Visakhapatnam
-
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేయగా.. 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్‌లో విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. -
విశాఖలో NRI మహిళ మృతి కేసులో అనేక ట్విస్టులు
-
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతిపై మూడో పట్టణ పోలీసులు విచారణ ప్రారంభించారు. హోటల్ సిబ్బందిని ఆదివారం పిలిపించి ఈ సంఘటన జరిగిన 6వ తేదీన మేఘాలయ హోటల్ రూమ్ నంబరు 229లో ఏమి జరిగిందోనని వివరాలు సేకరించారు. రోజా ఆమె స్నేహితుడు పిల్లా శ్రీధర్ ఎప్పుడు హోటల్‌కు వచ్చారు? వారికోసం ఎవరైనా వచ్చారా? హోటల్ సిబ్బందితో ఎలా ప్రవర్తించేవారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కాని ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేసు నీరుగార్చే ప్రయత్నం? ఈ కేసును మొదటి నుంచి కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం మేఘాలయ హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేస్తే కనీసం ఏమి జరగనట్లు మూడో పట్టణ పోలీసులు వ్యవహరించారు. చివరికి మీడియా ప్రతినిధులు పోలీసులను సంప్రదించినా అటువంటది ఏమి లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసులు విచారణ షురూ చేశారు. కానీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అంశాలను పరిశీలిస్తే కేసును నీరుగార్చే విధంగా ఉంది. కేసులో నిందితులు ఎవరు లేరు? మూడో పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు నిందితులు ఎవరు లేరని పేర్కొన్నారు. హోటల్ మేనేజర్ తన ఫిర్యాదులో రోజా మృతి పట్ల అనుమానంగా ఉందని తెలిపారు. తొలుత డాక్టర్ శ్రీధర్ అనే వ్యక్తి హోటల్ రూమ్ నుంచి బయటకి వచ్చి రూమ్ డోర్ అనుకోకుండా లాక్ అయిందని చెప్పారని, రూమ్ దగ్గరకి వెళ్లేసరికే తన స్నేహితురాలు అపస్మారక స్థితిలో ఉందని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా సరే శ్రీధర్‌ను నిందితుడిగా చేర్చకుండా పొలీసులు విచారణ చేయడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫిర్యాదులోనూ లొసుగులు? నిజానికి మేఘాలయ హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. డాక్టర్ శ్రీధర్ 6వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు హోటల్‌కు వచ్చినట్లు.. 1.40 గంటలకు రోజా నేరుగా హోటల్ రూమ్ నంబర్ 229కి వెళ్లినట్లు పేర్కొన్నారు. 3.35 గంటలకు శ్రీధర్ రూమ్ నుంచి బయటకి వచ్చి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. రెండు గంటల పాటు రోజా, శ్రీధర్ మాత్రమే రూమ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. రూమ్‌లో శ్రీధర్ ఉండగా రోజా బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకుందా..? అసలు హుక్ గానీ, కిటీకీ గాని లేని బాత్రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందా..? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా అనేక సందేహాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. -
Tamannaah Bhatia: ఫ్యాషన్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు (ఫోటోలు)
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. నేడు గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా కార్మికులు హాజరయ్యారు. -
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’
విశాఖపట్నం: అచ్చియ్యమ్మపేటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివి.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగుణ(34), తన భర్త అప్పన్న, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సుగుణ అచ్చియ్యమ్మపేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బులు ఇచ్చినందుకు వీడియో కూడా తీసింది. రూ.లక్షకు వారానికి రూ.20 వేలు అసలు, వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో, ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తానని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.40 వేలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగా.. ధనలక్ష్మి లేరు. ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు. కాగా.. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దల గొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న, తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అప్పన్న, అతని ఇద్దరు కుమారులు, మృతురాలి బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయి ఉందని పోలీసులు వెల్లడించారు.‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. నా కోసం బాధపడవద్దు. నేను అప్పులు మాత్రమే చేశాను. నా వల్ల నువ్వు, పిల్లలు సుఖపడలేరు. ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు. పిల్లలను హాస్టల్లో చేర్పించి బాగా చదివించు. నువ్వు నా కోసం బాధపడవద్దు’అని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాయిస్ మెసేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విశాఖ కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు. -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్‌కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. -
విశాఖ, ఏలూరు, గుంటూరులో కొనసాగుతున్న కౌంటింగ్
-
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కోసం కూటమి ప్రభుత్వం పాట్లు.
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శన ఆశించిన మేర ఉండేలా కనబడటం లేదు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ సర్వే కోసం సచివాలయ సిబ్బందిపై జీవీంఎసీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయాల్సిన సర్వేను.. సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 300 మంది ప్రజలు ఓటీపీలు సేకరించాలని ఆదేశించారు. అయితే ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. దాంతో జోనల్ కమిషనర్ శివప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనుకున్న టార్గెట్ చేరలేకపోయారంటూ సచివాలయ సిబ్బందికి నోటీసులు పంపారు శివ ప్రసాద్. ఆయన తీరుతో సచివాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయించాల్సిన సర్వేను తమతో చేయించడంపై మండిపడుతున్నారు. -
విశాఖకు శాపంగా చంద్రబాబు పాలన.. బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలన విశాఖ పర్యాటకానికి శాపంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి కారణంగా రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దుతో విశాఖ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఏపీలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖలోని రుషికొండకు పేరుంది. రుషికొండ వద్ద తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా వైఎస్సార్సీపీ హయాంలో 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రుషికొండ బీచ్‌లో ఎప్పటికప్పడు వ్యర్థాల తొలగింపు చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు బీచ్ క్లీన్‌గా ఉండేలా పలు చర్యలు తీసుకున్నారు. దీంతో, బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది.ఇక, చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత రుషికొండ బీచ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, ఇటీవల కాలంలో బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, ప్రయాణీకుల నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. అలాగే.. టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు దారుణంగా మారాయి. బీచ్ వద్ద నిర్వహణ అధ్వానంగా ఉన్న ఫొటోలను, వీడియోలను కొందరు పర్యాటకులు డెన్మార్క్ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తాజాగా రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. దీంతో, తీరంలోని జెండాలను పర్యాటకశాఖ అధికారులు కిందకు దించేశారు. -
‘రియల్’ ఢమాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖలో ‘రియల్’ రంగం ఆటుపోట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! టీడీపీ కూటమి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో అస్థిర వాతావరణం నెలకొంది. తింటే గారెలే తినాలి... కొంటే వైజాగ్‌లోనే ఇల్లు కొనాలనే పరిస్థితి నుంచి రాజకీయ కుట్రలకు బలవుతామేమోనన్న భయంతో కొనుగోలుదారులు ఇతర నగరాలవైపు చూస్తున్న పరిస్థితి తలెత్తింది. గతేడాది దేశవ్యాప్తంగా టైర్–2 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినా విశాఖలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. గృహ విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ నివేదికలో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. అమ్మకాల్లో అట్టడుగున విశాఖ దేశవ్యాప్తంగా 15 ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే నిర్వహించింది. టైర్–2 నగరాల్లో విశాఖలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గృహ విక్రయాలు బాగా పడిపోయిన నగరాల్లో విశాఖ సైతం టాప్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. విశాఖతో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, నాసిక్, జైపూర్, నాగపూర్, భువనేశ్వర్, మొహాలీ, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్, త్రివేండ్రంలో 2024లో ఇళ్ల అమ్మకాలు, నూతన గృహాల నిర్మాణాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే చేపట్టింది. విష ప్రచారంతోనే.. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేలా అడుగులు వేసింది. నగరంలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపింది. గత ప్రభుత్వ కృషితో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే విశాఖపై కూటమి పారీ్టలతో పాటు ఎల్లో మీడియా అక్కసు పెంచుకుంటూ వచ్చాయి. ఏటా సముద్ర మట్టం పెరిగి విశాఖ మునిగిపోతుందంటూ తప్పుడు కథనాలు వెలువరించాయి. నగరంలో భూ కబ్జాలు, హత్యాకాండలు అంటూ దు్రష్పచారానికి తెర తీశాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖలో ఒక్కసారిగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ఈ ప్రభావం ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ రంగంపై పడింది. ఫలితంగా మిగిలిన టైర్–2 నగరాలతో పోలిస్తే విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 21 శాతం తగ్గాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మినహా కొత్తవి ఏవీ పట్టాలు ఎక్కకపోవడానికి విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోయంబత్తూర్‌లో అత్యధికం2024లో టైర్ 2 సిటీల్లో గృహ విక్రయాలు నాలుగు శాతం పెరగగా విలువ పరంగా 20 శాతం వృద్ధి కనిపించింది. 15 నగరాల్లో 1,78,771 యూనిట్లు విక్రయించగా వీటి విలువ రూ.1,52,552 కోట్లుగా ఉంది. 2023లో రూ.1,27,505 కోట్ల విలువైన 1,71,903 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏకంగా 36 శాతం వృద్ధితో కోయంబత్తూర్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. అమ్మకాల విలువ పరంగా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే విక్రయాల విలువలో 47 శాతం వృద్ధి రేటును భువనేశ్వర్ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో రూ.49,421 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2023లో రూ.42,063 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది. ఏడాదిలో ఎంత తేడా ఏడాదిన్నర క్రితం వరకూ రియల్ బూమ్‌తో ఉప్పొంగిన విశాఖ ఇప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అధికార పార్టీ నేతల భూ దందాలతో క్రయ విక్రయాలు సుప్తావస్థలోకి చేరుకున్నాయి. ఫలితంగా విశాఖలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 2023లో విశాఖలో 5,361 ఇళ్లు అమ్ముడు కాగా 2024లో ఇది 4,258కి పడిపోయింది. ఇళ్ల నిర్మాణ విషయంలోనూ విశాఖలో తిరోగమనం కనిపించిందని ప్రాప్ ఈక్విటీ సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా విశాఖలో ఏటా సగటున 4,997 కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. గతేడాది మాత్రం దాదాపు 8శాతం తగ్గుదల నమోదైంది. అటు విక్రయాలతో పాటు ఇటు నిర్మాణాల్లోనూ విశాఖలో రియల్ రంగం తిరోగమనంలోనే సాగుతోంది. -
‘చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’
విశాఖ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నవ్వాలో జాలి పడాలో తెలియని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వైఎస్ జగన్ మరో 10 మెట్లు పైకి ఎక్కారన్నారు కురసాల. బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు లోకేష్ పొగడ్తలకే సరిపోయిందని, బడ్జెట్ ను మసి పూసి మారేడు కాయ చేశారన్నారు.బడ్జెట్ గురించి ఎల్లో మీడియాలో రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారు. వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పు చేస్తే రాష్ట్రం దివాలా అని వార్తల రాశారు. చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’ అని మండిపడ్డారు. పోసాని అరెస్టు ద్వారా కొత్త సంస్కృతికి తెర తీశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా జైల్లో పెట్టారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పై, వైఎస్సార్ సీపీ నేతలపై దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే సాంస్కృతిని కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వం ఈ సంస్కృతిని కొనసాగించదా? అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
విశాఖలో సినిమా నిర్మాణం పేరిట టీడీపీ నేత మోసం
-
విశాఖపట్నం : శివనామస్మరణతో పులకించిన సాగరతీరం (ఫొటోలు)
-
విశాఖలోని హోటల్ డాడీ గ్రాండ్ లో అగ్నిప్రమాదం
-
విశాఖపట్నం : సాగరతీరంలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలు (ఫొటోలు)
-
AP: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతం.. సీఎం డౌన్ డౌన్ అంటూ..
సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచేసింది. మెయిన్స్ వేయిదా వేస్తామని ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను ప్రభుత్వం నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్-2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు.విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతమైంది. ఇసుకతోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం డౌన్ డౌన్ అంటూ గ్రూప్-2 అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరుతున్నారు.కళ్లు తిరిగి పడిపోయిన గ్రూప్-2 అభ్యర్థిగ్రూప్-2 అభ్యర్థి శ్యామ్ కళ్లు తిరిగిపడిపోయాడు. శ్యామ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో అభ్యర్థి చిరంజీవి కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. రోస్టర్‌లో సవరణలు చేశాకే పరీక్షకు హాజరవుతామని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం మా గోడు పట్టించుకోవాలని గ్రూప్-2 అభ్యర్థులు చెబుతున్నారు. విజయవాడ: రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి స్పష్టత ఇంకా రాలేదు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మూడు రోజులుగా ధర్నాలోనే ఉన్నామని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని.. వాయిదా పడుతుందంటూ లోకేష్ చంద్రబాబు చెప్పారు. ఆ నమ్మకంతోనే ఎక్కడ వాళ్లం అక్కడే ఆగిపోయాం. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టాలి. రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టకపోతే మళ్లీ జ్యూడిషల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంకో రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే గ్రూప్-2 ప్రిపరేషన్ కోసం ఇల్లు వదిలి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా రాయలేమని నాయక్ అన్నారు. -
‘వైఎస్ జగన్‌కు ఏ విధంగా భద్రత తొలగిస్తారు?’
విశాఖ. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న భద్రతను ఏ విధంగా తొలగిస్తారని ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయనకు యధావిధిగా భద్రత కొనసాగించాలని కన్నబాబు కోరారు. వైఎస్ జగన్ జడ్ ప్లస్ భద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాల్సిన అవసరం ఉందన్నారు.వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ పై తన కడుపు మంటను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అంటూ నిలదీశారు కురసాల కన్నబాబు. మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నించారు. మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే గానీ చంద్రబాబులో చలనం రాలేదని ధ్వజమెత్తారు.మోదీ, అమిత్ షాలకు మిథున్‌రెడ్డి లేఖప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసి కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు. -
రెక్కల గుర్రంపై... విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలు
చందమామ కథల్లో విన్న జలకన్యలు కళ్ల ముందు ప్రత్యక్షమై ‘హాయ్’ అని పలకరిస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లోనే చూసిన రంగుల వెలుగుల జలకన్యలు ‘పదండి మా లోకంలోకి’ అని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం సొంతమై మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. విశాఖ ఎక్స్పో– 2025 మెర్మైడ్స్ (జల కన్యలు) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు రెక్కలతో ఎగిరొచ్చిన జలకన్యల పరిచయం...చిన్నతనంలో కథలు, కార్టూన్లలో జలకన్యలను చూసి తెగ సంతోషించేది ఫిలిప్పీన్స్‌కి చెందిన కినా. ‘జలకన్యలు’ నిజం అనే భావనతోనే పెరిగింది. తాను కూడా వారిలా మారాలని బలంగా అనుకుంది. తరువాత కాలంలో స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. సముద్రంలో కూడా ఈద గలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న కినా మెర్మైడ్ప్రొఫెషన్ ఎంచుకుంది. ‘శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతో ప్రధానం’ అంటున్న కినా నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంది. మెర్మైడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.‘మెర్మైడ్గా నీటిలో ఈదుతూ ప్రేక్షకులను అలరించాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి మంచినిద్ర, తగినంత వ్యాయాయం అవసరం. నిత్యం ఉదయంవేళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు, యోగా చేస్తాము. దీనివల్ల నీటిలో ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన మాస్క్, ఇయర్ ప్లగ్స్, ప్రత్యేకమైన సూట్, నడుముకి 2 నుంచి 4 కేజీల బరువుండే బెల్ట్, ఫిన్ వంటివి ధరిస్తాము’ అంటుంది ఫిలిప్పీన్స్ కు చెందిన రుత్.ఇటలీకి చెందిన క్లియోప్రొఫెషనల్ సింగర్. చిన్నప్పటి నుంచి మెర్మైడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటకు వీడ్కోలు చెప్పి శిక్షణ తరువాత మెర్మైడ్ ప్రొషెషన్లోకి వచ్చింది. ‘మమ్మల్ని చూసిన తరువాత చిన్నారుల మోముల్లో కనిపించే చిరునవ్వులు ఎంతోసంతోషాన్ని, వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తాయి. మా వృత్తిలో గౌరవప్రదమైన వేతనం ఉంటుంది’ అంటుంది క్లియో.ఫిజికల్ థెరపిస్ట్‌గా ఫిలిప్పీన్స్‌లోని హాస్పిటల్స్‌లో రెండేళ్లు పనిచేసిన విరోనికకు మెర్మైడ్ప్రొఫెషన్ అనేది చిన్ననాటి కల. తన కలను సాకారం చేసుకోవడమే కాదు రెండువృత్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ‘భారత్‌లో మమ్మల్ని బాగా ఆదరించారు’ అంటుంది విరోనిక.మూవీ థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన క్లియో మెర్మైడ్ ప్రొఫెషన్లోకి రావడం ద్వారా తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, వృత్తిపరమైన సంతృప్తి, సంతోషాల మాట ఎలా ఉన్నా....ఇది ఆషామాషీ వృత్తేమీ కాదు. నిత్యం రెండు నుంచి నాలుగు గంటల సమయం నీటిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.హైపోథేమియా, హైకోక్సియావంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన నీరు లేని పక్షంలో చర్మసమస్యలు వస్తాయి. చర్మ, కేశ సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఖర్చు చేయాల్సి వస్తుంది. నీటిలో దిగే సమయంలో శరీరానికి వివిధ లోషన్లు పూసుకుంటారు. పైభాగంలో ఉంచే లైట్ల నుంచి వచ్చే వేడిని దృష్టిలో పెట్టుకొని సన్‌స్క్రీన్ వాడతారు. కాళ్లకు ఉపయోగించే ప్రత్యేకమైన తోక వంటి పరికరం వల్ల కాళ్లపై గాయాలు కావడం అనేది సర్వసాధారణం.నాలుగు దశల శిక్షణమెర్మైడ్ప్రొఫెషన్ కోసం ప్రాథమిక స్థాయి, ఓషన్ మెర్మైడ్, అడ్వాన్స్డ్, ఇన్స్ట్రక్టర్...నాలుగు దశల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో ఈత కొట్టడంలోప్రాథమిక సూత్రాలు, రెండోదశలో సముద్రంలో, ద్వీపాలలో ఈత కొట్టడం, మూడోదశలో మరింత నైపుణ్యంతో ఈత కొట్టడం నేర్పిస్తారు. నాల్గవ దశలో ఈతలో, మెర్మైడ్స్గా ఉపాధిని పొందడానికి వచ్చే వారికి అవసరమైన శిక్షణ అందించే ఇన్‌స్ట్రక్టర్‌గా మారడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.– వేదుల నరసింహంఎ.యూ. క్యాంపస్, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎం.డి. నవాజ్ -
విశాఖ ఆర్కే బీచ్ లో ఇసుక లారీ బీభత్సం
-
ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్‌కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం. -
‘మండే’ కాలం.!
సాక్షి, విశాఖపట్నం: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం.. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈసారి వేసవికాలం ముందుగానే వచ్చేస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండేకాలం ముందుందని హెచ్చరిస్తున్నారు.నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంపై నైరుతి, ఆగ్నేయ దిశగా పొడిగాలులు వీస్తున్నాయి. దీనితోడు... సూర్యుడు నేటి నుంచి ఉత్తరార్థగోళం వైపు వస్తున్నాడనీ, ఈ రెండింటి ప్రభావంతో ముందస్తు వేసవి వచ్చేసినట్లేనని అంచనా వేస్తున్నారు.విజయనగరం, అనకాపల్లి, విశాఖ శివారు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతాయన్నారు. -
విశాఖపట్నం బీచ్‌రోడ్డులో పింక్ శారీ వాక్ సినీనటి గౌతమి సందడి (ఫొటోలు)
-
వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధానిగా భాసిల్లుతూ.. నిన్నటిరవకు కార్యనిర్వాహక రాజధానిగా ఎదిగిన విశాఖపట్నం నగరాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఓ పక్క విశాఖపై చాలా ప్రేమ ఉందని చెబుతూనే, మరోపక్క ఈ మహా నగరం అభివృద్ధిని అడ్డుకుంటోంది. అన్ని రకాల సౌకర్యాలను విశాఖపట్నం ప్రజల నుంచి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆర్బీఐ రీజనల్ కార్యాలయం ఏర్పాటవుతుందన్న తరుణంలో దాన్ని విజయవాడకు పట్టుకుపోయిన చంద్రబాబు సర్కారు.. చివరకు విమాన సర్వీసులనూ తరలించేస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకొస్తుంటే.. ఆ సర్వీసులను విజయవాడ నుంచి నడపాలంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేక విమానయాన సంస్థలు అసలు ఏపీ నుంచి సర్వీసులు నడపాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నాయి. స్లాట్లపై నౌకాదళం ఆంక్షలతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వివక్షతో విశాఖ విమానాశ్రయం అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రయాణికులతో పాటు కార్గోలోనూ అపారమైన వృద్ధి సామర్థ్యం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసి.. కొత్త సర్వీసుల్ని కూడా విజయవాడకు మళ్లిస్తోంది. ఎమిరేట్స్‌పై ఒత్తిడి? మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపేందుకు విశాఖ ఉత్తమ ప్రాంతంగా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. వివిధ దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ అవకాశాలు కూడా వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్ కూడా ఏపీ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడిపేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులను అధ్యయనం చేసింది. విశాఖే అనుకూలంగా ఉందని భావించింది.అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నుంచి కాకుండా విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్టు) నుంచి దుబాయ్‌కి సర్వీసు నడపాలంటూ ఈ ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి షార్జాకు ఓ సర్వీసు నడుపుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రెండో సర్వీసు నడిపినా ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. అయినా విశాఖపై కక్ష సాధింపుతో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచే నడపాలని అంటుండటంతో ఎమిరేట్స్ సంస్థ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం ఇలాగే ఒత్తిడి చేస్తే పూర్తిగా సర్వీసు రద్దు చేసే అవకాశం కూడా ఉందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమిరేట్స్ సంస్థ పరిస్థితిని చూసిన ఇతర సంస్థలు ఏపీ నుంచి సర్వీసులు నడపడానికి వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో దుబాయ్‌కి విజయవంతంగా సర్వీసుకోవిడ్–19కి ముందు విశాఖ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ దుబాయ్‌కు ఏడేళ్ల పాటు సర్వీసుని నడిపింది. 80 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ సర్వీసు నడిచింది. ఇప్పుడూ ఇదే విధమైన డిమాండ్ ఉన్నప్పటికీ, దుబాయ్ సర్వీసును ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 180 సీటర్ ప్యాసింజర్ విమానానికి 2 టన్నుల కార్గోని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ సర్వీసు విశాఖ నుంచి నడిస్తే 100 శాతం ఆక్యుపెన్సీతో పాటు రొయ్యలు, ఔషధాలు, దుస్తులు, ఇతర కార్గో ఎగుమతులకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు కార్గో అదనపు ఆదాయాన్నిస్తుంది. అందువల్ల విదేశీ సర్వీసులకు వైజాగ్ పూర్తి అనుకూలమని విమానయాన సంస్థలు భావిస్తున్నా, ప్రభుత్వం మోకాలడ్డడంపై విమర్శలు వస్తున్నాయి. -
విశాఖ నుంచి చౌకగా విమానయానం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు టికెట్ బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది. సాధారణంగా వైజాగ్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్‌కు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.4,400 నుంచి రూ.5వేల లోపే టికెట్ ధర ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది. అన్ని వర్గాల ప్రయాణికులకు విమానయాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించింది. -
మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్!
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
నల్లగా మారిన విశాఖ సాగర తీరంలోని ఇసుక
-
విశాఖపట్నం : ప్రేమసాగరం ఆర్కేబీచ్లో ప్రేమికుల సందడి (ఫొటోలు)
-
భర్త వికృత చేష్టలు.. విశాఖలో నవ వధువు..
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని.. నాలుగు నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్కరు కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదన్నారు. ఈ నెల 27న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎన్నిక నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
బాబూ.. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పుకుంటారు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ బొత్స(Botsa Satyanarayana) విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు. ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒకొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. విద్యార్థులు తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం.వైఎస్సార్సీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేశాం. వైఎస్ జగన్ మాటలతో పరిపాలన చేయలేదు. చేతలతో పరిపాలన చేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించారు. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పి బతుకుతారు. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నారు. ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన సీట్ నివేదికను విడుదల చేయాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయన్న కూటమి నేతలు ఎప్పుడు వాటిని బయటపెడతారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచుతున్నారు. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్‌పూర్‌కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్‌లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది
-
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం.కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలుస్కిల్ ఇండియా పథకం 2025 వరకూ పొడిగింపురూ. 8,800 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వంజాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం పొడిగింపు2028 మార్చి 31 వరకూ పొడిగించిన కేంద్రం -
ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం
సాక్షి, విశాఖపట్నం: కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. 10,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని.. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా పరిధిలో కలిసిపోతుందని సీపీఎం పేర్కొంది.అరకు అభివృద్ధికి ఒరిస్సా మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం సాధించారని కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. జోన్ ఏర్పాటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం తెలిపింది.కాగా, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు. -
భారతీయులకు బేడీలు.. మోదీ ఏం చేస్తున్నారు?: కేఏ పాల్
సాక్షి, విశాఖపట్నం: మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారు?. విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో భారతీయుల కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.కేఏ పాల్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మన దేశ పౌరులకు బేడీలు వేశారు. వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా?. ఇంత జరుగుతుంటే ప్రదాని మోదీ ఏం చేస్తున్నారు?. మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలి?. విదేశాంగ మంత్రి బాధత్య వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. చైనాను ఎదిరించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరం.ఒకప్పుడు మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నాడు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారు?. విశాఖ ఎంపీ భరత్.. ఆయన మావయ్య పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలో ఇబ్బందిలో ఉన్న భారతీయులు కేఏ పాల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వార్నింగ్ ఇస్తున్నాను. ట్రంప్ భార్య కూడా అమెరికాకు విజిట్ వీసాపై వచ్చింది. వారిని ఇప్పుడు పంపించేస్తే కుదురుతుందా?. ట్రంప్‌కి మిలానియా మూడో భార్య. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ట్రంప్‌ను ఫాలో అవుతున్నాడు. పవన్ సనాతన ధర్మం అంటున్నందుకు ఆయన భార్య విడాకులు ఇవ్వచ్చు. మళ్ళీ ఆమె సొంత దేశానికి వెళ్లిపోవచ్చు.నేను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గలాన్ని విప్పాలి. రేవంత్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. లోకేష్ దగ్గరకు వెళ్తే ఏం సాయం చేస్తారు. వాళ్ళ నాన్న దోచుకోవడమే లోకేష్‌కు నేర్పించాడు. వాళ్ళ దగ్గర పవన్ నేర్చుకొని.. కోట్లు దోచుకుంటున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
విశాఖకు ద్రోహం.. ఒడిశాకు పట్టం
-
షిప్‌యార్డ్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.!
హిందుస్థాన్ షిప్‌యార్డ్.. విశాఖపట్నంలోని మేటి నౌకా నిర్మాణ కేంద్రమిది. వాణిజ్యపరంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ఈ షిప్‌యార్డు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 200కు పైగా భారీ నౌకల నిర్మాణం తోపాటు 2000కు పైగా నౌకలు, పలు నావికాదళ జలాంతర్గాములకు మరమ్మతులు చేసిన ఘనత ఈ షిప్యార్డుది. ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా.. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ రూ.20 వేల కోట్ల పనుల్ని సొంతం చేసుకొని.. దేశంలోనే సుప్రీం షిప్‌యార్డుగా రూపొందింది. నౌకా నిర్మాణమైనా, మరమ్మతులైనా సకాలంలో పూర్తిచేయడం ఈ సంస్థ విశిష్టత. దేశీయ నౌకల తయారీలో మేటిగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆర్డర్లు పొందేందుకు కృషి చేస్తోంది. ముందుగా ఆగ్నేయాసియా దేశాలకు రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, విశాఖపట్నంరూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లుఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకా నిర్మాణానికి హిందుస్థాన్ షిప్‌యార్డు అడుగులు వేస్తోంది. భారత నౌకా దళం, కోస్ట్‌గార్డ్ కోసం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ని తయారు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యున్నత ప్రమాణాలతో ఈ నౌకలను నిర్మించనుంది. 45 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దీంతో వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరిగింది. గత ఆరి్థక సంవత్సరంలో హెచ్ఎస్ఎల్ చరిత్రలోనే తొలిసారిగా రూ.1,413 కోట్ల టర్నోవర్‌తో రూ.119 కోట్ల లాభాలు ఆర్జించింది.ఈ ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లు కూడా దక్కించుకుంది. ఇదే ఊపుతో అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ దేశాల యుద్ధ నౌకల మరమ్మతుల్ని విజయవంతంగా నిర్వహిస్తున్న హెచ్ఎస్ఎల్... ఇప్పుడు విదేశీ జలాంతర్గాముల పునర్నిర్మాణ పనులకూ సిద్ధమవుతోంది. తొలి ప్రయత్నంగా ఆగ్నేయాసియాలోని దేశాలపై దృష్టి సారించింది. వియత్నాం దేశ జలాంతర్గాముల పునర్నిర్మాణం కోసం వియత్నాం పీపుల్స్ నేవీ (వీపీఎన్)తో ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్‌తోనూ చర్చలు జరుపుతోంది. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా..విదేశీ నౌకల మరమ్మతులతో అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షించిన ఈ షిప్‌యార్డు.. ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యానికీ సిద్ధమవుతోంది. 2021లో 17,000 టన్నుల విదేశీ నౌకని డాక్ చేసి విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది. భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా నిర్మించిన ఓషన్ సరై్వలెన్స్ షిప్ (ఓఎస్ఎస్) ఐఎన్ఎస్ ధృవ్‌ని నిర్మించిన హెచ్ఎస్ఎల్.. 2022లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో డైవింగ్ సపోర్ట్ వెసల్స్ ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిపుణ్ యుద్ధ నౌకల్ని నిర్మించి సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని అంతర్జాతీయ నౌకల నిర్మాణానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.షిప్ బిల్డింగ్ హబ్‌గా వైజాగ్దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ హెచ్ఎస్ఎల్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా షిప్‌యార్డుని ఆధునికీకరిస్తున్నాం. రానున్న మూడేళ్లలో రూ.1,000 కోట్లతో షిప్‌యార్డు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఫ్లీట్ షిప్స్ తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖతో కుదర్చుకున్న ఒప్పందం షిప్‌యార్డు భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ నౌకల తయారీ ద్వారా అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం లభిస్తుంది. నౌకల తయారీలో దాదాపు 90 శాతం వరకూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు, సామగ్రిని వినియోగిస్తాం.దేశీయ నౌకల నిర్మాణంపైనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, మరమ్మతుల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకొనేందుకు, అత్యాధునిక సదుపాయాల కోసం రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కేవలం షిప్ రిపేర్ హబ్‌గా కాకుండా.. షిప్ బిల్డింగ్ హబ్‌గా విశాఖపట్నంని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్ షిప్‌యార్డ్ -
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
-
విశాఖపట్నం బీచ్ : అలలు పోయి.. శిలలు పైకి పర్యాటకులు సెల్ఫీలు (ఫొటోలు)
-
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కుమారస్వామికి నిరసన సెగ
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు. ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కాసేపట్లో కేంద్ర మంత్రులు సమీక్ష జరపనున్నారు. అయితే ఆ మీటింగ్‌కు కార్మిక సంఘాలను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని సంఘాల నేతలు చెబుతున్నారు. కాన్వాయ్‌లో ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలు సందర్శిస్తున్నారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరోకటి ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు దెబ్బ తిన్నాయి. ధ్వంసమైన కారులో ఒకటి మాజీ ఎంపీ జీవీఎల్‌కు చెందిన కారు ఉన్నట్లు తెలుస్తోంది. -
తల్లి కష్టాన్ని చూడలేక.. భుజం కాసిన బిడ్డలు!
అమ్మ కష్టాన్ని చూడలేక ఈ చిన్నారులు(అక్కా, తమ్ముడు) చలించిపోయారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన ఈ తల్లి పొలం నుంచి వస్తూ వంటకు పుల్లలు పోగు చేసుకుని, ఆ పుల్లల మోపు తలపై పెట్టుకుని, మరో పెద్ద కట్టెను భుజాన వేసుకుని వస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేక ఆమె భుజాలపై ఉన్న పెద్ద కట్టెను చిన్నారులిద్దరూ తమ భుజాలపైకి తీసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు సమీపంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – ప్రత్తిపాడుమంచు జల్లులో తడిసి ప్రకృతి పులకిస్తోంది.. వెండి చినుకులు ఆకుల అంచులపై నుంచి సుతారంగా జాలువారుతూ నేలను మురిపెంగా ముద్దాడుతుంటే.. మట్టి తడిసి ముద్దవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా మలికిపురం మండలం గుడిమళ్ల లంకగ్రామంలో మంగళవారం ఉదయం మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురపరిచింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమండ్రిహెల్మెట్ ధరించి వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (Helmet) వాడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆమె ఏలూరులో (Eluru) హెల్మెట్ ధరించని వాహనదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని పలువురికి చలానా విధించారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, ఏలూరు కీడల్లో రాణించాలన్న వారి పట్టుదల ముందు రన్నింగ్ ట్రాక్ చిన్నబోయింది. ఉత్తి కాళ్లపై విద్యార్థినులు పోటీల్లో పరుగు పెట్టిన తీరు ఆకట్టుకుంది. విశాఖపట్నంలో మంగళవారం రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలు నిర్వహించగా... ఇందులో కొంత మంది విద్యార్థినులు కాళ్లకు షూ లేనప్పటికీ.. పోటీల్లో ఇలా పాల్గొన్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఫిషింగ్ హర్బర్‌లో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ, విశాఖపట్నం (Visakhapatnam) ఆధ్వర్యంలో రెండు పరిశోధనా నౌకల్లో ప్రజలు, విద్యార్థులు సందర్శన కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల సందర్శనకు విద్యార్థులు భారీగా బారులు తీరారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నంచదవండి: అమ్మకడుపులో రాచపుండు -
‘అప్పుడేం చెప్పావో మర్చిపోయావా?.. నటించొద్దు బాబూ’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు.. అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడంటూ సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం రూ.3 లక్షల కోట్లు కేంద్రం ఇస్తే రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజులు చెల్లించక విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు.. వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు.‘‘వైఎస్ జగన్ ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పావ్.. ఇప్పుడు నువ్వేం చేస్తున్నాం.. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావ్.. అమరావతికి కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? కేవలం అప్పు మాత్రమే ఇచ్చారు.. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత సీఎం చంద్రబాబుదే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలన్నావ్.. ఆ మాట ఇప్పుడు ఏమైంది?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నలు గుప్పించారు.‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చంద్రబాబు అన్నాడు. ఇప్పడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు. దేశం తిరోగమనం వైపు వెళుతుంది.. మత ఛాందసం పెరిగిపోయింది. కుంభమేళాను గొప్పగా చెప్తున్నారు. ఒంటి నిండా బూడిద పూసుకొని పుర్రెలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా.? సీపీఐ పార్టీ వందేళ్ల ప్రయాణంలో కామ్రేడ్స్ త్యాగాలు మరువలేనివి. బ్రిటీష్ వారిపై పోరాడిన పార్టీ సీపీఐ. ఆర్ఎస్ఎస్ ఏనాడూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ నేడు స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది. బీజేపీకి 400 స్థానాలు వచ్చి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండేది కాదు’’ అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తప్పుడు వార్తలు.. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి -
కోస్ట్‌గార్డ్ రైజింగ్ డే బైక్ ర్యాలీ ప్రారంభం
సింథియా: ఇండియన్ కోస్ట్‌గార్డ్ 49వ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్ ర్యాలీని కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్‌గార్డ్ కమాండర్ జెండా ఊపి ప్రారంభించారు.49 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బందితో ఈ బైక్ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్ మెరైన్ బీచ్ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్‌లను సందర్శించి రైజింగ్ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్ ర్యాలీని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. -
అలలపై కదిలే సౌధం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22వ తేదీ మధ్య పుదుచ్చేరి, చెన్నైకి మూడు సర్విసులు నడిపేందుకు కార్డేలియా క్రూయిజ్ షిప్ సిద్ధమవుతోంది. జీఏసీ షిప్పింగ్ సంస్థ ఈ సర్విసులు నడపనుంది. అంతర్జాతీయస్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను 2023 సెప్టెంబరు 4న అధికారికంగా ప్రారంభించారు. ఆగస్టు నెల నుంచి ఈ టెర్మినల్ ద్వారా సర్విసులు ప్రారంభం కానున్నాయని ఇటివల విశాఖ పోర్టులో జరిగిన సమావేశంలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలికి అధికారులు వివరించారు. ఈ ఆధునిక క్రూయిజ్ టెర్మినల్‌లో ఉన్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా టూరిజం ఆపరేటర్లకు, ఇతర సంస్థలకు విశాఖపట్నం పోర్టు అధికారులు వివరించారు. అంతర్జాతీయ హంగులు..అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక హంగులతో విశాఖ క్రూయిజ్ టెర్మినల్ మొత్తం 3,530 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ 2,750 చ.మీ. విస్తీర్ణంలో ప్రయాణికుల రాకపోకల కోసం వినియోగిస్తారు. మొదటి అంతస్తు 780 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ టెర్మినల్‌లో 180 మీటర్ల పొడవు గల బెర్త్ ఉంటుంది. నాలుగు మూరింగ్ డాల్పిన్లతో కలిపి 330 మీటర్ల పొడవు, 37.6 మీటర్ల వెడల్పు, 8.1 మీటర్ల డ్రాఫ్ట్ గల పెద్ద క్రూయిజ్ షిప్‌లను ఇది హ్యాండిల్ చేయగలదు. ఒకేసారి రెండువేల మంది ప్రయాణికులకు అవసరమైన అన్నిసేవలు అందించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఈ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్ క్లియ రెన్స్ కౌంటర్లు, పార్కింగ్, డ్యూటీ ఫ్రీ షాప్స్, ఫుడ్ కోర్ట్లు, లాంజ్‌లు ఉన్నాయి. 11 అంతస్తుల భారీ షిప్ కార్డేలియా..ఆగస్టు నెలలో విశాఖ టెర్మినల్‌కు రానున్న ‘కార్డేలియా’ 11 అంతస్తులున్న భారీ క్రూయిజ్ షిప్. ఇందులో ఒకేసారి 1,800 మంది వరకూ ప్రయాణించవచ్చు. 692 అడుగుల పొడవు కలిగిన ఈ భారీ షిప్లో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, థియేటర్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో తదితర సౌకర్యాలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అయితే, లిక్కర్, ఇతర సర్విసులకు మాత్రం అదనపు చార్జీలు వసూలు చేస్తారు. 48,563 టన్నుల బరువైన ఈ భారీ నౌకలో 796 కేబిన్లు ఉంటాయి. -
భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. -
మీనాక్షమ్మ గుడిలా నూకాలమ్మ ఆలయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవతగా విరాజిల్లుతున్న అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం తరహాలో అభివృద్ది చేస్తున్నారు. మూడు వైపులా రాజగోపురాలు నిర్మించడంతో పాటు రానున్న 200 సంవత్సరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆలయానికి తూర్పు వైపున మాత్రమే రాజగోపురం ఉండగా... మిగిలిన మూడువైపులా రాజగోపురాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా గర్భగుడిని కూడా విస్తరిస్తున్నారు. మొత్తం రూ. 8 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పనులూ పూర్తయితే ఉగాది నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను 2023 అక్టోబర్ నెలలో అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. శతాబ్దాల చరిత్ర...! అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఉత్తరాంధ్రలోని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో నూకాంబిక దేవి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు కాకర్లపూడి అప్పలరాజు పాయకారావు ఈ ఆలయాన్ని తమ కుటుంబ దేవత అయిన కాకతాంబిక కోసం నిర్మించారు. ఆ తర్వాత ఈ దేవతను నూకాంబిక లేదా నూకలమ్మ అని పిలుస్తున్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాచీన వైభవాన్ని పరిరక్షించడంలో భాగంగా గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ఏటా ఉగాది అనంతరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఆలయంలో నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రానున్న 200 సంవత్సరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఇలా...! గతంలో కాకతీయుల కాలంలో ఆలయ అభివృద్ది పనులు జరుగగా ఇన్నాళ్ల తరువాత గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టింది. అమ్మవారి ఆలయం మొదటి భాగంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి తీసుకొచ్చిన నల్లరాయితో గర్భాలయం 14X14 అడుగుల నుంచి 17.11x17.11 అడుగులకు విస్తరించనున్నారు. అంతరాలయాన్ని సైతం భారీగా విస్తరిస్తున్నారు. చూడగానే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకు వచ్చేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
మత్తుమందు ఇస్తున్నారు.. మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదు..!
విశాఖ : తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ(Visakha) వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహం(Girls Hostel)లోని బాలికలు నిరసనకు దిగారు. తమకు నిద్రమాత్రలు ఇచ్చి మానసికంగా రోగులుగా మారుస్తునన్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంటికి పంపించేయాలంటూ మరోసారి హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు.అయితే ఈరోజు(గురువారం)మరోసారి హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టిన బాలికల్నిజజ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani) పరామర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాలికల శరీరంపై ఉన్న గాయాలు చూసి వివరాలు తెలుసుకున్నారు.తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని ఆ బాలికలు.. వరుదు కళ్యాణకి తెలిపారు. అంతే కాకుండా మత్తు మందు ఇస్తున్నారని బాధిత బాలికలు స్పష్టం చేశారు.బాలికకు మత్తుమందు ఇవ్వడం దుర్మార్గం: వరుదు కళ్యాణిఈ ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘బాలికలకు మత్తు మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదని, బాలికల సదన్ ఘటనపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.ఐదుగురు బాలికల ఆందోళనకాగా, జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్షాప్లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. -
కలలు రూపుదిద్దుకుంటున్నాయి.. సింధు పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
విశాఖపట్నం : కైలాసగిరి..సందడే సందడి (ఫొటోలు)
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
సాక్షి, విశాఖపట్నం: కుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది -
జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!
ఆరిలోవ : విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు. ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. » ఫ్లూయంట్ గ్రిడ్ లిమిటెడ్ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్‌క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. » ఎన్‌క్లోజరు వద్ద ఐఓసీఎల్ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్ పేరుతో బోర్డును దాని ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు. » ఆర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్(ఏఎన్/ఎంఎస్) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్‌క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. » వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇక్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి దత్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఆదాయం పన్ను మినహాయింపు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు. దాతలు ముందుకు రావాలి జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు.ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. – మంగమ్మ, జూ క్యూరేటర్ ఆహారం ఇలా... సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్
-
పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపకపోవడంతో..
పెందుర్తి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో చోటుచేసుకుంది. భర్త తరచూ భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించింది. తమ కుమార్తె మృతికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ.. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా ఆమెను పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో కారణంతో కొట్టేవాడు. ఈ నెల 11న కూడా పార్వతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సీఐ కె.వి.సతీ‹Ùకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
మోదీ పగలబడి నవ్వింది అందుకే!
దేశ ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం. ఎవరూ తప్పుపట్టలేము. కానీ ప్రధానే ఇబ్బందిపడేలా పొగిడితే? ఎంత ఎబ్బెట్టు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇది ఆయన సొంతపార్టీ తెలుగుదేశం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కూడా!. .. అంత పొగిడినా మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా బాబును నిరాశకు గురి చేసి ఉంటుంది. అలాగని ఆ విషయం గట్టిగా చెప్పలేని స్థితి. కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ఉన్న సమయంలో.. చంద్రబాబు మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావిచ్చారనిపిస్తోంది. బహుశా కేంద్రం స్థాయిలో తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)కు పట్టం కట్టాల్సి వస్తే సమస్యల్లేకుండా చూసుకోవడం వంటివి బాబుకు ఈ పరిస్థితి కల్పించి ఉంటాయని అనుకుంటున్నారు!. చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని మోదీ ప్రశంసలకే కేటాయించడం సొంతపార్టీలోనే చాలామందికి నచ్చలేదట!. ఇది పార్టీ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా ఫర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే 2019 ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు. పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానమంత్రిని ‘టెర్రరిస్టు’గా అభివర్ణించారు. ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు. చివరికి భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించే వారు. పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ‘యూ టర్న్ బాబు’ అని నామకరణం చేసింది కూడా మోదీనే. కొడుకు కోసమే బాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేశారు. దీనికి ప్రతిగా బాబు తనకు కుటుంబం ఉందని, మీకేం ఉందని మోదీని ఘాటుగా ప్రశ్నించారు అప్పట్లో. అయితే 2024నాటికి తిరిగి వారిద్దరూ కలిసిన తీరు రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఒక నిదర్శనం!. పరువు ప్రతిష్టలు, ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవే కానీ, ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి.. మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత. ఆయన 1978 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నారు. 1995లోనే తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. తాను సీనియర్‌ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు పదే పదే గుర్తు చేశారు కూడా. అలాంటి బాబుగారు ఇప్పుడు ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అంటున్నారు. తమ ఇద్దరిది ఒకటే స్కూల్ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించడంతో మోదీ నవ్వుతూ కూర్చున్నారు. బహుశా ఇదే చంద్రబాబు గతంలో తనను ఉద్దేశించి ఏమన్నది మోదీకి గుర్తు వచ్చి ఉండవచ్చు!. గత మూడు దశాబ్దాలలో మోదీకి, చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. జరిగిన మత ఘర్షణలలో ఆయన రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. వస్తే అరెస్టు చేయిస్తానిని కూడా హెచ్చరించారు. అప్పటికి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు. 2009లో బీజేపీని వదలి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), వామపక్షాలతో కూటమి కట్టి ఓటమి పాలవడంతో తిరిగి బీజేపీ వైపు మళ్లారు. 2014లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాట్లు పడ్డారు. మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మాట కలిపే యత్నం చేశారు. ఎలాగైతేనేం..2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత.. ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్యనేతలు దూషించేవారు. ఆ క్రమంలో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శించారు. ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే భావన ఏర్పడేది. దానికి తోడు చంద్రబాబు 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు.. 2019లో ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో.. తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు. ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. అలాగే.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇదే టైమ్‌లో బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ సిద్దం కాకపోవడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది!... ఎలాగైతేనేం 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగుడుతున్నారు. అది విశాఖ సభలో శ్రుతి మించిందని చెప్పకతప్పదు. మోదీ భజన చేస్తే చేశారులే.. ఏపీకి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడతారేమో అని ఆశగా ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా.. విశాఖపట్నంలో ఐదు దశాబ్దాలుగా విరాజిల్లుతున్న విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని మాత్రం కోరలేకపోయారు. పైగా పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయదలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి గుర్తు చేసి, ప్రధాని పాజిటివ్‌గా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ స్టీల్ సంగతేమిటి?’’ అని ఎవరికైనా సందేహం వస్తే అది వారి ఖర్మ. కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు. పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలమని ఏమైనా చెప్పారా? అంటే అదీలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సెంటిమెంట్ అని, దానిని కాపాడుకోవాల్సిందేనని, ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే విశాఖ స్టీల్ ను సేవ్ చేయగులుగుతామని, తాము ప్రధానిని ఒప్పించగలుగుతామని చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. వాటిని కూడా నమ్మి అక్కడి వారు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్దులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారిపోయింది. పైకి మాత్రం మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూ, అక్కడ ఉద్యోగాలు పోతున్నా, ఇనుప ఖనిజం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా వామపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్‌లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా వ్యవహరించారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాని మోదీని విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయవద్దని, దానికి అసరమైన గనులు కేటాయించాలని కోరారు కదా. మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అంటూనే, ఏపీకి కావల్సిన డిమాండ్లను తీర్చాలని విస్పష్టంగా కోరారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగారు. కానీ.. ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దాని గురించి మర్చిపోయారు. ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు, పవన్ లు ప్రస్తావించకపోవడంతో ప్రధాని మోడీకి సమాధానం చెప్పే అవసరమే లేకుండా పోయింది.విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే కూటమి నేతలంతా పరిమితం అయ్యారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులకు ఆరోజుల్లో తెలుగుదేశం నేతలు అడ్డుపడే యత్నం కూడా చేశారు. పలు రాష్ట్రాలు పోటీపడినా ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దానిని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతేనని నిస్సిగ్గుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్.టి.పి.సి ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే. అలాగే రైల్వేజోన్ కు అవసరమైన భూమిని కేటాయించింది సైతంం జగన్ సర్కారే. కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు. చివరికి అదే భూమిలో శంకుస్థాపన చేశారు. అయినా మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలగాలి. శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ,ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు మించినవారు ఉండరేమో!. ప్రధాని మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్దతి అనుకోవచ్చు. అలాకాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం?. ఇంతకీ మోదీని ఆనాడు చంద్రబాబు దూషించడాన్ని సమర్ధించాలా? లేక ప్రస్తుతం పొగడడాన్ని ఒప్పుకోవాలా?.. అంటే ఏమి చెబుదాం. అలాగే ఒకప్పుడు అవినీతిపరుడు అన్న చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి? మొత్తం మీద వీరిద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేశారా?!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి👉🏾: ‘చంద్రబాబు ఎన్డీయేకి ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం!’ -
నాలుగు నెలలుగా జీతాలు లేవని ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులు
-
విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికుల (vizag steel) అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు.మరో వైపు, కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పల్లె కన్నీరు పెడుతోందో -
విశాఖలో ఉక్కు కార్మికుల వినూత్న నిరసన
-
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను -
చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కోట్ల విలువైన విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను పడింది. ఫ్రీ–హోల్డ్ భూములను చేజిక్కించుకునేందుకు చిన్న బాస్ క్లాస్మేట్ కిలాడీ విశాఖలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటన సమయంలో ఇక్కడకు వచ్చిన సదరు కిలాడీ భీమిలి, ఆనందపురంతో పాటు సబ్బవరం తదితర ప్రాంతాల్లోని విలువైన భూముల వివరాలను సేకరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో చిన్న బాస్ మిత్రుడిగా ‘శానా’ అతిచేస్తున్న మరో నేత కూడా కలిసి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం రైతులకు కేటాయించిన డీ–పట్టా భూములను ఫ్రీ–హోల్డ్ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా వాటిని తమ అవసరాలకు వినియోగించుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది. అయితే, కొత్త ప్రభుత్వం వీటిపై గత కొద్ది నెలలుగా నిషేధం విధించింది. రానున్న మూడేళ్ల కాలంలో ఫ్రీ–హోల్డ్ కానున్న (20 ఏళ్లు పూర్తయిన) భూముల వివరాలనే సదరు కిలాడీ టీమ్ సేకరిస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వివాదాస్పద భూములపై కూడా వీరి కన్ను పడింది. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల మాటకు విలువ లేకుండా ఇప్పటికే చక్రం తిప్పుతున్న సదరు కిలాడీ టీమ్.. మొత్తం భూ దందాను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు రెవెన్యూ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఫ్రీ–హోల్డ్ భూములపై కన్ను! వాస్తవానికి రైతుల వద్ద 20 ఏళ్ల నుంచి ఉన్న డీ–పట్టా భూములను తమ అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఫ్రీ–హోల్డ్ చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశాఖ జిల్లాలో సుమారు 100 ఎకరాల భూములు మాత్రమే ఫ్రీ–హోల్డ్ జరిగింది. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు అనేక ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఈ ప్రభుత్వం నియమించుకున్న అధికారులే తేలి్చచెప్పారు. మరోవైపు ఫ్రీ–హోల్డ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 20 ఏళ్లు పూర్తయిన డీ–పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈలోగా ఈ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ కాస్తా విశాఖపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయిన వాటితో పాటు రానున్న 3 ఏళ్లల్లో ఏయే భూములు ఫ్రీ–హోల్డ్ అయ్యే అవకాశం ఉందో... ఆ వివరాలను సేకరిస్తున్నారు. తద్వారా ఆయా రైతుల నుంచి వీటిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ ఇక్కడే మకాం వేసినట్టు సమాచారంప్రధాని పర్యటన ఏర్పాట్లలోనూ..! వాస్తవానికి ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేదు. కేవలం చిన్న బాస్ మిత్రుడని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పటికే అమరావతిలో చిన్న బాస్ ఆదేశాలతో పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్న సదరు కిలాడీ.. ఇప్పుడు విశాఖలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ... ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులతో కలిసి ఏయూ గ్రౌండ్స్‌లో హల్చల్ చేశారు. అధికారులకు ఆదే శాలు ఇస్తూ ఏర్పాట్లపై సమీక్షించారు. ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ చిన్న బాస్ క్లాస్ మేట్ హోదాలో సకల వ్యవహారాలు సదరు కిలాడీనే చూసుకుంటున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. సాక్షాత్తూ ప్రధాని పర్యటన ఏర్పాట్ల వ్యవహారంలోనూ జిల్లా లోని అధికారులకు కూడా ఈ విషయం అర్థమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సదరు కిలాడీ భీమి లి, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లోని ఫ్రీ–హోల్డ్ భూములపై వివరాలు సేకరించారు. ఆయా రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు తీసుకొని.. రైతుల నుంచి చౌకగా కొట్టేసి... ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమకు చెందేలా వ్యవహారాలు సర్దుబాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. -
విశాఖపట్నంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు (ఫొటోలు)
-
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్ -
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)పై చంద్రబాబు (Chandrababu) మోసం మరోసారి బయటపడింది. విశాఖ మోదీ (PM Modi) సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.1400 రోజులకుపైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రధానికి అపాయిమెంట్ ఇప్పించాలని కార్మికుల కోరిన కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం ఐరన్‌ఓర్ సప్లై చేసేందుకు పైప్‌లైన్ వేసేందుకు అనుమతించాలని మోదీని చంద్రబాబు కోరారు.స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ అడగకుండా.. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్‌ను చంద్రబాబు అడిగారు. రైల్వే జోన్‌పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ చంద్రబాబు డాంబికాలు పలికారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తించారు. అటు ఇంగ్లీషు, ఇటు హిందీలోనూ ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విశాఖ(visakhapatnam)లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్‌స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు మార్గాని భరత్
-
విశాఖకు మోదీ.. నిరాహార దీక్షలో ఉక్కు పోరాట కమిటీ
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్(visaka Steel Plant) పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు పోరాటం కార్మికులు ఉక్కు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.విశాఖ(visakhapatnam)లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. నేడు విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. స్టీల్‌ప్లాంట్ కోసం ఉక్కు కార్మికులు నిరాహర దీక్ష చేస్తున్నా కనీసం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నేడు విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్‌స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని, సెయిల్‌లో విలీనం చేయిస్తామని, సొంత గనులు కేటాయిస్తామని, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద రూ.18వేల కోట్లు మంజూరు చేయించి చర్యలు చేపడతామని చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన బల్లెంలా పెట్టటానికి తహతహలాడుతున్నారని మండిపడ్డారు. -
ఒక్కొక్కరికి రూ.110తో ఫుడ్ ప్యాకెట్
మహారాణిపేట: ప్రధాని మోదీ రోడ్డు షో, బహిరంగ సభ కోసం వచ్చే ప్రజల కోసం ఆహారం తయారీలో సివిల్ సప్లయిస్ అధికారులు బిజీగా ఉన్నారు. రెండు లక్షల మందికి పైగా భోజనాలు, స్నాక్స్ తయారు చేయిస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ.110 చొప్పున తయారీ కోసం పలువురికి క్యాటరింగ్ అప్పగించారు. పెదగదిలి(తోటగరువు) వద్ద ఉన్న యెర్ని దుర్గామాంబ కల్యాణ మండపంలో ఓం సాయిరామ్ కేటరింగ్, పవన్ కేటరింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు. రామాటాకీస్ వద్ద ఉన్న బి.ఆర్.అంబేడ్కర్ భవన్లో అమృతం కేటరింగ్, క్విక్ సప్లయిర్స్‌కు, అక్కయ్యపాలెం షాదీఖానా కల్యాణ మండపంలో కృష్ణారెడ్డి కేటరింగ్‌కు, ఫెర్రీ రోడ్డు(వన్ టౌన్) పొట్టి శ్రీరాములు కల్యాణ మండపంలో మణికంఠ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటేషన్లకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్, రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ అందించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. -
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
నేడు విశాఖలో ప్రధాని పర్యటన
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం సచివాలయం నుంచి అధికారులతో సమీక్షించారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్‌గా 20 వరకూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నట్లు సీఎస్ చెప్పారు. ‘సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళతారు.’ అని సీఎస్ వివరించారు. 3 గంటలపాటు విశాఖలో... ప్రధాని విశాఖలో మూడు గంటలపాటు ఉంటారని, వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుంచి కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారని సీఎస్ తెలిపారు. అక్కడ నుంచే వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్ రైల్వే లైన్ల డబ్లింగ్ వంటి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారన్నారు. -
కూటమి నేతలకు మేతగా...!
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే మాటను పక్కన పెట్టి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి కొందరు నేతలకు లబ్ధి కలిగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను సైతం కాల్చివేసి ఖాళీ స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖలో రూ.100 కోట్లకుపైగా విలువైన 2.20 ఎకరాల స్థలాన్ని బహుళ అంతస్తుల భవనం పేరిట కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. సొంత లాభమే లక్ష్యంగా..విశాఖపట్నం నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సుమారు 2.20 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయాలు, ఉద్యోగుల అతిథి గృహం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న రెండు అంతస్తుల భవనంలో విశాఖపట్నం పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. అదేవిధంగా విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పనుల కోసం 11 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఇక్కడ ఉన్న అతిథి గృహం ఒక్కటే వసతి కల్పిస్తోంది. అయితే, ఆ భవనాలను నేలమట్టం చేసి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని బహుళ అంతస్తుల భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే భారీ భవనంలోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, లేదా నగరంలోనే సాగర్‌నగర్ వద్ద నిర్మిస్తున్న మరో భవనంలోకి విశాఖ సర్కిల్ ఆఫీసును తరలించడం అనే రెండు ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సిందిగా సర్కిల్ అధికారులను ఆదేశించింది. మరోవైపు తమ కార్యాలయాన్ని కాల్చివేసి విలువైన స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలతో సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి కంపెనీ స్థలాలను ఇలా లాక్కొని ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు. – తెనాలిమేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ! ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు. – మలికిపురంశునక వానర స్నేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది. – మలికిపురం'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలుసముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్‌లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్‌కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
Visakhapatnam : యుద్ధ నౌకల విన్యాసాలు.. నేవీ షో అదరహో (ఫోటోలు)
-
పీడీఎస్ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!
సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్నప్పుడు రేషన్ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతున్నాయి. రేషన్ బియ్యమే అయినా.. దర్జాగా షిప్ ఎక్కి దేశాలు దాటిపోతున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌కు వచ్చి పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లలో తనిఖీలంటూ హడావుడి చేశారు. బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతుల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్ బియ్యం.. సీజ్ ది రైస్.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి బిబో ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన 8 లారీల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రకటించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపోతే బియ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. 48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతున్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపివేయిస్తామని ఆ ఎక్స్‌పోర్టు సంస్థని బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని క్లీన్చిట్ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు. మంత్రి అనుచరులు ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యానికి క్లీన్ చిట్ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదుర్చుకోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్) నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్ పోర్టు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం. – డిసెంబర్ 9న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనకట్ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జారీ చేసిన సర్క్యులర్ -
సత్తా చాటిన నౌకాదళం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్కె బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.నౌకాదళం, మెరైన్ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టుకుంది. ఆయిల్ రిగ్‌ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. డార్నియర్ హెలికాప్టర్, హాక్ జెట్ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్‌తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 8న పీఎంచే రైల్వే జోన్‌కు శంకుస్థాపన: చంద్రబాబునావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్‌కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్టీపీసీ–జెన్కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. విశాఖలో త్వరలో టీసీఎస్ ఏర్పాటు కానుందని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతిఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చెప్పారు. విశాఖ వేదికగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగమవుతోందని అన్నారు. ఇటీవల నిర్వహించిన నేవీ మారథాన్‌లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. తూర్పు నావికాదళానికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు మంత్రులు, అధికారులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు హాజరయ్యారు. -
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ(TDP) సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath). పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్(nara Lokesh) తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది. ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. గ్రామంలో వైఎఎస్సార్సీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా?.ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా 150 ఓట్లు మాత్రమే ఉంది. భీమిలీలో వైఎస్సార్సీపీకి బలమైన కేడర్ ఉంది. 100 శాతం సభ్యత్వం జరిగిందని లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారు?. సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు. కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలిస్తాం.. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు. గత ఏడు నెలల ప్రవచనాలు చెబుతున్న అనితా గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చింది. టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషీ చేరుకుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏం చెబుతారు మరి?. టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏం చేస్తున్నారు?. మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారు అని కామెంట్స్ చేశారు. విశాఖలోని ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
జైల్లో మరో సెల్‌ఫోన్ గుర్తించిన అధికారులు
-
విశాఖ : సాగరతీరంలో బాంబుల మోత..ఆయిల్ రిగ్ పేల్చిన నౌకాదళం (ఫొటోలు)
-
విశాఖలో సందడి చేసిన సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
‘ఇంగ్లీష్ మీడియం.. మీ పిల్లలకేనా?..మా పిల్లలకొద్దా?’
విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?.. .. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది. -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు.‘‘రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం రూ.20 వేలు ఏమైంది?. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని జిల్లాల్లో పోరుబాట ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎండగడతాం’’ అని అమర్నాథ్ తెలిపారు.‘‘ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూశారు. ప్రజలు నమ్మించి మోసం చేసిన పార్టీ కుటమిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. వైఎస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఐదేళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారు...భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం చంద్రబాబు పెట్టారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. మేము చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది.ఇదీ చదవండి: అత్యంత ధనిక సీఎం చంద్రబాబు..తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు లేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు..\ ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. త్వరలో జిల్లాలు వారీగా వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఏడు నెలల కాలంలో లక్ష 12 వేల కోట్లు అప్పు చేశారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలో ధనిక సీఎం వైఎస్ జగన్ అని ప్రచారం చేశారు. సుమారు రూ. 950 కోట్లు చంద్రబాబు సంపాదించారు. దేశంలోనే ధనిక సీఎం గా చంద్రబాబు పేరు సంపాదించారు. చంద్రబాబు ఆస్తుల పక్కన ఒకటో రెండో సున్నాలు మర్చిపోయి ఉంటారు.’’ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.‘‘రెండు ఎకరాల నుంచి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు?. చంద్రబాబు ఆస్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఉంగరం వాచ్ ఫోన్ పెట్టుకోలేనంత మాత్రాన ఆస్తులు లేవంటే ప్రజలు నమ్మరు. సంక్షేమ పథకాలు అమలు చేయక చివరికి దేవుడుకి ఆదాయం కూడా పడిపోయింది. బీసీ మంత్రులను కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. గౌతు శిరీషతో క్షమాపణ చెప్పించారు. ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ కు ఎదురు పడితే ఆ మంత్రిని టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి తమ వైఖరిని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా లేదా అనేది ఎంపీకి తెలియక పోవడం ఆశ్చర్యం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
విశాఖలో వివాదంగా మారిన పోలీసుల పనితీరు
-
బాంబుల మోతతో దద్దరిల్లిన విశాఖ సాగరతీరం (ఫొటోలు)
-
మన్మోహన్‌కు వైఎస్సార్సీపీ నేతల నివాళులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.విశాఖలో మన్మోహన్ సింగ్ మృతిపై వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్‌గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు. -
విశాఖ సాగర తీరం.. కోత ఘోరం!
ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరంలో కొన్ని రోజులుగా ‘అల’జడి కొనసాగుతోంది. పర్యాటకానికి మణిహారంగా నిలిచిన ఆర్కే బీచ్‌తో (RK Beach) పాటు పలు ప్రదేశాలు.. ఇప్పుడు తీవ్ర కోతకు గురవుతున్నాయి. తుపాన్లకు తోడు ఇటీవల వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విశాఖ తీరంలో జరుగుతున్న మార్పులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పార్కులో గోడ కూలిపోవడం, నేల కుంగిపోవడం, అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురు కోత పెరగడం వంటివి విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి. తీరంలో కోతను నివారించే ప్రయత్నాలు చేపట్టాలని.. నిపుణుల సూచనలతో తీరాన్ని అభివృద్ధి చేసి విశాఖను సంరక్షించాలని అధికారులను విశాఖ వాసులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ఎలుగుబంటి కాదు.. మానుపిల్లిగూడెంకొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జడుమూరు వద్ద కాఫీతోటల్లో (Coffee Fields) గురువారం ఎలుగుబంటి (Bear) హల్చల్ చేసిందంటూ జరిగిన ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు. తోటల్లో కాఫీపండ్లను తింటున్నది ఎలుగుబంటి కాదని, అది అడవిలో సంచరించే మానుపిల్లి అని తెలిపారు. ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉన్నా.. ఇది సాధుజంతువని, మనుషులపై దాడిచేయదని పేర్కొన్నారు.చదవండి: నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ -
విశాఖపట్నం : పాలను సముద్రంలో వదిలి..గంగమ్మతల్లికి పూజాలు (ఫొటోలు)
-
చంద్రబాబు తీరు దుర్మార్గం.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్‌కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్‌ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
విశాఖ: ఆర్కే బీచ్‌లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్‌లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. వర్షాల నేపథ్యంలో రిటైనింగ్ వాల్‌పై ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.వివరాల ప్రకారం.. విశాఖలో భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అలాగే, ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్ సైతం దెబ్బతిన్నంది. గడిచిన పది రోజులుగా పెద్ద సాగర తీరం పెద్ద ఎత్తున కోతతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సాక్షి టీవీ హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. -
విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విశాఖపట్నంలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలోని పీఎం పాలెంలో గల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్‌బాబు తెలిపారు.ఇక ఈ వన్డే టోర్నీ గ్రూప్-డిలో భాగంగా డిసెంబరు 21 నుంచి జనవరి 5 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్- మిజోరం జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఇక 23న మిజోరం- ఉత్తర్‌ప్రదేశ్, 26న తమిళనాడు- ఉత్తర్‌ప్రదేశ్, 28న చండీగఢ్- విదర్భ, 31న తమిళనాడు- విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. అదే విధంగా.. జనవరి 3న చత్తీస్‌గఢ్- జమ్ము కశ్మీర్, 5న చండీగఢ్- జమ్ము కశ్మీర్ జట్లు తలపడతాయి.ఇక విజయ్ హజారే ట్రోఫీ కోసం వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇక టోర్నీకి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను జియో సినిమాతో పాటు.. ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్సైట్లలో వీక్షించవచ్చు. -
అల్పపీడనం ఎఫెక్ట్.. విశాఖ సంద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
భయపెడుతున్న విశాఖ సముద్రం
-
జాయ్ జెమీమా కేసు: ‘ హర్షకుమార్కు ఎందుకంత ఇంట్రెస్టో అర్థం కావడం లేదు’
విశాఖ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన జాయ్ జెమీమా హనీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి. ఈ మేరకు మంగళవారం హనీ ట్రాప్ కేసుకు సంబంధించి కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు సీపీ. ‘జాయ్ జెమీమా గ్యాంగ్ చాలామంది జీవితాలతో ఆడుకుంది. మోసాలతో పాటు హత్యాయత్నాలు కూడా చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ వేణురెడ్డి రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జాయ్ జెమీమా పెళ్లి జరిగినట్లు ఒప్పుకున్నారు. 10 మందిని జాయ్ జెమీమా మోసం చేసినట్లు గుర్తించాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం. ఈ కేసులో ఆయనకు ఎందకతం ఇంట్రెస్టో అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులతో సంబంధాలపై విచారణ చేస్తున్నాం. జాయ్ జెమీమాతో ఎంపీ హర్షకుమార్ కుమారుడు పరిచయాలపై విచారణ జరుగుతోంది.మాజీ ఎంపి హర్ష కుమార్ కుమారునికి జాయ్ జమీమాకు పరిచయాలు పై విచారణ జరుగుతోంది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ముఠాలో ప్రధాన నిందితులు జాయ్ జెమిమాతో పాటు వేణు రెడ్డి, కిషోర్‌లను అరెస్ట్ చేశాం. ఈ ముఠాకు సంబంధించిన మరో ముగ్గురిని గుర్తించాం త్వరలో అరెస్టు చేస్తాం’ అని సీపీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెళ్లైన వారే కిలాడీ లేడీ టార్గెట్..!విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
-
విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్ కానిస్టేబుల్ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు.సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు. -
విశాఖలో సందడి చేసిన సినీ నటి శ్రీలీల (ఫొటోలు)
-
విశాఖలో YSRCP కార్యాలయం ప్రారంభం
-
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన
-
ఓలా షోరూంకు తాళం వేసిన కస్టమర్.. ఏం జరిగిందంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఓలా కస్టమర్ ప్రస్టేషన్ పీక్కు చేరింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కి తాళం వేశాడు. బైక్‌లో పదేపదే సమస్యలు వచ్చినా సిబ్బంది స్పందించడం లేదని కస్టమర్ సీరియస్ అయ్యారు. నడిరోడ్డుపై తరచూ బైక్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ చేయకపోగా బెదిరిస్తున్నారంటూ కస్టమర్ ఆరోపించారు.కాగా, ఇటీవల కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ తన బైక్‌ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరో ప్రాంతంలో ఓలా బైక్‌కి చెప్పుల దండ వేసి ఊరేగించగా.. మరో ఘటనలో కస్టమర్.. స్కూటీని తగులబెట్టాడు. రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి షోరూం ముందే బైక్‌ను సుత్తితో పగలగొట్టాడు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
సాక్షి, విశాఖపట్నం: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట దాటేసిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం చంద్రబాబు పాతపాటే పాడారు. శుక్రవారం విశాఖలో ఆయన పర్యటించారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా స్టీల్‌ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నాం అంటూ మాట దాటేశారు. దీంతో స్టీల్‌ఫ్లాంట్‌పై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాత స్వరమే వినిపించడంతో ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఆరు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు.మరో వైపు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న నిరసనలను అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా.. ఉద్యమిస్తున్న కార్మికులపై ఉక్కుమోదం మోపుతోంది. ఇదీ చదవండి: దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి -
Vizag: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.35 వేలు ప్రాణం మీదికి తెచ్చింది. నిందితురాలు సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వద్ద అంగన్వాడీ టీచర్ మున్నిసా బేగం రూ.35 వేలు అప్పు తీసుకోగా.. డబ్బులు అడిగేందుకు సంగీత వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ సంగీత బెదిరింపులకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో పెట్రోల్ మీద పోసుకున్న అంగన్వాడీ టీచర్ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది.. దీంతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి అంటూ ప్రచారం జరగడంతో కలకలం రేగింది. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది.ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ! -
విశాఖలో దారుణం.. అంగన్వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం:గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం(డిసెంబర్3) తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకుంది.మృతులను పిల్లి దుర్గారావు,సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏం కష్టం వచ్చింది తల్లీ.. -
విశాఖ మెట్రో రైలు పనులకు ఆమోదం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రోరైల్ నిర్మాణం మొదటి దశ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. రూ.14,309 కోట్లతో 4 కారిడార్లలో 76.90 కి.మీ మేర రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.పీపీపీ విధానంలో చేపట్టే ఈ పనులకు ఆమోదం తెలుపుతూ సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులిచ్చారు. ఇందులో స్టీల్‌ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు 34.40 కి.మీ., గాజువాక నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.05 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర మూడు కారిడార్లలో పనులు చేపట్టనున్నారు. ఫేజ్–2 కింద కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కి.మీ పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టును కేంద్రం 40 శాతం, ప్రైవేటు డెవలపర్స్ 60 శాతం వాటా భరిస్తాయి. విజయవాడ లైట్ మెట్రో రైలు డీపీఆర్‌కు కూడా..విజయవాడ కేంద్రంగా అమరావతి, గన్నవరం తదితర ప్రాంతాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కూడా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఫేజ్–1లో 1ఏ, 1బీ కారిడార్ల కింద 38.30 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రూ.11,009 కోట్లతో నిర్మాణ పనులు, మరో రూ.1,152 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నారు. ఫేజ్–2లో 27.75 కి.మీ మేర నిర్మాణం చేపడతారు. కారిడార్ 1ఏ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, 1బీ కారిడార్ పనులు పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు, కారిడార్–3 పనులు పీఎన్బీఎస్ నుంచి అమరావతి (రిజర్వాయర్ స్టేషన్) వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
విశాఖలో దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
విశాఖజిల్లా జబ్బార్ తోటలో డయేరియా కలకలం
-
విశాఖలో డయేరియా కలకలం.. చిన్నారి మృతి!
సాక్షి, విశాఖ: విశాఖపట్నం ఏపీలో చాప కింద నీరులో డయేరియా విస్తరిస్తోంది. విశాఖలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డయేరియాతో 41 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, డయేరియా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఓ చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం చోటుచేసుకుంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిల్లో చేరారు. వాంతులు, వీరోచనాలతో బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మంచి నీటి కొళాయి వద్ద మురుగు నీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్టు స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ..‘డయేరియా ప్రబలిన ప్రాంతంలొ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. 41 మంది డయేరియా బారిన పడ్డారు. గీతిక అనే బాలిక డయేరియాతో చనిపోయిందని నిర్ధారించలేం.. వేరే కారణం ఏదైనా అవ్వచ్చు. ఏడుగురు డయేరియా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డయేరియా బాధితులకు డయాలసిస్ అవుతుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. -
కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇదే. ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వీటిని సమకూర్చుకుంది. -
హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారినే పనిలో పెట్టుకోవాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. లేబర్ గేటు వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు.. తమకు అనుకూలంగా వ్యవహారిస్తేనే పనులు సాగనిస్తామని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.పనులు బహిష్కరించాలని కార్మికులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల ఆరాచకాలతో హెచ్‌పీసీఎల్ యాజమాన్యం విసిగిపోతోంది. తెర వెనక ఉండి ఎమ్మెల్యే గణబాబు కథ నడిపిస్తున్నారు. -
బొర్రా గుహల్లో చిల్ అవుతున్న హీరోయిన్ లయ (ఫొటోలు)
-
ముంచుకొస్తున్న ‘ఫెంగల్’ తుఫాన్ ...సముద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్‌కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
PM Modi AP Tour: మోదీ విశాఖ టూర్ ..
-
చిన్నతరహా పరిశ్రమల్లో విశాఖ దూకుడు
సాక్షి, అమరావతి: కొత్త ఎంఎస్ఎంఈల ఏర్పాటులో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది (2023–24)లోనే రాష్ట్రంలో కొత్తగా 2,71,341 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.8,286.46 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సామాజిక ఆర్థిక సర్వే–2024 వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన యూనిట్ల ద్వారా 19,86,658 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 1.90 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య గడచిన ఐదేళ్ల కాలంలో వేగంగా విస్తరించడం ద్వారా 10 లక్షలు దాటింది. గడచిన ఏడాది కొత్త ఎంఎంస్ఎంఈల ఏర్పాటులో విశాఖ జిల్లా మంచి దూకుడు కనబర్చినట్టు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.648.40 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16,505 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.477.56 కోట్లతో గుంటూరు జిల్లా (16,085 యూనిట్లు), రూ.526.13 కోట్లతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (15,910 యూనిట్లు), రూ.491.88 కోట్లతో కృష్ణా (14,729 యూనిట్లు), రూ.313.84 కోట్లతో అనంతపురం (14,280 యూనిట్లు) జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,213 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఉపాధి కల్పనలో కర్నూలు ఫస్ట్ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 8.75 మందికి ఉపాధి కల్పించడం ద్వారా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో రూ.266.11 కోట్ల పెట్టుబడితో 12,256 యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 2,33,019 మందికి ఉపాధి లభించినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు జిల్లా 1,72,276 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 5.79 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 2023–24లో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి కేవలం 2.39 మందికి ఉపాధి లభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విలువ పరంగా చూస్తే రూ.648 కోట్ల ఎంఎస్ఎంఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గడచిన ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ 2023–27 ద్వారా ఎంఎంస్‌ఎంఈలను అంతర్జాతీయంగా ఎదిగే విధంగా అనేక ప్రోత్సహకాలు ఇవ్వడమే కాకుండా ఎంఎంస్ఎంఈ క్లస్టర్ పోగ్రాం, ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేవిధంగా ర్యాంప్ పథకం, టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు సర్వేలో ప్రముఖంగా పేర్కొన్నారు. -
ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ, రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. 29న సాయంత్రం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో తూర్పు నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్ వినాయక్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్రధాన వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు.టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ నిర్దేశించిన బహిరంగ సభ కార్యక్రమంలో 4.45 నుంచి 5.00 గంటల వరకు గవర్నర్, సీఎం, ఉప ముఖ్యమంత్రితో కలిసి పాల్గొని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌తో పాటు, రైల్వే లైన్లు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని ప్రధాని చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల అనంతరం సాయంత్రం 5.25 నుంచి 5.43 గంటల వరూ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అనంతరం.. సాయంత్రం 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. -
విశాఖలో హైటెన్షన్.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. ఆదివారం.. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిన్న(శనివారం) అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు.కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. -
29న విశాఖకు ప్రధాని మోదీ రాక
సాక్షి, విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 29న విశాఖ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏయూ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖ నుంచే వర్చువల్ విధానంలో అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సింహాద్రి ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టుకు, పాయకరావుపేటలో ఫార్మా ఎస్ఈజెడ్లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేస్తారు.ఈ నేపథ్యంలో ఏయూలో జరగాల్సిన బీఈ–బీటెక్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్ విశాఖలో సమీక్షించనున్నారు. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
-
విశాఖ సెంట్రల్ ఖైదీలకు గంజాయి సరఫరా
-
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం
-
విశాఖలో దారుణం.. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విశాఖలో దారుణం జరిగింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షితో విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసులో బాధితురాలికి నిందితులలో ఒకరికి రెండు నెలల నుంచి పరిచయం ఉందని.. విచారణ జరుగుతుందని తెలిపారు. -
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని: సింగర్ సునీత
సంగీత ప్రపంచంలో ఆమె స్వరం మధురం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికినా.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట.. ఆ మాటా ఓ అద్భుతం అనాల్సిందే. పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకుంది సునీత ఉపద్రష్ట. విశాఖకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతాన్ని ప్రేమించాలిసంగీతం అనేది భగవదత్తంగా రావాలి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. స్వరం మాత్రం జన్మతహా వస్తుంది. సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి. సంగీతాన్ని ప్రేమించాలి. నేటి తరం గాయకులకు ఇవే లక్షణాలు ఉండాలన్న నిబంధనలు లేవు. ఎవరు పాడినా తక్కువ సమయంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి.నేను అదృష్టవంతురాలినిచాలా కాలంగా పాటలు పాడటం వలన అనేక వైవిధ్యమైన పాటలు పాడే అవకాశం కలిగింది. అనేకమంది సంగీత దర్శకులు ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించారు. నా ముందుతరం వారు పాడిన కొన్ని పాటలు వింటుంటే కొన్ని సార్లు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇంతమంచి పాట నేను పాడలేకపోయాను అనే భావన కలిగింది.విశాఖలో బంధువులున్నారు మా అమ్మవాళ్లది విశాఖ. చిన్న తనం నుంచి అమ్మ ఈ నగరం గురించి చెబుతుంటే విశాఖపట్నం ఇలా ఉంటుందా అని ఊహించుకునే దాన్ని. అమ్మ చిన్నతనం ఇక్కడే సాగింది. అమ్మచెప్పినవి వింటూ ఊహల్లో పెరిగాను. ఆ విధంగా విశాఖ నగరంపై ప్రేమ పెరిగింది. నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది. కై లాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మా పెద్దమ్మ వాళ్లు విశాఖలో ఉండేవారు. ప్రకృతి అంతా ఇక్కడే ఉందని అని అనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు.పరిధి పెరిగిందినేడు సంగీత ప్రపంచం పరిధి విస్తరించింది, సినిమాల్లో పాత్ర, సంగీత దర్శకుడి ఆసక్తి, పరిస్థితులు ఆధారంగా పాటలు పెట్టడం జరుగుతోంది. సంగీతం నేర్చుకోవడం, గాయకులుగా స్థిరపడటంతో పాటు ఈ రంగంలో స్థానాన్ని నిలుపుకోవడం ఎంతో అవసరం.కాలంతో పాటు మార్పుల్లో భాగంగా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఆదరణ, ప్రాముఖ్యత పెరిగింది. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. సంగీత కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్యమాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం.ఇండిపెండెంట్ మ్యూజిక్కు ఆదరణనాకు కొండలు, సముద్రం అంటే ఎంతో ఇష్టం, నేనొక ప్రకృతి ప్రేమికురాలిని. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మధ్యలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడతాను. విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయి. -
జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచాక తొలిసారిగా జిల్లాలవారీ స్థూల ఉత్పత్తిని లెక్కించారు. ఈ క్రమంలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా వాటా 9.15 శాతం ఉండగా ఎన్టీఆర్ జిల్లా వాటా 5.65 శాతం, కృష్ణా జిల్లా వాటా 5.24 శాతం ఉంది. ఇక చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 1.16 శాతం వాటాతో నిలిచింది. పారిశ్రామిక, సేవా రంగాల్లోనూ విశాఖ టాప్..కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏలూరు జిల్లా 9.87 శాతం వాటాతో మొదటి ర్యాంకులో ఉండగా కృష్ణా జిల్లా 7.56 శాతంతో రెండో ర్యాంకులో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా 5.32 శాతం వాటాతో మూడో ర్యాంకు దక్కించుకుంది. పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం జిల్లా 18.82 శాతం వాటాతో మొదటి ర్యాంకులో నిలవగా తిరుపతి 7.78 శాతం వాటాతో రెండో ర్యాంకులో నిలిచింది.అనకాపల్లి 7.02 శాతం వాటాతో మూడో ర్యాంకులో ఉంది. అలాగే సేవా రంగంలోనూ విశాఖపట్నం జిల్లా సత్తా చాటింది. 10.22 శాతం వాటాతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఎన్టీఆర్ జిల్లా 9.45 శాతం వాటాతో రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా 6.57 శాతం వాటాతో మూడో ర్యాంకులో నిలిచాయి. -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
‘హామీలు నిలబెట్టుకోలేక.. అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్నాథ్ ఎండగట్టారు.పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు...సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
వారమైనా ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ?
సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల క్రితం సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వచ్చి రమణారెడ్డిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారని.. రోజుకోక పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదంటున్నారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్తూ.. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు డీలీట్ చేశారు.ఇంటికి వచ్చిన వెంటనే రమణారెడ్డి నుంచి మొబైల్‌ను పోలీసులు తీసేసుకున్నారు. బెయిల్ ఇస్తామంటూ ప్రకాశం జిల్లాలోని స్టేషన్లను పోలీసులు తిప్పుతున్నారు. మామ ఆచూకీ కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ రమణారెడ్డి అల్లుళ్లు తిరుగుతున్నారు. రమణారెడ్డి ఆచూకీ తెలియక తల్లి,భార్య, కుమార్తెలు తల్లడిల్లిపోతున్నారు. రమణారెడ్డి ఫోన్‌ను పోలీసులు తీసేసుకున్నా ఆయన ఫోన్ నుంచి ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఆయనకు కుమార్తె తెలిపింది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా, కూటమి సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటివరకు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పన్నింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (24 గంటల్లో) 29 కేసులు నమోదు చేయించారు. -
24 అడుగుల భారీ కళాకృతి
సాంస్కృతిక ఐక్యత, సమాజ స్ఫూర్తి కలిగేలా విశాఖపట్నంకు చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ 24 అడుగుల పొడవైన యాక్రిలిక్ కాన్వాస్ పెయింటింగ్ వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ కళాకృతి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని 10 జిల్లాల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఏకీకరణకు దృశ్యంగా నిలిచింది.స్థానిక వారసత్వానికి జీవంస్పష్టమైన రంగులు, క్లిష్టమైన వివరాలతో ఆయా రాష్ట్రాల్లోని కమ్యూనిటీల స్థానిక వారసత్వం, సంప్రదాయాల సారాంశానికి జీవం పోశాడు. కాన్వాస్లోని ప్రతి భాగం ఈ ప్రాంతాలలోని ప్రముఖ ప్రదేశాలు, గిరిజన నృత్యాలు, పండగలు, చేతి పనులు, మార్కెట్లతో పాటు ఈ ప్రాంతాలకు విలక్షణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాలను, వాటితో అనుసంధానంగా ఉండే వ్యక్తుల జీవితాలను కళ్లకు కడుతుంది. ఇవే కాదు గనులు, చిత్రకూట్ జలపాతాలు, కోలాబ్ డ్యామ్, విజయనగరం కోట వంటి మూడు రాష్ట్రాల్లోని 53 ప్రసిద్ధ ప్రదేశాలను చూపుతుంది.సామాజిక జీవనానికి అంకితం‘ఈ ఆర్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంప్రదాయాలు, వాణిజ్యం ఒకచోట చేర్చే విలువలను పంచుకునే కమ్యూనిటీల సామరస్యపూర్వక సహజీవనానికి ఈ కళాకృతి అంకితం. ఈ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నప్పటికీ, నేను నా పని ద్వారా వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని ఆశించాను‘ అని విజయ్ కుమార్ తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ భారీ కళాకృతిని ప్రదర్శించడానికి ఆ శాఖ చొరవ తీసుకోవడం, వారి ప్రాంగణంలో స్థానిక కళ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నానాన్ని అంతా అభినందిస్తున్నారు.(చదవండి: రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!) -
తలసరి ఆదాయంలో విశాఖ ‘వన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెంచిన తరువాత తొలిసారిగా 2022–23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉండగా, రెండులో కృష్ణా, మూడులో ఏలూరు జిల్లా ఉంది. 2021–22లో ఉమ్మడి జిల్లాల్లో తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో ఉండగా విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. -
ఆగని వేధింపులు.. ఇంటూరి రవికిరణ్‌పై మరో కేసు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. పోలీసులను వారిపైకి ఉసిగొలుపుతోంది. తప్పుడు కేసులు పెడుతూ.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌పై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ప్రస్తుతం.. మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఇంటూరిని రాజమండ్రి తరలించనున్నారు.విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు కొనసాగుతుండగా, ఈ రోజు కూడా ఇంటూరి రవికిరణ్‌ను ఉదయం 11 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు గంటలుగా స్టేట్మెంట్ పేరుతో కాలయాపన చేశారు. నిన్న(శనివారం) దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంటూరిపై దువ్వాడ, మహారాణిపేట పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, ఇంటూరిపై ప్రకాశం జిల్లాలోనూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఒక కేసుపై తీసుకెళ్లి రెండు,మూడు కేసులను పెడుతున్నారు.కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బహిరంగ సమావేశంలోనే వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసింది.ఇదీ చదవండి: అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్టప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీస్ అస్త్రాన్ని ప్రయోగించింది. 2019 నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ప్రశ్నించే గొంతులను ఖాకీల ద్వారా నొక్కించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. కక్ష సాధిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తూ.. సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన నలుగురు కార్యకర్తలకు చిత్ర హింసలకు గురిచేసి కటకటాల పాలు చేసింది. మరింత మందిని కూడా జైలు పాటు చేయడానికి కూటమి పార్టీల చోటా నేతల ద్వారా కేసులు పెట్టిస్తోంది. -
దువ్వాడ పీఎస్‌లో ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం!
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ఇవాళ దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని పీఎస్‌కు తరలించారు. స్టేట్మెంట్ రికార్డు పేరుతో ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.రవికిరణ్‌ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని ఆయన భార్య మీడియా ఎదుట వాపోయారు. ‘‘పదే పదే పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు’’ అని అన్నారామె.దువ్వాడ పోలీసులు రవికిరణ్, ఆయన భార్యతో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీలు చేయాలని చెబుతూ.. ఆమె కారు తాళాలు లాక్కున్నారు. తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఇద్దరినీ భోజనం కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. తన భర్తకు కనీసం మాత్రలు ఇవ్వాలని ఆమె కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇబ్బంది పెడతానంటూ సీఐ మల్లేశ్వరరావు బహిరంగంగానే ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేయించారు. అంతేకాదు.. విచారణ పేరుతో పిలిపించుకుని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.