under 19 cricket
-
T20 World Cup 2025: సూపర్ సిక్స్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన శ్రీలంక
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది. మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. తాజాగా శ్రీలంక ఆసీస్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్కు చేరాయి. జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బే (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెక్కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. -
T20 World Cup: త్రిష ఆల్‌రౌండ్ షో.. భారత్ ఖాతాలో వరుసగా ఐదో గెలుపు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో (ICC Under 19 Women's T20 World Cup 2025) భారత్ (India) వరుసగా ఐదో విజయం సాధించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాట్‌తో విధ్వంసకర శతకం బాదిన త్రిష.. ఆతర్వాత బంతితోనూ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.అనంతరం 209 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయూషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాశించారు. ఆయూషి, వైష్ణవి శర్మ, త్రిష వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆయూషి 3 ఓవర్లలో 8 పరుగులు.. వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు.. త్రిష 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 12 పరుగులకు మించి చేయలేదు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క ప్రత్యర్థి కూడా కనీసం మూడంకెల మార్కును చేరుకోలేకపోయింది. వెస్టిండీస్ 44, మలేసియా 31, శ్రీలంక 58, బంగ్లాదేశ్ 64, తాజాగా స్కాట్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్ లారెన్స్ (6 నాటౌట్), జెమ్మా బోతా (6 నాటౌట్) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు. పెను సంచలనంనిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది. -
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
పసికూనపై విరుచుకుపడిన టీమిండియా... భారీ విజయం
అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్ ఆయుశ్ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్ బ్యాటర్ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్) రాణించగా.. స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వంశ్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్.. భారత బౌలర్లు యుధాజిత్ గుహ (7-3-9-1), హార్దిక్ రాజ్ (8-2-9-2), చేతన్ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ ఇన్నింగ్స్‌లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్ హింజే (35 నాటౌట్), నిహార్ పర్మార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
వికెట్ తీసిన ఆనందంలో అతి చేశాడు.. మైదానంలో నుంచి మోసుకెళ్లారు..!
వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఆదివారం నేపాల్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ బౌలర్ యువరాజ్ ఖాత్రి వికెట్ తీసిన ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు. A twist of fate 🫣When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024ఓసారి సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్‌ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ 4 వికెట్లతో మెరిసినా నేపాల్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో జపాన్ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది. -
Asia Cup 2024: శతక్కొట్టిన కెప్టెన్.. టీమిండియా భారీ స్కోర్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జపాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (118 బంతుల్లో 122; 7 ఫోర్లు) కదం తొక్కాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించారు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 23 పరుగులకే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వన్ష్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్, పాక్, జపాన్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో తలపడుతున్నాయి. ఇవాళే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) సెంచరీల మోత మోగించారు. -
అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ తెలుగు హీరో శ్రీ విష్ణు మాత్రం క్రికెటర్ కాబోయి హీరో అయినట్లు ఉన్నాడు. గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన క్రికెట్ కెరీర్ గురించి బయటపెట్టాడు. అదే టైంలో అంబటి రాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)అతిథి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇతడు నాలుగు పాత్రల్లో నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్లో తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశాడు.తాను ఆంధ్రా జట్టు తరఫున అండర్-19 క్రికెట్ ఆడానని, తన టైంలో అంబటి రాయుడు.. హైదరాబాద్ తరఫున ఆడేవాడని, అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్‌గా నటించాడు. రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Permit Room (@thepermitroommedia) -
ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేసిన భారత్
అండర్-19 యూత్ వన్డే సిరీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (71), ఓపెనర్ రుద్ర పటేల్ (77) అర్ద సెంచరీలతో రాణించగా.. హర్వంశ్ సింగ్ (46), కిరణ్ చోర్మలే (30), హార్దిక్ రాజ్ (30) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఎయిడెన్ ఓ కాన్నర్ 4 వికెట్లు పడగొట్టగా.. లాచ్లన్ రనాల్డో 2, క్రిస్టియన్ హోవ్, హ్యారీ హొయెక్స్ట్రా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ ఒలివర్ పీక్ (111), స్టీవెన్ హోగన్ (104) సెంచరీలతో కదంతొక్కడంతో లక్ష్యానికి చేరువగా వచ్చింది. అయితే ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ సైతం గట్టిగానే పోరాడింది. ఒలివర్ పీక్, స్టీవెన్ హోగన్ మూడో వికెట్‌కు 180 పరుగులు జోడించి ఆసీస్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించారు. ఆఖర్లో ఎయిడెన్ ఓ కాన్నర్ (35) వేగంగా పరుగులు సాధించినప్పటికీ ఆసీస్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్ 3, కిరణ్ చోర్మలే, యుద్దజిత్ గుహ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో భారత యువ జట్టు తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్ అనంతరం సెప్టెంబర్ 30 నుంచి తొలి టెస్ట్.. అక్టోబర్ 7 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి.చదవండి: కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..! -
ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా
ఆస్ట్రేలియా యువ జట్టుపై భారత అండర్-19 క్రికెట్ టీమ్ ఘన విజయం సాధించింది. రెండో యూత్ వన్డేలో కంగారూ టీమ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది.ఇందులో భాగంగా.. పుదుచ్చేరిలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో వన్డేలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. పుదుచ్చేరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల జోరు.. కంగారూ బ్యాటర్లు బేజారుకంగారూ టీమ్‌లో అడిసన్ షెరిఫ్(39), క్రిస్టియన్ హోవే(28) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహ్మద్ ఎనాన్, కిరణ్ చోర్మాలే రెండేసి వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హార్దిక్ రాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సాహిల్ పరేఖ్ ధనాధన్ సెంచరీఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అండర్-19 జట్టు 22 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్ సాహిల్ పరేఖ్ 75 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రుద్ర పటేల్(10) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు.. సాహిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 50 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. సాహిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిరీస్ భారత్ కైవసంవీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత యువ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. సాహిల్ పరేఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.తుదిజట్లుభారత్రుద్ర పటేల్, సాహిల్ పరేఖ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), మహ్మద్ అమాన్ (కెప్టెన్), కె.పి.కార్తికేయ, కిరణ్ చోర్మాలే, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, మొహ్మద్ ఎనాన్, యుధాజిత్ గుహ,సమర్థ్ నాగరాజ్.ఆస్ట్రేలియారిలే కింగ్సెల్, జాక్ కర్టెన్, అడిసన్ షెరిఫ్, ఆలివర్ పీక్ (కెప్టెన్), అలెక్స్ లీ యంగ్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ హోవే, లింకన్ హాబ్స్, హ్యారీ హోక్స్ట్రా, లాచ్లాన్ రానాల్డో, హేడెన్ షిల్లర్, విశ్వ రామ్ కుమార్.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
మలేషియాలో జరగబోయే మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.Here's the schedule for the ICC U19 Women's T20 World Cup 2025, which will take place in Malaysia.🏆𝐆𝐫𝐨𝐮𝐩 𝐀: India, West Indies, Sri Lanka, Malaysia𝐆𝐫𝐨𝐮𝐩 𝐁: England, Pakistan, Ireland, USA𝐆𝐫𝐨𝐮𝐩 𝐂: New Zealand, South Africa, Africa Qualifier, Samoa𝐆𝐫𝐨𝐮𝐩… pic.twitter.com/8Z690tEO3K— CricTracker (@Cricketracker) August 18, 2024భారత్ గ్రూప్-ఏలో వెస్టిండీస్, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన భారత సంతతి కుర్రాడు
భారత సంతతికి చెందిన విశ్వ రామ్‌కుమార్ అనే కుర్రాడు ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో (సెప్టెంబర్) భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుకు రామ్‌కుమార్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. భారత్ పర్యటనలో ఆసీస్ మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రామ్‌కుమార్ దేశవాలీ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసి ఆసీస్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత సంతతికి చెందిన మరో ఇద్దరు(హర్జస్ సింగ్, హర్కీరత్ బజ్వా) ఆసీస్ జట్టుకు ఎంపికయ్యారు. భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ ఎగరేసుకుపోయింది.భారత పర్యటనకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు..థామస్ బ్రౌన్, సైమన్ బడ్జ్, జాక్ కర్టన్, రిలే కింగ్సెల్, అలెక్స్ లీ యంగ్, స్టీవెన్ హోగన్, లింకన్ హాబ్స్, హ్యారీ హోయెక్స్ట్రా, క్రిస్టియన్ హోవ్, ఎయిడెన్ ఓ కానర్, ఓలీ ప్యాటర్సన్, ఓలీ పీక్, విశ్వ రామ్‌కుమార్, లాచ్లన్ రనాల్డో, హేడెన్ స్కిల్లర్, అడిసన్ షెరిఫ్ -
సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్‌గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్, పాక్‌లకు పరాభవం
అండర్-19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్‌ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్‌కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్‌తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్‌కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్‌కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్‌లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సంచలన ప్రదర్శనలతో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నియామ్ హోలాండ్ (10), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (19), అలెక్సా స్టోన్‌హౌస్ (11), సోఫీ స్మేల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కూడా ఆరంభంలోనే తడబడుతుంది. 3.4 ఓవర్లలోనే భారత జట్టు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 27/2గా ఉంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా చరిత్ర సృష్టించేనా..?
ICC Under 19 Womens T20 World Cup 2023: సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొట్టతొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్,ఇంగ్లండ్ జట్టు తుది సమరానికి అర్హత సాధించాయి. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను, భారత్.. న్యూజిలాండ్‌ను సెమీస్‌లో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాయి. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జనవరి 29) సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. టోర్నీలో భారత, ఇంగ్లండ్ జట్ల ప్రస్థానాన్ని గమనిస్తే.. ఇరు జట్లు పోటాపోటీగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, తుది సమరానికి అర్హత సాధించాయి. గ్రూప్ దశలో ఇరు జట్లు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. ఈ దశలోనూ ఇరు జట్లు గ్రూప్ టాపర్లుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో యువ భారత జట్టు న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఇంగ్లండ్ అతికష్టం మీద ఆసీస్‌ను 3 పరుగుల తేడాతో ఓడించింది. ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. టీమిండియా ఓపెనర్లు శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో 1 (శ్వేత, 6 మ్యాచ్‌ల్లో 146 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 292 పరుగులు), 4 (షెఫాలీ, 6 మ్యాచ్‌ల్లో ఒకఅర్ధసెంచరీ సాయంతో 157 పరుగులు) స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌లోనూ భారత లెగ్ స్పిన్నర్ పర్షవి చోప్రా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ అమ్మాయి 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. మరో స్పిన్నర్ మన్నత్ కశ్యప్ కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఈ అమ్మాయి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టింది. -
మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అతని చిన్ననాటి మిత్రుడు, భారత అండర్ 19 జట్టు మాజీ సభ్యుడు ప్రదీప్ సాంగ్వాన్ ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో షేర్ చేసుకున్నాడు. జూనియర్ క్రికెట్లో కోహ్లికి రూమ్ మేట్ అయిన సాంగ్వాన్.. 2008 అండర్19 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఓ సంఘటనను తన వ్యాసంలో ప్రస్తావించాడు. చిన్నతనంలో కోహ్లి స్ట్రీట్ ఫుడ్‌ను చాలా ఇష్టంగా తినేవాడని.. కూర్మా రోల్స్, చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను వదిలేవాడుకాదని, 2008కి ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో(అండర్ 19 జట్టుతో) కూడా ఇలానే స్ట్రీట్ ఫుడ్ (మటన్ రోల్స్) కోసం వెళ్లి లైఫ్‌ను రిస్క్ చేశాడని, అందులో నేను కూడా బాధితుడినేనని గుర్తు చేసుకున్నాడు. తమ జట్టు బస చేసే హోటల్‌కు దగ్గర్లో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని తెలిసిన వ్యక్తి చెప్పడంతో కోహ్లి తనను వెంటతీసుకు వెళ్లాడని, ఆ స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రాంతం అంత సురక్షితం కాదని, కొన్ని రోజుల ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని తమ డ్రైవర్ వారించినా కోహ్లి వినలేదని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి వెళ్లి మటన్ రోల్స్‌ను టేస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఎట్టకేలకు తాము ఆ ప్రాంతానికి వెళ్లి రుచికరమైన మటన్ రోల్స్‌ను ఆరగించామని, అయితే తిరుగు ప్రయాణంలో కొందరు దుండగులు తమ కారును వెంబడించారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కాగా, విరాట్ కోహ్లి టీమిండియాలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2012 నుంచి కోహ్లి తన ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా కష్టపడుతుంటాడు. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు పాటిస్తూ సమకాలీకులతో పాటు నేటి తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. చదవండి: పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ అండర్-19 విజేతగా యువ భారత్ నిలిచింది. వరుణుడి ఆటంకాల నడుమ 38 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక యువ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక ఇన్నింగ్స్‌లో యాసిరు రోడ్రిగో(19 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ భారత్.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్ జట్టు.. పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా? -
‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’
బెంగళూరు: ఇటీవల ఆసీస్ గడ్డపై టీమిండియా సాధించిన సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లను భారత జట్టు మాజీ సారధి, ప్రస్తుత భారత అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆకాశానికెత్తాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి టీమిండియాకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించారు. వారి ఆ స్థాయి ప్రదర్శన వెనుక 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ కృషి ఉందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాహుల్ మాత్రం దాంతో ఏకీభవించడం లేదు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ మొత్తం వారికే దక్కాలని ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మైదానంలో కుర్రాళ్లు చూపిన తెగువ, ధైర్యం, ఆట పట్ల నిబద్ధత ఎంతో అద్భుతమని, వారి వ్యక్తిగత ప్రతిభ కారణంగానే కుర్రాళ్లు ఈ స్థాయికి చేరారని ద్రవిడ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత సీనియర్ జట్టులో సభ్యులైన కుర్రాళ్లకు అండర్-19 జట్టు సభ్యులుగా ఉన్నప్పుడు తాను కోచింగ్ ఇచ్చానన్న కారణంగా కుర్రాళ్లు సాధించిన ఘనతను తనకు ఆపాదించడం సమంజసం కాదని అన్నాడు. క్రెడిట్ మొత్తానికి వారు మాత్రమే అర్హులని పేర్కొన్నాడు. కాగా, యువకుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆటలో వారికి మెళకువలు నేర్పించి, కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనకు కారకుడైన ద్రవిడ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. -
పదికి పది వికెట్లు
కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్‌ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు
దుబాయ్: జెంటిల్మెన్ క్రికెట్‌కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
ప్రియమ్ గార్గ్ శతకం: భారత్ శుభారంభం
డర్బన్: నాలుగు దేశాల అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 66 పరుగులతో నెగ్గి శుభారంభం చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సారథి ప్రియమ్ గార్గ్ (110; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో కదంతొక్కాడు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసి ఓడింది. భారత బౌలర్ సుశాంత్ మిశ్రా 4 వికెట్లతో రాణించాడు. -
36 ఏళ్ల తర్వాత పవన్ షా
హంబన్‌టోటా: శ్రీలంకతో జరుగుతున్న అండర్-19 రెండో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా కదం తొక్కిన సంగతి తెలిసిందే. పవన్ షా 332 బంతుల్లో 33 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 282 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ యూత్ టెస్టు మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంచితే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ఈకేవీ పెరీరా వేసిన 108 ఓవర్లో వరుస ఆరు బంతుల్ని ఫోర్లగా మలచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా ఒక ఓవర్లో ఆరు బంతుల్ని ఆరు ఫోర్లుగా కొట్టిన రెండో భారత ఆటగాడిగా షా అరుదైన రికార్డును లిఖించాడు. చివరిసారి 1982లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ పాటిల్ ఒక ఓవర్లో ఆరు ఫోర్లుగా కొట్టగా, 36 ఏళ్ల తర్వాత ఆ ఘనతను పవన్ షా అందుకున్నాడు. కాగా, ఆనాటి టెస్టు మ్యాచ్‌లో నో బాల్ సాయంతో ఏడు బంతుల్ని ఎదుర్కొని సందీప్ పాటిల్ ఆ ఘనత సాధించగా, పవన్ షా వరుస బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. చదవండి: పవన్ షా డబుల్ సెంచరీ -
పవన్ షా డబుల్ సెంచరీ
హంబన్‌టోటా: రెండో రోజూ బ్యాట్స్‌మెన్ కదంతొక్కడంతో... శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతోన్న నాలుగు రోజుల రెండో యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. పవన్ షా (332 బంతుల్లో 282; 33 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అంతర్జాతీయ అండర్–19 మ్యాచ్‌ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. దీంతో భారత్ 128.5 ఓవర్లలో 613/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 428/4తో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ పవన్ షా దూకుడుకు తోడు నేహల్ వధేర (64; 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. లంక సీమర్ విచిత్ర పెరీరా వేసిన ఇన్నింగ్స్ 108వ ఓవర్లో పవన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ట్రిపుల్ సెంచరీకి సమీపంలో పవన్ ఔటవడంతో భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (18 బంతుల్లో 14; 2 ఫోర్లు) రనౌటయ్యాడు. -
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
-
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భాగంగా అర్జున్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన అర్జున్ డకౌట్‌గా ఔటయ్యాడు. అంతకుముందు కమిల్ మిషారాను ఔట్ చేయడం ద్వారా తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం కనీసం పరుగు చేయకుండానే నిష్క్రమించాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే అరంగేట్రంలో మ్యాచ్‌లో సైతం డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. 1989లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ పరుగులేమీ చేయకుండా ఔట్ కావడం గమనార్హం. చదవండి: అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు.. -
అండర్ 19 వరల్డ్ కప్: కివీస్ శుభారంభం
తౌరాంగా(న్యూజిలాండ్):అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న న్యూజిలాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 39.3 ఓవర్లలో రెండు వికెట్లతో ఛేదించి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో అలెన్(115 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు ఓపెనర్ భులా(83) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సిమ్మన్స్(92 నాటౌట్), మెలియస్(78) మినహా ఎవరూ ఆకట్టకోలేకపోవడంతో విండీస్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. -
శ్రీలంక 'మిస్టరీ' స్పిన్నర్!
కొలంబో: పాల్ ఆడమ్స్ గుర్తున్నాడా?, 1995 కాలంలో పాల్ ఆడమ్స్ బౌలింగ్ యాక్షన్ ఒక సంచలనం. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ చైనామన్ బౌలర్ తన యాక్షన్ తో విశేషంగా ఆకట్టుకునేవాడు. కనీసం పిచ్‌ను చూడకుండా అతనెలా బౌలింగ్ చేస్తున్నాడో అని అంతా ఆశ్చర్యపోయేవారు. దాదాపు దశాబ్దపు కాలం పాటు టెస్టు క్రికెట్ ఆడిన ఆడమ్స్ 45 టెస్టు మ్యాచ్ ల్లో 134 వికెట్లు తీసాడు. ఇదిలా ఉంచితే, ఇప్పుడు అతన్ని మైమరిపించే బౌలర్ శ్రీలంకలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుడిచేతి వాటం స్పిన్నర్ కెవిన్ కొత్తిగొడ.. ఆడమ్స్‌ను తలపించే బౌలింగ్ యాక్షన్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. మలేసియాలో జరుగుతున్న అండర్-19 ఆసి యా కప్‌లో కెవిన్ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్న కెవిన్.. శ్రీలంక జాతీయ జట్టుకు త్వరలోనే ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 'మిస్టరీ' స్పిన్నర్ ఎంతవరకూ రాణిస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. -
ప్రజ్ఞయ్ రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించారు. కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (285 బంతుల్లో 212; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా, ఎ. వరుణ్ గౌడ్ (233 బంతుల్లో 165; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో చెలరేగడంతో హైదరాబాద్ రెండోరోజు ఆటలో భారీస్కోరును సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 308/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 155 ఓవర్లలో 4 వికెట్లకు 633 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 69 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ ప్రజ్ఞయ్ రెడ్డి 147 బంతుల్లో సెంచరీని, 276 బంతుల్లో డబుల్ సెంచరీని అందుకున్నాడు. వరుణ్ గౌడ్ 171 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 360 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 603 పరుగుల వద్ద రోహిత్ సింగ్ బౌలింగ్‌లో ఎస్ఎస్ పాల్‌కు క్యాచ్ ఇచ్చి వరుణ్ అవుటయ్యాడు. మరో 3 పరుగుల్లోపే ప్రజ్ఞయ్ రెడ్డి కూడా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త్రిపుర రెండోరోజు ఆట ముగి సే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. తన్మోయ్ దాస్ (26 బ్యా టింగ్), డీబీ దేబ్బర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో సి. రక్షణ్ రె డ్డి, అజయ్‌దేవ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
మరోసారి చెలరేగిన శుభ్‌మాన్
ముంబై: అండర్ -19 వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలోనూ భారత ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. గత వన్డేల్లో శతకంతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మాన్... నాల్గో వన్డేలో భారీ శతకం సాధించాడు. 120 బంతుల్లో 23 ఫోర్లు, 1 ఫోర్ సాయంతో 160 పరుగులు చేశాడు. అతనికి జతగా పృథ్వీ షా (105;89 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 231 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేల్లో ఇంగ్లండ్ గెలవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తో గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ ఫలితం కోసం చివరి వన్డే వరకూ వేచి చూడాలి. -
విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ స్మారక అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెటఖ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టు చాంపియన్ గా నిలిచింది. రాజస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ ను కైవసం చేసుకుంది. ట?స గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థానఖ జట్టు 19.3 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ (21) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో మిక్కీ జైశ్వాల్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 74 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 11.1 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. సాగర్ (25) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బహత్ 2 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం రాణించిన రోహిత్ ‘బెస్ బ్యాట్స్ మన్ ’ పురస్కారాన్ని గెలుచుకోగా... అజయ్ దేవ్ బెస్త్ బౌలర్’, సాగర్ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డులను దక్కించుకున్నారు. సాయి ప్రతీక్, సాయి ప్రణయ్‌లకు ‘బెస్ట్ కీపర్’ పురస్కారం దక్కింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు భట్టి విక్రమార్క, హనుమంతరావు పాల్ఠ్గని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ , క్రికెటఖ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు సాజిద్ పాషా, జనరల్ సెక్రటరీ అమర్జీత్ కుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ విజయం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం తెలంగాణ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (35) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రత్యూష్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తెలంగాణ జట్టు 15.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. చరణ్ (24) పోరాడాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్, అంకేత్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, రాజస్తాన్, జట్లు కూడా సెమీస్‌లో అడుగుపెట్టాయి. -
హైదరాబాద్ విజయానికి 73 పరుగులు
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ)తో రేవా జిల్లాలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో బుధవారం ఆటముగిసే సమయానికి హైదరాబాద్ 78 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది. పి. సారుు వికాస్ రెడ్డి (83) ఆకట్టుకున్నాడు. మికెల్ జైశ్వాల్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో రితేశ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 159/7తో మూడోరోజు రెండో ఇన్నింగ్‌సను కొనసాగించిన ఎంపీసీఏ 71.1 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స ఆధిక్యం 78 పరుగులు కలిపి మొత్తం 265 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ముందుంచింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయం కోసం మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నారుు. తొలి ఇన్నింగ్సలో మధ్యప్రదేశ్ 245 పరుగులకు అలౌటవ్వగా... హైదరాబాద్ 186 పరుగులు చేసింది. -
హైదరాబాద్, జార్ఖండ్ మ్యాచ్ డ్రా
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. 402 పరుగుల లక్ష్య ఛేదనలో... 55/0 ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు రెండో ఇన్నింగ్‌సను కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 132 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులతో నిలిచింది. నితీశ్ రెడ్డి (63), సారుు వికాస్ రెడ్డి (78) అర్ధసెంచరీలు చేయగా... భగత్ వర్మ (37 నాటౌట్) రాణించాడు. జార్ఖండ్ బౌలర్లలో వినాయక్ విక్రమ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్సలో 194 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్‌సను 350 /6 వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 143 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స ఆధిక్యం కారణంగా జార్ఖండ్‌కు 3 పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు 1 పాయింట్ దక్కింది. -
హైదరాబాద్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: మహిళల క్రికెట్ అండర్-19 జోనల్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని సాధించింది. తమిళనాడుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. త్రిష (35), కీర్తి (37), పూజ (32), చిత్ర (40) బ్యాటింగ్‌లో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో శ్వేత 3 వికెట్లతో రాణించింది. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన తమిళనాడు జట్టు 37.2 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో ఫ్లవియా పెరీరా, శ్రవీణ, లక్ష్మిప్రసన్న, పూజ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్ర: 253/7 (దుర్గ 32, అనూష 74, పద్మజ 23, పుష్పలత 71నాటౌట్; దీక్ష 4/62), గోవా: 63 (ప్రవళిక 2/16, భావన 2/16, శ్రీలేఖ 2/13). కర్నాటక: 230/7 (శుభ 102, కె. ప్రత్యూష 30, సి. ప్రత్యూష 57; మిన్ను మణి 4/42), కేరళ: 192/6 (అక్షయ 60, దృశ్య 42, ప్రత్యూష 4/23). -
హైదరాబాద్ బౌలర్లు విఫలం
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. రోజంతా ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టారు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 116 ఓవర్లలో 3 వికెట్లకు 457 పరుగులు చేసింది. మూడోరోజు ఆటలో కెవిన్ (314 బంతుల్లో 217; 39 ఫోర్లు, 1 సిక్సర్) డబుల్‌సెంచరీతో హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఏకంగా 39 బౌండరీలతో చెలరేగాడు. నిఖత్‌జోషి (84) అర్ధసెంచరీ చేశాడు. సచిన్ (28 బ్యాటింగ్), జడేజా (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రసాద్, వినీత్‌రెడ్డి, రిషబ్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్సలో 19 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. -
హైదరాబాద్ 438 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: సౌరాష్ట్రతో జరుగుతున్న కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 154.2 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. 284/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్‌కు షేక్ సొహైల్ (112), జీవీ వినీత్ రెడ్డి (157) సెంచరీలతో భారీ స్కోరును అందించారు. సౌరాష్ట్ర బౌలర్లలో దేవంగ్ 3, కరణ్ 4, ప్రణవ్ కరియా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది. -
పటిష్ట స్థితిలో హైదరాబాద్
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది. రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 91 ఓవర్లలో 3 వికెట్లకు 284 పరుగులు చేసింది. జి. వి. వినీత్ రెడ్డి (273 బంతుల్లో 124 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చందన్ సహాని (58), పి. సాయి వికాస్ రెడ్డి (61) అర్ధసెంచరీలు చేయగా... షేక్ సొహాలి (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.