్థి ఫెయిల్ అయితే ఒక ఏడాది కోల్పోయేలా కాకుండా డిగ్రీ పట్టాకు అర్హత సాధించడానికి నిర్ణీత క్రెడిట్లు పొందే వీలు కల్పిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే స్థానిక అవసరాలకు అనుగుణంగా తమ పాఠ్య ప్రణాళికను రూపొందించుకునేందుకు ఈ బిల్లు మరింత స్వేచ్ఛ కల్పిస్తుంది. ఉదాహరణకు ఆదిలాబాద్‌లో ఏర్పడబోయే గిరిజన విశ్వవిద్యాల యానికి యూజీసీ, పాఠ్య ప్రణాళిక రూపొందించ డంలో అర్థం ఉండదు. ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన ప్రతి సంస్థా తు.చ. తప్పకుండా పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం జరుగుతోంది. అలా పాటించని, తగిన పనితీరు కనబరచని సంస్థలను చట్టప్రకారం మూసి వేయడం జరుగుతుంది. అయితే, గ్రాంట్లు కేటాయించే అధి కారాన్ని ఈ బిల్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు కూడా కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి అవకాశం ఇస్తుం దన్న అంశాలపై ఈ బిల్లు విమర్శలకు గురౌతోంది. నిధుల కేటాయింపు అధికారాన్ని నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తనకు తానుగా తీసుకోవడం కాకుండా ఆ మంత్రిత్వ శాఖ కింద విద్యారంగ నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లతో కూడిన స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించాలని పలువురు అభి ప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణల విషయంలో చొరవ తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లు అభినందనీయులు. ప్రపంచం లోని అత్యున్నత స్థాయి పది విశ్వ విద్యాలయాలలో కనీసం ఒక భారతీయ విశ్వవిద్యాలయం ఉండే విధంగా చూసేలా భారతీయ ఉన్నత విద్యామండలి ఏ విధంగా ముందుకు పోతుందన్న దానికి కాలమే సాక్ష్యం. రాగల కాలంలో ఈ ప్రతిష్టాత్మక స్థాయిని సాధించడమే మనం, తత్వవేత్త, పాలనాదక్షుడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అర్పించే ఘన నివాళి అవుతుంది. వ్యాసకర్త: ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ మెయిల్ : n_ramchanderrao@yahoo.com -
కొత్తకొత్తగా చదివిద్దాం
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో సమూల మార్పులకు కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. పాత మూస ధోరణులను వదిలి అధునాతన ప్రణాళికలు, బోధనా విధానాలు అనుసరించేలా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సంబంధించి వర్సిటీలతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటిని పాటించాల్సిందిగా సూచించింది. ఆయా సంస్థల్లో ఇకపై విద్యార్థి కేంద్ర బిందువుగా పాఠ్య ప్రణాళిక, బోధనాభ్యాసన విధానాలను అమలుచేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్’ పేరిట ఈ మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేలా ఉన్నత విద్యాసంస్థలన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులను నూతన ఆలోచనల దిశగా ముందుకు తీసుకువెళ్లడం.. సామాజిక అంశాలపై సునిశితంగా స్పందించడం.. నైతిక విలువలను పెంపొందించుకోవడం.. బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందులోని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. కొత్తవిధానంలో ప్రధానాంశాలు.. ప్రస్తుతం నాలుగు గోడల మధ్య పుస్తకాల ఆధారంగా సాగే బోధనకు బదులు ఈ కొత్త విధానం సామాజికీకరణ, అనుసంధానత, పాలనా భాగస్వామ్యం, అనుభవీకరణ అనేవి ప్రధానాంశాలుగా ఈ నూతన విధానంలో పొందుపరిచారు. - కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులు సౌకర్యవంతంగా తమ చదువు కొనసాగించేందుకు సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులతో మార్గనిర్దేశం చేస్తారు. దీనివల్ల విద్యార్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో చదువుకునేందుకు వీలుంటుంది. - సంస్థలోని విద్యార్థులు, అధ్యాపకుల మధ్య అనుబంధం ఏర్పడేలా చేయాలి. - సంస్థ విధానాలు, కార్యక్రమాలు, విలువలు, మెంటార్ గ్రూపులపై ముందుగా వారికి అవగాహన కల్పించాలి. - నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఆయా విద్యా సంస్థల పరిధిలోని స్థానిక అంశాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో పర్యటనలు చేయించాలి. - గ్రూపు చర్చలు, సబ్జెక్టు అంశాలపై ప్రసంగాలు, అభ్యసన నైపుణ్యాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, మానవతా విలువలు తదతర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అనుభవాలను ప్రోదిచేయాలి. మెంటరింగ్.. కనెక్టింగ్ ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఫ్యాకల్టీ సభ్యులతో అనుసంధానించడం (మెంటార్షిప్) అతిముఖ్యమైనది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆరోగ్యకరమైన బంధాన్ని నెలకొల్పుతుంది. దీనివల్ల విద్యార్థులు కొత్త అనుభవాలతో మరింత వికాసాన్ని పొందడంతో పాటు అభ్యసనంలో మరింత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. మెంటార్షిప్ వల్ల ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే స్వభావాన్ని అలవర్చుకుంటారు. కులమతాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలపై విద్యార్థి ఆలోచించేలా చేయాలి. ఈ మెంటారింగ్‌లో.. అంశాలను ఎంచుకోవడం, ఏం చేయాలో.. ఏం చేయరాదో అన్నవాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మెంటార్ల ప్రధాన బాధ్యత. వివిధ అంశాలపై ఆరు రోజుల పాటు మెంటార్షిప్ కొనసాగించాలి. ప్రతీ మెంటార్ పరిధిలో 20 మంది చొప్పున గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. విద్యార్థులు తమ జీవితంపట్ల, సమాజంలో తాను పోషించాల్సిన పాత్రపట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చూడాలి. అంతేకాక.. విద్యార్థులు వేరు, విద్యా సంస్థ వేరు అనేలా కాకుండా మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండేలా విద్యా సంబంధిత కార్యక్రమాలు, సదస్సులు, ప్రయోగశాలలు, తదితర కార్యక్రమాలు పెంపొందించాలి. అలాగే, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. సెమిస్టర్ పూర్తయిన అనంతరం ప్రతీవారం ఓ గంట ప్రతీ మెంటార్ గ్రూపు సమావేశమవ్వాలి. క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి విద్యార్థులను కేవలం బోధన, పుస్తక పఠనాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం లేదా స్థానిక వాతావరణానికి వీలుగా అనువైన సమయాల్లో వీటిని చేపట్టాలి. ఇవి సమిష్టి కృషికి తోడ్పడతాయి. ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడాంశంలో పాల్గొనేలా చేయాలి. ఆ తరువాత దానిలో నైపుణం సాధించేలా తీర్చిదిద్దాలి. -
కాలేజీల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్ ఫుడ్‌ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు. అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్‌ఫుడ్ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్‌ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. -
‘డిస్టెన్స్’పై యూజీసీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించింది. 2018–19 విద్యా సంవత్సరం, ఆపై కాలానికి విశ్వవిద్యాలయాలు, వాటికి అనుమతిచ్చిన కోర్సులతో యూజీసీ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమైన కోర్సులకు సంబంధించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో సహా చాలా వర్సిటీల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఆయా వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి ఎంబీఏ/ఎంసీఏ/బీఈడీ/ఎంఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు గుర్తింపు లభించాలంటే తొలుత ఆయా కోర్సులకు సంబంధించిన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని యూజీసీ కొత్త నిబంధనలు విధించింది. ఉదాహరణకు బీఈడీ వంటి కోర్సులను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేయాలంటే యూజీసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కోర్సుకూ ఆయా నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలను నియంత్రించే విషయాన్ని సరిగా పట్టించుకోకుండా, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విషయంలో యూజీసీ ఇలా వ్యవహరించడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల వర్సిటీ పాలనా వ్యవహారాలు గాడితప్పి, అసలు లక్ష్యాలు పక్కదారిపడతాయని వారు విమర్శిస్తున్నారు. -
‘యూజీసీ రద్దు ఆలోచనను విరమించుకోండి’
హైదరాబాద్: యూజీసీ రద్దు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ‘యూజీసీ రద్దు–ఉన్నత విద్య విధ్వంసం’ అనే అంశంపై సదస్సు జరిగింది. పీడీఎస్‌యూ ఓయూ అధ్యక్షుడు లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విద్యను కాషాయీకరణ చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాము పాల్గొన్నారు. యూజీసీ స్కేల్ అమలుపై అధ్యయనానికి కమిటీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అర్హత కలిగిన బోధనాసిబ్బందికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సవరించిన ఏడో వేతన కమిషన్ వేతనాలను చెల్లించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీలో ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఓయూ మాజీ వీసీ, జేఎన్టీయూ, మçహాత్మాగాంధీ వర్సిటీ వీసీలు, కళాశాల విద్యా కమిషనర్‌ను సభ్యులుగా నియమించారు. -
కాఫీకి రా.. లేకపోతే ఫెయిల్ చేస్తా..!
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు బాలికలపై అనేక దాడులు జరుగుతున్నాయని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్ధినులు డిమాండ్ చేస్తున్నారు. -
నియామకాలు నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నియామకాలను నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. నియామకాల్లో యూనివర్సిటీ వారీగా ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్లు కాకుండా, విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలని గత ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నియామకాల్లో కోర్టు నిబంధనలు పాటించాలని యూజీసీ అప్పట్లో యూనివర్సిటీలకు లేఖలు రాసింది. అయితే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేవరకు నియామకాలను ఏ దశలో ఉన్నా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు గురువారం యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఊర్మిళదేవి అన్ని రాష్ట్రాల, సెంట్రల్ యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. -
హెకీపై యూజీసీ చైర్మన్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో అమల్లోకి తేనున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ)పై రాష్ట్ర అభిప్రాయాన్ని నివేదిక రూపంలో ఉన్నత విద్యా మండలి యూజీసీకి అందజేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో ఈనెల 16న ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని వైస్చాన్స్లర్లు, విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందరి అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను గురువారం యూజీసీ అధికారులకు ఢిల్లీలో అందజేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ ఈ నివేదికను అందజేశారు. ప్రతిపాదిత హెకీలో పలు సవరణలు చేయాలన్న అభిప్రాయం వచ్చిందని, రాష్ట్రాల అధికారాలకు కోత పెట్టకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు సవరణల కోసం పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేశారు. -
యూజీసీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్చాన్స్లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్ వీసీలతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు. -
‘జియో’కు ఏం ఎక్కువ, మాకేం తక్కువా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలను కాదని ఇంకా ఆవిర్భవించని ‘జియో ఇనిస్టిట్యూట్’ విద్యా సంస్థకు ‘ఎమినెన్స్ (అత్యున్నత)’ హోదాను కేంద్ర ప్రభుత్వ కల్పించడాన్ని ఈ హోదా కోసం జియోతో పోటీ పడిన సంస్థలేవీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అలా పోటీ పడిన 27 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఓపీ జిందాల్ యూనివర్శటీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల పురోగతి రికార్డును పరిగణలోకి తీసుకోకుండా ఎంత అద్భుతమైన ప్రణాళికలను చూపించినప్పటికీ రాబోయే విద్యా సంస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఎలా విశ్వసిస్తారని ఈ హోదా దక్కని విద్యా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ‘జియో ఇనిస్టిట్యూట్’ను ప్రతిపాదించిన రిలయెన్స్ గ్రూపునకు దేశంలో చాలా మంచి పేరున్నందున, ఆ గ్రూప్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నందున, విద్యా సంస్థ కోసం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందున, సంస్థను ఏర్పాటు చేసిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిస్తుందని పూర్తి విశ్వాసం కలిగినందున ఆ సంస్థకు ‘ఎమినెన్స్’ హోదా ఇచ్చామని ఇటు ఎంపిక కమిటీ, అటు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ హోదా కోసం యూజీసీ ప్రతిపాదించిన ప్రమాణాల మేరకే హోదా ఇచ్చారా ? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పడం లేదు. ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామంటూ చెప్పిందే చెబుతూ సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోత్నిస్తోంది. ఎందులో జియోతో తాము సరితూగమో చెప్పండని ఈ గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని ప్రతిపాదిత క్రియా యూనివర్శిటీ (దీనికి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సలహాదారు), ఒరిస్సా వేదాంత యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ కింద ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, యూనివర్శిటీ, డీమ్డ్ యూనివర్శిటీ హోదాలేని ఉన్నత విద్యా సంస్థలు గ్రీన్‌ఫీల్డ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని 2017, నవంబర్ 17న యూజీసీ వివరణ ఇచ్చిందని, ఆ వివరణ మేరకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తమ సంస్థలో భారతీయ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా గణనీయంగా చదువుతున్నారని పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఒకే ఒక్క సంస్థకు అత్యున్నత హోదా ఇస్తున్నారని తెలియడంతో అది కాస్త జియోకే దక్కుతుందని తాము భావించామని, అందుకు ఆ సంస్థకు, ప్రభుత్వానికున్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సమీకరణలు కారణం కావొచ్చని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని విద్యా సంస్థల యాజమాన్యాలు మీడియా ముందు వ్యాఖ్యానించాయి. ‘ఎమినెన్స్’ హోదా కింద ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రోత్సహకాలు ఏమీ ఉండకపోయినా విద్యా సంస్థపై పెట్టే పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: రిలయెన్స్ మీద అంత మోజెందుకు? -
కేంద్రం గుప్పిట ఉన్నత విద్య
యూజీసీ స్థానంలో భారత ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే మొదట– కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. దీని వల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యాలయం అనే భావనకే విరుద్ధం. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలు ఎప్పుడో మొదలెట్టింది. కొత్త విద్యా విధానం తీసుకొస్తానని చెబుతోంది. నిజానికి కేంద్ర సర్కారు కొత్తగా తెస్తున్నదేమీ లేదనే చెప్పాలి. సంస్కరణల పేరుతో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థల రూపురేఖలు మార్చివేసి తన అధికారగణంతో నింపుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. పేరు మారినా చేసే పని ఒకటే. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని తన కబంధ హస్తాల్లోకి తీసుకుంటోంది. ఏమాత్రం అనుభవంలేని వారిని ఈ సంస్థల చైర్మ న్లుగా, సభ్యులుగా నియమించింది. మరో పక్క పాఠ శాల విద్యలోని సిలబస్‌ను సగానికి సగం తగ్గిస్తున్నా మని ప్రకటించింది. చివరికి చేసిందేమంటే, గతంలో వామపక్ష, లౌకిక భావాలున్నవారు రూపొందించిన పాఠ్య ప్రణాళికను తొలగించి, పాలకపక్ష భావజా లంతో దాన్ని నింపడానికి ప్రయత్నించడమే. పేరుకు విద్యార్థులకు చదువుల భారం తగ్గిస్తానని చెబు తున్నా, స్కూల్ బ్యాగ్‌ల బరువు తగ్గించాలని ప్రొఫె సర్ యశ్పాల్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగ లోకి తొక్కి కొత్తగా చేసేదేమీ లేదన్నట్టు వ్యవహరి స్తోంది. విద్యను కాషాయీకరించడానికే ఈ పను లన్నీ చేస్తోందని స్పష్టమౌతోంది. యూజీసీ స్థానంలో నూతన సంస్థ ఇప్పుడు నేరుగా యూనివర్సిటీ గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) స్థానంలో కిందటి నెల 27న భారత ఉన్నత విద్యా సంఘం(హెచ్ఈసీఐ–హెసీ) ఏర్పాటు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఉన్నత విద్యను కేంద్రీకరించడంలో భాగంగా ఈ సంస్థను స్థాపి స్తోంది. ప్రజాస్వామ్య సూత్రమైన వికేంద్రీకరణకు ఇలా గండికొడుతోంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) 1953 డిసెంబర్ 28న అవతరిం చింది. పార్లమెంటు చేసిన చట్టం ద్వారా 1956లో ఇది అధికార వ్యవస్థగా రూపుదిద్దుకుంది. యూని వర్సిటీల్లో ఉన్నత విద్య పరిశోధన, బోధన స్థాయి పెంచడమే ప్రధాన లక్ష్యంగా యూజీసీని నెలకొ ల్పారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థగా దీనికి మంచి పేరొచ్చింది. ఉన్నత విద్యారంగానికి చెందిన యూనివర్సిటీలు, కాలేజీలకు నిధులు సమ కూరుస్తూ వాటికి మార్గదర్శకంగా ఉండే ఓ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర సంస్థగా ఇది అప్పటి నుంచీ పని చేస్తూ వస్తోంది. దీనికి మరింత స్వాతంత్య్రం, సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పించే విధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) ఓ కొత్త బిల్లు తీసుకొచ్చింది. ‘తక్కువ ప్రభుత్వం– ఎక్కువ పాలన’ అనే నినాదంతో ఈ బిల్లును కేంద్ర సర్కారు రూపొందించింది. ఇప్పటికే పనిచేస్తున్న శిఖర సంస్థల నియంత్రణాధికారాలు తగ్గించడం, నిధులు అందించే విధానంలో మార్పులు తీసుకురా వడం, విద్య నాణ్యత పెంచడం, చివరగా యూజీసీ చట్టాన్ని రద్దుచేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు వల్ల దేశంలోని సుమారు 850 విశ్వవిద్యాల యాలు, స్వయం ప్రతిపత్తి గల 40 వేల కళాశాలల పని విధానంలో చాలా మార్పులు చోటుచేసుకుం టాయి. అంతేగాక, యూజీసీ గుర్తించిన నకిలీ యూనివర్సిటీలను పూర్తిగా రద్దుచేసి, అవసరమైతే వాటిపై శిక్షలు కూడా వేస్తారని అంటున్నారు. ఇంకా, యూజీసీని ఓ నియంత్రణా వ్యవస్థగా మార్చి, పూర్తి అధికారాలను ఎంహెచ్చార్డీకి బదలాయిస్తారు. ఇది కేవలం ముసాయిదా బిల్లు అయినప్పటికీ దీన్ని– భారత ఉన్నత విద్యా కమిషన్ చట్టం, 2018 (విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘాన్ని రద్దు చేయడం) అని కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యకు సంబంధించిన వాటాదారులు అంటే విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, ప్రజల నుంచి సలహాలను ఈ నెల ఏడో తేదీ లోగా స్వీకరించాలని ప్రభుత్వం కోరింది. ఇంత తక్కువ సమ యంలో ఇది సాధ్యంకాని పని అని సర్కారుకు తెలుసు. పైకి ఇలా ప్రజాభిప్రాయానికి అవకాశమిచ్చి నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో బిల్లును చట్టంగా మార్చడానికి ముందుకెళ్లవచ్చు. వైద్యం మినహా అన్ని శాఖలకు వర్తింపు! కొత్తగా అవతరించే భారత ఉన్నత విద్యా సంఘం (హెచ్ఈసీఐ–హెసీ) ఉన్నత విద్యారంగంలో వైద్యం మినహా మిగిలిన శాఖలకు విస్తరిస్తుంది. ఇందులో వ్యవసాయం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తున్న విద్యాసంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఉన్నత విద్యను నియంత్రించడం నుంచి నిధులు అందించే పద్ధతిని విడదీస్తుంది. ఇప్పుడైతే మానవ వనరుల శాఖే నేరుగా నిధులందించే పని చేస్తోంది. అంటే ఇక ముందు ప్రభుత్వ కనుసన్నల్లో విద్యా సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది. లెక్కకు మించిన అనేక సంస్థలను నియత్రించడం ఈ కొత్త కమిషన్‌కు భారమౌతుంది. 1980ల నుంచి 1990ల వరకూ ఉదార ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన ప్రయివేటీ కరణ వల్ల కుప్పలు తెప్పలుగా ప్రయివేటు యూనివ ర్సిటీలు, కాలేజీలు పుట్టుకొచ్చాయి. వాటి వల్ల వచ్చిన సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. వృత్తి విద్యకు సంబంధించిన నియంత్రణా సంస్థలైన ఎన్సీటీఈ, ఎంసీఐ, ఏఐసీటీఈ, బీసీఈ కూడా సరిగ్గా పనిచే యడం లేదనే విమర్శ ఉంది. సంస్థలు ఎక్కువైతే అజమాయిషీ తక్కువయ్యే ప్రమాదముంది. కొత్తగా వస్తున్న కమిషన్ విద్యా విషయాలతోపాటు ఆర్థికప రమైన విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అనుభవమున్న వారిని ఈ కమిషన్‌లో నియమించక పోతే పాత పరిస్థితే నెలకొంటుంది. దేశంలో ముఖ్య మైన ప్రతి యూనివర్సిటీని, ఇంకా ఎఫ్టీఐఐ, ఐసీఎ స్సెస్సార్ తదితర విద్యా సంస్థలను ఆరెసెస్ మద్దతు దారులకు అప్పజెప్పారు. వారిలో చాలా మందికి ఇలాంటి ఉన్నత విద్యాసంస్థలను నడిపించే అను భవం ఏ మాత్రం లేదు. పరిశోధన, ఇతర విష యాల్లో ‘సంఘ్’ ఎజెండాను అమలుపరచడం వల్ల కొన్ని యూనివర్సిటీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రవుతోంది. నియంత్రణ హెచ్ఈసీఐకి భారమే! తామర తంపరగా పుట్టుకొస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలను సరైన మార్గంలో పెట్టి, క్షీణిస్తున్న విలువ లకు అడ్డుకట్ట వేయడం హెచ్ఈసీఐకి భారంగా మారుతుంది. సంస్థల విద్యా విషయాలను ఈ బిల్లు ఏ విధంగా మెరుగుపరుస్తుందనే విషయం పక్కన పెడితే, వృత్తి విద్యకు సంబంధించిన సంస్థలను ఏ విధంగా అదుపు చేస్తుందో తెలియదు. కేవలం నిధులు కేటాయించడమే పని అయితే హెచ్ఈసీఐ స్థాపనే ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలో అత్యు న్నత సంస్థలుగా(సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్) గుర్తింపు పొందిన వంద కంటే ఎక్కువ సంస్థలకు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులు కేటా యిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఐఐటీలు, ఐఐ ఎస్సీ, ఎన్ఐటీలు, ఐఐఎసీఈఆర్ వంటి సంస్థలు న్నాయి. అలాగే దేశంలోని 47 కేంద్ర విశ్వవిద్యాల యాలకు కూడా ఈ శాఖ నిధులనందిస్తోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయానికి వచ్చేసరికి 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే నిధులు ఇస్తా నంటోంది. ప్రస్తుతం వీటికి రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్(రూసా) నుంచి నిధులు సమకూరుస్తు న్నారు. ఈ విషయంలో హెచ్ఈసీఐ పాత్ర ఎంత సమర్థంగా ఉంటుందో కాలమే చెబుతుంది. ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైనవి– ఐఐఎం వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకు పూర్తి స్థాయి స్వాతంత్య్రం ఇవ్వడం, కొత్తగా వచ్చే సంస్థలకు విడతల వారీగా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం, నిధులతో సంబంధం లేకుండా నడిచే వాటిని ప్రోత్సహించడం. మరో ముఖ్య లక్ష్యం ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థలను తమ సొంత నిధులతో పనిచేసేలా ప్రోత్సహించడం. ఇందుకు అవసరమైన ఉపయోగ రుసుములు వసూలు చేసుకునే హక్కును వాటికి కల్పిస్తారు. అవసరమైతే హెచ్ఈసీఐనుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ సంస్థలు హెచ్ ఈసీఐ అనే మరో ప్రభుత్వ సంస్థ నుంచి రుణాలు తీసుకుని తగిన సమయంలో వడ్డీతో పాటు అసలు చెల్లించాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే హెచ్ఈసీఐ కేవలం నిధులందించడానికే పరిమితమౌతుంది. ప్రయోజనాల కన్నా సమస్యలే అధికం! ఈ బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట–కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. ఒకేసారి ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఎలాగూ వాయిదాల్లో అప్పుతీసుకుని కట్టే రాయితీ ఉంది. దీనివల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యా లయం అనే భావనకే విరుద్ధం. సమయానికి రుణాలు తీర్చలేని విద్యార్థులు అపరాధభావంతో కుమిలిపోతారు. అంతేగాక ఆర్థిక ఇబ్బందులకు గుర వుతారు. ఇప్పటికీ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం ఒక శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయి స్తున్నారు. దీన్ని కనీసం రెండు శాతానికైనా పెంచా ల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యాసంస్థలను విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటే వాటిని వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. పరిశోధనకు పెద్ద పీట వేయాలి. దీనితోపాటు అసంఖ్యాకంగా ఉన్న దళిత, ఆదివాసీ, పేద విద్యార్థులకు కులమత భేదం లేకుండా అవకాశాలు కల్పించాలి. చదివిన కోర్సులకు ఉద్యోగిత (ప్రొడక్టివిటీ) ఉండేలా చూడాలి. ఈ విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత రాకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ధనం వెచ్చించి తనకు తానుగా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం ఉన్నత విద్యను సరైన దారిలో పెట్టాలనుకోవడం అత్యాశే అవు తుంది. వ్యాసకర్త: ప్రొ. కె.పి.సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ -
జియోకు స్టేటస్, కేంద్రం నవ్వుల పాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. జియో ఇన్స్టిట్యూట్ కనీసం ఏర్పాటు చేయనప్పటికీ ఈ విద్యాసంస్థకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను అందించింది. కనీసం ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక్క భవనం లేనప్పటికీ, ఒక్క విద్యార్థి కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పొందనప్పటికీ, ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను ఎలా కేటాయిస్తారంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఆరు ఇన్స్టిట్యూట్లకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను కేటాయించింది. వాటిలో రెండు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ, మనిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్స్టిట్యూట్ కూడా ఆ స్టేటస్‌ను దక్కించుకుంది. ‘వరల్డ్ క్లాస్’ ఇన్స్టిట్యూషన్లుగా మార్చడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. కానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఈ స్టేటస్ కేటగిరీలో చేర్చడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేకుండా ఈ స్టేటస్‌ను అందించడం విడ్డూరంగా ఉందని హెచ్ఆర్డీపై మండిపడుతున్నారు. జియో ఇన్స్టిట్యూట్ దీనిలో చేర్చడం మరో బిగ్ స్కాం అని ట్విటర్ యూజర్లంటున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కనీసం వెబ్సైట్ కూడా లేదని.. అలా ఎలా హెచ్ఆర్డీ ‘ప్రఖ్యాత సంస్థ’ ట్యాగ్‌ను జియో ఇన్స్టిట్యూట్కు ఇస్తుందని మండిపడుతున్నారు. కేవలం ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్టు మాత్రమే నీతా అంబానీ 2018 మార్చి 11న ప్రకటించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఎంహెచ్ఆర్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2018 ర్యాంకింగ్స్ జాబితాలోనే లిస్ట్ కాలేదని, ఎందుకు టాప్ ర్యాంక్ కలిగిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లకు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పక్కన బెట్టి మరీ జియోకు ఈ స్టేటస్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ల లాంటి పలు చరిత్రాత్మక ఇన్స్టిట్యూషన్ల కంటే జియో ఇన్స్టిట్యూటే మెరుగైనదని ఎలా నిర్ణయించారని మరో ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. అయితే తమ ఈ నిర్ణయాన్ని హెచ్ఆర్డీ కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్ సుబ్రమణ్యం సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేశామని చెప్పారు. ఎలా టాప్-క్లాస్ ఇన్స్టిట్యూట్లగా మార్చుకుంటారో తెలుపుతూ వారి ప్లాన్ల వివరాలు అందించాలని కోరామని కూడా చెప్పారు. యూజీసీ(వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్స్ 2016 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుచేసే అధికార నిపుణుల కమిటీ ఈ ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసింది. -
కొత్త సీసాలో పాత సారానా?
ఏ విశ్వవిద్యాలయమైనా రాజకీయ ఒత్తిడుల నుంచి బయటపడి స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగ లదు. ఒకప్పుడు భారతీయ చరిత్రలో పేరు మోసిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా వెలుగొందాయంటే ఆర్థికంగా వాటికి కావలసిన నిధులను ఆ కాలంలోని రాజులు సమకూర్చడం, వాటి పరిపాలనా వ్యవహారాల్లో ఏనాడూ వారు వేలుపెట్టకపోవడమే. కానీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు పేరుకు స్వయం ప్రతిపత్తి కలవే గానీ ప్రతివిషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. అధ్యాపకుల నియామకాల దగ్గర్నుంచి, నిధుల కేటాయింపు వరకు అన్నిటిలోనూ అవినీతి, అక్రమాలకు తెరలేపుతూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటిని అయినవారి ఆవాసులుగా మార్చుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలను అడ్డుకోవడానికే యూజీసీ వంటి స్వతంత్ర సంస్థలు వెలిశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేసి కొత్తగా భారతీయ ఉన్నత విద్యా కమిషన్ అనే సంస్థను దాని స్థానంలో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సంస్థ పేరు మార్చినంత మాత్రాన దాని అవలక్షణాలు చెరిగిపోవు. మన దేశంలో ఉన్నత విద్య కష్టాల బారినపడటానికి కారణం సరైన నియంత్రణా సంస్థలను రూపొందించకపోవడం కాదు. ప్రస్తుత సంస్థల ఆశ్రిత పక్షపాతంతోపాటు, పాలక మండలుల ఆలోచనాధోరణి కూడా కారణమే. ఏ ఉన్నత విద్యాసంస్థనైనా రాజకీయ ప్రయోజనాలకోసం పనిముట్టుగా వాడుకోవాలని చూసినప్పుడే దాని పతనం ప్రారంభం అవుతుందని యూజీసీ ఉదంతం చెబుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటికనుగుణంగా దాన్ని తోలుబొమ్మను చేసి ఆడించారు కాబట్టే యూజీసీ ఇప్పుడు పాలకులకు ఖాయిలా పడ్డ పరిశ్రమలా, నిర్వీర్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. అంతమాత్రాన యూజీసీని నిర్వహించిన పాత్రను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పుడు యూజీసీ స్థానంలో కొత్తగా హెచ్.ఇ.సి.ఐ. ఏర్పాటు కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఇప్పుడు యూజీసీ స్థానంలో హెచ్.ఇ.సి.ఐ.ని తీసుకురావటంలో కూడా ముఖ్యోద్దేశం విధులను నియంత్రణ నుండి వేరు చెయ్యటమే. అసలు నిజం.. వర్సిటీలపై ఆర్థిక ఆంక్షలు విధించటమే. హెచ్.ఇ.సి.ఐ.ని స్థాపించటానికి రూపొందిం చిన చట్టంలో, విద్యా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిలపటానికి, విద్యా బోధనలో నాణ్యతను తీసుకురావటానికి ఈ కొత్త నియంత్రణా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నా, నాణ్యత అనే దానికి నిర్వచనాన్ని మాత్రం ఇవ్వలేకపోతోంది. ఎన్ని రకాలైన ప్రమాణాలను నిర్వచించినా వాటికి నానార్థాలు చెబుతూ, వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకోవటం మన విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ప్రతి ప్రామాణికానికి నకిలీ ప్రామాణికాన్ని రూపొందించటం పరిపాటైంది. నిజానికి వాసిపరంగా విద్యా సంబంధమైన సామర్థ్యాన్ని అంచనా వెయ్యటం అంత సులభమేమీ కాదు. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా నాణ్యత మాత్రం వీసమెత్తు కూడా పెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏమింటంటే.. వందలోపు జాతీయ ర్యాంకులు సాధించిన సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహజంగానే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్ఈటీలు, ఐఐ ఎమ్‌లు వందలోపు నిలబడతాయి. వీటికి ఇప్పటికే నిధులు ఇబ్బడిముబ్బడిగా అందుతున్నాయి. మళ్లీ వీటికే నిధుల వరద పారించటంలో ఆంతర్యమేమిటో ఏలినవారే చెప్పాలి. నిధులు లేక, సరైన మౌలిక వసతులు లేక, రాష్ట్ర ప్రభుత్వాల కనికరం లేక ర్యాంకుల్లో వెనుకబడిన రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఏ మాత్రం ఆర్థిక సహాయం లేక ఇంకా వెనుకబడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అంటూ ఇప్పటికే దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలలో మొదటి 20 వాటిని ఎన్నుకుని వాటికి ఎటువంటి నిబంధనలు నియంత్రణలూ లేకుండా పూర్తి స్వేచ్ఛని చ్చారు. మిగతా వాటిని మాత్రం యూజీసీ ఉక్కు పిడికిళ్లలోనే నలగమని ఆదేశాలిచ్చారు. అదేమంటే వాటిలో ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయంటున్నారు. అసలు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు దిగజారటానికి కారకులు రాజకీయ నాయకులు, విద్యా సంస్థల ఏలికలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలే. గ్రేడింగ్ విధానం ద్వారా పరిమిత స్వయంప్రతిపత్తి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, మోడల్ పాఠ్యాంశ వృత్తి విద్యా కోర్సులు, ఐసీటీ వినియోగం వంటి ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని చూస్తున్న ఈ తరుణంలో వాటి ఫలితాలు రాకముందే, యూజీసీ స్థానంలో మరో కొత్త సంస్థ హెచ్ఇసీఐను తీసుకురావల్సిన అవసరం లేదు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులను ఓడించటానికి విద్యా సంస్థలను ఫణంగా పెట్టడం దిగజారుడుతనం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే ఈ జూద క్రీడలో క్షతగాత్రులుగా హైదరాబాద్, వారణాసి, ఢిల్లీ, పూణే, అలహాబాద్ తదితర విశ్వవిద్యాలయాలు మిగిలాయి. మరింతగా వీటిని ఫణంగా పెట్టడానికి హెచ్.ఇ.సి.ఐ.ని ఒక ఆయుధంగా తయారుచేస్తే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకొకటి ఉండదు. ప్రొ‘‘ ఇ. శ్రీనివాసరెడ్డి ,వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ మొబైల్ : 789361 11985 -
ఉన్నత విద్య ప్రక్షాళన ఇలాగేనా?!
ఏటా ప్రకటించే అంతర్జాతీయ ర్యాంకుల్లో ఎప్పుడూ తీసికట్టుగానే కనిపించే మన ఉన్నత విద్యా రంగ సంస్థలను ప్రక్షాళన చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ)మంత్రిత్వ శాఖ పూనుకుంది. ఇప్పుడున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ)ను నెలకొల్పబోతున్నట్టు తెలిపింది. దానికి సంబంధించిన బిల్లు ముసాయిదాను బుధవారం విడుదల చేసి పదిరోజుల్లో...అంటే వచ్చే నెల 7 లోగా ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చునని ప్రకటించింది. వచ్చే నెల 18నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హెచ్ఈసీఐ బిల్లును ప్రవేశపెడతామని కూడా ఆ శాఖ వివరించింది. గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావ్డేకర్ ఉన్నత విద్యారంగంపై అధికారులతో కూలంకషంగా చర్చించినప్పుడు యూజీసీని, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)ని విలీనం చేసి ఒకే నియంత్రణ సంస్థ నెలకొల్పాలన్న ప్రతిపాదన వచ్చింది. అలా చేస్తే అనవసర వివాదాలు బయల్దేరతాయి గనుక ఏ సంస్థకా సంస్థను సంస్కరించాలని నిర్ణయించారు. హెచ్ఈసీఐ వ్యవహారం పూర్తయితే కేంద్రం ఏఐసీటీఈపై దృష్టి సారించదల్చుకుంది. అయితే ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడా నికి ముందు విద్యారంగ నిపుణుల, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలనీ, వివిధ దేశాలు అమలు చేస్తున్న విధానాలనూ, అక్కడి నియంత్రణ వ్యవస్థలనూ పరిశీలించాలని కేంద్రప్రభుత్వా నికి తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభంకాని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పది రోజుల వ్యవధిలో అందరూ అభిప్రాయాలు చెప్పటం, వాటి మంచిచెడ్డ లపై చర్చ జరగటం సాధ్యమేనా? ప్రభుత్వం ఆలోచించాలి. నాలుగేళ్లక్రితం అధికారంలోకొచ్చినప్పుడే విద్యా రంగాన్ని సంస్కరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటైంది. అది సవివరమైన నివేదికలిచ్చి రెండేళ్లు దాటుతోంది. మూడు దశలుగా వెలువడిన ఆ నివేదికలపై అందరి అభిప్రాయాలూ సేకరించారు. అయితే నిర్దిష్టంగా ఉన్నత విద్యా రంగంలో భారీ సంస్కరణలను ప్రతిపాదించి, యూజీసీ స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పాలను కున్నప్పుడు దాని లక్ష్యాలపై, పరిమితులపై, నియమనిబంధనలపై... వాటి మంచిచెడ్డలపై లోతుగా చర్చించాల్సిన అవసరం లేదా? మన ఉన్నత విద్యారంగం మొదటినుంచీ వెలవెలబోతోంది. యూజీసీ ఛత్రఛాయలో దాదాపు 850 విశ్వవిద్యాలయాలు, 37,204 కళాశాలలు ఉన్నాయి. కానీ వీటిల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన పరిశోధనలు లేవు. అసలు అందుకవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. బోధనకు అవసరమైనంతమంది అధ్యాపకులు లేరు. ఉన్నవారిపై భారం ఎక్కువగా పడటంతో వారు పరిశోధనల్లో పాలుపంచుకోవటం సాధ్యపడటం లేదు. ఇది బోధనా ప్రమాణాలపైనా, విద్యార్థుల్లో పెంపొందాల్సిన సృజనాత్మకతపైనా ప్రభావం చూపుతోంది. చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో పని కానిస్తున్నామన్న సంబరమేగానీ... అందుమూలంగా ప్రమాణాలు పతనమవుతున్నాయని, ప్రతిభాపాటవాల్లో మన పట్టభద్రులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని గుర్తించటం లేదు. కొత్త నియంత్రణ వ్యవస్థ వీటన్నిటినీ సరిచేసేలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ముసా యిదాను చూస్తే అలాంటి ఆశ కలగదు. కొత్త వ్యవస్థ సంపూర్ణంగా విద్యారంగ ప్రమాణాలపైనే దృష్టి సారిస్తుందని ఊరిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం తగ్గించటం దీని ప్రధాన ఉద్దేశమంటున్నారు. ఇన్నాళ్లూ బోగస్ విశ్వవిద్యాలయాల, బోగస్ కళాశాలల జాబి తాను మాత్రమే యూజీసీ విడుదల చేసేది. కొత్తగా ఏర్పడే సంస్థకు వాటిని రద్దు చేసే అధికారం ఉంటుంది. అలాగే తగిన ప్రమాణాలు సాధించని సంస్థలపై చర్య తీసుకునే అధికారం కూడా ఇచ్చారు. తనిఖీ రాజ్‌కు స్వస్తి పలకడం, పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాల సాధనకు కృషి చేయటం కొత్త సంస్థ లక్ష్యమంటున్నారు. నిధుల మంజూరు వ్యవహారాన్ని దీన్నుంచి తప్పిస్తామని, ఇకపై నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ పని చూసుకుంటుందని ముసాయిదాతో పాటు విడుదల చేసిన నోట్ వివరించింది. ఒకపక్క ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గిస్తామని చెబుతూ నిధుల మంజూరు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం వింత కాదా? ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ఆ రంగంలోని నిపుణులకు వదిలిపెట్టడమే యూజీసీ నెలకొల్పడంలోని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం యూజీసీకి నిధులిస్తే వాటిని ఎలా వ్యయం చేయాలో ఆ సంస్థ నిర్ణయించుకుంటుందని అనుకు న్నారు. కానీ యూజీసీకి నేతృత్వం వహించినవారిలో చాలాకొద్దిమంది మాత్రమే స్వతంత్రంగా వ్యవ హరించగలిగారు. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది అధికారంలో ఉన్నవారి ఇష్టా యిష్టాలకు లోబడే వ్యవహరించారు. యూజీసీకిచ్చే నిధుల్లో రాను రాను కోత పడటం మొదలైంది. అది ఆ బడ్జెట్లోనే సర్దుకోవటానికి సిద్ధపడింది. దాని ప్రభావం కొత్త కోర్సుల ప్రారంభంపైనా, ఉన్న కోర్సుల కొనసాగింపుపైనా, అధ్యాపక నియామకాలపైనా పడింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల పేరుతో విద్యను పేద వర్గాల పిల్లలకు అందుబాటులో లేకుండా చేశారు. వీటన్నిటి ఫలితంగా విశ్వ విద్యాలయాలు నీరసించటం మొదలైంది. సంస్థల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసి నిధులు మంజూరు చేయటం యూజీసీ విధి. కానీ కొత్త బిల్లు చట్టమైతే ప్రమాణాలను సమీక్షించడం వరకే దాని పని. నిధుల మంజూరు వ్యవహారం ప్రభుత్వానిది. ఈ స్థితి ఉన్నదాన్ని మెరుగుపరు స్తుందో, మరింత దిగజారుస్తుందో ఎవరికైనా సులభంగానే బోధపడుతుంది. మన విశ్వవిద్యాల యాలు బోధనలో, పరిశోధనలో మేటిగా ఉండటానికి, అత్యున్నత ప్రమాణాలు సాధించడానికి ఇంత కంటే మెరుగైన కార్యాచరణను ప్రతిపాదించటం అవసరమని పాలకులు గుర్తించాలి. -
మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం
-
యూజీసీ ఇక గతం..
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు శ్రీకారం చుట్టేలా బుధవారం కేంద్రం నూతన చట్ట ముసాయిదాను ప్రతిపాదించింది.యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కానుంది. ఇందుకు మార్గం సుగమం చేస్తూ యూజీసీ చట్టం, 1956ను తొలగిస్తూ నూతన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. నూతన ముసాయిదా చట్టంపై జులై 7లోగా విద్యాసంస్థలు, మేథావులు, నిపుణులు, తల్లితండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలను పంపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా సంస్థలకు మరింత ప్రతిపత్తి కల్పించే నియంత్రణ వ్యవస్థలను సంస్కరించే క్రమంలో ముసాయిదా చట్టం తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, మరిన్ని అధికారాలను కల్పించడం వంటి ఆశయాలతో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలో ప్రభుత్వం మార్పులు చేపట్టిందని చెప్పారు. యూజీసీ చట్టం స్ధానంలో ఉన్నత విద్యా కమిషన్ చట్టం 2018ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దేశంలో కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలు ఇక ఉన్నత విద్యా కమిషన్ పరిధిలో ఏర్పాటవుతాయి. కాగా, విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చడంలో యూజీసీ కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఇక ఈ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషన్ తలకెత్తుకోనుంది. -
ఇక నకిలీ విద్యాలయాల ఆటకట్టు..!!
సాక్షి, న్యూఢిల్లీ : విద్యావ్యవస్థ పటిష్టానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్(హెచ్ఈసీ)ను తీసుకురానుంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ అధికారులు ముసాయిదా బిల్లు తయారు చేశారని కేంద్రం తెలిపింది. విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వెలుడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌తో భారతీయ విద్యారంగం మరింతగా బలోపేతమవుతుందని కేంద్రం భావిస్తోంది. విద్యాసంస్థల్లో మితిమీరిన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకే నూతన కమిషన్‌కు రూపకల్ప చేసినట్టు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. విద్యాసంస్థల్లో తనిఖీల పేరిట జరుగుతున్న అక్రమాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌తో అరికట్టొచ్చని ధీమా వ్యక్తం చేశారు. తనిఖీల పేరిట జరుగుతున్న అక్రమాలు ఇకపై సాగవని మంత్రి అన్నారు. ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న నకిలీ విద్యాలయాల ఆటకట్టిస్తామని పేర్కొన్నారు. ఇకపై విద్యాసంస్థలు సాధించే ప్రగతి ఆధారంగానే వాటి భవితవ్యం ఆధారపడుతుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిషన్ రాకతో యూజీసీ కార్యకాలాపాలను మానవ వనరుల శాఖ చేపట్టనుండగా, విద్యా సంబంధ వ్యవహారాలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ దృష్టి సారించనుంది. ఏఐసీటీఈ, యూజీలను రద్దు చేస్తున్నందున కొత్త నియమ నిబంధనల రూపకల్పనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రెగ్యులేషన్ ఏజన్సీని ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. జూలై 7 వరకు నూతన కమిషన్‌కు సలహాలు సూచనలు అందించాలని హెచ్చార్డీ ప్రజల్ని కోరింది. Under the leadership of PM @narendramodi has embarked on a process of reforms of the regulatory agencies for better administration of the HE sector. In a landmark decision, a draft Act for repeal of #UGC & setting up #HECI (Higher Education Commission of India) has been prepared. — Prakash Javadekar (@PrakashJavdekar) June 27, 2018 -
పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీచేసే ఓపెన్, దూరవిద్య డిగ్రీలు, డిప్లొమాలను అంగీకరించాలని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ఆదేశించింది. ఓపెన్, దూరవిద్య విధానంలో పొందిన డిగ్రీలు, డిప్లొమాలను పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సుబ్రమణ్యం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై సదరు విభాగం స్పందిస్తూ... పీఎస్‌యూల్లో బోర్డు కంటే తక్కువస్థాయి ఉద్యోగాల భర్తీని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రైజెస్(సీపీఎస్ఈ) చేపడతాయని పేర్కొంది. -
వర్సిటీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి
న్యూఢిల్లీ: విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని యూజీసీ కోరింది. ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, స్ట్రాలు, బ్యాగ్‌లు, లంచ్ ప్యాకెట్ల వాడకంపై నిషేధం విధించాలని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను కోరింది. వాడిపారేసే వాటర్ బాటిళ్లకు బదులు పునర్వినియోగానికి వీలుండే బాటిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం కింద మున్సిపాలిటీలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వర్సిటీల వైస్ చాన్సలర్లను కోరింది. పాఠశాల విద్యార్థులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచ్‌లు, నదీ తీరాలు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ 19 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాలకు ఈ ఏడాది భారత్ వేదిక కానున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ సూచన చేసింది. -
దేశం గర్వపడేలా చేశారు..!
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు అభినందనలు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు. బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు. రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్ వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు. ‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు. -
రోస్టర్ అమలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రభు త్వం ఆమోదం తెలిపిన 1,061 పోస్టులను జూన్‌లోగా భర్తీ చేయాలని ఓవైపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించడం.. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో కొత్త నిబంధనలు తేవడంతో వర్సిటీ అధికారులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. పోస్టుల భర్తీలో కచ్చితంగా కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని యూజీసీ పేర్కొనడంతో ఇప్పుడేం చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. ఇప్పటివరకు వర్సిటీ యూనిట్‌గా పోస్టుల భర్తీలో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్నాయి. అది సరికాదని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దానిపై యూజీసీ ఉన్నత స్థా యి కమిటీని ఏర్పా టు చేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టు వారీగా, డిపార్ట్మెంట్ వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమ లు చేయాలని యూజీసీ ఈ నెల 5వ తేదీన అన్ని వర్సిటీలకు ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీని ఎలా చేపట్టాలన్న ఆలోచనలో అధికారులు పడ్డారు. సబ్జెక్టు, డిపార్ట్మెంట్ వారీగా రోస్టర్‌ను రూపొందించడం, న్యాయ వివాదాలు తలెత్తకుండా చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. నెలాఖరులోగా నోటిఫికేషన్ల జారీ అసాధ్యం! డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్లలోనే పోస్టులను భర్తీ చేసుకోవాలని, అవసరం లేని డిపార్ట్మెంట్ల నుంచి పోస్టులను అవసరం ఉన్న డిపార్ట్మెంట్లకు మార్పు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ పరిస్థితుల్లో పోస్టుల కన్వర్షన్, కొత్త రోస్టర్ విధానం రూపొందించి, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదన్న భావనకు వర్సిటీలు వచ్చాయి. -
వర్సిటీల్లో రిజర్వేషన్లకు కోత!
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం యూనివర్శిటీల వారీగా రిజర్వేషన్లు ఉండగా వీటికి బదులు శాఖల్లోని పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్ అమలుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రిజర్వేషన్ విధానంలో యూనివర్శిటీకి బదులుగా ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం కోసం యూజీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఓకే చెప్పిందని, త్వరలో నోటిఫికేషన్రానుందని సమాచారం. అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు.. అలహాబాద్ హైకోర్టులో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకం కేసు విచారణ సందర్భంగా గత ఏప్రిల్‌లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం యూనివర్శిటీని ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లతో ముడిపడిన పది కేసుల్లో కోర్టు తీర్పుల్ని అధ్యయనం చేసిన అనంతరం.. అలహాబాద్ కోర్టు తీర్పును అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తింపచేయవచ్చని యూజీసీ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం యూనివర్శిటీల వారిగా రిజర్వేషన్ వర్గాలకు అధ్యాపక పోస్టుల్ని నిర్ణయిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒకే గ్రేడ్ పోస్టుల్ని(ఉదా: అసిస్టెంట్ ప్రొఫెసర్) లెక్కించి రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఒక శాఖలో ఒకే గ్రేడ్‌కు చెందిన మొత్తం పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ శాఖలో ఒకే ప్రొఫెసర్ పోస్టుంటే రిజర్వేషన్ అమలుకాదు. అలా కాకుండా యూనివర్సిటీలోని అన్ని శాఖల పోస్టుల్ని కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కొన్ని పోస్టులు దక్కుతాయి. రిజర్వేషన్ వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 2016 ప్రభుత్వ నివేదిక ప్రకారం...కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కలిపి ప్రతి వంద మంది టీచర్లలో ఏడుగురు మాత్రమే అణగారిన వర్గాల వారున్నారు. మొత్తం 716 యూనివర్శిటీలు, 38,056 కాలేజీల్లోని 14.1 లక్షల టీచర్లలో ఎస్సీలు 1.02 లక్షలు(7.22 శాతం), ఎస్టీలు 30 వేల(2.12 శాతం) మంది ఉన్నారు. గత ఏప్రిల్ వరకూ 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 17,106 టీచింగ్ పోస్టుల్లో 5,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాల్లో త్వరలో చేపట్టనున్న 1,061 అధ్యాపక నియామకాల్లో 100 మార్కుల వెయిటేజీతో స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెట్/స్లెట్/సెట్ ఉన్న సబ్జెక్టులకు రాత పరీక్ష లేకుండానే వెయిటేజీ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని సూచించింది. ఈ మేరకు ఈనెల 19న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య నియామకాల మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో 2ను జారీ చేశారు. ఇందులో గరిష్టంగా 50 మార్కులు అకడమిక్ రికార్డులకు, 30 మార్కులు సబ్జెక్టు నాలెడ్జి, టీచింగ్ స్కిల్స్‌కు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించాలని స్పష్టం చేశారు. నెట్/స్లెట్/సెట్ లేని సబ్జెక్టులకు రాత పరీక్ష నెట్/స్లెట్/సెట్ లేని టెక్నికల్/ఇంజనీరింగ్/ఇతర ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష సిలబస్, పరీక్ష విధానం గేట్ తరహాలో ఉంటుంది. అయితే ఆ 100 మార్కులకు వాటిని 14 మార్కులకు నార్మలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థికి పీహెచ్డీ ఉంటే పీహెచ్‌డీకి 7 మార్కులను కేటాయించాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులను మాత్రం మరో 7 మార్కులకు నార్మలైజ్ చేయాలి. మార్గదర్శకాల్లోని మరిన్ని అంశాలు.. పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశాక, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి యూనివర్సిటీ.. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సబ్జెక్టు వారీగా స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత సబ్జెక్టు డీన్, వైస్ చాన్స్‌లర్ నామినీ, ఇతర యూనివర్సిటీల నుంచి సబ్జెక్టు నిçపుణుడు, ఉన్నత విద్యా మండలి నామినేట్ చేసే సబ్జెక్టు నిపుణుడు, డిపార్ట్మెంట్ హెడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఉండాలి. -
యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్ సింగ్
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్‌ను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డైరెక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. కాగా, ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. -
ఆ 30వేల మంది ఇంజినీర్లకు అర్హత పరీక్ష
న్యూఢిల్లీ: డీమ్డ్ వర్సిటీల్లో దూరవిద్యలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారంతా తిరిగి తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (రాజస్తాన్), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ (తమిళనాడు) దూరవిద్య విధానం ద్వారా 30వేల మందికి ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అయితే, ఈ పట్టాలు చెల్లవంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరిగే ఈ పరీక్ష రాయాలనుకునే వారు జనవరి 15లోగా పేర్లను నమోదు చేయించుకోవాలని కోరింది. ఇందులో పాసైన వారికే ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొంది. -
‘దూర విద్య’ ఇంజినీరింగ్ పట్టాలు రద్దు
న్యూఢిల్లీ: దూర విద్య ద్వారా నాలుగు డీమ్డ్ యూనివర్సిటీలు అందించిన ఇంజినీరింగ్ పట్టాలను యూజీసీ రద్దు చేసింది. ఈ జాబితాలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్, తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీల ఇంజినీరింగ్ డిగ్రీలను సస్పెండ్ చేస్తున్నట్లు యూజీసీ కార్యదర్శి పీకే థాకూర్ చెప్పారు. డిగ్రీలు రద్దయిన విద్యార్థులకు 2018 జనవరి 15లోగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
యూనివర్సిటీ అనే పదం వాడుకోరాదు
సాక్షి, అమరావతి : దేశంలోని డీమ్డ్ యూనివర్సిటీలుగా ఉన్న సంస్థలు విశ్వవిద్యాలయాలు(యూనివర్సిటీలు)గా పేర్కొంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఇకపై అవి యూనివర్సిటీలుగా కాకుండా డీమ్డ్ వర్సిటీలుగానే తమ పేర్లను స్పష్టంగా పేర్కొనాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశిం చింది. ఈ మేరకు ఆయా డీమ్డ్ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు, డైరెక్టర్లకు లేఖ రాసింది. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసులో విచారణ సందర్భంగా ఈ సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలుగా కాకుండా యూనివర్సిటీల పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిందని యూజీసీ పేర్కొంది. ఇకపై ఆయా సంస్థలు యూనివర్సిటీలుగా పేరును వాడరాదని, డీమ్డ్ యూనివర్సిటీలుగానే తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టంచేసింది. దేశంలో ఇలాంటి సంస్థలు 123 ఉన్నాయని గుర్తించామంటూ.. వాటి వివరాలను తన లేఖలో పొందుపరిచింది. వీటిలో ఐదు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. విశాఖపట్నంలోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గీతం), గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్, అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఉన్నాయి. -
‘జంతు’ ప్రయోగాలపై యూజీసీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నియమించిన కమిటీ దగ్గర నమోదు కాకుండా కొన్ని విశ్వవిద్యాలయాలు జంతువులపై ప్రయోగాలు నిర్వహించడంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయోగాల నిమిత్తం జంతువులను కోయడాన్ని 2014లోనే నిషేధించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి పీకే ఠాకూర్ అన్ని విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లకు లేఖ రాశారు. విశ్వవిద్యాలయాలతో పాటు అనుబంధ కళాశాలల్లో జంతువులను చంపటాన్ని నిలువరించాలని ఆదేశించారు. ప్రయోగాల కోసం జంతువులను కోయడానికి, వాటి పునరుత్పత్తికి కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యానిమల్స్(సీపీసీఎస్ఈఏ) కమిటీ వద్ద వర్సిటీ లు నమోదుకావాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. లైఫ్ సైన్సెస్, జంతుశాస్త్రం కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు నిబంధనల మేరకు జంతువులపై ప్రయోగాల కోసం సీపీసీఎస్ఈఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
‘విశిష్ట’ హోదాకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విశిష్ట’(ఎమినెన్స్) హోదా కోరే విద్యా సంస్థల నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారత విద్యా సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి 20 ప్రపంచస్థాయి సంస్థల (ప్రభుత్వ రంగంలో 10, ప్రైవేట్ రంగంలో 10)ను ఏర్పాటుచేయాలని మానవ వనరుల శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇలా ఏర్పడబోయే ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో కేంద్రం పదేళ్ల కాలానికి రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సాధారణ గ్రాంట్లకు ఈ నిధులు అదనం. వీటి ఏర్పాటుకు ఆసక్తి ఉన్న సంస్థలు 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
భావచౌర్యం కట్టడికి యూజీసీ కొత్త విధానం!
న్యూఢిల్లీ: భావచౌర్యాన్ని కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించింది. విద్యార్థులు బాధ్యతగా కొత్త అధ్యయనాలు చేసేందుకు, కాపీ కొట్టకుండా పరిశోధనా వ్యాసాలు రాసేందుకు ఈ చర్య దోహదపడనుంది. ఒకే తరహా వ్యాసాలను గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముసాయిదా పేర్కొంది. ఇతరుల వ్యాసాలను కాపీ కొట్టకుండా, అంతగా అవసరమైతే మూల వ్యాసం రాసిన వారి అనుమతి తీసుకుని ఆ సమాచారాన్ని వాడుకునేలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కళాశాలల యాజమాన్యాలు సూచనలివ్వాలనే నిబంధన ముసాయిదాలో ఉంది. పరిశోధన సాగించడం, ప్రాజెక్టు వర్కు పూర్తి చేయడం, వ్యాసాలు రాయడం తదితర అంశాలపై కళాశాలలు అవగాహాన సదస్సులు నిర్వహించాలని ముసాయిదా పేర్కొంటుంది. -
రూ.42 వేలపైనే వేతనం!
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల పెంపునకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచే ప్రక్రియ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కుదరదని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికను పరిశీలించడంతోపాటు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలను ఏ మేరకు పెంచాలన్న విషయంపై అధ్య యనం చేసి నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్టీ యూ, ఉస్మానియా, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీలు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ సీతారామరావుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధ్యయనం దాదాపు పూర్తయింది. కాంట్రాక్టు అధ్యాపకులకు కనీసంగా నెలకు రూ.42 వేలకు పైగా వేతనాలు ఇచ్చేలా కమిటీ తమ నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం వర్సిటీల్లో కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే గౌరవ వేతనాలు వస్తున్నాయి. మరికొందరికి రూ.35 వేల వరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు పని చేస్తున్న కాలాన్ని బట్టి సీనియారిటీ ఆధారంగా ఆ వేతనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన తక్కువ సీనియారిటీ కలిగిన అధ్యాపకునికి కూడా నెలకు రూ.45 వేలకు పైగా వేతనాలు వచ్చే అవకాశం ఉంది. 2,500 మందికి ప్రయోజనకరం..: ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 10న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆయన రాగానే నివేదికను అందజేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదంతో వేతనాల పెంపునకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో 2,500 మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వారందరికి ప్రయోజనం చేకూరనుంది. -
నగదు రూపంలో ఫీజులు వద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. విద్యార్థుల ఫీజుతో పాటు పరీక్ష ఫీజులు, ఉద్యోగులకు జీతాలతో పాటు వ్యాపారులకు చెల్లింపుల్ని డిజిటల్ రూపంలోనే చేయాలని తెలిపింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ నివేదికలు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
డబ్బు రూపంలో ఫీజులు తీసుకోవద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.