Vijay Sethupathi
-
పరోటా మాస్టర్‌గా శిక్షణ తీసుకున్న విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజా. ఈయన నటించిన 50వ చిత్రం ఇది. ఆ మధ్య తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. (సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్: మీ అభిమాన తారలను నామినేట్ చేయండి)సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నటుడు విజయ్‌సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. కాగా ఇంతకు ముందు నటుడు సూర్య హీరోగా ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ఈటీ ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజా చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విజయ్‌సేతుపతి ఈ చిత్రంతో పాటూ ఎస్, గాంధీ టాకీస్, మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మొదలగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి
తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సినీ కార్మికుల కోసం కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. చెన్నై పక్కనే ఉన్న పాయనూరులో వారి కోసం తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాల భూమిని జారీ చేసిందని సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, దర్శకులు ఆర్కే సెల్వమణి తెలిపారు.సినీ కార్మికులకు నటుడు విజయ్ సేతుపతి చేసిన సాయం గురించి ఆర్కే సెల్వమణి తెలిపారు. 'దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో మూడేళ్లలోగా భూమి ఇచ్చి ఇళ్లు కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, పరిపాలన మారడం తదితర కారణాలతో నివాసాలు నిర్మించుకోలేకపోయారు. నా నేతృత్వంలో ఈ పెప్సీ ఏర్పాటైన తర్వాత అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ భూమిని మళ్లీ నివాసాలకు వినియోగించాలని కోరాం. అధికారులు, మంత్రులందరినీ సంప్రదించిన తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు ఉత్తర్వులు వచ్చాయి. నిరాశ్రయులైన మన కార్మికుల కోసం తొలిదశలో 1,000 ఇళ్లు నిర్మించనున్నాం. గృహ నిర్మాణానికి డబ్బు కావాలి. ఇల్లు కావాల్సిన వారు కనీసం 2.5 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ డబ్బు కూడా చెల్లించలేని కార్మికుల కోసం మేము చాలా మంది ప్రముఖులకు విజ్ఞప్తి చేశాము. ఈ క్రమంలో నటుడు విజయ్ సేతుపతి కోటి 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ డబ్బు సుమారు 50 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఆయన సాయం ఎప్పటికీ మరిచిపోలేం. అందుకే ఈ భూమిలో నిర్మించనున్న 6 టవర్లలో ఒకదానికి విజయ్ సేతుపతి పేరు పెట్టబోతున్నాం. తమిళ పరిశ్రమలో డబ్బున్న సెలబ్రిటీలు అందరూ కూడా పేద కార్మికుల కోసం చేతనైనంత సాయం చేయాలి.' అని ఆయన కోరారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో 23 విభాగాలకు చెందిన దాదాపు 30 వేల మంది సభ్యులతో ఈ సంస్థ కొనసాగుతోంది. తమిళ నటీనటుల సంక్షేమం కోసం ఈ సంస్థ పాటుపడుతుంది. దీని ఏర్పాటులో దర్శకులు ఆర్కే సెల్వమణిదే కీలక పాత్ర కావడం విశేషం. -
మినిస్టర్ సతీమణి కాంబోలో విజయ్ సేతుపతి సినిమా
కృతిక ఉదయనిధి ఒక బిగ్‌స్టార్‌తో సినిమా ప్రారంభించనున్నారు. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే మూడు చిత్రాలతో పాటు ఒక వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కానీ, పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఈసారి ఒక బలమైన కథతో హిట్ కొట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి(Kiruthiga Udhayanidhi) అన్న విషయం తెలిసిందే. ఈమె దర్శకురాలిగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు రవి మోహన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా కాదలిక్క నేరమిల్లై చిత్రాన్ని తెరకెక్కించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 4వ తేదీన తెరపైకి వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే చిత్రంలోని సన్నివేశాలు ప్రత్యేకంగా ఉన్నట్లు ప్రశంసలు పొందాయి. తర్వాత చిత్రానికి కృతిక ఉదయనిధి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో విజయ్ సేతుపతిని(Vijay Sethupathi) కథానాయకుడిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఆర్ముగకుమార్ దర్శకత్వంలో నటించిన ఏస్, మిష్కిన్ దర్శకత్వంలో నటించిన ట్రైన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విజయ్‌సేతుపతి, క్రితిక కాంబోలో రూపొందనున్న ఈ చిత్రంపై కచ్చితంగా మంచి అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
రెండు నెలలుగా ఆస్పత్రిలో.. కన్నుమూసిన నటుడు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్.. విజయ్‌తో బిగిల్, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద సినిమాల్లో నటించారు.తన కెరీర్లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.చదవండి: హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్ -
ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది. విడుదల పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే!సినిమా కథప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో విడుదల 1 కథ ముగుస్తుంది. జైల్లో ఉన్న పెరుమాళ్ విచారణతో విడుదల పార్ట్ 2 ప్రారంభమవుతుంది. పెరుమాళ్ అరెస్టు విషయం బయటకు తెలియడంతో అతడిని మరో క్యాంపుకు తరలించి అక్కడే ఎన్కౌంటర్ చేయాలని పథకం రచిస్తారు. కొమరన్ (సూరి)తో కలిసి మరికొంతమంది పోలీసులు పెరుమాళ్‌ను అడవి మార్గం గుండా క్యాంపుకు తీసుకెళ్తారు.ఈ ప్రయాణంలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ కథ చెప్తాడు. ప్రజాదళంలోకి ఎలా వచ్చాడు? అతడి ఆశయం ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనక ఉన్న నిజమేంటి? పోలీసుల కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి.. -
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేశారు.చైనా అధికారి ట్వీట్.. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025 -
ఆకట్టుకుంటున్న ‘కోర’ టీజర్
యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కోర మీద అంచనాలు పెంచేశాయి.తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. -
ఓటీటీలో 'విడుదల 2' స్ట్రీమింగ్.. సంక్రాంతికి ప్లాన్
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.విడుదలై 2 బాక్సాఫీస్ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. 2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు టాక్. అయితే, ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంది.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు.మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కమర్షియల్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి ఫస్ట్ సినిమా.. నిర్మాతగా నయనతార
కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన హీరో, విలన్ అన్న తారతమ్యం లేకుండా పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్నారు. గత ఏడాదిలో 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందే విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి ఆ చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇక ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా విడుదలై 2 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రైన్, ఏస్, గాంధీ టాకీస్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా విజయ్ సేతుపతి కథానాయకుడిగా మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హరి గతంలో సూర్యతో సింగం సీక్వెల్స్ చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆపై హీరో విశాల్‌తో పూజై సినిమాతో బిగ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా నిజమైతే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార, విగ్నేష్ శివన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థలో పలు వైవిద్య భరిత సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన నయనతార విగ్నేశ్ శివన్ లు తాజాగా విజయ్ సేతుపతి హీరోగా చిత్రం చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
'బేబీ జాన్' తర్వాత మరో స్టార్ హీరోను సెలక్ట్ చేసుకున్న అట్లీ
రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ డైరెక్టర్ శంకర్ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న అట్లీ ఆ తర్వాత విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, తెరీ, బిగిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను చేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి షారుక్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్నిచేశారు. నయనతార, దీపిక పడుకొనే, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో నిర్మించారు. నటి కీర్తి సురేష్‌ను ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం చేశారు. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తమిళంలో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. బాలీవుడ్‌కు చెందిన మురాద్ ఖేతని చిత్ర నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. మహారాజా విడుదలై విజయాలతో మంచి జోరు మీద ఉన్న విజయ్ సేతుపతి కథానాయకుడుగా నటించనున్న ఈ చిత్రం సంబంధించిన దర్శకుడు, కథానాయకి తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలో 'విడుదల 2'.. ఫ్యాన్స్ కోసం ఎక్స్టెండెడ్ వెర్షన్ : వెట్రిమారన్
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్ టైమ్ రివీల్ చేసి దర్శకుడు షాక్ ఇచ్చారు.విడుదల-1 పూర్తి రన్‌టైమ్ 2గంటల 40 నిమిషాలు ఉంటే.. విడుదల -2 మాత్రం 2గంటల 50 నిమిషాలు ఉంది. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్‌టైమ్ సుమారు ఎనిమిది గంటలు ఉందని తాజాగా దర్శకుడు వెట్రిమారన్ రివీల్ చేశారు. కానీ తాను ప్రేక్షకులు చూపింది కేవలం 5:30 గంటలేనని ఆయన పేర్కొన్నారు. 'విడుదల 2' ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. మరో గంట నిడివి గల ఫుటేజ్‌ను యాడ్ చేస్తామని వెట్రిమారన్ పేర్కొన్నారు.'విడుదల 1'లో సూరి మెప్పించాడు. దీంతో కథంతా కానిస్టేబుల్ ఆయన కోణంలోనే సాగితే. అయితే, రెండో పార్ట్‌లో ఎక్కువగా ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది. పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి సహజమైన నటనతో మెప్పిస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఆయన పాత్ర తీరుకు మంచి మార్కులే పడ్డాయి. -
విజయ్ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ
టైటిల్: విడుదల 2నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులునిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)దర్శకత్వం: వెట్రీమారన్సంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ఎడిటింగ్: ఆర్. రామర్విడుదల తేది: డిసెంబర్ 20, 2024విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వెట్రిమారన్ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. అయితే పార్ట్ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే మావోయిస్ట్ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. నక్సలైట్స్ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్‌గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి. అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పెరుమాళ్, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది. కరుప్పన్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ నక్సలైట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు.. ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగే ఎన్కౌంటర్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్ చూసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. పార్ట్ 3 కోసం తీసుకున్న లీడ్ బాగుంది. వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్లో నగ్నంగా ఉండే సీన్ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్‌కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. పోలీస్ డ్రైవర్ కొమరన్గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు. డబ్బింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది
‘‘విడుదల–1’లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్ మాత్రమే జరిగింది. అయితే కథ అంతా ‘విడుదల–2’ లోనే ఉంటుంది. మొదటి భాగానికి మించి పదిరెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది. ఇందులో పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటన, భావోద్వేగాలు చూస్తారు’’ అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, సూరి, మంజు వారియర్, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదల–2’. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ తమిళ్, తెలుగులో ఈ నెల 20న విడుదల కానుంది. శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చింతపల్ల రామారావు మాట్లాడుతూ– ‘‘అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజల్ని ఎలా బయటపడేలా చేశారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలతో తీసిన చిత్రమిది. ఇళయరాజాగారి నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. నేను నిర్మించిన ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే ‘డ్రీమ్ గర్ల్’ అనే మూవీని ప్రారంభించబోతున్నాం. మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు. -
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీక్వెల్ రిలీజ్‌కు ముందు 'విడుదల-1' సినిమాను జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర్లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగానే వ్యూస్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం డిసెంబర్ 20 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల పార్ట్-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్-2లో మాత్రం మంజు వారియర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. -
విజయ్ సేతుపతి మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2. గతంలో విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో సూరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. -
చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్
భారతీయ సినిమాలు చైనాలో కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్ 29న సుమారు 40 వేలకు పైగా థీయేటర్స్లలో ఈ చిత్రం విడుదలైంది. కరోనా తర్వాత చైనాలో విడుదలైన భారతీయన సినిమాలలో మహారాజా మాత్రమే అక్కడ రానిస్తుంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ చలనచిత్ర సమీక్ష వెబ్సైట్లలో ఒకటైన డౌబన్‌లో మహారాజా సినిమాకు 8.7/10 రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవలి కాలంలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఫైనల్‌గా చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.'మహారాజ' చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో దుమ్మురేపుతుంది. -
చైనాలో దుమ్మురేపుతున్న విజయ్ సేతుపతి సినిమా..
-
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా విడుదల2 ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.విజయ్ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. -
మహారాజ సినిమా దుమ్మురేపడానికి రెడీ అవుతుంది
-
చైనాలో 'మహారాజ' విడుదల.. ఇదే జరిగితే రూ. 500 కోట్లు..!
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు. -
విడుదల షురూ
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో విడుదలై తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ–‘‘మంచి వాణిజ్య విలువలున్న ‘విడుదల 2’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ‘విడుదల పార్ట్ 1’ లా ‘విడుదల 2’ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజ్, సంగీతం: ఇళయరాజా. -
'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే
వెట్రిమారన్ 'విడుదల' సినిమా గతేడాది రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర తెలుగు థియేటర్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మేరకు మూవీ టీమ్‌ని కలిశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'విడుదల 2' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?) -
నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు చిక్కులు
కోలీవుడ్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది. నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ను కోర్టు ఆదేశించబడింది.ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియాఈ చిత్రంలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం కూడా వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. -
విజయ్ సేతుపతితో జాతీయ నటి ఫిక్స్... షూటింగ్ ప్రారంభం
కథానాయకుడు, ప్రతినాయకుడు అనే వ్యత్యాసం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధమవుతున్న అరుదైన నటుడు విజయ్ సేతుపతి. తాజాగా బిగ్‌బాస్ రియాల్టీ గేమ్నూ యాంకరింగ్ చేస్తున్న ఈయన ఇప్పుడు నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈయన జంటగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రానికి పాండిరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పసంగ, మెరీనా. కేడి బిల్లా కిలాడి రంగ, పసంగ –2, ఇది నమ్మ ఆలు, కథాకళి, కడైకుట్టి సింగం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈయన తన తాజా చిత్రాన్ని విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ మంగళవారం తిరుచెందూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అక్కడ సముద్రతీరంలో విజయ్ సేతుపతి తదితర నటీనటులతో సన్నివేశాలను తదుపరి తూత్తుకుడి రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగులు నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వారు పేర్కొన్నారు. -
'హిట్ సినిమాకు సీక్వెల్.. వాయిదా ప్రసక్తే లేదు'
కోలీవుడ్ హాస్యనటుడు సూరి కథానాయకుడుగా పరిచయమైన చిత్రం 'విడుదలై'.. వెట్రిమారన్ దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విడుదలై–2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, కిషోర్, కెన్ కరుణాస్, రాజీవ్ మీనన్, గౌతమ్ మేనన్ బోస్ వెంకట్, భవాని శ్రీ, విన్సెంట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవలే చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను చైన్నెలో ప్రారంభించినట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండవ భాగంలో నటి మంజు వారియర్, నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన ముఖ్యమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. వారి ప్రతిభావంతమైన నటన ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచిందన్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే మూవీని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా వి.మణికంఠన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విడుదలై– 2 చిత్రాన్ని డిసెంబర్ 24 తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
మొదలైన తమిళ బిగ్‌బాస్.. 18 మందిలో ఆ ఇద్దరు మాత్రం (ఫొటోలు)
-
Bigg Boss 8: పాపం.. వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేట్
ఇప్పటికే బిగ్‌బాస్ 8 తెలుగులో మొదలైపోయింది. ఐదు వారాలు గడిచిపోయాయి. వచ్చిన కంటెస్టెంట్స్‌లో పసలేకపోయేసరికి వైల్డ్ కార్డ్స్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. దీని సంగతి పక్కనబెడితే తమిళంలోనే తాజాగా (అక్టోబర్ 6) బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్. అయితే వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.తమిళం గత సీజన్ వరకు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. షో మొదలై ఒకరోజే అయింది కాబట్టి ఇప్పుడే హోస్టింగ్ గురించి ఇంకా ఏం చెప్పలేం. కానీ ఈసారి షో మొదలైన 24 గంటల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి బాంబ్ పేల్చాడు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)తాజాగా తమిళ బిగ్ బాస్ తొలిరోజు ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించారు. 'మహారాజ' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సచన అనే అమ్మాయి ఈసారి హౌసులోకి వచ్చింది. ఆమెనే ఇప్పుడు ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. కనీసం వారమైనా అయితే కదా ఎవరు ఎలా ఫెర్ఫార్మ్ చేశారు? ఎలిమినేట్ చేయడానికి కారణాలైనా కనిపిస్తాయి. ఇలాంటివి ఏం లేకుండా ఈ ఎలిమినేషన్ ఎందుకో? బిగ్‌బాస్ తలతిక్క నిర్ణయం వెనక మరేదైనా మతలబు ఉందా అనేది చూడాలి?ఇక తమిళ బిగ్‌బాస్ 8లోకి వచ్చిన వాళ్లలో నటి మహాలక్షి భర్త రవీందర్ ఒకడు. రెండేళ్ల క్రితం వీళ్ల పెళ్లి సెన్సేషన్ అయిపోయింది. ఇతడితో పాటు దర్శ గుప్తా, సత్య, దీపక్, ఆర్జే అనంతి, సునీతో గోగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రసాద్, తర్షిక, వీజే విశాల్, అన్షిదా, అర్ణవ్, ముత్తుకుమార, జాక్వెలిన్ హౌసులోకి వచ్చారు. వీళ్లలో చాలామంది టీవీ నటులే ఉండటం విశేషం.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి) -
'మహారాజ' విజయం.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు.. ఎవరిచ్చారో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా రీసెంట్గా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చెన్నైలో సెలబ్రేషన్స్ జరిగాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా విజయం పట్ల మేకర్స్ ఫుల్ ఖుషి అయ్యారు.మహారాజా చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా కోలీవుడ్‌లో విడుదలైంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ జరిపారు. ఈ క్రమంలో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్ప్రైజ్ ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారును విజయ్ సేతుపతి చేతుల మీదుగా గిఫ్ట్‌గా అందించారు. ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులుఈ క్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నిథిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక నిథిలన్ శ్రమ ఎక్కువుగా ఉందని కొనియాడారు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా తనను ఎంతోమంది ప్రశంసించారని విజయ్ సేతుపతి గుర్తుచేసుకున్నారు. టీమ్ సహకారంతోనే మహారాజ సినిమా విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఒక తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో అనే కథను దర్శకుడు చాలా ఆసక్తిగా చెప్పాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించారు. మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి కీలకపాత్రలలో మెప్పించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్‌మ్యాన్.. ఫ్యాన్స్‌ను మెప్పిస్తాడా?
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కొత్త హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. గత ఏడు సీజన్స్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సారి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపించారు. హోస్ట్‌గా అందరితో నవ్వులు పూయించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో నటి మహాలక్ష్మిని పెళ్లాడిన ఆయన పలుసార్లు వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు.గతంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన రవీందర్ చంద్రశేఖరన్ తాజా తమిళ సీజన్లో బిగ్‌బాస్ హోస్లో అడుగుపెట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది కొత్త హోస్ట్ విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. #பிக்பாஸ் இல்லத்தில்.. #Fatman 😎 Bigg Boss Tamil Season 8 #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது.. நம்ம விஜய் டிவில.. #Nowshowing #BiggBossTamilSeason8 #TuneInNow #VijayTelevision #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil pic.twitter.com/LvYMbNhS1C— Vijay Television (@vijaytelevision) October 6, 2024 -
బిగ్‌బాస్ సీజన్-8.. కంటెస్టెంట్స్ వీళ్లేనా.. లిస్ట్ వైరల్!
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ షో అలరిస్తోంది. ఈ షో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి కాస్తా ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తమిళంలోనూ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఆయన తప్పుకున్నారు.ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-8 వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచే విజయ్ టీవీ ప్రసారం కానుంది. విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం ఈ షో ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షోను చూడొచ్చు. కాగా.. ఇప్పటికే మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.కంటెస్టెంట్స్ జాబితా వైరల్!బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8లో కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖంగా నటుడు వీటీవీ గణేశ్ వినిపిస్తోంది. ఆయనతో పాటు సునీతా గొగోయ్, పాల్ డబ్బా అలియాస్ అనీష్, అన్షిత అక్బర్షా, కేఆర్ గోకుల్, ఐశ్వర్య, అరుణ్ ప్రసాద్, దార్శిక, సౌందర్య నంజుండన్, విజే విశాల్ పేర్లు టాప్-10లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం దాదాపు 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ముగ్గురు-నాలుగు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.புது வீடு புது மனுசங்க, சண்ட போடுவாங்களா தெரியாது., ஆனா கண்டிப்பா சமாதானமா இருக்க மாட்டாங்க.. எதுவா இருந்தாலும் நான் Ready..🔥#GrandLaunch of Bigg Boss Tamil Season 8 - அக்டோபர் 6 முதல் மாலை 6 மணிக்கு நம்ம விஜய் டிவில.. 😎 #VJStheBBhost #Vijaysethupathi #BiggBossTamilSeason8 pic.twitter.com/gTjpbrL1x9— Vijay Television (@vijaytelevision) October 1, 2024 -
విజయ్ సేతుపతికి ఊహించలేనంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'బిగ్‌బాస్'
దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'.. ఇప్పటికే తెలుగులో సీజన్-8 ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి తమిళ్లో సీజన్-8 మొదలుకానుంది. అయితే, ఇప్పటి వరకు హోస్ట్‌గా ఉన్న కమల్ హాసన్ ఈ సీజన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కోసం విజయ్ సేతుపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకోనున్నారని పెద్ద చర్చే జరుగుతుంది.విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారు రూ.120 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. ఈ విజయం తర్వాత బిగ్‌బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్ బాస్ సీజన్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే ఆయన బిగ్‌బాస్‌లో కనిపిస్తారు. అందుకుగాను సుమారు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక యాడ్‌లో నటిస్తే రూ. 1కోటి వరకు ఛార్జ్ చేస్తారని టాక్. బిగ్‌బాస్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో చాలా యాడ్స్ వస్తుంటాయి. అలా చూస్తే విజయ్ సేతుపతికి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువే అని చెప్పవచ్చు. సేతుపతి మంచి నటుడే కాదు మంచి వక్త కూడా. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఆయన ఎంపిక పర్ఫెక్ట్ అని అంటున్నారు అభిమానులు. మక్కల్ సెల్వన్ తదుపరి సీజన్లకు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతాడని, భవిష్యత్తులో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కమల్ హాసన్ బిగ్‌బాస్ కోసం రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన తీసుకునే వారని ప్రచారం ఉంది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. నటుడు సూరికి ఈ మూవీ ఎంతో పేరు తెచ్చింది. సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన 'విడుదల పార్ట్ 2' రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో తెలుగు, తమిళంలో దీనిని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి. 'విడుదల పార్ట్ 2'లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ఢీ కొట్టాల్సి ఉంది. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా కూడా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇలా రెండు బిగ్ ప్రాజెక్ట్‌ల మధ్య 'విడుదల పార్ట్ 2' సినిమా రిలీజ్ కానుంది. Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw— VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024 -
హిందీ సినిమా రికార్డులు తిరగరాస్తున్న విజయ్ సేతుపతి..?
-
ఓటీటీలో 'మహారాజ' రికార్డ్.. నం.1 ప్లేస్
విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి.. రీసెంట్గా 'మహారాజ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తెలుగు, తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. కొన్నిరోజులకు ఓటీటీలోకి రాగా, అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)'మహారాజ'లో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు. సీరియస్ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు. దీంతో తెలుగు, తమిళంలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్) -
విజయ్ సేతుపతి మంచి మనసు.. సినీ పరిశ్రమలో ప్రశంసలు
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన మహారాజా సినిమా మంచి విజయం సాధించింది. తమిళంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహారాజా సినిమాతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంలో విజయ్ సేతుపతి సినీరంగంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్టిస్టులకు, వారి కుటుంబాలకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో, హాస్యనటుడు తెనాలి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి నిలిచాడు.చాలా చిత్రాలలో హాస్య పాత్రల్లో నటించిన ఆయన విజయ్ సేతుపతి చిత్రాల్లో కూడా నటించారు. ఆయన కుమారుడు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదివేందుకు ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నాడని తెలుసుకున్న నటుడు భావ లక్ష్మణన్.. ఆ విషయాన్ని విజయ్ సేతుపతికి చేరవేశాడు. దీంతో విజయ్ సేతుపతి వెంటనే కాలేజీ ఫీజు రూ.76 వేల రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని కూడా చెప్పడంతో వారు సంతోషించారు. ఈ సందర్భంగా నటుడు తెనాలి మాట్లాడుతూ.. నా కుటంబానికి సాయం చేసిన విజయ్ సేతుపతిని భవిష్యత్తులో ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు. ఈ వార్త విజయ్ సేతుపతి అభిమానులను సంతోషపెట్టింది. ఆర్థికంగా చితికిపోయిన చాలామంది చిన్న ఆర్టిస్టులకు అండగా నిలిచేందుకు విజయ్ సేతుపతి ముందుకు వచ్చారు. ఈ చర్యకు సినీ పరిశ్రమలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా ఆ స్టార్ హీరోనే.. !
బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోలల్లో బిగ్‌బాస్ రేంజ్ వేరు. ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈ సీజన్లో ఎవరు హోస్ట్‌గా ఉండబోతున్నారన్న విషయంపై కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడంతో ఎవరు వస్తారన్న ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొంది.ఈ నేపథ్యంలోనే మరో కోలీవుడ్ స్టార్ హీరో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ లిస్ట్‌లో హీరో శింబు పేరు కూడా వినిపించింది. కానీ చివరికీ విజయ్ సేతుపతినే ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఎందుకంటే..తమిళ బిగ్‌బాస్ సీజన్-8కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ షోతో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల రియాలిటీ షోకు హోస్ట్‌గా పనిచేయడం ఆయనకు కొత్తేమీ కాదు. అందుకే ఆ అనుభవం బిగ్‌బాస్‌కు పనికొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా.. బిగ్ బాస్ సీజన్- 8 అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. త్వరలో కొత్త హోస్ట్‌తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా కమల్ హాసన్ ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. స్టార్ హీరో ప్లేసులో మరో హీరో?
మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున ఉన్నాడు. తమిళంలో మాత్రం కమల్ తప్పుకొన్నాడు. రీసెంట్‌గానే పోస్ట్ పెట్టడంతో ఆడియెన్స్ షాకయ్యారు. దీంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరా అని మొన్నటి నుంచి సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)బిగ్ బాస్ షో తెలుగు-తమిళంలో ఒకేసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈసారి సరికొత్తగా ఉండనుందని రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రోమోతో చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో మాత్రం కమల్ స్థానంలో విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారు. హీరో శింబుని కూడా అనుకున్నారు. కానీ మూవీ కమిట్మెంట్స్ వల్ల కుదరలేదని, సేతుపతి ఫైనల్ అయ్యిందని అంటున్నారు.మరోవైపు విజయ్ సేతుపతి, శింబు కాదని ఏకంగా నయనతార హోస్టింగ్ చేయనుందనే రూమర్ కూడా వస్తోంది. సేతుపతి లేదా నయనతార.. వీళ్లెవరైనా సరే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీలే. మరి వీళ్లలో బిగ్ బాస్ తమిళ కొత్త హోస్ట్‌గా ఎవరు ఫిక్స్ అవుతారనేది చూడాలి?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
తమిళ 'బిగ్‌బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. కమల్ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
'మహారాజ'కు రజనీకాంత్ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆయన సీనీ కెరీర్లో 50వ మైలురాయిని అందుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేడం చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సినీ విమర్శకుల చేత కూడా మెప్పించే విధంగా కథ ఉండటంతో అభినందనలు దక్కాయి. సస్పెన్స్, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందించారు.మహారాజ సినిమాలో దర్శకుడి ప్రతిభ ఎంతమేరకు ఉందో విజయ్ సేతుపతి నటన కూడా అంతే స్థాయిలో ఉంది. సినిమా మొత్తం తన భుజాలపై మోసి అద్భుతమైన నటుడిగా మళ్లీ నిరూపించుకున్నారు. కేవలం రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు రాబట్టింది. ఇంతటీ హిట్ అందుకున్న మహారాజ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్ చూశారు. ఈ సందర్భంలో దర్శకుడు నితిలన్ సామినాథన్ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. రజనీకాంత్ చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. ఆ విషయాలను నిథిలన్ ఇలా పంచుకున్నారు. ప్రియమైన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సమావేశంలో మీ అనుభవాల నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేను. మహారాజా సినిమా మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో తలచుకుంటేనే ముచ్చటగా ఉంది. చిరకాలం ఆనందంగా ఉండాలని నన్ను ఆశీర్వదించారు. మరోసారి ధన్యవాదాలు తలైవా..' అని దర్శకుడు నితిలన్ సామినాథన్ పోస్ట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు లైకులు, కామెంట్లు విసురుతున్నారు. తలైవాను కలుసుకునే అవకాశం దక్కినందుకు కంగ్రాట్స్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. -
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్‌పాట్!
కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
విజయ్ సేతుపతి ‘ట్రైన్’ కోసం.. ‘శ్రుతి’ గానం
తమిళ సినిమా: నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ట్రైన్ చిత్రం. నటి డింపుల్ హైయతీ నాయకిగా నటిస్తున్నారు. ఆర్.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్.రవికుమార్, వినయ్ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, అందులో ఓ పాటను దర్శకుడు మిష్కిన్ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కాగా డార్క్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ట్రైన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిసింది. కాగా దర్శకుడు మిష్కిన్ ఈ చిత్రానికి ముందు పిశాచి – 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఆ చిత్రాని కంటే ముందు ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. -
Maharaja: ఓటీటీలో ‘మహారాజా’ రికార్డు
విజయ్ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజా’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పెద్దగా ప్రచారమే లేకుండా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 20 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. జులై 12 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ ప్రేక్షకులను కాదు.. ఓటీటీ ప్రియుల మనసును కూడా ‘మహారాజా’ దోచేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ట్రెండింగ్ జాబితాలో(ఇండియాలో) ‘మహారాజా’ తొలి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.. ‘ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది’ అని ఆనందం వ్యక్తం చేసింది.‘మహారాజా’ కథేంటంటే.. మహారాజా(విజయ్ సేతుపతి) ఓ బార్బర్. అతనికి భార్య, కూతురు ఉంటుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోవడంతో.. కూతురుతో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అతని కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాడు. అయితే ఓ రోజు నిండు గాయాలతో పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తారు. (చదవండి: అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య)తన కూతురు ప్రాణాలను కాపాడిన ‘లక్ష్మి’ని ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తాడు. దాన్ని వెతికేందుకు పోలీసులకు రూ. 7 లక్షల లంచం ఇవ్వడానికి కూడా సిద్దపడతాడు. మరి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లిన ఆ ముగ్గురు ఎవరు? వారికి మహారాజాతో ఉన్న వైరం ఏంటి? రూ. 500 వందల విలువ చేసే చెత్తబుట్ట(లక్ష్మి) కోసం రూ. 7 లక్షలు కూడా ఇవ్వడానికి కారణం ఏంటి? చివరకు లక్ష్మి దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .This Maharaja’s on top, as he should👑 Watch Maharaja, now trending #1 on Netflix! #MaharajaOnNetflix pic.twitter.com/0DuJV9kavq— Netflix India South (@Netflix_INSouth) July 15, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
కంటెంట్ బాగుంటే ప్రచారాలు, ఆర్భాటాలు ఏవీ అవసరం లేదు. మౌత్ టాక్‌తోనే హిట్ సాధించేస్తాయి. అలా విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఆశ్చర్యంగా పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ కలెక్షన్స్ ఎక్కువయ్యాయి. అలా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది.ఓటీటీలో..నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14న తెలుగులో విడుదలైంది. ఇందులో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం (జూలై) 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని ఓటీటీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!కథేంటంటే?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ రోజు యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త డబ్బా వల్ల కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటాడు. ఓ రోజు లక్ష్మి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత ఏమైంది? లక్ష్మి దొరికిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం -
విజయ్ సేతుపతి సరసన...
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట. గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది. -
రూ. 100 కోట్లతో మహారాజా.. ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే..?
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న విడుదలైంది. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.విజయ్ సేతుపతి కెరియర్లో మహారాజా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం మహారాజా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 19న OTT విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ్ వర్షన్స్ రెండూ ఒకేరోజు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళంలో కూడా బయర్స్‌కు లాభాల పంటను పడించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్‌లలో సందడి చేస్తుంది. టాలీవుడ్లో అయితే, ఏకంగా రూ. 20 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ విషయంలో కూడా మహారాజా సినిమాను మంచి రేటుతోనే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
విజయ్ సేతుపతి ఫ్రీగా నటించిన సినిమా.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్
విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. 'మహారాజ' మూవీతో తెలుగు, తమిళంలో అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు. మూవీ వచ్చిన రెండు వారాలైనప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మరోవైపు ఇతడు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ఓ తమిళ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సేతుపతి అద్భుతమైన నటుడు. కాకపోతే సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్గా తన 50వ మూవీ 'మహారాజ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ఇతడు అతిథి పాత్రలో నటించిన తమిళ మూవీ 'అళగియ కన్నె'.. గతేడాది జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిందే లేటు అంటే మళ్లీ అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.రొమాంటిక్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్ విజయ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ డైరెక్టర్‌పై ఉన్న అభిమానంతోనే విజయ్ సేతుపతి.. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటించాడు. ఇందులో నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. కాకపోతే సినిమా రొటీన్‌గా ఉండేసరికి జనాలు సినిమా పెద్దగా ఆడలేదు. దర్శకుడు కావాలనే ఓ కుర్రాడు.. నాటకాల్లో పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కులాల వేరు కావడంతో పెద్దలు ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఈ కుర్రాడికి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?) -
చరణ్ బుచ్చిబాబు మూవీపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
-
తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇంత వరకు తెలుగులో డైరెక్ట్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెళ్లడించారు.విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. 'నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ. ఆ ప్రాజెక్ట్‌లో వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక్కడి వారు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్ చేసిన పాత్రకు నేను సెట్ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. భవిష్యత్‌లో నాకు సెట్ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను.' అని విజయ్ సేతుపతి అన్నారు.నిథిలన్- విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మహారాజ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆధరిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్ వంటి వారు కీలక ఇందులో పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ చిత్రంగా జూన్ 14న మహారాజ విడుదలైంది. ఇప్పటికే సుమారు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
'మహారాజ' కలెక్షన్స్.. దుమ్మురేపిన విజయ్‌సేతుపతి
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిథిలన్ ఈ మూవీని తెరకెక్కించారు. అనురాగ్ కశ్యప్, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ చిత్రంగా జూన్ 14న మహారాజ విడుదలైంది.మహారాజ చిత్రం విడుదల సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. కానీ, మొదటిరోజు తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చాలా బాగుందంటూ కితాబు ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మహారాజ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతుండటంతో పంపిణీదారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.మహారాజ కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 40కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. తెలుగులోనే రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బార్బర్‌గా నటించి మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. నేటి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా మహారాజ ఉందని ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. మహారాజ ఓటీటీ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో ఓటీటీ డీల్ కూడా భారీగానే సెట్ అయినట్లు తెలుస్తోంది.జులై రెండో వారంలో ఓటీటీలోకి మహారాజ విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
అప్పుడు భయం వేసింది: విజయ్ సేతుపతి
‘‘మహారాజ’ విడుదలకి ముందు హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమాభిమానాలు చూసి కొంచెం భయం వేసింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నా. తెలుగు ప్రేక్షకులు అది నెరవేర్చడం ఆనందాన్నిచ్చింది. తెలుగు వారు నాపై చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్టౌన్లానే అనిపిస్తోంది. నాకు ఈ అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు.నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ మూవీని తెలుగులో ఎన్వీఆర్ సినిమా ఈ నెల 14న రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మహారాజ’ మూవీ థ్యాంక్స్ మీట్లో నితిలన్ సామినాథన్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల నుంచి మా ‘మహారాజ’కి లభిస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు ‘‘మహారాజ’ని కుటుంబంతో కలసి చూడండి.. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ మారుతి. ‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘మహారాజ’’ అన్నారు మరో అతిథి గోపీచంద్ మలినేని. ‘‘ఈ సినిమా హిట్ ఏ రేంజ్‌కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం’’ అన్నారు ఇంకో అతిథి బుచ్చిబాబు సాన. డైరెక్టర్ అనీల్ కన్నెగంటి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
మహారాజ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచవలేదు. అసలు మహారాజ సినిమా ఏంటి? ఇదెప్పుడు తీశారు? అని చాలామంది అనుకున్నారు. అయితే రిలీజైన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్‌తోనే మహారాజ గురించి అందరికీ తెలిసొచ్చింది. విజయ్ సేతుపతి నటన, నితిలన్ సామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఏ రోజుకారోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది.రామ్‌చరణ్ సినిమాలో?జూన్ 14న ఈ ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం రిలీజవగా.. సోమవారం నాడు చిత్రయూనిట్ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సేతుపతి ఓపికగా సమాధానాలిచ్చాడు. బుచ్చిబాబు-చరణ్(#RC16) మూవీలో ఏదైనా పాత్ర చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమన్న క్వశ్చన్‌కు రొమాంటిక్ పాత్రలు చేయడం ఎక్కువ ఇష్టమన్నాడు.సీరియస్‌గా ట్రై చేశా..సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ తీసుకున్నారు.. అలాగే పుష్ప సినిమా రిజెక్ట్ చేశారా? అన్న ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ.. నేను సీరియస్‌గా ప్రయత్నించాను సర్, కానీ నాకు ఎవరూ అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో ఛాన్స్ నేను రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలే మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని పేర్కొన్నాడు.ఎప్పుడో చెప్పిన సేతుపతికాగా పుష్ప 1 షూటింగ్‌కు ముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2020వ సంవత్సరంలోనే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. పుష్పలో భాగం కావాలని ఉన్నప్పటికీ డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. దర్శకుడు సుకుమార్‌ను కలిసి మరీ తన నిర్ణయాన్ని తెలిపినట్లు వెల్లడించాడు.చదవండి: పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా? -
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ మహారాజా చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో పర్యటించారు. ఓ హోటల్ జరిగిన ఈవెంట్లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీలో కలిసి పనిచేసిన బుచ్చిబాబు ఏకంగా విజయ్ సేతుపతి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి
'మహారాజ' సినిమాతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హాఫ్ సెంచరీ కొట్టాడు. తన కెరీర్‌లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూతురు జ్యోతిగా సాచన నమిదాస్ అనే అమ్మాయి నటించింది. చివర్లో నేను..అయితే ఈ సినిమా కోసం సెలక్ట్ చేసినప్పుడు తనను తీసుకోవద్దని సేతుపతి సూచించాడట. తాజాగా ఈ విషయాన్ని సాచన బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. చాలామంది ఆడిషన్‌కు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ సహా అంతా అయిపోయేసరికి చివర్లో నేను, మరో అమ్మాయి మిగిలాం. విజయ్ సేతుపతిగారు నన్ను వద్దని సూచించారు. మరో అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చారు.నన్ను వద్దన్నారుకానీ దర్శకుడు నితిలన్ సర్ మాత్రం నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి సినిమాలో తీసుకున్నారు. షూటింగ్ మొదలైన వారం రోజులకే నన్ను తీసుకుని మంచి పని చేశారని విజయ్ సేతుపతి తండ్రి డైరెక్టర్‌ను మెచ్చుకున్నారు. చాలామంది నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు నా వయసు 18 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సేతుపతి సైతం సాచన నటనను మెచ్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక చిత్రం చేస్తున్నాడు.చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. -
నయనతార భర్తతో గొడవ..స్పందించిన విజయ్ సేతుపతి
మహారాజా చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. తన కెరీర్లో 50వ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడంతో విజయ్ సేతుపతి ఆనందం వ్యక్తం చేశాడు.అంతేకాదు ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో జరిగిన గొడవపై స్పందించాడు. అతన్ని అపార్థం చేసుకోవడం వల్లే గొడవ జరిగిందని చెప్పారు.(చదవండి: మహారాజా మూవీ రివ్యూ)‘నానుమ్ రౌడీ థాన్’(తెలుగులో నేను రౌడీ) సినిమా షూటింగ్ మొదటి రోజే విఘ్నేశ్‌తో గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం నేనే అతని ఫోన్ చేసి ‘నువ్వు నాకు నటన నేర్పుతున్నావా?’అని గట్టిగా అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార వచ్చి మా ఇద్దరికి నచ్చచెప్పింది. వాస్తవానికి నేను విక్కిని సరిగా అర్థం చేసుకోలేదు. స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించి వెంటనే ఓకే చెప్పాను. కానీ షూటింగ్ రోజు ఆయన అంచనాకు తగ్గట్టుగా నటించలేదు. మొదటి నాలుగు రోజు నా పాత్రను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు అభద్రతాభావానికి గురయ్యాను. ఒకరికొకరం అర్థం చేసుకున్నాక.. షూటింగ్ సాఫీగా సాగిపోయింది. విఘ్నేశ్ టాలెంట్ ఉన్న దర్శకుడు. ఎవరు టచ్ చేయని కథలను గొప్పగా తీయగలడు. ఇప్పడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాం’అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్‌లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్‌గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్‌లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి సూపర్ యాక్టర్. హీరో అని మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటాడు. ఇతడు 50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి సేతుపతి చెప్పినట్లు హిట్ కొట్టాడా? 'మహారాజ' ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ. (Maharaja Movie Review)ఎలా ఉందంటే?కొన్ని సినిమాల గురించి ఏ మాత్రం ఎక్కువ మాట్లాడుకున్నా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. చూసేటప్పుడు ఫీల్ మిస్ అవుతుంది. 'మహారాజ' సరిగ్గా అలాంటి సినిమానే. రెండున్నర గంటల సినిమానే గానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సరదాగా మొదలైన మూవీ కాస్త మెల్లమెల్లగా సీరియస్ టోన్‌లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.హీరో భార్య, కూతురు ఓ ఇంట్లో కూర్చుని ఉండగా.. సడన్‌గా ఓ లారీ వచ్చి వాళ్లపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో హీరో భార్య చనిపోతుంది. ఓ చెత్త డబ్బా వల్ల కూతురు బతుకుంది. దీని తర్వాత వర్తమానంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఫస్టాప్ అంతా సరద సరదాగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరో అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడా? ఎందుకు అందరితో తన్నులు తింటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడో ఓ మూల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని డౌట్ వస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్లేసరికి చూస్తున్న ఆడియెన్స్‌కి కిక్ వస్తుంది.ఏదో సినిమా తీస్తున్నాం కదా అని అనవసరంగా పాటలు, కమర్షియల్ అంశాల పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏదో ఎంత కావాలో ఏ సీన్ ఎక్కడుండాలో ఫెర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ' అని చెప్పొచ్చు. అలానే చూస్తున్నప్పుడు ఎక్కడా సినిమా చూస్తున్నామని అనిపించదు. మన పక్కింట్లో వాళ్ల జీవితం చూస్తున్నం అనిపించేంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.ఎవరెలా చేశారు?విజయ్ సేతుపతి పాత్రే డిఫరెంట్. దేనికి కూడా త్వరగా రియాక్ట్ అవడు. చాలా నెమ్మదిగా ఎమోషనల్‌గా బరస్ట్ అవుతాడు. చూడటానికి మామూలుగా కనిపిస్తాడు గానీ ఒక్కోసారి ప్రేక్షకుల మైండ్ పోయాలా ప్రవర్తిస్తాడు. దీన్ని సేతుపతి పిక్టర్ ఫెర్ఫెక్ట్గా చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశాడు. కృూరంగా కనిపిస్తూనే చివర్లో ఎమోషన్‌తో మనసు పిండేస్తాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఒకటి రెండు సీన్స్‌లో కనిపించే భారతీ రాజా, ఎస్సైగా నటరాజన్ సుబ్రమణియం ఆకట్టుకున్నారు.టెక్నికల్ విషయాలకొస్తే.. స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ అండ్ రామ్ మురళి అనే అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫెర్ఫెక్ట్ మూవీ అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ సీట్లలో కూర్చోబెట్టేశాడు. స్క్రీన్ ప్లేకి తగ్గట్లు ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే హింస, క్రైమ్ ఇందులో గట్టిగానే ఉంది. పాటలు, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో ఉండవు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం 'మహారాజ' నచ్చేస్తుంది. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ మాత్రం అస్సలు రివీల్ చేయొద్దు. (Maharaja Movie Review In Telugu)-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్వీఆర్ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే ‘మైఖేల్’లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుక్ ఖాన్గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
స్టార్ హీరోతో మమతా మోహన్ దాస్.. డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్లో యమదొంగ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్. మలయాళంతో పాటు తెలుగులోనూ నటించింది. వెంకటేశ్ సరసన చింతకాయల రవి చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన మమతా సినిమాలకు దూరమైంది. చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కోలీవుడ్‌లో మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. "నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ నాపై ప్రశంసలు కురిపించారు.' అని అన్నారు.డేటింగ్ గురించి మాట్లాడుతూ..'గతంలో లాస్ఎంజిల్స్లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్లో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే' అని అన్నారు. మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం మమతా నటించిన మహారాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్, నట్టి నటరాజ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది. -
దీపావళికి ఐదు సినిమాలు.. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కూడా!
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో భారీ చిత్రాలు తెరపైకి వస్తుంటాయి. అదే విధంగా ఈ దీపావళికి తమిళంలో పాంచ్ పటాక్గా ఐదు చిత్రాలు బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. వాటిలో విడుదలై– 2 చిత్రం ఒకటని తెలుస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హాస్యనటుడు సూరి కథానాయకుడిగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన చిత్రం విడుదలై. గతేడాది మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దీనికి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఇదే దీపావళికి మరో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి, సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రాలతో పాటు, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఎల్ఐసీ, కవిన్ హీరోగా నటిస్తున్న కిస్ చిత్రాలు దీపావళి రేసుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం. మరి అప్పటివరకు వీటిలో ఏది బరిలో ఉంటుందో, ఏది తప్పుకుంటుందో చూడాలి. -
విజయ్ సేతుపతి మహారాజా మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
మహారాజపై నమ్మకం ఉంది: విజయ్ సేతుపతి
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ మూవీ విజయంపై చాలా నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. థియేటర్స్‌కి వచ్చి చూడండి’’ అని విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది.ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్ వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మహారాజ’ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో కొంత గ్యాప్ తర్వాత నేను చేసిన సినిమా ‘మహారాజ’. విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు’’ అన్నారు.‘‘విజయ్‌గారి 50వ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నితిలన్ సామినాథన్ . ‘‘మహారాజ’ లో మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. విజయ్‌గారి నట విశ్వరూపం చూస్తారు’’ అన్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నటి అభిరామి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
కృతి శెట్టి హీరోయిన్ గా ఉంటే నేను చేయనని ఖరాకండిగా చెప్పిన హీరో..!
-
కూతురి లాంటి ఆమెతో రొమాన్స్ చేయలేను.. స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగాఉప్పెన ఫేమ్ కృతిశెట్టిపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో సినిమాలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని చెప్పా. కూతురిగా భావించిన కృతిశెట్టితో నటించడం నా వల్ల కాదు' అని అన్నారు. కాగా.. గతంలోనూ విజయ్ సేతుపతి ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్గా కృతిని ఎంపిక చేయగా తిరస్కరించారు. -
విడుదలకు ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరో!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా. ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా..ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది 50వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్ చేసుకుంది.ఈ మూవీని ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తెలుగు వర్షన్ విడుదలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. #MaharajaFrom June 14th@VijaySethuOffl #VJS50 pic.twitter.com/zASbuIUjxy— Nithilan Saminathan (@Dir_Nithilan) June 5, 2024 -
నా లక్ష్మీ కనిపించట్లేదు.. విచిత్రమైన పాత్రలో సేతుపతి!
విజయ్ సేతుపతి ఓ నటుడు. నటుడు అని ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కాకుండా హీరో, విలన్ తదితర పాత్రలు చేస్తూ మెప్పిస్తుంటాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ సినిమా 'మహారాజా'. సుదన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ సంగీతమందించాడు. ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)ఈ మూవీలో విజయ్‌సేతుపతి.. ఓ సెలూన్ షాప్ ఓనర్. ఓసారి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి తన లక్ష్మి కనిపించకుండా పోయిందని, ఎఫ్ఐఆర్ రాసి దాన్ని వెతికి పట్టుకోవాలని చెబుతాడు. ఇంతకీ కనిపించకుండా పోయిన లక్ష్మి ఎవరనేదే సస్పెన్స్. అయితే ఇందులో సేతుపతి ఫుల్ డీ గ్లామర్ లుక్‌తో కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం ఆగితే సరి!(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే) -
అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరో మాత్రమే కాదు అందరినీ మెప్పించే విలన్ కూడా.. టాలీవుడ్,కోలీవుడ్‌లో తన నటనతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అందుకే విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు మలేషియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.తాజాగా విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో పెళ్లికి వచ్చిన అతిథిలు అందరూ ఆశ్చర్యపోయారు. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజయ్ సేతుపతికి అభిమానులు. అంతేకాకుండా విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా ఒకరు ఉంటే మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ అన్నదమ్ములు మే 2న తమకు నచ్చిన యువతులను పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, విజయ్ సేతుపతికి 2వ తేదీలో సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో నేడు వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఆయన ఒక బాలుడిని ఎత్తుకుని ఫోటో దిగడం విశేషం. అనంతరం మెట్టుపాళయంలో షూటింగ్‌కు బయలుదేరారు.மணமக்கள் ஹாப்பி அண்ணாச்சி...! ரசிகர் மன்ற மாவட்ட தலைவர், துணைச் செயலாளரின் இல்லத் திருமண விழா...நேரில் கலந்து கொண்டு மணமக்களை வாழ்த்திய விஜய் சேதுபதி#Madurai | #VijaySethupathi | #Marriage | #PolimerNews pic.twitter.com/3XrVXk9Pdq— Polimer News (@polimernews) May 30, 2024 విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా మహారాజ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. -
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్‌గా ఉంటే..విలన్ నెగటివ్‌గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్‌గాను మారుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్ హీరోలపై ఓ లుక్కేయండి. -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్‌గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్‌గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కలర్‌ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్‌తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన స్టార్ హీరో
తమిళనాడులో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ ప్రముఖ హీరోలు క్యూ కట్టారు. సెలబ్రిటీలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూలలో నిలబడి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, నటుడు ధనుష్, నటుడు విక్రమ్ వంటి ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉన్న విజయ్ కూడా ఈరోజు తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. చేతికి చిన్న గాయంతో కనిపించిన విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్ ఉన్న నటుడు అని ఆమె కొనియాడింది. దీంతో వెంటనే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది అభిమానులు ఆయనతో కరచాలనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. This Is Why He Is Makkal Selvan #VijaySethupathi 🥹❤️pic.twitter.com/txOW6vF731 — Kolly Corner (@kollycorner) April 19, 2024 -
విజయ్ సేతుపతి కొత్త మూవీ.. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ట్రైన్ ఒకటి. డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరాం, కేఎస్ రవికుమార్, నాజర్, వినయ్‌రాయ్, భావన, సంపత్ రాజ్, బబ్లూ పృథ్వీరాజ్, యుగీ సేతు, గణేష్ వెంకట్రామన్, శ్రీరంజని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే దీనికి సంగీతం అందించడం విశేషం. ఇంతకు ముందు మిస్కిన్ 'డెవిల్' అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి గెస్ట్‌రోల్ చేశారు. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఇప్పుడు ట్రైన్ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా మిస్కిన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైన్ మూవీ కోసం భారీ రైలు సెట్ వేసి అధిక భాగం షూటింగ్‌ను అందులోనే చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన సరికొత్తగా ఉంటుందని దర్శకుడు మిస్కిన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి విడుదల తేదీ తదితర వివరాలను వెల్లడించనున్నట్లు యూని ట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: తల్లి మరణంతో ఒంటరి జీవితం.. ఆ కారణంతో పెళ్లికి కూడా దూరం -
అట్లీ నిర్మాతగా స్టార్ హీరోతో సినిమా ప్లాన్
భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగుతున్న పేరు అట్లీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ దర్శకుడు నిర్మాతగానూ సక్సెస్‌పుల్ చిత్రాలను చేస్తున్నారు. రాజారాణీ చిత్రంతో తన దర్శక పయనాన్ని సక్సెస్‌పుల్‌గా మొదలుపెట్టిన అట్లీ ఆ తరువాత విజయ్ హీరోగా మెర్సిల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి షారూఖ్‌ఖాన్ 'జవాన్' సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. నయనతార, దీపికాపడుకొనే హీరోయిన్లుగా నటించిన ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా అదరగొట్టారు. ఈ చిత్రం రూ.వెయ్యి కోట్లు వసూలు చేసింది. కాగా ప్రస్తుతం దర్శకుడు అట్లీ టాలీవుడ్‌పై దృష్టి సారించారు. స్టార్ హీరో అల్లుఅర్జున్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇందులో నటి త్రిష ఒక నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని, గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్ పుట్టిన రోజు అయిన ఈ నెల 8వ తేదీన వెల్లడించనున్నట్లు తాజా సమాచారం. కాగా దర్శకుడు అట్లీ ఏ ఫర్ యాపిల్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, ఇంతకు ముందు నటుడు జీవా హీరోగా సంగిలి బుంగిలి కదవ తొర అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. తాజాగా తన శిష్యుడు కలీస్‌కు దర్శకత్వం అవకాశం కల్పించి, హిందీలో బేబీజాన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది తమిళ చిత్రం తెరి కి రీమేక్ అన్నది గమనార్హం. ఇందులో వరుణ్ దావన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి కీర్తీసురేష్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అట్లీ డైరెక్టర్ కాదట.. నిర్మాతగా మాత్రమే ఉండనున్నారట. దీనికి 'నడువుల కొంచెం కానోమ్' చిత్రం ఫేమ్ బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
‘రవికుల రఘురామ’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది: విజయ్ సేతుపతి
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ మూవీ..
భాషాభేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్‌గా, హీరోయిన్ తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. పాత్ర నచ్చాలే కానీ ఏదైనా ఓకే అంటున్నాడు. ఈయన ఇటీవల హీరోగా నటించిన చిత్రం మెర్రీ క్రిస్మస్. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి చివరకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ముందుగా హిందీ, తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. Vijay Sethupathy’s #MerryChristmas will be streaming from Mar 8 on NETFLIX. pic.twitter.com/t3iNs7obth — Christopher Kanagaraj (@Chrissuccess) March 6, 2024 చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు -
నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బద్లాపూర్ వంటి థ్రిల్లర్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్‌లోనే మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని టాక్. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. -
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఇక పై హీరోగానే కనిపించబోతున్నాడా ?
-
మా అమ్మ మధురైలో ఓ స్కూల్లో పని చేసింది: హీరోయిన్
విజయ్‌సేతుపతితో కలిసి నటించడం మంచి అనుభవమని బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అన్నారు. బాలీవుడ్లో ప్రముఖ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించిన ఈమె తొలిసారిగా మెర్రీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించారు. బద్లాపూర్, అంధదూన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో పని చేశా.. అందుకే విజయ్‌సేతుపతి, కత్రికా కైఫ్, దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ సహా తదితరులు పాల్గొన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. తను ఆరంభ దశలో దుబాయిలో పని చేయడం వల్ల హిందీ భాష తెలుసన్నారు. అది ఈ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యిందని చెప్పారు. కత్రినా కైఫ్ మాట్లాడుతూ తనకు చైన్నె అంటే చాలా ఇష్టం అన్నారు. తన తల్లి కూడా కొంత కాలం మధురైలోని ఒక పాఠశాలలో పనిచేశారని చెప్పారు. తమిళంలో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ తను ఇప్పటికే దక్షిణాదిలో తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించానని ఇప్పుడు తొలిసారిగా మెర్రీ క్రిస్మస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటించడం ఇంకా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ చిత్రం కోసం ముందుగా తాము రిహార్సల్స్ చేశామని చెప్పారు. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: హనుమాన్, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్ -
సూపర్ స్టార్ సినిమాలో విలక్షణ నటుడు.. మరోసారి విలన్‌గా!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రను పోషించిన లాల్ సలామ్. విష్ణువిశాల్, విక్రాంత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటితే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ చిత్రం పొంగల్‌కు విడుదల కానుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో ఆయన మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పవర్‌పుల్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి ఇప్పుటికే రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో నటుడు శివకార్తీకేయన్ ముఖ్య పాత్రలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్రనైనా పోషిస్తూ తన స్థాయిని జాతీయ స్థాయికి పెంచుకుంటూ పోతున్న విజయ్ సేతుపతి.. ఆ మధ్య మాస్టర్ చిత్రంలో విజయ్‌తో ఢీకొట్టారు. ఆ తరువాత విక్రమ్ చిత్రంలో కమలహాసన్‌తో పోటీ పడ్డారు. అంతకు ముందే రజినీకాంత్‌తో పేట చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. తాజాగా విజయ్ సేతుపతి మరోసారి రజినీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
డింపుల్ హయత్‌కు గోల్డెన్ ఛాన్స్.. స్టార్ హీరోతో సినిమా
కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు విజయ్‌సేతుపతి. ఆ తరువాత కథానాయకుడు స్థాయికి ఎదిగారు. అలా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈయన ఆ తరువాత ప్రతినాయకుడిగానూ సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల హిందీ చిత్రం జవాన్‌లో షారూఖ్‌ఖాన్‌తో ఢీకొని సక్సెస్ అయ్యారు. మళ్లీ వరుసగా కథానాయకుడు పాత్రలో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇకపై విలన్‌గా నటించనని స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అలా ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'ట్రైన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇది స్వతంత్య్ర నేపథ్యంలో సాగే ట్రైన్ ట్రావెలింగ్ కథా చిత్రం కావడంతో దీనికి ట్రైన్ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో విజయ్‌సేతుపతి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో డింపుల్ హయత్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఈరా దయానంద్, నాజర్, భావన, బట్లు పృథీరాజా, కేఎస్ రవికుమార్, రూడీసేతు, గణేష్ వెంకట్రామన్, కనిహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్‌నే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పాసియా పాతిమా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్, నాజర్, నిర్మాత మురళిరామస్వామి, రాధాకృష్ణన్, ఎస్.కదిరేశన్, అన్బుచెలియన్ హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
కొత్త ప్రయాణం ఆరంభం
రైలు ప్రయాణం మొదలు పెట్టారు విజయ్ సేతుపతి. ఆయనతో జర్నీ షేర్ చేసుకుంటున్నారు డింపుల్ హయతి. విజయ్ సేతుపతి హీరోగా డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు ‘ట్రైన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారు మిస్కిన్. -
విజయ్ సేతుపతి క్రేజ్.. మలేషియాలో వేలసంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన 50వ చిత్రం మహరాజాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా తాజాగా తన 51వ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేశారు. 7 సీస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఒరు నల్లనాళ్ పార్తు సొల్రేన్ చిత్రం ఫేమ్ పి.ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌సేతుపతి, ఆర్ముగకుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న రెండవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయకిగా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. నటుడు యోగిబాబు, పీఎస్.అవినాష్, దివ్యాపిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బగత్తూర్ రావత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మలేషియా నేపథ్యంలో సాగే లవ్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం మలేషియాలోనే నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూటింగ్ చేయని కొత్త ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇటీవల విజయ్‌సేతుపతి చైనీస్ స్టంట్ కళాకారులతో పోరాడే భారీ ఫైట్ సన్నివేశాలను, ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకిరించినట్లు చెప్పారు. పత్తుమలై మురుగన్ ఆలయం వద్ద తుది ఘట్ట సన్నివేశాలను రూపొందించినట్లు తెలిపారు. విజయ్ సేతుపతిని చూడడానికి మలేషియాలోని ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారని, వారందరికి విజయ్‌సేతుపతి చిరునవ్వుతో అభివాదం చేసి సంతోషపరిచారని చెప్పారు. షూటింగ్ పూర్తికావడంతో త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: కెప్టెన్ విజయకాంత్ మరణించారంటూ వదంతులు.. వీడియో రిలీజ్ చేసిన నటుడి భార్య -
పిశాచి డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి సినిమా.. కాన్సెప్ట్ ఏంటంటే?
వైవిధ్య భరిత కథా చిత్రాల నటుడిగా పేరు గాంచిన నటుడు విజయ్ సేతుపతి. విభిన్న కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్ సేతుపతి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. జవాన్ చిత్రంతో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. ఇక చిత్తిరం పేసుదడి, అంజాదే, పిశాచి వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న దర్శకుడు మిష్కిన్. కాగా ఈ రేర్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుందని సమాచారం. ఇది ట్రైన్ ట్రావెలింగ్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. రైలులో జరిగే కథ కావడంతో దీనికి ట్రైన్ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. జయరాం ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారని.. దర్శకుడు మిష్కిన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈయన ఇటీవలే డెవిల్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఇదే విధంగా మిష్కిన్ తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నిదిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై యూనిట్ వర్గాలు చాలా నమ్మకంతో ఉన్నాయి. చదవండి: ఇంట్రెస్టింగ్గా వీకెండ్ ఎపిసోడ్.. హాట్ బ్యూటీ అశ్విని ఎలిమినేట్ -
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. నిలిచిన విజయ్ సేతుపతి సినిమా!
కోలీవుడ్‌లో నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా సౌత్ ఇండియాలో పెద్ద చర్చాంశంగా మారింది. త్రిషకు మన్సూర్ సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. తమిళ చిత్రసీమలో ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయని.. ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా పలువురు హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురికావడం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ మనీషాపై సుమారు 9 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తెరపైకి వచ్చింది మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులు శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన 'ఉదామ విధ ఏవల్' చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే, కొడైకెనాల్లో సినిమా షూటింగ్లో నటి మనీషా యాదవ్‌ను శీను రామసామి లైంగికంగా వేధించాడని జర్నలిస్ట్ బిస్మీ భకీర్ తాజాగా ఆరోపించారు. ఈ సందర్భంలో మనీషా యాదవ్ దీనిపై ఓ పోస్ట్ పెట్టి మరోసారి వైరల్‌గా మారింది. శీను రామస్వామి షేర్ చేసిన వీడియో: మనీషా యాదవ్ తన వల్లనే సినిమా నుంచి తప్పుకున్నారా..? అంటూ ఒక వీడియో షేర్ చేశారు. అందులో శీను రామస్వామి కృతజ్ఞతలు చెబుతూ మనీషా యాదవ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పోస్ట్‌పై మనీషా యాదవ్ స్పందించింది. 2010లో విజయ్ సేతుపతితో శీను రామస్వామి తీసిన మరోచిత్రం 'తెన్మెర్కు పరువాకత్రు'. ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. విజయ్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. నేను ఏదీ ఎప్పటికీ మరచిపోలేను శీను రామస్వామి వీడీయోకు కౌంటర్‌గా మనీషా కూడా ఒక పోస్ట్ పెట్టింది. 'ఒక చెత్త కథ ఆడియో ఆవిష్కరణలో అందరికీ కృతజ్ఞతలు తెలిపినట్లే శీను రామస్వామికి కూడా నేను కృతజ్ఞతలు తెలిపాను. లేదంటే 9 ఏళ్ల క్రితం నేను అతని గురించి చెప్పిన దానికి ప్రత్యామ్నాయం లేదని, తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తితో ఎప్పటికీ పని చేయను.' మనీషా యాదవ్ చెప్పింది. అప్పట్లో అతనిపై ఆమె చేసిన ఆరోపణల వల్లే అప్పట్లో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. 9 ఏళ్లు అయినా ఆ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. -
స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే?
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి స్టార్‌గా ఎదిగిన వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారాయన. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తండ్రిబాటలోనే పయనించేందుకు ఆయన వారసుడు వచ్చేస్తున్నాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫీనిక్స్' అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంతో అరసు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. గతంలో ఆయన ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశారు. కాగా.. ఆయన కుమారుడు సూర్య 'నానుమ్ రౌడీ ధాన్'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత 'సింధుబాద్'చిత్రంలో సహాయక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విడుతలై పార్ట్ 2'లో సూర్య కనిపించనున్నారు. కాగా... ఈ చిత్రానికి సీఎస్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ అరసు తెలిపారు. -
హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేస్తున్న విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం సూదు కవ్వుమ్. తమిళ్ విడుదలైన ఈ సినిమా ఆయన తొలి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీనిని దర్శకుడు నలన్ కుమారసామి తెరకెక్కించాడు. ఆ తరువాత వీరి కాంబినేషన్లో రూపొందిన కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం కూడా కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో విజయ్‌సేతుపతి, దర్శకుడు నలన్ కుమార్స్వామిల చిత్రం అంటే చాలా అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి హిట్ కాంబినేషన్ రిపీట్ కానున్నదని తాజా సమాచారం అందుతుంది. దర్శకుడు నలన్ కుమారస్వామి ప్రస్తుతం నటుడు కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్తీ నటిస్తున్న 26వ చిత్రం. ఇందులో ఆయన ఎంజీఆర్ అభిమానిగా నటిస్తున్నట్టు తెలిసింది. నటి కీర్తిసురేష్ నాయకిగా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదే సంస్థ తర్వాత విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో చిత్రాన్ని చేయనున్న ట్లు సమాచారం. దీనికి సంబంధించిన సింగిల్ లైన్ స్టోరీ కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో మరో ముగ్గురు స్టార్ నటులు నటించే అవకాశం వున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తి చిత్రం షూటింగ్ పూర్తి అయిన తరువాత విజయ్‌సేతుపతి హీరోగా నటించే మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం వున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వారిద్దరి గత చిత్రాలు తమిళం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్నారు. -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్‌కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్‌కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
సంక్రాంతి రేసులోకి 11వ సినిమా.. కాకపోతే!
చిన్నచిన్న పాత్రల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విలక్షణ నటుడిగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్థ సెంచరీ సినిమాల మార్క్ దాటేసిన విజయ్.. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా తన కొత్త మూవీని సంక్రాంతి బరిలో పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ 'మేరీ క్రిస్మస్'. రాధికా శరత్‌కుమార్, సంజయ్‌కపూర్, టీనూ ఆనంద్, రాధిక ఆప్టే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రాన్ని 2024 జనవరి 12న అంటే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పొంగల్ బరిలో రజనీకాంత్ లాల్‌సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, సుందర్.సి 'అరణ్మణై 4' రెడీగా ఉన్నాయి. అలానే తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీస్టార్, నా సామిరంగ, రవితేజ 'ఈగల్' కూడా సంక్రాంతి బరిలోనే ఉండటం విశేషం. అయితే విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి గానీ హీరోగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అవుతున్నాయి. మరి 'మేరీ క్రిస్మస్' ఏం చేస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) View this post on Instagram A post shared by Tips Films (@tipsfilmsofficial) -
సౌత్ పాపులర్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం. కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్‌తో పాటు విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్‌సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్‌సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
ఆ క్రేజీ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి మరోసారి
అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం విజయ్ సేతుపతి తెగ తిరిగాడు. ఇప్పుడు తమ సినిమాల్లో నటించాలని దర్శకులు అతడి చుట్టూ తిరుగుతున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తూ 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో 'పిశాచి 2'లోనూ విజయ్ లీడ్ రోల్ చేశాడు. ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్‌తో సినిమా చేయాలని మిస్కిన్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్ డేట్‌పై అప్డేట్!
ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ భాషా భేదం లేకుండా ఎడాపెడా నటిస్తోన్న నటుడు విజయ్‌సేతుపతి. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అని కూడా ఆలోచించకుండా.. పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నారు. అలా ఏక కాలంలో హీరోగా, విలన్‌గా నటిస్తున్న అరుదైన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనొక్కరే అని చెప్పక తప్పదు. తాజాగా హీరోగా నటించిన తమిళ చిత్రం మహారాజా. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయ్‌సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం. కాగా విజయ్ సేతుపతి ఇప్పటికే ఫర్జ్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. తాజాగా జవాన్ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కు విలన్‌గా నటించి బాలీవుడ్లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న మేరీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా బాలీవుడ్ క్రేజీ భామ కత్రినా కై ఫ్ నటించడం విశేషం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మేరీ క్రిస్మస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే తాజాగా ఒక వారం ముందే అంటే డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషల్లో వేర్వేరుగా రూపొందించినట్లు వారు తెలిపారు. దీంతో మేరీ క్రిస్మస్ చిత్రంపై కోలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. Christmas comes even earlier this year!! Be ready to feel the chills and thrills of #SriramRaghavan's #MerryChristmas, now on 8th December, in cinema halls near you.@TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif #SanjayKapoor… pic.twitter.com/PHp65E9KPx — VijaySethupathi (@VijaySethuOffl) October 3, 2023 -
విజయ్ సేతుపతి కాల్షీట్ల కోసం హీరో వెయిటింగ్..
జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. నటి విజయలక్ష్మి, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుదన్ సుందరం నిర్మించిన ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఇరైవన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు జయం రవి మాట్లాడుతూ.. ఇరైవన్ చిత్ర టైటిల్ గురించి చాలా మంది అడిగారన్నారు. ఇదే విషయం గురించి తాను దర్శకుడిని అడగ్గా ఇరైవన్ అంటే ప్రేమ అని చెప్పారన్నారు. ఇది ప్రేమతో ప్రారంభమైన చిత్రం అన్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తాను చూసిన తొలి హీరో జయం రవి అన్నారు. అయితే తాను దర్శకత్వం వహించాలని కోరుకుంటున్న తొలి కథానాయకుడు విజయ్ సేతుపతి అని.. ఆయన త్వరగా కాల్షీట్స్ ఇవ్వాలని జయంరవి కోరారు. ఇక దర్శకుడు అహ్మద్ ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడూ ఉండాలన్నారు. ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత సుదన్ సుందర మాట్లాడుతూ జయం రవి, విజయ్ సేతుపతి ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమించే నటులని పేర్కొన్నారు. చదవండి: శివాజీ నోటిదూల.. 'ఎక్స్' టాపిక్.. నీ క్యారెక్టర్ ఏంటంటూ శుభశ్రీపై ఫైర్ -
800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్ సోమవారం నాడు హైదరాబాద్‌లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. లక్ష్మణ్‌తో అలాంటి అనుబంధం: ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్‌ను చూశా. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! వెంకటేశ్‌ను కెప్టెన్ చేయాలి హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతిని బెదిరించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు బ్రేకప్, డిప్రెషన్లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు! -
విజయ్ సేతుపతికి జోడీగా కృతీశెట్టి.. వద్దే వద్దన్న హీరో
ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది కృతీ శెట్టి. తొలి సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య సరైన హిట్స్ రావడం లేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని ఆశపడుతోందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఒక్కేసి సినిమా ఆమె చేతిలో ఉన్నాయి. అయితే గతంలో ఆమెకు విజయ్ సేతుపతితో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందట! హీరోయిన్ కృతీ శెట్టి అని తెలిసిన సేతుపతి తనతో నటించనని తెగేసి చెప్పాడట! దీంతో బేబమ్మకు ఆ ఆఫర్ చేజారిపోయింది. గతంలోనూ దీనిపై క్లారిటీ ఇచ్చిన సేతుపతి తాజాగా మరోసారి కృతీని ఎందుకు రిజెక్ట్ చేశాడో చెప్పుకొచ్చాడు. 'ఉప్పెన సినిమాలో బేబమ్మ(కృతీ శెట్టి)కు తండ్రిగా నటించాను. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నేను తమిళంలో ఓ సినిమాకు సంతకం చేశాను. నాకు జోడీగా కృతీ శెట్టి అయితే బాగుంటుందని మేకర్స్ భావించారు. హీరోయిన్ ఈవిడే అంటూ నాకు తన ఫోటో పంపించారు. అది చూసిన వెంటనే చిత్రయూనిట్‌ను పిలిచి తను వద్దని చెప్పాను. ఎందుకంటే అప్పటికే ఉప్పెనలో ఆమెకు తండ్రిగా నటించాను. అలాంటిది రొమాంటిక్‌గా తనతో నటించడం నాకిష్టం లేదు. అందుకే హీరోయిన్గా తనను తీసుకోవద్దని సూచించాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సేతుపతి ప్రస్తుతం మహారాజా, మేరీ క్రిస్మస్, గాంధీ టాక్స్ సహా తదితర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. చదవండి: బిగ్‌బాస్‌కు వచ్చేముందు జీరో బ్యాలెన్స్.. ఆఖరికి దుస్తులు కూడా లేవా? ప్రిన్స్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? -
మహారాజాగా విజయ్ సేతుపతి!
తమిళ సినిమా: బహుభాషా నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్ జగదీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరంగు బొమ్మై చిత్రం ఫేమ్ నిధిలన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహిస్తున్నారు. నటి మమతా మోహన్ దాస్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి అభిరామి, నటుడు నట్టి, అరుల్ దాస్, సింగంపులి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, అద్నీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక హోటల్లో చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటుడు నట్టి మాట్లాడుతూ.. ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఇకపై వచ్చే చిత్రాలకు ఒక ఉదాహరణగా ఉంటుందన్నారు. నటి అభిరామి మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అన్నారు. చురుకైన కళ్లు కలిగిన వ్యక్తి కమలహాసన్ తర్వాత విజయ్ సేతుపతినే అని పేర్కొన్నారు. ఇలాంటి ఒక స్పెషల్ చిత్రంలో తాను నటించడం సంతోషమని నటి మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. మహారాజా రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. విజయ్ సేతుపతి 50వ చిత్రానికి తాను దర్శకుడు కావడం సంతోషమాన్ని నిధిలన్ పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ చతుపతి మాట్లాడుతూ.. అనుభవం, సహనం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన తన దర్శక నిర్మాతలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. 50వ చిత్రం కచ్చితంగా తన సినిమా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రం నిర్మాతలకు మూడు రెట్లు లాభాలు తెచ్చిపెడుతుందని దర్శకుడు చెప్పారని, అది పొగరు కాదని.. చిత్రంపై నమ్మకం అన్నారు. -
లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!
సౌత్ సినీ ప్రపంచంలో త్రిష ఒక అద్భుతమైన తార. సుదీర్ఘ విరామం తర్వాత త్రిష మళ్లీ మళ్లీ యాక్టివ్‌గా మారింది. త్రిష చివరిగా తెరపైకి వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. సిరీస్‌లోని రెండు చిత్రాలలో త్రిష తన నటనతో ప్రశంసలు అందుకుంది. త్రిష- విజయ సేతుపతి జంటగా నటించిన 96 సినిమా ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోకి రీమేక్ చేయబడింది. ఈ సినిమా ద్వారా రామ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా జానుగా త్రిష ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష- విజయ్ సేతుపతి తమ నటనతో రామ్- జానుగా గుర్తింపు పొందారు. తమిళ్లో వచ్చిన ఈ సినిమాను చూసిన వారెవరూ వారిద్దరి పాత్రల్ని ఎప్పటికీ మరిచిపోరని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు) సినిమా క్లైమాక్స్ సీన్లో అత్యంత హృదయాన్ని హత్తుకునే సన్నివేశం ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు పలికిన సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సీన్‌ని పరిశీలిస్తే.. త్రిష, విజయ్ సేతుపతిలు ముద్దుల సీన్ లేకుండా కనిపించారు. బదులుగా, వారు తమ ముఖాలపై చేతులు ఉంచారు. అయితే స్క్రిప్ట్ ప్రకారం విజయ్ సేతుపతి, త్రిష ఈ సన్నివేశంలో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. అందుకు త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమాలో మాత్రం ఈ సీన్ మారిపోయింది. దానికి కారణం విజయ్ సేతుపతి. ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ చేయడానికి విజయ్ సేతుపతి సంకోచించాడు. ఆ సీన్ చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు చేయడు. ఇదే విషయాన్ని ఆయన డైరెక్టర్లకు ముందే చెబుతాడట. సేతుపతిలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ వంటి నటులు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి నిరాకరించే నటులే. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తర్వాత విజయ్‌తో త్రిష నటిస్తున్న చిత్రం లియో కాగా విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం జవాన్ విజయంతో దూసుకుపోతున్నాడు. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్: జవాన్ నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్, సంజయ్ దత్ నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ దర్శకత్వం: అట్లీ కుమార్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్‌కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్లో సరైన హిట్ లేకపోవడంతో అక్కడ సౌత్ సినిమాల హవా కొనసాగింది. అలాంటి సమయంలో పఠాన్ విడుదల కావడం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి బాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. అలా పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన షారుక్.. తాజాగా 'జవాన్'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదుల అయిన జవాన్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ‘జవాన్’ కథేంటంటే.. కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) అండ్ టీమ్ హైజాక్ చేస్తారు. ఆ టీమ్‌లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ (షారుక్ ఖాన్) మెట్రోను ఎందుకు హైజాక్ చేశాడు. .? ఆ హైజాక్ సీన్లోకి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్ రాథోడ్ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్ డీలర్‌గా ఉన్న విజయ్ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్ రాథోడ్‌కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ రివేంజ్ సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్ ఓరియేంటేడ్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్ అట్లీ తమిళ హీరో విజయ్‌తో తెరి, మెర్సిల్, బిగిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాలీవుడ్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్‌లో కూడా మంచి మెసేజ్‌ను ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో విక్రమ్ రాథోడ్‌తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్‌కు ప్లస్ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్ సీన్లు ఇవే. ఫస్టాఫ్‌లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్ ఇష్యూలతో జవాన్ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్ నటన, యాక్షన్స్ సీన్స్ ముందు అవన్నీ ఆడియన్స్ పెద్దగా పంటించుకోరు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే.. ఈ విషయంలో జైలర్‌గా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్, ఆజాద్‌కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్‌లో కూడా మంచి యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ అంతగా పండించవనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆజాద్ జైలర్ అయితే విక్రమ్ రాథోడ్ ఒక జవాన్ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్' చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్' ప్రాణాలు పోతాయి. సేమ్ 'జవాన్' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలో షారుక్ ఖాన్ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రంజెంటేషన్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ సీన్స్ పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. జవాన్‌తో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్‌కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్ అనిపించేలా తనదైన మార్క్ నటనతో మెప్పించింది. కానీ షారుక్ ఖాన్‌తో ఆమె జోడీ అంతగా హైలెట్ కాలేదు. విక్రమ్ రాథోడ్‌కు భార్యగా దీపికా పదుకోన్ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్ అయ్యేలా మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాళీ గైక్వాడ్‌గా విజయ్ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్ అతనికి బాలీవుడ్లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్ పెరగడం ఖాయం. సినిమాలో విలన్ రోల్‌తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్‌లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్ దత్ కామియో రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ ఉండదు. విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఇందులో అనిరుధ్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్‌తో పాటు పలు సీన్స్‌లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ ఉండదు. ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’.‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘జవాన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. (చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్ మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జవాన్’కి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందని కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమని, షారుఖ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. Just started watching #Jawan, and I'm already hooked! The action scenes are intense, and the story is gripping. Can't wait to see how the hero saves the day. Any recommendations for similar action-packed movies? #MovieNight 🍿 — RushLabs (@RushLab) September 7, 2023 ఇప్పుడే జవాన్ చూశాను. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. కథనం ఆకట్టుకుంది. షారుఖ్ నటన అదుర్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Jawan Early Review B L O C K B U S T E R: ⭐️⭐️⭐️⭐️⭐️#Atlee has delivered a masterpiece, an exhilarating blend of emotion and mass action This year belongs to the baadhshah #ShahRukhKhan𓃵 👑 #VijaySethupathi #Nayantara & rest were great DON'T MISS IT !!#JawanReview pic.twitter.com/lKuYZ6oWGr — ConectMagnet (@ConectMagnet) September 7, 2023 ‘జవాన్ బ్లాక్ బస్టర్ హిట్. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్ మరియు మాస్ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే. విజయ్ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు. జవాన్ చూడడం మిస్ కాకండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #Atlee#OneWordReview #Jawan : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Jawan is a WINNER and more than lives up to the humongous hype… Atlee immerses us into the world of Mass pan-Indian film, delivers a KING-SIZED ENTERTAINER… Go for it. MUST WATCH. #JawanReview #ShahRukhKhan pic.twitter.com/WgtqoKFyjD — Rithik Modi (@rithiek) September 7, 2023 జవాన్ విజయం సాధించాడు. సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్డ్ ఎంటర్టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #jawanReview..!!! 1st Half ok👍 2nd Half average.. Nayanthara Entry 🔥 VJ sethupathi Acting🙏 🔥 'One word ' #Jawan film loved by Shahrukh Khan fans#JawanFirstDayFirstShow#JawanFDFS #ShahRukhKhan𓃵 #AskSRK pic.twitter.com/qC7eArxP79 — Raj (@Rajwriter7) September 7, 2023 ‘ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ యావరేజ్. నయనతార ఎంట్రీ బాగుంది. విజయ్ సేతుపతి నటన అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే...‘జవాన్’ షారుఖ్ అభిమానులను అలరిస్తుంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. The film @iamsrk starer #jawan will create a tsunami at Bharat & overseas box office 🔥🔥🔥 from its Day1, all the existing records in danger. People are going to witness what happens when the world's biggest superstar comes with mass Avtar 💥💥💥 #JawanFDFS #ShahRukhKhan𓃵 💓 — basha (@Noone47949911) September 6, 2023 My friends from New Zealand told me. It's going to be tsunami at the box office for #Jawan. #KingKhan SRK is going to rule Global Box Office. The collections will be earth shattering. 🔥🔥 — Says A man (@saysAmann) September 7, 2023 Jawan came to creat history at box office. Biggest blockbuster of bollywood industry. CRAZE for #Jawan is unmatchable. Even in early morning 🔥🔥🔥#JawanFirstDayFirstShow #JawanReview #JawanAdvanceBooking #JawanFDFS pic.twitter.com/Ta0uM5gZwv — Satya Prakash (@Satya_Prakash08) September 7, 2023 #JawanReview :⭐⭐⭐⭐#Jawan is a fascinating crime filled movie told from multiple perspectives with perfect pace & cinematography. An absolute entertainer package with action, comedy, thrill & what else.. @iamsrk @VijaySethuOffl & @Atlee_dir keep us on the edge of our seat pic.twitter.com/kBVFX3UK4B — Shams Ansari (@realshams01) September 7, 2023 #Jawan craze is like a festival 🔥 This is unbelievable and Unmatchable for other stars.#ShahRukhKhan𓀠 is ready to rule the box office and wins hearts ✅#JawanTsunamiTomorrow #JawanFirstDayFirstShow #Jawan #ShahRukhKhan𓀠 #JawanReviews #Nayanthara #ThalapathyVijay pic.twitter.com/sohSZzbeom — Jani ( Fan Account) (@filmy49515) September 7, 2023 -
షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా జవాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. షారుఖ్‌ని డైరెక్ట్ చేసిన రెండో వ్యక్తి అట్లీ షారుఖ్ ఖాన్ సినీ కెరీర్ 1992లో ప్రారంభమైంది. బాలీవుడ్‌లోని బడా డైరెక్టర్స్ అందరితో షారుఖ్ కలిసి పని చేశాడు. కానీ సౌత్ వాళ్లతో కలిసి పని చేయడం చాలా తక్కువ. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమిళ డైరెక్టర్‌తో కలిసి షారుఖ్ ఓ సినిమా చేస్తున్నాడు. అట్లీ కంటే ముందు 2000 సంవత్సరంలో కమల్ హాసన్ దర్శకత్వంలో ‘హే రామ్’ అనే సినిమా చేశాడు. నయనతార తొలి చిత్రం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’. స్వతహా షారుఖ్ అభిమాని అయిన నయన్.. అతనితో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట. అంతకు ముందు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ‘వన్ టూ త్రీ ఫోర్’.. అనే పాటలో నటించే చాన్స్ ముందుగా నయన్‌కే వచ్చిందట. కారణం ఏంటో తెలియదు కానీ అప్పుడు ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట. నయన్ వద్దనడంతో ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారట. షారుఖ్ ద్విపాత్రాభినయం ‘జవాన్’లో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశాడు. అంతేకాదు పలు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ట్రైలర్లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న టాటు బాగా వైరల్ అయింది. షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. అతిథి పాత్రలో దీపికా పదుకొణె చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుఖ్‌కు జోడిగా నటించిన దీపికా పదుకొణె.. ‘జవాన్’లో అతిథి పాత్రలో మెరవబోతుంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించడంతో షారుఖ్, దీపికా పదుకొణెల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. షారుఖ్ కోసమే దీపికా అతిథి పాత్రను ఒప్పుకుందట విలన్‌గా విజయ్ సేతుపతి జవాన్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించడం మరో విశేషం. విజయ్‌కి రెండో బాలీవుడ్ చిత్రమిది. అంతకు ముందు ముంబైకర్ చిత్రంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. అయితే అది ఓటీటీలో విడుదల కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ‘జవాన్’తో విజయ్ సేతుపతి బాలీవుడ్ భారీ విజయం అందుకోబోతున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ రిస్కీ ఫైట్స్ ‘జవాన్’కోసం షారుఖ్ రిస్కీ ఫైట్స్ చేశారట. ఈ చిత్రం కోసం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం గమనార్హం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. రూ.300 కోట్ల బడ్జెట్ జవాన్ బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు. ఇందులో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట. తొలి బాలీవుడ్ చిత్రానికిగాను రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్ ముంబై, పుణె, చెన్నై, రాజస్తాన్, హైదరాబాద్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది. రన్ టైం ఎంత? జవాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్‌టైం 2:49 గంటలు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొన్ని గంటల్లోనే తొలిరోజు షోకి సంబంధించి సుమారు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. బాలీవుడ్ చరిత్రలో ఇదొక రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్‌పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్‌కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్‌తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ జవాన్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారుక్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?
విజయ్ సేతుపతి ఓ నటుడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు-వెబ్ సిరీస్‌లు ఫుల్ బిజీగా ఉన్నాడు. పేరుకే తమిళ యాక్టర్ గానీ దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న సేతుపతికి పెళ్లయిందని, టీనేజ్ కూతురు ఉందని చాలామందికి తెలియదేమో. తాజాగా ఓ పిక్ బయటకు రావడంతో ఈ విషయం తెలుగు నెటిజన్స్ మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ విజయ్ సేతుపతి కూతురు డీటైల్స్ ఏంటి? కెరీర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి.. పలు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశాడు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోకముందే అంటే 2003లోనే జెస్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అబ్బాయి సూర్య, అమ్మాయి శ్రీజ పుట్టారు. అయితే సేతుపతికి బోలెడంత స్టార్డమ్, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. కానీ ఇతడి ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పొచ్చు. వాళ్ల ఫొటోలు కూడా పెద్దగా ఏం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) అయితే విజయ్ సేతుపతి కొడుకు సూర్య.. తన 'నేను రౌడీనే' సినిమాలో చైల్డ్ క్యారెక్టర్లో నటించాడు. ఇక కూతురు శ్రీజ కూడా.. 2020లో విజయ్ సేతుపతి నటించిన 'ముగిల్' మూవీలో నటించింది. రీల్ లైఫ్ లోనూ వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి.. తన కొడుకు-కూతురితో ఉన్న పిక్ బయటకు రావడంతో అందరూ షాకవుతున్నారు. ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే శ్రీజ సేతుపతి ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం చూస్తుంటే.. తండ్రి అంతా ఎత్తు కూడా పెరిగిపోయింది. అన్ని కలిసొస్తే.. త్వరలో నటి లేదా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాసరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
విజయ్ సేతుపతితో సినిమా చేయడం సాధ్యం కాదు: డైరెక్టర్
భారతి కన్నమ్మ, దేశీయ గీతం, వెట్రికొడిగట్టు, పాండవర్ భూమి, సొల్లమరంద కథా, ఆటోగ్రాఫ్, తవమా య్ తవమిరుందు వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల దర్శకుడు, వీటిలో పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన దర్శక నటుడు చేరన్. అయితే ఇటీవల ఆయన నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు నిరాశ పరచడంలో మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు. కాగా ఆ మధ్య నటు డు విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తానని ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు చేరన్ను విజయ్ సేతుపతితో చేసే చిత్రం ఏమైందన్న మీడియా ప్రశ్నకు ఆ చిత్రాన్ని ఇకపై చేయటం వీలుకాదని బదులిచ్చారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన కోసం కథను మార్చాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం విజయ్ సేతుపతి చాలా బిజీగా ఉన్నారని, కాబట్టి ఆయనతో చిత్రం చేయడం ఇప్పట్లో అసాధ్యమని చేరన్ స్పష్టం చేశారు. -
రష్మిక లక్ మాములుగా లేదుగా.. ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్
కన్నడ భామ రష్మికమందన్న మళ్లీ దక్షిణాదిలో అవకాశాలతో పుంజుకుంటోంది. తెలుగులో క్రేజీ నటిగా రాణించిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుని నటిస్తోంది. అయితే హిందీలో ఈమె నటించిన రెండు చిత్రాలు బోల్తా కొట్టాయి. తాజాగా నటిస్తున్న యానిమల్ చిత్రంపై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో పుష్ప–2, చిత్రంతోపాటు రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సరైన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత విజయ్‌కు జంటగా వారీసు చిత్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయినా, రష్మిక అందాలారబోత మినహా చేసిందేమీ లేదని విమర్శలను మూటకట్టుకుంది. అలాంటిది ఈ అమ్మడికి ఇప్పుడు మళ్లీ పాన్ ఇండియా చిత్రాలు నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ కథానాయకుడుగా నటించే ద్విభాషా ( తమిళం, తెలుగు)చిత్రంలో రష్మిక నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నటుడు విక్రమ్ హీరోగా నటించే పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించినట్లు తాజా సమాచారం. ఇటీవల 2018 అనే సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ తర్వాత పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నట్లు ఆయనకు జంటగా రష్మికమందన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు, ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి కథానాయకుడిగా మంచి విజయాన్ని అందించిన చిత్రం పిజ్జా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుని, ఘన విజయం అందుకుంది. కాగా పిజ్జా చిత్రం సక్సెస్‌తో ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా పిజ్జా –2 విల్లా చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే సంస్థలో సీవీ కుమార్ ఇటీవల నిర్మించిన చిత్రం పిజ్జా –3 దిమమ్మీ . నటుడు అశ్విన్ కాక్కుమను కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రవీనా దాహా, సుభిక్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 28వ విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. (ఇదీ చదవండి: కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్ అని!) దీంతో పిజ్జా– 4 చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను ఇంతకు ముందు హారర్ర్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందించిన పిజ్జా చిత్రం మూడు సీక్వెల్స్ ను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించి వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందని నిరూపించారన్నారు. వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజ్జా –4 చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన దర్శకుడు, నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ చెప్పారు. -
ప్రభుదేవా కోసం విజయ్ సేతుపతి పాట
సినిమాల్లో ఇప్పుడు హీరోలు పాడటం సర్వసాధారణం అయ్యింది. నటుడు విజయ్, ధనుష్, శింబు ఇలా చాలా మంది నటనతో పాటు పాటలను కూడా పాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటుడు విజయ్‌సేతుపతి చేరారు. ఈయన నటుడిగా తమిళం దాటి తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. పాత్రలో వైవిధ్యం ఉందనుకుంటే హీరో, విలన్ అంటూ చూడకుండా నటించేస్తున్నారు. ఇకపోతే నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉల్ఫ్. ఇది ఈయన నటిస్తున్న 60వ చిత్రం. ఇందులో నటి అంజు కురియన్ నాయకిగా నటిస్తుండగా పుష్ప చిత్రం ఫేమ్ అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీగోపిక, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుళ్విన్సెంట్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైకిలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రానికి సిండ్రిల్లా చిత్రం ఫేమ్ వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం నటుడు విజయ్ సేతుపతి ఒక పాట పాడటం విశేషం. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేశాడట. సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్‌లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
ప్లాన్ మారింది.. స్టార్ హీరోయిన్ వచ్చింది!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైర్సటైల్ నటుడు అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో అని మాత్రమే కాకుండా విలన్, సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్స్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీలో వెబ్ సిరీసులు అన్నీ కవర్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో 'విడుదలై-1' ఒకటి. కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ తీసిన మూవీ ఇది. ఇందులో సేతుపతి నటించాడు కాకపోతే ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. రెండో భాగాన్ని చాలావరకు షూట్ చేసిన వెట్రిమారన్.. ఇప్పుడు చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నాడట. సీక్వెల్లో విజయ్ సేతుపతికి జోడీని చేర్చారు. ఆ పాత్రని మలయాళ నటి మంజు వారియర్ చేస్తున్నారు. ఈ జంటకి సంబంధించిన సీన్స్‌ని చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. త్వరలో థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) -
విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రొమాన్స్
బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారన్నది తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన 'తలైవి' చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో వస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్‌ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో లారెన్స్ కథానాయకుడిగా నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్) మరో తమిళ చిత్రంలో నటించడానికి కంగనా రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ట్రైడెంట్ ఆర్ట్స్, అహింసా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఒక తమిళ నటుడు, హిందీ నటి కలిసి నటించబోతున్నట్లు ఇంతకముందే వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతోపాటు కంగనా నటించనున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న) దీనికి మలయాళం టాప్ దర్శకుడు విపిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. కాగా నటి కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న హిందీ చిత్రం ఎమర్జెన్సీ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోందన్నది గమనార్హం. -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్‌పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్‌కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్‌బాబు ‘స్పైడర్’, సుధీర్‌బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
మహారాజా రెడీ
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్–థింక్ స్టూడియోస్ జగదీష్ పళనిసామి సమర్పణలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
విజయ్ సేతుపతి 50వ సినిమా, హీరోయిన్ ఎవరంటే?
బహుభాషా నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు అర్ధ సెంచరీని టచ్ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో నటిస్తూ ఇండియన్ సినీ నటుడిగా పేరు గడించిన విజయ్‌సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రానికి మహరాజా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సుదన్ సుందరం సంస్థలు నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతున్న ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కాగా నటి మమతామోహన్‌దాస్ చాలా గ్యాప్ తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది. దీనికి అజినీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని, ధినేశ్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని నిర్మాతలు తెలిపారు. చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్‌సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం కావడంతో మహారాజాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) చదవండి: ఎక్కువమంది చూసిన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఏదో తెలుసా? -
టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?
ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడులేని రీతిలో వాటితో పోటీపడుతోంది. మరేదో కాదు.. అదేనండీ.. టమాటా. ఎందుకంటే మనకు టమాటా లేకుండా ఏ కూర, పప్పు చేయలేరు. ఒకప్పుడు ఉల్లిగడ్డ ఇతర వాటితో పోటీ పడేది. అదేంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉల్లిగడ్డ ప్లేస్‌ను టమాటా ఎప్పుడో కబ్జా చేసింది. ఇప్పుడు ఎక్కడా చూసిన టమాటా ధరలపైనే చర్చ నడుస్తోంది. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి అభిమానులు గొప్ప మనసును చాటుకున్నారు. (ఇది చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) తమిళనాడులో పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. తమిళనాడులోని మానవహారం జిల్లా ఆలందూరులో ఈ కార్యక్రమం చేపట్టారు. చెంగల్పట్టు విజయ్ సేతుపతి అభిమానుల సంఘం అధినేత తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) -
కమల్ హాసన్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి
విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత విశ్వనటుడు కమల్ హాసన్ ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో కమల్ హాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికంటే ముందు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నారు. ఇది ఆయన నటించే 233వ చిత్రం అవుతుంది. ఇది వ్యవసాయంతో పాటు పలు సామాజిక సమస్యల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. వినోద్ చెప్పిన కథ నచ్చడంతో కమల్ హాసన్ ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి కథలో మార్పులు చేర్పులు చేసి మరింత పఠిష్టంగా తయారు చేసినట్లు సమాచారం. రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఇందులో నటుడు విజయ్‌సేతుపతి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు విక్రమ్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోనూ విలన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్ర షూటింగ్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. చదవండి: హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అక్కడ ముద్దు పెట్టేసిందిగా -
ప్రత్యేక అతిథిగా...
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల వెండితెర క్రిస్మస్ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్’, ‘అంథాధూన్’లో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఉత్తమ నటుడిగా విజయ్, ఉత్తమ విలన్ అవార్డు ఎవరంటే?
ఒసాకా తమిళ్ అంతర్జాతీయ 2021 సినీ అవార్డుల వేడుక ఇటీవల జపాన్‌లో జరిగింది. ఈ వేదికపై 2021 ఏడాదికి గానూ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అందులో మాస్టర్ చిత్రంలోని నటనకు గానూ కథానాయకుడు విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించారు. మాళవికా మోహన్ హీరోయిన్గా నటించిన ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్, ఎక్స్‌బీ.ఫిలిం క్రియేటర్స్ సంస్థలు నిర్మించాయి. ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును ప్రకటించారు. ఈ చిత్రంలోని వాత్తి కమింగ్ పాట ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది. ఆ విధంగా మాస్టర్ చిత్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. ఇకపోతే తలైవి చిత్రంలో నటనకు గానూ నటి కంగనారనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అదే విధంగా సార్పట్ట పరంపరై చిత్రానికి గానూ పా.రంజిత్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును మానాడు చిత్రానికి గానూ దర్శకుడు వెంకట్‌ప్రభు గెలుచుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ అవార్డును మండేలా చిత్రానికి గానూ వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్బెర్రి ఫిలింస్ సంస్థలు గెలుచుకున్నాయని అవార్డుల జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. Thalapathy Vijay's #Master bags 3 awards at the Osaka Film International Festival. The Osaka Tamil Film International Film Festival was recently held in Japan. Vijay was awarded the "Best Actor" award for his performance in Master. #LEO #LeoFilm #BloodySweet @actorvijay pic.twitter.com/DcHHFXx4Of — Actor Vijay Team (@ActorVijayTeam) May 23, 2023 చదవండి: విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
Vidudhala Movie Review: వెట్రిమారన్ ‘విడుదల పార్ట్-1’ రివ్యూ
టైటిల్: విడుదల పార్ట్-1 నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు నిర్మాత : ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం: వెట్రిమారన్ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ విడుదల తేది: ఏప్రిల్ 15, 2023 కథేంటంటే.. పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్ : 2.75/5 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ సేతుపతి ఓ జెంటిల్మెన్.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళ సినిమా: విజయ్ సేతుపతి ఓ జెంటిల్మెన్ అని నటి సాయి రోహిణి పేర్కొంది. వేలూరుకు చెందిన అచ్చ తమిళ అమ్మాయి ఈ చిన్నది. తల్లిదండ్రులు కోరిక మేరకు చదువుకోవడానికి చైన్నెకి వచ్చిన సాయి రోహిణి చదువు పూర్తయిన తర్వాత తన దృష్టిని సినిమాలపై సారించింది. నటిని కావాలన్నది తన డ్రీమ్ అని పేర్కొంది. దాన్ని శక్తి వంచన లేకుండా ప్రయత్నించి సాధించగలననే నమ్మకంతో నటీమణులు కావాలనే ప్రకటనలను చూసి ప్రతి ఆడిషన్‌ను వదలకుండా పాల్గొనేదాన్నని చెప్పింది. అలా లభించిన అవకాశమే నాట్ రీచ్చబుల్ చిత్రం అని తెలిపింది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అనే చిత్రంలో నటించినట్లు చెప్పింది. ప్రస్తుతం దుచ్చాదనన్ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్ర షూటింగ్ గోపిశెట్టి పాలెం, ఈరోడ్ ప్రాంతాల్లో జరుపుకుంటోందని తెలిపింది. కాగా నటుడు సూరికి జంటగా హాట్ స్టార్ ఓటీటీ కోసం నిర్మాత అరుణ్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటించనున్నట్లు చెప్పింది. దీనికి వెట్రివీరన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపింది. వీరితోపాటు మరో రెండు తెలుగు చిత్రాలకు కమిట్ అయినట్లు చెప్పింది. కాగా విజయ్ సేతుపతి నేతృత్వంలో 2023 క్యాలెండర్ రూపొందించిన విషయం తెలిసిందే అన్నారు. అందులో నెలకొకటి చొప్పున 12 పేజీలను రూపొందించినట్లు అందులో రెండు పేజీల కోసం తాను విజయ్ సేతుపతి కలిసి నటించినట్లు చెప్పింది. అందుకోసం షూటింగ్ ఒకరోజు నిర్వహించినా అందులో విజయ్ సేతుపతితో కలిసి నటించిన అనుభవం మరువలేనిదని పేర్కొంది. ఆయన ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా మర్యాదగా చూసుకున్నారని చెప్పింది. ఆ క్యాలెండర్ కోసం నటించిన వారిలో ఏకై క నటిని తానేనని సాయి రోహిణి చెప్పింది. -
తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'విడుతలై పార్ట్ 1'. ఈ సినిమాను వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'విడుదల పార్ట్1' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం, అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవవుతుంది. సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్‌గా నటిస్తున్నారు. అన్యాయం గురించి అతను పడే నిరాశ, అసమర్థతను కూడా ట్రైలర్లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది? చివరకు అతన్ని ఎవరు పట్టుకుంటారు? అనేది అసలు కథ. కాగా.. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ప్రధానపాత్రల్లో నటించారు, రజినీకాంత్ ప్రశంసలు ఇప్పటికే ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇళయరాజా సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. పార్ట్-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విడుదల పార్ట్1 టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. pic.twitter.com/FawO7l1oqA — Rajinikanth (@rajinikanth) April 8, 2023 -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ 70వ పుట్టినరోజును పురస్కరించుకొని చెన్నైలోని తేనాంపేటలో 'స్టాలిన్ 70' పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ నటీనటులు హాజరయ్యారు. విజయ్ సేతుపతి కూడా అక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలని, తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే విజయ్ సేతుపతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
రోహిణి థియేటర్ నిర్వాహం.. కమల్ హాసన్ తీవ్ర ఖండన
చైన్నెలోని రోహిణి థియేటర్ నిర్వాహకం చర్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు శింబు కథనాయకుడిగా నటించిన చిత్రం పతు తల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. దీంతో శింబు అభిమానులు వేకువజాము నుంచే థియేటర్ ముందు గుమికూడారు. అలాంటి వారిలో సంచార జాతి ప్రేక్షకులు ఉన్నారు. వీరు స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్లో పత్తుతల చిత్రాన్ని చూడడానికి వచ్చారు. టికెట్లు కూడా కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ థియేటర్ కార్మికుడు వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొంత సమయం తర్వాత వారిని లోపలికి అనుమతించారు. டிக்கெட் இருந்தும் நரிக்குறவ மக்களை படம் பார்க்க அனுமதிக்காத @RohiniSilverScr திரையரங்கம் ... இவுங்களுக்கு நீ தனி ஷோ போட்டுக்காட்டத்தான் போற அத நான் பாக்கத்தான் போறேன் ...#RohiniTheatre #PathuThala @SilambarasanTR_ @CMOTamilnadu @IamSellvah pic.twitter.com/1Pd3rE8CsV — Viji Nambai (@vijinambai) March 30, 2023 అయితే ఈ వ్యవహారంపై థియేటర్ నిర్వాహకం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కమలహాసన్, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్, నటి ప్రియా భవానిశంకర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్ ట్విటర్లో పేర్కొంటూ టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. டிக்கெட் இருந்தும் நாடோடிப் பழங்குடியினருக்குத் திரையரங்கத்திற்குள் அனுமதி மறுக்கப்பட்டுள்ளது. சமூகவலைதளங்களில் எதிர்ப்பு கிளம்பிய பிறகே அவர்கள் அனுமதிக்கப்பட்டுள்ளனர். இது கண்டிக்கத்தக்கது. https://t.co/k9gZaDH0IM — Kamal Haasan (@ikamalhaasan) March 31, 2023 -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్ టైమ్ రికార్డ్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్ టైమ్ వ్యూయర్షిప్ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. Thanks for all the love!! 🫶🏼#Farzi #FarziOnPrime pic.twitter.com/zcjqkQyW6x — Raj & DK (@rajndk) March 25, 2023 -
భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ పాగా వేసిన సంచలన నటి మరోసారి వార్తల్లో నానుతున్నారు. నయనతార పెళ్లి అయిన తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఏమీ ఆశించిన విధంగా విజయాలు సాధించలేదు. ఇక తన భర్త విఘ్నేష్ శివన్ విషయంలో ఘోర పరాభవం జరిగింది. ఈయన నటుడు అజిత్ కథానాయకుడుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రకటన కూడా జరిగింది. ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అన్న తరుణంలో సినిమా కథ నచ్చలేదంటూ ఇటు అజిత్, అటు సంస్థ పేర్కొనడమే కాకుండా చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను తొలగించారు. ఇది దర్శకుడు విఘ్నేష్ శివన్ కంటే ఆమె భార్య, నటి నయనతారను బాగా గాయపరచిందనే ప్రచారం వైరల్ అయ్యింది. దీనికి కారణం ఈ వ్యవహారంలో ఆమె చేసిన సంధి ప్రయత్నం కూడా విఫలం కావడమే. దీంతో అజిత్‌కు బదులుగా నటుడు విజయ్ సేతుపతిని తీసుకొని విఘ్నేష్ శివన్ చిత్రం చేసేలా నయనతార చక్రం తిప్పిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా నటుడు విజయ్ సేతుపతి తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే తాజాగా ఆ చిత్ర కథ నచ్చలేదంటూ సుందర్.సి కి హ్యాండ్ ఇచ్చారు. అయితే దీని వెనుక నటి నయనతార హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అజిత్ తిరస్కరించిన కథలోనే విజయ్ సేతుపతిని నటింపజేస్తూ తన ఈగోను తృప్తి పరచుకుంటోందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, విఘ్నేష్ శివన్ కాంబోలో ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్, కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రాలు రూపొందాయి. -
ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా!
సుందర్ సీ దర్శకుడిగా, నటుడిగా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన కాఫీ విత్ కాదల్ చిత్రం యూత్‌ను బాగానే ఆలరించింది. ఇప్పుడు ఓ హార్రర్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు రెడీ అయ్యారు. గతంలో ఆయన దర్శకత్వం వహించి ముఖ్య పాత్ర పోషించిన అరణ్మణై పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాలు మంచి విజయాన్ని పొందడంతో తాజాగా వాటికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా హార్రర్ జానర్లో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! కాగా ఇందులో విజయ్ సేతుపతి, సంతానం కథానాయకులుగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన తెలుగు, తమిళం, హిందీ, భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో కాల్ షీట్స్ సమస్య తలెత్తడంతో అరణ్మణై 4 చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో ఆయన పాత్రలో సుందర్.సీనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అవ్నీ సినిమా పతాకంపై నటి కుష్బూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం -
ఆయనతో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్
చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి దీప్శిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఆమె రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తను నటించిన అనేక సన్నివేశాలను తొలగించారని ఆమె విచారం వ్యక్తం చేసింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం ‘నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నేను చేయాల్సింది కాదు. ఈ మూవీ కోసం మొదట మరో నటి నటించాల్సి ఉంది. కానీ ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. దర్శకుడు రంజిత్ జయకొడి నాకు ఒక్కలైన్ స్టోరీనే చెప్పారు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతికి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, మూవీ లెంగ్త్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
డిమాన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వసంత బాలన్ సమర్పణలో డిమాన్ అనే చిత్రం రూపొందుతోంది. వండర్ బాయ్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ సోమసుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేశ్ పళనీవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన అంగాడి తెరు, అరవాన్, కావ్యతలైవన్, జైల్, ఇదర్కుదానా ఆశపట్టాయ్ బాల కుమారా, కాష్మోరా చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇందులో నటుడు సచిన్, నటి అబర్నది జంటగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటనలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చిత్రం స్క్రీన్ పై ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని అన్నారు. పిజ్జా, రక్షకన్, పిశాచి వంటి చిత్రాల తరహాలో ఇది ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. చిత్రంలో కుంకీ అశ్విన్, రవీనా దహ, బిగ్ బాస్ ఫ్రేమ్ శతి పేరియసామి, మిప్పుసామి ప్రభాకరన్, అశోక్, ధరణి, నవ్య సుజి, సలీమా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రోనీ రఫెల్ సంగీతాన్ని, ఆర్ఎస్ ఆనంద్ కుమార్ చాయాగ్రహణంం అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం నటుడు విజయ్‌సేతుపతి దర్శకుడు మిష్కిన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. Happy to launch #WindowBoysPictures #Demon First Look Poster.Congrats @dirramesh1603 & team.@Vasanthabalan1 @sachinmvm75 @abarnathi21 @Actor_Ashwin @suruthisamy8 @RaveenaDaha @anandakumardop @RonnieRaphael01 @EditorRavikumar @iamKarthikNetha @DoneChannel1 @CtcMediaboy pic.twitter.com/4U2CrC8rwI— VijaySethupathi (@VijaySethuOffl) February 16, 2023 చదవండి: స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్ చెన్నై -
ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా తమిళ్, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మెప్పిస్తున్నాడు. ఇటీవల విక్రమ్ మూవీలో అలరించిన ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఆయన కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆయనకు చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం విజయ్ సేతుపతి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే 2021లో బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ సేతుపతి, అతడి మనుషులు తనపై దాడి చేశారని, తనని అభ్యంతరకర పదాలతో విజయ్ దూషించారని ఆరోపిస్తూ మహా గాంధీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికీ ఈ కేసు కోర్టులోనే ఉంది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు విజయ్ సేతుపతిని హెచ్చరించింది. చదవండి: ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్ ‘సెలబ్రెటీలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు పెద్ద హీరో. మీకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రజల్లో ఉన్నప్పుడు మీ ప్రవర్తన అదుపులో ఉండాలనే విషయాన్ని గుర్తు పెట్టుకొండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీకు ఇష్టం వచ్చినట్లు దూషించడం సరైనది కాదు. ప్రజలని తిడుతూ సెలబ్రెటీలు వారి మధ్యలో తిరగడం సాధ్యం కాదు’ అంటూ విజయ్‌ని కోర్టు హెచ్చరించింది. ఆ తర్వాత ఇద్దరికీ అంగీకారం అయితే చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తమ సమాధానం చెప్పేందుకు ఇద్దరూ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను మార్చి 2కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం కోర్టు. -
అలా పిలవకండి.. విజయ్ సేతుపతి అసహనం
విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్నారు విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాడు. అయితే అతన్ని మాత్రం పాన్ ఇండియా స్టార్ అంటే ఫైర్ అవుతున్నాడు. నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి అని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను కేవలం నటుడిని మాత్రమే. దయచేసి నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి. ఆ ట్యాగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. కొన్ని సార్లు ఒత్తిడికి కూడా గురి చేస్తోంది. మళ్లీ చెబుతున్నా..నేను కేవలం నటుడిని మాత్రమే. అన్ని భాషల్లో నటించాలనుకుంటున్నాను. ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్లి నటిస్తాను’ అన్నారు. 96 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఆ తర్వాత సైరా, ఉప్పెన, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్లో కూడా అభిమాన దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నటించిన మైఖేల్ చిత్ర ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో మేరి క్రిస్మస్ చిత్రంలో నటిస్తున్నాడు. -
రిలీజ్‌కు రెడీ అయిన సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్
నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మైఖేల్. దివ్యాంష కౌషిక్ హిరోయిన్‌గా చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసయ భరద్వాజ్, వరలక్ష్మి శరత్ కువర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రంజిత్ జయక్కొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. శ్యాం సీఎస్ సంగీతాన్ని, కిరణ్ కౌశిక్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాచిత్రంగా ఫిబ్రవరి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్థానిక చెట్‌పేట్‌లోని లేడీ అండ్ స్కల్ ఆవరణలో మీడియాసమావేశాన్ని నిర్వహింంది. దర్శకుడు రంజిత్ జయక్కొడి మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రకు ఎలాంటి ఎమోషనల్, డైలాగులు లేకుండా రూపొందించాలని భావించామన్నారు. దానికి నటుడు సందీప్ కిషన్ అద్భుతంగా నటించారన్నారు. అదేవిధంగా యాక్షన్ సన్నివేశాలు శక్తివంతంగా ఉండటానికి ఫైట్ మాస్టర్ చాలా శ్రమించారన్నారు. ఇందులో ఒక క్యామియో పాత్ర ఉందని దానికి అన్ని భాషలకు తెలిసిన నటుడు అవసరమయ్యారని దీంతో తన మిత్రుడు విజయ్ సేతుపతిని నటించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించాలని చెప్పారు. చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత భరత్ చౌదరినే తమకు ఉద్వేగాన్ని కలిగించారన్నారు. తమ కలను ఇప్పుడు మైఖేల్‌గా మార్చింది కూడా ఆయనేనని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించారని అన్నారు. దర్శకుడు రంజిత్ జయక్కొడి మం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయ్ సేతుపతి మంచి మిత్రుడు అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. -
మా నమ్మకం నిజమైంది : సందీప్ కిషన్
‘‘మైఖేల్’ కథని, దర్శకుడు రంజిత్ని బలంగా నమ్మాం. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన మా నమ్మకాన్ని నిజం చేసింది. కథ, కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’ యూనివర్సల్‌గా రీచ్ అయ్యే సినిమా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుసూ్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ జయకొడి మాట్లాడుతూ– ‘‘నేను తమిళ్లో మూడు సినిమాలు తీశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ కిషన్‌కి సినిమా తప్ప మరో తపన ఉండదు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ట్రైలర్లోనే తెలుస్తోంది. ‘మైఖేల్’తో సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘రంజిత్ ‘మైఖేల్’ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పా’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘మైఖేల్’ లాంటి మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్. -
‘మనీ హేస్ట్’ సిరీస్‌ను తలపిస్తున్న షాహిద్ ‘ఫర్జీ’ ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఫర్జీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైం వీడియోస్. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చూట్టు కథ తిరుగనుందని తెలుస్తోంది. ‘నేను ఎంత డబ్బు సంపాదించాలంటే.. ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటూ షాహిద్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా పెంచుతోంది. దొంగ నోట్లు ముద్రించే యువకుడిగా షాహిద్ ఇందులో కనిపంచనున్నాడు. ఇక ఫర్జీ ట్రైలర్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మనీ హేస్ట్ ఇంగ్లీష్ సిరీస్‌ను తలపిస్తోంది. చదవండి: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకులు రాజ్-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఎంతో అభిరుచితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించామని, ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు కేకే మేనన్, రాశీఖన్నాలు మరో కీలక పాత్రలు పోషించారు. -
సందేశాత్మక చిత్రాలను మనమే ఆదరించడం లేదు: డైరెక్టర్ ఆవేదన
తమిళ సినిమా: సపర్బ్ క్రియేషన్స్ పతాకంపై నవ నిర్మాత రాజగోపాల్ ఇళంగోవన్ నిర్మించిన చిత్రం వెల్లిమలై. ఓం విజయ్ కథ బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ నటుడు సపర్ గుడ్ ఫిలిమ్స్ సుబ్రమణి ప్రధాన పాత్రలో నటించారు. నటి మంజు నాయకి. రఘునందన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో ఒక ముఖ్యమైన అంశాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం వెల్లిమలై. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ వేడుకలో నామ్ తమిళం పార్టీ నేత సీమాన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ మిష్కిన్, పేరరసు, దిండుక్కల్ లియోన్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ చిత్రం కోసం దిండుక్కల్ లియోన్ ఒక పాట పాడటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మిష్కన్ మాట్లాడుతూ.. మంచి సందేశంతో కూడిన చిత్రాలను కూడా మనం ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లో సినిమాలకు ఆదరణ కరువైందని, ఓటీటీలో సినిమా చూడటమంటే రౌడీయిజంతో సమానమంటూ ఆసక్తిక వ్యాఖ్యాలు చేశారు. ఇంతకుముందు మణికంఠన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నిర్మించి ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కడైసీ వ్యవసాయి అన్నారు. ఆ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. కానీ మనం మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నారు. రూ. 300, 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల మధ్య కడైసీ వ్యవసాయి చిత్రానికి రూ. 30 కోట్లు కూడా రాకపోవడం విచారకరమన్నారు. మంచి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని మిష్కిన్ పేర్కొన్నారు. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మైఖేల్ సినిమాలో సందీప్‌కిషన్‌కు జోడీగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. Meet the Man who Loved the Hardest #MICHAEL 🖤 Worldwide only in Theatres on Feb 3rd, 2023 🔥#MichaelfromFEB3rd 👊🏾@VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/5NEnI0KZgW — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) January 3, 2023 -
విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి. చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉంటే స్టార్ నటుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నయా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి స్లీమ్‌గా హీరోలా కనిపించి ట్రోలర్స్‌కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) -
Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..
నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఇటీవల నటించినా విక్రమ్ చిత్రం ఘన విజయంతో చాలా జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ – 2 చిత్రంలో నటిస్తూ, మరోపక్క బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 23న అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాతి రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డీఎస్పీ. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకంపై పొన్రామ్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ట్రేడ్ సెంటర్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలహాసన్ మాట్లాడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురైతే పరామర్శించిన తరువాత తదుపరి చిత్రం ఏమిటి? ఎప్పుడు నటించనున్నారు? అని అడిగే వారున్నారు. ఇప్పుడు కాలు చిన్నగా గీరుకు పోయినా పెద్దగా ప్రచారం చేస్తున్నారన్నారు. కారణం ఒకటి మీడియా, రెండు అభిమానం అని పేర్కొన్నారు. తాను చిన్న దగ్గు సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరానని స్పష్టం చేశారు. ఇకపోతే నటుడు విజయ్ సేతుపతి కోసమే తానీ కార్యక్రమానికి విచ్చేసినట్లు చెప్పారు. కారణం తనలాగే ఆయన సినిమా ప్రేమికుడు అని పేర్కొన్నారు. చిత్ర ట్రైలర్ చాలా బాగుందంటూ.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తాను నటుడు మర్లన్ బ్రాండోను కలిసినప్పుడల్లా ఆయన ముందు మోకాళ్లపై నిలబడి ఆయన చేతులను ముద్దాడే వాడినన్నారు. ఈ వేదికపై విజయ్ సేతుపతి తన ముందు మోకాళ్లపై నిలబడి పుష్పగుచ్ఛం ఇవ్వాలని, భవిష్యత్‌లో ఆయన ముందు మరో నటుడు వంగి నిలబడుతారని కమలహాసన్ అన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ నటుడు కమలహాసన్‌తో కలిసి విక్రమ్ చిత్రంలో నటించినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆయన మరో నాలుగైదు తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. -
మరో సూపర్‌స్టార్‌తో విజయ్ సేతుపతి
ఇతర కథానాయకులకు భిన్నమైన నటుడు విజయ్ సేతుపతి. ఈయనకు హీరోగా స్టార్ డమ్ ఉన్నా దాని పక్కన పెట్టి ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నచ్చిన, వచ్చిన అవకాశాలను వదలుకోకుండా నటిస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాకీస్, మేరీ క్రిస్మస్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే మైఖేల్, విడుదలై, జవాన వంటి చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలోనూ, తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విలన్‌గా పేట చిత్రంలో, కమలహాసన్‌కు విలన్‌గా విక్రమ్ చిత్రంలో, విజయ్‌కు ప్రతినాయకుడిగా మాస్టర్ చిత్రంలోనూ పోటీ పడి నటించి మెప్పించారు. కాగా తాజాగా మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందులోనూ విజయ్ సేతుపతి విలన్‌గానే కనిపిస్తారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన విజయ్ సేతుపతి, విష్ణు విశాల్ చిత్రం
విజయ్ సేతుపతి, విష్ణు విశాల్, నటి ఐశ్వర్య రాజేశ్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇడమ్ పొరుళ్ ఎవల్’. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు శీను రామస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2014లోనే విడుదల కావాల్సింది. అయితే ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయింది. కాగా న్యాయస్థానం ఆదేశంతో 8 ఏళ్ల తరువాత ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిజానికి ఈ చిత్రంపై అప్పట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కారణం దర్శకుడు శీను రామస్వామి కావడమే. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి వస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లకు విముక్తి కలిగింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేదీ? అది థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అన్న విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్‌ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రలో విజయ్ సేతుపతి?
తమిళసినిమా: చిరుతై పులిగళ్ పార్టీ నేత వేలు పిళ్లై ప్రభాకరన్‌ను తమిళులు ఎప్పటికీ మరచిపోలేరు. శ్రీలంక ప్రజల హక్కులు, వారి రక్షణ కోసం నిరంతరం పోరాడి శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు ప్రభాకరన్. ఆ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయి న ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. తాజాగా మరో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విడుదలై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీని తరువాత నటుడు సూర్య హీరోగా వాడి వాసల్ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత వేలుపిళ్లై ప్రభాకరన్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనిని నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ నిర్మించనున్నట్లు ఇటీవల ఒక వేదికపై స్వయంగా వెల్లడించారు. అదేవిధంగా ఇటీవలే విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని జయం రవి నటించిన అరుణ్మొళి ఇతివృత్తంతో చిత్రం చేస్తానని తెలిపారు. కాగా వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని చర్చ జరిగినట్లు, ఆ పాత్రకు విజయ్‌కాంత్ మాత్రమే న్యాయం చేయగలరని, అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగుండకపోవడంతో నటించే అవకాశం లేదని సీమాన్ భావించినట్లు సమాచారం. దీంతో వేలుపిళ్లైప్రభాకరన్ పాత్రలో ప్రస్తుతం నటించగల సత్తా వున్న నటుడు విజయ్ సేతుపతికి మాత్రమే ఉందన్న నిర్ణయానికి వచ్చి ఆయన్ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. -
భారీ బడ్జెట్‌తో విజయ్ సేతుపతి ‘విడుదల’, రూ. 10 కోట్లతో రైలు సెట్
విజయ్ సేతుపతి ఉపాధ్యాయుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘విడుదలై’ (విడుదల). కానిస్టేబుల్ పాత్రను సూరి చేస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ రెండు భాగాలుగా నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మొదటి భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో రూ. 10 కోట్లతో రైలు, రైలు బ్రిడ్జి సెట్ రూపొందించాం. అలాగే సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యంలో భారీ సెట్ నిర్మించాం. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కొడైకెనాల్లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడుకి వచ్చిన స్టంట్ బృందం పాల్గొంటోంది’’ అన్నారు. భవాని శ్రీ, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: వేల్రాజ్. -
రెండు భాగాలుగా విజయ్ సేతుపతి కొత్త చిత్రం ‘విడుదలై’
ప్రస్తుతం రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రాల సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. బాహుబలి రెండు భాగాలుగా రూపొంది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా పుష్ప తొలి భాగం సంచలన విజయం సాధింంది. దాని సీక్వెల్‌కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఇక పొన్నియిన్ సెల్వన్ చిత్రం కూడా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. తాజాగా 'విడుదలై' చిత్రం కూడా ఈ లిస్టులో చేరిపోయింది. విజయశాంతి, సూరి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థల అధినేతలు ఎల్ రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ భారీఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సంస్థలు ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, కో వంటి సపర్‌హిట్ చిత్రాలను రూపొందించారు. దీంతో 'విడుదలై' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం తొలి భాగం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని నిర్మాతలు తెలిపారు. కాగా రెండవ భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. కథ డిమాండ్ చేయడంతో రూ.10 కోట్ల వ్యయంతో ఓ రైల్వే బ్రిడ్జ్‌ను రైలు కంపార్టుమెంట్ బోగి సెట్లను వేసి షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అదే విధంగా సిరుమలై ప్రాంతంలో ఒక గ్రామం సెట్ వేసి కీలక సన్నివేశాలను త్రీకరింనట్లు చెప్పారు. ప్రస్తుతం కొడైకెనాల్లో విజయ్ సేతుపతి, సూరి, పలువురు ఫైట్ కళాకారులతో భారీ ఫైట్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. తమ గత చిత్రాల మాదిరిగానే విడుదలై కూడా కచ్చితంగా విజయం సాధిస్తాయన్న నమ్మకాన్ని నిర్మాతల్లో ఒకరైన ఎల్రెడ్ కుమార్ వ్యక్తం చేశారు.