West godavari
-
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్‌షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్‌ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఏపీలో మూడు స్థానిలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ మరో గంటలో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్..ఇప్పటికే 80శాతం పైగా పోలింగ్ నమోదు.. విశాఖ: కొనసాగుతున్న ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం నమోదుడబ్బులు పంచుతున్న కూటమి నేతలుకాకినాడ..పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకి నోటుఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపగలే డబ్బులు పంచుతున్న కూటమి నేతలుపిఠాపురంలో బరితెగించిన కూటమి నేతలుకూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌కి ఓటు వేస్తే మూడు వేలు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలుమున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు రూ.3 వేలు పంచుతున్న వైనంఓటుకి మూడు వేలు పంచుతున్నా చర్యలు తీసుకోని అధికారులువిశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్..ఆరు జిల్లాల్లో 12 గంటల వరకు 57.71% పోలింగ్ నమోదు..కృష్ణాజిల్లా..ఎమ్మెల్సీ ఎన్నికల పోల్ పెర్సెంటేజ్.....మధ్యాహ్నం 12.00గంటల వరకు..మొత్తం ఓటర్లు: 63,114పోలైన ఓట్లు :19,306పురుషులు: 11,330స్త్రీలు :7,976ఓటింగ్ శాతం: 30.59%. విశాఖ..ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్ హాజరవుతున్న ఉపాధ్యాయులు..విశాఖ జిల్లాలో మొదటి నాలుగు గంటల్లో 44.4 శాతం పోలింగ్ నమోదు..టీడీపీ నేతల బరితెగింపు..కృష్ణాజిల్లా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల ప్రలోభాలుపోలింగ్ కేంద్రాల వద్దే బరితెగిస్తున్న టీడీపీ నేతలుఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ నేతలుపెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలుఓటు వేసేందుకు వెళ్తున్న గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తున్న అధికార పార్టీ నేతలుపోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హల్చల్..కృష్ణాజిల్లా..గుడివాడలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు హల్చల్.నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రమైన ఎస్పీఎస్ స్కూల్ ప్రధాన గేటు ముందు తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు.ఓటు వేసేందుకు వెళుతున్న పట్టభద్రులకు.. కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాము, నేతలు.టీడీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు.గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సీపీఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి.నిబంధన ప్రకారంగా నిర్దేశించిన దూరంలో ఉండాలంటూ టీడీపీ నేతలకు సూచించిన ఆర్డీఓ బాల సుబ్రమణ్యం.ఆర్డీవో వెళ్లిన తర్వాత తిరిగి గేటు వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు.విశాఖ.. 10 గంటల వరకు 21.66 శాతం పోలింగ్ నమోదు..విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ..పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు క్యూ కడుతున్న టీచర్స్...కొనసాగుతున్న 144 సెక్షన్పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్..ఉత్తరాంధ్ర జిల్లాలలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...మొత్తం ఓటర్లు 22,493 మంది...బరిలో 10 మంది అభ్యర్థులు...ఇప్పటివరకు 6% పోలింగ్ నమోదయింది...ఇప్పటి వరకు సమస్యత్మీక ప్రాంతాలు ఏవి గుర్తించలేదుసాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది...90 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నాం.. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.👉పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ 👉ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.👉ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు.👉ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. -
జనసేన ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
AP: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
-
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు
గోవా: న్యూఇయర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోవాలో ఏపీ టూరిస్ట్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.బీచ్ షాక్ యజమాని బీచ్ షాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్‌లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్‌లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్‌కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు.కాగా, గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్‌లు మరణించారు. అంతకుముందు నవంబర్‌లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు. -
డెడ్ బాడీ పార్శిల్ కేసులో వీడిన మిస్టరీ.. వారే నిందితులు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మృతదేహం ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. రంగరాజు కుమార్తెలు తులసి, రేవతి మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి.రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. రంగరాజుకి రెండున్నర ఎకరాల పొలం, బంగారం ఉన్నాయి. రంగరాజు ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ.. తులసి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఈ కుట్రలో ఇరికించాలని ప్రయత్నించాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు వర్మ, రేవతి డ్రామా ఆడారు.ఇదీ చదవండి: డామిట్.. పారని ‘పార్శిల్’ పాచిక (క్రైమ్ స్టోరీ)ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ నెలలో తులసికి పెయింట్స్, టైల్స్ పంపించారు. మూడో పార్శిల్‌గా డెడ్‌బాడీ పంపారు. ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హత్య చేసి ఆ డెడ్ బాడీని పార్శిల్‌గా పంపారు. డెడ్ బాడీ వచ్చినప్పుడు రంగరాజు, ఆయన భార్య, శ్రీధర్ వర్మ, తులసి, రేవతి ఉన్నారు. డెడ్ బాడీ పార్శిల్ బాక్స్‌లో కోటి 35 లక్షల ఇవ్వాలని లేఖ పెట్టారు. ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీ సముద్రంలో పడేస్తానని డబ్బు ఇవ్వాలంటూ శ్రీధర్ వర్మ తులసిని, కుటుంబ సభ్యులను నమ్మించాడు.పోలీసులకు సమాచారం అందడంతో కారులో పరారయ్యాడు. పర్లయ్యను నైలాన్ తాడుతో గొంతు బిగించి శ్రీధర్ వర్మ చంపాడు. పర్లయ్య కంటే ముందు వేరే వ్యక్తి ని చంపడానికి ప్రయత్నించాడు. ప్రధానంగా ఈ కేసులో శ్రీధర్ వర్మ, రెండో భార్య రేవతి, మూడో భార్య సుష్మ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నయీం అస్మీ తెలిపారు.ఇదీ చదవండి: డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు -
డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులకే ఈ కేసు పెను సవాలుగా మారింది. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్‌బాడీ పార్సిల్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీధర్‌వర్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నకొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. సాగి తులసి ఇంటికే డెడ్‌బాడీని శ్రీధర్‌వర్మ ఎందుకు పార్శిల్ చేశాడన్నదానిపై క్లారిటీ వస్తోంది.తన వదిన ఆస్తిని కాజేసేందుకే ఈ స్కెచ్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. తులసికి శవాలంటే భయమన్న విషయం తెలుసుకున్న శ్రీధర్‌వర్మ.. ఆమెను భయటపెట్టేందుకు డెడ్‌బాడీని పంపించినట్టు సమాచారం. వదిన తులసిని భయపెట్టాలంటే.. డెడ్‌బాడీ కావాలి. మృతదేహమంటే.. అదేదో అంగట్లో దొరికే వస్తువు కాదు. అందుకే అమాయకుడైన బర్రె పర్లయ్యను టార్గెట్ చేశాడు శ్రీధర్‌వర్మ. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19 వరకు మృతదేహాన్ని ఎక్కడ దాచారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీధర్ వర్మకు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క అయిన సాగి తులసితో ఆస్తి గొడవలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్‌తో పర్లయ్యను హత్య చేసి డెడ్‌బాడీని పార్శిల్లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.పర్లయ్యను హత్య విషయంలోనూ శ్రీధర్‌వర్మ ముందుగానే పెద్ద ప్లానే వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజు ఇద్దరికి పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇద్దరిలో ఒకరిని చంపి పార్శిల్ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు.బర్రె పర్లయ్య హత్య అంతా శ్రీధర్‌వర్మ మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. పర్లయ్యను హత్య చేసి ఆపై అప్పటికే తాను ముందే సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 17న బర్రె వర్లయ్యను హత్య చేసేందుకు శ్రీధర్ వర్మ పక్కా ప్రణాళికతో చెక్క పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. మద్యం తాగించి అనంతరం ఉండి మండలం వాండ్రం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ చేయడానికి గాంధీనగర్ తీసుకువెళుతుండగా వర్షం కురవడంతో, కారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో శవాన్ని కారులోనే ఉంచి, మరొక పెట్టెను కైకలూరు నుంచికొని తెచ్చాడు. అనంతరం మృత దేహాన్ని గణపవరం మండలం సాగిపాడు వద్దకు పెట్టెలో తీసుకువెళ్లి మూడో భార్య సుష్మ సాయంతో ఆటోడ్రైవర్‌కు అప్పగించి తులసికి డోర్ డెలివరీ చేశారు.ఇప్పటి వరకు అనుమానాస్పద కేసుగా విచారణ చేసిన పోలీసులు దీనిని హత్య కేసుగా మార్పు చేశారు. తులసికి చెందిన ఆస్తిని కాజేయడం కోసమే శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి భీమవరంలోని పలు నగల దుకాణాల్లో బంగారం తాకట్టు పెట్టి, మరికొంత విక్రయించినట్లు తెలియడంతో మూడు బంగారం దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌లో మొదటి భార్య ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి అంటున్నారు.ఇదీ చదవండి: కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను.. శ్రీధర్‌వర్మ హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే శ్రీధర్‌వర్మ ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు శ్రీధర్ వర్మ వృత్తి ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తులసిని ఆస్తి కోసం బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్ బాడీ పార్శిల్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. -
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్‌కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. -
అబద్ధాల కాంపిటీషన్లో బాబుతో పోటీపడలేకపోయాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవని అన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ వేధింపులు, కేసులు మనకు తాత్కాలికం మాత్రమేనని తెలిపారు.ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దేవుడు అన్ని విషయాలు చూస్తున్నాడు అనేందుకు తిరుమల లడ్డూ వివాదం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. బాబుకు దేవుడే మొట్టికాయలు వేశాడు..లడ్డూ విషయంలో విష ప్రచారం చేశారని, వారి ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని గోబెల్స్ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మేయగల సమర్థులని విమర్శలు గుప్పించారు. అయినా లడ్డూ వ్యవహారంలో గట్టిగా నిలబడి ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని తెలిపారు. చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.విచ్చలవిడిగా జూదం, క్లబ్బులుపశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో వైఎస్ జగన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో, నియోజకవర్గాల్లో జూదం, క్లబ్బులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక, మద్యంల్లో స్కాంలు నడుస్తున్నాయని, స్టాక్‌యార్డుల్లో పెట్టిన ఇసుక మాయం అయిపోయిందని విమర్శలు గుప్పించారు. మొత్తం స్టాకుయార్డుల్లో నిల్వలను లూటీ చేశారన్న ఆయన.. ఇప్పుడు ఇసుక ఎక్కడ దొరకడం లేదని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక ధర కన్నా ఇప్పుడు ధర చాలా ఎక్కువ ఉందన్నారు.మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు..‘ప.గో. జిల్లాకు చెందిన నాయకులే చెప్తున్నారు. వైయస్సార్సీపీ హయాంలో టన్నుకు రూ. 550లు అయితే, ఇప్పుడు రూ.1375కు అమ్ముతున్నారని చెప్తున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎవరి జేబుల్లోకి డబ్బు పోతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపులనుంచి ఎమ్మెల్యేలకు వాటాలు, ఆపై వాళ్లకు వాటాలు. గ్రామ, గ్రామాన బెల్డు షాపులు వస్తున్నాయి.మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదుఐదేళ్ల పరిపాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. జగన్ మంచే చేశాడు.. చెడు చేయలేదన్న మాటే ప్రతిచోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాల కాంపిటీషన్లో చంద్రబాబుతో పోటీపడలేకపోయాం. చంద్రబాబు చెప్పినట్టుగా జగన్ చెప్పలేకపోయాడు. చంద్రబాబులా జగన్‌కూడా హామీలు ఇవ్వాలన్నట్టుగా చాలామంది ఎదురుచూశారు. కాినీ, ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా తలెత్తుకునే రాజకీయాలు చేస్తాం.ప.గో.జిల్లా జడ్పీ ఛైర్మన్ పార్టీ మారినా, జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. వారి పోరాట స్ఫూర్తికి అభినందనలు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత మీరు చూపారు. జడ్పీటీసీలు అందరికీ కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శనీయంగా నిలిచింది. ఎప్పుడూ చీకటి మాత్రమే ఉండదు, వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రజల తరఫున పోరాటాలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు వైఎస్ జగన్. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘‘బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలు.. తేడాను గమనిస్తున్నారు.. ‘‘గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు.చంద్రబాబు అబద్ధాలు.. మోసాలుగా మారుతున్నాయి‘‘చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదుకదా.. ఉన్న పలావు పోయింది. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందిచంద్రబాబు సర్కార్‌లో ప్రతీదీ స్కామే....ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి. డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్. నాయుకుల దగ్గరకు వెళ్తే కాని పెన్షన్ రాని పరిస్థితి. పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. కాని వైఎస్సార్సీపీ హయాంలో కన్నా, ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉంది. మన హయాంలో ఇసుక సరసమైన ధరకే దొరికేది, ప్రభుత్వానికీ ఆదాయం కూడా వచ్చేది. వైఎస్సార్సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు, రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణకు పెద్ద పీట వేశాం. అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. ఇలా ప్రతీదీ స్కామే.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!కేసులకు భయపడొద్దు....రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్అన్యాయమైన పరిపాలన సాగుతోంది..‘‘నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీకూడా చేసి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్‌బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
ఏలూరుపాడులో రఘురామకృష్ణంరాజు దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
AP: భయం గుప్పిట్లో కొల్లేరు
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్‌కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
సాక్షి,పశ్చిమ గోదావరి : స్టార్ హీరో అల్లు అర్జున్‌పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.‘తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారు. తన స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారు’ అని తెలిపారు. ‘అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? అని అల్లు అర్జున్ను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
AP: చికెన్ తెగ తినేశారు
సార్వత్రిక పోరు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చికెన్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. నోటిఫికేషన్‌కు ముందు నుంచే విందు భోజనాల హడావిడి మొదలైంది. ఓట్ల పండుగలో నాన్‌వేజ్ వంటకాలెన్ని వడ్డించినా చికెన్‌దే సింహ భాగమైంది. రికార్డు స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు జరగ్గా, గత నెల రోజుల్లో మాంసాహార ప్రియులు రూ.435 కోట్లు విలువైన చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగించేశారు. సాక్షి, భీమవరం: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందు భోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టూ ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు ఆశావాహుల ఇంట నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఈ సందడి మొదలవుతుంది. ఎన్నికల సమీపించే కొద్ది వివిధ సంఘాల వారికి విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో గత నెల రోజులోగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఆతీ్మయ కలయికల పేరిట రాజకీయ విందులే. అభ్యర్థులు తమ ఎన్నికల కార్యాలయాల వద్ద ప్రతి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నామినేషన్లు, ప్రచార కార్యక్రమాల్లో కేడర్ కోసం ప్రత్యేక విందులు వడ్డించారు. మరో పక్క మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలు, ఆటో, తోపుడుబండ్లు యూనియన్లు, వివిధ వర్తక సంఘాలతో పాటు ఎక్కువగా ప్రజల్లో ఉండే పీఎంపీలు, పాస్టర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితర వర్గాల వారికి పోటాపోటీగా ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విందు భోజనాల్లో చేప, రొయ్య వంటకాలు చేసినా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే చికెన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గరిష్ట స్థాయి విక్రయాలు సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ పారీ్టల నేతల నుంచి హోల్‌సేల్ వ్యాపారులకు రోజూ వందల కిలోల చికెన్ ఆర్డర్లు వచ్చాయి. గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అంతకు వారం పది రోజుల ముందు నుంచి చికెన్ ఆర్డర్లు రావడం మొదలైందని వ్యాపారులు అంటున్నారు. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్డర్ల జోరు మరింత పెరిగిందంటున్నారు. రోజువారి అమ్మకాలతో పోలిస్తే సగటున గత నెల రోజులుగా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని వారు తెలిపారు. మునుపెన్నడూ ఇంత భారీస్థాయిలో వరుసగా అమ్మకాలు జరిగింది లేదంటున్నారు. కోళ్లు సిద్ధంగా.. ధర నిలకడగా ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం తదితర ప్రాంతాల్లోని ఫాంలలో ఏడు లక్షలకు పైగా కోళ్ల పెంపకం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి వేసవిలో 40 రోజులకు, శీతాకాలంలో మేత ఎక్కువగా తీసుకోవడం వలన 35 రోజుల్లోనే రెండు కేజీలు వరకు బరువు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రతకు కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. వేసవి తాపం నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు షెడ్లపై వాటర్ స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు తదితర వాటి ఏర్పాటుతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. వేడి చేస్తుందన్న భావనతో చికెన్ వినియోగం తక్కువగా ఉండటం వలన డిమాండ్ లేక ధర పతనమవుతుంది. ఆయా కారణాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వేసవిలో కొత్త బ్యాచ్‌లు తక్కువగా వేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్ కావడం వ్యాపారం బాగుంటుందని ముందే ఊహించి కొత్త బ్యాచ్‌లు సిద్ధం చేయడం వారికి కలిసొచ్చింది. వేసవిలో కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలికే చికెన్ ధర ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూ.280 నుంచి రూ.300 మధ్య నిలకడగా ఉందని హోల్‌సేల్ వర్గాలు అంటున్నాయి. సగటున కిలో రూ.290 చొప్పున సాధారణ అమ్మకాలు మేరకు రోజుకు రూ.7.25 కోట్ల చొప్పున నెలకు రూ. 217.5 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. అయితే నెల రోజులుగా ఎన్నికల నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో జరిగిన అమ్మకాల మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.435 కోట్లు మేర చికెన్‌ను మాంసాహారప్రియులు లాగించేశారంటున్నారు. -
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘ఉండి’ టికెట్ రగడ.. భీమవరంలో ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భీమవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై తెలుగుదేశం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు.. సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సెట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు. -
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టీడీపీ టికెట్ ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి పెట్టారు. మంగళవారం(ఏప్రిల్9) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అనంతరం రామరాజు మీడియాతో మాట్లాడారు. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు..వారు చెప్పినట్టు చెస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా’ అని రామరాజు చెప్పారు. ‘ఉండి’ సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరో చోట టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు ఆందోళనకు దిగింది. రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాగా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని ఇటీవల పాలకొల్లు ప్రచారంలో చంద్రబాబు ప్రకటించడంతో రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి.. మూడు ముక్కలైన ఉండి టీడీపీ -
పశ్చిమగోదావరి: టీడీపీ-జనసేనలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటన ఇరు పార్టీల కేడర్‌కు మింగుడు పడటం లేదు. పొత్తుల పేరుతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు అలకబూనారు. భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గ పోరు నెలకొంది. తణుకు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో విడివాడ రామచంద్రరావు నైరాశ్యంలో మునిగిపోయారు. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనంటూ ఆయన శపథం పూనుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. పోలవరం సీటుపై పంచాయితీ తేలలేదు. టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, లేదా జనసేన నుంచి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమని కేడర్ తేల్చి చెబుతోంది. -
పశ్చిమగోదావరి YSRCP MLA అభ్యర్థుల జాబితా
-
ఉమ్మడి పశ్చిమగోదావరి: టీడీపీలో అసమ్మతి సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రగులుతోంది. పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతయ్యింది. పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు కూడా ఇదే పరిస్థితి.. పొత్తు స్థానాల ఇన్ఛార్జ్లకు ఫోన్ చేసి సీట్లు లేవంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్‌తో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెంలో అసంతృప్తి భగ్గుమంది. డబ్బు ఖర్చుపెట్టి హడావుడి చేసిన తర్వాత పొత్తు పేరు చెప్పి సీటు గల్లంతు చేయడం సరికాదంటూ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వలవల బాబ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్‌కు సీటు కేటాయించాలని నాయకులు తీర్మానించారు. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉంగుటూరులో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకి సీటు కేటాయించాలంటూ చంద్రబాబును కలిసేందుకు భారీ ర్యాలీతో మంగళగిరి వెళ్లేందుకు ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన అభ్యర్థుల పేరుతో జిల్లాలో హడావిడిగా సర్వేలు చేపట్టగా, భీమవరం, నరసాపురం సీట్లు తేల్చకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం: పవన్ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. భీమవరం టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్‌తో సమావేశం కోసం ఉదయం నుంచి టీడీపీ నాయకులు వేచి ఉన్నారు. కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మాత్రమే భేటీ జరిగింది. పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దు అవడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా.. అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ధ్వజమెత్తారు. మండలాల వారీ మీటింగ్ పెట్టండి అంటూ సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నాయకులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ పితాని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం
యలమంచిలి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. కొబ్బరి కాయల్ని నిల్వ ఉంచే కురిడీ కొట్ల సమీపంలో పాదయాత్ర సాగుతుండగా.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చారు. కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజువ్వలు వేయొద్దని వేడుకుంటున్నా టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. గాలిలోకి వదిలిన తారాజువ్వల వల్ల ఆర్యపేటలోని కొడవటి వెంకటేశ్వరరావు (కొండయ్య) అనే వ్యాపారికి చెందిన మూడంతస్తుల కొబ్బరి గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో ఉద్ధృతమై గోడౌన్లో ఉన్న 10 లక్షల కురిడీ కొబ్బరి కాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటితో పాటు గోడౌన్ కూడా దగ్ధమైంది. దగ్ధమైన కొబ్బరి కాయల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, దగ్ధమైన గోడౌన్ విలువ మరో రూ.కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
టీడీపీ మేనిఫెస్టో మాకు గొడ్డలిపెట్టుగా మారింది: ఆటో డ్రైవర్లు
-
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్ కార్డులు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్ కార్డు ఇస్తే యాప్‌లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ఓటీపీ నంబర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడిదేం పని? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు. అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్‌లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – బి.మణి, వన్‌టౌన్, ఏలూరు చదవండి: ఇదీ.. జగన్ కమిట్మెంట్ -
AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎం జగన్ దిగ్భ్రాంతి మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. -
మెడలో తాళి కట్టి.. విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: యండగండి పాఠశాలలో అమానుషం జరిగింది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు.. విద్యార్థినిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే స్కూల్ లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కీచక ఉపాద్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆమెకు ముగ్గురు... మొదటి భర్త ఆత్మహత్య! -
నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా జనం నీరాజనాలు పలుకుతున్నారు. నివారం సామాజిక సాధికార యాత్ర విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును ఆ వర్గానికి చెందిన మంత్రులు, నేతలు ప్రజలకు వివరించనున్నారు. -
టీడీపీ-జనసేన పొత్తు.. టీడీపీ నేతల్లో కంగారెందుకు?.. ఏం జరగబోతోంది?
తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు. తణుకు నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీకి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సర్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టీడీపీ-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయిన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు. టీడీపీ అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఏ ముగింపునిస్తుందో అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. చదవండి: ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి’ -
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: సీఎం జగన్ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని, అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం ఆయన ‘వై ఏపీ నీడ్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్ పాలనలో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అవినీతి లేని పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఏపీని భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీఎంగా జగనే కావాలి’’ అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో టీడీపీని ఎందుకు మూసేశారు?: మంత్రి జోగి రమేష్ -
చంద్రబాబు అబద్ధం.. జగన్ నిజం.. పాలకొల్లు సభలో మంత్రి వేణు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ పథకాలతో వారి ఎదుగుదలకు ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర సాగింది. గాంధీ బొమ్మల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ పాల్గొన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ, గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల సమయంలో నాలుగు మాయమాటలు చెప్పి అధికారం పొందాలని గత పాలకులు అనుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు. పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని అంబేద్కర్ చెప్పారు. ఆయనకు నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ‘‘విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన.. వంటి పథకాలతో అందరిని ద్రాక్షగా ఉన్న చదువును పేదలకు చేరువచేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బున్న వారిని జల్లెడ పట్టి వారికి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు బీసీలు వెళ్లి అడిగితేనే తోకలు కత్తిరిస్తా అన్నాడు. మంత్రి మండలిలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.. బీసీ కులాలకు ఆత్మ గౌరవాన్ని నింపిన వ్యక్తి సీఎం జగన్.’’ అని మంత్రి చెప్పారు. మూడు ప్రాంతాల్లో జరుగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిక యాత్ర బహిరంగసభలు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల అగ్రవర్ణ పేదల ప్రభుత్వం. సామాజిక సాధికారత జగనన్నకే సాధ్యమైందని పాలకొల్లు సభ ద్వారా తెలుపబోతున్నాం. రెండు లక్షల 38 వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. అందులో ఒక లక్ష 78 వేల కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అణగారినవర్గాలకు చేరింది. సీఎం జగన్ పాలన అణగారిన వర్గాల్లో మనోధైర్యం నింపింది’’ అని మంత్రి వేణు తెలిపారు. చదవండి: ‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’ సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది: మంత్రి విశ్వరూప్ ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదంటూ మంత్రి విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చెప్పింది చెప్పినట్టు నెరవేర్చే ఒకే ఒక్కడు జగన్ మాత్రమే.. చంద్రబాబు ఇచ్చే హామీలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది. దేశంలో అత్యుత్తమ పాలన జగన్ అందిస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పింఛన్ విడతల వారీగా పెంచుతామని అన్నారు. 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్’’ అని మంత్రి కొనియాడారు. -
పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించామని.. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. డీ వాటర్ వర్క్ అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలవుతాయన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య.. సీఫేస్ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి తెలిపారు. ‘‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగింది. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపాం. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు’’ అని మంత్రి తెలిపారు. -
మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడి
వీరవాసరం: మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు -
పట్టుపురుగుల పెంపకంతో రైతులకు మంచి లాభాలు
-
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర! -
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
మీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త రేషన్ కార్డులొచ్చాయ్
సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. గతంలో రేషన్‌కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ప్రతి ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. వలంటీర్ల ద్వారా అర్హులతో దరఖాస్తు చేయించి కార్డులు మంజూరు చేయడంతో పాటు నేరుగా ఇంటికే తీసుకవచ్చి కొత్త కార్డు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా తాజాగా జిల్లాలోని 20 మండలాల్లో అర్హులైన పేదలకు 9,372 బియ్యం కార్డుల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. కొత్తగా పెళ్లయినా దంపతులకు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టినా తక్షణం కొత్త రేషన్‌కార్డు మంజూరు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. జిల్లాలోని 20 మండలాల్లో ప్రస్తుతం 5,62,395 రేషన్‌కార్డుల ద్వారా ప్రతి నెలా 8,641 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే తక్కువ ధరకు పంచదార, కందిపప్పును ఇంటి వద్దే రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్నారు. గతనెలలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 9,372 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా వీటి పంపిణీ ప్రారంభమైంది. భీమవరం రెవెన్యూ డివిజన్లో 10 మండలాలకు 4,627, నరసాపురం డివిజన్లో 10 మండలాలకు 4,745 కార్డులు మంజూరయ్యాయి. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందిస్తారు. గతంలో ఎదురుచూపులు గతంలో రేషన్ కార్డు కావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే రేషన్ కార్డు అందజేశారు. సత్వరమే కొత్త కార్డు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. –కటికితల వసంతకుమార్,ఏలూరుపాడు, కాళ్ల మండలం వచ్చేనెల నుంచి రేషన్ పంపిణీ జిల్లాలో నూతనంగా మంజూరైన 9,372 బియ్యం కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చేనెల నుంచి ఉచితంగా బియ్యంతోపాటు తక్కువ ధరకు పంచదార, కందిపప్పు అందిస్తాం. ఇప్పటికే జిల్లాలో సుమారు 5.62 లక్షల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు దాదాపు 8,641 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. –ఎన్.సరోజ, జిల్లా పౌరసరఫరాల అధికారి, భీమవరం -
గోదావరి దాటికి విలవిలలాడుతున్న లంక గ్రామాలు
-
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో స్నేహం కారణంగా పవన్ మతిపోయిందని, టీడీపీ వాళ్లు రాసి ఇచ్చిన డైలాగులు, కిరాయి ఇచ్చిన వాళ్ళ స్క్రిప్ట్‌లు రెచ్చగొట్టే రీతిలో చదివేస్తే కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. పవన్ ను చూస్తే జాలేస్తుందని, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరవపరిచాడన్నారు. "హలో ఏపీ అంటే వీళ్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి బైబై చెప్పినట్టా? - బాబు, పవన్ తెలంగాణ వెళ్లిపోతున్నామని బైబై చెప్పినట్టు ఉంది. నిన్న అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు సినీ ఫక్కీలో చెప్పారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా.." అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు ఈ శతాబ్ధపు డర్టీ పొలిటీషియన్‌గా అభివర్ణించిన మంత్రి కొట్టు.. హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తాడన్నారు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చంద్రబాబుని ప్రజలు రాజకీయ సమాధి చేసినా.. పైకి కనబడే ఆ తలతోనే, పచ్చ మీడియా సపోర్ట్‌తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాకినాడ, పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లిస్టు ప్రకారం వారి దగ్గర చదివి ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మండలానికి సంబంధించి 2 టీమ్‌లు, పట్టణానికి సంబంధించి 3 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 7 రోజులు ఫిర్యాదులు సేకరించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ఏదేని కారణం చేత ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనలో రూ. 2,16,000 వేల కోట్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సక్షన్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని వెల్లడించారు. -
‘ఏయ్ ఆగవయ్యా.. నువ్వాగు!’.. రైతులపై చంద్రబాబు అసహనం
తణుకు: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు గురువారం రాత్రి ఇరగవరం వచ్చిన చంద్రబాబు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు ఆయనను నిలదీస్తుండగా చంద్రబాబు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ యువరైతు మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పరిస్థితుల్ని చూసి చలించిపోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీరు అలా ఎందుకు చేయట్లేదు’ అని ప్రశ్నించగా.. అతడిపై చంద్రబాబు కస్సుమన్నారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ అసహనం ప్రదర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల నుంచి «ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న చంద్రబాబు తాను చెప్పేది మాత్రమే వినాలంటూ ఎప్పటిలా తన సొంత డబ్బా చెప్పుకొంటూ వెళ్లారు. రైతు బిడ్డల్ని కోటీశ్వరులను చేస్తానని, పేదలను ధనికులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలులో పాత విధానం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు గోదావరి జిల్లాల్లో పర్యటించి 72 గంటల్లో తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇస్తే.. ఇప్పుడు తాను తిరుగుతున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ‘సాక్షి’పై మరోసారి అక్కసు ఈ పర్యటన సందర్భంలో చంద్రబాబు ‘సాక్షి’పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రైతులను పరామర్శించడానికి వచ్చి రైతులతో మాట్లాడుతుంటే కొందరు సైకో కార్యకర్తలను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. దీనిని వక్రీకరిస్తూ ‘సాక్షి’ పేపర్లో ‘చంద్రబాబును అడ్డుకున్న రైతులు’ అని రాస్తారన్నారు. రైతుల ముసుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
చంద్రబాబుపై తీరుపై మండిపడ్డ మంత్రి ధర్మాన
రైతులకు పూర్తి భరోసా అందించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న ఇనాం, అనాధీనం భూములుపై రైతులకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. పేదలకు, రైతులకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చట్టాలు చేస్తుంటే టీడీపీ వాటిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాయి, ఇంకా చేరేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,07,000 కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తుంటే చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి పేరుతో దోచుకుంటే జగన్ అవినీతి రహిత అభివృద్ధి అందిస్తున్నారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్‌కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం -
శ్రీనివాస్ అనే వ్యక్తిపై జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు దాడి
-
పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. సీఎం జగన్‌కు మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ స్వాగతం పలికారు. చదవండి: నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా.. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
అసత్య కథనాలపై ఆగని ఆగ్రహ జ్వాల
సాక్షి, భీమవరం/కాళ్ల(పశ్చిమగోదావరి జిల్లా): అసత్య కథనాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే లక్ష్యంతో ఈనాడు పత్రిక సమాజంలో తన ఉనికిని కోల్పోయిందని భీమవరం ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గానాగమల్లేశ్వరరావు (బాబు), వైఎస్సార్సీపీ నాయకులు తోట భోగయ్య, గూడూరి ఉమాబాల మండిపడ్డారు. ఈనాడు పత్రిక తప్పుడు రాతలను నిరసిస్తూ శుక్రవారం భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లడానికి ఈనాడు చేసిన కుట్ర బహిర్గతమైందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘పచ్చ’ రాతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ నాయకులు కోడే విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, మానేపల్లి నాగన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విలువలను దిగజార్చుతూ.. కాళ్ల: ఈనాడు అధినేత రామోజీరావు పాత చిత్రాలను కొత్తవిగా చూపించే ప్రయత్నంలో జర్నలిజం విలువలను దిగజార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు ఆదేశాల మేరకు ఆయన సోదరుడు పెనుమత్స గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. నాయకులు పెనుమత్స గోపాలకృష్ణరాజు, జెడ్పీటీసీలు సోమేశ్వరరావు, రణస్తుల మహంకాళి మాట్లాడుతూ చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను పెన్నుల్లో నింపేసుకుని రామోజీరావు రాష్ట్రంపై, సీఎం జగన్‌పై తప్పుడు వార్తలు, కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరిరాజు, కాళ్ల, ఉండి మండల పార్టీ కన్వీనర్లు రాంబాబు పెనుమత్స ఆంజనేయరాజు కోపల్లె, కలవపూడి, ఉండి సొసైటీల చైర్మన్లు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, పెనుమత్స ప్రసాద్‌రాజు, పేరిచర్ల సూర్యనారాయణ రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాత పాటి సర్రాజు కన్నుమూత
-
పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందారు. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం -
ముగిసిన పాతపాటి సర్రాజు అంత్యక్రియలు
సాక్షి, పశ్చిమగోదావరి: గుండెపోటుతో కన్నుమూసిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు అంత్యక్రియలు ముగిసాయి. పాతపాటి స్వగ్రామం జక్కరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పాతపాటి సర్రాజుకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సర్రాజు తుదిశ్వాస విడిచారు. కాగా, 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో ఆయన జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం -
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
జూదం ఆడితే చర్యలు తప్పవన్న ఎస్పీ రవిప్రకాశ్
-
టీడీపీకి షాక్.. సీనియర్ నేత రాజీనామా
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. సుదీర్ఘకాలం టీడీపీకి సేవ చేసిన ముదునూరు మాజీ సర్పంచ్ బుద్దన శ్రీరామారావు (బాబులు), ఆయన భార్య, మాజీ సర్పంచ్ శారదలీలాపద్మావతి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాను కృషిచేశానని, అయితే ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు వేర్వేరుగా ఉండటం, పార్టీ తనను చిన్నచూపు చూడటంతో మనస్తాపం చెందానన్నారు. కష్టపడే వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో కీలక నేతగా ఉన్న బాబులు రాజీనామాతో పలువురు ఇదే దారిలో ఉన్నట్టు తెలిసింది. చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రొచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా.. -
చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం గుర్తు చేశారు. ‘‘టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. వాళ్ల పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకుని ఉంటారు. అందుకే 2019లో వారికి ప్రజలు బైబై చెప్పారు’’ అని సీఎం అన్నారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీ కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకుని ఉంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలన్నారు. ‘‘మంచి జరిగితే మాకు అండగా, తోడుగా నిలబడండి’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి -
CM YS Jagan: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఒకేరోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. ‘‘నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిషరీస్ యూనివర్శిటీతో నర్సాపురం రూపురేఖలు మారతాయి. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలకు సంక్షేమ పథకాల్లో భాగంగా రూ.1, 76, 516 కోట్లు అవినీతి లేకుండా నేరుగా జమ చేశామని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకుల ఊహకు అందని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్ -
సీఎం రాకతో నర్సాపురం రూప రేఖలు మారబోతున్నాయి : ప్రసాద రాజు
-
సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే.. నెరవేరుస్తారు : మంత్రి కారుమూరి
-
Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Time: 01:16 PM టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం అన్నారు. Time: 12:46 PM నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. Time: 12:42 PM నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు. Time: 12:34 PM గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు. Time: 12:25 PM దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు. Time: 12:13 PM పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. Time: 12:05 PM పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. Time: 11:59 AM మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు. Time: 11:05 AM సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. Time: 10:35 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవీ ప్రారంభోత్సవాలు ♦నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ♦నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. సీఎం జగన్ పర్యటన ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’
సాక్షి, పశ్చిమగోదావరి: ఆక్వా పాలిట విలన్ చంద్రబాబేనంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రంగానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి సబ్సిడీలు అందిస్తుందన్నారు. ధరల నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా రంగంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. చదవండి: అంతా బాగున్నా అసత్యాల సేద్యమే -
సూపర్ స్టార్ మృతి.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. -
ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది. తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు. ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు. -
లారీ బోల్తా.. దారి పొడవునా చేపలు..ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న చేపల లారీ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దారిపొడవునా చేపలు పడిఉండటంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కాగా పడిపోయిన చేపలన్నీ క్యాట్ ఫిష్ రకానికి చెందినవి. వీటిని రాష్ట్రంలో నిషేదించడంతో ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన వెంటనే లారీ సిబ్బంది అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు. చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
ఆహ్లాదం.. వన విహారం
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): కార్తీకమాసం అంటే కేవలం భక్తితో పూజలు చేయడమే కాదు. పర్యాటకుల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. వన విహారాల పేరిట పర్యాటక ప్రాంతాలు సందడిగా మారతాయి. అలాంటి వారికి భక్తితో పాటు ఆహ్లాదాన్ని అందించే అనేక ఆధ్యాత్మక, ఆహ్లాదకరమైన ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతోపాటు పిక్నిక్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మక దేవాలయాలపై ఒక లుక్కేద్దాం. పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకే మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో జలపాతాలు చూపరుల మదిని దోచుకుంటాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్నిక్ స్పాట్లుగా ఉన్నాయి. ప్రతీ ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వన¿ోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆహ్లాదకరం గోదావరి విహారం కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్ళేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో పాటు కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తోంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పాపికొండల యాత్రలో సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమం చూడొచ్చు. గోదావరి వెంట ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది. గుంటుపల్లి గుహలు మనసుకు ఆహ్లాదం, ఉత్తేజం కలిగించే కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి(జీలకర్రగూడెం) బౌద్ధాలయాల్ని ఈ కార్తీక మాసంలో అత్యధికమంది దర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న భారీ లింగాకారాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రత్యేకంగా కార్తీక సోమవారాల్లో వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ధర్మలింగేశ్వర స్వామి పాలరాతి స్తూపాలను భక్తులు కార్తీక సోమవారాల్లో ఎక్కువగా దర్శించుకుంటారు. జిల్లాలో పలు ఆధ్యాత్మక క్షేత్రాలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పర్యాటక ఆధ్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి. నర్సాపురం సమీపంలోని పేరుపాలెం బీచ్ కార్తీకమాసంలో పర్యాటకులతో నిండిపోతుంది. సముద్ర స్నానానికి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు బీచ్‌కు చేరుకుని సందడి చేస్తారు. ఈ సముద్రం వెంట పచ్చని కొబ్బరిచెట్లు, సర్వే చెట్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాటికింద సేదతీరుతుంటారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటకులు పిక్నిక్లు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తారు. పంచారామ క్షేత్రాల్లో భీమవరంలోని గునుపూడి ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో భక్తులు వేలాదిమంది ఈ క్షేత్రాల్ని దర్శించుకుంటారు. అందాల నిలయం కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీకమాసంలో వన సమారాధన ఏర్పాటు చేసుకునేలా పర్యాటకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు చేసిన అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా వెంకట్రామ థియేరట్‌లో బిల్లా సినిమాను రీరిలీజ్ చేశారు. చాలాకాలంగా మూతబడిన ఈ థియేరట్ను అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగుతు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx — 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022 -
సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం. చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్‌ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్‌ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్‌పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్‌ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్‌కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లోనే 1.50 లక్షల సీడ్ పెంపకం జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్ దాదాపు 1.50 లక్షల సీడ్‌ను పెంచుతున్నారు. సీడ్ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్ పెరగడంతో వైజాగ్ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్‌లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం. పిల్ల పరిమాణం ఆధారంగా మేత మైక్రో సీడ్ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్‌కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్‌ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్‌ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్‌ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీడ్ ఎగుమతి ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్ ఎగుమతి జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా పెంపకం కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం స్వయం ఉపాధికి అవకాశం నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. – డాక్టర్ దేవీవరప్రసాద్‌రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
‘చంద్రబాబు నాటకం బట్టబయలు.. వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే’
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ ముసుగులో జరుగుతున్నదే మహా పాదయాత్ర అని, అందులో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం. మరోసారి భవిష్యత్ తరాలకు ఆ పరిస్థితి రాకూడదన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’ ‘‘టీడీపీ పరిస్థితి భూ స్థాపితం అయిపోయింది. చంద్రబాబు ఆడుతున్న నాటకం పూర్తిగా బట్టబయలైంది. అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నేతలు రెచ్చ గొడుతున్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు కోరుతున్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. చంద్రబాబు 14 ఏళ్లలో అవినీతి పాలన చేశారు’’ అని కారుమూరి దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెలవాలని మంత్రి సవాల్ విసిరారు. ‘‘స్థానిక ఎన్నికల్లో గెలవలేని టీడీపీకి తమ రాజీనామాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మహా పాద యాత్ర కాదు.. ఫేక్ యాత్ర అది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. -
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం
పోడూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పెనుమంట్ర జెడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీసుభాషిణి భర్త, మార్టేరు ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు కర్రి వేణుబాబుపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఎనిమిదిమంది దుండగులు దాడిచేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వేణుబాబు భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేణుబాబు మార్టేరు శివారులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణపనుల పర్యవేక్షణకు కారులో వెళ్లారు. కారు డ్రైవర్ నవీన్‌ను ఇంటికి వెళ్లిపోమని చెప్పి ఆయన అక్కడే ఉన్నారు. చదవండి: ఏపీలో కుండపోత.. మరో రెండు రోజులు భారీ వర్షాలు నవీన్ ఇంటికి వెళుతుండగా పోడూరు మండలం పండితవిల్లూరు శివారు కట్లమ్మతాడి సమీపంలో ఆ కారును.. ఎదురుగా వచ్చిన కారులోని గుర్తుతెలియని ఎనిమిదిమంది దుండగులు ఆపారు. డ్రైవర్ నవీన్‌తో గొడవపెట్టుకుని అతడిని కొట్టారు. దీంతో నవీన్.. వేణుబాబుకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న వేణుబాబుపై దుండగులు దాడి చేశారు. తలపై ఇనుప రాడ్డుతో కొట్టి కారును వదిలేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వేణుబాబును డ్రైవర్ నవీన్ మార్టేరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వేణుబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు రూరల్ సీఐ కె.శ్రీనివాస్, పోడూరు, పెనుమంట్ర ఎస్ఐలు వై.నాగలక్ష్మి, బి.సురేంద్రకుమార్ ఘటనాప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. దుండగులు వదిలివెళ్లిన కారులో కారంపొడి ప్యాకెట్లు, సుత్తి, మద్యం సీసా ఉన్నాయి. దాడిచేసిన వ్యక్తులు మధ్యాహ్నం నుంచి ఆ ప్రాంతంలోనే ఉండి వేణుబాబు కదలికలు గమనించినట్టు కొందరు చెబుతున్నారు. వేణుబాబును మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫోన్లో పరామర్శించారు. -
పాదయాత్రకు నిరసన సెగ.. ఫేక్ యాత్రికులారా గో బ్యాక్..
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్ ఫేక్ యాత్రికులంటూ ఫ్లైక్సీలు ఏర్పాటయ్యాయి. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. బ్లాక్ బెలూన్స్ కూడా ఎగరవేశారు. చదవండి: ‘దుష్ట చతుష్టయం కోసం.. రియల్ ఎస్టేటే చంద్రబాబు ఆలోచన’ సీఎం జగన్‌ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అంటూ ఫ్లైక్సీలపై స్లోగన్స్ ఉన్నాయి. సీఎం జగన్‌ది అభివృద్ధి మంత్రం, చంద్రబాబుది రాజకీయ కుతంత్రం. రాష్ట్రం కోసం సీఎం జగన్ ఆరాటం. 26 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటమంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. -
ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకుంది ఆ కిలాడీ లేడీ. డబ్బున్న వారిని గుర్తించడం. వారి చెంత చేరడం. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. గుంటూరు, భీమవరం, శారదానగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసినట్టు బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్షి్మ(అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్షి్మ) అతని వద్ద పనికి చేరింది. అతనికి దగ్గరవ్వడమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మారి్పంచుకుంది. ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాను. అనంతరం ఆమె గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది. -
ద్వారకాతిరుమల కొండపై టోల్ మాయాజాలం!
ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్ గేట్ రుసుం కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్ టెండర్ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. అసలు షరతులు ఇవీ.. టెండర్ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో టోల్గేట్ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో టోల్ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా తగ్గిన టోల్ ధరలు టోల్ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ పెంచిన ధరలను తగ్గించి, టెండర్ షరతుల్లోని టోల్ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కుమ్మక్కయ్యారు బహిరంగ వేలం పాట, సీల్ టెండర్ నిర్వహించిన సమయంలో టోల్ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల, -
అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం.. వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్పైన్స్ మొక్కల సాగును విస్తరించారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో... అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. పర్యాటకులకు కనువిందు... మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి. చింతపల్లి ప్రాంతం అనువైనది ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. – శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి -
Krishnam Raju: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు
బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బ వంటి డైలాగులతో రెబల్‌స్టార్‌గా సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మొగల్తూరు రాజ సంస్థాన వారసుడిగా రాచరికపు ఆచారాలు, సంప్రదాయాలను ముందుండి పాటించడంతో పాటు సొంత ప్రాంత అభివృద్ధికి ఆయన విశేష కృషిచేశారు. నరసాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా గ్రామాల్లో రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. సహాయం చేయడంలో మనసున్న మా‘రాజు’గా నిలిచారు. సాక్షి, నరసాపురం/మొగల్తూరు: మొగల్తూరుకోట సంస్థానంలో 1940 జనవరి 20న ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు పెద్ద కుమారుడిగా కృష్ణంరాజు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు కోటలోని వ్యవహారాలు, పొలాల బాధ్యతలు చూసే వారు. వాస్తవానికి కృష్ణంరాజు వంశీయులది తూర్పుగోదావరి జిల్లా జి.ఎర్రంపాలెం కాగా తండ్రి చిన్నతనంలోనే మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు బాల్యం మొగల్తూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు స్థానికంగా, ఎస్ఎస్ఎల్సీ నరసాపురంలోని టేలర్ స్కూల్లో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969లో కోట సంస్థానాదీశులు కలిదిండి లక్ష్మీ కాంతరాజ బహుద్దూర్ (గాంధీబాబు) కు మార్తె సీతాదేవిని వివాహమాడగా అల్లుడు హోదా లో సంస్థాన వారసుడు అయ్యారు. 1995లో కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందగా 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్యామలాదేవికి కూడా మొగల్తూరు సంస్థానాదీశులతో బంధుత్వం ఉంది. ఓడి.. గెలిచిన నాయకుడిగా.. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం గల కృష్ణంరాజు అదే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నరసాపురం నుంచి పోటీచేసి లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పారీ్టలో చేరినా కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికి వచ్చారు. సొంతూరిపై మమకారం కృష్ణంరాజు మొదటి నుంచీ సొంతూరుపై మమకారం చూపారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డితో మాట్లాడి రూ.80 లక్షలు మంజూరు చేయించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో స్వజలధార పథకంలో జిల్లాలో పలు గ్రామాలకు లక్షలాది నిధులు మంజూరు చేయించారు. 214 జాతీయ రహదారిని 216 ఏగా మారి్పంచి నరసాపురం, మొగల్తూరు మండలాలను కలుపుతూ ఒంగోలు వరకూ రోడ్డును విస్తరింపజేశారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి చిన్ననాటి స్నేహితులను కలిసేవారు. మొగల్తూరు వస్తే సొంతింటిలోనే బస చేసేవారు. గోదావరి ముద్దు బిడ్డగా.. రాచరికపు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో ముందుండే కృష్ణంరాజు కుటుంబంలో ఏ కార్యక్రమమైనా సొంతింటిలోనే జరిపించేవారు. గోదావరిపై మక్కువతో ఆయన నటించిన చిత్రాల్లో గోదావరి పాటలను ఉండేలా చూసేవారు. గోదావరి పుష్కరాలకు సతీసమేతంగా హాజరయ్యేవారు. నరసాపురం వశిష్ట గోదావరి, మొగల్తూరులోని సముద్ర తీర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు చేశారు. సొంతింట్లో 4 నెలల విశ్రాంతి బంగారుతల్లి సినిమా షూటింగ్ నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయంతో కాలు విరిగి నాలుగు నెలలపాటు మొగ ల్తూరులోని నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మొగల్తూరు మొనగాళ్లుగా.. మొగల్తూరు ప్రాంతానికి చెందిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందడాన్ని ఈ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకునేవారు. కృష్ణంరాజు రైతుగా వ్యవసాయం కూడా చేశారు. రెబల్ పాత్రలతో రెబల్‌స్టార్‌గా పేరుపొందారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మొగల్తూరులో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. మొగల్తూరు అందే బాపన్న జూనియర్ కళాశాల, కోట్ల రంగారావు డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలిపాయి. ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం బుట్టాయగూడెం: కృష్ణంరాజుకు పశి్చమ ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడు బాపూ దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప సినిమాలోని పలు సన్నివేశాలను బుట్టాయగూడెం సమీపంలోని ఇప్పలపాడు, దొరమామి డి, అలివేరు, పట్టిసీమ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెల పాటు షూ టింగ్ జరగ్గా.. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య ఇంటి వద్ద కృష్ణంరాజు బసచేశారు. ఇప్పలపాడు గ్రామం పక్కన ప్రత్యేక సెట్టింగ్స్‌తో గిరిజన గూడేన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ విరా మ సమయంలో ఇప్పలపాడులోని వీధుల్లో కృష్ణంరాజు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ అందరినీ పలకరించేవారని అప్పటి షూటింగ్‌ను తిలకించిన గిరిజనులు అంటున్నారు. మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తినేవారని చెబుతున్నా రు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. -
ముర్రా.. మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: అత్యధిక పాల దిగుబడినిచ్చే గేదెలు ఏవంటే.. హర్యానా ముర్రా గేదెలని పాడి రైతులు చెప్పేమాట. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆ జాబితాలో ‘ఆంధ్రా ముర్రా’ గేదెలు కూడా చేరిపోయాయి. హర్యానా ముర్రా గేదెలు దక్షిణాది రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఆశించిన స్థాయిలో పాల దిగుబడి ఇచ్చేవి కాదు. దీనివల్ల వాటిని పెంచే రైతులకు తగిన ఫలితం దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయడంలో మన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ఇప్పుడు ‘ఆంధ్రా ముర్రా’ గేదెల కోసం పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్న గూడెంలోని గేదెల పరిశోధనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే ముర్రా జాతి గేదెల పునరుత్పత్తికి బాటలు వేసింది. హర్యానాలోని కేంద్రీయ గేదెల పరిశోధనా కేంద్రం నుంచి వెయ్యి డోసుల ముర్రా జాతి గేదెల ఘనీకృత వీర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడి రైతులకు సరఫరా చేయడం ద్వారా.. ముర్రా జాతిని మన ప్రాంత వాతావరణాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దారు. మన రాష్ట్రంలోని నాటు గేదెలకు ముర్రా జాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసి గ్రేడెడ్ ముర్రా గేదెల పేరిట ఆంధ్రా ముర్రా జాతిని అభివృద్ధి చేశారు. మారుమూల గ్రామాల్లోనూ.. పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన ఆంధ్రా ముర్రా జాతి గేదెలను మారుమూల పల్లెలకూ విస్తరించేలా వెంకట్రామన్నగూడెం పరిశోధనా స్థానం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటి వరకు లక్ష డోసుల ఘనీకృత వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి కోసం పాడి రైతులకు అందించారు. 350 దున్న దూడలను సైతం పంపిణీ చేసి కృత్రిమ గర్భోత్పత్తికి అవకాశం లేని గ్రామాల్లో గ్రేడెడ్ ముర్రా జాతిని మరింతగా విస్తరింపచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో 62.19 లక్షల పాడి గేదెల సంతతి ఉంటే.. వాటిలో 30 లక్షలకు పైగా ముర్రా జాతి గేదెలున్నాయి. వాటిలో 25–30 శాతం గేదెలు వెంకట్రామన్నగూడెం పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన గ్రేడెడ్ ముర్రా జాతికి చెందినవే కావడం గమనార్హం. వీటికి ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. కావాల్సిన సమయానికి ఎదకు రప్పించేలా.. గ్రేడెడ్ ముర్రా జాతిని మరింత అభివృద్ధి చేసేలా చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇన్ బ్రీడింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ.. ఓపెన్ న్యూక్లియస్ బ్రీడింగ్ సిస్టం ద్వారా మేలుజాతి గేదెలను అభివృద్ధి చేస్తున్నారు. గేదెలను కావాల్సిన సమయంలో ఎదకు రప్పించేలా ఈస్ట్రస్ సింక్రొనైజేషన్ పద్ధతితో పాటు గర్భవాతం నివారించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనిన 45–65 రోజుల్లోనే తిరిగి ఎదకు వచ్చేలా ఈ గేదెలను అభివృద్ధి చేశారు. చూడి శాతాన్ని 42 నుంచి 65 శాతానికి పెంచగలిగారు. గేదెల్లో గొడ్డుమోతు తనం నివారణకువివిధ హార్మోన్ చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచ్చారు. మన వాతావరణ ప్రభావాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దడంతో ఏడాది పొడవునా గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యాలను పెంచగలిగారు. అత్యధిక పోషక విలువలు కలిగిన 15 రకాల బహువార్షిక గడ్డి రకాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ అభివృద్ధి చేసిన సూపర్ నేపియర్ పశు గ్రాసానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు తీసుకెళ్లి సాగుచేస్తూ అధిక పాల దిగుబడులను సాధిస్తున్నారు. చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు ‘దున్న యువరాజ్’ జాతి అభివృద్ధిపైనా దృష్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యువరాజ్ జాతికి చెందిన దున్నల పునరుత్పత్తిపై పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. యువరాజ్ దున్నలకు చెందిన ఘనీభవించిన వెయ్యి డోసుల వీర్యాన్ని తీసుకొచ్చి గోదావరి జిల్లాల పాడి రైతులకు అందించారు. అభ్యుదయ పాడి రైతుల వద్ద గల గేదెలకు యువరాజ్ దున్న వీర్యంతో కృత్రిమ గర్భోత్పత్తి చేస్తున్నారు. మరోవైపు దాణా ధరలు విపరీతంగా పెరగటంతో కొత్తగా అభివృద్ధి చేసిన షియా మీల్ (షియా కేక్)ను తవుడుకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకితెచ్చారు. దీన్ని దాణాలో 20% వరకూ కలుపుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రేడెడ్ దూడలతో జీవనోపాధి నేను దేశవాళీ గేదెల్ని పెంచేవాణ్ణి. వెంకట్రామన్నగూడెం పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన ముర్రా జాతి వీర్యాన్ని తీసుకొచ్చి మా గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా చూలు కట్టించి గ్రేడెడ్ ముర్రాజాతి దూడలను అభివృద్ధి చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగుంది. నా ఫారంలో ఉన్న గేదెలకు ఏ అనారోగ్య సమస్యలు ఎదురు కావడం లేదు. సకాలంలో ఎదకు వస్తున్నాయి. – నూనె శ్రీను, వెంకట్రామన్నగూడెం త్వరలో నానో టెక్నాలజీ ద్వారా పరిశోధనలు మేలు జాతి పాడి పశువుల సంతతి అభివృద్ధి కోసం చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలోని ముర్రా జాతి పశువుల్లో 25–30 శాతం మన కేంద్రం అభివృద్ధి చేసినవే. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ), నానో టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మేలు జాతి గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుపై త్వరలో పరిశోధనలు చేయబోతున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం. – ప్రొఫెసర్ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ -
కంద సాగుతో డబ్బులే డబ్బులు.. ఎకరానికి లక్ష లాభం..
పెరవలి(పశ్చిమగోదావరి): గత ఐదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంద రైతులు ఇప్పుడు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభిస్తోంది. దానికి తోడు ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎకరానికి 70 నుంచి 80 పుట్టుల వరకూ కంద ఊరుతోంది. 232 కిలోలను పుట్టుగా వ్యవహరిస్తారు. ఎకరం కంద చేను తవ్వితే 70 నుంచి 80 పుట్టులు దిగుబడి వస్తోంది. దీంతో రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకూ మిగులుతోంది. జిల్లాలో కందసాగు విస్తీర్ణం జిల్లాలో కంద పంటను పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, మండలాల్లో సుమారు 1,250 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పట్టు రూ.3,400 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.4,000 వద్ద స్థిరంగా ఉంది. గతంలో ఇదే ధర ఉన్నప్పటికీ ఆశించనం తగా ఊరికలు లేక రైతులు నష్టాల చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతులు లాభాల బాట పడుతున్నారు. ఊరుతున్న లాభాలు కంద సాగు చేసినపుడు రైతులు పుట్టు విత్తనాన్ని రూ.3000 నుంచి రూ. 3400 రేటుకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.4000 ఉండడానికి తోడు ఊరికలు బాగా రావడం రైతులకు కలసి వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 80 పుట్టులకు రూ.3.20 లక్షలు, 70 పుట్టుల ఊరిక ఉంటే రూ.2.80 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి ఖర్చు రూ.2.10 లక్షలు అయ్యిందని రైతులు చెబుతున్నారు పెట్టుబడి రూ. లక్షల్లో.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో కంద వేయాలంటే విత్తనానికి రూ.1.02 లక్షలు, దుక్కి దున్నడానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్క వేయడానికి కూలీలకు రూ.50 వేలు అవుతుంది. అలాగే పెంట వేయడానికి రూ.18 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ, 25 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.15 వేలు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు రూ.2.10 లక్షలు అవుతుండగా నేడు ఊరికల ఆధారంగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష మిగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. రేటు స్థిరంగా ఉంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం సంతోషదాయకం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.70 వేల మిగులు వచ్చింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన రేటు స్థిరంగా ఉంది. –కోటిపల్లి పెద్దకాపు, కంద రైతు, అన్నవరప్పాడు అన్నీ అనుకూలించాయి ఐదేళ్ల తరువాత కంద రైతులు లాభాలు బాట పట్టారు. గతంలో ధర ఉంటే ఊరికలు లేవు, ఊరికలు ఉంటే ధర ఉండేది కాదు. కానీ నేడు ధరలు బాగున్నాయి. దిగుబడి బాగుంది. –బొలిశెట్టి వెంకటేశ్వరావు, కంద రైతు, అన్నవరప్పాడు నగరాల్లో డిమాండ్ ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు మద్రాస్, ముంబై వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.అందుకే రేటు బాగుంది. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద ఊరికలు గతంలో కంటే బాగా ఎక్కువగా వస్తున్నాయి. – గడుగొయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి -
PULASA FISH: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే!
పెనుగొండ: ప్రతి ఏటా జూలై నెల వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో పులసలు సందడి చేస్తుంటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్.. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అనిపిస్తాయి. ఏడాదికి రెండు మూడు నెలలు మాత్రమే లభించే పులసలను వేలు ఖర్చు చేసి కొంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ పులసలు దొరుకుతుంటాయి. సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి నదిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్లకు పులసలు చిక్కుతుంటాయి. సాధారణంగా బ్రతికి ఉన్న పులసలు దొరకడం కష్టం. వలకు చిక్కగానే పులసలు చనిపోతుంటాయి. గోదావరి తీరం జాతీయ రహదారిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తుంటారు. వారం రోజులుగా అందుబాటులోకి.. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పులసలు దొరకడం ప్రారంభమయ్యాయి. అరకొరగా దొరుకుతున్న పులసల ధరలు అధికంగానే ఉన్నాయి. సామాన్య కుటుంబాలు పులస కొనాలంటే కష్టమే. కేజీ పులసలు రూ.2000 నుంచి రూ.6000 వరకూ అమ్ముతున్నారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టమైనే పనే. దీంతో ఇలసల్ని అమ్మేస్తుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొంటుంటారు. గోదావరికి వరద నీరు ముందుగానే రావడంతో ఈ ఏడాది పులసలు ఎక్కువ కాలం దొరికే అవకాశం ఉందని జాలర్లు అంటున్నారు. ఇలసలనే పులసలుగా అమ్మకం ఒడిశా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకొచ్చి పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యం. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేయడంతో.. శరీరంపై ఎర్రటి చాయలు వెండి రంగు ధగధగలు ఉంటాయి. ఇలసలు తెలుపుగా కనిపిస్తాయి. సంతానోత్పత్తి కోసం వచ్చి... ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్ సముద్ర ప్రాంతాల్లో హిల్షా ఇలీషాగా పిలిచే ఈ చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకొని బంగాళాఖాతం చేరుకుంటుంది. గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకొని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ గుడ్లను పెడుతుంది. గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించినప్పుడు పులసగా పిలుస్తారు. పులసలను ఉన్నతాధికారులకు, బాస్‌లకు గిఫ్ట్‌లుగా పంపుతారు. గోదావరి పరిసర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని పంపుతుంటారు. వండడం కూడా ప్రత్యేకమే పులస పులుసు తయారీ కూడా ప్రత్యేకమే. ఇతర చేపల్లాగా వండకూడదు. మట్టి కుండలో పులసను వండాలి. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా వీటిని వండుతుంటారు. ముందుగా చేపముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకలు, లేదా కట్టెల పొయ్యి పై తక్కువ మంటపై ఎక్కువ సమయం వండాలి. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసి వండుతారు. మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియుల చెబుతుంటారు. -
పెండలం దుంప సాగుతో ఊహించని లాభాలు.. ఎకరాకు ఆదాయం ఎంతంటే?
దేవరపల్లి(పశ్చిమగోదావరి): కష్టాన్ని నమ్ముకున్న రైతుకు ఈ ఏడాది పెండలం దుంప సాగు ఊహించని లాభాలు తెచ్చింది. జూలైలో పంట విక్రయించిన వారికి కాసులు కురిపిస్తోంది. ఈ పంట దిగుబడులు తగ్గినా ధర బాగుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మెట్ట ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో పెండలం దుంపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో, కొవ్వూరు మండలం పెనకలమెట్ట, దొమ్మేరు, వాడపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా పెండలం సాగు జరుగుతోంది. చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా? పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో దాదాపు 25 ఏళ్లుగా పెండలం సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. మూడు గ్రామాల్లో సుమారు 220 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఖరీఫ్‌లో పంట వేయగా, జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుంప తయారు అవుతోంది. మే, జూన్, జూలై నెలల్లో ఎగుమతి చేస్తారు. ఒక్కో దుంప రెండు నుంచి 5 కిలోల బరువు ఉంటోంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. రికార్డు స్థాయిలో ధర ప్రస్తుతం పెండలం ధర రికార్డు స్థాయిలో ఉంది. మొన్నటి వరకూ టన్ను ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల ఉండగా, జూలైలో రికార్డు స్థాయికి చేరింది. టన్ను ధర రూ.39 వేలు పలుకుతోంది. ధర పెరగడంతో పెండలం సాగు చేసిన రైతులకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర గతంలో ఎన్నడూ లేదని వారంటున్నారు. అయితే అమ్మకాలు ముమ్మరంగా ఉన్న సమయంలో టన్ను ధర రూ.15 వేలు పలకడంతో ముందుగా అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఈ నెలలో విక్రయించిన రైతులకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. పల్లంట్ల దుంపకు డిమాండ్ దేవరపల్లి మండలం పల్లంట్లలో పండించిన పం టకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దుంప సైజు, నాణ్యత ఉంటుంది. 2 కిలోల నుంచి 5 కిలోలు దుంప తయారు అవుతుంది. దుంప పంట కావడంతో భూమిలో పెరుగుతుంది. దుంప తయా రైన తర్వాత భూమిలో నుంచి దుంపను తవ్వితీసి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. పెండలం పంట సాగుకు పెట్టుబడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎకరం కౌలు రూ.50 వేలు ఉండగా, పెట్టుబడి మరో రూ.70 వేలు అవుతుంది. ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువ కావడంతో నిఖర ఆదాయం తగ్గిందని రైతులు తెలిపారు. ఒడిశాకు ఎగుమతులు జిల్లాలో పండించిన పెండలం దుంపను ఒడిశాకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలో పెండలాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో పెండలాన్ని ఇంటింటికీ 10 కిలోల చొప్పున సారెగా పంపిణీ చేస్తారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన వ్యాపారులు పల్లంట్ల పరిసర గ్రామాలకు వచ్చి దుంపను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు. పది టన్నుల లారీ రూ.3.90 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు వివరించారు. మార్కెట్లో ధర పెరిగింది.. పెండలం దుంపకు మార్కెట్ బాగుంది. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో సుమారు 100 మంది రైతులు దాదాపు 220 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెండేళ్లు మార్కెట్ బాగోక నష్టపోయారు. గత ఏడాది 10 టన్నుల ధర రూ.70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.3.90 లక్షలు వస్తోంది. దిగుబడులు తగ్గడంతో పెండలానికి డిమాండ్ ఏర్పడింది. నెల రోజుల నుంచి మార్కెట్లో ధర పెరిగింది. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు జిల్లా: ముంపు బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్ వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఈ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. కేంద్రంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ మొత్తం అయితే కేంద్రం ఇవ్వకున్నా మేమే ఇచ్చేవాళ్లం. రూ.20 వేల కోట్లు అయ్యేసరికి ఏమీ చేయలేకపోతున్నాం. ప్రధానిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశా. కేంద్ర మంత్రులను మన మంత్రులు కలుస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో కదలిక లేదు. ప్రధాని మోదీని కలిసి వరద ఏ స్థాయిలో ఉందో వివరిస్తా. వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరతామని’’ సీఎం జగన్ అన్నారు. -
మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు. చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు. -
‘లోన్ యాప్’ ఒత్తిడికి తాతా మనవళ్ల ఆత్మహత్య
నరసాపురం రూరల్(పశ్చిమ గోదావరి): రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణేశ్వరం గ్రామం పరసావారి మెరకకు చెందిన తాతా మనవళ్లు ఆన్లైన్ లోన్ యాప్ ఒత్తిడి తట్టుకోలేక బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగిరెడ్డి రాఘవరావు (73) వ్యవసాయం చేస్తూ, ఆయన మనవడు భోగిరెడ్డి గిరి ప్రసాద్ (26) ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్లైన్ లోన్ యాప్ నుంచి కొంత మొత్తం రుణం తీసుకుని కొంతకాలం సక్రమంగానే చెల్లించారు. చదవండి: కుమారుడిని ఇంట్లో వదిలేసి.. వివాహిత అదృశ్యం అనంతరం ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో రుణం చెల్లించడం ఆలస్యమైంది. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వీరిని ఒత్తిడి చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాఘవరావు కుమారుడు, గిరిప్రసాద్‌కు తండ్రి అయిన భోగిరెడ్డి నాగరాజు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. తాతా మనవళ్లు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? ‘‘పుష్కరాల్లో బాబు లెగ్ పెట్టాడు. 29 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. నిన్న కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టాడు. పడవ ప్రమాదం జరిగింది. గోదారమ్మ దయతో శాంతించింది కాబట్టి టీడీపీ నేతలు బతికి బయట పడ్డారు. సీఎం జగన్ పాలనలో గోదావరి ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వరదలు సంభవించినప్పటి నుంచి సీఎం జగన్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మంచి కోసం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి అన్నారు. -
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్‌పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
-
కాళ్లకూరులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు
కాళ్ల(పశ్చిమగోదావరి): కాళ్లకూరులో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు. అనంతరం త్రివిక్రమ్ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. -
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం (ఫొటోలు)
-
అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భీమవరం అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని మోదీ సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... మహా యోధుడి విగ్రహావిష్కరణ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి భీమవరం వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గారికి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు మిత్రులందరికీ సభాధ్యక్షుడి హోదాలో సాదర స్వాగతం పలుకుతున్నాను. అందరికీ హృదయ పూర్వక స్వాగతం... నా అన్నదమ్ములకు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మనమంతా ఇవాళ ఏకమయ్యాం. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్ధం మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డమీద మన పూర్వీకులు మన స్వాతంత్య్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. ఇది ఈ అజాదీ కా అమృత్ అనే పదానికి అర్ధం. 75 ఏళ్ల క్రితం వరకు జరిగన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు.. అంటే దాదాపు 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే.. పరాయి దేశాల, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే... అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది ప్రాణత్యాగాల ఫలితం.. లక్షల మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం. అటువంటి మహా త్యాగ మూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. మహా అగ్నికణం అల్లూరి అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని... ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను. అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125 వ జయంతి సందర్భంగా.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధామంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం. తెలుగుజాతికి, భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత... తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. తన జీవితం, మరణం కూడా సందేశమే.. ఇక్కడ (భీమవరంలో)ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్ అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
ఆకివీడు(పశ్చిమ గోదావరి): భర్త నుంచి కోర్టులో విడాకులు తీసుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని కోరగా, అతను నిరాకరించడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుప్పనపూడి గ్రామానికి చెందిన పుష్పలత అదే గ్రామానికి చెందిన ఎడమటి సతీష్‌ను ప్రేమించింది. ఇది తెలియని పెద్దలు ఆమెను భీమవరం మెంటేవారితోటకు చెందిన గెడ్డం ఏసురాజుతో గత ఏడాది అక్టోబర్ 28న వివాహం చేశారు. చదవండి: ఎంతపని చేశావ్.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం.. ఆమె ప్రేమ విషయం భర్త తెలుసుకుని కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అనంతరం సతీష్‌ను పెద్దలు కలిసి పుష్పలతను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత ఈ నెల 3వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆకివీడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. సోదరుడు మారంపూడి నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ భూషణం చెప్పారు. -
శభాష్ వలంటీర్!
నరసాపురం రూరల్/ కొయ్యలగూడెం: అనారోగ్యంతోనో, ప్రమాదానికి గురవడం వల్లో వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన లబ్ధిదారులకు వారివద్దకే వెళ్లి పింఛన్ల సొమ్ము అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పలువురు వలంటీర్లు. మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కట్టా కనకరాజు కల్లుగీత కార్మికుడు. ఇటీవల కల్లుగీతకు చెట్టెక్కి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుకు స్థానిక వలంటీర్ గెద్దాడ శివకృష్ణ శుక్రవారం ఆస్పత్రికే వెళ్లి గీత కార్మిక పింఛను సొమ్ము అందజేశాడు. కష్టంలో ఉండగా అందించిన సొమ్ము తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగరాజు సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే కొయ్యలగూడెం మండలం పరింపూడి–2 సచివాలయ ఉద్యోగి సిరాజు తాను సైతం అంటూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లి పింఛను అందజేశాడు. పరింపూడికి చెందిన గాలంకి వెంకటేశం అనే వృద్ధుడు దేవరపల్లి వెళ్లి టైఫాయిడ్ జ్వరం వల్ల అక్కడే ఉండిపోయాడు. స్థానిక వలంటీర్ సెలవుపై ఉండటంతో వెంకటేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సిరాజు శుక్రవారం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశాడు. ఈ సందర్భంగా సిరాజును ఎంపీడీవో కేఆర్ఎస్ కృష్ణప్రసాద్ అభినందించారు. -
వైఎస్సార్సీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. చదవండి: ‘మహానాడులో చంద్రబాబుకు ఆ ఏడుపు మరీ ఎక్కువైంది’ -
మూడో రోజు వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం
-
సామాజిక న్యాయభేరి: మూడో రోజు బస్సు యాత్ర
సాక్షి, తాడేపల్లిగూడెం: వైఎస్సార్సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం జరుగుతోంది. కేబినెట్లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. మేమంతా సీఎం జగన్ తయారు చేసిన సైనికులం’’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరూ సామాజిక న్యాయం పాటించలేదు. సీఎం జగన్ ఒక్కరే సామాజిక న్యాయం పాటించారు’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే.. -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
Ganapavaram: సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి, గణపవరం(పశ్చిమగోదావరి): ఈనెల 16న గణపవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో రైతులకు సీఎం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తికావచ్చింది. హెలికాప్టర్ ట్రయల్‌రన్ పూర్తిచేశారు. హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనశ్రేణిలో నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. ఇందుకోసం ప్రధాన రోడ్డుకు చేరడానికి ప్రత్యేకంగా రోడ్డును నిర్మించారు. అలాగే సీఎం పర్యటించే దారిలో పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. ఏలూరు ఆర్డీఓ పెంచల కిషోర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. హెలికాప్టర్ దిగినప్పుడు దుమ్ము రేగకుండా ఆ ప్రాంతం వాటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ సభావేదికను నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, మంత్రులు, రాçష్ట్రస్థాయి నాయకులు, అధికారులు కూర్చునే విధంగా సువిశాలమైన సభావేదికను నిర్మిస్తున్నారు. సభలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణానికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఐదు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదిక నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు పరిశీలించారు. సభకు తరలివచ్చే రైతులు, ప్రజలకు సిట్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ పరిశీలించారు. గురువారం రాత్రి వ్యవసాయ శాఖ జిల్లా, స్థానిక అధికారులతో సమావేశమై స్టాల్స్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమై పార్టీపరంగా ఏర్పాట్లపై చర్చించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈనెల 16న పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన గణపవరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసు అధికారులతో పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలూ తలెత్తకుండా, ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకూ రోడ్డు మార్గాన్ని పరిశీలించి ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలో సూచించారు. గణపవరంలో సిద్ధం చేస్తున్న హెలీప్యాడ్ -
స్పెషల్ పికిల్స్: ‘‘ఊరగాయల ఊరు’’.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే
Pickle Village Usulumarru: ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నసమయంలో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం చేపట్టిన ఊరగాయల తయారీయే ఇప్పుడు ఆ ఊరికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి వారందరినీదర్జాగా బతికిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ రకరకాల ఊరగాయలు తయారు చేయడం ఆ ఊరి ప్రత్యేకత. అక్కడ తయారయ్యే పచ్చళ్లకు లేబుల్ లేకపోయినా.. బ్రాండ్ మాత్రం ఉంది. ఆ ఊరి పేరు ఉసులుమర్రు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన పెరవలి మండలంలోని గ్రామమది. పెరవలి: ఊరగాయల ఊరుగా ఉసులుమర్రు పేరొందింది. గ్రామ జనాభా 2,500 కాగా.. వారిలో 1,600 మంది పచ్చళ్ల తయారీ, విక్రయాలలో నిమగ్నమవుతుంటారు. ఏడాది పొడవునా ఏదో రకం ఊరగాయ తయారు చేస్తూ నిత్యం కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్ద.. ఆడ మగా అనే తేడా లేకుండా అందరూ ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. మగవాళ్లు దూరప్రాంతాలకు వెళ్లి ఊరగాయల వ్యాపారాలు చేస్తుంటే.. మహిళలు ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటూ ఊరగాయలు తయారు చేస్తుంటారు. సీజన్ల వారీగా ఆవకాయ, మాగాయ, టమాటా, ఉసిరి, అల్లం, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ, కాకర వంటి నిల్వ పచ్చళ్లు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కేవలం ఈ ఒక్క గ్రామం నుంచే సుమారు 300 మంది వ్యాపారులు పుట్టుకురాగా.. ఏటా 200 టన్నులకు పైగా ఊరగాయల ఉత్పత్తి అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో ఊరగాయ రూ.200–రూ.250కి విక్రయిస్తున్నారు. అందరికీ అదే ఉపాధి ఉసులుమర్రు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామం. ఇక్కడ కేవలం వరి మాత్రమే పండిస్తారు. అందువల్ల ఏటా జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే వ్యవసాయ పనులుంటాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులకు బతుకుదెరువు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సుమారు 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పిళ్లా శ్రీరామమూర్తి కుటుంబం ఊరగాయలు తయారు చేసి ఊరూరా వెళ్లి విక్రయించడం ప్రారంభించారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఆయనే మరికొందరికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. అలా మొదలైన ఆ ఊరి ఊరగాయల ప్రస్థానం ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల వరకు విస్తరించింది. ఊరగాయల తయారీతో గ్రామస్తులందరికీ ఇప్పుడు నిత్యం పని దొరుకుతోంది. మహిళలకు రోజుకు రూ.300, పురుషులకు రూ.400 చొప్పున కనీస కూలి లభిస్తోంది. ఆటుపోట్లు ఎన్నొచ్చినా.. ఈ వ్యాపారంలో తాము ఎన్ని ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదుర్కొన్నా కేవలం తామిచ్చే నాణ్యత మాత్రమే తమను నిలబెట్టిందని గ్రామస్తులు సగర్వంగా చెబుతుంటారు. ఇక్కడి వ్యాపారులు తెలంగాణలోని బోధన్, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, విశాఖ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి హోటళ్లు, పికిల్స్ షాపులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులంతా ఏడాదిలో 10 నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. కొందరు భార్యాబిడ్డలను వెంట తీసుకుని వెళతారు. మరికొందరు మాత్రం భార్యాబిడ్డలను గ్రామంలోనే ఉంచి సరుకు తయారు చేయించుకుంటారు. 20 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం 20 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారాన్ని నేటికీ కొనసాగిస్తున్నాం. ఏడాదిలో 10 నెలలు బయటి ప్రాంతాల్లోనే ఉంటాం. భార్యాబిడ్డలు ఇక్కడే ఉంటారు. ఈ వ్యాపారం వల్ల ఆస్తులైతే కూడగట్టలేం గానీ.. దర్జాగా బతకగలుగుతాం. – కొమ్మర వెంకటేశ్వరావు, వ్యాపారి ఇదే మాకు బతుకునిస్తోంది పిల్లల భవిష్యత్ కోసం మా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఊరగాయల్ని విక్రయిస్తుంటే.. నేను ఊళ్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ పచ్చళ్లు తయారు చేసి పంపిస్తుంటా. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. వడ్డీకి తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటాం. – కూనపురెడ్డి సత్యవతి పచ్చడి వ్యాపారి ఉసులుమర్రు ఈ వ్యాపారం అంత సులభం కాదు ఈ వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర వ్యాపారాల మాదిరిగా పచ్చళ్ల వ్యాపారం చేయడం అంత సులభం కాదు. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధికారుల వేధింపులు ఎదురవుతాయి. తృణమో ఫణమో ముట్టజెప్పి ముందుకు వెళుతుంటాం. ఈ వ్యాపారానికి బ్యాంకుల సహకారం ఏమాత్రం లేదు. రుణాలిస్తే మరింత మెరుగ్గా వ్యాపారాలు చేస్తాం. పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. వచ్చిన లాభం వడ్డీకే సరిపోతోంది. – ముత్యాల రామాంజనేయులు, వ్యాపారి -
నాపై దాడి చేసింది టీడీపీ నేతలే: ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్
సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై టీడీపీ నేతలే దాడికి ప్రయత్నించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను హత్య చేశారని తెలిసి తాను అక్కడికి వెళ్లగానే టీడీపీ నాయకులు, కొత్త వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడి చేయబోయారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులకు పాల్పడ్డారో పోలీసులు తేల్చాలన్నారు. చదవండి: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత -
గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు... జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ.. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. -
‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’
తణుకు(పశ్చిమ గోదావరి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను... అమ్మా, నాన్నా నన్ను క్షమించండి... నేను చనిపోతున్నాను అంటూ నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆపిల్ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మాత్రపు షారోన్ కుమారి (21) సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రి మూడో అంతస్తు హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. చదవండి👉: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో? భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన షారోన్‌కుమారి మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. మనస్తాపం చెందిన ఆమె ఇటీవల స్వగ్రామం వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. సోమవారం తోటి విద్యార్థులంతా తరగతులకు వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో స్వీపర్ వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై ఎం.వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తండ్రికి తలకొరివి పెట్టిన ఏడేళ్ల చిన్నారి
భీమడోలు(ఏలూరు జిల్లా): కన్న తండ్రికి ఏడేళ్ల కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన గుండుగొలనులో మంగళవారం జరిగింది. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆభం శుభం తెలియని ఏడేళ్ల వయస్సు ఉన్న పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించి కన్న రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనులోని బీసీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ కాకర్ల శ్రీనివాసరావు (42) ఆనారోగ్యంతో ఇంటి వద్దనే మృతి చెందాడు. చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు ప్రియదర్శిని (7), సంజన (5) ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్రీనివాసరావుకు మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పెద్దలు తండ్రి చితికి పెద్ద కుమార్తె ప్రియదర్శినితో తలకొరివి పెట్టించారు. భార్య పార్వతీ, కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!
వేలేరుపాడు: జీవనది గోదావరి చెంతన పాపికొండలుకు వెళ్లే మార్గంలో విహార యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందిన గిరిజన గ్రామం పేరంటపల్లి (పేరంటాలపల్లి). పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గల ఈ గ్రామంలో శ్రీరామకృష్ణ మునివాటం ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి దర్శించి.. పచ్చని ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను.. గుడి వెనుక రాళ్ల నుంచి పారే నీటిని వీక్షించే పర్యాటకులు పరవశించిపోతారు. కొండ గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కితే 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణ అంజనేయస్వామి వార్లు సజీవంగా మన ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే ఉండే వాలి, సుగ్రీవుల గుట్టలు కనువిందు చేస్తాయి. ఆ గ్రామంలో సుమారు 60 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరిదీ ఒకే వృత్తి. వెదురు బొమ్మల తయారీలో వారంతా నిష్టాతులే. కొండకోనల్లో దొరికే ములస వెదురు వీరికి ఉపాధినిస్తోంది. ఆకట్టుకునే కళాకృతులు తమచుట్టూ క్రూర మృగాలుంటాయని తెలిసినా అక్కడి గిరిజనులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తుంటారు. అక్కడి గిరిజనులు దారీతెన్నూ లేని గుట్టల్లో ప్రయాణించి వెదురు బొంగులను సేకరిస్తారు. వాటితో వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. తామర, గులాబీ పువ్వులు, వివిధ అంతస్తుల భవనాలు, లాంచీలు, బోట్లు, ఫైల్ ట్రే తదితర నమూనాల రూపంలో కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటివల్ల నిరంతరం ఇళ్ల వద్దే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఆదివారం, సెలవు రోజులతో పాటు దసరా, శివరాత్రి, సంక్రాంతి పండుగలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వెదురు కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి జ్ఞాపికలుగా తీసుకెళ్తుంటారు. ఒక్కో బొమ్మ సైజును బట్టి రూ.50 నుంచి రూ.350 వరకు ధర పలుకుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఐటీడీఏ ఇచ్చిన శిక్షణ కొండరెడ్ల కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. వెదురు వస్తువులే మా జీవనం వెదురు బొమ్మల తయారీతోనే మేం జీవిస్తున్నాం. పర్యాటకులు వచ్చే సీజన్లో నిత్యం 5 నుంచి 10 బొమ్మలు అమ్ముతా. రోజుకు రూ.500 వరకు ఆదాయం వస్తోంది. – కోపాల యశోద, పేరంటపల్లి వీటితోనే మా కుటుంబం గడుస్తోంది నేను రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. పర్యాటకులు బాగానే కొంటున్నారు. రోజుకు 15 బొమ్మలు అమ్ముతున్నాను. వీటి తయారీ, విక్రయం ద్వారానే మా కుటుంబం గడుస్తోంది. – కెచ్చెల అనురాధ, పేరంటపల్లి -
రెండు మల్టీనేషనల్ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం
గణపవరం(పశ్చిమగోదావరి): గ్రామీణ నేపథ్యం కలిగిన గణపవరం చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని రెండు బహుళజాతి కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరై రెండు కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. ప్రిన్సిపల్ శ్యాంబాబు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న బాలం రుచితాదేవి ఇటీవల బహుళజాతి సంస్థలు నిర్వహించిన ఆన్లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైంది, నాలుగు రౌండ్లలో జరిగిన రాత, ముఖాముఖి పరీక్షలలో విజయం సాధించి యాస్సెంచర్, క్యాప్‌జెమిని సంస్థలలో ఏడాదికి దాదాపు రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించింది. చదవండి: చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం ఈ విద్యార్థిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ తమ కళాశాలలో ఇచ్చిన శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని రుచితను కాలేజి అభివృద్ది కమిటి అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ మధురాజు, న్యాక్ కోఆర్డినేటర్ అక్కిరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అఫీసర్ డివివి చినసత్యనారాయణ, రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. -
భీమవరంలో రియల్ ఎస్టేట్ జోరు.. సెంటు రూ.కోటిపైనే!
భీమవరం : విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ది చెందుతున్న భీమవరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో మదుపరులు ఇక్కడ భూముల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. భీమవరం పట్టణంలో ఇప్పటికే కార్పొరేట్ స్ధాయి ఆసుపత్రులు, విద్యాసంస్థలున్నాయి. దీనికితోడు ఆక్వారంగం బాగా విస్తరించడంతో విదేశాలకు సైతం చేపలు, రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. రైతులకు, ఆక్వా వ్యాపారులకు డాలర్ల పంట పండడంతో భీమవరం ఖరీదైన పట్టణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పట్టణం సుమారు 14 కిలోమీటర్లు విస్తరించగా.. ఇటీవల మండలంలోని తాడేరు, చినఅమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే సమయంలో భీమవరం జిల్లా కేంద్రం కావడంతో మరో 10 కిలోమీటర్లు విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేయగా పర్మినెంట్‌గా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడానికి సుమారు 10 ఎకరాలు, ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు మరో 15 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. పర్మినెంట్ జిల్లా కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు ప్రాంతాలపై దృష్టి పెట్టి భూములు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. భీమవరం సెంటర్లో సెంటు రూ.కోటిపైనే రెండేళ్లుగా కరోనా కారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మందగించాయి. అనంతరం ప్రభుత్వం పేదలకు పంపిణీచేసిన ఇళ్లస్థలాల పూడిక కారణంగా ప్రైవేటు భూముల పూడికకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గడం, ప్రైవేటు భూముల పూడికకు అవకాశం ఏర్పడడంతోపాటు భీమవరం జిల్లా కేంద్రంగా అవతరించడంతో కొనుగోలుదారుల కన్ను భీమవరంపై పడింది. భీమవరం పట్టణం నడిబొడ్డున సెంటు స్థలం రూ.కోటి పైమాటే. జువ్వలపాలెం రోడ్డులో సెంటు స్థలం ఇప్పటికే రూ.50 లక్షల వరకు పలుకుతుండగా కుముదవల్లిరోడ్డులో ఇటీవల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెరిగినట్లు చెబుతున్నారు. మూడు నెలల్లో రూ. 18 కోట్ల ఆదాయం భీమవరం పట్టణంలోని గునుపూడి, తాలుకా ఆఫీసు సెంటర్లోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు నెలల్లో సుమారు రూ.18 కోట్ల ఆదాయం వచ్చిందని రెండుచోట్ల నెలకు చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 1,700 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఒక అధికారి చెప్పారు. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వ్యాపారి మాట్లాడుతూ గతంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వాళ్లమని, జిల్లా కేంద్రం కావడంతో భూములు ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. -
అమ్మమ్మ, మనవడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టి.. యువతిపై అత్యాచారయత్నం, ఆపై
కాళ్ల (పశ్చిమ గోదావరి): యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఓ మృగాడికి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఆమెను నేలకేసి కొట్టిచంపిన కిరాతక ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పాల కల్యాణి (19) తన అమ్మమ్మ ఒడుగు దుర్గ వద్ద ఉంటోంది. కల్యాణి తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. నెలసరి కావడంతో కల్యాణి ఆదివారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో నిద్రించగా.. ఆమె అమ్మమ్మ దుర్గ మనవడితో కలసి మరో గదిలో నిద్రించింది. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదే గ్రామానికి చెందిన తిరుమల సాయిప్రసాద్ అలియాస్ నాని అనే యువకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి దుర్గ, ఆమె మనుమడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టాడు. ఆ తరువాత కల్యాణి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతడిని ప్రతిఘటించిన కల్యాణి కేకలు వేస్తూ పక్క గదిలో నిద్రిస్తున్న అమ్మమ్మను పిలవటంతో నిందితుడు సాయిప్రసాద్ ఆమె తలను నేలకేసి కొట్టి హతమార్చాడు. మనవరాలి కేకలు విని నిద్రలేచిన దుర్గ తన గదిలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులకు గొళ్లెం పెట్టి ఉండటంతో బయటకు రాలేక బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విని చుట్టపక్కల ఇళ్లల్లోని వారు వచ్చి తలుపులు తెరిచారు. పక్కగదిలోకి వెళ్లి చూడగా కల్యాణి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. నిందితుడు సాయిప్రసాద్ మృతురాలి ఇంటినుంచి పారిపోవడం తాను చూసినట్టు స్థానికుల్లో ఒకరైన వైధాని దుర్గారావు చెప్పాడని కల్యాణి అమ్మమ్మ దుర్గ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు టీడీపీ నేత కుమారుడు నిందితుడు సాయిప్రసాద్ టీడీపీ నేత తిరుమల భాస్కరరావు పెద్ద కుమారుడు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, నిందితుడు సాయిప్రసాద్ 9 నెలల క్రితం కూడా ఓ యువతిపై ఇదే తరహాలో అఘాయిత్యానికి ఒడిగట్టాడని గ్రామస్తులు తెలిపారు. రాజీకి యత్నం.. రంగంలోకి పోలీసులు ఈ ఘటనపై గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వటంతో కాళ్ల పోలీసులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ఎస్పీ రవిప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. సాయిప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
నలుగురు ప్రధానులకు రక్షకుడిగా ‘మిస్టర్ ఆంధ్ర’ రాజగోపాల్
సాక్షి, అమరావతి: ప్రతి యువకుడికి తండ్రే తన మొదటి హీరో. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వాసంశెట్టి రాజగోపాల్ కూడా తన తండ్రి స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరారు. నలుగురు ప్రధానులకు అంగరక్షక బృందంలో పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న వ్యక్తిగా రాష్ట్రం నుంచి రాజగోపాల్ ఒకే ఒక్కడు కావడం విశేషం. రాజగోపాల్ తండ్రి సత్తిరాజు ఆంగ్లేయుల కాలం(1930 ప్రాంతం)లో ఎస్సైగా పనిచేస్తే.. రాజగోపాల్ 1984లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు. రెండేళ్లకే ఎస్పీజీలో అవకాశం రాజగోపాల్‌కు వృత్తిలో చేరిన రెండేళ్లకే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)లో పనిచేసే అవకాశం దక్కింది. ప్రధానులకు అంగరక్షకులుగా ఉండే ఎస్పీజీలో 1986లో చేరారు. ఏడాదిపాటు కఠిన శిక్షణ అనంతరం 1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వద్ద ఎస్పీజీలో ఉండే 10 మంది రక్షకుల్లో ఒకరిగా చేరారు. వరుసగా ప్రధానులుగా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహరావు వద్ద రక్షకుడిగా ఉంటూ వారితో శభాష్ అనిపించుకున్నారు. 1992లో తిరిగి రాష్ట్ర పోలీస్ విభాగానికి వచ్చిన ఆయన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పనిచేశారు. ఇటీవల రాజమండ్రిలో ఏఎస్పీగా పదవీ విరమణ చేశారు. సేవల్లోనూ మేటి పోలీస్‌గా ఎక్కడ విధులు నిర్వహించినా ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. భీమవరం రూరల్ ఎస్సైగా పనిచేసిన కాలంలో కాళీపట్నం గ్రామానికి చెందిన జయరాజు అనేవ్యక్తిని పాము కరవగా.. అత్యవసరంగా జయరాజుకు రక్తం కావాలని వైద్యులు చెప్పడంతో రాజగోపాల్ రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడారు. తణుకులో రోడ్డు ప్రమాదానికి గురైన ఆటో డ్రైవర్‌కు అధిక రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉంటే రాజగోపాల్ రక్తదానం చేసి కాపాడారు. నిడదవోలు, తణుకు సీఐగా పనిచేసిన సమయంలోనూ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. రాజగోపాల్‌కు 70కి పైగా రివార్డులు, అవార్డులు దక్కాయి. మిస్టర్ ఆంధ్రా రాజగోపాల్ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు తొలినుంచీ ప్రాధాన్యత ఇచ్చే రాజగోపాల్ శరీర సౌష్టవ (బాడీ బిల్డింగ్)లో 1979 నుంచి 1982 వరకు మూడేళ్లపాటు వరుసగా మిస్టర్ ఆంధ్రాగా కొనసాగడం విశేషం. సంతృప్తిగా ఉంది.. పోలీస్ శాఖలో బాధ్యతలు నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉంది. నలుగురు ప్రధానులకు రక్షకుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మా నాన్న సత్తిరాజు స్ఫూర్తితో పోలీస్ అయిన నేను విధి నిర్వహణలో సంతృప్తికరంగా పనిచేశాను. ప్రస్తుతం రాజమండ్రిలో వ్యవసాయం, తోటల పెంపకం వంటి వ్యాపకాలను పెట్టుకున్నాను. ఇకపై సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. – వి.రాజగోపాల్, రిటైర్డ్ ఏఎస్పీ -
ట్రావెల్ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ సీన్..
నల్లజర్ల/ప్రత్తిపాడు/నరసన్నపేట:ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రెండు వేర్వేరు టోల్‌ప్లాజాల వద్ద శుక్రవారం వేకువజామున ఈ తనిఖీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన సోదాల్లో రూ.4.76 కోట్ల నగదు, 352 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జరిపిన తనిఖీల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడింది. వివరాలివీ.. వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 37టీబీ7555 నంబరు గల బస్సులో ప్రయాణికుల సీట్ల కింద, లగేజీ డిక్కీలోనూ 11 పార్శిళ్లలో ఉన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ మొత్తాన్ని రూ.4,76,89,050 లుగా లెక్కగట్టారు. అలాగే.. 352.892 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవరు, క్లీనరుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరుగాక మరో ఏడుగురు వ్యక్తులు మూడు కార్లలో బస్సు వెనకాలే వస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీ తప్పించుకునేందుకే.. గతంలో బంగారం వ్యాపారం చేసే పిన్నిని కోటేశ్వరరావు, రమేష్ అన్నదమ్ములు. నరసన్నపేటలో ఉండే వీరు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. శ్రీకాకుళంలోని వ్యాపారులకు జీఎస్టీ బిల్లులు లేకుండా (జీరో బిజినెస్) బంగారం ఇప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఉగాదికి వరుసగా సెలవులు రావడంతో ముందుగానే వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుని బంగారం కొనుగోలుకు బయలుదేరి పోలీసులకు చిక్కారు. మరోవైపు.. బంగారం కొనుగోలు నిమిత్తం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి విజయవాడకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు వారు వెల్లడించారు. తిరిగి ఇదే బస్సులో సాయంత్రం బంగారం తరలించనున్నట్లు తెలిపారు. ఇలా నెలకు నాలుగైదుసార్లు వెళ్తుంటామన్నారు. ఇక పట్టుబడ్డ నోట్ల లెక్కింపు కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ త్రినా«థ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవికుమార్, నల్లజర్ల తహసీల్దారు ఎ.శ్రీనివాస్, సీఐలు ఆకుల రఘు, వైవీ రమణ పాల్గొన్నారు. దీనిపై ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారాన్ని ప్రభుత్వ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు. ‘తూర్పు’లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం.. ఇక తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద గంజాయి కోసం మాటువేస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టుబడ్డాయి. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు తమ సిబ్బందితో టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఎదురెదురు మార్గాల్లో వస్తున్న పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సోదాచేశారు. దీంతో బ్యాగుల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుకు సంబంధించి ఎలాంటి రశీదులూ లేవని తెలిపారు. నరసన్నపేటలో కలకలం పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లో పెద్దఎత్తున డబ్బు, బంగారం పట్టుబడిందన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. అంతాకలిసి హడావుడిగా పశ్చిమగోదావరి జిల్లాకు బయల్దేరారు. వీరి కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన సొత్తు అంతా పలాస, నరసన్నపేటకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులదేనని తెలుస్తోంది. వీటికి ఆధారాలు చూపించి వాటిని వెనక్కి తీసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక నిత్యం పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లే ప్రైవేటు బస్సులు శుక్రవారం ఈ ఘటనలతో నిలిచిపోయాయి. -
నేనే దొంగ.. నేనే పోలీస్
సాక్షి,కైకలూరు(పశ్చిమ గోదావరి): ప్రజలను రక్షించాల్సిన ఆ కానిస్టేబుల్ చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. కైకలూరులో మహిళ మెడలో గొలుసు తెంచి పారిపోతుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసు స్టేషన్లో సింగిడి సత్యనారాయణ 2008 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని సొంతూరు గణపవరం సమీపంలోని అప్పనపేట. సత్యనారాయణ ఇటీవల క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ పేకాటలో అప్పుల పాలయ్యాడు. సత్యనారాయణ వాలీబాల్ ఆడుతుంటాడు. ఈ క్రమంలో ఉండి సమీపంలోని ఉప్పులూరుకు చెందిన బుద్దాల సుభాష్(21)తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి కైకలూరుకు కేటీఎం స్పోర్ట్స్ మోటారు బైక్‌పై వచ్చారు. సంతమార్కెట్ వద్ద గూడూరి వెంకట వరప్రసాద్ పచారీ దుకాణానికి వెళ్లారు. అతను కౌంటర్లో ఉండగా భార్య లోపల సరుకుల వద్ద ఉంది. సత్యనారాయణ జీడిపప్పు కావాలని ఆమెను అడిగాడు. ఆమె వెనక్కి తిరగగానే మెడలో 4 కాసుల బంగారు గొలుసు తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న సుభాష్‌తో కలిసి ఏలూరురోడ్ వైపు పరారయ్యాడు. ప్రజలు వెంబడించగా సత్యనారాయణ తప్పించుకున్నాడు. సుభాష్ దొరకగా.. కైకలూరు స్టేషన్‌కు తరలించారు. అతని చెప్పిన సమాచారంతో సత్యనారాయణను ఆటపాకలో బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,20,000 విలువ చేసే గొలుసు, చాకు, పెప్పర్ స్ప్రే బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేనేజర్ రోజూ ఏదో ఒక వంకతో మా దగ్గరకు వచ్చి.. -
బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని..
సాక్షి,నరసాపురం(పశ్చిమ గోదావరి ): 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరసాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమ వారం అరెస్ట్ చేశారు. టౌన్ ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బాలిక 9వతరగతి చదువుతోంది. యలమంచిలికి చెందిన 25 ఏళ్ల యువకుడు బాలిక ఇంటికి దగ్గరలోనే టైల్స్ పనికి వెళ్లేవాడు. ఆదివారం బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని దిండి సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే బైక్‌పై ఇంటి వద్ద దింపి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆరాతీసి పోలీసులను ఆశ్రయించారు. యువకుడిపై పోక్సో చట్టం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చదవండి: ‘అమ్మా.. అమ్మా’ అని కేక వేసే లోగానే దారుణం జరిగిపోయింది -
సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ పర్యటన సాగిందిలా..
సాక్షి, పోలవరం (పశ్చిమగోదావరి): పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పరిశీలించారు. పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా వ్యూ పాయింట్ వద్ద పరిశీలన చేసిన సీఎం, కేంద్రమంత్రి.. తర్వాత స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం పూర్తైన ఎగువ కాఫర్ డ్యాంను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు. వివరించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం, కేంద్రమంత్రి.. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. ►పోలవరం ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్తులో చేయాల్సిన పనులు తదితర అంశాలపై పీపీఏ అధికారులు, ఇరిగేషన్ అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ►కేంద్రమంత్రి ముందు నిర్దిష్ట అంశాలను ఉంచిన ముఖ్మమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ►2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిని కోరారు ►తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తిచేశారు ►ఇదే సందర్భంలో కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందు ఉంచారు ►ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాంపొనెంట్ వారీగా రీయింబర్స్ చేస్తోందని, కాంపొనెంట్ వారీగా నియంత్రణల వల్ల కొన్ని పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి మందు ముఖ్యమంత్రి ఉంచారు ►దీనివల్ల పోలవరం, కుడి-ఎడమ కాల్వలకు సంబంధించిన పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని, ఏకంగా చేసిన పనులకు బిల్లులు కూడా పీపీఏ అప్లోడ్ చేయడంలేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు ►దీనివల్ల రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్ర ప్రభుత్వం చేసిన రీయింబర్స్‌మెంట్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్న సీఎం ►వివిధ పనుల కోసం ఖర్చుచేసిన రూ.859.59 కోట్ల రూపాయల బిల్లులను పీపీఏ నిరాకరించిన విషయాన్ని సీఎం, రాష్ట్ర అధికారులు.. కేంద్రమంత్రికి వివరించారు. ►మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకుని, ప్రతి 15 రోజుల కొకసారి బిల్లులను చెల్లించాలని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ ఫ్లో ఉంటుందని తెలిపిన సీఎం ►దిగువ కాఫర్ డ్యాం మరియు ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో వరదల కారణంగా ఏర్పడ్డ కోతకు గురైన ప్రాంతాన్ని ఏ విధంగా పూడ్చాలన్న దానిపై ఇప్పటివరకూ విధానాలను, డిజైన్లను ఖరారు చేయలేదని కేంద్రమంత్రికి రాష్ట్ర అధికారులు తెలిపారు ►ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని కోరిన సీఎం. ►పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలన్న సీఎం.. దీనివల్ల పనుల నిర్మాణ పరిశీలన ఎప్పటికప్పుడు జరుగుతుందని, అలాగే సమన్వయ లోపం లేకుండా, పరిపాలన సులభంగా జరిగేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ►పోలవరం ప్రాజెక్టు కారణంగా మంపునకు గురవుతున్న వారికి నష్టపరిహారాన్ని డీబీటీ పద్ధతిలో చెల్లించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం ►ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో సమస్యలను ఎప్పటికప్పుడు తొలగించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా కేంద్రమంత్రే సమీక్షలు చేసి వాటి పరిష్కారాలను సాధించాలని, తద్వారా పోలవరం ప్రాజెక్టును శీఘ్రగతిని పూర్తి చేయడానికి దోహదపడుతుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ►కనీసం 3 నెలల పాటు ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయన్న సీఎం సీఎం విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి: ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞాపనలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే పీపీఏ సహా, తన శాఖకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ♦పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడంపై నిర్ధిష్ట కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు. నెలవారీ కార్యాచరణ తయారు చేయాలన్నారు. ♦పీపీఏ స్థాయిలో, మంత్రిత్వ శాఖ స్థాయిలో వారం వారీగా ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు. ♦ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రత్యక్ష నగదుబదిలీ పథకం ద్వారా పరిహారాన్ని ఇవ్వాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనను అంగీకరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ♦ముఖ్యమంత్రి కోరినట్టుగా పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని, వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ♦దిగువ కాఫర్‌డ్యాం, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై, నిర్మాణాలు పటిష్టంగా చేయడంపై వెంటనే డిజైన్లు ఖరారు చేయాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. దేశంలో, లేదా దేశం వెలుపల నిపుణులైన సంస్థల సేవలను వినియోగించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. 15 రోజుల్లోగా దీన్ని కొలిక్కి తీసుకు రావాలని పీపీఏ సహా అధికారులను ఆదేశించారు ♦ముఖ్యమంత్రి కోరినట్టుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి 15 రోజులకోసారి వచ్చే మూడు నెలలపాటు సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు, సంబంధిత అధికారులు దీనికి హాజరుకావాలన్నారు. ♦పోలవరం పనుల ప్రగతిపై ఒక డ్యాష్ బోర్డ్‌ని ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రగతి తెలుస్తుందన్నారు. ♦ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు నివేదించిన మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ముందుకుసాగుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, రవాణా, ఐఅండ్‌పీఆర్ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్ అయ్యర్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్..
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలవరం నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సీఎం అండగా నిలిచారన్నారు. వారికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయనే స్వయంగా గృహ ప్రవేశం చేయించడంతో నిర్వాసితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ జగన్ అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కాలనీలో మరికొన్ని సౌకర్యాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ స్వయంగా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని.. నమ్మలేకపోయామని నిర్వాసితులు అన్నారు. సీఎం జగన్ వస్తే నా పెద్దకొడుకే వచ్చినట్లు ఉందని వృద్ధురాలు అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని.. సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. చదవండి: మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఇందుకూరు-1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులను కలుసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. అనంతరం ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహించారు. చదవండి: Andhra Pradesh: వడివడిగా వరదాయని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామన్న మాట బెట్టుకుంటామన్నారు. వైఎస్ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
AP: 4న పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయా ఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పరిశీలించనున్నారు. చదవండి: కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చే నెల 4న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. -
సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..?
తాడేపల్లిగూడెం అర్బన్(పశ్చిమగోదావరి): భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో కామిశెట్టి దేవరాజు అలియాస్ విగ్గురాజు, సుబ్బలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేయడంతో ఉద్యోగం చేసి వాటిని తీర్చేందుకు సుబ్బలక్ష్మి (38) కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లింది. ఇటీవల దుబాయి నుంచి తిరిగొచ్చింది. కొద్ది రోజులుగా సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో భర్త విగ్గురాజు దీనిపై నిలదీశాడు. సుబ్బలక్ష్మి సరైన సమాధానం చెప్పకపోవడంతో కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. చదవండి: నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు ఈ నేపధ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఇలాగే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో విగ్గురాజు ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భార్య సుబ్బలక్ష్మిపై దాడిచేసి విచక్షణా రహితంగా గుండె, కడపులోను పొడిచాడు. సుబ్బలక్ష్మి కేకలు వేయగా, సమీపంలో ఉన్న బంధువులు వచ్చి చూసేసరికి కిందపడి ఉంది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బలక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పట్టణ ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఆటోడ్రైవర్ది ఎంత మంచి మనసు..!
పెరవలి(పశ్చిమగోదావరి జిల్లా) : ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు, నగదును మహిళకు అందించాడు. పెరవలి గ్రామానికి చెందిన పడాల స్వప్న పెనుగొండ వెళ్లేందుకు శనివారం ఉదయం ఆటో ఎక్కింది. ఆమె బ్యాగ్‌లో 10 కాసుల బంగారు నగలు, నగదు ఉన్నాయి. స్వప్న గమ్యానికి చేరుకొన్న తరువాత ఆటోలో బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. ఆటోలో బ్యాగ్ ఉండటం గమనించిన డ్రైవర్ అడపా రమేష్ కొద్దిసేపు పెనుగొండలోనే ఉండి ఎవరైనా వస్తారని ఎదురు చూశాడు. ఎవరూ రాకపోవడంతో పెరవలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బ్యాగ్ అప్పగించాడు. ఆటో వెళ్ళిన గంటసేపటికి బ్యాగ్ పోగొట్టుకున్న స్వప్న ఆటో కోసం వెతకడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు జరిగిన విషయం తెలిపారు. ఇంతలో ఎస్సై సూర్య భగవాన్ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఉందని చెప్పారు. దీంతో స్వప్న స్టేషన్‌కు వచ్చి బ్యాగ్‌లో ఉన్న నగలు, నగదు పరిశీలించి అన్ని ఉన్నాయని చెప్పటంతో డ్రైవర్ రమేష్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. ఆటో డ్రైవర్ నిజాయతీని అందరు అభినందించారు. -
అర్హతలే భీమవరానికి వరం!
ఆకివీడు/భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు, హంగులూ భీమవరానికి ఉన్నాయి. విద్య, వ్యాపార, వాణిజ్య, రవాణాపరంగా ఇప్పటికే ఆధునికతను సంతరించుకుంది. ముఖ్యంగా జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణ కీలకం కాగా, 1500 ఎకరాల ప్రభుత్వ భూమి భీమవరంలో అందుబాటులో ఉంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాకు భౌగోళికంగా నడిబొడ్డున ఉండగా, జి ల్లాలో ఏ ప్రాంతం నుంచి అయినా ప్రజలు జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వనరులపై ఈ ప్రాంత ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక నివేదికను సిద్ధం చేసి ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. భూసేకరణకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ఆ సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలు, బంగ్లాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు చెబుతుండటం విశేషం. కూత వేటు దూరంలోనే వందల ఎకరాలు జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణాన్ని ప్రకటించిన నేపథ్యంలో పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న గొల్లవానితిప్ప సమీపంలో 1,500 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే కలెక్టర్ కార్యాలయంతో పాటు, ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు, కోర్టులు, ఎస్పీ కార్యాలయం తదితర సుమారు 100 కార్యాలయాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి పోలీస్ పెరేడ్ గ్రౌండ్, కలెక్టర్ కార్యాలయానికి పెరేడ్ గ్రౌండ్, క్రీడా స్టేడియం ఏర్పాటుకు ఎంతో భూమి అవసరం. అంతేకాక ముఖ్యమైన జిల్లా స్థాయి అధికారులు, జడ్జిలకు బంగ్లాలు, క్వార్టర్లు నిర్మించాల్సి ఉంది. వచ్చే 50 ఏళ్ల జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా జిల్లా కేంద్రాన్ని సిద్ధం చేయాల్సి ఉంది. భీమవరాన్ని జిల్లా కేంద్రంగానే కాక కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో డివిజన్ స్థాయిలో కూడా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, అధికారుల నివాసానికి అనుగుణంగా బంగ్లాలు, క్వార్టర్లను కూడా నిర్మించాల్సి ఉంది. వీటన్నిటి అవసరాలకు గొల్లవానితిప్ప భూములు సరిపోతాయని అంటున్నారు. భీమవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఇప్పటికే డబుల్ లైన్ తారురోడ్డు ఉంది. రైల్వే సౌకర్యం ఉంది. విజయవాడ – భీమవరం, నిడదవోలు – భీమవరం, నర్సాపురం – భీమవరం ప్రాంతాల మధ్య డబుల్ లైన్, విద్యద్దీకరణ పనులు చాలావరకూ పూర్తయ్యాయి. అందుబాటులో ఎన్‌హెచ్, సోలార్ విద్యుత్ 216ఏ కోస్తా జాతీయ రహదారి ఈ గ్రామానికి అతి సమీపంలో ఉండగా, దీనివల్ల కోల్కత్తా – చెన్నై, విజయవాడ, అమరావతికి రోడ్డు రవాణా మార్గం అందుబాటులో ఉంది. ఈ గ్రామం సమీపంలో ఉన్న లోసరి మెయిన్ చానల్ కాంక్రీట్ లైన్‌తో పటిష్టంగా 365 రోజులూ తాగు, సాగునీటి అవసరాలు తీరుతున్నాయి. డెల్టా ప్రాంతంలో ఎక్కడా లేనివిధంగా నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ, బంగ్లాలు, క్వార్టర్లకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అందించే అవకాశం ఉంది. సమీపంలోనే తీరం గోల్లవానితిప్ప సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమికి దగ్గరలోనే సముద్ర తీరం ఉంది. సముద్ర ఉత్పత్తులు అభివృద్ధికి, భవిష్యత్‌లో పోర్టు నిర్మాణానికి, సముద్ర వనరుల్ని వినియోగించుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఉండి కేవీకే ప్రాంతంలో.. భీమవరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూమి జిల్లా కేంద్రం కోసం అందుబాటులో ఉందని మాజీ ఎమ్మెల్యే, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. భీమవరానికి 10 కిలోమీటర్ల దూరంలో కాళ్ల మండలం సీసలి గ్రామంలో 10 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు ముందుకు వచ్చారు. ఏ విధంగా చూసినా భీమవరంలో కొత్తగా జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజనల్ కేంద్రం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉండగా, సహకారం అందించేందుకు ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వస్తుండటం శుభపరిణామం. సరైన నిర్ణయం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణాన్ని ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పట్టణం విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్యే, భీమవరం జిల్లాల విభజన పారదర్శకం జిల్లాల విభజనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల్ని కూడా అభివృద్ధి దిశలో ఎంపిక చేశారు. వివాదాలకు తావులేకుండా ప్రజలు సీఎం మాటకు కట్టుబడి అభివృద్ధికి చేయూతనివ్వాలి. – గోకరాజు రామరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన భూమి ఉండి కేవీకే ప్రాంతంలో ఉందని గతంలోనే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని కోరాను. – పాతపాటి సర్రాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వందలాది ఎకరాల్లో ప్రభుత్వ భూములు భీమవరం జిల్లా కేంద్రం నిర్మాణానికి అపారమైన ప్రభుత్వ భూములు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నాయి. భీమవరం తప్ప మరే ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. వందలాదిగా ఉన్న ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకోవచ్చు. – ఎన్ఎల్. నారాయణరాజు, భీమవరం అన్ని రంగాల్లో అగ్రగామి అందరికీ అందుబాటులో భీమవరం ఉంది. డెల్టాప్రాంత ప్రజలకు అనువైనది. గొల్లవానితిప్పలో ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణానికి భూమి కావాల్సినంత ఉంది. ఆక్వా, ఇతర రంగాల్లోనూ పట్టణం అభివృద్ధి చెందింది. అన్నింటికీ అనువైన కేంద్రం భీమవరం. – షేక్ ఫకీర్ సాహెబ్, నూర్భాషా సంఘ సభ్యులు, భీమవరం అందుకే దేశమంతటా ఒకే పంచాంగం లేదు -
పాపం ఏమైందో.. వివాహిత ఆత్మహత్య
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్‌ఫోన్‌ను అక్కడ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్‌సైకిల్ గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆర్ఎంపీ డాక్టర్ పాడుపని.. తల్లిదండ్రులు లేని సమయంలో..
West Godavari: మండలంలోని పందలపర్రు గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆర్ఎంపీ తిక్కా దుర్గారావును అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని సోమవారం తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికతో దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీపై అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి! -
ఆహా ఏమి రుచి.. తేగలు తినడం వల్ల లాభాలివే..
సాక్షి, పశ్చిమగోదావరి: శీతాకాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు. ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో పాటు పెరవలి మండలం కానూరు, ముక్కమల, పెరవలి, అన్నవరప్పాడు తదితర గ్రామాల్లో తేగల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో తేగలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలు ఏటా ఈసీజన్లో తేగల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. పెద్ద సైజు తేగల కట్ట రూ.50 నుంచి రూ.100, చిన్న సైజు తేగల కట్ట రూ.20 వ్యాపారులు విక్రయిస్తున్నారు. తేగల ధర అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. తేగలను కుండల్లో పెట్టి కాలుస్తున్న దృశ్యం తేగల తయారీ విధానం మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో తాటిచెట్లు నుంచి తాటికాయలు తయారైన తరువాత వాటిని సేకరించి నేలలో గుంతలు తీసి పాతర వేస్తారు. అవి మొలకలు వచ్చి తేగలు తయారువు తాయి. ఇవి ఏటా నవంబర్ నాటికి సిద్ధమవుతాయి. ఆతరువాత పాతర నుంచి తేగలను నుంచి తాటి బుర్రలను వేరే చేస్తారు. తేగలను మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారు. తరువాత వాటిని కట్టలు కడతారు. వీటిని స్థానిక దుకాణాల్లో, హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తారు. ఈఏడాది తేగల వ్యాపారం మార్కెట్ ఆశాజనకంగా ఉందని విక్రయదారులు అంటున్నారు. లాభాలు తాటి కాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగ య్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. -
చరిత్ర సృష్టించిన పశ్చిమ గోదావరి జాహ్నవి.. స్పేస్ కావాలి!
ఓ పాపాయి నేను డాక్టర్ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి. మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి. ‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు. ‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు. ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ. భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. ‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది. జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే. రాకెట్ నడిపింది! జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్‌కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్‌గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది. అమ్మమ్మ పెంపకం! జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. వివక్ష తప్పలేదు... కానీ! ఆడపిల్లలు డైనమిక్‌గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి. అంతరిక్షమే హద్దు! ‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది. ఇంజినీరింగ్‌కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్లైన్లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ... ‘నాసా’ సెంటర్లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రియాజ్, ఏలూరు -
తెల్లవారకముందే ముగియడం ఈ సంత మార్కెట్ ప్రత్యేకం!
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాతపాడు సంత అంటే ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పేరు. వేకువజామున 3 గంటలకు ప్రారంభమై తెల్లవారకముందే ముగియడం ఈ సంత ప్రత్యేకం. ఎండు చేపలు, కూరగాయలు, కిరాణా సరుకులు, దుస్తులు, బంగారు వస్తువులు, ఫ్యాన్సీ సామాన్లు వంటివి అమ్ముతుంటారు. ప్రతి మంగళవారం జరిగే సంత కోసం సోమవారం సాయంత్రానికే అమ్ముకునేవారు, కొనుగోలుదారులతో గ్రామం కోలాహలంగా మారుతుంది. సంత ఏర్పడిందిలా.. పాతపాడు పూర్తిగా మత్స్యకార గ్రామం. ఇక్కడకు వచ్చేందుకు పూర్వం సరైన రవాణా సదుపాయాలు లేవు. గ్రామం చుట్టూ ఏరులు ఉండటంతో లాంచీలు, పడవలే ఆధారం. మత్స్య సంపద అపారంగా ఉండటం, బయట ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడంతో ఇక్కడ సంత ఏర్పడింది. ముఖ్యంగా ఎండుచేపలకు పెట్టింది పేరుగా మారింది. వేటలో లభ్యమయ్యే చేపలు కోసి వాటికి ఉప్పు దట్టించి ఎండబెట్టి ఉప్పు చేపలు లేదా ఎండు చేపలుగా విక్రయిస్తారు. ఇరుగుపొరుగు గ్రామాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా చిరువ్యాపారులు తమ మత్స్య ఉత్పత్తులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సంత పేర్గాంచింది. మత్స్య సంపదతో పాటు మిగిలిన వస్తువుల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల కోసం బంగారు తాళిబొట్టును కూడా ఇక్కడ ఆర్డరు ఇచ్చి చేయించుకునేవారు. సంతలో దొరికే రకాలు పాతపాడు సంతలో పలురకాల ఎండు చేపలు లభిస్తాయి. పండు గప్ప, వంజరం, మాగ, సప్పిడి గొరక, పార, సండువాయి చుక్కర్లు, కవర్లు, బల్లపరిగ, సావిడాయి, కట్టి పరిగ, కారెగప్ప, రొయ్యలు, పీతలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ ఎండు చేపలను దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో నివసించే బంధుమిత్రులకు పంపించేవారు. సంతలో దుకాణాల నిర్వహణలో మహిళలదే ప్రధాన పాత్ర. ఇక్కడ దుకాణాల్లో మహిళలు విక్రయిస్తుంటే మగవారు సాయం చేస్తుంటారు. తగ్గిన ఆదరణ మండల కేంద్రం మొగల్తూరు నుంచి పాతపాడు రావాలంటే రెండు రేవులు దాటాలి. ఇటీవల రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఆక్వా పరిశ్రమలు పెరగడం, మత్య్స సంపదను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచడం వంటి పరిణామాలతో పాతపాడు సంతకు ఆదరణ తగ్గింది. గతంలో సంత జరిగే రోజు సుమారు 200 టన్నుల మత్య్స సంపద విక్రయాలు జరగ్గా ప్రస్తుతం టన్ను సరుకు కూడా అమ్ముడవడం లేదని గ్రామ పెద్దలు అంటున్నారు. రాష్ట్రంలోనే పేరు పాతపాడు సంతకు రాష్ట్రంలోనే పేరుంది. అయితే మారిన కాలానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, మత్య్స సంపదను నిల్వ చేసుకునే అవకాశం ఉండటంతో పాతపాడు సంత తన ప్రాభవాన్ని కోల్పోయింది. –కొప్పాడ లక్ష్మీతులసి, సర్పంచ్, పాతపాడు ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాతపాడు సంతకు వస్తున్నా. ఎండుచేపలను కొనేందుకు ఎక్కడెక్కడ నుంచో కొనుగోలుదారులు వచ్చేవారు. ఎక్కడికక్కడ ఎండుచేపలు అందుబాటులోకి రావడంతో పాతపాడు సంత తగ్గింది. –చింతా వెంకటేశ్వరమ్మ, చినగొల్లపాలెం -
మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్
-
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
-
పేదవాడికి మేలుచేస్తుంటే చూడలేకపోతున్నారు: సీఎం జగన్
-
AP: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగింపు
సాక్షి, పశ్చిమగోదావరి: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలివే.. ♦ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి. ♦లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు. ♦రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది. ♦నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు. ♦ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోంది. ♦22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. ♦ రిజిస్ట్రేషన్ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు. ♦ లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నామ మాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేట్ల కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలి’’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోతే మీరు కొంటారా? అని వారిని ప్రశ్నించాలన్నారు. ‘‘మీ ఆస్తులైతే రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్ట్రేషన్లు అవ్వకూడాదా? మంచి చేస్తుంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ జీర్ణించుకోలేపోతున్నారని’’ అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదు సార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు. రుణమాఫీ కాదు కాదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరు’’ అని సీఎం దుయ్యబట్టారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతి రూపం ఇల్లు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు లబ్ధిచేకూరే మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. ‘‘ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని’’ సీఎం అన్నారు. తణకులో ఇంటి మార్కెట్ విలువ రూ.30 లక్షల వరకు ఉంది. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి యజమానులుగా మారుస్తున్నాం. కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ.16వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్..
తణుకు(పశ్చిమగోదావరి): పట్టణానికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పుష్పలత (21) శుక్రవారం మధ్యాహ్నం ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత, విజయవాడకు చెందిన సాయిబాలచందు ఈ ఏడాది జనవరి 9న ప్రేమవివాహం చేసుకున్నారు. చదవండి: నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి.. సోషల్ మీడియా యాప్‌లో పరిచయంతో వీరు వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలచందు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. పుష్పలత గృహిణి. శుక్రవారం ఉదయం నుంచి భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన బాలచందు మరో గదిలో ఉండగా పడక గదిలో ఆమె ఉరేసుకుంది. అయితే ఘటనా స్థలంలో ఆనవాళ్లు ప్రకారం ఆమె ఉరేసుకున్నట్లుగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కె.గంగాధరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
వృద్ధ మహిళలే వారి టార్గెట్.. ఒంటరిగా కనపడితే స్కెచ్ వేసి..
సాక్షి,భీమడోలు(పశ్చిమ గోదావరి): ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలే వారి టార్గెట్.. వ్యసనాలకు అలవాటుపడిన ఆ ఇద్దరూ దోపిడీని వృత్తిగా ఎంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో వృద్ధ మహిళలపై దాడి చేయడంతోపాటు వారిని హత్యచేసి నగదు, బంగారం ఉడాయించేవారు. ఈ నెల 3వ తేదీన జరిగిన భీమడోలు మండలం గుండుగొలనులో జరిగిన ఒక వృద్ధ మహిళ హత్య కేసును విచారిస్తుండగా.. గతంలో వారు చేసిన మరో మూడు హత్యలు బయటపడ్డాయి. గుండుగొలను హత్యకేసులో వారికి ఒక వ్యక్తి సాయపడగా.. నిందితులు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరును కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, సీఐ ఎం.సుబ్బారావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుండుగొలనుకు చెందిన దొంగ కృష్ణంరాజు, గంధం పవన్‌కల్యాణ్ వ్యసనాలకు డబ్బుల కోసం వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని హత్య చేసేవారు. 2019 జనవరి నుంచి ఇంతవరకూ నలుగురిని హత్య చేశారు. గతంలో జరిగిన మూడు హత్య కేసులు వెలుగులోకి రాలేదు. అయితే గుండుగొలనులో ఈనెల 3న ఉద్దరాజు నాగమణి హత్యకు గురైంది. నాగమణి భర్త చేపల చెరువు వద్దకు వెళ్లాక.. దొంగ కృష్ణంరాజు, గంధం పవన్‌కల్యాణ్‌లు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల కొట్టారు. ఆమె ముఖంపై తలగడతో నొక్కి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసు, సూత్రాలు, ఉంగరం, చెవిదిద్దులు, రూ.4వేల నగదును ఆపహరించుకు పోయారు. ఈ హత్యకు కోరుకల్లు పంచాయతీలోని బద్రికోడుకు చెందిన సీమోన్ రాజు పథక రచన చేశాడు. దొంగిలించిన నగల్లో కొన్ని పోడూరు మండలం పండితవిల్లూరుకు చెందిన గెద్దాడ శ్రీనుకు అమ్మారు. ఈ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నేరస్తుల ఆచూకీ కనిపెట్టారు. వారిని విచారించగా కృష్ణంరాజు, పవన్‌కల్యాణ్‌లు గతంలో మరో ముగ్గురు వృద్ధ మహిళల్ని హత్య చేసినట్లు అంగీకరించారు. 2019 నుంచి హత్యల పరంపర 2019 జనవరి 5న బద్రికోడుకు చెందిన సాగిరాజు రామసీత(75)ను హత్య చేసి బంగారు చెవి దిద్దులు దొంగిలించారు. అదే ఏడాది సెప్టెంబర్ 3న బద్రికోడుకు చెందిన మంతెన వరహాలమ్మ (72)ను హత్య చేసి 10 కాసుల బంగారు అభరణాలు అపహరించారు. ఈ కేసులో గెద్దాడ శ్రీను ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2021 ఆగస్ట్ 27న నిడమర్రు మండలం సిద్ధాపురానికి చెందిన మర్రాపు వరహాలు(70)ను హత్య చేసి 4.5 కాసుల బంగారు అభరణాలు దొంగిలించారు. పాత కేసులకు సంబంధించి వారి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని డీఎస్పీ తెలిపారు. -
జంగారెడ్డిగూడెం : జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ( ఫొటోలు )
-
పెళ్లిలో బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్
ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని జీవితంలో ఎప్పటికీ తీపి జ్జాపకంలా గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరి సమక్షంలో వైభవంగా సంబరాలు చేసుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం పెళ్లిళ్లలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈతరం యువత కొంచెం ట్రెండ్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. మెహందీ పార్టీ, హల్దీ ఫంక్షన్, డ్యాన్స్‌లతో హడావిడీ చేస్తున్నారు. . తాజాగా ఓ కుంటుంబం తన కొడుకుని పెళ్లి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వరుడిని పెళ్లి ఊరేగింపులో భాగంగా ద్వారకాతిరుమలలో కేరళ సంప్రదాయంలో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అంతేగాక పెళ్లి కుమారుడుని బాహుబలి సినిమాలో బళ్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఊరేగింపుగా వెళుతుంటే అక్కడున్న వారంతా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. అయితే వరుడికుటుంబ సభ్యులు మాత్రం ఇలా తీసుకెళ్లినందుకు గర్వంగా ఫీలవుతున్నారు. తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలని, అందుకే ఇలా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: పెరుగు కోసం ట్రైన్ ఆపిన లోకో పైలట్, తరువాత ఏం జరిగిందంటే.. చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి! -
అక్కడ దేవుడికే దిక్కులేదు.. పట్టించుకునే వాళ్లు లేరా!
చూడటానికి ఆ ఆలయాలు చక్కగా కనబడతాయి. వర్షం వస్తే భక్తులపైనే కాదు గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలపై కూడా వర్షం పడుతుంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో ఆ ఆలయాలకు వచ్చే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దివ్య క్షేత్రంలోని పలు ఉపాలయాల దుస్థితి ఇది. సాక్షి,ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ఉప, దత్తత ఆలయాలు ఉన్నాయి. రోజూ క్షేత్రానికి వేలాదిగా వచ్చే భక్తులు చినవెంకన్న దర్శనానంతరం ఆ ఆలయాలనూ సందర్శిస్తారు. ముఖ్యంగా క్షేత్రదేవత కుంకుళ్లమ్మ, క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లీశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. చెరువు వీధిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, పసరు కోనేరు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఆయా ఆలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను చినవెంకన్న దేవస్థానం నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. అధికారుల అలసత్వం కారణంగా ఆలయాల అభివృద్ధిలో మాత్రం డొల్లతనం బయటపడుతోంది. మేడిపండులా.. మేడిపండులా కనిపించే కుంకుళ్లమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, క్షేత్రపాలకుని ఆలయాల ఆవరణల్లో ఉన్న నవగ్రహ మండపాల శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ కుంకుళ్లమ్మ ఆలయ ముఖ మండపం మడుగుగా మారుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారిపైనే వర్షం పడుతోంది. ఆ ఆలయ ప్రహరీ బాగా బీటలు వారింది. క్షేత్రపాలకుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపం శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు దాన్ని బోట్లు పెట్టి నిలబెట్టారు. భక్తులు ఆ మండపంలోనే పూజలు చేస్తున్నారు. ఆదాయం రూ.కోట్లలో ఉన్నా.. శ్రీవారి ప్రధాన ఆలయానికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ఉపాలయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.త్వరలో మరమ్మతులు చేయిస్తాం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుంకుళ్లమ్మ ఆలయ శ్లాబ్‌లు దెబ్బతిన్న విషయం నా దృష్టికి రాలేదని దేవస్థానం ఈఓ జీవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఈఈ శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శ్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది తమకు తెలపలేదన్నారు. ఈ ఆలయంతో పాటు కుంకుళ్లమ్మ ఆలయం, నవగ్రహ మండపం శ్లాబ్‌లకు త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. -
దొంగతనం కోసం వచ్చి.. తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి..
సాక్షి,భీమడోలు(పశ్చిమగోదావరి): దొంగతనం కోసం వచ్చి నిద్రిస్తున్న మహిళను హత్య చేసిన దారుణ ఘటన గుండుగొలనులో శుక్రవారం పట్టపగలు జరిగింది. గుండుగొలనులోని వినాయకుని గుడి ఎదురు రోడ్డులో ఉద్దరాజు నాగమణి(54), సూర్యనారాయణరాజు దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సూర్యనారాయణరాజు ఆక్వా రైతు వద్ద గుమాస్తాగా ఉంటున్నాడు. దీంతో రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతూ బయట తలుపుకు గెడ పెట్టి వెళ్లిపోయాడు. దుండగుడు(లు) గెడ తీసుకుని లోపలకు ప్రవేశించి బీరువాను పగులగొట్టాడు. ఈ అలికిడికి నిద్రలేచిన నాగమణి కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతను ఆమె నిద్రిస్తున్నమంచంపైగల తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీనితో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఆమె మెడలోనినానుతాడు, గొలుసు, చెవిదిద్దులు 4 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.4 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ ఇంటి పనిమనిషి రాగా నాగమణి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న సీఐ ఎం.సుబ్బారావు, భీమడోలు, దెందులూరు ఎస్సైలు వీఎస్వీ భద్రరావు, ఐ.వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్యాడ్ టీమ్ హత్య అనంతరం పరారైన నిందితుడి మార్గాన్ని గుర్తించారు. ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ హత్య కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎస్సై భద్రరావు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితులు ఒకరా, ఇద్దరా అనేది తెలియాల్సి ఉందన్నారు. -
తుపాను గండం: అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. -
ప్రతీకారం.. ప్లాన్ ప్రకారం అతిగా మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే..
వేలేరుపాడు(పశ్చిమ గోదావరి): ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నా.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలు తొలగిపోవడం లేదు. అందుకు ఉదాహరణే వేలేరుపాడు మండలంలోని కొర్రాజులగూడెంలో గ్రామంలో జరిగిన కారం రాజులు(57) హత్య. చేతబడి అనుమానంతో గ్రామానికి చెందిన కొందరు అతనిని హత్య చేయగా ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రాజులగూడెంకు చెందిన నూపా లక్ష్మయ్య ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందాడు. తన భర్త మృతికి కారం రాజులు చేతబడే కారణమని, భార్య నూపా దుర్గమ్మ భావించింది. రాజులపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసింది. వరుసకు కొడుకయ్యే నూపా పెంటయ్య, కొడుకు వంశీతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ఈ నెల 17న రాత్రి గ్రామంలోని పొలంలో ఉన్న రాజులు వద్దకు పెంటయ్యను పంపింది. పెంటయ్య, రాజులు కలిసి అతిగా మద్యం సేవించారు. రాజులు మత్తులోకి జారుకున్నాక దుర్గమ్మ, పెంటయ్య, వంశీ అక్కడికి వచ్చారు. ముందుగా రాజులు తలపై కొట్టి, మొఖంపై గట్టిగా మోదారు. దీంతో రాజులు మృతి చెందాడు. ఈ విషయం 19న వెలుగులోకి వచ్చింది. అదే రోజున గ్రామస్తులు, దహన సంస్కారాలు కూడా చేశారు. ఆనంతరం కూతురు కారం రజిని 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. శుక్రవారం నిందితులైన దుర్గమ్మ, పెంటయ్యను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. చదవండి: భర్తతో విడాకులు, మరో వ్యక్తితో ప్రేమ, ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని -
ప్రేమ పెళ్లి: రోజూ నరకం చూపిస్తూ.. చివరికి చీర కొనుక్కుందని..
సాక్షి,నల్లజర్ల( పశ్చిమ గోదావరి): ప్రేమించానంటూ వెంటపడ్డాడు. అతనిని నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతికి భర్త నరకం చూపించాడు. చివరకు అతనే కర్కశంగా హతమార్చాడు. చీర కొనుక్కుందన్న కోపంతో ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్ బ్యాండ్లు, చెంపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ కూడా అదే వృత్తి చేసేవాడు. తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేసి భర్త, అత్త మామలను పోషించేది. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు గర్భస్రావమైంది. ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో బుధవారం రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య గొడవ జరిగింది. అత్త మరిడమ్మ కూడా అతనికి తోడైంది. ఈ గొడవ పెరిగి పక్కనే ఉన్న ఇటుక రాయితో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పది గంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దానమ్మను భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహహింసకు పాల్పడినందుకు, అబార్షన్‌కు కారణమైనందుకు భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఏడాది వయసున్న చిన్నారి ఏం జరిగిందో తెలియక బిత్తరచూపులు చూస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం
ఏలేశ్వరం (తూర్పుగోదావరి): కుటుంబసమేతంగా మోటార్ సైకిల్‌పై తన అత్తవారి ఊరు బయలు దేరిన అతడికి రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కళ్లెదుటే భార్యను కోల్పోయి, క్షతగాత్రులైన పిల్లలను చూసి అతడు బోరున విలపించాడు. ఏలేశ్వరం మండల పరిధిలోని యర్రవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఏరుకొండ గ్రామానికి చెందిన పెరాపు సత్యనారాయణ తన అత్తవారి ఊరు పశ్చి మగోదావరి జిల్లా పొలమూరులో సెలూన్ షాపు నడుపుతున్నాడు. భార్య కల్యాణి (26), ఏడేళ్ల కుమారుడు విష్ణువర్దన్, ఐదేళ్ల కుమారై లాస్యశ్రీతో కలిసి సొంతూరు ఏరుకొండ వెళ్లాడు. అక్కడి నుంచి పొలమూరు వెళ్లేందుకు ఉదయం బైక్‌పై భార్యాపిల్లలతో బయలుదేరాడు. మార్గమధ్యంలో యర్రవరం వద్ద వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో కల్యాణి అక్కడికక్కడే మృతిచెందింది. సత్యనారాయణ, ఇద్దరు పిల్లలు గాయపడగా వారిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్సై సుబ్బిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది -
ప్రియుడితోనే.. పిల్లల కిడ్నాప్
సాక్షి, పాలకోడేరు(పశ్చిమగోదావరి): ప్రియుడితో కలిసి జల్సా చేసేందుకు.. తన పిల్లలనే కిడ్నాప్ చేయించిన ఓ వివాహిత బాగోతం బట్టబయలయ్యింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో రాజేష్ అలియాస్ రామకృష్ణ అద్దెకు ఉంటూ తాపీ పని చేస్తుంటాడు. అదే వీధిలోని ఓ కుటుంబంతో చనువుగా ఉంటూ ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ వ్యవహారం ఆమె అత్తకు తెలిసిపోవడంతో అత్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు హత్యాయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఘటన అనంతరం ప్రియుడితో వెళ్లి జల్సాగా జీవించాలనే ఆలోచనకు వచ్చిన వివాహిత.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన ఇద్దరు కుమారులను మామయ్యతో వెళ్లండని నచ్చచెప్పి పంపించింది. రాజేష్ వారిని గురువారం రాజమండ్రికి తీసుకెళ్లి ఒక లాడ్జిలో మకాం పెట్టాడు. అనంతరం పిల్లల తల్లికి వాట్సాప్ ఫోన్ కాల్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే పిల్లల్ని చంపేస్తానని నానమ్మను బెదిరించాడు. దీంతో పిల్లల తండ్రి, నానమ్మ పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు నర్సాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, రూరల్ ఇన్చార్జి సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ రామచంద్రరావు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. మహిళను అదుపులోకి తీసుకుని రాజేష్‌కి ఫోన్ చేయించారు. పిల్లలు ఎలా ఉన్నారని, వాట్సాప్‌లో ఫొటో పంపించమని అడిగించారు. దీంతో అతను ఫొటో పంపించగా, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు రాజమండ్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న రాజేష్‌ని శుక్రవారం అదుపులోకి తీసుకుని, పిల్లలను తండ్రికి అప్పగించారు. కిడ్నాప్‌నకు సహకరించిన వివాహితను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అభినందించారు.