USA
-
కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఆంక్షలు విధించారు. బోర్డర్ దాటి అమెరికాలోకి వచ్చే కెనడా పౌరులు తమ దేశంలో 30 రోజులు మించి ఉండకూడదు. దాటితే తమ నిబంధనలకు లోబడి ఉండాలి. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో (Ontario) ప్రకటించింది. ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించారు. సాధారణంగా కెనడా పౌరులు బోర్డర్ దాటి అమెరికాలో చొరబడుతుంటారు. 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఇందుకోసం ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉండేది కాదు. కానీ తాజాగా ట్రంప్ నిర్ణయంతో 30రోజులు దాటిన అమెరికాలోని కెనడా పౌరులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.లేదంటే 5వేల డాలర్ల ఫైన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైన్‌తో పాటు, ఆరు నెలల జైలు శిక్షను విధించాల్సి ఉంటుంది. తాజాగా, ట్రంప్ విధించిన నిబంధనలు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అమెరికా ఉత్పత్తులపై ఈయూ ప్రతీకార సుంకాలు
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్‌ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్‌ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్‌లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు. -
జెలెస్కీ గ్రీన్‌సిగ్నల్.. పుతిన్ ప్లానేంటి?
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్‌స్‌్క, వొరొనెజ్‌తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్‌ట్‌స్‌్క, నిజ్నీ నొవ్‌గొరోడ్, ఒరియోల్, రైజాన్‌లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది. -
నా ఐస్‌క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా సుంకాలు: ఆ రంగంపైనే అధిక ప్రభావం..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప్పుడు భారత ఫార్మా రంగంపై అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక టారిఫ్‌లతో అమెరికాలో భారత ఫార్మా ఉత్పత్తుల ఖరీదు, ఇతర దేశాలతో పోల్చితే పెరిగిపోతుందంటున్నారు. అదే సమయంలో భారత ఆటోమొబైల్ కంపెనీలపై సుంకాల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందంటూ.. అమెరికాకు ఆటో ఎగుమతులు చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు మోపుతున్న భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే స్థాయిలో ప్రతిసుంకాలు అమలు చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే పనిగా ప్రకటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకం అమలు చేస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు.చరిత్రను గమనిస్తే దేశీ డిమాండ్‌ను తీర్చుకునేందుకు అమెరికా ఇప్పటి వరకు ఫార్మా ఉత్పత్తుల విషయంలో నికర దిగుమతిదారుగా ఉన్నట్టు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ అరవింద్ శర్మ తెలిపారు. ‘‘భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై గణనీయ స్థాయిలో టారిఫ్‌లు విధించాలని అమెరికా ఇటీవల నిర్ణయించడం భారత ఫార్మా రంగంపైనా చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా దేశీ వినియోగంపైనా దీని ప్రభావం ఉంటుంది’’అని చెప్పారు.అమెరికన్లకు గణనీయంగా ఆదా..అమెరికాలో ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్ నుంచి సరఫరా అవుతుండడం గమనార్హం. చౌకగా భారత్ అందిస్తున్న ఔషధాలతో అమెరికాకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. 2013 నుంచి 2022 వరకు చూస్తే పదేళ్ల కాలంలో 1.3 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు భారత చౌక జనరిక్ ఔషధాలతో అమెరికాకు వచ్చే ఐదేళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా.భారత ఫార్మా ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్ అని శర్మ చెప్పారు. భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటాయే మూడింట ఒక వంతుగా ఉన్నట్టు తెలిపారు. ఉన్నట్టుండి టారిఫ్‌లు పెంచితే, అది భారత్‌లో ఔషధ తయారీని, దిగుమతి వ్యయాలను పెంచుతుందన్నారు. అదే జరిగితే అప్పుడు ఇతర దేశాలతో పోల్చితే భారత ఔషధ ఉత్పత్తులు ఖరీదుగా మారతాయన్నారు. ఇది అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచుతుందని, వినియోగదారులపై భారాన్ని మోపుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఫార్మా రంగానికి కొత్త దారులుఅమెరికా అధిక సుంకాలతో కొత్త మార్కెట్ అవకాశాల దిశగా భారత ఫార్మా రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని శర్మ అంచనా వేస్తున్నారు. భారత కంపెనీలు యూరప్, ల్యాటిన్ అమెరికా లేదా ఆఫ్రికాలపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు భారత ఆటో ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ రంగంపై సుంకాల ప్రభావం తక్కువే ఉంటుందని ఇండస్ లా పార్ట్నర్ శశి మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. కాకపోతే భారత ఆటో విడిభాగాల కంపెనీలపై కొంత ప్రభావం ఉండొచ్చన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు ఆ దేశ ఆటో ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నా స్థాయికి సమీప కాలంలో తగ్గించకపోవచ్చన్న విశ్లేషణ వ్యక్తం చేశారు. -
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్‌షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్‌ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్‌లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్‌లను విధించాయి. -
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
హెచ్ 1 బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు
-
నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కాగా, కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు. -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్టర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్గా పిలిచే అసిటమినోఫిన్ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్‌డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్‌డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్ మెంటల్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దశాబ్దాలుగా వాడకం ‘‘అసిటమినోఫిన్ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్ వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్‌డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్‌ను తప్పనిసరైతేనే, అదీ తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్‌డీఏతో పాటు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్ ఓబ్స్ట్రిటీíÙయన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఆఫ్ కెనడా, ది సొసైటీ ఆఫ్ మెటర్నల్ –ఫీటల్ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్ వాడితే పిల్లలకు ఏడీహెచ్‌డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్‌డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం. – వాషింగ్టన్ -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై దృష్టి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఐఐపీ, సీపీఐ జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇతర అంశాలూ కీలకమే దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. గత వారమిలాగత వారం(3–7) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.అమ్మకాలువీడని ఎఫ్పీఐలుమార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు. -
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో మారణాయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని బలగాలు కాల్చి చంపాయి. వైట్ హౌస్ ఎబ్లాక్ కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతని వద్ద గన్ తో పాటు పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని షూట్ చేసి చంపారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం అతను అనుమనాస్పద రీతిలో వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. అతనిపై ఒక్కసారిగా కాల్పులకు దిగి మట్టుబట్టాయి. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.తొలుత ఆతన్ని నివారించే క్రమంలో ఎదురుకాల్పులకు దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే ఒక్కసారిగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరూ గాయపడలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో లేరని, ఫ్లోరిడాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే అతనే ఏ ఉద్దేశంతో మారణాయుధాలతో అక్కడకు వచ్చాడనేది తెలియలేదన్నాయి, -
న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వింత కోరిక.. ట్రంప్ అందుకు ఒప్పుకుంటారా?
వాషింగ్టన్: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ చేసేందుకు ఎఫ్‌బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్‌తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ తన పనిమీద రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే జోబైడెన్ ప్రభుత్వ హయాం నుంచి ఎఫ్‌బీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు,ఏజెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాను ఎఫ్‌బీఐ ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ట్రంప్‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా? ఉంటే సాధ్యసాధ్యాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా వచ్చీ రాగానే ఎఫ్‌బీఐ కార్యాలయం ఏడవ ఫ్లోర్‌లోని అధికారులను తొలగించారు. ఆ ఫ్లోర్లో డైరెక్టర్‌గా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలు చేయాలన్నా ఎఫ్‌బీఐ డైరెక్టర్ హోదాలో డిప్యూటీ అటార్నీ జనరల్‌తో మాట్లాడుతారు.డిప్యూటీ అటార్నీ జనరల్ ఇతర సీనియర్ అధికారులతో మంతనాలు జరిపి కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారినే తొలగించి మరో ఫ్లోర్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.సెక్యూరిటీ రిత్యా సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులు తమ కార్యాలయాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. తాజాగా,వైట్ హౌస్ స్విచ్‌బోర్డ్, సీఐఏ, ఇతర జాతీయ భద్రతా సంస్థలతో మాట్లాడేందుకు వీలుగా ట్రంప్‌తో మాట్లాడేలా సురక్షితమైన ల్యాండ్‌లైన్ వ్యవస్థ ఇప్పటికే చాలా మంది ఎఫ్‌బీఐ అధికారుల డెస్క్‌లపై ఉంది. బదులుగా కాష్ పటేల్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడేలా చూడాలని కోరినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. అదనంగా, పటేల్ తన రక్షణ కోసం ఇప్పటికే ఎఫ్‌బీఐ ఏజెంట్లను నియమించినప్పటికీ, తన సొంత ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పరిశీలించినట్లు సమాచారం. పటేల్ ఎఫ్‌బీఐ ఏజెంట్లను పూర్తిగా విశ్వసించడం లేదని, కాబట్టే ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు.కాగా,చరిత్రలో తొలిసారి ఎఫ్‌బీఐ తొలిడైరెక్టర్ జే. ఎడ్గార్ హూవర్ తన ఇంటి నుండి అధ్యక్షుడికి నేరుగా ఫోన్లో మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి ఎఫ్‌బీఐ, వైట్ హౌస్‌ల మధ్య ఓ ఫోన్ కాల్ వ్యవస్థ ఏర్పాటైంది. మళ్లీ ఇప్పుడు కాష్ పటేల్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్చిర్చు అంటుకుంది. ఎత్తుపడుతున్న మంటల కారణంగా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ మంటలు చెలరేగాయి. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్ హోంప్టన్స్తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో, ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు.BREAKING: New York Governor Kathy Hochul has declared a state of emergency as wildfires continue to spread across New York. pic.twitter.com/gQJsHAS3tU— The General (@GeneralMCNews) March 8, 2025కార్చిర్చు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. అయితే, ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. 🚨Evacuations ordered as multiple wildfires erupt near Long Island, New York pic.twitter.com/51rH3AbjNE— H. Gökhan Güleç (@gokhangulec) March 9, 2025 -
అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!
యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. క్లింట్ హిల్ ఇటీవలే ఫిబ్రవరి 21న తన 93వ యేట కన్నుమూశారు. తుదిశ్వాస వరకు కూడా జీవితమంతా ఆయన ఒకటే ఆశించారు. తను 1963 నవంబర్ 22నే.. ‘ఆన్ ది స్పాట్’ చనిపోయి ఉంటే బాగుండేదని, ప్రజల మనసుల్లో తనకు చిరస్మరణీయ స్థానం దక్కి ఉండేదని! ఏమిటి ఆ రోజుకు అంత ప్రత్యేకత? అదేమిటో తెలుసుకోవాలంటే, ముందు ఆయన ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి!ఐదుగురు ప్రెసిడెంట్ల దగ్గర..!ఐసనోవర్ మొదలు, వరుసగా జాన్ ఎఫ్. కెన్నెడీ, లిండన్ బి.జాన్సన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్.. మొత్తం ఐదుగురు అమెరికా ప్రెసిడెంట్ల దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా పని చేశారు క్లింట్ హిల్! గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మిలటరీ సర్వీస్‌ను ముగించుకుని వచ్చాక 1958లో ప్రెసిడెంట్ ఐసనోవర్ సీక్రెట్ సర్వీస్‌లో ఏజెంట్‌గా తొలి ‘టఫెస్ట్’ జాబ్! అప్పటికి అతడి వయసు 26 ఏళ్లు. ఐసనోవర్ 1953 నుంచి 1961 వరకు ఎనిమిదేళ్ల పాటు రెండు టెర్మ్‌లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత జాన్ ఎఫ్.కెన్నెడీ అధ్యక్షుడిగా వచ్చేవరకు ఐసనోవర్ దగ్గర మూడేళ్లు పని చేశారు హిల్. తర్వాత కెన్నెడీకి, ఆయన సతీమణి జాక్వెలీన్‌కు సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా ఉన్నారు. ‘‘ఆ రోజే, ఆన్ ది స్పాట్, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది’’ అని క్లింట్ ఏ రోజు గురించైతే అంటూండేవారో ఆ.. 1963 నవంబర్ 22.. కెన్నడీ హయాం లోనిదే!అసలు ఆ రోజు ఏమైంది?!ఏమీ కాలేదు! 62 ఏళ్ల క్రితం నాటి ఆ మధ్యాహ్నం 12.29 నిముషాల వరకు కూడా– అసలు ఏమీ కాలేదు. ఆ తర్వాతి 30వ నిముషంతోనే ఆ రోజుకు ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చి పడింది. ఓపెన్ టాప్ కారులో వెళుతున్న జాన్ ఎఫ్. కెన్నెడీ తలలోకి దూరాన్నుంచి తుపాకీ బులెట్ వచ్చి దిగబడింది! కెన్నెడీ అక్కడిక్కడ తల వాల్చేశారు. కారులో ఆయన పక్కన ఆయన సతీమణి కూర్చొని ఉన్నారు. వారి కారు వెనకే సీక్రెట్ ఏజెంట్ క్లింట్ హిల్ కూర్చొని ఉన్న కారు వెళ్తోంది. కెన్నెడీపై కాల్పులు మొదలవ్వగానే క్లింట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక ఉదుటున గాల్లోంచి పైకి లేచి, కెన్నెడీ ఉన్న కారు మీదకు దూకారు. అతడి మొదటి లక్ష్యం ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడటం, కొన్ని లిప్తల ఆలస్యంతో ఆ లక్ష్యం చేజారింది. రెండో లక్ష్యం జాక్వెలీన్ని కాపాడటం. అప్పటికే ఆమె దిక్కు తోచనట్లు సీట్లోంచి పైకి లేచి కంగారుగా కారు పై భాగంలోకి వచ్చేశారు. హిల్ తక్షణం ఆమెను తిరిగి ఆమె సీట్లోనే కూర్చోబెట్టి ఆమెకు వలయంగా ఏర్పడ్డాడు. ఇదంతా కూడా కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడే. క్షణమైనా ఆలస్యం చేయలేదు..!కెన్నెడీపై కాల్పులు జరుగుతున్నట్లు గ్రహించగానే హిల్ వెంటనే తన కారులోంచి నేరుగా కెన్నెడీ ఉన్న కారు పైకి జంప్ చేశారు! ‘‘ఆ ఘటనలో నేను సెకనులో ఐదో వంతు వేగాన్ని, కనీసం ఒక సెకను వేగంగానైనా సాధించగలిగి ఉంటే... దురదృష్టవశాత్తూ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని ఉండి ఉండేవాడిని కాదు..’’ అని అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రాం ‘సీబీఎస్ 60 మినిట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హిల్. ‘‘ఆ వేగం నాకు సాధ్యపడి ఉంటే ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడే ప్రయత్నంలో నాకూ బులెట్లు తగిలి ఉండేవి. నేనూ ఆన్ ది స్పాట్ చనిపోయి ఉండేవాడిని. అప్పుడు నా మరణానికి ఒక సార్థకత ఉండేది’’ అని కుమిలిపోయారు హిల్. ఆ అపరాధ భావనతోనే 1975లో గెరాల్డ్ ఫోర్ట్ అధ్యక్షుడు అయిన రెండో ఏడాదే, తన 43 ఏళ్ల వయసులో సీక్రెట్ సర్వీస్ నుంచి ముందుగానే పదవీ విరమణ చేశారు. ‘‘హీరోని కాదు, నేనొక జీరో!’’ఆ రోజు– కెన్నెడీ కారు, ఆ వెనుక మరికొన్ని కార్లు, నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళుతున్న సమయంలో, రోడ్డుకు రెండు పక్కల నిలబడి చేతులు ఊపుతున్న జనం మధ్యలో అబ్రహాం జఫ్రూడర్ కూడా ఉన్నాడు. అతడొక వస్త్రాల వ్యాపారి. ప్రెసిడెంట్ కెన్నెడీ కాన్వాయ్‌ని ఉత్సాహం కొద్దీ వీడియో తీస్తూ ఉన్న అబ్రహాం చేతిలోని కెమెరాలో... కెన్నెడీపై కాల్పులు జరగడం, ఆయన తలవాల్చటం, వెనుక కార్లోంచి క్లింట్ హిల్ అమాంతం ఈ కారులోకి దూకటం– అన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ వీడియో బయటికి వచ్చాక.. హిల్ అమెరికా ప్రజల హీరో అయ్యారు. కానీ హిల్ హీరోలా ఫీల్ అవలేదు. తానెందుకు బతికిపోయానా అని జీవితాంతం జీరోలా బాధపడుతూనే ఉండిపోయారు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలారు. జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా అమెరికన్ ప్రజలు అతడిని కొనియాడారు. (చదవండి: -
భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.కాలిఫోర్నియాలోని చినోహిల్స్ ప్రాంతంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో BAPS పబ్లిక్ అఫైర్స్ సభ్యుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆలయం ప్రహరీ గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారు. అనంతరం గట్టిగా నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. భారత సమాజం ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటోందని, ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుందన్నారు. మానవత్వానికి విలువ ఇచ్చి, ఎవరిపై తాము దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.Our response to media queries regarding vandalism at a Hindu Temple in California: 🔗 https://t.co/8H25kCdwhY pic.twitter.com/H59bYxq7qZ— Randhir Jaiswal (@MEAIndia) March 9, 2025ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రణధీర్ ట్విట్టర్ వేదికగా..‘కాలిఫోర్నియాలో ఒక హిందూ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము చూశాము. ఇటువంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు. In the face of another Mandir desecration, this time in Chino Hills, CA, the Hindu community stand steadfast against hate. Together with the community in Chino Hills and Southern California, we will never let hate take root. Our common humanity and faith will ensure that peace…— BAPS Public Affairs (@BAPS_PubAffairs) March 8, 2025 -
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025 -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం. -
ట్రంప్ కేబినెట్ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశం రసాభాసా చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో(Marco Rubio), వైట్‌హౌజ్ సలహాదారు ఇలాన్ మస్క్‌లు ట్రంప్ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.స్టేట్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను తొలగించకపోవడాన్ని ప్రస్తావించిన మస్క్.. రుబియోపై చిందులు తొక్కారు. ట్రంప్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి.. కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టిసారిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే.. అబద్ధాలు చెబుతున్నారంటూ మస్క్ మొహం మీదే రుబియో కౌంటర్లు ఇచ్చారు.స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని(Layoffs). ఒకవేళ వాళ్లందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరి తొలగించాలని మస్క్ భావిస్తున్నారేమోనని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకానొక టైంలో.. ట్రంప్ రుబియోకి మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఇక.. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చర్యలతో రిపబ్లికన్లలోనూ అసహనం పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే వైట్‌హౌజ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ మీటింగ్‌లో ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం కేబినెట్ మీటింగ్‌లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. అయితే..అలాంటిదేం లేదుకేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగిందన్న మీడియా కథనాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. శుక్రవారం ఓవెల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే(మీడియాను ఉద్దేశించి..) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఇలాన్, మార్కో ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్లు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్ పొగడ్తలు గుప్పించారు.డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది.అయితే.. డోజ్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. -
అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్‌లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది. కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ లేఖ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఇరాన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో మీరు మాతో చర్చలకు సన్నద్ధం అవుతారని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్‌తో అణుఒప్పందం చేసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నాను. ఈ ఒప్పందం సఫలమైతే ఆదేశానికే మంచిది. ఇక నేను రాస్తున్న లేఖకు ఇరాన్ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నాను. ప్రతిఫలంగా ఆదేశానికి అమెరికా ఏదో ఒకటి చేస్తోంది. ఎందుకంటే మరే ఇతర దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ రాసిన ఆ లేఖ ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇంటి అడ్రస్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖపై వైట్ హౌస్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో అణు ఆయుధాల ఒప్పందాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయయని ఇదే విషయాన్ని ఇరాన్ రాయబారి కాజెం జాలాలితో చర్చించినట్లు శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
ట్రంప్‌కు కొత్త ట్విస్ట్.. వలసదారుల కోసం ఇంత ఖర్చు పెట్టారా?
వాషింగ్టన్: అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఖర్చు తడిసి మోపెడవుతోందని అమెరికా గుండెలు బాదుకుంటోంది. వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. వలసదారులతో చివరి విమానం అమెరికా నుంచి మార్చి 1న వెళ్లింది. తరవాత వాటిని ఇప్పటిదాకా షెడ్యూల్ చేయలేదు. ఈ విరామాన్ని పొడిగించడమో, తరలింపులను శాశ్వతంగా నిలిపివేయడమో చేయొచ్చని చెబుతున్నారు. గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులను వెనక్కి పంపే చర్యలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. కొందరిని స్వదేశాలకు, ఇతరులను గ్వాంటనామో బేలోని సైనిక స్థావరానికి పంపారు. ఈ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో చెప్పేందుకు 30 సి–17, 12 సి–130 తరహా సైనిక విమానాలను వాడారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన మూడు విమానాలకే ఏకంగా 30 లక్షల డాలర్లు ఖర్చయింది. గ్వాంటనామోకు తరలించడానికి ఒక్కో వ్యక్తిపై అమెరికా 20 వేల డాలర్లు ఖర్చు చేసింది. ఇది అమెరికా ఎయిర్‌లైన్స్ విమాన టికెట్ల కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కమర్షియల్ చార్టర్ ఫ్లైట్ కంటే కూడా చాలా ఎక్కువ!. దీంతో, దీంతో, ఈ ఖర్చుపై అమెరికాలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. -
ఈసారి జెలెన్స్కీ వెంట మాక్రాన్, స్టార్మర్!
పారిస్: అమెరికా అత్యున్నత పరిపాలనా పీఠం శ్వేతసౌధం సాక్షిగా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా అనూహ్యంగా పట్టుసడలించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లూ చేసిన సైనిక, నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జెలెన్స్కీ వైఖరిలో మార్పు రావడం గమనార్హం. ఒంటరిగా వచ్చిన జెలెన్స్కీ ఆనాడు ట్రంప్, జేడీ వాన్స్‌తో మాటల యుద్ధానికి దిగి దౌత్యమంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్, బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్లు జెలెన్స్కీని అమెరికాను వెంటబెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భేటీ ఎప్పుడనేది ఇంకా నిర్ధారణకాలేదు. ‘‘ఉక్రెయిన్, అమెరికా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషిచేస్తున్నాయి. ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది’’ అని గురువారం తెల్లవారు జామున జెలెన్స్కీ ఒక ప్రకటనచేశారు. బుధవారం ట్రంప్‌కు జెలెన్స్కీ ఒక లేఖ రాయడం, ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెల్సిందే. ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యురోపియన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు పంపే వీలుంది. రష్యా దూకుడుకు ఈ బలగాలు అడ్డుకట్టవేస్తాయి. డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం పారిస్‌లో ఈయూ దేశాల సైనిక చీఫ్‌లతో చర్చలు జరుపుతాం’’ అని మాక్రాన్ చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే!అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూని యన్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే, పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ను అమెరికాకు దగ్గరచేయాలని ఈయూ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జెలెన్స్కీని అమెరికా రప్పించి ‘శాంతి, ఖనిజ ఒప్పందం’ కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి. అందులోభాగంగా మాక్రాన్, స్టార్మర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
ఈ అనిశ్చితి పోయేదెలా?
జనవరి 20న గద్దెనెక్కినప్పటినుంచీ అధిక టారిఫ్‌లపై హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చివరికి అందుకు తుది గడువు ఖరారు చేశారు. తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాలన్నీ వచ్చే నెల 2 నుంచి తమ దెబ్బ కాచుకోవాలని హెచ్చరిక జారీచేశారు. దాదాపు వంద నిమిషాలపాటు అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా ఇలాంటి హెచ్చరికలున్నాయి. ఇప్పటికే చాలా సాధించినట్టు స్వోత్కర్షలున్నాయి. అమెరికా ప్రజల పాలిట తాను ఆపద్బాంధవుడినన్న భ్రమ కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ‘నేను విధించబోయే సుంకాలు కేవలం ప్రజానీకం ఉద్యోగాలు కాపాడటానికి మాత్రమే కాదు... ఈ చర్య మన దేశ ఆత్మను కాపాడటానికి కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగానే ప్రపంచమంతా ఏప్రిల్ గురించి బెంగపడుతోంది. ముంచుకొచ్చే ద్రవ్యపరమైన అసమతౌల్యతను అధిగమించడమెలాగో తెలియక అయోమయంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ట్రంప్ చైనాపై అదనంగా 10 శాతం, మెక్సికో, కెనడాలపై మరో 25 శాతం సుంకాలు ప్రకటించటం వల్ల ఈ ఉపద్రవం ఖాయమని అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. సుంకాలను ట్రంప్ ‘సర్వరోగ నివారిణి’గా భావిస్తున్నారు. మెక్సికో మాదకద్రవ్య ముఠాల నుంచి పెద్ద యెత్తున వచ్చిపడే ఫెంటానిల్ అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. అక్రమ వలసలు దీనికి అదనం. వలసలను అరికట్టి, మాదకద్రవ్య ముఠా నాయకుల్ని పట్టి అప్పగించకపోతే 25 శాతం సుంకాలు తప్పవని గత నెల 4న ట్రంప్ హెచ్చరించటంతో కెనడా, మెక్సికోలు ఒక నెల వ్యవధి కోరాయి. మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ వెనువెంటనే అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి అదనంగా 10,000 మంది సైనికులను తరలించి తనిఖీలు పెంచి వలసలను నియంత్రించారు. దేశంలో ఫెంటానిల్ నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయటంతోపాటు భారీయెత్తున అరెస్టులు చేయించారు. 29 మంది డ్రగ్స్ ముఠా నాయకుల్ని అమెరికాకు అప్పగించారు. కెనడా అధ్యక్షుడు ట్రూడో ఫెంటానిల్ సరిహద్దులు దాటకుండా తనిఖీ వ్యవస్థను ముమ్మరం చేశారు. అయినా ట్రంప్ మనసు మారలేదు. ఆ రెండు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలుంటాయని తన ప్రసంగంలో ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్ని కల్లో పార్టీ ఓటమి ఖాయమన్న అంచనాలుండటంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవ టానికి ట్రూడో సిద్ధపడ్డారు. అందుకే ‘సై అంటే సై’ అంటున్నారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించ బోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే 2,100 కోట్ల డాలర్ల విలువైన సరుకుపై సుంకాలు వడ్డించారు. వివాదం సద్దుమణగకపోతే మరో 8,700 కోట్ల డాలర్ల సరుకుపై ఇది తప్పదని హెచ్చరించారు. షీన్బామ్ ఈమధ్యే అధికారంలోకొచ్చారు గనుక ఆమెకు కావలసినంత వ్యవధి వుంది. అందుకే ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్‌మెయిలింగ్ కొత్తగా ట్రంప్‌కు పుట్టిన బుద్ధికాదు. అమెరికాలో ఎవరున్నా ఇలాంటి బెదిరింపులతోనే ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకున్నారు. 1986–89 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక (గాట్)కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్ చర్చల్లోనైనా, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పై జరిగిన దోహా రౌండ్ చర్చల్లోనైనా అమెరికా వ్యూహం ఇదే. బ్రెజిల్ నుంచి వచ్చిన 4 కోట్ల డాలర్ల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించింది. మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపైనా ఇలాంటి చర్యే తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల(ఐపీఆర్)పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. ఆఫ్రికా దేశాలనూ ఇలాగే దారికి తెచ్చుకుంది. అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి వుంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18 శాతమైతే థాయ్‌లాండ్ నుంచి 17 శాతం, దక్షిణ కొరియానుంచి 16 శాతం ఎగుమతులుంటాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78 శాతం. తమ సంపద పెంచుకోవటానికి సంపన్న రాజ్యాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. భారత్‌తో సహా అనేక దేశాలు సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిపోవటానికి ఏకైక కారణం ఇదే. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యతకూ, తయారైన సరుకు అమ్ముకోవటానికీ సరిహద్దులు దాటి వెళ్తూ సమయానుకూలంగా విధానాలు మార్చుకోవడం సంపన్న రాజ్యాల నైజం. గతంలో తన మార్కెట్‌ను విస్తరించుకోవటానికి డబ్ల్యూటీవో తీసుకొచ్చిన అమెరికాయే ఇప్పుడు వేరే మార్గానికి మళ్లింది. అయితే ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. సగటు పౌరుల జీవన వ్యయం పెరిగి పోతుంది. వ్యాపారం దెబ్బతిని నిరుద్యోగం ప్రబలుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. తరతమ స్థాయిల్లో అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. 80 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లను శాసిస్తూ అతిగా సంపద పోగేసిన దేశమే ‘నన్ను అందరూ దోచుకుతింటున్నార’ంటూ పెడబొబ్బలు పెట్టడం ఒక వైచిత్రి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క దేశం అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతోంది. మున్ముందు కొత్త మార్కెట్ల వెదుకులాట కూడా మొదలవుతుంది. ఇలాకాక దేశాలన్నీ సమష్టిగా వ్యవహరిస్తేనే ఏదో మేర ప్రయోజనం ఉంటుంది. అమెరికాపై ఒత్తిడి పెరిగి సహేతుకమైన పరిష్కారం వీలవుతుంది. -
పుతిన్‌ను బుజ్జగిస్తూ మాతో కయ్యమా: ట్రూడో
టొరంటో: కెనడాపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లు విధించడాన్ని మూర్ఖత్వంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. కెనడాపై వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బుజ్జగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజాగా విధించిన 25 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 100 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు. ‘అమెరికా తన అత్యంత ఆత్మీయ, మిత్ర దేశంపై వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. అదే సమ యంలో, రష్యాకు అనుకూలంగా మా ట్లాడుతోంది. ఒక అబద్ధాలకోరు, దుర్మా ర్గపు నియంత అయిన పుతిన్‌ను బుజ్జగించే పనులు చేస్తోంది’అని ట్రూడో నిప్పులు చెరిగారు. ‘అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడాను ఎన్నటి కీ కానివ్వం. డొనాల్డ్ అనే అమెరికన్‌కు నేరుగా ఈ విషయం స్పష్టం చేస్తున్నాను’అంటూ నేరుగా ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. -
అమెరికా ఈజ్ బ్యాక్
వాషింగ్టన్: ‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అని ఉద్ఘాటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని స్పష్టంచేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చబోతున్నామని చెప్పారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ మొదటిసారిగా మాట్లాడారు. ఏకంగా ఒక గంట 40 నిమిషాలకుపైగా ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో గానీ, తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో గానీ అధ్యక్షుడు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటిదాకా బిల్ క్లింటన్ పేరిట ఉన్న రికార్డును ట్రంప్ తిరగరాశారు. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో ఒక గంట 28 నిమిషాల 49 సెకండ్ల పాటు ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పందించారు. సరిహద్దు భద్రత, టారిఫ్‌లు, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల, అక్రమ వలసలు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పనామా కాలువను స్వా«దీనం చేసుకుంటామని, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది ‘‘ఇండియాతోపాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయి. ఇలా చేయడం ముమ్మాటికీ అన్యాయమే. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా తదితర దేశాల టారిఫ్‌ల గురించి విన్నారా? ఇండియాలో అయితే అటో టారిఫ్‌లు 100 శాతానికి పైగా విధిస్తున్నారు. చాలాదేశాలు దశాబ్దాలుగా మా ఉత్పత్తులపై సుంకాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు సుంకాల మోత మోగిస్తున్నాయి. ఈ భూగోళంపై ఉన్న దాదాపు ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది. ఇకపై ఈ దోపిడీ సాగడానికి వీల్లేదు. ఇప్పుడు మా వంతు వచి్చంది. మా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాల ఉత్పత్తులపై మేము కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేస్తాం. వచ్చే నెల 2వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఆయా దేశాలు వారి ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు చెల్లించాల్సిందే. ట్రంప్ పాలనలో కొన్ని సందర్భాల్లో టారిఫ్‌లు చాలాచాలా అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి మార్కెట్లలోకి మమ్మల్ని రానివ్వకపోతే మేము కూడా అదే పనిచేస్తాం. మా మార్కెట్లలోకి వారిని అడుగు పెట్టనివ్వం. జెలెన్స్కీ లేఖ ప్రశంసనీయం ఉక్రెయిన్‌తో ఘర్షణకు ముగింపు పలికి, శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి నాకు బలమైన సంకేతాలు అందాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి నాకు ఈరోజే ఒక ముఖ్యమైన లేఖ అందింది. శాంతి సాధన కోసం సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల కంటే మిన్నగా శాంతిని ఆకాంక్షిస్తున్నవారు ఎవరూ లేరని లేఖలో జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది నిశ్చయంగా శుభ పరిణామం. శాశ్వత శాంతి కోసం ట్రంప్ నాయకత్వంలో పని చేస్తామని జెలెన్స్కీ, ఆయన బృందం చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని వారు తెలిపారు. ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వం, స్వాతంత్య్రాన్ని అమెరికా కాపాడుతుందని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాతోపాటు ఉక్రెయిన్ భద్రత విషయంలో ఒప్పందంపై ఏ సమయంలోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ నా దృష్టికి తీసుకొచ్చారు. జెలెన్స్కీ రాసిన లేఖ ప్రశంసనీయం. క్రూరమైన యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో ఇప్పటికే లక్షలాది మంది అన్యాయంగా బలైపోయారు. చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ మారణకాండ ఆగిపోవాల్సిందే. మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే. ఉక్రెయిన్‌లో ఘర్షణకు తెరదించడానికి నేను ఎంతగానో కష్టపడుతున్నా. రష్యా ప్రతినిధులతో ఇటీవలే చర్చలు జరిపాం. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు వారు బలమైన సంకేతాలిచ్చారు. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడి 13 మంది అమెరికా సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ముహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. పాకిస్తాన్ సాయంతో అతడిని బంధించాం. అమెరికాకు తరలిస్తున్నాం. సత్వరమే చట్టప్రకారం విచారణ చేపట్టి, అతడిని శిక్షిస్తాం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో అప్పటి పాలకులు న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కాశ్ పటేల్ పునరుద్ధరించారు. కాశ్ పటేల్ మున్ముందు గొప్ప పనులు చేయబోతున్నారు. అలాగే లింగ మార్పిడి చర్యలకు మేము వ్యతిరేకమే. లింగ మారి్పడిని శాశ్వతంగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నా. చిన్నారుల్లో క్యాన్సర్, ఆటిజం కేసులను తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మన పర్యావరణం నుంచి విషకారకాలను, ఆహార పదార్థాల అన్ని రకాల విష రసాయనాలను తొలగించి, చిన్నారులను ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డ్రిల్ బేబీ డ్రిల్ అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదలతోపాటు అనేక సమస్యలకు గత జో బైడెన్ ప్రభుత్వమే కారణం. బైడెన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూపంలో బంగారం ఉంది. ముడి చమురు, సహజ వాయువును వెలికితీస్తే ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారమవుతుంది. బైడెన్ పాలనలో వందకుపైగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మూసివేశారు. వాటిని మళ్లీ తెరవబోతున్నాం. ఇంధన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం. నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి విధించా. కాళ్ల కింద ఉన్న బంగారాన్ని తవ్వితీస్తే ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు. అమెరికా పౌరులందరికీ సామాజిక భద్రత కలి్పంచడమే మా ధ్యేయం. 300 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుకొనే విధానం తీసుకొస్తాం. అక్రమ వలసలపై మా వైఖరేమిటో ఇప్పటికే బయటపెట్టాం. అక్రమ వలసదార్లను బయటకు పంపిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ వలసను అరికట్టడానికి సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఆ దేశాలకు రాయితీలు బంద్ ‘‘పొరుగు దేశాల నుంచి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ కారణంగా వేలాది మంది అమెరికా పౌరులు అకాల మరణం చెందుతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలు పొందుతున్న దేశాలు చేస్తున్న నిర్వాకమిది. కెనడా, మెక్సికో దేశాలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నాం. వందల బిలియన్ల డాలర్ల సొమ్ము ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఇలాంటి త్యాగాలకు మేము సిద్ధంగా లేము. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాయితీలిచ్చే ప్రసక్తే లేదు’’. గ్రీన్లాండ్ అమెరికాలో భాగం కావాల్సిందే ‘‘పనామా కాలువను మా అ«దీనంలోకి తీసుకోవడానికి మావద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి పనామా కాలువను నియంత్రణలోకి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిమ్మీ కార్టర్ ప్రభుత్వం కేవలం ఒక్క డాలర్‌కు పనామా కాలువను ఇతరులకు ఇచ్చేసింది. అప్పట్లో కుదిరిన ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక మాది మేం తీసుకుంటాం. గ్రీన్లాండ్ సైతం అమెరికాలో భాగం కాక తప్పదు. ఒక మార్గంలో కాకపోతే మరో మార్గంలో గ్రీన్ల్యాడ్ను స్వా«దీనం చేసుకుంటాం. సొంత భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు గ్రీన్లాండ్ ప్రజలకు ఉంది. అమెరికా పౌరులుగా మారాలనుకుంటే సాదర స్వాగతం పలుకుతాం. గ్రీన్లాండ్ ప్రజలను భద్రంగా చూసుకుంటాం’’. -
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్ (27), గాయత్రి సంతానం. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్.. అనంతరం 2023 ఆగస్టులో అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. అదే పట్టణంలోని ఓ మాల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 18న ఇంటికి వచ్చిన ప్రవీణ్ జనవరి 20న తిరిగి అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరిగి ఉదయాన్నే వాట్సాప్ కాల్ చేయమని మెసేజ్ పెట్టినా ప్రవీణ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీంతో ఉదయం 7 గంటలకు కుమారుడి ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తులు ప్రవీణ్ వివరాలను అడగటంతో సైబర్ నేరగాళ్లు అనుకుని ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రవీణ్‌తో కలిసి రూంలో ఉండే అతని మిత్రులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వివరాలు తెలుసుకున్న వారు గుర్తుతెలియని వ్యక్తులు మాల్లో ప్రవీణ్‌ను గన్‌తో కాల్చారని, బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అండగా ఉంటాం: డీకే అరుణ అమెరికాలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బుధవారం ప్రవీణ్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎంపీతో ఫోన్లో మాట్లాడించారు. వివరాలను అందిస్తే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. -
అమెరికా ఇక ఎందులో గొప్ప?
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.హక్కుల గురించి మీరా మాట్లాడేది?విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది. అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా. భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు. ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్లకు పీటఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు. యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం. అలిగార్క్లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం. అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. 2 బిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాలని కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టి పారేసింది. మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కింద కోర్టు నిర్ణయాన్ని ఏకీభవించింది. ఇటీవల అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు వాషింగ్టన్కు చెందిన యుఎస్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన యుఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి అమిర్ అలీ మానవతా సాయం నిలిపి వేయడాన్ని తప్పుబట్టారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (యూఎస్ఏఐడీ), రాష్ట్ర విభాగం అనుమతించిన గ్రాంట్లు, ఒప్పందాలపై పని చేసిన పాత చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో మానవతా సహాయంపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏదైనా ఉంటే ఆ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.ట్రంప్ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం ట్రంప్ ప్రభుత్వం విదేశాలకు మానవతసహాయం అందించడాన్ని 90 రోజుల పాటు నిలిపిలించింది. స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించే కార్యకలాపాల్ని స్తంభింపజేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మలేరియా, ఎయిడ్, అభివృద్ధి సహాయం, శరణార్థుల సహాయం వంటి విభాగాలపై ప్రతీకూలం ప్రభావం చూపింది.మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు సైతం తప్పుబడుతున్నారు. మానవతా సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల మందికి శాశ్వతమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా రోగాలు, సంక్షోభాలు నివారించడంలో అమెరికా ఇచ్చే నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘అమెరికాతో ఎలాంటి యద్ధానికైనా మేం సిద్ధం’ : చైనా
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా (china) ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) ఘాటు వ్యాఖ్యలే చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు.‘అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంది. మరి అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటుంది. అది టారిఫ్, ట్రేడ్ వార్ ఇతర యుద్ధమైనా మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయభార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025ట్రంప్ చైనా ఉత్పుత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది. అమెరికా పార్లమెంట్లో ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్ధాలుగా అమెరికాలోని సుంకాలు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.ఇది సరైన పద్దతి కాదుసగటున యురోపియన్ యూనియన్,చైనా,బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు మనం విధించే దిగుమతి సుంకాలకంటే ఆ దేశాలు మన దేశ ఉత్పతులపై విధించే దిగుమతి సుంకాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది సరైన పద్దతి కాదు. అమెరికా ఆటో మొబైల్ ఉత్పత్తులపై 100శాతం కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తోంది. చైనా కూడా అంతే మనం విధించే దిగుమతి సుంకాల కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తోంది. సౌత్ కొరియా నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. మనం ఎంత చెల్లిస్తున్నామో.. వాళ్లుకూడా అంతే చెల్లించాలి మనతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా. ఇప్పుడు మన వంతు వచ్చింది. వారు మన ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తారో. మనం కూడా అంతే వారి ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తున్నాం. అందుకే తక్షణమే అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏ దేశం ఉత్పత్తులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో సంబంధిత వివరాల్ని వెల్లడించారు.అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకంఅమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పతులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం దిగుమతి సుంకం తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పతుత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10శాతం, 15శాతం దిగుమంది సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. -
అమెరికాలో కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు వారాల్లోనే వందకు పైగా సంతకాలు చేసినట్టు ట్రంప్ తెలిపారు.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో వివరించారు. ఈ క్రమంలో ట్రంట్ మాట్లాడుతూ..‘ఆరు వారాల్లో వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశాను. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు అనిపిస్తోంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ పని చేయడానికి అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.. చేసుకుంటూ పోతున్నాను. త్వరలోనే అమెరికన్ల కల నిజం కాబోతుంది. గతంలో కంటే మెరుగైన జీవితం వారికి లభిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. #WATCH | While addressing a joint session, US President Donald Trump says, " America is back. 6 weeks ago, I stood beneath the dome of this capitol and proclaimed the dawn of the golden age of America. From that moment on, there has been nothing but swift and unrelenting action… pic.twitter.com/5es6k7Idpg— ANI (@ANI) March 5, 2025ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలపై వాటిని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, ఇతర దేశాలు మనం వసూలు చేసే దాని కంటే చాలా ఎక్కువ సుంకాలను మన నుండి వసూలు చేస్తాయి. ఇది చాలా అన్యాయం. భారత్ మన నుండి ఆటో సుంకాలను 100% వసూలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయి. వారు మనపై ఎలాంటి సుంకాలు వేస్తారో.. మనం వాటిపై అంతే సుంకాలు విధిస్తాం అని చెప్పారు.#WATCH | While addressing a joint session of US Congress, US President Donald Trump says, " Other countries have used tariffs against us for decades and now it is our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil,… pic.twitter.com/7lRu4udKEN— ANI (@ANI) March 5, 2025అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను. అలాగే, సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | US President Donald Trump says, "Within hours of taking the oath of office, I declared a national emergency on our southern border. I deployed US military and border patrol to repel the invasion of our country and what a job they have done! As a result, illegal border… pic.twitter.com/Nn4xc97rj7— ANI (@ANI) March 5, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. #WATCH LIVE via ANI Multimedia | Republicans in Congress stand up and chant 'USA, USA' to a Democrat heckler during US President Donald Trump's Address. (Video Source: US Network Pool Via Reuters) pic.twitter.com/IV8hygCPpp— ANI (@ANI) March 5, 2025 -
ఉక్రెయిన్ కి మిలటరీ సాయం నిలిపివేసిన అమెరికా
-
అమెరికా దెబ్బకు జెలెన్స్కీ యూటర్న్.. ట్రంప్ బిగ్ ప్లాన్?
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ట్రంప్‌తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని జెలెన్స్కీ చెప్పారు. విభేదాలు సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్స్కీ అంగీకరించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడతామని వెల్లడించారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) నుంచి ఈ స్పందన వచ్చింది.ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అమెరికా ఇచ్చిందెంత? 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ ఉక్రెయిన్‌కు 300 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యూరప్ దేశాలు మాత్రం 100 బిలియన్ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం 119.7 బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ స్పష్టంచేసింది. పుతిన్‌ను నిలువరించేది ఖనిజాల ఒప్పందం మాత్రమే: వాన్స్రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్– ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. -
Trump: చేతిపై కమిలిన గాయాలు.. కాళ్లు ఈడ్చుకుంటూ..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆర చేతిపై చర్మం కమిలిన గుర్తులు ఎందుకు ఉన్నట్లు? కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో తైవాన్ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ)గురించి మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఆయన ఎడమ చేయి అరచేతిలో రెండు చోట్ల చర్మం ఎర్రగా కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండో సారి కుడి చేయి పైభాగంలో అలాంటి గుర్తులే ఉన్నాయి. గతవారం ప్రపంచాది నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై ఇదే తరహాలో గుర్తులు కనిపించాయి.అంతేకాదు, కాళ్లు ఈడ్చుకుంటూ ట్రంప్ నడుస్తున్న వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అమెరికా అధ్యక్షుడు తన గోల్ఫ్ కార్ట్‌లో (వాహనం) నుండి ఇబ్బంది పడుతూ దిగారు. వాహనం నుంచి దిగిన తర్వాత కాళ్లు ఈడ్చుకుంటూ, కొన్ని సెకన్ల పాటు వణుకుతున్నట్లు కనిపించారు. Donald Trump moves his right leg like a piece of wood?#grok does not report issue about that.@realDonaldTrump #USA #trump #republicans @cnnbrk #potus pic.twitter.com/lQIA54BLMG— polemus (FR+EN) (@polemus) March 2, 2025ట్రంప్ చర్మంపై కమిలిన గుర్తులతో పాటు కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ గుర్తులపై స్పందిస్తూ నెటిజన్లు.. ట్రంప్ డైమన్షియా సమస్యతో బాధపడుతున్నారని ఒకరంటే.. ట్రంప్‌కు ఆనారోగ్య సమస్యలు తలెత్తాయిని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.అయితే, ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని వైట్ హైస్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఖండించారు. అధ్యక్షునికి అనారోగ్య సమస్యలు లేవని,ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడు ప్రజల మనిషి. అతని నిబద్ధత తిరుగులేనిది. ఆయన చేతిపై గాయాలున్నాయి. ఎందుకంటే ఆయన నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. కరచాలనం చేస్తున్నారు. ఫలితంగా ట్రంప్ చేయి కమిలిందని అన్నారు. కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. -
ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.చైనాపై ట్రంప్ సుంకాలుచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
నన్ను మార్చడం ఈజీ కాదు
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో వాగ్యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా(Resignation) చేయాలన్న వైట్‌హౌస్ అధికారులు, రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలపై జెలెన్స్కీ(Zelensky) మండిపడ్డారు. అమెరికాతో ఉక్రెయిన్ మళ్లీ చర్చలు జరపాలంటే జెలెన్స్కీ వైదొలగాలని, కొత్త అధ్యక్షుడు చర్చలకు రావాలని సెనేటర్ లిండ్సే గ్రాహం, హౌస్ స్పీకర్ మైక్జాన్సన్ సూచించారు. వీటిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం లండన్‌లో యూరప్ దేశాల నాయకులతో కీలక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘ఉక్రెయిన్ నాయకున్ని నిర్ణయించుకునే హక్కు ఉక్రేనియన్లకు మాత్రమే ఉంది. మా దేశంలో నాయకత్వం స్థానం కావాలంటే గ్రాహం కూడా ఉక్రెయిన్ పౌరసత్వం తీసుకోవచ్చు. ఆయనకు నేను పౌరసత్వం ఇవ్వగలను. అప్పుడాయన మా దేశ పౌరుడు అవుతాడు. ఆయన వ్యాఖ్యలకు విలువా ఉంటుంది. అతడు ఉక్రెయిన్ పౌరునిగా చెప్పేది వింటాను’’అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరిస్తే అధ్యక్ష పదవి వీడేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అదే సమయంలో తనను మార్చడం అంత సులభం కాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాను గెలవకుండా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొనకుండా తనను అడ్డుకోవడమే మార్గమని ధీమా వ్యక్తం చేశారు.ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధమే అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. ‘‘గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా.ఉక్రెయిన్ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా’’అని చెప్పారు. -
ఉక్రెయిన్‌కు భారీ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు షాకిస్తూ అమెరికా నుంచి అందే మిలటరీ సాయాన్ని నిలిపివేశారు. జెలెన్స్కీ ఖనిజాల ఒప్పందంపై అంగీకరించని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ తనదైనా పంథాలో ముందుకు సాగుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉన్న వారిపై ఆంక్షలు, టారిఫ్‌లు విధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో జెలెన్స్కీకి ట్రంప్ ఊహించని షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. తాజా నిర్ణయంలో పైప్‌లైన్‌లో ఉన్న కోటి డాలర్ల విలువైన సైనిక పరికరాల అప్పగింత నిలిచిపోయింది. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టిసారించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోందని అనుకుంటున్నాం. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవల ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి ట్రంప్, జెలెన్స్కీ వైట్‌హౌస్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాడీవేడి చర్చ జరిగింది. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. దీంతో, ట్రంప్ విరుచుకుపడ్డారు. సాయం అందించిన అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శాంతి ఒప్పందం చేసుకోవడం జెలెన్స్కీకి ఇష్టం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ చర్చలు కాస్తా రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. 🚨BREAKING: The Trump Administration has officially paused all U.S. military aid to Ukraine, abandoning our allies as they face a Russian invasion. RETWEET if you stand with President Zelenskyy against Donald Trump and Vladimir Putin! pic.twitter.com/C4LsP00NY7— Protect Kamala Harris ✊ (@DisavowTrump20) March 4, 2025మరోవైపు.. జెలెన్ స్కీ తాజాగా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా. ఉక్రెయిన్ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీన్ పెరిగింది
అమెరికన్ ఫిల్మ్ మేకర్ సీన్ బేకర్ సీన్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ‘అనోరా’ సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో సీన్ బేకర్‌కు నాలుగు అవార్డులు దక్కాయి. ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి నాలుగు అవార్డులు సాధించిన ఒకే ఒక్కడు సీన్ బేకర్ కావడం విశేషం. హాలీవుడ్ సమాచారం ప్రకారం... 1954లో వాల్ట్ డిస్నీ (అమెరికన్ యానిమేటర్, వాయిస్ యాక్టర్, ప్రొడ్యూసర్)కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయట. కానీ ఇవి ఒకే సినిమాకి రాలేదు. అలాగే 1974లో అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొ΄్పోల ‘ది గాడ్ ఫాదర్ 2’ చిత్రానికి మూడు ఆస్కార్ అవార్డులు (బెస్ట్ పిక్చర్, డైరెక్టర్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో) గెలుచుకున్నారు. . దయచేసి థియేటర్లలోనే సినిమా చూడండి – సీన్ బేకర్ ‘‘సెక్స్ వర్కర్స్ (వేశ్యల నేపథ్యంలో ‘అనోరా’ని రూపొందించారు) కమ్యూనిటీకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఆస్కార్ అవార్డును వారితో షేర్ చేసుకుంటున్నట్లుగా ఫీలవుతున్నాను’’ అన్నారు సీన్ బేకర్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘థియేటర్స్‌లో సినిమా చూడటం ఓ గొప్ప అనుభూతి. మనందరం కలిసి నవ్వుతాం... ఏడుస్తాం... ఉత్సాహంగా అరుస్తాం. ప్రపంచమంతా వివిధ భాగాలుగా విడిపోతున్నట్లు కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో థియేటర్స్‌లో అందరం కలిసి సినిమా చూడటం అనేది ఓ ముఖ్యమైన అంశం కావొచ్చు. ప్రస్తుతం థియేట్రికల్ ఎక్స్పీరియన్్స ప్రమాదంలో ఉంది. సినిమా థియేటర్స్, మరీ ముఖ్యంగా స్వంతంత్రంగా రన్ చేస్తున్న థియేటర్స్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మనందరం సపోర్ట్ చేయాలి. సినిమాలను థియేటర్స్‌లో చూడటం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను థియేటర్స్‌లో సినిమాలు చూసే విధంగా ప్రోత్సహించాలి. అద్భుతమైన ఆర్టిస్టుల రక్తం, కన్నీళ్లు, చెమటలతో ‘అనోరా’ను నిర్మించడం జరిగింది. ఇండిపెండెంట్ సినిమాలు కలకాలం జీవించాలి’’ అని పేర్కొన్నారు సీన్ బేకర్. మరో హైలెట్ ఏంటంటే... సీన్ బేకర్ తల్లి పుట్టిన రోజునే ఆయనకు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తన తల్లికి సీన్ బేకర్ థ్యాంక్స్ చెప్పారు.→ ‘‘అనోరా’ను మేం తక్కువ డబ్బుతోనే చేశాం. యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మీరు చెప్పాలనుకుంటున్న కథలను చెప్పండి. మీరు ఏ మాత్రం పశ్చాత్తాపపడరనడానికి మాకు దక్కిన ఈ అవార్డు ఓ ఉదాహరణ’’ అని ‘అనోరా’ నిర్మాతలు అలెక్స్ కోకో, సమంత క్వాన్ అన్నారు. -
Oscars 2025: అనోరా... పాంచ్ పటాకా
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 97వ ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేటర్లో ఆదివారం రాత్రి (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) 97వ ఆస్కార్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. మొత్తం ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, నటి, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సపోర్టింగ్ యాక్టర్) నామినేషన్స్ దక్కించుకున్న అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అనోరా’ చిత్రం ఉత్తమ సహాయ నటి విభాగం మినహాయించి, మిగిలిన ఐదు విభాగాల్లో అవార్డులు సాధించి, 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పీరియాడికల్ డ్రామా ‘ది బ్రూటలిస్ట్’కి మూడు (ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) అవార్డులు దక్కాయి. ఇక ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధికంగా 13 నామినేషన్లు దక్కించుకున్న స్పానిష్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పెరెజ్’, 10 నామినేషన్లు దక్కించుకున్న అమెరికన్ మ్యూజికల్ ఫ్యాంటసీ ‘వికెడ్’, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ‘డ్యూన్ పార్టు 2’ చిత్రాలు రెండేసి అవార్డులతో సరిపెట్టుకున్నాయి. అమెరికన్ ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ బాబ్ డైలాన్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా ‘ఏ కంప్లీట్ అన్నోన్’ చిత్రానికి ఎనిమిది నామినేషన్స్ దక్కినా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది. ‘ది బ్రూటలిస్ట్’లోని నటనకుగాను అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా, ‘అనోరా’కి మైకీ మాడిసన్‌కి ఉత్తమ నటిగా అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ‘అనోరా’ నిలవగా, అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు సీన్ బేకర్‌కి దక్కింది. ఇంకా పలు విభాగాల్లో పలువురు అవార్డులు అందుకున్నారు.భారతీయులకు నిరాశలైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం చిత్రం ‘అనూజ’పోటీలో నిలిచినా అవార్డును గెలుచుకోలేకపోవడం భారతీయ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ విభాగంలో డచ్ ఫిల్మ్ ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ మూవీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపగా నామినేషన్ దక్కించుకోలేకపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.నల్ల జాతీయుడి రికార్డ్ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ‘వికెడ్’ సినిమాకు గాను, పాల్ తేజ్‌వెల్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయుడు పాల్ కావడం విశేషం. ‘‘కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో తొలి అవార్డు అందుకున్న తొలి నల్ల జాతి వ్యక్తిని నేనేనని గర్వంగా చెబుతున్నా. ఈ అవార్డుతో గౌరవించిన ఆస్కార్ అకాడమీకి థ్యాంక్స్. మా ‘వికెడ్’ లీడింగ్ లేడీస్, టీమ్‌కి కూడా థ్యాంక్స్’’ అని పాల్ పేర్కొన్నారు. ఆస్కార్ విజేతలు... → ఉత్తమ చిత్రం – అనోరా → నటుడు – అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) → నటి – మైకీ మాడిసన్ (అనోరా) → దర్శకత్వం – అనోరా (సీన్ బేకర్) → సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ) → సహాయ నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్) → స్క్రీన్ ప్లే – అనోరా (సీన్ బేకర్) → సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే) → విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్ : పార్ట్2 → ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్) → అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కాన్ క్లేవ్ (పీటర్ స్ట్రాగన్ ) → సౌండ్ – డ్యూన్ : పార్ట్2 → మేకప్, హెయిర్ స్టైల్ – ది సబ్‌స్టాన్ ్స → ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్) → కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్‌వెల్) → ఒరిజినల్ స్కోర్ – ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్– బ్రెజిల్) → డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్– ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా → లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్ → యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ ∙→ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో → డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్→ ‘‘డొమినికన్ ఆరిజన్ కు చెందిన తొలి అమెరికన్ గా నేను ఆస్కార్ అవార్డు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇలా అవార్డు అందుకుంటున్న చివరి అమ్మాయిని నేను కాదని కూడా నాకు తెలుసు’’ అన్నారు ఉత్తమ సహాయ నటి సల్దానా.మహిళలకు అంకితం – దర్శకుడువాల్టెర్ సాల్లెస్ ΄÷లిటికల్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ ‘ఐయామ్ స్టిల్ హియర్’ చరిత్ర సృష్టించింది. 97 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. వాల్టెర్ సాల్లెస్ ఈ సినిమాకు దర్శకుడు. కథ రాసిన రూబెన్స్ నిర్మించారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర యూనిస్ పైవాగా బ్రెజిలియన్ నటి ఫెర్నాండా టోర్రెస్ నటించారు. అదృశ్యమైన తన భర్త కోసం ఓ మహిళ చేసే అసాధారణమైనపోరాటం నేపథ్యంలో ‘ఐయామ్ స్టిల్ హియర్’ మూవీ సాగుతుంది. ‘‘ఓ మహిళ అసాధారణపోరాటమే ఈ సినిమాకు అవార్డు తెచ్చిపెట్టింది. ఆపోరాటానికి ్రపాణంపోసిన ఫెర్నాండా టోర్రెస్, ఫెర్నాండా మోంటెనెగ్రోలకు ఈ అవార్డు దక్కుతుంది’’ అని వాల్టెర్ సాల్లెస్ పేర్కొన్నారు. అమెరికన్ రికార్డు ప్రొడ్యూసర్–కంపోజర్ క్విన్సీ జోన్స్‌తో పాటు పలువురు ప్రముఖులకు ఆస్కార్ నిర్వాహకులు నివాళులు అర్పించారు. ఇక ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు హాక్‌మాన్ గురించి మెమోరియమ్ సెగ్మెంట్లో అమెరికన్ యాక్టర్,ప్రొడ్యూసర్ మెర్గాన్ ఫ్రీమాన్ మాట్లాడారు.చూయింగ్ గమ్.. ఛీ... ఛీఆస్కార్ విజేతలు వేదికపై మాట్లాడేందుకు నిర్వాహకులు 45 సెకన్ల నిడివిని నిర్ణయించారు. కానీ అడ్రియన్ దాదాపు మూడు నిమిషాలకు పైనే మాట్లాడుతుండటంతో నిర్వాహకులు మ్యూజిక్ ప్లే చేశారు. ఆ మ్యూజిక్‌ను ఆపాలని అడ్రియన్ పేర్కొన్నారు. అలాగే స్టేజ్ మీదకు వచ్చే ముందు నోట్లో ఉన్న చూయింగ్ గమ్‌ను తన గాళ్ ఫ్రెండ్ జార్జినా చాప్మాన్ (నటి, ఫ్యాషన్ డిజైనర్) æవైపు విసిరేశారు. ఈ వింత ప్రవర్తన చాలామంది వీక్షకులకు నచ్చలేదు. ‘ఇదేంటి... ఛీ ఛీ’ అన్నట్లుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక అడ్రియన్‌కు ఇది రెండో ఆస్కార్ అవార్డు. 2003లో వచ్చిన ‘ది పియానిస్ట్’ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా తొలి ఆస్కార్ అందుకున్నారు అడ్రియన్. అప్పుడు తనకు అవార్డు అందజేసిన నటి హాలీ బెర్రీని ముద్దుపెట్టుకున్నారు. 75వ ఆస్కార్ అవార్డ్స్ లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనమైంది. తాజాగా 97వ ఆస్కార్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై హాలీ బెర్రీని ముద్దాడి వార్తల్లో నిలిచారు అడ్రియన్.→ ఆస్కార్ వేదికగా ‘కిల్‌బిల్’ (2003) ఫేమ్ డారిల్ హన్నా ఉక్రెయిన్ తరఫున తన స్వరం వినిపించారు. ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో విజేతను ప్రకటించేందుకు వేదికపైకి వచ్చిన, డారిల్ ఉక్రెయిన్‌కు విజయం వరించాలన్నట్లుగా విక్టరీ సింబల్’ చూపించారు. -
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం
2024 సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్ కాని, ఇండియన్ సినిమాల్లోకానివేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్ గురించి కథనం.వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?అమెరికా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.ఎవరీ ‘అనోరా’?:నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్–ఏ–ఆజమ్’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్–ఏ–ఆజమ్‌లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్‌లోని ఓ క్లబ్లో స్ట్రిప్పర్‌గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమెను క్లబ్ యజమాని రష్యాకు చెందిన ఇవాన్ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా పార్టీల్లో, వీడియో గేమ్స్‌లో సమయం గడుపుతూ ఉంటాడు. అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్‌కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.కష్టాలు మొదలుఅయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్లో తన ఇష్టానికి స్ట్రిప్పర్‌గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్‌ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్ పారిపోతాడు. ఇవాన్‌ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.ఊరడించే బంధంఅయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్‌ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్ డిస్ట్రబ్ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.సినిమా విశేషాలు→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్ బేకర్‌కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్–అమెరికన్ జంట కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ. 2000–2001 సమయంలో న్యూయార్క్‌లో సీన్ బేకర్ వీడియో ఎడిటర్‌గా పని చేస్తూ అనేక రష్యన్–అమెరికన్ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం కోసం కెనెడియన్ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం ఆమె గతంలో సెక్స్ వర్కర్‌గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్ వోర్’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. → కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. 25 ఏళ్ల మైకీ మాడిసన్ లాస్ ఏంజెలెస్‌లో పుట్టి శాన్ ఫెర్నాండ్ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.→ 2013లో తొలిసారి ‘రిటైర్మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే నాటికి మైకీ మాడిసన్ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది. 2017లో హీరోయిన్గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్’, ‘మాన్ స్టర్’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్‌లలోనూ నటించి, మెప్పించింది. → 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఆ పై ‘స్క్రీమ్’, ‘లేడీ ఇన్ ది లేక్’ సినిమాల్లో నటించింది. → తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్క్రీమ్’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్ బేకర్ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది. -
అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లూసియానా(Louisiana)లోని ఫ్రాంక్లిన్టన్లో జరిగిన మార్డి గ్రాస్ పరేడ్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత పరేడ్‌లో చోటుచేసుకున్న గందరగోళం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ బ్రేకింగ్ న్యూస్(Breaking News) ప్రత్యక్షమయ్యింది. BREAKING🚨: Several individuals were injured in a shooting that took place during a parade in Franklinton, Louisiana, a small town located in Washington Parish. The incident disrupted what was intended to be a festive community event.— Officer Lew (@officer_Lew) March 3, 2025 ఇది కూడా చదవండి: 9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే.. -
డీల్ ఓకే.. ట్రంప్‌తో మరోసారి భేటీకి సిద్ధమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నేతల నుంచి మద్దతు వస్తున్న వేళ అధ్యక్షుడు జెలెన్స్కీ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన ప్రకటనపై ట్రంప్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘అమెరికాతో మేము సత్సంబంధాలను కాపాడుకోగలం. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిర్మాణాత్మక సంభాషణ కోసం ఆహ్వానిస్తే తప్పకుండా ట్రంప్‌ను కలుస్తాను. అలాగే, ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేస్తాను. ఇది భద్రతా హామీల వైపు మొదటి అడుగు అవుతుంది. భద్రతా హామీలు లేని కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు ప్రమాదకరం. మేము గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అమెరికా మా వైపు ఉందని ఉక్రేనియన్ ప్రజలు తెలుసుకోవాలి. మాకు కావాల్సింది శాంతి. అంతులేని యుద్ధం కాదు. అందుకే భద్రతా హామీలు దీనికి కీలకమని మేము చెబుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.ఇటీవల డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్ వేదికగా జరిగిన చర్యల వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. జెలెన్స్కీపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై ఉక్రెయిన్‌కు సాయం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. As a result of these days, we see clear support from Europe. Even more unity, even more willingness to cooperate.Everyone is united on the main issue – for peace to be real, we need real security guarantees. And this is the position of all of Europe – the entire continent. The… pic.twitter.com/inGxdO8jQz— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 3, 2025 -
అమెరికాలో ట్విస్ట్.. జేడీ వాన్స్, మస్క్‌కు ఝలక్
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్, జేడీ వాన్స్‌ల ఆవేశపూరిత సంభాషణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్ అనుకూల నిరసనలు జరిగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్లలో వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ‘అమెరికా స్టాండ్స్ విత్ ఉక్రెయిన్’, ‘బి స్ట్రాంగ్ ఉక్రెయిన్’ ప్లకార్డులను ప్రదర్శించారు.హాలిడే కోసం వెర్మోంట్లోని వెయిట్స్ఫీల్డ్కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. మరోవైపు వీరికి వ్యతిరేకంగా, ట్రంప్, వాన్స్‌లకు అనుకూలంగా వెయిట్స్ఫీల్డ్లో కౌంటర్ నిరసనలు కూడా జరిగాయి. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టోర్ల ముందు కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv— Bill Madden (@maddenifico) March 1, 2025ట్రంప్‌పై నమ్మకం లేదు..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించలేదు. Hundreds of protesters gathered in Waitsfield on Saturday morning to protest Vice President JD Vance, who is visiting Vermont with his family for a ski trip this weekend. pic.twitter.com/gICcSJBU2a— Vermont Public (@vermontpublic) March 1, 2025 -
చందమామపై బ్లూ ఘోస్ట్
కేవ్ కెనావెరల్ (యూఎస్): చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. చంద్రుని ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో ఇది దిగిందని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ ప్రకటించారు. ‘‘దశాబ్దకాలం క్రితం పురుడుపోసుకున్న మా అంకుర సంస్థ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ పలు గండాలను తప్పించుకుంది. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. గతంలో పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయతి్నంచి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్, కూలిపోవడం, ఒరిగిపోవడం వంటి అపశ్రుతులకు తావులేకుండా ఒక ప్రైవేట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా చంద్రునిపై ల్యాండర్‌ను దించడం ఇదే తొలిసారి. దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి. బ్లూఘోస్ట్ ల్యాండయిన అరగంటకే చంద్రుని పరిసరాల ఫొటోలు తీసి అమెరికాలో ఆస్టిన్ నగరంలోని సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. అమెరికాలో అరుదైన పేడపురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు. వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్సూట్పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది. గురువారం మరో ల్యాండర్ హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్ల ఎత్తయిన ల్యాండర్‌ను గురువారం చంద్రునిపై దింపేందుకు కూడా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో కిందివైపు దాన్ని ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్‌ను విజయవంతంగా దించినా దాని కాలు విరిగి పక్కకు ఒరిగి నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్‌ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రునిపై కాలుమోపనుంది. దీన్ని కూడా బ్లూఘోస్ట్తో పాటే ప్రయోగించారు. -
వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు అంటే ఒక్క లీటరు చమురు ఇవ్వబోమని అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే దేశ చమురు, యుద్ధనౌకల్ని సరఫరా చేసే హాల్ట్బ్యాక్ బంకర్స్ (Haltbakk Bunkers) సంస్థ ఖరాఖండీగా చెప్పేసింది. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల (Volodymyr Zelensky)మధ్య మాటలు మంటలు రేపాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇందుకు అమెరికా పెద్దన్నగా వ్యవరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య బహిరంగంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ పట్టుబట్టారు. భవిష్యత్‌లో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా?, అందుకు మీరు భరోసా ఇస్తారా జెలెన్ స్కీ ఎదురు ప్రశ్నవేశారు. జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్,జేడీ వాన్స్ లు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేలా మాటమాట పెరిగింది.WOW. After yesterday’s Oval Office ambush of President Zelensky, Haltbakk Bunkers, one of Norway’s leading marine fuel providers, announced that it will no longer refuel U.S. Navy vessels, urging other European firms to follow suit.The United States is weaker and more isolated… pic.twitter.com/D9w32n1xBA— Republicans against Trump (@RpsAgainstTrump) March 1, 2025 ఈ పరిణామంలో ప్రపంచ దేశాలు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. తాజాగా, నార్వేజియన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని అమెరికాకు సరఫరా చేసే నార్వేజియన్ దేశ సంస్థ haltbakk బుంకెర్స్ కీలక ప్రకటన చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్న అమెరికా సైనిక బలగాలకు సరఫరా చేసే ఇంధనాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు వాషింగ్టన్లో శుక్రవారం అమెరికా, ఉక్రెయిన్ దేశాల దౌత్య సమావేశంలో జరిగిన వివాదమేనని తెలుస్తోంది. హల్ట్ బ్యాక్ బంకర్స్ తన ప్రకటనలో 2024లో అమెరికా సైనిక బలగాలకు సుమారు 30,00,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. వైట్ హౌస్‌లో దేశాధ్యక్షుల మధ్య జరిగిన వాగ్వాదంలో జెలెన్స్కీకి అండగా నిలుస్తోంది. అందుకే మా సంస్థ అమెరికా సైనిక బలగాలకు ఇంధన సరఫరా చేయడం వెంటనే ఆపివేయాలని నిర్ణయించుకుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఏమైందో ఏమో కొద్ది సేపటి తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసినట్లు సమాచారం. -
Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్ బారిన వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కొందరు రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు. గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.వివేక్ రామస్వామికి సోషల్ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్ బాక్స్‌లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా ఉంటారని ఒక యూజర్ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి.. -
Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!
వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ అంటే హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అగ్రదేశాధ్యక్షుడు ముందు మిగతా దేశాధ్యక్షులు చాలా నెమ్మదిగా వ్యవరిస్తారనే భావన మనలో చాలామందికే ఉంటుంది. . మరి అందరి దేశాధినేతలు వలే ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీ(Zelensky) స్టైలే సెపరేటు.‘నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్లను.. నా దారి రహదారి’ అనే ముక్కుసూటితనం జెలెన్స్కీలో కనిపిస్తూ ఉంటుంది. రష్యాతో యుద్ధం మొదలుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో నిన్నటి చర్చల వరకూ జెలెన్స్కీ ప్రత్యేక పంథాలోనే వెళుతున్నారు. ఎక్కడా తగ్గేదే లే.. నా రూటే సెపరేట్ అన్న శైలి ఆయనలో కనిపిస్తోంది. ట్రంప్ తో భేటి అయ్యే క్రమంలో కూడా జెలెన్స్కీ సాధారణంగానే వచ్చారు. ఎక్కడ హంగు, ఆర్భాటం లేకుండా వైట్ వైస్ లో దర్శనమిచ్చారు. అయితే జెలెన్స్కీ కనీసం సూట్ కూడా ధరించకుండా ట్రంప్ తో భేటీ కావడంపై అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ లో ఆసక్తిని పెంచింది. ఉండబట్టలేక అడిగేశాడు.సూట్ ధరించకపోతే నీకేమైనా నష్టమా?అయితే దీనికి కూడా జెలెన్స్కీ తనదైన స్టైల్ లోనే సమాధానమిచ్చారు. ‘సూట్ ధరించకపోతే నీకేమైనా సమస్యా.. లేక ఏమైనా నష్టమా? అంటూ జెలెన్స్కీ అనడంతో సదరు రిపోర్టర్ కాస్త కంగుతిన్నాడు. దాన్ని సరిచేసుకునే క్రమంలోనే ఆ రిపోర్టర్.. కాదు కాదు.. చాలా మంది అమెరికన్లలో ఒక భావన ఉంది. వైట్ హౌస్ ఆఫీస్ కి హాజరయ్యే క్రమంలో డ్రెస్ కోడ్ కు విలువ ఇవ్వరనే అమెరికన్లు అనుకుంటూ ఉంటారు అంటూ సర్దుకునే యత్నం చేశాడు రిపోర్టర్..ఆ రోజు వచ్చినప్పుడే సూట్ ధరిస్తా..దీనికి ప్రతిగా జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘ నేను కచ్చితంగా సూట్ ధరిస్తా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన క్షణమే నేను సూట్ ధరిస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నేను సూట్ ను కచ్చితంగా వేసుకుంటాను. డ్రెస్ కోడ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొద్దు.. మీలాగ. థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు.జెలెన్స్కీ మద్దతుగా నెటిజన్లు..జెలెన్స్కీ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు డ్రెస్ కోడ్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అలా అయితే ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశానికి ఎలన్ మస్క్ సూట్ తో ఎందుకు రాలేదు.. కేవలం టీ షర్ట్ మాత్రమే ఎందుక ధరించారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, అసలు మిమ్ముల్ని ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ సూట్ ఎందుకు ధరించలేదో అడగండి’ అంటూ మరొకరు నిలదీశారు. ఇలా జెలెన్స్కీపై ఏ రకంగా చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికాతో పెట్టుకున్నప్పుడు భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రస్తుతానికి జెలెన్స్కీకి మద్దతు మాత్రం పెద్ద ఎత్తులోనే లభిస్తూ ఉండటం విశేషం. Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 WHY doesn’t THIS guy wear a suit? pic.twitter.com/ZAQHWYjIob— The Resistor Sister®️♥️🇺🇸 (@the_resistor) February 28, 2025 ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా! -
ఈ వైరం ఇప్పటిది కాదు
-
రక్షణ హామీలు కావాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాతో బలమైన బంధాన్ని ఆకాంక్షిస్తున్నామని ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యాతో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు దన్నుగా నిలుస్తున్నందుకు అమెరికాకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జెలెన్స్కీకి కృతజ్ఞత లేదని, కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా లక్షలాది మంది ఉక్రేనియన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారని శుక్రవారం చర్చల్లో ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. దాంతో వారి భేటీ అర్ధ్ధంతరంగా ముగియడమే గాక అమర్యాదకర పరిస్థితుల్లో జెలెన్స్కీ వైట్‌హౌస్‌ను వీడారు. తర్వాత శనివారం ఆయన ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘‘అమెరికా ప్రజలకు, ముఖ్యంగా ట్రంప్‌కు, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. ఆ దిశగానే కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ట్రంప్ మద్దతు మాకు చాలా కీలకం. యుద్ధానికి తెర దించాలని ఆయన కాంక్షిస్తున్నారు. కానీ మాకంటే శాంతికాముకులు ఇప్పుడు ఇంకెవరూ ఉండబోరు. ఇది మా స్వేచ్ఛ కోసం, ఇంకా చెప్పాలంటే ఉనికి కోసం జరుగుతున్న పోరు. అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల ఆర్థిక, రక్షణపరమైన బంధాలను ఇది బలోపేతం చేయగలదు. కానీ మాకు కేవలం ఈ ఒప్పందాలు మాత్రమే చాలవు. ఉక్రెయిన్ రక్షణకు సరైన హామీలు లేకుండా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం మా దేశాన్ని ముప్పులో పడేస్తుంది. రష్యా మరోసారి మాపై దురాక్రమణకు దిగకుండా కచ్చితమైన హామీలు కావాల్సిందే. అప్పటిదాకా రష్యాతో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదు. అమెరికా పూర్తిగా మావైపే ఉందని ఉక్రేనియన్లందరికీ విశ్వాసం కలిగించడం ఇప్పుడు చాలా ముఖ్యం’’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ట్రంప్‌తో వాగ్యుద్ధం ఇరు పక్షాలకూ మంచి చేయలేదని అభిప్రాయపడ్డారు. -
స్టార్మర్తో జెలెన్స్కీ చర్చలు
లండన్: అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా శనివారమే బ్రిటన్ చేరుకున్నారు. ప్రధాని కియర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఇకముందు కూడా అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్టార్మర్ పునరుద్ఘాటించారు. మూడేళ్లుగా తమకు బ్రిటన్ అందిస్తూ వస్తున్న మద్దతుకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేతలిద్దరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పు, అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి తదితరాలు ప్రస్తావనకు వచి్చనట్టు సమాచారం. ఆదివారం లండన్‌లో యూరప్ నేతల భేటీ జరగనుంది. అందులో జెలెన్స్కీ పాల్గొనే అవకాశముంది. ఉక్రెయిన్ యుద్ధం, యూరప్ భద్రతే ప్రధాన అజెండాగా భేటీ జరగనుంది. నిజానికి మార్చి 6న పారిస్‌లో యూరప్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్ ఆహ్వానంపై యూరప్ దేశాధినేతలంతా లండన్‌లో భేటీ కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
దేవుడా.. ఇలా జరిగిందేంటి?.. ఉక్రెయిన్ రాయబారి ఆవేదన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ జెలెన్స్కీ మధ్య శాంతి చర్యలు విఫలమయ్యాయి. జెలెన్స్కీని ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేశారు. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ట్రంప్, జెలెన్స్కీ మధ్య భేటీ వాగ్వాదానికి దారితీసింది. శాంతి చర్చలు కాస్తా రసాభాసగా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, ట్రంప్.. జెలెన్స్కీ ప్రవర్తన మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు. బైడెన్ కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మండిపడ్డారు.ఇక, ఇదంతా జరుగుతున్న సమయంలో ఇరు దేశాల రాయబారులు అక్కడే ఉన్నారు. దీంతో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి నేతల భేటీతో మంచి జరగుతుందని ఆశిస్తే ఇలా జరుగుతుందేంటీ? అన్నట్టుగా తల పట్టుకుని కూర్చున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టుగా ఆమె హావభావాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇺🇦🇺🇸 Ukrainian Ambassador in the USA Oksana Markarova watches Zelensky in despair 🤷♂️🥹 pic.twitter.com/LUhjYc5vfb— Roberto (@UniqueMongolia) February 28, 2025 -
మీడియా ఎదుట డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీ వాగ్వాదం
-
జెలెన్స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్, జెలెన్స్కీ భేటీ అనంతరం యూరోపియన్ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. జెలెన్స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేసింది. ట్రంప్, జెలెన్స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ ప్రజల కోసం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ వేదికగా ఇద్దరు నేతల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఉక్రెయిన్‌పై ట్రంప్ సంచలన విమర్శలు చేశారు.ట్రంప్‌తో చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్‌హౌస్‌కు వచ్చారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై ఒత్తిడి చేశారు. ఈ సందర్బంగా ఇద్దరు నేతల మధ్య చర్చలు ప్రారంభమైన వెంటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మీడియా ఎదుటే వాదులాడుకున్నారు.ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ ప్రజల జీవితాలో మీరు చెలగాటం ఆడుతున్నారు. మీ ఆలోచనల కారణంగా మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది. మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోంది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది. దీని నుంచి గట్టెక్కడం అసాధ్యం. చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.Watching Trump and Vance gang up and bully Zelensky, I have never been so disgusted and ashamed to be an American in my life. 😡😡😡👇 pic.twitter.com/EjwPkTPAfW— Bill Madden (@maddenifico) February 28, 2025ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోంది. మా దేశ భూభాగంలో మేము ఉంటున్నాం. మేము అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలా?. మేము దృఢసంకల్పంతో ఉన్నాం. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని చెప్పారు.ఈ క్రమంలో ట్రంప్ పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్స్కీకి హితవుపలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. వెంటనే జెలెన్స్కీ.. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.This is utterly repulsive!Trump and Vance just tried to humiliate Zelensky live on American TV, smugly demanding gratitude while openly mocking him like playground bullies counting favors. My respect for Zelensky—and my embarrassment as an American—just surged off the charts.… pic.twitter.com/0C4d03PDmi— Brian Krassenstein (@krassenstein) February 28, 2025మరోసారి ట్రంప్ కలగజేసుకుని.. రష్యాతో యుద్ధంలో అమెరికా మీకు ఎంతో సాయం చేసింది. మీకు మద్దతుగా నిలిచాం. ఆయుధాలు సమకూర్చాం. 350 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశాం. మా సైనిక పరికరాలే లేకపోతే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేది. ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయింది. అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు. యుద్ధమే చేస్తామంటున్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి అంగీకరించండి. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది. మరణాలు ఆగుతాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, మరోసారి జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అవును.. మీరు చెప్పింది నిజమే. రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వనేతలను అడగండి. ఏం చెబుతారో వినండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.ఇక, వీరి భేటీ అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నాను. శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది. -
అధికార భాష ఆంగ్లం
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారాల్లో ఉపయోగించే భాష ఆంగ్లమే. దేశంలో ఇతర భాషలు సైతం మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ భాషకూ అధికార భాష హోదా లేదు. ఇంగ్లిష్‌కు ఇప్పుడు ఆ హోదా కల్పించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకల్పించారు. ఇంగ్లిష్‌ను దేశమంతటా అధికార భాషగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలియ జేశాయి. అయితే, ఎప్పుడు సంతకం చేస్తారన్నది బయటపెట్టలేదు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంగ్లాన్ని అధికార భాషగా గుర్తించాయి. -
డ్రగ్ లార్డ్ క్వింటెరో అమెరికాకు తరలింపు
మెక్సికో సిటీ: డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపా లన్న ట్రంప్ యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వంపై పనిచేశాయి. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరడుగట్టిన డ్రగ్స్ ముఠా నాయకుడు రఫేల్ కారో క్వింటెరో సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే మంగళవారం నుంచి అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం. మెక్సికోలోని వే ర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్ మాఫి యా పెద్దతలలను గురు వారం రాజధాని మెక్సికో సిటీ లో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందిన వారున్నారు. కారో క్వింటెరోతోపాటు సినలోలా కార్టెల్లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్ కరోలినాలో పోలీసు అధికారి హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, హత్య తదితర నేరారోపణల కింద వీరిపై విచారణ జరపనున్నామని అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి చెప్పారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వలసదా రులను నిలువరించడం, ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తిని నిలిపివేయడం వంటివి మానుకో కుంటే టారిఫ్‌లు తప్పవని, సానుకూలంగా స్పందించిన పక్షంలో టారిఫ్‌ల అమలును వాయిదా వేస్తామని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. -
ట్రంప్ నిర్ణయానికి జడ్జి బ్రేక్
-
ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. బెడిసికొడుతున్న నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ డోజ్ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 🚨Shocking: US judge temporarily blocks White House from ordering mass firing of federal workers pic.twitter.com/YFlzyBjiDS— EverthingEverything (@EverthingEv) February 28, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్ఎయిడ్లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.US judge temporarily blocks White House from ordering mass firing of federal workers Ruling deals blow to efforts by Donald Trump and Elon Musk to shrink government workforce Source - Financial Times— Prime View News (@primeviewnews) February 28, 2025 -
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల్లో 90 శాతం రద్దు!
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.ఖాళీకి పావుగంటఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు. -
ఈయూపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్ యూనియన్ (ఈయూ)నూ తాకింది. ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యా యం జరుగుతోందని ఆరోపించారు. ‘‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్ ఆరోపించారు. గట్టిగా బదులిస్తాం: ఈయూట్రంప్ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్ కమిషన్ దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వి వక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’’ అని కమిషన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. అమెరికా, ఈయూ ఉద్రిక్తతలురెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది! -
బంగారు కొండ దిగొస్తోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది. వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్‌కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్‌ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు. -
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
-
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనమవుతోంది. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అబివృద్ధితోపాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా బతకడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగ్గుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓవ్యక్తి మాత్రం పదేళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ..తాను స్వదేశానికి వచ్చి మంచి పనిచేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పేస్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునేవారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ సీఈవో.ఎందుకంటే..ఆర్క్అలైన్డ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనిరుద్ధ అంజనా అమెరికాలో ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చేశారు. అయితే వాళ్లు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే..అనిరుద్ధ తన వృద్ధ తల్లిదండ్రులును చూసుకోవాలనే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, కెరీర్ సమస్యల వల్ల కాదని తేల్చి చెప్పేరు. కేవలం తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు బంధువులు నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యలు వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యాలు వచ్చాయి. కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వెచ్చించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్‌స్టాగ్రాంలో వివరించారు సీఈవో అనిరుద్ధ. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు. అనిరుద్ధ పోస్ట్ సోషల్‌మీడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్‌పై స్పందిస్తూ..సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒకరు, బంధాల విలువను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ నిరర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aniruddha (@growwith_ani) (చదవండి: 'గైనకాలజీ పితామహుడు': అనస్థీషియా లేకుండా నల్లజాతి మహిళలపై..!) -
ట్రంప్ తిక్క కుదిరిందా?.. గ్రాఫ్ గోవిందా.. గోవిందా!
-
Volodymyr Zelenskyy: ‘కవచం’గా నిలబడితే ఖనిజాలిస్తాం
కీవ్: సొంత భూభాగాలను కాపాడుకునేందుకు రష్యాతో యుద్ధంచేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మూడేళ్లుగా అమెరికా చేసిన ఆయుధ, ఆర్థిక సాయానికి అత్యంత అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞత చూపేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ దేశ రక్షణ, భద్రత విషయంలో అగ్రరాజ్యం అండగా ఉండాలని కీలక షరతు విధించారు. అయితే ఈ షరతుకు అమెరికా ఏ మేరకు ఒప్పుకుంటుందో శుక్రవారంకల్లా స్పష్టత వచ్చే వీలుంది. శుక్రవారం జెలెన్స్కీ అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అయి విస్తృతస్థాయిలో చర్చలు జరపనున్నారు. చర్చలు సఫలమైతే కీలకమైన ఖనిజ, ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. అరుదైన ఖనిజాల డీల్ కుదిరాక, యుద్ధంలో రష్యాకు ఎదురునిలబడి అమెరికా తమకు ఏమేరకు అండగా నిలబడుతుందనే అనుమానాలు జెలెన్స్కీ మదిలో అలాగే ఉన్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి సాక్షిగా రష్యా వ్యతిరేక తీర్మానంలో తమకు మద్దతు పలకాల్సిందిపోయి రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటేసిన నేపథ్యంలో భద్రతా అంశంపై జెలెన్స్కీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో వందల బిలియన్ డాలర్ల ఆర్థిక, ఆయుధ సాయం పొందిన కారణంగా అగ్రరాజ్య ఖనిజ సంపద డిమాండ్‌కు జెలెన్స్కీ తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై బుధవారం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికాలో ఆర్థిక ఒడంబడిక చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యాచరణ ఒప్పందం త్వరలో సమగ్ర ఒడంబడికకు బాటలు వేస్తుంది. ఈ ఒప్పందంలో మా దేశ భద్రతా అంశమే అత్యంత ప్రధానమైంది. ఈ అంశాన్ని తేల్చుకునేందుకు అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అవుతా. ఖనిజ వనరులపై పాక్షిక హక్కులు ధారాదత్తం చేయడంసహా యుద్ధంలో ఆయుధసాయంపై చర్చిస్తా. యుద్ధంలో సైనికసాయం కొనసాగించే ఉద్దేశం అమెరికాకు ఉందో లేదో తెల్సుకుంటా. నేరుగా అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు విషయమూ మాట్లాడతా. స్తంభింపజేసిన రష్యా స్థిర,చరాస్తులను మేం ఆయుధాల పెట్టుబడుల కోసం వినియోగించుకునే అంశాన్నీ ప్రస్తావిస్తా. అన్ని విషయాలు కొలిక్కివస్తే సమగ్ర ఒప్పందంపై సంతకం చేస్తా’’ అని జెలెన్స్కీ వివరించారు. భారీ డీల్ కుదుర్చుకుంటాం: ట్రంప్మూడేళ్ల సాయానికి ప్రతిఫలంగా విలువైన ఖనిజ సంపద, సహజ వనరులపై వాటా కోరుతున్న ట్రంప్ ఈ ఒప్పందంపై మాట్లాడారు. బుధవారం వాషింగ్టన్లో తమ మంత్రివర్గ తొలి భేటీ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ జెలెన్స్కీ శుక్రవారం వాషింగ్టన్కు వస్తారు. నాతో కలిసి అతిపెద్ద ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అమెరికన్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన సొమ్మును మేం ఉక్రెయిన్ కోసం యుద్ధంలో సాయంగా ఖర్చుచేశాం. ఈ సొమ్ము అంతా ఇప్పుడు తిరిగిరాబోతోంది. ఖనిజాల తవ్వకంతో అమెరికా లాభపడనుంది. ఉక్రెయిన్‌తో దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నా’’ అని ట్రంప్ అన్నారు. ‘‘నాటోలో సభ్యత్వం ఆశను ఉక్రెయిన్ వదులుకుంటే మంచిది. నాటో కూటమి సైతం ఈ అంశాన్ని మర్చిపోతే బాగుంటుంది’’ అని ట్రంప్ అన్నారు. ప్రాథమిక ఒప్పందం ఓకేఇరుదేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం దాదాపు ఖరారైందని ఉక్రెయిన్ ప్రధాన మంత్రి డెనిస్ షెమిహాల్ బుధవారం వెల్లడించారు. ‘‘ యుద్ధంలో దెబ్బతిన్న కారణంగా ఉక్రెయిన్ పునర్ నిర్మాణం, శాంతి, పెట్టుబడుల ప్రాతిపదికన అమెరికాతో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఉక్రెయిన్ పునర్నిర్మాణ క్రతువులో అమెరికా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావి స్తున్నాం’’ అని ఉక్రెయిన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రధాని డెనిస్ ప్రకటించారు. -
ఆయన అనుకున్నదంతా అయ్యేనా?
ఆయుధ బలం, ఆర్థిక బలంతో ఏదైనా సాగించవచ్చునన్నట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, అదంత తేలిక కాదని నెల రోజులు తిరిగేసరికి అర్థమవుతుండాలి! అమెరికన్లతోపాటు వారి అనుయాయ పశ్చిమ దేశాలను, మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఆయన చర్య లను, అందుకు ఎదురవుతున్న ప్రతిఘటన లను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది.అధ్యక్షుని ప్రకటనలను, చర్యలను రెండు విధాలుగా విభజించాలి. అంతర్గతమైనవి, విదేశాంగపరమైనవి. అంతర్గతంగా అన్నీ ఇప్పటికి తను కోరుకున్న విధంగానే జరిగిపోతున్నాయి. కొన్ని చర్యల వల్ల తమ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీస్ రంగాలపైన, గృహావస రాలపైన, సామాజిక సంబంధాలపైన ప్రభావాలు మొదలైనా, నిర సనలు మంద్ర స్థాయిలోనే ఉన్నాయి. ప్రతిపక్షమైన డెమోక్రాట్లలో చలనమే లేదు. ట్రంప్‌కు అడ్డుపడటమంటూ ఏమైనా జరిగితే అది కోర్టుల స్టే ఉత్తర్వుల వల్లనే. నష్టపోతున్న వారిలో ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఆకర్షితులై భారీగా ఓటు చేసిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికి ఇప్పటికే పనులూ, ఫెడరల్ ఉద్యోగాలు పోతుండటం, ధరల పెరుగు దల వంటి సమస్యలు ఎదురవుతున్నాయనీ వార్తలు చెప్తున్నాయి. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగితే తప్ప ట్రంప్ తన అంతర్గత విధా నాలను సవరించుకోకపోవచ్చు.బయటి నిరసనలుఅంతర్గతంగా ఎట్లున్నా, బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరంగిక పరిస్థితులు, ప్రయోజనాలతో ఉండటం నిజమే అయినా, బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినపుడు ఈ 40 రోజులలో కనిపిస్తున్నది ఏమిటి?ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు పనామా కాలువ స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం, గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమె రికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చటం. ఈ అంశాలలో జరి గిందేమిటి? పనామా బలహీన దేశం. అయినా వారి కాలువను స్వాధీనపరచుకోలేక పోయారు. కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్ట మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే.అదే ప్రాంతపు మెక్సికో, తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇపుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసినా, యూరోపియన్ దేశాలు సైతం ఆమో దించటం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్‌ల్యాండ్ మరొక బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది. ట్రంప్‌కు కావలసింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం. కానీ అమెరికాకు అమ్మకం అయేందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తర ణకు, సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్‌ల్యాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి. యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్‌దే రాజ్యమయ్యేది.అమెరికాకు సరిహద్దున ఉండటమేగాక అన్నివిధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అంటున్న 51వ రాష్ట్రపు మాటను కెనడా ఛీత్కరిస్తున్నది. 25 శాతం సుంకాలకు బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించింది. ప్రజలలో జాతీయాభిమానం ఎగసి రాగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బలమైన మద్దతుగల గ్రీన్‌ల్యాండ్ వలెనే, స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి నెరవేరటం లేదన్నమాట.బుల్డోజర్ పథకం సాగేనా?ఇంచుమించు ఇటువంటిదే గాజా విషయం. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్న అమెరికా విధానంలో నిజాయితీ లేకున్నా నోటి మాటగా అంటూ వస్తూ, ఇపుడు తిరిగి అధికారానికి వచ్చినాక దానిని అకస్మాత్తుగా వదలివేసిన ట్రంప్, గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్టుగా మారుస్తామన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీనియన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు, యూరోపియన్ యూనియన్, తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్యసమితి వెంటనే కొట్టివేశాయి. అయినప్పటికీ తన పంతం వీడని ట్రంప్, తమపై బాగా ఆధారపడి ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లను ఒత్తిడి చేసి గాజా ప్రజలను, బహుశా తర్వాత వెస్ట్ బ్యాంక్ పాల స్తీనియన్లను కూడా ఆ దేశాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఈజిప్ట్, జోర్డాన్‌ల సొంత ఆలోచనలు ఏవైనా అక్కడి ప్రజాభిప్రాయానికి, తక్కిన అరబ్ ప్రపంచం ఆగ్రహానికి భయపడి అందుకు అంగీకరించలేదు. కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా, ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు. దానితో, తాము చెప్పిన దానికన్న మెరుగైన ప్రతిపాదన ఉంటే సూచించాలని అరబ్ దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇపుడు కోరు తున్నారు. గాజా ప్రజలు తమ మాతృభూమిలోనే నివసించే విధంగా పునర్నిర్మాణ పథకాన్ని, పాలస్తీనా స్వతంత్ర దేశ పథకాన్ని అరబ్ దేశాలు ఇంచుమించు రూపొందించాయి. ఆ విధంగా అమెరికా అధ్యక్షుని బుల్డోజర్ ఉధృతి అక్కడ సాగబోవటం లేదు. ఈ పరి ణామాల దరిమిలా, తాము, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ధ్వంసం చేయటం, లొంగ దీసుకోవటం జరగవచ్చునా అన్నది వేచి చూడ వలసిన ప్రశ్న అవుతున్నది.ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చేస్తున్నదేమిటో రోజూ వార్తలు వెలువడుతున్నాయి. తాము, యూరప్ కలిసి ఉక్రెయిన్ను మూడేళ్లుగా నిలబెట్టలేక పోవటంతో, వ్యక్తిగతంగా వ్యాపార ధోరణి గల ట్రంప్ ఇప్పుడు రెండువైపుల నుంచి ప్రయోజనాలు పొందే వ్యూహం వైపు మారారు. ఉక్రెయిన్ను, యూరప్‌ను దారికి తెచ్చుకుని ఉక్రెయిన్‌లోని లోహాలు, ఖనిజాలను సంపాదించటం; బలమైన రష్యాతో ఆర్థిక, ఇతర సంబంధాల మెరుగుదల. ఎటూ గెలవలేని యుద్ధంలో ఆ విధంగా ఉక్రెయిన్, యూరప్, తనను కాదని చేయగలిగింది కూడా లేని బలహీనులు కావటం వల్ల వారిని దారికి తేగలుగుతున్నారు. దీనినిబట్టి అర్థమయే దేమిటి? పనామా, కెనడా, గాజా, ఉక్రెయిన్, యూరప్ వంటివి వేర్వేరు విధాలైన కేసులు. మొత్తం మీద తన పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే అమెరికా అధ్యక్షుడు ఇన్నిన్ని అనుభవాలు గడించటం బహుశా మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. ఆయనతో ప్రపంచ అనుభవాలు కూడా అటువంటివే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్ కూడా ఇచ్చింది.గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే సమాధానం చెప్పానా?’ కామెంట్ చేయాలంటూ నెటిజనులను కోరింది.చదవండి: వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన నెటిజన్లు ఏమన్నారంటేఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్ రాశారు.కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. -
యాపిల్ డీఈఐ కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రతిపాదనలు
అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (ఎన్సీపీపీఆర్) యాపిల్ తన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్(డీఈఐ) కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని కోరుతూ ఇటీవల ఒక ప్రతిపాదనను రూపొందించింది. దీనికి స్పందించిన యాపిల్ వాటాదారులు ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని యాపిల్ స్పష్టం చేసింది.అమెరికాలోని ప్రజా విధాన సమస్యలకు స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారాలను ప్రోత్సహించడంపై ఎన్సీపీపీఆర్ దృష్టి సారిస్తుంది. అయితే యాపిల్ అనుసరిస్తున్న డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్(డీఈఐ) కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఫెడరల్ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో డీఈఐ కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.డీఈఐపై చట్టపరమైన, ఆర్థిక ఆందోళనలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీఈఐ కార్యక్రమాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం తరువాత ఫెడరల్ ఏజెన్సీలను అన్ని డీఈఐ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)ను జారీ చేశారు. వాటిని ‘ప్రజా వ్యర్థాలు’గా అభివర్ణించారు. ఈ ఉత్తర్వులు ప్రైవేట్ కంపెనీలను కూడా వర్తింపజేయాలని చెప్పారు. డీఈఐ ప్రోగ్రామ్‌లతో ముడిపడి ఉన్న చట్టపరమైన ప్రమాదాల గురించి కొన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి వివక్షకు సంబంధించిన కేసులకు దారితీస్తాయని భయపడుతున్నాయి. డీఈఐ కార్యక్రమాలు ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయనే నమ్మకం కొంతమంది వ్యాపార నాయకుల్లో ఉంది.ఇప్పటికే డీఈఐ కార్యక్రమాల నుంచి వైదొలిగిన కొన్ని హైప్రొఫైల్ కంపెనీల బాటలోనే యాపిల్ కూడా నడవాలని ఎన్సీపీపీఆర్ ప్రతిపాదన కోరుతోంది. డీఈఐ కార్యక్రమాలు కంపెనీలకు, వాటి వాటాదారులకు గణనీయమైన ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయని వాదిస్తుంది. డీఈఐ విధానాలు ఇటీవలి కోర్టు తీర్పులకు అనుగుణంగా లేవని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపుయాపిల్ స్పందన..ఎన్సీపీపీఆర్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ యాపిల్ తన డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కంపెనీ వైవిధ్య కార్యక్రమాలు తన సంస్కృతి, విధానాల్లో భాగమని తెలిపింది. డీఈఐ ప్రయత్నాలు మరింత సమ్మిళిత, సృజనాత్మక పనివాతావరణాన్ని సృష్టిస్తాయని నొక్కి చెప్పింది. ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో యాపిల్ యాజమాన్యం దాని డీఈఐ కార్యక్రమాలను సమర్థించుకుంది. వాటాదారులు ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కొత్త ప్లాన్ రూపొందించారు. పెట్టుబడిదారుల పౌరసత్వానికి ‘గోల్డ్ కార్డ్’ వీసాను తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం దాదాపు 44కోట్లు) పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామని ట్రంప్ తెలిపారు.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామన్నారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు.కాగా.. ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. BREAKING:Trump announces USA will start selling gold cards in 2 weeks.“We're gonna put a price on that card of about $5 million and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship and wealthy people will come to our country” pic.twitter.com/OJnhFLeWAL— Visegrád 24 (@visegrad24) February 25, 2025ఈబీ-5 వీసా అంటే? యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 800,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.జన్మతః పౌరసత్వం రద్దు..అంతకుముందు.. రెండోసారి అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది. -
USA: ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో నిర్ణయంతో ఫెడరల్ యంత్రాంగాన్ని అయోమయంలోకి నెడుతున్న అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.ఇదే సమయంలో అత్యంత ముఖ్యమైన ప్రజా సేవల విభాగాన్ని ధ్వంసం చేసేందుకు తమ నైపుణ్యాన్ని వినియోగించాలంటూ అందిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. అమెరికా ప్రజలకు సేవ చేస్తామంటూ విధుల్లో చేరేటప్పుడు చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో నెరవేర్చలేమని స్పష్టమైందంటూ వారు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించే బాధ్యతలను చేపట్టిన డోజ్ యంత్రాంగంలోని వారంతా రాజకీయ నేపథ్యం కలిగిన వారనీ, వీరికి అందుకు అవసరమైన నైపుణ్యాలు గానీ, అనుభవం గానీ లేవని అందులో తెలిపారు. బాధ్యతల నుంచి వైదొలగిన వారిలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఉన్నారు.వీరు గతంలో అమెజాన్, గూగుల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలను నిర్వహించిన అనుభవజ్ఞులు. ఒబామా హయాంలో హెల్త్‌కేర్ విధానాలను అమలు చేసేందుకు యూఎస్ డిజిట్ సర్వీస్ పేరుతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విభాగానికి చెందిన 40 మంది సిబ్బందిని ఈ నెల మొదట్లో ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.BREAKING: 21 employees have just RESIGNED from Elon Musk's DOGE, refusing to "dismantle critical public services."“We swore to serve the American people and uphold our oath to the Constitution across presidential administrations,” the 21 staffers wrote in a joint resignation… pic.twitter.com/7ra4Hatqia— Brian Krassenstein (@krassenstein) February 25, 202540% నిరుపయోగమే..అధికారంలోకి రాగానే ట్రంప్ ఏర్పాటు చేసిన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమేనని తేలింది. వాటివల్ల ఖజానాకు నిధులు ఆదా అయ్యేదేమీ లేదని వెల్లడైంది. గత వారం నాటికి 1,125 కాంట్రాక్టులను డోజ్ రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇప్పటికే పూర్తిగా నిధులను ఖర్చు చేయడం దీనికి కారణమని వెల్లడైంది. -
పుతిన్‌కు అండగా ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్ వైఖరి ఇదే..
ఐక్యరాజ్యసమితి: బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడేళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నిరకాల సాయం చేస్తే తాజాగా ట్రంప్ సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న ఉదంతం ఐక్యరాజ్యసమితి సాక్షిగా తొలిసారిగా బహిర్గతమైంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ యూరప్ దేశాలు చేసిన ఒక తీర్మానానికి ఎన్నో దేశాలు మద్దతు పలికితే అమెరికా వ్యతిరేకంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక, యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొండివైఖరే కారణమని పదేపదే ప్రస్తావిస్తున్న ట్రంప్ సర్కార్ వైఖరి సోమవారం ఐరాస వేదికగా తేటతెల్లమైంది. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని, రష్యా సేనలు వెంటనే ఆక్రమణ భూభాగాల నుంచి వెనుతిరగాలని, పలు డిమాండ్లతో ఐరాసలో సోమవారం మూడు తీర్మానాలను పలు సభ్యదేశాలు ప్రతిపాదించాయి. ఒక బిల్లులో రష్యాను ఆక్రమణదారుగా పేర్కొన్నారు. అయితే రష్యాను ఆక్రమణదారుగా పేర్కొనడాన్ని సమర్థించబోనని అమెరికా తెగేసి చెప్పింది.రష్యా తప్పేంలేదన్నట్లు ప్రవర్తిస్తూ ఓటింగ్ వేళ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. యూరప్ మిత్రదేశాలను కాదని ట్రంప్ సర్కార్ రష్యా అనుకూల వైఖరితో ముందుకెళ్లడం ఇప్పుడు యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. రష్యా సైన్యం తమ ప్రాదేశిక స్థలాల నుంచి వైదొలగాలని ఉక్రెయిన్ చేసిన ఒక తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా అమెరికా ఒత్తిడిచేసినట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు చేసిన మరో తీర్మానంలో ఓటేయకుండా అమెరికా దూరంగా ఉండిపోయింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లుతు న్నాయనేది ఐరాస వేదికగా బహిర్గతమైంది.దూరంగా ఉండిపోయిన భారత్చర్చలు, సంప్రదింపుల ద్వారానే యు ద్ధాన్ని ముగించాలని మొదట్నుంచీ కోరుకుంటున్న భారత్ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. సర్వ ప్రతినిధి సభలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మా నంపై ఓటింగ్‌లో 176 దేశాలు పాల్గొనగా 93 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా సహా 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, చైనా, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, ఖతార్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. ‘‘యుద్ధం కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య శాంతికి ప్రయత్నాలు చేద్దాం’’ అంటూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్ మూడు సవరణలు సూచించింది. రష్యా కారణంగానే యుద్ధం మొదలైందని పేర్కొంది. దీనిపై రష్యా స్పందించింది. అసలు ఈ ఉద్రిక్తతలకు మూలకారణాలను ప్రస్తావించాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే ఈ సవరణలను 93 దేశాలు సమర్థించగా 8 దేశాలువ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. -
ఆఫీసులకు రాకుంటే.. లీవు తప్పదు!
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం నుంచి తప్పనిసరిగా తిరిగి విధులకు హాజరు కావాల్సిందేనని ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. హాజరు కాని వారందరినీ పరిపాలనా పరమైన లీవుపై సాగనంపుతామని హెచ్చరించారు. వారికిక వేతనాలుండవన్నారు. ఆయన సోమవారం ‘ఎక్స్’లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేప ట్టాక వేగంగా జరుగుతున్న పరిణా మాలతో ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో అయోమయం, ఉద్యోగుల్లో ఆందోళన పెరిగి పోయాయి. యంత్రాంగాల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఉద్యోగులు ఎవ రికి వారు తమ పనితీరును వివరించాలంటూ మస్క్ రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలపై స్పందించాలంటూ హెల్త్, హ్యూమన్ రిసోర్సెస్, డ్రగ్ ఎన్ఫో ర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తమ ఉద్యోగులకు సూచించగా ఆ అవసరం లేదంటూ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇంధన, వాణిజ్య విభాగాలు సూచించాయి. ఇప్పటికే కన్జూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో ఉద్యోగులను మస్క్ యంత్రాంగం ఇళ్లకు పంపించేసింది.యూఎస్ఎయిడ్లో 1,600 ఉద్యోగుల తొలగింపువాషింగ్టన్: ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీలు, అనుబంధ విభాగాల్లో సిబ్బంది కోత పరంపర కొనసాగుతోంది. తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూ ఎస్ఎయిడ్) విభాగంలోని 1,600 మంది ఉద్యోగులను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ఎయిడ్కు సంబంధించిన కీలక విధులు, ప్రత్యేక కార్యక్రమాల్లో నిమగ్నమైన సిబ్బందిని సోమవారం నుంచి సెలవులపై పంపుతున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. -
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుతిన్‌తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గానీ, ఇటు యూరప్ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్‌లో పోటీగా శాంతిచర్చలకు యూరప్‌లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్‌కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్ ప్రాంతం, లోగడ తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్‌పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్ ప్రయత్నం చేయవచ్చు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్ విధానాలు యూరప్‌పై దాడిగా ప్రముఖ యూరప్ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.ఉక్రెయిన్ ఆన్లైన్ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్‌ల శాంతి ఒప్పందాలను లీక్ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్ స్క్‌ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్‌లు మాస్కోలో, వాషింగ్టన్లో కల్సుకొంటారని, జెలెన్స్కీ, పుతిన్‌లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిచైనాను ఎదుర్కొనే వ్యూహంతాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్ తీవ్ర నష్టాల పాలయ్యింది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్‌కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!నేటితో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్‌లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్ నాటికి ఉక్రెయిన్‌కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్ డాలర్లు అని ‘కేఎస్ఈ ఇనిస్టిట్యూట్’ అంచనా. ఉక్రెయిన్ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. -బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
ట్రంప్ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ముందు చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా నుంచి అందే సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా రెండు వేల మంది ‘యూఎస్ ఎయిడ్’ డిపార్ట్మెంట్ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్ యంత్రాంగం ముందుకెళ్లింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. అమెరికా నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు యూఎస్ ఎయిడ్ ద్వారా సాయం అందుతూ ఉంటుంది.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బిలియనీర్ ఇలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)ని ఏర్పాటు చేశారు.తాజాగా అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు గత వారం ఏం చేశారో చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని డీవోజీఈ నుంచి వెళ్లిన మెయిళ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మెయిళ్లకు సోమవారం అర్ధరాత్రిలోగా సమాధానమివ్వాలని ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారు. -
టారిఫ్‌లు, ప్రపంచ మార్కెట్లపై దృష్టి
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా ఎఫెక్ట్ యూఎస్ టారిఫ్‌లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు. వారాంతాన... గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!ఇతర అంశాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ వార్తలు ట్రెండ్‌ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు. -
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్‌నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.ఆక్సిజన్ సరఫరా ట్యూబ్‌లు పెట్టుకుని డెస్క్ టాప్‌పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్చేశారు. ‘‘హైపర్బారిక్ ఆక్సీజన్ ఛాంబర్లోకి ఆఫీస్‌కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్‌బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది. హెచ్‌బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీలుస్తా’’అని చెప్పారు. పీడనంతో అంతా సమతుల్యం ‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్మ్యాక్స్లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్‌చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్‌చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గత వారం దేశం కోసం ఏం చేశారు?
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దాదాపు అనధికార అధ్యక్షుడిగా చలామణి అవుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) విభాగం నుంచి వివాదాస్పద నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీల్లోని సిబ్బంది పనితీరును క్రోడీకరించే పేరుతో వారి ఉద్యోగాలకు కోత పెట్టే పనిని మొదలెట్టారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలోని ఉద్యోగులకు తాజాగా ఒక మెయిల్ వచ్చింది. అందులో ‘‘దయచేసి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఈ–మెయిల్‌కు మీ స్పందన తెలియజేయండి. గత వారం మీరంతా విధినిర్వహణలో భాగంగా దేశం కోసం ఏమేం పనులు చేశారు?. ఒక ఐదు కీలకమైన అంశాలను విడివిడిగా కుప్లంగా పేర్కొంటూ ప్రతిస్పందన మెయిల్ పంపించండి. సోమవారం రాత్రి 11.59 గంటలకల్లా మెయిల్‌ను పంపించండి. మీరు గనక ఈ–మెయిల్ పంపించకపోతే మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తాం’’అని మెయిల్లో ఉంది. ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు గత వారం మొత్తంలో దేశం కోసం ఏమేం చేశారని సంజాయిషీ అడగడమేంటని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్(ఓపీఎం) విభాగం నుంచి వచ్చిన ఈ మెయిల్‌ను స్పందనగా మెయిల్‌ను పంపొద్దని తమ సిబ్బందికి అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం తదితర ఏజెన్సీలు సూచించాయి. ‘‘ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులను చట్టవ్యతిరేకంగా తొలగిస్తే ఊరుకోం. కోర్టుల్లో సవాల్ చేస్తాం. అసలు కనీసం ఒక్క గంట సమయం నిజాయతీగా ప్రజాసేవ చేయని, ఎన్నికల్లో పోటీచేయని ప్రపంచకుబేరుడు మస్క్‌తో ఉద్యోగులకు విధినిర్వహణపై హితబోధ చేయించడాన్ని మించిన అవమానం మరోటి లేదు’’అని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవిరెట్ కెల్లీ అన్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడమో లేదంటే కొన్ని నెలల జీతం ముందస్తుగా ఇచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు లేఖలు రాయించుకోవడమే డోస్ చేసింది. మాజీ ఉద్యోగుల వ్యవహరాల విభాగం, రక్షణ, ఆరోగ్యం, మానవీయ సేవలు, అంతర్గత రెవిన్యూ సేవు, జాతీయవనాల విభాగం తదితర ఏజెన్సీల్లోని చాలా మంది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులపై వేటువేసిన సంగతి విదితమే. ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడమే లక్ష్యంగా డోజ్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. -
అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్‌కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు. సీఈపీపీఎస్కు 48 కోట్ల డాలర్లు ‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్‌కు భారత్‌కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్‌ను వినియోగించాలని బంగ్లాదేశ్‌లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. -
కొత్త మలుపు తీసుకున్న యూఎస్ఎయిడ్ వివాదం
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా నుంచి యూఎస్ఎయిడ్ తరఫున 2.1 కోట్ల డాలర్ల నిధులు వచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ ప్రభుత్వం కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023–24 ఆర్థికసంవత్సరంలో భారత్‌లో ఏడు ప్రాజెక్టుల కోసం యూఎస్ఎయిడ్ 75 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చిందని భారత ఆర్థికశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ మొత్తంగా 75 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారత ప్రభుత్వ భాగస్వామ్యంలో యూఎస్ఎయిడ్ చేపట్టింది. అందులో 2023–24 కాలంలో 9.7 కోట్ల డాలర్లను ఖర్చుచేశారు. ఇందులో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ లేదు. వ్యవసాయం, ఆహార భద్రత, నీరు, శుభ్రత(వాష్ ప్రోగ్రామ్), పునరుత్పాదక ఇంధనం, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, సుస్థిర అడవులు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఇంధన సమర్థ వినియోగ సాంకేతికలను అందుబాటులోకి తేవడం, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి’’ అని వార్షిక నివేదిక పేర్కొంది. 1951 ఏడాదిలో మొదలైన ద్వైపాక్షిక అభివృద్ధి సాయంలో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటిదాకా 555కుపైగా ప్రాజెక్టుల్లో ఏకంగా 17 బిలియన్ డాలర్ల సాయం అందించిందని వార్షిక నివేదిక పేర్కొంది. ద్వైపాక్షిక నిధుల వ్యవహారాలను చూసే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థికవ్యవహారాల విభాగం సైతం ఈ వివరాలను వెల్లడించింది. -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈసారి ఎంతమందంటే?
అమెరికాలో అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 12మంది భారతీయుల్ని ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి తరలించినట్లు అధికారులు ప్రకటించారు.అమెరికాలో భారతీయ అక్రమ వలసదారులను ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో 12మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించింది. వారిని ఈ రోజు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో వలస దారుల్ని ఢిల్లీకి తీసుకువచ్చింది. వారిని పనామా నుంచి భారత్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారుల్లో పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో ఉద్యోగులకు మస్క్ బిగ్ షాక్..!
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్ ఇలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మేరకు మస్క్ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్(ట్విటర్)లో ఒక షాకింగ్ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు. Consistent with President @realDonaldTrump’s instructions, all federal employees will shortly receive an email requesting to understand what they got done last week.Failure to respond will be taken as a resignation.— Elon Musk (@elonmusk) February 22, 2025 మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మస్క్ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్ తగలడం గమనార్హం. అయితే మస్క్ మెయిళ్లపై ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. -
ఈవిడ... పాస్‌పోర్ట్‌లో ‘అతను’
వాషింగ్టన్: జన్మత: అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ప్రముఖ హెచ్‌బీవో ‘యుఫోరియా’సిరీస్ నటి హంటర్ షాఫెర్ అమెరికా నూతన ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పాస్‌పోర్ట్‌లో తన పేరుకు ముందు అబ్బాయి అని పేర్కొనడాన్ని నటి తీవ్రంగా తప్పుబట్టారు. 1998లో జన్మించిన హంటర్ 2019 ఏడాదిలో శస్త్రచికిత్స తర్వాత అమ్మాయిగా మారారు. ఆనాటి పాస్‌పోర్ట్‌లో అమ్మాయి అనే ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లోనూ అలాగే ఉంది. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక లెస్బియన్, గే తదితర ఎల్జీబీటీక్యూ+ లింగమార్పిడి వర్గాల కోసం ప్రత్యేకంగా ‘ఎక్స్’వంటి పదాలను ఉపయోగించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్జీబీటీక్యూ+ వర్గాల వ్యక్తులను అమ్మాయి లేదా అబ్బాయిగా మాత్రమే ప్రభుత్వం పరిగణిస్తుంది. పుట్టినప్పటికి స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. దీంతో హంటర్ కొత్త పాస్‌పోర్ట్‌లో అబ్బాయి అని వచ్చింది. దీనిపై హంటర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘విదేశాల్లో సినిమా షూటింగ్ వేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా. దాంతో కొత్తగా దరఖాస్తు చేస్తే అబ్బాయి అని పేర్కొంటూ కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారు. మారిన వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం పట్టించుకోదా?. ప్రజాస్వామ్య అమెరికాలో పౌరుల హక్కులకు విలువ లేదా?. అబ్బాయి అని పేర్కొనడంతో నాకెన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాల్లో ‘అబ్బాయి’అని ఉంటే విమానాశ్రయాల్లో, మరెన్నో చోట్ల చాలా సమస్యలొస్తాయి’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్‌వర్క్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్‌వెల్ట్‌తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్‌లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్‌ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి. WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమBirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలుఅలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది. -
ట్రంప్‌కు పీఎం ట్రూడో కౌంటర్
ఒట్టావా:కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. మా దేశాన్ని,మా ఆటను మీరు తీసుకోలేరు’అని ట్రంప్‌కు చురకంటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెనడాపై అమెరికా టీమ్ విజయం సాధించాలని,కెనడా త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని ట్రంప్ ఒక పోస్టులో ఆకాంక్షించారు. దీనికి బదులుగా హాకీ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని ట్రంప్‌కు కౌంటర్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.You can’t take our country — and you can’t take our game.— Justin Trudeau (@JustinTrudeau) February 21, 2025అమెరికా,కెనడా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లలో గత 50 ఏళ్లలో ఎక్కువ మ్యాచ్‌లు కెనడానే గెలుపొందడం గమనార్హం.కాగా4, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత పొరుగు దేశమైన కెనడాపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. -
చరిత్రలో అతిపెద్ద మోసం.. 4 లక్షల కోట్లు ఏమయ్యాయి?
-
భగవద్గీత మీద కాశ్‌పటేల్ ప్రమాణం..ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్:అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా నియమితులైన కాశ్‌పటేల్ తన మూలాలను మర్చిపోలేదు. భారతీయులు పవిత్రంగా భావించే భగవద్గీత మీద ప్రమాణం చేసి కాశ్‌పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.వైట్‌హైజ్ క్యాంస్లోని ఓ భవనంలో శనివారం(ఫిబ్రవరి21) కాశ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాశ్ భార్యాపిల్లలు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్పై ప్రశంసలు కురిపించారు. అమెరికా సెనేట్ శుక్రవారమే కాశ్ నియామకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.గతంలో కౌంటర్ టెర్రరిజం పప్రాసిక్యూటర్గా పనిచేసిన కాశ్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడంపై డెమోకక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాశ్ స్వతంత్రంగా పనిచేస్తారన్న నమ్మకం లేదంటున్నారు.ఎఫ్‌బీఐ డైరెక్టర్లు సాధారణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. గుజరాతీలైన కాశ్‌పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. కాశ్‌పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు. -
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు. -
ఫినిక్స్‌లో సేంద్రీయ వ్యవసాయంపై నాట్స్ అవగాహన
ఫినిక్స్ : అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు వారి కోసం సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫినిక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను ఈ సదస్సులో నాట్స్ నాయకులు వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల నేలతల్లికి కూడా మేలు చేసినట్టవుతుందని ప్రముఖ పర్యావరణ ప్రేమికులు ప్రవీణ్ వర్మ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యానికి జరిగే మేలును ఆయన వివరించారు. ఇదే కార్యక్రమంలో ఇంటి ఆవరణలోనే పండించిన సేంద్రీయ ఉత్పత్తులను రైతు బజార్ తరహాలో పెట్టి విక్రయించారు. తాము ఎలా సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలు పండించింది కూడా పండించిన వారు ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన నాట్స్ ఫినిక్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలోని సెయింట్ లూయిస్ మహాత్మ గాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. స్థానికంగా ఉండే తెలుగు వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందారు. డాక్టర్లను అడిగి తమ అనారోగ్యాలకు గల కారణాలను, నివారణ మార్గాలను తెలుసుకున్నారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ నాయకులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల మధుసూదన్ దడ్డలతో పాటు పలువురు నాట్స్ వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం దిగ్విజయం చేయడంలో కృషి చేశారు. సెయింట్ లూయిస్‌లో తెలుగువారి కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించిన మిస్సోరీ చాప్టర్ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
శత్రువు దాడులకు ‘అటానమస్’ కౌంటర్..యూఎస్ కంపెనీతో ‘ఎమ్అండ్ఎం’ ఒప్పందం
ముంబయి: అత్యాధునిక భద్రతా,నిఘా సాంకేతికత అభివృద్ధి చేయడంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అండ్యూరిల్ గ్రూపుతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా(ఎమ్అండ్ఎమ్) కంపెనీ తెలిపింది. అండ్యూరిల్ గ్రూపు సహకారంతో కృత్రిమమేధ (ఏఐ) ఆధారంగా నడిచే అటానమస్ (స్వయం ప్రతిపత్తి) మారిటైమ్ సిస్టమ్స్, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్(సీయూఎస్ఎస్) సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు తయారు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.ఈ అత్యాధునిక సాంకేతికతో ప్రాంతీయ భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొంది. ఇంతేగాక మాడ్యులార్ అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్స్(ఏయూవీ)లను అభివృద్ధి చేసేందుకు అండ్యూరిల్తో కుదిరిన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎమ్ తెలిపింది. సముద్ర తీర ప్రాంత భద్రత,నిఘాకు ఏయూవీలు ఎంతగానో ఉపయోగపడతాయని,ఏయూవీలతో జలాల లోపల మోహరించే ఆయుధ సంపత్తి మరింతగా పెరుగుతుందని పేర్కొంది. ఇవే కాకుండా డ్రోన్ దాడులను గర్తించి నిర్వీర్యం చేసే సీయూఏఎస్ సాంకేతికత అభివృద్ధి కోసం రెండు కంపెనీలు పనిచేస్తాయని తెలిపింది. డ్రోన్లతో పెరిగిన వైమానక దాడుల ముప్పును అరికట్టడంలో సీయూఏఎస్ సాంకేతికత దోహద పడుతుందని వెల్లడించింది.రక్షణ నిఘా వ్యవస్థల్లో వాడే పలు రకాల సెన్సార్ సాంకేతికతలన్నింటిని కలిపి సెన్సార్ ఫ్యూజన్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు పనిచేస్తాయని ఎమ్అండ్ఎమ్ తెలిపింది.భద్రత పరంగా ముంచుకొస్తున్న ముప్పును అత్యాధునిక సాంకేతికతో ఎదుర్కొనేందుకు రెండు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎం గ్రూపు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ వినోద్ సహాయ్ తెలిపారు. ప్రస్తుతం డ్రోన్లు, మానవరహిత ఆయుధాల ద్వారా ఎదురువుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన సాంకేతిక వ్యవస్థలు ఎంతో ముఖ్యమని అండ్యూరిల్ గ్రూపు సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ గ్రెగ్ కాస్నర్ అభిప్రాయపడ్డారు. -
ఉదారతకు ట్రంప్ వీడ్కోలు!
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్‌లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్‌కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు. దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్‌కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యా లయం వెబ్సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే. అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం. 2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది. అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది. అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు. సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా? -
తనని తాను ‘రాజు’గా ప్రకటించుకున్న ట్రంప్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనని తాను రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. ట్రంప్ తాజాగా, న్యూయార్క్ నగరంలోని పాత బస్సు, మెట్రో రవాణా వ్యవస్థకు నిధులు సమకూర్చే కాంక్షన్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ (Congestion Pricing Program)ను రద్దు చేశారు. రద్దు అనంతరం, ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తనను తాను ‘రాజు’ అని ప్రకటించుకున్నారు. దీంతో ఆయన అధ్యక్షాధికారాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మరింత వివాదంవైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్రంప్ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ, టైమ్ మ్యాగజైన్ మేకప్ కవర్‌ను షేర్ చేసింది. అందులో లాంగ్ లైవ్ ద కింగ్ అనే క్యాప్షన్ జోడించడం గమనార్హం. అంతేకాదు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ ఏఐ-తయారుచేసిన ట్రంప్ రాజరిక చిత్రం పోస్ట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. "CONGESTION PRICING IS DEAD. Manhattan, and all of New York, is SAVED. LONG LIVE THE KING!" –President Donald J. Trump pic.twitter.com/IMr4tq0sMB— The White House (@WhiteHouse) February 19, 2025న్యూయార్క్ గవర్నర్ వార్నింగ్ ట్రంప్ రాజు ప్రకటనపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తీవ్రంగా స్పందించారు. మేం రాజుల పాలనలో లేం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కోర్టులో కలుసుకుందాం’ అంటూ ఘాటుగా స్పందించారు.అధ్యక్ష అధికార దుర్వినియోగమా? ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీ, ఇతర ఫెడరల్ అధికారులపై కేసు నమోదు చేసింది. ట్రంప్ ప్రభుత్వం న్యూయార్క్ ట్రాన్స్పోర్ట్ టోల్ ప్రోగ్రామ్ రద్దు చేయాలని ప్రయత్నించడం అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శంకర నేత్రాలయ యూఎస్ఏ బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్‌రెడ్డి కాటంరెడ్డితో మీట్ అండ్ గ్రీట్
శంకర నేత్రాలయ USA (SN USA) అట్లాంటాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఈ నెల 15న ఘనంగా జరిగింది. కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU)ను స్థాపించడానికి ప్రసాద రెడ్డి కాటంరెడ్డి రూ.500,000 విరాళం ఇచ్చినందుకు మరియు 11 అడాప్ట్-ఎ-విలేజ్ ప్రోగ్రామ్‌లను స్పాన్సర్ చేసినందుకు ఆయనను గుర్తించి గౌరవించింది. MESU అనేది చక్రాలపై నడిచే ఆసుపత్రి, ఇది 500 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కవర్ చేస్తుంది. ప్రతి MESUలో రెండు బస్సులు ఉంటాయి. ఈ బస్సులు మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రంలోనే శస్త్రచికిత్సలు చేస్తాయి. ఒక బస్సును సన్నాహక యూనిట్‌గా, మరొక బస్సును ఆపరేటింగ్ థియేటర్‌గా ఉపయోగిస్తారు.శంకర నేత్రాలయ USA ప్రసాద రెడ్డి కాటంరెడ్డిని SN USA బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి, ఆయనకు అభినందనలు తెలిపారు. అట్లాంటా హిందూ దేవాలయం పూజారి శ్రీనివాస్ శర్మ పవిత్ర మంత్రాలతో సత్కరించారు. అట్లాంటాలోని ప్రఖ్యాత శాస్త్రీయ గాయకులు, యువ ప్రతిభావంతులైన విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో వేదికను అలంకరించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి గాయకుడు శివునిపై రెండు శాస్త్రీయ గీతాలను పాడారు. ఈవెంట్ హాల్ భక్తితో నిండిపోయింది. అందరూ గాయకులను వారి పాటలకు ప్రశంసించారు. శివుని వైబ్‌లను సృష్టించిన గాయకులు ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, శ్రీనివాస్ దుర్గం, సందీప్ కౌతా, దుర్గా గోరా, శ్రీవల్లి శ్రీధర్, శిల్పా ఉప్పులూరి, ఉషా మోచెర్ల మరియు జనార్ధన్ పన్నెల. ఇది SN USA వర్చువల్ ప్రోగ్రామ్‌ల ద్వారా అనేక ఉపగ్రహ అధ్యాయాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయడానికి దోహదపడిన అన్ని అకాడమీలు, గురువులు మరియు విద్యార్థులకు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సాయంత్రం కళకు మాత్రమే కాకుండా సమాజం మరియు దాతృత్వ స్ఫూర్తికి కూడా ఒక వేడుకగా నిలిచింది, ప్రతి గాయకుడు మరియు స్వచ్ఛంద సేవకుడు అవసరమైన వారికి నిధులు సేకరించడంలో కీలక పాత్ర పోషించారు.సాయంత్రం అంతా, SN USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి దార్శనికతకు అందరూ తమ హృదయపూర్వక ప్రశంసలను వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో, పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే గొప్ప లక్ష్యం కోసం గణనీయమైన నిధులు మరియు అవగాహన సేకరించబడ్డాయి. ముందు నుండి నాయకత్వం వహించడంలో మరియు ఈ మిషన్‌లో చేరడానికి ఇతరులను ప్రేరేపించడంలో బాలా అవిశ్రాంత కృషిని చాలా మంది ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి SN USA కోశాధికారి మూర్తి రేకపల్లి బాల ఇందూర్తితో కలిసి అవిశ్రాంతంగా పనిచేశారు.ట్రస్టీలు శ్రీని వంగిమళ్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నముదూరి, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ రమేష్ చాపరాల, ఎంఈఎస్‌యూ కమిటీ స్థాపన చైర్ డాక్టర్ కిషోర్‌రెడ్డి రసమల్లు, అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తద్దర్‌కమిటీ సభ్యులు రాజేష్ తద్దర్‌కమిటీ సభ్యులు షరతులు లేని మద్దతు లభించింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని వేములమాడ, శ్రీధర్ జూలపల్లి, పద్మజ కేలం, యూత్ కమిటీ సభ్యులు అంష్ గడ్డమణుగు, చరిత్ర జూలపల్లి. భోజన, వేదిక ఏర్పాట్లను మెహర్ చంద్ లంక, నీలిమ గడ్డమణుగులు నిర్వహించారు. డల్లాస్ TX నుండి డాక్టర్ రెడ్డి ఉరిమిండి (NRU) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరియు అతను జూన్ 28, 2025న డల్లాస్ TXలో నిర్వహించాలనుకుంటున్న SN ఈవెంట్ కోసం అట్లాంటా కమ్యూనిటీని ఆహ్వానించారు.ముందస్తు కట్టుబాట్ల కారణంగా, గౌరవనీయులైన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా రమేష్ బాబు లక్ష్మణన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ, అతను ఫిబ్రవరి 17, 2025 సోమవారం నాడు తన కార్యాలయంలో SN USA బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద రెడ్డి కాటంరెడ్డి మరియు SN USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తిని కలవడానికి సమయం కేటాయించాడు మరియు భారతదేశంలోని వేలాది మందికి సహాయపడే భారీ విరాళానికి కృతజ్ఞతలు తెలిపాడు.గత 15 సంవత్సరాలుగా రెండు MESU బృందాలు పనిచేస్తున్నాయి. ఒకటి చెన్నైలో 2011 నుండి సేవలందిస్తోంది. టాటా ట్రస్ట్ సహాయంతో 2వ MESU 2016 నుండి జార్ఖండ్‌లో ఉంది. ఇటీవల, శంకర నేత్రాలయ హైదరాబాద్‌లో 3వ MESUను ప్రారంభించింది, ఇది 2024 నుండి సేవలందిస్తోంది. హైదరాబాద్ ఆధారిత యూనిట్‌తో, శంకర నేత్రాలయ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 18 అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది, వేలాది మంది రోగుల దృష్టిని పునరుద్ధరిస్తోంది. ప్రతి శిబిరం 10 రోజుల పాటు నడుస్తుంది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రాంతాలకు సేవలందించడానికి 4వ యూనిట్ మార్చి 2025లో పుట్టపర్తిలో ప్రారంభమవుతుంది. ప్రతి యూనిట్ దాని మూల స్థానం నుండి 500 కి.మీ వ్యాసార్థంలో ఉన్న ప్రాంతానికి సేవలు అందిస్తుంది. ఈ యూనిట్లు దాదాపు 1/3 వంతు భారతీయ గ్రామీణ గ్రామాలను కవర్ చేస్తాయి. SN USA వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు ఎమెరిటస్ SV ఆచార్య, మరియు సలహాదారుల బోర్డు, ట్రస్టీల బోర్డు మరియు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.SN USA అధ్యక్షుడు బాల ఇందుర్తి రాబోయే MESU ప్రాజెక్టుల గురించి, అవి ఎంత ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి మరియు వివిధ నగరాల్లో నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భారతదేశం నుండి నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించడానికి ట్రస్టీలు మరియు వాలంటీర్లు అవిశ్రాంతంగా ఎలా కృషి చేస్తున్నారో వివరించారు. పేద రోగులకు దృష్టిని పునరుద్ధరించడానికి SN USA చేసిన కృషికి ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు లభించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి లెక్కలేనన్ని గంటలు వెచ్చించిన SN USA అట్లాంటా బృందం - మూర్తి రేకపల్లి, నీలిమా గడ్డమనుగు, మెహర్ లంక, శ్రీని రెడ్డి వంగిమల్ల, ఉపేంద్ర రాచుపల్లి, డాక్టర్ మాధురి నముదూరి, రాజశేఖర్ ఐల, సురేష్ వేములమడ, శ్రీధర్ రావు జులపల్లి, రాజేష్ తడికమల్ల, రమేష్ చాపరాల మరియు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు - ప్రత్యేక ధన్యవాదాలు.అట్లాంటా గాయకులు ఫణి డొక్కా (సినిమా దర్శకుడు), రామ్ దుర్వాసుల, శ్రీనివాస్ దుర్గం, సందీప్ కౌతా, దుర్గా గోరా, శ్రీవల్లి శ్రీధర్, శిల్పా ఉప్పులూరి (MC), ఉషా మోచెర్ల, మరియు శాంతి మేడిచెర్లను వర్చువల్ టీవీ ప్రోగ్రామ్‌లకు అందించడంలో తమ నిరంతర మద్దతు కోసం SN USA బృందం సత్కరించింది. SN USA అద్భుతమైన DJ కోసం శ్రీనివాస్ దుర్గం మరియు అతని వీడియో మరియు ఫోటోగ్రఫీ కోసం వెంకట్ కుత్తువాను సత్కరించింది.ఈ మొత్తం కార్యక్రమం ఆదివారాల్లో ప్రధాన స్రవంతి టీవీ ఛానెళ్లలో రెండు భాగాలుగా ప్రసారం అవుతుంది - (పార్ట్ 1) ఫిబ్రవరి 23వ తేదీ మరియు (పార్ట్ 2) మార్చి 2వ తేదీ 2025. 1978లో ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 20 లక్షల మంది రోగుల దృష్టిని పునరుద్ధరించడం ద్వారా శంకర నేత్రాలయ దేశానికి చేసిన సేవను SN USA ట్రెజరర్ మూర్తి రేకపల్లి వివరించారు. రెండు అంశాలను ఆయన హైలైట్ చేశారు.ప్రతి 3వ అంధుడు భారతీయుడు, అయితే భారతదేశ మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 1/6వ వంతు మంది ఉన్నారు & భారతదేశంలో 65% అంధత్వం నయం చేయగలది (కంటిశుక్లం & వక్రీభవన లోపాలు). భారతదేశం నుండి నివారించగల అంధత్వాన్ని నిర్మూలించడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కంటిశుక్లం శస్త్రచికిత్సకు $65 స్పాన్సర్ చేయవచ్చు మరియు పేద రోగికి సహాయం చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని లాజిస్టిక్‌లను జాగ్రత్తగా చూసుకున్నందుకు EVP శ్యామ్ అప్పాలి మరియు కార్యదర్శి వంశీ ఎరువరం, త్యాగరాజన్, దీన దయాలన్‌లకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘం నాయకులు, MESU దత్తత-ఎ-విలేజ్ స్పాన్సర్లు పాల్గొని శంకర నేత్రాలయ కంటి శిబిరాల గురించి వారి అనుభవాలను పంచుకున్నారు -
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్‌సర్‌లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
Millionaire Bryan Johnson: డైట్లో గరం మసాలా, స్టీల్ డబ్బాల్లో..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత తనపై చేసుకుంటున్న ప్రయోగాలు ఫలితాల గురించి కూడా నెటిజన్లతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటారు. వాటిలో కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. అయితే బ్రయాన్ తన డైట్లో భారత ఆహార పదార్థాల గొప్పతనం వాటి ప్రయోజనాల గురించి గతంలో షేర్ చేసుకున్నారు. తాజాగా భారతీయులు కూరలకు సువాసనతో కూడిన ఘమఘమలు అందించేందుకు ఉపయోగించే గరం మసాలాని కూడా తన డైట్లో చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు. తరుచుగా మన ముంబైలో గాలి నాణ్యత బాగాలేదని ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందంటూ విచారం వ్యక్తం చేసే బ్రయాన్ మన భారతీయ వంటకాల గొప్పదనాన్ని మాత్రం మెచ్చుకుంటూనే ఉంటారు. వాటిలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు కూడా. కానీ ఈసారి బ్రయాన్ మన భారతీయులు ప్రయాణాల్లో ఉపయోగించే టిఫిన్ డబ్బాల్లోనే ఆహారం నిల్వ చేయడం విశేషం. అలాగే భారతీయులు ఉపయోగించే గరం మసాలను కాల్చిన యాపిల్, క్యారెట్లతో కూడిన బటర నట్ స్క్వాష్ సూప్‌లో ఉపయోగించినట్లు వెల్లడించారు. ఇక ఆ రెసిపీ తయారీ విధానాన్నికూడా సవివరంగా వెల్లడించారు. అలాగే తన సూపర్‌ఫుడ్ స్మూతీ బ్లాక్‌బీన్ అండ్ మష్రూమ్ బౌల్ విత్ చిక్పీ రైస్‌లో ఏమి జోడించి తింటారో కూడా తెలిపారు. వీటితోపాటు మెటల్ కంటైనర్లలో(స్టీల్ డబ్బాల్లో) నిల్వ చేసిన తన ఫుడ్ ఫోటోలను కూడా షేర్ చేశారు. అవి చూడగానే భారతీయుల మాదిరిగా స్టీడబ్బాలు, టిఫిన్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన అందరికి ఆరోగ్యంపై స్ప్రుహ కలుగుతోందని, అందువల్లే ఫాస్ట్‌ఫుడ్ నుంచి ఆరోగ్యకరమైన భారతీయ ఆహార విధానాల వైపు దృష్టిపెడుతున్నారంటూ పెట్టిన పోస్టు నెటిజన్లందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదీ ఏమైన వృద్ధాప్యాన్ని తరిమికొట్టే ప్రయోగాలకు పేరుగాంచిన బ్రయాన్ జాన్సన్ సైతం మన భారతీయులు ఆహార సంస్కృతిని గౌరవించడం, వాటి ప్రయోజనాల గురించి ఆయన నోట వినడం చూస్తుంటే మన పెద్దలు ఆనాడే ఆరోగ్యం పట్ల ఎంత జాగుకరతతో వ్యవహరించారో అనిపిస్తోంది కదూ. ఇప్పటిది కాదు ఆరోగ్య స్ప్రుహ ఆనాడే మన పూర్వీకులు దానిపై దృష్టిపెట్లి మనకు ఔషధ గుణాలు కలిగిన వాటిని పరిచయం చేసి ఉపయోగించేలా చేశారు కదూ..!. What I'm eating for the next few days: Blueprint Superfood Smoothie •½ cup strawberries•½ cup blueberries•¼ cup pomegranate arils•½ cup dark cherries, pitted•1 cup almond milk•1 tablespoon flax seeds•5-6 macadamia nuts•1 teaspoon chia seeds•1 teaspoon… pic.twitter.com/YWfX1zR6hc— Bryan Johnson /dd (@bryan_johnson) February 18, 2025 (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
బైడెన్.. ఎవరిని గెలిపించేందుకు భారత్‌కు డబ్బులిచ్చారు?: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాజీ అధ్యక్షుడు జో బైడెన్, భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతం కోసం 21 మిలియన్ డాలర్లను అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు. ఎవరినో గెలిపించేందుకే బైడెన్ ఇలా చేశారని ఆరోపించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తాజాగా మియామీలో ఓ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి?. భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. ఎవరి కోసం బైడెన్ డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే కీలక ముందడుగు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా డబ్బులు ఎందుకు?. 21 మిలియన్ డాలర్లు ఇవ్వడమేంటి?. భారత్ వద్దే చాలా సొమ్ము ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని మోదీ పట్ల చాలా గౌరవం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "... Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government... This is a total… pic.twitter.com/oxmk6268oW— ANI (@ANI) February 20, 2025 -
అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో రెండు చిన్న విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం రన్‌వే-12పై విమానాలు సెస్నా 172S, లాంకైర్ 360 MK II ఢీకొన్నట్టు జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది. ఈ రెండు విమానాలు ఫిక్స్డ్-వింగ్, సింగిల్ ఇంజిన్ విమానాలని పేర్కొంది. ఈ ఘటనలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. BREAKING: Another American Plane Crash under the Trump administration today in Arizona. What’s going on?We’ve had at least 9 plane crashes since Trump took office. Do you think this has anything to do with him firing many valuable FAA workers?Repeat after me:1/29 –… pic.twitter.com/jtXo5LfgdB— Ed Krassenstein (@EdKrassen) February 19, 2025ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. విమాన ప్రమాదాల కారణంగా వందల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 30న అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం, జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణీకులు మరణించారు. -
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్‌కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్‌లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్‌లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్‌ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్‌ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్‌పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్‌లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్‌కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్‌లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక్క దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్నాచితక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచచ్చిపోతున్నాయి.ఏంచేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్‌లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది, ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93 శాతం పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.సౌత్ మెంఫిస్ వాల్ మార్ట్ నుంచి నూడుల్స్, ఇతర ప్యాకెట్లను దొంగిలించినందుకు అష్లే క్రాస్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 37 ఏళ్ల క్రాస్ చిన్నాచితక దొంగతనాల్లో పెద్ద పేరు తెచ్చుకుంది. అష్లే క్రాస్‌ను మల్టీనేషనల్ రిటైల్ స్టోర్ వాల్‌మార్ట్ ‘అథరైజేషన్ ఆఫ్ ఏజెన్సీ’ జాబితాలో చేర్చింది. అమెరికాలోని ఏ వాల్ మార్ట్లోకీ అడుగు పెట్టకుండా ఆమెను నిషేధించారు.‘మేము మా కస్టమర్లకు విలువ ఇస్తాం. వారు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. అరుదుగా అయినప్పటికీ కొందరిని స్టోర్లలోకి స్వాగతించని సందర్భాలు ఉన్నాయి’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది? -
‘రాజకీయ కారణాలతోనే బైడెన్ వారిని వదిలేశారు’
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఆయన సన్నిహితుడు ఇలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాల వల్లే సునీతా విలియమ్స్,విల్మోర్లను బైడెన్ అంతరిక్షంలో వదిలేశారని చెప్పారు. మంగళవారం(ఫిబ్రవరి 18)ట్రంప్, మస్క్ సంయుక్తంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడి ఆదేశాల మేరకు వ్యోమగాములిద్దరిని నాలుగు వారాల్లో భూమికి తీసుకువస్తామని మస్క్ తెలిపారు. గతంలో చాలా మంది వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన చరిత్ర తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీకి ఉందన్నారు. ఇంతలో ట్రంప్ జోక్యం చేసుకుని వారిని త్వరగా తీసుకు రావాలని మస్క్‌ను కోరారు. గతంలో బైడెన్ వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ‘స్పేస్ ఎక్స్’కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని ట్రంప్ చెప్పారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి(ఐఎస్ఎస్) 10 రోజుల కోసం వెళ్లిన సునీత,విల్మోర్లు బోయింగ్ వ్యోమనౌకలో సమస్యల వల్ల ఇప్పటికీ భూమికి తిరిగి రాలేదు. వీరిని మార్చి మొదటి వారంలో మస్క్‌కు చెందిన స్పేస్ క్స్ క్రూ డ్రాగన్ భూమికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు!
శాన్‌జోస్: భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రానున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది.ఈ సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ..‘భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం’ అని తెలిపారు. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతీయులను స్వదేశానికి పంపించింది. ఇదిలా ఉండగా.. పనామా హోటల్లో భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులు ఉన్నారు. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. Costa Rica Will Take Central Asian and Indian Migrants Deported by U.S.Costa Rica is the second Central American nation to accept migrants from distant countries as the Trump administration ramps up deportation flights. pic.twitter.com/AhCqKhiOIt— Deportation Counter (@DeportedNumber) February 18, 2025 -
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్‌తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. -
‘ఈసీ’కి అమెరికా సాయం..? మాజీ ‘సీఈసీ’ ఫైర్
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అమెరికా నిధులిచ్చిందనే విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా ఇచ్చే 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.‘భారత్‌లో ఓటర్ టర్నౌట్ విషయంలో సాయం కోసం తాను సీఈసీగా ఉండగా ఎన్నికల కమిషన్ అమెరికాతో ఒప్పందం కుదర్చుకుందనడంలో కొంచెం కూడా నిజం లేదు.నేను 2012లో సీఈసీగా ఉన్నపుడు ఐఎఫ్‌ఈస్‌తో మాత్రమే సిబ్బంది శిక్షణ కోసం ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందంలో ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రస్తావన లేనే లేదు.ఆర్థిక,న్యాయపరమైన బాధ్యతలేవీ ఉండవని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నాం’అని ఖురేషి తెలిపారు. భారత్‌లో ఓటర్ టర్నౌట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల సాయాన్ని మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఇప్పటికే ప్రకటించింది.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ సలహాదారు సంజీవ్ సన్యాల్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అమెరికా సాయం అనేది అతి పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. -
అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షంతో పాటుగా భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు.)అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.Floodwaters are creeping toward homes as heavy rain triggers dangerous flash flooding across the south-central U.S., including Kentucky, West Virginia, Virginia, and Tennessee. pic.twitter.com/4PY8tAMLvg— AccuWeather (@accuweather) February 16, 2025అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. వర్జీనియా(#Virginia), పశ్చిమ వర్జీనియా, టేనస్సీలో కూడా వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.Parts of West Virginia, Virginia, Kentucky, Arkansas, and Tennessee are experiencing severe flooding. I wonder what they think about Donald Trump wanting to get rid of FEMA right about now? pic.twitter.com/VLts0ltv5s— Art Candee 🍿🥤 (@ArtCandee) February 16, 2025మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. Amerika'yı fırtına vurdu!ABD’nin Tennessee, Kentucky, Virginia ve Georgia eyaletlerinde meydana gelen fırtına ve selde, ilk belirlemelere göre 9 kişi hayatını kaybetti. pic.twitter.com/vSe020el2I— 23 Derece (@yirmiucderece) February 17, 2025 #BREAKING: Powerful overnight storm leaves at least 9 dead in Kentucky & Georgia, officials say#tnwx #Georgia #Floods #Tornado #Tennessee#Kentucky #Virginia pic.twitter.com/by2i750f1o— JUST IN | World (@justinbroadcast) February 16, 2025 -
అమెరికా అమ్మాయి వెడ్స్.. తెలంగాణ అబ్బాయి
-
గుడ్డుకు గడ్డురోజులొచ్చే
-
వలసదారులతో అమృత్ సర్ కు చేరుకున్న మూడో విమానం
-
సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు
హోషియార్పూర్/పటియాలా/చండీగఢ్: అమెరికా తిప్పి పంపిన రెండో విమానంలోనూ భారతీయ వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. చేతులకు సంకెళ్లు.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. 116 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు మినహా అందరిదీ ఇదే పరిస్థితి. మరోవైపు వలసదారుల్లోని సిక్కులు తలపాగా ధరించడానికి అమెరికా అనుమతించకపోవడాన్ని ఎస్జీపీసీ ఖండించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వలసదారులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం రాత్రే అరెస్టు చేశారు. సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లు 2023లో నమోదైన ఒక హత్య కేసులో నిందితులని పోలీసులు ధ్రువీకరించారు. వలసదారుల్లో సిక్కులను తలపాగా ధరించడానికి కూడా అనుమతించకపోవడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని విదేశాంగ శాఖను కోరారు. రెండేళ్ల నరకం... శనివారం వచ్చిన వలసదారుల్లో పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ది విషాద గాధ. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లాలనుకున్న దల్జీత్ ఏజెంట్ రెండేండ్ల పాటు నరకం చూపారు. గ్రామంలోని ఓ వ్యక్తి దల్జీత్‌కు 2022లో ట్రావెల్ ఏజెంట్‌ను పరిచయం చేయగా.. ఆయనకు రూ.65 లక్షలు చెల్లించారు. అవి తీసుకున్న ఏజెంట్ 2022లో దల్జీత్‌ను మొదట దుబాయ్‌కు పంపారు. 18 నెలలు అక్కడున్న తరువాత.. ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత అతన్ని అమెరికా పంపుతానని చెప్పి.. దక్షిణాఫ్రికాకు పంపించారు. అక్కడ నాలుగున్నర నెలలున్నారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 26న డంకీ మార్గం ద్వారా అమెరికా వెళ్లేందుకు ముంబై నుంచి బ్రెజిల్‌కు పంపించారు. బ్రెజిల్లో దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత మూడు రోజులపాటు కాలినడక, ట్యాక్సీ, వివిధ మార్గాల ద్వారా పనామా దాటించారు. చివరకు మెక్సికోకు చేరుకున్న దల్జీత్ అక్కడా నెలరోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్ ఏజెంట్ దల్జీత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. అమెరికాకు పంపాలంటే.. వారి కుటుంబానికున్న నాలుగున్నర ఎకరాల భూమి యాజమాన్యాన్ని తనకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చారు. బదిలీ చేసిన తరువాత జనవరి 27న దల్జీత్‌ను యూఎస్‌లోకి పంపించేశారు. అక్కడ అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. బయటకు కూడా రానివ్వకుండా గదిలో బంధించారు. ఆహారంగా నీళ్లబాటిల్, చిప్స్ ప్యాకెట్, ఆపిల్ ఇచ్చారు. రెండో విమానంలో తిరిగి భారత్‌కు పంపించారు. -
అమెరికాలో వరదలు
లూయిస్విల్లే: ప్రకృతి వైపరీత్యాలు అమెరి కాను వణికిస్తున్నాయి. ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలా కుతలం చేస్తుండగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. కెంటకీలోని క్లే కౌంటీలో సంభవించిన వరదల్లో శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద హెచ్చరికల నేపథ్యంలో జాక్సన్లోని కెంటకీ రివర్ మెడికల్ సెంటర్‌ను మూసివేశారు. కెంటకీలో నివాస భవనాలు, కార్లు వరదల్లో చిక్కుకుపోగా వర్జీనియాలోని రోడ్లను బురద కమ్మేసింది. టెన్నెస్సీ, అర్కా న్సాస్లోనూ అధికారులు వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూఇంగ్లండ్, న్యూయార్క్‌ల్లో చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. నెబ్రస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. మొంటానా, డకోటా, మిన్నెసోటాల్లో మైనస్ 51 డిగ్రీల వరకు పడిపోయతాయని అధికారులు చెప్పారు. -
భారత్‌కు 2.1 కోట్ల డాలర్ల... ఎన్నికల నిధులు ఆపేశాం
వాషింగ్టన్: విదేశీ నిధులకు కత్తెర వేసే చర్యల్లో భాగంగా భారత్‌కు అందజేస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు కోట్లాది డాలర్ల ఎన్నికల నిధులిచ్చే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ఆదివారం ప్రకటించింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేస్తున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్థిక వనరుల వృథాకు ముకుతాడు వేసేందుకు డోజ్‌ను అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తెలిసిందే. ‘‘భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి 2.1 కోట్ల డాలర్ల చొప్పున ప్రత్యేకిస్తూ వస్తున్నాం. ఇకపై ఆ ఫండింగ్‌ను నిలిపేస్తున్నాం’’ అని డోజ్ వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో భేటీ అయిన మూడు రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే భారత్‌కు ఇస్తున్నట్టు చెబుతున్న ఈ 2.1 కోట్ల డాలర్లను ఎప్పటినుంచి, ఎంత తరచుగా, ఎవరికి అందజేస్తూ వస్తోందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వ్యవహారంపై బీజేపీ తక్షణం స్పందించింది. ఇది కచ్చితంగా భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమేనంటూ దుయ్యబట్టింది. ‘‘ఓటింగ్ పెంచడానికి 2.1 కోట్ల డాలర్లా? దీని వల్ల ఎవరికి లాభం చేకూరుతూ వస్తున్నట్టు? కచ్చితంగా అధికార పారీ్టకైతే కాదు!’’ అంటూ పార్టీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నిధులను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే పొందిందని ఆరోపించారు. ‘‘2012లో నాటి ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.వై.ఖురేషి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తాలూకు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్‌తో ఒప్పందం చేసుకుంది. అలా మన ఎన్నికల వ్యవస్థను విదేశాలకు అప్పగించడానికి కూడా వెనకాడలేదు! ఇప్పుడు వాళ్లే సీఈసీ నియామకంలో పారదర్శకత లేదని గగ్గోలు పెడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ఈసీ వంటి సంస్థల్లోకి చొప్పించేందుకు యూపీఏ వీలు కల్పించిందని డోజ్ ప్రకటనతో స్పష్టమవుతోందన్నారు. బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 2.9 కోట్ల డాలర్లను కూడా నిలిపేస్తున్నట్టు డోజ్ పేర్కొంది. మరో 15 పై చిలుకు దేశాలకు ఇస్తున్న నిధులకూ మంగళం పాడుతున్నట్టు తెలిపింది. -
మోదీ-ట్రంప్ భేటీ తర్వాతే భారత్‌కు అమెరికా భారీ షాక్!
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన అలా ముగించి ఇలా వచ్చారో లేదో.. భారత్‌కు ట్రంప్ భారీ షాకిచ్చారు. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOSE) శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నిర్వహిస్తున్నారు. ఎలోన్ మస్క్ సూచన మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ గతవారం అమెరికాలో పర్యటించారు. పర్యటన సమయంలో ఇద్దరు నేతలు అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేసేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేటాయించే 21 మిలియన్ల డాలర్లను, బంగ్లాదేశ్ రాజకీయాల్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 29 మిలియన్ల డాలర్ల మొత్తాన్ని తగ్గించాలని అమెరికా నిర్ణయించినట్లు ఎలోన్ మస్క్ ప్రభుత్వ సామర్థ్య విభాగం డోజ్ ఆదివారం ప్రకటించింది. ఇదే విషయాన్ని డోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్‌ని ప్రధాని మోదీని కలిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం.మరోవైపు బంగ్లాదేశ్‌లో, రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పాలనను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అమెరికా ఆదేశానికి 29 మిలియన్ డాలర్లను కేటాయిస్తుండేది. తాజాగా ఆ నిధుల కేటాయింపుల్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించడంతో దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నప్పటికీ, రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వం తన విదేశాంగ విధాన వ్యూహాల్లో భాగంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం, పాలన కార్యక్రమాలకు తరచుగా నిధులు సమకూరుస్తుంది. అలా భారత్‌లో ఓటింగ్ శాతం పెరగడానికి డబ్బు ఖర్చు చేస్తుంది. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాల్ని ప్రోత్సహించడం ద్వారా చైనా వంటి దేశాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. -
ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలను మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్ళు అమ్మకానికి ఉంచినట్లు.. ఒక ఎక్స్ యూజర్ పేర్కొంటూ.. ''ఎలుకలు పారిపోతున్నాయి” అని అన్నారు. నగరవాసులు తమ వస్తువులను సర్దుకుని.. సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని అన్నారు.4,271 houses put up for sale in just the last 14 days in Washington, D.C. The rats are running away. 🇺🇸 pic.twitter.com/Ra5Gq21RBJ— Joseph 💎✌️🪑🇺🇸 Tesla Long Term Investor (@ShrimpTeslaLong) February 15, 2025వలసలకు కారణం.. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అని చెబుతున్నారు. నగరంలో, ఆ చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫోటోలను కూడా షేర్ చేశారు. నగరంలో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని.. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ప్లేస్ అయిన 'జిల్లో'లో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో ఎక్స్ యూజర్ షేర్ చేసాడు. ఏడు రోజులలో 201, 14 రోజులలో 378, 30 రోజులలో 706, 90 రోజులలో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసాడు.Zillow Washington DC new home listings:•7 days: 201 new homes•14 days: 378 new homes•30 days: 706 new homes•90 days: 1,198 new homesIs this volume typical for the season? pic.twitter.com/KbGh3VOWhS— Architectoid (@Architectoids) February 15, 2025 -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. న్యాయమూర్తులను తొలగిస్తూ..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. అంతకు ముందు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను నోటీసు లేకుండా తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ తెలిపారు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు. ‘తన దేశాన్ని కాపాడుకునే వారు ఎన్నటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించరూ’ అంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల జారీఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం,పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు,ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం, అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ఇలా మెరుపు వేగంతో పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వరుస వ్యాజ్యాలుఅయితే, వాటిల్లో అక్రమ వలసలపై కొనసాగుతున్న కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో పనిచేయకుండా నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడం అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా పలువురు ట్రంప్ నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిల్లో, అక్రమ వలసలపై అణిచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేసే ఏడు వ్యాజ్యాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్‌పై పలు కేసులు నమోదయ్యాయని అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నెపోలియన్‌ను ప్రస్తావిస్తూఈ వరుస పరిణామలపై ట్రంప్ స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడు అని ట్రూత్ సోషల్ యాప్‌లో పోస్ట్ చేసారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు 1804లో నెపోలియన్ కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించిన ఫ్రెంచ్ సైనిక నాయకుడి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ, ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్‌ను వినిపించేవారు. కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని ట్రంప్ చెబుతుండగా, ఆయన సలహాదారులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దాడి చేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం ట్వీట్ చేశారు. -
భారత్‌కు 116 మంది అక్రమ వలసదారుల రాక.. ఏ రాష్ట్రం వారు ఎక్కువగా ఉన్నారంటే?
అమృత్సర్: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండయింది. రాత్రి 10 గంటలకు రావాల్సిన ఈ విమానం ఆలస్యమైంది. ఈ విమానంలో 119 మంది వలసదారులను పంపుతామని అమెరికా అధికారులు ప్రకటించినా, 116 మంది మాత్రం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా 18–30 ఏళ్ల మధ్య వారేనని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి మొదటి విడతలో ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రావడం తెలిసిందే. #WATCH | Punjab | The second batch of illegal Indian immigrants who were deported from the US and brought to Amritsar today are now being sent to their respective states. Visuals from outside of the Amritsar airport pic.twitter.com/T3MLtrmAVO— ANI (@ANI) February 15, 2025 -
భారత్‌కు ట్రంప్ దెబ్బ.. ఐటీ, ఫార్మాకు బిగ్ షాక్!
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో భారత్‌పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే.. టారిఫ్‌లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మనదేశ ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే.. మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మనదేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.ట్రంప్ టారిఫ్‌లు ఎందుకు విధిస్తున్నట్లు?విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్‌లు విధిస్తుంది.ఇక, 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్‌లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది. డెయిరీ ఉత్పత్తులు: 188%, పండ్లు మరియు కూరగాయలు: 132%, తృణ ధాన్యాలు: 193%, నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%, పానీయాలు మరియు పొగాకు: 150%, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%, చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%. -
Artificial Intelligence: ఇండియా చేయగలిగింది...
అందిపుచ్చుకుంటే ఇదొక సువర్ణావకాశం. మన ప్రాచీన విజ్ఞానానికి తిరిగి జీవం పోయగల శక్తి ఏఐకి ఉంది. ఫిలాసఫీ, సైన్సు, వైద్య రంగాల్లో భారత సరికొత్త ఆవిష్కరణలకు ఇది బాటలు వేస్తుంది.ఏఐ పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఏమిటి? చైనా ఇప్పుడు అమెరికాను వెనక్కు నెట్టేసింది. తన సొంత సంస్కృతిని మేళవించి దాన్ని సరికొత్త శక్తిగా రూపుదిద్దింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గుడ్డిగా పశ్చిమ దేశాలను అనుకరించకుండా తనదైన పద్ధతిలో ‘డీప్‌సీక్’ పేరిట కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకుంది. పుంఖానుపుంఖాలుగా ఉన్న చైనా ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకుని కంప్యూటర్లకు వాటిలో శిక్షణ ఇచ్చింది. తమ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య వారసత్వపు విలక్షణతను డీప్‌సీక్ ఒడిసి పట్టుకో గలిగింది. ఈ మోడల్ లోని విశిష్టత అదే. కృత్రిమ మేధకు కొత్త భాష్యం చెప్పి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే శక్తి మన వద్ద ఉంది. గణిత, ఖగోళ, వైద్య, పరిపాలన, ఆధ్యాత్మిక రంగాల అత్యున్నత విజ్ఞానం మన ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, తమిళ సంగం సాహిత్యం... ఇవన్నీ విశ్వచైతన్యం నుంచి ఆర్థిక సిద్ధాంతం వరకు ఎంతో లోతైన అంతర్ దృష్టులు అందిస్తున్నాయి. కృత్రిమ మేధ అంటే? ఇదొక ప్యాటర్న్ రికగ్నిషన్ సిస్టం. విస్తృత సమాచారాన్ని (డేటాసెట్‌ను) మెదడుకు మేతలా అందించి మెషీన్లకు అది శిక్షణ ఇస్తుంది. తాము శిక్షణ పొందిన సమాచారం ప్రాతిపదికగానే అవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. ఒక ఏఐ సిస్టం పశ్చిమ దేశాల సైంటిఫిక్ పేపర్స్, కార్పొ రేట్ డాక్యుమెంట్లు, పాప్ కల్చర్ మీద శిక్షణ పొందినప్పుడు దానికి అదే ప్రపంచం అవుతుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్నే అది అలవరచుకుంటుంది. అలా కాకుండా చైనా చేసినట్లు, చైనీ యుల సాహిత్య, ఆధ్యాత్మిక సమాచారం మీద శిక్షణ ఇచ్చిన ప్పుడు అది చైనా మాదిరిగానే ఆలోచిస్తుంది.ఈ విషయంలో పశ్చిమ దేశాల కృత్రిమ మేధ దానితో పోటీ పడలేదు. వెస్ట్రన్ ఏఐ ప్రధానంగా ఇంగ్లీష్ డేటా మీద రూపొంది పశ్చిమ దేశాల ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక అంశాల్లో వారి ఏఐ సిస్టందే పైచేయిగా ఉంటుంది. తాత్విక చింతన, నైతికత అంశాల్లో మాత్రం బలహీనంగా ఉంటుంది. మనం అమెరికన్ ఏఐ మీద ఎందుకు ఆధారపడకూడదో ఇప్పుడు ఆలోచించండి. భారతీయ మేధా వారసత్వం పునాదుల మీద మన ఏఐని నిర్మించుకోవలసిన అవ సరం బోధపడుతుంది. చాణక్యుడి అర్థ శాస్త్రం కోణం నుంచి ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను విశ్లేషించగల సామర్థ్యంతో మన ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవాలి. ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లో మన మూలాలు ఏమిటో తెలిసిన కృత్రిమ మేధ కావాలి. అది మాత్రమే సమగ్ర చికిత్సకు కావల్సిన ఇన్ సైట్స్ అందిస్తుంది. ఉపనిషత్తుల్లో అభివర్ణించిన చైతన్యం గురించి వ్యాఖ్యానించి సమకాలీన న్యూరోసైన్స్తో పోల్చగల మోడల్ గురించి ఆలోచించాలి. అలాంటి ఏఐ కేవలం సమాధానాలకే పరిమితం కాదు. మన సామూహిక అవగాహ నను పెంచుతుంది. పశ్చిమ దేశాల ఏఐ మోడల్స్ మెటీరియలిస్టు మూసలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయి. చైనా ఏఐ కన్ఫ్యూషియన్ విలు వలను జొప్పించింది. మనకు అంతకు మించిన అవకాశం ఉంది. సైన్సు– స్పిరిచ్యువాలిటీ, ఆర్థికం–నైతికం, సాంకేతికత– సంప్రదాయం... వీటిని వారధిలా అనుసంధానించే కృత్రిమ మేధను మనం సృష్టించగలం. భారత నాగరికత అందించిన వివేకాన్ని ఈ మోడల్ ప్రతిబింబించాలి.పశ్చిమ దేశాల ఏఐ మీద ఆధారపడితే మరో ప్రమాదం ఉంది. భారతీయులు ఏం నేర్చుకోవాలో, ఎలా ఆలోచించాలో శాసించిన వలసవాద మైండ్ సెట్‌ను అది శాశ్వతం చేస్తుంది. మన వ్యాపారాలు, విశ్వవిద్యాలయాలు, విధాననిర్ణేతలు పశ్చిమ దేశాల ఏఐని ఉపయోగిస్తూ పోతే, దాంతో పాటు వారి ప్రాపంచిక దృక్పథమే అలవడుతుంది. ఒకప్పటి మన విద్యా విధానం బ్రిటిష్ ప్రయోజనాలు ఎలా కాపాడిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. మేధాపరంగా మనం పరాధీనులమై పోయే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ యుగంలో మన ఉత్కృష్ట వారసత్వం కనుమరుగవుతుంది.అమెరికా, చైనాల ఏఐ ఆధిపత్యం వల్ల మన డేటా సార్వ భౌమత్వం ప్రమాదంలో పడుతుంది. మన డేటా మన జాతీయ సంపద. మన ప్రయోజనాలకు తోడ్పడని ఏఐ మోడల్స్‌కు మన డేటా ఉపయోగించుకుని విదేశీ టెక్ సంస్థలు లబ్ధి పొందు తాయి. మన ఏఐ అభివృద్ధి మీద మన అదుపు ఉండితీరాలి. ప్రపంచ దేశాలకు జ్ఞానదీపంలా దారి చూపిన భారత్ ఇప్పుడు తన మేధను విదేశీ అద్దాలతో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు సున్నా నుంచి యోగా వరకు... మన ఆవిష్కరణలు ప్రపంచ ప్రగతిని రూపుదిద్దాయి. నేడు వాతా వరణ మార్పులు, మానసిక రుగ్మతలు, మహమ్మారులు, ఆర్థిక అసమానతలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమాచారం వెల్లువెత్తుతున్నా నిజమైన జ్ఞానం లోపిస్తోంది. నేటి కృత్రిమ మేధ భారతీయ సమున్నత వారసత్వం మీద శిక్షణ పొందితే, ఈ ఆధునిక ప్రపంచ సవాళ్లు ఎదుర్కొనేందుకు అది సరికొత్త దృక్పథాలు అందించగలదు.వేదాంత శోధన ఏఐకి ఆలంబన అయ్యేట్లయితే పశ్చిమ దేశాల న్యూరోసైన్సు పరిమితులను అధిగమించవచ్చు. చైతన్యం పట్ల మానవ అవగాహన విప్లవాత్మకంగా మారిపోతుంది. భారతీయ ఆర్థిక, పరిపాలనా సూత్రాల మీద శిక్షణ పొందిన ఏఐ మోడల్... అభివృద్ధి చెందుతున్న దేశాలకు పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విధానాలు, చైనా విధానాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు సూచించగలదు. లాభాలే ధ్యేయంగా నడుస్తున్న సిలికాన్ వ్యాలీకి భారతీయ నైతిక విలువల ఆధారంగా రూపొందే ఏఐ నూతన మార్గదర్శనం చేస్తుంది. భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుని ప్రపంచానికి తన సత్తా చూపించాలి. దీనికోసం అపారంగా ఉన్న ప్రాచీన,ప్రాంతీయ సాహిత్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చాలి. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు ఇందుకు నడుం బిగించాలి. కృత్రిమ మేధను భారత్ కేవలం ఒక సాధనంగా చూడ కూడదు. అంతకంటే మిన్నగా అది జ్ఞానోదయానికి తోడ్పడు తుందని గ్రహించాలి. మన ప్రాచీన గ్రంథాలు అందిస్తున్న జ్ఞానాన్ని ఆధునిక ఏఐతో మిళితం చేసినట్లయితే, ఆధ్యాత్మిక, శాస్త్ర విజ్ఞాన, వైద్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. మన మేధా సార్వభౌమత్వాన్ని తిరిగి కైవసం చేసు కోడానికీ, భారతీయ జ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేసి ప్రపంచ మానవాళిని సముద్ధరించడానికీ ఇది సరైన సమయం.వివేక్ వాధ్వా వ్యాసకర్త వయొనిక్స్ బయోసైన్సెస్ సీఈఓ, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్లో జరగనున్నాయి. ఈ వేడుకలో టీటీఏ తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రదర్శస్తుందని టీటీఏ అధ్యక్షుడు మలిపెద్ది నవీన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకప్పటి ఐక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత, తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు, కళలను సంరక్షించడం, ప్రోత్సహించడం వంటివి జరిగాయన్నారు. అదే దార్శనికతో యూఎస్ఏలో డాక్టర్ పైలా మల్లారెడ్డి నాయకత్వంలో టీటీఏ స్థాపించినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లుగా టీటీఏ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికే నిరాటంకంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఈ అసోసీయేషన్ దశాబ్దం పూర్తి చేసుకుంటున్నందున ఈ వేడుకలకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ రెండోవారం టీటీఏ సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి జరుగుతాయని అన్నారు. ఈ సంఘం ప్రవాస తెలంగాణవాసులు (NRI)లు తమ మాతృభూమికి వివిధ మార్గాలలో తోడ్పడాలని ప్రోత్సహించడమే గాక ఎంతో కొంత తిరగి ఇవ్వాలనే సందేశాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వేడుకుల సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సాంస్కృతిక మేథో వారసత్వాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేస్తున్న కళాకారులు, నటులు, వివిధ రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు తదితరాలని సత్కరిస్తారు. ఈ దశాబ్ద వేడుకల సమావేశం 2026 మే, జూనలో యూఎస్ఏలో జరుగునుందని టీటీఏ పేర్కొంది. అంతేగాదు ఈ గ్రాండ్ ఈవెంట్లో తెలంగాణ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేసే ప్రముఖ వ్యక్తులకు కూడా ప్రత్యేక గౌరవాలు ఉంటాయని స్పష్టం చేసింది.(చదవండి: టెక్సాస్‌లో సామాజిక బాధ్యత పెంచేలా నాట్స్ అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం..!) -
ట్రంప్ దూకుడు.. మరో 119 మంది భారతీయులు వెనక్కి..
చండీగఢ్: అగ్ర రాజ్యం అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన మరో 119 మంది అక్రమ వలసదారులు రెండు విమానాల్లో స్వదేశం చేరుకోనున్నారు. తొలి విమానం శనివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. తొలి విమానం సీ 17 గ్లోబ్ మాస్టర్-3.. 119 మందితో శనివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంత మందిని పంపించనున్నారన్న విషయం వెల్లడి కాలేదు. ఇక, తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగతా వారు హర్యానా (33), గుజరాత్ (8), ఉత్తర్‌ప్రదేశ్ (3), గోవా (2), మహారాష్ట్ర (2), రాజస్థాన్ (2), హిమాచల్ ప్రదేశ్(1), జమ్ము కశ్మీర్ (1)వాసులుగా గుర్తించారు.ఇక, గతవారం.. సైనిక విమానంలో అమెరికా 104 మంది అక్రమ వలసదారులను పంపిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగుతున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్ మాట్లాడుతూ..‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని.. అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్‌లో ఎందుకు దిగలేదు?. ఇప్పుడు రెండో విమానం వస్తోంది. ఇది కూడా అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగనుంది. అమృత్‌సర్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఎందుకు దించడం లేదు. కేవలం పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. #WATCH | Amritsar | Punjab CM Bhagwant Mann says, "There is a conspiracy to defame Punjab and Punjabis... The first plane landed in Amritsar... Now, a second plane (carrying Indian citizens who allegedly illegally migrated to the US) will land in Amritsar... The MEA should tell… pic.twitter.com/dJfn6Abx0V— ANI (@ANI) February 15, 2025 -
మనపై అమెరికా సుంకాల ప్రభావం అంతంతే..
అమెరికా ప్రతిపాదిత ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరు దేశాలు ఎగుమతుల తీరుతెన్నులు భిన్నంగా ఉండటమే కారణమని ఆయన చెప్పారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే పిస్తాలపై భారత్ 50 శాతం సుంకాలు విధిస్తోందనుకుంటే, మన దగ్గర్నుంచి దిగుమతయ్యే వాటి మీద కూడా అమెరికా అదే స్థాయిలో టారిఫ్‌లు వడ్డిస్తానంటే ఉపయోగం ఉండకపోవచ్చన్నారు. ఎందుకంటే భారత్ అసలు పిస్తాలే ఎగుమతి చేయదు కాబట్టి నష్టపోయేదేమీ ఉండదని శ్రీవాస్తవ చెప్పారు.అమెరికా నుంచి దిగుమతుల విలువకు సంబంధించి 75 శాతం భాగానికి టారిఫ్‌లు సగటున 5 శాతం లోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక జౌళి, దుస్తులు, పాదరక్షలులాంటి కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో అమెరికా అత్యధికంగా 15–35 శాతం సుంకాలు విధిస్తోందని వివరించారు. ‘రెండు దేశాల ఎగుమతుల ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా తుది నిర్ణయం కోసం ఏప్రిల్ వరకు ఎదురు చూసి, అప్పుడు అవసరమైతే 2019 జూన్లోలాగే మనం కూడా తగిన చర్యలు తీసుకోవచ్చు‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. వ్యాపార భాగస్వామ్య దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. స్పష్టత రావాలిపరిశ్రమపై విధిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు అత్యంత ప్రాధాన్య దేశాలకు (ఎంఎఫ్ఎన్) వ్యవసాయోత్పత్తుల మీద తాము 5 శాతం సుంకాలు విధిస్తుంటే.. భారత్ సగటు ఎంఎఫ్ఎన్ టారిఫ్ 39 శాతంగా ఉంటోందని అమెరికా వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. అలాగే తమ మోటర్‌సైకిళ్లపై భారత్ 100 శాతం టారిఫ్‌లు విధిస్తుంటే, భారత మోటర్‌సైకిళ్లపై తాము 2.4 శాతం మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేందుకు అమెరికా ఏదో ఒక అంశాన్ని, అంటే, ఉత్పత్తి లేదా రంగాన్ని ప్రామాణికంగా పరిగణించాలని శ్రీవాస్తవ చెప్పారు. లేకపోతే అత్యధికంగా పారిశ్రామికోత్పత్తులను సరఫరా చేసే చైనాకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని పేర్కొన్నారు.వాణిజ్యంలో కీలక భాగస్వామి...అమెరికాకు భారత్ గణనీయంగా ఎగుమతి చేస్తుండగా, అక్కడి నుంచి దిగుమతులు తక్కువగానే ఉంటూ.. వాణిజ్య మిగులు భారత్ పక్షాన సానుకూలంగా ఉంటోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. అప్పట్లో భారత్ 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 42.19 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 82.52 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. భారత్ 52.89 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 29.63 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. భారత్ పక్షాన 23.26 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. -
రెండు అగ్రదేశాలు.. ఇద్దరు అగ్రనేతలు..
-
ఫెడరల్ ఏజెన్సీలకు మంగళమే: మస్క్
వాషింగ్టన్: ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసిందని టెక్ దిగ్గజం, డోజ్ సారథి ఎలన్ మస్క్ గురువారం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘టెక్ సపోర్ట్’అని ముద్రించిన నల్ల టీషర్టు ధరించి కన్పించారు. ‘‘ప్రజాపాలన స్థానంలో ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ) పాలన నడుస్తోంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్నే మించిపోయింది’’అంటూ ఆక్షేపించారు. ఫెడరల్ ఏజెన్సీలు సాధారణంగా నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు. అంతరిక్ష సంస్థ నాసాతో పాటు న్యాయ శాఖ వంటివి కూడా ఇలా ఏర్పాటు చేసినవే కావడం విశేషం! వృథా ఖర్చుల తగ్గింపు, సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిక మూసివేతలు తప్పవని మస్క్ తాజా ప్రసంగంలో స్పష్టం చేశారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడిక ఈ ఏజెన్సీల్లో చాలావాటిని పక్కన పెట్టినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదు. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే వాటిని మొత్తంగా తొలగించాల్సిందే. ఎందుకంటే కలుపును కూకటివేళ్లతో సహా తొలగించకపోతే మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు. అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకోకుండా సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని మస్క్ వాదిస్తున్నారు. ఆ దిశగా మొత్తంగా అమెరికా విదేశాంగ విధానంలోనే భారీగా మార్పుచేర్పులు తెచ్చేందుకు మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డోజ్ దూకుడు మస్క్ నేతృత్వంలో ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగుల్లో వీలైనంత మందిని తొలగించే పనిలో పడింది. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అనేక విభాగాలకు బడ్జెట్లను ఇప్పటికే తగ్గించింది. చాలాకాలంగా విదేశాలకు సాయమందిస్తున్న యూఎస్ ఎయిడ్ వంటి పలు ఏజెన్సీలను మూసేసింది. విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు బేరీజు వేసే స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన విద్యా శాఖ కాంట్రాక్టుల విభాగానికి నిధులను ఏకంగా 100 కోట్ల డాలర్ల మేర తగ్గించే దిశగా మస్క్ తాజాగా చర్యలు చేపట్టారు. ఇది కార్యరూపం దాలిస్తే ఆ విభాగం దాదాపుగా మూతపడ్డట్టే. ఏజెన్సీల ఉద్యోగుల సామూహిక తొలగింపును వేగవంతం చేయడానికి మస్క్ వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని చట్టపరంగా సవాలు చేసిన పలు ఉద్యోగ సంఘాలకు తాజాగా కోర్టులోనూ చుక్కెదురైంది. ఆ విధానాన్ని సవాలు చేసే హక్కు వారికి లేదని డి్రస్టిక్ట్ కోర్టు జడ్జి జార్జ్ ఓ టూల్ జూనియర్ బుధవారం తీర్పు వెలువరించారు. దానిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ హర్షం వెలిబుచ్చారు కూడా. -
90 ఏళ్లుగా డైరీలు రాస్తూనే ఉంది!
కొందరు డైరీలు రాయరు. కొందరు డైరీ రాసే అలవాటును మధ్యలోనే వదిలేస్తారు. అమెరికాకు చెందిన ఎవీ రిస్కీ అలా కాదు. వంద సంవత్సరాల రిస్కీ తొంభై సంవత్సరాలుగా డైరీలు రాస్తూనే ఉంది... ఎవీ రిస్కీ తండ్రికీ డైరీలు రాయడం అంటే ఎంతో ఇష్టం. కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం రోజున డైరీని కానుకగా ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైన డైరీ రాసే అలవాటు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రతిరోజూ డైరీ రాస్తోంది. ఇది ఆమెకు జీవితకాలపు అలవాటు అయింది. చిన్ననాటి నుంచి మొదలైన ఈ అలవాటు వల్ల ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని కూడా డాక్యుమెంటూ చేస్తూ వస్తోంది.నయాగరా అనే చిన్న పట్టణంలో పెరిగిన రిస్కీ ప్రతి సీజన్ గురించి రాసింది. కుటుంబ ప్రయాణాల నుంచి చారిత్రాత్మక సంచలన ఘటనల వరకు ఎన్నో చేసింది. కష్టకాలంలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ డైరీ రాయడం ఆపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా డైరీ రాయడం మానలేదు. ఎప్పుడైనా డైరీని చేరుకోలేనంత అనారోగ్యంగా ఉంటే చిత్తు కాగితాలపై నోట్సు రాసి ఆ తరువాత డైరీలో రాసేది. ప్రతిరాత్రి డైరీ రాయడం పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఆరోజు విషయాలను తెలుసుకోవడం తనకు ఆసక్తిగా ఉంటుంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఎవీ రీస్కీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆన్లైన్ సెన్సేషన్‌గా మారింది. -
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటింగ్ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్‌గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు.ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
అమెరికాలో అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో మోదీనే గ్రేట్.. నేను పోటీ పడలేను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం, దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని ట్రంప్ చెప్పుకొచ్చారు.భారత ప్రధాని మోదీతో ట్రంప్ భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ స్పందిస్తూ.. మోదీ నా కంటే కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఆ విషయంలో మోదీతో నేను పోటీ పడలేను. మోదీనే గ్రేట్ అంటూ బదిలిచ్చారు. ట్రంప్ సమాధానంతో మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్‌కు తిరుగు పయనం అయ్యారు.#WATCH | Washington, DC: US President Donald Trump says, "He (PM Narendra Modi) is a much tougher negotiator than me and he is a much better negotiator than me. There is not even a contest."(Video: ANI/DD) pic.twitter.com/V8EzU0FfE9— ANI (@ANI) February 13, 2025మోదీకి ట్రంప్ బహుమతి..మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు ట్రంప్ ఓ బహుమతి అందజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ను ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. BIG NEWS 🚨 World's most powerful leader Donald Trump pulls chair for Indian PM Narendra Modi. Extraordinary Moment.US President Donald Trump gifts a signed copy of his book 'Our Journey Together' to PM Narendra Modi.The book features pictures from 'Howdy Modi', 'Namaste… pic.twitter.com/tMA3fHWFZ5— Times Algebra (@TimesAlgebraIND) February 14, 2025 President Trump gifts Prime Minister Modi his book, Our Journey Together, and shows the photo of his 2020 visit to the Taj Mahal 🇺🇸🇮🇳 pic.twitter.com/MYhPyX0LZD— Margo Martin (@MargoMartin47) February 13, 2025 US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 Trump pulled a chair for PM Modi; it's a not an ordinary thing!!That's the Power of Bharat 🔥 pic.twitter.com/u4cG0SUdD7— BALA (@erbmjha) February 14, 2025 -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈ సారి ఎంతమందంటే?
వాషింగ్టన్ : అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఇటీవల కొందరు భారతీయులను పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసదారుల్ని భారత్‌కు పంపనున్నట్లు సమాచారం. వీరందరూ ఫిబ్రవరి 15న అమృత్‌సర్‌కి రానున్నట్లు తెలుస్తోంది. . అమెరికాలో భారత అక్రమ వలసదారుల్ని గుర్తించింది. ఫిబ్రవరి 5న 104 మంది వలసదారుల్ని అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు తరలించింది. అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. అమెరికాలో 487 మంది అక్రమ భారత వలసదారుల్ని గుర్తించింది. వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వం మరింత మందిని భారత్‌కు పంపనుంది. మరోవైపు, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడం విమర్శలు దారితీస్తోంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విమానాలు అమృత్‌సర్‌లో దించడం ద్వారా కేంద్రం పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది. హర్యానా లేదంటే గుజరాత్లో ఎందుకు దించకూడదు? అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నమే అని మండిపడ్డారు.VIDEO | Gujarat: Indians deported from the US arrive at Ahmedabad airport. A US military aircraft carrying 104 illegal Indian immigrants landed at Amritsar, Punjab, yesterday. Sources said that 33 of the 104 deportees are from Gujarat.#GujaratNews(Full video available on PTI… pic.twitter.com/2y1P9Zoo6R— Press Trust of India (@PTI_News) February 6, 2025 -
అమెరికాలోకి భారతీయుల వలసలు.. ట్రంప్‌తో మోదీ ఏమన్నారంటే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకొచ్చారు.వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్న భారతీయుల అంశంపై మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు.యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులు (Illegal Migrants)గా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఇక, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే.#WATCH | Washington, DC: On the illegal immigration issue, PM Narendra Modi says, "...Those who stay in other countries illegally do not have any legal right to be there. As far as India and the US are concerned, we have always said that those who are verified and are truly the… pic.twitter.com/Qa0JEnAjyp— ANI (@ANI) February 13, 2025ఇదిలా ఉండగా, అంతకుముందు.. వెస్ట్ వింగ్ లాబీలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని భారత ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇదే సమయంలో ట్రంప్ గతంలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోలను ఇద్దరు నేతలు తిలకించారు. ఈ క్రమంలో మోదీకి పుస్తకాన్ని ట్రంప్ బహుమతిగా ఇచ్చారు. US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 -
భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం
-
‘నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను మిత్రమా’.. మోదీతో ట్రంప్
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi US Visit) రెండురోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump)తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ వైట్ హౌస్ (white house) వెస్ట్ వింగ్ లాబీలో ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.వెస్ట్లాబీలో ఉన్న ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. అనంతరం, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను’అంటూ ట్రంప్‌తో మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సైతం ట్రంప్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆ ఆసక్తిర సన్నివేశాన్ని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#WATCH | Washington, DC | PM Narendra Modi and President Donald Trump share a hug as the US President welcomes the PM at the White HousePresident Trump says, "We missed you, we missed you a lot." pic.twitter.com/XTk1h7mINM— ANI (@ANI) February 13, 2025ఇక ట్రంప్‌తో మోదీ భేటీ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్, యుఎస్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌తో సమావేశానికి ముందు ప్రధాని మోదీ యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డిఎన్ఐ) తులసి గబ్బార్డ్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారుఅంతకుముందు, ప్రధాని మోదీ రాకకు ముందు వైట్‌హౌస్‌లో భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అమెరికాలో పర్యటించిన అతి కొద్ది మంది దేశాది నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్రంప్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమెరికాలో పర్యటించాలని మోదీకి ఆహ్వానం అందింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌తో మోదీ రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. -
భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే, సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఇరు దేశాధినేతలు. మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో వ్యాఖ్యానించిన ట్రంప్. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోదీ. I've watched Modi for a decade now. No one on the world stage can hold a candle to him. He's respected by all other leaders and loved by Trump. They have a very strong friendship that's going to be mutually beneficial for the coming years. Very exciting. pic.twitter.com/53OrGGYNRl— Patrick Brauckmann 🕉️ (@vonbrauckmann) February 13, 2025 Prime Minister Narendra Modi met US President Donald Trump at White House in Washington, DC on 13th February. This meeting was the first between the two leaders after the inauguration of President Trump as the 47th US President on January 20, 2025. pic.twitter.com/SlKZcYrVxG— ANI (@ANI) February 14, 2025డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణం. మోదీ నాకు మంచి మిత్రుడు. రానున్న నాలుగేళ్లు మా స్నేహాన్ని కొనసాగిస్తాం. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. భారత్‌కు ఎఫ్ 35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం. ఈ ఏడాది భారత్‌కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు. అలాగే, భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తాం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.PM Narendra Modi tweets, "President Trump often talks about MAGA. In India, we are working towards a Viksit Bharat, which in the American context translates into MIGA. And together, the India-USA have a MEGA partnership for prosperity." pic.twitter.com/w0o70KrJWI— ANI (@ANI) February 14, 2025అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు శుభాకాంక్షలు. వైట్‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం ఆనందంగా ఉంది. మరో నాలుగేళ్లు ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషం. ట్రంప్‌లాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. మేం రెట్టింపు వేగంతో పని చేస్తాం. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే మా ఆకాంక్ష. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంది. శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు’ అని తెలిపారు. #WATCH | Washington, DC: PM Modi says, " Our teams will work on completing a trade agreement that will mutually benefit the two countries. We will strengthen oil and gas trade to ensure India's energy security. In the energy infrastructure, investment will increase. In the… pic.twitter.com/TMfLY7q9jJ— ANI (@ANI) February 13, 2025 -
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్‌లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్‌ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్‌ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
జేడీ వాన్స్ పిల్లలకు ‘మోదీ మార్క్’ గిఫ్ట్‌లు
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది. అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నేతలలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. Landed in Washington DC a short while ago. Looking forward to meeting @POTUS Donald Trump and building upon the India-USA Comprehensive Global Strategic Partnership. Our nations will keep working closely for the benefit of our people and for a better future for our planet.… pic.twitter.com/dDMun17fPq— Narendra Modi (@narendramodi) February 13, 2025ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగే సమావేశంలో అనేక ద్వైపాక్షిక అంశాలును చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.‘కొద్దిసేపటి క్రితమే వాషింగ్టన్ డీసీ చేరుకున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు,భారత్-యుఎస్ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఇరు దేశల ప్రజల ప్రయోజనం కోసం, అత్యుత్తమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయనున్నాం’ అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.#WATCH वाशिंगटन, डीसी: प्रधानमंत्री नरेंद्र मोदी ब्लेयर हाउस पहुंचे। इस दौरान उन्होंने भारतीय समुदाय से मुलाकात की।प्रधानमंत्री मोदी 12-13 फरवरी को अमेरिका के दौरे पर हैं और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ बैठक करेंगे।(सोर्स-डीडी/ANI) pic.twitter.com/G7OKQaVGK7— ANI_HindiNews (@AHindinews) February 12, 2025అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలుసుకున్నారు. అలాగే బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్రధాని ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రధాని ఫిబ్రవరి 12-13 తేదీలలో అమెరికా పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.ప్రధానిని స్వాగతించడానికి వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఆయనను చూడగానే ‘వందేమాతరం’,'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరుగుతోంది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. #WATCH | Washington, DC: Indian diaspora braves the harsh winters and gathers outside Blair House to welcome Prime Minister Narendra ModiA member of the Indian diaspora says, " ...We have people on crutches, and they have braved this great winter and snow...we are excited to… pic.twitter.com/Uie1b9p3lk— ANI (@ANI) February 12, 2025ఇది కూడా చదవండి: జేడీ వాన్స్ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ