vishnu priya
-
తిరుపతిలో బుల్లితెర జంట విష్ణుప్రియ- సిద్దార్థ్ (ఫోటోలు)
-
బాలీలో చిల్ అవుతున్న విష్ణుప్రియ నెట్టింట ఫోటోలు వైరల్
-
చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. బాలిలో విష్ణుప్రియ చిల్!
చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో చిల్ అవుతోన్న బిగ్‌బాస్ భామ విష్ణుప్రియ..పెళ్లి కూతురిలా ముస్తాబైన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్..మాల్దీవుస్లోనే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..బీచ్‌లో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి సురేఖవాణి..గ్రీన్ శారీలో ప్రియమణి పోజులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
తెలుగు బుల్లితెర నటి విష్ణు ప్రియ పెళ్లి రోజు (ఫోటోలు)
-
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్‌బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్‌లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్‌బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
చీరలో చూడముచ్చటగా సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫోటోలు)
-
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్‌పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్‌పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్‌పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్‌బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్‌మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ చరిత్రలో నిలిచిపోనున్న విష్ణుప్రియ
అవినాష్, రోహిణికి మంచి టాలెంట్ ఉంది.. నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు కూడా! కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు. అయినా నబీల్ సాధించిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో అవినాష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. తర్వాత గట్టిగా ఆడి టికెట్ టు ఫినాలే కొట్టాడు.టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్కానీ రోహిణికి అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎంత గట్టిగా ఆడినా తొలిసారి నామినేషన్స్‌లోకి రావడంతో ఆమెకు పెద్దగా ఓట్లు రాలేదు, ఫలితంగా ఎలిమినేట్ అయిపోయింది. నేడు మరో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతోంది. ఆమె ఎవరో కాదు విష్ణుప్రియ. ఈమెకు విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఉంది. తన నిజాయితీకి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. మోస్ట్ జెన్యున్ పర్సన్కానీ గెలవాలన్న కసి తనలో లేకపోవడం, పృథ్వీ మైకంలో మునగడంతో విన్నర్ అయ్యేంత దమ్మున్న ఈ లేడీ కంటెస్టెంట్ ఈ రోజు బిగ్‌బాస్ హౌస్‌ను వీడనుంది. చుట్టూ కెమెరాలున్నాయని ఆలోచించకుండా తన మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేది. హోస్ట్ నాగార్జునతో మోస్ట్ జెన్యున్ పర్సన్ అని కితాబు అందుకుంది. నిజమే.. బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత నిజాయితీగా, ఎలాంటి ముసుగు వేసుకోని కంటెస్టెంట్‌గా విష్ణు నిలిచిపోనుంది. వారమంతా ఎలా ఉన్నా వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే విష్ణు.. హౌస్‌లో చివరి ఫన్ టాస్క్‌నూ హుషారుగా పాల్గొంది. ఈమేరకు ప్రోమో రిలీజైంది. ఏదేమైనా ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్‌ను విష్ణు చేజేతులా పోగొట్టుకుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్‌గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్‌బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
గ్లామర్ డాల్‌లా విష్ణుప్రియ.. భలే క్యూట్ (ఫొటోలు)
-
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్‌ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.ఎలిమినేషన్నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.ప్రాంక్?ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమపై విష్ణుప్రియ క్లారిటీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి!
బిగ్‌బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్‌లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్‌బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్‌లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్‌ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!) -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!
బిగ్‌బాస్ 8వ సీజన్ 13వ వారంలోకి ప్రవేశించింది. యష్మి ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. ఎప్పటిలానే సోమవారం మళ్లీ నామినేషన్స్ రచ్చ మొదలైంది. ప్రస్తుతం హౌసులో తొమ్మిది మంది ఉండగా.. ఇద్దరిని తప్పితే మిగిలిన అందరూ నామినేట్ అయ్యారట. ఇప్పటికే షూట్ జరగ్గా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)ప్రోమో బట్టి చూస్తే నబీల్.. గౌతమ్-విష్ణుప్రియని, పృథ్వీ.. అవినాష్‌ని నామినేట్ చేసినట్లు చూపించారు. వీళ్లతో పాటు రోహిణి-విష్ణుప్రియ మధ్య కూడా గతవారం పోటీల్లో చేసుకున్న 'క్యారెక్టర్' గొడవ గురించి ఈసారి నామినేషన్లలో రచ్చ జరిగిందట.మెగా చీఫ్ అవడంతో రోహిణి, ఈమెతో పాటు నబీల్.. ఈ వారం నామినేషన్లలో లేరట. మిగిలిన పృథ్వీ, నిఖిల్, అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ, తేజ, గౌతమ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 13వ వారం కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వీక్ అంతా ఏమేం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
Bigg Boss 8: బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ... 'బోల్డ్ వీక్'
తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్‌బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్‌తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్‌తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్‌గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.విష్ణు ఓపెన్‌గా రోహిణి క్యారెక్టర్‌పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు. ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్‌కు తెలిసినా తెలియకపోయినా బిగ్‌బాస్‌కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్‌బాస్‌కు లాభదాయకం కాబట్టి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్‌ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌బాస్‌పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్‌బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!-ఇంటూరు హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.నీ క్యారెక్టర్ కనిపిస్తోందిదీంతో నాగ్.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్‌కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.తప్పు ఒప్పుకోని విష్ణుప్లాన్ అనడం రోహిణిదే తప్పని అవినాష్ అనగా.. ప్లాన్ కంటే క్యారెక్టర్ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్ తనను సైలెంట్ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది. -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్‌బాస్ పలుమార్లు కిచెన్‌లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్‌నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్‌ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్‌లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్‌కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీని ఓడించిన రోహిణి.. దెబ్బ అదుర్స్ కదూ!
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి. మొదట అందరూ ఎవరి ఆటపై వారు దృష్టి సారించారు. అయితే విష్ణుప్రియ.. అవతలివారు ఆటలో ముందుకు పోకుండా తన తెడ్డుతో ఆ గ్లాసుల్ని పడగొట్టింది. గలీజ్ గేమ్దీంతో యష్మి.. ఇలా గలీజ్ ఆట ఆడాలంటే మొదటి నుంచే ఆడొచ్చు అని అసహనానికి లోనైంది. ఇక ఇప్పటివరకు పెట్టిన గేమ్స్‌లో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న ముగ్గురికీ చివరి టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ టాస్క్‌లో తేజ, పృథ్వీ, రోహిణి పాల్గొన్నారు. ఇసుక కూజాల్ని కింద పడకుండా హోల్డ్ చేయాలి. ఈ గేమ్‌లో తేజ ఓడిపోగా చివర్లో పృథ్వీ, రోహిణి మిగిలారు.పృథ్వీని ఓడించిన రోహిణినువ్వు పరిగెత్తగలవా? అంటూ హేళన చేసిన పృథ్వీపై రోహిణి విజయం సాధించి మెగా చీఫ్ అయినట్లు సమాచారం. ఇది తెలిసిన అభిమానులు దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పరాభవాన్ని పృథ్వీ తట్టుకుంటాడా? తన ఇగో హర్ట్ అయిందా? అనేది ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్‌లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్‌బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్‌బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్‌లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్‌బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్‌లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్‌బాస్ తాజాగా హౌస్‌లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్‌గా రోహిణి!బిగ్‌బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్‌ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్‌లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్‌లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న సీరియల్ బ్యూటీ.. ఎంత క్యూట్‌గా ఉన్నారో?
-
నా కూతురికి అన్యాయం చేశా.. క్షమించమన్న విష్ణు తండ్రి
ఫ్యామిలీ వీక్ అంటే చాలు హౌస్మేట్స్ ముఖం కళకళలాడుతుంది. ఇప్పటికే హౌస్‌లోకి నబీల్, యష్మి, నిఖిల్, అవినాష్, రోహిణి కుటుంబసభ్యులు అడుగుపెట్టారు. తాజాగా విష్ణుప్రియ తండ్రి ఇంట్లోకి వచ్చాడు. అతడిని చూడగానే విష్ణు సంతోషంతో ఎగిరిగంతేసింది.అందరిముందు చెప్పొద్దు నాన్ననువ్వు ఇంకా బాగా ఆడాలిరా అని పెద్దాయన చెప్పడంతో విష్ణు.. ఇవన్నీ అందరిముందు చెప్పొద్దు నాన్న, మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం అంది. అలా వీరిద్దరూ ఒంటరిగా కూర్చుని మాట్లాడుకున్నారు. పృథ్వీని పట్టుకుని వేలాడటం వల్ల కూడా బ్యాడ్ అవుతున్నావని చెప్పాడు. నువ్వు కొద్దిగా అటు వైపు ఎక్కువగా ఉండటం వల్ల నీ అభిమానులే నిన్ను విమర్శిస్తున్నారన్నాడు. ఆ ఫీలింగ్ ఎందుకు దాచేయాలి?అందుకు విష్ణు.. నాకు అలాంటి భావన వచ్చినప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలని నిష్కల్మషంగా అడిగింది. అందుకాయన జనాలకు మనం నచ్చాలని సర్దిచెప్పాడు. ఇక చిన్నప్పటినుంచి కూతురికి దూరంగా ఉన్న సంగతులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కొన్ని సమస్యల వల్ల చాలారోజులు విష్ణు దగ్గరకు వెళ్లలేకపోయాను. అన్యాయం చేశా..తనకు దూరంగా ఉంటున్నానని చాలా బాధపడ్డాను. నేను వాళ్లకు అన్యాయం చేశాను.. అందుకు ఇక్కడ కూడా సారీ చెప్తున్నాను అన్నాడు. ఇంతలో తేజ పెళ్లి ప్రస్తావన తేగా.. తప్పకుండా దగ్గరుండి వివాహం జరిపిస్తానన్నాడు. తనకు నచ్చినవాళ్లు దొరకాలిగా అన్నాడు. దీంతో రోహిణి.. అబ్బాయిని కూడా మీ అమ్మాయే చూసుకుంటుందిలెండి అనేసింది. అందుకాయన.. హౌస్‌లో జరిగేవన్నీ సరదా కోసం మాత్రమే! అని తెలిపాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?
డంబ్.. ఈ ఒక్కమాటతో విష్ణుప్రియ పృథ్వీపై కోపం పెంచుకుంది. లాగి పెట్టి కొట్టాలన్నంత కోపమొచ్చింది. అతడికి ఆ మాట అన్నాడని కూడా గుర్తు లేదట.. అయినా సారీ చెప్పడంతో విష్ణు ఇట్టే కరిగిపోయింది. తాను కూడా ఏమైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ మళ్లీ అతడి మాయలోనే పడింది. మరి హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తప్పులో కాలేసిన యష్మిబిగ్బాస్ చిట్టచివరగా స్క్రూను తిప్పు-కంటెండర్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియను ఓడించి యష్మి విజేతగా నిలిచి కంటెండర్ బ్యాడ్జ్ ధరించింది. అయితే పొరపాటున యష్మి.. తన సూట్‌కేస్‌కు బదులు విష్ణు సూట్‌కేస్ తెచ్చి ఓపెన్ చేసింది. అందులో ఉన్న రూ.75 వేలున్నాయి. అంతలోనే తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న యష్మి.. తప్పయిపోయింది బిగ్‌బాస్ అంటూ తన ఒరిజినల్ సూట్‌కేస్ ఓపెన్ చేసింది. అందులో రూ.1,84,000 ఉన్నాయి. కానీ బిగ్‌బాస్ దానికి ఒప్పుకోకుండా ముందుదాని ప్రకారం రూ.75 వేలను ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు.పృథ్వీ, విష్ణు మధ్య దూరంమరోవైపు పృథ్వీ ప్రవర్తనకు విష్ణుకు చిర్రెత్తిపోయింది. నన్ను డంబ్ అన్నాడు. నన్ను హర్ట్ చేసి తను మాత్రం సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకొద్దు. ఫస్ట్ టైమ్ అతడికి పంచ్ ఇవ్వాలనిపించింది అని తన కోపాన్ని, బాధనంతా యష్మి ముందు కక్కేసింది. ఇంతలో పృథ్వీ అటుగా రావడంతో యష్మి.. వీరిద్దరికీ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించింది. ఆమెకు సారీ చెప్పమని అడిగింది. మనసులో స్థానం కోల్పోయాడంటూ భారీ డైలాగ్స్అతడు నో అనేసరికి నేనేమీ సారీ అడగలేదని విష్ణు అంది. అది విన్న పృథ్వీ.. నేను నీతో మాట్లాడట్లేదు అని సీరియస్‌గా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపం వల్లే అతడు తన మనసులో స్థానం కోల్పోయాడని విష్ణు నిఖిల్‌తో చెప్పింది. చివరకు పృథ్వీ సారీ చెప్పడంతో విష్ణు ఆవేశమంతా చప్పున చల్లారింది. బిగ్‌బాస్ ఓ ఫన్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అవినాష్ ఫేమస్ డైరెక్టర్, రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.ఏబీసీ.. సినిమావీరిద్దరూ ఆడిషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారు. ఇంకేముంది.. హౌస్మేట్స్ తమ కళలు చూపిస్తూ ఛాన్స్ పొందాలని ప్రయత్నించారు. ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా.. అక్కా బావ ఎక్కడ? అనేది క్యాప్షన్ అన్నాడు అవినాష్. సినిమా పేరుకు తగ్గట్లే ఓ రియల్ సీన్ చేసి చూపించారు నిఖిల్, యష్మి, గౌతమ్. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అని పిలిస్తే నిఖిల్ వద్దని వారించాడు. యష్మిని అక్కా అని పిలుస్తావా?దీంతో గౌతమ్.. సరే నేను పిలవను, మరి నువ్వు యష్మిని అక్కా అని పిలుస్తావా? అని ప్రశ్నించాడు. ఈ మాటతో అక్కడున్న అందరూ పడీపడీ నవ్వారు. ఇలా ఫన్ టాస్క్ ద్వారా కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటలు జమైంది. పృథ్వీ తనకు అక్కర్లేదన్న విష్ణుప్రియ చివరకు అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి మళ్లీ అతడి మైకంలోనే పడిపోయింది.మూట ముఖ్యం బిగిలు మెగా చీఫ్ కంటెండర్లు రోహిణి, ప్రేరణ, నబీల్, పృథ్వీ, యష్మిలకు మూట ముఖ్యం బిగిలు అన్న గేమ్ ఇచ్చాడు. ఎవరు చీఫ్ కాకూడదని కోరుకుంటున్నారో వారి డబ్బాలో హౌస్మేట్స్ మూటలు వేయాలన్నాడు. అలా మొదటి రౌండ్లో యష్మి, రెండో రౌండ్లో నబీల్ ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ప్రేరణ మెగా చీఫ్ అయినట్లు సమాచారం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాపై ఎవరూ ఇంత సీరియస్ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్‌లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.సారీ చెప్పువేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.ఇకపై పృథ్వీకి దూరంగా?ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.అక్కా అని పిలవకుఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్‌లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్‌లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్‌తో అందరూ నవ్వేశారు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్‌షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్బాస్ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్‌మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్‌బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ చేతిలో విష్ణు ఓటమి.. అయినా మేలే జరిగిందిలే!
మెగా చీఫ్ పోస్ట్ కోసం పోటీపడాలంటే ముందు కంటెండర్లు కావాలి. కంటెండర్లు కావాలన్నా, ఆల్రెడీ కంటెండర్లుగా ఉన్నవారు మరో అడుగు ముందుకు వేయాలన్నా గేమ్ ఆడి గెలవాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో పలు టాస్కులు జరుగుతున్నాయి. నేటి ప్రోమోలో కీని పట్టు కంటెండర్‌షిప్ గెలిచేట్టు అనే గేమ్ ఇచ్చాడు.ప్లాన్ చేసి మరీ..ఇందులో మొదట విష్ణుప్రియ చురుకుగా ఆడింది. కానీ చివర్లో పృథ్వీ సరైన కీ వెతికి పట్టుకోవడంతో ఆమె కన్నా ముందుగా బాక్సులు తెరిచి విజయం సాధించాడు. ఇంతలో తేజ.. వాంటెడ్‌గా ప్లాన్ చేసి మరీ నిన్ను ఓడించారంటూ విష్ణుకు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అయితే ఓడిపోయినా విష్ణుకు మేలే జరిగింది.విష్ణుకు ఛాన్స్ ఇచ్చిన పృథ్వీఒకర్ని కంటెండర్ చేసే ఛాన్స్ పృథ్వీకి రాగా అతడు ఆ అవకాశాన్ని విష్ణుప్రియకే ఇవ్వడం విశేషం. ఆ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవాలంటే మరో ఆట ఆడి గెలవాల్సి ఉంటుంది. మరి ఎవరెవరు చీఫ్ కంటెండర్లయ్యారు? ఫైనల్‌గా చీఫ్ పోస్టును ఎవరు అధిరోహించారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
నాకు నాకంటే కూడా నువ్వే ఎక్కువ.. సిగ్గు విడిచి చెప్పిన విష్ణు
బీబీ ఇంటికి దారేది టాస్కులో కొట్లాటలు పుష్కలంగా ఉన్నాయి. అన్నింటికీ మించి కన్నడ టీమ్ మధ్యలోనే ఎక్కువ పోట్లాటలు జరుగుతూ ఉండటం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పానీపట్టు యుద్ధం గెలిచిందెవరంటే?బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో భాగంగా ఇచ్చిన పానీపట్టు యుద్ధం టాస్క్ కొనసాంగిపుతో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సైడ్ అవగా తర్వాత రెడ్ టీమ్ ఓడిపోయింది. చివరి రౌండ్లో ఎల్లో టీమ్‌పై గ్రీన్ టీమ్ విజయం సాధించింది. వీరు బ్లూ టీమ్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ టీమ్ లీడర్ నబీల్ రెండుసార్లు డైస్ వేసి ఒక పాయింట్‌ను తేజకు, మూడు పాయింట్లను తనకు ఇచ్చుకున్నాడు.నిఖిల్‌తో యష్మి వాదనపానీపట్టు యుద్ధం గేమ్‌లో తనను విసిరేయడాన్ని గుర్తు చేస్తూ నిఖిల్‌తో గొడవకు దిగింది యష్మి. సంచాలకుడు ఆపేయమని చెప్తున్నా నువ్వు నన్ను వదిలేయలేదు.. అక్కడ నీ శక్తి వాడాల్సిన అవసరం లేదు అని గద్దించి చెప్పింది. దీంతో చిరాకు పడ్డ నిఖిల్.. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. కానీ ఆ కోపం కాసేపటికే బాధగా కరిగిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండుయష్మి హగ్ చేసుకోవడానికి వస్తే కూడా నిరాకరించాడు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఉన్నన్ని రోజులు నేను సోలోగానే ఆడతా.. త్వరగా వెళ్లిపోతే బాగుండనిపిస్తోంది. రిలేషన్షిప్ ఏదైనా ఉంటే బయటకు వెళ్లాక చూసుకుందాం అని కఠినంగా చెప్తూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి మాటలకు బాధపడ్డ యష్మి సారీ చెప్పి ఒక్కసారిగా ఏడ్చేసింది.నా కన్నా నువ్వే ముఖ్యంమరోవైపు అన్నీ తెలిసిన పృథ్వీ.. నన్నెందుకు నామినేట్ చేయవు అని విష్ణును అడిగాడు. అందుకామె.. నా దృష్టిలో నాకన్నా నువ్వే ఎక్కువ అని బదులిచ్చింది. మరి నేనెందుకు నిన్ను నామినేట్ చేయను? అని అడిగాడు. నువ్వు చేయగలవు, ఎందుకంటే నీకు నువ్వే ముఖ్యం, నేను కాదు.. అని విష్ణు తెలిపింది. అందుకతడు అవునని తలాడిస్తూనే అయినా నేను ఇప్పటికీ నిన్ను నామినేట్ చేయలేదని నవ్వాడు. అందుకు విష్ణు.. అది నీ గ్రేట్ పర్సనాలిటీ అని పొగడ్తలతో ముంచెత్తింది.మళ్లీ ఏడ్చేసిన నయనితర్వాత బిగ్‌బాస్ స్లీపింగ్ రేస్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గెలిచిన బ్లూ టీమ్ గ్రీన్ టీమ్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చింది. హరితేజ డైస్ వేయగా వచ్చిన ఐదు పాయింట్లను నిఖిల్‌కు, మూడు పాయింట్లను అవినాష్‌కు ఇచ్చాడు. ఇకపోతే స్లీపింగ్ రేస్‌లో ఫౌల్ గేమ్ ఆడావంటూ నయనిని పక్కకు తీసుకెళ్లి చెప్పింది రోహిణి. మన టీమ్వాళ్లే ఇలా మాట్లాడితే బాధగా ఉంటుందంటూ వెంటనే కన్నీళ్ల ట్యాప్ ఓపెన్ చేసింది.తేజపై విష్ణు చిరాకుఆమె రియాక్షన్ చూశాక రోహిణి.. ఇదంతా కావాలని చేస్తున్నట్లుందని అభిప్రాయపడగా.. ఏదో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తోందని ప్రేరణ కూడబలికింది. ఇక అవినాష్, తేజ సరదాగా పొట్టతో గేమ్ ఆడుతుంటే అందుకు విష్ణు ఒప్పుకోలేదు. ఇలాంటి గేమ్స్ వల్ల తేజ ఎనర్జీ పోతుందని, అయినా వినకుండా ఆడతానంటే నెక్స్ట్ గేమ్‌లో తేజను పంపించనని చెప్పింది. సరదాగా ఆడుకుంటే అందులో తప్పేముంది? అంత పెద్ద మాటలనాల్సిన అవసరమేంటని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు.గంగవ్వ అవుట్బిగ్బాస్ పాయిజన్ యాపిల్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలుపొందింది. వీరికి బిగ్‌బాస్ రెండు ఎల్లో కార్డ్స్ ఇవ్వగా ఆ రెండింటినీ బ్లూ టీమ్‌కు ఇచ్చారు. దీంతో వాళ్లు తమ టీమ్‌లోని గంగవ్వను రేసులో నుంచి తీసేశారు. ఇక యష్మి డైస్ వేయగా వచ్చిన ఒక పాయింట్‌ను గౌతమ్‌కు, రెండు పాయింట్లను ప్రేరణకు ఇచ్చింది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్‌గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్‌ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్‌గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్‌బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్‌పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్‌ను చేయడంతో పాటు విలన్‌ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్‌లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్‌కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్‌లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్‌ను పంపించాడు. తర్వాత బజర్‌కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్‌ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్‌గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్ప్రైజ్
గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్ అది కేవలం ప్రాంక్ అని బయటపెట్టాడు. ప్రైజ్‌మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్‌పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్ 26) ఎపిసోడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..ఇవే తగ్గించుకుంటే మంచిదిఘోస్ట్ ప్రాంక్‌లో గంగవ్వ యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన నాగ్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ సీక్రెట్‌గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్‌లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్.. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్ కొట్టాడు. నీ వల్ల అరలక్ష గోవిందా..ప్రైజ్‌మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్‌మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్‌కు నొక్కి చెప్పాడు. గౌతమ్ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్? నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతర్వాత నిఖిల్- యష్మి - గౌతమ్‌ల ట్రయాంగిల్ లవ్‌స్టోరీని నాగ్ బయటపెట్టాడు. హౌస్‌లో జరిగిన టీ షర్ట్ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తానని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్ టీషర్ట్ కావాలని యష్మి అడిగింది. నిఖిల్ టీషర్ట్ లేదు కాబట్టి గౌతమ్‌ది వేసుకుంది. అప్పుడు నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.యష్మికి గడ్డి పెట్టిన నాగ్రాయల్ టీమ్‌లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్‌లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్, మళ్లీ గేమ్‌కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు కెమెరామన్, ఇప్పుడు డైరెక్టర్ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్ అని.. ఈ ఐడియా అవినాష్, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్. తర్వాత కంగువా ప్రమోషన్స్ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్‌గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.సూర్య కోసం వచ్చేందుకు రెడీసూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్మేట్స్ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్ వేసి అతడిని సర్ప్రైజ్ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్ అడగ్గా తప్పకుండా వస్తాను సర్ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్ డైలాగ్ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.డ్యాన్స్ రిహార్సల్స్‌లో గొడవఅయితే డ్యాన్స్ రిహార్సల్స్‌లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్ పార్ట్నర్ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్‌గా లేము బిగ్‌బాస్. పార్ట్నర్స్ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్‌బాస్ నిఖిల్ -యష్మిని విడదీశాడు. నిఖిల్‌తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్ చేయాలన్నాడు.బిత్తరపోయిన విష్ణుఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్‌గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్‌ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా విష్ణుప్రియ.. ఆమె కూడా ఊహించి ఉండదు!
విష్ణుప్రియ.. ఒక్కోసారి ఏది పడితే అది మాట్లాడుతుంది. కారణం.. తన బుర్రకు నత్తి అని చెప్తుంది. టాస్కులు ఎందుకు ఆడవంటే.. ఆడాలనిపించినప్పుడే ఆడతానంటుంది. తనవల్ల కాదనుకుంటే ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కేవలం పృథ్వీ వెనక పడటం తప్ప నీ ఆట ఏముంది? అని వైల్డ్‌కార్డులు ముఖం పట్టుకుని నిలదీసినా తనలో రవ్వంత మార్పు రాలేదు.ప్రేమ మైకంలో విష్ణునేను నాలాగే ఉంటాను.. ఎవరికోసమూ నా స్వభావాన్ని, పద్ధతిని మార్చుకోనని చేతల్లో నిరూపించింది. పృథ్వీ బాహుబలిలా టాస్కులు ఆడుతుంటే ఈమె చీర్గర్ల్లా కమాన్ పృథ్వీ అంటూ ఎంకరేజ్ చేస్తుంది. అతడు గెలిస్తే ఉప్పొంగిపోతుంది. నామినేషన్స్‌లో ఉంటే సేవ్ అవ్వాలని దేవుళ్లకు మొక్కుతుంది. అతడు తాగిన టీ కప్పులు కడగటం దగ్గరి నుంచి కాలికి మసాజ్ చేయడం వరకు అన్నీ చేస్తుంది.మెగా చీఫ్బిగ్బాస్ గేమ్ కంటే కూడా పృథ్వీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈమె ఈ వారం మెగా చీఫ్ అయిపోయింది. నిజానికి ఇది విష్ణు కూడా ఊహించి ఉండకపోవచ్చు. చీఫ్ కంటెండర్లు కావడానికి భీకరమైన ఫిజికల్ టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. అలా పృథ్వీ, నిఖిల్, రోహిణి, ప్రేరణ కంటెండర్లు అయ్యారు. ఈ నలుగురికీ ఏదైనా టఫ్ టాస్క్ ఇస్తాడనుకుంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియకు పట్టంవీళ్లలో మెగా చీఫ్ అయ్యేందుకు అనర్హులని భావించిన వారి మెడలో దండ వేసి రేసు నుంచి తీసేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్మేట్స్ నచ్చనివారిని తీసుకుంటూ పోయారు. అలా పృథ్వీ, ప్రేరణ బలైపోయారు. ఆశ్చర్యంగా చివర్లో నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. ఇంతవరకు చీఫ్ అవలేదని విష్ణుప్రియకు పట్టం కట్టారు! దీంతో విష్ణు వచ్చేవారం నామినేషన్ నుంచి తప్పించుకుది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ.. ఎంత పనిచేశావ్ యష్మి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నామినేషన్స్ రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ వారం కూడా వాడీవేడిగా సాగింది. నబీల్ వంతు పూర్తవడంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ ఆగింది. ఇన్నాళ్లు విష్ణుప్రియ-పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ ఏదో అలా కనిపించింది. మంగళవారం ఎపిసోడ్‌తో అది కాస్త బ్రేకప్ అయింది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? విష్ణు బ్రేకప్ సంగతేంటి? అనేది మంగళవారం ఎపిసోడ్ (51వ రోజు) హైలైట్స్‌లో చూద్దాం.ముందుగా తేజ మొదలుపెట్టాడు. నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తోందని గంగవ్వని అని విష్ణుప్రియ అనడం నచ్చలేదని చెప్పి ఆమెని నామినేట్ చేశాడు. ప్రతిసారి రివేంజ్ అనడం అస్సలు నచ్చలేదని చెప్పి పృథ్వీ పేరు చెప్పాడు. దీంతో పృథ్వీ-రోహిణి మరోసారి గొడవపడ్డారు. తర్వాత వచ్చిన మెహబూబ్.. హరితేజ సరిగా ఆడట్లేదని, ఫైర్ కాస్త ఫ్లవర్ అయిందని అన్నాడు. బ్యాటరీ టాస్క్‌లో నయని సరిగా ఆడలేదని నామినేట్ చేశాడు.తర్వాత వచ్చిన ప్రేరణ.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని కారణం చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం నడించింది. విష్ణుప్రియ ఓ ఫేక్ ఫ్రెండ్ అని ముద్ర వేసేసింది. పృథ్వీని నేను నామినేట్ చేయడం నీకు నచ్చలేదు అంతే కదా అని ప్రేరణ అనేసరికి... అవును, ఆ నిర్ణయం నాకు నచ్చలేదు అని విష్ణు వాదించింది. మధ్యలో నబీల్ టాపిక్ వచ్చింది. ఓసారి నబీల్ చెంప పగలగొడతా అన్నావ్ కదా ప్రేరణ అని విష్ణుప్రియ అనేసరికి.. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అని ప్రేరణ వాదించింది.(ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్ ఎంతంటే?)నీ గేమ్ మొత్తం పృథ్వీ వైపే ఉంది, అతడే నీ గేమ్ అని ప్రేరణ వాదించేసరికి.. అవును అయితే ఏంటి, నువ్వు పెడిక్యూర్, మేనిక్యూర్, హెయిర్ స్టైల్ తప్ప హౌస్‌లో ఏం చేస్తున్నావ్ అని ప్రేరణ గురించి విష్ణు కామెంట్ చేసింది. తర్వాత ప్రేరణ.. పృథ్వీ పేరు చెప్పింది. నువ్వు రివేంజ్ నామినేషన్ వేస్తావ్, బయటికెళ్లడానికి చాలా అర్హత ఉంది నీకు అని కుండ బద్దలు కొట్టేసింది. రెండు వారాల ఇమ్యూనిటీ ఇస్తానన్నా సరే గడ్డం తీయలేదు. మరెవరైనా అయితే చేసేవాళ్లు అని కారణాలు చెప్పింది. దీంతో రెచ్చిపోయిన పృథ్వీ.. ఓటింగ్ ప్రకారం ఉంటా, గేమ్‌పై నమ్మకముంది. నువ్వు టాస్క్ ఇవ్వండి అని అడుక్కుంటూ కూర్చో అని పృథ్వీ అన్నాడు.తర్వాత వచ్చిన గంగవ్వ.. నిఖిల్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అనంతరం నిఖిల్ వచ్చి.. మెహబూబ్, నయనిని నామినేట్ చేశాడు. యష్మి వంతు వచ్చేసరికి.. విష్ణుప్రియ, మెహబూబ్‌ని నామినేట్ చేసింది. అవినాష్.. గతవారం గొడవని బయటకు తీసి పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత నిఖిల్‌ని కూడా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి.నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. షీల్డ్ ఉన్నప్పటికీ హరితేజని ఇద్దరు సభ్యులు నామినేట్ చేసిన కారణంగా ప్రైజ్‌మనీ నుంచి లక్ష రూపాయలు తగ్గిపోయాయి. ఇక వీళ్లలో ఒకరిని కాపాడొచ్చు అని బిగ్‌బాస్ చెప్పేసరికి మెగా చీఫ్ గౌతమ్.. హరితేజని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, నయని నామినేషన్స్‌లో నిలిచారు.ఇదంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి పృథ్వీ-యష్మీృ-ప్రేరణ చాలాసేపు డిస్కషన్ పెట్టారు. విష్ణుప్రియతో రిలేషన్ ఉందా? లేదా అనే టాపిక్‌పై చాలాసేపు మాట్లాడుకున్నారు. విష్ణుప్రియపై ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని యష్మి అడిగేసరికి లేదు జస్ట్ ఫ్రెండ్ అని పృథ్వీ చెప్పాడు. దీని తర్వాత విష్ణు-పృథ్వీ కూడా కాసేపు మాట్లాడుకుని తమ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదన్నట్లుగా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’) -
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్‌హాట్‌గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్‌ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్‌బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్‌ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో మరెంత హాట్‌హాట్‌గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాన్నతో నేను మాట్లాడలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ
బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు రచ్చ రచ్చగా సాగింది. మొత్తం తొమ్మిది మంది లిస్టులో ఉన్నారు. అసలు ఘట్టం అయిపోయింది కాబట్టి కాస్త ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ బయటపడ్డాయి. విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి చెప్పగా.. గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నామినేషన్లో జరిగిన సీరియస్ విషయాన్ని రోహిణి-తేజ-అవినాష్ కలిసి ఫుల్ కామెడీ చేసేశారు.ఉదయం లేచిన తర్వాత ముచ్చట్లు పెట్టిన టైంలో విష్ణుప్రియ తన కుటుంబంలో గొడవ గురించి బయటపెట్టింది. 'నాన్న ఊరిలో ఉంటారు. ఆయనతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా నాన్నతో నేను మాట్లాడలేదు' అని చెప్పింది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు రావడంతో విష్ణుప్రియ ఓదార్చింది. ఇకపోతే కొన్నేళ్ల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయింది.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)మరోవైపు మనిద్దరం డీలింగ్ చేసుకుందామని గంగవ్వతో మణికంఠ మాట్లాడాడు. ఈ వారం గనక తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని గంగవ్వతో అన్నాడు. దీంతో పక్కనే ఉన్న హరితేజ.. నాకు బంగారు వడ్డనం ఇస్తావా చెప్పు అని జోక్ చేసింది. నాకు ఏమిస్తావ్ అని రోహిణి అడగ్గా.. ముద్దు ఇస్తానని చెప్పాడు. ఎనిమిదో వారం సేవ్ అయితే నాకు తులం బంగారం పెట్టు అని గంగవ్వ మణితో చెప్పింది.ఏడో వారం సేవ్ కావాలి, తొమ్మిదో వారం సేవ్ కావాలి అనే మణికంఠ చెప్పేసరికి.. నువ్వు అప్పటివరకు ఉండవ్, ఎనిమిదో వారమే ఎలిమినేట్ అయిపోతావ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో గొడవ గొడవ చేసిన గౌతమ్, పృథ్వీలని ఇమిటేట్ చేస్తూ అవినాష్-తేజ-రోహిణి ఫుల్ కామెడీ చేశారు. అలా ప్రోమో కాస్త ఎమోషనల్, కాస్త ఎంటర్టైనింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత) -
సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది'
దసరా సందర్భంగా బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్, గెస్టుల రాక, టీమ్స్ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్మేట్స్ కూడా అంతే కలర్ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్ ఎలా సాగిందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి!నాగార్జున మొదటగా యష్మిని సేవ్ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్ ఉంటుందన్నాడు. ఈ బంపర్ ఆఫర్ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారుఫస్ట్ టాస్క్‌లో ఓజీ టీమ్ గెలుపుతర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది. ఇక నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్ టీమ గెలుపొందింది. బతుకమ్మసింగర్ మంగ్లీ మాస్, లవ్, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్ టీమ్ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్ కూడా ప్లే చేశారు.ఫరియా డ్యాన్స్దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ గెలిచింది. తర్వాత డింపుల్ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్ ఆడించారు. ఇందులోనూ రాయల్ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.రాయల్ టీమ్‌కు బంపర్ ఆఫర్నాగ్ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్ రెజ్లింగ్ అని ఆరో గేమ్ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్.. నిఖిల్‌ను, గౌతమ్.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్ అయ్యేందుకు రాయల్ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్ టీమ్‌లోని వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాగ్ తెలిపాడు.ముగ్గురికీ హార్ట్ ఇచ్చిన సీతచివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్ చేసి సీతను ఎలిమినేట్ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్నర్ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్ గెలవాలంది. అవినాష్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్ హార్ట్ ఇచ్చింది.సీత కోసం మాటిచ్చిన మెహబూబ్తర్వాత నిఖిల్, గౌతమ్, నయనికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్.. హజ్బెండ్ మెటీరియల్ అని చెప్పింది. గౌతమ్.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. మరిన్ని బిగ్‌బాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడో, ఎవరో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.రైజింగ్ స్టార్స్ ఎవరంటే?అలాగే రాయల్ టీమ్‌లో కూడా హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్.. రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్, గంగవ్వను రైజింగ్ స్టార్లుగా పేర్కొంటూ నబీల్, తేజ, విష్ణుప్రియ, గౌతమ్‌ను ఫాలింగ్ స్టార్స్‌గా అభివర్ణించాడు. ఇప్పుడెందుకు?ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్‌ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్‌గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించాడు. అమాయకంగా ఫేస్ పెట్టిన మణిరోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్‌గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్ అని అమాయకంగా అన్నాడు.నాతో గేమ్స్ వద్దుదీంతో నాగ్.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్ వద్దు, నాతో గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్‌గా తీసుకోరని తెలిపాడు. నబీల్.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్‌గా మణిఅటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణిని టార్గెట్ చేసిన లవ్ బర్డ్స్.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం మొదటి పోటీ జరిగింది. ఇందులో అవినాష్, రోహిణి, మెహబూబ్, మణికంఠ, గౌతమ్, హరితేజ, నయని పావని పాల్గొన్నారు. అయితే ప్రేమపక్షులు విష్ణుప్రియ- పృథ్వీ.. రోహిణిని టార్గెట్ చేసినట్లున్నారు. ఇక పృథ్వీ అయితే ఏకంగా తలకు గురి పెట్టి విసిరాడు. అవి తన కళ్లకు తగులుతుండటంతో రోహిణి ఫైర్ అయింది. దాడి చేశాక సారీ దేనికి?బాడీపై విసురు, కానీ కళ్లపై కొట్టవద్దని అరిచింది. ఒక్కరిపైనే దాడి చేసి తర్వాత సారీ చెప్పేస్తే నాకెలా అనిపిస్తుంది? అని రోహిణి బాధపడింది. అటు విష్ణుప్రియ.. మరి తను వచ్చీరాగానే నన్ను నామినేట్ చేసింది.. నాకెలా అనిపిస్తుంది? అయినా ఐ లవ్యూ చెప్తున్నాగా.. అని అభిప్రాయపడింది. ఏడుపందుకున్న నయనిఇక నయని పావని మరోసారి కన్నీటి కుళాయి ఓపెన్ చేసింది. నన్ను టాప్2లో తీసుకోలేదు, ముందే అవుట్ చేద్దామని మా టీమ్ డిసైడయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న మెహబూబ్ మెగా చీఫ్‌గా గెలిచాడని సమాచారం.చదవండి: తనలో సడన్ మార్పు, చాలా సెల్ఫిష్.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్ ఫ్రెండ్! -
ఫ్రెండ్ అంటే ఇలా ఉంటారా? విష్ణు ఫేక్.. ఇప్పటికీ అదే చెప్తా!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో విష్ణుప్రియ, సీత, నైనిక ముగ్గురూ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. హౌస్‌లో చీమ చిటుక్కుమన్నా సరే దాని గురించి ఒకరి చెవి మరొకరు కొరుక్కునేవాళ్లు. మంచి దోస్తుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లు. తమ గ్యాంగ్‌కు పవర్పఫ్ గర్ల్స్ అని పేరు పెట్టుకున్నారు. కానీ పోయినవారం ముగ్గురూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. విష్ణు.. నైనికను, సీత, నైనిక.. విష్ణును నామినేట్ చేసింది. అదే వారం నైనిక ఎలిమినేట్ కూడా అయింది.ఫ్రెండ్ అంటే..ఇంటర్వ్యూలతో వారంపాటు బిజీగా ఉన్న నైనిక ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్లు చూస్తూ వస్తోంది. నిన్న లైవ్ కూడా చూసిందట! ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ఫ్రెండ్ అంటే.. గేమ్‌లో అయినా టాస్క్‌లో అయినా తప్పు చేస్తే చెప్పాలి. అంతేకానీ అప్పుడు నీ గేమ్ నువ్వు ఆడేసి తర్వాత దాని గురించి గాసిప్ చేస్తారా? నీ స్నేహితురాలిని కిందకు లాగాలని ఎలా ప్రయత్నిస్తావ్?చాలా సెల్ఫిష్బిగ్బాస్ హౌస్‌లో కనెక్షన్స్ ఎలా మారిపోతున్నాయో చూస్తున్నా.. ముందు అదే ఫ్రెండ్‌కు వెళ్లి తప్పులు చెప్తుండే, ఇప్పుడు సడన్‌గా మారిపోయింది. జనాలు చాలా సెల్ఫిష్ అంటూ 'ఎండ్ ఆఫ్ పవర్ ఆఫ్ గర్ల్స్' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. విష్ణుప్రియ గురించే ఇలా రాసిందని అభిప్రాయపడుతున్నారు. అది నిజమేనన్నట్లు మరో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.ఫేక్ ఫ్రెండ్విష్ణును ఫేక్ ఫ్రెండ్ అన్నందుకు నన్ను ప్రశ్నించారు.. కానీ ఇప్పటికీ తను ఫేక్ ఫ్రెండ్ అనే చెప్తాను అని నొక్కి మరీ చెప్పింది. అలాగే నబీల్.. సీత గురించి వెనకాల మాట్లాడటం కూడా నచ్చలేదని పేర్కొంది. డేంజర్ జోన్లో ఉన్న సీతకు ఓట్లేయమని కోరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ ఇమ్మెచ్యూర్ అన్న ప్రేరణ.. మణికి గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన హోటల్ టాస్క్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అని ఎదురు చూశారు. అంత నీరసంగా సాగింది. టాస్క్ అయిపోగానే బెస్ట్ పర్ఫామర్లను సెలక్ట్ చేయాలన్నాడు. వీరే మెగా చీఫ్ కోసం పోటీపడతారని పేర్కొన్నాడు. ఓజీ టీమ్‌లో మెగా చీఫ్ కంటెండర్‌ను సెలక్ట్ చేసే క్రమంలో ప్రేరణ, నబీల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇమ్మెచ్యూర్..నీ మైండ్‌లో నాకు వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకున్నావ్.. అందులే అలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అనేసింది. నీ మాట వినకుండా ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు నాది తప్పు అను అని నబీల్ రిప్లై ఇచ్చాడు. అయినా తగ్గని ప్రేరణ.. వెటకారం వద్దు.. నువ్వు నన్ను నమ్మట్లేదు.. నువ్వు ఇమ్మెచ్యూర్ అనేయడంతో నబీల్ నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు.బెస్ట్ పర్ఫామర్లు ఎవరంటే?ఓజీ టీమ్ నుంచి మణికంఠ, రాయల్ టీమ్ నుంచి అవినాష్, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్‌లను బెస్ట్ పర్ఫామర్లుగా ఎంపిక చేశారు. తమ టీమ్‌లోని మిగతా ఇద్దరు కూడా బానే చేశారని అవినాష్ అనగా.. అలాంటప్పుడు ఫస్ట్ తమ పేరెందుకు చెప్పలేదని గంగవ్వ నిలదీసింది. కడిగి పారేసిన గంగవ్వనేను మహారాణి అయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా సేవలు చేశారా? అని ప్రశ్నించింది. అందుకు విష్ణు.. నేను పెరుగన్నం తినిపించా కదా అని గుర్తు చేయగా డబ్బులిస్తే ఆ పని చేశావని గంగవ్వ కౌంటరిచ్చింది. గంగవ్వలో ఈ ఫైర్ చూసి అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణుప్రియ.. వీడియో వైరల్
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అంతే! ఈ సీజన్లో పృథ్వీ, నిఖిల్ దమ్ముకొడుతుంటారు. నాలుగువారాలపాటు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను సునాయాసంగా కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా బాగానే ప్రయత్నించింది. అమ్మాయిలు కూడా..సిగరెట్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ క్లిప్పింగ్ తెగ వైరలయింది. అయితే బయటకు వచ్చిన సోనియా ఈ విషయంపై కాస్త సీరియస్ అయింది. నిఖిల్ సిగరెట్ తాగడాన్నే చూపించారు కానీ హౌస్‌లో చాలామంది తాగుతారు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. కానీ, వాళ్లను చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను అనేసింది.వీడియో వైరల్అప్పటినుంచి మొదలైంది అసలు రచ్చ.. హౌస్‌లో దమ్ము లాగే లేడీస్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. కిర్రాక్ సీత కావచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంతలో విష్ణుప్రియ సిగరెట్ తాగిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. విష్ణుప్రియ దమ్ము కొడుతుందని శేఖర్ బాషా సైతం ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిలు తాగితే తప్పేం లేదని కాకపోతే ఎవరైనా సరే ఈ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదన్నాడు. ఇకపోతే వీడియో చూసిన విష్ణు ఫ్యాన్స్.. ఆమె సిగరెట్ తాగితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka)#VishnuPriya smoking 🚬 in the corner 👀?#BiggBossTelugu8 pic.twitter.com/bnW62aYQZ5— BIG BOSS S8 (@Mrunalqueen) October 8, 2024 మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఒక ట్విస్ట్ ఉంటుందని నాగార్జున ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే గురువారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేషన్ కానున్నారు. అనంతరం మరికొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి ఎవరు ఇంటిబాట పడుతారోనని ఫ్యాన్స్ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.సోమవారం రోజు నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ భారీగానే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్ అఫీషియల్ పోలింగ్స్ను పరిశీలిస్తే.. నబీల్ ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత నిఖిల్, విష్ణుప్రియ ముందంజలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అయితే, నైనిక, ఆదిత్యలకు మధ్య ఓటింగ్ విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. కానీ, తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో ఆదిత్య, నైనిక, విష్ణుప్రియలు డైంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం ఈ ముగ్గిరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ కావచ్చని సమాచారం. అయితే, ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య హౌస్ నుంచి బయటకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన్ను సీక్రెట్ రూమ్‌కు పంపించే ఛాన్స్ ఎక్కువగా ఉందని ప్రచారం జరగుతుంది. -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్‌లో ఎవరంటే?చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నీకే నోటిదూల'.. కోపంతో మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య!
గమ్యం లేకుండా ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే విష్ణుప్రియ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఆదిత్య కూడా అసలు హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు కానీ తనకు ఈ షో అవసరమని ఒకానొక సందర్భంలో చెప్పాడు.గేమ్‌ను లైట్ తీసుకున్న విష్ణు?విష్ణుప్రియ మాత్రం అవసరం కాదుకదా టైం పాస్ అన్నట్లుగా గేమ్‌ను లైట్ తీసుకుంటోంది.. పృథ్వీతో లవ్ యాంగిల్ ట్రై చేస్తూ గేమ్‌ను పక్కన పడేసింది. పైగా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది. పతివ్రత, పుణ్యస్త్రీ వంటి పదాలు వాడిన ఆమె పోయినవారం నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ దారుణంగా మాట్లాడింది.ఈయనకే నోటిదూలఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ నిఖిల్.. విష్ణుప్రియను నామినేట్ చేశాడు. కానీ దాన్ని ఒప్పుకోని విష్ణు.. ఈయనకే పెద్ద నోటిదూల ఉంది, అయినా నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నవ్వేసింది. తర్వాత నిఖిల్.. మణికంఠను నామినేట్ చేశాడు.మంటలో చేయి పెట్టిన ఆదిత్యప్రేరణ వంతు రాగా.. ఎక్కువ మంచిమాటలు చెప్పి నెగెటివ్ విషయాల్ని మాత్రం చెప్పడం లేదని ఆదిత్యను నామినేట్ చేశాడు. నాజీవితంలో ఇలాగే ఉంటాను.. వచ్చేవారం కూడా ఇలాగే ఉంటానని ఆదిత్యబదులిచ్చాడు. వచ్చేవారం దాకా హౌస్‌లోనే ఉంటావన్న నమ్మకం నీకు లేదటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. ఈ నామినేషన్‌ను ఒప్పుకోని ఆదిత్య మంటల్లో చేయి పెట్టి తన ఫోటో బయట పడేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుకు మొట్టికాయలు.. సోనియా గ్యాంగ్‌కు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?గ్రూప్ గేమ్పైగా ఫైర్ బ్రాండ్లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు. సోనియా ఆట కూడా చెడగొట్టండితాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.బొట్టు ఒక్కటే తక్కువఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయిన నిఖిల్.. క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ప్రోమో రానే వచ్చింది.. కింగ్ నాగార్జున ఇంటిసభ్యులతో హీరో- జీరో గేమ్ ఆడించాడు. అంటే హౌస్‌లో మీకు హీరోగా కనిపించిన వ్యక్తికి రాజకిరీటం పెట్టమని.. ఆటలో జీరో అనిపించిన వ్యక్తి ముఖంపై రాంగ్ సింబల్ అచ్చు దింపాలని ఆదేశించాడు. అలా ఎక్కువమంది నబీల్, నిఖిల్, సీత హీరో అని అభిప్రాయపడగా నైనిక, మణికంఠను ఎక్కువమంది జీరో అని తేల్చేశారు.కేవలం శక్తి టీమ్ విజయం కోసంఈ క్రమంలో ప్రేరణ.. నిఖిల్‌కు జీరో ట్యాగ్ ఇచ్చింది. అందుకు బలమైన పాయింట్ కూడా చెప్పింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపడానికి హౌస్ అంతా కలిసి ఆడదామన్నాడు. కానీ చివరికి తన టీమ్ కోసం హౌస్‌ను పక్కనపడేశాడంది. అందుకు నాగార్జున సైతం తనకూ అలాగే అనిపించిందన్నాడు. నబీల్ను గేమ్‌లో నుంచి తీసేయడం కరెక్టేనా? అని అడగ్గా.. అందుకు నిఖిల్ ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయిందన్నాడు. బ్యాలెన్స్ తప్పడానికి ఏ మిస్ కారణం? అని నిలదీయడంతో నిఖిల్ బిక్కముఖం వేశాడు.ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు క్లాన్ చీఫ్ (టీమ్ లీడర్)గా ఉన్నప్పుడు హౌస్ అంతా కూడా నీ టీమ్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకో ఒక్కసారైనా ఆలోచించావా? అని నాగ్ సూటిగా అడిగాడు. ఏం చేసినా మేం ముగ్గురమే కలిసి చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారని తెలిపాడు నిఖిల్. అది నిజమేనా? అని నాగ్ అడగ్గా హౌస్ అంతా కూడా అవును అని బదులిచ్చింది.చదవండి: -
వింటేజ్ కారు, పూలచీరలో విష్ణు ప్రియ అదిరే లుక్స్ (ఫోటోలు)
-
పృథ్వీ ఆమెకు పడిపోయాడు, తనను చూస్తే భయమేస్తోంది: సోనియా
సీరియస్ టాస్క్‌లకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్మేట్స్ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. నబీల్ అయితే నెక్ట్స్ లెవల్.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వి మాయలో విష్ణుపృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆమె (విష్ణు)కు పడిపోతున్నాడు. నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది.రేషన్ టాస్క్తర్వాత బిగ్‌బాస్ రేషన్ టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.టీమ్ మార్చేసిన మణిఅనంతరం బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్ను లాక్కోవాలని శక్తి టీమ్.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. అలా శక్తి టీమ్‌ను వదిలేసి కాంతార టీమ్‌లో చేరాడు. అయితే కాంతార టీమ్‌లో నుంచి ఒకరిని స్వాప్ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీమ్‌కు పంపించాడు.పరకాయ ప్రవేశంతర్వాత బిగ్‌బాస్.. ఇంట్లో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలన్నాడు. ప్రేరణ.. మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య.. సోనియాను అచ్చుదింపేశాడు. నబీల్.. ఆదిత్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరూ తగ్గలేదు. అందరిలో నబీల్ను బెస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్ టాస్కులో నిఖిల్, సోనియా, పృథ్వీలను ఒక గ్రూపుగా పేర్కొంటూ వారిపైనే ఫోకస్ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురి గురించే హౌస్ అంతా మాట్లాడుకుంటోందని మురిసిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియాకు బ్రేకప్ చెప్పిన నిఖిల్.. అటు విష్ణుప్రియ..
రెడ్ కార్డ్, సీరియస్ వార్నింగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ నిన్న హీటెక్కింది. ఈ వాతావరణాన్ని కూల్ చేసేందుకు నాగ్ సండే రోజు కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్ ఆడించాడు. అటు హౌస్మేట్స్ కూడా సినిమా పాటలకు అద్భుతమైన పర్ఫామెన్స్తో అల్లాడించారు.హార్ట్ బ్రేక్అలాగే సెట్, కట్ గేమ్ ఆడించారు. హౌస్‌లో సెట్ అయ్యేవాళ్లకు హార్ట్, సెట్ అవని వాళ్లకు బ్రేక్ చేసిన హార్ట్ ఇవ్వమన్నాడు. దీంతో నిఖిల్.. పృథ్వీ సెట్ అని.. సోనియా తెలిసో తెలియకో కొన్ని మాటలు అనేస్తుందని, దానివల్ల హార్ట్ బ్రేక్ అవుతుందన్నాడు.సీతతో సెట్..మణికంఠ.. తన ఫ్రెండ్ నిఖిల్‌తో కట్, సోనియాతో సెట్ అని చెప్పాడు. విష్ణుప్రియ తనకు సీతతో సెట్టయిందని చెప్పింది. మంచి ఫ్రెండ్స్‌లా కనిపించే విష్ణుప్రియ, పృథ్వీ ఒకరికొకరు కటీఫ్ చెప్పుకోవడం గమనార్హం. యష్మి సెట్ అయిపోందంటూ ఆమెకు హార్ట్ సింబల్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అభయ్కు రెడ్ కార్డ్నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది. క్లాస్ పీకిన నాగ్తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.పతివ్రత..పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.ఎందుకంత సీన్ చేశారు?తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.ఆడపిల్ల ఇబ్బందిపడితే..తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.తప్పు తెలుసుకున్న మణిమొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచిగోల చేయలేదు, ఏకంగా కిందపడేసి రక్కి మరీ అవతలివారి దగ్గరనుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోస గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయితీ పెట్టుకున్నారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..'శక్తి'కి లగ్జరీ రేషన్ఆడింది అయిదునిమిషాలైతే అరుచుకోవడం అరగంట.. కాదు, హాఫ్‌డే అన్నట్లుంది బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీమ్ గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతార టీమ్ కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోసె అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోసె వేసుకోవడం రాదు, కాబట్టి ఒకటి వేసిస్తే తప్పేంటని మణి నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోసె వేసిచ్చింది.ఏడుపందుకున్న విష్ణుఇలా ముఖం మాడ్చుకుని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణు శోకమందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు? అని మణి, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారాం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మణి వల్లే ఈ గొడవ పెద్దదైందని అతడిని చులకన చేస్తూ మాట్లాడింది.సోనియాకు దూరంగా పృథ్వీ?ఇదిలా ఉంటే 'నువ్వెవడివిరా నాకు చెప్పడానికి..' అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా? అన్న ఆలోచనలో పడింది.సోనియా ప్రేమ కబుర్లుతర్వాత సోనియా.. ప్రేరణతో తన ప్రేమవిషయాలను పంచుకుంది. మేము మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జీవోకు అతడు వెబ్ డిజైనింగ్‌లో సహాయపడ్డాడు, అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా! అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పింది.14 గంటల టైమ్లైన్అనంతరం బిగ్‌బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు. కిచెన్‌లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తునట్లు తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంటగ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారుకోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్‌లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్నవాళ్ల దగ్గర లాక్కునేందుకు రెండు టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకుని, నెట్టేసుకుని, లాగేసి, కిందామీద పడేసి నానాతంటాలు పడ్డారు.చలనం లేకుండా పడి ఉన్న మణిమొదటి రౌండ్లో శక్తి టీమ్ 21, కాంతార టీమ్ 10 గుడ్లు సంపాదించింది. కామన్సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వరస్ట్ పర్ఫామర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణికంఠను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాలపాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తలపగిలిందేమోనని కాంతార టీమ్ లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్‌లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హర్ట్ అయిన మణి కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కుని వెక్కివెక్కి ఏడ్చాడు. బిగ్‌బాస్ షో.. నా జీవితంనీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్లాంబిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే, ఆడుదువులేనని అభయ్ సముదాయించాడు. అటు నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా.. తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంలో బూతులు అనేసి తలపట్టుకున్నాడు.నబీల్ అవుట్ఇంతలో బిగ్‌బాస్ రెండు టీమ్స్ ఎగ్స్ లెక్కపెట్టమన్నాడు. అలా శక్తి టీమ్ దగ్గర 66, కాంతార వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు ఇచ్చాడు. అలా వాళ్లు నబీల్ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ.. ఏమైందంటే?
బిగ్‌బాస్ 8లో రోజులు మారుతున్నకొద్దీ హౌస్మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టారు. సంచాలక్స్ వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మిపై తెగ అరిచేశారు. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంల ప్రేరణ ప్రవర్తన వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో ఇదే తంతు.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 8 నుంచి బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కాగా 8 మంది లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. మరోవైపు ప్రేరణ తనకు ఫుడ్ ప్లేట్లో వడ్డించకుండా, విసిరేస్తుందని విష్ణుప్రియ బాధపడింది. మిగతా వాళ్లు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది.ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ.. ప్రేరణకి యాటిట్యూడ్ తగ్గించుకోమని ఏదో చెప్పబోయాడు. కానీ ఏమైనా చేసుకో పో అని ప్రేరణ అనడాన్ని ప్రోమోలో చూపించారు. అంటే బుధవారం ఎపిసోడ్లో ఈ గొడవని ఎక్కువ హైలైట్ చేసేలా ఉన్నారు. ఈ వారం గేమ్స్‌తో పాటే ఏడుపులు, అరుపులు ఎక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్‌లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్‌లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్‌లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్ బాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు నా గైడెన్స్ అవసరం: సోనియాసోనియా పాటతో ఫండే ఎపిసోడ్ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్. నిఖిల్, అభయ్ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్ పర్ఫామర్ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. విష్ణుప్రియతో గొడవలకు ఫుల్స్టాప్!అభయ్ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీమ్‌కు కాంతార, నిఖిల్ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. నాగ్ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్ స్టోరీ చెప్తే వారికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానన్నాడు నాగ్. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆరు నెలల్లో 14 కిలోలు తగ్గానా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీమ్ విజేతగా నిలిచింది.హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్ చేయాలా? అని నాగ్ రెండు ఆఫర్స్ ముందు పెట్టాడు. టీమ్ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000కు చేరింది. తర్వాత సీత సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. సీత మాత్రమే బాషాకు సపోర్ట్ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా శేఖర్ ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్ చేస్తారు అని తెలిపాడు.ఎవరు ఫేక్? ఎవరు రియల్?స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది చెప్పమని గేమ్ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్ పర్సన్ లిస్టులో చేర్చాడు. సోనియాకు రెండు ముఖాలుఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్ కోల్పోయింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్‌గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్‌ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్.. సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ
నేను మరీ అంత చెడ్డోడిని కాదంటూనే తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు బిగ్‌బాస్. కెరటం టీమ్(నిఖిల్, మణికంఠ) ఆకలేస్తుందని అర్ధరాత్రి దొంగల్లా దోసెలు తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాసు పీకాడు. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూపించాడు. ఓడిపోయేవాళ్లంటేనే గిట్టదన్న సోనియా ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ఈ సీజన్లో అంతులేనంత డబ్బు ప్రైజ్‌మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. తాను ఇచ్చే ఛాలెంజ్‌లలో మూడు టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలన్నాడు. ఏ టీమ్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్‌మనీలో యాడ్ అవుతుందన్నాడు. మొదటి ఛాలెంజ్‌లో మణి, విష్ణుప్రియ, సోనియాను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కిందపడిపోగా మణికంఠను పృథ్వీ ముందుకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టేసుకోవడంతో అతడు వెనకబడిపోయాడు. విష్ణు మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీమ్ ఖాతాలో రూ.25 వేలు పడేలా చేసింది.ఎగిసిపడ్డ కెరటంబిగ్బాస్.. రెండో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. ఈ కలర్ బాల్స్ గేమ్‌లో పృథ్వీ, నబీల్, నిఖిల్ హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ గెలవడంతో కెరటం టీమ్ ఖాతాలో అర లక్ష పడింది. మూడో ఛాలెంజ్ విలువను రూ.70 వేలుగా ప్రకటించాడు. ఈ స్పెల్లింగ్ గేమ్‌లో యష్మి, మణికంఠ, నైనిక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్‌గా రాసిన మణికంఠ కెరటం టీమ్ ఖాతాలో రూ.70 వేలు పడేలా చేశాడు.ఆకలితో అలమటించిన నిఖిల్రేషన్ లేకపోవడంతో కేవలం రాగిజావతో సరిపెట్టుకుంటున్న మణి, నిఖిల్ అర్ధరాత్రి ఆకలేసింది. దీంతో దొంగచాటుగా పక్క టీమ్ చేసుకున్న దోశలు ఆరగించారు. ఇది చూసిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందర్నీ నిద్రలో నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తుచేశాడు. ఇంట్లో ఫుడ్ దొంగతనం మొదలుపెట్టిన యష్మికి.. తమ పాలప్యాకెట్ అవతలివారు ఎత్తుకుపోయేసరికి ఉక్రోశం పట్టలేకపోయింది. విష్ణుప్రియతో గొడవకు దిగింది. దబాయించిన యష్మిమా చికెన్ దొంగిలించలేదా? అని విష్ణు ఎదురుతిరిగితే.. నీ దగ్గర సాక్ష్యం ఉందా? అని దబాయించింది. ఎందుకు అరుస్తున్నావంటే నేనిలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. నాలుగో ఛాలెంజ్ విలువ ఏకంగా రూ.1,50,000గా ప్రకటించాడు. ఈ గేమ్‌లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీపడ్డారు. ఆదిత్య ఓడిపోగా.. అభయ్(అఖండ టీమ్), నిఖిల్(కెరటం టీమ్) గెలిచి చెరో రూ.75 వేలు గెలుచుకున్నారు. ఐదో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. నిఖిల్, నబీల్, పృథ్వీ వ్యాక్స్ చేయించుకోవాలన్నాడు. కాళ్లు మొక్కిన విష్ణుప్రియఅయితే ఆ నొప్పి భరించలేక తన వల్లకాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు. సోనియా.. నబీల్ (అంతులేని వీరులు టీమ్)ను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్లకు నమస్కరించింది. ఆరో ఛాలెంజ్ విలువ బిగ్‌బాస్ రూ.1 లక్షగా ప్రకటించాడు. చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబీల్, అభయ్, పృథ్వీ పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచాలకురాలు ప్రేరణ అందరిమీద గరమైంది. ఈ తోసుకోవడాలు, కొట్టుకోవడాలు ఆపండని అరిచింది.బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతా..పాపం, తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కిందపడ్డానని విష్ణుప్రియ, అది నిజమైతే బిగ్‌బాస్ హౌస్ నుంచే వెళ్లిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియను మళ్లీ ఆడించినా చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గరమయ్యాడు. చివర్లో నిఖిల్, అభయ్కు టై అయినట్లు ప్రకటించడంతో ఇరు టీమ్స్‌కు చెరి రూ.50 వేలు లభించాయి. ఫైనల్‌గా రూ.2,45,000తో కెరటం టీమ్ లీడ్‌లో ఉంది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కిందపడ్డ సోనియా.. గెలిచి చూపించిన విష్ణుప్రియ
బిగ్‌బాస్ హౌస్‌లో కిరాణా సామాను పంపిణీ ముగిసింది. యష్మి, నైనిక టీమ్ సభ్యులు రేషన్ గెలుచుకుని, దాన్ని హాయిగా వండుకుని కడుపు నింపుకున్నారు. కానీ నిఖిల్ టీమ్ మాత్రం రాగిముద్ద, ఉడకబెట్టిన కూరగాయలతో సరిపెట్టుకుంది. రేషన్ గొడవ అయిపోవడంతో బిగ్‌బాస్(#BiggBossTelugu8) ప్రైజ్‌మనీపై దృష్టి సారించాడు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న ప్రైజ్‌మనీని హౌస్మేట్స్ వీలైనంతవరకు లాక్కుంటూ పోవచ్చన్నమాట!కిందపడ్డ సోనియాఈ ప్రైజ్‌మనీ టాస్కుల్లో భాగంగా మొదట విష్ణుప్రియ, సోనియా, మణికంఠలను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో సోనియా కిందపడిపోయింది. విష్ణు అందరికంటే ముందు దూకి రూ.25 వేలు గెలిచింది. తర్వాతి టాస్కులో నిఖిల్, నబీల్, పృథ్వీ కలర్ బాల్ గేమ్ ఆడారు. ఇందులో నబీల్ ఆదిలోనే అవుట్ అయిపోగా నిఖిల్, పృథ్వీ హోరాహోరీగా పోరాడారు. అబ్బాయిల కష్టాలుఅంతిమంగా నిఖిలే గెలిచి రూ.50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అనంతరం నిఖిల్, పృథ్వీ, నబీల్ను వ్యాక్స్ చేసుకోమన్నాడు బిగ్‌బాస్. ఈ వ్యాక్స్ చేసుకునేందుకు ముగ్గురూ నానాతంటాలు పడ్డారు. ఇకపోతే ఏదో పాల ప్యాకెట్ డస్ట్ బిన్లో కాకుండా కింద పడేసినందుకు విష్ణుప్రియకు యష్మి క్లాస్ పీకింది. మీరు మా చికెన్ దొంగిలించారుగా అని తనేదో చెప్పబోతుంటే యష్మి ఒంటికాలిపై లేచింది. సాక్ష్యం ఉందా? మేము తీసుకున్నట్లు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అని నిలదీసింది. ఎందుకు అరుస్తున్నావని అడిగితే నేనిలాగే మాట్లాడతానంటూ తన కోపాన్ని ప్రదర్శించింది. బహుశా ఇప్పటివరకు ప్రైజ్‌మనీ కోసం పెట్టిన గేమ్స్‌లో తన టీమ్ ఒక్కటి కూడా గెలవలేదన్న బాధను యష్మి ఇలా చూపిస్తుందేమో! -
తడిబట్టలతో అబ్బాయిల ముందు! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు
పర్సనల్ వేరు, గేమ్ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి.. ఇది సోనియా చెప్పిన మాటే!అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను కానీ పాటించనంటోందీ ఆర్జీవీ బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నన్ను అడల్ట్రేటెడ్ జోకులు అనడం నచ్చలేదని విష్ణుప్రియ.. సోనియాను నామినేట్ చేసింది. విష్ణుప్రియ కౌంటర్తను పద్ధతిగా సోనియా గారు అని మాట్లాడుతుంటే సోనియా మాత్రం తనపై బురదజల్లే ప్రయత్నం చేసింది. నీకు అలాంటి జోకులే వచ్చని మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన విష్ణుప్రియ.. అడల్ట్ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చింది.సోనియా దిగజారుడు వ్యాఖ్యలుతనకు ఎదురు తిరగడంతో సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. దుస్తులు సరిగ్గా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా తెలీదు. అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా మళ్లీ వెళ్లి అతడి పక్కనే నిలబడుతున్నావంటే నీ మాటలు, చేతలు అడల్ట్లాగే అనిపిస్తాయి అని దారుణంగా మాట్లాడింది. ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని విష్ణు సాఫ్ట్‌గానే అడిగినా.. అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తావని మండిపడింది. పొరపాటున..అసలు అంతగా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది? అంటే.. బాత్రూమ్లో చీర కట్టుకోవడం కష్టం కాబట్టి విష్ణుప్రియ బెడ్రూమ్లోకి వెళ్లింది. అది తెలియక పొరపాటున ఆదిత్య ఓం బెడ్రూమ్లోకి వెళ్లాడు. ఆమె చీర కట్టుకుంటుందని తెలిసి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. అతడిని గమనించిన విష్ణు.. ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. ఇంతదానికి సోనియా.. ఏదో చెండాలం జరిగిపోయినంత బిల్డప్ ఇచ్చింది. మరి నీ డ్రెస్సింగ్ సెన్స్ ఏది?అక్కడ ఆదిత్య ఇబ్బందిపడకపోయినా సోనియానే తెగ ఫీలైపోయింది. నిఖిల్, అభయ్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుండగా ఏం జరిగిందో తెలిసా? అని మళ్లీ మొదలుపెట్టింది. పైగా తడిచిన బట్టల్లో, కేవలం టీషర్ట్‌తో ఉండగానే వాళ్ల ముందు నిలబడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి ఓవర్‌గా మాట్లాడిన సోనియా.. మరి ఇలా తడిచిన బట్టలతో వాళ్ల ముందు నిలబడటమేంటో తనకే తెలియాలి! Sonia is the cheapest contestant on #BiggBossTelugu8 She is slut-shaming #VishnuPriya to two guys over a genuine misunderstanding. Hefty PR can't hide her ugliness and no, she can never be Bindu👎pic.twitter.com/26Nz6JqXiI— 🍋 (@yunoforeva) September 10, 2024Enta galeez ga undi enti ah Soniya #Vishnupriya saree drape cheskunte ah Aditya om by mistake ah room Loki velipoyadu tanu sorry kuda chepindi adi edo tanu kavali ani ala chesinatu oka sexualize way lo cheptundi anduke ninu adultrated ananu ani antundi #BiggBossTelugu8 pic.twitter.com/kyDN5pFQ4a— Abhishek (@uniqueabhi18) September 10, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది: నిఖిల్
బిగ్‌బాస్ 8 సీజన్లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ, పసలేని పాయింట్లతో ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అన్నీ సిల్లీ పాయింట్లను తీసుకొచ్చి చిరాకు పుట్టించేలా వారి కారణాలు ఉన్నాయి. బిగ్‌బాస్‌లో ఎంతోకొంత కామెడీ చేసే భాషాని కూడా కామెడీ చేయొద్దని నామినేట్ చేస్తున్నారంటే వారి కారణాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎపిసోడ్ చివర్లో కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఇంతకూ హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో (సెప్టెంబర్ 10) నాటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.నామినేషన్లతో చిరాకుబిగ్బాస్లో రెండు రోజులపాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మొదటిరోజు కొంతమంది లిస్ట్‌లో చేరగా నేటి ఎపిసోడ్లో మరికొంతమంది చేరారు. తాజా ఎపిసోడ్లో ప్రేరణతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫుడ్ ప్రిపేర్ చేయలేదని పాత టాపిక్‌నే సాగదీస్తూ నిఖిల్‌ని నామినేషన్ చేసింది. ఆ తర్వాత సీతను ప్రేరణ నామినేషన్ చేసింది. డస్ట్‌బిన్ టాపిక్‌నే మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ప్రేరణ పసలేని వాదానలతో ముగించింది. అయితే, ప్రేరణ లేవనెత్తిన పాయింట్లను సక్సెస్‌ఫుల్‌గా సీత తిప్పికొట్టిందని చెప్పవచ్చు. ఆ వెంటనే పృథ్వీ నామినేషన్ చేసే సమయం వస్తుంది. అతను కూడా సరైన పాయింట్లు లేకుండానే నామినేషన్ ముగించాడు. మణికంఠ,నైనికాను పృథ్వీ నామినేషన్ చేస్తాడు. అలా హౌస్‌లో అందరూ కూడా చెత్త కారణాలతో నామినేషన్ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారని చెప్పవచ్చు. నేను వెళ్లిపోతా: నిఖిల్నామినేషన్స్ ప్రక్రియలో నిఖిల్‌ని నబి నామినేషన్ చేస్తాడు. అయితే, నిఖిల్ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేషన్ చేస్తాడు. దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్, పృథ్వీ మధ్య కాస్త వాగ్వాదం పెరుగుతుంది. వాస్తవంగా బిగ్‌బాస్‌లో నిఖిల్, పృథ్వీ,సోనియా, అభయ్ నవీన్ ఒక బ్యాచ్‌గా ఉంటారు. కానీ, నామినేషన్లో భాగంగా ఈ బ్యాచ్‌లో కాస్త అలజడి రేగుతుంది. ఈ క్రమంలో నిఖిల్ బాదపడ్డారు. తాను తనలానే ఉంటానని, ఎలిమిట్ అయినా సరే తనలో ఎలాంటి మార్పులు రావని చెప్పుకొచ్చాడు. హౌస్ నుంచి క్విట్ చేసి బయటికి వెళ్లాలనిపిస్తోందని కూడా ఆయన అన్నాడు. కానీ, అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్టు అవుతుందని మణికంఠ వద్ద నిఖిల్ చెప్తాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తనను తనలా ఉండనివ్వడం లేదని పరోక్షంగా తన బ్యాచ్‌లో ఉండే వారి గురించి నిఖిల్ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటుంటూ చాలా బాధగా ఉందని నిఖిల్ అంటాడు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, డబ్బు అవసరం ఉండటం వల్లే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు చెప్పుకొస్తాడు. అలా అని డబ్బు కోసం ఇలాంటి మాటలు పడాలంటే కాస్త ఇబ్బందిగా ఉందంటాడు. హౌస్ నుంచి వెళ్లిపోదామనుకుంటే తనదే తప్పు అనుకుంటారని అందుకే ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నాడు. 'నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్లు కూడా ఇప్పడు గేమ్ కోసం విమర్శిస్తుంటే బాధగా ఉంది' అని స్టేట్మెంట్ ఇస్తాడు. సోనియా,పృథ్వీలను ఉద్దేశించే నిఖిల్ ఈ కామెంట్లు చేశాడని అర్థం అవుతుంది.రెండో వారం నామినేషన్ లిస్ట్‌లో ఎవరున్నారంటేబిగ్బాస్ 8 రెండో వారం ఎలిమినేషన్ గండంలో పృథ్విరాజ్,నిఖిల్, మణికంఠ,కిర్రాక్ సీత,విష్ణుప్రియ, పృథ్విరాజ్, ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఉన్నారు. అయితే, పెద్ద క్లాన్కు చీఫ్‌గా ఉన్న యష్మికి బిగ్‌బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు. ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న వారి నుంచి ఒకరిని కాపాడి.. సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేషన్ చేయమని కోరతాడు. దీంతో ప్రేరణను యష్మి కాపాడుతుంది. అప్పటి వరకు సేవ్ అయి ఉన్న విష్ణుప్రియ నేరుగా నామినేట్ అయింది. కేవలం యష్మి వల్ల ప్రేరణ సేవ్ అయితే.. విష్ణుప్రియ ఎలిమినేషన్ గండంలో చిక్కుకుంది.ఫుడ్‌తో షాకిచ్చిన బిగ్బాస్హౌస్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ షాకింగ్ న్యూస్ చెప్తాడు. రేషన్‌తో సహా ఇంటిలోని ఆహార పదార్థాలు అన్నీ స్టోర్ రూమ్‌లో ఉంచాలని చెప్తాడు. ఇక నుంచి ఫుడ్ కావాలంటే మీరే సంపాదించుకోవాలని సూచిస్తాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నిట్టూర్చారు. అలాంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు వారికి ఇష్టమైన ఆహారం తినొచ్చు అని బిగ్‌బాస్ ఆఫర్ ఇస్తాడు. దీంతో వారికి నచ్చిన ఆహారం అందరూ తినేస్తారు. కానీ, ఆదిత్య ఓం మాత్రం ఏం తినకుండా సోఫాలో కూర్చోని ఉండిపోతాడు. -
విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు
బిగ్ బాస్ షో రెండో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో తీవ్రమైన చర్చ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌లో కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియలను మాటలతో సోనియా టార్గెట్ చేసింది. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. పర్సనల్ ఎటాక్‌కు దిగిందంటూ సోనియాపై ఫైర్ అవుతున్నారు.రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణుప్రియ ఇద్దరిని ఎంచుకుంటుంది. మొదట మణికంఠను నామినేషన చేసిన విష్ణు ఆపై సోనియాను నామినేట్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంతకు విష్ణుప్రియ మీద సోనియా ఎలాంటి కామెంట్లు చేసిందంటే.నువ్వు ముందు దుస్తులు సరిగ్గా వేసుకోవు.. అలాంటి దుస్తులతోనే ఇతరుల పక్కన నిల్చుంటావ్.. నీ వల్ల వారు డిస్కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్. నీ మాటలు, చేతలు హౌజ్‌లో చాలా తేడా ఉన్నాయి.' అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని సోనియా మరింత వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగింది. విష్ణుప్రియను ఉద్దేశిస్తూ.. 'నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటా.. నన్ను మాత్రం అలాంటివి చేయడానికి పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ విష్ణుప్రియను సోనియా దారుణంగా అవమానించింది. దీంతో సోనియాకు భారీగా నెగటివిటీ వచ్చింది. సోనియా నోరుని డ్రైనేజీతో పోల్చి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సోనియాకు కాస్త తిక్క ఉందంటూ చెప్పుకొస్తున్నారు. సోనియా చేసిన కామెంట్లకు నాగార్జున గట్టగా రియాక్ట్ కావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో సోనియా పేరు ఉంటే వీకెండ్లో ఆమె ఎలిమినేషన్ కావడం పక్కా అని బిగ్ బాస్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. -
విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా! ఇప్పటికీ అదే అంటా!
వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు? ఏంటనేది సినిమా క్లియర్‌గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చిట్టా పెద్దగానే ఉందే!ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్లే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ.. సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీ లాగింది. అందుకామె.. నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్‌గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్నదానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయటపెట్టింది.ఆమెకు ఇష్టమైన కూర చేసిన నిఖిల్మరోపక్క ఈమె మెంతి టమాట కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్‌లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీమ్‌లోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్‌లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ (#BiggBoss8Telugu) తెలిపాడు. పెద్ద టీమ్ చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్‌లో ఉండబోదని పేర్కొన్నాడు.కోరిక తీర్చేసుకున్న సీతమొదటగా సీత.. గతవారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్‌పై రంగు పోసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్.. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా వర్సెస్ సీతసోనియా.. చీఫ్‌గా ఫెయిలైందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి.. టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాసు పీకింది. అభయ్‌తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉందని తేలిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీమ్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది. టోటల్‌గా గ్రూప్ అంతా ఫెయిలైందని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా విన్న సీత.. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడని కౌంటరిచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి.. మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది.ఆదిత్యపై పడ్డారే!మణికంఠ.. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా? లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా? అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు.. మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్లు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని బాషాను నామినేట్ చేశాడు.ఆరని జ్వాలఆదిత్య వంతు రాగా.. స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్‌ను, ఈ గేమ్‌కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ బాషాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గతవారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. మీకు కోపం వచ్చినప్పుడు అవతలివారిపై నిందలు వేస్తున్నారంది.దుస్తులు సరిగా వేసుకోవు!అందుకామె.. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు.. సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేం.. నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు.. ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా.. ఒకరు కంఫర్ట్‌గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ.ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్బాషా వంతు రాగా.. నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్.. అతడే మణికంఠ.. అతడు జనజీవన స్రవంతిలో కలవనంతవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. వీళ్ల రూటే సెపరేటుదీంతో ఆదిత్య.. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు.. నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంకా లీడర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ బేబక్క? టైం అయిపాయె!
మొన్నటిదాకా కూల్‌గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తోంది. ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్‌లో లేటుగా వంట చేయడం వల్ల లేనిపోని గొడవలకు కారణమవుతోంది. మరోవైపు తొలినాళ్లలో ఫైర్‌తో కనిపించిన నిఖిల్ కాస్తా చల్లబడిపోయాడు. ఇక ఈ వారం పర్ఫామెన్స్లో ఎక్కువమంది లేడీస్ ఫెయిలయ్యారని తీర్పునిచ్చాడు నాగ్. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(సెప్టెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆమె మీద కోపం అతడిపై..ఎప్పటిలాగే కిచెన్‌లో గొడవ మొదలైంది. బేబక్క.. 'సోనియా.. నన్ను పర్సనల్ అటాక్ చేస్తోంది. తనతో వైబ్ రావట్లేద చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదేంటి?' అని తన టీమ్ లీడర్ నిఖిల్ మీద ఫైర్ అయింది. సోనియా అయినా ముఖం మీద మాట్లాడుతుంది కానీ నువ్వు మాస్క్ వేసుకుని ఉన్నావంటూ అతడిపై నిందలు వేసింది. అయితే సోనియా మీద కోపం నిఖిల్ మీద చూపించినట్లు అనిపించింది.అడల్ట్ కామెడీ..మరోవైపు విష్ణుప్రియ.. మొదట్లో నీకు నిఖిల్‌తో పడలేదుగా, మరి ఇప్పుడెలా స్నేహం కుదిరిందని అడిగింది. ఈ ప్రశ్న నచ్చకపోవడంతో సోనియా.. అడల్ట్ జోకులు నాపై వేయొద్దని ఫైర్ అయింది. ఆ మాటతో చిర్రెత్తిన విష్ణుప్రియ మీ మధ్య ఏదో ఉందని అనలేదుగా.. దానికి అంత మాట అనాల్సిన అవసరం లేదని తిట్టిపోసింది. దీంతో సోనియా ఏడ్చేసింది. అయినా విష్ణుప్రియ వల్లేదు. నన్ను ఆ మాట ఎలా అంటావ్? నువ్వు ఒక్కదానివే పుణ్య స్త్రీ.. మేము మాత్రం ఇలాంటివాళ్లమా? అని చిర్రుబుర్రులాడింది. ఇవన్నీ శుక్రవారం జరిగాయి.కత్తి దింపిన కంటెస్టెంట్లుశనివారం నాడు.. నాగార్జున వచ్చీరాగానే వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరికీ స్వీట్లు పంపించాడు. అలాగే ఓ టాస్క్ ఇచ్చాడు. మాటలతో గాయపర్చేవారిని చురకత్తితో, నెగెటివ్ అనిపించినవారిని నల్లకత్తితో, రెండునాలుకలు ఉన్నవారిని ఇరువైపులా పదునున్న కత్తితో, చలనం లేకుండా పడి ఉన్న కంటెస్టెంట్లను తుప్పుకత్తితో పొడవాలన్నాడు. మొదటగా బాషా.. మణికంఠలో నెగెటివ్ ఎనర్జీ చూస్తున్నానంటూ అతడు ధరించిన దిండుపై నల్లకత్తితో పొడిచాడు.నిఖిల్ టీమ్ నుంచి బయటకువిష్ణుప్రియ.. అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తున్నానంటూ సోనియా తనపై మాటలు జారిందని చురకత్తితో పొడిచింది. ఈ విషయంలో నాగ్ సోనియాకే సపోర్ట్ ఇవ్వడం గమనార్హం. విష్ణు.. సోనియాను పుణ్య స్త్రీ అంటూ వెక్కిరించి మాట్లాడటాన్ని తప్పుపట్టాడు. నైనిక.. తన టీమ్‌తో ఎక్కువ పని చేయించిందంటూ యష్మిని చురకత్తితో పొడిచింది. బేబక్క.. నిఖిల్ తన టీమ్‌లో ఉన్న నాకు బదులుగా సోనియాను ఎక్కువ పట్టించుకున్నాడంటూ అడిని పదును కత్తితో పొడిచింది. మారిపోయిన నిఖిల్అలాగే అతడితో ఉండటం ఇష్టం లేదంటూ టీమ్ నుంచి బయటకు వచ్చేసింది. అభయ్.. నిఖిల్‌ను మాస్క్ తీసే కత్తితో పొడిచాడు. మొదట్లో అగ్రెసివ్‌గా ఉన్న నిఖిల్ ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారోనన్న భయంలో పడిపోయాడు. అవన్నీ అవసరం లేదు, మొదట్లో ఎలా ఉన్నావో అలా ఉంటే చాలని సూచించాడు.వెగటు కామెడీనెగెటివ్ ఎనర్జీ అన్న కారణంతో సీత.. యష్మిని, సోనియా.. బేబక్కను నల్లకత్తితో పొడిచారు. నబీల్.. నిఖిల్ వెగటు కామెడీ నచ్చలేదని అతడిని చురకత్తితో పొడిచాడు. ప్రేరణ, పృథ్వి.. ఆదిత్య ఓంకు తుప్పు పట్టిన కత్తి దింపారు. మణికంఠ, యష్మి ఒకరినొకరు పదునుకత్తితో పొడుచుకున్నారు. నిఖిల్ వంతురాగా.. రెండు నాలుకలు ఉన్నాయంటూ బేబక్కను పదును కత్తితో పొడిచాడు. ఆదిత్య.. బాషాను తుప్పు పట్టిన కత్తితో పొడిచాడు.ఆ ఐదుగురు ఫ్లాప్అనంతరం నాగ్.. ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్టు కార్డును బయటపెట్టాడు. పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ ఫ్లాప్ అయ్యారని తెలిపాడు. చివర్లో సోనియా సేవ్ అయినట్లు వెల్లడించాడు. ఇక సండే ఎపిసోడ్ షూట్ పూర్తవగా బేబక్కను ఎలిమినేట్ చేశారట! పాపం.. ఇది ముందు గ్రహించలేకపోయిన ఆమె తనే లీడరను అవుతానని శపథం చేసింది. ఇంతలోనే ఇల్లు వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏడ్చిన సోనియా.. విష్ణుప్రియకు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు స్వీట్లు పంపించాడు. అలాగే ప్రతి వీకెండ్లో తప్పొప్పులు ఎత్తి చూపే నాగ్ మీ పొరపాట్లు ఏంటో మీరే చెప్పండని కంటెస్టెంట్లను ఆదేశించాడు. దీంతో అందరూ లేచి నిలబడ్డారు.మణిని గుచ్చిన బాషాతనలో తను మాట్లాడుకోవడం ఒంటరితనమో ఏంటో అర్థం కావడం లేదంటూ నాగమణికంఠను కత్తితో పొడిచాడు బాషా. ఆ ఒంటరితనం ఎందువల్ల ఏర్పడిందనేది తర్వాత చెప్పాడుగా అని నాగ్ బదులివ్వగా వాటిని నేను ఆమోదించలేనన్నాడు బాషా. తర్వాత విష్ణుప్రియ.. సోనియాకు కోపంలో అనే మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయంది. దీంతో ఓ వీడియో ప్లే చేశారు. ఉన్నమాట అడిగిన విష్ణుప్రియఅందులో విష్ణుప్రియ.. నీకు ముందునుంచి నిఖిల్ అంతగా నచ్చలేదు. అలాంటిది మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అని ఉన్నమాట అడిగింది. ఇది కేవలం విష్ణుప్రియకు వచ్చిన డౌటే కాదు.. బిగ్‌బాస్ చూసే ఆడియన్స్‌కు వచ్చిన డౌట్ కూడా! కానీ ఆ ప్రశ్నకు సోనియా సమాధానం దాటవేసింది. అంతేకాకుండా ఇలాంటి అడల్ట్రేటెడ్ కామెడీ తన మీద ప్రయోగించొద్దని సీరియస్ అయింది. దీంతో విష్ణుప్రియకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా?మీ మధ్య ఏమైనా నడుస్తుందా? అని ఆ టైప్‌లో ఏమైనా జోకులు వేశానా? లేదు కదా? అని నిలదీసింది. ఆ మాటతో సోనియా.. ఇక ఆపేయ్ అని అరుచుకుంటూ బయటకు వెళ్లి ఏడ్చేసింది. అది చూసిన విష్ణుప్రియ.. నేను కూడా ఏడుస్తాను.. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా? అని నోరుపారేసుకుంది. ఇది చూసిన నాగార్జున.. తను ఏడుస్తున్నప్పుడు మళ్లీ గుచ్చేలా మాట్లాడటం అవసరమా? అని కోప్పడ్డాడు. మరి ఇంకా ఎవరెవరికి క్లాసులు పీకాడో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫేస్‌వాష్‌తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్‌లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్‌లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలి: మణి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..పని చేయట్లేదంటూ..ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అన్‌ఫిట్ అయితే పోతా..అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.మళ్లీ బాధలు చెప్పుకున్న మణితర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.నా జీవితం దగ్గరుండి చూశారా? నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.ఏడిపించేసిన మణినేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.అందుకే తిరిగావా?నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.సింపతీ కార్డ్అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.నామినేషన్లో ఎవరంటే?తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. నా చివరి యుద్ధండ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.నా భార్య నాక్కావాలిఅతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చీరలో ఉంగరాల జుట్టుతో సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫొటోలు)
-
కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో ఇలా
తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. 14 మంది అది కూడా జంటలుగా ఈ సారి హౌసులో అడుగుపెట్టారు. వీళ్లలో జనాలకు తెలియని వాళ్లే ఎక్కువే ఉన్నారు. కొందరు సీరియల్ హీరోయిన్లతో పాటు యాంకర్ విష్ణుప్రియ కాస్తోకూస్తో జనాలకు తెలియొచ్చు. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ కంటెస్టెంట్ అయిన విష్ణుప్రియ గతంతో ఇదే షోపై ఊహించని కామెంట్స్ చేసింది. అసలు షో కాన్సెప్టే నచ్చదని, కోట్లు ఇచ్చినా వెళ్లనని చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన సీరియల్ నటి అంజలి పవన్.. ఎందుకంటే?)ఇంతకీ ఏమైంది?బిగ్‌బాస్ 4 అంటే 2020. సీజన్ చివరకొచ్చేసరికి ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు.. ఓ ప్రోగ్రాంలో కనిపించిన యాంకర్ విష్ణుప్రియని బిగ్‌బాస్ షోపై అభిప్రాయం అడిగారు. దీంతో షో గురించి నిజాలు చెప్పేసింది. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఎలిమినేషన్.. ఇవన్నీ అస్సలు నచ్చవని చెప్పింది. అసలు ఇలాంటి షోనే ఎంకరేజ్ చేయనని చెప్పింది.వీడియోలో ఏముంది?'బిగ్ బాస్ కాన్సెప్టే నాకు నచ్చదు. ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఎలిమినేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా? లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. మీ ఇళ్లు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా.. నేను బిగ్‌బాస్ పర్సన్‌ని కాదు.. చిన్నప్పటి నుంచి కూడా నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇలాంటి షోని నేను ఎంకరేజ్ చేయను'(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్మేట్స్ వీళ్లే)'నేను ఎప్పుడూ చేసే పని ద్వారా నా స్టాటస్ పెరగాలని అనుకోను. పది మంది గుర్తించాలని కూడా అనుకోను. నేను చేసిన పనిని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసిన తరువాతే అవతలి వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నా గోల్ ఏంటంటే.. నేను నవ్వుతూ ఉండాలి.. నా చుట్టుపక్కల వాళ్లు కూడా నవ్వుతూ ఉండాలి. అది ఎలా అయినా సరే.. టీవీ కావచ్చు.. సినిమా కావచ్చు. నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి. పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అయితే లేదు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోకి అయితే వెళ్లడం జరగదు. రాసిపెట్టుకోండి. వెళ్తే నన్ను బ్లేమ్ చేసుకోవచ్చు' అని విష్ణుప్రియ చెబుతున్న పాత వీడియో తాజాగా ఆమె షోలో అడుగుపెట్టిన నేపథ్యంలో వైరల్ అవుతోంది.ఈసారి బిగ్ బాస్ షోలో 12వ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ అడుగుపెట్టింది. ఈమెతో పాటు యష్మి గౌడ, నిఖిల్ మళయక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బేబక్క (మధు నెక్కంటి), శేఖర్ భాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, నబీల్ అఫ్రిది ఉన్నారు. వారాలు అయ్యేకొద్ది వీళ్లలో గెలిచి నిలిచేది ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: భార్య చెప్పిందని ఆఫర్ వదులుకున్న నటుడు? ఇంద్రనీల్ ఏమన్నాడంటే?)Edhi ela miss ayyam Abba🤣🤣#BiggBossTelugu8 #VishnuPriya pic.twitter.com/5XU6fKxeRm— Kishore (@kishorekish13) September 2, 2024 -
#BiggBoss8 : ‘బిగ్‌బాస్ 8’ సీజన్లో 14 మంది హౌస్మేట్స్ వీళ్లే (ఫొటోలు)
-
Bigg Boss 8: పద్నాలుగోవారం విష్ణుప్రియ ఎలిమినేట్
తెలుగు బుల్లితెర యాంకర్‌గా విష్ణుప్రియ పేరు అందరికీ సుపరిచితమే! పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా అలరించిన ఈ బ్యూటీ కామెడీ స్కిట్స్‌లోనూ పాల్గొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ మానస్‌తో కలిసి చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జేడీ చక్రవర్తి తన ఫస్ట్ క్రష్ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ అప్పట్లో నానా హంగామా చేసింది. కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఏకంగా హౌస్‌లోనే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లలో ఈవిడే జనాలకు కాస్త ఎక్కువ పరిచయమున్న ఫేస్. అందచందాలతో అల్లాడించే ఈ యాంకర్ పృథ్వీ అనే కంటెస్టెంట్ వెనకాల పడి ఆటపై ఫోకస్ పెట్టడం మర్చిపోయింది. దాంతో ఫైనల్స్‌లో ఉండాల్సిన ఆమె పద్నాలుగోవారంలో ఎలిమినేట్ అయింది. -
కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా?
యాంకర్, నటి విష్ణుప్రియ బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందని ప్రతి ఏడాది రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ప్రచారం కాస్త ఊపందుకుంది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోకి విష్ణుప్రియ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ఊహాగానాలపై విష్ణుప్రియ స్పందించింది.అదే జరిగితే బిగ్‌బాస్‌లో ఉంటాఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వెళ్తే నేను పది కిలోల బరువు తగ్గుతానన్న నమ్మకముంది. నిజానికి నాకు బిగ్‌బాస్ షోకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఎందరో ప్రేక్షకుల దీవెనల వల్ల రియాలిటీ షోలో అడుగుపెడతానేమోనని భయమేస్తోంది. చాలామంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా మీరు నన్ను బిగ్‌బాస్‌లో చూస్తారు అని చెప్పింది. అక్కడే ఉన్న రీతూ చౌదరి సైతం.. నాది కూడా విష్ణుప్రియలాంటి పరిస్థితే అని పేర్కొంది.జీవితంలో వెళ్లనుకాగా విష్ణుప్రియ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా జీవితంలో బిగ్‌బాస్‌కు వెళ్లను అని చెప్పింది. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఆ హౌస్‌లోకి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. చిన్నప్పటినుంచి బిగ్‌బాస్ చూడలేదని, దానిపై అంత ఆసక్తి లేదంది. పైగా అందులోని గొడవలు, ఎలిమినేషన్ తనకసలు నచ్చవంది.చదవండి: Kalki 2898 AD: గుడ్ న్యూస్.. చవక రేటుకే కల్కి టికెట్స్ -
విల్లులా ఒళ్లు వంచేసిన షాలినీ.. బిగ్‌బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్!
గులాబీ పెట్టుకున్న గులాబీలో కీర్తి సురేశ్గోల్డ్ కంటే బ్రైట్‌గా మెరిసిపోతున్న శ్రీలీలఒళ్లుని విల్లులా వంచేసి హోయలు పోతున్న షాలీనీ పాండేఅద్దాల డ్రస్సులో జిగేలుమనేలా హెబ్బా పటేల్అందాల కుందనపు బొమ్మలా యాంకర్ విష్ణుప్రియజడతో పరాచకాలు ఆడేస్తున్న శ్రుతిహాసన్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న బిగ్‌బాస్ స్రవంతిAngel in Gold 💫 Our @sreeleela14 as showstopper, show openerThrowback to @TimesFashionWk @BangaloreTimes1 By @studiobhargavi #Sreeleela pic.twitter.com/9a6qaKvunH— Team Sreeleela (@Teamsreeleela) July 30, 2024 View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
విష్ణుప్రియ మాస్ డ్యాన్స్.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన పూనమ్!
'పుష్ప 2' మెలోడీ పాటకి విష్ణుప్రియ హాట్ డ్యాన్స్తడి అందాలతో తెలుగు యాంకర్ ఇందు'ప్రేమలు' హీరోకి క్యూట్ బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్నెమలి ఫించాలతో హాట్నెస్ పెంచేసిన నార్త్ బ్యూటీవింటేజ్ స్టైల్లో మరింత అందంగా అమృత అయ్యర్బిగ్ బాస్ 7 రతిక అందాల విందు.. మీరు చూశారా? View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Virti vaghani (@virtivaghani_) View this post on Instagram A post shared by Salony Luthra (@salonyluthra) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) View this post on Instagram A post shared by Indhu oruganti (@anchor.indu) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aɴᴜsʜᴀ Hegde (@anushahegde__official) View this post on Instagram A post shared by RAFTAAЯ (@raftaarmusic) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.' ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది. తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు. ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్ అవసరం కూడా ఉండదు. తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్‌కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది. ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్ అన్నాడు ఆమెతో. ‘ఇన్షా– అల్లాహ్!’ మజీద్ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు. తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు. ‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్. ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్. ‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’ ఆ ఊళ్ళో అజీజ్ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్ కబాబ్ కానీ మరోటి కానీ మజీద్‌కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్‌ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని. ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్. ‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్ తీసుకునేవాడు. అజీజ్ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్‌కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు. ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్ లెనిన్ బోల్ట్’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు. ‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు. ఈ యుధ్ధంలోనే అజీజ్ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి. ‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది. అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు. ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్ అన్నాడు. ‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్!’ ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్. ‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’ ‘అబ్బా, మజీద్! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’ ‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’ అజీజ్ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్ వెనక్కెళ్ళి కూచున్నాడు. ‘అస్సలామలేకుమ్!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్ కేబుల్స్ కోసం అడిగారు. అజీజ్ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్. ‘పర్లేదులే’ మజీద్ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్ వైపు చూశాడు. ‘ఎంతివ్వాలి?’ ‘ఎంత బాబూ, యాభై షిల్స్ అంతే!’ ‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్ జేబులని వెతుకుతూ అన్నాడతను. మజీద్ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు. ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు. ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్’ అన్నాడు అజీజ్. తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్. అంగీకారంగా తలూపి అజీజ్ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్ లైన్స్ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది. ‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.’ ‘మజీద్! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ ‘హు! ఈ సర్కస్ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’ ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్ రాజు కూడా చూపలేడేమో!’ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’ ‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’ ‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్. అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో! చాప మడుస్తూ ఎందుకనో మజీద్ ఆలోచనలో పడ్డాడు. ‘ఏమిటంత ఆలోచన మజీద్?’ ‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’ ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్. ‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’ ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్. ‘అంటే, ఇదే న్యాయమంటావా?’ ‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’ అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్. మజీద్ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్‌కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్!’ ఆశావహంగా అన్నాడు అజీజ్. ‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్. ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్ దృష్టి మరల్చడానికి అజీజ్ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్ తన భోజనాన్ని తీసుకొచ్చాడు. రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు. అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్ గబగబ అజీజ్ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి! ప్రతిరోజూ తెల్లవారే అజీజ్ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్ కోసం తెస్తుంటాడు. అజీజ్ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్. ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు. పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్‌లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం. ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్. ‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్. వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు. ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి. కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి. తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి! ‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది! శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ డాక్టర్ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి. ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్‌ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది. శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్ మనసు మొద్దుబారిపొయింది. ‘అల్లా హు అక్బర్! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు. ‘మజీద్.’ ‘ఏం చేస్తుంటావు?’ ‘చెప్పులు కుడతాను.’ ‘ఎక్కడుంటావు?’ ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’ క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు. ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’ ‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’ ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’ మజీద్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు. ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్! చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి! ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. — మూల కథ : ది సైన్ (ఇంగ్లిష్) రచయిత్రి : స్నేహ సుసాన్ షిబు తెలుగు అనువాదం: డాక్టర్ యు విష్ణుప్రియ. ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం! -
తల్లి వర్ధంతి.. యాంకర్ విష్ణుప్రియకు డైమండ్ గిఫ్ట్!
యూట్యూబ్ నుంచి వచ్చి బుల్లితెర సెలబ్రిటీగా మారింది యాంకర్ విష్ణుప్రియ. యాంకర్‌గా, నటిగా అలరించిన బ్యూటీ ఈ మధ్య షోలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ మానస్‌తో కలిసి జరీ జరీ పంచెకట్టి అనే ప్రైవేట్ సాంగ్‌లో ఆడిపాడింది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన ఈ పాట ఏకంగా 61 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. సిల్వర్ స్క్రీన్‌పై హవా తగ్గించేసిన ఈ బ్యూటీ తరచూ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు చెక్కేస్తోంది. చెల్లి గిఫ్ట్.. అక్క ఫుల్ ఖుషీ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడూ యూట్యూబ్‌లోనూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది. తాజాగా తనకు చెల్లి డైమండ్ నగలు బహుమతిగా ఇచ్చిందోచ్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఒకరోజు నేను నా చెల్లి పావనిని ఇంటినుంచి తరిమేశాను. ఆమె ఈ రోజు ఏ స్థాయికి ఎదిగిందంటే తన సొంతకారులో ఏఎమ్బీకి తీసుకెళ్లి వజ్రాభరణాలు కొనిచ్చింది. అమ్మ మొదటి వర్ధంతి.. తను కష్టజీవి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నప్పటినుంచి తనకు నేను ఎటువంటి లగ్జరీలు ఇవ్వలేదు. తను మాత్రం నాకు ఈ రోజు డైమండ్ కొనిచ్చింది. ఇక్కడో విషయం చెప్పాలి. గతేడాది జనవరి 26న అమ్మ చనిపోయింది. అమ్మ వర్ధంతికి ఒకరోజు ముందు తన రూపంలో ఈ గిఫ్ట్స్ నాకు వచ్చాయనుకుంటాను' అని చెప్తూ సంతోషపడిపోయింది. చదవండి: 12 ఏళ్ల కష్టం.. పొలం పని చేసుకుందాం, వెళ్లిపోదామన్నా.. -
Vishnu Priya: స్టన్నింగ్ ఫోజులతో విష్ణు ప్రియా అందాలు.. చూస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా? (ఫోటోలు)
-
అనుపమ స్పెషల్ పచ్చబొట్టు.. విష్ణుప్రియని ఇలా చూస్తే మాత్రం!
వంగి మరీ అందాలు చూపిస్తున్న యాంకర్ విష్ణుప్రియ షైనింగ్ ఔట్ ఫిట్‌లో ధగధగా మెరిసిపోతున్న శివాత్మిక బిగ్‌బాస్ భాను శ్రీ బ్లాక్ డ్రస్సులో వయ్యారాలు వెకేషన్లో చిల్ అవుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ టూర్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత హాట్నెస్ పెంచి మరి టెంప్ట్ చేస్తున్న అనుపమ సండే స్పెషల్.. అలాంటి స్టిల్స్‌తో రెచ్చగొడుతున్న మలైకా ఎద అందాలతో మెల్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ ఆరెంజ్ డ్రస్‌లో వావ్ అనిపిస్తున్న శ్రద్ధాదాస్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాజల్ అలా.. మంచు లక్ష్మీ మాత్రం!
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తొలిసారి హాట్ పోజులు పూల డ్రస్ లో కలర్ఫుల్గా 'సామజవరగమన' రెబా మోనికా 'జబర్దస్త్' కొత్త యాంకర్ సిరి హనుమంత్ కిర్రాక్ పోజులు బ్యూటిఫుల్ డ్రస్‌లో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ మంచు లక్ష్మీ మెస్మరైజింగ్ స్టిల్స్.. బ్యాక్ చూపిస్తూ తెల్లని డ్రస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న శ్రీలీల జిగేలు అనేంతలా తయారై వచ్చిన కత్రినా కైఫ్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!
యాంకర్ అంటే ఒకప్పుడు సుమ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు బోలెడంత మంది ఉన్నారు. అనసూయ, రష్మీ, విష్ణుప్రియ.. ఇలా చెప్పుకుంటే పోతే యాంకరింగ్‌కి వీళ్లు గ్లామర్ తీసుకొచ్చారు. వీళ్ల కోసమే షోలు చూసేవాళ్లు ఉన్నారన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సరే ఇదంతా పక్కనబెడితే యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్లో పలు షోలకు యాంకర్‌గా చేసింది. పండగ స్పెషల్ షోల్లో డ్యాన్సులు కూడా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో నటిగా ప్రయత్నాలు చేసింది. గతేడాది 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో హీరోయిన్గా చేసింది. రీసెంట్గా వచ్చిన 'దయ' వెబ్ సిరీసులో జర్నలిస్టుగా నటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇలా అంతా బాగానే ఉన్నాసరే విష్ణుప్రియకు సరిగా అవకాశాలు రావట్లేదు అనుకుంటా. దీంతో తాజాగా ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. 'ఆరోగ్యం పాడైంది. కెరీర్ దెబ్బతింది. షెడ్యూల్స్, రిలేషన్స్.. ఇలా అన్నీ ఖరాబ్ అయినా సరే చిల్ అవుతున్నా' అని టెక్స్ట్ ఉన్న రీల్‌ని తన స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం తన పరిస్థితి ఇలానే ఉందని చెప్పుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే విష్ణుప్రియకి అనారోగ్యం పాలైందా? అని ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. అదే టైంలో కెరీర్ డిస్ట్రబ్ అయిందా? అని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
Anchor Vishnu Priya: అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న విష్ణుప్రియ..(ఫోటోలు)
-
పెళ్లి తర్వాత మరింత హాట్నెస్.. చీరలో ఆ లేడీ యాంకర్
డిఫరెంట్ లుక్‌లో మెగాడాటర్ నిహారిక అందాల విందు చేసిన యాంకర్ మంజూష లైట్ పింక్ ఔట్ఫిట్తో ఆకట్టుకున్న ఈషా రెబ్బా టైట్ జీన్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ వయ్యారాలు టాప్ యాంగిల్ నుంచి గ్లామర్ చూపిస్తున్న నేహాశర్మ ఛైర్‌పై కూర్చుని మరీ కాజల్ అగర్వాల్ సోయగాలు హీటెక్కించే పోజులతో చెమట పట్టించిన కియారా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
Vishnu Priya Bhimeneni: కిక్ ఎక్కించే యాంకర్ విష్ణు ప్రియ భీమినేని కొత్త ఫోటోలు
-
సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!
యాంకర్ విష్ణు ప్రియ పరిచయం అక్కర్లేని పేరు. ఫోక్ సాంగ్స్ చేస్తూ యువతను అలరిస్తోంది. మానస్‌తో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. బుల్లితెరపైనా ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఎప్పుడు వెకేషన్ అంటూ బీచ్‌లు తిరిగే విష్ణుప్రియ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టింది. సమంతను ఫాలో అవుతూ ఆలయాలను సందరిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఈషా ఫౌండేషన్‌లో ఎక్కువగా కనిపించే విష్ణు ప్రియ.. ఇటీవలే నాసిక్ కూడా వెళ్లింది. తాజాగా వారణాసిలో కనిపించింది. (ఇది చదవండి: నా సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారంటే: కాజల్ అగర్వాల్) యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణుప్రియ ప్రత్యేకంగా కనిపించింది. మెడలో దండ వేసుకుని పూర్తి సమంతను గుర్తుకు తెచ్చింది. ఇటీవలే సమంత ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో అచ్చం అలాగే కనిపించింది. అంతే కాకుండా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఫోటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. రీసెంట్గా విష్ణు ప్రియ ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్‌గా చేసిన దయాలో విష్ణుప్రియ ఓ జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) -
టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేడీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓషోలో యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి అంటే తనకిష్టమని.. పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్‌పై స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ పెళ్లి వార్తలపై జేడీ ఏమన్నారో చూద్దాం. (ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..'తమ మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్‌లో నటించాం. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సిరీస్ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు.' అని అన్నారు. ఆ తర్వాత జేడీ ఆమె నేను నటించిన చిత్రాల్లోని పాత్రలతో మాత్రమే ప్రేమలో పడ్డారని తెలిపారు. అంతే తప్ప నాతో కాదు.. మాది గురు శిష్యుల అనుబంధంమని అన్నారు. కాగా.. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'గంగులు' అనే సాంగ్‌తో అభిమానులను పలకరించింది విష్ణుప్రియ. ఈ సాంగ్‌లో బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. (ఇది చదవండి: తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ) -
తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ
యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈ భామ ఆ తర్వాత యాంకరింగ్‌తో క్రేజ్ సంపాదించుకుంది. సుడిగాలి సుధీర్‌తో చేసిన 'పోవే పోరా' షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తుంది. రీసెంట్గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్‌గానూ మారింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్‌హాట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ చలాకీగా ఉండే విష్ణుప్రియ జీవితంలో ఇటీవలె తీరని విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె ఆమె తల్లి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మథర్స్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ షోలో తన తల్లిని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణుప్రియ. 'మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురిగానే పుడతానమ్మా. ఐలవ్ యూ' అంటూ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
అచ్చం సిల్క్‌స్మితలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
బోల్డ్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసిన ఆమె దశాబ్దానికి పైగా ఓ వెలుగు వెలిగింది. నిషా కళ్లు,హస్కీ వాయిస్, గ్లామర్‌తో హీరోయిన్లకు పోటీ ఇచ్చిన సిల్క్ స్మిత వారికి ధీటుగా స్టార్డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఐటెం సాంగులతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిల్క్ దాదాపు స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోస్ సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ అమ్మాయి అచ్చుగుద్దినట్లు సిల్క్ స్మితను పోలినట్లు ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూనియర్ సిల్క్‌గా గుర్తింపు పొందిన ఆ అమ్మాయి పేరు విష్ణుప్రియ. చూడటానికి అచ్చం జిరాక్స్ కాపీలా ఉన్న ఆమె సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. నటిగా రాణించాలన్నది తన కోరిక అని, అంతేకాకుండా సిల్క్ స్మిత తన ఫ్యామిలీకి ఎంతో సహాయం చేసిందంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gandhi Vishnu Priya (@ivishnupriyagandhi) View this post on Instagram A post shared by Gandhi Vishnu Priya (@ivishnupriyagandhi) -
నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది. విష్ణుప్రియ పోవే పోరా షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. (ఇది చదవండి: ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ) ఇటీవలే 'గంగులు' అనే సాంగ్‌తో అభిమానులను పలకరించింది. ఈ సాంగ్‌లో బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఓ టీవీ షో పాల్గొన్న విష్ణుప్రియ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీరు ఎవరైనా సెలబ్రిటీతో క్రష్‌లో ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఇటీవలే జేడీ చక్రవర్తితో ప్రేమలో పడ్డా. ఓ వెబ్ సిరీస్ కోసం మంగళూరులో ఆయనతో జర్నీ చేశా. పది రోజులకే ఆయనపై మనసు పారేసుకున్నా. అయితే ఆయన వయసులో నాకంటే పెద్దవారు. ఆంటీ ఓకే చెబితే వాళ్లింటికి కోడలిగా వెళ్తా. జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నా' అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది. మీ ప్రేమ పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా? అని మళ్లీ అడిగేసరికి.. 'నేనైతే నా మనసులో మాట చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు' అంటూ చెప్పుకొచ్చింది. కాగా జేడీ చక్రవర్తి.. నటి అనుకృతిని 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: -
అలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడొస్తుందో?: టాలీవుడ్ యాంకర్
యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే ఇటీవలే 'గంగులు' అంటూ సాంగ్‌తో అభిమానులను పలకరించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచుగా తన ఫొటోలు, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. అయితే తాజాగా విష్ణు ప్రియ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఏప్రిల్ 14న బాలీవుడ్ కపుల్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కారులో వెళ్తున్న ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఫ్యాన్స్‌ను పలకరించారు. అందరూ చూస్తుండగానే ఆలియా.. తన భర్తకు ముద్దుపెట్టింది. ఈ వీడియో చూసిన విష్ణుప్రియ క్రేజీ కామెంట్స్ చేసింది. 'ఓ దేవుడా! ఇలా ముద్దు పెట్టుకునే అవకాశం నాకెప్పుడొస్తుంది' పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. గతంలో మానస్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ మరోసారి సందడి చేసింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఈ పాటకు మానస్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌కు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి పాల్గొన్నారు. -
అమ్మా, నీ ప్రేమను ఎవరూ రీప్లేస్ చేయలేరు: విష్ణుప్రియ భావోద్వేగం
గత నెలలో తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది యాంకర్ విష్ణుప్రియ. అప్పటినుంచి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె తల్లి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ మరోసారి భావోద్వేగానికిలోనైంది. ఫిబ్రవరి 15న తల్లి బర్త్‌డే కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'నీ ప్రేమ, ఎనర్జీని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నా డార్లింగ్ ఏంజెల్‌ను ఇప్పటికీ, ఎప్పటికీ మిస్ అవుతాను. లవ్ యూ అమ్మ' అని తనపై ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో వ్యక్తీకరించింది. ఇక వీడియోలో అమ్మతో గడిపిన సరదా క్షణాలను, జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే తల్లి ఫోటోకు నమస్కరించిన ఫోటోను చూపించింది. వీడియో చివర్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను జత చేసింది. 'నా జీవితంలో ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే' అని చెప్పుకొచ్చింది. కాగా జనవరి 26న విష్ణుప్రియ తల్లి తుదిశ్వాస విడిచింది. మరోవైపు విష్ణుప్రియ స్నేహితురాలు, నటి రీతూ చౌదరి సైతం ఇటీవలే తన తండ్రిని కోల్పోగా ఇప్పటికీ ఆ బాధలో నుంచి తేరుకోలేకపోతోంది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) చదవండి: రెండుసార్లు బ్రేకప్.. అది నాకు బ్లాక్ డే అంటున్న బ్యూటీ -
యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఆమె తల్లి కన్నుమూశారు. తన తల్లి మరణవార్తను సోషల్ మీడియాలో వెల్లడించింది విష్ణుప్రియ. 'నా ప్రియమైన అమ్మ.. ఈ రోజువరకు నువ్వు నావెంటే ఉన్నందుకు వేవేల కృతజ్ఞతలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత కూడా! నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. ప్రతిచోటా.. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వే ఉంటావు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డావు. నా కోసం చేసిన త్యాగాలకు, నాపై కురిపించిన ప్రేమకు నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీనికి తల్లితో కలిసున్న ఫోటోను జత చేసింది. కాగా విష్ణుప్రియ, జబర్దస్త్ రీతూ చౌదరి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరిద్దరూ వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. ఈ మధ్యే రీతూ చౌదరి తండ్రి మరణించగా తాజాగా విష్ణుప్రియ తల్లిని కోల్పోవడంతో ఇద్దరి ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) చదవండి: జమున కన్నుమూత కోలీవుడ్ విలన్‌తో ప్రేమలో నటి -
Anchor Vishnupriya: థాయ్‌లాండ్ వ్యాకేషన్లో విష్ణు ప్రియ (ఫొటోలు)
-
ప్రేమికుల డ్రగ్స్ దందా.. సహజీవనం చేస్తూ.. డాన్‌గా ఎదగాలని
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ దందా చేస్తున్న కేరళకు చెందిన ప్రేమికులను శనివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 25 లక్షల విలువైన డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్నారు. చందాపురలోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్న సిగిల్ వర్గీస్, విష్ణుప్రియాను పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ ఎస్టీ శరణప్ప తెలిపారు. ఓ అంతర్జాతీయ పెడ్లర్‌ను రోల్‌మాడల్‌గా చేసుకుని వీరు డాన్‌గా ఎదగాలని మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేలింది. నిరి్ధష్టమైన స్థలాల్లో డ్రగ్స్ ఉంచి కస్టమర్లకు లొకేషన్ షేర్ చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేసుకునేవారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 100 గ్రాములు ఎండీఎంఏ, 150 గ్రాములు ఎస్‌ఎల్‌డీ మాత్రలు, డ్రగ్స్ వ్యవహారాల డైరీ, ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్ ఫొటోలను స్వాధీనం చేసుకున్నామని శరణప్ప తెలిపారు. చదవండి: (సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు హరి కన్నుమూత) -
సీరియల్ నటి ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి
టీవీ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆమె తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొండంత అండను కొల్పొయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తండ్రితో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా గుండె ఎప్పటికి కోలుకోలేదు డాడీ. నా సూపర్ హీరో, బిగ్గెస్ట్ బ్లెస్పింగ్ కోల్పోయాను. ప్రతి క్షణం నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను... కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విష్ణు ప్రియ భావోద్వేగానికి లోనయ్యింది. కాగా విష్ణుప్రియ ప్రస్తుతం తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో బిజీగా ఉంది. ఇక ఆమె తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నటుడు నరేశ్ -
మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఫేస్బుక్ పేజీలో అశ్లీల ఫొటోలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి చూసి అంత షాక్ ఒక్కసారిగా అయ్యారు. విష్ణు ప్రియ ఎంటి ఇలాంటి ఫొటోలు షేర్ చేసిందంటూ ఆశ్చర్యపోయారు. చదవండి: ‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా చివరకు తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని, తన పేజీని అన్‌ఫాలో చేయాల్సిందిగా ఆమె తన ఫాలోవర్స్‌కు సూచించింది. అయితే అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ తన పేజీలో న్యూడ్ వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీంతో తన స్నేహితులు, బంధువుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్‌కాల్స్ వచ్చాయట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలాటే నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి ఫేస్బుక్లో ఆ వీడియోలు ఎంటని అడుగుతున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కాదు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? పదే పదే నా అకౌంట్‌ను ఎందుకు హ్యాక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ అంటూ తన స్నేహితుల వద్ద ఆమె వాపోయిందట. కాగా ఆమె ఫేస్బుక్ పేజీతో తరచూ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట, అప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్న విష్ణు ప్రియ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని, ఎందుకు సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం లేదని.. తన పేజీని ఎందుకు డిలిట్ చేయడం లేదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
తన ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, స్పందించిన విష్ణుప్రియ
-
విష్ణుప్రియ ఫేస్బుక్లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు!
నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఆ మధ్య పలు షోలు చేస్తూ బుల్లితెరపై సందడి చేసిన ఆమె తర్వాత సినిమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇటీవలే బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి చేజారుతున్నవ్రో అనే ప్రైవేట్ సాంగ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఎప్పుడూ ఫొటోషూట్స్‌తో బిజీగా ఉండే విష్ణుప్రియ దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ స్టోరీలో మహిళల నగ్న ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు ఫొటోలతో పాటు కొన్ని అశ్లీల వీడియోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. విష్ణుప్రియ ఇలాంటివి పోస్ట్ చేసిందేంటని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విష్ణుప్రియ స్పందించింది. 'అసలేం జరిగింది అంటూ పొద్దున్నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. నా ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా ఇంకా నా అకౌంట్ నా చేతికి రాలేదు. ఇప్పటికే ఇలా రెండుసార్లు జరిగింది. ఆ పేజీని రిపోర్ట్ చేయండి. అన్‌ఫాలో చేయండి. నా పేజీలో అశ్లీల కంటెంట్ రావడంతో మీరు చాలా ఇబ్బందిపడ్డారు. అందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. నా అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని దయచేసి అందరికీ తెలియజేయండి' అని కోరింది. చదవండి: మోకాళ్లపై తిరుపతి మెట్లెక్కిన హీరోయిన్ కంటెస్టెంట్లను పస్తులుంచిన బిగ్‌బాస్ నటి ఆత్మహత్య కేసు, దంపతులను పట్టిస్తే రివార్డ్ -
కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు..
యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆతర్వాత యాంకర్‌గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రీసెంట్గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇటీవల ఆమె జరీ జరీ అనే అల్భం సాంగ్‌తో ఉర్రుతలుగించింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్‌హాట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. బిగ్‌బాస్ ఫేం మానస్‌తో కలిసి ఆమె చేసిన ఈ అల్భమ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ సాంగ్ ఆఫర్ తనకు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వల్ల వచ్చిందని, ఆపాటకు ఆయన తన పేరును రెఫర్ చేశారని చెప్పింది. ఇక ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ అంటున్నారు.. మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘అవును పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ అనేది నిజమే. అయితే అది పోవడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకు స్వతంత్య్రం వచ్చింది. ఆడవాళ్లు కూడా ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆయా రంగాల్లో మహిళలు రాణించాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా 15-20 ఏళ్లలో ఆడవాళ్లు కూడా మగవాళ్లకు పోటీగా వస్తారు’ అని చెప్పింది. చదవండి: ‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’ ఇక కాస్టింగ్ కౌచ్‌పై అభిప్రాయం అడగ్గా.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా ఉందని చెప్పింది. ‘కాస్టింగ్ కౌచ్ అనేది అన్నిచోట్ల ఉంది. కానీ అది చూస్ చేసుకోవలా? వద్దా? అనేది ఆడవాళ్ల చేతిలో ఉంది. మనకు ఎప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏది చూస్ చేసుకోవాలన్నది అమ్మాయి వ్యక్తిగతం. అదే నన్ను చూసుకోండి. ఆఫర్స్ కోసం చూస్తున్న సమయంలో నన్ను కూడా చాలా మంది కోరిక తీర్చాలని అడిగారు. దానివల్ల ఎన్నో ఆఫర్లు వదులున్నా’ అని చెప్పుకొచ్చింది. అనంతరం తనకు యాంకర్ అనే ట్యాగ్ వద్దని, అలా పిలిపించుకోవడం ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇక్కడ తన కంటే అందంగా, చాలా బాగా తెలుగు మాట్లాడే యాంకర్స్ ఉన్నారని, వారితో సమానంగా యాంకర్ అని పిలుపించుకుని ఆ పదం విలువ తీయలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. -
శ్రీవారి సేవలో రీతు చౌదరి, విష్ణుప్రియ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరిలు గురువారం సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం కొండపైన గజ, గోసంరక్షణ శాలలను వారు సందర్శించారు. గజలక్ష్మి (ఏనుగు)తో ఫొటోలు దిగి సందడి చేశారు. -
బుల్లితెర నటి బర్త్‌డే, బోలెడు బంగారం గిఫ్టిచ్చిన నటుడు
బుల్లితెర నటి విష్ణు ప్రియ సీరియల్స్‌లో తన నటనతో అదరగొడుతోంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో తగ్గేదే లేదన్నట్లుగా సీరియల్స్‌తో అలరిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్న ఈ బ్యూటీ తన బర్త్‌డే కోసం షాపింగ్ చేసింది. బర్త్‌డే షాపింగ్ అంటే డ్రెస్సులు, మ్యాచింగ్ జ్యువెలరీస్ అనుకునేరు, కానే కాదు.. తన భర్తతో కలిసి బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లింది. తనకు నచ్చిన గాజులు, నెక్లెస్, ఇయర్ రింగ్స్‌లు ఎంపిక చేసుకుంది. ఇవన్నీ కలిపితే 200 గ్రాములకు పైనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. భార్య సెలక్ట్ చేశాక బిల్లు కట్టడమే తరువాయి అన్నట్లుగా వాటన్నింటినీ ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించాడు ఆమె భర్త, నటుడు సిద్దార్థ్ వర్మ. బంగారం లాంటి భార్య పుట్టినరోజుకు ఈమాత్రం గోల్డ్ జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వలేనా అంటున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను 'నా బర్త్ డేకి మావారి బంగారు కానుక' అంటూ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: ఇలాగైతే జనాలు థియేటర్‌కు ఎందుకు వస్తారు: నరేశ్ ఫైర్ బిగ్‌బాస్ పింకీ పెళ్లి? యాంకర్ రవి ఏమన్నాడంటే? -
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా: విష్ణు ప్రియ
యాంకర్ విష్ణు ప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్ ఫొటోషూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేస్తుంటుంది. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే ఈ క్రమంలో సినిమాల్లో అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న ఆమె ఏకంగా హీరోయిన్ చాన్సే కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. వాంటెడ్ పండుగాడ్ అనే టైటిల్న ఖారారు చేసిన ఈ సినిమాలో టిక్‌టాక్ స్టార్ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ మూవీ మీడియా సమావేశంలో విష్ణు ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్ కాకుండానే చనిపోతానేమోనని భయపడ్డానంది. ‘నేను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్రరావు గారు పండుగాడ్ చిత్రంలో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన వల్ల నేను హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. కాగా ఇటీవల కొన్ని రోజుల క్రితం రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘మై బెస్ట్ ఫ్రెండ్’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో హాట్‌హాట్ ఫొటోతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆమె మరి హీరోయిన్ ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి. -
పెళ్లి ఎప్పుడో చెప్పిన విష్ణు ప్రియ, ఆలోపే మింగిల్ అవుతానన్నా యాంకర్
Vishnu Priya Gave Clarity On Her Marriage: యాంకర్ విష్ణు ప్రియ తనకు సంబంధించిన ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. పోవే పోరాతో యాంకర్‌గా పరిచయమైన విష్ణు ప్రియా హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తరచూ తన ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సింగిల్స్ డే సందర్భంగా విష్ణు ప్రియ తన పెళ్లి విషయంపై స్పందించింది. ఈ సందర్భంగా త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. నేడు(నవంబర్ 11) సింగిల్స్ డే. చదవండి: కంగనా విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు దీంతో ‘సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి. నమ్మండి నెక్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను సింగిల్‌గా ఉండను. కానీ కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుంది. వీలైనంత వరకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి’ అంటూ స్టోరీ షేర్ చేసింది. ఇక ఆమె స్టోరీ చేసిన వారంత అయితే త్వరలోనే విష్ణు ప్రియ పెళ్లి చేసుకోబోతుందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పెళ్లి తేదీ ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇప్పటి యాంకర్లలో విష్ణు ప్రియ ముందుగా ఇల్లాలు కాబోతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు -
బిగ్‌బాస్ షోలో విష్ణుప్రియ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ? నిజమేనా?
ఏ బిగ్‌బాస్ షోలో అయినా రోజులు, వారాలు గడిచేకొద్దీ గొడవలవుతుంటాయి. కానీ తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో మాత్రం మొదటివారమే కొట్లాటలతో కొనసాగింది. రెండోవారం ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. మూడోవారానికి వచ్చేసరికి ఒక వ్యక్తి క్యారెక్టర్‌కే మచ్చ తెచ్చేలా మాట్లాడారు. వినోదం ఏమో కానీ కలహాలతోనే కాలక్షేపం చేస్తున్నారు కంటెస్టెంట్లు. అందుకే బిగ్‌బాస్ షోకు సరికొత్త రంగులు అద్దేందుకు త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందంటూ గతకొంత కాలంగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే! ఒక లేడీ యాంకర్‌ను రంగంలోకి దింపుతున్నారంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ లేడీ యాంకర్ ఎవరో కాదు, విష్ణుప్రియ అని సోషల్ మీడియాలో సరికొత్త బజ్ వినిపిస్తోంది. త్వరలో విష్ణుప్రియ బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే తనకు బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదని ఎన్నోసార్లు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది విష్ణుప్రియ. ఎన్ని కోట్లు ఇస్తానన్నా, ఎన్ని సీజన్ల నుంచి పిలుపు వచ్చినా షోలో ఎంట్రీ ఇచ్చేదే లేదని పలు ఇంటర్వ్యూల్లో కుండ బద్ధలు కొట్టి చెప్పేసింది. అలాంటిది విష్ణుప్రియ షోలోకి రావడం కేవలం అపోహ అంటున్నారు ఆమె అభిమానులు. బిగ్‌బాస్ అంటేనే గిట్టదన్న విష్ణుప్రియ షోలో పాల్గొనే అవకాశమే లేదని బల్లగుద్ది చెప్తున్నారు. మరి నిజంగానే విష్ణుప్రియ తన మాటమీద నిలబడుతుందా? లేదంటే కళ్లు చెదిరే ఆఫర్ ఇస్తే షోలో ఎంట్రీ ఇస్తుందా? అన్నది చూడాలి! -
పాట పాడిన దీప్తి సునైనా.. స్టెప్పులతో రచ్చ చేసిన విష్ణుప్రియ
యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా పాట పాడుతూ అలరించింది సాయంకాలానా.. అందమైన ఫోటోలు షేర్ చేసింది బిగ్‌బాస్ బ్యూటీ దివి ఫిల్టర్‌లో సారంగ దరియా సాంగ్‌కు పెదవులు కలిపి నవ్వులు పూయించింది యాంకర్ రష్మీ జిమ్ ఫోటోలను షేర్ చేసింది జాన్వీకపూర్ View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
షణ్ముఖ్ జెన్యూన్, కానీ సపోర్ట్ మాత్రం..: విష్ణుప్రియ
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న క్రేజ్‌తో, అభిమానుల సపోర్ట్‌తో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. మొదట్లో కొంత గందరగోళానికి లోనైనా ఇప్పుడిప్పుడే కుదుటపడుతూ ఆట మొదలెట్టాడు. గేమ్ స్టార్ట్ చేశాడో లేదో ఫ్యాన్స్ అప్పుడే ఈ సీజన్ విన్నర్ షణ్ముఖ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల షణ్నూ గురించి మాట్లాడింది ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ. ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ చాలా మంచివాడని, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్ చేయకున్నా సొంతంగా ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని మెచ్చుకుంది. అతడికి అంతా మంచే జరగాలని ఆశించింది. అయితే తాను బిగ్‌బాస్ షో చూడనని, కాబట్టి ఎవరినీ సపోర్ట్ చేయనని కుండబద్ధలు కొట్టింది. తనకసలు బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదని, ఎప్పటికీ ఆ షోలో అడుగు పెట్టనని తేల్చి చెప్పేసింది విష్ణుప్రియ. -
కొంటె చూపులతో పోజులిస్తున్న యాంకర్ విష్ణుప్రియ
-
సోషల్ హల్చల్: శ్రీముఖి చిందులు.. రెజీనా ఆటలు
లంగా ఓణి మెరిసిపోతున్న శ్రీముఖి.. హీందీ పాటలు అదిరే స్టెప్పులు ఏకాంతంగా రెచ్చిపోయి చిందులేసిన యాంకర్ విష్ణుప్రియ పెట్‌తో రెజీనా ఆటలు యోగా చేస్తోన్న తన ఫొటోని పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్ బ్లూ సారీలో దర్శనమిచ్చి, ఓరచూపులు చూస్తూ కుర్రకారు మతులు పొగొడుతోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
సోషల్ హల్చల్: సునీత మెలోడీ.. అలీ కామెడీ
మహేశ్ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సినిమా సెట్లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్ అంటూ యాంకర్, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. సింగర్ సునీత నోట మరో మెలోడీ సాంగ్ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న కమెడియన్ అలీకి ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్ స్వాగతం పలికాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
నాకు కాబోయే భర్త అలా ఉండాలి : యాంకర్ విష్ణు ప్రియ
షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్ అయిన విష్ణు..ఆ తర్వాత సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తుంటుంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో స్నేహితురాలు, యాంకర్ శ్రీముఖితో కలిసి పలు వీడియోలు చేస్తూ ఎంటర్టైన్ చేసేది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన విష్ణు..తన కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది. తనకు ఆషికి-2 సినిమాలో హీరో ఆదిత్యరాయ్ కపూర్‌లాంటి వ్యక్తి భర్తగా కావాలని, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయితే ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో 'వచ్చే జన్మదాకా ఎందుకు ఈ జన్మలోనే నువ్వు కోరుకున్న వ్యక్తి దొరుకుతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఈ టైంలో లవ్ అంటోన్న నటి, నెక్స్ట్ ఏంటన్న బ్రహ్మాజీ
► క్యూట్ ఫొటో షేర్ చేసిన చార్మీ కౌర్ ► రిజెక్ట్ చేసేముందు ఆలోచించుకోండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను షేర్ చేసిన నటి సిమ్రత్ కౌర్ ► సండేను సూపర్‌గా ఎంజాయ్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ► కరోనా టైంలో లవ్ అంటోన్న శిల్పా శెట్టి ► ఊయలూగుతున్న నందినీ రాయ్ ► ఆహార పొట్లాలు పంచుతోన్న మంచు లక్ష్మీ టీమ్ ► తన కన్నా తన పిల్లి క్లారా బాగా రీల్స చేస్తుందంటోన్న శృతీ హాసన్ ► నెక్స్ట్ ఏంటి అని అడుగుతోన్న బ్రహ్మాజీ ► త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
లవ్ యూ అన్న అప్సర.. నవ్వులు చిందించిన నాగబాబు
అంతర్జాతీయ కుటుంబం దినోత్సవం సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది అలానాటి హీరోయిన్ మీనా యాంకర్ అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా అనసూయ, శ్రీముఖితో కలిసి ఉన్నఫోటోని షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది ‘జాతిరత్నాలు’ఫేమ్ ఫరియా అబ్దుల్లా అప్సరరాణి ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలోవర్సు్ 200kకి చేరింది. ఈ సందర్భంగా లవ్ యూ ఆల్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. బ్లాక్ టాప్‌లో అదరగొడుతున్న యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
అక్కా ముఖం చూపించుకోలేకపోతున్నాం.. విష్ణుప్రియ రిప్లై
కరోనా సమయంలో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలను నెటిజన్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది మీ వినోదం కోసమేనంటూ పలువురూ ధీటైన సమాధానమిస్తూ నెటిజన్ల నోరు మూయిస్తున్నారు. ఈ క్రమంలో సారీ కట్టుకున్న ఫొటోలను షేర్ చేసిన విష్ణుప్రియను కూడా కొందరు విమర్శించడం మొదలు పెట్టారు. "అక్కా మా ముఖాలు చూపించలేకపోతున్నాం. మీ ప్రియా చూడు ఎలా పెడుతుందో పిక్స్ అంటున్నారు! కొద్దిగా మంచిగ పెట్టు అక్కా" అంటూ దియా అనే అభిమాని అసహనం వ్యక్తం చేస్తూనే మంచి ఫొటోలు పెట్టంటూ అభ్యర్థించాడు. ఇది చూసిన విష్ణుప్రియ.. నానా దియా.. నువ్వు రాయిలో కూడా దేవుడిని చూడవచ్చు. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే నా వృత్తిలో రకరకాల బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతమాత్రాన నన్ను తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని విష్ణుప్రియ ఘాటుగా సమాధానమిచ్చింది. View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) చదవండి: ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్ -
సూదంటి కళ్లు, తేనేటీగ ఒళ్లుతో చంపేస్తున్న ముద్దుగుమ్మలు
♦ చీరలో మెరుస్తున్న విష్ణుప్రియ ♦ కొన్నేళ్ల క్రితం ఈ స్టంట్ చేశా అంటోన్న భూమిక ♦ చీరతో చిత్రాలు చూపిస్తోన్న అనన్య నాగళ్ల ♦ ప్రేమకు నిజమైన అర్థం అమ్మ అంటోన్న పూజా హెగ్డే ♦ ఎప్పుడూ నవ్వుతూ ఉండంటూ శ్రీముఖికి బర్త్‌డే విషెస్ చెప్పిన నాగబాబు ♦ సూదంటి కళ్లే...పాటకు ఎక్స్‌ప్రెషన్స్‌తో తెగ నవ్వించేస్తున్న శ్రీముఖి ♦ అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? అని అడుగుతున్న తేజస్వి View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా!
సందీప్ బొలినేని, విష్ణుప్రియ, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్ మేట్’. ‘సూటిగా సొల్లు లేకుండా’ అన్నది ఉపశీర్షిక. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వేలంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ వేలంపల్లి మాట్లాడుతూ– ‘‘కొత్త రకం ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘చెక్ మేట్. మామూలుగా ప్రతి ప్రేమకథలో వారి కుటుంబ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి.. అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు క్లోజ్ ఫ్రెండ్ వల్లే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేంటి? స్నేహితురాలి నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తన ప్రేమని గెలిపించుకుంది? అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగమ్మాయి చేస్తే బాగుంటుందని విష్ణు ప్రియని సెలక్ట్ చేశాం. తన ఫ్రెండ్‌గా దీక్షా పంత్ నటించారు’’ అన్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, కృష్ణ భగవాన్, సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, సుధీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: అంజి (‘గరుడవేగ’ ఫేమ్), నేపథ్య సంగీతం: సాగర్ మహతి, సంగీతం–నిర్మాత–దర్శకత్వం: ప్రసాద్ వేలంపల్లి. -
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్‌డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్‌కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌లోకి వెళ్లను : యాంకర్
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్‌బాస్ షోపై ప్రముఖ బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాల్లో సీజన్లో విష్ణుప్రియ పాల్టొంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇటీవల ఓ యూట్యూబ్ చానల్లో విష్షుప్రియ మాట్లాడుతూ.. తనకు బిగ్ బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా బిగ్ బాస్ వెళ్లనని తేల్చి చెప్పింది. ‘బిగ్ బాస్ కన్సెప్టే నాకు నచ్చదు. ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు.. ఎలిమినేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా? లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. మీ ఇళ్లు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా.. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాదు.. చిన్నప్పటి నుంచి కూడా నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇలాంటి షోని నేను ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడూ చేసే పని ద్వారా నా స్టాటస్ పెరగాలని అనుకోను. పది మంది గుర్తించాలని కూడా అనుకోను. నేను చేసిన పనిని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసిన తరువాతే అవతలి వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నా గోల్ ఏంటంటే.. నేను నవ్వుతూ ఉండాలి.. నా చుట్టుపక్కల వాళ్లు కూడా నవ్వుతూ ఉండాలి. అది ఎలా అయినా సరే.. టీవీ కావచ్చు.. సినిమా కావచ్చు. నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి. పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అయితే లేదు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోకి అయితే వెళ్లడం జరగదు. రాసిపెట్టుకోండి. వెళ్తే నన్ను బ్లేమ్ చేసుకోవచ్చు’ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఆమెను బ్లేమ్ చేసే సమయం వస్తుందో రాదో చూడాలి మరి. కాగా, ‘పోవే పోరా' షోతో ఫేమస్ అయిన విష్షుప్రియ.. ప్రస్తుతం వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతుంది. ఇటీవల ఆమె 'చెక్‌మేట్' అనే సినిమాలో అందరాలు ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి : బిగ్‌బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) -
పాము కాటుతో విద్యార్థిని మృతి
డిచ్పల్లి: మండలంలోని యానంపల్లి తండాకు చెందిన ధనావత్ విష్ణుప్రియ(8) అనే విద్యార్థిని పాము కాటుతో మృతి చెందింది. తండావాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి భోజనాలు చేశాక తండాకు చెందిన ధనావత్ శ్రీనివాస్– యమున దంపతులు రోజులాగే తమ ఇద్దరు కూతుళ్లలో ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి వారి పెద్ద కూతురు విష్ణుప్రియ ఏడ్వడంతో నిద్రలేచిన శ్రీనివాస్ లైటు వేసి చూడగా కూతురు కాలిపై పాము కాటు వేసిన గుర్తులు కన్పించాయి. పక్కనే కట్లపాము కన్పించడంతో దానిని కొట్టి చంపివేశారు. వెంటనే విష్ణుప్రియను ఆటోలో చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కన్నీటితో వెనుదిరిగారు. రెండో తరగతి చదువుతున్న విష్ణుప్రియ ఆకస్మిక మృతితో తండాలో విషాదం నెలకొంది. కూతురు మృతదేహాన్ని చూస్తూ శ్రీనివాస్, యమున దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
‘విధి’ విజయం సాధించాలి
రామ్, విష్ణుప్రియ, కల్పన ముఖ్య తారాగణంగా మారుతీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌రెడ్డి బిల్లా దర్శకత్వంలో హనుమంతరెడ్డి నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ చిత్రం పోస్టర్‌ను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించి, ‘‘ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వై.ఎస్. జగన్‌ను శనివారం చిత్రబృందం కలిసింది. చిత్రదర్శకుడు అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగనన్న పాదయాత్ర మహోన్నతమైనది. ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విష్ణుప్రియకు సన్మానం
న్యూజెర్సీ : కళాభారతి న్యూజెర్సీ ఆధ్వర్యంలో నాటా ఐడల్-2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణుప్రియ కొత్తమాసును ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర తెలుగు సంఘాల పెద్దలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో విష్ణుప్రియా కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. ఈ వేడుకలకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణుప్రియకు తన తర్వాతి చిత్రంలో గాయనిగా అవకాశం ఇవ్వనున్నట్లు కళ్యాణ్ మాలిక్ ప్రకటించారు. అనంతరం అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రముఖులు విజేతను అభినందించారు. చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ కళాభారతి జరిపిన కార్యక్రమం ఎంతో బాగుందని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటంలో కళాభారతి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, హోలీ, దీపావళి వంటి పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన చిన్నతనం నుంచి పాల్గొంటున్న విష్ణుప్రియ ఈ అవార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని విజయాలను అందుకోవాలని కళాభారతి సభ్యులు, పెద్దలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు అతిథులను అలరించాయి. -
కర్నూలులో మెడికో ఆత్మహత్య
కర్నూలు హాస్పిటల్ : కర్నూలు మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగంలో పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విష్ణుప్రియ అనే విద్యార్థిని మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం నగరానికి చెందిన ఎన్.వి.మోహన్‌రెడ్డి భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. రెండవ కుమార్తె విష్ణుప్రియకు కర్నూలు మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగంలో పీజీ సీటు రావడంతో మిడుతూరు డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న పిన్ని ఇంటిలో ఉంటోంది. మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు ముగించుకుని స్థానిక చాణక్యపురి కాలనీలోని నివాసానికి చేరుకున్న విష్ణుప్రియ పిన్నికి విష్ణుప్రియ ఉరేసుకుని ఉండడం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలసి విష్ణుప్రియను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చలాకీగా, అందరితో కలుపుగోలుగా ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్నా.. నన్ను క్షమించు. జీవితంలో ఓడిపోయాను. నేను బలహీనురాలిని. పోరాడే ధైర్యం లేదు’ అంటూ విష్ణుప్రియ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నిలా వదిలేయొచ్చుగా!
వేదిక రెండేళ్లక్రితం నాకు పెళ్లయింది. ఈ మధ్యనే నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను. అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నాను. అసలేమైందంటే మా అమ్మానాన్నలకు నేను ఒక్కగానొక్క కూతుర్ని...ఏ లోటు లేకుండా పెంచారు అమ్మానాన్నా. చదువు పూర్తయిపోగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐదంకెల జీతం. ఓ ఏడాది తర్వాత అమ్మానాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు నా భర్త గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. మంచి చదువు, ఉద్యోగం, అందగాడు, ఆస్తిపరుడు....ఇలా ఆకాశానికి ఎత్తేయడంతో అమ్మానాన్న అడిగినంత కట్నం ఇచ్చి...గ్రాండ్‌గా పెళ్లి చేసి నన్ను అతనికి కట్టబెట్టారు. పెళ్లి సమయంలో నేను ఒక నెలరోజులు సెలవు పెట్టాను. దాంతో పెళ్లి తర్వాత చాలారోజులు ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ సమయంలో నా భర్త నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఎప్పుడైతే నేను ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టానో ఆయన అసలు రూపం భయపడడం మొదలైంది. ఒళ్లంతా అనుమానమే ఆయనకి. ఉదయం ఓ పది నిమిషాలు ముందు బయలుదేరినా, సాయంత్రం ఓ పావుగంట ఆలస్యమైనా సవాలక్ష ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. ఆయన ప్రవర్తన గురించి మా అత్తగారికి చెబితే... ‘నువ్వు...వాడి మాటలేం పట్టించుకోకు’ అనేవారు. కానీ ఆయన అనే మాటలు, ఆయనకొచ్చే అనుమానాలు చాలా భయంకరంగా ఉండేవి. ఊహించడానికి వల్లకాని నిందలు వేసేవారు. నా స్నేహితురాలితో చెబితే...‘ఇలాంటి సమస్యలు చాలామంది ఆడవాళ్లకు తప్పడం లేదు. నీ భర్త కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తే ముందు నీ పరువే పోతుంది. నిప్పులేకుండా పొగరాదు కదా!, ఈ రోజు అమ్మాయిల్ని నమ్మడానికి లేదు...లాంటి డైలాగులన్నీ నీ చెవిన పడతాయి. వాటిని విని తట్టుకోగల శక్తి ఉంటే నీ భర్త గురించి పెద్దవాళ్లకు చెప్పి బుద్ధి చెప్పించు’ అంది. నాకంత ఓపిక లేక...ఓ ఏడాదిపాటు నోరునొక్కుకుని భరించాను. ఆయన దుర్మార్గం రోజురోజుకీ ఎక్కువైపోవడంతో భరించే శక్తి లేక ఒకరోజు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆయనపై గృహహింస కేసు పెట్టాను. అమ్మానాన్న...బంధువులు, స్నేహితులు అందరూ షాక్. ‘నువ్వేనా ఇంత పనిచేసింది!’ అంటూ ఆశ్చర్యపోయారు. అమ్మానాన్నా నా బాధను అర్థం చేసుకున్నారు. అలాంటి అనుమానపు రాక్షసుణ్ణి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మధ్యనే విడాకులు వచ్చేశాయి. నేను అదే ఉద్యోగంలో కొనసాగుతున్నాను. నేను నా భర్త నుండి విడిపోయానని తెలియగానే నా చుట్టుపక్కలవారు నన్ను కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టారు. వారి చూపుల్లో అర్థం మారింది. వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పనని తెలిశాక నాతో మాటలు కూడా తగ్గాయి. బంధువులు మాత్రం అమ్మానాన్నలను ‘అమ్మాయిని అలా వదిలేయకండి! ఏదో ఒక దారి చూడండి’ అంటూ తరమడం మొదలెట్టారు. నాకు మాత్రం మళ్ళీ పెళ్లంటే భయం వేస్తోంది. నన్నిలా ప్రశాంతంగా వదిలేయొచ్చుగా! - విష్ణుప్రియ, పఠాన్‌చెరువు, హైదరాబాద్ -
నేను... నా ఫ్రెండ్స్
రచయిత జీఎస్ రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేను... నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్దార్థ్‌వర్మ, హరీష్, రవి, అంజన, విష్ణుప్రియ, హారిక, కృతిక, సంగీత ఇందులో హీరో హీరోయిన్లు. పరుచూరి గోపాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు సినిమా క్రియేషన్స్ పతాకంపై గండెల హరిత సమర్పణలో వి.మధుసూదన్, సాయిమేథ రమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశామని, అతి త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, సహనిర్మాతలు: మోహన్‌రెడ్డి, చాగూరు రవి, సి.శ్రీనివాసరావు, కిశోర్.