Union Cabinet
-
కేదార్నాథ్ రోప్‌వేకి కేంద్ర కేబినెట్ ఆమోదం
కేదార్నాథ్ రోప్‌వే నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ .4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్.. 8-9 గంటలు పట్టే కఠినమైన ట్రెక్కింగ్‌ను కేవలం 36 నిమిషాల ప్రయాణానికి తగ్గిస్తుంది. యాత్రికులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.ప్రాజెక్టు వివరాలుసోన్ ప్రయాగ్ నుంచి కేదార్ నాథ్ ను కలుపుతూ రోప్ వే 12.9 కిలోమీటర్లు ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టు ఉపయోగిస్తుంది.ప్రయోజనాలుకేదార్నాథ్ రోప్ వే యాత్రికులకు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. అన్ని రకాల వాతావరణాల్లో 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కాలినడకన, గుర్రాల ద్వారా లేదా హెలికాఫ్టర్ సర్వీసుల ద్వారా 16 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాల్సి వస్తోంది. రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని, నిర్మాణం, కార్యాచరణ దశలలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆతిథ్యం, ట్రావెల్, ఆహార, పానీయాల వ్యాపారాలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.పర్యావరణ, ఆర్థిక ప్రభావంసంప్రదాయ రవాణా విధానాలతో ముడిపడి ఉన్న కేదార్నాథ్ సందర్శనలో పర్యావరణ హితంగా రోప్‌వేను రూపొందించారు. గుర్రాలు, హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా, సుస్థిర ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తూ పెళుసైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.ఆర్థికంగా, కొండ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది.మరో రోప్‌వేకీ గ్రీన్ సిగ్నల్కనెక్టివిటీని పెంచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరో రోప్‌వేకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్‌జి వరకు 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.రూ.2,730.13 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ఈ రోప్‌వేను అభివృద్ధి చేయనున్నారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘంగారియా స్ట్రెచ్ (10.55 కిలోమీటర్లు) కోసం మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (ఎండీజీ) వ్యవస్థ, ఘంగారియా నుంచి హేమకుండ్ సాహిబ్ జీ స్ట్రెచ్ (1.85 కిలోమీటర్లు) కోసం ట్రైకబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) వ్యవస్థతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ రోప్ వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ప్రవేశ ద్వారంగా మారనుంది. -
ఐటీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ 60 ఏళ్లనాటి ఐటీ చట్టం స్థానంలో ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని (ఎస్ఐపీ) కొనసాగించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. దానికి రూ. 8,800 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీఎం కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీఓ 4.0), పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (పీఎం–ఎన్ఏపీఎస్), జన్ శిక్షణ్ సంస్థాన్‌లను ఎస్ఐపీ కింద ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం.కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలుస్కిల్ ఇండియా పథకం 2025 వరకూ పొడిగింపురూ. 8,800 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వంజాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం పొడిగింపు2028 మార్చి 31 వరకూ పొడిగించిన కేంద్రం -
కోల్ కారిడార్‌కు లైన్‌క్లియర్!
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే పరిమితమైన కోల్ కారిడార్ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్‌ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్‌కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉండటంతో.... ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్–మహబూబాబాద్–డోర్నకల్–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్ జంక్షన్ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి. కోల్‌మైన్ టూ పవర్‌ప్లాంట్స్.. రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి కొత్తలైన్ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది. గిరిజిన ప్రాంత ప్రయాణికులకు.. గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. రైటప్: కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గం ఇలా.. -
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్‌కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది. కొత్త లాంచ్ ప్యాండ్ ప్రస్తుతమున్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరా లను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.రెండు ప్యాడ్లపైనే ఆధారంభారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ పాడ్లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్ఎల్వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్ఎల్వీ మిషన్ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదేవిధంగా, 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.రెండో లాంఛ్ ప్యాడ్‌కు బ్యాకప్‌గా..ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్‌కు బ్యాకప్‌ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దన్నుగా నిలువనుంది. నాలుగేళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మూడో లాంఛ్ ప్యాడ్ కేవలం నెక్ట్స్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్‌తో లాంఛ్ వెహికల్ మార్క్–3(ఎల్వీఎం3)వాహనాలకు, అలాగే ఎన్జీఎల్వీ యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంఛ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే. మరిన్ని విశేషాలువిస్తరణ: రెండో లాంచ్ ప్యాడ్‌లో సమ స్యలు తలెత్తిన సందర్భాల్లో జీఎస్ఎల్వీ ప్రయోగా లు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా పనిచేస్తుంది. ఎన్జీఎల్వీ సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు: నూతన తరం లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) కుతుబ్ మినార్‌కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువగా అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా, ఎన్జీఎల్వీ అత్యధిక పేలోడ్‌ను అంటే 70 టన్నుల పేలోడ్‌ను సైతం భూమికి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
8వ వేతన సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ: దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ గురువారం ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తంచేశారు. గురువారం ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే వేతనసంఘాన్ని ఏ తేదీన ఏర్పాటుచేస్తారో ఆయన వెల్లడించలేదు. ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూలవేతనం, దానికి హౌస్ రెంట్ అలవెన్సులు, ఇతరత్రాలు కలుపుకుని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చు. వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలుచేస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. ఏడో వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఏడాది నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు వేతనసంఘాన్ని ఏర్పాటుచేశారు. చివరిసారిగా 2016లో ఏడో వేతన సంఘం అమల్లోకి వచి్చంది. ‘‘ 7వ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలముంది. ఈలోపే పూర్తిస్థాయిలో సలహాలు, స్వీకరించడానికి సరిపడా సమయం ఉండటం కలిసొచ్చే అంశం’’ అని మంత్రి వైష్ణవ్ అన్నారు. జీత భత్యాలు, వేతనాలు, అలవెన్సులు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమిషన్‌దే కీలక పాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో పే కమిషన్ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. తగు సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. ఏడో కమిషన్ ఏం చెప్పింది? ఏడో పే కమిషన్‌ను 2014లో ఏర్పాటుచేయగా అది 2016 జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. 7వ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. నెలకు కనీస వేతనం రూ.18,000 ఉండాలని, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు ఉండాలని సిఫార్సు చేసింది. మూలవేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు రూ.20 లక్షలు ఉండాలని సిఫార్సుచేసింది. అంతకుముందు 2006 ఏడాదిలో వచి్చన ఆరో పే కమిషన్ నెలకు కనీస వేతనం రూ.7,000, కార్యదర్శిస్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం రూ.80,000 చెల్లించవచ్చని సిఫార్సు చేసింది. 1.86 రెట్లు ఫిట్మెంట్ ఉండాలని, గ్రాట్యుటీ రూ.10 లక్షలు ఇవ్వాలని, సరిపడా హౌస్ రెంట్ అలవెన్సు ఇవ్వాలని సూచించింది. అరకోటి మంది ఉద్యోగులకు లబ్ధి జీతభత్యాలను పెంచుతూ ఎనిమిదో కమిషన్ ఇచ్చే సిఫార్సులతో దాదాపు అరకోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబి్ధపొందనున్నారు. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో రక్షణ శాఖతోపాటు ఢిల్లీ రాష్ట్రపరిధిలో పనిచేసే ఉద్యోగులూ ఉంటారు. అంటే ఫిబ్రవరి ఐదున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్ ఏర్పాటు వార్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్ పే కమిషన్ ఏర్పాటుపై హడావుడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలొచ్చాయి. ఏడో పే కమిషన్ సిఫార్సులను అమలుచేయడం వల్ల ప్రభుత్వంపై 2016–17 ఆర్థికసంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల వ్యయభారం పడింది. అయితే పెరిగిన వేతనాలను ఉద్యోగులు ఖర్చుచేయడంతో దేశంలో వినిమయం పెరిగి దేశారి్థకం బాగుపడుతుందనే వాదనలూ ఉన్నాయి. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ప్రతి పదేళ్లకు పే కమిషన్ ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలావరకు పే కమిషన్ సిఫార్సులను పరగణనలోకి తీసుకుని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ఓ నిర్ణయానికొస్తాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు -
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
-
అన్నదాతలకు అండగా..
న్యూఢిల్లీ: రైతన్నలకు మరింత చేయూతనిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. డై అమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ)పై అదనపు రాయితీ గడువును పొడిగించింది. 50 కిలోల డీఏపీ ఎరువు రూ.1,350కి లభించనుంది. ఈ రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ.3,850 కోట్ల భారం పడనుంది. వాస్తవానికి అదనపు రాయితీ గడువు గత ఏడాది డిసెంబర్ 31న ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ ప్యాకేజీ కింద టన్ను డీఏపీ రాయితీని రూ.3,500గా నిర్ణయించారు. గత ఏడాది ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా అమల్లో ఉంది. డీఏపీ ధరను నియంత్రించడానికి ప్రభుత్వం రూ.2,625 కోట్లు ఖర్చు చేసింది. ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా అదనపు రాయితీ గడువును మరోసారి పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. తక్కువ ధరలకే రైతులకు డీఏపీ అందించాలన్నదే లక్ష్యమని స్పష్టంచేసింది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన దేశంలో 2024–25 రబీ, ఖరీఫ్ సీజన్లలో తగినంత డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. రైతన్నలు 50 కిలోల డీఏపీని ఇకపై కూడా రూ.1,350కే కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీ రూ.3,850 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, యుద్ధాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 దాకా ఎరువుల రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2004 నుంచి 2014 దాకా ఇచ్చిన దానికంటే(రూ.5.5 లక్షల కోట్లు) ఇది రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. 28 గ్రేడ్ల ఫాస్ఫేటిక్ అండ్ పొటాసిక్ ఎరువులను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. రెండు పథకాలకు కేటాయింపులు పెంపు రెండు పంటల బీమా పథకాల గడువును కేంద్రం పొడిగించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. రెండు బీమా పథకాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 15వ ప్లానింగ్ కమిషన్ గడువు ప్రకారం 2025–26 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ రెండు బీమా పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ(ఎఫ్ఐఏటీ) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం విశేషం. ఈ నిధికి ప్రభుత్వం రూ.824.77 కోట్లు కేటాయించింది. రెండు పథకాలకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అందుకే వీటికి నిధుల కేటాయింపులు పెంచుతున్నట్లు వివరించారు. పంటల బీమా పథకాల్లో పంటల నష్టం అంచనా, క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగంగా పూర్తిచేయడానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలసీల సంఖ్యలో పీఎంఎఫ్‌బీవై అనేది దేశంలో అతిపెద్ద బీమా పథకం. ప్రీమియంల విషయంలో మూడో అతిపెద్ద పథకం. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ అమలుకు 2020–21 నుంచి 2024–25 దాకా రూ.66,550 కోట్లు కేటాయించగా, 2021–22 నుంచి 20253–26 వరకు ఈ కేటాయింపులను రూ.69,515.71 కోట్లకు పెంచారు. #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Farmers will continue to get DAP at Rs 1,350 per 50 kg bag, which costs more than Rs 3,000 in other countries... This package will cost about Rs 3,850 crore... Since 2014, PM… pic.twitter.com/yUyKNBfxqf— ANI (@ANI) January 1, 2025 #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Rs 800 crore fund for innovation and technology has been created for faster assessment, faster claim settlement, and fewer disputes... To increase coverage and ease enrollment, PM… pic.twitter.com/DAJEGcgWm5— ANI (@ANI) January 1, 2025కొత్త సంవత్సరంలో తొలి నిర్ణయం రైతులకే అంకితం నూతన సంవత్సరంలో కేబినెట్ మొదటి సమావేశంలో తీసుకున్న మొదటి నిర్ణయాన్ని రైతు సోదరులకు, సోదరీమణులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘పంటల బీమా పథకాలకు నిధుల కేటాయింపులు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో ఆమోదించాం. దీనివల్ల పంటలకు మరింత భద్రత లభిస్తుంది. పంటలకు నష్టం వాటిల్లినా రైతులు దిగులు పడాల్సిన అవసరం ఉండదు. డీఏపీపై వన్–టైమ్ ప్రత్యేక ప్యాకేజీ గడువును పెంచడంతో తక్కువ ధరకే ఎరువు లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి వివరించారు. -
జమిలి ఎన్నికలపై కేంద్ర మరో ముందడుగు
-
జమిలి బిల్లుకు సై
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ను సైతం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ఈ రెండు బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు తెలియజేశాయి. బిల్లుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు వివరించారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని, వారిని చైతన్యపర్చాలని ప్రధాని మోదీ సూచించారు. నిజానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశవ్యాప్తంగా మున్సిపాలీ్టలు, పంచాయతీలకు సైతం ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది. కానీ, జమిలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతానికి చేర్చకూడదని కేంద్రం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీతోపాటు కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీలు అంగీకారం తెలియజేయాలి. కేబినెట్ భేటీ అజెండాలో ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ తొలుత లేదని అమిత్ షా చెప్పారు. అయినప్పటికీ దానిపై చర్చించి, ఆమోదించామని అన్నారు. వచ్చే ఏడాదే ఓటింగ్ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీతోపాటు శాసనసభలు ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లో జమిలి ఎన్నికల నిర్వహణకు మూడు చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్–1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియట్ టెరిటరీస్ యాక్ట్–1963, జమ్మూకశీ్మర్ రీఆర్గనైజేషన్ యాక్ట్–2019లో సవరణ చేయడానికి బిల్లు సిద్ధం చేశారు. ఈ మూడు చట్టాలను సవరించే బిల్లు సాధారణమైందే . దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదిస్తే సరిపోతుంది. మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించనున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల అభిప్రాయాలను ఈ కమిటీ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులతోపాటు సాధారణ ప్రజల అభిప్రాయాలు సైతం తెలుసుకోవాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. బిల్లుపై భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరగాలన్నదే ప్రభుత్వ యోచన. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బిల్లుపై వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే? జమిలి ఎన్నికల బిల్లు ప్రత్యేకమైంది. ఇది రాజ్యాంగ సవరణలతో ముడిపడిన వ్యవహారం. బిల్లు నెగ్గాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 243. ప్రస్తుతం కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు మద్దతు పలకాలి. ఎన్డీయేకు 122 మంది సభ్యులున్నారు. ఎగువ సభలో ఖాళీల భర్తీ తర్వాత ఎన్డీయే బలం పెరుగనుంది. లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలున్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. బిల్లుకు అనుకూలంగా కనీసం 361 ఓట్లు రావాలి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే మనుగడ సాగిస్తోంది. ఎన్డీయేకు 293 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కూటమి మరో 68 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. అది అంత కష్టం కాకపోవచ్చు. జమిలి ఎన్నికల విషయంలో రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించగా, 32 పారీ్టలు మద్దతిచ్చాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. కోవింద్ కమిటీ కీలక సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 2023 సెపె్టంబర్ 2న తమ కార్యాచరణ ప్రారంభించింది. రాజకీయ పార్టీలు, భాగస్వామ్యపక్షాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. అందరి అభిప్రాయాలు సేకరించింది. 191 రోజుల కసరత్తు అనంతరం నివేదికను సిద్ధం చేసింది. 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫార్సులను ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫార్సులు ఏమిటంటే.. → దేశంలో గతంలో అమలైన జమిలి ఎన్నికలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చట్టపరమైన కట్టుదిట్టాలు చేయాలి. పటిష్టమైన చట్టం తీసుకురావాలి. → జమిలి ఎన్నికల్లో భాగంగా తొలి అంచెలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. → రెండో అంచెలో మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. → జమిలి ఎన్నికలు పూర్తయ్యాక లోక్‌సభ మొదటి సమావేశానికి తేదీని(అపాయింటెడ్ డే) రాష్ట్రపతి నోటిఫై చేయాలి. ఆ రోజు నుంచే లోక్‌సభ గడువు మొదలవుతుంది. → అపాయింటెడ్ డే ప్రకారమే రాష్ట్రాల అసెంబ్లీలు కొలువుదీరుతాయి. ఆ రోజు నుంచి వాటి గడువు ప్రారంభమవుతుంది. లోక్‌సభ గడువుతోపాటే అసెంబ్లీల గడువు కొనసాగుతుంది. గడువు ముగిసిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికలు చేపట్టాలి. → లోక్‌సభలో హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్త లోక్‌సభను ఎన్నుకోవాలి. → ఈ కొత్త సభ పూర్తి ఐదేళ్లు మనుగడలో ఉండదు. దీని కంటే ముందున్న సభ కాలపరిమితి ముగిసే తేదీ వరకే కొత్త సభ గడువు కొనసాగుతుంది. అంటే పాత సభ గడువే కొత్త సభకు సైతం వర్తిస్తుంది. → రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్తగా కొలువుదీరిన శాసనసభ కాలపరిమితి ఆ సమయంలో ఉన్న లోక్‌సభ గడువు ముగిసే వరకే కొనసాగుతుంది. అనంతరం లోక్‌సభతోపాటే ఆ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. → జమిలి ఎన్నికలకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలి. → వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకోవాలి. ఎప్పుడు జరగొచ్చు? ప్రస్తుత 18వ లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. 2029 కంటే ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శాసనసభల గడువు ముగియనుంది. 2027లో గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మోదీ సర్కారు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. → 2025లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఢిల్లీ, బిహార్ → 2026లో.. అస్సాం, పశి్చమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ → 2027లో.. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ → 2028లో.. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ → 2029లో.. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూకశీ్మర్, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రఇదీ చదవండి: శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..ప్రజాధనం ఆదా: బీజేపీఒకే దేశం.. ఒకే ఎన్నికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రతిఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని ఆయన చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులు ఆపేయాల్సి వస్తోందని, ఇది మంచి పరిణామం కాదని అంటున్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ముగించేస్తే పరిపాలనపై దృష్టి పెట్టడానికి, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. జమిలి ప్రతిపాదనను మోదీ 2016 డిసెంబర్లో తొలిసారిగా తెరపైకి తెచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. బీజేపీ మిత్రపక్షాలు జమిలికి మద్దతు ఇస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలతో ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి.జనం దృష్టిని మళ్లించడానికే జమిలి జపం: కాంగ్రెస్ జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ సర్కారు జమిలి జపం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు జేపీసీ పరిశీలనకు పంపించాలని కోరుతామని అన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పష్టంచేశారు. కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేని ప్రభుత్వం జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. జమిలి బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు తప్పుపట్టారు. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యతిరేకమని తేలి్చచెప్పారు. క్రూరమైన ఈ బిల్లును పార్లమెంట్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ఏయే ఆరి్టకల్స్ సవరించాలి? దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు ప్రధానంగా కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం. → లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83కు సవరణ → రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)కు సవరణ → అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆరి్టకల్ 83(2)కు సవరణ → రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆరి్టకల్ 85(2)(బి)కు సవరణ. → రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దఖలు పరిచే ఆరి్టకల్ 174(2)(బి)కు సవరణ → రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కలి్పంచే ఆర్టికల్ 356కి సవరణ → ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324కి సవరణ నేపథ్యం పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మన దేశంలో కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు చేపట్టాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఏయే దేశాల్లో జమిలి? జమిలి ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లో ఎన్నికల తీరును రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అధ్యయనం చేసింది. జమిలితో మంచి ఫలితాలు వస్తున్నట్లు గుర్తించింది. -
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కీలకమైన జమిలి ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి, ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్ట నున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జమిలి ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.మరోవైపు జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదింపజేసు కోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. -
ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
-
కొత్తగా 85 కేవీలు, 28 ‘నవోదయ’లు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల కాలంలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దేశంలో ప్రస్తుతం 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, ఏపీలో కొత్తగా మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి, వలసపల్లి , పాల సముద్రం, తాళ్లపల్లి నందిగామ, రొంపిచర్ల, నూజివీడు, డోన్లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. -
పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ!
సాక్షి, అమరావతి: కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడం ద్వారా జీవనాడి పోలవరానికి తీరని ద్రోహం చేసిన కూటమి సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంఅడ్డగోలుగా బుకాయిస్తోంది. తమకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలను వల్లె వేస్తూ తాము చేసిన ద్రోహాన్ని వైఎస్సార్సీపీ సర్కారుపై నెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అడ్డగోలుగా అబద్ధాలను వల్లె వేస్తోంది. వాస్తవాలు ఇవిగో..ప్రభుత్వంపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది... మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది... అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. పోలవరం ఎత్తును తగ్గించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే!వాస్తవంపోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) రూ.55,548.87 కోట్లుగా ఖరారు చేసిందని.. దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్సీసీ) రూ.47,725.75 కోట్లుగా లెక్కకట్టిందని పీఐబీ నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి(వ్యయ విభాగం) అధ్యక్షతన నిర్వహించిన కమిటీ చర్చల్లో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు రెండో దశలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం, అనుబంధ పనులు పూర్తి చేయడం... 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పించడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 29న పీఐబీ కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.ఈ నివేదికపై మార్చి 6న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుసుకున్న అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులు ఇస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో పోలవరంపై పీఐబీ ఇచ్చిన నివేదికను చేర్చలేదు. పీఐబీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇవ్వాలనే అంశం ఆర్థిక శాఖ ప్రతిపాదనలో లేదు. దీనిపై నాటి సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. మరి జీవనాడి పోలవరానికి ద్రోహం చేసిందెవరు? కూటమి ప్రభుత్వమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టును తొలి దశ, రెండో దశ అంటూ దశలవారీగా పూర్తి చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని పీపీఏ కుండబద్ధలు కొట్టింది.వాస్తవంవిభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకుంది. ఈ క్రమంలో తాగునీటి విభాగం వ్యయం రూ.4,068 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు ఇవ్వబోమని.. కేవలం నీటిపారుదల విభాగానికి అదీ 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనకు నాడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు మాత్రమే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీతో సమావేశమై.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పనకే రూ.33,168.24 కోట్లు వ్యయం అవుతుందని.. అలాంటప్పుడు రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని... తాజా ధరల మేరకు నిధులిచ్చి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. తాగునీటి విభాగం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని, రెండు ఒకటేనని.. తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ.. వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సూచించారు. దీంతో 2021 జూలై 8న తాగునీటి వ్యయ విభాగాన్ని నీటిపారుదల విభాగంలో కలిపేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ అంగీకరిస్తూ.. ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఏదైనా ఓ ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాది కనీస నీటిమట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత క్రమంగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని 1986 మే 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ.. పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించింది. ఇదే అంశాన్ని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ సమాధానంగా చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామంది. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం పీపీఏ చెప్పిన దాన్ని వక్రీకరించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ అడ్డగోలుగా అబద్ధాలు వల్లె వేసింది.ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఆ ప్రభుత్వం పాపమే కారణం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే వైఎస్ జగన్‌కు లేదు.వాస్తవంటీడీపీ హయాంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 డిసెంబర్లో ఒకేసారి చేపట్టారని.. 2017 జూలై నాటికి 1,006 మీటర్లు.. 2018 జూన్ నాటికి 390.6 మీటర్లు పూర్తి చేశారని.. 2017లో గోదావరి వరదలు డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడం వల్ల కోతకు గురైందని.. 2018లో వరద ఉధృతికి మరింత దెబ్బతిందని తేల్చిచెబుతూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా నిమ్మలా? ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల.. ఆ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ పాపాలు కారణం కాదా? కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా వైఎస్ జగన్ మళ్లించారు.కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను, ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ అనుసంధానాలను.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే శరవేగంగా ప్రధాన డ్యాంను పూర్తి చేస్తామని కేంద్రాన్ని వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో డయాఫ్రం వాల్ భవితవ్యంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో జీవనాడి పోలవరాన్ని జీవచ్ఛవంగా చేసిందెవరు? జీవనాడిగా మార్చిందెవరు?ప్రభుత్వంపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు 2021లోనే జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై మేం అప్పట్లో శాసనసభ లోపలా.. బయటా పోరాటం చేశాం.వాస్తవంపోలవరం స్పిల్ వేను ఇప్పటికే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించామని.. కావాలంటే టేపు తీసుకొని వచ్చి కొలుచుకోవాలని అప్పట్లో శాసనసభలో నాటి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రధాన డ్యాంను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించాలనే ప్రతిపాదన లేనే లేదని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో అటు రాజ్యసభ.. ఇటు లోక్‌సభలో నాటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు రాతపూర్వకంగా కుండబద్ధలు కొట్టారు.రాజ్యసభలో నాటి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ 2023 మార్చి 27న అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 2023 డిసెంబరు 7న అప్పటి ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. దీన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది వాస్తవం కాదా? అప్పట్లో బాబు చేసిన అసత్య ప్రచారాన్నే ఇప్పుడు కేంద్రం ఆయుధంగా మార్చుకుని నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సహజ సాగుకు రూ.2,481 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో 7.5 లక్షల హెక్టార్లలో సహజ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,481 కోట్లతో జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా కోటి మంది రైతులను సహజసాగు దిశగా ప్రోత్సహించనున్నారు. రీసెర్చి వ్యాసాలు, జర్నళ్లను దేశవ్యాప్తంగా ఔత్సాహికులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రూ.6,000 కోట్లతో తలపెట్టిన ‘వన్ నేషనల్, వన్ సబ్ స్క్రిప్షన్’ పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర నిర్ణయాలు... → రూ.7,927 కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు → అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.3,689 కోట్లతో 2 హైడ్రో ప్రాజెక్టులు → అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపు. దాని రెండో దశకు రూ.2,750 కోట్లు → పాన్ 2.0 ప్రాజెక్టుకు రూ.1,435 కోట్లు -
కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్‌కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్‌పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
అస్థిరమైనా ప్రజాస్వామ్యమే మేలు!
జమిలి ఎన్నికల గురించిన చర్చ నేడు దేశంలో వాడిగా, వేడిగా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇటు ప్రజలలోనూ, అటు అనేక రాజకీయ పక్షాలలోనూ అనేక ప్రశ్నలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల వ్యయాలు, రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్లు పాలించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడగలదు. రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా లేకుండా చేయగలదు.జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన లోతుపాతులూ, సాధ్యా సాధ్యాలూ వంటి అంశాలను కాసేపు పక్కన పెడదాం. జమిలి ఎన్ని కల అనుకూల వాదనలకు ప్రాతిపదికగా వున్న కొన్ని అంశాలను చూద్దాం. జమిలి ఎన్నికల వలన పదే పదే ఎన్నికలు జరిగే పరిస్థితి పోయి, ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక వాదన. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొంటుందనేది మరో వాదన. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు గాను, దేశ వ్యాప్తంగా అయిన మొత్తం ఖర్చును సుమారుగా 50 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 2024ల ఎన్నికల ఖర్చు, 2019 నాటి కంటే రెట్టింపై అది సుమారుగా 1–1.35 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంది. ఈ ఖర్చులను పైపైన చూస్తే , ఎన్నికల పేరిట చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చయిపోతోందని అనిపించక మానదు. కానీ, దీన్ని ప్రభుత్వ లేదా ఎన్నికల కమిషన్ వ్యయాలు... పార్టీలు, అభ్యర్థుల వ్యయాలుగా విడగొట్టి చూస్తే వాస్తవం మెరుగ్గా అర్థం అవుతుంది. 2019లోని ఎన్నికల ఖర్చులో, ఎన్నికల కమిషన్ వాటా కేవలం 15% అనేది గమనార్హం. అంటే, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం, 2024లో ఎన్నికల మొత్తం వ్యయంలో 15 వేల కోట్ల రూపా యలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యయంగా ఉంది. ఎన్నికల వ్యయాలలో సింహభాగం నిజానికి ప్రైవేటు అభ్యర్థులది. దీని వలన, అటు దేశ ఖజానాకో, ప్రజల పన్ను డబ్బుకో వచ్చి పడిన ముప్పేమీ లేదు.సమస్య నాయకులకే!నిజానికి, రాజకీయాలు వ్యాపారంగా మారిన నేటి కాలంలో, అభ్యర్థులు చేసే ఈ ఖర్చులు, జనం డబ్బును తిరిగి జనానికి చేరుస్తు న్నాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే, పదే పదే ఎన్నికలు రావడం వలన జనానికి వచ్చిపడే నష్టం ఏమీ లేదు. అది కేవలం రాజకీయ నాయకుల సమస్య. 2024 ఏప్రిల్– జూన్ కాలంలో (2024–25 ఆర్థిక సంవత్సరం తాలూకు తొలి త్రైమాసికం) దేశ ఆర్థిక వ్యవస్థ, సుమారు 21 నెలల మందగమనం తర్వాత, కొంత కోలుకోవడాన్ని గమనించొచ్చు. ఆ కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దాని తాలూకు ఖర్చులు ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఉద్దీపనలుగా పని చేశాయి. బాడుగ కార్లు మొదలుకొని, బ్యానర్లు, పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్‌ల ఖర్చులు, సోషల్ మీడియా ప్రచార ఖర్చులు... వీటితో పాటుగా ఎటుకూడి ‘ఓటుకు నోటు’ను జనానికి అలవాటు చేశారు కాబట్టి, ఆ వ్యయాలు కూడా కలగలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన కావడంలో ఆశ్చర్యం లేదు.ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేసిన అనేక మంది రాజకీయ నేతలు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, జమిలి ఎన్నికల రూపంలో ఐదు సంవత్స రాల సుస్థిర పాలనను హామీ చేసుకోవడం అనేది అటు అభ్యర్థులకూ, ఇటు పాలక పార్టీలకూ వెసులుబాటుగానే కనపడినా... అది ప్రజలకు మాత్రం సుదీర్ఘకాల సాధికారత లేని స్థితినీ, పరిపాలన బాగా లేకున్నా భరించక తప్పని స్థితినీ తెచ్చిపెడుతుంది. ఇక్కడి ప్రశ్న రాజకీయ నాయకులకూ, పాలక పార్టీలకూ వాటి పాలనా అధికార వ్యవధిని గ్యారెంటీ చేసే జమిలి ఎన్నికలు మెరుగా? లేదా... ప్రజలకు ఎంతో కొంత నేతల అందుబాటునూ, సాధికారతనూ హామీ చేసే సజీవమైన అస్థిరతే మెరుగా అన్నది!కాలవ్యవధికి గ్యారెంటీయా?మన దేశంలో ఉన్నది ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థ. మన లోక్ సభ, రాజ్య సభలకు తరచుగా మధ్యంతర ఎన్నికలు వస్తూనే ఉండటం తెలిసిందే. గెలిచిన అభ్యర్థుల మరణాలు, వారి రాజీనా మాలు తదితర అనేక కారణాల వలన కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. కాబట్టి, జమిలి ఎన్నికల పేరిట ఐదేళ్ల పాటు నికరంగా, సుస్థిరంగా పాలించి తీరగలమన్న ఆశ అంత వాస్తవికమై నదేమీ కాదు. పదే పదే ఎన్నికలు రాకుండా నివారించగలిగితే, పాలక పక్షాలు అనేక విధాన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాయన్న వాదన కూడా ఉన్నది. ఇది కేవలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో పాలక పక్షాలకు కావలసిన సుస్థిర పాలనను హామీ చేసే వాదన మాత్రమే. నిజానికి, గతం నుంచి ఇటువంటి వాదన వేరొక రూపంలో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఏ విధంగా పరస్పరం ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకున్నా, ఎన్నికల అనంతరం అటు పాలక పక్షం... ఇటు ప్రతిపక్షమూ రెండూ కలగలిసి దేశ అభ్యున్నతికి పాటు పడాలి అన్నది. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. అధికార పక్షం తాను ప్రాతినిధ్యం వహించే వర్గాల, సమూహాల ప్రయోజనాల కోసం పని చేస్తూ పోతుంటే... మరో పక్కన, భిన్నమైన ప్రయోజనాలు వున్న సామాజిక వర్గాలు, సమూ హాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలు అనివార్యంగా పాలక పక్షంతో తలపడక తప్పని స్థితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించటం పేరిట, యజమానులు లేదా పెట్టు బడిదారులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తే, అది సహజంగానే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సుస్థిరత పేరిట ప్రభు త్వాలకు ఆ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని గ్యారెంటీ చేయడం ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించని ఇతరేతర వర్గాలకు నియంతృత్వంగానే పరిణమించగలదు. సుస్థిర నియంతృత్వమా? అస్థిర ప్రజాస్వామ్యమా?నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాల క్రమంలో, పేద ప్రజలకూ, సామాన్య జనానికీ ఇచ్చే సబ్సిడీలు లేదా రాయితీలపై నిరంతరంగా కోతలు పడుతున్నాయి. ప్రధాని మోదీనే స్వయంగా ‘రేవడి సంస్కృతి’ (ఉచితాల సంస్కృతి)పై చర్చ జరగా లంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. ఈ సంక్షేమ వ్యయాలు లేదా ‘ఉచితాల’ గురించిన చర్చ అంతిమంగా అనేక దేశాలలో పొదుపు చర్యల రూపంలో ఆర్థిక మాంద్య స్థితికీ, అస్థిరతకూ కారణం కావడాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం. గతంలో, అనేక లాటిన్ అమెరికా దేశాలలోనూ... యూరోప్‌లోని గ్రీస్‌లోనూ... ఈ మధ్య కాలంలోనే ఆసియా ఖండంలోని శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలలోనూ సామాన్య జనానికి కల్పించే రాయితీలను పొదుపు చర్యల పేరిట తగ్గించి వేయడం ఏ విధంగా సామాజిక విస్పోటనాలకూ, పోరా టాలకూ దారి తీసిందో చూశాం. ఇటువంటి, ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక నిర్ణయాలను మధ్య మధ్యలో వచ్చి పడే ఎన్నికల లేదా ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్ల పాటు నిరాఘాటంగా తీసుకోగలిగే టందుకు మాత్రమే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడ గలదు. కాబట్టి, ఇప్పటికే ప్రజలకు దూరమైన రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలు, రాజకీయ నేతలను అదుపు చేయగలిగేటందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా, ఈ జమిలి ఎన్నికలు లేకుండా చేసేయగలవు. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఎన్నికల వ్యయాలు లేదా రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. అది, దేశ రాజకీయాలపై సామాన్య జనానికి పట్టు వుండాలా... లేదా కార్పొ రేట్లు, ధనవంతులు లేదా వారి అనుకూల రాజకీయ పక్షాలకు పట్టు ఉండాలా అనే అంశానికి సంబంధించింది అనేది సుస్పష్టం. సుస్థిర ప్రజా వ్యతిరేక పాలన కంటే, నిరంతరంగా ప్రజలకు లోబడిన, వారికి లొంగి వుండే అస్థిర రాజకీయ వ్యవస్థే మేలు.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలుదేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది. -
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం పలు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే. ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు. -
ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్ ధార, ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపిఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజ్ఞాన్ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది.రిటైర్మెంట్కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు. -
పుణె, థానే, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పుణే, థానే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు ప్రాజెక్టుల పొడగింపునకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్–3లో రెండు కొత్త కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 44.65 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లలో మొత్తం 31 సేష్టన్లు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. జేపీ నగర్– కెంపపురా, హోషహళ్లి– కడబగెరే కారిడార్ల నిర్మాణానికి రూ.15,611 కోట్ల ఖర్చు కానుంది. బెంగళూరు పశి్చమ ప్రాంతాన్ని ఈ మెట్రోరైలు ప్రాజెక్టు మెరుగ్గా అనుసంధానిస్తుందని కేంద్రం పేర్కొంది. పుణె మెట్రో ఫేజ్–1లో స్వరగేట్– కాట్రాజ్ భూగర్భ రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. పుణే శివార్లలో కనెక్టివిటీని పెంచే ఈ లైన్–1బి పొడిగింపు ప్రాజెక్టు వ్యయం రూ.2,954 కోట్లని, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును సమంగా భరిస్తాయని తెలిపింది. థానే పశి్చమ ప్రాంతాన్ని కలుపుతూ వెళ్లే.. థానే ఇంటెగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కారిడార్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌లో 22 స్టేషన్లు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,200 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయని వెల్లడించింది. రెండు విమానాశ్రయాల విస్తరణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం రెండు విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసింది. పశి్చమబెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయంలో రూ. 1,549 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. బిహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని రూ. 1,413 కోట్లతో విస్తరించనున్నారు. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
రేపు కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ, సాక్షి: ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు(జులై 3, బుధవారం) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. భేటీ ఎజెండా, అందులో చర్చించబోయే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
Modi 3.0: 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద (పీఎంఏవై) దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయమందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. మోదీ అధికారిక నివాసం ‘7, లోక్ కల్యాణ్ మార్గ్’లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సహా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను తీర్చాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు కనీస సదుపాయాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే నిమిత్తం 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంఏవై పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని కింద గత పదేళ్లలో 4.21 కోట్ల మంది అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివసేన అసంతృప్తి
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.అయితే మోదీ కేబినెట్ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్ పాశ్వాన్, ఒక ఎంపీ కలిగిన జితన్ రాం మాంఝీ, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించారని.. తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్‌కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది. -
మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవరికి ఏ పదవులు?
Updateప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూకి రెండు శాఖలు లభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ సీనియర్ నేతలు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్లను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్‌ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా.. రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ నాథ్ ఠాగూర్ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరించనున్నాయనే అంశంపై సర్వత్రా చర్చనీయాంగా మారింది. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీలక పదవులు కోరుతూ తమతమ డిమాండ్లను మోదీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ తనవద్దనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి పదవులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్నట్లు సమాచారం.ఇక శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్‌లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 242 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్డీయేలో భాగమైన టీడీపీి 16 స్థానాలు, నితీష్‌కుమార్‌కు చెందిన జేడీయూ 14, ఏక్నాథ్ షిండే నేత!త్వంలోని శివసేన 7, లోక్‌జనశక్తి రామ్ విలాస్ 3 చోట్ల విజయం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది. -
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఆ శాఖలన్నీ బీజేపీ వద్దనే!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), శివసేన(ఏక్నాథ్ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్ డెవెలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది. -
మోదీ 3.0 కేంద్ర కేబినెట్.. ఏపీ ఆశావహులు వీళ్లే!
ఢిల్లీ/ గుంటూరు, సాక్షి: కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇవాళ ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపిన బీజేపీ అగ్రనేతలు.. మోదీనే మరోసారి ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు కూడా. అయితే కీలకమైన మంత్రి బెర్తుల పంపకాలపై ఇవాళ్టి భేటీలో ప్రస్తావనేం రాలేదని సమాచారం.మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కేబినెట్లో తమకు తగిన్ని మంత్రి పదవులు, కీలక శాఖలు ఆశిస్తున్నాయి. కేబినెట్ కూర్పునకు ఇంకా టైం ఉండడంతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. నాలుగు కేబినెట్ బెర్తులు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.టీడీపీ నుంచి మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రామ్మోహన్ నాయుడితో పాటు ఏపీ బీజేపీ చీఫ్.. బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీగా నెగ్గిన దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన నుంచి బాలశౌరికి కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో బెర్త్ కోసం గట్టి పోటీనే ఉండొచ్చని తెలుస్తోంది.ఆశావహుల లిస్ట్ పెద్దదేగుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ విశాఖ ఎంపీ భరత్, అమలాపురం ఎంపి జీఎం హరీష్(మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు), ఒంగోలు ఎంపీ మాగుంట, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, అనంతపురం ఎంపి పార్ధసారధి.. ఇంకా కొన్ని పేర్లు ప్రధానంగా వినవస్తున్నాయి. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు కొత్త మెట్రో లైన్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్-4లో భాగంగా ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, లజపతి నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ వరకు నిర్మాణం చేపట్టనుంది. రూ. 8,339 కోట్లతో ఈ రెండు కొత్త కారిడార్ల నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమవేశమైన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు 8.4 కి.మీ మెట్రో లైన్ ఎనిమిది స్టేషన్లను కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కి.మీ పొడవు ఉంటుందని పేర్కొన్నారు. వీటి మధ్య పది స్టేషన్లు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి 29 నాటికి వీటి నిర్మాణం పూర్తవ్వనున్నట్లు చెప్పారు. దీనితో రాజధాని మెట్రో నెట్వర్క్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 450 కి.మీకి విస్తరించనుంది. ప్రధాని మోదీ అధ్యతన సమవేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి: బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం -
టెలికం స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సేవల కోసం ఉద్దేశించిన ఎనిమిది బ్యాండ్లలో స్పెక్ట్రమ్ వేలాన్ని బేస్ ధర రూ.96,318 కోట్లపై నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. దివాలా పరిష్కార చర్యల పరిధిలోకి వచి్చన కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ ఈ ఏడాదితో గడువు తీరిపోనుండగా, దీన్నీ వేలం వేస్తుంది. -
Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది. ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం. ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు. ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
‘ఉజ్వల’ లబ్దిదారులకు మరో రూ.100 రాయితీ
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని మరో రూ.100 పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై మొత్తం రాయితీకి రూ. 300కు చేరుకుంది. ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచి్చన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 12 రాయితీ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.200 చొప్పున కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీని మరో రూ.100 పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ కోసం రూ.703 ఖర్చు చేస్తున్నారు. ఇకపై రూ.603 చొప్పున వెచి్చంచాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన లబి్ధదారులకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం శుభపరిణామం
సాక్షి, హైదరాబాద్: మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని, రాజకీయాలకతీతంగా ఈ బిల్లుకు మద్దతిద్దామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని..మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు. -
కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సహా స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు. జీ20 సదస్సు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆమోదించిన నిర్ణయాలు: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం. * మొత్తం ఖర్చు తామే భరిస్తామని తెలిపిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. * 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామన్న అనురాగ్ ఠాకూర్. * దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ సిస్టమ్ ఉపకరిస్తుందన్న కేంద్రం. * యబిలిటీ గ్యాప్ ఫండింగ్ వల్ల రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్ర మంత్రి. * ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ స్కీమ్ (IDS) 2017 కింద హిమాచల్, ఉత్తరాఖండ్ లో పరిశ్రమల అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వనున్న కేంద్రం. * రూ.1,164 కోట్లు కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్‌కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
రెండోలైన్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని రెండు ప్రధాన రూట్లతో రైల్వే ప్రాజెక్టులకు లైన్‌క్లియర్ అయ్యింది. ముద్ఖేడ్–మేడ్చల్–మహబూబ్‌నగర్–డోన్, గుంటూరు–బీబీనగర్ సెక్షన్ల మధ్య రెండో రైల్వేలైన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ రెండు రైల్వే రూట్లలో ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల క్రితమై మంజూరై, సర్వేలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏడు ప్రాజెక్టులకు మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ల అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే ముద్ఖేడ్– డోన్, గుంటూరు– బీబీనగర్ ప్రాజెక్టులను రూ. 7,539 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు మంజూరు చేస్తారు. ► సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ వరకు డబ్లింగ్ పనులు రెండు భాగాలుగా కొనసాగుతాయి. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే...సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రెండోదశ కింద రెండో లైన్ పూర్తయింది. ఇప్పుడు మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వయా నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ► ఇక సికింద్రాబాద్ టు డోన్ రూట్లో ఇప్పటికే మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తయింది. ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రెండో రైల్వేలైన్ పనులు చేపడతారు. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్లో ప్రస్తుతం సింగిల్ రూట్ ఉన్న కారణంగా లైన్ సామర్థ్య వినియోగం 167 శాతానికి చేరుకుంది. ట్రాఫిక్ అధికంగా ఉండటం, సామర్థ్యానికి మించి రైళ్లు తిరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డిమాండ్ దృష్ట్యా కొత్త రైళ్లు నడపటం సాధ్యం కావటం లేదు. దీంతో డబ్లింగ్ అనివార్యమైంది. మూడేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరు చేసినా, నిధుల విడుదలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ► ముద్ఖేడ్ ఆవల మన్మాడ్ వరకు వెళ్లి ప్రధాన ట్రంక్ లైన్‌తో కలుస్తుంది. ముద్ఖేడ్ తర్వాత పర్బణి–మన్మాడ్ మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, ఇప్పుడు ఈ పనులు మొదలవుతున్నాయి. ఇది పూర్తయితే, అటు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి అనుసంధానం అయ్యే ప్రధాన ప్రత్యా మ్నాయ మార్గంగా మారుతుంది. అప్పుడు బెంగుళూరు–హైదరాబాద్–ముంబై ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల సంఖ్య పెరగటంతోపాటు వాటి వేగం పెరుగుతుంది. ట్రంక్ లైన్‌తో పోలిస్తే దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుంది. ► బల్హర్షా–కాజీపేట–సికింద్రాబాద్, కాజీపేట –విజయవాడ సెక్షన్ల మధ్య కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బల్హర్షా–రామగుండం–సికింద్రాబాద్–వాడి– గుంతకల్ సెక్షన్లకు బొగ్గు, స్టీల్ రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. ► హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే రూట్లో బీబీనగర్‌కు డబ్లింగ్ ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు మీదుగా తెనాలి వద్ద ప్రధాన లైన్‌ను కలిసే ప్రత్యామ్నాయమార్గంగా బీబీనగర్–గుంటూరు మధ్య రెండో లైన్ నిర్మా ణానికి రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్రం కనికరం చూపి దానికి నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్– విజయవాడ ప్రధాన లైన్‌పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్రంక్‌లైన్ సామర్థ్యానికి మించి 137 శాతం వినియోగంలో ఉంది. ఫలితంగా కొత్త రైళ్లు నడిపేందుకు కష్టంగా మారింది. ౖòప్రధాన ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే కీలక ప్రాజెక్టు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గుంటూరు–బీబీనగర్ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం 148 శాతంగా ఉంది. రెండో లైన్నిర్మాణంతో ఆ సమస్య పరిష్కారమై కొత్త రైళ్లు ఆ మార్గంలో మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. కొన్నేళ్లలో ఈ మార్గంలో కొత్తగా సిమెంటు కార్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► ఇనుము–ఉక్కు: చిట్యాల– నార్కట్‌పల్లి . ► సిమెంట్ ప్లాంట్లు: విష్ణుపురం, నడికుడి, తుమ్మలచెరువు, జాన్‌పహాడ్, మేళ్లచెరువు, మఠంపల్లి, జగ్గయ్యపేట, రామాపురం ► థర్మల్ పవర్ ప్లాంట్: విష్ణుపురం సమీపంలో 4000 ఎంవీ థర్మల్ ప్లాంట్ (అందుబాటులోకి రావాలి) ► ఆహార ధాన్యాలు: నాగిరెడ్డిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్‌సీఐలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విష్ణుపురం, నార్కట్‌పల్లి ► గిడ్డంగులు: హైదరాబాద్ చుట్టూ 100కి పైగా వేర్ హౌస్‌లు – గుంటూరు చుట్టూ 50కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► బొగ్గు: రామగుండం, మంచిర్యాల, మందమర్రి ► ఆర్థిక కారిడార్లు: రాయచూరు–దేవరకద్ర, కర్నూలు –పీలేరు, కొడంగల్–మహబూబ్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్–చిట్యాల, సంగారెడ్డి–హైదరాబాద్, ముత్తంగి–మంచిరేవుల ► థర్మల్ పవర్ ప్లాంట్లు: పర్లి వద్ద మహా జెన్కో కర్ణాటకలోని రాయచూర్, యెర్మరస్లో కేపీసీసీ, ఆంధ్రప్రదేశ్‌లోని ముద్దనూరు వద్ద ఏపీజెన్కో ► ఆహార ధాన్యాల తరలింపు ప్రాంతాలు: ముద్ఖేడ్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, నిజామాబాద్, నాందేడ్ , మెదక్, కర్నూలు, గద్వాల, ఇటిక్యాల, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి ► గిడ్డంగులు–శీతల గిడ్డంగులు: నిజామాబాద్, బోధన్ , సారంగాపూర్ , బండమల్లారం , మహబూబ్‌నగర్, గద్వాల ఖోర్దా రోడ్ –విజయ నగరం రూట్లో.. భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖోర్దా రోడ్–విజయనగరం రూట్లో ఒడిశాలోని భద్రక్, జజ్పూర్, ఖోర్దా, కటక్, గంజాం జిల్లాలో 184 కి.మీ, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోని 201 కి.మీ మేర మూడోలేన్ పనులు జరుగుతాయి. దీనికి రూ.5618.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ముద్ఖేడ్ –మేడ్చల్, మహబూబ్‌నగర్ –డోన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ నుంచి ముంబై, పూణె, షిరిడీలతో పాటు నిజామాబాద్ నుంచి బెంగళూరుల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగి, ప్రయాణ మార్గం సులభతరం అవుతుందన్నారు. -
ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..
ముంబయి: ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్ల భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జట్టు కడుతున్న ఇండియా కూటమిని చెదరగొట్టేందుకు అజిత్ పవార్ నేతృత్వంలో వ్యూహం నడుస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తు కుదిరితే శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని వినికిడి. దీనిపై ఆయన ఏం చెప్పారంటే..? పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శరద్ పవార్, అజిత్ పవార్లు భేటీ అయ్యారు. అజిత్ పవార్ వర్గం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిన నెలరోజుల తర్వాత చిన్నాన్న శరద్ పవార్‌ను కలిశారు. అయితే.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమికి షాక్ ఇచ్చే విధంగా శరద్ పవార్‌ను బీజేపీతో కలిసేలా అజిత్ పవార్ ఒప్పించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నారు. ఈ పుకార్లపై మాట్లాడిన శరద్ పవార్.. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది శ్రేయోభిలాషులు తనను బీజేపీతో పొత్తు కుదిరేలా ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్‌తో సమావేశం జరిగినట్లు పేర్కొన్న ఆయన.. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ పెద్దగా తనకు ఏం ఆఫర్ ఇవ్వగలరని అన్నారు. అజిత్ పవార్‌తో సాధారణంగానే సమావేశం జరిగిందని శరద్ పవార్ గతంలో కూడా చెప్పారు. అయితే.. శరద్ పవార్ భేటీ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) కూటమిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరద్ పవార్‌ను భీష్మ పితామహగా పేర్కొన్న ఎంపీ సంజయ్ రౌత్.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఎలాంటి పనులను శరద్ పవార్ చేయరని ధీమా వ్యక్తం చేశారు. ముంబయిలో ఆగష్టు 31న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విభజించడమే బీజేపీకి తెలిసిన పని అని శరద్ పవార్ విమర్శించారు. యథావిధిగా కూటమి భేటీ జరుగుతుందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
3,238 కోట్ల ఖర్చుతో గుంటూరు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు
సాక్షి, ఢిల్లీ: పలు కొత్త పథకాలతో పాటు కీలక నిర్ణయాలకు ఇవాళ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ‘‘పీఎం ఈ - బస్ సేవ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 169 నగరాల్లో 10వేల ఈ - బస్ లు ప్రవేశ పెట్టనుంది కేంద్రం. అలాగే.. 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. ఇక పీఎం విశ్వ కర్మ నూతన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. చేతివృత్తుల వారికి రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం 32,500 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న కేంద్రం వీటిలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు - బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో.. విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేటా బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెడతారని అధికార వర్గాల సమాచారం. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం దీని లక్ష్యం. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం డేటా పరిరక్షణ బిల్లు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు డేటా సేకరణకు ముందు పౌరుల అనుమతి తీసుకోవాలి. -
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు భారత్‌కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 మెడికల్ డివైజ్ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
క్వాంటమ్ మిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి ఉద్దేశించిన నేషనల్ క్వాంటమ్ మిషన్(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ విభాగాల్లో నాలుగు థీమాటిక్ హబ్స్(టీ–హబ్స్) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠినౖ నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు. -
స్పేస్ పాలసీకి ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ పాలసీ–2023కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తోపాటు ఈ రంగంలోని ప్రైవేట్ సంస్థల పోషించాల్సిన పాత్ర, నెరవేర్చాల్సిన బాధ్యతలను ఈ పాలసీ కింద రూపొందించారు. సహజ వాయువు, సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలపై నియంత్రణకు నూతన ప్రైసింగ్ ఫార్ములానూ కేబినెట్ ఆమోదించింది. దీనిప్రకారం దేశంలో పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజ వాయువు (ఏపీఎం గ్యాస్) ధరలే ఇకపై ముడి చమురు ధరలకు సూచికగా ఉంటాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా చమురు ధరల ఆధారంగా మన దేశంలో ధరలను నిర్ణయిస్తున్నారు. -
PACS: సహకార వ్యవస్థ బలోపేతం కోసం..
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మంత్రివర్గం ఇవాళ(బుధవారం) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రధాన నిర్ణయానికి కేబినెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ మీడియాకు వివరించారు. ప్రతీ పంచాయతీలో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మొగ్గుచూపింది. దీని ప్రకారం.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక పీఏసీఎస్(Primary Agricultural Credit Society) ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో మొత్తంగా రెండు లక్షల పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మధ్య తరగతికి చేరువ కండి
మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు. ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మంత్రులకు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్‌లో వివరించారు. -
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు రూ.19,744 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్ , ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్ చెప్పారు. ఈ మిషన్ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైబ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్ సాకారమైతే ఇంధన రంగంలో భారత్ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది. -
కేంద్ర మంత్రి వర్గ కీలక భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గం ఇవాళ(బుధవారం) భేటీ కానుంది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. పలు కీలకాంశాలపై చర్చ కోసమే కేబినెట్ జరగనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మీటింగ్ కూడా ఇవాళ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్‌లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్‌వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్‌ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
‘సోలార్’కు రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే. మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది. భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు. రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ పీఎల్ఐలో మార్పులు సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్వర్క్ చైన్‌లో చిప్ ఫ్యాబ్‌లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. -
కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలో రూ.1,957 కోట్లతో కొచ్చీ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత్–మాల్దీవుల మధ్య ఇటీవల కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎంఓయూ) ఆమోదం తెలియజేసింది. విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఒక దేశంలోని కోర్సులు, విద్యార్హతలను మరో దేశం గుర్తించేలా యూకే–భారత్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను పీఎం–శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 35 ఏళ్లకు రైల్వే భూముల లీజు రైల్వే కొత్త ల్యాండ్ పాలసీ ప్రతిపాదనలో కార్గో, పబ్లిక్ యుటిలిటీ, రైల్వేల ప్రత్యేక వినియోగాల్లో సవరణలు చేశారు. రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానం రాబోయే 90 రోజుల్లో అమలవుతుందని కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఐదేళ్లలో 300 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తాం. తద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కార్గో టెర్మినళ్లతో సరుకు రవాణాలో రైల్వే వాటా కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు. దన్నారు. ఆధునిక విద్యకు పెద్దపీట పీఎం–శ్రీ స్కూళ్లలో ఆధునిక విద్యావిధానం అమలు చేస్తారు. స్మార్ట్ తరగతి గదులు, క్రీడలు, సదుపాయాలపై పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికింద రాష్ట్రాలు, స్కూళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో 18.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అంచనా. -
రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన. Union Cabinet has approved policy on long-term leasing of Railways' Land to implement PM Gati Shakti framework. 300 cargo terminals will be developed in 5 years: Union Minister Anurag Thakur on Union Cabinet decisions pic.twitter.com/i3VEwVSXYs — ANI (@ANI) September 7, 2022 ప్రైవేటీకరణలో భాగంగానే.. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న రైల్వే లీజ్ నిర్ణయాలు.. నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్‌కు ఇవ్వాలని, పీపీపీ పద్దతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది. పీఎం శ్రీస్కూల్స్ కేంద్ర కేబినెట్లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను ఎంపిక చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యావిధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టీకల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది. ఇదీ చదవండి: హెలికాప్టర్ సర్వీస్ పేరిట కుచ్చు టోపీ -
స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ రాయితీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో రుణ వితరణను పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3 లక్షలలోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ భేటీ వివరాలను సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియజేశారు. సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2022–23 నుంచి 2024–25 వరకూ అన్ని రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంప్యూటరైజ్డ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి తీసుకున్న రూ.3 లక్షలలోపు రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రాయితీ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఠాకూర్ చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని 2020 మే నెలలో నిలిపివేశారు. బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు రుణాలిస్తున్నాయి. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును పెంచింది. దీంతో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అందుకే వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీజీఎల్‌ఎస్‌కు మరో రూ.50,000 కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీజీఎల్‌ఎస్)కు 2022–23 కేంద్ర బడ్జెట్లో రూ.4.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మరో రూ.50,000 కోట్లు ఇవ్వనున్నారు. అదనపు సొమ్మును కోవిడ్‌తో దెబ్బతిన్న ఆతిథ్య, అనుబంధ రంగాలకు రుణాలిస్తారు. భారత్–ఫ్రాన్స్ ఒప్పందానికి ఆమోదం భారత రవాణా రంగంలో అంతర్జాతీయ రవాణా వేదిక(ఐటీఎఫ్) కార్యకలాపాలకు ఊతం ఇవ్వడానికి భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022 జూలై 6న ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇకపై అందరికీ టీకేడీఎల్ డేటాబేస్ సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ(టీకేడీఎల్) డేటాబేస్‌ను ఇకపై కేవలం పేటెంట్ అధికారులే కాదు సామాన్యులు ఉపయోగించుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ యూజర్లకు దశలవారీగా ఈ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. చందారూపంలో రుసుము చెల్లించి వాడుకోవచ్చు. -
ఆ రోజు నాలుగు మంత్రి పదవులడిగా.. బీజేపీ ఇవ్వలేదు: నితీశ్
పట్నా: 2019లో కేంద్ర కేబినెట్లో తమ పార్టీకి నాలుగు బెర్తులు కేటాయించాలన్న తమ డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోలేదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అందుకే, తాము కేబినెట్లో చేరకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘మాకు 16 మంది ఎంపీలున్నారు. అందుకే కేబినెట్లో కనీసం నాలుగు మంత్రి పదవులు కావాలని అడిగా. బీజేపీ ఇవ్వలేదు. అదే బిహార్‌లోని ఐదుగురు బీజేపీ ఎంపీలను మంత్రులుగా తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో చెడు సంకేతాలు ఇచ్చినట్లయింది. అందుకే, కేబినెట్లో చేరరాదని నిర్ణయించుకున్నాం’అని వివరించారు. గత ఏడాది తన మాజీ సన్నిహితుడు ఆర్సీపీ సింగ్‌ను తనకు చెప్పకుండానే కేబినెట్లో చేర్చుకున్నారని స్పష్టం చేశారు. అందుకే ఆరు నెలలకే రాజీనామా చేయించినట్లు వెల్లడించారు. చదవండి: (సంక్షోభాలు, విలయాలతో.. అంటురోగాలు) -
5జీ కమింగ్ సూన్: దాదాపు 10 రెట్ల వేగంతో
సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది. 5జీ సేవల బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్‌వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు. ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. కొత్త శకానికి నాంది 5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్‌కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల లభ్యతపై మంగళవారం మోదీ లోతుగా సమీక్ష జరిపారు. అనంతరం అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు’’ అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు ట్వీట్ చేసింది. 2020 మార్చి 1 నాటికి కేంద్రంలో 40.78 లక్షల ఉద్యోగాలు మంజూరు చేయగా 31.91 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు. 21 శాతానికి పైగా ఖాళీలున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ పే అండ్ అలవెన్స్ నివేదిక తెలిపింది. ప్రధాని తాజా ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వివిధ శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీల సంఖ్యను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యువతలో కొత్త ఆశలు: అమిత్ షా ప్రధాని ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగ యువతలో కొత్త ఆశల్ని, కొంగొత్త ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘యువత సాధికారత సాధిస్తేనే మోదీ కలలుగంటున్న నూతన భారత్ ఆవిష్కృతమవుతుంది. అందుకే యుద్ధప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చారు’’ అని చెప్పాన్నారు. నిరర్ధక హామీలు: రాహుల్ మోదీ 10 లక్షల ఉద్యోగాల ప్రకటనను ఉత్తుత్తి మాటలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను మోసగించారు. ఇప్పుడూ అదే తరహాలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటున్నారు’’ అని ట్వీట్ చేశారు. ‘‘మోదీవి మాయ మాటలు. ఉద్యోగాలు కల్పించడం ఆయనకు చేతకాదు. వాటిపై వార్తలు పుట్టించడంలో మాత్రం దిట్ట’’ అంటూ ఎద్దేవా చేశారు. 30 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఎన్నాళ్లిలా మాటలతో బురిడీ కొట్టిస్తారని ప్రశ్నించారు. మోదీ ప్రకటనల ప్రధాని మాత్రమేనని సీపీఎం, బీఎస్పీ దుయ్యబట్టాయి. ఎందుకీ జాబ్ మేళా? ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలివ్వడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం నానాటికి పెరిగిపోతూండటంతో యువతలో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది. ఆర్థిక రంగమూ క్షీణిస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించాలని ఆశపడుతున్న మోదీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. తాజా ప్రకటన అందులో భాగమేనంటున్నారు. వామ్మో నిరుద్యోగం కరోనా, లాక్డౌన్ దెబ్బతో 2022 ఏప్రిల్ నాటికి దేశంలో నిరుద్యోగిత 8.1 శాతానికి చేరింది. ఉద్యోగార్థుల సంఖ్య 1.3 కోట్లు దాటింది. ఎంబీఏలు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు చిన్నా చితక పనులు చేస్తున్నారు. నైపుణ్యమున్నవాళ్లు విదేశీ బాట పట్టారు. దాంతో 2017–2022 మధ్య దేశంలో ఉత్పాదక రంగ కార్మికుల సంఖ్య 46 నుంచి 40 శాతానికి పడిపోయింది. దేశంలో 90% ఉపాధి అవకాశాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో 12.2 కోట్లు, రెండే వేవ్‌లో కోటి మందికి పైగా రోడ్డున పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో ఉద్యోగుల కొరతతో పనులు స్తంభిస్తున్నాయి. కత్తి మీద సామే! ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ కష్టమేనని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఏటా 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నందున 2030 నాటికి 9 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందని మెకెన్సీ గ్లోబల్ నివేదిక వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 6 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. 2005లో 35 శాతమున్న మహిళా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 21 శాతానికి తగ్గింది. వారికీ ఉద్యోగాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. మోదీ ప్రకటన వెనక ఈ కారణాలన్నీ ఉన్నాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: (Corona Virus: 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య) -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలోనే.. 129 ఏళ్ల అనుబంధం
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుందా? రైల్వే జోన్ ఏర్పాటు కోసం డివిజన్ విచ్ఛిన్నం అనివార్యమా?.. అంటే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటనతో అవుననే తేలిపోయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. 129 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విభజనతో నీరుగారిపోతోంది. వాల్తేరు డివిజన్‌ని కొనసాగించాలని ప్రజాప్రతినిధుల విన్నపాలను పక్కన పెట్టడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్.. తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా.. వాల్తేర్ డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. గతంలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్.. ఇప్పుడు రాయగడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుందని కేంద్రం పేర్కొంది. డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలతోపాటు జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..! వాల్తేరే డివిజన్ కీలకం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. భూ సర్వేకు సన్నద్ధం ఇప్పటికే జోన్‌కు సంబంధించిన ఓఎస్డీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఓఎస్డీ ఆధ్వర్యంలో జోన్ ప్రధాన కార్యాలయ సముదాయానికి సంబంధించిన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిగిలిన కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు భూ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. విశాఖలో సమగ్ర వనరులు జోన్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించినా. విశాఖపట్నం సమగ్ర వనరులతో సిద్ధంగా ఉంది. తాత్కాలిక జోనల్ కార్యాలయంగా వాల్తేరు డీఆర్ఎం ఆఫీస్‌ని వినియోగించనున్నారు. శాశ్వత కార్యాలయం నిర్మించాలంటే సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇందుకు అవసరమైన స్థలాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో మెండుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో, ముడసర్లోవ పరిసరాల్లోనూ 70 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి. దీంతో పాటు మర్రిపాలెం, గోపాలపట్నం పరిసరాల్లోనూ స్థలాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు.. ఇప్పటికే విశాఖలో ఆఫీసర్స్ క్లబ్, రైల్వే సంస్థలు, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎన్నో వసతులు ఉన్నాయి. ఉద్యోగులు ఎందరు వచ్చినా వారికి కావల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో.. ఎప్పుడు జోన్ ప్రకటన వచ్చినా ఉద్యోగులు వెంటనే విశాఖకు రావచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలందరం నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా.. మొట్టమొదట కోరేది రైల్వే జోన్ గురించే. కేంద్ర మంత్రివర్గం జోన్ ఏర్పాటుకు ఆమోదించడం హర్షణీయం. అయితే వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరి నిమిషం వరకూ వాల్తేరు డివిజన్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. – ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ ఆర్ఆర్బీ ఏర్పాటుకు కృషి చేస్తాం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఆనందంగా ఉంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదనపు రైళ్లు, రైల్వే లైన్లు వస్తాయి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుకు కావల్సిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి నివేదిస్తాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తీసుకొస్తాం. – డా.బీవీ సత్యవతి, అనకాపల్లి ఎంపీ వాల్తేరు డివిజన్ కొనసాగించాల్సిందే.. జోన్ ఏర్పాటు చేసే సమయంలో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరుని విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు దేశ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. – డా. పెదిరెడ్ల. రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ -
మిగులు స్థలాలు, భవంతులపై కేంద్రం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: ప్రైవేటీకరిస్తున్న లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్ చేయడానికి కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పేరిట ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటవుతుంది. ఇందులో పూర్తి వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నిరుపయోగంగా ఉన్న, పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోలేకపోతున్న ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఉపయోగంలోకి తెచ్చి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది మానిటైజేషన్ స్కీము లక్ష్యం. ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతం అందించగలదని కేంద్రం ఆశిస్తోంది. ప్రస్తుతం స్థలం, భవనాల రూపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) దగ్గర మిగులు, నిరుపయోగంగా ఉన్న, అంతగా ఉపయోగంలో లేని కీలకయేతర అసెట్స్ గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేత బాటలో ఉన్న సీపీఎస్ఈలకు సంబంధించి .. ఈ తరహా అసెట్స్ నుంచి విలువను రాబట్టడం చాలా ముఖ్యమని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఎన్ఎల్ఎంసీ తగు తోడ్పాటు అందిస్తుందని వివరించింది. ఎన్ఎల్ఎంసీ విధి విధానాలు.. ► ఇది ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటవుతుంది. వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేతలో ప్రక్రియలో ఉన్న సంస్థల అసెట్స్‌ను ఎన్ఎల్ఎంసీకి బదలాయిస్తారు. కీలకయేతర మిగులు అసెట్స్‌ను గుర్తించి, వాటి నుంచి విలువను రాబట్టడంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సలహాలు, మద్దతు అందిస్తుంది. ► నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ (ఎన్ఐఐఎఫ్), ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఎన్ఎల్ఎంసీ కూడా ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకోవచ్చు. డైరెక్టర్ల బోర్డులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, నిపుణులు .. సభ్యులుగా ఉంటారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ద్వారా చైర్మన్, ప్రభుత్వయేతర డైరెక్టర్ల నియామకం జరుగుతుంది. ► పూర్తి స్థాయి సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉంటారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మార్కెట్ నుంచి వీరిని నేరుగా నియమించుకోవచ్చు. -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు. నిపుణుల ఆందోళన వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు.అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది. ఈ చట్టాలకు సవరణ! మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్ ఠాకూర్ సమాధానమివ్వలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 80 కోట్ల మందికి లబ్ధి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద ఇచ్చే రేషన్ సరుకులకు ఇవి అదనం. ‘ఓ–స్మార్ట్’కు రూ.2,177 కోట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్), సముద్ర పరిశీలక నెట్వర్క్ (ఓఓఎస్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)–చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్)–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీవోఆర్)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి. ఏసీఆర్‌ఓఎస్‌ఎస్ కొనసాగింపు 14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్ క్లైమేట్ రీసెర్చ్–మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్ కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్లకు స్టైపెండ్ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ(డీఎన్‌హెచ్), డయ్యూ డామన్(డీడీ)లో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్ ఆశిస్తోంది. -
24న కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆ బిల్లుల ఉపసంహరణ..
న్యూఢిల్లీ: ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదించనుంది. ఇక నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. చదవండి: (Heavy Rains, Floods: సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీ ల్యాండ్స్) నిధుల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కేంద సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగానికి ఈ పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు. చదవండి: ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున ఒకే విడుదలో అందనున్నాయని పేర్కొన్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 5 కోట్లు.. రెండు విడతలుగా రూ. 2.5 కోట్ల చొప్పునమంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే గతేడాది ఏప్రిల్‌లో కేంద్రం ఎంపీ ల్యాండ్స్‌ను కరోనా మహమ్మారి కారణంగా నిలిపి వేసింది. ఈ నిధులను కోవిడ్ ఆరోగ్య సేవలకు వినియోగిస్తామని పేర్కొంది. చదవండి: లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే... అలాగే పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పొరేషన్‌కు భారీగా నిధులు విడుదల చేసింది. పత్తి మద్దతు ధర కోసం రూ. 17,408 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా గిరిజన నాయకుడు, స్వతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
దేశంలో కొత్తగా 100 సైనిక పాఠశాలలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కొత్త సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో 5వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటులో రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 3వేల మంది ఉన్నారు. అదేవిధంగా, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) అటల్ మిషన్ 2025–26 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ఫలితాల సుస్థిరత, అన్ని నగరాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ సాధించడం, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల్లో వ్యర్థ జలాల నిర్వహణపై దృష్టి సారించనుంది. స్వచ్ఛ భారత్ మిషన్(పట్టణ) 2.0 నిమిత్తం రూ.1,41,600 కోట్లు కేటాయించగా దీంట్లో కేంద్ర వాటా రూ.36,465 కోట్లు. పథకం చివరి దశకు చేరే నాటికి కేంద్రం వాటా రూ.62,009 కోట్లకు పెరుగుతుంది. పట్టణ పరివర్తన, పునరుజ్జీవనకు అటల్ మిషన్ ఫర్ రెజునవేషన్, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) 2.0ను 2025–26 వరకు సాగించేందుకు మంత్రివర్గం అనుమతించింది. ఈ పథకం వ్యయం రూ.2,77,000 కోట్లు కాగా కేంద్రం వాటా రూ.76,760 కోట్లుగా ఉంది. తాజాగా 4,378 పట్టణాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 500 అమృత్ నగరాల్లో వందశాతం మురుగునీటి నిర్వహణతోపాటు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు, 2.64 కోట్ల మురుగు నీటి కనెక్షన్లు అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి మార్చి 2022 వరకూ నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, సల్ఫర్లకు పోషక ఆధారిత సబ్సిడీ రేట్లకు ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేజీ సబ్సిడీ ధర నత్రజనికి రూ.18.789, పాస్ఫరస్‌కి రూ.45.323, పొటాష్ రూ.10.116, సల్ఫర్‌కు రూ.2.374కు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని అమలుతో రూ.28,602 కోట్ల భారం పడుతుందని కేంద్రం పేర్కొంది. -
వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్ ఆటోమోటివ్ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వివరించారు. 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. సంబంధిత దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేలా కొత్త పెట్టుబడులను పెట్టేందుకు ఈ ప్రోత్సాహక స్వరూపం దోహదపడుతుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా వేసింది. సుమారుగా రూ. 2.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు పెరగడం వల్ల 7.5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ ఆటోమోటివ్ వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుతుంది. రెండు విధాలుగా అమలు.. ఈ పీఎల్ఐ స్కీమ్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న తయారీ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు కూడా వర్తిస్తుంది. ఇందులో రెండు కాంపొనెంట్లు ఉన్నాయి. చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమైన స్కీమ్. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్‌కు వర్తిస్తుంది. ఇక కాంపొనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమై ఉన్న మరో పథకం. ఇది అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కాంపొనెంట్స్, సీకేడీ, సెమీ సీకేడీ కిట్స్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విడిభాగాలకు వర్తిస్తుంది. రూ. 18 వేల కోట్లతో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్‌కు ఇప్పటికే పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేసింది. అలాగే రూ. 10 వేల కోట్లతో ఫేమ్ స్కీమ్ అమలు చేస్తోంది. డ్రోన్స్‌కు రెక్కలు పీఎల్ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. 2021 డ్రోన్ నిబంధనల ప్రకారం డ్రోన్ల నిర్వాహకులు నింపవలసిన దరఖాస్తులను 25 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా విప్లవాత్మక ఆధునిక తర టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సాహించనుంది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. రూ. 1,500 కోట్ల అర్హతగల అమ్మకాలు పెరగవచ్చని, ఇదే విధంగా 10,000 మందికి అదనంగా ఉపాధి లభించగలదని భావిస్తోంది. పథకంకింద డ్రోన్ల విడిభాగాలలో ఎయిర్‌ఫ్రేమ్, ప్రొపుల్షన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, బ్యాటరీలు, ఫ్లైట్ కంట్రోల్ మాడ్యూల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెమెరాలు, సెన్సార్లు తదితరాలను చేర్చింది. కాగా.. డ్రోన్ల సంబంధిత ఐటీ ప్రొడక్టుల అభివృద్ధి సంస్థలకు సైతం పీఎల్ఐ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో పీఎల్ఐ పథకానికి అనుమతించిన 13 రంగాలలో భాగంగానే డ్రోన్ల పరిశ్రమను చేర్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. -
Sugarcane FRP Increased: చెరుకు రైతులకు గుడ్‌న్యూస్
-
‘ఆ ఎంపీలపై చర్యలు తీసుకోండి’
న్యూఢిల్లీ: ఏడుగురు కేంద్ర మంత్రుల బృందం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసింది. ఆగస్టు 11న రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ బృందం కోరింది. వారి చర్యలను అనూహ్యమైనవిగా, హింసాయుతమైనవిగా బృందం వర్ణించింది. వెంకయ్యను కలిసిన బృందంలో పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురళీధరన్ ఉన్నారు. శనివారం ఆయన పార్లమెంటుకు వెళ్లి ఘటన ఫుటేజీలను పరిశీలించారు. అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
పీఎస్‌యూ రిఫైనరీల్లో 100% ఎఫ్‌డీఐ
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వరంగ రిఫైనరీ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగానే అమలవుతోంది. తాజా నిర్ణయంతో బీపీసీఎల్‌కు విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు బిడ్లు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. బీపీసీఎల్‌లో కేంద్ర సర్కారుకు 52.98 శాతం వాటా ఉండగా.. ఇందుకోసం రెండు విదేశీ కంపెనీలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేశాయి. ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసిన సంస్థ.. అదనంగా 26 శాతం వాటా కొనుగోలుకు వీలుగా ప్రస్తుత వాటాదారులకు ఆఫర్‌ను ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోణంలోనే ఎఫ్‌డీఐ పరిమితి పెంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ మినహా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక్కటే నేరుగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. హెచ్‌పీసీఎల్‌ను మరో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బీపీసీఎల్ కోసం వేదాంత, అమెరికాకు చెందిన పీఈ సంస్థ అపోలో గ్లోబల్, ఐ స్కేర్డ్ క్యాపిటల్‌కు చెందిన థింక్ గ్యాస్ ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేశాయి. వృద్ధికి ఊతం... ప్రభుత్వ నిర్ణయం దేశీయంగా తయారీ కేంద్రాల ఏర్పాటుకు, పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి, టెక్నాలజీలకు మద్దతునిస్తుందని పరిశ్రమల మండళ్లు అభిప్రాయపడ్డాయి. లిస్టెడ్ స్పెషాలిటీ స్టీల్ కంపెనీలకు భారీ అవకాశాలకు వీలు కల్పిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌కు దారి చూపుతుందని పీహెచ్‌డీసీసీఐ చైర్మన్ (మినరల్స్, మెటల్స్ కమిటీ) అనిల్కుమార్చౌదరి అభిప్రాయపడ్డారు. స్పెషాలిటీ స్టీల్‌కు మద్దతు ఆత్మ నిర్భర్ భారత్, భారత్‌లో తయారీ లక్ష్యాలతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద స్పెషాలిటీ స్టీల్ రంగాన్ని కూడా చేరుస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ స్టీల్‌ను తయారు చేసే కంపెనీలకు ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.6,322 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల 5.25 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం దేశీయంగా తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కోటెడ్, ప్లేటెడ్ స్టీల్ ఉత్పత్తులు, హై స్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రేల్స్, అలాయ్ స్టీల్, స్టీల్వైర్స్, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తులు పీఎల్ఐ పథకం కిందకు వస్తాయి. ఈ స్టీల్ ఉత్పత్తులను ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆయిల్, గ్యాస్ రవాణా పైపులు, రక్షణ రంగ ఉత్పత్తులు, అధిక వేగంతో కూడిన రైల్వే మార్గాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో వినియోగిస్తారు. ఒక కంపెనీకి గరిష్ట రాయితీల పరిమితిని రూ.200 కోట్లుగా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ రంగంలోకి రూ.40,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, అదనంగా 25 మిలియన్ టన్నుల తయారీ సామర్థ్యం పెరుగుతుందంటూ కేంద్ర ఉక్కు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఎల్ఐసీలో వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో వాటా విక్రయానికి (డిజిన్వెస్ట్‌మెంట్) రంగం సిద్ధమైంది. తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న కమిటీ ఎంత వాటాను విక్రయించేదీ, షేరు విక్రయ ధరను నిర్ణయించనున్నట్లు ఈ సందర్భంగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) జనవరిలోనే ఎల్ఐసీ విలువ మదింపునకు మిల్లీమన్ అడ్వయిజర్స్‌ను నియమించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎల్ఐసీని లిస్టింగ్ చేసే అంశానికి గత వారమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఎల్ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌తో దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. ఎల్ఐసీ చట్టానికి బడ్జెట్లో చేపట్టిన సవరణలతో కంపెనీ అంతర్గత విలువను మిల్లీమన్ మదింపు చేయనుంది. ఈ ఏడాది (2021–22) ముగిసేలోగా ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవోను చేపట్టగలదని అంచనా. చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ -
ఇదో ‘అనుభూతి’ బాణం!
మంత్రివర్గాల్లో మార్పులు, చేర్పులు సాధారణం. మొన్నటి కేంద్ర మంత్రివర్గ మార్పుచేర్పులు మాత్రం అసాధారణం. గడిచిన డెబ్బయ్యేళ్ల చరిత్రలో ఇంతటి భారీస్థాయి పునర్వ్య వస్థీకరణ దేశంలో ఎప్పుడూ జరగలేదు. పన్నెండుమందిని తొల గించి 36 మందిని కొత్తగా తీసుకున్నారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి 78కి చేరింది. యూపీఏ-2ను జంబో కేబినెట్‌గా బీజేపీ వాళ్లు ఆనాడు వెక్కిరించారు. ఇప్పుడు వారి మంత్రి మండలిలో అంతకంటే ఒక నెంబర్ పెరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ‘పరిమిత ప్రభుత్వం-విస్తృత పరిపాలన’ తమ లక్ష్యమని చెప్పే వారు. అందుకు తగినట్టుగానే 2014లో తొలి కేబినెట్ కూర్పును తనతో సహా 46 మందితోనే సరిపెట్టారు. నిబంధనల ప్రకారం మంత్రిమండలి సంఖ్య 81 దాకా ఉండవచ్చు. కనుక ఇప్పటి ఈ జంబో కేబినెట్‌ను తప్పుపట్టవలసిన అవసరం ఏమీలేదు. కానీ ‘పరిమిత ప్రభుత్వం’ అనే సంకల్పం పరిధులు ఎందుకు విస్తరించవలసి వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లేదా దాని నాయకత్వంలోని కూటమి మరోసారి గెలిచి ఢిల్లీ గద్దెనెక్కితే ఆ పార్టీ సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానానికి వీలు చిక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నామమాత్రావశిష్టంగా తయారైంది. మరో ఓటమిని నిభాయించుకోలేదు. పూర్తిగా శిథిలమైపోతుంది. ఆ శిథిలాల మీద మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సమయం పడుతుంది. ఈలోపల గట్టిగా కుదురుకుంటే, ఏక బిగిన ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రికార్డును తిరగ రాయవచ్చన్న ఆశ బీజేపీ నాయకత్వాన్ని సలుపుతున్నది. ఇంకోసారి గెలిస్తే నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలనందించిన నాయకుడిగా మోదీ మెడలో ఓ వీరతాడు పడుతుంది. ఇందిరమ్మ నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మూడు విజయాలనందించారు. కానీ వరుసగా కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఒక అపురూప సన్నివేశపు అంచున నిలబడి ఉన్నారని భావించాలి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారా? కాషాయ యుగపు పాంచజన్యం పూరిస్తారా? ఈ లక్ష్యసాధనకు గల అవకాశా లేమిటి? అడ్డంకులేమిటి? అనే విషయాలపై మేధోమథనం జరి గిన తర్వాతనే జంబో కేబినెట్ రంగప్రవేశం చేసిందనే అభి ప్రాయం కలుగుతున్నది. రాజకీయంగా చూస్తే ఇప్పటికీ మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. రెండేళ్ల కిందటితో పోలిస్తే రేటింగ్ కొంత తగ్గినప్పటికీ మోదీయే అగ్ర స్థానంలో కొనసాగుతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆయ నకు దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేడు. అయితే పరిపాలనాపరంగా ఆయన ప్రభుత్వానికి పడుతున్న మార్కు లెన్ని?. ప్రజల ఆర్థిక - ఆయురారోగ్య పరిస్థితులెట్లా వున్నాయి? రక్షణ-విదేశాంగ విధానాలు దేశ ప్రతిష్ట ఇనుమడించేవిధంగా ఉన్నాయా? ఉద్యోగ ఉపాధి రంగాలు యువతరంగాలతో జత గూడుతున్నాయా? వ్యవసాయం, పరిశ్రమలూ లాభదాయకం గానే ఉన్నాయా? ... ఇత్యాది అంశాలపై అలుముకునే ప్రజాభి ప్రాయమే మోదీ పాలనపై రేపటి తీర్పునకు కీలకం. ప్రజాభిప్రాయం ఎట్లా ఏర్పడుతుంది? ఒకటి ప్రత్యక్ష అనుభవం, రెండోది పరోక్షంగా కలిగే అనుభూతి. కరోనా పీక్ టైమ్‌లో ఇంటిల్లిపాదికీ సోకిందనుకోండి. ఒకరికో ఇద్దరికో సీరి యస్ అయింది. ఆస్పత్రిలో బెడ్ ఆలస్యంగా దొరికింది. ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఒకరు చనిపోయారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆ కుటుంబ సభ్యులు అనుభవపూర్వకంగా చెబు తారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సరిగ్గా పనిచేయ లేదు. ఇటువంటి అలక్ష్యాన్ని మోదీ అస్సలు సహించరు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను పీకిపారేశారు. ఇది అనుభూతి. అనుభవం వ్యక్తిగతం. ఇది కూడిక లెక్కలతో పెరుగుతుంది. అనుభూతి సామూహికం. ఇది హెచ్చవేతలతో పెరుగుతుంది. కనుక చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాల (experiences ) కంటే సామూహిక అనుభూతి (perception)ది పైచేయి అవు తుంది. ‘హర్ దర్ద్కో ఏకీ దవా (సర్వరోగనివారిణి) జిందా తిలి స్మాత్’ అనే మాటను పూర్వకాలం నుంచీ వింటున్నాము. ఆ మందును ఎప్పుడూ వాడకపోయినా, ఆ నినాదాన్నయితే నమ్ముతాము. అదీ అనుభూతి. మోదీ సర్కార్ పాలనలో ప్రజల వ్యక్తిగత దైనందిన జీవితానుభవాలు ఎట్లా ఉన్నా... సామూహి కంగా ఒక పాజిటివ్ అనుభూతిని ఉత్పత్తి చేయడం సంఘ్ పరివార్ మేథోవర్గం ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ కార్యక్రమంలో తొలిదశ మొన్న జంబో కేబినెట్ ఏర్పాటుతో పూర్తవుతుంది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్, డాక్టర్ హర్ష వర్ధన్, సదానందగౌడ వంటి సీనియర్లు ఉండటం కొంత ఆశ్చ ర్యాన్ని కలిగించింది. కీలక శాఖల్లోని వైఫల్యాలకు కొందరు వ్యక్తులను బాధ్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నదనే అభిప్రాయం విన బడుతున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన వారిలో రాజ్‌నాథ్, నఖ్వీ ఇద్దరే మిగిలారు. ఇది వాజ్‌పేయి నీడ కూడా లేని అచ్చమైన మోదీ కేబినెట్. వైఫల్యాలను కడిగేసుకోవడంతోపాటు సామాజిక మార్పు సంకేతాలను కూడా ఈ పునర్వ్యవస్థీకరణ బలంగా ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలిరోజుల్లో ‘జనసంఘ్’గా ఉన్న ప్పుడు దానిపై బ్రాహ్మణ్-బనియా (వైశ్య) ముద్ర ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విలీనం కావడం, అందులో చేరిన నానాజాతి సభ్యుల్లోని తటస్థ వర్గాలను తన గూటికి ఆకర్షించి బీజేపీ పేరుతో పునరుత్థానమవడం వెనుక వాజ్‌పేయి, అడ్వాణీల వ్యూహరచనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ వ్యూహం ఆరెస్సెస్ ఆలోచన కూడా కావచ్చు. అనంతర కాలంలో రామ మందిర ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోని వెనుకబడిన వర్గాలనూ, గిరిజనులను పెద్దఎత్తున బీజేపీ సమీకరించుకోగలిగింది. పార్టీ సామాజిక పొందికను విస్తృతం చేసే పనిని మోదీ మరింత వేగవంతం చేశారు. ప్రధానితో సహా 78 మంది సభ్యులున్న మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంఖ్య 52. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఎక్కువమంది బలహీనవర్గాల ప్రతినిధులున్న కేంద్ర మంత్రి వర్గం ఇదే కావచ్చు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయా వర్గాల పాజిటివ్ అనుభూతిని మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నదని చెప్ప వచ్చు. కేంద్ర మంత్రిమండళ్లలో సహాయ మంత్రుల పాత్ర నామమాత్రం. అధికారాన్ని చలాయించే కేబినెట్ మంత్రులు ఇప్పుడు ప్రధానితో కలిపి 31 మంది ఉన్నారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిపితే 11 మంది. ఇరవైమంది హిందూ అగ్రవర్ణాల వారు. వారిలో ఆరుగురు బ్రాహ్మణులు. ఐదుగురు రాజ్‌పుత్‌లు. ఇద్దరు బనియాలు, ఇద్దరు పాటీదార్లు (పటేల్), ఒకరు రెడ్డి. ఒకరు భూమిహార్, ఒకరు మల్హోత్రా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కేబినెట్ కూర్పును ఖరారు చేసినట్టు స్పష్టంగా కనిపి స్తున్నది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎక్కువ లోక్‌సభ సీట్లున్న యూపీ నుంచి ఏడుగురిని కొత్తగా తీసుకున్నారు. వీరిలో ఎక్కు వమంది యాదవేతర బీసీలు. ఇక్కడ బీజేపీకి ప్రధాన పోటీ దారు అఖిలేశ్ సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ. ఈ పార్టీ నుంచి నాన్-యాదవ్ బీసీలను దూరం చేయడం ద్వారా యాదవ-ముస్లిం వర్గాలకే సమాజ్‌వాది పార్టీని పరి మితం చేసే లక్ష్యం ఈ వ్యూహంలో కనిపిస్తున్నది. యాదవుల తర్వాత ప్రధాన బీసీ కులమైన కుర్మీ వర్గానికి చెందిన అనుప్రియా పటేల్ (అప్నాదళ్)కు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవీయోగం పట్టింది. ఉత్తరాఖండ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఐదు ఎంపీ సీట్లున్న చిన్న రాష్ట్రం అది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి బీజేపీ గెలవడం ఆనవాయితీ. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గుజరాత్ గెలుపు పట్ల బీజేపీలో పెద్దగా అనుమానాల్లేవు. ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకునే జనం ఓట్లేస్తారని ఆ పార్టీ విశ్వాసం. అయినా ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్రంలో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న పాటీదార్ల (పటేళ్లు)కు రెండు కేబినెట్ బెర్తులు కేటాయించారు. పంజాబ్‌ను అంతగా పట్టించుకోలేదు. రైతుల ఆందోళన తర్వాత పంజాబ్ మీద బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకున్నది. పంజాబ్ నుంచి ఒక్క జాట్ సిక్కుకూ స్థానం దొరకని మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి ఇదే. ఈ రాష్ట్రానికి చెందిన హర్దీప్సింగ్ పూరీ అనే ఖత్రీ కులానికి చెందిన సిక్కు కేబినెట్లో ఉన్నారు. రాష్ట్రంలో జాట్ సిక్కుల జనాభా 30 శాతం దాకా ఉంటుంది. దళితుల జనాభా మరో 30 శాతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ, లెఫ్ట్, బీఎస్పీలతో కూడిన అకాలీదళ్ కూటమికీ మధ్యనే ప్రధానంగా పోటీ జరగబోతున్నది. పటియాలా రాజవంశస్థు డైన కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయం ఉన్నది. యువకులు, విద్యావంతుల అనుభూతిని కూడా ప్రభా వితం చేసే అంశాలకు కేబినెట్ పొందికలో వీలు కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58కి తగ్గింది. రాజకీయ రంగంలో ఇది యూత్ కిందే లెక్క. అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారులకు, టెక్నోక్రాట్లకు, డాక్టర్లకు, లాయర్లకు అవకాశం లభించింది. అశ్వినీ కుమార్ వైష్ణవ్ మాజీ ఐఏఎస్ అధికారి. ఆయనకిప్పుడు కేబినెట్ హోదా వచ్చింది. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. కాన్పూర్ ఐఐటీలో ఎమ్‌టెక్ చేశారు. అక్కడ ఆయన స్పెషలైజేషన్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్ షిప్ మీద. ఆయనకిప్పుడు రైల్వే శాఖ లభించడం వెనుక లక్ష్యం సుస్పష్టమే. భారతీయ రైల్వేలు ఇక పీపీపీ పట్టాలెక్కబోతు న్నాయి. మరో ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌సింగ్‌కు ప్రమోషన్ లభించి కేబినెట్ మంత్రయ్యారు. బీజేపీ ప్రజా పునాదులను విస్తృతం చేసిన అడ్వాణీ రథయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్ కుమార్‌సింగ్ బిహార్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న లాలూయాదవ్ జిల్లా కలెక్టర్‌కూ, ఎస్పీకి చెప్ప కుండా రాజ్‌కుమార్‌కు అదనపు మేజిస్ట్రేట్ హోదా కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలిచ్చి ఈయన ద్వారానే అడ్వాణీని అరెస్ట్ చేయిం చారని చెబుతారు. అడ్వాణీని అరెస్ట్ చేసిన అధికారి అదే బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కావడం విధివిలాసమేమో! కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్‌టెక్ పట్టా పొందారు. ఆయనకిప్పుడు ఐటీ సహాయమంత్రి పదవి లభించింది. బీపీఎల్ టెలికామ్ కంపెనీని ఈయనే స్థాపించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాన్ని ఈయన పర్యవేక్షించనున్నారు. మంత్రిమండలిలో మహి ళల సంఖ్య కూడా 11కు పెరిగింది. అందుబాటులో ఉన్న వివ రాల మేరకు ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. మంత్రిమండలి కూర్పులోని సానుకూలాంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధిపొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పైపూతల వల్ల లోతైన గాయాలు (ఉంటే) ఏమేరకు మాను తాయో చూడాలి. కీలక మంత్రులను తప్పించినంత మాత్రాన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలగడం సాధ్యమేనా? ఈ అంశం మీద ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎమ్మెల్యే, యువ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘‘ఖరాబీ ఇంజిన్ మే హై, ఔర్ బద్లే డిబ్బే జారహే హై’’. సమస్య ఇంజన్లో ఉంటే డబ్బాలను మారుస్తున్నారట. ఈ రైలు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మాత్రం జిగ్నేష్ చేసిన కామెంట్ తప్పవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మరో 23 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో.. దేశంలో వైద్య రంగంలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చడం కోసం రూ. 23,123 కోట్లను సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు కూడా రుణ సాయం పొందే వీలు కల్పిస్తూ తెచ్చిన పలు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త మంత్రి మండలి కొలువుదీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వైద్య రంగంలో మౌలిక వసతులకు సంబంధించిన ఈ ఆర్థిక ప్యాకేజీని వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు అమలు చేస్తామని కేబినెట్ భేటీ అనంతరం మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు, హెల్త్ సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్రం గతంలో రూ. 15 వేల కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజా ప్యాకేజీని రెండో విడతగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ నిధుల్లో కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20 శాతం పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ యూనిట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ కమిటీలకు రుణ సదుపాయం లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మార్కెట్ల సామర్ధ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్ కమిటీలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని వివరించారు. ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రయివేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్ యార్డ్ పరిధిలో కోల్డ్ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణలు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్ పోస్టును నాన్ ఎగ్జిక్యూటిక్ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణయం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్ చేసే సభ్యుల్లో నాలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని ఆరుగురికి పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తం గా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్ ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20% పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌ను నిల్వ చేసేం దుకు స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ యూని ట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ కమిటీలకు రుణ సదుపాయం లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్ కమి టీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మార్కెట్ల సామర్థ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్ కమిటీలు మరింత బలోపేతమయ్యేం దుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబి నెట్ ఆమోదం తెలిపింది’ అని వివరించారు. ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్ యార్డ్ పరిధిలో కోల్డ్ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణ లు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్ పోస్టును నాన్ ఎగ్జిక్యూటిక్ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణ యం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్ చేసే సభ్యుల్లో 4 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని 6కు పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. ముఖ్యమైన నిర్ణయాలు: మోదీ రైతుల సంక్షేమం కోసం కొన్ని ముఖ్య మైన నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఇకపై వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించవచ్చన్నారు. కోవిడ్–19 ప్యాకేజ్‌తో చిన్న పిల్లల కరోనా చికిత్సకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నామన్నారు. జిల్లా స్థాయిలో పీడియాట్రిక్ కేర్ యూనిట్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ స్టోరేజ్, అంబులెన్స్, ఔషధాల అందుబాటు.. మొదలైన సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని పలు వరుస ట్వీట్లు చేశారు. -
12 మందికి ఉద్వాసన..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కీలక శాఖలు చేపట్టిన వారిలో ఏకంగా ఆరుగురు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు ఆరుగురు సహాయమంత్రులు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 12మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. కేంద్ర మంత్రుల రాజీనామాల వెనుక వారి వయస్సు, కరోనా సమయంలో శాఖల పనితీరు, బెంగాల్ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిíపించింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్‌ను వయస్సు రీత్యా మంత్రివర్గం నుంచి తప్పించి కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఈయనతోపాటు విద్య, వైద్య, పర్యావరణ శాఖలకు చెందిన కేబినెట్ మంత్రితో పాటు సహాయమంత్రులను సైతం పక్కనబెట్టేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలోని ఆరోగ్య సేవల పేలవమైన పరిస్థితి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఉద్వాసనకు దారితీసింది. అదే శాఖలోని సహాయమంత్రి అశ్విని చౌబేపై వేటు పడింది. బెంగాల్లో బీజేపీ ఓటమి ప్రభావంతో ఇద్దరు బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో, దేబోశ్రీ చౌదరిలపై వేటు పడింది. వీరితో పాటు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ, కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్ కుమార్ గంగ్వార్లకు ఉద్వాసన పలికారు. వీరితోపాటు సంజయ్ ధోత్రే, రతన్‌లాల్ కటారియా, ప్రతాప్ సారంగీ తమ పదవులకు రాజీనామా చేశారు. కరోనా కారణంగా హర్షవర్ధన్ ఉద్వాసన కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు కుప్పకూలి పోయిన కారణంగా వై ద్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్థన్‌పై వేటు పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మోదీ ప్రభుత్వం పైపెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా హర్షవర్ధన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో హర్షవర్థన్ రాజీనామాతో 2 కీలక శాఖలు ఖాళీ అయ్యాయి. అనారోగ్య కారణాలతో పోఖ్రియాల్ ఔట్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్ పోఖ్రియాల్ కేంద్ర విద్యాశాఖ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణాలతో నిశాంక్‌ను తొలగించినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారినపడి ఒక నెల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో దేశంలో విద్యారంగంలో పరిస్థితి ఘోరంగా దిగజారిందనే విమర్శలు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి నేపథ్యంలో సీబీఎస్ఈపై నిర్ణయం తీసుకొనే విషయంలో ప్రధాని మోదీ స్వయంగా ముందుకు రావలసి వచ్చింది. ప్రధాని మోదీ ఎంతో కీలకంగా భావించే జాతీయ విద్యావిధానం అమలులో మంత్రిగా చొరవ చూపలేదన్నది కూడా పదవి కోల్పోవడానికి కారణమని తెలిసింది. బెంగాల్ ఎన్నికల కారణంగా.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ బాబుల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆయనను బాధ్యుడిగా చేసిన కారణంగా పార్టీపై సుప్రియో ఆగ్రహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. సుమారు 50వేల ఓట్ల తేడాతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మోడీ ప్రభుత్వ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్ తన వయస్సు రీత్యా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే, ఆయనను కర్ణాటక గవర్నర్‌గా చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చారు. 3 శాఖలపై కరోనా తీవ్ర ప్రభావం ► ఆరోగ్య శాఖ: సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవటంలో, నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► విద్యా శాఖ: నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాలేదు. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► కార్మిక శాఖ: కార్మికుల వలస, సుప్రీంకోర్టు మందలించడం, అసంఘటిత రంగ కార్మికుల కోసం పోర్టల్‌ను సృష్టించలేకపోవడం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మంత్రి రాసిన లేఖ వైరల్ కారణంగా మంత్రిపై వేటు. -
కేబినెట్ విస్తరణ: ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులు
-
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
-
జూలై 8న కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకే ప్రాధాన్యం?
-
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
-
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరో 25 మందికి చోటు ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్‌కు, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్ సింగ్‌లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి.. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కనుంది. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులలో జీవీఎల్‌కుగానీ, టీజీ వెంకటేష్‌కుగానీ చాన్సు దక్కొచ్చని తెలుస్తోంది. -
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కసరత్తు సాగిస్తున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని సంకల్పించినట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మందికి స్థానం ఉంది. ప్రస్తుతం 53 మంది మంత్రులున్నారు. అంటే మరో 28 మందికి అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి శర్బానంద సోనోవాల్‌ను కేబినెట్లో చేర్చుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిహార్ నుంచి లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) చీలిక వర్గం నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ కూడా మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ కూడా కేబినెట్లో స్థానం కోసం ఎదురు చూస్తోంది. ఆ పార్టీ నుంచి లాలన్‌సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహా కేంద్ర కేబినెట్లో చోటు కోసం పోటీ పడుతున్నారు. బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ, మహారాష్ట్ర నేత నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్ కేబినెట్లో చేరనున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లో కచ్చితంగా అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పలువురు యూపీ నేతలకు కేబినెట్లో స్థానం కల్పించబోతున్నారు. పనితీరే ప్రామాణికం కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, హర్షవర్దన్, నరేంద్రసింగ్ తోమర్, రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, హరదీప్‌సింగ్ పురి అదనపు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి వారికి పనిభారం తగ్గించనున్నారు. మంత్రివర్గం నుంచి ఎవరెవరిని తొలగించాలన్న దానిపై ఇప్పటికే ప్రధాని మోదీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగా పలువురికి ఉద్వాసన తప్పదంటున్నారు. చదవండి: స్పుత్నిక్ లైట్‌కి నో -
రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డు గల 80 కోట్ల మందికి కేంద్రం శుభవార్త అందించింది. ఈ నెలలో మొదట్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఎఈ)ను నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు పీఎం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నేడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రం ఉచిత ఆహార కార్యక్రమం పీఎంజీకెఎఈను దీపావళి వరకు ఐదు నెలల పాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. "పీఎంజీకెఎఈ (ఫేజ్ IV) కింద అదనపు ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల కాలానికి అంటే 2021 జూలై నుంచి నవంబర్ వరకు కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వల్ల కలిగే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కష్టాలను తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013(ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కవర్ అయ్యే 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు పీఎంజీకెఎఈ కింద ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఎ కింద కవర్ చేయబడ్డ పేద లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. ఉచితంగా ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల పాటు అందించడం వల్ల రూ.64,031 కోట్లు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రవాణా, నిర్వహణ, రేషన్ దుకాణ డీలర్ల మార్జిన్లు మొదలైన వాటి కోసం ప్రభుత్వం సుమారు రూ.3,234.85 కోట్ల అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. "అందువల్ల, భారత ప్రభుత్వం భరించాల్సిన మొత్తం అంచనా వ్యయం రూ.67,266.44 కోట్లు" అని తెలిపింది. చదవండి: పీఎన్బీ స్కాం: నీరవ్ మోదీకి భారీ షాక్ -
అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను కేంద్ర మంత్రివర్గం బుధవారం అమోదించింది. అద్దె ఇళ్ల కొరతను పరిష్కరించేందుకు కొత్త వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె ఇళ్ల వ్యాపార రంగానికి నాంది పలికింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని పంపనుంది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం తోపాటు, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా అద్దెగృహాలకు సంబంధించి చట్టపరమైన చట్రాన్నిసరిదిద్దడంలో సహాయపడుతుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాలకు తగిన అద్దె హౌసింగ్ స్టాక్‌ను రూపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని, తద్వారా నిరాశ్రయుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.అద్దె గృహాలను క్రమంగా అధికారిక మార్కెట్ వైపుకు మార్చడం ద్వారా, మగృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 లో కేంద్రం "మోడల్ అద్దె చట్టం" ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అధికారిక అద్దె ఒప్పందం అవసరం, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, అద్దె పెరుగుదల రేటు, తొలగింపుకు కారణాలు వంటి అంశాలను ఇది పరిష్కరిస్తుంది. అలాగే అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా, అద్దెదారు ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ చట్టం ప్రకారం గరిష్టంగా రెండు నెలలు. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. చదవండి: Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
ఏసీ, ఎల్ఈడీల తయారీకి పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్, ఎల్ఈడీ విద్యుత్తు దీపాలు వంటి వైట్ గూడ్స్ తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వర్తింపచేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 6,238 కోట్లు వెచ్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు పీఎల్ఐ పథకంపరమైన ప్రోత్సాహకాలు దోహదపడనున్నాయి. దీని ద్వారా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది. వైట్ గూడ్స్ పీఎల్ఐ స్కీమ్ ప్రకారం దేశీయంగా ఏసీలు, ఎల్ఈడీ లైట్లు తయారు చేసే కంపెనీలకు అయిదేళ్లపాటు విక్రయాలపై 4 నుంచి 6 శాతం దాకా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో తగినంత స్థాయిలో ఉత్పత్తి లేనటువంటి ఉత్పాదనల తయారీని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఫినిష్డ్ గూడ్స్‌ను అసెంబ్లింగ్ మాత్రమే చేసే సంస్థలకు ఇది వర్తించదు. కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న ఐదేళ్ల కాలంలో పీఎల్ఐ పథకం వల్ల రూ. 7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ .64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష–పరోక్ష మార్గాల్లో రూ. 49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది కేంద్రం అంచనా. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి .. అధిక సామర్థ్యం కలిగిన గిగా వాట్ స్థాయి సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యుల్స్’ పేరుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం వర్తింపజేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 4,500 కోట్లు ప్రోత్సాహకాలుగా వెచ్చించనుంది. దేశీయ పరిశ్రమలో సోలార్ పీవీ మాడ్యుల్స్ నిర్వహణ సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీటి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల దేశీయంగా సామర్థ్యం పెంపు కోసం పీఎల్ఐ స్కీమ్ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్లు
న్యూఢిల్లీ: ఆహారశుద్ధి పరిశ్రమ (ఫుడ్ ప్రాసెసింగ్) కు ఉత్పత్తి ఆధారిత పథకాన్ని (పీఎల్ఐ స్కీమ్) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలను ఆరేళ్ల పాటు 2026–27 నాటి వరకు అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల 2026–27 నాటికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని.. అదే విధంగా ఎగుమతులు పెరుగుతాయని.. ఈ రంగం మరింత విస్తరించి రూ.33,494 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిర్ణయం రైతులకు ఇచ్చే గౌరవమని మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. భారత రెడీటుఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్న) ఉత్పత్తులకు, సహజసిద్ధ ఆహార ఉత్పాదనలకు, శుద్ధి చేసిన పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండడంతో.. దేశ ఆహార శుద్ధి పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని మంత్రి చెప్పారు. నిర్దేశిత కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు, నిర్దేశిత విక్రయాలను నమోదు చేసే ఆహార శుద్ధి, ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఈ పథకం రూపంలో మద్దతు అందించనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాల కోసం ఆసక్తి వ్యక్తీకరణలకు ఏప్రిల్ చివరి నాటికి ఆహ్వానం పలకనున్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి పుష్ఫ సుబ్రమణ్యం తెలిపారు. దీనికింద కంపెనీలు కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు కనీస అదనపు విక్రయాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. -
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రపతి అనుమతి తరువాత అసెంబ్లీ రద్దవుతుందన్నారు. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాక ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. గురువారం పుదుచ్చేరిలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రూ.కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. పుదుచ్చేరిని తమిళనాడులో చేర్చేందుకు బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నారాయణస్వామి బుధవారం ఆరోపించారు. -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్‌పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
ఎస్సీ విద్యార్థులపై కేంద్రం వరాలు
న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థులకు భారీగా పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ స్కాలర్షిప్ మొత్తాన్నిఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.59 వేల కోట్ల స్కాలర్షిప్లు అందించనున్నట్లు తెలిపింది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతంగా అంటే రూ.35,534 కోట్లుగా ఉండగా మిగిలిన వాటా రాష్ట్రాలదే బాధ్యత అని స్పష్టం చేసింది. డీటీహెచ్ సర్వీసుల మార్గదర్శకాలను సైతం సవరించింది. ఇక నుంచి 20 ఏళ్లకు ఒకసారి డీటీహెచ్ సర్వీస్ లైసెన్స్ ఉంటుందని, ప్రతి మూడు నెలలకోసారి లైసెన్స్ ఫీజు చెల్లించాలని వివరించింది. డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాల షేరింగ్‌కు అనుమతినిచ్చింది. (చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్) ఎల్లుండి పీఎం కిసాన్ నిధులు విడుదల నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు విభాగాలను విలీనం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ఎఫ్డీసీలో ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ విలీనాలను ఆమోదించింది. ఇదిలా వుండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.9 కోట్లకు పైగా రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడనున్నారు. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలను వివరించనున్నారు. (చదవండి: స్పెక్ట్రమ్ వేలానికి సై!) -
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ, సాక్షి: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన కేంద్ర కేబినెట్ తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, టెలికం, విద్యుత్ రంగాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. కొద్ది రోజులుగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఐదు కోట్లమంది రైతులు, ఐదు లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు తెలియజేశారు. గత రెండు, మూడేళ్లుగా చక్కెర ఉత్పత్తి మిగులుకు చేరుకున్నందున ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఈ సీజన్(2020-21 అక్టోబర్- సెప్టెంబర్)లో రూ. 3,600 కోట్ల సబ్సిడీలను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) స్పెక్ట్రమ్ వేలం 2016 తదుపరి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 700 ఎంహెచ్‌జెడ్ మొదలు, 800, 900, 2100, 2300, 2500 ఎంహెజెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. 20ఏళ్ల గడువుతో వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 2,251కుపైగా ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను విక్రయానికి ఉంచనున్నట్లు తెలియజేశారు. తద్వారా రూ. 3.92 లక్షల కోట్లకుపైగా లభించవచ్చని అంచనా వేశారు. 2021 మార్చిలో వేలాన్ని చేపట్టే వీలున్నట్లు వెల్లడించారు. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు చేపట్టవచ్చని తెలియజేశారు. 5జీ ఇలా టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 5జీ సర్వీసులకు 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. అయితే రక్షణ శాఖ 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించుకోనుంది. దీంతో 175 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్త ప్రాతిపదికన ట్రాయ్ 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కుగాను రూ. 492 కోట్లను బేస్ ధరగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 100 ఎంహెచ్‌జెడ్ 5జీ వేవ్స్‌కుగాను రూ. 50,000 కోట్లు లభించవచ్చని అంచనా. -
కొనసాగుతున్న రికార్డులు..
ముంబై: ఫార్మా, మెటల్, ఆటో షేర్ల ర్యాలీతో సూచీలు ఎనిమిదోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 43,594 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లను ఆర్జించి 12,749 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సూచీల రికార్డుల పర్వం మూడోరోజూ కొనసాగినట్లయింది. దేశంలో పది కీలక రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్ఐ)కు ఆమోదం తెలపడంతో సంబంధిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే ఫైజర్ కంపెనీ రూపొందించిన కోవిడ్ –19 వ్యాక్సిన్ విజయవంతం ఆశలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 43, 708 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల 12,770 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో అమ్మకాలు... లాభాలతో మొదలైన మార్కెట్లో తొలి గంటలో కొనుగోళ్లు కొనసాగాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇంధన, మీడియా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌సెషన్ కల్లా సెన్సెక్స్ ఇంట్రాడే(43,708) నుంచి ఏకంగా 738 పాయింట్ల కోల్పోగా, నిఫ్టీ డే హై నుంచి 200 పాయింట్లు పడింది. 4 శాతం నష్టపోయిన రిలయన్స్... ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు బుధవారం 4 శాతం నష్టపోయి రూ. 1979 వద్ద స్థిరపడింది. ఎమ్ఎస్సీఐ ఇండెక్స్ రివ్యూలో రిలయన్స్ షేరుకు వెయిటేజీ తగ్గించడంతో అమ్మకాలు తలెత్తాయి. గ్లాండ్ ఫార్మా ఐపీఓకు 2 రెట్ల స్పందన హైదరాబాద్: గ్లాండ్ ఫార్మా ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 2.05 రెట్లు్ల ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ జారీ చేసిన మొత్తం 3.50 కోట్ల షేర్లకు గానూ 6.21 కోట్ల బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) విభాగం 6.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ)విభాగం 51 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 శాతం సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. రూ.6,480 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన ఇష్యూ ఈ నవంబర్ 9 న ప్రారంభమైంది. -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తే తాజా ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు కోసం సమీకరించే భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని, అలాంటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన మేరకు 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి నివేదించాలని సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. పీపీఏ ఈ విధంగా ప్రతిపాదనలు పంపితే.. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), టీఏసీ (సాంకేతిక సలహా మండలి), ఆర్సీసీ (సవరించిన అంచనా కమిటీ) ఆమోదించిన మేరకు రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇస్తుందని, తర్వాత ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు జల్ శక్తి శాఖ కేంద్ర కేబినెట్లో తాజా తీర్మానాన్ని ప్రతిపాదిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదిస్తే 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి. అప్పుడే అభ్యంతరం తెలిపి ఉంటే.. 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటన చేసినప్పుడు, ఆ ప్రకటనను అమలు చేస్తూ 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, వాటికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు, 2017 మే 8న పోలవరం మొదటిసారి సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు షరతు విధించినప్పుడు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం కనుక అభ్యంతరం తెలిపిఉంటే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై గందరగోళం నెలకొని ఉండేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కార్ చేసిన పాపాలే పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు శాపాలై వెన్నాడుతున్నాయని సాగునీటిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా ధరల మేరకు నిధులు సాధించి 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. రూ.2,234.288 కోట్లను బేషరతుగా విడుదల చేసేందుకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపడానికే మూడేళ్లు జాప్యం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాజా ధరల ప్రకారం ఎంత అంచనా వ్యయం అవుతుందో ప్రతిపాదనలు సమర్పిస్తే కేంద్రానికి పంపి ఆమోదం తీసుకుంటామని 2015 మార్చి 12న జరిగిన తొలి సర్వసభ్య సమావేశంలో పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాత వరుసగా మూడు నెలలకు ఒకసారి చొప్పున నిర్వహించిన ఐదు సమావేశాల్లోనూ ఆ విధంగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇలా దాదాపు మూడేళ్ల పాటు జాప్యం చేసి చివరకు 2018 జనవరి 2న 2017–18 ధరల ప్రకారం రూ.57,297.42 కోట్ల అంచనా వ్యయంతో పీపీఏకు ప్రతిపాదనలు ఇచ్చింది. నాలుగు కీలక సందర్భాల్లో చంద్రబాబు మౌనం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా అప్పటి సీఎం చంద్రబాబు కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పోలవరం నిర్మాణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజు ప్రత్యేక సహాయంపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. ప్రత్యేక సహాయాన్ని అమలు చేస్తూ 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక సహాయంపై ఆమోదముద్ర వేస్తూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి అంగీకరించింది. డిజైన్ మారినా, ధరలు పెరిగినా, అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ షరతుతో కూడిన పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఆ షరతు ఏమిటంటే.. 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ.. ఆ రోజు నాటి ధరల ప్రకారం మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామన్నది. ఈ విధంగా ముఖ్యమైన నాలుగు సందర్భాల్లోనూ టీడీపీ ప్రభుత్వం, అప్పటి సీఎం చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా మౌనం వహించారని, అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించి తాజా ధరల ప్రకారం పోలవరానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసి ఉంటే ఈ రోజు ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇంత గందరగోళం నెలకొని ఉండేది కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
విద్యాశాఖ బలోపేతానికి ‘స్టార్స్’
న్యూఢిల్లీ: పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ‘‘చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దాం’’ అని జవదేకర్ చెప్పారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నట్టు చెప్పారు. రూ.520 కోట్ల ప్యాకేజీ.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని జవదేకర్ చెప్పారు. -
కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం10:30 గంటలకు ప్రారంభమైంది. మంత్రివర్గ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగటం ఇదే తొలిసారి. పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడడంతో మంత్రివర్గ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చెరుకు మద్దతు ధర పెంపు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టలకు సంబంధించి పీపీపీ విధానంలో లీజ్, సబార్డినేట్ ఉద్యోగాల నియామకానికి జాతీయ నియామక సంస్థ ఏర్పాటు, ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలకు కనీస ఉమ్మడి ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ కోసం ‘మిషన్ కర్మయోగి’ ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
చవగ్గా అద్దె గృహ సముదాయాలు
న్యూఢిల్లీ: పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్– ఏఆర్‌హెచ్‌సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్ కాంప్లెక్స్‌లను 25 ఏళ్ల కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు. పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏఆర్‌హెచ్‌సీని అభివృద్ధి చేస్తారు. కన్సెషన్ అగ్రిమెంట్ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ కింద రూ. 600 కోట్లను కేటాయించారు. కన్సెషన్ అగ్రిమెంట్‌దారులను పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్‌లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది. సొంత భూమిలో ఏఆర్‌హెచ్‌సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు. ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను.. వారు సెప్టెంబర్ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ‘ఉచిత రేషన్’కు కేబినెట్ ఆమోదం ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ వరకు ఉచిత రేషన్ కార్యక్రమానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు నవంబర్ వరకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించనున్నట్లు జూన్ 30న మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అంతరిక్ష రంగంలో ప్రైవేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లభించనుందని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ వ్యవహరిస్తుందన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)’ వీలు కల్పిస్తుందన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం ద్వారా దేశీయంగా అంతరిక్ష రంగ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఓబీసీల వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు ఓబీసీ వర్గీకరణ కోసం ఏర్పడిన కమిషన్ కాలపరిమితిని జనవరి 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల్లో కొన్ని కులాలకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి న్యాయం జరగడం లేదని, ఈ విషయంలో తగిన సిఫారసులు చేయాలని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ను కేంద్రం 2017లో ఏర్పాటు చేసింది. -
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల్లో పాలన మెరుగుపడనుంది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు రక్షణ లభించనుంది. ఇందుకుగాను అన్ని పట్టణ, బహుళ రాష్ట్రాల్లో పనిచేసే సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) వైఫల్యం తరహా సంక్షోభాలకు చోటివ్వకుండా ఈ నిర్ణయానికి వచ్చింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య బ్యాంకుల మాదిరే ఇకమీదట ఆర్బీఐ పర్యవేక్షణ కిందకు 1,540 పట్టణ కోపరేటివ్, మల్టీ స్టేట్ కోపరేటివ్ (ఒకటికి మించి రాష్ట్రాల్లో పనిచేసేవి) బ్యాంకులు రానున్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 1,482 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోపరేటివ్ బ్యాంకులు పనిచేస్తుండగా.. వీటి పరిధిలో 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి రూ. 4.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎంసీ బ్యాంకులో రుణాల స్కామ్ వెలుగు చూడడంతో ఆర్బీఐ 2019 సెప్టెంబర్ 23న నిషేధం విధించడం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అదే విధంగా కాన్పూర్‌కు చెందిన పీపుల్స్ కోపరేటివ్ బ్యాంకు డిపాజిట్ల ఉపసంహరణపైనా ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చిన్న రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) కింద శిశు రుణ ఖాతాలపై 2% వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది . లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారస్తులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. ముద్రా యోజన పథకం కింద శిశు రుణాల విభాగంలో ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను రూ.50,000 వరకు బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. ఈ రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో 2% మేర ఏడాది వరకు రాయితీ లభించనుందని.. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.1,542 కోట్ల భారం పడుతుందని జవదేకర్ తెలిపారు. 2020 మార్చి నాటికి బకాయిలు చెల్లించాల్సి, నిరర్థక ఆస్తుల(ఎన్పీఏలు) జాబితాలో లేని రుణ ఖాతాలకు ఇది అమలుకానుంది. ఈ పథకం ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఆర్బీఐ మారటోరియం (రుణ చెల్లింపుల విరామం) కింద ఉన్న ఖాతాలకు.. మారటోరియం నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి 12 నెలల పాటు (2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఆగస్ట్ 31 వరకు) వడ్డీ రాయితీ లభిస్తుంది. 2020 మార్చి నాటికి పీఎంఎంవై çపరిధిలోని శిశు విభాగంలో రూ.9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. దీని కింద విడుదల చేసిన రుణాల మొత్తం రూ.1.62 లక్షల కోట్లుగా ఉంది. రూ. 15 వేల కోట్లతో ‘పశుసంవర్ధక మౌలిక’ నిధి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీని అనుసరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ. 15,000 కోట్లతో పశుసంవర్థక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏహెచ్ఐడీఎఫ్)కి బుధవారం ఆమోదం తెలిపింది. పాడి, మాంసం ప్రాసెసింగ్, విలువ పెంచే మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు రంగంలో పశుగ్రాస కర్మాగారాల స్థాపన వంటి మౌలిక సదుపాయాల స్థాపనలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏహెచ్ఐడీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లు, ఎంఎస్ఎంఈలు, సెక్షన్ 8 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు కనీసం 10% మార్జిన్ మనీతో పెట్టుబడి పెడితే మిగిలిన 90% షెడ్యూల్డ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అర్హతగల లబ్ధిదారులకు భారత ప్రభుత్వం 3% వడ్డీ రాయితీని కల్పిస్తుంది. ప్రధాన రుణ మొత్తానికి 2 సంవత్సరాల మారటోరియం ఉంటుంది. నాబార్డ్ నిర్వహించేలా రూ. 750 కోట్లతో మరొక క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ఎంఈ పరిధిలో మంజూరైన ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారంటీ కోసం ఈ నిధిని ఉపయోగిస్తారు. -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు. -
విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్మెంట్ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ... ► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ► మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి. ► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్‌లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు తగిన ఇన్ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు. ► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్చార్జ్గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం భారత్‌లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది. ► డిఫాల్టర్లకు ఊరట... ఐబీసీ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్‌ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్‌లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్‌ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. -
వరికి మద్దతు రూ.53 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి మద్ధతు ధరను స్వల్పంగా రూ. 53 పెంచింది. ఈ పెంపుతో వరి క్వింటాల్ ధర సాధారణ రకం రూ. 1,868కి, ఏ గ్రేడ్ రకం రూ. 1888కి చేరింది. నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020–21 పంట సంవత్సరానికి(2020 జూలై– 2021 జూన్) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. అత్యధికంగా గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్)కు క్వింటాలుకు రూ. 755 పెంచారు. నువ్వులకు రూ. 370, మినుములకు రూ. 300, పత్తికి రూ. 275 మేర పెంచారు. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018–19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా సజ్జల(బాజ్రా)కు 83%, మినుములకు 64%, కందులకు 58%, మొక్కజొన్నకు 53%, ఇతర పంటలకు కనీసం 50% మేర ప్రతిఫలం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో వరి ప్రధాన పంట. ఇప్పటికే 35 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల మేరకు 2020–21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50% నుంచి 83% వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. వరి దిగుబడి వ్యయాన్ని సాధారణ రకానికి రూ. 1245, ఏ గ్రేడ్ రకానికి రూ. 1246గా నిర్ధారించి, దానిపై 50% ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర నిర్ణయించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు. రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించే తేదీని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సమీక్షించారు. హైదరాబాద్ సహా 13 నగరాల్లోనే 70 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులూ హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణే, కోల్‌కతా/హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. కేసుల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమావేశంలో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ నిర్వహణపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్ కేసుల రేటు, రెట్టింపు రేటు, టెస్టుల సంఖ్య తదితర అంశాలపై దృష్టిపెట్టేలా మార్గదర్శకాలు ఉన్నాయి. కేసులు, భౌగోళిక వ్యాప్తి వంటి అంశాల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను భౌగోళికంగా నిర్వచించాలని కేంద్రం నొక్కి చెప్పింది. తద్వారా లాక్డౌన్ నియమావళిని అమలు చేయడంలో సహాయపడుతుంది. రెసిడెన్షియల్ కాలనీలు, బస్తీలు, మునిసిపల్ వార్డులు లేదా పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాలు, మునిసిపల్ జోన్లు, పట్టణాలను అవసరమైన విధంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించవచ్చా అన్న అంశాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు నిర్ణయించవచ్చు. -
‘హాట్ స్పాట్స్’ కాని ప్రాంతాల్లో..!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా వైరస్ హాట్‌స్పాట్స్ కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను క్రమానుగతంగా ఉపసంహరించేలా ప్రణాళిక రూపొందించాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా గత గురువారం ప్రధాని లాక్డౌన్ ఎత్తివేత దిశగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక రంగంపై కరోనా ప్రతికూల ప్రభావం అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేలా లాక్డౌన్ అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రులను ఆదేశించారు. లాక్డౌన్ ప్రకటన అనంతరం తొలిసారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కేబినెట్ భేటీ నిర్వహించారు. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం గురించి ఈ భేటీలో చర్చించారు. పంట కోతల సమయంలో రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ప్రధాని కోరారు. ‘రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఈ పంట కోతల సమయంలో సాధ్యమైనంత సాయాన్ని వారికి ప్రభుత్వం అందించాలి’ అని స్పష్టం చేశారు. పంటలను మార్కెట్లకు చేర్చేందుకు సాంకేతికత సాయం తీసుకోవాలని, క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్ల తరహాలో ట్రక్ సర్వీస్ అగ్రిగేటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చేమో ఆలోచించాలని సూచించారు. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను సేకరించే విషయంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు లభించిన ఒక అవకాశంగా భావించాలని ప్రధాని సూచించారు. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మంత్రిత్వ శాఖలు ‘వ్యాపార కొనసాగింపు ప్రణాళిక’లను సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. లాక్ డౌన్ అనంతరం అమలు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన 10 నిర్ణయాలను, 10 ప్రాధాన్య రంగాలను గుర్తించాలని మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, తమ తమ మంత్రిత్వ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, దేశీయంగా ఉత్పత్తులను పెంచడం, తద్వారా ఎగుమతులను పెంచేందుకు ఆచరణపూర్వక సూచనలు ఇవ్వాలని మంత్రులను కోరారు. కొత్తగా ఏయే ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చో, ఏయే దేశాలకు ఎగుమతి చేయొచ్చో ఆలోచించాలన్నారు. అదే సమయంలో దేశీయంగా నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూడాలని మంత్రులను కోరారు. బ్లాక్ మార్కెట్‌ను, ధరలను అక్రమంగా పెంచడాన్ని అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని కోరారు. ఈ పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు కచ్చితంగా అందేలా చూడాలన్నారు. ప్రధాని నివాసంలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా మంత్రులు తమ కార్యాలయాలు, నివాసాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది సుదీర్ఘ పోరాటం: మోదీ కరోనా వైరస్‌పై భారత్ సుదీర్ఘ పోరు జరపాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటంలో అంతిమంగా భారత్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగనుంది. అలసట చెందినట్లు గానీ, ఓటమి పాలయినట్లు గానీ మనం భావించరాదు. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తాం. విజేతలుగా నిలుస్తాం. కరోనా మహమ్మారిపై గెలుపు సాధించడమే యావత్ జాతి లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్–19 తీవ్రతను అర్థం చేసుకుని సరైన సమయంలో సమగ్ర చర్యలు అమలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ తీసుకున్న చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. లాక్డౌన్ సమయంలో ప్రజలు చూపిన పరిణతి అపూర్వం. భారత్ వంటి పెద్ద దేశంలో ప్రజలు ఇలా క్రమశిక్షణ చూపుతారని ఎవరూ ఊహించి ఉండరు’ అని ప్రధాని అన్నారు. -
ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దు
సాక్షి, అమరావతి: హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని, లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు కేంద్రం రాష్ట్రాలకు జారీ చేస్తున్న మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ► వివిధ రాష్ట్రాల సరిహద్దులు, జాతీయ రహదారులపై చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిధులను వినియోగించుకోవాలి. ► నిత్యావసర వస్తువులు, సరుకులు రవాణా చేసే వివిధ రకాల వాహనాలకు ఎక్కడా ఆటంకం లేకుండా వాటి నిర్ధేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలి. అలాగే ప్రజలందరికీ నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాలి. ► కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించిన చోట్ల తగిన సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలి. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పటిష్టంగా అమలు చేస్తున్నాం: సతీష్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మాట్లాడుతూ.. ఏపీలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను రైతు బజార్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. అలాగే ఒక్కో మనిషికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు వంటి రేషన్ సరుకులను 15 రోజులకు ఒకసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటకలోని కోలార్ నుంచి రాష్ట్ర సరిహద్దు చిత్తూరు జిల్లాకు చేరుకున్న 1,500 కూలీలకు సంబంధించిన అంశాన్ని ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. -
‘ఫసల్ బీమా’ ఇక స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో కేంద్రం కీలక మార్పు చేసింది. ఆ పథకంలో చేరడం తప్పనిసరి కాదని, రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమేనని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా నిర్ణయంతో, రుణాలు తీసుకున్న రైతులు కానీ, తీసుకోవాలనుకుంటున్న రైతులు కానీ ఈ బీమా పథకంలో అవసరమనుకుంటేనే చేరొచ్చు. రైతు సంఘాలు, పలు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర కేబినెట్ బుధవారం దీనికి ఆమోదం తెలిపినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంలోనూ తదనుగుణంగా మార్పులు చేశామని అందులో పేర్కొన్నారు. నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5% ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు. పీఎంఎఫ్‌బీవైపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం తెలిపారు. కేబినెట్ భేటీలో ఆమోదించిన ఇతర నిర్ణయాలు.. ► కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్ట్రీని, రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేబెనెట్ ఆమోదం తెలిపింది. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలనే, వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలనే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో పొందుపర్చారు. ► క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ► పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2% నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు. ► స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020–21 నుంచి 2024–25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి. ► రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి. -
పన్నుల పరిష్కార పథకం పరిధి పెంపు...
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ’వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్టీ) ఉన్న పెండింగ్ కేసులను కూడా ఇందులోకి చేర్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంబంధిత వర్గాల సిఫార్సులకు అనుగుణంగా వివాద్ సే విశ్వాస్ బిల్లుకు కొత్త సవరణలను ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, 12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వా న్ని పెంచేందుకు ఇది తోడ్పడనుంది. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. -
‘పెస్టిసైడ్స్’ నియంత్రణకు బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్సెక్టిసైడ్ యాక్ట్ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు. ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. -
అబార్షన్‌కు 24 వారాల గడువు
న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. గర్భ విచ్ఛిన్నానికి గరిష్ట గడువుని 20 వారాల నుంచి 24 వారాలకి పెంచడం వల్ల ఎందరో మహిళలకు బాగా సాయపడుతుందని అన్నారు. అత్యాచార బాధితులు, మైనర్లు గర్భం దాల్చినప్పటికీ చాలా ఆలస్యంగా గ్రహిస్తారని, అలాంటి వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని అన్నారు. అంతేకాదు సులువుగా గర్భస్రావం, మహిళల పునరుత్పత్తి హక్కుల్ని కాపాడినట్టు అవుతుందని చెప్పారు. చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు జవదేకర్ చెప్పారు. దీనిని ఒక ప్రగతిశీల సంస్కరణగా జవదేకర్ అభివర్ణించారు. అయితే ఇన్నాళ్లూ ఒక వైద్యుడు అంగీకరిస్తే అబార్షన్ చేసేవారని, కానీ 24 వారాలు వచ్చాక అబార్షన్ చేస్తే ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి తీరాలని జవదేకర్ వివరించారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు ఎన్ఈసీ నిధుల్లో 30% నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఈసీ) నిధుల్లో 30 శాతం సమాజంలో అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాలు, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకి ఈ నిధుల్ని కేటాయించనున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఎన్ఈసీ నిబంధనల్ని కూడా సవరించనున్నారు. మిగిలిన నిధుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేటాయిస్తారు. -
ప్రవాసి భారతీయ కేంద్రంలో కేబినెట్ భేటీ
-
రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్
రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన మన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశలో తొలి అడుగుగా దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 53,596 కిలోమీటర్ల రైలు మార్గంవుంది. అదిప్పుడు మరో 13,772 కిలోమీటర్ల మేర మాత్రమే పెరిగిందంటే దాని వృద్ధి ఏమేరకువుందో అర్ధమవుతుంది. అప్పటితో పోలిస్తే అది నిత్యం నిర్వహించాల్సిన రైళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. స్టేషన్లు ఎక్కు వయ్యాయి. ప్రయాణికుల సంఖ్య కూడా ఊహకందనివిధంగా పెరిగింది. 29 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలూ, 8,500 స్టేషన్లువున్నాయి. వేలాది రైళ్లు రోజూ 2 కోట్ల 30 లక్షలమంది ప్రయాణికులను చేరేస్తాయి. సరుకు రవాణా రోజుకు 30 లక్షల టన్నులమేర విస్తరించింది. ఈ కార్యనిర్వహణంతా 17 జోన్లు, 68 డివిజన్లు పరిధిలోవుండే 13 లక్షలకుపైగా సిబ్బంది చేతుల మీదుగా సాగుతుంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత మన రైల్వే వ్యవస్థే అతి పెద్దది. కానీ ఈ వ్యవస్థ నిత్యం ఆర్థిక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది. 2017–18లో రైల్వే శాఖ ఆర్జించిన ప్రతి రూపాయిలో 98.44 పైసల వరకూ నిర్వహణకే పోయిందని ఇటీవల కాగ్ నివేదిక తెలిపింది. ఇది గత పదేళ్లతో పోలిస్తే అత్యంత అధమ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించింది. ఇంత కన్నా దారుణమేమంటే ఎన్టీపీసీ, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఇర్కాన్) సంస్థలు రైల్వేలకిచ్చిన అడ్వాన్సుల వల్ల ఈమాత్రమైనావుంది కానీ, లేనట్టయితే ఇది 102. 66 పైసలుగా నమోదయ్యేదని కాగ్ తెలిపింది. ఈ అడ్వాన్సుల కారణంగా రైల్వేల జమాఖర్చుల పద్దులో రూ. 1,665.61 కోట్లు మిగులు కనబడింది. ఆ రెండింటినీ మినహాయిస్తే 5,676.29 కోట్ల నష్టం నమో దయ్యేది. సరుకు రవాణా నుంచి వచ్చే లాభాల్లో 95 శాతాన్ని ప్రయాణికుల సర్వీసులో ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి వినియోగించాల్సివస్తోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి రైల్వేశాఖకు జవసత్వాలు కల్పిస్తామని నాలుగేళ్లక్రితం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణా పరిమాణం భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం రైల్వేల ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలని వివరించింది. అన్నీ పూర్తయితే రైల్వేల ఆదాయం మరిన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఇదంతా ఆశించినంతమేర జరగలేదు. నిజానికి బడ్జెట్లలో ప్రకటించిన ప్రాజెక్టులన్నీ సక్రమంగా అమలు చేయడానికి అవస రమైన నిధులు ఆ శాఖ దగ్గర ఉండవు. కనుక ప్రాథమికమైన పనులు మొదలు కావడానికే ఏళ్లూ పూళ్లూ పడుతూంటుంది. మన రైల్వేలు 30 ఏళ్లకిందటి ప్రాజెక్టుల్ని కూడా ఇంకా పూర్తిచేయాల్సే వున్నదని ఆమధ్య ఒక నివేదిక ప్రకటించింది. రైల్వేల్లో వున్న అనేకానేక విభాగాలు మధ్య సరైన సమన్వయం వుండకపోవడం వల్ల అడుగడుగునా ఇబ్బందులు తలెత్తడమేకాక, తలపెట్టినవేవీ సక్ర మంగా సాగటం లేదని ఆ నివేదిక తెలిపింది. ఒకపక్క అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ సాధనను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందులో కీలకపాత్ర పోషించాల్సిన రైల్వే వ్యవస్థ మాత్రం ఇంతటి దుస్థితిలో వుండ టం ఆందోళన కలిగించే అంశమే. కనుకనే కేంద్రమంత్రివర్గం రైల్వే ప్రక్షాళనకు నడుం బిగించా నంటున్నది. సమస్యలెదురైనప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు సిబ్బంది సంఖ్యపై దృష్టి పెడ తాయి. రిటైరవుతున్నవారు అవుతుండగా వారి స్థానంలో కొత్తవారి నియామకం విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ఈసారి పైస్థాయినుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలని నిర్ణయించడం మెచ్చదగిందే. రైల్వే బోర్డులో ఇప్పుడున్న ఎనిమిది మంది సభ్యుల సంఖ్యను అయిదుకు తగ్గించాలని, వేర్వేరు కేడర్లనూ, విభాగాలనూ విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ వగైరా ఎనిమిది విభాగాలను ఇండియన్ రైల్వే మేనే జ్మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) పేరిట ఒకే సర్వీస్కిందకు తీసుకొస్తారు. ఇకపై రైల్వేల్లో రైల్వే పరిరక్షణ దళం, వైద్య సర్వీసుల విభాగాలు మాత్రమే వుంటాయి. రైల్వే బోర్డు చైర్మన్, మరో నలుగురు సభ్యులు మాత్రమే బోర్డులో వుంటారు. చైర్మన్‌ను సీఈఓగా వ్యవహరిస్తారు. అలాగే సమర్థత, అనుభవం, నైపుణ్యం వున్నవారిని బయటినుంచి తెచ్చే యోచన కూడావుంది. 1994లో ప్రకాష్ టాండన్ కమిటీతో మొదలుపెట్టి 2015లో వివేక్ దేబ్రాయ్ కమిటీ వరకూ మూడు, నాలుగు కమిటీలు ఈ సంస్కరణలన్నీ సూచిస్తూనేవున్నాయి. అయితే కేంద్రం ఆ విషయంలో తట పటాయిస్తూ వచ్చింది. దేబ్రాయ్ కమిటీ 2015లో చేసిన సిఫార్సులు అప్పట్లో కలకలం సృష్టించాయి. రైల్వే మంత్రిత్వ శాఖను, రైల్వేలను వేరుచేయాలనడం, రైల్వే వ్యవస్థను రైళ్ల నిర్వహణకు మాత్రమే పరిమితం చేసి ఇతర బాధ్యతల నిర్వహణకు మౌలిక సదుపాయాల కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలు రేకెత్తించాయి. ఇప్పుడు కేంద్ర కేబినెట్ అంత లోతుకు పోలేదు. అయితే మున్ముందు వాటిపై కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2018–2030 మధ్య రైల్వేల్లో 50 లక్షల కోట్ల మేర పీపీపీ ప్రాతిపదికన పెట్టుబడులు సేకరించాలని నిర్ణయించినట్టు నిరుటి రైల్వే పద్దులోనే కేంద్రం ప్రకటించింది. రైల్వేల్లో అమలు చేసే ఏ సంస్కరణలైనా దాని లోపాలను పరిహరించి, అది పూర్తి జవసత్వాలతో పనిచేసే విధంగా తీర్చిదిద్దాలి. కేవలం ప్రైవేటుకిస్తే మంత్రించినట్టు అంతా సవ్యంగా మారుతుందనే ధోరణి సరికాదు. -
‘ఎన్పీఆర్’కు కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఒకవైపు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్– ఎన్పీఆర్)ను తాజాగా సవరించేందుకు(అప్డేట్) రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన – 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఈ ఎన్పీఆర్లో నమోదు చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. మొదట 2010లో జాతీయ జనాభా పట్టికను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్డేట్ చేశారు. 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నార్సీతో సంబంధం లేదు ఎన్పీఆర్ను 2010లోనే రూపొందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూపీఏ హయాంలో పౌరసత్వ చట్టం–1955 లోని నిబంధనల కింద 2010లోనే ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభమైందని, 2015లో ఒకసారి అప్డేట్ అయిందని వివరించారు. అప్పుడు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. తాజాగా, ఆ జాబితాను అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక) ప్రక్రియ చేపడ్తారన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎన్పీఆర్కు ఎన్సార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మరో మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ‘ఎన్పీఆర్ ప్రక్రియలో ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే బయోమెట్రిక్ ముద్రలు కూడా అవసరం లేదు. ఇదొక స్వీయ ధ్రువీకరణ వంటిదే. కేంద్ర సంక్షేమ పథకాలను అవసరమైన వారందరికీ చేర్చే లక్ష్యంతో ఈ ఎన్పీఆర్ ప్రక్రియ ఉంటుంది. గతంలో మాదిరిగా పెద్ద దరఖాస్తు నింపాల్సిన పనేమీ లేదు. మొబైల్ యాప్ ద్వారా సులువుగా నింపే వెసులుబాటు ఉంటుంది’ అని వెల్లడించారు. అయితే, జనగణన కమిషనర్ అధికారిక వెబ్సైట్లో మాత్రం ఎన్పీఆర్ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తామని ఉండటం గమనార్హం. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగించుకున్నాయని జవదేకర్ గుర్తు చేశారు. ఎన్పీఆర్ డేటాను ఆయుష్మాన్భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల, సౌభాగ్య తదితర కేంద్ర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, కేరళసహా కొన్ని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఎన్పీఆర్ కార్యక్రమంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయగా.. ‘ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. దీనికి సంబంధించి అధికారులకు శిక్షణనివ్వడం కూడా ప్రారంభించాయి’ అని జవదేకర్ సమాధానమిచ్చారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్: కాంగ్రెస్ ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ చర్య రాజ్యాంగంలోని లౌకికభావనకు భంగకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదంటూ హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటన..ఎన్నార్సీపై పార్లమెంట్లో చర్చించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య కంటే పెద్ద అబద్ధమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్నార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్ అంటూ హోం శాఖ తన వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. 2021లో జనగణనతోపాటుగా ఎన్పీఆర్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జనగణన’కు ఆమోదం దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన– 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది దేశంలో జరిగే 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. ఈ జనగణన దేశమంతటా చేస్తారు. జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరిస్తుండడంతో జనగణన వివరాలను ప్రకటించే అవకాశముంది. -
దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్‌ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్‌లో కేంద్రం భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాలి. ► ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ► చిన్నపాటి ఉల్లంఘనలకు కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్ టర్నోవరులో 2% దాకా జరి మానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ
న్యూఢిల్లీ: సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే కేంద్ర కేబినెట్లో చేరేందుకు సిద్ధమేనని జనతాదళ్(యునైటెడ్) బుధవారం సంకేతాలిచ్చింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని జేడీయూ నిరాకరించిన విషయం తెలిసిందే. జేడీయూకి కేంద్రంలో ఒకే మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించడంతో ప్రభుత్వంలో చేరేందుకు నాడు జేడీయూ నిరాకరించింది. తాజాగా, బుధవారం జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పార్టీ మరో మూడేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ తరువాత నితీశ్ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ సిద్ధంగానే ఉందని, అయితే, తమకు మంత్రిమండలిలో సరైన ప్రాతినిధ్యం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కానీ ఈ విషయంలో చొరవ తీసుకుంటే తాము స్వాగతిస్తామన్నారు. ఈ విషయంలో తామేమీ షరతులు విధించబోమన్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటులో విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో.. తాజాగా జేడీయూ ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను నితీశ్ ఓడించారు. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
బంకు ఓపెన్!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తలుపులు తెరిచినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి‘ అని సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఇంధన మార్కెటింగ్ నిబంధనలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో అమల్లోకి వచ్చినవి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత మార్పులతో పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది. పెట్రోల్ బంకులపై సీసీఈఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రధానాంశాలు.. ► పెట్రోల్ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎల్ఎన్జీ, బయోఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్లెట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ► రూ. 250 కోట్ల నికర విలువ గల కంపెనీలు .. పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్స్‌కి అనుమతులు పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంధన రిటైలింగ్ లైసెన్సు పొందాలంటే హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్ లేదా ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్ వంటి వాటిపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ఇంధనాల మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న కంపెనీలకు.. ఈ నిబంధన ప్రతిబంధకంగా ఉంటోంది. ► ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా మొత్తం అవుట్‌లెట్స్‌లో 5% అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. లేదంటే ఒక్కో బంకుకు రూ. 3 కోట్ల మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. దిగ్గజాల ఎంట్రీకి మార్గం.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎస్ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో, బ్రిటన్ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్ .. 2018 నవంబర్లోనే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్ విక్రయాల అవుట్‌లెట్స్ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్ బంకుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది. ప్యూమా ఎనర్జీ రిటైల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్కో ఇంకా చర్చల్లో ఉంది. ప్రభుత్వ సంస్థల హవా... కంపెనీ బంకుల సంఖ్య ఐఓసీ 27,981 హెచ్‌పీసీఎల్ 15,584 బీపీసీఎల్ 15,078 రిలయన్స్ 1,400 నయారా 5,344 (గతంలో ఎస్సార్ ఆయిల్) షెల్ 160 -
‘రబీ’కి కేంద్రం మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను పెంచింది. 2020–21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్లో ఇది రూ.1,440గా ఉండేది. శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది. మసూర్ (కేసరి) పప్పు క్వింటాల్ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది. ఆవాలు క్వింటాలు ధర గత సీజన్లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్లో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది. కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది. చైనా సరిహద్దుకు కొత్త సైనికులు ! దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇండో–టిబెటన్ బార్డర్ పోలీసు కేడర్‌ను కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఈ సమీక్షలో పలువురికి పదోన్నతులు దక్కనున్నాయి. దీంతో పాటు గ్రూప్ ఏ సాధారణ విధుల కేడర్, నాన్ జనరల్ విధుల విభాగంలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐటీబీపీ 58వ రైజింగ్ డే సందర్భంగా ఈ సమీక్ష చేపట్టారు. గతంలో చివరగా 2001లో సమీక్ష చేపట్టారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. కొత్త ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో 50 లక్షల మందికి లబ్ధి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుం దని జవదేకర్ చెప్పారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. -
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఢిల్లీలోని నివసిస్తున్న 40 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం ఇక, నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను గట్టెక్కించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేసి.. పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను మూసివేయబోమని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఆ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండబోదని ఆయన చెప్పారు. ఈ సంస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయించడంతోపాటు రూ. 15వేల కోట్ల సావరీన్ బాండ్స్ జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రెండు సంస్థల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు. పంటల కనీస మద్దతు ధర పెంపు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. గోధుమ సహా మరికొన్ని పంటల కనీస మద్ధతు ధర పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
సంపద పెంచుకోవడానికే కదా నిషేధం!
న్యూఢిల్లీ: ఇ- సిగరెట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇ-సిగరెట్లతో పాటు మొత్తంగా పొగాకు ఉత్పత్తులన్నింటిపై నిషేధం విధించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అత్యధిక ఆదాయం ఇచ్చే పొగాకు సిగరెట్లపై కూడా నిషేధం విధించడానికి కేంద్రానికి మనసు ఎలా ఒప్పుతుందిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇ-సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. అమెరికాలో ఇ-సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ఇ-సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఎవరి దగ్గరైనా ఇ-సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.(చదవండి : 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు..ఎందుకు హానికరం) ఇక ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు...‘ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇ-సిగరెట్లను నిషేధించలేదు. ఖజానాను నింపుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సిగరెట్లపై నిషేధం విధిస్తే ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఆదాయం కోల్పోతారు కదా. అందుకే వాటిని నిషేధించే ధైర్యం చేయలేరు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల సిగరెట్లపై నిషేధం విధించాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా..‘ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పొగాకు ఉత్పత్తుల వినియోగదారుల జాబితాలో భారత్ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. పొగాకు ఉత్పత్తుల కారణంగా ఏడాదికి 9 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌లో వీటి గురించి ప్రస్తావన లేదు. చాలా ఆనందం. ఇ- సిగరెట్లపై నిషేధంతోనే సరిపెట్టండి. బాగుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. సిగరెట్ తాగే అలవాటు మానుకోవడానికి ఇ- సిగరెట్లు ఆశ్రయించే వారు ఇప్పుడు సాధారణ సిగరెట్ కాలుస్తారు. కాబట్టి వాటిని అమ్మే వారి ఆదాయం బాగానే పెరుగుతోంది అంటూ వివిధ రకాల మీమ్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. Banning #ecigarettes by the Government is not because of Health, It is because of Wealth. They'll not ban regular cigarettes, because of heavy revenue from it. If they really cares about the Health and Disease , then they have to ban the entire cigarette of all types. pic.twitter.com/EtXOpAOTfg — Md Furquan Ahmad (@FurquanAMU) September 18, 2019 The short journey of #ecigarettes Dealers, retailers and smokers pic.twitter.com/jsdwtLZ6Kz — gajender (@gajender00) September 18, 2019 -
రైల్వేలో 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రైల్వేశాఖలోని ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ) అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..‘78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇవ్వాలన్న నిర్ణయం కారణంగా రైల్వేశాఖలో 11.52 లక్షలమందికిపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. దీనివల్ల కేంద్రం ప్రభుత్వంపై రూ.2,024.40 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ బోనస్‌తో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. తద్వారా రైల్వేశాఖలో ఉత్పాదకత పెరుగుతుంది’ అని తెలిపారు. అయితే కేంద్రం కేవలం 78 రోజుల బోనస్ మాత్రమే ప్రకటించడంపై రైల్వే యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ విషయమై అఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య స్పందిస్తూ..‘రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత ఆధారంగా బోనస్ అందించాలని మేం కోరాం. ఈ విషయంలో రైల్వేబోర్డు ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపాం. రైల్వే ఉద్యోగులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పగలు–రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. మేం న్యాయమైన బోనస్‌నే కోరాం. కానీ దురదృష్టవశాత్తూ అది అమలుకాలేదు’ అని విమర్శించింది. -
ఇ–సిగరెట్లపై నిషేధం
న్యూఢిల్లీ : ఇ–సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇ–సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇ–సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. ఎవరి దగ్గరైనా ఇ–సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేయడం నేరమే. వీరికి రూ.50 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వరకు విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేసినవారు ఆర్డినెన్స్ అమలయ్యే నాటికి వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో జమ చేయాలి. జూల్ ల్యాబ్స్, ఫిలిప్ మారిస్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు తమ ఇ–సిగరెట్ వ్యాపారాలను భారత్‌కు విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం తీసుకురానున్నారు. అమెరికాలో ఇ–సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని నిర్మల చెప్పారు. ఇ–సిగరెట్లను చూపుతున్న మంత్రి నిర్మల ఇ–సిగరెట్లు ఎందుకు హానికరం ? ఇ–సిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అనే పదార్థం వేడెక్కి ఆవిరిగా మారి పొగ పీల్చడానికి అనువుగా మారుతుంది. సంప్రదాయంగా పొగాకు తాగడం, సిగరెట్లు కాల్చడం కంటే ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరమనే వివిధ నివేదికలు వెల్లడించాయి. పొగతాగడం కంటే ఇ–సిగరెట్స్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, ఇ–సిగరెట్లను నిషేధించాల్సిన సమయం వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ‘ప్రస్తుతం అమెరికా కంటే భారత్‌లోనే ఇ–సిగరెట్లను పీల్చడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే నగరాలకే ఈ ట్రెండ్ పరిమితం కావడంతో వ్యాధులు, మృతులు వంటివేవీ వెలుగులోకి రాలేదు’ అని పల్మనాలజిస్ట్ అర్జున్ ఖన్నా అన్నారు. 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు భారత్‌లో 460 ఇ–సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఇవేవీ భారత్‌లో తయారవడం లేదు. 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ–సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్‌లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇ–సిగరెట్లపై నిషేధం విధించారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఇ–సిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది రెగ్యులర్‌గా ఇ–సిగరెట్లను వాడుతున్నారు. 2011–16 సంవత్సరాల మధ్య వీటి వాడకంలో 900 శాతం వృద్ధి నెలకొంది. పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో భారత్‌లో ప్రతీ ఏడాది 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత పొగ తాగే వారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. మొత్తంగా 10.6 కోట్ల మంది పొగాకు బానిసలుగా మారారు. -
కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను వెల్లడించారు. దేశంలోని యువతపై ఈ-సిగరెట్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నాం. వాటిపై ప్రకటనలు, విక్రయం కూడా ఇక నేరమే. దీనికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది’ అంటూ కేబినెట్ నిర్ణయాలను నిర్మలా వివరించారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ-సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. -
ఈ-సిగరెట్స్‌పై నిషేధం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయవచ్చని భావిస్తున్నారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ సిగరెట్లను కలిగిఉంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ 50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. -
మీడియా చేతికి ‘టాప్ సీక్రెట్’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు చేరుకున్న అమిత్ షా, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా షా చేతిలో ‘టాప్ సీక్రెట్’పేరుతో ఉన్న పత్రాలు మీడియా కంటపడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను.. రాజ్యాంగపరమైన, రాజకీయం, శాంతిభద్రతలు అనే మూడు అంశాలుగా వర్గీకరించారు. మొదటి విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్ షా నోట్ చేసుకున్నారు. సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందులో ఉంది. అలాగే రాజ్యసభలో భద్రత విషయంలో ప్రధాని మోదీ సభ చైర్మన్ వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్ షా నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆగస్టు 7న జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది. జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్‌తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్లో ఉంది. మరోవైపు శాంతిభద్రతల అంశానికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాను జమ్మూకశ్మీర్‌కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారు. -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
చిన్నారులపై అత్యాచారానికి ఉరిశిక్షే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న నికృష్టపు ఘటనల నేపథ్యంలో.. చిన్నారులను లైంగిక దాడులనుంచి కాపాడే చట్టం–2012 (పోక్సో)కు పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా అణచివేసేందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వారికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష విధించేలా పోక్సో చట్టంలో మార్పులు చేశామన్నారు. కఠినమైన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన మూడో విడతలో భాగంగా.. గ్రామీణప్రాంతాల్లో అనుసంధానతకోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగిల్ కోడ్‌లోకి 13 కార్మిక చట్టాలు: 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు (కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు – 2019)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు బీమా కవరేజీ పెరిగేందుకు అవకాశముంటుంది. 10 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ కోడ్ వర్తిస్తుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లు’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరించని డిపాజిట్ల పథకం ఆర్డినెన్స్–2019 స్థానంలో ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచినట్లయితే అటువంటి సందర్భాల్లో సదరు వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి. ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు (ఆర్పీఎఫ్) ఆర్గనైజ్డ్ గ్రూప్–ఏ హోదాను కేంద్ర కేబినెట్ కల్పించింది. -
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2019కు శుక్రవారం ఉదయం కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్న సీతారామన్ కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్!
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులు ఇక మీదట జాగ్రత్తగా నిబంధనలను పాటించాల్సిందే. లేదంటే జరిమానాల మోత మోగనుంది ఈ మేరకు మోటారు వాహనాల (సవరణ) బిల్లులో ప్రతిపాదిత మార్పులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం లాంటి అంశాలను ప్రధానంగా ఈ బిల్లు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాను ఐదు రెట్లు పెంచనుంది. అలాగే ప్రమాదకరమైన రేసింగ్‌లు, అతివేగంగా నడిపితే జరిమానాను ఏకంగా పది రెట్లు పెంచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది తాజా నిబంధనల ప్రకారం జరిమానా తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలుగా ఉండనుంది. రోడ్డు ప్రమాద మృతులకు రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ. 20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. అంతేకాదు రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా ప్రతిపాదిత సవరణ చేసింది. అలాగే థర్డ్‌పార్టీ బీమాను గరిష్టంగా రూ.10 లక్షలు పరిమితం చేయాలనేది మరో ప్రతిపాదన. కొత్త వాహనాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలను చేర్చాలని భావిస్తోంది. ఉదాహరణకు, లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది. కాగా ఈ సవరణలకు సంబంధించిన ఈ బిల్లుకు లోక్‌సభలో 2017 లో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభ మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ ప్రతిపాదనలతో కూడిన బిల్లు చట్టం రూపం దాల్చాలంటే ఉభయ సభల అనుమతి పొందాల్సి ఉంటుంది. -
అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు. సీటు బెల్ట్ లేకుంటే లైసెన్స్ రద్దు.. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుకు ఆమోదం.. నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేబినెట్ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
-
మోదీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన మోదీ ఆయనకు రాజీనామా లేఖ అందచేశారు. మోదీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పదవిలో కొనసాగాలని కోరారు. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం ఆమోదించారు. మంత్రి మండలి తీర్మానం నేపథ్యంలో ప్రధాని మోదీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించారు. కాగా నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఇది తుది కేబినెట్ సమావేశం కావడం గమనార్హం. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తదుపరి ప్రభుత్వంలో తొలి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణపైనా చర్చ జరిగినట్టు సమాచారం. -
అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సచివాలయంలో ప్రదీప్ కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరువు కార్యాచరణ ప్రణాళిక అమలు, భూగర్భజలాలు, విద్యుత్ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటాసేకరణ, విశ్లేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్లో అధిక నిధులు ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామని, రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని, ప్రధాన రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, వడగాడ్పులపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కర్ణాటక రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినందుకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రివర్గ సహచరులతో మోదీ సమావేశం
-
మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం
-
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ/ గువాహటి: కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు–2018కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మిత్రపక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ) సహా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు విద్యార్థి సంఘాలు, నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కేంద్రం ముందుకు వెళ్లేందుకే నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2016లో తొలిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ) ప్రభుత్వం అప్పట్లో నియమించింది. అస్సాం, మేఘాలయలతో పాటు గుజరాత్, రాజస్తాన్‌లో పర్యటించిన ఈ కమిటీ.. ప్రజలు, నేతలు, నిపుణులు, వేర్వేరు సంఘాల అభిప్రాయాన్ని సేకరించింది. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు డీజీపీలతో చర్చించింది. ఈ నివేదికను సోమవారం కమిటీ లోక్‌సభకు సమర్పించగా, కొన్ని గంటల్లోనే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో హిందువులు మైనారిటీలవుతారు పౌరసత్వ బిల్లుపై అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని తీసుకురాకుంటే రాబోయే ఐదేళ్లలో అస్సాంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారని హెచ్చరించారు. అలా జరిగితే అస్సాం మరో కశ్మీర్‌గా మార్చాలనుకుంటున్న శక్తులకు లాభం చేకూరుతుందన్నారు. ఇది జిన్నా వారసత్వానికి, భారత వారసత్వానికి యుద్ధమని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించబోదని అస్సాం సీఎం సోనోవాల్ చెప్పారు. మద్దతు ఉపసంహరించుకున్న ఏజీపీ కేబినెట్ పౌరసత్వ ముసాయిదా (సవరణ) బిల్లు–2018ను ఆమోదించడంతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి తమ 14 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మితప్రక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ) ప్రకటించింది. ఈ విషయమై ఏజీపీ అధ్యక్షుడు, అస్సాం మంత్రి అతుల్ బోరా మాట్లాడుతూ.. ‘ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేందుకు చివరి ప్రయత్నంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. దీనివల్ల అస్సాం ఒప్పందం, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియ నిర్వీర్యం అవుతాయని వివరించాం. మేం ఎన్డీయే కూటమిలో చేరినప్పుడు అక్రమ వలసదారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ బీజేపీ ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విచారిస్తున్నాం’ అని తెలిపారు. ఏజీపీ మద్దతు ఉపసంహరణతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన ఇబ్బందేమీ లేదు. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 74 మంది సభ్యుల బలముంది. 61 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(12), ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు. కాగా, పౌరసత్వ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో అస్సాం అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. పౌరసంఘాలు, అల్ఫాతో కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్లమెంటుతోపాటు అస్సాం భవన్ ముందు ఏఏఎస్‌యూ, కేఎంఎస్ఎస్ సభ్యులు నగ్నంగా నిరసన తెలిపారు. ముసాయిదా బిల్లులో ఏముందంటే.. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన మైనారిటీలు అంటే.. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్దులకు పౌరసత్వం కల్పిస్తారు. సరైన పత్రాలు లేకపోయినా వీరు కనీసం ఆరేళ్ల పాటు భారత్‌లో నివాసముంటే పౌరసత్వం ఇస్తారు. ఇందుకోసం పౌరసత్వ చట్టం–1955ను సవరించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అస్సాం, మేఘాలయ, మిజోరం సహా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1971, మార్చి 24 తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని అస్సాం ఒప్పందం–1985 చెబుతోంది. తాజాగా ఈ పౌరసత్వ ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే అస్సాం ఒప్పందం నిర్వీర్యమై పోతుందని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం ప్రకటించాయి. లౌకిక దేశంలో మతాల ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వడం రా జ్యాంగ విరుద్ధమన్నాయి. కాగా, ఈ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ ప్రకటిం చాయి. ఈ మూడు దేశాల నుంచి భారత్‌ను ఆశ్రయించే మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. కటాఫ్.. 2014, డిసెంబర్ 31 బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లో వివక్షకు గురై భారత్‌ను ఆశ్రయించిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికలో తెలిపింది. బీజేపీ ఎంపీ రాజేంద్ర అగ్రవాల్ అధ్యక్షతన ఏర్పాటైన జేపీసీ తన 440 పేజీల నివేదికలో ‘వలసదారులకు అధికారికంగా పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం 2014, డిసెంబర్ 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం వీలవుతుంది. అంతేకాకుం డా వలసదారుల ముసుగులో పొరుగుదేశాలు పన్నే కుట్రలను తిప్పికొట్టవచ్చు’ అని తెలిపింది. పలువురు అడ్డుచెప్పిన ప్పటికీ చివరికి మెజారిటీ ఓటుతో నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.