Visakha Steel Plant
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. నేడు గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా కార్మికులు హాజరయ్యారు. -
ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి షాక్
-
ఉక్కు కార్మికులపై విషం కక్కిన బీజేపీ
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనపై పోలీసుల ఆంక్షలు
-
ఉక్కు గొంతుపై ప్రైవేటీకరణ కత్తి తుక్కు సంకల్పం.. చంద్రబాబు చిల్లర పబ్లిసిటీ
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
సాక్షి, విశాఖపట్నం: కుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది -
వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది.’ అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకూ కర్మాగారం అభివృద్ధిలో నడిచింది. 2016–17లో 7.3 మిలియన్ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటి నుంచి నష్టాలు ప్రారంభయ్యాయి. 2018–19, 2020–21లో రూ.930 కోట్లు లాభాలు వచ్చాయి. 2021 కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అంతేకాదు.. ఉద్యమాలు, ఆందోళనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి.. అప్పటి ప్రభుత్వంవల్లే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.Thankyou YSRCP MP's For Saving VIZAG STEEL PLANT✊ pic.twitter.com/UECSvaE8Wj— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 17, 2025ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయినేను కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సమీక్షలు చేసి విశాఖ ఉక్కుకు సాయంచేయాలనే విషయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లా. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా, వాటిని పక్కనపెట్టి చివరి అవకాశంగా రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. దీంతో రెండేళ్లలోనే స్టీల్‌ప్లాంట్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడాన్ని నేను సవాలుగా తీసుకున్నా.ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి రూ.10 వేల కోట్లుకు పైగా పెట్టుబడిని మద్దతుగా ఇచ్చేందుకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థంచేసుకుని ఈ చర్య చేపట్టాం’ అని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘ఎక్స్’లో తెలిపారు. విలీనం, ఉద్యోగుల వీఆర్ఎస్పై దాటవేత..ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్ని వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు.. సెయిల్ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా ప్రస్తావించగా.. కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్ఎస్పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి, పరిష్కరించేందుకు ముందుకెళ్తామన్నారు.అలాగే, ప్యాకేజీ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో రూ.26,114.82 కోట్లు అప్పుల్లో ఉన్నట్లు ఉంది. ఇదే అంశంపై కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘రూ.26,114.82 కోట్లు కాదు రూ.35 వేల కోట్లు రుణభారం ఉంది. దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం’ అన్నారు. ప్యాకేజీకి.. ఉన్న రుణభారానికి సంబంధంలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ జగన్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఆనాడు లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా ఏపీ శాసనసభ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సంస్థను కాపాడేందుకు @ysjagan ప్రభుత్వం ఆది నుంచి పోరాడుతూనే… pic.twitter.com/vdsM9VCkIS— YSR Congress Party (@YSRCParty) January 18, 2025 -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు, పవన్ గ్రీన్ సిగ్నల్ ..!
-
నాటి జగన్ సర్కార్ ఒత్తిడితోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది: కుమారస్వామి
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిన సంగతి తెలిసిందే.. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు.పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు కరోనా సమయంలో రూ.930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తుచేశారు.నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం... పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారంప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం -
ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్‌తో ఒరిగేదేమీ లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఉక్కు పోరాట కమిటీ.. ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్రాలకు లేదని మండిపడుతోంది. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన సాయం పై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం అరకొరగా స్పందించిందని.. అరకొర చర్యలతో విశాఖ ఉక్కుకు ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 11,500 కోట్లు ప్యాకేజీ ప్రకటించి.. అందులోనే 10,300 కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తామనడం సరికాదు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటే సెయిల్‌లో విలీనం చేయాల్సిందే. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి ప్రోత్సహించడం సరికాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించడం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకమే’’ అని రామకృష్ణ స్పష్టం చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
స్టీల్ ప్లాంట్ కార్మికులను సాగనంపేందుకు బాబు కుట్రలు
-
మోదీ భజనకే బాబు, పవన్ పరిమితం.. ఇక ఉక్కు ఉద్యమం ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయిస్తూ.. పోరాటానికి సన్నద్ధమవుతోంది. 35 గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది.ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ తో సహా మరి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీక్షా శిబిరం వద్దే ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు బైఠాయించారు. కాగా, ఇప్పటికే దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.ఏపీ హక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదు. స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు, పవన్ అడగలేదు. కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది.ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడగని చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ కోసం అడగని చంద్రబాబు.. పోలవరం నిర్వాసితుల నిధులపై కూడా స్పష్టత కోరలేదు.చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిదంటూ నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబు, పవన్.. ఎంపీల బలం ఉన్నా ఏపీ హక్కుల కోసం నోరువిప్పలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సాగిలపాటు వైఖరి విశాఖ, ఏపీ ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది. -
దీక్షా శిబిరం దాటొస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
-
విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికుల తీవ్ర పోరు
-
వారు చరిత్ర హీనులే.. బాబు, పవన్ పై విశాఖ కార్మికుల ఆగ్రహం
-
తగ్గేదేలే అంటున్న విశాఖ ఉక్కు కార్మికులు
-
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం
-
ఢిల్లీకి విశాఖ ఉక్కు పోరాటం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందని జీతాలు
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట దాటేసిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం చంద్రబాబు పాతపాటే పాడారు. శుక్రవారం విశాఖలో ఆయన పర్యటించారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా స్టీల్‌ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నాం అంటూ మాట దాటేశారు. దీంతో స్టీల్‌ఫ్లాంట్‌పై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాత స్వరమే వినిపించడంతో ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఆరు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు.మరో వైపు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న నిరసనలను అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా.. ఉద్యమిస్తున్న కార్మికులపై ఉక్కుమోదం మోపుతోంది. ఇదీ చదవండి: దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని కేంద్రమంత్రి చెప్పి మూడు నెలలైంది.. ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఆ సంఘాల నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
విశాఖలో హైటెన్షన్.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. ఆదివారం.. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిన్న(శనివారం) అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు.కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. రెండు లక్షల కోట్ల విలువచేసే స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’’ అని మరోసారి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని చంద్రబాబు విజయవాడకు తీసుకెళ్లారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశ్యం. త్వరలో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు 44 స్థానాలకు పెరగనున్నాయి. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలను గెలుచుకుంటాము. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాము. వారికి ఎటువంటి కష్టం రానివ్వం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ -
బాబూ.. బేల మాటలేల?
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్‌ని నడిపించాలి. సెయిల్ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలి? ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్‌కు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్‌కు, స్టీల్‌ప్లాంట్‌కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్‌తో పోలిస్తే స్టీల్‌ప్లాంట్‌కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది బాబూ.? స్టీల్‌ప్లాంట్‌కు మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్‌కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్మెంట్ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్ఎస్, మరో ప్లాంట్‌కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో యూనిట్‌కి రూ.8 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్ ఎన్‌క్యా‹మెంట్, ఎల్‌టీఏ(లాంగ్ ట్రావెల్ అలవెన్స్), లాంగ్‌లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్ఎల్టీసీ), ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కూడా నిలిపేశారు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.నక్కపల్లిలో ప్రైవేట్ ప్లాంట్‌కు సొంత గనులా? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికిప్లాంట్ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్‌ప్లాంట్‌కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్ సజీవంగా బతికేది.ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఉంటే సెయిల్ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్‌ప్లాంట్ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి -
స్టీల్ ప్లాంట్ లో పరిణామాలపై చంద్రబాబు వైఖరేంటి : బొత్స
-
‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’
''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై క్లియర్ పిక్చర్ లేదు’’... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాదని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చూస్తే చాలా అమాయకుడని అనిపించవచ్చు. కానీ.. మాటల మార్చడంలో, ప్రగల్భాలు పలకడంలో, యూటర్న్ తీసుకోవడంలో ఈయన్ను మించిన వారు ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. బహుశా దేశం మొత్తమ్మీద ఇంకొకరు లేరనడానికి ఇది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బాబు వ్యాఖ్య ఒక నిదర్శనమనే చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి మీడియాతో మాట్లాడుతూ వారు ఏ ప్రశ్న అడిగినా అది సాధ్యం కాదన్న సమాధానం వచ్చేలా చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వొచ్చుకదా అంటే ''అవును ఇవ్వొచ్చుగానీ అంతటితో అయిపోదు కదా, గనుల్లేవు అని ముక్తాయిస్తారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయొచ్చుకదా అంటే ''అలా చేయవచ్చుగానీ, అందుకు వారు అంగీకరించాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి'' అంటూ జవాబా ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణ కాకుండా నిలబెడతామన్నారు కదా అని ప్రశ్నిస్తే ''ప్రతిపక్షంలో ఉనప్పుడు మాకు క్లియర్ పిక్చర్ లేదు'' కదా అని నిస్సిగ్గుగా బదులిస్తారు.వీటన్నిటి సారాంశం ఒకటే..స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అపలేమని చెప్పడమే. ఇక్కడే ఆయన తన తెలివితేటలన్నీ ఉపయోగిస్తుంటారు. ఇంకో అనుమానం కూడా వస్తోంది. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నదని, పది వేల మందికి ఉపాధి వస్తుందని తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బ్యానర్ కథనాలు వండివార్చాయి. ఇందులో లోకేష్‌ను పైకెత్తడం ఒక పాయింట్ అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనంలో ఉన్న ఆందోళనను డైవర్ట్ చేయడం కూడా మరో అంశం అనిపిస్తోంది. నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫోసిస్, టీసీఎస్ మొదలైన సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను జగన్ స్వయంగా ఆరంభించారు. బీచ్ ఐటీ పేరుతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చాలని జగన్ ప్రయత్నిస్తే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటివి ఎల్లో మీడియా రకరకాలుగా విమర్శిస్తూ అడ్డుకునేంత పనిచేశాయి. కానీ ఇప్పుడు ఆ సెంటర్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఆ సెంటర్ వస్తే మంచిదే. కానీ అంతా అయిపోయినట్టు, పదివేల మందికి ఉపాధి వచ్చేసినట్టు ప్రచారం చేయడమంటే జనాన్ని మభ్యపెట్టడమే.ఇదంతా విశాఖలో స్టీలప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి మీద జనంలో ఉన్న నిరసనను తగ్గించడానికే అని అనుకోవచ్చు.ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఏమని చెప్పారో గుర్తు చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానికోసం ఎందాకైనా వెళ్లి పోరాడతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు శపథాల మీద శపథాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తే ఇంకేముంది భూములు కాజేయడానికే అని దుష్ప్రచారం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినా జగన్ ప్రైవేటీకరణను ఆపడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తేనే దాన్ని నిలబెడతామని గొప్పలకు పోయారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా తామే ఫ్యాక్టరీని నిలబెట్టామని చెప్పుకున్నారు. విశాఖ ఉక్కు రక్షణకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీల వారిని ఢిల్లీ తీసుకువెళతామని చంద్రబాబు, పవన్ లు తమ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిద్దరూ చేతులెత్తేయడం, నాలుక మడతేయడం చేస్తున్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకాదు.. కాదన్నట్లు పరిస్థితి ఏర్పడుతున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిమ్మకు నీరెత్తితనట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ముందే తాము ప్రైవేటీకరణకు అనుకూలం అని చెప్పి ఉంటే, ఇప్పుడు తప్పు పట్టజాలం. అలా కాకుండా, జనాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు కబుర్లు చెప్పి, ఇప్పుడు నాలుక మడతేయడం అంటే ఆంధ్రులను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీ తన జేబులో ఉన్నట్టు మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కొద్ది రోజులక్రితం తెలుగుదేశం మీడియా ఈనాడులో విశాఖ స్టీల్‌ను విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అంటూ ఒక పెద్ద కథనాన్ని ఇచ్చారు. అంటే అప్పుడు కార్మికులను మభ్యపెట్టడం కోసం రాశారన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే సెయిల్ లో విలీనం అంత తేలిక కాదు అని చంద్రబాబే చెబుతున్నారు. జనసేన నేతలైతే కార్మిక సంఘాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి వచ్చిందని ఎదురు దాడి కూడా చేస్తున్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంపై నంగినంగిగా మాట్లాడినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయించడానికి సిద్ధమైందని, దానికి ఆయన ఓకే చేశారనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అఖిలపక్షం వేస్తే ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ విమర్శలు తప్ప అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు క్లియర్ పికచ్చర్ లేదని బుకాయిస్తున్నారు. తానే విశాఖ స్టీల్ ను కాపాడానని ప్రచారం చేసుకుంటూ ఇంకో వైపు క్లియర్ పిక్చర్ లేదని చంద్రబాబు చెబుతుండడం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును, ఆయనే ప్రైవేట్ వారికి అమ్మేస్తున్నట్టుగా అనుకోవాలన్న మాట.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబకు స్టీల్ ప్లాంట్ గురించి తెలియదంటే ఆయన విజన్ ఏమైనట్టు? ఆయన చేసిన వాగ్ధానాలు ఏమైనట్టు? ఎన్నికలకు ముందు కార్మికుల ఆందోళనలో భాగస్వామ్యమై వారిని నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని అనుకోవాలి. కేంద్రంలోను, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీరు పూర్తిగా యూటర్న్ తీసుకోవడమంటే విశాఖ ప్రజలనే కాకుండా ఆంధ్ర ప్రజలందరినీ పచ్చిగా మోసం చేసినట్టు అవుతుంది కదా.విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం వేలాది మంది రైతులు తమ భూములను ఇచ్చారు. స్లీల్ ప్లాంట్ వచ్చాక విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. అది ప్రభుత్వపరంగా ఉండడంతో ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరాయి. ఆ ప్లాంట్‌కు ఇప్పటికైనా ఐరన్ ఓర్ గనిని కేటాయించి, ఒక ప్యాకేజీ ఇస్తే అది నిలబడుతుందని, కానీ కావాలనే ఈ ప్లాంట్‌ను నష్టాల పాలు చేస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వివిధ హామీల విషయంలో జనాన్ని మాయ చేసినట్లుగానే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మరోసారి మాట తప్పుతున్నారు. తద్వారా రాష్ట్రానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమే తీరని ద్రోహం చేస్తోందన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ ఉక్కుపై బాబు అండ్ కో యూటర్న్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు. నిర్భీతిగా మాట మార్చేస్తున్నారు. ‘ప్రైవేటీకరణను నిలవరించలేని జగన్.. రాజీనామా చెయ్యి’ అంటూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని ఎన్నికలకు ముందు ప్రజాగళం సభలో శపథం చేశారు. వాజపేయి హయాంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోతే తానే అడ్డుకున్నానని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం రాబట్టి ఫ్యాక్టరీని ఆదుకున్నామని.. ఇప్పుడూ కాపాడుకుంటామని గద్దె నెక్కిన కొత్తలో సెలవిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం యూనియన్ నాయకులకూ మొన్న ఆగస్టులో అదే హామీ ఇచ్చారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానివ్వం. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. నాతో కలిసి రండి, ఢిల్లీకి తీసుకువెళ్తా. ఇక్కడ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో మన వాణి బలంగా వినిపిద్దాం..’ అని ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బల్లగుద్ది చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతానని హామీ ఇచ్చారు. ఇన్ని మాటలు మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చేశారు. పవన్ మౌన వ్రతం పాటిస్తుండగా.. చంద్రబాబు తన ఒక్కడి చేతుల్లో లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై ఢిల్లీ వెళదామని నేను పిలిస్తే స్పందించారా? ప్రైవేటు ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల బాటలో నడుస్తుంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా భ్రష్టు పట్టడానికి కారణమేంటో యాజమాన్యం, సిబ్బంది ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు గత నెల 17న మీడియాతో రివర్స్‌లో మాట్లాడారు. అప్పుడు మొత్తం పిక్చర్ తెలీదట!‘‘విశాఖ స్టీలు ప్లాంటును ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి? ఏ విధంగా ట్రాక్‌లో పెట్టాలి.. ఏ విధంగా చేస్తే ముందుకు వెళుతుంది.. అనే అంశాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. సెయిల్‌లో విలీనం చేయాలనేది ఒక ప్రత్యామ్నాయం. అందుకు సెయిల్, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అదొక సమస్య. ఎన్ఎండీసీకి భూమి ఇస్తే.. వారు డబ్బులిచ్చినా అది తాత్కాలికం. ఆ డబ్బులు చాలవు. రూ.వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లతో రివైవ్ కాదు. దీనికి ఒక పూర్తి ప్యాకేజీ ఇవ్వాలి. ముడి సరుకు కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేం ఆలోచిస్తున్నాం. మొత్తం మీద ఫెయిర్‌గా డిస్కస్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. ఎవరో ఒకరు.. కేంద్రమో, రాష్ట్ర ప్రభుత్వమో, బ్యాంకులో ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి. మేనిఫెస్టోలో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేస్తాం అని చెప్పాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మొత్తం పిక్చర్ ఉండదు. వెరీ క్లియర్. అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని తాజాగా అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో హామీ లిచ్చామని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దాటవేసే ప్రయత్నం చేశారు. పైగా సెయిల్‌లో విలీనానికి సెయిల్, కేంద్రం ఒప్పుకోవాలని.. ఇది తమ చేతుల్లో లేదనే రీతిలో వ్యాఖ్యానించారు. తద్వారా విశాఖ స్టీలు ప్లాంటుపై ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కొద్ది రోజులు మాట్లాడిన మాటలు అంతా హంబక్ అని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.అసెంబ్లీ తీర్మానంతో వైఎస్సార్సీపీ అడ్డుకునే యత్నం » స్టీల్ ప్లాంట్‌ను దివాలా పరిశ్రమగా చూపించే కుట్ర జరుగుతోంది. 2021లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. వెంటనే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్లాంట్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి లేఖలు రాశారు. » అంతటితో ఆగకుండా అసెంబ్లీలో సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విశాఖలో భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలో కూడా వేదికపై లక్షల మంది ప్రజల సమక్షంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. » రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశీల్‌మెట్ట జంక్ష¯న్ నుంచి కూర్మన్నపాలెం జంక్ష¯Œన్ వరకు అప్పటి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో భారీ పాదయాత్ర చేపట్టారు. స్టీలు ప్లాంట్ ఉద్యమానికి వైఎస్సార్సీపీ నుంచి లభించిన మద్దతు కార్మికుల్లో ధైర్యాన్ని పెంచింది. ఫలితంగా కేంద్రం దూకుడుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు వెళ్లింది.» ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు స్టీలు ప్లాంటులో ఇంత జరుగుతున్నా... ఏ ఒక్క రోజూ నోరు విప్పి మాట్లాడేందుకు సాహసించ లేదు. పైగా జనసేన నేతలు నెపమంతా కార్మికులపై నెట్టేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో మాట్లాడతామని, ఇప్పుడు అంత సులువుకాదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. రుణం పేరుతో నిబంధనలు, బెనిఫిట్స్‌లో కోత » స్టీల్ ప్లాంట్ కోసం రూ.12 వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, కేంద్రం రూ.2 వేల కోట్ల రుణాన్ని (ఎస్బీఐ ద్వారా) అందిస్తున్నట్టు పైకి నటిస్తూ.. ఈ నిధులను జీఎస్టీ, పీఎఫ్ బకాయిలు, ప్రభుత్వ లెవీ, వెండర్స్‌కు చెల్లింపులు చేయాలని నిబంధనలు విధించింది. ఇతరత్రా అంశాలకు ఖర్చు చేస్తే.. ఆ నిధుల్ని ఫ్రీజ్ చెయ్యాలంటూ ఆదేశించింది. » వాస్తవానికి స్టీలు ప్లాంటు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 7.9 మిలియన్ టన్నులు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు 30 వేల మంది కార్మికులు ఉండాలి. ఒకవైపు సెయిల్‌లో 19 మిలియ¯Œన్ టన్నుల సామర్థ్యానికి లక్ష మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న 14 వేల మందిలోనే 4 వేల మందిని తొలగించేందుకు ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా ప్రతిఘటించాయి.» దీంతో రానున్న రోజుల్లో విడతలు విడతలుగా కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌లోనూ భారీగా కోతలకు యాజమాన్యం దిగింది. గత ఆరు నెలలుగా ఉద్యోగులు జీతం ఒకేసారి అందుకున్న దాఖలాలు లేవు. సగం జీతం కూడా నెలాఖరున చెల్లిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించ లేక డీఫాల్టర్లుగా మారుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించడం లేదు. టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు, పీఆర్పీ, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ తాత్కాలికంగా నిలుపుదల వంటి అనేక చర్యలకు దిగింది. వీటన్నింటిపై ఏ ఒక్క రోజు కూడా కూటమి నేతలు కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడిన దాఖలాలు లేవు.జగన్ చెప్పిందే నిజమవుతోంది.. వాస్తవానికి ఎన్నికల ముందు గాజువాకలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంటు సీట్లల్లో టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు ఓటు వేయడమేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చి గెలుపొందారు. ఆ తర్వాత స్టీలు ప్లాంట్ ఉన్న నియోజకవర్గంలో తమకు వచ్చిన భారీ మెజార్టీ ధైర్యంతోనే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయని అర్థమవుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో కార్మికులు, ఉద్యోగులు పోరుబాట పడుతున్నప్పటికీ కూటమి నేతలెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.పరిస్థితి తారుమారు» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి తారుమారైందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్డీయే సర్కారు వరుస నిర్ణయాలతో స్టీల్ ప్లాంట్‌ను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఇందుకు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ముందుగా మూల ధనం సమీకరణ పేరుతో ఆస్తుల వేలానికి సిద్ధమైంది. » ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్ యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లుగా లెక్కగట్టింది. ఆ వెంటనే ఉత్పిత్తిని తగ్గించే కుట్రలో భాగంగా రెండు నెలల క్రితం బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసివేసింది. » స్టీల్ ప్లాంట్‌కు ఏటా 73 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ సంస్థ నిర్వీర్యం చేయడానికి బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసేసిన కూటమి ప్రభుత్వం.. గత నెలలో బొగ్గు కొరతను కారణంగా చూపిస్తూ... బ్లాస్ట్ ఫర్నేస్–3ని బ్లోడౌ¯న్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్–2 ద్వారా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. సాధారణంగా ఒక్కో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి రోజుకు 7 వేల టన్నుల ఉత్పత్తికి అవకాశమున్నప్పటికీ.. బీఎస్–2 ద్వారా కేవలం 4 నుంచి 5 వేల టన్నులు స్టీల్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.» మరో వైపు సుమారు 4 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించడానికి రూ.1,261 కోట్లు కేటాయించింది. రాత్రికి రాత్రి రేపటి నుంచి ఉద్యోగాల్లోకి రావద్దంటూ కార్మికులకు కబురు పంపింది. అయితే, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా స్టీలు ప్లాంటు యాజమాన్యం వెనక్కు తగ్గింది. మరోవైపు 500 మంది ప్లాంట్ అధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై పంపాలని తీర్మానించారు. వీరితో పాటు 25 శాతం మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించారు. » మరోవైపు జనసేన నేత బొలిశెట్టి సత్య నోటి దురుసుతో అసలు ప్రైవేటీకరణకు కారణం కార్మికులే అని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ఖండించలేదు. పైగా పవన్ కళ్యాణ్ మౌనం కాస్తా ఇదే తమ పార్టీ స్టాండ్ అనే రీతిలో ప్రజలకు అర్థమవుతోంది. -
విశాఖ ఉక్కుపై శ్వేతపత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం నా ఒక్కడి చేతిలో లేదు. ఏం చేద్దామన్న విషయంపై మాకు సరైన స్పష్టత లేదు. ఈ అంశం విషయంలో ఆల్ పార్టీ నేతలతో మీటింగ్ పెడితే వాళ్లేం చెబుతారు? వాళ్లు రాజకీయ విమర్శలే కదా చేసేది? శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా. అందుకే దీనిపై వైట్ పేపర్ (శ్వేతపత్రం) రిలీజ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.ఉదయం రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి.. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియా బృందంతో సమావేశం నిర్వహించి, ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చాలా జఠిల సమస్య అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీని కలిసి ‘స్వర్ణాంధ్ర–2047’ డాక్యుమెంట్‌ను వివరించానని, పోలవరం నిధుల విషయంలో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపనవిశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా రూ.73,743 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్–అమరావతి–చెన్నై–బెంగుళూరు–హైదరాబాద్ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ తీసుకు రావాలని కోరానని తెలిపారు. 2026లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అమరావతి–విజయవాడ రైల్వే లైన్, మచిలీపట్నం–రేపల్లె కనెక్టివిటీ, ఇక్కడ నుంచి కాకినాడకు కనెక్టివిటీ ఉండేలా పనులు ప్రారంభించాలని కోరామన్నారు.రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని.. నడికూడి, శ్రీకాళహస్తి, కోటపల్లి, నర్సాపూర్ వంటి లైన్లను కూడా మార్చాలని కోరానని తెలిపారు. హైదరాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ వేపై నితిన్ గడ్కరీతో చర్చించానని చెప్పారు. 189 కి.మీల అమరావతి ఓఆర్ఆర్పై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. -
ఉద్యమంపై ‘ఉక్కు’పాదం..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్‌లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మెడపై కత్తి.. ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు. నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం.. అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఉక్కు పోరాటం ఉధృతం
-
ప్రైవేటీకరణ ఆపకుంటే.. కూటమి నుంచి వైదొలగాలి..
సీతమ్మధార: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఆపాలని.. లేకుంటే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తమ మద్దతును ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు ఉద్యమించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రసంగించారు. ఆనాడు తమనంపల్లి అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలను నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలిచి్చ.. కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబదీ్ధకరించాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర తీర్మానాలను రమణమూర్తి సభలో చదివి వినిపించారు. తరలి వచ్చిన జనవాహిని అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ జన సంద్రమైంది. మార్గంమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలువురు వ్యాపారులు మద్దతు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే అక్కడ ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్ధరిల్లింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దాస్, భారత నాస్తిక సమాజం జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి వై.నూకరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేఎస్ చలం, మురికివాడల సంక్షేమ సంఘం తరఫున కె.రవికుమార్, ఇసరపు లక్ష్మి, హెచ్ఆర్ఎఫ్ నుంచి శరత్, ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున కె.అన్నపూర్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి లడ్డూపై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్‌పై లేదుసీతమ్మధార: రాష్ట్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూతో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై లేదని అఖిలపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి0ది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన నాయకులు నేడు బీజేపీ చర్యల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక, ప్రజ సంఘాల పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చెర్మన్ నాగభూషణం, మన్మథరావులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టే విధానాలు అవలంభిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, సీఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ఎ.కనకారావు, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె.శంకరావు, ఏపీఎఫ్‌టీయూ కె.దేవా, మల్లన్న, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు ధర్నా కొనసాగింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.చివరకు ఒత్తిడిల నేపథ్యంలో యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో తొలగించిన కార్మికులకు నెలవారీ పాసులు, వేరే రంగు పాసులు ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి ఆగ్రహించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసు బలగాల మోహరింపు ధర్నాకు ముందెన్నడూ లేనివిధంగా విధుల్లో ఉన్న కార్మికులు కూడా హాజరయ్యారు. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులను నిలువరించేందుకు ఈడీ భవనం ముందు, వెనుక గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు భవనం ఎదుట కారిడార్‌లో బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులు రెండు గేట్ల వద్ద బైఠాయించడంతో భవనం నుంచి ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒకానొక దశలో పోలీసులు ఆందోళనాకారులను లాఠీల సాయంతో పక్కకు నెట్టారు. అప్పటికే అక్కడికి మీటింగ్‌కు వచ్చి ఉన్న వివిధ విభాగాధిపతులు మధ్యాహ్నం భోజనానికి తమ విభాగాలకు వెళ్లలేక పోయారు. సాయంత్రం 5.30కు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులను కూడా బిల్డింగ్ బయటకు అనుమతించక పోవడంతో వారు తమ కార్యాలయాల్లో నిలిచిపోవాల్సి వచి్చంది.డిమాండ్లపై యాజమాన్యం ససేమిరా డిమాండ్ల సాధన కోసం యాజమాన్యం ప్రతినిధులతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. గతంలో మాదిరిగా పాసులు ఇవ్వాలని, వారికి పాత రంగులో పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం రాతపూర్వకంగా హామీ కోరగా.. యాజమాన్యం ససేమిరా అనేసింది. దీంతో రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెగేసి చెప్పారు. వర్క్స్ ఉన్నతాధికారులు, హెచ్ఆర్ అధికారులు ఉన్నత యాజమాన్యం అనుమతి కోసం ప్రయత్నం చేసినా సానుకూల స్పందన రాలేదు. ఫలితంగా కార్మికులు మంగళవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు
-
తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మికులు అంటున్నారు.నిన్న(ఆదివారం) సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.మరోవైపు, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: ‘స్టీల్’ కాంట్రాక్ట్ కార్మికుల నెత్తిన పిడుగుదీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
ఒకేసారి 4 వేల మంది తొలగింపు!.. రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్‌లో విలీనం చేయాలి. ప్లాంట్‌కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలి. మూడు బ్లాస్ట్ ఫర్నిస్ను పూర్తిస్థాయిలో నడపాలి’’ అని కార్మికులు కోరుతున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది.నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఇదీ చదవండి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం -
స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు, పవన్ ఏ విధంగా అమ్మేస్తున్నారు.. కేఏ పాల్ సంచలన విషయాలు
-
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది. ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు. అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833 -
బాబు, పవన్ ఎక్కడ..? స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన..
-
ఉక్కు పోరాటం ఉధృతం
-
ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్.. ఉక్కు కార్మికుల నిరసన
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు నిరసనకు దిగారు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్లలో భారీ నిరసనలు చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.మరోవైపు, అనుబంధ పరిశ్రమల విక్రయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటుకు అప్పగించిన ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌ను విక్రయించారు. మరో రెండేళ్ల పాటు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా అమ్మేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: లాభాల్లో ఉన్నా అమ్మేశారుకేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారంటూ ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రశ్నిస్తోంది. ఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలాచేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీతో కార్మిక సంఘాలు శనివారం భేటీ అయ్యాయి. కార్మిక సంఘాల నేతలతో సీఎండీ అరుణ్ భక్షీ సంచలన విషయాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు నిధులు విడుదల చేశారన్నది అవాస్తవమని తెలిపారు. నిధుల విడుదల అయినట్టు నాకు సమాచారం లేదు. ఢిల్లీలో ఉక్కు శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం నేను చెప్పలేను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నా’’ అంటూ సీఎండీ స్పష్టం చేశారు.కాగా, స్టీల్‌ప్లాంట్ సీఎండీతో పోరాట కమిటీ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ముడిసరుకు సరఫరా చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అరకొరగా నిధులు విడుదల చేసినా.. మళ్లీ గడ్డు పరిస్థితి తప్పదని కార్మికులు వివరించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్‌పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం.. స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉక్కు ఉద్యమాలు..
-
స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర.. ‘కూటమి’పై సీపీఎం నేత ఫైర్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్‌ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్‌కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూసీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.‘‘స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్‌లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు యూ టర్న్
-
విశాఖ స్టీల్‌పై చంద్రబాబు యూటర్న్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ధ్వజమెత్తింది. ‘స్టీల్ ప్లాంట్ నష్టాలకు బాధ్యత ఎవరిది? సెంటిమెంట్ కాపాడుతుందా’.. అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. విశాఖ స్టీల్‌ను కాపాడేందుకు కేంద్రం చేయాల్సిందంతా చేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కితాబు ఇవ్వడాన్ని వక్తలు ఖండించారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై పోరాట వేదిక, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు చర్చించాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ గత నెలలో పోరాట కమిటీ చంద్రబాబును కలిసిన సందర్భంలో విశాఖ స్టీల్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ అంశంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో ఉద్యమం నడపాలని 2021 జూలైలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు పోరాట కమిటీకి ఇచ్చిన లేఖను మీడియాకు చూపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందన్నారు. పోరాట వేదిక కన్వీనర్లు జి.ఓబులేషు, వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ను నాశనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీలో ఇప్పటికే రెండు ఫర్నేష్లు మూతపడ్డాయన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ఇచ్చిన హామీ మూడు నెలలు అయినా అమలు కాలేదన్నారు. విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని కోరారు. 2 నుంచి ఉద్యమ కార్యాచరణ విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, యూనివర్సిటీలు, కళాశాలల్లో ఆందోళనలు చేపట్టాలని తీర్మానించింది. రిలే నిరాహార దీక్షలు, నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. 2న కార్మిక సంఘాలు, 3న రైతు సంఘాలు, 4న విద్యార్థి, యువజన సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం చేపట్టాలని కోరింది. ఈ సమావేశంలో ఇఫ్టూ రాష్ట్ర నాయకులు పి.పోలారి, మోహన్, రైతు సంఘం నాయకులు ఎం. కృష్ణయ్య, ఎం. హరిబాబు, వెలగపూడి అజాద్, యం.వెంకటరెడ్డి, కొల్లా రాజమోహన్, యు.వీరబాబు, టీయూసీఐ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు, రవీంద్రనాథ్, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
పవన్ ఎక్కడ దాక్కున్నావ్.. బాబు వ్యాఖ్యలపై మండిపడ్డ కార్మిక నాయకులు
-
బొలిశెట్టి వ్యాఖ్యలపై దుమారం
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులను అవమానిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 1,314 రోజులుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలవలేదని, వారిని చాచిపెట్టి కొట్టాల’న్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్టాండా? అని ప్రశ్నిస్తున్నారు. అదే వారి విధానమైతే తాము స్టీల్‌ప్లాంట్ కోసమే కాకుండా.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.ఆ వ్యాఖ్యలు పట్టించుకోంకార్మిక సంఘాల ఉద్యమాల వల్లే ప్రైవేటీకరణ ఇంతకాలం ఆగిందని బహిరంగ సభలో పవన్చెప్పారు. బొలిశెట్టి జనసేనలో ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. – డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీక్షమాపణ చెప్పాలిఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇది. ఏనాడూ బొలిశెట్టి కార్మికుల ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే టెంట్ వద్దకు వచ్చి ఆ మాట చెప్పాలి. – రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్టీయూసీసంఘాల వల్లే ప్రైవేటీకరణ ఆగిందికార్మిక సంఘాలు ఉండబట్టే ఇప్పటివరకు ప్రైవేటీకరణ ఆగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఐటీయూ పోరాటాల వల్ల ఆగింది తప్ప.. పవన్‌కళ్యాణ్ వల్ల కాదు. ఈ విషయాలేవీ బొలిశెట్టికి తెలియదేమో. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూవిమర్శలు అర్థరహితంస్టీల్ప్లాంట్ కార్మిక సంఘాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన విమర్శలు అర్థరహితం. జనసేన అధికారంలోకి వచ్చాకే కార్మిక సంఘాలు మంచివి కావని ఆయనకు తెలిసిందా. – వై.మస్తానప్ప, ప్రధాన కార్యదర్శి, స్టీల్ వైఎస్సార్టీయూసీ -
ఉక్కు కార్మికుల ఎదురుతెన్నులు
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డు కుంటామనీ, అన్ని యూనియన్ల లీడర్లను తీసుకెళ్లి ప్రధానితో సమావేం ఏర్పాటు చేస్తామనీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ‘ఎటువంటి త్యాగాల కోసమైనా సిద్ధం’ అన్నారు పవన్ కల్యాణ్. రాజీనామా పేరుతో ప్రగ ల్భాలు పలికారు గంటా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ‘పొరపాటున జగన్ అనే వ్యక్తి ఓడిపోతే ప్రైవేటీకరణ తప్పద’ని జగన్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో దాదాపు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అటువంటి ప్లాంట్ 18 వేల మందికి ప్రత్య క్షంగానూ, 23 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. సాగర తీరాన నెలవై ఉన్న విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం లభించింది. ఇటువంటి కామధేనువు లాంటి ప్లాంట్ మూసి వేత దిశగా అడుగులు వేస్తోంది. అదీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థం వల్ల! ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో రెండు అన్నపూర్ణ, కృష్ణ పర్నేసులను ఆపేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క ఫర్నేస్‌తో అతి తక్కువ ఉక్కును ఉత్పత్తి చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల్లేవు.రెండు నెలలుగా పర్మినెంట్ ఉద్యోగులకూ వేతనాల్లేవ్. పీఎఫ్ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు అందించాల్సిన సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారు. కార్మి కులు దాదాపు 1300 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమే.అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా కూడా బాబు, పవన్‌లు కార్మికులను కలిసిన దాఖలాలు లేవు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీనివాస వర్మ చాలా నిర్మొహమాటంగా పెట్టుబడుల ఉపసంహ రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలను వెనక్కు తీసుకుంటోందన్నారు. ఇక రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జాడ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించారు. సీఎంగా తనకు కేంద్రం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. 2021లోనే కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాస్తూ ఈ ప్లాంటు ఆవశ్యకతను చాలా స్పష్టంగా వివరించారు. దీనిని ఎటువంటి పరిస్థి తుల్లోనూ అమ్మివేయద్దని కోరారు. ఇటువంటి లేఖనే టీడీపీ, జనసేన ఎందుకు రాయలేక పోతోంది? మోదీ, షా అంటే ఆ పార్టీల అధినేతలకు భయం అన్నది అర్థమ వుతోంది. కానీ, జగన్ నిర్మొహమాటంగా కేంద్రానికి చెప్పడమే కాకుండా విశాఖలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తుందని చెప్పారు. ఆయన చెప్పింది ఇప్పుడు నిజమనే భావన కనిపిస్తోంది. ప్లాంట్ నష్టపోకుండా లాభాల్లో నడవాలంటే బొగ్గు గనులు, ఉక్కు గనులు కేటాయించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంటు ఏర్పాటైన తొలినాళ్లలో దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. దీనికి సొంతంగా ఉక్కు, బొగ్గు గనులు లేవు. వీటిని ప్రైవేటు సంస్థల నుండి, వేరే రాష్ట్రాల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అనాలోచితంగా దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నులకు పెంచారు. దీంతో అప్పుల ఊబిలోకి ఇది కూరుకుపోయింది. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చేసిన రుణాలు కూడా పెద్ద భారంగా మారాయి. దీనిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించే ప్రయత్నం చేయ బోతోంది.ప్రైవేటైజేషన్‌లో భూమి ఎక్కువగా ఉంటే కొనేందుకు సంస్థలు ముందుకొస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే దాదాపు 20 వేల ఎకరాల భూమి ఉంది. ప్లాంటు పరిధిలో 11 వేలు, టౌన్ షిప్ పరిధిలో 500 ఎకరాలు, రిజర్వాయర్ పరిధిలో 500 ఎక రాలు, నిరుపయోగంగా మరో 7 వేల ఎక రాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉంది కాబట్టి అనేక ప్రైవేటు సంస్థలు ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గద్దల్లాగా వాలు తున్నాయి. ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ఆ సాకుతో ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమవుతోందన్న విమర్శ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కార్మికుల కడుపు కాలకముందే కేంద్ర పెద్దలు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలతో ప్లాంట్‌కు పున ర్జీవం పోయాలని ప్రజలు కోరుతున్నారు. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455 -
బెడిసికొట్టిన టీడీపీ రాజీనామా డ్రామాలు
-
డోంట్ కేర్..ఆ మూడు కోసమే ముగ్గురం కలిశాం..
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ‘కూటమి’ కుట్ర: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమ్తెతారు.‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం వైఖరీ చెప్పాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగ ఫలంతో ఏర్పడింది. 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు.. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం11 వేల కోట్ల ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ పైవేటికరణ చేయొద్దని వైఎస్ జగన్ అడిగారు. ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు వలన ఒరిగేది లేదు. ఇదీ చదవండి: చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్ జగన్..కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు.. రెండవ బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. మా పార్టీ విధానమే ప్లాన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్. మేము వ్యతిరేకించాము కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. -
చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ తెగనమ్మడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరండి’’ అంటూ రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి -
అణచివేతపై భగ్గుమన్న స్టీల్‌ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్‌ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉక్కులో నిండుకున్న ముడి పదార్థాలు
ఉక్కునగరం (విశాఖ జిల్లా): విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్లాంట్‌లో ముడి పదార్థాల నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయం అందకపోతే స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోతుంది. సీఎం చంద్రబాబు కల్పించుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్ గత కొన్ని నెలలుగా ముడి పదార్థాల కొరతతో సతమతమవుతోంది. మూడు బ్లాస్ట్ఫర్నేసుల్లో ఒక దానిని నిలిపివేసి అంతంత మాత్రం హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెలలో స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థాలు సెయిల్, ఎన్ఎండీసీ ద్వారా సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి నెల దాటినా ఇంతవరకు ముడి పదార్థాలు రాలేదు. ముఖ్యంగా బొగ్గు నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిల్వలు చేరుకున్నాయి. ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) మూడు రోజులకు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో కోక్ ఓవెన్స్ బ్యాటరీల పుషింగ్స్ 300 నుంచి 200కు తగ్గించారు. విశాఖ ఉక్కు కొనుగోలు చేసిన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో 1.40 లక్షల టన్నులు ఉంది. దానిపై కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ ఉండటంతో పోర్టులోనే నిలిచిపోయింది. ఉక్కు మంత్రి పర్యటనలో మూడు షిప్మెంట్ల కోల్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు మూడు రేక్‌లు మాత్రమే సెయిల్ నుంచి అందాయి. అవి దాదాపు వినియోగించారు. మరోవైపు ఐరన్ ఓర్ లంప్స్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. సైజ్డ్ ఓర్, ఐరన్ ఓర్ ఫైన్స్ నిల్వలు ఐదు రోజులకు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా బాయిలర్ కోల్ నిల్వలు కూడా జీరో స్ధాయికు చేరుకున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీని విస్మరించిన కూటమి నాయకులు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నేతలంతా ఆ హామీలను పూర్తిగా విస్మరించారు. తక్షణం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉక్కు ఉద్యోగ కార్మిక నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై స్పష్టమైన హామీను కోరాలని, ప్లాంట్‌కు కావాల్సిన ముడి పదార్థాలు, ఆర్థిక ప్యాకేజీలపై చర్చించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం సెక్రటేరియట్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు. -
చంద్రబాబూ.. ఇదేం పద్దతి: ఉక్కు పోరాట కమిటీ సీరియస్
సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి తాము మోసపోయామన్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి నేతలు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.కాగా, ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పోరాట కమిటీ సభ్యులందరం సీఎం చంద్రబాబుని కలిశాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరాం. ఈ సందర్భంగా చంద్రబాబు.. మీరు మాట్లాడొద్దు నేను చెప్పింది వినండి.. మీరు రాజకీయాలు చేయద్దు.. పని చేయండి అని అన్నారు. మేము పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ముడి సరుకు లేదని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఆయన మాటలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా కనీస స్పందన లేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకోవాలి. కేంద్రంలో మనపై ఆధారపడి పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్లాంట్‌లో ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు. బ్లాస్ట్ ఫర్నీచర్ దెబ్బతింటే మళ్ళీ రివైవల్ చేయడం అతి కష్టం’ అని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలకు అవమానం
-
విశాఖ స్టీల్ ప్లాంట్.. CMD మైండ్ గేమ్..
-
స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం
ఉక్కునగరం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర భారీ, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసశర్మ తదితరులతో కలిసి గురువారం ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాలను సందర్శించారు. మొదట ఈడీ(బిలి్డంగ్)లోని మోడల్ రూమ్‌ను సందర్శించారు. అక్కడ సీఎండీ అతుల్ భట్ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియ, ముడి పదార్థాల సరఫరా, ఉత్పత్తుల రవాణా తదితర అంశాలను వివరించారు. అక్కడే ఉన్న అవార్డు గ్యాలరీకి వెళ్లి స్టీల్‌ప్లాంట్ సాధించిన అవార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కోక్ ఓవెన్స్, బ్లాస్ట్‌ఫర్నేస్–3, ఎస్ఎంఎస్–2, వైర్ రాడ్ మిల్–2 విభాగాలను సందర్శించారు. అనంతరం ఉక్కు పరిపాలన భవనంలో సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్ అధికారులతో స్టీల్‌ప్లాంట్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్‌కు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి సంజయ్ రాయ్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. ఆందోళన వద్దుఆయన సందర్శన పుసక్తంలో ఇలా రాశారు ‘ఈ స్టీల్‌ప్లాంట్ సందర్శించాక దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్లాంట్ సహాయపడుతుందని నాకు అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్‌పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్‌ను రక్షించడం నా బాధ్యత. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రధాని ఆశీస్సులు, సాయంతో ప్లాంట్ నూరు శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది’ అని రాశారు. ప్రధానితో చర్చించాకే నిర్ణయం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పా రు. ఇందుకు తమకు రెండు నెలలు వ్యవధి అవసరమన్నారు. అయితే ప్రైవేటీకరణ రద్దుపై కుమారస్వామి పూర్తి భరోసా ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబే: సీపీఎం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబేనని..నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేట్ వ్యక్తులు ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించింది సీపీఎం.. గనులు కేటాయించకపోవడం వల్లే స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలంటూ సీపీఎం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులపైన కన్నేసి ప్రైవేటీకరణ వైపు వెళుతున్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. మీడియా పై దాడులతో సమస్యలు పరిష్కారం కావని వెంకట్ హితవు పలికారు.కాగా, విశాఖలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం పర్యటించారు. స్టీల్‌ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరిస్తుందని కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణపై చంద్రబాబు స్పందించకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ నోరు విప్పడం లేదు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకుందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు జరగవన్న మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోవలసింది ప్రధానేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ చేస్తున్నారుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోదీతో చెప్పించాలని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అప్పటి సీఎం జగన్.. ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖ రాశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. -
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన
-
ఇది ఫిక్స్.. విశాఖ స్టీల్ అమ్మేద్దాం !
-
‘విశాఖ స్టీల్’ అమ్మేద్దాం! ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’గా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఐదేళ్ల పాటు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న వైఎస్సార్సీపీ పోరాటం వృథా అవుతోంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూటర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న ఆ పార్టీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యమంటూ ఆంగ్ల మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. తొలుత ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్.. విశాఖ ఉక్కు విక్రయానికి టీడీపీ అనుకూలమని.. ఈ మేరకు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయంటూ కథనాన్ని ప్రచురించింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ సైతం ఇదే తరహాలో మరో కథనాన్ని అచ్చేసింది. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. మూడు రోజుల క్రితం విశాఖలో స్థానిక టీడీపీ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ తాము గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండటంతో చాలా ఇబ్బందులున్నాయని అసలు విషయాన్ని చెప్పేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఇబ్బందులు అంటూ రాగాలు తీయడంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను రూ.12,100 కోట్లకు టాటా గ్రూపు కొనుగోలు చేసి విస్తరణ చేపట్టింది. అదేవిధంగా విశాఖ స్టీల్‌ను భారీగా విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థకు కేంద్రం విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తాజాగా విశాఖ స్టీల్‌ను సందర్శించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఒక భారీ ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి లభిస్తుందంటూ టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.రంగం సిద్ధం..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు 10 శాతం, 20 శాతం షేర్లు డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మక అమ్మకం (స్ట్రాటజిక్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆరాటపడుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మడుగులొత్తుతోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కేంద్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. రూ.2,859 కోట్ల నష్టాల సాకుతో కేంద్రం స్టీల్‌ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించడానికి, దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రైవేటీకరణ చేస్తే తమకెలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ‘ప్రైవేట్ చేతికిస్తే పెట్టుబడులు పెరుగుతాయి కదా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ నగరాల్లో ఆస్తుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) టెండర్లను కూడా ఆహ్వానించడం గమనార్హం.గనుల కేటాయింపులో వివక్ష వల్లే.. దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్షత చూపుతూ వస్తోంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయమవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సివస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలను చవి చూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ గత ముప్పై ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యంఇటీవల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న శ్రీనివాసవర్మ అయితే ప్రైవేటీకరణ అనివార్యమని మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు భారీ నష్టాల్లో ఉందని, ప్రజాధనం వృథా కావడాన్ని తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. 7 మిలియన్ టన్నుల కంటే అత్యల్ప స్థాయిలో ఉత్పత్తి చేస్తూ గతేడాది రూ.2,859 కోట్ల నష్టాలను మూటకట్టుకుందన్నారు. 2011–12లో రూ.13,659 కోట్ల మూలధనం కలిగిన విశాఖ స్టీల్ ఇప్పుడు రూ.391 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో ప్రైవేటీకరణ తప్ప మరే మార్గం లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మంత్రుల పరిధిలో లేదని.. ప్రధాని నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడారు. సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వాటిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితులపై అవగాహన కోసమే కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖ వచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రులిద్దరూ గురువారం స్టీల్ ప్లాంట్‌లోని పలు ఉత్పత్తి విభాగాలను సందర్శిస్తారు. అనంతరం ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమవుతారు.పవన్ మౌనమేలా?ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నేతలు ప్రైవేటీకరణకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు జారీ చేస్తున్నా మౌనంగా ఉండటంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ ఉన్నా ప్రైవేటీకరణను అడ్డుకునేవాడినని పవన్ గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీకి పవన్‌తో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా మాట్లాడకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జనసేన ఎంపీలు ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయాలని 2021లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాలతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ఇవ్వడం ద్వారా ప్రైవేటీకరణను అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో టీడీపీ ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. -
విశాఖ స్టీల్ కు సొంత గనులుకేటాయించాలి..
-
చంద్రబాబు, నితీష్‌పై బీజేపీకి అపనమ్మకమే: సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్ చేశారు.కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్‌ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
మా ఆస్తులనే అమ్ముకుంటున్నాం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని విశాఖ ఉక్కు యాజమాన్యం (ఆర్ఐఎన్ఎల్) మంగళవారం హైకోర్టును కోరింది. స్టీల్ ప్లాంట్ ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకు ఉందని, స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల విక్రయాల ప్రక్రియ నిలిచిపోయిందని ఆర్ఐఎన్ఎల్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ నివేదించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతంగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా భూ సేకరణ ద్వారా పెద్ద మొత్తంలో భూములు సేకరించిందని తెలిపారు. కేంద్రం సేకరించిన భూముల జోలికి తాము వెళ్లడం లేదని, తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని పేర్కొన్నారు. భూముల విక్రయానికి వేలం ప్రక్రియ కూడా మొదలైందని, 170 మంది బిడ్డర్లు పాల్గొనగా 72 మందిని హెచ్–1 బిడ్డర్లుగా ప్రకటించినట్లు చెప్పారు. హెచ్–1 బిడ్డర్ల నుంచి రూ.243 కోట్లు రావాల్సి ఉండగా, రూ.45 కోట్లు ఇప్పటికే జమ చేశారన్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల మిగిలిన మొత్తాన్ని జమ చేయకుండా నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల విషయంలో స్పష్టత కోసం హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అనుబంధ పిటిషన్లో కోరిన విధంగా స్టేటస్ కో ఉత్తర్వులను సవరించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వుల సవరణ కోసం ఆర్ఐఎన్ఎల్ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లందరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రైవేటీకరణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అమ్మకం కాదు.. పెట్టుబడుల ఉపసంహరణకేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహశర్మ వాదనలు వినిపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూ సేకరణ ద్వారా 21 వేల ఎకరాలు సేకరించామన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయన్నారు. మిగిలిన భూములు ఆర్ఐఎన్ఎల్కే చెందుతాయన్నారు. అసలు తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100 శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామని తెలిపారు. ఇదే రీతిలో దేశవ్యాప్తంగా 8 యూనిట్లల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామన్నారు. ఆర్ఐఎన్ఎల్ ఆస్తులతో తమకు సంబంధం లేదన్నారు. వాళ్ల ఆస్తులను వాళ్లు అమ్ముకోవచ్చునన్నారు. -
‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురూ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్‌ని నిర్వీర్యంచేసే పనుల్ని చాపకింద నీరులా చేసుకుంటూపోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్డీఏ సర్కారు.. స్టీల్‌ప్లాంటుపై ‘ఉక్కు’పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్‌ప్లాంట్ ఆస్తులు విక్రయించి.. దివాలా సంస్థగా చూపించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్‌యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపి... తూతూ మంత్రంగా తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.మూలధన సంక్షోభం పేరుతో..స్టీల్‌ప్లాంట్ బయట నిరర్థకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి సంస్థ యాజమాన్యం రంగం సిద్ధంచేసుకుంటోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమిస్తూ.. పూర్తిస్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఆస్తుల వేలం ప్రక్రియ షురూ చేసింది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్ విక్రయించేందుకు ఉన్న అవకాశాలపైనే దృష్టిసారించింది. రెండ్రోజుల క్రితం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి.. ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. రైతులు, ప్రజలు త్యాగాలు చేసి.. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకు శతవిధాలా యత్నిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ స్తబ్దుగా ఉన్నా.. తాజాగా విశాఖ ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్లీ వేగవంతం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ప్రైవేటీకరణకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. నిజానికి.. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు. సెయిల్‌లో విలీనం చేయడం మరో పరిష్కారం అని తెలిసినా, కేంద్రం ఆ పని కూడా చేయడంలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ‘విశాఖ ఉక్కు’ ఊపిరి తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎఎన్ఎల్ ఆస్తుల వేలానికి సిద్ధమవుతోంది.బోర్డు సమావేశంలో వేలం అంశం!ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆస్తుల విక్రయంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ మెటీరియల్స్ నిల్వచేయడానికి హైదరాబాద్, చెన్నైలలో స్టాక్‌యార్డుల ఏర్పాటుకోసం కొనుగోలు చేసిన భూములతో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్ని విక్రయించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల స్టీల్ వినియోగదారుల అవసరాల్ని మూడు దశాబ్దాల కాలంగా హైదరాబాద్, చెన్నైలోని స్టాక్‌యార్డులు తీరుస్తున్నాయి. ఇతర మెట్రో ప్రాంతాలతో పోలిస్తే.. ఈ స్టాక్ యార్డుల్లో హ్యాండ్లింగ్ చార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడే విక్రయాలు జరిగేవి. వీటిని విక్రయిస్తే అటు స్టీల్‌ప్లాంట్‌కు, ఇటు వినియోగదారులకు నష్టాలే తప్ప ఎలాంటి ఉపయోగంలేదు. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు. నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్‌కు బోర్డు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేందుకు బోర్డు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.ఆదరిస్తే.., అద్భుతాలే కానీ..ఇటీవలే కొంతమేర లాభాలతో పాటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ స్టీల్‌ప్లాంట్ దూసుకుపోతోంది. సొంత గనులు కేటాయించి మూలధన సాయంచేస్తే ఉక్కు కర్మాగారం ఉరకలు వేసే అవకాశాలున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటులో పూర్తి సామర్థ్యం మేరకు ఉక్కు ఉత్పత్తి చేయకుండా ఆస్తులను అమ్మడానికి ఆసక్తి చూపడంపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్థలాలు అమ్మితే విశాఖ ఉక్కు కష్టాలు తీరుతాయా అంటే ముడిసరుకు కొనుగోలు చేయడానికి, పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి సైతం సరిపోవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జిందాల్ సంస్థతో ముడిసరుకు సరఫరాకు ఆర్థిక సాయానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీఎఫ్–3 ప్రారంభించినా, ముడిసరుకు సక్రమంగా అందక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. నిత్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా 21 వేల టన్నులు ఉత్పత్తి చేసే అవకాశమున్నా, 14 వేల టన్నులకే పరిమితమవుతోంది. ఎన్ఎండీసీ ద్వారా ప్లాంటుకు ప్రతిరోజూ 6 రేక్‌ల ఇనుప ఖనిజం అందాలి. నాలుగు రేక్‌లకు మించి అందించడంలేదు. ఇప్పుడిస్తున్న ఇనుప ఖనిజం కేవలం రెండు ఫర్నేస్‌లకు మాత్రమే సరిపోతోంది. బీఎఫ్–3 పరిస్థితి ఏంటనే దానిపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టిసారించకుండా ఆస్తుల్ని విక్రయించేసి.. స్టీల్‌ప్లాంట్‌ని మోడువారేలా చేసి.. ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాలు తెలిసినా టీడీపీ, జనసేన పార్టీలు.. పొత్తు పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కదిలించేందుకు భయపడిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. -
ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?: సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఆరోపించారు. మరిప్పుడు చంద్రబాబు ఎలా మంచోడయ్యాడో అర్థం కావట్లేదు. ప్రధాని మోదీ మాటలు వింటుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని బాధగా ఉంది. తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది.గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే.. ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరూ ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే?.. వాళ్లు దీన్నే ఎన్నికల రిఫరెండంగా తీసుకుంటారు! స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలంతా మద్దతు తెలిపారు కాబట్టే టీడీపీ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడని చెబుతారు! ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా.చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోమని జట్టు కట్టారా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశి్నంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. అవినీతిపరుడని అన్న నోటితోనే.. విచిత్రం ఏమిటంటే.. మనం ఇంతగా అభివృద్ధి బాటలో కనిపిస్తుంటే నిన్న సభలో ప్రధాని మోదీ గారు చేసిన విమర్శలు చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు గురించి ఆయన ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని కోరుతున్నా. పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు గురించి చెప్పలేదా? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇవాళ ఇదే మోదీగారు మళ్లీ ఇవాళ బాబు తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడంటున్నారు. అంటే.. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలని కోరుతున్నా. వారితో ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాటలు మారుస్తున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలి. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోమని జట్టు కట్టారా? జగన్ ఆమోదం లేదు కాబట్టే ఆగింది.. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసింది. ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టే! ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని కోరుతున్నా. స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపేలా ఈ ఎన్నికల్లో ఆ బాబు, దత్తపుత్రుడు, బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడ నుంచి పంపాలని కోరుతున్నా.గాజువాకలో టీడీపీకి ఓటు.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్టే గాజువాకలో మీరు టీడీపీకి ఓటు వేయడం అంటే దాని అర్థం.. ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్న ఎన్డీఏకి ఓటు వేయడమే. అంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నా.గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదు. దీన్ని రిఫరెండంగా తీసుకుంటారు. ఆ తర్వాత దీన్ని ఆపడానికి జగన్ ఎంత ప్రయత్నం చేసినా ‘‘నీకెందుకయ్యా బాధ? వాళ్లకు లేని బాధ నీకెందుకు? ఎన్డీఏకి ఓటు వేశారంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వారంతా గ్రీ¯న్ సిగ్నల్ ఇచి్చనట్లే కదయ్యా..! మరి నీకెందుకయ్యా బాధ?’’ అని అంటారని గుర్తు పెట్టుకోండి.రెండు బిల్డింగ్లు కడితే రైల్వే జోన్ కాదు.. రైల్వే జోన్‌కు మనం భూములు ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడుతున్నారు. రైల్వే జోన్‌కు అర్థం.. ఆరి్థకంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం రెండు బిల్డింగులు కట్టి మమ.. అనిపించడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్లు మనమీద చూపిస్తున్నదని దొంగ ప్రేమేనని గమనించాలని కోరుతున్నా. తిట్టిన వారి చంకనెక్కడం లాంటి విద్యల్లో చంద్రబాబు నిపుణుడు. -
భూములు, ఆస్తుల విక్రయంపై యథాతథస్థితి
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయం విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తులను విక్రయించే ప్రతిపాదన ఏదీ ఇప్పటివరకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు రికార్డ్ చేసింది. కేవలం కర్మాగారంలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకే కట్టుబడి ఉన్నామన్న వాదనను కూడా రికార్డ్ చేసింది. కర్మాగారానికి చెందిన ఒక్క ఎకరా భూమిని కూడా తాకబోమని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి. నరసింహశర్మ హైకోర్టుకు వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పెట్టుబడుల ఉపసంహరణ, భూములు, ఆస్తుల విక్రయం తదితర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటీకరణ నిర్ణయంపై ‘పిల్’లు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు.అలాగే, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రేషన్ కార్డుదారులకు ఉద్యోగాలిస్తామన్న గత హామీ మేర ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది.గత విచారణ సమయంలో ధర్మాసనం, అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ చట్ట ప్రకారం ప్రైవేటీకరిస్తున్నారు? ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయాలు చూడాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి రాసిన లేఖపై ఏం నిర్ణయం తీసుకున్నారు? ప్రైవేటీకరణకు ముందు కార్మికులు, ఉద్యోగులు, కర్మాగారంతో ముడిపడి ఉన్న వారిని సంప్రదించారా? అన్న వివరాలను తమ ముందుంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే.పాత కౌంటర్‌నే అటూఇటూగా మార్చి..ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు రాగానే, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ, గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. గతంలో దాఖలు చేసిన అంశాలనే అటూ ఇటూగా మార్చి, కొద్దిగా ఇంగ్లీష్ పదాలు చేర్చి తాజా కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. ధర్మాసనం అడిగిన వివరాలు ఆ కౌంటర్లో లేవని ఆయన తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని, దాని గురించి కౌంటర్లో ప్రస్తావనే లేదన్నారు.ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి. నరసింహ శర్మ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి లేఖకు ఆర్థిక శాఖ 2021లోనే సమాధానం ఇచ్చారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఇప్పటివరకు సూత్రప్రాయ నిర్ణయమేనని, ఇప్పుడు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇక ఈ ప్లాంట్ భూములు అమ్మే ప్రతిపాదన కూడా ఏదీలేదని.. ఒక్క ఎకరా భూమిని కూడా తాకబోమన్నారు.అలా అయితే స్టేటస్ కో కొనసాగిస్తారా?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. అలా అయితే స్టీల్‌ప్లాంట్ భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగిస్తారా? ఆ మేర ఉత్తర్వులు జారీచేయమంటారా? అని ప్రశ్నించింది. అందుకు నరసింహ శర్మ అంగీకరించారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన యలమంజుల బాలాజీ స్పందిస్తూ.. ఏఎస్జీ చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని కోరగా.. ధర్మాసనం రికార్డ్ చేసి భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. -
విశాఖ స్టీల్‌పై కూటమి వైఖరి చెప్పాలి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎండాడలో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి (కార్మిక సంఘం) నాయకులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్యలపై నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కార్మికుల తరఫున మొట్టమొదట గళమెత్తిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అదే విధంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ తాను స్వయంగా ప్రధానికి లేఖ రాశాను’.. అని గుర్తుచేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీది రాజీలేని ధోరణి అని జగన్ స్పష్టంచేశారు. ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడంవల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని ఆయన కార్మికులకు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయాలు ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు ఈ విషయంపై తమ నిర్ణయాన్ని స్పష్టంచేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీ స్టీల్‌ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోరాట కమిటీ నాయకులు సీహెచ్. నర్సింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వై. మస్తానప్ప ఉన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం కష్టమే: పవన్‌కళ్యాణ్
సాక్షి, అనకాపల్లి: ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కష్టమే.. గతంలో నేను స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు నాతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదు’’.. అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తనకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదిని ఊరికే నిందిస్తే సరికాదని స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను పవన్ తప్పుబట్టారు. అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఓడిపోయానని, ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. అనకాపల్లిలో ఉన్న శారదానది విదేశాల్లో ఉండి ఉంటే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేదని, మా కూటమి గెలిస్తే దాని ఒడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరోవైపు.. దారి పొడువునా సీఎం జిందాబాద్ అంటుంటే ‘మనకు అంత శక్తిలేదు.. 2029లో సీఎం అవడానికి ప్రయత్నిస్తా’నని పవన్ అన్నారు. -
సీఎం జగన్ లేఖపై ఏం చేశారు?: హైకోర్టు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్దిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నింటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని, ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటీకరణపై పలు వ్యాజ్యాలు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా ‘పిల్స్’ దాఖలు చేశారు. రేషన్‌కార్డుదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. సీఎం లేఖ గురించి కేంద్రం ఏమీ చెప్పడం లేదు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని తొలుత కేఏ పాల్ వాదనలు వినిపించారు. కేంద్ర మంత్రి విశాఖకు వచ్చి తనను కలిశారన్నారు. కేంద్రం అనుమతిస్తే తాను ఇక్కడే కూర్చొని రూ.8 వేల కోట్ల నిధులను రప్పించి ఏ ఖాతాలో కావాలంటే అందులో జమ చేయిస్తానని చెప్పారు. లేని పక్షంలో ఏ శిక్షకైనా తాను సిద్ధమేనన్నారు. 45 ఏళ్లలో ఉక్కు కర్మాగారం పన్నుల కింద రూ.54 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను సూచించిందా? అని ప్రశ్నించగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖ సంగతి ఏమిటో కేంద్రం చెప్పడం లేదని నివేదించారు. మేం కొన్న 25 ఎకరాలనే అమ్ముతున్నాం ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకుని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. ప్రైవేటీకరణ నిజమేనా? భూములు అమ్ముతున్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని ఆర్ఐఎన్ఎల్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ నివేదించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో వేటినీ అమ్మడం లేదన్నారు. ఆర్ఐఎన్ఎల్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. దీంతో ధర్మాసనం వివేక్ చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. మరో న్యాయవాది వై.కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, యథాతథస్థితి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా..? ఆ 25 ఎకరాలు కాకుండా సేకరించిన మిగిలిన భూముల సంగతి ఏమిటి? ఆ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసలు విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా? ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ భూముల అమ్మకం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. పిటిషనర్లది ఆందోళన మాత్రమేనన్నారు. ఏం చేసినా పారదర్శకంగా చేస్తామని, పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. దీంతో అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించగా మూడు వారాల్లో అందచేస్తామని రుద్ర నివేదించారు. నిధులు తెచ్చే విషయంలో ఏమైనా వినపతిత్రం ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా మార్చిలో అందచేసినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆ వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ఘనత
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్‌కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్‌నాగ్ పాల్గొన్నారు. -
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది’
విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. నరసింహారావు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ముడిసరుకు ఇచ్చేందుకు ఎన్ఎండీసీ సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ‘విశాఖ నుంచి వారణాసికి ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. చాలా సందర్బాల్లో రైల్వే మంత్రిని కలిసి రైలు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చింది. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉంది. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరాం’ అని తెలిపారు. చదవండి: ‘జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?’ -
విశాఖ ఉక్కు కోసం కేంద్రంతో గొడవపెట్టుకోలేను
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం తన చేతుల్లో లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేతులెత్తేశారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేనందున, తనకు ప్రధాని మోదీతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే సత్తా లేదని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు కోసం తాను కేంద్రంతో గొడవ పెట్టుకోలేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఒప్పిస్తే ఒప్పుకుంటారని, కానీ తనకు ఒక్క ఎంపీ కూడా లేరని, వైఎస్సార్సీపీ ఎంపీలు ఒప్పించడం లేదన్నారు. ఆంధ్ర ఎంపీలంటే ఢిల్లీలో చాలా చులకన అన్నారు. ఆదివారం రాత్రి గాజువాకలో జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జనసేన పార్టీ నడపడానికే సినిమాలు ఇంధనం వంటివని, అందుకే తాను సినిమాల్లో నటిస్తున్నానని, పార్టీ నడపడానికి ఎవరైనా నిధులిస్తే తీసుకుంటానని చెప్పారు. తాను 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్ల వరకు సీఎం పదవిని ఆశించకూడదనుకున్నానన్నారు. ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అది జనసేన నుంచా లేక మిశ్రమ ప్రభుత్వం నుంచా? అన్నది కాలానికే వదిలేస్తున్నట్టు తెలిపారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం కాకూడదన్నదే తన అభిమతంగా చెప్పారు. విశాఖ రుషికొండ భవిష్యత్తులో ఏదో ఒక రోజు జగన్‌తో సహా భూమిలోకి కూరుకుపోతుందన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గతంలో రౌడీషీటర్ అని చెప్పారు. ఆయన విశాఖ సిరిపురంలో నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకుని 26 ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే గుర్గావ్లో టవర్స్ మాదిరిగానే కూల్చేస్తామని, ఎంవీవీపై మళ్లీ రౌడీషీట్ తెరుస్తామన్నారు. విశాఖ పెదజాలరిపేటలో రూ.2 వేల కోట్ల టీడీఆర్ కుంభకోణం జరిగిందన్నారు. రాష్ట్రం కోసం మంగళగిరికి మకాం మార్చానని, తాను విశాఖను రెండో ఇల్లుగా చేసుకుంటానని చెప్పారు. విప్లవకారుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. -
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్.. రాజ్యాంగంలో రాసి ఉందా? అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి విషయంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలోనూ నిరసనలు తెలిపారని ఫైరయ్యారు. ప్రైవేటీకరణ వద్దంటూనే స్టీల్‌ప్లాంట్ విషయంలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా? కేసీఆర్ చెప్పాలి. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు అవుతున్నా నిజాం షుగర్స్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని నిలదీశారు. ముఖ్యమంత్రికి ఇఫ్తార్ విందుకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. భద్రాచలానికి మాత్రం రారు. భద్రాచలం సీతారాముల కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదు?. అవినీతిపై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపవద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? అన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టం తనపని చేసుకుంటూ పోతుంది అందులో ఎవరి జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
-
విశాఖ ఉక్కు: ‘ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లం’.. సాయంత్రానికి ఉల్టా పల్టా!
దొండపర్తి (విశాఖ దక్షిణ)/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే స్పష్టం చేశారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపై దృష్టి సారించామని తెలిపారు. గనుల సమస్యనూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆపడం నా చేతుల్లో లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే కొద్ది గంటల వ్యవధిలోనే మాట మార్చారు. గురువారం సాయంత్రం ఆయన నోవోటెల్లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సి.హెచ్.నరసింగరావులు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చామన్నారు. సింగరేణిలో ఆంధ్ర వాటా తేల్చండి బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్ఎస్కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని, గనుల కేటాయింపు విషయం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తామని మంత్రి చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణపై కేంద్రం కాస్తా వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోందని చెప్పారు. ప్లాంట్ లాభాల కోసం మాట్లాడుతుండటం శుభపరిణామమన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తామని ముందుకు వస్తే ప్లాంట్ కొనటానికి వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. బీజేపీతో గొడవ ఉంటే వారితో నేరుగా తేల్చుకోవాలని, స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు. -
అంబేడ్కర్ ఆశయాల అమల్లో కేసీఆర్
సనత్‌నగర్: దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లతో కలసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఆయన ఆశయాల అమల్లో భాగంగానే దళితబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామికవేత్తలుగా వారు ఎదుగుతున్నారన్నారు. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట దళితబంధు తరహా పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అలాగే నూతన సచివాలయ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టారని తెలిపారు. దళిత, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే టీ–ప్రైడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్ వివరించారు. కాగా, ఈ వేదికపై టీ–ప్రైడ్ కింద 8 వేల మంది ఔత్సాహికులకు రూ. 523 కోట్లను కేటీఆర్ మంజూరు చేశారు. అలాగే టీ–ప్రైడ్ కింద సబ్సిడీ పొంది విజయవంతంగా దూసుకెళ్తున్న 17 మందికి బెస్ట్ టీ–ప్రైడ్ అవార్డులను ప్రదానం చేశారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ)కి 2 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షధ్వానాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రేఖానాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ‘డిక్కీ’ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత, గిరిజనులకు స్వర్ణయుగం: సత్యవతి దళిత, గిరిజనులు కూడా అందరితో సమానంగా వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దళిత, గిరిజనులకు ఇది స్వర్ణయుగం లాంటిదన్నారు. తెలంగాణ రాక ముందు 263 గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి చేరిందన్నారు. నూతన ఆవిష్కరణలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, విజన్ ఉన్న సీఎంతోనే ఇది సాధ్యమవుతోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీ–ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు యువ పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వస్తున్నారన్నారు. కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను విరమించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా డిమాండ్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొంటామని కేసీఆర్ ప్రకటించడం వల్లే కేంద్రం దిగొచ్చి తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకున్నట్లు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ వివరించారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయట పెట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్రం నామమాత్ర ప్రకటన చేసిందని కేటీఆర్ అంతకుముందు ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆగేంత వరకు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ ఒత్తిడి కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఆ డబ్బులతో నిజాం షుగర్స్ తెరిపించండి: బండి సంజయ్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. దీంతో, తమ వల్లే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌పై ఈ నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొంటామన్న డబ్బుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను తెరిపించాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బు ఖర్చు చేయాలి అని వ్యాఖ్యలు చేశారు. -
హరీష్ రావు బాధ్యతగా మాట్లాడాలి: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మంత్రి బొత్స సత్యానారాయణ సీరియస్ అయ్యారు. హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి అని హితవు పలికారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కాగా, బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను మేం మొదటి నుంచి వ్యతిరేకించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రైవేటీకరణను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు భూములు దోచుకున్నారు. సీఎం జగన్ పాలనలో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ జగనే సీఎం అవుతారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు బాధ్యతగా మాట్లాడాలి. బీఆర్ఎస్ వల్లే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనడం హాస్యాస్పందం. బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది.. రెండు స్టేట్మెంట్లు ఇస్తే సరిపోతుందా. మధ్యలో వచ్చి మా వల్లే ఆగింది అంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడటం మానుకోండి. కేంద్రాన్ని బీఆర్ఎస్ ఏం నిలదీసింది. ఏపీలో జరుగుతున్న సంక్షేమం తెలంగాణలో ఎందుకు జరగడం లేదు’ అని ప్రశ్నించారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్ పెట్టామన్నారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
చంద్రబాబు హయాంలో మూతపడ్డ 64 ప్రభుత్వ సంస్థలు
-
బిడ్డింగ్ పై పాలిటిక్స్
-
ఏది నిజం?: చంద్రబాబే ప్రైవేటు మాస్టర్.. ఒక్క ముక్క రాయని ఈనాడు
ఒకటీరెండూ కాదు! 54 ప్రభుత్వ సంస్థలు. కొన్నిటిని కావాల్సిన వారికి అమ్మేశారు. మరికొన్నింటి ఆస్తుల్ని నచ్చినవారికి ఇచ్చేసి.. వాటిని మూసేశారు. అక్కడితో ఆగలేదు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రయివేటీకరణ... ఓ విజయగాధ’’ అంటూ పుస్తకం వేసుకున్నారు నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు. తన ఘనతకు జబ్బలు చరుచుకుంటూ... ‘‘మారకపోతే ముందుకెళ్లటం అసాధ్యం. ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాగే ఉంటే కష్టం’’ అని ముందుమాట కూడా రాశారు. ఇక నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడైతే... ఇలాంటి పుస్తకం తెచ్చినందుకు తన జన్మ ధన్యమైందంటూ ఉప్పొంగిపోయారు. ప్రయివేటీకరణ అనే పదానికి పేటెంట్ తీసుకుని, దానికోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వ సంస్థల్ని ఊచకోత కోసిన చంద్రబాబు ఇప్పుడేమంటున్నారో తెలుసా? విశాఖ స్టీల్ ప్రయివేటీకరణను అడ్డుకోవటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి లేదట!!. ఇక చంద్రబాబు ఏ కంపెనీని అమ్మేసినా... మూసేసినా శెబాషంటూ కితాబిచ్చిన ‘ఈనాడు’ ఇప్పుడేమంటోందో తెలుసా? తెలంగాణకు ఉన్నపాటి శ్రద్ధయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదట!!. ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం చేతగాదని, ప్రయివేటీకరణను గట్టిగా వ్యతిరేకించడానికి కూడా భయపడుతున్నారని.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు మాత్రం సత్తా చాటారని రంగస్థల పద్యాలు రాసేశారు రామోజీ!!. ఈ దుర్మార్గపు కుట్రల వెనక నిజానిజాలివిగో... విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నది తమ విధానమని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోంది. దీనికోసం ఉద్యమిస్తున్న అక్కడి కార్మిక సోదరులకు వివిధ సందర్భాల్లో మద్దతు కూడా తెలుపుతోంది. అంతేకాదు! మొదటి నుంచీ దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... దీనికోసం 2021 ఫిబ్రవరి 6న, 2022 మార్చి 9న నేరుగా ప్రధానిని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఏదో అడిగినట్లు కాకుండా... స్టీల్ ప్లాంటుకు ఉన్న సమస్యలేంటి? దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? అనేవి లేఖలో సూచించారు. ప్లాంటుకు ఉన్న విలువైన భూముల్ని ప్లాంటు గనక విక్రయించుకోగలిగితే రుణం సమస్య తీరుతుందని, సొంత ముడి ఇనుము గనులు కేటాయిస్తే మిగిలిన ప్లాంట్ల మాదిరిగానే లాభదాయకత సమస్య ఉండదని వివరంగా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు! ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినపుడల్లా విశాఖ ఉక్కును ప్రస్తావిస్తూనే వస్తున్నారు. అది ఒకసంస్థ మాత్రమే కాదని... తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని కూడా కేంద్రానికి చెబుతూ వస్తున్నారు. మరోవంక చంద్రబాబు నాయుడు మాత్రం తను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకించే ప్రయత్నమే చేయలేదు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ప్రకటనా చేయలేదు. పైపెచ్చు ఇపుడు బిడ్డింగ్‌లో పాల్గొంటామంటూ తెలంగాణ సర్కారు తన ఆలోచనను బయటపెట్టడంతో... ఇదే సాకుగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌పై విషం చిమ్మటం మొదలెట్టారు. ఆయనకు జతకలిశాడు ఆయన ఆప్తమిత్రుడు రామోజీరావు. ‘‘ఉక్కు సంకల్పం మనకేదీ?’’ అంటూ ఓ కథనాన్ని వండేశారు. అసలు ఇలాంటి కథనాలు వండే ముందు అందులో సాధ్యాసాధ్యాలు... బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఉన్న అవకాశాలు ఇవన్నీ చూడాలి కదా? అదేమీ లేకుండా తెలంగాణ సర్కారు తన ఆలోచన బయటపెట్టగానే... ఆంధ్రకేదీ ఉక్కు సంకల్పం? అంటూ విషపు చుక్కలు విసిరేయటమేనా? అసలు వైఎస్ జగన్ ప్రభుత్వమంటే ఎందుకంత కక్ష రామోజీరావు గారూ? ఎందుకంత అక్కసు.. అసూయ? ఏపీ, తెలంగాణ, సింగరేణిలకు బిడ్డింగ్‌లో నో చాన్స్! వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్టాలకూ ప్రభుత్వ రంగ సంస్థలకూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, 51 శాతానికన్నా ఎక్కువ ప్రభుత్వ వాటా ఉన్న సంస్థలు గానీ... డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా విక్రయించే సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనకూడదని నిషేధం విధించింది. అలా పాల్గొనే అర్హత వీటికి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ప్రభుత్వ వాటా 51 శాతానికన్నా ఎక్కువ ఉన్న సింగరేణి సంస్థకు కూడా ఈ అర్హత లేదు. ఈ నిబంధనలను సడలిస్తూ ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం గనక ప్రత్యేకంగా అనుమతి ఇస్తే... వారికి బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హత వస్తుంది. బహుశా... తాము ప్రయత్నించినా కేంద్రం తమను అనుమతించలేదని చెప్పుకోవటం తెలంగాణ ప్రభుత్వ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ అర్హత గురించి ‘ఈనాడు’కు తెలియదనుకోవాలా? తెలిసి కూడా... వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తెలంగాణతో పోల్చి.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి కుట్ర చేశారనుకోవాలా? రెండోదే నిజం. ఏదో ఒకరకంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారమే ధ్యేయంగా సాగుతున్న రామోజీరావు... ఇలాగైనా తన చంద్రబాబుకు సాయపడాలనుకున్నారు. అందుకే ఈ దుర్మార్గపు రాతకలు దిగారు. కడప స్టీల్ ప్లాంటును పట్టించుకోలేదేం? నాడు– నేడు ప్రైవేటీకరణను వ్యతిరేకించింది జగన్ ఒక్కరే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో... కడపలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ ఐదేళ్లు అధికారంలో ఉన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. కనీసం కేంద్రాన్ని గట్టిగా అడగలేదు. ఎందుకు అడగటం లేదంటూ చంద్రబాబును ‘ఈనాడు’ ప్రశ్నించలేదు కూడా!!. ఐదేళ్లలో కడప స్టీల్ ప్లాంటు దిశగా ఒక్క అడుగూ పడకపోయినా... ‘ఈనాడు’ ఏనాడూ ఒక్క అక్షరం కూడా రాయలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలుమార్లు కేంద్రాన్ని అభ్యర్థించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... కేంద్ర నిరాసక్తతను గమనించి ప్రయివేటు సంస్థలను రప్పించే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రభుత్వ రంగంలో కుదరనపుడు ప్రయివేటు రంగంలోనైనా భారీ ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం ప్రయత్నాలు ఫలించి... దేశంలో అగ్రగామి సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ముందుకొచ్చింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ ఈ ప్లాంటుకు సీఎం సమక్షంలో శంకుస్థాపన చేశారు. అదీ చిత్తశుద్ధి అంటే. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి ముఖ్యమంత్రి లేఖలు రాయటం... అభ్యర్థించటం ఒకవైపు జరుగుతుండగానే... మరోవైపు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు సైతం గళమెత్తుతూ వస్తున్నారు. మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రతిపక్షంలో బీరాలు పలికారని, అదికారంలోకి వచ్చాక చేష్టలుడిగారని ‘ఈనాడు’ విషం కక్కడమే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ఇదీ... బాబు గారి ప్రయివేటీకరణ లోగుట్టు విలువైన ప్రభుత్వ సంస్థల్ని, వాటి ఆస్తుల్ని తన వారికి కట్టబెట్టేయాలని ముందే పథకం వేసిన చంద్రబాబు... 1996లో తాను సీఎం అయ్యాక పద్ధతి ప్రకారం దాన్ని అమల్లోకి తెచ్చారు. అందుకు రామోజీరావు శక్తివంచన లేకుండా సహకరించారు. మూసేయాలనుకున్న సంస్థలకు ముందుగా... నష్టాల ఊబిలో కూరుకుపోయాయంటూ ముద్ర వేసేవారు. ‘ఈనాడు’లో ఆయా సంస్థలు విపరీతమైన నష్టాల్లో ఉన్నాయని, వాటిని పోషించటం వృథా అంటూ వరసగా కథనాలు రాయించేశారు. ఒక కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలన్న సూత్రాన్ని రామోజీ–బాబు పక్కాక్కా అమలు చేశారు. అందులో భాగంగానే నిజాం షుగర్స్‌కు చెందిన 8 యూనిట్ల ఆస్తులను కారుచౌకగా ప్రయివేటు పరం చేసేశారు. డెల్టా షుగర్ మిల్‌తో పాటు ఇతర సహకార చక్కెర కర్మాగారాలను మూసేశారు. ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్‌ను ప్రైవేట్ పరం చేశారు, ఆల్విన్ వాచీలు, స్పిన్నింగ్ మిల్లులు, పేపర్ మిల్లులు వంటి 54 సంస్ధలను అందిన కాడికి అమ్మేశారు. ఇందులో కొన్నిటిని ప్రైవేటీకరించగా 22 సంస్ధలను మూసేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ‘వీఆర్ఎస్’ పేరిట ఇంటికి పంపేయటం ద్వారా రూ.1282 కోట్లను ఆదా చేసినట్లు గుడ్ గవర్నెన్స్ పుస్తకంలో చంద్రబాబు రాసుకున్నారంటే పరిస్థితిని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించి... వీఆర్ఎస్ పేరిట 89,000 మంది సింగరేణి ఉద్యోగులను ఇంటికి పంపేసినా ‘ఈనాడు’ దాన్ని వ్యతిరేకించలేదు. సరికదా పొగిడింది. 2004 నుంచి రెండోద ప్రయివేటీకరణలో మరో 68 సంస్ధల్ని తమ వారికి అప్పగించేందుకు చంద్రబాబు పథకం వేసి ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రెండో దశలో ఆర్టీసీతో పాటు, విద్యుత్ పంపిణీ సంస్ధల వంటివి ప్రయివేటీకరణ జాబితాలో ఉన్నాయి. అయితే 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఒడిపోవటంతో అవన్నీ బతికిపోయాయి. ఆ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా వైఎస్, రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో బాబు ప్రయివేటీకరణ ఘట్టానికి ఫుల్స్టాప్ పడింది. 07–02–2021న ప్రధానమంత్రి మోదీకి సీఎం జగన్ లేఖ –ప్రత్యామ్నాయం చూడండి–ప్రైవేట్‌కు వద్దు –విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాష్ట్రానికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆభరణం, దాన్ని కాపాడుకుటంటాం, సంస్థ పునురుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంట్ ఇది. 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉంది. సొంత గనులు లేకపోవడం..వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి. పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి. ప్లాంట్ తప్పనిసరిగా లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీల భారం ఉండదు.. 09–03–2021న ప్రధానమంత్రి మోదీకి సీఎం జగన్ మరో లేఖ మీ నిర్ణయం మార్చుకోండి–విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు ప్రధాని మోదీకి సీఎం జగన్ మరో లేఖ గత నెలలో నేను మీకు (ప్రధానమంత్రి) రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలన్నింటినీ వివరించాను. ఆర్దిక మంత్రి ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. మా ఆకాంక్షలు, సెంటిమెంట్..ప్లాంట్‌ను ప్రవేటీకరించకుండా ఉన్న మార్గాల గురించి మీకు మరో సారి వివరించడానికి అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలను వెంట తీసుకుని వస్తాను. త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మరో మారు మీకు లేఖ రాస్తున్నాను.విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. -
తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్న బయ్యారం ఉక్కు కర్మాగారానికి బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించకుండా తన మిత్రుడు అదానీకి కట్టబెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదానీకి కట్టబెట్టిన ఆ మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 150 కి.మీ దూరంలోని బయ్యారానికి, 600 కి.మీ దూరంలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం లాభసాటి కానప్పుడు..1,800 కి.మీ దూరంలోని గుజరాత్‌లోని ముంద్రాలో నిర్మించే ఉక్కు పరిశ్రమకు ఏ విధంగా లాభసాటి అవుతుందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, భానుప్రసాద్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కుట్రలు గమనించలేక పోయాం.. ‘బయ్యారం, విశాఖ రెండింటికీ ముఖ్యమైది బైలదిల్లా. 134 కోట్ల మెట్రిక్ టన్నుల గని. బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలు నిర్మిస్తామని ఏపీ పునరవ్వ్యస్థీకరణ చట్టంలోనే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బయ్యారం కోసం 2014 నుంచి అడుగుతోంది. పరిశ్రమల మంత్రిగా నేను ప్రధానమంత్రిని 2018 జూన్‌లో కలిసి విజ్ఞప్తి చేశా. సీఎం కేసీఆర్ కూడా లేఖలు రాశారు. అయితే బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత తక్కువ అంటూ తప్పుదోవ పట్టించారు. వారు చెప్పిందే నిజం అనుకున్నా. ‘‘బయ్యారానికి కేవలం 150 కి.మీ దూరంలోపి బైలదిల్లాలో నాణ్యత గల ఇనుప ఖనిజం ఉంది. అక్కడ నుంచి స్లర్రీ పైపు లైను వేయవచ్చు. అందుకయ్యే వ్యయంలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే 15 వేల నుంచి 20 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది..’’అని ప్రధానికి చెప్పా. కానీ వారి కుట్రలు గమనించలేకపోయాం. మేము అడిగి వచ్చామో లేదో 2018 సెప్టెంబర్‌లో అదాని బైలదిల్లా ఐరన్ ఓర్ కంపెనీని పెట్టారు. బైలదిల్లా అదాని చేతుల్లోకి వెళ్లింది..’అని కేటీఆర్ వివరించారు. ‘విశాఖ’ను అమ్మడానికి కేంద్రం కుట్ర.. ‘విశాఖ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వకుండా నష్టాల్లోకి వెళ్లేలా చేసి, దానిని అడ్డికి పావుశేరు లెక్కన అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. అదానీకి రూ.6 లక్షల కోట్ల విలువైన బైలదిల్లాను కట్టబెట్టడమే కాకుండా.. రూ. 1.5 లక్షల కోట్ల విలువైన విశాఖ కర్మాగారాన్ని కూడా కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ.. పాస్కో విశాఖ కర్మాగారాన్ని చూసిందని, అక్కడ పరిశ్రమ పెట్టే యోచన చేస్తోందని చెప్పింది. కానీ దానిని గుజరాత్‌కు మళ్లించారు. ఇలా రెండు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు..’అని మంత్రి ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఓ అజ్ఞాని.. ‘బయ్యారం ఉక్కు పరిశ్రమను పట్టించుకోకుండా విశాఖ ఉక్కుపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయనకు విషయ పరిజ్ఞానం లేదు. ఓ అజ్ఞాని. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఫీజబులిటీ లేదు అంటాదు. అక్కడ నాణ్యత లేదంటాడు. ప్రధాని, ఆదాని, అజ్ఞాని.. ఓ డెడ్లీ కాంబినేషన్. ప్రధానులు ఎవరైనా ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కానీ ఈ ప్రధాని జాతి సంపదను తన జాతి రత్నాలకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, పోర్టులను కట్టబెట్టారు..’అని కేటీఆర్ ఆరోపించారు. బిడ్డింగ్ సాధ్యాసాధ్యాల పరిశీలనకే విశాఖకు.. ‘విశాఖపై అధ్యయనం మాత్రమే చేస్తున్నాం. క్యాప్టివ్ మైనింగ్ లేకుండా సాధ్యం అవుతుందా లేదా..? బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికే అధికారులు అక్కడికి వెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చిన తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ తెలిపారు. రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపిస్తామంటే నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి, అందుకోసం రూ.250 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఇప్పటికీ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. సిర్పూర్ పేపర్ మిల్‌ను తెరిపించామని, బిల్ట్‌ను తెరిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీపైన ఏమైనా రాశారా?
తాదూర సందు లేదు.. మెడకో డోలు అన్నది ఒక సామెత. అలా ఉంది తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్యాక్టరీకి సంబంధించి చేస్తున్న ప్రతిపాదన. ఇది కూడా ఇంతవరకు లీకుల రూపంలోనే ప్రచారం చేస్తున్నారు తప్ప కాంక్రీట్‌గా ఆరంభం అయినట్లు కనిపించదు. ఇంకా కొన్ని రోజుల గడువు ఉంది కనుక అప్పుడు ఏమి జరుగుతుందో చూడవచ్చు. ఈలోగా ఏపీలో మాత్రం ఈనాడు ,తదితర తెలుగుదేశం మీడియా లు విపరీతమైన హైప్ ఇచ్చే యత్నం చేస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా పతాక శీర్షికలలో కథనాలు వండి వార్చుతున్నాయి.అదేదో కెసిఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసి, ఆయన వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చుచేసి కార్మికులకు సాయ పడనున్నట్లు ,ఆంద్రుల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించబోతున్నట్లుగా పిక్చర్ ఇస్తూ కొందరు పబ్లిసిటీ చేయడమే చిత్రంగా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతూ, అబద్దాలు ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా ఉక్కు సంకల్పం మనకేదీ అంటే బానర్ కధనాన్ని రాసేసింది. తెలంగాణకు ఉన్నపాటి శ్రద్ద అయినా లేదా అంటూ ప్రశ్నించి చెడరాసింది. కేంద్రాన్ని ప్రశ్నించడం చాతకాదా అని జగన్ ప్రభుత్వాన్ని అడిగేసింది. పోని జగన్ ప్రభుత్వంపై రాస్తే, రాసిందిలే , అసలుప్రైవేటైజ్ చేయాలన్న ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపైన , ప్రధాని మోదీపైన ఏమైనా రాశారా అని చూస్తే మాత్రం ఒక్క ముక్కరాస్తే ఒట్టు. మరి మోదీ అంటే ఈనాడు వణుకుతోందా? మార్గదర్శి అక్రమాలు బయటపడుతున్న తరుణంలో ఇలాంటి వార్తలు రాసి ప్రజలను మోసం చేయాలన్న తపన తప్ప ఇంకొకటి కనిపించదు. గతంలో ఒకసారి బందరు ఓడరేవులో కొంత పెట్టుబడి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. అంతే ఇదే తెలుగుదేశం, ఈనాడు వంటి పత్రికలు అప్పుడు ఏమి రాశాయి. ఇంకేముంది బందరు పోర్టును కెసిఆర్ కు అమ్మేస్తున్నారని ,రాసిచ్చేస్తున్నారని వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ను తెలంగాణ ప్రభుత్వం ఉద్దరించేసినట్లు రాస్తున్నారు. ఇలా ఉంది వీరి ద్వంద్వ నీతి. పోనీ ఈ రోజు రాసిన ఉక్కు సంకల్పం వార్త తెలంగాణలో ప్రచురించారా అని విచారిస్తే ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే వీరి దుష్ట సంకల్పం అర్ధం అవుతుంది. తెలంగాణ ఏదో చేసేస్తున్నట్లు, ఏపీ ప్రభుత్వం ఏమి చేయనట్లు ప్రొజెక్టు చేయడమే వీరి లక్ష్యం అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. కాకపోతే ఆంద్రులు అమాయకులని భావించి ఈనాడు మీడియా ఇలాంటి దిక్కుమాలిన స్టోరీలు అల్లుతోంది.ఒకవేళ మాటవరసకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ లోని మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కు అవసరమైన ముడిసరుకుల సరఫరాకు అంగీకారం కుదుర్చుకుందని అనుకుందాం. అప్పుడు ఏమైనా లాభాలు వస్తే ,వాటిని తెలంగాణకు తీసుకువెళతారా? ఆంద్రలో ఖర్చు చేస్తారా? కచ్చితంగా తెలంగాణకే తీసుకువెళతారు. ప్రైవేటు సంస్థలు కూడా అదే పనిచేస్తాయి. అలాంటప్పుడు వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్ దీనికి మంచి సమాధానమే ఇచ్చారు. అసలు ప్రైవేటైజేషన్ నే వ్యతిరేకిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం టెండర్ లో ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు. పోనీ తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా అంత సామర్ద్యం ఉందా అని ఆలోచిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల ఇరవయ్యో తేదీ వరకు జీతాలే ఇవ్వలేకపోతున్నారు. అలాంటప్పుడు వేల కోట్ల పెట్టుబడి విశాఖలో ఎలా పెడతారు?నిజంగా ఆ ఆలోచన ఉంటే అధికారికంగానే ప్రకటించవచ్చు కదా?వారి సొంత మీడియాలో కాకుండా ఇతర మీడియాలలో వారు లీకులు ఇచ్చి ఎందుకు ప్రచారం చేసుకున్నారు. కేవలం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఈ గేమ్ ఆడుతున్నారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థలోనే కొన్ని కోల్ బ్లాక్ లను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ప్రభుత్వం నష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే వారికంత చిత్తశుద్ది ఉంటే ఏపీకి రావల్సిన ఆస్తులను ఇచ్చివేయవచ్చు కదా అని కొందరు అంటున్నారు. విద్యుత్ సంస్థలు బకాయి పడ్డ సుమారు ఆరువేల కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చి వేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు విషయం ఏమిటి? విశాఖ స్టీల్ లో మూతపడిన మూడోనెంబర్ బ్లాస్ట్ పర్నేస్ ను పనిచేయించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాని ప్రకారం ఎవరైనా ఆసక్తి ఉన్నవారు స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడి ఇనుము, ఫెర్రో అల్లాయిస్ వంటి వాటిని సరఫరా చేసి ,తద్వారా ఉత్పత్తి అయ్యే స్టీల్ ఉత్పత్తులను తీసుకోవడం. అంటే ఒక విధంగా బార్టర్ సిస్టమ్ వంటిది. అంటే ఒక సరుకు ఇచ్చి ,మరో సరుకు తీసుకోవడం అన్నమాట.మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు టెండర్ పిలిచారన్నట్లుగా కొన్ని వర్గాలు , తెలుగుదేశం వంటి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా విశాఖ కార్మికులను భయపెట్టడానికి, ఏపీలో ఓటర్లను కొంత ప్రభావితం చేయడానికి వారు తంటాలు పడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు విశాఖ ఉక్కుకర్మాగారంలోని ఆ ఫర్నేస్ ను సందర్శించి వెళ్లాయి. అవి ఎంత వరకు ఈ కాంట్రాక్టును నిర్వహించలేవినేనని సందేహం వ్యక్తం చేస్తూ స్టోరీలు వచ్చాయి. అదే సమయంలో జిందాల్ సంస్థ కూడా వస్తున్నదని, దానికి అప్పగిస్తే ,క్రమేపీ మొత్తం ప్రైవేటైజ్ అవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ రాస్తున్నారు. అంటే సత్తాలేని కంపెనీలు రాలేవని, కాస్త కెపాసిటీ ఉన్న కంపెనీ వస్తే దానిని రానివ్వకుండా చేయడం ఎలా అన్నదానిపై కొన్ని వర్గాలు కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. తొలుత మంత్రి కెటిఆర్ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత టెండర్లలో పాల్గొంటున్నట్లు లీకులు ఇచ్చారు. అయితే సింగరేణి ద్వారా ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కు అవసరమైన దానిలో పదిహేను శాతమే సమకూర్చగలుగుతారట. మిగిలినవాటి కోసం భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాల్సి ఉంటుంది. దానిని తెలంగాణ ప్రభుత్వం భరించగలుగుతుందా? ఇప్పటికే తెలంగాణ లోని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎద్దేవ చేస్తూ ప్రకటనలు ఇచ్చాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసమో, ఆంద్రలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికో కెసిఆర్ ఈ వ్యూహం పన్నితే ఏపీలో ఈనాడు వంటి టిడిపి మీడియా సంస్థలు దానికి హైప్ ఇచ్చి ఏదో జరిగిపోతుందన్నట్లుగా వార్తలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్: సజ్జల
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి తోడు సీపీఐ, సీపీఎం నాయకులు జత కలిశారని, అసలు కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఏమైందని ప్రశ్నించారు. సంస్కరణల పేరుతో చంద్రబాబు ఎన్నో ప్రభుత్వ సంస్థలు మూసివేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ ఛాంపియన్ బాబు అని ఎవరిని అడిగినా చెబుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన నాయకుడు సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన నాయకుడు సీఎం అని గుర్తుచేశారు. అదీ జగన్‌కి, చంద్రబాబుకు ఉన్న తేడా అని తెలిపారు. రామోజీరావు రాసేవన్నీ తప్పుడు వార్తలే.. విశాఖ ప్లాంట్ మీద కూడా అలాగే విషపు రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఐడీ వాళ్లు వెళ్తే మంచంమీద పడుకుని డ్రామా ప్లే చేస్తున్నారని, ఇవన్నీ పాతకాలపు డ్రామాలని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కేంద్రం చేస్తున్న ప్రయివేటీకరణపై అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునే అంశంపై సీఎం కొన్ని సూచనలు కూడా చేశారని, ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే అంశంపై ప్రధాని మోదీతో కూడా మాట్లాడారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారని, క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఎవరినో మభ్య పెట్టటానికి తాము పోరాటం చేయటం లేదని, వాటి రూపాలు మారాయన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా విజయం సాధించటమే గొప్ప.. అదే దారిలో సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వ లేకపోతున్నాయని, అందుకే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును సీఎంగా చూడాలనుకునే బ్యాచ్ వ్యవహారం మరింత దారుణంగా మారిందని ఫైర్ అయ్యారు. -
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం’
శ్రీకాకుళం: విశాఖ స్టీల్‌ప్టాంట్ ప్రైవేటికరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్టాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి అనేకసార్లు తెలిపిన విషయాన్ని అమర్నాథ్ మరోసారి ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిపి తమ ఉద్దేశాన్ని తెలుపుతూ కేంద్రానికి, ప్రధానికి మూడుసార్లు సీఎం జగన్ లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మరాదన్నదే మా స్టాండ్. అటువంటప్పుడు ప్రైవేటీకరణ.. ఎవరు కొంటారు.. అన్న ప్రశ్నలే ఉత్పన్నం కావు. కేంద్రప్రభుత్వమే ప్లాంట్‌ను నడపాలన్నది మా ప్రభుత్వ డిమాండ్. ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ అనే సెంటిమెంట్‌ను కాపాడతాం. దానికోసం ఇప్పటికే ప్రధానికి మూడుసార్లు లేఖలు రాశాం. అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నాం.’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ స్టాండ్‌పై క్లారిటీలేదు ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్ .. మళ్లీ అదే ప్లాంట్‌ను కొంటారని ఎలా అనుకుంటారు..? ఒకవేళ అదే నిజమైతే, ప్లాంట్‌ను అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా..?. అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ గానీ.. బీఆర్ఎస్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్టేట్మెంట్ను మేం వినలేదు. మా దృష్టికి రాలేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న మమ్మల్ని ప్లాంట్ ను మీరే కొంటారా అని ఎలా అడుగుతారు...? అలాగే, ప్రైవేటీకరణ వద్దని కేసీఆర్ చెప్పినప్పుడు ఆయనే మళ్లీ కొనేందుకు ముందుకొస్తున్నారని మీరు ఎలా చెబుతారు.. మీ మీడియాల్లో ఎలా రాస్తారు..? రాజకీయంగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకుని మేం స్పందించలేం కదా.. ! వాస్తవానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్ఎస్ ఏదైనా మాట్లాడితే.. వాళ్ల స్టాండ్ ఏంటో తెలిశాక అప్పుడు మేం స్పందించడం కరెక్టు గానీ, రాజకీయ దుమారం రేపే గాలివార్తలపై మేం ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముమ్మాటికీ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌గానే మేం భావిస్తున్నాం.. ఆ మేరకు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్న విధానంపైనే మా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది’ అని పేర్కొన్నారు. -
పూర్తి సామర్ధ్యం దిశగా విశాఖ ఉక్కు.. బొగ్గు, ఖనిజం లోటు లేకుండా చర్యలు!
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ఎదుర్కొంటున్న కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ కొరత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. భారీ పెట్టుబడులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు విస్తరిస్తే ప్రస్తుతం అందులో మూడింట ఒకటో వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయం వాస్తవమేనా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అది వాస్తవం కాదని చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్‌ను అధునీకరించి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినప్పటికీ సమగ్ర ఉక్కు ఉత్పాదన సామర్ధ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించలేదని మంత్రి తెలిపారు. అలాగే తీరప్రాంతంలో ఉన్నందున వాతావరణంలోని ఉప్పు సాంద్రత కారణంగా స్టీల్ ప్లాంట్‌లోని భారీ పరికరాలకు తుప్పు పట్టే అవకాశం లేదా ప్రశ్నించగా.. మంత్రి జవాబిస్తూ స్టీల్ ప్లాంట్‌ను తీరప్రాంతంలో నెలకొల్పుతున్నందున ఎక్విప్మెంట్ సమకూర్చుకునే దశలోనే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి సామర్ధ్యం మేరకు స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పాదన జరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల గురించి మంత్రి ఈ విధంగా వివరించారు. ►వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిరాటంకంగా కోకింగ్ కోల్ సరఫరా చేసే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►. వైజాగ్ స్టీల్ కోసం ఒక ఇనుప ఖనిజం బ్లాక్‌ను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా ఒడిషా ప్రభుత్వాన్ని కోరడం జరగింది. ► ఇనుప ఖనిజ నిక్షేపాలను తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయవలసిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయమంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే ఒడిషా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలను కోరింది. ►స్టీల్ ప్లాంట్ వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం సులభతరమైన వడ్డీతో రుణాల మంజూరు కోసం వైజాగ్ స్టీల్ యాజమాన్యం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుతోంది. ► వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న పలు ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో 211 సీఎన్జీ స్టేషన్లు న్యూఢిల్లీ, మార్చి 13: ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 2030 నాటికి 211 సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటకు అర్హత పొందిన అధీకృత సంస్థలు ఈ ఏడాది జనవరి 31 నాటికి ఉత్తరాంధ్రలో 13 సీఎన్‌జి స్టేషన్లను నెలకొల్పాయని తెలిపారు. పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు, సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) నెట్వర్క్ అభివృద్దిలో భాగం. ఈ పనులను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పర్యవేక్షణలో అది ఆమోదించిన అధీకృత సంస్థలు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. 11-ఏ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ పూర్తయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ అంతటా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కు అనుమతించనున్నట్లు మంత్రి తెలిపారు. విశిష్ట పరిశోధనా కేంద్రంగా విశాఖ ఐఐపీఈ చమురు, సహజవాయవుల రంగానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై విశిష్ట పరిశోధనలు చేస్తూ, పెట్రోలియం, ఇంధన రంగాలలో సుశిక్షితులైన మానవ వనరులును అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో సోమవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ లక్ష్యంతోనే రాజీవ్ ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంస్థకు అనుబంధంగా రెండు కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో రెండు సెంటర్లను విస్తరించినట్లు తెలిపారు. చమురు, సహజవాయువు రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా చమురు, సహజవాయువు రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం ముంబైలో విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంధన పరిశ్రమను ఏకీకృత లక్ష్యం వైపు నడిపించడం, కాంప్లెక్స్ ఎనర్జీ, పర్యావరణ అంశాలకు సంబంధించి అనువైన పరిష్కారాల మార్గాలు అభివృద్ధి చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, టెక్నాలజీకి సంబంధించి కొత్త హద్దులు అన్వేషించడం లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు మంత్రి తెలిపారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్
-
విశాఖ ఉక్కులో పేలుడు
ఉక్కు నగరం/గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇనుము ఉత్పత్తిలో భాగంగా స్లాగ్ పాట్ వెళ్లే ట్రాక్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. వాటిని తొలగిస్తుండగా దాని కిందనున్న నీటిలో వేడిగా ఉన్న స్లాగ్ (ఖనిజం నుంచి లోహాన్ని వేరు చేయగా మిగిలిన ద్రవం) పడింది. దీంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ మేనేజర్ జె.జయకుమార్ (34), టెక్నీషియన్లు బి.ఈశ్వర్ నాయక్ (36), పండా సాహు (36), డిప్యూటీ జనరల్ మేనేజర్ థాయ్‌వాలా (55), కాంట్రాక్ట్ కార్మికులు ఎస్.పోతయ్య (44), కె.శ్రీను (34), ఆర్.బంగారయ్య (34), ఆర్.సూరిబాబు (36), సీహెచ్.అప్పలరాజు (37) గాయపడ్డారు. శ్రీనుకు 90 శాతం, పోతయ్యకు 65 శాతం, డీజీఎం థాయ్‌వాలాకు 45 శాతం గాయాలైనట్టు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు ప్రమాదంలో గాయపడిన 9 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం సిబ్బంది క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్లాంట్ ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. డీసీపీ–2 ఆనంద్‌రెడ్డి, సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్ ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్ (కమర్షియల్) డీకే మహంతి తదితర ఉన్నతాధికారులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనతో ఉద్యోగ సంఘాల నాయకులు విస్మయానికి గురయ్యారు. ఉద్యోగులు పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కాగా, పేలుడు ధాటికి విభాగంలోని ఉత్పత్తి కొంతసేపు నిలిచిపోయింది. ప్రమాదం వల్ల మెషినరీ చాలావరకు దగ్ధమైంది. ఎలక్ట్రికల్ వస్తువులు కూడా కాలిపోయాయి. ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉత్పత్తిని పునఃప్రారంభించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు పరామర్శించారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద ప్రమాదం
-
వైజాగ్ స్టీల్ నయా బ్రాండింగ్
ఉక్కు నగరం (విశాఖపట్నం): ఉత్పత్తుల విక్రయంలో బ్రాండింగ్దే ప్రధాన భూమిక. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులకు ఉండే బ్రాండ్ ఇమేజ్ను చూసి వినియోగదారులు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దేశీయ ఉక్కు పరిశ్రమలో విశాఖ స్టీల్ ప్లాంట్ తనదైన టీఎంటీ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ కలిగి ఉంది. తాజాగా ఈ ప్లాంట్ కొత్త బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్ టీఎంటీ 500డి, వైజాగ్ టీఎంటీ హెచ్సీఆర్డీ బ్రాండింగ్ స్థానంలో కొత్తగా వైజాగ్ టీఎంటీ ఎఫ్ఈ 550డి, 500డి 6686 59, 8568 66 అనే బ్రాండ్ నంబర్లు ముద్రిస్తోంది. 16 ఎంఎం నుంచి 36 ఎంఎం వరకు ఉన్న సైజు ఊచలు, రైల్వే సంస్థకు పంపే ఉత్పత్తులపై హెచ్సీఆర్డీ (హై కరోజన్ రెసిస్టెంట్ డీటైల్)ను ముద్రిస్తున్నారు. ఎలా మొదలైందంటే.. విశాఖ ఉక్కు ఉత్పత్తులను తొలినాళ్లలో ఇతర కంపెనీల ఉత్పత్తుల మాదిరిగానే ఎలాంటి గుర్తిం పు మార్కులు లేకుండా విక్రయించేవారు. దీంతో విశాఖ ఉక్కును గుర్తించడం కష్టంగా ఉండేది. ఆ తరువాత స్టీల్ ప్లాంట్ అధికారులు రీబార్స్ మధ్యలో ఆంగ్ల అక్షరం ‘వి’ ఉండేలా చేశారు. అది స్పష్టంగా కనిపించేది కాదు. అనంతరం ఉత్పత్తులపై ప్రారంభంలో బ్రాండింగ్ కోసం పెద్ద సైజు ‘నంబర్ పంచ్’ అనే సాధనంతో వైజాగ్ స్టీల్ అని వేసేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని ఉత్పత్తుల మీద ఇలా వేయాలంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టేవి. 2002 తర్వాత నేరుగా ఉత్పత్తి మీద ముద్రపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో రోలింగ్ మిల్స్ విభాగాలైన లైట్ అండ్ మీడియం మర్చంట్ మిల్ (ఎల్‌ఎంఎంఎం), మీడియం మర్చంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్ (ఎంఎంఎస్ఎం), వైర్ రాడ్ మిల్స్ (డబ్ల్యూఆర్ఎం), స్పెషల్ బార్ మిల్ (ఎస్బీఎం), వైర్ రాడ్ మిల్ (డబ్ల్యూఆర్ఎం)–2, స్ట్రక్చరల్ మిల్ (ఎస్టీఎం)లలో రీబార్స్, రౌండ్స్, ఏంగిల్స్, చానల్స్, బీమ్స్ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. నిర్ణీత పరిమాణంలో ఆ రోల్స్‌ను సిద్ధం చేసిన తర్వాత దానిపై విశాఖ ఉక్కు ప్రతిష్టగా నిలిచే వైజాగ్ స్టీల్ టీఎంటీ (ధర్మో మెకానికల్ ట్రీట్మెంట్) ముద్రను వేస్తారు. నకిలీలకు చెక్ జాతీయ, అంతర్జాతీయ విపణిలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న గిరాకీ నేపథ్యంలో తరచూ నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నట్టు విశాఖ స్టీల్స్ యాజమాన్యం గుర్తించింది. ఈ దృష్ట్యా డూప్లికేటింగ్ జరగకుండా బ్రాండింగ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ ఉత్పత్తి గ్రేడ్‌ను కూడా తెలిపేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రాండింగ్ చేస్తున్నారు. రోలింగ్ మిల్స్‌లో ఆయా ఉత్పత్తులు రోల్ అవుతున్న క్రమంలోనే ఆ ఉత్పత్తిపై ఇది విశాఖ ఉక్కు ఉత్పత్తి అని తెలిసేలా బ్రాండింగ్ చేస్తున్నారు. -
లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో కొనసాగుతున్నప్పుడు దాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. నిర్వాసితులకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల కల్పనపై దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సువర్ణరాజు అనే వ్యక్తి కూడా పిల్ దాఖలు చేశారు. అలాగే ఈ అంశంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ధనలక్ష్మి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఎంత మేర నష్టాల్లో ఉంది? ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకెళుతూనే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు?.. ఆ సంస్థ నష్టాల్లో ఉందా? అంటూ ప్రశ్నించింది. సొంత అవసరాల నిమిత్తం క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడంతో ఆ సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. దీనిని సాకుగా చూపి ఆ సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ప్రైవేటీకరణకు కారణాలు ఏమిటో కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గత ఐదేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎంత మేర నష్టాలు వచ్చాయని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం నోరుమెదపడం లేదని ఆదినారాయణరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల వ్యాపారాలు మందకొడిగా సాగినా, ఒక్క ఉక్కు వ్యాపారం మాత్రం భారీ ఎత్తున సాగిందని తెలిపింది. ఆ సమయంలో చైనా ఉక్కును సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో అది మన ఉక్కు పరిశ్రమలకు కలిసొచ్చిందని గుర్తు చేసింది. స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తోంది.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందని చెప్పారు. వందల కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జించిందన్నారు. ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. లాభాల్లో ఉంటే ప్రైవేటీకరణ ఎందుకని ప్రశ్నించింది. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. నిరంతర నష్టాల వల్లే ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సమయంలో ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ.. ప్రపంచంలో ధనవంతులుగా చలామణి అవుతున్న కొంతమంది ఈ సంస్థను నడపగలరని కేంద్రం భావిస్తోందని, ఆ వ్యక్తులెవరో అందరికీ తెలుసన్నారు. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1,923 కోట్ల లాభం
విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,923 కోట్ల లాభం అర్జించింది. బుధవారం స్టీల్‌ప్లాంట్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో, స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ ఏడాది ప్లాంట్ అత్యధికంగా రూ. 28,215 కోట్లు టర్నోవర్ సాధించిందని, గత ఏడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అలాగే కంపెనీ ఆరేళ్ల తర్వాత పన్నుకు ముందు లాభాలను (పీబీటీ) అర్జించిందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాది కంటే 148 శాతం వృధ్దితో రూ.3,469 కోట్ల ఎబిటా సాధించిందన్నారు. కోకింగ్ కోల్ సంక్షోభం కారణంగా క్యూ4లో కార్యకలాపాలు తగ్గినప్పటికి, అన్ని ప్రధాన ఉత్పత్తి రంగాల్లో అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరక్టర్లు సీతా సిన్హా, ఘన శ్యాం సింగ్, సునీల్ కుమార్ హిరానీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉక్కు మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఎస్. నారాయణస్వామి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏజీఎంకు హాజరయ్యారు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
స్టార్టప్‌లకు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)తో కలిసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్ఐఎన్ఎల్, ఎన్టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కల్పిస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ, కేంద్ర ఐటీ శాఖ అధికారులతో వర్చువల్‌గా మంగళవారం ఓసీపీ–1ను ప్రారంభించనున్నారు. రూ.20 కోట్లతో ‘కల్పతరువు’ సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 సీవోఈ అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్‌లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్‌లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్ వినియోగించుకోవడంతోపాటు ఎస్టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్ సహకారం లభిస్తాయి. -
ప్రత్యామ్నాయాలపై కేంద్రం చెప్పడం లేదు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణకు బదులుగా దాన్ని లాభాలబాట పట్టించేం దుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గా లను అన్వేషించిందా? లేదా? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్లో స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై కేంద్ర ప్రభు త్వాన్ని వివరణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ల న్యాయవాదులు సైతం ఇదే రీతిలో కోరారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు వల్ల నిర్వాసితులైనవారి కుటుంబసభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అన్ని వ్యాజ్యాలను కలిపి సెప్టెంబర్ 21న విచారి స్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక రణ నిమిత్తం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవా లు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సువర్ణరాజు అనే వ్యక్తి కూడా పిల్ దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారించిన సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులు, దాన్ని లాభాలబాట పట్టించేందుకు ప్రత్యామ్నాయాల అన్వేషణను నొక్కిచెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని చెప్పారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తన కౌంటర్లో పేర్కొనలేదన్నారు. దీనిపై కేంద్రాన్ని వివరణ కోరాలన్నారు. జేడీ లక్ష్మీనారాయణ న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ఉక్కు పరిశ్రమ కోసం ఎంతోమంది తమ భూములను ఇచ్చారన్నారు. దాదాపు 22 వేల ఎకరాలను ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్నారని తెలిపారు. భూములిచ్చినవారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలిస్తామన్న హామీ ఇన్నేళ్లయినా అలాగే మిగిలిపోయిందని చెప్పారు. విశాఖ ఉక్కును లాభాలబాట పట్టించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించారో లేదో కేంద్రం చెప్పడం లేదన్నారు. ఈ సమయంలో న్యాయవాది వై.కోటేశ్వరరావు స్పందిస్తూ.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో భూములు కోల్పోయి నిర్వాసితులు అయినవారి కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని కూడా విచారించాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది. -
జాతి సంపదను ప్రైవేట్‌పరం చేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 120 మంది ఎంపీలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాని కార్యాలయంలో అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేడీ, బీఎస్పీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఎం, ఐయూఎంల్, ఆర్ఎల్పీ తది తర పార్టీలకు చెందిన సభ్యులు దీనిపై సంతకాలు చేసినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలోనే ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇవీ... ► విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలు, వేల మంది త్యాగాలకు ప్రతిరూపం. 64 గ్రామాలకు చెందిన 16,500 కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. వేలమంది రైతులు 23 వేల ఎకరాల వ్యవసాయ భూములను కోల్పోయారు. ►మూడు టన్నుల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పరిశ్రమకు కేంద్రం రూ.4,900 కోట్లను దశలవారీగా ఇచ్చింది. సొంతంగా గనులు లేకుండా ఉక్కు ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఒక్కటే. ► ప్రస్తుతం 17,500 మంది రెగ్యులర్, అంతే సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. వీరితోపాటు సీఐఎస్ఎఫ్, హోంగార్డులకు సంస్థ వేతనాలు చెల్లిస్తోంది. సంస్థ కారణంగా నివాసాలు కోల్పోయిన కుటుంబాల్లో 8,500 మందికే ఉపాధి కల్పించారు. మిగతా వారు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ► విశాఖ ఉక్కు వచ్చిన తర్వాతే నగరం అభివృద్ధి చెంది మెట్రో సిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా నిధులిచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖ ఉక్కు పాలు పంచుకుంది. కరోనా వల్ల 150 మంది ఉద్యోగులు మృతి చెందినా 20 వేల టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ► ప్రభుత్వంపై ఆధార పడకుండా నెలకు రూ.200 కోట్లను రుణాల వాయిదా కింద చెల్లిస్తూ సంస్థ లాభాల బాట పట్టింది. ఉత్పత్తి ఖర్చులో 65 శాతం ముడి పదార్థాలకే వెచ్చించాల్సి వస్తోంది. క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయిస్తే విశాఖ ఉక్కు అద్భుతమైన లాభాలు ఆర్జిస్తుంది. ► విశాఖ స్టీల్ ప్లాంట్ దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, మెట్రోలు, సర్దార్ పటేల్ విగ్రహం, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, పోర్టుల నిర్మాణ పనులకు ఉక్కును అందజేసి జాతి సంపదగా నిలిచింది. ►కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4,900 కోట్లను దశలవారీగా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వెచ్చించగా రూ.45 వేల కోట్లను పన్నుల రూపంలో తిరిగి ఇచ్చింది. ► 2021–22 తొలి మూడు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రూ.19,403 కోట్ల రెవెన్యూ సాధించింది. పన్నులు చెల్లించిన తర్వాత రూ.790 కోట్ల లాభాల్లో ఉండగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు పార్లమెంటులోని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని పార్టీ ఎంపీలు సత్కరించారు. స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ డ్రామాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. విశాఖ ఉక్కుకు మద్దతుగా 120 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తే టీడీపీ ఎంపీలు మాత్రం అందుకు నిరాకరించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో చంద్రబాబు ఎరువుల కర్మాగారాలు, చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు తదితర 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారని గుర్తు చేశారు. చదవండి: సంతకం పెట్టని టీడీపీ -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 28,008 కోట్లు
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22లో ఉత్పత్తి, అమ్మకాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డులతో హోరెత్తిచ్చిందని కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జీఎం బీఎస్ సత్యేంద్ర తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 5.773 మిలియన్ టన్నుల హాట్‌మెటల్, 5.272 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్, 5.138 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్ ఉత్పత్తిని చేయడం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమైన ప్రగతి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కోకింగ్ బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికి స్టీల్‌ప్లాంట్ రూ. 28,008 కోట్లు టర్నోవర్ సాధించి ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ విక్రయ పనితీరును నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలం సాధించిన విక్రయాలు రూ. 17,956 కోట్లు కంటే 56 శాతం ఎక్కువ కావడం విశేషం. ఇక ఉత్పత్తిలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే .. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో మొదటసారిగా పల్వరైజ్డ్ కోల్ ఇంజక్షన్ సరాసరి టన్ను హాట్మెటల్కు 100 కేజీలు సాధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఆరు రోలింగ్ మిల్లులో 22 కొత్త హై ఎండ్ నవీన ఉత్పత్తులు అభివృద్ధి చేశారు. సంస్థ ఉత్పత్తులు, ఎగుమతుల విక్రయాలు రూ. 5,607 కోట్లు చేయడం ద్వారా గత ఏడాది కంటే 37 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు సత్యేంద్ర పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో రూ. 3501 కోట్లు అమ్మకాలు చేయడం ద్వార గత ఏడాది ఇదే వ్యవధి కంటే 6 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గత ఏడాదిలో స్టీల్‌ప్లాంట్‌కు సీఐఐ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అందజేసింది. ఉత్తమ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఎల్డీ గ్యాస్ హోల్డర్ ఇంటర్ కనెక్షన్ కోసం ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత, పనితీరును అభినందించారు. -
విశాఖలో రెండోరోజు సార్వత్రిక సమ్మె
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ బంద్
-
AP: రికార్డులు తిరగరాసిన విశాఖ స్టీల్‌ప్లాంట్
ఉక్కునగరం (గాజువాక)/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది. చదవండి: దక్షిణ కొరియా మార్కెట్లో ఏపీ బంగినపల్లి -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో కొత్త ఉద్యోగాలు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు)/సింహాచలం(పెందుర్తి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆది వారం విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు గత ప్రభు త్వాలు గనులు ఇవ్వకపోవడం వల్లే ఈ పరి స్థితి తలెత్తిందన్నారు. ఆర్థిక అత్యవసర పరి స్థితి విధించే దిశగా ఏపీ పయనిస్తోందని వి మర్శించారు. మద్యంపై భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని హామీగా చూపి.. ప్రభుత్వం రుణాలు తీసుకోవడం దారుణమన్నారు. కోవిడ్ వల్ల అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పడం సరికాదన్నారు. గత టీడీపీ ప్రభు త్వమే ప్రత్యేక హోదా వద్దని చెప్పిందన్నారు. కాగా, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. సింహాచలంలో ఆమె మాట్లాడారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లాగా ఉండాలనేది బీజేపీ ప్రతిపాద న కూడా అని ఆమె పేర్కొన్నారు. మార్కా పురం, రాజంపేటలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నెలలోనే ఐదు సార్లు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేసి రికార్డులు నమోదు చేసిన స్టీల్ ప్లాంట్.. తాజాగా వాటిని అధిగమించింది. ఆవిర్భావ దినోత్సవం రోజైన శుక్రవారం.. బ్లాస్ట్ ఫర్నేస్–1లో 8,019 టన్నుల హాట్ మెటల్‌ను ఉత్పత్తి చేసింది. అంతకుముందు అత్యధికంగా ఈ నెల 8న 7,620 టన్నులు, 13న 7,670 టన్నులు, 15న 7,730 టన్నులు, 16న 7,835 టన్నులు, 17న ఉత్పత్తి 7,874 టన్నుల ఉత్పత్తి ద్వారా నెలకొల్పిన రికార్డులను అధిగమించింది. కార్మికులను సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్(ఆపరేషన్స్) ఏకే సక్సేనా అభినందించారు. -
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి
అగనంపూడి (గాజువాక): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం కూర్మన్నపాలెం కూడలి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ .. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ఉద్యమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం తగదన్నారు. ఇప్పటికే విద్య, వైద్య, రక్షణ, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరించిన కేంద్రం కొరియన్ సంస్థ పోస్కోకు విశాఖ స్టీల్‌ను అమ్మేస్తే భవిష్యత్‌లో తెలుగు ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మృగ్యం అవుతాయన్నారు. విశాఖ జోలికి రావద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్కో యాజమాన్య ప్రతినిధులకు చెప్పారని, అవసరమైతే కడప స్టీల్‌ప్లాంట్ అప్పగిస్తామని చెప్పినా అవసరం లేదని వారు తేల్చి చెప్పేశారన్నారు. కేవలం విశాఖ ఉక్కు భూములు, ఇక్కడ సహజ నౌకాశ్రయం ద్వారా దేశ సంపదను తరలించిపోడానికి పన్నిన పన్నాగమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి మేల్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు సీహెచ్.నరసింగరావు, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, వై.మస్తానప్ప, డి.ఆదినారాయణ పాల్గొన్నారు. 239 మంది కార్మికుల అరెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో గాజువాకలో 239 మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద, తగరపువలసలో కూడా జైల్‌భరో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలువురు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. -
కేంద్ర ఉక్కు సహాయ మంత్రికి ఉద్యమ సెగ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకు స్టీల్‌ప్లాంట్ ఉద్యమ సెగ తగిలింది. కులస్తే శనివారం కోల్‌కతా నుంచి విశాఖ మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంది. విజయవాడకు నేరుగా విమానం లేకపోవడంతో విశాఖలో దిగి, ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం విమానంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఉక్కు ఉద్యమకారుల ఆందోళనలతో ఆయన పర్యటనలో మార్పు జరిగింది. ఎన్ఏడీ కొత్తరోడ్డు వద్ద ఓ ప్రైవేట్ హోటల్లోనే ఆయన బస చేశారు. కొద్దిసేపు స్టీల్‌ప్లాంట్ అధికారులు, బీజేపీ నేతలతో ఆయన మాట్లాడారు. అక్కడే విశ్రాంతి తీసుకుని విజయవాడ వెళ్లిపోయారు. సర్క్యూట్ హౌస్ జంక్షన్లో నిరసన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సిరిపురం జంక్షన్ నుంచి సర్క్యూట్ హౌస్ జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేసిన జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును అమ్మే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. -
నేడు 365 జెండాలతో 365 మంది నిరసన
-
స్టీల్‌ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ పార్లమెంట్లో గళమెత్తారు. లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని చెప్పారు. ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరిట అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాలతో 1982లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు 64 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఆభరణం వంటిదన్నారు. 35 వేల మంది ఉద్యోగుల, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు ఈ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. దేశంలో ముడిసరుకు కోసం అధిక మొత్తం వెచ్చి స్తున్న స్టీల్‌ప్లాంట్‌గా, సొంతగనులు లేని ప్లాంట్‌గా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
పవన్‌కల్యాణ్ ఆవు కథ.. ఏకిపారేసిన అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడంలో ఆంతర్యమేమిటని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం అమ్మకానికి పెట్టడంపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంది. చదవండి: CM YS Jagan: మరోసారి గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్ పవన్ పోరాటం చేయాల్సింది బీజేపీతో. పవన్ కల్యాణ్‌కు బీజేపీ కార్యాలయం ఎదుట ప్లకార్డు పట్టుకుని పోరాటం చేసే దమ్ముందా?’ అని నిప్పులు చెరిగారు. పార్ట్నర్(బీజేపీ)ను నిలదీయలేని పవన్ కల్యాణ్‌కు.. సీఎం వైఎస్ జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నావా.. లేక సీఎం వైఎస్ జగన్‌ను నిందించడం కోసం రాజకీయాలు చేస్తున్నావా.. చెప్పాలని నిలదీశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. పార్లమెంట్లో పోరాటం కనిపించలేదా? ► ప్రత్యేక హోదా అంటూ నిన్న బాబు మాట్లాడితే.. ఇవాళ విశాఖ ఉక్కు దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ మరో నాటకం ఆడారు. కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి ఆవు కథ చెబుతున్నారు. ► రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో నడిపేందుకు సీఎం వైఎస్ జగన్ పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేశారు. ఇప్పటికీ గట్టిగా నిలబడ్డారు. ఇవేవీ పట్టని పవన్ కల్యాణ్.. తన బాస్ చంద్రబాబు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీ బాస్ అధికారంలో లేడనే ఏడుపు ► రాజకీయాల్లోనే వారసత్వానికి వ్యతిరేకమా? సినిమాల్లో కూడా వారసత్వానికి వ్యతిరేకమా? పవన్ చెప్పాలి. సినిమాల్లో ఈ స్థాయికి పవన్ కల్యాణ్ ఎలా ఎదిగారో కూడా చెప్పాలి. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ ప్రధాని నరేంద్రమోదీని తిట్టావు. ఇప్పుడు ప్రశంసిస్తున్నావు. ఇంతలోనే ఏ రసాయనిక మార్పు జరిగిందో చెప్పాలి. ► గిఫ్ట్‌గా దక్కిన రెండెకరాల భూమి కోసమే ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరావా? ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యే సీట్లు.. 22 లోక్‌సభ స్థానాలను గెలిపించుకున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించే అర్హత రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్‌కు ఎలా ఉంటుంది? సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్నాడనే ఆక్రోశం.. బాస్ చంద్రబాబు అధికారంలో లేడనే బాధతో పవన్ కల్యాణ్ ఏడుస్తున్నారు. ► కొందరే కోట్లు కాజేసేందుకు కాకుండా అందరూ బాగా బతికే సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలం. నిర్మాతల కోరిక మేరకు ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెస్తున్నాం. నిజాయితీ ఉంటే.. సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నావ్? ఎంత రెమ్యునరేషన్‌కు ట్యాక్స్ కడుతున్నావో చెప్పాలి. ► ఏడాదిలో ఖాళీగా ఉండే నాలుగు రోజులు బాస్ చంద్రబాబు చెప్పినట్లు రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ వంటి వారిని ప్రజలెవ్వరూ విశ్వసించకూడదు. -
పవన్ కల్యాణ్ మాకు లేఖ రాయలేదు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కువిషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాల విషయంలో ప్రధాన సమాచార కమిషనర్ వద్ద ఉన్న రికార్డులలో ఎటువంటి సమాచారం లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద గత నవంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. ఈ అంశంలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ బదులిచ్చారని ఆ శాఖ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు. -
విద్యార్థుల ‘ఉక్కు’ పిడికిలి
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం తొక్కారు. స్టూడెంట్స్ మార్చ్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. 1966 నవంబర్ 1న వన్‌టౌన్ ప్రాంతంలో విశాఖ ఉక్కు సాధన కోసం జరిగిన ప్రదర్శనపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మంది నగర విద్యార్థులను పొట్టన పెట్టుకున్న రోజును పురస్కరించుకుని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఏవీఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త రోడ్డు మీదుగా పాత పోస్టాఫీస్ వరకు సాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఫ్ బిశ్వాస్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పూనుకుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కి మహేషరీ మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు.. ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నరసింగరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు మంత్రి రాజశేఖర్, ఎం.జగ్గునాయుడు, కమిటీ ప్రతినిధి డాక్టర్ కొల్లా రాజమోహన్, ఆదినారాయణ, ప్రసన్నకుమార్, హరీష్‌కుమార్, జాన్సన్, రామ్మోహనరావు, కుసుమ, చిన్నారి, పాల్గొన్నారు. -
పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలి
ఆలకూరపాడు(టంగుటూరు): బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని కలిసి నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో పోరాడాలని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే, కుమారుడు మున్నా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రుడైన పవన్ చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుపై మోదీని నిలదీయాలన్నారు. కర్మాగారం కాపాడుకునేందుకు దీక్ష చేపడతానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రెండోసారి జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. శాసించే స్థాయి పదవిలో ఆయన ఉండి కూడా విశాఖ ఉక్కుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. -
కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు
అగనంపూడి (గాజువాక): ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళ్లే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సారథ్యంలో చేపట్టిన రిలే దీక్షలు 250వ రోజుకు చేరిన సందర్భంగా మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో నిరసన గళం విప్పామన్నారు. ఇకపై జరగబోయే ఏ సమావేశాల్లోనైనా ఆంధ్రుల అభీ ష్టాన్ని తెలియజేస్తూ నిరసన తెలుపుతామని చెప్పారు. ఉద్యమానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆంధ్రులకు ఉన్న ఏకైక అతిపెద్ద కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూ రావు, కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. అయినా కేంద్రం ముందుకు వెళ్తే భవి ష్యత్‌లో జరగబోయే పరిణామాలకు బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రుల మనోభావాలతో ఆడుకోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అలాకాదని మొండిగా వెళ్తే బీజేపీ పాలకులు రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. పోరాట కమిటీ నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేలమంది నిర్వాసితుల త్యాగం వల్ల ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే నిర్వాసితులు, ఉద్యోగుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఏయూ మాజీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు, ఉక్కు మాజీ డైరెక్టర్ కె.కె.రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు జె.వి.సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నగర ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడారు. -
250వ రోజు..250 మందితో 25 గంటల దీక్ష ప్రారంభం
విశాఖ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షలు 250వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం గేటు వద్ద 250 మంది కార్మికులు ఇరవై ఐదు గంటల నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా హక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘం నాయకులు. హెచ్చరించారు చదవండి: ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం! Visakhapatnam: 7 వండర్స్ ఇన్ వైజాగ్ -
స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు మూసివేసి నిరసన
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం: జీవీఎల్
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరు..
గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు ఏడు నెలలుగా పోరాడుతున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం సబబు కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉక్కు అఖిల పక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో ఆదివారం నిర్వహించిన మహా పాదయాత్రను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరని స్పష్టం చేశారు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు నష్టాలొచ్చాయన్నది మాత్రం దుష్ప్రచారమని కొట్టిపారేశారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వ్యతిరేకిస్తూ మహా పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కాకతీయ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రారంభించిన ఈ పాదయాత్రలో గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమరి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. (చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం) ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో నడుస్తోందన్నారు. పార్టీలకతీతంగా స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడు నెలలుగా రోడ్లపైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వ్యతిరేకిస్తున్న కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం... విభజన హామీలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. చదవండి: ఒంగోలులో స్ట్రీట్ ఫైట్: వీడియో వైరల్ -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులంతా సేఫ్‌జోన్‌లోనే ఉంటారు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులంతా సేఫ్‌జోన్‌లోనే ఉంటారని, ఎవరూ సంక్షేమం, భవిష్యత్ కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఉక్కు ప్రైవేటీకరణ వల్ల పరిశ్రమకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను గతంలో పోస్కో, తరువాత టాటా కొనుగోలు చేస్తుందని మీడియాలోనే కథనాలు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ విక్రయానికి కేంద్రం టెండర్లు పిలవలేదన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీకి ఎంతగానో నష్టం కలిగిందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో విధ్వంసకర, కక్ష పూరితమైన పాలన సాగుతోందన్నారు. ఏపీ అప్పులపాలై దీన, హీన స్థితిని ఎదుర్కొంటోందన్నారు. రూ.20 ఖరీదు చేసే మద్యాన్ని రూ.200కి అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతి వల్లనే ఇసుక ధరలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్రంపై ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు. -
విశాఖ ఉక్కు పోరాటం @ 200 రోజులు
-
200 రోజులకు చేరుకున్న విశాఖ ఉక్కు ఉద్యమం
-
కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి
అగనంపూడి(గాజువాక)/ఉక్కునగరం(గాజువాక): ఆంధ్రుల మనోభావాలను లెక్క చేయకుండా కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ముందుకు వెళ్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సారధ్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు జరిగిన పది కిలోమీటర్ల మానవహారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవహారానికి పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కదిలి వచ్చారని.. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎవరు కొనుగోలు చేసినా వాళ్లు విశాఖ రాలేరని.. వచ్చినా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. విశాఖ ఉక్కు పేరుతో ఉన్న 21 ఎకరాల భూమిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడానికే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కర్మాగారం వెళ్తే.. ప్లాంట్ భూములతో వ్యాపారం చేసి ఉడాయిస్తారన్నారు. ప్లాంట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాల పరిస్థితిపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల సారధ్యంలో ఐక్య పోరాటాలు సాగిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలిపారన్నారు. ఈ విషయంలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌కు తమ నిరసన గళం వినిపించామన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వైఎస్ జగన్ పలుమార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని చెప్పారు. పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దడానికి అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కాగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటం సోమవారానికి 200వ రోజుకు చేరుకుంటోంది. కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న కూర్మన్నపాలెం కూడలి వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆ««ధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. -
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మానవహారం
-
విశాఖ ఉక్కుకు 3 జాతీయ ఇంధన అవార్డులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మూడు జాతీయ స్థాయి ఇంధన అవార్డులు లభించాయి. సీఐఐ జీబీసీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంధన నిర్వహణపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు, ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డు, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అవార్డులను ప్రకటించారు. స్టీల్‌మెల్ట్ షాప్‌నకు చెందిన ఎల్డీ గ్యాస్ హోల్డర్ 1, 2కు చెందిన ప్రాజెక్టుకు ఇన్నోవేటివ్ అవార్డు, ఇంధన నిర్వహణలో చూపిన ప్రతిభకు ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డును ఇవ్వనున్నారు. స్టీల్ ప్లాంట్‌కు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు వరుసగా నాలుగేళ్లు లభించడం విశేషం. త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సీఎండీ డీకే మహంతి ఉద్యోగులను అభినందించారు. ఇవీ చదవండి: కొత్త రకం మోసం: ఫిట్స్ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా? -
'ఉక్కు' పరిరక్షణకు 29న భారీ మానవహారం
గాజువాక: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 29న నిర్వహించనున్న భారీ మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. అగనంపూడి నుంచి బీహెచ్ఈఎల్ వరకు జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పొడవునా 10 వేల మంది కార్మికులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఫిబ్రవరి 18న నిర్వహించిన ఉక్కు పరిరక్షణ దినోత్సవానికి రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు. ఆ తరువాత కాలంలో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి రెండు లేఖలను రాశారని, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని పంపిందని పేర్కొన్నారు. జీవీఎంసీ కూడా తన మొదటి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. పార్లమెం ట్ సమావేశాల్లో మన ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జవాబు ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకుండా మొండిగా తన నిర్ణయాలను అమలు చేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పునఃసమీక్షిస్తేనే మేలు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించేందుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశారని వివరించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం సైతం చేశారని తెలిపింది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరిందని వివరించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తన కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదంది. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కౌంటర్ దాఖలు చేశారు. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లే నష్టాలు... ‘విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల 20వేల మందికి పైగా ప్రత్యక్షంగా, అనేక వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కర్మాగార ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 7.30 మిలియన్ టన్నులు. ఆధునికీకరణ, విస్తరణ నిమిత్తం కర్మాగారం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంది. 2014–15 నుంచి ఈ కర్మాగారం నష్టాలు ఎదుర్కొంటోంది. క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కర్మాగారం పునరుద్ధరణ నిమిత్తం ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాస్తూ పలు సూచనలు చేశారు. లాభాల బాట పట్టించేందుకు వీలుగా విశాఖ ఉక్కు కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, ఆర్థిక పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. నెలకు రూ.200 కోట్ల వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ, విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని కరికాల వలవన్ ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ హిల్‌టాప్ గెస్ట్‌హౌస్ వద్ద కార్మికుల నిరసన
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత ఉధృతం
-
కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలంటూ పలుసార్లు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని కేంద్రం తెలిపిం ది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లకుండా తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జూలై 5న లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలంటూ జూన్ 17న తెలంగాణ జెన్కోను ఆదేశించినట్లు తెలి పారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌తో పాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పాదనను కొనసాగించడంతో వెంటనే నిలిపివేయాలని జూలై 15న తెలంగాణ జెన్కో అధికారులను కేఆర్ఎంబీ ఆదేశించిందన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు చెప్పారు. కేఆర్ఎంబీ లేఖలకు తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమి స్తూ తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు ఆదేశాలు జారీచేసే వరకు.. శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్, నాగా ర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉ త్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ జూలై 16న రా సిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలి పారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖా తరు చేస్తూ తెలంగాణ జలవిద్యుత్తు ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియో గం చేసేదిశగా ఆ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు చెప్పారు. దీనివల్ల బోర్డు సమర్థంగా పనిచేస్తుందన్నారు. విశాఖ ఉక్కుకు రబోధి బొగ్గు గనులు విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)కు జార్ఖండ్‌లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్రం తెలిపింది. కోకింగ్ కోల్ లభించే రబోధి బొగ్గుగనిని ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్ అథారిటీకి 2019 డిసెంబర్ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్ఐఎన్ఎల్కు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆర్ఐఎన్ఎల్కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వశాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్ఐఎన్ఎల్కు రబోధి గనుల కేటాయింపు జరిగిందన్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లోని నూరుశాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పూర్తి రాయపూర్–విశాఖపట్నం సెక్షన్ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా బైపాస్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం 32 శాతం బైపాస్ పనులు జరిగాయని, గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కల్పన చేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. ఈ పథకం ద్వారా 2018–19 నుంచి 2021–22లో జూలై 9 వరకు 6,536 మెక్రో ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ద్వారా 52,288 మందికి ఉపాధి కల్పన అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలకు ‘ఉక్కు’ నిరసన సెగ
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ తీవ్ర ప్రయత్నం చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీతారామన్‌ను అడ్డుకోవాలని విశాఖ కార్మిక సంఘాలు పలుమార్లు విఫలయత్నం చేశాయి. ఆదివారం ఉదయం మంత్రి కేడీపేట వెళ్తున్నారని తెలుసుకున్న పరిరక్షణ కమిటీ నాయకులు కూర్మన్నపాలెం కూడలిలో అడ్డుకోవాలని భావించారు. పసిగట్టిన పోలీసులు ఆమెను సింహాచలం మీదుగా పంపించారు. దీంతో పరిరక్షణ కమిటీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, కె.సత్యనారాయణరావు, అయోధ్య, సుబ్బయ్య, రామకృష్ణ, కోరాడ వెంకటరావు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రికి ‘ఉక్కు’ నిరసనల సెగ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉక్కు’ ఉద్యమ సెగ తగిలింది. 150 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి చేరుకోక ముందు నుంచే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్, కేంద్ర బలగాలు కూడా ఎయిర్‌పోర్టు లోపల పహారా కాశాయి. ఎయిర్ పోర్టులోకి వచ్చే వాహనాల్ని తనిఖీ చేసి.. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ బలగాలు వారిని నిరోధించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప పెనుగులాట జరిగింది. నిర్మలా సీతారామన్ గో బ్యాక్, విశాఖ ద్రోహి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ.. విమానాశ్రయ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అప్రమత్తమై వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కొంతమంది ఉద్యమకారులు పోలీస్ వలయాన్ని దాటుకుంటూ.. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బయటికి రావడంతో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోకుండా భద్రతా బలగాలు ఉద్యమకారులను నిలువరించాయి. సీతారామన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లేంత వరకూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేస్తున్న పోర్టు గెస్ట్ హౌస్ వరకూ ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
విశాఖ ఉక్కు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు’’ అని తెలిపారు. ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని.. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు అన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. -
ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం.. ఏపీ భవన్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికుల డిమాండ్ చేశారు. కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గీత, సత్యవతి, మాధవ్, కోటగిరి శ్రీధర్, ఎంవీవీ సత్యనారాయణ, అనురాధ, తలారి రంగయ్య ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయ పోరాటం చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్నారు. సొంత గనులు ఇవ్వాలని, అప్పును ఈక్విటీగా మార్చాలని సూచించామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యోగుల యాజమాన్యంలో ఉంచితే బాగుంటుందని తన ఉద్దేశమన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం
-
'విశాఖ ఉక్కు'పై పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేస్తామని, ఇందుకు కొంత గడువునివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రిప్లైదాఖలుకు గానూ తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో వ్యాజ్యంలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఉక్కు శాఖ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇస్తామని గడువునివ్వాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ వేశామని, ఒక్కో శాఖ తరఫున ఒక్కో కౌంటర్ అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, తాము కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది -
జోరువానలోనూ ఉక్కు సంకల్పం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదాలతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్ధరిల్లింది. బ్యారికేడ్లు, పోలీస్ ఆంక్షలను ఛేదించుకుని ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జంతర్ మంతర్ సాక్షిగా ఎలుగెత్తి చాటారు. కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకున్న కార్మికులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. విశాఖ నుంచి రైలు ద్వారా ఢిల్లీ చేరుకున్న కార్మికులను తిరిగి వెళ్లాలని ఒత్తిడి చేశారు. వారు బస చేసిన హోటళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ ధర్నా సమయానికి జంతర్‌మంతర్ చేరుకున్న కార్మికులు జోరువానలోనూ నిరసన గళాన్ని వినిపించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, íసీపీఐ, ఎల్జేడీ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూయూ, ఐద్వా సంఘీభావం తెలిపాయి. పోరాడి అడ్డుకుంటాం.. ప్రజల త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా పార్లమెంట్లో పోరాడుతామని సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మోదీ సర్కార్ వేగవంతం చేసిందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించకుండా దేశ సంపదను ప్రైవేట్‌పరం చేయడంపైనే కేంద్రం మొగ్గు చూపుతోందన్నారు. ప్రజా ఉద్యమంతో తిరుగుబాటు కచ్చితంగా జరుగుతుందని, స్టీల్‌ప్లాంట్ ఉద్యమంతో ఇది ప్రారంభమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పోరాటం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేని పార్టీలు సైతం విశాఖ ఉక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నాయని, ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందించిన సహకారం మరిచిపోలేనిదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. కార్మికుల ఉద్యమానికి రైతులు అండగా ఉంటారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మాదిరిగానే దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు విక్రయించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడిందని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మూర్ఖత్వంతో వ్యవహరిస్తోందని, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు విశాఖ ఉక్కు నాణ్యమైనదంటూ ప్రకటించి మరోవైపు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. కలసికట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ సూచించారు. వైఎస్సార్సీపీ సంఘీభావం ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటంచేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా జరిపే పోరాటంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లుగా తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ విశాఖలో ప్రత్యామ్నాయ మార్గాలపై కార్మిక సంఘాల నేతలతో గత ఫిబ్రవరిలో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారన్నారు. కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయించాలని.. అలాగే, రూ.22 వేల కోట్ల రుణ భారానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘం నేతలు -
స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
-
విశాఖ ఉక్కు కార్మికుల ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు పోరాట కమిటీ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఢిల్లీని తాకింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కార్మికుల నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జంతర్‌మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. -
తీవ్ర రూపం దాలుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో అంతిమ విజయం కార్మికులదే అని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం రిలే దీక్షా శిబిరం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్, కణితి, వడ్లపూడి ప్రధాన రహదారుల మీదుగా రిలే దీక్షా శిబిరం వరకు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారనుందని చెప్పారు. ఢిల్లీ పెద్దలను కదిలించే స్థాయిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్రను జాతీయస్థాయిలోని బీజేపీయేతర పార్టీల పార్లమెంటరీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
164వ రోజుకు చేరిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల రిలే దీక్షలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. స్టీల్‌ప్లాంట్ కార్మికుల రిలే దీక్షలు 164వ రోజుకు చేరాయి. కూర్మన్నపాలెం నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర చేపట్టాయి. నిర్వాసిత కాలనీల్లో కార్మిక సంఘాలు పాదయాత్ర చేస్తున్నాయి. పాదయాత్రలో అఖిలపక్ష నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.